SCERT AP 10th Class Social Study Material Pdf 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Social Solutions 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు
10th Class Social Studies 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
 కింది వాటిని జతపరచండి. (AS1)
 సన్ యెట్-సెన్ దేశాన్ని సైనిక దేశం చేశాడు
 చియాంగ్ కై షేక్ పర్యావరణ ఉద్యమం
 మావో జెడాంగ్ జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
 కెన్ సారో వివా రైతాంగ విప్లవం
 జవాబు:
 సన్ యెట్-సెన్ – జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
 చియాంగ్ కై షేక్ – దేశాన్ని సైనిక దేశం చేసాడు
 మావో జెడాంగ్ – రైతాంగ విప్లవం
 కెన్ సారో వివా – పర్యావరణ ఉద్యమం

ప్రశ్న 2.
 దశాబ్దాల కాలంలో చైనాలో మహిళల పాత్రలో వచ్చిన మార్పులను గుర్తించండి. రష్యా, జర్మనీలో సంభవించిన మార్పులకూ, వీటికీ తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
 జవాబు:
 దశాబ్దాల కాలంలో చైనాలో మహిళల పాత్రలో అనేక మార్పులు సంభవించాయి. ఈ గుయోమిండాంగ్ పార్టీ నాయకుడిగా ఉన్న చియాంగ్ కై షేక్ కాలంలో మహిళల పరిస్థితులు మరీ దారుణంగా ఉండేవి. మహిళలకు తక్కువ వేతనాలు లభించేవి. పనిగంటలు అధికంగా ఉండేవి. చియాంగ్ మహిళల హక్కుల గురించి, సమానత్వం పునాదిపై కుటుంబాలను నిర్మించటం, ప్రేమ వంటి భావనను గూర్చి ఆలోచించడం, చర్చించడం చేసారు. పాతివ్రత్యం, రూపం, మాట, పని అన్న నాలుగు సుగుణాలపై వాళ్ళు శ్రద్ధ పెట్టాలని అతడు భావించాడు. ఆ తదుపరి మావో గ్రామీణ మహిళా సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాడు. విడాకుల విధానాన్ని సరళీకృతం చేస్తూ కొత్త వివాహ చట్టాన్ని చేశాడు.
తేడాలు :
| చైనా | రష్యా | జర్మని | 
| 1) కార్మిక సంఘాలలో మహిళలు సంఘటితం అయ్యేవారు. పనిగంటలు ఎక్కువ, దారుణమైన పరిస్థితులు. | మహిళా కార్మికులు తరచు తమ తోటి పురుష కార్మికులకు స్ఫూర్తిని ఇచ్చేవారు. | మహిళలకు ప్రాధాన్యం లేదు. | 
| 2) మహిళల పాత్ర ఇంటికే పరిమితమై ఉండేది. | మహిళా దినోత్సవం వంటి సందర్భాలలో ఉత్సవాలు నిర్వహించి, పురుషులకు ఎర్ర మెడ పట్టీలను బహుమతిగా ఇస్తుండేవారు. | పురుషుల ప్రపంచంలో మహిళలకు ప్రాధాన్యత లేదు. | 
| 3) గ్రామీణ మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. | ఉద్యమాలకు ముందుండేవారు. | పురుషుల రంగాల్లో మహిళలు జోక్యం చేసుకోకూడదు. మహిళ ఇచ్చే ప్రతీ సంతానం యుద్ధం కోసమే అన్నట్లు ఉండేది. | 
పోలికలు:
| చైనా | రష్యా | జర్మని | 
| 1) చైనాలో అణగదొక్కబడిన మహిళలకు ప్రాధాన్యమిచ్చారు. | మహిళలలో వచ్చిన మార్పువల్ల ప్రాధాన్యం పొందారు. | రెండో ప్రపంచయుద్ధం తరువాత మహిళలలో చాలా మార్పు కనబడింది. | 
| 2) మహిళా సంఘాలుగా ఏర్పడి అభివృద్ధి పథంలో నడిచారు. | టెలిఫోన్ భవనం వంటి కర్మాగారాలలో ఉద్యమాల ద్వారా అభివృద్ధి సాధించారు. | ఒక జాతిని కాపాడటంలో అన్నిటికంటే స్థిరమైన అంశం మహిళలేనని తెలుసుకుని అభివృద్ధి సాధించారు. | 
| 3) పాలకులు ప్రోత్సహించారు. | ఫిబ్రవరి విప్లవం ద్వారా మార్పు కనబడింది. | నాజీ పార్టీ ప్రోత్సహించింది. | 
ప్రశ్న 3.
 రాచరిక పాలనను పడదోసిన తరువాత చైనాలో రెండు రకాల పాలనలు ఏర్పడ్డాయి. వీటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
 జవాబు:
 రాచరిక పాలనను ప్రజలు తిరస్కరించారు. పాలనాధికారులు, ప్రజలు రాచరిక పాలనపై అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో, అస్తవ్యస్థమైన చైనాలో రెండు రకాల పాలనలు ఏర్పడ్డాయి. వీటి మధ్య పోలికలు, తేడాలు ఉన్నాయి. వీటిలో ఒకటి సయెట్-సెన్ ఆధ్వర్యంలో గల గణతంత్ర రాజ్యం , రెండవది నూతన ప్రజాస్వామ్యం చైనా కమ్యూనిస్టు పార్టీ.
పోలికలు:
| గణతంత్ర రాజ్యం | చైనా కమ్యూనిస్టు పార్టీ | 
| 1) సయెట్-సెన్ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు అమలు. | 1) మావో జెడాంగ్ ఆధ్వర్యంలో చైనాలో అనేక విప్లవాత్మక చర్యలు అమలు. | 
| 2) మహిళలకు రక్షణ నిచ్చి, ప్రాధాన్యతనందించారు. పురుషులతో పాటు సమాన హోదా. | 2) మహిళలకు రక్షణ నిచ్చి, హక్కులపై అవగాహన కల్పించి, అభివృద్ధి పథంలో నడిపించారు. | 
| 3) భూమిలేని రైతాంగానికి భూమిని పంచి, భూసంస్కరణలు, సమర్థంగా అమలుచేసారు. | 3) భూస్వాముల భూములను జపు చేసి, పేదలకు పంచి, భూసంస్కరణలు వినూత్న రీతిలో అమలుచేశారు. | 
తేడాలు :
| గణతంత్ర రాజ్యం | చైనా కమ్యూనిస్టు పార్టీ | 
| 1) సామ్యవాదం, జాతీయతావాదం, ప్రజాస్వామ్యం పునాదిగా ఏర్పాటు. | 1) భూస్వామ్య విధానం, సామ్రాజ్యవాదం వ్యతిరేకతతో ఏర్పాటు. | 
| 2) ప్రజలు కలిసి పనిచేసే సహజాత అలవాటు పెంపొందించుకోవాలని ఆశించారు. | 2) శ్రామికవర్గం ద్వారా విప్లవం వస్తుందని భావించారు. | 
| 3) పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించారు. | 3) రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాపింపచేయటానికి వయోజన రైతాంగ పాఠశాలలు ఏర్పరచారు. | 
| 4) సామాజిక మూలాలు పట్టణాలలో ఉన్నాయి. | 4) సామాజికాభివృద్ధి ఛాయలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. | 
| 5) సైనిక దేశాన్ని నిర్మించారు. | 5) స్వతంత్రంగా ఉండే ప్రభుత్వం, సైన్యాలను ఏర్పరచారు. | 
ప్రశ్న 4.
