AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 6 ప్రబోధం.
AP State Syllabus 9th Class Telugu Important Questions 6th Lesson ప్రబోధం
9th Class Telugu 6th Lesson ప్రబోధం Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
క్రింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. అరటిపండ్లలో విటమిన్ ‘బి ‘ అత్యధికంగా లభిస్తుంది. వాపులను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెంచడంలో సహకరించే విటమిన్ ఇది. సమృద్ధిగా లభించే ఈ
 పండులో విటమిన్ ‘బి’, పొటాషియం అధికంగా ఉంటాయి.
 ప్రశ్నలు:
 1. అరటిలో అత్యధికం లభించే విటమిన్ ఏది?
 2. అరటి దేని ఉత్పత్తి పెండచంలో సహకరిస్తుంది?
 3. అరటి తినడంవల్ల ఏ వ్యవస్థ బలంగా ఉంటుంది?
 4. విటమిన్ ‘బి’ తో పాటు అరటిపండులో ఇంకా ఏది ఉంటుంది?
 జవాబులు:
 1. ‘బి’
 2. తెల్ల రక్తకణాలు
 3. నాడీ
 4. పొటాషియం

2. కొలంలో చలి, వేడిమి, వర్షం సాధారణమనే మార్పులుండాలి. లేని పక్షంలో ప్రాణులు జీవించలేవు. నడక, పరుగు, దూకుడు ……. ఇలాంటి భేదాల్లేని పక్షంలో జీవితంలో ఏ పనినీ చేయలేడు. కోపం, ప్రార్థన, మందలింపు, బుజ్జగింపు ……. ఇలాంటి మార్పుల్లేనిదే సంసారం సాగదు. బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధాప్యం, అతివార్ధక్యం, మరణం …… ఇలా మార్పులుండాలి. మార్పు లేనిదే ఎదుగుదల లేదు. ఇవన్నీ లేకపోవడమే మరణమంటే.
 ప్రశ్నలు:
 1. కాలంలో వచ్చే మార్పులేవి?
 2. మార్పులేనిదే ఏది లేదు?
 3. ఎలాంటి మార్పుల్లేనిదే సంసారం సాగదు?
 4. ఏవి లేని పక్షంలో జీవితంలో ఏ పనినీ చేయలేము?
 జవాబులు:
 1. చలి, వేడిమి, వర్షం, సాధారణం
 2. ఎదుగుదల
 3. కోపం, ప్రార్ధన, మందలింపు, బుజ్జగింపు
 4. నడక, పరుగు, దూకుడు
II. స్వీయరచన
అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
 “ప్రబోధం” ప్రక్రియ గూర్చి రాయండి.
 జవాబు:
 కనుపర్తి వరలక్ష్మమ్మగారిచే రచించబడిన ‘ప్రబోధం’ పాఠ్యము ‘లేఖ’ ప్రక్రియకు చెందినది. లేఖ అంటే జాబు, ఉత్తరం. ఒకచోటు నుండి మరొక చోటుకు, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి కబుర్లు, వార్తలు, విశేషాలు చేరవేయడానికి ఉపయోగపడే రచనా మాధ్యమం లేఖ. కొందరు ప్రముఖ వ్యక్తుల ఉత్తరాలను సాహిత్యంగా పరిగణించడం జరుగుతుంది. ఇవి ఆ వ్యక్తుల అభిప్రాయాలను, వివిధ వ్యక్తులతో వాళ్ళకున్న పరిచయాలు, సంబంధాలు, సమాజ జీవనాన్ని, పరిణామాలను తెలుపుతాయి. లేఖను విమర్శకులు మూడు రకాలుగా విభజించారు. వ్యక్తిగత లేఖలు, వ్యాపార లేఖలు, బహిరంగ లేఖలు అని చెప్పవచ్చు.
ప్రశ్న 2.
 కనుపర్తి వరలక్ష్మమ్మ స్త్రీల సమస్యల గూర్చి చర్చించడానికి కలం పట్టారు. చర్చించండి.
 జవాబు:
 పాతుకు పోయిన కొన్ని భ్రమలను పటాపంచలు చేయడానికేనన్నట్టు కొన్ని సందర్భాలలో చరిత్ర కొన్ని ఘట్టాలకు చోటు కల్పిస్తూ ఉంటుంది. కనుపర్తి వరలక్ష్మమ్మ తెలుగునాట పుట్టడం, సాహిత్య, రాజకీయ, సామాజిక, సేవలకు అంకింతం కావడం అలాంటి ఘట్టమే. స్త్రీకి అక్షరం అందుబాటులో లేని కాలంలో ఆమె పుట్టారు. కానీ కుటుంబం వరలక్ష్మమ్మ చదువుకు మనసారా సహకరించింది. ఆనాటి సమాజంలో ఆడపిల్లలు, గృహిణులు పడుతున్న బాధలను తన రచనలలో ప్రతిబింబింపజేసింది. బాల్య వివాహాలు, వేశ్యా సమస్య, గృహహింస ఇలా వివిధ అంశాలపై చర్చించారు. స్త్రీలకు
 సాహిత్యాది విషయాలు తెలిపేందుకు ‘స్త్రీ హితైషిణి మండలి’ స్థాపించి, స్త్రీ జనోద్ధరణకు పాటుపడింది.

