AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం.
AP State Syllabus 8th Class Telugu Important Questions 1st Lesson అమ్మకోసం
8th Class Telugu 1st Lesson అమ్మకోసం Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది చుక్కగుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.
1) ఉ. ఆయతపక్ష తుండహతి నక్కులతైలము లెల్ల నుగ్గుగాఁ
 జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
 బాయక వీపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
 సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!
భావం:
 పద్మం వంటి ముఖం గల తల్లీ ! విశాలమైన నా రెక్కలతో వాడి అయిన ముక్కుతో కుల పర్వతాలనన్నిటినీ పిండిగా చేయగల గొప్పబలం, కీర్తి నాకు ఉన్నాయి. అటువంటి నేను నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయడానికీ, వాటికి సేవలు చేయడానికీ, గల కారణం ఏమిటో చెప్పు.
2) చ. అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
 త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
 త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
 కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహాగేంద్రుఁడు సంతసంబునన్
భావం:
 “నీవు అంతులేని విక్రమం, వేగం, బలం కలిగిన పక్షి శ్రేష్ఠుడివి. నీకు దాస్యం పోగొట్టు కోవాలనే అభిప్రాయం ఉంటే నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా, మాకు అమృతాన్ని తెచ్చి ఇయ్యి” అని పాములు చెప్పగా, గరుత్మంతుడు అప్పుడు సంతోషంతో.

3) మ. వితతోల్కాశనిపుంజ మొక్కొ యనఁగా విన్వీథి విక్షిప్ర ప
 క్షతి వాతాహతిఁ దూలి, తూల శకలాకారంబు లై వారిద
 ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
 పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దల్పాలుర్ భయం బందఁగన్.
భావం:
 పక్షిరాజు మనోవేగంతో బయలు దేరాడు. అప్పుడతడు నిప్పు కణాలతో కూడిన తోక చుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదలుతూ ఉన్నప్పుడు, అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా, గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్నచోటికి వెళ్ళాడు.
ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తలనుండు విషము ఫణికిని
 వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
 దల తోఁక యనక యుండును
 ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
 ప్రశ్నలు:
 1. ఫణికి విషం ఎక్కడ ఉంటుంది?
 జవాబు:
 ఫణికి విషం తలలో ఉంటుంది.
2. దేనికి విషం తోకలో ఉంటుంది?
 జవాబు:
 వృశ్చికానికి (తేలుకు) విషం తోకలో ఉంటుంది.
3. ఖలునకు విషం ఎక్కడ ఉంటుంది?
 జవాబు:
 ఖలునకు విషం నిలువెల్లా (శరీరమంతా) ఉంటుంది.
4. ఈ పద్యం ద్వారా మనకు ఏం తెలుస్తోంది?
 జవాబు:
 ఈ పద్యం ద్వారా మనకు ఖలుని స్వభావం తెలుస్తోంది.
2. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
 చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
 నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
 సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
 పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
 ప్రశ్నలు :
 1. నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
 జవాబు:
 నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.
2. పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
 జవాబు:
 పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.
3. ఈ పద్యానికి శీర్షికను సూచి.డి.
 జవాబు:
 ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.
4. ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
 జవాబు:
 ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

3. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
 అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
 నక్షరంబు జిహ్వ కిక్షు రసము
 అక్షరంబు తన్ను రక్షించు గావున
 నక్షరంబు లోక రక్షితంబు.
 ప్రశ్నలు:
 1. మానవులకు ఏం కావాలి?
 జవాబు:
 మానవులకు అక్షరం (విద్య) కావాలి.
2. అక్షరం జిహ్వకు ఎటువంటిది?
 జవాబు:
 అక్షరం జిహ్వకు చెరకురసం వంటిది.
3. అక్షరము దేనిని రక్షిస్తుంది?
 జవాబు:
 అక్షరము తనను (చదువుకున్నవానిని) రక్షిస్తుంది.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
 జవాబు:
 ఈ పద్యానికి శీర్షిక ‘అక్షర మహిమ.’
4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
 కందుకము వోలె సుజనుడు
 క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
 మందుడు మృత్పిండమువలె
 గిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.
 ప్రశ్నలు:
 1. సుజనుడు ఎట్లు ఉంటాడు?
