Andhra Pradesh AP Board 5th Class Telugu Solutions 3rd Lesson కొండవాగు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Telugu Solutions Chapter 3 కొండవాగు
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.

 ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
 పై బొమ్మలో మీకు ఏమేం కనిపిస్తున్నాయి ?
 జవాబు:
 పై బొమ్మలో మాకు – విహార యాత్రకు వెళ్తున్న బస్సు, అందులోని డ్రైవరు – పిల్లలు; దారికి అడ్డంగా వెళ్తున్న మేకలు కర్ర పుచ్చుకుని చంకలో చిన్న మేకపిల్లతో వెనకాల వెళ్తున్న కాపరి, అతని వెనకాల – వీపు పైన మరొక చిన్న మేకపిల్లను మోసుకెళ్తున్న చిన్నమ్మాయి.
ప్రశ్న 2.
 పిల్లలంతా ఎక్కడకు వెళ్తున్నారు ?
 జవాబు:
 పిల్లలంతా విహారయాత్రకు వెళ్తున్నారు.

ప్రశ్న 3.
 మీరు చేసిన ఒక ప్రయాణం గురించి చెప్పండి.
 జవాబు:
 క్రిందటి దసరా సెలవులకు నాన్న – అమ్మ – నేను – అక్క అందరూ విజయవాడ వెళ్ళాం. మా ఊరు నుండి విజయవాడ 2 1/2 గంటల ప్రయాణం. నాన్న మాకు విజయవాడ నగరం మొత్తం చూపించాడు. ముందుగా దసరా పండుగ రోజులు కదా! అందుకని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నాం.
ఆరోజు సరస్వతీ అమ్మవారుగా అవతారం వేశారు. చదువుకునే పిల్లలు దర్శించుకుంటే మంచిదట. అందుకని మొదట గుడికి వెళ్ళి అక్కడనుండి కృష్ణానదిలో స్నానం చేసి, కొండపల్లి కోటకు వెళ్ళాం. అక్కడ ఉన్న ఏనుగులశాల, గుఱ్ఱలశాల, కోనేరు అన్నీ చూసాం. కొండపల్లి బొమ్మలు కొనుక్కున్నాం. చాలా బాగున్నాయి. సాయంత్రానికి ఇంటికి వచ్చేశాము.
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
 జావేద్ సెలవులలో రామం వాళ్ళ ఊరు వెళ్ళాడు కదా! అక్కడ ఏమేం చూశాడో చెప్పండి.
 జవాబు:
 జావేద్ – రామం వాళ్ళ ఊళ్ళో … రకరకాల కొండలు, బిల బిలమంటూ పారే వాగులు, పచ్చని చెట్లు, మిట్ట పల్లాల దారులు, కొండల మీద నుండి జాలువారుతున్న బోలెడన్ని నీటిపాయలు, గుట్టలు, గుట్ట మధ్యలోని నీటి బుగ్గ, పాము మెలికల్లాంటి దారులు, కొండపల్లి బొమ్మల్లాంటి ఇళ్ళను చూసాడు.
ప్రశ్న 2.
 మీరు ఏదైనా ఊరు వెళ్ళడానికి ఏమేం సిద్ధం చేసుకుంటారో చెప్పండి.
 జవాబు:
 మేము ఏదైనా ఊరు వెళ్ళాలంటే ముందుగా – మేం వెళ్ళే ఊరు దాని విశిష్ఠత, అక్కడ చూడదగ్గ ప్రదేశాలు సమాచారం దగ్గర పెట్టుకుంటాం, వెళ్ళటానికి కావల్సిన బట్టలు ఉదయం నుండి రాత్రి వరకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, అవసరమైన మందులు, సరిపడినంతా డబ్బులు, తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు – తినడానికి సరిపడే తినుబండారాలు, చక్కని దృశ్యాలను ఫోటో తీయడానికి కెమేరా మొబైల్స్ – చార్జర్లు మొదలైనవన్నీ సిద్ధం చేసుకుంటాము.

