These AP 8th Class Biology Important Questions 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి will help students prepare well for the exams.
AP Board 8th Class Biology 4th Lesson Important Questions and Answers జంతువులలో ప్రత్యుత్పత్తి
ప్రశ్న 1.
 కొందరు పిల్లలలో వారి తల్లిదండ్రులు లక్షణాలు రెండూ కనిపిస్తాయి – అని అనిల్ కిషోర్ తో అన్నాడు. అనిల్ మాట నిజమేనా ?
 జవాబు:
 అవును నిజమే. దానికి శాస్త్రీయంగా అవకాశం ఉంది.
 1) తల్లి గర్భం దాల్చాలంటే తల్లి నుండి అండం – (దాని కేంద్రకంలో సగం లక్షణాలు) తండ్రి నుండి శుక్రకణం (దీని కేంద్రకంలో సగం లక్షణాలు) ఫలదీకరణ చెంది ‘సంయుక్త బీజాన్ని’ ఏర్పరుస్తాయి.
 శుక్రకణం (x) + అండం (x) → సంయుక్త బీజం (2x)
 50% + 50% → 100% క్రోమోజోములు
 ఏకస్థితిక + ఏకస్థితిక → (ద్వయ స్థితిక)
 2) అంటే సగం తండ్రి క్రోమోజోములు, సగం తల్లి క్రోమోజోములు ఉన్నాయన్న మాట.
 3) ఇవి కలసి, కలగలసి, సంయుక్త బీజంలో కేంద్రకం ఏర్పడుతుందని తెలుసుకున్నారు.
 4) కాబట్టి కొన్ని తల్లి వైపు నుండి గానీ, తల్లి లక్షణాలు గానీ, కొన్ని తండ్రి వైపు నుండి గానీ, తండ్రి లక్షణాలు పోలికలు గానీ పిల్లలలో వస్తాయని అనిల్, కిషోర్లు వారి మిత్రుల పోలికలు చూసి తెలుసుకున్నారు.
ప్రశ్న 2.
 క్రింద ఇవ్వబడిన పుష్పంలోని పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలలో ఉన్న భాగాలను గుర్తించుము.
 
 జవాబు:
| పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు | స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు | 
| 1) 3వ వలయం | 1) 4వ వలయం | 
| 2) కేసరావళి | 2) అండాశయం | 
| 3) కేసరములు | 3) కీలము, కీలాగ్రం, అండాశయం | 
| 4) పుప్పొడి రేణువులు | 4) అండాలు | 

ప్రశ్న 3.
 మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
 జవాబు:
- మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం దిగువ భాగంలో అమరి ఉంటుంది.
- పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటాయి.
- ముష్కాలు అండాకారంలో ఉంటాయి. ఇవి మిలియన్ల కొద్దీ శుక్రకణాలను ముష్కాలు ఉత్పత్తి చేస్తాయి.
- ప్రతి ముష్కం నుండి ఒక శుక్రవాహిక బయలుదేరుతుంది.
- శుక్రకణాలు శుక్రవాహికల గుండా ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటకు విడుదలవుతాయి.

ప్రశ్న 4.
 మానవ శుక్రకణాన్ని వర్ణించండి.
 జవాబు:
 
- శుక్రకణాలు అతి సూక్ష్మ మైనవి.
- శుక్రకణం తల, మధ్య భాగము, పొడవైన తోకను కలిగి ఉంటుంది.
- తల భాగంలో కేంద్రకం ఉంటుంది.
- మధ్య భాగంలో అనేక మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇవి శుక్ర కణాలు చలించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
- శుక్ర కణాలలో తోక చలనానికి తోడ్పడుతుంది.
ప్రశ్న 5.
 మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
 జవాబు:
 
- స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం లోపల, నాభికి కొంచెం దిగువగా అమరి ఉంటుంది.
- ఈ వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు (Ovaries), ఒక జత ఫాలోపియన్ నాళాలు (fallopian tubes), ఒక గర్భాశయం (uterus), బాహ్య జననాంగం ఉంటాయి.
- స్త్రీ బీజకోశాలు ఉదరం లోపల, కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి.
- ప్రతీ స్త్రీ బీజకోశం నుండి ఒక ఫాలోపియన్ నాళం బయలుదేరుతుంది.