 జవాబు:
 సుజనుడు కందుకంలా ఉంటాడు.
2. మందుడు ఎలా ఉంటాడు?
 జవాబు:
 మందుడు మృత్పిండంలా ఉంటాడు.
3. సుజనుని కవి దేనితో పోల్చాడు?
 జవాబు:
 సుజనుని కవి బంతితో పోల్చాడు.
4. ఈ పద్యంలోని అలంకారమేమి?
 జవాబు:
 ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
 ‘అమ్మకోసం’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
 (లేదా)
 తెలుగులో ఆదికవిగా పేరుపొందిన నన్నయ గురించి పరిచయం చేయండి. (S.A.III – 2015-16)
 జవాబు:
 ‘అమ్మకోసం’ అనే పాఠ్యభాగ రచయిత నన్నయభట్టు. ఈయన 11వ శతాబ్దికి చెందినవాడు. రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. సంస్కృత మహాభారతాన్ని ఆంద్రీకరించిన కవిత్రయంలో నన్నయ మొదటివాడు. ఈయనకు ఆదికవి, శబ్దశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. భారతంలోకి ఆది, సభా పర్వాలను పూర్తిగాను, అరణ్య పర్వంలోని సగభాగాన్ని అనువదించారు.
అక్షరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తినిధిత్వం నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శకుడయ్యాడు నన్నయ.

ప్రశ్న 2.
 ‘ఇతిహాసం’ ప్రక్రియను వివరించండి.
 జవాబు:
 ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘ఇతిహాసం’ అనే ప్రక్రియ ముఖ్యమైనది. ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశురూపంలో ఉండేవి. ఇందులో కథ, కథనానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. రామాయణ, మహాభారతాలను ఇతిహాసాలు అని అంటారు.
ప్రశ్న 3.
 గరుత్మంతుని స్వభావాన్ని వివరించండి.
 జవాబు:
 ‘అమ్మకోసం’ అనే పాఠ్యభాగంలో గరుత్మంతుని పాత్ర ప్రముఖమైనది. తల్లి పట్ల అపరిచితమైన భక్తి విశ్వాసాలు కలవాడు. తల్లిదాస్యాన్ని గూర్చి తెలుసుకున్నాడు. ఆమె దాస్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు. అమృతభాండాన్ని తీసుకొని వచ్చి తల్లికి దాస్యవిముక్తిని కలిగించాడు.
గరుత్మంతుని వేగం అసమానమైంది. అంతులేని పరాక్రమం, గరుత్మంతునికే సొంతం. తల్లికి దాస్యవిముక్తిని కల్గించాడు. తల్లి ఆశలను నెరవేర్చాడు. పిల్లలందరు తనలాగే ఉండాలని లోకానికి తెలియజేసిన మహనీయుడు గరుత్మంతుడు.
ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
 గరుత్మంతుడు తల్లికి దాస్య విముక్తిని కల్గించి ఉత్తమునిగా కీర్తి పొందాడు కదా ! అట్లే నీ తల్లికి నీవు ఎలా సేవలు చేస్తావు? ఆమెకు ఎలాంటి ఆనందాన్ని కల్గిస్తావు?
 జవాబు:
 గరుత్మంతుడు తల్లిని సేవించాడు. ఆమెకు దాస్యవిముక్తిని కలిగించాడు. సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. గరుత్మంతుడినే నేను ఆదర్శంగా తీసుకున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ అని పెద్దలు అంటారు. తల్లిదండ్రుల ఋణాన్ని పిల్లలు తీర్చుకోవాలి. వారికి అండగా ఉండాలి.
తల్లిదండ్రులకు ఇంటి పనుల్లోను, బయట పనుల్లోను చేదోడువాదోడుగా ఉంటాను. తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడతారు. తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగినపుడు వారికి అండగా ఉంటాను. తల్లిదండ్రుల కష్టాలను తొలగించేందుకు కృషి చేస్తాను.
