AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 4th Lesson వ్యవసాయ రంగం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 4th Lesson వ్యవసాయ రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యతను వివరించండి.
జవాబు:
భారతదేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత కీలకపాత్రను పోషిస్తుంది. క్రింద పేర్కొన్న అంశాలు ద్వారా భారత ఆర్థికవ్యవస్థలో వ్యవసాయరంగం పాత్రను తెలుసుకోవచ్చు.

1) స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన అడవుల పెంపకం, చేపల పెంపకం, పాడి, పశుపోషణ, కోళ్ళ పెంపకం, పట్టు పరిశ్రమ, తోటపంటలు, గనులు, క్వారీలు మొదలైనవన్నీ, కలిపి వ్యవసాయ రంగం అంటారు. నేటికి జాతీయాదాయంలో వ్యవసాయరంగం ముఖ్య భూమికను పోషిస్తూ వుంది. మొత్తం స్థూల, దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయరంగంలో వాటా 1950-51 సంవత్సరంలో 56.5 శాతంగా వుంది. ఈ వాటా క్రమేపీ తగ్గుతూ 2013-14 నాటికి 13.9 శాతానికి చేరుకుంది. ఈ తగ్గుదలకు ప్రధానకారణం వ్యవసాయేతర రంగాలు అభివృద్ధి చెందడం ఉదాహరణకు జాతీయాదాయంలో వ్యవసాయరంగం వాటా ఇంగ్లాండులో 2 శాతం, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 3 శాతం, ఆస్ట్రేలియాలో 6 శాతం ఫ్రాన్స్లో 7 శాతంగా వుంది.

2) ఉపాధికల్పనలో వ్యవసాయరంగం: భారత ప్రజల ప్రధాన వృత్తి, వ్యవసాయం, నేటికి ఉపాధికల్పనలో వ్యవసాయరంగం కీలక భూమిక పోషిస్తుంది. వ్యవసాయరంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది.

వ్యవసాయరంగంపై ఆధారపడిన జనాభా (మిలియన్లలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం 1

పట్టిక 4.2 పరిశీలిస్తే 1951 జనాభాలెక్కల ప్రకారం మొత్తం పనిచేస్తున్న జనాభాలో వ్యవసాయం మీద ఆధారపడిన వారి సంఖ్య 98 మిలియన్లు వుండగా 2011 నాటికి 234.1 మిలియన్లకు చేరింది. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయరంగంపై ఆధారపడిన జనాభాశాతం చాలా తక్కువగా వుంది. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్ దేశాలలో వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి సంఖ్య 2 శాతంకాగా, ఆస్ట్రేలియాలో 6 శాతం, జపాన్, ఫ్రాన్స్లలో 7 శాతంగా వుంది.

3) అంతర్జాతీయ వ్యాపారంలో వ్యవసాయరంగం పాత్ర: అంతర్జాతీయ వ్యాపారంలో భారతవ్యవసాయరంగం కీలకపాత్ర పోషిస్తుంది. చాలాకాలం వరకు మనదేశ వ్యవసాయ ఉత్పత్తులలో ముఖ్యంగా మూడురకాలైన ఉత్పత్తులైన నూలు వస్త్రాలు, జనుము, టీ అంతర్జాతీయ ఎగుమతులలో 50 శాతం ఆక్రమించాయి. వీటికి ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను కలిపితే మొత్తం విదేశీ వ్యాపారంలో వ్యవసాయరంగం వాటా 70 శాతానికి చేరుతుంది. ప్రస్తుతం భారతదేశం ప్రత్తి, పొగాకు, పంచదార, బియ్యం, కాఫీ, టీ, చేపలు, మాంసం, పండ్లు, పప్పుధాన్యాలు, నూనెపిండి, జీడిపప్పు, సుగంధద్రవ్యాలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఎగుమతుల ద్వారా మనకు విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

4) సామాజిక రక్షణ కవచం: భారతదేశం గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్న పేదప్రజలలో ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనాధారం. భారతదేశ జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 15శాతం కంటే తక్కువగా వున్నప్పటికీ నేటికి పనిచేస్తున్న జనాభాలో సగం మందికి వ్యవసాయమే జీవనాధారంగా వుంది. గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ స్థాయిలో పంటలతో పాటు, పాడి, పశుపోషణ, చేపల పెంపకం, పట్టు పరిశ్రమ, తోటల పెంపకం, వ్యవసాయ అడవులు మొదలైన అనుబంధ వృత్తులను ప్రోత్సహిస్తే దారిద్య్రం, ఆకలి వాటంతట అవే తొలగిపోతాయి. ఈ విధంగా వ్యవసాయం గ్రామీణ ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తూ, వారి సామాజిక జీవిత భద్రతకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

5) ఆహార భద్రత: వేగంగా పెరుగుతున్న జనాభాకు ఆహారభద్రతకు సమకూర్చడానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి. తాజా ఆకలిసూచిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం 75 ఆకలి పీడిత దేశాలలో మనదేశంలో 55వ స్థానంలో ఉంది. మనదేశంలో ఆహార సంక్షోభాన్ని నివారించాలంటే వ్యవసాయరంగం స్థిరంగా అభివృద్ధి చెందాలి. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 255 మిలియన్ టన్నులను చేరినపటికీ నేటికి మనదేశంలో ఆహారభద్రత కరువైంది.

6) పారిశ్రామికీకరణలో వ్యవసాయరంగం పాత్ర: సాధి ౦గా కొన్ని పరిశ్రమలు తమ ముడిపదార్థాల కోసం వ్యవసాయరంగంపై ఆధారపడి వుంటాయి. అలాంటి పరిశ్రమలను వ్యవసాయధార పరిశ్రమలు అంటారు. ఉదాహరణకు జనపనార, వస్త్ర, పంచదార పరిశ్రమలు, నూనెమిల్లులు, పిండిమిల్లులు మొదలైనవి ప్రత్యక్షంగా ముడిసరుకుల |కోసం వ్యవసాయరంగంపై ఆధారపడి వున్నాయి. ఇవికాగా బియ్యం మిల్లులు, నూనె మిల్లులు, తోటపంటలు, ఆహారతయారీ మొదలైన చిన్న, కుటీర పరిశ్రమలు కూడా ముడిసరుకుల కోసం వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నాయి. పరోక్షంగా మరెన్నో పరిశ్రమలకు వ్యవసాయరంగం తోడ్పడుతుంది.

అదేవిధంగా పారిశ్రామికాభివృద్ధి వ్యవసాయరంగ ప్రగతికి దోహదపడుతుందని చెప్పవచ్చు. పరిశ్రమలు అభివృద్ధిచెందితే వ్యవసాయానికి అవసరమైన యంత్రాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు మొదలైన ఉత్పాదకాలను అందిస్తాయి. ఈ విధంగా వ్యవసాయ పారిశ్రామికరంగాలు పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడి అభివృద్ధి చెందుతున్నాయి.

7) పారిశ్రామిక వస్తువులకు గిరాకీ: భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూడవవంతు గ్రామీణ ప్రాంతాలలోనే నివశిస్తున్నారు. వీరికి ఆదాయం చాలా తక్కువగా వుండి పారిశ్రామిక వస్తువులను కొనగల సామర్థ్యం లోపించింది. గ్రామీణ ప్రజల కొనుగోలుశక్తి పెరుగుదల వ్యవసాయరంగ అభివృద్ధిపై ఆధారపడి వుంటుంది. వ్యవసాయరంగం అభివృద్ధి చెందితే వ్యవసాయరంగం ఉత్పాదకత, విక్రయం కాగల మిగులు పెరిగే వ్యవసాయదారుల ఆదాయాలు, శ్రామికుల వేతనాలు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన ఆదాయంవల్ల పారిశ్రామిక వస్తువుల గిరాకీ పెరిగి పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభ్యమవుతుంది.

8) ఇతర అంశాలు:

  1. వ్యవసాయరంగం ప్రగతి రవాణా రంగాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా ఈ రంగం ఆదాయాన్ని ఆర్జిస్తుంది. .
  2. వ్యవసాయరంగం ప్రగతి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలను కనిష్టస్థాయిలో ఉంచుతుంది.
  3. పశువులకు కావలసిన మేత, దాణా మొదలైనవి వ్యవసాయరంగం సరఫరా చేయడం ద్వారా పశుగణాభివృద్ధికి తోడ్పడుతుంది.
  4. వ్యవసాయ ఆధారిత పర్యాటకాన్ని పెంపొందించవచ్చు.
  5. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అభివృద్ధి చెందితే జీవవైవిధ్యం పరిరక్షించబడుతుంది.
    పైన పేర్కొనబడిన అంశాల ఆధారంగా భారతదేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయరంగం ప్రముఖపాత్ర పోషిస్తుంది చెప్పవచ్చు. అందువల్ల భారతదేశ వ్యవసాయ దేశంగా పరిగణించబడింది.

ప్రశ్న 2.
వ్యవసాయ శ్రామికుల ప్రస్తుత స్థితిగతులను వివరించి వారి స్థితిగతులను మెరుగుపరచడానికి తీసుకోవలసిన పరిష్కార మార్గాలను సూచించుము.
జవాబు:
సంవత్సరంలోని మొత్తం పనిదినాలలో సగానికి పైగా వ్యవసాయరంగంలో పనిచేసే వ్యక్తులను వ్యవసాయ శ్రామికులంటారు.
జాతీయ వ్యవసాయ శ్రామికుల పరిశీలనా సంఘం వ్యవసాయ శ్రామికులను రెండు రకాలుగా వర్గీకరించింది. 1) సాధారణ శ్రామికులు 2) రైతుల వద్ద పనిచేసే శ్రామికులు.
వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు:
1) అల్పసాంఘిక హోదా: నేటికీ వ్యవసాయ శ్రామికులలో ఎక్కువమంది తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన అణగారిన వర్గాలకు చెందినవారు. సాంఘిక అసమానత్వం, దోపిడీ భావన వీరి విషయంలో సర్వసాధారణం. వీరు తమ హక్కుల పరిరక్షణకు ఏమాత్రం పోరాటం చేయలేని దయనీయస్థితిలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వివక్షకు గురైన వీరి సాంఘిక హోదా తక్కువగా ఉంటుంది.

2) అసంఘటిత శ్రామికులు: మనదేశంలో వ్యవసాయ శ్రామికుల మారుమూల గ్రామాలలో నివసిస్తున్నారు. అందువల్ల వీరు సంఘటితం కాలేకపోతున్నారు. వీరికి కార్మికసంఘాలు లేవు. అంతేకాక వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. అందువల్ల అసంఘటితంగా వున్న వీరికి భూస్వాములతో బేరమాడే శక్తి లోపించి తగిన వేతనాలు పొందలేకపోతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) రుతుసంబంధిత ఉద్యోగిత: వ్యవసాయ కార్యకలాపాలు రుతువులపై ఆధారపడి వుంటాయి. వ్యవసాయ కార్మికులు నాట్లు వేసేటప్పుడు, పంట కోసేటప్పుడు మాత్రం ఉపాధిని పొంది సంవత్సరంలో ఎక్కువ భాగం ఖాళీగా వుంటారు. నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత వీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. అందువల్ల వీరి ఆదాయాలు తక్కువగా ఉండి జీవన ప్రమాణాలు అల్పంగా ఉంటాయి.

4) అల్ప వేతనాలు: వ్యవసాయ శ్రామికులకు చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నందువల్ల వారి కుటుంబ ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శ్రామికులకు వివిధ రాష్ట్రాల్లో ఇచ్చే వేతనాలలో భిన్నత్వం వుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో తప్ప ఎక్కువ రాష్ట్రాలలో వీరికి చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నాయి. హరిత విప్లవనాంతరం వీరికి చెల్లించే ద్రవ్యవేతనాలు పెరిగినప్పటికీ వస్తుసేవల ధరలు పెరిగినందువల్ల వీరి నిజవేతనాలు
పెరగలేదు.

5) మహిళా శ్రామికుల పట్ల వివక్షత: వ్యవసాయరంగంలో పురుష శ్రామికులతో సమానంగా మహిళా శ్రామికులకు వేతనాలు ఇవ్వరు. అంతేగాక వ్యవసాయ కార్యకలాపాలతో వీరిచే బలవంతంగా అధికశ్రమ చేయిస్తారు. అనగా వ్యవసాయరంగంలో మహిళాశ్రామికులు వివక్షతకు గురవుతున్నారు.

6) గ్రామీణ రుణగ్రస్తత: గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ శ్రామికుల ఆదాయం తక్కువగా ఉండి పేదరికంలో ఉన్నారు. అందువల్ల వీరికి రుణ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సంస్థాగత పరపతి సంస్థలనుంచి రుణం తీసుకోవడానికి అవసరమైన హామీపత్రాలు లేనందువల్ల సంస్థాగతం కాని వడ్డీవ్యాపారస్థులు, భూస్వాముల నుంచి అధికవడ్డీలకు రుణం పొందుతున్నారు. ఈ రుణభారం అధికమై తరతరాలుగా వారసత్వంగా సంక్రమించి వ్యవసాయ శ్రామికులు వెట్టిశ్రామికులుగా మారుతున్నారు.

7) అధికసంఖ్యలో బాలకార్మికులు: ఆసియాఖండంలోని బాలకార్మికులలో మూడవ వంతు మంది భారతదేశంలో ఉన్నారు. మనదేశంలోని బాలకార్మికులలో అధిక సంఖ్యాకులు వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు. వీరికి ‘చెల్లిస్తున్న వేతనాలు అత్యల్పంగా వుండి వారి కుటుంబ జీవన ప్రమాణంపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి.

8) వ్యవసాయేతర వృత్తుల కొరత గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర వృత్తులు అభివృద్ధి చెందలేదు. అందువల్ల శ్రామికులు ఉపాధికోసం ఎక్కువగా వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో శ్రామికుల సంఖ్య అధికమై ప్రచ్ఛన్న నిరుద్యోగితకు దారితీసింది.

వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు పెంపొందించే చర్యలు: వ్యవసాయ శ్రామికుల జీవన స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయి. వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం కింద పేర్కొన్న కొన్ని చర్యలను చేపట్టింది.
1) కనీస వేతనాలు: వ్యవసాయ శ్రామికుల జీవన స్థితిగతులను పెంపొందించడానికి భారత ప్రభుత్వం 1948లో కనీసవేతనాల చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని జీవన వ్యయాలను, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని మూడు సంవత్సరాలలోపు కనీసవేతన చట్టాలను రూపొందించి అమలు చేయాలి.

2) భూమి లేని శ్రామికులకు భూపంపిణీ: వ్యవసాయ శ్రామికుల ఆర్థికస్థితులను పెంపొందించాలంటే ఉద్దేశంతో భూమిలేని శ్రామికులకు భూపంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్య సాధన కోసం కమతాల గరిష్ట పరిమితి చట్టం ద్వారా, భూదాన గ్రామదానోద్యమాల ద్వారా లభించిన 70లక్షల హెక్టారుల మిగులు భూమిని భూమిలేని వ్యవసాయ శ్రామికులకు పంపిణీ చేయడం జరిగింది.

3) నివాస గృహాలను, ఇళ్ల స్థలాలను కల్పించడం: వ్యవసాయ శ్రామికులలో ఎక్కువ మందికి సరైన స్వంత నివాస గృహాలు లేవు. సాధారణంగా వీరు గాలి, వెలుతురు లేని మట్టిచే నిర్మించబడిన గుడిసెలలో నివశిస్తూ తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. ఇందుకు పరిష్కారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందిరా ఆవాస్ యోజన, కనీస అవసరాల కార్యక్రమం వంటి పథకాలను రూపొందించి పేదవారికి ఉచితంగా నివాస స్థలములు యిచ్చి రాయితీ ప్రాతిపదికన ఇండ్లను నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టాయి.

4) శ్రామిక సహకార సంఘాలను ఏర్పరచడం: రెండవ పంచవర్ష ప్రణాళికల కాలంలో శ్రామిక సహకార సంఘాల ఏర్పాటు చేయబడ్డాయి. రహదారుల నిర్మాణం, కాలువలు, చెరువులు తవ్వడం, అటవీకరణ మొదలైన కార్యక్రమాల నిర్వహణను ఒప్పంద ప్రాతిపదికపైన ఈ శ్రామిక సంఘాలు చేపట్టుతాయి. దీని వల్ల శ్రామికులకు దోపిడీ రహిత ఉపాధి లభిస్తుంది.

5) ప్రత్యేక ఉపాధి కల్పనా పథకాలు: ప్రణాళికల కాలంలో ఉపాధి అవకాశాలు కల్పించుటకు అనేక పథకాలు ప్రారంభించబడ్డాయి. ఉదాహరణకు పనికి ఆహార పథకం (FWP) ఉపాధి హామీ పథకం (EGS) జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (NREP) గ్రామీణ భూమిలేని శ్రామికుల ఉపాధి హామీ పథకం (RLEGP) జవహర్ రోజ్ గార్ యోజన (JRY) సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన (SGRY), చిన్నరైతుల అభివృద్ధి సంస్థ (SFDA).

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

6) రుణాలు, రాయితీలు మంజూరులు: మనదేశంలో వ్యవసాయ శ్రామికులకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అల్పవడ్డీ రేట్లపై రుణాలు మంజూరు చేస్తున్నారు. వ్యవసాయ శ్రామికులకు తక్షణం రుణవిముక్తి కల్పించడానికి రుణమాఫీని సైతం చేస్తున్నాయి. వ్యవసాయ శ్రామికుల స్వయం ఉపాధిని చేపట్టడానికి ప్రభుత్వం, రుణాలు, రాయితీలు మంజూరు చేస్తున్నాయి.

7) వెట్టిచాకిరి నిర్మూలన: దోపిడీ, బానిసత్వం అమానుషమైన కార్యక్రమాలే గాక శిక్షార్హులైన నేరాలు కూడా, 1976లో భారత ప్రభుత్వం వెట్టిచాకిరి నిర్మూలనా చట్టాన్ని రూపొందించింది. కాని నేటికీ వ్యవసాయ రంగంలో వెట్టిచాకిరి కొనసాగుతూనే వుంది. రైతులను విద్యావంతులను చేయడం, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం వెట్టిచాకిరి నిర్మూలనకు చక్కని పరిష్కారమార్గాలు.

8) కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం: వ్యవసాయరంగంపై జనాభా ఒత్తిడిని కనిష్ట స్థాయికి తగ్గించాలి. అందుకుగాను ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో కుటీర, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి. ప్రణాళికా కాలంలో ప్రభుత్వం నిర్వహించిన ఈ విధమైన కృషి ఫలితంగా వ్యవసాయరంగంపై ఒత్తిడి కనిష్టస్థాయికి తగ్గి వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు గరిష్టస్థాయికి పెరిగాయి.

ప్రశ్న 3.
భారతదేశంలో పంటతీరును ప్రభావితం చేసే అంశాలు ఏవి ? పంటల తీరును మెరుగుపరిచే చర్యలను సూచించుము.
జవాబు:
పంటల తీరు: సాధారణంగా ఒకదేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో లభించే సహజ వనరుల లభ్యత, వినియోగంపై ఆధారపడి ఉంటుంది. సహజ వనరులైన భూమి, నీరు, ఖనిజాలు మొదలైన వాటిని సమర్థవంతంగా, అభిలషణీయంగా, వినియోగించినప్పుడే కొనసాగించగలిగే అభివృద్ధి సాధ్యమవుతుంది. అదేవిధంగా భూసారం, నీటిపారుదల సౌకర్యాల లభ్యతను బట్టి దేశంలో విభిన్న పంటలు పండించడం జరుగుతుంది. దేశంలో పండే వివిధ పంటల తీరు ఆ దేశ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేస్తుంది.

పంటలతీరును ప్రభావితం చేసే అంశాలు: భారతదేశంలో పంటల తీరును భౌతిక, సాంకేతిక ఆర్థిక అంశాలతోపాటు ప్రభుత్వవిధానాలు కూడా ప్రభావితం చేస్తాయి.
I) భౌతికాంశాలు: పంటలతీరును నిర్ణయించడంలో భౌతికాంశాల పాత్ర కీలకమైంది.
1) శీతోష్ణస్థితి, వర్షపాతం: శీతోష్ణస్థితి, వర్షపాతం, పంటలతీరును ప్రభావితం చేస్తాయి. ఉష్ణ ప్రాంతాలలో, శీతల ప్రాంతాలలో పండే పంటలు వేర్వేరుగా వుంటాయి. ఉదాహరణకు, శీతల ప్రాంతాలలో మాత్రమే ఆపిల్స్ వుంటాయి. అదేవిధంగా వర్షపాతం కూడా పంటలతీరును ప్రభావితం చేస్తుంది.

2) భూస్వరూపం, భూసారం: భూసారం, భూస్వరూపంపై ఆధారపడి పంటలు పండుతాయి. ఉదాహరణకు నల్లరేగడి మృత్తికలు, పత్తిపంటకు అనుకూలం. అదేవిధంగా గోధుమ పంటకు సారవంతమైన ఒండ్రు, తడిబంకమన్ను మృత్తికలు అవసరం. ఈ విధంగా భూసారం, భూస్వరూపం పంటలతీరును ప్రభావితం చేస్తాయి.

3) నీటిపారుదల: నీటిపారుదల సౌకర్యాలు పంటలతీరును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా లభ్యమైనపుడు వరి, చెరకు, గోధుమ మొదలైన పంటలు పండుతాయి. నీటిపారుదల సౌకర్యాలు తగినంతగా లేనిచోట రాగులు, మొక్కజొన్న, సజ్జలు వంటి పంటలు పండుతాయి.

II) ఆర్థికాంశాలు:
1) ధరలు, ఆదాయం: సాధారణంగా వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను అధికధరలకు విక్రయించి తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవాలనుకుంటారు. వరి, గోధుమలాంటి ఆహార పంటల ధరలపై మార్కెట్ ప్రభావం లేకుండా నిర్దేశిత సేకరణ ధరల పేరుతో ప్రభుత్వం ఈ పంటల ధరలను ముందుగా నిర్ణయిస్తుంది. ఈ విధమైన నియంత్రణల వల్ల రైతులు తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవడానికి వాణిజ్య పంటలైన చెరకు, పత్తి, వేరుశెనగ మొదలైన వాటిని పండిస్తున్నారు.

2) భూకమతాల పరిమాణం: భూకమతాల పరిమాణం పంటల తీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా చిన్న కమతాల రైతులు ఆహారపంటలను, పెద్దకమతాల రైతులు వాణిజ్యపంటలను పండిస్తారు. ఇటీవల కాలంలో చిన్న కమతాల రైతులు కూడా అధిక లాభాలను ఆశించి వాణిజ్యపంటలను పండిస్తున్నారు.

3) ఉత్పాదకాలు, అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయ ఉత్పాదకాలు కూడా పంటల తీరును నిర్ణయిస్తాయి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు మొదలైన ఉత్పాదకాల లభ్యత పంటల తీరును ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా రవాణా, గిడ్డంగులు, మార్కెటింగ్, నీటిపారుదల వంటి అవస్థాపనా సౌకర్యాల లభ్యతపై కూడా పంటల తీరు ఆధారపడి వుంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

4) భీమా సౌకర్యాలు: సాధారణంగా వ్యవసాయదారులు విభిన్నమైన పంటలు పండిస్తారు. ఏదైన ఒక పంట నష్టానికి గురైనప్పుడు ఆ నష్టాన్ని ఇతర పంటల నుండి రాబట్టుకోవచ్చు అన్న ఉద్దేశ్యంలో బహుళపంటలు పండిస్తారు. అదే ప్రభుత్వం నష్టభయాన్ని ఎదుర్కొనడానికి ఏ పంటలకు బీమా సౌకర్యాలను కల్పిస్తుందో ఆ పంటలను రైతులు ధీమాగా పండిస్తారు.

5) కౌలుదారీ పద్ధతి: సాధారణంగా భూస్వాములు తమ భూములను కౌలుకు ఇచ్చేటప్పుడు ఏ పంటలు పండించాలో ముందుగానే కౌలుదార్లతో ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి పంటలతీరు భూస్వాముల ఇష్టాలపై చాలావరకు ఆధారపడి వుంటుంది.

6) సాంఘీక కారణాలు: పరిసరాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మొదలైన సాంఘిక అంశాలు పంటల తీరును నిర్ణయించడంలో కొంతమేరకు ప్రభావాన్ని చూపుతాయి. ఈ అంశాలు రైతులను సాంప్రదాయ పంటలను, సాంప్రదాయ పద్దతుల్లో పండించేటట్లు ప్రేరేపిస్తాయి.

III) ప్రభుత్వ విధానాలు: విభిన్న పంటలు, ఎగుమతులు, పన్నులు, రాయితీలు, సాంకేతిక విజ్ఞానం, ఉత్పాదకాల సరఫరా, పరపతి లభ్యత, మద్దతుధరలు మొదలైన అంశాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు పంటలతీరును నిర్ణయిస్తాయి.

  1. కొన్ని పంటల ఉత్పత్తికి కొన్ని ప్రాంతాలు మాత్రమే అనుగుణంగా వుంటాయి. అంటే అన్ని పంటలు అన్ని ప్రాంతాలలో పండవు. కాబట్టి ప్రభుత్వమే ముందుగా ఏ ప్రాంతం ఏ పంటకు అనుకూలంగా ఉందో నిర్ణయించి ఆ ప్రాంతానికి అనుకూలమైన పంటను మాత్రమే పండించేటట్లు చట్టాలను రూపొందించాలి.
  2. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలకు అనుగుణంగా ఆహార పంటలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలి.
  3. ప్రభుత్వం నూతన వ్యవసాయ వ్యూహాన్ని ప్రోత్సాహించడం ద్వారా పంటల తీరును ప్రభావితం చేయాలి.

ప్రశ్న 4.
భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండటానికి గల కారణాలేవి ? ఉత్పాదకత పెంచడానికి తీసుకోవలసిన చర్యలను తెలియజేయండి. [Mar ’17]
జవాబు:
భారత వ్యవసాయరంగంలో ఉత్పత్తి అల్పంగా వుండటానికి అనేక కారణాలు వున్నాయి. వీటిని ప్రధానంగా నాలుగురకాలుగా వర్గీకరించారు.

