These AP 9th Biology Important Questions and Answers 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు will help students prepare well for the exams.
AP Board 9th Class Biology 9th Lesson Important Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు
9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
 జీవులలోని అనుకూలనాలు అని వేటిని అంటారు?
 జవాబు:
 వివిధ పరిస్థితులలో జీవించే జీవులు కొంతకాలం తరువాత వాటికి అనుకూలంగా మారతాయి. లేదా అభివృద్ధి చెందుతాయి. వీటినే జీవులలోని అనుకూలనాలు అంటారు.
ప్రశ్న 2.
 నిశాచరులు అని వేటిని అంటారు?
 జవాబు:
 నిశాచరులు :
 రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను నిశాచరులు(nocternals) అంటారు.
ప్రశ్న 3.
 బబ్బర్లు, యాంటీ ఫ్రీజ్ అనగానేమి?
 జవాబు:
 చాలా సముద్ర జీవులు బబ్బర్లు అనే క్రొవ్వు పొరను కలిగి ఉంటాయి. ఇది ఉష్ణ బంధకంలా ఉండి చలితీవ్రత నుండి రక్షిస్తుంది. కొన్ని చేపలు శరీరంలోని రక్తం గడ్డకట్టకుండా ప్రవహించేలా చేయటానికి యాంటీ ఫ్రీజింగ్ (Anti Freeze వంటి పదార్థం కలిగి ఉంటాయి.
ప్రశ్న 4.
 లిట్టోరల్ మండలం అనగానేమి?
 జవాబు:
 సరస్సు ఒడ్డున తక్కువ లోతు గల భాగాన్ని లిటోరల్ మండలం అంటారు. ఈ మండలం సమీపంలో నీరు మట్టితో కలిసి మట్టిగా ఉంటుంది.

ప్రశ్న 5.
 లిమ్నెటిక్ మండలం అనగానేమి?
 జవాబు:
 సరస్సులో నీటి పైభాగం (ఉపరితలం) లో బయటకు కనిపించే భాగాన్ని లిమ్నెటిక్ మండలం అంటారు. ఈ భాగం ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది.
ప్రశ్న 6.
 ప్రొఫండల్ మండలం అని దేనిని అంటారు?
 జవాబు:
 మంచినీటి ఆవరణ వ్యవస్థలో తక్కువ వెలుతురు కలిగి మసకగా, చల్లగా ఉండే మండలాన్ని ప్రొఫండల్ మండలం అంటారు. ఈ ప్రాంతంలో చాలా వరకు సర్వాహారులు (heterotrophs) ఉంటాయి.
ప్రశ్న 7.
 లైకెన్లు అనగానేమి?
 జవాబు:
 శిలీంధ్ర సమూహాలతో సహజీవన సంబంధం సాగిస్తూ జీవించే అనుకూలన రూపాలనే ‘లైకిళ్లు’ అంటారు. ఇలాంటి సమూహాలు, రాళ్ళు, వృక్షకాండాలపై పెరగడాన్ని చూడవచ్చు.
9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 నీటి ఆవరణ వ్యవస్థలోని రకాలు ఏవి? ఉదాహరణలివ్వండి.
 జవాబు:
- నీటి లేదా జల ఆవరణ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాలు. అవి.
 1 మంచి నీటి ఆవరణ వ్యవస్థ
 2. ఉప్పునీటి/సముద్రనీటి ఆవరణ వ్యవస్థ.
- కొలనులు, సరస్సులు, నదులు మంచినీటి ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణలు.
- సముద్రాలు, మహాసముద్రాలు ఉప్పునీటి ఆవాసాలకు ఉదాహరణలు.
ప్రశ్న 2.
 ఎలక్ట్రిక్ ఈల్ గురించి లఘుటీక రాయండి.
 జవాబు:
- ఎలక్ట్రిక్ ఈల్ అనే చేపలు దాదాపు 600 వోల్టుల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
- ఈ విద్యుత్తుని ఉపయోగించి అవి శత్రువుల బారి నుండి తమను తాము కాపాడుకుంటాయి.
- వీటి పేరు ఈల్ అనగా సర్పం అయినప్పటికీ ఇది పాము కాదు. ఒక రకమైన కత్తి చేప.
ప్రశ్న 3.
 మన రాష్ట్రంలోని మంచి నీటి జలాశయములు, ఆవరణ వ్యవస్థలు ఏవి?
 జవాబు:
 కృష్ణాజిల్లాలోని కొల్లేరు సరస్సు, శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉన్న మడ్డు వలస, ప్రకాశం జిల్లాలోని కంభం చెరువు మొదలైనవి మన రాష్ట్రంలోని కొన్ని మంచినీటి జలాశయములు మరియు ఆవరణ వ్యవస్థలు.
ప్రశ్న 4.
 సముద్ర జీవుల శరీరం లోపలి సాంద్రత బయటి సముద్ర నీటి సాంద్రత కంటే తక్కువగా (దాదాపు 8.5%) ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవుల శరీరం నుండి నీరు సముద్రంలోకి వచ్చి చేరుతుంది. ఇది జీవికి ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితుల్లో అవి ఎలా జీవిస్తాయి?