 ఈ అధ్యాయంలో చర్చించిన దేశాలన్నీ ప్రధానంగా వ్యవసాయం పైన ఆధారపడినవే. అందులోని పద్ధతులు మార్చటానికి , – ఈ దేశాలలో ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి? (AS1)
 జవాబు:
 చైనా దేశంలో సయెట్-సెన్ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశాడు. రైతాంగాన్ని పట్టించుకోలేదు. దీనివల్ల నేలలు నిస్సారం కావడం, అడవులను నరికివెయ్యటం, వరదల వలన జీవావరణం దెబ్బతినడం వంటివి జరిగాయి. ఆ తదుపరి మావో జెడాంగ్ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ, రైతాంగాన్ని సంఘటితం చేస్తూ రైతాంగ సైన్యాన్ని నిర్మించాడు. భూసంస్కరణలు అమలుచేసి, “పనిబృందాలు” ఏర్పరచి వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాడు.
అదే విధంగా వియత్నాంలో ఫ్రెంచివారి పాలనలో ఈ దేశాన్ని వరిని ఎగుమతి చేసే దేశంగా చేయడానికి గాను, సాగునీటి సదుపాయాల్ని మెరుగుపరచి, వరి, రబ్బరు వంటి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కి సహకరించారు. నీటి పారుదల వసతులు వ్యవసాయానికి అందించి, అంతర్జాతీయ మార్కెట్లో వరి ఉత్పత్తి ఎగుమతిని పెంచారు. ఈ పద్దతుల వలన వియత్నాం ప్రపంచంలో 3వ అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా మారింది.
అదే విధంగా నైజీరియాలో కూడా బానిసల వ్యాపారాన్ని నిషేధించిన పిదప, వ్యవసాయరంగానికి ప్రాధాన్యమిచ్చి, ఉత్పత్తులు పెంచడానికి కృషి చేసి అనేక పద్ధతుల ద్వారా “కోకో”, “పామాయిల్” వంటి వ్యవసాయ పంటలకు ప్రాధాన్యత ఇచ్చారు.
చమురు నిల్వల కోసం తవ్వకాల వలన పర్యావరణ జీవావరణం పాడైపోతుందని, కెన్ సారో వివా వంటివారు పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు.

ప్రశ్న 5.
 పైన చర్చించిన దేశాలలో పరిశ్రమలు ఎవరి అధీనంలో ఉన్నాయి? ఈ పద్ధతులను మార్చటానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి? పోల్చటానికి ఒక పట్టికను తయారు చేయండి. (AS1)
 జవాబు:
 పరిశ్రమల మూలాలు ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో ఉండేవి. పారిశ్రామిక ప్రగతి పరిమితం గానూ, నిదానం గానూ ఉంది. ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారిన షాంఘై వంటి నగరాలలో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. ఈ పరిశ్రమలన్నీ శ్రామిక వర్గం ఆధీనంలో నడిచి, అభివృద్ధికి బాటలు వేశాయి. వీరిలో అధిక శాతం “మధ్యతరగతి పట్టణవాసులు”. వీరిలో వ్యాపారస్తులు, దుకాణదారులు ఉండేవారు.
చియాంగ్ కాలంలో ఫ్యాక్టరీ యజమానులను ప్రోత్సహించడానికి, కార్మిక సంఘాలను అణిచివెయ్యడానికి కూడా పూనుకున్నాడు.
వియత్నాంలో పండించిన పంటలు, వాణిజ్య సరుకుల రవాణా కోసం, పారిశ్రామిక ప్రగతి కల్పించడానికి గాను రోడ్డు, రైలు మార్గాలను అభివృద్ధి చేశారు.
నైజీరియాలో చమురు ముఖ్యమైన వనరు. చమురును ఎగుమతి చేసి ఆర్ధికంగా లాభపడింది. అయితే జీవావరణ వ్యవస్థపై పెను ప్రభావం చూపింది. దీనివల్ల తాగునీళ్ళు కలుషితమై ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. దీనికిగాను గిరిజన ప్రజలు తిరుగుబాటు చేసి తమకు నష్టపరిహారం కావాలని కెన్ సారో వివా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
ప్రశ్న 6.
 భారతదేశం, నైజీరియాలలోని జాతీయ ఉద్యమాలను పోల్చండి. భారతదేశంలో ఇది ఎందుకు బలంగా ఉండింది? (AS1)
 జవాబు:
 భారతదేశ జాతీయ ఉగ్యమాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. 1600 సం|| నుండి బ్రిటిష్ వలస పాలనలో మ్రగ్గిన దేశాన్ని రక్షించడానికి భారతీయుల ప్రతిఘటన, 1857 తిరుగుబాటు, భారతీయ పునరుజ్జీవనం, భారతీయులలో జాతీయ చైతన్యం తదితర భావాలతో అన్ని వర్గాల ప్రజలు ఏకమైనారు. ఆంగ్లేయులు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టారు. ఆంగ్లభాష ద్వారా భారతీయులు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం వంటి అంశాలకు సంబంధించిన పాశ్చాత్యభావాలను తెలుసుకోగలిగారు. పాశ్చాత్య విద్యనభ్యసించిన ఈ భారతీయుల వల్లనే జాతీయవాద స్ఫూర్తి పెంపొందింది.
పాశ్చాత్య భావాల వల్ల, విలువల వల్ల ప్రభావితులైన ఆనాటి విద్యావంతులయిన భారతీయులు ప్రారంభించిన అనేక ఉద్యమాలలో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం, ఆలీఘడ్ ఉద్యమం ముఖ్యమైనవి. ఈ సంస్కరణ ఉద్యమాలు – భారతదేశానికి మత మౌఢ్యాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి భారతదేశానికి విముక్తి , కలిగించడానికి ప్రయత్నించాయి. భారతదేశంలో బ్రిటిష్ వారు విభజించు-పాలించు విధానం అమలుచేయడం ద్వారా భారతీయులలో బ్రిటిష్ వారి పట్ల ద్వేషం పెరిగింది. భారతదేశంలో ముడి పదార్థాలు, సుగంధ ద్రవ్యాల కొరకు పలసలను స్థాపించారు.
నైజర్ నదీ వ్యవస్థ కింద వివిధ తెగలు ఉంటున్న వేరువేరు ప్రాంతాలను ఒకటిగా చెయ్యటం ద్వారా బ్రిటిష్ వారు నైజీరియాను ఏర్పరచారు. ఈ దేశంలో ముస్లింలు అధికం. ఈబో, యెరుబా గిరిజన తెగలు ఉండేవి. నైజీరియాలో దేశ సహజ వనరులపై ప్రత్యేకించి చమురుపై ఆధిపత్య వలసలను స్థాపించారు. భారతదేశంలో (కలకత్తా) పశ్చిమబెంగాల్లో లాగోస్ వలస పాలనపై వ్యతిరేకతకు, నైజీరియా జాతీయతావాదానికి ఖండాంతర ఆఫ్రికా వాదానికి కేంద్రంగా ఉంది. మన దేశంలో లాగా ఆధునిక విద్యకు, పరిపాలన ఆధునీకరణకు ప్రోత్సాహం లభించింది. నైజీరియాలో కూడా విభజించు, పాలించు విధానం ద్వారా తమ దోపిడీ విధానాన్ని కొనసాగించారు. భారతదేశంలో జాతీయ కాంగ్రెస్, నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీయైన నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (NNDP) ని 1923లో హెర్బెర్ట్ మకాలే స్థాపించాడు. మీరు తీవ్రవాద దాడులకు కూడా మన దేశ అతివాదుల మాదిరిగా మారారు. గాంధీజీలా అక్కడ ఎన్ నంది అజికివె జాతీయ నాయకుడుగా మారారు. భారతదేశంలో లాగా నైజీరియా జాతీయవాదం ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం , వివిధ తెగల మధ్య ఐకమత్యం.
