These AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం will help students prepare well for the exams.
AP Board 10th Class Biology 7th lesson Important Questions and Answers జీవక్రియలలో సమన్వయం
10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
 ఆవు వంటి జంతువులలో వ్యతిరేక దిశలో పెరిస్టాలిసిస్ జరగకపోతే ఏమవుతుంది?
 జవాబు:
 ఆవులు ఆహారాన్ని త్వరగా నమిలి మ్రింగి తీరిక సమయంలో తిరిగి నోటిలోనికి తెచ్చుకొని నెమరువేస్తాయి. వ్యతిరేక పెరిస్టాలిసిస్ జరగకపోతే ఈ నెమరువేయు ప్రక్రియ జరగదు.
ప్రశ్న 2.
 ఆహారవాహికలో శ్లేష్మం లేకపోతే ఏం జరుగుతుంది?
 జవాబు:
 ఆహారవాహికలో శ్లేష్మం లేకపోతే :
- పెరిస్టాలిటిక్ చలనముకు అవరోధం ఏర్పడును.
- ఆహారపు బోలస్, జారడంకు కష్టమగును.
- ఆహారం మ్రింగడం కష్టతరమగును.
- ఆహారవాహిక గోడలు దెబ్బతినును.
- వివిధ గాడతలు గల ఆహార పదార్థాల నుండి ఆహారవాహిక రక్షించబడదు.
ప్రశ్న 3.
 క్రింది పట్టికను పూరించండి.
 జవాబు:
| జీర్ణాశయంలో స్రవించబడే హార్మోనులు | విధులు | 
| గ్రీలిన్ | ఆకలి కోరికలు ప్రేరేపించుట | 
| లెఫ్టిన్ | ఆకలి కోరికను తగ్గించుట | 
ప్రశ్న 4.
 జీర్ణమైన ఆహారాన్ని శోషించుకునే చిన్న ప్రేగు యొక్క భాగమేది?
 జవాబు:
 సూక్ష్మచూషకాలు (విల్లి)
ప్రశ్న 5.
 పిండిపై లాలాజలం యొక్క చర్యలో ఉపయోగించు రసాయనం ఏది?
 జవాబు:
 అయోడిన్ ద్రావణం

ప్రశ్న 6.
 మీ తరగతి గదిలో ఆహార వాహిక నందు జరిగే పెరిస్టాలిటిక్ చలనంను అర్థం చేసుకోవడానికి నిర్వహించిన కృత్యంలో ఉపయోగించిన పరికరాలు ఏవి?
 జవాబు:
 పెరిస్టాలిటిక్ చలన కృత్యంలో ఉపయోగించిన పరికరాలు : సైకిల్ ట్యూబ్, బంగాళదుంప, నూనె.
ప్రశ్న 7.
 ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ చలనం లేకపోతే ఏం జరగవచ్చు?
 జవాబు:
 1. ఆహారమును మింగలేము
 (లేదా)
 2. ఆహారము జీర్ణాశయమునకు చేరదు.
ప్రశ్న 8.
 జీర్ణక్రియ అనగానేమి?
 జవాబు:
 జీర్ణక్రియ:
 సంక్లిష్ట ఆహారపదార్థాలను, రక్తంలో శోషణ చెందే సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను “జీర్ణక్రియ” అంటారు.
ప్రశ్న 9.
 జీర్ణక్రియలో ఏ ఏ జీవక్రియల సమన్వయం పరిశీలించవచ్చు?
 జవాబు:
 మన శరీరంలో అనేక జీవక్రియలు పరస్పరం సమన్వయంతో పనిచేస్తాయి.
 ఉదా : జీర్ణక్రియ జరగటానికి నాడీవ్యవస్థ, అంతస్రావీ వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తాయి.
ప్రశ్న 10.
 ఆకలి సంకేతాలు మెదడులోని ఏ భాగాన్ని చేరతాయి?
 జవాబు:
 జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన ఆకలి సంకేతాలు, పదవ కపాలనాడి ‘వేగస్ నాడి’ ద్వారా మెదడులోని ‘డైయన్ సెఫలాన్’ను చేరతాయి.
ప్రశ్న 11.
 రుచులలో భేదం ఎలా కల్గుతుంది?
 జవాబు:
 ఆహారపదార్ధాలలోని రసాయన స్వభావాన్ని బట్టి వివిధ రుచులు ఏర్పడతాయి. తీపి, ఉప్పు, పులుపు, చేదు వంటి రుచులు ఆహారపదార్థంలోని రసాయన భేదాలను బట్టి ఏర్పడతాయి.
ప్రశ్న 12.
 ఆహారం రుచిని కనుగొనటంలో అంగిలి పాత్ర ఏమిటి?
 జవాబు:
 ఆహారం లాలాజలంలో కరిగినపుడు ద్రవస్థితికి మారుతుంది. నాలుక అంగిలిని నొక్కినపుడు ఆహారపదార్థం రుచి మొగ్గ యొక్క ద్వారాన్ని నొక్కి రుచిగుళికలలోనికి ప్రవేశిస్తాయి.
ప్రశ్న 13.
 మానవ నోటిలో దంతాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
 జవాబు:
 మానవ నోటిలో నాలుగు రకాల దంతాలు ఉంటాయి.
 అవి 1. కుంతకాలు 2. రదనికలు 3. చర్వణకాలు 4. అగ్రచర్వణకాలు
ప్రశ్న 14.
 చూర్ణం చేయటం అనగానేమి?
 జవాబు:
 చూర్ణం చేయటం :
 నోటిలో దంతాలు ఆహారాన్ని విసరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ విధానాన్ని “నమలడం లేదా చూర్ణం చేయటం” (Mastication) అంటారు.
ప్రశ్న 15.
 బోలస్ అనగా నేమి?
 జవాబు:
 బోలస్ :
 నోటిలో ఆహారం ముక్కలు కాబడి, లాలాజలంతో కలసి మింగటానికి అనుకూలంగా జిగురు ముద్దలా మారుతుంది. దీనిని “బోలస్” (Bolus) అంటారు.

ప్రశ్న 16.
 ఆహారంపై లాలాజలం చర్య ఏమిటి?
 జవాబు:
 లాలాజలంలో ‘ఏమైలేజ్ ‘ అనే ఎంజైమ్ పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చుతుంది. పిండిపదార్ధం → చక్కెర
ప్రశ్న 17.
 లాలాజలం యొక్క స్వభావం ఏమిటి?
 జవాబు:
 లాలాజలం క్షార స్వభావాన్ని కల్గి ఉంటుంది.
ప్రశ్న 18.
 ఆహారవాహిక పని ఏమిటి?
 జవాబు:
 ఆహారవాహిక నోటిలోని ఆహారాన్ని జీర్ణాశయంలో చేర్చటానికి తోడ్పడుతుంది.
ప్రశ్న 19.
 ఆహారవాహికలోని కదలికలను ఏమంటారు? (లేదా) పెరిస్టాలిసిస్ అనగానేమి?
 జవాబు:
 ఆహారం ప్రయాణించేటప్పుడు ఆహారవాహికలో అలల వంటి కదలికలు ఏర్పడతాయి. వీటినే ‘పెరిస్టాల్ చలనాలు’ అంటారు. ఈ ప్రక్రియను ‘పెరిస్టాల్ సిస్’ అంటారు.
ప్రశ్న 20.
 జీర్ణాశయం రసాయనికంగా ఏ స్వభావం కల్గి ఉంటుంది?
 జవాబు:
 జీర్ణాశయ గోడలు జఠర రసాన్ని స్రవిస్తాయి. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCI) కలిగి ఉండుట వలన జీర్ణాశయం రసాయనికంగా ఆమ్ల స్వభావాన్ని కల్గి ఉంటుంది.
ప్రశ్న 21.
 కైమ్ (Chyme) అనగానేమి?
 జవాబు:
 క్రైమ్ :
 జీర్ణాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమై ద్రవంలా మారుతుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని “క్రైమ్” (Chyme) అంటారు.
ప్రశ్న 22.
 సంవరిణి కండరం (Pyloric sphincter) ఎక్కడ ఉంటుంది? దాని పని ఏమిటి?
 జవాబు:
 జీర్ణాశయం నుండి ఆంత్రమూలం ప్రారంభమయ్యే ప్రాంతంలో సంవరిణీ కండరం ఉంటుంది. ఇది ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది.
ప్రశ్న 23.
 ఆహారవాహికలో వ్యతిరేక పెరిస్టాలిసిస్ ఎప్పుడు జరుగుతుంది?
 జవాబు:
- నెమరు వేయు జంతువులలో వ్యతిరేక పెరిస్టాల్సస్ వలన ఆహారం జీర్ణాశయం నుండి నోటిలోనికి వచ్చి నెమరు వేయటం జరుగుతుంది.
- మానవులలో ఈ క్రియ ఆహారనాళానికి సరిపడని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే రక్షణ ప్రతిచర్యగా ఉపయోగపడుతుంది.
ప్రశ్న 24.
 జీర్ణక్రియలో పాల్గొనే కొన్ని హార్మోన్స్ పేర్లు తెలపండి.
 జవాబు:
 సెక్రిటిన్, కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్స్ జీర్ణక్రియలో పాల్గొంటాయి.
ప్రశ్న 25.
 ఆంత్రచూషకాలు (Villi) అనగానేమి? వాటి పని ఏమిటి?
 జవాబు:
 చిన్న ప్రేగు గోడల లోపలి తలంలో వేల సంఖ్యలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఆంత్ర చూషకాలు (Villi) అంటారు. ఇవి శోషణ తల వైశాల్యం పెంచి, జీర్ణమైన ఆహారాన్ని శోషించుకొంటాయి.
ప్రశ్న 26.
 శోషణ అనగానేమి?
 జవాబు:
 శోషణ :
 జీర్ణమైన ఆహారం రక్తంలోనికి పీల్చుకోబడటాన్ని “శోషణ” అంటారు. ఇది చిన్నప్రేగులలో జరుగుతుంది.
ప్రశ్న 27.
 రెండవ మెదడుగా దేనిని పరిగణిస్తున్నారు?
 జవాబు:
 ఆహారవాహిక నుండి పాయువు వరకు 9 మీటర్ల పొడవునా, జీర్ణవ్యవస్థకు అనుబంధంగా నాడీవ్యవస్థ వ్యాపించి ఉంది. దీనిని రెండవ మెదడుగా పరిగణిస్తున్నారు.
ప్రశ్న 28.
 మలం అనగానేమి?
 జవాబు:
 మలం :
 జీర్ణవ్యవస్థలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను “మలం” అంటారు. ఇది పాయువు ద్వారా విసర్జింపబడుతుంది.
ప్రశ్న 29.
 కణాలకు శక్తి ఎలా లభిస్తుంది?
 జవాబు:
 జీర్ణక్రియ ద్వారా శోషించబడిన పోషకాలు కణాలలో ఆక్సీకరణం చెంది శక్తిని ఇస్తాయి.

