AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

9th Class Social Studies 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సరైన వాటిని ఎంచుకోండి. (AS1)
ఎ) ఒక దేశానికి …………… ఉండాలని ప్రజాస్వామిక, జాతీయతావాద ఉద్యమాలు భావించాయి. (ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ, పైవన్నీ, పైవి ఏవీకావు)
జవాబు:
ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి ‘ఆర్థిక వ్యవస్థ.

బి) వివిధ దేశాలలో జాకోబిన్ క్లబ్బులను ………. ఏర్పాటు చేసింది. (రైతాంగం, రాచరికం, మధ్యతరగతి, సైన్యం)
జవాబు:
మధ్యతరగతి

సి) 18వ శతాబ్దం మధ్యకాలంలో భూమి ……………. కింద ఉండేది. దానిని ……………… ‘సాగు చేసేవాళ్ళు. (మధ్యతరగతి, సైన్యం, రాచరిక కుటుంబాలు, కౌలుదారులు)
జవాబు:
రాచరిక కుటుంబాలు, కౌలుదారులు.

ప్రశ్న 2.
18వ శతాబ్దపు మధ్యకాలం నాటి యూరప్ లోని ప్రజలలో భాష, జాతి మూలాలు, వాణిజ్య పద్ధతులలో గల పోలికలు, తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
18వ శతాబ్దపు మధ్యకాలంలో యూరప్ లోని ప్రజలలో భాష, జాతి మూలాలు వాణిజ్య పద్ధతులలో పోలికలు, తేడాలు కూడా మనకు కనిపిస్తాయి.

పోలికలు :

  1. ప్రధానంగా ఈ ప్రాంతాలలో నియంతృత్వ రాచరికాలు ఉండేవి.
  2. కులీన, మధ్యతరగతి, సంపన్న వర్గాల అధీనంలో భూములు, ఎస్టేట్స్ ఉండేవి.
  3. ఈ ప్రాంతాలలో ఉమ్మడి సంస్కృతి, లేదా సామూహిక గుర్తింపు ఉండేది.
  4. పశ్చిమ ప్రాంతాలు, మధ్య యూరప్ లు మార్కెట్ కోసం ఉత్పత్తి చేసే వాణిజ్య వర్గాలు ఏర్పడ్డాయి.
  5. శ్రామిక వర్గ ప్రజలు, మధ్యతరగతి, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్థులు, వృత్తి నిపుణులు ఏర్పడ్డారు.

తేడాలు :

  1. వీరంతా (యూరప్ లోని వారు) వేరు వేరు భాషలు మాట్లాడేవారు. టైరాల్, ఆస్ట్రియా, సుడెటె లాండ్, బొహీమియాలలో, ఆల్ఫైన్ ప్రాంతాలలో జర్మన్ భాష మాట్లాడేవారు.
  2. హంగరీలో సగం మంది జనాభా. మగ్యార్ మాట్లాడేవారు.
  3. గాలిసియాలో కులీనవర్గం వారు పోలిష్ భాష మాట్లాడేవారు.

వీరి మూలాలు కూడా వేరుగా ఉండేవి. సామ్రాజ్య పరిధిలో రైతాంగ ప్రజలు ఉండేవాళ్ళు. ఉత్తరానికి బొహీమియన్లు, స్లోవాకు, కార్నియోలాలో స్లోవీన్లు, దక్షిణానికి క్రొయాట్లు, తూర్పున ట్రాన్సిల్వేనియాలో రౌమన్లు ఈ తేడాల వల్ల రాజకీయ ఐక్యత అంత తేలికగా ఏర్పడదు.

వాణిజ్య పద్ధతులలో కూడా తేడా ఉంది. 18వ శతాబ్దంలో రెండవ భాగంలో ముందుగా ఇంగ్లాండ్ లో పారిశ్రామికీకరణ మొదలై వివిధ వాణిజ్య, వ్యాపారస్తులు లాభపడ్డారు. అయితే జర్మనీ, ఫ్రాన్స్ లో 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ వల్ల అంత ప్రగతి సాధించబడలేదు.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
“జాతీయ రాజ్యాలు ఏర్పడటంతో రాచరిక వర్గాల ఆధిపత్యం తగ్గి మధ్య తరగతి ప్రాభవం పెరిగింది” అన్న వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? కారణాలు ఇవ్వండి. (AS2)
జవాబు:
జాతీయ రాజ్యాలు ఏర్పడటం వల్ల రాచరిక వర్గాల ఆధిపత్యం తగ్గి మధ్య తరగతి ప్రాభవం పెరిగిందని నేను ఏకీభవిస్తాను.