మన దేశానికి 1947లో స్వాతంత్ర్యం రాగా నైజీరియాకు 1963 అక్టోబర్ 1న స్వాతంత్ర్యం లభించింది. భారతదేశంలో జాతీయ ఉద్యమాలు బలంగా ఉండడానికి కారణం ప్రపంచం మెచ్చే మేధావులైన రాజకీయ నాయకులు, ప్రపంచంలోని మేధావులతో సంబంధాలు గలవారు ఉద్యమాలను నడిపించారు. ఉద్యమాలు 3 దశలుగా ఒక ప్రణాళికాబద్ధంగా నడిచాయి. అంతేకాకుండా అహింసా పద్ధతిలో ప్రజాస్వామ్యం, గణతంత్రం, లౌకిక విధానాలు రూపుదిద్దుకున్నాయి.
ప్రశ్న 7.
 స్వతంత్ర నైజీరియా దేశం ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న వాళ్లతో పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
 జవాబు:
 1963 అక్టోబర్ 1న నైజీరియా స్వాతంత్ర్యం పొందింది. దురదృష్టవశాత్తు ప్రస్వామిక న్యాయపూరిత సమతుల్యం సాధించలేకపోవడం వలన అనతి కాలంలోనే నైజీరియాలో పౌరయుద్ధం చెలరేగింది. ఫలితంగా సైనిక పాలన ఏర్పడింది. పౌర, ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చెయ్యటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా విఫలమైనాయి. సైనిక పాలనలో అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన కొనసాగాయి. అవినీతి పాలకులకు మద్దతు ఇచ్చే బహుళజాతి చమురు కంపెనీలు, సైనిక ప్రభుత్వాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. చమురును వెలికితీయడం వలన వాతావరణ, జల కాలుష్యం పెరిగి ఈ దేశ ప్రజల అనేక నిరసనలకు, ఉద్యమాలకు నైజీరియా కారణమైంది.
పోలికలు
| స్వతంత్ర భారతదేశం | స్వతంత్ర నైజీరియా | 
| 1) 1950 నుండి ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా, లౌకిక రాజ్యంగా రూపొందింది. | 1) 1999 నుండి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. | 
| 2) హత్యలు, దోపిడీ, దహనాలు యథేచ్ఛగా కొనసాగాయి. | 2) సైనికపాలన ఏర్పడి పౌరయుద్ధం కొనసాగింది. | 
| 3) స్వాతంత్ర్య సంపాదన అనంతరం మత ఘర్షణలు ఎక్కువయ్యాయి. | 3) ఇక్కడ కూడా బై ఫారియన్ వంటి యుద్ధాలు కొనసాగాయి. | 
| 4) పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. | 4) ఇక్కడ కూడా చమురు వల్ల సమస్యలు ఎక్కువయ్యాయి. | 
తేడాలు
| స్వతంత్ర భారతదేశం | స్వతంత్ర నైజీరియా | 
| 1) స్వాతంత్ర్యానంతరం దేశ అభివృద్ధి కొరకు మేధావులు రాజ్యాంగ రచనకు శ్రీకారం చుట్టారు. | 1) సైనిక పాలన వలన రాజ్యాంగ రచన జరగలేదు. | 
| 2) స్వాతంత్ర్యం సిద్ధింపచేసిన గాంధీజీ లాంటి జాతిపితను పొట్టన పెట్టుకున్నారు. | 2) హింసాకాండ జరిగినా జాతీయ నాయకుల మరణాలు లేవు. | 
| 3) స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడం వలన విపరీత పరిణామాలు జరిగాయి. | 3) స్వదేశీ సంస్థానాలు లేవు. | 
| 4) 1947లో స్వాతంత్ర్యం సిద్ధించింది. | 4) 1999 నాటికి 50 సం||ల తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించింది. | 
| 5) కోటి, 50 లక్షల మంది, హిందూ – ముస్లింలు నిర్వాసితులయ్యారు. | 5) ఇంత పెద్ద సంఖ్యలో జరగలేదు. | 

ప్రశ్న 8.
 భారతదేశం, వియత్నాంల లాగా స్వాతంత్ర్యం కోసం నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాలేదు. దీనికి కొన్ని కారణాలను పేర్కొనండి. (AS1)
 జవాబు:
 పాశ్చాత్య విద్య సొందిన కొంతమంది మేధావులైన నైజీరియన్లు ఉమ్మడి నైజీరియా దేశం అన్న భావనను కలిగించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. నైజీరియా మొదటి రాజకీయ పార్టీ “నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (NNDP) ని మకాలే స్థాపించిన పిదప, (1923లో) అది, 1923, 1928, 1933లో అన్ని స్థానాలను గెలుచుకుని బ్రిటిష్ వారికి పెను సవాళ్ళు విసిరింది. మకాలే బ్రిటిష్ వలస ప్రభుత్వంపై తీవ్రవాద దాడులను కూడా ప్రోత్సహించాడు. ఖండాంతర ఆఫ్రికా వాదం, ఖండాంతర నైజీరియా వాదం జాతీయ ఉద్యమానికి ప్రేరణ అయింది. దీంతో బ్రిటిష్ వారికి కనువిప్పు కలిగింది. 1945 నుండి సమ్మెలు, ఉద్యమాలతో జాతీయవాద కార్మికుల ఆధ్వర్యంలో ముందుకు నడిచారు.
రెండు లక్ష్యాలతో నైజీరియన్లు ఉద్యమాన్ని నడిపించారు. ఒకటి “బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం”. రెండు “వివిధ తెగల మధ్య ఐకమత్యం”. ఈ క్రమంలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు.
1950 నాటికి నైజీరియాలోని 3 ప్రాంతాలలో 3 ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఉత్తర ప్రాంతంలో “సాంప్రదాయ భావాలతో కూడిన “ఉత్తర ప్రజల కాంగ్రెస్”, తూర్పు ప్రాంతంలో “నైజీరియా కెమరూన్ల జాతీయ సంఘం, పశ్చిమ ప్రాంతంలో యాక్షన్ గ్రూపు. వీటి ద్వారా నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాకుండా స్వాతంత్ర్యం పొందింది.
ప్రశ్న 9.
 పైన చర్చించిన దేశాలలోని జాతీయ ఉద్యమాలలో పాఠశాల విద్య పాత్ర ఏమిటి? (AS6)
 జవాబు:
 జాతీయ ఉద్యమాలలో పాఠశాల విద్య ప్రముఖ పాత్ర వహించింది. చైనాలో సామాజిక, సాంస్కృతిక మార్పులకు సంధానంగా పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం కల్పించారు. భూసంస్కరణలు సమర్థంగా అమలు చెయ్యడానికి, ఆర్ధిక సంస్కరణ కార్యక్రమంలో యువతకు అవగాహన కలిగించేందుకు గాను రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాపింపజేయటానికి గాను పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. చైనా నవ చైతన్యానికి సాధించిన అద్భుత విజయాలకు చైనా భవిష్యత్తు ప్రగతికి బలమైన పునాదిగా నిలవడానికి అందరికీ పాఠశాల విద్య ప్రముఖపాత్ర వహించిందని మేధావులందరూ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు.
