These AP 8th Class Biology Important Questions 1st Lesson విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి? will help students prepare well for the exams.
AP Board 8th Class Biology 1st Lesson Important Questions and Answers విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?
1 మార్కు ప్రశ్నలు
ప్రశ్న 1.
 విజ్ఞానశాస్త్రం అందించిన కొన్ని ఆధునిక ఫలితాలు తెలపండి.
 జవాబు:
- విజ్ఞానశాస్త్రం మానవుని సుఖమయ జీవనానికి అనేక వస్తువులు, వసతులు అందించింది.
- కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, అంతరిక్షనౌకలు, సంకరజాతి ఆహారధాన్యాలు, రొబోటిక్స్, వైద్యం ఈ కోవలోనికి వస్తాయి.
ప్రశ్న 2.
 శాస్త్రీయ పద్ధతిని నిర్వచించండి.
 జవాబు:
 శాస్త్రీయ పద్ధతి : శాస్త్రవేత్తలు గుర్తించిన సమస్యలకు, ప్రశ్నలకు కొన్ని క్రమపద్ధతులు వినియోగిస్తారు. వీటినే శాస్త్రీయ పద్ధతులు అంటారు.
ప్రశ్న 3.
 శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు అంటే ఏమిటి?
 జవాబు:
 శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు : శాస్త్రీయ పద్ధతిలో వాడే ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి కొన్ని నైపుణ్యాలు అవసరం. వీటిని శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు అంటారు. ఉదా : సేకరణ, నిర్వహణ, విశ్లేషణ మొదలగునవి.
ప్రశ్న 4.
 విజ్ఞాన శాస్త్రంను నిర్వచించండి.
 జవాబు:
 విజ్ఞాన శాస్త్రం : ప్రకృతిలో దాగివున్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే చక్కటి, స్పష్టమైన మార్గాన్ని ‘విజ్ఞాన శాస్త్రం’ అంటారు.
ప్రశ్న 5.
 నీకు తెలిసిన ఏవైనా ఐదు ప్రక్రియా నైపుణ్యాలు రాయండి.
 జవాబు:
 శాస్త్రీయ పద్ధతిలో వాడే కొన్ని పనులే ప్రక్రియా నైపుణ్యాలు. అవి :
- కొలవటం
- సేకరించటం
- నమోదు చేయటం
- ప్రదర్శించటం
- ఊహించటం

లక్ష్యాత్మక నియోజనము
సరియైన సమాధానమును గుర్తించుము.
ప్రశ్న 1.
 ‘పొడవు’ లను ……………. ప్రమాణంతో కొలుస్తారు.
 ఎ) గ్రాము
 బి) లీటరు
 సి) సెంటీమీటరు
 డి) క్యూబిక్ మీటరు
 జవాబు:
 సి) సెంటీమీటరు
ప్రశ్న 2.
 వస్తువులను వాటి లక్షణాలు, ఆకారాల ఆధారంగా వర్గీకరించటం ………. గా పరిగణిస్తారు.
 ఎ) ప్రక్రియా నైపుణ్యం
 బి) శాస్త్రీయ పద్ధతి
 సి) పరికల్పనా నైపుణ్యం
 డి) అతివాహకత
 జవాబు:
 ఎ) ప్రక్రియా నైపుణ్యం
ప్రశ్న 3.
 ‘కంగారు’ అనే జంతువు …………. ఖండంలో మాత్రమే కనబడుతుంది.
 ఎ) ఆసియా
 బి) ఆస్ట్రేలియా
 సి) ఆఫ్రికా
 డి) అమెరికా
 జవాబు:
 బి) ఆస్ట్రేలియా
ప్రశ్న 4.
 ‘జీవవైవిధ్య సదస్సు’ …………. నగరంలో జరిగింది.
 ఎ) పూణే
 బి) హైదరాబాద్
 సి) ఢిల్లీ
 డి) ముంబై
 జవాబు:
 బి) హైదరాబాద్
ప్రశ్న 5.
 ప్రస్తుత శాస్త్ర విజ్ఞానం ప్రకారం కడుపులో అల్సర్ లకు కారణం ………….. గా కనుగొన్నారు.
 ఎ) వ్యాకులత
 బి) ఆహారపు అలవాట్లు
 సి) బాక్టీరియా
 డి) నులి పురుగులు
 జవాబు:
 సి) బాక్టీరియా

ప్రశ్న 6.
 ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గం
 ఎ) సామాన్యశాస్త్రం
 బి) జీవశాస్త్రం
 సి) విజ్ఞానశాస్త్రం
 డి) జీవసాంకేతికశాస్త్రం
 జవాబు:
 సి) విజ్ఞానశాస్త్రం
ప్రశ్న 7.
 ‘సెన్షియా’ అనగా
 ఎ) జ్ఞానం
 బి) విజ్ఞానం
 సి) సామాన్య జ్ఞానం
 డి) శాస్త్ర జ్ఞానం
 జవాబు:
 ఎ) జ్ఞానం
ప్రశ్న 8.
 కడుపులో అల్సర్లకు కారణం
 ఎ) ఆహారపు అలవాట్లు
 బి) వ్యాకులత
 సి) బాక్టీరియా
 డి) నిద్రలేకపోవడం
 జవాబు:
 సి) బాక్టీరియా
ప్రశ్న 9.
 విజ్ఞానశాస్త్రం ద్వారా
 ఎ) ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది.
 బి) ప్రజల ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చెందుతాయి.
 సి) ఆరోగ్యవంతమైన సమాజం రూపొందుతుంది.
 డి) పైవన్నీ
 జవాబు:
 డి) పైవన్నీ
ప్రశ్న 10.
 సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్సు అంటారు అన్న శాస్త్రవేత్త
 ఎ) ఐన్ స్టీన్
 బి) కార్ల్ పాపర్
 సి) పాశ్చర్
 డి) ఫ్లెమింగ్
 జవాబు:
 బి) కార్ల్ పాపర్