ప్రశ్న 30.
 అనియంత్రిత చర్యలు మెదడు ఏ భాగంలో నియంత్రించబడతాయి?
 జవాబు:
 శ్వాసక్రియ, హృదయస్పందన వంటి అనియంత్రిత చర్యలు స్వయంచోదిత నాడీవ్యవస్థ ద్వారా మెదడులోని మజ్జి ముఖం నియంత్రిస్తుంది.
ప్రశ్న 31.
 ‘ఆకలి కోరికలు’ ఎలా ఏర్పడతాయి?
 జవాబు:
 రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినపుడు, జీర్ణాశయ గోడలు ‘గ్రీలిన్’ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఈ హార్మోన్ జీర్ణకోశంలో ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది.
ప్రశ్న 32.
 ఆకలి కోరికలు ఎలా నియంత్రించబడతాయి?
 జవాబు:
 మనకు కడుపు నిండుగా ఉండి ఇక ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినపుడు లెఫ్టిన్ అనే మరో హార్మోన్ స్రవించబడి ఆకలిని అణిచి వేస్తుంది.
ప్రశ్న 33.
 మనం వాసన, రుచిని ఎలా గుర్తించగల్గుతాము?
 జవాబు:
 ముక్కులోని శ్లేష్మసరం ఓ పలుచని నీటిపొర కలిగి ఉంటుంది. మనం వాసన చూసినపుడు గాలిలో తేలియాడే వాసన పదార్ద అణువులు ఈ పొరలో కరుగుతాయి. ముక్కు మరియు నాలుకపై గల రసాయన గ్రాహకాలు లేదా ఘ్రాణ గ్రాహికలు (Olfactory receptors) సంకేతాలను నాడీ ప్రచోదాల రూపంలో మెదడుకు పంపుతాయి. మెదడు ఈ సంకేతాలను విశ్లేషించి వాసన మరియు రుచిని గుర్తిస్తుంది.
ప్రశ్న 34.
 నిబంధిత, ఉద్దీపన, ప్రతిస్పందనలపై ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్తలు ఎవరు?
 జవాబు:
 రష్యాకు చెందిన ఇవాన్ పావ్లోవ్ నిబంధిత, ఉద్దీపన, ప్రతిస్పందనలపై ప్రయోగాలు చేశాడు. ఆహారం గురించి ఆలోచన వచ్చిన వెంటనే లాలాజలం ఊరటం ఒక నిబంధిత ఉద్దీపనకు ప్రతిస్పందన అని చెప్పాడు.
ప్రశ్న 35.
 మనకు రోజూ నిర్దిష్ట సమయంలోనే ఎందుకు ఆకలి వేస్తుంది?
 జవాబు:
 మనం రోజూ నిరిష సమయానికి ఆహారం తీసుకోవటం వలన శరీర జీవక్రియలు దానికి అలవాటు పడిపోతాయి. ఇది ఒక నిబంధన సహిత ప్రతిచర్యగా మారి రోజూ అదే సమయానికి ఆకలివేస్తుంది.
ప్రశ్న 36.
 మనకు జలుబు చేసినపుడు ఆహార రుచిని సరిగా గుర్తించలేము. ఎందుకు?
 జవాబు:
 రుచి జనం వాసనతో ముడిపడి ఉంది. జలుబు చేసినపుడు, శ్లేష్మసరంలోని అధిక శ్లేష్మం వలన వాసనను గుర్తించలేము. కావున రుచిని కూడ సరిగా ఆస్వాదించలేము.
ప్రశ్న 37.
 మనం తినే ఆహారాన్ని, రుచిని ప్రభావితం చేయు అంశాలు ఏమిటి?
 జవాబు:
- నోటిలోని తేమ
- అంగిలి నొక్కబడటం
- పదార్థ ఉష్ణోగ్రత
- పదార్థం యొక్క వాసన
- పదార్ధ రసాయన స్వభావం మొదలగు అంశాలు ఆహార రుచిని ప్రభావితం చేస్తాయి.
10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 రెండు ఆకుపచ్చని పత్రాలలో ఒక దానికి గ్రీజు రాసి ఉంచి, మరొకటి అలాగే వదిలేసి, ఆ రెండు ఆకులపై రెండు చుక్కల ఆమ్లం వేసిన ప్రయోగములో నీవు ఏమి గమనించెదవు?
 జవాబు:
- గ్రీజు రాసిన ఆకు పై భాగం ఆమ్లం వలన దెబ్బతినలేదు. ఆమ్ల ప్రభావాన్ని గ్రీజు ఒక పొరలా ఉండి నిరోధించింది.
- గ్రీజు రాయని ఆకు ఆమ్ల ప్రభావం వలన దెబ్బతిని పాడైపోయింది.
ప్రశ్న 2.
 మానవులలో ఉపజిహ్విక లేకపోతే ఏమి జరగవచ్చు?
 జవాబు:
- కంఠబిలం ద్వారా స్వర పేటికలోనికి ఆహారం ప్రవేశిస్తుంది.
- ఊపిరితిత్తులలోనికి ఆహారం ప్రవేశిస్తుంది. దాని వల్ల ప్రాణాపాయం కలుగుతుంది.
- సరిగ్గా మాట్లాడలేము.
- గాలి, ఆహార మార్గాల నియంత్రణ సరిగ్గా జరగదు.

