These AP 9th Biology Important Questions and Answers 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక will help students prepare well for the exams.
AP Board 9th Class Biology 4th Lesson Important Questions and Answers ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక
9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
 వివిధ రకాల విధులను నిర్వహించడానికి కణమునకు కావలసిన పదార్థాలు ఏవి?
 జవాబు:
 వివిధ రకాల విధులను నిర్వహించడానికి కణమునకు కావలసిన పదార్థాలు గ్లూకోజ్, నీరు, ఆక్సిజన్, ప్రోటీన్లు, కొవ్వులు మరియు విటమిన్లు.
ప్రశ్న 2.
 చక్కెర ద్రావణంలో చక్కెరను మరియు నీటిని ఏమంటారు?
 జవాబు:
 చక్కెర ద్రావణంలో చక్కెరను ద్రావితం అని, నీటిని ద్రావణి అని అంటారు.
ప్రశ్న 3.
 ద్రవాభిసరణ ప్రక్రియలో నీరు ఎల్లప్పుడూ ఎటువైపు ప్రయాణిస్తుంది?
 జవాబు:
 ద్రవాభిసరణ ప్రక్రియలో నీరు ఎల్లప్పుడూ ఎక్కువ గాఢత కలిగిన చక్కెర లేదా ఉప్పు ద్రావణం వైపు ప్రయాణిస్తుంది.
ప్రశ్న 4.
 పారగమ్యత అనగానేమి?
 జవాబు:
 కొన్ని పదార్థాలను మాత్రమే తన ద్వారా ప్రయాణించడానికి అనుమతించడాన్ని పారగమ్యత అంటారు.
ప్రశ్న 5.
 ఎంటోసైటాసిస్ అనగానేమి?
 జవాబు:
 కణం ఆహారాన్ని కాని ఇతర బాహ్య కణాలను గానీ చుట్టి బాహ్య పరిసరాల నుండి వేరు చేసి ఆహారాన్ని సేకరించే విధానమును ఎండోసైటాసిస్ అంటారు.
 ఉదా : అమీబా.
ప్రశ్న 6.
 పాక్షిక పారగమ్యత అనగానేమి?
 జవాబు:
 ప్లాస్మాత్వచం తన గుండా పోవడానికి ద్రావణికి అనుమతి ఇస్తుంది కాని దానిలో కరిగిన ద్రావితాన్ని అనుమతించకపోవడాన్ని పాక్షిక పారగమ్యత అంటారు.

ప్రశ్న 7.
 కాల్షియం కార్బొనేటుతో తయారయ్యే గుడ్డు పెంకును కరిగించడానికి ఏ ఆమ్లము నందు ఉంచాలి?
 జవాబు:
 కాల్షియం కార్బొనేటుతో తయారయ్యే గుడ్డు పెంకును కరిగించడానికి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లము నందు 4 నుండి 5 గంటలు ఉంచాలి.
ప్రశ్న 8.
 మొక్కలలో ద్రవాభిసరణ ఆవశ్యకత ఏమిటి?
 జవాబు:
 మొక్కల వేర్లలోనికి నీరు ప్రవేశించడానికి, కణాల మధ్య నీరు ప్రవహించడానికి, పత్రరంధ్రాలు మూసుకోవటానికి, తెరుచుకోవడానికి అవసరం.
ప్రశ్న 9.
 జంతువులలో ద్రవాభిసరణ ఆవశ్యకత ఏమిటి?
 జవాబు:
 రక్తములో మలినాలు వడపోయడానికి మరియు మన శరీరానికి కావలసిన నీరు మరియు లవణాలు పునఃశోషణ చేసుకోవడానికి ద్రవాభిసరణం అవసరం.
ప్రశ్న 10.
 వ్యాపనం అనగానేమి?
 జవాబు:
 గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారు.
ప్రశ్న 11.
 గ్రాహం వాయు వ్యాపన నియమం అనగానేమి?
 జవాబు:
 మాధ్యమంలో కరిగే పదార్థాలు, కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని థామస్ గ్రాహం కనుగొన్నాడు. దీనిని గ్రాహం వాయు వ్యాపనం అంటారు.
ప్రశ్న 12.
 డయాలసిస్ యంత్రం ఏ సూత్రాల ద్వారా పనిచేస్తుంది?
 జవాబు:
 డయాలసిస్ యంత్రం వడపోత, ద్రవాభిసరణ సూత్రాల ద్వారా పారగమ్య త్వచాలను ఉపయోగించి పనిచేస్తుంది.
ప్రశ్న 13.
 జంతు కణాలను తక్కువ గాఢత గల ద్రవాల యందు ఉంచినప్పుడు ఎందుకు పగిలిపోతాయి? వృక్ష కణాలు ఎందుకు పగిలిపోవు?
 జవాబు:
 ద్రవాల యందు ఉంచినప్పుడు జంతుకణాలకు కణకవచాలు లేకపోవడం వలన పగిలిపోతాయి. వృక్షకణాలకు కణకవచాలు ఉండడం వలన పగిలిపోవు.
ప్రశ్న 14.
 శీతల పానీయాలు ఏ విధంగా తయారుచేస్తారు?
 జవాబు:
 శీతల పానీయాలు చక్కెర ద్రావణాన్ని, CO2 ని కరిగించి చక్కెర ద్రావణాన్ని తయారుచేస్తారు.
ప్రశ్న 15.
 జీర్ణమైన ఆహార పదార్థములు శోషణం జరుగుటయందు ఫాత్రవహించే భాగము ఏది?
 జవాబు:
 జీర్ణమైన ఆహార పదార్ధముల శోషణ జరుగుటయందు ప్లాస్మాత్వచం సూక్ష్మ చూషకాలుగా రూపాంతరం చెందుతుంది.
ప్రశ్న 16.
 వ్యాధి జనక జీవుల నుండి శరీరమును రక్షించుటలో ప్లాస్మాత్వచం పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
 జవాబు:
 ప్లాస్మాత్వచం పైన ఉన్న కొన్ని పదార్థాలు గుర్తింపు కేంద్రాలుగా పనిచేసి మనలను వ్యాధిజనక జీవుల నుండి రక్షణ కలిగిస్తుంది.
ప్రశ్న 17.
 నీరు లేని కొబ్బరికాయలోనికి రంధ్రము చేయకుండా నీరు నింపగలరా? ఎలా?
 జవాబు:
 కొబ్బరికాయ పెంకు నిర్జీవ దృఢకణజాలంతో నిర్మితమైనది. ద్రవాభిసరణం నిర్జీవ కణాలలో ‘జరుగదు. అందువలన రంధ్రం చేయకుండా నీరు నింపలేము.

