These AP 10th Class Social Studies Important Questions 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు will help students prepare well for the exams.
AP Board 10th Class Social 22th Lesson Important Questions and Answers పౌరులు, ప్రభుత్వాలు
10th Class Social 22th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది?
 జవాబు:
 2005 లో.
2. న్యాయ సేవల ప్రాధికార చట్టం ఏ సంవత్సరంలో చేసారు?
 జవాబు:
 2002 లో.
3. ఏదేని ప్రభుత్వ కార్యాలయంలో సమాచారం కావాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలి?
 జవాబు:
 పౌర సమాచార అధికారికి (PIO)
4. లోక్ అదాలత్ ముఖ్య ప్రయోజనం ఏమిటి?
 జవాబు:
 సత్వర న్యాయం.
5. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థకు ఛైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు?
 జవాబు:
 జిల్లా జడ్జి.
![]()
6. న్యాయ సేవల ప్రాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం పొందాలంటే వార్షిక ఆదాయం ఎంత లోపు ఉండాలి?
 జవాబు:
 ఒక లక్ష రూపాయల లోపు.
7. మీ గ్రామంలో వేసిన రోడ్డుకు ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలి?
 జవాబు:
 ప్రజా పనుల శాఖకు.
8. సమాచార హక్కు చట్టంలో సవరణలు / మార్పులు చేయుటకు ఎవరికి అధికారం కలదు?
 జవాబు:
 పార్లమెంటుకు.
9. కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించే అవకాశం ఏ న్యాయస్థానాల్లో ఉంది?
 జవాబు:
 లోక్ అదాలత్ లో.
10. “కోర్టు బయట సమర్థ, ప్రత్యామ్నాయ, సృజనాత్మక వివాద పరిష్కార విధానాన్ని రూపొందించటం,” దేని యొక్క ముఖ్య ఉద్దేశ్యం?
 జవాబు:
 న్యా య సేవల ప్రాధికార సంస్థ.
11. మీ పాఠశాలలో పౌర సమాచార అధికారి ఎవరు?
 జవాబు:
 ప్రధానోపాధ్యాయులు / ప్రిన్సిపాల్.
![]()
12. లోక్ అదాలలు ఏ వర్గాల వారికి న్యాయ సేవలు అందించేందుకు ఏర్పాటు చేయబడ్డవి?
 జవాబు:
 బలహీన వర్గాల.
13. సైనిక దళాల సమాచారం ….. హక్కు పరిధిలోకి రావు.
 జవాబు:
 సమాచార
14. PWDని విస్తరింపుము.
 జవాబు:
 ప్రజా పనుల శాఖ
15. ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని ……… హక్కు ద్వారా పొందలేం.
 జవాబు:
 సమాచార
16. ఎవరు ఇచ్చిన తీర్పులకు అప్పీలును అనుమతించరు?
 జవాబు:
 లోక్ అదాలనే
17. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థని పనిచేసేలా చూడటానికి వేటిని ఏర్పాటు చేసారు?
 జవాబు:
 లోక్ అదాలత్.
18. న్యాయ సేవా పీఠాలు ఎవరి కోసం ఏర్పాటు చేసారు?
 జవాబు:
 పేద, బలహీన వర్గాలవారికోసం.
![]()
19. సమాచారాన్ని పొందటానికి పౌరులు ఎంత రుసుము చెల్లించాల్సి ఉంది?
 జవాబు:
 5 – 10 రూ||
20. పురుషులు, ముసలివారు, నిరుద్యోగులు, స్త్రీలలో ఎవరు ఉచిత న్యాయ సహాయానికి అర్హులు?
 జవాబు:
 స్త్రీలు
