Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 9th Lesson కణం: జీవప్రమాణం Textbook Questions and Answers.
AP Inter 1st Year Botany Study Material 9th Lesson కణం: జీవప్రమాణం
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
 వృక్షకణంలో రిక్తిక ప్రాముఖ్యం ఏమిటి?
 జవాబు:
 రిక్తికలో ప్రధానంగా నీరు, జీవక్రియా ఉపఉత్పన్నాలు, విసర్జక పదార్థాలు, వ్యర్థపదార్థాలతో కూడిన రసం ఉంటుంది. ఇది కణద్రవాభిసరణచర్యల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
ప్రశ్న 2.
 705, 805 రైబోసోమ్లో ‘S’ అంటే అర్థం ఏమిటి?
 జవాబు:
 705, 805 రకపు రైబోసోమ్లలో ‘S’ అనగా స్వెడ ్బర్గ్ ప్రమాణంలో చెప్పబడే అవసాధన గుణకము, ఇది పరోక్షంగా సాంద్రత, పరిమాణమును తెలిపే అంశము.
ప్రశ్న 3.
 హైడ్రోలైటిక్ ఎంజైమ్‌ల (జలవిశ్లేషణ) తో నిండి ఉన్న త్వచయుత కణాంగాన్ని పేర్కొనండి.
 జవాబు:
 లైసోసోమ్.
ప్రశ్న 4.
 వాయురిక్తికలు అంటే ఏమిటి? వాటి విధులు ఏమిటి?
 జవాబు:
 సైనో బ్యాక్టీరియా కణాలలోని రిక్తికలు నిజకేంద్రక కణాలలోవలె టోన్స్ట్ పొర వుండదు, దీనిలో వాయువు వుంటుంది. అందుచే దీనిని వాయురిక్తికలు అంటారు.
విధులు :
- ఈ రిక్తికలు జీవ రసాయన చర్యలవలన కణాలలో ఏర్పడిన వాయువులను నిల్వచేయబడి వుంటాయి.,
 - అధిక కాంతి తీక్షతనలో ఇవి బద్ధలై అదృశ్యమవుతాయి. అలాగే కాంతి తీక్షతనుపట్టి రిక్తికల సాయంతో ఇవి తమ స్థానాన్ని మార్చుతాయి.
 
ప్రశ్న 5.
 పాలీసోమ్ల విధులు ఏమిటి?
 జవాబు:
 అనేక రైబోసోమ్‌లు ఒకే రాయబారి RNA పోచకు అతుక్కుని గొలుసు వలె కనిపిస్తాయి. వీటిని పాలిరైబోసోమ్లు లేదా పాలిసోమ్లు అంటారు. వీటిలోని రైబోసోమ్‌లు రాయబారి RNA లోని సమాచారాన్ని ప్రోటీన్లుగా అనువదిస్తాయి.
![]()
ప్రశ్న 6.
 మోటాసెంట్రిక్ క్రోమోసోమ్ యొక్క లక్షణం ఏమిటి?
 జవాబు:
 మెటాసెంట్రిక్ క్రోమోసోమ్లో మధ్యలో సెంట్రోమియర్ ఉంటుంది. దీనివల్ల 2 బాహువులు సమానంగా ఉంటాయి. చలనదశలో ఇవి ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.
ప్రశ్న 7.
 శాటిలైట్ క్రోమోసోమ్ అంటే ఏమిటి?
 జవాబు:
 కొన్ని క్రోమోసోమ్లు అభిరంజకాన్ని గ్రహించని ద్వితీయ కుంచనాలను సుస్థిర స్థానాలలో చూపిస్తాయి. దీనివల్ల క్రోమోసోమ్లో ఒక చిన్న ఖండికలాంటి భాగం కనిపిస్తుంది. దీన్ని శాటిలైట్ అంటారు. శాటిలైట్ ఉన్న క్రోమోసోమ్ను శాటిలైట్ క్రోమోసోమ్ అంటారు.
ప్రశ్న 8.
 సూక్ష్మదేహాలంటే ఏవి? వాటిలో ఉన్న పదార్థాలేమిటి?
 జవాబు:
 పెరాక్సీసోమ్‌లు మరియు గ్లైఆక్సీసోమ్లను సూక్ష్మదేహాలు అంటారు. పెరాక్సీసోమ్‌లు ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణలోను, కాంతి శ్వాసక్రియలోను పాల్గొంటాయి. గ్లె ఆక్సీసోమ్లు క్రొవ్వు సంమృద్ధిగా గల అంకురించే విత్తనాలలో ఉంటాయి. వీటిలో ఉన్న లిపిడ్లను కార్భోహైడ్రేటులుగా మార్చే గ్లైఆక్సీలేట్ వలయానికి చెందిన ఎంజైమ్‌లు ఉంటాయి.
ప్రశ్న 9.
 మధ్యపటలిక దేనితో ఏర్పడి ఉంటుంది ? దాని విధులు ఏ విధంగా ముఖ్యమైనవి?
 జవాబు:
 మధ్యపటలిక ముఖ్యంగా కాల్షియం పెక్టేట్తో నిర్మితమై, ప్రక్కనున్న కణాలను బంధించి ఉంచుతుంది. ఇది కణవిభజన సమయంలో ఏర్పడిన కణఫలకం నుంచి తయారవుతుంది. కణకవచం, మధ్యపటలిక ద్వారా కణద్రవ్య బంధాలు కణకణానికి వ్యాపించి పొరుగున ఉన్న కణాల కణద్రవ్య పదార్థాలతో సంబంధాన్ని ఏర్పరుస్తాయి.
ప్రశ్న 10.
 ద్రవాభిసరణ అంటే ఏమిటి?
 జవాబు:
 అయానులు లేక నీటి అణువులు అల్పగాఢతకల ప్రదేశం నుండి అధిక గాఢత కల ప్రదేశంలోనికి పారగమ్య త్వచం ద్వారా చలించుటను ద్రవాభిసరణ అంటారు.
ప్రశ్న 11.
 గ్రామ్ అభిరంజన పద్ధతికి బాక్టీరియమ్ కణంలోని ఏ భాగం గురి అవుతుంది? [Mar. ’14]
 జవాబు:
 కణ ఆచ్ఛాదనలోని రసాయన నిర్మాణంలో గల భిన్నత్వం.
![]()
ప్రశ్న 12.
 ఈ కింది వాటిలో ఏవి సరైనవి కావు?
 a) రాబర్ట్ బ్రౌన్ కణాన్ని కనుక్కొన్నారు,
 b) ప్లీడన్, ష్వాన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు,
 c) కొత్త కణాలు అంతకుముందు ఉన్న కణాల నుంచి ఏర్పడతాయని నిర్షా వివరించారు.
 d) ఏకకణజీవి జీవ చర్యలన్నింటిని కణంలోపలే నిర్వహిస్తుంది.
 జవాబు:
 a) కాదు. కణమును కనుగొన్న వారు రాబర్ట్ హుక్.
 b) సరైనది
 c) సరైనది
 d) సరైనది
ప్రశ్న 13.
 కొత్త కణాలు దీని నుంచి ఉత్పత్తి అవుతాయి.
 a) బాక్టీరియల్ కిణ్వనం
 b) పాత కణాల పునరుత్పత్తి
 c) అంతకుముందు ఉన్న కణాలు (pre-existing cells) d) నిర్జీవ పదార్థాలు.
 జవాబు:
 c) సరి అయినది.
ప్రశ్న 14.
 కింది వాటిని జతపరచండి.
 a) క్రిస్టే i) ఆవర్ణికలోని చదునైన త్వచయుత కోశాలు
 b) సిస్టిర్నే ii) మైటోకాండ్రియాలోని అతర్వలనాలు
 c) థైలకాయిడ్లు iii) గాల్జీ పరికరంలోని బిళ్లల వంటి కోశాలు
 జవాబు:
 a) క్రిస్టే – మైటో కాండ్రియాలోని అంతర్వలనాలు
 b) సిస్టర్‌నే – గాల్జి పరికరంలోని బిళ్ళల వంటి కోశాలు
 c) థైలకాయిడ్లు – అవర్ణికలోని చదునైన త్వచయుతాకేశాలు.
ప్రశ్న 15.
 ఈ కింది వానిలో సరియైనది
 a) జీవరాశుల కణాలన్నింటిలో కేంద్రకం ఉంటుంది.
 b) వృక్ష, జంతు కణాలు రెండింటిలో స్పష్టమైన కణకవచం ఉంటుంది.
 c) కేంద్రక పూర్వ జీవులలో త్వచంతో ఆవరించబడిన కణాంగాలు ఉండవు.
 d) నిర్జీవ పదార్థాల నుంచి (denovo) నవజాతంగా కణాలు ఏర్పడతాయి.
 జవాబు:
 c సరిఅయినది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
 పత్రహరితాన్ని కలిగిన కణాంగాన్ని వర్ణించండి.
 జవాబు:
 పత్రహరితాన్ని కలిగిన కణాంగము హరితరేణువు. హరితరేణువులు అత్యధిక సంఖ్యలో పత్రం యొక్క పత్రాంతర కణజాలంలో కనిపిస్తాయి. ఇవి కటకాకారం లేదా అండాకారంలో ఉంటాయి. వీటి పరిమాణం 5-10 µm పొడవు, 2-4 µm వెడల్పు ఉంటుంది.
 