ప్రశ్న 18.
 అన్ని రకాల పదార్థాలను తన గుందా రావడానికి ప్లాస్మాత్వచం అనుమతించినట్లయితే ఏమి జరుగుతుంది?
 జవాబు:
 అన్ని రకాల పదార్థాలను తన గుండా రావడానికి ప్లాస్మాత్వచం అనుమతించినట్లయితే కణమునకు అవసరం లేని పదార్థాలు మరియు హానికర పదార్థముల చేరిక వలన కణము చనిపోతుంది.
ప్రశ్న 19.
 సముద్రపు నీటి నుండి లవణాలను తొలగించి మంచి నీటిని తయారు చేసిన శాస్త్రవేత్తలు ఎవరు?
 జవాబు:
 ఫ్రెడ్జిమెర్యురీ, డేవిడ్ బోరి పారగమ్యత్వచాన్ని ఉపయోగించి సముద్రపు నీటి నుండి లవణాలను వేరుచేసి మంచి నీటిని తయారు చేశారు.
ప్రశ్న 20.
 నిత్యజీవితములో వ్యాపనం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?
 జవాబు:
 పంచదార స్ఫటికములను నీటిలో కరిగించుటకు, దోమల నివారణకు, గాలిని శుభ్రపరిచే డియోడరెంట్ల వినియోగంలో వ్యాపనం ఉపయోగపడుతుంది.
ప్రశ్న 21.
 వ్యతిరేక ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా ఉన్న నీరు మంచినీరుగా ఎలా మారుతుంది?
 జవాబు:
 సముద్రపు నీటిపై ఎక్కువ పీడనాన్ని కలుగచేసినప్పుడు ఉప్పునీరు లవణాలను వదిలివేసి పారగమ్యత్వచం ద్వారా ఉప్పు నీటి నుండి మంచి నీటిలోనికి ప్రవేశిస్తుంది.
ప్రశ్న 22.
 మానవులకు ద్రవాభిసరణ ప్రక్రియ ఏ విధంగా ఉపయోగపడుతుంది?
 జవాబు:
 రక్తంలో మలినాలు వడపోయడానికి, మన శరీరానికి కావలసిన నీరు మరియు లవణాలు పునఃశోషణ చేసుకోవడానికి ద్రవాభిసరణ ఉపయోగపడుతుంది.
ప్రశ్న 23.
 మన కళ్ళకు గంతలు కట్టుకొని వివిధ పదార్థములను ఎలా గుర్తించగలుగుతాము?
 జవాబు:
 వాసనను కలిగించే వివిధ పదార్థాల అణువులు గాలిలోనికి వ్యాపనం చెందుట ద్వారా వివిధ రకాల పదార్థాలను గుర్తిస్తాము.
ప్రశ్న 24.
 వాటర్ ప్యూరిఫైయర్ నందు పరిశుభ్రమైన నీరు ఎలా తయారవుతుంది?
 జవాబు:
 వాటర్ ప్యూరిఫైయర్ నందు రివర్స్ ఆస్మోమీటర్ను ఉపయోగించుట ద్వారా పరిశుభ్రమైన నీటిని పొందవచ్చు.
ప్రశ్న 25.
 విలియం కాఫ్ అన్ డచ్ వైద్యుడు డయాలసిస్ యంత్రాన్ని కనుగొనకపోయినట్లయితే ఏమి జరిగేది?
 జవాబు:
 డయాలసిస్ యంత్రం ద్వారా కృత్రిమంగా వ్యర్థ పదార్థాలు వడపోయబడతాయి. లేని పక్షంలో వ్యర్థ పదార్థాలు శరీరంలో నిల్వ ఉండి శరీరం విషపూరితమై మరణం సంభవించటం జరిగేవి.
ప్రశ్న 26.
 శీతలపానీయం తాగినా కూడా మనకు దాహం తీరదు? ఎందువలన?
 జవాబు:
 శీతలపానీయం తాగినా కూడా మనకు దాహం తీరదు. శీతల పానీయం గాఢమైన చక్కెర ద్రావణం. శరీర కణాలలో ద్రవం కన్న శీతల పానీయం గాఢత ఎక్కువ. అందువలన శరీరకణాల నుండి నీరు జీర్ణవ్యవస్థలోనికి ప్రవేశిస్తుంది. తద్వారా దాహం తీరనట్లు మనకు అనిపిస్తుంది.