ప్రశ్న 3.
 మీ ఊరిలో మీకు నచ్చిన విషయాలను చెప్పండి.
 జవాబు:
 మా ఊరిలో అన్ని నాకు నచ్చిన విషయాలే. ఊరి బైట నుండి మధ్యదాక పచ్చగా పరుచుకున్న పంటపొలాలు, 24 గిలకలతో ఉన్న పెద్ద ఊట బావి, ప్రక్కనే చెరువు, పెద్ద కొండ, కొండ పైన కోనేరు, కోనేరు ప్రక్క దీపాల గుడి, ఊరి మధ్యలో వేణుగోపాల స్వామి గుడి, శివాలయం, రాముడు తయారుజేసే జిలేబి కొట్టు, చెరువు ప్రక్కనే పార్కు, పార్కులో పెద్ద వేదిక, వేదిక పైన గొట్టాల మైకులోనుండి వినిపించే వార్తలు. ఊరిమధ్యలోని రచ్చబండ – ఇవన్నీ మా ఊరిలో నాకు నచ్చే విషయాలు.
చదవడం – వ్యక్త పరచడం
అ) పాఠం చదవండి. కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాలో ఉన్నాయో గుర్తించి గీత గీయండి. పేరా సంఖ్య రాయండి.
ప్రశ్న 1.
 సూర్యకాంతిపడి ఆ పాయలన్నీ తళతళ మెరుస్తున్నాయి …………………
 జవాబు:
 4వ పేరా
ప్రశ్న 2.
 చూడాలనుకోవాలే గానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే ……………………..
 జవాబు:
 8వ పేరా
ప్రశ్న 3.
 ఆ వాగు పుట్టినచోటికి ఎలా వెళ్ళడమా అనే ఆలోచన నాకు ……………………
 జవాబు:
 2వ పేరా
ప్రశ్న 4.
 మేఘాలు ఏనుగుల్లా బారులు తీసి వరుసగా నడుస్తున్నట్లు ఉంది ……………………….
 జవాబు:
 7వ పేరా

ప్రశ్న 5.
 దూరాన ఉన్న ఇళ్లన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి ………………………..
 జవాబు:
 6వ పేరా
ఆ) పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
హెలెన్ కెల్లర్ మన అందరిలా చూడలేదు. కాని స్పర్శ ద్వారా గ్రహిస్తుంది. ఆమె ఏమంటోందో ఆమె మాటల్లోనే చూడండి. పోకచెక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను. వసంత కాలంలో కొత్త పరిమళాల పూలకోసం అన్వేషిస్తాను. పట్టువంటి ఆ పూలరెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఒక చెట్టు కొమ్మకు చేతిని ఆనించగానే ఏదో ఒక పక్షి కుహు కుహు శబ్దాలు చెవుల్లో మారుమ్రోగుతాయి. సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ళ సందుల నుండి నీళ్ళు ప్రవహించడం నాకు పట్టరాని ఆనందాన్నిస్తుంది.
 
 ప్రశ్న 1.
 హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది ?
 జవాబు:
 హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా పోక చెక్క నున్న దనాన్ని, దేవదారు వృక్షాల కరకు దనాన్ని గుర్తించేది.
ప్రశ్న 2.
 హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది ?
 జవాబు:
 హెలెన్ కెల్లర్ పూలను, పూల రెక్కల మృదుత్వాన్ని పట్టుతో’ పోల్చి వర్ణించింది.
ప్రశ్న 3.
 హెలెన్ కెల్లర్ కి ఆనందాన్ని కలిగించినవి ఏవి ?
 జవాబు:
 పట్టువంటి పూల రెక్కల మృదుత్యాన్ని తాకడం, వాటి సువాసనను ఆస్వాదించడం, పక్షుల కుహు కుహు శబ్దాలు చెవుల్లో మారుమ్రోగడం సెలయేటి ప్రవాహంలోని చేతిని వేళ్ళ మధ్యనుండి నీళ్ళు ప్రవహించడం అనేవి హెలెన్ కెల్లర్ కి ఆనందాన్ని కలిగించాయి.

