Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 7th Lesson వారి సేవలు విలువైనవి Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class EVS Solutions Lesson 7 వారి సేవలు విలువైనవి
I. విషయావగాహన:
ప్రశ్న 1.
 మన దైనందిన జీవితంలో మనకు సహాయపడే ముగ్గురు వృత్తి కార్మికులు పేర్లు రాయండి.
 జవాబు.
 రైతులు, పారిశుద్ధ్య కార్మికులు, చాకలివారు, కూరగాయలు అమ్మేవారు, పచారీ వ్యాపారి మొదలైన వారు మన దైనందిన జీవితంలో సహాయ పడతారు.
ప్రశ్న 2.
 రైతుకు వ్యవసాయంలో సహకరించే వృత్తుల వారెవరు ?
 జవాబు.
 ఈ క్రింది వృత్తుల వారు రైతుకు వ్యవసాయంలో సహకరిస్తారు.
- వ్యవసాయశాఖాధికారి
- వ్యవసాయ కూలీలు
- బ్యాంక్ మేనేజరు
- వడ్రంగి, కంసాలి
- తహసీల్దారు
ప్రశ్న 3.
 ఒక ప్లంబరు మీకు ఎలా సహాయపడతారో రాయండి.
 జవాబు.
- ప్లంబరు ఇంటి నీటి సరఫరా కొరకు పైపులను బిగిస్తాడు. రిపేరు చేస్తాడు.
- ఇండ్లలో వాడే సింక్లు, బాత్ టబ్, వాటర్ హీటర్లను బిగిస్తాడు.
- పైపులలో గాని కుళాయిలలో గాని ఎటువంటి రిపేర్లు వచ్చిన, ప్లంబర్ మనకు సహాయపడతాడు.

II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
 మీ గ్రామంలోని పచారికొట్టు వారిని, వారి వృత్తి గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
 జవాబు.
- ఈ సరుకులు ఎక్కడ కొంటారు?
- ఈ వృత్తిలో మీకు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు?
- పచారీ సరుకులు పాడవడం గాని, నష్టం జరగడం గాని ఉంటుందా?
- సరుకులు పాడవకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
 మీ గ్రామంలోని ఒక చర్మకారుని దగ్గరకు వెళ్ళి అతను చెప్పులు కుట్టే విధానాన్ని పరిశీలించండి.
 జవాబు.
 విద్యార్ధికృత్యము.
చెప్పులు కుట్టే వ్యక్తి. లెదర్ (తోలు), దారం, కత్తి, సుత్తి, త్రిపాద(Tripod), మొదలైన పరికరాలను ఉపయోగించి చెప్పులు.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
 వార్తా పత్రికల నుండి వివిధ వృత్తుల వారు వినియోగించే పనిముట్లు చిత్రాలను సేకరించి స్క్టాప్ పుస్తకంలో అతికించండి.
 జవాబు.
 1. తాపీమేస్త్రీ వాడే పనిముట్లు :

2) దర్జీకి ఉపయోగపడే పనిముట్లు :


V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
 బొమ్మలు గీసి రంగులు వేయండి.
 (అ) కొడవలి
 (2) నాగలి
 జవాబు.
 విద్యార్ధికృత్యము.

VI. ప్రశంస:
ప్రశ్న 8.
 మీ గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవలను నీవు ఎలా అభినందిస్తావు?
 జవాబు.
- పారిశుద్ధ్య కార్మికులు మన వీధులను, మురుగు కాలువలను శుభ్రం చేస్తారు.
- సైనికులు దేశాన్ని కాపాడుతునట్టే, పారిశుద్ధ కార్మికులు వారి పనుల ద్వారా మనల్ని రోగాల నుండి కాపాడుతున్నారు.
- వారి ప్రాముఖ్యతను, అభినందించి వారిని గౌరవించాలి.
ప్రశ్న 9.
 క్రింది చిత్రాలను చూసి నీ అనుభూతులు రాయుము?

జవాబు.
 విద్యార్ధికృత్యము.
- ఇచ్చిన పటంలో రైతు తన గేదెను కడుగుతున్నాడు.
- దానికి గడ్డి వేసి, నీళ్ళు పెడుతున్నాడు.
- గేదె రైతుకు పాలు ఇస్తుంది.
- రైతు కొన్ని పాలను దూడకు ఉంచి దానికి పాలు తాగిస్తున్నాడు.
- ఈ చిత్రంలో రైతు గేదెను తన కుటుంబ సభ్యుడిగా ప్రేమగా చూసుకుంటున్నాడు.