రాచరిక వర్గాల వల్ల రైతాంగం పన్నులు కట్టలేక, చర్చి అధీనంలో పని చేయలేక, వారికి సేవలు చేయలేక నలిగి పోతుండేవారు. ఒక సం|| పంటలు సరిగా పండకపోయినా, లేదా ఆహార ధరలు పెరిగినా పల్లెల్లో, పట్టణాల్లో పేదరికం పెరిగిపోతుంది.

కొత్తగా ఏర్పడిన, మధ్య తరగతులు విదేశీ సముద్ర ప్రయాణం, వర్తక, వాణిజ్యాల ద్వారా అధికంగా ఆస్తులు సంపాదించారు. వీళ్ళకు వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులుగా ఉండటం అన్న వాటికి ఉదారవాదం ప్రతీకగా నిలిచింది.

మధ్య తరగతి వర్గం ఫ్రెంచి విప్లవం నాటి నుంచి నియంత పాలనకు అంతం, చర్చి ప్రత్యేక హక్కులకు అంతం, రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా పరిగణింపబడసాగింది. మధ్యతరగతిలో మేధావి వర్గానికి చెందిన ఆచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కళాకారులు, రచయితలు, వాణిజ్యవేత్తలు, వారి వారి స్థాయిలలో రాచరిక ప్రాధాన్యత తగ్గించి ప్రజా చైతన్యం, విప్లవాలు ద్వారా మధ్య తరగతి ప్రాతినిధ్యం పెరిగింది.

ప్రశ్న 4.
మీరు చదివిన ఒక భారతదేశ జాతీయతావాదికి, మాజినికి మధ్య సంభాషణను ఊహించి రాయండి. (AS6)
జవాబు:
సంభాషణ

మాజిని : మాటలు, ఉపన్యాసాలు, చర్చల ద్వారా జాతీయ రాజ్యం ఏర్పరచలేము. ఏదో ఒకటి చేయాలి.

రూసో : విప్లవాలు, ఉద్యమ హింసల ద్వారా స్వాతంత్ర్యం పొందలేం ……… జాతి ఐక్యతను సాధించలేం ……. కాలమే నిర్ణయిస్తుంది.

మాజిని : ఎంతకాలమో కాలయాపన. ఏదో విప్లవ సంఘాలు, రహస్య పోరాటాల ద్వారానే ఐక్యత సాధించగలం.

రూసో : ప్రజా చైతన్యం రావడానికి కాలం పడుతుంది. ప్రజలలో మార్పు ద్వారా జాతీయతావాదం బలపడుతుంది. ముందుగా ప్రజలలో చైతన్య బావుటా ఎగురవేయాలి.

మాజిని : ఎంతకాలమో ఎగురలాటలు, గంతులు, జిమ్మిక్కులు, యుద్ధ వాతావరణం కల్పించాలి. రాచరిక, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి.

రూసో : దానికో మార్గం ఉంది ……………… ఆగాలి.

మాజిని : ఇంకా ఆగితే అధోగతే ……………….

రూసో : ఫ్రెంచి విప్లవం ఎలా సాధ్యమయ్యిందో, ఎలా ఫలితాలు సాధించాయో తెలుసు కదా!

మాజిని : అప్పటి పరిస్థితులు వేరు.

రూసో : ఉద్రేకాల వల్ల, యుద్ధాలు పరిష్కారం కావు.