 జవాబు:
- సముద్రంలో ఎన్నో జాతి జీవుల శరీరంలోని లవణీయత సముద్ర నీటి సాంద్రత కంటే తక్కువ ఉంటుంది.
- కావున ద్రవాభిసరణం ద్వారా కోల్పోయిన నీటి కొరతను పూరించడానికి అధిక పరిమాణంలో నీరు గ్రహిస్తాయి.
- వీటిలోని లవణాలను మూత్రపిండాలు మరియు మొప్పలలోని ప్రత్యేకమైన కణాల ద్వారా విసర్జిస్తాయి.

ప్రశ్న 5.
 మడ అడవి ఆవరణ వ్యవస్థలోని చేపలు, నదులు మరియు సముద్రాలలో ఎలా జీవిస్తాయి?
 జవాబు:
- మడ అడవి ఆవరణ వ్యవస్థలోని చేపలు, నదులు మరియు సముద్రాలలో కూడా జీవిస్తాయి.
- మడ అడవి ఆవరణ వ్యవస్థలోని చేపలు ఎప్పటికప్పుడు మారే లవణీయతను తట్టుకొని నిలబడతాయి.
- మంచినీటి చేపలు తమ శరీరంలోని ద్రవాభిసరణ నియంత్రకాల ద్వారా నిరంతరం మారే లవణీయతలోని తేడాలను తట్టుకుంటాయి.
9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 సముద్ర జీవులలో కనిపించే కొన్ని అనుకూల లక్షణాలు రాయండి.
 జవాబు:
- ప్రతి సముద్ర ప్రాణి ఒక నిర్ణీత స్థలంలో ఉండే లవణీయత, ఉష్ణోగ్రత, వెలుతురు లాంటి మార్పులకు అనుగుణంగా అనుకూలనాలు ఏర్పరచుకుంటుంది.
- సముద్ర చరాలు వాటి శరీరంలో జరిగే మంచినీటి, ఉప్పునీటి ప్రతిచర్యలను తప్పక నియంత్రించాలి. వీటికొరకు ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన మూత్రపిండాలు, మొప్పలు వంటి అవయవాలు సహాయపడతాయి.
- సీ అనిమోన్లు వంటి కొన్ని జంతువులు చర్మం ద్వారా వాయువులను గ్రహిస్తాయి.
- నీటిలో చలించే జంతువులు నీటి నుండి, గాలి నుండి ఆక్సిజన్ గ్రహించుటకు మొప్పలు లేదా ఊపిరితిత్తులను ఉపయోగిస్తాయి.
- చాలా సముద్ర జీవులు బట్లర్లు అనే కొవ్వు పొరను కలిగి ఉంటాయి. ఇది ఉష్ణబంధకంలా ఉండి’ చలి తీవ్రత నుండి రక్షిస్తుంది.
- కొన్ని చేపలు శరీరంలోని రక్తం గడ్డకట్టకుండా ప్రవహించేలా చేయడానికి యాంటి ఫ్రీజింగ్ వంటి పదార్థం కలిగి ఉంటాయి.
- సముద్ర ఆవరణ వ్యవస్థలో సహజీవనం, రక్షించుకునే ప్రవర్తన, దాక్కోవటం, ప్రత్యుత్పత్తి వ్యూహాలు, సమాచార సంబంధాలు మొదలగునవి కలిగి ఉంటాయి.
ప్రశ్న 2.
 నీటిలో నివసించే మొక్కలందు గల అనుకూలనాలు ఏవి?
 జవాబు:
 
- పాక్షికంగా నీటిలో మునిగి ఉండే మొక్కల కాండాలు, ఆకులు, వేర్లలో ఉన్న గాలి గదుల వలన వాయు మార్పిడికి మరియు సమతాస్థితికి తోడ్పడతాయి.
- గుర్రపుడెక్క పత్రం అంచులకు గాలితో నిండిన నిర్మాణాలు ఉండటం వలన మొక్క నీటిపై తేలుతుంది.
- కలువ మొక్కలో ఆకులు బల్లపరుపుగా ఉండి, మైనపు పూత గల ఉపరితలంలో పత్రరంధ్రాలు ఉంటాయి.
- నీటిలో తేలియాడే హైడ్రిల్లా మొక్కలలో పత్రరంధ్రాలు ఉండవు. పలుచని ఆకులు, సులభంగా వంగే కాండాలు కలిగి ఉంటుంది.
ప్రశ్న 3.
 హైఢిల్లా మొక్క నీటిలో నివసించడానికి గల ప్రత్యేక అనుకూలనాలు ఏవి?
 జవాబు:
 
- హైడ్రిల్లా మొక్కలలో పత్రరంధ్రాలు ఉండవు.
- కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, ఇవి బాగా పెరగగలవు.
- నీటి నుండి CO2 ను బాగా గ్రహించగలవు. తదుపరి అవసరాల కోసం పోషకాలను నిలువ చేయగలవు.
- నీటి ప్రవాహవేగం, ఎద్దడి వంటి వివిధ రకాల పరిస్థితులు తట్టుకోగలవు.
