SCERT AP 9th Class Social Studies Guide Pdf 23rd Lesson విపత్తుల నిర్వహణ Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Social Solutions 23rd Lesson విపత్తుల నిర్వహణ
9th Class Social Studies 23rd Lesson విపత్తుల నిర్వహణ Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
ప్రకృతి ప్రమాదాలు ఏవిధంగా విపత్తులు మారుతున్నాయో వివరించండి. (AS1)
జవాబు:
- ప్రణాళికలు లేకుండా నగరాలు విస్తరించడం.
- మురుగునీరు పోవడానికి సరైన సౌకర్యం లేకపోవడం.
- జనాభా వేగంగా పెరగడం.
- మానవుల నిర్లక్ష్యం వల్ల లేదా కావాలని ఒక వ్యక్తి లేదా బృందం చేసే పనుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి.
- ఈ విపత్తులు వల్ల ప్రాణనష్టం జరుగుతుంది.
- దేశ ఉత్పాదక, ఆర్థిక సామర్థ్యంపై దీర్ఘకాల ప్రభావం ఉంటుంది.
- వీటితోపాటు రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు జరగడం వల్ల వాటివల్ల విలువైన ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవిస్తున్నాయి.
- వీటితోపాటు అగ్నిప్రమాదాలు, వరదలు, కరవుకాటకాలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించి ప్రాణ, ఆస్తినష్టాలు జరుగుతున్నాయి.
ప్రశ్న 2.
ఉగ్రవాదం అనగానేమి? వారి యొక్క లక్ష్యాలు ఏమిటి? (AS1)
జవాబు:
ఉగ్రవాదం అనగా :
హింసాత్మక చర్యల ద్వారా ప్రజలను, పాలకులను, దేశాధినేతలను బెదిరిస్తూ, తమ కోర్కెలను సాధించుకొనేందుకు చేపట్టే ఉగ్ర భయంకర దుష్ట చేష్టలనే ఉగ్రవాదము అంటారు.
ఉగ్రవాదం యొక్క లక్ష్యాలు :
- యుద్ధం, అంతర్గత పౌర యుద్ధాలు పెచ్చుమీరిపోయి ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణము కావడం.
- అల్లర్లను సృష్టించి, ప్రశాంత వాతావరణం లేకుండా చేయడం.
- సైనికులను, సామాన్య ప్రజానీకాన్ని భయ భ్రాంతులకు గురి చేయడం.
- రక్తపాతాన్ని సృష్టించడం.
- మందు పాతరలు పెట్టి రైళ్ళను పడగొట్టడం, వంతెనలు పేల్చడం, సైనికులను చంపడం వంటివి చేయడం.
- పిల్లలు కూడా నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతుంటారు.
ప్రశ్న 3.
అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి మనం’ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు:
అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- నిప్పు లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి / హెచ్చరిక జారీ చేయండి.
- సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్లండి. వీలైతే మిమ్మల్ని కప్పుకోండి. వరండాలో బయటకు తప్పించుకునే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడండి.
- ఫోను ఎక్కడుందో తెలుసుకుని 101కి ఫోన్ చేయండి. నిదానంగా, స్థిమితంగా మీ చిరునామా చెప్పి అగ్నిమాపక దళాన్ని పంపించమని అడగండి.
- పొగ ఉన్నప్పుడు నేలమీద పాకుతూ వెళ్లండి. వేడిగాలి, పొగ పైకి లేస్తాయి కాబట్టి నేల దగ్గర గాలి బాగుంటుంది.
- మీరు బైటకు వెళ్లేదారి మూసివేసి ఉంటే కిటికీ ఉన్న ఒక గదిలోకి వెళ్లండి. తలుపు వేసి పొగ లోపలికి రాకుండా చేయండి. కిటికీ తలుపు తెరిచి సహాయం కోసం అరవండి.
- తలుపు మూసి ఉంటే మంటలు వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి. భవనాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు అందరికంటే వెనకనున్న వాళ్లు తలుపులు వేసుకుంటూ రావాలి.
- విద్యుత్తు స్విచ్చులన్నీ తీసేసి ఉంచాలి. మెయిన్ స్విచ్ ను కట్టెయ్యటం ఉత్తమం.
