SCERT AP 8th Class Biology Study Material Pdf 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Biology 8th Lesson Questions and Answers మొక్కల నుండి ఆహారోత్పత్తి
8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం
ప్రశ్న 1.
 గోధుమ పంటను రబీలోనే ఎందుకు పండిస్తారో కారణాలు చెప్పండి.
 జవాబు:
- చాలా మొక్కలు పుష్పించుటకు, రాత్రి సమయానికి దగ్గర సంబంధం ఉంటుంది.
- గోధుమ మొక్కలు పుష్పించుటకు రాత్రి సమయం సుమారుగా 12 గంటలు కావాలి.
- గోధుమపంట సాగు రబీలో అనగా (అక్టోబర్, నవంబర్ మధ్య) మొదలు పెడితే అవి పుష్పించుటకు 8-10 వారాలు పట్టును.
- జనవరి చివరి నుంచి ఫిబ్రవరి వరకు రాత్రి సమయం సుమారుగా 12 – గంటలు ఉంటుంది.
- కాబట్టి గోధుమపంటను రబీలోనే సాగుచేస్తారు.
ప్రశ్న 2.
 రామయ్య తన పొలాన్ని చదునుగా దున్నాడు. సోమయ్య పొలం హెచ్చుతగ్గులు ఉంది. ఎవరు అధిక దిగుబడి సాధిస్తారు? ఎందుకు ?
 జవాబు:
 రామయ్య ఎక్కువ దిగుబడి సాధిస్తాడు. కారణం నేలను చదును చేయడం వలన పొలంలో నీరు అన్నివైపులకు సమానంగా ప్రసరించును. పొలంలో వేసిన పశువుల ఎరువు కూడా సమానంగా నేలలో కలిసి అన్ని మొక్కలకు అందును. విత్తనాలు వేయుటకు లేదా నారు మొక్కలు నాటడానికి వీలుగా ఉండును.

ప్రశ్న 3.
 పొలాన్ని దున్నడం వల్ల ప్రయోజనాలేమిటి ?
 జవాబు:
 పొలాన్ని దున్నడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి :
- మట్టి మృదువుగా మారడం వల్ల నేల లోపల నీరు చాలాకాలం నిల్వ ఉంటుంది.
- వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొని పోవడానికి వీలు అగును.
- వేళ్ళకు శోషించడానికి అవసరమైన గాలి, నీరు నేలలోకి సులభంగా చేరును.
- రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టిలో బాగా పెరుగుతాయి.
- నేలను దున్నడం వల్ల నేల లోపల ఉన్న కొన్ని రకాల అపాయకరమైన సూక్ష్మజీవులు, క్రిమికీటకాల గ్రుడ్లు బయటికి వచ్చి సూర్యుని వేడికి నశించును.
ప్రశ్న 4.
 నేనొక మొక్కను, నేను పంటపొలాల్లో పెరుగుతాను. రైతులు నన్ను చూస్తేనే పీకేస్తారు. కారణం ఎందుకో నాకు తెలియదు. నీవు చెప్పగలవా ? నేనెవరిని ?
 జవాబు:
 నీవు పొలాల్లో సాగు మొక్కలతో బాటు పెరిగే కలుపుమొక్కవి. రైతులు నిన్ను చూస్తేనే పీకేస్తారు. కారణం సాగు మొక్కలతో ఆశ్రయం కోసం, ఆహారం కోసం పోటీపడతావు. వాటికి చేరవలసిన పోషక పదార్థాలు నీవు గ్రహిస్తావు. అంతేకాకుండా వ్యాధుల వ్యాప్తిలో కూడా పాత్ర పోషిస్తావు.
ప్రశ్న 5.
 రైతులు వరిపంటను కోసిన తర్వాత ఎండలో ఎందుకు ఆరబెడతారు. ఎందుకు ?
 జవాబు:
 రైతులు వరిపంటను కోసిన తర్వాత ఎండలో ఎందుకు ఆరబెడతారంటే దాని కాండంలోను, ఆకులలోను, కంకులలోను ఉన్న తేమ పోవటం కోసం. కాండంలోను, ఆకులలోను తేమ పోకపోతే కుప్పగా వేసిన తర్వాత వాటినుండి ఆవిరి వచ్చి కంకులలో ఉండే ధాన్యం రంగు మారుతుంది.
 కంకులలో ఉండే తేమ పోకపోతే కంకులకు బూజు (శిలీంధ్రాలు) పడుతుంది.
ప్రశ్న 6.
 వేసవి దుక్కులు అంటే ఏమిటి ? ఇవి పర్యావరణానికి ఏ విధంగా మేలుచేస్తాయో రాయండి.
 జవాబు:
 రైతులు వేసవికాలంలోనే తమ పొలాలను దున్నుతారు. వీటిని వేసవి దుక్కులు అంటారు. వాటివలన గాలి మట్టి రేణువుల మధ్య చేరును. అందువలన నేల గుల్లబడును. అంతేకాకుండా నేలలో క్రిములు, సూక్ష్మజీవులు కూడా నశించును. కాబట్టి పంటలు వేసినప్పుడు వ్యాధులు తక్కువగా వచ్చును. దీనివలన క్రిమిసంహారక మందులు తక్కువగా వాడుట జరుగును. ఈ విధంగా వేసవి దుక్కులు పర్యావరణానికి మేలు చేస్తున్నాయి.