ప్రశ్న 6.
 మానవ అండాన్ని వర్ణించండి.
 జవాబు:
 
- స్త్రీ బీజకోశాలు స్త్రీ బీజ కణాలను అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి.
- సాధారణంగా మానవులలో స్త్రీ బీజకోశం నుండి ప్రతినెలా ఒక పరిపక్వమైన అండం విడుదలవుతుంది.
- శుక్రకణం మాదిరిగా అండం కూడా ఏక స్థితిక దశలో (haploid) ఉంటుంది.
- అండం ఒక పొరతో కప్పబడి ఉంటుంది.
- అండం లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది.
ప్రశ్న 7.
 పిండము అనగానేమి ? ఇది ఎక్కడ ఉంటుంది ?
 జవాబు:
- ఫలదీకరణలో సంయుక్తబీజం ఏర్పడుతుంది.
- ఇది అనేక సార్లు విభజన చెంది అనేక కణాలను ఏర్పరుచుకుంటుంది.
- ఆ కణాలన్నీ కలిసి బంతి ఆకారాన్ని పోలి ఉంటాయి.
- ఈ కణాలే తరువాత వివిధ కణజాలాలు, అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి.
- ఈ విధంగా అభివృద్ధి చెందిన నిర్మాణాన్నే ‘పిండం’ (Embryo) అంటాం.
- పిండం గర్భాశయ కుడ్యానికి అంటి పెట్టుకొని ఉంటుంది.
- పిండం యొక్క తదుపరి అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది.
ప్రశ్న 8.
 IVF అనగానేమి ? ఎటువంటి వారికి ఇది అవసరమవుతుంది ?
 జవాబు:
- కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు మూసుకుపోయి ఉంటాయి.
- ఫలదీకరణ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
- అలాగే కొందరు పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి, వాటి సంఖ్యలో లోపాలుంటాయి.
- కాబట్టి ఇటువంటి వ్యక్తులకు పిల్లలు పుట్టడం అరుదు.
- ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు సదరు వ్యక్తుల నుండి లేదా దాతల నుండి అండం సంగ్రహించి పరీక్షనాళికలో ఫలదీకరణం చెందిస్తారు. దీనినే IVF అంటాం.
- ఫలదీకరణ చెందిన సంయుక్త బీజాన్ని ఒక వారం రోజుల వరకు ప్రయోగశాలలో అభివృద్ధి చేసి తరువాత దానిని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు.

ప్రశ్న 9.
 పవన్ పావురం పిల్లను వెంటిలేటర్ లో తిరిగి ఉంచటాన్ని ఎలా అభినందిస్తావు ? నీవు పవన్ స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తావు ?
 జవాబు:
- పవన్ పావురం పిల్లను తిరిగి వెంటిలేటర్ లో ఉంచటాన్ని మనం తప్పక అభినందించాలి.
- కారణం అతని భూతదయ మరియు జంతువుల, పక్షుల పట్ల ప్రేమ.
- అవి చిన్న పక్షులు. ఎగరలేనివి. కొంతమంది కొంటె పిల్లలు దాని నిస్సహాయతను ఆసరా చేసుకుని దాంతో ఆటలాడతారు. అందువల్ల అది చనిపోయినాపోవచ్చు.
- కానీ మన పవన్ పావురం పిల్లను చూసి, దాని లక్షణాలు గమనించి మరలా దాన్ని యథాస్థానంలో ఉంచి అభినందనీయుడయ్యాడు.
- నేను పవన్ స్థానంలో ఉన్నా ఇలానే చేసేవాడిని.
- ప్రకృతిపట్ల ప్రేమ, మన సహచర జంతు, పక్షి, వృక్షాలపట్ల భూతదయ కలిగి ఉండాలని మా సైన్స్ మాస్టారు చెప్పే మాటలను నేను తప్పక ఆచరిస్తాను.
ప్రశ్న 10.
 కింది ఆధారాల సహాయంతో పదకేళిని పూర్తి చేయండి.
 అడ్డం :
 1. మానవునిలో జరిగే ఫలదీకరణం (9)
 2. పిండం పెరుగుదల జరిగే చోటు (5)
 3. అభివృద్ధి చెందిన సంయుక్త బీజం (3)
 నిలువు :
 1. అండం విడుదలయ్యే ప్రదేశం (5)
 4. హైడ్రాలో ఉబ్బెత్తు భాగం (4)
 5. అభివృద్ధి చెందిన పిండం (2)
 
