These AP 8th Class Biology Important Questions 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి will help students prepare well for the exams.
AP Board 8th Class Biology 9th Lesson Important Questions and Answers జంతువుల నుండి ఆహారోత్పత్తి
ప్రశ్న 1.
 పశుపోషణ ఆవశ్యకత ఏమిటి ?
 జవాబు:
- పశుపోషణ వలన మనకు పాలు వాటి ఆహార ఉత్పత్తులు లభిస్తాయి.
- వ్యవసాయంలో పశువుల పాత్ర కీలకం.
- రవాణాలో కూడ పశువులను వాడుతున్నాము.
- పశు వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా వాడుతున్నారు.
- పశువుల పేడ నుండి బయోగ్యాస్ తయారుచేస్తారు.
- భారతదేశం వంటి దేశాలలో పశుపోషణ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంది.

ప్రశ్న 2.
 వరి పొలాలలో చేపలు పెంచటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి ?
 జవాబు:
- ఈ మధ్య కాలంలో రైతులు వరి పంటతో పాటుగా పొలంలో చేపలు కూడా పెంచుతున్నారు.
- వరిచేనులోని నీటిలోనే చేపలను పెంచుతారు.
- వరిపొలంలో చేపలను పెంచడం అనేది అనేక రకాలుగా ఉపయోగమైన పద్ధతి.
- వరి పొలాలలో రసాయనిక ఎరువులు, కీటక సంహారిణులు ఎక్కువ వాడటం వలన వెలువడే విష రసాయనాలు చేపలు, పక్షులు, పాములపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
- వరిపొలంలో చేపలను పెంచడం వలన వరిలో కాండం తొలుచు పురుగు వంటి వ్యాధులను అరికట్టవచ్చు.
- అందువల్ల రసాయనాల వినియోగం తగ్గుతుంది. పర్యావరణం కాపాడబడుతుంది.
ప్రశ్న 3.
 గుడ్డులోని పోషకవిలువలు గురించి రాయండి.
 జవాబు:
 గుడ్డు మంచి పౌష్టిక ఆహారము. అది అనేక పోషకాలను కల్గి ఉంది. దీనిలో
 కార్బోహైడ్రేట్స్ – 1.12 గ్రా.
 కేలరీస్ – 647 కి.జె.
 ప్రొటీన్స్ – 12.6 గ్రా.
 క్రొవ్వు – 10.6 గ్రా.
 విటమిన్ A – 19%
 థయామిన్ – 0.066 మి.గ్రా. (6%)
 రైబోఫ్లెవిన్ – 0.5 మి.గ్రా. (42%)
 విటమిన్ D – 87 IU
 విటమిన్ E – 1.03 మి.గ్రా.
 కాల్షియం – 50 మి.గ్రా.
 ఐరన్ – 1.2 మి.గ్రా.
 మెగ్నీషియం – 10 మి.గ్రా.
 ఫాస్పరస్ – 172 మి.గ్రా.
 కొలెస్టరాల్ – 126 మి.గ్రా. ఉన్నాయి

