These AP 7th Class Telugu Important Questions 14th Lesson కరపత్రం will help students prepare well for the exams.
AP State Syllabus 7th Class Telugu 14th Lesson Important Questions and Answers కరపత్రం
7th Class Telugu 14th Lesson కరపత్రం Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
1. ఈ కింది పరిచిత గద్యాన్ని చదవండి. నాలుగు ప్రశ్నలు తయారుచేయండి.
“చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణను ఇచ్చే కాగితాన్ని ‘కరపత్రం’ అనవచ్చు. కరపత్రం సంస్కృత పదం. చేతిలోని కాగితమని దీని అర్థం. దీన్నే ఆంగ్లంలో ‘పాంప్లెట్’ అంటారు. పదిమందికి తెలియవలసిన విషయంతో కూడుకున్నదే కరపత్రం. ఒక వ్యక్తి ఒక విషయాన్ని మరొకరికి తెలియబరచడానికి ఒక కాగితం మీద రాసి పంపవచ్చు. ఆ విషయం ఆ ఒక్క వ్యక్తికే సంబంధించినది కాక, ఎందరికో సంబంధించినది కావచ్చు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ మతస్థితులను ప్రతిబింబించేది కావచ్చు. ఇలా రాసి పంపే కాగితాలను లేఖలు అనవచ్చు గదా ! అనిపిస్తుంది.
 ప్రశ్నలు:
 అ) కరపత్రం అంటే ఏమిటి?
 ఆ) కరపత్రం అంటే అర్థం ఏమిటి? దీన్ని ఆంగ్లంలో ఏమంటారు?
 ఇ) కరపత్రంలో విషయం దేనితో కూడుకొని ఉంటుంది?
 ఈ) కరపత్రంలో విషయం దేన్ని ప్రతిబింబిస్తుంది?
2. ఈ కింది పరిచిత గద్యాన్ని చదవండి. దీనిపై ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
లిపి వాడుకలోకి వచ్చిన తరువాత, గుడ్డముక్కల మీద, చెక్క పలకల మీద రాసేవారు. ఒక విషయాన్ని – దూరప్రాంతాల వారికి పంపాలనుకున్నప్పుడు మందపాటి గుడ్డమీద రాసి దానికి ఒక పిడిని అమర్చి ఆ పిడి చుట్టూ రాత ఉన్న గుడ్డను చుట్టి పైన తాడుతో కట్టి పంపేవారు. రాజుల కాలంలో ఇది ఎక్కువగా వాడుకలో ఉండేది. ఇలాంటి గుడ్డ ఉత్తరాలు ఇప్పటికీ కొన్ని ప్రాచీన మఠాలలో ఉన్నాయని తెలుస్తోంది. చేతులలో అందంగా అమరే ఈ గుడ్డ ఉత్తరాలను, కరపత్రాల పరిణామంలో రెండో దశగా భావించవచ్చు. ముద్రణ సౌకర్యం ఏర్పడిన తరువాత, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలలో కరపత్రాల ముద్రణ మొదలై, ప్రపంచమంతా విస్తరించింది.
 ప్రశ్నలు:
 అ) గుడ్డ ఉత్తరాలు ఎలా పంపేవారు?
 జవాబు:
 గుడ్డ మీద రాసి, దానికి ఒక పిడి అమర్చి, ఆ పిడి చుట్టూ రాత గుడ్డను చుట్టి, పైన తాడుతో కట్టి, పంపేవారు.
ఆ) గుడ్డ ఉత్తరాలు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తాయి?
 జవాబు:
 గుడ్డ ఉత్తరాలు ప్రాచీన మఠాలలో ఉన్నాయని తెలుస్తోంది.
ఇ) గుడ్డ ఉత్తరాలు కరపత్రాల పరిమాణంలో ఎన్నో దశకు సంబంధించినవి?
 జవాబు:
 గుడ్డ ఉత్తరాలు కరపత్రాల పరిణామంలో రెండవ దశగా భావించాలి.
ఈ) కరపత్రాలు మొదట ఏయే దేశాల్లో ముద్రించబడ్డాయి?
 జవాబు:
 కరపత్రాల ముద్రణ, మొదట ఇంగ్లాండ్, ఫ్రాన్సు, జర్మనీ దేశాలలో జరిగింది.