 జవాబు:
 
ప్రశ్న 11.
 అండోత్పాదక, శిశూత్పాదక జీవులు అంటే ఏమిటి ? వాటి లక్షణాలను తెలపండి. ఉదాహరణలు ఇవ్వండి.
 జవాబు:
 1) గుడ్లు పెట్టి పిల్లతరాన్ని అభివృద్ధి చేసే జీవులను అండోత్పాదకాలు అంటారు. వీనిలో అంతర ఫలదీకరణ జరుగును. ఉదా : పక్షులు, సరీసృపాలు.
 2) పిల్లల్ని కని పెంచి తరువాత తరాన్ని అభివృద్ధి చేసే జీవులను శిశోత్పాదక జీవులు అంటారు. ఉదా : క్షీరదాలు, గబ్బిలం.
a) అండోత్పాదక జీవిలో i) చెవులు బయటకు కనిపించవు. ii) చర్మం పై రోమాలు ఉండవు. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు గుడ్లు పెడతాయి. ఉదా : పక్షులు, మొసలి,తాబేలు, పాము.
 b) శిశోత్పాదక జీవిలో 1) చెవులు బయటకు కనిపిస్తాయి. ii) చర్మంపై రోమాలు ఉంటాయి. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు పిల్లల్ని కని పెంచుతాయి. ఉదా : క్షీరదాలు.

ప్రశ్న 12.
 క్షితిజ చేపలాంటి లార్వాను చూసి చేప అనుకొని తెచ్చి అక్వేరియంలో ఉంచింది. కొద్దిరోజుల తర్వాత ఆమె ఏం చూసి ఉంటుంది?
 జవాబు:
- క్షితిజ తెచ్చిన లార్వా డిపోల్. ఇది కప్ప లార్వా.
- టాడ్ పోల్ కొన్ని రోజుల తర్వాత రూపవిక్రియ చెంది కప్పగా మారుతుంది.
- కాబట్టి క్షితిజ చేపలాంటి టాడ్ పోల్ స్థానంలో కప్పను చూసి ఉంటుంది.
ప్రశ్న 13.
 టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి నీకు వచ్చిన సందేహాలను తీర్చుకొనేందుకు డాక్టరును ఏమి ప్రశ్నలు అడుగుతావు ?
 జవాబు:
- టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎక్కడ జన్మిస్తారు ?
- టెస్ట్ ట్యూబ్ బేబీలకు సాధారణ శిశువులకు ఏ విధమైన తేడాలు ఉంటాయి ?
- ప్రజలలో టెస్ట్ ట్యూబ్ బేబీలకు ఉన్న ప్రధానమైన అపోహలు ఏమిటి ?
- టెస్ట్ ట్యూబ్ బేబీలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ?
ప్రశ్న 14.
 మానవ శుక్రకణం బొమ్మను గీసి భాగాలు గుర్తించండి. కింది పట్టిక నింపండి.
| వ.సం. | అవయవం | విధి | 
| 1. | తోక | |
| 2. | మైటోకాండ్రియా | |
| 3. | తల | |
| 4. | మధ్యభాగం | 
జవాబు:
 
| వ.సం. | అవయవం | విధి | 
| 1. | తోక | శుక్రకణ చలనాలకు సహకరిస్తుంది. | 
| 2. | మైటోకాండ్రియా | శక్తి విడుదల చేసి శుక్రకణ కదలికలకు మరియు అండంలోకి చొచ్చుకు పోవడానికి అవసరమయ్యే శక్తిని అందిస్తుంది. | 
| 3. | తల | ఫలదీకరణంలో సహాయపడును. | 
| 4. | మధ్యభాగం | అనేక మైటోకాండ్రియాలకు స్థానం కల్పిస్తుంది. | 
ప్రశ్న 15.
 లత మానవునిలో జరిగే ప్రత్యుత్పత్తి విధానమును తెలిపే స్లో చార్టును కింది విధంగా గీచింది. ఇది సరిఅయినదేనా ? కాకపోతే సరి చేసి రాయండి.
 