మాజిని : ఇంకా ఏదో తేల్చుకోవాలి. వేలకొలది యువకులతో విప్లవ జ్వా లలు రగిలించాలి …….. విప్లవ జ్వాలలు రగిలించాలి …… రగిలించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 5.
సాంప్రదాయవాదులు, ఉదారవాదుల గురించి వివరించే వాక్యాలను గుర్తించండి. మన ప్రస్తుత నేపథ్యంలో వీటికి ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
1815లో నెపోలియన్ ఓడిపోయిన తరువాత యూరోపియన్ ప్రభుత్వాలలో సంప్రదాయవాదం చోటుచేసుకుంది. రాచరికం, చర్చి, సామాజిక తారతమ్యాలు, ఆస్తి, కుటుంబం వంటి సంప్రదాయ వ్యవస్థలను కాపాడాలని భావించారు. ఆధునిక సైన్యం, సమర్థ పరిపాలనా వ్యవస్థ, వృద్ధి చెందుతున్న ఆర్థిక స్థితి, ఫ్యూడలిజం, బానిసత్వాల రద్దు ద్వారా యూరపులో నిరంకుశ రాచరికాలను బలోపేతం చేయవచ్చు అని వాళ్ళు భావించారు.
ఉదా : కుటుంబ సంప్రదాయం, స్థానిక ప్రభుత్వం ఏర్పాటు.

ఉదారవాదం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులే అన్న వాటికి ప్రతీకగా నిలిచింది. నియంత పాలనకు స్వస్తి చెప్పి, చర్చి ప్రత్యేక హక్కులను అంతం చేసి, రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా పరిగణింపబడింది. సాంప్రదాయ వాదులు నియంత్రించిన, పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యత నిచ్చింది.

ఉదా : వాక్ స్వాతంత్ర్యం, సమన్యాయపాలన.

ప్రశ్న 6.
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలలో జాతీయ రాజ్యాలు ఏర్పడటంలో తేడాలు, పోలికలు చూపించే పట్టికను తయారుచేయండి. (AS1)
జవాబు:
తేడాలు :

ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ
ఫ్రాన్స్ లో నిరంకుశ పాలనకు వ్యతి రేకంగా, అధిక పన్నులు, అభద్రతా భావం వల్ల, మధ్యతరగతి వర్గం చైత న్యంతో జాతీయ రాజ్యం ఏర్పడింది. జర్మనీలోని వివిధ ప్రాంతాలను సమాఖ్యగా ఏర్పరచి, ఎన్నికైన పార్లమెంట్ పాలనలో జాతీయ రాజ్యాంగం, రాజ్యస్థాపనకు కృషి. ఇటాలియన్ స్రామాజ్యం చెల్లాచెదురుగా ఉండేవి.
చదువుకున్న మధ్యతరగతి సంపన్న వర్గాలకు చెందిన ఉదారవాద జాతీయతా ఉదారవాదుల ప్రయత్నాన్ని రాచరిక, సైనిక శక్తులు అణచివేశాయి. ఇటాలియన్ ప్రజలు అధిక శాతం నిరక్షరాస్యులు.
వాదం విప్లవ భావాలతో కలవసాగాయి. జాకోబిన్ క్లబ్, రాబిన్ స్పియర్. బ్లెడ్ అండ్ ఐరన్ బిస్మార్క్, యంగ్ ఇటలీ మాజిని.
ఫ్రాన్స్ లో, జాతీయ రాజ్యం ప్రారంభం. ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా

పోలికలు :

ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ
తిరుగుబాట్ల ద్వారా, ఉద్యమాలు ద్వారా రాజ్యస్థాపన. ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
రాచరికం, గణతంత్రం. ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
ఆకలి, కష్టాలు, ఆవేదనలు, ఆక్రందనల నుంచి ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
జాతీయ రాజ్యాలు ఏర్పాటు ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
స్త్రీలకు ప్రాధాన్యం ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
యువకులలో రాజకీయ చైతన్యం ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా

ప్రశ్న 7.
1848 ఉదారవాదుల తిరుగుబాటు అంటే ఏమిటో వివరించండి. ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు ఏమిటి? (AS1)
జవాబు:
చార్లెన్ X తదుపరి వరుసకి సోదరుడైన లూయీ ఫిలిప్ రాజు అయ్యాడు. 1830లో లాగానే 1848లో కూడా తిరుగుబాటు ఫ్రాన్స్ లో మొదలైంది. రాజ్యాంగబద్ద రాచరికంలో భాగంగా లూయీ ఫిలిప్ పరిపాలించాలి. సింహాసనాన్ని అధిష్టిస్తున్నప్పుడు అతడిని “పౌర రాజుగా” పేర్కొన్నారు. అతడి పట్టాభిషేకం దేవుని దయతోను, “జాతి కోరిక ప్రకారం” జరిగిందని అన్నారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఫిలిప్ తిరోగామి పంథా అవలంబించడం వల్ల 1848 నాటికి అతడి పాలనకు తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రజలు తిరగబడ్డారు. పలాయనం తప్పించి లూయీ ఫిలిప్ కి మరో దారి లేకుండా పోయింది. “గణతంత్రం వర్ధిల్లాలి” అన్న నినాదాలు వీధులలో మిన్నుముట్టాయి. ఫిలిప్ భయపడి ఇంగ్లాండ్ కు పారిపోయాడు. ఆ తదుపరి హింస కొనసాగింది. తిరుగుబాటుదారులను అంతిమంగా ప్రభుత్వ సైన్యాలు ఓడించి తీవ్ర శిక్షలు విధించాయి. ఉదారవాద ఉద్యమంలో మహిళలు చురుకుగా పాల్గొన్నారు.

ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు :

  • వ్యక్తిగత స్వేచ్ఛ, చట్ట సమానత్వం.
  • రాజకీయంగా ప్రజామోదంతో ప్రభుత్వం అన్న భావన.
  • వ్యక్తిగత ఆస్తి హక్కుకు ప్రాధాన్యత.
  • రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వం.
  • సరుకులు, ప్రజలు, పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలింపబడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం ఏర్పాటు.
  • సుంకాల సమాఖ్య లేదా జోల్వెరిన్ ఏర్పాటు.
  • రైలు మార్గాల అభివృద్ధితో ప్రగతి అధికం.
  • దేశ ఐక్యతకు తగ్గట్లు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల కల్పన.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 8.
జర్మనీ ఏకీకృతమైన ప్రక్రియను క్లుప్తంగా వివరించండి. (AS1)
(లేదా)
జర్మనీ ఏకీకరణను వివరించండి.
జవాబు:
జర్మనీ మధ్యతరగతి వర్గాలలో జాతీయభావం అధికం. 1848లో వీళ్ళు జర్మనీలోని వివిధ ప్రాంతాలను సమాఖ్యగా ఏర్పరచి, ఎన్నికైన పార్లమెంట్ పాలనలో జాతీయ రాజ్యాంగం మలచటానికి ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలను రాచరిక, సైనిక శక్తులు అణచివేశాయి. ఇందులో సైన్యానికి జంకర్లు అనే ప్రష్యా బడా, భూస్వాములు కూడా సహకరించారు. అప్పటి నుంచి జాతిని ఏకం చేసే ఉద్యమానికి ప్రష్యా నాయకత్వం వహించింది. ప్రష్యా సైన్యం, పాలనా యంత్రాంగం సహాయంతో ప్రష్యా ప్రధానమంత్రి ఒట్టోవాన్ బిస్మార్క్ ఈ ప్రక్రియకు సూత్రాధారిగా వ్యవహరించాడు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్ పై జరిగిన మూడు యుద్ధాలలో ప్రష్యా విజయం సాధించడంతో ఏకీకరణ ప్రక్రియ పూర్తయింది. ప్రష్యా రాజైన విలియం-I జర్మన్ చక్రవర్తిగా 1871లో ప్రకటింపబడ్డారు.

ప్రశ్న 9.
వియన్నా సమావేశం చేసిన మార్పులను యూరపు పటంలో చూపించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1

ప్రశ్న 10.
పేజీ నెం. 177లోని ‘ఆకలి కష్టాలు, ప్రజా తిరుగుబాటు’ శీర్షిక కింద ఉన్న మొదటి పేరాను చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
యూరపులో 1830లలో ఆకలి, కష్టాలు తత్ఫలితంగా ప్రజా తిరుగుబాటు .జరిగి ఆర్థికంగా తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. 194|| మొదటి సగంలో యూరప్ అంతటా జనాభా గణనీయంగా పెరిగింది. చాలా దేశాలలో పనుల కంటే పనిచేసే వాళ్లు ఎక్కువైనారు. పల్లె ప్రాంతాల నుండి పట్టణాలకు వలస వెళ్లి, మురికి వాడలలో నివసించి, దుర్భర జీవితం అనుభవించారు. పంటలు సరిగా పండకపోయినా, లేదా ఆహార ధరలు పెరిగినా పల్లెల్లో, పట్టణాల్లో పేదరికం పెరిగిపోయింది. తత్ఫలితంగా నిరసనలు పెల్లుబికి తిరుగుబాటుకు దారి తీసింది.

