These AP 7th Class Telugu Important Questions 16th Lesson బాల్య క్రీడలు will help students prepare well for the exams.
AP State Syllabus 7th Class Telugu 16th Lesson Important Questions and Answers బాల్య క్రీడలు
7th Class Telugu 16th Lesson బాల్య క్రీడలు Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
కింది పరిచిత గేయాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. కసవు గల దిరవు పసులకు,
 లస దద్రినదీ మహీజ లతికావలి పెం
 పెసఁగును, గాఁపురమునకును,
 బొసఁగును బృందావనంబు వొదఁడచ్చటికిన్.
 ప్రశ్నలు – జవాబులు :
 అ) బృందావనము పశువులకు ఎలా ఉంటుంది?
 జవాబు:
 బృందావనము పశువులకు అనుకూలము. అక్కడ వాటికి గడ్డి దొరుకుతుంది.
ఆ) బృందావనము పర్వతాలు, నదులు, చెట్లు, తీగలతో ఉంటుంది. అనే భావం గల పంక్తి ఏది ?
 జవాబు:
 “లసద8నదీమహీజలతికావలి పెంపెసఁగును” అనే పెద్దబొబ్బ పెట్టాడు. పద్యంలో పంక్తి పై భావాన్ని ఇస్తుంది.
ఇ) ఈ పద్య రచయిత ఎవరు ? ఇది ఏ పాఠంలోనిది ?
 జవాబు:
 ఈ పద్య రచయిత “బమ్మెరపోతన” – ఇది ‘బాల్య క్రీడలు’ పాఠంలోనిది.
ఈ) ‘పొదడచ్చటికిన్’ – అంటే ఏమిటి?
 జవాబు:
 ‘అక్కడికి పోదాం’ అని ఆ పంక్తికీ గల భావం.

2. ఒక్కఁడు ము న్నే మతి చన
 నొక్కఁడు బలుబొబ్బ పెట్టు నులికిపడన్, వే
 టొక్కఁడు ముట్టి తటాలున,
 నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁ గన్ ఆ
 ప్రశ్నలు – జవాబులు :
 అ) ఎప్పుడు బలుబొబ్బ పెట్టాడు?
 జవాబు:
 ఒకడు ఏమరుపాటుగా . నడుస్తుండగా, మరొకడు పెద్దబొబ్బ పెట్టాడు.
ఆ) పెద్దబొబ్బ పెడితే ఏమయింది?
 జవాబు:
 బలుబొబ్బ (పెద్దకేక) పెడితే, నడిచివెళ్ళే వాడు ఉలికిపడ్డాడు.
ఇ) . ‘ఉలికిపడేటట్లు ఓకడు పెద్దకేక వేయగా’ అనే అర్థం వచ్చే పంక్తి ఏది?
 జవాబు:
 ‘ఒక్కడు బలుబొబ్బ పెట్టు నులికిపడన్’ అనే పంక్తి పై భావాన్ని ఇస్తుంది.
ఈ) కనుదోయి మూయగా ఏమి జరిగింది?
 జవాబు:
 ఒకడు కనుదోయి మూయగా, అది చూచి మరొకడు నవ్వాడు.
3. వనజాక్షుఁడు మున్నరిగిన,
 ‘మునుపడఁగా నేనెయతని ముట్టెద’ ననుచుం
 గని మును ముట్టనివానిన్,
 మును ముట్టినవాఁడు నవ్వు మొనసి నరేంద్రా !
 ప్రశ్నలు – జవాబులు:
 అ) ఈ పద్యంలో నరేంద్రా ! అన్న నరేంద్రుడు ఎవరు?
 జవాబు:
 ఇక్కడ పద్యంలోని నరేంద్రుడు “పరీక్షిత్తు మహారాజు ”.
ఆ) ముందుగా వెళ్ళినవారు ఎవరు?
 జవాబు:
 ముందుగా వెళ్ళినవాడు ‘వనజాక్షుడు’ అనగా శ్రీకృష్ణుడు.
ఇ) గోపబాలురు ఏమి పందెము వేసుకున్నారు?
 జవాబు:
 ఇతరుల కంటే ముందుగా వెళ్ళి, కృష్ణుని ముట్టు కోవాలని వారు పందెము వేశారు.
ఈ) ‘ముందుగా నేనే అతన్ని ముట్టుకుంటాను’ అని అర్థం వచ్చే పంక్తి ఏది?
 జవాబు:
 ‘మునుపడగా నేనెయతని ముట్టెదను’ అనే పంక్తి ఈ భావాన్ని ఇస్తుంది.

