These AP 7th Class Telugu Important Questions 5th Lesson తెలుగు వెలుగు will help students prepare well for the exams.
AP State Syllabus 7th Class Telugu 5th Lesson Important Questions and Answers తెలుగు వెలుగు
7th Class Telugu 5th Lesson తెలుగు వెలుగు Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
1. కింది పరిచిత గద్యాన్ని చదవండి. దీనికి నాలుగు ప్రశ్నలు తయారుచేయండి.
ఎవరి మాతృభాష వారికి కన్నతల్లి లాంటిది. మన తెలుగుభాష మనకు అమృతం కదూ ! మనం తెలుగులోనే ఆలోచిస్తాం. తెలుగులోనే మాట్లాడతాం. తెలుగులోనే జీవిస్తాం! మా స్నేహితులను ఇలానే ప్రోత్సహిస్తాం. మీ స్నేహితులనే కాదు. అందరినీ, అన్ని అవసరాలకూ తెలుగుభాషనే వాడమని ప్రోత్సహించాలి. తెలుగు గొప్పదనాన్ని పద్యాల్లో గేయాల్లో, పాటల్లోనూ నలుదిక్కులా పాడి వినిపించాలి. తెలుగుభాష ఆరాధ్యభాష అయ్యేలా చూడాలి.
 జవాబు:
 అ) ఏది ఎవరికి కన్నతల్లి లాంటిది?
 ఆ) మనం ఏమిచేస్తాం?
 ఇ) స్నేహితులనూ, ఇతరులనూ ఏమని ప్రోత్సహించాలి?
 ఈ) నలుదిక్కులా ఏమి పాడి వినిపించాలి?
2. కింది పరిచిత గద్యాన్ని చదవండి. దీనిపై నాలుగు ప్రశ్నలు రాయండి.
“కప్పను గని ఫణివరుండు గడగడ వణికెన్”
అనే పంక్తితో మా పుస్తకంలో ఒక గమ్మత్తు పద్యం ఉంది. వాటిని సమస్యాపూరణలు అంటారు. ఇవి సాధారణంగా అవధాన ప్రక్రియల్లో ఉంటాయి. అష్టావధానం అంటే అదేనా ? ఔను అష్టావధానంలో సమస్యాపూరణం అనేది, ఒక విషయం, శతావధానం, సహస్రావధానం అనేవి కూడా ఉన్నాయి. ఇది కూడా తెలుగులో ఒక అద్భుత
 విధానం:
 కవి ఏకాగ్రతనూ, ధారణనూ, ప్రతిభనూ తెలుసుకోదగిన ప్రక్రియ ఇది.
 జవాబు:
 అ) పుస్తకంలోని గమ్మత్తు పద్యంలోని పంక్తి ఏది?
 ఆ) సమస్యా పూరణలు ఏ ప్రక్రియల్లో ఉంటాయి?
 ఇ) అవధానాలలో రకాలను పేర్కొనండి.
 ఈ) అవధానాలు ఎటువంటి ప్రక్రియలు?

3. కింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో పేర్లు రాయండి.
1. ఎవరా పైడి బొమ్మ?
 జవాబు:
 ప్రశ్నార్థక వాక్యం
2. నువ్వు నోరు మూస్తావా? ముయ్యవా?
 జవాబు:
 సందేహార్థక వాక్యం
3. సీత బడికెళ్ళిందా? లేదా?
 జవాబు:
 సందేహార్థక వాక్యం
4. శ్రీ మహాలక్ష్మీ ! కరుణ జూపవమ్మా !
 జవాబు:
 ప్రార్థనార్థక వాక్యం
5. ఆకాశవాణిలో విషయం ప్రకటించండి.
 జవాబు:
 ప్రార్థనార్థక వాక్యం
6. నీవు గుడికి వెళ్ళవచ్చు.
 జవాబు:
 అనుమత్యర్థక వాక్యం
7. నేను బడికి వెళ్ళగలను.
 జవాబు:
 సామర్థ్యార్థక వాక్యం
8. కేబుల్ గ్రామ్ పంపించు.
 జవాబు:
 విధ్యర్థక వాక్యం
9. నీవు బడికి రావద్దు.
 జవాబు:
 నిషేధార్థక వాక్యం
ఈ క్రింది అపరిచిత గద్యాలను చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. గాంధీజీ తన ప్రసంగాలలో సత్యం, అహింస అనే రెండు తరచుగా ఉపయోగించేవారు. అయితే ఈ రెంటిలో మొదటిదానికే ప్రాధాన్యమిచ్చారు. అతడు సత్యాన్వేషకుడే కాదు. సత్యాన్ని ఆరాధించిన భక్తుడు. తన జీవితాన్ని “సత్యమార్గంతో పరిశోధనలు”గా అభివర్ణించారు. ప్రారంభంలో భగవంతుడే సత్యమని ప్రకటించారు. కానీ, చివరకు “సత్యమే భగవంతుడు” అని ప్రకటించే స్థితికి వచ్చారు. “ఎందుకంటే భగవంతుని ఉనికిని నిరాకరించవచ్చు. కానీ, సత్యమును కాదనడం కష్టం”
 ప్రశ్నలు:
 అ) గాంధీ తన ప్రసంగాలలో తరచుగా ఉపయోగించేవి ఏవి?
 జవాబు:
 సత్యం, అహింస.
ఆ) ఆయన తన జీవితాన్ని ఏమని అభివర్ణించారు?
 జవాబు:
 సత్యమార్గంతో పరిశోధనలు.
ఇ) ప్రారంభంలో ఆయన దేనిని సత్యమని ప్రకటించారు?
 జవాబు:
 భగవంతుడే సత్యం.
ఈ) చివరకు ఆయన దేనిని భగవంతునిగా ప్రకటించే స్థితికి వచ్చారు?
 జవాబు:
 సత్యమే భగవంతుడు.

