SCERT AP 10th Class Biology Guide Pdf Download 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Biology 2nd Lesson Questions and Answers శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ
10th Class Biology 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
కింది వాటి మధ్య తేడాలు రాయండి. (AS1)
ఎ) ఉచ్చ్వాసం-నిశ్వాసం
బి) వాయుసహిత-అవాయు శ్వాసక్రియ
సి) శ్వాసక్రియ దహనం
డి) కిరణజన్యసంయోగక్రియ-శ్వాసక్రియ
జవాబు:
ఎ) ఉచ్చ్వాసం-నిశ్వాసం :
ఉచ్ఛ్వా సం | నిశ్వాసం |
1. గాలిని లోపలికి పీల్చే ప్రక్రియను ఉచ్ఛ్వాసం అంటారు. | 1. గాలిని బయటకు పంపే ప్రక్రియను నిశ్వాసం అంటారు. |
2. బాహ్య శ్వాసక్రియలో ఇది మొదటి ప్రక్రియ. | 2. బాహ్య శ్వాసక్రియలో ఇది రెండవ ప్రక్రియ. |
3. ఈ దశలో ఉరఃకుహరం పరిమాణం పెరుగుతుంది. | 3. ఈ దశలో ఉరఃకుహర పరిమాణం తగ్గుతుంది. |
4. వెలుపలి గాలి ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. | 4. ఊపిరితిత్తులలోని గాలి బయటకు పంపబడుతుంది. |
5. ఉచ్ఛ్వాస గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఎక్కువ. | 5. నిశ్వాస గాలిలో ఆక్సిజన్ పరిమాణం తక్కువ. |
6. CO2, నీటిఆవిరి, పరిమాణం తక్కువ. | 6. CO2, నీటి ఆవిరి పరిమాణం ఎక్కువ. |
బి) వాయుసహిత-అవాయు శ్వాసక్రియ :
వాయుసహిత శ్వాసక్రియ | అవాయు శ్వాసక్రియ |
1. C6H1206 + 602 → 6H2O+ 6CO2 + 686 K.Cal | 1. C6H12O6 → C2H5OH + 2CO2 + 56 K.Cal |
2. ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఆక్సిజన్ లేకపోతే ఈ చర్య జరగదు. | 2. దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. ఆక్సిజన్ లేకుండా ఈ చర్య జరుగుతుంది. |
3. ఈ చర్యలో కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఏర్పడతాయి. | 3. ఈ చర్యలో కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది. నీరు ఏర్పడదు. ఇథనాల్ లేక లాక్టిక్ ఆమ్లం వంటివి ఉత్పత్తి అవుతాయి. |
4. దీనిలో ఎక్కువ శక్తి ఉత్పన్నమవుతుంది. | 4. దీనిలో అతి తక్కువ -శక్తి ఉత్పన్నమవుతుంది. |
5. దీనిలో మైటోకాండ్రియాతో సంబంధం ఉంటుంది. | 5. దీనిలో మైటోకాండ్రియా ప్రమేయం ఉండదు. |
6. క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. | 6. క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా ఇందులో జరగదు. |
7. ఈ చర్యలో 38 ATP అణువులు ఏర్పడతాయి. | 7. ఈ చర్యలో 2 ATP అణువులు ఏర్పడతాయి. |
8. ఈ శ్వాసక్రియ ముఖ్యంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసములు జరుపు అభివృద్ధి చెందిన జీవులలో జరుగుతుంది. | 8. ఈ శ్వాసక్రియ ఈస్టు కణములు, క్లోస్ట్రీడియం, ఆ బాక్టీరియా లాంటి నిమ్నస్థాయి జీవులలో జరుగును. |
9. ఈ చర్యలో గ్లైకాలసిస్ తరువాత క్రెట్స్ వలయము జరుగుతుంది. | 9. ఈ చర్యలో గ్లైకాలసిస్ తరువాత కిణ్వప్రక్రియ జరుగుతుంది. |
సి) శ్వాసక్రియ దహనం :
(లేదా)
శ్వాసక్రియ, దహనక్రియ రెండూ ఆక్సీకరణ చర్యలు అయినప్పటికీ, చాలా విషయాలలో విభేదిస్తాయి. వివరించండి.
శ్వాసక్రియ | దహన క్రియ |
1. శ్వాసక్రియలో బయట నుంచి వేడిమిని అందించవలసిన వేడిమిని అందిస్తాము. | 1. దహన క్రియలో చక్కెర అణువులు మండటానికి అవసరం లేదు. |
2. చక్కెర నల్లగా మారడం గాని, మండటం గాని జరగదు. | 2. ఈ క్రియలో చక్కెర మొదట నల్లగా మారి ఆ తరువాత మంటతో మండుతుంది. |
3. శ్వాసక్రియలో శక్తి వివిధ దశలలో నెమ్మదిగా విడుదలౌతుంది. | 3. దహన క్రియలో శక్తి ఒక్కసారిగా వేడిమి రూపంలో విడుదలౌతుంది. |
4. శ్వాసక్రియ నీటి సమక్షంలో ఉన్నప్పుడు జరుగుతుంది. | 4. దహనం నీరు లేకుండా ఉన్నప్పుడు జరుగుతుంది. |
5. శ్వాసక్రియలో అనేక యోగికాలు, మాధ్యమిక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. | 5. దహనక్రియలో మాధ్యమిక పదార్థాలు ఉత్పత్తి కావు. |
6. ఈ చర్యకు ఎంజైములు అవసరము. | 6. ఈ చర్యకు ఎంజైములు అవసరం లేదు. |
7. శక్తి అంచెలంచెలుగా విడుదల అగును. | 7. శక్తి అంతా ఒకేసారి విడుదల అవుతుంది. |
8. నియంత్రిత చర్య. | 8. నియంత్రణ శ్రమతో కూడుకున్నది. |
9. రసాయనబంధాలు అంచెలంచెలుగా విచ్చిన్నమౌతాయి. | 9. రసాయనబంధాలు ఒకేసారి విచ్ఛిన్నమౌతాయి. |
డి) కిరణజన్యసంయోగక్రియ – శ్వాసక్రియ :
కిరణజన్యసంయోగక్రియ | త్వాసక్రియ |
1. వృక్షాలలో మరియు కొన్ని ఫోటోసింథటిక్ బాక్టీరియాల్లో జరుగును. | 1. అన్ని జీవుల్లో జరుగును. |
2. పగటిపూట మాత్రమే జరుగును. | 2. అన్నివేళలా (పగలు, రాత్రి) జరుగును. |
3. కిరణజన్యసంయోగక్రియ జరపకుండా మొక్క కొద్దిరోజులు జీవించగలదు. | 3. శ్వాసక్రియ లేకుండా ఏ జీవీ కొద్దినిమిషాలు కూడా జీవించలేదు. |
4. మొక్కల్లో కొద్ది కణాలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియని జరుపుతాయి. | 4. సజీవి శరీరంలో అన్ని కణాలు శ్వాసక్రియను జరుపుతాయి. |
5. హరితరేణువుల్లో జరుగుతుంది. దీనికి సూర్యకాంతి అవసరం. | 5. వాయుసహిత శ్వాసక్రియ జీవపదార్థం, మైటోకాండ్రియాలలో జరుగును. దీనికి సూర్య కాంతి అవసరం లేదు. |
6. ఈ చర్యలో కాంతిశక్తి బంధించబడుతుంది. | 6. ఈ చర్యలో శక్తి విడుదలవుతుంది. |
7. కార్బన్ డై ఆక్సైడ్, నీరు మూలపదార్థాలు/ ఆరంభ పదార్థాలు. | 7. పిండిపదార్థాలు, కర్బన పదార్థాలు, ఆక్సిజన్’ వినియోగం అవుతాయి. |
8. కార్బన్ డై ఆక్సైడ్, వినియోగం చెంది ఆక్సిజన్ విడుదల అవుతుంది. | 8. ఆక్సిజన్ వినియోగం చెంది, కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. |
9. జీవి బరువుని పెంచుతుంది. | 9. జీవి బరువుని తగ్గిస్తుంది. |
10. వికిరణ కాంతిశక్తిని, రసాయనిక శక్తిగా మారుస్తుంది. | 10. రసాయనశక్తిని గాని, గుప్తశక్తిని గాని ఇతర చర్యల కోసం విడుదల చేస్తుంది. |
11. కాంతిశక్తిని ఉపయోగించి ATP ని ఉత్పత్తి చేస్తుంది. (కాంతి భాస్వీకరణము) | 11. గ్లూకోజును ఆక్సీకరణం చేసి ATP ని ఉత్పత్తి. చేస్తుంది. (ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్) |
12. నీటి అణువులోని హైడ్రోజన్ ని ఉపయోగించుకొని NADP ని NADPH2 గా క్షయకరణం చేస్తుంది. | 12. NADH2, పిండిపదార్థాలలోని హైడ్రోజన్ నుండి ఏర్పడుతుంది. |
13. ATP, NADPH2 ముఖ్యంగా కర్బన సమ్మేళనాలు తయారీకి ఉపయోగపడతాయి. | 13. ATP, NADH2 లు కణంలోని చర్యలకు ఉపయోగపడతాయి. |
14. ఇది నిర్మాణాత్మక చర్య. | 14. ఇది విచ్ఛిన్న క్రియ. |
15. | 15. C6H12O6 + 602 → 6C02 + 6H2O + 686 K.Cal |
16. ఇది ఉష్ణగ్రాహక చర్య. | 16. ఇది ఉష్ణమోచక చర్య. |
ప్రశ్న 2.
