AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

9th Class Social Studies 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
………………….., …………….. ల కోసం బ్రిటను ఇతర దేశాలపై ఆధారపడలేదు. (శ్రామికులు, ముడి సరుకులు, పెట్టుబడి, . ఆవిష్కరణలు) (AS1)
జవాబు:
పెట్టుబడి, శ్రామికులు.

ప్రశ్న 2.
పారిశ్రామిక విప్లవకాలంలో ప్రధానమైన రెండు రవాణా మార్గాలు ………… (రోడ్డు, వాయు, జల, రైలు) (AS1)
జవాబు:
జల, రైలు.

ప్రశ్న 3.
పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో కింది వాటి గురించి రెండు వాక్యాలు రాయండి. (AS1)
అ) సాంకేతిక విజ్ఞానం
ఆ) ఆర్థిక వనరులు సమకూర్చడం, డబ్బులు
ఇ) వ్యవసాయిక విప్లవం
డి) రవాణా వ్యవస్థలు
జవాబు:
అ) సాంకేతిక విజ్ఞానం :
పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో సాంకేతిక విజ్ఞానం ప్రధాన పాత్ర పోషించింది. చేతివృత్తులు, చేతి యంత్రాలు వల్ల పెద్ద ఎత్తున సరుకులు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. వాణిజ్య కార్యకలాపాలకు పేరు గడించడానికి అనేక పరిశ్రమలు స్థాపించి, ప్రపంచ కర్మాగారంగా ఇంగ్లాండ్ పిలువబడడానికి కారణం సాంకేతిక విజ్ఞానమే.

ఆ) ఆర్థిక వనరులు సమకూర్చడం, డబ్బులు :
కొత్త యంత్రాలు, సాంకేతిక విజ్ఞానంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన ఇంగ్లాండ్ లో సంపద అనంతంగా ఉండడం వల్ల పెట్టుబడి సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడలేదు. ప్రపంచ దేశాలతో వాణిజ్య కార్యకలాపాల వలన అధికంగా ఆర్థిక వనరులు సంపాదించింది. ఈ ఆర్థిక వనరులను సరైన పద్ధతిలో ఉపయోగించారు. డబ్బును అధికం చేయడంలో ఇంగ్లాండ్ బ్యాంక్ ప్రధానపాత్ర పోషించింది. లండన్ విత్తమార్కెట్, ఉమ్మడి స్టాక్ బ్యాంకు, ఉమ్మడి స్టాక్ కార్పొరేషన్ ఏర్పడడంతో ఆర్థిక వనరులు, డబ్బు. పుష్కలంగా సమకూరాయి. సరుకులు, ఆదాయాలు, సేవలు, జ్ఞానం, ఉత్పాదక సామర్థ్యం వంటి రూపాలలో ఆర్థిక వనరులు వృద్ధి చెందాయి.

ఇ) వ్యవసాయిక విప్లవం :
బ్రిటిష్ జనాభా పారిశ్రామికీకరణ వల్ల పెరిగింది. లాభసాటికాని, పాతకాల వ్యవసాయ పద్ధతుల స్థానంలో కొత్త సాగు పద్ధతులు అంటే శాస్త్రీయంగా పంటలమార్పిడి వంటివి అనుసరించసాగారు. దీనివల్ల అధికంగా ఆహార ఉత్పత్తి పెరిగింది.