  1. సాధారణ కారణాలు
  2. వ్యవస్థాపూర్వక కారణాలు
  3. సాంకేతిక కారణాలు
  4. పర్యావరణ కారకాలు

I) సాధారణ కారణాలు: వ్యవసాయ ఉత్పత్తి అల్పంగా వుండటానికి గల కారణాలు కింద విశ్లేషించబడినాయి.

1) వ్యవసాయరంగంపై జనాభా వత్తిడి: భారతదేశంలో జనాభా వేగంగా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 263 మిలియన్ల జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగం మీద ఆధారపడి వున్నారు. దీనికి తోడు వ్యవసాయేతర రంగాల్లో ప్రగతి చురుకుగా లేనందువల్ల పెరుగుతున్న జనాభా జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడటం తప్పనిసరైంది. అందువల్ల వ్యవసాయరంగం మీద ఒత్తిడి ఎక్కువై కమతాల విభజన, విఘటనలతో పాటు ప్రచ్ఛన్న నిరుద్యోగిత అధికమవుతుంది.

2) నిరాశాపూరిత గ్రామీణ వాతావరణం: మనదేశంలో గ్రామీణ వాతావరణం నిరాశాజనకంగా వుండి, వ్యవసాయ ప్రగతికి ప్రతిబంధకంగా మారింది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఎక్కువగా పేదవారు, నిరక్షరాస్యులు, అందువల్ల వీరు మూఢనమ్మకాలకు, సనాతన సాంప్రదాయాలకు విలవినిస్తూ నూతన వ్యవసాయ వ్యూహం యెడల నిరాసక్తతను కనపరుస్తున్నారు. రైతులలో సంకుచిత ధోరణి ఏర్పడి ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నమవడం, భూమిపై మక్కువ మొదలైన గ్రామీణ పరిస్థితుల వల్ల వ్యవసాయ కమతాలు విభజన, విఘటనలకు గురై వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతింటుంది. గ్రామీణ ప్రాంతాలలో కక్షలు, కుట్రలు, తగాదాలు, కోర్టు వ్యవహారాలు మొదలైన వాటి కారణంగా నిరుత్సాహపూరితమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడి రైతులు తమ విలువైన సమయం, ధనం వృథా చేసుకుంటున్నారు. ఫలితంగా మనదేశ వ్యవసాయరంగంలో ఉత్పాదకత తక్కువగా ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయాభివృద్ధికి అవసరమైన పరపతి, రవాణా, మార్కెటింగ్, గిడ్డంగి, సౌకర్యాలు రైతుల అవసరాలకు సరిపడినంతగా లేవు. జాతీయ బ్యాంకులు, సహకార పరపతి సంస్థలు, వ్యవసాయ విస్తరణ సేవాకేంద్రాల ప్రోత్సాహం రైతులందరికి అందుబాటులో లేదు. ఈ విధమైన అవస్థాపనా సౌకర్యాల కొరత వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదలకు ప్రతిబంధకంగా తయారైంది.

4) బ్రిటీష్ పాలనా ప్రభావం: బ్రిటీషువారు తమ పరిపాలనా కాలంలో భారతదేశాన్ని ఒక వలసదేశంగా భావించారే తప్ప మనదేశ వ్యవసాయాభివృద్ధికి ఏవిధమైన చర్యలు చేపట్టలేదు. వారనుసరించిన భూస్వామ్య విధానాలు, కౌలుదారి విధానాలు, భూమిశిస్తు వసూళ్ళు భారత వ్యవసాయరంగ ప్రగతిని దెబ్బతీశాయి. మనదేశ వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా వుండటానికి బ్రిటీషువారి పాలన చాలావరకు కారణమైంది.

II) వ్యవస్థాపూర్వక కారణాలు:
1) అల్ప కమతాల పరిమాణం: మనదేశంలో భూకమతాల పరిమాణం చాలా అల్పంగా ఉంది. జాతీయ సర్వేక్షణా సంస్థ నివేదిక ప్రకారం 1960 – 61లో రెండు హెక్టారుల కంటే తక్కువ పరిమాణం ఉన్న కమతాలు మొత్తం కమతాలలో 52 శాతం వుండగా 2010-11 నాటికి వీటి సంఖ్య 85 శాతానికి పెరిగింది. ఎక్కువ భూమి కొద్దిమంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. వీరు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపరు. వారసత్వ చట్టాలు, కమతాల విభజన, విఘటనల ఫలితంగా కమతాల పరిమాణం అల్పంగా వుండి తక్కువ భూమి ఎక్కువ మంది రైతుల ఆధీనంలో వుంది. చిన్న కమతాలు నూతన వ్యవసాయ కార్యకలాపాలకు అనుగుణంగా ఉండకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉంది.

2) భూస్వామ్య వ్యవస్థలోని లోపాలు: బ్రిటీషువారి పరిపాలనా కాలంలో మనదేశంలో ఏర్పాటు చేసిన జమీందారీ పద్ధతి, జాగిర్దారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి మొదలైన లోపభూయిష్టమైన భూస్వామ్య పద్ధతులు వ్యవసాయప్రగతిని ఆటంకపరచాయి. స్వాతంత్ర్యానంతరం రైత్వారీ పద్ధతి అమలులోకి వచ్చింది. ఈ విధానంలో కౌలుదారులకు కౌలుభద్రత, నిశ్చితమైన కౌలు పరిమాణం భూయాజమాన్యం హక్కులు వుండేవి కావు. ఈ అభద్రతల కారణంగా కౌలుదారుల వ్యవసాయంపై శ్రద్ధ చూపలేరు. ఫలితంగా వ్యవసాయరంగం యొక్క ఉత్పాదకత తగ్గింది.

3) మార్కెట్, పరపతి సౌకర్యాల కొరత: వ్యవసాయభివృద్ధికి అవసరమైన మార్కెట్ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, పరపతి సౌకర్యాలు కొరత వలన నూతన పద్ధతిలో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడం కష్టమైంది. వీరికి కావలసిన పరపతి సముచితమైన వడ్డీరేట్లకు లభించదు. అంతేగాక ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ ఉత్పత్తులకు అందించే రాయితీలు సంతృప్తికరంగా లేవు. ఈ కారణాల వల్ల అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, నీటిపారుదల సౌకర్యాలను ఉపయోగించి నూతన పద్ధతులలో సాగుచేయడానికి బదులు సాంప్రదాయ పద్దతులలో సాగుచేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో ఉత్పాదకత తగ్గింది.

III) సాంకేతిక కారణాలు:
1) పురాతన ఉత్పత్తి పద్ధతులు: భారతదేశంలోని రైతులు పేదరికం, అవగాహనారాహిత్యం కారణంగా పురాతన పనిముట్లు సహాయంతో సాంప్రదాయమైన వ్యవసాయ పద్ధతులలో సాగుచేయడం వల్ల పురాతన ఉత్పత్తి ఉత్పాదకత తక్కువగా వున్నాయని టి.డబ్ల్యు. హార్ట్ అనే ఆర్థికవేత్త అభిప్రాయపడినారు. నేటికి భారతీయ రైతులు కొడవళ్ళు, చెక్కనాగళ్ళు, ఎడ్లబండ్లు ఉపయోగిస్తున్నారు. వీరు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులను, క్రిమిసంహారక మందులను, యంత్రాలను పరిమితంగా వాడుచున్నారు. కాని ప్రభుత్వ నిర్విరామ కృషి, విద్యావ్యాప్తి ఫలితంగా ఇటీవల కాలంలో ఈ పరిస్థితులలో కొంతమేరకు మార్పు వచ్చింది.

2) నీటిపారుదల సౌకర్యాల కొరత: 2011 నాటికి వివిధ పంటల కింద సాగవుతున్న భూవిస్తీర్ణం 198.97 మిలియన్ హెక్టారులు వుండగా అందులో 89.36 మిలియన్ హెక్టారుల భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం వుంది. అంటే 55శాతం సాగు భూమికి వర్షాలే ఆధారం. అకాల, అల్ప, అనిశ్చిత వర్షాల వల్ల వర్షాధార ప్రాంతాలలో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితులలో నూతన వ్యవసాయ వ్యూహం దేశమంతా విస్తరించడం కష్టమై వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకాలు, తక్కువగా వున్నాయి.

3) వ్యవసాయ ఉత్పాదకాల కొరత: అధిక దిగుబడిని సాధించుటకు ఆధునిక ఉత్పాదకాల వినియోగం తప్పనిసరి. ఆధునిక ఉత్పాదకాలైన సంకరజాతి విత్తనాలు, రసాయనిక ఎరువులు, యంత్రాలు, క్రిమిసంహారక మందుల సరఫరా రైతుల అవసరాలకు సరిపడినంతగా లేదు. ఉత్పాదకాలు సరిపడినంతగా లభ్యం కానందువల్ల వాటి వినియోగం తగ్గి వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత అల్పంగా వున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

IV) పర్యావరణ కారణాలు: వ్యవసాయ ఉత్పాదకతను నిర్ణయించడంలో పర్యావరణం పాత్ర ప్రముఖమైనది. భూసార క్షీణత, వాతావరణంలో మార్పులు, నీటికాలుష్యం, వాయు కాలుష్యం, మొదలైనవి వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకాల మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి. పంటల క్షీణతకు కింది పర్యావరణ ప్రతికూల అంశాలు కారణభూతాలు అవుతున్నాయి.

  1. భూతాపం.
  2. భూసారం క్షీణించడం.
  3. అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉపయోగించి సాంద్రవ్యవసాయం చేయడం.
  4. మితిమీరి రసాయనిక ఎరువులను వాడటం.
  5. పోడు వ్యవసాయం.
  6. పర్యావరణ పరిరక్షణా ప్రణాళికలు లేకపోవడం.
  7. సాంప్రదాయ పంటలను సాగుచేయకపోవడం.

వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి తీసుకోవలసిన చర్యలు:
ఏ అంశాలు వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండటానికి కారణభూతాలు అవుతున్నాయో వాటికి పరిష్కారాలను సూచిస్తే వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుంది.

1) భూసంస్కరణలు: భారత వ్యవసాయరంగంలోని వ్యవస్థాపూర్వక లోపాలను తొలగించడానికి స్వాతంత్య్రానంతరం భారతప్రభుత్వం “దున్నే వానికే భూమి’ అనే నినాదంతో భూసంస్కరణలను ప్రవేశపెట్టింది. అల్పకమతాల సమస్య పరిష్కారానికి కమతాల సమీకరణ, సహకార వ్యవసాయం మొదలైన కార్యక్రమాలను ప్రవేశపెట్టడం
జరిగింది.

2) జనాభా పెరుగుదలను అరికట్టడం: భారతదేశంలో జనాభావిస్ఫోటనం కొనసాగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పెరుగుదల వార్షిక వృద్ధిరేటు 1.64 శాతంగా వుంది. భూమి మీద జనాభా ఒత్తిడిని తగ్గించడానికి వేగంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించడంతోపాటు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలను విస్తృత
పరచాలి.

3) నీటిపారుదల సౌకర్యాలు: వ్యవసాయానికి నీరు అత్యంత ఆవశ్యకమైన ఉత్పాదక వనరు. నీటిపారుదల సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం విరివిగా భారీతరహా, మధ్యతరహా, చిన్న తరహా ప్రాజెక్టులను స్థాపించి నీటిపారుదల సౌకర్యాలు వున్న భూవిస్తీర్ణాన్ని పెంపొందించాలి.

4) వ్యవసాయ సేవాకార్యక్రమాల విస్తరణా సంస్థలు: వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) పంటలలో భిన్నత్వం, జీవవైవిధ్య పరిరక్షణ, భూసార సంరక్షణ కోసం వాలు ప్రాంతాల వ్యవసాయ భూసాంకేతిక విజ్ఞానం (SALT), వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, వివిధ పంటల రకాలకు సంబంధించిన సమాచారం అందించడానికి ఇ-వ్యవసాయం మొదలైన వ్యవసాయ విస్తరణా సేవా సంస్థలను, పథకాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.

5) అవస్థాపనా సౌకర్యాలు: వ్యవసాయ ఉత్పాదకతను అవస్థాపనా సౌకర్యాలు విశేషంగా ప్రభావితం చేస్తాయి. వ్యవసాయ ఉత్పాదకాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, సంకరజాతి విత్తనాలతో పాటు అవస్థాపనా సౌకర్యాలైన రవాణా, పరపతి, గిడ్డంగులు, మార్కెటింగ్, నిరంతర విద్యుత్ సరఫరా మొదలైన వ్యవసారంగం యొక్క ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.

6) వ్యవసాయ యాంత్రీకరణ: వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయరంగం యొక్క ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ‘కాబట్టి వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పంపుసెట్లు, ట్రాక్టర్లు, పంటమార్పిడి యంత్రాలు నాట్లు వేసే యంత్రాలు, డ్రిల్లర్లు మొదలైన వాటి వినియోగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

7) మార్కెటింగ్, పరపతి సౌకర్యాలు: నూతన వ్యవసాయ వ్యూహం అమలుకు అధిక వ్యయంతో కూడుకున్న సంకరజాతి విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, నీటిపారుదల సౌకర్యాలు మొదలైన వ్యవసాయ ఉత్పాదకాలను విరివిగా వినియోగించాలి. వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు అందించాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

8) అక్షరాస్యతను పెంపొందించడం: భారతీయ రైతుల ఉత్పాదక సామర్థ్యాన్ని అక్షరాస్యత పెంపొందిస్తుంది. కాబట్టి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు విరివిగా వయోజన విద్యాకేంద్రాలను స్థాపించి రైతులను విద్యావంతులను చేయాలి. అప్పుడే రైతుల యొక్క ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది.

9) వ్యవసాయ పరిశోధనలు: భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అనేక ఇతరసంస్థల కృషి, పరిశోధనల ఫలితంగా అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను సృష్టించడం జరిగింది. ఈ పరిశోధనలు భూసార పరీక్ష, భూసార పరిరక్షణ, తెగుళ్ళు నివారణ, నూతన వ్యవసాయ పరికరాల సృష్టి మొదలైన కార్యక్రమాలను కూడా విస్తరించాలి.

భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం: హరిత విప్లవం భారత ఆర్థిక వ్యవస్థపై విశేష ప్రభావాన్ని చూపింది. హరిత విప్లవం వల్ల ఏర్పడిన సత్ఫలితాలను కింది విధంగా వివరించవచ్చు.
1) ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం యొక్క ప్రత్యక్ష ఫలితం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అధిక పెరుగుదల సాధించడం. హరిత విప్లవం ప్రభావం వరి, గోధుమ ఉత్పత్తి మీద ఎక్కువ ఉంది. 1960-61లో వరి, ధాన్యం ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 104 మిలియన్ టన్నులకు పెరిగింది. గోధుమ ఉత్పత్తి 1960-61లో 11 మిలియన్ టన్నులు ఉండగా 2011-12 నాటికి 255 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 2012-13 నాటికి 257 మిలియన్ టన్నులకు పెరిగింది.

2) వాణిజ్య పంటల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం ప్రారంభంలో ఆహార పంటలకు మాత్రమే పరిమితమై వాణిజ్య పంటల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. హరిత విప్లవం 1973-74 తరువాత వాణిజ్య పంటలైన చెరకు ఉత్పత్తి మీద విశేషమైన ప్రభావాన్ని, నూనె గింజలు, బంగాలదుంపల ఉత్పత్తుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపింది. చెరకు ఉత్పత్తి 1960-61లో 110 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 358 మిలియన్ టన్నులకు పెరిగింది. నూనెగింజలు ఉత్పత్తి 1960-61లో 7 మిలియన్ల టన్నుల నుంచి 2011-12 నాటికి 30 మిలియన్ టన్నులకు పెరిగింది.

3) ఉపాధి అవకాశాల పెరుగుదల: హరిత విప్లవం ఫలితంగా సాగులోవున్న భూ విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వ్యవసాయరంగంలో శ్రమశక్తి ఎక్కువ అవసరమయ్యే వరి, చెరకు, తోటపంటలు, బంగాళదుంపలు కూరగాయలు మొదలైన పంటలు సాగుచేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతేగాక సాంద్ర వ్యవసాయంలో భాగంగా బహుళ పంటలు పండించటం వల్ల కూడా ఉపాధి అవకాశాలు వృద్ధి చెందాయి. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయరంగంలో చిల్లర అమ్మకాలు చేపట్టడంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి.

4) బలిష్టమైన ముందు, వెనుక బంధాలు: వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండూ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడే రంగాలు వ్యవసాయం పరిశ్రమలకు కావల్సిన ముడిసరుకులనూ అందిస్తుంది. దీన్నే “ముందువైపు బంధం” అంటారు. అనాదిగా బలిష్టంగా ఉంది. పరిశ్రమలు వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలను అందిస్తుంది. దీనిని “వెనుకవైపు బంధం” అంటారు. అయితే ఈ బంధం బలహీనంగా ఉంది. హరిత విప్లవ ఫలితంగా పారిశ్రామిక రంగం సరఫరా చేసే వ్యవసాయ ఉత్పాదకాలను విపరీతంగా గిరాకీ పెరిగింది. తద్వారా వెనుక వైపు బంధం కూడా బలిష్టమైనది. ఈ విధంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండూ బలోపేతం చేయబడ్డాయి.

5) ఆదాయల్లో పెరుగుదల: ఈ నూతన వ్యవసాయ వ్యూహం రైతులు తాము పండించిన పంటలను శ్రేణీకరణ, ప్రామాణీకరణ చేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధరలకు ప్రత్యక్షంగా చిల్లర వ్యాపారం చేసే కంపెనీలకు, అమ్ముకొనే అవకాశాలను కల్పించింది. ఈ కంపెనీలు రైతులకు లాభసాటి ధరలను, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే గాక ధరల నియంత్రణకు తోడ్పడ్డాయి. హరితవిప్లవ ఫలితంగా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతుల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.

6) పేదరికం తగ్గుదల: హరిత విప్లవం ఉపాధి అవకాశాలను వ్యవసాయరంగంలోనే కాక వ్యవసాయేతర రంగాలైన రవాణా, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పరిశ్రమల్లో, బ్యాకింగ్, సేవారంగాల్లో ఉపాధిని * కల్పించింది. అంతేకాక హరితవిప్లవ ఫలితంగా ఆహారధాన్యాలలో లభించిన మిగులును ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరలకు పేదవారికి అందించడం జరుగుతుంది. దీని ఫలితంగా పేదవారి వాస్తవిక ఆదాయం పెరిగి పేదరికం తగ్గుతుంది.

ప్రశ్న 5.
భారతదేశంలో వివిధ రకాల నీటిపారుదల సౌకర్యాలను వివరించి, నీటిపారుదల సౌకర్యాల ప్రాధాన్యతను వివరింపుము.
జవాబు:
వ్యవసాయాభివృద్ధికి నీటిపారుదల అత్యంత ఆవశ్యకమైన ఉత్పాదక వనరు. మనదేశంలో కొన్ని ప్రాంతాలలో వర్షపాతం కొరతగాను అనిశ్చితంగా వుంది. ఈ పరిస్థితులలో వర్షంపై ఆధారపడి సంవత్సరం పొడవునా వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడం అసాధ్యం. నేటికీ సాగుచేయబడుతున్న భూవిస్తీర్ణంలో 55 శాతం వర్షపాతంపై ఆధారపడి వుంది. వర్షంపై ఆధారపడి సాగుచేయడం అంటే “రుతువులతో జూదం ఆడటమే.”

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

1) కాలువలు: భారతదేశంలో వ్యవసాయరంగానికి వున్న నీటిపారుదల వనరులలో కాలువలు అత్యంత ప్రధానమైనవి. కాలువల తవ్వకం, నిర్వహణ అధిక వ్యయంతో కూడుకున్న కార్యక్రమం. కాని ఎక్కువ భూవిస్తీర్ణానికి కాలువలు నీటిపారుదల సౌకర్యాలను అందిస్తాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో కాలువలు ఎక్కువ భూమికి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మొత్తం సాగుభూమిలో కాలువలు ద్వారా సాగవుతున్న భూవిస్తీర్ణం 2011-12 నాటికి 16.1 మిలియన్ల హెక్టారులుగా వుంది. కాలువలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు.
ఎ) శాశ్వత కాలువలు
బి) వెల్లువ నీటికాలువలు

ఎ) శాశ్వత కాలువలు: నదులపై అడ్డంగా ఆనకట్టలు కట్టగా ఏర్పడిన జలాశయాలకు ఈ కాలువలను అనుసంధానం చేస్తారు. అందువల్ల ఇవి వ్యవసాయానికి సంవత్సరం పొడవునా నీటిని అందించి శాశ్వత కాలువలుగా పిలవబడుతున్నాయి. ఈ కాలువలు ఎక్కువ విస్తీర్ణంలో భూమికి నీటిని అందిస్తాయి.

బి) వెల్లువ నీటికాలువలు: వరదలు వచ్చినపుడు పంటలు ముంపునకు గురికాకుండా ఈ కాలువలను ఏర్పాటు చేస్తారు. అందువల్ల వీటిని “వెల్లువ నీటికాలువలు” అంటారు. వేసవికాలంలో ఈ కాలువలు పూర్తిగా ఎండిపోతాయి. కరువు కాటకాల సందర్భాలలో అవసరమైతే అల్ప భూమివిస్తీర్ణానికి సాగునీరు అందించడానికి కూడా నీటిని ఉపయోగిస్తారు.

2) బావులు: బావులు ఆధారపడదగిన ముఖ్యమైన నీటి వనరులు. బావులను సాధారణ బావులని, గొట్టపు బావులని రెండు రకాలుగా వర్గీకరించారు. సాధారణ బావులు ద్వారా సాగవుతున్న భూవిస్తీర్ణం గొట్టపు బావుల ద్వారా సాగవుతున్న భూవిస్తీర్ణం కంటే చాలా తక్కువగా వుంది.

3) చెరువులు: సాధారణంగా బావులు, కాలువలు ద్వారా, నీటిపారుదల సౌకర్యాలు లభ్యంకాని ప్రాంతాలలో చెరువులు ప్రధాన నీటిపారుదల వనరులు. చెరువులు వర్షంతో నిండి రైతులకు అవసరమైనపుడు నీరు అందిస్తాయి. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో చెరువుల ద్వారా సాగుచేస్తున్న భూవిస్తీర్ణం అధికంగా
ఉంది.

నీటిపారుదల ప్రాధాన్యత:
1) అకాల అనిశ్చిత వర్షాలు: వర్షాలు రుతువులపై ఆధారపడి సంవత్సరంలో నాలుగు నెలలకు మాత్రమే పరిమితమై వుంటాయి. కొన్నిసార్లు రుతువుల్లో సైతం వర్షపాతం అల్పంగా ఉండటమే గాక, అకాల వర్షాలు వస్తుంటాయి. నీటిపారుదల సౌకర్యాలను విస్తృత పరుచుట ద్వారా కరువుకాటకాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

2) ఉత్పాదకత పెరుగుదల: నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా వున్నచోట వ్యవసాయ ఉత్పాదకత ఎక్కువగా వుంటుంది. నీటిపారుదల సౌకర్యాలు వున్నప్పుడే ఆధునిక వ్యవసాయ ఉత్పాదకాలైన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలు, ఎరువులు మొదలైన వాటిని వినియోగించడానికి వీలవుతుంది. ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో వార్షిక పెరుగుదల 1.6 శాతం నుండి 2.6 శాతానికి పెరిగింది. అదే నీటిపారుదల సౌకర్యాలు అల్పంగా వున్న ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల 1శాతం లేదా గమనించలేనంత తక్కువగా నమోదైంది.

3) బహుళ పంటలు పండించడం: భారతదేశం ఉష్ణమండల, ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితులు విస్తరించి వున్నాయి. ఈ దేశానికి సంవత్సరమంతా పంటలు పండించగల సామర్థ్యం వుంది. మనదేశంలో వర్షపాతం నాలుగు నెలలలోపు కాలానికి మాత్రమే పరిమితమైంది. కాబట్టి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే సంవత్సరమంతా బహుళ పంటలు పండించవచ్చు.

4) నూతన వ్యవసాయ వ్యూహంలో ప్రధానపాత్ర: నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా ప్రవేశపెట్టబడిన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను, రసాయనిక ఎరువులను విజయవంతంగా వినియోగించాలంటే సకాలంలో, సరిపడినంత నీటిపారుదల సౌకర్యాలు అవసరం. ఈ విత్తనాలు, ఎరువుల వినియోగానికి క్రమబద్ధంగా పుష్కలంగా నీటిని అందించాలి. నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే నూతన వ్యవసాయ వ్యూహం కిందసాగులో వున్న భూవిస్తీర్ణం పెరుగుతుంది.

5) సాగుభూమి విస్తీర్ణంలో పెరుగుదల: భూవినియోగ గణాంకాల ప్రకారం మనదేశంలో లెక్కించిన మొత్తం భూమి 2009-10 నాటికి 305.56 మిలియన్ల హెకార్టు. ఇందులో 42.95 మిలియన్ల హెక్టార్లు వ్యవసాయం చెయ్యని భూములు కాగా 26.23 మిలియన్ల హెక్టార్లు బంజరు భూములుగా వున్నాయి. నీటిపారుదల సౌకర్యాల కల్పిస్తే నిరుపయోగంగా వున్న ఈ భూములను కొంతమేరకు సాగులోకి తీసుకురావచ్చు.

6) సంపద పెరుగుదల: కరువు కాటకాలు సంభవించినప్పుడు సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు అస్థిరతకు లోనవుతాయి. కాని నీటిపారుదల సౌకర్యాల కరువు కాటకాల సమయంలో పంటలను రక్షించి వ్యవసాయ ఉత్పత్తులను ఒడిదుడుకులకు గురికాకుండా స్థిరీకరిస్తాయి. ఉత్పత్తులలో స్థిరీకరణ సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పరిరక్షించబడి సంపద స్థిరంగా పెరుగుతుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

7) పరోక్ష ప్రయోజనాలు: నీటిపారుదల సౌకర్యాలను దేశం నలుమూలలకు విస్తరింపజేయడం ద్వారా ఆహారధాన్యాలు ఉత్పత్తిలో అసమానతలు రూపుమాసిపోతాయి. అంతేకాక వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుతుంది. ఈ విధంగా సాధించబడిన పెరుగుదల వ్యవసాయ ఉత్పతుల ధరల స్థిరీకరణకు తోడ్పడుతుంది. భారత ఆర్థికవ్యవస్థ ప్రాధాన్యతా రంగాల్లో ఒకటైన వ్యవసాయ రంగాన్ని ప్రగతి ప్రధాన నడపడంలో నీటిపారుదల సౌకర్యాలు కీలక భూమికను పోషిస్తున్నాయి.