3. ఈ కింది పరిచిత గద్యాన్ని చదవండి. దీనిపై ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
‘కరపత్రాల్లో విషయాలు ఉద్దేశించిన వ్యక్తులకు వెంటనే అర్ధమౌతాయి. మిగిలిన వాళ్ళకు వాటిలోని భావాలు సందిగ్ధంగా ఉంటాయి. కొన్ని కరపత్రాలను ఎవరికీ తెలియనివ్వకుండా రహస్యంగా అతి తక్కువ సమయంలో ముద్రించి పంపకం చేస్తారు. అందువల్ల అచ్చు తప్పులకు, అపార్థాలకు ఎక్కువ ఆస్కారముంటుంది. కరపత్రాల్లోని విషయాలు నిజాలా ! అబద్ధాలా అనే అనుమానం కలుగుతుంది. ఆధారాలు దొరికితే తప్పు, ఈ విషయాల వెనక ఉన్న వాస్తవం బయటపడదు. కొన్ని విషయాలను వార్తాపత్రికల్లో చూడనివారు కరపత్రాల్లో చూసి తెలుసుకుంటారు. కరపత్రాల్లో ఎక్కువగా వాడుకభాష ఉంటుంది. సాధారణంగా కరపత్రాలను ఉచితంగా పంపిణీ చేస్తారు. కరపత్రం మనిషి భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకేతం.
 ప్రశ్నలు:
 అ) కరపత్రాల్లో విషయాలు ఎవరికి వెంటనే అర్థమౌతాయి?
 జవాబు:
 కరపత్రాలలో విషయాలు, ఉద్దేశించిన వ్యక్తులకు వెంటనే అర్థం అవుతాయి.
ఆ) కరపత్రాల్లో విషయాలు ఎవరికి సందిగ్ధంగా ఉంటాయి?
 జవాబు:
 ఉద్దేశింపబడినవారు కాని వ్యక్తులకు, కరపత్రంలో విషయాలు సందిగ్ధంగా ఉంటాయి.
ఇ) అచ్చుతప్పులు కరపత్రాల్లో ఎందుకు వస్తూ ఉంటాయి?
 జవాబు:
 కరపత్రాలు రహస్యంగా, అతితక్కువ సమయంలో ముద్రించబడడం చేత అచ్చు తప్పులు వస్తాయి.
ఈ) కరపత్రాలను చదివినపుడు ఏమని అనుమానం కలుగుతుంది?
 జవాబు:
 కరపత్రాలలోని విషయాలు నిజాలా? అబద్ధాలా? అనే అనుమానం కలుగుతుంది.
ఈ క్రింది అపరిచిత గద్యాలను చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. గాంధీజీ తన ప్రసంగాలలో సత్యం, అహింస అనే రెండు తరచుగా ఉపయోగించేవారు. అయితే ఈ రెంటిలో మొదటిదానికే ప్రాధాన్యమిచ్చారు. అతడు సత్యాన్వేషకుడే కాదు. సత్యాన్ని ఆరాధించిన భక్తుడు. తన జీవితాన్ని “సత్యమార్గంతో పరిశోధనలు” గా అభివర్ణించారు. ప్రారంభంలో భగవంతుడే సత్యమని ప్రకటించారు. కానీ, చివరకు సత్యమే భగవంతుడు” అని ప్రకటించే స్థితికి వచ్చారు. “ఎందుకంటే భగవంతుని ఉనికిని నిరాకరించవచ్చు. కానీ, సత్యమును కాదనడం కష్టం”.
 ప్రశ్నలు:
 అ) గాంధీ తన ప్రసంగాలలో తరచుగా ఉపయోగించేవి ఏవి?
 జవాబు:
 సత్యం, అహింస.
ఆ) ఆయన తన జీవితాన్ని ఏమని అభివర్ణించారు?
 జవాబు:
 సత్యమార్గంతో పరిశోధనలు.
ఇ) ప్రారంభంలో ఆయన దేనిని సత్యముని ప్రకటించారు?
 జవాబు:
 భగవంతుడే సత్యం.
ఈ) చివరకు ఆయన దేనిని భగవంతునిగా ప్రకటించే స్థితికి వచ్చారు?
 జవాబు:
 సత్యమే భవంతుడు.

2. శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన భావ కవిత్వం పై తిరుగుబావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తరువాత విప్లవ కవిత్వమునకు స్ఫూర్తినిచ్చాడు. “అనితర సాధ్యం నా మార్గం” అని చాటిన ప్రజాకవి. “మహాప్రస్థానం” కావ్యం, సిరిసిరి మువ్వ శతకం” శ్రీశ్రీకి మంచి కీర్తిప్రతిష్ఠలు సంపాదించి పెట్టాయి. ఆయన సమాజాన్ని చైతన్యపరిచే రచనలెన్నో చేశాడు. అందుకే సాహిత్య విమర్శకులు ఆయనను అభ్యుదయ కవిత్వానికి యుగకర్త అంటారు.
 ప్రశ్నలు:
 అ) శ్రీశ్రీ అసలు పేరేమి?
 జవాబు:
 శ్రీరంగం శ్రీనివాసరావు.
ఆ) ఆయన అభ్యుదయ భావాలు దేనికి స్ఫూర్తినిచ్చాయి?
 జవాబు:
 ఆయన అభ్యుదయ భావాలు విప్లవ కవిత్వానికి స్ఫూర్తినిచ్చాయి.
ఇ) తన రచనాశైలి విషయంలో ఆయన ఏమని చాటుకొన్నాడు?
 జవాబు:
 ‘అనితర సాధ్యం నా మార్గం’ అని శ్రీశ్రీ తన రచనా శైలి విషయంలో చాటుకొన్నాడు.
ఈ) శ్రీశ్రీకి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన రచనలు ఏవి?
 జవాబు:
 మహాప్రస్థానం అనే కావ్యం, సిరిసిరి మువ్వ అనే శతకం శ్రీశ్రీకి కీర్తిప్రతిష్ఠలు తెచ్చి పెట్టిన రచనలు.
3. జనపదం’ అంటే పల్లెటూరు. జనపదాలలో ఉండేవారు జానపదులు. జానపదులు పాడే పాటలు లేక గేయాలను జానపద గేయాలంటారు. వీటిని ఆంగ్లంలో ‘ఫోక్ సాంగ్స్’ అంటారు. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను లోక్ గీత్ లేదా లోక్ సాహిత్య అంటారు. జానపద సాహిత్యం సమిష్టి సంపద. శిష్ట సాహిత్యంలాగా కాక జానపద సాహిత్యం పలువురి చేతులలో పెరిగింది. ఇది దాని మొదటి లక్షణం. గేయ రచనా కాలం స్పష్టంగా ఉండకపోవడం మరో లక్షణం. నదీ నదాలు, వాగులు, వంకలూ మనకు ఉపయోగపడక సముద్రం పాలైనట్లే జానపద గేయస్రవంతి కూడా చాలా భాగం మనకు అందలేదు. జానపద సాహిత్యాన్ని భద్రపరచవలసిన అవసరం ఉన్నది.
 ప్రశ్నలు:
 అ) జానపదులు అంటే ఎవరు?
 జవాబు:
 జనపదాల్లో ఉండేవారిని జానపదులు అంటారు.
ఆ) ఉత్తర భారతదేశంలో జానపదాలను ఏమంటారు?
 జవాబు:
 ఉత్తర భారతదేశంలో జానపదాలను ‘లోక్ గీత్’ (లేదా) ‘లోక్ సాహిత్య’ అని అంటారు.
ఇ) జానపద సాహిత్యం ప్రథమ లక్షణం ఏమిటి?
 జవాబు:
 సమిష్టి సంపదయై, పలువురి చేతులలో పెరుగుట జానపద సాహిత్య ప్రథమ లక్షణం.
ఈ) ఆంగ్లములో జానపద గేయాల్ని ఏమంటారు?
 జవాబు:
 ఆంగ్లములో జానపద గేయాలను “ఫోక్ సాంగ్స్” అని అంటారు.