ఈ) రవాణా వ్యవస్థలు :
ముడి సరుకులు, ఉత్పత్తి అయిన వస్తువులను ప్రపంచ నలుమూలలకు చేర్చడానికి, లాభసాటి వ్యాపారాలు చేయడానికి రవాణా వ్యవస్థ ప్రధానపాత్ర పోషించింది. ముఖ్యంగా, రైలు, జల మార్గాలు పట్టణాలకు ఇనుము, బొగ్గును సమీప పట్టణాలకు ప్రయాణీకులను, సరుకులను వేగంగా, తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి తోడ్పాటు నందించాయి.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
పారిశ్రామిక విప్లవ సమయంలో జరిగిన ఆవిష్కరణల ప్రత్యేకత ఏమిటి? (AS1)
జవాబు:
యాంత్రీకరణకు అవసరమైన ప్రధాన ముడి సరుకులైన బొగ్గు, ఇనుప ఖనిజాలతో పాటు పరిశ్రమలలో వినియోగించే సీసం, రాగి, తగరం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఇంగ్లాండ్లో లభించేవి. ఇనుప ఖనిజం నుంచి దానిని కరిగించే ప్రక్రియ (స్మెల్టింగ్) ద్వారా స్వచ్ఛమైన ఇనుమును ద్రవరూపంలో తీస్తారు. కొన్ని శతాబ్దాల పాటు కలపను కాల్చటం నుంచి బొగ్గుతో ఇనుమును కరిగించేవారు. తద్వారా అడవులు మొత్తం నాశనమయ్యాయి. ఇటువంటి తరుణంలో ‘కమ్మరం” పనిచేసే ప్రాప్ షైర్ కి చెందిన డర్బీలు 3 తరాలు ద్వారా కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది) ని ఉపయోగించే ఈ బట్టీలో అధిక ఉష్ణోగ్రతలు సాధించగలిగారు. ఈ ఆవిష్కరణల కారణంగా కలప, బొగ్గుపై బట్టీలు ఆధారపడటం తప్పిపోయింది. బొగ్గు, లోహాలను లోతైన గనుల నుంచి వెలికి తీసే క్రమంలో గనులు తరుచు నీటి ముంపునకు గురయ్యేవి. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రంతో ఈ సమస్య పరిష్కారమైంది. రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో “మెడం” ద్వారా పక్కా రోడ్లు తయారుచేసే విధానం మరింత ప్రాధాన్యత పెంచింది. స్టీఫెన్సన్ యొక్క ఆవిరి రైలింజన్ ద్వారా విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

ఈ విధంగా పారిశ్రామిక ప్రగతిగ పురోభివృద్ధి సాధించడంలో ఆవిష్కరణలు ప్రధానపాత్ర పోషించాయి.

ప్రశ్న 5.
పారిశ్రామిక విప్లవం వల్ల బ్రిటిష్ మహిళలలోని వివిధ వర్గాలు ఏవిధంగా ప్రభావితమయ్యా యి? (AS1)
(లేదా)
“పారిశ్రామిక విప్లవం వలన బ్రిటిష్ సమాజంలోని అన్ని తరగతుల మహిళలూ ప్రభావితమయ్యారు” – వ్యాఖ్యానించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం వల్ల మహిళల జీవన విధానంలో అనేక మార్పులు సంభవించాయి. ముందుగా – మహిళలు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, పశుపాలన చేస్తూ, కట్టెపుల్లలు తెచ్చేవాళ్ళు. ఇంటి దగ్గర రాట్నం మీద నూలు వడికే వాళ్ళు. అయితే కర్మాగారాలలో పని పూర్తిగా మారిపోయింది. వ్యవసాయ విప్లవంతో వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల జీవన గమనంలో అనేక మార్పులు సంభవించాయి. విరామం లేకుండా చాలా గంటల సేపు ఒకే పని చేస్తూ ఉండేవారు. ఆ పనిపై పర్యవేక్షణ, తప్పులకు శిక్షలు కఠినంగా ఉండేవి. పురుషుల కంటే తక్కువ కూలీకి పనిచేయడానికి సిద్దపడే మహిళలను పనిలో పెట్టుకొనేవాళ్ళు. లాంక్ షైర్, యార్క్ షెర్లలోని నూలు వస్త్ర పరిశ్రమల్లో మహిళలను పెద్ద సంఖ్యలో పెట్టుకునేవాళ్ళు. పట్టు, లేసు తయారీ అల్లిక పరిశ్రమల్లో, బర్మింగ్ హాంలోని లోహ పరిశ్రమల్లో మహిళలే ప్రధాన కార్మికులుగా ఉండేవారు.

