AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

SCERT AP 8th Class Biology Study Material Pdf 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 8th Lesson Questions and Answers మొక్కల నుండి ఆహారోత్పత్తి

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
గోధుమ పంటను రబీలోనే ఎందుకు పండిస్తారో కారణాలు చెప్పండి.
జవాబు:

  1. చాలా మొక్కలు పుష్పించుటకు, రాత్రి సమయానికి దగ్గర సంబంధం ఉంటుంది.
  2. గోధుమ మొక్కలు పుష్పించుటకు రాత్రి సమయం సుమారుగా 12 గంటలు కావాలి.
  3. గోధుమపంట సాగు రబీలో అనగా (అక్టోబర్, నవంబర్ మధ్య) మొదలు పెడితే అవి పుష్పించుటకు 8-10 వారాలు పట్టును.
  4. జనవరి చివరి నుంచి ఫిబ్రవరి వరకు రాత్రి సమయం సుమారుగా 12 – గంటలు ఉంటుంది.
  5. కాబట్టి గోధుమపంటను రబీలోనే సాగుచేస్తారు.

ప్రశ్న 2.
రామయ్య తన పొలాన్ని చదునుగా దున్నాడు. సోమయ్య పొలం హెచ్చుతగ్గులు ఉంది. ఎవరు అధిక దిగుబడి సాధిస్తారు? ఎందుకు ?
జవాబు:
రామయ్య ఎక్కువ దిగుబడి సాధిస్తాడు. కారణం నేలను చదును చేయడం వలన పొలంలో నీరు అన్నివైపులకు సమానంగా ప్రసరించును. పొలంలో వేసిన పశువుల ఎరువు కూడా సమానంగా నేలలో కలిసి అన్ని మొక్కలకు అందును. విత్తనాలు వేయుటకు లేదా నారు మొక్కలు నాటడానికి వీలుగా ఉండును.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 3.
పొలాన్ని దున్నడం వల్ల ప్రయోజనాలేమిటి ?
జవాబు:
పొలాన్ని దున్నడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి :

  1. మట్టి మృదువుగా మారడం వల్ల నేల లోపల నీరు చాలాకాలం నిల్వ ఉంటుంది.
  2. వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొని పోవడానికి వీలు అగును.
  3. వేళ్ళకు శోషించడానికి అవసరమైన గాలి, నీరు నేలలోకి సులభంగా చేరును.
  4. రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టిలో బాగా పెరుగుతాయి.
  5. నేలను దున్నడం వల్ల నేల లోపల ఉన్న కొన్ని రకాల అపాయకరమైన సూక్ష్మజీవులు, క్రిమికీటకాల గ్రుడ్లు బయటికి వచ్చి సూర్యుని వేడికి నశించును.

ప్రశ్న 4.
నేనొక మొక్కను, నేను పంటపొలాల్లో పెరుగుతాను. రైతులు నన్ను చూస్తేనే పీకేస్తారు. కారణం ఎందుకో నాకు తెలియదు. నీవు చెప్పగలవా ? నేనెవరిని ?
జవాబు:
నీవు పొలాల్లో సాగు మొక్కలతో బాటు పెరిగే కలుపుమొక్కవి. రైతులు నిన్ను చూస్తేనే పీకేస్తారు. కారణం సాగు మొక్కలతో ఆశ్రయం కోసం, ఆహారం కోసం పోటీపడతావు. వాటికి చేరవలసిన పోషక పదార్థాలు నీవు గ్రహిస్తావు. అంతేకాకుండా వ్యాధుల వ్యాప్తిలో కూడా పాత్ర పోషిస్తావు.

ప్రశ్న 5.
రైతులు వరిపంటను కోసిన తర్వాత ఎండలో ఎందుకు ఆరబెడతారు. ఎందుకు ?
జవాబు:
రైతులు వరిపంటను కోసిన తర్వాత ఎండలో ఎందుకు ఆరబెడతారంటే దాని కాండంలోను, ఆకులలోను, కంకులలోను ఉన్న తేమ పోవటం కోసం. కాండంలోను, ఆకులలోను తేమ పోకపోతే కుప్పగా వేసిన తర్వాత వాటినుండి ఆవిరి వచ్చి కంకులలో ఉండే ధాన్యం రంగు మారుతుంది.
కంకులలో ఉండే తేమ పోకపోతే కంకులకు బూజు (శిలీంధ్రాలు) పడుతుంది.

ప్రశ్న 6.
వేసవి దుక్కులు అంటే ఏమిటి ? ఇవి పర్యావరణానికి ఏ విధంగా మేలుచేస్తాయో రాయండి.
జవాబు:
రైతులు వేసవికాలంలోనే తమ పొలాలను దున్నుతారు. వీటిని వేసవి దుక్కులు అంటారు. వాటివలన గాలి మట్టి రేణువుల మధ్య చేరును. అందువలన నేల గుల్లబడును. అంతేకాకుండా నేలలో క్రిములు, సూక్ష్మజీవులు కూడా నశించును. కాబట్టి పంటలు వేసినప్పుడు వ్యాధులు తక్కువగా వచ్చును. దీనివలన క్రిమిసంహారక మందులు తక్కువగా వాడుట జరుగును. ఈ విధంగా వేసవి దుక్కులు పర్యావరణానికి మేలు చేస్తున్నాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 7.
గ్రామంలో రైతులందరూ ఒకే రకమైన పంట వేశారు. దీని వలన కలిగిన నష్టాలు ఏమిటో వివరించండి.
జవాబు:
గ్రామంలో రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయడం వలన చాలా నష్టాలు కలుగుతాయి. అవి :

  1. అందరూ ఒకే పంటవేస్తే విత్తన కొరత వచ్చును.
  2. అందరూ వరి వేస్తే నీటి సమస్య వచ్చి జీవరాసులపై ప్రభావం చూపును.
  3. అందరికీ ఒకే ఎరువులు కావాలి. కాబట్టి వాటి ధర కూడా పెరుగును.
  4. ఒక పొలంలో వ్యాధులు సోకితే మిగతా పొలాలకు కూడా చాలా తొందరగా వ్యాధులు వ్యాపించును. దీనివలన జీవవైవిధ్యానికి ఆటంకం వచ్చును.
  5. ఒకవేళ, అందరికీ పొలాలు బాగా పండి పంట దిగుబడి ఎక్కువ వస్తే అమ్మకపు ధర పడిపోవును.
  6. అమ్మకపు ధర తగ్గితే రైతు నష్టపోవును.

ప్రశ్న 8.
రాత్రి కాలానికి, పంట దిగుబడికి సంబంధం ఏమిటి ?
జవాబు:
రాత్రి కాలానికి, పంట దిగుబడికి చాలా దగ్గర సంబంధం గలదు. మొక్క పుష్పించడం రాత్రికాల సమయం పై ఆధారపడి ఉంది. ఉదా : కొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12 1/2 గంటలు ఉన్నప్పుడు మాత్రమే అధికంగా పుష్పించును. ఉదా: గోధుమ.
మరికొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12 1/2 గంటలు కన్నా ఎక్కువ ఉన్నప్పుడే బాగా పుష్పిస్తాయి. ఉదా : జొన్న, ప్రత్తి.
పుష్పించిన తర్వాత పరాగ సంపర్కం జరుగును. పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఫలదీకరణ జరుగును. ఫలదీకరణ తర్వాత పుష్పాలు కాయలుగా మారును. కాసిన దానిని బట్టే పంట దిగుబడి ఉండును.

ప్రశ్న 9.
విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకు ?
జవాబు:
విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకంటే నేలలో ఉన్న ఏవైనా శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవుల నుండి విత్తనాలను రక్షించుకొనుటకు రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు.

ప్రశ్న 10.
నారు పోసి పెంచి వాటిని తిరిగి పొలాల్లో నాటే పద్ధతిలో పెంచే పంటలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
1. వ్యవసాయంలో కొన్ని పంటలను నారు పోసి పెంచి తిరిగి పంట పొలాల్లో నాట్లు వేస్తారు.
2. ఈ పద్ధతిని ప్రధానంగా వరి పంటలో పాటిస్తారు.
3. వరితో పాటుగా, మిరప, వంగ, టమోటా, పొగాకు వంటి పంటలలోనూ నాట్లు వేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 11.
సత్యనారాయణ తన పొలంలో ప్రత్తి పంట పండించాడు. అతనికి సరైన దిగుబడి రాలేదు. పంట దిగుబడి సరిగా రాకపోవడానికి గల కారణాలు ఊహించి చెప్పగలరా ? (లేదా) ఒక రైతు తన పొలంలో పత్తి పంట పండించాడు. పత్తి దిగుబడి సరిగా రాలేదు. దీనికి ఏవైనా నాలుగు కారణాలు ఊహించి రాయండి.
జవాబు:

  1. అతను వేసిన నేల ప్రత్తి పంటకు అంత అనుకూలంగా లేకపోవచ్చు.
  2. అతను పంటను రబీ సీజన్లో వేసి ఉండవచ్చు. దీనివలన అది పుష్పించుటకు కావలసిన రాత్రి సమయం (12 1/2 గంటల కంటే ఎక్కువ) ఉండదు.
  3. పొలాన్ని సరిగా దున్ని, చదును చేయకపోవచ్చు.
  4. ప్రత్తి పంటకు సరైన నీటి పారుదల వసతి కల్పించకపోవచ్చు.
  5. ప్రత్తి విత్తనాల ఎంపిక సరిగా చేయకపోవచ్చు.
  6. కలుపు మొక్కలను పత్తి పంట నుంచి తొలగించకపోవచ్చు.
  7. ప్రత్తి పంటకు. వ్యాధులు సోకిన గమనించక పోవచ్చు.
  8. ప్రత్తి పంటకు సరైన కాలంలో శిలీంధ్ర నాశకాలు ఉపయోగించటం జరగకపోవచ్చు.

ప్రశ్న 12.
రహీం తన పంట పొలంలో కలుపు మొక్కలను తొలగించాడు. కాని డేవిడ్ కలుపు తీయలేదు. ఎవరు అధిక దిగుబడి సాధిస్తారో ఊహించండి ? ఎందుకు ?
జవాబు:
డేవిడ్ ఎక్కువ దిగుబడి సాధిస్తాడు. కారణం కలుపు మొక్కలను పొలంలో కలియదున్నాడు. అవి మడి ఉన్న నీటిలో కుళ్లి పోతాయి. అప్పుడు వాటిలోని పోషక పదార్థాలు నేలలోకి చేరతాయి. అది జీవ ఎరువు వలె పని చేయును.

ప్రశ్న 13.
పిడికెడు శెనగలను నీళ్ళలో వేయండి. మీరేమి పరిశీలించారో కింది ప్రశ్నల ఆధారంగా విశ్లేషించండి.
ఎ) రెండు రకాల విత్తనాల్లో మీరేమి తేడాను గమనించారు ?
బి) ఏ విత్తనాలు తక్కువ బరువు కలిగి ఉన్నాయి ? ఎందుకు ?
సి) ఏ విత్తనాలు బాగా మొలకెత్తాయి? ఎందుకు ?
డి) ఏ విత్తనాలు సరిగా మొలకెత్తవు ? ఎందుకు ?
జవాబు:
ఎ) కొన్ని విత్తనాలు నీటిపై తేలుతున్నాయి. కొన్ని విత్తనాలు నీటిలో మునిగిపోయాయి.
బి) కీటకాలు విత్తనం లోపల గల ఆహార పదార్థాలు తినుట వలన పుచ్చులు ఏర్పడి తక్కువ బరువు కలిగి ఉన్నాయి.
సి) నీటిలో మునిగి నీటిని బాగా పీల్చుకున్న విత్తనాలు బాగా మొలకెత్తాయి. కారణం పోషక పదార్థాలలో ఉన్న షుప్తావస్థ మేలుకోవడం వలన.
డి) నీటిపై తేలిన విత్తనాల లోపల పోషక పదార్థాలు తక్కువగా ఉండబట్టి సరిగా మొలకెత్తవు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 14.
వరి (వడ్ల గింజలు) విత్తనాలు తీసుకొని ఒక రోజంతా నానబెట్టండి. వాటిని వాచ్ గ్లాస్ లో తీసుకొన్న మట్టిలో నాటండి. మొలకెత్తిన తర్వాత భూతద్దంలో పరిశీలించి ప్రథమమూలం, ప్రథమ కొండం మొదలైన భాగాలు గుర్తించి, పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 1

ప్రశ్న 15.
మీ దగ్గరలోని ఎరువుల దుకాణానికి వెళ్ళి రసాయనిక ఎరువుల వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 2
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 3

ప్రశ్న 16.
వరి పంటలో నాటడం నుండి దాచడం వరకు ఉన్న వివిధ దశలను వివరించే ఫ్లోచార్టును తయారు చేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 4
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 5

ప్రశ్న 17.
తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాలలో అనుసరించే నీటిపారుదల పద్ధతులను నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:

  1. తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాలలో నీటిని పొదుపుగా వాడుకోవటానికి బిందు సేద్యం, స్ప్రింక్లర్స్ వంటి పరికరాలు ఉపయోగిస్తారు.
  2. వీటి వలన చాలా తక్కువ నీటితో వ్యవసాయం చేయవచ్చును.
  3. శాస్త్ర విజ్ఞానం అందించిన ఈ పద్దతులు నాకు బాగా నచ్చాయి.
  4. ఈ పద్దతుల వినియోగం వలన నీటికొరత ప్రాంతాలు ఆర్థికంగా బలపడ్డాయి.
  5. వీటి వినియోగం వలన సహజవనరు అయిన నీరు ఆదా చేయబడుతుంది.
  6. ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చే ఇటువంటి పద్ధతులు అభినందనీయమైనవి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 18.
నరేంద్ర ప్రత్తిపంటపై అధిక మోతాదులో క్రిమిసంహారక మందులు చల్లాడు. ఇది జీవవైవిధ్యానికి, పంట దిగుబడికి ఎంతో హానికరం అని రమేష్ అన్నాడు. నీవు రమేష్ చెప్పిన దానితో ఏకీభవిస్తున్నావా ? ఎందుకు ?
జవాబు:
నేను రమేష్ చెప్పిన దానితో ఏకీభవిస్తాను. ఇది జీవవైవిధ్యానికి, పంట దిగుబడికి ఎంతో హానికరం. అధిక మొత్తంలో క్రిమిసంహారక మందుల వలన హానికరమైన కీటకాలతో బాటు పరాగ సంపర్కానికి సహాయపడు కీటకాలు మరణించును. పరాగ సంపర్కం జరగకపోతే ఫలదీకరణం జరగదు.

అప్పుడు పంట దిగుబడి తగ్గును. క్రిమిసంహారక మందుల వలన కొన్ని కీటక జాతులు అంతరించిపోవును. అప్పుడు ఆ కీటకాలను తిని బ్రతికే జీవులు అంతరించిపోవును. ఆ విధంగా జరిగితే ఆహారపు గొలుసు అస్తవ్యస్తం అగును. ఇది జీవవైవిధ్యంపై ప్రభావం చూపును.

ప్రశ్న 19.
వెంకటేష్ వరిపంటకు నీళ్లను పెట్టే పద్ధతిని చూశాడు. తాను కూడా మొక్కజొన్న పంటకు ఇలాగే నీళ్లను పెట్టాలనుకున్నాడు. నీవు అతనికి ఏ సూచనలు, సలహాలు ఇస్తావు ?
జవాబు:
వెంకటేష్ కు మొక్కజొన్న పంటకు, వరిపంటకు నీళ్ళు పెట్టే విధంగా పెట్టవద్దు అని నేను సూచన చేస్తాను. ఇంకా అతనికి మొక్కజొన్న అనేది. మెట్ట పంట మరియు వర్షాధారపు పంట అని, వరిపంటకు అవసరమైనంత నీళ్ళు మొక్కజొన్నకు అవసరం లేదు అని సలహా ఇస్తాను.

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers

కృత్యములు

ప్రశ్న 1.
భారతదేశ పటం చూడండి. మన దేశంలో ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ పండిస్తున్నారో పరిశీలించి రాయండి. (అవసరమైతే అట్లాసును కూడా ఉపయోగించుకోండి.)
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 6
జవాబు:
వరి : అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, హర్యానా, కాశ్మీర్
గోధుమ : ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర
మొక్కజొన్న : రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, గుజరాత్
జొన్న : రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్
పప్పుధాన్యాలు: మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్
చెరకు : ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్
జనపనార : పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశా, అసోం
కొబ్బరి : కేరళ
ప్రత్తి : కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్
టీ : కర్ణాటక, అసోం, మణిపూర్

1. మన దేశంలోని అన్ని ప్రాంతాలలో పండే పంటలు ఏవి ?
జవాబు:
వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ప్రత్తి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

2. కొన్ని పంటలను అన్ని ప్రాంతాలలోనూ ఎందుకని పండించగలుగుతున్నారు ?
జవాబు:
సారవంతమైన భూమి, నీరు లభ్యత వలన.

3. పై పట్టికలో మీ ఊళ్ళో పండే పంటలు ఏవో గుర్తించి రాయండి.
జవాబు:
వరి, చెరకు, మొక్కజొన్న, పెసలు.

4. మీ సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాన్ని గాని, గ్రంథాలయంలోని పుస్తకాలను గాని చూసి వివిధ ప్రదేశాలలో ప్రధానంగా పండే పంటలు జాబితా తయారుచేయండి.
జవాబు:
దేశం : వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న.
రాష్ట్రం : వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ప్రత్తి, చెరకు, జనపనార జిల్లా : వరి, చెరకు, మామిడి, అరటిపండు
మీ గ్రామం : వరి, చెరకు (గమనిక : ఏ గ్రామ విద్యార్థులు అక్కడ పండే పంటలు సేకరించి రాసుకోవాలి.)

ప్రశ్న 2.
మీ గ్రామంలోని రైతులను అడిగి ఏ పంటలు పండడానికి ఎంతకాలం పడుతుందో వివరాలు సేకరించండి. కింది పట్టికలో రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 7

1. పంటలు పండుటకు ఎంత కాలం పడుతుంది ?
జవాబు:
సుమారుగా 100 రోజుల లోపు నుంచి దాదాపుగా 365 రోజులు పడుతుంది.

2. అన్ని పంటలు పండడానికి పట్టేకాలం ఒక్కటేనా ?
జవాబు:
కాదు.

3. మీకు తెలిసిన పంటలలో ఏ పంట పండడానికి ఎక్కువ సమయం పడుతుంది ?
జవాబు:
చెరకు

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

3. పంటలను ఎప్పుడు పండిస్తారు ?

ప్రశ్న 1.
మనం రకరకాల పండ్లు, కూరగాయలు తింటుంటాం. సంవత్సరం పొడవునా అన్ని రకాల పండ్లు, కూరగాయలు మనకు లభిస్తాయా ? కొన్ని కాలాల్లో అధికంగాను, కొన్ని కాలాల్లో తక్కువగాను లభిస్తాయి. కొన్ని ఒక ప్రత్యేక రుతువులో తప్ప మిగిలిన సమయాల్లో అసలు లభించవు. జట్టులో చర్చించి ఏ కాలంలో ఏవి లభిస్తాయో కింది పట్టికలో రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 8

1. ఏ కాలంలో ఎక్కువ రకాల కూరగాయలు మనకు మార్కెట్లలో లభిస్తాయి ? ఎందుకు ?
జవాబు:
వర్షాకాలంలో వర్షపు నీరు వలన.

సాధారణంగా రైతులు వర్షాకాలంలోనే వివిధ రకాల కూరగాయలు పండిస్తారు. కారణమేమిటో ఊహించి చెప్పగలరా ?
జవాబు:
కావలసినంత నీరు లభిస్తుంది. కాబట్టి.

ప్రశ్న 4.
కింది ఫోను చూడండి. ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 9

1. రబీ సీజన్లోనే గోధుమ పంటను ఎందుకు సాగుచేస్తారు ?
జవాబు:
ఫిబ్రవరి నెలలో వాతావరణం వేడిగా ఉంటుంది. గింజ అభివృద్ధి చెందడానికి ఇది సరైన సమయం. గోధుమ పుష్పించడానికి రాత్రి కాల సమయం తక్కువగా ఉండటంతో పాటు విత్తనాలు ఏర్పడటానికి తగినంత వేడి కూడా వాతావరణంలో ఉండటం అవసరము. అందుకే గోధుమపంటను రబీ సీజన్ లోనే సాగుచేస్తారు.

2. సెప్టెంబరు నెలలో సాగుచేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
సెప్టెంబరులో సాగుచేస్తే అవి పుష్పించుటకు 8 నుండి 10 వారాలు పట్టును. అనగా జనవరిలో పుష్పించుట జరుగును. రాత్రి సమయం ఎక్కువగా అనగా 12 1/2 గంటలు ఉంటుంది. కాబట్టి పుష్పాలు సరిగా రావు. పంట దిగుబడి తగ్గుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

3. ఎందుకు ఖరీఫ్ సీజన్లో గోధుమపంట సాగు చేయరు ?
జవాబు:
అవి పుష్పించుటకు కావల్సినంత రాత్రి సమయం ఉండదు కాబట్టి.

4. గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే ఏమవుతుంది ?
జవాబు:
గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. కారణం ఫిబ్రవరిలో రాత్రి కాల సమయం తక్కువగా ఉండి, విత్తనాలు ఏర్పడటానికి తగినంత వేడి కూడ వాతావరణంలో ఉండును.

5. గింజలు బలంగా పెరగడానికి తగినంత ఉష్ణోగ్రత అవసరం. మరి మనకు ఎప్పుడు వేడి అధికంగా ఉంటుంది ?
జవాబు:
రబీ సీజన్లో వేడిమి ఎక్కువగా ఉంటుంది.

5. వరిసాగు

ప్రశ్న 5.
మీ దగ్గరలోని రైతులను అడిగి వివరాలు సేకరించి కింది పట్టిక నింపండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 10

1. ఏ కాలంలో రైతులు అధిక ఫలసాయం, ఆదాయం పొందుతున్నారు ?
జవాబు:
ఖరీఫ్ కాలంలో.

2. మంచి పరిమాణంలో ఉండే గింజలు ఏ కాలంలో వస్తాయి ? రబీలోనా ? ఖరీఫ్ లోనా ?
జవాబు:
ఖరీఫ్ లో.

3. మూడవ పంట గురించి తెలుసా ? మన రాష్ట్రంలో మూడవ పంటగా వేటిని పండిస్తారు ?
జవాబు:
తెలుసు. అపరాలను మన రా” లో 3వ పంటగా పండిస్తారు.

4. ఖరీఫ్, రబీ రెండు కాలాలలోనూ పండే పంటలు ఏమిటి ?
జవాబు:
వరి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

5. రబీ సీజన్ కంటే ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీరు అంగీకరిస్తారా ? అయితే కారణాలు చెప్పండి.
జవాబు:
అంగీకరిస్తాను. కారణాలు ఖరీఫ్ సీజన్ లో వరి మొక్కల పెరుగుదలకు అవసరమైనంత నీరు లభించును. వేడిమి తక్కువగా ఉండును

6. మంచి విత్తనాలను వేరు చేయడం, ఎంపిక చేయడం ఎలాగో మీకు తెలుసా ?

ప్రశ్న 6.
గుప్పెడు శనగ విత్తనాలను తీసుకొని బక్కెట్లోని నీళ్లలో వేయండి. కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. నీళ్ళపై తేలిన విత్తనాలన్నింటిని తీసివేయండి. నీళ్ళలో మునిగిన వాటిని అలాగే ఒక రోజంతా ఉంచండి. మరుసటి రోజు వీటిని ఆరబెట్టి గిన్నెలోగాని, పాత్రలోగాని వేసి మూత పెట్టి తగినంత వేడిగా ఉండే చీకటి గదిలో ఉంచండి. 2 లేక 3 రోజుల తర్వాత విత్తనాలను పరిశీలించండి. ఏం జరిగినది ? నీవెప్పుడైనా మొలకెత్తిన గింజల్ని తిన్నావా ?
జవాబు:
శనగ విత్తనాల నుంచి మొలకలు రావడం జరిగినది. నేను చాలాసార్లు మొలకెత్తిన గింజలు తిన్నాను.

1. ఎందుకు కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలాయి ?
జవాబు:
కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. కారణం అవి పుచ్చు విత్తనాలు అయి ఉండటం వలన విత్తనం లోపల ఖాళీగా ఉండి నీటికన్న తక్కువ సాంద్రత ఉంటాయి. అందుకని నీటిపై తేలుతాయి.

2. తేలిన విత్తనాలను ఎందుకు తీసి వేయాలి ?
జవాబు:
తేలిన విత్తనాలకు మొలకెత్తే సామర్థ్యం ఉండదు కాబట్టి వాటిని తీసివేయాలి.

3. విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి ?
జవాబు:
విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టడం వలన విత్తనం తేమగా అయ్యి విత్తనాలకు అంకురించే శక్తి వస్తుంది.

7. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి. ఒక పిడికెడు గింజల్ని నీళ్ళలో వేయండి. కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. వాటిని వేరుచేసి భూతద్దంలో పరిశీలించండి. నీటమునిగిన గింజలకు, తేలిన గింజలకు గల పోలికలు, భేదాలను గుర్తించి మీ పరిశీలనలను కింది పట్టికలో ‘✓’ గుర్తు పెట్టండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 11

1. పై రెండు రకాల గింజల్లో ఏవైనా తేడాలను మీరు గుర్తించారా ?
జవాబు:
పై రెండు రకాల గింజల్లో తేడాలను మేము గమనించాము.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

2. నీళ్ళపై తేలిన విత్తనాలు తక్కువ బరువు ఎందుకున్నాయో చెప్పగలరా ?
జవాబు:
లోపల పోషక పదార్థాలు లేక ఖాళీగా ఉండడం వలన.

8. ఎంపిక మరియు మొలకెత్తుట

నీళ్ళలో తేలిన విత్తనాలను, మునిగిన విత్తనాలను వేరువేరుగా కుండీల్లో నాటండి. రెండు కుండీల్లోనూ సమానంగా నీరు పోయండి. రెండు కుండీల్లోని మొక్కల పెరుగుదలను పరిశీలించండి. నివేదిక తయారుచేయండి.
తేలిన విత్తనాలు : ఇవి వేసిన కుండీలో మొక్కలు సరిగా రాలేదు. పెరుగుదల తక్కువగా ఉంది.
మునిగిన విత్తనాలు : ఇవి వేసిన కుండీలో మొక్కలు బాగా వచ్చాయి. పెరుగుదల కూడా చాలా బాగుంది.

1. ఏ గింజలు బాగా మొలకెత్తినాయి ? ఎందుకు ?
జవాబు:
నీటిలో మునిగిన విత్తనాలు. కారణం లోపల ఉన్న పోషక పదార్థాలు ఉత్తేజితం అయి విత్తనాలు మొలకెత్తుటకు కావలసిన
శక్తిని ఇస్తుంది.

2. ఏ గింజలు సరిగా మొలకెత్తలేదు ? ఎందుకు ?
జవాబు:
నీటిపై తేలిన గింజలు. కారణం పోషక పదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి విత్తనాలు మొలకెత్తుటకు కావలసిన శక్తి సరిగా రాదు.

3. అన్ని రకాల పంట గింజలను ఇలాగే పరీక్ష చేస్తారా ?
జవాబు:
అవును, ఇలాగే పరీక్ష చేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

9. ఏ విత్తనాలను ఏ ఏ పద్ధతుల్లో నాటుతారో రైతుల నుండి వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 12

1. ఒక ఎకరా వరి పంట పండించడానికి ఎన్ని కిలోల వరి గింజలు అవసరమో నీకు తెలుసా ?
జవాబు:
సుమారు 25 కేజీలు.

2. అన్ని రకాల వరి పంటలకు ఇదే పరిమాణంలో అవసరమవుతాయా ?
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 13
జవాబు:
అన్ని రకాల వరి పంటలకు ఇదే పరిమాణంలో అవసరమవ్వవు.
ఉదా : నాటే పద్ధతి – 20 – 25 కేజీలు,
వెదజల్లటానికి – 24 – 30 కేజీలు
శ్రీ పద్ధతి – 2 కేజీలు

3. తక్కువ వితనాలు ఉపయోగించి వరిసాగు చేసే పదతులు ఏమైనా ఉన్నాయా ? విత్తనాలు చెత చల్లటం
జవాబు:
ఉన్నది. ఆ పద్ధతి శ్రీ పద్ధతి.

4. విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో ఎందుకు కప్పుతారు ?
జవాబు:
విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో కప్పుటకు కారణాలు మట్టి నుండి వాటికి కావలసిన తేమను, వేడిమిని పొందుటకు మరియు గుల్లగా ఉన్న నేల నుండి గాలిని తీసుకొనుటకు. మట్టిలో విత్తిన తర్వాత కప్పకపోతే పక్షులు, ఇతర జంతువులు ఆ విత్తనాలను తినేస్తాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

10. నలుగురైదుగురు విద్యార్థులతో జట్లుగా ఏర్పడండి. మీ దగ్గరలోని పొలంలో మందులు ‘చల్లుతున్న రైతులను అడిగి ఏ ఏ పంటలకు ఏ ఏ వ్యాధులు ఎలా వస్తాయి ? వాటిని ఎలా అదుపు చేస్తారు ? ఏ మందులు చల్లుతారు ? వంటి వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి. వ్యాధి పేరు తెలియకపోతే దానిని స్థానికంగా ఏమంటారో రాయండి.
పంటలకు (వరి, వేరుశనగ, చెరకు, మినుము) ముఖ్యంగా అగ్గితెగులు, టిక్కా, ఆకుపచ్చ తెగులు, తుప్పు తెగులు బూడిద తెగులు.
ముఖ్యంగా వ్యాధులు బాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు కొన్ని రకాల కీటకాల వలన వచ్చును.
పంట పేరు, పరిశీలించిన వ్యాధులు, ఉపయోగించిన క్రిమిసంహారక మందులు, ఫలితాలు క్రింది పట్టికలో ఉన్నాయి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 14

1. అందరు రైతులు ఒకే రకమైన పంటపైన ఒకే రకమైన మందులే చల్లుతున్నారా ?
జవాబు:
చల్లరు. అది వాళ్ళ ఇష్టం. ఉదాహరణకు వరి అగ్గి తెగులుకు ట్రైసైక్లోజన్ 75% లేదా ఎడిఫెన్ పాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తారు.

2. అన్ని రకాల పంటల్లో సాధారణంగా కనిపించే వ్యాధి ఏదో గుర్తించావా ?
జవాబు:
రసంపీల్చే పురుగు వ్యాధి.

3. రైతులు క్రిమి సంహారక మందులను ఎక్కడ కొనుక్కుంటారు ?
జవాబు:
ఎరువులు మరియు క్రిమి సంహారక మందులు అమ్మే కొట్టులో కొనుక్కుంటారు.

4. మందులు చల్లడానికి వారు ఎలాంటి పనిముట్లను వాడుతున్నారు ?
జవాబు:
నాక సాక్ స్ప్లేయర్, గటార్ ప్రేయర్, తైవాన్ ప్రేయర్, పవర్ స్ప్లేయర్, రోటరీ డస్టర్.

5. క్రిమి సంహారక మందులు చల్లినప్పుడు క్రిమికీటకాలతో పాటు ఇంకా ఏవైనా చనిపోయినట్లు నీవు గుర్తించావా ? అయితే అవి ఏమిటి ?
జవాబు:
క్రిమిసంహారక మందులు చల్లినప్పుడు క్రిమికీటకాలతో పాటు పరాగ సంపర్కంకు సహాయపడు జీవులు చనిపోయినట్లు నేను గుర్తించితిని. అవి తూనీగలు, సీతాకోక చిలుకలు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

11. మీ పాఠశాల తోటలోని మొక్కలను పరిశీలించండి. మొక్కల ఆకులు, కాండాలను జాగ్రత్తగా పరిశీలించి కింది వివరాలు సేకరించండి. లక్షణం ఉంటే “✓” లేకపోతే “×” పెట్టండి. లక్షణం
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 15
పంటపేరు /మొక్క పేరు : వేరుశనగ స్థలం : మొక్కలలోని ఆకులపైన

1. మొక్కలోని అన్ని ఆకులపైనా మచ్చలున్నాయా ?
జవాబు:
ఉన్నాయి.

2. మచ్చలతో ఉన్న ఆకు బొమ్మను మీ నోటు పుస్తకంలో గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 16

3. ఆకుల అంచులు కత్తిరించబడినట్లుగా ఉండడానికి కారణమేమి ?
జవాబు:
చీడల వలన ఆకులు అంచులు కత్తిరించబడినట్లు ఉండును.

4. కాండంపై ఉండే చారలు, ఆకులపై ఉండే మచ్చలు ఒకేలా ఉన్నాయా ?
జవాబు:
ఒకేలా ఉన్నాయి.

5. ముడుచుకొనిపోయిన ఆకుల్లో ఏవైనా కీటకాలను గుర్తించావా ? అయితే అవి ఏమిటి ?
జవాబు:
కీటకాలు ఉన్నాయి అవి రసం పీల్చే పురుగులు, రెక్కల పురుగులు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

6. ఆకుల మచ్చలపై ఉన్న పొడిలాంటి పదార్థాన్ని సేకరించండి. దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. మీరేం గమనించారో మీ నోటుపుస్తకంలో రాయండి.
జవాబు:
ఆకుల మచ్చలపై ఉన్న పొడిలాంటి పదార్థాన్ని సేకరించితిని. దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించితిని. అప్పుడు ఆ పొడిలో శిలీంధ్రం యొక్క తంతువులు, స్పోర్సు కనిపించాయి.

12. చీడ పీడల్ని నియంత్రించే పద్ధతులు

ప్రశ్న 1.
మీ గ్రామంలోని రైతులు వివిధ పంటల్లో వచ్చే క్రిమి కీటకాలను అదుపు చేయడానికి వివిధ రకాల కీటక నాశనులు ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. మీ పెద్దలను కాని), రైతులను కాని అడిగి ఏ ఏ పురుగు మందులను కింది పద్ధతుల్లో ఉపయోగిస్తారో తెలుసుకొని రాయండి.
జవాబు:
1. స్పేయర్ తో చల్లడం : మోనోక్రోటోపాస్, ప్రొఫేనోపాస్, నూవాన్, స్పైనోఫాడ్
2. పొడి మందులు చల్లడం : మిథైల్ థెరాఫియాన్, ఫాలిడాల్
3. నేలలోపల ఉంచడం : కార్బొప్యూరాన్, కార్టాక్ హైడ్రోక్లోరైడ్
4. కాల్చడం, పీకివేయడం : వైరల్ కి సంబంధించిన వ్యాధులలో పొలాల నుంచి ,రోగకారక మొక్కలను కాల్చడం, పీకివేయడం చేస్తారు.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 17

13. రైతులు పంటలకు నీళ్ళెప్పుడు పెడతారు ?

