These AP 8th Class Biology Important Questions 2nd Lesson కణం – జీవుల మౌళిక ప్రమాణం will help students prepare well for the exams.
AP Board 8th Class Biology 2nd Lesson Important Questions and Answers కణం – జీవుల మౌళిక ప్రమాణం
ప్రశ్న 1.
 సూక్ష్మజీవి ప్రపంచంపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తల పేర్లు మీ పాఠం నుండి సంగ్రహించి రాయండి.
 జవాబు:
 సూక్ష్మజీవి ప్రపంచం గురించి మానవాళికి ఎన్నో విషయాలు కనిపెట్టి చెప్పిన శాస్త్రవేత్తలలో ముఖ్యులు.
- అథినాసియస్ కిర్చర్
- జాన్ స్వామ్మర్ డామ్
- ఆంథోనివార్ల్యూవెన్‌హాక్
- రాబర్ట్ హుక్
- రాబర్ట్ బ్రౌన్
- పెలిస్ పాంటానా
- జకారస్ జాన్సన్
ప్రశ్న 2.
 ‘రంజనం’ చేసే విధానాన్ని క్లుప్తంగా వివరింపుము.
 జవాబు:
 1. కణ అంతర్భాగాలకు కొన్ని రసాయన వర్ణదాలు (రంగులు) పీల్చుకునేలా చేసి వాటి నిర్మాణాన్ని అధ్యయనం చేయటానికి ఉపయోగపడే విధానమే ‘రంజనం’ చేయటం.
 2. మొదట కణాన్ని స్లెడ్ పై తీసుకోవాలి.
 3. కణం, కణాంగాల స్వభావాన్ని బట్టి
- సాఫనిన్
- మిథాలిన్ బ్లూ
- అయొడిన్
- ఎర్రసిరా మొదలైన వర్లదాలలో ఏదైనా ఒకదాన్ని ఎన్నుకొని స్లెడ్ పై వేయాలి.
4. అది బాగా పీల్చుకున్న తరువాత ఒక చుక్క నీరు వేసి జాగ్రత్తగా ఒక చుక్క గ్లిసరిన్ వేసి కవర్ స్లితో స్లెడ ను కప్పాలి.
 5. తరువాత సూక్ష్మదర్శినితో పరిశీలించితే కణాంగాలు చక్కగా రంగులతో కనిపిస్తాయి.

ప్రశ్న 3.
 మీ ప్రయోగశాలను సందర్శించి అందులో వున్న ఏవైనా మూడు సైడ్లను చూచి పరిశీలనలు నమోదు చేయండి.
 జవాబు:
 మా ప్రయోగశాలలో నాడీకణం నునుపు కండర కణం, ఎర్రరక్త కణంల స్లెలు నేను పరిశీలించి ఈ కింది విషయాలు తెలుసుకున్నాను.
 1. నాడీకణం :
 
- ఇది అతి పొడవైన కణం.
- మధ్యలో నల్లని చుక్కలాగ, గుండ్రంగా ఒక భాగం కనిపించింది.
- దీనిని కేంద్రకంగా గుర్తించాను.
- జీవపదార్థం కూడా కనిపించింది.
- ఒక పొడవైన శాఖను ఆక్సాన్‌గా గుర్తించాను.
- పటం కూడా గీశాను.
2. నునుపు కండర కణం :
 
- ఇది దోసగింజ లాగా ఉంది.
- జీవపదార్థం మధ్యలో కేంద్రకం ఉంది.
3. ఎర్రరక్త కణం :
 
- ఇది ద్విపుటాకారంగా ఉంది.
- గుండ్రంగా ఉంది.
- అంటే పార్లే పాపిన్స్ బిళ్ళలాగా ఉందన్న మాట.
ప్రశ్న 4.
 అమీబా పటం గీసి, భాగాలు గుర్తించుము.
 జవాబు:
 

ప్రశ్న 5.
 గడ్డిచామంతి కాండం అడ్డుకోత పటం గీసి, భాగాలు గుర్తించండి.
 జవాబు:
 
ప్రశ్న 6.
 క్లామిడోమోనాస్ కణం పటం గీసి, భాగాలు గుర్తించుము.
 జవాబు:
 