ప్రశ్న 6.
భారతదేశంలో కమతాల పరిమాణం అల్పంగా ఉండటానికి గల కారణాలేవి ? కమతాల పరిమాణం అల్పంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యలు సూచింపుము.
జవాబు:
రైతు వ్యవసాయ కోసం వినియోగించే భూమి పరిమాణానికి “భూకమతం” అంటారు. కుటుంబ సభ్యులందరికి సముచిత జీవనప్రమాణం, ఉపాధి అవకాశాలు కల్పించే భూమి పరిమాణాన్ని “ఆర్థికకమతం” అంటారు. భారతదేశంలో రైతులు సాగుచేస్తున్న భూకమతాలు చిన్నవిగా ఉండటమే గాక కాలక్రమేణ తగ్గిపోతున్నాయి. మనదేశంలో కమతాల సగటు పరిమాణం 1980-81లో 1.84 హెక్టార్లు వుండగా 2010-11 నాటికి 1.16 హెక్టార్లకు తగ్గింది. కాని అమెరికాలో కమతాల సగటు పరిమాణం 122.5 హెక్టార్లుగా వుంది.

భారతదేశంలో కమతాల పరిమాణం అల్పంగా వుండటానికి గల కారణాలు: మనదేశంలో కమతాల సగటు పరిమాణం అల్పంగా ఉన్నందువల్ల వ్యవసాయ ప్రగతి కుంటుపడి ఉత్పత్తి, ఉత్పాదకత తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ సమస్యకు పరిష్కార మార్గాలు సూచించాలంటే అందుకు గల కారణాలను అన్వేషించాలి.

1) వారసత్వ చట్టాలు: మనదేశంలో కమతాల విభజన, విఘటనలకు వారసత్వ చట్టాలు ముఖ్య కారణం. హిందూ, మహమ్మదీయ చట్టాల ప్రకారం పిత్రార్జితమైన ఆస్తిని పంచుకోవడానికి కుమారులు మరియు కుమార్తెలు అర్హులు. ఈ కారణంగా కమతాల పరిమాణం విభజనకు, విఘటనకు లోనై కాలక్రమేణా తగ్గిపోతుంది.

2) భూమిపై జనాభా ఒత్తిడి: మనదేశంలో జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 1.64 శాతంగా వుంది. జనాభా పెరుగుదల రేటు వేగంగా ఉన్నప్పటికీ వ్యవసాయ యోగ్యమైన భూవిస్తీర్ణంలో పెరుగుదలరేటు అత్యల్పంగా వుంది. అంతేగాక మనదేశంలో వ్యవసాయేతర రంగాలు వేగంగా విస్తరించక పోవడం వల్ల పెరుగుతున్న జనాభా వ్యవసాయరంగాన్ని ఆశ్రయించడంలో కమతాల విభజన విఘటనలకు దారితీస్తుంది.

3) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవడం: తరతరాలుగా కుటుంబ సభ్యులు కలిసి జీవించే ఉమ్మడి కుటుంబాలు పాశ్చాత్యీకరణ వల్ల విచ్ఛిన్నమై వాటాస్థానంలో వ్యక్తిగత కుటుంబాలు ఆవిర్భవించాయి. వ్యక్తిగత కుటుంబాల సంఖ్య పెరిగి, వ్యవసాయ భూమి అనేకసార్లు విభజనకు గురై కమతాల సగటు పరిమాణం క్రమేపి తగ్గిపోతున్నది.

4) గ్రామీణ రుణగ్రస్తత: గ్రామీణ ప్రాంతాలలోని రైతులు సంస్థాపరమైన పరపతి సౌకర్యాల అందుబాటులో లేక వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడి పీకల్లోతు అప్పుల్లో మునిగి ఉన్నారు. కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు, చిన్న, సన్నకారు రైతుల భూమిని కబళించాలనే ఉద్దేశంలో వీరికి భూముల తనఖా మీద అప్పులిస్తుంటారు. అంతేకాక వీరు మోసపూరిత కార్యకలాపాలను అవలంభిస్తారు. రైతుల బాకీల పరిష్కారం కొరకు తమ భూమిని అమ్ముకునే పరిస్థితులు కల్పిస్తారు. తత్ఫిలితంగా వ్యవసాయదారుల భూకమతాలు క్రమేపి తగ్గిపోతున్నాయి.

5) భూమిపై మక్కువ ఎక్కువ: సాధారణంగా గ్రామీణ ప్రాంత రైతుల మానసిక, సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల భూమిపై మక్కువ కలిగి ఉంటారు. వీరు భూమి కలిగి ఉండటాన్ని ఆస్థిగా కాక సాంఘిక హోదాగా, గౌరవంగా భావిస్తారు. అందువల్ల వీరు భూమిపై మమకారాన్ని అనుబంధాన్ని పెంచుకొని తమకు వారసత్వంగా లభించిన భూమి పరిమాణం ఎంత స్వల్పమైనప్పటికీ వదులుకోవడానికి ఇష్టపడరు. భూమి మీద ఉన్న ఈ అతి మక్కువ వల్ల ‘కమతాల పరిమాణం క్రమంగా క్షీణిస్తుంది.

6) చేతి వృత్తుల, కుటీర పరిశ్రమలు క్షీణించడం: పారిశ్రామికీకరణకు పూర్వం గ్రామీణ ప్రాంతాలలో చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు వైభవోపేతంగా విరాజిల్లుతుండేవి. పారిశ్రామికీకరణ తర్వాత అధునాతన యంత్రాల సహయంతో తయారయ్యే వస్తువుల పోటీకి తట్టుకోలేక చేతివృత్తులు, కుటీరపరిశ్రమలు కాలక్రమేణా క్షీణించడం ప్రారంభించాయి. ఈ రంగాలపై ఆధారపడిన గ్రామీణ వృత్తి కళాకారులు, ఇతరులు జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడటం తప్పనిసరైంది. అందువల్ల కమతాల పరిమాణం క్షీణించడం ప్రారంభమైంది.

చిన్న కమతాల పరిమాణం వల్ల ఏర్పడే దుష్పరిణామాలు:
1) వ్యవసాయపు భూమి వృథా: విభజన, విఘటన వల్ల కమతాల సంఖ్య పెరిగే కొద్ది విలువైన వ్యవసాయ భూమి గట్లు, కంచెలు, కాలిబాటలు మొదలైన వాటి రూపంలో మొత్తం భూమిలో మూడు నుండి నాలుగు శాతం వరకు వృథా అవుతుంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో కమతాల సగటు పరిమాణం 0.006 ఎకరాలుగా వుంది. దీనిని బట్టి మనదేశంలో అల్పకమత పరిమాణ తీవ్రతను అర్థంచేసుకోవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

2) పర్యవేక్షణ కష్టం: మనదేశంలో రైతులుకున్న భూమి చిన్నచిన్నకమతాలుగా వేర్వేరు ప్రాంతాలలో విస్తరించి వుంటాయి. అంతేగాక వ్యవసాయ కార్యకలాపాలు రుతుబద్ధకంగా వుంటాయి. అందువల్ల వేర్వేరు ప్రాంతాలలో నిర్వహింపబడే వ్యవసాయ కార్యకలాపాలను వ్యవసాయదారులు ఏకకాలంలో పర్యవేక్షించలేరు. ఫలితంగా వ్యవసాయ ఉత్పాదక సామర్థ్యం, ఉత్పత్తి క్షీణిస్తున్నాయి.

3) ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అవకాశం తక్కువ: వ్యవసాయకమతాలు చిన్నవిగా వున్నప్పుడు వ్యవసాయ కార్యకలాపాలలో యంత్రాలను వినియోగించడం కష్టం. అంతేకాక ఈ అల్పకమతాల అధిక పెట్టుబడితో కూడుకున్న ట్రాక్టర్లు విద్యుత్ మోటార్లు, డ్రిల్లర్లు, స్ప్రేయర్లు, పంటమార్పిడి యంత్రాలను వినియోగించి ఆధునిక పద్ధతుల్లో సాగుచేయడానికి అననుకూలం. తత్ఫలితంగా వ్యయసాయ యాంత్రీకరణ లోపించి ఉత్పత్తి క్షీణిస్తుంది.

4) ఉత్పత్తి పరికరాల రవాణా: కమతాల విభజన, విఘటనల ఫలితంగా వేర్వేరు ప్రాంతాలలో విస్తరించి ఉన్న చిన్న కమతాలలో వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకై వ్యవసాయ పరికరాలను యంత్రాలను, పశువులను, విత్తనాలను ఇతర ఉత్పత్తి పరికరాలను ఒకచోటు నుంచి వేరొక చోటుకు రవాణా చేయవలసి వుంటుంది. అందువల్ల రైతుల సమయం, ధనం వృథా అవుతాయి.

5) సరిహద్దు తగాదాలు, కోర్టు వ్యవహారాలు: సాధారణంగా చిన్న కమతాల సంఖ్య పెరిగే కొలది గ్రామీణ ప్రాంతాలలో కాలిబాటలు, సరిహద్దులు, కంచెలు, పంటలను దొంగిలించడం, దొంగతనంగా పశువులను మేపడం మొదలైన విషయాలలో గొడవలు జరగడం సర్వసాధారణం. వీటివల్ల గ్రామీణ వాతావరణం, కలుషితమై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. రైతులు న్యాయస్థానాలు చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని, ధనాన్ని వృథా చేసుకుంటూ వ్యవసాయ కార్యకలాపాలను అశ్రద్ధ చేస్తున్నారు.

6) ప్రచ్ఛన్న నిరుద్యోగిత: వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడంతో అవకాశాలు కొరవడి రైతు కుటుంబ సభ్యుల తప్పనిసరి పరిస్థితులలో జీవనోపాధికై తమ చిన్న వ్యవసాయ కమతాలలోనే పనిచేయడం తప్పనిసరైంది. ఫలితంగా వ్యవసాయరంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏర్పడింది.

7) శ్రమ, మూలధనాల అల్పవినియోగం చిన్న రైతులు శ్రామికులను, మూలధనాన్ని పూర్తిగా వినియోగించుకోలేరు. అంతేకాక మార్కెటింగ్, పరపతి సౌకర్యాలను కూడా సరిపడినంతగా పొందలేరు. అందువల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి తగిన ప్రతిఫలం పొందలేకున్నారు.

రైతులు తమ చిన్న వ్యవసాయ కమతాలలో భూసారపరిరక్షణ, భూమి పునరుద్ధరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేరు. అంతేకాక పంటల మార్పిడి, పంటల విరామం వంటి నూతన పద్ధతులలో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించలేరు.

ప్రశ్న 7.
సహకార వ్యవసాయం వల్ల లభించే లాభాలను, నష్టాలను వివరింపుము.
జవాబు:
సహకార వ్యవసాయం – అర్థం: “ఒక్కరికోసం అందరు – అందరికోసం ఒక్కరు” అనే మహత్తర భావనతో 1904 సంవత్సరంలో మనదేశంలో సహకార వ్యవసాయానికి పునాదులు ఏర్పడ్డాయి. గ్రామంలోని రైతులంతా స్వచ్ఛందంగా ఒక సంఘంగా ఏర్పడి తమ భూములు, వ్యవసాయ పరికరాలు, పశువులు మొదలైన ఉత్పాదకాలన్నంటిని సంఘానికి అందించి మొత్తం భూమిని ఏకఖండంగా చేసి సహకార ప్రాతిపదికన నిర్వహించే వ్యవసాయాన్ని “సహకార వ్యవసాయం” అంటారు. పండిన పంటను రైతులు సంఘానికి అందించిన భూమి అనుపాతానికి అనుగుణంగా పంచుకొంటారు. ఈ విధంగా రైతులు భూమిమీద తమ యాజమాన్యపు హక్కులను కోల్పోరు.

సహకార వ్యవసాయం – ప్రయోజనాలు:
1) ఉత్పత్తిలో పెరుగుదల: సహకార వ్యవసాయంలో భూములన్నింటినీ ఏకఖండంగా చేయడంలో గట్లు, కాలిబాటల రూపంలో వుండే భూములు, బంజరు భూములు కూడా సాగులోకి తేవడంవల్ల సాగులో వున్న భూవిస్తీర్ణం పెరుగుతుంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తి, అధికమై విక్రయం కాగల మిగులు పరిమాణం పెరుగుతుంది.

2) పెద్దతరహా ఆదాలు: సహకార వ్యవసాయం ద్వారా ఉత్పత్తిలో సాంకేతిక, మార్కెటింగ్, ద్రవ్యపరమైన ఆదాలు లభిస్తాయి. అందువల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఉత్పత్తిలో పెద్దతరహా ఆదాలు లభిస్తాయి.

3) వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు: సహకారవ్యవసాయం, పెద్దతరహా వ్యవసాయం, అయినందువల్ల భూసార సంరక్షణ భూమి పునరుద్ధరణ, గొట్టపుబావులు త్రవ్వకం మొదలైన కార్యక్రమాలను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అధిక పెట్టుబడి అవసరమయ్యే ఈ కార్యకలాపాలను సంఘంస్థాయిలో సమిష్టిగా చేపట్టి వ్యవసాయాభివృద్ధిని సాధించవచ్చు.

4) నూతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానం సహకార వ్యవసాయంలో నూతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని పెద్ద తరహాలో ప్రవేశపెట్టవచ్చు. అందువల్ల సగటు వ్యయం తగ్గి లాభాల స్థాయి పెరుగుతుంది.

5) సమర్థవంతమైన క్షేత్ర నిర్వహణ: విస్తృత ప్రాతిపదికన జరుగుతున్న సహకార వ్యవసాయంలో వ్యవసాయ శాస్త్రవిజ్ఞాన నిపుణుల సేవలను వినియోగించి క్షేత్ర నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టవచ్చు. అంతేకాక శ్రమ విభజనను ప్రవేశపెట్టి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక ఫలితాలు పొందవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

6) వ్యవసాయరంగంలో ఉద్యోగిత అవకాశాలు: సహకార వ్యవసాయ విధానంలో సాంద్ర, విస్తృత వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువ ఫలితంగా శ్రామికులకు డిమాండ్ పెరిగి రుతుసంబంధిత, ప్రచ్ఛన్న, నిరుద్యోగితలు తగ్గి ఉపాధి, అవకాశాలు పెరుగుతాయి.

7) సాంఘీక సమానత్వం: సహకార సంఘాలలోని రైతులందరూ పరస్పరం సహకరించుకుంటూ, సమిష్టిగా ఆలోచిస్తూ, ఉమ్మడిగా వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టడం ద్వారా వారి మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం ఏర్పడి సాంఘిక సమానత్వం సాధించబడుతుంది.

సహకార వ్యవసాయంలోని సమస్యలు:
1) రైతుల వ్యతిరేకత: సహకార వ్యవసాయ విధానంలో రైతులకు తమ భూముల మీద యాజమాన్యపు హక్కులు కోల్పోతామనే అపోహలుండేవి. అంతేగాక తాము శ్రామికుల స్థాయికి దిగజారుతామనే ఎక్కువమంది రైతుల విశ్వాసం. అందువల్ల వ్యతిరేకత ఈ కార్యక్రమ ప్రగతికి ప్రతిబంధకమైంది.

2) నిర్వహణ సమస్యలు: సాధారణంగా భారతీయ వ్యవసాయదారులకు చిన్న కమతాల నిర్వహణలో మాత్రమే సమర్ధులు. వీరికి పెద్ద కమతాలను నిర్వహించగల నిపుణత, దక్షత లేదు. అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో నిపుణుల |కొరతవల్ల సహకార వ్యవసాయం నిరుత్సాహపరచబడింది.

3) నిరుద్యోగిత: సహకార వ్యవసాయ నిర్వహణలో భారీ ఎత్తున యంత్రాలను ఉపయోగించడానికి అవకాశాలు ఎక్కువ. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల శ్రామికులు ఉపాధి కోల్పోవడంతో నిరుద్యోగిత మరింత అధికమవుతుంది.

4) పెద్ద రైతుల ఆధిపత్యం: సహకార వ్యవసాయం నిర్వహణలో పెద్దరైతుల ఆధిపత్యం కొనసాగి, చిన్న రైతుల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పెద్ద రైతులు చిన్న రైతులను ఎప్పటికీ తమలో సమానంగా చూడరనేది దాగిన సత్యం. అందువల్ల ఈ విధానంలో సమానత్వం సాధించడం సాధ్యం కాదు.

5) శిక్షణ, పొందిన సిబ్బంది కొరత: విస్తృత ప్రతిపాదికన జరిగే సహకార వ్యవసాయాన్ని నిర్వహించడానికి | శిక్షణ పొందిన నిపుణులు అవసరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్యా స్వల్పంగా ఉంది.

6) ఇతర సమస్యలు:

  1. రైతులలో సహకార వ్యవసాయం పట్ల ఆసక్తిని ప్రేరేపించకుండా పూర్తిగా స్వచ్ఛంద ప్రాతిపదికన ఈ విధానాన్ని ఏర్పరచడం వల్ల విఫలమైంది.
  2. సహకార వ్యవసాయం ద్వారా లభించిన ఉత్పత్తి ఫలాలు ఏ ప్రాతిపదికన రైతులు, వ్యవసాయ కూలీల మధ్య పంపిణీ చేయాలి అన్న విషయం పట్ల నిర్థిష్ట ప్రమాణాలు లేవు.

ప్రశ్న 8.
భారతదేశంలో కౌలు సంస్కరణలను వివరింపుము.
జవాబు:
ఏ రైతులు జీవనోపాధి కోసం, భూస్వాముల నుంచి భూమిని తీసుకొని సాగుచేస్తారో వారినే కౌలుదార్లు అంటారు. వీరిని మూడు రకాలుగా వర్గీకరించారు.

  1. జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు
  2. ఉపకౌలుదార్లు
  3. ఏ హక్కులు లేని కౌలుదారులు.

జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు:
1) జిరాయితీ హక్కులున్న కౌలుదార్లను శాశ్వత కౌలుదారులంటారు. వీరికి తమ అధీనంలోని భూములపై యాజమాన్యపు హక్కులుంటాయి. వీరు కౌలు సక్రమంగా చెల్లిస్తున్నంత కాలం వీరిని భూస్వాములు భూమి నుంచి తొలగించలేరు. వీరు చెల్లించాల్సిన కౌలు పరిమాణం ముందుగా నిర్ణయించబడి కౌలు భద్రత కల్గి ఉంటారు.

2) ఉపకౌలుదారులు: ఉపకౌలుదారులను “తాత్కాలిక కౌలుదారులు” అంటారు. శాశ్వత కౌలుదారులు తమ అధీనంలోని భూమిని ఇతరులకు కౌలుకిస్తారు. వీరినే ఉపకౌలుదారులు అంటారు. వీరికి తాము వ్యవసాయం చేస్తున్న భూములపై ఎలాంటి హక్కులుండవు.

3) ఏ హక్కులు లేని కౌలుదార్లు ఈ కౌలుదారుల పరిస్థితి అనిశ్చితం, దయనీయం, కౌలు పరిమాణాన్ని పెంచడం, భూమి నుంచి తొలగించడం వంటి చర్యల వల్ల వీరు దోపిడికి గురి అవుతారు.

కౌలుదారులను దోపిడి నుంచి రక్షించడానికి ప్రభుత్వం కౌలు సంస్కరణలు చేపట్టింది. కౌలుదారులు కౌలు భద్రత కల్పించడం, కౌల పరిమాణాన్ని నిర్ణయించడం కౌలుదారులకు యాజ్యమాన్యపు హక్కులు కల్పించడం కౌల సంస్కరణలలో ప్రధాన అంశాలు.

1) కౌలు పరిమాణం క్రమబద్ధీకరణ: స్వాతంత్ర్యానికి పూర్వం మనదేశంలో కౌలుపరిమాణం చాలా ఎక్కువగా ఉండేది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కౌలపరిమాణంలో వ్యత్యాసాలున్నాయి. చట్ట ప్రకారం నిర్ణయించిన కౌలు పరిమాణం కంటే వాస్తవంగా చెల్లించే కౌలు పరిమాణం ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం, భూమి మీద జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉండటం.

2) కౌలు భద్రత: మనదేశంలో కౌలుదారులు భూస్వాముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. అందువల్ల కౌలుదారులు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపేవారు కాదు. కౌల భద్రత ఉన్నప్పుడే మీరు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపుతారు. అప్పుడు మాత్రమే వారు భూమి అభివృద్ధి కార్యక్రమాలు, భూసార పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించగలరు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు: “దున్నేవానికే భూమి” అనేది మన దేశ కౌలు సంస్కరణల ప్రధానోద్దేశం. ఈ లక్ష్య సాధన కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కౌలదారులకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ శాసనాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా 12. 42 మిలియన్ల కౌలదారులకు 6.32 మిలియన్ల హెక్టారుల భూమిపై యాజమాన్యపు హక్కులు లభించాయి.

ప్రశ్న 9.
భారతదేశంలో వివిధ రకాల భూ సంస్కరణలను సంక్షిప్తంగా వివరింపుము.
జవాబు:
వ్యవసాయాభివృద్ధి కొరకు ఉత్పత్తిని అధికం చేయుటకు, ప్రణాళిక బద్ధంగా ఆర్థికాభివృద్ధిని సాధించుటకు, సాంఘిక న్యాయాన్ని చేకూర్చుటకు మనదేశంలో భూ సంస్కరణలు అమలులోకి వచ్చాయి.
1) మధ్యవర్తుల తొలగింపు: మనదేశంలో భూ సంస్కరణలను అమలు చేయడంలో భాగంగా మధ్యవర్తులను తొలగించడమైనది. జమీందారి విధానం, జాగీరుదారుని విధానం, రైత్వారీ విధానంలోని లోపాలను తొలగించడం. 1948లో మధ్యవర్తుల తొలగింపు చట్టం చేశారు. ఫలితంగా 30 లక్షల మంది కౌలుదార్లు 62 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్యపు హక్కులుపొందారు. మనదేశం తొలగించిన మధ్యవర్తులకు నష్టపరిహారం చెల్లించింది.

2) కౌలు సంస్కరణ: ఏ రైతులు జీవనోపాధికోసం, భూస్వాముల నుంచి భూమిని తీసుకొని సాగుచేస్తారో వారినే కౌలుదార్లు అంటారు. వీరిని మూడు రకాలుగా వర్గీకరించారు. 1) జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు 2) ఉపకౌలుదార్లు 3) ఏ హక్కులూ లేని కౌలుదార్లు వ్యవసాయదారులలో సుమారు 50% మంది ఏ హక్కులు లేని కౌలుదారులుగా ఉన్నారు. వారు ఎటువంటి కౌలు భద్రతా లేదు. ఇష్టం వచ్చినప్పుడు భూస్వామి కౌలుదారులను తొలగించవచ్చు. అందుచేత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కౌలు సంస్కరణలు ప్రవేశపెట్టాయి.

  1. కౌలు భద్రత: కౌలుదారుడు సక్రమంగా కౌలు చెల్లించినంత కాలం భూస్వామి అతనిని తొలగించుటకు వీలులేదు. చట్టం నుండి తప్పించుకొనుటకు భూస్వాములు సొంత వ్యవసాయం చేసే నెపముతో కౌలుదార్లును తొలగించరాదు.
  2. కౌలు పరిమాణం: కౌలుదారుల నుండి భూస్వాములు వసూలు చేసే కౌలుకు పరిమితి నిర్ణయించారు. మొత్తం ఉత్పత్తిలో కౌలుదారులు చెల్లించవలసిన కౌలు ఉత్పత్తిలో 25 నుండి 50% మించకూడదని నిర్ణయించారు. రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య కౌలు పరిమాణంలో తేడాలున్నాయి. ఆంధ్రలో మొత్తం ఉత్పత్తిలో 20 నుండి 30 శాతం గుజరాత్లో 1/6; కర్ణాటకలో 1/5 నుండి 1/4 భాగం.
  3. కౌలుదార్లుకు యాజమాన్యపు హక్కులు భూమిని దున్నే రైతులకు ఆ భూమిపై యాజమాన్యపు హక్కు కల్పించవలెననేది కౌలు సంస్కరణల ముఖ్యలక్ష్యం.

3) కమతాల గరిష్ట పరిమితి నిర్ణయం: వ్యవసాయ రంగంలో సాంఘిక అన్యాయాలను తొలగించి కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించవలెను. భూమి దున్నేవారికి భూములు కల్పించటం కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించటం ముఖ్య లక్ష్యం. కమతాల గరిష్ట పరిమాణం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. గరిష్ట పరిమితి నిర్ణయించేటప్పుడు భూసారం, నీటిపారుదల వసతులు, సేద్యపు పద్ధతులు మొదలగునవి పరిగణనలోనికి తీసుకోవడం, జరుగుతుంది. కుటుంబ సభ్యులు 5గురు కన్నా మించి ఉన్నట్లయితే గరిష్ట పరిమితి పెంచబడుతుంది.

4) చిన్న కమతాల సమస్యలు పరిష్కరించుట: కమతాల సమీకరణ,. లాభసాటి కమతాలను ఏర్పరుచుట, సహకార వ్యవసాయం మొదలగునవి చిన్న కమతాల సమన్వయ పరిష్కరించుటకు తీసుకొనిన చర్యలు.

5) సహకార వ్యవసాయం ప్రోత్సహించుట: భూ సంస్కరణల లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయరంగ సామర్థ్యాన్ని పెంచడానికి సహకార వ్యవసాయం ఒక మంచి మార్గమని ఆర్థికవేత్తలు సూచించడం జరిగింది. ఈ విధానంలో రైతులందరూ సహకరించి చేసే ఉమ్మడి వ్యవసాయం. వ్యవసాయం పెద్ద తరహాలో చేస్తే వచ్చేలాభాలంటిని రైతులందరూ ఈ విధానంలో పొందే అవకాశం ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించడం తేలిక. వనరులు సమర్థవంతంగా ఉపయోగించుకునే వీలుంటుంది.

