SCERT AP 9th Class Social Studies Guide Pdf 24th Lesson రోడ్డు భద్రతా విద్య Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Social Solutions 24th Lesson రోడ్డు భద్రతా విద్య
9th Class Social Studies 24th Lesson రోడ్డు భద్రతా విద్య Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
వాహన చోదకులు ఏ విధమైన ధృవపత్రాలను తమ వెంట ఉంచుకోవాలి? ఏ విధమైన నైపుణ్యాలు భద్రతాపరమైన డ్రైవింగ్ కు అవసరం.? (AS1)
జవాబు:
వాహన చోదకులు ఈ క్రింది పేర్కొన్న ధ్రువపత్రాలను తమ వెంట ఉంచుకోవాలి.
- డ్రైవింగ్ లైసెన్స్
- వాహన రిజిస్ట్రేషన్
- వాహనం యొక్క ఇన్స్యూరెన్స్
- వాహనం యొక్క కాలుష్యరహిత ధ్రువపత్రం
భద్రతాపరమైన డ్రైవింగ్ కు నైపుణ్యాలు :
- రక్షిత, ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
- ట్రాఫిక్ సిగ్నల్స్ ను అతిక్రమించరాదు.
- భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ లు ఉపయోగించాలి.
- తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.
- ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.
ప్రశ్న 2.
ట్రాఫిక్ గుర్తులను ఒకవేళ ఎవరైనా పాటించకుండా వెళితే ఏమవుతుంది? (AS1)
జవాబు:
- ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది.
- ప్రమాదాలు ఒక్కొక్కసారి తీవ్ర గాయాలకు, అంగవైకల్యానికి దారితీయవచ్చు.
- ఘోర ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోవటానికి అవకాశం ఉంటుంది.
- ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన మనకు మాత్రమేగాక ఎదుటివారికి కూడా హాని జరగవచ్చు.
- విలువైన వాహనాలు దెబ్బతింటాయి.
- అందువల్ల ట్రాఫిక్ గుర్తులను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ, ఎదుటివారి ప్రాణాలకు కూడా రక్షణ కల్పిస్తే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.
ప్రశ్న 3.
రోడ్డు భద్రతకుగాను మీ ప్రాంతంలో తీసుకుంటున్న చర్యలను సూచించండి. (AS4)
జవాబు:
రోడ్డు భద్రతకుగాను మా ప్రాంతంలోని వివిధ వర్గాల వారు తీసుకుంటున్న చర్యలు :
డ్రైవర్ తీసుకుంటున్న చర్యలు :
- ఎడమవైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదులుతున్నారు.
- ఎడమవైపు నుంచి వాహనాలను దాటరు.
- రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తారు.
- తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలనే ఉపయోగిస్తున్నారు.
- అనవసరంగా హారన్ మోగించరు.
- భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగిస్తున్నారు.
- ట్రాఫిక్ సిగ్నలను అతిక్రమించరు.
- తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతారు.
- ఆల్కహాల్ సేవించి వాహనాలను నడపరు.
- డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరు.
పాదచారులు పాటిస్తున్న నిబంధనలు :
- పాదచారులకు నిర్దేశించిన మార్గంలోనే నడుస్తారు. ఒకవేళ అలాంటి ప్రత్యేక మార్గం లేకుంటే, రోడ్డు ఇరుకుగా ఉంటే రోడ్డుకు కుడివైపునే ఎదురుగా వస్తున్న వాహనాలను పరిశీలిస్తూ నడుస్తారు.
- రాత్రివేళ బయట రోడ్డుపై నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతిబింబించే దుస్తులను ధరిస్తారు.
- రాత్రివేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చిలైట్ దగ్గర ఉంచుకుంటారు.
- రోడ్డును దాటునపుడు ఎడమవైపు, కుడివైపు చూసి వాహనాలు రాకుండా ఉన్నప్పుడు దాటుతారు.
- ఒకవేళ వాహనాలు రెండువైపులా, వస్తూ ఉంటే అవి వెళ్లే వరకు వేచి ఉంటారు.
- వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా నడుచుకుంటూ రోడ్డును దాటుతారు. రెండువైపులా వాహనాలు వస్తున్నాయో లేదో గమనిస్తారు.
