AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం

9th Class Social Studies 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రిటిష్ పాలనకు ముందు ప్రజలు అడవులను ఎలా ఉపయోగించుకున్నారు ? ఆ రోజుల్లో అడవులు, పూర్తిగా నాశనమయ్యే అవకాశం అంత ఎక్కువగా ఎందుకు లేదు? (AS1)
జవాబు:
అనాదిగా అడవులలో నివసిస్తున్న ప్రజలు, ఆదివాసీలు తమ రోజువారీ జీవితాలకు కావలసిన అనేక వస్తువులను అడవుల నుండి పొందేవాళ్ళు. ఒక విధంగా అడవుల యజమానులు వాళ్ళే. వేటాడడానికి దుంపలు, పళ్ళు, పూలు, మూలికలు సేకరించటానికి, పశువులను మేపుకోవడానికి అడవులను ఉపయోగించుకునే వాళ్ళు. లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మే వాళ్ళుకాదు.

వ్యవసాయ భూముల కోసం అడవులను నరికినప్పటికీ రైతులు, ఆదివాసీల మధ్య ఘర్షణలు ఉన్నప్పటికీ అడవి కింద విస్తార భూభాగాలు ఉండేవి. అడవులను ఉపయోగించుకున్నప్పటికీ ప్రజలు వాటిని రక్షించే వాళ్ళు. కలపకు పెద్ద చెట్లు నరికి, కొత్త చెట్లను పెరగనిచ్చేవాళ్ళు. విచ్చలవిడిగా విశాల పరిధిలో అడవులను వాళ్ళు నరికెయ్యలేదు. అందువల్ల అడవులు పూర్తిగా నాశమయ్యే అవకాశం అంత ఎక్కువగా లేదు.

ప్రశ్న 2.
ఆదివాసీలు ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? తమ కోపాన్ని, నిరసననీ వాళ్ళు ఎలా వ్యక్తం చేశారు? కొన్ని – ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ పరిపాలనకు ముందు ఆదివాసీలు అడవిలో లభించే అనేక ఫలసాయాన్ని, అటవీ ఉత్పత్తులను అమ్ముకొని, జీవించేవాళ్ళు. లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మేవాళ్ళు కాదు. కానీ బ్రిటిష్ వారి పాలనలో ఆదివాసీల జీవితాలు దుర్భరమైనాయి. వారి జీవన పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. మధ్యప్రదేశ్, తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి విదేశస్థులపై ఆధారపడవలసి వచ్చేది. స్వాతంత్ర్యం తరువాత . కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అంతగా చదువుకోని కార్మికశక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా కొనసాగింది.

ఛత్తీస్ గఢ్ కు చెందిన బైగా, మురియా, గోండ్, భిల్ జాతులు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కోయ, రెడ్డి, కోలం జాతులు, ఒడిశాలోని సవర ఆదివాసీలు అటవీశాఖ లేదా గుత్తేదారుల వద్ద కూలీలుగా పనిచేయవలసి వచ్చేది. వడ్డీ వ్యాపారస్తుల వద, రైతుల పొలాల్లో వెట్టి కార్మికులుగా మారేవాళ్ళు, బయట నుండి వచ్చిన ప్రజలు ఆదివాసీల భూములను ఆక్రమించుకుని, హింసలకు గురి చేశారు. అటవీశాఖ అధికారులు జరిమానాలు విధించడం, చిన్న చిన్న కారణాలకు ప్రజలను కొట్టడం, బలవంతంగా ఇళ్ళలో చొరబడి వస్తువులను లాక్కోవడం, ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లంచాలు తీసుకోవడం వంటి విషయాలు సాధారణమైపోయాయి.

ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాలలో ప్రతిఘటించసాగారు. ఈ ప్రతిఘటనలలో పోలీసు స్టేషన్లు, అటవీశాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్ళు వంటివి తగలబెట్టేవాళ్ళు. అనేకసార్లు అడవిని తగలబెట్టేవాళ్ళు.
ఉదా : 1856 జార్ఖండ్ సంతాల్ తిరుగుబాట్లు.
1922 ఆంధ్రప్రదేశ్ కోయ తిరుగుబాట్లు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 3.
అదివానీ తిరుగుబాటులను బ్రిటిష్ పాలకులు ఏ విధంగా అణచివేశారు?
జవాబు:
అడవి హక్కులు అనుభవించడానికి, స్వేచ్ఛా జీవితం గడపడానికి బయట వ్యక్తుల దోపిడీల నుండి రక్షణ పొందడానికి, వేధింపుల నుండి బయటపడడానికి, అడవిలో హాయిగా నివసించడానికి గాను ఆదివాసీలు తిరుగుబాట్లు చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు. ప్రధానంగా జార్ఖండ్ కి చెందిన సంతాల్ ఆదివాసీలు బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించసాగారు. 1855-56లో సంతాలులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. జమిందారులను, వడ్డీ వ్యాపారస్తులను చంపి దోచుకోసాగారు. అయితే సంతాలుల వద్ద విల్లంబులు, బాణాలు తప్పించి వేరే ఆయుధాలు లేవు. తుపాకులున్న బ్రిటిష్ సైనికులను వాళ్ళు ఎక్కువ కాలం నిలువరించలేకపోయారు.

