Students can go through AP Board 9th Class Social Notes 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు
→ ఆధునిక సమాజాల్లో చాలావరకు కీలకమైన విధులను ప్రభుత్వమే నిర్వహించవలసిన బాధ్యత కలిగి ఉంది.
→ ఆరోగ్య సేవలు, పరిశుభ్రత, విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలల నిర్వహణ వంటివి ప్రభుత్వం కల్పించే సదుపాయాలు.
→ ప్రజా సదుపాయం యొక్క ముఖ్య లక్షణం ప్రజలందరూ ప్రయోజనం పొందడం.
→ ప్రజా సదుపాయాలను స్వయంగా ప్రభుత్వమే చేపట్టాలి లేదా ఇతరులచే నిర్వహింపజేయాలి.
→ ప్రభుత్వం రసాయన ఎరువులు ఫ్యాక్టరీల ధరల కన్నా తక్కువ ధరలకు లభించే విధంగా రైతులకు తోడ్పడుతుంది.
→ ప్రభుత్వం వసూలు చేసిన పన్నులే ప్రభుత్వ ఆదాయం అవుతుంది.
→ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం , ప్రభుత్వం చేసే ఖర్చుల నివేదికను “బడ్జెట్” అంటారు.
→ బడ్జెట్ లోని ఖర్చులన్నింటిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నా పారిశ్రామిక వర్గాలు, రైతు సమూహాలు, పౌర సమాజ కార్యకర్తల వంటివారితో సంప్రదింపులు జరుపుతారు.
→ ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరు పన్నులు.
→ ఉత్పాదన అనంతరం వస్తువులు ఒకరి నుండి ఒకరికి తరలించబడతాయి.
→ పన్నులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు.
- పరోక్ష పన్నులు
- ప్రత్యక్ష పన్నులు.
→ పరోక్ష పన్నులను వస్తువులు, సేవలపై విధిస్తారు.
→ ఫ్యాక్టరీలలో తయారుచేసే లేదా ఉత్పత్తిచేసే వస్తువులపై ఎక్సైజ్ సుంకం విధించబడుతుంది.
→ వస్తువుల ధరలకు అన్ని రకాల పన్నులు కలుస్తూ ఉంటాయి.
→ ఉత్పాదన అనంతర వస్తువులు ఒకరి నుండి ఒకరికి తరలించబడతాయి.
→ సేవలపై విధించే పన్నును “సేవా పన్ను” అంటారు.
→ ప్రస్తుత విలువ ఆధారిత పన్ను, విధానాన్ని అనుసరించి ఉత్పత్తిదారులు చేకూర్చిన విలువకు మాత్రమే పన్ను చెల్లిస్తారు.
→ విలువ ఆధారిత పన్ను విధానంలో ఉత్పత్తిదారు చెల్లించే పన్ను తక్కువగా ఉంటుంది.
→ వస్తువుల యొక్క వివిధ ఉత్పత్తి దశల్లో, అమ్మకాలపై ప్రతిస్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు.
→ ప్రత్యక్ష పన్నుల్లో ముఖ్యమైనవి
- ఆదాయపు పన్ను
- కార్పొరేట్ పన్ను.
→ వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై ఆదాయం పన్ను వీధించబడుతుంది.
→ ఆదాయం పన్ను చట్టాలననుసరించి ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఎక్కువ భాగాన్ని పన్నుగా చెల్లించాలి.
→ ప్రతి ఒక్కరూ ధనవంతులైనా, పేదవారైనా వస్తువులను కొన్నప్పుడు ఒకే విధమైన పన్ను చెల్లించాలి.
→ పన్నుల వలన వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో అయ్యే ప్రభుత్వ ఖర్చులకు సరిపోవడం లేదు.
→ ప్రభుత్వం వివిధ రకాల పన్నుల నుండి ఆదాయం పొందుతుంది.
→ వ్యవసాయపు ఆదాయం మొత్తాన్ని పన్ను నుండి మినహాయించారు.
→ ప్రజలు తమ ఆదాయాన్ని పైకి కనబడకుండా దాచిపెట్టే ధనాన్ని నల్లధనం అంటారు.
→ కస్టమ్స్ సుంకాలను అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నుండి, అమ్మకం పన్నును వ్యాపారుల నుండి దుకాణ నిర్వాహకుల నుండి వసూలు చేస్తారు.
→ వార్షిక బడ్జెట్ : రాబోవు ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వానికి వచ్చే ఆదాయం , ప్రభుత్వం చేసే ఖర్చులను గురించిన నివేదిక్ష.
→ నల్లధనం చాలామంది ప్రజలు తమ మొత్తం ఆదాయాలను వెల్లడించకుండా, వాస్తవంగా ఉన్నదాని కంటే తక్కువగా చూపడం లేదా ఆదాయాన్ని పైకి కనబడకుండా దాచి పెట్టిన ధనాన్ని “నల్లధనం” అంటారు.
→ విలువ ఆధారిత పన్ను : ఉత్పత్తిదారులు చేకూర్చిన విలువకు మాత్రమే పన్ను చెల్లించే దానిని “విలువ ఆధారిత పన్ను” అంటారు.
→ కార్పొరేట్ పన్ను : ఉత్పత్తి సంస్థల ఆదాయంపై విధించే పన్నును “కార్పొరేట్ పన్ను” అంటారు.
→ ప్రత్యక్ష పన్ను : వ్యక్తులు ఆదాయాలపై లేక కంపెనీలు, వ్యాపారాల్లో ఆర్జించే లాభాలపై నేరుగా విధించబడే పన్నులు.
→ పరోక్ష పన్ను వస్తువుల యొక్క వివిధ ఉత్పత్తి దశల్లో, అమ్మకాలపై ప్రతిస్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించుట, ఏది ఏమైనా మొత్తం పన్ను అంతిమంగా వినియోగదారునిపై పడుతుంది. కాకపోతే వినియోగదారులు పరోక్షంగా చెల్లిస్తారు.
→ ఆదాయ పన్ను వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై విధించే పన్ను “ఆదాయం పన్ను”