AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు.
AP State Syllabus 8th Class Telugu Important Questions 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు
8th Class Telugu 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది పరిచిత గద్యాంశాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
సమాజంలో కుటుంబమే అత్యంత కీలకమైంది. ప్రప్రథమ సమూహం కుటుంబమే. వ్యక్తి సమాజంలో ఒంటరిగా మనజాలడు. కుటుంబంతో తాను మమేకమై జీవించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు. అందుకే పుట్టుకతోనే మనిషికి కుటుంబంతో విడదీయలేని అనుబంధం ఏర్పడుతుంది. పోషణ, భద్రత కల్పించడం కుటుంబవ్యవస్థలో మౌలికాంశాలు. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. కుటుంబంలో అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతూంటాయి. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, విచక్షణ జ్ఞానాన్నివ్వడం, సంస్కృతిని వారసత్వంగా అందించడం కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి.
 ప్రశ్నలు :
 1. వ్యక్తి సమాజంలో ఎలా మనజాలడు?
 జవాబు:
 వ్యక్తి సమాజంలో ఒంటరిగా మనజాలడు.
2. వ్యక్తి ఎలా ఆనందాన్ని పొందగలుగుతాడు?
 జవాబు:
 వ్యక్తి కుటుంబంతో తాను మమేకమై జీవించడం ద్వారా ఆనందాన్ని పొందగలుగుతాడు.
3. కుటుంబ వ్యవస్థలో మౌలికాంశాలు ఏవి?
 జవాబు:
 పోషణ, భద్రత కల్పించడం కుటుంబ వ్యవస్థలో మౌలికాంశాలు.
4. . కుటుంబ వ్యవస్థకు ప్రాథమిక లక్షణం ఏది?
 జవాబు:
 కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం
2. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
వేదకాలంనాటికే నాగరికమైన పద్ధతుల్లో ఈ కుటుంబవ్యవస్థ ఏర్పడిందని కొందరు చరిత్రకారుల భావన. వారి రాతల వల్ల కుటుంబ జీవనవిధానం ఆ కాలంలో అత్యున్నత స్థాయిలో ఉండేదనీ, భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఉన్నతశ్రేణిలో ఉండేవని తెలుస్తూంది. వేల ఏండ్ల నుంచీ విలువలకు కట్టుబడి జీవిస్తూ విశ్వానికి ఆదర్శంగా నిలిచిన కుటుంబ వ్యవస్థ మనది. ఆనాడు కుటుంబ జీవనం చాలా వరకు సాఫీగా సుఖంగా సాగిపోయిందనీ, అది చాలా నియమబద్ధంగా ఉండేదని తెలుస్తూంది. ఆ కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైంది. గౌరవప్రదమైంది. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతటి ఉన్నతస్థానం ఇచ్చారో | అర్థమవుతుంది. ఆ
 ప్రశ్నలు:
 1. కుటుంబ వ్యవస్థ ఎప్పటి నుండి ఏర్పడిందని చరిత్రకారులు భావించారు?
 జవాబు:
 కుటుంబ వ్యవస్థ వేద కాలం నుండి ఏర్పడిందని చరిత్రకారులు భావించారు.
2. ఏ బాంధవ్యాలు ఉన్నత స్థాయిలో ఉండేవి?
 జవాబు:
 భార్యాభర్తల సంబంధ, బాంధవ్యాలు ఉన్నత స్థాయిలో ఉండేవి.
3. కుటుంబంలో ఎవరి పాత్ర కీలకమైంది?
 జవాబు:
 కుటుంబంలో తల్లి పాత్ర కీలకమైంది.
4. పై పేరాలో ఉన్న తెలుగు నానుడి ఏది?
 జవాబు:
 పై పేరాలో ఉన్న నానుడి ‘ఇంటికి దీపం ఇల్లాలు’

3. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కాలం మారింది. కుటుంబం అనే మాటకు అర్థం, దాని నమూనా మారిపోయింది. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకు ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడం, స్వార్థం పూర్తిగా పెరిగిపోవడం, వీటివల్ల ఉమ్మడి కుటుంబవ్యవస్థలో మార్పులు అనివార్యమయ్యాయి. చిన్న కుటుంబభావన బలపడింది. సమష్టి వ్యవస్థ పూర్తిగా వ్యవ వ్యవస్థగా మారింది. తత్కారణంగా జీవన సరణిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునికతవల్ల శ్రమవిభజనలో కొత్త మార్పులు వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి. ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటిపైనే ‘వ్యష్టి’ కుటుంబం ఆధారపడింది. ఈ వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయాధికారం లభిస్తాయి. అయితే ఇలా వ్యక్తి ప్రాధాన్యత పెరిగి ఉమ్మడికుటుంబ వ్యవస్థ మరుగున పడిపోతుంది.
 ప్రశ్నలు:
 1. కాలంతోపాటు దేనికి అర్థం మారింది?
 జవాబు:
 కాలంతో పాటు కుటుంబం అనే మాటకు అర్థం మారిపోయింది.
2. ఏ కారణం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరుగున పడిపోయింది?
 జవాబు:
 వ్యక్తి ప్రాధాన్యత పెరగడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరుగున పడిపోయింది.
3. ఏ సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి?
 జవాబు:
 స్త్రీ, పురుష సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి.
4. వ్యష్టి కుటుంబం వేటిమీద ఆధారపడింది?
 జవాబు:
 ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటి పైన వృష్టి కుటుంబం ఆధారపడింది.
4. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపిన మధుర క్షణాలు, జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దయిన తరవాత సినిమాలా కళ్ళముందు మెదలాలి. ఈ మధురమైన అనుభూతిని పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవాలంటే చక్కని కుటుంబం కావాలి. గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి మహనీయులెందరికో వారి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి. ఆ * ఉమ్మడి కుటుంబం, వ్యక్తి కుటుంబాల మేలి కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా; ఆధిపత్యాల పోరులేని, ప్రేమానురాగాలు, విలువలు, మానవసంబంధాలు అంతస్సూత్రమైన ఒక మంచి
 కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. అప్పుడే సమాజం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతాయి.
 ప్రశ్నలు:
 1. దేన్ని పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవాలి?
 జవాబు:
 మధురమైన అనుభూతిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలి.
2. కుటుంబ వ్యవస్థ ఎవరికి స్ఫూర్తినిచ్చింది?
 జవాబు:
 కుటుంబ వ్యవస్థ గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం వంటి వారికి స్ఫూర్తినిచ్చింది.
3. మనకు ఎలాంటి కుటుంబం కావాలి?
 జవాబు:
 మనకు కమ్మని కుటుంబం కావాలి.
4. ఈ గద్యాంశానికి శీర్షికను సూచించండి.
 జవాబు:
 ఈ పై పేరాకు ‘ఉమ్మడి కుటుంబం’ అనే శీర్షిక తగింది.