2. భాష నేర్చుకోవడం రెండు రకాలు. భాష కోసం భాష. విషయం కోసం భాష, భాషా స్వరూప స్వభావాలను సమగ్రంగా అధ్యయనం చేయడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయాలను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటిని అధ్యయనం చెయ్యడం రెండవ రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకాలుగా తయారయింది. ప్రాచీన కావ్య) భాష, ఆధునిక (ప్రామాణిక) భాష, సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది. కాని, దాన్ని గురించి చెప్పడానికీ, రాయడానికి ఆధునిక భాషే కావాలి. ఎందువల్లనంటే ఏ కాలంలో జీవించేవాడి ఆలోచన, అలవాట్లూ ఆ కాలం నాటి భాషలోనే సాగుతుంటాయి. కనుక ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. వివిధ శాస్త్ర విషయాలను వివరించడానికే కాదు, పూర్వ భాషా సాహిత్యాలను వివరించడానికి కూడా ఆధునిక భాషే కావాలి.
 ప్రశ్నలు:
 అ) భాషను ఏ యే రకాలుగా నేర్చుకొంటాము?
 జవాబు:
 భాషను భాష కోసం, విషయం కోసం నేర్చుకుంటాము.
ఆ) భాష ఎన్ని రకాలుగా తయారయింది?
 జవాబు:
 భాషలో ప్రాచీన భాష (కావ్య), ఆధునిక భాష (ప్రామాణిక) అని రెండు రకాలు.
ఇ) ప్రాచీన భాష ఎందుకు ఉపయోగపడుతుంది?
 జవాబు:
 ప్రాచీన భాష సాహిత్యంలోని తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ) ఆధునిక భాష ఉపయోగం ఏమిటి?
 జవాబు:
 ఆధునిక భాష సాహిత్యంలో తరతరాల గురించి చెప్పడానికి, రాయడానికి ఉపయోగపడుతుంది.
3. పరభాషల ద్వారా కాక మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుటయే సహజమైన పద్ధతి అని వాదించి వంగభాషలో బాలురకు ఉపయుక్తములగు వాచకములను, శాస్త్ర గ్రంథములను రచించిన విద్యావేత్త ఈశ్వరచంద్రుడు.
అతనివలే ఒకవైపు సంఘ సంస్కరణ చేయుచు, మరొకవైపు భాషా సేవ చేసిన మహనీయుడు మన వీరేశలింగం పంతులు గారు. పంతులుగారికి దక్షిణదేశ విద్యాసాగరుడను బిరుదు కలదు. విద్యాసాగరుడు పంతులుగారు పరస్పరం ఉత్తరములు రాసుకొనేవారు. ఈశ్వరచంద్రుని వలన వంగదేశము, పంతులుగారి వలన తెలుగుదేశము వాసిగాంచినవి.
 ప్రశ్నలు:
 అ) విద్యాబోధన చేయుటకు సహజమైన పద్ధతి ఏది?
 జవాబు:
 మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుట సహజమైన పద్ధతి.
ఆ) ఈశ్వరచంద్రుడు ఏ భాషలో వాచకములను రాసెను?
 జవాబు:
 ఈశ్వరచంద్రుడు వంగభాషలో వాచకములను రాసెను.
ఇ) పంతులుగారి బిరుదు ఏమిటి?
 జవాబు:
 ‘దక్షిణ దేశ విద్యాసాగరుడు’ అనేది పంతులుగారికి గల బిరుదు.
ఈ) ఈశ్వరచంద్రుని వలన ఏ దేశము వాసిగాంచెను?
 జవాబు:
 ఈశ్వరచంద్రుని వలన వంగదేశము వాసి గాంచెను.

4. మేధా సంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమవుతుంది అనేది ఎంతయినా యథార్థం. ఒక దేశం యొక్క సంస్కృతి, వికాసం, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా, కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక యుగంలో విద్య మానవునికి ఒక ముఖ్యమైన జీవితావసరంగా కూడా మారింది. నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు ఒక ప్రాథమిక అవసరంగా భావించి వాటిని రాజ్యాంగంలో పొందుపరచడమైనది.
 ప్రశ్నలు:
 అ) యథార్థమైనది ఏది?
 జవాబు:
 స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతమవుతుంది.
ఆ) ఒక దేశ సంస్కృతి, ప్రగతి దేనిమీద ఆధారపడి ఉంటుంది?
 జవాబు:
 ఒక దేశ సంస్కృతి, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా. కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
ఇ) రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక అవసరాలేవి?
 జవాబు:
 నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు అనే ప్రాథమిక అవసరాలు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి.
ఈ) వైజ్ఞానిక వాస్తవం ఏమిటి?
 జవాబు:
 మేధాసంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం.
5. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
జంధ్యాల గారు అన్నట్లుగా హాస్యం అనేది చక్కని వంటకంలో ఉప్పులాంటిది. ఉప్పులేని కూర ఎంత చప్పగా ఉంటుందో సున్నిత హాస్యం లేని ప్రసంగం కూడా అలాగే ఉంటుంది. అంటే జోక్ చెప్తున్నట్లుగా చెప్పకూడదు. అది ప్రసంగంలో భాగమైపోవాలి. మాట్లాడే మాటలు ప్రాంతాన్ని బట్టి అర్థం మారిపోతుంది. ఒక పెద్దాయన వచ్చి ‘ఈ వాల్ పోస్టర్లు అంటించండి !’ ఆ పెద్దాయన సహాయకులు వెంటనే రంగంలోకి దూకి తగులబెట్టారు. అంటించండి అంటే అతికించండి అని ఆయన ఉద్దేశ్యం.
 ప్రశ్నలు:
 1. హాస్యం ఎలాంటిది?
 జవాబు:
 చక్కని వంటకంలో ఉప్పులాంటిది
2. ఉప్పులేని కూర ఎలా వుంటుంది?
 జవాబు:
 చప్పగా ఉంటుంది.
3. పై పేరాలో హాస్యం గురించి మాట్లాడినది ఎవరు?
 జవాబు:
 జంధ్యాలగారు
4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
 జవాబు:
 ప్రసంగంలో ఏది ఉండాలి?