వియత్నాంలో స్థానికులను నాగరికులుగా చెయ్యటానికి విద్య ఒక మార్గంగా భావించారు. విద్యావంతులైన ‘వియత్నామీయుల వలన ఫ్రెంచి పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి, టీచర్లు, దుకాణదారులు, పోలీసులు వంటి ఉద్యోగాలు పొందడానికి ప్రాథమిక విద్య, పాఠశాల విద్య కీలకమని ఆలోచించారు. ఈ విధంగా కొద్దిమంది మాత్రమే పాఠశాల విద్య పూర్తి చేసి అభివృద్ధి సాధించారు. వియత్నాం నుంచి ఫ్రెంచివాళ్ళను తరిమివేయడానికి, ఉన్నతులుగా వియత్నామీయులు మారడానికి గాను ఉన్నత పాఠశాల విద్య కొరకు జపాన్ వెళ్ళేవారు.
వలస పాలనతో దోపిడీకి గురై విభజించు – పాలించు విధానం ద్వారా, అవినీతి, అక్రమాలు ఎదిరించే క్రమంలో నైజీరియాలో ఆధునిక విద్యకు మరీ ముఖ్యంగా పాఠశాల విద్యకు ప్రాధాన్యమిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం వంటి సూత్రాలను పెంపొందించడానికి గాను పాఠశాల విద్య ప్రధాన భూమిక పోషిస్తుందని తలంచి, నైజీరియాలో ఈ విద్యకు ప్రముఖస్థానం కల్పించారు.
ప్రశ్న 10.
 ఈ దేశాల స్వాతంత్ర్య పోరాటాలలో పాలకులపై యుద్ధాలు చేశారు. వాటి ప్రభావాన్ని క్లుప్తంగా వివరించండి. (AS1)
 జవాబు:
 చైనా గణతంత్ర, నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడి అగ్రదేశంగా మారినప్పటికీ, వలస పాలకుల చర్యల వలన , అనేక ఇబ్బందులకు గురైంది. 1937 – 1945 మధ్యకాలంలో చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించింది. క్రూర, వలస, సైనిక పాలనను జపాను అమలు చెయ్యటంతో చైనా సమాజం, ఆర్థిక పరిస్థితి దారుణంగా ప్రభావితమయ్యాయి. జపాన్ ఆక్రమణలను ప్రతిఘటించడానికి గుయోమిండాంగ్, సిసిపి చేతులు కలిపాయి.
వియత్నాంలో దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడారు. వియత్నామీయులు తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందని భయపడే ఫ్రెంచి పాలకులతోను, స్థానిక సంపన్నులతోను పోరాడారు.
ఆగ్నేయ ఆసియాపై తన ఆధిపత్యం సాధించాలన్న సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా జపాను 1940లో వియత్నాంను ఆక్రమించింది. దాంతో జాతీయవాదులు ఫ్రెంచి వాళ్ళనే కాకుండా, జపనీయులతో కూడా తలపడవలసి వచ్చింది.
అప్పటికే రెండవ ప్రపంచయుద్ధంలో హిట్లర్ ఫ్రాన్స్ మొత్తాన్ని ఆక్రమించటం వలన ఫ్రెంచివారు బలహీనపడ్డారు. వియత్నాం స్వాతంత్ర్య సమితి జపనీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడి 1946 సెప్టెంబర్ లో హనాయ్ ని తిరిగి స్వాధీనం చేసుకుంది. తదుపరి అమెరికా యుద్ధంలో జోక్యం చేసుకోవడం వల్ల వియత్నామీయులకే కాకుండా, అమెరికాకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.
రెండవ ప్రపంచయుద్ధం తరువాత నైజీరియా ఆర్థిక పరిస్థితి కష్టాలకు లోనవటంతో నైజీరియా ప్రజలు జాతీయతావాదం తీవ్రవాద భావాలకు గురయ్యారు. బ్రిటన్ తరపున పోరాడి సైనికులు, కార్మిక సంఘ నాయకులు నైజీరియా స్వాతంత్ర్యం కొరకు కృషి చేశారు.
10th Class Social Studies 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 1900-1950 : భాగం-II InText Questions and Answers
10th Class Social Textbook Page No.203
ప్రశ్న 1.
 ఆయా దేశాల సాంప్రదాయ పాలకులు స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉంటే ఎటువంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఉండేవి?
 జవాబు:
 వలసపాలిత దేశాల సాంప్రదాయ పాలకులుగా ఉన్న రాజులు, చక్రవర్తులు స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉంటే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఉండేవి.
10th Class Social Textbook Page No.210
ప్రశ్న 2.
 బియ్యం ధరలు పడిపోవటంతో గ్రామీణ ఋణభారం ఎందుకు పెరిగింది?
 జవాబు:
 1930 ల నాటి ఆర్థికమాంద్యం వియత్నాంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. బియ్యం ధరలు పడిపోయి, గ్రామీణ ఋణభారం పెరిగింది.

10th Class Social Textbook Page No.203
ప్రశ్న 3.
 జాతీయతాభావం అంటే ఏమిటో, అది ఎలా రూపుదిద్దుకుందో అర్థం చేసుకోటానికి 9వ తరగతి పాఠ్యపుస్తకాన్ని మరొకసారి చదవండి.
 జవాబు:
 తమ దేశ సంస్కృతి, చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూ దేశ ఐక్యతకు పాటుపడడాన్ని జాతీయతాభావం అంటాం. జనాదరణ పొందిన కుటుంబ సంప్రదాయాలు, బానిసత్వాల రద్దు వంటి వాటివల్ల కూడా జాతీయతాభావం పెరిగింది. కళలు, కవిత్వం, కథలు, సంగీతం వంటివి జాతీయతాభావాన్ని మలచటంలో సహాయపడ్డాయి.
10th Class Social Textbook Page No.203
ప్రశ్న 4.
 వలసపాలిత ప్రాంతాలలో ఏ సామాజిక వర్గాలు స్వాతంత్ర్యం కోసం పోరాడాయి ? సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న భావనలు వాళ్ళకు ఎందుకు ముఖ్యం అయ్యాయి?
 జవాబు:
 వలసపాలిత ప్రాంతాలలో మధ్యతరగతివారు, కార్మికవర్గం, యువకులు, మహిళలు, మేధావులు, ఆయా దేశాల సాంప్రదాయ పాలకులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు. కొన్ని దేశాలలోని అనుభవాలను, వలసపాలిత ప్రాంతాల లక్షలాది ప్రజల జీవితాలలో మార్పును అర్థం చేసుకోటానికి సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న భావనలు వాళ్లకు చాలా ముఖ్యం అయ్యాయి.
10th Class Social Textbook Page No.204
ప్రశ్న 5.
 యువ చైనీయులు పాత సాంప్రదాయాలను, విదేశీ శక్తులను ఎందుకు వ్యతిరేకించసాగారు?
 జవాబు:
 1919 మే 4న యువ చైనీయులు నిరసన ఉద్యమంగా చేపట్టి, పాత సాంప్రదాయాలను తిరస్కరించి, ఆధునిక విజ్ఞానశాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్ళాలని యువత సంకల్పించింది. దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమివెయ్యాలని, పేదరికాన్ని తగ్గించి, అసమానతలను తగ్గించాలని, సాధారణ భాష, లిపులను
 అనుసరించడం, వివాహాలలో సమానత్వం, పేదరికాన్ని అంతం చేయటం వంటి వాటి కొరకు ఉద్యమించారు.
10th Class Social Textbook Page No.204
ప్రశ్న 6.