- రోడ్డును దాటుటకు జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగిస్తారు.
- రోడ్డుపై నడుస్తున్నపుడు, రోడ్డును దాటుతున్నపుడు మొబైల్ ఫోన్ ను ఉపయోగించరు.
- ట్రాఫిక్ పోలీస్ సహాయంతో రోడ్డును దాటుతారు.
ప్రశ్న 4.
తప్పనిసరిగా, జాగ్రత్తపడే, సమాచార నిమిత్తం ఉన్న ట్రాఫిక్ గుర్తులను ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
ట్రాఫిక్ గుర్తులు :
- తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు
- సమాచార గుర్తులు
- జాగ్రత్తపరచే గుర్తులు.
ప్రశ్న 5.
కమల ఒక నూతన వాహనాన్ని కొనాలని భావించింది. ఆమెకు ఏ విధమైన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమవుతాయో వివరించండి. (AS1)
జవాబు:
కమల ఒక నూతన వాహనాన్ని కొనాలని భావించినప్పుడు ఆమెకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు :
- అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ధ్రువపత్రం
- రోడ్డుపై నడపటానికి వీలైనది అని తెలిపే ధ్రువీకరణ పత్రం
- వాహన బీమా ధ్రువపత్రం
- కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం
- నివాస రూఢీ ధ్రువపత్రం
శాశ్వత రిజస్ట్రేషన్ :
తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించేటపుడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత దరఖాస్తుతో పాటుగా ఆర్.టి.ఏ అధికారులకు ఒక నెలలోపుగా సమర్పించి శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు.
ప్రశ్న 6.
రాము తన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను వేరే వాహనానికి మార్చాలని భావించాడు. ఇది చేయవచ్చా చేయకూడదా? ఎందుకో వివరించండి. (AS6)
జవాబు:
రాము తన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను వేరే వాహనానికి మార్చడానికి వీల్లేదు. ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌కు, వేరొక రిజిస్ట్రేషన్ నెంబర్‌కు పోలిక ఉండదు.
అలా మార్చడం వలన :
- ప్రమాదాలు జరిగిన సమయంలో ఇబ్బందులు ఎదురౌతాయి.
- నియమ నిబంధనలకు వ్యతిరేకం.
- ఒక్కొక్క నెంబరు ప్రారంభం ఒక్కొక్క వాహనానికి వేరేగా ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ సందర్భంలో ఆర్.టి.ఏ. అధికారులకు అప్పగించిన ధృవపత్రాలలో తేడా రాకూడదు.
- అలా మార్చిన వాహనాలను ఆర్.టి.ఏ. అధికారులు సీజ్ చేస్తారు.
కాబట్టి ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను వేరొక రిజిస్ట్రేషన్ నెంబరుకు మార్చకూడదు.
ప్రశ్న 7.
రోడ్డు భద్రతా ఆవశ్యకతను వివరించండి. (AS1)
జవాబు:
- జనాభా, పారిశ్రామికీకరణ, నగరీకరణ, గ్లోబలైజేషన్ వంటి వాటి పెరుగుదల వాహనాల రద్దీని కూడా పెంచింది.
- అందువల్ల రవాణా సులభతరం కావడానికి ఒక క్రమబద్ధీకరణ అవసరం.
- క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించడమే.
- రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డును ఉపయోగించుకునే ప్రతి ఒక్కరి బాధ్యత.
- రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోతే ప్రాణాంతకమైన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది.
- రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా మనం సుఖంగా ఉండడమే గాక తోటి ప్రయాణికులను కూడా సుఖంగా ఉంచవచ్చును.
ప్రశ్న 8.
పేజీ నెం. 286లోని ‘ప్రమాద బాధితులు – వయస్సు’ పట్టిక చదివి అత్యధిక కేసులు నమోదైన వయస్సు వారిని గుర్తించి, బార్ ను గీయండి. (AS3)
జవాబు:
ప్రశ్న 9.