హరితరేణువులు రెండు పొరలచే ఆవరింపబడి ఉంటాయి. లోపలి పొరచేత ఆవరింపబడి ఉన్న అంతరప్రదేశాన్ని ఆవర్ణిక అంటారు. అనేక చదునైన త్వచయుత కోశాలు ఆవర్ణికలో కలిగి ఉంటాయి. వీటిని థైలకాయిడ్లు అంటారు. థైలకాయిడ్లు నాళాల రూపంలో ఒకదానిపై మరొకటి దొంతరలవలే అమరి ఉంటాయి. వీటిని (గానా) థైలకాయిడ్లు అంటారు. వీటితోపాటు అనేక చదునైన త్వచయుత నాళికలు ఆవర్ణికలో ఉన్న పటలికారాశులను కలుపుతూ ఉంటాయి. వీటిని పటలికలు అంటారు. థైలకాయిడ్లు లోపలి ప్రదేశాన్ని అవకాశిక అంటారు. హరితరేణువు ఆవర్ణికలో కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్ల సంశ్లేషణకు కావలిసిన ఎంజైమ్‌లు ఉంటాయి. థైలకాయిడ్లలో కిరణ జన్య సంశ్లేషణ వర్ణ ద్రవ్యాలు ఉంటాయి.
![]()
ప్రశ్న 2.
 కణ శక్త్యాగారాల నిర్మాణం, విధులను వివరించండి.
 జవాబు:
 
 మైటోకాండ్రియాను కణశక్త్యాగారాల కణాంగముగా పేర్కొంటారు. మైటోకాండ్రియా దండాకారంలో, 0-2-1.0 µm వ్యాసం, 1.0-4.1 µm పొడవుగల చిన్న గొట్టాలుగా లేక స్థూపాలుగా కనిపిస్తాయి. ప్రతి మైటోకాండ్రియా చుట్టూ రెండు పొరలు ఆవరించి ఉంటాయి. లోపలిపొర లోపలికి ముడతలును ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. లోపలిపొరలోపల ప్రదేశాన్ని మాత్రిక అంటారు. మాత్రికలో శ్వాసక్రియకు సంబంధించిన ఎంజైమ్‌లు ఉంటాయి. క్రిస్టేలో శ్వాసక్రియ ఎలక్ట్రాన్ రవాణా సంక్లిష్టాలు ఉంటాయి. మైటోకాండ్రియాలు వాయు సహితి శ్వాసక్రియ జరిపి ATP రూపంలో కణశక్తి ఉత్పత్తి చేస్తాయి. కావున వీటిని కణశాక్త్యాగారాలు అంటారు. మాత్రికలు ఒక వృత్తాకార DNA అణువు, 70 S రైబోసోమ్‌లు ఉంటాయి.
విధులు :
- మైటోకాండ్రియాలో కణ వాయు సహితి శ్వాసక్రియ జరుగుతుంది. కావున దీనిని కణశక్తిగారాలుగా పేర్కొంటారు.
 - మైటోకాండ్రియాలో వృత్తాకార DNA అణువు 70S రైబోసోమ్‌లు ఉండటంవల్ల వాటికి కావలిసిన ప్రొటీన్లను స్వయంగా సంశ్లేషణ చేసుకుంటాయి. కావున దీనిని స్వయం ప్రతిపత్తి కలిగిన కణాంగముగా పేర్కొంటారు.
 
ప్రశ్న 3.
 సెంట్రియోల్ యొక్క బండిచక్రం నిర్మాణంపై వ్యాఖ్యానించండి.
 జవాబు:
 సెంట్రోసోమ్ అనే కణాంగము సాధారణంగా సెంట్రియోల్లు అనే రెండు స్థూపాకార నిర్మాణాలను చూపిస్తుంది. ఇవి రూపరహిత పెరిసెంట్రియోలార్ పదార్థాలతో ఆవరించి ఉంటాయి. సెంట్రోసోమ్లోని సెంట్రియోల్లు ఒకదానికి మరొకటి లంబంగా అమర్చబడి ప్రతిదానిలో బండి చక్రంలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెంట్రియోల్లో తొమ్మిది సమదూరంకల ట్యూబ్యులిన్చే నిర్మించబడిన పరిధీయ పోచలు ఉంటాయి. ప్రతి పరిధీయ పోచలో 3 సూక్ష్మ నాళికలు ఉంటాయి. ప్రక్క ప్రక్కనున్న పరిధీయ పోచలు త్రికాలు కలుపబడి ఉంటాయి. సెంట్రియోల్ కేంద్రభాగము ప్రోటీను పదార్థం నిర్మితమై హబ్ (Hub) గా పిలవబడుతుంది. హబ్ భాగము ప్రోటీనాయుతమైన వ్యాసార్ధ పోచలతో పరిధీయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోల్లు శైలికలు లేదా కశాభాలను, కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరమును ఉత్పత్తి చేస్తాయి.
![]()
ప్రశ్న 4.
 కణసిద్ధాంతంను సంగ్రహంగా వర్ణించండి.
 జవాబు:
 వృక్ష, జంతు శరీరాలు కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయనే పరికల్పనని ష్వాన్ ప్రతిపాదించారు. ప్లీడన్ అను జర్మన్ శాస్త్రవేత్త పెద్ద సంఖ్యలో మొక్కలను పరిశీలించి, మొక్కలన్ని వివిధ రకాల కణాలతో ఏర్పడి ఉన్న కణజాలాలతో నిర్మింపబడి ఉంటాయని గుర్తించారు. ప్లీడన్, ష్వాన్లు సంయుక్తంగా కణ సిద్ధాంతంను ప్రతిపాదించారు. కాని ఈ సిద్ధాంతము కొత్త కణాలు ఎలా పుడతాయనే అంశాన్ని వివరించలేదు. 1855లో రుడాల్ఫ్ విర్షా కొత్త కణాలు అంతకు పూర్వము ఉన్న కణాల నుంచి విభజనవల్ల ఏర్పడతాయని వివరించారు. దీనిని ‘ఆమ్నిస్ సెల్లులా-ఇ-సెల్లులా’ అంటారు. ఈయన ప్లీడన్, ష్వాన్ల పరికల్పనకి రూపాంతరం చేసి కణసిద్ధాంతానికి పరిపూర్ణతను కల్పించారు. ప్రస్తుతం కణసిద్ధాంతము అనగా జీవులన్నీ కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి. అన్ని కణాలు పూర్వమున్న కణాల నుంచి పుడతాయి.
ప్రశ్న 5.
 గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం (RER) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం (SER) ల మధ్యగల భేదాల్ని తెలపండి.
 జవాబు:
| గరుకు అంతర్జీవ ద్రవ్య జాలము | నునుపు అంతర్జీవ ద్రవ్య జాలము | 
| 1) అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రైబోసోమ్‌లు ఉంటాయి. | 1) అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రైబోసోమ్‌లు ఉండవు. | 
| 2) ఇది సిస్టర్నేలను కల్గి ఉంటుంది. | 2) ఇది నాళికలను కల్గి ఉంటుంది. | 
| 3) ఇది కేంద్రక త్వచంను అంటిపెట్టుకొని ఉంటుంది. | 3) ఇది ప్లాస్మా పొరను అంటి పెట్టుకొని ఉంటుంది. | 
| 4) ఇది ప్రోటీనుల సంశ్లేషణలో పాల్గొంటుంది. | 4) ఇది లిపిడ్ సంశ్లేషణలో పాల్గొంటుంది. | 
ప్రశ్న 6.
 ప్లాస్మాపొర జీవ రసాయనిక నిర్మాణాన్ని తెలపండి. పొర లోపల లిపిడ్ అణువుల అమరిక ఎలా ఉంటుంది?
 జవాబు:
 ప్లాస్మా పొర రెండు వరుసల లిపిడ్ అణువులతో ఏర్పడి ఉంటుంది. పొరలోపలి లిపిడ్ అణువుల ధృవ శీర్షాలు వెలుపలి వైపునకు, అధృవ తోకలు లోపలివైపునకు అమర్చబడి ఉంటాయి. ఈ అమరిక వల్ల సంతృప్త హైడ్రోకార్బన్ తోకలు జల వాతావరణం నుంచి రక్షింపబడతాయి. పొరలోని లిపిడ్ పదార్థము ముఖ్యంగా ఫాస్ఫోలిపిడ్లను కలిగి ఉంటుంది. తరువాత జరిగిన జీవరసాయన పరిశోధనలు కణపొరలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయని స్పష్టంగా తెలిపాయి. త్వచప్రోటీన్లను, వాటి స్థానంను బట్టి అంతర్గత ప్రోటీనులు, పరిధీయ ప్రోటీన్లుగా వర్గీకరిస్తారు. పరిధీయ ప్రోటీన్లు త్వచ ఉపరితల భాగాలలో ఉంటే, అంతర్గత ప్రోటీన్లు త్వచంలో పాక్షికంగా లేక సంపూర్ణంగా దిగబడి ఉంటాయి.
కణత్వచ నమూనాను 1972లో సింగర్ మరియు నికల్సన్లు ప్రతిపాదించారు. దీనిని ఫ్లూయిడ్, మొజాయిక్ నమూనా అంటారు. దీని ప్రకారం అర్ధద్రవస్థితిలో ఉన్న లిపిడ్ పొర ప్రోటీను అణువుల పార్శ్వ కదలికలకు వీలు కల్పిస్తుంది.
ప్రశ్న 7.
 కేంద్రకం నిర్మాణాన్ని వివరించండి.
 జవాబు:
 