ప్రశ్న 7.
 గ్రామంలో రైతులందరూ ఒకే రకమైన పంట వేశారు. దీని వలన కలిగిన నష్టాలు ఏమిటో వివరించండి.
 జవాబు:
 గ్రామంలో రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయడం వలన చాలా నష్టాలు కలుగుతాయి. అవి :
- అందరూ ఒకే పంటవేస్తే విత్తన కొరత వచ్చును.
- అందరూ వరి వేస్తే నీటి సమస్య వచ్చి జీవరాసులపై ప్రభావం చూపును.
- అందరికీ ఒకే ఎరువులు కావాలి. కాబట్టి వాటి ధర కూడా పెరుగును.
- ఒక పొలంలో వ్యాధులు సోకితే మిగతా పొలాలకు కూడా చాలా తొందరగా వ్యాధులు వ్యాపించును. దీనివలన జీవవైవిధ్యానికి ఆటంకం వచ్చును.
- ఒకవేళ, అందరికీ పొలాలు బాగా పండి పంట దిగుబడి ఎక్కువ వస్తే అమ్మకపు ధర పడిపోవును.
- అమ్మకపు ధర తగ్గితే రైతు నష్టపోవును.
ప్రశ్న 8.
 రాత్రి కాలానికి, పంట దిగుబడికి సంబంధం ఏమిటి ?
 జవాబు:
 రాత్రి కాలానికి, పంట దిగుబడికి చాలా దగ్గర సంబంధం గలదు. మొక్క పుష్పించడం రాత్రికాల సమయం పై ఆధారపడి ఉంది. ఉదా : కొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12 1/2 గంటలు ఉన్నప్పుడు మాత్రమే అధికంగా పుష్పించును. ఉదా: గోధుమ.
 మరికొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12 1/2 గంటలు కన్నా ఎక్కువ ఉన్నప్పుడే బాగా పుష్పిస్తాయి. ఉదా : జొన్న, ప్రత్తి.
 పుష్పించిన తర్వాత పరాగ సంపర్కం జరుగును. పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఫలదీకరణ జరుగును. ఫలదీకరణ తర్వాత పుష్పాలు కాయలుగా మారును. కాసిన దానిని బట్టే పంట దిగుబడి ఉండును.
ప్రశ్న 9.
 విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకు ?
 జవాబు:
 విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకంటే నేలలో ఉన్న ఏవైనా శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవుల నుండి విత్తనాలను రక్షించుకొనుటకు రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు.
ప్రశ్న 10.
 నారు పోసి పెంచి వాటిని తిరిగి పొలాల్లో నాటే పద్ధతిలో పెంచే పంటలకు ఉదాహరణ ఇవ్వండి.
 జవాబు:
 1. వ్యవసాయంలో కొన్ని పంటలను నారు పోసి పెంచి తిరిగి పంట పొలాల్లో నాట్లు వేస్తారు.
 2. ఈ పద్ధతిని ప్రధానంగా వరి పంటలో పాటిస్తారు.
 3. వరితో పాటుగా, మిరప, వంగ, టమోటా, పొగాకు వంటి పంటలలోనూ నాట్లు వేస్తారు.

ప్రశ్న 11.
 సత్యనారాయణ తన పొలంలో ప్రత్తి పంట పండించాడు. అతనికి సరైన దిగుబడి రాలేదు. పంట దిగుబడి సరిగా రాకపోవడానికి గల కారణాలు ఊహించి చెప్పగలరా ? (లేదా) ఒక రైతు తన పొలంలో పత్తి పంట పండించాడు. పత్తి దిగుబడి సరిగా రాలేదు. దీనికి ఏవైనా నాలుగు కారణాలు ఊహించి రాయండి.
 జవాబు:
- అతను వేసిన నేల ప్రత్తి పంటకు అంత అనుకూలంగా లేకపోవచ్చు.
- అతను పంటను రబీ సీజన్లో వేసి ఉండవచ్చు. దీనివలన అది పుష్పించుటకు కావలసిన రాత్రి సమయం (12 1/2 గంటల కంటే ఎక్కువ) ఉండదు.
- పొలాన్ని సరిగా దున్ని, చదును చేయకపోవచ్చు.
- ప్రత్తి పంటకు సరైన నీటి పారుదల వసతి కల్పించకపోవచ్చు.
- ప్రత్తి విత్తనాల ఎంపిక సరిగా చేయకపోవచ్చు.
- కలుపు మొక్కలను పత్తి పంట నుంచి తొలగించకపోవచ్చు.
- ప్రత్తి పంటకు. వ్యాధులు సోకిన గమనించక పోవచ్చు.
- ప్రత్తి పంటకు సరైన కాలంలో శిలీంధ్ర నాశకాలు ఉపయోగించటం జరగకపోవచ్చు.
ప్రశ్న 12.
 రహీం తన పంట పొలంలో కలుపు మొక్కలను తొలగించాడు. కాని డేవిడ్ కలుపు తీయలేదు. ఎవరు అధిక దిగుబడి సాధిస్తారో ఊహించండి ? ఎందుకు ?
 జవాబు:
 డేవిడ్ ఎక్కువ దిగుబడి సాధిస్తాడు. కారణం కలుపు మొక్కలను పొలంలో కలియదున్నాడు. అవి మడి ఉన్న నీటిలో కుళ్లి పోతాయి. అప్పుడు వాటిలోని పోషక పదార్థాలు నేలలోకి చేరతాయి. అది జీవ ఎరువు వలె పని చేయును.
ప్రశ్న 13.
 పిడికెడు శెనగలను నీళ్ళలో వేయండి. మీరేమి పరిశీలించారో కింది ప్రశ్నల ఆధారంగా విశ్లేషించండి.
 ఎ) రెండు రకాల విత్తనాల్లో మీరేమి తేడాను గమనించారు ?
 బి) ఏ విత్తనాలు తక్కువ బరువు కలిగి ఉన్నాయి ? ఎందుకు ?
 సి) ఏ విత్తనాలు బాగా మొలకెత్తాయి? ఎందుకు ?
 డి) ఏ విత్తనాలు సరిగా మొలకెత్తవు ? ఎందుకు ?
 జవాబు:
 ఎ) కొన్ని విత్తనాలు నీటిపై తేలుతున్నాయి. కొన్ని విత్తనాలు నీటిలో మునిగిపోయాయి.
 బి) కీటకాలు విత్తనం లోపల గల ఆహార పదార్థాలు తినుట వలన పుచ్చులు ఏర్పడి తక్కువ బరువు కలిగి ఉన్నాయి.
 సి) నీటిలో మునిగి నీటిని బాగా పీల్చుకున్న విత్తనాలు బాగా మొలకెత్తాయి. కారణం పోషక పదార్థాలలో ఉన్న షుప్తావస్థ మేలుకోవడం వలన.
 డి) నీటిపై తేలిన విత్తనాల లోపల పోషక పదార్థాలు తక్కువగా ఉండబట్టి సరిగా మొలకెత్తవు.

ప్రశ్న 14.
 వరి (వడ్ల గింజలు) విత్తనాలు తీసుకొని ఒక రోజంతా నానబెట్టండి. వాటిని వాచ్ గ్లాస్ లో తీసుకొన్న మట్టిలో నాటండి. మొలకెత్తిన తర్వాత భూతద్దంలో పరిశీలించి ప్రథమమూలం, ప్రథమ కొండం మొదలైన భాగాలు గుర్తించి, పటం గీయండి.
 జవాబు:
 
ప్రశ్న 15.
 మీ దగ్గరలోని ఎరువుల దుకాణానికి వెళ్ళి రసాయనిక ఎరువుల వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి.
 