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కలుగదు. ఆ పుత్రుని పదిమంది మెచ్చుకొంటున్నప్పుడు కలుగుతుంది. ధృతరాష్ట్రునకు నూరుమంది కొడుకులు పుట్టారు. వారి వల్ల ఆయనకు కష్టాలే వచ్చాయి గాని సుఖం కలుగలేదు. వారందరూ అధర్మ మార్గాన నడిచారు. పాండు పుత్రులు ఐదుగురైనా ధర్మమార్గాన నడిచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. పెద్దయిన తరువాత మా తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని మేము బాగా చదువుతున్నాము. నేను, మా చెల్లి మా తల్లిదండ్రుల్ని ప్రత్యక్షదైవాలుగా చూసుకొంటున్నాము. మా చదువులు పూర్తయ్యే వరకు మా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండి, ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తాము.
ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
 తల్లిని గౌరవించాలని తెలియజేసే విధంగా కొన్ని నినాదాలు రాయండి.
 జవాబు:
- తల్లిని గౌరవించు. ఆదర్శంగా జీవించు.
- మాతృమూర్తి రూపమిచ్చిన అమృతమూర్తి,
- సకల పుణ్యతీర్థాలు తల్లిలో ఉన్నాయి. ఆ తల్లిని మించిన దైవం లేదు.
- కొట్టినా పెట్టేది తల్లి. పెట్టినా కొట్టేది కొడుకు.
- కష్టబెట్టబోకు కన్నతల్లి మనసు.
- కన్నతల్లి కంటే ఘనదైవంబు లేదు.
- అంతులేని ప్రేమ తల్లి మనసు.
- త్యాగానికి మరోరూపు తల్లి.

ప్రశ్న 2.
 తల్లిదండ్రులను గౌరవించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
 జవాబు:
| పొదిలి. ప్రియమైన మిత్రుడు శరత్ కు, నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన కన్న తల్లిదండ్రులు దైవంతో సమానం. వారిని గౌరవించడం మన ధర్మం. పుట్టినప్పటి నుంచి మన బాధ్యతలను తల్లిదండ్రులు చూస్తారు. వారు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పిల్లల అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులను గౌరవించాలి. వారు చెప్పినట్లు మంచి మార్గంలో నడవాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దూరంగా విడిచిపెట్టకుండా తమ దగ్గరే ఉంచుకొని, వారి యోగక్షేమాలను చూచుకోవాలి. నీవు నా (అభిప్రాయంతో ఏకీభవిస్తావని ఆశిస్తున్నాను. పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపగలవు.) ఇట్లు చిరునామా : | 
ప్రశ్న 3.
 ప్రాచీన సాహిత్యంలోని ముఖ్యమైన గ్రంథాలేమిటో మీ పాఠ్యపుస్తకం ఆధారంతో రాసి – వాటిని చదవడం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలియజేయండి. (S.A. III – 2015-16)
 జవాబు:
 సమాజ హితమే సాహిత్యం , సంఘంలోని ప్రజలకు మంచి చెడులను తెలియచెప్పేవి గ్రంథాలు. అందులో ప్రాచీన సాహిత్యంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రామాయణం, భారతం, భాగవతాదులు. మన పాఠ్యాంశాలలో అమ్మకోసం (ఆంధ్రమహాభారతం), హరిశ్చంద్రుడు (హరిశ్చంద్రోపాఖ్యానం) అనేవి ప్రాచీన సాహిత్య గ్రంథాలు.
ఈ గ్రంథాలు చదవడం ద్వారా ప్రజలకు అన్ని విధాల మంచి జరుగుతుంది. మాతృభక్తి, విలువలు ఒకటి చెబుతుంటే, మరొకటి వ్యక్తిత్వ విలువలు నేర్పుతుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లల వైఖరి ఎలా ఉండాలో భారతం చెబుతుంది. ఇంకా ఒక సమాజానికి నిలువుటద్దంగా నిలిచింది. అందుకే ‘వింటే భారతం వినాలి’ అంటారు. అనగా సమాజంలోని వ్యక్తులకు అద్దం పట్టే విధంగా భారతం తీర్చిదిద్దబడింది. అన్ని రకాల వ్యక్తిత్వాలు భారతంలో మనం చూడవచ్చు. ధర్మం ఎవరి వైపు ఉంటుందో, వారి వైపే విజయం ఉంటుంది అని తెలుస్తుంది. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలన పాటించి సత్యహరిశ్చంద్రుడు అయ్యాడు. ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధం ఆడలేదు. మహాత్మగాంధీకి సత్యమార్గాన్ని చూపిన వ్యక్తి, ఈ మహనీయుడు. ఈయన కథను చదవడం ద్వారా విశ్వసనీయత, నైతిక విలువలు పెరుగుతాయి. ధర్మతత్పరతకు అవకాశం కల్గుతుంది. ‘సత్యమేవ జయతే’ అన్న సూక్తికి రూపం హరిశ్చంద్రుడు. పై గ్రంథములను చదవడం వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.