వాయుసహిత, అవాయు శ్వాసక్రియలలో ఏవైనా రెండు పోలికలు రాయండి. (AS1)
జవాబు:
వాయుసహిత, అవాయు శ్వాసక్రియలో రెండింటిలోనూ
- శక్తి వెలువడుతుంది.
- రెండింటిలోనూ గ్లైకాలసిస్ ఉమ్మడి దశ
- రెండింటిలోనూ పదార్థం వినియోగించబడుతుంది.
- రెండు చర్యలలో ఎంజైమ్స్ పాల్గొంటాయి.
- రెండు చర్యలు జీవనియంత్రిత చర్యలు.
ప్రశ్న 3.
ఒక్కోసారి ఆహారం శ్వాసనాళంలోకి పోయి ఇబ్బంది కలిగిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? (AS1)
జవాబు:
గ్రసని ఆహార, శ్వాస మార్గాల కూడలి. ఈ ప్రాంతంలో వాయు, ఆహార కదలికలను నియంత్రిస్తూ ‘ఉపజిహ్వ’ ‘ఉంటుంది. ఇది మనం ఆహారం తినేటప్పుడు వాయునాళాన్ని మూసివేస్తుంది. మనం మాట్లాడుతూ లేదా ఆలోచిస్తూ భోజనం చేస్తున్నప్పుడు ఈ ఉపజిహ్వ వాయునాళాన్ని సరిగా మూయదు. అందువలన ఆహారం శ్వాసనాళంలోనికి చేరి ‘కొర’ పోతుంది.
ప్రశ్న 4.
కొండలు, గుట్టల వంటి ప్రదేశాల్లో నెమ్మదిగా నడిచినప్పటికీ శ్వాసక్రియ వేగంగా జరగడానికి కారణాలు రాయండి. (AS1)
జవాబు:
కొండలు, గుట్టలు వంటి ఎత్తైన ప్రదేశాలలోని గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. కావున శరీరానికి సరిపడేలా .. ఆక్సిజన్ అందించటానికి ఎక్కువసార్లు శ్వాసించవలసి ఉంటుంది. అందువలన శ్వాసక్రియ రేటు పెరుగుతుంది.
ప్రశ్న 5.
రక్తకేశనాళికలోకి చేరడానికి వీలుగా గాలి వాయుగోణులలో నిలువ ఉంటుంది. ఈ వాక్యంలో సరిచేయవలసిన అంశాలు ఏమిటి? (AS1)
జవాబు:
రక్తకేశనాళికలో వాయు వినిమయం జరగటానికి వీలుగా గాలి వాయుగోణులలో నిలువ ఉంటుంది అని సరిచేయాలి. ఎందుకంటే రక్తకేశనాళిలోనికి గాలి అంతా చేరదు. గాలిలోని ఆక్సిజన్ మాత్రమే రక్తంలోనికి విసరణ చేంది, రక్తం నుండి CO2 గాలిలోనికి విసరణ చెందుతుంది. దీనినే వాయు వినిమయం అంటారు.
ప్రశ్న 6.
మొక్కలు పగలు కిరణజన్యసంయోగక్రియను, రాత్రి శ్వాసక్రియను నిర్వర్తిస్తాయి. మీరు ఈ అంశాన్ని అంగీకరిస్తారా? (AS1)
(లేదా )
మొక్కలు పగలు కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. రాత్రి శ్వాసక్రియను జరుపుతాయి అని బాలు చెప్పాడు అతనితో నీవు ఏకీభవిస్తావా, లేదా? ఎందుకు?
జవాబు:
ఈ అంశాన్ని నేను అంగీకరించటం లేదు. ఎందుకంటే కిరణజన్యసంయోగక్రియకు కాంతి అవసరం కనుక మొక్కలు కిరణజన్యసంయోగక్రియను పగలు నిర్వహిస్తాయి. అయితే శ్వాసక్రియ శక్తిని వెలువర్చే క్రియ. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. పై వాక్యంలో మొక్కలు, రాత్రి శ్వాసక్రియను నిర్వహిస్తాయని చెప్పారు, కావున నేను దీనిని మాత్రం అంగీకరించటంలేదు. మొక్కలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎల్లవేళలా శ్వాసక్రియను నిర్వహిస్తుంటాయి.
ప్రశ్న 7.
సముద్రాల లోపలికి వెళ్ళి ఈతకొట్టేవాళ్ళు, పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలెండర్లను తీసుకొని వెళతారు ఎందుకు? (AS1)
జవాబు:
నేల ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది గాలి నందు ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. సముద్ర మట్టానికి 13 కి.మీ. ఎత్తున, కేవలం 5 వంతుల ఆక్సిజన్ మాత్రమే లభ్యమౌతుంది. ఈ ఆక్సిజన్ శ్వాసించటానికి సరిపోదు కావున పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలెండర్లను తీసుకెళతారు.
సముద్రాలలోనికి వెళ్ళేవారు, నీటి నుండి ఆక్సిజన్‌ను గ్రహించలేరు. అంత లోతు నుండి ఆక్సిజన్ కోసం పైకి రాలేరు . కావున వారు తమవెంట ఆక్సిజన్ సిలెండర్లను తీసుకెళతారు.
ప్రశ్న 8.
గరిష్ఠ స్థాయిలో వాయు వినిమయం జరగడానికి వీలుగా వాయు గోణులు ఎలా మార్పు చెందాయో రాయండి. (AS1)
జవాబు:
వాయుగోణులు ఊపిరితిత్తుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు. వాయు వినిమయం వీటి ప్రధాన విధి. వాయు వినిమయం కోసం వాయుగోణులు ఈ క్రింది అనుకూలనాలు కలిగి ఉంటాయి.
- అధిక సంఖ్యలో రక్తనాళాలు కలిగి ఉంటాయి. అందువలన రక్తం ఎక్కువ మొత్తంలో వాయు వినిమయానికి అందుబాటులో ఉంటుంది.
- గోళాకార నిర్మాణాలు కలిగి ఉంది. ఉపరితల వైశాల్యం పెంచుతాయి.
- గాలిని నిల్వ చేసుకొని వాయు వినిమయ రేటును పెంచుతాయి.
- అధిక సంఖ్యలో ఉండుట వలన వాయు వినిమయ రేటు పెరుగుతుంది.
- రక్తకేశనాళికలు పలుచగా ఉండి వాయు వినిమయానికి అనుకూలంగా ఉంటుంది.
ప్రశ్న 9.
శ్వాసక్రియలో చక్కెరల నుండి శక్తి ఎక్కడ విడుదలవుతుంది అనే ప్రశ్నకు మాల ‘ఊపిరితిత్తులు’ అని, రజియ ‘కండరాలు’ అని సమాధానం రాశారు. ఎవరి సమాధానం సరైనది? ఎందుకు? (AS1)
జవాబు:
శ్వాసక్రియలో శక్తి కండరాలు లేదా కణజాలం నుండి విడుదల అవుతుంది. ఊపిరితిత్తులలో కేవలం వాయు వినిమయం జరుగుతుంది. O2 గ్రహించబడి CO2 విడుదల చేయబడుతుంది. ఈ ప్రక్రియను బాహ్య శ్వాసక్రియ అంటారు. ఈ ప్రక్రియలో ఎటువంటి శక్తి వెలువడదు.
శ్వాసక్రియలో శక్తి విడుదల కణస్థాయిలో జరుగుతుంది. దీనిని కణశ్వాసక్రియ లేదా అంతర శ్వాసక్రియ అంటారు. , కావున శ్వాసక్రియలో శక్తి కణజాలంలో విడుదల అవుతుంది.
ప్రశ్న 10.