ప్రశ్న 7.
 మొక్కలు క్షోభ్యత కలిగి ఉంటాయా ? అని రాహుల్ రవిని ప్రశ్నించాడు. నీవు వాటి పట్ల ఎలా సానుభూతిని ప్రదర్శిస్తావు ?
 జవాబు:
- రాహుల్ ప్రశ్నలో నిజం ఉంది.
- ‘క్షోభ్యత’ అంటే జీవులు. అవి మొక్కలు గానీ, జంతువులు కానీ, వాటి పరిసరాలలో జరిగే మార్పులకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. దీనినే ‘క్షోభ్యత’ అంటారు.
- అంటే బాధ, సంతోషం, చలి, ఎండ మొదలైన ప్రతిస్పందనలు అన్నమాట.
- మొక్కకు నీళ్ళు పోయకపోతే ముందు వాడి పోతుంది. తరువాత చనిపోతుంది.
- జగదీష్ చంద్రబోస్ ప్రెస్మోగ్రాఫ్ ద్వారా మొక్కలలో కూడా ప్రతిస్పందనలు ఉంటాయని నిరూపించాడు.
- అంటే వాటికి నీళ్ళు పోస్తే సంతోషిస్తాయి. హాయిగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.
- వాటికి నరికేటప్పుడు వాటికైన గాయాలు మొక్కలను బాధ పెడతాయి.
- అందుకే మన పూర్వీకులు మొక్కలను నరికే వాళ్ళు కాదు.
- వాటి ఎండు భాగాలు మాత్రమే వంట చెరకుగా వాడేవారు.
- అందువల్ల మనం కూడా మొక్కల పట్ల సానుభూతితో వుండి వాటిని రక్షిస్తే అవి మనకు ఆహారం, ఆక్సిజన్ ఇచ్చి రక్షిస్తాయి. ‘వృక్షో రక్షతి రక్షితః’

ప్రశ్న 8.
 కణం, దాని కణాంగాల గురించి నీకు తెలిసిన శాస్త్రీయ పదజాలాన్ని ప్రవాహ పటం గీయుము.
 జవాబు:
 
ప్రశ్న 9.
 సంయుక్త సూక్ష్మదర్శిని పటం గీచి భాగాలు గీయండి.
 జవాబు:
 

ప్రశ్న 10.
 కణాంగాలు కణంలోని ఏ భాగంలో ఉంటాయి ?
 జవాబు:
- కణంలో జీవపదార్థం ఉంటుంది.
- దీనిలో చిన్న చిన్న రేణువులు కలసిపోయి ఉంటాయి.
- మిగిలిన కణాంగాలు అన్నీ ఈ జీవపదార్థంలోనే ఉంటాయి.
 (మైటోకాండ్రియా, గాల్టి సంక్లిష్టం, రిక్తికలు, రైబోసోమ్ లు, రైసోసోమ్ లు, ఆహార రిక్తికలు మొ॥నవి.)
- ఇది జిగురు జిగురుగా ఉంటుంది.
- ఈ జీవపదార్థం మధ్యలో గుండ్రంగా కేంద్రకం ఉంటుంది.
ప్రశ్న 11.
 ఏకకణ జీవులకు, బహుకణ జీవులకు ఉదాహరణలు ఇవ్వండి.
 జవాబు:
 ఏకకణ జీవులు : ఒకే ఒక కణంతో నిర్మితమైన జీవులను ఏకకణ జీవులు అంటారు.
 ఉదా : అమీబా, క్లామిడోమోనాస్, పేరమీషియం , స్పెరోగైరా వర్సెస్ ఈ. కోలి బాక్టీరియా మొ॥నవి.
 బహుకణ జీవులు : ఒకటి కన్నా ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను బహుకణ జీవులు అంటారు.
 ఉదా : హైడ్రా, వాల్ వాక్స్, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు మొ॥నవి.
ప్రశ్న 12.
 పొడవు ప్రమాణాలు, వాటి ప్రామాణికాలు తెలపండి.
 జవాబు:
 1 మీటరు = 100 సెం.మీ.
 1 సెం.మీ = 10 మిల్లీమీటరు
 1 మి.మీ = 1000 మైక్రాన్లు/ మైక్రోమీటరు
 1 మైక్రాన్ = 1000 నానోమీటర్లు