ఆ) కింది ప్రశ్నకు పది లేకి పన్నెండు వాక్యాలలో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
 కవయిత్రి, విదుషీమణియైన సరోజినీ దేవి స్త్రీ అభ్యుదయం పట్ల తన ఉపన్యాసంలో ఏయే అంశాలను ప్రస్తావించారో మీ స్వంత మాటల్లో రాయండి.
 జవాబు:
 కవయిత్రి విదుషీమణియైన శ్రీమతి సరోజినీదేవి స్త్రీల అభ్యుదయం గూర్చి మదనపల్లిలోని హిందూ సమాజం వారు ఏర్పాటు చేసిన సభలో చక్కగా మాట్లాడారు. ఆమె ప్రస్తావించిన విషయాలు పరిశీలిస్తే – బాలికలంతా తప్పక విద్య నేర్చుకోవాలన్నారు. స్త్రీలకు నియోజక, నియోజిత స్వాతంత్ర్యం కావాలన్నారు. బాల్య వివాహాలు వద్దన్నారు. ఇతర దేశాలలో స్త్రీలు ఎక్కువ కష్టంతో సాధించిన ఎన్నిక హక్కులు, మనదేశంలోని స్త్రీలు పెద్దగా కష్టపడకుండానే సాధించారన్నారు. ఈ స్వాతంత్ర్యపు హక్కుల్ని సమర్థతతో నిర్వహించాలంటే స్త్రీలు విద్యావంతులు కావాలి. కాని మనదేశంలో స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు అడ్డంకి అయ్యాయి. వాటిని రూపుమాపాలన్నారు.
స్త్రీ శక్తి స్వరూపం. లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ మొదలైన ప్రధాన దేవతలంతా స్త్రీలేనని గుర్తుంచుకోవాలన్నారు. తమ సొంత శక్తితో విద్యను, సంపదలను పొందవచ్చు. పిరికితనాన్ని, బిడియాన్ని విడిచిపెట్టడం ద్వారా సాహసకార్యాలను చేయవచ్చు. కానీ అట్టి శక్తి నేటి మహిళలలో స్తంభించిపోయిందన్నారు. స్త్రీలకు సౌందర్యం వెలలేని ఆభరణాలను ధరించడంలో లేదు, నిర్మలమైన ప్రేమను, కరుణను ఇరుగు పొరుగు వారిపై కలిగి ఉండాలన్నారు.
III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)
1. ఆర్ధాలు :
నియోజక : నియోగించునది (స్వయంగా / నిర్ణయం)
 నియోజిత : ఆజ్ఞాపించునది (స్వతంత్ర ఆలోచనతో)
 ప్రబోధం : మేలుకోలు, మిక్కిలి తెలివి
2. పర్యాయపదాలు :
స్వాతంత్ర్యం : స్వేచ్ఛ, స్వతంత్రం, సొంతం
 వివాహం : పెండ్లి, పరిణయం, కళ్యాణం
 సరస్వతిదేవి : వాణి, భారతి, బ్రాహ్మి, శారద
 లక్ష్మీదేవి : పద్మ, కమల, రమ, ఇందిర
 పిఱికి : భీరువు, భయము, వెఱపు
 శక్తి : సత్తువ, బలం
 దేశం : నాడు, జనపదం, రాజ్యం , రాష్ట్రం , సీమ
 ప్రేమ : అనురక్తి, అనురాగం, అభిమానం, ప్రణయం
 పుణ్యం : ధర్మం, సుకృతం, కుశలం, శ్రేయం
 హృదయం : మనస్సు, మానసం, ఎద, చిత్తం, మది
3. వ్యుత్పత్యర్థాలు :
బాల : పదహారేండ్ల లోపుగల పడుచు
 లక్ష్మి : ఈమెచే సర్వము చూడబడును (విష్ణుని భార్య)
 సర్వసతీ : అంతటను వ్యాపించి యుండునది /బ్రహ్మలోకమున బ్రహ్మ సరస్సును ఆశ్రయించి నదీ రూపముగా ప్రవహించెడు నది (వాగధి దేవత)
4. నానార్థాలు :
మతం : అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి
 ప్రబోధం : మేలుకోలు, మిక్కిలి, తెలివి
 శక్తి : బలిమి, చిల్లకోల, పార్వతి
5. ప్రకృతి – వికృతులు :
వనితా – వెలది
 రత్నము – రతనము
 భాష – బాస
 ప్రేమ – పేర్మి, ప్రేముడి
 కుమారీ – కోమరిత
 యాత్ర – జాతర
 ప్రాణము – పానం
 సౌందర్యం – చందు
 మణి – మిన్న
 లేఖ – లేక
 హృదయం – ఎద, ఎడద
 నిర్మలం – నిచ్చలము
 శ్రీమతి – సీమాటి (భాగ్యవతి)
 కార్యం – కర్జము
 పుణ్యము – పున్నెము
6. సంధులు :
గంభీర + ఉపన్యాసము = గంభీరోపన్యాసము – గుణసంధి
 మహత్తర + ఉపన్యాసము = మహత్తరోపన్యాసము – గుణసంధి
 ఉత్కంఠము + పడు = ఉత్కంఠపడు – పడ్వాది సంధి
 అగ్ర + ఆసన + అధిపురాలు = అగ్రాసనాధిపురాలు – సవర్ణదీర్ఘ సంధి
 ముఖ్య + అంశాలు = ముఖ్యాంశాలు – సవర్ణదీర్ఘ సంధి
 నెఱు + చెలి = నెచ్చెలి – ప్రాతాది సంధి
 స్త్రీలు + ఎల్లరు = స్త్రీలెల్లరు – ఉత్వసంధి
 విద్య + అభివృద్ధి = విద్యాభివృద్ధి – సవర్ణదీర్ఘ సంధి
 రామ + ఈశ్వర + ఆది = రామేశ్వరాది – గుణ, సవర్ణదీర్ఘ సంధులు
7. సమాసాలు :
గంభీరోపన్యాసం – గంభీరమైన ఉపన్యాసం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 మహత్తరోపన్యాసం – మహత్తరమైన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 ఉపన్యాసం పెక్కు విషయాలు – పెక్కు అయిన విషయాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 పాశ్చాత్య స్త్రీలు – పాశ్చాత్యులైన స్త్రీలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 పుణ్యక్షేత్రం – పుణ్యమైన క్షేత్రం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 బాల్యవివాహం – బాల్యము నందు వివాహం – సప్తమీ తత్పురుష సమాసం
 భూతదయ- భూతములందు దయ – సప్తమీ తత్పురుష సమాసం
 కరుణాభరితం – కరుణచేత నిండినది – తృతీయా తత్పురుష సమాసం
 పుణ్యయాత్రలు – పుణ్యము కొఱకు యాత్రలు – చతుర్థి తత్పురుష సమాసం
 లక్ష్మీ ప్రసన్నత – లక్ష్మి యొక్క ప్రసన్నత – షష్ఠీ తత్పురుష సమాసం
 మదరాసు రాష్ట్రం – మదరాసు అనుపేరు గల రాష్ట్రం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
 విద్యాభివృద్ధి – విద్య యొక్క అభివృద్ధి – షష్ఠీ తత్పురుష సమాసం
9th Class Telugu 6th Lesson ప్రబోధం 1 Mark Bits
1. ఝాన్సీరాణి వీరనారిగా పేరొందినది – నానార్థాలు గుర్తించండి. (S.A.II – 2018-19)
 ఎ) స్త్రీ – ఉవిద
 బి) స్త్రీ – విల్లు
 సి) స్త్రీ – వింటితాడు
 డి) స్త్రీ – బాణం
 జవాబు:
 సి) స్త్రీ – వింటితాడు
2. ఇంతులు ఈ కాలంలో చదువులో అపార నైపుణ్యం ప్రదర్శించి ఆహా! లలనలు గొప్పవారే అనిపించారు. (గీత గీసిన పదాలకు తగిన పర్యాయపదం గుర్తించండి) (S.A.III – 2016-17)
 ఎ) పూబంతులు
 బి) లక్ష్ములు
 సి) ఉవిదలు
 డి) శ్రీలు
 జవాబు:
 సి) ఉవిదలు

