These AP 6th Class Telugu Important Questions 7th Lesson మమకారం will help students prepare well for the exams.
AP State Syllabus 6th Class Telugu 7th Lesson Important Questions and Answers మమకారం
6th Class Telugu 7th Lesson మమకారం Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత గద్యాలు
1. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మన భాష అన్నది మన సంస్కృతికీ, మన జీవన విధానానికి ప్రతీక అని నా నిశ్చితాభిప్రాయం. మేము పిల్లల్లో ‘అమ్మనాన్న’లనే పిలిపించుకుంటున్నాం. అది నా సంస్కృతిగా, నా జీవన విధానంగా భావిస్తాను. నా తండ్రిని నేను ‘నాన్నా’ అంటూ పిలిచినపుడు; ఆయనకు కలిగిన ఆనందం, వాత్సల్యం – ఈ పొద్దు నా పిల్లలు నన్ను ‘నాన్నా’ అని పిలిచినపుడు నాకు కలగాలి. చదువుకోసం, ఉద్యోగం కోసం ఇంగ్లీషు అవసరమైతే నేర్చుకుంటాం, అంతేకానీ వాళ్ళ ఆచార వ్యవహారాలూ, వాళ్ళ జీవనశైలీ మనకు అనవసరం అన్నది నా వాదన.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) భాష దేనికి ప్రతీక?
 జవాబు:
 భాష సంస్కృతికి, జీవన విధానానికి ప్రతీక.
ఆ) రచయిత తన తండ్రిని ఏమని పిలుస్తాడు?
 జవాబు:
 రచయిత తన తండ్రిని ‘నాన్నా’ అని పిలుస్తాడు.
ఇ) ‘నాన్నా’ అని పిలిస్తే ఏమి కలుగుతాయి?
 జవాబు:
 ‘నాన్నా’ అని పిలిస్తే ఆనందం, వాత్సల్యం కలుగుతాయి.
ఈ) ఇంగ్లీషు ఎందుకు నేర్చుకోవాలి?
 జవాబు:
 ఇంగ్లీషు చదువు కోసం, ఉద్యోగం కోసం నేర్చు కోవాలి.

2. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎందుకో గాని సత్యం గుర్తుకురాగానే వెంటనే ఇంగ్లీషే జ్ఞాపకానికి వస్తుంది. అతను గుంటూరు, ఆంధ్ర క్రిష్టియన్ కాలేజీలో బి.ఏ., చదివాడు. దాంతో అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడ్డం అలవడింది. ఇంక అతను పెళ్ళి చేసుకున్న అమ్మాయి బెంగుళూరులో ఇంగ్లీషు దొరసానుల పెంపకంలో చదువుకున్న మలయాళ స్త్రీ. ఇంక ఆ ఇంట్లో తెలుగు పలుకుకు చోటు’ ఎక్కడుంటుంది? ఆంధ్రదేశంలో ఇంగ్లీషు మాట్లాడే కుటుంబాన్ని చూడాలన్న ఉబలాటం బయల్దేరింది నాలో.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) రచయితకు సత్యం గుర్తుకు రాగానే ఏది గుర్తుకు వచ్చింది?
 జవాబు:
 రచయితకు సత్యం గుర్తుకురాగానే ఇంగ్లీషు జ్ఞాపకం వచ్చింది.
ఆ) సత్యం ఎక్కడ చదువుకున్నాడు?
 జవాబు:
 సత్యం గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాడు.
ఇ) సత్యం భార్య ఏ భాషకు చెందినది?
 జవాబు:
 సత్యం భార్య మలయాళ భాషకు చెందినది.
ఈ) రచయితకు గల ఉబలాటం ఏది?
 జవాబు:
 ఆంధ్రదేశంలో ఇంగ్లీషు మాట్లాడే కుటుంబాన్ని చూడాలని రచయిత ఉబలాటం.
3. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
“నాకు తెలుసు నువ్వు రాజు మామవని.. పొద్దున్న నాన్న ఆల్బంలో నీ ఫోటో చూపించి, నువ్వు అనంతపురం నించి ఇక్కడికి వచ్చినావని చెప్పినాడు” అన్నాడు నవ్వు మొగంతో. తొణుకూ బెణుకూ లేకుండా వాడు అట్లా మట్లాడుతూ ఉంటే నాకు ఒకటే ఆశ్చర్యం. అంతకన్నా ఆశ్చర్యం, కేవలం మిత్రుడిని మాత్రమే అయిన నన్ను ‘మామ’ ను చేయడం. వాళ్ళ పేర్లు అడిగాను చెరో బిస్కెట్టు పేకెట్ అందిస్తూ. ‘ పెద్దాడు బుజ్జీ అనీ, చిన్నోడు చిన్న అనీ చెప్పారు.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) పిల్లలు రచయితను ఎలా గుర్తుపట్టారు?
 జవాబు:
 పిల్లలు తమ నాన్న ఆల్బంలో చూపిన ఫోటో చూడడం వల్ల రచయితను గుర్తుపట్టారు.
ఆ) పిల్లలు రచయితను ఏమని సంబోధించారు?
 జవాబు:
 పిల్లలు రచయితను ‘మామా’ అని సంబోధించారు.
ఇ) పిల్లల పేర్లు ఏవి?
 జవాబు:
 పిల్లల పేర్లు బుజ్జి, చిన్న.