ప్రశ్న 13.
 మొక్కలకు నీరు ఎందుకు అవసరం ?
 జవాబు:
 1) కణాలలో అన్ని జీవక్రియల నిర్వహణకు
 2) కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థాల తయారీకి నీరు అత్యవసరం.
ప్రశ్న 14.
 చిత్రంలోని భాగాలను గుర్తించండి.
 
 b) పట్టిక నింపండి.
| విషయము | సంబంధించిన భాగం | 
| కణం చుట్టూ ఆవరించి ఉంటుంది | |
| దాదాపు కణం మధ్యభాగంలో ఉంటుంది | |
| కణమంతా ఆవరించివుండే ద్రవపదార్థం | |
| కణానికి శక్తినిస్తుంది | 
జవాబు:
| విషయము | సంబంధించిన భాగం | 
| కణం చుట్టూ ఆవరించి ఉంటుంది | కణత్వచం | 
| దాదాపు కణం మధ్యభాగంలో ఉంటుంది | కణకేంద్రకం | 
| కణమంతా ఆవరించివుండే ద్రవపదార్థం | కణ ద్రవ్యం | 
| కణానికి శక్తినిస్తుంది | మైటోకాండ్రియా | 
ప్రశ్న 15.
 కింది పేరాను చదివి వృక్షకణానికి, జంతుకణానికి భేదాలు రాయండి.
 జీవులన్నీ కణాలతో ఏర్పడతాయి. అన్ని కణాలు ఒకే విధంగా వుండవు. అవి చేసే పనిని బట్టి వాటి నిర్మాణంలోను, ఆకారంలోను మార్పులు ఉంటాయి. వృక్షకణాలకు కణకవచం వుంటే జంతుకణాలకు వుండదు. జంతుకణాలలో రిక్తిక చిన్నదిగా వుంటే వృక్షకణాలలో రిక్తిక పెద్దదిగా వుంటుంది. వృక్షకణాలలో కనిపించినట్లుగా జంతుకణాలలో హరితరేణువులు వుండవు.
| వృక్షకణము | జంతుకణము | 
| 
 
 | 
జవాబు:
| వృక్షకణము | జంతుకణము | 
| 1. కణ కవచం ఉంటుంది. | 1. కణ కవచం ఉండదు. | 
| 2. రిక్తిక పెద్దదిగా ఉంటుంది. | 2. రిక్తికలు చిన్నవిగా ఉంటాయి. | 
| 3. హరిత రేణువులు ఉంటాయి. | 3. హరిత రేణువులు ఉండవు. | 
ప్రశ్న 16.
 కింది పటంను గుర్తించండి. దాని విధి ఏమిటి ?
 
 జవాబు:
 పటంలో చూపబడినది నాడీకణం అది మెదడు నుండి శరీర భాగాలకు, శరీర భాగాల నుండి మొదడుకు సమాచారాన్ని చేరవేస్తుంది.

1 మార్కు ప్రశ్నలు
ప్రశ్న 1.
 కణం యొక్క ఆకారం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది ?
 జవాబు:
 కణం యొక్క ఆకారం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- కణత్వచం
- కణకవచం
- కణం చేసే పని
ఉదా : నాడీకణం పొడవుగా ఉంటుంది. అది నాడులను ఏర్పరచటానికి పొడవుగా ఉండటం అవసరం.
ప్రశ్న 2.
 ఏకకణ జీవులకు ఉదాహరణలు ఇవ్వండి.
 జవాబు:
 ఏకకణ జీవులు : ఒకే ఒక కణంతో నిర్మితమైన జీవులను ఏకకణ జీవులు అంటారు.
 ఉదా : అమీబా, క్లామిడోమోనాస్, పేరమీషియం, స్పెరోగైరా వర్సెస్ ఈ. కోలి బాక్టీరియా మొ॥నవి.
ప్రశ్న 3.
 బహుకణ జీవులకు ఉదాహరణలు ఇవ్వండి.
 జవాబు:
 బహుకణ జీవులు : ఒకటి కన్నా ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను బహుకణ జీవులు అంటారు.
 ఉదా : హైడ్రా, వాల్ వాక్స్, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు మొ॥నవి.

