SCERT AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Physical Science 7th Lesson Questions and Answers నేలబొగ్గు మరియు పెట్రోలియమ్
8th Class Physical Science 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
 క్రింది ఖాళీలను సారూప్యతను (Analogy) బట్టి సరైన పదంతో పూర్తి చేయండి. (AS1)
1. నేలబొగ్గు : తరిగిపోయేది :: …………….. : తరిగిపోనిది.
 జవాబు:
 సౌరశక్తి
2. కోల్ తార్ : ……………. :: కోక్ : స్టీల్ తయారీ
 జవాబు:
 కృత్రిమ అద్దకాలు లేదా ప్రేలుడు పదార్థాలు
3. పెట్రోరసాయనాలు : ప్లాస్టిక్ :: సి.యన్.జి. : ……
 జవాబు:
 ఇంధనం
4. కార్బన్ డై ఆక్సైడ్ : భూతాపము :: ……………… : నాసియా
 జవాబు:
 పెయింట్ల నుండి వెలువడే విషపదార్థాలు
ప్రశ్న 2.
 జతపరచండి. (AS1)
| 1. సహజవనరు | A) కార్బొ నైజేషన్ | 
| 2. నేలబొగ్గు | B) ప్లాస్టిక్ కుర్చీ | 
| 3. పెట్రోరసాయన ఉత్పన్నం | C) కృష్ణా గోదావరి డెల్టా | 
| 4. సహజవాయువు | D) ప్లాంక్టన్ | 
| 5. పెట్రోలియం | E) నీరు | 
జవాబు:
| 1. సహజవనరు | E) నీరు | 
| 2. నేలబొగ్గు | A) కార్బొ నైజేషన్ | 
| 3. పెట్రోరసాయన ఉత్పన్నం | B) ప్లాస్టిక్ కుర్చీ | 
| 4. సహజవాయువు | C) కృష్ణా గోదావరి డెల్టా | 
| 5. పెట్రోలియం | D) ప్లాంక్టన్ | 

ప్రశ్న 3.
 బహుళైచ్ఛిక ప్రశ్నలు : (AS1)
 i) క్రింది వానిలో కాలుష్య పరంగా ఆదర్శ ఇంధనం ఏది?
 A) సహజవాయువు (CNG)
 B) నేలబొగ్గు
 C) కిరోసిన్
 D) పెట్రోల్
 జవాబు:
 A) సహజవాయువు (CNG)
ii) బొగ్గులో ముఖ్య అనుఘటకం
 A) కార్బన్
 B) ఆక్సిజన్
 C) గాలి
 D) నీరు
 జవాబు:
 A) కార్బన్
iii) షూ పాలిష్ (Shoe Polish) ను తయారుచేయడానికి క్రింది వానిలో ఏ పదార్థాన్ని వాడతారు?
 A) పారాఫిన్ మైనం
 B) పెట్రోలియమ్
 C) డీజిల్
 D) లూబ్రికేటింగ్ నూనె
 జవాబు:
 D) లూబ్రికేటింగ్ నూనె
ప్రశ్న 4.
 ఖాళీలు పూరించండి. (AS1)
 ఎ) ………………….. ను ఉక్కు తయారీలో ఉపయోగిస్తాం.
 జవాబు:
 కోక్
బి) నేలబొగ్గు యొక్క …………………. అంశీభూతం కృత్రిమ అద్దకాలు మరియు పెయింట్స్ ఉపయోగిస్తాం.
 జవాబు:
 కోల్ తారు
సి) భూమిలోపల కప్పబడి ఉన్న ………………… గల ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో నేలబొగ్గు లభ్యమవుతుంది.
 జవాబు:
 జీవ అవశేషాలు
డి) భూతాపానికి మరియు వాతావరణ మార్పులకు కారణమయ్యే వాయువు …………..
 జవాబు:
 కార్బన్ డై ఆక్సైడ్
ప్రశ్న 5.
 రోడ్లను వేసేటప్పుడు రోడ్డు పైపొరలో వాడే పెట్రోలియం ఉత్పత్తులను తెల్పండి. (AS1)
 జవాబు:
 రోడ్లను వేసేటప్పుడు రోడ్డు పై పొరలో ఉపయోగించే పెట్రోలియం ఉత్పత్తి తారు లేదా బిట్యుమెన్ (Bitumen).

