SCERT AP 9th Class Physical Science Guide Pdf Download 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ? Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Physical Science 3rd Lesson Questions and Answers మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ?
9th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ? Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
 కింది వాటిని వేరుచేయడానికి ఏ విధమైన పద్దతులను వాడతారు? (AS 1)
 జవాబు:
| మిశ్రమం | వేరుచేయు పద్ధతి | 
| ఎ. సోడియం క్లోరైడ్ జల ద్రావణం నుండి సోడియం క్లోరైడ్ | స్ఫటికీకరణం | 
| బి. సోడియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్ మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడ్ | ఉత్పతనము | 
| సి. కారు ఇంజన్ ఆయిల్ లోనున్న చిన్న లోహపు ముక్కలు | వడపోత | 
| డి. వివిధ పుష్పాల ఆకర్షణ పత్రావళి నుండి వర్ణదములు | క్రొమటోగ్రఫీ | 
| ఇ. పెరుగు నుండి వెన్న | అపకేంద్రనము | 
| ఎఫ్. నీటి నుండి నూనె | వేర్పాటు గరాటు | 
| జి. తేనీరు నుండి టీ పొడి | వడపోత | 
| హెచ్. ఇసుక నుండి ఇనుప ముక్కలు | అయస్కాంతము | 
| ఐ. ఊక నుండి గోధుమలు | తూర్పారబట్టుట | 
| జె. నీటిలో అవలంజనం చెందిన బురద కణాలు | తేర్చుట, వడపోయుట (లేదా) ఫిల్టర్ పేపరును ఉపయోగించి వడపోయుట | 
ప్రశ్న 2.
 సరైన ఉదాహరణలతో ఈ క్రింది వాటిని వివరించండి. (AS 1)
 ఎ) సంతృప్త ద్రావణం బి) శుద్ధ పదార్ధం సి) కొలాయిడ్ డి) అవలంబనం
 జవాబు:
 ఎ) సంతృప్త ద్రావణం :
 ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరగగలదో అంతే ద్రావితాన్ని కలిగియున్న ద్రావణంను “సంతృప్త ద్రావణం” అంటారు.
 
- ఒక ఖాళీ కప్పులో 50 మి.లీ నీటిని పోయండి.
- దానిలో ఒక చెంచా చక్కెరను తీసుకుని కరిగేంతవరకు బాగా కలపండి.
- అది కరిగిన తర్వాత మరొక చెంచా కలపండి. ఇలా దీనిలో చక్కెర ఇంకా ఏ మాత్రం కరగదు అనేంత వరకు కలపండి.
- ఇలా ఏర్పడిన ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు.
బి) శుద్ధ పదార్థం :
 
 ఒక పదార్థం శుద్ధమైనది అంటే అది సజాతీయమైనది. ఆ పదార్థం యొక్క ఏ భాగం నుండి తీసుకున్న నమూనాలోనైనా సంఘటనంలో మార్పు ఉండదు.
 ఉదా : శుద్ధమైన బంగారం బిస్కెట్ నుండి ఏ సూక్ష్మభాగాన్ని నమూనాగా తీసుకుని పరిశీలించినా, సంఘటనం ఒకేలా ఉంటుంది.
సి) కొలాయిడ్ :
 కొలాయిడ్ లేదా కాంజికాభకణ ద్రావణాలు విజాతీయ మిశ్రమాలు. వీటి కణాల పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కాంతిపుంజాలను పరిక్షేపించగలిగేంతగా ఉంటాయి.
 ఉదా : పాలు, వెన్న, జున్ను, క్రీమ్, జెల్, షూ పాలిష్ వంటివి కొలాయిడ్ ద్రావణాలకు ఉదాహరణలు.
డి) అవలంబనం :
 ఒక ద్రావణిలో కరగకుండా ఉండి మన కంటితో చూడగలిగే పదార్థాల కణాలతో అవలంబనాలు ఏర్పడుతాయి. ఇవి ‘విజాతీయ’ మిశ్రమాలు,
 ఉదా : సిరట్లు, నీటిలో కలిపిన సుద్దపొడి మిశ్రమం మొదలగునవి అవలంబనాలకు ఉదాహరణలు.
ప్రశ్న 3.
 మీకు ఒక రంగులేని ద్రవంను ఇస్తే అది శుద్ధమైన నీరు అని ఎలా నిర్ధారిస్తారు? (AS 1)
 జవాబు:
- ముందుగా వాసనను చూడాలి. అది ఏ విధమైన వాసనను కలిగియుండరాదు.
- సాధారణ కంటితో గమనించినపుడు దానిలో ఏ విధమైన అవలంబన కణాలుగాని, పొగలు గాని, గాలి బుడగలు గాని కనబడవు.
- ఒక కాంతికిరణాన్ని పంపితే అది విక్షేపం చెందదు.
- ఆ ద్రవం ఉష్ణోగ్రత సాధారణంగా ఉండాలి. అప్పుడు ఆ ద్రవం శుద్ధమైన నీరు.