 ఇటువంటిది ఏమైనా భారతదేశంలో జరిగిందా?
 జవాబు:
 భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళ దోపిడీ విధానాన్ని నిరంకుశ పాలనకు, భారతీయుల దౌర్భాగ్యస్థితిని దూరం చేయడానికి అతివాదులుగా పేరొంది హింసామార్గంలో పయనించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, మరెందరో యువకులు వీరోచితంగా పోరాడారు. క్విట్ ఇండియా ఉద్యమకాలం (1942) లో గాంధీజీని అరెస్టు చేయగా, యువకులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఏకమై, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేయించి, సహాయనిరాకరణ, విధ్వంసం వంటి అనేక పద్ధతుల ద్వారా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేపట్టారు.

10th Class Social Textbook Page No.205
ప్రశ్న 7.
 ఈ కాలంలో ఆవిర్భవించిన ముఖ్యమైన రాజకీయ పార్టీలు ఏవి?
 జవాబు:
 ఈ కాలంలో ఆవిర్భవించిన ముఖ్యమైన రాజకీయ పార్టీలు – “గుయోమిండాంగ్” (జాతీయ ప్రజాపార్టీ, దీనినే కె.ఎం.టి అనే వాళ్ళు) మరియు చైనా కమ్యూనిస్టు పార్టీ (సిసిపి). ఇవి దేశ ఐక్యత, సుస్థిరత సాధన అనే లక్ష్యాలతో ఏర్పడ్డాయి.
10th Class Social Textbook Page No.205
ప్రశ్న 8.
 ఇటువంటి సమీకరణల్లో సభ్యులు ఎవరు?
 జవాబు:
 ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారిన షాంఘై వంటి నగరాలలో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. వీరిలో అధికశాతం మధ్యతరగతి పట్టణవాసులు (సియావో షిమిన్) గా పరిగణింపబడే వ్యాపారస్తులు దుకాణదారులు ఉన్నారు.
10th Class Social Textbook Page No.205
ప్రశ్న 9.
 వాళ్ళు ఆశించిన సామాజిక, ఆర్థిక మార్పుల స్వరూపం ఏమిటి?
 జవాబు:
 వాళ్ళు కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా అన్నవి 4 ప్రధాన అవసరాలుగా గుర్తించారు. స్వేచ్చాభావనలు ఆదరణ పొందటంతో మహిళల హక్కుల గురించి, సమానత్వం పునాదిపై కుటుంబాలను నిర్మించటం, ప్రేమ వంటి వాటి గురించి ఆలోచించడం, చర్చించటం మొదలు పెట్టారు. ఫ్యాక్టరీ యజమానులకు ప్రోత్సాహకంగా కార్మిక సంఘాలను అణగదొక్కారు. పెట్టుబడిని నియంత్రించి, భూమి సమాన పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చారు.
10th Class Social Textbook Page No.207
ప్రశ్న 10.
 దేశ అభివృద్ధికి, స్వాతంత్ర్యానికి స్త్రీ, పురుషులకు, సమాన అవకాశాలు, వాళ్ల సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
 జవాబు:
 దేశ అభివృద్ధికి, స్వాతంత్ర్యానికి స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు, వాళ్ళ సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో నేను అంగీకరిస్తాను. ప్రస్తుతం, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురుషులతో పాటు స్త్రీలు ప్రధానభూమిక పోషిస్తున్నారు.
దేశ అభివృద్ధిలో స్త్రీలు తమ మేధాశక్తి, యుక్తులతో అపూర్వ సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ దృక్పథంతో నేను ఏకీభవిస్తున్నాను.
10th Class Social Textbook Page No.209
ప్రశ్న 11.
 భూమి లేని రైతాంగానికీ, భూమి లేని కార్మికునికీ మధ్య తేడా ఏమిటి?
 జవాబు:
 కొంతమంది రైతులు తమకు భూమి లేకపోయినా, భూస్వాముల నుంచి భూమి తీసుకొని కౌలు చేసేవారు. వాస్తవానికి భూమి వాళ్ళది కాదు. దీనివలన వారు కౌలు చెల్లించడమే కాకుండా, భూస్వాముల ఇళ్ళల్లోనూ, పొలాల్లోనూ పనిచేసి దుర్భర జీవనం గడిపేవారు.
 అదే విధంగా కార్మికులు, యంత్రాలలో వివిధ పరిశ్రమలలో, శ్రమ ద్వారా జీవనం సాగిస్తుంటారు. వాస్తవంగా వాళ్ళ ఆధీనంలో భూమి ఉండదు. వ్యవసాయానికి సంబంధించి అవగాహన తక్కువ.

10th Class Social Textbook Page No.210
ప్రశ్న 12.
 స్వతంత్ర వియత్నాం ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్యలలో భూమి కౌలు తగ్గించటం ఒకటి. ఈ చర్య ఎందుకు చేపట్టారు?
 జవాబు:
 గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్యం పెరిగి పెద్ద పెద్ద భూస్వాములు చిన్న రైతుల భూములను చేజిక్కించుకుని వారితో కౌలు రైతులుగా పనిచేయించుకునే వాళ్ళు. ఫలితంగా రైతాంగ జీవన ప్రమాణం పడిపోయింది. కౌలు రైతులు అప్పుల విషవలయంలో చిక్కుకుపోయి బయటపడలేకపోయేవారు. అన్నాం అనే ప్రాంతంలో సుమారు 53% కుటుంబాలకు అసలు ఏమాత్రం భూమి లేదు. ఈ కారణాలతో వియత్నాం ప్రభుత్వంవారు అధికంగా ఉన్న కౌలు భూములు మిగతావారికి పంచడానికి కృషి చేశారు. వారి దుర్భర జీవితాలను దూరం చేయ్యడానికి గాను భూమి కౌలు తగ్గించారు.
10th Class Social Textbook Page No.211
ప్రశ్న 13.
 ఇటువంటి భూసంస్కరణలు వియత్నాం సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపి ఉంటాయి ? గ్రామీణ ప్రాంతాలలోని వివిధ సామాజిక వర్గాల దృష్ట్యా దీనిని చర్చించండి.
 జవాబు:
 ఇటువంటి భూసంస్కరణల వలన భూస్వాముల చేతుల్లో ఉన్న వేల ఎకరాలను సేకరించి, పేద, మధ్యతరగతి రైతాంగానికి పునఃపంపిణీ చేయడం జరిగింది. రైతాంగ సంఘాలు ఏర్పడి, గ్రామీణ ప్రాంతాలలో వారు నాయకులుగా మారి మంచి – పాలన అందించడానికి ప్రయత్నం చేశారు. వెట్టిచాకిరి, వెట్టి కార్మికులు పోయి, అప్పుల బాధ తొలగి రైతాంగం ఆనందకర జీవనం కొనసాగించారు. ఏమాత్రం అసలు భూమి లేని 79% ప్రజలు ఈ సంస్కరణల వలన లబ్ధి పొందారు.
10th Class Social Textbook Page No.219
ప్రశ్న 14.
 అమెరికా అంతటి బలమైన దేశాన్ని వియత్నాం వంటి చిన్నదేశం ఎలా ఎదిరించగలిగింది?