8th Class Telugu 1st Lesson అమ్మకోసం 1 Mark Bits
1. అమిత పరాక్రమంబును “రయంబు”ను (అర్థాన్ని గుర్తించండి) (S.A. I. 2019-20)
 ఎ) బలము
 బి) వేగము
 సి) దుమ్ము
 డి) రజను
 జవాబు:
 బి) వేగము
2. మెరుపులతో పాటు కులిశములు రాలాయి (పర్యాయ పదాలు గుర్తించండి) (SA. I. 2018-19)
 ఎ) పన్నగం, పిడుగు
 బి) అశని, పిడుగు
 సి) అశని, ఫణి
 డి) గగనం, సర్పం
 జవాబు:
 బి) అశని, పిడుగు
3. ఆయత పక్షతుండహతి. పక్షము అనే పదానికి నానార్థాలు గుర్తించండి. (S.A. I – 2018-19)
 ఎ) వైపు, రెక్క
 బి) రెక్క వారం
 సి) పులుగు, పక్షి
 డి) ఖగం , పక్షి
 జవాబు:
 ఎ) వైపు, రెక్క
4. “అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధియగు” ఈ సూత్రం వర్తించే సంధి పదాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
 ఎ) నెగడెందమములు
 బి) అత్యుగ్ర
 సి) ఔరౌర
 డి) వంటాముదం
 జవాబు:
 సి) ఔరౌర
5. గరుత్మంతుని పక్షములు చాలా అందమైనవి (నానార్థాలు గుర్తించండి) (S.A. II – 2018-19)
 ఎ) రెక్కలు, 15 రోజుల కాలం
 బి) పాలు, అమృతము
 సి) పృథ్వీ, ధర
 డి) ఆకాశము, అంబరం
 జవాబు:
 ఎ) రెక్కలు, 15 రోజుల కాలం
6. గీత బజారుకు వెళ్లి కూరగాయలు కొన్నది (ఏ వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
 ఎ) శత్రర్థకం
 బి) సంక్లిష్ట
 సి) సంయుక్త
 డి) సామాన్య
 జవాబు:
 బి) సంక్లిష్ట

7. మహాభారతమును తెలుగులో మొట్టమొదటగా నన్నయ రాశారు. (సంధి పేరు గుర్తించండి) (SA. II – 2017-18)
 ఎ) ఆమ్రేడిత
 బి) గుణ
 సి) అకార
 డి) త్రిక
 జవాబు:
 ఎ) ఆమ్రేడిత
8. అశని ధ్వని వింటే నాకు భయంగా ఉంటుంది. (సమానార్థక పదాలు గుర్తించండి.) (S.A. III – 2016-17)
 ఎ) పిడుగు – కులిశం
 బి) అల – గోల
 సి) తరంగం – అల
 డి) సరస్సు – శిరస్సు
 జవాబు:
 ఎ) పిడుగు – కులిశం
9. “నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు” ఇది ఏ రకమైన వాక్యం (S.A. III – 2015-16)
 ఎ) కర్తరి వాక్యం
 బి) సంయుక్త వాక్యం
 సి) సామాన్య వాక్యం
 డి) సంక్లిష్ట వాక్యం
 జవాబు:
 సి) సామాన్య వాక్యం
భాషాంశాలు – పదజాలం
ఆర్థాలు :
10. విద్యార్థులకు అభీష్టం చదువుపట్లే ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) కోరిక
 బి) అమరిక
 సి) తపన
 డి) అంతరంగం
 జవాబు:
 ఎ) కోరిక
11. గగనంలో చంద్రుడు ఉదయించాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) త్రిదిపం
 బి) ఆకాశం
 సి) దరి
 డి) దారి
 జవాబు:
 బి) ఆకాశం
12. ఈ సంవత్సరంలో వృష్టి కురిసింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) క్షేత్రం
 బి) నింగి
 సి) వాన
 డి) క్షీరం
 జవాబు:
 సి) వాన
13. దివాకరుడు వెలుగును ఇచ్చాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) శుక్రుడు
 బి) తపన
 సి) పాంథము
 డి) సూర్యుడు
 జవాబు:
 డి) సూర్యుడు
14. పుట్టలో ఉదగం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) భుజం
 బి) భుజగం
 సి) శీర్షం
 డి) ఉదరం
 జవాబు:
 బి) భుజగం
15. కుశమును కోయడం చాలా కష్టం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) దర్భ
 బి) ధర
 సి) ధరణి
 డి) వసుధ
 జవాబు:
 ఎ) దర్భ
16. అనిమిషనాథుడు వయుధం ధరించాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) శని
 బి) కుబేరుడు
 సి) ఇంద్రుడు
 డి) వాయువు
 జవాబు:
 సి) ఇంద్రుడు

17. అమరులు అమృతం త్రాగారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) కిన్నెరులు
 బి) రాక్షసులు
 సి) గంధర్వులు
 డి) దేవతలు
 జవాబు:
 డి) దేవతలు
పర్యాయపదాలు :