 జవాబు:
 

ప్రశ్న 16.
 అమీబాలో జరిగే ప్రత్యుత్పత్తి విధానం, కప్పలో జరిగే ప్రత్యుత్పత్తి విధానాల మధ్య భేదాలను రాయండి.
 జవాబు:
| అమీబాలో జరిగే ప్రత్యుత్పత్తి | కప్పలో జరిగే ప్రత్యుత్పతి | 
| 1. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది. | 1. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది. | 
| 2. సంయోగబీజాల కలయిక ఉండదు. | 2. సంయోగ బీజాల కలయిక ఉంటుంది. | 
| 3. ద్విధావిచ్చిత్తి లేదా బహుధా విచ్చితి జరిపి పిల్ల అమీబాలు ఏర్పడుతాయి. | 3. బాహ్య ఫలదీకరణ ప్రక్రియలో అనేక జీవులు జన్మిస్తాయి. | 
| 4. ఏర్పడిన పిల్ల అమీబాలు పూర్తిగా తల్లిని పోలి ఉంటాయి. | 4. ఏర్పడిన జీవులు రూపంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. | 
| 5. ప్రత్యుత్పత్తి తరువాత తల్లి జీవి అంతరించి పోతుంది. | 5. ప్రత్యుత్పత్తి అనంతరం తల్లి జీవి అంతరించదు. | 
ప్రశ్న 17.
 కప్ప జీవితచరిత్రను పరిశీలించేందుకు చేసిన ప్రాజెక్టులో నీవు ఏయే పరికరాలను ఉపయోగించావు ?
 జవాబు:
 వెడల్పు మూతి గల తొట్టి లేక గాజు సీసా, పారదర్శక గ్లాస్, డ్రాపర్, పెట్రేడిష్, గులకరాళ్ళు, భూతద్దం, బీకరు.
ప్రశ్న 18.
 కింది పేరా చదివి ఖాళీలను వివరించండి.
 పురుషులలో వుండే ప్రధాన ప్రత్యుత్పత్తి అవయవాలు A మరియు స్త్రీలలో వుండే ప్రధాన ప్రత్యుత్పత్తి అవయవాలు B. A మరియు B లు C, D అనే బీజకణాలను విడుదల చేస్తాయి. C, D ల కలయికను E అంటారు. E ఫలితంగా F ఏర్పడుతుంది. F క్రమేపి పెరిగి G గా ఏర్పడి చివరకు H గా మారుతుంది.
 
ప్రశ్న 19.
 కింది పటాన్ని పరిశీలించండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
 
 1. ఈ పటం ఏ వ్యవస్థకు చెందినది.
 జవాబు:
 మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
2. ఇందులో A, B, C భాగాలను గుర్తించండి.
 జవాబు:
 A – శుక్రవాహికలు
 B – ముష్కాలు
 C – పురుషాంగం
3. B భాగము నుండి ఏమి ఉత్పత్తి అవుతాయి ?
 జవాబు:
 శుక్రకణాలు
4. భాగము A యొక్క పని ఏమిటి ?
 జవాబు:
 శుక్రవాహికల గుండా శుక్రకణాలు ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటకు విడుదల అవుతాయి.

ప్రశ్న 20.
 కింది చిత్రాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
 
 1. ఇది ఏ వ్యవస్థకు చెందినది ?
 జవాబు:
 ఇది మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ
2. A భాగం పేరేమి ఇక్కడ ఏమి ఉత్పత్తి అవుతాయి ?
 జవాబు:
 స్త్రీ బీజకోశం
3. B భాగం పేరేమి ?
 జవాబు:
 గర్భాశయం
4. ఫాలోపియన్ నాళాలు మూసుకొనిపోతే ఏమౌతుంది ?
 జవాబు:
 ఫలదీకరణం జరుగదు.
1 మార్కు ప్రశ్నలు
ప్రశ్న 1.
 అన్ని జంతువులు గుడ్లు పెడతాయా ?
 జవాబు:
 లేదు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మాత్రమే గుడ్లు పెడతాయి. క్షీరదాలు గుడ్లు పెట్టవు. పిల్లల్ని కంటాయి.
ప్రశ్న 2.
 ఏ ఏ జంతువులు పిల్లల్ని కంటాయి ?
 జవాబు:
 క్షీరదాలు అన్ని పిల్లల్ని కంటాయి. ఉదా : ఆవు, గేదె, గుర్రం, ఎలుక, పిల్లి, ఏనుగు, మనిషి.
ప్రశ్న 3.
 ఏ ఏ జంతువులు గ్రుడ్లు పెడతాయో, ఏవి పిల్లల్ని కంటాయో తెలుసుకోవటం ఎలా ?
 జవాబు:
 పిల్లల్ని కనే జంతువులలో కొన్ని బాహ్య లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుడ్లు పెట్టే వాటి నుండి వేరుగా తెలుసుకోవచ్చు.