- అతుకులు, పలు ఉన్న విద్యుత్తు తీగలు, కేబుళ్లకోసం చూడండి. ఇవి ప్రమాదకరమైనవి కాబట్టి వీటిని వెంటనే మార్చాలి. ప్లగ్ పాయింట్లు కిందకల్లా ఉంటే, ప్రత్యేకించి ప్రాథమిక తరగతుల్లో వాటికీ టేపు వేసేసి ఉంచాలి. లేకపోతే చిన్నపిల్లలు వాటిల్లో వేళ్లు పెట్టినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశముంది.
- బడిలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్తు తీగలను గమనించండి. ఏవైనా గోడలు నెమ్ముకుంటూ ఉంటే వాటిని వెంటనే మరమ్మతు చేసి, విద్యుత్తు తీగలను మార్చివేయాలి. నిప్పు, లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి/హెచ్చరిక జారీ చేయండి.
- సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్లండి. వీలైతే మిమ్మల్ని కప్పుకోండి. వరండాలో బయటకు తప్పించుకునే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడండి.
చేయగూడనివి :
- మీ బొమ్మలు, పెంపుడు జంతువులు వంటి వాటికోసం అగ్నిప్రమాదానికి గురైన భవనం లోపలికి మళ్లీ వెళ్లవద్దు. అగ్నిమాపకదళం మీకంటే వేగంగా ముఖ్యమైన వాటిని బయటకు తీసుకురాగలరు.
- మంచం కిందగానీ, అలమర లోపలగానీ ఎప్పుడూ దాక్కోవద్దు. పెద్దగా అరుస్తూ భవనం నుంచి బయటకు వెళ్లాలి.
- చాపలు, తివాచీ వంటి వాటికింద నుంచి విద్యుత్తు తీగలు, కేబుళ్లు వంటివి తీస్తే అవి పాడైపోయి ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఈ పరిస్థితి ఎక్కువగా పాఠశాల పరిపాలనా విభాగంలో ఎదురవుతూ ఉంటుంది.
- తేలికగా కాలిపోవటానికి వీలుండే కర్టెన్లు, ఇతర వస్తువులకు దగ్గరగా విద్యుత్తు బల్బులు అమర్చగూడదు.
ప్రశ్న 4.
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణాలేవి? వాటిని తగ్గించడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
జవాబు:
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణాలు :
- నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం.
- ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించటం.
- తాగి వాహనం నడపటం.
- వాహనాలు సరైన స్థితిలో ఉండక పోవటం.
- వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవటం.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు :
- మద్యం సేవించి వాహనాలను నడపరాదు.
- వాహనాలను నడిపేవారు మందులను తీసుకుంటూ నడపరాదు.
- అలసిపోయి ఉన్నవారు, అలసట ఉన్నవారు వాహనాలను నడపరాదు.
- జబ్బుపడినవారు, గాయాల పాలైన వారు వాహనాలను నడపరాదు.
- కోపంగా లేదా ఆందోళనగా ఉన్నవారు వాహనాలను నడపరాదు.
- రోడ్డు మీద అసహనంగా ఉండరాదు. రోడ్డు మీద పరుగులు తీయరాదు.
- మలుపు / మూల వద్ద రోడ్డును ఎప్పుడూ దాటరాదు.
- బస్సు / వాహనం ఎక్కటానికి పరుగులు పెట్టరాదు.
- ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉన్నచోట, జీబ్రా క్రాసింగ్ ఉన్నచోట మాత్రమే రోడ్డు దాటాలి.
- బస్సు పూర్తిగా ఆగిన తరువాత ఎక్కాలి. క్యూ పద్ధతి పాటించాలి.
మొదలైన చర్యలు జాగ్రత్తగా పాటించడం వలన రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చును.
ప్రశ్న 5.
ఉగ్రవాదుల దాడుల వలన ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. వీరి చర్యలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:
ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో వారి చర్యలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- రవాణా వాహనాలలో, బహిరంగ ప్రదేశాలలో ఎవరికీ చెందని సూట్ కేసు, సంచి వంటిని గమనిస్తే పోలీసులకు తెలియజేయాలి. ఎందుకంటే వాటిలో పేలుడు పదార్థాలు ఉండవచ్చు.
- “100” నంబరుకి పోలీస్ కంట్రోలు రూమ్ కి ఫోన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఫోన్ చేసే హక్కు ఉంది. తద్వారా ప్రమాదాన్ని వారి ద్వారా నివారించవచ్చు.