 జవాబు:
 ప్రతిఘటనకి, ఇల్లు, కుటుంబాలను త్యాగం చెయ్యటానికి, దారుణ పరిస్థితులలో జీవించటానికి, స్వాతంత్ర్యం కోసం పోరాడడానికి వీలుగా ప్రజలకు జాతీయతాభావం ఇచ్చిన ప్రేరణ వల్లే అమెరికాను వియత్నాం ఢీకొంది. భూస్వాముల చేతులలో తరాలపాటు దోపిడీకి గురయి, అప్పుడే కొంత భూమిని పొందిన లక్షలాది పేద రైతాంగం నిబద్ధతతో అమెరికాను , ఎదిరించింది. జాతీయతాభావంతో ప్రేరణ భూసంస్కరణలతో ఉత్సాహం పొందిన ఈ పేద రైతాంగం ప్రపంచంలో కెల్లా – మేటి సైన్యాన్ని ఓడించడంలో కీలకపాత్ర పోషించింది.
10th Class Social Textbook Page No.217
ప్రశ్న 15.
 నైజీరియాలోని చమురు వనరులలో అధికభాగం ఆగ్నేయ భాగంలో ఉన్నాయి. చమురు లాభాలలోని అధిక భాగం తమకు చెందాలని ఈ బూలు భావిస్తారు. చమురు సంపదతో ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్యకు సరైన, న్యాయపూరితమైన పరిష్కారం ఏమిటి?
 జవాబు:
 నైజీరియాలోని చమురు నిల్వలలో అధిక వనరులు ఈబూలకే చెందాలి. ఎందుకంటే ఇక్కడ ఈ తెగవారే అధికులు. మరియు వెనుకబడిన అవిద్యావంతులు, నిరుద్యోగులు, ఉత్తర ప్రాంతంలో ఇంతకు ముందే ముస్లింలు అధికంగా ఉండి, ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నారు. కాబట్టి అధికభాగం చమురు లాభాలు ఈబూలకే చెందాలి.
10th Class Social Textbook Page No.202
ప్రశ్న 16.
 క్రింది పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
 
 1) బ్రిటన్‌కి చెందిన వలసలలో ఆసియాలో ఒక ప్రాంతాన్ని, ఆఫ్రికాలో మరొక ప్రాంతాన్ని గుర్తించండి.
 జవాబు:
 భారతదేశం, దక్షిణాఫ్రికా
2) హాలెండ్ కి చెందిన ఒక ఆసియా, ఒక ఆఫ్రికా వలస ప్రాంతాన్ని గుర్తించండి.
 జవాబు:
 ఇండోనేషియా, పశ్చిమ సహారా
3) ఫ్రాన్స్ కి చెందిన ఒక ఆసియా, ఒక ఆఫ్రికా వలస ప్రాంతాన్ని గుర్తించండి.
 జవాబు:
 కాంబోడియా, మొరాకో.
4) ఏ దేశానికి వలసపాలిత ప్రాంతంగా లేని ఆసియాలో రెండు దేశాలను, ఆఫ్రికాలో ఒక దేశాన్ని గుర్తించండి.
 జవాబు:
 చైనా, రష్యా, ఇథియోపియా
5) ఆస్ట్రేలియా ఏ దేశానికి వలసపాలిత ప్రాంతంగా ఉంది?
 జవాబు:
 ఇంగ్లాండ్
10th Class Social Textbook Page No.207
ప్రశ్న 17.
 యుద్ధంలో గెలవటానికి సిసిపికి భూసంస్కరణలు ఎలా దోహదపడ్డాయి?
 జవాబు:
 విదేశీ సామ్రాజ్యవాదంపై పోరాడటానికి, భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చెయ్యటం ద్వారా బలమైన రైతాంగ సంఘాలను సిసిపి నిర్మించింది. గ్రామాలలో ఉంటున్న అందరి వర్గాలను గుర్తించడం, తరువాత భూస్వాముల భూమి, ఇతర ఉత్పాదక ఆస్తులను స్వాధీనం చేసుకుని తిరిగి పంచటం వంటివి దీంట్లో ముఖ్యమైన దశలు. దీనికై “భూసంస్కరణల సంఘాన్ని ఏర్పరచారు. దీని ద్వారా స్థానిక నాయకత్వ స్థానాలకు వాటి నుంచి క్రియాశీలక సభ్యులను ఎంపిక చెయ్యటం వాటి ముఖ్య విధుల్లో భాగంగా ఉండేవి. ఇది ప్రధానంగా పేద, మధ్య తరగతి రైతాంగం నుంచి ఏర్పడింది. ఈ విధంగా భూసంస్కరణల కారణంగా అత్యధికుల మన్ననలు పొందడంతో, యుద్ధంలో గెలవటానికి అవకాశం ఏర్పడింది.

10th Class Social Textbook Page No.207
ప్రశ్న 18.
 భారతదేశంలో అమలు అయిన భూసంస్కరణలను చైనాలో జరిగిన వాటితో పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలను పేర్కొనండి.
 జవాబు:
 భారతదేశంలో అమలు జరిగిన భూసంస్కరణలు లోపభూయిష్టంగా ఉండేవి. జమీందారుల ఆధీనంలో సాగుచేస్తున్న కౌలుదారులను ప్రభుత్వం భూయజమానులుగా గుర్తించింది. కానీ జమీందారులకు పెద్ద మొత్తంలో వెల చెల్లించాల్సి ఉన్నందున దానిని వారు కట్టలేక వారు కౌలుదారులుగా, వ్యవసాయ కూలీలుగానే ఉండిపోయారు. చైనాలో అలా కాకుండా భూస్వాముల భూమి నంతటినీ స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చేశారు.
భారతదేశంలో జమీందారుల ఆధీనంలో ఉన్న మిగులు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అందువలన చాలామంది జమీందారులు తమ బంధువులు, దూరపు బంధువుల పేరున రాయించుకున్నారు. అటవీ, బంజరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిసి, అటవీ భూములలో గల చెట్లు నరికి, అమ్మి అధికాదాయం జమీందారులు పొందగలిగారు.
చైనాలో అలా కాకుండా పేద, మధ్యతరగతి ప్రజలనే భూసంస్కరణ సంఘాలు ఏర్పరచి, వారినే నాయకులుగా గుర్తించి, ‘పని బృందాలు’ ఏర్పరచి, “రైతాంగ సంఘాల” నిర్మాణం ద్వారా ప్రణాళికా బద్ధంగా భూసంస్కరణలు అమలుచేసి ఆ దేశం అద్భుత విజయాలకు నిలయమైంది.
10th Class Social Textbook Page No.209
ప్రశ్న 19.
 వియత్నాంలో రైలు మార్గాలను, కాలవలను ఫ్రెంచివాళ్ళు ఎందుకు అభివృద్ధి చేశారు?
 జవాబు:
 వియత్నాంని వరిని ఎగుమతి చేసే దేశంగా అభివృద్ధి చెయ్యాలని ఫ్రెంచి చాలా ఆసక్తి చూపించింది. ఇందులకై సాగునీటి సదుపాయాల్ని మెరుగుపరచాలని, మెకాంగ్ డెల్టా ప్రాంతంలో సాగు విస్తీర్ణాన్ని పెంచటానికి ఫ్రెంచివాళ్ళు బీడు భూముల నుంచి నీటిని తోడి కాలువల నిర్మాణం చేపట్టారు. తద్వారా వరి ఉత్పత్తి అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతి చెయ్యడం సాధ్యమైంది.
అదే విధంగా 1931 నాటికి వియత్నాం ప్రపంచంలో మూడవ అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది. దీనితోపాటు వాణిజ్య సరుకుల రవాణా కోసం, సైనిక కేంద్రాలను తరలించటానికి, మొత్తం ప్రాంతాన్ని తమ అదుపులో పెట్టుకోడానికి గాను మౌలిక సదుపాయాలు అనగా రోడ్డు, రైలుమార్గాలను అభివృద్ధి చేశారు.
