These AP 9th Physical Science Important Questions and Answers 8th Lesson గురుత్వాకర్షణ will help students prepare well for the exams.
AP Board 9th Class Physical Science 8th Lesson Important Questions and Answers గురుత్వాకర్షణ
9th Class Physical Science 8th Lesson గురుత్వాకర్షణ 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
 ఒక క్రమాకార వస్తువు యొక్క గురుత్వ కేంద్రమును కనుగొనుటకు చేయు ప్రయోగములో తీసుకోవలసిన జాగ్రత్తలు వ్రాయుము.
 జవాబు:
- జ్యామితీయ కేంద్రం గుండా తాడు పోయే విధంగా తాడును కట్టవలయును.
- వస్తువు పూర్తిగా విశ్రాంతికి వచ్చిన తర్వాతే తాడు గుండా గీతగీయాలి.
ప్రశ్న 2.
 భూమి చుట్టూ తిరిగే చంద్రుడు తన భ్రమణాలను ఆపేస్తే చంద్రుడు అనుసరించే మార్గం ఏది?
 జవాబు:
 భూమి చుట్టూ తిరిగే చంద్రుడు తన భ్రమణాలను ఆపేస్తే చంద్రుడు తను తిరుగుతున్న కక్ష్యకి స్పర్శరేఖ మార్గాన్ని అనుసరిస్తుంది.
ప్రశ్న 3.
 అభికేంద్ర బలంను నిర్వచించుము.
 జవాబు:
 సమవృత్తాకార చలనంలోనున్న వస్తువుపై పనిచేసే ఫలిత బలం, వృత్తకేంద్రం వైపునకు ఉంటే ఆ బలాన్ని ‘అభికేంద్ర బలం’ అంటారు.
ప్రశ్న 4.
 అభికేంద్ర త్వరణం అనగానేమి?
 జవాబు:
 వస్తువు వేగదిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణాన్ని అభికేంద్ర త్వరణం అంటారు.
ప్రశ్న 5.
 న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని తెలుపుము.
 జవాబు:
 విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును కొంత బలంతో ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బల పరిమాణం వాటి ద్రవ్యరాశుల లబ్దానికి అనులోమానుపాతంలోను, వాటి మధ్యదూర వర్గానికి విలోమానుపాతంలోను ఉంటుంది.

ప్రశ్న 6.
 గురుత్వ త్వరణమును నిర్వచింపుము.
 జవాబు:
 భూమికి దగ్గరగా ఉండే వస్తువుల్లో భూమ్యాకర్షణ వల్ల ఏర్పడే త్వరణమును గురుత్వ త్వరణము లేదా స్వేచ్ఛాపతన త్వరణము అంటారు.
ప్రశ్న 7.
 విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం అనగానేమి?
 జవాబు:
 ఒక కి.గా, ద్రవ్యరాశి గల రెండు వస్తువులు ఒక మీటరు దూరంలో వేరుచేయబడి ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలమును విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం (G) అంటారు.
ప్రశ్న 8.
 స్వేచ్ఛాపతన వస్తువు అనగానేమి?
 జవాబు:
 భూమ్యాకర్షణ బలంతో క్రిందికి పడే వస్తువులను స్వేచ్ఛాపతన వస్తువులు అంటారు.
ప్రశ్న 9.
 భారము అనగానేమి?
 జవాబు:
 స్వేచ్ఛావతన వస్తువు పై పనిచేసే భూమ్యాకర్షణ బలమును భారము అంటారు.
ప్రశ్న 10.
 గురుత్వ కేంద్రమును నిర్వచింపుము.
 జవాబు:
 ఒక వస్తువు యొక్క మొత్తం భారం ఏ బిందువుగుండా పనిచేస్తుందో ఆ’ బిందువునే ఆ వస్తువు యొక్క గురుత్వ కేంద్రం అంటారు.
ప్రశ్న 11.
 ఒక వస్తువు ఎప్పుడు సమతాస్థితిలో ఉంటుంది?
 జవాబు:
 వస్తువు గురుత్వ కేంద్రం నుండి గీసిన క్షితిజలంబం, దాని ఆధారిత వైశాల్య భాగం గుండా పోయినచో ఆ వస్తువు సమతాస్థితిలో లేక స్థిరత్వంలో ఉంటుంది.
ప్రశ్న 12.
 భ్రమణకాలం (T) అనగానేమి?
 జవాబు:
 సమవృత్తాకార చలనంలోనున్న వస్తువు ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టే కాలాన్ని భ్రమణకాలం (T) అంటారు.