ఈ) రచయిత పిల్లలకు ఏమి బహూకరించాడు?
 జవాబు:
 రచయిత పిల్లలకు చెరొక బిస్కెట్టు ప్యాకెట్ బహూకరించాడు.
అపరిచిత గద్యాలు
1. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మనకు విలువలు లేకపోయినా, భాషకు విలువలు లేకపోయినా జాతికి దుర్గతి తప్పదు. అచ్చ తెలుగు మాట్లాడటానికి ప్రజలు పండితులు కానక్కరలేదు. విద్యావంతులు కానక్కరలేదు. మనిషి పుట్టినప్పటి నుండి పెరిగే కొద్దీ మాతృభాషను తనకు తానే నేర్చుకుంటాడు. భాష సంస్కారపు పొలిమేరలు దాటకూడదు.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) ఎవరికి విలువలు లేకపోతే జాతికి దుర్గతి పడుతుంది?
 జవాబు:
 మనకు, భాషకు విలువలు లేకపోతే జాతికి దుర్గతి పడుతుంది.
ఆ) అచ్చ తెలుగు మాట్లాడాలంటే ఎవరు కానక్కరలేదు?
 జవాబు:
 అచ్చ తెలుగు మాట్లాడటానికి పండితులు, విద్యావంతులు కానక్కరలేదు.
ఇ) మనిషి దేనిని తనకు తానే నేర్చుకుంటాడు?
 జవాబు:
 మనిషి మాతృభాషను తనకు తానే నేర్చుకుంటాడు.
ఈ) భాష దేనిని దాటకూడదు?
 జవాబు:
 భాష సంస్కారపు పొలిమేరలు దాటకూడదు.

2. కింది అపరిచిత గద్యాన్ని చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మన రాష్ట్రంలో ప్రవహించే నదులలో గోదావరి, కృష్ణ ముఖ్యమైనవి. కృష్ణానదీ తీరంలో శ్రీశైలం, విజయవాడ వంటి పుణ్యక్షేత్రాలు, నాగార్జునసాగర్, అమరావతి వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. గోదావరీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు, రాజమండ్రి వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో గోదావరి 770 కిలోమీటర్లు, కృష్ణానది. 720 కిలోమీటర్లు ప్రవహిస్తాయి.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నదులు ఏవి?
 జవాబు:
 మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ.
ఆ) కృష్ణానదీ తీరంలోని పుణ్యక్షేత్రాలు ఏవి?
 జవాబు:
 కృష్ణానదీ తీరంలో శ్రీశైలం, విజయవాడ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
ఇ) గోదావరీ తీరంలో ఏ చారిత్రక ప్రదేశం ఉంది?
 జవాబు:
 గోదావరి నదీ తీరంలో రాజమండ్రి అనే చారిత్రక ప్రదేశం ఉంది.
ఈ) తెలుగు రాష్ట్రాలలో గోదావరి, కృష్ణ ఎంతదూరం ప్రవహిస్తాయి?
 జవాబు:
 తెలుగు రాష్ట్రాలలో గోదావరి 770 కిలోమీటర్లు, కృష్ణ 720 కిలోమీటర్లు ప్రవహిస్తాయి.
3. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
చిన్నారుల ఆకలి మంటలూ, రైతుల ఆకలి చావులతో ఒకప్పుడు వణికిపోయిన నేల ఇప్పుడు పంట పొలాలతో సుభిక్షంగా వర్ధిల్లుతోంది. రోజుకి ఒక్కసారైనా నాలుగువేళ్ళూ నోట్లోకి వెళ్తే చాలనుకున్న కుటుంబాలు, ఇప్పుడు నాలుగు రాష్ట్రాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. త్రాగడానికి గుక్కెడు నీళ్ళు లేక అల్లాడిన 51 గ్రామాలు ఆ రాష్ట్రానికి నీటి సంరక్షణ పాఠాలు చెబుతున్నాయి. ఈ విషయాలన్నీ ఈ ఏడాది పద్మశ్రీ అందుకున్న సైమన్ ఒరేన్ అనే శ్రామికుడి కష్టానికి దక్కిన ఫలితమే.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) ఇపుడు పంటపొలాలతో సుభిక్షంగా ఉన్న నేల ఒకప్పుడు ఎలా ఉండేది?
 జవాబు:
 చిన్నారుల ఆకలి మంటలతో, రైతుల ఆకలి చావులతో వణికిపోయేది
ఆ) రోజుకి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తే చాలనుకున్న కుటుంబాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి?
 జవాబు:
 తమ ఉత్పత్తులను నాలుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాయి.
ఇ) త్రాగడానికి నీళ్ళు లేక అల్లాడిన 51 గ్రామాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి?
 జవాబు:
 ఆ రాష్ట్రానికి నీటి సంరక్షణ పాఠాలు చెబుతున్నాయి.
ఈ) ఈ విజయాలన్నిటికి ఎవరు కారణం?
 జవాబు:
 ఈ విషయాలన్నింటికి కారణం ఈ ఏడాది పద్మశ్రీ అందుకున్న సైమన్ ఒరేన్ అనే శ్రామికుడు.
4. కింది ప్రకటన చూడండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
 
 ప్రశ్నలు – జవాబులు:
 అ) వస్త్ర దుకాణం పేరేమిటి?