9th Class Social Studies 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.174

ప్రశ్న 1.
ఆయా దేశాలలో జాతీయతాభావం ఏర్పడడానికి నెపోలియన్ దాడులు ఎలా దోహదపడి ఉంటాయి?
జవాబు:
నెపోలియన్ దాడుల తర్వాత 1815లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయా దేశాలలో ప్రభుత్వాలలో నెపోలియన్ ద్వారా పదవీచ్యుతులైన రాచరికాలకు తిరిగి అధికారం కట్టబెట్టి యూరపులో కొత్త సంప్రదాయవాదాన్ని నెలకొల్పటం ప్రధాన ఉద్దేశ్యంగా వియన్నా సమావేశం ఏర్పాటైంది. నెపోలియన్ చేపట్టిన మార్పుల ద్వారా రాజ్యాధికారం మరింత బలోపేతం అయి, ఆయన దాడుల వలన జాతీయతాభావం పెరిగింది. ఆధునిక సైన్యం, సమర్థ పరిపాలనావ్యవస్థ, వృద్ధి చెందుతున్న ఆర్థిక స్థితి, బానిసత్వాల రద్దు యూరప్లో రాచరికం తగ్గి, జాతీయతా భావాలు పెరిగాయి.

ప్రశ్న 2.
జాతీయతావాదం, జాతీయ రాజ్యాలు అన్న భావనలు ఎలా ఆవిర్భవించాయి?
జవాబు:
ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆర్థిక జీవనం పంచుకుందామన్న భావం కలిగిన పౌరుల క్రియాశీల భాగస్వామ్యంపై ఆధారపడిన బలమైన దేశాలను ఏర్పాటు చేయటానికి జాతీయతావాద ఉద్యమాలు ఆవిర్భవించాయి. ఈ ప్రయత్నాల ఫలితంగా పలు దేశాలతో కూడిన వంశపారంపర్య రాచరిక స్థానంలో యూరపులో జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
జాతీయతాభావం ఏర్పడటంలో భాష, జనాదరణ పొందిన సంప్రదాయాల ప్రాముఖ్యత గురించి చర్చించండి.
జవాబు:
జాతీయతాభావం ఏర్పడడంలో భాష, జనాదరణ పొందిన సంప్రదాయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. యూరపు ప్రాంతాలు నియంతృత్వ రాచరికాల కింద ఉండేవి. వాళ్ళ పాలనలో వివిధ రకాల ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళు తమకు ఒక ఉమ్మడి సంస్కృతి, లేదా సామూహిక గుర్తింపు ఉందని భావించే వాళ్ళు కాదు. వాళ్ళు తరచు వేరు వేరు భాషలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. జాతీయతాభావం ఏర్పడడానికి అంతా ఒకటై ముందుకు సాగారు. అదే విధంగా జనాదరణ పొందిన కుటుంబ సాంప్రదాయాలు, బానిసత్వాల రద్దు వంటి సాంప్రదాయాల వల్ల కూడా జాతీయతా భావం పెరిగింది. కళలు, కవిత్వం, కథలు, సంగీతం వంటివి జాతీయతా భావాన్ని మలచటంలో సహాయపడ్డాయి.

9th Class Social Textbook Page No.176

ప్రశ్న 4.
పాత రాజ్యాలు వ్యాపార, పరిశ్రమల ప్రగతిని ఏ విధంగా అడ్డుకున్నాయి?
జవాబు:
ఆర్థికరంగంలో స్వేచ్ఛా మార్కెట్లనూ, సరుకునూ, పెట్టుబడి కదలికలపై పాత రాజ్యాలు, వ్యాపార, పరిశ్రమల ప్రగతిని అడ్డుకున్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి తనదైన ద్రవ్య విధానం, తూనికలు, కొలతలూ ఉండేవి. చాలా ప్రదేశాలలో తనిఖీలు, అధికంగా సుంకాలు వసూలు చేసేవారు. ప్రతీ ప్రాంతానికీ తనదైన తూనికలు, కొలతలు ఉండడం వల్ల సుంకం లెక్కించటానికి చాలా సమయం పట్టేది. తద్వారా వ్యాపార, పరిశ్రమల ప్రగతికి నిరోధకమయ్యెను.