 జవాబు:
 
ప్రశ్న 16.
 వరి పంటలో నాటడం నుండి దాచడం వరకు ఉన్న వివిధ దశలను వివరించే ఫ్లోచార్టును తయారు చేయండి.
 జవాబు:
 
 
ప్రశ్న 17.
 తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాలలో అనుసరించే నీటిపారుదల పద్ధతులను నీవెలా ప్రశంసిస్తావు?
 జవాబు:
- తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాలలో నీటిని పొదుపుగా వాడుకోవటానికి బిందు సేద్యం, స్ప్రింక్లర్స్ వంటి పరికరాలు ఉపయోగిస్తారు.
- వీటి వలన చాలా తక్కువ నీటితో వ్యవసాయం చేయవచ్చును.
- శాస్త్ర విజ్ఞానం అందించిన ఈ పద్దతులు నాకు బాగా నచ్చాయి.
- ఈ పద్దతుల వినియోగం వలన నీటికొరత ప్రాంతాలు ఆర్థికంగా బలపడ్డాయి.
- వీటి వినియోగం వలన సహజవనరు అయిన నీరు ఆదా చేయబడుతుంది.
- ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చే ఇటువంటి పద్ధతులు అభినందనీయమైనవి.

ప్రశ్న 18.
 నరేంద్ర ప్రత్తిపంటపై అధిక మోతాదులో క్రిమిసంహారక మందులు చల్లాడు. ఇది జీవవైవిధ్యానికి, పంట దిగుబడికి ఎంతో హానికరం అని రమేష్ అన్నాడు. నీవు రమేష్ చెప్పిన దానితో ఏకీభవిస్తున్నావా ? ఎందుకు ?
 జవాబు:
 నేను రమేష్ చెప్పిన దానితో ఏకీభవిస్తాను. ఇది జీవవైవిధ్యానికి, పంట దిగుబడికి ఎంతో హానికరం. అధిక మొత్తంలో క్రిమిసంహారక మందుల వలన హానికరమైన కీటకాలతో బాటు పరాగ సంపర్కానికి సహాయపడు కీటకాలు మరణించును. పరాగ సంపర్కం జరగకపోతే ఫలదీకరణం జరగదు.
అప్పుడు పంట దిగుబడి తగ్గును. క్రిమిసంహారక మందుల వలన కొన్ని కీటక జాతులు అంతరించిపోవును. అప్పుడు ఆ కీటకాలను తిని బ్రతికే జీవులు అంతరించిపోవును. ఆ విధంగా జరిగితే ఆహారపు గొలుసు అస్తవ్యస్తం అగును. ఇది జీవవైవిధ్యంపై ప్రభావం చూపును.
ప్రశ్న 19.
 వెంకటేష్ వరిపంటకు నీళ్లను పెట్టే పద్ధతిని చూశాడు. తాను కూడా మొక్కజొన్న పంటకు ఇలాగే నీళ్లను పెట్టాలనుకున్నాడు. నీవు అతనికి ఏ సూచనలు, సలహాలు ఇస్తావు ?
 జవాబు:
 వెంకటేష్ కు మొక్కజొన్న పంటకు, వరిపంటకు నీళ్ళు పెట్టే విధంగా పెట్టవద్దు అని నేను సూచన చేస్తాను. ఇంకా అతనికి మొక్కజొన్న అనేది. మెట్ట పంట మరియు వర్షాధారపు పంట అని, వరిపంటకు అవసరమైనంత నీళ్ళు మొక్కజొన్నకు అవసరం లేదు అని సలహా ఇస్తాను.
8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers
కృత్యములు
ప్రశ్న 1.
 భారతదేశ పటం చూడండి. మన దేశంలో ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ పండిస్తున్నారో పరిశీలించి రాయండి. (అవసరమైతే అట్లాసును కూడా ఉపయోగించుకోండి.)
 
 జవాబు:
 వరి : అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, హర్యానా, కాశ్మీర్
 గోధుమ : ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర
 మొక్కజొన్న : రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, గుజరాత్
 జొన్న : రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్
 పప్పుధాన్యాలు: మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్
 చెరకు : ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్
 జనపనార : పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశా, అసోం
 కొబ్బరి : కేరళ
 ప్రత్తి : కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్
 టీ : కర్ణాటక, అసోం, మణిపూర్
1. మన దేశంలోని అన్ని ప్రాంతాలలో పండే పంటలు ఏవి ?
 జవాబు:
 వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ప్రత్తి.

2. కొన్ని పంటలను అన్ని ప్రాంతాలలోనూ ఎందుకని పండించగలుగుతున్నారు ?
 జవాబు:
 సారవంతమైన భూమి, నీరు లభ్యత వలన.
3. పై పట్టికలో మీ ఊళ్ళో పండే పంటలు ఏవో గుర్తించి రాయండి.
 జవాబు:
 వరి, చెరకు, మొక్కజొన్న, పెసలు.
4. మీ సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాన్ని గాని, గ్రంథాలయంలోని పుస్తకాలను గాని చూసి వివిధ ప్రదేశాలలో ప్రధానంగా పండే పంటలు జాబితా తయారుచేయండి.
 జవాబు:
 దేశం : వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న.
 రాష్ట్రం : వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ప్రత్తి, చెరకు, జనపనార జిల్లా : వరి, చెరకు, మామిడి, అరటిపండు
 మీ గ్రామం : వరి, చెరకు (గమనిక : ఏ గ్రామ విద్యార్థులు అక్కడ పండే పంటలు సేకరించి రాసుకోవాలి.)
ప్రశ్న 2.
 మీ గ్రామంలోని రైతులను అడిగి ఏ పంటలు పండడానికి ఎంతకాలం పడుతుందో వివరాలు సేకరించండి. కింది పట్టికలో రాయండి.
 
1. పంటలు పండుటకు ఎంత కాలం పడుతుంది ?
 జవాబు:
 సుమారుగా 100 రోజుల లోపు నుంచి దాదాపుగా 365 రోజులు పడుతుంది.
2. అన్ని పంటలు పండడానికి పట్టేకాలం ఒక్కటేనా ?
 జవాబు:
 కాదు.
3. మీకు తెలిసిన పంటలలో ఏ పంట పండడానికి ఎక్కువ సమయం పడుతుంది ?
 జవాబు:
 చెరకు

3. పంటలను ఎప్పుడు పండిస్తారు ?
ప్రశ్న 1.
 మనం రకరకాల పండ్లు, కూరగాయలు తింటుంటాం. సంవత్సరం పొడవునా అన్ని రకాల పండ్లు, కూరగాయలు మనకు లభిస్తాయా ? కొన్ని కాలాల్లో అధికంగాను, కొన్ని కాలాల్లో తక్కువగాను లభిస్తాయి. కొన్ని ఒక ప్రత్యేక రుతువులో తప్ప మిగిలిన సమయాల్లో అసలు లభించవు. జట్టులో చర్చించి ఏ కాలంలో ఏవి లభిస్తాయో కింది పట్టికలో రాయండి.
 