ప్రశ్న 6.
 భూమిలో పెట్రోలియం ఏర్పడే విధానాన్ని వివరించండి. (AS1)
 జవాబు:
- సముద్రాల మరియు మహాసముద్రాల ఉపరితలాలకు దగ్గరగా ఉండే ప్లాంక్టన్ (Plankton) వంటి సూక్ష్మజీవుల అవశేషాలు భూమి పొరలలో కప్పబడి కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెట్రోలియంగా రూపాంతరం చెందుతాయి.
- ప్లాంక్టన్ల శరీరంలో కొద్ది మొత్తంలో చమురు ఉంటుంది.
- ఈ ప్రాణులు చనిపోయినప్పుడు వాటి అవశేషాలు నదులు, మహాసముద్రాల. అడుగున ఇసుక, మట్టి పొరలచేత కప్పబడతాయి.
- కొన్ని లక్షల సంవత్సరాలు ఆ మృత అవశేషాలు గాలి లేకుండా అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఉండడం చేత అవి పెట్రోలియం, సహజవాయువులుగా రూపాంతరం చెందుతాయి.
ప్రశ్న 7.
 ప్రాజెక్ట్ పని : (AS4)
 సంపీడిత సహజవాయువు (CNG) తో మరియు డీజిల్ తో నడిచే వాహనాలు విడుదల చేసే కాలుష్య కారకాలు, కాలుష్య స్థాయి మరియు ఇంధన ధరల దృష్ట్యా పోల్చండి. మీరు కనుగొన్న అంశాలపై ఒక నివేదికను రూపొందించండి. (దీని కొరకు అవసరమైతే ఒక వాహన చోదకుడి సహాయం తీసుకోండి)
| ఇంధన రకము | ఇంధన ప్రస్తుతధర | విడుదలయ్యే కాలుష్య కారిణులు | 
| డీజిల్/ పెట్రోల్ | ||
| CNG | 
జవాబు:
| ఇంధన రకము | ఇంధన ప్రస్తుతధర | విడుదలయ్యే కాలుష్య కారిణులు | 
| డీజిల్ | ₹ 52-46 (లీ|| కు), | CO, CO2, నైట్రోజన్ యొక్క ఆక్సెలు (NO, NO2), | 
| పెట్రోల్ | ₹ 78-60 (లీ|| కు) | సల్ఫర్ యొక్క ఆక్సైలు (SO2, SO3), సీసం (Pb) మొదలైనవి. | 
| CNG | 49 (కి.గ్రా. కు) | CO2 | 
ప్రశ్న 8.
 నీ ఇరుగు పొరుగులో ఉన్న ఐదు కుటుంబాలను ఎంచుకోండి. రవాణా మరియు వంట పనుల్లో శక్తి వనరులను పొదుపు చేయడానికి ఎటువంటి మార్గాలు. అనుసరిస్తున్నారో అడిగి తెలుసుకోండి. మీరు సేకరించిన సమాచారంను పట్టికలో నమోదు చేయండి. (AS4)
 మీ పరిశీలనలతో ఒక రిపోర్ట్ తయారు చేయండి.
 
 జవాబు:
 
ఈ రిపోర్ట్ ను బట్టి తేలిన అంశములు :
- బైక్ ల కంటే కార్ల వినియోగం ఎక్కువైనది.
- వంట కొరకు చేసే ఖర్చు కంటే రవాణా వాహనాలపై ప్రతి కుటుంబం చేస్తూన్న ఖర్చు ఎక్కువైనది.
- వంట కొరకు చాలా కుటుంబాలు ఇండక్షన్ పొయ్యిలూ, రంపపు పొట్టు పొయ్యిలూ ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు.

ప్రశ్న 9.
 క్రింది పట్టిక 1991 నుండి 1997 వరకు భారతదేశంలో శక్తిలేమి (Power shortage) ని శాతాలలో సూచిస్తుంది. సంవత్సరాలను X అక్షంగా, శక్తిలేమి శాతంను Y అక్షంగా తీసుకొని మొత్తం దత్తాంశంను దిమ్మరేఖా చిత్రంలో (Bar graph) సూచించండి. (AS4)
| సంవత్సరం | శక్తిలేమి (%) | 
| 1. 1991 | 7.9 | 
| 2. 1992 | 7.8 | 
| 3. 1993 | 8.3 | 
| 4. 1994 | 7.4 | 
| 5. 1995 | 7.1 | 
| 6. 1996 | 9.2 | 
| 7. 1997 | 11.5 | 
ఎ) శక్తిలేమి శాతం పెరుగుతున్నదా? తగ్గుతున్నదా?
 జవాబు:
 శక్తి లేమి శాతం పెరుగుతున్నది.
బి) శక్తిలేమి శాతం పెరుగుచున్నట్లయితే అది మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించండి.
 జవాబు:
 శక్తిలేమి శాతం క్రమంగా పెరుగుచున్నది. శక్తిలేమి శాతం తగ్గించవలెనంటే శక్తి వనరుల వినియోగరేటు పెంచవలెను. మనకు ఉన్న సాంప్రదాయ (తరిగిపోయే) ఇంధన వనరులు పరిమితంగా ఉన్నాయి. ఈ వనరులను వాడుకుంటూపోతే ఎంతోకాలం మిగలవు. కావున మనం ప్రస్తుతం ప్రకృతి నుండి లభించే ఎప్పటికి తరిగిపోని సాంప్రదాయేతర శక్తి వనరులైన సౌరశక్తి, పవన శక్తి, అలల శక్తి మొదలయిన శక్తివనరులను ఉపయోగించుకోవాలి.
 