ప్రశ్న 27.
 ఉప్పుతో కూడిన పదార్థాలను తిన్న తర్వాత ఎక్కువ దాహార్తికి ఎందుకు గురి అవుతాం?
 జవాబు:
 ఉప్పుతో కూడిన పదార్థాలను తిన్న తర్వాత శరీరంలో ఉండే ద్రవాలను ఉప్పు పీల్చుకోవటం వలన నీరు అధికంగా జీర్ణవ్యవస్థలోకి చేరి ద్రవాల గాఢతను సరి చేస్తుంది. అందువలన ఉప్పుతో కూడిన పదార్థాలను తిన్న తర్వాత ఎక్కువ దాహార్తికి గురి అవుతాం.
ప్రశ్న 28.
 ప్రయాణంలో ఎటువంటి ఆహారం మంచిది?
 జవాబు:
 80% నుండి 90% నీరు కలిగిన సహజసిద్ధమైన పండ్లు ఆకలినే కాక దాహార్తిని కూడా తీరుస్తాయి. అందువలన ప్రయాణంలో నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకెళ్ళటం మంచిది.
ప్రశ్న 29.
 బాహ్య ద్రవాభిసరణం అనగానేమి?
 జవాబు:
 కణం నుండి నీరు బయటకు పోవడాన్ని బాహ్య ద్రవాభిసరణం అంటారు.
ప్రశ్న 30.
 అంతర ద్రవాభిసరణం అనగానేమి?
 జవాబు:
 కణము లోపలికి నీరు ప్రవేశించడాన్ని అంతర ద్రవాభిసరణం అంటారు.
9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 వ్యాపనమునకు, ద్రవాభిసరణకు గల భేదములేవి?
 జవాబు:
| విసరణ / వ్యాపనం | ద్రవాభిసరణము | 
| 1. గాఢత ఆధారంగా మాధ్యమంలో పదార్థాలు సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారు. | గాఢత ఆధారంగా పదార్థాలు ద్రవమాధ్యమంలో విచక్షణా స్తరం ద్వారా విస్తరించడాన్ని ద్రవాభిసరణ అంటారు. | 
| 2. ఇది భౌతిక చర్య. | ఇది జీవ, భౌతిక చర్య. | 
| 3. పాక్షిక పారగమ్యత్వచం అవసరం లేదు. | పాక్షిక పారగమ్యత్వచం అవసరం. | 
| 4. ద్రవ, వాయు స్థితులలో జరుగుతుంది. | కేవలం ద్రవస్థితిలోనే జరుగుతుంది. | 
ప్రశ్న 2.
 ద్రవాభిసరణం అనగానేమి ? ఉదాహరణతో వివరింపుము.
 జవాబు:
 తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢతకు పాక్షిక పారగమ్యత్వచం ద్వారా నీటి అణువుల కదలిక రెండువైపులా సమానమయ్యే వరకు జరిగే ప్రక్రియను ద్రవాభిసరణ అంటారు.
 ఉదాహరణ : కిస్మిస్ తో ద్రవాభిసరణం
- కిస్మిస్ను బీకరు నీటిలో వేసి కొద్దిసేపు కదలకుండా ఉంచాలి. తరువాత దానిని తీసి ఎక్కువ గాఢత గల పంచదార లేదా ఉప్పునీటి ద్రావణంలో ఉంచాలి.
- నీటిలో ఉంచినపుడు కిస్మిస్ నీటిని గ్రహించి ఉబ్బుతుంది. గాఢమైన పంచదార లేదా ఉప్పు ద్రావణంలో ఉంచినపుడు ముడుచుకుపోతుంది.
- పై రెండు సందర్భాలలోను నీరు తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢతకు ద్రవాభిసరణ ప్రక్రియ వలన కదలినది.
ప్రశ్న 3.
 వ్యతిరేక ద్రవాభిసరణము అనగానేమి? దాని ఉపయోగమేమి?
 జవాబు:
 1) సముద్రపు నీటిపై ఎక్కువ పీడనాన్ని కలుగజేసినపుడు ఉప్పు నీరు లవణాలను వదిలివేసి పారగమ్యత్వచం ద్వారా ఉప్పు నీటి నుండి మంచి నీటిలోనికి ప్రవేశిస్తుంది.
2) ఈ పద్ధతిని వ్యతిరేక ద్రవాభిసరణము అంటారు.
 ఉపయోగము :
 మూడు నుండి ఐదు పొరలుండే పారగమ్యత్వచాల ద్వారా ఉప్పు నీటిని వడపోసే యంత్రాలు ప్రస్తుతము గృహవినియోగానికి వాడుతున్నారు.

ప్రశ్న 4.
 వ్యాపనం అనగానేమి? ఉదాహరణనిమ్ము.
 జవాబు:
 గాలి లేదా నీరులాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారు.
 ఉదాహరణ :
 గదిలోని ఒక మూల సెంటుసీసా మూత తెరిస్తే సెంటులోని అణువులు గది అంతా వ్యాపనం చెందుట వలన గది అంతా వాసన సమానంగా వ్యాపిస్తుంది.
ప్రశ్న 5.
 కణములోనికి CO2 ఎందుకు ప్రవేశించలేదు?
 జవాబు:
- శ్వాసక్రియ సందర్భముగా O2 వినియోగించబడి CO2 విడుదల అవుతుంది.
- కణములో CO2, గాఢత ఎక్కువగా ఉంటుంది. కణము బయట CO2 గాఢత తక్కువగా ఉంటుంది.
- అందువలన వ్యాపనము ద్వారా కణము నుండి CO2 బయటకు పోతుంది.
ప్రశ్న 6.
 50 గ్రాముల పొటాటో చిప్స్ ను ప్రయాణ సమయంలో తినిన తరువాత దాహం వేయడానికి కారణం?
 జవాబు:
- మనం బస్సులో ప్రయాణం చేసే సమయంలో గాలివేగం వలన శరీరం నుండి ఎక్కువ నీటిని కోల్పోతాం.
- 50 గ్రాముల చిప్స్ తిన్న తర్వాత శరీరంలో ఉండే ద్రవాలను ఉప్పు పీల్చుకోవడం వలన నీరు అధికంగా జీర్ణవ్యవస్థలోకి చేరి ద్రవాల గాఢతను సరిచేస్తుంది.
- దీనివలన మనం ఉప్పుతో కూడిన పదార్థాలను తిన్న తర్వాత ఎక్కువ దాహార్తికి గురవుతాం.
ప్రశ్న 7.
 ద్రవాభిసరణంతో పనిచేసే ఏవైనా మూడు సన్నివేశాలను తెలపండి.
 జవాబు:
- మొక్కల వేర్లలోనికి నీరు ద్రవాభిసరణము ద్వారా ప్రవేశిస్తుంది.
- రక్తంలో మలినాలను వడపోయడానికి ద్రవాభిసరణ సహాయపడుతుంది.
- పత్ర రంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం ద్రవాభిసరణ వలన జరుగుతుంది.
9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 ప్లాస్మా (పొర) అనగానేమి? దాని యొక్క విధులేవి?
 జవాబు:
 కణాన్ని ఆవరించి ఉండి కణంలోని అంశాలను బాహ్యపరిసరాలతో వేరుపరచే పొరను ప్లాస్మా పొర అంటారు.
ప్లాస్మా పొర, విధులు :
 1) ఆకారం :
 కణానికి కణంలోని అంశాలకు నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుంది.
2) యాంత్రిక అవరోధం :
 కణంలోని అంశాలను రక్షించడానికి యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది.
3) పారగమ్యత :
 కణం గుండా ప్రవేశించే, నిర్ణమించే పదార్థాలను ప్లాస్మాత్వచం నిర్ధారిస్తుంది.
4) ఎండోసైటాసిస్ :
 త్వచం సరళమైన నిర్మాణం కలిగి ఉండుట వలన కణం ఆహారాన్ని గాని, ఇతర బాహ్య కణాలను గాని చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరుచేసి ఆహారాన్ని సేకరిస్తుంది.
 ఉదా : అమీబా.
5) గుర్తించటం :
 త్వచం నందలి గుర్తింపు కేంద్రాలు కణజాల నిర్మాణానికి బాహ్యపదార్థాలను గుర్తించడానికి వ్యాధిజనక జీవుల నుండి రక్షణ పొందడానికి సహాయపడతాయి.
6) సమాచార ప్రసారం :
 అదే జీవిలోని వివిధ కణాల మధ్య సమాచార ప్రసారానికి దోహదం చేస్తుంది.
7) ద్రవాభిసరణం :
 చిన్న చిన్న నీటిమార్గాలు ప్లాస్మాత్వచంలో ఉండుట వలన ద్రవాభిసరణ జరుగుతుంది.
8) కణ నిరంతరత :
 ప్లాస్మాత్వచం ప్లాస్మాడెస్మోటాల నిర్మాణాల ద్వారా ప్రక్క ప్రక్క కణాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది.
9) ప్రత్యేకత :
 వివిధ విధులను నిర్వర్తించడానికి ప్లాస్మాత్వచం రూపాంతరం చెందుతుంది. ఉదాహరణకి సూక్ష్మ చూషకాలతో శోషణ.