ప్రశ్న 4.
 పిల్లల్ని కనే జంతువుల బాహ్య లక్షణాలు తెలుసుకోవడానికి పద్ధతులేమైనా ఉన్నాయా ?
 జవాబు:
 పిల్లల్ని కనే జంతువులు బాహ్య చెవులను, చర్మం మీద రోమాలను కలిగి ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుర్తించవచ్చు.
ప్రశ్న 5.
 శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే ఏమవుతుందో చెప్పగలరా ?
 జవాబు:
 శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. వైవిధ్యం గల జీవులు ఏర్పడవు. క్రొత్త జాతులు అవతరించవు.
ప్రశ్న 6.
 కొన్ని జంతువులు మాత్రమే పిల్లలకు ఎందుకు జన్మనిస్తాయో చెప్పగలరా ?
 జవాబు:
 పిల్లల్ని కనే స్త్రీ జంతువుల్లో గర్భాశయము, పిండాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అందువలన పిండాలు గర్భాశయంలో ఎదిగి పిల్ల జీవులుగా పుడతాయి. గుడ్లు పెట్టే జంతువులలో ఈ అమరిక ఉండదు.
ప్రశ్న 7.
 జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
 జవాబు:
 జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే, తదుపరి తరం జీవులు ఉత్పత్తి కావు. ఉన్న జీవులు కొంత కాలానికి మరణిస్తాయి. కావున భూమి మీద జీవరాశి అంతరించిపోతుంది.
ప్రశ్న 8.
 టాడిపోల్ ఏ ఆకారాన్ని పోలి ఉంది ?
 జవాబు:
 టాడి పోల్ చేప ఆకారాన్ని పోలి ఉంది.
ప్రశ్న 9.
 ఏ దశలో టాడ్ పోల్ లో మొప్పలు కనిపిస్తాయి ?
 జవాబు:
 గుడ్డు నుండి వచ్చిన టాడ్పేల్ బాహ్య మొప్పలు కలిగి ఉంది. మొదటి దశలో టాడ్ పోల్ లార్వా బాహ్య మొప్పలు కలిగి ఉంది.

లక్ష్యాత్మక నియోజనము
సరియైన సమాధానమును గుర్తించుము.
ప్రశ్న 1.
 పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
 ఎ) కీలం
 బి) కేసరావళి
 సి) అండాశయం
 డి) ఆకర్షక పత్రాలు
 జవాబు:
 బి) కేసరావళి
ప్రశ్న 2.
 శుక్రకణం + అండం = ………….
 ఎ) సంయుక్త బీజము
 బి) కోరకం
 సి) భ్రూణం
 డి) పిల్లకణం
 జవాబు:
 ఎ) సంయుక్త బీజము
ప్రశ్న 3.
 రూపవిక్రియ …………. లో జరుగును.
 ఎ) మానవుడు
 బి) ఒంటె
 సి) కప్ప
 డి) పాము
 జవాబు:
 సి) కప్ప
ప్రశ్న 4.
 బాహ్య ఫలదీకరణం …….. లో జరుగును.
 ఎ) చేప
 బి) ఈగ
 సి) పిల్లి
 డి) ఎలుక
 జవాబు:
 ఎ) చేప
ప్రశ్న 5.
 అంతర ఫలదీకరణ ……….. లో జరుగును.
 ఎ) చేప
 బి) కప్ప
 సి) వానపాము
 డి) మానవుడు
 జవాబు:
 డి) మానవుడు