ప్రశ్న 10.
 తరిగిపోయే మరియు తరిగిపోని వనరులు, వాటి ఉపయోగముపై క్రమచిత్రం (Flow chart) తయారుచేయండి. (AS5)
 జవాబు:
  
 
ప్రశ్న 11.
 ఆంధ్రప్రదేశ్ లో నేలబొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువులు లభ్యమయ్యే ప్రాంతాలకు సంబంధించిన సమాచారం సేకరించి ఆ ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ పటం (Outline map) లో గుర్తించండి. (AS5)
 జవాబు:
 ఆంధ్రప్రదేశ్ లో నేలబొగ్గు లభ్యమయ్యే ప్రాంతాలు లేవు.
పెట్రోలియం లభ్యమయ్యే ప్రాంతాలు : కృష్ణ-గోదావరి డెల్టా ప్రాంతం
సహజ వాయువు లభ్యమయ్యే ప్రాంతాలు : కృష్ణ-గోదావరి డెల్టా ప్రాంతం
పెట్రోలియం మరియు సహజవాయువులు కృష్ణ-గోదావరి డెల్టా ప్రాంతాలైన నర్సాపురం దగ్గర లింగబోయినచర్ల, కైకలూరు, రాజోలు, చించునాడు, పీచుపాలెం, ఎనుగువారి లంక, భీముని పల్లె, అబ్బయిగూడెం మరియు మేదరవాని మెరకల వద్ద నిక్షేపాలు గలవు.
 
ప్రశ్న 12.
 నేలబొగ్గు, పెట్రోలియంలకు ప్రత్యామ్నాయ శక్తి వనరులను కనుగొనడానికి మానవుడు చేసే ప్రయత్నాలను ఏవిధంగా నీవు అభినందిస్తావు? (AS6)
 జవాబు:
 నేలబొగ్గు మరియు పెట్రోలియంలు రెండూ తరిగిపోయే శక్తి వనరులు. వీటి నిల్వలు పరిమితంగా ఉన్నాయి. ఈ శక్తి వనరులు ఇంధనం మాత్రమే కాకుండా కొత్త సంయోగ పదార్థాల సంశ్లేషణకు ప్రారంభ పదార్థాలు. వీటి వినియోగం ఎక్కువవుతున్న రోజులలో వీటికి ప్రత్యామ్నాయ వనరులపై ప్రయత్నాలను క్రమంగానే సాంప్రదాయేతర శక్తి వనరులు అయిన సౌరశక్తి, వాయు శక్తి, జలశక్తి, బయోగ్యాస్, గార్బేజ్ శక్తి ఉపయోగించుకొంటున్నాము. ఇంకా సాంప్రదాయేతర వనరులైన భూ ఉష్ణశక్తి, అలల శక్తి పైన ప్రయత్నాలు జరుగుచున్నవి. సాంప్రదాయేతర శక్తి వనరులు తరగని శక్తి వనరులు అంతేకాదు వాతావరణ కాలుష్యరహితమైనవి. కావున సాంప్రదాయేతర శక్తి వనరుల ప్రయత్నాలను మనం అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రశ్న 13.
 హర్షిత్ తన తండ్రితో “దగ్గరి పనుల కొరకు బండికి బదులుగా సైకిల్ ను వాడితే మనం ఇంధనాన్ని పొదుపు చేయవచ్చు కదా !” అని అన్నాడు. ఈ విషయాన్ని నీవు ఎలా అభినందిస్తావు? (AS6)
 జవాబు:
 హర్షిత్ తన తండ్రితో అన్న విషయాన్ని బట్టి మనకు తెలిసినవి ఏమిటంటే
- ఇంధనాలను పొదుపుగా వాడుకోవడం.
- ఇంధనాన్ని పొదుపుగా వాడడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గించినట్లు అవుతుంది.
- శిలాజ ఇంధనాలు తరిగిపోయేవి కాబట్టి పొదుపుగా వాడుకుంటే ముందు తరాల వారికి అందించినట్లు అవుతుంది.
వీటినిబట్టి హర్షిత కు ఇంధన పొదుపుపై సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ మరియు ప్రకృతి పై గౌరవము ఉన్నట్లుగా అభినందించవచ్చును.
ప్రశ్న 14.
 ప్రజలు శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలపై ఎందుకు దృష్టి సారిస్తున్నారు? (AS7)
 జవాబు:
- శిలాజ ఇంధనాలు తరిగిపోయే శక్తి వనరులు.
- శిలాజ ఇంధన వనరుల నిల్వలు పరిమితంగా ఉండడం వలన.
- కొత్త సంయోగ పదార్థాల సంశ్లేషణకు ప్రారంభ పదార్థాలు శిలాజ ఇంధనాలు కావడం వల్ల.
- శిలాజ ఇంధనాలు వాతావరణ కాలుష్యాన్ని అధికం చేయడం వల్ల.
- ఇంధనాలను మండించడం వలన విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ భూతాపం (గ్లోబల్ వార్మింగ్)కి దారితీయడం వల్ల.
- థర్మల్ విద్యుత్ కేంద్రాలలో విడుదలయ్యే వాయువు మానవ అనారోగ్య సమస్యలకు మరియు గ్రీన్హౌస్ ప్రభావం ఏర్పడుట వల్ల.
పై కారణాల వల్ల శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించవలసి వస్తుంది.
ప్రశ్న 15.
 ఒక వేళ నీవు వాహనచోదకుడివైతే పెట్రోలు మరియు డీజిల్ ను పొదుపు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటావు? (AS7)
 జవాబు:
 నేను వాహనచోదకుడిని అయితే పెట్రోల్, డీజిల్ పొదుపు చేయుటకు క్రింది చర్యలు తీసుకుంటాను.
- వాహనాన్ని నిర్ణయించిన నిర్ణీత వేగముతో నడపడం.
- వాహనాన్ని కొద్ది సమయం ఆపవలసి వచ్చినపుడు ఇంజన్ ఆపడం.
- సిగ్నల్ వద్ద గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకు ఇంజన్ ఆపడం.
- వాహన టైర్లలో నిర్ణీత గాలి పీడనం ఉండేటట్లు చూడడం.
- వాహనాన్ని తరచుగా సర్వీసింగ్ చేయిస్తూ ఉండడం.
- వాహనాలకు కత్తీ లేని ఇంధనాన్ని వాడడం.
ప్రశ్న 16.
 “క్రూడాయిల్, శుద్ధి చేయబడిన ఇంధనం సముద్రాలలో ఓడ ట్యాంకర్ల నుండి బయటకు కారడం వలన సహజ ఆవరణ వ్యవస్థకు హానికలుగజేస్తుంది” చర్చించండి. (AS7)
 జవాబు:
 ముడిచమురు మరియు శుద్ధి చేసిన చమురు ఆయిల్ ట్యాంకర్లలో సముద్రం పై తరలిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ట్యాంకు నుండి జారిపడే చమురు సముద్రంలోకి చేరి నీళ్లపై తెట్టులాగా వందల కిలోమీటర్ల వరకు విస్తరించును. సముద్ర నీళ్లలోనికి గాలి, వెలుతురు వెళ్ళక, లోపలి జీవరాశుల జీవ ప్రక్రియలు ఆగిపోయి, సముద్రంలోని మొక్కలు, జంతువులు, చేపలు మరియు జీవరాశులు చనిపోతాయి. దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది.