ప్రశ్న 3.
 జీర్ణ వ్యవస్థలో ఏర్పడే సమస్యలను తెలుసుకొనుటకు గాస్ట్రో ఎంటరాలజిస్టు అడిగే ప్రశ్నలు నాలుగింటిని రాయండి.
 జవాబు:
- మనకు ఆజీర్ణము ఎందుకు కలుగును?
- మనకు వాంతులు ఎందుకు కలుగుతాయి?
- మనకు త్రేన్పులు ఎందుకు కలుగుతాయి?
- మనకు అల్సర్స్ ఎందుకు కలుగుతాయి?
- మనకు కడుపులో మంట ఎలా కలుగుతుంది?
ప్రశ్న 4.
 నోటిలో జరిగే జీర్ణక్రియలో కండరాల పాత్రను తెలపండి.
 జవాబు:
- నోటిలో ఉండే వలయ కండరాలు ఆహారాన్ని నోటి కుహరంలో నెట్టడంలోనూ మరియు నోటిలో చుట్టూ కదిలించటంలోనూ సహాయపడతాయి.
- దవడలోని ఉపరితల కండరాలు ఆహారాన్ని దంతాల క్రిందకు నెట్టి, కొరకటం మరియు నమలటం వంటి క్రియలకు తోడ్పడతాయి.
- దవడలోని అంతర కండరాలు ఆహారం నమిలేటప్పుడు దవడను పైకి, క్రిందకు, ముందుకు, వెనుకకు కదిలించటంలో తోడ్పడతాయి.
ప్రశ్న 5.
 నోటి జీర్ణక్రియలో పాల్గొనే వివిధ భాగాలు తెలపండి.
 జవాబు:
 దంతాలు ఆహారాన్ని నమలడం, విసరడంలో తోడ్పడితే నాలుక కదలికలు ఆహారాన్ని లాలాజలంతో కలుపుతూ నోటి కుహరంలో సమంగా విస్తరించడంలో తోడ్పడుతుంది. నోటి కండరాలు ఆహారాన్ని ఆస్యకుహరంలోకి నెట్టడానికి సహాయపడతాయి. 5వ కపాలనాడి దవడలోని అంతర కండరాల కదలికలను నియంత్రిస్తుంది.
ప్రశ్న 6.
 పగలు నిద్రించినపుడు సొంగ (లాలాజలం) ఎందుకు కారుతుంది?
 జవాబు:
 నిశాచర జీవుల (Nocturnals) గురించి మీరు వినే ఉంటారు కదా! ఇవి రాత్రివేళలో చురుకుగా ఉంటాయి. అయితే మనం పగటివేళలో చురుకుగా ఉండి, రాత్రివేళలో విశ్రాంతి తీసుకుంటాం. శరీరంలోని వ్యవస్థలన్నీ మనం పని చేస్తున్నప్పుడు చురుకుగా ఉంటాయి. అందుకే మనిషిని దివాచరులు (Diurnal animals) అంటారు.
మన జీర్ణవ్యవస్థ పగటివేళలో చురుకుగా ఉండడం వలన అది ఆహారాన్ని స్వీకరించి జీర్ణక్రియ జరపడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పగటివేళలో నిద్రిస్తే నోటి ద్వారా స్రవించే లాలాజలం తలదిండును తడుపుతుంది. కానీ రాత్రివేళలో ఇలా జరగదు. సాధారణంగా ఒక రోజులో మనం 1-1.5 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం.
ప్రశ్న 7.
 ఆహారవాహికలో ఆహారం జారటానికి లాలాజలం ఎలా తోడ్పడుతుంది?
 జవాబు:
- ఆహారనాళపు గోడలు జారుడు గుణంగల జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిని ‘శ్లేష్మం’ (Mucus) అంటారు.
- శ్లేష్మం చమురులా పనిచేస్తూ ఆహారవాహిక గోడలకు హాని జరగకుండా కాపాడుతుంది.
- దీని వలన ఆహార బోలస్ నూనెపూసిన బంగాళదుంపల్లా ఆహారవాహికలో సులభంగా కదులుతూ కిందికి జారుతుంది.
- దీనికి తోడుగా ఆహార బోలలోని లాలాజలం సులభంగా దానిని జీర్ణాశయంలోకి చేరవేయడంలో ఉపయోగకడుతుంది.
ప్రశ్న 8.
 జీర్ణాశయంలో ఆహారం పొందే మార్పులు ఏమిటి?
 జవాబు:
 జీర్ణాశయంలో ఆహారం పొందే మార్పులు
- జఠర రసంతో చిలకబడి, ఆమ్ల స్వభావంగా మారుతుంది.
- జఠర రసంలోని రెనిన్ పాలపదార్థంపై పనిచేస్తుంది.
- లైపేజ్ క్రొవ్వులను జీర్ణం చేసి క్రొవ్వు ఆమ్లాలుగా మార్చుతుంది.
- పెప్సిన్ ప్రోటీన్స్ పైన పనిచేసి వాటిని పెప్టైడ్, పాలిపెప్టెడ్ గా మార్చుతాయి.
ప్రశ్న 9.
 ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారం ఎలా నియంత్రించబడుతుంది?
 జవాబు:
 జీర్ణాశయంలో జీర్ణక్రియ ముగింపు దశకు చేరుకునే సరికి జీర్ణాశయ గోడల సంకోచాలు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా జీరాశయం చిన్న ప్రేగులోకి తెరుచుకునే భాగంలో గల సంవరిణీ కండరాన్ని (Pyloric sphincter) సంకోచం చెందిస్తుంది. అందువల్ల ఆంత్రమూలం లోపలికి దారి ఏర్పడి అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం కొద్దికొద్ది మోతాదుల్లో ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది.
ప్రశ్న 10.
 నెమరు వేయటం అనగానేమి? ఇది ఎలా జరుగుతుంది?
 జవాబు:
 కొన్ని శాఖాహార జంతువులు, విరామ సమయంలో, జీర్ణాశయం నుండి ఆహారాన్ని నోటిలోనికి తెచ్చుకొని తీరుబడిగా నమలుతాయి. ఈ ప్రక్రియను ‘నెమరు వేయుట’ అంటారు. ఆహారం దొరికినపుడు, నెమరువేయు జంతువులు ఆహారాన్ని పూర్తిగా నమలకుండా గబగబా మింగుతాయి. విరామ సమయంలో ఇవి ఆహారాన్ని నోటిలోనికి తెచ్చుకొంటాయి. ఈ ప్రక్రియలో ఆహారవాహికలోని కండరాలు వ్యతిరేక పెరిస్టాల్సినను జరుపుతాయి. అందువలన ఆహారం జీర్ణాశయం నుండి నోటిలోనికి వస్తుంది.
ప్రశ్న 11.
 మానవ ఆహారనాళంలో వ్యతిరేక చలనం ఎప్పుడు జరుగుతుంది?
 జవాబు:
- ఒకవేళ మనం చెడిపోయిన లేదా శరీరానికి సరిపడని ఆహారపదార్థాలు తిన్నప్పుడు జీర్ణక్రియా యంత్రాంగం దాన్ని గుర్తుపట్టి జీర్ణం చేయడానికి నిరాకరిస్తుంది.
- అనియంత్రిత నాడీవ్యవస్థ అధీనంలో పనిచేసే జీర్ణాశయ గోడలలో అలజడి ఏర్పడి, జీర్ణం కాని ఆహారంతోపాటు ‘క్రైమ్’ను కూడా బయటకు నెట్టివేస్తుంది.
- దీనినే మనం వాంతులుగా పరిగణిస్తాం. ఒక్కోసారి హఠాత్తుగా త్రేన్పులు కూడా (belching) వస్తుంటాయి.
ప్రశ్న 12.
 పెద్దప్రేగులో మలం ఎలా ఏర్పడుతుంది?
 జవాబు:
- అవసరమైన వ్యర్థ పదార్థాలు పెద్దప్రేగును చేరినపుడు దానిలోని నీటిని పెద్దప్రేగు గోడలు శోషిస్తాయి.
- పెరిస్టాలిసిస్ తరంగాలు వ్యర్థ పదార్థాలను పెద్ద ప్రేగు నుండి పురీషనాళంలోకి కదిలిస్తాయి.
- పెద్ద ప్రేగులోని కొలాన్ ఎడమ భాగం మలాన్ని నిలువ చేసే ట్యాంలా పనిచేస్తుంది. నీటిని పునఃశోషణం చెందుతుంది.
- మిగిలిన వ్యర్థాలు పెద్ద ప్రేగులోని చివరి భాగమైన పురీషనాళంలో నిలువ చేయబడతాయి.
- దుర్గంధంతో కూడిన ఈ పసుపు రంగులోని వ్యర్థాన్నే సాధారణంగా ‘మలం’ (Faecal matter) అంటాం.
- తదుపరి ఇది శరీరం నుండి పాయువు (Anus) ద్వారా బయటకు విసర్జింపబడుతుంది.
ప్రశ్న 13.
 గుప్పెడు మిగిలిపోయిన తడి టీ పొడిని ఒక అద్దుడు కాగితంలో తీసుకొని ఒక ముద్దలా చేయండి. తరవాత దానిని సున్నితంగా ఒత్తి తెరిచి చూడండి. ‘ఏం గమనించారు? అద్దుడు కాగితం టీ పొడిలోని నీటిని పీల్చుకుంది కదా! ఈ ప్రక్రియను జీర్ణవ్యవస్థలోని ఏ భాగంతో పోల్చవచ్చు?
 జవాబు:
 తడి టీ పొడిలోని నీటిని అద్దుడు కాగితం పీల్చుకొన్నట్లు మన జీర్ణవ్యవస్థలోని జీర్ణమైన ఆహారం నుండి పెద్ద ప్రేగు నీటిని పీల్చుకొంటుంది. ఈ ప్రక్రియలో జీర్ణమైన ఆహారాన్ని టీ పొడితోనూ, పెద్ద ప్రేగును అద్దుడు కాగితంతోనూ పోల్చవచ్చు.
ప్రశ్న 14.
 మలవిసర్జన ఎలా నియంత్రించబడుతుంది?
 జవాబు:
 పెద్ద ప్రేగు చివరి భాగంలో ఉండే రెండు కండర పొరలు పాయువు యొక్క సంవరణి కండరాలుగా (Anal sphincter)ఏర్పడతాయి. లోపలి సంవరిణీ కండరం అనియంత్రితంగాను, బాహ్య సంవరిణీ కండరం నియంత్రితంగా పనిచేస్తుంది. ఇవి మలవిసర్జన మార్గాన్ని నియంత్రిస్తాయి.
ప్రశ్న 15.
 కణాలలో శక్తి ఎలా వెలువడుతుంది?
 జవాబు:
- ఉచ్చ్వాస క్రియలో ఆక్సిజన్ వాయుగోణుల గోడల ద్వారా రక్తంలోకి చేరుతుంది.
- ఇక్కడ నుండి ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశించి శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేయబడుతుంది.
- అదే సమయంలో రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తులోని వాయుగోణులలోనికి చేరుతుంది.
- నిశ్వాస క్రియలో అది బయటకు పంపబడుతుంది. కణాల్లోకి పోషకాలు ఆక్సీకరణం చెంది శక్తి విడుదలవుతుంది.