ప్రశ్న 4.
 ఈ క్రింద పేర్కొన్న వస్తువులలో శుద్ధ పదార్థములు ఏవో తెలిపి, కారణం రాయండి. (AS 1)
 ఎ) ఐస్ ముక్క బి) పాలు సి) ఇనుము డి) హైడ్రోక్లోరికామ్లం ఇ) కాల్షియం ఆక్సెడ్ ఎఫ్) మెర్క్యూరి జి) ఇటుక హెచ్) కర్ర ఐ) గాలి
 జవాబు:
 ఇటుక, కర్ర తప్ప మిగిలిన పదార్థాలను శుద్ధ పదార్థాలుగా చెప్పవచ్చు.
కారణం :
 ఇటుక, కర్ర తప్ప పైన పేర్కొన్న మిగిలిన పదార్థాల నుండి ఏ సూక్ష్మ భాగాన్ని తీసుకుని పరిశీలించినా, వాటి అనుఘటకాలలో ఏ మార్పు ఉండదు.
ప్రశ్న 5.
 ఈ క్రింద ఇవ్వబడిన మిశ్రమాలలో ద్రావణాలను పేర్కొనుము. (AS 1)
 ఎ) మట్టి బి) సముద్రపు నీరు సి) గాలి డి) నేలబొగ్గు ఇ) సోదానీరు
 జవాబు:
 సముద్రపు నీరు, గాలి, సోడానీరు ద్రావణాలు.
ప్రశ్న 6.
 ఈ క్రింది వాటిని జాతీయ, విజాతీయ మిశ్రమాలుగా వర్గీకరించి కారణములను తెలుపుము. (AS 1)
 సోడానీరు, కర్ర, గాలి, మట్టి, వెనిగర్, వడపోసిన తేనీరు.
 జవాబు:
| సజాతీయ మిశ్రమాలు | విజాతీయ మిశ్రమాలు | 
| సోడానీరు, గాలి, వెనిగర్, వడపోసిన తేనీరు. కారణము : పై మిశ్రమాలలోని అనుఘటకాలు మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించుకుని ఉన్నాయి. వాటిని మనం కంటితో చూడలేము. | మట్టి, కర్ర. కారణము : పై మిశ్రమాలలోని అనుఘటకాలు ఏకరీతిగా విస్తరించుకొని లేవు. | 
ప్రశ్న 7.
 ఈ కింది వానిని మూలకాలు, సంయోగ పదార్థాలు మరియు మిశ్రమాలుగా వర్గీకరించండి. (AS 1)
 ఎ) సోడియం బి) మట్టి సి) చక్కెర ద్రావణం డి) వెండి ఇ) కాల్షియం కార్బొనేట్ ఎఫ్) టిన్ జి) సిలికాన్ హెచ్) నేలబొగ్గు బి) గాలి జె) సబ్బు కె) మీథేన్ ఎల్) కార్బన్ డై ఆక్సైడ్ ఎమ్) రక్తం
 జవాబు:
| మూలకాలు | సంయోగ పదార్థాలు | మిశ్రమాలు | 
| సోడియం | కాల్షియం కార్బొనేట్ | మట్టి | 
| వెండి | బొగ్గు | చక్కెర ద్రావణం | 
| టిన్మ మీథేన్ | గాలి | |
| సిలికాన్ | కార్బన్ డైఆక్సైడ్ | రక్తం | 
| సబ్బు | 
ప్రశ్న 8.
 ఈ కింద ఇచ్చిన పదార్థాలను పట్టికలో చూపినట్లు వర్గీకరించి నమోదు చేయండి. (AS 1)
 సిరా, సోదానీరు, ఇత్తడి, పొగమంచు, రక్తం, ఏరోసాల్ స్త్రీలు, ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాఫీ, నూనె, నీరు, షూ పాలిష్, గాలి, గోళ్ళ పాలిష్, ద్రవరూపంలో ఉన్న గంజి (Liquid starch), పాలు.
 జవాబు:
| ద్రావణం | అవలంబనం | కొలాయిడ్ | 
| సోడానీరు | సిరా | పొగమంచు | 
| ఫ్రూట్ సలాడ్ | గోళ్ళ పాలిష్ | ఏరోసాల్ స్ప్రేలు | 
| బ్లాక్ కాఫీ | ద్రవరూపంలోనున్న గంజి | షూ పాలిష్ | 
| గాలి | పాలు | |
| ఇత్తడి | రక్తం | 
ప్రశ్న 9.
 100 గ్రాముల ఉప్పు ద్రావణంలో 20 గ్రాముల ఉప్పు కలిగి ఉంది. ఈ ద్రావణపు ద్రవ్యరాశి శాతం ఎంత? (AS 1)
 జవాబు:
 ఉప్పు ద్రవ్యరాశి = 20 గ్రా
 ఉప్పు ద్రావణం ద్రవ్యరాశి = 100 గ్రా.
 
ప్రశ్న 10.
 50 మి.లీ. పొటాషియం క్లోరైడ్ (KCI) ద్రావణంలో 2.5 గ్రా. పొటాషియం క్లోరైడ్ ఉంటే ఆ ద్రావణం యొక్క ద్రవ్యరాశి /ఘనపరిమాణ శాతం కనుక్కోంది. (AS 1)
 జవాబు:
 పొటాషియం క్లోరైడ్ ద్రవ్యరాశి = 2.5 గ్రా
 పొటాషియం క్లోరైడ్ ద్రావణం ద్రవ్యరాశి = 50 మి.లీ.
 
ప్రశ్న 11.
 ఈ క్రింది వాటిలో ఏవి బొండాల్ ప్రభావమును ప్రదర్శిస్తాయి ? వాటిలో టిండాల్ ప్రభావమును మీరెలా ప్రదర్శించి చూపుతారు? (AS 2, AS 3)
 ఎ) లవణ ద్రావణం బి) పాలు సి) కాపర్ సల్ఫేట్ ద్రావణం డి) గంజి ద్రావణం
 జవాబు:
 పాలు టిండాల్ ప్రభావమును చూపును.
 ప్రదర్శన :
- పాలు, కాపర్ సల్ఫేట్, లవణము మరియు గంజి ద్రావణాలను వేరు వేరు గాజు బీకరులలో తయారుచేయుము.
- ప్రతి ఒక్క బీకరు గుండా కాంతి పుంజాన్ని ప్రసరింపజేయుము.
- పాల గుండా కాంతిపుంజం మనకు స్పష్టంగా కనబడును.
- మిగిలిన ద్రావణాల గుండా కాంతిపుంజం కనబడదు.
- ఈ ప్రయోగాన్ని చీకటి గదిలో చేస్తే ఫలితం ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది.