- లవణీయత ఎక్కువగా ఉన్న ఉప్పు నీటిలో కూడా పెరుగుతాయి.
- లైంగిక, అలైంగిక విధానాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపగలవు.
ప్రశ్న 4.
 లైకెన్ల గురించి క్లుప్తంగా రాయండి.
 జవాబు:
 
- పై పటంలో శైవలాలు, శిలీంధ్రాలు సమూహపరమైన లైకెన్లో ఫలవంతమైన అనుకూలనాలు చూడవచ్చు.
- శిలీంధ్ర సమూహం శైవలాల సమూహంపై దాడి చేస్తుంది. శైవలాలు పోటీపడలేక విఫలమై నశిస్తాయి.
- శిలీంధ్ర సమూహాలతో సహజీవన సంబంధం సాగిస్తూ జీవించే అనుకూలన రూపాలను “లైకెన్లు” అంటారు.
- శైవలాలకు కావలసిన నీరు, ఖనిజ లవణాలను శిలీంధ్రం అందిస్తుంది.
- శైవలాలు కిరణజన్య సంయోగక్రియ జరుపుతూ శిలీంధ్రాలకు కావలసిన ఆహారాన్ని చక్కెర రూపంలో సరఫరా చేస్తుంది.
- ఇలాంటి అనుకూలనాల వలన లెకెన్స్ ప్రతికూల పరిస్థితులలో కూడా జీవించగలుగుతాయి.
ప్రశ్న 5.
 గాలపోగాన్ దీవులందు పిచ్చుకలపై డార్విన్ చేసిన పరిశోధనలు గురించి వివరించండి.
 జవాబు:
 
- చార్లెస్ డార్విన్ -1885వ సంవత్సరంలో హెచ్.ఎమ్.ఎస్. బీగిల్ అనే ప్రసిద్ధిగాంచిన ఓడ నుండి ఒక ద్వీపం మీద అడుగుపెట్టాడు.
- ఇది 120 చిన్న దీపాల సముదాయమైన గాలపోగాన్ ద్వీపాలకు చెందినది.
- ఆ ద్వీపాలలోని వివిధ రకాల జీవులపై అధ్యయనం చేశాడు.
- ఈయన పిచ్చుకల గురించి చేసిన పరిశీలనలు చాలా ప్రఖ్యాతి చెందాయి.
- చిన్న ప్రాంతమైన గాలపోగాన్ దీవులలో ఈకల రంగులు, ముక్కులలో వైవిధ్యాలు గల పదమూడు రకాల పిచ్చుకలను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు.
- కొన్ని పిచ్చుకలు గింజలు, కొన్ని పండ్లు, మరికొన్ని కీటకాలు తింటాయని తెలుసుకున్నాడు.
- ఈ పిచ్చుకలు తమ సమీప పరిసరాలను ఆహారం, నివాసం కోసం అనుకూలించుకున్నాయి.
- ఒకే జాతికి చెందిన పక్షులలో కూడా ప్రత్యేకంగా ముక్కుల్లో వైవిధ్యం ఉండడం డార్విన్ గమనించాడు.
- అనుకూలనాలు అనేవి ఒక జీవిలో నిరంతరం జరుగుతుంటాయి.
- భౌగోళికంగా వేరు చేయబడిన ప్రాంతాలలో దగ్గర సంబంధాలు గల వాటిలో కూడా ప్రత్యేకంగా అనుకూలనాలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయని డార్విన్ తీర్మానించాడు.

ప్రశ్న 6.
 నిశాచర జీవులను గురించి క్లుప్తంగా రాయండి.
 జవాబు:
- రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను నిశాచరులు అంటారు.
- ఈ జంతువులలో వినడానికి, వాసన పీల్చడానికి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
- రాత్రి సమయంలో చూడడానికి వీలుగా పెద్ద పెద్ద కళ్ళు అనుకూలనాలు చెంది ఉంటాయి.
- గబ్బిలం లాంటి జీవులు హెచ్చు కీచుదనం గల శబ్దాలు చేసి వస్తువుల ఉనికి పసికడతాయి. ఆహారాన్ని ఎంచుకొంటాయి. శత్రువుల బారినుండి తమను తాము రక్షించుకుంటాయి.
 ఉదా : పిల్లులు, ఎలుకలు, గుడ్లగూబలు, మిణుగురు పురుగులు, క్రికెట్ కటిల్ ఫిష్.
ప్రశ్న 7.
 ధృవ ప్రాంతములలో నివసించే జంతువులు చూపే అనుకూలనాలు ఏవి?
 జవాబు:
 
- శీతల ప్రాంతాలలో నివసించే జీవులు వివిధ రకాలుగా అనుకూలనాలు ఏర్పరచుకుంటాయి.
- వాటి చర్మాల కింద దళసరి కొవ్వు పొరను నిలువ చేసుకుంటాయి లేదా దళసరి బొచ్చుతో తమ శరీరాలను కప్పి ఉంచుతాయి.