ప్రశ్న 16.
 మన శరీరంలోని వివిధ వ్యవస్థలు సమన్వయంగా పని చేస్తున్నాయని ఎలా చెప్పగలవు?
 జవాబు:
- సంక్లిష్టమైన ఈ జీర్ణక్రియా విధానంలో అనేక రకాల అవయవాలు, అవయవ వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి.
- జీర్ణక్రియ నోటినుండి పాయువు వరకు వ్యాపించి ఉన్న ఆహారనాళంలో జీర్ణక్రియ జరుగుతున్నప్పటికీ దీనికి శ్వాసవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీవ్యవస్థలతో సమన్వయం ఎంతో అవసరం.
- లేకపోతే ఆహారం ఆక్సీకరణం చెందడం పదార్థాల రవాణా, శక్తి ఉత్పాదకత మొదలైన ప్రక్రియలు చోటుచేసుకోలేవు. అలా జరగనట్లయితే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్న జీవ వ్యవస్థలన్నీ నిలిచిపోతాయి.
10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 ఆహార వాహికలో ఆహారం పెరిస్టాలిక్ చలనాల ద్వారా ముందుకు నెట్టబడి, జీర్ణాశయాన్ని చేరుతుంది. దీన్ని పటము. ద్వారా చూపండి. బోలస్ అనగానేమి?
 జవాబు:
 
 బోలస్ :
 నోటిలో ఆహారం నమలబడి లాలాజలంతో కలిసి ఏర్పడే ముద్దను బోలస్ అంటారు. ఇది ఆస్యకుహరంలో ఏర్పడుతుంది.
ప్రశ్న 2.
 పెరిస్టాల్టిక్ చలనం అంటే ఏమిటి? ఆహారవాహికలో ఆహార చలనాన్ని, మీరు పాఠశాలలో చేసిన సైకిలు ట్యూబ్ లో ఆలుగడ్డ (బంగాళదుంప) కదలిక ప్రయోగంతో పోల్చి వివరించండి.
 జవాబు:
 ఆహారం మ్రింగినపుడు ఆహారవాహికలో ఏర్పడే అని యాంత్రిత క్రమబద్ద చలనాన్ని పెరిస్టాల్టిక్ చలనం అంటారు. దీని వలన ఆహారం నోటి నుండి జీర్ణాశయం చేరుతుంది.
మేము నిర్వహించిన సైకిల్ ట్యూబ్ ప్రయోగంలో
 సైకిల్ ట్యూబ్ – ఆహారవాహిక
 బంగాళదుంప – ఆహారపు
 నూనె పూత – లాలాజలం
 కదలిక – పెరిస్టాలిటిక్ చలనంతో పోల్చవచ్చు.
ప్రశ్న 3.
 జీర్ణాశయం సొంత ఆమ్లాల స్రావాల నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో అర్థం చేసుకొనుటకు నిర్వహించిన ఆమ్లం మరియు పత్ర ప్రయోగం విధానాన్ని రాయండి. ఫలితాలను మానవ జీర్ణ వ్యవస్థలో జరిగే అంశాలతో పోల్చండి.
 జవాబు:
 కావలసిన పరికరాలు :
 రెండు ఆకులు, పెట్రోలియం జెల్లీ / వాజ్ లీన్, బలహీన ఆమ్లం, రెండు పెట్రెడిషన్లు, డ్రాపర్.
ప్రయోగ విధానం :
- రెండు ఆకుపచ్చని పత్రాలు సేకరించాలి. ఒక పత్రానికి పెట్రోలియం జెల్లీ లేదా వాజ్ లీన్ పూయాలి. మరొక దానిని అలాగే వదిలేయాలి.
- రెండు ఆకులను పెట్రెడిష్ లో ఉంచి 1 లేదా 2 చుక్కల బలహీన ఆమ్లాన్ని రెండు పత్రాలపై డ్రాపర్ సహాయంతో వేయాలి.
- అరగంట తరువాత పత్రాలను పరిశీలించాలి. వాజ్ లీన్ పూసిన ఆకులో ఏ మార్పు ఉండదు.
- వాజ్ లీన్ పూయని ఆకు ఆమ్లం ప్రభావం నుండి రక్షించబడలేదు. (కాలినట్లుగా మారింది).
పోలిక :
- శ్లేష్మ పదార్థం జీర్ణాశయపు గోడలపై ఒక పలుచని పొరలా ఏర్పడుతుంది. ఇది ఆమ్ల ప్రభావం నుండి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది.
- పెట్రోలియం జెల్లీ చేసే పనిని జీర్ణాశయపు గోడలలోని శ్లేష్మం చేసే పనితో పోల్చవచ్చు.
ప్రశ్న 4.
 క్రింది వాటికి కారణాలు తెలపండి.
 a) జీర్ణాశయం ఖాళీ అయినపుడు ఆకలి సంకేతాలు మెదడుకు చేరతాయి.
 b) జీర్ణాశయం ఆహారంతో నిండినపుడు ఇంక ఆహారం అవసరం లేదనిపిస్తుంది.
 c) జలుబు చేసినపుడు ఆహారం రుచిగా ఉండదు.
 d) ఒక ద్రాక్షపండును నాలుకపై ఉంచినపుడు దాని రుచి మనకు తెలియదు.
 జవాబు:
 a) జీర్ణకోశ గోడల నుండి ‘గ్రీలిన్’ హార్మోన్ స్రవించుట వలన ఆకలి సంకేతాలు మెదడుకు చేరతాయి.
 b) జీర్ణాశయం ఆహారంతో నిండినపుడు లెప్టిన్ అనే హార్మోన్ స్రవించబడి ఆకలిని అణచివేస్తుంది.
 c) ఋణ గ్రాహికలు మూసుకుపోవటం వలన జలుబు చేసినపుడు ఆహారం రుచిగా ఉండదు.
 d) ఆహారపదార్థం రుచి కళికలలోనికి ప్రవేశించినపుడు మాత్రమే రుచి తెలుస్తుంది. ద్రాక్షపండు ద్రవరూపంలో లేకపోవటం వలన పదార్ధం రుచి కళికలలోనికి ప్రవేశించలేదు.
ప్రశ్న 5.
 మానవ జీర్ణ వ్యవస్థలోని క్రింది భాగాలలో పెరిస్టాలిసిస్ విధులు తెల్పండి.
 a) ఆహారవాహిక
 b) జీర్ణాశయం
 c) చిన్న ప్రేగు
 d) పెద్ద ప్రేగు
 జవాబు:
 a) ఆహారవాహిక :
 ఆహారవాహికలో పెరిస్టాలిసిస్ బోలను జీర్ణాశయంలోనికి నెడుతుంది.
b) జీర్ణాశయం :
 జీర్ణాశయంలో పెరిస్టాలిసిస్ ఆహారాన్ని నిల్వ చేయుటలోనూ, ముక్కలు చేయుటలోనూ, జఠర రసంలో కలుపుటలోనూ తోడ్పడుతుంది.
c) చిన్న ప్రేగు :
 జీర్ణ రసాలతో క్రైమ్ ను కలుపుతుంది.
d) పెద్ద ప్రేగు :
 జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు పురీష నాళం ద్వారా బయటకు పంపుటలో సహాయపడుతుంది.
ప్రశ్న 6.
 పిండిపై లాలాజలం యొక్క చర్యను వివరించడానికి నీవు చేసిన ప్రయోగమును వివరించుము.
 (లేదా)
 పిండి పదార్థాలపై లాలాజలం యొక్క చర్యను తెలుసుకొనుటకు నీవు నిర్వహించిన ప్రయోగం తెలపండి. లాలాజలము యొక్క pH ను ఏ విధంగా గుర్తించారు?
 జవాబు:
 కావాల్సిన పరికరాలు :
 1) పరీక్షనాళిక, 2) పిండి, 3) లాలాజలం, 4) అయోడిన్ ద్రావణం, 5) డ్రాపర్, 6) pH కాగితం.
ప్రయోగ విధానం :
- ఒక పరీక్షనాళిక తీసుకుని సగం వరకు నీటితో నింపి చిటికెడు పిండి కల్పి బాగా కదిలించండి.
- మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా రెండు పరీక్షనాళికల్లో తీసుకోండి.
- టీస్పూన్ లాలాజలంను ఒక పరీక్షనాళికలో కలపండి. రెండో పరీక్షనాళికలో కలపవద్దు.
- 45 ని|| తరువాత ఒక చుక్క అయోడిన్ ద్రావణం రెండు పరీక్షనాళికలలో కలపండి.
పరీశీలన మరియు నిర్ధారణ :
 లాలాజలం కలిపిన ద్రావణం నీలిరంగులోకి మారలేదు. లాలాజలం కలపని ద్రావణం నీలిరంగులోకి మారింది.
గుర్తించుట :
 ఒక చిన్న pH కాగితం ముక్కను తీసుకుని నాలుకపై తాకించండి. దానిపై ఏర్పడిన రంగును రంగు పట్టికతో జత చేసి చూడండి pH విలువను గుర్తించవలెను.