4. మేధా సంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమవుతుంది అనేది ఎంతయినా యథార్థం. ఒక దేశం యొక్క సంస్కృతి, వికాసం, ప్రగతి ఆ దేశంలోని . స్త్రీలందరూ విద్యావంతులా, కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక యుగంలో విద్య మానవునికి ఒక ముఖ్యమైన జీవితావసరంగా కూడా మారింది. నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు ఒక ప్రాథమిక అవసరంగా భావించి వాటిని రాజ్యాంగంలో పొందుపరచడమైనది.
 ప్రశ్నలు:
 అ) యథార్థమైనది ఏది?
 జవాబు:
 స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతమవుతుంది.
ఆ) ఒక దేశ సంస్కృతి, ప్రగతి దేనిమీద ఆధారపడి ఉంటుంది?
 జవాబు:
 ఒక దేశ సంస్కృతి, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది
ఇ) రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక అవసరాలేవి?
 జవాబు:
 నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు అనే ప్రాథమిక అవసరాలు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి.
ఈ) వైజ్ఞానిక వాస్తవం ఏమిటి?
 జవాబు:
 మేధాసంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం.
7th Class Telugu 14th Lesson కరపత్రం 1 Mark Bits
III. భాషాంశాలు
పదాలు – ఆర్థాలు :
 సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థం గుర్తించండి.
1. అపార్థం చేసుకోకూడదు.
 ఎ) చెడు మాట
 బి) విరక్తి మాట
 సి) తప్పు అర్థం
 డి) తప్పు పని
 జవాబు:
 సి) తప్పు అర్థం
2. వ్యక్తీకరణ ప్రధానంగా ఉండాలి.
 ఎ) చక్కగా వ్రాయడం
 బి) కోపగించడం
 సి) శాంత పరచడం
 డి) వెల్లడించడం
 జవాబు:
 డి) వెల్లడించడం
3. మనుషుల మధ్య భేదం ఉండరాదు.
 ఎ) పాదము
 బి) భాగము
 సి) తేడా
 డి) మదనము
 జవాబు:
 సి) తేడా
4. కరంతో దానం చేయాలి.
 ఎ) చేయి
 బి) గరళం
 సి) పాదం
 డి) నాశిక
 జవాబు:
 ఎ) చేయి

5. చిత్రం నిర్మలంగా ఉండాలి.
 ఎ) నాశిక
 బి) ఉదరం
 సి) మనసు
 డి) నుదురు
 జవాబు:
 సి) మనసు
6. నిశితంగా పరిశీలించాను.
 ఎ) మందంగా
 బి) తీక్షణంగా
 సి) అనుమానంగా
 డి) తేలికగా
 జవాబు:
 బి) తీక్షణంగా
7. రూపంలో పరిణామం వచ్చింది.
 ఎ) మదింపు
 బి) మమత
 సి) మార్పు
 డి) సమత
 జవాబు:
 సి) మార్పు
8. వర్షం బాగా విస్తరించుట గమనించాడు.
 ఎ) తొలగు
 బి) సందిగ్ధం
 సి) వ్యాపించు
 డి) సంశయం
 జవాబు:
 సి) వ్యాపించు
పర్యాయపదాలు :
 సూచన : క్రింది గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను గుర్తించండి.
9. లేఖ రాశాను.
 ఎ) ఉత్తరం, జాబు
 బి) జాబు, జాతర
 సి) ఉత్తరం, కరము
 డి) జాతనం, జాబు
 జవాబు:
 ఎ) ఉత్తరం, జాబు
10. పద్ధతి మారాలి.
 ఎ) విధం, వధ
 బి) రీతి, రకం
 సి) పంక్తి, వరుస
 డి) తీరు, రీతి
 జవాబు:
 డి) తీరు, రీతి