ఈ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. ఎఱుక గలవారి చరితలు
 గడచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
 బెఱుగుచు నెఱిగినదానిని
 మఱువ కనుష్ఠించునది సమంజసబుద్దిన్
 ప్రశ్నలు :
 అ) ఎవరి చరిత్ర తెలుసుకోవాలి?
 జవాబు:
 జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.
ఆ) ధర్మాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి?
 జవాబు:
 ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.
ఇ) దేనిని అనుష్ఠించాలి?
 జవాబు:
 ధర్మాన్ని అనుష్ఠించాలి.
ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
 జవాబు:
 ఈ పద్యా నికి శీర్షిక ‘నీతిబోధ’.
2. తను లోకము గొనియాడగ
 విని యుబ్బడు సజ్జనుండు వెండియుఁ గడు మే
 లొనరించుఁ గీడాకించుక
 యును దనదెసఁ దోఁపనిక యుడుపుచు వచ్చున్.
 ప్రశ్నలు :
 అ) లోకం తనను పొగిడితే పొంగిపోనివాడు ఎవరు?
 జవాబు:
 లోకం తనను పొగిడితే పొంగిపోనివాడు సజ్జనుడు.
ఆ) సజ్జనుడు లోకానికి ఏం చేస్తాడు?
 జవాబు:
 సజ్జనుడు లోకానికి మేలు చేస్తాడు.
ఇ) తనవల్ల ఏమాత్రం హాని కలుగకుండ చూసేవాడు ఎవరు?
 జవాబు:
 తనవల్ల ఏమాత్రం హాని కలుగకుండ చూసేవాడు సజనుడు.
ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
 జవాబు:
 ఈ పద్యానికి శీర్షిక ‘సజ్జన స్వభావం’.

3. సద్గోష్ఠి సిరియు నొసగును
 సద్గోష్టియె కీర్తిఁబెంచు; సంతుష్టియు నా
 సద్గోష్ఠియె యొనగూర్చును;
 సద్గోష్టియె పాపములను చఱచు కుమారా!
 ప్రశ్నలు :
 అ) సద్గోష్ఠి దేన్ని ఇస్తుంది?
 జవాబు:
 సద్గోష్ఠి సంపదను ఇస్తుంది.
ఆ) కీర్తిని పెంచేది ఏది?
 జవాబు:
 కీర్తిని పెంచేది సదౌష్ఠి.
ఇ) పాపములను పోగొట్టేది ఏది?
 జవాబు:
 పాపములను పోగొట్టేది సదౌష్ఠి.
ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
 జవాబు:
 ఈ పద్యానికి శీర్షిక ‘సదౌష్ఠి ప్రయోజనం’.
4. కందుకము వోలె సుజనుడు
 క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
 మందుడు మృత్పిండమువలె
 గ్రిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.
 ప్రశ్నలు :
 అ) సుజనుడు ఎట్లా ఉంటాడు?
 జవాబు:
 సుజనుడు కందుకంలా ఉంటాడు.
ఆ) మందుడు ఎలా ఉంటాడు?
 జవాబు:
 మందుడు మృత్పిండంలా ఉంటాడు.
ఇ) సుజనుని కవి దేనితో పోల్చాడు?
 జవాబు:
 సుజనుని కవి బంతితో పోల్చాడు.
ఈ) ఈ పద్యంలోని అలంకారమేమి?
 జవాబు:
 ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న1.
 బాల్యక్రీడలు పాఠ్యభాగ రచయిత పోతన కవిని గూర్చి పరిచయం చేయండి. (S.A. II – 2017-18)
 జవాబు:
 ‘బాల్యక్రీడలు’ అనే పాఠం పోతన మహాకవి రచించిన ఆంధ్రమహాభాగవతము దశమ స్కంధములోనిది. పోతన 15వ శతాబ్దము వాడు. ఈయన తెలంగాణాలో వరంగల్లు జిల్లా బమ్మెర గ్రామంలో పుట్టాడు. ఈయనకు ‘సహజ పండితుడు’ అనే బిరుదు ఉంది.
పోతన గారు ఆంధ్రమహాభాగవతము, భోగినీ దండకము, వీరభద్ర విజయము, నారాయణ శతకము అనే ” గ్రంథాలు రచించాడు. పోతనగారి పద్యం ఒక్కటైనా రాని తెలుగువాడు ఉండడు.