6. ఈ కింది అపరిచిత గేయాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
గోరంత దీపమ్ము కొండంత వెలుగు
 మా యింటి పాపాయి మా కంటి వెలుగు
 వెచ్చని సూరీడు పగలంత వెలుగు
 చల్లని చంద్రుడు రాత్రంత వెలుగు
 ముత్యమంత పసుపు ముఖమంత వెలుగు
 మంచి చదువులతో మన భవిష్యత్తు వెలుగు.
 ప్రశ్నలు:
 1. కొండంత వెలుగును ఇచ్చేది ఏది?
 జవాబు:
 గోరంతదీపం
2. రాత్రి వెలుగు ఇచ్చేది ఎవరు?
 జవాబు:
 చంద్రుడు
3. మన భవిష్యత్తు వెలుగుకు ఏం కావాలి?
 జవాబు:
 మంచి చదువు
4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
 జవాబు:
 పై గేయంలో ఉన్న అలంకారం ఏది?
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
1 భాష వల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి.
 జవాబు:
 భాషాప్రయోజనాలు :
 మనలోని భావాన్ని, ఇతరులకు తెలపడానికి మానవులు రూపొందించుకున్న ప్రధాన సాధనం “భాష”. భాష లేకపోతే, మనిషికీ, పశువుకు తేడా ఉండదు. జంతువులు తమ అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పలేవు. మనిషికి భాష ఉంది కాబట్టి తన అభిప్రాయాన్ని ఇతరులకు అర్థం అయ్యేలా చెపుతున్నాడు. ప్రపంచంలో భాషలేని మనుషులు లేరు.
భావాలను వ్యక్తీకరించే సంకేతాల వ్యవస్థ భాష. సమస్త కళలు, సకల శాస్త్రాలు భాష లేకపోతే నిర్జీవాలే. భాష మన మనోభావాలను వెలువరించగలదు. దాచగలదు. వక్రీకరించగలదు. మానవుడు మానవుడనిపించుకొన్నది. భాషను ఉపయోగించడం తెలిసినప్పటి నుండి మాత్రమే. భాష యోచనకు ఉపయోగపడే వాహనమే కాదు, అదొక గొప్ప శక్తివంతమైన ఆలోచనల సాధనం. భాష సంస్కృతికి పునాది. అది లేనిదే ఏ విద్యను నేర్వడం, నేర్పడం కుదరదు.
ఇలా ఎన్నో ప్రయోజనాలు భాష వల్ల మనకు కలుగుతాయి.

2. తెలుగు భాషా గొప్పతనం గురించి, దానిని కాపాడడాన్ని గురించి మిత్రునికి లేఖ రాయండి.
 జవాబు:
| మిత్రునికి లేఖ బాపట్ల, ప్రియమైన మిత్రుడు కార్తీక్ కు, నీ స్నేహితుడు జస్వంత్ సమీర్ వ్రాసే లేఖ – ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలుస్తాను. ఇటీవల మా క్లాసులో ‘తెలుగుభాషా గొప్పదనం’ అనే అంశం మీద చర్చావేదిక పెట్టారు. అందరం పాల్గొన్నాం. తెలుగుభాష చాలా అందమైనదని, అన్ని భావాలను తెలిపే సామర్థ్యం కలదని, తెలుగుభాషలో ఉన్న గొప్పదనం, దానిలోని సామెతలు, శబ్ద పల్లవాలు, జాతీయాలు మొదలైనవి, హరికథలు, సంకీర్తనలు మొదలైన ప్రక్రియలు, తెలుగు భాష అందచందాలను గూర్చి అందరం మాట్లాడాము. ఈ కార్యక్రమం ద్వారా మాలో నూతన ఉత్సాహం పెంపొందింది. మీ క్లాసులో జరిగిన సంగతులు తెలుపుతూ ఉత్తరం రాయి. మీ అమ్మానాన్నలకు నా నమస్కారములు. ఇట్లు చిరునామా : | 
7th Class Telugu 5th Lesson తెలుగు వెలుగు 1 Mark Bits
1. శ్రీనిధి చూడచక్కని బంగారు బొమ్మ. (పర్యాయపదాలు గుర్తించండి)
 ఎ) పసుపు – కుంకుమ
 బి) అన్నము – సున్నము
 సి) గాలి – పవనము
 డి) పసిడి – కనకం
 జవాబు:
 డి) పసిడి – కనకం
2. భరత్ పాఠము చదివెను. (ఇది ఏ కాలము గుర్తించండి)
 ఎ) వర్తమానకాలం
 బి) భూతకాలం
 సి) భవిష్యత్ కాలం
 డి) తద్దర్మకాలం
 జవాబు:
 బి) భూతకాలం
3. పుస్తకాలు చదవడం వల్ల, విజ్ఞానం వస్తుంది. (వ్యతిరేకపదం గుర్తించండి)
 ఎ) వివేకం
 బి) అజ్ఞానం
 సి) సంతోషం
 డి) వినయం
 జవాబు:
 బి) అజ్ఞానం
4. కోకిల పాట పాడింది. (ఏ క్రియో గుర్తించండి)
 ఎ) అసమాపక
 బి) సమాపక
 సి) ఉభయమాపక
 డి) సమ అసమాపక
 జవాబు:
 బి) సమాపక
5. కిందివానిలో జంట పదాలను గుర్తించండి.
 ఎ) అన్నం – నీరు
 బి) ఆడుట – తినుట
 సి) ధర్మం – మోక్షము
 డి) కలిమి – లేమి
 జవాబు:
 డి) కలిమి – లేమి