1. ఏ కాలంలో ఎక్కువ రకాల కూరగాయలు మనకు మార్కెట్లలో లభిస్తాయి ? ఎందుకు ?
 జవాబు:
 వర్షాకాలంలో వర్షపు నీరు వలన.
సాధారణంగా రైతులు వర్షాకాలంలోనే వివిధ రకాల కూరగాయలు పండిస్తారు. కారణమేమిటో ఊహించి చెప్పగలరా ?
 జవాబు:
 కావలసినంత నీరు లభిస్తుంది. కాబట్టి.
ప్రశ్న 4.
 కింది ఫోను చూడండి. ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
 
1. రబీ సీజన్లోనే గోధుమ పంటను ఎందుకు సాగుచేస్తారు ?
 జవాబు:
 ఫిబ్రవరి నెలలో వాతావరణం వేడిగా ఉంటుంది. గింజ అభివృద్ధి చెందడానికి ఇది సరైన సమయం. గోధుమ పుష్పించడానికి రాత్రి కాల సమయం తక్కువగా ఉండటంతో పాటు విత్తనాలు ఏర్పడటానికి తగినంత వేడి కూడా వాతావరణంలో ఉండటం అవసరము. అందుకే గోధుమపంటను రబీ సీజన్ లోనే సాగుచేస్తారు.
2. సెప్టెంబరు నెలలో సాగుచేస్తే ఏం జరుగుతుంది ?
 జవాబు:
 సెప్టెంబరులో సాగుచేస్తే అవి పుష్పించుటకు 8 నుండి 10 వారాలు పట్టును. అనగా జనవరిలో పుష్పించుట జరుగును. రాత్రి సమయం ఎక్కువగా అనగా 12 1/2 గంటలు ఉంటుంది. కాబట్టి పుష్పాలు సరిగా రావు. పంట దిగుబడి తగ్గుతుంది.

3. ఎందుకు ఖరీఫ్ సీజన్లో గోధుమపంట సాగు చేయరు ?
 జవాబు:
 అవి పుష్పించుటకు కావల్సినంత రాత్రి సమయం ఉండదు కాబట్టి.
4. గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే ఏమవుతుంది ?
 జవాబు:
 గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. కారణం ఫిబ్రవరిలో రాత్రి కాల సమయం తక్కువగా ఉండి, విత్తనాలు ఏర్పడటానికి తగినంత వేడి కూడ వాతావరణంలో ఉండును.
5. గింజలు బలంగా పెరగడానికి తగినంత ఉష్ణోగ్రత అవసరం. మరి మనకు ఎప్పుడు వేడి అధికంగా ఉంటుంది ?
 జవాబు:
 రబీ సీజన్లో వేడిమి ఎక్కువగా ఉంటుంది.
5. వరిసాగు
ప్రశ్న 5.
 మీ దగ్గరలోని రైతులను అడిగి వివరాలు సేకరించి కింది పట్టిక నింపండి.
 
1. ఏ కాలంలో రైతులు అధిక ఫలసాయం, ఆదాయం పొందుతున్నారు ?
 జవాబు:
 ఖరీఫ్ కాలంలో.
2. మంచి పరిమాణంలో ఉండే గింజలు ఏ కాలంలో వస్తాయి ? రబీలోనా ? ఖరీఫ్ లోనా ?
 జవాబు:
 ఖరీఫ్ లో.
3. మూడవ పంట గురించి తెలుసా ? మన రాష్ట్రంలో మూడవ పంటగా వేటిని పండిస్తారు ?
 జవాబు:
 తెలుసు. అపరాలను మన రా” లో 3వ పంటగా పండిస్తారు.
4. ఖరీఫ్, రబీ రెండు కాలాలలోనూ పండే పంటలు ఏమిటి ?
 జవాబు:
 వరి.

5. రబీ సీజన్ కంటే ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీరు అంగీకరిస్తారా ? అయితే కారణాలు చెప్పండి.
 జవాబు:
 అంగీకరిస్తాను. కారణాలు ఖరీఫ్ సీజన్ లో వరి మొక్కల పెరుగుదలకు అవసరమైనంత నీరు లభించును. వేడిమి తక్కువగా ఉండును
6. మంచి విత్తనాలను వేరు చేయడం, ఎంపిక చేయడం ఎలాగో మీకు తెలుసా ?
ప్రశ్న 6.
 గుప్పెడు శనగ విత్తనాలను తీసుకొని బక్కెట్లోని నీళ్లలో వేయండి. కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. నీళ్ళపై తేలిన విత్తనాలన్నింటిని తీసివేయండి. నీళ్ళలో మునిగిన వాటిని అలాగే ఒక రోజంతా ఉంచండి. మరుసటి రోజు వీటిని ఆరబెట్టి గిన్నెలోగాని, పాత్రలోగాని వేసి మూత పెట్టి తగినంత వేడిగా ఉండే చీకటి గదిలో ఉంచండి. 2 లేక 3 రోజుల తర్వాత విత్తనాలను పరిశీలించండి. ఏం జరిగినది ? నీవెప్పుడైనా మొలకెత్తిన గింజల్ని తిన్నావా ?
 జవాబు:
 శనగ విత్తనాల నుంచి మొలకలు రావడం జరిగినది. నేను చాలాసార్లు మొలకెత్తిన గింజలు తిన్నాను.
1. ఎందుకు కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలాయి ?
 జవాబు:
 కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. కారణం అవి పుచ్చు విత్తనాలు అయి ఉండటం వలన విత్తనం లోపల ఖాళీగా ఉండి నీటికన్న తక్కువ సాంద్రత ఉంటాయి. అందుకని నీటిపై తేలుతాయి.
2. తేలిన విత్తనాలను ఎందుకు తీసి వేయాలి ?
 జవాబు:
 తేలిన విత్తనాలకు మొలకెత్తే సామర్థ్యం ఉండదు కాబట్టి వాటిని తీసివేయాలి.
3. విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి ?
 జవాబు:
 విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టడం వలన విత్తనం తేమగా అయ్యి విత్తనాలకు అంకురించే శక్తి వస్తుంది.
7. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి. ఒక పిడికెడు గింజల్ని నీళ్ళలో వేయండి. కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. వాటిని వేరుచేసి భూతద్దంలో పరిశీలించండి. నీటమునిగిన గింజలకు, తేలిన గింజలకు గల పోలికలు, భేదాలను గుర్తించి మీ పరిశీలనలను కింది పట్టికలో ‘✓’ గుర్తు పెట్టండి.
 
1. పై రెండు రకాల గింజల్లో ఏవైనా తేడాలను మీరు గుర్తించారా ?
 జవాబు:
 పై రెండు రకాల గింజల్లో తేడాలను మేము గమనించాము.

2. నీళ్ళపై తేలిన విత్తనాలు తక్కువ బరువు ఎందుకున్నాయో చెప్పగలరా ?
 జవాబు:
 లోపల పోషక పదార్థాలు లేక ఖాళీగా ఉండడం వలన.
8. ఎంపిక మరియు మొలకెత్తుట
నీళ్ళలో తేలిన విత్తనాలను, మునిగిన విత్తనాలను వేరువేరుగా కుండీల్లో నాటండి. రెండు కుండీల్లోనూ సమానంగా నీరు పోయండి. రెండు కుండీల్లోని మొక్కల పెరుగుదలను పరిశీలించండి. నివేదిక తయారుచేయండి.
 తేలిన విత్తనాలు : ఇవి వేసిన కుండీలో మొక్కలు సరిగా రాలేదు. పెరుగుదల తక్కువగా ఉంది.
 మునిగిన విత్తనాలు : ఇవి వేసిన కుండీలో మొక్కలు బాగా వచ్చాయి. పెరుగుదల కూడా చాలా బాగుంది.
1. ఏ గింజలు బాగా మొలకెత్తినాయి ? ఎందుకు ?
 జవాబు:
 నీటిలో మునిగిన విత్తనాలు. కారణం లోపల ఉన్న పోషక పదార్థాలు ఉత్తేజితం అయి విత్తనాలు మొలకెత్తుటకు కావలసిన
 శక్తిని ఇస్తుంది.
2. ఏ గింజలు సరిగా మొలకెత్తలేదు ? ఎందుకు ?
 జవాబు:
 నీటిపై తేలిన గింజలు. కారణం పోషక పదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి విత్తనాలు మొలకెత్తుటకు కావలసిన శక్తి సరిగా రాదు.
3. అన్ని రకాల పంట గింజలను ఇలాగే పరీక్ష చేస్తారా ?
 జవాబు:
 అవును, ఇలాగే పరీక్ష చేస్తారు.

9. ఏ విత్తనాలను ఏ ఏ పద్ధతుల్లో నాటుతారో రైతుల నుండి వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి.
 జవాబు:
 
1. ఒక ఎకరా వరి పంట పండించడానికి ఎన్ని కిలోల వరి గింజలు అవసరమో నీకు తెలుసా ?
 జవాబు:
 సుమారు 25 కేజీలు.
2. అన్ని రకాల వరి పంటలకు ఇదే పరిమాణంలో అవసరమవుతాయా ?
 
 జవాబు:
 అన్ని రకాల వరి పంటలకు ఇదే పరిమాణంలో అవసరమవ్వవు.
 ఉదా : నాటే పద్ధతి – 20 – 25 కేజీలు,
 వెదజల్లటానికి – 24 – 30 కేజీలు
 శ్రీ పద్ధతి – 2 కేజీలు
3. తక్కువ వితనాలు ఉపయోగించి వరిసాగు చేసే పదతులు ఏమైనా ఉన్నాయా ? విత్తనాలు చెత చల్లటం
 జవాబు:
 ఉన్నది. ఆ పద్ధతి శ్రీ పద్ధతి.
4. విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో ఎందుకు కప్పుతారు ?
 జవాబు:
 విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో కప్పుటకు కారణాలు మట్టి నుండి వాటికి కావలసిన తేమను, వేడిమిని పొందుటకు మరియు గుల్లగా ఉన్న నేల నుండి గాలిని తీసుకొనుటకు. మట్టిలో విత్తిన తర్వాత కప్పకపోతే పక్షులు, ఇతర జంతువులు ఆ విత్తనాలను తినేస్తాయి.

10. నలుగురైదుగురు విద్యార్థులతో జట్లుగా ఏర్పడండి. మీ దగ్గరలోని పొలంలో మందులు ‘చల్లుతున్న రైతులను అడిగి ఏ ఏ పంటలకు ఏ ఏ వ్యాధులు ఎలా వస్తాయి ? వాటిని ఎలా అదుపు చేస్తారు ? ఏ మందులు చల్లుతారు ? వంటి వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి. వ్యాధి పేరు తెలియకపోతే దానిని స్థానికంగా ఏమంటారో రాయండి.
 పంటలకు (వరి, వేరుశనగ, చెరకు, మినుము) ముఖ్యంగా అగ్గితెగులు, టిక్కా, ఆకుపచ్చ తెగులు, తుప్పు తెగులు బూడిద తెగులు.
 ముఖ్యంగా వ్యాధులు బాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు కొన్ని రకాల కీటకాల వలన వచ్చును.
 పంట పేరు, పరిశీలించిన వ్యాధులు, ఉపయోగించిన క్రిమిసంహారక మందులు, ఫలితాలు క్రింది పట్టికలో ఉన్నాయి.
 
1. అందరు రైతులు ఒకే రకమైన పంటపైన ఒకే రకమైన మందులే చల్లుతున్నారా ?
 జవాబు:
 చల్లరు. అది వాళ్ళ ఇష్టం. ఉదాహరణకు వరి అగ్గి తెగులుకు ట్రైసైక్లోజన్ 75% లేదా ఎడిఫెన్ పాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తారు.
2. అన్ని రకాల పంటల్లో సాధారణంగా కనిపించే వ్యాధి ఏదో గుర్తించావా ?
 జవాబు:
 రసంపీల్చే పురుగు వ్యాధి.
3. రైతులు క్రిమి సంహారక మందులను ఎక్కడ కొనుక్కుంటారు ?
 జవాబు:
 ఎరువులు మరియు క్రిమి సంహారక మందులు అమ్మే కొట్టులో కొనుక్కుంటారు.
4. మందులు చల్లడానికి వారు ఎలాంటి పనిముట్లను వాడుతున్నారు ?
 జవాబు:
 నాక సాక్ స్ప్లేయర్, గటార్ ప్రేయర్, తైవాన్ ప్రేయర్, పవర్ స్ప్లేయర్, రోటరీ డస్టర్.
5. క్రిమి సంహారక మందులు చల్లినప్పుడు క్రిమికీటకాలతో పాటు ఇంకా ఏవైనా చనిపోయినట్లు నీవు గుర్తించావా ? అయితే అవి ఏమిటి ?
 జవాబు:
 క్రిమిసంహారక మందులు చల్లినప్పుడు క్రిమికీటకాలతో పాటు పరాగ సంపర్కంకు సహాయపడు జీవులు చనిపోయినట్లు నేను గుర్తించితిని. అవి తూనీగలు, సీతాకోక చిలుకలు.

11. మీ పాఠశాల తోటలోని మొక్కలను పరిశీలించండి. మొక్కల ఆకులు, కాండాలను జాగ్రత్తగా పరిశీలించి కింది వివరాలు సేకరించండి. లక్షణం ఉంటే “✓” లేకపోతే “×” పెట్టండి. లక్షణం
 
 పంటపేరు /మొక్క పేరు : వేరుశనగ స్థలం : మొక్కలలోని ఆకులపైన
1. మొక్కలోని అన్ని ఆకులపైనా మచ్చలున్నాయా ?
 జవాబు:
 ఉన్నాయి.
2. మచ్చలతో ఉన్న ఆకు బొమ్మను మీ నోటు పుస్తకంలో గీయండి.
 జవాబు:
 
3. ఆకుల అంచులు కత్తిరించబడినట్లుగా ఉండడానికి కారణమేమి ?
 జవాబు:
 చీడల వలన ఆకులు అంచులు కత్తిరించబడినట్లు ఉండును.
4. కాండంపై ఉండే చారలు, ఆకులపై ఉండే మచ్చలు ఒకేలా ఉన్నాయా ?
 జవాబు:
 ఒకేలా ఉన్నాయి.
5. ముడుచుకొనిపోయిన ఆకుల్లో ఏవైనా కీటకాలను గుర్తించావా ? అయితే అవి ఏమిటి ?
 జవాబు:
 కీటకాలు ఉన్నాయి అవి రసం పీల్చే పురుగులు, రెక్కల పురుగులు.

6. ఆకుల మచ్చలపై ఉన్న పొడిలాంటి పదార్థాన్ని సేకరించండి. దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. మీరేం గమనించారో మీ నోటుపుస్తకంలో రాయండి.
 జవాబు:
 ఆకుల మచ్చలపై ఉన్న పొడిలాంటి పదార్థాన్ని సేకరించితిని. దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించితిని. అప్పుడు ఆ పొడిలో శిలీంధ్రం యొక్క తంతువులు, స్పోర్సు కనిపించాయి.
12. చీడ పీడల్ని నియంత్రించే పద్ధతులు
ప్రశ్న 1.
 మీ గ్రామంలోని రైతులు వివిధ పంటల్లో వచ్చే క్రిమి కీటకాలను అదుపు చేయడానికి వివిధ రకాల కీటక నాశనులు ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. మీ పెద్దలను కాని), రైతులను కాని అడిగి ఏ ఏ పురుగు మందులను కింది పద్ధతుల్లో ఉపయోగిస్తారో తెలుసుకొని రాయండి.
 జవాబు:
 1. స్పేయర్ తో చల్లడం : మోనోక్రోటోపాస్, ప్రొఫేనోపాస్, నూవాన్, స్పైనోఫాడ్
 2. పొడి మందులు చల్లడం : మిథైల్ థెరాఫియాన్, ఫాలిడాల్
 3. నేలలోపల ఉంచడం : కార్బొప్యూరాన్, కార్టాక్ హైడ్రోక్లోరైడ్
 4. కాల్చడం, పీకివేయడం : వైరల్ కి సంబంధించిన వ్యాధులలో పొలాల నుంచి ,రోగకారక మొక్కలను కాల్చడం, పీకివేయడం చేస్తారు.
 
13. రైతులు పంటలకు నీళ్ళెప్పుడు పెడతారు ?
ప్రశ్న 1.
 మీ దగ్గరలోని రైతులను అడిగి ఏ ఏ పంటలకు నీళ్ళను ఎప్పుడెప్పుడు పెడతారో తెలుసుకొని కింది పట్టిక నింపండి.
 జవాబు:
 
ప్రశ్న 2.
 అన్ని పంటలకు నీళ్ళు ఒకేసారి అందిస్తారా ?
 జవాబు:
 లేదు.

14. మీ దగ్గరలోని తోటకు వెళ్ళి స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను పరిశీలించండి. ఈ పద్ధతిలో ఉపయోగించే పరికరాలు పనిముట్లు వాటిని అమర్చిన విధానం, నీటిని పంపిణీ చేసే విధానం, ఈ పద్ధతి వల్ల కలిగే లాభాలు, నష్టాలు మొదలగు వివరాలతో నివేదిక తయారుచేయండి. ఇందుకోసం అక్కడి రైతులను కలిసి మాట్లాడండి. వివరాలు సేకరించండి.
 జవాబు:
 స్ప్రింక్లర్ పద్ధతి :
 ఎ) పరికరాలు & పనిముట్లు : మోటారు, గొట్టాలు, గుండ్రంగా తిరిగే స్ప్రింక్లర్స్, కవాటాలు, నాజిల్స్.
 బి) వాటిని అమర్చిన విధానం మరియు నీటిని పంపిణీ చేయు విధానం : నీరు ఉన్న ప్రాంతాలలో గొట్టాలు అమర్చి ఒక మోటారు సహాయంతో నీరు బయటకు తెచ్చి పొలంలో లంబంగా అమర్చబడిన గొట్టాలకు గుండ్రంగా తిరిగే స్ప్రింక్లిల్స్ ద్వారా నీటిని పొలంలో వెదజల్లుతారు.
 డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) : నీరు ఉన్న ప్రాంతాలలో గొట్టాలు అమర్చి ఒక మోటారు సహాయంతో నీరు బయటకు తెచ్చి పొలంలో సమాంతరంగా నిర్ణీత ప్రదేశాలలో రంధ్రాలు (మొక్క వేరుకు దగ్గరగా) చేయబడిన గొట్టాలు అమర్చి నీటి బిందువుల రూపంలో మొక్క వేరుకు సరఫరా చేస్తారు.
 లాభాలు :
 1. నీరు ఎక్కువగా అందుబాటులేని చోట
 2. ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిలో
 3. ఇసుక నేలలకు ఈ పద్దతి బాగా ఉపయోగపడును.
నష్టాలు :
 1. ఖర్చుతో కూడి ఉన్నది.
 2. అన్ని రకాల పంటలకు అనుకూలం కాదు.
15. కలుపు మొక్కల సమాచారం :
ప్రశ్న 1.
 మీ దగ్గరలోని రైతులను అడిగి ఏ ఏ పంటలలో ఏ ఏ కలుపు మొక్కలు పెరుగుతాయో తెలుసుకుని ఒక నివేదిక తయారు చేయండి.
 జవాబు:
 
16. మీ గ్రామంలోని చుట్టుప్రక్కల గాని, వివిధ పంటలకు పంట నూర్పిడి చేసే పద్ధతుల వివరాలు సేకరించి పట్టిక నింపండి.
 జవాబు:
 
ఆలోచించండి – చర్చించండి
ప్రశ్న 1.
 జపాన్లో అధిక దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ? (పేజీ.నెం.118)
 జవాబు:
 జపాన్ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ఉపయోగించటం. జపాన్ అత్యధిక దిగుబడి వచ్చే వరి విత్తనాలు ఉపయోగించటం.

ప్రశ్న 2.
 భారతదేశంలో తక్కువ దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ? (పేజీ.నెం. 118)
 జవాబు:
 భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రాచీన పద్ధతులు ఉపయోగించుట. వ్యవసాయంలోనికి చదువుకున్న వాళ్ళు రాకపోవటం.
ప్రశ్న 3.
 నాగలి కర్రు పొడవుకి, విత్తటానికి ఏమైనా సంబంధం ఉందా ? (పేజీ.నెం. 119)
 జవాబు:
 లేదు.
ప్రశ్న 4.
 మెట్ట పొలాల్లో కూడా నేలను ఇలాగే తయారు చేస్తారా ? (పేజీ.నెం. 119)
 జవాబు:
 మెట్ట పొలాల్లో కూడా నేలను ఇలాగే తయారు చేస్తారు.
ప్రశ్న 5.
 నేలను దున్నడం వల్ల కలిగే ప్రయోజనాలేవి ? (పేజీ.నెం. 119)
 జవాబు:
 నేలను దున్నడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి :
 1) మట్టి మృదువుగా మారడం వల్ల నేల లోపల నీరు చాలా కాలం నిల్వ ఉంటుంది.
 2) వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొనిపోవడానికి వీలు అగును.
 3) వేళ్ళకు శోషించడానికి అవసరమైన గాలి, నీరు నేలలోకి సులభంగా చేరును.
 4) రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టిలో బాగా పెరుగుతాయి.
 5) నేలను దున్నడం వల్ల నేల లోపల ఉన్న కొన్ని రకాల అపాయకరమైన సూక్ష్మజీవులు, క్రిమికీటకాల గుడ్లు బయటికి వచ్చి సూర్యుని వేడికి నశించును.

ప్రశ్న 6.
 ఎందుకు ఈ చాళ్లు “v” ఆకారంలో ఏర్పడతాయి? నేలలో “V” ఆకారంలో చాళ్లు ఏర్పడటం వల్ల చాళ్ల వెంట నీళ్ళను పాగించడమే కాక ఇంకా ఏ ఏ రకాలుగా ఉపయోగపడుతుందో చెప్పండి. (పేజీ.నెం. 120)
 జవాబు:
 నాగలి చివర పదునైన ఇనుపబద్ధ (కర్ర) ఉంటుంది. నాగలితో చాళ్ళను చేయునపుడు ఈ కర్ర నేలలోనికి చొచ్చుకొని పోతుంది. అందువలన ఆ ప్రదేశంలో ఉన్న మట్టి కర్రుకు ఇరువైపులా గట్టురూపంలో ఏర్పడుతుంది. కనుక వాళ్ళు v ఆకారంలో ఏర్పడతాయి.
v ఆకారం చాళ్ళు వల్ల ఉపయోగములు :
1) ఈ చాళ్ళ వలన గాలి నీరు లోపలి మట్టి కణాల మధ్యకు సులభంగా చేరతాయి.
 2) విత్తనాలను ఒక వరుస తరువాత ఒక వరుస విత్తుతుంటారు. ఆ సమయంలో మొదటి వరుస మట్టితో రెండవ వరుస మూసుకొనుటకు ఈ v ఆకారపు చాళ్ళు ఉపయోగపడును.
ప్రశ్న 7.
 ఎరువుల కోసం రైతులు పోట్లాడుకోవడం, ఉద్యమాలు చేయడం మీరెప్పుడైనా చూశారా లేదా పత్రికల్లో చదివారా ? ఎందుకు ఇలా జరుగుతోంది ? ఎందుకు రైతులు ఎక్కువ ఎరువుల బస్తాలు కావాలని కోరుకుంటారు ? దీనికి సంబంధించిన మీ ఆలోచనలు చార్టు మీద రాసి గోడ పత్రికలో ప్రదర్శించండి. (పేజీ.నెం. 130)
 జవాబు:
 చూశాను మరియు పత్రికల్లో చదివాను. ఇలా జరుగుటకు కారణం ఎరువుల కొరత. రైతులు ఎక్కువ ఎరువుల బస్తాలు కావాలని ఎందుకు కోరుకుంటారు అంటే పంట దిగుబడి పెంచుటకు. దానికి సంబంధించిన నా ఆలోచనలు
 1. రసాయనిక (కృత్రిమ) ఎరువులు తక్కువగా వాడటం.
 2. జీవ (సహజ) ఎరువుల వాడకాన్ని పెంచటం.
పాఠ్యాంశంలోని ప్రశ్నలు
ప్రశ్న 1.
 మూడవ పంట అన్ని ప్రాంతాలలో పండించకపోవడానికి కారణాలు ఏమిటో మీ ఉపాధ్యాయుడితో చర్చించండి. (పేజీ.నెం. 117)
 జవాబు:
 నీటి పారుదల వసతి లేకపోవడం. నేల సారాన్ని కోల్పోవడం.
ప్రశ్న 2.
 వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడులుగా ఎందుకు చేస్తారు ? (పేజీ.నెం. 118)
 జవాబు:
 పంటకు నీరు అందించుట సులభంగా ఉంటుంది. కాబట్టి వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడుగులుగా చేస్తారు.
ప్రశ్న 3.
 వరిని ఎలా పండిస్తారు ? (పేజీ.నెం. 121)
 జవాబు:
 వరిని నారుపోసి, నాట్లు వేసి చిన్న చిన్న మడులలో పండిస్తారు.
ప్రశ్న 4.
 మీ పెద్దలను గాని, రైతులను గాని అడిగి విత్తనాలు ఎక్కడ కొంటారో తెలుసుకోండి. (పేజీ.నెం. 121)
 జవాబు:
 విత్తనాలను అమ్ముటకు ధ్రువీకరించిన దుకాణాలలో కొంటారు.

ప్రశ్న 5.
 ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి ? ఇలా ఎందుకు జరుగుతోంది ఆలోచించండి. (పేజీ.నెం. 122)
 జవాబు:
 ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే వాటి స్థానాన్ని సంకరణ జాతి విత్తనాలు ఆక్రమించటం వలన.
ప్రశ్న 6.
 మొక్కలో ఏ భాగం వేరుగా మారుతుంది ? (పేజీ.నెం. 122)
 జవాబు:
 ప్రథమ మూలం మొక్కలో వేరు భాగంగా మారును.
ప్రశ్న 7.
 ఏ భాగం కాండంగా మారుతుందో చెప్పగలరా ? (పేజీ.నెం. 122)
 జవాబు:
 ప్రథమ కాండం కాండంగా మారుతుంది.
ప్రశ్న 8.
 ఏ ఏ పదార్థాలు ఉపయోగించి విత్తనశుద్ధి చేస్తారో జాబితా రాయండి. అదే విధంగా విత్తనాలు నాటే ముందు మీ ఊళ్ళో ఇంకా ఏ ఏ రకమైన పద్ధతులు అవలంభిస్తారో తెలుసుకొని మీ నోటు పుస్తకంలో రాయండి. (పేజీ.నెం. 123)
 జవాబు:
 విత్తనాలను ఈ కింది రసాయనిక పదార్థాలు ఉపయోగించి శుద్ధి చేస్తారు. అవి :
 1. కార్బడిజ
 2. మాంకో జాజ్
 3. ఇమడోకోట్రిడ్
ప్రశ్న 9.
 నారు నాటడం ద్వారా ఇంకా ఏ ఏ పంటలు పండిస్తారో మీ స్నేహితులతో చర్చించి రాయండి. (పేజీ.నెం. 123)
 జవాబు:
 మిరప, వంగ, టమోటా మొదలైనవి నారు నాటడం ద్వారా పంటలు పండిస్తారు.
ప్రశ్న 10.
 ఎందుకు నారు మొక్కలను దూరం దూరంగా నాటుతారు ? (పేజీ.నెం. 125)
 జవాబు:
 నారు మొక్కలు దూరం దూరంగా నాటుటకు కారణం అవి పెరిగి పెద్దగా అయిన తర్వాత స్థలం కోసం, నీటి కోసం, ” ఆహార పదార్థాల కోసం పోటీ లేకుండా ఉండుటకు.
ప్రశ్న 11.
 అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగానే పీకి మళ్ళీ నాటుతారా ? అలా ఎందుకు చేయరు ? (పేజీ.నెం. 125)
 జవాబు:
 అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగా మళ్ళీ పీకి నాటరు. కారణం వాటి విత్తనాలు పెద్దవిగా ఉండటం.
ప్రశ్న 12.
 వ్యాధి సోకిన పంటలోని మొక్కలను రైతు ఏం చేస్తాడు ? (పేజీ.నెం. 127)
 జవాబు:
 వ్యాధి సోకిన పంటలోని మొక్కల ఆకులు, అవసరం అనుకొంటే మొక్కలను రైతు తొలగిస్తాడు. అవి అన్నీ ఒకచోట వేసి కాలుస్తాడు.

ప్రశ్న 13.
 రామయ్య, అనే రైతు వ్యాధి సోకిన మొక్కలను పొలం నుండి పీకి కాల్చి వేశాడు. ఇది మంచిదా ? నీ స్నేహితులతో – చర్చించండి. (పేజీ.నెం. 127)
 జవాబు:
 రామయ్య అనే రైతు వ్యాధి సోకిన మొక్కలను పొలం నుండి పీకి కాల్చి వేశాడు. ఇది చాలా మంచిది. కారణం ఇతర , మొక్కలకు వ్యాధి కొంతమేర సోకదు.
ప్రశ్న 14.
 రెండు రకాల కీటక నాశకాలను ఉపయోగిస్తే కీటక సంఖ్య మొదటి సంవత్సరం తగ్గింది కాని మరునాటి సంవత్సరం వాటి సంఖ్య పెరిగింది. కారణాలు తెలపండి. (పేజీ.నెం. 127)
 జవాబు:
 రెండు రకాల కీటక నాశకాలను ఒక్కసారి ఉపయోగించినపుడు మొదటి సంవత్సరం కీటకాల సంఖ్య తగ్గినది. రెండవ సంవత్సరం పెరిగాయి. కారణం ఆ మందులకు కీటకాలు నిరోధకతను ఏర్పరచుకున్నాయి.
ప్రశ్న 15.
 రైతులు ఎరువులను ఎలా వేస్తారు ? (పేజీ.నెం.130)
 జవాబు:
 రైతులు ఎరువులను చేతితోగాని, కొన్ని పనిముట్లతో గాని వేస్తారు.
ప్రశ్న 16.
 మీ పాఠశాలలో కంపోస్టు గుంత ఉందా ? అందులో ఏమేమి వేస్తుంటారు ? (పేజీ.నెం.130)
 జవాబు:
 మా పాఠశాలలో కంపోస్టు గుంత ఉంది. అందులో కూరగాయల తొక్కలు, మిగిలిన అన్నం, ఎండిన ఆకులు వేస్తారు.

ప్రశ్న 17.
 కింది చిత్రాన్ని చూడండి. దీనిలో ఏ మూలకం ఏ పరిమాణంలో ఉందో చెప్పండి. (పేజీ.నెం. 130)
 జవాబు:
 నైట్రోజన్ 20%
 ఫాస్ఫరస్ 5%
 పొటాషియం 10%
 
ప్రశ్న 18.
 ఏది మంచి ఎరువు ? రసాయనిక ఎరువులకు, సహజ ఎరువులకు మధ్యగల తేడాలు ఏవి (పేజీ.నెం. 131)
 జవాబు:
 
 (i) పై రెండింటిని పోల్చి ఏది మనకు ప్రయోజనకరమో చెప్పండి.
 జవాబు:
 సహజ ఎరువు.
(ii) పై పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఎరువులు వాడితే రైతులకు ప్రయోజనమో మీ ఉపాధ్యాయునితో చర్చించి రాయండి.
 జవాబు:
 సహజ ఎరువులు వాడితే రైతులకు ప్రయోజనం. ఇవి వేస్తే నేలలో హ్యూమస్ చేరుతుంది. అదే విధంగా నేల ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి.
ప్రశ్న 19.
 రైతులు వరి పొలాలకు నీళ్ళు ఎప్పుడు అందిస్తారు ? (పేజీ.నెం. 132)
 జవాబు:
 నాట్లు వేసేటప్పుడు, మూన తిరిగిన రోజు నుండి పైరు దబ్బు చేయుటకు 2-3 రోజులకు ఒక్కసారి.

ప్రశ్న 20.
 మీ గ్రామంలో నీటి వనరులను వ్రాయండి. (పేజీ.నెం. 132)
 జవాబు:
 కాలువలు, చెరువులు, బావులు.
ప్రశ్న 21.
 ఆ నీటి వనరులు రైతులకు ఉపయోగపడుతున్నాయా ? (పేజీ.నెం. 132)
 జవాబు:
 ఆ నీటి వనరులు రైతులకు ఉపయోగపడుతున్నాయి.
ప్రశ్న 22.
 మీ గ్రామంలో రైతులు ఏ రకంగా పొలాలకు నీళ్ళు పెడుతున్నారు ? (పేజీ.నెం. 132)
 జవాబు:
 మా గ్రామంలో రైతులు ఎక్కువమంది ఆధునిక పద్ధతుల ద్వారా, కొంతమంది పురాతన పద్ధతుల ద్వారా పొలాలకు నీళ్ళు పెడుతున్నారు.
ప్రశ్న 23.
 కలుపు మొక్కలను ఎందుకు తొలగించాలి ? (పేజీ.నెం. 134)
 జవాబు:
 కలుపు మొక్కలు పోషక పదార్థాలు, నీరు, వెలుతురు కోసం పంట మొక్కలతో పోటీపడతాయి. దీనివల్ల సాగు మొక్కలు పెరగవు. అందుకే కలుపు మొక్కలు తొలగించాలి.