ప్రశ్న 12.
 ఒక ద్రావణం, అవలంబనం, కొలాయిడల్ విక్షేపణాలను వివిధ బీకర్లలో తీసుకోండి. బీకరు పక్క భాగంపై కాంతి పడేటట్లు చేసి ప్రతీ మిశ్రమం టిండాల్ ప్రభావంను చూపుతుందో, లేదో పరీక్షించండి. (AS 3)
 జవాబు:
- చక్కెర ద్రావణం (ద్రావణం), గంజి ద్రావణం (అవలంబనం) మరియు పాలు (కొలాయిడల్ విక్షేపణం)లను మూడు వేరు వేరు బీకర్లలో తీసుకోండి.
- ప్రతి బీకరు యొక్క పక్క భాగంపై టార్చ్ లేదా లేసర్ లైట్ సహాయంతో ఒక కాంతిపుంజాన్ని పడేటట్టు చేసి పరిశీలించండి.
- ప్రతి బీకరులోని ద్రావణం గుండా కాంతిపుంజాన్ని స్పష్టంగా చూడవచ్చు.
- కావున పైన పేర్కొన్న ద్రావణాలన్నీ టిండాల్ ప్రభావాన్ని చూపుతాయి.
ప్రశ్న 13.
 స్వేదన ప్రక్రియ మరియు అంశిక స్వేదన ప్రక్రియల కొరకు పరికరాల అమరికను చూపే పటాలను గీయండి. ఈ రెండు ప్రక్రియలలో వాడే పరికరాల మధ్య ఏమి తేడాను గమనించారు? (AS 5, AS 1)
 జవాబు:
 
 
 ఈ రెండు పరికరాల మధ్య ప్రధాన భేదమేమనగా, అంశిక స్వేదన ప్రక్రియకు వాడే పరికరంలో స్వేదన కుప్పెడు, కండెన్సరకు మధ్య స్వేదన గది ఉంటుంది.
ప్రశ్న 14.
 తేనీరు(tea)ను ఏ విధంగా తయారుచేస్తారో రాయండి. ఈ కింద పేర్కొన్న పదాలను ఉపయోగించి తేనీరు తయారీ విధానాన్ని తెలపండి. (AS 7)
 ద్రావణం, ద్రావణి, ద్రావితం, కరగదం, కరిగినది, కరిగేది, కరగనిది, వడపోయబడిన పదార్థం , వదపోయగా మిగిలిన పదార్థం
 జవాబు:
- ఒక టీ కెటిల్ నందు ఒక కప్పు పాలు (ద్రావణి) తీసుకోండి.
- ఒక టేబుల్ స్పూన్ చక్కెర (ద్రావితము), ఒక టేబుల్ స్పూన్ టీ పొడి (కరగనిది) మరియు పాలు (ద్రావణి) కలపండి.
- ఈ మిశ్రమాన్ని స్టా మీద పెట్టి వేడిచేయండి.
- చక్కెర (ద్రావితము) పాలు (ద్రావణి) లో కరుగుతుంది. టీ పొడి కరగకుండా అడుగున మిగిలిపోతుంది.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడపోయండి.
- వడపోయగా మిగిలిన ద్రావణమే తేనీరు.
- జల్లెడలో మిగిలిన అవక్షేపం ద్రావణిలో కరగని పదార్థం.
9th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ? Textbook InText Questions and Answers
9th Class Physical Science Textbook Page No. 38
ప్రశ్న 1.
 లాండ్రీ డయర్ తడి బట్టల నుండి నీటిని ఎలా వేరుచేస్తుంది?
 జవాబు:
- బట్టలు ఉతికే యంత్రంలోనున్న డ్రయర్, గోడలకు రంధ్రాలున్న ఒక స్థూపాకార పాత్రను కలిగియుంటుంది.
- తడి బట్టలను ఆ స్థూపాకార పాత్రలో వేసి, విద్యుత్ మోటారు సహాయంతో అధిక వేగంతో దానిని తిప్పుతారు.
- అపకేంద్ర బలం వల్ల బట్టలలోని నీరు పాత్ర గోడలవద్దకు చేరుకుని, పాత్రకు గల రంధ్రాల ద్వారా బయటకు నెట్టివేయబడుతుంది.
- ఈ విధంగా యంత్రం తడి బట్టల నుండి నీటిని వేరుచేయగలుగుతుంది.
9th Class Physical Science Textbook Page No. 40
ప్రశ్న 2.
 “అన్ని ద్రావణాలు మిశ్రమాలే, కాని అన్ని మిశ్రమాలు ద్రావణాలు కావు”. ఈ వాక్యం సరైనదో కాదో చర్చించి మీ వాదనను సమర్థించే విధంగా సరైన కారణాలు రాయండి.
 జవాబు:
- ఉప్పు ద్రావణము లేదా చక్కెర ద్రావణము వంటి వాటిని తీసుకున్నట్లయితే, ఇవి సజాతీయ మిశ్రమాలు. కావున ఇవి ద్రావణాలు.
- ఇసుక, ఇనుపరజనుల మిశ్రమాన్ని తీసుకున్నట్లయితే, ఇది విజాతీయ మిశ్రమము. కావున ఇది ద్రావణం కాదు.
ప్రశ్న 3.
 సాధారణంగా ద్రావణాలను ఘన / ద్రవ / వాయు పదార్థాలు కలిగి ఉన్న ద్రవాలుగానే భావిస్తాం. కాని కొన్ని ఘన ద్రావణాలు కూడా ఉన్నాయి. వీటికి కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా?
 జవాబు:
- నిర్మాణాలలో వాడే ఉక్కు (ఇది ఇనుము మరియు కార్బన్ సజాతీయ మిశ్రమము).
- ఇత్తడి (ఇది జింక్ మరియు కాపర్ సజాతీయ మిశ్రమము).
9th Class Physical Science Textbook Page No. 43
ప్రశ్న 4.
 జలుబు, దగ్గుతో బాధపడుచున్నపుడు మీరు త్రాగే సిరపను ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలించారా? ఈ మందును త్రాగడానికి ముందు ఎందుకు బాగా కుదుపుతారు? ఇది అవలంబనమా? లేదా కాంజికాభ ద్రావణమా?
 జవాబు:
- జలుబు, దగ్గుకు వాడే సిరప్ కు అడుగు భాగాన కొన్ని కరగని పదార్థాలు తేరుకొని ఉంటాయి. కావున ఈ మందును వాడే ముందు బాగా కుదుపుతారు.
- కావున దగ్గుకు వాడే సిరప్ ఒక అవలంబనము.