ప్రశ్న 5.
ఆ దేశాలలో ఉదారవాద ప్రజాస్వామ్యం వ్యాపార, పరిశ్రమలకు ఏ విధంగా దోహదం చేసింది?
జవాబు:
ఉదారవాద ప్రజాస్వామ్యాలు వ్యాపార పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత నిచ్చాయి. కొత్తగా ఏర్పడిన మధ్య తరగతి వర్గం వర్తక, వాణిజ్యాల ద్వారా, సముద్రయానం ద్వారా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశాయి. రాచరిక వ్యవస్థలో గల ఇబ్బందులు తొలగించడానికి ఇవి కృషి చేశాయి. వస్తువులు, సరుకుల పెట్టుబడిపై ప్రభుత్వ పరిమితులను రద్దు చేశాయి. సరకులు, ప్రజలు, పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలింపబడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం ఏర్పాటు చేయాలని ఈ వర్గాలు కోరాయి. తనిఖీ కేంద్రాలు రద్దు చేసి ద్రవ్య విధానాలను రెండుకి కుదించాయి. రైలు మార్గాలు అభివృద్ధి చేసి పరిశ్రమలను ప్రోత్సహించాయి.

ప్రశ్న 6.
మన దేశంలో ఉదారవాద, ప్రజాస్వామిక రాజకీయ విధానం ఉందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జవాబు:
మనదేశంలో ఉదారవాద, ప్రజాస్వామిక రాజకీయ విధానం ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ, సమన్యాయ పాలనతో పాటు, 18 సం||లు నిండిన స్త్రీ, పురుషులు కుల, మత, లింగ, పేద, ధనిక భేదం లేకుండా వయోజన ఓటు హక్కు కల్పించబడింది. 21 సం||లు నిండినవారు ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయవచ్చు. నిరంకుశ, నియంత పాలన మనదేశంలో లేదు. రాజ్యాంగం, పార్లమెంటు ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా మనదేశం పరిగణించబడింది.

ప్రశ్న 7.
మన ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి సంప్రదాయవాదం మంచిదనే వాళ్ళకీ, ఉదారవాద ప్రజాస్వామ్యం మంచిదనే వాళ్ళకీ మధ్య చర్చ నిర్వహించండి.
జవాబు:
సంప్రదాయవాదులు :
రాచరికమే మంచిది. రాజే ఉన్నతుడు, సామాజిక తారతమ్యాలే దేశాన్ని నడిపిస్తాయి.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
ప్రజలే ప్రభువులు. రాజ్యమంటే ప్రజలే…. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం మేం పని చేస్తున్నాం.

సంప్రదాయవాదులు :
చర్చి అధీనంలో హక్కులు ఉండి, పరిపాలనలో మేటిగా ఉంటాం. ఆస్తి, కుటుంబ సంప్రదాయాలకు విలువిస్తాం.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
చట్టం ముందు అందరూ సమానులే. వయోజనులకు ఓటు హక్కు కల్పించాము. వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం అందించాం.

సంప్రదాయవాదులు :
మధ్య తరగతి వారు ధనవంతులు కాకుండా, వాణిజ్య వ్యాపారాలను నివేదించాం. పత్రికల స్వేచ్ఛ, అభివృద్ధి నిరోధకం దానిని రూపుమాపాం.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
నిరంకుశ భావాలు సహించం. ఉద్యమాలు, విప్లవాల ద్వారా చైతన్యం తెస్తాం. సంప్రదాయ చీకటి దారుల్ని తెరిపించి, వెలుగునందిస్తాం.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 8.
అభిప్రాయ వ్యక్తీకరణ, విమర్శలకు వ్యక్తికి ఉన్న స్వేచ్ఛలను సంప్రదాయవాదం ఎందుకు హరిస్తుంది?
జవాబు:
సంప్రదాయవాదం అభిప్రాయ వ్యక్తీకరణకు వ్యక్తికి ఉన్న స్వేచ్ఛలను అడ్డుకుంటుంది. అభిప్రాయ వ్యక్తీకరణ, విమర్శల వలన సంప్రదాయవాదుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని, వ్యక్తికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల వలన అభివృద్ధి కుంటుపడుతుందని, పత్రికా స్వేచ్చ వలన కూడా ప్రజలు చెడు మార్గంలో పయనిస్తారని భావించింది. కుటుంబ సాంప్రదాయాలు, సామాజిక తారతమ్యాలు దెబ్బతిని పరిపాలకుల మనుగడ దెబ్బ తింటుందని తలంచాయి.