6. రవి తన తల్లి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాడు. ( జాతీయాన్ని గుర్తించండి)
 ఎ) రవి తల్లి
 బి) కళ్ళు కాయలు కాచేలా
 సి) తల్లికోసం
 డి) ఎదురు చూశాడు.
 జవాబు:
 బి) కళ్ళు కాయలు కాచేలా
7. తెలుగు భాష మధురమైనది. (వికృతిని గుర్తించండి)
 ఎ) బాస
 బి) భావం
 సి) తెనుగు
 డి) తీపి
 జవాబు:
 ఎ) బాస
8. “దేశము నందలి భాషలు” (సమాసమును గుర్తించండి)
 ఎ) సప్తమీ తత్పురుష
 బి) ద్విగు సమాసం
 సి) ద్వంద్వ సమాసం
 డి) బహుబ్లి హి సమాసం
 జవాబు:
 ఎ) సప్తమీ తత్పురుష
9. శకుంతలకు లెక్కలు చేయుట కొట్టిన పిండి. దానికై సాధన చేసింది. జాతీయాన్ని గుర్తించండి)
 ఎ) లెక్కలు చేయుట
 బి) కొట్టిన పిండి
 సి) శకుంతల
 డి) సాధనచేయుట
 జవాబు:
 బి) కొట్టిన పిండి
10. రామయ్య వ్యవసాయం చేయడంలో తలపండినవాడు. కాబట్టి ప్రతి ఏటా మంచి పంట పండిస్తున్నాడు. (జాతీయాన్ని గుర్తించండి.)
 ఎ) వ్యవసాయం చేయడం
 బి) తలపండినవాడు
 సి) ప్రతి ఏటా
 డి) పంట పండించుట
 జవాబు:
 బి) తలపండినవాడు
11. ‘ఆహాహా ! అమరావతి ఎంత అందంగా ఉంది. (సంధి నామం గుర్తించండి)
 ఎ) ఇత్వసంధి
 బి) ఉత్వసంధి
 సి) సవర్ణదీర్ఘ సంధి
 డి) ఆమ్రేడిత సంధి
 జవాబు:
 డి) ఆమ్రేడిత సంధి

12. తెలుగు అనే పేరుగల భాష మధురంగా ఉంటుంది.(సమాస పదం గుర్తించండి.)
 ఎ) తెలుగు భాష
 బి) తెలుగు అనేది భాష
 సి) తెలుగు పేరు భాష
 డి) భాష తెలుగు
 జవాబు:
 ఎ) తెలుగు భాష
III. భాషాంశాలు
పదాలు – అర్థాలు:
 సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన ‘పదాల అర్థం గుర్తించండి.
13. మీ తాతయ్య ఎన్నో పద్యాలు నెమరువేస్తుంటారు.
 ఎ) నమిలి మ్రింగడం
 బి) జ్ఞప్తికి తెచ్చుకోవటం
 సి) నోట్లోకి తెచ్చుకోవటం
 డి) జీర్ణం చేసుకోవడం
 జవాబు:
 బి) జ్ఞప్తికి తెచ్చుకోవటం
14. నా మిత్రుడు ఆశువుగా పద్యాలు చెపుతాడు.
 ఎ) అప్పటికప్పుడు ఊహించుకొని చెప్పడం
 బి) నెమ్మదిగా చెప్పడం
 సి) వేగముగా చెప్పడం
 డి) అర్థంలేనివి చెప్పడం
 జవాబు:
 సి) వేగముగా చెప్పడం
15. సినిమా పాటలు ఆబాలగోపాలాన్నీ అలరిస్తాయి.
 ఎ) పిల్లలు పెద్దలు
 బి) పిల్లల నుండి పెద్దలను
 సి) పిల్లల నుండి ఆవుల వరకు
 డి) గోవుల నుండి
 జవాబు:
 బి) పిల్లల నుండి పెద్దలను
16. విద్యార్థులకు సామర్ధ్యం ఉండాలి.
 ఎ) విన్యాసం
 బి) సమర్థత
 సి) వినోదం
 డి) వివేకం
 జవాబు:
 బి) సమర్థత
17. మనుషుల తీరు మారాలి.
 ఎ) విరామం
 బి) తరము
 సి) విధము
 డి) తమర
 జవాబు:
 సి) విధము