ప్రశ్న 4.
 కేంద్రక త్వచం విధులను వివరించండి.
 జవాబు:
 కేంద్రక త్వచం :
- కేంద్రకం చుట్టూ ఉన్న పలుచని పొరను కేంద్రక త్వచం అంటారు.
- ఇది కేంద్రకానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇచ్చి, పటుత్వాన్ని కలుగచేస్తుంది.
ప్రశ్న 5.
 ఏనుగులో ఉండే కణాలు, మనిషిలో ఉండే కణాల కంటే పెద్దవా ?
 జవాబు:
- ఏనుగు మరియు మనిషిలో ఉండే కణాలు ఒకే పరిమాణం కలిగి ఉంటాయి.
- జీవి ఆకారం కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది కాని కణాల పరిమాణంపై కాదు.
- కావున ఏనుగులో మనిషి కన్నా ఎక్కువ కణాలు ఉంటాయి.

లక్ష్యాత్మక నియోజనము
సరియైన సమాధానమును గుర్తించుము.
ప్రశ్న 1.
 రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని దీనిలో పరిశీలించాడు.
 ఎ) విబ్రియో
 బి) కప్పలు
 సి) ఆర్కిలు
 డి) స్పెరోగైరా
 జవాబు:
 సి) ఆర్కిలు
ప్రశ్న 2.
 ఈ కింది వాటిలో కణం యొక్క విధులను నిర్థారించు నది
 ఎ) కణం యొక్క పరిమాణం, ఆకారం
 బి) కణం యొక్క పరిమాణం మాత్రమే
 సి) కణం యొక్క ఆకారం మాత్రమే
 డి) కణాంగాలు మాత్రమే
 జవాబు:
 ఎ) కణం యొక్క పరిమాణం, ఆకారం
ప్రశ్న 3.
 క్రిందివాటిలో వృక్షకణంలో మాత్రమే ఉండేవి
 ఎ) కణకవచము
 బి) కణత్వచము
 సి) హరితరేణువు
 డి) A మరియు C
 జవాబు:
 డి) A మరియు C
ప్రశ్న 4.
 ఎర్రరక్తకణపు ఆకారం
 ఎ) గుండ్రము
 బి) నక్షత్రాకారం
 సి) కండె ఆకారం
 డి) రిబ్బనువలె
 జవాబు:
 సి) కండె ఆకారం
ప్రశ్న 5.
 మనం అన్ని కణాలను నేరుగా కంటితో చూడలేము. కారణం
 ఎ) అతి పెద్దగా ఉంటాయి కాబట్టి
 బి) చాలాచాలా చిన్నగా ఉంటాయి కాబట్టి
 సి) అవి దాక్కొని ఉంటాయి కాబట్టి
 డి) అవి కనిపించవు కాబట్టి
 జవాబు:
 బి) చాలాచాలా చిన్నగా ఉంటాయి కాబట్టి

ప్రశ్న 6.
 ఈ కణం ఏమిటో గుర్తించండి.
 
 ఎ) ఎర్ర రక్తకణం
 బి) నాడీకణం
 సి) తెల్ల రక్తకణాలు
 డి) కండరకణం
 జవాబు:
 బి) నాడీకణం
ప్రశ్న 7.
 రాబర్ట్ బ్రౌన్ కణంలో దీనిని గుర్తించినారు
 ఎ) కణకవచము
 బి) కేంద్రకము
 సి) రిక్తిక
 డి) మైటోకాండ్రియా
 జవాబు:
 బి) కేంద్రకము
ప్రశ్న 8.
 మీ సైన్స్ టీచర్ ఒక కణం నిర్మాణంను వివరిస్తూ ఈ కణంలో కేంద్రకం, హరితరేణువు, కణత్వచం, రిక్తికలు కణ కవచం ఉంటాయని వివరించాడు. ఆ కణం కింది వాటిలో ఏదై ఉండవచ్చు ?
 ఎ) కేంద్రక పూర్వకణం
 బి) వృక్షకణం
 సి) జంతుకణం
 డి) పై సమాచారం సరిపోదు
 జవాబు:
 బి) వృక్షకణం
ప్రశ్న 9.
 