ప్రశ్న 1.
మీ దగ్గరలోని రైతులను అడిగి ఏ ఏ పంటలకు నీళ్ళను ఎప్పుడెప్పుడు పెడతారో తెలుసుకొని కింది పట్టిక నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 18

ప్రశ్న 2.
అన్ని పంటలకు నీళ్ళు ఒకేసారి అందిస్తారా ?
జవాబు:
లేదు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

14. మీ దగ్గరలోని తోటకు వెళ్ళి స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను పరిశీలించండి. ఈ పద్ధతిలో ఉపయోగించే పరికరాలు పనిముట్లు వాటిని అమర్చిన విధానం, నీటిని పంపిణీ చేసే విధానం, ఈ పద్ధతి వల్ల కలిగే లాభాలు, నష్టాలు మొదలగు వివరాలతో నివేదిక తయారుచేయండి. ఇందుకోసం అక్కడి రైతులను కలిసి మాట్లాడండి. వివరాలు సేకరించండి.
జవాబు:
స్ప్రింక్లర్ పద్ధతి :
ఎ) పరికరాలు & పనిముట్లు : మోటారు, గొట్టాలు, గుండ్రంగా తిరిగే స్ప్రింక్లర్స్, కవాటాలు, నాజిల్స్.
బి) వాటిని అమర్చిన విధానం మరియు నీటిని పంపిణీ చేయు విధానం : నీరు ఉన్న ప్రాంతాలలో గొట్టాలు అమర్చి ఒక మోటారు సహాయంతో నీరు బయటకు తెచ్చి పొలంలో లంబంగా అమర్చబడిన గొట్టాలకు గుండ్రంగా తిరిగే స్ప్రింక్లిల్స్ ద్వారా నీటిని పొలంలో వెదజల్లుతారు.
డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) : నీరు ఉన్న ప్రాంతాలలో గొట్టాలు అమర్చి ఒక మోటారు సహాయంతో నీరు బయటకు తెచ్చి పొలంలో సమాంతరంగా నిర్ణీత ప్రదేశాలలో రంధ్రాలు (మొక్క వేరుకు దగ్గరగా) చేయబడిన గొట్టాలు అమర్చి నీటి బిందువుల రూపంలో మొక్క వేరుకు సరఫరా చేస్తారు.
లాభాలు :
1. నీరు ఎక్కువగా అందుబాటులేని చోట
2. ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిలో
3. ఇసుక నేలలకు ఈ పద్దతి బాగా ఉపయోగపడును.

నష్టాలు :
1. ఖర్చుతో కూడి ఉన్నది.
2. అన్ని రకాల పంటలకు అనుకూలం కాదు.

15. కలుపు మొక్కల సమాచారం :

ప్రశ్న 1.
మీ దగ్గరలోని రైతులను అడిగి ఏ ఏ పంటలలో ఏ ఏ కలుపు మొక్కలు పెరుగుతాయో తెలుసుకుని ఒక నివేదిక తయారు చేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 19

16. మీ గ్రామంలోని చుట్టుప్రక్కల గాని, వివిధ పంటలకు పంట నూర్పిడి చేసే పద్ధతుల వివరాలు సేకరించి పట్టిక నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 20

ఆలోచించండి – చర్చించండి

ప్రశ్న 1.
జపాన్లో అధిక దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ? (పేజీ.నెం.118)
జవాబు:
జపాన్ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ఉపయోగించటం. జపాన్ అత్యధిక దిగుబడి వచ్చే వరి విత్తనాలు ఉపయోగించటం.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 2.
భారతదేశంలో తక్కువ దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ? (పేజీ.నెం. 118)
జవాబు:
భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రాచీన పద్ధతులు ఉపయోగించుట. వ్యవసాయంలోనికి చదువుకున్న వాళ్ళు రాకపోవటం.

ప్రశ్న 3.
నాగలి కర్రు పొడవుకి, విత్తటానికి ఏమైనా సంబంధం ఉందా ? (పేజీ.నెం. 119)
జవాబు:
లేదు.

ప్రశ్న 4.
మెట్ట పొలాల్లో కూడా నేలను ఇలాగే తయారు చేస్తారా ? (పేజీ.నెం. 119)
జవాబు:
మెట్ట పొలాల్లో కూడా నేలను ఇలాగే తయారు చేస్తారు.

ప్రశ్న 5.
నేలను దున్నడం వల్ల కలిగే ప్రయోజనాలేవి ? (పేజీ.నెం. 119)
జవాబు:
నేలను దున్నడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి :
1) మట్టి మృదువుగా మారడం వల్ల నేల లోపల నీరు చాలా కాలం నిల్వ ఉంటుంది.
2) వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొనిపోవడానికి వీలు అగును.
3) వేళ్ళకు శోషించడానికి అవసరమైన గాలి, నీరు నేలలోకి సులభంగా చేరును.
4) రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టిలో బాగా పెరుగుతాయి.
5) నేలను దున్నడం వల్ల నేల లోపల ఉన్న కొన్ని రకాల అపాయకరమైన సూక్ష్మజీవులు, క్రిమికీటకాల గుడ్లు బయటికి వచ్చి సూర్యుని వేడికి నశించును.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 6.
ఎందుకు ఈ చాళ్లు “v” ఆకారంలో ఏర్పడతాయి? నేలలో “V” ఆకారంలో చాళ్లు ఏర్పడటం వల్ల చాళ్ల వెంట నీళ్ళను పాగించడమే కాక ఇంకా ఏ ఏ రకాలుగా ఉపయోగపడుతుందో చెప్పండి. (పేజీ.నెం. 120)
జవాబు:
నాగలి చివర పదునైన ఇనుపబద్ధ (కర్ర) ఉంటుంది. నాగలితో చాళ్ళను చేయునపుడు ఈ కర్ర నేలలోనికి చొచ్చుకొని పోతుంది. అందువలన ఆ ప్రదేశంలో ఉన్న మట్టి కర్రుకు ఇరువైపులా గట్టురూపంలో ఏర్పడుతుంది. కనుక వాళ్ళు v ఆకారంలో ఏర్పడతాయి.

v ఆకారం చాళ్ళు వల్ల ఉపయోగములు :

1) ఈ చాళ్ళ వలన గాలి నీరు లోపలి మట్టి కణాల మధ్యకు సులభంగా చేరతాయి.
2) విత్తనాలను ఒక వరుస తరువాత ఒక వరుస విత్తుతుంటారు. ఆ సమయంలో మొదటి వరుస మట్టితో రెండవ వరుస మూసుకొనుటకు ఈ v ఆకారపు చాళ్ళు ఉపయోగపడును.

ప్రశ్న 7.
ఎరువుల కోసం రైతులు పోట్లాడుకోవడం, ఉద్యమాలు చేయడం మీరెప్పుడైనా చూశారా లేదా పత్రికల్లో చదివారా ? ఎందుకు ఇలా జరుగుతోంది ? ఎందుకు రైతులు ఎక్కువ ఎరువుల బస్తాలు కావాలని కోరుకుంటారు ? దీనికి సంబంధించిన మీ ఆలోచనలు చార్టు మీద రాసి గోడ పత్రికలో ప్రదర్శించండి. (పేజీ.నెం. 130)
జవాబు:
చూశాను మరియు పత్రికల్లో చదివాను. ఇలా జరుగుటకు కారణం ఎరువుల కొరత. రైతులు ఎక్కువ ఎరువుల బస్తాలు కావాలని ఎందుకు కోరుకుంటారు అంటే పంట దిగుబడి పెంచుటకు. దానికి సంబంధించిన నా ఆలోచనలు
1. రసాయనిక (కృత్రిమ) ఎరువులు తక్కువగా వాడటం.
2. జీవ (సహజ) ఎరువుల వాడకాన్ని పెంచటం.

పాఠ్యాంశంలోని ప్రశ్నలు

ప్రశ్న 1.
మూడవ పంట అన్ని ప్రాంతాలలో పండించకపోవడానికి కారణాలు ఏమిటో మీ ఉపాధ్యాయుడితో చర్చించండి. (పేజీ.నెం. 117)
జవాబు:
నీటి పారుదల వసతి లేకపోవడం. నేల సారాన్ని కోల్పోవడం.

ప్రశ్న 2.
వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడులుగా ఎందుకు చేస్తారు ? (పేజీ.నెం. 118)
జవాబు:
పంటకు నీరు అందించుట సులభంగా ఉంటుంది. కాబట్టి వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడుగులుగా చేస్తారు.

ప్రశ్న 3.
వరిని ఎలా పండిస్తారు ? (పేజీ.నెం. 121)
జవాబు:
వరిని నారుపోసి, నాట్లు వేసి చిన్న చిన్న మడులలో పండిస్తారు.

ప్రశ్న 4.
మీ పెద్దలను గాని, రైతులను గాని అడిగి విత్తనాలు ఎక్కడ కొంటారో తెలుసుకోండి. (పేజీ.నెం. 121)
జవాబు:
విత్తనాలను అమ్ముటకు ధ్రువీకరించిన దుకాణాలలో కొంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 5.
ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి ? ఇలా ఎందుకు జరుగుతోంది ఆలోచించండి. (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే వాటి స్థానాన్ని సంకరణ జాతి విత్తనాలు ఆక్రమించటం వలన.

ప్రశ్న 6.
మొక్కలో ఏ భాగం వేరుగా మారుతుంది ? (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రథమ మూలం మొక్కలో వేరు భాగంగా మారును.

ప్రశ్న 7.
ఏ భాగం కాండంగా మారుతుందో చెప్పగలరా ? (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రథమ కాండం కాండంగా మారుతుంది.

ప్రశ్న 8.
ఏ ఏ పదార్థాలు ఉపయోగించి విత్తనశుద్ధి చేస్తారో జాబితా రాయండి. అదే విధంగా విత్తనాలు నాటే ముందు మీ ఊళ్ళో ఇంకా ఏ ఏ రకమైన పద్ధతులు అవలంభిస్తారో తెలుసుకొని మీ నోటు పుస్తకంలో రాయండి. (పేజీ.నెం. 123)
జవాబు:
విత్తనాలను ఈ కింది రసాయనిక పదార్థాలు ఉపయోగించి శుద్ధి చేస్తారు. అవి :
1. కార్బడిజ
2. మాంకో జాజ్
3. ఇమడోకోట్రిడ్

ప్రశ్న 9.
నారు నాటడం ద్వారా ఇంకా ఏ ఏ పంటలు పండిస్తారో మీ స్నేహితులతో చర్చించి రాయండి. (పేజీ.నెం. 123)
జవాబు:
మిరప, వంగ, టమోటా మొదలైనవి నారు నాటడం ద్వారా పంటలు పండిస్తారు.

ప్రశ్న 10.
ఎందుకు నారు మొక్కలను దూరం దూరంగా నాటుతారు ? (పేజీ.నెం. 125)
జవాబు:
నారు మొక్కలు దూరం దూరంగా నాటుటకు కారణం అవి పెరిగి పెద్దగా అయిన తర్వాత స్థలం కోసం, నీటి కోసం, ” ఆహార పదార్థాల కోసం పోటీ లేకుండా ఉండుటకు.

ప్రశ్న 11.
అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగానే పీకి మళ్ళీ నాటుతారా ? అలా ఎందుకు చేయరు ? (పేజీ.నెం. 125)
జవాబు:
అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగా మళ్ళీ పీకి నాటరు. కారణం వాటి విత్తనాలు పెద్దవిగా ఉండటం.

ప్రశ్న 12.
వ్యాధి సోకిన పంటలోని మొక్కలను రైతు ఏం చేస్తాడు ? (పేజీ.నెం. 127)
జవాబు:
వ్యాధి సోకిన పంటలోని మొక్కల ఆకులు, అవసరం అనుకొంటే మొక్కలను రైతు తొలగిస్తాడు. అవి అన్నీ ఒకచోట వేసి కాలుస్తాడు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 13.
రామయ్య, అనే రైతు వ్యాధి సోకిన మొక్కలను పొలం నుండి పీకి కాల్చి వేశాడు. ఇది మంచిదా ? నీ స్నేహితులతో – చర్చించండి. (పేజీ.నెం. 127)
జవాబు:
రామయ్య అనే రైతు వ్యాధి సోకిన మొక్కలను పొలం నుండి పీకి కాల్చి వేశాడు. ఇది చాలా మంచిది. కారణం ఇతర , మొక్కలకు వ్యాధి కొంతమేర సోకదు.

ప్రశ్న 14.
రెండు రకాల కీటక నాశకాలను ఉపయోగిస్తే కీటక సంఖ్య మొదటి సంవత్సరం తగ్గింది కాని మరునాటి సంవత్సరం వాటి సంఖ్య పెరిగింది. కారణాలు తెలపండి. (పేజీ.నెం. 127)
జవాబు:
రెండు రకాల కీటక నాశకాలను ఒక్కసారి ఉపయోగించినపుడు మొదటి సంవత్సరం కీటకాల సంఖ్య తగ్గినది. రెండవ సంవత్సరం పెరిగాయి. కారణం ఆ మందులకు కీటకాలు నిరోధకతను ఏర్పరచుకున్నాయి.

ప్రశ్న 15.
రైతులు ఎరువులను ఎలా వేస్తారు ? (పేజీ.నెం.130)
జవాబు:
రైతులు ఎరువులను చేతితోగాని, కొన్ని పనిముట్లతో గాని వేస్తారు.

ప్రశ్న 16.
మీ పాఠశాలలో కంపోస్టు గుంత ఉందా ? అందులో ఏమేమి వేస్తుంటారు ? (పేజీ.నెం.130)
జవాబు:
మా పాఠశాలలో కంపోస్టు గుంత ఉంది. అందులో కూరగాయల తొక్కలు, మిగిలిన అన్నం, ఎండిన ఆకులు వేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 17.
కింది చిత్రాన్ని చూడండి. దీనిలో ఏ మూలకం ఏ పరిమాణంలో ఉందో చెప్పండి. (పేజీ.నెం. 130)
జవాబు:
నైట్రోజన్ 20%
ఫాస్ఫరస్ 5%
పొటాషియం 10%
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 21

ప్రశ్న 18.
ఏది మంచి ఎరువు ? రసాయనిక ఎరువులకు, సహజ ఎరువులకు మధ్యగల తేడాలు ఏవి (పేజీ.నెం. 131)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 22
(i) పై రెండింటిని పోల్చి ఏది మనకు ప్రయోజనకరమో చెప్పండి.
జవాబు:
సహజ ఎరువు.

(ii) పై పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఎరువులు వాడితే రైతులకు ప్రయోజనమో మీ ఉపాధ్యాయునితో చర్చించి రాయండి.
జవాబు:
సహజ ఎరువులు వాడితే రైతులకు ప్రయోజనం. ఇవి వేస్తే నేలలో హ్యూమస్ చేరుతుంది. అదే విధంగా నేల ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి.

ప్రశ్న 19.
రైతులు వరి పొలాలకు నీళ్ళు ఎప్పుడు అందిస్తారు ? (పేజీ.నెం. 132)
జవాబు:
నాట్లు వేసేటప్పుడు, మూన తిరిగిన రోజు నుండి పైరు దబ్బు చేయుటకు 2-3 రోజులకు ఒక్కసారి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 20.
మీ గ్రామంలో నీటి వనరులను వ్రాయండి. (పేజీ.నెం. 132)
జవాబు:
కాలువలు, చెరువులు, బావులు.

ప్రశ్న 21.
ఆ నీటి వనరులు రైతులకు ఉపయోగపడుతున్నాయా ? (పేజీ.నెం. 132)
జవాబు:
ఆ నీటి వనరులు రైతులకు ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 22.
మీ గ్రామంలో రైతులు ఏ రకంగా పొలాలకు నీళ్ళు పెడుతున్నారు ? (పేజీ.నెం. 132)
జవాబు:
మా గ్రామంలో రైతులు ఎక్కువమంది ఆధునిక పద్ధతుల ద్వారా, కొంతమంది పురాతన పద్ధతుల ద్వారా పొలాలకు నీళ్ళు పెడుతున్నారు.

ప్రశ్న 23.
కలుపు మొక్కలను ఎందుకు తొలగించాలి ? (పేజీ.నెం. 134)
జవాబు:
కలుపు మొక్కలు పోషక పదార్థాలు, నీరు, వెలుతురు కోసం పంట మొక్కలతో పోటీపడతాయి. దీనివల్ల సాగు మొక్కలు పెరగవు. అందుకే కలుపు మొక్కలు తొలగించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

SCERT AP 8th Class Biology Study Material Pdf 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 7th Lesson Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలు

8th Class Biology 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థను ఎలా నిర్వచిస్తావు ? సరైన ఉదాహరణతో వివరించండి.
జవాబు:
1. సజీవులు, నిర్జీవులు వాతావరణ కారకాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ వున్న ప్రకృతి యొక్క మూల ప్రమాణం అని నేను నిర్వచిస్తాను.
2. ఎందుకంటే ‘ఆవరణ వ్యవస్థ’లో ఈ మూడు ముఖ్యమైనవి.
ఉదా : ఇల్లు ‘ఒక’ ఆవరణ వ్యవస్థగా తీసుకుంటే, ఇంటిలో మనుషులు, కీటకాలు, చీమలు, ఈగలు, బల్లులు, మొక్కలు, పక్షులు ఇవన్నీ సజీవులు. మట్టి, కుర్చీలు, కర్రలు, గ్యాస్, గ్యాస్ పొయ్యి, పాత్రలు, దుస్తులు, సైకిళ్ళు, కార్లు, పుస్తకాలు ఇవన్నీ నిర్జీవులు.
3. ఇంటిలోని వాతావరణం – గాలి, ఉష్ణోగ్రత, నీరు, గాలిలో తేమ ఇవన్నీ వాతావరణ కారకాలు. వీటి మధ్య బంధం ఉంటుంది. ఇది నిలకడగా కొనసాగుతుంది. అందువల్ల మన ఇంటిని ‘ఒక ఆవరణ వ్యవస్థగా’ చూడవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 2.
జీవవైవిధ్యం ఆవరణవ్యవస్థను బలోపేతం చేయడానికి ఎలా దోహదపడుతుందో వివరించండి.
జవాబు:

  1. అనేక జాతులు, లక్షణాలు, భేదాలు గల జీవుల అభివృద్ధినే ‘జీవవైవిధ్యం’ అంటారు.
  2. ‘ఆవరణ వ్యవస్థ’ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దీనిలో జీవవైవిధ్యం ఉండాలి.
  3. ఒక ‘పార్కును’ తీసుకోండి. దీనిలో ఒక్క ‘గడ్డి’ (పచ్చిక) ఉంటే సరిపోతుందా ?
  4. లేదు. పార్కులో అనేక రకాల మొక్కలు, పూల మొక్కలు, తీగలు, పొదలు, గుల్మాలు, అలంకార మొక్కలు, చెట్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి. అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
  5. ఒకే జాతి కాకుండా, దీనిలోనే ఎన్నో ప్రజాతులు ఉండేలా చేస్తే ఎక్కువ జీవవైవిధ్యం ఉంటుంది.
  6. ఒక ఆవరణ వ్యవస్థలో జీవవైవిధ్యం ఎక్కువ ఉంటే అది మంచి ఆవరణ వ్యవస్థగా కొనసాగుతుంది.

ప్రశ్న 3.
ఆవరణ వ్యవస్థలో ఎలుకలు ఉన్నాయి. అందులో ఎక్కువ పిల్లులను ప్రవేశపెడితే ఏమవుతుంది ?
జవాబు:

  1. ఒక ఆవరణ వ్యవస్థలో ఎలుకలు ఉన్నాయి. వాటి సంఖ్య ఆ వ్యవస్థ శక్తి ప్రసరణకు అనుకూలంగా ఉంది.
  2. అక్కడి ఆహార గొలుసుకు అనుబంధంగా వాటి సంఖ్య ఉంది.
  3. మరి మనం కావాలని ఎక్కువ పిల్లులను ఈ ఆవరణ వ్యవస్థలోకి వదిలామనుకోండి.
  4. ఇవి (పిల్లులు) ఎక్కువ ఎలుకలను చంపివేస్తాయి. తద్వారా ఎలుకల సంఖ్య బాగా తగ్గి పిల్లుల సంఖ్య బాగా పెరిగి ఆవరణ వ్యవస్థ ‘సమతాస్థితి’ దెబ్బ తింటుంది.

ప్రశ్న 4.
ఈ క్రింది వాటిలో ఉత్పత్తిదారుడు ఏది ? ఎందుకు?
ఎ) నక్క
బి) శిలీంధ్రం
సి) కోడి
డి) గడ్డి
జవాబు:
పైన పేర్కొన్న నాలుగింటిలో ‘గడ్డి’ని ‘ఉత్పత్తిదారు’గా నేను భావిస్తాను. ఎందుకంటే
ఎ) నక్క – ఇది మాంసాహారి. తృతీయ వినియోగదారుని హోదాలో ఆహార జాలకంలో వుంది.
బి) శిలీంధ్రం – ఇది విచ్ఛిన్నకారి. కుళ్ళిన పదార్థాలపై నివసిస్తూ శక్తిని తీసుకుని, జీవిస్తూ ఆ పదార్థాలలో ఉన్న పోషకాలను తిరిగి మృత్తిక (భూమిపై పొర) లోనికి పంపుతుంది.
సి) కోడి – ఇది సర్వ భక్షకాహారి. ద్వితీయ వినియోగదారు హోదాలో ఉంది. పై మూడూ కాదు.
డి) గడ్డి – పచ్చిక – ఇది సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహారాన్ని తయారు చేస్తుంది. కాబట్టి ఇది ‘ఉత్పత్తిదారుడు’.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 5.
ఆవాసానికి, ఆవరణవ్యవస్థకు మధ్య తేడా ఏమిటి ?
జవాబు:

ఆవాసము ఆవరణ వ్యవస్థ
1. ఇది నివసించే ప్రదేశాన్ని తెలియచెప్పే పదం.

2. మొక్కలు, జంతువులు పెరిగే చోటు.

3. దీనిలో నిర్జీవ అంశాల ప్రస్తావన ఉండదు.

4. వాతావరణ కారకాలు, వాటి ప్రభావం ఇక్కడ పట్టించుకోరు.

1. ఇది ఆ ప్రదేశంలోని సజీవ, నిర్జీవ, వాతావరణ కారకాల మధ్య సంబంధాన్ని వివరించే పదం.

2. మొక్కలు, జంతువుల మధ్య సంబంధాన్ని కొనసాగించే ఒక మూల ప్రమాణం.

3. నిర్జీవ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి.

4. ఇక్కడ వాతావరణ కారకాల ప్రభావం కీలకం అని భావిస్తారు.

6. నేనెవరిని ?

ప్రశ్న (అ)
నేను ఆహారపు గొలుసులో ప్రధాన మూలం.
జవాబు:
గడ్డి – ఉత్పత్తిదారులు

ప్రశ్న (ఆ)
నేను ఆహారం కోసం ఇతరులపై ఆధారపడతాను.
జవాబు:
వినియోగదారులు – జంతువులు, క్షీరదాలు, మానవులు.

ప్రశ్న (ఇ)
నేను చనిపోయిన మొక్కల, జంతువుల శరీరాలను కుళ్ళింపచేస్తాను.
జవాబు:
విచ్ఛిన్నకారులు – బాక్టీరియా, శిలీంధ్రాలు.

ప్రశ్న 7.
మొక్క పులి, కుందేలు, నక్క, గ్రద్ద.
పై వాటిలో ఏదైనా సంబంధాన్ని తెలుసుకోగలరా ? పై జాబితా నుండి కుందేలును తీసివేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 1

  1. ఈ జంతువులు, మొక్కలు ఒక ఆహార జాలకంలో భాగమై ఉన్నాయి.
  2. వేరు, వేరు ఆహార గొలుసులలో ఉన్నా ఒకే జాలకంలో ఉన్నాయి కాబట్టి వీటి మధ్య పరస్పర ‘సంబంధం’ ఉంది.
  3. ఇవి ఒక దానిపై మరొకటి ప్రభావం చూపుతాయి.
  4. మొక్క – ఉత్పత్తిదారు; కుందేలు – ప్రాథమిక వినియోగదారు. నక్క, పులి, గద్ద – తృతీయ వినియోగదారులు.
  5. పై జాబితా నుండి కుందేలును తీసివేస్తే, నక్కకు ఆహారం అందదు – నక్కల సంఖ్య తగ్గుతుంది.
  6. అలాగే గడ్డి తినే కుందేలు లేకపోవటం వల్ల ఆవరణ వ్యవస్థలో గడ్డి ఎక్కువ పెరుగుతుంది. దాంతో కీటకాల సంఖ్య, పురుగుల సంఖ్య పెరిగి ఆవరణ వ్యవస్థ ‘సమతాస్థితి’ లయ తప్పుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 8.
మీ దగ్గరలోని పార్ము/తోటను సందర్శించి అక్కడ మీరు పరిశీలించిన మొక్కల, జంతువుల వివరాలు సేకరించి పేజీ. నంబరు 110 లోని పట్టిక నింపి నివేదిక తయారుచేయండి.
జవాబు:
అడవి పేరు : నల్లమల
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 2
నివేదిక :

  1. నేను శ్రీశైలంలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించాను. అది అనేక వృక్ష, జంతు జాతులను కలిగి ఉంది.
  2. మద్ది, టేకు, వేప, రావి, మర్రి వంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉండి అనేక పక్షులకు, జంతువులకు ఆవాసంగా ఉంటున్నాయి.
  3. రాగి, బలుసు, వెంపలి వంటి చిన్న మొక్కలు పొదలుగా ఏర్పడ్డాయి. వీటిలో కుందేలు వంటి చిన్న జంతువులు నివసిస్తున్నాయి.
  4. అడవిలో కుందేలు, జింకలు, దుప్పులు వంటి శాకాహార జంతువులు ఉన్నాయి.
  5. వీటిని ఆహారంగా తీసుకొంటూ, పులులు, సింహాలు, నక్కలు వంటి మాంసాహారులు ఉన్నాయి.
  6. పక్షులలో నెమలి, చిలుకలు, పిచ్చుకలు వంటి విభిన్న జీవులు ఉన్నాయి.
  7. అడవి మంచి జీవవైవిధ్యాన్ని కలిగి ఉంది.

ప్రశ్న 9.
మీ పొలంలో లేదా పాఠశాల తోటలో పరిశీలించి ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారుల జాబితాను తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాల ఆవరణను పరిశీలించి ఈ కింది జాబితాను తయారు చేశాను.
1. ఉత్పత్తిదారులు : మొక్కలు, పచ్చిక, అశోక చెట్లు, బంతి చెట్లు, క్రోటన్లు, కాగితపు పూల చెట్లు, విప్ప చెట్టు, వేప చెట్టు, పాల చెట్టు, సపోటా చెట్టు, కొబ్బరి మొక్కలు.
2. వినియోగదారులు : విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు (మానవులు), కప్పలు, వాన కోయిలలు, కీటకాలు, మేకలు, పశువులు, బల్లులు, తొండలు, పక్షులు, గబ్బిలం.
3. విచ్ఛిన్నకారులు : పుట్ట గొడుగులు, లైచెన్లు (కర్రలపై పెరిగే తెల్ల పెచ్చుల్లాంటి జీవులు).

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 10.
ఎడారి జంతువులు ఏ ఏ అనుకూలనాలను పొందినాయో మీ పాఠశాల గ్రంథాలయంలో పరిశీలించి పట్టిక తయారు చేయండి.
జవాబు:

  1. సగటు వర్షపాతం అతి తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాన్ని ‘ఎడారి’ అంటారు.
  2. ఇక్కడ పెరిగే మొక్కలు, జంతువులు తమకు తాము కొన్ని మార్పులు చేసుకుని అనుకూలనాలు పొంది జీవించటానికి పాటుపడుతుంటాయి.
  3. జంతువులలో కింది అనుకూలనాలను మనం గమనించవచ్చు.
    1. ఎడారిలో జంతువుల సంఖ్య తక్కువ.
    2. నీటి కొరత తట్టుకునే జాతులు ఇక్కడ పెరుగుతాయి.
    3. శరీరంపై పొలుసులు గల పాములు (సరీసృపాలు) ఎక్కువ.
    4. కొన్ని రకాల కీటకాలు పైన ఉన్న కైటిన్ పొరను మందంగా అభివృద్ధి చేసుకున్నాయి.
    5. ఒంటె నీటిని తనలో దాచుకోవటానికి మొక్కల లేత కాండాలు తింటుంది. నీటిని జీర్ణాశయంలో నిల్వచేసుకుంటుంది. అందుకే దీనిని ‘ఎడారి ఓడ’ అన్నారు.
    6. వీటి శరీరం భూమి ఉపరితలానికి తగలకుండా ఇవి మార్పులు చేసుకున్నాయి.
    7. పగటి పూట జంతువులు బయట తిరగవు. రాళ్ళ క్రింద, పొదలలో, చెట్ల పైకి ఎక్కి రాత్రిపూట ఆహార వేటకు ఉపక్రమిస్తాయి. అందుకే వీటిని ‘నిశాచరులు’ అంటారు.

ప్రశ్న 11.
‘ఆహార జాలకం’ అంటే మీరేమి అవగాహన చేసుకున్నారు ? ఆహార జాలకాన్ని మీ సొంత మాటలతో వర్ణించండి. రేఖాచిత్రం ద్వారా ఆహారజాలకం గురించి నీకేం అవగాహన అయింది. మీ సొంత ఆహారజాలకం చిత్రాన్ని గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 3
1. ఉత్పత్తిదారుడు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉన్న గొలుసు లాంటి జంతువుల శక్తి మార్పిడి వ్యవస్థను ‘ఆహారపు గొలుసు’ అంటారు.
2. అనేక ‘ఆహారపు గొలుసులు’ ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఒక సమూహంగా, ఆవరణ వ్యవస్థలో కొనసాగే క్రియాత్మక వ్యవస్థను ‘ఆహార జాలకం’ అంటారు.
3. దీనిలో నీటిలో మొక్కలు, నేలపై మొక్కలు, నీటిలో కీటకాలు, నేలపై కీటకాలు, జలచరాలు, ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు, పక్షులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉంటాయి.
4. చివరగా అతిశక్తివంతమైన తృతీయ వినియోగదారు (సింహం, పులి, గద్ద మొదలగునవి) ఉంటుంది.

ప్రశ్న 12.
మొక్కలు, జంతువుల మధ్య పరస్పర సంబంధాలపై మీ అవగాహన ఏమిటి ? దీనిని మీరు ఎలా అభినందిస్తారు ?
జవాబు:

  1. మొక్కలు స్వయం పోషకాలు మరియు ఉత్పత్తిదారులు.
  2. ఇవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వివిధ భాగాలలో నిల్వ చేస్తాయి.
  3. జంతువులు వినియోగదారులు. ఇవి మొక్కల నుండి శక్తి బదలాయింపు జరుపుకుంటాయి.
  4. తద్వారా ఇవి ఆవరణ వ్యవస్థలో పరస్పరం ఆధారపడి జీవిస్తాయి అని పరిశీలించినపుడు – వీటిని అభినందించాల్సిన అవసరం ఉంది.
  5. జంతువుల నుండి వివిధ రూపాలలో పోషకాలు నేలకు చేరి మరలా వాటిని మొక్కలు ఉపయోగించుకునేలా మారతాయి.
  6. మొక్కల జనాభా పెరుగుదలను జంతువులు నియంత్రిస్తాయి. ఎలా అంటే మొక్కలు వాటి ఆహారం కనుక.
  7. జంతువుల సంఖ్య తగ్గించాలంటే మొక్కల సంఖ్య తగ్గిపోతుంది. తద్వారా ఆహార లభ్యత లేక జంతువుల సంఖ్య తగ్గుతుంది. ఇలాంటి విషయాలు ప్రకృతిలో సర్వ సామాన్యం. కాబట్టి నేను అభినందిస్తాను.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 13.
గడ్డి – మొక్కలు – మిడత – కప్పు – పాము – గ్రద్ద – మేక – నక్క – పులి – తోడేలు – కుందేలు – వీటి సహాయంతో ఆహారజాలకం పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 4

ప్రశ్న 14.
గట్టి నేల ఆవరణ వ్యవస్థలో కుందేలు మొక్కలను మాత్రమే తింటుంది. మొక్కలు పెరిగే లోపలనే అవి మొక్కలను తొందరగా తింటాయి. అలాంటప్పుడు ఆవరణ వ్యవస్థను సమతాస్థితికి తీసుకునిరావడానికి ఏమి జరగాల్సిన అవసరముంది?
జవాబు:

  1. కుందేలు మొక్కలను పెరిగే లోపల తినేస్తుంది.
  2. ఎక్కువ సంఖ్యలో మొక్కల సంఖ్య ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. కాబట్టి కుందేలు పెరిగే లోపల మొక్కలను తిన్నా – పెద్దగా ప్రభావం ఉండదు. కానీ
  3. ఒక వేళ కుందేళ్ళ సంఖ్య, మొక్కలు కుందేళ్ళ నిష్పత్తి కన్నా ఎక్కువ ఉన్నట్లైతే ఆ ప్రభావం మొక్కలపై పడుతుంది.
  4. మొక్కల సంఖ్య తగ్గి, కుందేళ్ళ సంఖ్య పెరుగుతుంది.
  5. అప్పుడు వీటిపై ఆధారపడి జీవించే నక్కలు, కుక్కలు, తోడేళ్ళకు ఇవి అందుబాటులోకి వస్తాయి.
  6. లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల, వాతావరణ కారకాల వల్ల, తప్పనిసరిగా కుందేళ్ళ సంఖ్య మొక్కల నిష్పత్తికి తగినట్లుగా తగ్గించబడి, సమతాస్థితిని కొనసాగించటానికి వీలవుతుంది.

ప్రశ్న 15.
ఒకేరకమైన అలవాట్లు కలిగిన రెండు . జంతువులు ఒకే ఆవరణవ్యవస్థను ఎంచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది ? ఈ వైవిధ్యాన్ని కాపాడటానికి నీవు ఏమి చేస్తావు ?
జవాబు:

  1. ఒకేరకమైన అలవాట్లు కలిగిన రెండు జంతువులు ఒకే ఆవరణ వ్యవస్థను ఎంచుకున్నప్పుడు వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది.
  2. సాధారణంగా ఈ పోటీలో తట్టుకొన్న జీవులు మనుగడను సాగిస్తాయి. మిగిలిన జీవులు నశిస్తాయి.
  3. ఉదాహరణకు ఆవు, గుర్రం ఒకే ఆహారపు అలవాట్లు కలిగి ఉంటాయి. ఈ రెండు ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు – ఆహారం కొరకు వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది. తగినంత ఆహారం లభించనపుడు బలమైన జీవి మాత్రమే ఆహారం సంపాదించుకొని జీవిస్తుంది.
  4. ప్రకృతి ధర్మాలలో జీవవైవిధ్యం ఒకటి. జీవవైవిధ్యం కాపాడటానికి ఆవాసంలోని జీవుల అవసరాలను తీర్చే మార్గాలను అన్వేషించాలి.
  5. ఎక్కువ ఆహార వసతి, ఆవాసాలు ఏర్పాటు చేయటం వలన జీవవైవిధ్యం కాపాడవచ్చును.
  6. పిల్ల జీవులను సంరక్షణ చర్యలు తీసుకోవటం వలన జీవవైవిధ్యాన్ని పెంచవచ్చు.