3. తోడి మానవుల నస్పృశ్యులుగా భావించుట తప్పు – (ఆధునిక వచనాన్ని గుర్తించండి) (S.A.I – 2018-19)
 ఎ) తోటి మానవుల నస్పృశ్యులుగా భావించుట తప్పు
 బి) తోటి మనుషులను అస్పృశ్యులుగా భావించడం తప్పు
 సి) తోటి మనుషులను అస్పృశ్యులుగా భావించడం దొసగు
 డి) తోడి మనుషులను అస్పృశ్యులుగా భావించుట తప్పు
 జవాబు:
 బి) తోటి మనుషులను అస్పృశ్యులుగా భావించడం తప్పు
4. పెక్కు విషయములను గూర్చి చర్చించియున్నారు. (ఆధునిక వచనంలోకి మార్చిన వాక్యం గుర్తించండి.) (S.A.III – 2016 17)
 ఎ) పెక్కు విషయముల గూర్చి చర్చించి యుండలేదు.
 బి) పెక్కు విషయాల గురించి చర్చించారు.
 సి) పెక్కు విషయముల గురించి చర్చించలేదు.
 డి) పెక్కు విషయాలను చర్చిస్తారు.
 జవాబు:
 బి) పెక్కు విషయాల గురించి చర్చించారు
5. తోటిమానవులను అస్పృశ్యులుగా భావించుట తప్పని సరోజినీదేవి అన్నది. (ఈ పరోక్ష కథనానికి ప్రత్యక్ష కథనాన్ని గుర్తించండి.)
 ఎ) తోటిమానవులను అస్పృశ్యులుగా భావించుట తప్పని సరోజినీదేవి అనలేదు
 బి) తోటిమానవులను అస్పృశ్యులుగా భావించుట తప్పేనని సరోజినీదేవి అన్నది.
 సి) “తోటిమానవులను అస్పృశ్యులుగా భావించుట తప్పు” అని సరోజినీదేవి అన్నది.
 డి) “తోటిమానవులను అస్పృశ్యులుగా భావించుట తప్పేననీ” సరోజినీదేవి అన్నది.
 జవాబు:
 సి) “తోటిమానవులను అస్పృశ్యులుగా భావించుట తప్పు” అని సరోజినీదేవి అన్నది.
భాషాంశాలు (పదజాలం , వ్యాకరణం)
1. ఆర్గాలు:
6. రామాయణ, భారతాలు మంచివైపు నడవమని ప్రబోధిస్తాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 A) హెచ్చరిక
 B) బెదిరింపు
 C) మేలుకొలుపు
 D) బ్రతిమాలు
 జవాబు:
 C) మేలుకొలుపు
7. ఉత్తములు ఎప్పుడు శుభ ఫలితాలకై ఆలోచిస్తారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 A) చెడు
 B) మంచి
 C) మిశ్రమ
 D) సమ
 జవాబు:
 B) మంచి
8. సంస్కారవంతమైన చదువు మేధావిని చేస్తుంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 A) కుబుద్ది
 B) కుమతి
 C) కుటిల
 D) శుద్ధి
 జవాబు:
 D) శుద్ధి