ప్రశ్న 10.
భారతదేశంలో హరిత విప్లవం రావడానికి గల కారణాలను, భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిది. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం వ్యవసాయరంగ ప్రగతిని వేగవంతం చేసేందుకు అనేక వ్యవస్థాపూర్వక, వ్యవస్థేతర సంస్కరణలను చేపట్టింది. వ్యవస్థేతర సంస్కరణలో నూతన వ్యవసాయ వ్యూహం అత్యంత ప్రధానమైంది. భారత ప్రభుత్వం 1965లో ప్రారంభించిన ఈ నూతన వ్యవసాయ వ్యూహం వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు పునాది వేసింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ఆచార్య నార్మన్ బోర్లెగ్ ఈ నూతన వ్యవసాయ వ్యూహానికి పితామహుడు. అంతర్జాతీయ అభివృద్ధి సంఘ సమావేశంలో ఉపన్యసిస్తూ విలియం ఎస్. గాండ్ అనే ఆర్థికవేత్త హరితవిప్లవం అనే పదాన్ని మొదటి సారిగా ఉపయోగించారు. అనేకమంది ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని క్రింది విధంగా నిర్వచించారు.

1) వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే ఉద్దేశంతో రైతుల్లో నవచైతన్యాన్ని రగిల్చి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, యంత్రపరికరాలను ఉపయోగించి జీవనాధార, వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే విప్లవాత్మకమైన మార్పుల కూర్పును ‘హరిత విప్లవం’ అంటారు.
పై నిర్వచనం ప్రకారం రైతుల్లో ప్రేరణ కలిగించి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించడానికి ప్రవేశపెట్టబడిన మౌలికమైన మార్పులను హరిత విప్లవం అంటారు.

2) జాన్, కేరీ వంటి ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని రసాయన ఎరువులు, విత్తనాల విప్లవం అంటారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. భారతదేశ హరిత విప్లవ రూపశిల్పి డాక్టర్ ఎమ్. ఎస్. స్వామినాథన్ వ్యవసాయరంగ ప్రగతికి భూసార పునరుద్ధరణ, అభిలషణీయ నీటి వినియోగం, సరిపడినంత పరపతి, యాంత్రికీకరణ, సరైన మార్కెట్ సౌకర్యాలు ఆవశ్యకం అని సూచించారు.

హరిత విప్లవాన్ని ప్రభావితం చేసే అంశాలు:
భారత ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికోసం అనేక పథకాలు, ప్రణాళికలు రూపొందించి అమలుచేసింది. ఈ చర్యల ఫలితంగా భారతదేశంలో హరిత విప్లవం ఆవిర్భవించింది. కింది అంశాలు హరిత విప్లవం ఆవిర్భవించడానికి కారణభూతాలైనాయి.

1) సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (IADP): భారత ప్రభుత్వం 1964లో ఫోర్ట్ ఫౌండేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా అధిక భూసారం, నిశ్చితంగా లభించే నీటివనరులు, తగిన వర్షపాతం మొదలైన సౌకర్యాలుండి, వరదలు, మురుగునీరు, భూసార క్షీణత వంటి సమస్యల తీవ్రత తక్కువగా వున్న ఏడు జిల్లాలను చూచుకొని సాంద్ర వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి కృషి ప్రారంభించింది.
సాంద్ర వ్యవసాయ జిల్లాల అభివృద్ధి పథకం కింద రైతులకు అవసరమైన ఉత్పాదకాలను అన్నింటినీ ఒకేసారి అందించడం జరుగుతుంది. అందువల్లనే ఈ పథకాన్ని “పేకేజ్ పథకం” అని కూడా పిలుస్తారు.

2) సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం (IAAP): భారత ప్రభుత్వం 1967లో సాంద్ర వ్యవసాయం కింద ఉన్న భూ విస్తీర్ణాన్ని అధికం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకుగాను ఈ పథకాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, ఈ పథకం కొన్ని ఎంచుకున్న పంటలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ పథకాన్ని మనదేశంలోని 114 జిల్లాలకు విస్తరింపచేశారు.

సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమంలాగానే సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం కూడా కొన్ని ఎంచుకున్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉన్నప్పటికీ ఈ ప్రాంతాల్లోని అభివృద్ధి ఫలితంగా సమీప ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనినే ‘విస్తరణ ప్రభావాలు’ అంటారు.

3) అధిక దిగుబడినిచ్చే విత్తనాల కార్యక్రమం (HYVP): ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 1965లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం. హరిత విప్లవాన్ని సాధించడంలో సంకరజాతి విత్తనాల పాత్ర కీలకమైనది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) పంజాబ్లోని వ్యవసాయ విద్యాలయాలు, వివిధ పరిశోధనా కేంద్రాల సమిష్టి కృషి ఫలితంగా అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను సృష్టించడం జరిగింది.

4) అల్పఫలన కాలపు పంటలు: భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఇక్రిశాట్ (ICRISAT) మొదలైన సంస్థల సమిష్టి కృషి, పరిశోధనల ఫలితంగా మనదేశంలో పంటల ఫలన కాలం గణనీయంగా తగ్గి అల్పఫలన కాలపు పంటలు అనుభవంలోనికి వచ్చాయి. వరి, గోధుమ, మొక్కజొన్న మొదలైన పంటల ఫలన కాలం బాగా తగ్గింది. వరి పంట ఫలనకాలం 6 నెలల కాలవ్యవధి నుండి 120 రోజులకు తగ్గింది. అద్భుత గోధుమ (MIRACLE WHEAT) ప్రాచుర్యం పొందిన మెక్సికన్ రకం గోధుమ, 188, 12Ro, 1001, 1010 మసూరి, బాసుమతి, జయ, పద్మ వంటి వరి రకాలు మనదేశంలో పండించబడుతున్నాయి. ఈ విత్తనాల ఫలన కాలం తగ్గినందువల్ల సంవత్సరానికి రెండు లేదు మూడు పంటలను పండించడం సాధ్యమైనది.

5) నీటిపారుదల సౌకర్యాల విస్తరణ: నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా లభ్యమయ్యే ప్రాంతాలలో వ్యవసాయ పరిశోధనలు, ప్రయోగాలు చేయడానికి వీలవుతుంది. అంతేగాక అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలకు సమృద్ధిగా నీటిపారుదల సౌకర్యాలు అవసరం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

6) వ్యవసాయ యాంత్రికీకరణ: ఇది హరిత విప్లవంలో అంతర్భాగం వ్యవసాయ యాంత్రికీకరణలో భాగంగా విద్యుత్ పంపుసెట్లు చెరకు క్రషర్స్, ట్రాక్టర్లు పంట మార్పడి యంత్రాలు మనదేశంలో విరివిగా వాడుకలోకి వచ్చాయి. వ్యవసాయ యాంత్రీకీకరణ వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి.

7) రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందుల వినియోగం: అధిక దిగుబడినిచ్చే విత్తనాలకు అధిక పరిమాణంలో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం అవసరం. అప్పుడు మాత్రమే ఈ విత్తనాలు సత్ఫలితాలాలను ఇస్తాయి. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. అందువల్ల భారత ప్రభుత్వం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల సరఫరా అధికం చేసే ఉద్దేశంతో వీటిని ఉత్పత్తి చేసే సంస్థలకు సౌకర్యాలు, రాయితీలు కల్పించి ప్రోత్సహించింది.

8) ఇతర అంశాలు: భారతదేశంలో హరిత విప్లవ ఆవిర్భావానికి పైన పేర్కొనబడిన అంశాలు కూడా దోహదం చేశాయి.
1) వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి అవసరమైన విస్తరణాధికారులను, గ్రామీణ విజ్ఞాన కేంద్రాలను, (RKC), వ్యవసాయం సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) ను స్థాపించి రైతులకవసరమైన విస్తరణ సేవలను ప్రభుత్వం అందించింది.

2) విద్యావంతులైన రైతులు మాత్రమే నూతన వ్యవసాయ పద్ధతులను అవగాహన చేసుకోగలరు. అందుకే రైతుల్లో నిరక్షరాస్యతను తొలగించడం కోసం ప్రభుత్వము వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటు చేసింది.

3) రైతులు వ్యవసాయ కార్యకలాపాలను సకాలంలో నిర్వర్తించడానికి పరపతి అవసరం. అందువల్ల భారత ప్రభుత్వం వాణిజ్య బ్యాంకులను, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను, ప్రాథమిక వ్యవసాయ పరపతి .సంఘాలను స్థాపించి సకాలంలో పరపతి అందిస్తుంది.

భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం: హరిత విప్లవం భారత ఆర్థిక వ్యవస్థపై విశేష ప్రభావాన్ని చూపింది. హరిత విప్లవం వల్ల ఏర్పడిన సత్ఫలితాలను కింది విధంగా వివరించవచ్చు.
1) ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం యొక్క ప్రత్యక్ష ఫలితం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అధిక పెరుగుదల సాధించడం. హరిత విప్లవం ప్రభావం వరి, గోధుమ ఉత్పత్తి మీద ఎక్కువ ఉంది. 1960-61లో వరి, ధాన్యం ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 104 మిలియన్ టన్నులకు పెరిగింది. గోధుమ ఉత్పత్తి 1960-61లో 11 మిలియన్ టన్నులు ఉండగా 2011-12 నాటికి 255 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 2012-13 నాటికి 257 మిలియన్ టన్నులకు పెరిగింది.

2) వాణిజ్య పంటల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం ప్రారంభంలో ఆహార పంటలకు మాత్రమే పరిమితమై వాణిజ్య పంటల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. హరిత విప్లవం 1973-74 తరువాత వాణిజ్య పంటలైన చెరకు ఉత్పత్తి మీద విశేషమైన ప్రభావాన్ని, నూనె గింజలు, బంగాలదుంపల ఉత్పత్తుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపింది. చెరకు ఉత్పత్తి 1960-61లో 110 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 358 మిలియన్ టన్నులకు పెరిగింది. నూనెగింజలు ఉత్పత్తి 1960-61లో 7 మిలియన్ల టన్నుల నుంచి 2011-12 నాటికి 30 మిలియన్ టన్నులకు పెరిగింది.

3) ఉపాధి అవకాశాల పెరుగుదల: హరిత విప్లవం ఫలితంగా సాగులోవున్న భూ విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వ్యవసాయరంగంలో శ్రమశక్తి ఎక్కువ అవసరమయ్యే వరి, చెరకు, తోటపంటలు, బంగాళదుంపలు కూరగాయలు మొదలైన పంటలు సాగుచేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతేగాక సాంద్ర వ్యవసాయంలో భాగంగా బహుళ పంటలు పండించటం వల్ల కూడా ఉపాధి అవకాశాలు వృద్ధి చెందాయి. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయరంగంలో చిల్లర అమ్మకాలు చేపట్టడంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి.

4) బలిష్టమైన ముందు, వెనుక బంధాలు: వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండూ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడే రంగాలు వ్యవసాయం పరిశ్రమలకు కావల్సిన ముడిసరుకులనూ అందిస్తుంది. దీన్నే “ముందువైపు బంధం” అంటారు. అనాదిగా బలిష్టంగా ఉంది. పరిశ్రమలు వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలను అందిస్తుంది. దీనిని “వెనుకవైపు బంధం” అంటారు. అయితే ఈ బంధం బలహీనంగా ఉంది. హరిత విప్లవ ఫలితంగా పారిశ్రామిక రంగం సరఫరా చేసే వ్యవసాయ ఉత్పాదకాలను విపరీతంగా గిరాకీ పెరిగింది. తద్వారా వెనుక వైపు బంధం కూడా బలిష్టమైనది. ఈ విధంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండూ బలోపేతం చేయబడ్డాయి.

5) ఆదాయల్లో పెరుగుదల: ఈ నూతన వ్యవసాయ వ్యూహం రైతులు తాము పండించిన పంటలను శ్రేణీకరణ, ప్రామాణీకరణ చేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధరలకు ప్రత్యక్షంగా చిల్లర వ్యాపారం చేసే కంపెనీలకు, అమ్ముకొనే అవకాశాలను కల్పించింది. ఈ కంపెనీలు రైతులకు లాభసాటి ధరలను, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే గాక ధరల నియంత్రణకు తోడ్పడ్డాయి. హరితవిప్లవ ఫలితంగా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతుల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

6) పేదరికం తగ్గుదల: హరిత విప్లవం ఉపాధి అవకాశాలను వ్యవసాయరంగంలోనే కాక వ్యవసాయేతర రంగాలైన రవాణా, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పరిశ్రమల్లో, బ్యాకింగ్, సేవారంగాల్లో ఉపాధిని * కల్పించింది. అంతేకాక హరితవిప్లవ ఫలితంగా ఆహారధాన్యాలలో లభించిన మిగులును ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరలకు పేదవారికి అందించడం జరుగుతుంది. దీని ఫలితంగా పేదవారి వాస్తవిక ఆదాయం పెరిగి పేదరికం తగ్గుతుంది.

ప్రశ్న 9.
భారతదేశంలో వివిధ రకాల భూ సంస్కరణలను సంక్షిప్తంగా వివరింపుము.
జవాబు:
వ్యవసాయాభివృద్ధి కొరకు ఉత్పత్తిని అధికం చేయుటకు, ప్రణాళిక బద్ధంగా ఆర్థికాభివృద్ధిని సాధించుటకు, సాంఘిక న్యాయాన్ని చేకూర్చుటకు మనదేశంలో భూ సంస్కరణలు అమలులోకి వచ్చాయి.
1) మధ్యవర్తుల తొలగింపు: మనదేశంలో భూ సంస్కరణలను అమలు చేయడంలో భాగంగా మధ్యవర్తులను తొలగించడమైనది. జమీందారి విధానం, జాగీరుదారుని విధానం, రైత్వారీ విధానంలోని లోపాలను తొలగించడం. 1948లో మధ్యవర్తుల తొలగింపు చట్టం చేశారు. ఫలితంగా 30 లక్షల మంది కౌలుదార్లు 62 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్యపు హక్కులు పొందారు. మనదేశం తొలగించిన మధ్యవర్తులకు నష్టపరిహారం చెల్లించింది.

2) కౌలు సంస్కరణ: ఏ రైతులు జీవనోపాధికోసం, భూస్వాముల నుంచి భూమిని తీసుకొని సాగుచేస్తారో వారినే కౌలుదార్లు అంటారు. వీరిని మూడు రకాలుగా వర్గీకరించారు.
1) జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు 2) ఉపకౌలుదార్లు 3) ఏ హక్కులూ లేని కౌలుదార్లు వ్యవసాయదారులలో సుమారు 50% మంది ఏ హక్కులు లేని కౌలుదారులుగా ఉన్నారు. వారు ఎటువంటి కౌలు భద్రతా లేదు. ఇష్టం వచ్చినప్పుడు భూస్వామి కౌలుదారులను తొలగించవచ్చు. అందుచేత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కౌలు సంస్కరణలు ప్రవేశపెట్టాయి.

1. కౌలు భద్రత: కౌలుదారుడు సక్రమంగా కౌలు చెల్లించినంత కాలం భూస్వామి అతనిని తొలగించుటకు వీలులేదు. చట్టం నుండి తప్పించుకొనుటకు భూస్వాములు సొంత వ్యవసాయం చేసే నెపముతో కౌలుదార్లును
తొలగించరాదు.

2. కౌలు పరిమాణం: కౌలుదారుల నుండి భూస్వాములు వసూలు చేసే కౌలుకు పరిమితి నిర్ణయించారు. మొత్తం ఉత్పత్తిలో కౌలుదారులు చెల్లించవలసిన కౌలు ఉత్పత్తిలో 25 నుండి 50% మించకూడదని నిర్ణయించారు. రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య కౌలు పరిమాణంలో తేడాలున్నాయి. ఆంధ్రలో మొత్తం ఉత్పత్తిలో 20 నుండి 30 శాతం గుజరాత్లో 1/6; కర్ణాటకలో 1/5 నుండి 1/4 భాగం.

3. కౌలుదార్లుకు యాజమాన్యపు హక్కులు భూమిని దున్నే రైతులకు ఆ భూమిపై యాజమాన్యపు హక్కు కల్పించవలెననేది కౌలు సంస్కరణల ముఖ్యలక్ష్యం.

3) కమతాల గరిష్ట పరిమితి నిర్ణయం: వ్యవసాయ రంగంలో సాంఘిక అన్యాయాలను తొలగించి కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించవలెను. భూమి దున్నేవారికి భూములు కల్పించటం కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించటం ముఖ్య లక్ష్యం. కమతాల గరిష్ట పరిమాణం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. గరిష్ట పరిమితి నిర్ణయించేటప్పుడు భూసారం, నీటిపారుదల వసతులు, సేద్యపు పద్ధతులు మొదలగునవి పరిగణనలోనికి తీసుకోవడం, జరుగుతుంది. కుటుంబ సభ్యులు 5గురు కన్నా మించి ఉన్నట్లయితే గరిష్ట పరిమితి పెంచబడుతుంది.

4) చిన్న కమతాల సమస్యలు పరిష్కరించుట: కమతాల సమీకరణ,. లాభసాటి కమతాలను ఏర్పరుచుట, సహకార వ్యవసాయం మొదలగునవి చిన్న కమతాల సమన్వయ పరిష్కరించుటకు తీసుకొనిన చర్యలు.

5) సహకార వ్యవసాయం ప్రోత్సహించుట: భూ సంస్కరణల లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయరంగ సామర్థ్యాన్ని పెంచడానికి సహకార వ్యవసాయం ఒక మంచి మార్గమని ఆర్థికవేత్తలు సూచించడం జరిగింది. ఈ విధానంలో రైతులందరూ సహకరించి చేసే ఉమ్మడి వ్యవసాయం. వ్యవసాయం పెద్ద తరహాలో చేస్తే వచ్చేలాభాలంటిని రైతులందరూ ఈ విధానంలో పొందే అవకాశం ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించడం తేలిక. వనరులు సమర్థవంతంగా ఉపయోగించుకునే వీలుంటుంది.

ప్రశ్న 10.
భారతదేశంలో హరిత విప్లవం రావడానికి గల కారణాలను, భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిది. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం వ్యవసాయరంగ ప్రగతిని వేగవంతం చేసేందుకు అనేక వ్యవస్థాపూర్వక, వ్యవస్థేతర సంస్కరణలను చేపట్టింది. వ్యవస్థేతర సంస్కరణలో నూతన వ్యవసాయ వ్యూహం అత్యంత ప్రధానమైంది. భారత ప్రభుత్వం 1965లో ప్రారంభించిన ఈ నూతన వ్యవసాయ వ్యూహం వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు పునాది వేసింది.

ఆచార్య నార్మన్ బోర్లెగ్ ఈ నూతన వ్యవసాయ వ్యూహానికి పితామహుడు. అంతర్జాతీయ అభివృద్ధి సంఘ సమావేశంలో ఉపన్యసిస్తూ విలియం ఎస్. గాండ్ అనే ఆర్థికవేత్త హరితవిప్లవం అనే పదాన్ని మొదటి సారిగా ఉపయోగించారు. అనేకమంది ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని క్రింది విధంగా నిర్వచించారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

1) వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే ఉద్దేశంతో రైతుల్లో నవచైతన్యాన్ని రగిల్చి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, యంత్రపరికరాలను ఉపయోగించి జీవనాధార, వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే విప్లవాత్మకమైన మార్పుల కూర్పును ‘హరిత విప్లవం’ అంటారు.
పై నిర్వచనం ప్రకారం రైతుల్లో ప్రేరణ కలిగించి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించడానికి ప్రవేశపెట్టబడిన మౌలికమైన మార్పులను హరిత విప్లవం అంటారు.

2) జాన్, కేరీ వంటి ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని రసాయన ఎరువులు, విత్తనాల విప్లవం అంటారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. భారతదేశ హరిత విప్లవ రూపశిల్పి డాక్టర్ ఎమ్. ఎస్. స్వామినాథన్ వ్యవసాయరంగ ప్రగతికి భూసార పునరుద్ధరణ, అభిలషణీయ నీటి వినియోగం, సరిపడినంత పరపతి, యాంత్రికీకరణ, సరైన మార్కెట్ సౌకర్యాలు ఆవశ్యకం అని సూచించారు.

హరిత విప్లవాన్ని ప్రభావితం చేసే అంశాలు:
భారత ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికోసం అనేక పథకాలు, ప్రణాళికలు రూపొందించి అమలుచేసింది. ఈ చర్యల ఫలితంగా భారతదేశంలో హరిత విప్లవం ఆవిర్భవించింది. కింది అంశాలు హరిత విప్లవం ఆవిర్భవించడానికి కారణభూతాలైనాయి.

1) సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (IADP): భారత ప్రభుత్వం 1964లో ఫోర్ట్ ఫౌండేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా అధిక భూసారం, నిశ్చితంగా లభించే నీటివనరులు, తగిన వర్షపాతం మొదలైన సౌకర్యాలుండి, వరదలు, మురుగునీరు, భూసార క్షీణత వంటి సమస్యల తీవ్రత తక్కువగా వున్న ఏడు జిల్లాలను చూచుకొని సాంద్ర వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి కృషి ప్రారంభించింది.

సాంద్ర వ్యవసాయ జిల్లాల అభివృద్ధి పథకం కింద రైతులకు అవసరమైన ఉత్పాదకాలను అన్నింటినీ ఒకేసారి అందించడం జరుగుతుంది. అందువల్లనే ఈ పథకాన్ని “పేకేజ్ పథకం” అని కూడా పిలుస్తారు.

2) సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం (IAAP): భారత ప్రభుత్వం 1967లో సాంద్ర వ్యవసాయం కింద ఉన్న భూ విస్తీర్ణాన్ని అధికం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకుగాను ఈ పథకాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, ఈ పథకం కొన్ని ఎంచుకున్న పంటలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ పథకాన్ని మనదేశంలోని 114 జిల్లాలకు విస్తరింపచేశారు.

ప్రశ్న 11.
భారతదేశంలో వివిధ రకాల పరపతి మూలాలు ఏవి ?
జవాబు:
ఆర్థిక కార్యకలాపాలకు ధనం ప్రధాన ఇంధనం, వ్యవసాయ కార్యకలాపాల నిర్వాహణకు సకాలంలో సరిపడినంత పరపతి అవసరం. కాబట్టి వ్యవసాయాభివృద్ధి పరపతిలో ప్రత్యక్షంగా ముడిపడి ఉంది. వ్యవసాయం చేయడానికి సకాలంలో సరిపడినంత పరపతి లభించక మనదేశ రైతులు తగిన వ్యవసాయ ప్రతిఫలాలు పొందలేకున్నారు. T.W. ఘర్జ్ అనే ఆర్థికవేత్త అభిప్రాయంలో పరపతి కొరత వ్యవసాయాభివృద్ధిని కుంటుపరచడం మాత్రమే గాక సాంప్రదాయ వ్యవసాయాన్ని ఆధునికీకరించడంలో ప్రతిబంధంకంగా తయారైంది.”

వ్యవసాయ పరపతి వర్గీకరణ: సాధారణంగా వ్యవసాయ పరపతి పరిమాణం సాగులోవున్న భూకమతం పరిమాణం, ఉత్పత్తి విధానాలు, ఉత్పత్తి కారకాల లభ్యత, సాంకేతిక విజ్ఞానం, కుటుంబ అవసరాలు మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రైతులు పరపతిని ఉపయోగించే కార్యకలాపాల ఆధారంగా తిరిగి చెల్లించే కాలవ్యవధి ఆధారంగా వర్గీకరిస్తారు. అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన సంఘం సూచనలను అనుసరించి రైతుల పరపతి అవసరాలను మూడు రకాలుగా వర్గీకరించారు.

1) స్వల్పకాలిక పరపతి: విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వేతనాలు, పశువుల దాణా, రవాణా మొదలైన అవసరాల కోసం పొందే పరపతిని ‘స్వల్పకాలిక పరపతి’ అంటారు. దీనిని 15 నెలల కాలవ్యవధిలో తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

2) మధ్యకాలిక పరపతి: భూమిని మెరుగుపరుచుట, బావుల తవ్వకం, పశువుల, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు మొదలైన అవసరాలు తీర్చుకొనుటకు పొందే పరపతి మధ్యకాలిక పరపతి అంటారు. దీనిని 15 నెలలు నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధిలో తీర్చవలసి ఉంటుంది.

3) దీర్ఘకాలిక పరపతి: నూతన భూములు కొనుగోలు, శాశ్వతంగా భూమిని అభివృద్ధి చేయుట, ట్రాక్టర్లు, విద్యుత్తు పంపుసెట్లు, పంట మార్పిడి యంత్రాలు మొదలైనవి కొనుగోలు చేయుటకు, పాత బాకీలు చెల్లించుటకు మొదలైన అవసరాల కోసం రైతులకు పెద్దమొత్తంలో అవసరమయ్యే పరపతిని దీర్ఘకాలిక పరపతి అంటారు. దీనిని 5 నుంచి 20 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

ఉత్పాదక, అనుఉత్పాదక రుణాలు: రుణాలను ఉత్పాదక, అనుత్పాదక రుణాలని రెండు రకాలుగా వర్గీకరించారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలు, బావులు త్రవ్వకం, కంచెల నిర్మాణం మొదలైన ఉత్పాదకాల కొనుగోలు తీసుకున్న రుణాలను ఉత్పాదక రుణాలు అంటారు. కానీ మత సంబంధ కార్యక్రమాలు, వివాహాలు, పండుగలు, నగలు కొనుగోలు మొదలైన కార్యక్రమాల కోసం తీసుకున్న రుణాలను అనుత్పాదక రుణాలు అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

భారతదేశంలో వ్యవసాయ పరపతి ఆధారాలు: వ్యవసాయ కార్యకలాపాల నిర్వాహణకు పరపతి అత్యంత ఆవశ్యకం. రైతుల పరపతి ఆధారాలను సంస్థాగత మూలాధారాలు, సంస్థేతర మూలాధారాలు అని రెండు రకాలుగా వర్గీకరించారు. కాలక్రమేణా వ్యవసాయ పరపతిలో సంస్థాగత పరపతి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది.