జార్బండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగపూర్ పీఠభూమిలోని ముండా ఆదివాసీలు 1874 – 1901 మధ్య ‘బిర్సా’ అనే యువకుడి నాయకత్వంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనుకున్నారు. వడ్డీ వ్యాపారస్తులు, జమీందారులకు రక్షణ నిచ్చిన విదేశీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలనుకున్నారు. కానీ నాయకులను పట్టుకొని జైలుపాలు చేయటంతో చివరికి ముండా తిరుగుబాటును అణచివేయగలిగారు. 1900లో బిర్సాముండా జైలులో చనిపోయాడు.

ఆంధ్రప్రదేశ్ లో కోయ ఆదివాసీలు, బస్తర్, మరియా, మురియా ఆదివాసీలు, గోండ్, కోలం ఆదివాసీల తిరుగుబాట్లను ఉత్తరాఖండ్ లోని కుమావూ తిరుగుబాట్లను బ్రిటిష్ పాలకులు కుటిల కుతంత్రాలతో, ఆధునిక ఆయుధాలతో అణచివేశారు.

ప్రశ్న 4.
భారతదేశ వివిధ ప్రాంతాలలో ఆదివాసీల తిరుగుబాటులను తెలియజేసే కాల పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:
భారతదేశ వివిధ ప్రాంతాలలో ఆదివాసీల తిరుగుబాటులను తెలియచేసే కాల పట్టిక :
1880 C : ఆంధ్రప్రదేశ్ లో కోయలు తిరుగుబాటు.
1866 – 56 : జార్ఖండ్ కి చెందిన సంతాల్ ఆదివాసీల తిరుగుబాట్లు.
1874 – 1901 : జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగపూర్ పీఠభూమిలోని ముండా ,ఆదివాసీల తిరుగుబాట్లు
1910 : మధ్యప్రదేశ్ లోని బస్తర్ లో మరియా, మురియా ఆదివాసీల తిరుగుబాట్లు.
1922 : ఆంధ్రప్రదేశ్ కోయ, కోలం ఆదివాసీల తిరుగుబాట్లు.
1940 : గోండ్, కోలం ఆదివాసీల తిరుగుబాట్లు.
1921 – 22 : ఉత్తరాఖండ్ లోని కుమావూ ప్రాంతంలోని ఆదివాసీల తిరుగుబాట్లు చేశారు.

ప్రశ్న 5.
బ్రిటిష్ ప్రభుత్వంతో భారతీయ పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సమస్యలు ఉండేవి?
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వంతో భారతీయ సారిశ్రామిక వేత్తలకు ఎదురయిన సమస్యలు :

 • రోడ్డు, రైలు మార్గాలు, విద్యుత్, బొగ్గు, ఇనుము వంటి అనేక వనరులు, సౌకర్యాలు భారతీయ పారిశ్రామిక వేత్తలకు కావాలి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ రంగాలపై తగినంత దృష్టి నిలపలేదు.
 • భారతీయ పారిశ్రామిక వేత్తలు తమకు కావలసిన యంత్రాలన్నింటినీ విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేది. యంత్రాలను తయారుచేసే పరిశ్రమలు భారతదేశంలో ఇంకా స్థాపించబడలేదు.
 • పరిశ్రమల అభివృద్ధికి శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల సహాయం కావాలి. చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిలలో కావాలి. అయితే భారతదేశంలో చదువుకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. భారతీయ శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి విదేశస్థులపై ఆధారపడవలసి వచ్చేది. స్వాతంత్ర్యం తరువాత . కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అంతగా చదువుకోని కార్మికశక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా కొనసాగింది.