11. మార్గంలో దిరగాలి.
 ఎ) పథం, పాంథుడు
 బి) దారి, పథం
 సి) దారి, దారం
 డి) పథం, పంక్తి
 జవాబు:
 బి) దారి, పథం
12. కరం చాపాలి.
 ఎ) చేయి, హస్తం
 బి) నాదం, చలిగా
 సి) చామరం, కారం
 డి) చారకుం, చామరం
 జవాబు:
 ఎ) చేయి, హస్తం
13. వాస్తవం తెలుపాలి.
 ఎ) వారి, వాదము
 బి) సత్యం, అన్వయం
 సి) నిజం, యథార్థం
 డి) గతం, వర్తమానం
 జవాబు:
 సి) నిజం, యథార్థం
14. ఓర్పు వహించాలి.
 ఎ) సహనం, క్షమ
 బి) సన్నుతి, సాగరం
 సి) నలపాధం, సాదరం
 డి) సంపత్తి, సహనం
 జవాబు:
 ఎ) సహనం, క్షమ
15. వితం సాధించాలి.
 ఎ) ఆరాయం, ఆరామం
 బి) విరామం, విశదం
 సి) ధనం, సంపద
 డి) సంపద, సంసారం
 జవాబు:
 సి) ధనం, సంపద

16. శిలపై శిల్పాలు చెక్కారు.
 ఎ) రాయి, పాషాణం
 బి) పరుపు, శాల
 సి) శిల్పం, శాల
 డి) పాషాణం, పరుషం
 జవాబు:
 ఎ) రాయి, పాషాణం
ప్రకృతి – వికృతులు :
17. రాత్రి నిద్ర పోయారు – వికృతి పధం ఏది?
 ఎ) రోత్రము
 బి) రద్రము
 సి) రాతిరి
 డి) రేత్రము
 జవాబు:
 సి) రాతిరి
18. నీరం పొందాము – దీనికి వికృతి పదం ఏది?
 ఎ) నేరం
 బి) నాథం
 సి) నోరు
 డి) నీరు
 జవాబు:
 డి) నీరు
19. స్థలంలో ఉన్నాను , దీనికి వికృతి పదం ఏది?
 ఎ) కరము
 బి) తల
 సి) సరము
 డి) తరము
 జవాబు:
 బి) తల
20. కత రాశాను – దీనికి ప్రకృతి పదం ఏది?
 ఎ) కమ్మ
 బి) కర
 సి) కరము
 డి) కథ
 జవాబు:
 డి) కథ

21. స్త్రీని గౌరవించాలి – వికృతి.పదం ఏది?
 ఎ) ఇంతి
 బి) చెంద
 సి) అంత
 డి) సిరి
 జవాబు:
 ఎ) ఇంతి
22. గౌరవం చూపాలి – వికృతి పదం ఏది?
 ఎ) గారవం
 బి) గురవం
 సి) గౌరవం
 డి) గోరవం
 జవాబు:
 ఎ) గారవం
23. విద్యను నేర్వాలి – వికృతి పదం ఏది?
 ఎ) విద్దె
 బి) విద్ది
 సి) విదీయ
 డి) చదువు
 జవాబు:
 ఎ) విద్దె
24. మనం మంచి ప్రాంతంలో ఉండాలి – వికృతి పదం ఏది?
 ఎ) పిత
 బి) పాంత
 సి) పొంత
 డి) పాంత
 జవాబు:
 సి) పొంత
వ్యతిరేకపదాలు :
 సూచన : క్రింది గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలను గుర్తించండి.
25. నిజం చెప్పాలి.
 ఎ) నృతం
 బి) సత్యం
 సి) నూతరం
 డి) అబద్దం
 జవాబు:
 డి) అబద్దం
26. ధరలు చౌకగా ఉన్నాయి.
 ఎ) సారం
 బి) ప్రియం
 సి) పలుచన
 డి) వేలిన్
 జవాబు:
 బి) ప్రియం

27. అందరికి ధనం ప్రధానంగా ఉంది.
 ఎ) అన్వ ప్రధానం
 బి) ప్రతిధానం
 సి) అనుధానం
 డి) అప్రధానం
 జవాబు:
 డి) అప్రధానం
28. చదువు పట్ల ఆసక్తి ఉండాలి.
 ఎ) యథాసక్తి
 బి) అనాసక్తి
 సి) గతాసక్తి
 డి) ప్రతాసక్తి
 జవాబు:
 బి) అనాసక్తి
29. వాస్తవం చెప్పాలి.
 ఎ) అను వాస్తవం
 బి) అనాగరికం
 సి) అవాస్తవం
 డి) ప్రతివాస్తవం
 జవాబు:
 సి) అవాస్తవం
30. అంతా సౌకర్యంగా ఉంది.
 ఎ) అసౌకర్యం
 బి) అనుకౌర్యం
 సి) గత సౌకర్యం
 డి) ప్రతి సౌకర్యం
 జవాబు:
 ఎ) అసౌకర్యం
31. ప్రాచీన కాలం ఉత్తమం.
 ఎ) సనాతన కాలం
 బి) సంధి కాలం
 సి) సక్రమ కాలం
 డి) నవీన కాలం
 జవాబు:
 డి) నవీన కాలం
సంధులు :
32. అత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
 ఎ) మనందరి
 బి) వివాదాస్పదం
 సి) ఎవరెంత
 డి) మహేశుడు
 జవాబు:
 ఎ) మనందరి