1) ప్రభుత్వం: సంస్థాగత పరపతి విస్తరించిన కాలంలో ప్రభుత్వమే వ్యవసాయ పరపతిని అందించే ముఖ్యమైన సంస్థ. సాధారణంగా వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకు రైతులకు ప్రభుత్వం అందించే పరపతి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. వరదలు, కరువు కాటకాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకొనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యక్షంగా తక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేస్తుంది. ఈ రుణాలను ‘తక్కువ రుణాలు’ అంటారు. రైతులు ఈ రుణాలను సులభ వాయిదాలలో ప్రభుత్వానికి చెల్లించవచ్చు.

2) భారత రిజర్వు బాంకు పాత్ర: 1935లో మనదేశంలో స్థాపించిన కేంద్ర బాంకును 1949లో జాతీయం చేశారు. అదే భారత రిజర్వ్ బాంకుగా ప్రారంభం నుంచి గ్రామీణ పరపతిని అందించడంలో విశిష్టమైన పాత్ర పోషిస్తుంది. ఈ బాంకు భారత వ్యవసాయాభివృద్ధి కోసం 1956లో రెండు రకాల నిధులను ఏర్పాటు చేసింది.

  1. జాతీయ వ్యవసాయ పరపతి – దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి.
  2. జాతీయ వ్యవసాయ పరపతి – స్థిరీకరణ నిధి.

రైతులకు అవసరమైన దీర్ఘకాలిక రుణ సదుపాయాల కల్పనకు మొదటి నిధిని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకోవడానికి రెండవ నిధిని ఏర్పాటు చేశారు.
3) సహకార, పరపతి సంఘాలు: జర్మనీలో విజయవంతంగా అమలు చేయబడిన సహకార పరపతి విధానాన్ని ఆసరాగా తీసుకొని భారతదేశంలో 1904లో సహకారోద్యమం ప్రారంభించబడింది. గ్రామీణ రైతులను రుణ విముక్తులను చేసి వారిలో పొదుపు – అలవాట్లను పెంపొందించడం సహకార పరపతి సంస్థల మఖ్యోద్దేశం. మనదేశంలో సహకార పరపతి విధానాన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది.
4) వాణిజ్య బాంకులు: “లాభోద్దేశంలో బాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే బాంకులే వాణిజ్య బ్యాంకులు” 1951 వరకు వ్యవసాయానికి అందించబడిన మొత్తం పరపతిలో వాణిజ్య బాంకుల వాటా కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది.

1. వాణిజ్య బాంకులు గ్రామీణ రైతులకు అవసరమైన మొత్తం స్వల్పకాలిక పరపతిలో 42 నుంచి 45 శాతం వరకు అందిస్తున్నాయి. అదే విధంగా రైతులు, యంత్రాలు, ట్రాక్టర్లు, పంపుసెట్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తం దీర్ఘకాలిక పరపతిలో 35 నుంచి 37 శాతం వరకు అందిస్తున్నాయి.

2. వాణిజ్య బాంకులు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలైన పశుపోషణ, పాడి, పందుల పెంపకం, కోళ్ళు పెంపకం, చేపల పెంపకం మొదలైన కార్యక్రమాలకు కూడా పరపతిని అందిస్తున్నాయి.

5) ప్రాంతీయ గ్రామీణ బాంకులు: భారత ప్రభుత్వం ఆచార్య యమ్. నరసింహం కమిటీ సిఫార్సులు ఆధారంగా 1975 అక్టోబర్ 2వ తేదీన ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 5 ప్రాంతీయ గ్రామీణ బాంకులను ప్రారంభించింది.
చిన్న రైతులు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, హస్తకళాకారులు, చిన్న వ్యాపారస్తులు మొదలైన వారికి పరపతిని సమకూర్చి ఉత్పాదక కార్యక్రమాల్లో ప్రగతిని సాధించడం గ్రామీణ బాంకుల ప్రధాన ఆశయం.

6) జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బాంకు (NABARD): వ్యవస్థీకృత పరపతి సౌకర్యాల సమీక్షా సంఘం (CRAFICARD) సిఫార్సుల మేరకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కోసం 1982 జులై 12వ తేదీన జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బాంకును ప్రారంభించారు.

  1. వ్యవసాయం, కుటీర, గ్రామీణ, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు మొదలైన కార్యక్రమాలకు పరపతిని అందించి సమగ్ర గ్రామీణాభివృద్ధికి నాబార్డ్ తోడ్పడుతుంది.
  2. గ్రామీణ బాంకులు, సహకార సంఘాలు కార్యకలాపాలను పర్యవేక్షించడమేగాక పరపతికి సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వానికి నాబార్డ్ సలహాదారుగా వ్యవహరిస్తుంది.

సంస్థేతర మూలాధారాలు:
1) వడ్డీ వ్యాపారస్తులు: మనదేశంలో సంస్థాపరమైన పరపతి అభివృద్ధి చెందకపోవడం వల్ల చాలాకాలంగా భారతదేశ వ్యవసాయ పరపతిలో వడ్డీ వ్యాపారస్తులు పాత్ర ఎక్కువగా ఉంది. వడ్డీ వ్యాపారస్తులు రెండు రకాలు. 1) వ్యవసాయదారులైన వడ్డీ వ్యాపారస్తులు. వీరు వ్యవసాయం చేస్తూ వడ్డీ వ్యాపారాన్ని మాత్రమే నిర్వహిస్తారు. సాధారణంగా వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీని వసూలు చేయడమేగాక అనుత్పాదక రుణాలను ప్రోత్సహిస్తారు. వీరు తప్పుడు లెక్కల ద్వారా రైతులను దోచుకుంటారు ప్రస్తుతం వడ్డీ వ్యాపారస్తుల పాత్ర క్రమేపి తగ్గుతున్నది.

2) భూస్వాములు: ఎక్కువ సందర్భాల్లో సన్నకారు రైతులు, కౌలుదారులు తమ పరపతి అవసరాల కోసం | భూస్వాముల దగ్గర నుంచి రుణాలు తీసుకొంటారు. భూస్వాములు అధిక వడ్డీని వసూలు చేయడమే కాక ఉత్పాదక, అనుత్పాదక కార్యక్రమాలు రెండింటికీ రుణాలిస్తుంటారు. వీరు తమ సమీపంలోని సన్నకారు రైతుల భూమిని కబళించాలనే దురాలోచనలో అధిక వడ్డీరేట్లకు వారికి తరచుగా రుణాలిస్తుంటారు. రైతులు అధిక వడ్డీతో కూడుకున్న ఈ రుణాలను చెల్లించలేక కొంతకాలం తరువాత రుణ పరిష్కారం కోసం తమ భూములను రుణాలిచ్చిన భూస్వాములకే అమ్మి వ్యవసాయ శ్రామికులుగా మారుతుంటారు. మొత్తం వ్యవసాయ పరపతిలో వీరి వాటా 1951లో 15శాతం ఉండగా 2002 నాటికి 1 శాతానికి తగ్గింది.

3) వ్యాపారులు కమీషన్ ఏజెంట్లు: వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్లు ఉత్పాదక కార్యక్రమాల కోసం పంట తనఖా మీద రైతులకు రుణాలిస్తారు. పంట పండిన తరువాత రైతులు తమ పంటను వీరికి మాత్రమే అమ్మవలసి ఉంటుంది. వీరు రైతులకు తక్కువ ధరలను చెల్లించడమేగాక, అధిక కమీషన్ వసూలు చేస్తారు. అందువల్ల రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందలేక రుణగ్రస్తులు అవుతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ఉదాహరణకు వాణిజ్య పంటలైన పత్తి, చెరకు మొదలైన పంటలకు తనఖా మీద రుణాలిస్తారు. మొత్తం వ్యవసాయ పరపతిలో 1951లో 55 శాతంగా ఉన్న ఈ పరపతి 2012 నాటికి 2.6 శాతానికి తగ్గింది.

4) బంధువులు స్నేహితులు: రైతులు తరచుగా వ్యవసాయ అవసరాల కోసం బంధువులు, స్నేహితుల వద్ద రుణాలు తీసుకొంటారు. మొత్తం వ్యవసాయ పరపతిలో ఈ విధమైన పరపతి వాటా తక్కువ. వీరు వడ్డీ వసూలు చేయవచ్చు లేదా తక్కువ వడ్డీకి రుణం ఇవ్వవచ్చు. ఇది దోపిడీ రహిత పరపతి విధానం.

సాధారణంగా రైతులు పంట చేతికి రాగానే ఈ రుణాలను తిరిగి చెల్లిస్తారు. మొత్తం వ్యవసాయ పరపతిలో వీరి వాటా 1951 నాటికి 14.2 శాతం ఉండగా 2002 నాటికి 7.1 శాతానికి తగ్గింది.

ప్రశ్న 12.
భారతదేశంలో గ్రామీణ రుణగ్రస్తతకు కారణాలేవి? రుణ విముక్తికి కొన్ని పరిష్కారాలను సూచించుము. [Mar ’16]
జవాబు:
గ్రామీణ రుణగ్రస్తత: గ్రామీణ రుణగ్రస్తతకు భారతదేశంలో వ్యవసాయదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య. రుణగ్రస్తత వ్యవసాయ కార్యకలాపాలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా రైతులు ఉత్పాదక, అనుత్పాదక కార్యక్రమాల కోసం రుణాలు తీసుకొంటారు. రైతులు తాము తీసుకున్న రుణంలో అధిక భాగం అనుత్పాదక కార్యక్రమాల కోసం వ్యయం చేస్తున్నారు. అందువల్ల వీరు రుణాలను తిరిగి చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులు ప్రతి సంవత్సరం చేసే రుణాలు పెరుగుతూనే వున్నాయి తప్ప చెల్లించలేకపోతున్నారు. దీనినే గ్రామీణ రుణగ్రస్తత అంటారు.

గ్రామీణ రుణగ్రస్తతకు కారణాలు:
1) వారసత్వపు అప్పులు: సాధారణంగా ఆస్తుల్లాగా అప్పులు కూడా వారసత్వంగా సంక్రమిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ రుణం వారసత్వంగా సంక్రమించినదే. వాస్తవంగా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులతో పాటు అప్పులకు కూడా బాధ్యత వహించాలి. భారతదేశంలోని రైతులు వారసత్వపు రుణాలను తీర్చడం గౌరవంగాను, నైతిక బాధ్యతగాను భావిస్తున్నారు. అందువల్ల ఎక్కువమంది రైతులు తమ జీవితాలను అప్పులతోనే ప్రారంభిస్తున్నారు.

2) పేదరికం: గ్రామీణ రుణగ్రస్తతకు మరో ప్రధాన కారణం పేదరికం. పేదరికం కారణంగా పొదుపు చేయలేని రైతులు తమ కుటుంబ, వ్యవసాయ అవసరాలకోసం, పాత బాకీలు చెల్లించడం కోసం రుణం తీసుకోవడం తప్పనిసరైంది. పేదరికం, రుణగ్రస్తత ఒకదానికి మరొకటి కారణం మాత్రమేగాక ఫలితం కూడాను.

3) ప్రకృతి వైపరీత్యాలు: భారతదేశంలో వ్యవసాయం రుతువులపై ఆధారపడే జూదంలాంటి కార్యకలాపం రుతువుల వైఫల్యం వల్ల తరచుగా కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. అధిక వర్షపాతం వల్ల విధ్వంసం జరిగి వరదలు రావడం మూలంగా పంటలు నాశనమవుతున్నాయి. వర్షపాతానికి అనిశ్చితివల్ల వ్యవసాయదారులు కనీస ప్రతిఫలాలు కూడా పొందలేకపోతున్నారు. అదేవిధంగా తుఫానులు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా రైతులు తమ పంటలను నష్టపోయి రుణగ్రస్తులవుతున్నారు.

4) రైతుల దుబారా వ్యయం: భారతీయ రైతులు వివాహాలు, పుట్టుకలు, పండుగలు, కర్మక్రతువులు, విందులు, వినోదాలు, ఆభరణాల కొనుగోలు మొదలైన సాంఘీక, ఆర్థిక, మత సంబంధ అంశాలపై దుబారా వ్యయం చేయడం వల్ల రుణగ్రస్తులవుతున్నారు.

5) వడ్డీ వ్యాపారులు: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు పరపతిని సులువుగా అందించే ముఖ్యమైన మూలాధారం వడ్డీ వ్యాపారస్తులు. రైతుల భూములను కబళించాలనే ఉద్దేశంతో అధిక వడ్డీరేట్లకు అనుత్పాదక కార్యక్రమాల కోసం అప్పు తీసుకొనేటట్లు వడ్డీ వ్యాపారస్తులు రైతులను ప్రోత్సహిస్తారు. వీరు నిరక్షరాస్యులైన వ్యవసాయదారులను తప్పుడు లెక్కల ద్వారా మోసగిస్తున్నారు.

6) అల్ప కమతాలు: భారతదేశంలో సగటు భూకమతం పరిమాణం విభజన, విఘటనలకు గురై స్వల్పంగా ఉంది. ఈ కమతాలు నూతన వ్యవసాయ వ్యూహానికి అనువుగా లేకపోవడం వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత తక్కువగా ఉన్నది. అందువల్ల రైతులు వ్యవసాయరంగం ద్వారా లాభదాయకమైన ప్రతిఫలాలు పొందలేక రుణగ్రస్తులవుతున్నారు.

7) న్యాయపరమైన వ్యవహారాలు: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కాలిబాటలు, హద్దులు, కంచెలు మొదలైన విషయాలపై గొడవలు పడి కోర్టులు చుట్టూ తిరుగుతారు. వీరు కోర్టు వ్యవహారాల్లో గెలుపొందడం వ్యక్తిగత లేదా కుటుంబ ప్రతిష్టగా భావిస్తారు. ఈ విధంగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని ధనాన్ని వృధా చేసుకుంటూ వ్యవసాయ కార్యకలాపాలను నిర్లక్ష్యం చేసి రుణగ్రస్తులవుతున్నారు.

8) భూమిపై మక్కువ ఎక్కువ సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భూమి కావాలనే తీవ్రవాంఛ కలిగివుంటారు. వీరు కొంత భూమైనా కల్గి ఉండటాన్ని హోదాగా, గౌరవంగా భావిస్తారు. భూమిపై అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఎంత వ్యయమైనా వెనుకాడరు. వీరు పొదుపు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమునుంచి పరిణామం అయినప్పటికీ ఈ కార్యక్రమాల కోసం రైతులు తలకు మించిన అప్పులు చేసి రుణగ్రస్తులు కావడం ఆందోళనకరం. 9) ఇతర కారణాలు: రైతులు విలాసవంతమైన కుటుంబ జీవితం గడపడం, దురలవాట్లపై వ్యయం చేయడం, వ్యవసాయ ఖర్చులు పెరగడం, ప్రైవేటు రుణాలుపై ఆధారపడటం మొదలైన కారణాలవల్ల రైతులు రుణగ్రస్తులవుతున్నారు.

గ్రామీణ రుణగ్రస్తత నివారణకు తీసుకోవలసిన చర్యలు:
1) సంస్థాగత పరపతి సౌకర్యాల విస్తరణ: గ్రామీణులకు ముఖ్యంగా రైతులకు సకాలంలో సరిపడినంత పరపతిని సంస్థాగత పరపతి సంస్థల ద్వారా అందించాలి. ఈ లక్ష్య సాధన కోసం వాణిజ్య బాంకులను, గ్రామీణ బాంకులను సహకార పరపతి సంఘాలను స్థాపించి వాటి ద్వారా సంస్థాగతమైన పరపతిని అందించి రుణవిముక్తి కలిగించాలి.

2) వడ్డీ వ్యాపారస్తుల నియంత్రణ: వడ్డీ వ్యాపారస్తుల నుండి గ్రామీణులను రక్షించడానికి అవసరమైన చట్టాలను ప్రభుత్వం రూపొందించి అమలుచేయాలి. అవసరమైన లైసెన్సులు, నిర్దేశించిన పద్ధతిలో వడ్డీ వ్యాపార గణకాల నిర్వహణ, గరిష్ట వడ్డీరేటుకు నిర్ణయించడం, చెల్లింపులకు రశీదులు ఇవ్వడం మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

3) రుణమాఫీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాల ద్వారా చిన్న ఉపాంత రైతులను, వ్యవసాయ శ్రామికులను రుణవిముక్తులను చేయడానికి రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

4) రైతులను విద్యావంతులను చేయడం: ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యాకేంద్రాలను స్థాపించి రైతులను, గ్రామీణులను విద్యావంతులను చేయాలి. అంతేగాక రైతులు సాంఘిక, మత సంబంధ వ్యయాలు, న్యాయపరమైన ఖర్చులు మొదలైన అనవసర వ్యయాలను తగ్గించుకొని రుణవిముక్తులు అవుతారు.

5) ఉత్పాదకాల సరఫరా సంస్థాగత పరపతి సంస్థలు రైతులకవసరమైన పరపతిని ద్రవ్యరూపంలో కాక ఉత్పాదకాల రూపంలో అందించాలి. ఫలితంగా అనుత్పాదక వ్యయం తగ్గి సకాలంలో రుణాలను చెల్లించే సామర్థ్యం పెరగడంతో రైతులు రుణవిముక్తులు అవుతారు.

6) ఇతర చర్యలు: పైన పేర్కొనబడిన చర్యలతో పాటు పేదరిక నిర్మూలన కోసం. ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి అమలుచేయాలి.

ప్రశ్న 13.
భారతదేశంలో వ్యవసాయ, గ్రామీణ పరపతి రంగంలో నాబార్డ్ పాత్రను వివరింపుము.
జవాబు:
వ్యవస్థీకృత పరపతి సౌకర్యాల సమీక్షాసంఘం (CRATICARD) సిఫార్సుల మేరకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి |కోసం 1982 జులై 12వ తేదీన జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బాంకును (NABARD) ప్రారంభించారు. రిజర్వు బాంకులోని గ్రామీణ పరపతి ప్రణాళిక విభాగం, వ్యవసాయపరపతి కోసం ఏర్పాటైన రెండు ప్రత్యేక విధులు, వ్యవసాయ పునర్విత్త అభివృద్ధి సంస్థ (ARDC) మొదలైన వాటిని రిజర్వ్ బాంకు నాబార్డ్ బదిలీ చేసింది. నాబార్డ్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శిఖరాగ్ర సంస్థగా పనిచేస్తుంది. ఈ బాంకు యొక్క అధీకృత మూలధనం 500 కోట్ల రూపాయలు చెల్లించిన మూలధనం 100 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బాంకు సమానంగా సమకూర్చినాయి.

ఎ) నాబార్డ్ విధులు: నాబార్డ్ ప్రధానంగా మూడు రకాల విధులు నిర్వర్తిస్తుంది.
1) పునర్విత్త విధులు 2) అభివృద్ధి ప్రోత్సాహక విధులు 3) పర్యవేక్షణ విధులు. నాబార్డ్ ప్రత్యేకంగా క్రింది విధులను నిర్వర్తిస్తుంది.

  1. రాష్ట్ర సహకార బాంకులను, ప్రాంతీయ గ్రామీణ బాంకులను భూమి అభివృద్ధి బాంకులను రిజర్వ్ బాంకు అనుమతితో గ్రామీణభివృద్ధిలో పాల్గొంటున్న విత్తసంస్థలు మొదలైన వాటన్నింటికి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతిని అందించి తద్వారా వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధికి నాబార్డ్ పరోక్షంగా తోడ్పడుతుంది.
  2. సహకార సంస్థలకు వాటా మూలధనాన్ని అందించటం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు దీర్ఘకాలిక రుణాలను నాబర్డ్ మంజూరు చేస్తుంది.
  3. వ్యవసాయం, కుటీర గ్రామీణ, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు మొదలైన కార్యక్రమాలకు పరపతిని అందించి సమగ్ర గ్రామీణాభివృద్ధికి నాబర్డ్ తోడ్పడుతుంది.
  4. గ్రామీణ బాంకులు సహకార సంఘాలు కార్యకలాపాలను పర్యవేక్షించుడయే గాక పరపతికి సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వానికి, నాబర్డ్ సలహాదారులు వ్యవహరిస్తుంది.
  5. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రణాళికా సంఘం, ఇతర సంస్థల కార్యకలాపాలను సమన్వయలా పరిచి చిన్న, కుటీర గ్రామీణ పరిశ్రమలు, చేతివృత్తులు, హస్తకళలు మొదలైన వీటి అభివృద్ధికి నాబార్ట్ పునర్వత్త సహాయం చేస్తుంది.
  6. తన ఆధీనంలోని విధులు అభివృద్ధి పథకాలను పరిశీలించడమే కాక వాటి పురోగతిని ఎప్పటికప్పుడు మదింపు చేస్తుంది.
  7. వ్యవసాయం గ్రామీణాభివృద్ధితో సంబంధం కలిగి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ సంస్థకైన నాబార్డ్ రుణాలనిచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తుంది.
  8. వ్యవసాయం గ్రామీణాభివృద్ధి రంగాలలో పరిశోధనల కోసం ప్రత్యేకనిధిని నాబార్డ్ ఏర్పాటు చేస్తుంది.

బి) పునర్విత్త విధులు: నాబార్డ్ గ్రామీణ అవస్థాపనానిధి (RIDF) రైతుల పరపతి కార్డులు, (KCC) రైతు క్లబ్బులు, రైతు సాంకేతిక విజ్ఞానం బదిలీ నిధి (FTTF) వ్యవసాయంలో నూతన కల్పనల అభివృద్ధి నిధి (FIDF) మొదలైన నూతన పథకాలను రూపొందించింది. ఈ పధకాల ద్వారా పరపతిని అందిస్తూ నాబార్డ్ గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది.
1) గ్రామీణ అవస్థాపనా అభివృద్ధి నిధి: ఈ నిధిని 1995-96 సం॥లో ఏర్పాటు చేసారు. వాణిజ్య బ్యాంకుల ప్రాధాన్యత రంగాలకు వ్యవసాయానికి ఇచ్చే ఋణాలు పోను మిగిలిన పరిమితి మొత్తంలో ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగినది. ఆనాటి నుండి నాబార్డ్ గ్రామాలలో అవస్థాపనా సౌకర్యాలను కల్పించడం రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం వహిస్తూ వుంది.

ఈ నిధికి 1995-96 బడ్జెట్ లో 2000 కోట్ల రూపాయలను కేటాయిస్తే 2012-13 బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2012-13 నాటికి ఈ నిధి కింద మొత్తం 1,72,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది. భారత్ నిర్మాణ్ ఆశయమైన రహదారులు కల్పనకు ఈ నిధి 18,500 కోట్ల రూపాయలు అందించింది.

2) రైతుల పరపతి కార్డుల పథకం: కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ను ఆగష్టు 1998 సం||లో ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో సకాలానికి తగినంత స్వల్పకాల పంట ఋణాలను రైతులకు అందించేందుకుగాను ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉత్పత్తికి సంబంధించిన ఖర్చుల కోసం, వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేసేందుకుగాను ఈ పథకం రైతులకు సహాయపడుతుంది. ఈ పథకం కింద 2012 ఆగష్టు నెలలో 9.54 కోట్ల కార్డులను మంజూరు చేసి 91,676 కోట్ల రూపాయల రుణాన్ని రైతులకందించడం జరిగింది.

3) సూక్ష్మవిత్తం: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు, స్వయం ఉపాధి లబ్ధిదారులకు స్వల్పమొత్తంలో విత్త సహాయాన్నే అందించడమే సూక్ష్మవిత్తం యొక్క లక్ష్యం. అందుకుగాను బాంకింగ్ సేవలకు పేదవారికి ముంగిటకు తీసుకువచ్చే నూతన కార్యక్రమమే సూక్ష్మవిత్తం. ఈ పథకం పొదుపును ప్రోత్సహించి వడ్డీ వ్యాపారస్తుల కబంద హస్తాలలో పేదవారు చిక్కకుండా కాపాడుతుంది. ఈ పథకం కింద 1986 87 నాబార్డ్ 2012-13 వార్షిక బడ్జెట్ లో 3916.64 కోట్ల రూపాయలు నిత్య సహాయాన్నే స్వయం సహాయక బృందాలకు అందించింది. ప్రభుత్వేతర సంస్థలు కూడా సూక్ష్మవిత్తం అందిస్తున్నాయి.

4) స్వర్ణజయంతి గ్రామీణా స్వయం ఉపాధి ప్రణాళిక: ఈ ప్రణాళికను 1999 సం॥ ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించారు. ఈ ప్రణాళిక ద్వారా ఇచ్చిన ఋణాల మధ్య కాలిక ఋణాలుగా ఉంటాయి. ఈ ప్రణాళిక 2009-10 సం|| బడ్జెట్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా మార్పు చేసి అమలుపరుస్తున్నారు. స్త్రీలు బలహీన వర్గాలవారు సాధకారతను సాధించడమే ప్రధానలక్ష్యంగా ఈ పునర్నిర్మాణం జరిగింది. నాబార్డ్ కూడా ఈ ప్రణాళికలకు పునర్విత సహాయాన్ని అందిస్తుంది. నాబర్డ్ 2012- 13 సం|| వార్షిక బడ్జెట్లో ఈ పథకానికి 111.72 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 14.
భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్లో లోపాలను వివరించి పరిష్కార మార్గాలను సూచింపుము.
జవాబు:
భారత వ్యవసాయ మార్కెటింగ్లో లోపాలు: భారత వ్యవసాయ మార్కెటింగ్లో దోపిడీ అధికంగా ఉంది. అందువల్ల రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను పొందలేకపోతున్నారు. వ్యవసాయ మార్కెటింగ్లోని ముఖ్యమైన లోపాలను కింద వివరించడం జరిగింది.
1) మధ్యవర్తుల జోక్యం: మన వ్యవసాయ మార్కెటింగ్లో రైతులకు, వినియోగదారులకు మధ్య దళారీలు ఎక్కువగా ఉన్నారు. దళారీలు వ్యాపారులతో రహస్యమంతనాలు జరిపి ఉత్పత్తులను తక్కువ ధర చెల్లించి రైతులను మోసగిస్తున్నారు. రకరకాల మోసపూరిత పద్ధతుల ద్వారా వీరు రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఉత్పత్తి యొక్క మార్కెట్ ధరల్లో 60 నుంచి 70% వరకు మధ్య దళారీలే దోచుకుంటున్నారన్నది ఒక అంచనా.