ప్రశ్న 2.
 జీవులలో ద్రవాభిసరణ ప్రాముఖ్యత ఏమిటి?
 జవాబు:
- మొక్కల వేర్లలోకి నీరు ప్రవేశిస్తుంది.
- కణాల మధ్య నీరు ప్రవహిస్తుంది.
- పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరచుకోవడం జరుగుతుంది.
- మొక్కలలో నీరు, లవణాల కదలికకు సహాయపడుతుంది.
- రక్తంలో మలినాలు వడపోయడానికి సహాయపడుతుంది.
- మన శరీరానికి కావలసిన నీరు మరియు లవణాలు పునఃశోషణం చేసుకోవడానికి ద్రవాభిసరణ ఉపయోగపడుతుంది.
9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Important Questions and Answers
ప్రశ్న 1.
 లత KMnO4 స్పటికాలను బీకరులోని నీటిలో వేసి, ఏం జరుగుతుందోనని పరిశీలిస్తోంది. ఈ ప్రయోగంలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏమిటి?
 జవాబు:
 వ్యాపనము
ప్రశ్న 2.
 కింద ఇవ్వబడిన పట్టికను చదివి అందులోని సమాచారం ఆధారంగా పట్టికను పూరించుము.
 జవాబు:
| ప్రక్రియ /విధి | దృగ్విషయము పేరు | 
| 1. కణం గుండా ప్రవేశించే, నిర్గమించే పదార్థాలను ప్లాస్మా త్వచం నిర్ధారిస్తుంది. | |
| 2. ప్లాస్నా త్వచము సరళమైన నిర్మాణం కలిగి వుండటం వలన కణం ఆహారాన్ని కానీ, ఇతర బాహ్య కణాలను గానీ చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి ఆహారాన్ని సేకరిస్తుంది. | |
| 3. చిన్న చిన్న నీటి మార్గాలు ప్లాస్మా త్వచంలో వుండటం వలన నీరు లోనికి ప్రవేశిస్తుంది. (లేదా) బయటకు వెళుతుంది. | |
| 4. అణువులు అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశానికి కదులుట | 
జవాబు:
- పారగమ్యత
- ఎండోసైటాసిస్
- దృవాభిసరణ
- వ్యాపనము
ప్రశ్న 3.
 పటమును పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
 ఎ) కోడిగ్రుడ్డు నుండి విచక్షణాస్తరంను తయారుచేయుటకు నీవు ఉపయోగించిన రసాయన పదార్థమేది?
 బి) విచక్షణాస్తరంను తయారుచేయడంలో ఏ జాగ్రత్తలు తీసుకున్నావు?
 
 జవాబు:
 ఎ) సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం
 బి) 1) గ్రుడ్డును 4-5 గంటలపాటు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో పెంకు కరిగే వరకు ఉంచాలి.
 2) తరువాత గుడ్డుకు పెన్సిల్ పరిమాణంలో ఉండే రంధ్రం చేయాలి. లోపలి పదార్థాన్ని నెమ్మదిగా బయటకు పోయేటట్లు చేయాలి.
 3) పొరలోపలి భాగాన్ని నీటితో కడగాలి.

ప్రశ్న 4.
 క్రింది పట్టికను పరిశీలించండి.
| పదార్థం | కణం లోపలకు ప్రవేశిస్తుంది | కణం వెలుపలకు ప్రవేశిస్తుంది | 
| ఆక్సిజన్ | ||
| గ్లూకోజ్ | ||
| ప్రోటీన్స్ | ||
| కొవ్వులు | ||
| విటమిన్లు | ||
| కార్బన్ డై ఆక్సైడ్ | ||
| వ్యర్థాలు | 
ఎ) ఏయే పదార్థాలు కణంలోపలకు వెళతాయి?
 బి) ఏ యే వ్యర్థాలు కణం వెలుపలకు వస్తాయి? ఎందుకు?
 సి) ఒక కణంలోకి పదార్థాల రవాణా దేని ద్వారా జరుగుతుంది?
 డి) పారగమ్యత లక్షణం ఉపయోగమేమిటి?
 జవాబు:
 ఎ) ఆక్సీజన్, గ్లూకోజ్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్లు
 బి) కార్బన్ డై ఆక్సైడ్, వ్యర్థాలు
 సి) ప్లాస్మాత్వచం
 డి) కణానికి అపాయం కలిగించే పదార్థాలను లోనికి ప్రవేశించకుండా అదే విధంగా కణంలో తయారయ్యే విష పదార్థాలను మాత్రమే కణం బయటకు పోయే విధంగా పారగమ్యతా లక్షణం ఉపయోగపడుతుంది.
ప్రశ్న 5.
 మీకు రెండు బీకరులు, గరాటు, వడపోత కాగితం, స్టాండు, చక్కెర, బియ్యం లేదా గోధుమపిండి, ప్లాస్టిక్ బాటిల్ ఇవ్వబడినవి. వీటితో నీవు నిర్వహించే ప్రయోగం, ప్రయోగ విధానం, తీసుకోవలసిన జాగ్రత్తలు రాయండి.
 జవాబు:
 