- పోలీసులకు తెలియజేసిన పిదప అనుమానాస్పద వస్తువులపై నిఘా ఉంచాలి. ఇతరులను కూడా దాని నుంచి దూరంగా ఉండమని చెప్పాలి.
- అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు వారి ప్రవర్తనపై, నిలిపి ఉన్న వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- పౌరుల భద్రత అందరికీ సంబంధించిన విషయం కాబట్టి భద్రత పట్ల అవగాహన కల్పించటానికి వివిధ సంస్థలు తమ విధి విధానాలు ప్రకటిస్తూ ప్రజలను జాగృతం చేయాలి.
- ఉగ్రవాదాన్ని ఎదుర్కోటానికి, క్షేమకర జీవితం గడపటానికి పోలీసులు కొన్ని పోస్టర్లు జారీ చేస్తారు. వాటి గురించి తెలుసుకుని వాటిని జీవితంలో అనుసరించాలి.
ప్రశ్న 6.
రైలు ప్రమాదాలకు గల కారణాలను గుర్తించండి. (AS1)
జవాబు:
ప్రపంచంలో ఎక్కువ రైలు మార్గాలు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో రైలు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. తరుచుగా జరిగే రైలు ప్రమాదాలకు గల కారణాలు :
- రైలు ప్రమాదాలకు కారణాలలో రైలు పట్టాలు తప్పటం ఒకటి.
- రైలు మార్గాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం.
- విద్రోహ చర్యలు, కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
- మానవ పొరపాట్లు, అప్రమత్తంగా లేకపోవడం.
- గ్యాస్, పెట్రోల్, బొగ్గు, నూనె వంటి మండే పదార్థాల రవాణా కారణంగా కూడా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
- రైలులో పొగత్రాగడం, సిగరెట్, బీడీ వంటి వాటి వలన కూడా అగ్ని ప్రమాదాలు రైలులో జరుగుటకు కారణం.
- కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద కూడా ప్రమాదాలకు మూలమౌతున్నాయి.
ప్రశ్న 7.
మీ గ్రామంలో, పాఠశాలలో, మీ ఇంటి దగ్గర సంభవించగల ప్రమాదాలను గుర్తించండి. (AS4)
జవాబు:
మా గ్రామంలో, పాఠశాలలో, మా ఇంటి దగ్గర సంభవించగల ప్రమాదాలు :
- మలుపు / మూలల దగ్గర రోడ్డు దాటేటప్పుడు.
- పాఠశాల వదిలి పెట్టిన సమయం.
- బస్సు / వాహనం ఎక్కడానికి పరుగులు తీసే సమయం.
- బడివాళ్ళు నిర్దేశించిన బస్సులు తప్పించి ఇతర బస్సులు ఎక్కే సమయం.
- ట్రాఫిక్ సిగ్నళ్ళు పాటించకపోవడం.
- జీబ్రా క్రాసింగ్ గుర్తులున్న చోటనే రోడ్డును దాటకపోవడం వంటి సమయాలు.
ప్రశ్న 8.
భారతదేశ పటంలో ఉగ్రవాదుల దాడులకు గురైన ఈ కింది నగరాలను గుర్తించండి. (AS5)
జవాబు:
ఎ) ముంబై బి) హైదరాబాద్ సి) భాగల్ పూర్ డి) కుంభకోణం ఇ) బెంగళూరు
ప్రశ్న 9.
మీకు తెలిసిన ఒక ప్రమాద సంబంధ వైపరీత్యం గురించి రాయండి. (AS6)
జవాబు:
ఇటీవల కాలంలో మా జిల్లాలో అత్యంత దురదృష్టకరమైన రైలు ప్రమాదం జరిగింది. దీని కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మంది వరకు గాయాలపాలయ్యారు. విజయనగరం దగ్గరి గొట్లాం సమీపంలో రాత్రి 7 గంటల సమయంలో బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో పొగచిమ్మగా, పెద్ద ప్రమాదం రైలులో సంభవిస్తుందని తోటి ప్రయాణికులలో అలజడులు రేగగా, ఆ పుకార్లు షికార్లు చేసి భయంతో ప్రయాణీకులు గొలుసులాగి, ఎదురుగా పట్టాలపై పరిగెత్తసాగారు. అదే సమయంలో విజయవాడ వెళుతున్న రాయగడ పాసింజర్ ఈ ప్రయాణీకులను ఢీకొనగా అక్కడికక్కడే చనిపోయారు. ఇది నాకు తెలిసిన ఇటీవల జరిగిన అత్యంత ప్రమాద సంబంధ వైపరీత్యం.
