These AP 8th Class Social Important Questions 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 will help students prepare well for the exams.
AP Board 8th Class Social 11Ath Lesson Important Questions and Answers జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919
ప్రశ్న 1.
 కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.
మరుసటి సంవత్సరం (1905) కాంగ్రెస్ సమావేశంలో అతివాద జాతీయ నాయకులైన తిలక్, బిపిన్ చంద్రపాల్, లజ్ పత్ రాయ్ వంటి వాళ్లు, బెంగాల్ విభజన రద్దు చేయమనే కాకుండా సంపూర్ణ స్వాతంత్ర్యం, అంటే ‘స్వరాజ్యం’ కోరుతూ ఉద్యమాన్ని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరింపచేయాలని భావించారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను’ అనే ప్రఖ్యాత నినాదాన్ని బాలగంగాధర్ తిలక్ ఇచ్చాడు. ఇంతకు ముందులాగా ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వటం కాకుండా బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి దేశం విడిచి వెళ్లిపోయేలా చేయాలని వాళ్ళు అనుకున్నారు. అంతకు ముందు చేపట్టిన విధానాన్ని ‘బిచ్చం అడుక్కోవటం’గా పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల వాళ్లని ‘అతివాద జాతీయవాదులు’ అని పిలవసాగారు.
 1. ఎవరేని ఇద్దరు అతివాదుల పేర్లు తెలపండి.
 జవాబు:
 తిలక్, బిపిన్ చంద్రపాల్.
2. స్వరాజ్యం అంటే ఏమిటి?
 జవాబు:
 స్వరాజ్యం అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం.
3. తిలక్ నినాదం ఏమిటి?
 జవాబు:
 స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను.
4. మితవాదుల విధానాన్ని వీరు ఎలా వర్ణించారు?
 జవాబు:
 వీరు మితవాదుల విధానాన్ని ‘బిచ్చం అడుక్కోవటం’గా వర్ణించారు.
5. మితవాదులు ఏం చేశారు?
 జవాబు:
 వారు బ్రిటిషు వారికి వినతిపత్రాలు సమర్పించారు.
ప్రశ్న 2.
 కింది పేరాను చదివి ఒక అర్థవంతమైన ‘ప్రశ్న’ను రాయుము.
7వ తరగతిలో మీరు 1857 తిరుగుబాటు గురించి చదివారు. దీంట్లో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా సైనికులు, సాధారణ రైతులు, చేతివృత్తుల వాళ్లు, రాజులు సైతం చేతులు కలిపారు. ఈ తిరుగుబాటు బ్రిటిషు పాలనను వ్యతిరేకించింది కానీ దేశానికి ఒక కొత్త దార్శనికతను అది ఇవ్వలేకపోయింది. వాస్తవానికి అది పాతకాలపు రాజులు, రాణుల పాలనను, కుల ఆధారిత సమాజాన్ని కోరుకుంది.
 జవాబు:
 ప్రశ్న : 1857 విప్లవం ఎందుకు విఫలమయ్యింది?

ప్రశ్న 3.
 కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.
మచిలీపట్నం నుండి కృష్ణా పత్రిక.
కృష్ణా పత్రికను 1902లో మచిలీపట్నంలో స్థాపించారు. దాని స్థాపకులలో ముట్నూరు కృష్ణారావు ఒకరు. అతను 1902లో ఆ పత్రికకు ఉపసంపాదకుడిగా చేరాడు. 1907లో దాని సంపాదకుడై 1945లో అతడు చనిపోయే దాకా పత్రిక కోసం కృషి చేసాడు. వందేమాతరం ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలలో ప్రజలను చైతన్యం చేసింది.
 1. కృష్ణా పత్రికను ఎక్కడ స్థాపించారు?
 జవాబు:
 మచిలీపట్నంలో
2. కృష్ణా పత్రిక స్థాపకులెవరు?
 జవాబు:
 ముట్నూరు కృష్ణారావు.
3. ఉపసంపాదకుడిగా కృష్ణారావు ఎప్పుడు పనిచేశారు?
 జవాబు:
 1902
4. కృష్ణారావు ఎప్పుడు చనిపోయాడు?
 జవాబు:
 1945
5. స్వాతంత్ర్య ఉద్యమంలో కృష్ణా పత్రిక పాత్ర?
 జవాబు:
 క్విట్ ఇండియా ఉద్యమం వరకు ప్రజా చైతన్యం.
ప్రశ్న 4.
 ‘స్వదేశీ’ అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు?
 జవాబు:
 ‘స్వదేశీ’ అంటే ‘మనదేశంలో తయారయినవి లేదా మనదేశంలోనివి’ అని నేను అర్థం చేసుకున్నాను.
ప్రశ్న 5.
 స్వదేశీ వల్ల ప్రభావితమైన ముఖ్యమైన రంగాలు ఏమిటి?
 జవాబు:
- రాజకీయ రంగం
- సామాజికరంగం
- వ్యాపారరంగం (జాతీయ)
- పారిశ్రామికరంగం
- విదేశీ వ్యాపారరంగం
- ఆధ్యాత్మికరంగం
- విద్యారంగం
- సాంస్కృతికరంగం
- న్యాయ రంగం
ప్రశ్న 6.
 ఎవరేని ఇద్దరు అతివాదుల పేర్లు తెలపండి.
 జవాబు:
 తిలక్, బిపిన్ చంద్రపాల్.
ప్రశ్న 7.
 స్వరాజ్యం అంటే ఏమిటి?
 జవాబు:
 స్వరాజ్యం అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం.
ప్రశ్న 8.
 తిలక్ నినాదం ఏమిటి?
 జవాబు:
 స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని సాధించి తీరతాను.
ప్రశ్న 9.
 మితవాదుల విధానాన్ని అతివాదులు ఎలా వర్ణించారు?
 జవాబు:
 అతివాదులు మితవాదుల విధానాన్ని ‘బిచ్చం అడుక్కోవటం’గా వర్ణించారు.
ప్రశ్న 10.
 మితవాదులు ఇద్దరి పేర్లు రాయండి?
 జవాబు:
 గోపాలకృష్ణ గోఖలే, సుబ్రమణ్యం అయ్యంగార్.