ప్రశ్న 6.
బ్రిటిష్ పాలనలో పరిశ్రమలు నెలకొల్పటం భారతీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకు ఎందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి ? కొన్ని కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ పాలనలో చాలా కార్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతుల్లో కాకుండా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందువల్ల ఈ కంపెనీలకు ఎన్నో ప్రయోజనాలు సమకూరాయి. బ్రిటిష్ ప్రభుత్వంలోని వివిధ . స్థాయిల అధికారులు, ఉద్యోగస్తులు, బ్రిటిష్ వాళ్లకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఆ సౌకర్యం భారతీయ కంపెనీలకు లేదు. విదేశీ వ్యాపారం అంతా యూరపు కంపెనీల చేతుల్లో ఉన్నందువల్ల వాళ్ళకు ఎటువంటి నిధుల కొరతాలేదు. భారతదేశంలో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామికీకరణలో ప్రగతి సాధించే శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు విదేశీ కంపెనీలలో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. తద్వారా భారతీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఉండేవి.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 7.
కార్మిక చట్టాలు ముందుగా పిల్లలకు, ఆ తర్వాత మహిళలకు, చివరకు పురుషులకు చేశారు. వీటిని ఈ క్రమంలో ఎందుకు చేశారు?
జవాబు:
మిల్లులలో మరియు యంత్రాలలో పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. కార్మాగారపు వేడి, తేమ, మోత, ధూళితో రోజంతా గడిచేది. అనారోగ్యాలు, జబ్బులు, అంటువ్యాధులతో రోజూ వేసవిలో 14 గంటలు, శీతాకాలంలో 12 గంటలు పనిచేయవలసి వచ్చేది.

పై దుర్భర కష్టాలన్నీ పిల్లలు, స్త్రీలు కూడా అనుభవించారు. 1-12 సం||ల వయసుగల బాలలు భయంకరమైన పనులు చేసేవారు. బాల్యమంతా మిల్లులలో కరిగిపోయేది. పూవులాంటి పసి పిల్లల కన్నీళ్ళు తుడవాలని, బాల్య మాధుర్యాన్ని పిల్లలకు అందించాలని తలంచి పనిభారం నుండి ముందుగా విముక్తులను చేయడానికి పిల్లలకు చట్టాలు కల్పించారు.

అదే విధంగా మహిళలు కూడా, ఇంటి పని, వంట పని, కుటుంబ భారమంతా మోస్తూ మరల కర్మాగారాలలో 14 నుండి 18 గంటలు పురుషులతో పాటు పనిచేయడం అందులో గర్భిణులుగా, బాలింతలుగా ఉండటం వల్ల మహిళలు నరకయాతన అనుభవించే వాళ్ళు. దీనిని దృష్టిలో పెట్టుకుని మిల్లులలో పిల్లలు, మహిళలకే ఎక్కువగా దుర్భర పరిస్థితులు ఉన్నందున ముందుగా వాళ్ళకి విముక్తి చట్టాలు రూపొందించారు.

ప్రశ్న 8.
పారిశ్రామిక అభివృద్ధిని విద్య ఎలా ప్రభావితం చేస్తుంది ? తరగతిలో చర్చించండి. (AS6)
జవాబు:
చాలా దేశాలలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి, సాంకేతిక విజ్ఞానంతో పయనించి, ప్రపంచ పోటీలో నిలదొక్కుకో సుకానికి ఆయా దేశాలు ముందుగా విద్యకు ప్రాధాన్యత నిచ్చాయి. ముఖ్యంగా, ఇంగ్లాడ్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు పారిశ్రామిక అభివృద్ధికి, విద్యకు పెద్దపీట వేశాయి.

చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిలలో ఉండాలి. అప్పుడే పారిశ్రామిక అభివృద్ధి సాగుతుంది. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, విషయ నిపుణతగల సాంకేతిక నిపుణులు కావాలి. వీరంతా మేధావంతులుగా మారి పరిశ్రమలు వేగవంతం కావడంలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుంది. వివేచనా జ్ఞానం, అద్భుత తెలివితేటలతో పరిశ్రమలను వివిధ స్థాయిలలో అభివృద్ధి చేసి, పోటీని తట్టుకోగలగాలి. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధిని విద్య ముఖ్య భూమిక పోషిస్తుంది.

ప్రశ్న 9.
20వ శతాబ్దంలోని ప్రధాన పారిశ్రామిక పట్టణాలను భారతదేశ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
నా శ్రామిక పట్టణాలు :

 1. ముంబై
 2. అహ్మదాబాద్
 3. జంషెడ్ పూర్
 4. చెన్నై (మద్రాస్)
 5. సూరత్
 6. హైదరాబాద్
 7. పూనె
 8. విశాఖపట్నం
 9. కోల్ కతా
 10. కాన్పూర్
 11. నాగపూర్
 12. ఇండోర్
 13. సేలం

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 1

ప్రశ్న 10.
ఆదివాసీల తిరుగుబాట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకొని ఆ ప్రదేశాలను భారతదేశ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
ఆదివాసీల తిరుగుబాట్లు జరిగిన ప్రదేశాలు పటంలో చూడండి.