18. తల్లి పుత్రుని రక్షించు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
 ఎ) అంబ, అంబాలిక
 బి) మాత, జనని
 సి) అమ్మ, అమృతం
 డి) వనిత, మాత
 జవాబు:
 బి) మాత, జనని
19. దినకరుడు అస్తమించాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 ఎ) జలధి, జలజం
 బి) రజనీశ్వరుడు, రాతిరి
 సి) సూర్యుడు, ఆదిత్యుడు
 డి) మారుతి, ఇనుడు
 జవాబు:
 సి) సూర్యుడు, ఆదిత్యుడు
20. ఖగము గగనంపై విహరించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) పుండరీకం, శృంగాలం
 బి) నక్క, కాకి
 సి) బకము, వింజామరం
 డి) పక్షి, పులుగు
 జవాబు:
 డి) పక్షి, పులుగు
21. శైలంబుపై ఝరి ప్రవహించింది – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
 ఎ) అది
 బి) తరువు
 సి) నగరం
 డి) పథము
 జవాబు:
 ఎ) అది
22. ఆననం పై కుంకుమ బొట్టు ఉంది – గీత గీసిన పదానికి సమానార్థకం గుర్తించండి.
 ఎ) కరం
 బి) ముఖం
 సి) నాశిక
 డి) కర్ణం
 జవాబు:
 బి) ముఖం
ప్రకృతి – వికృతులు :
23. హృదయం నిర్మలంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
 ఎ) ఎద
 బి) హేయం
 సి) హాయం
 డి) హంస
 జవాబు:
 ఎ) ఎద
24. శక్తి మించి పని చేయరాదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) సత్తి
 బి) సెత్తి
 సి) సొత్తి
 డి) మిత్తి
 జవాబు:
 ఎ) సత్తి
25. కులము కంటే గుణము మిన్న – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
 ఎ) కొలము
 బి) గొలము
 సి) కెలము
 డి) కిలము
 జవాబు:
 ఎ) కొలము
26. అగ్ని మండును – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
 ఎ) అగ్గే
 బి) అగ్గి
 సి) అగ్గి
 డి) అచ్చి
 జవాబు:
 బి) అగ్గి
27. ప్రజలు సంతోషం పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
 ఎ) సంతషం
 బి) సెంతసం
 సి) సొంతసం
 డి) సంతసం
 జవాబు:
 డి) సంతసం

28. మానవుడు ముతి పొందాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
 ఎ) ముగిచె
 బి) ముక్తి
 సి) ముత్తె
 డి) ముచ్చ
 జవాబు:
 బి) ముక్తి
నానార్థాలు :
29. అన్నింట అర్థం అవసరం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) కారణం, కాసర
 బి) సంపద, శబ్దార్థం
 సి) శ్రీ, గానుగ
 డి) లక్ష్మి, అరమరిక
 జవాబు:
 బి) సంపద, శబ్దార్థం
30. పక్షి రయమున వెళ్ళె – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) వనము, వేగము
 బి) వేదం, వెల్లువ
 సి) వేగం, వేకువు
 డి) వేకువ, వరద
 జవాబు:
 బి) వేదం, వెల్లువ
31. దేవతలు సుధను త్రాగారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) అమృతం, పాలు
 బి) నీరు, నాలుక
 సి) జలం, వారి
 డి) క్షీరం, సున్నం
 జవాబు:
 ఎ) అమృతం, పాలు
32. పక్షి పక్షములతో ఎగిరింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) 15 రోజులకాలం
 బి) క్షీరం
 సి) జలధి
 డి) ఉదధి
 జవాబు:
 ఎ) 15 రోజులకాలం
33. సరస్సులో వారి ఉంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) లావు
 బి) సరస్వతి
 సి) సామర్థ్యం
 డి) లక్ష్మి
 జవాబు:
 బి) సరస్వతి
వ్యుత్పత్తర్థాలు :
34. దేవతలు అమృతం త్రాగారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
 ఎ) మృతి కావాలనేది
 బి) మరణము పొందింపనిది
 సి) మరణం కానిది
 డి) మరణం చెందేది
 జవాబు:
 బి) మరణము పొందింపనిది
35. పున్నామ నరకం నుండి రక్షించువాడు-అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
 ఎ) పుత్రుడు
 బి) భూమాత
 సి) జనకుడు
 డి) పురం
 జవాబు:
 ఎ) పుత్రుడు
36. అనిమిషనాథుడు దివి యందు ఉండె – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం గుర్తించండి.