10th Class Social Textbook Page No.209
ప్రశ్న 20.
 బ్రిటిష్ పాలనలోని భారతదేశ రైతాంగ పరిస్థితి గురించి మీరు చదివారు. వియత్నాం రైతాంగ స్థితికీ, దీనికీ పోలికలు ఏమిటి?
 జవాబు:
 బ్రిటిష్ పాలనలోని భారతదేశ రైతాంగ పరిస్థితి దారుణంగా ఉండేది. వియత్నాంలో కూడా రైతాంగ స్థితిలో అటువంటి ‘ దుర్భర పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి వీటి మధ్య పోలికలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
పోలికలు: భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో భూస్వాములు, జమీందారులు సన్నకారు రైతుల భూములను చేజిక్కించుకొనడం, లేదా నామమాత్రం భూములు ఇచ్చి, దానికి అధికంగా శిస్తులు విధించడంతో వాటిని ఆ చిన్న రైతులు కట్టలేక, పంట ఫలాలు అందక దుర్భర పరిస్థితులు అనుభవించారు.
వియత్నాంలో కూడా పెద్ద భూస్వాములు చిన్న రైతుల భూములను చేజిక్కించుకుని కౌలు రైతులుగా మార్చి జీవనం దిగజార్చారు.
భారతదేశంలో బలవంతపు వ్యవసాయం బ్రిటిష్ వాళ్ళు అమలుచేశారు. ఆహారపంటలకు బదులు వాణిజ్య పంటలు వేసి ఇబ్బందులకు గురి చేయించారు. వియత్నాంలో కూడా బలవంతంగా వరి, రబ్బరు వంటి పంటలను తమ స్వలాభం కోసం వేయించారు.
భారతదేశంలో వ్యవసాయం చేయలేక, అప్పులకు వడ్డీ చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు వెట్టి కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారారు, వియత్నాం రైతుల్లో కూడా వ్యవసాయం చేయలేక చనిపోయినవారు, నలిగిపోయినవారు, తిండి లేక అలమటించినవారున్నారు.

10th Class Social Textbook Page No.209
ప్రశ్న 21.
 భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానాన్ని గుర్తుచేసుకోడానికి ప్రయత్నించండి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు, వియత్నాంలో ఫ్రెంచివాళ్ళు అనుసరించిన వలసపాలన విధానాలను పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
 జవాబు:
 భారతదేశంలో బ్రిటిష్ వారు, వియత్నాంలో ఫ్రెంచివారు అనుసరించిన వలసపాలనలో పోలికలు తేడాలు ఉన్నాయి. ముందుగా పోలికలు చూద్దాం.
పోలికలు:
| బ్రిటిష్ వారు (భారత్) | ఫ్రెంచివారు (వియత్నాం) | 
| 1) వీరు భారతదేశ రాజులను, చక్రవర్తులను కీలు బొమ్మలుగా మార్చి వ్యాపార రీత్యా వచ్చి స్థిరపడ్డారు. | 1) వీరు కూడా వియత్నాం చక్రవర్తిని లోబరుచుకొని తమ దోపిడీ విధానాన్ని అనుసరించారు. | 
| 2) భారత్ లో రోడ్డు, రైలు, జల మార్గాలను తమ ఉత్పత్తుల మార్కెట్ కొరకు, వాణిజ్య పంటలకు ఎగుమతుల కొరకు అభివృద్ధి చేశారు. | 2) ఫ్రెంచివారు కూడా వరి, రబ్బరు ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసి ధనాన్ని కూడబెట్టాలని ఆశించారు. | 
| 3) వీరు విభజించు – పాలించు విధానం అమలుచేశారు. | 3) ఫ్రెంచివారు కూడా ఈ విధానాన్నే అనుసరించారు. | 
| 4) ఇక్కడ భూస్వాములు, చిన్న రైతుల భూములను ఆక్రమించి వారిని వ్యవసాయ కూలీలుగా మార్చారు. | 4) వియత్నాంలో కూడా ఫ్రెంచివారు రైతుల భూములను ఆక్రమించి వారిని పెట్టి కార్మికులుగా మార్చారు. | 
| 5) భారతీయులు అనాగరికులని వీరు భావించారు. మూఢనమ్మకాలు, సంప్రదాయ పద్ధతులకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు. | 5) ఫ్రెంచివారు కూడా వియత్నాం వాసులకు అనాగరికులుగా భావించి, ఆధునిక నాగరికత ఫలాలు అందించడానికి కృషి చేశారు. | 
తేడాలు :
| బ్రిటిష్ వారు (భారత్) | ఫ్రెంచివారు (వియత్నాం) | 
| 1) సుదీర్ఘకాలం దోపిడీకి గురైంది. | 1) ఎక్కువకాలం కొనసాగలేదు. | 
| 2) అనేక రాజకీయ, సంస్కరణ ఉద్యమాలు, అనేక సమాజాలు, సంస్థలు ఏర్పడి బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాయి. | 2) ఇన్ని సంస్థలు, ఇంత స్థాయిలో జరగలేదు. | 
| 3) మహిళలు, యువకులు, విద్యావంతులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రిటిష్ వారిని ఎదిరించారు. | 3) మహిళల పాత్ర తక్కువ. | 
| 4) ఒక ప్రణాళికాబద్ధంగా 30 దశలుగా ఉద్యమాన్ని నడిపించారు. | 4) ఫ్రెంచ్‌లో అలా జరగలేదు. | 
| 5) ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఆంగ్ల విద్యను అభ్యసించారు. | 5) ఇక్కడ సంపన్న వియత్నామీయుల పిల్లలే ఫ్రెంచి బడిలో చదివారు. | 
10th Class Social Textbook Page No.210
ప్రశ్న 22.
 వియత్నాం, చైనాలలో జాతీయతావాదం ఏర్పడటంతో యువత, విద్యార్థులు ముఖ్యపాత్ర పోషించారు. వీటి మధ్య పోలికలు, తేడాలను చర్చించండి.
 జవాబు:
 చైనా యువత, విద్యార్థులు :
 చైనాలో యువత 1919 మే 4న వర్సయిల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బ్రిటన్, పక్షాన చైనా ఉన్నప్పటికి జపాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు చైనాకు రాలేదు.
పాత సంప్రదాయాలను తిరస్కరించి, ఆధునిక విజ్ఞానం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్ళాలని, దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమెయ్యాలని, పేదరికాన్ని తగ్గించి, అసమానతలను తగ్గించాలని యువత కోరుకుంది. సాధారణ భాష, లిపిలను అనుసరించడం, మహిళలపై ఉన్న దురాచారాలను దూరం చెయ్యాలని యువత, విద్యార్థులు సంకల్పించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించడంతో సామాజిక సాంస్కృతిక మార్పులకు ఊతం ఇచ్చింది.
వియత్నాం విద్యార్థులు, యువత :
కార్యాలయాలలో ఉద్యోగాలకు వియత్నామీయులను అనర్హుల్ని చేసేలా ఉన్న వలస ప్రభుత్వ ప్రయత్నాలను విద్యార్థులు ప్రతిఘటించసాగారు. “దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడటం విద్యావంతుల విధి” అన్న నమ్మకంతో వారు ప్రేరణ పొందారు. కనుకనే వారు సంపన్నులతోను, ఫ్రెంచి పాలకులతోను ఘర్షణ పడ్డారు. 1920 ల నాటికి విద్యార్థులు “యువ అన్నాం” పార్టీ వంటి రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసి, “అన్నామీస్ స్టూడెంట్” వంటి పత్రికలను ప్రచురించారు. వియత్నాం దేశంలో యువత, విద్యార్థుల ప్రధాన ఉద్దేశం- “వియత్నాం నుండి ఫ్రెంచి వాళ్ళను తరిమివెయ్యడం”. కీలుబొమ్మ చక్రవర్తిని తొలగించి, అంతకుముందు ఫ్రెంచివాళ్ళు పడదోసిన “ఎ గుయెన్” వంశాన్ని తిరిగి అధికారంలోనికి తీసుకురావడం.