9. పశ్చాత్తాపమే మనసులో పాపాన్ని కడిగివేస్తుంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 A) తప్పు చేసాననే భావం
 B) దానం
 C) మంచి
 D) తృప్తి
 జవాబు:
 A) తప్పు చేసాననే భావం
10. భక్తి అంటే మనసు అర్పించుట – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 A) తీసుకోవడం
 B) లాక్కోవడం
 C) ఇచ్చుట
 D) పారేసుకోవడం
 జవాబు:
 C) ఇచ్చుట
11. ‘నెచ్చెలీ ! నీకు ఒక శుభ సమాచారము’ – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
 A) స్నేహితురాలు
 B) శత్రువు
 C) విరోధి
 D) యువతి
 జవాబు:
 A) స్నేహితురాలు
12. అగ్రాసనాధిపురాలు అనుమతి లేనిదే మాట్లాడరాదు – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
 A) సింహాసనస్థురాలు
 B) అధ్యక్షురాలు
 C) అధ్యక్షుడు
 D) రాణి
 జవాబు:
 B) అధ్యక్షురాలు
13. నీ పనికి ఏమీ ప్రతిబంధకం లేదు – గీత గీసిన పదం అర్థం ఏమిటి?
 A) ఎదిరించేది
 B) తిరిగి బంధించేది
 C) అడ్డగించేది
 D) ఎదురు
 జవాబు:
 C) అడ్డగించేది
2. పర్యాయపదాలు :
14. స్వాతంత్య్రం నా జన్మహక్కు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 A) స్వేచ్ఛ, స్వతంత్రం
 B) సొంతం, మీది
 2) మాది, మీది
 D) కోరిక, కాంక్ష
 జవాబు:
 A) స్వేచ్ఛ, స్వతంత్రం

15. వివాహం రెండు కుటుంబాల స్నేహం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 A) పెండ్లి, పేరంటం
 B) కళ్యాణం, పరిణయం
 C) పెళ్ళి, భోజనం
 D) కళ్యాణం, కమనీయం
 జవాబు:
 B) కళ్యాణం, పరిణయం
16. సరస్వతి చదువుల తల్లి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 A) వాణి, రాణి
 B) భారతి, భార్గవి
 C) బ్రాహ్మి, శారద
 D) వాణి, నారద
 జవాబు:
 C) బ్రాహ్మి, శారద
17. సంపదలనిచ్చే తల్లి లక్ష్మీదేవి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 A) పద్మ, కమలం
 B) కమల, కోమల
 C) రమ, రమ్య
 D) ఇందిర, రమ
 జవాబు:
 D) ఇందిర, రమ
13. యుద్ధంలో పిఱికితనం చూపకూడదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 A) భీరువు, వెఱ్ఱి
 B) భయం, వెఱపు
 C) భీరు, ధైర్యం
 D) వెఱపు, ఎఱుపు
 జవాబు:
 B) భయం, వెఱపు
19. జ్ఞాపకశక్తి ఉన్నప్పుడే విద్యార్థి అన్నీ సాధించగల్గుతాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 A) తెలివి, బుద్ధి
 B) జ్ఞానం, బలం
 C) సత్తువ, బలం
 D) సత్తువ, మనసు
 జవాబు:
 C) సత్తువ, బలం
20. భారతదేశం కర్మభూమి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 A) రాజ్యం, రాజు
 B) నాడు, జనపదం
 C) రాష్ట్రం, మంత్రి
 D) సీమ, రాణి
 జవాబు:
 B) నాడు, జనపదం
21. పెద్దలు పిల్లలపై ప్రేమానురాగాలు కురిపిస్తారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 A) అనురక్తి, కోపం
 B) అనురాగం, భక్తి
 C) అభిమానం, భయం
 D) అభిమానం, ప్రణయం
 జవాబు:
 D) అభిమానం, ప్రణయం
22. ‘పరోపకారం పుణ్యం‘ అని పెద్దల మాట – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 A) ధర్మం, సుకృతం
 B) కుశలం, పాపం
 C) శ్రేయం, దానం
 D) సుకృతం, న్యాయం
 జవాబు:
 A) ధర్మం, సుకృతం