 పై పటాలలో తెల్ల రక్త కణాన్ని గుర్తించండి.
 ఎ) 1, 2
 బి) 1 మాత్రమే
 సి) 2 మాత్రమే
 డి) ఈ రెండూ కావు
 జవాబు:
 సి) 2 మాత్రమే
ప్రశ్న 10.
 సూక్ష్మదర్శినిలో, పదార్థాన్ని పరిశీలించేందుకు దీనిపై గ్లిజరిన్ వేసి కవర్ తో కప్పుతారు. ఎందుకనగా
 ఎ) అది ముడతలు లేకుండా స్పష్టంగా కనిపించేందుకు
 బి) అది త్వరగా ఆరిపోకుండా వుండేందుకు
 సి) నీరు సూక్ష్మదర్శిని కటకానికి అంటుకోకుండా వుండేందుకు
 డి) పైవన్నీ
 జవాబు:
 డి) పైవన్నీ

ప్రశ్న 11.
 రాబర్ట్ బ్రౌన్ …….. పత్రాలపై పరిశోధన చేశారు.
 ఎ) ఓక్ పత్రాలు
 బి) ఆర్కిడ్ పత్రాలు
 సి) కొని ఫెర్ పత్రాలు
 డి) మందార పత్రాలు
 జవాబు:
 బి) ఆర్కిడ్ పత్రాలు
ప్రశ్న 12.
 ………. కణంలో కశాభాలు ఉంటాయి.
 ఎ) అమీబా
 బి) పేరమీషియం
 సి) క్లామిడోమోనాస్
 డి) ప్లాస్మోడియం
 జవాబు:
 సి) క్లామిడోమోనాస్
ప్రశ్న 13.
 కణద్రవ్యం ఒక …………. పదార్థం.
 ఎ) సజాతీయ
 బి) విజాతీయ
 సి) సరళ
 డి) నిర్జీవ
 జవాబు:
 బి) విజాతీయ
ప్రశ్న 14.
 ఒక మైక్రాస్ అంటే …………. లో …….. వంతు.
 ఎ) సెంటీమీటర్, మిలియన్
 బి) మీటర్, మిలియన్
 సి) డెసీమీటర్, మిలియన్
 డి) కిలోమీటర్, మిలియన్
 జవాబు:
 బి) మీటర్, మిలియన్
ప్రశ్న 15.
 …………… కణానికి, బలాన్ని గట్టిదనాన్ని ఇస్తుంది.
 ఎ) కణకవచం
 బి) కణత్వచం
 సి) కణద్రవ్యం
 డి) కేంద్రకం
 జవాబు:
 ఎ) కణకవచం

ప్రశ్న 16.
 మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ ను రూపొందించి బాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా జీవులను పరిశీలించినది
 ఎ) రాబర్ట్ హుక్
 బి) రాబర్ట్ బ్రౌన్
 సి) మార్సెల్లో మాల్ఫీజి
 డి) ఆంటోనివాన్ లీవెన్‌హాక్
 జవాబు:
 డి) ఆంటోనివాన్ లీవెన్‌హాక్
ప్రశ్న 17.
 లాటిన్ భాషలో సెల్ అనగా
 ఎ) చిన్న గది
 బి) చిన్న ప్రదేశం
 సి) చిన్న స్థలం
 డి) చిన్న కుహరం
 జవాబు:
 ఎ) చిన్న గది
ప్రశ్న 18.
 రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్న సంవత్సరం
 ఎ) 1632
 బి) 1665
 సి) 1674
 డి) 1723
 జవాబు:
 బి) 1665
ప్రశ్న 19.
 ఈ క్రింది వానిలో సూక్ష్మజీవ ప్రపంచానికి చెందని శాస్త్రవేత్త
 ఎ) అథినాసియస్ కిర్చర్
 బి) జాన్ స్వామ్మర్ డామ్
 సి) విలియంహార్వే
 డి) లీవెన్‌హాక్
 జవాబు:
 సి) విలియంహార్వే
ప్రశ్న 20.
 కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
 ఎ) పెలిస్ పాంటానా
 బి) రాబర్ట్ హుక్
 సి) రాబర్ట్ బ్రౌన్
 డి) లీవెన్‌హాక్
 జవాబు:
 సి) రాబర్ట్ బ్రౌన్