ప్రశ్న 7.
 రుచి నాలుక మరియు అంగిలికి సంబంధించిన విషయం – దీనిని నిరూపించే ఒక కృత్యాన్ని రాయండి.
 జవాబు:
- కొంచెం చక్కెరను నాలుకపై వేసుకొని, నాలుకను అంగిలికి తగలకుండా నోటిని తెరిచి ఉంచాలి.
- కొద్ది సేపటికి రుచి గుర్తించబడుతుంది.
- స్టాప్ క్లాక్ ను ఉపయోగించి నాలుకపై చక్కెర ఉంచినప్పటి నుండి రుచి గుర్తించినప్పటి వరకు పట్టిన సమయాన్ని గుర్తించాలి.
- ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని నాలుకపై చక్కెర వేసుకొని దానిని అంగిలితో నొక్కి ఉంచి చేయాలి.
- ఇప్పుడు రుచి చాలా కొద్ది సమయంలోనే తెలుస్తుంది.
- దీనిని బట్టి రుచి నాలుక మరియు అంగిలికి సంబంధించిన విషయం అని తెలుస్తుంది.
ప్రశ్న 8.
 క్రింది పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
 
 i) ఆహారవాహికలో గల కండరాలు తరంగం లాగా జరిపే కదలికలను ఏమంటారు?
 జవాబు:
 ఆహారవాహికలో గల కండరాలు తరంగం లాగా జరిపే కదలికలను పెరిస్టాలిటిక్ చలనము అంటారు.
ii) ఆహారవాహిక ఏ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది?
 జవాబు:
 ఆహారవాహిక పొడవాటి గొట్టము వంటి నిర్మాణము కలిగి ఉంటుంది.
iii) ఆహారవాహికలో ఆహారం ప్రయాణించడానికి శ్లేషస్తరం ఎలా ఉపయోగపడుతుంది?
 జవాబు:
 శ్లేష్మము, ఆహారము సులభంగా క్రిందికి జారుటకు తోడ్పడుతుంది.
iv) ఆహార నాళంలోని ఏఏ భాగాలు ఆహారవాహిక ద్వారా కలుపబడుతూ ఉంటాయి?
 జవాబు:
 ఆహార నాళంలోని గ్రసని మరియు జీర్ణాశయము ఆహారవాహిక ద్వారా కలుపబడుతూ ఉంటాయి.
ప్రశ్న 9.
 నోటి జీర్ణక్రియలో లాలాజల పాత్ర ఏమిటి?
 జవాబు:
- అనియంత్రిత నాడీవ్యవస్థ చర్య వలన లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి.
- ఇది ఆహారాన్ని తేమగా చేసి నమిలి మింగడానికి అనుకూలంగా తయారుచేస్తుంది. అపుడు ఆహారం జిగురు ముద్దలా మారుతుంది. దీనిని “బోలస్” (Bolus) అంటారు.
- నాలుక సహాయంతో మింగడం వలన ఇది ఆహారవాహికలోనికి చేరుతుంది.
- లాలాజలంలో ఉండే ‘లాలాజల ఎమైలేజ్’ అనే ఎంజైమ్ పెద్ద పెద్ద పిండిపదార్థ అణువులను చిన్న చిన్న అణువులుగా మారుస్తుంది. సాధారణంగా చక్కెరలుగా మారుస్తుంది.
- మింగే క్రియాయంత్రాంగం కూడా నాడీ సమన్వయంతో పనిచేస్తుంది. మెదడు కాండం దగ్గరలోని మజ్జిముఖంలో ఈ నియంత్రణ కేంద్రం ఉంటుంది.
- దంతాలు, నాలుక సహాయంతో ఆహారాన్ని నమిలి చూర్ణం చేయడం వల్ల ఆహార పదార్థాల పరిమాణం మింగడానికి అనువుగా మారుతుంది.
ప్రశ్న 10.
 ఆహారవాహికలో ‘బోలస్’ ఎలా క్రిందకు కదులుతుంది?
 జవాబు:
- ఆహారవాహిక గోడలు రెండు రకాలైన మెత్తని నునుపు కండరాలను కలిగి ఉంటాయి.
- లోపలి పొరలో వలయాకార కండరాలు వెలుపలి పొరలో సంభాకార కండరాలు ఉంటాయి.
- వలయాకార కండరాలు సంకోచించినపుడు ఆహారపు ముద్దకు వెనుక ఉండే ఆహారవాహిక భాగం ముడుచుకుని ఆహార ముద్దను కిందికి జరిగేలా ఒత్తిడి కలిగిస్తుంది.
- స్తంభాకార కండరాల వలన ఆహారవాహికలోని బోలస్ ముందు భాగం పొడవు తగ్గి గొట్టం వెడల్పవుతుంది. బోలస్ ముందుకు కదులుతుంది.
- ఇలా కండరాల సంకోచ వ్యాకోచ కదలికల వలన ఒక తరంగం లాంటి చలనం ఏర్పడి ఆహార బోలను జీర్ణాశయం లోనికి నెడుతుంది. ఈ ప్రక్రియను ‘పెరిస్టాల్ సిస్’ (Peristalsis) అంటారు.
- ఇది అనియంత్రితమైనది, మరియు అనియంత్రిత నాడీవ్యవస్థ అధీనంలో నియంత్రించబడుతుంది.
ప్రశ్న 11.
 చిన్నప్రేగుల అంతర నిర్మాణం వర్ణించండి.
 జవాబు:
- చిన్నప్రేగుల లోపలి గోడలు అనేక ముడతలు పడి ఉంటాయి. వీటిని ఆంత్రచూషకాలు అంటారు.
- ఆంత్రచూషకాలు రక్తనాళాలు మరియు శోషరసనాళాలను కలిగి ఉంటుంది.
- జీర్ణమైన ఆహారం రక్తంలోనికి పీల్చుకొనబడుతుంది. ఈ ప్రక్రియను శోషణ అంటారు.
- శోషణ చిన్నప్రేగుల ప్రధానవిధి. శోషణాతల వైశాల్యం పెంచటానికి ఆంత్రచూషకాలు తోడ్పడతాయి.
- గ్లూకోజ్ రక్తనాళంలోనికి, ఎమైనోఆమ్లాలు, గ్లిజరాల్ శోషరస నాళంలోనికి శోషణ చెంది శరీర కణజాలానికి రవాణా కాబడతాయి.
ప్రశ్న 12.
 రెండవ మెదడు అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
 జవాబు:
- జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ నాడీ కణాలతో కూడిన ఎంతో సంక్లిష్టమైన నాడీ వలయాన్ని కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తారు.
- దాదాపు 100 మిలియన్ల నాడీకణాలు ఈ రెండవ మెదడులో ఇమిడి ఉంటాయి. ఇది వెన్నుపాము లేదా పరిధీయ నాడీవ్యవస్థలోని నాడీ కణాల సంఖ్యను మించి ఉంటుంది.
- జీర్ణనాడీవ్యవస్థలోని ఈ మహా నాడీకణాల సముదాయం జీర్ణవ్యవస్థ యొక్క అంతర ప్రపంచం, అందులో గల పదార్థాల గురించి తెలుసుకోవడానికి, అనుభూతి చెందడానికి తోడ్పడుతుంది.
- ఆహారాన్ని చిన్నచిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేయడం, పోషకాలను గ్రహించడం మరియు వ్యర్థాలను విసర్జించడం లాంటి జీవక్రియలను ఉత్తేజపరచడం మరియు సమన్వయం చేయడానికి అనేక రసాయనిక పద్ధతులు, యాంత్రిక మిశ్రణీకరణ విధానాలు, లయబద్దమైన కండర సంకోచాలు ఒకదానివెంట ఒకటిగా జీర్ణక్రియా చర్యలన్నీ జరుగుతూ ఉంటాయి.
- రెండవ మెదడు తనదైన స్వీయ ప్రతిస్పందనలను, జ్ఞానేంద్రియ శక్తిని కలిగి ఉండడంవల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎన్నో పనుల నిర్వహణను మెదడుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నియంత్రిస్తుంది.
- జీర్ణవ్యవస్థలో పదార్థాలు సజావుగా లోనికి రావడానికి, బయటకు వెళ్ళడానికి వీలుగా ఈ వ్యవస్థ ఇంత సంక్లిష్టతతో ఏర్పడి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రశ్న 13.
 జీర్ణాశయంలో పెరిస్టాల్టిక్ చలనాన్ని చూపే బొమ్మను గీయండి. జీర్ణాశయంలో ఆహార కదలికలు వివరించండి.
 జవాబు:
 