ప్రశ్న 4.
 పాల శీతలీకరణ కేంద్రాలలో పాలలోని సూక్ష్మజీవులను నాశనం చేసి, పాలను నిల్వచేసే పద్ధతిని వివరించండి.
 జవాబు:
- పాల శీతలీకరణ కేంద్రాలలో పాలను 72 ( వద్ద 30 నిమిషాల పాటు వేడిచేసి హఠాత్తుగా 10 కన్నా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద శీతలీకరిస్తారు. ఈ ప్రక్రియను పాశ్చరైజేషన్ అంటారు.
- దీనివలన పాలు సూక్ష్మజీవరహితం చేయబడి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
- ఈ పద్ధతిని లూయిస్ పాశ్చర్ కనిపెట్టాడు.
ప్రశ్న 5.
 పశువుల పెంపకంలో అనుబంధ ఉత్పత్తులు, పరిశ్రమల గురించి రాయండి. (లేదా) ఆవుపేడ జీవ ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఇది ఒక అనుబంధ పదార్దమేకదా! పశుసంవర్థనంలో ఉత్పత్తి అయ్యే ఇలాంటి కొన్ని అనుబంధ ఉత్పత్తుల గురించి రాయండి.
 జవాబు:
 పశువుల పెంపకంలో అనుబంధ ఉత్పత్తులు :
 మాంసం, పేడ, తోళ్ళు, ఎముకలు, చర్మం, వాటి కొమ్ములు.
 పరిశ్రమలు :
- డైరీ పరిశ్రమ : దీనిలో పాలు, పాల ఉత్పత్తులు చేస్తారు.
- కబేల (పశువధశాల) : ఎద్దు మాంసం ఇక్కడ తయారుచేస్తారు.
- తోళ్ళ పరిశ్రమ : ఇక్కడ తోళ్లను శుభ్రపరిచి పర్సులు, బెలు, చెప్పులు తయారుచేస్తారు.
- ఎరువుల పరిశ్రమ : పేడను ఉపయోగించి బయోగ్యాస్ తయారుచేస్తారు.
- బయోగ్యాస్ పరిశ్రమ : పశువుల ఎముకలను ఎరువుల కర్మాగారాలలో వాడతారు.
- వస్తువులు తయారుచేసే పరిశ్రమ : పశువుల చర్మం, కొమ్ములను ఉపయోగించి వివిధ రకాల ఆట మరియు అలంకార వస్తువులు తయారుచేస్తారు.
1 మార్కు ప్రశ్నలు
ప్రశ్న 1.
 నదీముఖ ద్వారాలు అనగానేమి ? అవి సముద్రపు మరియు నీటి చేపలు నివసించటానికి ఎలా అనువుగా ఉంటాయి ?
 జవాబు:
 నదీముఖ ద్వారాలు అనగా నదులు సముద్రంలో కలిసే చోటు. నదీముఖ ద్వారాలలో సముద్రపు మరియు మంచినీటి చేపలు నివసించటానికి ఎలా అనువుగా ఉంటుంది అంటే ఈ ప్రాంతాలలో నివసించే చేపలు లవణీయత వ్యత్యాసాన్ని తట్టుకొనే శక్తిని కలిగి ఉంటాయి.

ప్రశ్న 2.
 శ్వేత విప్లవం అనగానేమి?
 జవాబు:
 శ్వేత విప్లవం : పాల ఉత్పత్తిని పెంచటం. పాల నుండి లభించే ఇతర పదార్థాల నాణ్యతని, పరిమాణాన్ని పెంచి, సాధ్యమైనంత తక్కువ ధరలో అందరికీ అందించటానికి జరిగిన ప్రయత్నాన్ని శ్వేత విప్లవం అంటారు.
ప్రశ్న 3.
 నీలి విప్లవం అనగానేమి?
 జవాబు:
 నీలి విప్లవం : చేపల పెంపకం. దిగుబడి పెంచటానికి, నాణ్యత అధికం చేయుటకు జరిగిన ప్రయత్నాన్ని నీలి విప్లవం అంటారు.
ప్రశ్న 4.
 ఎపిస్ టింక్చర్ అంటే ఏమిటి?
 జవాబు:
 ఎపిస్ టింక్చర్ : తేనెటీగల విషంతో తయారుచేయబడిన హోమియో మందుని ఎపిస్ టింక్చర్ అంటారు.
ప్రశ్న 5.
 చేపలను నిలవ చేయడంలో పాటించే పద్ధతులను వివరించండి.
 జవాబు:
 చేపలను నిలవ చేయడంలో పాటించే పద్ధతులు
 1. ఎండలో ఎండబెట్టడం
 2. పాక్షికంగా ఎండబెట్టడం
 3. పొగ బెట్టడం
 4. ఉప్పులో ఊరబెట్టడం
ప్రశ్న 6.
 ఆవు, గేదె, మేక, గొర్రెల పెంపకంలో ఏమైనా తేడాలున్నాయా ?
 జవాబు:
 ఆవులు, గేదెలు, ఎండిన గడ్డితో పాటు పచ్చిగడ్డి తింటాయి. మేకలు చెట్ల ఆకులను, పచ్చిగడ్డిని ఆహారంగా తీసుకొంటాయి. గొర్రెలు పచ్చిగడ్డిని, నూకలను ఆహారంగా తీసుకుంటాయి.