ప్రశ్న 6.
కాలువల ద్వారా, రైళ్ళ ద్వారా రవాణాలలోని లాభాలు ఏమిటి? (AS1)
జవాబు:
పారిశ్రామిక విప్లవం ఫలితంగా ప్రపంచ దేశాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పోటీని తట్టుకొని ప్రపంచ దేశాలను ఆకర్పించడానికి పటిష్టమైన రవాణా వ్యవస్థ బాగా ఉపయోగపడింది. రవాణా రంగంలో ప్రధానంగా కాలువలు, రైళ్ళు ముఖ్యమైనవి. కాలువల ద్వారా అనేక ప్రయోజనాలను గమనించవచ్చు. ముడి సరుకులను, ఉత్పత్తి అయిన వస్తువులను సురక్షితంగా, తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు, చేర్చడానికి ముఖ్యమైనది. కాలువల ద్వారా, బొగ్గు, ఇనుము వంటి వాటిని సమీప పట్టణాలకు చేరవేయవచ్చును. కాలువల ద్వారా ప్రయాణ దూరం కూడా సగానికి “పైగా తగ్గుతుంది. కాలువల వలన. వ్యవసాయ భూమి విలువ పెరగడమేగాక సారవంతమవుతుంది. ఎక్కువ దిగుబడితో ఉత్పత్తులు పెరగడానికి కాలువలు దోహదపడతాయి.

రైళ్ళ ద్వారా సుఖవంతమైన, విలాసవంతమైన ప్రయాణం సాధ్యం. అధిక లోడు, అధిక టన్నుల ఉత్పత్తులు గమ్యస్థానాలకు చేరడానికి రైలు రవాణా ముఖ్యమైనది. సరుకులను, ప్రయాణీకులను, ముడి పదార్థాలను వేగవంతంగా గమ్యస్థానాలకు చేర్చగలదు. కరవు, వరదలు, నీళ్ళు గడ్డకట్టడం, క్షామం , తుపానులు వంటి సందర్భాలలో అత్యవసర సేవలకు రైళ్ళు ముఖ్య మైనవి.

ప్రశ్న 7.
పారిశ్రామిక విప్లవ కాలంలో ఇంగ్లాండ్ లో వస్త్ర, ఇనుము పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్న ప్రదేశాలను పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
1. ఇంగ్లాండ్ లో ఇనుము పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాలు :
AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 1

2. బ్రిటన్ లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాలు :
AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 2

ప్రశ్న 8.
పారిశ్రామిక విప్లవ కాలంలో ఆవిష్కరణలకు సంబంధించిన పట్టికను తయారుచేయండి.
జవాబు:

  • జేమ్స్ వాట్ – ఆవిరి యంత్రం
  • స్టీఫెన్సన్ – ఆవిరి రైల్వే ఇంజన్
  • మెక్కం – పక్కా రోడ్లు తయారుచేసే విధానం
  • హార్ గ్రీవ్స్ – నూలు వడికే యంత్రం
  • మొదటి అబ్రహాం డర్బీ – కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది)
  • రెండవ డర్బీ – ఇనుము నుండి (తేలికగా విరిగిపోని) దుక్క ఇనుమును తయారుచేయుట.
  • హెన్రీ కోర్ట్ – కలబోత బట్టీ (దీంతో కరిగిన ఇనుములోని కలుషితాలు తొలగించవచ్చు.)
  • క్రుప్ కుటుంబం – క్షేత్ర ఫిరంగుల కర్మాగారం. రైలు పెట్టెలు, ఆయుధ తయారీ.
  • వెర్నెర్ సీమెన్స్ – విద్యుత్ డైనమో కనుగొన్నాడు.
  • ఎడ్మండ్ కార్డ్ రైట్ – నీటి సహాయంతో నడిచే మరమగ్గం
  • సామ్యుల్ క్రాంప్టన్ – మ్యూల్ అనే మెరుగైన యంత్రం (దీని వలన నాణ్యమైన నూలు ఉత్పత్తి పెరిగెను).
  • ఆర్కిరైట్ – జలశక్తితో మెరుగైన మగ్గాన్ని కనుగొనెను.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 9.
ఓ నెం. 191లోని “కార్మికులు” అనే శీర్షిక కింద ఉన్న పేరాను చదివి వ్యాఖ్యానించండి?
జవాబు:
పారిశ్రామికీకరణ, సామాజిక మార్పులో భాగంగా కార్మికులు తమ జీవనాన్ని దుర్భరంగా గడిపారు. కార్మికుల సగటు జీవితకాలం చాలా తక్కువ. బర్మింగ్ హాంలో 15 సంవత్సరాలు, మాంచెస్టర్ లో 17, డర్బీలో 21 సంవత్సరాలుగా ఉండేది. చిన్న వయసులో మరణాలు అధికంగా ఉండడమే కాకుండా, చిన్న పిల్లల్లో 50 సంవత్సరాల లోపు మరణాలు సంభవిస్తుండేవి. నీటి కాలుష్యం వల్ల వ్యాపించే కలరా, టైఫాయిడ్, గాలి కాలుష్యం వల్ల క్షయ వంటి అంటువ్యాధుల వల్ల మరణాలు ఎక్కువగా ఉండేవి. కలరా వ్యాపించడం వలన 1832లో 31,000 పైగా ప్రజలు చనిపోయారు. ఆ రోజుల్లో ప్రజలు అనుభవిస్తున్న రోగాలకు తగిన వైద్య సహాయం, వైద్య విజ్ఞానం అందకపోవడం, లేకపోవడం కూడా కార్మికులు, దీన స్థితిలో బ్రతకడానికి దోహదపడ్డాయి.

9th Class Social Studies 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు InText Questions and Answers

9th Class Social Textbook Page No.186

ప్రశ్న 1.
పారిశ్రామిక విప్లవకాలంలో మహిళలు, పిల్లలు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక విప్లవ కాలంలో మహిళలు, పిల్లలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. పేద ప్రజల పిల్లలు ఇళ్ళల్లో, పొలాల్లో పనిచేస్తుండేవాళ్ళు. పగటిపూట ఎక్కువ పనిగంటలు చేస్తుండేవారు. లోహ పరిశ్రమల్లో పిల్లలు కూడా పని చేసేవాళ్ళు. బొగ్గు గనుల వంటి ప్రమాదకర పనులు సైతం పిల్లలు చేసేవారు. మహిళలు తక్కువ కూలీకి పనిచేయటానికి సిద్ధపడేవారు. విరామం లేకుండా మహిళలు పని చేసేవారు. తక్కువ కూలీ అందించేవారు. పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమల్లో, లోహపరిశ్రమల్లో పని చేస్తూ మహిళలు అనేక కష్టాలు అనుభవించేవారు.

9th Class Social Textbook Page No.187

ప్రశ్న 2.
బ్రిటిష్ లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించిన 18వ శతాబ్దం నాటి బ్రిటన్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల పరిణామాలను చర్చించండి.
జవాబు:
ఆధునిక పారిశ్రామికీకరణను చవిచూసిన మొట్టమొదటి దేశం బ్రిటన్. బ్రిటన్ యూరప్ దేశాలన్నింటికంటే ముందే ఉత్పత్తిలో గణనీయమైన మార్పులను సాధించి, దాని ఫలితంగా ప్రపంచ కర్మాగారంగా గౌరవించబడింది. పరిశ్రమలు స్థాపించబడి అభివృద్ధి చెందటానికి బ్రిటన్‌కు ఎన్నో సానుకూల పరిస్థితులే కాకుండా అందుకు కావలసిన వనరులన్నీ ఉన్నాయి. ఇతర దేశాలు, ప్రపంచంలోని, దేశాలు ఈ మార్పులను తరువాత చవిచూశాయి.