శ్వాసక్రియలో ఎపిగ్లాటిస్, డయాఫ్రమ్ పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:
ఎపిగ్లాటిస్ :
గ్రసనిలో స్వరపేటికను కప్పుతూ, మూతవలె ఉండే నిర్మాణం ఎపిగ్లాటిస్. ఇది శ్వాస మార్గం, ఆహార మార్గాలను నియంత్రిస్తుంది. వాయునాళంలోనికి ఆహారం పోకుండా నియంత్రించటం దీని ప్రధానవిధి.
డయాఫ్రమ్ :
ఇది ఉరఃకుహరానికి క్రింద ఉండే కండరయుత నిర్మాణం. దీని కదలిక వలన ఉరఃకుహరంలో పీడనం మారి, బయటి గాలి లోపలికి, లోపలి గాలి బయటకు ప్రవేశిస్తుంది. పురుష శ్వాస కదలికలో డయాఫ్రమ్ కీలకపాత్ర వహిస్తుంది.
ప్రశ్న 11.
కణస్థాయిలో వాయు వినిమయం ఎలా జరుగుతుంది? (AS1)
జవాబు:
- ఆక్సిజన్తో కూడిన రక్తం కణజాలాలలోనికి సరఫరా అయినపుడు, కణజాలాలలో ఆక్సిజన్ వినియోగించబడి తక్కువ గాఢతతో ఉంటాయి.
- కావున రక్తం నుండి O2 కణజాలంలోని విసరణ చెందుతుంది. 3. కణ శ్వాసక్రియ వలన కణాలలో CO2 ఏర్పడి దాని గాఢత ఎక్కువగా ఉంటుంది.
- సాపేక్షంగా రక్తంలో CO2, గాఢత తక్కువ కావున కణజాలం నుండి CO2 రక్తానికి చేరుతుంది.
- ఈ విధంగా గాఢత ఆధారంగా కణజాలం, రక్తం మధ్య వాయు వినిమయం జరుతుంది.
ప్రశ్న 12.
బ్రాంఖియోల్ (శ్వాసనాళికల) వాయు వినిమయం ఎలా జరుగుతుంది? (AS1)
జవాబు:
- ఊపిరితిత్తులలోని బ్రాంఖియోల్ అనగా శ్వాసనాళికలు గాలితో నిండినపుడు, రక్తంలో ఆక్సిజన్ గాఢత సాపేక్షంగా తక్కువగా ఉంటుంది.
- అందువలన గాలి నుండి ఆక్సిజన్ రక్తంలోనికి విసరణ చెందుతుంది.
- అదే సందర్భంలో కణజాలం నుండి CO2 రక్తంలో చేరటం వలన రక్తంలో O2 గాఢత అధికంగా ఉంటుంది.
- అధిక గాఢతలో ఉన్న CO2, రక్తం నుండి ఊపిరితిత్తులలోని గాలిలోనికి విసరణ చెందుతుంది.
- ఈ ప్రక్రియను వాయు వినిమయం అంటారు. ఈ ప్రక్రియ మొత్తం గాఢత స్వభావం ఆధారంగా జరుగుతుంది.
ప్రశ్న 13.
కష్టమైన వ్యాయామాలు చేసినపుడు కండరాలలో నొప్పి కలుగుతుంది. కండరాల నొప్పికి, శ్వాసక్రియకు సంబంధం ఏమిటి? (AS1)
జవాబు:
- వ్యాయామం చేసినపుడు కండరాలలో శక్తి కొరకు అవాయు శ్వాసక్రియ జరుగుతుంది.
- అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
- కండరాలలో లాక్టిక్ ఆమ్లం పెరిగినపుడు కండరాలు అలసిపోయి నొప్పి చెందుతాయి.
- కొంత విరామం తరువాత కండరాలలో లాక్టిక్ ఆమ్లం తొలగించబడి కండరాలు సాధారణ స్థాయికి చేరుకొంటాయి.
- కావున కండరాల నొప్పికి శ్వాసక్రియకు సంబంధం ఉందని నిర్ధారించవచ్చు.
- అధిక ఆక్సిజన్ లభ్యత కోసం ఆరుబయట వ్యాయామం చేయటం మంచిది.
ప్రశ్న 14.
ఆకులతో పాటు కాండం కూడా శ్వాసిస్తుందని రాజు చెప్పాడు. నీవు అతనిని సమర్థిస్తావా? ఎలా? (AS1)
జవాబు:
- ఆకులతో పాటు కాండం కూడా శ్వాసిస్తుంది అనే మాటను నేను సమర్థిస్తాను.
- శ్వాసక్రియలో O2 గ్రహించబడి CO2 విడుదల చేయబడుతుంది. ఈ ప్రక్రియను వాయు వినిమయం అంటారు.
- వాయు వినిమయం కోసం పత్రాలు, పత్రరంధ్రాలను కలిగి ఉంటే, కాండాలు ‘లెంటి సెల్స్’ అనే నిర్మాణాలు కలిగి ఉంటాయి.
- లెంటిసెల్స్ కాండ కణజాలంతో సంబంధం కల్గి వాయు వినిమయానికి తోడ్పడతాయి.
- కావున ఆకులతో పాటు కాండం కూడా. శ్వాసిస్తుందని నిర్ధారించవచ్చు.
ప్రశ్న 15.
శరీరంలో డయాఫ్రమ్ లేకపోతే ఏమవుతుంది? (AS2)
జవాబు:
పురుషుల శ్వాస కదలికలో డయాఫ్రమ్ కీలకపాత్ర వహిస్తుంది. డయాఫ్రమ్ లేకపోతే మన శ్వాసకదలికలు సమర్థవంతంగా ఉండవు. గాలి పీల్చటం, వదలటం కష్టంగా ఉంటుంది. శ్వాసక్రియ సమర్థవంతంగా జరగదు. శరీరానికి సరిపడినంత ఆక్సిజన్‌ను అందించలేము.
ప్రశ్న 16.
ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడిని కలిసే అవకాశం కలిగితే, అపుడు శ్వాసక్రియ గురించి అతడిని నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు? (AS3)
జవాబు:
- శ్వాసక్రియ రేటు ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
- శ్వాసక్రియ రేటును యోగాసనాలలో ఎలా నియంత్రిస్తారు?
- జల స్తంభన విద్య సాధ్యమేనా?
- వేగంగా పరిగెత్తేవారు శ్వాస విషయంలో తీసుకొనే జాగ్రత్తలు ఏమిటి?
- ఊపిరితిత్తుల ఆరోగ్యం కొరకు తీసుకొనవలసిన జాగ్రత్తలు ఏమిటి?
- నికొటిన్ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
ప్రశ్న 17.
మీ పాఠశాల ప్రయోగశాలలో అవాయు శ్వాసక్రియ గురించి తెలుసుకోవటానికి మీరు చేసిన ప్రయోగంలో అనుసరించిన విధానం ఏమిటి? (AS3)
జవాబు:
ఉద్దేశం :
అవాయు శ్వాసక్రియ జరుగునపుడు ఆల్కహాలు ఏర్పడునని నిరూపించుట. కావలసిన పరికరాలు : గాజుసీసా, గ్లూకోజ్ ద్రావణం, ఈస్టు కణాలు, చిన్నబీకరు.
ప్రయోగం చేయు విధానం :
వెడల్పు మూతిగల ఒక గాజుసీసా తీసుకొనవలెను. సున్నపుతేట నింపిన చిన్న బీకరును ఆ గాజు సీసాలో ఉంచవలెను. గాజు సీసాలో 200 మి.లీ. గ్లూకోజు ద్రావణం తీసుకుని దానికి కొంచెం రొట్టెలలో ఉపయోగించే ఈస్టు కలపవలెను. గ్లూకోజ్ ద్రావణం పైన నూనె పోసి కప్పవలెను. దీని వలన గాలి బైకార్బొ నేట్ గ్లూకోజ్ లో ప్రవేశించదు. గాజు సీసాకు గట్టి బిరడాను ద్రావణం బిగించవలెను. ఒకటి రెండు రోజులు తరువాత సీసా మూతను తీసి వాసన చూస్తే, అది ఆల్కహాలు వాసన వేడిచేసి చల్లార్చిన గ్లూకోజ్ ఉండడం గమనించవలెను. అలాగే సున్నపుతేట పాలవలె అవాయు శ్వాసక్రియలో వెలువడిన ఉష్ణం, మారడం గమనించవలెను.
పరిశీలన :
అవాయు పరిస్థితులలో శ్వాసక్రియ జరగడం వల్ల గ్లూకోజు ద్రావణం ఆల్కహాలుగా మారినది. కార్బన్ డై ఆక్సైడు విడుదలగుట వలన సున్నపు తేట పాలవలె మారినది.
నిర్ధారణ :
దీనిని బట్టి అవాయు పరిస్థితులలో కూడా శ్వాసక్రియ జరుగుతుందని తెలుస్తుంది.