 1. జార్ఖండ్
 2. చోటానాగపూర్ పీఠభూమి
 3. ఉత్తరాఖండ్
 4. చింతపల్లి
 5. ఆదిలాబాద్

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 2

ప్రశ్న 11.
పేజీ నెం. 221లోని “ఆదివాసీ తిరుగుబాట్లు” అంశాన్ని చదివి, వాఖ్యానించండి. (AS2)
జవాబు:
అనాదిగా అడవులను ఆధారం చేసుకొని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీలు జీవనం సాగించేవాళ్లు. మధ్యప్రదేశ్, చత్తీ కి చెందిన బైగా, మురియా, గోండ్, బిల్ జాతులు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కోయ, రెడ్డి, కోలం జాతులు, ఒడిశాలోని సవర జాతులు అటవీశాఖాదికారులు, గుత్తేదారుల వద్ద, లేదా వడ్డీ వ్యాపారస్తుల వద్ద వెట్టిచాకిరీ కార్మికులుగా శ్రమను చిందించేవారు. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల నుండి మైదాన ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు, గిరిజనుల భూములను చేజిక్కించుకుని, గిరిజనులను అణగదొక్కారు. అదేవిధంగా అటవీశాఖాధికారులు కూడా గిరిజనులను ఇబ్బందులకు గురిచేసి జరిమానాలు విధించి, చిన్న కారణాలకు సైతం ప్రజలను కొట్టడం, బలవంతంగా ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను లాక్కోని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నిత్యసత్యమైపోయాయి.

ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాలలో ప్రతిఘటించసాగారు. దీనికిగాను వారు విప్లవ పంథాను ఎంచుకుని, పోలీస్ స్టేషన్లు, అటవీశాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లు వంటిని తగలబెట్టేవారు. కొన్ని సందర్భాలలో అడవిని తగలబెట్టేవాళ్లు. ఈ తిరుగుబాట్లు 1856లో జార్ఖండ్ సంతాల్ ఆదివాసీలు, 1880, 1922 ఆంధ్రప్రదేశ్ కోయ ఆదివాసీలు, 1940లలో గోండ్, కోలం ఆదివాసీలు చేశారు.

9th Class Social Studies 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం InText Questions and Answers

9th Class Social Textbook Page No.220

ప్రశ్న 1.
బ్రిటిష్ పాలనకు ముందు ఆదివాసుల జీవనవిధానం, అడవులను వాళ్ళు ఉపయోగించుకున్న విధానాలను తెలియజేసే నాలుగు వాక్యాలను గుర్తించండి.
జవాబు:
అడవులలో ఆనందంగా జీవించే ఆదివాసీలే అడవులకు యజమానులు. తమ రోజూవారీ జీవనానికి కావలసిన అనేక ఉత్పత్తులు హాయిగా అడవుల నుండి పొందేవాళ్ళు. వేటాడుతూ, తమ ఆహారానికి అవసరమైన దుంపలు, పళ్ళు’ ఆరగిస్తూ, పూలు, వనమూలికలు సేకరిస్తూ, పశువులను మేపుకుంటూ అడవులను ఉపయోగించుకునే వాళ్ళు.

9th Class Social Textbook Page No.221

ప్రశ్న 2.
రైల్వే పట్టాలలో ఒకప్పుడు ఉపయోగించిన కలప స్లీపర్లను మీరు చూశారా? వీటికి బదులుగా ప్రస్తుతం ఏమి వాడుతున్నారు? ఈ మార్పు ఎందుకు చేయవలసి వచ్చింది? చర్చించండి.
జవాబు:
భారతదేశం బ్రిటిష్ పరిపాలనకు ముందు అడవులతో పచ్చని చెట్లతో వికసించేది. పరిశ్రమల అభివృద్ధి పేరుతో ఓడలు, గనుల నిర్మాణాలకు కలప కోసం అడవులలో లభించే చెట్లను నరికేవారు. రైలు మార్గాలు అభివృద్ధి చెందిన తరువాత, ప్రతి సంవత్సరం కొత్త రైలు మార్గాలు వేయటానికి ఒక కోటికి పైగా కలప స్లీపర్లు అవసరమయ్యేవి. తద్వారా అడవులు రానురాను అంతరించడమే కాకుండా అడవులు కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తుండటంతో ప్రస్తుతం కలప స్లీపర్లకు బదులు ఇనుప స్లీపర్లను వాడుతూ, పర్యావరణాన్ని, ప్రకృతిని, అడవులను కాపాడుతున్నారు.