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers

కృత్యములు

ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థను అర్ధం చేసుకోవటానికి నీవు నిర్వహించే ప్రాజెక్ట్ వివరాలు తెలపండి. ( లేదా)
ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకొనుటకు చేయు ప్రయోగంలో మీరు ఉపయోగించిన పరికరాలను పేర్కొని, ప్రయోగ విధానాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశం : ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడానికి పాఠశాల లేదా ఇంటి తోటను అధ్యయనం చేయడం.
కావల్సిన పదార్థాలు : కొలిచే టేపు, దారం, చిన్న చిన్న కట్టెపుల్లలు, భూతద్దం, గడ్డపార (hand towel).
విధానం : ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకోడానికి ఈ కింది విధానాన్ని అనుసరించాలి.
1. నలుగురు విద్యార్థుల చొప్పున జట్లుగా ఏర్పడండి. మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశంలో టేపుతో కొలిచి ఒక మీటరు పొడవు, ఒక మీటరు వెడల్పు ఉండే చతురస్రాకారపు ప్రాంతాన్ని నిర్ణయించుకోండి. ఈ ప్రాంతంలో గడ్డి ఉండవచ్చు లేదా గడ్డి ఉండకపోవచ్చు (baredirt) లేదా కాలిబాట (side walk) కావచ్చు.
2. ఆ ప్రాంతానికి నాలుగు వైపులా చిన్న కర్ర ముక్కలు పాతి దారంతో చతురస్రం ఒక చదరపు మీటరు ప్రాంతం యొక్క అంచులను పటంలో చూపిన విధంగా గుర్తించండి. ఇదే మనం పరిశీలించవలసిన ప్రదేశం.
3. అధ్యయనం చేసే ప్రాంతాన్ని పరిశీలించండి. ఆ ప్రాంతంలో నివసించే మొక్కలు, జంతువులను అవసరమైతే భూతద్దంతో నిశితంగా పరిశీలించండి.
4. మీరు పరిశీలించిన జీవులన్నింటినీ మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి. మీరు ఆ ప్రాంతంలోని మట్టిని తవ్వి అందులోని జీవులన్నింటిని కూడా పరిశీలించాలి. దేనినీ వదిలివేయకుండా జాగ్రత్తగా పరిశీలించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

2. ప్రక్కపటంలోని ఆహార జాలకాన్ని పరిశీలించండి. ఈ కింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 5

ప్రశ్న (i)
ఆహార జాలకంలో ఉత్పత్తిదారులేవి ?
జవాబు:
నీటి మొక్కలు, నాచు, శైవలాలు, గడ్డి, మొక్కలు.

ప్రశ్న (ii)
వినియోగదారులేవి ?
జవాబు:
కీటకాలు, ఎలుకలు, సాలె పురుగులు, కుందేలు, జింక, పిల్లి, నక్క, కప్ప, చేప, పాము, తోడేలు, నెమలి, గుడ్లగూబ, రాబందు, గద్ద, కొంగ, పులి, సింహం.

ప్రశ్న (iii)
ఆహార జాలకం ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది ?
జవాబు:
ఆహార జాలకం ఉత్పత్తిదారుల నుంచి ప్రారంభమవుతుంది.

ప్రశ్న (iv)
ఆహార జాలకం ఎక్కడ ముగుస్తోంది ?
జవాబు:
నాల్గవ స్థాయి వినియోగదారు అయిన సింహం దగ్గర ముగుస్తోంది.

ప్రశ్న (v)
ఆహార జాలకంలోని మొక్కలు చనిపోతే ఏమవుతుంది ?
జవాబు:

  1. ఆహార జాలకంలో మొక్కలు చనిపోతే శక్తి ఉత్పత్తిచేసే అవకాశం పోతుంది.
  2. దీనితో సూర్యరశ్మి నుంచి శక్తి బదలాయింపు ఆగిపోతుంది.
  3. కొంత కాలం తర్వాత నెమ్మదిగా క్రింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి జీవులన్నీ అంతరించిపోతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

3. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రకాల మొక్కలు, జంతు జాతుల పేర్లను పట్టికలో నింపి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
జవాబు:
అడవి పేరు : నల్లమల
ప్రదేశం : శ్రీశైలం
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 6

ప్రశ్న (i)
అన్ని రకాల అడవులలో ఒకే రకమైన వృక్ష సంపద ఉందా ! (పేజీ నెం. 110)
జవాబు:
1. ఉండదు. ఎందుకంటే ఆవరణ వ్యవస్థ ప్రదేశం మారే కొద్దీ అక్కడ వాతావరణ కారకాలు మారతాయి.
2. సూక్ష్మ, స్థూల పోషకాల లభ్యత వేరుగా ఉంటుంది.
3. కాబట్టి వైవిధ్యం ఎక్కువ మార్పుతో ఉంటుంది.
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 7

ప్రశ్న (ii)
అడవి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు వినియోగదారుల కంటే ఎక్కువగా ఉన్నాయా ? ఎందుకు ?
జవాబు:
1. ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువ ఉంది.
2. కారణం వినియోగదారులు తమ ఆహారం కోసం ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిదారులను వినియోగించుకుని శక్తిని పొందుతాయి.
3. సుమారుగా 1 : 20 గా వినియోగదారు ఉత్పత్తిదారు నిష్పత్తి ఉంటుంది.
ఇవి కొన్ని సార్లు పెరగవచ్చు. తగ్గవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న (iii)
అన్ని రకాల అడవులలో ఒకే రకమైన జంతువులు ఉన్నాయా ? ప్రత్యేకమైనవి ఏమైనా ఉన్నాయా ?
జవాబు:
1. అన్ని రకాల అడవులలో ఒకే రకమైన జంతువులు ఉండవు.
2. కొన్నిచోట్ల ప్రత్యేకమైన జంతువులు ఉంటాయి.
ఉదా : శ్రీశైలం, నల్లమల అడవులలో పులులుంటాయి. చిత్తూరు, శేషాచలం అడవులలో ఔషధ మొక్కలు ఎక్కువగా ఉంటాయి.

పాఠ్యాంశములోని ప్రశ్నలు

1. ఈ పటాన్ని పరిశీలించి ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (పేజీ. నెం. 105)

ప్రశ్న (ఎ)
బొమ్మలో బాణం గుర్తు ఏం సూచిస్తుంది ?
జవాబు:
బొమ్మలో బాణం గుర్తు జీవుల మధ్య ఆహార సంబంధాలను సూచిస్తున్నది.

ప్రశ్న (బి)
గడ్డి నుండి పులి వరకు ఉన్న మార్గాన్ని గుర్తించండి.
జవాబు:
గడ్డి → కుందేలు → పులి.

ప్రశ్న (సి)
కుందేలు ఎన్ని రకాల ఆహారాలపైన ఆధారపడుతుంది ? వాటి పేర్లు రాయండి.
జవాబు:
కుందేలు మూడు రకాల పదార్థాలపై ఆధారపడింది. అవి 1. క్యారెట్ 2. గడ్డి 3. గింజలు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న (డి)
కుందేలుపై ఆధారపడ్డ జీవులు ఎన్ని ? వాటి పేర్లు రాయండి.
జవాబు:
కుందేలుపై నాలుగు రకాల జీవులు ఆధారపడ్డాయి. అవి 1. కొండచిలువ 2. నక్క 3. గుడ్లగూబ 4. పులి.

ప్రశ్న 2.
మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నుండి గ్రహిస్తాయి ? (పేజీ.నెం. 105)
జవాబు:
1. మొక్కలు స్వయం పోషకాలు.
2. ఇవి తమ ఆహారాన్ని తామే తయారుచేసుకొంటాయి.
3. సూర్యరశ్మి, కార్బన్ డై ఆక్సైడ్, నీరులతో పత్రాలు ఆహారం తయారుచేసే ఈ ప్రక్రియను ‘కిరణజన్య సంయోగక్రియ’ అంటారు.

ప్రశ్న 3.
ఆహారం ఒక్కటే కాకుండా జంతువులు బ్రతకటానికి కావల్సిన ఇతర అంశాలు ఏమిటి ? (పేజీ.నెం. 105)
జవాబు:
జంతువులకు ఆహారంతో పాటు,

  1. నీరు
  2. గాలి
  3. ఆవాసం బతకటానికి కావాల్సి ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

SCERT AP 8th Class Biology Study Material Pdf 5th Lesson కౌమార దశ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 5th Lesson Questions and Answers కౌమార దశ

8th Class Biology 5th Lesson కౌమార దశ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
బాల్యావస్థ కౌమార దశ కంటే ఏ విధంగా భిన్నమైనది ?
జవాబు:

  1. బాల్యావస్థలో శరీర అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది.
  2. కానీ కౌమార దశలో ఇది అత్యంత ఎక్కువ స్థాయికి వెళ్తుంది.
  3. అంతేకాక మానసిక ఎదుగుదల, భావోద్వేగాలు ఎక్కువగా వ్యక్తమవుతాయి.
  4. బాల్యావస్థలో ఉన్న ఆధారపడే మనస్తత్వం (తల్లి, తండ్రి, అక్క, అన్నల మీద) కౌమార దశలో తగ్గుతుంది.
  5. కౌమార దశలో వ్యక్తిగత శ్రద్ధ, స్వయంగా నా పనులు నేను చూసుకోగలననే అభిప్రాయం పిల్లలలో వ్యక్తమవుతుంది.
  6. ఇలా శారీరక, మానసిక, భావోద్వేగాల వ్యక్తీకరణలో బాల్యావస్థ కౌమార దశ కన్నా భిన్నమైనదని చెప్పవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 2.
క్లుప్తంగా రాయండి.
(i) ద్వితీయ లైంగిక లక్షణాలు
(ii) ఆడమ్స్ యాపిల్
జవాబు:
(i) ద్వితీయ లైంగిక లక్షణాలు:

  1. కౌమార దశలో, హార్మోనుల ప్రభావం వల్ల శరీరంలో వచ్చే ముఖ్య లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు.
  2. మగపిల్లలలో నూనుగు మీసాలు, గడ్డం రావటం, గొంతు బొంగురుగా మారటం.
  3. ఆడపిల్లలలో నాజూకుతనం మొదలైనవి.
  4. లైంగిక అవయవ వ్యవస్థలో పరిపక్వతకు వస్తాయి.
  5. బాహు మూలాల్లో వెంట్రుకలు పెరుగుతాయి.

(ii) ఆడమ్స్ యాపిల్ :

  1. గొంతు దగ్గర ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉన్న థైరాయిడ్ మృదులాస్థి ఎముకను ‘ఆడమ్స్ యాపిల్’ అంటారు.
  2. ఈ ‘ఆడమ్స్ యాపిల్’ మన స్వరపేటిక (Larynx) యొక్క పాక్షిక పెరుగుదల వలన పెరుగుతుంది.
  3. కౌమారదశలో థైరాయిడ్ మృదులాస్థి పెరగటం వల్ల ‘ఆడమ్స్ యాపిల్’ ఏర్పడుతుంది.
  4. ఇది మగపిల్లలలో ఒకానొక ద్వితీయ లైంగిక లక్షణం.

ప్రశ్న 3.
కౌమార దశలో మానవ శరీరంలో జరిగే మార్పుల జాబితా రాయండి.
జవాబు:
1. ‘కౌమార దశ’ ప్రతి మానవునిలో 13-19 సం||ల మధ్య వచ్చే ముఖ్యమైన దశ.
2. దీని వల్ల మానవ శరీరంలో
ఎ) కండరాలు, ఎముకల అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది.
బి) దీనివల్ల ఎత్తు, బరువు పెరుగుతారు.
సి) శరీరంలో జీవనక్రియ రేటు పెరుగుతుంది. దీనివల్ల శక్తి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. (దీనిని + ‘tive గా మార్చుకోవాలి)
డి) ‘ఆడమ్స్ యాపిల్’ మగపిల్లలలో పెరుగుతుంది.
ఇ) ఆడపిల్లలలో స్థనాల పరిమాణం పెరుగుతుంది.
ఎఫ్) బాహు మూలాల్లో, ప్రత్యుత్పత్తి అంగాల దగ్గర వెంట్రుకలు పెరుగుతాయి.
జి) బాలికలలో ఋతుచక్రం మొదలవుతుంది.
హెచ్) మగపిల్లలలో వీర్యకణాల ఉత్పత్తి మొదలవుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 4.
జతపరచండి.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 1
జవాబు:
1) C
2) B
3) D
4) A

ప్రశ్న 5.
కౌమార దశలో మొటిమలు, మచ్చలు ఎందుకు వస్తాయి ? వాటి పట్ల ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు:
1. కౌమార దశలో శరీరంలో అభివృద్ధి ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. ఈ
2. దీనివల్ల శరీరంలోని తైల గ్రంథులు, స్వేద గ్రంథులు కూడా ఎక్కువ స్థాయిలో స్పందించి తైలాన్ని, స్వేదాన్ని ఉత్పత్తి చేస్తాయి.
3. దీనివల్ల ముఖం జిడ్డుగా ఉండటం, తైల గ్రంథుల నాళాలలో బాక్టీరియా చేరి ఉబ్బుగా ఉండే బుడిపెలు (మొటిమలు) రావటం సాధారణ విషయం.
4. కొన్నిసార్లు చీము పట్టి ఇవి నొప్పిని కలుగచేస్తాయి.
5. వీటిని గిల్లినా, గోరు తగిలినా అది మచ్చగా మారుతుంది.
6. చెమట వల్ల శరీరం నుంచి ఒక రకమైన వాసన కూడా వస్తుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
ఎ) ముఖాన్ని చల్లని నీటితో రోజుకు 3, 4 సార్లు శుభ్రం చేసుకోవాలి.
బి) మాటిమాటికీ సబ్బుతో ముఖాన్ని కడగకూడదు.
సి) మొటిమలను గిల్లకూడదు. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడాలి.
డి) వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
ఇ) ఒత్తిడి, ఆందోళన లేకుండా మానసిక ఉల్లాసానికి సాధన చేయాలి.

ప్రశ్న 6.
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించటానికి నువ్వు మీ స్నేహితుడికి ఏం సలహాలు ఇస్తావు?
జవాబు:
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రతకు, నా స్నేహితునికి కింది సలహాలు ఇస్తాను.

  1. ప్రతిరోజు రెండు పూటలా స్నానం చేయాలి.
  2. మర్మావయవాల శుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి.
  3. ముఖాన్ని ఎక్కువసార్లు చల్లని నీటితో కడగాలి.
  4. మొటిమలను గిల్లటం కాని, వత్తటం కాని చేయరాదు.
  5. ముఖానికి లేపనాలు రాయరాదు.
  6. అవాంఛిత రోమాలను తొలగించుకోవాలి.
  7. నూనె, నెయ్యి తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  8. తగినంత శారీరక శ్రమ కొరకు వ్యాయామం చేయాలి. ఆటలు ఆడాలి.

ప్రశ్న 7.
మీకు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులపై కోపం వచ్చిందా ? మీ తల్లిదండ్రులు ఎలా ఉండాలని మీరు భావిస్తారు ?
జవాబు:
1. నాకు చిన్నప్పటి నుండి ఎప్పుడూ నా తల్లిదండ్రులపై కోపం రాలేదు.
2. కానీ ఈ మధ్య వారిచ్చే సూచనల పట్ల విసుగు వస్తోంది.
3. నాకు తెలిసిన విషయాలు కూడా వారు పదే పదే చిన్నపిల్లవాడికి చెప్పినట్లు చెప్పటం విసుగనిపిస్తోంది.
4. నా వయస్సు ఇప్పుడు 14 సం||లు.
5. ఎండలో స్నేహితులతో ఆటలకు వెళ్ళేద్దంటారు.
6. స్నేహితులను ఇంటికి రానివ్వరు. వచ్చినా బయట మాట్లాడమంటారు. కానీ నాకు వారితో గడపటం ఇష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు కోపం వస్తుంది.
7. ఎక్కువగా ఈ మధ్య ఇది చెయ్యి. అది చేయకూడదు అన్న సలహాల ప్రక్రియ మొదలయ్యింది. ఇది నాకిష్టం లేదు.
8. నా తల్లిదండ్రులు
ఎ) నేను పెద్దవాణ్ణి అయ్యాను అని గుర్తించాలని కోరుకుంటాను.
బి) నాకు నచ్చిన, నాకిష్టమైన పనులు చేయవద్దని అనకుండా ఉంటే బాగుంటుంది.
సి) నేను పెద్దవాణ్ణి అని వారు గుర్తించాలనిపిస్తుంది.
డి) నేను కూడా స్వతంత్రంగా పనులు చేయగలనని వారు విశ్వసించాలని భావిస్తాము.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 8.
మీరు మీ తల్లిదండ్రుల కంటే స్నేహితులతో ఏ ఏ సమస్యలు, అభిప్రాయాలు పంచుకుంటారు ?
జవాబు:
నేను నా స్నేహితులతో ఈ కింది అభిప్రాయాలు పంచుకుంటాను.
1. నా శరీరంలో జరిగే మార్పులు – ఎత్తు, బరువు, మొటిమల గురించి వారి అనుభవాలను తెలుసుకోవాలని అనుకుంటాను.
2. చదువు విషయంలో ప్రగతి విషయమై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులిచ్చిన సూచనలపై వారి అభిప్రాయాలు తీసుకొని, వారి సలహాలను నిర్లక్ష్యం చేస్తాను. (చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయంలో వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తారు. )
3. సినిమాలు, హీరో, హీరోయిన్ల విషయాలు ‘స్నేహితులతో ఎక్కువగా పంచుకుంటాను.
4. వీడియో గేమ్ లు, సాంఘిక అంతర్జాల పట్టికల గురించి వారి సలహాలు, అనుభవాలు తెలుసుకోవటానికి ఉత్సాహం చూపుతాను.
5. భిన్నలింగ వర్గీయుల గురించి, కబుర్లు ఎక్కువగా స్నేహితులతో చర్చిస్తాను.
6. లైంగిక అవయవాల అభివృద్ధి గురించి కంగారు పడి స్నేహితుల సలహాల కోసం ఆత్రుతగా చూస్తాను. (ఇది కూడా 99% ఋణాత్మక ఫలితాన్ని ఇస్తుంది. సమ వయస్కులు కాబట్టి ఈ విషయంపై వారికి శాస్త్రీయ పరిజ్ఞానం ఉండదు. )

ప్రశ్న 9.
ఒకవేళ నీకు వైద్యుడ్ని సంప్రదించే అవకాశం వస్తే, కౌమార దశలో ఉద్వేగాల గురించి నీవు అడిగే ప్రశ్నలు ఏమిటి ?
జవాబు:
నాకు వైద్యుడ్ని కలిసి కౌమార దశలో నేను ఎదుర్కొనే ఉద్వేగాల గురించి ఈ కింది ప్రశ్నలు అడుగుతాను.

  1. నేను నా సౌందర్యంపై మునుపెన్నడూ లేనంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాను. ఎందుకని ?
  2. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు సలహాలు నచ్చక వారితో విభేదిస్తున్నాను. కారణం ఏమిటి ?
  3. అందరి దృష్టిలో నేను ఎందుకు అగుపడాలి అని భావిస్తున్నాను.
  4. ఈ మధ్య నా ప్రవర్తనలో దూకుడు, దుందుడుకు మనస్తత్వం ఎందుకు వస్తున్నది ?
  5. ఎందుకు నాకు అవకాశమెచ్చినప్పుడు గట్టిగా అరచి గోల చేయాలనిపిస్తున్నది ?
  6. భిన్న లైంగిక వర్గీయుల పట్ల నేను ఎందుకు ఆకర్షణకు లోనవుతున్నాను ?
  7. నా లైంగిక అవయవాల దగ్గర, బాహు మూలాల్లో వెంట్రుకలు ఎందుకు పెరుగుతున్నాయి ? చెమట ఎక్కువ పోస్తున్నది. ఎందుకు ?
  8. ఋతుచక్రం, రజస్వల అవటం ఆడపిల్లలలో జరిగే మార్పులు. మరి మగవారిలో ఎలాంటి మార్పులు వస్తాయి ?
  9. అనవసరమైన సిగ్గు, అసహనం, అరచి గోల చేయాలనిపించటం – గొంతు బొంగురు పోవటం ఎందువల్ల నాలో కలుగుతున్నాయి ?
  10. ‘వ్యక్తిగత పరిశుభ్రత’ అంటే ఏమిటి ? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ప్రశ్న 10.
కొన్ని మొబైల్ ఫోన్లలో ఉండే ఆడియో మీటరును ఉపయోగించి 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న కొందరి విద్యార్థుల స్వరాల పౌనఃపున్యాన్ని నమోదు చేసి మీ పరిశీలనలు రాయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 2
పరిశీలనలు :
1. 6వ తరగతి పిల్లలలో స్వర పౌనఃపున్యం దాదాపు ఆడ, మగపిల్లల్లో ఒకే విధంగా ఉందని గమనించాను.
2. 7వ తరగతిలో కూడా స్వర పౌనఃపున్యం ఆడ, మగపిల్లల్లో ఒకే విధంగా ఉంది.
3. 8వ తరగతిలో మగపిల్లలలో పౌనఃపున్యం తగ్గింది. అంటే వారి స్వరం బొంగురుగా ఉంది. ఆడపిల్లల్లో మాత్రం సన్నగా ఉండి పౌనఃపున్యం 6, 7వ తరగతుల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. (కౌమార దశ ప్రారంభమైనదని సూచన)
4. 9,10 తరగతుల మగపిల్లల్లో బొంగురు గొంతు ఉంది. సాధారణంగా పురుషులలో ఉండాల్సిన పౌనఃపున్యం 120 Htz కు దగ్గరగా ఉన్నది. అమ్మాయిలలో సన్నని గొంతు ఇంకా సున్నితత్వంతో ఉందని మా పరిశీలనలో తేలింది.
5. టెస్టోస్టిరాన్, అడ్రినలిన్ల ప్రభావం వల్ల 13 నుండి 15 సం|| వయస్సుకు వచ్చిన పిల్లల గొంతు బొంగురుగా వుంటుంది.
6. ఈస్ట్రోజన్ ప్రభావం వల్ల ఆడపిల్లల గొంతులో సున్నితత్వం మొదలయిందని గమనించాము.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 11.
బాల్యవివాహాలు, బాలికల ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి సమాచారం సేకరించి నివేదిక తయారుచేయండి.
జవాబు:
బాల్యవివాహాలు ఒక సాంఘిక దురాచారం. చిన్న వయస్సులోనే వివాహం చేయటం వలన వారిలో గర్భధారణకు
కావలసిన శారీరక పరిణితి ఉండదు. అందువలన ప్రసవ సమయంలో తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. వీరికి కలిగే సంతానం కూడా సరైన ఎదుగుదల లేకపోవటం వంటి సమస్యలతో బాధపడతారు.

అంతేగాక వివాహ బంధాన్ని కొనసాగించటానికి కావలసిన మానసిక పరిణితి లోపించి వివాహాలు విఫలమవుతాయి. చిన్న వయస్సులోనే తల్లి కావటం వలన వారి గర్భాశయం సరిగా ఎదగక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువలన భారత ప్రభుత్వం వివాహానికి కనీస వయస్సు పురుషులకు 21 సంవత్సరాలుగాను, స్త్రీలకు 18 సంవత్సరాలుగాను నిర్ణయించింది. బాధ్యత గల పౌరునిగా మనం వీటిని పాటించాలి.

ప్రశ్న 12.
పటంను పరిశీలించండి. మానవ శరీరంలో ఉండే అంతఃస్రావ గ్రంథులు, అవి ఉండే చోటును తెలిపే పటం గీయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 3
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 10

ప్రశ్న 13.
ఆడమ్స్ యాపిల్ పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 4

ప్రశ్న 14.
కౌమార దశలో జరిగే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తూ ఒక ఉపన్యాస వ్యాసం తయారుచేయండి. (లేదా) ఏ లక్షణాలను బట్టి బాలబాలికలు కౌమారదశను చేరుకున్నారని తెలుసుకోవచ్చు.
జవాబు:
1. 13-19 సం|| మధ్య వయస్సు గల పిల్లలలో కనిపించే అతి సున్నితమైన, ముఖ్యమైన దశను కౌమార దశ అంటారు.
2. దీనినే టీనేజ్ అంటారు. ఇది శారీరక, మానసిక భావోద్వేగాల అభివృద్ధిని వేగవంతం చేసే వయస్సు.

మార్పులు :

(1) శారీరక మార్పులు :

  1. ఈ దశలో శరీరంలో అభివృద్ధి బాగా ఎక్కువ జరుగుతుంది.
  2. BMR (Basal Metabolic Rate) ఎక్కువగా ఉంటుంది.
  3. కండరాల అభివృద్ధి, ఎముకల పెరుగుదల ఎక్కువవటం వల్ల ఎత్తు, బరువు పెరుగుతారు.
  4. మగపిల్లల్లో గొంతు బొంగురుపోవటం, మీసాలు, గెడ్డాలు రావటం, జననాంగాల వద్ద వెంట్రుకలు రావటం ప్రారంభమవుతుంది.
  5. బాహు మూలాల్లో వెంట్రుకలు పెరిగి, శరీరంలో చెమట ఎక్కువ పోస్తుంది.
  6. ఆడపిల్లల్లో రజస్వల అయ్యి, ఋతుచక్రం ప్రారంభమవుతుంది.
  7. ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయి.

(2) మానసిక మార్పులు :

  1. వీరిలో దేనిపైనా సరైనా ఆసక్తి ఉండదు.
  2. విసుగు ఎక్కువ.
  3. నిర్లక్ష్యంగా ఉంటూ, ఎక్కువ సార్లు అసహనం వ్యక్తపరుస్తారు.
  4. అరచి గోల చేయాలనిపిస్తుంది.
  5. అందరి దృష్టి తన పైనే ఉండాలని, తాను పెద్దవాడ్ని అయ్యాను కాబట్టి తన నిర్ణయాల పట్ల అందరూ సానుకూలంగా స్పందించాలని కోరుకుంటారు.
  6. భావోద్వేగాల స్థాయి ఎక్కువగా ఉంటుంది.
  7. ఎక్కువ సేపు అద్దం ముందు గడుపుతూ తమ సౌందర్యంపై ఎక్కువ మక్కువ చూపిస్తారు.
  8. సమ వయస్కులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు.
  9. కలల ప్రపంచంలో విహరిస్తూ, ఆ స్వప్నంలో తమ కోరికలు నెరవేరినట్లు హిస్తూ గడపటానికి ప్రాధాన్యం ఇస్తారు.
  10. భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణకు లోనవుతారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. ఈ భావోద్వేగ మార్పులను తనలో సహజంగా హార్మోనుల వల్ల వచ్చే మార్పులని ముందుగా తనకు తాను చెప్పుకోవాలి.
  2. స్నేహితుల ప్రోదల్బంతో చెడు అలవాట్లకు దగ్గరవకుండా స్వీయ క్రమశిక్షణ పాటించాలి.
  3. తనలో జరిగే ఈ ‘సంక్లిష్ట సంఘర్షణ’ నుండి బయటపడడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సాయం, అవసరమైతే డాక్టర్ల సాయం తీసుకోవాలి.
  4. మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలి.
  5. ‘వ్యక్తిగత పరిశుభ్రత’ పాటిస్తూ వ్యాధుల నుండి కాపాడుకోవాలి.
  6. ‘తేలికపాటి వ్యాయామం’ ఆటల ద్వారా శరీరాన్ని అలసట చెందించటం ద్వారా మంచి నిద్రను ఆహ్వానించవచ్చు.
  7. టివిల ముందు వీడియో గేమ్ ల ముందు, చాటింగ్ (చరవాణి ద్వారా SMS) లను నివారించి, స్థూలకాయత్వం రాకుండా చూసుకొనవచ్చు.
  8. భిన్నలింగ వర్గీయుల పట్ల గౌరవ భావాన్ని పెంచుకోవాలి.
  9. ఇది ఇప్పటి సమాజ శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమైనది.
  10. తల్లిదండ్రులు పిల్లల్ని ఈ దశలో నిశిత పరిశీలన చేస్తూ వారికి మానసికంగా కావలసిన అండదండలను అందించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 15.
ప్రత్యుత్పత్తిపరంగా మరొక తరం సంతతిని ఉత్పత్తి చేసే విధంగా ప్రకృతి మానవ శరీరాన్ని తయారుచేసింది. దీన్ని నువ్వెట్లా అభినందిస్తావు ?
జవాబు:

  1. ప్రత్యుత్పత్తిపరంగా మరొక తరం సంతతిని ఉత్పత్తి చేసే విధంగా ప్రకృతి మానవ శరీరంలో లింగ భేదం ఉన్న ప్రత్యుత్పత్తి వ్యవస్థలను తయారుచేసింది.
  2. పురుషులలో ఒక జత ముష్కాలతో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను, స్త్రీలలో ఒక జత స్త్రీ బీజకోశాలతో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను, ప్రకృతి అభివృద్ధి చేసింది.
  3. పురుషుల నుండి శుక్రకణం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో విడుదలైన అండంతో కలిసి సంయోగం చెంది సంయుక్త – బీజంగా అభివృద్ధి చెందుతుంది.
  4. దీనిని అంతర ఫలదీకరణ అంటారు.
  5. ఇది స్త్రీలలోని ఫాలోపియన్ నాళాలలో జరుగుతుంది.
  6. తరువాత పిండం ఏర్పడి గర్భాశయ గోడలకు అంటిపెట్టుకుని ‘భ్రూణం’గా అభివృద్ధి చెందుతుంది.
  7. ఈ భ్రూణం ‘గర్భావధి కాలం 270-280 రోజుల మధ్య ఉంటుంది. పూర్తిగా అభివృద్ధి చెంది శిశువుగా మారిన తరువాత తల్లి బిడ్డకు జన్మనిస్తుంది.
  8. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికి అవసరమైన ఏర్పాట్లు గర్భాశయంలోనే ప్రకృతి అభివృద్ధి చేసింది.
  9. ఇది ఎంతో అభినందించవలసిన విషయం.
  10. ఈ ఏర్పాట్ల వల్ల మానవ సంతతి తరం తర్వాత తరంలో అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది.

ప్రశ్న 16.
బాల్యవివాహం ఒక సామాజిక దురాచారం అని మీకు తెలుసు. దీని నివారణకై కొన్ని నినాదాలు తయారుచేయండి.
జవాబు:
1. వివాహం మరొక తరాన్ని సృష్టించటంలో కీలకపాత్ర పోషించే ఒక సామాజిక, సాంస్కృతిక ప్రక్రియ.
2. దీనికి పురుషులలో 21 సంవత్సరాలు. స్త్రీలలో 18 సంవత్సరాల కనిష్ఠ వయస్సును మన దేశ రాజ్యాంగం చట్టంగా చేసింది. దీనిని మనందరం గౌరవించాలి.
నినాదాలు :

  1. బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం.
  2. బాల్య వివాహాలు నేరం.
  3. పిల్లల్ని ఎదగనీయండి. తరువాత వివాహం చేయండి. ఆరోగ్యమైన సంతతిని పొందండి.
  4. ఆడపిల్లల చదువు – ఆ ఇంటికి వెలుగు.
  5. బాల్య వివాహం – తల్లీ బిడ్డల ఆరోగ్యానికి హానికరం.
  6. బాల్య వివాహాలు – వారి జీవితాల్లో ఆటుపోటులకు ఆనవాలు.
  7. బాల్య వివాహాలు ఆపుదాం – ముందు తరాలను కాపాడదాం.
  8. బాల్య వివాహం – ఒక సామాజిక దురాచారం.

ప్రశ్న 17.
13 ఏళ్ళ స్వరూప్ తన ఎత్తు గురించి కలవరపడుతున్నాడు. అతడు ఎత్తు పెరుగుతాడా ? తనకి నువ్వు ఇచ్చే సలహా ఏమిటి ?
జవాబు:
1. స్వరూప్ ప్రస్తుత వయస్సు 13 సంవత్సరాలే.
2. పిల్లలు సాధారణంగా కౌమార దశ చివరి వరకు ఎత్తు బాగా పెరుగుతారు.
3. కౌమార దశ 13-19 సం|| వరకు, కాబట్టి స్వరూప్ ఇంకా కౌమార దశ మొదట్లోనే ఉన్నాడు. ఇంకా అతను 6 సం||ల వరకు ఎత్తు ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
4. 19 సం|| దాటిన తర్వాత కూడా 25 నుండి 30 సం|| వరకూ స్వల్పంగా ఎత్తు పెరిగే అవకాశం ఉన్నది.
5. కాబట్టి స్వరూప్ తన ఎత్తు గురించి కలవరపడే అవసరం లేదని నేను అతనికి సలహా .(శాస్త్రీయంగా) ఇస్తాను.

ప్రశ్న 18.
మీ పాఠశాలలో ఉన్న రెడ్ రిబ్బన్ క్లబ్ నిర్వహించే కార్యక్రమాలు మెరుగుపరచుకోవడానికి ఏవైనా ఐదు సలహాలు సూచించండి.
జవాబు:
1. మా పాఠశాలలో ‘కౌమార విద్య’ పై అవగాహన కల్పిస్తూ వాటి కార్యక్రమాల రూపకల్పన మరియు నిర్వహణ కోసం రూపొందించబడిన వాలంటరీ జట్టునే ‘రెడ్ రిబ్బన్ క్లబ్’ అంటారు.
2. చాలామంది దీనిని HIV / AIDS కార్యక్రమ ప్రచారం కోసమే అని భావిస్తారు. కానీ అది తప్పు.
3. ఇది కౌమార దశలో ఉన్న టీనేజర్లు చేసే తప్పులను చేయకూడదని చెప్తూ వారిని చైతన్యపరచి వారి భావోద్వేగాల నియంత్రణకు అవసరమైన కార్యక్రమాలను రూపకల్పన చేస్తుంది.

ఈ క్లబ్ నిర్వహణ మెరుగుపడడానికి కొన్ని సూచనలు :

  1. క్లబ్ నిర్మాణం పారదర్శకంగా ఉండాలి.
  2. సమూహాన్ని జట్లుగా విభజించి ప్రతి జట్టుకు నిర్దిష్టమైన బాధ్యతలను, విధులను కేటాయించాలి.
  3. వీరందరినీ సమన్వయపరచటానికి ఒక ఉపాధ్యాయినీ (బాలికలకు), ఒక ఉపాధ్యాయుడు (బాలురకు) విడిగా ఉండాలి.
  4. చేసిన కార్యక్రమ వివరాలు విధిగా ‘ఒక రిజిస్టరు నందు నమోదు చేయాలి.
  5. ఈ క్లబ్ నిర్వహణ ‘ఒక సామాజిక బాధ్యత’గా పాఠశాల ఉపాధ్యాయులు స్వీకరించాలి.

8th Class Biology 5th Lesson కౌమార దశ InText Questions and Answers

కృత్యములు

1. పట్టికను గమనించండి. క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
జవాబు:
బాల బాలికల వయస్సు ఆధారంగా ఉండవలసిన సగటు ఎత్తు.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 5
(a) ఏ వయస్సుకు చేరుకున్న తర్వాత అబ్బాయిలలో ఎత్తు పెరుగుదల దాదాపుగా ఆగిపోయింది?
జవాబు:
18 సం|| వయస్సు నాటికి అబ్బాయిలలో పెరుగుదల 100% పూర్తి అవుతుంది.

(b) అమ్మాయిలలో పెరుగుదల ఏ వయస్సులో వేగంగా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు ?
జవాబు:
అమ్మాయిలలో పెరుగుదల 8 సంవత్సరాల నుండి వేగంగా ప్రారంభమై 16 సం|| పూర్తి అవుతుంది.