21. ఏవి కోర్టుల్లో చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న కేసులను తక్కువ కాలంలో ఎటువంటి ఖర్చు లేకుండా పరిష్కరిస్తుంది?
 జవాబు:
 లోక్ అదాలలు.
22. అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు ఎవరికి జవాబు దారీగా ఉంటారు?
 జవాబు:
 రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి,
23. సమాచార హక్కు చట్టం – 2005 ప్రకారం సమాచారం కోరుతూ దరఖాస్తులను క్రింది ఏ పద్ధతి/తుల్లో కోరాలి?
 i) చేత్తో వ్రాసిన ఉత్తరం ద్వారా
 ii) ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా
 iii) మౌఖికంగా చెప్పడం ద్వారా
 జవాబు:
 i, ii & iii
24. న్యాయ సేవల ప్రాధికార సంస్థల చట్టంకు ఏఏ సంవత్సరాల్లో సవరణ చేసారు?
 జవాబు:
 1994, 2002
![]()
25. రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థకు పాట్రన్-ఇన్- ఛీ ఎవరు ఉంటారు?
 జవాబు:
 ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
26. తాలుకా న్యాయ సేవా సంఘాల అధిపతి?
 జవాబు:
 సీనియర్ సివిల్ జడ్జి.
27. లోక్ అదాలత్ లో ఈ వివాదాన్ని పరిష్కరించుకోలేం.
 → వైవాహిక విభేదాలు
 → గృహహింస కేసులు.
 → భరణానికి సంబంధించిన కేసులు
 → ఆర్థిక నేరానాకి సంబంధించిన కేసులు
 జవాబు:
 ఆర్థిక నేరానికి సంబంధించిన కేసులు.
28. క్రింది వాక్యాలను పరిగణించండి.
 i) ప్రతి ప్రభుత్వ శాఖ రికార్డులను నిర్వహించి, వాటిని పౌరులకు అందుబాటులో ఉంచాలి.
 ii) ప్రతి ప్రభుత్వ శాఖ స్వచ్ఛందంగానే కొన్ని వివరాలను బహిర్గతం చేయాలి.
 పై వాక్యా లలో సరైనది ఏది?
 A) (i) మాత్రమే
 B) (ii) మాత్రమే
 C) (i) మరియు (ii)
 D) రెండూ కావు
 జవాబు:
 C (i) మరియు (ii)
29. PIOని విస్తరించండి.
 జవాబు:
 పౌర సమాచార అధికారి.
30. SPICని విస్తరించండి.
 జవాబు:
 రాష్ట్ర పౌర సమాచార కమీషనర్.
![]()
31. CPIC ని విస్తరించండి.
 జవాబు:
 కేంద్ర పౌర సమాచార కమిషనర్
32. NALSA ని విస్తరించండి.
 జవాబు:
 జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ.
33. SLSA ని విస్తరించండి.
 జవాబు:
 రాష్ట్ర న్యాయ సేవల ప్రాథికార సంస్థ
34. క్రింది వానిని సరిగా జతపరచండి.
 i) వ్యభిచార వృత్తి నివారణ చట్టం ( ) a) 1956
 ii) బాల నేరస్తుల న్యాయ చట్టం ( ) b) 1986
 iii)న్యా య సేవల ప్రాధికార చట్టం ( ) c) 2002
 iv)మానసిక ఆరోగ్య చట్టం ( ) d) 1987
 జవాబు:
 i – a, ii – b, iii – c, iv – d
10th Class Social 22th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
 వివాదాల పరిష్కారానికి సంబంధించి లోక్ అదాలత్ వలన కలిగే ఏవైనా రెండు ప్రయోజనాలను పేర్కొనండి.
 జవాబు:
- ఎటువంటి కోర్టు రుసుము లేకపోవడం.
 - వివాదాల వేగవంతమైన విచారణ.
 - విధానంలో వెసులుబాటు.
 - కక్షిదారులు నేరుగా న్యాయమూర్తులతో సంభాషించే అవకాశం.
 