 కేంద్రకం :
 దీనిని ప్రధాన కణాంగము / కణమేధస్సు అంటారు. దీనిని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు. అంతర్థశ కేంద్రకంలో క్రోమాటిన్ అనే న్యూక్లియో ప్రోటీనులు, కేంద్రకమాత్రిక, గోళాకారంలో ఉన్న కేంద్రకాంశాలు ఉంటాయి. కేంద్రకంలోని పదార్థాలను కణద్రవ్యం నుంచి వేరుచేస్తూ రెండు పొరలు ఆచ్ఛాదనగా ఉంటాయి. ఈ పొరల మధ్య ప్రదేశాన్ని పరిన్యూక్లియార్ ప్రదేశము అంటారు. వెలుపలి పొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది, ఉపరితలంపై రైబోసోమ్లను గల్గి’ ఉంటుంది. కేంద్రక తొడుగులో రెండు పొరలు కలుసుకోవడం వల్ల సూక్ష్మరంధ్రాలు ఏర్పడతాయి. వీటిద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకం మరియు కణద్రవ్యాల మధ్య ద్విదిశాపధంలో చలనం చెందుతాయి.
కేంద్రకంలోని ద్రవపదార్థంలో కేంద్రకాంశం, క్రోమాటిన్ ఉంటాయి. కేంద్రకాంశం కేంద్రకరసంలో కలిసిపోయి ఉంటుంది. కేంద్రకాంశం రైజోసోమల్ RNA చురుకుగా సంశ్లేషణ జరిపే ప్రదేశాలు. అంతర్ధశ కేంద్రకంలో క్రోమాటిన్ అనే వదులైన అస్పష్టంగా కనిపించే న్యూక్లియో ప్రోటీను పొగులతో ఏర్పడిన వలవంటి నిర్మాణం ఉంటుంది. కాని కణ విభజన సమయంలో క్రోమాటిన్ అనేది క్రోమోసోమ్లుగా మారతాయి. క్రోమాటిన్ DNA హిస్టోనులు, కొన్ని నాన్ హిస్టోన్లు, RNA లను కలిగి ఉంటాయి.
ప్రశ్న 8.
 సెంట్రోమియర్ స్థానాన్ని ఆధారంగా క్రోమోసోమ్‌ల రకాలను గురించి క్లుప్తంగా వ్రాయండి.
 జవాబు:
 ప్రతి క్రోమోసోమ్లో సంట్రోమియర్ ఉంటుంది. క్రోమోసోమ్లో గుర్తించారు. అవి. సెంట్రోమియర్ స్థానాన్ని 4 రకాల క్రోమోసోమ్లను
1) మెటాసెంట్రిక్ :
 సెంట్రోమియర్ / క్రోమోసోమ్ మధ్యస్థానంలో ఉండి రెండు వైపులా బాహువులు సమానంగా ఉంటాయి. చలన దశలో ఈ క్రోమోసోమ్లు ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.
2) సబ్ మెటాసెంట్రిక్ :
 సెంట్రోమియర్ / క్రోమోసోమ్ మధ్య స్థానంలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. బాహువులు అసమానంగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ‘L’ ఆకారంలో కనిపిస్తాయి.
3) ఎక్రోసెంట్రిక్ :
 సెంట్రోమియర్ ఒక వైపుగా ఏర్పడి ఉంటుంది. ఒక బాహువు పొడవుగా, మరొకటి పొట్టిగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ” ఆకారంలో కనిపిస్తాయి.
4) టిలోసెంట్రిక్ :
 సెంట్రోమియర్ క్రోమోసోమ్ బాహువు కోనలో ఉంటుంది. దీనివల్ల ఒకే బహువు ఉంటుంది. ఈ క్రోమోసోమ్లు చలనదశలో ‘” (పుడక) ఆకారంలో కనిపిస్తాయి.
 