కృత్యము: (TextBook Page No.62)
క్రింది చిత్రాలను చూసి వారి వృత్తులను రాయండి.

జవాబు.


అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
 పనిముట్టు అంటే ఏమిటి ?
 జవాబు.
 ఒక పనిని సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువును పనిముట్టు అంటారు.
ప్రశ్న 2.
 క్రింద ఇవ్వబడిన వివిధ రకాల బ్రష్ ను చూసి, వివధ వృత్తుల వారు ఉపయోగించి వివిధ రకాల బ్రషన్లను గుర్తించండి.

జవాబు.
| బ్రష్ | ఉపయోగించే వృత్తి/వ్యక్తి | 
| రంగులు వేసే బ్రష్ | పెయింటర్ (రంగులు వేసే వ్యక్తి) | 
| జట్టుకు రంగు వేసే బ్రష్ | బ్యూటిషియన్ ఉడ్చే బ్రష్ | 
| ఊడ్చే బ్రష్ | పని మనిషి | 
| మేకప్ బ్రష్ | బ్యూటీషియన్ | 
| బూట్లు పాలీష్ చేసే బ్రష్ | చెప్పులు కుట్టే వ్యక్తి | 
| షేవింగ్ బ్రష్ | మంగళి | 
| డ్రాయింగ్ బ్రష్ | బొమ్మలు వేసే వ్యక్తి | 
| బట్టలు ఉతికే బ్రష్ | చాకలి | 
ప్రశ్న 3.
 వృత్తి అంటే ఏమిటి ?
 జవాబు.
 నైపుణ్యం కలిగిన పనులు ద్వారా సంపాదించ గలిగే పనులను వృత్తి అంటారు.

ప్రశ్న 4.
 రైతులు ఉపయోగించు వివిధ పనిముట్లు, వాటి ఉపయోగాలకు సంబంధించిన సమాచారాన్ని పట్టికలో రాయండి.
 జవాబు.
| క్రమ. సంఖ్య | పనిముట్టు | ఉపయోగం | 
| 1. | పార | నేలను చదును చేయుట, నీరు పారడానికి బోదెలను తవ్వుట | 
| 2. | కొడవలి | పంటలను కోయడానికి | 
| 3. | నాగలి | భూమిని దున్నడానికి | 
| 4. | ట్రాక్టర్ | నేలను చదును చేయడం, దున్నడం | 
ప్రశ్న 5.
 దర్జీ ఉపయోగించు వివధ పనిముట్లను, వాటి ఉపయోగాలను ఒక పట్టిక రూపంలో రాయండి.
 జవాబు.
| క్రమ. సంఖ్య | పనిముట్టు | ఉపయోగం | 
| 1. | టేపు | కొలతలు తీసుకోవడానికి | 
| 2. | కత్తెర | బట్టలను కత్తిరించడానికి | 
| 3. | కుట్టు మిషన్ | బట్టలను కుట్టడానికి | 
| 4. | సూది, దారం | గుండీలు, హులు కుట్టడానికి | 
ప్రశ్న 6.
 “తాపి మేస్త్రీ” అంటే ఏవరు తాపిమేస్త్రీ ఉపయోగించే పనిముట్లను రాయండి.
 జవాబు.
 ఇంటిని నిర్మించడంలో ఉపయోగపడే వ్యక్తిని “తాపిమేస్త్రీ” అంటారు.
 తాపి మేస్త్రీ ఉపయోగించే పనిముట్లు :
- పార
- గమేలా
- తూకం దారం
- మూల మట్టం
- తాపి ద్రవమట్టం
 మొదలైనవి ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
 ఒక గోడ నిర్మాణంలో ఉపయోగించే పనిముట్లు ఏవి?
 జవాబు.
 గమేలా, తాపి, తూకం దారం, మూల మట్టం, మొదలైన వాటిని గోడ నిర్మాణంలో ఉపయోగిస్తారు.
ప్రశ్న 8.
 మన నిత్య జీవితంలో ఏయే వృత్తుల వారు . ఏ విధంగా సహాయ పడతారో ఒక పట్టిక రూపంలో రాయండి.
 జవాబు.
| క్రమ. సంఖ్య | వృత్తి | ఉపయోగపడే విధానం | 
| 1. | కూరగాయలు అమ్ముట | కావలసిన కూరగాయలు అమ్ముతారు. | 
| 2. | పాల వ్యాపారి | పాలు పోస్తాడు | 
| 3. | పూల వ్యాపారి | పూలు అమ్ముతాడు | 
| 4. | కెమిస్ట్ | మందులు అమ్ముతాడు | 
| 5. | పచారీ వ్యాపారి | సరుకులు అమ్ముతాడు | 
| 6. | పారిశుద్ధ్య కార్మికులు | వీధులను, మురుగు కాల్వలను శుభ్రం చేస్తారు | 
ప్రశ్న 9.
 ఒక కుండల తయారీ వ్యక్తిని అడిగి, కుండలు తయారు చేసే విధానాన్ని రాయండి.
 జవాబు.
- కుండల తయారీ కొరకు కావలసిన మట్టిని తెస్తాడు.
- మట్టిని నీటితో తడిపి, కాళ్ళతో తొక్కి మొత్తగా చేస్తాడు.
- మెత్తగా అయిన మట్టిని కుమ్మరి చక్రం పై ఉంచి దానిని కుండ రూపంలో మలచుతాడు.
- తయారైన కుండను ఒక చెక్క ముక్కతో సున్నితంగా వొత్తి సరైన ఆకారంలోకి తెస్తాడు.
- కుండలను ముందుగా నీటిలో ఆరబెట్టి ఆ తరువాత ఎండలో ఉంచుతారు.
- ఎండిన కుండలను కొలిమిలో కాల్చుతారు.