23. ఆ వనితా మణి, నారీ రత్నము పేరు సరోజిని – గీత గీసిన పదాలకు పర్యాయపదము గుర్తించండి.
 A) విద్వాంసురాలు
 B) రమ
 C) రత్నము
 D) మహిళ
 జవాబు:
 D) మహిళ
24. బాల్య వివాహములు అనర్థకం అని చెప్పారు – గీత గీసిన పదానికి పర్యాయపదము లేవి ?
 A) పెండ్లి, వడుగు
 B) శుభకార్యము, పాణిగ్రహణము
 C) కళ్యాణము, పెండ్లి
 D) పరిణయము, బారసాల
 జవాబు:
 C) కళ్యాణము, పెండ్లి
25. భూత దయ పశ్చాత్తాపములచే తనువే పుణ్యక్షేత్రముగా చేసికోవచ్చు – గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది?
 A) దైవము
 B) కోవెల
 C) శరీరము
 D) మనిషి
 జవాబు:
 C) శరీరము
3. వ్యుత్పత్త్యర్థాలు :
26. పదహారేండ్ల లోపు పడుచు – దీనికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
 A) వయోజన
 B) బాల
 C) గృహిణి
 D) భార్య
 జవాబు:
 B) బాల
27. ఈమెచే సర్వము చూడబడును – దీనికి వ్యుత్పత్యర్థం గుర్తించండి.
 A) విష్ణువు
 B) పార్వతి
 C) లక్ష్మి
 D) నేత్రము
 జవాబు:
 C) లక్ష్మి
28. అంతటను వ్యాపించి యుండునది – దీనికి వ్యుత్పత్యర్థం గుర్తించండి.
 A) సరస్వతి
 B) లక్ష్మి
 C) వాయువు
 D) పరమాత్మ
 జవాబు:
 A) సరస్వతి
4. నానార్థాలు :
29. మతం మత్తు మందులా వ్యాపిస్తోంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 A) అభిప్రాయం, ఆలోచన
 B) అభిప్రాయం, శాస్త్రం
 C) సమ్మతి, అసమ్మతి
 D) శాస్త్రం, జ్ఞానం
 జవాబు:
 B) అభిప్రాయం, శాస్త్రం
30. మహాత్ముల ప్రబోధాలు శిరోధార్యాలు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 A) మాట, పాట
 B) జానం, బుద్ధి
 C) మేలుకొలుపు, మిక్కిలి తెలివి
 D) బోధ, ఆలోచన
 జవాబు:
 C) మేలుకొలుపు, మిక్కిలి తెలివి

31. శక్తియుక్తులు మనిషికి మనిషిలాగా తోడుంటాయి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 A) పార్వతి, అబల
 B) బలిమి, సరస్వతి
 C) చిల్లకోల, లక్ష్మి
 D) బలిమి, పార్వతి
 జవాబు:
 D) బలిమి, పార్వతి
32. ‘కాశీ క్షేత్రము ను దర్శించాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు’ – గీత గీసిన పదానికి నానార్థములు గుర్తించండి.
 A) వరిమడి, గుడి
 B) పుణ్యక్షేత్రము. భార్య
 C) శరీరము, అవయవము
 D) నగరము, కోవెల
 జవాబు:
 B) పుణ్యక్షేత్రము. భార్య
33. ‘సరోజినీ దేవి నారీ రత్నము’ – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 A) మహిళ, స్త్రీ
 B) పడతి, యువతి
 C) వింటినారి, స్త్రీ
 D) నరము, రత్నము
 జవాబు:
 C) వింటినారి, స్త్రీ
34. ‘లక్ష్యం లేకుండా చేసిన పనికి ఫలం లభించదు’ – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి?
 A) పండు, ప్రయోజనం
 B) ఫలం, జామపండు
 C) బాణము, ఉపయోగం
 D) పండు, శక్తి
 జవాబు:
 A) పండు, ప్రయోజనం
5. ప్రకృతి – వికృతులు :
35. వెలది కన్నులు ముత్యములా అన్నట్లు స్వచ్ఛముగా ఉన్నవి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది ?
 A) యువతి
 B) వనితా
 C) పడతి
 D) ముగిత
 జవాబు:
 B) వనితా
36. అంతఃసౌందర్యమే లేనప్పుడు, వారి అందం – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
 A) సుందరం
 B) సొగసు
 C) చందు
 D) వన్నె
 జవాబు:
 C) చందు