ప్రశ్న 9.
 కణ అస్థిపంజరం అనగానేమి? అది చేసే పనులేమిటి?
 జవాబు:
 కణద్రవ్యంలో ప్రోటీనులతో నిర్మితమైన, తంతురూప, విస్తారమైన వలలాంటి ఆకారాలను సమిష్టిగా కణఅస్థి పంజరము అంటారు. ఇది నిజకేంద్రక జీవులలో మూడు ప్రధాన అంశాలను చూపుతుంది. అవి సూక్ష్మ తంతువులు, మధ్యస్థ తంతువులు, సూక్ష్మనాళికలు. ఇది యాంత్రిక ఆధారము, కణరూపాన్ని నిలపటం, కణచలనము, కణాంతర్గత రవాణా, కణం వెలుపలికి సంకేతాలు పంపడం, కేంద్రక విభజన వంటి విధులలో పాల్గొంటుంది.
![]()
ప్రశ్న 10.
 అంతరత్వచ వ్యవస్థ అనగానేమి? ఏ కణాంగాలు దీనిలో భాగం కాదు? ఎందుకు?
 జవాబు:
 కణంలో కనిపించే వివిధ త్వచయుత కణాంగాలు నిర్మాణంలో విధులలో విస్పష్టంగా ఉన్నప్పటికీ వాటిలో జరిగే జీవక్రియల మధ్య అనుసంధానం కనిపిస్తుంది. కావున వీటిని అన్నింటిని కలిపి అంతరత్వచ వ్యవస్థగా గుర్తిస్తారు.
మైటోకాండ్రియా, హరితరేణువు, పెరాక్సిసోమ్లు, వీటిలో భాగము కావు. ఇవి అంతర్జీవద్రవ్యజాలం, గాల్జి సంక్లిష్టం, లైసోజోమ్లతో సంబంధం చూపవు.
ప్రశ్న 11.
 సక్రియ రవాణా మరియు నిష్క్రియా రవాణాల మధ్య తేడాను గుర్తించండి.
 జవాబు:
| సక్రియ రవాణా | నిష్క్రియా రవాణా | 
| 1) అయానులు లేదా అణువులు ప్లాస్మాపొర ద్వారా జీవక్రియా శక్తిని ఉపయోగించుకుని రవాణా అగు ప్రక్రియ. | 1) అయానులు లేదా అణువులు ప్లాస్మాపొర ద్వారా జీవక్రియా శక్తి ప్రమేయం లేకుండా రవాణా అగు ప్రక్రియ. | 
| 2) ఇది గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఉదా : సోడియం పంప్ ద్వారా కణాలు లవణాలను గ్రహిస్తాయి.  | 2) ఇది గాఢతా ప్రవణతకు అనుకూలంగా జరుగుతుంది. ఉదా : కణాలలోనికి నీరు విసరణ ప్రక్రియ ద్వారా చేరుట.  | 
ప్రశ్న 12.
 న్యూక్లియోసోమ్లు అంటే ఏమిటి ? అవి దేనితో చేయబడతాయి? [Mar. ’14]
 జవాబు:
 ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో చూసినపుడు క్రొమాటిన్ పూసలు గుచ్చిన దారపు పోగువలె కనిపిస్తాయి. ఈ పూసలవంటి భాగాలను న్యూక్లియోసోమ్లు అంటారు. న్యూక్లియోసోమ్లో 200 క్షార జతల పొడవున్న ద్విసర్పిల DNA అణువు కోర్‌ను చుట్టి ఉంటుంది. కోర్ భాగము 8 హిస్టోన్ అణువులతో ఏర్పడి ఉంటుంది. అవి H2A, H2B, H3, H4. ఇవి ఒక్కొక్కటి రెండు నకళ్ళుగా ఉంటాయి. H1 హిస్టోన్ అణువు న్యూక్లియోసోమ్ కోర్ వెలుపల, DNA కోర్లోనికి ప్రవేశించేచోట, నిష్క్రమించే చోట DNA రెండు చుట్లను కోర్కు అతికిస్తుంది. రెండు అనుక్రామిక న్యూక్లియోసోమ్ల మధ్యన కొనసాగివున్న
 DNA ను లింకర్ DNA అంటారు.
ప్రశ్న 13.
 రెండు త్వచాలతో ఆవరించబడి ఉన్న రెండు కణాంగాలను తెలపండి. వీటి లక్షణాలు ఏమి? వాటి విధులను తెలిపి వాటి పటాలను గీసి భాగాల్ని గుర్తించండి.
 జవాబు:
 మైటోకాండ్రియా, హరితరేణువు :
 మైటోకాండ్రియాలు దండాకారంలో లేక స్థూపాలులాగా ఉంటాయి. ఇవి 0.2 – 1.0 µm వ్యాసం, 1.0 – 4.1 µm పొడవులో ఉంటాయి. దీనికి ఉన్న రెండు పొరలలో వెలుపలి పొరను నునుపుగాను, లోపలిపొర లోపలి వైపుకు ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. మైటోకాండ్రియాలు వాయు సహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు. వీటిని కణశక్త్యాగారాలు అంటారు.
 
హరితరేణువులు అండాకారం, గోళాకారం లేక రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. ఇది 5 – 10 µm పొడవు, 2- 4 µm వెడల్పు కలిగి ఉంటాయి. హరితరేణువు యొక్క అవర్ణికలో కార్బోహైడ్రేటులు, ప్రోటీనులు సంశ్లేషణకు అవసరమయిన అనేక ఎంజైమ్‌లు ఉంటాయి.
ప్రశ్న 14.
 కేంద్రక పూర్వకణం యొక్క లక్షణాలు తెలపండి.
 జవాబు:
- కేంద్రక త్వచము ఉండదు. కణం మధ్యలో ఒకే ఒక వలయాకార, నగ్న DNA ఉంటుంది. దీనిని న్యూక్లియాయిడ్ అంటారు.
 - కేంద్రకాంశం ఉండదు.
 - అంతర త్వచ వ్యవస్థ ఉండదు.
 - మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు, లైసోజోమ్‌లు, పెరాక్సిజోమ్లు, కణ అస్థిపంజరము ఉండవు.
 - 70 S రకానికి చెందిన రైబోజోమ్‌లు ఉంటాయి.
 - కణ కవచము పాలీశాఖరైడ్లు, లిపిడ్లు, ప్రోటీనులతో నిర్మితమై ఉంటుంది.
 - శ్వాసక్రియా ఎంజైమ్‌లు కణత్వచంలో ఉంటాయి.
 - కణాలు ద్విధావిచ్చిత్తి ద్వారా సాధారణ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
 
ప్రశ్న 15.
 కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో ఈ కింది శాస్త్రజ్ఞుల పాత్ర గురించి సంగ్రహంగా వివరించండి.
 a) రుడాల్ఫ్ విర్షా b) ప్లీడన్, ష్వాన్
 జవాబు:
 a) రుడాల్ఫ్ విర్షా :
 1855 లో ఈయన కొత్త కణాలు అంతకు పూర్వము ఉన్న కణాల నుంచి విభజన వల్ల ఏర్పడతాయని వివరించారు. దీనిని “ఆమ్నిస్ సెల్లులా -ఇ-సెల్లులా” అంటారు. ఈయన ప్లీడన్ మరియు ష్వాన్ల పరికల్పనకు రూపాంతరం చేసి కణ సిద్ధాంతానికి పరిపూర్ణత కల్పించారు. దీని ప్రకారము జీవులన్ని కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి. అన్ని కణాలు పూర్వమున్న కణాల నుంచి పుడతాయి.
b) ప్లీడన్ మరియు ష్వాన్ :
 1838 లో ప్లీడన్ అను జర్మన్ వృక్షశాస్త్రవేత్త ఎక్కువ సంఖ్యలో మొక్కలను పరిశీలించి మొక్కలన్ని వివిధ రకాల కణాలతో ఏర్పడి వున్న కణజాలాలతో నిర్మింపబడి ఉంటాయని గుర్తించారు. థియోడార్ ష్వాన్ అను బ్రిటిష్ జంతుశాస్త్రవేత్త వివిధ రకాల జంతుకణాలను అధ్యయనంచేసి, కణాలు పలుచని పొరతో కప్పబడి ఉంటాయని కనుగొన్నారు. దానిని ఇప్పుడు ప్లాస్మాపొర అని అంటున్నారు. ఆయన వృక్షకణాలపై చేసిన పరిశోధనల ఆధారంగా కణకవచం ఉండుట.
వృక్ష కణాల ప్రత్యేక లక్షణంగా నిర్ధారించారు. ఈ పరిజ్ఞానం ఆధారంగా, ష్వాన్ వృక్ష, జంతు శరీర కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి అనే పరికల్పనను ప్రతిపాదించారు.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
 ఒక కణం సజీవకణంగా పిలువబడడానికి దానిలో ఏ నిర్మాణాత్మక, క్రియాత్మక గుణాలు ఉండాలి?
 జవాబు:
 అన్ని వృక్ష, జంతు శరీరాలు కణాలు, వాటి ఉత్పత్తులతో తయారయి ఉంటాయి. కణము జీవి యొక్క మౌళికమైన నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము ప్రతి కణంలో వివిధ రకాల కణాంగాలు వివిధ రకాల చర్యలను జరుపుతుంటాయి.
- కణాలు శక్తి సూత్రాలు అనుసరిస్తాయి అనగా శక్తిని రవాణా చేస్తాయి.
 - కణాలు బహిర్గత లక్షణాలు కల నిర్మాణాలు.
 - కణాలు పరిణామ క్రమ ఉత్పత్తిని కల్గి ఉంటాయి.
 - కణాలులో జీవక్రియా మార్గాలు, పోషకాల వినిమయము, వాతావరణానికి అనువుగా మారడంవంటి లక్షణాలు ఉంటాయి.
 - కణాలు స్వయం ప్రతికృతి చెందే కేంద్రకామ్లాలను కల్గిఉంటాయి.
 - కణద్రవాభిసరణక్రమ చర్యలను నియంత్రించే రిక్తికలను కల్గిఉంటాయి.
 - కణములు వార్తా ప్రసార వ్యవస్థను కల్గి ఉంటాయి.
 - కణాలు కదలికలు చూపుతాయి.
 - కణాలు పెరుగుతాయి. విభజన చెందుతాయి.
 - కణాలు చనిపోతాయి.
 