18. గ్రామంలో వేడుక జరిగింది
 ఎ) వారము
 బి) పనస
 సి) వరిము
 డి) పండుగ
 జవాబు:
 డి) పండుగ
19. వివేకానందుడు యువతను జాగృతం చేశాడు
 ఎ) జాతర
 బి) మేలుకొల్పడం
 సి) జేగండ
 డి) నిద్రపుచ్చడం
 జవాబు:
 బి) మేలుకొల్పడం
20. ప్రజలు పంక్తిలో వేచియున్నారు
 ఎ) పనస
 బి) విరుద్ధం
 సి) నిలబడి
 డి) వరుస
 జవాబు:
 డి) వరుస
పర్యాయపదాలు:
 సూచన : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకి పర్యాయపదాలు గుర్తించండి.
21. శ్రీని న్యాయ మార్గంలో సాధించాలి.
 ఎ) సంపద, విత్తం
 బి) గిరి, వరి
 సి) సిరి, సరి
 డి) సరి, చరణం
 జవాబు:
 ఎ) సంపద, విత్తం
22. స్త్రీని గౌరవించాలి.
 ఎ) సంపది, ఉవిద
 బి) సంపద, కరం
 సి) చామాత, సంపద
 డి) మహిళ, వనిత
 జవాబు:
 డి) మహిళ, వనిత

23. మాత పూజ్యురాలు
 ఎ) జామాత, జనని
 బి) జగతి, జాగృతి
 సి) జనని, అమ్మ
 డి) జగతి, జనత
 జవాబు:
 సి) జనని, అమ్మ
24. ఆర్జన సంపాదించాలి.
 ఎ) సంపద, ధనము
 బి) ఆజ్ఞ, ఆన
 సి) గని, గిరి
 డి) సరి, వారి
 జవాబు:
 ఎ) సంపద, ధనము
25. స్నేహితుడు హితం కోరాడు.
 ఎ) వైరి, విరోధి
 బి) విరోధి, మిత్రుడు
 సి) నెయ్యం, కయ్యం
 డి) మిత్రుడు, సఖుడు
 జవాబు:
 డి) మిత్రుడు, సఖుడు
26. బంగారంతో నగలు చేస్తారు.
 ఎ) భృంగారం, లోహం
 బి) హేమం, సువర్ణం
 సి) రజితం, రంజితం
 డి) రజతం, సువర్ణం
 జవాబు:
 బి) హేమం, సువర్ణం
27. విద్యార్థులకు చదువుపై ఆకాంక్ష ఉందాలి.
 ఎ) చామరం, కరం
 బి) కరం, కరి
 సి) కోరిక, ఇచ్ఛ
 డి) చరణం, పాదం
 జవాబు:
 సి) కోరిక, ఇచ్ఛ

28. అయోధ్యకు రాజు దశరథుడు.
 ఎ) సామి, భూమి
 బి) పతి, చంద్రుడు
 సి) ఇంద్రుడు, చంద్రుడు
 డి) నృపుడు, భూపాలుడు
 జవాబు:
 డి) నృపుడు, భూపాలుడు
ప్రకృతి – వికృతులు :
29. నాన్న ప్రయాణం చేశాడు – దీనికి వికృతిపదం గుర్తించండి.
 ఎ) పెయనం
 బి) పయనం
 సి) సయనం
 డి) పాయసం
 జవాబు:
 బి) పయనం
30. తల్లి సంతసం పొందింది – ప్రకృతి పదం గుర్తించండి.
 ఎ)సంగతం
 బి) సంతోషం
 సి) వందనం
 డి) సంబరం
 జవాబు:
 బి) సంతోషం
31. పెద్దలపట్ల గారవం చూపాలి – వికృతి పదం గుర్తించండి.
 ఎ) గరవం
 బి) గౌరవం
 సి) గౌరవం
 డి) గారెవం
 జవాబు:
 బి) గౌరవం

32. రాత్రి నిద్రపోయాడు – దీనికి వికృతిపదం గుర్తించండి.
 ఎ) రాతరి
 బి) రేయి
 సి) రతరి
 డి) రాగ్రి
 జవాబు:
 బి) రేయి
33. ఒజ్జను గౌరవించాలి – ప్రకృతి పదం గుర్తించండి.
 ఎ) అరాచికం
 బి) ఉపాధ్యాయుడు
 సి) గురువు
 డి) ఆచార్యుడు
 జవాబు:
 బి) ఉపాధ్యాయుడు
34. అందరు పద్యం చదవాలి – వికృతిపదం గుర్తించండి.
 ఎ) పదియం
 బి) పరెము
 సి) పద్దెము
 డి) పబ్లేము
 జవాబు:
 సి) పద్దెము
35. స్త్రీని గౌరవించాలి – వికృతిపదం గుర్తించండి.
 ఎ) సిరి
 బి) ఈదు
 సి) సరి
 డి) ఇంతి
 జవాబు:
 డి) ఇంతి
36. మీ అమ్మ ఎక్కడ ఉంది? – గీతగీసిన పదం ప్రకృతిని గుర్తించండి.
 ఎ) ఆర్య
 బి) అంబ
 సి) అం
 డి) మాత
 జవాబు:
 బి) అంబ
37. ఈ పుస్తకము ఎక్కడ కొన్నావు? – గీతగీసిన పదానికి వికృతిని గుర్తించండి.
 ఎ) పుస్తకం
 బి) గ్రంథము
 సి) కావ్యము
 డి) పొత్తము
 జవాబు:
 డి) పొత్తము
38. ‘తెలుగు భాష మధురమైనది’ – గీతగీసిన పదం వికృతిని గుర్తించండి.
 ఎ) భాష్
 బి) భాష
 సి) బాస
 డి) మాట
 జవాబు:
 సి) బాస
వ్యతిరేక పదాలు :
39. నా తమ్ముడు నిగర్విగా పేరుపొందాడు.
 ఎ) సగర్వి
 బి) అగర్వి
 సి) గర్వి
 డి) గర్విష్టి
 జవాబు:
 సి) గర్వి