ప్రశ్న 17.
 “ఆటోమొబైల్ రంగంలో ఇంధనాలుగా CNG, LPG లను వాడితే వాయుకాలుష్యం తగ్గడంలో, పర్యావరణ సమతుల్యత కాపాడడంలో సహాయపడుతుంది.” ఇది అవును అనిపిస్తే వివరించండి. (AS7)
 జవాబు:
 ఆటోమొబైల్ రంగంలో వాహనాలకు CNG, LPG ఇంధనాలు వాడితే, వాహనాలు విడుదలచేయు వాయువులో CO2 (కార్బన్ డై ఆక్సైడ్) మాత్రమే ఉంటుంది. దీనివలన పర్యావరణానికి ఎక్కువగా నష్టం ఉండదు. ఎందుకంటే ఏర్పడ్డ కార్బన్ డై ఆక్సైడు మొక్కలు, వృక్షాలు వినియోగించుకోవడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడినట్లు అవుతుంది. అంతే కాకుండా వృక్షాలు CO2 గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి.
పరికరాల జాబితా
శక్తి వనరులకు సంబంధించిన చార్టుల సేకరణ, నేలబొగ్గు, పెట్రోలియం ఉత్పత్తుల చిత్రాలు లేదా. నమూనాల సేకరణ, పెట్రో ఉత్పత్తుల నమూనాలు లేదా చిత్రాల సేకరణ, శక్తి సంకటం గురించిన చిత్రాల సేకరణ, రెండు స్టాండులు, రెండు పెద్ద పరీక్ష నాళికలు, రబ్బరు బిరడాలు, వాయు వాహక నాళం, జెట్ నాళం, బుస్సెన్ జ్వాలకం.
8th Class Physical Science 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ Textbook InText Questions and Answers
8th Class Physical Science Textbook Page No. 96
ప్రశ్న 1.
 మన చుట్టూ ఉండే ఈ వనరులు ఎల్లప్పుడు ఇలాగే అందుబాటులో ఉంటాయా?
 జవాబు:
 మన చుట్టూ ఉండే ఈ వనరులు ఎల్లప్పుడు ఇలాగే అందుబాటులో ఉండవు.
ప్రశ్న 2.
 మన చుట్టూ ఉండే గాలి ఎప్పుడైనా పూర్తిగా లేకుండా పోతుందా?
 జవాబు:
 మన చుట్టూ ఉండే గాలి ఎప్పుడైనా పూర్తిగా లేకుండా పోదు.
ప్రశ్న 3.
 ఎప్పుడైనా మనకి ప్రకృతిలో నీరు పూర్తిగా దొరక్కుండా పోయే అవకాశం ఉందా?
 జవాబు:
 జలచక్రం వల్ల నీరు ఎల్లప్పుడూ భూమిపై ఉంటుంది.
ప్రశ్న 4.
 మానవ చర్యల వల్ల ఈ వనరులు తరిగిపోతున్నాయా?
 జవాబు:
 తరిగిపోతున్నాయి.
ప్రశ్న 5.
 నేలబొగ్గు, పెట్రోలియంల అపరిమితమైన నిల్వలు మనకు అందుబాటులో ఉన్నాయా?
 జవాబు:
 ప్రస్తుతం ఉన్నాయి. ముందు ముందు ఉండకపోవచ్చు.