 జవాబు:
 వస్త్ర దుకాణం పేరు శ్రీరస్తు.
ఆ) శ్రీరస్తు దేనికి ప్రత్యేకం?
 జవాబు:
 పెళ్లిబట్టలకు ప్రత్యేకం.
ఇ) శ్రీరస్తు ఎక్కడ ఉంది?
 జవాబు:
 శ్రీరస్తు రాజమండ్రిలో ఉంది.
ఈ) పై ప్రకటన ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
 జవాబు:
 పై ప్రకటనను ఎవరు విడుదల చేశారు?
5. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
వాగ్రూప భాష అంటే మాట్లాడే భాష. మాట్లాడే భాష వలన చాలా ప్రయోజనాలున్నాయి. అసలు భాష యొక్క మొదటి ప్రయోజనం మాట్లాడడమే. దీని వలన మన భావాలు వ్యక్తపరచవచ్చు. ఇతరుల’ భావాలను గ్రహించవచ్చు. మన మాటలలో లోకోక్తులు, జాతీయాలు, సామెతలు, చేర్చినందు వలన గౌరవం పెరుగుతుంది. హాస్యం, చమత్కారం చేరిస్తే ఎదుటివారిని వశం చేసుకోవచ్చును. ”నోరు మంచిదైతే ఊరు. మంచిదౌతుంది’ అన్నట్లు చక్కని భాషనుపయోగించి మాట్లాడితే దేనినైనా సాధించవచ్చు.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) వాగ్రూప భాష అంటే ఏమిటి?
 జవాబు:
 వాగ్రూప భాష అంటే మాట్లాడే భాష,
ఆ) మన మాటలకు దేని వలన గౌరవం పెరుగుతుంది?
 జవాబు:
 మన మాటలలో లోకోక్తులు, జాతీయాలు, సామెతలు చేర్చడం వలన గౌరవం పెరుగుతుంది.
ఇ) మాట్లాడే భాష వలన ప్రయోజనమేమి?
 జవాబు:
 భాష వలన మన భావాలు వ్యక్తపరచవచ్చు. ఇతరుల భావాలను గ్రహించవచ్చు.
ఈ) పై పేరాలో ఉన్న సామెతను గుర్తించండి.
 జవాబు:
 పై పేరాలో ఉన్న సామెత “నోరు మంచిదైతే ఊరు మంచి దౌతుంది”.

6. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
లేఖ రాయడానికి కొన్ని నియమాలు పాటించాలి. కుడిచేతి వైపు కాగితం పైన ఊరి పేరు రాయాలి. పక్కన కామా పెట్టాలి. దాని కింద తేదీ వేయాలి. పక్కన చుక్క పెట్టాలి. దానికింద వరుసలో ఎడమవైపున కాగితం మొదట సంబోధన రాయాలి. పెద్దవారికి పూజ్యులని, చిన్నవారికి, మిత్రులకు ప్రియమైన అని రాయాలి. ప్రక్కన వారితో వరుస (అన్న, అక్క, రాణి ….. మొ||వి) రాయాలి.
విషయం రాయాలి. కింద ఎడమవైపు ‘ఇట్లు’ రాసి, బంధుత్వం రాసి, సంతకం చేయాలి. ఎవరికి రాస్తున్నామో వారి చిరునామా ఎడమవైపు రాయాలి.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) ఇట్లు, అని రాసిన తర్వాత ఏం రాయాలి?
 జవాబు:
 ఇట్లు, అని రాసిన తర్వాత బంధుత్వం రాయాలి.
ఆ) పూజ్యులు అని ఎవరికి రాయాలి?
 జవాబు:
 పెద్దవారికి పూజ్యులు అని రాయాలి.
ఇ) చిరునామా ఎక్కడ రాయాలి?
 జవాబు:
 లేఖ చివర ఎడమవైపున చిరునామా రాయాలి.
ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న రాయండి.
 జవాబు:
 పై పేరాలో దేని గురించి చెప్పారు?
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
 రచయిత దేనిని భరించలేకపోయాడు? ఎందుకు?
 జవాబు:
 రచయిత ఒక ఆదివారం ఉదయం తన అత్తవారింటికి బళ్ళారి వెళ్ళాడు. అక్కడ తన భార్య సీత చెల్లెళ్ళు, వాళ్ళ భర్తలు, పిల్లలు, సీత తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు, పిల్లలు ఉన్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. కానీ అక్కడున్న పిల్లల్లో రచయితకు ఒక కొత్త వాతావరణం కనిపించింది. వాళ్ళు చిన్నాయన, పిన్ని, మామ, అత్త అని ఎవరినీ పిలవటం లేదు. ఆంటీ, అంకుల్ అని పిలుస్తున్నారు. వాళ్లు తన మరదళ్ళ పిల్లలు. రచయితకు ఆ పిలుపులు రుచించలేదు. వాళ్ళలా పిలవడాన్ని భరించలేకపోయాడు.

ప్రశ్న 2.
 రచయితకు ఆయన భార్య ఎందుకు వార్నింగ్ ఇచ్చింది?