37. తీర్థయాత్రలు పుణ్యప్రదమైనవి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
 A) యాతర
 B) జాత్ర
 C) జాతర
 D) యాత్రి
 జవాబు:
 B) జాత్ర
38. వివాహం కాని యువతి కుమారీ – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
 A) కొమరిత
 B) కొమరి
 C) పుత్రి
 D) పుత్రిక
 జవాబు:
 A) కొమరిత
39. అన్నెం పున్నెం ఎరుగని అమాయకులు వీధిబాలలు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
 A) పున్నమి
 B) పుణ్యం
 C) పుప్లైం
 D) పురాతనం
 జవాబు:
 B) పుణ్యం
40. వివాహితను శ్రీమతి అంటారు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
 A) సీమంతి
 B) సీమతి
 C) ముత్తైదవ
 D) సీమాటి
 జవాబు:
 D) సీమాటి
41. ఒకరి నుండి మరొకరికి సమాచారం అందించేవి లేకలు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
 A) పత్రం
 B) లేఖ
 C) జాబు
 D) జవాబు
 జవాబు:
 B) లేఖ
42. శుక్రవారము లక్ష్మిని పూజించాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
 A) సరస్వతి
 B) లచ్చి
 C) లచ్చిమి
 D) లక్ష్మీ
 జవాబు:
 B) లచ్చి

43. నాకు ఆ పని చేసే సత్తి లేదు – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
 A) సత్వము
 B) సత్తా
 C) శక్తి
 D) సత్యము
 జవాబు:
 C) శక్తి
44. ‘మీ ఇంటికి మా కన్నయ్య వచ్చాడా?’ – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
 A) కృష్ణ
 B) కృష్ణయ్య
 C) కృష్ణుడు
 D) రామయ్య
 జవాబు:
 C) కృష్ణుడు
6. సంధులు :
45. ‘రామేశ్వరాది‘ పుణ్యక్షేత్రాలు దర్శనీయ స్థలాలు – గీత గీసిన పదం విడదీయండి.
 A) రామ + ఈశ్వరాది
 B) రామేశ్వర + అది
 C) రామ + ఈశ్వర + ఆది
 D) రా మేశ + ఆది
 జవాబు:
 C) రామ + ఈశ్వర + ఆది
46. ‘స్త్రీ లెల్లరు’ సంధి పేరేమిటి?
 A) అత్వసంధి
 B) ఉత్వసంధి
 C) ఇత్యసంధి
 D) లు,ల,నల సంధి
 జవాబు:
 B) ఉత్వసంధి
47. ‘ఉత్కంఠపడు’ విడదీయుము.
 A) ఉత్కంఠ + పడు
 B) ఉత్కంఠము + పడు
 C) ఉత్కంఠం + పడు
 D) ఉత్కంఠ + పడుము
 జవాబు:
 B) ఉత్కంఠము + పడు
48. ‘గుణసంధి’కి ఉదాహరణను గుర్తించండి.
 A) ముఖ్యాంశాలు
 B) విద్యాభివృద్ధి
 C) గంభీరోపన్యాసం
 D) అగ్రాసనం
 జవాబు:
 C) గంభీరోపన్యాసం

49. నెఱు + చెలి – సంధి చేయుము.
 A) నెఱచెలి
 B) నెచ్చెలి
 C) నీచెలి
 D) నాచెలి
 జవాబు:
 B) నెచ్చెలి
50. ‘భయపడు’ – సంధిని విడదీయండి.
 A) భయ + పడు
 B) భయం + పడు
 C) భయము + పడు
 D) భ + యపడు
 జవాబు:
 C) భయము + పడు
51. ‘నెచ్చెలి’ పదంలోని సంధిని గుర్తించండి.
 A) రుగాగమ సంధి
 B) ప్రాతాది సంధి
 C) ఆమ్రేడిత సంధి
 D) ద్విరుక్తటకారాదేశ సంధి
 జవాబు:
 B) ప్రాతాది సంధి
52. ‘సభ్యురాలు’ పదంలో గల సంధి ఏది?
 A) అత్వ సంధి
 B) రుగాగమ సంధి
 C) టుగాగమ సంధి
 D) ఉత్వ సంధి
 జవాబు:
 B) రుగాగమ సంధి
7. సమాసాలు :
53. బాల్యవివాహం చట్టరీత్యా నేరం – గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.
 A) తృతీయా
 B) పంచమీ
 C) రూపకం
 D) సప్తమీ
 జవాబు:
 D) సప్తమీ
54. కరుణ చేత నిండినది – గీత గీసిన పదానికి విభక్తిని గుర్తించండి.
 A) తృతీయా
 B) చతుర్టీ
 C) ద్వితీయ
 D) సప్తమీ
 జవాబు:
 A) తృతీయా
55. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
 A) మదరాసు రాష్ట్రం
 B) విద్యాభివృద్ధి
 C) పెక్కు విషయాలు
 D) కరుణాభరితం
 జవాబు:
 D) కరుణాభరితం