ఇ) కీర్తన ఫిబ్రవరి 10వ తేదీన తన డైరీలో ఈ విధంగా రాసుకుంది. డైరీ చదవండి. ప్రశ్నలు తయారు చేయండి.
10 ఫిబ్రవరి, సోమవారం
 ఈ రోజు ఉదయం విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలకు వెళ్ళాం. చర్చి దగ్గర భక్తులతో చాలా రద్దీగా ఉంది. భక్తులందరూ ఉత్సాహంగా కొండ పైకి నడిచి వెళుతున్నారు. మేమందరం కొండపైకి నడిచి వెళ్ళాం. ప్రార్థనలో పాల్గొన్నాం. మేరీమాతను దర్శించుకున్నాం. కొండ పై నుంచి ఊరంతా భలే అందంగా కనిపించింది. అక్కడే ఉన్న బొమ్మల దుకాణాల్లో బొమ్మలు కొనుక్కున్నాం. పీచు మిఠాయి, మరమరాలు కొనుక్కుని తిన్నాం. తాజా జామకాయలు కొనుక్కున్నాం. సాయంత్రం వేళకి ఆనందంగా ఇంటికి చేరుకున్నాం.
 
 జవాబు:
 ప్రశ్నలు :
- మేరీ మాత ఉత్సవాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
- కీర్తన మేరీమాత ఉత్సవాలకు ఏరోజు వెళ్ళింది ?
- ఉత్సవాలలో కీర్తన ఏమేం కొనుక్కుంది ?
పదజాలం
అ) కింది గీతాన్ని చదవండి. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో, రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభమవడాన్ని ముక్తపదగ్రస్తం అంటారు. గీత గీసిన పదాలను ఉపయోగించి ఇలాంటి వాక్యాలను మీరు రాయండి.
సెల ఏటి దరి నొక్క చెంగల్వ బాట …………………………………..
 బాట వెంటనే పోతె పువ్వుల్ల తోట ………………………………….
 తోటలో ఒక పెద్ద దొరలుండు కోట ………………………………….
 కోటలో రతనాలు కూరిచిన పీట ………………………………….
 పీట ఎక్కి దూకిన ఆట ……………………………..
 ఆటకే కోయిలల అందాల పాట ……………………………….
 పాటయే పసమించు బంగారు మూట ………………………………..
 జవాబు:
 సెల ఏటి దరి నొక్క చెంగల్వ బాట        అదిగో చక్కని బాట
 బాట వెంటనే పోతె పువ్వుల్ల తోట            బాట పక్కనే తోట
 తోటలో ఒక పెద్ద దొరలుండు కోట           తోట పక్కనే కోట
 కోటలో రతనాలు కూరిచిన పీట               కోట ఎక్కుటకు అదునైన పీట
 పీట ఎక్కి దూకిన ఆట పీట                      పై రాణుల్ల ప్రియమైన ఆట
 ఆటకే కోయిలల అందాల పాట                ఆట మధ్యన వినిపించే పాట
 పాటయే పసమించు బంగారు మూట        పాట నాకందించె ముత్యాల మూట

అ) కింది పదాలు చదవండి. కొండవాగు పాఠంలో కవి వేటిని వేటితో పోల్చాడో జతపరచండి. పూర్తి వాక్యంగా రాయండి.