 ఎ) దేవతలకు ప్రభువు
 బి) రాక్షసులకు రాజు
 సి) దేవతలకు గురువు
 డి) దేవతలకు సేనాని
 జవాబు:
 ఎ) దేవతలకు ప్రభువు
37. వెనతేయుడు బుధిమంతుడు – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
 ఎ) వినత యొక్క అల్లుడు
 బి) వినత యొక్క కుమారుడు
 సి) వినత యొక్క మామ
 డి) వినత యొక్క ఆశయం
 జవాబు:
 బి) వినత యొక్క కుమారుడు

38. భుజంగము – దీనికి వ్యుత్పత్తి ఏది?
 ఎ) వేగంగా పోవునది
 బి) మంధముగా పోవునది
 సి) కుటిలముగా పోవునది
 డి) గగనంపై వెళ్ళునది
 జవాబు:
 సి) కుటిలముగా పోవునది
39. ఖేచరం విహరించును – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
 ఎ) సర్వత్ర తినునది
 బి) ఆకాశమున సంచరించునది
 సి) ఆకాశంచేత పయనించునది
 డి) స్వర్గంపై తిరిగేది
 జవాబు:
 బి) ఆకాశమున సంచరించునది
వ్యాకరణాంశాలు
సంధులు :
40. అత్యుగ్రం – దీన్ని విడదీయడం గుర్తించండి.
 ఎ) అతో + అగ్రము
 బి) అతీ + అగ్రము
 సి) అతే + అగ్రం
 డి) అతి + ఉగ్రము
 జవాబు:
 డి) అతి + ఉగ్రము
41. దధ్యోదనం – ఇది ఏ సంధి?
 ఎ) సునీతి పరిమళాలు
 బి) నీతి పరిమళాలు
 సి) పరిమళనీతులు
 డి) అపరిమళనీతులు
 జవాబు:
 ఎ) సునీతి పరిమళాలు
42. చిట్టచివర ఉన్నాను – దీనిని విడదీయడం గుర్తించండి.
 ఎ) చిట్టి + చివర
 బి) చివర + చివర
 సి) చిట్ట + చివర
 డి) చిరు + చివర
 జవాబు:
 బి) చివర + చివర
43. ద్విరుక్తము యొక్క పరరూపాన్ని ఏమంటారు?
 ఎ) ఆమ్రేడితం
 బి) త్రికము
 సి) ఉత్వ
 డి) శత్రర్థకం
 జవాబు:
 ఎ) ఆమ్రేడితం
44. వృద్ధులు అనగా ఏవి?
 ఎ) ఆ, ఈ, ఏ
 బి) ఉ, ఋ, ఎ
 సి) య, వ, ర, ల
 డి) ఐ, ఔ
 జవాబు:
 డి) ఐ, ఔ

45. దేశోన్నత్యం పెరగాలి – ఇది ఏ సంధి?