ప్రశ్న2.
 పాఠంలోని చిత్రాలను చూడండి. పద్యభావాలను ఊహించండి.
 జవాబు:
- గోపాలురు, ‘బృందావనం’ మంచి చెట్లతో పచ్చిగడ్డితో అందంగా ఉందని, పశువులకు అక్కడ మంచి మేత దొరుకుతుందని వారు ఆనందపడుతున్నారు.
- కొందరు పిల్లలు మునీశ్వరులవలె తపస్సు చేస్తున్నారు. గోవులు పచ్చిక మేస్తున్నాయి. పిల్లలు చేతులెత్తి ఆనందంగా – కేకలు వేస్తున్నారు. కొందరు ఆనందంగా కళ్ళు మూసుకుని చేతులు చాపి పాడుతున్నారు, చెట్లపై రాళ్ళు . విసిరి పళ్ళు పడగొడుతున్నారు.
- బలరాముడు నాగలి ధరించాడు. గోపాలురు చేతికర్రలతో పశువులను మేపుతున్నారు.
- కొందరు పర్వతాలపైకి ఎక్కి, కిందికి జారుతున్నారు.
- బాలికలు దాగుడుమూతలు ఆడుతున్నారు.
- శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవిని చేతితో పట్టుకొని నడుస్తున్నాడు. కొందరు పిల్లలు ఒకరి చేతిలో మరొకరు చేతులు . వేస్తూ చెమ్మ చెక్క ఆట ఆడుతున్నారు.
పూర్వకథ :
 కృష్ణుడు వ్రేపల్లెలో యశోదానందుల ఇంట్లో పెరుగుతున్నాడు. అక్కడ పూతన చనుబాలు ఇచ్చి కృష్ణుడిని చంపబోయింది. సుడిగాలి వచ్చి కృష్ణుడిని ఎత్తుకుపోయింది. శకటాసురుడు వచ్చాడు. చెట్లు వానిపై పడిపోయాయి. ఈ అపాయాలు అన్నీ భగవంతుని దయవల్ల తప్పిపోయాయి. అప్పుడు నందుడు వ్రేపల్లెలో ఒక
 సమావేశం ఏర్పాటుచేశాడు. వస్తున్న ఉపద్రవాల గురించి చర్చించారు. వారిలో ‘ఉపనందుడు’ అనే ముసలి గోపాలకుడికి దైవ సంకల్పం వల్ల ఒక ఆలోచన వచ్చింది. వ్రేపల్లెను విడిచి పెట్టి, బృందావనమునకు వెళ్ళడం మంచిదని అతడే వారికి ఇలా సలహా ఇచ్చాడు.
7th Class Telugu 16th Lesson బాల్య క్రీడలు 1 Mark Bits
1. “ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం” – ఏ అలంకార లక్షణం?
 ఎ) ఉపమ
 బి) ఉత్ప్రేక్ష
 సి) వృత్త్యనుప్రాస
 డి) అంత్యానుప్రాస
 జవాబు:
 బి) ఉత్ప్రేక్ష
2. “రాముడు” – గురు, లఘువులు గుర్తించండి.
 ఎ) UIU
 బి) III
 సి) UII
 డి) UUI
 జవాబు:
 సి) UII
3. దైత్యవరులమై అబ్ది చిలుకుదామా ! (అర్థాన్ని గుర్తించండి)
 ఎ) ఆకాశం
 బి) సముద్రం
 సి) వాయువు
 డి) వెలుగు
 జవాబు:
 బి) సముద్రం