5. కింది పరిచిత గద్యం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2016-17)
కాలాలు మారినా ఏళ్లు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉంది. విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు మూలస్తంభాల మీద మన కుటుంబవ్యవస్థ ఆధారపడి ఉంది. “అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారికోసమే నా జీవితం” అనే త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక, కుటుంబ వ్యవస్థ బాగుంటే సమాజమూ బాగుంటుంది.
 ప్రశ్నలు:
 1. ఎటువంటి త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదికగా ఉంది?
 జవాబు:
 “అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారి కోసమే నా జీవితం”.
2. భారతీయ కుటుంబ వ్యవస్థకు ఆధార స్తంభాలు ఏవి?
 జవాబు:
 విశ్వసనీయత, సమగ్రత, ఏకత
3. కుటుంబ వ్యవస్థలోని గొప్పదనమేమిటి?
 జవాబు:
 కాలాలు మారినా ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉండటం విశేషం.
4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారుచేయండి.
 జవాబు:
 సమాజ అభివృద్ధికి దోహదం చేసేదేది?
6. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. III – 2015-16)
‘కలసి ఉంటే కలదు సుఖం’ అనే సూత్రం ఆధారంగా సమష్టి కుటుంబం కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ మొత్తం కుటుంబానికి అక్కరకు వచ్చేదే అమలయ్యేది. స్వార్థపరతకు తావు తక్కువ. మన అనే భావనకు అందరూ లోనై ఉండేవారు. రైతు కుటుంబాల్లో అయితే ఇంటిల్లిపాదీ ఇంటి పనుల్లో, బయటి పనుల్లో పాలుపంచుకునేవారు. శ్రామిక వర్గం అంతా దాదాపు అలానే ఉండేది. ఊరిలో ఏదన్నా పెళ్లి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసేవారికి ఆనందం కలిగించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నెముక అయింది. సిరిసంపదలను పోగుచేసింది. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టిందానాడు. మన ఇతిహాసాలైన రామాయణ భారతాలు ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి. –
 ప్రశ్నలు:
 1. సమష్టి కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చే మూల సూత్రం ఏది?
 జవాబు:
 “కలసి ఉంటే కలదు సుఖం”
2. ఏది దేశానికి వెన్నెముక?
 జవాబు:
 సంఘీభావం.
3. ఈ పై పేరా ఆధారంగా రెండు ప్రశ్నలు తయారు చేయండి.
 జవాబు:
 1) కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించేవి ఏవి?
 2) ఏ భావనకు అందరూ లోనై ఉండేవారు?
ఆ) కింది అపరిచిత గద్యాంశాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. ఈ కింది వచనాలను చదివి వాటి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
గాంధీజీ తన ప్రసంగాలలో సత్యం, అహింస అనే రెండు తరచుగా ఉపయోగించేవారు. అయితే ఈ రెంటిలో మొదటిదానికే ప్రాధాన్యమిచ్చారు. అతడు సత్యాన్వేషకుడే కాదు. సత్యాన్ని ఆరాధించిన భక్తుడు. తన జీవితాన్ని “సత్యమార్గంతో పరిశోధనలు”గా అభివర్ణించారు. ప్రారంభంలో భగవంతుడే సత్యమని ప్రకటించారు. కానీ, చివరకు “సత్యమే భగవంతుడు” అని ప్రకటించే స్థితికి వచ్చారు. “ఎందుకంటే భగవంతుని ఉనికిని నిరాకరించవచ్చు. కానీ, సత్యమును కాదనడం కష్టం.
 ప్రశ్నలు :
 1. గాంధీ తన ప్రసంగాలలో తరచుగా ఉయోగించేవి ఏవి?
 జవాబు:
 సత్యం, అహింస.
2. ఆయన తన జీవితాన్ని ఏమని అభివర్ణించారు?
 జవాబు:
 సత్యమార్గంతో పరిశోధనలు.
3. ప్రారంభంలో ఆయన దేనిని సత్యమని ప్రకటించారు?
 జవాబు:
 భగవంతుడే సత్యం.
4. చివరకు ఆయన దేనిని భగవంతునిగా ప్రకటించే స్థితికి వచ్చారు?
 జవాబు:
 సత్యమే భగవంతుడు.

2. భాష నేర్చుకోవడం రెండు రకాలు. భాష కోసం భాష విషయం కోసం భాష. భాషా స్వరూప స్వభావాలను సమగ్రంగా అధ్యయనం చేయడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయాలను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటిని అధ్యయనం చెయ్యడం రెండవ రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకాలుగా తయారయింది. ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రామాణిక) భాష, సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది. కాని, దాన్ని గురించి చెప్పడానికీ, రాయడానికి ఆధునిక భాషే కావాలి. ఎందువల్లనంటే ఏ కాలంలో జీవించేవాడి ఆలోచన, అలవాట్లూ ఆ కాలం నాటి భాషలోనే సాగుతుంటాయి. కనుక ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. వివిధ శాస్త్ర విషయాలను వివరించడానికే కాదు, పూర్వ భాషా సాహిత్యాలను వివరించడానికి కూడా ఆధునిక భాషే కావాలి.
 ప్రశ్నలు :
 1. భాషను ఏయే రకాలుగా నేర్చుకొంటాము?
 జవాబు:
 భాషను భాష కోసం, విషయం కోసం నేర్చు కుంటాము.
2. భాష ఎన్ని రకాలుగా తయారయింది?
 జవాబు:
 భాషలో ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రామాణిక) భాష అని రెండు రకాలు.
3. ప్రాచీన భాష ఎందుకు ఉపయోగపడుతుంది?
 జవాబు:
 ప్రాచీన భాష సాహిత్యంలోని తరతరాల వార సత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది.
4. ఆధునిక భాష ఉపయోగం ఏమిటి?
 జవాబు:
 ఆధునిక భాష సాహిత్యంలో తరతరాల గురించి చెప్పడానికి, రాయడానికి ఉపయోగపడుతుంది.
3. పరభాషల ద్వారా కాక మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుటయే సహజమైన పద్ధతి అని వాదించి వంగభాషలో బాలురకు ఉపయుక్తములగు వాచకములను, శాస్త్ర గ్రంథములను రచించిన విద్యావేత్త ఈశ్వరచంద్రుడు.
అతనివలే ఒకవైపు సంఘ సంస్కరణ చేయుచు, మరొకవైపు భాషాసేవ చేసిన మహనీయుడు మన వీరేశలింగం పంతులు గారు. పంతులుగారికి దక్షిణదేశ విద్యాసాగరుడను బిరుదు కలదు. విద్యాసాగరుడు పంతులుగారు పరస్పరం ఉత్తరములు రాసుకొనేవారు. ఈశ్వరచంద్రుని వలన వంగదేశము, పంతులుగారి వలన తెలుగుదేశము వాసిగాంచినవి.
 ప్రశ్నలు :
 1. విద్యాబోధన చేయుటకు సహజమైన పద్ధతి ఏది?
 జవాబు:
 మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుట సహజమైన పద్ధతి.
2. ఈశ్వరచంద్రుడు ఏ భాషలో వాచకములను రాసెను?
 జవాబు:
 ఈశ్వరచంద్రుడు వంగభాషలో వాచకములను రాసెను.
3. పంతులుగారి బిరుదు ఏమిటి?
 జవాబు:
 ‘దక్షిణ దేశ విద్యాసాగరుడు’ అనేది పంతులుగారికి గల బిరుదు.
4. ఈశ్వరచంద్రుని వలన ఏ దేశము వాసిగాంచెను?
 జవాబు:
 ఈశ్వరచంద్రుని వలన వంగదేశము వాసి గాంచెను.
4. మేధా సంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమవుతుంది అనేది ఎంతయినా యథార్థం. ఒక దేశం యొక్క సంస్కృతి, వికాసం, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా, కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక యుగంలో విద్య మానవునికి ఒక ముఖ్యమైన జీవితావసరంగా కూడా మారింది. నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు ఒక ప్రాథమిక అవసరంగా భావించి వాటిని రాజ్యాంగంలో పొందుపరచడమైనది.
 ప్రశ్నలు:
 1. యథార్థమైనది ఏది?
 జవాబు:
 స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంత మవుతుంది.
2. ఒక దేశ సంస్కృతి, ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది?
 జవాబు:
 ఒక దేశ సంస్కృతి, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
3. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక అవసరాలేవి?
 జవాబు:
 నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు అనే ప్రాథమిక అవసరాలు రాజ్యాంగంలో పొందుపరచ బడ్డాయి.
4. వైజ్ఞానిక వాస్తవం ఏమిటి?
 జవాబు:
 మేధాసంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం.

5. వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు ఐదువందల మంది శిష్యులతో హిమాలయాల్లో ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్నిచోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి. శిష్యులలో ఒకడు వాటి దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండటంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి గూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్ళు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి ఇతనికివ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే రెండువందల యాభై బండ్లు నిండాయి. వాటిని అక్కడి ఐదువందలమంది శిష్యులు తృప్తిగా తినేవాళ్ళు.
 ప్రశ్నలు:
 1. జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి?
 జవాబు:
 జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి.
2. వాటి బాధ ఎలా తీరింది?
 జవాబు:
 బోధిసత్వుని శిష్యుడు ఒక తొట్టెను తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టిలో పోయటం ద్వారా వాటి బాధ తీరింది.
3. ఈ కథ ద్వారా మీరు గ్రహించిందేమిటి?
 జవాబు:
 అన్ని ప్రాణుల యెడల జాలి, దయ కలిగి ఉండాలనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాను.
4. జీవకారుణ్యం అంటే ఏమిటి?
 జవాబు:
 జీవులపట్ల జాలి, దయ కలిగి ఉండుటను జీవ కారుణ్యం అంటారు.
6. ఈ కింది వ్యవహార రూపాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. I – 2018-19)
 జవాబు:
| పెదపాడు, ప్రియమైన మిత్రుడు శ్రీకర్ కు, నీ మిత్రుడు వినయ్ రాయునది. ఉభయకుశలోపరి. నేను బాగానే చదువుచున్నాను. నీవు బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. నేను ఒక చిన్నకథ చదివాను. గాంధీజీ జీవితానికి సంబంధించింది. నువ్వు ఆ కథ చదువుతావని ఇక్కడ రాస్తున్నాను. మహాత్మాగాంధీ బాలునిగా ఉన్నప్పుడు ఆయనను “మోనియా” అని పిలిచేవారు. ఒకనాడాయన ఇంటి సమీపంలో దేవాలయ ప్రాంగణంలో కొందరు పిల్లలు ఆయనను కొట్టారు. ఈ విషయం తల్లికి చెప్పాడు. “నీవు వారిని తిరిగి కొట్టలేక పోయినావా ?” అని ఆమె అన్నది. “అమ్మా ! ఆ పని చెయ్యమని నీవేల అంటున్నావు ? నేను వారి సోదరుడను కదా!” అని మోనియా తల్లితో అన్నాడు. ఈ చిన్న కథలో తోటి వారితో ఎలా మెలగాలో, తప్పు చేసిన వారిపట్ల ఏ భావం కలిగి ఉండాలో ఉంది కదా ! ఈ కథ నీకూ నచ్చి ఉంటుందని అనుకుంటూ, దసరా సెలవులు ఎలా గడిపావో విశేషాలతో లేఖరాయి. ఇట్లు, చిరునామా : | 
ప్రశ్నలు:
 1. గాంధీజీని బాల్యంలో ఏ పేరుతో పిలిచేవారు?
 జవాబు:
 మోనియా
2. గాంధీజీ తనను కొట్టిన వారిని తిరిగి కొట్టడానికి ఎందుకు నిరాకరించాడు?
 జవాబు:
 వారిని సోదరులుగా భావించాడు కనుక.
3. ఈ కథ ద్వారా నీవేం తెలుసుకున్నావు?
 జవాబు:
 తోటివారితో ఎలా మెలగాలో తెలుసుకున్నా
4. పై లేఖ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
 జవాబు:
 పై పేరాలో ఎవరి కథ చెప్పబడింది?
7. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2018-19)
రామాయణం అనే మహా గ్రంథాన్ని సంస్కృత భాషలో వాల్మీకి మహర్షి రాశారు. అందులో 6 కాండలు ఉన్నాయి. తెలుగులో గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే పేరుతో, మొల్ల రామాయణం అనే పేరుతో కవయిత్రి మొల్ల రచించారు. రామాయణంలో గురు – శిష్య, తండ్రి – కొడుకుల, అన్నదమ్ముల, భార్యభర్తల, స్నేహితుల సంబంధం బాంధవ్యాల గురించి చెప్పారు. –
 ప్రశ్నలు:
 1. గోనబుద్ధారెడ్డి రచించిన గ్రంథం పేరు ఏమి?
 జవాబు:
 రంగనాథ రామాయణం
2. సంస్కృత భాషలో రామాయణం రాసిన వారెవరు?
 జవాబు:
 వాల్మీకి
3. రామాయణంలో ఎన్ని కాండలున్నాయి?
 జవాబు:
 6 కాండలున్నాయి.
4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
 జవాబు:
 రామాయణం దేని గురించి చెబుతుంది?

8. ఈ క్రింది అపరిచిత గద్యం చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. III – 2015-16)
పాండురాజు భార్య కుంతీదేవికి ముగ్గురు కొడుకులు. వారిలో ధర్మరాజు పెద్దవాడు. రెండోవాడైన భీముడు బలవంతుడు. మూడోవాడైన అర్జునుడు విలువిద్యలో నిపుణుడు. పాండురాజు రెండో భార్య అయిన మాద్రికి నకుల, సహదేవులనే ఇద్దరు కుమారులు పుట్టారు. మొత్తం అందరూ కలిపి పాండురాజుకు ఐదుగురు కొడుకులున్నారు. ఈ ఐదుగుర్నీ పాండవులంటారు.
 ప్రశ్నలు :
 1. పాండురాజు కొడుకులను ఏమంటారు?
 జవాబు:
 పాండవులు అంటారు.
2. కుంతీదేవికి మొత్తం ఎంతమంది కొడుకులు?
 జవాబు:
 ముగ్గురు
3. భీముడి ప్రత్యేకత ఏమిటి?
 జవాబు:
 బలవంతుడు
4. పాండవులు ఎంతమంది?
 జవాబు:
 ఐదుగురు
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
 ‘మన’ అనే భావన వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
 జవాబు:
 ‘మన’ అనే భావన ఉంటే సమష్టి కుటుంబ వ్యవస్థ అనేది సక్రమంగా ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులు అందరూ, ఆ కుటుంబం అభివృద్ధికి పాటుపడతారు. ఆ కుటుంబం ‘మనది’ అనుకుంటారు. అందువల్ల భేదభావాలు ఈర్ష్యాద్వేషాలు లేకుండా అందరూ తమ శక్తికి మించి పనిచేస్తారు. ముఖ్యంగా రైతు కుటుంబాల్లో ఐతే, ఇంటిల్లిపాదీ ఇంటిపనుల్లో, బయట పనుల్లో పాలుపంచుకుంటారు. వ్యవసాయం పనులు ఇంటి వారంతా కలిసి చేసుకుంటారు. కాబట్టి వేరుగా కూలిపని వారిని పెట్టుకోనక్కరలేదు. కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కోపని చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. కాబట్టి ఆ కుటుంబం అవసరాలను, ఆ కుటుంబం వారే ఇతరుల అవసరం లేకుండా పూర్తి చేసుకోవచ్చు. వారిండ్లలో పెళ్ళిపనులు వంటి కార్యక్రమాలు వస్తే, కుటుంబ సభ్యులు అందరూ, అది తమ కార్యక్రమమని శ్రమను పంచుకొని ఆనందంగా ఆ పని పూర్తి చేస్తారు. ఈ ‘మన’ అన్న సంఘీభావం, దేశానికి వెన్నెముక వంటిది. అందరూ కుటుంబం మనది అనుకుంటే, ఆ కుటుంబం సిరిసంపదలతో వర్ధిల్లుతుంది.
ప్రశ్న 2.
 ‘మంచి కుటుంబ నేపథ్యంలో వచ్చిన పిల్లలే, ఈ సమాజంలో నిలదొక్కుకుంటున్నారు. ఎందుకు?
 జవాబు:
 మంచి కుటుంబంలో పెరిగిన పిల్లలు, తల్లిదండ్రుల నుండి క్రమశిక్షణ, ఇంట్లో పెద్దల నుండి ప్రేమానురాగాలు, నీతి, చక్కని నడవడి నేర్చుకుంటారు. వారు చక్కగా చదువుకొని, బాధ్యతతో పెరిగి పెద్దవారవుతారు. తమ తల్లిదండ్రుల పట్ల, దేశంపట్ల, సంఘం పట్ల, మంచి బాధ్యతతో క్రమశిక్షణ గలిగి, దేశభక్తితో నడచుకుంటారు. దేశ పౌరులుగా తమ విధులను నెరవేరుస్తారు.
సహజంగా పిల్లలు సమష్ఠి కుటుంబంలో పెరిగి, సంతోషాన్ని, కష్టాల్నీ, బాధల్నీ ఒకరికొకరు పంచుకోవాలి. కాని వ్యష్టి కుటుంబాల్లో పిల్లలు ‘ఎవరికివారే యమునా తీరే’ అన్నట్లు వెలుగుతున్నారు. అందువల్లే పిల్లల్లో కొందరు అనాథలుగా, సమాజ వ్యతిరేక శక్తులుగా మారిపోతున్నారు. వీరిలో కొందరు అశాంతి, హింసలకు ముఖ్యకారకులు అవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావంతో పాటు, సమాజమూ, తోడి పిల్లలూ, ప్రసారసాధనాల ప్రభావమూ కూడా ఉంటుంది.
అందువల్లే మంచి కుటుంబం నేపథ్యం నుండి వచ్చిన పిల్లలే, సమాజంలో నిలదొక్కుకుంటున్నారు.
ప్రశ్న 3.
 కుటుంబ వ్యవస్థకు మౌలికాంశాలేవి?
 జవాబు:
 కుటుంబ వ్యవస్థకు మౌలికాంశాలు పోషణ, భద్రత కల్పించడం. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, విచక్షణ జ్ఞానాన్నివ్వడం, సంస్కృతిని వారసత్వంగా అందించడం, కుటుంబ వ్యవస్థ ప్రధానోద్దేశాలలో ఒకటి. విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు స్తంభాల మీద మన కుటుంబవ్యవస్థ ఆధారపడియుంది. “అందరిలో నా సుఖం ఉంది. వారి కోసమే మన జీవితం” అనేది భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.
ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
 తల్లిదండ్రులు ఇతరులతో పోటీపడుతూ పరుగెడుతున్న నేటి సమాజంలో పిల్లల పరిస్థితులు ఏమిటి?
 జవాబు:
 తల్లిదండ్రులు నేటికాలానికి అనుగుణంగా, ఆర్థిక పరిస్థితిని బట్టి ఇద్దరూ సంపాదిస్తేనే గాని కుటుంబం గడిచే పరిస్థితి ఉండటం లేదు.
వారు సమాజంలో ఒక యాంత్రికమైన జీవనాన్ని గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో పిల్లల ఆలనా పాలనా, మంచిచెడ్డలు చూసుకునే సమయం కూడా వారికి ఉండటం లేదు.
ఈ రోజుల్లో తల్లిదండ్రులు, తమ పిల్లలను బాగా చదివించాలనీ, వాళ్ళు మంచి ఉద్యోగులుగా, మంచి డబ్బు సంపాదించే వాళ్ళుగా తయారవ్వాలని పోటీపడుతున్నారు. అందుకోసం తమ సర్వస్వాన్నీ త్యాగం చేసి, పిల్లల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. ఇది ఒక రకంగా మంచి పోటీయే.
కాని ఈ పోటీలో తల్లిదండ్రులు, తమ పిల్లలకు ఏ విషయంపై అభిరుచి ఉందో, ఆసక్తి ఉందో గమనించడం లేదు.
శక్తి గల పిల్లలు, తల్లిదండ్రుల కృషి వల్ల బాగుపడుతున్నారు. కాని అందరూ ఒకే దారి తొక్కడం వల్ల పోటీ పెరుగుతోంది. నిరుద్యోగం పెరిగిపోతోంది. దానితో పిల్లలలో నిరాశా నిస్పృహలు పెరిగిపోతున్నాయి. మరి కొందరు పిల్లలకు ఆ చదువులపై ఆసక్తి, శక్తి లేక, మధ్యలోనే చదువులు మానివేసి, తప్పుడు దారులు తొక్కుతున్నారు. మరికొందరు నక్సలైట్లుగా, ఉగ్రవాదులుగా, హింసా ప్రవర్తకులుగా మారిపోతున్నారు.
బలవంతంగా పిల్లలను ఇంగ్లీషు మాధ్యమంలో చదివించడంతో, అటు ఇంగ్లీషు, ఇటు మాతృభాష రెండూ రాక, ఉభయభ్రష్టులు అవుతున్నారు. ముఖ్యంగా అందరికీ ప్రాథమిక విద్య, మాతృభాషలోనే నేర్పాలి. పదవతరగతి పూర్తి అయ్యే వరకూ, మాతృభాషను ప్రథమ భాషగా పిల్లలకు నేర్పాలి. పిల్లల అభిరుచులను తల్లిదండ్రులు తెలిసికొని, వారి ఇష్టానికి తగిన చదువులనే చదివించాలి.
పిల్లలపై తల్లిదండ్రులు, తమ అభిరుచులనూ, ఆసక్తులను అంటగట్టక, పిల్లల ఇష్టాలను గుర్తించి, వారిని సర్వతోముఖంగా అన్ని రంగాలలో సంసిద్ధులను చేయాలి.

ప్రశ్న 2.
 వృష్టి కుటుంబమైనా, సమష్టి కుటుంబమైనా సమాజానికి, దేశానికి పనికి వచ్చే పిల్లల్ని అందించాలంటే ఏం చేయాలి?
 జవాబు:
 కుటుంబ పరమైన వారసత్వభావనలు, మానవ సంబంధాలు, ఆప్యాయత, అనురాగం, జీవన సంప్రదాయాలు, సంస్కృతి తమ పిల్లలకు అందేలా చేయాలి. తల్లిదండ్రులకు పిల్లల సంక్షేమమే, మొదటి ప్రాధాన్యం కావాలి. తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారగుణం అందించాలి. సమస్త సద్గుణాలకూ, దుర్గుణాలకూ ఇల్లే పునాది అని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లల్ని కేర్ టేకింగ్ సెంటర్లలో వదలి, తాము ఉద్యోగాలు చేసుకుంటూ కూర్చోరాదు.
పిల్లలకు పెద్దల పై, గురువులపై, తల్లిదండ్రులపై గౌరవం ఆదరం కలిగేలా చూసుకోవాలి. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలి. చిన్ననాటి నుండి విలువలను కాపాడే సంస్కృతిని, విద్యను నేర్పించాలి. పిల్లలకు హక్కులతో పాటు బాధ్యతలను నేర్పించాలి.
తల్లిదండ్రులు, తాము ఏ కుటుంబంలో ఉన్నప్పటికీ, కుటుంబ భావనలు పిల్లలకు వివరించి చెప్పగలగాలి. పెద్దల బలాన్ని పొందాలి. ఉమ్మడి, వ్యష్టి కుటుంబాల మేలు కలయికతో, ఆధిపత్యాల పోరులేని ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు అంతస్సూత్రంగా ఉన్న ఒక కొత్త కుటుంబవ్యవస్థను ఏర్పాటు చేసుకొని, పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి. వారికి తమ కుటుంబ వారసత్వాన్ని అందించాలి.
ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
 ఉమ్మడి కుటుంబ ఆవశ్యకతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
 జవాబు:
| అమరావతి, ప్రియమైన మిత్రుడు రమేష్ కు, నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన భారతదేశంలోని కుటుంబ వ్యవస్థకు సమున్నతమైన స్థానం ఉంది. ప్రజలందరూ ఉమ్మడి కుటుంబాన్ని గౌరవించాలి. ఉమ్మడి కుటుంబం వల్ల మానవీయ సంబంధాలు పెరుగుతాయి. నైతిక విలువలు వృద్ధి పొందుతాయి. ఆత్మీయతానురాగాలు నిత్యం ఉంటాయి. పరస్పర సహకారం కలుగుతుంది. అందువల్ల మనమంతా ఉమ్మడి కుటుంబాలనే గౌరవిద్దాం. మన కుటుంబ వ్యవస్థను చిరకాలం నిలుపుదాం. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు. ఆత్మీయతానురాగాలు నిత్యం ఉంటాయి. పరస్పర సహకారం కలుగుతుంది. అందువల్ల మనమంతా ఉమ్మడి కుటుంబాలనే గౌరవిద్దాం. మన కుటుంబ వ్యవస్థను చిరకాలం నిలుపుదాం. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు చిరునామా : | 
ప్రశ్న 2.
 సహజీవన మాధుర్యం గురించి ఒక వ్యాసం రాయండి.
 జవాబు:
 వ్యక్తి కుటుంబంలో సభ్యుడైనా – సమాజంలో పౌరుడుగా కొనసాగుతూ ఉంటాడు. కుటుంబాలన్నీ కలిసే సంఘ మనబడుతుంది. కానీ వ్యక్తి తన పాత్రను అటు కుటుంబంలో, ఇటు సమాజంలో బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. మంచి కుటుంబ సభ్యుడు కానప్పుడు ఆకష్టం, నష్టం కుటుంబానికే పరిమితమై ఉంటుంది. కానీ సత్పౌరుడు కాకపోతే దేశానికే సమస్యగా పరిణమిస్తాడు. అందుకే కుటుంబక్షేమం కోసం వ్యక్తినీ, సమాజశ్రేయస్సుకోసం కుటుంబాన్నీ, దేశశ్రేయస్సుకోసం సమాజాన్నీ కూడా పరిత్యజించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇక్కడ మనిషి హక్కుల్నీ, బాధ్యతల్నీ బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎదురవుతుంది. వ్యక్తి తనహక్కుల్నే అనుభవించడంలో సమాజంలోని సాటివారి ప్రాథమికహక్కుల్ని కూడా గౌరవించాల్సి ఉంది. వ్యక్తి స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛను హరించని పరిస్థితుల్లో మాత్రమే రాణిస్తుంది. అంటే నాగరిక సమాజంలో ప్రతిమనిషికీ, ఇంకొకరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహజీవనంలో వసుధైక కుటుంబ భావన పరిపూర్ణంగా పాటించాల్సి ఉంది.
ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకూ సమాజం ఒకేలా లేదు. ప్రాథమిక అవసరాల కోసం మనిషి జీవించే తీరులో మార్పు వచ్చింది. దేశ కాలపరిస్థితుల్ని బట్టి మానవుడు నియమబద్ధమైన ప్రవర్తన నియమావళిని రూపొందించుకొంటూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో అనేక అంతరహిస్సంఘర్షణలకు లోనయ్యాడు. మానసికంగా పరిశ్రమించి, తపస్సు చేసి జీవితపరమార్థాన్ని తెలుసుకోగలిగాడు. తాను దర్శించిన సత్యాల ప్రాతిపదికగా మానవజాతికోసం, మూల్యవ్యవస్థను నిర్మించాడు. ఈ మూల్యవ్యవస్థ నిర్మాణం సమిష్టి కృషిగానే సాగింది. వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం అనే క్రమంలో సువ్యవస్థిత స్థితిని ఉంచేందుకు చేసే కృషి కూడా మూల్యం అని చెప్పబడుతుంది. వ్యక్తి తన లో నుంచి రూపొందించుకున్న విలువ, సామాజికమై, అందరి సంక్షేమం కోసం ఉద్దేశింపబడుతుంది. సత్యం చర మొదలైనవి ఇలాంటివే.
ప్రశ్న 3.
 “ఉత్తమ సమాజ రూపకల్పనకు కుటుంబ వ్యవస్టే వెన్నెముక” అనడానికి కారణాలు రాయండి. (S.A. I – 2018-19)
 జవాబు:
 సమాజానికి కుటుంబం వెన్నెముక. మంచి కుటుంబం, మంచి సమాజం వీటి నుంచి మంచి దేశం, మంచి ప్రపంచం ఏర్పడతాయి. అందుకు అందరూ కృషి చేయాలి.
కుటుంబం అనే మాట మధురమైనది. కుటుంబం అన్న భావన తలపుకు రాగానే మనస్సులో ఏదో అనిర్వచనీయమైన హాయి కలుగుతుంది. తీపి జ్ఞాపకాలెన్నో గుర్తుకు వస్తాయి.
చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపిన మధురక్షణాలు, జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దయిన తర్వాత సినిమాలా కళ్ళముందు మెదలాలి. ఈ మధురమైన అనుభూతిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే చక్కని కుటుంబం కావాలి. గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి మహనీయులెందరికో వారి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి.
ఉమ్మడి కుటుంబం, వ్యష్టి కుటుంబాల మేలి కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగకుండా, ఆధిపత్యాల పోరులేని, ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు అంతస్సూత్రమైన ఒక మంచి కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. అప్పుడే సమాజం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతాయి.

ప్రశ్న 4.
 “అభివృద్ధి చెందుతున్న సమాజానికి, అనుబంధాలతో ఉన్న కుటుంబమే మూలం” ఈ వాక్యాన్ని సమర్థించే “ఇల్లు – ఆనందాల హరివిల్లు” ఎలా అవుతుందో తెల్పండి. (S.A. II – 2017-18)
 జవాబు:
 ‘అభివృద్ధి చెందుతున్న సమాజానికి, అనుబంధాలతో ఉన్న కుటుంబమే మూలం’ అని ‘ఇల్లు – ఆనందాల హరివిల్లు’ పాఠం ద్వారా రచయిత చెప్పిన మాట అక్షరసత్యం. సమాజం అంటే మనుషులే. మనుషులంతా కలిస్తేనే సమాజం. దీనిని బట్టి సమాజం బాగుంది అంటే మనుషులు బాగున్నట్టే కదా !
ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక, సహాయ సహకారాలందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలున్న స్త్రీ పురుషులు, వారి పిల్లలు ఉన్న సమూహమే కుటుంబం అని పెద్దలు నిర్వచించారు. ‘విశ్వసనీయత, సమగ్రత, ఏకత’ అనే వాటి మీద కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. “అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారి కోసమే నా జీవితము” అనే త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.
సమాజంలో కుటుంబమే అత్యంత కీలకం. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. తల్లిదండ్రులకు పిల్లల సంక్షేమమే తొలి ప్రాధాన్యం. మంచి కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లలు కష్టాలను అధిగమించి సమాజంలో నిలదొక్కు కుంటారు. కుటుంబం అనే హరివిల్లులో అమ్మానాన్నలు, పిల్లలు, తాతానానమ్మలు ఇలా అందరూ భాగమైతే అందం, ఆనందం వెల్లి విరుస్తుంది. ఆ ‘ఇల్లే ఇలలో స్వర్గం’ అవుతుంది. కుటుంబంలోని సభ్యుల మధ్య బంధాలు, అనురాగాలు, గౌరవం, మంచితనం అనేవి సహజంగా ఉన్నప్పుడు ఆ లక్షణాలు పిల్లలకూ వారసత్వంగా వస్తాయి.
ఈ వారసత్వ లక్షణాలున్న కుటుంబం సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది.
8th Class Telugu 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు 1 Mark Bits
1. ఇల్లు – ఆనందాల “హరివిల్లు” (అర్థాన్ని గుర్తించండి) (S.A.I – 2018-19)
 ఎ) ఇంద్రధనస్సు
 బి) మేఘం
 సి) ఆనందం
 డి) సత్కారం
 జవాబు:
 ఎ) ఇంద్రధనస్సు
2. మనం చట్టం అతిక్రమించకూడదు. (ప్రకృతిని గుర్తించండి) (S.A. I – 2018-19)
 ఎ) చుట్టం
 బి) శాస్త్రం
 సి) క్షేమం
 డి) శీర్షం
 జవాబు:
 బి) శాస్త్రం
3. కింది వాటిలో సరైన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
 ఎ) లత, శ్రీలత అక్కా చెల్లెళ్ళు.
 బి) చెట్లు చిగిర్చిపూలు పూశాయి.
 సి) రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
 డి) మీరు అల్లరి చేయవద్దు. కూర్చోండి.
 జవాబు:
 బి) చెట్లు చిగిర్చిపూలు పూశాయి.
4. సమప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడితే అది ఏ వాక్యం? (S.A.I- 2018-19)
 ఎ) సంయుక్త వాక్యం
 బి) సంక్లిష్ట వాక్యం
 సి) సామాన్య వాక్యం
 డి) సంక్లిష్ట వాక్యం
 జవాబు:
 ఎ) సంయుక్త వాక్యం
5. కుటుంబంతో కలిపి దేవాలయానికి వెళ్లాలి (సంధి పేరు గుర్తించండి) (S.A. II – 2018-19)
 ఎ) సవర్ణదీర్ఘసంధి
 బి) అత్వసంధి
 సి) గుణసంధి
 డి) వృద్ధి సంధి
 జవాబు:
 ఎ) సవర్ణదీర్ఘసంధి
6. ఈ కింది వానిలో సంయుక్త వాక్యం గుర్తించండి. (S.A. II – 2018-19)
 ఎ) విమల తెలివైనది. విమల అందమైనది కదా
 బి) విమల తెలివైనదీ, విమల అందమైన దీ
 సి) విమల తెలివిగానే విమల అందమైనదే
 డి) విమల తెలివైనది మరియు అందమైనది.
 జవాబు:
 డి) విమల తెలివైనది మరియు అందమైనది.

7. చిన్మయీ హోంవర్క్ పూర్తి చేసి నిద్రపోయింది. (ఏ రకపు వాక్యమో గుర్తించండి) (S.A. III – 2016-17)
 ఎ) సంయుక్త వాక్యం
 బి) సామాన్య వాక్యం
 సి) సంక్లిష్ట వాక్యం
 డి) విశేష వాక్యం
 జవాబు:
 సి) సంక్లిష్ట వాక్యం
8. అక్షర పాటలు రాస్తుందీ, పాడుతుంది. (ఏ వాక్యమో గుర్తించండి) (S.A. II – 2017-18)
 ఎ) సంయుక్త వాక్యం
 బి) సందేహ వాక్యం
 సి) విద్యర్థక వాక్యం
 డి) సంక్లిష్ట వాక్యం
 జవాబు:
 ఎ) సంయుక్త వాక్యం
9. అమ్మ కడుపు నిండా అన్నం పెట్టింది. (ప్రకృతి పదం గుర్తించండి.) (S.A. III – 2016-17)
 ఎ) ఉదరం
 బి) గర్భం
 సి) అర్భకుడు
 డి) పొట్ట
 జవాబు:
 బి) గర్భం
10. నేను దక్షిణానికి తిరిగి దక్షిణ నిచ్చాను. (నానార్థాలు గుర్తించండి.) (S.A. II – 2017-18)
 ఎ) తూర్పు – పడమర
 బి) ఉత్తరం – దక్షిణం
 సి) ఒక దిక్కు – సంభావన
 డి) డబ్బు – దస్కం
 జవాబు:
 సి) ఒక దిక్కు – సంభావన
11. అనైక్యత అనర్ధానికి దారి తీస్తుంది. వాక్యంలో గీత గీసిన పదానికి వ్యతిరేకపదం గుర్తించండి. (S.A. III – 2015-16)
 ఎ) వాక్యం
 బి) ద్వేషం
 సి) ఐక్యత
 డి) క్రోథం
 జవాబు:
 సి) ఐక్యత
12. నారాయణ అన్నం తిన్నాడు. నారాయణ నీళ్లు తాగాడు. ఈ రెండు సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మారిస్తే ఏది సరైన వాక్యమవుతుంది? (S.A. III – 2015-16)
 ఎ) నారాయణ అన్నం తిని నీళ్లు తాగాడు.
 బి) నారాయణ అన్నం, నీళ్లు తాగాడు
 సి) నారాయణ అన్నం తిని నీళ్లు తాగలేదు.
 డి) నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతున్నాడు.
 జవాబు:
 ఎ) నారాయణ అన్నం తిని నీళ్లు తాగాడు.
భాషాంశాలు – పదజాలం
ఆర్థాలు :
13. ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) ఆవేదన
 బి) అంగీకారం
 సి) తిరస్కారం
 డి) విజయం
 జవాబు:
 బి) అంగీకారం

14. రాష్ట్రానికి తొలి రాజధాని కర్నూలు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) మొదటి
 బి) చివరి
 సి) మధ్యమ
 డి) ప్రయోజన
 జవాబు:
 ఎ) మొదటి
15. పనులకు భంగం కలుగకూడదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) ఆటంకం
 బి) ఆవేదన
 సి) ఆకారం
 డి) ఆకలి
 జవాబు:
 ఎ) ఆటంకం
16. వీరుల మధ్య పోరు జరిగింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) సాగరం
 బి) అంబుధి
 సి) యుద్ధం
 డి) తరుణం
 జవాబు:
 సి) యుద్ధం
17. పనిలో సామర్థ్యం కనబరచాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) అయోగ్యత
 బి) మోదం
 సి) భేదం
 డి) యోగ్యత
 జవాబు:
 డి) యోగ్యత
18. విద్యార్థులకు వివేచన అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) మిక్కిలి
 బి) ఆలోచన
 సి) ఆరాధన
 డి) అపరాధం
 జవాబు:
 బి) ఆలోచన
19. మనిషికి స్వాతంత్ర్యం అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) మోదము
 బి) స్వేచ్ఛ
 సి) బంధిఖాన
 డి) ప్రియము
 జవాబు:
 బి) స్వేచ్ఛ
20. ఇలపై నందనం విరియాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) తార్కాణం
 బి) భూమి
 సి) సుధ
 డి) వ్యధ
 జవాబు:
 బి) భూమి
పర్యాయపదాలు:
21. పుష్పాల్లో సౌరభం ఉంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 ఎ) సువాసన, తావి
 బి) తరుణం, తామకం
 సి) తమసం, తదనంతరం
 డి) వాసన, దుర్గంధం
 జవాబు:
 ఎ) సువాసన, తావి
22. స్వరంలో దేవతలు ఉంటారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 ఎ) మర్త్యము
 బి) త్రిదివం
 సి) త్రిభువనం
 డి) రసాతలం
 జవాబు:
 బి) త్రిదివం

23. భార్యను గౌరవించాలి-గీత గీసిన పదానికి సమానార్థక పదాలు గుర్తించండి.
 ఎ) విన్నానం
 బి) వివేణం
 సి) యతి, పది
 డి) సతి, నది
 జవాబు:
 ఎ) విన్నానం
24. రాము గృహంలో ఉన్నాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
 ఎ) ధూదం, ద్రవ్యం
 బి) ఇల్లు, సదనం
 సి) నికేతనం, నందనం
 డి) నారలు, మదిలు
 జవాబు:
 బి) ఇల్లు, సదనం
25. తల్లి వంద్యురాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 ఎ) పితామహి, ప్రభావతి
 బి) సతి, గాంధర్వం
 సి) జనని, మాత
 డి) జనని, జనకుడు
 జవాబు:
 సి) జనని, మాత
26. జనకుడు ఊరికి వెళ్ళాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 ఎ) ఊరు, పేరు
 బి) తండ్రి, పిత
 సి) పత, జత
 డి) నాకం, నరకం
 జవాబు:
 బి) తండ్రి, పిత
27. పెళ్ళి జరిగింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 ఎ) సాహచర్యం, సంతర్పణ
 బి) సాయుధం, బలాత్కారం
 సి) వివాహం, పరిణయం
 డి) సదనం, నికేతనం
 జవాబు:
 సి) వివాహం, పరిణయం
28. సదనంలో ఉన్నాను – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
 ఎ) గతం, గేహం
 బి) ఇల్లు, గృహం
 సి) నికేతనం, నాటకం
 డి) వీధి, రంగం
 జవాబు:
 బి) ఇల్లు, గృహం
29. కర్షకుడు వ్యవసాయం చేస్తాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 ఎ) రైతు, భూమీశుడు
 బి) కృషీవలుడు, రైతు
 సి) పృథ్వి, ధరణీశ్వరుడు
 డి) అవని, జలధి
 జవాబు:
 బి) కృషీవలుడు, రైతు
ప్రకృతి – వికృతులు :
30. పుణ్యం పొందాలి – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి.
 ఎ) పొన్నెం
 బి) పున్నెం
 సి) పన్నెం
 డి) పందెం
 జవాబు:
 బి) పున్నెం
31. చట్టం తెలియాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి. ఏది?
 ఎ) శాస్త్రి
 బి) శాస్త్రం
 సి) శారం
 డి) వస్త్రం
 జవాబు:
 బి) శాస్త్రం

32. మంత్రంతో పని జరగాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
 ఎ) చంద్రం
 బి) జింతం
 సి) గెంత్రం
 డి) పంత్రం
 జవాబు:
 సి) గెంత్రం
33. విజ్ఞానం సాధించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
 ఎ) ఇల్లాలు, కులస్త్రీ
 బి) పత్ని, గవి
 సి) విన్ననం
 డి) విన్నపం
 జవాబు:
 ఎ) ఇల్లాలు, కులస్త్రీ
34. కర్ణం సాధించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
 ఎ) పర్జన్యం
 బి) కార్యం
 సి) కార్యెం
 డి) కర్యం
 జవాబు:
 బి) కార్యం
నానార్థాలు :
35. అకాలంలో మరణించాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) ఆకాశం, అనంతం
 బి) సమయం, మరణం
 సి) చావు, కీర్తి
 డి) యశస్సు, ఆర్తి
 జవాబు:
 బి) సమయం, మరణం
36. పురోహితుడు దక్షిణ పొందాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) నాగరికం, సదనం
 బి) తటం, ధాన్యం
 సి) ఒక దిక్కు, సంభావన
 డి) నగలు, నుదురు
 జవాబు:
 సి) ఒక దిక్కు, సంభావన

37. మానవులు ధర్మం ఆచరించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) ధరణి, దాపరికం
 బి) మోక్షం, ముత్యం
 సి) దిక్కు, శరణు
 డి) పుణ్యం, న్యాయం
 జవాబు:
 డి) పుణ్యం, న్యాయం
వ్యుత్పత్యర్థాలు :
38. పక్షములు కలది – అనే వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
 ఎ) పాక్షికం
 బి) సాగరం
 సి) పక్షి
 డి) నది
 జవాబు:
 సి) పక్షి
39. ఇలా జరిగిందని చెప్పునది – అనే వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
 ఎ) కావ్యం
 బి) ప్రక్రియ
 సి) గాథ
 డి) ఇతిహాసం
 జవాబు:
 డి) ఇతిహాసం
40. మనువు వల్ల పుట్టినవాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం గుర్తించండి.
 ఎ) ఉత్తరం
 బి) మానవుడు
 సి) దానవుడు
 డి) దక్షిణ
 జవాబు:
 బి) మానవుడు

41. సువాసనతో కూడినది – అనే వ్యుత్పత్త్యం గల పదం
 ఎ) సౌరభం
 బి) దానవం
 సి) దాపరికం
 డి) నాకము
 జవాబు:
 ఎ) సౌరభం
వ్యాకరణాంశాలు
సంధులు :
42. ప్రేమానురాగాలు పెంచాలి – గీత గీసిన పదం ఏ సంధి?
 ఎ) సవర్ణదీర్ఘ సంధి
 బి) గుణసంధి
 సి) వృద్ధి సంధి
 డి) త్రికసంధి
 జవాబు:
 ఎ) సవర్ణదీర్ఘ సంధి
43. క్రింది వానిలో పొసగని సంధి ఏది?
 ఎ) సవర్ణదీర్ఘ సంధి
 బి) అత్వసంధి
 సి) గుణసంధి
 డి) వృద్ధిసంధి
 జవాబు:
 బి) అత్వసంధి
44. భావ + ఉద్వేగాలు – దీన్ని కలిపి రాస్తే
 ఎ) భావైద్వేగాలు
 బి) భావోద్వేగాలు
 సి) బావాద్వేగాలు
 డి) భవైద్వేగాలు
 జవాబు:
 బి) భావోద్వేగాలు
45. లు, ల, న సంధికి ఉదాహరణను గుర్తించండి.
 ఎ) నట్టిల్లు
 బి) అమ్మలక్కలు
 సి) అనుబంధాలు
 డి) సూర్యోదయం
 జవాబు:
 సి) అనుబంధాలు
46. తెలుగులో నిత్య సంధికి ఉదాహరణను గుర్తించండి.
 ఎ) త్రికసంధి
 బి) ఇత్వసంధి
 సి) ఉత్వసంధి
 డి) అత్వసంధి
 జవాబు:
 సి) ఉత్వసంధి