ప్రశ్న 10.
పేజీ నెం. 281లోని ‘అగ్ని ప్రమాదం’ అంశం చదివి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాల కారణంగా సుమారు 30,000 మంది చనిపోతున్నారు. వేడిమి, ఇంధనం, ప్రాణ వాయువు – ఈ మూడు కలిసినపుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి అందకుండా చేయడం ద్వారా నిప్పును ఆపవచ్చు. ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. మానవ నిర్లక్ష్యం, లేదా అవగాహన లోపం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగి విపరీత నష్టాలకు మూలమౌతున్నాయి.
ఉదా :
తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది బాలలు చనిపోయారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు ఏం చేయాలో టీచర్లకు, విద్యార్థులకు తెలియకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన ఉంటే ఇటువంటి సందర్భాలలో అపాయం నుంచి తప్పించుకోవచ్చు.
9th Class Social Studies 23rd Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం InText Questions and Answers
9th Class Social Textbook Page No.277
ప్రశ్న 1.
ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తులు ఎంతవరకు సహజమైనవి? దీని గురించి ఎప్పుడైనా విశ్లేషించారా? ముంబాయిలోని వరదలను ఉదాహరణగా తీసుకుందాం. పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణాలు ఏమిటి? భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందా?
జవాబు:
ప్రకృతి వైపరీత్యాలనేవి కొంతవరకు సహజమైనవి. కొంతవరకు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి.
మానవులు చేసే తప్పులను దిద్దుకుంటే కొన్ని వైపరీత్యాలను నివారించవచ్చు. ముంబయిలోని వరదలను ఉదాహరణగా తీసుకుంటే పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణాలు :
- ఏ ప్రణాళికా లేకుండా నగరం విస్తరించటం.
- మురుగునీరు పోవటానికి సరైన సౌకర్యం లేకపోవటం.
- జనాభా వేగంగా పెరగటం వంటి కారణాల వలన, భారీ వర్షాల వలన పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది.
దేశ ఉత్పాదక, ఆర్థిక సామర్థ్యం పైన కూడా దీర్ఘకాల ప్రభావం పడింది. ప్రకృతి వైపరీత్యాలలో సహజమైనవాటికి ఉదాహరణగా వరదలు, కరవు కాటకాలు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం వంటి అంశాలను పేర్కొనవచ్చు.
అగ్నిప్రమాదాలు, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు వంటి వాటిని మానవ కారక వైపరీత్యాలుగా చెప్పవచ్చును.
9th Class Social Textbook Page No.279, 280
ప్రశ్న 2.
రైలు ప్రమాదాలను తగ్గించటానికి పాటించవలసిన భద్రతా చర్యలు ఏవి?
జవాబు:
రైలు ప్రమాదాలను తగ్గించటానికి పాటించవలసిన భద్రతా చర్యలు :
- రైల్వే క్రాసింగ్ దగ్గర సిగ్నల్ కోసం చూడండి. రైలు గేటును గమనిస్తూ ఉండండి.
- గార్డులేని రైల్వే క్రాసింగ్ దగ్గర వాహనం దిగి రెండువైపులా చూసిన తరవాత పట్టాలు దాటాలి.
- రైల్వే క్రాసింగ్ వద్ద గేటు కింద నుంచి దూరి పట్టాలు దాటరాదు.
- ప్రయాణీకులను తరలించడానికి వీలుకాని వంతెన మీద, సొరంగాల వద్ద రైలును, రైలింజన్ డ్రైవర్లు ఆపకూడదు.
- మండే గుణమున్న పదార్థాలను రైలులో తీసుకెళ్ళరాదు.
- నడుస్తున్న రైలులో తలుపు దగ్గర నిలబడరాదు. బయటకు తొంగి చూడరాదు.
- ఆగి ఉన్నలేదా కదులుతున్న రైలులోంచి మీ తల, చేతులు బయటపెట్టరాదు.