2) మార్కెట్లోని మోసపూరిత విధానాలు: వ్యవసాయ మార్కెటింగ్లో అనేక మోసపూరిత విధానాలు నెలకొని వున్నాయి. వ్యాపారులు, దళారులు కుమ్మకై రైతులను మోసం చేసి తక్కువ ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారస్తులు ఉపయోగించే తూనికలు, కొలతలు ప్రామాణికమైనవి కావు. వీరు నాణ్యతా, పరీక్షలు, ధర్మాలు, మామూళ్ల పేరిట ఉత్పత్తుల్లో కొంత భాగాన్ని కాజేస్తుంటారు. అంతేగాక వ్యాపారస్తులు రైతులకు ఉత్పత్తుల ప్రతిఫలాలను పాయిదా పద్ధతుల్లో చెల్లిస్తుంటారు. అందువల్ల రైతులు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు.

3) రవాణా సౌకర్యాల కొరత: మనదేశంలో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. నేటికి మన గ్రామీణ ప్రాంతాలలో చాలావరకు మట్టి రోడ్లు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ రోడ్లు మీద రవాణా అసాధ్యం. ఎక్కువ భాగం గ్రామీణ రహదారులు రైలు మార్గాలతోను, పక్కారోడ్లు, మార్గాలతో అనుసంధానం చేయబడలేదు. అధికభాగం రైతులు తమ ఉత్పత్తులను స్థానిక సంతలలో లేదా మండీలలో గిట్టుబాటుకాని ధరలకు అమ్ముకోవడం తప్పనిసరైంది.

4) గిడ్డంగి సౌకర్యాల కొరత: ఈ వ్యవసాయ మర్కెటింగ్లో మరో ప్రధాన లోపం రైతులు తాము పండించిన పంటను నిల్వ చేసుకోవాలంటే సరిపడే గిడ్డంగి సౌకర్యాలుండాలి. వీటి కొరతవలన రైతులు తమ ఉత్పత్తులను పాతర్లలోను, మట్టికుండల్లోను అశాస్త్రీయ పద్ధతుల్లో నిల్వ చేస్తారు. ఈ అశాస్త్రీయ పద్ధతుల వల్ల తేమ తగిలి పంట నాణ్యత తగ్గుతుంది. అంతేకాక 10 నుంచి 20% వరకు పంటను చీమలు, ఎలుకలు, పందికొక్కులు తింటున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు గిట్టుబాటు ధర వచ్చేంతవరకు ధాన్యాన్ని దాచుకోలేక తక్కువ ధరలకు నిర్భందంగా అమ్ముకోవలసి వస్తుంది.

5) మార్కెట్ సమాచార లోపం: మనదేశంలోని రైతులు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడం వల్ల వీరికి సమాచారం తెలియదు. నిరక్షరాస్యులైన వీరికి డిమాండ్, సప్లయ్, ధరల్లో మార్పులు, ప్రభుత్వ ధరల విధానం మొదలైన విషయ పరిజ్ఞానం ఉండదు. సమాచార లోపం కారణంగా రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను పొందడంలో విఫలమవుతున్నారు.

6) శ్రేణీకరణ, ప్రామాణీకరణ సదుపాయాల కొరత: వ్యవసాయ ఉత్పత్తులను మనదేశంలో తగినరీతిలో శ్రేణీకరణ చేయడము లేదు. సాధారణంగా రైతులు తమ ఉత్పత్తులను నాణ్యతాపరంగా శ్రేణీకరణ, ప్రామాణికీకరణ చేయకుండా మొత్తం ఉత్పత్తినంతటికి ఒకే ధరకు అమ్ముతున్నారు. శ్రేణీకరణ చేయకపోవడం వల్ల రైతులు తమ నాణ్యమైన ఉత్పత్తులను సైతం తక్కువ ధరలకు అమ్ముకొని నష్టపోతున్నారు.

7) పరపతి సౌకర్యాల కొరత: సంస్థాగత పరపతి సౌకర్యాల కొరతవల్ల మనదేశంలోకి పేద రైతులు గ్రామీణ ప్రాంతాలలో పరపతి కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడతారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పరపతికి వ్యవసాయ మార్కెటింగ్కు మధ్య సమన్వయం కొరవడింది. రైతులు పంట చేతికొచ్చిన తక్షణమే మార్కెట్ ధరలు ఎంత తక్కువగా ఉన్నప్పటికీ అమ్మి వడ్డీ వ్యాపారులకు చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల గిట్టుబాటు ధరలు వచ్చేంత వరకు వేచిఉండలేక రైతులు నష్టపోతున్నారు.

8) రైతులు అసంఘటితంగా ఉండటం: మనదేశంలోని రైతులు వేర్వేరు ప్రాంతాలలో నివసించడంవల్ల సంఘటితం కాలేకపోతున్నారు. కాని వ్యాపారస్తులు మాత్రం సంఘటితంగా ఉండి రైతులను గిట్టుబాటు ధరలు పొందకుండా అడ్డుకుంటున్నారు. ఫలితంగా అసంఘటితమైన రైతులు సంఘటితమై సమిష్టిగా బేరమాడుతున్న వ్యాపారస్తులను ఎదుర్కొని గిట్టుబాటు ధరలు పొందలేక నష్టపోతున్నారు.

నివారణ చర్యలు: వ్యవసాయ మార్కెటింగ్ లోని లోపాలను అరికట్టి రైతులు మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. కింద పేర్కొన్న చర్యలు రైతులు మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతున్నాయి.
1) క్రమబద్ధమైన మార్కెట్లు (Regulated Markets): రైతుల ఉత్పత్తులకు సముచితమైన ధరలు చెల్లించడం, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య ధరలలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలన్న లక్ష్యాలతో 1951లో భారత ప్రభుత్వం 200లకు పైగా క్రమబద్ధమైన మార్కెట్లను ఏర్పాటుచేసింది. 2005 మార్చి చివరకు వీటి సంఖ్య 7521 కి పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లోని లోపాలను సరిదిద్దడం కోసం, వ్యాపారస్తులకు, కమీషన్ ఏజెంట్లకు వారి విధులపరంగా కాకుండా లభించే మార్జిన్లను తగ్గించడం కోసం ఈ మార్కెట్లను రూపొందించారు. క్రమబద్ధమైన మార్కెట్లు కింది విధంగా నిర్వహిస్తాయి.

  1. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నోటీస్ బోర్డులో ఉంచుతాయి.
  2. ప్రామాణికమైన తూనికలు, కొలతల వాడకాన్ని తప్పనిసరి చేస్తాయి.
  3. మధ్యవర్తుల సంఖ్యను తగ్గించి వారికి లైసైన్సులను మంజూరు చేస్తాయి.
  4. తూకం చార్జీలు, దళారీలు కమీషన్లను ముందుగానే మార్కెట్ కమిటీలు నిర్ణయిస్తాయి.

2) సహకార మార్కెటింగ్: భారతదేశంలో మొట్టమొదటి సహాకార మార్కెటింగ్ సంఘం 1951లో ఏర్పడింది. ఈ విధానం డెన్మార్క్ విజయవంతంగా అమలు చేయబడి సత్ఫలితాలనిచ్చింది. ఈ సంఘాల ముఖ్య ఉద్దేశం రైతులు తమ ఉత్పత్తులకు లాభసాటి ధరలు వచ్చేంతవరకు విక్రయించకుండా వేచిఉండేటట్లు చేయడం.
ఈ విధానంలో గ్రామంలోని రైతులందరూ ఒక సంఘంగా ఏర్పడతారు. రైతులు తమ ఉత్పత్తులను సహకార సంఘానికి అందచేసిన వెంటనే కొంత ద్రవ్యాన్ని ముందస్తుగా అందజేస్తారు. సహకార సంఘాల గిట్టుబాటు ధరలు రాగానే ఈ ఉత్పత్తులను విక్రయించి ముందస్తు చెల్లింపులు పోగా మిగిలిన మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు. ప్రతి సంఘం పరిధిలో కొన్ని గ్రామాలు ఉంటాయి.

3) ఒప్పందపు వ్యవసాయం: వ్యవసాయ మార్కెటింగ్ విధానంలోని లోపాలను పరిష్కారించడానికి ఒప్పందపు వ్యవసాయం మరొక మంచి పరిష్కార మార్గం. రైతులు తమ ఉత్పత్తులను వినియోగించే సంస్థలతో ప్రత్యక్షంగా ఒప్పందాలను కుదుర్చుకొని చేసే వ్యవసాయ విధానాన్ని ‘ఒప్పందపు వ్యవసాయం’ అని నిర్వచించవచ్చు.

  1. ఈ విధానంలో ముందుగా ధరలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో ఉండే అస్థిరతలను తొలగించి రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని పెంపొందించవచ్చు.
  2. రైతులు ఏ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో అవి పరపతి, సాంకేతిక సహాయం అందిస్తాయి. 3. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు లభించడానికి అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే రైతులు ముందుగా చేసుకొన్న ఒప్పందాలు మేరకు నాణ్యమైన ఉత్పత్తులను అందించవలసి ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

4) రైతుబజార్లు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1999 జనవరి 26వ తేదీన వ్యవసాయ ఉత్పత్తిని విక్రయించడానికి రైతుబజార్లు అను నూతన మార్కెట్లను ప్రశేశపెట్టింది. ఈ మార్కెట్ కేంద్రాలను నగరాల్లోను, పట్టణాల్లోను ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్లలో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు దళారీల ప్రమేయం లేకుండా విక్రయించుకోవచ్చు. రైతులు ఈ మార్కెట్ కేంద్రాలలో బియ్యం, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులను సహేతుకమైన ధరలకు విక్రయిస్తున్నారు. ఈ మార్కెట్లలో ధరలు ఉత్పత్తిదారులైన రైతులకు, కొనుగోలుదారులకు ఇరువురికి లాభసాటిగా ఉంటాయి. ఈ మార్కెట్లలో వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. దళారులు ఉండరు కనుక రైతులు ఎలాంటి దోపిడికి గురికారు.

5) శ్రేణీకరణ, ప్రామాణికీకరణ: వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణీకరణ, ప్రామాణీకరణ సౌకర్యాల కల్పన కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్ చట్టం 1937 కింద భారత ప్రభుత్వం జైపూర్, భోపాల్, నాగపూర్, భువనేశ్వర్, షిల్లాంగ్ మొదలైన ప్రాంతాలలో వస్తుగుణ నిర్ణయ కేంద్రాలను స్థాపించింది. ఈ ప్రయోగశాలల్లో వస్తువుల యొక్క భౌతిక, రసాయన ధర్మాలను విశ్లేషించి నాణ్యతా ప్రమాణాలను నిర్ధారిస్తారు. ఈ కేంద్రాలలో 162 వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను శ్రేణీకరించి ప్రామాణికీకరిస్తారు. ఉదాహరణకు బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, నూనెలు, నెయ్యి, వెన్న, పత్తి, తేనె, మసాల దినుసులు మొదలైనవి. గ్రేడింగ్ చేసిన వ్యవసాయ వస్తువుల నాణ్యతకు చిహ్నంగా అగ్మార్క్ (AGMARK) గుర్తును ముద్రిస్తారు. అగ్మార్క్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ యొక్క సంకేతం. ఈ గుర్తు ఉన్న వస్తువుల మార్కెట్ విస్తరించడమేగాక, వాటికి సముచితమైన ధరలు లభిస్తాయి.

6) గిడ్డంగి సదుపాయాలు: రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి అవసరమైన గిడ్డంగి సౌకర్యాలు ఉన్నప్పుడు పంట చేతికి రాగానే అమ్మడానికి సిద్ధపడరు. ఉత్పత్తులను నిల్వచేయగల సామర్థ్యం రైతుల యొక్క బేరమాడే శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాక రైతులు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలు వచ్చేంతవరకు వేచి ఉండగల శక్తిని కూడా గిడ్డంగి సౌకర్యాలు కల్పిస్తాయి. గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన సరుకుకు ఇచ్చే రశీదు ఆధారంగా వాణిజ్య బాంకులు రైతులకు రుణాలను మంజూరు చేస్తాయి. అందువల్ల భారత ప్రభుత్వం దేశం నలుమూలల గిడ్డంగులను ఏర్పాటుచేస్తుంది.

7) రవాణా సౌకర్యాలు: చక్కని రహదారులు, తక్కువ రవాణా చార్జీలు, అనువైన రవాణా సాధనాలు ఉన్నప్పుడు రైతులు ఖచ్చితంగా తమ ఉత్పత్తులను మార్కెట్ కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధరలకు అమ్ముకుంటారు. ఎందుకంటే ఈ సౌకర్యాలు రైతులు బేరమాడే శక్తిని పెంపొందిస్తాయి. కాబట్టి ప్రభుత్వం పక్కా రోడ్లను నిర్మించి ట్రాక్టర్లు, ట్రాలీలు మొదలైన చిన్న వాహనాలను గ్రామీణ రవాణా నిమిత్తం ప్రోత్సహించాలి.

8) పరపతి సౌకర్యాలు: రైతులకు సకాలంలో, సరిపడినంత, సంస్థాగత పరపతి సౌకర్యాలు కల్పిస్తే రుణం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించరు. అంతేగాక తమ ఉత్పత్తులకు లాభసాటి ధరలు వచ్చేంతవరకు వేచి వుండి విక్రయిస్తారు. దీని కోసం భారత ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, వాణిజ్య బాంకులు, ప్రాంతీయ గ్రామీణ బాంకులు మొదలైన సంస్థాగత పరపతి సంస్థలను ఏర్పాటుచేసింది. పరపతి, మార్కెటింగ్ సౌకర్యాల నడుమ సమన్వయం కుదిరి, రైతులు లాభపడతారు.

9) మార్కెట్ ధరల సమాచారం: రైతులు ఎప్పుడైతే మార్కెట్లోని వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సంబంధించిన పక్కా సమాచారం తెలుసుకొని ఉంటారో అప్పుడు మాత్రమే సముచిత ధరలకు తమ ఉత్పత్తులను విక్రయించగలరు. ఇందుకోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు రేడియో, టి.వి, వార్తాపత్రికలు మొదలైన సమాచార సాధనాల ద్వారా ధరల సమాచారం రైతులకు తెలియజేయాలి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశ వ్యవసాయరంగం – లక్షణాలు వివరింపుము.
జవాబు:
1) అనిశ్చితమైన వ్యవసాయ ఉత్పత్తులు:భారతదేశ వ్యవసాయరంగం అభివృద్ధి శీతోష్ణస్థితి, రుతువులపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ వ్యవసాయరంగ అభివృద్ధిపై దుష్పరిణామాలు చూపుతున్నాయి. దీనిని బట్టి భారత వ్యవసాయరంగం రుతువులతో జూదం ఆడుతుందని చెప్పవచ్చు.

2) వ్యవసాయరంగంలో భూస్వామ్యం:స్వాతంత్య్రానంతరం మనదేశంలో భూస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపాలైన, జమీందారీ, మహల్వారీ విధానాలు అమలులోకి వచ్చాయి. అందువల్ల కౌలుదారులు రైతుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేవారు.

3) గ్రామీణ రుణగ్రస్తత:స్వాతంత్య్రానంతరం భారతప్రభుత్వం సంస్థాగత సంస్థలైన సహకార పరపతి సంఘాలు, వాణిజ్య బాంకులు మొదలైన వాటిని స్థాపించి గ్రామీణ ప్రజలకు పరపతిని అందిస్తుంది. వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీ వసూలు చేయడంలో పాటు, లెక్కలను తారుమారు చేసి రైతులను మోసం చేయడం పరిపాటైంది, రైతులకు రుణగ్రస్తత నిత్యసమస్యై తగిన పెట్టుబడి లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు అల్పంగా ఉన్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

4) శ్రామిక మార్కెట్లో ద్వంద్వత్వం:వ్యవసాయరంగంపై జనాభా ఒత్తిడి అధికమై ఈ రంగంలో పనిచేసే శ్రామికుల వేతనాల వ్యవసాయేతర రంగాల్లో పనిచేసే శ్రామికుల వేతనాల కంటే తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శ్రామికుల వేతనాలు అల్పంగా ఉన్నందువల్ల వీరిని అధిక సంఖ్యలో వినియోగించి శ్రమ సాంద్ర వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు.

5) వ్యవసాయరంగంలో భిన్నత్వం:దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు భూసారాలు, నీటిపారుదల సౌకర్యాలు, వర్షపాత పరిమాణాలు ఉన్నాయి. అదే విధంగా కొన్ని ప్రాంతాలలో వరదలు, కరువుకాటకాలు, నీటి లవణీయతలు అధికంగాను మరికొన్ని ప్రాంతాలలో అల్పంగాను ఉన్నాయి.

6) సాంకేతిక ద్వంద్వత్వం:నేటికి మనదేశంలో అధిక సంఖ్యాక రైతులు వ్యవసాయ కార్యకలాపాల్లో సనాతన ఉత్పాదకాలైన శ్రామికులు, పశువులు, వర్షాలు, పశువుల పేడ ఎరువు మొదలైన వాటిపై ఆధారపడి జీవనాధార వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి, సాగుచేయడం వల్ల అధిక దిగుబడిని పొందుతున్నారు.

ప్రశ్న 2.
వ్యవసాయ శ్రామికుల ప్రస్తుత స్థితిగతులను వివరింపుము.
జవాబు:
వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు :
1) అల్పసాంఘీక హోదా:నేటికీ వ్యవసాయ శ్రామికులలో ఎక్కువమంది తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన అణగారిన వర్గాలకు చెందినవారు. సాంఘీక అసమానత్వం, దోపిడీ భావన వీరి విషయంలో సర్వసాధారణం. వీరు తమ హక్కుల పరిరక్షణకు ఏమాత్రం పోరాటం చేయలేని దయనీయస్థితిలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వివక్షకు గురైన వీరి సాంఘిక హోదా తక్కువగా ఉంటుంది.

2) అసంఘటిత శ్రామికులు:మనదేశంలో వ్యవసాయ శ్రామికుల మారుమూల గ్రామాలలో నివసిస్తున్నారు. అందువల్ల వీరు సంఘటితం కాలేకపోతున్నారు. వీరికి కార్మికసంఘాలు లేవు. అంతేకాక వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. అందువల్ల అసంఘటితంగా వున్న వీరికి భూస్వాములతో బేరమాడేశక్తి లోపించి తగిన వేతనాలు పొందలేకపోతున్నారు.

3) రుతుసంబంధిత ఉద్యోగిత:వ్యవసాయ కార్యకలాపాలు రుతువులపై ఆధారపడి వుంటాయి. వ్యవసాయ కార్మికులు నాట్లు వేసేటప్పుడు, పంట కోసేటప్పుడు మాత్రం ఉపాధిని పొంది సంవత్సరంలో ఎక్కువ భాగం ఖాళీగా వుంటారు. నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత వీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. అందువల్ల వీరి ఆదాయాలు తక్కువగా ఉండి జీవన ప్రమాణాలు అల్పంగా ఉంటాయి.

4) అల్ప వేతనాలు:వ్యవసాయ శ్రామికులకు చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నందువల్ల వారి కుటుంబ ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శ్రామికులకు వివిధ రాష్ట్రాల్లో ఇచ్చే వేతనాలలో భిన్నత్వం వుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో తప్ప ఎక్కువ రాష్ట్రాలలో వీరికి చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నాయి. హరిత విప్లవనాంతరం వీరికి చెల్లించే ద్రవ్యవేతనాలు పెరిగినప్పటికీ వస్తుసేవల ధరలు పెరిగినందువల్ల వీరి నిజవేతనాలు పెరగలేదు.

5) మహిళా శ్రామికుల పట్ల వివక్షత:వ్యవసాయరంగంలో పురుష శ్రామికులతో సమానంగా మహిళాశ్రామికులకు వేతనాలు ఇవ్వరు. అంతేగాక వ్యవసాయ కార్యకలాపాలతో వీరిచే బలవంతంగా అధికశ్రమ చేయిస్తారు. అనగా వ్యవసాయరంగంలో మహిళాశ్రామికులు వివక్షతకు గురవుతున్నారు.

6) గ్రామీణ రుణగ్రస్తత:గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ శ్రామికుల ఆదాయం తక్కువగా ఉండి పేదరికంలో ఉన్నారు. అందువల్ల వీరికి రుణ అవసరాలు ఎక్కువగా వుంటాయి. వీరికి సంస్థాగత పరపతి సంస్థలనుంచి రుణం తీసుకోవడానికి అవసరమైన హామీపత్రాలు లేనందువల్ల సంస్థాగతం కాని వడ్డీవ్యాపారస్థులు, భూస్వాముల నుంచి అధికవడ్డీలకు రుణం పొందుతున్నారు. ఈ రుణభారం అధికమై తరతరాలుగా వారసత్వంగా సంక్రమించి వ్యవసాయ శ్రామికులు వెట్టిశ్రామికులుగా మారుతున్నారు.

7) అధికసంఖ్యలో బాలకార్మికులు:ఆసియాఖండంలోని బాలకార్మికులలో మూడవ వంతు మంది భారతదేశంలో ఉన్నారు. మనదేశంలోని బాలకార్మికులలో అధిక సంఖ్యాకులు వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు. వీరికి చెల్లిస్తున్న వేతనాలు అత్యల్పంగా వుండి వారి కుటుంబ జీవన ప్రమాణంపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి.

8) వ్యవసాయేతర వృత్తుల కొరత గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర వృత్తులు అభివృద్ధి చెందలేదు. అందువల్ల శ్రామికులు ఉపాధికోసం ఎక్కువగా వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో శ్రామికుల సంఖ్య అధికమై ప్రచ్ఛన్న నిరుద్యోగితకు దారితీసింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 3.
పంటల తీరును ప్రభావితం చేసే అంశాలను వివరింపుము.
జవాబు:
పంటల తీరు:సాధారణంగా ఒకదేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో లభించే సహజ వనరుల లభ్యత, వినియోగంపై ఆధారపడి ఉంటుంది. సహజ వనరులైన భూమి, నీరు, ఖనిజాలు మొదలైన వాటిని సమర్థవంతంగా, అభిలషణీయంగా, వినియోగించినప్పుడే కొనసాగించగలిగే అభివృద్ధి సాధ్యమవుతుంది. అదేవిధంగా భూసారం, నీటిపారుదల సౌకర్యాల లభ్యతను బట్టి దేశంలో విభిన్న పంటలు పండించడం జరుగుతుంది. దేశంలో పండే వివిధ పంటల తీరు ఆ దేశ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేస్తుంది.
పంటలతీరును ప్రభావితం చేసే అంశాలు:భారతదేశంలో పంటల తీరును భౌతిక, సాంకేతిక ఆర్థిక అంశాలతోపాటు ప్రభుత్వవిధానాలు కూడా ప్రభావితం చేస్తాయి.

I) భౌతికాంశాలు:పంటలతీరును నిర్ణయించడంలో భౌతికాంశాల పాత్ర కీలకమైంది.
1) శీతోష్ణస్థితి, వర్షపాతం:శీతోష్ణస్థితి, వర్షపాతం, పంటలతీరును ప్రభావితం చేస్తాయి. ఉష్ణ ప్రాంతాలలో, శీతల ప్రాంతాలలో పండే పంటలు వేర్వేరుగా వుంటాయి. ఉదాహరణకు, శీతల ప్రాంతాలలో మాత్రమే ఆపిల్స్ వుంటాయి. అదేవిధంగా వర్షపాతం కూడా పంటల తీరును ప్రభావితం చేస్తుంది.

2) భూస్వరూపం, భూసారం:భూసారం, భూస్వరూపంపై ఆధారపడి పంటలు పండుతాయి. ఉదాహరణకు నల్లరేగడి మృత్తికలు, పత్తిపంటకు అనుకూలం. అదేవిధంగా గోధుమ పంటకు సారవంతమైన ఒండ్రు, తడిబంకమన్ను మృత్తికలు అవసరం. ఈ విధంగా భూసారం, భూస్వరూపం పంటలతీరును ప్రభావితం చేస్తాయి.

3) నీటిపారుదల:నీటిపారుదల సౌకర్యాలు పంటలతీరును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా లభ్యమైనపుడు వరి, చెరకు, గోధుమ మొదలైన పంటలు పండుతాయి. నీటిపారుదల సౌకర్యాలు తగినంతగా లేనిచోట రాగులు, మొక్కజొన్న, సజ్జలు వంటి పంటలు పండుతాయి.

II) ఆర్థికాంశాలు :
1) ధరలు, ఆదాయం:సాధారణంగా వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను అధికధరలకు విక్రయించి తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవాలనుకుంటారు. వరి, గోధుమలాంటి ఆహార పంటల ధరలపై మార్కెట్ ప్రభావం లేకుండా నిర్దేశిత సేకరణ ధరల పేరుతో ప్రభుత్వం ఈ పంటల ధరలను ముందుగా నిర్ణయిస్తుంది. ఈ విధమైన నియంత్రణల వల్ల రైతులు తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవడానికి వాణిజ్య పంటలైన చెరకు, పత్తి, వేరుశెనగ మొదలైన వాటిని పండిస్తున్నారు.

2) భూకమతాల పరిమాణం: భూకమతాల పరిమాణం పంటల తీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా చిన్న కమతాల రైతులు ఆహారపంటలను, పెద్దకమతాల రైతులు వాణిజ్యపంటలను పండిస్తారు. ఇటీవల కాలంలో చిన్న కమతాల రైతులు కూడా అధిక లాభాలను ఆశించి వాణిజ్యపంటలను పండిస్తున్నారు.

3) ఉత్పాదకాలు, అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయ ఉత్పాదకాలు కూడా పంటల తీరును నిర్ణయిస్తాయి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు మొదలైన ఉత్పాదకాల లభ్యత పంటల తీరును ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా రవాణా, గిడ్డంగులు, మార్కెటింగ్, నీటిపారుదల వంటి అవస్థాపనా సౌకర్యాల లభ్యతపై కూడా పంటల తీరు ఆధారపడి వుంటుంది.