ప్రశ్న 13.
 కొంత ఎత్తు నుండి చెరువు నీటిలోనికి లేదా స్విమ్మింగ్ పూల్ లోనికి దూకిన అనుభవం మీకుందా ? ఉంటే ఈ సందర్భంలో మీ శరీర స్థితిని గూర్చి వ్రాయుము.
 జవాబు:
 మనిషి ఎగిరినప్పుడు కాని, ఎత్తు నుండి కిందికి దూకేటప్పుడు కాని అతడు “భారరహిత స్థితి”లో ఉంటాడు. కావున చెరువులోకి గాని, స్విమ్మింగ్ పూల్ లోనికి గాని దూకినప్పుడు నా శరీరం గాలిలో తేలినట్లు అనిపిస్తుంది.
9th Class Physical Science 8th Lesson గురుత్వాకర్షణ 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 60 Kg ద్రవ్యరాశి గల ఒక వ్యక్తి చంద్రుని మీదకు వెళితే
 i) అతని ద్రవ్యరాశి మరియు భారములలో ఏమైనా మార్పు ఉంటుందా?
 జవాబు:
 అతని ద్రవ్యరాశి 60 kg మాత్రమే ఉంటుంది. కానీ, అతని భారంలో మార్పు ఉంటుంది.
ii) భూమి మరియు చంద్రునిపై అతని భారము ఎంత?
 జవాబు:
 భూమిపై అతని భారం We = mg = 60 × 9.8 = 588.0 = 588 N.
 
ప్రశ్న 2.
 క్రింది చలన సమీకరణాలను పరిగణలోకి తీసుకొని వాటిని స్వేచ్ఛా పతన వస్తువుకు ఆపాదించి వ్రాయండి.
 v=u + at
 s = ut + \(\frac{1}{2}\) at
 జవాబు:
 స్వేచ్ఛా పతన వస్తువుకి
 u = 0 (తొలివేగం = 0 మీ/సె)
 a = g (త్వరణం = గురుత్వ త్వరణం)
 s = h (దూరం = ఎత్తు)
 చలన సమీకరణాలు స్వేచ్ఛా పతన వస్తువుకి క్రింది విధంగా మారును.
 i) v = u+ at ⇒ v = 0 + gt ⇒ v = gt
 ii) s = ut + \(\frac{1}{2}\) at² ⇒ h = 0 + \(\frac{1}{2}\)gt² ⇒ h = \(\frac{1}{2}\)gr²
ప్రశ్న 3.
 గురుత్వాకర్షణబలం ఫార్ములా \(\mathrm{F}=\mathrm{G} \frac{\mathrm{M}_{1} \mathrm{M}_{2}}{\mathrm{R}^{2}}\) ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
 i) G విలువ ఎంత?
 జవాబు:
 G విలువ = 6.67 × 10-11 Nm²kg-2
ii) ఈ ఫార్ములాలో ‘R’ దేనిని తెలుపుము?
 జవాబు:
 ‘R’ రెండు వస్తువుల మధ్య దూరాన్ని సూచిస్తుంది.

ప్రశ్న 4.
 భూ వాతావరణం యొక్క గురుత్వ కేంద్రం ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడానికి రవి తన ఉపాధ్యాయుణ్ణి ఏ ప్రశ్నలు అడిగి ఉంటాడు? ఉపాధ్యాయుని సమాధానం ఏమై ఉంటుంది?
 జవాబు:
 రవి ప్రశ్నలు:
- భూమి ఏ ఆకారంలో ఉంటుంది?
- గోళాకృతిలో ఉన్న వస్తువు యొక్క గురుత్వ కేంద్రం ఎక్కడ ఉంటుంది?
ఉపాధ్యాయుని సమాధానాలు
- భూమి గోళాకారంలో ఉంటుంది.
- గోళం యొక్క జ్యామితీయం కేంద్రమే దాని గురుత్వ కేంద్రం అవుతుంది.
ప్రశ్న 5.
 చంద్రుడు భూమి చుట్టూ సుమారుగా వృత్తాకార మార్గంలో ఏ విధంగా చలించగలుగుతున్నాడు? అలా చలించడానికి సహాయపడుతున్న అంశమేమిటి?
 జవాబు:
- చంద్రుడు భూమి చుట్టూ సమవృత్తాకార చలనములో నిరంతరంగా చలించేందుకు చంద్రునిపై ఒక అభికేంద్ర బలం పనిచేయాలి.
- ఈ బలం భూమి మరియు చంద్రుడు మధ్య గల ఒక ఆకర్షణ బలం వలన ఉత్పత్తి అవుతుంది.
- అందువలన చంద్రుడు భూమి చుట్టూ చలించడానికి సహాయపడుతున్న అంశము అభికేంద్రబలమే.
ప్రశ్న 6.
 విశ్వగురుత్వ స్థిరాంకంను నిర్వచించుము. దానికి ప్రమాణాలను మరియు విలువను వ్రాయుము.
 జవాబు:
 1) విశ్వగురుత్వ స్థిరాంకం (G) :
 ఒక కేజీ ద్రవ్యరాశి గల రెండు వస్తువులు ఒక మీటరు దూరంలో వేరు చేయబడి ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం విశ్వగురుత్వ స్థిరాంకం (G) కు సమానము.
 న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం ప్రకారం
 