- 100 మి.లీ. నీటికి ఒకచెంచాడు గోధుమ లేదా వరిపిండి కలిపి ద్రావణం చేయండి.
- ఈ ద్రావణానికి ఒక చుక్క టింక్చర్ అయొడినను కలపండి.
- ఈ ద్రావణాన్ని వడపోయండి. ఈ వడపోత ద్వారా నీరు మరియు నీటిలో కరిగిన పిండి గరాటు కింద గల బీకరులోనికి చేరుతుంది.
- వడపోత కాగితం నీటిలో కరగని పిండిని తన గుండా ప్రయాణించడానికి, అనుమతి ఇవ్వలేదు. పిండి అవక్షేపం వడపోత కాగితం మీద ఏర్పడినది.
జాగ్రత్తలు:
- ఉపయోగించిన వడపోత కాగితానికి రంధ్రాలు లేకుండా చూసుకోవాలి.
- వడపోత కాగితం లోకి పిండి ద్రావణం పోసేటప్పుడు నెమ్మదిగా, కలియదిప్పుతూ పోయాలి.
9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 1 Mark Bits Questions and Answers
లక్ష్యాత్మక నియోజనము
1. ‘ప్లాస్మా పొర
 A) పారగమ్యత కలిగినది
 B) పాక్షిక పారగమ్యత గలది.
 C) విచక్షణాస్తరం
 D) పైవి అన్నియూ
 జవాబు:
 D) పైవి అన్నియూ
2. ప్లాస్మా పొర దీనియందు ఉంటుంది.
 A) మొక్కలలో
 B) జంతువులలో
 C) మొక్కలు మరియు జంతువులలో
 D) పైవేవీ కావు
 జవాబు:
 C) మొక్కలు మరియు జంతువులలో
3. వ్యాపనం ఈ మాధ్యమంలో జరుగుతుంది.
 A) ఘనపదారములందు
 B) ద్రవపదార్థములందు
 C) వాయువులందు
 D) పైవి అన్నియూ
 జవాబు:
 D) పైవి అన్నియూ
4. ద్రవాభిసరణం ఈ మాధ్యమం నందు జరుగుతుంది.
 A) ఘనపదార్థములందు
 B) ద్రవపదార్థములందు
 C) వాయువులందు
 D) పైవేవీ కావు
 జవాబు:
 B) ద్రవపదార్థములందు
5. విచక్షణాస్తరం ఈ ప్రక్రియ జరగటానికి అవసరం.
 A) ద్రవాభిసరణం
 B) వ్యాపనం
 C) ద్రవాభిసరణం మరియు వ్యాపనం
 D) పైవేవీ కావు
 జవాబు:
 A) ద్రవాభిసరణం

6. ద్రావణిని గుర్తించండి
 A) పంచదార
 B) ఉప్పు
 C) నీరు
 D) కణద్రవ్యం
 జవాబు:
 C) నీరు
7. ద్రావణంలో కరిగియున్న పదార్థం
 A) ద్రావణి
 B) ద్రావితం
 C) మిశ్రమం
 D) నీరు
 జవాబు:
 B) ద్రావితం
8. ప్లాస్మా పొర విధి
 A) కణానికి, కణంలోని అంశాలకు నిర్దిష్టమైన ఆకారం ఇవ్వడం
 B) ద్రవాభిసరణం
 C) సమాచార ప్రసారం
 D) పైవి అన్నియూ
 జవాబు:
 D) పైవి అన్నియూ
9. వాయువుల వ్యాపనంపై పరిశోధన చేసినవాడు
 A) థామస్ గ్రాహం
 B) ఫెడ్డి మెర్క్యురి
 C) ఎండోసైటాసిస్
 D) ఎక్సోసైటాసిస్
 జవాబు:
 A) థామస్ గ్రాహం
10. ఈ క్రింది వానిలో కణం నుండి బయటకు వెళ్ళేది
 A) ఆక్సిజన్
 B) కార్బన్-డై-ఆక్సెడ్
 C) గ్లూకోజ్
 D) ఖనిజ లవణాలు
 జవాబు:
 B) కార్బన్-డై-ఆక్సెడ్
11. బీకరు అడుగున పదార్థము మిగిలే ద్రావణము
 A) సంతృప్త ద్రావణం
 B) అసంతృప్త ద్రావణం
 C) చల్లని ద్రావణం
 D) వేడి ద్రావణం
 జవాబు:
 A) సంతృప్త ద్రావణం
12. గ్రీకు భాషలో “ఆస్మా” అనగా
 A) లాగటం
 B) నెట్టడం
 C) పీల్చడం
 D) త్రాగడం
 జవాబు:
 B) నెట్టడం

13. ద్రవాభిసరణ ప్రక్రియలో
 A) నీరు అధిక గాఢత నుండి అల్ప గాఢతకు ప్రయాణిస్తుంది.
 B) నీరు అల్ప గాఢత నుండి అధిక గాఢతకు ప్రయాణిస్తుంది.
 C) పదార్థపు అణువులు అధిక గాఢత నుండి అల్ప గాఢతకు ప్రయాణిస్తాయి.
 D) పదార్థపు అణువులు అల్ప గాఢత నుండి అధిక గాఢతకు ప్రయాణిస్తాయి.
 జవాబు:
 B) నీరు అల్ప గాఢత నుండి అధిక గాఢతకు ప్రయాణిస్తుంది.
14. వ్యాపన ప్రక్రియలో
 A) నీరు అధిక గాఢత నుండి అల్ప గాఢతకు ప్రయాణిస్తుంది.
 B) నీరు అల్ప గాఢత నుండి అధిక గాఢతకు ప్రయాణిస్తుంది.
 C) పదార్థపు అణువులు అధిక గాఢత నుండి అల్ప గాఢతకు ప్రయాణిస్తాయి.
 D) పదార్థపు అణువులు అల్ప గాఢత నుండి అధిక గాఢతకు ప్రయాణిస్తాయి.
 జవాబు:
 C) పదార్థపు అణువులు అధిక గాఢత నుండి అల్ప గాఢతకు ప్రయాణిస్తాయి.
15. పారగమ్యత్వచం దీనికి అవసరం.
 A) వ్యాపనం
 B) ద్రవాభిసరణం
 C) వ్యతిరేక ద్రవాభిసరణం
 D) B మరియు C
 జవాబు:
 D) B మరియు C
16. ప్లాస్మాపొర గురించిన సత్య వాక్యం
 A) ప్లాస్మాపొర తన ద్వారా నీరు ప్రయాణించడానికి అనుమతిస్తుంది.
 B) నీటిలో కరిగిన కొన్ని పదార్థాలను కూడా తన ద్వారా అనుమతిస్తుంది.
 C) ప్లాస్మాపొర కొన్ని పదార్థాలను తన ద్వారా అనుమతించదు.
 D) పైవి అన్నియు.
 జవాబు:
 D) పైవి అన్నియు.
17. ప్లాస్మాపొర గురించి సత్య వాక్యం
 A) ఇది స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటుంది.
 B) పారగమ్యత లక్షణం కలిగి ఉంటుంది.
 C) సజీవ త్వచం
 D) పైవి అన్నియు
 జవాబు:
 D) పైవి అన్నియు
18. కణం ఘన ఆహారాన్ని సేకరించే ప్రక్రియ
 A) ఆస్మాసిస్
 B) పీనోసైటాసిన్
 C) డేవిడ్ బోరి
 D) బిచాట్
 జవాబు:
 C) డేవిడ్ బోరి
19. ప్లాస్నాత్వచం పక్క కణాలతో వీని ద్వారా సంబంధం కలిగి ఉంటుంది.
 A) ఆక్సాన్లు
 B) డెండ్రైట్
 C) టెలి డెండ్రైట్
 D) ప్లాస్మాడెస్మేటా
 జవాబు:
 D) ప్లాస్మాడెస్మేటా
20. ఈ క్రింది వానిలో ప్లాస్మాత్వచం యొక్క రూపాంతరం
 A) కేంద్రకం
 B) సూక్ష్మచూషకాలు
 C) కణకవచం
 D) అంటు బిళ్ళలు
 జవాబు:
 B) సూక్ష్మచూషకాలు