ప్రశ్న 6.
 శుక్రకణం జీవితకాలం …… గం॥
 ఎ) 24
 బి) 34
 సి) 36
 డి) 38
 జవాబు:
 ఎ) 24
ప్రశ్న 7.
 గర్భాశయం …….. భాగంలో ఉంటుంది.
 ఎ) పొట్ట
 బి) పొత్తి కడుపు
 సి) ఛాతి
 డి) మెడ
 జవాబు:
 బి) పొత్తి కడుపు
ప్రశ్న 8.
 పట్టు పురుగు ………. ఆకులను మాత్రమే తింటుంది.
 ఎ) మందార
 బి) మునగ
 సి) మల్బరీ
 డి) మామిడి
 జవాబు:
 సి) మల్బరీ
ప్రశ్న 9.
 మానవునిలో గర్భావధి కాలం …… రోజులు.
 ఎ) 270-280
 బి) 280-290
 సి) 290-300
 డి) 300-310
 జవాబు:
 ఎ) 270-280
ప్రశ్న 10.
 …….. కాలంలో కప్పలు ఫలదీకరణంలో పాల్గొంటాయి.
 ఎ) ఎండాకాలం
 బి) వర్షాకాలం
 సి) శీతాకాలం
 డి) వసంతకాలం
 జవాబు:
 బి) వర్షాకాలం

ప్రశ్న 11.
 ఒక జంతువు గ్రుడ్డు పెడుతుందా, లేదా పిల్లల్ని కంటుందా అని దీనిని చూసి చెప్పవచ్చు.
 ఎ) చెవి
 బి) రోమాలు
 సి) ఎ మరియు బి
 డి) చెప్పలేము
 జవాబు:
 సి) ఎ మరియు బి
ప్రశ్న 12.
 పిల్లల్ని కనే జంతువుల్ని ఏమంటారు ?
 ఎ) అండోత్పాదకాలు
 బి) శిశోత్పాదకాలు
 సి) పిండోత్పాదకాలు
 డి) పైవేవీ కావు
 జవాబు:
 బి) శిశోత్పాదకాలు
ప్రశ్న 13.
 సంయోగబీజాలు ఏర్పడకుండా కొత్తతరాన్ని ఏర్పరిచే పద్దతి
 ఎ) అలైంగిక ప్రత్యుత్పత్తి
 బి) లైంగిక ప్రత్యుత్పత్తి
 సి) భిన్నోత్పత్తి
 డి) పిండోత్పత్తి
 జవాబు:
 ఎ) అలైంగిక ప్రత్యుత్పత్తి
ప్రశ్న 14.
 అలైంగిక ప్రత్యుత్పత్తి జరపని జీవి
 ఎ) అమీబా
 బి) పేరమీషియం
 సి) హైడ్రా
 డి) వానపాము
 జవాబు:
 డి) వానపాము
ప్రశ్న 15.
 హైడ్రాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి
 ఎ) ద్విధావిచ్ఛిత్తి
 బి) కోరకీభవనం
 సి) బహుధా విచ్ఛిత్తి
 డి) సిద్ధబీజాలు
 జవాబు:
 బి) కోరకీభవనం

ప్రశ్న 16.
 అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి
 ఎ) ద్విధావిచ్ఛిత్తి
 బి) కోరకీభవనం
 సి) బహుధావిచ్ఛిత్తి
 డి) సిద్ధబీజాలు
 జవాబు:
 ఎ) ద్విధావిచ్ఛిత్తి
ప్రశ్న 17.
 ద్విదావిచ్ఛిత్తిలో ఒక అమీబా నుండి ఎన్ని పిల్ల అమీబాలేర్పడతాయి ?
 ఎ) 1
 బి) 2
 సి) 3
 డి) 4
 జవాబు:
 బి) 2
ప్రశ్న 18.
 స్త్రీ, పురుష సంయోగబీజాల కలయిక ద్వారా ఏర్పడేది
 ఎ) అండం
 బి) పిండం
 సి) సంయుక్తబీజం
 డి) సిద్ధబీజం
 జవాబు:
 సి) సంయుక్తబీజం
ప్రశ్న 19.
 శుక్రకణం చలించటానికి కావలసిన శక్తి యిక్కడ ఉత్పత్తి అవుతుంది.
 ఎ) తల
 బి) మధ్యభాగం
 సి) తోక
 డి) శుక్రకణం మొత్తం
 జవాబు:
 బి) మధ్యభాగం
ప్రశ్న 20.
 శుక్రకణంలో మైటోకాండ్రియాలు ఉండే ప్రదేశం
 ఎ) తల
 బి) మధ్యభాగం
 సి) తోక
 డి) ఎ మరియు బి
 జవాబు:
 బి) మధ్యభాగం