- ఇవి ఉష్ణ బంధకాలుగా పనిచేస్తూ తమ శరీరాల నుండి ఉష్ణం కోల్పోకుండా నిరోధిస్తాయి.
- కొవ్వు పొర శరీరానికి ఉష్ణబంధకంగా సహాయపడుతూ ఉష్ణం, శక్తిని ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి.
9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Important Questions and Answers
ప్రశ్న 1.
 కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులివ్వండి.
 “సైడ్ వైండర్ యాడర్ స్నేక్” – ఈ పాము ప్రక్కకు పాకుతూ కదులుతుంది. దీని వలన శరీరంలోని కొంత భాగం మాత్రమే వేడెక్కిన ఇసుక తలాన్ని ఒత్తుతుంది. ఈ విధమైన కదలిక శరీరాన్ని చల్లగా ఉంచటంలో తోడ్పడుతుంది. “గోల్డెన్ మోల్” అనే జంతువు ఎండవేడిమి నుండి తప్పించుకోవడానికి ఇసుకలో దూకి ఈదుతున్నట్లు కదులుతుంది. ఇది అన్ని అవసరాలు నేల లోపలే తీర్చుకోవడం వలన చాలా అరుదుగా నేల బయటకు వస్తుంది. కొన్ని జంతువులు ఎడారిలో జీవించడానికి అసాధారణమైన సామర్థ్యాలు చూపిస్తాయి. ఉత్తర అమెరికా పడమటి ఎడారిలో నివశించే “క్యాంగ్రూ ఎలుక” జీవిత కాలమంతా నీరు తాగకుండా జీవిస్తుంది. వీటి శరీరం జీర్ణక్రియా క్రమంలో కొంత నీటిని తయారుచేస్తుంది. ఎడారి పక్షి “సాండ్ గ్రౌజ్ ” నీటి కోసం చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్ ను చేరుతుంది. తన కడుపులోని క్రాప్ అనే భాగంలో నీటిని నింపుకొని వచ్చి గూటిలోని పిల్లలకు తాగిస్తుంది.
అ) ఏ ఎడారి జీవి జీవితాంతం నీటిని త్రాగదు?
 జవాబు:
 క్యాంగ్రూ ఎలుక
ఆ) గోల్డెన్ మోల్ ఎండ వేడిమిని ఏ విధంగా తప్పించుకుంటుంది?
 జవాబు:
 ఇసుకలో దూరి ఈదుతున్నట్లు కదులుతుంది.
ఇ) సాండ్ గ్రేజ్ కు నీరు ఎక్కడి నుండి లభిస్తుంది?
 జవాబు:
 ఒయాసిస్ నుండి
ఈ) సైడ్ వైండర్ యాడర్ స్నేక్ ఎందుకు పక్కకు ప్రాకుతుంది?
 జవాబు:
 దీని వలన శరీరంలోని కొంత భాగం మాత్రమే వేడెక్కిన ఇసుకతలాన్ని ఒత్తుతుంది. ఈ విధమైన కదలిక శరీరాన్ని చల్లగా ఉంచడంలో తోడ్పడుతుంది.

ప్రశ్న 2.
 పట్టిక ఆధారంగా సమాధానాలు రాయండి.
| జంతువు పేరు | నివసించే ప్రాంతం | చూపించే అనుకూలనాలు | 
| కాంగ్రూ ఎలుక | ఉత్తర అమెరికా | జీవితకాలమంతా నీరు త్రాగకుండా ఉంటుంది. జీర్ణక్రియలోనే కొంత నీటిని తయారుచేసుకుంటుంది. | 
| శాండ్ గ్రూస్ | ఎడారులు | తన కడుపులో క్రాప్ అనే భాగంలో నీటిని నింపి ఉంచుకుంటుంది. | 
పై పట్టిక ఆధారంగా ఈ రెండు జంతువులు చూపే అనుకూలనాలను రాయండి.
 జవాబు:
- కాంగ్రూ ఎలుక నీరు దొరకని ప్రాంతాలలో జీవించడం వలన జీవితకాలమంతా నీరు త్రాగకుండా ఉంటుంది. దీనికి కారణం అది జీర్ణక్రియలో తయారైన నీటిని పొదుపుగా వాడుకుంటూ జీవిస్తుంది.
- శాండ్ గ్రూస్ అనే ఎడారి పక్షి, తన కడుపులో క్రాప్ అనే భాగంలో నీటిని నింపి ఉంచుకుంటుంది. చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్లో నీటిని త్రాగుతుంది.
9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 1 Mark Bits Questions and Answers
లక్ష్యాత్మక నియోజనము
1. మడ మొక్కలందు ఉండే శ్వాస రంధ్రాల ఉపయోగం
 A) కిరణజన్య సంయోగక్రియ
 B) వేరు శ్వాసక్రియ
 C) శ్వాసక్రియ
 D) బాష్పోత్సేకము
 జవాబు:
 B) వేరు శ్వాసక్రియ
2. నేడు అలంకారం కోసం ఇళ్ళలో పెంచబడుతున్నమొక్కలు
 A) నీటి మొక్కలు
 B) ఎడారి మొక్కలు
 C) A మరియు B
 D) ఏదీకాదు
 జవాబు:
 B) ఎడారి మొక్కలు
3. ఒంటె నందు కొవ్వును నిలువచేయు భాగం
 A) మోపురం
 B) జీర్ణాశయం
 C) చర్మం
 D) పైవన్నీ
 జవాబు:
 A) మోపురం
4. ఉత్తర అమెరికా పడమటి ఎడారిలోని ఈ జీవి జీవితకాలమంతా నీరు తాగకుండా జీవిస్తుంది.