4. ‘ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్లయితే అది ఏ అలంకార లక్షణం?
 ఎ) వృత్త్యనుప్రాస
 బి) ఛేకానుప్రాస
 సి) లాటానుప్రాస
 డి) ఉపమాలంకారం
 జవాబు:
 ఎ) వృత్త్యనుప్రాస
5. “సాగరం” (గురు లఘువులు గుర్తించండి)
 ఎ) UII
 బి) UIU
 సి) UUI
 డి) UUU
 జవాబు:
 బి) UIU
6. “రామయ్యకు భాగ్యం కొద్దీ ఉద్యోగం దొరికింది”.
 ఎ) సముద్రం
 బి) రాజు
 సి) దుఃఖం
 డి) అదృష్టం
 జవాబు:
 డి) అదృష్టం
III. భాషాంశాలు
పదాలు – ఆర్థాలు :
 సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థం గుర్తించండి.
7. రాముడు కపులతో కలసి వారధి కట్టాడు.
 ఎ) సైనికులు
 బి) రాక్షసులు
 సి) కోతులు
 డి) చెట్లు
 జవాబు:
 సి) కోతులు
8. ప్రావీణ్యం కోసం రోజూ అభ్యాసం చెయ్యాలి.
 ఎ) నేర్పు
 బి) ప్రతిభ
 సి) తెలివి
 డి) జ్ఞానము
 జవాబు:
 ఎ) నేర్పు
9. గోప కుమారులు పన్నిదములు వేసి పండ్లగుత్తులను రాల్చారు.
 ఎ) రాళ్ళు
 బి) పందెములు
 సి) చిక్కాలు
 డి) ప్రతిజ్ఞలు
 జవాబు:
 బి) పందెములు

10. వారు కపులవలె జలరాశిని బంధించారు.
 ఎ) నీళ్ళు
 బి) చెరువులు
 సి) సరస్సు
 డి) సముద్రము
 జవాబు:
 డి) సముద్రము
11. పిల్లలకు ఈడు వచ్చింది.
 ఎ) మదం
 బి) వయసు
 సి) దురంతం
 డి) సొగసు
 జవాబు:
 బి) వయసు
12. ఆకాశంలో నక్షత్రాలు తనరుట చూచాను.
 ఎ) పలకరించు
 బి) నశించు
 సి) ప్రకాశించు
 డి) ఆరాధించు
 జవాబు:
 సి) ప్రకాశించు
13. తటాలున వర్షం కురిసింది.
 ఎ) మందంగా
 బి) చిన్నగా
 సి) మనోహరంగా
 డి) హఠాత్తుగా
 జవాబు:
 డి) హఠాత్తుగా

14. పుణ్యాత్ములకు ఈ భూమి ఇరవుగా ఉంది.
 ఎ) పాపం
 బి) మందిరం
 సి) కర్మ
 డి) స్థానం
 జవాబు:
 డి) స్థానం
15. క్రేపు మందలో కలిసింది.
 ఎ) నాడ
 బి) వాడ
 సి) దూడ
 డి) వరాహం
 జవాబు:
 సి) దూడ
పర్యాయపదాలు :
 సూచన : గీత గీసిన పదాలకు పర్యాయపదాలను గుర్తించండి.
16. “కవులమై జలరాశి కట్టుదుమా?” గీత గీసిన పదానికి సమానార్థక పదాలు గుర్తించండి.
 ఎ) సముద్రము, అబ్ది
 బి) సరోవరము, పారావారము
 సి) సంద్రము, అంబుజాకరము
 డి) అంభోది, చలిచెలమ
 జవాబు:
 ఎ) సముద్రము, అబ్ది
17. రాజు రాజ్యం పాలించాడు.
 ఎ) సచివుడు, సేనాని
 బి) సచివుడు, నరపతి
 సి) నరపతి, పృథ్వీపతి
 డి) సురపతి, నరపతి
 జవాబు:
 సి) నరపతి, పృథ్వీపతి
18. అమరులు వరాలు ఇస్తారు.
 ఎ) రాక్షసులు, దేవతలు
 బి) దేవతలు, సురలు
 సి) దానవులు, సురలు
 డి) కిన్నెరులు, కింపురుషులు
 జవాబు:
 బి) దేవతలు, సురలు

19. అందరు ఆవళిలో ఉన్నారు.
 ఎ) జలధి, ఆశ
 బి) ఆవరణం, ఆరోపణ
 సి) వరుస, పంక్తి
 డి) సాగరం, సముదాయం
 జవాబు:
 సి) వరుస, పంక్తి
20. దెయ్యాలు దయాహీనులు.
 ఎ) బుధులు, వామరులు
 బి) రమణులు, రంజనులు
 సి) దానవులు, రాక్షసులు
 డి) నటులు, వైద్యులు
 జవాబు:
 సి) దానవులు, రాక్షసులు
21. అంఘ్రి యుగళానికి నమస్సులు.
 ఎ) పాదము, పాపము
 బి) కరము, వారము
 సి) తొండము, కిరణము
 డి) కాలు, పాదము
 జవాబు:
 డి) కాలు, పాదము
22. తనువును రక్షించాలి.
 ఎ) మేను, మనువు
 బి) మంత్రి, నాశిక
 సి) శరీరం, దేహం
 డి) నరము, నయనం
 జవాబు:
 సి) శరీరం, దేహం
23. వనంలో దిరిగాము.
 ఎ) జలధి, జలం
 బి) వారి, వారిదం
 సి) ధనము, దాపు
 డి) అరణ్యం, విపినం
 జవాబు:
 డి) అరణ్యం, విపినం
ప్రకృతి – వికృతులు :
24. కరవు వల్ల కసవుకు లోటు వచ్చింది – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
 ఎ) గ్రాసము
 బి) ఘాసము
 సి) గటిక
 డి) కాసము
 జవాబు:
 బి) ఘాసము