 2) ‘G’ యొక్క విలువ 6.67 × 10-11.
 3) దీని ప్రమాణాలు Nm² kg-2 అగును.
ప్రశ్న 7.
 స్వేచ్ఛాపతన వస్తువును నిర్వచించి, వివరించుము.
 జవాబు:
 స్వేచ్ఛాపతన వస్తువు :
 భూమ్యాకర్షణ బలం మాత్రమే పని చేసే వస్తువులను స్వేచ్ఛాపతన వస్తువు అంటారు.
వివరణ :
 కొంత ఎత్తు నుండి ఒక పుస్తకంను, పేపర్‌ను వదలిన పుస్తకం ముందుగా భూమిని చేరును. అదే గాలి నిరోధంను లెక్కలోనికి తీసుకోకున్న రెండు వస్తువులు భూమికి ఒకేసారి చేరును. ఈ వస్తువుల విషయంలో భూమి వాటిపై బలంను మాత్రమే ప్రయోగిస్తుంది. కావున వాటిని స్వేచ్ఛాపతన వస్తువులు అందురు.
ప్రశ్న 8.
 గురుత్వ కేంద్రంను నిర్వచించుము. కొన్ని జ్యామితీయ ఆకారాల యొక్క గురుత్వ కేంద్రంను తెల్పుము.
 జవాబు:
 గురుత్వ కేంద్రం :
 వస్తువు యొక్క ఏ స్థితిలోనైనా, స్థానంలోనైనా దాని బరువు యొక్క చర్యారేఖ, ఏ బిందువు గుండా పోతుందో ఆ బిందువును దాని గురుత్వ కేంద్రం లేక గరిమనాభి అందురు. వివిధ పటాలకు వేర్వేరు స్థానాలలో గురుత్వ కేంద్రముండును.
- వృత్తాకార వస్తువులకు వాటి కేంద్రం వద్ద,
- త్రిభుజాకార వస్తువులకు వాటి మధ్యగతరేఖల ఖండన బిందువు వద్ద ఉండును.
ప్రశ్న 9.
 స్థిరత్వం గూర్చి వ్రాయుము.
 జవాబు:
- ఒక వస్తు స్థిరత్వము దాని గురుత్వ కేంద్రంపై ఆధారపడి ఉండును.
- వస్తు గురుత్వ కేంద్రం గుండా గీసిన క్షితిజ లంబము, దాని ఆధార వైశాల్యం గుండా పోయిన ఆ వస్తువు స్థిరత్వాన్ని కలిగి ఉండును.
- వస్తు గురుత్వ కేంద్రం గుండా గీసిన క్షితిజ లంబము, దాని ఆధార వైశాల్యమునకు దూరంగా బయటకి వెళ్ళిన ఆ వస్తువు స్థిరత్వాన్ని కోల్పోయి పడిపోవును.

ప్రశ్న 10.
 రాజు తన 9వ తరగతి పుస్తకం నుండి “గురుత్వాకర్షణ” పాఠంను చదివాడు. అతనికి చంద్రుడు, భూమి, సూర్యుని చలనాలపై కొన్ని సందేహాలు తలెత్తాయి. అవి ఏమిటో ఊహించి వ్రాయుము.
 జవాబు:
- భూమి, సూర్యుని చుట్టూ చేసే చలనం ఏ రకమైనది?
- చంద్రుడు, భూమి చుట్టూ అదే రకమైన చలనంలో ఉన్నాడా?
- భూమి, చంద్రునికి మరియు సూర్యునికి, భూమికి మధ్య ఏమైనా బలాలు పని చేస్తున్నాయా?
ప్రశ్న 11.
 వర్షాకాలంలో నీటి గుంటలయందు సైకిల్ చక్రాన్ని తిప్పిన చక్రం నుండి వచ్చు నీటి దిశ ఒక ఋజుమార్గంలో ప్రయాణించును. ఎందుకో మీ ఉపాధ్యాయుడిని అడిగి సమాచారాన్ని సేకరించుము.
 జవాబు:
 వృత్తాకార మార్గం పరంగా వస్తువు యొక్క వేగం ఎల్లప్పుడూ వృత్తాకార మార్గానికి గీసిన స్పర్శరేఖ దిశలో ఉంటుంది. అదేవిధంగా చక్రం నుండి విడుదలగు నీటి (వస్తువు) దిశ ఎల్లప్పుడు ఋజుమార్గంలోనే ప్రయాణించును.
ప్రశ్న 12.
 సమవృత్తాకార చలనంలో వున్న వస్తు వేగసదిశలను చూపు పటంను గీయుము.
 జవాబు:
 
ప్రశ్న 13.
 సమవృత్తాకార చలనంలో వున్న వస్తువు యొక్క త్వరణ దిశను చూపు పటము గీయుము.
 జవాబు:
 