9th Class Social Textbook Page No.178

ప్రశ్న 9.
ఎనిమిదవ తరగతిలో భారతీయ జాతీయతావాదులు దేశంలోని సాంప్రదాయ, జానపద కళల పునరుద్ధరణకు ప్రాధాన్యత నిచ్చారని మీరు చదివారు. ఇది ముఖ్యమని వాళ్ళు ఎందుకు భావించారు?
జవాబు:
ప్రజలలో ఐక్యత, విజ్ఞానం, అక్షర జ్ఞానం లేకపోవడం వల్ల తరతరాలుగా బానిసత్వ బతుకుల్లా సంస్కృతి, సాంప్రదాయాలు, మన ఆచారాల పరిరక్షణకు వారు తలంచారు. ప్రజలలో ఉన్న అమాయకత్వం, మూఢ నమ్మకాలు, అవగాహనాలేమి, అవినీతి, వారసత్వ రాజకీయాలలో ప్రజలను చైతన్యపరచడానికి ప్రభుత్వాలు అందించు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పథకాలు సామాన్యులకు, వెనుకబడిన వర్గాల వారికి చేరవేయటానికి, సాంప్రదాయ, జానపద ‘కళల పునరుద్దరణకు ప్రాధాన్యతనిచ్చారు. మన కళలు, సాంప్రదాయాలు, మన సంస్కృతికి, మన వారసత్వానికి ప్రతిబింబాలు. జానపద కళలు, సాంప్రదాయాలు మన జీవన ఆధారాలు కాబట్టి ముఖ్యమని తలంచారు.

9th Class Social Textbook Page No.180

ప్రశ్న 10.
చార్లెస్ X, లూయీ ఫిలిట్లు ఫ్రాన్స్ వదిలి ఎందుకు పారిపోవలసి వచ్చిందో వివరించండి.
జవాబు:
చార్లెస్ X :

  1. చార్లెస్ X విప్లవాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.
  2. కులీనులకు, మత గురువులకు ప్రత్యేక హక్కులను పునరుద్ధరించటానికి ప్రయత్నించాడు.
  3. 1814 చార్టర్ ని పక్కకు పెట్టి తన ఇష్టమొచ్చినట్లు పరిపాలించసాగాడు.
  4. తిరుగుబాట్లు, విప్లవంతో వచ్చిన నిరసనలు ద్వారా ఇక ప్రాణం కాపాడుకోవడానికి ఫ్రాన్స్ ను వదలి పారిపోయాడు.

లూయీ ఫిలిప్ :
చార్లెస్ X కి వరుసకు సోదరుడైన లూయీ ఫిలిప్ రాజు అయ్యాడు. ప్రారంభంలో పౌర రాజుగా కీర్తింపబడినా, ఆ తరువాత

  1. గడుస్తున్న కొద్దీ అతడి ప్రభుత్వం తిరోగామి పంథాను అవలంబించింది.
  2. 1848 నాటికి అతడి పాలనపై తీవ్ర వ్యతిరేకత.
  3. శత్రువులు పెరిగిపోయారు.
  4. అతడు నియమించిన ముఖ్యమంత్రి ప్రజాదరణ కోల్పోవటంతో అతడిని తొలగించారు.
  5. రాజు సైనికులు జరిపిన కాల్పులలో ఇరవై ముగ్గురు చనిపోయారు.
  6. దాంతో ప్రజలు తిరగబడ్డారు.
  7. గణతంత్రం వర్ధిల్లాలి, అన్న నినాదాలు మిన్నంటాయి.
  8. దాంతో భయపడి ఫిలిప్ ఇంగ్లాండుకు పారిపోయాడు.

