SCERT AP 8th Class Maths Solutions Chapter 3 చతుర్భుజాల నిర్మాణాలు Ex 3.5 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 8th Class Maths Solutions 3rd Lesson చతుర్భుజాల నిర్మాణాలు Exercise 3.5
కింది చతుర్భుజాలను ఇవ్వబడిన కొలతలతో నిర్మించండి.
(a) PQRS చతుర్భుజంలో PQ = 3.6 సెం.మీ., QR = 4.5 సెం.మీ., RS = 5.6 సెం.మీ., ∠PQR = 135° మరియు ∠QRS = 60°.
 సాధన.
 నిర్మాణ క్రమం :
 1. 3.6 సెం.మీ. వ్యాసార్ధంతో \(\overline{\mathrm{PQ}}\) రేఖాఖండాన్ని నిర్మించితిని.
 
 2. Q కేంద్రంగా 135° కిరణాన్ని, 4.5 సెం.మీ. వ్యాసార్ధంతో ఒక చాపాన్ని గీయగా వాటి ఖండన బిందువును ‘R’ గా గుర్తించితిని.
 3. R కేంద్రంగా 60° ల కిరణాన్ని, 5.6 సెం.మీ. వ్యాసార్ధంతో ఒక చాపం గీయగా, వాటి ఖండన బిందువును ‘S’ గా గుర్తించితిని.
 4. R, S లను కలిపితిని.
 ∴ PQRS చతుర్భుజం ఏర్పడినది.
(b) LAMP చతుర్భుజంలో AM = MP = PL = 5 సెం.మీ., ∠M = 90° మరియు ∠P = 60°.
 సాధన.
 నిర్మాణ క్రమం :
 1. 5 సెం.మీ. వ్యాసార్ధంతో \(\overline{\mathrm{AM}}\) రేఖాఖండాన్ని గీచితిని.
 
 2. M కేంద్రంగా 90° కోణంతో ఒక కిరణాన్ని, 5 సెం.మీ. వ్యాసార్ధంతో ఒక చాపాన్ని గీయగా, వాటి ఖండన బిందువును P గా గుర్తించితిని.
 3. P కేంద్రంగా 60° కోణంతో ఒక కిరణాన్ని, 5 సెం.మీ. వ్యాసార్ధంతో ఒక చాపాన్ని గీయగా వాటి ఖండన బిందువును L గా గుర్తించితిని.
 4. A, L లను కలిపితిని.
 ∴ LAMP చతుర్భుజం ఏర్పడినది.

(c) ABCD ట్రెపీజియం (సమలంబ చతుర్భుజం)లో AB//CD, AB = 8 సెం.మీ., BC = 6 సెం.మీ., CD = 4 సెం.మీ., మరియు ∠B = 60°.
 సాధన.
 \(\overline{\mathrm{AB}}\)//\(\overline{\mathrm{CD}}\) అయిన ∠B + ∠C = 180°
 ⇒ ∠C = 180° – 60° = 120 ∴ ∠C = 120°
 
 నిర్మాణ క్రమం :
 1. 8 సెం.మీ. వ్యాసార్ధంతో \(\overline{\mathrm{AB}}\) రేఖాఖండాన్ని నిర్మించితిని.
 2. ‘B’ కేంద్రంగా 60° ల కిరణాన్ని, 6 సెం.మీ. వ్యాసార్ధంతో ఒక చాపాన్ని గీయగా, వాటి ఖండన బిందువును ‘C’ గా గుర్తించితిని.
 3. ‘C’ కేంద్రంగా 120° లతో ఒక కిరణాన్ని, 4 సెం.మీ.లతో ఒక చాపాన్ని గీయగా, వాటి ఖండన బిందువును ‘D’ గా గుర్తించితిని.
 4. A, Dలను కలిపితిని.
 ∴ ABCD ట్రెపీజియం ఏర్పడినది.