ప్రశ్న 11.
 హోం రూల్ ఉద్యమాన్ని ఎవరు స్థాపించారు.
 జవాబు:
 తిలక్ మరియు అనిబి సెంట్.
ప్రశ్న 12.
 ఫ్లో చార్టు
 
 ఎ) అతివాదుల ముఖ్య లక్ష్యం ఏమిటి?
 బి) జాతీయోద్యమంలో విన్నపాలు, అర్జీలు అనే విధానాలు అనుసరించిన నాయకులు ఎవరు?
 సి) స్వరాజ్యం నా జన్మహక్కు అని నినాదించినది ఎవరు?
 డి) స్వాతంత్ర్య సమపార్జనకు గాంధీజీ అనుసరించిన విధానాలు ఏవి?
 జవాబు:
 ఎ) సంపూర్ణ స్వరాజ్యం సాధించడం అతివాదుల లక్ష్యం. .
 బి) జాతీయోద్యమంలో విన్నపాలు, అర్జీలు అనే విధానాలు అనుసరించినవారు మితవాద నాయకులు.
 సి) ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని చాటినవారు బాలగంగాధర్ తిలక్.
 డి) స్వాతంత్ర్య సముపార్జనకు గాంధీజీ అనుసరించిన విధానాలు :
- సత్యం
- అహింస
- సత్యాగ్రహం.
ప్రశ్న 13.
 వందేమాతరం ఉద్యమం గురించి వివరించండి.
 జవాబు:
- 1903లో బెంగాల్ ను తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విభజించాలని కర్జన్ చేసిన ప్రతిపాదన జాతీయ భావాలను పెద్ద ఎత్తున రగిల్చింది.
- బెంగాల్ ప్రజలను విడదీసి, జాతీయోద్యమాన్ని బలహీనపరిచే ప్రభుత్వ రాజకీయ కుట్రగా జాతీయవాదులు బెంగాల్ విభజనను నిరసించారు.
- పెద్ద ఎత్తున సామూహిక నిరసనలు, అభ్యర్థనలు, ప్రచారం జరిగాయి. కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా 1905లో బెంగాలను విభజించింది.
- విదేశీ వస్త్ర, ఉప్పు బహిష్కరణకు పిలుపునిచ్చారు. దేశమంతటా ప్రధాన పట్టణాలు, నగరాలలో, బెంగాల్ మారుమూల ప్రాంతాల్లో విదేశీ వస్త్ర బహిష్కరణ, దహనం, విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల ముందు పికెటింగ్ వంటివి సర్వసాధారణమై పోయాయి.
- ప్రభుత్వ సంస్థలయిన పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు వంటి వాటిని బహిష్కరించమని కూడా పిలుపునిచ్చారు
- బెంగాల్ విభజింపబడిన 1905 అక్టోబరు 16న విషాద దినంగా పాటించారు. ఆ రోజు బెంగాల్ లో ఎవరూ వంట చెయ్యలేదు. దుకాణాలు అన్నింటిని మూసివేశారు.
- కలకత్తాలో హర్తాళ్ ప్రకటించారు. ప్రజలు గంగానదిలో స్నానం చేసి ‘వందేమాతరం’ పాడుతూ వీధుల్లో ఊరేగారు.
- బెంగాల్ రెండు భాగాల ఐక్యతకు చిహ్నంగా ప్రజలు ఒకరికొకరు రాఖీ కట్టుకున్నారు.
