SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 6 దత్తాంశ నిర్వహణ InText Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 6th Lesson దత్తాంశ నిర్వహణ InText Questions
[పేజీ నెం. 216]
అంక సగటు ఏ విలువల మధ్య ఉంటుంది?
 తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులలో సరళ, బిందు, గీత మరియు రేఖలు పొందిన మార్కుల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
 
 సాధన.
 ప్రతీ సబ్జెక్టులో విద్యార్థులు పొందిన సరాసరి మార్కులు గణన చేద్దాం.
 
(i) పై పట్టిక నుండి, నీవు ఏమి గమనించావు ?
 సాధన.
 సగటు ఎల్లప్పుడూ గరిష్ఠ మరియు కనిష్ఠ విలువల మధ్య ఉంటుంది.

(ii) అన్ని సందర్భములలో అంకగణిత సగటు అత్యల్ప మరియు అత్యధిక పరిశీలనా విలువల మధ్య ఉన్నదా ?
 సాధన.
 అవును, అంకగణిత సగటు ఎల్లప్పుడూ అత్యల్ప మరియు అత్యధిక పరిశీలనా విలువల మధ్య ఉంటుంది.
నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 218]
ప్రశ్న 1.
 5 యొక్క మొదటి మూడు గుణిజాల అంక గణిత సగటు కనుగొనుము.
 సాధన.
 5 యొక్క మొదటి మూడు గుణిజాలు 5, 10, 15.
 
 ∴ 5, 10, 15 ల సగటు = \(\frac{5+10+15}{3}\) = \(\frac{30}{3}\) = 10
అన్వేషిద్దాం [పేజి నెం. 218]
తరగతిలోని 10 మంది విద్యార్థుల బరువులను (కిలోగ్రాములలో) సేకరించండి. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
 
 సాధన.
| విద్యార్థి పేరు | బరువు (కిలోగ్రాములలో) | 
| ఆదిత్య | 38 | 
| కిశోర్ | 39 | 
| బాలు | 40 | 
| శ్రీకరి | 36 | 
| ఖైరవి | 37 | 
| స్వాతి | 37 | 
| కృష్ణ | 41 | 
| రామ్ | 39 | 
| ప్రసాద్ | 39 | 
ప్రశ్న 1.
 అత్యధిక మరియు అత్యల్ప బరువులు ఏవి?
 సాధన.
 కృష్ణ = 41 కి.గ్రా. – అత్యధిక బరువు
 శ్రీకరి = 35 కి.గ్రా. – అత్యల్ప బరువు

ప్రశ్న 2.
 సేకరించిన దత్తాంశమునకు అంకగణిత సగటు కనుగొనుము.
 సాధన.
 ఇవ్వబడిన రాశులు: 38, 39, 40, 36, 35, 37, 36, 41, 39, 39.
 రాశుల మొత్తం = 38 + 39 + 40 + 36 + 35 + 37 + 36 + 41 + 39 + 39 = 380
 రాశుల సంఖ్య = 10
 రాశుల మొత్తము 38 అంకగణిత సగటు = రాశుల సంబం – 10 = 38 కి.గ్రా.
ప్రశ్న 3.
 అంకగణిత సగటు, అత్యధిక మరియు అత్యల్ప పరిశీలనా విలువల మధ్య ఉన్నదో లేదో గమనించండి.
 సాధన.
 అంకగణిత సగటు 38 కి.గ్రా. అత్యధిక బరువు 41 కి.గ్రా. మరియు అత్యల్ప బరువు 35 కి.గ్రా. మధ్య ఉన్నది.
నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 220]
ప్రశ్న 1.
 మొదటి 10 పూర్ణాంకముల వ్యాప్తి కనుగొనుము.
 సాధన.
 మొదటి 10 పూర్ణాంకాలు : 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
 వ్యాప్తి = గరిష్ఠ విలువ – కనిష్ఠ విలువ
 = 9 – 0 = 9
 ∴ మొదటి 10 పూర్ణాంకాల వ్యాప్తి = 9.
నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 222]
10, 9, 12, 10, 8, 7, 6, 10, 9, 7, 8, 5 మరియు 2 రాశుల బాహుళకము ఎంత ?
 సాధన.
 ఇచ్చిన దత్తాంశాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చగా
 2, 5, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 10, 12
 మిగతా రాశుల కన్నా 10 ఎక్కువసార్లు పునరావృతం అయినది.
 ∴ బాహుళకం = 10
అన్వేషిద్దాం [పేజి నెం. 222]
ఒక పాచికను తీసుకోండి. దానిని 20 సార్లు దొర్లించండి. పాచిక పై భాగంలో వచ్చిన అంకెలను నమోదు చేయండి. ఆ అంకెల బాహుళకం కనుగొనుము.
 