4) భీమా సౌకర్యాలు:సాధారణంగా వ్యవసాయదారులు విభిన్నమైన పంటలు పండిస్తారు. ఏదైన ఒక పంట నష్టానికి గురైనప్పుడు ఆ నష్టాన్ని ఇతర పంటల నుండి రాబట్టుకోవచ్చు అన్న ఉద్దేశ్యంలో బహుళపంటలు పండిస్తారు. అదే ప్రభుత్వం నష్టభయాన్ని ఎదుర్కొనడానికి ఏ పంటలకు బీమా సౌకర్యాలను కల్పిస్తుందో ఆ పంటలను రైతులు ధీమాగా పండిస్తారు.

5) కౌలుదారీ పద్ధతి:సాధారణంగా భూస్వాములు తమ భూములను కౌలుకు ఇచ్చేటప్పుడు ఏ పంటలు పండించాలో ముందుగానే కౌలుదార్లతో ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి పంటలతీరు భూస్వాముల ఇష్టాలపై చాలావరకు ఆధారపడి వుంటుంది.

6) సాంఘీక కారణాలు:పరిసరాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మొదలైన సాంఘీక అంశాలు పంటల తీరును నిర్ణయించడంలో కొంతమేరకు ప్రభావాన్ని చూపుతాయి. ఈ అంశాలు రైతులను సాంప్రదాయ పంటలను, సాంప్రదాయ పద్ధతుల్లో పండించేటట్లు ప్రేరేపిస్తాయి.

ప్రశ్న 4.
నీటిపారుదల సౌకర్యాల ప్రాధాన్యతను వివరింపుము.
జవాబు:
నీటిపారుదల ప్రాధాన్యత :
1) అకాల అనిశ్చిత వర్షాలు:వర్షాలు రుతువులపై ఆధారపడి సంవత్సరంలో నాలుగునెలలకు మాత్రమే పరిమితమై వుంటాయి. కొన్నిసార్లు రుతువుల్లో సైతం వర్షపాతం అల్పంగా ఉండటమేగాక, అకాల వర్షాలు వస్తుంటాయి. నీటిపారుదల సౌకర్యాలను విస్తృత పరుచుట ద్వారా కరువుకాటకాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

2) ఉత్పాదకత పెరుగుదల:నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా వున్నచోట వ్యవసాయ ఉత్పాదకత ఎక్కువగా వుంటుంది. నీటిపారుదల సౌకర్యాలు వున్నప్పుడే ఆధునిక వ్యవసాయ ఉత్పాదకాలైన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి. విత్తనాలు, ఎరువులు మొదలైన వాటిని వినియోగించడానికి వీలవుతుంది. ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో వార్షిక పెరుగుదల 1.6 శాతం నుండి 2.6 శాతానికి పెరిగింది. అదే నీటిపారుదల సౌకర్యాలు అల్పంగా వున్న ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల 1శాతం లేదా గమనించలేనంత తక్కువగా నమోదైంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) బహుళ పంటలు పండించడం:భారతదేశం ఉష్ణమండల, ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితులు విస్తరించి వున్నాయి. ఈ దేశానికి సంవత్సరమంతా పంటలు పండించగల సామర్థ్యం వుంది. మనదేశంలో వర్షపాతం నాలుగు నెలలలోపు కాలానికి మాత్రమే పరిమితమైంది. కాబట్టి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే సంవత్సరమంతా బహుళ పంటలు పండించవచ్చు.

4) నూతన వ్యవసాయ వ్యూహంలో ప్రధానపాత్ర:నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా ప్రవేశపెట్టబడిన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను, రసాయనిక ఎరువులను విజయవంతంగా వినియోగించాలంటే సకాలంలో, సరిపడినంత నీటిపారుదల సౌకర్యాలు అవసరం. ఈ విత్తనాలు, ఎరువుల వినియోగానికి క్రమబద్ధంగా పుష్కలంగా నీటిని అందించాలి. నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే నూతన వ్యవసాయ వ్యూహం కిందసాగులో వున్న భూవిస్తీర్ణం పెరుగుతుంది.

5) సాగుభూమి విస్తీర్ణంలో పెరుగుదల:భూవినియోగ గణాంకాల ప్రకారం మనదేశంలో లెక్కించిన మొత్తం భూమి 2009-10 నాటికి 305.56 మిలియన్ల హెకార్టు. ఇందులో 42.95 మిలియన్ల హెక్టార్లు వ్యవసాయం చెయ్యని భూములు కాగా 26.23 మిలియన్ల హెక్టార్లు బంజరు భూములుగా వున్నాయి. నీటిపారుదల సౌకర్యాల కల్పిస్తే నిరుపయోగంగా వున్న ఈ భూములను కొంతమేరకు సాగులోకి తీసుకురావచ్చు.

6) సంపద పెరుగుదల:కరువు కాటకాలు సంభవించినప్పుడు సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు అస్థిరతకు లోనవుతాయి. కాని నీటిపారుదల సౌకర్యాల కరువు కాటకాల సమయంలో పంటలను రక్షించి వ్యవసాయ ఉత్పత్తులను ఒడిదుడుకులకు గురికాకుండా స్థిరీకరిస్తాయి. ఉత్పత్తులలో స్థిరీకరణ సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పరిరక్షించబడి సంపద స్థిరంగా పెరుగుతుంది.

7) పరోక్ష ప్రయోజనాలు:నీటిపారుదల సౌకర్యాలను దేశం నలుమూలలకు విస్తరింపజేయడం ద్వారా ఆహారధాన్యాలు ఉత్పత్తిలో అసమానతలు రూపుమాసిపోతాయి. అంతేకాక వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుతుంది. ఈ విధంగా సాధించబడిన పెరుగుదల వ్యవసాయ ఉత్పతుల ధరల స్థిరీకరణకు తోడ్పడుతుంది.
భారత ఆర్థికవ్యవస్థ ప్రాధాన్యతా రంగాల్లో ఒకటైన వ్యవసాయ రంగాన్ని ప్రగతి ప్రధాన నడవడంలో నీటిపారుదల సౌకర్యాలు కీలక భూమికను పోషిస్తున్నాయి.

ప్రశ్న 5.
వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండటానికి గల కారణాలు వివరింపుము.
జవాబు:
భారత వ్యవసాయరంగంలో ఉత్పత్తి అల్పంగా వుండటానికి అనేక కారణాలు వున్నాయి. వీటిని ప్రధానంగా నాలుగురకాలుగా వర్గీకరించారు.
1) సాధారణ కారణాలు 2) వ్యవస్థాపూర్వక కారణాలు 3) సాంకేతిక కారణాలు 4) పర్యావరణ కారణాలు సాధారణ కారణాలు:వ్యవసాయ ఉత్పత్తి అల్పంగా వుండటానికి గల కారణాలు కింద విశ్లేషించబడినాయి.

1) వ్యవసాయరంగంపై జనాభా వత్తిడి:భారతదేశంలో జనాభా వేగంగా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 263 మిలియన్ల జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగం మీద ఆధారపడి వున్నారు. దీనికి తోడు వ్యవసాయేతర రంగాల్లో ప్రగతి చురుకుగా లేనందువల్ల పెరుగుతున్న జనాభా జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడటం తప్పనిసరైంది. అందువల్ల వ్యవసాయరంగం మీద ఒత్తిడి ఎక్కువై కమతాల విభజన, విఘటనలతో పాటు ప్రచ్ఛన్న నిరుద్యోగిత అధికమవుతుంది.

2) నిరాశాపూరిత గ్రామీణ వాతావరణం:మనదేశంలో గ్రామీణ వాతావరణం నిరాశాజనకంగా వుండి, వ్యవసాయ ప్రగతికి ప్రతిబంధకంగా మారింది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఎక్కువగా పేదవారు, నిరక్షరాస్యులు, అందువల్ల వీరు మూఢనమ్మకాలకు, సనాతన సాంప్రదాయాలకు విలవినిస్తూ నూతన వ్యవసాయ వ్యూహం యెడల నిరాసక్తతను కనపరుస్తున్నారు. రైతులలో సంకుచిత ధోరణి ఏర్పడి ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నమవడం, భూమిపై మక్కువ మొదలైన గ్రామీణ పరిస్థితుల వల్ల వ్యవసాయ కమతాలు విభజన, విఘటనలకు గురై వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతింటుంది. గ్రామీణ ప్రాంతాలలో కక్షలు, కుట్రలు, తగాదాలు, కోర్టు వ్యవహారాలు మొదలైన వాటి కారణంగా నిరుత్సాహపూరితమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడి రైతులు తమ విలువైన సమయం, ధనం వృథా చేసుకుంటున్నారు. ఫలితంగా మనదేశ వ్యవసాయరంగంలో ఉత్పాదకత తక్కువగా వుంది.

3) అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయాభివృద్ధికి అవసరమైన పరపతి, రవాణా, మార్కెటింగ్, గిడ్డంగి, సౌకర్యాలు రైతుల అవసరాలకు సరిపడినంతగా లేవు. జాతీయ బ్యాంకులు, సహకార పరపతి సంస్థలు, వ్యవసాయ విస్తరణ సేవా కేంద్రాల ప్రోత్సాహం రైతులందరికి అందుబాటులో లేదు. ఈ విధమైన అవస్థాపనా సౌకర్యాల కొరత వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదలకు ప్రతిబంధకంగా తయారైంది.

4) బ్రిటీష్ పాలనా ప్రభావం: బ్రిటీషువారు తమ పరిపాలనా కాలంలో భారతదేశాన్ని ఒక వలసదేశంగా భావించారే తప్ప మనదేశ వ్యవసాయాభివృద్ధికి ఏవిధమైన చర్యలు చేపట్టలేదు. వారనుసరించిన భూస్వామ్య విధానాలు, కౌలుదారి విధానాలు, భూమిశిస్తు వసూళ్ళు భారత వ్యవసాయరంగ ప్రగతిని దెబ్బతీశాయి. మనదేశ వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా వుండటానికి బ్రిటీషువారి పాలన చాలావరకు కారణమైంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

II) వ్యవస్థాపూర్వక కారణాలు :
1) అల్ప కమతాల పరిమాణం: మనదేశంలో భూకమతాల పరిమాణం చాలా అల్పంగా ఉంది. జాతీయ సర్వేక్షణా సంస్థ నివేదిక ప్రకారం 1960 – 61లో రెండు హెక్టారుల కంటే తక్కువ పరిమాణం ఉన్న కమతాలు మొత్తం కమతాలలో 52 శాతం వుండగా 2010-11 నాటికి వీటి సంఖ్య 85 శాతానికి పెరిగింది. ఎక్కువ భూమి కొద్దిమంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. వీరు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపరు. వారసత్వ చట్టాలు, కమతాల విభజన, విఘటనల ఫలితంగా కమతాల పరిమాణం అల్పంగా వుండి తక్కువ భూమి ఎక్కువ మంది రైతుల ఆధీనంలో వుంది. చిన్న కమతాలు నూతన వ్యవసాయ కార్యకలాపాలకు అనుగుణంగా ఉండకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉంది.

2) భూస్వామ్య వ్యవస్థలోని లోపాలు:బ్రిటీషువారి పరిపాలనా కాలంలో మనదేశంలో ఏర్పాటు చేసిన జమీందారీ పద్ధతి, జాగిర్దారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి మొదలైన లోపభూయిష్టమైన భూస్వామ్య పద్ధతులు వ్యవసాయప్రగతిని ఆటంకపరచాయి. స్వాతంత్ర్యానంతరం రైత్వారీ పద్ధతి అమలులోకి వచ్చింది. ఈ విధానంలో కౌలుదారులకు కౌలుభద్రత, నిశ్చితమైన కౌలు పరిమాణం భూయాజమాన్యం హక్కులు వుండేవి కావు. ఈ అభద్రతల కారణంగా కౌలుదారుల వ్యవసాయంపై శ్రద్ధ చూపలేరు. ఫలితంగా వ్యవసాయరంగం యొక్క ఉత్పాదకత తగ్గింది.

3) మార్కెట్, పరపతి సౌకర్యాల కొరత: వ్యవసాయభివృద్ధికి అవసరమైన మార్కెట్ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, పరపతి సౌకర్యాలు కొరత వలన నూతన పద్ధతిలో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడం కష్టమైంది. వీరికి కావలసిన పరపతి సముచితమైన వడ్డీరేట్లకు లభించదు. అంతేగాక ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ ఉత్పత్తులకు అందించే రాయితీలు సంతృప్తికరంగా లేవు. ఈ కారణాల వల్ల అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, నీటిపారుల సౌకర్యాలను ఉపయోగించి నూతన పద్ధతులలో సాగుచేయడానికి బదులు సాంప్రదాయ పద్దతులలో సాగుచేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో ఉత్పాదకత తగ్గింది.

III) సాంకేతిక కారణాలు :
1) పురాతన ఉత్పత్తి పద్ధతులు:భారతదేశంలోని రైతులు పేదరికం, అవగాహనారాహిత్యం కారణంగా పురాతన పనిముట్లు సహాయంతో సాంప్రదాయమైన వ్యవసాయ పద్ధతులలో సాగుచేయడం వల్ల పురాతన ఉత్పత్తి ఉత్పాదకత తక్కువగా వున్నాయని టి. డబ్ల్యు. హార్ట్ అనే ఆర్థికవేత్త అభిప్రాయపడినారు. నేటికి భారతీయ రైతులు కొడవళ్ళు, చెక్కనాగళ్ళు, ఎడ్లబండ్లు ఉపయోగిస్తున్నారు. వీరు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులను, క్రిమిసంహారక మందులను, యంత్రాలను పరిమితంగా వాడుచున్నారు. కాని ప్రభుత్వ నిర్విరామ కృషి, విద్యావ్యాప్తి ఫలితంగా ఇటీవల కాలంలో ఈ పరిస్థితులలో కొంతమేరకు మార్పు వచ్చింది.

2) నీటిపారుదల సౌకర్యాల కొరత:2011 నాటికి వివిధ పంటల కింద సాగవుతున్న భూవిస్తీర్ణం 198.97 మిలియన్ హెక్టారులు వుండగా అందులో 89.36 మిలియన్ హెక్టారుల భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం వుంది. అంటే 55శాతం సాగు భూమికి వర్షాలే ఆధారం. అకాల, అల్ప, అనిశ్చిత వర్షాల వల్ల వర్షాధార ప్రాంతాలలో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితులలో నూతన వ్యవసాయ వ్యూహం దేశమంతా విస్తరించడం కష్టమై వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకాలు, తక్కువగా వున్నాయి.

3) వ్యవసాయ ఉత్పాదకాల కొరత:అధిక దిగుబడిని సాధించుటకు ఆధునిక ఉత్పాదకాల వినియోగం తప్పనిసరి. ఆధునిక ఉత్పాదకాలైన సంకరజాతి విత్తనాలు, రసాయనిక ఎరువులు, యంత్రాలు, క్రిమిసంహారక మందుల సరఫరా రైతుల అవసరాలకు సరిపడినంతగా లేదు. ఉత్పాదకాలు సరిపడినంతగా లభ్యం కానందువల్ల వాటి వినియోగం తగ్గి వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత అల్పంగా వున్నాయి.

IV) పర్యావరణ కారణాలు:వ్యవసాయ ఉత్పాదకతను నిర్ణయించడంలో పర్యావరణం పాత్ర ప్రముఖమైనది. భూసార క్షీణత, వాతావరణంలో మార్పులు, నీటికాలుష్యం, వాయు కాలుష్యం, మొదలైనవి వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకాల మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి. పంటల క్షీణతకు కింది పర్యావరణ ప్రతికూల అంశాలు కారణభూతాలు అవుతున్నాయి.

  1. భూతాపం.
  2. భూసారం క్షీణించడం.
  3. అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉపయోగించి సాంద్రవ్యవసాయం చేయడం.
  4. మితిమీరి రసాయనిక ఎరువులను వాడటం.
  5. పోడు వ్యవసాయం.
  6. పర్యావరణ పరిరక్షణా ప్రణాళికలు లేకపోవడం.
  7. సాంప్రదాయ పంటలను సాగుచేయకపోవడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 6.
ప్రస్తుతం భూమి వినియోగం తీరును వివరింపుము.
జవాబు:
ఆర్థిక వ్యవస్థ ప్రగతి సహజవనరులు లభ్యత, వినియోగం పై ఆధారపడి ఉంటుంది. సహజ వనరులలో భూమి అత్యంత ప్రధానమైన వనరు. భూమి యొక్క పరిమాణం అవ్యాకోచంగా ఉంటుంది. భూమి పరిమాణం ఆర్థికాభివృద్ధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల నేటి ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా భూ వినియోగం తీరులో మార్పులు తీసుకొని రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారతదేశంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణం 328.72 మిలియన్ల హెక్టార్లు మొత్తం సాగవుతున్న పంట భూమి 192.. మిలియన్లు హెక్టార్లు. బీడుభూములు మొత్తం పరిమాణం 26 మిలియన్ల హెక్టార్లు. అడవుల క్రింద వున్న భూవిస్తీర్ణం 70 మిలియన్ల హెక్టార్లు.

ఇటీవల కాలంలో భూమి వినియోగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. భూస్వాముల ఆధీనంలోని బంజరు భూములను భూసంస్కరణల తరువాత వ్యవసాయయోగ్యంగా మార్చడం జరిగింది. బంజరు భూముల పునరుద్ధరణ “ఫలితంగా సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. నీటిపారుదల సౌకర్యాల విస్తరణ వల్ల అల్ప ఫల కాలపు సంకరజాతి వంగడాల సృష్టి ఫలితంగా ఒకటి కంటే ఎక్కువ పంటలు పండే భూవిస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

నాటికి కౌ 23 మిలియన్ల హెక్టార్లు భూమికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించడం జరిగింది. వ్యవసాయేతర అవసరాలైన నివాస స్థలాలు, పరిశ్రమల స్థాపనకు భూవనరుల వాడకం అధికమైంది. దీని ఫలితంగా పొలాలలో ఉన్న భూవిస్తీర్ణం తగ్గి వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. కాబట్టి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి భూవనరులను అభిలషణీయంగా వినియోగించాలి.

ప్రశ్న 7.
భారతదేశంలో కమతాల సమీకరణ.
జవాబు:
మనదేశంలో కమతాల విభజన విఘటనకు గురై చిన్న పరిమాణానికి చేరి పంటల సాగును లాభదాయకం కాని పరిమాణానికి చేరినాయి. ఈ చిన్న కమతాలన్నింటిని కలిపి ఒక పెద్ద కమతంగా ఏర్పాటు చేయడం చాలా అవసరం. విడివిడిగా చిన్న చిన్నగా ఉన్న కమతాలను ఒక్కటిగా చేయటమే కమతాల సమీకరణ అంటారు. ప్రారంభంలో ఈ ప్రక్రియ చాలా వేగంగా జరిగింది. 2001 సం॥ సెప్టెంబరు నాటికి 1,633 లక్షల ఎకరాలలో మాత్రమే కమతాల సమీకరణ సాధ్యపడింది. రైతులు సమీకరణకు సహకరించలేదు. అందువల్ల ఉత్తరప్రదేశ్లో తప్ప మిగతా రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. కమతాల సమీకరణ కార్యక్రమం విజయవంతం అవడానికి రైతుల సహకారం చాలా అవసరం.

ప్రశ్న 8.
లాభసాటి కమతాలు ఏర్పాటు.
జవాబు:
చిన్న కమతాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలకు ముఖ్యమైన పరిష్కారం మార్గం లాభసాటి కమతాల ఏర్పాటు. భారత వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి లాభసాటి కమతాల ఏర్పాటు తప్పనిసరి. కొంతమంది ఆర్థికవేత్తలు లాభసాటి కమతాలను “కుటుంబ కమతాలు” లేదా “అభిలషణీయ కమతాలు” అంటారు.

లాభసాటి కమతాలను ఏర్పాటు చేయడానికి క్రింది సూచనలు సహకరిస్తాయి.

  1. ప్రభుత్వం లాభసాటి కమతాలను ఏర్పాటు చేయడానికి ముందు భూములను, శాస్త్రీయంగా వర్గీకరించాలి.
  2. ప్రభుత్వం భూములను శాస్త్రీయంగా వర్గీకరించి, ఆర్థిక కమతం పరిమాణాన్ని నిర్ణయించేటపుడు భూసారాన్ని, నీటిపారుదల, రవాణా సౌకర్యాలను పరిగనణలోనికి తీసుకోవాలి.`
  3. ప్రభుత్వం చట్టాలను రూపొందించి, “ప్రామాణిక కమతం” పేరుతో లాభసాటి కమతాల కనీస పరిమాణాన్ని నిర్దేశించాలి.
  4. ప్రభుత్వం జనాభా పెరుగుదలను అరికట్టడానికి చట్టాలను రూపొందించి భూమిపై జనాభా ఒత్తిడిని తగ్గించి కమతాల విభజనను అరికట్టి ఆర్థిక కమతాల ఏర్పాటును ప్రోత్సహించాలి.
  5. ప్రభుత్వం లాభసాటికాని చిన్న కమతాలలో సాగు చేస్తున్న చిన్న రైతులను జీవనోపాధికై తమ కమతాలను వదిలి వ్యవసాయేతర రంగాలపై ఆధారపడేటట్లు ప్రోత్సహించాలి.

ప్రశ్న 9.
భారతదేశంలో భూ సంస్కరణల ఆవశ్యకత. [Mar ’17, ’16]
జవాబు:
భూసంస్కరణల ఆవశ్యకత :
1) వ్యవసాయాభివృద్ధి:వ్యవసాయాభివృద్ధిని ఆటంకపరిచే వివిధ రకాల ప్రతిబంధకాలను భూసంస్కరణల ద్వారా నిరోధించవచ్చు. ఉదాహరణకు మధ్యవర్తుల తొలగింపు, కౌలు సంస్కరణలు, కమతాల సమీకరణ, కమతాల విభజనను అరికట్టుట, సహకార వ్యవసాయం మొదలైన సంస్కరణలు. అప్పుడు మాత్రమే సాంకేతిక సంస్కరణలు సఫలమై వ్యవసాయాభివృద్ధి జరుగుతుంది.

2) ఆర్థికాభివృద్ధి:భూసంస్కరణల మరొక లక్ష్యం ఆర్థికాభివృద్ధిని సాధించడం. వ్యవసాయాభివృద్ధి పరిశ్రమలు, వ్యాపారం, రవాణా మొదలైన ఇతర రంగాల అభివృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ముందుగా వ్యవసాయరంగం, అభివృద్ధి చెందాలి. తద్వారా కొనసాగించగల అభివృద్ధిని సాధించడం సాధ్యమవుతుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) సాంఘీక న్యాయం:భూసంస్కరణలను అమలుచేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం, ఆదాయ అసమానతలను తగ్గించి, సాంఘిక న్యాయాన్ని సాధించి సామ్యవాదరీతి సమాజ స్థాపనకు పునాదులు వేయవచ్చు. ఉదాహరణకు, కౌలు భద్రత వల్ల కౌలుదార్లు వ్యవసాయం మీద శ్రద్ధ చూపుతారు. కమతాల గరిష్ట పరిమితి చట్టాలు భూపంపిణీలోని అసమానతలను రూపుమాపుతాయి. అంతేకాక బలహీన వర్గాల ప్రజలకు భూమి పంపిణీ చేయడం, నివాస స్థలములు ఇవ్వడం, స్త్రీలకు భూమిపై యాజమాన్యపు హక్కులను కల్పించడం మొదలైన కార్యక్రమాల ద్వారా సాంఘిక న్యాయాన్ని సాధించవచ్చు.

4) వ్యవసాయ ఉత్పాదకత:భూసంస్కరణ ద్వారా భూమి యాజమాన్యానికి సంబంధించి, వ్యవస్థాపూర్వక మార్పులు తేవడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించవచ్చు. యాజమాన్యపు హక్కులు కల్పించడం ద్వారా కౌలుదార్లు, రైతుకూలీలు శ్రద్ధలో వ్యవసాయం చేసి అధిక ఉత్పత్తిని సాధిస్తారు. ఈ విధంగా అదనపు వ్యయం లేకుండానే భూసంస్కరణల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను అధికం చేయవచ్చు.

ప్రశ్న 10.
భూ సంస్కరణలలో భాగంగా మధ్యవర్తుల తొలగింపు.
జవాబు:
మధ్యవర్తుల తొలగింపు:మనదేశంలో భూ సంస్కరణలను అమలుచేయడంలో భాగంగా మధ్యవర్తులను తొలగించడమైనది. జమీందారి విధానం, జాగీరుదారుని విధానం, రైత్వారీ విధానంలోని లోపాలను తొలగించడం. 1948లో మధ్యవర్తుల తొలగింపు చట్టం చేశారు. ఫలితంగా 30 లక్షల మంది కౌలుదార్లు 62 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్యపు హక్కులు పొందారు. మనదేశం తొలగించిన మధ్యవర్తులకు నష్టపరిహారం చెల్లించింది.

ప్రశ్న 11.
కమతాల గరిష్ట పరిమితి.
జవాబు:
కమతాల గరిష్ట పరిమితి చట్టాలు రైతులకు ఉండవలిసిన భూమి గరిష్ట పరిమితిని నిర్ధేశిస్తాయి. కమతాల గరిష్ట పరిమాణం అన్నీ రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదు. ప్రభుత్వం గరిష్ట పరిమాణాన్ని నిర్ణయించేటప్పుడు భూసారం నీటి పారుదల సౌకర్యాలు, వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులు, పంటల స్వభావం మొదలైన అంశాలను పరిగణలోనికి తీసుకొంటుంది.

గరిష్ట పరిమాణం నిర్ణయించడంలో ఏకరూపకతను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 1972లో ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
1) గరిష్ట పరిమితి పరిమాణం:నిశ్చితంగా నీటిపారుదల సౌకర్యాలు కలిగి, సంవత్సరానికి రెండు పంటలు పండే సారవంతమైన భూములు విషయంలో గరిష్ట పరిమితి 18 ఎకరాలుగా నిర్ణయించడమైనది. ఈ ప్రత్యేక రకాల భూముల గరిష్ట పరిమితిని నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు విచక్షణాధికారం ఉంది.