 జవాబు:
 రచయిత తన మరదళ్ళ పిల్లలు ఆంటీ, అంకుల్ అని పిలవటాన్ని భరించలేకపోయాడు. చక్కగా తెలుగులో వరసలు పెట్టి పిలిస్తే బాగుంటుందనుకున్నాడు. అదే విషయాన్ని ఒక రోజు సాయంత్రం వరండాలో కూర్చుని కాఫీలు తాగుతున్న సమయంలో తన మరదళ్ళకు చెప్పాడు. వాళ్ళు మొహాలు మాడ్చుకున్నారు. అనంతపురం వచ్చాక రచయిత భార్య సీత తన చెల్లెళ్ళు బాధపడిన విషయాన్ని రచయితకు చెప్పింది. రచయితతో మాట్లాడాలంటేనే ‘ తన చెల్లెళ్ళు భయపడుతున్నారని చెప్పింది. ఇంకెప్పుడూ వాళ్ళనేమీ అనవద్దని వార్నింగ్ ఇచ్చింది.
ప్రశ్న 3.
 సత్యం కుటుంబం గురించి వ్రాయండి.
 జవాబు:
 సత్యానికి ఇద్దరు మగపిల్లలు, భార్య. సత్యం అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. అతని భార్యది బెంగుళూరు. ఆమె ఇంగ్లీష్ దొరసానుల పెంపకంలో పెరిగింది. ఇంగ్లీష్ భాషను నేర్చుకుంది…ఆమె మలయాళ స్త్రీ. కానీ ఆ ఇంట్లో ఆయన పిల్లలు చక్కటి తెలుగులో వరసలు పెట్టి పిలుస్తూ మాట్లాడతారు. సత్యం, ఆయన భార్య ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. వాళ్ళిద్దరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు.
ప్రశ్న 4.
 మమకారం పాఠం ఎవరు రచించారు? ఆయన గురించి వ్రాయండి.
 జవాబు:
 మమకారం పాఠాన్ని చిలుకూరి దేవపుత్రగారు రచించారు. ఆయన రచించిన ‘ఆరు గ్లాసులు’ అనే కథా సంపుటిలోని కథ ఇది. ఆయన అనంతపురం జిల్లా కాల్వపల్లెలో 24-04-1952న జన్మించారు. ఆయన 18-10-2016 వరకూ జీవించారు. ఆయన రచించిన పంచమం నవలకు ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) వారి బహుమతి లభించింది. ఆయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారి ధర్మనిధి పురస్కారం, చా.సో. స్ఫూర్తి సాహితీ సత్కారం, గుర్రం జాషువా పురస్కారం అందుకున్నారు. ఆయన ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ మొదలైన కథాసంపుటాలు, రెండు నవలలు రచించారు.
ప్రశ్న 5.
 కింది కవితను పొడిగించండి.
 మా తల్లి తెలుగుతల్లి
 అనురాగాల కల్పవల్లి ……….
 జవాబు:
 మా తల్లి తెలుగు తల్లి
 అనురాగాల కల్పవల్లి
 పాడిపంటలతో విలసిల్లి
 సిరిసంపదలతో భాసిల్లి
 అయ్యింది భరతమాతకు పెద్ద చెల్లి

ప్రశ్న 6.
 తెలుగుతల్లి ఏకపాత్రాభినయం రాయండి.
 జవాబు:
తెలుగుతల్లి
పిల్లలూ ! నేనర్రా తెలుగు తల్లిని. అంటే మీరు మాట్లాడే తెలుగుభాషను. ఎందుకర్రా ! ఈ మధ్య అమ్మా నాన్నలను మమ్మీ డాడీ అంటున్నారు. చక్కగా అమ్మా నాన్న అంటే ఎంత ముద్దుగా ఉంటుంది. ఆంటీ, అంకుల్ కూడా బాగోవు. చక్కగా మామయ్యా”అత్తా, పిన్నీ-బాబాయి అని పిలపండి. ఆంగ్లం నేర్చుకోండి. వద్దనడంలేదు. అమ్మ లాంటి తెలుగుభాషను మరిచిపోకండి. మీ తెలుగు ఉపాధ్యాయులు చూడండి. తెలుగును ఎంత చక్కగా మాట్లాడతారో ! మీరు కూడా అలా స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోండి. మీ తాతగారిని అడగండి. ఎన్నో కథలు చెబుతారు. పద్యాలు చెబుతారు. మీ మామ్మగారు చక్కటి పాటలు పాడతారు. నేర్పుతారు. నేర్చుకోండి. ఈసారి మంచికథ చెబుతానేం, మళ్ళీ కలుద్దాం.