పేజీ నెం. 287లోని ‘ట్రాఫిక్ ఇబ్బందులు’ అంశాన్ని చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ఇప్పుడు ప్రతీ పట్టణంలో, నగరాలలో అతి ముఖ్యమైన సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు (గందరగోళం) తెల్లవారి లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వివిధ పనులు నిమిత్తం, ఉద్యోగ రీత్యా ప్రజలు వాహనాలనే ఉపయోగించే తమ ప్రయాణాలు చేయడం వలన ట్రాఫిక్ జాంకు కారణమౌతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, డాక్టర్లు ఇలా ఎందరో వివిధ పనుల నిమిత్తం బయలుదేరి ట్రాఫిక్ లో చిక్కుకుని బాధలు అనుభవిస్తుంటారు. డ్రైనేజీ నిర్మాణం సక్రమంగా లేకపోవడం, వీధుల్లో సంచరించే జంతువులు, పండ్లు, కూరగాయల వ్యాపారులు, వాహనదారులు ముఖ్యంగా కారు, ఆటో రిక్షా వారు “నిలుపుటకు వీలులేదు” అనే ప్రదేశంలో వాహనాలు నిలుపుట వల్ల ట్రాఫిక్ జాంకు కారణమౌతున్నాయి.
కాబట్టి వీలైనంత వరకు దగ్గర పనులకు నడవడం ద్వారా కొంత వరకు ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు.
9th Class Social Studies 24th Lesson రోడ్డు భద్రతా విద్య InText Questions and Answers
9th Class Social Textbook Page No.286
ప్రశ్న 1.
ఏ గ్రూపు వయస్సు వారిపై ఎక్కువ కేసులు ఉన్నాయి? ఎందుకో మీరు చెప్పగలరా?
జవాబు:
25 – 30 సం||రాల మధ్య వయస్కులపై ఎక్కువ కేసులు ఉన్నాయి. వారిపై ఎక్కువ కేసులు ఉండటానికి కారణం :
- ప్రతి విషయంలోనూ ఈ వయస్సువారు దుడుకుతనంతో వ్యవహరిస్తారు.
- తనకు నచ్చినట్లే చేయాలనే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు.
- వివిధ అవసరాల నిమిత్తం రోడ్డును ఎక్కువగా ఉపయోగిస్తున్నది కూడా ఈ వయస్సు వారే.
- ఈ వయస్సులోనివారు స్వతంత్రతను ఎక్కువగా కోరుకోవడంతో వారు ప్రమాదాలను కూడా ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తున్నది.
- కాబట్టి ఈ వయస్సు వారే ఎక్కువగా ప్రమాదాలకు గురౌతున్నారు.
ప్రశ్న 2.
20 – 25, 25 – 30 వయస్సు వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి?
జవాబు:
9th Class Social Textbook Page No.287
ప్రశ్న 3.
ఈ చిత్రాన్ని పరిశీలించి ప్రమాదాలకు గురైన వాహనాల యొక్క సమాచారంతో మీ తరగతిలో చర్చించండి.
హైదరాబాద్ నగరం
ద్విచక్ర వాహనాల ప్రమాదాల శాతం | 30% |
త్రిచక్ర వాహనాల ప్రమాదాల శాతం | 11% |
నాలుగు చక్రాల వాహనాల ప్రమాదాల శాతం | 28% |
డి.సి.యంల ప్రమాదాల శాతం | 3% |
తెలియని వాహనాల ప్రమాదాల శాతం | 5% |
ఆర్టీసీ బస్సుల ప్రమాదాల శాతం | 11% |
ప్రైవేట్ బస్సుల ప్రమాదాల శాతం | 1% |
ట్రక్కుల ప్రమాదాల శాతం | 5% |
టెంపోట్రాలి ప్రమాదాల శాతం | 2% |
ఇతరములు | 4% |
మొత్తం ప్రమాదాల సంఖ్య | 2577 |
ప్రశ్న 4.
ఏ రకమైన వాహనాలు ఎక్కువ ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఎందుకో చెప్పగలవా?
జవాబు:
ద్విచక్రవాహనాలు ఎక్కువ ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఎందుకంటే
- యువకులు ఆ వాహనాలను ఎక్కువగా ఉపయోగించటం.
- వారు రోడ్డు నియమ నిబంధనలను పాటించకపోవటం.
- ద్విచక్ర వాహనాలకు ప్రమాదం జరగటం సులభతరం.
ప్రశ్న 5.