![]()
ప్రశ్న 2.
 నిజకేంద్రక కణాలలోని కణాంగాలు
 a) త్వచంలో చుట్టబడి ఉండవు
 c) రెండు త్వచాలతో చుట్టబడి ఉంటాయి.
 b) ఒకే త్వచంతో చుట్టబడి ఉంటాయి
 కణంలోని విభిన్న కణాంగాలను పై మూడు వర్గములలో చేర్చండి.
 జవాబు:
 a) కేంద్రకాంశము
 b) లైసోజోమ్‌లు, రిక్తికలు
 c) మైటోకాండ్రియా, హరితరేణువు, కేంద్రకము
ప్రశ్న 3.
 కేంద్రకం లోపలి జన్యు పదార్థం ప్రతి ఒక జాతికి స్థిరంగా ఉంటుంది. కాని, క్రోమోసోమేతర DNA జనాభాలోని విభిన్న జీవుల మధ్య వైవిధ్యంగా ఉంటుంది. వివరించండి.
 జవాబు:
 కేంద్రక పూర్వజీవులలో జీనోమిక్ DNA తో పాటు, కణద్రవ్యంలో జీనోమేతర DNA ముక్కలు ఉంటాయి. వాటిని ప్లాస్మిడ్లు అంటారు. ఇవి బాక్టీరియమ్లకు కొన్ని ప్రత్యేక దృశ్య రూపలక్షణాలను (సూక్ష్మజీవ నాశకాలకు నిరోదకత) ఆపాదిస్తాయి. ఇదీ బాక్టీరియంలలో బయటినుంచి వచ్చే DNA తో జన్యు పరివర్తన చర్యను కలుగచేయుటలో తోడ్పడతాయి.
నిజకేంద్రక కణాలలో జీనోమేతర DNA లు హరితరేణువు అవర్ణికలోను, మైటోకాండ్రియా మాత్రికలోనూ ఉంటాయి. వీటివలన ఇవి పాక్షిక స్వయం ప్రతిపత్తికల కణాంగాలు అని అంటారు.
ప్రశ్న 4.
 “మైటోకాండ్రియాలు కణశక్త్యాగారాలు” దీన్ని సమర్ధించండి?
 జవాబు:
 
 మైటోకాండ్రియాలు దండాకారంలో, 0.2 – 1.0 µm వ్యాసం, 1.0 – 4.1 µm పొడవుగల చిన్న గొట్టాలుగా లేక స్థూపాలుగా కనిపిస్తాయి. ప్రతిమైటోకాండ్రియా చుట్టూ రెండు పొరలు ఉంటాయి. బాహ్యపొర ఈ కణాంగానికి హద్దుగా ఉంటుంది. లోపలి పొర లోపలికి ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. లోపలి పొరలోపల మాత్రిక ఉంటుంది. ఈ రెండు పొరలలో విశిష్ట ఎంజైమ్‌లు మైటోకాండ్రియాలో జరిగే ప్రత్యేక విధులకు సంబంధించి ఉంటాయి. మైటో కాండ్రియాలు వాయు సహిత శ్వాసక్రియ జరిపి ATP రూపంలో కణశక్తి ఉత్పత్తి చేస్తాయి. కావున వీటిని కణశక్త్యాగారాలు అంటారు. మాత్రికలో ఒక వృత్తాకార DNA అణువు, కొన్ని RNA అణువులు 70 S రైబోసోమ్‌లు, ప్రోటీనుల సంశ్లేషణకు కావలసిన అంశాలు ఉంటాయి.
ప్రశ్న 5.
 జాతి విశిష్టమైన లేదా ప్రాంత విశిష్టమైన ప్లాస్టిడ్ రకాలున్నాయా? వీటిలో, ఒక దానిని మరొకదాని నుంచి గుర్తించడమెలా?
 జవాబు:
 ప్లాస్టిడ్లు జాతి విశిష్టము. ఇవి వృక్షజాతులన్నింటిలో యూగ్లినాయిడ్లలో ఉంటాయి. వీటిలో వున్న విశిష్ట వర్ణద్రవ్యాలవల్ల అవి ఉన్న వృక్ష భాగాలకు విశిష్టరంగులనిస్తాయి. లోపల ఉన్న వర్ణద్రవ్యాల ఆధారంగా ప్లాస్టిడ్లు 3 రకాలు. అవి శ్వేతరేణువులు, వర్ణ రేణువులు, హరిత రేణువులు.
1) శ్వేతరేణువులు :
 ఇవి వర్ణ రహిత ప్లాస్టిడ్లు. ఇవి పోషకాలను నిల్వచేస్తాయి. నిల్వచేయు పోషకంను బట్టి 3 రకాలు. అవి “కార్బోహైడ్రేట్లను నిల్వచేస్తే అమైలోప్లాస్ట్లు అని, ప్రొటీనులను నిల్వచేస్తే అల్యురోప్లాస్ట్లు అని, నూనెలు, కొవ్వులను నిల్వచేస్తే ఇలియోప్లాస్ట్లు అని అంటారు. ఇవి మొక్క భూగర్భ భాగాలలో ఉంటాయి.
2) వర్ణరేణువులు :
 కెరోటిన్, జాంథోఫిల్లు, కెరోటినాయిడ్ వర్ల ద్రవ్యాలను కలిగి ఉంటాయి. ఇవి మొక్కల బాగాలకు పసుపు, నారింజ లేదా ఎరుపు వర్ణంను కలుగచేస్తాయి.
3) హరితరేణువులు :
 కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన పత్రహరితం, కెరోటినాయిడ్ వర్ల ద్రవ్యాలు కాంతి వికిరణ శక్తిని గ్రహిస్తాయి. ప్రతి హరితరేణువు రెండు పొరలచే ఆవరించబడి ఉంటుంది. పొరల లోపల ఆవర్ణిక ఉంటుంది. దీనిలో చదునైన త్వచయుత కోశాలు ఉంటాయి. వీటిని థైలకాయిడ్లు అంటారు. ఇవి ఒక దానిపై మరొకటి నాణాల రూపంలో అమరి ఉంటాయి. వీటిని పటలికా రాశులు అంటారు. వీటితోపాటు ఆవర్ణికా పటలికలు ఉంటాయి. ఆవర్ణిక్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సంశ్లేషణకు కావలసిన ఎంజైమ్‌లు ఉంటాయి.
ప్రశ్న 6.
 ఈ క్రింది వాని విధులను వివరించండి.
 a) సెంట్రోమియర్ b) కణకవచం c) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం d) గాల్జీ పరికరం e) సెంట్రియోల్లు
 జవాబు:
 a) సెంట్రోమియర్ :
 క్రోమోజోమ్ లోని వర్ణరహిత భాగంను సెంట్రోమియర్ అంటారు. క్రొమోసోంల విభజనకు అవసరము, సోదర క్రొమాటిడ్లను కలుపుతూ ఉంటుంది. సెంట్రోమియర్ ఇరువైపులా రెండు బిళ్ళల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కైనిటోకోర్లు అంటారు. కణ విభజన సమయంలో కైనిటోకోర్లకు కండెతంతువులు అతుక్కుంటాయి.
b) కణకవచము :
 కణం నకు ఒక నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తుంది. కణంను మాత్రిక హని నుండి వ్యాధికారక సూక్ష్మ జీవుల నుండి రక్షిస్తుంది. ఇది ప్రక్క ప్రక్క కణాలను కలుపుతూ, అవాంఛనీయ అణువులకు అడ్డుగోడవలె పనిచేస్తుంది.
c) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము :
 రైబోసోమ్‌లు లేని అంతర్జీవ ద్రవ్యజాలము. ఇది లిపిడ్ల సంశ్లేషణలోను, కార్బోహైడ్రేట్ల జీవ క్రియలోను, కాల్షియం గాఢతను సమతుల్యత చేయుటలో పాల్గొంటుంది. దీనిలో గ్లోకోసన్ను గ్లూకోస్ – 6 ఫాస్పేట్గా మార్చి గ్లూకోజ్ 6-ఫాస్పోట్రాన్స్ఫరేజ్ అను ఎంజైం ఉంటుంది.
d) గాల్జి సంక్లిష్టము :
 గ్లైకోప్రోటీన్లు, గ్లైకోలిపిడ్లను ఉత్పత్తిచేసే ముఖ్య కేంద్రంగా ఉంటుంది. కవచ పదార్థాల తయారీకి, కణ విభజన సమయంలో కణఫలకం ఏర్పాటులోను పాల్గొంటుంది.
e) సెంట్రియోల్ :
 శైలికలు లేదా కశాభాలను, కండె పోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరంను ఉత్పత్తి చేస్తాయి.
ప్రశ్న 7.
 విభిన్న రకాల ప్లాస్టిడ్లు ఒక రూపం నుంచి వేరొక రూపంలోకి మార్పు చెందగలవా? అయితే ఉదాహరణలతో వివరించండి.
 జవాబు:
 ప్లాస్టిడ్లు ఒకరూపం నుంచి వేరొక రూపానికి మార్పు చెందగలవు. మొక్కలలో సాధారణంగా శ్వేతరేణువులు, వర్ణరేణువులు, హరితరేణువులు అను మూడు ప్లాస్టిడ్లు ఉంటాయి. శ్వేత రేణువులు నిల్వకు, వర్ణరేణువులు ఆయా మొక్కల బాగాలకు రంగును ఇవ్వడానికి, హరితరేణువులు కిరణజన్యసంయోగ క్రియకు తోడ్పడతాయి. టమాటో ఎరుపులో ఉండుట అనేది లైకోపిన్ అను వర్ణద్రవ్యం వల్ల వస్తుంది. ఎరుపు శైవలాలలో ఫైకోసమనిన్, ఫైకోఎరిథ్రిన్ అను వర్ణద్రవ్యాలు ఉంటాయి. గోధుమ శైవలాల్లో ప్యూకోజాంథిన్ ఉంటుంది.
పరిస్థితులను బట్టి ఒక ప్లాస్టిడ్ వేరొకరకంగా మారుతుంది. ఉదా : 1) బంగాళదుంపలోని శ్వేత రేణువులను కాంతికి గురిచేసిన హరిత రేణువులుగా మారతాయి.
2) మిరపలో అండాశయంలోని కణాలు శ్వేతరేణువులను కల్గి ఉంటాయి. అండాశయం, ఫలంగా మారేటప్పుడు అవి హరితరేణువులు, వర్ణరేణువులుగా మారతాయి.
ప్రశ్న 8.
 ఈ క్రిందివాటిని భాగాలు గుర్తించబడిన పటాల సహాయంతో వివరించండి?
 1) కేంద్రకం 2) సెంట్రోసోమ్
 జవాబు:
 