9th Class Physical Science Textbook Page No. 45
ప్రశ్న 5.
 నిజ ద్రావణమునకు, కొలాయిడ్ ద్రావణమునకు మధ్య తేడాలు ఉన్నాయా ? మీరు వాటి మధ్య తేడాలు గమనిస్తే అవి ఏమిటి?
 జవాబు:
 నిజ ద్రావణమునకు, కొలాయిడ్ ద్రావణమునకు మధ్య తేడాలు :
| ధర్మము | నిజ ద్రావణము | కొలాయిడ్ ద్రావణము | 
| 1. కణాల పరిమాణము | < 1 నానో మీటర్ | 1 – 1000 నానో మీటర్లు | 
| 2. వడపోత ధర్మం | కొలాయిడ్ ద్రావణ కణాలు వడపోత కాగితం గుండా ప్రవహిస్తాయి. | నిజ ద్రావణ కలు వడపోత కాగితంలో త్వరగా విక్షేపణం చెందుతాయి. | 
| 3. స్వభావం | ఇది సజాతీయము. | ఇది విజాతీయము. | 
| 4. కంటికి కనబడే స్వభావం | వీటి కణాలు సాధారణ కంటికి కనబడవు. | వీటి కణాలు కూడా కంటికి కనబడవు. | 
| 5. టిండాల్ ప్రభావము | టిండాల్ ప్రభావమును చూపవు. | టిండాల్ ప్రభావమును చూపుతాయి. | 
| 6. పారదర్శకత | ఇవి సంపూర్ణ పారదర్శకాలు. | ఇవి పాక్షిక పారదర్శకాలు. | 
9th Class Physical Science Textbook Page No. 46
ప్రశ్న 6.
 ధాన్యం మరియు ఊక అదే విధంగా అమ్మోనియం క్లోరైడ్ మరియు ఉప్పు మొదలగునవి విజాతీయ మిశ్రమాలు అయినప్పటికీ వాటిని వేరుచేయుటకు వేరు వేరు పద్ధతులను ఎందుకు వాడుతున్నాము?
 జవాబు:
- ధాన్యము మరియు ఊక మిశ్రమాన్ని వేరుచేయుటకు మనము తూర్పారబట్టడం అనే పద్ధతిని వాడుతాము. ఎందుకంటే ఊక చాలా తేలికైనది కావున ఇది గాలిలో తేలుతుంది.
- అమ్మోనియం క్లోరైడ్, ఉప్పుల మిశ్రమాన్ని వేరుచేయుటకు మనము ఉత్పతనము అనే పద్దతిని వాడుతాము. ఎందుకంటే అమ్మోనియం క్లోరైడ్ ఉత్పతనం చెందుతుంది.
ప్రశ్న 7.
 ఒక మిశ్రమాన్ని వేరుచేయడానికి ఏ పద్ధతి అనువైనది అనే విషయాన్ని దేని ఆధారంగా నిర్ణయిస్తామో చర్చించండి.
 జవాబు:
 ఒక మిశ్రమాన్ని వేరుచేయడానికి ఏ పద్ధతి అనువైనది అనే విషయాన్ని ఆ మిశ్రమంలోని అనుఘటకాల ధర్మాలైన నీటిలో కరుగుట, బాష్పీభవన స్థానము, వాటి బాహ్య నిర్మాణము, కణాల పరిమాణము వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తాము.
9th Class Physical Science Textbook Page No. 50
ప్రశ్న 8.
 గాలిలోని వాయువులన్నింటిని వాటి వాటి మరగుస్థానాలు పెరిగే క్రమంలో అమర్చండి. ఏం గమనించారు?
 జవాబు:
| వాయువు | మరగు స్థానం | 
| హీలియం | 268.93°C | 
| హైడ్రోజన్ | 252.9°C | 
| నియాన్ | 246.08°C | 
| నైట్రోజన్ | 195.8°C | 
| ఆర్గాన్ | 185.8°C | 
| ఆక్సిజన్ | 183°C | 
| మీథేన్ | 164°C | 
| క్రిప్టాన్ | 153.22°C | 
| జీనాన్ | 108.120 | 
| కార్బన్ డయాక్సైడ్ | 78°C | 
ప్రశ్న 9.
 గాలి చల్లబడడం వలన ఏ వాయువు ముందుగా ద్రవరూపంలోకి మారుతుంది?
 జవాబు:
 గాలి చల్లబడడం వలన ఆక్సిజన్ ముందుగా ద్రవరూపంలోకి మారుతుంది.
9th Class Physical Science Textbook Page No. 40
ప్రశ్న 10.
 సజాతీయ మిశ్రమాలకు మీరు కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా?
 జవాబు:
 చక్కెర ద్రావణం, నిమ్మరసం, పండ్ల రసాలు, వైద్యంలో వాడే టానిన్లు, సిరట్లు మొదలగునవి.