(c) అమ్మాయిల్లో పెరుగుదల ఏ వయసులో ఎక్కువగా జరుగుతుంది ?
జవాబు:
అమ్మాయిల్లో పెరుగుదల ప్రధానంగా 11 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య ఎక్కువగా (4%) జరుగుతుంది.

(d) అబ్బాయి, అమ్మాయిలలో ఎవరు వేగంగా పెరుగుతారు ? ఎట్లా చెప్పగలవు ?
జవాబు:
1. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలలో పెరుగుదల రేటు అధికం అనిపిస్తుంది.
2. మొదట అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల సమానంగా ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

(b) మీ సంపూర్ణ ఎత్తు ఎంతో ఎలా లెక్కకట్టగలవు ? (పేజీ నెం. 70)
జవాబు:
1. దీనికి నా ప్రస్తుత వయస్సు ఎంతో కావాలి.
2. తరువాత ఈ వయస్సులో ఎంత ఎత్తు ఉన్నానో తెలియాలి.
3. చివరగా ఎత్తు పెరుగుదల శాతం, ఈ వయస్సుకు ఎంతో తెలియాలి.
అంటే నా ప్రస్తుత వయస్సు = 14 సం||
నా ప్రస్తుత ఎత్తు = 130 సెం.మీ.
ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం = 92
ఈ విషయాలను కింది సూత్రంలో ప్రతిక్షేపించాలి.
నా సంపూర్ణ ఎత్తు = ప్రస్తుత ఎత్తు / ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం × 100 = \(\frac {130}{92}\) × 100 = 141.3 సెం.మీ.
నేను టీనేజ్ పూర్తయ్యే నాటికి 141.3 సెం.మీ. ఎత్తు పెరుగుతాను. అంటే ఇంకా 11.3 సెం.మీ. ఎత్తు పెరుగుతానన్న మాట!
(దీనికి అనుబంధంగా వయస్సు, పెరుగుదల శాతం గల పట్టిక సహాయం తీసుకోవాలి)

ఎత్తు అంచనావేద్దాం.

ప్రశ్న 2.
నీ స్నేహితులు ఆరుగురిని ఎంపిక చేసి వారి ప్రస్తుత ఎత్తు, భవిష్యత్ ఎత్తు ఎలాప్రశ్న అంచనా వేస్తావో చెప్పు. (పేజీ నెం. 71)
జవాబు:
సూత్రం : మీ సంపూర్ణ ఎత్తు = ప్రస్తుత ఎత్తు (సెం.మీ.లలో) / ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం × 100
(పట్టిక – 1లోని సమాచారం ఉపయోగించుకున్నాను.)
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 6

మీ శరీరంలో మార్పులు పరిశీలిద్దాం.

3. మీ పాఠశాలలోని లేదా మీ తరగతిలోని స్నేహితుల ఆరోగ్య కార్డులను గమనించి కింది పట్టిక పూరించండి. మీ పరిశీలనలు రాయండి. (పేజీ నెం. 71)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 7
పరిశీలనలు :
1. కౌమార దశలో శారీరక మార్పులు వేగంగా జరుగుతాయి.
2. అమ్మాయిల కంటే అబ్బాయిల భుజాలు వెడల్పుగా మారాయి.
3. అమ్మాయిలలో నడుం కింద భాగం వెడల్పుగా మారడం గమనించాము. (ఈ మార్పు ముందు ముందు బిడ్డకు జన్మ నివ్వడంలో తోడ్పడుతుంది.)

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

4. మీ స్నేహితుని ప్రవర్తన మీ ప్రవర్తనలు కింది చెక్ లిస్ట్ తో సరిపోతాయో లేదో సరిచూసుకోండి. దానిని బట్టి నువ్వు ఏ ఏ విషయాలు గమనించావో తెలపండి.
జవాబు:
చెక్ లిస్ట్ :
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 8
పై చెక్ లిస్టు ఆధారంగా చేసుకుని ఈ కింది విషయాలు అర్థం చేసుకున్నాను.

  1. బాల్యంలో చేసే పనులకు, కౌమార దశలో చేసే పనులకు తేడా ఉంటుంది.
  2. ఈ దశలో బాలబాలికలు స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
  3. శారీరక, మానసిక మార్పులు వస్తాయి.
  4. ఉద్వేగానికి, అయోమయానికి లోనయ్యే దశలో మేమున్నాం అని గుర్తించాం.
  5. కొత్త ఆలోచనల వెల్లువ మనసులో ఏర్పడుతుంది.
  6. కొత్త విషయాలు అన్నీ తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది.
  7. మానసిక ఒత్తిడి ఉంటుంది.
  8. అనుమానాలు, సంశయాలు తీర్చే ఉపాధ్యాయులన్నా, పెద్దలన్నా చాలా గౌరవభావం ఏర్పడుతుంది. (కౌమార దశలో ప్రకృతి సహజంగా ఉన్న రహస్యాల గురించి దాచి పెట్టకుండా అన్నింటినీ నివృత్తి చేయాలి.)

పాఠ్యాంశములోని ప్రశ్నలు

ప్రశ్న 1.
చిన్న పిల్లలు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు గొంతును బట్టి అమ్మాయా, అబ్బాయో చెప్పగలమా ? (పేజి నెం. 72)
జవాబు:
చిన్న పిల్లల గొంతును బట్టి అబ్బాయో, అమ్మాయో చెప్పలేము. ఇద్దరి గొంతు ఒకే విధంగా ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 2.
మాట్లాడేవారు అబ్బాయో, అమ్మాయో ఎప్పుడు ఎలా చెప్పగలుగుతాం ? (పేజి నెం. 72)
జవాబు:
యుక్త వయస్సు వచ్చిన తర్వాత అబ్బాయిల గొంతు గంభీరంగా మారి అమ్మాయిల కంటే విభిన్నంగా ఉంటుంది. అప్పుడు గొంతు ఆధారంగా అబ్బాయో, అమ్మాయో చెప్పలేము.

ప్రశ్న 3.
కౌమార దశలో సాధారణంగా మగపిల్లల కంఠస్వరంలో మార్పు ఎందుకు వస్తుంది ? (పేజి నెం. 72)
జవాబు:
కౌమార దశలో మగపిల్లల స్వరకోశం పరిమాణంలో పెద్దదిగా పెరుగుతుంది. దీనినే ఆడమ్స్ యాపిల్ అంటారు. దీని పరిమాణం పెరగటం వలన గొంతు గంభీరంగా ఏర్పడి ఆడవారి నుండి విభేదిస్తుంది.

ప్రశ్న 4.
ప్రత్యుత్పత్తి దశలను, ప్రత్యుత్పత్తి దశల క్రమాన్ని ఫ్లోచార్టు రూపంలో రాయండి. ఫ్లోచార్టు ఆధారంగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (పేజి నెం. 74)
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 9

(a) స్త్రీలలో అండం విడుదల చాలా రోజుల వరకు కొనసాగుతుందా ?
జవాబు:
స్త్రీలలో అండం విడుదల దాదాపు 50 నుండి 55 సంవత్సరాలపాటు కొనసాగుతుంది.

(b) ఒక వేళ అండం విడుదల ఆగిపోతే ఏం జరుగుతుంది ?
జవాబు:
1. అండం విడుదల కాకపోతే, ఫలదీకరణ జరగదు.
2. కావున కొత్త జీవులు ఏర్పడవు.

(c) ఫలదీకరణ చెందిన అండాలు ఏమవుతాయి ?
జవాబు:
1. ఫలదీకరణ చెందిన అండాలు సంయుక్త బీజంగా మారతాయి.
2. సంయుక్త బీజం గర్భాశయంలో జీవిగా ఎదుగుతుంది.

(d) ఫలదీకరణ జరగకపోతే ఏమౌతుంది ?
జవాబు:
1. ఫలదీకరణ జరగకపోతే జీవులు ఏర్పడవు.
2. జాతి అంతరించి పోతుంది.

(e) అసలు అండమే విడుదల కాకపోతే ఏమౌతుంది ?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తికి అండము తప్పనిసరి. అసలు అండము విడుదల కాకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. దానివలన కొత్త జీవులు రూపొందవు.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 5.
NPEGEL కార్యక్రమం ద్వారా పాఠశాలలో అమ్మాయిలకు నాప్ కిన్లు అందజేస్తున్నారు. మీ పాఠశాలలో ఈ పథకంలో భాగంగా ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో రాయండి. (పేజీ నెం. 79)
జవాబు:
NPEGEL కార్యక్రమం మా పాఠశాలలో

  1. ఆరోగ్య విద్య మీద చర్చ నిర్వహిస్తారు.
  2. కౌమార దశలో శారీరక శుభ్రత ప్రాధాన్యత వివరిస్తారు.
  3. ఉద్వేగ నియంత్రణ అంశంపై క్లాసులు నిర్వహిస్తాడు.
  4. మంచిగా ఆలోచించటం, కలిసి జీవించటం వంటి అంశాలపై అవగాహన ఏర్పరుస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

SCERT AP 8th Class Biology Study Material Pdf 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 4th Lesson Questions and Answers జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
ప్రకృతిలో అన్ని జీవులు ప్రత్యుత్పత్తిని ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:

  • ప్రత్యుత్పత్తి అనేది సజీవులలో ఒక ముఖ్యమైన జీవనక్రియ.
  • దీనివల్ల ప్రౌఢ జీవులు, పిల్ల జీవులను ఉత్పత్తి చేసి తమ తమ జాతులను, వాటి జనాభాను పెంచుకుంటూ ఈ జీవావరణంలో తమ ప్రభావం కోల్పోకుండా చూసుకుంటాయి.
  • దీనివల్ల పాత తరం స్థానంలో కొత్త తరం వచ్చి ఆవరణ వ్యవస్థలో వాటి పాత్రను పూర్తిచేసి ప్రకృతి సమతుల్యతను కాపాడతాయి.
  • ప్రత్యుత్పత్తిని జీవులు ఆపివేస్తే, ఉన్న జీవులు ముసలివై కొంతకాలం తర్వాత చనిపోతాయి. తరువాత వాటి స్థానాన్ని భర్తీచేసే కొత్తతరం ఉండదు.
  • కాబట్టి ‘ప్రకృతిలో సమతుల్యత’ దెబ్బతిని సృష్టి అంతానికి కారణమవుతుంది.

ప్రశ్న 2.
ఈ కింది వాటిలో తేడాలను తెలపండి.
ఎ) లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి
జవాబు:

లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి
1. ఒక జీవి లేదా స్త్రీ పురుష జీవులు అవసరం. 1. ఒక జీవి మాత్రమే అవసరమవుతుంది.
2. స్త్రీ పురుష బీజకణాలు ఏర్పడతాయి. 2. బీజ కణాలు ఏర్పడవు.
3. సంయుక్త బీజం ఏర్పడుతుంది. 3. సంయుక్తబీజం ఏర్పడదు.
4. సగం తల్లి లక్షణాలు, సగం తండ్రి లక్షణాలు వస్తాయి. 4. ఇవి తల్లి జీవి నకలు (జిరాక్స్) గా ఉంటాయి.

బి) సంయోగ బీజం, సంయుక్త బీజం
జవాబు:

సంయోగ బీజం సంయుక్త బీజం
1. ఇది స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల నుండి తయారవుతుంది. 1. ఇది స్త్రీ, పురుష బీజకణాల కలయిక వల్ల ఏర్పడుతుంది.
2. ఇది ఏకస్థితికం. 2. ఇది ద్వయ స్థితికం.
3. ఇది ఫలదీకరణలో పాల్గొంటుంది. 3. ఫలదీకరణ తరువాత మాత్రమే ఇది ఏర్పడుతుంది. తద్వారా జీవి పెరుగుదల మొదలవుతుంది.

సి) బాహ్య ఫలదీకరణం, అంతర ఫలదీకరణ
జవాబు:

బాహ్య ఫలదీకరణ అంతర ఫలదీకరణ
1. శరీరం బయట జరుగు ఫలదీకరణను బాహ్య ఫలదీకరణ అంటారు. 1. శరీరం లోపల (స్త్రీ జీవిలో) జరిగే ఫలదీకరణను అంతర ఫలదీకరణ అంటారు.
2. సంయుక్తబీజం బయట (గాలి, నీరు, నేల) అభివృద్ధి చెందుతుంది. ఉదా : కప్ప, చేప 2. సంయుక్త బీజం స్త్రీ జీవి శరీరంలోపల అభివృద్ధి చెందుతుంది. ఉదా : క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు మొ॥నవి.

డి) అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు
జవాబు:

అండోత్పాదకాలు శిశోత్పాదకాలు
1. గుడ్లు పెట్టి పిల్లతరాన్ని అభివృద్ధి చేసే జీవులను అండోత్పాదకాలు అంటారు. 1. పిల్లల్ని కని, పెంచి తరువాతి తరాన్ని అభివృద్ధి చేసే వాటిని శిశోత్పాదకాలు అంటారు.
2. వీటిలో అంతర ఫలదీకరణ జరుగును.
ఉదా : పక్షులు, సరీసృపాలు
2. వీటిలో కూడా అంతర ఫలదీకరణ జరుగును.
ఉదా : క్షీరదాలు, గబ్బిలం (ఎగిరే క్షీరదం)

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 3.
హైడ్రా, అమీబాల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియను పోల్చండి.
జవాబు:

హైడ్రా ప్రత్యుత్పత్తి అమీబాలో ప్రత్యుత్పత్తి
1. ఇది బహుకణ జీవి. 1. ఇది ఏకకణ జీవి.
2. దీనిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. 2. దీనిలో కూడా అలైంగిక పద్ధతిలోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
3. ఈ పద్ధతిని మొగ్గ తొడగడం లేదా ‘కోరకీ భవనం’ అంటారు. 3. ఇది ద్విధావిచ్ఛిత్తి లేదా బహుధా విచ్ఛిత్తిల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
4. ప్రత్యుత్పత్తి తరువాత తల్లిజీవి అంతరించిపోదు. 4. కానీ దీనిలో మాత్రం ద్విధా లేదా బహుధా విచ్ఛిత్తి తల్లిజీవి, పిల్లజీవి రెండూ జీవనం కొనసాగిస్తాయి. తరువాత తల్లి కణం అంతర్ధానమయ్యి పిల్ల కణాలను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 4.
సంయుక్తబీజం ఏర్పరచకుండానే జంతువులు వాటి సంతతిని ఉత్పత్తి చేయగలవా ? ఉదాహరణతో వివరించండి.
జవాబు:

  • లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్తబీజం ఏర్పడి, దాని నుండి జీవులు ఏర్పడతాయి.
  • కాని అన్ని జంతువులు లైంగిక ప్రత్యుత్పత్తిని అనుసరించవు.
  • కొన్ని జీవులు అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్తబీజం ఏర్పడకుండానే సంతతిని ఉత్పత్తి చేస్తాయి.
  • ఉదా : అమీబా – ద్విదావిచ్ఛిత్తి
    హైడ్రా – మొగ్గతొడగటం

ప్రశ్న 5.
బాహ్య లక్షణాలు పరిశీలించి ఒక జీవి అండోత్పాదకమో, శిశోత్పాదకమో ఎలా గుర్తించగలవు ?
జవాబు:
1) అండోత్పాదక జీవిలో

  • చెవులు బయటకు కనిపించవు.
  • చర్మంపై రోమాలు ఉండవు. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు గుడ్లు పెడతాయి.
  • ఉదా : పక్షులు, మొసలి,తాబేలు, పాము.

2) శిశోత్పాదక జీవిలో

  • చెవులు బయటకు కనిపిస్తాయి.
  • చర్మంపై రోమాలు ఉంటాయి. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు పిల్లల్ని కని పెంచుతాయి.
  • ఉదా : క్షీరదాలు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 6.
నేను ఎవరిని ?
i) నేను పురుష, స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల ఏర్పడతాను.
జవాబు:
సంయుక్త బీజము అంటారు.

ii) నాకు తోక ఉంటుంది. అండంతో సంయోగం చెందుతాను.
జవాబు:
శుక్రకణం అంటారు.

iii) తల్లి గర్భాశయంలో పూర్తిగా ఎదిగిన పిండాన్ని నేను.
జవాబు:
భ్రూణం అంటారు.

ప్రశ్న 7.
అనేక భూచరాలలో అంతర ఫలదీకరణ జరుగుటకు కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:

  • బాహ్య ఫలదీకరణలో నీరు మాధ్యమంగా పనిచేస్తుంది.
  • అందువలన సంయోగబీజాలు ఎండిపోయి చనిపోవటం జరగదు.
  • వీటి చలనానికి నీరు దోహదపడుతుంది.
  • భూచర జీవులు భూమిమీద నివశిస్తాయి.
  • నేలమీద సంయోగబీజాలు చలించలేవు.
  • వేడికి, గాలికి సంయోగబీజాలు చనిపోతాయి.
  • అందువలన భూచరజీవులు అంతర ఫలదీకరణను అవలంబిస్తాయి.

ప్రశ్న 8.
కింది పటం సహాయంతో అందులోని జీవి యొక్క జీవిత చరిత్రలో వివిధ దశలను గుర్తించండి. ఈ జీవిలో రూపవిక్రియ ఎలా జరుగుతుందో వివరించండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 1
జవాబు:

  • ఈ పటంలో ఉన్నది ‘పట్టు పురుగు’ జీవిత చక్రంనకు సంబంధించినది.
  • దీనిలో ఎ) ప్రౌఢజీవి b) గుడ్ల దశ c) లార్వా దశ d) ప్యూపా దశలు ఉన్నాయి.
  • పట్టు పురుగు నందు అంతర ఫలదీకరణ జరిగి సంయుక్త బీలు – స్త్రీ జీవిలో ఏర్పడతాయి.
  • ఇది మల్బరీ ఆకుల వెనుకభాగాన గుడ్లు దశలు దశలుగా, గుంపులుగా పెడుతుంది.
  • ఇవి ‘సూర్యరశ్మి’ సమక్షంలో పొదగబడి లార్వా దశకు చేరుకుంటాయి.
  • ఇది ‘గొంగళి పురుగు’ మాదిరిగా ఉండి మల్బరీ ఆకులను తింటూ జీవిస్తుంది.
  • తరువాత ‘ప్యూపాదశ’లో ఈ డింభకం ఒక సంచి వంటి కోశాన్ని నిర్మించి దానిలో సుప్తావస్థలోకి వెళ్తుంది.
  • తరువాత అది కోశం నుండి ‘ప్రౌఢజీవి’ గా అభివృద్ధి చెందుతుంది.
  • ప్రౌఢజీవి లక్షణాలు లార్వా, ప్యూపా దశలలో లేనప్పటికీ చివరికి మరలా తల్లి లక్షణాలతో జీవి అభివృద్ధి చెందింది. దీనిని రూపవిక్రియ అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 9.
జతపరచండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 2
జవాబు:
ఎ) 2
బి) 1
సి) 4
డి) 3

ప్రశ్న 10.
ఈ కింది ఖాళీలను పూరింపుము.
ఎ) పిల్లలను కనే జంతువులను ……………….. అంటాం.
బి) మానవులలో శిశువు పెరుగుదల …………………. లో జరుగుతుంది.
సి) అండాలు ……………………… నుండి విడుదలవుతాయి.
డి) టాడ్ పోల్ అనేది ……………………… యొక్క ప్రాథమిక రూపం.
ఇ) కోరకీభవనం, ద్విధా విచ్ఛిత్తి …………………… ప్రత్యుత్పత్తి విధానాలు.
జవాబు:
ఎ) శిశోత్పాదక జీవులు
బి) స్త్రీ జీవి గర్భాశయం
సి) స్త్రీ జీవి బీజకోశం
డి) కప్ప
ఇ) అలైంగిక

ప్రశ్న 11.
అమీర్ ఒక చెరువులో టాడ్ పోల్ ను చేపగా భావించి జాగ్రత్తగా అక్వేరియంలో ఉంచాడు. కొన్ని రోజుల తరువాత అమీర్ దానిలో ఏమేమి మార్పులు గమనిస్తాడో రాయండి.
జవాబు:

  • ‘టాడ్పేల్’ అచ్చం చేపపిల్ల లక్షణాలు కలిగిన ‘కప్ప డింభకం’.
  • పిల్లలు (అమీర్) దానిని చెరువులో చూసి చేపపిల్ల అనుకుని ఆక్వేరియంలో ఉంచాడు.
  • ముందు దీనికి జిగురు ముద్ద లాంటి మూతి ఉండటం గమనించాడు.
  • అది నీళ్ళలో నాచును, అక్వేరియంలో గోడలను అంటిపెట్టుకోవటానికి పనికి వస్తుందని గమనించాడు.
  • దీనికి ఉన్న తోక సాయంతో ఈదగలుగుతుందని గమనించాడు.
  • ఇది బాహ్య మొప్పల ద్వారా ‘జల శ్వాసక్రియ’ జరుపుతుందని తెలుసుకున్నాడు.
  • నెమ్మదిగా ముందున్న శ్లేష్మస్థర ముద్ద నోరుగా పై క్రింది పెదవులుగా విడిపోవటం చూసాడు.
  • తరువాత మొప్పలపై ఉపరికుల ఏర్పడింది.
  • తరువాత దీని తోక కొంచెం కొంచెం పొడవు తగ్గటాన్ని గమనించాడు.
  • ఉపరికుల, బాహ్య మొప్పల స్థానంలో ముందు కాళ్లు ఆవిర్భవిస్తున్నాయి.
  • తరువాత తోక మొదలైన స్థానం నుంచి ఇరుపక్కల వెనుక కాళ్లు ఆవిర్భవిస్తున్నాయి.
  • తల కింది భాగంలో ఇరువైపులా ఉన్న బాహ్య మొప్పలు అంతరించిపోయాయి.
  • తోక పూర్తిగా కుంచించుకుపోయింది.
  • ముందు, వెనుక కాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందాయి.
  • ఊపిరితిత్తులు ఏర్పడి ఇది నీటి పైకి మూతి పెట్టి బాహ్య నాసికా రంధ్రాల ద్వారా గాలి పీల్చుకోవటం గమనించాడు.
  • ఇది ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెంది కప్ప పిల్లగా మారిపోవడాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయాడు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 12.
చేపలు, కప్పలు అధిక సంఖ్యలో అండాలను ఎందుకు విడుదల చేస్తాయి ? మానవుని వంటి క్షీరదాలు అధిక సంఖ్యలో అండాలు విడుదల చేయకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయో ఉపాధ్యాయునితో చర్చించి రాయండి.
జవాబు:

  • చేపలు, కప్పలలో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది.
  • కావున ఇవి అండాలు, శుక్రకణాలను నీటిలోనికి విడుదల చేస్తాయి.
  • నీటి ప్రవాహానికి వర్షాలకు ఇతర జీవుల ఆహారంగా కొన్ని అండాలు నశిస్తాయి.
  • అందువలన అండాలలో ఫలదీకరణ అవకాశాలు తగ్గుతాయి. కావున ఈ జీవులు అధిక సంఖ్యలో అండాలను ఉత్పత్తి చేస్తాయి.
  • మానవుని వంటి క్షీరదాలలో అంతర ఫలదీకరణ జరుగుతుంది.
  • అండాలు నశించటం ఉండదు. ఫలదీకరణ అవకాశాలు అధికం.
  • కావున క్షీరదాలలో అండాలు తక్కువ సంఖ్యలో విడుదల అవుతాయి.

ప్రశ్న 13.
మీ గ్రంథాలయము నుండి గాని, ఇతర వనరుల నుండి గానీ తేనెటీగ యొక్క జీవిత చరిత్రను సేకరించి, పాఠశాల సింపోసియంలో ఆ అంశాలను చర్చించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 3

  • తేనెటీగ ‘ఆర్థోపొడ’ వర్గానికి చెందిన జీవి.
  • ఇవి చాలా కష్టజీవులు. పువ్వుల నుండి మకరందం సేకరించి ‘తేనె’ తయారు చేస్తాయి.
  • క్రమ శిక్షణకు, నాయకత్వ విధేయతకు, మాతృసామ్య వ్యవస్థ మూలాలకు ఈ తేనెటీగలు మంచి ఉదాహరణ.
  • వీని జీవిత చరిత్రలో 4 దశలు ఉన్నాయి. a) గుడ్లు b) లార్వా c) ప్యూపా d) ప్రౌఢజీవి.
  • ఆడ ఈగలు ప్రత్యుత్పత్తి తర్వాత గుడ్లు పెడతాయి.
  • ఇవి పొదగబడిన తరువాత వాటి నుండి లార్వాలు వస్తాయి.
  • ఈ లార్వాలు తేనెటీగలు ఏర్పరచుకున్న తెట్టులోగానీ, పుట్టలోగానీ ఉంచబడతాయి.
  • ఇవి తరువాత పొదగబడి పౌడజీవులుగా ఏర్పడతాయని తెలుసుకున్నాను.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 14.
కింది పటాలను గమనించి బొమ్మలు గీయండి. వాటి విధులు రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 4
జవాబు:
ముష్కము విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 5

  • ముష్కము పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య భాగం.
  • ఇది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది.
  • పురుష లైంగిక హార్మోన్ టెస్టోస్టిరాన్ ను ఉత్పత్తి చేస్తుంది.
  • మగ పిల్లలలో యుక్తవయస్సుకు రాగానే “ద్వితీయ లైంగిక” లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. ముష్కము
  • ఇది పీయూష గ్రంథి ఆజ్ఞల ప్రకారం పని చేస్తుంది.

స్త్రీ బీజకోశాలు-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 6

  • స్త్రీ బీజకోశాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య భాగాలు.
  • వీటిలో ‘అండ పుటికలు’ ఉంటాయి.
  • ఇవి యుక్త వయసు వచ్చిన తర్వాత నుండీ మోనోపాజ్ దశ వరకు ప్రతి 28 రోజులకొకసారి ఒక పుటిక పక్వానికి వచ్చి అండాన్ని విడుదల చేస్తుంది.
  • పగిలిన పుటిక స్త్రీ లైంగిక హార్మోన్లయిన 1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్లను ఉత్పత్తి చేస్తుంది.

ఫాలోపియన్ నాళాలు-విధులు :

  • ఇవి ఆడపిల్లలలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని జరిపిస్తాయి.
  • తల్లుల ఆరోగ్యానికి, గర్భం దాల్చినప్పుడు మార్పులకు, బిడ్డకు పాలివ్వటానికి ప్రొజెస్టిరాన్ సహకరిస్తుంది.
  • అండం గర్భాశయానికి చేరటానికి సహకరిస్తాయి.
  • ఫలదీకరణకు అవకాశమిస్తాయి.

మానవ శుక్రకణం-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 7

  • ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న ‘ముష్కము’ నుండి విడుదల అవుతుంది.
  • ఇది ఏక స్థితికం.
  • కదలగలిగి ఉంటుంది. (దీని తోక సాయంతో)
  • అండాన్ని గర్భాశయంలో కనుగొని ఫలదీకరణ చెందించేందుకు పనిచేస్తుంది.
  • దీని జీవితకాలం 24-72 గంటలు.

అండం-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 8

  • ఇది స్త్రీ బీజకణం.
  • స్త్రీ బీజకోశాలలోని అండ పుటికలు దీనిని ఉత్పత్తి చేస్తాయి.
  • ఇది ఫాలోపియల్ నాళం గుండా ప్రయాణించే సమయంలోనే ఫలదీకరణ చెందేందుకు అవకాశం ఉంటుంది.
  • దీని జీవిత కాలం 24 గం॥ మాత్రమే.

ప్రశ్న 15.
మానవ పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటాన్ని గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 9

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 16.
కప్ప జీవిత చరిత్ర పటం గీచి దానిలో ఏవి శాఖాహార దశలో గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 10

  • కప్ప లార్వాను చిరుకప్ప లేదా టాడ్ పోల్ అంటారు.
  • ఈ దశలో కప్ప చేపను పోలి ఉండి శాకాహారిగా ఉంటుంది.

8th Class Biology 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి InText Questions and Answers

8th Class Biology Textbook Page No. 54

ప్రశ్న 1.
కింద కొన్ని జంతువుల పేర్లు ఇవ్వబడ్డాయి. వాటిని పరిశీలించి జ్ఞాపకం తెచ్చుకుని పట్టిక నింపండి.
(లేడి, చిరుత, పంది, చేప, గేదె, జిరాఫీ, కప్ప, బల్లి, కాకి, పాము, ఏనుగు, పిల్లి)
జవాబు:

క్ర.సం. చెవి బయటకు కనిపించే జీవులు చెవులు బయటకు కనిపించని జీవులు
1. లేడి చేప
2. చిరుత కప్ప
3. పంది బల్లి
4. గేదె కాకి
5. జిరాఫీ పాము
6. ఏనుగు
7. పిల్లి
ఇవన్నీ శిశోత్పాదక జీవులు ఇవన్నీ అండోత్పాదక జీవులు

a) చెవులు బయటకు కనిపించకపోయినా ఈ జీవులు ఎట్లా వినగల్గుతున్నాయి ?
జవాబు:

  • చెవి నిర్మాణంలో, వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అనే మూడు నిర్మాణాలు ఉంటాయి.
  • వినటంలో కీలక పాత్ర వహించేది లోపలి చెవి.
  • గుడ్లు పెట్టే జంతువులలో బాహ్య చెవి మాత్రమే ఉండదు. మధ్య చెవి, లోపలి చెవి ఉంటుంది.
  • అందువలన ఇవి ధ్వని వినగల్గుతాయి.

8th Class Biology Textbook Page No. 54

ప్రశ్న 2.
కింద కొన్ని జంతువుల పేర్లు ఇవ్వబడ్డాయి. వాటిని జ్ఞాపకం చేసుకుని ఈ పట్టికను నింపండి.
(ఆవు, ఎలుక, కాకి, పంది, నక్క కోడి, ఒంటె, బాతు, కప్ప, ఏనుగు, గేదె, పావురం, పిల్లి, నెమలి, బల్లి )
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 11

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology Textbook Page No. 57

ప్రశ్న 3.
ఈ క్రింది దానిమ్మ పుష్పాలు పరిశీలించి వాటి ప్రత్యుత్పత్తి భాగాలు రాయండి. (పేజీ నెం. 57)
ఎ) మొక్కలలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 12
1) ………………….
2) ………………….
3) ………………….
4) ………………….
5) ………………….
6) ………………….
జవాబు:
వాటి భాగాలు
1) కేసరము
2) కేసర దండము
3) పరాగ కోశము
4) పరాగ రేణువులు
5) సంయోజకము
6) కేసరావళి

బి) మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ వాటి భాగాలు
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 13
1) ………………….
2) ………………….
3) ………………….
4) ………………….
5) ………………….
6) ………………….
జవాబు:
వాటి భాగాలు
1) అండకోశము
2) అండాశయము
3) కీలము
4) కీలాగ్రము
5) అండన్యాస స్థానము
6) అండాలు

8th Class Biology Textbook Page No. 59

ప్రశ్న 4.
ఈ క్రింది స్లో చార్టును పూరించండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 14
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 15

a) శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే ఏమవుతుందో చెప్పగలరా ?
జవాబు:
శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. వైవిధ్యం గల జీవులు ఏర్పడవు. క్రొత్త జాతులు అవతరించవు.

b) కొన్ని జంతువులు మాత్రమే పిల్లలకు ఎందుకు జన్మనిస్తాయో చెప్పగలరా ?
జవాబు:
పిల్లల్ని కనే స్త్రీ జంతువుల్లో గర్భాశయము, పిండాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అందువలన పిండాలు గర్భాశయంలో ఎదిగి పిల్ల జీవులుగా పుడతాయి. గుడ్లు పెట్టే జంతువులలో ఈ అమరిక ఉండదు.

c) జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే, తదుపరి తరం జీవులు ఉత్పత్తికావు. ఉన్న జీవులు కొంత కాలానికి మరణిస్తాయి. కావున భూమి మీద జీవరాశి అంతరించిపోతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology Textbook Page No. 61

ప్రశ్న 5.
టాడ్ పోల్ లార్వాలు ఏ ఏ ఋతువులలో కనిపిస్తాయో చెప్పండి.
జవాబు:

  • టాడ్ పోల్ లార్వాలు వర్షాకాలంలో బాగా కనిపిస్తాయి.
  • వర్షాకాలంలో కప్ప వర్షపు నీటిలో ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
  • అందువలన కప్ప అండాలు బాహ్యఫలదీకరణం చెందుతాయి.
  • ఇవి సూర్యరశ్శికి పొదిగి టాడ్ పోల్ లార్వాలను ఉత్పత్తి చేస్తాయి..
  • ఇవి చేపల వలె నీటిలో ఈదుతూ రూపవిక్రియ చెంది కప్పలుగా మారతాయి.

ప్రశ్న 6.
వర్షాకాలంలో కప్పలు ఎందుకు బెక బెకమని శబ్దాలు చేస్తాయి ?
జవాబు:

  • వర్షాకాలం కప్పల ప్రత్యుత్పత్తికి అనుకూల సమయం.
  • ఈ కాలంలో మగకప్ప బెక బెకమని శబ్దాలు చేసి ఆడకప్పను ఆకర్షిస్తుంది.
  • ఆడ, మగ, కప్పలు కలిసి వర్షపు నీటిలో శుక్రకణాలు, అండాలను విడుదల చేస్తాయి.