40. తెలుగు అచ్చులతో అంతమయ్యే భాష
 ఎ) అంత్యము
 బి) చివర
 సి) ముగింపు
 డి) ఆరంభము
 జవాబు:
 డి) ఆరంభము
41. కవి మేలుకొనియున్నాడు
 ఎ) కూర్చొను
 బి) ఆనందించు
 సి) నిద్రపోవు
 డి) ఆరాధించు
 జవాబు:
 సి) నిద్రపోవు
42. తూర్పున సూర్యుడు ఉదయించాడు.
 ఎ) ఈశాన్యం
 బి) దక్షిణం
 సి) పడమర
 డి) ఉత్తరం
 జవాబు:
 సి) పడమర
43. నరుడు జీవించాడు.
 ఎ) రక్షించు
 బి) మరణించు
 సి) భక్షించు
 డి) త్యాగించు
 జవాబు:
 బి) మరణించు

44. కృతజ్ఞత చూపాలి.
 ఎ) కృప
 బి) మణ్యద
 సి) కృతఘ్నత
 డి) సంతసం
 జవాబు:
 సి) కృతఘ్నత
45. మొదటపని జరగాలి.
 ఎ) మధ్య ము
 బి) ఆది
 సి) చివర
 డి) రసాయణ
 జవాబు:
 సి) చివర
46. ప్రాచీన కాలంలో సంస్కృతి ఉంది.
 ఎ) ప్రతిచీనం
 బి) సనాతన
 సి) అనుచీనం
 డి) నవీనం
 జవాబు:
 డి) నవీనం
సంధులు:
47. ఇత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
 ఎ) పరోపకరము
 బి) పచ్చిదొకటి
 సి) ముందడుగు
 డి) అచ్చుతానంద
 జవాబు:
 బి) పచ్చిదొకటి
48. సహస్రావధానం – ఇది ఏ సంధి?
 ఎ) సవర్ణదీర్ఘ సంధి
 బి) గుణసంధి
 సి) త్రికసంధి
 డి) యణాదేశసంధి
 జవాబు:
 ఎ) సవర్ణదీర్ఘ సంధి
49. ఏ, ఓ, అర్ లను ఏమంటారు?
 ఎ) పరుషాలు
 బి) యణ్ణులు
 సి) త్రికాలు
 డి) గుణాలు
 జవాబు:
 డి) గుణాలు
50. యణాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
 ఎ) ప్రత్యేకం
 బి) గణేశుడు
 సి) పరోపకారం
 డి) పరాపకారం
 జవాబు:
 ఎ) ప్రత్యేకం

51. అయ్యయ్యో ఎక్కడకు వెళ్ళావు? – గీత గీసిన పదాన్ని విడదీసి చూపండి.
 ఎ) ఆ + అయ్యో
 బి) అయ్య + యో
 సి) అయ్యో + అయ్యో
 డి) అయ్య + అయ్యో
 జవాబు:
 సి) అయ్యో + అయ్యో
52. పట్టపగలు దొంగతనం జరిగింది – గీత గీసిన పదం ఏ సంధియో గుర్తించండి?
 ఎ) అత్వ సంధి
 బి) ద్విరుక్తటకార సంధి
 సి) టుగాగమ సంధి
 డి) ఆమ్రేడిత సంధి
 జవాబు:
 డి) ఆమ్రేడిత సంధి
53. అష్టావదానం నిన్న జరిగింది – గీత గీసిన పదం విడదీయండి.
 ఎ) అష్టా + వధానం
 బి) అష్టావ + ధానం
 సి) అష్ఠ + అవధానం
 డి) అష్ట + వధానం
 జవాబు:
 సి) అష్ఠ + అవధానం
54. ‘ఓరోరి‘ ఎక్కడ నుండి వచ్చావు? – గీత గీసిన పదం ఏ సంధి?
 ఎ) ఆమ్రేడిత సంధి
 బి) అత్వసంధి
 సి) ఇత్వసంధి
 డి) రుగాగమసంధి
 జవాబు:
 ఎ) ఆమ్రేడిత సంధి
55. పని విషయంలో ఏకాగ్రత్త అవసరం – గీత గీసిన పదాన్ని విడదీయండి
 ఎ) ఏకే + అగ్రత
 బి) ఏక + అగ్రత
 సి) ఏవ + అగ్రత
 డి) ఐక + అగ్రత
 జవాబు:
 బి) ఏక + అగ్రత
56. క్రింది వానిలో బహుళ సంధిని గుర్తించండి.
 ఎ) ఉత్వసంధి
 బి) త్రికసంధి
 సి) అత్వసంధి
 డి) ఇత్వసంధి
 జవాబు:
 సి) అత్వసంధి
సమాసాలు :
57. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి
 ఎ) అవ్యయీభావం
 బి) బహువ్రీహి
 సి) ద్వంద్వము
 డి) ద్విగు
 జవాబు:
 డి) ద్విగు

58. శాస్త్రజ్ఞుడు – ఇది ఏ సమాసం?
 ఎ) చతుర్థి తత్పురుష
 బి) సప్తమీ తత్పురుష
 సి) ద్వితీయా తత్పురుష
 డి) బహువ్రీహి
 జవాబు:
 సి) ద్వితీయా తత్పురుష
59. నల్లకాకి – దీనికి విగ్రహ వాక్యం గుర్తించండి.
 ఎ) నల్లదైన కాకి
 బి) నల్లయందు కాకి
 సి) నల్లతో కాకి
 డి) నల్లను కాకి
 జవాబు:
 ఎ) నల్లదైన కాకి
60. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణను గుర్తించండి.
 ఎ) తెలుగుభాష
 బి) నలుమూలలు
 సి) కొత్తపదం
 డి) చతుర్ముఖుడు
 జవాబు:
 ఎ) తెలుగుభాష