47. సూత్రమైన – దీన్ని విడదీస్తే
 ఎ) సూత్రము + అయిన
 బి) సూత్రం + ఐన
 సి) సూత్రాలు + ఐన
 డి) సూత్రము + ఐన
 జవాబు:
 డి) సూత్రము + ఐన
48. ప్రత్యక్షంగా చూడాలి – ఇది ఏ సంధి?
 ఎ) గుణసంధి
 బి) యణాదేశ సంధి
 సి) త్రికసంధి
 డి) ఉత్వసంధి
 జవాబు:
 బి) యణాదేశ సంధి
49. పరోపకారం చేయాలి – దీన్ని విడదీయండి.
 ఎ) పర + అపకారం
 బి) పర + ఉపకారం
 సి) పరె + అపకారం
 డి) పరై + అపకారం
 జవాబు:
 బి) పర + ఉపకారం
50. నిరయాధికారం ఉండాలి – ఇది ఏ సంధి?
 ఎ) గుణసంధి
 బి) సవర్ణదీర్ఘ సంధి
 సి) త్రికసంధి
 డి) అత్వసంధి
 జవాబు:
 బి) సవర్ణదీర్ఘ సంధి
సమాసాలు :
51. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
 ఎ) పరోక్షం
 బి) ప్రత్యక్షం
 సి) ఆశ్రమధర్మం
 డి) స్త్రీపురుషులు
 జవాబు:
 బి) ప్రత్యక్షం
52. భార్యాభర్తలు ఉన్నారు – ఇది ఏ సమాసం?
 ఎ) అవ్యయీభావ సమాసం
 బి) ద్వంద్వ సమాసం
 సి) బహుహ్రీహి సమాసం
 డి) కర్మధారయ సమాసం
 జవాబు:
 బి) ద్వంద్వ సమాసం
53. పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏమిటి?
 ఎ) తత్పురుష సమాసం
 బి) బహుహ్రీహి సమాసం
 సి) అవ్యయీభావ సమాసం
 డి) రూపక సమాసం
 జవాబు:
 సి) అవ్యయీభావ సమాసం

54. భారతదేశము – ఏ సమాసం?
 ఎ) సంభావనా పూర్వపద కర్మధారయం
 బి) కర్మధారయ సమాసం
 సి) ద్విగు సమాసం
 డి) బహున్రీహి సమాసం
 జవాబు:
 ఎ) సంభావనా పూర్వపద కర్మధారయం
55. దినము దినము – దీనిని సమాసపదంగా చేస్తే
 ఎ) ప్రతిదినం
 బి) అనుదినం
 సి) యదినం
 డి) గతదినం
 జవాబు:
 ఎ) ప్రతిదినం
56. సమానాధికరణ తత్పురుష అని దేనిని అంటారు?
 ఎ) అవ్యయీభావం
 బి) బహుజొహి
 సి) కర్మధారయం
 డి) ద్విగు
 జవాబు:
 సి) కర్మధారయం
57. ఉన్నతశ్రేణి – ఇది ఏ సమాసం?
 ఎ) అవ్యయీభావం
 బి) విశేషణ పూర్వపద కర్మధారయం
 సి) విశేషణ ఉత్తరపద కర్మధారయం
 డి) ఉపమాన పూర్వపద కర్మధారయం
 జవాబు:
 బి) విశేషణ పూర్వపద కర్మధారయం

58. శుభమును, అశుభమును – దీన్ని సమాస పదంగా మార్చండి.
 ఎ) అశుభశుభములు
 బి) అశుభాశుభములు
 సి) శుభాశుభములు
 డి) శుభఅశుభములు
 జవాబు:
 బి) అశుభాశుభములు
59. షష్ఠీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
 ఎ) ఉన్నతశ్రేణి
 బి) శ్రామికవర్గం
 సి) కొత్త ధోరణులు
 డి) పక్షం రోజులు
 జవాబు:
 బి) శ్రామికవర్గం
గణ విభజన :
60. IUU – ఇది ఏ గణము?
 ఎ) న గణం
 బి) య గణం
 సి) త గణం
 డి) మ గణం
 జవాబు:
 బి) య గణం
61. ‘న’ గణమును గుర్తించండి.
 ఎ) UUU
 బి) UIU
 సి) III
 డి) UII
 జవాబు:
 సి) III
62. భాస్కరా – ఇది ఏ గణము?
 ఎ) త గణం
 బి) జ గణం
 సి) మ గణం
 డి) ర గణం
 జవాబు:
 డి) ర గణం
వాక్యాలు :
63. పెండ్లి జరిగింది గాని సందడి లేదు – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) సంయుక్త వాక్యం
 బి) కర్మణి వాక్యం
 సి) కర్తరి వాక్యం
 డి) తద్ధర్మార్థక వాక్యం
 జవాబు:
 ఎ) సంయుక్త వాక్యం
64. వాల్మీకి రామాయణం రచింపబడింది – దీన్ని కర్తరి వాక్యంగా రాస్తే
 ఎ) వాల్మీకి వల్ల రామాయణం రాశాడు.
 బి) వాల్మీకి రామాయణం రచించాడు.
 సి) రామాయణం నందు వాల్మీకి రచించాడు.
 డి) రచించాడు రామాయణం వాల్మీకి.
 జవాబు:
 బి) వాల్మీకి రామాయణం రచించాడు.

65. ‘నాకు చదవడం ఇష్టం’ అని రవి అన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) కర్మణి వాక్యం
 బి) కర్తరి వాక్యం
 సి) ప్రత్యక్ష కథన వాక్యం
 డి) పరోక్ష కథన వాక్యం
 జవాబు:
 సి) ప్రత్యక్ష కథన వాక్యం
66. మీకు మేలు కలుగుగాక – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) కర్మణివాక్యం
 బి) ఆశీరార్థక వాక్యం
 సి) తద్ధర్మార్థక వాక్యం
 డి) అభ్యర్థక వాక్యం
 జవాబు:
 బి) ఆశీరార్థక వాక్యం
67. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) శత్రర్థక వాక్యం
 బి) హేత్వర్ధక వాక్యం
 సి) కర్తరి వాక్యం
 డి) కర్మణి వాక్యం
 జవాబు:
 బి) హేత్వర్ధక వాక్యం
68. నేను తప్పక వస్తాను – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) అప్యర్థక వాక్యం
 బి) కర్మణి వాక్యం
 సి) నిశ్చయార్థక వాక్యం
 డి) తద్ధర్మార్థక వాక్యం
 జవాబు:
 బి) కర్మణి వాక్యం
69. పెద్దలను మనం గౌరవించాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
 ఎ) కొందరు పెద్దలను గౌరవించవలెను.
 బి) పెద్దలను మనం గౌరవించకూడదు.
 సి) పెద్దలను మనం గౌరవించకపోవచ్చు.
 డి) పెద్దలను మనం తప్పక గౌరవింపలేకపోవచ్చు.
 జవాబు:
 బి) పెద్దలను మనం గౌరవించకూడదు.

70. అందరు కలసి ఉండాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
 ఎ) అందరు కలసి ఉండకూడదు.
 బి) అందరు కలసి ఉండవచ్చు.
 సి) అందరు కలసి ఉండాలి గదా!
 డి) కొందరు కలిసి ఉండకూడదు.
 జవాబు:
 ఎ) అందరు కలసి ఉండకూడదు.
సొంతవాక్యాలు :
71. జీవనవిధానం : భారతీయుల జీవనవిధానం అందరికీ ఆదర్శంగా నిలవాలి.
72. విశ్వసనీయత : నేటి రాజకీయ నాయకుల్లో విశ్వసనీయత తగ్గింది.
73. ప్రాతిపదిక : భారతీయులకు సహనం ఒక ప్రాతిపదికగా ఉంది.
74. సంస్కృతి : అమరావతికి ఘనమైన సంస్కృతి ఉంది.
75. అత్యున్నత స్థాయి : మన విద్యా ప్రమాణాలు అత్యున్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.
76. కీలకం : కోర్టులో సాక్ష్యాలు కీలకంగా మారుతాయి.
77. ఆచార వ్యవహారాలు : భారతీయుల ఆచార వ్యవహారాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయి.
78. నియమబద్ధజీవనం : ప్రాచీన కాలంలో ఋషులు నియమబద్ధ జీవనం గడిపేవారు.
79. చేదోడు వాదోడు : మిత్రులు ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉండాలి.
80. ఆలనా పాలనా : తల్లిదండ్రులు పిల్లల ఆలనా పాలనా శ్రద్ధగా చూస్తారు.
81. సహాయసహకారాలు : ఆపన్నులకు ధనవంతులు సహాయసహకారాలను అందించాలి.