 1) కేంద్రకం :
 దీనిని ప్రధాన కణాంగము / కణ మేధస్సు అంటారు.
దీనిని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు. అంతర్థశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే న్యూక్లియోప్రొటీనులు, కేంద్రకమాత్రిక, గోళాకారంలో ఉన్న కేంద్రకాంశాలు ఉంటాయి. కేంద్రకంలోని పదార్ధాలను కణద్రవ్యం నుంచి వేరుచేస్తూ రెండుపొరలు ఆచ్ఛాదనగా ఉంటాయి. ఈ పొరల మధ్య పరిన్యూక్లియార్ ప్రదేశము ఉంటుంది. వెలుపలిపొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది, ఉపరితలంపై రైబోసోమ్లను గల్గి ఉంటుంది. కేంద్రక తొడుగులో రెండు పొరలు కలుసుకోవడం వల్ల ఏర్పడిన సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకము మరియు కణద్రవ్యాల మధ్య ద్విదిశాపధంలో చలనం చెందుతాయి. కేంద్రక ద్రవ్యంలో కేంద్రకాంశం, క్రొమాటిన్ ఉంటాయి. కేంద్రకాంశాల చుట్టూ పొర ఉండదు. దీనిలోని పదార్ధము కేంద్రకంసంలో కలిసిపోయి ఉంటుంది. ఇవి రైబోసోమల్ RNA చురుకుగా సంశ్లేషణ జరిపే ప్రదేశాలు అంతర్ధశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే వదులైన అస్పష్టంగా కనిపించే న్యూక్లియో ప్రోటీను పోగులతో ఏర్పడిన వల వంటి నిర్మాణం ఉంటాయి. కాని కణ విభజన సమయంలో క్రోమోసోమ్లుగా మారతాయి. క్రొమాటిన్లో DNA హిస్టోనులు, కొన్ని నాన్ హిస్టోన్లు, RNA ఉంటాయి.
2) సెంట్రోసోమ్ :
 
 సెంట్రిసోమ్ అనే కణాంగము సాధారణంగా -సెంట్రియోల్లు అనే రెండు స్థూపాకార నిర్మాణాలను చూపిస్తుంది. ఇవి రూపరహిత పెరియోసెంట్రియోలార్ పదార్థాలతో ఆవరించి ఉంటాయి. సెంట్రోసోమ్లోని సెంట్రియోలు ఒకదానికి మరొకటి లంబంగా అమర్చబడి ప్రతిదానిలో బండిచక్రం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెంట్రియోల్లో తొమ్మిది సమదూరంకల ట్యూబ్యులిన్చే నిర్మించబడిన పరిధీయ పోచలు ఉంటాయి. ప్రతి పరిధీయ పోచలో 3 సూక్ష్మ నాళికలు ఉంటాయి. ప్రక్క ప్రక్క నున్న పరిధీయ పోచలు త్రికాలు కలుపబడి ఉంటాయి. సెంట్రియోల్ కేంద్రభాగము ప్రోటీను పదార్థంచే నిర్మితమై హబ్ (Hub) గా పిలవబడుతుంది. హబ్ భాగము ప్రోటీనుయుతమైన వ్యాసార్ధ పోచలతో పరిధీయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోల్లు శైలికలు లేదా కశాభాలను, కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరమును ఉత్పత్తి చేస్తాయి.
![]()
ప్రశ్న 9.
 సెంట్రోమియర్ అనగా నేమి? క్రోమోజోమ్‌ల వర్గీకరణలో సెంట్రోమియర్ స్థానం ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. విభిన్న రకాల క్రోమోసోమ్‌లలో సెంట్రోమియర్ స్థానాలను చూపే పటం గీసి వివరించండి.
 జవాబు:
 ప్రతి క్రోమోసోమ్లో ప్రాథమిక కుంచనం లేక సెంట్రోమియర్ ఉంటుంది. దీనికి ఇరువైపులా రెండు బిళ్లల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కైనిటోకోర్లు అంటారు. వీటికి కండెతంతువులు అతుక్కుని క్రొమోసోమ్ల విభజనకు సహాయపడతాయి. క్రోమోసోంలో సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి 4 రకాల క్రోమోసోంలు గుర్తించారు. అవి :
 1) మెటాసెంట్రిక్ :
 సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్యస్థానంలో ఉండి రెండు వైపులా బాహువులు సమానంగా ఉంటాయి. చలన దశలో ఈ క్రోమోసోమ్లు ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.
2) సబ్మెటా సెంట్రిక్ :
 సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్య స్థానంలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. బాహువులు అసమానంగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ‘L’ ఆకారంలో కనిపిస్తాయి.
 
3) ఎక్రోసెంట్రిక్ :
 సెంట్రోమియర్ ఒక వైపుగా ఏర్పడి ఉంటుంది. ఒక బాహువు పొడవుగా, మరొకటి పొట్టిగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ” ఆకారంలో కనిపిస్తాయి.
4) టీలోసెంట్రిక్ :
 సెంట్రోమియర్ క్రోమోసోమ్ బాహువు కొనలో ఉంటుంది. దీనివల్ల ఒకే బాహువు ఉంటుంది. ఈ క్రోమోసోమ్లు చలనదశలో ” (పుడక) ఆకారంలో కనిపిస్తాయి.
Intext Question and Answers
ప్రశ్న 1.
 కేంద్రక పూర్వకణంలోని మీసోసోమ్ అంటే ఏమిటి? అది నిర్వహించే విధులు ఏవి?
 జవాబు:
 ప్లాస్మా పొర కణంలోనికి అనేక చోట్ల వ్యాపనం చెందడం వల్ల కనిపించే త్వచయుత ఆకారాలను మీసోసోమ్లు అంటారు. ఇవి కోశికలు, నాళికలు, పటలికలు వలె కనిపిస్తాయి. అవి కణ కవచం ఏర్పడటానికి, DNA ప్రతికృతి చెందడానికి, పిల్ల కణాలకు DNA వితరణ చెందడానికి తోడ్పడతాయి. ఇవి శ్వాసక్రియలో, స్రావక క్రియలో ప్లాస్మాపొర ఉపరితల వైశాల్యాన్ని పెంచడం ద్వారా పోషకాల శోషణ క్రియలో, ఎంజైమ్‌ల పరిమాణం పెంచడంలో తోడ్పడతాయి.
ప్రశ్న 2.
 తటస్థ అణువులు ప్లాస్మాత్వచం ద్వారా ఎలా చలిస్తాయి ? ధృవ అణువులు కూడా వాటివలెనే చలిస్తాయా? కానిచో అవి త్వచంలో ఏ పద్ధతిలో రవాణా చెందుతాయి?
 జవాబు:
 తటస్థ ద్రావితాలు కణ పొర ద్వారా సామాన్య విసరణ పద్ధతిలో గాఢతా ప్రవణతను అనుసరించి అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢత దిశలో ప్రయాణిస్తాయి. ధృవ ధర్మంగల అణువులు అధృవ స్వభావం ఉన్న ద్విపటలికాయుత లిపిడ్ పొర ద్వారా ప్రయాణించలేవు. కనుక వాటికి త్వచం గుండా రవాణా చెయ్యటానికి వాహక ప్రోటీన్ల సాయం కావాలి. కొద్ది అయానులు లేదా అణువులు వాహక ప్రోటీన్ల సహాయంతో వాటి గాఢతా ప్రవణతకు వ్యతిరేకదిశలో అంటే అల్పగాఢతనుంచి అధికగాఢతలవైపు త్వచం గుండా రవాణా చెందుతాయి.
ప్రశ్న 3.
 రెండు త్వచాలచే ఆవరించబడిఉన్న రెండు కణాంగాలను తెలపండి. వాటి లక్షణాలు ఏవి? వాటి విధులను తెలిపి, వాటి భాగాలు గుర్తించిన పటాలు గీయండి.
 జవాబు:
 
 మైటోకాండ్రియా, హరితరేణువు :
 మైటోకాండ్రియాలు దండాకారంలో లేక స్థూపాలులాగా ఉంటాయి. ఇవి 0.2 – 1.0 µm వ్యాసం, 1.0 – 4.1 µm పొడవులో ఉంటాయి. దీనికి ఉన్న రెండు పొరలలో వెలుపలి పొరను నునుపుగాను, లోపలిపొర లోపలి వైపుకు ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. మైటోకాండ్రియాలు వాయు సహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు. వీటిని కణశక్త్యాగారాలు అంటారు.
హరితరేణువులు అండాకారం, గోళాకారం లేక రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. ఇది 5 10 µm పొడవు, 2.4 µm వెడల్పు కలిగి ఉంటాయి. హరితరేణువు యొక్క ఆవర్ణికలో కార్బోహైడ్రేటులు, ప్రోటీనుల సంశ్లేషణకు అవసరమయిన అనేక ఎంజైమ్‌లు ఉంటాయి.
ప్రశ్న 4.
 కేంద్రక పూర్వజీవుల కణాల లక్షణాలు ఏమిటి?
 జవాబు:
- కేంద్రక త్వచము ఉండదు. కణం మధ్యలో ఒకే ఒక వలయాకార, నగ్న DNA ఉంటుంది. దీనిని న్యూక్లియాయిడ్ అంటారు.
 - కేంద్రకాంశం ఉండదు.
 - అంతర త్వచ వ్యవస్థ ఉండదు.
 - మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు, లైసోజోమ్‌లు, పెరాక్సిజోమ్లు, కణ అస్థిపంజరము ఉండవు.
 - 70 S రకానికి చెందిన రైబోజోమ్‌లు ఉంటాయి.
 - కణ కవచము పాలీశాఖరైడ్లు, లిపిడ్లు, ప్రోటీనులతో నిర్మితమై ఉంటుంది.
 - శ్వాసక్రియా ఎంజైమ్‌లు కణత్వచంలో ఉంటాయి.
 - కణాలు ద్విధావిచ్చిత్తి ద్వారా సాధారణ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
 
ప్రశ్న 5.
 బహుకణయుత జీవులలో శ్రమవిభజన ఉంటుంది. వివరించండి.
 జవాబు:
 బహుకణజీవులు మిలియన్, ట్రిలియన్ కణాలతో నిర్మితమై ఉంటాయి. ఈ కణాలు అన్ని వేరు వేరు పనులు నిర్వర్తిస్తాయి. ఒకేరకమైన విధులు నిర్వర్తించే కణాల సముదాయమును కణజాలము అంటారు. కావున జీవి దేహంలో, ప్రత్యేక విధిని ప్రత్యేకకణజాలం ఒక ప్రదేశంలో నిర్వహిస్తుంది.
అదేవిధంగా వివిధ రకాల కణాలు వివిధ రకాల విధులను నిర్వహిస్తాయి. ఈ విధమైన శ్రమ విభజన వల్ల బహుకణయుత జీవులు, సంక్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొనగలుగుతాయి.
![]()
ప్రశ్న 6.
 కణం జీవానికి మౌళిక ప్రమాణము. సంగ్రహంగా చర్చించండి.
 జవాబు:
 ప్లీడన్ అను జర్మన్ వృక్షశాస్త్రవేత్త అనేక మొక్కలను పరిశీలించి మొక్కలన్నీ వివిధ రకాల కణాలతో ఏర్పడి వున్న కణజాలాలతో నిర్మితమై ఉంటాయని గుర్తించారు. దీని ఆధారంగా వృక్ష, జంతు శరీరాలు కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయనే పరికల్పనను ప్రతిపాదించారు. ప్లీడన్ మరియు ష్వాన్లు కణ సిద్ధాంతంను ప్రతిపాదించారు. రుడాల్ఫ్ విర్షా, కొత్త కణజాలాలు అంతకు పూర్వమున్న కణాల నుంచి విభజన వల్ల ఏర్పడ్డాయని వివరించారు. దీనిని ‘ఆమ్నిస్ సెల్యులా సెల్యులా’ అంటారు. కణం ఒక జీవ భౌతికాధారము. కణము జీవులన్నింటిలో మౌళికమైన నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము. – కణంను సజీవస్థితిలో ఉంచడానికి కావలసిన వివిధ రసాయన చర్యలు కణద్రవ్యంలోనే జరుగుతాయి. కొన్ని నిర్మాణాలు (కణాలు) రవాణాలోను, కొన్ని ఆహారపదార్థాల తయారీలోను మరికొన్ని శక్తిని విడుదల చేస్తాయి.
ఒక ఆకుపచ్చని మొక్కను పరిశీలించిన దానిలో పత్రహరితము ఉండి, సూర్యరశ్మిని గ్రహించి, కావలసిన శక్తి పూరిత ఆహార పదార్ధములను తయారుచేసుకుంటుంది. ఇది కణంలోని భాగము, దీనిని హరితరేణువు అంటారు. మొక్కల జంతువులోని కణాలలో కేంద్రకము ప్రధాన కణాంగంగా పనిచేసి, కణచర్యలను నియంత్రిస్తుంది. కణ ద్రవ్యంలో వివిధ కణాంగాలు వివిధ రకాల జీవక్రియలను నియంత్రిస్తూ ఉంటాయి.
ప్రశ్న 7.
 కేంద్రక త్వచ రంధ్రాలు అంటే ఏమిటి? వాటి విధులను తెలియజేయండి.
 జవాబు:
 కేంద్రక త్వచంలో అనేక ప్రదేశాలలో సూక్ష్మరంధ్రాలను కలిగి ఉంటుంది. ఇవి తొడుగులోని రెండు పొరలు కలుసుకోవడంవల్ల ఏర్పడతాయి. వీటిని కేంద్రక రంధ్రాలు అంటారు. వీటి ద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకం మరియు కణ ద్రవ్యాల మధ్య ద్విదిశాపథంలో చలనం చెందుతాయి. నిజకేంద్రక కణాలలో కేంద్రకము, కణద్రవ్యం నుండి కేంద్రక త్వచంచే వేరు చేయబడి ఉంటుంది. ఇది కేంద్రకంలోని DNA కు రక్షణగా పనిచేస్తుంది. ఈ వారధితోపాటు కేంద్రక రంధ్రాల ద్వారా కేంద్రక ద్రవ్యానికి, కణద్రవ్యానికి మధ్య సంబంధం ఉంటుంది.
ప్రతి కేంద్రక రంధ్రము ప్రోటీను సంక్లిష్టంతో నిర్మితమై, చిన్న అణువులు, అయానులను స్వేచ్ఛగా కేంద్రకం నుండి విసరణ చెయ్యడానికి తోడ్పడుతుంది మరియు కణద్రవ్యం నుండి అవసరమైన ప్రోటీనులను కేంద్రకంలోనికి అనుమతిస్తుంది. కేంద్రకంలో తయారయిన RNA మరియు ప్రోటీనులను కణ ద్రవ్యంలోనికి పంపడానికి కూడా కేంద్రక రంధ్రాలు తోడ్పడతాయి.
ప్రశ్న 8.
 లైసోసోమ్‌లు, రిక్తికలు రెండు అంతరత్వచ వ్యవస్థకు చెందినవే అయినా వాటి విధులు భిన్నంగా ఉంటాయి. వ్యాఖ్యానించండి.
 జవాబు:
 హైడోలైటిక్, ఎంజైములను సమృద్ధిగా కలిగి కార్బోహైడ్రేట్లు, ప్రోటీనులు, లిపిడ్లు, కేంద్రకామ్లములను జీర్ణంచేసే త్వచయుత కణాంగాలను లైసోసోమ్‌లు అంటారు. ఈ ఎంజైమ్‌లు ఆమ్ల PH ల వద్ద యుక్తతమంగా పనిచేస్తాయి. కరువు పరిస్థితులలో లైసోసోమ్‌లు కణంలోని అంశాలను ఎంజైమ్‌ల ద్వారా జీర్ణింపచేసి కణం మృతికి కారణం అవుతాయి. ఈ చర్యను స్వయంవిచ్ఛిత్తి అంటారు.
కణంలో, కణద్రవ్యంలో కనిపించే త్వచయుత ఆచ్ఛాదన కల ప్రదేశాలును రిక్తికలు అంటారు. వీటిలో ప్రధానంగా నీరు, జీవక్రియా ఉపఉత్పన్నాలు విసర్జక పదార్థాలు, వ్యర్థ పదార్థాలతో కూడిన రసం ఉంటుంది. దీనిని రిక్తికరసం అంటారు. దీనిలో మొక్క భాగాలకు రంగు నిచ్చే ఆంథోసయనిన్ లాంటి వర్ణద్రవ్యాలు ఉంటాయి. రిక్తిక చుట్టూ ఏకపొర త్వచం ఉంటుంది. దీనిని రిక్తిక పొర (Tonoplast) అంటారు. ఇది అనేక అయాన్లు వాటి గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా రిక్తికలోనికి రవాణా చెందడానికి తోడ్పడుతుంది. రిక్తికలు కణ ద్రవాభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
ప్రశ్న 9.
 ఈ క్రింది వానిని భాగాలు గుర్తించిన పటాలతో వర్ణించండి.
 1) కేంద్రకము
 2) సెంట్రోసోమ్
 జవాబు:
 