ప్రశ్న 21.
 ముష్కాలుండునది
 ఎ) పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
 బి) స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ
 సి) స్త్రీ పిండాభివృద్ధి వ్యవస్థ
 డి) గర్భాశయం
 జవాబు:
 ఎ) పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
ప్రశ్న 22.
 ఒక స్త్రీ బీజకోశం నుండి అండం విడుదలయ్యేది
 ఎ) నెలకు ఒకటి
 బి) నెలకు రెండు
 సి) రెండు నెలలకి ఒకటి
 డి) రెండు నెలలకు రెండు
 జవాబు:
 సి) రెండు నెలలకి ఒకటి
ప్రశ్న 23.
 ఈ క్రింది వానిలో ద్వయ స్థితికంలో ఉండునది
 ఎ) శుక్రకణం
 బి) అండం
 సి) సంయుక్తబీజం
 డి) అంకురచ్ఛదం
 జవాబు:
 సి) సంయుక్తబీజం
ప్రశ్న 24.
 ఈ క్రింది వానిలో బాహ్యఫలదీకరణం జరిగే జీవి
 ఎ) కప్ప
 బి) పాము
 సి) బల్లి
 డి) కోడి
 జవాబు:
 ఎ) కప్ప
ప్రశ్న 25.
 సంయుక్తబీజం భ్రూణంగా మార్పుచెందే ప్రక్రియ నేమంటారు ?
 ఎ) ఫలదీకరణం
 బి) గర్భం దాల్చుట
 సి) శిశు జననం డ
 డి) గర్భావధి కాలం
 జవాబు:
 బి) గర్భం దాల్చుట

ప్రశ్న 26.
 పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని ఏమంటారు ?
 ఎ) అండం
 బి) పిండం
 సి) భ్రూణం
 డి) శిశువు
 జవాబు:
 సి) భ్రూణం
ప్రశ్న 27.
 టెస్ట్యూబ్ బేబిలో పిండాభివృద్ధి యిక్కడ జరుగుతుంది.
 ఎ) పరీక్షనాళిక
 బి) తల్లి గర్భాశయం
 సి) కృత్రిమ గర్భాశయం
 డి) తండ్రిలో ప్రత్యేక సంచి
 జవాబు:
 బి) తల్లి గర్భాశయం
ప్రశ్న 28.
 IVF అనగా
 ఎ) ఇ విట్రో ఫెర్టిలైజేషన్
 బి) ఇంట్రా వర్టికల్ ఫెర్టిలైజేషన్
 సి) ఇన్వర్టికల్ ఫాలోపియస్ట్యూబ్
 డి) ఇన్వర్టికల్ ఫెర్టిలైజేషన్
 జవాబు:
 ఎ) ఇ విట్రో ఫెర్టిలైజేషన్
ప్రశ్న 29.
 రూపవిక్రియ చూపని జీవి
 ఎ) వానపాము
 బి) కప్ప
 సి) పట్టుపురుగు
 డి) సీతాకోకచిలుక
 జవాబు:
 ఎ) వానపాము
ప్రశ్న 30.
 ఈ క్రింది వానిలో ఉభయ లైంగిక జీవి
 ఎ) వానపాము
 బి) కప్ప
 సి) చేప
 డి) బొద్దింక
 జవాబు:
 ఎ) వానపాము