- పెరిస్టాల్టిక్ చలనాలు ఆహారాన్ని ఒక చోట నుండి మరియొక చోటుకి కదిలిస్తాయి.
- జీర్ణాశయంలో పెరిస్టాల్టిక్ కదలికలు, కండరాల కదలికలు వేగంగా ఉండడం వల్ల ఆహారం మెత్తగా నూరబడుతుంది.
- జీర్ణాశయ కండరాలలో కలిగే సంకోచ సడలికలు ఆహారాన్ని ఆమ్లాలు మరియు ఇతర జీర్ణరసాలతో కలిపి చిలుకుతాయి. జీర్ణరసాలు ఆహారాన్ని మెత్తటి జావలాంటి ద్రవంలా మారుస్తాయి. దీనిని క్రైమ్ అంటారు.
- జీర్ణాశయంలో జీర్ణక్రియ ముగింపు దశకు చేరుకునే సరికి జీర్ణాశయ గోడల సంకోచాలు తగ్గుముఖం పడతాయి.
10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం ½ Mark Important Questions and Answers
ఫ్లో బారులు
1.
 
 జవాబు:
 నాడీ వ్యవస్థ
2.
 
 జవాబు:
 లెఫ్టిన్
3.
 
 జవాబు:
 ద్వారగొర్ధం
4.
 
 జవాబు:
 పులుపు
5.
 
 జవాబు:
 పొలియెట్
6.
 
 జవాబు:
 ఋణ గ్రాహకాలు / వాసన గ్రాహకాలు
7.
 
 జవాబు:
 రదనికలు
సరైన గ్రూపును గుర్తించండి
8. ఏ గ్రూపు సంఘటనలు సరైన క్రమంలో ఉన్నాయి?
 A. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం – గ్రీలిన్ జీర్ణాశయ గోడల నుండి స్రవించడం – జీర్ణాశయంలో ఆకలి కోరికలు
 B. గ్రీలిన్ జీర్ణాశయ గోడల నుండి స్రవించడం – రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం – జీర్ణాశయంలో ఆకలి కోరికలు
 జవాబు:
 గ్రూపు – A
9. మెదడు వాసనను గుర్తించే సరైన క్రమాన్ని కనుగొనండి.
 A. మెదడులో ఘోణ గ్రాహకాలు-ముక్కులో ఋణ గ్రాహకాలు – వాసన గుర్తించబడటం
 B. ముక్కులో మాణ గ్రాహకాలు-మెదడులో ఘ్రాణ గ్రాహకాలు – వాసన గుర్తించబడటం
 జవాబు:
 గ్రూపు – B
10. ఏ గ్రూపు సంఘటనలు ఆహారం యొక్క రుచిని గుర్తించడంలో చోటు చేసుకుంటాయి?
 A. నాలుక మీద ఉంచిన ఆహారం – లాలాజలంలో కరగడం – నాలుకతో అంగిలిని నొక్కడం.
 B. నాలుక మీద ఉంచిన ఆహారం – నోరు తెరచి ఉంచడం – నాలుక అంగిలిని తాకరాదు.
 జవాబు:
 గ్రూపు – A

11. ఏ గ్రూపు దంత అమరిక సరైన క్రమంలో అమరి ఉన్నాయి?
 A. కుంతకాలు – రదనికలు – చర్వణకాలు – అగ్ర చర్వణకాలు
 B. కుంతకాలు – రదనికలు – అగ్ర చర్వణకాలు – చర్వణకాలు
 జవాబు:
 గ్రూపు – B
12. క్రింది వానిలో పాలపళ్ళు దంత సూత్రాన్ని సూచించేది ఏమిటి?
 
 జవాబు:
 గ్రూపు – B
13. ఆహార వాహిక యొక్క పెరిస్టాలసిస్ సమయంలో ఏ గ్రూపు సంఘటనలు చోటు చేసుకుంటాయి?
 A. వలయ కండరాల సంకోచం – ఆహార వాహిక విశాలం – స్తంభాకార కండరాల సంకోచం – ఆహారవాహిక ముడుచుకుపోవడం
 B. వలయ కండరాల సంకోచం – ఆహారవాహిక ముడుచుకుపోవడం-స్తంభాకార కండరాల సంకోచం – బోలస్ ముందు ఉన్న ఆహారవాహిక విశాలం.
 జవాబు:
 గ్రూపు – B
14. ఏ గ్రూపు ప్రక్రియలు జీర్ణాశయంకు సంబంధించినవి?
 A. నూరడం, ప్రొపల్టన్, రెట్రోపర్టైన్
 B. నమలడం, మాస్టికేషన్, శోషణం
 జవాబు:
 గ్రూపు – A
15. ఏ గ్రూపు సంఘటనలు స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటాయి?
 A. మింగడం, హార్మోన్ స్రావం, మాస్టికేషన్
 B. లాలాజలం స్రావం, పెరిస్టాలసిస్, రివర్స్ పెరిస్టాలసిస్
 జవాబు:
 గ్రూపు – B
నేను ఎవరు?
16. నేనొక హార్మోన్‌ని. ఆకలి అనే అనుభూతిని కల్గించి, ఆహారం తీసుకొనే విధంగా ప్రేరణను కల్గిస్తాను.
 జవాబు:
 గ్రీలిన్
17. నాలుక మీద ఇమిడి మరియు రుచిని గ్రహించడం నా బాధ్య త.
 జవాబు:
 రుచి మొగ్గ
18. నోటి కుహరం మరియు నాసికా కుహరాల మధ్య అమరియున్న అస్థి పలకను నేను. ఆహారం నాకు వ్యతిరేకంగా నొక్కినప్పుడు మాత్రమే మీరు ఆహారం
 జవాబు:
 అంగిలి
19. నేను మెదడులో ఒక బాగం. మింగుట అనే ప్రక్రియ నా అధీనంలో జరుగుతుంది.
 జవాబు:
 మజ్జిముఖం
20. నేనొక జిగురు లాంటి పదార్థాన్ని మరియు ఆహారవాహిక గోడలు దెబ్బతినకుండా కందెన వలె పనిచేస్తూ కాపాడతాను.
 జవాబు:
 శ్లేష్మం
21. ఆహారనాళంలో కనపడే తరంగాకార కదలికను. ఆహారం ఆహారనాళంలో ముందుకు కదలడానికి తోడ్పడతాను.
 జవాబు:
 పెరిస్టాలసిస్
22. జీర్ణనాళపు గోడలలో ఆహారవాహిక నుండి పాయువు వరకు ఏర్పడిన సంక్లిష్ట నాడీ కణాలతో ఏర్పడిన నాడీ యంత్రాంగాన్ని.
 జవాబు:
 జీర్ణ సాడీ వ్యవస్థ / రెండవ మెదడు
23. నేను లాలాజలంలో ఉండే ఒక ఎంజైమ్ ను మరియు కార్బోహైడ్రేట్ పై చర్య జరుపుతాను.
 జవాబు:
 టయలిన్ / లాలాజల అమైలేజ్
24. ఆహారనాళంలో పొడవైన భాగాన్ని నేను. నా పూర్వ భాగము గ్రసనితోను మరియు నా పరభాగము జీర్ణాశయంతోను ‘కలపబడి ఉంటుంది.
 జవాబు:
 ఆహార వాహిక