ప్రశ్న 7.
 పశువులను పెంచేవారు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలేవి ?
 జవాబు:
 అనావృష్టి పరిస్థితులలో పశుగ్రాసం కొరత పశువులు పెంచేవారు సాధారణంగా ఎదుర్కొనే సమస్య.
ప్రశ్న 8.
 అధిక మొత్తంలో చేపలను పట్టడానికి ఏం చేస్తారు ?
 జవాబు:
 అధిక మొత్తంలో చేపలు పట్టుకొనుటకు నైలాన్ వలలు ఉపయోగిస్తారు. పెద్ద వలలను, మోటార్ పడవలను ఉపయోగిస్తారు.
లక్ష్యాత్మక నియోజనము
ప్రశ్న 1.
 గేదె జాతులలో ప్రసిద్ధ జాతి పేరు :
 ఎ) జెర్సీ
 బి) హాల్ స్టీన్
 సి) ముర్రా
 డి) అనోకా
 జవాబు:
 సి) ముర్రా
ప్రశ్న 2.
 ఏనెలలో పాల దిగుబడి చాలా తక్కువగా ఉండును ?
 ఎ) జనవరి
 బి) ఏప్రిల్
 సి) డిసెంబర్
 డి) నవంబర్
 జవాబు:
 బి) ఏప్రిల్

ప్రశ్న 3.
 ఆస్ట్రిచ్ గుడ్డు తర్వాత అతిపెద్ద గుడ్డు పెట్టు పక్షి
 ఎ) ఈము
 బి) ఏనుగు
 సి) పావురం
 డి) పెంగ్విన్
 జవాబు:
 ఎ) ఈము
ప్రశ్న 4.
 ఏ గేదె పాలు రిఫ్రిజిరేటర్లలో ఉంచకున్నా దాదాపు వారం రోజులపాటు చెడిపోకుండా ఉంటాయి ?
 ఎ) ముర్రా
 బి) జెర్సీ
 సి) కోలేరు
 డి) చిల్కా
 జవాబు:
 డి) చిల్కా
ప్రశ్న 5.
 పంది మాంసాన్ని ఏమంటారు ?
 ఎ) బీఫ్
 బి) పోర్క్
 సి) మటన్
 డి) చికెన్
 జవాబు:
 బి) పోర్క్

ప్రశ్న 6.
 మాంసం కోసం పెంచే కోళ్ళు
 ఎ) లేయర్స్
 బి) హెచరీస్
 సి) బ్రాయిలర్స్
 డి) అనోకా
 జవాబు:
 సి) బ్రాయిలర్స్
ప్రశ్న 7.
 కోడిగ్రుద్దును ఇంక్యుబేటర్స్ ఉపయోగించి పొదిగితే కోడిపిల్ల వచ్చుటకు ఎన్ని రోజులు పట్టును?
 ఎ) 21
 బి) 15
 సి) 18
 డి) 10
 జవాబు:
 ఎ) 21
ప్రశ్న 8.
 కోడిపందాల కొరకు పెంచే భారతీయ దేశీయకోడి
 ఎ) అనోకా
 బి) ఆసిల్
 సి) క్లైమౌత్
 డి) వైట్ లెగ్ హార్న్
 జవాబు:
 బి) ఆసిల్

ప్రశ్న 9.
 తేనెటీగలలో సోమరులు
 ఎ) ఆడ ఈగలు
 బి) వంధ్య ఆడ ఈగలు
 సి) మగ వంధ్య ఈగలు
 డి) మగ ఈగలు
 జవాబు:
 డి) మగ ఈగలు
ప్రశ్న 10.
 కృత్రిమ తేనెపట్టులో ఎన్ని భాగాలుంటాయి ?
 ఎ) 2
 బి) 6
 సి) 4
 డి) 1
 జవాబు:
 బి) 6
ప్రశ్న 11.
 ఈ క్రింది వానిలో అత్యంత ప్రాచీన కాలంలోనే మచ్చిక చేసుకున్న జంతువు
 ఎ) కుక్క
 బి) గొట్టె
 సి) పంది
 డి) మేక
 జవాబు:
 ఎ) కుక్క
ప్రశ్న 12.
 నట్టల వ్యాధి వీనికి వస్తుంది.
 ఎ) కోళ్ళు
 బి) ఆవులు, గేదెలు
 సి) మేకలు, గొట్టెలు
 డి) కుక్కలు
 జవాబు:
 సి) మేకలు, గొట్టెలు