25. రాజకుమారులు అడవికి వెళ్ళారు – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
 ఎ) కొమరులు
 బి) క్రూరులు
 సి) పుత్రులు
 డి) పిల్లలు
 జవాబు:
 ఎ) కొమరులు
26. గోపబాలకులు పన్నిదము వేశారు – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
 ఎ) ఫణిదం
 బి) పనిదం
 సి) పణితము
 డి) పందెము
 జవాబు:
 సి) పణితము
27. ఆ యోగి మా గ్రామానికి రాలేదు – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
 ఎ) జ్యోగి
 బి) రోగి
 సి) సన్నాసి
 డి) జోగి
 జవాబు:
 డి) జోగి
28. అప్సర నటించింది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
 ఎ) అచ్చర
 బి) అమ్మర
 సి) అక్కర
 డి) అప్పర
 జవాబు:
 ఎ) అచ్చర

29. మృగాలు అటవిలో ఉంటాయి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
 ఎ) ఆడావి
 బి) అరవి
 సి) అడవి
 డి) అరివె
 జవాబు:
 సి) అడవి
30. అతని రూపము బాగుంది. – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
 ఎ) రోపు
 బి) రూపు
 సి) రూపం
 డి) రిపు
 జవాబు:
 బి) రూపు
31. భాగ్యం పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
 ఎ) బాయము
 బి) బారము
 సి) బరము
 డి) బాగెము
 జవాబు:
 డి) బాగెము
వ్యతిరేక పదాలు :
32. దేవతలు వచ్చారు.
 ఎ) రాక్షసులు
 బి) కిన్నరులు
 సి) సురలు
 డి) గంధర్వులు
 జవాబు:
 ఎ) రాక్షసులు
33. చెట్టు అడ్డంగా పెరిగింది.
 ఎ) మధ్యగ
 బి) మధ్యము
 సి) నిలువు
 డి) మరియ
 జవాబు:
 సి) నిలువు

34. ఇహంలో స్థానం పొందాలి.
 ఎ) పారం
 బి) గతం
 సి) పరం
 డి) తానం
 జవాబు:
 సి) పరం
35. ముందు నడవాలి.
 ఎ) మెల్లగా
 బి) అడ్డుగా
 సి) మందంగా
 డి) వెనక
 జవాబు:
 డి) వెనక
36. రాకుమారులు చనుదురు.
 ఎ) వెళ్తారు
 బి) వత్తురు
 సి) రారు
 డి) పోవుదురు
 జవాబు:
 బి) వత్తురు
సంధులు :
37. వనజాక్షుడు వేణుగానం చేశాడు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
 ఎ) వన + జాక్షుడు
 బి) వనజా + క్షుడు
 సి) వనజ + అక్షుడు
 డి) వనజం + అక్షుడు
 జవాబు:
 సి) వనజ + అక్షుడు
38. ‘నరేంద్రుడు‘ – గీత గీసిన పదం ఏ సంధి?
 ఎ) గుణసంధి
 బి) అత్యసంధి
 సి) వృద్ధి సంధి
 డి) యణాదేశ సంధి
 జవాబు:
 ఎ) గుణసంధి