ప్రశ్న 2.
 లోక్ అదాలత్ యొక్క ప్రయోజనాలను తెల్పండి.
 జవాబు:
 i) లోక్ అదాలత్ వల్ల సత్వర, వేగవంతంగా న్యాయం అందుతుంది.
 ii) లోక్ అదాలత్ వల్ల తక్కువ వ్యయంతో న్యాయం చేకూరుతుంది.
ప్రశ్న 3.
 సమాచార హక్కు చట్టంను ఎవరు, ఎప్పుడు చేశారు?
 జవాబు:
 సమాచార హక్కు చట్టంను కేంద్రప్రభుత్వం 2005లో చేసింది.
![]()
ప్రశ్న 4.
 సమాచార హక్కు లేనపుడు ఆయా శాఖలను ఎవరు తనిఖీ చేసేవారు?
 జవాబు:
 ఆ శాఖలోని పై అధికారులు, లేదా మంత్రి మాత్రమే ఆ వివరాలను తీసుకొని, తనిఖీ చెయ్యగలిగి ఉండేవాళ్లు.
ప్రశ్న 5.
 ప్రతి ప్రభుత్వశాఖ యొక్క కనీస బాధ్యత ఏమిటి?
 జవాబు:
 సమాచారా హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వ శాఖకు రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.
ప్రశ్న 6.
 అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు ఎవరికి బాధ్యత వహిస్తారు?
 జవాబు:
 అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
ప్రశ్న 7.
 జరిమాన విధించే అధికారం ఎవరికి ఉంది?
 జవాబు:
 రాష్ట్ర, కేంద్ర సమాచార కమిషనర్లు సంబంధిత పౌరసమాచార అధికారికి జరిమానా విధించవచ్చు.
ప్రశ్న 8.
 సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు చేసుకునే వారిలో ఎవరు రుసుము చెల్లించనవసరం లేదు?
 జవాబు:
 సమాచారం కోరుతున్న వ్యక్తి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారు రుసుము చెల్లించనవసరం లేదు.
ప్రశ్న 9.
 ఏ చట్టం ప్రకారం మనదేశంలో ఉచిత న్యాయసేవలు అందిస్తున్నారు?
 జవాబు:
 “న్యాయసేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002”, ప్రకారం ఉచిత సేవలు అందిస్తున్నారు.
ప్రశ్న 10.
 న్యాయ సేవా పీఠాలను ఏర్పాటుచేయుటలో ఉద్దేశం ఏమిటి?
 జవాబు:
 ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటుచేశారు.
ప్రశ్న 11.
 దేని ప్రకారం లోక్ అదాలత్ లను ఏర్పాటు చేశారు?
 జవాబు:
 న్యాయసేవల పీఠాల చట్టం 1987ని 1994 లోనూ, తిరిగి 2002 లోనూ సవరించారు. దీని కింద లోక్ అదాలత్ లను (ప్రజాస్వామ్య పీఠాలను) ప్రతి రాష్ట్రంలోను ఏర్పాటుచేశారు.
![]()
ప్రశ్న 12.
 రాష్ట్ర న్యాయసేవల ప్రాధికార సంస్థకి అధిపతిగా ఎవరుంటారు?
 జవాబు:
 అధిపతిగా, ప్యాట్రన్ – ఇన్ చీఫ్ గా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు.
10th Class Social 22th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
 సమాచార హక్కు చట్టం గూర్చి సంక్షిప్తంగా రాయండి.
 (లేదా)
 సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా సుసంపన్నం చేస్తుందో వివరించండి.
 జవాబు:
- సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2005 సంవత్సరంలో ఆమోదించింది.
 - ప్రజా ఉద్యమాల కారణంగా, పౌరులకు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగంలోని అంశాల కారణంగా ఈ చట్టం రూపొందించబడింది.
 - రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థ మరియు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభల ప్రకారం ఏర్పడిన సంస్థలు ఈ చట్టంలో విధులు నిర్వహిస్తాయి.
 - ప్రస్తుతం ఏ పౌరుడైనా ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖలోనైనా రికార్డు రూపంలో ఉండే సమాచారం కావాలని అడిగినప్పుడు ఈ శాఖలో వారు పౌరునికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వవలెను.
 - ఈ చట్టం న్యాయసహాయాన్ని కూడా ప్రజలకు అందిస్తుంది. దాని కోసం లోక్ అదాలత్ లను ఏర్పాటు చేయటం జరిగింది.
 - సమాచార హక్కు చట్టం వలన, ప్రతి ప్రభుత్వ శాఖ కూడా వారి పనులకు సంబంధించిన విషయాలను రికార్డు రూపంలో ఉంచి ప్రజలకు మరింత జవాబుదారీగా ఉంటున్నారు.
 