 1) కేంద్రకం :
 దీనిని ప్రధాన కణాంగము / కణ మేధస్సు అంటారు. దీనిని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు. అంతర్థశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే న్యూక్లియోప్రొటీనులు, కేంద్రకమాత్రిక, గోళాకారంలో ఉన్న కేంద్రకాంశాలు ఉంటాయి. కేంద్రకంలోని పదార్థాలను కణద్రవ్యం నుంచి వేరుచేస్తూ రెండుపొరలు ఆచ్ఛాదనగా ఉంటాయి. ఈ పొరల మధ్య పరిన్యూక్లియార్ ప్రదేశము ఉంటుంది. వెలుపలిపొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది, ఉపరితలంపై రైబోసోమ్లను గల్గి ఉంటుంది. కేంద్రక తొడుగులో రెండు పొరలు కలుసుకోవడం వల్ల ఏర్పడిన సూక్ష్మరంద్రాలు ఉంటాయి. వీటి ద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకము మరియు కణద్రవ్యాల మధ్య ద్విదిశాపధంలో చలనం చెందుతాయి. కేంద్రక ద్రవ్యంలో కేంద్రకాంశం, క్రొమాటిన్ ఉంటాయి. కేంద్రకాంశాల చుట్టూ పొర ఉండదు. దీనిలోని పదార్ధము కేంద్రకంసంలో కలిసిపోయి ఉంటుంది. ఇవి రైబోసోమల్ RNA చురుకుగా సంశ్లేషణ జరిపే ప్రదేశాలు అంతర్దశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే వదులైన అస్పష్టంగా కనిపించే న్యూక్లియో ప్రోటీను పోగులతో ఏర్పడిన వల వంటి నిర్మాణం ఉంటాయి. కాని కణ విభజన సమయంలో క్రోమోసోమ్లుగా మారతాయి. క్రొమాటిన్లో DNA హిస్టోనులు, కొన్ని నాన్ హిస్టోన్లు, RNA ఉంటాయి.

 2) సెంట్రోసోమ్ :
 సెంట్రిసోమ్ అనే కణాంగము సాధారణంగా పరిధీయ సూక్ష్మ నాళికల జతలు సెంట్రయోల్లు అనే రెండు స్థూపాకార నిర్మాణాలను చూపిస్తుంది. కేంద్రస్థ తొడుగు ఇవి రూపరహిత పెరిసెంట్రియోలార్ పదార్థాలతో ఆవరించి ఉంటాయి. సెంట్రోసోమ్లోని సెంట్రియోల్లు ఒకదానికి మరొకటి లంబంగా అమర్చబడి ప్రతిదానిలో బండిచక్రం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెంట్రియోల్లో తొమ్మిది సమదూరంకల ట్యూబ్యులిన్చే నిర్మించబడిన పరిధియ పోచలు ఉంటాయి. ప్రతి పరిధియ పోచలో 3 సూక్ష్మ నాళికలు ఉంటాయి. ప్రక్క ప్రక్క నున్న పరిధియ పోచలు త్రికాలు కలుపబడి ఉంటాయి. సెంట్రియోల్ కేంద్రభాగము ప్రోటీను పదార్థంచే నిర్మితమై హబ్ (Hub) గా పిలవబడుతుంది. హబ్ భాగము ప్రోటీనుయుతమైన వ్యాసార్ధ పోచలతో పరిధేయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోల్లు శైలికలు లేదా కశాభాలను, కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరమును ఉత్పత్తి చేస్తాయి.
ప్రశ్న 10.
 సెంట్రోమియర్ అనగానేమి? క్రోమోసోమ్‌ల వర్గీకరణకు సెంట్రోమినం ఏ రకంగా ఆధారమౌతుంది. వివిధ రకాల క్రోమోసోమ్లలోని సెంట్రోమియర్ స్థానాన్ని చూపే పటంతో మీ సమాధానాన్ని బలపరచండి.
 జవాబు:
 ప్రతి క్రోమోసోమ్లో ప్రాథమిక కుంచనం లేక సెంట్రోమియర్ ఉంటుంది. దీనికి ఇరువైపులా రెండు బిళ్లల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కైనిటోకోర్లు అంటారు. వీటికి కండెతంతువులు అతుక్కుని క్రొమోసోమ్ల విభజనకు సహాయపడతాయి. క్రోమోసోంలో సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి 4 రకాల క్రోమోసోంలు గుర్తించారు. అవి :
 1) మెటాసెంట్రిక్ :
 సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్యస్థానంలో ఉండి రెండు వైపులా బాహువులు సమానంగా ఉంటాయి. చలన దశలో ఈ క్రోమోసోమ్లు ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.
2) సబ్మెటా సెంట్రిక్ :
 సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్య స్థానంలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. బాహువులు అసమానంగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ‘L’ ఆకారంలో కనిపిస్తాయి.
 
3) ఎక్రోసెంట్రిక్ :
 సెంట్రోమియర్ ఒక వైపుగా ఏర్పడి ఉంటుంది. ఒక బాహువు పొడవుగా, మరొకటి పొట్టిగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ” ఆకారంలో కనిపిస్తాయి.
4) టీలోసెంట్రిక్ :
 సెంట్రోమియర్ క్రోమోసోమ్ బాహువు కొనలో ఉంటుంది. దీనివల్ల ఒకే బాహువు ఉంటుంది. ఈ క్రోమోసోమ్లు చలనదశలో ” (పుడక) ఆకారంలో కనిపిస్తాయి.