ప్రశ్న 18.
చక్కెరను మండించే ప్రయోగంలో నీవు గమనించిన అంశాలు ఏమిటి? (AS3)
జవాబు:
చక్కెరను మండించే ప్రయోగంలో నేను గమనించిన అంశాలు :
- చక్కెరను వేడి చేసినపుడు అది కరిగి ద్రవస్థితికి మారింది.
- అధిక ఉష్ణోగ్రత వద్ద చక్కెర మండి CO2 ను విడుదల చేసింది.
- చక్కెర మండినపుడు శక్తి ఉష్ణరూపంలో వెలువడింది.
- ఇది ఒక భౌతికచర్య, నియంత్రణ కష్టమైనది.
- ఈ చర్యలో ఆక్సిజన్ వినియోగించబడింది కావున ఇది ఒక ఆక్సీకరణ చర్య.
- శక్తి అంతా ఒకేసారి విడుదల అవుతుంది.
- నీటి సమక్షంలో ఈ దహన ప్రక్రియ ఆగిపోతుంది.
- చక్కెర నల్లని కార్బగా మిగిలిపోయింది.
ప్రశ్న 19.
కప్పలో జరిగే చర్మీయ శ్వాసక్రియ గురించి సమాచారం సేకరించండి. నివేదిక తయారుచేసి మీ తరగతిలో ప్రదర్శించండి. (AS4)
జవాబు:
- కప్ప ఉభయచర జీవి. ఇది నీటిలోనూ, నేలమీద జీవిస్తుంది.
- నీటిలోనూ, నేలమీద కూడా చర్మం దాని ముఖ్యమైన శ్వాసేంద్రియం.
- కప్ప తీసుకొనే మొత్తం ఆక్సిజన్ పరిమాణంలో 3వ వంతు చర్మం ద్వారా తీసుకొంటుంది.
- కప్ప చర్మాన్ని ఎల్లవేళలా తడిగా ఉంచుకొంటుంది.
- చర్మం ఉపరితలం మీదికి శ్లేష్మాన్ని స్రవించే అనేక గ్రంథులు కప్ప చర్మంలో ఉన్నాయి.
- చర్మాన్ని తేమగా ఉంచటం కోసం, కప్పలు తరచుగా నీటిలోకి దుముకుతుంటాయి.
- వేడిగా, పొడిగా ఉండే వేసవి నేలల్లో, కప్పలు నేలలో లోతుగా బొరియలు చేసుకొని నివసిస్తాయి. వీటిని ‘గ్రీష్మకాల సుప్తావస్థ’ లేక ‘వేసవి నిద్ర’ అంటారు.
- శీతాకాలంలో కూడా బొరియలలో నిద్రిస్తాయి. దీనినే ‘శీతాకాల సుప్తావస్థ’ లేక ‘శీతాకాల నిద్ర’ అనీ అంటారు. ఈ కాలాలలో కప్పలు చర్మం ద్వారా శ్వాసిస్తాయి.
ప్రశ్న 20.
పొగాకు వినియోగం, కాలుష్యం మొదలైన వాటివల్ల కలిగే శ్వాసకోశ వ్యాధుల గురించి సమాచారం సేకరించండి. దానిపై మీ తరగతిలో చర్చించండి. (AS4)
జవాబు:
పొగాకు, సిగిరెట్ వినియోగం వలన ఏటా ఒక్క అమెరికాలోనే 4, 38,000 మంది చనిపోతున్నట్లు ప్రాథమిక అంచనా. పొగాకు వినియోగం వలన ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చే అవకాశం 87% అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా. ప్రతిరోజు 1,100 మంది టీనేజర్స్ (17 సంవత్సరాలలోపు యువకులు) పొగాకుకు, పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారు. పొగాకు వినియోగం కేవలం శ్వాసకోస వ్యాధులపైనే కాకుండా, నోటి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదకర రోగాలనూ కలిగిస్తుంది.
పొగాకు వినియోగం వలన ఈ క్రింది ప్రమాదకర రోగాలు సంక్రమిస్తాయి.
1. క్రానిక్ బ్రాంకైటిస్ (Chronic bronchitis) :
ఇది దీర్ఘకాలిక వ్యాధి. వాయునాళంలో శ్లేష్మం పేరుకుపోవటం, విపరీతమైన దగ్గు దీని లక్షణాలు. దగ్గు దీర్ఘకాలికంగా ఉంటే శ్వాసనాళం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
2. ఎంఫిసెమా (Emphysema):
ఈ వ్యాధిలో ప్రధానంగా వాయు గోణులు దెబ్బతింటాయి. ఆయాసం, శ్వాసపీల్చటంలో ఇబ్బంది. దగ్గు, అలసట, బరువు కోల్పోవటం, ఒత్తిడి వంటివి ఈ వ్యాధి లక్షణాలు.
3. లంగ్ కేన్సర్ (Lung’s cancer) :
వాయు మార్గంలోని కణజాలం నికొటిన్ ప్రభావం వలన అదుపులేని కణవిభజన జరుపుతూ వ్రణాలను ఉత్పత్తి చేస్తుంది. దీని వలన ఊపిరితిత్తి మార్గాలలో గడ్డలు ఏర్పడతాయి. శ్వాస సమస్యలు ఏర్పడతాయి. వ్రణాలు పెరిగే కొలది దగ్గు, రక్తస్రావం, ఛాతినొప్పి, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
శ్వాససంబంధ రోగాలు పొగ త్రాగేవారిలోనే కాకుండా వారి ప్రక్కన ఉండే వారిపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. దీనినే Second hand smoke అంటారు. దీని ప్రభావం వలన, విసుగు, కళ్ళుమండుట, గొంతుమంట, దగ్గువంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి.
ప్రశ్న 21.
శ్వాసక్రియా మార్గాన్ని తెలియజేసే బొమ్మ గీసి, భాగాలు గుర్తించండి. (AS5)
జవాబు:
ప్రశ్న 22.
శ్వాసక్రియలో జరిగే దశలను తెలిపే రేఖాచిత్రం (Block diagram) గీయండి. కణశ్వాసక్రియ గురించి మీరేమి తెలుసుకున్నారో రాయండి. (AS5)
జవాబు:
శ్వాసక్రియలో వివిధ దశలు ఉంటాయి. అయితే వీటి మధ్య విభజన స్పష్టంగా ఉండదు. అవి ఉచ్చ్వాస నిశ్వాసాలు, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, రక్తం ద్వారా వాయురవాణా, కణజాలాల్లో వాయు మార్పిడి మరియు కణశ్వాసక్రియ.
కణశ్వాసక్రియ :
- కణస్థాయిలో జరిగే శ్వాసక్రియను కణశ్వాసక్రియ అంటారు. దీనినే అంతర శ్వాసక్రియ అని కూడా అంటారు.
- ఈ ప్రక్రియలో పరిసరాల నుండి గ్రహించబడిన ఆక్సిజన్ వినియోగించబడి, పదార్థం ఆక్సీకరణం చెందుతుంది.
- ఈ ప్రక్రియలో కొంత శక్తితో పాటు CO2 నీటి ఆవిరి వెలువడుతుంది. మరికొంత శక్తి ఉష్ణరూపంలో వెలువడుతుంది.
- కణశ్వాసక్రియ మొత్తం రెండు దశలలో జరుగుతుంది. అవి: 1 గ్లైకాలసిస్ 2. క్రైవలయం
- గ్లైకాలసిస్ కణద్రవ్యంలో జరగగా, క్రైవలయ చర్యలు మైటోకాండ్రియాలో జరుగుతాయి.
- మైటోకాండ్రియా నుండి శక్తి వెలువడుతుంది. కావున వీటిని కణశక్త్యాగారాలు అంటారు.
ప్రశ్న 23.
మన శరీరంలో జరిగే శ్వాసక్రియా యంత్రాంగాన్ని నీవెలా అభినందిస్తావు? (AS5)
జవాబు:
జీవులలో శ్వాసక్రియ ఒక అద్భుత జీవక్రియ. ఇది ప్రాణాధారం. అన్ని జీవక్రియలకు కావలసిన శక్తిని అందించే ఒకే వనరు శ్వాసక్రియ. ఈ ప్రక్రియలో ఆహారంలో పదార్థం ఆక్సీకరణం చెంది ATP శక్తిగా మారుతుంది. శ్వాసక్రియ దహనంవలె ఆక్సీకరణ చర్య అయినప్పటికి, చాలా వైవిధ్యం చూపుతుంది. శక్తిని వెలువర్చే ఈ క్రియ దహనంవలె కాకుండా 90% నీరు కలిగిన జీవద్రవ్యంలో ఎంజైమ్ సమక్షంలో నియంత్రిత చర్యగా జరగటం అద్భుతంగా ఉంటుంది. వెలువడే శక్తి అంతా ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా శరీర అవసరాలకు తగినట్టుగా వెలువడటం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. జీవి శరీర అవసరాలకు తగట్టు శ్వాసక్రియ రేటు పెరగటం, తరగటం కూడా అద్భుతవిషయం. సుప్తావస్థలో శ్వాసక్రియ రేటు కనిష్ఠంగా పడిపోవటం కూడా అద్భుతమైన విషయం.