ప్రశ్న 13.
 ప్రపంచంలో పాల ఉత్పత్తి అధికంగా చేస్తున్న దేశం
 ఎ) ఇజ్రాయిల్
 బి) అమెరికా
 సి) జపాన్
 డి) భారతదేశం
 జవాబు:
 ఎ) ఇజ్రాయిల్
ప్రశ్న 14.
 దేశీయ గేదె జాతులు రోజుకు సరాసరి ఎన్ని లీటర్ల పాలు యిస్తాయి?
 ఎ) 2 నుండి
 బి) 2 నుండి 5
 సి) 3 నుండి
 డి) 3 నుండి 7
 జవాబు:
 బి) 2 నుండి 5
ప్రశ్న 15.
 మనరాష్ట్రంలో పెంచే ముర్రాజాతి గేదెలు రోజుకు ఎన్ని పాలను యిస్తాయి ?
 ఎ) 8 లీటర్లు
 బి) 10 లీటర్లు
 సి) 14 లీటర్లు
 డి) 6 లీటర్లు
 జవాబు:
 ఎ) 8 లీటర్లు
ప్రశ్న 16.
 జర్సీ ఆవు ఏ దేశానికి చెందింది ?
 ఎ) ఇంగ్లాండ్
 బి) డెన్మార్క్
 సి) అమెరికా
 డి) యూరప్
 జవాబు:
 ఎ) ఇంగ్లాండ్

ప్రశ్న 17.
 సంకరజాతి ఆవు రోజుకు ఎన్ని పాలనిస్తాయి ?
 ఎ) 10 లీటర్ల నుంచి 20 లీటర్లు
 బి) 8 లీటర్ల నుంచి 20 లీటర్లు
 సి) 8 లీటర్ల నుంచి 15 లీటర్లు
 డి) 10 లీటర్ల నుంచి 15 లీటర్లు
 జవాబు:
 బి) 8 లీటర్ల నుంచి 20 లీటర్లు
ప్రశ్న 18.
 మనదేశంలో పాల ఉత్పత్తిలో ఎక్కువ పాలు వీనినుండి లభిస్తున్నాయి.
 ఎ) ఆవులు
 బి) గేదెలు
 సి) ఒంటెలు
 డి) మేకలు, గాడిదలు
 జవాబు:
 ఎ) ఆవులు
ప్రశ్న 19.
 ప్రొఫెసర్ జె.కె. కురియన్ ఏ విప్లవ పితామహుడు ?
 ఎ) హరిత విప్లవం
 బి) నీలి విప్లవం
 సి) శ్వేత విప్లవం
 డి) ఎల్లో రివల్యూషన్
 జవాబు:
 సి) శ్వేత విప్లవం

ప్రశ్న 20.
 ఆపరేషన్ ప్లడ్ దీనికి సంబంధించినది.
 ఎ) నూనెలు
 బి) చేపలు, రొయ్యలు
 సి) పాలు
 డి) మాంసం, గ్రుడ్లు
 జవాబు:
 సి) పాలు
ప్రశ్న 21.
 కంగాయం జాతి ఎద్దులు ఈ జిల్లాలో కనిపిస్తాయి.
 ఎ) ఒంగోలు
 బి) నెల్లూరు
 సి) చిత్తూరు
 డి) తూర్పుగోదావరి
 జవాబు:
 బి) నెల్లూరు
ప్రశ్న 22.
 ఒక ఎద్దు నెలలో ఎన్ని ఆవులు గర్భం ధరించటానికి ఉపయోగపడుతుంది ?
 ఎ) 10-20
 బి) 20-30
 సి) 10-30
 డి) 1-10
 జవాబు:
 బి) 20-30
ప్రశ్న 23.
 ఏ జాతి పశువుల పాలు ఉప్పగా ఉంటాయి ?
 ఎ) ముర్రా
 బి) చిల్కా
 సి) కంగాయం
 డి) ఒంగోలు
 జవాబు:
 సి) కంగాయం