 A) సాండ్ గ్రౌజ్
 B) ఫెన్సిస్ ఫాక్స్
 C) క్యాంగ్రూ ఎలుక
 D) గోల్డెన్ మోల్
 జవాబు:
 C) క్యాంగ్రూ ఎలుక
5. హెచ్చు కీచుదనం గల శబ్దాలు చేసి వస్తువుల ఉనికి పసిగట్టేవి
 A) కటిల్ ఫిష్
 B) గబ్బిలం
 C) క్రికెట్ కీటకం
 D) పిల్లి
 జవాబు:
 B) గబ్బిలం

6. క్రింది వానిలో ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థను గుర్తించుము.
 A) కొలను
 B) వాగులు
 C) నది
 D) సముద్రం
 జవాబు:
 D) సముద్రం
7. కణాలలో నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలేవి
 A) ప్లవకాలు
 B) డాల్ఫిన్లు
 C) పెద్ద మొక్కలు
 D) చేపలు
 జవాబు:
 A) ప్లవకాలు
8. ప్రతి 10 మీటర్ల లోతునకు పెరిగే పీడనము
 A) 1 అట్మాస్ఫియర్
 B) 2 ఎట్మాస్ఫియర్లు
 C) 3 అట్మాస్ఫియర్లు
 D) 4 ఎట్మాస్ఫియర్లు
 జవాబు:
 A) 1 అట్మాస్ఫియర్
9. సీలు మరియు తిమింగలము లందు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ నిల్వ ఉండు ప్రదేశము
 A) ఊపిరితిత్తులు
 B) కండర కణజాలము
 C) చర్మము
 D) పైవన్నీ
 జవాబు:
 B) కండర కణజాలము
10. ఈ సముద్ర జీవులు ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలనాలు కలిగి ఉంటాయి.
 A) తిమింగలాలు
 B) హెర్రింగ్ గల్స్
 C) A మరియు B
 D) ఏదీకాదు
 జవాబు:
 C) A మరియు B
11. సముద్ర ఆవరణ వ్యవస్థ నందలి మండలాలు
 A) యుఫోటిక్ మండలం, బెథియల్ మండలం
 B) బెథియల్ మండలం, అబైసల్ మండలం
 C) అబైసల్ మండం, యూఫోటిక్ మండలం
 D) యుఫోటిక్ మండలం, బెథియల్ మండలం, అబైసల్ మండలం
 జవాబు:
 D) యుఫోటిక్ మండలం, బెథియల్ మండలం, అబైసల్ మండలం
12. కిరణజన్య సంయోగక్రియ గరిష్ఠంగా జరిగే మండలం
 A) బెథియల్ మండలం
 B) యుఫోటిక్ మండలం
 C) అబైసల్ మండలం
 D) పైవన్నియు
 జవాబు:
 B) యుఫోటిక్ మండలం
13. సముద్ర ఆవరణ వ్యవస్థ నందలి ఈ మండలము సంవత్సరము పొడవున చీకటిగా, చల్లగా ఉంటుంది.
 A) అబైసల్ మండలం
 B) బెథియల్ మండలం
 C) యూఫోటిక్ మండలం
 D) బేథియల్ మరియు అబైసల్ మండలం
 జవాబు:
 A) అబైసల్ మండలం
14. ఎలక్ట్రిక్ ఈల్ అనే చేపలు ఎన్ని వోల్టులు విద్యుత్ ను ఉత్పత్తి చేయగలవు?
 A) 500 వోల్టులు
 B) 600 వోల్టులు
 C) 700 వోల్టులు
 D) 400 వోల్టులు
 జవాబు:
 B) 600 వోల్టులు
15. ఉప్పునీటి సరస్సు గుర్తించండి.
 A) కొల్లేరు
 B) పులికాట్
 C) ఉస్మాన్ సాగర్
 D) షామీర్ పేట సరస్సు
 జవాబు:
 B) పులికాట్
16. మంచినీటి ఆవరణ వ్యవస్థలో జీవులపై ప్రభావం చూపే కారకాలు
 A) కాంతి, లవణీయత
 B) ఆహారము
 C) ఆక్సిజన్
 D) పైవన్నియూ
 జవాబు:
 D) పైవన్నియూ
17. సముద్ర నీటి లవణీయత
 A) 2.8%
 B) 2.5%
 C) 3.5%
 D) 3.8%
 జవాబు:
 C) 3.5%
18. మంచినీటి చేపలు శరీరాలలో
 A) తక్కువ లవణీయత ఉంటుంది
 B) ఎక్కువ లవణీయత ఉంటుంది
 C) A మరియు B
 D) చాలా తక్కువ లవణీయత ఉంటుంది.
 జవాబు:
 B) ఎక్కువ లవణీయత ఉంటుంది

19. ఉష్ణమండలంలోని కొన్ని మొక్కలు ఆకులు రాల్చు కాలము
 A) చలికాలము ముందు
 B) వేసవి మొదలు కాకముందు
 C) చలికాలము తరువాత
 D) వర్షాకాలము
 జవాబు:
 A) చలికాలము ముందు
20. మన రాష్ట్ర పక్షి
 A) పాలపిట్ట
 B) గ్రద్ద
 C) చిలుక
 D) పావురం
 జవాబు:
 A) పాలపిట్ట
21. సముద్ర ఆవరణ వ్యవస్థలో సహజీవనము కలిగిన జీవులు
 A) తిమింగలాలు, హెర్రింగ్ గల్స్
 B) క్లోన్ ఫిష్, సముద్ర అనిమోను
 C) రేచేప మరియు సముద్ర అనిమోను
 D) తిమింగలం కేస్ ఫిష్
 జవాబు:
 B) క్లోన్ ఫిష్, సముద్ర అనిమోను
22. శ్వాసవేర్లు సుమారుగా ఇంత పొడుగు పెరుగుతాయి.
 A) 8 అంగుళాలు
 B) 10 అంగుళాలు
 C) 12 అంగుళాలు
 D) 14 అంగుళాలు
 జవాబు:
 C) 12 అంగుళాలు
23. శ్వాస వేర్లు ఈ మొక్కలో కనిపిస్తాయి.
 A) కలబంద
 B) సైప్రస్
 C) లింగాక్షి
 D) డక్వడ్
 జవాబు:
 B) సైప్రస్
24. ఈ క్రింది వానిలో కణజాలం నీటిని నిల్వచేసే మొక్కలు
 A) ఉష్ణమండల మొక్కలు
 B) సమశీతోష్ణ మండల మొక్కలు
 C) జలావాస మొక్కలు
 D) టండ్రా మొక్కలు
 జవాబు:
 A) ఉష్ణమండల మొక్కలు
25. జంతువులు తినకుండా వదిలేసే మొక్కలు
 A) గులకరాళ్ళ మొక్కలు
 B) ఎడారి మొక్కలు
 C) జలావాస మొక్కలు
 D) టండ్రా మొక్కలు
 జవాబు:
 A) గులకరాళ్ళ మొక్కలు
26. ఎడారిలో కనిపించే పాము
 A) రసెల్స్ వైపర్
 B) సాండ్ బోయా
 C) సైడ్ వైడర్
 D) కింగ్ కోబ్రా
 జవాబు:
 C) సైడ్ వైడర్
27. జీవితాంతం నీరు త్రాగకుండా ఉండే జీవి
 A) గోల్డెన్ మోల్
 B) క్యాంగ్రూ ఎలుక
 C) సాండ్ గ్రెస్
 D) సైడ్ వైడర్
 జవాబు:
 B) క్యాంగ్రూ ఎలుక
28. ఎడారి పక్షి
 A) గోల్డెన్ మోల్
 B) క్యాంగ్రూ ఎలుక
 C) సాండ్ గ్రేస్
 D) సైడ్ వైడర్
 జవాబు:
 C) సాండ్ గ్రేస్
29. క్రింది వానిలో నిశాచర జీవి
 A) గబ్బిలం
 B) కటిల్ ఫిష్
 C) క్రికెట్
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
30. ప్లవకాలు వీటి సహాయంతో నీటిపై తేలుతాయి.
 A) గాలితిత్తులు
 B) గాలిగదులు
 C) నూనె బిందువులు
 D) వాజాలు
 జవాబు:
 C) నూనె బిందువులు
31. జీర్ణమండలంలో ఫ్లూటర్స్ అనే ప్రత్యేక నిర్మాణం కల్గినవి
 A) తాబేళ్ళు
 B) చేపలు
 C) డాల్ఫిన్లు
 D) B & C
 జవాబు:
 D) B & C

32. సముద్రంలో రక్తంలాంటి ద్రవాలపై ప్రతి 10 మీటర్లకు ఎంత వాతావరణ పీడనం పెరుగుతుంది?
 A) 1 అట్మాస్ఫియర్
 B) 2 అట్మాస్ఫియర్లు
 C) 3 అట్మాస్ఫియర్లు
 D) 4 అట్మాస్ఫియర్లు
 జవాబు:
 A) 1 అట్మాస్ఫియర్
33. సీలు చేపలో ఊపిరితిత్తులు కుచించుకోగానే
 A) దాని బరువు పెరుగుతుంది.
 B) నీటిలో సులభంగా మునుగుతుంది.
 C) ఆక్సిజన్ నిల్వల్ని కాపాడుకుంటుంది.
 D) పైవన్నీ
 జవాబు:
 A) దాని బరువు పెరుగుతుంది.
34. ఈతతిత్తులు దేనికి పనికి వస్తాయి?
 A) నీటిలో తేలటం
 B) నీటిలో ఈదటం
 C) నీటిలో సమతాస్థితి
 D) పైవన్నీ
 జవాబు:
 C) నీటిలో సమతాస్థితి
35. చేపలను అగాథాల నుండి పైకి తెచ్చినపుడు నోటి ద్వారా బయటకు వచ్చేది
 A) నాలుక
 B) పేగులు
 C) ఈతతిత్తి
 D) కళ్ళు మరియు రక్తం
 జవాబు:
 C) ఈతతిత్తి
36. సముద్ర జలాల్లో ద్రవాభిసరణను నియంత్రించేవి
 A) మూత్రపిండాలు
 B) మొప్పలు
 C) A మరియు B
 D) పైవేవీ కావు
 జవాబు:
 C) A మరియు B
37. సీ అనిమోన్లు దేని ద్వారా వాయువులను గ్రహిస్తాయి?
 A) నోరు
 B) ఊపిరితిత్తులు
 C) ముక్కు
 D) చర్మం
 జవాబు:
 D) చర్మం
38. యాంటీ ఫ్రీజింగ్ పదార్థాలు వీటిలో ఉంటాయి.
 A) చేపలు
 B) ఉభయచరాలు
 C) పక్షులు
 D) క్షీరదాలు
 జవాబు:
 A) చేపలు
39, బ్లబ్బరను కలిగి ఉండేది
 A) ఎడారిజీవులు
 B) సముద్ర జీవులు
 C) టండ్రా జీవులు
 D) B మరియు C
 జవాబు:
 D) B మరియు C
40. శైన్ ఫిష్ మరియు సముద్ర అనిమోన్లకు మధ్యగల సంబంధం
 A) పరాన్నజీవనం
 B) సహజీవనం
 C) సహభోజకత్వం
 D) పూతికాహార విధానం
 జవాబు:
 B) సహజీవనం
41. సముద్రంలో లేని ప్రాంతం
 A) యుఫోటిక్ జోన్
 B) లిమ్నెటిక్ జోన్
 C) బేథియల్ జోన్
 D) అబైసల్ జోన్
 జవాబు:
 B) లిమ్నెటిక్ జోన్
42. మసక మండలం అని దీనిని అంటారు.
 A) యుఫోటిక్ జోన్
 B) బెథియల్ జోన్
 C) అబైసల్ జోన్
 D) ప్రొఫండల్ జోన్
 జవాబు:
 B) బెథియల్ జోన్
43. కాంతిని ఉత్పత్తి చేసే అవయవాలు కల జీవులు ఇక్కడ ఉంటాయి.
 A) యుఫోటిక్ జోన్
 B) బెథియల్ జోన్
 C) అబైసల్ జోన్
 D) ప్రొఫండల్ జోన్
 జవాబు:
 C) అబైసల్ జోన్
44. సముద్రపు అడుగు భాగాల్లో నివసించే జీవులకు
 A) దృష్టి లోపిస్తుంది
 B) వాసన, వినికిడి బాగుంటాయి
 C) A మరియు B
 D) పైవేవీ కావు
 జవాబు:
 C) A మరియు B
45. ఇందులో సరస్సులో లేని మండలం
 A) లిటోరల్ జోన్
 B) లిమ్నెటిక్ జోన్
 C) ప్రొఫండల్ జోన్
 D) బెథియల్ జోన్
 జవాబు:
 D) బెథియల్ జోన్

46. పత్ర రంధ్రాలు లేని మొక్క
 A) తామర
 B) గుర్రపుడెక్క
 C) కలువ
 D) హైడ్రిల్లా
 జవాబు:
 D) హైడ్రిల్లా
47. వేసవికాలం రాకముందే ఆకురాల్చే మొక్కలు
 A) ఉష్ణమండల మొక్కలు
 B) సమశీతోష్ణ మండల మొక్కలు
 C) ఎడారి మొక్కలు
 D) టండ్రా మొక్కలు
 జవాబు:
 A) ఉష్ణమండల మొక్కలు
48. శీతాకాల సుప్తావస్థ, గ్రీష్మకాల సుప్తావస్థ చూపే జీవులు
 A) చేపలు
 B) ఉభయచరాలు
 C) సరీసృపాలు
 D) పక్షులు
 జవాబు:
 B) ఉభయచరాలు
49. పత్తర్ ఫూల్ అనే సుగంధ ద్రవ్యం
 A) ఒక శైవలం
 B) ఒక శిలీంధ్రం
 C) ఒక లైకెన్
 D) ఒక చెట్టు బెరడు
 జవాబు:
 C) ఒక లైకెన్
50. 1885వ సంవత్సరంలో H.M.S బీగల్ అనే ఓడపై ప్రయాణించి డార్విన్ ఈ ద్వీపాలకు చేరాడు.