39. బొబ్బవెట్టి పిలిచాడు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
 ఎ) బొబ్బ + వెట్టి
 బి) బొబ్బ + ఎట్టి
 సి) బొబ్బ + పెట్టి
 డి) బొబ్బా + పెట్టి
 జవాబు:
 సి) బొబ్బ + పెట్టి
40. ‘పరాగమింత’ ఉంది – దీనిని విడదీయండి.
 ఎ) పరాగము + అంత
 బి) పరాగం + అంత
 సి) పరాగము + ఇంత
 డి) పరాగ + అంత
 జవాబు:
 సి) పరాగము + ఇంత
41. క్రింద వానిలో నిత్యసంధి ఏది?
 ఎ) ఉత్వసంధి
 బి) త్రికసంధి
 సి) అత్వసంధి
 డి) టుగాగమసంధి
 జవాబు:
 ఎ) ఉత్వసంధి
42. ఐ, ఔ లను ఏమంటారు?
 ఎ) గుణాలు
 బి) యజ్ఞులు
 సి) అనునాసికలు
 డి) వృద్ధులు
 జవాబు:
 డి) వృద్ధులు
43. ‘తెచ్చియిచ్చు – ఇది ఏ సంధి?
 ఎ) అత్వసంధి
 బి) యడాగమసంధి
 సి) ఇత్వసంధి
 డి) త్రికసంధి
 జవాబు:
 బి) యడాగమసంధి

44. క్రింది వానిలో తెలుగు సంధి పదం గుర్తించండి.
 ఎ) ప్రత్యయం
 బి) గుణైక
 సి) చల్లులాడ
 డి) నరేంద్రుడు
 జవాబు:
 సి) చల్లులాడ
సమాసాలు :
45. రామకృష్ణులు’ అనే పదం ఏ సమాసమో గుర్తించండి.
 ఎ) ద్విగు సమాసం
 బి) ద్వంద్వ సమాసం
 సి) బహువ్రీహి సమాసం
 డి) అవ్యయీభావ సమాసం
 జవాబు:
 బి) ద్వంద్వ సమాసం
46. ‘వనజాక్షుడు’ అనే సమాసానికి విగ్రహవాక్యం గుర్తించండి.
 ఎ) వనజములు, అక్షులు
 బి) వనజముల వంటి అక్షులు గలవాడు
 సి) వనం యొక్క అక్షుడు
 డి) వనజము లాంటి కన్నులు
 జవాబు:
 బి) వనజముల వంటి అక్షులు గలవాడు
47. మతిహీనుడు – ఇది ఏ సమాసం?
 ఎ) తృతీయా తత్పురుష
 బి) బహువ్రీహి
 సి) షష్ఠీ తత్పురుష
 డి) ద్వంద్వము
 జవాబు:
 ఎ) తృతీయా తత్పురుష

48. అసత్యం పలుకరాదు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
 ఎ) ప్రతిసత్యం
 బి) సత్యం సత్యం
 సి) సత్యం కానిది
 డి) అనుసత్యం
 జవాబు:
 సి) సత్యం కానిది
49. షష్ఠీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
 ఎ) నెలరాజు
 బి) కావ్యనిధి
 సి) చక్రపాణి
 డి) నరేంద్రుడు
 జవాబు:
 డి) నరేంద్రుడు
50. లతికల యొక్క ఆవళి – దీనికి సమాస పదం గుర్తించండి.
 ఎ) లతా వరస
 బి) ప్రత్యావళి
 సి) లతికావళి
 డి) అనుతావళి
 జవాబు:
 సి) లతికావళి
51. ఉర్వీనాథుడు – దీనికి విగ్రహవాక్యం ఏది?
 ఎ) ఉర్వి యందు నాథుడు
 బి) ఉర్వి కొరకు నాథుడు
 సి) ఉర్వికి నాథుడు
 డి) ఉర్విని నాథుడు
 జవాబు:
 సి) ఉర్వికి నాథుడు
52. అన్యపదార్థ ప్రాధాన్యము గల సమాసం గుర్తించండి.
 ఎ) బహువ్రీహి
 బి) తత్పురుష
 సి) ద్వంద్వము
 డి) ద్విగువు
 జవాబు:
 ఎ) బహువ్రీహి
వాక్య ప్రయోగాలు :
53. బాలుడు ఆశ్రమం, చేరాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
 ఎ) బాలుడు ఆశ్రమం చేరలేదు
 బి) బాలుడు ఆశ్రమం చేరకపోవచ్చు
 సి) బాలుడు ఆశ్రమం చేరాలి
 డి) బాలుడు ఆశ్రమం చేరలేకపోవచ్చు
 జవాబు:
 ఎ) బాలుడు ఆశ్రమం చేరలేదు