61. బతుకమ్మ పాటలు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
 ఎ) బతుకమ్మ యందు పాటలు
 బి) బతుకమ్మ కొరకు పాటలు
 సి) బతుకమ్మ యొక్క పాటలు
 డి) బతుకమ్మతో పాటలు
 జవాబు:
 సి) బతుకమ్మ యొక్క పాటలు
62. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణను గుర్తించండి.
 ఎ) మంచిపనులు
 బి) నలుమూలలు
 సి) గందరగోళము
 డి) అందచందాలు
 జవాబు:
 డి) అందచందాలు
63. దేశము నందలి భాషలు మధురం – గీత గీసిన వాక్యానికి సమాసపదం గుర్తించండి.
 ఎ) దేశభాషలు
 బి) భాషాదేశాలు
 సి) భాషదేశాలు
 డి) ప్రతి భాషదేశము
 జవాబు:
 ఎ) దేశభాషలు
64. పదసంపదను సాధించాలి – విగ్రహవాక్యం గుర్తించండి.
 ఎ) పదాలయందు సంపద
 బి) పదముల యొక్క సంపద
 సి) పదాలచేత సంపద
 డి) పదాల కొరకు సంపద
 జవాబు:
 బి) పదముల యొక్క సంపద
వాక్యప్రయోగాలు :
65. ఒక గొప్ప ధ్వని పుట్టింది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
 ఎ) ఒక గొప్ప ధ్వని పుట్టాలి
 బి) ఒక గొప్ప తక్కువగా పుట్టాలి
 సి) ఒక గొప్ప ధ్వని పుట్టలేదు
 డి) ఒక గొప్ప ధ్వని పుట్టలేకపోవచ్చు
 జవాబు:
 సి) ఒక గొప్ప ధ్వని పుట్టలేదు
66. పద్యం రాగంతో పాడాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది.?
 ఎ) పద్యం రాగంతో పాడకపోవచ్చు
 బి) పద్యం రాగంతో పాడితీరాలి
 సి) పద్యం రాగంతో పాడకూడదు
 డి) పద్యం రాగంతో చదివి తీరాలి
 జవాబు:
 సి) పద్యం రాగంతో పాడకూడదు

67. ‘సకాలంలో పని చేయాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
 ఎ) సకాలంలో పనిచేయకూడదు
 బి) సకాలంలో పనిచేసి తీరాలి
 సి) సకాలంలో పని చేయకపోవచ్చు
 డి) సకాలంలో పని తక్కువ చేయాలి
 జవాబు:
 ఎ) సకాలంలో పనిచేయకూడదు
68. వర్షాలు పడినాయి. బావుల్లో నీరు లేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది?
 ఎ) బావుల్లో నీరు లేకపోవడానికి వర్షాలే కారణం
 బి) వర్షాలు కురవడం వల్ల బావుల్లో నీరులేదు
 సి) వర్షాలు కురవడం వల్ల బావుల్లో నీరు అందలేదు
 డి) వర్షాలు పడినాయి గాని బావుల్లో నీరు లేదు
 జవాబు:
 డి) వర్షాలు పడినాయి గాని బావుల్లో నీరు లేదు
69. బస్సు వచ్చింది. ప్రయాణికులు దిగలేదు – దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి.
 ఎ) బస్సు దిగాలి ప్రయాణీకులందరు
 బి) బస్సు వచ్చిందేగాని ప్రయాణీకులు దిగలేరు
 సి) బస్సు వచ్చింది గాని ప్రయాణీకులు దిగలేదు
 డి) బస్సు వచ్చినందు వల్ల ప్రయాణికులు దిగలేరు
 జవాబు:
 సి) బస్సు వచ్చింది గాని ప్రయాణీకులు దిగలేదు
70. హనుమంతుడు సముద్రం దాటగలడు – ఇది ఏరకమైన వాక్యం?
 ఎ) సామర్థ్యార్థక వాక్యం
 బి) అభ్యర్థక వాక్యం
 సి) హేతుర్థక వాక్యం
 డి) ధాత్వర్థక వాక్యం,
 జవాబు:
 బి) అభ్యర్థక వాక్యం

71. హనుమంతు తప్పక వస్తాడు – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) తద్ధర్మార్థక వాక్యం
 బి) నిశ్చయార్థక వాక్యం
 సి) ప్రార్ధనార్థక వాక్యం
 డి) హేత్వర్థక వాక్యం
 జవాబు:
 బి) నిశ్చయార్థక వాక్యం
72. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) తుమున్నర్థక వాక్యం
 బి) ఆశ్చర్యార్థక వాక్యం
 సి) హేత్వర్థక వాక్యం
 డి) అప్యర్థక వాక్యం
 జవాబు:
 సి) హేత్వర్థక వాక్యం
73. మీరు దొంగతనం చేయవద్దు – ఏ రకమైన వాక్యం?
 ఎ) అభ్యర్థక వాక్యం
 బి) కర్తరి వాక్యం
 సి) కర్మణి వాక్యం
 డి) నిషేథాథక వాక్యం
 జవాబు:
 డి) నిషేథాథక వాక్యం
74. దేవా ! నన్ను దీవించు – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) తుమున్నర్థక వాక్యం
 బి) ప్రార్థనార్థక వాక్యం
 సి) అప్యర్థక వాక్యం
 డి) తద్ధర్మార్థక వాక్యం
 జవాబు:
 బి) ప్రార్థనార్థక వాక్యం
75. నీరు పల్లంగా ప్రవహించును – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) అప్యర్థక వాక్యం
 బి) తద్ధర్మార్థక వాక్యం
 సి) హేత్వర్థక వాక్యం
 డి) గుణ్మాతక వాక్యం
 జవాబు:
 బి) తద్ధర్మార్థక వాక్యం
76. మానవుడు కళలు నేర్చి కీర్తి పొందాలి – గీత గీసిన పదం ఏ క్రియా పదం?
 ఎ) క్త్వార్థకం
 బి) తద్ధర్మార్థకం
 సి) అప్యర్థతకం
 డి) చేదర్థకం
 జవాబు:
 ఎ) క్త్వార్థకం
77. అల్లరి చేస్తే దెబ్బలు తప్పవు – గీత గీసిన పదం ఏ క్రియా పదం?
 ఎ) భావార్థకం
 బి) తద్ధర్మార్థకం
 సి) చేదర్థకం
 డి) అభ్యర్థకం
 జవాబు:
 సి) చేదర్థకం