ప్రశ్న 24.
 మొత్తం మాంసం ఉత్పత్తిలో 74% మాంసం వీనినుండి లభిస్తుంది.
 ఎ) చేపలు, రొయ్యలు
 బి) గొట్టెలు, మేకలు
 సి) కోళ్ళు, బాతులు
 డి) ఎద్దులు
 జవాబు:
 డి) ఎద్దులు
ప్రశ్న 25.
 ప్రపంచంలో కోడిగ్రుడ్ల ఉత్పత్తిలో భారత్ స్థానం( )
 ఎ) 1
 బి) 2
 సి) 3
 డి) 4
 జవాబు:
 డి) 4
ప్రశ్న 26.
 ప్రపంచంలో మాంసం ఉత్పత్తిలో భారత్ స్థానం )
 ఎ) 2
 బి) 3
 సి) 4
 డి) 5
 జవాబు:
 బి) 3
ప్రశ్న 27.
 గ్రుడ్ల కోసం పెంచే కోళ్ళు
 ఎ) బ్రాయిలర్
 బి) లేయర్
 సి) నాటుకోళ్ళు
 డి) పైవన్నీ
 జవాబు:
 బి) లేయర్

ప్రశ్న 28.
 బ్రాయిలర్లు పెరుగుటకు పట్టే కాలం
 ఎ) 5 నుండి 6 వారాలు
 బి) 6 నుండి 8 వారాలు
 సి) 5 నుండి 10 వారాలు
 డి) 6 నుండి 12 వారాలు
 జవాబు:
 బి) 6 నుండి 8 వారాలు
ప్రశ్న 29.
 లేయర్ కోడి వాటి జీవితకాలంలో సుమారుగా పెట్టే గ్రుడ్ల సంఖ్య
 ఎ) 250-300
 బి) 300-350
 సి) 200-250
 డి) 350-400
 జవాబు:
 ఎ) 250-300
ప్రశ్న 30.
 గ్రుడ్లను పొదగటానికి అనుకూలమైన ఉష్ణోగ్రత
 ఎ) 30°C – 31°C
 బి) 33°C – 34°C
 సి) 37°C – 38°C
 డి) 39°C – 40°C
 జవాబు:
 సి) 37°C – 38°C
ప్రశ్న 31.
 గ్రుడ్లను ఈ నెలలో ఎక్కువగా పొదిగిస్తారు.
 ఎ) జూన్-జులై
 బి) జనవరి, ఏప్రిల్
 సి) ఆగస్టు-అక్టోబర్
 డి) మార్చి, మే
 జవాబు:
 బి) జనవరి, ఏప్రిల్
ప్రశ్న 32.
 N.E.C.C అనగా
 ఎ) నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ
 బి) న్యూట్రిషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ
 సి) నాచురల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ
 డి) నేషనల్ ఎగ్ కన్జ్యూమర్ కమిటీ
 జవాబు:
 ఎ) నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ
ప్రశ్న 33.
 ‘ఈమూ’ ఈ దేశానికి చెందిన పక్షి.
 ఎ) ఆఫ్రికా
 బి) ఆస్ట్రేలియా
 సి) న్యూజిలాండ్
 డి) అమెరికా
 జవాబు:
 బి) ఆస్ట్రేలియా

ప్రశ్న 34.
 తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు ?
 ఎ) పిశికల్చర్
 బి) ఎపికల్చర్
 సి) పాలీ కల్చర్
 డి) లాక్ కల్చర్
 జవాబు:
 బి) ఎపికల్చర్
ప్రశ్న 35.
 అధిక తేనెనిచ్చే తేనెటీగ జాతి
 ఎ) ఎపిస్ డార్సెటా
 బి) ఎపిస్ ఇండికా
 సి) ఎపిస్ మెల్లిఫెరా
 డి) ఎపిస్ మెలిపోనా
 జవాబు:
 సి) ఎపిస్ మెల్లిఫెరా

ప్రశ్న 36.
 భారతీయ తేనెటీగ ఒక సం||లో ఉత్పత్తి చేసే తేనెం
 ఎ) 1 నుండి 3 కిలోలు
 బి) 3 నుండి 5 కిలోలు
 సి) 3 నుండి 8 కిలోలు
 డి) 3 నుండి 10 కిలోలు
 జవాబు:
 డి) 3 నుండి 10 కిలోలు
ప్రశ్న 37.
 యూరోపియన్ తేనెటీగ ఒక సం||రానికి ఉత్పత్తి చేసే తేనె
 ఎ) 10-15 కిలోలు
 బి) 15-20 కిలోలు
 సి) 20-25 కిలోలు
 డి) 25-30 కిలోలు
 జవాబు:
 డి) 25-30 కిలోలు
ప్రశ్న 38.
 తేనెపట్టులో ఎన్ని రకాల ఈగలుంటాయి?
 ఎ)1
 బి) 2
 సి) 3
 డి) 4
 జవాబు:
 సి) 3
ప్రశ్న 39.
 ఒక తేనెపట్టులో రాణి ఈగల సంఖ్య
 ఎ) 1
 బి) 2
 సి)
 డి) 4
 జవాబు:
 ఎ) 1
ప్రశ్న 40.
 రాణి ఈగ రోజుకు పెట్టే గ్రుడ్ల సంఖ్య
 ఎ) 800-1000
 బి) 800-1200
 సి) 800-1400
 డి) 800-1600
 జవాబు:
 బి) 800-1200