9th Class Social Textbook Page No.188

ప్రశ్న 3.
పారిశ్రామికీకరణకు నాణ్యమైన ఇనుము, ఉక్కు ఎందుకు కావాలి? తరగతిలో చర్చించండి.
జవాబు:
యాంత్రీకరణకు, పారిశ్రామిక ప్రగతికి ప్రధాన ముడిసరుకు ఇనుము, ఉక్కు. ఇనుప ఖనిజం నుంచి దానిని కరిగించే ప్రక్రియ ద్వారా స్వచ్చమైన ఇనుమును ద్రవరూపంలో తీయవచ్చు. ఇనుము, ఉక్కుతో ఎన్నో రకాల వస్తువులను తయారు చేయవచ్చు. రోజువారీ వస్తువులలో కలపతో చేసిన భాగాలతో పోలిస్తే ఇనుముతో చేసిన వస్తువులు ఎక్కువ కాలం మనగలుగుతాయి. కలపతో చేసిన వస్తువులు కాలిపోయి, ముక్కలు అయ్యే ప్రమాదముంది. ఇనుము నాశనం కాకుండా, దాని యొక్క భౌతిక రసాయనిక, గుణాలను నియంత్రించవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
ఇనుప ఖనిజం, బొగ్గు తవ్వకాలకు సమాన ప్రాధాన్యత ఎందుకు లభించింది?
జవాబు:
పారిశ్రామికీకరణకు ముఖ్యమైనవి బొగ్గు, ఇనుము. ఇనుము, బొగ్గు పరిశ్రమల ఆధారంగా నాగరికతను ప్రపంచమంతా అనుకరించింది. బొగ్గును ఇనుమును కరిగించే ప్రక్రియలో ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్కసారి ఒకే గనిలో నాణ్యమైన . బొగ్గు, ఇనుప ఖనిజాలు లభించేవి. ముడిసరుకులకు, వస్తూత్పత్తికి, బొగ్గు, ఇనుముకు సమాన ప్రాధాన్యత ఉండేది. ముడి ఇనుము తయారు చేయటానికి టన్నుల కొద్దీ బొగ్గు అవసరమయ్యేది. ఈ విధంగా బొగ్గు, ఇనుముకు సమాన ప్రాధాన్యత లభించింది.

ప్రశ్న 5.
తొలినాటి పారిశ్రామిక కేంద్రాలు ఇనుము, బొగ్గు గనుల దగ్గర ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
యాంత్రీకరణకు ప్రధానమైనవి ఇనుము, బొగ్గు. వస్తువుల ఉత్పత్తికి, బొగ్గు, ఇనుము ద్వారా తయారీకి ఆయా దేశాలు ప్రాధాన్యతనందించేవి. సులభంగా రవాణాకు, సమీప పట్టణాలకు తరలించటానికి, ప్రపంచ వ్యాప్తంగా తయారైన వస్తువులకు మార్కెట్ కల్పించడానికి,. బహుళ ప్రచారం చేయడానికి గాను ఇనుము, బొగ్గు గనుల దగ్గర పారిశ్రామిక కేంద్రాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 6.
వస్త్ర పరిశ్రమను విప్లవాత్మక మార్పులకు గురిచేసిన రెండు ముఖ్యమైన ఆవిష్కరణలు పేర్కొనండి.
జవాబు:
వస్త్ర పరిశ్రమను విప్లవాత్మక మార్పులకు గురిచేసిన రెండు ముఖ్యమైన ఆవిష్కరణలలో జేమ్స్ వాట్ 1769లో కనిపెట్టిన ఆవిరి యంత్రం ఒకటి.. దీనివలన వస్తూత్పత్తి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. అదే విధంగా రెండోది 1770లో జేమ్స్ హార్ గ్రీవ్స్ కనిపెట్టిన “స్పిన్నింగ్ జెన్ని” (నూలు వడికే యంత్రం). దీనివలన నాణ్యమైన వస్త్రాలు ఉత్పత్తి అయ్యాయి.