8th Class Biology Textbook Page No. 62

ప్రశ్న 7.
కప్ప జీవిత చక్రాన్ని పరిశీలించటానికి నీవు చేయు ప్రాజెక్ట్ వివరాలు తెలపండి.
జవాబు:
ఉద్దేశం : కప్ప జీవిత చక్రం పరిశీలించుట.
పరికరాలు : వెడల్పు మూతిగల తొట్టి లేదా గాజుసీసా, పారదర్శక గ్లాసు, డ్రాపర్, పెట్రెడిష్, గులకరాళ్ళు, భూతద్దం, బీకరు.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 16
విధానము :

  • వర్షాకాలంలో దగ్గర ఉన్న చెరువు వద్దకు వెళ్ళి నురగ వంటి కప్ప గుడ్లను పరిశీలించాను.
  • దానిని జాగ్రత్తగా వెడల్పు మూతిగల సీసాలోనికి తీసుకున్నాను.
  • ఇలా సేకరించిన అండాలను 15 సెం.మీ. లోతు, 8 – 10 సెం.మీ. వ్యాసార్ధం కలిగిన తొట్టిలోకి మార్చాను.
  • భూతద్దం సహాయంతో అండాలను పరిశీలించాను.
  • అండం మధ్య భాగంలో చుక్కవంటి నిర్మాణం గమనించాను. అదే కప్ప పిండం.
  • గుడ్లు పొదిగి కొన్ని రోజులకు, టాడ్ పోల్ లార్వాలు బయటకు వచ్చాయి.
  • ఈ లార్వాలు చేపను పోలి ఉన్నాయి.
  • వీటి తల భాగంలో మొప్పలు ఉన్నాయి.
  • ఇవి క్రమేణా అనేక శారీరక మార్పులు చెందాయి.
  • పరిమాణంలో పెరిగి కాళ్ళు, చేతులు ఏర్పరచుకున్నాయి.
  • తోక అంతరించిపోయింది.
  • మొప్పలు అదృశ్యమైపోయాయి. ఊపిరితిత్తులు ఏర్పడ్డాయి.
  • చివరికి అది తోక కలిగిన కప్ప ఆకారం నుండి కప్పగా మార్పు చెందింది.
  • ఈ ప్రక్రియనే రూపవిక్రియ అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 17

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 8.
a) గుడ్లు పొదగటానికి ఎన్ని రోజులు పట్టింది ?
జవాబు:
గుడ్లు పొదగటానికి వారం రోజులు పట్టింది. (7 నుండి 9 రోజులు)

b) టాడ్పల్ ఏ ఆకారాన్ని పోలి ఉంది ?
జవాబు:
టాడ్ పోల్ చేప ఆకారాన్ని పోలి ఉంది.

c) ఏ దశలో టాడ్ పోల్ లో మొప్పలు కనిపిస్తాయి ?
జవాబు:
గుడ్డు నుండి వచ్చిన టాడ్పేల్ బాహ్య మొప్పలు కల్గి ఉంది. మొదటి దశలో టాడ్ పోల్ లార్వా బాహ్య మొప్పలు కల్గి ఉంది.

d) సేకరించిన ఎన్ని రోజులకు టాడ్ పోల్ కు కింది అవయవాలు కనిపించాయి ?
జవాబు:
గుండె – 2వ వారము (14 రోజులు తరువాత)
ప్రేగులు – 3వ వారము (21 రోజులు)
ఎముకలు – 4వ వారము (28 రోజులు)
పురీషనాళం – 3వ వారము (21 రోజులు)
ముందు కాళ్ళు – 9వ వారము (63 రోజులు)
వెనుక కాళ్ళు – 10వ వారము (70 రోజులు)

e) టాడ్ పోల్ లార్వాలో మొప్ప చీలికలు ఎన్నవ రోజు నుండి కనిపించకుండాపోయాయి ?
జవాబు:
28 రోజులు (నాలుగు వారాలు) తరువాత మొప్ప చీలికలు అదృశ్యమైనాయి.

f) ఎన్నవ రోజు తోక పూర్తిగా కనిపించకుండా పోయింది ?
జవాబు:
84 రోజులు (12 వారాలు) తరువాత తోక కనిపించకుండా పోతుంది.

g) టాడ్ పోల్ లార్వా కప్పగా మారుటకు ఎన్ని రోజులు పట్టింది ?
జవాబు:
టాడిపోల్ లార్వా కప్పగా మారుటకు 48 రోజులు పట్టింది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ఆలోచించండి – చర్చించండి

ప్రశ్న 1.
అన్ని జంతువులు గుడ్లు పెడతాయా ?
జవాబు:
లేదు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మాత్రమే గుడ్లు పెడతాయి. క్షీరదాలు గుడ్లు పెట్టవు. పిల్లల్ని కంటాయి.

ప్రశ్న 2.
ఏ ఏ జంతువులు పిల్లల్నికంటాయి ?
జవాబు:
క్షీరదాలు అన్ని పిల్లల్ని కంటాయి. ఉదా : ఆవు, గేదె, గుర్రం, ఎలుక, పిల్లి, ఏనుగు, మనిషి.

ప్రశ్న 3.
ఏ ఏ జంతువులు గ్రుడ్లు పెడతాయో, ఏవి పిల్లల్ని కంటాయో తెలుసుకోవటం ఎలా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులలో కొన్ని బాహ్య లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుడ్లు పెట్టే వాటి నుండి వేరుగా తెలుసుకోవచ్చు.

ప్రశ్న 4.
అలా తెలుసుకోవడానికి పద్ధతులేమైనా ఉన్నాయా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులు బాహ్య చెవులను, చర్మం మీద రోమాలను కలిగి ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుర్తించవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
మీ ప్రయోగశాలలో ఉన్న హైడ్రా సైడ్ ను చూస్తే, దానిపై ఉబ్బెత్తు బుడిపెలు కనపడ్డాయా ? అవి ఏమిటి ? మీ పరిశీలన ఆ రాయండి.
జవాబు:
1) హైడ్రా సైడ్ ను పరిశీలిస్తున్నప్పుడు ఈ ఉబ్బెత్తు భాగాలను పరిశీలించాను.
2) మా టీచరు వాటిని ‘మొగ్గలు’ (కోరకాలు) అన్నారు.
3) అవి ఎలా ఏర్పడతాయి ?
4) లైబ్రరీ నందున్న జీవశాస్త్ర పుస్తకంలో ఈ కింది విధానం ఉంది. గమనించండి.

  • ముందుగా హైడ్రా శరీరంపై ఉన్న ఒక భాగం జీవ పదార్థ పీడనం వల్ల బయటకు నెట్టబడుతుంది.
  • తరువాత దీని లోపలి గోడలపై కొత్త కణాలు, కణ ద్రవ్యం ఏర్పడి దాని పరిమాణం పెరుగుతుంది.
  • తరువాత ఈ ఉబ్బెత్తు భాగం చివర కళాభాలు మొలుస్తాయి.
  • దానిని సంపూర్ణ పిల్ల హైడ్రాగా మనం చూడవచ్చు.
  • ఇది తల్లి నుండి వేరై, స్వతంత్రంగా జీవనం సాగిస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 18

కృత్యం – 2

ప్రశ్న 2.
అమీబాలో ‘ద్విధావిచ్ఛిత్తి’ జరుగుతుందని చెప్పే బొమ్మలను పరిశీలించి మార్పులు పొందుపరచండి. (లేదా) అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి ? దానిని పటం ద్వారా చూపుము.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 19
జవాబు:
పటం – 1
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 20

  • అమీబా కేంద్రకం మామూలుగా ఉంది.
  • శరీరం (అంటే కణకవచం) సాధారణంగా ఉంది.

పటం – 2
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 21

  • అమీబా శరీరం గుండ్రని ఆకృతి పొందింది.
  • మిద్యాపాదాలు చాలా వరకు లేవు.
  • కేంద్రకం సాగి, మధ్యలో నొక్కు ఏర్పడింది.

పటం – 3
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 22

  • కేంద్రకం రెండుగా విడిపోయింది.
  • శరీరం మధ్యలో నొక్కు ఏర్పడి అది కణం మధ్య వైపునకు పెరుగుతుంది.
  • పెరుగుదల రెండు పక్కలా అంటే కింది నుంచి, పై నుంచి కూడా ఉంది.

పటం – 4
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 23

  • కణం మధ్యలో నొక్కు బాగా దగ్గర వచ్చింది.

పటం – 5
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 24

  • నొక్కు ఇంకా దగ్గరకు వచ్చింది.
  • అటు పక్క, ఇటు పక్క మిద్యాపాదాలు ఏర్పడటం గమనించాను.

పటం – 6
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 25

  • రెండుగా విడిపోయాయి.
  • తద్వారా తల్లి కణం అంతరించి రెండు పిల్లకణాలు ఉద్భవించాయి.

ఇలా అమీబాలో ద్విధావిచ్ఛిత్తి జరగటం నేను గమనించాను.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

కృత్యం – 3

ప్రశ్న 3.
ఐదారుగురు విద్యార్థులతో జట్టుగా ఏర్పడండి. మీ జట్టు సభ్యుల తల్లిదండ్రుల ఫోటోలను సేకరించండి. ఆ ఫోటోలతో వారిని పోల్చండి. ఏ ఏ భాగాలు / అవయవాలు, తల్లి లేదా తండ్రిని పోలిఉన్నాయో పరిశీలించి, పట్టికలో నమోదు చేయండి. (పాఠ్యాంశంలోని ప్రశ్న పేజీ నెం. 60)
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 26
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 27

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

SCERT AP 8th Class Biology Study Material Pdf 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 3rd Lesson Questions and Answers సూక్ష్మజీవుల ప్రపంచం 2

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 Textbook Questions and Answers

ప్రశ్న 1.
కవితకు తీవ్రమైన జబ్బు చేస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ 5 రోజులకు సూక్ష్మజీవ నాశకాలు (Antibiotics) వాడమని మందులు రాశాడు. మూడు రోజులు వాడిన తరువాత జబ్బు నయం అయింది. ఆమె యాంటిబయాటిక్ మందులు వాడటం మానివేసింది. ఆమె చేసింది సరైనదేనా ? కాదా ? ఎందుకు ? కారణాలు రాయండి.
జవాబు:

  • కవిత చేసింది సరైంది కాదు.
  • ఎందుకంటే డాక్టరు ఆమె జబ్బు నయం అయ్యేందుకు అవసరమైన మోతాదు ఐదు రోజులకు సూక్ష్మజీవ నాశకాలు వాడమని అన్నారు.
  • కానీ జబ్బు మూడవ రోజు తగ్గిందని ఆమె మందులు మానింది.
  • పైకి జబ్బు తగ్గినట్లుగా వున్న, శరీరం లోపల ఇంకా ఆ వ్యాధికారక సూక్ష్మజీవులు వుంటాయి.
  • అవి పూర్తిగా నిర్మూలించబడకుండా మందులు మానివేస్తే జబ్బు తిరగబెడుతుంది.
  • ఒకవేళ మందులు మానివేయాలి అంటే అది డాక్టరు సలహా పై జరగాలి తప్ప మనంతట మనం నిర్ణయించుకోవటం మంచిది కాదు.
  • ఉదా : పచ్చ కామెర్లు తగ్గినా, దీని వ్యాధికారక క్రిమి 6 నెలల వరకు పాక్షికంగా మన శరీరంలోనే వుంటుంది. అందుకే డాక్టరు ఇచ్చిన మోతాదు తప్పక వాడాలి.

ప్రశ్న 2.
టీకాలు మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తాయి ?
జవాబు:
టీకాలు లేదా వ్యాక్సిన్లు మన శరీరంలో వ్యాధి రాకముందే ప్రవేశించి, రోగకారక క్రిమిని నశింపచేయటానికి తగిన రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయి. ఉదా : ‘పోలియో చుక్కలు’. ఈ మందు చిన్నపిల్లలకు ఇచ్చినప్పుడు ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తరువాత పోలియో వైరస్ శరీరంలోకి ప్రవేశించినా అది పోలియోను కలుగచేయలేదు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 3.
పాశ్చరైజేషన్ అంటే ఏమిటి ? అది ఎందుకు ఉపయోగపడుతుంది ?
జవాబు:

  • “లూయీపాశ్చర్” వైన్ చెడిపోవటానికి సూక్ష్మజీవులు కారణం అని గుర్తించాడు.
  • వైన్ ను వేడి చేయటం ద్వారా సూక్ష్మజీవులను చంపి, ఎక్కువ కాలం వైన్ ను నిల్వ చేయవచ్చని నిరూపించాడు. ఈ విధానాన్ని ‘పాశ్చరైజేషన్’ అంటారు.
  • ఇది పాలను పెరుగుగా మార్చటానికి, ద్రాక్ష రసాన్ని పులియబెట్టి వైన్ గా మార్చటానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 4.
మలేరియా వ్యాధిని నిర్మూలించటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:
1. ‘మలేరియా’ ఇది జ్వర రూపంలో వచ్చే వ్యాధి.
2. తీవ్రమైన చలితో కూడిన జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం దీని లక్షణాలు.
3. ఇది దోమల వల్ల వచ్చే వ్యాధి. కాబట్టి దోమల నివారణకు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎ) పరిసరాలలో మురుగు గుంటలు, కాలువలు లేకుండా చేయాలి.
బి) ఒకవేళ వున్నా ఆ మురికినీటిపై నూనె చుక్కలు వేస్తే అది నూనె తెట్టును ఏర్పరుస్తుంది. దీంతో ఆ నీటిలోవున్న లార్వాలు చనిపోతాయి.
సి) దోమ తెరలను వాడాలి.
డి) దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులకు తెరలను పెట్టాలి.
ఇ) ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా వుంచుకోవటం ముఖ్యమైన విషయం.

ప్రశ్న 5.
వ్యాక్సిన్ తీసుకోవటానికి, యాంటిబయాటిక్ తీసుకోవడానికి సరైన సమయం ఏది ? ఎందుకు ?
జవాబు:

  • వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందును ‘వ్యాక్సిన్’ అంటారు.
  • వ్యాధి వచ్చిన తరువాత అది తగ్గటానికి తీసుకునే మందులే యాంటిబయాటిక్స్.
  • కాబట్టి చిన్న వయస్సులో పెద్దలు, డాక్టర్ల సూచనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవాలి.
  • ఉదా : 1) ధనుర్వాతం, మశూచి మొ॥ రాకుండా చిన్నపిల్లలకు చిన్నప్పుడే టీకాలు వేస్తారు.
    2) పచ్చ కామెర్లు రాకుండా 10-15 సం॥ పిల్లలలో, పెద్దలకు కూడా Hepatitis – B వ్యాక్సిన్ ఇస్తారు.
  • ఇక యాంటిబయాటిక ను జబ్బు లక్షణాలు కనిపించిన తరువాత డాక్టరు నిర్ణయించిన మోతాదు ప్రకారం మాత్రమే మందులను వేసుకోవాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 6.
వ్యాక్సిను, యాంటిబయాటిక్ తేడాలు ఏమిటి?
జవాబు:

వ్యాక్సిన్ యాంటిబయాటిక్
1) చైతన్య రహిత సూక్ష్మజీవులను శరీరంలోనికి ఎక్కించే ప్రక్రియను వాక్సిన్ అంటారు. 1) సూక్ష్మజీవులను చంపే రసాయన పదార్థాలను సూక్ష్మజీవ నాశకాలు లేదా యాంటిబయాటిక్స్ అంటారు.
2) వ్యాధినిరోధక వ్యవస్థను పెంచుతుంది. 2) వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినపుడు యాంటిబయాటిక్స్ వాడతారు.
3) ప్రతిరక్షకాలు తయారవుతాయి. 3) ప్రతిరక్షకాలు తయారుకావు.
4) దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది. 4) ప్రభావం తాత్కాలికంగా ఉంటుంది.
5) వ్యాధి రాకుండానే వాక్సిన్ ఇస్తారు. 5) వ్యాధి వచ్చిన తరువాత యాంటిబయాటిక్స్ వాడతారు.
6) వ్యాక్సిన్స్ వ్యాధి రాకుండా ఉండటానికి తోడ్పడతాయి. 6) యాంటిబయాటిక్స్ వ్యాధిని తగ్గించటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 7.
‘పెన్సిలిన్ ఆవిష్కరణ ప్రపంచాన్ని మరణాల నుండి రక్షించింది’ దీనిని వివరించండి.
జవాబు:

  • ‘పెన్సిలిన్’ అంటే యాంటిబయాటిక్ మందు.
  • దీనిని సూక్ష్మజీవ నాశకం అని కూడా అంటారు.
  • దీనిని డా॥ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కనిపెట్టాడు.
  • గాయపడిన సైనికులు సూక్ష్మజీవుల బారినపడి మరణిస్తుంటే, వీటిపై ప్రయోగాలు చేసి ఈ మందును కనిపెట్టాడు.
  • ఎందరో సైనికులను వ్యాధుల నుండి కాపాడాడు.
  • తరువాత కాలంలో ఇది మరెన్నో కోట్ల మందిని మరణం నుంచి, వ్యాధుల నుంచి కాపాడింది.
  • అందుకే పెన్సిలిన్ ఆవిష్కరణ ప్రపంచాన్ని మరణాల నుంచి రక్షించింది.

ప్రశ్న 8.
ప్రతిరక్షకాలు అంటే ఏమిటి ? ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి ? ఎలా మనకు సహాయపడతాయి ?
జవాబు:

  • వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుండి మనల్ని రక్షించేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది.
  • వీటినే ప్రతిరక్షకాలు అంటారు.
  • ఇవి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులతో పోరాటం చేస్తాయి.
  • ఇవి వ్యాధికారక క్రిమి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కువ ఉత్పత్తి అవుతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 9.
రాజీ తన పక్కింటి వారితో “మురుగునీరు నిల్వ ఉంటే వ్యాధులు ప్రబలుతాయి” అని చెప్పింది. ఈ సమయంలో ఆమె వ్యాధుల గురించి ఏమేమి వివరాలు చెప్పి ఉంటుందో ఊహించి రాయండి.
జవాబు:

  • మురుగునీరు నిల్వ ఉంటే దానిలో దోమలు, వాటి లార్వాలు పెరుగుతాయి.
  • వాటి ద్వారా వ్యాధులు ప్రబలుతాయి.
  • ఉదాహరణకు ‘మలేరియా’ జ్వరం దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • టైఫాయిడ్ కూడా క్యూలెక్స్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • మలేరియా చలితో వచ్చే జ్వరం. కానీ టైఫాయిడ్ తక్కువ జ్వరంతో చాలా రోజులు బాధపెడు.
  • ఈ రెండు వ్యాధులకు మురుగునీరు ఒక రిజర్వాయర్ లాంటిది. దీనిలో వీటి లార్వాలు పెరిగి వ్యాధి వ్యాప్తికి కారణమవుతాయి.
  • ఇవి రెండు కాకుండా పోలియో, కలరా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడు వాపు వ్యాధి లాంటి వ్యాధులన్నింటికీ దోమలు వాహకాలు.
  • మురుగునీరు దోమలకు ఆవాసం. కాబట్టి మురుగునీరు నిల్వ ఉంటే వ్యాధులు ప్రబలుతాయి అని రాజీ చెప్పిన విషయం సరైనదే.

ప్రశ్న 10.
మూడు గిన్నెలు తీసుకుని A, B, C గా గుర్తించండి. వాటిలో గోరువెచ్చని పాలు, వేడి పాలు, చల్లని పాలు వరుసగా పోయండి. మూడింటిలో ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పెరుగు తోడు వేయండి. కదపకుండా 5-6 గంటల సేపు ఉంచండి. తరువాత మూతలు తీసి పాలలో వచ్చిన మార్పులు గమనించండి.
1. గిన్నెలో పాలు పెరుగుగా మారాయి ?
2. ఏ రెండు గిన్నెలలో పాలు పెరుగుగా మారలేదు ?
జవాబు:

  • గోరువెచ్చని పాలు వున్న ‘A’ గిన్నెలో పెరుగు తయారయింది.
  • ‘B’ గిన్నెలో వేడి పాలు వున్నాయి. అంత ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద లాక్టోబాసిల్లస్’ బాక్టీరియా చనిపోతుంది. కాబట్టి కిణ్వనం జరపలేదు. అందుకే పెరుగు తయారవ్వలేదు. పాలు అడలి పోయినట్లు అయిపోతాయి.
  • ‘C’ గిన్నెలో చల్లని పాలు ఉన్నాయి. బాక్టీరియాకు అవసరమైన ఉష్ణోగ్రత కన్నా తక్కువ పాలలో వుంది. కాబట్టి బాక్టీరియా ఎదుగుదల అతి తక్కువ కాబట్టి పెరుగు తయారవ్వలేదు సరికదా పాలు విరిగిపోతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 11.
మైక్రోబయాలజీకి సంబంధించిన విషయాలు కనుగొన్న శాస్త్రవేత్తల గురించి సమాచారాన్ని సేకరించండి. ఈ ఆవిష్కరణలు మానవాళికి ఎలా ఉపయోగపడతాయో సూచించే చార్టును రూపొందించి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:

వ.సం. శాస్త్రవేత్త పేరు కనుగొన్న అంశం
1. ఆంథోనివాన్ ల్యూవెన్ హాక్ బాక్టీరియా
2. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్
3. డా॥ యల్లాప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్
4. డా॥ జోసన్ సాక్
డా॥ ఆల్బర్ట్ సాచిన్ పోలియో
పోలియో వ్యాక్సిన్
(చుక్కల మందు)
5. ఎడ్వర్డ్ జెన్నర్ మశూచికి టీకా మందు
6. లూయీ పాశ్చర్ కుక్క కాటుకి టీకా పాశ్చరైజేషన్
7. డా॥ రోనాల్డ్ రాస్ మలేరియా దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పాడు.

ప్రశ్న 12.
మైక్రోబయాలజీ (సూక్ష్మజీవుల శాస్త్రం) లో ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తల ఫోటోలతో ఆల్బమ్ తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 1

ప్రశ్న 13.
మీ దగ్గరలో వున్న పాల డైరీని లేదా గ్రంథాలయాన్ని సందర్శించండి. పాశ్చరైజేషన్ జరిగే విధానాన్ని వివరించే ప్రాజెక్టు తయారుచేయండి.
జవాబు:
పాశ్చరైజేషన్ : నిర్వచనం : ఆహార పదార్థాలను వేడి చేయటం ద్వారా సూక్ష్మజీవులను తొలగించి వాటిని ఎక్కువ సమయం నిల్వ చేయటాన్ని పాశ్చరైజేషన్ అంటారు. దీనిని లూయీపాశ్చర్ కనిపెట్టారు.

విధానం : పాలను నిల్వ చేయటం : 1. మొదట పాలను 70°C వరకు 30 సెకన్ల పాటు వేడి చేస్తారు. 2. తరువాత పాలను చల్లార్చి నిల్వ చేస్తారు.

వైన్ ను నిల్వ చేయటం : 1. మొదట వైన్ ను వేడి చేసి తరువాత చల్లబరుస్తారు. 2. ఆపై దానిని నిల్వచేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 14.
మీ గ్రామంలోని పశువుల ఆసుపత్రిని సందర్శించి అక్కడి డాక్టర్ ని అడిగి పశువులు, గొర్రెలు మరియు మేకలలో వచ్చే జబ్బుల జాబితా తయారుచేయండి.
జవాబు:

జబ్బులు
1. పశువులు జబ్బులు గాలికుంటు వ్యాధి, నోటి వ్యాధులు, సెప్టిసీమియ
2. గొర్రెలు ఆంధ్రాక్స్
3. మేకలు ఆంధ్రాక్స్

ప్రశ్న 15.
“సూక్ష్మజీవులు లేకపోతే భూమి చెత్తాచెదారం, జంతువుల మృత కళేబరాలతో నిండిపోతుంది” అని సమీర్ వాళ్ళ నాన్నతో అన్నాడు. అతనితో నీవు ఏకీభవిస్తావా ? ఎందుకు ?
జవాబు:

  • సమీర్ తో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే సూక్ష్మజీవులు కొన్ని ఉపయోగకరమైనవి. మరికొన్ని అపాయకరమైనవి.
  • అపాయకరమైన సూక్ష్మజీవులు వ్యాధులు కలుగచేస్తాయి. ఆహారం తదితరాలను పాడుచేస్తాయి.
  • కానీ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఇంటిలోను, పరిశ్రమలలోను, పరిసరాలలోని పర్యావరణాన్ని శుద్ధి చేయటానికి ఉపయోగపడతాయి.
  • భూమిపై నున్న చెత్తను కుళ్ళింపచేయటానికి సూక్ష్మజీవులే కారణం.
  • తద్వారా ఆ చెత్తను భూమి మృత్తికలో కలసి పోయేలా చేస్తాయి.
  • జంతువుల మృత కళేబరాలు కుళ్ళి భూమిలో (మృత్తికలో) కలసిపోవటానికి కూడా ఈ సూక్ష్మజీవులే కారణం.
  • ఇవే కనుక లేకపోతే భూమి అంతా చెత్తచెదారం జంతువుల మృత కళేబరాలతో నిండిపోతుంది.

ప్రశ్న 16.
ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి వ్యాధికి టీకా కనుగొనే క్రమంలో కౌపాక్స్ సోకిన వ్యక్తి బొబ్బల నుండి ద్రవం తీసి 8 సంవత్సరాల బాలుడికి ఎక్కించాడు. తరువాత ఆ బాలునికి మశూచి రాదని ప్రయోగ పూర్వకంగా నిరూపించాడు. ఎడ్వర్డ్ జెన్నర్ ధైర్యంతో కూడిన నిశిత పరిశీలనలను ఎలా అభినందిస్తావు ?
జవాబు:

  • ఎడ్వర్డ్ జెన్నర ను ముందుగా అతని ధైర్యానికి అభినందించాలి.
  • అలాగే తన ప్రయోగాలు, పరికల్పనలపై ఆయనకున్న నమ్మకాన్ని మనం అభినందించాలి.
  • శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు, పరికల్పనలు చేస్తుంటారు.
  • జెన్నర్ లాంటి డాక్టర్ల ప్రయోగాలు ముందు జంతువుల పై, తరువాత అనుమతితో మనుషులపై చేస్తున్నప్పుడు ఎంతో ఉద్విగ్నత కలుగుతుంది.
  • 8 సం॥ బాలుడిపై ప్రయోగం కోసం అతను ఆ పిల్లాడి తల్లిదండ్రులను ఎలా ఒప్పించగలగాడో ? ఆ రోజుల్లో అదొక అద్భుతం. వారు ఒప్పుకుని జెన్నర్ విజయంలో భాగస్వాములయ్యారు. అందుకు వారు అభినందనీయులు.
  • కౌపాక్స్, చికెన్ పాక్స్ వచ్చిన ఇద్దరు వేరు వేరు రోగులను నిశితంగా పరిశీలించి, వాటి కారణాల కోసం ఎంతో ఉత్తమమైన పరికల్పనలు చేసిన జెన్నర్ నిశిత పరిశీలన ఈనాటి డాక్టర్లకు కావలసిన ముఖ్య లక్షణం. అందుకు డా॥ జెన్నర ను నేను ఎంతో అభినందిస్తాను.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 17.
‘చికిత్స కంటే నివారణే మేలు’ దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:

  • ‘చికిత్స’ అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం తీసుకునే వైద్యం.
  • ‘నివారణ’ అంటే ఆ జబ్బు రాకుండా తీసుకునే ‘ముందు జాగ్రత్త’ కాబట్టి నివారణకే మనం ప్రాధాన్యత నివ్వాలి.
  • ప్రతి వ్యాధికి ఈ రోజున నివారణా పద్ధతులు వున్నాయి.
  • వ్యాధి బారిన పడి బాధపడే కంటే నివారణోపాయాలు తెలుసుకుని వ్యాక్సిన్లు, జాగ్రత్తలు పాటించి మనల్ని మనం ఆరోగ్యవంతులుగా ఉంచుకోవటం మంచిది అని నా అభిప్రాయం.

ప్రశ్న 18.
“చాక్లెట్స్, ఐస్ క్రీములు తిన్న తరువాత నోరు బాగా పుక్కిలించాలి” అని లత తన సోదరుడు రాజేష్ తో చెప్పింది. లత చెప్పింది నిజమేనా ? ఎందుకు ?
జవాబు:

  • లత రాజేష్ తో చెప్పింది నిజమే.
  • కారణం ఏమిటంటే – చాక్లెట్, ఐస్ క్రీమ్ లు తిన్నప్పుడు అవి దంతాల మధ్యలో, చిగుళ్ళలో ఇరుక్కుపోతాయి.
  • నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవటం ద్వారా సూక్ష్మజీవులు చేరకుండా చూసుకోవచ్చు.
  • చాక్లెట్, ఐస్ క్రీమ్ లో చక్కెర శాతం ఎక్కువ మరియు రెండూ అతి మెత్తని ఆహార పదార్థాలు.
  • వీటిని తిన్నప్పుడు నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవటం తప్పనిసరి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 InText Questions and Answers

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
లాక్టోబాసిల్లస్ బాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుందని నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:

  • పెరుగులో లాక్టోబాసిల్లస్ బాక్టీరియా ఉంటుంది.
  • ఈ పెరుగు గోరువెచ్చని పాలలో కలిసినప్పుడు ఈ బాక్టీరియా పాలలో పెరిగి పాలను పెరుగుగా మారుస్తుంది.
  • ఈ బాక్టీరియా లేకపోతే పాలు విరిగిపోతాయి తప్ప పెరుగు రాదు.

కృత్యం – 2

ప్రశ్న 2.
ఇడ్లీ, దోసెల పిండి ఉదయానికల్లా పొంగుతుంది ? ఎందువల్ల ?
జవాబు:

  • ఇడ్లీ, దోసెల పిండిలలో మినపపప్పు, బియ్యం, (ఉప్పుడు బియ్యపు రవ్వ) వేసి కలిపి అలా వుంచుతారు.
  • గాలిలో బాక్టీరియా వుంటుంది కదా ! ఆ బాక్టీరియాలో ‘ఈస్ట్’ వుంటుంది.
  • ఇది ఇడ్లీ, దోసెల పిండి పై చర్య (కిణ్వనం) జరిపి CO2 ను తయారుచేస్తుంది.
  • ఇది పిండితో కలసి ఆ పిండి పరిమాణం ఎక్కువయ్యేలా చేస్తుంది.
  • తద్వారా ఉదయానికల్లా ఇడ్లీ, దోసెల పిండి పొంగుతుంది.

కృత్యం – 3

ప్రశ్న 3.
సూక్ష్మజీవుల వాణిజ్యపరమైన ఉపయోగాలు.
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 2
కృత్యం : రెండు చిన్న గిన్నెలు లేదా బీకర్లు తీసుకోవలెను. రెండింటిలో సగం వరకు నీరు పోయవలెను. వాటికి 5 నుండి 10 చెంచాల చక్కెర కలపవలెను. ఒకదానికి 2 నుండి 3 చెంచాల ఈస్టును కలపవలెను. రెండు గిన్నెలపై మూతలు పెట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచవలెను. 3 లేదా 4 గంటల తరువాత మూతలు తీసి వాసన చూడవలెను.

గమనించినది : ఈస్టు కలిపిన గిన్నె నుండి ఆల్కహాలు వాసన వచ్చింది. ఈస్టు కలపని గిన్నె నుండి ఎటువంటి వాసన లేదు.

కారణము : చక్కెరను ఈస్టులు ఆల్కహాలుగా మార్చుతాయి. కాబట్టి ఈస్టు కలిపిన చక్కెర నుండి ‘ఆల్కహాలు’ వాసన వస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

కృత్యం – 4

ప్రశ్న 4.
మీ దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కార్యకర్తను లేదా డాక్టర్‌ను కలవండి. వివిధ వ్యాధుల రాకుండా ఏ వయస్సులో ఏ టీకాలు ఇస్తారో తెలుసుకోండి. మీరు సేకరించిన సమాచారాన్ని పట్టిక తయారుచేసి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:

టీకా నిరోధక వ్యాధి వయస్సు
బిసిజి క్షయ పుట్టినప్పుడు, 10 సం॥లకు
డిటిపి డిప్తీరియా
కోరింతదగ్గు
ధనుర్వాతము
6వ వారం, 10వ వారం,
14వ వారం , 18వ నెల
హెపాటిటిస్ – బి హెపాటిటిస్ – బి పుట్టినప్పుడు, 6వ వారం, 14వ వారం
ఒపివి పోలియో పుట్టినప్పుడు, 6వ వారం, 10వ వారం, 14వ వారం, 5వ సంవత్సరంలో బూస్టర్ డోస్
ఎంఎంఆర్ తడపర, గవదబిళ్ళలు, రూబెల్లా 9వ నెల, 15వ నెలలో బూస్టర్ డోస్
పిసివి న్యూమోనియా 6వ వారం, 10వ వారం, 14వ వారం, 15వ నెలలో బూస్టర్ డోస్
టైఫాయిడ్ టైఫాయిడ్ 2వ సంవత్సరం, 5వ సంవత్సరంలో బూస్టర్ డోస్
వరిసెల్లా ఆటలమ్మ మొదటి సంవత్సరం

కృత్యం – 5

ప్రశ్న 5.
నేల సారాన్ని సూక్ష్మజీవులు పెంచుతాయి. అని ఎలా చెప్పగలరు ?
జవాబు:

  • గాలిలో 78% నత్రజని వుంది.
  • మొక్కలు పోషకాలు తయారుచేయటానికి నత్రజని అవసరం.
  • కానీ మొక్కలు నేరుగా గాలిలో వున్న నత్రజనిని ఉపయోగించుకోలేవు.
  • దీనికి ‘రైజోబియం’ అనే బాక్టీరియా గాలిలో నత్రజనిని నైట్రేట్లుగా మార్చి భూసారాన్ని పెంచుతుంది.
  • రైజోబియం, నాస్టాక్, అనబినా, అజటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు గాలిలో నత్రజనిని, నత్రితా సమ్మేళనాలుగా మార్చి నేలకు పోషక పదార్థాలు అందచేస్తాయి.
  • చిక్కుడు జాతి మొక్కల వేర్లలో ‘వేరు బొడిపెలు’ వుంటాయి. వాటిలో ‘రైజోబియం’ బాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది.
  • అందుకే రైతులు వీటి వేళ్ళను భూమిలోనే వుంచి దున్నుతాయి. అందువల్ల భూసారం పెరుగుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

కృత్యం – 6

ప్రశ్న 6.
కంపోస్టు గుంట :
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 3
మీ పాఠశాల బడితోటలో ఒక మూలన లేదా మీ ఇంటిలో గల ఖాళీ స్థలములో రెండు గుంటలు తవ్వండి లేదా 2 ఖాళీ కుండలు తీసుకోండి. వీటిని సగం వరకు మట్టితో నింపండి. దీనిలో రాలిన ఆకులు, వృథా అయిన కూరగాయలు, కాగితం ముక్కలు, చెత్తాచెదారంతో నింపండి. రెండవ దానిలో వాడి పారేసిన ప్లాస్టిక్ సంచులు, వస్తువులను పాలిథీన్ సంచులను, గాజు ముక్కలతో నింపండి. ఇప్పుడు రెండు కుండలను లేదా గుంతలను మట్టితో కప్పండి. వాటిపై నీటిని చల్లండి. ఈ విధంగా ప్రతిరోజు నీరు చల్లండి. మూడు, నాలుగు వారాల తర్వాత గుంతల కుండలపై మట్టిని తొలగించండి.

గమనించినది : మొదటి కుండలోని పదార్థాలు కుళ్ళాయి. దీనిలో వేసిన ఆకులు, కాగితం ముక్కలు, కూరగాయలు మొదలైనవి నేలలో కలసిపోయే పదార్థాలు. ఇవి సూక్ష్మజీవులచే విచ్ఛిన్నం కాబడతాయి. రెండవ కుండలోని మార్పుచెందని లేదా కుళ్ళని పదార్థాల వలన నేల స్వభావం మారుతుంది. నేల ఆరోగ్యం క్షీణించి, నేల కాలుష్యానికి దారి తీస్తుంది.

కృత్యం – 7

ప్రశ్న 7.
మీకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా డాక్టరును సందర్శించి, సూక్ష్మజీవుల వలన వచ్చే వివిధ రకాల వ్యాధులను గురించి అడిగి తెలుసుకోండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 4

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

SCERT AP 8th Class Biology Study Material Pdf 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1 Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 3rd Lesson Questions and Answers సూక్ష్మజీవుల ప్రపంచం 1

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1 Textbook Questions and Answers

ప్రశ్న 1.
ఏ జీవి సజీవులకు, నిర్జీవులకు మధ్య. అనుసంధానం అనుకుంటున్నారు ? ఎందుకు ?
జవాబు:

  • సజీవులకు, నిర్జీవులకు మధ్య అనుసంధానంగా వైరస్లు వున్నాయని నేను అనుకుంటున్నాను.
  • ఎందుకంటే సజీవ కణంలోకి ప్రవేశిస్తేనే వైరస్లు ప్రత్యుత్పత్తి జరుపుకుంటూ క్షోభ్యతను ప్రదర్శిస్తాయి.
  • కణం బయట వున్నప్పుడు ఇవి నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి.
  • ఈ విషయాన్ని బట్టి సజీవులకు, నిర్జీవులకు మధ్య వైరస్లు వారధిగా అనుసంధానం చేశాయి అని అనుకుంటున్నాను.