25. నేను అమెరికన్ శాస్త్రవేత్తని. నా ప్రయోగాలు జీర్ణక్రియ భావనలు విప్లవంగా మారాయి.
 జవాబు:
 డా॥ బ్యూమాంట్ దోషాన్ని గుర్తించి, సరిచేసి వ్రాయండి
26. కడుపు నిండినప్పుడు గ్రీలిన్ స్రవించడం వల్ల ఆకలి అణచివేయబడుతుంది.
 జవాబు:
 కడుపు నిండినప్పుడు లెఫ్టిన్ స్రవించడం వల్ల ఆకలి అణచివేయబడుతుంది.
27. ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడాన్ని రిట్రో పల్టన్ అంటారు.
 జవాబు:
 ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడాన్ని మాస్టికేషన్ / నమలడం అంటారు.
28. 10వ కపాలనాడి దవడ భాగంలోని కండరాల కదలికను నియంత్రిస్తుంది.
 జవాబు:
 5వ కపాలనాడి దవడ భాగంలోని కండరాల కదలికను నియంత్రిస్తుంది.
29. మనం లాలాజలాన్ని స్టార్చ్ ద్రావణానికి జోడించినప్పుడు, లాలాజలంలోని పెప్సిన్ ఎంజైమ్ యొక్క చర్య వలన నీలం నలుపు రంగు అదృశ్యం అవుతుంది. యొక్క రుచిని గుర్తించగలరు.
 జవాబు:
 మనం లాలాజలాన్ని స్టార్చ్ ద్రావణానికి జోడించినప్పుడు, లాలాజలంలోని టయలిన్/ అమైలేజ్ ఎంజైమ్ యొక్క చర్య వలన నీలం సలుపు రంగు అదృశ్యం అవుతుంది.
30. మింగడం అనేది మెదడు కాండం అనగా ద్వారగోర్లం నియంత్రణలో ఉంటుంది.
 జవాబు:
 మింగడం అనేది మెదడు కాండం అనగా మజ్జిముఖం నియంత్రణలో ఉంటుంది.
31. పెరిస్టాలిసిస్ అనేది అసంకల్పిత చర్య మరియు ఎంటరిక్ నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది.
 జవాబు:
 పెరిస్టాలిసిస్ అనేది అసంకల్పిత చర్య మరియు స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది.
32. చిన్న ప్రేగులో నీరు పునఃశోషణం చెందుతుంది మరియు మిగిలిన వ్యర్థాలు పురీషనాళంలో నిల్వ చేయబడతాయి.
 జవాబు:
 పెద్ద ప్రేగు లో నీరు పునఃశోషణం చెందుతుంది మరియు మిగిలిన వ్యర్థాలు పురీషనాళంలో నిల్వ చేయబడతాయి.
33. మలద్వార రంధ్రం తెరుచుకోవడం మరియు మూయడంలో జఠర నిర్గమ సంవరిణి దోహదపడుతుంది.
 జవాబు:
 మలద్వార రంధ్రం తెరుచుకోవడం మరియు మూయడంలో పాయువు సంవరిణి కందరం దోహదపడుతుంది.
34. జఠర రసంలో ఎక్కువ మొత్తంలో సల్స్యురిక్ ఆమ్లం ఉంటుంది మరియు రసాయన చర్యలలో పాల్గొనే రసాయన కారకంగా పనిచేస్తుంది.
 జవాబు:
 జఠర రసంలో ఎక్కువ మొత్తంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది మరియు రసాయన చర్యలలో పాల్గొనే రసాయన కారకంగా పనిచేస్తుంది.
35. రివర్స్ పెరిస్టాలసిస్లో కండర సంకోచాలు స్వయం చోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో 5వ కపాలనాడి ద్వారా నియంత్రించబడతాయి.
 జవాబు:
 రివర్స్ పెరిస్టాలసిలో కండర సంకోచాలు స్వయం చోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో 10వ కపాలనాడి ద్వారా నియంత్రించబడతాయి.
జతపరచుట
36. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
 పాల దంతాలు – 20
 జ్ఞాన దంతాలు – 8
 శాశ్వత దంతాలు – 32
 జవాబు:
 జ్ఞాన దంతాలు

37. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
 కుంతకాలు – విసరడం
 రదనికలు – చీల్చడం
 అగ్ర చర్వణకాలు – కొరకడం
 జవాబు:
 రదనికలు – చీల్చడం
38. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
 ఆకలి కోరికలు – 30-45 నిమిషాలు
 లాలాజలం pH – 6.4-7.2
 కడుపు ఖాళీ చేసే సమయం – 10 గంటలు
 జవాబు:
 కడుపు ఖాళీ చేసే సమయం – 10 గంటలు
39. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
 నాలుక – ఝణ గ్రాహకాలు
 ఆకలి కోరికలు – వేగస్ నాడి
 ముక్కు – రుచి గ్రాహకాలు
 జవాబు:
 ఆకలి కోరికలు – వేగస్ నాడి
40. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
 మాస్టికేషన్ – 5వ కపాలనాడి
 హార్మోన్ల స్రావం – హైపోథాలమస్
 రివర్స్ పెరిస్టాలసిస్ – 7వ కపాలనాడి
 జవాబు:
 రివర్స్ పెరిస్టాలసిస్ – 7వ కపాలనాడి
41. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
 మలము – జీర్ణం కాని వ్యర్థ పదార్థం
 బోలస్ – పాక్షికంగా జీర్ణమైన ఆహారం
 క్రైమ్ – మెత్తగా చేయబడిన ఆహారపు ముద్ద
 జవాబు:
 మలము – జీర్ణం కాని వ్యర్థ పదార్థం
42. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
 రెండవ మెదడు – జీర్ణనాళం
 జఠర నిర్గమ సంవరిణి – జీర్ణాశయం
 పాయు సంవరిణి కండరం – పెద్ద ప్రేగు
 జవాబు:
 పాయు సంవరిణి కండరం – పెద్ద ప్రేగు
ఉదాహరణలు ఇవ్వండి
43. వాంతులు రివర్స్ పెరిస్టాలసిస్కు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
 జవాబు:
 త్రేనుపు
44. నెమరువేయడం అనేది రివర్స్ పెరిస్టాలసిస్ ప్రక్రియ. నెమరువేయు జీవికి ఉదాహరణ ఇవ్వండి.
 జవాబు:
 ఆవు/గేదె
45. గబ్బిలం నిశాచర జంతువుకు ఉదాహరణ. దిశాచర జీవికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
 జవాబు:
 మానవుడు
46. గ్రీలిన్ అనే హార్మోన్ ఆకలి కోరికలను ప్రేరేపిస్తుంది. కాలేయం, క్లోమం మొదలైన వాటి నుంచి జీర్ణ రసాలను స్రవించడాన్ని ప్రేరేపించే హార్మోన్‌కు మరో ఉదాహరణ. ఇవ్వండి.
 జవాబు:
 సెక్రెటిన్ / కోల్ సెప్టోకైనిన్

47. జీర్ణాశయం దగ్గరలో జఠర నిర్గమ సంవరిణి కండరం ఉంటుంది. మలద్వారం వద్ద ఉండే నంవరిణి కండరానికి మరో ఉదాహరణను ఇవ్వండి.
 జవాబు:
 పాయు సంవరిణి కండరం
విస్తరించుము
48. ENSని విస్తరించుము.
 జవాబు:
 Enteric Nervous System/ జీర్ణనాడీవ్యవస్థ
49. ANSని విస్తరించుము.
 జవాబు:
 Autonomous Nervous System/స్వయంచోదిత నాడీవ్యవస్థ
50. pH ని విస్తరించుము.
 జవాబు:
 Potential of Hydrogen
పోలికను గుర్తించుట
51. ఆహారవాహిక : బోలస్ : : జీర్ణాశయం 😕
 జవాబు:
 క్రైమ్
52. కుంతకాలు: 2::?: 1
 జవాబు:
 రదనికలు
53. ముక్కు : ఘోణ గ్రాహకాలు : : ? : రుచి గ్రాహకాలు
 జవాబు:
 నాలుక
54. పెరిస్టాలసిస్ : ఆహార వాహిక :: రెట్రోపర్టన్ : ?
 జవాబు:
 జీర్ణాశయం

55. జీర్ణాశయం : చిలకడం :: సూక్ష్మ చూషకాలు 😕
 జవాబు:
 శోషణం
బొమ్మలపై ప్రశ్నలు
56.
 
 దీనికి ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది?
 జవాబు:
 గ్రీలిన్
57.
 
 ఈ చిత్రం దేనిని సూచిస్తుంది?
 జవాబు:
 నాలుక చూషకాలు
58.
 
 ఈ పటం దేనిని సూచిస్తుంది?
 జవాబు:
 pH స్కేలు
59.
 
 ఈ ప్రయోగంలో ఏ పదార్థాన్ని మీరు శ్లేష్మం పొరగా ఉపయోగిస్తారు?
 జవాబు:
 రదనిక
60.
 