54. వృద్దుడు’ అందరిని ఆదుకున్నాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
 ఎ) వృద్దుడు అందరిని తప్పక ఆదుకోకూడదు
 బి) వృద్దుడు ఆదుకోకూడదు
 సి) వృద్ధుడు కొందరిని ఆదుకోలేదు
 డి) వృద్దుడు అందరిని ఆదుకోలేదు
 జవాబు:
 డి) వృద్దుడు అందరిని ఆదుకోలేదు
55. అంతట బంధువులు కలరు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
 ఎ) అంతట బంధువులు ఉండాలి
 బి) అంతట బంధువులు మాత్రమే ఉండకూడదు
 సి) అంతట బంధువులు లేరు
 డి) అంతట బంధువు లేకపోవచ్చు
 జవాబు:
 సి) అంతట బంధువులు లేరు
56. అన్నింటికి కారణం ఉంటుంది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
 ఎ) అన్నింటికి కారణం ఉండాలి
 బి) అన్నింటికి కారణం ఉండకపోవచ్చు
 సి) అన్నింటికి కారణం ఉండి తీరాలి
 డి) అన్నింటికి కారణం ఉండదు
 జవాబు:
 డి) అన్నింటికి కారణం ఉండదు
57. మితిమీరిన ఆశ ఉండాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
 ఎ) మితిమీరిన ఆశ ఉండకూడదు
 బి) మితిమీరిన ఆశ ఉండకపోవచ్చు
 సి) మితిమీరిన ఆశ ఉండి తీరాలి
 డి) మితిమీరిన ఆశ ఉండలేకపోవచ్చు
 జవాబు:
 ఎ) మితిమీరిన ఆశ ఉండకూడదు
58. సన్యాసి పండుకున్నాడు. సన్యాసి నిద్రపోలేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది?
 ఎ) నిద్ర కోసం, సన్యాసి పండుకున్నాడు
 బి) సన్యాసి నిద్ర కోసం పండుకున్నాడు
 సి) సన్యాసి పండుకున్నాడుగాని నిద్రపోలేదు
 డి) సన్యాసి పండుకున్నాడు నిద్రించాడు.
 జవాబు:
 సి) సన్యాసి పండుకున్నాడుగాని నిద్రపోలేదు

59. నాలో చురుకుదనం ఉంది. జిజ్ఞాస ఉంది – దీనికి సంయుక్త వాక్యం ఏది?
 ఎ) నాలో చురుకుదనం, జిజ్ఞాస ఉన్నాయి
 బి) నాలో చురుకుదనమే కాదు జిజ్ఞాస కూడా ఉంది
 సి) నాలో జిజ్ఞాస వల్ల చురుకుదనం ఉంది
 డి) నాలో చురుకుదనం వల్ల జిజ్ఞాస ఉంది
 జవాబు:
 ఎ) నాలో చురుకుదనం, జిజ్ఞాస ఉన్నాయి
60. ఆయన సత్యకాలం వాడు. పరమ సాత్వికుడు దీనికి సంయుక్త వాక్యం ఏది?
 ఎ) ఆయన సత్యకాలం వాడు, పరమ సాత్వికుడు
 బి) ఆయన సత్యకాలంలోనేవాడు కాదు సాత్వికుడు
 సి) ఆయన సాత్వికత వల్ల సత్యకాలం వాడు
 డి) పరమ సాత్వికుడు సత్యకాలం వాడు ఆయన
 జవాబు:
 ఎ) ఆయన సత్యకాలం వాడు, పరమ సాత్వికుడు
61. మీరు రావద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) ధాత్వర్థక వాక్యం
 బి) నిషేధార్థక వాక్యం
 సి) అప్యర్థక వాక్యం
 డి) హేత్వర్థక వాక్యం
 జవాబు:
 బి) నిషేధార్థక వాక్యం
62. రాము ఊరికి తప్పక వెళ్తాడు – ఇది ఏ రకమైన పురుష వాక్యం? (సి)
 ఎ) తద్ధర్మార్థక వాక్యం
 బి) అభ్యర్థక వాక్యం
 సి) నిశ్చయార్థక వాక్యం
 డి) వ్యతిరేకార్థక వాక్యం
 జవాబు:
 సి) నిశ్చయార్థక వాక్యం
63. రామం తప్పక వెళ్తాడు – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) హేత్వర్థక వాక్యం
 బి) నిశ్చయార్థక వాక్యం
 సి) తుమున్నర్థక వాక్యం
 డి) ప్రార్థనార్థక వాక్యం
 జవాబు:
 బి) నిశ్చయార్థక వాక్యం
64. అతడు వస్తాడో ! రాడో ! – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) తద్ధర్మార్థక వాక్యం
 బి) సందేహార్థక వాక్యం
 సి) అప్యర్థక వాక్యం
 డి) హేత్వర్థక వాక్యం
 జవాబు:
 బి) సందేహార్థక వాక్యం