ప్రశ్న 2.
సూక్ష్మజీవులు వలన కలిగే వ్యాధుల గురించి రాయండి.
జవాబు:

  • కంటికి కనబడకుండా వుండే అతి చిన్న జీవులను సూక్ష్మజీవులు అంటారు.
  • ఇవి బాక్టీరియా, వైరస్, శైవలాలు శిలీంధ్రాలు.
  • బాక్టీరియా వల్ల టైఫాయిడ్, క్షయ, కుష్టు వంటి వ్యాధులు వస్తాయి.
  • వైరస్ల వల్ల పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ వంటి వ్యాధులు వస్తాయి.
  • శైవలాలు ఎక్కువగా నిల్వ వాటిలో వుంటాయి. కాబట్టి వీటి వల్ల దురదలు వస్తాయి.
  • శిలీంధ్రాలు మన చర్మం పై వుంటూ, చర్మ వ్యాధులైన గజ్జి, తామర వంటి వాటిని కలుగచేస్తాయి.

ప్రశ్న 3.
కుంట నీటిలో ఏయే రకమైన సూక్ష్మజీవులు ఉంటాయి ?
జవాబు:

  • కుంట నీరు అంటే ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీరు.
  • అందువల్ల దీనిలో శైవలాలు, బాక్టీరియా, ప్రోటోజోవా వర్గానికి చెందిన ఏక కణజీవులు ఉంటాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 4.
సూక్ష్మజీవులు మనకు ఉపకారులా ? అపకారులా ? వివరించండి.
జవాబు:
కొన్ని సూక్ష్మజీవులు మనకు అపకారులుగాను, మరికొన్ని సూక్ష్మజీవులు మనకు ఉపకారులుగాను ఉంటాయి.
ఉపకారులైన సూక్ష్మజీవులకు ఉదాహరణలు :

  • లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా పాలను, పెరుగుగా మార్చుతుంది.
  • కిణ్వణప్రక్రియలో ఈస్ట్ ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను పెద్ద మొత్తంలో ఆల్కహాలు, వైన్, బీరు, ఎసిటిక్ ఆమ్లాల తయారీలో ఉపయోగిస్తారు.
  • శిలీంధ్రాల నుండి సూక్ష్మజీవి నాశకాలు (antibiotics) ను తయారు చేస్తారు.

అపకారులైన సూక్ష్మజీవులకు ఉదాహరణ :

  • టైఫాయిడ్, క్షయ, కుష్టు, డయోరియా లాంటి జబ్బులు బాక్టీరియా వలన కలుగుతాయి.
  • మలేరియా, అమీబియాసిస్ లాంటి వ్యాధులు ప్రోటోజోవాల వల్ల కలుగుతాయి.
  • శిలీంధ్రాలు, బాక్టీరియా, మైక్రో ఆర్రోపోడాల వల్ల కొన్ని రకాల చర్మవ్యాధులు కలుగుతాయి.

ప్రశ్న 5.
మజ్జిగ కలిపినప్పుడు ఏ రకమైన పాలు పెరుగుగా మారతాయి ? పరికల్పన చేయండి.
అ) చల్లని పాలు
ఆ) వేడి పాలు
ఇ) గోరువెచ్చని పాలు
జవాబు:

  • మజ్జిగ కలిపినపుడు గోరువెచ్చని పాలు పెరుగుగా మారతాయి.
  • లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా వలన పాలు పెరుగుగా మారతాయి.
  • లాక్టోబాసిల్లస్ పెరుగుదలకు కొంచెం అధికంగా ఉష్ణోగ్రత అవసరం.
  • కావున లాక్టోబాసిల్లస్ గోరు వెచ్చని పాలలో వేగంగా పెరిగి, పెరుగు తయారవుతుంది.
  • తక్కువ ఉష్ణోగ్రతలో కానీ, అధిక ఉష్ణోగ్రతలో కానీ బాక్టీరియా పెరుగుదల సరిగా ఉండదు.
  • కావున చల్లని, వేడిపాలలో కలిపిన మజ్జిగ వలన పెరుగు ఏర్పడలేదు.

ప్రశ్న 6.
మానవ కార్యకలాపాల వల్ల సూక్ష్మజీవులకు హాని కలుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుంది ?
జవాబు:
మానవ కార్యకలాపాల వల్ల సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది. ఈ హాని వలన అపాయకరమైన మరియు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి.

ప్రశ్న 7.
మీరు లాక్టోబాసిల్లస్ బాక్టీరియాను ప్రయోగశాలలో పరిశీలించినపుడు అనుసరించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 1
ఒకటి లేదా రెండు మజ్జిగ చుక్కలు స్లెడ్ పై తీసుకోవాలి.

  • సైడు 3-4 సెకన్ల పాటు వేడి చేయాలి.
  • తరువాత దీనిపై క్రిస్టల్ వైలెట్ ద్రావణాన్ని 2 లేదా 3 చుక్కలు వేయాలి.
  • ఇది వర్ణదము కాబట్టి బాక్టీరియాను రంజనం చేసి చూపుతుంది.
  • ఇలా చేసిన తర్వాత 30-60 సెకన్ల వరకూ స్లెడ్ ను కదపకుండా వుంచాలి.
  • తరువాత నీటిలో సైడ్ ను జాగ్రత్తగా, పదార్థం కొట్టుకుపోకుండా కడగాలి.
  • ఇప్పుడు స్లెడ్ ను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలిస్తే కింది పటంలో చూపినట్లుగా లాక్టోబాసిల్లస్ బాక్టీరియా కనపడుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 8.
మీ ఉపాధ్యాయుని సహాయంతో మీ దగ్గరలోని బేకరీని సందర్శించి బ్రెడ్, కేక్ తయారుచేసే పద్ధతిని తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు:
బ్రెడ్ : కావలసినవి : మైదా: 1\(\frac {1}{2}\) కప్పు; బేకింగ్ పౌడర్ : \(\frac {1}{2}\) టీ స్పూన్; బేకింగ్ సోడా : 1 టీ స్పూను; నూనె : \(\frac {3}{4}\) కప్పు; గ్రుడ్లు : 2; పంచదార: 1\(\frac {1}{4}\) కప్పు; వెనీలా ఎసెన్స్ : టీ స్పూను.

తయారీ : ఓవెన్‌ను 180 డిగ్రీలకు వేడిచేయాలి. బ్రెడ్ పాన్ కి కాస్త వెన్న రాసి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి స్పూనుతో కలపాలి. మరో గిన్నెలో గ్రుడ్ల సొన వేసి గిలకొట్టాక పంచదార, నూనె వేసి కలిసేలా గిలకొట్టాలి. వెనీలా ఎసెన్స్ వేసి మృదువుగా అయ్యే వరకూ గిలకొట్టాక మైదా మిశ్రమం వేసి నెమ్మదిగా కలపాలి. మరీ వేగంగా కలిపితే బ్రెడ్ గట్టిగా వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఓవెన్లో ఉంచి సుమారు గంట పాటు బేక్ చేసి, తీసి చల్లారాక కోయాలి.

క్యారెట్ కేక్ : మైదా: 2 కప్పులు, దాల్చిన చెక్కపొడి : 1\(\frac {1}{2}\) టీ స్పూన్లు: బేకింగ్ పౌడర్ : 1\(\frac {1}{2}\) టీ స్పూన్లు; ఉప్పు : 1\(\frac {1}{2}\) టీ స్పూను క్యారెట్ తురుము : 2\(\frac {1}{2}\) కప్పులు; గ్రుడ్లు : 4; పంచదార : 1\(\frac {1}{2}\) కప్పులు; వెనీలా ఎక్స్ ట్రాక్ట్ : 2 టీ స్పూన్లు; నూనె : కప్పు.

తయారీ : మైదాలో దాల్చిన చెక్కపొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచాలి. విడిగా ఓ గిన్నెలో కోడిగ్రుడ్లు వేసి రెండు నిమిషాలు గిలకొట్టాలి. తర్వాత పంచదార వేసి మరో ఐదు నిమిషాలు బీట్ చేయాలి. ఇప్పుడు వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వేసి మరో నిమిషం గిలకొట్టాలి. నెమ్మదిగా నూనె పోస్తూ గిలకొడుతుండాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ, తెడ్డు లాంటి గరిటెతో కలపాలి. చివరగా క్యారెట్ తురుము వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి వెన్నరాసిన రెండు కేకు గిన్నెలో వేసి ముందుగానే 180 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర వేడి చేసిన ఓవెన్లో 30 నిమిషాల పాటు బేక్ చేయాలి. చల్లారాక ముక్కలుగా కోయాలి.

ప్రశ్న 9.
మట్టితో గానీ, థర్మోకోల్ తో గానీ ఏదేని సూక్ష్మజీవి నమూనా తయారుచేయండి. దాని లక్షణాలను వివరిస్తూ నివేదిక రాయండి.
జవాబు:
HIV వైరస్:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 2

  • దీని సమాచారం మా సైన్స్ ల్యాబ్ నుండే సేకరించాను.
  • ఇది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్.
  • ఇది మానవుని తెల్లరక్త కణాలు. అంటే లింఫోసైట్లలోనే జీవించగలుగుతుంది.
  • AIDS వ్యా ధిని కలుగచేస్తుంది.
  • ఇది ‘ఐకోసా హెడ్రల్’ రూపంలో వుంటుంది.
  • దీనిలో ఎంజైములు, RNA వుంటాయి.
  • పై పొర గరుకుగా వుంటుంది. లోపలి పొర నున్నగా వుంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 10.
మీ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ లో వున్న సూక్ష్మజీవుల పర్మినెంట్ స్లెలు పరిశీలించండి. వాటి పటాలు గీయండి.
జవాబు:
మా పాఠశాల సైన్స్ ల్యాబ్ లో ఈ కింద పేర్కొన్న సూక్ష్మజీవుల స్లెలు వున్నాయి.
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 3

ప్రశ్న 11.
భోజనం చేసేముందు చేతులను సబ్బుతో శుభ్రంగా ఎందుకు కడుక్కోవాలి ?
జవాబు:

  • మనం రోజూ చేతులతో అనేక పనులు చేస్తాం. అనేక వస్తువులను తాకుతాం.
  • ఆ పనుల వలన, తాకిన వస్తువుల వలన చేతులకు మురికి అంటుకుంటుంది. ఆ మురికి ద్వారా అనేర రోగకారక క్రిములు చేతులకు అంటుకుంటాయి.
  • ఆ చేతులతో భోజనం చేయుటవలన మనము అనేక రోగాల బారిన పడతాం.
  • అందువలన భోజనం చేసేముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1 InText Questions and Answers

పాఠ్యాంశములోని ప్రశ్నలు

ప్రశ్న 1.
సూక్ష్మజీవుల సమూహాలు గురించి రాయండి.
జవాబు:
సూక్ష్మజీవులను 5 సమూహాలుగా విభజిస్తారు. అవి –

  1. బాక్టీరియా
  2. శైవలాలు
  3. శిలీంధ్రాలు
  4. ప్రోటోజోవన్స్ మరియు
  5. సూక్ష్మ ఆర్రోపోడ్స్

2. బాక్టీరియా ఎటువంటి ఆవాసాలలో జీవించగలదు ?
జవాబు:

  • బాక్టీరియాను మజ్జిగ లేదా పెరుగులోను, నాలుకపై ఉండే పాచి (నోరు శుభ్రం చేయకముందు) లోను, నేలలోను, చెట్ల కాండంపైన, చర్మంమీద, చంకలోను ఇంకా అనేక ప్రదేశాలలో చూడవచ్చు.
  • కానీ వీటిని సాధారణ సూక్ష్మదర్శినిలో చూడలేం.
  • మన చర్మం పైన కూడా కొన్ని రకాల బాక్టీరియాలు పెరుగుతాయి. వీటిలో కొన్ని మనకు రోగాలు కలుగజేస్తాయి.
  • కొన్ని ఇతర బాక్టీరియాలతో సహజీవనం చేస్తాయి.
  • మన శరీరం లోపల కూడా రకరకాల బాక్టీరియాలున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఉండే బాక్టీరియాలు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి.
  • బాక్టీరియాలు ఉండని చోటేలేదని చెప్పవచ్చు. నేలలో, నీటిలో, గాలిలో లక్షల సంఖ్యలో ఉన్నాయి.
  • ఇవి అతి తక్కువ, అతి ఎక్కువ ఉష్ణోగ్రతలలో కూడా జీవించగలుగుతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 3.
సూక్ష్మ శైవలాల ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
సూక్ష్మశైవలాలు (మైక్రో ఆల్గే) జరిపే కిరణజన్య సంయోగక్రియ భూమి మీద జీవులకు చాలా ముఖ్యం. వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఇవే ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 4.
వైరస్లు గురించి రాయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 8

  • వైరస్లు చాలా ఆసక్తిని రేకెత్తించే సూక్ష్మజీవులు.
  • ఇవి సజీవ కణము బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి.
  • కానీ బాక్టీరియా, వృక్షకణాలు, జంతు కణాల లాంటి అతిథేయి కణాలలో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తిస్తాయి.
  • వీటిని శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపులలో మాత్రమే చూడగలం.
  • పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ మొదలైన వ్యాధులన్నీ వైరస్ల వలననే కలుగుతాయి.

ప్రశ్న 5.
సూక్ష్మ ఆర్రోపోడ్ ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:

  • నేల సారాన్ని పెంచడానికి కొన్నిరకాల మైక్రో ఆర్రోపోడ్ జీవులు చాలా అవసరం.
  • ఇవి జీవ పదార్ధాన్ని కుళ్లిపోయేలా చేస్తాయి.
  • సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి.

ప్రశ్న 6.
ప్రోటోజోవనను పరిశీలించే విధానం రాయండి.
జవాబు:

  • ప్రోటోజోవాలను వర్తనం చేయడానికి ఎండుగడ్డిని నీటిలో నానబెట్టాలి.
  • 3-4 రోజుల తరువాత గడ్డితో సహా నీటిని సేకరించాలి.
  • గడ్డితో సహా సేకరించిన నీటి నుండి ఒక చుక్క నీటిని స్లెడ్ పై తీసుకుని కవర్ స్లిప్ తో కప్పాలి.
  • దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
  • అనేక ఏకకణ ప్రోటోజోవనను గుర్తించవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 7.
బాక్టీరియాను రంజనం చేసే విధానాన్ని క్లుప్తంగా వివరింపుము. (లేదా) మీ ప్రయోగశాలలో మీరు బాక్టీరియాను పరిశీలించారు కదా ! అయిన కింది వాటికి జవాబులిమ్ము. ఎ) ఈ ప్రయోగం చేయడానికి కావలసిన పరికరాలు ఏవి? బి) ప్రయోగ విధానం ఏమిటి ?
జవాబు:
ఎ) అగార్ మాధ్యమం, సైడ్లు, క్రిస్టల్ వైలెట్ రంజకం, సూక్ష్మదర్శిని, బున్ సెన్ బర్నర్.
బి) 1. బాక్టీరియాలు కలిగిన మాధ్యమాన్ని స్లెడ్ పై వేసి, మరొక స్లె తో రుద్ది సమంగా చేయాలి.
2. అలా చేసిన తరువాత కొద్దిగా వేడి చేయాలి. 3. తరువాత ఒక చుక్క ‘క్రిస్టల్ వైలెట్’ వేసి 30 నుండి 60 సెకన్లు వేడి చేయాలి.
4. కొద్ది సేపటి తరువాత నీరు పోసి కడగాలి తడి ఆరిన తరువాత స్లెడ్ ను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

ప్రశ్న 8.
శైవలాలు ఆకుపచ్చగా వుండటానికి కారణం ఏమిటి ?
జవాబు:

  • నిల్వ వున్న నీటిలో శైవలాలు ఎక్కువగా పెరుగుతాయి.
  • వీటి పెరుగుదల వల్ల ఆ నీటికి పచ్చదనం వస్తుంది.
  • వీటి కణాలలో ‘హరితరేణువులు’ వుంటాయి. ఇవి ‘కిరణజన్య సంయోగక్రియ’ జరిపి ఆహారాన్ని తయారుచేసి కణానికి అందిస్తాయి.
  • అందువల్ల శైవలాలు వున్న ప్రదేశం ఆకుపచ్చని చెట్టు లాగా కనబడుతుంది.

ప్రశ్న 9.
‘పరాన్న జీవులు’ అనగానేమి ?
జవాబు:
కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవుల మీద ఆధారపడి జీవిస్తాయి. ఇలాంటి వాటిని ‘పరాన్న జీవులు’ అంటారు.

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
నీటిలోని సూక్ష్మజీవులను పరిశీలించే విధానం తెలపండి.
జవాబు:

  • మీ పరిసరాలలో ఉన్న నీటి కుంట / మురికి కుంట నుండి కొంత నీటిని సేకరించండి.
  • కుంటలోని నీరు ఆకుపచ్చని చెట్టులా ఉండేలా చూసుకోండి.
  • సేకరించిన నీటి నుండి 1-2 చుక్కల నీటిని స్లెడ్ పై వేసి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి.
  • కదులుతున్న రకరకాల ప్రోటోజోవన్స్ కనిపిస్తాయి.
  • వీటితోపాటు ఆకుపచ్చగా ఉండే శైవలాలను చూడవచ్చు.
  • మరికొన్ని నీటి లార్వాలను గమనించవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 4

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

కృత్యం – 2

ప్రశ్న 2.
కుళ్ళిన కూరగాయలు, నల్లబ్రెడ్, చెడిపోయిన కొబ్బరిలో ఎలాంటి సూక్ష్మజీవులు వుంటాయి ?
జవాబు:

  • కుళ్ళిన కూరగాయలు, చెడిన నల్లని బ్రెడ్, కొబ్బరిలను సేకరించాలి.
  • తరువాత కొద్ది పదార్థాన్ని సూదితో సేకరించి స్లెడ్ పైన ఉంచండి.
  • దానిపై చుక్క నీరు వేసి స్లెడను కవర్ స్లితో కప్పాలి.
  • తరువాత స్లెడ్ ను సూక్ష్మదర్శినిలో పరిశీలించగా అది ‘రైజోఫస్’ అనే శిలీంధ్రంగా గుర్తించాను.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 5

కృత్యం – 3

ప్రశ్న 3.
ఒకటి లేదా రెండు చుక్కలు మజ్జిగ తీసుకొని స్లెడ్ పైన పరచండి. సైడ్ ను 3-4 సెకన్లు పాటు వేడి చేయండి. దాని పైన కొన్ని చుక్కలు “క్రిస్టల్ వైలెట్” ద్రావణం వేయాలి. 30-60 సెకన్ల పాటూ కదపకుండా ఉంచాలి. తరువాత నీటితో సైడ్ ను పదార్థం కొట్టుకు పోకుండా నెమ్మదిగా కడగాలి. దీనిని సంయుక్త సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి. మీరు పరిశీలించిన దాని పటం గీయండి. నీవు గీచిన పటాన్ని పటంతో పోల్చి చూడండి.
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 6

కృత్యం – 4

ప్రశ్న 4.
శైవలాలను పరిశీలించే విధానం రాయండి. (లేదా) నీటి కొలనులో తేలియాడే నాచుమొక్కల, మైక్రోస్కోప్, సైడులు, కవర్ స్లిన్లు, వర్ణదాలను ఇవ్వబడినవి. వీటితో ప్రయోగశాలలో మీరు ఏం చేయగలరో నివేదిక రాయండి.
జవాబు:

  • కుంటలలో నిలువ ఉన్న నీరు ఆకుపచ్చగా ఉండడాన్ని మనం చూస్తూంటాం.
  • నీటిలో పెరిగే శైవలాల వల్ల నీటికి పచ్చదనం వస్తుంది.
  • స్పెరోగైరా, ఖారా లాంటి శైవలాలు కంటితో చూడవచ్చు.
  • నీటిలో ఉండే చాలా శైవలాలను కంటితో చూడలేం. కేవలం సూక్ష్మదర్శిని సాయంతో మాత్రమే చూడగలం.
  • నీటి కుంటలోని నీటిని ఆకుపచ్చని చెట్టుతో సహా సేకరించండి.
  • సేకరించిన నీటి నమూనా నుండి సన్నని దారపు పోగుల్లాంటి నిర్మాణాలు లేదా వాటి ముక్కలను స్లెడ్ పైన తీసుకోవాలి.
  • కవర్‌ స్లిప్ తో కప్పి, సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
  • ఆకుపచ్చని తంతువులు కణాలతో సహా కనిపిస్తాయి.
  • పత్రహరితం కలిగిన ఈ జీవులను శైవలాలు అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

కృత్యం – 5

ప్రశ్న 5.
గడ్డితో సహా సేకరించిన నీటి నుండి ఒక చుక్క నీటిని స్లెడ్ పై తీసుకుని కవర్ స్లిప్ తో కప్పాలి. దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించాలి. మీరు పరిశీలించిన దాని పటాలు గీయండి. గీచిన పటాలను పటంతో పోల్చండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 7

కృత్యం – 6

ప్రశ్న 6.
నేలలోని సూక్ష్మజీవులను పరిశీలించే విధానం రాయండి.
జవాబు:
నేలలోని సూక్ష్మజీవులను పరిశీలించే విధానం :

  • పొలం నుండి సేకరించిన మట్టిని ఒక బీకరు లేదా గ్లాసులో వేసి నీరు పోయండి. బాగా కలపండి.
  • తరువాత మట్టికణాలు బీకరు అడుగున పేరుకునే వరకు ఆగండి.
  • దాని నుండి ఒక నీటి చుక్కను డ్రాపి తీసుకుని స్లెడ్ పైన వేయండి.
  • సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి.
  • అనేక సూక్ష్మజీవులు కదులుతూ స్లెడ్ మీద కనిపిస్తాయి.
  • వీటిలో బాక్టీరియాను సులువుగా గుర్తించవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 2 కణం – జీవుల మౌళిక ప్రమాణం

SCERT AP 8th Class Biology Study Material Pdf 2nd Lesson కణం – జీవుల మౌళిక ప్రమాణం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 2nd Lesson Questions and Answers కణం – జీవుల మౌళిక ప్రమాణం

8th Class Biology 2nd Lesson కణం – జీవుల మౌళిక ప్రమాణం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
మొట్టమొదట కణాన్ని ఎవరు, ఎలా కనిపెట్టారు ?
జవాబు:

  1. బ్రిటన్ కు చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త పలుచని బెండు ముక్క నుంచి ఒక పలుచని పొరను సూక్ష్మదర్శినితో పరిశీలించాడు.
  2. బెండు ముక్కలో ఖాళీ గదుల లాంటి నిర్మాణాలను గమనించాడు.
  3. అవి తేనెపట్టులో ఉండే ఖాళీ గదుల్లా కనిపించాయి.
  4. వీటికి ‘కణం’ అని పేరు పెట్టాడు.
  5. లాటిన్ భాషలో ‘సెల్’ (cell) అనగా చిన్నగది అని అర్థం. మనం. దాన్ని తెలుగులో ‘కణం’ అంటాము.
  6. కణం యొక్క ఆవిష్కరణ సైన్సు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం.

ప్రశ్న 2.
కణం యొక్క ఆకారం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది ?
(లేదా) ఒక కణం యొక్క ఆకారాన్ని ప్రభావితం చేసే అంశాలేమిటి ?
జవాబు:
కణం యొక్క ఆకారం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

  1. కణత్వచం
  2. కణకవచం
  3. కణం చేసే పని మీద వాటి ఆకారం ఆధారపడి ఉంటుంది.

ఉదా : నాడీకణం పొడవుగా ఉంటుంది. అది నాడులను ఏర్పరచటానికి పొడవుగా ఉండటం అవసరం.

AP Board 8th Class Science Solutions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 3.
ఏకకణ జీవులకు, బహుకణ జీవులకు మధ్యగల భేదాలు రాయండి.
జవాబు:

ఏకకణ జీవులు బహుకణ జీవులు
1. ఇవి ఒకే ఒక కణంతో నిర్మితమై ఉంటాయి. 1. ఇవి ఒకటి కన్నా ఎక్కువ కణాలతో నిర్మితమై ఉంటాయి.
2. అన్ని జీవక్రియలు ఒక కణం లోపలే జరుగుతాయి. 2. వీటిలో ప్రతి జీవక్రియను చేయటానికి ఒక నిర్దిష్ట కణం లేదా కణాలు ఉంటాయి.
3. వీటికి స్పష్టమైన ఆకారం అమీబా వంటి వాటిలో ఉండదు. కానీ పేరమీషియం, యుగ్లీనా వంటి వాటిలో నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. 3. బహుకణ జీవులకు నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది.
4. ఇవన్నీ సూక్ష్మదర్శిని సాయంతోనే చూడవచ్చు. 4. వీటిలో కొన్ని సూక్ష్మదర్శినితోనూ, మరికొన్ని మన కంటితోనూ చూడవచ్చు.

ప్రశ్న 4.
స్లెడ్ మీద ఉంచిన పదార్థం త్వరగా ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేస్తావు ?
జవాబు:

  • స్లెడ్ మీద ఉంచిన పదార్థం త్వరగా ఆరిపోకుండా ఉండాలంటే ఒక నీటిచుక్కతో పాటు ఒక చుక్క గ్లిసరినను వేయాలి.
  • ఎక్కువ రోజులు సైడ్ ను ఉంచాలంటే గ్లిసరిన్, వేసి కవర్ స్లిప్ ను కూడా అమర్చాలి.
  • అందువల్ల నీరు కానీ, గ్లిసరిన్ కానీ సూక్ష్మదర్శిని యొక్క అక్షి కటకానికి అంటుకోకుండా ఉంటుంది.

ప్రశ్న 5.
“మనం కణాలను కంటితో చూడలేం !” అని దీక్షిత్ చెప్పాడు. ఈ వాక్యం తప్పా ? ఒప్పా ? ఎందుకో రాయండి.
జవాబు:
1. ఈ వాక్యం ‘తప్పు.
2. కారణాలు :
i) కణాలు చాలా సూక్ష్మంగా ఉండి, మైక్రోస్కోప్ సహాయంతో చూడగలము. అయినప్పటికి దీనికి మినహాయింపుగలదు. అండము (ఆస్ట్రిచ్ గుడ్డు) ఒక కణము. ఇది 17 సెం.మీ. నుండి 18 సెం.మీ. పరిమాణం ఉంటుంది.
ii) చాలా కణాలు సూక్ష్మంగా ఉన్నప్పటికి, కంటికి కనిపించే పెద్ద కణాలు కూడా కలవు.

AP Board 8th Class Science Solutions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 6.
పెద్ద ఉల్లిగడ్డలను, చిన్న ఉల్లిగడ్డలతో పోల్చినప్పుడు పెద్ద కణాలు కలిగి ఉంటాయి” అని రియాజ్ చెప్పాడు. అతడు . చెప్పిన దానితో నీవు ఏకీభవిస్తావా ? కారణాలు వివరించండి.
జవాబు:
రియాజ్ చెప్పిన దానితో నేను ఏకీభవించను.
శరీర పరిమాణానికి కణపరిమాణానికి సంబంధం లేదు. దాదాపు ఒక కణజాలంలోని కణాలన్ని ఒకే పరిమాణం కల్గి ఉంటాయి. శరీర పరిమాణం పెరిగే కొలది కణాల సంఖ్య పెరుగుతుంది. కావున చిన్న ఉల్లిగడ్డలో కణాల సంఖ్య తక్కువగాను, పెద్ద ఉల్లిగడ్డలో అదే పరిమాణం కలిగిన కణాలు అధికంగా ఉంటాయి. కణాల సంఖ్య పెరగటం వలన జీవి పరిమాణం పెరుగుతుంది. భూమిపైన పెద్ద శరీరం కలిగిన ఏనుగులోనూ కణాల పరిమాణం సాధారణంగానే ఉంటుంది.

ప్రశ్న 7.
కింది వాక్యాలు చదవండి. తప్పుగా ఉన్న వాటిని గుర్తించి, సవరించి రాయండి.
ఎ) కణకవచం వృక్ష కణాలకు తప్పనిసరిగా అవసరం.
బి)కేంద్రకం కణం యొక్క జీవక్రియలను నియంత్రిస్తుంది.
సి) ఏకకణ జీవులు శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ నిర్వహిస్తాయి.
డి) కేంద్రకం, కణాంగాలు స్పష్టంగా చూడటానికి రంజనం చేయనవసరం లేదు.
జవాబు:
ఎ) కణకవచం వృక్షకణాలకు తప్పనిసరి. ఎందుకంటే ఇది కణానికి పటుత్వాన్ని ఇస్తుంది.
బి) కేంద్రకం కణం యొక్క జీవక్రియలు నిర్వర్తిస్తుంది. (DNA సహాయంతో) నిజమే !
సి) ఏకకణ జీవులు శ్వాసక్రియ, విసర్జనక్రియ, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ నిర్వహిస్తాయి.
వాస్తవమే – కనుక ఇది ఒప్పు.
డి) కేంద్రకం, కణాంగాలు స్పష్టంగా చూడటానికి రంజనం చేయాలి. అప్పుడే మనం స్పష్టంగా అన్నింటినీ సూక్ష్మదర్శినితో చూడగలం.

ప్రశ్న 8.
కేంద్రకం విధులను వివరించండి.
జవాబు:
కేంద్రకం విధులు :

  • ఇది కణంలోని జీవపదార్థం మధ్యలో గుండ్రంగా ఉంటుంది.
  • ఇది కణంలో అంతర్భాగం.
  • ఈ కేంద్రకం కణంలో జరిగే చర్యలను నియంత్రిస్తుంది.
  • కేంద్రకంలో ఉన్న జన్యువులు ఈ వంశపారంపర్య లక్షణాలను జీవులలో ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమింపచేస్తాయి.

AP Board 8th Class Science Solutions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 9.
ఉల్లిపొరలోని కణాలకు, గడ్డి చేమంతి కాండం అడ్డుకోతలోని కణాలకు తేడాలు తెలపండి.
జవాబు:

ఉల్లిపొరలోని కణాలు గట్టి చేమంతి కాండంలోని కణాలు
1. ఇవి అన్నీ ఒకే ఆకారంలో ఉన్నాయి. 1. ఇవి అన్నీ ఒకే ఆకారంలో లేవు.
2. ఇవి అన్నీ ఒకే పరిమాణంలో ఉన్నాయి. 2. ఇవి అన్నీ ఒకే పరిమాణంలో లేవు. వేర్వేరుగా ఉన్నాయి.
3. ఇవి కేంద్రకాన్ని కలిగి ఉన్నాయి. 3. వీటిలో కూడా కేంద్రకం ఉంది.
4. ఇవి అన్నీ ఒకే పనికి వినియోగించబడ్డాయి. అది ఆహార నిల్వ. 4. వీటిని గ్రూపు-ఎ, గ్రూపు-బి, గ్రూపు-సి, గ్రూపు-డి లుగా గుర్తిస్తాం.
5. జీవక్రియలన్నీ ఏకకణంలోనే జరుగుతాయి. (జీర్ణక్రియ, నీరు, ఆహార రవాణా, పెరుగుదల మొదలైనవి.) 5. గ్రూపు-ఎ కణాలు ఆకారాన్ని ఇస్తాయి.
గ్రూపు-బి కణాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేస్తాయి.
గ్రూపు-సి కణాలు నీరు, ఆహారాన్ని రవాణా చేస్తాయి.
గ్రూపు-డి కణాలు కాండం మధ్యలో ఉంటాయి.

ప్రశ్న 10.
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 1
పైన ఇవ్వబడిన పటాలలో భాగాలు గుర్తించండి. వీటిలో ఏది వృక్షకణమో ? ఏది జంతు కణమో గుర్తించండి.
(లేదా)
ఎ) వృక్షకణ నిర్మాణం చూపు బొమ్మను గీచి, భాగాలను గుర్తించండి.
బి) కణ కవచం దేనికి ఉపయోగపడుతుంది ?
జవాబు:
A. కేంద్రకము
B. జీవపదార్ధం
C. ప్లాస్మాపొర
D. రిక్తిక
E. కేంద్రకం
F. కణకవచము
G. ప్రక్క కణము
H. ప్లాస్మాపొర
I. జీవ పదార్థము
పై పటాలలో ఎడమవైపుది జంతుకణం, కుడివైపుది వృక్షకణం (దీర్ఘచతురస్రాకారం)
1. కుడివైపున ఉన్న కణం జంతు కణం.
2. ఎడమవైపున ఉన్న కణం వృక్ష కణం.
బి) కణ కవచం వృక్షకణానికి యాంత్రిక బలాన్ని చేకూర్చుతుంది.

ప్రశ్న 11.
కణాలలో వైవిధ్యం గురించి తెలుసుకోవటానికి నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. కణాలన్నీ చిన్నవిగా ఉంటాయా? కొన్ని పెద్దకణాలు ఉంటాయా?
  2. కణాలలో ఉండే ప్రధానమైన నిర్మాణాలు ఏమిటి?
  3. కణాల ఆకారం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
  4. అతిపొడవైన కణం ఏమిటి?
  5. వృక్షకణం జంతుకణం కంటే విభిన్నంగా ఉంటుందా?
  6. వృక్షాలలో లేకుండా జంతువులలో మాత్రమే ఉండే కణాలు ఏమిటి?

AP Board 8th Class Science Solutions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 12.
ఏకకణజీవులు, బహుకణజీవుల గురించి తెలుసుకోవటానికి ఏమేమి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. ఏకకణజీవులు అనగానేమి?
  2. బహుకణజీవులు అనగానేమి?
  3. బహుకణజీవులలో కణాల పరిమాణం ఎలా ఉంటుంది?
  4. ఏకకణజీవులలో అన్ని జీవక్రియలు జరుగుతాయా?
  5. ఉపయోగకర ఏకకణజీవులు ఏమిటి?
  6. బహుకణజీవులను ఎలా వర్గీకరిస్తావు?

ప్రశ్న 13.
నీటికుంటలో తేలే పచ్చని మొక్కను (Slime) సేకరించండి. దాని నుండి సన్నని భాగాన్ని వేరు చేసి స్లెడ్ మీద వేసి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించండి. మీరు పరిశీలించిన దానిని పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 2
మా ఇంటి దగ్గరలోని కుంటలో తేలియాడుతున్న పచ్చని మొక్కను సేకరించాను.

  • అది నాచు మొక్కలా జిగురుగా ఉంది.
  • పీచు భాగం కూడా దానిలో ఉండటం గమనించాను.
  • దానిని బ్లేడుతో సన్నని ముక్కలుగా చేసి పెట్రేడిష్ లో కణకవచం ఉన్న నీళ్ళలో వేశాను.
  • అతి సన్నని ముక్కను బ్రష్ సహాయంతో స్లెడ్ పైన వేసి ఒక చుక్క నీరు వేశాను.
  • తరువాత దానికి ఒక చుక్క గ్లిసరిన్ వేసి దానిని కవర్ స్లిప్ తో కప్పాను.
  • తరువాత దానిని సూక్ష్మదర్శిని సాయంతో చూడగా పక్క బొమ్మ మాదిరిగా కనిపించింది.