III. భాషాంశాలు
1. పర్యాయపదాలు :
సీత = జానకి, మైథిలి
 చెల్లెలు = సహోదరి, సోదరి
 తమ్ముడు = సోదరుడు, సహోదరుడు
 ఏడుపు = రోదన, ఆక్రందనము
 అమ్మ = తల్లి, జనని
 మిత్రుడు = స్నేహితుడు, చెలికాడు
 బట్టలు = వస్త్రాలు, ఉడుపులు
 పల్లె = జనపదం, గ్రామం
 మొగం = ముఖం, వదనం
 మమకారం = ప్రేమ, అనురాగం
 ఆదివారం = భానువారం, రవివారం
 భర్త = పెనిమిటి, మగడు
 భార్య = పత్ని, సతి
 స్వర్గం = నాకము, దివి
 నాన్న = తండ్రి, పిత
 కొడుకు = సుతుడు, తనయుడు
 ఆశ్చర్యం = వింత, విస్మయం
 సమాధానం = జవాబు, ఉత్తరం
 కరము = చెయ్యి, హస్తము
 నీరు = జలం, ఉదకం

2. వ్యతిరేకపదాలు:
ఎండ వాన
 సరసం × విరసం
 చిన్న × పెద్ద
 అవసరం × అనవసరం
 ప్రత్యక్షం × పరోక్షం
 ముందుకు × వెనుకకు
 రాజు × బంటు
 వెనుక × ముందు
 దగ్గర × దూరం
 పిల్లలు × పెద్దలు
 స్వర్గం × నరకం
 అర్థం × అనర్థం
 ఆచారం × అనాచారం
 రమ్మనడం × పొమ్మనడం
 కాదు × ఔను
 లోపల × బైట
 శబ్దం × నిశ్శబ్దం
3. ప్రకృతి – వికృతులు:
భాష – బాస
 సంతోషం – సంతసం
 ఆశ్చర్యం – అచ్చెరువు
 శబ్దం – సద్దు
 విధము – వితము
 ప్రశ్న – పన్నము
 ప్రజ – పజ
4. సంధులు:
సెలవులకు + అని = సెలవులకని – (ఉత్వ సంధి)
 పిల్లలు + ఇద్దరు = పిల్లలిద్దరు – (ఉత్వ సంధి)
 సెలవులు + అన్న = సెలవులన్న – (ఉత్వ సంధి)
 తమ్ముళ్లు + ఇద్దరూ = తమ్ముళ్లరూ – (ఉత్వ సంధి)
 అర్థము + అయింది = అర్థమయింది – (ఉత్వ సంధి)
 లేవు + అని = లేవని – (ఉత్వ సంధి)
 అవసరము + ఐతే = అవసరమైతే – (ఉత్వ సంధి)
 రమ్ము + అన్నాడు = రమ్మన్నాడు – (ఉత్వ సంధి)
 వివరము + అడిగాను = వివరమడిగాను – (ఉత్వ సంధి)
 కలుస్తాను + అని = కలుస్తానని – (ఉత్వ సంధి)
 చిన్నవాడు + అయి = చిన్నవాడయి – (ఉత్వ సంధి)
 ఎవరు + అనుకుంటున్నాడో = ఎవరనుకుంటున్నాడో – (ఉత్వ సంధి)
 నువ్వు + అనుకొంటున్న = నువ్వనుకొంటున్న – (ఉత్వ సంధి)
 మామవు + అని = మామవని – (ఉత్వ సంధి)
 మేము + ఇద్దరం = మేమిద్దరం – (ఉత్వ సంధి)
 రకరకాలు + అయిన = రకరకాలయిన – (ఉత్వ సంధి)
 సమాధానము + ఇస్తూ = సమాధానమిస్తూ – (ఉత్వ సంధి)
 ముద్దు + ఆడాను = ముద్దాడాను – (ఉత్వ సంధి)
 మరి + ఒక = మరొక – (ఇత్వ సంధి)
 అది + ఏమిటి + ఆ = అదేమిటా – (ఇత్వ సంధి)
 మమ్మల్ని + అందర్నీ = మమ్మల్నందర్నీ – (ఇత్వ సంధి)
 మాట్లాడాలి + అంటే = మాట్లాడాలంటే – (ఇత్వ సంధి)
 సంతోషాన్ని + ఇస్తుంది = సంతోషాన్నిస్తుంది – (ఇత్వ సంధి)
 ఇస్తుంది + అని =ఇస్తుందని – (ఇత్వ సంధి)
 చూడాలి + అన్న = చూడాలన్న – (ఇత్వ సంధి)
 పూర్తి + అవదు = పూర్తవదు – (ఇత్వ సంధి)
 చేయాలి + అంటే = చేయాలంటే – (ఇత్వ సంధి)
 ఏమి + అనకు = ఏమనకు – (ఇత్వ సంధి)
 ఎక్కడ + అయితే = ఎక్కడయితే – (అత్వ సంధి)
 అక్కడ + ఉన్న = అక్కడున్న – (అత్వ సంధి)
 చిన్న + ఆయన = చిన్నాయన – (అత్వ సంధి)
 ఎట్లాగ + అంటే = ఎట్లాగంటే – (అత్వ సంధి)
 పిలిచిన + అపుడు = పిలిచినపుడు – (అత్వ సంధి)
 ఉన్న + అట్లు = ఉన్నట్లు – (అత్వ సంధి)
 ఎక్కడ + ఉంటుంది = ఎక్కడుంటుంది – (అత్వ సంధి)
 ఇంక + ఎప్పుడూ = ఇంకెప్పుడూ – (అత్వ సంధి)
 వాత + ఆవరణం = వాతావరణం – (సవర్ణదీర్ఘ సంధి)
 ఆప్యాయత + అనురాగాలు = ఆప్యాయతానురాగాలు – (సవర్ణదీర్ఘ సంధి)
 నిశ్చిత + అభిప్రాయం = నిశ్చితాభిప్రాయం – (సవర్ణదీర్ఘ సంధి)

5. సమాసాలు
| సమాస పదం | విగ్రహవాక్యం | సమాస నామం | 
| వదినా మరదళ్లు | వదినయును, మరదలును | ద్వంద్వ సమాసం | 
| ఆప్యాయతానురాగాలు | ఆప్యాయతయును, అనురాగమును | ద్వంద్వ సమాసం | 
| బావామరుదులు | బావయును, మరిదియును | ద్వంద్వ సమాసం | 
| అమ్మానాన్నలు | అమ్మయును, నాన్నయును | ద్వంద్వ సమాసం | 
6. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
1. కొంతమంది అనర్గళంగా మాట్లాడతారు.