65. వారందరికి ఏమైంది? – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) ప్రశ్నార్థక వాక్యం
 బి) అభ్యర్థక వాక్యం
 సి) తద్ధర్మార్థక వాక్యం
 డి) సందేహార్థక వాక్యం
 జవాబు:
 ఎ) ప్రశ్నార్థక వాక్యం
66. అగ్ని మండును – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) విధ్యర్థక వాక్యం
 బి) తద్ధర్మార్థక వాక్యం
 సి) ప్రశ్నార్థక వాక్యం
 డి) హేత్వర్థక వాక్యం
 జవాబు:
 బి) తద్ధర్మార్థక వాక్యం
విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషలు
67. నేర్పుతో పని సాధించాలి – ఇది ఏ విభక్తి?
 ఎ) తృతీయా విభక్తి
 బి) సప్తమీ విభక్తి
 సి) పంచమీ విభక్తి
 డి) షష్ఠీ విభక్తి
 జవాబు:
 ఎ) తృతీయా విభక్తి
68. నదులలో నీరుంది – ఇది ఏ విభక్తి ప్రత్యయం?
 ఎ) ప్రథమా
 బి) షష్ఠీ
 సి) ద్వితీయా
 డి) సప్తమీ
 జవాబు:
 బి) షష్ఠీ
69. అందరు గుడికి వెళ్ళారు – ఇది. భాషాభాగం?
 ఎ) అవ్యయం
 బి) క్రియ
 సి) సర్వనామం
 డి) క్రియ
 జవాబు:
 సి) సర్వనామం

70. పచ్చతోరణాలు ఇంటికి కట్టారు – ఇది ఏ భాషా భాగం?
 ఎ) విశేషణం
 బి) క్రియ
 సి) అవ్యయం
 డి) ధాతువు
 జవాబు:
 ఎ) విశేషణం
71. వాడు పెళ్ళికి వెళ్ళాడు – ఇది ఏ పురుష ప్రత్యయం?
 ఎ) ప్రథమ పురుష
 బి) మధ్యమ
 సి) అధమ పురుష
 డి) ఉత్తమ పురుష
 జవాబు:
 ఎ) ప్రథమ పురుష
72. నేను, మేము – ఇవి ఏ పురుష ప్రత్యయాలు?
 ఎ) ప్రథమ పురుష
 బి) ఉత్తమ పురుష
 సి) మధ్యమ పురుష
 డి) అధమ పురుష
 జవాబు:
 బి) ఉత్తమ పురుష

సొంతవాక్యాలు :
 సూచన : క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
73. ఒడిసి పట్టుకొను : నీటిలో మునుగుతున్న నా మిత్రుడి చొక్కాను ఒడిసిపట్టుకొని పైకి లాగాను.
 74. బొబ్బపెట్టు : చీకట్లో మనిషిని చూసి దెయ్యం అనుకొని పెద్దగా బొబ్బ పెట్టాను.
 75. మన్ననచేయు : మా గ్రామ సర్పంచి గారిని, మా గ్రామస్థులు అంతా బాగా మన్నన చేస్తారు.
 76. కౌతుకము : మా మామయ్య పిల్లలతో కౌతుకముతో ఆడుతాను.
 77. వన్య జంతువులు : వన్య జంతువులను మనం బాధించరాదు.
 78. బాల్య క్రీడలు : పెద్దవారికి కూడా వారి బాల్య క్రీడలు గుర్తిస్తే ఉత్సాహం కలుగుతుంది.
 79. ప్రావీణ్యం : కళాకారులు తమ కళలో ప్రావీణ్యం ప్రదర్శిస్తారు.
 80. జలరాశి : జలరాశిలో నదులన్నీ కలిసి తీరుతాయి.
 81. నరేంద్రుడు : నరేంద్రుడు రాజ్యాన్ని పాలించాడు.
 82. పన్నిదములు : గోదావరి జిల్లాలో పన్నిదములు జరుగుతాయి.