ప్రశ్న 2.
 న్యాయ సేవల సంస్థ ద్వారా ఎవరెవరు ప్రయోజనం పొందవచ్చు?
 (లేదా)
 ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి ఎవరు అర్హులు?
 జవాబు:
 క్రింద పేర్కొన్న వ్యక్తులు న్యాయ సేవల సంస్థ ద్వారా ప్రయోజనం పొందవచ్చును.
- షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ జాతులకు చెందిన వ్యక్తులు.
 - మానవ అక్రమ రవాణా బాధితులు, భిక్షాటకులు,
 - స్త్రీలు, పిల్లలు,
 - మతిస్థిమితం లేనివారు లేదా అంగవైకల్యం ఉన్నవారు,
 - పెను విపత్తు, జాత్యహంకార హింస, కుల వైషమ్యాలు, వరదలు, కరువులు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులకు గురైనవారు,
 - పారిశ్రామిక కార్మికులు,
 - నిర్బంధంలో ఉన్న వ్యక్తులు,
 - లక్ష రూపాయలలోపు ఆదాయం ఉన్న వ్యక్తులు.
 
ప్రశ్న 3.
 సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం వెల్లడిచేయడానికి గల మినహాయింపులను తెలపండి.
 జవాబు:
 కొంత సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడి చేయకుండా ఉండే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఆ అంశాలు :
- భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారం, విదేశీ శక్తుల సందర్భంలో కీలక ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలు కలిగి ఉండే అంశాలు.
 - పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కలిగించే సమాచారం.
 - గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశ ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం.
 - ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం.
 - (అంతిమ నిర్ణయం తీసుకోటానికి ముందు) మంత్రుల లేదా సెక్రటరీల బృందం ముందు ఉంచే క్యాబినెట్ పత్రాలు లేదా రికార్డులు.
 - మన సైనిక దళాలు, భద్రతా సంస్థలు చాలా వరకు సమాచార కమిషన్ల పరిధిలోకి రావు.
 
![]()
ప్రశ్న 4.
 సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు ఏ విధంగా చేయాలి?
 జవాబు:
 సమాచారం కావాలన్న విన్నపాన్ని చేతితో రాసిన ఉత్తరం రూపంలో కానీ, ఎలక్ట్రానిక్ మెయిల్ రూపంలో కానీ ఇవ్వవచ్చు. సమాచారాన్ని ఆ రాష్ట్ర అధికార భాషలో కానీ, లేదా ఇంగ్లీషులో కానీ, లేదా హిందీలో కానీ ఇవ్వవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి ఉత్తరం రాయలేకపోతే పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి వద్ద మౌఖికంగా చెప్పటం ద్వారా, కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు.
ప్రశ్న 5.
 సమాచారం కోరే వ్యక్తి ఎంత రుసుం చెల్లించాలి?
 జవాబు:
 సమాచారాన్ని పొందటానికి పౌరులు నామమాత్రమైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎక్కడి కార్యాలయం అనేదాన్ని బట్టి 5-10 రూపాయల మధ్య ఉంటుంది. సమాచారం కోరుతున్న వ్యక్తి దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే అతను/ఆమె ఈ రుసుము చెల్లించనవసరం లేదు. కాబట్టి ఈ చట్టం అనేక విధాలుగా అందరికీ సమాచారం అందుబాటులో ఉండేలా చేసింది.
ప్రశ్న 6.
 లోక్ అదాలలు ఏ విధంగా పనిచేస్తాయి?
 జవాబు:
 ఇప్పుడు వీటి ద్వారా న్యాయ కోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతో తగాదాలు వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఖర్చు లేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలు ఇప్పుడు లోక్ అదాలను ఉపయోగించుకుంటున్నారు. కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ సహాయపడుతుంది. ఒకవేళ అప్పటికే కక్షిదారులు కోర్టు రుసుము చెల్లించి ఉంటే అది కూడా వెనక్కి ఇస్తారు.
ప్రశ్న 7.
 న్యాయ సేవల ప్రాధికార సంస్థలు నిర్వర్తించే విధులు ఏవి?
 జవాబు:
- చట్టంలో పొందుపరిచిన ప్రకారం అర్హులైన వ్యక్తులకు న్యాయ సేవలను అందించటం.
 - లోక్ అదాలలను నిర్వహించటం.
 - ముందస్తు నివారణ, వ్యూహాత్మక న్యాయ సహాయ కార్యక్రమాలను చేపట్టటం.
 - న్యాయసేవల ప్రాధికార సంస్థ నిర్ణయించే ఇతర విధులను నిర్వర్తించటం.
 