9th Class Social Textbook Page No.225

ప్రశ్న 3.
‘రక్షిత మార్కెటు’ అంటే ఏమిటో చర్చించండి.
జవాబు:
ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై లేదా బట్టలపై పన్నులను విధించినట్లయితే విదేశీ వస్తు ధరలు పెరుగుతాయి. మన దేశంలో వస్తువులపై పన్ను విధించకుండా తక్కువ ఖరీదుకు వస్తువులను అమ్మినట్లయితే భారతదేశ వస్తువులకు విలువ, ప్రాధాన్యత, పనితనం కనిపించి వస్తువులు అమ్మటానికి అనువైన వాతావరణం కనిపిస్తుంది. దీనినే రక్షిత మార్కెట్ అంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 4.
భారతదేశానికి వస్తున్న బ్రిటిష్ సరుకులపై పన్నులు విధించాలని భారతీయులు కోరసాగారు. ఇది న్యాయమైన కోరికేనా? భారతీయ, బ్రిటిష్ పరిశ్రమలతో ప్రభుత్వం సమానంగానే వ్యవహరించాలా?
జవాబు:
భారతదేశానికి వస్తున్న బ్రిటిష్ సరుకులపై పన్నులు విధించాలని భారతీయులు కోరడం న్యాయమైన కోరికే. ఎందుకంటే మన దేశంలో ముడి పదార్థాలను అతి చౌకగా కొని, వాటిని వారి దేశంలో వస్తువులుగా మార్చి , అధిక ధరలకు మన దేశ మార్కెట్లో అమ్మి మన సంపదనంతా వస్తు రూపంలో దోచుకుంటున్నారు. అదే విధంగా వారు తయారుచేసిన వస్తువులలో సాంకేతిక విజ్ఞానం, పనితనం కనిపించడం వలన ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించగలుగుతున్నాయి. పన్నులు విధించడం వల్ల బ్రిటిష్ వస్తు ఖరీదు పెరగడమే కాకుండా మన దేశ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. కాబట్టి దోపిడీ పాలన గల బ్రిటిష్ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం సమానంగా వ్యవహరించవలసిన అవసరం లేదు.

9th Class Social Textbook Page No.226

ప్రశ్న 5.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారత పరిశ్రమలు ఎందుకు వేగంగా వృద్ధి చెందాయి?
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో (1914-18) భారతదేశంలోని విదేశీ వస్తువుల దిగుమతి గణనీయంగా పడిపోయింది. సరుకు రవాణా ఓడలను యుద్ధ సంబంధ పనులకు మళ్ళించడం వల్ల ఓడల కొరత ఏర్పడడం ఒక కారణం. అంతేకాకుండా యూరప్ కర్మాగారాలలో యుద్దానికి కావలసిన వస్తువులను ఉత్పత్తి చేయసాగారు. దాంతో భారతదేశ మార్కెటు కోసం ఉత్పత్తి చేసే వస్తువులు తగ్గిపోయాయి.

ఈ పరిస్థితులలో భారతదేశంలో ఏర్పాటు చేసిన కర్మాగారాలు తమ ఉత్పత్తిని, అమ్మకాలను పెంచుకున్నాయి. ఈ అమ్మకాలతో ప్రేరణ పొంది పరిశ్రమలు వేగంగా వృద్ధి చెందాయి.

9th Class Social Textbook Page No.227

ప్రశ్న 6.
బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఏ పరిశ్రమలు స్థాపించారు?
జవాబు:
బ్రిటిష్ పాలనలో భారతదేశంలో నూలు, వస్త్ర పరిశ్రమ. జెంషెటాటా ఆధ్వర్యంలో జంషెడ్ పూర్ వద్ద ఉక్కు కర్మాగారం స్థాపించారు.

ప్రశ్న 7.
స్వాతంత్ర్య సమయంలో భారత పరిశ్రమల అభివృద్ధికి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్య సమయంలో చాలా కర్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతులలో లేవు. ఇవి చాలా ఎక్కువగా బ్రిటిష్ వారి అధీనంలో ఉండేవి. పరిశ్రమల అభివృద్ధికి కావలసిన అధికారాలు, ఉద్యోగస్తులు బ్రిటిష్ వాళ్ళకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఇటువంటి మేధావులైన కార్మికులు మన దేశ పరిశ్రమలలో పనిచేసేవారు కాదు. పరిశ్రమల అభివృద్ధికి కావలసిన నిధులు కూడా మన పరిశ్రమలకు కొరతగా ఉండేవి. శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కూడా తగినంత మంది లేకపోవడం కూడా మన పరిశ్రమలు సమస్యలు ఎదుర్కోవడానికి కారణమైంది.