78. లత పని చేస్తూ వెళ్తుంది – గీత గీసిన పదం ఏ క్రియా పదం?
 ఎ) శత్రర్థకం
 బి) భావార్థకం
 సి) హేత్వర్తకం
 డి) క్వార్థకం
 జవాబు:
 ఎ) శత్రర్థకం
79. నీవు ఇంటి వెళ్ళవచ్చు. ఇది ఏ అర్థక వాక్యం?
 ఎ) సామర్థ్యార్థక వాక్యం
 బి) ప్రార్థనార్థక వాక్యం
 సి) విధ్యర్థకం
 డి) అనుమత్యర్థక వాక్యం
 జవాబు:
 డి) అనుమత్యర్థక వాక్యం
80. ‘ఎవరా పైడిబొమ్మ’ – ఇది ఏ అర్థక వాక్యం?
 ఎ) ప్రశ్నార్థక వాక్యం
 బి) అనుమత్యక వాక్యం
 సి) సందేహార్థక వాక్యం
 డి) విధ్యర్థక వాక్యం
 జవాబు:
 ఎ) ప్రశ్నార్థక వాక్యం
విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషలు :
81. ‘ఆమె పాట పాడింది’ – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
 ఎ) నామవాచకం
 బి) విశేషణం
 సి) అవ్యయము
 డి) సర్వనామము
 జవాబు:
 డి) సర్వనామము

82. వాక్యాలు తీసుకొని ఆడుకోండి – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
 ఎ) ద్వితీయా
 బి) ప్రథమా
 సి) తృతీయా
 డి) షష్టీ
 జవాబు:
 బి) ప్రథమా
83. వసతి కొరకు ప్రయత్నించాను – ఇది ఏ విభక్తి ప్రత్యయం?
 ఎ) షష్టీ
 బి) తృతీయా
 సి) పంచమీ
 డి) చతుర్డీ
 జవాబు:
 డి) చతుర్డీ
84. పాసం వలన భయం పొందారు – ఇది ఏ విభక్తి ప్రత్యయం?
 ఎ) షష్ఠీవిభక్తి
 బి) చతుర్థి విభక్తి
 సి) తృతీయావిభక్తి
 డి) పంచమీవిభక్తి
 జవాబు:
 డి) పంచమీవిభక్తి
85. ఆమె అడవికి వెళ్ళింది – ఇది ఏ భాషాభాగం?
 ఎ) నామవాచకం
 బి) సర్వనామం
 సి) క్రియ
 డి) అవ్యయం
 జవాబు:
 బి) సర్వనామం
86. సైనికులు యుద్ధం చేశారు – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
 ఎ) అవ్యయం
 బి) నామవాచకం
 సి) సర్వనామం
 డి) క్రియ
 జవాబు:
 బి) నామవాచకం
87. ఎదుటివానికి తెలియజేయు – ఏ పురుష?
 ఎ) ప్రథమపురుష
 బి) మధ్యమపురుష
 సి) అధమపురుష
 డి) ఉత్తమపురుష
 జవాబు:
 బి) మధ్యమపురుష

88. నీవు అక్కడ ఉన్నావు – ఇది ఏ పురుషను చెందినది?
 ఎ) క్త్వార్ధపురుష
 బి) మధ్యమపురుష
 సి) ఉత్తమపురుష
 డి) ప్రథమపురుష
 జవాబు:
 బి) మధ్యమపురుష
సొంతవాక్యాలు :
89. భగీరథ ప్రయత్నం : మా ఊరికి కుళాయిలు పెట్టించాలని, భగీరథ ప్రయత్నం చేశాను.
 90. తలలో నాలుక : నా మిత్రుడు గురువులందరికీ తలలో నాలుకలా ఉంటాడు.
 91. కళ్ళు కాయలు కాయటం : మా అమ్మను చూడాలని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను.
 92. వీనులవిందు : నా స్నేహితురాలు శైలజ, వీనుల విందుగా పాడుతుంది.
 93. గుండె కరిగింది : అన్నార్తులను చూడగానే థెరిస్సాకు గుండె కరిగింది.
 94. తలపండిన : నరేంద్రమోదీ దేశంలో తలపండిన నాయకుడు.
 95. కంటికి కాపలా : సైనికుల కంటికి కాపలా కాసినట్లు సరిహద్దులు రక్షిస్తున్నారు.
 96. కాలికి బుద్ది చెప్పు : పోలీసులను చూడగానే దొంగ కాలికి బుద్ధి చెప్పడం చూశాను.
 97. బయటపడు : రైలు ప్రమాదం నుండి రాము సురక్షితంగా బయటపడ్డాడు.
 98. ఏరుకోను : రైతు బజారులో కూరలను ఏరుకొనడం చేయరు.