ప్రశ్న 31.
 కప్ప లార్వానేమంటారు ?
 ఎ) రిగ్లర్
 బి) టంబ్లర్
 సి) టాడ్పేల్
 డి) మాగట్
 జవాబు:
 సి) టాడ్పేల్
ప్రశ్న 32.
 క్లోనింగ్ ప్రక్రియను మొదటిసారిగా నిర్వహించినది
 ఎ) జూలీ రాబర్ట్
 బి) ఇయాన్ విల్మట్
 సి) ఆడమ్
 డి) విల్సన్
 జవాబు:
 బి) ఇయాన్ విల్మట్
ప్రశ్న 33.
 క్లోనింగ్ ప్రక్రియను ఈ జీవిపై చేశారు.
 ఎ) ఎలుక
 బి) కోతి
 సి) కుందేలు
 డి) గొర్రె
 జవాబు:
 డి) గొర్రె
ప్రశ్న 34.
 క్లోనింగ్ ప్రక్రియలో జన్మించిన గొర్రె పేరు
 ఎ) బాలి
 బి) డాలి
 సి) జూలి
 డి) డోలి
 జవాబు:
 బి) డాలి
ప్రశ్న 35.
 జంతువుల క్లోనింగను మొదటిసారిగా విజయవంతంగా జరిపిన శాస్త్రవేత్త
 ఎ) బ్యారి మార్గాల్
 బి) ఇయాన్ విల్మట్
 సి) ఎ.జి.టాన్స్ లే
 డి) ఎడ్వర్డ్ జెన్నర్
 జవాబు:
 బి) ఇయాన్ విల్మట్

ప్రశ్న 36.
 మనదేశంలో చట్టపరంగా పురుష, స్త్రీ వివాహ వయసు
 ఎ) 18, 21
 బి) 19, 21
 సి) 21, 19
 డి) 21, 18
 జవాబు:
 డి) 21, 18
ప్రశ్న 37.
 ఈ క్రింది ప్రత్యుత్పత్తి విధానంలో సంయోగబీజదాలు ఏర్పడవు. ఇందుకు ఉదాహరణ
 ఎ) లైంగిక ప్రత్యుత్పత్తి-మానవుడు
 బి) అలైంగిక ప్రత్యుత్పత్తి-హైడ్రా
 సి) లైంగిక ప్రత్యుత్పత్తి-కప్ప
 డి) లైంగిక ప్రత్యుత్పత్తి-కోడి
 జవాబు:
 బి) అలైంగిక ప్రత్యుత్పత్తి-హైడ్రా
ప్రశ్న 38.
 సంయుక్తబీజం పదేపదే విభజనచెంది అభివృద్ధి చెందేది
 ఎ) పిల్లలు
 బి) పిండము
 సి) భ్రూణము
 డి) అండము
 జవాబు:
 బి) పిండము
ప్రశ్న 39.
 సరికాని దానిని గుర్తించండి.
 ఎ) హైడ్రా – ద్విధావిచ్ఛిత్తి
 బి) మానవుడు – అంతర ఫలదీకరణ
 సి) చేపలు – బాహ్య ఫలదీకరణ
 డి) పక్షులు – అంతర ఫలదీకరణ
 జవాబు:
 ఎ) హైడ్రా – ద్విధావిచ్ఛిత్తి
ప్రశ్న 40.
 సంయుక్త బీజం, భ్రూణముగా ఎదగడానికి పట్టే కాలాన్ని ‘గర్భావధి కాలం’ అంటారు. మానవులలో ఇది
 ఎ) 120 – 180 రో॥
 బి) 270 – 280 రో॥
 సి) 310 – 320 రో॥
 డి) 180 – 220 రో॥
 జవాబు:
 బి) 270 – 280 రో॥

ప్రశ్న 41.
 కింది వానిలో బాహ్యఫలధీకరణం జరుపుకునే జీవులు
 ఎ) చేప, కప్ప
 బి) కాకి, కోడి
 సి) గేదె, ఆవు
 డి) పాము, ఉడుత
 జవాబు:
 ఎ) చేప, కప్ప
ప్రశ్న 42.
 మగ పుష్పంలో లోపించిన భాగం
 ఎ) రక్షక పత్రావళి
 బి) ఆకర్షణ పత్రావళి
 సి) కేసరం
 డి) కీలాగ్రం
 జవాబు:
 డి) కీలాగ్రం
ప్రశ్న 43.
 కింది వానిలో అండోత్పాదకాలను గుర్తించండి.
 1) గేదె
 2) చిలుక
 3) చేప
 4) ఆవు
 5) కప్ప
 6) జింక
 ఎ) 1, 4, 6
 బి) 1, 2, 6
 సి) 2, 3, 5
 డి) 5, 2, 1
 జవాబు:
 సి) 2, 3, 5