ప్రశ్న 11.
 ద్రావణంలో కాంతికిరణ మార్గాన్ని మనం చూడలేము. దీనిని మీరు ప్రయోగం ద్వారా నిరూపించగలరా?
 జవాబు:
- ఒక పరీక్ష నాళికలో చిక్కటి పాలను తీసుకోండి.
- టార్చిలైటు / లేజర్ లైట్ ద్వారా కాంతికిరణ పుంజాన్ని బీకరులోనికి ప్రసరింపచేయండి.
- కాంతికిరణ మార్గాన్ని మనం ఆ ద్రావణంలో చూడలేము.
ప్రశ్న 12.
 ద్రావణంను విలీనపరిచినపుడు కాంతి మార్గంను మనం చూడగలమా?
 జవాబు:
 ద్రావణంను విలీనపరిచినపుడు కాంతి మార్గంను మనం చూడలేము.
ప్రశ్న 13.
 మీరు కొంచెం ఎక్కువ ద్రావితంను ద్రావణికి కలిపితే ఏమి జరుగుతుంది?
 జవాబు:
 ద్రావణం యొక్క గాఢత పెరుగుతుంది.
ప్రశ్న 14.
 ఒక ద్రావణంలో ఎంత శాతం ద్రావితం ఉందో మీరు ఎలా నిర్ధారిస్తారు?
 జవాబు:
- ఒక బీకరులో 100 మి.లీ. ద్రావణంను తీసుకోండి.
- ఒక ప్లేటులో 50 గ్రా. చక్కెరను తీసుకోండి.
- బీకరులోని నీటికి ఒక టేబుల్ స్పూన్ చక్కెరను కలిపి అది కరిగేంతవరకు బాగా కలపండి.
- ఇదే విధంగా చక్కెరను, నీటిలో చక్కెర కరగని స్థితి వచ్చేవరకు కలుపుతూ ఉండండి.
- ఇప్పుడు ప్లేటులో మిగిలిన చక్కెర బరువును కనుక్కోండి.
- ఈ బరువును 50 గ్రా. నుండి తీసివేయండి. ఈ బరువు నీటిలో కరిగిన చక్కెర బరువును తెలుపుతుంది.
- కావున 100 మి.లీ. ల ద్రావణిలో కరిగియున్న ద్రావిత గరిష్ఠ పరిమాణాన్ని ద్రావిత శాతం (ద్రావణీయత) అంటారు.
9th Class Physical Science Textbook Page No. 44
ప్రశ్న 15.
 సినిమా థియేటర్లలో టిందాల్ ప్రభావాన్ని మీరెప్పుడైనా గమనించారా?
 జవాబు:
 సినిమా థియేటర్లలో సినిమా నడిచేటప్పుడు ప్రొజెక్టరు వైపు గమనిస్తే, ప్రొజెక్టరు నుండి తెర వైపుకి ఒక కాంతి కిరణపుంజం కనిపిస్తుంది. ఆ కాంతి కిరణపుంజంలో దుమ్ము, ధూళి కణాలు కూడా కనిపిస్తాయి. ఇది టిండాల్ ప్రభావము.
9th Class Physical Science Textbook Page No. 46
ప్రశ్న 16.
 ఈ మిశ్రమం విజాతీయ సమ్మేళనమా? కారణాలు తెలపండి.
 జవాబు:
 అమ్మోనియం క్లోరైడ్ మరియు ఉప్పుల మిశ్రమం విజాతీయ మిశ్రమం. ఇవి రెండూ తెల్లరంగులో ఉన్నప్పటికీ, వాటి కణాలు ఒకదానితోనొకటి కలవవు.
ప్రశ్న 17.
 అమ్మోనియం క్లోరైడ్ మరియు ఉప్పుల మిశ్రమం నుండి ఉప్పు మరియు అమ్మోనియం క్లోరైడ్ లను ఎలా వేరుచేస్తారు?
 జవాబు:
 అమ్మోనియం క్లోరైడ్ మరియు ఉప్పుల మిశ్రమం నుండి ఉప్పు మరియు అమ్మోనియం క్లోరైడ్లను ఉత్పతనము ద్వారా వేరుచేస్తారు.
9th Class Physical Science Textbook Page No. 49
ప్రశ్న 18.
 అంశిక స్వేదన ప్రక్రియను ఉపయోగించే సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వండి.
 జవాబు:
 ముడి చమురులోని అనుఘటకాలైన పెట్రోల్, నాఫ్తలీన్, కిరోసిన్, గ్రీజు వంటి వాటిని వేరుచేయుటకు అంశిక స్వేదన ప్రక్రియను ఉపయోగిస్తారు.
ఉదాహరణ సమస్యలు
9th Class Physical Science Textbook Page No. 42
ప్రశ్న 1.
 200 గ్రా||ల నీటిలో 50 గ్రా.ల ఉప్పు కలిగియున్నది. ఆ ద్రావణం యొక్క ద్రావణ ద్రవ్యరాశి శాతాన్ని కనుక్కోండి.
 జవాబు:
 ద్రావిత ద్రవ్యరాశి (లవణం) = 50 గ్రా||
 ద్రావణి ద్రవ్యరాశి (నీరు) | = 200 గ్రా||
 ద్రావణం ద్రవ్యరాశి = ద్రావిత ద్రవ్యరాశి + ద్రావణి ద్రవ్యరాశి
 = 50 + 200 = 250 గ్రా||
 
ప్రశ్న 2.
 80 మిల్లీ లీటర్ల ద్రావణంలో 20 మిల్లీ లీటర్ల చక్కెర కరిగి ఉన్నది. ఆ ద్రావణపు ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతంను కనుక్కోండి.
 జవాబు:
 ద్రావణ ఘనపరిమాణము = 80 మి.లీ||
 ద్రావిత ద్రవ్యరాశి = 20 మి.లీ||
 
పరికరాల జాబితా
కవ్వం, పాత్ర, పాలు, అపకేంద్రయంత్రం నమూనా, నూనెనీరు, నూనె వెనిగర్, నీరూనాఫ్తలీన్, పింగాణీ కప్పు, చక్కెర, ఉప్పు, టార్చిలైటు లేదా లేజరు లైటు, నలుపు రంగు మార్కర్, పెన్సిల్, సెల్లోటేపు, నీరు, నూనె, కిరోసిన్, రెండు పరీక్ష నాళికలు, గాజు బీకర్లు, సారాయి దీపం, గాజు కడ్డీ, వడపోత కాగితం, గాజు గరాటు, బీకరు, వాచ్ గ్లాస్, వేర్పాటు గరాటు, స్వేదన కుప్పె, అంశిక స్వేదన కుప్పె, పింగాణి కుప్పె, అయస్కాంతం, సుద్దపొడి, అమ్మోనియం క్లోరైడ్, ఉప్పు, సిరా, ఇనుపరజను, సల్ఫర్ పొడి.
9th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ? Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
వెన్నతీయని పాలు శుద్ధమైనవా? :
ప్రశ్న 1.
 పాల నుండి వెన్నను వేరుచేయు విధానమును వివరించుము.
 