9th Class Physical Science 8th Lesson గురుత్వాకర్షణ 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 ఒక వస్తువు యొక్క గురుత్వ కేంద్రం ఆ వస్తువు యొక్క బయటిభాగంలో ఉండే సందర్భాలను రెండింటిని తెల్పి, వివరించండి.
 జవాబు:
- ఒక అథ్లెట్ హైజంప్ చేయు సందర్భంలో, కొంత ఎత్తునుండి పారాచూట్ సహాయంతో విమానం నుండి దూకు సందర్భంలో గురుత్వ కేంద్రం బయటకు వచ్చును. ఎందుకనగా ఈ స్థితిలో వస్తువు అస్థిరత్వం మరియు భారరహితంగా ఉంటుంది కావున.
- గుర్రపునాడ అయస్కాంతం యొక్క గురుత్వకేంద్రం బాహ్యంగా ఉంటుంది. కానీ వస్తువుపై ఉండదు.
- వృత్తాకార రింగ్ యొక్క గురుత్వ కేంద్రం, దాని మధ్య భాగంలో ఉంటుంది. కానీ వస్తువుపై ఉండదు.
- అర్ధగోళం (గుల్ల) యొక్క గురుత్వ కేంద్రం కూడా వస్తువుకి బయటే ఉంటుంది.
ప్రశ్న 2.
 20 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల రెండు గోళాకార వస్తువుల కేంద్రాల మధ్య దూరం 20 సెం.మీ. వాటి మధ్యగల గురుత్వాకర్షణ బలంను లెక్కించండి. (G = 6.67 × 10-11 Nm²kg-2)
 జవాబు:
 రెండు గోళాకార వస్తువుల ద్రవ్యరాశులు వరుసగా (m,, m) = 20 కి.గ్రా మరియు 20 కి.గ్రా.
 గోళాల మధ్య దూరం (d) = 20 cm = 0.2 m.
 G = 6.67 × 10-11 Nm²kg-2
 
ప్రశ్న 3.
 కింది సమర్తి వస్తువుల పటములు గీచి ద్రవ్యరాశి కేంద్రములను గుర్తించండి.
 i) సమబాహు త్రిభుజం ii) చతురస్రం iii) వృత్తం
 జవాబు:
 
b) వస్తువు గరిమనాభి ప్రత్యేకత ఏమిటి?
 జవాబు:
- ఒక వస్తు స్థిరత్వము దాని గురుత్వ కేంద్రంపై ఆధారపడి ఉండును.
- వస్తు గురుత్వ కేంద్రం గుండా గీసిన క్షితిజ లంబము, దాని ఆధార వైశాల్యం గుండా పోయిన ఆ వస్తువు స్థిరత్వాన్ని కలిగి ఉండును.
- వస్తు గురుత్వ కేంద్రం గుండా గీసిన క్షితిజ లంబము, దాని ఆధార వైశాల్యమునకు దూరంగా బయటకి వెళ్ళిన ఆ వస్తువు స్థిరత్వాన్ని కోల్పోయి పడిపోవును.
ప్రశ్న 4.
 అభికేంద్ర బలమును నిర్వచించి, దానిని లెక్కించుటకు సూత్రంను రాబట్టుము.
 జవాబు:
 1) అభికేంద్ర బలము :
 సమవృత్తాకార చలనంలో ఉన్న వస్తువుపై పనిచేసే ఫలిత బలం వృత్తకేంద్రం వైపు పనిచేయు బలమును “అభికేంద్ర బలము” అంటారు.
2) ఇది వస్తు వేగ దిశను మాత్రమే మార్చగల ఫలిత బలం. కావున న్యూటన్ రెండవ గమన నియమం నుండి ఫలిత బలం, Fnet = ద్రవ్యరాశి × త్వరణము
3) సమవృత్తాకార చలనంలో ఫలితబలం, అభికేంద్ర బలం (Fc)కి సమానం కావున
 
 4) ఈ బలం (Fc) దిశ ఎల్లప్పుడూ వృత్త కేంద్రం వైపు ఉంటుంది.

ప్రశ్న 5.
 అభికేంద్ర త్వరణమనగానేమి? దానిని లెక్కించుటకు సూత్రమును రాబట్టుము.
 జవాబు:
 1) అభికేంద్ర త్వరణం :
 వస్తువు వేగదిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణాన్ని “అభికేంద్ర త్వరణం” అంటారు.
2) ఈ త్వరణ పరిమాణం, ఒక పూర్తి భ్రమణంలో వస్తువు పొందిన వేగ మార్పు పరిమాణం మరియు భ్రమణ కాల నిష్పత్తికి సమానము.
3) సమవృత్తాకార చలనంలో గల వస్తు త్వరణంను ‘a.’ అనుకొనుము.
 
ప్రశ్న 6.
 న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమమును తెల్పి, దానిని వివరించుము.
 జవాబు:
 
 విశ్వగురుత్వాకర్షణ నియమము :
 విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బల పరి మాణం వాటి ద్రవ్యరాశుల లబ్దానికి అనులోమానుపాతం లోనూ, వాటి మధ్య దూర వర్గానికి విలోమాను పాతంలోనూ ఉంటుంది.
వివరణ :
 ఈ నియమం ప్రకారం, విశ్వంలోని ఏవైనా రెండు వస్తువుల ద్రవ్యరాశులు M1 మరియు M2, వాటి మధ్య దూరము ‘d’ అనుకొనుము.
వాటి మధ్య ఆకర్షణ బలం (F), వాటి ద్రవ్యరాశుల లబ్దానికి అనులోమానుపాతంలోనూ అనగా F ∝ M1 M2
  
 
 
ప్రశ్న 7.
 గురుత్వత్వరణమును నిర్వచించుము. భూమి ద్రవ్యరాశి (M) మరియు విశ్వగురుత్వ స్థిరాంకం (G)లలో గురుత్వ త్వరణంకు గల సంబంధమును రాబట్టుము.
 జవాబు:
 
 1) ‘m’ ద్రవ్యరాశి గల వస్తువు (ఆపిల్)ను భూ ఉపరితలానికి దగ్గరగా విడువుము.
 2) భూమి ద్రవ్యరాశి ‘M’ మరియు భూమి వ్యాసార్ధం ‘R’ అనుకొనుము.
 