56. పుణ్యయాత్రలు – సమాసం పేరు గుర్తించండి.
 A) ద్వితీయా
 B) చతుర్థీ
 C) షష్టీ
 D) పంచమీ
 జవాబు:
 B) చతుర్థీ
57. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
 A) కృష్ణవేణి
 B) మదరాసు రాష్ట్రం
 C) తిమ్మ సముద్రం
 D) త్రినేత్రుడు
 జవాబు:
 B) మదరాసు రాష్ట్రం
58. ‘రత్నము వంటి నారి’ – సమాసపదంగా కూర్చండి.
 A) రత్ననారి
 B) రత్నపు నారి
 C) నారీరత్న
 D) నారీ రత్నము
 జవాబు:
 D) నారీ రత్నము
59. ‘బాల్య వివాహాలు’ సమాసానికి విగ్రహవాక్యం రాయండి.
 A) బాల్యము నందు వివాహాలు
 B) బాల్యము, వివాహము
 C) బాల్యంలో వివాహము
 D) బాల్యమందే పెండ్లి
 జవాబు:
 A) బాల్యము నందు వివాహాలు
60. ‘నారీ రత్నము’ – ఇది ఏ సమాసము?
 A) బహుజొహి
 B) ద్వంద్వ
 C) ఉపమాన ఉత్తరపద కర్మధారయము
 D) షష్ఠీ తత్పురుషము
 జవాబు:
 C) ఉపమాన ఉత్తరపద కర్మధారయము
8. ఆధునిక వచనాన్ని గుర్తించడం :
61. మీరు లక్ష్మీపూజ చేయుదురు – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
 A) మీరు లక్ష్మి పూజ చేస్తారా
 B) మీరు లక్ష్మీపూజ చేస్తారు
 C) మీరు లక్ష్మికి పూజ చేస్తారు
 D) మీరు లక్ష్మితో పూజ చేస్తారు
 జవాబు:
 B) మీరు లక్ష్మీపూజ చేస్తారు
62. మానవులందడొకటె – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
 A) మానవులొకటి
 B) మానవులే ఒకటి
 C) మానవులందరూ ఒకటే
 D) మానవులేకం
 జవాబు:
 C) మానవులందరూ ఒకటే

63. వీనిలో నేదైనా పొరపాటులున్న అవి నావియేయని యెంచుము – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
 A) వీటిలో ఏదైనా పొరపాట్లున్న అవి నావే అని ఎంచు.
 B) వీటిలో ఏవైనా పొరపాట్లుంటే అవి నావేనని ఎంచుము.
 C) వీనిలో ఏదైనా తప్పులున్న అవి నాదేనని ఎంచు.
 D) వీనిలో ఏవైనా తప్పులుంటే అది నాదే అని ఎంచు.
 జవాబు:
 A) వీటిలో ఏదైనా పొరపాట్లున్న అవి నావే అని ఎంచు.
64. ‘స్త్రీలకు రిజర్వేషనులు కావలెనని తీర్మానములు గావించియున్నారు’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
 A) స్త్రీలకు రిజర్వేషనులు ఇవ్వండని తీర్మానం చేశారు.
 B) స్త్రీలకు రిజర్వేషనులు కావాలని తీర్మానాలు చేశారు.
 C) స్త్రీలకు రిజర్వేషనులు కావాలని తీర్మానం చేస్తున్నారు.
 D) స్త్రీలకు రిజర్వేషనులు కావలెనని తీర్మానం చేయాలి.
 జవాబు:
 B) స్త్రీలకు రిజర్వేషనులు కావాలని తీర్మానాలు చేశారు.
65. ‘అతడు ప్రతి కార్యమునకు సాహసించును’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
 A) అతడు సాహస కార్యాలు చేస్తాడు
 B) అతడు సాహసించి కార్యము చేయును
 C) అతడు ప్రతి పనికి సాహసిస్తాడు
 D) అతడు పనికి సాహసంగా దూకుతాడు
 జవాబు:
 C) అతడు ప్రతి పనికి సాహసిస్తాడు
9. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం :
66. విద్యా సంఘంలో స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింప బడ్డారు – దీని కర్తరి వాక్యాన్ని గుర్తించండి.
 A) విద్యా సంఘములో స్త్రీలను సభ్యులుగా నియమిస్తారు
 B) విద్యా సంఘములో – స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు
 C) విద్యా సంఘంలో స్త్రీలు సభ్యులుగా నియమించాలి
 D) విద్యా సంఘంలో స్త్రీలను సభ్యురాండ్రుగా నియ మించవలెను
 జవాబు:
 B) విద్యా సంఘములో – స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు
67. ‘రమేష్ భారతాన్ని చదివాడు’ – దీని కర్మణి వాక్యాన్ని గుర్తించండి. (S.A. II – 2018-19)
 A) రమేష్ చే భారతం చదువబడింది
 B) రమేష్ భారతం చదువగలడు
 C) రమేష్ భారతాన్ని చదువుతాడు
 D) రమేష్ వల్ల భారతం చదువబడును
 జవాబు:
 A) రమేష్ చే భారతం చదువబడింది
10. ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించడం :
68. ‘ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త’ అని అతడినే బెదిరించింది మెల్లీ – ఈ వాక్యానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.
 A) అది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది జాగ్రత్త అని అతడినే మెల్లీ బెదిరించింది.
 B) ఇది అంతర్జాతీయ సమస్య అవుతుంది జాగ్రత్త అని మెల్లీ బెదిరించింది.
 C) ఇది అంతర్జాతీయ సమస్య అవుతుంది జాగ్రత్త మెల్లీ అతడిని బెదిరించింది.
 D) మెల్లీ అతడిని అంతర్జాతీయ సమస్య వస్తుందని బెదిరించింది.
 జవాబు:
 A) అది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది జాగ్రత్త అని అతడినే మెల్లీ బెదిరించింది.