 జవాబు:
 అనర్గళంగా = ధారాళంగా
 తెలుగులో ధారాళంగా మాట్లాడడం నేర్చుకోవాలి.
2. తల్లి ప్రేమకు తుల్యం ఏదీకాదు.
 జవాబు:
 తుల్యం = సమానం
 అమ్మానాన్నలు దేవతలతో సమానం.
3. అహింసకు ప్రతీకగా భారత్ నిలిచింది.
 జవాబు:
 ప్రతీక = గుర్తు
 వాడు మంచితనానికి గుర్తు అనేలా జీవించాలి.
7. కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.
| 1. భాష | అ) అచ్చెరువు | 
| 2. ఆశ్చర్యం | ఆ) పండుగ | 
| 3. పర్వము | ఇ) బాస | 
జవాబు:
| 1. భాష | ఇ) బాస | 
| 2. ఆశ్చర్యం | అ) అచ్చెరువు | 
| 3. పర్వము | ఆ) పండుగ | 
8. కింది వ్యతిరేక పదాలను జతపరచండి.
| 1. శబ్దం | అ) ఔను | 
| 2. కాదు | ఆ) నిశ్శబ్దం | 
| 3. సరసం | ఇ) విరసం | 
జవాబు:
| 1. శబ్దం | ఆ) నిశ్శబ్దం | 
| 2. కాదు | అ) ఔను | 
| 3. సరసం | ఇ) విరసం | 
9. కింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
1. ఆమె పాట పాడుతూ నడుస్తోంది.
 జవాబు:
 ఆమె పాట పాడుతోంది. ఆమె నడుస్తోంది.
2. వర్షం వచ్చి బట్టలు తడిపింది.
 జవాబు:
 వర్షం వచ్చింది. వర్షం బట్టలు తడిపింది.
3. బస్సు వచ్చి దుమ్ము లేపింది.
 జవాబు:
 బస్సు వచ్చింది. బస్సు దుమ్ము లేపింది.
కింద గీత గీసిన వానికి సరైన జవాబులను గుర్తించి, బ్రాకెట్లలో రాయండి.
1. తల్లి ప్రేమకు ఏదీ తుల్యం కాదు. (అర్థం గుర్తించండి)
 అ) సమాసం
 ఆ) పోలిక
 ఇ) పోటీ
 జవాబు:
 అ) సమాసం
2. కొందరికి తొందరగా డబ్బు సంపాదించాలనే ఉబలాటం ఎక్కువ. (అర్థం గుర్తించండి)
 అ) దురాశ
 ఆ) ప్రయత్నం
 ఇ) ఆత్రుత
 జవాబు:
 ఇ) ఆత్రుత

3. మునుపు అందరూ స్నేహంగా ఉండేవారు. (అర్థం గుర్తించండి)
 అ) మొన్న
 ఆ) పూర్వం
 ఇ) భవిష్యత్తు
 జవాబు:
 ఆ) పూర్వం
4. సీత మహా పతివ్రత. (పర్యాయపదాలు గుర్తించండి).
 అ) జానకి, మైథిలి
 ఆ) జనని, తల్లి
 ఇ) అమ్మ, మాత
 జవాబు:
 అ) జానకి, మైథిలి
5. రాముని భార్య సీతమ్మ. (పర్యాయపదాలు గుర్తించండి)
 అ) సఖి, చెలికత్తె
 ఆ) పత్ని, సతి
 ఇ) ప్రాణం, అశువు
 జవాబు:
 ఆ) పత్ని, సతి
6. నాన్న చెప్పినట్లు వినాలి. (పర్యాయపదాలు గుర్తించండి)
 అ) అమ్మ, నాన్న
 ఆ) జనకుడు, జన్యుడు
 ఇ) తండ్రి, పిత
 జవాబు:
 అ) అమ్మ, నాన్న
7. అర్థం లేకుండా మాట్లాడకు. (వ్యతిరేకపదం గుర్తించండి)
 అ) అనర్థం
 ఆ) భావం
 ఇ) శబ్దం
 జవాబు:
 అ) అనర్థం
8. ఆచారం విడువకు. (వ్యతిరేకపదం గుర్తించండి)
 అ) దురాచారం
 ఆ) సదాచారం
 ఇ) అనాచారం
 జవాబు:
 ఇ) అనాచారం
9. దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. (వ్యతిరేకపదం గుర్తించండి)
 అ) అధ్యక్షుడు
 ఆ) పరోక్షం
 ఇ) నిరీక్షణ
 జవాబు:
 ఆ) పరోక్షం

10. ప్రశ్న వేయడమే కష్టం. (వికృతిని గుర్తించండి)
 అ) పన్నము
 ఆ) పరిప్రశ్న
 ఇ) సరిప్రశ్న
 జవాబు:
 అ) పన్నము
11. శబ్దం చేయవద్దు. (వికృతిని గుర్తించండి)
 అ) శబదం
 ఆ) శపథం
 ఇ) సద్దు
 జవాబు:
 ఇ) సద్దు
12. ఏ విధముగా చూసినా యుద్ధం మంచిదికాదు. (వికృతిని గుర్తించండి)
 అ) విధానం
 ఆ) వితము
 ఇ) పద్ధతి
 జవాబు:
 ఆ) వితము
13. సెలవులకని మా ఊరు వెళ్లాను. ‘(సంధి పేరు గుర్తించండి)
 అ) ఉత్వ సంధి