 జవాబు:
- ఒక పాత్రలో పాలు తీసుకొని, కవ్వముతో కొద్దిసేపు చిలకండి.
- ఈ విధంగా చిలికిన కొంత సేపటికి పేస్ట్ లా ఉండే చిక్కటి ఘనపదార్థం, పాల నుండి వేరగుటను గమనించవచ్చును.
- ఈ చిక్కని పదార్థాన్నే వెన్న అంటారు.
కృత్యం – 2
సజాతీయ, విజాతీయ మిశ్రమాలను గుర్తించుట :
ప్రశ్న 2.
 సజాతీయ, విజాతీయ మిశ్రమాలను గుర్తించడానికి ఒక కృత్యాన్ని వివరించండి.
 జవాబు:
- రెండు పరీక్షనాళికలను తీసుకొని, ఒకదానిని నీటితో, రెండవ దానిని కిరోసితో నింపండి.
- రెండు పరీక్షనాళికలలో ఒక చెంచా ఉప్పును కలిపి, బాగా కలపండి.
- మొదటి పరీక్ష నాళికలో గల నీటిలో ఉప్పు పూర్తిగా కరగడం గమనించవచ్చు.
- ఈ రకమైన మిశ్రమమును సజాతీయ మిశ్రమము అంటారు.
- రెండవ పరీక్ష నాళికలో గల కిరోసిన్లో ఉప్పు కరగదు.
- ఇది విజాతీయ మిశ్రమము.

కృత్యం – 3
ప్రశ్న 3.
 సంతృప్త, అసంతృప్త ద్రావణాలను తయారుచేయుట :
 ఎ) సంతృప్త ద్రావణము తయారుచేయు విధానమును వివరించుము.
 జవాబు:
 
 ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరగగలదో అంతే ద్రావితాన్ని కలిగియున్న ద్రావణంను “సంతృప్త ద్రావణం” అంటారు.
- ఒక ఖాళీ కప్పులో 50 మి.లీ నీటిని పోయండి.
- దానిలో ఒక చెంచా చక్కెరను తీసుకుని కరిగేంతవరకు బాగా కలపండి.
- అది కరిగిన తర్వాత మరొక చెంచా కలపండి. ఇలా దీనిలో చక్కెర ఇంకా ఏ మాత్రం కరగదు అనేంత వరకు కలపండి.
- ఇలా ఏర్పడిన ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు.
బి) అసంతృప్త ద్రావణమును తయారుచేయు విధానమును వివరించుము.
 జవాబు:
 
- కప్పులో తయారు చేసిన ద్రావణమును ఒక బీకరులోనికి తీసుకొని, దానిని సన్నని మంటపై వేడిచేయవలెను.
- మరిగించకుండా వేడి చేస్తూ దానికి ఇంకొంచెం చక్కెరను కలపవలెను.
- ద్రావణాన్ని వేడిచేసినప్పుడు ఎక్కువ చక్కెర కరగడాన్ని మనం గమనించవచ్చు.
కృత్యం – 4
కరిగేరేటును ప్రభావితం చేయు అంశాలు :
ప్రశ్న 4.
 కరిగేరేటును ప్రభావితం చేయు అంశాలేవి? వాటినెలా నిరూపిస్తావు?
 జవాబు:
 కరిగేరేటును ప్రభావితం చేయు అంశాలు :
- ద్రావణి ఉష్ణోగ్రత
- ద్రావిత కణాల పరిమాణం
- కలియబెట్టు పద్దతి
నిరూపణ :
- మూడు గాజు బీకర్లను తీసుకొని ఒక్కొక్క దానిలో 100 మి.లీ. నీటిని నింపండి.
- ప్రతి బీకరులో రెండు చెంచాల ఉప్పుపొడిని వేయండి.
- మొదటి బీకరును నిశ్చలంగా ఉంచండి.
- రెండవ బీకరులోని ద్రావణాన్ని కలియబెట్టండి.
- మూడవ బీకరులోని ద్రావణాన్ని గోరువెచ్చగా వేడి చేయండి.
- పై అన్ని సందర్భాలలో ఉప్పు కరుగుతుంది కాని కరగడానికి పట్టే సమయంలో తేడా ఉంటుంది.
- మూడవ బీకరు (వేడిచేసినది)లో ఉప్పు త్వరగా కరుగుతుంది.
- రెండవ బీకరు (కలియబెట్టినది)లో ఉప్పు కొంచెం నెమ్మదిగా కరుగుతుంది.
- మొదటి బీకరు (నిశ్చలంగా ఉంచినది)లోని ఉప్పు మరికొంచెం నెమ్మదిగా కరుగుతుంది.
- పై కృత్యం ద్వారా ద్రావణి ఉష్ణోగ్రత, ద్రావిత కణాల పరిమాణం, కలియబెట్టే విధానం అనేవి కరిగేరేటును ప్రభావితం చేస్తాయని తెలుస్తుంది.
కృత్యం – 5
విజాతీయ మిశ్రమాలను అవలంబన మరియు కాంజికాభకణ ద్రావణాలుగా గుర్తించుట :
ప్రశ్న 5.
 విజాతీయ మిశ్రమాలను అవలంబన, కాంజికాభకణ ద్రావణాలుగా గుర్తించుటకు ఒక కృత్యమును పేర్కొనుము.
 జవాబు:
- ఒక పరీక్ష నాళికలో కొంచెం సుపొడిని, మరొక పరీక్ష నాళికలో కొన్ని చుక్కల పాలను తీసుకోండి.
- ఈ రెండు పరీక్షనాళికలకు కొంత నీటిని కలిపి గాజు కడ్డీతో బాగా కలపిండి.
- ఇప్పుడు పై కృత్యాన్ని కింది సోపానాలతో పొడిగించండి.
సోపానం – 1: టార్చిలైట్ లేదా లేజర్ లైట్ నుండి వచ్చు కాంతిని నేరుగా పరీక్షనాళికలోని ద్రవంపై పడేటట్లు చేయండి.
 సోపానం – 2 : ఈ రెండు మిశ్రమాలను కదపకుండా కొద్దిసేపు ఒకచోట ఉంచండి.
 సోపానం – 3 : ఈ మిశ్రమాలను వడపోత కాగితంను ఉపయోగించి వడపోయండి.
ఇప్పుడు మీ పరిశీలనలను ఈ పట్టికలో పొందుపర్చండి.