ప్రశ్న 6.
 వివిధ అవసరాలను తీర్చే కలష కోసం తొందరగా అడవుల్ని నరికివేశారనుకోండి, ఏం జరుగుతుంది?
 జవాబు:
 ప్రకృతిలో సమతుల్యత నశించి, క్రమంగా అడవులు లేకుండా పోతాయి. చెట్లు మళ్లీ పెంచడానికి చాలా కాలం పడుతుంది.
8th Class Physical Science Textbook Page No. 97
ప్రశ్న 7.
 అడవులు తిరిగి పెరగడానికి ఎంత కాలం పడుతుందని మీరు భావిస్తున్నారు?
 జవాబు:
 అడవులు తిరిగి పెరగడానికి చాలా కాలం పడుతుందని నేను భావిస్తున్నాను.
ప్రశ్న 8.
 పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు మనకింకా ఎన్నాళ్ళు అందుబాటులో ఉంటాయి? అవి తరిగిపోవా?
 జవాబు:
 పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు మనకింకా కొద్దికాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి తరిగిపోతుంటాయి.
8th Class Physical Science Textbook Page No. 98
ప్రశ్న 9.
 శిలాజ ఇంధనాలైన నేలబొగ్గు, పెట్రోలియం పూర్తిగా హరించుకుపోతే ఏమౌతుంది?
 జవాబు:
 మానవుడు తిరిగి పాత రాతియుగపు జీవితాన్ని గడపాలి. ప్రయాణాలు ఉండవు. విద్యుత్తు కొరత తీవ్రమవుతుంది. ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి.
ప్రశ్న 10.
 మన భవిష్యత్ శక్తి వనరులేమిటి?
 జవాబు:
 మన భవిష్యత్ వనరులు తరగని శక్తి వనరులు. అవి :
- సౌరశక్తి,
- జలశక్తి,
- పవనశక్తి,
- అలలశక్తి,
- బయోగ్యాస్,
- సముద్ర ఉష్ణమార్పిడి శక్తి,
- భూ ఉష్ణశక్తి,
- గార్బేజి పవర్,
- కేంద్రక శక్తి.
ప్రశ్న 11.
 భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చడానికి ఇప్పుడున్న శిలాజ ఇంధన వనరులు సరిపోతాయా?
 జవాబు:
 పెరుగుతున్న అవసరాల దృష్ట్యా, జనాభా పెరుగుదల దృష్ట్యా ఇప్పుడున్న శిలాజ ఇంధన వనరులు సరిపోవు.

ప్రశ్న 12.
 భవిష్యత్ ఇంధన అవసరాలు తీరడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
 జవాబు:
- సౌరశక్తిని అధిక మొత్తం వినియోగించడము.
- జలశక్తిని వినియోగించుకోవడము.
- పవన శక్తిని వినియోగించుకోవడము.
- తీరప్రాంతాలలో అలల శక్తిని ఉపయోగించుకోవడం.
- బయోడీజిల్ ఉత్పత్తులను పెంచి, అధిక మొత్తంలో వినియోగించుకోవడం.
- బయోగ్యాస్ ఉపయోగించడం.
- గృహ వ్యర్థ పదార్థాల (గార్బేజి పవర్) నుండి శక్తిని వినియోగించడం.
- భూగర్భ ఉష్ణశక్తిని వినియోగించడం.
- సముద్ర ఉష్ణశక్తి మార్పిడిని వినియోగించుకోవడం.
- కేంద్రక శక్తిని వినియోగించడం.
పై చర్యలు చేయడం వలన భవిష్యత్ లో ఇంధన వనరుల అవసరాలను తీర్చవచ్చును.
8th Class Physical Science Textbook Page No. 105
ప్రశ్న 13.
 ఇంధనం, శక్తి వనరులను మనం దుర్వినియోగం చేసే సందర్భాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా?
 జవాబు:
- వాహనాలు నడుపుతున్నపుడు రెడ్ సిగ్నల్స్ వద్ద వాహన ఇంజన్ ఆపుచేయకపోవడం.
- వాహనం నిర్ణయించే వేగంతో కాకుండా ఎక్కువ లేదా తక్కువ వేగంతో నడపడం.
- పబ్లిక్ వాహనాలను (ఆర్టిసి బస్సుల) ఎక్కకుండా వ్యక్తిగత వాహనాలను ఉపయోగించడం.
- వంట చేస్తున్నపుడు వంటకు కుక్కర్లను ఉపయోగించకపోవడం.
- తక్కువ దూరాలకు వ్యక్తిగత వాహనాలను ఉపయోగించడం.
- పగటిపూట గదులలో కిటికీలు తీయకుండా లైట్లను, ఫ్యాన్లు ఉపయోగించడం.
- గదిలో లేకున్నను లైట్లు, ఫ్యాన్లు వినియోగించడం.
- వ్యక్తిగత వాహనాలను తరచుగా సర్విసింగ్ చేయించకపోవడం.
- అధిక సామర్థ్యం గల వాహనాలను ఉపయోగించకపోవడం.
ప్రశ్న 14.
 ఇంధన వనరులను పొదుపు చేయడానికి, ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలను నీవు సూచించగలవా?
 జవాబు:
- మన అవసరం పూర్తికాగానే ఇంధన వనరులను ఆపివేయడం.
- పెట్రోలు, డీజిల్ లీకేజీలను అరికట్టడం.
- అవసరమైన గదుల్లో మాత్రమే విద్యుద్దీపాలను వెలగనిచ్చి, మిగతా గదుల్లో ఆర్పివేయడం.
- పెట్రోలు లీకేజీ లేకుండా వాహనాలను మరమ్మతు చేయించడం.
- కొన్ని అవసరాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం.

ప్రశ్న 15.
 శిలాజ ఇంధనాల అతి వినియోగం ప్రకృతిలో జీవవైవిధ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
 జవాబు:
- శిలాజ ఇంధనాలను అతిగా వినియోగించడం వలన కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, లెడ్, CFC, పొగ కణాలు ఇతర ఆక్సైడ్లు వాతావరణంలో విడుదల అవుతాయి.
- కార్బన్ మోనాక్సైడ్ (CO) విషవాయువు. ఇది రక్తం, ఆక్సిజన్ వాయువును తీసుకునిపోయే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
- నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ వలన ఆస్తమా, దగ్గు లాంటి వ్యాధులు కలుగుతాయి.
- సల్ఫర్ డై ఆక్సైడ్ వలన శ్వాసక్రియకు సంబంధించిన వ్యాధులు వస్తాయి.
- CFC వాయువులు ఓజోన్ పొరను క్షీణింపచేయడం వలన సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమిపై పడి జీవరాశులకు హాని కలుగుజేస్తుంది.
- వాతావరణంలోని SO2, NO2 వలన ఆమ్ల వర్షాలు కురుస్తాయి. వీటివలన జీవరాశులకు అనేక ఇబ్బందులు ఏర్పడతాయి.
- ఆమ్ల వర్షాలు చెట్ల యొక్క ఆకులను పాడైపోతాయి.
- వాతావరణంలోని లెడ్ కణాల వలన కిడ్నీ, జీర్ణవ్యవస్థలు పాడైపోతాయి.
- ఇంధనాలను మండించినపుడు ఏర్పడే సూక్ష్మ కణాలలోని భారలోహ కణాల వలన కేన్సర్, చర్మ, ముక్కు, గొంతు, కళ్ళు మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి.
8th Class Physical Science 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ Textbook Activities
కృత్యం – 1 వివిధ అవసరాల కోసం మనం వాడే పరికరాలను, పదార్థాలను గుర్తించడం :
ప్రశ్న 1.
 ఈ క్రింది పట్టికలో నిలువు వరుస A లో కొన్ని సందర్భాలు మరియు వస్తువులు ఇవ్వబడ్డాయి. ఆయా సందర్భాలలో వినియోగించిన వస్తువుల తయారీకి 30 – 40 సం||ల ముందు ఏ పదార్థాలు వాడేవారో నిలువు వరుస B లో నింపండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. అవే అవసరాలకి ప్రస్తుతం ఎటువంటి పదార్థాలను వాడుతున్నామో నిలువు వరుస C లో నింపండి. మీ అవగాహన కొరకు పట్టికలో కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి.
| సందర్భం / పరికరం (A) | 30-40 సం|| క్రితం వాడిన పరికరం (B) | ప్రస్తుతం వాడుతున్న పరికరం (C) | 
| పచ్చళ్ళు నిల్వ చేసే జాడీ | పింగాణి జాడీలు | పింగాణి జాడి, ప్లాస్టిక్ జాడి | 
| ప్రయాణ సమయంలో వాడే ఆహార పదార్థాల ప్యాకింగ్ | విస్తరాకులు, అరిటాకులు | ప్లాస్టిక్ ప్యాకెట్లు | 
| ఇంట్లో వాడే నీటి పైపులు | లోహపు పైపులు (ఇనుప) | పి.వి.సి., రబ్బరు, ప్లాస్టిక్ పైపులు | 
| దువ్వెనలు | చెక్క దువ్వెనలు | ప్లాస్టిక్ దువ్వెనలు | 
| వంట సామాగ్రి | రాగి పాత్రలు, మట్టి పాత్రలు | స్టీలు వస్తువులు | 
| వంటకు ఉపయోగించే ఇంధనాలు | వంటచెఱకు | కిరోసిన్, ఎల్.పి.జి. గ్యా స్ | 
| రైలు ఇంజనులో వాడే ఇంధనం | నేలబొగ్గు | డీజిల్, విద్యుత్ శక్తి | 
| బట్టలు పెట్టడానికి ఉపయోగించే సామాను | ట్రంకు పెట్టెలు | సూట్ కేసు, బ్యాగులు | 
| నీటి బకెట్లు, మూతలు | లోహపు బకెట్లు, లోహపు మూతలు | ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ మూతలు | 
| నీరు నిల్వ చేయడానికి ఉపయోగించేవి | కుండలు, సిమెంటు తొట్లు | ప్లాస్టిక్ ట్యాంకులు | 
| నిర్మాణ సామాగ్రి | బంకమట్టి, ఇటుకలు, డంగు సున్నం | సిమెంటు, సిమెంటు ఇటుకలు, కాంక్రీట్, స్టీల్ (ఐరన్ రాడ్స్) | 
| ఆభరణాలు | బంగారం, రాగి, వెండి | డైమండ్స్, ప్లాటినం, ప్లాస్టిక్ | 
| గృహోపకరణాలు (కుర్చీలు, మంచాలు) | కలప కుర్చీలు, మంచాలు | ప్లాస్టిక్ కుర్చీలు, మంచాలు | 
1. 10 సంవత్సరాల క్రితం ఏ పదార్థాలు అందుబాటులో ఉండేవి?
 జవాబు:
 పి.వి.సి., రబ్బర్ పైపులు, ప్లాస్టిక్ దువ్వెనలు, ప్లాస్టిక్ కుర్చీలు.
2. 50 సంవత్సరాల క్రితం ఏ పదార్థాలు అందుబాటులో ఉండేవి?
 జవాబు:
 మట్టి కుండలు, రాగి పాత్రలు, ట్రంకు పెట్టెలు, బంగారం, వెండి, రాగి, కలప కుర్చీలు, కలప మంచాలు.
3. 100 సంవత్సరాల క్రితం వీటిలో ఏ పదార్థాలు అందుబాటులో ఉండేవి?
 జవాబు:
 మట్టి కుండలు, రాగి పాత్రలు, నేలబొగ్గు, వంటచెఱకు.

కృత్యం – 2
ప్రశ్న 2.
 పరిమితంగా ఉన్న సహజ వనరులు, తరగని సహజ వనరులను ఈ క్రింది పట్టికలో వాటికి సంబంధించిన గడిలో వ్రాయండి.
 జవాబు:
| తరగని సహజ వనరులు | పరిమితంగా ఉన్న (తరిగిపోయే) సహజ వనరులు | 
| సౌరశక్తి | నేలబొగ్గు | 
| జలశక్తి | పెట్రోలియం | 
| వాయుశక్తి | సహజ వాయువు | 
| బయోమాస్ శక్తి | కట్టెలు | 
| అలలశక్తి | కర్రబొగ్గు | 
| భూ ఉష్ణశక్తి | |
| సముద్ర ఉష్ణశక్తి మార్పిడి | |
| గార్బేజి పవర్ (గృహ వ్యర్థ పదార్థాల నుండి శక్తి) | |
| పరమాణు కేంద్రక శక్తి | |
| హైడ్రోజన్ శక్తి | |
| బయోడీజిల్ | 
కృత్యం – 3 వివిధ పెట్రోలియం ఉప ఉత్పత్తుల ఉపయోగాలు :
ప్రశ్న 3.
 ఈ క్రింది పట్టికలో పెట్రోలియం మరియు వాటి ఉత్పత్తుల ఇతర ఉపయోగాలను వ్రాయండి.
 జవాబు:
| పెట్రోలియం ఉత్పత్తి పేరు | ఉపయోగాలు | |
| ఇంధన గ్యాస్ (పెట్రోలియం గ్యాస్) | ఎల్.పి.జి. గ్యాస్ తయారు చేస్తారు. | |
| పరిశ్రమలలో ఇంధనంగా ఉపయోగిస్తారు. | ||
| గృహాలలో ఇంధనంగా ఉపయోగిస్తారు. | ||
| వాహనాలలో ఇంధనంగా ఉపయోగిస్తారు. | ||
| పెట్రోల్ | వాహనాలలో ఇంధనంగా ఉపయోగిస్తారు. | |
| ద్రావణిగా ఉపయోగిస్తారు. | ||
| డ్రైక్లీనింగ్ లో ఉపయోగిస్తారు. | ||
| కిరోసిన్ | వంట ఇంధనంగా ఉపయోగిస్తారు. | |
| జెట్ విమానాలలో ఇంధనంగా ఉపయోగిస్తారు. | ||
| డీజిల్ | వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. | |
| విద్యుత్ జనరేటర్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు. | ||
| పారఫిన్ మైనం | ఆయింట్ మెంట్ | అగ్గిపెట్టె | 
| ఫేస్ క్రీమ్ | కొవ్వొ త్తి | |
| గ్రీజు | వాష్ పేపర్స్ | |
| వ్యాజ్ లిన్ | ||
కృత్యం – 4 నేలబొగ్గు ఉత్పత్తుల ఉపయోగాలు :
ప్రశ్న 4.
 ఈ క్రింది పట్టికలో నేలబొగ్గు ఉత్పత్తుల ఉపయోగాలను వ్రాయండి.
 జవాబు:
| కోక్ | కోల్ తారు | కోల్ గ్యాసు | 
| లోహ సంగ్రహణకు | క్రిమిసంహారకాలు | వంటగ్యాస్ గా ఉపయోగిస్తారు. | 
| ప్రొడ్యూసర్ గ్యాస్ తయారీకి | ప్రేలుడు పదార్థాలు | కాంతి కొరకు ఉపయోగిస్తారు. | 
| వాటర్ గ్యాస్ తయారీకి | కృత్రిమ దారాలు | |
| స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు. | పరిమళ ద్రవ్యాలు | |
| నాఫ్తలిన్ | ||
| ఇంటి పైకప్పులు | ||
| ఫోటోగ్రఫిక్ పదార్థాలు | ||
| కృత్రిమ అద్దకాలు | ||
| పెయింట్లు | ||
| రోడ్లు వేయుటకు తారుగా ఉపయోగిస్తారు. | 

ప్రయోగశాల కృత్యం
ప్రశ్న 5.
 నాణ్యమైన నేలబొగ్గు పొడిని వేడిచేస్తే వెలువడే వాయువు మండునో లేదో ప్రయోగం చేసి పరీక్షనాళికలలో ఏమి ఏర్పడునో పరిశీలనలను వ్రాయండి.
 జవాబు:
 ఉద్దేశ్యం :
 నాణ్యమైన నేలబొగ్గు పొడిని వేడిచేస్తే వెలువడే వాయువు మండుతుందో లేదో పరిశీలించుట.
కావలసిన పరికరాలు :
 రెండు పెద్ద పరీక్ష నాళికలు (boiling tubes), రబ్బరు బిరడాలు, ఇనుప స్టాండులు, వాయువాహక నాళం, జెట్ నాళం, బుస్సెన్ బర్నర్.
 
పద్ధతి :
 ఒక చెంచా నేలబొగ్గు పొడిని తీసుకొని గట్టి పరీక్ష నాళికలో వేసి, పటంలో చూపిన విధంగా స్టాండుకు బిగించితిని. పరీక్షనాళికను రబ్బరు కార్కుతో మూయాలి. రెండవ స్టాండుకు కొద్దిగా నీటితో నింపిన మరొక పరీక్షనాళికను బిగించి రెండింటినీ “U” ఆకారపు వాయువాహక నాళంతో వాయువాహక నాళం కలిపితిని, రెండవ పరీక్ష నాళికకు పటంలో చూపినట్లు జెట్ నాళం అమర్చితిని. బున్సెన్ బర్నర్ సహాయంతో నేలబొగ్గు ఉన్న పరీక్ష నాళికను బాగా వేడి చేసితిని.
మొదటి పరీక్షనాళిక నుండి గోధుమ-నలుపు రంగు గల వాయువు రెండవ పరీక్షనాళికలో గల నీటిలోకి చేరి రంగులేని వాయువు బుడగల రూపంలో పైకి వస్తుంది. జెట్ నాళం మూతి వద్ద మండుచున్న పుల్లను ఉంచితే తెల్లని కాంతితో మండినది.
మొదటి పరీక్షనాళికను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడిచేసినప్పుడు నేలబొగ్గు పొడి, కోక్, కోల్ తారు మరియు కోల్ గ్యాస్లు ఏర్పడును. మొదటి పరీక్ష నాళికలో కోక్, రెండవ పరీక్ష నాళికలో నల్లని చిక్కని ద్రవం అనగా కోల్ తారు ఏర్పడినది. కోల్ గ్యాస్ జెట్ నాళం ద్వారా మండుచున్నది.

కృత్యం – 5 ఇంధన వనరుల దుర్వినియోగం మరియు దాని పరిణామాలు :
ప్రశ్న 6.
 ఇంధన వనరుల దుర్వినియోగం మరియు దాని పరిణామాలపై సమూహ చర్చ :
 మన నిత్యజీవితంలో ఇంధన వనరుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి నీవేమి ప్రత్యామ్నాయాలను సూచిస్తావు?
 జవాబు:
- అవసరం లేనపుడు గదిలో లైట్లు, ఫ్యానుల స్విచ్ ఆఫ్ చేయవలెను.
- పగటి పూట వెలుతురు కొరకు కిటికీలు తెరుచుకొనవలెను.
- గదిలో కూలర్స్, ఎసి, హీటర్లు మరియు గీజర్లు అవసరమైనపుడు మాత్రమే ఉపయోగించాలి.
- వంట చేస్తున్నపుడు, నీరు మరుగునపుడు స్టాప్ మంట తగ్గించాలి.
- సాధారణ బల్బ్ లకు బదులుగా CFL లేదా LED బల్బులు మరియు ట్యూబ్ లైట్లను ఉపయోగించాలి.
- రవాణాకు ప్రైవేటు వాహనాలకు బదులుగా ప్రభుత్వ వాహనాలను ఉపయోగించాలి.
- దగ్గర దూరాలను నడకతోగాని లేదా సైకిల్ తోగాని ప్రయాణించాలి.
- పప్పులను ఉడికించుటకు కుక్కర్లను ఉపయోగించాలి.
- వంట చేసేటప్పుడు వంట పాత్రలపై మూతలు ఉంచాలి. ఇలా చేస్తే త్వరగా వండవచ్చును.
- వంటకు పొగలేని స్టార్లు ఉపయోగించాలి (గ్యాస్ స్టాప్ లు).
- దక్షత గల ఇంధన పరికరాలను మాత్రమే ఉపయోగించాలి.