9th Class Social Textbook Page No.193

ప్రశ్న 7.
మహిళలు, పిల్లలపై పారిశ్రామికీకరణ చూపిన రెండు ముఖ్యమైన ప్రభావాలను పేర్కొనండి.
జవాబు:
నూలువడికే జెన్ని’ వంటి చిన్న యంత్రాలు తయారుచేసి పిల్లలను పనిలో నియమించేవారు. దీర్ఘకాల పనిగంటలు, ఆదివారాల నాడు యంత్రాలను శుభ్రం చేయటం వంటి పనుల వల్ల పిల్లలకు తాజా గాలి, తగినంత వ్యాయామం ఉండేవి కావు. పిల్లలు నిద్రలోకి జారుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మహిళలు కూడా పనిచేస్తూ ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం పెంచుకున్నా వారి జీవితాలు దుర్భరంగా ఉండేవి. ప్రసవ సమయంలో లేదా చాలా చిన్న వయసులోనే పిల్లలు చనిపోయేవాళ్ళు. లోహ పరిశ్రమల్లో పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమల్లో ఎక్కువగా మహిళలు పని చేసేవాళ్ళు.

9th Class Social Textbook Page No.194

ప్రశ్న 8.
తొలి పారిశ్రామికీకరణ వల్ల బ్రిటిష్ పల్లెలు, పట్టణాలపై ప్రభావాలను, భారతదేశంలో అదే పరిస్థితులలోని ప్రభావాలతో పోల్చండి.
జవాబు:
తొలి పారిశ్రామికీకరణ బ్రిటిష్ పల్లెలు, పట్టణాలపై చాలా ప్రభావాన్ని చూపింది. అనేక సమస్యలకు లోనై, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. జనాభా పెరుగుదలకు దీటుగా గృహవసతి, తాగటానికి శుభ్రమైన నీళ్ళు, పారిశుద్ధ్యం వంటివి పెరగలేదు. మురికివాడలలో నివసిస్తూ, కలరా, టైఫాయిడ్, క్షయ వంటి అంటు వ్యాధుల వలన అనేక వేలమంది చనిపోయారు.

భారతదేశంలో కూడా వలస పాలన వలన చేతివృత్తులు, కులవృత్తులు నశించి, వ్యవసాయరంగంలో ఆహార పదార్థాల • ఉత్పత్తి తగ్గిపోయి, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత నిచ్చారు. అనేక ప్రాంతాలలో కరువు కాటకాలు, మలేరియా, టైఫాయిడ్, క్షయవంటి జబ్బులు కమ్ముకున్నాయి. స్వచ్ఛమైన గాలి, మంచినీరు దొరకక ప్రజలు అల్లాడిపోయారు. వైద్యశాస్త్రం నిర్లక్ష్యం
చేయబడింది.

9th Class Social Textbook Page No.195

ప్రశ్న 9.
జర్మనీ, ఫ్రాన్లలో పారిశ్రామికీకరణలను పోల్చండి. పోలికలు, తేడాలను గుర్తించండి.
జవాబు:
పోలికలు :
జర్మనీ, ఫ్రాన్స్ రెండు దేశాలు, ఇంగ్లాండ్ బాటలో నడవడానికి ప్రయత్నించాయి. ఇవి పారిశ్రామికీకరణ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని తలంచాయి. రోడ్డు, రైలు మార్గాలు పారిశ్రామికీకరణకు రెండు దేశాలు ప్రాధాన్యతనిచ్చాయి.

తేడాలు :

జర్మనీ :
కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని జర్మనీ పరిశ్రమలు దిగుమతి చేసుకున్నాయి. పారిశ్రామికీకరణకు కావలసిన డబ్బులను పెద్ద పెద్ద బ్యాంకులు సమకూర్చాయి. జర్మనీ కొత్తతరం పరిశ్రమలైన ఇనుము – ఉక్కు రసాయనిక, విద్యుత్ పరిశ్రమలను అభివృద్ధి చేసింది. బ్రిటనను మించిపోయింది. బలమైన పారిశ్రామిక శక్తిగా జర్మనీ వెలుగొందింది.