- స్టేషనులో రైలు పట్టాల మీదుగా దాటరాదు. ప్లాట్ ఫారం మారటానికి ఉద్దేశించిన పాదచారుల వంతెనను ఉపయోగించండి.
- అనుమానాస్పద వస్తువులను తాకరాదు. పట్టాలమీద, రైల్వే యార్డులలో ఆటలు ఆడవద్దు. రైలుబోగీలు ఉన్నట్టుండి కదలడం వల్ల అక్కడ ఉన్నవారు ప్రమాదానికి గురవుతారు.
- కదులుతున్న రైలు మీదకి ఎటువంటి వస్తువులు విసరవద్దు. దీనివల్ల తీవ్రగాయాలు అవుతాయి.
9th Class Social Textbook Page No.281
ప్రశ్న 3.
విమానం ఎక్కినప్పుడు పాటించవలసిన విషయాలు ఏవి?
జవాబు:
- ప్రయాణ సమయంలో పాటించవలసిన భద్రతలను తెలియచేస్తున్నప్పుడు శ్రద్ధగా వినండి.
- మీరు కూర్చున్న ముందు సీటు జేబులో ఉండే భద్రతా వివరాల కార్డును జాగ్రత్తగా చదవండి.
- దగ్గరలో అత్యవసర ద్వారం ఎక్కడ ఉందో తెలుసుకోండి. దానిని ఎలా తెరవాలో తెలుసుకోండి.
- సీటులో కూర్చుని ఉన్నప్పుడు తప్పనిసరిగా సీటుబెల్టు పెట్టుకుని ఉండండి.
ప్రశ్న 4.
విమాన ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:
- ప్రశాంతంగా ఉండండి. విమాన సిబ్బంది చెపుతున్నది విని, అనుసరించండి. మీకు సహాయం చేయటం క్యాబిన్ సిబ్బంది ముఖ్యమైన బాధ్యత.
- అత్యవసర ద్వారాన్ని తెరవటానికి ముందు. కిటికీ నుండి బయటకు చూడండి బయట మంటలు ఉంటే తలుపు తెరవవద్దు. తలుపు తెరిస్తే మంటలు లోపలికి వ్యాపిస్తాయి. బయటకు వెళ్ళటానికి ఉన్న మరొక దారిని ఉపయోగించండి.
- పొగ పైకి లేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి క్యాబిన్లో పొగ ఉంటే నేలమీదకి ఉండండి.
- నేలలో ఉండే అత్యవసర దీపాలను అనుసరించండి. ఇవి బయటకు వెళ్లే ద్వారాలను సూచిస్తాయి.
- మీ దగ్గర గుడ్డ | రుమాలు ఉంటే ముక్కు, మూతికి అడ్డంగా పెట్టుకోండి.
9th Class Social Textbook Page No.283
ప్రశ్న 5.
సమీప అగ్నిమాపక కేంద్రానికి వెళ్ళి అగ్నిప్రమాదాలు తగ్గించటంలో మీరు పాటించగల మెలకువల గురించి తెలుసుకోండి.
జవాబు:
సమీప అగ్నిమాపక కేంద్రానికి వెళ్ళి అగ్ని ప్రమాదాలను తగ్గించటంలో మేము పాటించగల మెలకువలు గురించి తెలుసుకున్నాము. అవి :
- నిప్పుతో ఆటలాడరాదు.
- నిప్పు అవసరము తీరిన వెంటనే ఆర్పవలెను.
- సిగరెట్లు, బీడీలు కాల్చువారు కూడా సిగరెట్టు, బీడీ కాల్చుకుని మండుతున్న అగ్గిపుల్లను విసిరేసి వెళ్లిపోతారు. అది ప్రక్కన ఉన్న చెత్త చెదారంతో కలిసిపోయి పెద్ద పెద్ద మంటలు రావడానికి అవకాశం ఉంటుంది.
- అలాగే సిగరెట్లు, బీడీలు కాల్చుకుని ఆర్పివేయకుండా విసిరేసి వెళ్ళిపోతారు. దాని వలన కూడా పెద్ద పెద్ద మంటలు రావడానికి అవకాశం ఉంటుంది.
- గ్రామీణ ప్రాంతాల యందు కట్టెల పొయ్యి మీద అన్నం, కూరలు వండి, నిప్పును ఆర్పకుండా వారు వేరే పనులలో నిమగ్నమైపోతారు. అలాంటి సమయాలలో కూడా పెద్ద పెద్ద మంటలు ఏర్పడవచ్చును.