 పై సూత్రం ద్వారా ‘g’ విలువ వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడదు.
 వ్యాసార్ధపు వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది.
గురుత్వ త్వరణం :
 భూమికి దగ్గరగా ఉండే వస్తువుల్లో భూమ్యాకర్షణ వల్ల ఏర్పడే త్వరణంను గురుత్వత్వరణం లేదా స్వేచ్ఛాపతన త్వరణం అంటారు.
భూ ఉపరితలం వద్ద ‘g’ విలువ 9.8 మీ/సె² గా ఉండును.
ప్రశ్న 8.
 స్వేచ్ఛా పతన సమీకరణాలను వ్రాయుము. వాటి విషయంలో ‘g’ యొక్క ప్రభావంను తెల్పుము. దాని గుర్తులో మార్పు గూర్చి వ్రాయుము.
 జవాబు:
- స్వేచ్చా పతన వస్తు సమీకరణాలు V = u + at. s = ut + \(\frac{1}{2}\)at² మరియు v² – u² = 2as లు అగును.
  
- గురుత్వ త్వరణం (g) విలువ, భూ కేంద్రం నుండి వస్తువుకు గల దూరంతో పాటు మారును.
- భూ ఉపరితలం వద్ద ‘g’ విలువ స్థిరము. భూమి నుండి పైకి వెళ్ళే కొలది ‘g’ విలువ ధనాత్మకము, భూమి నుండి క్రిందకి వెళ్ళేకొలది ఋణాత్మకంగా తీసుకుంటాము.
ప్రశ్న 9.
 విశ్వగురుత్వ స్థిరాంకానికి మరియు గురుత్వ త్వరణానికి మధ్య గల భేదాలను వ్రాయండి.
 జవాబు:
| విశ్వగురుత్వ స్థిరాంకము | గురుత్వ త్వరణము | 
| 1) ప్రమాణ ద్రవ్యరాశులు గల రెండు వస్తువులు ప్రమాణ దూరంలో వేరు పరచబడిన వాని మధ్య గల గురుత్వాకర్షణ బలాన్ని విశ్వగురుత్వ స్థిరాంకం అంటారు. | 1) స్వేచ్ఛాపతన వస్తువులో, గురుత్వాకర్షణ బలం వలన కలిగే త్వరణాన్ని గురుత్వ త్వరణం అంటారు. | 
| 2) దీనిని ‘G’ తో సూచిస్తారు. | 2) దీనిని ‘g’ తో సూచిస్తారు. | 
| 3) దీని విలువ విశ్వంలో ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది. | 3) దీని విలువ ప్రదేశం నుండి ప్రదేశానికి మారును. | 
ప్రశ్న 10.
 ఒక క్రమాకార వస్తువు యొక్క గురుత్వ కేంద్రాన్ని కనుగొనే పద్ధతిని తెలుపుము.
 జవాబు:
 
- ఒక మీటరు స్కేలును తీసుకొనుము.
- ఆ స్కేలుపై వేర్వేరు బిందువులను మరియు మధ్య బిందువును గుర్తించుము.
- ఆ స్కేలును వేర్వేరు బిందువుల వద్ద పటంలో చూపినట్లు వ్రేలాడదీయుము. అది క్షితిజ సమాంతరంగా ఉండదు.
- ఇప్పుడు ఆ స్కేలును మధ్య బిందువు వద్ద వ్రేలాడదీయుము. అది క్షితిజ సమాంతరంగాను, స్థిరంగాను ఉండటం గమనించవచ్చును.
- స్కేలు యొక్క ఈ జ్యామితీయ కేంద్రం దాని గురుత్వ కేంద్రం అగును.
- స్కేలుపై గల ప్రతి చిన్న భాగాన్ని భూమి ఆకర్షించును.
- ఆ చిన్న చిన్న బలాల ఫలితబలం ఒక బిందువు వద్ద పని చేయును, దానినే గురుత్వ కేంద్రం అంటారు.

ప్రశ్న 11.
 ఒక అక్రమాకార వస్తువు యొక్క గురుత్వ కేంద్రంను ఏ విధముగా కనుగొంటారో వివరించుము.
 జవాబు:
 
- అక్రమాకార వస్తువు అంచుల వద్ద A, B, C అను మూడు రంధ్రాలను చేయుము.
- A రంధ్రం సహాయంతో కారు బోర్డును దారం సహాయంతో P మేకుకు వ్రేలాడదీయుము.
- వడంబకమును కూడా అదే మేకు నుండి వ్రేలాడదీయుము.
- వడంబకం త్రాడు వెంబడి వస్తువు పై AD సరళరేఖను గీయుము. ఈ రేఖ ఆ స్థానంలో వస్తువు బరువు యొక్క చర్యా దిశను తెలియజేస్తుంది.
- ఇదే ప్రయోగాన్ని, వస్తువును B రంధ్రం, C రంధ్రంల నుండి వ్రేలాడదీసి BE, CF చర్యారేఖలను గీయవలెను.
- ఈ మూడు చర్యారేఖల ఖండిత బిందువు ‘G’ వస్తువు గురుత్వ కేంద్రం అగును.
ప్రశ్న 12.
 కింది పటంను గమనించి దానిపై రెండు వాక్యాలను వ్రాయుము.
 జవాబు:
 