33. అక్కడక్కడ – దీనిని విడదీయండి.
 ఎ) అక్కడ + యక్కడ
 బి) అక్క + డక్కడ
 సి) అక్కడ + ఎక్కడ
 డి) అక్కడ + అక్కడ
 జవాబు:
 డి) అక్కడ + అక్కడ
34. వ్యక్తులందరు – ఇది ఏ సంధి?
 ఎ) త్రికసంధి
 బి) గుణసంధి
 సి) ఉత్వసంధి
 డి) అత్వసంధి
 జవాబు:
 సి) ఉత్వసంధి
35. బహుళము ఎన్ని రకాలు?
 ఎ) పది
 బి) ఎనిమిది
 సి) నాలుగు
 డి) ఆరు
 జవాబు:
 సి) నాలుగు
36. ద్విరుక్తము యొక్క పరరూపమును ఏమంటారు?
 ఎ) గుణము
 బి) శబ్దపల్లవం
 సి) విభాష
 డి) ఆమ్రేడితం
 జవాబు:
 డి) ఆమ్రేడితం
37. ఉత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
 ఎ) మరింత
 బి) సీతయ్య
 సి) పిల్లలందరు
 డి) ప్రత్యుపకారం
 జవాబు:
 సి) పిల్లలందరు
38. విషయ + ఆసక్తి ఉండాలి – దీనిని కలిపి రాయండి.
 ఎ) విషయైసక్తి
 బి) విషయాసక్తి
 సి) విషేషాసక్తి
 డి) విషయ్యశక్తి
 జవాబు:
 బి) విషయాసక్తి
39. మరొకరు రావాలి – దీనిని విడదీయండి.
 ఎ) మరొ + ఒకరు
 బి) మరి + ఒకరు
 సి) మర + ఒకరు
 డి) మరె + ఒకరు
 జవాబు:
 బి) మరి + ఒకరు
సమాసాలు :
40. నల్లకలువ ప్రకాశించింది – ఇది ఏ సమాసమో, గుర్తించండి.
 ఎ) ద్విగు సమాసం
 బి) విశేషణ పూర్వపద కర్మధారయం
 సి) రూపక సమాసం
 డి) షష్ఠీ తత్పురుష
 జవాబు:
 బి) విశేషణ పూర్వపద కర్మధారయం

41. పూర్వపదార్థ ప్రాధాన్యం గల సమాసం గుర్తించండి.
 ఎ) ద్వంద్వ సమాసం
 బి) కర్మధారయం
 సి) అవ్యయీభావం
 డి) బహువ్రీహి
 జవాబు:
 సి) అవ్యయీభావం
42. షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణను గుర్తించండి.
 ఎ) బాలబాలికలు
 బి) అభిప్రాయ వ్యక్తీకరణ
 సి) ఆంధ్రశ్రీ
 డి) నలుదిక్కులు
 జవాబు:
 బి) అభిప్రాయ వ్యక్తీకరణ
43. వివాదమునకు అస్పదం – దీనికి సమాసపదం గుర్తించండి.
 ఎ) ప్రతివివాదం
 బి) వివాదాస్పదం
 సి) అనువివాదం
 డి) ఆస్పది వివాదం
 జవాబు:
 బి) వివాదాస్పదం
44. ద్వంద్వ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
 ఎ) చతుర్ముఖుడు
 బి) బాలబాలికలు
 సి) ఉజ్వల భవిష్యత్తు
 డి) నలుదిక్కులు
 జవాబు:
 బి) బాలబాలికలు
45. సంఖ్యా శబ్దం పూర్వముగా కలిగిన సమాసం గుర్తించండి.
 ఎ) షష్ఠీ తత్పురుష
 బి) ద్విగువు
 సి) బహువ్రీహి
 డి) రూపకం
 జవాబు:
 బి) ద్విగువు