21. కణం లోపలికి నీరు ప్రవేశించడాన్ని ఏమంటారు?
 A) ఎక్సో ఆస్మాసిస్
 B) ఎండో ఆస్మాసిస్
 C) ఎండో సైటాసిస్
 D) ఎక్సో సైటాసిస్
 జవాబు:
 B) ఎండో ఆస్మాసిస్
22. రక్తంలో మలినాలు వడపోయడం ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుంది.
 A) వ్యాపనం
 B) ద్రవాభిసరణం
 C) వ్యతిరేక ద్రవాభిసరణం
 D) బాహ్య ద్రవాభిసరణం
 జవాబు:
 B) ద్రవాభిసరణం
23. డి-శాలినేషన్ కనుగొన్న శాస్త్రవేత్త
 A) విలియ్ కాఫ్
 B) ఫ్రెడ్డీ మెర్క్యూరీ
 C) డేవిడ్ బోరి
 D) B మరియు C
 జవాబు:
 D) B మరియు C
24. డి-శాలినేషన్ పద్ధతిలో సముద్రపు నీటి నుండి దీనిని వేరు చేస్తారు.
 A) మంచినీరు
 B) లవణాలు
 C) A మరియు B
 D) పైవీ ఏవీకాదు
 జవాబు:
 B) లవణాలు
25. ప్లాస్మాపొర ద్వారా రవాణా అయ్యేవి
 A) ఘన పదార్థాలు
 B) ద్రవ పదార్థాలు
 C) వాయు పదార్థాలు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
26. వ్యాపనం ఇక్కడ జరుగుతుంది.
 A) భూమిలో
 B) నీటిలో
 C) గాలిలో
 D) B మరియు C
 జవాబు:
 D) B మరియు C
27. వాయువ్యాపన నియమాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
 A) థామస్ గ్రాహం
 B) థామస్ ఎడిసన్
 C) అవగాడ్రో
 D) హంప్రిడేవి
 జవాబు:
 A) థామస్ గ్రాహం
28. దోమల నివారణ మందులు ఏ సూత్రంపై పనిచేస్తాయి?
 A) వ్యాపనం
 B) ద్రవాభిసరణం
 C) వ్యతిరేక ద్రవాభిసరణం
 D) పైవి ఏవీ కాదు
 జవాబు:
 A) వ్యాపనం
29. వ్యతిరేక ద్రవాభిసరణం ఏ సూత్రంపై పనిచేస్తుంది?
 A) వ్యాపనం
 B) ద్రవాభిసరణం
 C) పై రెండూ
 D) ప్రత్యేక పరిస్థితులు
 జవాబు:
 B) ద్రవాభిసరణం
30. పొటాటో ఆస్మోమీటర్ లోనికి నీరు ఏ పద్ధతి ద్వారా ప్రవేశిస్తుంది?
 A) వ్యాపనం
 B) ద్రవాభిసరణం
 C) వ్యతిరేక ద్రవాభిసరణం
 D) పైవి ఏవీకాదు
 జవాబు:
 B) ద్రవాభిసరణం

31. నీటిని శుద్ధి చేసే ప్రక్రియ
 A) వ్యాపనం
 B) ద్రవాభిసరణం
 C) వ్యతిరేక ద్రవాభిసరణం
 D) పైవి ఏవీకాదు
 జవాబు:
 C) వ్యతిరేక ద్రవాభిసరణం
32. డయాలసిస్ యంత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
 A) విలియమ్ కాఫ్
 B) ఫ్రెడ్డీ మెర్క్యూరి
 C) పై రెండూ
 D) పైవి ఏవీకాదు
 జవాబు:
 A) విలియమ్ కాఫ్
33. తక్కువ గాఢత గల ద్రవంలో ఉంచినపుడు పగిలిపోయేవి
 A) జంతుకణాలు
 B) వృక్షకణాలు
 C) నిర్జీవకణాలు
 D) పైవి ఏవీకాదు
 జవాబు:
 A) జంతుకణాలు
34. ప్రయాణంలో తీసుకోవాల్సింది
 A) కూల్ డ్రింక్స్
 B) పోటాటో చిప్స్
 C) చక్కెర ద్రావణంలో ముంచిన స్వీట్స్
 D) పైవేవీ తీసుకోకూడదు
 జవాబు:
 D) పైవేవీ తీసుకోకూడదు
35. రివర్స్ ఆస్మోసిస్లో ఉపయోగించేది
 A) కాంతి
 B) ఉష్ణోగ్రత
 C) పీడనం
 D) విద్యుత్
 జవాబు:
 C) పీడనం
36. కరిగే స్వభావం కలిగినది.
 A) ద్రావణి
 B) ద్రావితం
 C) ద్రావణము
 D) పదార్థము
 జవాబు:
 B) ద్రావితం
37. మొక్కల వేర్లలోకి నీరు ప్రవేశించే ప్రక్రియ
 A) వ్యాపనం
 B) ద్రవాభిసరణం
 C) వ్యతిరేక ద్రవాభిసరణం
 D) పైవి ఏవీకాదు
 జవాబు:
 B) ద్రవాభిసరణం
38. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడిన జత ఏది?
 i) వ్యాపనము – థామస్ గ్రాహం
 ii) ద్రవాభిసరణం – ఫ్రెడ్డీ మెర్క్యురీ మరియు డేవిడ్ బోరి
 iii) వ్యతిరేక ద్రవాభిసరణం – పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం
 A) i, iii
 B) ii మాత్రమే
 C) i మాత్రమే
 D) ii, iii
 జవాబు:
 D) ii, iii