- పై పటంలో భూమ్యాకర్షణ బలం వలన ఆపిల్ భూమి వైపు లాగబడుచున్నది.
- ఈ విషయంలో వస్తువును స్వేచ్ఛా పతన వస్తువు అందురు.
ప్రశ్న 13.
 కొన్ని జ్యామితీయ ఆకారాల యొక్క గురుత్వ కేంద్రాలను తెలుపు నమూనాను తయారు చేయండి.
 జవాబు:
| వస్తువు ఆకారము | గురుత్వ కేంద్రం ఏర్పడు స్థానము | 
| 1. క్రమస్థూపము | మధ్య బిందువు వద్ద | 
| 2. వృత్తాకార ప్లేటు | ప్లేటు మధ్య బిందువు వద్ద | 
| 3. త్రిభుజాకార వస్తువు | భుజాల మధ్యగత రేఖల మిళిత బిందువు వద్ద | 
| 4. స్థూపాకార శంకువు | శంకువు భూమి ఎత్తు (h) లో నాల్గవ వంతు వద్ద | 
| 5. దీర్ఘచతురస్రాకార వస్తువు | కర్ణాల ఖండన బిందువు వద్ద | 
| 6. వృత్తాకార రింగు | రింగు యొక్క మధ్యన (బాహ్యంగా) | 
9th Class Physical Science 8th Lesson గురుత్వాకర్షణ 1 Mark Bits Questions and Answers
1. సమవృత్తాకార చలనంలో వస్తువు విషయంలో సరియైనది / సరియైనవి
 i) వలిత బలం వస్తువు వేగదిశను మాత్రమే మారుస్తుంది.
 ii) ఫలితబలం ఎల్లపుడూ కేంద్రంవైపు ఉంటుంది.
 iii) ఫలితబలంను అభికేంద్రబలం అంటారు.
 A) i, ii
 B) ii, iii
 C) i, iii
 D) i, ii, iii
 జవాబు:
 D) i, ii, iii
2. భావన (A) : 10 కేజీల వస్తు భారం 98N
 కారణం (R) : భారం W = mg
 A) భావన (A) కారణం (R) రెండూ సత్యం మరియు R, A ను బలపరుస్తుంది.
 B) భావన (A) కారణం (R) రెండు సత్యం మరియు R, A ను బలపరచదు.
 C) భావన (A) సత్యం, కారణం (R) అసత్యం
 D) భావన (A) అసత్యం , R సత్యం
 జవాబు:
 A) భావన (A) కారణం (R) రెండూ సత్యం మరియు R, A ను బలపరుస్తుంది.
3. విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం విలువ
 A) 6.67 × 1011 Nm-2 kg²
 B) 6.67 × 10-11 Nm² kg-2
 C) 6.67 × 10-19 Nm² kg-2
 D) 6.67 × 10-11Nm-2 kg²
 జవాబు:
 B) 6.67 × 10-11 Nm² kg-2

4. నీ తరగతిలో ఒకేసారి ఒకరాయిని, ఆకును ఒకే ఎత్తునుండి పడవేసినపుడు నీ పరిశీలన
 A) రెండూ ఒకే కాలంలో భూమిని చేరుతాయి
 B) గాలిలో ఘర్షణ వల్ల రాయి భూమిని త్వరగా చేరుతుంది.
 C) ఆకు త్వరగా భూమిని చేరుతుంది.
 D) రెండూ భూమిని చేరవు.
 జవాబు:
 B) గాలిలో ఘర్షణ వల్ల రాయి భూమిని త్వరగా చేరుతుంది.
5. సమ వృత్తాకార చలనంలో త్వరణ దిశ
 A) స్పర్శ రేఖ వెంబడి
 B) కేంద్రం వైపు
 C) కేంద్రం వెలుపల
 D) దిశ ఉండదు
 జవాబు:
 B) కేంద్రం వైపు
6. భూ ఉపరితలం నుండి దూరంగా వెళ్ళేకొలది గురుత్వ త్వరణం విలువ
 A) తగ్గుతుంది
 B) పెరుగుతుంది
 C) మారదు
 D) శూన్యం
 జవాబు:
 A) తగ్గుతుంది
7. భావన (A) : ఒక వస్తు భారం చంద్రునిపై భూమి కంటే తక్కువగా ఉంటుంది.
 కారణం (R) : భూమి చంద్రుని కంటే బరువైనది.
 A) A మరియు R రెండు సరైనవి మరియు R, Aకు సరైన వివరణ
 B) A మరియు R రెండు సరైనవి మరియు R, Aకు సరైన వివరణ కాదు
 C) A సరైనది, కానీ R సరైనది కాదు
 D) A సరైనది కాదు, R సరైనది
 జవాబు:
 B) A మరియు R రెండు సరైనవి మరియు R, Aకు సరైన వివరణ కాదు
8. ఒక అర్థవంతమైన ప్రయోగం కొరకు కింది ఐచ్చికాల సరైన క్రమము
 P) ఒక బిందువు నుండి ఒక వస్తువును వ్రేలాడదీసి, క్షితిజ లంబాన్ని గీయండి.
 Q) రెండు రేఖల ఖండన బిందువు గురుత్వ కేంద్రం అవుతుంది.
 R) స్టీలు ప్లేటుతో తయారు చేసిన భారతదేశ పటాన్ని తీసుకోండి.
 S) మరొక బిందువు నుండి వస్తువును వ్రేలాడదీసి, క్షితిజ లంబరేఖను గీయండి.
 A) P,Q, R, S
 B) R, S, P,Q
 C) R, P, S, Q
 D) Q, R, P, S
 జవాబు:
 C) R, P, S, Q
9. ఒక వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉంటే, ఆ వస్తువు తొలి వేగమెంత?
 A) 9.8 మీ/సె.
 B) 8.9 మీ/సె.
 C) 0 మీ/సె.
 D) 10 మీ/సె.
 జవాబు:
 C) 0 మీ/సె.
10. గురుత్వ త్వరణం ఏ దిశలో పనిచేస్తుంది?
 A) ఎల్లపుడూ కిందికి
 B) ఎల్లపుడూ పైకి
 C) కొన్ని సందర్భాల్లో కిందికి, కొన్ని సందర్భాల్లో పైకి
 D) వస్తువు కదిలే దిశలో
 జవాబు:
 A) ఎల్లపుడూ కిందికి
I. సరియైన సమాధానమును రాయుము.
11. త్రిభుజాకారపు ఆకృతి గరిమనాభి
 A) లంబకేంద్రము
 B) గురుత్వ కేంద్రం
 C) అంతరవృత్త కేంద్రం
 D) పరివృత్త కేంద్రం
 జవాబు:
 D) పరివృత్త కేంద్రం

12. ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరిన, దాని గురుత్వ బలం పనిచేయు దిశ …… వైపు ఉండును.
 A) వస్తు చలనదిశ
 B) చలన దిశకు వ్యతిరేకదిశ
 C) స్థిరముగా
 D) వస్తువు పైకి వెళ్ళేటపుడు పెరుగును
 జవాబు:
 B) చలన దిశకు వ్యతిరేకదిశ
13. కొంత ఎత్తు నుండి పడుతున్న బంతిని
 A) భూమి మాత్రమే ఆకర్షించును
 B) బంతి మాత్రమే ఆకర్షించును
 C) రెండూనూ ఒకదానికొకటి ఆకర్షించుకొనును
 D) ఒకదానికొకటి వికర్పించుకొనును
 జవాబు:
 C) రెండూనూ ఒకదానికొకటి ఆకర్షించుకొనును
14. న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం పనిచేయు సందర్భం …………….
 A) సౌరవ్యవస్థలో మాత్రమే
 B) భూమిపై వస్తువుల మధ్య
 C) గ్రహాలందు మాత్రమే
 D) విశ్వమంతయు
 జవాబు:
 D) విశ్వమంతయు
15. ‘g’ మరియు ‘G’ ల మధ్య సంబంధము
 
 జవాబు:
 D
16. భూమికి దగ్గరగా గురుత్వ త్వరణము విలువ
 A) 8.9 ms-2
 B) 9.8 ms-2
 C) 8.9 cms-2
 D) 9.8 cms-2
 జవాబు:
 D) 9.8 cms-2
17. శూన్యం నందు స్వేచ్ఛాపతన వస్తువులన్నీ …………… కలిగి ఉంటాయి.
 A) ఒకే వేగాన్ని
 B) ఒకే వడిని
 C) ఒకే త్వరణాన్ని
 D) ఒకే బలాన్ని
 జవాబు:
 C) ఒకే త్వరణాన్ని
18. కొంత ఎత్తు నుండి ఒక రాయిని విడిచారు. 20 mలు పడిన తర్వాత దాని వేగము …………
 A) – 10 m/s
 B) 10 m/s
 C) – 20 m/s
 D) 20 m/s
 జవాబు:
 C) – 20 m/s
19. 10కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తు భారము
 A) 98 న్యూటన్లు
 B) 89 న్యూటన్లు
 C) 9.8 న్యూటన్లు
 D) 8.9 న్యూటన్లు
 జవాబు:
 A) 98 న్యూటన్లు