పరిశీలనలు:
- నీటిలో కలిపిన సుద్దపొడిని దానిలో కరగకుండా అవలంబనంగా నీరంతటా విస్తరించి ఉండడం గమనించవచ్చు.
- కావున సుద్దపొడి మిశ్రమం అవలంబనం.
- పాల కణాలు మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటాయి. అంతేగాక వడపోసినపుడు వడపోత కాగితంపై ఎటువంటి అవక్షేపం ఉండదు.
- కావున పాలు కొలాయిడల్ (కాంజికాభకణ ద్రావణాలు) ద్రావణం.
కృత్యం – 6
ఉత్పతనం :
ప్రశ్న 6.
 ఉత్పతనం ద్వారా మిశ్రమాలను వేరుచేయు పద్ధతిని ఉదాహరణతో వివరించుము. (లేదా) ఉప్పు, అమ్మోనియం క్లోరైడ్ మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడను వేరుచేయు పద్ధతిని వివరించుము.
 జవాబు:
 ఉద్దేశ్యం :
 ఉప్పు, అమ్మో సియం క్లోరైడ్ ల మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడ్ ను వేరుచేయుట
కావలసిన పరికరాలు :
 పింగాణి పాత్ర, దూది, అమ్మోనియం క్లోరైడ్, ఉప్పు, స్టవ్.
 
విధానం :
- ఒక చెంచా ఉప్పును, ఒక చెంచా అమ్మోనియం క్లోరైడను తీసుకుని వాటిని కలపండి.
- ఈ మిశ్రమాన్ని ఒక పింగాణీ పాత్రలో తీసుకోండి.
- ఒక గాజు గరాటును పటంలో చూపిన విధంగా పింగాణీ పాత్రపై బోర్లించి, గరాటు చివరి భాగాన్ని దూదితో మూసివేయండి.
- పింగాణీ పాత్రను దీపపు స్టాండుపై ఉంచి, కొద్దిసేపు వేడిచేసి గరాటు గోడలను పరిశీలించండి.
పరిశీలనలు :
- ముందుగా అమ్మోనియం క్లోరైడ్ బాష్పాలను గమనిస్తాము.
- కొంత సేపటికి ఘనీభవించిన అమ్మోనియం క్లోరైడ్ గరాటు గోడలపై నిలిచి ఉండడాన్ని గమనిస్తాము.
కృత్యం – 7
నీరు బాష్పీభవనం చెందే ప్రక్రియ :
ప్రశ్న 7.
 సిరా (మిశ్రమం) నుండి దాని అనుఘటకాలను వేరుచేయు పద్దతిని వివరించుము. (లేదా) బాష్పీభవన ధర్మమును ఉపయోగించి మిశ్రమాలను వేరుచేయు పద్ధతిని ఉదాహరణతో వివరించుము.
 జవాబు:
 ఉద్దేశ్యం :
 బాష్పీభవన ప్రక్రియ ద్వారా సిరా (మిశ్రమం) నుండి దాని అనుఘటకాలను వేరుచేయుట.
కావలసిన పరికరాలు :
 గాజు బీకరు, వాచ్ గ్లాసు, నీరు, సిరా, స్టవ్.
 
విధానం :
- ఒక బీకరులో సగం వరకు నీటిని నింపి దాని మూతిపై వాచ్ గ్లాసును ఉంచండి.
- ఆ వాచ్ గ్లాసులో కొన్ని చుక్కల సిరాను వేయండి.
- బీకరును వేడిచేస్తూ, వా గ్లాస్ ను గమనించండి.
పరిశీలనలు :
- వాచ్ గ్లాస్ నుండి పొగలు రావడం గమనిస్తాము.
- వా గ్లాస్ లో ఏ మార్పు గమనించనంత వరకు వేడిచేయడాన్ని కొనసాగించండి.
- వాచ్ గ్లాస్ లో ఒక చిన్న అవక్షేపం మిగిలి ఉండడాన్ని గమనిస్తాము.
నిర్ధారణ :
- సిరా, నీరు మరియు రంగుల మిశ్రమమని మనకు తెలుసు.
- ఈ కృత్యంలో వాగ్లాలో మిగిలియున్న అవక్షేపం సిరాలోని రంగు.

ప్రయోగశాల కృత్యం
ప్రశ్న 8.
 మార్కర్ సిరాలోనున్న అనుఘటకాలను పరిశీలించుటకు కాగితం క్రొమటోగ్రఫీ పద్దతిని వివరించుము.
 జవాబు:
 లక్ష్యం :
 సిరాలోనున్న అనుఘటకాలను కాగితం క్రొమటోగ్రఫీ ద్వారా పరిశీలించుట.
కావలసిన పదార్థాలు :
 బీకరు, దీర్ఘచతురస్రాకారపు వడపోత కాగితం, నలుపురంగు మార్కర్ పెన్, నీరు, పెన్సిల్, సెల్లో టేపు.
 