ఫ్రాన్స్ :
ఫ్రాన్స్ ఇందుకు విరుద్ధంగా పారిశ్రామికీకరణను నిదానంగా కొనసాగించింది. 19వ శతాబ్దం చివరకు కూడా ఫ్రాన్స్ లో అధిక శాతం ప్రజలు చిన్న చిన్న కమతాలు సాగుచేసే దేశంగానే ఉంది. యాంత్రీకరణ కంటే మానవశక్తికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ఫ్రాన్స్ లో ఆర్థిక కష్టాలు అధికంగా ఉండేవి. జర్మనీ అంత సాంకేతిక విజ్ఞానాన్ని, యాంత్రీకరణను ఫ్రాన్స్ దిగుమతి చేసుకోలేకపోయింది.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 10.
పారిశ్రామిక అభివృద్ధిలో ఫ్రాన్స్ వెనుకబడటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక అభివృద్ధిలో ఫ్రాన్స్ వెనుకబడటానికి కారణాలు :

  1. నిధుల సమస్య.
  2. ఇతర దేశాలు అభివృద్ధి చేసిన కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఫ్రాన్స్ అందుకోలేకపోయింది.
  3. గ్రామీణ శ్రామికులకు పని ఇవ్వటం వలన ఉత్పత్తి తగ్గుముఖం.
  4. బొగ్గు గనులు లేమి, దిగుమతులపై ఎక్కువ ఖర్చు.
  5. బట్టలు వంటి చిన్న పరిశ్రమలపై దృష్టి.
  6. ఎక్కువ పెట్టుబడిని ఇవ్వగల పెద్ద బ్యాంకులు ఫ్రాన్స్ లో లేకపోవడం.
  7. మానవ మేధస్సు తక్కువ.

ప్రశ్న 11.
పారిశ్రామిక ఉత్పత్తిలో ఇంగ్లాండ్, ఫ్రాన్లను అధిగమించటానికి జర్మనీకి దోహదం చేసిన అంశాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక ఉత్పత్తిలో ఇంగ్లాండ్, ఫ్రాన్లను జర్మనీ అధిగమించటానికి దోహదం చేసిన అంశాలు :

  1. బ్రిటన్, అమెరికా సాధించిన సాంకేతిక అభివృద్ధి వల్ల జర్మన్ పరిశ్రమల ప్రయోజనం.
  2. ప్రపంచ దేశాల సాంకేతిక విజ్ఞానం దిగుమతి చేసుకోవడం.
  3. పెద్ద పెద్ద పెట్టుబడుల్ని సమకూర్చగల బ్యాంకుల సహకారం.
  4. కొత్తతరం పరిశ్రమలైన రసాయనిక, విద్యుత్ పరిశ్రమల అభివృద్ధి.
  5. నూతన ఆలోచనా విధానం.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పారిశ్రామిక విప్లవ పరిణామాలు ఆర్థిక రంగంపై ఎలా ప్రభావం చూపాయో పేర్కొనండి. ఒక నివేదిక రాసి మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విజ్ఞానం, కొత్త యంత్రాల వినియోగంతో పారిశ్రామిక విప్లవం ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలలో పారిశ్రామికీకరణ వలన – సంపద అనంతంగా ఉండటంతో వస్తు ఉత్పత్తికి, ముడి పదార్థాల వినియోగానికి, రవాణా వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి పెట్టుబడి సమకూర్చుకోవడం తేలిక అయింది. 17వ శతాబ్దం ఆరంభం నుంచి ఇతర దేశాలతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు చేసి తద్వారా పెద్ద ఎత్తున లాభాలు గడించాయి.

పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆర్థిక వనరులతో పెట్టుబడిని రెండింతలు చేసి నిధులు మరింత పెంచుకోవడానికి దేశాలు బ్యాంకులలో ఆదా చేశాయి. అంతేకాకుండా సముద్రయానం చేసే పారిశ్రామికవేత్తలకు అధిక మొత్తంలో అధికవడ్డీకి డబ్బులు ఇచ్చి లాభాన్ని గడించాయి. విత్తమార్కెట్, స్టాక్ బ్యాంకు, స్టాక్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక పరిపుష్టి పెరిగింది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక చర్యలు వలన అధికంగా నిధులు సమకూరి ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.