ప్రశ్న 10.
 కొన్ని వృత్తులను వారు చేసే పనులను ఒక పట్టిక రూపంలో రాయండి.
 జవాబు.

బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
 పారను ____________ కొరకు ఉపయోగిస్తారు.
 A) పంట కోయుట
 B) నేలను చదును చేయుట
 C) నేలను దున్నుట
 D) పైవేవీ కావు
 జవాబు.
 B) నేలను చదును చేయుట
ప్రశ్న 2.
 నేలను దున్నడానికి ____________ ను ఉపయోగిస్తారు.
 A) కొడవలి
 B) పార
 C) నాగలి
 D) గొడ్డలి
 జవాబు.
 C) నాగలి
ప్రశ్న 3.
 ఇంటిని నిర్మించడంలో సహాయపడే వ్యక్తి ____________
 A) తాపిమేస్త్రీ
 B) చర్మకారుడు
 C) కాంట్రాక్టర్
 D) కంసాలి 4వ తరగతి
 జవాబు.
 A) తాపిమేస్త్రీ

ప్రశ్న 4.
 కూరగాయలను, పండ్లను అమ్మే వ్యక్తి ____________
 A) పూల వ్యాపారి
 B) కెమిస్ట్
 C) పచారీ వ్యాపారి
 D) కూరగాయల వ్యాపారి
 జవాబు.
 D) కూరగాయల వ్యాపారి
ప్రశ్న 5.
 ____________ కూరగాయలను కొని వాటిని సైజులు, నాణ్యతను బట్టి వేరు చేస్తారు.
 A) టోకు వ్యాపారులు
 B) రైతులు
 C) చిరు వ్యాపారులు
 D) ఎవరు కాదు
 జవాబు.
 C) చిరు వ్యాపారులు
ప్రశ్న 6.
 మన వీధులు, మురుగు కాలువలను శుభ్రం చేసేవారు ____________
 A) పారిశుద్ధ్య కార్మికులు
 B) పని మనిషి
 C) కుండలు తయారు చేయువారు
 D) చిరు వ్యాపారి
 జవాబు.
 A) పారిశుద్ధ్య కార్మికులు

ప్రశ్న 7.
 బంగారు ఆభరణాలు తయారు చేసేవారు ____________
 A) ప్లంబర్
 B) కంసాలి
 C) స్వర్ణకారుడు
 D) ఎలక్టీషియన్
 జవాబు.
 C) స్వర్ణకారుడు
ప్రశ్న 8.
 చెప్పులను కుట్టేవారు ____________
 A) ప్లంబర్
 B) కంసాలి
 C) స్వర్ణకారుడు
 D) చర్మకారుడు
 జవాబు.
 D) చర్మకారుడు
ప్రశ్న 9.
 రైతుకు భూమి హక్కు పాస్ పుస్తకాలను అందించేవారు ____________
 A) వ్యవసాయ అధికారి
 B) బ్యాంక్ మేనేజర్
 C) తహసీల్దారు
 D) విద్యుత్ ఇంజనీరు
 జవాబు.
 C) తహసీల్దారు

ప్రశ్న 10.
 మనకు మందులను అమ్మేవారు ____________
 A) పచారీ వ్యాపారి
 B) పూల వ్యాపారి
 C) నర్సు
 D) కెమిస్ట్
 జవాబు.
 D) కెమిస్ట్