46. సప్తమీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
 ఎ) బాలబాలికలు
 బి) అన్నదమ్ములు
 సి) విరామపత్రం
 డి) విషయాసక్తి
 జవాబు:
 డి) విషయాసక్తి
47. కరపత్రం చదవాలి – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
 ఎ) కరముతో పత్రం
 బి) కరము నందలి పత్రం
 సి) కరము కొరకు పత్రం
 డి) కరములో పత్రం
 జవాబు:
 బి) కరము నందలి పత్రం
వాక్య ప్రయోగాలు :
48. పేదలకు దానం చేయాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
 ఎ) పేదలకు కొద్దిగా దానం చేయాలి
 బి) పేదలకు దానం చేయకూడదు
 సి) పేదలకు దానం మాత్రమే చేయాలి
 డి) పేదలకు దానం చేయలేకపోవచ్చు
 జవాబు:
 బి) పేదలకు దానం చేయకూడదు
49. మన సంస్కృతిని రక్షించాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
 ఎ) మన సంస్కృతిని రక్షించకపోవచ్చు
 బి) మన సంస్కృతిని ఎందుకు రక్షించకూడదు?
 సి) మన సంస్కృతిని పరిమితంగా రక్షించాలి
 డి) మన సంస్కృతిని రక్షింపకూడదు
 జవాబు:
 డి) మన సంస్కృతిని రక్షింపకూడదు

50. అందరు ధర్మాన్ని ఆశ్రయించాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
 ఎ) అందరు ధర్మాన్ని ఆశ్రయించకపోవచ్చు
 బి) చాలామంది ధర్మాన్ని ఆశ్రయింపలేకపోతున్నారు
 సి) అందరు ధర్మాన్ని ఆశ్రయించకూడదు
 డి) కొందరు ధర్మాన్ని ఆశ్రయించకూడదు
 జవాబు:
 సి) అందరు ధర్మాన్ని ఆశ్రయించకూడదు
51. మూర్ఖులతో స్నేహం మంచిది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
 ఎ) మూర్ఖ్యులతో స్నేహం మంచిది కాదు
 బి) సజ్జనులతో స్నేహం చాలా మంచిది
 సి) మూర్చులతో వైరం వద్దు
 డి) మూర్చులతో స్నేహం తక్కువ మంచిది
 జవాబు:
 ఎ) మూర్ఖ్యులతో స్నేహం మంచిది కాదు
52. సజ్జనమైత్రి కీర్తిని ఇస్తుంది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
 ఎ) సజ్జనమైత్రి కీర్తిని కలుగనీయదు
 బి) సజ్జనమైత్రి అపకీర్తిని ఇవ్వదు
 సి) సజ్జనమైత్రి కీర్తిని ఇవ్వదు
 డి) సజ్జనమైత్రి కీర్తిని ఇవ్వకపోవచ్చు
 జవాబు:
 సి) సజ్జనమైత్రి కీర్తిని ఇవ్వదు
53. స్త్రీలను గౌరవించండి – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) ద్వాత్వర్థక వాక్యం
 బి) తద్ధర్మార్థక వాక్యం
 సి) విధ్యర్థక వాక్యం
 డి) అభ్యర్థక వాక్యం
 జవాబు:
 సి) విధ్యర్థక వాక్యం
54. మీరు నన్ను క్షమించండి – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) హేత్వర్థక వాక్యం
 బి) అభ్యర్థక వాక్యం
 సి) సందేహార్థక వాక్యం
 డి) ప్రార్థనార్థక వాక్యం
 జవాబు:
 డి) ప్రార్థనార్థక వాక్యం
55. నేను తప్పక చదువుతాను – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) నిషేధార్థక వాక్యం
 బి) నిశ్చయార్థక వాక్యం
 సి) తద్ధర్మార్థక వాక్యం
 డి) హేత్వర్ధక వాక్యం
 జవాబు:
 బి) నిశ్చయార్థక వాక్యం
56. చెరువులు నిండటం వలన పంటలు పండినాయి – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) నిశ్చయార్థక వాక్యం
 బి) హేత్వర్థక వాక్యం
 సి) ప్రశ్నార్థక వాక్యం
 డి) ఆత్మార్థక వాక్యం
 జవాబు:
 బి) హేత్వర్థక వాక్యం