![]()
ప్రశ్న 8.
 న్యాయసేవల ప్రాధికార సంస్థ ఉద్దేశాలు ఏమిటి?
 జవాబు:
- సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత, సమర్ధ న్యాయసేవలను అందించటానికి న్యాయసేవ ప్రాధికార సంస్థ చట్టాన్ని చేయడం.
 - ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరునికీ న్యాయం అందని పరిస్థితి లేకుండా చూడడం.
 - సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలత్ లను ఏర్పాటు చెయ్యటం.
 - కోర్టుల బయట సమర్థ, ప్రత్యామ్నాయ, సృజనాత్మక వివాద పరిష్కార విధానాన్ని రూపొందించటం.
 
ప్రశ్న 9.
 సమాచార కమిషన్లో ప్రధాన బాధ్యులు ఎవరు?
 జవాబు:
- ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటారు.
 - అదేశాఖలో ఒక అప్పీలేట్ అధికారి ఉంటారు.
 - అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
 - దీనికి రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు.
 - ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి.
 
ప్రశ్న 10.
 చమురు ధరలు పెరిగితే ప్రజాజీవనంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
 పై వ్యాఖ్యపై మీ అభిప్రాయం వ్రాయండి.
 జవాబు:
- చమురు ధరలు పెరిగితే ప్రజాజీవితంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
 - దాని వలన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు, పండ్లు తదితరాల రేట్లు పెరగడం జరుగుతుంది.
 - మనదేశం అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటుంది. కావున అత్యధిక మొత్తాలు ఖర్చవుతాయి.
 - విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంది.
 
ప్రశ్న 11.
 ప్రజా సంక్షేమ పథకాల యొక్క ప్రయోజనాలు అర్హులైన వారికి అందడం లేదనే అభిప్రాయం ఉంది. దీనిపై మీ సలహాలు, సూచనలు వ్రాయండి.
 జవాబు:
- ప్రజా సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయడంలో అధికార పక్షాలు, అధికారుల అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం ఉండటం వలన అందరికీ ఫలాలు సరిగా అందడం లేదు.
 - రాజకీయ పక్షపాతంకన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా ఉండాలి.
 - పథకాలలో అవినీతి జరగనీయకుండా చూడాలి.
 - అలాంటి వాటికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.
 
10th Class Social 22th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
 ‘సమాచార హక్కు చట్టము ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు దర్పణము’ – వివరించండి.
 జవాబు:
- ప్రజాస్వామ్యానికి అన్ని విషయాలు తెలిసిన పౌరులు కావాలి.
 - సమాచారంలో పారదర్శకత ఉండాలి.
 - సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులందరూ ఇటువంటి సమాచారాన్ని పొందగలరు.
 - ఇది అవినీతిని అరికట్టడానికి తోడ్పడుతుంది.
 - ప్రభుత్వాలు పౌరులకు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది.
 - గతంలో ప్రభుత్వ శాఖలు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మాత్రమే ప్రతిస్పందించేవి.
 - కానీ ఇప్పుడు సాధారణ పౌరులకు సైతం జవాబులు చెబుతున్నాయి.
 