ప్రశ్న 14.
మీ పరిసరాలలోని ఆకులు సేకరించండి. ఆకుల ఉపరితల కణాలు, ఆకారాలను, సూక్ష్మదర్శినితో చూడండి. ఒక పట్టిక తయారుచేయండి. పట్టికలో క్రమసంఖ్య, ఆకు పేరు, ఆకు ఆకారం, బాహ్యత్వచంలోని కణాలు ఆకారం రాయండి. మీరు ప్రత్యేకంగా కనుగొన్న అంశాలను పట్టిక కింద రాయడం మరువవద్దు.
జవాబు:
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 3

AP Board 8th Class Science Solutions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 15.
ఈ పాఠంలో మీరు పరిశీలించిన కణాలను అంతర్జాలం నుండి సేకరించి వాటిని చిత్తుపుస్తకంలో అతికించి, వాటి విధులు రాయండి.
జవాబు:

పటం కణం పేరు విధి
1. కండర కణం పటం కండర కణం చలనము, కదలిక
2. నాడీకణం పటం నాడీకణం సమాచార రవాణా సమాచార విశ్లేషణ
3. ఎర్రరక్త కణం పటం ఎర్రరక్త కణం O2, CO2, సరఫరా
4. తెల్లరక్త కణం పటం తెల్లరక్త కణం సూక్ష్మజీవుల నుండి రక్షణ

AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 4

ప్రశ్న 16.
సూక్ష్మదర్శినితో పరిశీలించిన వృక్ష, జంతు కణాల పటాలు, భాగాలను గీయండి.
జవాబు:
1. వృక్ష కణం
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 5

2. జంతు కణం
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 6

ప్రశ్న 17.
మానవులు, జంతువులు, వృక్షాలు మొదలైనవన్నీ కంటికి కనిపించని కణాలతో నిర్మితమైనాయి. దీనిని నీవు ఏవిధంగా అభినందిస్తావు ?
జవాబు:

  • కంటికి కనిపించని సూక్ష్మ నిర్మాణాలు కణాలు.
  • ఇవి సజీవులైన మొక్కలు, జంతువులు, మానవులలో నిర్మాణాత్మక, క్రియాత్మక నిర్మాణాలు అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.
  • కణాలన్నీ కలసి అంగాలను నిర్మిస్తాయి.
  • అంగాలన్నీ కలసి వ్యవస్థలు నిర్మిస్తాయి.
  • అభివృద్ధి చెందిన జీవులలో ప్రతి జీవక్రియా నిర్వహణకు ఒక్క వ్యవస్థ ఉంటుంది.
    ఉదా : జీర్ణవ్యవస్థ, విసర్జక వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ మొ॥నవి.
  • ఈ వ్యవస్థలన్నీ కలసి ‘జీవి’ నిర్మాణం జరుగుతుంది.
  • పై విషయాలు తెలుసుకున్నప్పుడు, కణం, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగి అభినందించాలని అనిపిస్తుంది.

AP Board 8th Class Science Solutions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 18.
“వృక్ష కణాలలో కణకవచం లేకపోతే మొక్కలు నిలబడలేవు” అని దీపక్ తన మిత్రుడు జాతో చెప్పాడు. అతను చెప్పిన దానిని నీవెలా సమర్థిస్తావు ?
జవాబు:

  • దీపక్ చెప్పిన ఈ విషయాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే –
  • వృక్ష కణాలలో కణత్వచంపై అదనపు రక్షణ, పటుత్వం కోసం కణకవచం ఉంటుంది.
  • ఈ పటుత్వం వల్ల మొక్కలు వృక్షాలు నిర్దిష్టమైన ఆకారంలో నిలబడతాయి.
  • వీటిలో ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థలు ఏర్పడతాయి.
  • అందువల్ల వేర్లు, కాండం, శాఖలు, ఆకులు పటుత్వంతో ఉంటాయి.
  • ఇది మొక్కను పటుత్వంతో నిలబెట్టగలుగుతుంది.

కనుక నేను దీపక్ చెప్పిన విషయాన్ని సమర్థిస్తాను.

8th Class Biology 2nd Lesson కణం – జీవుల మౌళిక ప్రమాణం InText Questions and Answers

8th Class Biology Textbook Page No. 21

ప్రశ్న 1.
వివిధ రకాల కణాలు కాండంలో ఎందుకు ఉంటాయో ఆలోచించండి. (పేజీ నెం. 21)
జవాబు:

  1. కాండము అనేక రకాల పనులు నిర్వహిస్తుంది.
  2. నీరు, పోషక పదార్థాల రవాణా కోసం ప్రత్యేక కణజాలం ఉంటుంది.
  3. ఆధారాన్ని ఇవ్వటానికి బరువు మోయటానికి ప్రత్యేక కణజాలం ఉంటుంది.
  4. కాండాన్ని ఆవరించి వెలుపలివైపు పొరవంటి కణజాలం రక్షణ ఇస్తుంది.
  5. కాండం పెరగడానికి విభజన చెందే కణాల గుంపు ఉంటుంది.

8th Class Biology Textbook Page No. 23

ప్రశ్న 1.
ఏనుగులో ఉండే కణాలు, మనిషిలో ఉండే కణాల కంటే పెద్దవా ?
జవాబు:

  1. ఏనుగు మరియు మనిషిలో ఉండే కణాలు ఒకే పరిమాణం కలిగి ఉంటాయి.
  2. జీవి సైజు కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది కాని కణాల పరిమాణంపై కాదు.
  3. కావున ఏనుగులో మనిషికన్నా ఎక్కువ కణాలు ఉంటాయి.

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
అగ్గిపుల్లలో కణాల పరిశీలన
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 7
కృత్యం : ఒక అగ్గిపుల్లను నీటిలో అరగంట నానబెట్టండి. పల్చని పొరలుగా బ్లేడ్ తో కత్తిరించండి. వీటిలో చాలా పల్చని పొరని బ్రష్ తో తీసుకొని దానిని స్లెడ్ పైన పెట్టండి. దానిపై ఒక నీటిచుక్క వేసి దానిని కవర్ స్లిప్ తో నీటి బుడగలు ఏర్పడకుండా కప్పండి. సూక్ష్మదర్శినితో పరిశీలించండి. మీరు గీసిన పటాన్ని నమూన పీఠం బెండు కణాల పటంతో పోల్చండి..

a) మీరు గీసిన పటాన్ని పటం – 2 తో పోల్చండి. రెండూ ఒకేరకంగా ఉన్నాయా ?
జవాబు:
ఔను. నేను గీసిన పటం,పటం – 2 రెండూ ఒకే విధంగా ఉన్నాయి.

b) దీర్ఘచతురస్రాకారంగా ఉన్న వాటిని ఏమని పిలుస్తారు ?
జవాబు:
దీర్ఘచతురస్రాకారంగా ఉన్న వాటిని కణాలు అంటారు.

AP Board 8th Class Science Solutions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

కృత్యం – 2

ప్రశ్న 2.
ఉల్లిగడ్డ పొరను పరిశీలించే విధానం రాయండి.
జవాబు:

  • ఉల్లిగడ్డ పొట్టు తీసి మందమైన చిన్న ముక్కను కోయాలి.
  • ఉల్లిముక్కను రెండుగా విరిచి నెమ్మదిగా వేరుచేసే ప్రయత్నం చేయండి.
  • రెండు ముక్కలను కలుపుతూ ఉన్న పలుచని పాక్షిక పారదర్శకంగా ఉండే పొరను గమనించండి.
  • ఈ పొరను నెమ్మదిగా వేరు చేయాలి. దాని నుండి చిన్నముక్క కత్తిరించాలి.
  • స్లెడ్ పై నీటిచుక్క వేసి ఉల్లి పొరను పెట్టాలి.
  • స్లెడ్ పైన వేసిన ఉల్లిపొర మడతలు పడకుండా జాగ్రత్తగా కవర్ స్లిప్ తో కప్పాలి. దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

a) మీరు పరిశీలించిన ఉల్లిపొర కణాల పటాలు గీయండి.
జవాబు:
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 8

b) మీరు గీచిన పటాన్ని పై పటంతో పోల్చండి. ఆ రెండింటి మధ్య ఏమైనా తేడాలున్నాయా ?
జవాబు:
రెండింటి మధ్య ఎటువంటి తేడాలు లేవు.

కృత్యం – 3

ప్రశ్న 3.
బుగ్గలోని కణాలను పరిశీలించే విధానం రాయండి.
జవాబు:
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 9

  • నోటిని శుభ్రంగా కడుక్కొని, ప్లాస్టిక్ స్పూన్ తో నోటి లోపల బుగ్గపై గీకండి.
  • స్లెడ్ పై నీటి బిందువును వేసి, దానిలో గీకగా వచ్చిన పదార్థం వేయాలి.
  • దీనిని కవర్ స్లితో కప్పి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
  • గుండ్రని, కేంద్రకం కలిగిన కణాలను మనం గమనించవచ్చు.

జాగ్రత్తలు :

  1. స్పూన్ శుభ్రంగా కడగాలి.
  2. నోటి లోపల గట్టిగా గీకరాదు.

a) నీవు పరిశీలించిన కణాలు, పటంలో చూపిన కణాలు మాదిరిగానే ఉన్నాయా ?
జవాబు:
ఔను నేను పరిశీలించిన కణాలులో చూపిన కణాలు మాదిరిగానే ఉన్నాయి.

b) రెండు కణాల చుట్టు ఆవరించి ఉన్న పొర ఒకే విధంగా ఉందా ?
జవాబు:
ఔను. రెండింటిని ఆవరించి ఉన్న పొర ఒకే విధంగా ఉంది. దీనినే ప్లాస్మాపొర అంటారు.

AP Board 8th Class Science Solutions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

కృత్యం – 4

ప్రశ్న 4.
ఉల్లి పొరలోని కేంద్రకం పరిశీలించే విధానం రాయండి. (లేదా) నీవు ఉల్లిపొరలోని కణాలను పరిశీలించావు కదా ? ఈ ప్రయోగ విధానాన్ని తెలపండి.
జవాబు:
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 10

  • ఉల్లిగడ్డ నుండి ఉల్లిపొరను తియ్యాలి.
  • పొరను స్లెడ్ పై ఉంచి 1-2 చుక్కల రంజకాన్ని (సాఫనిన్ లేదా మిథైలీన్ బ్లూ లేదా ఎర్రసిరా) వెయ్యాలి.
    కణకవచం
  • దానిని కవర్ స్లిప్ తో కప్పి 5 ని॥లు కదల్చకుండా ఉంచాలి.
  • తరువాత కవర్ స్లిప్ కు ఒకవైపు చుక్కలు చుక్కలుగా నీరు పోస్తూ అధికంగా ఉన్న నీటిని రెండవవైపు నుండి ఫిల్టర్ పేపర్లో అద్ది తీసివేయాలి.
  • దీనివల్ల అధికంగా ఉన్న రంజనం తొలగిపోతుంది. ఇప్పుడు సైడ్ ను సూక్ష్మదర్శిని సహాయంతో చూడండి.
  • నీలం లేదా ఎరుపు రంగులో ఉండే చుక్కలాంటి నిర్మాణం కనిపించింది కదా ! ఇదే ఉల్లిపొర కణంలోని కేంద్రకం.

కృత్యం – 5

ప్రశ్న 5.
బుగ్గ కణంలోని కేంద్రకం పరిశీలించే విధానం రాయండి.
జవాబు:
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 11

  • ఒక స్పూన్ తీసుకొని నోటి లోపలి భాగంలో గీకండి.
  • పదార్థాన్ని స్లెడ్ మీద ఉంచి ఒక్క చుక్క నీరు చేర్చండి.
  • దానికి మిథైలీన్ బ్లూ రంజకం కలిపి కవర్ స్లిప్ వేయండి.
  • స్లెడ్ ను మైక్రోస్కోప్ కింద పరిశీలించండి.
  • కణం మధ్యభాగంలో గుండ్రని కేంద్రకం కనిపిస్తుంది.

a) ఉల్లిపొరలోని కణాలను బుగ్గలోని కణాలను పరిశీలించారు కదా ? రెండింటిని పోల్చండి.
జవాబు:

  • ఉల్లిపొరలోని కణాలు చాలా పొడవుగా ఉండే బుగ్గకణాలు గుండ్రంగా ఉన్నాయి.
  • ఉల్లి పొరకణాలు దీర్ఘచతురస్రాకారంగా ఉంటే, బుగ్గకణాలు వృత్తాకారంగా ఉన్నాయి.

b) కణాలలో మీరు పరిశీలించిన నిర్మాణాలు ఏమిటి ?
జవాబు:

  • కణాలలో జీవపదార్థం ఉంది.
  • జీవ పదార్థంలో గుండ్రని నిర్మాణం ఉంది.
  • జీవపదార్థం చుట్టూ వెలుపలి పొర ఉంది.

c) రంగు కలిగిన గుండ్రని నిర్మాణాలు ఏవైనా చూసారా ?
జవాబు:
కణాల మధ్య అధిక రంగు కలిగిన గుండ్రని నిర్మాణాలు ఉన్నాయి.

d) అవి కణాల మధ్యలోనే ఉన్నాయా ?
జవాబు:
ఔను, రంగుకలిగిన గుండ్రని నిర్మాణాలు కణాల మధ్యలోనే ఉన్నాయి.

e) ఉల్లిపొరలోని కణాలు, బుగ్గకణాలు, బుగ్గకణాల బయట త్వచంలో ఏమైనా తేడాలు గమనించారా ?
జవాబు:
ఉల్లిపొరలోని త్వచం బయటకు స్పష్టమైన గోడవంటి నిర్మాణం ఉంది. బుగ్గ కణాల త్వచం బయట ఇటువంటి గోడ వంటి నిర్మాణం కనిపించదు.

AP Board 8th Class Science Solutions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

కృత్యం – 6

ప్రశ్న 6.
ఆకులోని కణాలను ఎలా పరిశీలిస్తావు ?
జవాబు:
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 12

  • లేతగడ్డి ఆకు నుండి పలుచని పొర తీసుకొని దానిని స్లెడ్ పైన ఉంచండి.
  • దానికి ఒక చుక్క నీటిని కలపండి.
  • పదార్థంపై కవర్ స్లిప్ వేసి సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి.
  • వరుసగా అమరిన కణాలు కనిపిస్తాయి.

a) మీరు పరిశీలించిన కణాలు పై పటంలో పోల్చి చూడండి. రెండింటిలో కణాలు ఒకే విధంగా ఉన్నాయి ?
జవాబు:
ఔను. రెండింటిలో కణాలు ఒకే విధంగా ఉన్నాయి.

b) దానిలో ఎన్ని రకాల కణాల గుంపులు చూసారు ?
జవాబు:
ఆకుపై పొరలోని కణాలు అన్ని ఒకే విధంగా ఉంటాయి.
కాని ఆకును అడ్డుకోత కోసి పరిశీలించగా విభిన్న కణాల గుంపులు ఉన్నాయి.

కృత్యం – 7

ప్రశ్న 7.
కింద ఇచ్చిన మానవ శరీర కణాలను పరిశీలించండి.
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 13

AP Board 8th Class Science Solutions Chapter 2 కణం - జీవుల మౌళిక ప్రమాణం

ప్రశ్న 8.
కింది పట్టిక నింపండి.
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 14
జవాబు:
AP Board 8th Class Science Solutions Chapter 1 కణం - జీవుల మౌళిక ప్రమాణం 15

a) కణాల ఆకారంలో ఏమైనా పోలికలు ఉన్నాయా ?
జవాబు:
కణాలు విభిన్న ఆకారాలలో ఉన్నాయి. కొన్ని గుండ్రముగా ఉండి, మరికొన్ని పొడవుగా, ఇంకొన్ని శాఖాయుతంగా ఉన్నాయి.

b) అన్ని కణాల కేంద్రకం ఉందా ?
జవాబు:
అన్ని కణాలలో దాదాపు కేంద్రకం ఉంది. కాని ఎర్రరక్త కణాలలో కేంద్రకం కనిపించలేదు.

c) అన్ని జీవులలో ఏ కణం పెద్దదిగా ఉంటుందో తెలుసా ?
జవాబు:
జీవులలో నాడీకణం పొడవుగా ఉంటుంది. ఇది సుమారు 90 నుండి 10 సెం.మీ. పొడవు ఉంటుంది. ఉష్ణపక్షి గుడ్డు అన్నింటికంటే పెద్దకణం. దీని పరిమాణం 17 సెం.మీ. × 18 సెం.మీ. ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

SCERT AP 8th Class Biology Study Material Pdf 1st Lesson విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి? Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 1st Lesson Questions and Answers విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

8th Class Biology 1st Lesson విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి? Textbook Questions and Answers

I. విషయావగాహన

ప్రశ్న 1.
విజ్ఞానశాస్త్రం అందించిన కొన్ని ఆధునిక ఫలితాలు తెలపండి.
జవాబు:

  • విజ్ఞానశాస్త్రం మానవుని సుఖమయ జీవనానికి అనేక వస్తువులు, వసతులు అందించినది.
  • కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, అంతరిక్ష నౌకలు, సంకరజాతి ఆహారధాన్యాలు, రొబోటిక్స్, వైద్యం ఈ కోవలోనికి వస్తాయి.

ప్రశ్న 2.
విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి ?
జవాబు:
మనచుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దాని పూర్వాపరాలను అవగాహన చేసుకోవడానికీ అందుబాటులో ఉన్న సౌకర్యాలతో, ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలను అన్నింటినీ కలిపి విజ్ఞానశాస్త్రం (Science) అంటారు.

ప్రశ్న 3.
చాలా సందర్భాలలో శాస్త్రవేత్తలు ఇంతకు ముందు కనుగొన్న అంశాల మీదనే తిరిగి ప్రయోగాలు చేస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తుంటారు ? ఉదహరించండి.
జవాబు:

  • కొత్త ఆలోచనలను పరీక్షించుకోవడానికి ప్రయత్నించడం లేదా పాత భావనలను తోసిపుచ్చడం ద్వారా కొత్త విషయాలను కనుగొనవచ్చు.
  • దీనివల్ల శాస్త్రవేత్తలు విజ్ఞానశాస్త్ర చరిత్రలో స్థానం సంపాదించిన వారవుతారు.
  • ఇలా కనుగొన్న నూతన భావనలు మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి.
  • ఉదాహరణకు నెప్ట్యూనను మనం ఇంతకాలం వరకు గ్రహంగా గుర్తించాం కాని నూతన పరిశోధనలు అది గ్రహం కాదని నిర్ధారించాయి.
  • అలాగే కడుపులో అల్సర్లకు ఆహారపు అలవాట్లు, వ్యాకులత కారణమని అనుకుంటుండేవాళ్ళం. కానీ దీనికి బ్యాక్టీరియా కారణమని నేడు కనుగొన్నారు.

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

ప్రశ్న 4.
శాస్త్రవేత్తలకు సమాజం బోలెడన్ని వనరులను ఎందుకు సమకూర్చుతుంది ?
జవాబు:

  • శాస్త్రవేత్తల పరిశోధనలు సామాన్య మానవులు మంచి జీవితం గడపటానికి దోహదం చేస్తాయి.
  • సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాస్త్రవేత్తలు పరిష్కారం చూపుతారు.
  • శాస్త్ర ఆవిష్కరణలు మానవ జీవితాన్ని మరింత సుఖమయం చేస్తాయి.
  • శాస్త్ర పరిశోధనలు మానవ జీవితాన్ని ఆధునీకరిస్తాయి.

అందుచేత సమాజం శాస్త్రవేత్తలకు వనరులను సమకూర్చుతుంది.

ప్రశ్న 5.
శాస్త్రవేత్తలు సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేయటానికి ప్రేరేపించే అంశం ఏమిటి ?
జవాబు:

  • శాస్త్రవేత్తలు ప్రజల జీవన విధానం మెరుగుపర్చాలనే తపన కలిగి ఉంటారు.
  • సమస్యను పరిష్కరించటం వలన శాస్త్రవేత్తలు తృప్తి పొందుతారు.
  • సాధారణంగా శాస్త్రవేత్తలు అన్వేషణ దృక్పథం కలిగి ఉంటారు. వారు పనిలో ఆనందం పొందుతారు.
  • దీని వలన వారు పరిశోధనల కొరకు జీవితాలను త్యాగం చేయగలరు.

ప్రశ్న 6.
ప్రజల ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి చేయటంలో శాస్త్రవేత్తల పాత్ర ఏమిటి ?
జవాబు:
ప్రజల ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి చేయడం. దీని కోసం చాలామంది శాస్త్రవేత్తలు ప్రకృతి వనరులైన పెట్రోలియం, ఖనిజాలను కనుగొనడం లేదా పునరుత్పత్తి చేయడంలో సరైన, సమర్థవంతమైన మార్గాల కోసం అన్వేషిస్తారు. వృక్ష శాస్త్రవేత్తలు కొత్త జాతుల పంటలు, పండ్ల మొక్కలు కనుగొనడం ద్వారా తక్కువ ధరల్లో పోషకాహారం అందించి ఆరోగ్యవంతమైన జాతిని రూపొందించడానికి ప్రయత్నిస్తారు.

ప్రశ్న 7.
ఈ కింది పదాలను నిర్వచించండి.
ఎ) శాస్త్రీయ పద్ధతి
బి) శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు
సి) విజ్ఞాన శాస్త్రం
జవాబు:
ఎ) శాస్త్రీయ పద్ధతి : శాస్త్రవేత్తలు గుర్తించిన సమస్యలకు, ప్రశ్నలకు కొన్ని క్రమపద్ధతులు వినియోగిస్తారు. వీటినే శాస్త్రీయ పద్ధతులు అంటారు.
బి) శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు : శాస్త్రీయ పద్ధతిలో వాడే ప్రణాళికను అర్థం చేసుకోవడానికి కొన్ని నైపుణ్యాలు అవసరం. వీటిని శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు అంటారు.
ఉదా : సేకరణ, నిర్వహణ, విశ్లేషణ మొదలగునవి.
సి) విజ్ఞాన శాస్త్రం : ప్రకృతిలో దాగివున్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే చక్కటి, స్పష్టమైన మార్గాన్ని ‘విజ్ఞాన శాస్త్రం’ అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

ప్రశ్న 8.
శాస్త్రీయ పద్ధతిలో వున్న సోపానాలను పేర్కొనండి.
జవాబు:
శాస్త్రీయ పద్ధతిలో ఈ క్రింది సోపానాలు కలవు. అవి

  • ప్రశ్నించటం
  • పరికల్పన చేయటం
  • ప్రణాళిక చేయటం
  • ప్రయోగం నిర్వహించటం
  • ఫలితాలను ప్రదర్శించటం

ప్రశ్న 9.
శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:

సోపానాలు వివరణ ఉదాహరణ
1. పరిశీలన వస్తువు, సంఘటనలను గురించి నేర్చు కోవడంలో జ్ఞానేంద్రియాలను వాడటం. ఉదా : విత్తనాలు నేలలో మొలకెత్తుతాయి.  కానీ ఏ నేల విత్తనాలు మొలకెత్తటానికి అనుకూలం?
2. పరికల్పన ఒక సమస్యకు సమాధానాలు ఊహించటం తోట నేలలో గింజలు బాగా మొలకెత్తుతాయని అనుకొంటున్నాను.
3. ప్రయోగం కోసం ప్రణాళిక పరికల్పనను నిరూపించటానికి ప్రయోగ విధానాన్ని రూపొందించుకోవటం. మూడు వేరు వేరు నేలలలో ఒకే రకం విత్తనాలు నాటి, పరిశీలించాలి.
4. ప్రయోగ నిర్వహణ ప్రణాళిక ప్రకారం చరరాశులను నియంత్రిస్తూ ప్రయోగం చేయటం. ఫలితాలను నమోదుచేయటం. మూడు కుండీలలో వేరు వేరు మట్టి తీసుకొని విత్తనాలు నాటి, నీరు పోశాను. 21 రోజుల తరువాత అన్ని మొక్కల పొడవు కొలిచాను.
5. నిర్ధారించటం ప్రయోగ ఫలిత సమాచారాన్ని విశ్లేషించి పరికల్పన సరైనదా కాదా అని నిర్ణయించడం. ప్రయోగంలో ఇసుకమట్టి, తోట మట్టిలో మొక్కలు బాగా పెరిగాయి. బంకమట్టిలో విత్తనాలు మొలకెత్తలేదు.

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

ప్రశ్న 10.
నీకు తెలిసిన ఏవైనా ఐదు ప్రక్రియా నైపుణ్యాలు రాయండి.
జవాబు:
శాస్త్రీయ పద్ధతిలో వాడే కొన్ని పనులే ప్రక్రియా నైపుణ్యాలు. అవి :

  • కొలవటం
  • సేకరించటం
  • నమోదు చేయటం
  • ప్రదర్శించటం
  • ఊహించటం

ప్రశ్న 11.
పరికల్పన అనగానేమి?
జవాబు:
పరీక్షించటానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని పరికల్పన అంటారు.
ఉదా : బండి ఆగిపోయినపుడు పెట్రోలు అయిపోయి ఉండవచ్చు అని భావించుట.

ప్రశ్న 12.
‘చరరాశులు’ అనగానేమి?
జవాబు:
‘పరిశోధనా ఫలితాన్ని ప్రభావితంచేసే అంశాలను చరరాశులు అంటారు. చరరాశులన్ని నియంత్రించటం వలన కచ్చితమైన ఫలితాలు పొందవచ్చు.

ప్రశ్న 13.
అన్వేషణా పద్ధతిలోని సోపానాలను ఉదాహరణతో వివరించండి.
జవాబు:
సమస్యను పరిష్కరించటంలో పాటించే క్రమమైన పద్ధతులను అన్వేషణా పద్ధతి అంటారు. దీనిలో ఈ క్రింది సోపానాలు ఉంటాయి.

సోపానము ఉదాహరణ
1. సమస్యను గుర్తించటం గదిలో లైటు వెలగకపోవటం
2. పరికల్పనలు చేయటం
  • ఫ్యూజ్ పోయి ఉండవచ్చు.
  • ఫిలమెంట్ కాలిపోయి ఉండవచ్చు.
  • స్విచ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల
  • వైర్లు ఊడిపోవటం వల్ల
3. సమాచారాన్ని సేకరించటం టెస్టర్, స్మూడైవర్, ఇన్సులేషన్, టేప్, కరెంట్ తీగలు, బ్లేడు, చెక్కస్కేలు, సేకరించుకోవటం
4. సమాచారాన్ని విశ్లేషించటం సేకరించిన వస్తువులను ప్రయోగాలకు, పరిశీలనకు అమర్చుకోవటం
5. ప్రయోగాలు చేయటం
  • ఫిలమెంట్ పరిశీలించటం
  • ఫ్యూజ్ పరిశీలించటం
6. ఫలితాల విశ్లేషణ ఫిలమెంట్ కాలిపోలేదు బాగానే ఉంది కాబట్టి ఫ్యూజ్ పరిశీలించాలి. ఫ్యూజ్ వైరు తెగిపోయి ఉంది. కాబట్టి ఫ్యూజ్ తీగను మార్చాలి. తీగను మార్చినపుడు బల్బు వెలిగింది.
7. నిర్ధారణకు రావటం ఫ్యూజ్ పోవటం వలన బల్బు వెలగలేదు.

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

II. ప్రశ్నించటం, పరికల్పన చేయటం

ప్రశ్న 1.
ప్రభుత్వం శాస్త్రవేత్తలకు బోలెడన్ని వనరులు ఇచ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని అడగటం సమంజసమేనా ? వివరించండి.
జవాబు:

  • ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచటానికి ప్రతి శాస్త్రవేత్త తపిస్తాడు.
  • దీని కోసం వారు తమ జీవితాలను సైతం త్యాగం చేస్తారు.
  • దీని ద్వారా అనేక కొత్త అంశాలు కనుగొనబడ్డాయి.
  • దీనితో ప్రజల స్థితిగతులు మెరుగుపడ్డాయి.
  • ఈ పరిశోధనా ఫలితాలు మానవాళి ఉన్నతికి చాలా ఉపయోగపడతాయి.
  • ఆహార ఉత్పత్తి అభివృద్ధి, జన్యు సమాచారం, సునామీ, తుపానులను ముందే గ్రహించే అవకాశం కలిగింది.
  • అందువల్ల ప్రభుత్వం శాస్త్రవేత్తలకు వనరులను అందించటం సమంజసమే అని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
కార్ల్ పాపర్ మాటల్లో “సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్” అంటారు. దీనిని నీవు ఎలా సమర్ధిస్తావు ?
జవాబు:

  • విజ్ఞానశాస్త్రం నిత్య నూతనంగా ఉంటుంది.
  • ఈ రోజు ఆవిష్కరణ రేపటి కొత్త ఆలోచనలకు పునాది అవుతుంది.
  • ఏ శాస్త్రవేత్త కూడా ఇదే అసలు పరిష్కారం అని భావించరు.
  • దీని కన్నా మంచి ‘సౌకర్యం’ మరింత సౌలభ్యంగా ఉంటుందనుకుంటారు.
  • ప్రస్తుత పరిశోధనలో తప్పులు సరిచేసుకుంటూ మంచి ఫలితం కోసం ప్రయత్నం చేస్తారు.
    ఉదా : 19వ శతాబ్దం మొదట్లో బస్సు గరిష్ఠ వేగం గంటకు 20 కి.మీ. నుండి 30 కి.మీ. మాత్రమే. కానీ ఇప్పుడు వొల్వో బస్సు వేగం గంటకు 300 నుండి 360 కి.మీ. ఇది శాస్త్ర ప్రగతికి మంచి ఉదాహరణ.
  • బస్సు ఇంజనులో ఉన్న చిన్న చిన్న సమస్యలను సరిచేసుకుంటూ ఈనాటి బస్సులను అభివృద్ధి చేసారు.
  • అందువల్ల నేను కార్ల్ పాపర్ మాటలను సమర్ధిస్తాను.

ప్రశ్న 3.
వివిధ శాస్త్రవేత్తలు చేసే పనులు, వారి పేర్లు తెలుసుకోవటానికి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు ?
1. ఖగోళ శాస్త్రవేత్త అని ఎవరిని అంటారు ?
జవాబు:
ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాల సమాచారం తెలిపేవారు.

2. భూగర్భ శాస్త్రవేత్త అని ఎవరిని అంటారు ?
జవాబు:
శిలాజాలు, ఖనిజాలు గురించి చెప్పేవారు.

3. జీవుల ప్రవర్తన గురించి ఎవరు అధ్యయనం చేస్తారు ?
జవాబు:
పర్యావరణ శాస్త్రవేత్త

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

ప్రశ్న 4.
ఈ కింద ఇవ్వబడిన శాస్త్ర విభాగాన్ని చదివి, అవి పరిశీలించే అంశాలు రాయండి.

వ.సం. శాస్త్ర విభాగం పరిశీలించే అంశం
1. వృక్షశాస్త్రం
2. సిస్మాలజీ
3. శిలాజ శాస్త్రం
4. మానవ శాస్త్రం
5. శరీర ధర్మశాస్త్రం
6. వాతావరణ శాస్త్రం

జవాబు:

వ.సం. శాస్త్ర విభాగం పరిశీలించే అంశం
1. వృక్షశాస్త్రం మొక్కల నిర్మాణం, పెరుగుదల వ్యాధులు మొ॥
2. సిస్మాలజీ భూకంపాల గురించి
3. శిలాజ శాస్త్రం వృక్ష, జంతు సంబంధ శిలల గురించి చెప్పేది.
4. మానవ శాస్త్రం ప్రాచీన, ఆధునిక మానవుల జీవన విధానాలు.
5. శరీర ధర్మశాస్త్రం జీవుల శరీర నిర్మాణాలు, అవి పని చేసే విధానాలు.
6. వాతావరణ శాస్త్రం వాతావరణంలోని గతులు-మార్పులు గురించి తెలిపేది.

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

III. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు

ప్రశ్న 1.
చరిత రాయి ఆకృతి పరిమాణంలో మార్పునకు గల కారణాలు ఎలా కనుగొన్నది ?
జవాబు:

  • చరిత మూడు రాళ్ళను సేకరించింది.
  • వాటి ద్రవ్యరాశులను కొలిచింది.
  • ఈ రాళ్లను నీరు, ఇసుక గల గ్లాసులో ఉంచింది.
  • రోజూ ఒకసారి ఊపుతూ ఒక వారం రోజుల పాటు చేసింది.
  • వారం తర్వాత ఆమె రాళ్లు, ఇసుక, జాడి ద్రవ్యరాశులను కొలిచింది. వచ్చిన సమాచారాన్ని విశ్లేషించింది.
  • రాళ్లు ఇసుకతో రుద్దడం వల్ల అవి పెచ్చులుగా విడిపోతాయని నిర్ధారించింది.

ప్రశ్న 2.
‘స్విచ్’ పనిచేసే విధానాన్ని నీవు ఎలా తెలుసుకొంటావు ?
జవాబు:

  • బ్యాటరీ, తీగెలు, బల్బుతో ఒక విద్యుత్ వలయం ఏర్పర్చాను.
  • ఒక డ్రాయింగ్ బోర్డుమీద రెండు డ్రాయింగ్ పిన్నులు గుచ్చి దానికి విద్యుత్ తీగలు కలిపాను.
  • రెండు పిన్నుల మధ్య లోహపు తీగె ఉంచినపుడు వలయం పూర్తిఅయి బల్బు వెలిగింది.
  • లోహపు తీగెను తీసినపుడు వలయం తెరుచుకొని బల్బు ఆరిపోయింది.
  • బల్బును ఆర్పటానికి, వెలిగించటానికి లోహపుతీగె స్విచ్ లా పనిచేసింది.

ప్రశ్న 3.
ఏ తువ్వాలు ఎక్కువ నీటిని పీల్చుకుంటుందో ఎలా నిర్ధారిస్తావు ?
జవాబు:

  • ఈ ప్రయోగానికి నేను మూడు రకాల టవల్స్ ఎన్నుకొన్నాను.
  • మూడు బీకర్లు తీసుకొని, ఒక్కొక్కదానిలో ఒక లీటరు నీరు పోశాను.
  • మూడు రకాల టవలను వేరు వేరు బీకర్లలో 10 సెకండ్ల పాటు ఉంచాను.
  • నీటి నుండి టవలను తీసి ప్రక్కన ఉంచాను.
  • బీకరులో మిగిలిన నీటిని గమనిస్తే ఏ టవల్ ఎక్కువ నీటిని పీల్చుకున్నదో అర్థమైనది.

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

ప్రశ్న 4.
మీ ఇంటిలోని వంటగదిలో ఉన్న ఆలుగడ్డను వారం రోజులు పరిశీలించి, నీ పరిశీలనలను నమోదు చేయండి.
జవాబు:

పరిశీలన
మొదటి రోజు
  1. ఆలుగడ్డపై అక్కడక్కడ గుంతలు ఉన్నాయి.
  2. వాటి లోపల లేత ఆకుపచ్చ రంగులో మొగ్గలు ఉన్నాయి.
రెండవ రోజు అక్కడక్కడా మొగ్గలు నెమ్మదిగా పెరుగుతుండటం గమనించాను.
నాల్గవ రోజు గుంతల్లా వున్న భాగాల నుంచి సన్నని కాడ మరియు చిన్న చిన్న ఆకులు రావటం గమనించాను.
ఉపాధ్యాయుడు : గుంతలున్న భాగాన్ని కోసి మరలా నాటితే ఏమవుతుందో చూడండి !
ఎనిమిదవ రోజు అది కొత్త మొక్కగా అభివృద్ధి చెందిందని గమనించాను.
“వీటిని కాండ మొగ్గలు” అంటారు. ఇవి రూపాంతరం చెందాయి.