 ‘X’ అనే భాగాన్ని గుర్తించండి.
 జవాబు:
 లాక్టియేల్స్
ఖాళీలను పూరించండి
61. జీర్ణవ్యవస్థలో సంచి వంటి నిర్మాణం …………….
 జవాబు:
 జీర్ణాశయం
62. ఆహారం ఆహారవాహికలో జారటానికి ………… తోడ్పడుతుంది.
 జవాబు:
 శ్లేష్మం
63. ఆహారవాహికలోని చలనం …………
 జవాబు:
 పెరిస్టాలిటిక్ చలనం
64. చెరకును చీల్చటానికి ఉపయోగించే దంతము ………..
 జవాబు:
65. పాయు సంవరణి కండరాల సంఖ్య …………
 జవాబు:
 2
66. లాలాజల స్వభావం ………..
 జవాబు:
 క్షార స్వభావం
67. జీర్ణవ్యవస్థలో ఆమ్ల స్వభావం కలిగిన భాగం ………
 జవాబు:
 జీర్ణాశయం

68. లాలాజలంలోని ఎంజైమ్ ………
 జవాబు:
 టయలిన్
69. అయోడిన్ పిండిపదార్థాన్ని …………… రంగుకు మారుస్తుంది.
 జవాబు:
 నూనె
10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 1 Mark Bits Questions and Answers
1. వ్యతిరేక దిశలో జరిగే పెరిస్టాలిసిస్ దీనిలో చూడవచ్చు.
 A) పులి
 B) ఉడుత
 C) ఆవు
 D) పిల్లి
 జవాబు:
 C) ఆవు
2. మానవుని దంతసూత్రం \(\frac{2}{2}, \frac{1}{1}, \frac{2}{2}, \frac{3}{3}\) ఇందులో \(\frac{1}{1}\) సూచించేది ………..
 A) కుంతకాలు
 B) రదనికలు
 C) అగ్రచర్వణకాలు
 D) చర్వణకాలు
 జవాబు:
 B) రదనికలు
3. నీవు చెఱకును చీల్చడానికి ఉపయోగించే దంతాలు ……….
 A) రదనికలు
 B) కుంతకాలు
 C) చర్వణకాలు
 D) అగ్రచర్వణకాలు
 జవాబు:
 A) రదనికలు
4. మన దంతాల అమరిక నిష్పత్తి 3: 2:1: 2 అయితే దీనిలో 3 దేనిని సూచిస్తుంది?
 A) రదనికలు
 B) చర్వణకాలు
 C) అగ్రచర్వణకాలు
 D) కుంతకాలు
 జవాబు:
 B) చర్వణకాలు

5. పటంలో బాణం గుర్తుగల భాగం పేరేమిటి?
 
 A) ఆహారవాహిక
 B) జీర్ణాశయము
 C) ఆంత్రమూలము
 D) ఉండుకము
 జవాబు:
 C) ఆంత్రమూలము
6. శ్రీరాశయపు ప్రతిచర్యకు ఉదాహరణ
 A) పెరిస్టాల్టిక్ చలనం
 B) శోషణం
 C) వాంతి
 D) జీర్ణమవడం
 జవాబు:
 C) వాంతి
7. బొమ్మలో సూచించిన చోట ఉండే కవాటం
 
 A) ద్విపత్ర కవాటం
 B) పైలోరిక్ కవాటం
 C) విల్లె
 D) త్రిపత్ర కవాటం
 జవాబు:
 B) పైలోరిక్ కవాటం
8. పాక్షికముగా జీర్ణమైన ఆహారము …………
 A) టైమ్
 B) బోలస్
 C) ఎముక
 D) కండరము
 జవాబు:
 A or B
9. నాలుక రుచి గ్రాహకం, కనుక రుచిని గ్రహించుటలో ఏ నాడి ముఖ్య మైనది?
 A) 6వ కపాలనాడి
 B) 5వ కపాలనాడి
 C) 10వ కపాలనాడి
 D) దృక్ నాడి
 జవాబు:
 C) 10వ కపాలనాడి
10. నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలం పరిమాణం
 A) మారదు
 B) తగ్గుతుంది
 C) పెరుగుతుంది
 D) పైవేవీ కాదు
 జవాబు:
 C) పెరుగుతుంది
11. జఠర రసములో ఉన్న ఆమ్లము
 A) సల్ఫ్యూరిక్ ఆమ్లము
 B) హైడ్రోక్లోరిక్ ఆమ్లము
 C) నైట్రస్ ఆమ్లము
 D) ఫాస్ఫారిక్ ఆమ్లము
 జవాబు:
 B) హైడ్రోక్లోరిక్ ఆమ్లము
12. pH విలువ 7 కన్నా తక్కువైతే ఆ పదార్థం
 A) ఆమ్లం
 B) క్షారం
 C) తటస్థం
 D) హార్మోన్
 జవాబు:
 A) ఆమ్లం
13. మానవునిలో దంత విన్యాసం
 
 జవాబు:
 A

14. మనకు కడుపు నిండుగా ఉండి, ఇంక ఎలాంటి ఆహారం స్రవించబడి ఆకలిని అణిచివేస్తుంది. ఆ హార్మోన్ పేరేమిటి?
 A) గ్రీలిన్
 B) వాసోప్రెస్సిన్
 C) లెఫ్టిన్
 D) ఇన్సులిన్
 జవాబు:
 C) లెఫ్టిన్
15. మానవునిలో జీర్ణక్రియను ప్రారంభించు ఎంజైమ్
 A) లాలాజల అమైలేజ్
 B) పెప్సిన్ అవంతి
 C) ట్రిప్సిన్
 D) లైపేజ్
 జవాబు:
 A) లాలాజల అమైలేజ్
16. పిండి పదార్థాల పై లాలాజలం యొక్క చర్యను నిరూపించుటకు నీవు ఏ కారకాన్ని వాడతావు?
 A) KOH
 B) ఆల్కహాల్
 C) అయోడిన్
 D) సున్నపునీరు
 జవాబు:
 C) అయోడిన్
17.
 
 A) థ్రాంబోలైనేజ్
 B) థ్రాంబిన్
 C) ఫ్రాంఛాంబిన్
 D) ఎంటిరోకైనేజ్
 జవాబు:
 B) థ్రాంబిన్
18. రెండవ మెదడు అనగా ………..
 A) మస్తిష్కం
 B) అనుమస్తిష్కం
 C) జీర్ణ నాడీవ్యవస్థ
 D) వెనుక మెదడు
 జవాబు:
 C) జీర్ణ నాడీవ్యవస్థ
19. ఆకలితో రజిని ఏడుస్తోంది. ఆమె జీర్ణాశయంలో ఆకలి ప్రచోదనాలకు కారణమైన హార్మోను ఏది?
 A) లెఫ్టిన్
 B) గ్రీలిన్
 C) వాసోప్రెస్సిన్
 D) థైరాక్సిన్
 జవాబు:
 B) గ్రీలిన్
20. జీర్ణాశయం, ఆంత్రమూలంలోకి తెరుచుకునే చోట ఉండే సంపరిణీ కండరం
 A) కార్డియాక్
 B) పైలోరిక్
 C) ఆనల్
 D) గాస్టిక్
 జవాబు:
 B) పైలోరిక్
21. ఆకలి కోరికలు ఎంత సమయం కొనసాగుతాయి?
 A) 10-15 నిముషాలు
 B) 1-2 గంటలు
 C) 15-20 నిముషాలు
 D) 30-45 నిముషాలు
 జవాబు:
 D) 30-45 నిముషాలు
22. మనకు కడుపు నిండుగా ఉండి, ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినప్పుడు స్రవించబడే హార్మోన్
 A) సెక్రిటిన్
 B) గ్లూకోగాన్
 C) లెఫ్టిన్
 D) గ్రీలిన్
 జవాబు:
 C) లెఫ్టిన్

23. కింది బొమ్మను గుర్తించండి. అవసరం లేదు అనిపించినపుడు ఒక హార్మోన్
 
 A) ధమని రక్తనాళం
 B) చాలకనాడీ కణం
 C) శ్వాసగోణి
 D) ఆంత్రచూషకం
 జవాబు:
 D) ఆంత్రచూషకం
మీకు తెలుసా?
* పగలు నిద్రించినపుడు సొంగ (లాలాజలం) ఎందుకు కారుతుంది?
 నిశాచర జీవుల (Nocturnals) గురించి మీరు వినే ఉంటారు కదా! ఇవి రాత్రివేళలో చురుకుగా ఉంటాయి. అయితే మనం పగటివేళలో చురుకుగా ఉండి, రాత్రివేళలో విశ్రాంతి తీసుకుంటాం. శరీరంలోని వ్యవస్థలన్నీ మనం పనిచేస్తున్నప్పుడు చురుకుగా ఉంటాయి. అందుకే మనిషిని దివాచరులు (Diurnal animals) అంటారు. మన జీర్ణ వ్యవస్థ పగటివేళలో చురుకుగా ఉండడం వలన అది ఆహారాన్ని స్వీకరించి జీర్ణక్రియ జరపడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పగటివేళలో నిద్రిస్తే నోటి ద్వారా స్రవించే లాలాజలం తలదిండును తడుపుతుంది. కానీ రాత్రివేళలో ఇలా జరగదు. సాధారణంగా ఒక రోజులో మనం 1- 1.5 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం.
పునశ్చరణం