ప్రశ్న 2.
 లోక్ అదాలలు సామాన్య మానవునకు ఏ విధంగా సహకరిస్తున్నాయి? వివరించండి.
 జవాబు:
- ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
 - వివాదాల వేగవంత విచారణ, విధానంలో వెసులుబాటు కల్పించబడ్డాయి.
 - వాది ప్రతివాదులిరువురూ ప్రత్యక్షముగా న్యాయమూర్తితో సంభాషించవచ్చును.
 - ఉచిత న్యాయసలహా అందజేయబడుతుంది.
 - వివాదాల పరిష్కారములో కాలయాపన నివారించబడుతుంది.
 
![]()
ప్రశ్న 3.
 “సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వం పనిని మెరుగు పరచడం, పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.” దీనితో మీరు ఏకీభవిస్తారా ? మీ సమాధానమును సమర్థించండి.
 జవాబు:
 సమాచార హక్కుచట్టం:
- అవును. ఇవ్వబడిన వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.
 - సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పనిని మెరుగుపరచడం, పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.
 - పరిపాలనలో పారదర్శకత పెరుగుతుంది.
 - ఇది లంచగొండితనాన్ని అరికట్టడానికి దోహదపడుతుంది.
 - ప్రభుత్వాలను సాధారణ పౌరులకు, వ్యక్తులకు జవాబుదారీగా ఉండేలా చేస్తుంది.
 
ప్రశ్న 4.
 సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చే ప్రభుత్వ సంస్థలేవి?
 జవాబు:
 సమాచార హక్కు చట్టం కిందికి వచ్చే ప్రభుత్వ సంస్థలను చట్టం ఈ కింది విధంగా గుర్తించింది.
 అ) రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థ
 ఆ) పార్లమెంటు, లేదా రాష్ట్ర శాసన సభల ప్రకారం ఏర్పడిన సంస్థ
 ఇ) సంబంధిత ప్రభుత్వ ఆదేశాలు లేదా నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన సంస్థ. ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ నియంత్రిత సంస్థ, ప్రభుత్వం నిధులు సమకూర్చిన సంస్థలు ఈ చట్టం కిందికి వస్తాయి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గణనీయ మొత్తంలో ప్రభుత్వ నిధులు అందే స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ చట్టం కిందికి వస్తాయి.
ప్రశ్న 5.
 దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ వివాదాలను పరిష్కరించుకోదలచిన వ్యక్తులు ఎవరికి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి?
 జవాబు:
 దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ వివాదాలు, తగాదాలు, కోర్టు కేసులను పరిష్కరించుకోదలచిన వ్యక్తులు తమ కేసు పూర్వపరాలు, కావలసిన పరిష్కారం, వివరిస్తూ సంబంధిత పత్రాలు మరియు తమ అర్హతను తెలియజేసే పత్రాలతో అఫిడవిట్ దాఖలు చేసి సత్వర, ఉచిత న్యాయాన్ని కోరవచ్చు.
వివిధ స్థాయిలలో ఎవరికి దరఖాస్తు చేయాలో దిగువన పేర్కొనబడినది.
 జిల్లాస్థాయిలో – కార్యదర్శి, జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ, జిల్లా కోర్టు భవనాలు.
 రాష్ట్రస్థాయిలో – సభ్యకార్యదర్శి, రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, న్యాయ సేవాసదన్, సిటీ సివిల్ కోర్టు భవనాలు, హైకోర్టు భవనాలు, హైదరాబాదు – 500 066
 (లేదా)
 హైకోర్టులో ఉన్న కేసులలో న్యాయ సహాయం కోరే వ్యక్తులు కార్యదర్శి, హైకోర్టు న్యాయ సేవల ప్రాధికార సంస్థ, హైకోర్టు భవనాలు, హైదరాబాదు – 500 066.
ప్రశ్న 6.
 లోక్ అదాలత్ వల్ల ప్రయోజనాలు ఏమిటి?
 జవాబు:
- ఎటువంటి కోర్టు రుసుము ఉండదు. ఒకవేళ కోర్టు రుసుము అప్పటికే చెల్లించి ఉంటే లోక్ అదాలత్ కేసు పరిష్కరింపబడినప్పుడు నియమాలకు లోబడి రుసుమును తిరిగి చెల్లిస్తారు.
 - వివాదాల వేగవంత విచారణ, విధానంలో వెలుసుబాటు అన్నవి లోక్ అదాలత్ లోని ముఖ్యమైన అంశాలు. వివాదాలను లోక్ అదాలత్ పరిష్కరించే క్రమంలో పౌర విచారణ స్మృతి సాక్షాల చట్టం వంటి వాటిల్లో పేర్కొన్న విధానాలను కచ్చితంగా పాటించాలని లేదు.
 - తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించవచ్చు. ఇది సాధారణ న్యాయస్థానాల్లో సాధ్యంకాదు.
 - లోక్ అదాలత్ ఇచ్చే తీర్పును వాది, ప్రతివాదులు గౌరవించాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుకి ఉండే విలువ దీనికి కూడా ఉంటుంది. వివాద అంతిమ పరిష్కారం ఆలస్యం కాకుండా ఉండటానికి దీనిపై అప్పీలును అనుమతించరు.
 - అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయ సలహా అందిస్తారు. కోర్టులలో కేసును వాదించటానికి అడ్వకేట్లను నియమిస్తారు. ఉచిత న్యాయ సేవలు, మద్ధతుకి అర్హులైన వ్యక్తులకు సంబంధించిన కోర్టు కేసులలో కోర్టు ఖర్చులను భరిస్తారు, తీర్పు నకళ్లను ఉచితంగా అందచేస్తారు.
 