20. వస్తు భారమును వ్యక్తపరచని ప్రమాణాలు ……………….
 A) కేజీ – భారము
 B) న్యూటన్లు
 C) డైన
 D) కేజీ
 జవాబు:
 D) కేజీ
II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.
1. విశ్వంలోని ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా ………… బలం ఉంటుందనే భావన న్యూటన్ అభివృద్ధి చెందించాడు.
 2. ఏదైనా వస్తువు స్థిరవడితో వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉంటే ఆ వస్తువు చలనాన్ని ………….. అంటారు.
 3. వస్తువు వేగం ఎల్లపుడు వృత్తాకార మార్గానికి గీసిన ……….. దిశలో వుండును.
 4. గమనంలో ఉన్న ఏ వస్తువైనా పనిచేసే ఫలిత బలదిశ ఆ వస్తువు యొక్క ………… దిశలోనే ఉంటుంది.
 5. వస్తు వేగ దిశను మాత్రమే మార్చగల ఫలిత బలాన్ని ………. బలం అంటారు.
 6. వేగ దిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణాన్ని ………… అంటారు.
 7. భూమి చుట్టూ చంద్రుని యొక్క చలనము ఇంచుమించు ………….. చలనమును పోలి వుంటుంది.
 8. భూమి నుండి చంద్రునికి గల దూరము ……… కి.మీ.
 9. భూమి చుట్టూ చంద్రుడు ఒక పూర్తి భ్రమణానికి పట్టు కాలం ……………………..
 10. భూమిపై చంద్రుడి త్వరణం ………
 11. భూ ఉపరితలానికి దగ్గరగా ఉండే వస్తువుల్లో త్వరణం
 12. భూ వ్యా సార్ధం …………………..
 13. విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకము (G) విలువ ………
 14. భూమికి దగ్గరగా భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో చలించే ఉపగ్రహం తీసుకునే సమయం సుమారుగా ……………..
 15. G, gల మధ్య సంబంధము ……………
 16. వస్తువు సమతాస్థితిలో ఉన్నప్పుడు వస్తువుపై పనిచేసే ఆధారిత బలము
 17. స్వేచ్ఛాపతన స్థితిలో వస్తువు …………. స్థితిగా వుంటుంది.
 18. ఒక వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉంటే ఆ వస్తువును …………….. వస్తువంటారు.
 19. వస్తు స్థిరత్వం, ఆ వస్తువు ………………. పై ఆధారపడి ఉంటుంది.
 జవాబు:
- గురుత్వాకర్షణ
- సమవృత్తాకార చలనం
- స్పర్శరేఖ
- త్వరణ
- అభికేంద్ర
- అభికేంద్ర త్వరణం
- సమవృత్తాకారం
- 3,84,400
- 27.3 రోజులు లేక 2.35 × 106 సెకనులు
- 0.27 సెం.మీ/సె²
- 981 సెం.మీ/సె²
- 6371 కి.మీ.
- 6.67 × 10-11 Nm²/kg²
- 1 గం|| 24.7 ని॥లు
- \(\left(g=\frac{G M}{R^{2}}\right)\)
- భారము
- భారరహిత
- స్వేచ్ఛాపతన
- గురుత్వ కేంద్రం
III. జతపరచుము.
i)
| Group – A | Group – B | 
| 1. భూమి ద్రవ్యరాశి | A) 9.8 m/se2 | 
| 2. భూ వ్యాసార్ధం | B) 0.027 m/s2 | 
| 3. భూమిపై చంద్రుని త్వరణం విలువ | C) 6.4 × 106 కి.మీ. | 
| 4. భూమిపై గురుత్వ త్వరణం విలువ | D) 6 × 1024 కి.గ్రా. | 
జవాబు:
| Group – A | Group – B | 
| 1. భూమి ద్రవ్యరాశి | D) 6 × 1024 కి.గ్రా. | 
| 2. భూ వ్యాసార్ధం | C) 6.4 × 106 కి.మీ. | 
| 3. భూమిపై చంద్రుని త్వరణం విలువ | B) 0.027 m/s2 | 
| 4. భూమిపై గురుత్వ త్వరణం విలువ | A) 9.8 m/se2 | 
ii)
| Group – A | Group – B | 
| 1. భారము | A) వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉండటం | 
| 2. అభికేంద్ర బలం | B) వస్తువు మొత్తం భారం ఏ బిందువు గుండా పని చేస్తుందో ఆ బిందువు | 
| 3. అభికేంద్ర త్వరణం | C) భూమ్యాకర్షణ వల్ల కలిగే త్వరణం | 
| 4. గురుత్వ కేంద్రం | D) వస్తువును సమవృత్తాకార చలనంలో ఉంచేందుకు ప్రయత్నించే బలం | 
| 5. గురుత్వ త్వరణం | E) వస్తువు పై పనిచేసే భూమ్యాకర్షణ బలము | 
| 6. స్వేచ్ఛాపతన వస్తువు | F) వస్తు వేగ దిశలో మాత్రమే నిరంతరంగా మార్పు తీసుకొని వచ్చే త్వరణం | 
జవాబు:
| Group – A | Group – B | 
| 1. భారము | E) వస్తువు పై పనిచేసే భూమ్యాకర్షణ బలము | 
| 2. అభికేంద్ర బలం | D) వస్తువును సమవృత్తాకార చలనంలో ఉంచేందుకు ప్రయత్నించే బలం | 
| 3. అభికేంద్ర త్వరణం | F) వస్తు వేగ దిశలో మాత్రమే నిరంతరంగా మార్పు తీసుకొని వచ్చే త్వరణం | 
| 4. గురుత్వ కేంద్రం | B) వస్తువు మొత్తం భారం ఏ బిందువు గుండా పని చేస్తుందో ఆ బిందువు | 
| 5. గురుత్వ త్వరణం | C) భూమ్యాకర్షణ వల్ల కలిగే త్వరణం | 
| 6. స్వేచ్ఛాపతన వస్తువు | A) వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉండటం | 
 
 