ప్రశ్న 41.
 రాణి ఈగ జీవితకాలం
 ఎ) 2-3 సం||
 బి) 2-4 సం||
 సి) 2-5 సం||
 డి) 2-6 సం||
 జవాబు:
 ఎ) 2-3 సం||
ప్రశ్న 42.
 తేనెపట్టులో అతి తక్కువ జీవిత కాలం కలిగినవి
 ఎ) రాణి
 బి) డ్రోన్లు
 సి) కూలీ ఈగలు
 డి) ఎ మరియు బి
 జవాబు:
 సి) కూలీ ఈగలు
ప్రశ్న 43.
 తేనెపట్టులో కూలీ ఈగలు
 ఎ) వంధ్య మగ ఈగలు
 బి) వంధ్య ఆడ ఈగలు
 సి) ఆడ మరియు మగ ఈగలు
 డి) మగ ఈగలు మాత్రమే
 జవాబు:
 బి) వంధ్య ఆడ ఈగలు
ప్రశ్న 44.
 ఎపిస్ టింక్చరు దీనితో తయారు చేస్తారు.
 ఎ) తేనె
 బి) తేనెటీగల మైనం
 సి) తేనెటీగల విషం
 డి) అయోడిన్
 జవాబు:
 బి) తేనెటీగల మైనం
ప్రశ్న 45.
 తేనె పట్టు నుండి తేనెను తినే జంతువు
 ఎ) కోతి
 బి) అడవి ఉడుత
 సి) ఎలుగుబంటి
 డి) గబ్బిలం
 జవాబు:
 సి) ఎలుగుబంటి

ప్రశ్న 46.
 భారతదేశంలో సముద్రతీరం
 ఎ) 6,500 కి.మీ.
 బి) 7,500 కి.మీ.
 సి) 8,500 కి.మీ.
 డి) 9,500 కి.మీ.
 జవాబు:
 సి) 8,500 కి.మీ.
ప్రశ్న 47.
 చేపల పెంపకంలో విత్తనం అనగా
 ఎ) చేపగ్రుడ్లు
 బి) చేపపిల్లలు
 సి) ఎ మరియు బి
 డి) గుడ్లతో ఉన్న చేపలు
 జవాబు:
 డి) గుడ్లతో ఉన్న చేపలు
ప్రశ్న 48.
 మన సముద్ర జలాల్లో లభించే ఆర్థిక ప్రాముఖ్యత గల చేప
 ఎ) బాంబేదక్
 బి) ఆయిల్ సార్డెన్
 సి) కాటి ఫిష్
 డి) ట్యూనా
 జవాబు:
 సి) కాటి ఫిష్

ప్రశ్న 49.
 ‘ఏశ్చురీ’ అనగా
 ఎ) నదీ, నదీ కలిసే ప్రదేశం
 బి) నదీ, సముద్రం కలిసే ప్రదేశం
 సి) కాలువ, నదీ కలిసే ప్రదేశం
 డి) సముద్రం, సముద్రం కలిసే ప్రదేశం .
 జవాబు:
 బి) నదీ, సముద్రం కలిసే ప్రదేశం
ప్రశ్న 50.
 సమ్మిళిత చేపల పెంపకంలో పరిగణనలోకి తీసుకోవల్సిన ముఖ్యమైన అంశం
 ఎ) చేపల రకం
 బి) చేపల ఆహారపు అలవాట్లు
 సి) చేపల ఆర్థిక ప్రాముఖ్యత
 డి) చేపలు పెరిగే ప్రదేశం
 జవాబు:
 డి) చేపలు పెరిగే ప్రదేశం
ప్రశ్న 51.
 నీలి విప్లవం దీనికి సంబంధించినది.
 ఎ) పాల ఉత్పత్తి
 బి) మాంసం ఉత్పత్తి
 సి) చేపల ఉత్పత్తి
 డి) చర్మాల ఉత్పత్తి
 జవాబు:
 ఎ) పాల ఉత్పత్తి
ప్రశ్న 52.
 పశువుల పెంపకంతో సంబంధించినది
 ఎ) బయోగ్యాస్
 బి) తోళ్ళ పరిశ్రమ
 సి) ఎముకల పరిశ్రమ
 డి) పైవన్నీ
 జవాబు:
 బి) తోళ్ళ పరిశ్రమ