9th Class Social Textbook Page No.229

ప్రశ్న 8.
భారతదేశంలో తొలినాటి కర్మాగారాలలో కార్మికుల పని, విశ్రాంతికి సంబంధించిన నియమాలు ఏమిటి?
జవాబు:
మిల్లులలో పనిచేసే కార్మికుల పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. తెల్లవారకముందే నిద్రలేచి మిల్లులకు బారులు తీరిన కార్మికులు పని మొదలు పెడితే ఆపడమనేదే లేదు.

విశ్రాంతి చాలా తక్కువగా ఉండేది. 15 -20 నిమిషాలు భోజనానికి విశ్రాంతి ఉండేది. సూర్యుడు అస్తమించిన తరువాత చీకటిలో చూడటం అసాధ్యమైనప్పుడు మాత్రమే యంత్రాలతో ఆ రోజుకి పని ఆగేది. వారానికి ఒక రోజు సెలవులేదు. ముఖ్యమైన పండుగలకు మాత్రమే సెలవు ఇచ్చేవారు. మిగతా సమయంతా పనిలోనే కార్మికులు నిమగ్నమయ్యేవాళ్ళు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 9.
వేతనాల చెల్లింపునకు సంబంధించిన నియమాలు ఏమిటి?
జవాబు:
కార్మికులు ఉత్పత్తి చేసిన సరుకులను బట్టి కూలీ చెల్లించే వాళ్ళు. “ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలీ” అన్న నియమాన్ని యజమానులు అమలు చేశారు. ఒక్కొక్క సారి యంత్రాలు పనిచేయకపోయినా చెల్లింపులు ఉండవని చెప్పేవారు. నెల అయిన తరువాత కార్మికులకు మిల్లు యజమాని మొత్తం కూలీ చెల్లించేవాడు కాదు. మళ్ళీ నెల వరకు కొంత డబ్బు తన వద్దే అట్టే పెట్టుకొనే వాళ్ళు. ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా కార్మికులు పనిమానేసి వెళ్లిపోవటం సాధ్యం అయ్యేది కాదు.

ప్రశ్న 10.
ఏ కారణాల వల్ల కార్మికుల వేతనాలను తగ్గించేవాళ్ళు?
జవాబు:
కార్మికులకు జరిమానాలు విధించేవాళ్ళు. ప్రతీ చిన్న విషయానికి, పనికి ఆలస్యంగా వచ్చారని, బట్ట పాడైపోయిందని, కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయలేదని యజమానికి అనిపించినా జరిమానాలు విధించి, కార్మికులకు నెలలో రావలసిన వేతనం నుంచి మినహాయించే వాళ్ళు.

9th Class Social Textbook Page No.230

ప్రశ్న 11.
కార్మికులు సమ్మె ఎందుకు చేసేవాళ్ళు?
జవాబు:
కార్మికుల దుర్భర పరిస్థితుల నుండి తమ హక్కుల సాధన కొరకు సమ్మె చేసేవారు.

 • కొన్ని సందర్భాలలో తమ వేతనాలు తగ్గించినందుకు నిరసనగా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేశారు.
 • అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా, తమ జీవన విధానం కొరకు వేతనాలను పెంచమని సమ్మె చేశారు.
 • మరి ముఖ్యంగా కార్మికులు వేతనాలు, హక్కుల కోసమే కాకుండా బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలన నుండి విముక్తి కొరకు సమ్మెల ద్వారా కార్మికులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.

ప్రశ్న 12.
ఇతర చర్యలకు బదులు సమ్మెనే ఆయుధంగా ఎందుకు ఉపయోగించే వాళ్ళు?
జవాబు:
ఈ సమ్మె చేయడం ద్వారా పరిశ్రమలు మూతబడతాయి.

 • ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ పరిశ్రమలకు, కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది.
 • కంపెనీ ఉత్పత్తులపై సమాజంలో చెడు ప్రభావం పడుతుంది.
 • నిరంకుశ నిర్ణయాలు గల యజమానుల నుండి మార్పు కొరకు సమ్మెనే ఎంచుకుంటారు.

సమ్మె ద్వారా వచ్చే నష్టం కంటే వారి కోరికలు తీర్చడమే ప్రధానమని యజమానులు భావించి, కార్మికుల కోర్కెలు తీరుస్తారు. నిరసనలు, ఉపన్యాసాలు, ఊరేగింపుల ద్వారా కంపెనీ యజమానులలో మార్పురాదు. కాబట్టి బలమైన ఆయుధం సమ్మెనే కార్మికులు ఎంచుకుంటారు.