 వాగు కామధేనువులా ఉంది.
 జవాబు:
 
 ఆ ఊరివాళ్ళు ఆ వాగును కామధేనువుగా భావిస్తారు.
 ఆ బండ సింహాసనంలా ఉంది. (సింహాసనంలాంటి ఆ బండమీద కూర్చున్నాం)
 ఆ దారులు వెడల్పైన గీతలుగా కనిపిస్తున్నాయి.
 ఆ ఇళ్ళు కొండపల్లి బొమ్మలుగా ఉన్నాయి.
 ఆ మేఘాలు ఒత్తుగా కదులుతూ ఏనుగులు బారులు తీసి నడుస్తున్నట్లు కనిపించాయి.
ఇ) కింది వర్ణన పదాలు చూడండి. ఇచ్చిన పదాలకు మీరు వర్ణన పదాలు రాయండి.

 జవాబు:
 

ఈ) పట్టిక ఆధారంగా వాక్యాలను తయారు చేయండి.

 జవాబు:
 నేను విజయవాడ వెళ్ళి దుర్గగుడి చూశాను
 నేను ధవళేశ్వరం వెళ్ళి కాటన్ బారేజి చూశాను
 నేను శ్రీకాకుళం వెళ్ళి శాలిహుండం చూశాను
 నేను అరకు వెళ్ళి బొర్రా గుహలు చూశాను
 నేను ఒంటిమిట్ట వెళ్ళి రామాలయం చూశాను
స్వీయరచన
అ) పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

 ప్రశ్న 1.
 నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి ?
 జవాబు:
 నీటి బుగ్గనుండి పాయలు కొన్ని పారుతున్నాయి. కొన్ని నృత్యం చేస్తున్నాయి. కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి. కొన్ని బుసబుసా పొంగుతున్నాయి.
ప్రశ్న 2.
 కొండ పై నుండి చూస్తుంటే ఊరు ఎలా కనిపిస్తుంది ?
 జవాబు:
 కొండపై నుండి చూస్తుంటే ఆ ప్రదేశమంతా వివిధ రంగులతో చేసిన దేశపటంలా; కాలి దార్లు, వాగులూ, రోడ్లు, వెడల్పైన గీతల్లా; దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఎటు చూసినా ప్రకృతి సౌందర్యంతో ఊరు కనిపిస్తుంది.

ప్రశ్న 3.
 ఆకాశంలో మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి ?
 జవాబు:
 ఆకాశంలో మేఘాలు పింజెమబ్బుల్లా ఒక దానిమీద ఒకటి పడి దొర్లుతూ విన్యాసాలు చేస్తున్నాయి. తూర్పున నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి. అవి ఏనుగులు బారులు తీసి వరుసగా’ నడుస్తున్నట్లు, కొన్ని కదం తొక్కుతున్నట్లు కనిపిస్తున్నాయి.
సృజనాత్మకత
అ) కింది పేరాను చదవండి. సంభాషణలు రాయండి.
పిల్లలూ! ‘నేలపట్టు’ పేరు ఎప్పుడైనా విన్నారా ? అది ఒక పక్షుల రక్షిత కేంద్రం. ఇది నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం సమీపంలో ఉంది. ఈ ప్రాంతానికి మేమూ, గూడబాతులు (పెలికాన్), ఎర్రకాళ్ల కొంగలు, నల్లకాళ్ల కొంగలు, నారాయణ పక్షులు, తెడ్డుముక్కు కొంగలు, చుక్కమూతి బాతులు, స్వాతి కొంగలు లాంటి ఎన్నో పక్షులు దేశ విదేశాల నుండి ఇక్కడకు వస్తాము.
అందులో గూడబాతులు అక్కడ చెట్ల పై గూళ్లు కట్టి, గుడ్లను పొదిగి పిల్లలను చేస్తాయి. ఇంతకీ మేమెవరో చెప్పలేదు కదా! మమ్మల్ని సముద్రపు రామచిలుకలు (ఫ్లెమింగోలు) అంటారు. మేము చాలా అందంగా ఉంటాము. మేమంటే మీకే కాదు, పెద్దలకు కూడా ఇష్టమే.
 