 ఆ) ఇత్వ సంధి
 ఇ) అత్వ సంధి
 జవాబు:
 అ) ఉత్వ సంధి
14. లేవని అనకూడదు. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
 అ) లేవు + అని
 ఆ) లేవ + అని
 ఇ) లేవ + ని
 జవాబు:
 అ) లేవు + అని
15. మామవు + అని (సంధి కలిసిన రూపం గుర్తించండి)
 అ) మామవేన
 ఆ) మామవుని
 ఇ) మామవని
 జవాబు:
 ఇ) మామవని
16. మమ్మల్నందర్నీ రమ్మన్నారు. (సంధి పేరు గుర్తించండి)
 అ) ఉత్వ సంధి
 ఆ) ఇత్వ సంధి
 ఇ) అత్వ సంధి
 జవాబు:
 ఆ) ఇత్వ సంధి
17. అమ్మను చూడాలన్న కోరిక ఎక్కువైంది. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
 అ) చూడాలి + అన్న
 ఆ) చూడాల + అన్న
 ఇ) చూడా + లన్న
 జవాబు:
 అ) చూడాలి + అన్న
18. పూర్తి + అవదు – (సంధి కలిపిన రూపం గుర్తించండి)
 అ) పూర్తవదు
 ఆ) పూర్తిగా అవదు
 ఇ) పూర్తవదు
 జవాబు:
 ఇ) పూర్తవదు
19. పిలిచినపుడు రావాలి. (సంధి పేరు గుర్తించండి)
 అ) అత్వ సంధి
 ఆ) ఇత్వ సంధి
 ఇ) ఉత్వ సంధి
 జవాబు:
 అ) అత్వ సంధి
20. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
 అ) ఉన్న + ఇట్లు
 ఆ) ఉన్న + అట్లు
 ఇ) ఉన్న + ఎట్లు
 జవాబు:
 ఆ) ఉన్న + అట్లు

21. ఎక్కడ + ఉంటుంది (సంధి కలిపిన రూపం గుర్తించండి)
 అ) ఎక్కడో ఉంటుంది
 ఆ) ఎక్కడ ఉంటుంది
 ఇ) ఎక్కడుంటుంది
 జవాబు:
 ఇ) ఎక్కడుంటుంది
22. అక్కడయున్నది ఇలా తేవాలి. (సంధి పేరు గుర్తించండి)
 అ) అత్వ సంధి
 ఆ) యడాగమం
 ఇ) ఇత్వ సంధి
 జవాబు:
 ఆ) యడాగమం
23. మా + ఊరు – (యడాగమ రూపం గుర్తించండి)
 అ) మాయూరు
 ఆ) మాఊరు
 ఇ) మావూరు
 జవాబు:
 అ) మాయూరు
24. ఏమి యున్నది (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
 అ) ఏమి + ఉన్నది
 ఆ) ఏమి + యున్నది
 ఇ) ఏమియు + న్నది
 జవాబు:
 అ) ఏమి + ఉన్నది
25. ఆప్యాయతానురాగాలు కలిగి జీవించాలి. (సమాసం పేరు గుర్తించండి)
 అ) ద్విగువు
 ఆ) ద్వంద్వ
 ఇ) బహుజొహి
 జవాబు:
 ఆ) ద్వంద్వ
26. అమ్మానాన్నలు నన్ను మెచ్చుకున్నారు. (విగ్రహవాక్యం గుర్తించండి)
 అ) అమ్మతో నాన్న
 ఆ) అమ్మ యొక్క నాన్న
 ఇ) అమ్మయును, నాన్నయును
 జవాబు:
 ఇ) అమ్మయును, నాన్నయును
27. బావయును మరిదియును (సమాస పదం గుర్తించండి)
 అ) బావమరిది
 ఆ) బావామరుదులు
 ఇ) బావ, మరదలు
 జవాబు:
 ఆ) బావామరుదులు
28. పాఠం చదివి మాట్లాడండి. ( ఏరకమైన వాక్యం)
 అ) సంక్లిష్టం
 ఆ) సంయుక్తం
 ఇ) చేదర్థకం
 జవాబు:
 అ) సంక్లిష్టం
29. మా ఊరు వెళ్లాను. కూరలు తెచ్చాను. (ఈ రెండు కలిపితే ఏర్పడేది)
 అ) మా ఊరు వెడుతూ కూరలు తెచ్చాను
 ఆ) మా ఊరు వెడితే కూరలు తెచ్చాను
 ఇ) మా ఊరు వెళ్లి కూరలు తెచ్చాను
 జవాబు:
 ఇ) మా ఊరు వెళ్లి కూరలు తెచ్చాను

30. ఒక సమాపక క్రియ, ఒకటి లేక అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలతో వాక్యాలను కలిపితే ఏర్పడేది?
 అ) సంయుక్త వాక్యం
 ఆ) సంక్లిష్ట వాక్యం
 ఇ) సామన్య వాక్యం
 జవాబు:
 ఆ) సంక్లిష్ట వాక్యం
చదవండి – ఆనందించండి
 (“అమ్మ ఉత్తరం”)
(ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలసపక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు…..)