రోడ్డు నియమ నిబంధనలు అంటే ఏమిటో మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
- రోడ్డు నియమ నిబంధనలు అనగా రోడ్డుపై వెళ్ళువారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు.
- అలా పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
- కారణం జనాభా విపరీతంగా పెరగడం వలన, రోడ్లు ఇరుకుగా ఉండటం వలన, రోడ్డు పైకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
- రోడ్డు పైకి వచ్చేవారు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు త్వరగా వెళ్ళాలి అనే భావంతో ప్రయాణించడం వలన ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
- రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రోడ్డుపైకి వచ్చేవారు కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. దానితో ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది.
9th Class Social Textbook Page No.288
ప్రశ్న 6.
డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తప్పనిసరిగా కలిగి ఉండాలి?
జవాబు:
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదు. ఇది ఎవ్వరికీ, మినహాయింపు కాదు.
డ్రైవింగ్ లైసెన్స్ రకాలు :
1) లెర్నర్ లైసెన్స్ :
ఇది తాత్కాలికమైనది. డ్రైవింగ్ నేర్చుకొనుటకు ఆరునెలల కాల పరిమితితో దీనిని జారీ చేస్తారు.
2) శాశ్వత లైసెన్స్ :
తాత్కాలిక లైసెన్స్ జారీచేసిన ఒక నెల తరువాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ చేసే విధానం అంతా పరిశీలించి ఇస్తారు కాబట్టి రోడ్డుపై వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి మరియు డ్రైవింగ్ విధి విధానాలు తెలిసిఉండాలి. కావున రోడ్డుపై వాహనాలు నడుపువారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
9th Class Social Textbook Page No.290
ప్రశ్న 7.
మీ టీచర్ సహాయంతో రోడ్డు ఉపరితలంపై సూచించే గుర్తులను ఆర్.టి.ఏ అధికారులు / ట్రాఫిక్ పోలీసుల నుంచి సేకరించి వివిధ గుర్తుల ద్వారా కలిగే ప్రయోజనాలను మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
రోడ్డుపైన సూచించే గుర్తులు :
రోడ్డు ఉపరితలంపై పొదచారుల కోసం, వాహన చోదకులకు మార్గ నిర్దేశనం చేయుటకు ఈ గుర్తులు ఉపయోగిస్తారు. రోడ్డుపై గందరగోళాన్ని, అగమ్యాన్ని నివారించడానికి ఒకే విధమైన గుర్తులను ఉపయోగిస్తారు.
1) పాదచారుల దారి :
రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవటానికి వీలుగా ఉండే దారి. ఇది సుమారు రెండు మీటర్లు వెడల్పు ఉంటుంది.
2) డివైడర్ :
రోడ్డును రెండు సమాన భాగాలుగా విభజించేది.
3) జీబ్రా క్రాసింగ్ :
పాదచారులు రోడ్డును ఒక వైపు నుంచి మరొక వైపునకు దాటడానికి ఉద్దేశించినది.
రోడ్డుపై సూచించే గుర్తుల వల్ల ప్రయోజనాలు :
- పాదచారుల దారి మీదకు వాహనాలు ఏవీ రావు కాబట్టి పాదచారులు నడవటానికి అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైన ప్రమాదాలు సంభవించవు.
- రోడ్డును రెండు సమానభాగాలుగా విభజించటం వలన ఏ విధమైన రాకపోకలకు అవాంతరాలు ఎదురుకావు మరియు ప్రమాదాలు జరగవు.
- జీబ్రా క్రాసింగ్ అనేది పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశము. వాహనాలు జీబ్రా క్రాసింగ్ గుర్తులున్నచోట నెమ్మదిగా వెళ్తాయి కాబట్టి పాదచారులు రోడ్డు దాటవలసి వస్తే ఇక్కడే దాటాలి. దీనితో ప్రమాదాలు నివారించబడతాయి.
ప్రాజెక్టు
ప్రశ్న 1.
మీకు అందుబాటులో ఉన్న ట్రాఫిక్ పోలీస్ / ఆర్.టి.ఎ అధికారులను అడిగి క్రింది విషయాలు సేకరించండి.
మీ ప్రాంతంలో ట్రాఫిక్ పరిస్థితులను తరగతి గదిలో చర్చించండి.
జవాబు: