Students can go through AP Board 8th Class Biology Notes 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి to understand and remember the concept easily.
AP Board 8th Class Biology Notes 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి
→ పంటలు పండడానికి 180 లేదా అంతకంటే ఎక్కువ రోజులు పట్టే పంటలను దీర్ఘకాలిక పంటలు అంటారు.
→ పంటలు పండడానికి 100 లేదా అంతకంటే తక్కువ రోజులు పట్టే పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు.
→ వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ అంటారు. ఇది జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది.
→ శీతాకాలంలో పండే పంటలను రబీ అంటారు. ఇది నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది.
→ కొన్ని మొక్కలు పుష్పించడం రాత్రి కాలంపై ఆధారపడి ఉంటుంది.
→ రాత్రి కాలం నిడివి 12 1/2 గంటల కంటే ఎక్కువగా ఉంటే కొన్ని మొక్కలు బాగా పుష్పిస్తాయి.
→ కొన్ని మొక్కలు రాత్రి కాలంతో నిమిత్తం లేకుండా సంవత్సరం పొడవునా పుష్పిస్తాయి.
→ నేలను సిద్ధం చేయడం వ్యవసాయంలో అతిముఖ్యమైన పని.
→ నేలను దున్నడం వల్ల మృత్తిక మెత్తగా మారి నీటిని నిల్వ చేసుకొనే శక్తి పెరుగుతుంది. గాలి, నీరు మొక్కల వేర్లకు సులభంగా అందుతాయి.
→ నేలను చదును చేయడం వలన పంటకు నీరందించడం సులభమవుతుంది.
→ రైతులు విత్తనాలను పరీక్షించి, శుద్ధి చేసిన తర్వాతనే నేలలో విత్తుతారు.
→ ఎరువులు రెండు రకాలు. 1. సహజ ఎరువులు (జీవ ఎరువులు) 2 కృత్రిమ ఎరువులు (రసాయనిక ఎరువులు)
→ నీరు తక్కువగా లభించే ప్రదేశాలలో స్ప్రింక్లర్లు, బిందు సేద్యం పద్ధతులు ఉపయోగిస్తారు.
→ కలుపు మొక్కలను తొలగించడం వల్ల పంట దిగుబడి అధికమవుతుంది. 2- 4 – డైక్లోరో ఫినాక్సి ఎసిటిక్ ఆమ్లము అనే కలుపు నాశనిని ద్విదళబీజ కలుపు మొక్కల నివారణకు ఉపయోగిస్తారు.
→ బాక్టీరియా, ఫంగై, క్రిములు, ఎలుకలు మొదలగు వాటివల్ల ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఆహార పదార్థాలను, ధాన్యాలను సరైన విధంగా భద్రపరచుటవల్ల ఈ నష్టాన్ని తగ్గించవచ్చు.
→ పంటదిగుబడి : పంట యొక్క ఫలసాయాన్ని పంట దిగుబడి అని అంటారు. పంట మొక్కలు ఉత్పత్తి చేసే కాయలను పంట దిగుబడి అనవచ్చు.
→ దీర్ఘకాలపు పంటలు : పంటలు పండడానికి 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పడితే ఆ పంటలను దీర్ఘకాలపు పంటలు అంటారు. ఉదా : జొన్న, కందులు.
→ స్వల్పకాలిక పంటలు : పంటలు పండటానికి 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం పడితే ఆ పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు. ఉదా : పెసలు, మినుములు.
→ ఖరీఫ్ పంటలు : వర్షాకాలంలో పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు.
→ రబీ పంటలు : శీతాకాలంలో పండే పంటల్ని రబీ పంటలు అంటారు.
→ విశ్వధాన్యం : ప్రపంచంలో చాలా దేశాల్లో ఆహారంగా తీసుకొనే ధాన్యాన్ని (వరి) విశ్వధాన్యం అంటారు.
→ దున్నడం : నేలను వదులుగా చేయటం. ఇది నాగలి సహాయంతో చేసే ప్రక్రియ.
→ కయ్యలు : వరి పొలాన్ని చిన్నచిన్న గట్లు కట్టి విభజిస్తారు. వీటిని మడులు లేక కయ్యలు అంటారు.
→ చదును చేయడం : నేలను నాగలితో దున్నిన తర్వాత ఎగుడు దిగుడుగా ఉన్న నేలను చదును పలకను ఉపయోగించి నేలంతా సమంగా చేయుటను చదును చేయడం అంటారు.
→ విత్తనాలు విత్తడం : విత్తనాలను నేలలో వేయుటను విత్తనాలు విత్తడం అంటారు.
→ ఎంపిక : పండిన పంట నుంచి మంచి విత్తనాలను వేరు చేయడాన్ని ఎంపిక అంటారు.
→ విత్తన కొరత : వ్యవసాయ రంగంలో రైతులకు కావలసిన రకమైన విత్తనాలు అందుబాటులో లేకపోవటాన్ని విత్తన కొరత అంటారు.
→ విత్తన వ్యాప్తి : విత్తనాలు ఒక చోటు నుంచి మరొకచోటుకు వెళ్ళటను విత్తన వ్యాప్తి అంటారు.
→ వెదజల్లడం : విత్తనాలను పొలంలో ఒక మడిగా వేయుటను వెదజల్లడం అంటారు.
→ విత్తనం గొర్రు : విత్తనాలను నేలలో విత్తడానికి ఉపయోగించే పనిముట్టు
→ వారుమడులు : 5 లేక 6 ఆకులతో వరిమడిలో ఉన్న మొక్కలు.
→ వరినాట్లు వేసే యంత్రం : ఎక్కువ విస్తీర్ణంలో వరినాట్లు వేయటానికి ఉపయోగించు పనిముట్టు
→ జీవ ఎరువులు : మొక్కల, జంతువుల వ్యర్థపదార్థాలు కుళ్ళింపచేసినపుడు తయారు అయిన ఎరువులు. వీటిని సహజ ఎరువులు అంటారు.
→ రసాయన ఎరువులు : రసాయన పదార్థాల నుండి కర్మాగారాల్లో తయారు అయిన ఎరువులు. వీటిని కృత్రిమ ఎరువులు అంటారు.
→ స్ప్రింక్లర్స్ : మొక్కలకు నీటి నష్టం జరగకుండా నీళ్ళను అందించే ఆధునిక పరికరాలు.
→ బిందు సేద్యం : నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలలో మరో ప్రయోజనకరమైన నీటిపారుదల పద్ధతితో చేసే సేద్యం
→ కలుపు నాశనులు : కలుపు మొక్కలను నాశనం చేయుటకు ఉపయోగించు రసాయనాలు. ఉదా : 2, 4-డి
→ తూర్పార బట్టడం : గింజలను గంపలతోగాని, చేటలతో గాని తీసుకొని ఎత్తైన ప్రదేశంపై నిలబడి గాలివీచే వైపునకు ఉంచడం.
→ గోదాములు : ఎండిన ధాన్యాన్ని గోనె సంచుల్లో నింపి భద్రపరచు ప్రదేశాలు (గదులు)
→ శీతల గిడ్డంగులు : కూరగాయలు, పండ్లు, చింతపండు, ఎండుమిర్చి వంటి వాటిని భద్రపరచుటకు ఉపయోగించే గదులు