 మా పేరుతోనే సూళ్ళూరు పేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుతారు. మేము పులికాట్ సరస్సులో చేపలు వేటాడుతూ కనిపిస్తాం. అక్కడ నీళ్ళు తగ్గిపోతుంటే మా పిల్లలతో సహా మా దేశమైన నైజీరియాకు వెళ్ళిపోతాం. పిల్లలూ! మా గురించి తెలుసుకున్నారు కదా! ఒకసారి మీరు కూడా మమ్మల్ని దర్శించండి.
 

గిరిజ : మహిత ! బాగున్నావా ?
 మహిత : బాగున్నాను గిరిజా, ఏంటీ విషయాలు?
 గిరిజ : మేము జనవరి నెలలో పక్షుల పండుగ చూడడానికి వెళ్ళాం.
 గిరిజ : ………………………………………………………….
 మహిత : ………………………………………………………….
 మహిత : ………………………………………………………….
 జవాబు:
 గిరిజ : మహిత ! బాగున్నావా ?
 మహిత : బాగున్నాను గిరిజా, ఏంటీ విషయాలు?
 గిరిజ : మేము జనవరి నెలలో పక్షుల పండుగ చూడడానికి వెళ్ళాం.
 గిరిజ : ఔనా! అవి ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగ. సూళ్ళూరుపేటలో జరుగుతుంది?
 మహిత : పక్షుల పండుగా! అదేంటి ? ఎప్పుడూ వినలేదు? ఎక్కడ జరుగుతుంది?
 మహిత : ఐతే… ఈసారి మేంకూడా వస్తాం. ఆ అందమైన పక్షులపండుగ చూస్తాం.
ప్రశంస
విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి పరిసరాలలో చెత్తా చెదారం వేయకుండా పరిశు భ్రంగా ఉంచాలి. ఇలా మీరు వెళ్ళినచోట పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించిన మీ మిత్రులను ఎలా ప్రశంసిస్తావు ?
 జవాబు:
 ప్రశంస : ఈ రోజు ఇక్కడకు నాతోపాటు వచ్చిన మిమ్మల్నందరినీ అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే – మనం ఇక్కడకు వచ్చినప్పుడు ఈ ప్రదేశం చాలా అందంగా, శుభ్రంగా ఉంది. మనం ఇక్కడ ఇంత సేపు కూర్చున్నాము – ఆడుకున్నాము – తిన్నాము – తిరిగి వెళ్ళేటప్పుడు కూడా శుభ్రంగా ఉంచి వెళ్తున్నాము. ఎవ్వరూ కూడా అక్కర్లేని తినుబండారాలు – కాగితాలు కింద ఎక్కడా పడేయకుండా చెత్త కుండీలో వేసారు. చేతులు, కాళ్ళు, నీళ్ళ కుండీ దగ్గర కడుక్కున్నారు. అందరూ చక్కగా మరుగుదొడ్లనే ఉపయోగించారు.
మీరందరూ ఇంత శుభ్రత పాటించారు కనుకనే ఈ ప్రదేశం మనం వచ్చే ముందు ఎలా ఉందో – మనం వెళ్ళేప్పుడూ అలాగే ఉంది. అందుకే మీ అందరికీ నా అభినందనలు. వెళ్లామా ! మరి.
భాషాంశాలు
అ) కింది పేరాను చదవండి. చదివి ఇందులో నామవాచకాలను గుర్తించాలి.
రాజశేఖరం కొడుకు విజయ్. అతడు పెద్ద చదువులు చదువుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తన తాతగారిని చూడానికి సిద్ధాంతం గ్రామానికి వచ్చాడు. తాత గారిద్వారా గ్రామ పరిస్థితులను తెలుసుకున్నాడు. అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన గ్రామానికి సేవ చేయాలనుకున్నాడు. అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
తన గ్రామానికి సేవ చేయాలనుకున్నాడు. గ్రామంలోని పాఠశాల, వైద్యశాల, చెరువు మొదలైన వాటిని చూశాడు. వాటికి మరమ్మతులు చేయించాడు. ఆ ఊరిలో ఒక కాలువ ఉంది. దాన్ని బాగుచేయించాడు. ఆ ఊరికి మంచి రహదారి వేయించాడు. గ్రామ సమస్యలు చాలావరకూ పరిష్కరించాడు.
 