 ఎ) అత్వసంధి
 బి) వృద్ధిసంధి
 సి) త్రికసంధి
 డి) యణాదేశ సంధి
 జవాబు:
 బి) వృద్ధిసంధి
46. క్రింది వానిలో పొసగని సంధి ఏది?
 ఎ) ఇత్వసంధి
 బి) ఉత్వసంధి
 సి) త్రికసంధి
 డి) అత్వసంధి
 జవాబు:
 సి) త్రికసంధి
47. మనోవేగంతో వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ సంధి?
 ఎ) త్రికసంధి
 బి) విసర్గసంధి
 సి) గుణసంధి
 డి) వృద్ధి సంధి
 జవాబు:
 బి) విసర్గసంధి
సమాసాలు :
48. సంఖ్యా శబ్దం కలిగిన సమాసమును గుర్తించండి.
 ఎ) ద్వంద్వ సమాసం
 బి) ద్విగు సమాసం
 సి) షష్ఠీ తత్పురుష
 డి) తృతీయా తత్పురుష
 జవాబు:
 బి) ద్విగు సమాసం
49. వనకరి – ఇది ఏ సమాసము?
 ఎ) ద్వితీయా తత్పురుష
 బి) చతుర్థి తత్పురుష
 సి) సప్తమీ తత్పురుష
 డి) అవ్యయీభావ సమాసం
 జవాబు:
 సి) సప్తమీ తత్పురుష
50. గుణసంయుతులు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
 ఎ) గుణమునందు సంయుతులు
 బి) గుణము యొక్క సంయుతులు
 సి) గుణములతో సంయుతులు
 డి) గుణం వల్ల సంయుతులు
 జవాబు:
 బి) గుణము యొక్క సంయుతులు
51. నీతి యొక్క పరిమళాలు – దీనికి సమస్త పదం గుర్తించండి.
 ఎ) యణాదేశ సంధి
 బి) గుణసంధి
 సి) త్రికసంధి
 డి) సవర్ణదీర్ఘ సంధి
 జవాబు:
 బి) గుణసంధి
52. సూర్యుని దెస – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
 ఎ) దెస సూర్యుడు
 బి) సూర్యదేస
 సి) అసూర్యదెస
 డి) సూర్యుని యొక్క దెస
 జవాబు:
 డి) సూర్యుని యొక్క దెస

53. దినము దినము – దీన్ని సమాసపదంగా గుర్తించండి.
 ఎ) యథాదినం
 బి) ప్రతిదినం
 సి) దినంప్రతి
 డి) అనుదినం
 జవాబు:
 బి) ప్రతిదినం
54. తల్లిదండ్రులు – ఇది ఏ సమాసం?
 ఎ) ద్వంద్వ సమాసం
 బి) అవ్యయీభావం
 సి) కర్మధారయం
 డి) ద్విగు సమాసం
 జవాబు:
 ఎ) ద్వంద్వ సమాసం
55. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసాన్ని గుర్తించండి.
 ఎ) బహుజొహి
 బి) కర్మధారయం
 సి) అవ్యయీభావం
 డి) తత్పురుష
 జవాబు:
 ఎ) బహుజొహి
గణవిభజన:
56. రగణం – దీనికి గణాలు గుర్తించండి.
 ఎ) UUI
 బి) UUU
 సి) UIU
 డి) IUU
 జవాబు:
 సి) UIU
57. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి?
 ఎ) చంపకమాల
 బి) ఉత్పలమాల
 సి) మత్తేభం
 డి) శార్దూలం
 జవాబు:
 సి) మత్తేభం
58. క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబు లై వారిద – ఇది ఏ పద్యపాదమో తెల్పండి.
 ఎ) చంపకమాల
 బి) మత్తేభం
 సి) శార్దూలం
 డి) ఉత్పలమాల
 జవాబు:
 బి) మత్తేభం

59. ఘోరవికార సన్నిహిత కోపముఖంబులు, దీప్తవిద్యుడు – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి.
 ఎ) ఉత్పలమాల
 బి) చంపకమాల
 సి) శార్దూలం
 డి) మత్తేభం
 జవాబు:
 ఎ) ఉత్పలమాల
60. UUU – ఇది ఏ గణం?
 ఎ) మ గణం
 బి) య గణం
 సి) త గణం
 డి) స గణం
 జవాబు:
 ఎ) మ గణం
61. ఆటవెలదిలోని రెండు, నాలుగు పాదాల్లో ఉండే గణాలు గుర్తించండి.