ప్రశ్న 7.
 
 ఇచ్చిన వార్తా కథనాలను చదివి సమాచార హక్కు ఉపయోగం గురించి చర్చించండి.
 జవాబు:
 పైన ఇచ్చిన వార్తా కథనాలను పరిశీలించినట్లయితే సమాచార హక్కు చట్టం మూలంగా అనేక అక్రమాలను, అవినీతి చర్యలను అరికట్టవచ్చని తెలుస్తుంది. మరియు ఈ చట్టం మూలంగా చాలా ఉపయోగాలున్నాయని తెలుస్తుంది.
కొన్ని ఉపయోగాలు :
- “తానే” నగరంలో అనుమతి లేని 40,000 ఆటోలు తిరుగుతున్నట్లుగా “సమాచార హక్కుచట్టం” ప్రకారం తెలిసింది.
 - సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచార కమిషనర్ జరిమానాలను విధించినట్లుగా తెలియుచున్నది.
 - ఇతర దేశాలలో 117 మంది భారతీయులను నిబంధనలకు వ్యతిరేకంగా ఖైదీలుగా బంధించారని సమాచార హక్కు చట్టం మూలంగా తెలుసుకోగలిగాం.
 - సమాచారం అడిగేవారు. వారి అడ్రసులను ఇవ్వవలసిన అవసరం లేదు. కాని సమాచారం పొందడానికి కనీసం పోస్ట్బక్స్ నంబరు అయినా ఇవ్వవలయును అని ఢిల్లీ వార్తాపత్రిక తెలియచేయుచున్నది.
 - చెన్నై కార్పొరేషనులో విద్యాపన్నుకు సంబంధించి 175 కోట్ల రూపాయలను వసూలు చేశారు, కాని గత 8 సంవత్సరాల నుండి ఆ డబ్బును ఉపయోగించలేదనే ఫిర్యాదు సమాచార హక్కు చట్టం ప్రకారం చెన్నైలో నమోదు అయ్యింది.
 
ఈ సమాచార హక్కు మూలంగా ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది. అదే విధంగా కొన్ని రాష్ట్రాలలో ఈ చట్టం మరుగున పడిపోయిందనే వార్తలు కూడా తెలుస్తున్నాయి.
ప్రశ్న 8.
 మీకిచ్చిన భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించుము.
 1) ఢిల్లీ 2) చెన్నై 3) ముంబయి 4) కోల్ కత 5) హైదరాబాద్ 6) బెంగళూరు
 