ప్రశ్న 24.
మీ పాఠశాల సింపోజియంలో చర్చించటానికి అవాయు శ్వాసక్రియపై ఒక వ్యాసాన్ని తయారుచేయండి. (AS5)
జవాబు:
ఆక్సిజన్ రహిత పరిస్థితులలో, జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు. ఇది చిన్నచిన్న జీవులలోనూ, కండరాలలోనూ జరుగుతుంది. ఈ ప్రక్రియలో వెలువడే శక్తి కూడా తక్కువగా ఉంటుంది.
C6H12O6 → 2C2H5OH + 2CO2 + 54 K.Cal
అవాయు శ్వాసక్రియ, రెండు దశలలో జరుగుతుంది. మొదటి ప్రక్రియలో గ్లూకోజ్ అణువు విచ్చిన్నం చెందుతుంది. ఈ ప్రక్రియను గ్లైకాలసిస్ అంటారు. ఈ ప్రక్రియలో పైరూవిక్ ఆమ్లం ఏర్పడుతుంది. రెండవ దశను కిణ్వనం అంటారు. ఈ ప్రక్రియలో పైరూవిక్ ఆమ్లం మిథనాల్ లేదా లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఈ ప్రక్రియలో CO2 తో బాటు కొద్ది మొత్తంలో శక్తి వెలువడుతుంది.
అవాయు శ్వాసక్రియ, ఈస్ట్ వంటి శిలీంధ్రాలలోనూ, కొన్ని రకాల బాక్టీరియాలలోనూ గమనించవచ్చు.
ప్రశ్న 25.
హిమోగ్లోబిన్, క్లోరోఫిలు శ్వాసక్రియ గురించి మాట్లాడుకుంటున్నట్లుగా ఒక కార్టూన్ గీయండి. (AS5)
జవాబు:
10th Class Biology 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ Textbook InText Questions and Answers
10th Class Biology Textbook Page No. 27
ప్రశ్న 1.
వాయు సంఘటనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రీస్టే ప్రయోగాలు ఉపయోగపడతాయని ‘చెప్పవచ్చా? ఎలా?
జవాబు:
ప్రీస్టే ప్రయోగాలకు పూర్వం గాలి ఒకే పదార్థంగా భావించేవారు. కానీ ప్రీస్టే ప్రయోగాల వలన గాలి ఒకే అంశ పదార్థం కాదని, అది కొన్ని పదార్థాల మిశ్రమం అని నిర్ధారించబడింది. జంతువులు ఖర్చుచేసే వాయువు ఏదో, మొక్కలు భర్తీ చేస్తాయని ప్రీస్టే నిరూపించాడు.
ప్రశ్న 2.
లేవోయిజర్ ప్రకారం వస్తువులు దహనం చెందినపుడు వెలువడేది ఏమిటి?
జవాబు:
లేవోయిజర్ ప్రకారం వస్తువు దహనం చెందినపుడు స్థిరవాయువు లేదా బొగ్గుపులుసు వాయువు వెలువడుతుంది. దీనినే మనం కార్బన్ డై ఆక్సైడ్ అంటాము.
ప్రశ్న 3.
గాలి గురించి తన ప్రయోగం ద్వారా లేవోయిజర్ ఏమి తెలుసుకున్నాడు?
జవాబు:
మనం పీల్చటానికి తోడ్పడుతున్న గాలిలో ఉండే వాయువు వస్తువులు మండించటానికి తోడ్పడుతుందని లేవోయిజర్ – గ్రహించాడు. దీనికి ఆక్సిజన్ అని నామకరణం చేశాడు.
ప్రశ్న 4.
లేవోయిజర్ ప్రయోగాల ఆధారంగా మనం ఏ నిర్ధారణకు రావచ్చు?
జవాబు:
లేవోయిజర్ ప్రయోగాల ఆధారంగా మనం పీల్చే వాయువు పదార్థాలను మండించటానికి కూడా తోడ్పడుతుందని గుర్తించాడు. దానికి ఆక్సిజన్ అని నామకరణం చేశాడు.
10th Class Biology Textbook Page No. 28
ప్రశ్న 5.
లేవోయిజర్ అనుకొన్న బొగ్గుపులుసు వాయువు ఏమిటి?
జవాబు:
లేవోయిజర్ అనుకొన్న బొగ్గుపులుసు వాయువును నేడు మనం కార్బన్ డై ఆక్సైడ్ గా పిలుస్తున్నాము.
ప్రశ్న 6.
లేవోయిజర్ పరిశోధనల ప్రకారం పీల్చడానికి పనికి వచ్చే గాలి ఏమిటి?
జవాబు:
లేవోయిజర్ పరిశోధనల ప్రకారం మనం పీల్చడానికి పనికి వచ్చే గాలి ‘ఖర్చయ్యే వాయువు’. దీనినే ఆక్సిజన్ అని పిలుస్తారు.
ప్రశ్న 7.
తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియ విధానంలో ఏయే సోపానాలు ఉంటాయని లేవోయిజర్ పేర్కొన్నాడు?
జవాబు:
లేవోయిజర్ తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో రెండు ప్రక్రియలు ఉంటాయని గుర్తించినప్పటికి ఒక ప్రక్రియ గురించి మాత్రమే తెలుసుకోగలిగాడు. విడిచే గాలిలో బొగ్గుపులుసు వాయువు ఉంటుందని తెలుసుకోగలిగాడు.
ప్రశ్న 8.
మనచుట్టూ ఉన్న గాలితో పోల్చినపుడు విడిచేగాలి వేడిగా ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. శ్వాసక్రియ దీనికి కారణమవుతుందని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
ఔను. శ్వాసక్రియలో కొంత శక్తి వేడిమి రూపంలో వెలువడుతుంది. ఈ వేడి శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచటానికి తోడ్పడుతూ, జీవక్రియలు జరగటానికి కూడా సహకరిస్తుంది. శ్వాసక్రియలో వెలువడే ఈ ఉష్ణం ఆధారంగానే మనం విడిచేగాలి వెచ్చగా ఉంటుంది.
10th Class Biology Textbook Page No. 29
ప్రశ్న 9.
ఏ వాయువు సున్నపు తేటసు పాలవలె తెల్లగా మారుస్తుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ సున్నపు తేటను తెల్లగా పాలవలె మార్చుతుంది.
ప్రశ్న 10.
మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినపుడు, మనం బయటకు వదిలే గాలిలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంది?
జవాబు:
మనం బయటకు విడిచే గాలిలో CO2 పరిమాణం (41%) అధికంగా ఉంటుంది.
10th Class Biology Textbook Page No. 32
ప్రశ్న 11.
మనం ఆహారం తినే సమయంలో మాట్లాడకూడదని ఎందుకు అంటారు?
జవాబు:
గ్రసని ఆహార, శ్వాసమార్గాల కూడలి. ఈ ప్రాంతంలో ఆహారం, ఆహార నాళంలోనికి ప్రవేశించకుండా వాయునాళంలోనికి ప్రవేశించే ప్రమాదం ఉంది. స్వరపేటిక మీద ఉండే ఉపజిహ్విక ఈ మార్గంలో ఆహారాన్ని నియంత్రిస్తుంది. మనం మాట్లాడుతున్నప్పుడు ఇది సరిగా పనిచేయకపోవచ్చు. కావున ఆహారం తినే సమయంలో మాట్లాడకూడదని అంటారు.
ప్రశ్న 12.
శ్వాసక్రియలో ప్రక్కటెముక కండరాలు, ఉదరవితానముల పాత్ర ఏమిటి? స్త్రీ, పురుషులు ఇరువురిలో రెండు శ్వాసక్రియలో పాల్గొంటాయా?
జవాబు:
శ్వాసకదలికలలో ప్రక్కటెముకలు, ఉదరవితానం ప్రముఖ పాత్ర వహిస్తాయి. వీటి కదలిక వలన ఉరఃకుహర పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. అందువలన వెలుపలి గాలి ఊపిరితిత్తులలోనికి, ఊపిరితిత్తుల నుండి మరలా ఆ ములుకు ప్రవేశిస్తుంది.
అయితే ఉదరవితానం పురుషులలో బాగా క్రియావంతంగా ఉండి శ్వాసకదలికలో ప్రముఖపాత్ర వహిస్తే, సీలలో ప్రక్కటెముకలు శ్వాసకదలికలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
10th Class Biology Textbook Page No. 33
ప్రశ్న 13.
శ్వాసక్రియను ప్రభావితం చేసే ఇతర పరిస్థితులు ఏమిటి?
జవాబు:
శ్వాసక్రియ 1. ఆక్సిజన్ లభ్యత 2. ఉష్ణోగ్రత 3. ఆక్సీకరణం చెందే పదార్థ స్వభావం 4. ఎంజైమ్ ల క్రియాశీలక 5. పరిసరాలు 6. జీవి ఆరోగ్యపరిస్థితి వంటి ఇతర కారకాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 14.
మెదడు నుండి శ్వాస అవయవాలకు వెళ్ళే నాడులను కత్తిరించినట్లయితే శ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివలన మనకు ఏం అర్థమవుతుంది?
జవాబు:
మెదడు నుండి శ్వాస అవయవాలకు వెళ్ళే నాడులను కత్తిరించినట్లయితే శ్వాసక్రియ నిలిచిపోతుంది. దీనినిబట్టి శ్వాసక్రియకు, మెదడుకు సంబంధం ఉందని తెలుస్తుంది. అంతేగాక శ్వాసక్రియను నియంత్రించే శ్వాసకేంద్రం మెదడులో ఉన్నట్లు నిర్ధారించవచ్చు.
10th Class Biology Textbook Page No. 34
ప్రశ్న 15.
శ్వాసక్రియ జరిగే సమయంలో ఏం జరుగుతుంది?
జవాబు:
శ్వాసక్రియ జరిగే సమయంలో పరిసరాల నుండి గ్రహించబడిన ఆక్సిజన్, ఆహారపదార్థాలను ఆక్సీకరణం చెందిస్తుంది. అందువలన పదార్థం నుండి శక్తి ఉష్ణముతో పాటు CO2 వెలువడుతుంది. అయితే క్రియలు ఒక వరుస క్రమంలో ఎంజైమ్స్ సమక్షంలో జరుగుతాయి.
ప్రశ్న 16.
నిశ్వాస సమయంలో శరీరం నుండి తొలగించబడిన వాయువు ఏది? ఇది ఎక్కడి నుండి వస్తుంది?
జవాబు:
నిశ్వాస సమయంలో శరీరం నుండి CO2 తొలగించబడుతుంది. ఇది శ్వాసక్రియలో పదార్థం ఆక్సీకరణం చెందటం వలన ఏర్పడుతుంది.
ప్రశ్న 17.
ఉచ్చ్వాస, సమయంలో ఊపిరితిత్తులలోనికి వెళ్ళే వాయువుల సంఘటనం ఏది?
జవాబు:
ఉచ్చ్వాస సమయంలో ఊపిరితిత్తులలోనికి వెళ్ళే వాయువులు
ఆక్సిజన్ – 21%
CO2 – 0.04% ఉంటాయి.
ప్రశ్న 18.
ఉచ్చ్వాస, నిశ్వాస వాయువుల సంఘటనంలో తేడా ఏమైనా ఉందా?
జవాబు:
ఉచ్ఛ్వాసం చెందే వాయువులలో ఆక్సిజన్ పరిమాణం ఎక్కువగా (21%) ఉంటే, నిశ్వాసం చెందే వాయువులలో CO2 పరిమాణం (4%) అధికంగా ఉంటుంది.
వాయువు | ఉచ్చ్వాసించే వాయువులో గల శాతం | నిశ్వాసించే వాయువులో గల శాతం |
ఆక్సిజన్ | 21 | 16 |
కార్బన్ డై ఆక్పైడ్ | 0.03 | 44 |
నైట్రోజన్ | 78 | 78 |
గమనిక : పట్టికలో ఇవ్వబడిన విలువలు సుమారైనవి మాత్రమే.
→ ఉచ్చ్వాసించే, నిశ్వాసించే వాయువులలో ఆక్సిజన్ పరిమాణంలో తేడాకు కారణమేమిటి?
జవాబు:
ఉచ్ఛ్వాస దశలో గాలి నుండి CO2 రక్తంలోనికి విసరణ చెందుతుంది. కావున ఈ గాలి నిశ్వాసం ద్వారా బయటకు వచ్చినపుడు O2 పరిమాణం తక్కువగా ఉంటుంది.
→ నిశ్వాసించే వాయువులలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుటకు కారణమేమిటి?
జవాబు:
ఉచ్చ్వాసదశలో రక్తం నుండి CO2 విసరణ చెంది ఊపిరితిత్తులలోనికి, గాలిలోనికి ప్రవేశిస్తుంది. కావున నిశ్వసించే గాలిలో CO2 పరిమాణం పెరుగుతుంది.
10th Class Biology Textbook Page No. 36
ప్రశ్న 20.
గ్లూకోజ్ అణువు విచ్చిన్నం చెందటం, అనేక క్రమానుగత రసాయన చర్యల ద్వారా జరుగుతుంది. ఇది శక్తి విడుదల కావడంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:
గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెందడాన్ని ‘గ్లైకాలసిస్’ అంటారు. ఈ చర్యలో గ్లూకోజ్ అణువు అనేక దశలలో విచ్ఛిన్నం చెంది చివరికి పైరూవిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ చర్యలన్నీ ఒకదాని తరువాత మరొకటి అనేక దశలలో జరుగుతాయి. కావున శ్వాసక్రియలో శక్తి కూడా ఒక్కసారిగా కాకుండా అంచెలంచెలుగా విడుదల అవుతుంది.
10th Class Biology Textbook Page No. 37
ప్రశ్న 21.
వాయుగోణులలోనికి కణాలకు కణశ్వాసక్రియ నిర్వహించడానికి ఆక్సిజన్ అవసరమా? ఎందుకు?
జవాబు:
పని నిర్వహించే ప్రతి కణజాలానికి శక్తి అవసరం. ఈ శక్తిని అవి శ్వాసక్రియ ద్వారా పొందుతాయి. శ్వాసక్రియ నిర్వహించటానికి ఆక్సిజన్ అవసరం కావున వాయుగోణులలోనికి కణాలు కణశ్వాసక్రియ నిర్వహించడానికి ఆక్సిజన్ అవసరము.
ప్రశ్న 22.
తీవ్రమైన వ్యాయామం చేసిన తరువాత మనకు కండరాలలో నొప్పి వస్తుంది కదా! కండరాలకు సరిపోయినంత ఆక్సిజన్ సరఫరా జరిగిందా?
జవాబు:
తీవ్రమైన వ్యాయామం చేసిన తరువాత కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోయి నొప్పి వస్తుంది. ఈ స్థితిలో కండరాలలో ‘ఆక్సిజన్ లోటు’ ఏర్పడుతుంది. ఈ పరిస్థితులలో కండరాలకు సరిపోయినంత ఆక్సిజన్ సరఫరా జరగదు. జరిగిన తరువాత కండరాలు సాధారణ స్థితికి వస్తాయి.
10th Class Biology Textbook Page No. 38
ప్రశ్న 23.
కండరాలలో ఏ రసాయనాలు ఏర్పడతాయి?
జవాబు:
కండరాలు అవాయు శ్వాసక్రియ జరిపి, లాక్టిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవటం వలన అలసిన అనుభూతి కలుగుతుంది. కొంత విరామం తరువాత లాక్టిక్ ఆమ్లం తొలగించబడి కండరాలు సాధారణ స్థితికి చేరుకొంటాయి.
10th Class Biology Textbook Page No. 41
ప్రశ్న 24.
బేకరీలలో రొట్టెల తయారీదారులు పిండికి ఈస్టు కలిపినపుడు ఏం జరుగుతుంది?
జవాబు:
బేకరీలలో రొట్టెల తయారీదారులు పిండికి ఈస్ట్ ను కలిపినపుడు, ఈస్ట్ పిండిలో అవాయు శ్వాసక్రియ జరుపుతుంది. “ఫలితంగా పిండిపదార్థం ఆల్కహాల్ గా మార్చబడి, CO2 వెలువడుతుంది. CO2 వెలువడుట వలన పిండి పరిమాణం పెరుగుతుంది. ఆల్కహాల్ వలన పిండి పులిసిన వాసన వస్తుంది.
ప్రశ్న 25.
శ్వాసక్రియ శక్తిని విడుదల చేసే ప్రక్రియ. దీనిని మీరు అంగీకరిస్తారా? ఎందుకు?
జవాబు:
ఔను, శ్వాసక్రియ శక్తిని విడుదల చేసే ప్రక్రియ. శ్వాసక్రియలో ఆహార పదార్థాలు ఆక్సీకరించబడి శక్తి వెలువడుతుంది. శక్తి ATP రూపంలో నిల్వచేయబడి కణక్రియల కొరకు వినియోగించబడుతుంది.
ప్రశ్న 26.
చక్కెరను మండించినపుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
చక్కెరను మండించినపుడు మొదట అది ద్రవస్థితికి మారుతుంది. తరువాత అది మండి కార్బన్ డై ఆక్సైడ్ ను, శక్తిని వెలువరుస్తుంది. ఈ ప్రక్రియను దహనం లేదా మండుట అంటారు. ఇది శ్వాసక్రియవలె ఆక్సీకరణ చర్య.
10th Class Biology Textbook Page No. 42
ప్రశ్న 27.
శీతాకాలంలో చలికోటు (స్వెట్టర్) వేసుకున్నపుడు మనకు వెచ్చగా ఉంటుంది. చలికోటు మన శరీరం విడుదల చేసిన ఉష్ణాన్ని వృథా కాకుండా కాపాడుతుంది. అంటే మన శరీరం ఉష్ణాన్ని విడుదల చేసిందని అనుకోవచ్చా? ఇంకా ఏయే మార్గాల ద్వారా మన శరీరం ఉష్ణాన్ని కోల్పోతుంది?
జవాబు:
- మన శరీరం ఉపరితలం నుండి నిరంతరం ఉష్ణాన్ని కోల్పోతూనే ఉంటుంది. కాబట్టి మన శరీరం కోల్పోయిన ఉష్ణాన్ని పూరించడానికి నిరంతరం ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉండాలి. దీని వలననే శరీర ఉష్ణోగ్రత నిరంతరం స్థిరంగా ఉంటుంది.
- మన పరిసరాలు చల్లగా ఉన్నప్పుడు, ప్రధాన చెవిడిప్ప, చేతివేళ్ళ ద్వారా ఉష్ణాన్ని త్వరగా కోల్పోతుంటాము. కావున ఈ భాగాలు ముందుగా చల్లబడతాయి.
ప్రశ్న 28.
శరీరం కోల్పోయే ఉష్ణోగ్రత, ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత ఒకే నిష్పత్తిలో ఉంటాయా?
జవాబు:
మనం శరీరం ఎల్లప్పుడూ నిర్దిష్ట ఉష్ణోగ్రతను (37°C) కలిగి ఉంటుంది. కావున మానవులు స్థిరోష్ణ జీవులు. శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలంటే శరీరం కోల్పోయే ఉష్ణోగ్రత, ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత సమానంగా ఉండాలి. మన శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. కావున శరీరం కోల్పోయే ఉష్ణోగ్రత ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది.
ప్రశ్న 29.
ఉదయం నిద్రలేవగానే మీ శరీర ఉష్ణోగ్రతను కొలవండి. కొంచెం సేపు జాగింగ్ చేసిన తరువాత మరలా ఉష్ణోగ్రతను కొలవండి. రెండింటికి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా? లేదా? వివరించండి.
జవాబు:
- ఉదయం నిద్రలేవగానే శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. కాసేపు జాగింగ్ చేసిన తరువాత శరీర ఉష్ణోగ్రత పెరిగింది.
- జాగింగ్ చేసినపుడు ఎక్కువ శక్తి అవసరం. శక్తి కోసం శ్వాసక్రియ రేటు పెరుగుతుంది.
- శ్వాసక్రియలో కొంత శక్తి ఉష్ణం రూపంలో వెలువడుతుంది. కావున జాగింగ్ తరువాత శరీర ఉష్ణోగ్రత పెరిగింది.
10th Class Biology Textbook Page No. 45
ప్రశ్న 30.
మొక్కలు, జంతువులలో జరిగే శ్వాసక్రియలలో నీవు ఏమేమి పోలికలు గమనించావు?
జవాబు:
మొక్కలు, జంతువులలో జరిగే శ్వాసక్రియలో చాలా పోలికలు ఉన్నాయి.
- రెండు జీవుల శ్వాసక్రియలో 0, గ్రహించబడుతుంది.
- CO2 విడుదల చేయబడుతుంది.
- పదార్థాలు ఆక్సీకరింపబడతాయి.
- శక్తి వెలువరించే ప్రక్రియ.
- విచ్ఛిన్నక్రియ రెండు రకాల జీవులలోనూ పదార్థం విచ్ఛిన్నం చేయబడుతుంది.
ప్రశ్న 31.
మీరు ఎప్పుడైనా చిత్తడి ప్రదేశాలకు వెళ్ళినపుడు అక్కడ పెరిగే మొక్కల కాండం సేకరించండి. దానిలో గల రంధ్రాల సంఖ్య, పరిమాణాన్ని మామూలు ల మీద పెరిగే మొక్కల కాండంతో పోల్చి చూడండి. రెండూ ఒకే రకంగా ఉన్నాయా? భిన్నంగా ఉన్నాయా? ఎందుకు?
జవాబు:
చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్క కాండం నేలమీద పెరిగే మొక్క కాండం కన్నా భిన్నంగా ఉంది. నేలమీద పెరిగే మొక్క కాండం పై రంధ్రాల సంఖ్య తక్కువగా ఉండి కొద్ది పరిమాణంలో ఉంటే, చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్క కాండం అధిక రంధ్రాలు కలిగి అధిక పరిమాణంలో ఉన్నాయి.
చిత్తడి ప్రాంతాలలో పెరిగే మొక్కల వేర్లకు వాయులభ్యత తక్కువ. నేల అంతా నీటితో నిండి ఉంటుంది. కావున ఈ మొక్కలు కాండం ద్వారా గాలి పొందటానికి అధిక సంఖ్యలో రంధ్రాలు కలిగి ఉంటాయి.
ప్రశ్న 32.
వాయుమార్గంలో తేమ లేనట్లయితే ఏం జరుగుతుంది?
జవాబు:
- వాయుమార్గంలో తేమ లేనట్లయితే, దుమ్ము, ధూళి కణాలు గాలి నుండి తొలిగించబడవు.
- వేసవికాలంలో గాలి చల్లబర్చకుండా ఊపిరితిత్తులను చేరుతుంది. దీని వలన ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
- శీతాకాలంలో గాలి వాయుమార్గంలో తేమ వలన వెచ్చబడి ఊపిరితిత్తులను చేరుతుంది. లేనట్లయితే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
ప్రశ్న 33.
రెండు ఊపిరితిత్తులూ ఒకే పరిమాణంలో ఉంటాయా?
జవాబు:
మన శరీరంలోని రెండు ఊపిరితిత్తులూ ఒకే పరిమాణంలో ఉండవు. కుడి ఊపిరితిత్తి మూడు తమ్మెలు కలిగి ఎడమ దానికంటే పెద్దదిగా ఉంటుంది. ఎడమ ఊపిరితిత్తి రెండు తమ్మెలు కలిగి కొంచెం చిన్నదిగా ఉంటుంది.
ప్రశ్న 34.
వాయుకోశగోణులు అసంఖ్యాకంగాను, అతిచిన్నవిగాను ఎందుకు ఉంటాయి?
జవాబు:
వాయుగోణులు ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంలో గాలి నుండి అణుస్థాయిలో వాయు వినిమయం జరపటానికి ఇవి సూక్ష్మంగా ఉంటాయి. పరిమాణంలో పెద్దవిగా ఉండే ఊపిరితిత్తులను నిర్మించటం కోసం ఇవి అసంఖ్యాకంగా ఉన్నాయి. ఊపిరితిత్తుల వైశాల్యం పెంచటంలో కూడా ఇవి కీలకపాత్ర వహిస్తాయి.
10th Class Biology 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
• మీ చేతిని నాసికా రంధ్రాలకు ఎదురుగా ఒక అంగుళం దూరంలో ఉంచండి. మీ శ్వాస బయటకు వచ్చి చేతిని తాకడం గమనించండి. ఈ కృత్యం పూర్తయ్యే వరకు చేతిని అక్కడ నుండి తీయకండి. ఒకటి రెండు నిమిషాలు నిలకడగా శ్వాసించండి. ఏదైనా ఆహార పదార్థాన్ని కొరికి బాగా నమిలి, మ్రింగే ముందుగా రెండవ చేతిని గొంతుపై ఉంచిన తరువాత ఆహారాన్ని మ్రింగడం.
1) మీరేం గమనించారు?
జవాబు:
ఆహారాన్ని మ్రింగుతున్నప్పుడు, గొంతులో కదలిక గుర్తించాను. అదే సమయంలో శ్వాస చేతికి తగలలేదు.
2) ఆహారాన్ని మ్రింగే సమయంలో మీ శ్వాసలో ఏమైనా తేడా గమనించారా?