 ఎ) 3 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు
 బి) 5 సూర్యగణాలు
 సి) 2 సూర్యగణాలు 3 ఇంద్రగణాలు
 డి) 5 ఇంద్రగణాలు
 జవాబు:
 బి) 5 సూర్యగణాలు
వాక్య రకాలు :
62. రాము తప్పక వస్తాడు – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) విధ్యర్థక వాక్యం
 బి) ఆనంతర్యార్థక వాక్యం
 సి) నిశ్చయార్థక వాక్యం
 డి) అప్యర్థక వాక్యం
 జవాబు:
 సి) నిశ్చయార్థక వాక్యం
63. రవి పాఠం విని నిద్రపోయాడు – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) విధ్యర్థక వాక్యం
 బి) సంక్లిష్ట వాక్యం
 సి) సంయుక్త వాక్యం
 డి) సామాన్య వాక్యం
 జవాబు:
 బి) సంక్లిష్ట వాక్యం
64. “నాకు ఆటలంటే ఇష్టం” అని రవి అన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) కర్తరి వాక్యం
 బి) ప్రత్యక్ష కథన వాక్యం
 సి) పరోక్ష కథన వాక్యం
 డి) కర్మణి వాక్యం
 జవాబు:
 బి) ప్రత్యక్ష కథన వాక్యం

65. మీకు మేలు కలుగుగాక – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) చేదర్థకం
 బి) ఆశీరార్థకం
 సి) అభ్యర్థకం
 డి) ధాత్వర్ధకం
 జవాబు:
 ఎ) చేదర్థకం
66. బాగా చదివితే మార్కులు వస్తాయి – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
 ఎ) హేత్వర్థక వాక్యం
 బి) తర్థర్మార్థక వాక్యం
 సి) చేదర్థక వాక్యం
 డి) అభ్యర్థక వాక్యం
 జవాబు:
 బి) తర్థర్మార్థక వాక్యం
67. గరుత్మంతుడు దాస్యం తొలగించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
 ఎ) గరుత్మంతునిచేత దాస్యం తొలగించబడింది
 బి) గరుత్మంతుని వల్ల దాస్యం చేరింది
 సి) గరుత్మంతునికి దాన్యం తొలగాలి
 డి) దాస్యంచేత గరుత్మంతుడు తొలగించాడు
 జవాబు:
 ఎ) గరుత్మంతునిచేత దాస్యం తొలగించబడింది
68. రైలు వచ్చింది గాని చుట్టాలు రాలేదు – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) విధ్యర్థక వాక్యం
 బి) హేత్వర్థక వాక్యం
 సి) అప్యర్థక వాక్యం
 డి) సంయుక్త వాక్యం
 జవాబు:
 డి) సంయుక్త వాక్యం

69. గరుత్మంతుడు ఎగిరి వెళ్ళాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
 ఎ) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళియుండకూడదు
 బి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళలేదు
 సి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళవచ్చు
 డి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళకూడదు
 జవాబు:
 బి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళలేదు
సొంతవాక్యాలు :
70. అన్యులు : కుటుంబ విషయాలను అన్యులకు చెప్పరాదు.
71. గుప్తము : విద్య మానవునికి గుప్తమగు ధనము.
72. ఉత్తముడు : శ్రీరాముడు మానవులలో పరమ ఉత్తముడు.
73. కరుణ : పేదప్రజలపై ధనవంతులు కరుణ చూపాలి.
74. సమర్థులు : సమర్థులు మాత్రమే అసాధ్యములైన పనులు చేస్తారు.
75. ప్రసిద్ధికెక్కు : అమరావతి చారిత్రాత్మకంగా మిక్కిలి ప్రసిద్ధికెక్కింది.
76. ఉపాయము : ఉపాయముతో అపాయాన్ని తొలగించుకోవచ్చు.
78. దాస్యము : విదేశీయుల పాలనలో భారతీయులు దాస్యము అనుభ వించారు.
79. విముక్తులు : ఖైదీలు సత్ప్రవర్తనతో జైలు నుండి విముక్తులయ్యారు.
80. దీవెనలు : తల్లిదండ్రులు తమ పిల్లలకు దీవెనలు అందజేస్తారు.