కన్నా !
 ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా ఉంటావు. అయిదేళ్ళనాడు రమ కూతురి పెళ్ళికి వచ్చావు. అంతే మళ్ళీ యిక రానేలేదు. కానక కన్న సంతానంలా నిన్ను నలుగురమ్మాయిల మధ్య కనుపాపలాగా చూసుకొని పెంచుకున్నాను. నిన్ను యిల్లు దాటి వెళ్ళనివ్వలేదు. ఆ చదువుల సరస్వతి నిన్ను వెంటేసుకుని వెళ్ళింది. అంతా చదువుకొన్నవాళ్ళేగా ! నా కన్న చదువుకొనక పోతేనేం సంస్కారం వచ్చింది. చదవనూ రాయనూ నేర్చుకున్నాడు చాలు. వద్దు అన్నాను. వినలేదు. తరువాత ఉద్యోగ లక్ష్మి ఊళ్ళేలిస్తోంది. ఎక్కడున్నా నువ్వు నా కొడుకువే. నీ సారస్వత సంఘాలూ, నీ సాంఘిక సేవలూ అన్నీ పేపర్ల ద్వారా, కోడలి ఉత్తరాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఏం లాభంరా తండ్రీ !
నీవూ నీ పిల్లలూ యింట్లో కాలికి చేతికి అడ్డంగా తిరుగుతూ ఉంటే కోడలి చేత్తో చేయించి పెడుతూ వుంటే సాగిపోయే జీవితం ఎలా వుంటుంది ? ఏమో ? అది నాకు ‘కల’ అయిపోయిందిరా బాబూ. ఇంత యింట్లో ఒంటరిగా బతుకుతున్నాను. నాకెంత కావాలి ? పిడికెడు ఉడకేసుకుంటే చాలు… వెళ్ళిపోతుంది కానీ, ఆసక్తి పోయింది. ఎలా తింటే కడుపు నిండదు ! అలాగే నడుస్తోంది.

 జీవితంలో పొద్దువాటారిపోతోంది. ఇంకెన్నాళ్ళు అనిపిస్తోంది ! మీ నాన్నగారూ హఠాత్తుగా పోయారు. నీకు కడసారి చూపులు కూడా దక్కలేదు. అప్పుడాయన దగ్గర్లో నేనున్నాను. గొంతుకలో గరగర లాడుతున్నప్పుడు నేను ఇన్ని నీళ్ళు పోశాను. నా దిగులల్లా అలా నాకు జరిగితే ఈ గొంతులో ఇంత తులసి తీర్థం పోసేవాళ్ళు కూడా వుండరే అని. నలుగురు కూతుళ్ళు ఒక కొడుకు, పండ్రెడుగురు మనుమలు, మనవరాళ్ళు. వున్నా నా గొంతు తడిపేవాళ్ళు వుండరేమో అని దిగులుపడుతున్నాను.
నువ్వు నన్ను అక్కడికే రమ్మని అంటావు. నిజమే ! వచ్చేయొచ్చు. కానీ రాలేను. రాను ! ఈ యిల్లు, ఈ పొలాలు, ఈ గాలి, ఈ వాతావరణం వీటిని వదలి రాలేను. మీ నాన్నగారు ఇక్కడే పోయారు, నేను ఇక్కడే పిడికెడు బూడిదైపోవాలి. అదే నా ఆశ !
ఈ మట్టికీ, మనిషికీ ఉండే ఆత్మీయత అంతేనేమో ! ఎంత చదివినా, ఎంత సాధించినా, ఏం చేసినా ఆఖరికి మనిషి ఈ మట్టిలో కలసిపోవాలి. అలానే ఆ మట్టి తనను కన్నవూరి మట్టి కావాలని ఆరాటపడతాడు మనిషి. ఇది నా ఊరు… ఇది నా ఇల్లు…. ఇది నాది… ఈ మమతానుబంధాలు లేని రోజున మానవత్వమే నశిస్తుందేమో! అందుకే అనాదిగా ఈ మమకారాలు ఇలాగే నిలిచిపోయాయి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, మహా మహా నిర్మాణాలు మట్టిచాటుకు పోయాయి. కానీ మానవత మాసిపోలేదురా బాబు ! అందుకే ఈ ప్రపంచం ఇంకా సాగుతోంది !
నేను అంత దూరం రాలేను. ఈ ఊరు విడవలేను. ఈ ప్రాణం తట్టెడా ! పుట్టెడా ! ఎప్పుడో హరీ అంటుంది. నాకు తెలుసు. నాది ఎలాగు దిక్కులేని చావే అవుతుంది. ఎప్పుడయితే ఆయన పోయారో – అప్పుడే నేను . ఒంటరిదాననై పోయాను. కానీ పోయేలోగా నువ్వు ఇక్కడికి వచ్చి నాలుగురోజులు గడిపి పో. కన్న తల్లిగా నేను అంతకంటే ఇంకేమీ కోరను. కోడలిని పిల్లలని కూడా తీసుకురా ! ఇక ఉంటాను ఆశీస్సులతో ….
నీ తల్లి
 కాంతమ్మ.
మాతా గురుతరా భూమేః (తల్లి భూమి కంటే గొప్పది)