ప్రశ్న 53.
 అగార్ అగార్ అనే కలుపు మొక్కను దేని కొరకు ఉపయోగిస్తారు?
 ఎ) ఆహారంగా
 బి) పరిశ్రమలలో పైకో కొల్లాయిడ్ గా
 సి) ఎ మరియు బి
 డి) పెట్రోలియం తయారీ
 జవాబు:
 డి) పెట్రోలియం తయారీ
ప్రశ్న 54.
 ఏ నెలలో పాల ఉత్పత్తి గరిష్ఠంగా ఉండును ?
 ఎ) నవంబర్
 బి) మార్చి
 సి) ఆగస్టు
 డి) అక్టోబర్
 జవాబు:
 ఎ) నవంబర్
ప్రశ్న 55.
 సంక్రాంతి వంటి పండుగలలో పందేలలో పోటీపడే స్థానిక కోడి రకము
 (A) చిట్టగాంగ్
 (B) వైట్ లెగ్ హార్న్
 (C) అసీల్
 (D) బుర్నా / బెరస
 జవాబు:
 (C) అసీల్

ప్రశ్న 56.
 మన రాష్ట్రానికి పరిమితమైన ఒక ఎండమిక్ జాతి
 (A) కివి
 (B) కంగారు
 (C) ఒంగోలు గిత్త
 (D) తెల్లపులి
 జవాబు:
 (C) ఒంగోలు గిత్త
ప్రశ్న 57.
 తేనెటీగలు, తేనెను ఎలా తయారు చేస్తాయో తెలుసు కోవడానికి కవిత కింది ప్రశ్నలను నూరు శేషన్నది అందులో సరియైన వాటిని గుర్తించండి.
 (1) తేనెటీగలలో ఎన్ని రకాలు ఉంటాయి ?
 (2) పరాగసంపర్కానికి తేనెటీగలు ఎలా తోడ్పడతాయి?
 (3) తేనె తయారీలో మగ ఈగల పాత్ర ఉంటుందా ?
 (4) తేనెను ఈగలోని శ్వాసగ్రంథులు తయారు చేస్తాయా?
 (A) 1, 2 మాత్రమే
 (B) 2, 3 మాత్రమే
 (C) 1 మాత్రమే
 (D) 4 మాత్రమే
 జవాబు:
 (B) 2, 3 మాత్రమే
ప్రశ్న 58.
 పశుసంవర్థనకు చెందిన సరైన నినాదం
 (A) సాంప్రదాయ లేదా అధిక దిగుబడినిచ్చే పశువులలో ఏదో ఒకదానిని పెంచడం
 (B) సాంప్రదాయరకాలనే పెంచడం
 (C) సాంప్రదాయ లేక అధిక దిగుబడి పశువులను పెంచకపోవడం
 (D) పైవన్నీ
 జవాబు:
 (A) సాంప్రదాయ లేదా అధిక దిగుబడినిచ్చే పశువులలో ఏదో ఒకదానిని పెంచడం

ప్రశ్న 59.
 ఆక్వా కల్చర్ : చేపలు : : ఎపికల్చర్ : …..
 (A) బ్రాయిలర్ కోళ్ళు
 (B) రొయ్యలు
 (C) పట్టుపురుగులు
 (D) తేనెటీగలు
 జవాబు:
 (D) తేనెటీగలు
ప్రశ్న 60.
 ఎపిస్ టింక్చర్ అనేది
 (A) రొయ్యల
 (B) కాల్షివర్ నూనె
 (C) తేనెటీగల విషం నుంచి తయారీ
 (D) పీతల తైలం
 జవాబు:
 (C) తేనెటీగల విషం నుంచి తయారీ