ప్రశ్న 11.
 శాస్త్రవేత్తలు అనుసరించే పద్ధతి
 ఎ) శాస్త్రీయ పద్ధతి
 బి) శాస్త్రీయ ప్రక్రియ
 సి) శాస్త్రీయ పరిశోధన
 డి) శాస్త్రీయ ప్రణాళిక
 జవాబు:
 ఎ) శాస్త్రీయ పద్ధతి
ప్రశ్న 12.
 పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని ఏమంటారు ?
 ఎ) పరిశీలన
 బి) పరికల్పన
 సి) ప్రయోగం
 డి) ప్రణాళిక
 జవాబు:
 బి) పరికల్పన
ప్రశ్న 13.
 పరిశోధనా ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలను ఏమంటారు ?
 ఎ) స్థిరరాశులు
 బి) చరరాశులు
 సి) సామాన్యరాశులు
 డి) ప్రక్రియా నైపుణ్యాలు
 జవాబు:
 బి) చరరాశులు
ప్రశ్న 14.
 ప్రయోగాల నిర్వహణలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచనా సరళులు
 ఎ) ప్రయోగ నైపుణ్యాలు
 బి) ప్రక్రియా నైపుణ్యాలు
 సి) ఆధార నైపుణ్యాలు
 డి) శాస్త్రీయ నైపుణ్యాలు
 జవాబు:
 బి) ప్రక్రియా నైపుణ్యాలు
ప్రశ్న 15.
 క్రింది వానిలో ప్రక్రియా నైపుణ్యం కానిది ఏది ?
 ఎ) ఊహించడం
 బి) ప్రదర్శించడం
 సి) ప్రణాళిక
 డి) భద్రత
 జవాబు:
 డి) భద్రత

ప్రశ్న 16.
 దత్తాంశాలను దీని ద్వారా ప్రదర్శించరు.
 ఎ) నమూనా
 బి) చార్ట్
 సి) పట్టిక
 డి) గ్రాఫ్
 జవాబు:
 ఎ) నమూనా
ప్రశ్న 17.
 ఒక ప్రయోగంలో ఎన్ని చరరాశులను పరీక్షించాలి ?
 ఎ) 1
 బి) 2
 సి) 3
 డి) 4
 జవాబు:
 ఎ) 1
ప్రశ్న 18.
 రాబోవు ఫలితాల గురించి వివరించడం
 ఎ) ప్రణాళిక
 బి) పరికల్పన
 సి) చరరాశుల నియంత్రణ
 డి) పైవన్నీ
 జవాబు:
 బి) పరికల్పన
ప్రశ్న 19.
 అభిప్రాయాన్ని వ్యక్తంచేసే పద్ధతి
 ఎ) లేఖలు
 బి) పద్యాలు
 సి) పాటలు
 డి) పైవన్నీ
 జవాబు:
 డి) పైవన్నీ
ప్రశ్న 20.
 క్రింది వానిలో కొలత పరికరం
 ఎ) స్కేలు
 బి) బీకరు
 సి) గడియారం
 డి) పైవన్నీ
 జవాబు:
 డి) పైవన్నీ

ప్రశ్న 21.
 సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కనిపెట్టినది
 ఎ) కెప్లర్
 బి) కోపర్నికస్
 బి) న్యూటన్
 డి) ఆర్కెమెడిస్
 జవాబు:
 బి) కోపర్నికస్
ప్రశ్న 22.
 గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది
 ఎ) కెప్లర్
 బి) కోపర్నికస్
 సి) న్యూటన్
 డి) ఆర్కెమెడిస్
 జవాబు:
 సి) న్యూటన్
ప్రశ్న 23.
 శాస్త్రీయ పద్ధతిలో లేనిది
 ఎ) సమాచారాన్ని సేకరించడం
 బి) సూత్రాలను విశ్లేషించడం
 సి) సమాచారాన్ని విశ్లేషించడం
 డి) ఫలితాలను విశ్లేషించడం
 జవాబు:
 బి) సూత్రాలను విశ్లేషించడం
ప్రశ్న 24.
 కీటకాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం
 ఎ) ఎంటమాలజీ
 బి) ఆర్నిథాలజీ
 సి) జువాలజీ
 డి) మైక్రోబయాలజీ
 జవాబు:
 ఎ) ఎంటమాలజీ
ప్రశ్న 25.
 శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
 ఎ) శిలాజశాస్త్రం
 బి) భూవిజ్ఞానశాస్త్రం
 సి) సిస్మాలజీ
 డి) మెటియోరాలజీ
 జవాబు:
 బి) భూవిజ్ఞానశాస్త్రం

ప్రశ్న 26.
 వాతావరణం గురించి తెలియచేసే శాస్త్రం
 ఎ) ఆస్ట్రానమి
 బి) ఆస్ట్రోఫిజిక్స్
 సి) మెటియోరాలజీ
 డి) జియోలజీ
 జవాబు:
 సి) మెటియోరాలజీ
ప్రశ్న 27.
 పురాతనకాలంలో జీవించిన జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
 ఎ) జియోలజీ
 బి) సిస్మాలజీ
 సి) డైనాలజీ
 డి) పేలియంటాలజీ
 జవాబు:
 డి) పేలియంటాలజీ
