Andhra Pradesh AP Board 5th Class Telugu Solutions 1st Lesson ఏ దేశమేగినా Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Telugu Solutions Chapter 1 ఏ దేశమేగినా
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.

 ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
 చిత్రంలో ఏం జరుగుతున్నది ?
 జవాబు:
 చిత్రంలో జెండా ఎగురవేస్తున్నారు.
ప్రశ్న 2.
 చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ? ఏ మేం చేస్తున్నారు ?
 జవాబు:
 చిత్రంలో ప్రధానోపధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విధ్యార్ధులు, విధ్యార్థినులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయురాలు జాతీయ జెండా ఎగుర వేస్తున్నారు. విద్యార్ధులు అందరూ నమస్కారం చేస్తున్నారు.

ప్రశ్న 3.
 మీ బడిలో జెండా ఎప్పుడెప్పుడు ఎగురవేస్తారు? ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తారు?
 జవాబు:
 మా బడిలో జాతీయజెండా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన, జనవరి 26 గణతంత్ర దినోత్సవమున ఎగురవేస్తారు. ఆ రోజు 1. వందేమాతరం 2. జనగణమన జాతీయ గీతాలు, దేశభక్తి గీతాలు అలపిస్తారు. జాతీయ నాయకుల త్యాగాలను వివరిస్తూ ఉపాధ్యాయులు ఉపన్యాసాలు ఇస్తారు.
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
 గేయాన్ని రాగయుక్తంగా పాడండి.
 జవాబు:
 విద్యార్థి కృతము
ప్రశ్న 2.
 గేయ భావం సొంత మాటల్లో చెప్పండి.
 
 జవాబు:
 మన జన్మభూమి భారతదేశం. మనం భారతీయులం. మన దేశీయులు మీరు. మీరు ఏ దేశం వెళ్ళినా, ఎంత గొప్ప పదవి పొందినా, ఇతరులు మనలను నిందించినప్పుడు సహించక, మన జాతి గౌరవాన్ని నిలుపండి.
మనం పూర్వ జన్మంలో ఎంతో పుణ్యం చేసుకున్నాం. గొప్ప యోగం – కలవాళ్ళమై ఈ భారతదేశంలో జన్మించాం. ఇది స్వర్గభూమి. ఈ దేశంలో ఆ జన్మించడానికి ఎన్నో గొప్ప పూవులతో ప్రేమించి పూజించి యుంటాం. అందుచేత భారతమాత నిన్ను తన కడపున మోసింది.
ఇంత గొప్ప భూమాత ప్రపంచంలోనే లేదు, మన భారతీయులంత ఉన్నతులు ఏ దేశంలో లేరు. పొద్దస్తమానం, సముద్రంలో ఓడలు అల్లంత కంగా దూరాన రెపరెపలాడుతూ కనబడే ప్రాంతం వరకూ ఈ జన్మభూమి గురించి పొగడు. మన భూమాతవంటి చల్లని తల్లి ఎచ్చటా లేదు. మన వీర భారత దేశం గురించి, నీవెక్కడ ఉన్నా పొగడుతునే ఉండు.

ప్రశ్న 3.
 మీకు తెలిసిన దేశభక్తి గేయాలు పాడండి.
 జవాబు:
 దేశమును ప్రేమించుమన్నా
 మంచియన్నది పెంచుమన్నా
 ఒట్టి మాటలు కట్టిపెట్టాయ్
 గట్టిమేల్ తలపెట్టవోయ్
పాడిపంటలు పొంగిపొరలే
 దారిలో నువు పాటు పడవోయ్
 తిండి కలిగితే కండ కలదోయ్
 కండకలవాడేను మనిషోయ్……..
ప్రశ్న 4.
 మీ బడిలో జరుపుకునే జెండా పండుగ గురించి చెప్పండి.
 జవాబు:
 మాబడిలో అందరం గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకున్నాం. బడిని రంగురంగుల జెండాలతో అలంకరించాం. ముందు “వందే మాతరం” పాడాం, జాతీయగీతం పాడాం. మా గ్రామ సర్పంచ్ జాతీయ జెండా ఎగురవేసారు. ఉపాధ్యాయులు దేశభక్తిని ప్రబోధించే ఉపన్యాసాలు ఇచ్చారు. బాలబాలికలం దేశభక్తి గేయాలు పాడాము. చివరగా ” జనగణమన” జాతీయ గీతం పాడాం. మాకు మిఠాయిలు పంచి పెట్టారు. అందరం ఆనందంగా ఇళ్ళకు చేరాం.
పదజాలం
అ) కింది పదాలను చదవండి.
 

ఆ) కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి.
 
 జవాబు:
 క = కడవ
 గ = గడప
 చ = చరణం
 జ = జడ
 ట = టపా
డ = డబ్బా
 త = తలుపు
 ద = దడ
 న = నలుపు
 ప = పడవ
బ = బలము
 మ = మర
 య = యముడు
 ర = రంగు
 ల = లత
వ = వల
 శ = శకటము
 ష = షరతు
 స = సరుకు
 హ = హంస
ఇ) కింది గుణింతాలతో పదాలను రాయండి.
 
 జవాబు:
 
ప్రశంస
ప్రపంచమంతా కరోనా వంటి మహమ్మారి వ్యాపించినప్పుడు వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలను కాపాడడంలో విశేష కృషి చేసారు. వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టారు. మీరు తోటివారిలోని మంచిని, శ్రమ విలువను ప్రశంసిస్తూ మాట్లాడండి.
 