- అలాంటి పరిస్థితులు వీలైనంత వరకు తటస్థపడకుండా జాగ్రత్తలు వహించాలి.
- అతుకులు, పట్టీలు ఉన్న విద్యుత్ తీగలు ఉపయోగించరాదు.
ప్రశ్న 6.
ఉగ్రవాద దాడి జరిగినప్పుడు మీరు పాటించవలసిన విషయాలు ఏవి?
జవాబు:
- ప్రశాంతంగా ఉండండి. ఉద్రేకానికి లోనవ్వవద్దు.
- స్థానిక అత్యవసర అధికారుల సూచనలు పాటించండి.
- వార్తల కోసం, సూచనల కోసం రేడియో వినండి. లేదా టీ.వి. చూడండి.
- మీ దగ్గరలో దాడులు జరిగితే ఎవరికైనా గాయాలు అయ్యాయేమో చూడండి. ప్రథమచికిత్స చేయండి. తీవ్ర గాయాలైన వారికి సహాయం అందేలా చూడండి.
- దెబ్బతిన్న పరికరాలను ఆపివేయండి.
- పెంపుడు జంతువులను కట్టేసి ఉంచండి. లేదా గదిలో బంధించి ఉంచండి.
- మీ కుటుంబ మిత్రులకు ఫోను చేయండి. ప్రాణానికి ముప్పు ఉంటే తప్పించి మళ్ళీ ఫోను ఉపయోగించవద్దు.
- మీ చుట్టు పక్కల వాళ్ళ గురించి, ప్రత్యేకించి వృద్ధులు, వైకల్యం ఉన్న వాళ్ళ గురించి ఆరా తీయండి.
9th Class Social Textbook Page No.284
ప్రశ్న 7.
భారతదేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలను గుర్తించండి. అవి చిన్న పిల్లల మీద చూపే ప్రభావాన్ని
వివరించండి. జ. భారతదేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలు : .
- ముంబయిలో తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు చేసిన దాడులు.
- హైదరాబాద్ లోని బాంబు పేలుళ్ళు.
- బెంగళూరులోని ‘బాంబు పేలుళ్ళు.
ఉగ్రవాదుల దాడులు చిన్న పిల్లల మీద అనేక రకాలుగా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉగ్రవాదులు దాడులు చేసే ప్రాంతాలలో పిల్లలు నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతుంటారు.
పిల్లలు పాఠశాలకు హాజరు కావటానికి, సాధారణ జీవితాలు గడపటానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి.
ప్రాజెక్టు
ప్రశ్న 1.
పత్రికలు, మ్యాగజైన్స్ ద్వారా ఇటీవల సంభవించిన మానవ విపత్తులు సమాచారాన్ని సేకరించండి. ఒకవేళ అలాంటి ప్రమాదాలు మీ ప్రాంతంలో సంభవిస్తే నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకొంటారు.?
జవాబు:
మానవ విపత్తులు సంభవించిన సమయంలో సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఒక మానవునిగా తోటి మానవుని ఆదుకోవటానికి అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది.
వారికి బట్టలు సరఫరా చేయటం కాని, ఆహార పదార్థాలు సరఫరా చేయటం కాని, ఇతర గృహనిర్మాణ సామానులు కాని, గృహోపకరణములు గానీ సరఫరా చేయటం జరుగుతుంది.
పశువులకు పశుగ్రాసం నష్టం వాటిల్లితే దానిని అందజేయడం జరుగుతుంది.
ప్రశ్న 2.
ఉగ్రవాదం వలన సంభవించే వివిధ రకాల నష్టాలను పట్టిక ద్వారా చూపండి.
జవాబు:
ఉగ్రవాదం – వివిధ రకాల నష్టాలు
- మానవ జీవనం అస్తవ్యస్తం అవుతుంది.
- జనజీవనం అల్లకల్లోలం
- వందల మంది మరణాలు
- వేలమంది క్షత్రగాత్రులు
- కోట్ల విలువైన ఆస్తినష్టాలు
- ప్రపంచ మేధావులలో అభద్రతా భావాలు
- పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలలో భయాందోళనలు
- అమాయక ప్రజల ఆర్తనాదాలు
- మత సామరస్య విఘాతం
- అభివృద్ధి కుంటుపడటం.