జవాబు:
ఆహారాన్ని మింగుతున్నప్పుడు శ్వాస ఆగినట్లు గమనించాను.
3) ఆహారాన్ని మ్రింగే సమయంలో, ఆహారం శ్వాసనాళంలోనికి ప్రవేశించకుండా సహాయపడుతున్నది ఏది? జ. ఆహారాన్ని మ్రింగే సమయంలో ఆహారం శ్వాసనాళంలోనికి ప్రవేశించకుండా, గ్రసనిలో ఉండే ఉపజిహ్విక సహాయపడుతుంది.
కృత్యం – 2
* చక్కెరను మండించినపుడు ఏం జరుగుతుంది?
పటంలో చూపిన విధంగా పరికరాలను అమర్చండి. ఒక పరీక్ష నాళికలో చక్కెరను తీసుకొని మంట సహాయంతో వేడి చేయండి. కొంచెం సేపటి తరువాత ఏం జరుగుతుందో గమనించండి.
1) చక్కెర కరిగిందా?
జవాబు:
వేడిచేసినపుడు చక్కెర కరిగింది.
2) ఇంకా ఎక్కువ సేపు పనిచేసినపుడు ఏం జరిగింది?
జవాబు:
చక్కెరను బాగా వేడిచేసినపుడు కార్బన్ డై ఆక్సైడ్ నీటితో పాటుగా శక్తి వేడి రూపంలో వెలువడుతుంది.
కృత్యం – 3
పిడికెడు శెనగలు లేదా రాగులు తీసుకోండి. మీ ప్రయోగానికి ఒక రోజు ముందు వాటిని నీళ్ళలో నానబెట్టండి. తరవాత వాటిని తీసి గుడ్డలో వేసి దారంతో గట్టిగా మూటకట్టండి. ఆ మూటను తరగతి గదిలో ఒక మూల ఉంచండి. రెండు రోజులపాటు పరిశీలించండి. గింజలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన గింజలను తీసుకొని గాజుసీసాలో వేయండి. ఒక చిన్న బీకరు తీసుకొని దానిలో మూడు వంతుల వరకు సున్నపుతేట నింపండి. సీసా మూతికి దారం కట్టి సీసాను జాగ్రత్తగా గాజు జాడీలో ఉంచండి. జాడీ మూత బిగించండి. ఇలాగే పొడి విత్తనాలతో మరొక అమరికను సిద్ధం చేసుకోండి. రెండింటిని రెండు రోజులపాటూ కదపకుండా ఉంచండి. రెండు అమరికలను పరిశీలించండి.
• మీ పరిశీలనలను నమోదు చేయండి.
1) ఏ జాడీలో ఉంచిన సీసాలో సున్నపు నీరు రంగు మారింది? ఎందుకు?
జవాబు:
- మొలకెత్తుతున్న గింజలు ఉన్న సీసాలోని సున్నపు నీరు రంగు మారింది.
- మొలకెత్తు గింజలు శ్వాసక్రియ జరిపి CO2 ను విడుదల చేయుటవలన, సున్నపునీరు CO2 సున్నపు నీటిని తెల్లగా పాలవలె మార్చింది.
కృత్యం – 4
మొలకెత్తిన గింజలను ఒక థర్మార్టైస్కులో తీసుకోండి. ఒక బిరడాను తీసుకొని, రంధ్రం చేసి దానిగుండా థర్మామీటరును అమర్చండి. ఈ థర్మామీటరు నొక్కు మొలకెత్తిన గింజల్లో మునిగి ఉండేలా జాగ్రత్తపడండి. ప్రతి రెండు గంటలకు థర్మామీటరులో ఉష్ణోగ్రత నమోదు చేయండి. మంచి ఫలితాల కోసం 24 గంటలపాటు పరిశీలించండి.
* మీ పరిశీలనల ఆధారంగా (కాలం – ఉష్ణోగ్రతలపై గ్రాఫ్ గీయండి.)
జవాబు:
* ఉష్ణోగ్రతలలో పెరుగుదలను ఏమైనా గుర్తించారా?
జవాబు:
ఔను, సీసాలో ఉష్ణోగ్రత పెరిగింది.
ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందా లేక రోజులో ఏదో ఒక సమయంలో అకస్మాత్తుగా పెరిగినట్లుగా ఉన్నదా?
జవాబు:
ఉష్ణోగ్రత క్రమంగా పెరగటం గమనించాను. ఒక్కసారిగా ఉష్ణోగ్రత పెరగలేదు.
* ఈ ఉష్ణం ఎక్కడ నుండి వచ్చిందని మీరు భావిస్తున్నారు?
జవాబు:
మొలకెత్తుతున్న గింజల శ్వాసక్రియ రేటు అధికంగా కలిగి కాలం గంటలలో ఉంటాయి. శ్వాసక్రియలో కొంత శక్తి ఉష్ణం రూపంలో వెలువడుట వలన, ధర్మాప్లాస్కులో ఉష్ణోగ్రత పెరిగినట్టు భావిస్తున్నాను.
ప్రయోగశాల కృత్యం
1. ఈ ప్రయోగం ద్వారా నీవు ఏ విషయాలు నిరూపించగలవు ?
జవాబు:
1. ఈ ప్రయోగం ద్వారా నేను అవాయు శ్వాసక్రియను నిరూపించగలను.
2. అవాయు శ్వాసక్రియలో CO2 వెలువడుతుందని నిరూపించగలను.
2. ఈ ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణాన్ని, ఎందుకు వేడిచేస్తారు?
జవాబు:
వేడిచేయటం వలన గ్లూకోజ్ ద్రావణంలోని ఆక్సిజన్ తొలగించవచ్చు. అందువలన అవాయు శ్వాసక్రియ పరిస్థితులు ఆకల్పిస్తాను.
3. గ్లూకోజ్ ద్రావణంపై పారాఫిన్ మైనం ఎందుకు పోశావు?
జవాబు:
గాలిలోని ఆక్సిజన్ గ్లూకోజ్ ద్రావణంలో కలవకుండా నిరోధించటానికి పారాఫిన్ మైనం పోశాను.
4. ఈ ప్రయోగంలో సున్నపు తేటలో ఏం మార్పు గమనించావు?
జవాబు:
సున్నపు నీరు పాలవలె మారటం గమనించాను. ఇది CO2 ఆవిడుదలను నిర్ధారించింది.
5. ఈ ప్రయోగంలో ఏ జీవులు అవాయు శ్వాసక్రియను నిర్వహిస్తాయి?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణానికి కలిపిన ఈస్ట్ కణాలు అవాయు శ్వాసక్రియ జరిపాయి.
కింది ఖాళీలను పూరించండి
1. విడిచేగాలిలో ………….. మరియు ……………… ఉంటాయి. (CO2, నీటి ఆవిరి)
2. గాలి, ఆహారం శరీరం లోపలికి వెళ్ళడానికి వీలుగా పనిచేసే కండరయుతమైన మూతవంటి నిర్మాణం …………… (ఉపజిహ్విక)
3. కణాలలో నిల్వ ఉన్న శక్తి ప్రమాణాన్ని ……………………. అంటారు. (ATP)
4. మొక్కలలో ……… భాగాలలో లెంటి సెల్స్ ఉంటాయి. ఇవి ……………….. చర్యకు తోడ్పడతాయి. (కాండ, వాయువినిమయం)
5. మాంగ్రూప్ లో శ్వాసక్రియ …………….. ద్వారా జరుగుతుంది. (శ్వాసవేర్లు)
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు.
A) వాయునాళం
B) స్వరపేటిక
C) నాశికాకుహరం
D) గ్రసని
జవాబు:
B) స్వరపేటిక
2. ఊపిరితిత్తులలో ఉండే గాలితిత్తుల వంటి నిర్మాణాలు
A) వాయుగోణులు
B) శ్వాసనాళాలు
C) శ్వాసనాళికలు
D) గాలిగదులు
జవాబు:
A) వాయుగోణులు
3. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్నక్రియ ఎందుకంటే
A) సంక్లిష్ట ఆహార పరమాణువులు విచ్ఛిన్నం అవుతాయి.
B) కాంతి శక్తి మార్పు చెందుతుంది.
C) రసాయన శక్తి సంశ్లేషించబడుతుంది.
D) శక్తి నిల్వ చేయబడుతుంది.
జవాబు:
A) సంక్లిష్ట ఆహార పరమాణువులు విచ్ఛిన్నం అవుతాయి.
4. కణాలలో శక్తి నిలువ ఉండే ప్రదేశం
A) కేంద్రకం
B) మైటోకాండ్రియా
C) రైబోసోమ్ లు
D) కణకవచం
జవాబు:
B) మైటోకాండ్రియా