 సాధన.
 ఒక పాచికను 20 సార్లు దొర్లించగా వచ్చిన అంకెలు
 2, 4, 5, 3, 1, 6, 5, 4, 2, 1, 3, 5, 4, 2, 6, 2, 2, 5, 1, 3.
 ఇచ్చిన రాశులలో ఒకే విధమైన రాశులను ఒక క్రమ పద్ధతిలో అమర్చితే
 1, 1, 1, 2, 2, 2, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 5, 5, 5, 5, 6, 6.
 మిగతా వాటికంటే ‘2’ ఎక్కువసార్లు పునరావృతం అయింది.
 ∴ బాహుళకం = 2.

ఆలోచించండి [పేజి నెం. 222]
కింది పట్టికలో విద్యార్థులు. రోజుకు చదువులో వెచ్చించే సమయం (గంటలలో) ఇవ్వబడినది అయిన బాహుళకము కనుగొనుము.
 
 సాధన.
 ఎక్కువ మంది విద్యార్థులు 1 గంట సమయం చదువుటలో వెచ్చించడం జరిగినది.
 కావున, ఇచ్చిన దత్తాంశం యొక్క బాహుళకం = 4.
నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 228]
మొదటి 7 ప్రధాన సంఖ్యల మధ్యగతము కనుగొనుము.
 సాధన.
 మొదటి 7 ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17.
 7 రాశులలో \(\left(\frac{7+1}{2}=\frac{8}{2}=4\right)\) 4వ రాశి మధ్యగతము.
 ∴ మధ్యగతము = 7.
అన్వేషిదాం [పేజి నెం. 228]
మీ పాఠశాల లేదా మీకు సమీపంలో గల పాఠశాల యొక్క గత 6 సంవత్సరాల పదవ తరగతి ఉత్తీర్ణతా శాతములను నమోదు చేసి మధ్యగతము కనుగొనుము.
 సాధన.
 మా పాఠశాల యొక్క గత 6 సంవత్సరాల పదవ తరగతి ఉత్తీర్ణతా శాతములు :
 100%, 98%, 93%, 95%, 96%, 97%.
 ఇవ్వబడిన పరిశీలనలను ఆరోహణ క్రమంలో అమర్చగా,
 
 ఈ ఆరు పరిశీలనలలో 3 మరియు 4 పరిశీలనలు 96% మరియు 97%.
 ఇక్కడ, 96% మరియు 97% అనునవి రెండు ముఖ్య మధ్యమ విలువలు.
 మధ్యగతము = రెండు ముఖ్య మధ్యమ విలువల సగటు
 = \(\frac{96+97}{2}\) = 96.5%
 ∴ దత్తాంశము యొక్క మధ్యగతము = 96.5%

ప్రాజెక్టు పని [పేజి నెం. 228]
మీ తల్లి తండ్రితో పాటు దగ్గరలోని కూరగాయల మార్కెట్ ను సందర్శించి, వివిధ కూరగాయల ధరలు సేకరించండి. క్రింది పట్టికను పూరించి, కేంద్రీయ స్థాన విలువలు కనుగొనుము.
 
 సాధన.
 
[పేజి నెం. 230]
ప్రసన్న ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకున్నాడు. అతను ఒకే లక్షణాలు (సౌకర్యాలు) గల రెండు విభిన్న కంపెనీల మొబైల్ ఫోన్లను ఎంపిక చేసుకున్నాడు. ఈ రెండు మొబైల్ ఫోనుల్లో ఏది మెరుగైనదో అతను తెలుసుకోవాలనుకున్నాడు. అతను వివిధ పత్రికలు మరియు మ్యాగజైన్లు నుండి ఈ క్రింది సమాచారమును సేకరించాడు.

ప్రశ్న 1.
 ప్రక్క పట్టికలో గల సమాచారం దేనిని సూచిస్తుంది ?
 జవాబు
 ప్రక్క పట్టిక మొబైల్ ఫోన్ల గురించి సమాచారం సూచిస్తుంది.

ప్రశ్న 2.
 పట్టికలోని సమాచారం ప్రసన్నకు ఉపయోగపడుతుందా ?
 జవాబు
 అవును.
ప్రశ్న 3.
 నీవైతే ప్రసన్నకు, ఏ మొబైల్ ఫోన్ ను సూచిస్తావు ?
 జవాబు
 ఫోన్ – A. (21 + \(\frac{1}{2}\) + \(\frac{1}{2}\) రేటింగ్)
నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 232]
ప్రక్క కమ్మీ చిత్రంను గమనించి, కింది ప్రశ్నలకు సమాధానాలు రాయుము.

ప్రశ్న 1.
 ఎక్కువ మంది ఇష్టపడే పండు ఏది ?
 జవాబు
 ఆపిల్.
ప్రశ్న 2.
 అరటి పండును ఇష్టపడే వారి సంఖ్య ఎంత ?
 జవాబు
 10.
[పేజి నెం. 232]
ప్రక్కనున్న చిత్రాన్ని గమనించండి. ఇవ్వబడిన రెండు వరుసల కమ్మీ చిత్రంను పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
 ఏ సంవత్సరములో రెండు మొబైల్ ఫోన్ కంపెనీల అమ్మకాలు సమానం ?
 జవాబు
 2018.

ప్రశ్న 2.
 2017 వ సంవత్సరములో ఏ మొబైల్ ఫోన్ కంపెనీ అమ్మకాలు ఎక్కువ ?
 జవాబు
 మొబైల్ ఫోన్ – A.
[పేజి నెం. 236]
ప్రశ్న 1.
 ప్రక్క పటంను గమనించండి.
 
 (1) వృత్తములోని అధిక భాగము ఏ రంగుతో షేడ్ చేయబడినది ?
 జవాబు
 ఎరుపు రంగు.
(2) నీలం రంగు, పింక్ రంగు భాగాలు సమాన పరిమాణములో ఉన్నాయా ?
 జవాబు
 లేవు.
(3) వృత్తములోని అత్యల్ప భాగము ఏ రంగుతో షేడ్ చేయబడినది ?
 జవాబు
 పసుపు రంగు.
ప్రశ్న 2.
 కింది పటములో మానస కుటుంబం యొక్క వివిధ ఖర్చుల వివరాలు చూపబడ్డాయి.
 
 (i) అధిక భాగం దేని కొరకు ఖర్చు పెట్టబడింది ?
 జవాబు
 ఆహారం.

(ii) సమాన మొత్తంలో ఖర్చు చేయబడిన అంశాలు ఏవి ?
 జవాబు
 సహాయం మరియు చదువు.
(iii) అత్యల్ప భాగం దేని కొరకు ఖర్చు పెట్టబడింది ?
 జవాబు
 ఇతరములు.
ప్రాజెక్టు పని [పేజి నెం. 244]
మ్యాగజైన్లు, దినపత్రికలలో కమ్మీ చిత్రాలు, పై చిత్రాల రూపంలో ఉన్న సమాచారాన్ని సేకరించండి. మీ తరగతి గోడపత్రికపై ప్రదర్శించండి.
 సాధన.
 విద్యార్థులు సొంతంగా నిర్వహించాలి.
తార్కిక విభాగం అక్షర శ్రేణి [పేజి నెం. 246]
అక్షరశ్రేణి అనేది ఒక నిర్దిష్ట క్రమంలో అమర్చబడ్డ ఇంగ్లీష్ అక్షరమాల యొక్క తార్కిక అమరిక. వీటిలో అక్షరాలశ్రేణి .. (అక్షరాలు), అక్షరాల సమూహాలు లేదా అక్షరాలు మరియు సంఖ్యల కలయిక ఇవ్వబడింది. ప్రతి అక్షరం లేదా అక్షరాల సమూహంను పదం అని అంటారు. శ్రేణిలోని పదాలు ఒక నిర్దిష్ట క్రమంలో లేదా నమూనాలో అమర్చబడ్డాయి. మనం శ్రేణిని గుర్తించి ఖాళీలో, ఆ శ్రేణిని సంతృప్తి పరచే పదము (తరువాత పదం) ఆ ప్రత్యామ్నాయాల నుండి కనుగొనాలి. అక్షరాల శ్రేణిని సాధన చేయడానికి అక్షరాలకు నెంబర్లు కేటాయించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
 
ఉదాహరణలు:
 ప్రశ్న 1.
 B, D, E, H, …………
 (1) 1
 (2) K
 (3) J
 (4) L
 జవాబు
 (3) J
వివరణ:
 

ప్రశ్న 2.
 A, B, D, E, G, ………….
 (1) H
 (2) I
 (3) K
 (4)F
 జవాబు
 (1) H
వివరణ:
 
ప్రశ్న 3.
 Z, X, U, Q, ………….
 (1) M
 (2) K
 ( 3) N
 (4) L
 జవాబు
 (4) L
వివరణ:
 
ప్రశ్న 4.
 QPO, NML, KJI, ……… EDC
 (1) KL
 (2) GHI
 (3) CAB
 (4) HGF
 జవాబు
 ఇచ్చిన శ్రేణిలోని అక్షరాలు ఇంగ్లీష్ అక్షరమాల యొక్క వ్యతిరేక (అపసవ్య) దిశ రాయబడ్డాయి కాబట్టి జవాబు ‘HGF’ అగును.

ప్రశ్న 5.
 AB, DE, HI, MN, ………..
 (1) TV
 (2) TU
 (3) ST
 (4) RS
 జవాబు
 (3) ST
వివరణ:
 
 కాబట్టి, శ్రేణిలోని తరువాత వచ్చే పదం ‘ST’.
ప్రశ్న 6.
 AB, EF, IJ, MN, ………….
 (1) QR
 (2) OP
 (3) XY
 (4) PQ
 జవాబు
 (1) QR
వివరణ:
 
 కాబట్టి, శ్రేణిలోని తరువాత వచ్చే పదం ‘QR’
ప్రశ్న 7.
 B2, D4, F6, H8, J10, ………
 (1) L12
 (2) K11
 (3) N14
 (4) M13
 జవాబు
 (1) L12
వివరణ:
 అక్షరాలు మరియు వాటికి కేటాయించిన సంఖ్యలు (ఒకటి విడిచి ఒకటి) కాబట్టి, జవాబు ‘L12’.

ప్రశ్న 8.
 AFK, BGL, CHM, DIN, ……… .
 (1) GJO
 (2) FIO
 (3) EJO
 (4) GUN
 జవాబు
 (3) EJO
వివరణ:
 ప్రతీ సమూహంలో అక్షరం మరియు దాని తరువాత వచ్చే యొక్క 5 వ అక్షరం కాబట్టి జవాబు ‘EJO’.
ఉదాహరణ
ప్రశ్న 1.
 ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకములో 6 రోజులపాటు భుజించిన విద్యార్థుల సంఖ్య వరుసగా 132, 164, 145, 182, 163 మరియు 114 అయిన మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థుల అంకగణిత సగటు కనుగొనుము.
 సాధన.
 మధ్యాహ్న భోజన పథకములో 6 రోజులపాటు భుజించిన విద్యార్థుల సంఖ్య వరుసగా 132, 164, 145, 182, 163, 114.
 
 = \(\frac{132+164+145+182+163+114}{6}\) = \(\frac{900}{6}\) = 150
ప్రశ్న 2.
 విద్యార్థుల వయసులు (సంవత్సరాలలో) 8, 5, 6, 6, 5, 7, 5, 6, 5, 4, 7, 6, 7, 6, 5, 8 మరియు 6 అయిన వాటి బాహుళకము ఎంత ?
 సాధన.
 విద్యార్థుల వయసులు 8, 5, 6, 6, 5, 7, 5, 6, 5, 4, 7, 6, 7, 6, 5, 8, 6 గా ఇవ్వబడినవి.
 ఇచ్చిన రాశులలో ఒకే విలువ గల రాశులను ఒక క్రమ పద్ధతిలో అమర్చితే
 4, 5, 5, 5, 5, 5, 6, 6, 6, 6, 6, 6, 7, 7, 7, 8, 8.
 మిగతా వాటికంటే ‘6’ ఎక్కువసార్లు పునరావృతం అయినది.
 ∴ కాబట్టి బాహుళకము = 6
ప్రశ్న 3.
 A, B, E, A, C, E, B, C, D, A, D, C, E, A మరియు C యొక్క బాహుళకం ఎంత ?
 సాధన.
 A, B, E, A, C, E, B, C, D, A, D, C, E, A, C లు ఇవ్వబడ్డాయి.
 ఇచ్చిన రాశులలో ఒకే విధమైన రాశులను ఒక క్రమ పద్ధతిలో అమర్చితే,
 A, A, A, A, B, B, C, C, C, C, D, D, E, E, F
 మిగతా వాటికంటే ‘A’ మరియు ‘C’ లు ఎక్కువ సార్లు పునరావృతం అయ్యాయి.
 ∴ కాబట్టి బాహుళకము = ‘A’ మరియు ‘C’

ప్రశ్న 4.
 32, 43, 25, 67, 46, 71 మరియు 182 ల మధ్యగతము కనుగొనుము.
 సాధన.
 32, 43, 25, 67, 46, 71, 182
 ఇచ్చిన రాశులు ఆరోహణ క్రమములో అమర్చిలే
 
 దత్తాంశములోని ఏడు రాశులలో 4వ రాశి మధ్యపదం అగును.
 ∴ మధ్యగతము = 46.
ప్రశ్న 5.
 8 మంది నెలసరి ఆదాయాలు ₹8000, ₹9000, ₹8200, ₹7900, ₹8500, ₹8600, ₹7700 మరియు ₹60000 అయిన వారి మధ్యగత ఆదాయాన్ని కనుగొనుము.
 సాధన.
 8 కుటుంబాల నెలసరి ఆదాయాలు
 ₹8000, ₹9000, ₹8200, ₹7900, ₹8500, ₹8600, ₹7700, ₹60000
 ఆదాయాలను ఆరోహణ క్రమములో అమర్చితే,
 
 మధ్యమ పదాలు 8200 మరియు 8500.
 మధ్యగతం, 8200, 8500 ల సరాసరి అగును.
 ∴ మధ్యగతం = \(\frac{8200+8500}{2}\) = \(\frac{16700}{2}\) = ₹18,350
ప్రశ్న 6.
 ఒక దుకాణదారుడు మార్చి నుండి ఆగష్టు వరకు ప్రతీ నెలలో అమ్మిన CFL బల్బులు మరియు LED బల్బుల అమ్మకాల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి అయిన క్రింది దత్తాంశమునకు రెండు వరుసల కమ్మీ చిత్రాన్ని నిర్మించండి.
 
 సాధన.
 రెండు వరుసల కమ్మీ చిత్రం నిర్మాణములో సోపానాలు :
- గ్రాఫు కాగితముపై X – అక్షం (క్షితిజ రేఖ), Y – అక్షం (నిలువు రేఖ) గీయండి. వాటి ఖండన బిందువును ‘O’ గా గుర్తించండి.
- X – అక్షంపై నెలల పేర్లు తీసుకోండి.
- Y – అక్షంపై CFL బల్బుల సంఖ్య, LED బల్బుల సంఖ్యను తీసుకోండి.
- రెండు రకాల బల్బుల సంఖ్య గ్రాఫ్ కాగితముపై గుర్తించుటకు వీలుగా సరైన స్కేలును Y – అక్షంపై తీసుకోండి.
 Y – అక్షంపై గుర్తించవలసిన గరిష్ఠ విలువ 100. కాబట్టి 1 సెం.మీ. = 10 బల్బులుగా తీసుకోవచ్చు.
- ఇచ్చిన విలువలను 10తో భాగించుట ద్వారా కమ్మీ పొడవు నిర్ధారించండి. (సూచిక భిన్నం 1 సెం.మీ. = 10 బల్బులు).
 ఉదా: 70 CFL బల్బులను సూచించు కమ్మీ పొడవు = \(\frac{70}{10}\) = 7 సెం.మీ.
 75 LED బల్బులను సూచించు కమ్మీ పొడవు = \(\frac{70}{10}\) = 7.5 సెం.మీ.
- ప్రతీ నెలలో అమ్మిన CFL బల్బులు మరియు LED బల్బుల సంఖ్యను సమాన వెడల్పు గల కమ్మీల రూపములో ప్రక్క ప్రక్కన గీయండి.


ప్రశ్న 7.
 ఒక పాఠశాలలోని 7వ తరగతిలో 100 మంది విద్యార్థులు కలరు. 7వ తరగతిలోని ప్రతీ విద్యార్థి ఏదో ఒక క్లబ్ లో సభ్యులుగా ఉన్నారు. కింది పట్టిక వివిధ క్లబ్ లోని విద్యార్థుల సంఖ్యను చూపుతుంది. అయిన పట్టికలోని సమాచారానికి పై చిత్రాన్ని గీయండి.
| క్లబ్ | సభ్యుల సంఖ్య | 
| గణితం | 50. | 
| సామాన్య శాస్త్రం | 30 | 
| సాంఘిక శాస్త్రం | 40 | 
| ఇంగ్లీషు | 40 | 
| కళలు | 20 | 
సాధన.
 సెక్టారు యొక్క కోణం క్లబ్ లోని విద్యార్థుల సంఖ్య మరియు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తిపై ఆధారపడును.
 
 
నిర్మాణ సోపానాలు:
- ఏదేని వ్యాసార్థంతో వృత్తాన్ని గీచి, దాని కేంద్రాన్ని ‘O’ గా గుర్తించండి.
- వృత్త పరిధిపై ఏదైనా ఒక బిందువును ‘A’ గా గుర్తించండి. OA ను కలపండి.
- గణిత క్లబ్ ‘సెక్టారును సూచించునట్లు ∠AOB = 100°ని నిర్మించండి.
- సామాన్య శాస్త్రం క్లబ్ సెక్టారును సూచించునట్లు ∠BOC = 60°ని నిర్మించండి.
- సాంఘిక శాస్త్రం క్లబ్ సెక్టారును సూచించునట్లు ∠COD = 80° ని నిర్మించండి.
- ఇంగ్లీషు క్లబ్ సెక్టారును సూచించునట్లు ∠DOE = 80°ని నిర్మించండి.
- ∠EOA = 40° అనే సెక్టారు కోణం కళల క్లబ్ ను సూచిస్తుంది.


సాధనా ప్రశ్నలు [పేజి నెం. 248]
దిగువ అక్షరశ్రేణిలో, ఖాళీలలో ఉండవలసిన పదం (తరువాత పదం) ను ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఎంచుకొని పూరించండి.
ప్రశ్న 1.
 B, F, J, N, R, V, …..
 (a) Z
 (b) W
 (c) X
 (d) Y
 జవాబు
 (a) Z
వివరణ:
 
ప్రశ్న 2.
 A, C, E, G, I, K, ………
 (a) P
 (b) O
 (c) N
 (d) M
 జవాబు
 (d) M
వివరణ:
 
ప్రశ్న 3.
 M, O, R, T, ……..
 (a) W
 (b) U
 (c) V
 (d) Q
 జవాబు
 (a) W
వివరణ:
 

ప్రశ్న 4.
 U, S, P, L, ……….
 (a) F
 (b) G
 (c) H
 (d) I
 జవాబు
 (b) G
వివరణ:
 
ప్రశ్న 5.
 ZA, YB, XC, WD, …..
 (a) UE
 (b) EV
 (c) VE
 (d) SH
 జవాబు
 (c) VE
వివరణ:
 
ప్రశ్న 6.
 AM, BO, CQ, DS, EU, …..
 (a) WF
 (b) FU
 (c) GV
 (d) KJ
 జవాబు
 (d) KJ
వివరణ:
 
ప్రశ్న 7.
 ZY, XV, UR, QM, …….
 (a) LG
 (b) LI
 (c) LH
 (d) KJ
 జవాబు
 (a) LG
వివరణ:
 

ప్రశ్న 8.
 AC, DF, GI, JL, …..
 (a) NO
 (b) MO
 (c) MN
 (d) NP
 జవాబు
 (b) MO
వివరణ:
 
ప్రశ్న 9.
 DN, EM, FL, GK, HJ, …..
 (a) IK
 (b) GI
 (c) IJ
 (d) NP
 జవాబు
 (d) NP
వివరణ:
 
ప్రశ్న 10.
 CBA, STU, FED, VWX, …..
 (a) IHG
 (b) GHI
 (c) IJK
 (d) YZA
 జవాబు
 (a) IHG
వివరణ:
 

ప్రశ్న 11.
 AZC, DYF, GXI, JWL, …..
 (a) OVM
 (b) UNV
 (c) MVO
 (d) MNO
 జవాబు
 (c) MVO
వివరణ:
 
ప్రశ్న 12.
 ABK, CDL, EFM, GHN, …..
 (a) JIO
 (b) IJO
 (c)MNO
 (d) ONM
 జవాబు
 (b) IJO
వివరణ:
 
ప్రశ్న 13.
 A2C, D5F, GRI, J11L, ………
 (a) M140
 (b) M120
 (c) N15P
 (d) N12P
 జవాబు
 (a) M140
వివరణ:
 

ప్రశ్న 14.
 A, CD, HIJ, PORS, …..
 (a) ZABCD
 (b) ZYXW
 (c) ABCDE
 (d) RSTUV
 జవాబు
 (c) ABCDE
వివరణ:
 
 ప్రతి పదానికి ఒక అక్షరం పెరుగుతున్నది. కావున, సమాధానంలో 5 అక్షరాలుండాలి.
ప్రశ్న 15.
 A, BC, DEF, GHIJ, …..
 (a) KLMNP
 (b) LMNOP
 (c) KLMNO
 (d) JKLMN
 జవాబు
 (c) KLMNO
వివరణ:
 
 ప్రతి పదానికి ఒక్కొక్క అక్షరం పెరుగుతున్నది. కావున, సమాధానంలో 5 అక్షరాలుండాలి.