 నామవాచకం : వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇలా పేర్లను తెలిపే పదాలను “నామవాచకాలు’ అంటారు.

ఆ) కింది వాక్యాలను చదవండి. నామవాచకాలను గుర్తించండి. వాటికి కింద గీత గీయండి.

- సరళ మామిడిపండు తింటుంది.
- కరీమ్ సెలవులకు పాలకొల్లు వెళ్లాడు.
- చెల్లాయమ్మ అడవికి వెళ్ళి విస్తరాకులు తెచ్చింది.
- శ్రీను వాళ్ల నాన్నగారు కారులో తిరుపతి వెళ్లారు.
జవాబు:
- సరళ మామిడిపండు తింటుంది.
- కరీమ్ సెలవులకు పాలకొల్లు వెళ్లాడు.
- చెల్లాయమ్మ అడవికి వెళ్ళి విస్తరాకులు తెచ్చింది.
- శ్రీను వాళ్ల నాన్నగారు కారులో తిరుపతి వెళ్లారు.
ఇ) కింది పేరాను చదవండి.
“నేను గ్రామానికి సేవ చేస్తే, దేశానికి సేవ చేసినట్లే” అని మా అమ్మ ట్రిప్పుడూ చెప్పేది. అమ్మ మాటలను నేను శ్రద్ధగా వినేవాడిని. తన మాటలు నా మనసులో నాటుకున్నాయి. ఆ మాటలే నా ఔర్యానికి బాటలు వేశాయి. నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది. మీరు కూడా మన గ్రామానికి సేవ చేయడానికి ముందుకు రావాలి. “సర్వనామాలను పరిచయం చేయడం” : నామవాచకాలకు బదులుగా వాడే వాటిని – సర్వనామాలు అంటారు.
 పై పేరాలో నేను – నా అన్నవి ఉన్నాయి. ఇందులో
 నేను అన్నది నామవాచక రూపం.
 నా అన్నది విశేషణ రూపం.

ఈ విశేషణ రూపాలు కొన్ని :
 
ఈ) కింది వాక్యాలను చదవండి. సర్వనామాల కింద గీతగీయండి.
- కిరణ్ గ్రామ సచివాలయంలో పని చేస్తున్నాడు. ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు.
- రాణి, దివ్య స్నేహితులు. వాళ్లు కలసి ఆటలు ఆడతారు.
- మేరీ పాటలు పాడుతుంది. ఆమె పాటల పోటీలో బహుమతి గెలుచుకుంది.
- లంబసింగి అందమైన ప్రదేశం. అది చాలా చల్లగా ఉంటుంది.
జవాబు:
- కిరణ్ గ్రామ సచివాలయంలో పని చేస్తున్నాడు. ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు.
- రాణి, దివ్య స్నేహితులు. వాళ్లు కలసి ఆటలు ఆడతారు.
- మేరీ పాటలు పాడుతుంది. ఆమె పాటల పోటీలో బహుమతి గెలుచుకుంది.
- లంబసింగి అందమైన ప్రదేశం. అది చాలా చల్లగా ఉంటుంది.
ధారణ చేద్దాం
ఆంధ్రభాస యమృత మాంధ్రారంబులు,
 మురుపు లొలుకు గండ్రి ముత్తియపులు
 ఆంధ్రదేశ మాయురారోగ్య వర్ధకం
 భాంధ్రదాతి నీతి సముసరించి
భావం :
 ఆంధ్రభాష అమృతం వంటింది. తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లాగా ఉండి అందాలొలుకుతూ ఉంటాయి. ఆంధ్రదేశం ఆయుష్షును, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది.
 జవాబు:
 విద్యార్థి పద్యాన్ని – భావాన్ని పదవిభాగంతో చదవటం. నేర్చుకుని, భావయుక్తంగా, అర్థవంతంగా ధారణచేయాలి. అందుకు ఉపాధ్యాయులు సహకరించాలి – అందులోని నీతిని, విషయాన్ని వంట పట్టించుకోవాలి.