39. సముద్రపు చేపకు మంచినీటిలో ఉంచితే అది చనిపోవడానికి గల కారణం
 A) ద్రవాభిసరణం
 B) బాహ్యద్రవాభిసరణం
 C) వ్యాపనం
 D) వ్యతిరేక ద్రవాభిసరణం
 జవాబు:
 A) ద్రవాభిసరణం
40. తాజా ద్రాక్ష పండును ఉప్పునీటిలో ఉంచినపుడు ఏమి జరుగుతుంది.
 A) ఉబ్బుతుంది
 B) కృశిస్తుంది
 C) మారదు
 D) పగులుతుంది
 జవాబు:
 B) కృశిస్తుంది
41. కాఫీ పొడి మరియు పొటాషియం పర్మాంగనేట్ (KMNO) లతో చేసే ప్రయోగం నిరూపించునది.
 A) ద్రవాభిసరణం
 B) వ్యతిరేక ద్రవాభిసరణం
 C) బాహ్య ద్రవాభిసరణం
 D) వ్యాపనం
 జవాబు:
 D) వ్యాపనం
42. ఉప్పు నీటిలో ఉంచిన కొడిగుడ్డు కృశించటానికి గల కారణం
 A) ద్రవాభిసరణం
 B) బాహ్య ద్రవాభిసరణం
 C) వ్యాపనం
 D) అంతర ద్రవాభిసరణం
 జవాబు:
 B) బాహ్య ద్రవాభిసరణం

43. కుళాయి నీటిలో ఉంచిన కోడిగుడ్లు ఉబ్బటానికి గల కారణం
 A) ద్రవాభిసరణం
 B) బాహ్య ద్రవాభిసరణం
 C) వ్యాపనం
 D) అంతర ద్రవాభిసరణం
 జవాబు:
 D) అంతర ద్రవాభిసరణం
44. ప్రక్కనున్న చిత్రం సూచించునది
 
 A) ద్రవాభిసరణకు పరికరముల ఏర్పాటు
 B) వడపోత పద్దతి పరికరాలు
 C) ఇది వ్యాపనాన్ని వివరిస్తుంది
 D) పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేయటం
 జవాబు:
 D) పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేయటం
45. ఈ పటం సూచించునది.
 
 A) ద్రవాభిసరణం
 B) బాహ్య ద్రవాభిసరణం
 C) వడపోత
 D) వ్యతిరేక ద్రవాభిసరణం
 జవాబు:
 C) వడపోత
46. ఈ చిత్రం సూచించునది.
 
 A) ద్రవాభిసరణం
 B) బాహ్య ద్రవాభిసరణం
 C) వడపోత
 D) వ్యతిరేక ద్రవాభిసరణం
 జవాబు:
 D) వ్యతిరేక ద్రవాభిసరణం
47. క్రింది (ఫ్ ను పరిశీలించి సరియైన ప్రవచనాన్ని ఎన్నుకోండి.
 
 A) B మరియు C ద్రావణాల కంటే A ద్రావణం గాఢత ఎక్కువ.
 B) A మరియు B ద్రావణాల కంటే C ద్రావణం గాఢత తక్కువ.
 C) B ద్రావణం గాఢత A మరియు C ద్రావణాల గాఢతతో సమానం.
 D) A మరియు B ద్రావణాల కంటే C ద్రావణం గాఢత ఎక్కువ.
 జవాబు:
 D) A మరియు B ద్రావణాల కంటే C ద్రావణం గాఢత ఎక్కువ.
48. సరియైన జతపరచడాన్ని గుర్తించండి.
 1) ద్రవాభిసరణం ( ) A) అమీబా
 2) ఎండోసైటాసిస్ ( ) B) సూక్ష్మచూషకాలు
 3) ప్రత్యేకత ( ) C) మూలకేసరాలు
 A) 1 – B, 2 – A, 3 – C
 B) 1 – C, 2 – B, 3 – A
 C) 1 – A, 2 – B, 3- C
 D) 1 – C, 2 – A, 3 – B
 జవాబు:
 D) 1 – C, 2 – A, 3 – B
49. భోపాల్ వాయు దుర్ఘటన జరగటానికి కారణం
 A) ద్రవాభిసరణం
 B) వ్యతిరేక ద్రవాభిసరణం
 C) వ్యాపనం
 D) బాహ్య ద్రవాభిసరణం
 జవాబు:
 C) వ్యాపనం
50. మన శరీరంలో రక్తం నుండి మలినాలు వేరు చేయబడే ప్రక్రియ
 A) రెప్లికేషన్
 B) ఎండో సైటాసిస్
 C) ద్రవాభిసరణం
 D) నిశ్వాసము
 జవాబు:
 C) ద్రవాభిసరణం
51. ఉడకబెట్టిన గుడ్డు నుండి పాక్షిక పారగమ్యత్వచాన్ని పొందుటకు ఉపయోగించే రసాయనం
 A) సజల HCl
 B) చక్కెర ద్రావణం
 C) ఉప్పు ద్రావణం
 D) స్వేదన జలం
 జవాబు:
 A) సజల HCl
52. మంచి నీటి అమీబాను ఉప్పు నీటిలో ఉంచితే ఏమవుతుంది?
 A) బాహ్యద్రవాభిసరణ – కణం స్పీతం చెందును
 B) బాహ్యద్రవాభిసరణ – కణం ముడుచుకు పోతుంది
 C) అంతరద్రవాభిసరణ – కణం సీతం చెందును
 D) అంతర ద్రవాభిసరణ కణం ముడుచుకు పోతుంది.
 జవాబు:
 B) బాహ్యద్రవాభిసరణ – కణం ముడుచుకు పోతుంది
53. పరికరము కింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.
 
 A) ద్రవాభిసరణం
 B) వ్యతిరేక ద్రవాభిసరణం
 C) విసరణం
 D) A మరియు C
 జవాబు:
 B) వ్యతిరేక ద్రవాభిసరణం
54. కొన్ని ఎంపికచేసిన ద్రావికాలను మాత్రమే తమగుండా ప్రవేశింపచేసేవి
 A) మృతకణజాలం
 B) విచక్షణార్థరం
 C) బెరడు
 D) పైవేవీ కావు
 జవాబు:
 B) విచక్షణార్థరం
55. ఎండాకాలంలో కూల్ డ్రింక్ త్రాగితే దాహం తీరదు. ఎందుకంటే
 A) కణరసం గాఢతకంటే కూల్ డ్రింక్ గాఢత ఎక్కువ
 B) కణరసం గాఢతకంటే కూల్ డ్రింక్ గాఢత తక్కువ
 C) రెండూ సమానం కావున
 D) పైవేవీ కావు
 జవాబు:
 A) కణరసం గాఢతకంటే కూల్ డ్రింక్ గాఢత ఎక్కువ
మీకు తెలుసా?
మనం సముద్ర నీటిని త్రాగగలమా? భూమి మీద నాలుగింట మూడు వంతులు సముద్రపు నీరు ఉన్నది. ఎంతో నీరు ఉన్నప్పటికీ, సముద్రపు నీరు ఉప్పగా ఉండటం వలన మనం ఆ నీటిని ఉపయోగించుకోలేం. సముద్రపు నీటి నుండి లవణాలను తొలగించగలిగితే, ఆ నీటిని మనం ఉపయోగించుకోగలం. ఫ్రెడ్డీ మెర్కురీ, డేవిడ్ బోరి అనే శాస్త్రవేత్తలు సముద్రపు నీటి నుండి లవణాలను పారగమ్య త్వచాన్ని ఉపయోగించి తొలగించే పద్ధతి కనుగొన్నారు. ఈ పద్ధతినే లవణాలను తొలగించడం (de salination) అంటారు.