10th Class Social Textbook Page No.211
ప్రశ్న 23.
 చైనా, వియత్నాం , భారతదేశాలలోని భూసంస్కరణల తీరును పోల్చండి.
 జవాబు:
 1) చైనాలో భూసంస్కరణలు :
 చైనాలోని భూసంస్కరణలలో ప్రధానాంశం ఏమనగా …….. గ్రామాలలోని ప్రజలందరి వర్గాలను ముందుగా గుర్తించటం, మరియు భూస్వాముల యొక్క భూమి, ఇతర ఆస్తులను జప్తు చేయుట ద్వారా కాని మరే విధంగానైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి వాటిని ప్రజలకు పంచటం అనేది ముఖ్యమైనది.
2) వియత్నాంలో భూసంస్కరణలు :
 భూమి కౌలును 25 శాతానికి తగ్గించారు. భూమిని తిరిగి మళ్లీ (మారు) కౌలుకు ఇవ్వటాన్ని నిషేధించారు. 1945 ఆగష్టు నాటికి ఉన్న కౌలుదార్లు కౌలు బకాయిలన్నింటిని మాఫీ చేశారు. మరియు కౌలుదార్లు భూ యజమానులు అయ్యారు.
3) భారతదేశంలో భూసంస్కరణలు :
 చైనా, వియత్నాంలలో అమలైనటువంటి భూసంస్కరణలేవి భారతదేశములో అమలు జరగలేదు. భూ ఒడంబడిక విధానంలో కొన్ని మార్పులు మాత్రమే జరిగాయి.
10th Class Social Textbook Page No.213
ప్రశ్న 24.
 పౌరులపైన, అడవుల మీద నాపాలం, ఏజెంట్ ఆరెంజ్ వంటి రసాయనిక ఆయుధాలను అమెరికా ఉపయోగించటం సరైనదేనా?
 జవాబు:
 పౌరులపైన, అడవుల మీద నాపాలం, ఏజెంట్ ఆరెంజ్ వంటి రసాయనిక ఆయుధాలను అమెరికా ఉపయోగించడం అమెరికా వంటి అగ్రదేశాలకు తగదు. కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతుందన్న ఆందోళనతో అమెరికా ప్రవర్తించిన తీరు దారుణమైంది. అత్యంత శక్తిమంతమైన వైమానిక బాంబర్లు అయిన బి52 విమానం రసాయనిక ఆయుధాల వినియోగంతో – నాపాలం (మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబు), ఏజెంట్ ఆరెంజ్ (చెట్లు, మొక్కలను చంపేసి భూమిని చాలా సం॥లు బీడుగా మార్చివేశాయి), భాస్వరం బాంబులతో అనేక గ్రామాలు ధ్వంసమయ్యాయి. అడవులు నాశనమైనాయి. వేల సంఖ్యలో పౌరులు చనిపోయారు. మానవాళి మనుగడకు తీవ్ర విపత్తులు సంభవించే విధంగా ఉన్నా అమెరికా దుశ్చర్యను ప్రపంచం యావత్తు విమర్శించింది. అమెరికా చర్యలను ఎండగట్టింది.
10th Class Social Textbook Page No.213
ప్రశ్న 25.
 వియత్నాం నుంచి అమెరికా ప్రభుత్వం విరమించుకోవటంలో ఆ దేశంలోని శాంతి ఉద్యమం పాత్ర ఏమిటి?
 జవాబు:
 వియత్నాం నుంచి అమెరికా ప్రభుత్వం విరమించుకోవటంలో ఆ దేశంలోని శాంతి ఉద్యమం ప్రముఖ పాత్ర వహించింది. యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల వియత్నామీయులకే కాకుండా అమెరికాకు కూడా చాలా భారంగా పరిణమించింది. తనకు సంబంధం లేని యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకున్నందుకు ప్రభుత్వాన్ని విమర్శించారు. యుద్ధం కోసం యువతను సైన్యంలోకి తీసుకురావడంతో అక్కడ వ్యతిరేకత ఇంకా పెరిగింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగడంతో అమెరికాలో దాని పట్ల బలమైన నిరసనలు వెల్లువెత్తసాగాయి. ప్రభుత్వ విధానాన్ని సర్వత్రా ప్రశ్నించటంతో అంతిమంగా యుద్ధ ముగింపు సంప్రదింపులు చేపట్టేలా చేసింది.
10th Class Social Textbook Page No.215
ప్రశ్న 26.
 జాతీయతావాదానికీ, ఖండాంతర ఆఫ్రికా భావానికి మధ్య తేడాలు ఏమిటో చర్చించండి. జాతీయతావాదం అన్నది పరిమితమైన భావమా?
 జవాబు:
 తమ దేశ సంస్కృతి, చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూ దేశ ఐక్యతకు పాటుపడడాన్ని “జాతీయతావాదం” అంటారు.
దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చెయ్యటానికి ఖండాంతర ఆఫ్రికా వాదం ప్రయత్నిస్తుంది.
ఆఫ్రికా భావం ముందు జాతీయతావాదం అన్నది పరిమితమైన భావం. ఎందుకంటే ఐకమత్యంతో వలసపాలనను, జాతి వివక్షతను వ్యతిరేకించటమే కాకుండా సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం అన్న సూత్రాల ఆధారంగా ఆఫ్రికా ఖండంలోని అన్ని తెగలు, ప్రజల సమూహాల మధ్య ఐకమత్యం సాధించటానికి ఆఫ్రికా భావం ప్రయత్నిస్తుంది.

10th Class Social Textbook Page No.215
ప్రశ్న 27.
 ఒక శతాబ్దకాల వలసపాలన వల్ల ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయి. భారతదేశంలో కూడా బ్రిటిష్ పాలనలో కోస్తా ప్రాంతాలైన బెంగాలు, మద్రాసు, బొంబాయి వంటివి వేగంగా అభివృద్ధి చెందాయి. అభివృద్ధిలో ఇలా అసమానతలు ఎందుకు చోటు చేసుకుంటాయి?
 జవాబు:
 శతాబ్ద కాల వలసపాలన వల్ల ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయి. ఎందుకంటే వలస పాలకులు తమ వ్యాపార అభివృద్ధికి, తమ దోపిడీ విధానాన్ని కొనసాగించడానికి తగ్గట్లు పాలించారు. భారతదేశంలో కూడా బెంగాలు, మద్రాసు, బొంబాయి వంటివి వేగంగా అభివృద్ధి చెందాయి. ఎందుకంటే ఈ నగరాలు, రవాణా, రోడ్డు మార్గాలకు అనుకూలంగా ఉండడం వల్ల తమ పరిపాలన కేంద్రాలుగా ఈ నగరాలను అభివృద్ధి చేశారు. ఇటువంటి నగరాలలో విద్యావంతులైన మేధావులు, వివిధ సంస్థలు, సమాజాలు కూడా వలస పాలితులను ఎదిరించడం వలన అభివృద్ధి పథంలో నడిపించక తప్పలేదు.