కలి పరిచయం
కవి : చెరుకుపల్లి జమదగ్ని శర్మ
 కాలము : 1920 నుండి 1986 వరకు
 కలం పేరు : ‘జమదగ్ని’
 ఇతర రచనలు : మూదయం, చిలుకా గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొ||నవి.
 విశేషాంశాలు : వీరు మంచి కవి, కథకుడు – వీరు పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు – రాశారు.
 
పదాలు – అర్థాలు
మేట = ఇసుక ప్రదేశం
 వాగు = చిన్న ఏరు
 జాలువారు = జారుతున్న
 బాట = దారి
 క్షేమం = కులాసా
 పొద్దు = రోజు, దినం
 దృశ్యం = సన్నివేశం, చూడదగినది
 బారులు = వరుసలు
 లంక = నదిలో పైకి లేచి ఉన్న భూభాగం
 కదంతొక్కు = ఉత్సాహంతో ముందుకు వెళ్ళు
వడగళ్లు
పాడుకుందాం
వడగళ్లు వడగళ్లు వానదేవుని పండ్లు
 వెలలేని తులలేనివెన్న ముద్దల చెండ్లు    ॥వడగళ్లు॥
వేసవి వెళ్ళింది వడగాడ్పు మళ్ళింది
 చల్లచల్లని నిల్ల వాయువులు వీచాయి
 ప్రొద్దు పొగరంతాను అణిగింది మణిగింది
 ఉఱుములు మెఱుపులు ఉరకలూ వేశాయి    ॥వడగళ్లు॥
ఆకాశమంతాను ఆయాసపడ్డాది.
 మబ్బు దొంతర్లిట్లే ముసురుకు పోయాయి
 జలజలా చుక్కల్లు గలగలా వడగళ్లు
 రాలాయి చేతుల్లో కరిగాయి క్షణముల్లో       ॥ వడగళ్లు ॥
 

ఆవులూ దూడలు గంతులు వేశాయి
 చెట్లన్ని పుట్లన్ని సేదల్లు దేరాయి
 భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి
 క్షణములో జగమంత పచ్చబడ్డాది      ॥ వడగళ్లు॥
బీరల్లు చిక్కుళ్ళు కాకర కాసర
 మల్లెలు మొల్లలు బంతిచామంతులు
 విత్తుకలూ చల్లాము మొక్కలు నాటాము
 పచ్చ పైరులువిచ్చె పచ్చసిరులన్నీని    ॥ వడగళ్లు ॥
ఆకాశ మలివేణి జెడలోన మెరిసింది
 ఏడురంగుల ఇంద్రధనుసు పూదండ
 ఎండలు వానలు చెట్టపట్టాలతో
 మాయిళ్లు వాకిళ్ళు వొళ్ళు తడిపాయి     ॥ వడగళ్లు ॥
ఎండలు వానలు చిటపటల నాడుతూ
 మాకళ్లు మామళ్లు మాయిళ్లు తడిపితే
 అటు ఆరు బైటకు ఇటు చూరుక్రిందకు
 పరుగులు తీస్తూను పకపకా ఆడాము      ॥ వడగళ్లు ॥
కవి పరిచయం
కవి : ఏడిద కామేశ్వరరావు
 కాలము : 12-09-1913 – 1984
 రచనలు : రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మరియు బాలల కోసం పాటలూ, నాటికలూ రాశారు.
 