విధానం :
- వడపోత కాగితం యొక్క అడుగు భాగంనకు కొంచెం పైన మార్కతో ఒక లావు గీతను గీయండి.
- బీకరులో కొంచెం నీరు పోసి, ఒక పెన్సిల్ కు వడపోత కాగితంను సెల్లో టేపుతో అతికించి, కాగితం చివర నీటికి తగిలేటట్లు పటంలో చూపిన విధంగా వేలాడదీయండి.
- గీచిన గీత నీటికి అంటుకోకుండా చూడండి.
- కాగితం ఒక చివర నీటికి తగిలేటట్లు ఉండడం వలన నీరు నెమ్మదిగా పైకి పాకుతుంది. 5 ని॥ తర్వాత వడపోత కాగితంను తొలగించి ఆరనీయండి.
- ఇదే ప్రయోగాన్ని ఆకుపచ్చ మార్కర్, పర్మనెంట్ మార్కర్లతో చేసి చూడండి.
పరిశీలనలు :
- నల్ల మార్కరను ఉపయోగించినపుడు ఎరుపు, ఆకుపచ్చ, ఊదా, నలుపు వంటి వివిధ రంగులు వడపోత కాగితంపై కనబడినవి.
- ఆకుపచ్చ మార్కరను ఉపయోగించినపుడు పసుపు, ఆకుపచ్చ, నీలము వంటి రంగులు వడపోత కాగితంపై కనబడినవి.
- పర్మనెంట్ మార్కర్ ను ఉపయోగించినపుడు వడపోత కాగితంపై గీచిన గీతలో ఎటువంటి మార్పు కనబడలేదు.
కృత్యం – 8
అమిశ్రణీయ (Immiscible) ద్రవాలను వేరుచేయడం :
ప్రశ్న 9.
 నీరు, కిరోసిన్ మిశ్రమం నుండి నీటిని, కిలోసిసెను వేరుచేసే విధానాన్ని వివరించండి.
 జవాబు:
 ఉద్దేశ్యం :
 నీరు, కిరోసిన్స్ శ్రమం నుండి నీటిని, కిరోసినన్ను వేరుచేయుట.
కావలసిన పరికరాలు :
 కిరోసిన్, నీరు, వేర్పాటు గరాటు, బీకరు.
 
విధానం :
- ఒక వేర్పాటు గరాటును తీసుకొని దానిలో నీరు, కిరోసిన్స్ మిశ్రమాన్ని పోయండి.
- ఈ గరాటును కొంత సమయం కదపకుండా స్థిరంగా ఉంచండి. దాని వలన నీరు, కిరోసిన్ యొక్క పొరలు ఏర్పడుతాయి.
- ఇపుడు వేర్పాటు గరాటుకు అమర్చియున్న స్టాప్ కాకను తెరచి కింది పొరలలో ఉన్న నీటిని నెమ్మదిగా బయటకు తీయండి.
- కిరోసిన్ స్టాప్ కాకను చేరగానే వెంటనే దానిని మూసివేయండి.
సూత్రం :
 అమిశ్రణీయ ద్రవాలలోని అనుఘటకాలను వాటి సాంద్రతల ఆధారంగా వేరుచేయవచ్చు.
కృత్యం – 9
స్వేదన ప్రక్రియ ద్వారా మిశ్రణీయ ద్రవాలను వేరుచేయుట :
ప్రశ్న 10.
 స్వేదన ప్రక్రియ ద్వారా మిశ్రణీయ ద్రవాలను వేరుచేయు ప్రక్రియను వివరించుము.
 జవాబు:
 ఉద్దేశ్యం :
 స్వేదన ప్రక్రియ ద్వారా మిశ్రణీయ ద్రవాల (నీరు, ఎసిటోన్)ను వేరుచేయుట.
కావలసిన పరికరాలు :
 స్టాండు, స్వేదన కుప్పె, థర్మామీటరు, కండెన్సర్, బీకరు, ఎసిటోన్, నీరు, ఒంటి రంధ్రం గల రబ్బరు బిరడా.
 
విధానం :
- ఎసిటోన్, నీరుల మిశ్రమంను ఒక స్వేదన కుప్పెలో తీసుకొనుము.
- దీనికి థర్మామీటరును బిగించి స్టాండుకు అమర్చండి.
- కండెన్సర్ యొక్క ఒక చివరను స్వేదన కుప్పెకు బిగించి మరొక చివరలో బీకరును ఉంచండి.
- మిశ్రమాన్ని నెమ్మదిగా వేడిచేస్తూ, జాగ్రత్తగా థర్మామీటరును పరిశీలించండి.
- బాష్పీభవనం చెందిన ఎసిటోన్ కండెన్సర్ లో ద్రవీభవనం చెందుతుంది.
- ద్రవరూపంలోనున్న ఎసిటోను కండెన్సర్ చివరనున్న బీకరులో సేకరించవచ్చు.
- నీరు మాత్రం స్వేదన కుప్పెలోనే ఉండిపోతుంది.
- పై విధంగా ద్రవరూప మిశ్రమాలను వేరుచేయడానికి వాడే ఈ పద్ధతిని స్వేదనం అంటారు.
సూత్రం :
 రెండు ద్రవాల బాష్పీభవన ఉష్ణోగ్రతలలో తేడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది.

కృత్యం – 10
ప్రశ్న 11.
 కాపర్ సల్ఫేట్, అల్యూమినియం మిశ్రమంను వేరుచేయగలమా?
 కాపర్ సల్ఫేట్, అల్యూమినియం మిశ్రమం నుండి కాపర్ లోహాన్ని వేరుచేయు విధానమును వివరింపుము.
 జవాబు:
- గాఢ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఒక బీకరులో తీసుకొని దానిలో ఒక అల్యూమినియం రేకును వేయండి.
- కొంత సమయానికి అల్యూమినియం రేకు ముక్కపై కాపర్ పొర ఏర్పడడాన్ని గమనించవచ్చు.
- కాపర్ సల్ఫేట్ ద్రావణం రంగును కోల్పోతుంది.
- అల్యూమినియం, గాఢ కాపర్ సల్ఫేట్ ద్రావణాల మధ్య రసాయనిక చర్య జరిగి కాపర్ లోహం వేరుపడి అల్యూమినియం రేకు పై పూతగా ఏర్పడుతుంది.