 స్కాట్లాండ్ కు చెందిన థామస్ గ్రాహం అనే భౌతిక, రసాయన శాస్త్రవేత్త వాయువుల వ్యాపనంపై అధ్యయనం చేశాడు. ఈయన వాయువుల వ్యాపనాన్నే కాకుండా ద్రవ పదార్థాల వ్యాపనాన్ని కూడా అధ్యయనం చేశాడు. మాధ్యమంలో కరిగే పదార్థాలు, కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని గ్రాహం కనుగొన్నాడు. దీనినే గ్రాహం వాయు వ్యాపన నియమం అంటారు. ఇప్పటి వరకు మనం ద్రవాభిసరణ, వ్యాపనాల గురించి అధ్యయనం చేశాం. కణత్వచం ద్వారా జరిగే వేర్వేరు ఇతర ప్రక్రియల గురించి పై తరగతులలో అధ్యయనం చేస్తాం.
పునరాలోచన

అనుబంధం
→ వాటర్ ప్యూరిఫైయర్ (వాటిని శుభ్రం చేసే యంత్రం) చూశారా ! శుభ్రం చేసే కడ్డీలను వాటర్ ఫిల్టర్ తరుచుగా వాడుతుంటారు, పరిశుభ్రమైన నీరు కావాలంటే రివర్స్ అస్మోమీటర్ను ఉపయోగించాలి. రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఈ యంత్రం నీటిని శుభ్రం చేస్తుంది.
 
→ మన శరీరంలో మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థ పదార్థాలను ద్రవాభిసరణ ప్రక్రియలో వడపోస్తాయి.
 మూత్రపిండాలు వడపోయలేని పక్షంలో వ్యర్థపదార్థాలు శరీరంలో నిల్వ ఉండిపోతాయి. దీనివలన శరీరం విషపూరితమై మరణం సంభవిస్తుంది.
డా|| విలియం కాఫ్ అనే డచ్ వైద్యుడు 1947లో డయాలసిస్ యంత్రాన్ని కనుగొన్నాడు. శరీరంలోని వృథా పదార్థాలను ఈ యంత్రం వడపోస్తుంది. ఈ యంత్రం వడపోత, ద్రవాభిసరణ సూత్రాల ద్వారా పారగమ్య త్వచాలనుపయోగించి పనిచేస్తుంది.
→ రక్తకణాలపై వివిధ రకాల ద్రవాలు ప్రభావం చూపుతాయి.
 వృక్ష కణాలలాగా జంతు కణాలలో కణ కవచం లేకపోవటం వలన, వివిధ రకాల ద్రవాల వలన అవి తీవ్రమైన మార్పులకు లోనవుతాయి. రక్త కణాలను తమ ద్రవాల గాఢత కంటే ఎక్కువ గాఢత గల ద్రవంలో ఉంచినపుడు అవి కృశించిపోతాయి. రక్త కణాలను తమ ద్రవాల గాఢత కంటే తక్కువ గాఢత గల డిస్టిల్ వాటర్ వంటి ద్రవాలలో ఉంచినప్పుడు కణాలు ఉబ్బి పగిలిపోతాయి.
గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే జంతు కణాలు తక్కువ గాఢత గల ద్రవంలో ఉంచినప్పుడు కణ కవచం లేకపోవటం వలన పగిలిపోతాయి. కాని వృక్ష కణాలు కణ కవచం. ఉండటం వలన అవి పగిలిపోవు.
→ దాహం వేసినప్పుడు చల్లటి పానీయం తాగాలనిపిస్తుందా?
 పక్షులు, జంతువులు దాహం వేసినపుడు ఏం చేస్తాయి? మంచినీరు త్రాగుతాయి. అభివృద్ధి చెందిన మానవులు మాత్రం దాహం తీర్చుకోవటానికి శీతల పానీయాలు త్రాగుతారు. నిజంగా శీతల పానీయాలు నీటిలాగా దాహాన్ని తీరుస్తాయా? శీతల పానీయాలు చక్కెర ద్రావణాన్ని CO2 ని కరిగించి తయారు చేస్తారు. శీతల పానీయం గాఢమైన చక్కెర ద్రావణం. శరీరం కణాలలో ద్రవం కన్న శీతల పానీయం గాఢత ఎక్కువ. దీని ప్రభావం మన శరీరంపై ఎలా ఉంటుంది? శీతల పానీయం తాగినా కూడా దాహం తీరకపోవడాన్ని మీరు గమనించే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించండి.
→ మీరు ప్రయాణంలో ఉప్పు, చక్కెరతో తయారైన ఆహార పదార్థాలు తింటారా?
 సాధారణంగా ఈ ప్రశ్నకు సమాధానం అవును అని వస్తుంది. మనం బస్సులో ప్రయాణం చేసే సమయంలో గాలి వేగం వలన శరీరం నుండి ఎక్కువ నీటిని కోల్పోతాం. ఆకర్షణీయమైన కవర్లలో నింపబడిన ఉప్పు వేసిన బంగాళదుంప చిప్స్ నోరూరిస్తాయి. 50 గ్రా.ల చిప్స్ తిన్న తర్వాత శరీరంలో ఉండే ద్రవాలను ఉప్పు పీల్చుకోవటం వలన నీరు అధికంగా జీర్ణవ్యవస్థలోకి చేరి ద్రవాల గాఢతను సరిచేస్తుంది. దీనివలన మనం ఉప్పుతో కూడిన పదార్థాలను తిన్న . తర్వాత ఎక్కువ దాహార్తికి గురవుతాం.
→ ప్రయాణంలో ఎటువంటి ఆహారం మంచిది?
 80 నుండి 90 శాతం నీరు కలిగిన సహజసిద్ధమైన పండ్లు మన ఆకలినే కాక దాహార్తిని కూడా తీరుస్తాయి.