57. మహిళలు సాధించి వెళ్ళారు – గీత గీసిన పదం ఏ క్రియా పదం?
 ఎ) క్వార్థకం
 బి) శత్రర్థకం
 సి) ఆత్మార్థకం
 డి) ప్రశ్నార్థకం
 జవాబు:
 ఎ) క్వార్థకం
58. స్త్రీలను గౌరవిస్తే మన్నన ఉంటుంది – గీత గీసిన పదం ఏ క్రియా పదం?
 ఎ) నిశ్చయార్థకం
 బి) చేదర్థకం
 సి) అభ్యర్థకం
 డి) ధాత్వర్ధకం
 జవాబు:
 బి) చేదర్థకం
59. పిల్లలు నడుస్తూ మాట్లాడుతున్నారు – గీత గీసిన పదం ఏ క్రియా పదం?
 ఎ) క్వార్థకం
 బి) శత్రర్థకం
 సి) తద్ధర్మార్థకం
 డి) అప్యర్థకం
 జవాబు:
 బి) శత్రర్థకం
60. బాగా చదివి నిద్రపోయాడు – గీత గీసిన పదం ఏ క్రియా పదం?
 ఎ) అప్యర్థకం
 బి) హేత్వర్ధకం
 సి) తద్ధర్మార్థకం
 డి) క్వార్ధకం
 జవాబు:
 డి) క్వార్ధకం
విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషులు
61. పిల్లలు ఎక్కడ ఉన్నారు – ఇది ఏ విభక్తి ప్రత్యయం?
 ఎ) ద్వితీయా విభక్తి
 బి) ప్రథమా విభక్తి
 సి) తృతీయా విభక్తి
 డి) అధమవిభక్తి
 జవాబు:
 బి) ప్రథమా విభక్తి
62. గ్రామాలలో బడికి వెళ్ళారు – ఇది ఏ విభక్తి ప్రత్యయం?
 ఎ) చతుర్థీ విభక్తి
 బి) షష్ఠీ విభక్తి
 సి) ప్రథమా విభక్తి
 డి) ద్వితీయా విభక్తి
 జవాబు:
 బి) షష్ఠీ విభక్తి

63. అందరు పనిచేయాలి – ఇది ఏ భాషాభాగము?
 ఎ) నామవాచకం
 బి) అవ్యయం
 సి) సర్వనామం
 డి) క్రియ
 జవాబు:
 డి) క్రియ
64. నీవు అన్నం తిన్నావు – ఇది ఏ పురుష ప్రత్యయం?
 ఎ) అధమ పురుష
 బి) మధ్యమ పురుష
 సి) ఉత్తమ పురుష
 డి) ప్రథమ పురుష
 జవాబు:
 బి) మధ్యమ పురుష
65. మేము పాఠం రాశాము – ఇది ఏ పురుష ప్రత్యయం?
 ఎ) ప్రథమ పురుష
 బి) ఉత్తమ పురుష
 సి) మధ్యమ పురుష
 డి) అధమ పురుష
 జవాబు:
 బి) ఉత్తమ పురుష
66. రాము పాఠం విన్నాడు – ఇది ఏ భాషాభాగం ప్రత్యయం?
 ఎ) సర్వనామం
 బి) నామవాచకం
 సి) క్రియ
 డి) విశేషణం
 జవాబు:
 బి) నామవాచకం

సొంతవాక్యాలు :
67. నిశితం : విషయాలను నిశితంగా పరిశీలించాలి.
 68. విస్తరించు : అంటురోగాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించు చున్నాయి.
 69. ఆస్కారం : అపార్థాలను ఆస్కారం లేకుండా ప్రయత్నించాలి.
 70. సౌకర్యం : ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది.