9th Class Social Textbook Page No.231

ప్రశ్న 13.
మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? కాల పట్టికలో దానిని గుర్తించండి. మీ తల్లిదండ్రులు, తాత, అవ్వలు, వీలైతే కొంతమంది వృద్ధ బంధువులు పుట్టిన సంవత్సరాలను కూడా గుర్తించండి.
జవాబు:
నేను 1999లో జన్మించాను. మా నాన్నగారు 1963లో జన్మించారు. మా అమ్మగారు 1965లో జన్మించారు. మా తాతగారు 1943లో, మా అవ్వ 1939లో జన్మించారు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 14.
వాళ్ళలో ఎవరైనా ఏదైనా కార్మిక చట్టాల వల్ల ప్రయోజనం పొందారేమో కనుక్కోండి.
జవాబు:
మా తాతగారు షుగర్ ఫ్యాక్టరీ (పంచదార పరిశ్రమ) లో పనిచేసేవారు. ఈ కార్మిక చట్టాల వలన పనిగంటలు తగ్గాయని, చాలా విషయాలలో కంపెనీ యజమానులు ప్రయోజనం కల్పించారని, వైద్య సదుపాయాలు మరియు విశ్రాంతికి తగిన అవకాశాలు కల్పించారని చెప్పారు.

ప్రశ్న 15.
మొదట్లో కార్మికుల సంక్షేమంపై భారతదేశంలోని విద్యావంతులు ఎందుకు అంతగా దృష్టి పెట్టలేదు?
జవాబు:

 • కార్మికులకు స్థిర ఆదాయాలు, సెలవు వంటి సౌకర్యాలు కల్పిస్తే మిల్లు ఉత్పత్తి తగ్గిపోతుందని,
 • యజమానుల ఖర్చులు పెరిగిపోతాయని,
 • దీనివల్ల కార్మాగారాలలో ఉత్పత్తి చేసే వస్తువుల ఖర్చు పెరిగిపోతుందని,

ఇదే జరిగితే బ్రిటన్ నుంచి వచ్చే వస్తువులు తేలికగా అమ్ముడయ్యి, భారతదేశంలో పరిశ్రమల ప్రగతి కుంటుపడుతుందని కార్మికుల సంక్షేమంపై అంతగా దృష్టి పెట్టలేదు.

ప్రశ్న 16.
కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటాయి?
జవాబు:
కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలను భయందోళనకు గురిచేశాయి. కార్మిక చట్టాల వల్ల పని గంటలు తగ్గడమే కాకుండా విశ్రాంతి గంటలు పెరగడం వలన ఉత్పత్తి తగ్గుతుందని, వారిలో ఐక్యత, సమ్మెవంటి హక్కులు ద్వారా మిల్లు యజమానులకు ఖర్చులు పెరిగి, నష్టాలు వచ్చే ప్రమాదముందని భయపడ్డారు.

ప్రశ్న 17.
బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధిని వ్యతిరేకించారు. అయినప్పటికీ వాళ్ళు భారతదేశ కార్మికుల పక్షాన నిలబడ్డారు. ఎందుకు?
జవాబు:
బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తులపై భారతదేశంలో పన్నులు విధించడం వల్ల వాళ్ళ వస్తూత్పత్తి ధరలు పెరగసాగాయి. కానీ భారతదేశంలో అధిక కార్మికులు తక్కువ వేతనానికి అధిక పని గంటలు పనిచేసి అధికోత్పత్తి సాధించడమే కాకుండా తక్కువ ధరకు భారతీయ ఉత్పత్తులు లభిస్తున్నాయి. కాబట్టి కార్మికులకు మరిన్ని హక్కులు, సౌకర్యాలు కల్పించి, పని గంటలు తగ్గించి, వేతనాలు పెంచినట్లయితే భారతీయ వస్తువుల ధరలు పెరిగి, తమ ఉత్పత్తులపై కొనుగోలు శక్తి పెరిగి అధిక లాభాలు పొందవచ్చని భావించారు.

ప్రశ్న 18.
బ్రిటిషు కాలంలో ఏ వయస్సు లోపల పిల్లలను కార్మికులుగా పెట్టుకోకుండా చేశారు?
జవాబు:
9 సం||ల లోపు పిల్లలను కార్మికులుగా పిల్లలను పెట్టుకోకుండా చేశారు.

ప్రశ్న 19.
ప్రస్తుత చట్టాల ప్రకారం ఏ వయస్సు లోపల పిల్లలను కార్మికులుగా పెట్టుకోకూడదు?
జవాబు:
14 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలలో నియమించకూడదు.

ప్రశ్న 20.
కార్మిక చట్టాల ప్రకారం పిల్లలు, మహిళలు, పురుషులు రోజుకి ఎన్ని గంటల పాటు పనిచేయాలి?
జవాబు:

 1. కార్మిక చట్టాల ప్రకారం పిల్లలతో రోజుకి 7 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.
 2. మహిళా కార్మికులతో రోజుకి 11 గంటలకు మించి పనిచేయించకూడదు.
 3. పురుష కార్మికులతో రోజుకి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.