 A) పసిఫిక్ దీవులు
 B) గాలపోగస్ దీవులు
 C) బెర్ముడా దీవులు
 D) మారిషస్ దీవులు
 జవాబు:
 D) మారిషస్ దీవులు
51. జలావరణ వ్యవస్థపై ప్రభావం చూపని కారకం
 A) లవణాలు
 B) ఉష్ణోగ్రత
 C) కాంతి
 D) పీడనం
 జవాబు:
 B) ఉష్ణోగ్రత
52. తీక్షణ, స్పష్టమైన దృష్టిగల జీవులు సముద్రంలో ఈ భాగంలో నివశిస్తాయి.
 A) బెథియల్ మండలం
 B) యూఫోటిక్ మండలం
 C) అబిస్పల్ మండలం
 D) పైవన్నీ
 జవాబు:
 B) యూఫోటిక్ మండలం
53. లైకెన్స్ లో సహజీవనం చేసేవి
 A) శైవలాలు, బాక్టీరియా
 B) శైవలాలు, శిలీంధ్రాలు
 C) బ్యా క్టీరియా, వైరస్
 D) శిలీంధ్రాలు, బ్యాక్టీరియా
 జవాబు:
 B) శైవలాలు, శిలీంధ్రాలు
54. డార్విన్ ఫించ్ పక్షుల గురించి నివేదిక వ్రాయాలంటే కింది వాటిలో ఏ అంశాన్ని ఎన్నుకుంటావు?
 A) పరిసరాలలోని మార్పులకు జీవులు స్థిరంగా వుంటాయి.
 B) ఒక జాతిలోని జీవులన్నీ ఒకే రకమైన అనుకూలనాలు చూపిస్తాయి.
 C) ఒకే జాతికి చెందిన జీవులు ఆహారపు అలవాట్లను బట్టి వేర్వేరు అనుకూలనాలను చూపిస్తాయి.
 D) జీవులలో ఏర్పడిన అనుకూలనాలు తరువాత తరాలకు అందజేయబడవు.
 జవాబు:
 C) ఒకే జాతికి చెందిన జీవులు ఆహారపు అలవాట్లను బట్టి వేర్వేరు అనుకూలనాలను చూపిస్తాయి.

55. పత్రరంధ్రాలు ఏ సందర్భంలో మూసుకుపోతాయి?
 i) వాతావరణం చల్లగా ఉన్నప్పుడు
 ii) వాతావరణం వేడిగా ఉన్నప్పుడు
 iii) వాతావరణం తేమగా ఉన్నప్పుడు
 iv) పై వన్నియూ మొక్కలు
 A) i, ii మాత్రమే
 B) ii, iii మాత్రమే
 C) i, iii మాత్రమే
 D) అన్నియూ సరైనవే
 జవాబు:
 A) i, ii మాత్రమే
56. ఎడారిమొక్కలకు సంబంధించిన అంశం
 1. త్వచకణాలు బాగా దళసరిగా ఉండి మైనపు పూతను కలిగి ఉంటాయి.
 2. కాండం నీటితో నిండి మందంగా ఉంటుంది.
 3. ఆకులు ముల్లుగా రూపాంతరం చెంది ఉంటాయి.
 A) 1 మాత్రమే
 B) 2 మాత్రమే
 C) 3 మాత్రమే
 D) పైవన్నీ సరైనవి
 జవాబు:
 D) పైవన్నీ సరైనవి
57. ఒంటెను ఇసుక, దుమ్మునుంచి రక్షించే అనుకూలనం
 A) మూపురం
 B) పొట్టి తోక
 C) పొడవైన కనుబొమ్మలు
 D) ఒంటె ఆకారం
 జవాబు:
 C) పొడవైన కనుబొమ్మలు
మీకు తెలుసా?
నిశాచరులు : రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను నిశాచరులు (nocturnals) అంటారు. జంతువులలో వినడానికి, వాసన పీల్చడానికి వీటి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. రాత్రి సమయంలో చూడడానికి వీలుగా పెద్ద పెద్ద కళ్ళు అనుకూలనాలు చెంది ఉంటాయి. గబ్బిలం లాంటి జీవులు హెచ్చు కీచుదనం గల శబ్దాలు చేసి వస్తువుల ఉనికి పసిగడతాయి. ఆహారాన్ని ఎంచుకుంటాయి, శత్రువుల బారి నుండి తమను తాము రక్షించుకుంటాయి.
పిల్లులు, ఎలుకలు, గబ్బిలాలు, గుడ్లగూబలు సాధారణంగా మన చుట్టూ కనిపించే నిశాచరులు. మిణుగురు పురుగులు, క్రికెట్ కీటకం, కటిల్ ఫిష్ వంటి జీవులు రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తాయి. పగటి ఉష్ణ తాపాన్ని తప్పించుకోవడానికి కొన్ని ఎడారి జంతువులు రాత్రి వేళల్లోనే సంచరిస్తాయి.
ఎలక్ట్రిక్ ఈల్ అనే చేపలు దాదాపు 600 వోల్టులు విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ విద్యుత్ ని ఉపయోగించి అవి శత్రువుల బారి నుండి తమను తాము కాపాడుకుంటాయి. వీటి పేరు eel అనగా సర్పం అయినప్పటికీ ఇది పాము కాదు, ఒక రకమైన కత్తిచేప మాత్రమే.
పునరాలోచన