ధారణ చేద్దాం
ఆంధ్రభాష యమృత మాంధ్రాక్షరంబులు
 మరువు లొలుకు గుండ్ర ముత్తియములు
 ఆంధ్రదేశ మాయురారోగ్య వర్ధకం
 బాంధ్రజాతి నీతి ననుసరించు

భావం :
 ఆంధ్రభాష అమృతం వంటిది. తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లాగా ఉండి అందాలొలుకుతూ ఉంటాయి. ఆంధ్రదేశం ఆయుష్షును, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకొంటుంది.
కవి పరిచయం
కవి : రాయప్రోలు సుబ్బారావు
 కాలము : 13-3-1892 – 30-06-1984
 రచించిన కావ్యాలు : తృణ కంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైనవి
 రచించిన గ్రంథాలు : రమ్యాలోకం, మాధురీదర్శనం
 బిరుదులు : పద్మభూషణ్
గేయములు-భావములు
1. ఏదేశమేగినా, ఎందుకాలిడిన
 ఏపీఠమెక్కినా, ఎవ్వరేమనిన
 పొగడరా నీ తల్లి భూమి భారతిని!
 నిలుపరా నీ జాతి నిండు గౌరవము!
 

2. ఏపూర్వపుణ్యమో, ఏయోగ బలమో
 జనియించినాడవీ, స్వర్గ ఖండమున
 ఏమంచి పూవులన్, ప్రేమించినావో
 నిను మోచె ఈ తల్లి, కనక గర్భమున!
3. లేదురా ఇటువంటి, భూదేవి యెందు
 లేరురామనవంటి, పౌరు లింకెందు
 సూర్యుని వెలుతురుల్, సోకు నందాక
 ఓడల జెండాలు ఆడు నందాక!
 
 4. అందాక గల ఈ, యనంత భూతలిని
 మన భూమి వంటి, చల్లని తల్లి లేదు
 పాడరా నీ తెగ్గు, బాల గీతములు
 పాడరా నీ వీర, భావ భారతము !
పదాలు – అర్థాలు
పీఠం = గద్దె, సింహాసనం:
 యోగం : అదృష్టం
 స్వర్గ ఖండం = స్వర్గంలాంటి ఈ భారత దేశం
 జనియించుట = పుట్టుట
 తెన్గు = తెలుగు
 కాలిడు = అడుగు పెట్టు
 భారతి = భారతదేశం
 గర్భము గర్భము
 సోకు = తగులు
 అనంతం = అంతులేనిది
చదువు – అర్ధం చేసుకో – ఆనందించు. పరీక్షల కోసం కాదు.
వివేకానందుని షికాగో ప్రసంగం
“ఏ దేశమేగినా ఎందుకాలిడిన పొగడరా నీతల్లి భూమి భారతిని” అని ఎక్కడికి వెళ్ళినా మన దేశపు గొప్పతనాన్ని తెలియజేయాలని ! తెలుసుకున్నారు కదా? అలా మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసినవారు | స్వామి వివేకానంద. అదేంటో ఆయన షికాగోలో చేసిన ప్రసంగం ద్వారా ” తెలుసుకోండి.
 
 1893 సెప్టెంబరు 11వ తేదీ ఉదయం స్వామి వివేకానందునితో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ షికాగోలోని కొలంబస్ హాలులోని ఒక విభాగంలో సమావేశమయ్యారు.

వచ్చిన ప్రతినిధులంతా ఒకరి తరువాత ఒకరు ప్రసంగిస్తున్నారు. విఏకానందుని వంతు వచ్చింది. వివేకానందుడు లేచాడు. ఒక్కక్షణం తన ఇష్టదైవాన్ని తలచుకుని “అమెరాకా దేశపు సోదరీసోదరీమణులారా” అంటూ సంబోధించాడు. ఆ సంబోధనతో అక్కడ అందరిని ఒక మహెూత్సాహం ఆవహించింది. చెవులు చిల్లులుపడేటట్ల కరతాళధ్వనులు మిన్నంటాయి. వివేకానందుడు ఆ కరతాళ ధ్వనుల మధ్య కాసేపు మాట్లాడలేకపోయాడు.ఈ ఘనమైన స్వాగతానికి ఆయన చలించిపోయాడు.
 
 తన ఉపన్యాసాన్ని కొసాగిస్తూ “సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు సనాతనధర్మం తల్లి అనదగింది. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతనధర్మం నా ధర్మం. సర్వమత సహనాన్నే కాక, సర్వమతాలు సత్యాలనే మేం విశ్వసిస్తాం. పరపీడితులై, శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశం.
శాఖాభిమానం, మతమౌఢ్యం లాంటి వాటిని ఖండించి అవి లేనట్టి , ఒక సమాజాన్ని రూపొందించాలనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను” అని అన్నాడు వివేకానందుడు. అన్ని మతాలు ఒకటేననీ, ఆ మతాలలో జరిగే పూజా విధానాలన్నీ భగవంతుడి తత్వాన్ని తెలియజేసేననీ వివేకానందుడు చెప్పాడు.
వివేకానందస్వామి సనాతన ధ్మం గొప్పతనాన్ని లోకానికి తెలియజేశాడు. ఈ ప్రసంగం ద్వారా ప్రపంచ ప్రజలకు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటాడు.
 – స్వామి చిరంతనానంద