9th Class Social Textbook Page No.232

ప్రశ్న 21.
బ్రిటిష్ కాలంలో భారతదేశంలో ఏర్పడిన రెండు ముఖ్యమైన కార్మిక సంఘాలు ఏవి?
జవాబు:
1920 ల నుంచి కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి.

 1. సోషలిస్టు భావాలతో ఏర్పడిన “గిర్నికాంగార్ యూనియన్”.
 2. అహ్మదాబాదులో గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన శక్తివంతమైన కార్మిక సంఘం “మజూర్ మహాజన్”.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 22.
కార్మికులకు కార్మిక సంఘం ఎందుకు ముఖ్యమైనది? చర్చించండి.
జవాబు:

 1. కార్మికుల సంక్షేమం కోసం.
 2. తమ హక్కుల సాధన కొరకు.
 3. మెరుగైన వేతనాలు సాధించుకోడానికి.
 4. మిల్లు యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకోడానికి.
 5. కార్మికులకు ప్రమాదాలు, మరణాలు సంభవించినప్పుడు, మెరుగైన నష్టపరిహారాలు యజమానుల నుండి పొందడానికి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
అటవీ శాఖకు వెళ్ళి అడవులను ఎలా కాపాడుకోవాలి, స్థానిక ప్రజలు, కర్మాగారాలు వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై ఒక అధికారితో ముఖాముఖి నిర్వహించండి.
జవాబు:
అటవీ శాఖకు వెళ్ళి ‘అడవులను కాపాడుకోవాల్సిన విధం, స్థానిక ప్రజలు, కర్మాగారాలు వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై ఒక అధికారితో ముఖాముఖి :

నేను – అటవీ శాఖాధికారిగారూ….. అడవులను ఎలా కాపాడుకోవాలి?

అటవీ శాఖాధికారి – అడవులను నరకరాదు. అవి మన జాతీయ సంపద.

నేను – మన కలప అవసరాలు అడవుల ద్వారానే కదా తీరేది.

అటవీ శాఖాధికారి – అడవులనుండి మనకు కలప లభిస్తున్నప్పటికి, అడవులను విచ్చలవిడిగా నరకరాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో నరకవలసి వచ్చిన వాటి స్థానంలో మొక్కలను నాటాలి.

నేను – అంటే చెట్లను నరుకుతున్న ప్రదేశాలలో క్రొత్త మొక్కలను నాటవలసి ఉంటుందన్నమాట.

అటవీ శాఖాధికారి – అంతేకాదు, మనం నివసిస్తున్న ప్రదేశాలందు ఖాళీగా ఉన్న ప్రాంతాలలోను, ఆ పాఠశాలల, కళాశాలల ఆవరణములలోని పారిశ్రామిక ప్రాంతాలయందు, రోడ్లకిరువైపుల నదులు, కాలువగట్లపైన మొక్కలను నాటవలసి ఉంటుంది.

నేను – మొక్కలను పెంచడం వలన ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా?

అటవీ శాఖాధికారి – అనేక ఉపయోగాలు ఉన్నాయి. పర్యావరణం పరిరక్షించబడుతుంది. వర్షాలు సంభవిస్తాయి. వరదలను అరికట్టడం జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వృక్షో రక్షతి రక్షితః – వృక్షాలను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి.

ప్రశ్న 2.
మీకు దగ్గరలో ఉన్న ఒక కర్మాగారాన్ని సందర్శించి దాని చరిత్ర, సాంకేతిక విజ్ఞానం ఎలా మారింది, కార్మికులు ఎక్కడ నుంచి వస్తారు తెలుసుకోండి. కొంతమంది కార్మికులు, యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ దృక్పథాలు తెలుసుకోండి.

పట నైపుణ్యాలు

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 3
అల్లూరి సీతారామరాజు
తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో సీతారామరాజు గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది, చింతపల్లి, రంపచోడవరం, కె.డి. పేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం పోలీస్ స్టేషన్లపై రాజు దాడులు చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం కృషిచేసిన రాజును మంప గ్రామం వద్ద బ్రిటిష్ ప్రభుత్వం కాల్చి చంపింది.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 4
కొమరం భీం
సీతారామరాజు పోరాటంతో, బిర్సాముండా తిరుగుబాటుతో స్ఫూర్తి పొంది, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాడు. గొండు, కోయ యువకులతో భీం గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయుధాలను ప్రయోగించడంలో గిరిజన ప్రజలకు శిక్షణ ఇచ్చాడు. జోడేఘాట్ అడవులలో ఒక పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో జరుగుతున్న పోరాటంలో కొమరం భీం వీరమరణం పొందారు.