ప్రశ్న 5.
మీ గ్రామ జనాభా వివరాలు సేకరించి కమ్మీ చిత్రాల ద్వారా దానిని ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి 1
పురుషులు – 1700
స్త్రీలు – 1400
పిల్లలు – 700
వృద్ధులు – 500
మైనారిటీలు – 600

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

IV. సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు

ప్రశ్న 1.
మీ బడిలోని ప్రయోగశాలను చూసి దానిలో మీరు తీసుకున్న భద్రతా వివరాలు రాయండి.
జవాబు:

  • మా పాఠశాలలో ఉన్న ప్రయోగశాలను మా సైన్సు ఉపాధ్యాయులు నిర్వహిస్తారు.
  • పెద్ద హాలు వంటి నిర్మాణంలో సగం జీవశాస్త్ర సంబంధ నమూనాలు, చార్టులు మొ॥నవి, రెండవ సగంలో భౌతిక, రసాయన శాస్త్రానికి సంబంధించిన పరికరాలు ఉన్నాయి.
  • భద్రత పరంగా మా ప్రయోగశాల సురక్షితమైనది. ఎందుకంటే –
  • ప్రయోగశాలలో నీటి సౌకర్యం ఉంది. దీనితో ప్రయోగ అనంతరం చేతులు, పరికరాలు శుభ్రంగా కడుక్కోవచ్చు.
  • తగిన సంఖ్యలో పెద్ద కిటికీలు ఉన్నాయి. దీని ద్వారా తగిన గాలి, వెలుతురు ప్రయోగశాలలో ఉంటుంది.
  • ప్రయోగశాలలో మేమందరం క్రమశిక్షణతో, నిశ్శబ్దంగా ఉంటాం.
  • మా సైన్సు మాష్టారి అనుమతి లేనిదే ఏమీ ముట్టుకోము. ఇది భద్రత పరంగా ఎంతో ముఖ్యం.
  • ప్రయోగ సమయంలో మా ఉపాధ్యాయులు చెప్పిన భద్రతా సూత్రాలు తప్పక పాటిస్తాం.
  • తలుపులు, కిటికీలు బయటకు తెరుచుకునేలా మా ప్రధానోపాధ్యాయులు జాగ్రత్త తీసుకున్నారు.

దీనివల్ల ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మేమందరం సురక్షితంగా బయటపడవచ్చు.

ప్రశ్న 2.
నీ స్నేహితులు శాస్త్ర విషయాలు చదివేటప్పుడు ఎదుర్కొనే సమస్యలపై ప్రాజెక్టు పనిని చేయండి.
జవాబు:
సమస్య : లలిత్, అభయ్ లు శాస్త్ర విషయాలు చదివేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవి :

  1. అవగాహన త్వరగా జరగటంలేదు.
  2. శాస్త్రీయ పదాలు గుర్తుండటం లేదు.

దీనిపై వారు వారి మిత్రుడు శ్రావణ్ ను సంప్రదించారు.

ప్రాథమిక సమాచారం :
AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి 2

దీన్ని విశ్లేషించి ఈ కింది సూచనలు చేశారు.

  1. ఇచ్చిన అంశాన్ని బిగ్గరగా చదవటం.
  2. దానిలోని శాస్త్రీయ పదాలను 5 లేదా 10సార్లు (imposition) రాయటం.

పై విధంగా 10 రోజులు సాధన తరువాత ద్వితీయ సమాచారం సేకరించడమైనది.
AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి 3

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

ప్రశ్న 3.
ప్రక్క ‘బార్ గ్రాఫ్’ ను పరిశీలించి మీరు గ్రహించిన సమాచారం తెలపండి.
AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి 4
జవాబు:

  • ఈ బార్ గ్రాఫ్. వివిధ దేశాలలోని పాల ఉత్పత్తిని తెలుపుతుంది.
  • పాల ఉత్పత్తిలో ఇజ్రాయెల్ అగ్రస్థానంలో ఉంది.
  • ఇజ్రాయెల్ తరువాత, అమెరికా, జపాన్ ద్వితీయ, తృతీయ స్థానాలలో కొనసాగుతున్నాయి.
  • పాల ఉత్పత్తిలో భారతదేశం గణనీయంగా వెనుకబడి ఉంది.

ప్రశ్న 4.
ప్రక్క గ్రాఫ్ నుండి నీవు గమనించిన అంశాలు ఏమిటి?
AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి 5
జవాబు:

  • పై చార్టు వివిధ జంతువుల పాల వినియోగం తెలుపుతుంది.
  • మనం, ఆవులు, గేదెలు, గొర్రెలు, గాడిదలు, ఒంటెల గేదెలు నుండి పాలు వినియోగిస్తున్నాం.
  • పాల వినియోగంలో అధిక శాతం ఆవుల నుండి లభిస్తుంది.
  • ఆవుల తరువాత, గేదెల పాల ‘మీద మనం అధికంగా ఆధారపడ్డాము.
  • గొర్రె, ఒంటె పాలను తక్కువ మంది జనాభా వినియోగిస్తున్నారు.

V. బొమ్మలు గీయడం, నమూనాలు తయారుచేయడం

ప్రశ్న 1.
పరిశోధనా ప్రణాళికలోని సోపానాలను ప్రవాహ పటం ద్వారా చూపుము.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి 6

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

VI. అభినందించటం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండటం, విలువలు పాటించడం

ప్రశ్న 1.
శాస్త్రవేత్తల కృషిని మీరు చదివినప్పుడు ఎలాంటి అనుభూతి పొందారు ?
జవాబు:

  • శాస్త్రవేత్తలు ప్రకృతిని పరిశీలించి, వాటిని నమోదు చేసి, విశ్లేషించి ప్రకృతి నియమాలను విపులంగా అర్థం చేసుకుంటారు.
  • ఈ క్రమంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తారు.
  • అవి మానవాళికి వారి జీవన విధానం మెరుగుపరచుకోవటానికి ఎంతో దోహదపడుతుందని అర్థం అయినప్పుడు, ఎంతో సంతోషం, ఉత్తేజంగా అనిపిస్తుంది.
  • కానీ ఈ అన్వేషణలో వారు తమ జీవితాలను ప్రయోగశాలలకే అంకితం చేస్తారు. వారి త్యాగం వెల కట్టలేనిది.
  • ఉదా : ఐన్ స్టీన్ ను అతని వ్యక్తిగత వైద్యుడు పరీక్షించి “మీరు బాగా అలసిపోతున్నారు. కాబట్టి మీ మనసుకు హాయి అనిపించే ప్రదేశానికి వెళ్ళండి” అని చెప్తే, ఐన్ స్టీన్ మరలా తన ప్రయోగశాలకే వెళ్ళాడు. దీనిని చదివినప్పుడు శాస్త్రవేత్తలు పడే శ్రమ, తపన అర్థం అవుతుంది. మనం కూడా భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్త అవుదామని అనిపిస్తుంది.

ప్రశ్న 2.
శాస్త్రాభివృద్ధి మానవ జీవితంలో తెచ్చిన మార్పులను నీవు ఎలా అభినందిస్తావు ?
జవాబు:

  • అనాగరికంగా, ఆదిమానవుడులా సంచరించే మానవుడు శాస్త్ర విజ్ఞానం వలన ఆధునిక మానవుడుగా అవతరించాడు.
  • నిప్పును కనుగొని ప్రకృతి శక్తులను తన చేతులలోనికి తీసుకోవటం ప్రారంభించాడు.
  • తరువాత కనుగొన్న చక్రం మానవ జీవితాన్ని ప్రగతి బాటన నడిపింది.
  • దీని వలన రోడ్డు రవాణా సౌకర్యాలు ప్రారంభమయ్యాయి.
  • ఆధునిక ఆవిష్కరణలో కంప్యూటర్ ఒక అద్భుత పరికరం.
  • ఇది ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చింది.
  • రోదసి యాత్రలు, మానవ పరిధిని భూగోళం దాటించాయి.
  • నేడు మనం వాడుతున్న అన్ని పరికరాలూ శాస్త్ర విజ్ఞానం వల్లనే లభించాయి.

ఈ సౌకర్యవంత జీవనానికి శాస్త్రరంగాన్ని అభినందిద్దాము.

AP Board 8th Class Biology Solutions Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

VII. నిజజీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండటం

ప్రశ్న 1.
నిజ జీవితంలో నీకు పనికి వస్తున్న శాస్త్ర విజ్ఞాన విషయాలను, వస్తువులను పట్టిక రూపంలో రాయండి.
జవాబు:

వ.సం. వస్తువు పేరు తెలుసుకోదగిన అంశం
1. ఉల్లిగడ్డ
  • కాండం రూపాంతరం
  • పొరను పరిశీలించి కణాలను పరిశీలించవచ్చు.
2. కరివేపాకు వేరు మొగ్గలకు ఉదాహరణ
3. నిమ్మరసం
  • ‘ఆమ్లం’ను గుర్తించటానికి
  • లిట్మస్ పరీక్షకు
4. బెలూన్లు గాలి అన్నివైపులా ఒత్తిడిని సమంగా కలిగిస్తుందని తెలుసుకోవటం.
5. అగ్గిపుల్లలు నానబెట్టి, పొరలు తీసి సూక్ష్మదర్శిని సాయంతో కణాల అన్వేషణ

ప్రశ్న 2.
సైన్సు ప్రయోగశాలలో పాటించే జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:
పాటించాల్సిన జాగ్రత్తలు :

  1. ముందుగా ఆలోచించండి : పరిశోధనలోని సోపానాలను అధ్యయనం చేయటం వలన మీరు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోవచ్చు. మీరు ఏవైనా ప్రశ్నలను అడగాలనుకుంటే ఉపాధ్యాయుడిని అడగండి. మీకు చూపించిన భద్రత గుర్తులను బాగా అవగాహన చేసుకోండి.
  2. శుభ్రంగా ఉండండి : మీరు పనిచేసే ప్రాంతం శుభ్రంగా ఉంచండి. మీకు పొడవైన వెంట్రుకలుంటే వెనుకకు నెట్టండి. ముందుకు పడకుండా చూసుకోండి. పొడవైన చొక్కా చేతులను మడుచుకోండి. లేకపోతే ప్రయోగం నిర్వహించేటప్పుడు జుట్టు లేదా చొక్కా చేతులు తగిలి పదార్థాలు ఒలికిపోవచ్చు.
  3. అడగండి : మీరు ఏదైనా పారేయాలన్నా, పగలగొట్టాలన్నా, కత్తిరించాలన్నా మీ ఉపాధ్యాయునికి తప్పని సరిగా చెప్పండి.
  4. మీ కళ్ళు జాగ్రత్త : భద్రతనిచ్చే కళ్లజోళ్లను వాడండి. మీ కళ్ళలో ఏమైనా పడితే మీ ఉపాధ్యాయునికి వెంటనే చెప్పండి.
  5. రుచి చూడవద్దు : సైన్స్ కృత్యాలు నిర్వహించేటప్పుడు మీ ఉపాధ్యాయుని అనుమతి లేకుండా ఏ పదార్థాన్ని త్రాగకండి, తినకండి.
  6. షాక్ నుండి దూరంగా ఉండండి : విద్యుత్ పరికరాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త పడండి. విద్యుత్ పరికరాలను భద్రంగా ఉంచండి. విద్యుత్ ప్రవాహానికి ఆటంకం కలగకుండా ప్లగ్గులు, వైర్లు ఉపయోగించండి. ప్లగ్గులు పెట్టేటప్పుడు, తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
  7. శుభ్రంగా ఉంచండి : పని ముగించిన వెంటనే ప్రయోగ బల్లను శుభ్రంగా ఉంచండి. అన్ని వస్తువులు ఎక్కడివి అక్కడ సర్ది పెట్టండి. మీరు పనిచేసే ప్రాంతాన్ని తుడవండి. మీ చేతులు కడుక్కోండి.

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions

AP SCERT 8th Class Maths Textbook Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions and Answers.

AP State Syllabus 8th Class Maths Solutions 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions

ఇవి చేయండి

1. ఒక రాశిలోని మార్పు వలన వేరొక రాశిలో కూడా మార్పు వచ్చే ఐదు సందర్భాలను వ్రాయండి. (పేజీ నెం. 231)
సాధన.
ఒక రాశిలో మార్పు వలన వేరొక రాశిలో కూడా మార్పు వచ్చే ఐదు సందర్భాలు:

  1. ఒక కుటుంబంలోని సభ్యుల సంఖ్య పెరిగిన వారు ఉపయోగించు బియ్యం పరిమాణం పెరుగును.
  2. వేగం పెరిగితే, సమయం తగ్గుతుంది.
  3. నీటి వాడకం ఎక్కువైతే భూగర్భజలాలు తగ్గుతాయి.
  4. వ్యక్తులు చేసే పనిసామర్ధ్యం పెరిగితే కాలం తగ్గుతుంది.
  5. తీగ యొక్క మందం పెరిగిన దాని నిరోధం తగ్గుతుంది.

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions

2. మీరు గమనించిన మూడు అనులోమానుపాత సందర్భాలను రాయండి. (పేజీ నెం. 233)
సాధన.
1. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు, ఉపాధ్యాయుల సంఖ్యకు మధ్య గల సంబంధం.
2. పశువుల సంఖ్య, అవి మేసే మేత పరిమాణం
3. కూలీల సంఖ్య, కట్టే గోడ పరిమాణం
పై సందర్భాలు అనులోమానుపాతంలో ఉంటాయి.

3. భుజముల పొడవులు 2, 3, 4 మరియు 5 సెం||మీ|| గల చతురస్రాలను తీసుకొని వాటి వైశాల్యాలను లెక్కించి క్రింది పట్టికను నింపండి. (పేజీ నెం. 233)
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 1
మీరు ఏమి గమనిస్తారు? చతురస్ర భుజము కొలత మారితే చతురస్ర వైశాల్యంలో ఏమైనా మార్పు వచ్చినదా? ఖచ్చితంగా వస్తుంది కదా. ఇంకా దాని వైశాల్యానికి, భుజము పొడవుకి గల నిష్పత్తిని కనుగొనంది. ఈ నిష్పత్తి సమానంగా వుందా? లేదు కదా. కాబట్టి ఈ మార్పు అనులోమానుపాతం కాదు.
సాధన.

భుజం పొడవు వైశాల్యానికి గల నిష్పత్తి
2 4 —> 2 : 4 = 1 : 2
3 9 —> 3 : 9 = 1 : 3
4 16 —> 4 : 16 = 1 : 4
5 25 —> 5 : 25 = 1 : 5

ఈ నిష్పత్తి సమానంగా లేదు. కాబట్టి ఈ మార్పు అనులోమానుపాతంలో లేదు. చతురస్ర భుజం కొలత మారితే చతురస్ర వైశాల్యం మార్పు వస్తుంది.

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions

4. ఇక్కడ మీకు గ్రాఫ్ కాగితంపై ఒకే వెడల్పు కలిగిన కొన్ని దీర్ఘ చతురస్రాలు యివ్వబడ్డాయి. ప్రతీ దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కనుగొని క్రింది పట్టికను నింపండి. (పేజీ నెం. 233)
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 2
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 3
దీర్ఘచతురస్ర వైశాల్యము పొడవుకు అనులోమానుపాతంలో వుందా?
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 4
దీర్ఘచతురస్ర వైశాల్యం, పొడవుకు అనులోమానుపాతంలో ఉంది.

5. ఒకగ్రాఫ్ కాగితంపై ఒకే పొడవు వేరువేరు వెడల్పులు గల దీర్ఘచతురస్రాలను గీయండి. ప్రతీ దీర్ఘచతురస్రము వైశాల్యాన్ని కనుగొనండి. వాటి వైశాల్యాలు మరియు వెడల్పుల గురించి మీరు ఏమి చెప్పగలుగుతారు? (పేజీ నెం. 233)
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 5
మొదటి దీర్ఘచతురస్ర వైశాల్యం (A1) = 3 × 1 = 3 చ.సెం.మీ.
రెండవ దీర్ఘచతురస్ర వైశాల్యం (A2) = 3 × 2 = 6 చ.సెం.మీ.
∴ దీర్ఘ చతురస్ర వైశాల్యాలు, వాటి వెడల్పులు అనుపాతంలో కలవు. [∵ \(\frac{1}{3}=\frac{2}{6}\)]

6. ఇచ్చిన మ్యాప్ లోని దూరాలను కొలిచి, దాని సహాయంతో (i) విజయవాడ మరియు విశాఖపట్నం (ii) తిరుపతి మరియు విజయవాడల మధ్యగల నిజదూరాలను కనుగొనండి. ఇచ్చిన మ్యాప్ ‘స్కేలు’. (పేజీ నెం. 235)
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 6
సాధన.
(i) విజయవాడ మరియు విశాఖపట్నం మధ్యగల దూరం = 2 సెం.మీ.
లెక్కప్రకారం 1 సెం.మీ. = 300 కి.మీ. అయినచో 2 సెం.మీ. = ?
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 7
⇒ x + 2 × 300 = 600 కి.మీ.
∴ విజయవాడ, విశాఖపట్నాల మధ్య నిజదూరం = 600 కి.మీ.

(ii) తిరుపతి, విజయవాడల మధ్య దూరం = 3 సెం.మీ.
లెక్క ప్రకారం 1 సెం.మీ. = 300 కి.మీ. అయినచో 3 సెం.మీ. = ?
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 8
⇒ x = 3 × 300 = 900 కి.మీ.
∴ తిరుపతి, విజయవాడల మధ్య నిజదూరం = 900 కి.మీ.

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions

7. మీరు గమనించిన మూడు విలోమానుపాత సందర్భాలను రాయండి. (పేజీ నెం. 238)
సాధన.

  1. కాలము – పనిసామర్థ్యం
  2. దూరం – వేగము
  3. కాలము – వేగం

8. గళ్ళ కాగితంపై ప్రక్క ప్రక్కన ఉండే 12 చదరాలను ఉపయోగించుకుంటూ వివిధ కొలతలు గల దీర్ఘ చతురస్రాలను గీయాలి. ఇలా ఏర్పడిన ప్రతీ దీర్ఘచతురస్రము యొక్క పొడవు, వెడల్పులను కనుగొని, ఆ వచ్చిన విలువలను క్రింది పట్టికలో రాయండి.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 9
మీరు ఏమి గమనిస్తారు? పొడవు పెరిగిన వెడల్పు తగ్గును లేదా వెడల్పు పెరిగిన, పొడవు తగ్గును (వైశాల్యము స్థిరాంకముగా వున్నపుడు) ఒక దీర్ఘచతురస్ర పొడవు, వెడల్పులు విలోమానుపాతంలో వున్నాయా? (పేజీ నెం. 238)
సాధన.
దీర్ఘచతురస్రంలో పొడవు పెరిగిన, వెడల్పు తగ్గును, వెడల్పు పెరిగిన, పొడవు తగ్గును.
∴ దీర్ఘచతురస్రంలో పొడవు, వెడల్పులు విలోమానుపాతంలో ఉన్నాయి.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 10

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions

ఆలోచించి, చర్చించి వ్రాయండి

1. ప్రతీ మార్పుని మనం అనుపాతంలో వుంది అని చెప్పగలమా? ఒక పుస్తకంలో 100 పేజీలు కలవు. పుస్తకంలో మనము చదివిన పేజీల సంఖ్య, మిగిలిన పేజీల సంఖ్య ఏవిధంగా మారుతాయో గమనించండి. (పేజీ నెం. 239)
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 11
మనం చదివిన పేజీల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉన్నపుడు మిగిలిన పేజీల సంఖ్యలో మార్పు రకంగా వస్తోంది? ఆ రెండు రాశులు విలోమానుపాతంలో వుంటాయా? వివరించండి.
సాధన.
ప్రతి సందర్భంలో చదివిన పేజీల సంఖ్య (x), మిగిలిన పేజీల సంఖ్య (y) కు విలోమానుపాతంలో ఉన్నాయి.
∵ చదివిన పేజీల సంఖ్య పెరిగే కొద్దీ, మిగిలిన పేజీల సంఖ్య తగ్గుతుంది.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు InText Questions 12

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.4

AP SCERT 8th Class Maths Textbook Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.4 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 8th Class Maths Solutions 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు Exercise 10.4

ప్రశ్న 1.
8 మందికి 20 రోజులకు కావలసిన బియ్యము వెల ₹ 480, అయిన 12 మందికి 15 రోజులకు కావలసిన బియ్యము వెల ఎంత?
సాధన.
వ్యక్తుల సంఖ్యకు మరియు ప్రతీరోజు వారికి కావలసిన బియ్యం విలోమానుపాతంలో ఉంటాయి.
వ్యక్తుల సంఖ్య (పనివారి సంఖ్య) ∝ \(\frac {1}{(రోజుల సంఖ్య)}\)

వ్యక్తుల సంఖ్య బియ్యం వెల (రూ.లలో) రోజుల సంఖ్య
8 480 20
12 x 15
8 : 12 480 : x —-(1) 20 : 15

⇒ 8 : 12 మరియు 20 : 15 ల బహుళ నిష్పత్తి
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.4 1
∴ 540 రూపాయలు విలువ చేసే బియ్యం అవసరం.

II వ పద్ధతి :

\(\frac{\mathrm{M}_{1} \mathrm{D}_{1}}{\mathrm{~W}_{1}}=\frac{\mathrm{M}_{2} \mathrm{D}_{2}}{\mathrm{~W}_{2}}\)
M1 = మనుష్యుల సంఖ్య (Men)
D1 = రోజుల సంఖ్య (Days) / గం||లు.
W1 = కట్టిన గోడ పొడవు / వెల / చేసిన పని పరిమాణం
∴ M1 = 8 , M2 = 12
D1 = 20 , D2 = 15
W1 = ₹480 , W2 = ? (x)
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.4 2
⇒ x = 45 × 12 = ₹ 540
∴ కావలసిన బియ్యం వెల = ₹ 540/-

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.4

ప్రశ్న 2.
10 మంది పనివారు 75 కి.మీ. పొడవు గల రోడ్డును 5 రోజులలో వేయగలరు. అదే పనితనము గల 15 మంది పనివారు 45 కి.మీ. పొడవు గల రోడ్డును ఎన్ని రోజులలో వేయగలరు?
సాధన.
\(\frac{\mathrm{M}_{1} \mathrm{D}_{1}}{\mathrm{~W}_{1}}=\frac{\mathrm{M}_{2} \mathrm{D}_{2}}{\mathrm{~W}_{2}}\)
⇒ M1 = 10 , M2 = 15
D1 = 5 , D2 = ?
W1 = 75 , W2 = 45
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.4 3
∴ x = 2
∴ కావలసిన రోజుల సంఖ్య = 2

ప్రశ్న 3.
రోజుకు 8 గంటల వంతున పనిచేస్తూ 24మంది ఒక పనిని 15 రోజులలో చేయగలరు. రోజుకు 9 గంటల వంతున పనిచేస్తూ 20 మంది అదేపనిని ఎన్ని రోజులలో చేస్తారు?
సాధన.
M1D1H1 = M2D2H2
⇒ M1 = 24 , M2 = 20
D1 = 15 రో॥ , D2 = ?
H1 = 8గంటలు , H2 = 9 గం॥లు
⇒ 24 × 15 × 8 = 20 × x × 9
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.4 4
∴ కావలసిన రోజుల సంఖ్య = 16
[మనుషుల సంఖ్య, పని గంటలు విలోమానుపాతంలో ఉంటాయి.]

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.4

ప్రశ్న 4.
175 మంది పనివారు 36 రోజులలో 3150 మీటర్ల పొడవు గల కాలువను త్రవ్వగలరు అయిన 3900 మీటర్ల పొడవు గల కాలువను 24 రోజులలో తప్పుటకు ఎంత మంది పనివారు కావలెను?
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.4 5
∴ కావలసిన పనివారి సంఖ్య = 325

ప్రశ్న 5.
14మంది టైపిస్టు రోజుకు 6 గంటల వంతున పనిచేయుచూ 12 రోజులలో ఒక పుస్తకమును టైప్ చేయగలరు. అయిన అదే పుస్తకమును 4 గురు టైపిస్టు రోజుకు 7 గంటల వంతున పనిచేయుచూ ఎన్ని రోజులలో టైప్ చేయగలరు?
సాధన.
M1D1H1 = M2D2H2
⇒ M1 = 14 : M2 = 4
D1 = 12 , D2 = ?
H1 = 6 , H2 = 7
⇒ 14 × 12 × 6 = 4 × x × 7
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.4 6
⇒ x = 36
∴ కావలసిన రోజుల సంఖ్య = 36
[∵ మనుషుల సంఖ్యకు వారుపనిచేసే పనిగంటలు విలోమానుపాతంలో ఉంటాయి..

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3

AP SCERT 8th Class Maths Textbook Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 8th Class Maths Solutions 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు Exercise 10.3

ప్రశ్న 1.
సిరి వద్ద, కిలో 8 రూపాయల చొప్పున 5 కిలోల బంగాళ దుంపలు కొనుటకు సరిపడ డబ్బులు కలవు. బంగాళదుంపల వెల కిలో 10 రూపాయలకు పెరిగిన ఆమె వద్ద వున్న సొమ్ముతో ఎన్నికిలోలు కొనగలదు?
సాధన.
బంగాళదుంపల ధర పెరిగిన వాటిని కొను డబ్బు విలువ తగ్గును.
∴ అవి విలోమానుపాతంలో ఉంటాయి.
∴ x1y1 = x2y2
⇒ 8 × 5 = 10 × x
⇒ x = \(\frac{8 \times 5}{10}\) = 4 కిలోలు.
∴ ఆమె కిలో బంగాళదుంపలు ₹ 10 చొప్పున 4 కిలోలు కొనగలదు.

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3

ప్రశ్న 2.
ఒక శిబిరంలో 500 మంది వ్యక్తులకు 70 రోజులకు సరిపడు ఆహార ధాన్యాల నిల్వ కలదు. ఆ శిబిరంలో అదనంగా 200 మంది చేరిన ఆ ఆహారధాన్యాల నిల్వ ఎన్ని రోజుల వరకు సరిపోతుంది?
సాధన.
వ్యక్తుల సంఖ్య, వారికి కావలసిన ఆహార పరిమాణం విలోమానుపాతంలో ఉంటాయి.
∴ x1y1 = x2y2
⇒ 500 × 70 = (500 + 200) × x
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3 1
∴ x = 50 రోజులు

ప్రశ్న 3.
36గురు కూలీలు ఒక పనిని 12 రోజులలో చేయగలరు. అయిన అదే పనిని 9గురు కూలీలు ఎన్ని రోజులలో చేయగలరు?
సాధన.
కూలీల సంఖ్య, వారు పనిచేయు రోజుల సంఖ్య విలోమానుపాతంలో కలవు.
∴ x1y1 = x2y2
⇒ 36 × 12 = 9 × x
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3 2
∴ x = 48 రోజులు

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3

ప్రశ్న 4.
ఒక వ్యక్తి సైకిల్ పై 28 కి.మీ. దూరమును 2 గంటలలో చేరును. అతను అదే వేగముతో ప్రయాణించిన 56 కి.మీ. దూరమును ఎంతకాలములో చేరగలడు?
సాధన.
దూరము – కాలము అనులోమానుపాతంలో ఉంటాయి.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3 3
∴ x = 4 గం ||లు

ప్రశ్న 5.
ఒక ఓద గంటకు 16 నాటికల్ మైళ్ళ వేగముతో కొంత దూరమును 10 గంటలలో చేరగలదు. అదే దూరము 8 గంటలలో చేరవలెనన్న ఆ ఓడ ఎంత అధిక వేగముతో ప్రయాణము చేయాలి? సముద్రములపై దూరమునకు ప్రమాణము నాటికల్మై ల్ (1 నాటికల్ మైల్ = 1852 మీటర్లు)
సాధన.
వేగము – దూరం విలోమానుపాతంలో ఉంటాయి.
⇒ x1y1 = x2y2
⇒ 16 × 10 = x × 8
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3 4
∴ ఆదనంగా పెంచాల్సిన ఓడ వేగం
= 20 – 16 = 4
= 4నాటికల్ మైళ్ళు

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3

ప్రశ్న 6.
ఒక ట్యాంకును 5 కుళాయిలు 1\(\frac {1}{2}\) గంటల కాలములో సింపును. అదే ట్యాంకును అర్ధగంటలో నింపవలెనన్న అటువంటి కుళాయిలు ఎన్ని కావలెను?
సాధన.
కుళాయిల సంఖ్య, వాటిని నింపే కాలం విలోమాను పాతంలో ఉంటాయి.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3 5
∴ కావలసిన కుళాయిల సంఖ్య = 15

ప్రశ్న 7.
15 మంది కూలీలు ఒక గోడను 48 గంటలలో కట్టగలరు. అదే గోడను 30 గంటలలోనే కట్టవలెనన్న ఎంతమంది కూలీలు కావలెను?
సాధన.
కూలీల సంఖ్య, కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3 6
∴ కావలసిన కూలీల సంఖ్య = 24

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3

ప్రశ్న 8.
ఒక పాఠశాలలో 45 నిమిషముల కాలవ్యవధితో 8 పీరియడ్లు కలవు. ఒక రోజులో 6 పీరియడ్లు మాత్రమే వుండవలెనన్న ఒక పీరియడు కాలవ్యవధి ఎంత వుండవలెను? (పాఠశాల పనివేళలలో మార్పులేదని భావించుము)
సాధన.
కాలానికి, పీరియడ్ల సంఖ్య విలోమానుపాతంలో ఉంటుంది.
⇒ x1y1 = x2y2
⇒ 45 × 8 = x × 6
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3 7

ప్రశ్న 9.
z అనే రాశి x అనే రాశితో అనులోమానుపాతంలోను, y అనే రాశితో విలోమానుపాతంలోను వుంటుంది. x రాశిలో 12% పెరుగుదల, y రాశిలో 20% తరుగుదల వున్న z రాశిలో వచ్చే పెరుగుదల శాతమును కనుగొనుము.
సాధన.
z ∝ x —————– (1)
z ∝ \(\frac {1}{y}\) ————- (2)
(1), (2) ల నుండి z ∝ \(\frac {x}{y}\)
z = k(\(\frac {x}{y}\))
⇒ k = \(\frac {yz}{x}\)
∴ \(\frac{y_{1} z_{1}}{x_{1}}=\frac{y_{2} z_{2}}{x_{2}}\) —————- (3)
∴ x1 = 100x
x2 = 112x (∵ x లో 12% పెరుగుదల)
y1 = 100y
y2 = 80y (∵ y లో 20% పెరుగుదల)
z1 = 100z z2 = ?
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3 8
⇒ 5z = \(\frac{\mathrm{z}_{2}}{28}\)
⇒ z2 = 140z
∴ z లో పెరుగుదల శాతం = 40%

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3

ప్రశ్న 10.
(x + 1) మంది పనివారు ఒక పనిని (x + 1) రోజులలో చేయగలరు. అయిన అదే పనిని (x + 2) మంది పనివారు ఎన్ని రోజులలో చేయగలరు?
సాధన.
పనివారి సంఖ్య, రోజుల సంఖ్యకు విలోమానుపాతంలో ఉంటుంది.
⇒ x1y1 = x2y2
⇒ (x + 1) (x + 1) = (x + 2) × k
⇒ k = \(\frac{(x+1)(x+1)}{(x+2)}\)
∴ k = \(\frac{(x+1)^{2}}{(x+2)}\) రోజులు

ప్రశ్న 11.
ఒక దీర్ఘచతురస్రము చుట్టుకొలత 24 మీ. దాని చుట్టుకొలతను మార్పుచేయకుండా పొడవును 1 మీ. పెంచినపుడు, దాని వెడల్పు మరియు వైశాల్యములలో మార్పు వచ్చును. క్రింది పట్టికను నింపి ఆ విలువల ఆధారంగా వెడల్పు, వైశాల్యముల విలువలు పొడవు విలువ మార్పు మీద ఏవిధంగా ఆధారపడతాయో గమనించుము. మీరు ఏమి గమనించారు? మీ పరిశీలనను నోట్ పుస్తకములో వ్రాయండి.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3 9
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.3 10

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2

AP SCERT 8th Class Maths Textbook Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 8th Class Maths Solutions 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు Exercise 10.2

ప్రశ్న 1.
క్రింది పట్టికలను పరిశీలించండి. ఏ పట్టికలోని చరరాశులు x, y లు విలోమానుపాతంలో వున్నాయో కనుగొనండి.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2 1
సాధన.
(i)
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2 2
పై పట్టిక నుండి x విలువ తగ్గుతుంటే y విలువ పెరుగుతుంది.
∴ x, yలు విలోమానుపాతంలో కలవు.

(ii)
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2 3
పై పట్టిక నుండి x విలువ పెరుగుతూ ఉంటే y విలువ తగ్గుతూ ఉంది.
∴ x, y లు విలోమానుపాతంలో కలవు.

(iii)
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2 4
∴ x విలువ తగ్గుతూ ఉంటే, y విలువ పెరుగుతూ ఉంది. కావున x, y లు విలోమానుపాతంలో కలవు.

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2

ప్రశ్న 2.
ఒక పాఠశాల వారు పుస్తకాలను కొనడానికి ₹ 6000 ఖర్చు పెట్టదలిచినారు. ఈ సమాచారాన్ని వుపయోగించుకొంటూ క్రింది పట్టికను నింపండి.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2 5
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2 6

AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2

ప్రశ్న 3.
ఒక గళ్ళ కాగితాన్ని తీసుకోండి. 48 చదరపు గడులను క్రింద చూపినట్లు వివిధ వరుసలలో అమర్చండి.
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2 7
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2 8
మీరు ఏమి గమనిస్తారు? R విలువ పెరిగితే, C విలువ తగ్గుతుంది.
(i) R1 : R2 = C2 : C1 అవుతుందా?
(ii) R3 : R4 = C4 : C3 అవుతుందా?
(iii) R మరియు C లు ఒకదానికొకటి విలోమానుపాతంలో వున్నాయా?
(iv) ఇదే కృత్యాన్ని గళ్ళ కాగితంపై 36 చదరపు గడులను తీసుకొని చేయండి.
సాధన.
(i) R1 : R2 = C2 : C1
⇒ 2 : 3 = 16 : 24
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2 9
∴ R1 : R2 = C2 : C1

(ii) R3 : R4 = C4 : C3
⇒ 4 : 6 = 8 : 12
⇒ \(\frac{4}{6}=\frac{8}{12}=\frac{4 \times 2}{6 \times 2}=\frac{4}{6} \Rightarrow \frac{4}{6}=\frac{4}{6}\)
∴ R3 : R4 = C4 : C3

(iii) ∴ R, C లు ఒకదానికొకటి విలోమానుపాతంలో కలవు.
∵ అడ్డువరుసలు పెరిగితే నిలువు వరుసలు తగ్గును.
నిలువు వరుసలు పెరిగితే అడ్డు వరుసలు తగ్గును.

(iv) గళ్ళ కాగితంపై 36 చదరపు గడులను తీసుకొనిన
AP Board 8th Class Maths Solutions Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు Ex 10.2 10
పై పట్టిక నుండి R విలువ పెరిగే కొద్దీ, C విలువ తగ్గును.