ప్రశ్న 21.
 ఈ క్రింది వానిలో ఏకకణజీవి కానిది
 ఎ) పారమీషియం
 బి) క్లామిడోమోనాస్
 సి) బాక్టీరియా
 డి) హైడ్రా
 జవాబు:
 డి) హైడ్రా
ప్రశ్న 22.
 స్థిరమయిన ఆకారంలేని జీవి
 ఎ) అమీబా
 బి) పారమీషియం
 సి) బాక్టీరియా
 డి) క్లామిడోమోనాస్
 జవాబు:
 ఎ) అమీబా
ప్రశ్న 23.
 అమీబాలో చలనానికి, ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు
 ఎ) శైలికలు
 బి) కశాభాలు
 సి) మిధ్యాపాదాలు
 డి) సూక్ష్మచూషకాలు
 జవాబు:
 సి) మిధ్యాపాదాలు
ప్రశ్న 24.
 ఒక మైక్రాన్ దీనికి సమానం.
 ఎ) 10 నానోమీటర్లు
 బి) 100 నానోమీటర్లు
 సి) 1000 నానోమీటర్లు
 డి) 10,000 నానోమీటర్లు
 జవాబు:
 సి) 1000 నానోమీటర్లు
ప్రశ్న 25.
 మానవుని నాడీకణం పొడవు సుమారు
 ఎ) 50-60 సెం.మీ.
 బి) 60-80 సెం.మీ.
 సి) 90-100 సెం.మీ.
 డి) 80-90 సెం.మీ.
 జవాబు:
 సి) 90-100 సెం.మీ.

ప్రశ్న 26.
 అన్నిటికంటే పెద్దకణం
 ఎ) తిమింగలం శరీరకణం
 బి) ఏనుగు శరీరకణం
 సి) ఉష్ణపక్షి గుడ్డు
 డి) పెంగ్విన్ గుడ్డు
 జవాబు:
 సి) ఉష్ణపక్షి గుడ్డు
ప్రశ్న 27.
 రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని ఏ కణాల్లో కనుగొన్నాడు ?
 ఎ) ఓక్ చెట్టు పత్రం
 బి) ఆర్కిడ్ పత్రం
 సి) గడ్డి ఆకు
 డి) ఉల్లిపొర
 జవాబు:
 బి) ఆర్కిడ్ పత్రం
ప్రశ్న 28.
 జంతుకణాలలో లేనిది
 ఎ) కణకవచం
 బి) కణత్వచం
 సి) కణద్రవ్యం
 డి) కేంద్రకం
 జవాబు:
 ఎ) కణకవచం
ప్రశ్న 29.
 కణానికి ఆకారాన్నిచ్చేది
 ఎ) కణకవచం
 బి) కణత్వచం
 సి) కణద్రవ్యం
 డి) కేంద్రకత్వచం
 జవాబు:
 బి) కణత్వచం
ప్రశ్న 30.
 మొట్టమొదట సంయుక్త సూక్ష్మదర్శినిని తయారుచేసినది
 ఎ) లీవెన్‌హాక్
 బి) జకారస్ జాన్సన్
 సి) రాబర్ట్ హుక్
 డి) రాబర్ట్ బ్రౌన్
 జవాబు:
 బి) జకారస్ జాన్సన్

ప్రశ్న 31.
 అతిచిన్న సూక్ష్మజీవులను కూడా పరిశీలించడానికి ఉపయోగపడేది
 ఎ) సరళ సూక్ష్మదర్శిని
 బి) సంయుక్త సూక్ష్మదర్శిని
 సి) ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని
 డి) బైనాక్యులర్ సూక్ష్మదర్శిని
 జవాబు:
 సి) ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని
ప్రశ్న 32.
 సంయుక్త సూక్ష్మదర్శినిలో ఉండే వస్తుకటక సామర్థ్యాలు
 ఎ) 4 × 10 × 40 × 100
 బి) 10 × 20 × 25 × 50
 సి) 5 × 15 × 25 × 50
 డి) 10 × 20 × 40 × 50
 జవాబు:
 ఎ) 4 × 10 × 40 × 100