69. ‘రాత్రి తాను భోజనం మానేశానని కలాం అన్నాడు’ – ఈ పరోక్ష కథనానికి, ప్రత్యక్ష కథనాన్ని గుర్తించండి.
 A) ‘రాత్రి నేను భోజనం మానేశాను’ అని కలాం అన్నాడు.
 B) కలాం రాత్రి తాను భోజనం మానేశానని అన్నాడు.
 C) రాత్రి తాను భోజనం మానేశానని’ కలాం అన్నాడు.
 D) “రాత్రి నేను భోజనం చేయను” అన్నాడు కలాం.
 జవాబు:
 A) ‘రాత్రి నేను భోజనం మానేశాను’ అని కలాం అన్నాడు.
11. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం:
70. ‘యాత్రల వలన ఫలము లేదు’ – ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (S.A. II – 2018-19)
 A) యాత్రల వలన ఫలితం లేదు
 B) యాత్రల వలన ఫలం ఉంది
 C) యాత్రల వలన ఫలం అనవసరం
 D) యాత్రలు లేకుండా ఫలం లేదు
 జవాబు:
 B) యాత్రల వలన ఫలం ఉంది
71. ‘పాలేరు రంగయ్య నాగలి తీసుకొచ్చాడు’ – దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి.
 A) ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణా తీరంలో పుట్టాడు.
 B) ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు.
 C) కృష్ణా తీరమున పుట్టిన ఆంధ్రుడు.
 D) ఆయన ఆంధ్రుడుగా, కృష్ణా తీరమున పుట్టాడు.
 జవాబు:
 C) కృష్ణా తీరమున పుట్టిన ఆంధ్రుడు.
72. మానవులంతా ఒకటే – ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం గుర్తించండి.
 A) ఒకటి కాదు
 B) మానవులంతా ఒకటి కాదు
 C) కాదు
 D) మానవులు ఒకటికాదు
 జవాబు:
 B) మానవులంతా ఒకటి కాదు

73. అన్నిటికీని మనస్సే ప్రధానం – ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం గుర్తించండి.
 A) కాదు
 B) ప్రధానం కాదు
 C) మనస్సే ప్రధానం కాదు
 D) అన్నిటికీ మనస్సే ప్రధానం కాదు
 జవాబు:
 D) అన్నిటికీ మనస్సే ప్రధానం కాదు
12. వాక్యంకాలను గుర్తించడం :
74. మీ బిడ్డలకు లక్ష్మీ ప్రసన్నత, సరస్వతీ ప్రసన్నత అసలే – ఇది ఏ రకమైన వాక్యం?
 A) సంక్లిష్ట
 B) సామాన్య
 C) సంయుక్త
 D) మహావాక్యం
 జవాబు:
 C) సంయుక్త
75. స్త్రీ మంత్రిణిగా నియమింపబడి సమర్థతతో నిర్వహించుచున్నది – ఇది ఏ రకమైన వాక్యం?
 A) సంక్లిష్ట
 B) సంయుక్త
 C) శత్రర్థకం
 D) అప్యర్థకం
 జవాబు:
 A) సంక్లిష్ట
76. ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణా తీరమున పుట్టినవాడు – ఈ సామాన్య వాక్యాలను కలిపిన సంయుక్త వాక్యాన్ని గుర్తించండి.
 A) పాలేరు రంగయ్య నాగలి తీసుకురాడు
 B) పాలేరు రంగయ్య నాగలి తీసుకురాబోతున్నాడు
 C) పాలేరు రంగయ్య నాగలి తీసుకురాలేదు
 D) పాలేరు రంగయ్య నాగలి తీసుకొస్తాడు
 జవాబు:
 B) పాలేరు రంగయ్య నాగలి తీసుకురాబోతున్నాడు
77. ‘రాజు తనను క్షమించుమని తన మిత్రుడితో అన్నాడు’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
 A) సామాన్య వాక్యం
 B) సంయుక్త వాక్యం
 C) సంక్లిష్ట వాక్యం
 D) మహావాక్యం
 జవాబు:
 C) సంక్లిష్ట వాక్యం

78. ‘నేనొక్కడినే అదృష్టవంతుడినా’? – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
 A) ఆశ్చర్యార్థకం
 B) నిషేధార్థకం
 C) అనుమత్యర్థకం
 D) ప్రశ్నార్థకం
 జవాబు:
 D) ప్రశ్నార్థకం
13. ప్రక్రియలను గుర్తించడం :
79. ‘సుగుణ వంట చేస్తూ పాటలు పాడుతోంది’ – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
 A) క్వార్థకం
 B) శత్రర్థకం లేదు
 C) చేదర్థకం
 D) ఆశ్చర్యార్థకం
 జవాబు:
 B) శత్రర్థకం లేదు
80. రమ రోడ్డు మీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి, చెత్తకుండీలో వేసి సైకిలెక్కి వెళ్ళిపోయింది – గీత గీసిన పదాలు ఏ ప్రక్రియకు చెందినవి?
 A) క్వార్థకం
 B) చేదర్థకం
 C) మహావాక్యం
 D) సామాన్య
 జవాబు:
 A) క్వార్థకం