9th Class Social Textbook Page No.181

ప్రశ్న 11.
ఈ వ్యంగ్య చిత్రాన్ని వివరించండి. బిస్మార్క్ కి ఎన్నికైన పార్లమెంటు డిప్యూటీలకీ మధ్య సంబంధాన్ని ఇది ఎలా చూపిస్తోంది? ప్రజాస్వామిక ప్రక్రియల గురించి చిత్రకారుడు ఏం వ్యాఖ్యానించదలుచుకున్నాడు?
AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2
జవాబు:
ఈ చిత్రం బిస్మార్క్ వ్యక్తిత్వాన్ని వివరిస్తుంది. బిస్మార్క్ విధానం క్రూరమైన బలప్రయోగం మీద ఆధారపడింది. జర్మనీ ఏకీకరణ ప్రసంగాలతోనూ, ఉత్సవాలతోను, పాటలతోను సాధ్యం కాదని, క్రూరమైన బలప్రయోగం ద్వారానే ఇది సాధ్యమవుతుందని బిస్మార్క్ నమ్మాడని చిత్రకారుడు వ్యంగ్యంగా చిత్రీకరించాడు.

బిస్మార్క్ విధానాలు ప్రజాస్వామిక ప్రక్రియలను అణచివేయడానికి దోహదపడ్డాయని చిత్రకారుని వ్యాఖ్యానం.

9th Class Social Textbook Page No.183

ప్రశ్న 12.
రాజు ఇమాన్యుయెల్-II కింద ఏకీకృతమైన ఇటలీ నిజమైన జాతీయ రాజ్యంగా మారిందా? మీ సమాధానానికి కారణాలు తెలపండి.
జవాబు:
ఇటలీ దీర్ఘకాలంగా రాజకీయంగా ముక్కలై ఉంది. అనేక వంశపారంపర్య రాజ్యాలలో, అనేక జాతులతో కూడిన హాట్స్ బర్గ్ సామ్రాజ్యంలో ఇటాలియన్లు చెల్లాచెదురై ఉన్నారు. 1831, 1848లోని విప్లవాలు విఫలం అవ్వటంతో యుద్ధం ద్వారా ఇటాలియన్ రాజ్యాలను ఒకటిగా చేసే బాధ్యత సార్డీనియా, పీడ్మాంట్ రాజు విక్టర్ ఇమాన్యుయెల్-II మీద పడింది. మాజిని, కవూర్, గారి బాల్డి నేతృత్వాలలో సాయుధ వలంటీర్ల తిరుగుబాటుతో, 1860లో వీళ్ళు దక్షిణ ఇటలీ నుండి సిసిలీస్ రాజ్యంలోకి చొచ్చుకుపోయి స్పానిష్ పాలకులను తరిమి కొట్టడానికి స్థానిక రైతాంగం మద్దతు కూడగట్టారు. 1861లో ఏకీకృత ఇటలీకి విక్టర్ ఇమాన్యుయెల్-II రాజుగా ప్రకటించారు.

కాని ఇటాలియన్ ప్రజానీకంలో అధిక శాతం నిరక్షరాస్యులు. వారికి ఉదారవాద, జాతీయతా భావజాలం తెలియకుండా ఉండిపోయారు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
18వ శతాబ్దపు మధ్యకాలపు (1815) పటాన్ని, ప్రస్తుత యూరపు పటంతో పోల్చి మీరు గమనించిన తేడాలను మీ నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:

  1. అప్పటి యూరప్ పటము నందు కనిపించెడి హనోవర్, బొహేమియా, బలేరియా ప్రాంతాలు నేడు జర్మనీలో అంతర్భాగాలు.
  2. ఆనాటి ప్రష్యా కూడా నేడు జర్మనీలో అంతర్భాగమే.
  3. సెర్బియా నేటి యుగోస్లావియాలో అంతర్భాగం.
  4. బల్గేరియా, రుమేనియా దేశాలు ప్రస్తుతం వేరు వేరు స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి.
  5. పోలెండ్ స్వతంత్ర దేశంగా అవతరించినది.
  6. రష్యా కూడా ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా, బెలారస్ యుక్రయిన్ జార్జియా, ఆర్మేనియా, అజీత్ బైజాన్ వంటి స్వతంత్ర రిపబ్లిలుగా అవతరించినది.