2) గరిష్ట పరిమాణాన్ని నిర్ణయించే యూనిట్:కమతాల గరిష్ట పరిమాణాన్ని నిర్ణయించేటప్పుడు కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటారు. కుటుంబం అంటే భార్య, భర్త, సంతానంగా నిర్వచించబడింది. ‘ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఐదుగురు మించినట్లైతే, ప్రతి అదనపు సభ్యునికి భూమిని కేటాయించి గరిష్ట పరిమితిని నిర్ణయిస్తారు. ఈ విధంగా నిర్ణయింబడిన గరిష్ట పరిమితి కుటుంబ యూనిట్ గరిష్ట పరిమితి రెట్టింపు కంటే ఎక్కువగా ఉండకూడదు. కుటుంబంలో యుక్త వయస్సుకు వచ్చిన ప్రతీ సభ్యుడిని వేరే యూనిట్గా పరిగణిస్తారు.

3) మినహాయింపులు:కమతాల గరిష్ట పరిమితిని నిర్ణయించేటప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన గరిష్ట పరిమితి మినహాయింపు చట్టాల్లో ఏకరూపకత లేదు. కాఫీ, టీ, రబ్బరు, కోకో మొదలైన తోట పంటల భూములను పంచదార కర్మాగారాలు, సహకార వ్యవసాయ క్షేత్రాల ఆధీనంలో ఉన్న భూములను గరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయించారు..

4) మిగులు భూమి పంపిణీ:కమతాల గరిష్ట పరిమితి చట్టాల అమలుచేయడం ద్వారా లభించిన మిగులు భూమిని భూమి లేని రైతు కూలీలు, చిన్నరైతులు, ఉపాంత రైతులకు పంపిణీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రశ్న 12.
భూ సంస్కరణలు విఫలం కావడానికి కారణాలు.
జవాబు:
భూ సంస్కరణలు పేదరికాన్ని నిర్మూలించి పేదవారికి సాధికారిత కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించినప్పటికీ ఆచరణలో అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాయి.
కారణాలు :

  1. రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేకపోవడం.
  2. బీనామి పేర్ల పై భూమి బదిలీ చేయడం.
  3. భూసంస్కరణ శాసనాలలో ఏక రూపత లేకపోవడం.
  4. న్యాయస్థానాల జోక్యం.
  5. భూమికి సంబంధించిన రికార్డులు సరిగ్గా లేకపోవడం.
  6. భూసంస్కరణ మినహాయింపు చట్టాలలో లొసుగులు ఉండటం.
  7. గ్రామీణ పేదలు అసంఘటితంగా ఉండటం.
  8. అవినీతిమీయమైన పరిపాలనా యంత్రాంగం.

ప్రశ్న 13.
భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావాన్ని వివరింపుము. [Mar ’17]
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం:హరిత విప్లవం భారత ఆర్థిక వ్యవస్థపై విశేష ప్రభావాన్ని చూపింది. హరిత విప్లవం వల్ల ఏర్పడిన సత్ఫలితాలను కింది విధంగా వివరించవచ్చు.
1) ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల హరిత విప్లవం యొక్క ప్రత్యక్ష ఫలితం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అధిక పెరుగుదల సాధించడం. హరిత విప్లవం ప్రభావం వరి, గోధుమ ఉత్పత్తి మీద ఎక్కువ ఉంది. 1960-61లో వరి, ధాన్యం ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 104 మిలియన్ టన్నులకు పెరిగింది. గోధుమ ఉత్పత్తి 1960-61లో 11 మిలియన్ టన్నులు ఉండగా 2011-12 నాటికి 255 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 2012-13 నాటికి 257 మిలియన్ టన్నులకు పెరిగింది.

2) వాణిజ్య పంటల ఉత్పత్తిలో పెరుగుదల:హరిత విప్లవం ప్రారంభంలో ఆహార పంటలకు మాత్రమే పరిమితమై వాణిజ్య పంటల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. హరిత విప్లవం 1973-74 తరువాత వాణిజ్య పంటలైన చెరకు ఉత్పత్తి మీద విశేషమైన ప్రభావాన్ని, నూనె గింజలు, బంగాలదుంపల ఉత్పత్తుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపింది. చెరకు ఉత్పత్తి 1960-61 లో 110 టన్నుల నుంచి 2011-12 నాటికి 358 మిలియన్ టన్నులకు పెరిగింది. మానె గింజల ఉత్పత్తి 1960-61లో 7 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 30 మిలియన్ టన్నులకు పెరిగింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

3) ఉపాధి అవకాశాల పెరుగుదల: హరిత విప్లవం ఫలితంగా సాగులోవున్న భూ విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వ్యవసాయరంగంలో శ్రమశక్తి ఎక్కువ అవసరమయ్యే వరి, చెరకు, తోటపంటలు, బంగాళదుంపలు కూరగాయలు మొదలైన పంటలు సాగుచేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతేగాక సాంద్ర వ్యవసాయంలో భాగంగా బహుళ పంటలు పండించటం వల్ల కూడా ఉపాధి అవకాశాలు వృద్ధి చెందాయి. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయరంగంలో చిల్లర అమ్మకాలు చేపట్టడంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి.

4) బలిష్టమైన ముందు, వెనుక బంధాలు:వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండూ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడే రంగాలు వ్యవసాయం పరిశ్రమలకు కావల్సిన ముడిసరుకులనూ అందిస్తుంది. దీన్నే “ముందువైపు బంధం” అంటారు. అనాదిగా బలిష్టంగా ఉంది. పరిశ్రమలు వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలను అందిస్తుంది. దీనిని “వెనుకవైపు బంధం” అంటారు. అయితే ఈ బంధం బలహీనంగా ఉంది. హరిత విప్లవ ఫలితంగా పారిశ్రామిక రంగం సరఫరా చేసే వ్యవసాయ ఉత్పాదకాలను విపరీతంగా గిరాకీ పెరిగింది. తద్వారా వెనుక వైపు బంధం కూడా బలిష్టమైనది. ఈ విధంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండూ బలోపేతం చేయబడ్డాయి.

5) ఆదాయల్లో పెరుగుదల:ఈ నూతన వ్యవసాయ వ్యూహం రైతులు తాము పండించిన పంటలను శ్రేణీకరణ, ప్రామాణీకరణ చేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధరలకు ప్రత్యక్షంగా చిల్లర వ్యాపారం. చేసే కంపెనీలకు, అమ్ముకొనే అవకాశాలను కల్పించింది. ఈ కంపెనీలు రైతులకు లాభసాటి ధరలను, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే గాక ధరల నియంత్రణకు తోడ్పడ్డాయి. హరితవిప్లవ ఫలితంగా పంజాబ్, హర్యానా మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతుల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.

6) పేదరికం తగ్గుదల:హరిత విప్లవం ఉపాధి అవకాశాలను వ్యవసాయరంగంలోనే కాక వ్యవసాయేతర రంగాలైన రవాణా, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పరిశ్రమల్లో, బ్యాకింగ్, సేవారంగాల్లో ఉపాధిని కల్పించింది. అంతేకాక హరితవిప్లవ ఫలితంగా ఆహారధాన్యాలలో లభించిన మిగులును ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌకధరలకు పేదవారికి అందించడం జరుగుతుంది. దీని ఫలితంగా పేదవారి వాస్తవిక ఆదాయం పెరిగి పేదరికం తగ్గుతుంది.

ప్రశ్న 14.
గ్రామీణ పరపతినందించడంలో ప్రాంతీయ గ్రామీణ బాంకుల పాత్ర.
జవాబు:
భారత ప్రభుత్వం ఆచార్య యమ్. నరసింహం కమిటి సిఫార్సుల ఆధారంగా 1975 అక్టోబర్ 2వ తేదిన ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 5 ప్రాంతీయ, గ్రామీణ బాంకులను ప్రారంభించింది. తరువాత కాలంలో వీటి సంఖ్య 196కి చేరింది. ప్రభుత్వ గ్రామీణ బాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వీటిని ఏకీకృతం చేసింది. సాధారణంగా గ్రామీణ బాంకులను ఒక జాతీయ బాంకు పూచిపై స్థాపించటం జరుగుతుంది. 2013 మార్చి చివరకు 26 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 635 జిల్లాలలో 17,856 గ్రామీణ బాంకు శాఖలు ఉన్నాయి.

ప్రతి గ్రామీణ బాంకు అధీకృత మూలధనం ఒక కోటి రూపాయలు, దీనిలో చెల్లించిన మూలధనం 25 లక్షల రూపాయలు. ఈ మొత్తంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 35 శాతం పూచీ ఇచ్చిన ప్రభుత్వ బాంకు సమకూరుస్తాయి.

జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బాంకు, రిజర్వుబాంకు ప్రాంతీయ గ్రామీణ బాంకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఏట కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.

చిన్న రైతులు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, హస్త కళాకారులు, చిన్న వ్యాపారస్తులు మొదలైన వారికి పరపతిని సమకూర్చి ఉత్పాదక కార్యక్రమాల్లో ప్రగతిని సాధించటం గ్రామీణ బ్యాంకుల ప్రధాన ఆశయం.

2011-2012 లో గ్రామీణ బాంకులు వ్యవసాయదారులకు 54,550 కోట్ల రూపాయల రుణం అందించాయి. ఇది మొత్తం సంస్థపరమైన పరపతిలో 10.65 శాతంగా ఉన్నది. ప్రస్తుతం గ్రామీణ బాంకులు, వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే సాధారణ బాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

ప్రశ్న 15.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు.
జవాబు:
సహకార పరపతి సంఘాలు:జర్మనీలో విజయవంతంగా అమలు చేయబడిన సహకార పరపతి విధానాన్ని ఆసరాగా తీసుకొని భారతదేశంలో 1904లో సహకారోద్యమం ప్రారంభించబడింది. గ్రామీణ రైతులను రుణ విముక్తులను చేసి వారిలో పొదుపు అలవాట్లను పెంపొందించడం సహకార పరపతి సంస్థల ముఖ్యోద్దేశం.

స్వల్పకాలిక సహకార పరపతి విధానాన్ని మూడు అంచెల్లో నిర్మించడం జరిగింది. మొదటి అంచెలో గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేశారు. రెండవ అంచెలో జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేశారు. మూడవ అంచెలో రాష్ట్ర సహకార బాంకులను ఏర్పాటు చేశారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు గ్రామ స్థాయిలో 10 లేదా అంతకంటే ఎక్కువమంది సభ్యులచేత ప్రారంభించబడతాయి. ఈ సంఘాలు ఎన్నుకోబడిన అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులచే నిర్వహించబడతాయి. రిజర్వ్ బాంకు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టింది.

1976లో జరిగిన ప్రాథమిక వ్యవసాయం సహకార పరపతి సంఘాల పునర్వ్యవస్థీకరణ వల్ల “ఏకగవాక్ష విధానం” అమల్లోకి వచ్చింది.

2012 మార్చి 31 నాటికి 31 రాష్ట్ర సహకార బ్యాంకులు, 370 జిల్లా సహకార బాంకులు, 92,432 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల స్వల్పకాలిక పరపతిని అందిస్తున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 16.
వాణిజ్య బాంకులు – గ్రామీణ పరపతి.
జవాబు:
లాభోద్దేశంతో బాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే బాంకులే వాణిజ్య బాంకులు “1951 వరకు వ్యవసాయానికి అందించబడిన మొత్తం పరపతిలో వాణిజ్య బాంకులు వాటా కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది. 1964 లో 14, 1980లో 6 బాంకులను జాతీయం చేసిన తరువాత వాణిజ్య బాంకులు విజయవంతంగా నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తున్నాయి. 2012 జూన్ నాటికి బాంకు శాఖలు 98,591 విస్తరించాయి.

వాణిజ్య బాంకులు కింది కార్యక్రమాలు కోసం గ్రామీణ పరపతిని అందిస్తున్నాయి.
1) వాణిజ్య బ్యాంకులు గ్రామీణ రైతులను అవసరమైన మొత్తం స్వల్పకాలిక పరపతిలో 42 నుంచి 45 శాతం వరకు అందిస్తున్నాయి. అదే విధంగా రైతులు యంత్రాలు, ట్రాక్టర్లు, పంపుసెట్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తం దీర్ఘకాలిక పరపతిలో 35 నుండి 37 శాతం వరకు అందిస్తున్నాయి.

2) వాణిజ్య బాంకులు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలైన పశుపోషణ, పాడి, పందుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం మొదలైన కార్యక్రమాలను కూడా పరపతిని అందిస్తున్నాయి.

3) వాణిజ్య బ్యాంకులు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో గ్రామీణ పేదరిక నిర్మూలనా పథకాలైన సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం, జవహర్ రోజ్ గార్ యోజన పథకం కింద లబ్దిదారులకు రుణ సౌకర్యాలు కల్పిస్తున్నారు.

4) వాణిజ్య బాంకులు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల కంపెనీలకు, భారత ఆహార సంస్థకు, కేంద్ర గిడ్డంగుల సంస్థకు సహకార పరపతి సంఘాలకు, గ్రామీణ బాంకులకు పరపతి అందించి తద్వారా రైతులకు పరోక్షంగా లబ్ది చేకూరుస్తున్నాయి.

ప్రశ్న 17.
గ్రామీణ పరపతినందించడంలో రిజర్వుబాంకు పాత్ర.
జవాబు:
మనదేశంలో రిజర్వుబాంకు 1935 సం॥లో స్థాపించి 1949లో జాతీయం చేశారు. ఈ రిజర్వుబాంకు ప్రారంభం నుంచి గ్రామీణ పరపతిని అందించడంలో ప్రముఖ పాత్ర పోషించుచున్నది. ఈ బాంకు వ్యవసాయభివృద్ధి కోసం 1956లో రెండు రకాల నిధులను ఏర్పాటు చేసింది.

  1. జాతీయ వ్యవసాయ పరపతి – దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి.
  2. జాతీయ వ్యవసాయ పరపతి – స్థిరీకరణ నిధి, రైతులకు అవసరమైన దీర్ఘకాలిక రుణ సదుపాయాల కల్పనకు మొదటి నిధిని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను అదుకోవడానికి రెండవ నిధిని ఏర్పాటు చేశారు.

1. స్వల్పకాలిక పరపతి:రిజర్వు బాంకు 15 నెలల కాలవ్యవధి కలిగిన పరపతిని అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ సెక్యూరిటీలపై, తక్కువ వడ్డీకి పరపతి అందిస్తుంది.

2. మధ్యకాలిక పరపతి:రిజర్వు బాంకు 15 నెలల నుంచి 5 సం॥ కాలపరపతి గల రుణాలను వర్తమాన వడ్డీ రేటు కంటే తక్కువవడ్డీ రేటుకు ప్రభుత్వ సెక్యూరిటీలపై రాష్ట్ర సహకార బాంకులకు మధ్యకాలిక రుణాలను అందిస్తుంది.

3. దీర్ఘకాలిక పరపతి:ఇది 20 సం॥లదీర్ఘ కాల పరపతి గల దీర్ఘకాలిక పరపతిని అందిస్తుంది.

4. ఇతర సేవలు:1) వ్యవసాయ పరపతిని అందించే సంస్థలన్నింటికి రిజర్వుబాంకు రుణాలు మంజూరు చేయును. 2) చిన్న రైతులకు ఉపాంత రైతులకు, అభివృద్ధి సంస్థల ద్వారా రుణాలు రిజర్వు బాంకు అందించుచున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 19.
వ్యవసాయ మార్కెటింగ్ లోని వివిధ దశలు.
జవాబు:
రైతులు పంటను పండించిన వెంటనే అమ్మకం జరపలేరు. విక్రయానికి ముందు ఈ ఉత్పత్తులు అనేక దశలను దాటవలసి ఉంటుంది. ఈ దశలనే వ్యవసాయ మార్కెటింగ్ దశలు అంటారు.

  1. అసెంబ్లింగ్:వివిధ ప్రాంతాలలోని అనేక మంది రైతులు అల్ప పరిమాణంలో చేసిన ఉత్పత్తులను సేకరించి పెద్ద మొత్తంగా పోగుచేసి ఒక నిర్ణీత ప్రదేశంలోకి చేర్చేప్రక్రియను ‘అసెంబ్లింగ్’ అంటారు.
  2. రవాణా:వ్యవసాయ వస్తువులను ఉత్పత్తి కేంద్రాల నుంచి మార్కెట్ కేంద్రాలకు తరలించటాన్ని రవాణా అంటారు.
  3. శ్రేణీకరణ:రైతులు పండించిన ఉత్పత్తుల నాణ్యతలో తేడాలుంటాయి. నాణ్యతలను బట్టి మన్నికను బట్టి ఉత్పత్తుల వర్గీకరించటాన్ని శ్రేణికరణ అంటారు.
  4. ప్రాసెసింగ్:వినియోగదారుల అన్ని వ్యవసాయ వస్తువులును నేరుగా వినియోగించే వాటిని వినియోగానికి అనువుగా మార్చాలి. ఈ ప్రక్రియను ప్రాసెసింగ్ అంటారు. ఉదా:వరి ధాన్యం బియ్యంగా, నూనెగింజలను వంటనూనెగా మార్చడం.
  5. ప్రతిచయనీకరణ:వ్యవసాయ వస్తువులను ప్రామాణికరించడం కోసం శ్రేణీకరణ చేయబడిన ఉత్పత్తుల నుంచి కొన్ని ప్రతిచయనాలను ఎంపిక చేయుట.
  6. పాకింగ్:ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులను పాకింగ్ చేయాలి.
  7. నిల్వ చేయడం:గిట్టుబాటు ధర వచ్చేంత వరకూ కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయాలి. నశ్వర వ్యవసాయ వస్తువులను భద్రపర్చుటకు శీతల గిడ్డంగులు అవసరం.

ప్రశ్న 20.
క్రమబద్దీకరించిన మార్కెట్లు. [Mar ’16]
జవాబు:
మార్కెట్లను 1951 సం॥లో ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లోని లోపాలను సరిదిద్దడం కోసం, వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లకు వారి విధులు పరంగా కాకుండా లభించే మార్జిన్లు తగ్గించడం కోసం ఈ మార్కెట్లు రూపొందించారు. ఈ మార్కెట్లు నిర్వహించడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రైతులు, వ్యాపారస్తుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విధులు :

  1. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నోటీస్ బోర్డులో ఉంచుతాయి.
  2. మధ్యవర్తుల సంఖ్యను తగ్గించి వారికి లైసెన్సులను మంజూరు చేస్తాయి.
  3. తూకం చార్జీలు, దళారీల కమీషన్లు ముందుగానే మార్కెట్ కమిటీలు నిర్ణయిస్తాయి.
  4. ప్రామాణికమైన తూనికలు, కొలతలు వాడకాన్ని తప్పనిసరి చేస్తాయి.
  5. అవసరమైన ప్రదేశాలలో సాధారణ, శీతలీకరణ గిడ్డంగులను ఏర్పాటు చేస్తాయి.
  6. మార్కెట్ మోసాలను పూర్తిగా నియంత్రిస్తాయి.

ప్రశ్న 21.
సహకార వ్యవసాయం.
జవాబు:
గ్రామంలోని రైతులంతా స్వచ్ఛందంగా ఒక సంఘంగా ఏర్పడి, తమ భూములు వ్యవసాయ పరికరాలు, పశువులు మొదలైన ఉత్పాదకాలన్నింటికీ సంఘానికి అందించి మొత్తం భూమిని ఏకఖండంగా చేసి సహకార ప్రాతిపదికన నిర్వహించే వ్యవసాయాన్ని ‘సహకార వ్యవసాయం’ అంటారు.

  1. సహకార వ్యవసాయం వల్ల ఉత్పత్తి అధికమై మిశ్రమం కొరకు మిగులు ఏర్పడుతుంది.
  2. ఈ వ్యవసాయం వల్ల ఉత్పత్తిలో సాంకేతిక, మార్కెటింగ్, ద్రవ్యపరమైన ఆదాలు లభిస్తాయి.
  3. భూమి పునరుద్ధరణ, గొట్టపు బావుల త్రవ్వకం మొదలైన కార్యక్రమాలకు అధిక పెట్టుబడి అవసరం. ఈ కార్యకలాపాలను సంఘం స్థాయిలో సమిష్టిగా చేపట్టి వ్యవసాయాభివృద్ధి సాధించవచ్చు.
  4. ఈ వ్యవసాయ విధానంలో సాంద్ర, విస్తృత వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువ.
  5. సహకార సంఘంలోని రైతులందరూ పరస్పరం సహకరించుకుంటూ, ఉమ్మడిగా వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టడం ద్వారా వారి మధ్య సాంఘిక సమానత్వము సాధించవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 22.
ఒప్పందపు వ్యవసాయం.
జవాబు:
వ్యవసాయ మార్కెటింగ్ విధానంలోని లోపాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన పరిష్కార మార్గం ఒప్పంద వ్యవసాయం రైతులు తమ ఉత్పత్తులను వినియోగించే సంస్థలతో ప్రత్యక్షంగా ఒప్పందాలను కుదుర్చుకొని చేసే వ్యవసాయ విధానాన్ని ‘ ఒప్పంద వ్యవసాయం’ అంటారు.

  1. ఈ విధానంలో ముందుగా ధరలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో ఉండే అస్థిరతలను తొలగించి రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని పెంపొందించవచ్చు.
  2. రైతులు ఏ పరిశ్రమలలో ఒప్పందాలు కుదుర్చుకున్నారో అవి పరపతి, సాంకేతిక సహాయం అందిస్తాయి.
  3. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు లభించడానికి అవకాశం పెరుగుతుంది.
  4. రైతులు వ్యక్తిగతంగా కాక సహకార ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకుంటే వారికి బేరమాడే శక్తి పెరుగుతుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవసాయరంగం.
జవాబు:
వ్యవసాయం, దాని అనుబంధరంగాలైన అడవుల పెంపకం, చేపల పెంపకం, పాడి, పశుపోషణ, తోటల పెంపకం, గనులు, క్వారీలు మొదలగువాటన్నింటికి కలిపి వ్యవసాయరంగం అంటారు.

ప్రశ్న 2.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు.
జవాబు:
పరిశ్రమలు వాటికవసరమైన ముడిసరుకులు అది వ్యవసాయరంగముపై ఆధారపడితే వాటిని వ్యవసాయ ఆధార పరిశ్రమలంటారు. మనదేశంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు అనేకం ఉన్నాయి. ఉదా:జనపనార, పంచదార మొదలగు పరిశ్రమలు. ఈ పరిశ్రమల అభివృద్ధికి వ్యవసాయ ప్రగతి తోడ్పడుతుంది.

ప్రశ్న 3.
ఆహార భద్రత.
జవాబు:
ఆరోగ్యవంతమైన, చురుకైన జీవనాన్ని కొనసాగించడానికి ప్రజలందరికి అన్ని కాలాలలో చాలినంత పరిమాణంలో ఆహారం అందుబాటులో ఉండటం “ఆహార భద్రత”.

ప్రశ్న 4.
బంజరు భూముల పునరుద్ధరణ.
జవాబు:
వ్యవసాయరంగంలో మధ్యవర్తుల తొలగింపు ఫలితంగా బంజరు భూములు మీద యాజమాన్యపు హక్కులు పొందిన రైతులు వాటిని వ్యవసాయ యోగ్యంగా మార్చడమే “బంజరు భూముల” పునరుద్ధరణ.

ప్రశ్న 5.
పంటల తీరు .
జవాబు:
నిర్ణీత కాలంలో ఒకదేశంలో వ్యవసాయ భూమిని వివిధ పంటలు పండించటానికి ఉపయోగిస్తున్నారు. ఈ రీతిని “పంటతీరు” అంటారు.

ప్రశ్న 6.
శాశ్వత నీటి కాలువలు.
జవాబు:
నదులపై అడ్డంగా ఆనకట్టలు కట్టగా ఏర్పడిన జలాశయాలకు ఈ కాలువలను అనుసంధానం చేస్తారు. అందువల్ల ఇవి వ్యవసాయానికి సంవత్సరం పొడవున నీటిని అందించి శాశ్వత కాలువులుగా పిలవబడుతున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 7.
బిందు నీటి పారుదల.
జవాబు:
మొక్కల యొక్క వేరు మొదలులో నీటిని బొట్లు బొట్టుగా చేయడం ‘బిందు నీటిపారుదల’.

ప్రశ్న 8.
తుంపరల నీటి పారుదల.
జవాబు:
మొక్కల్ని తడపడానికి సాంకేతిక పరికరాల సహాయంతో నీరు తుంపర్లుగా పడేటట్లు చేస్తారు. దీనినే తుంపర్ల నీటి పారుదల.

ప్రశ్న 9.
భూ సంస్కరణలు.
జవాబు:
సమానత్వం, సాంఘీకన్యాయం, వ్యవసాయాభివృద్ధి సాధించడానికి భూమి మీద చేపట్టే ఆర్థిక, ఆర్థికేతర చర్యలను “భూసంస్కరణలు” అంటారు.

ప్రశ్న 10.
సేంద్రీయ వ్యవసాయం. [Mar ’16]
జవాబు:
ప్రకృతి సిద్ధంగా లభించే ఎరువులను, క్రిమిసంహారక మందులను ఉపయోగించి వ్యవసాయం చేయడాన్ని “సేంద్రియ వ్యవసాయం” అంటారు.

ప్రశ్న 11.
ఆర్థిక మతం
జవాబు:
కుటుంబ సభ్యులందరికి సముచితమైన జీవనప్రమాణం,ఉపాధి కల్పించే భూపరిణాన్ని “ఆర్థిక కమతం” అంటారు.

ప్రశ్న 12.
వ్యవసాయ యాంత్రీకరణ.
జవాబు:
వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణలో ట్రాక్టర్లు, పంపుసెట్లు, పంటమార్పిడి యంత్రాలు మొదలగునవి వినియోగించడాన్ని “వ్యవసాయ యాంత్రీకరణ” అంటారు.

ప్రశ్న 13.
కమతాల సమీకరణ.
జవాబు:
గ్రామంలో వేర్వేరు ప్రాంతాలలో విస్తరించి ఉన్న భూకమతాలను ఏకఖండంగా చేసే ప్రక్రియను కమతాల సమీకరణ అంటారు.

ప్రశ్న 14.
సహకార వ్యవసాయం.
జవాబు:
గ్రామంలోని రైతులందరూ స్వచ్ఛందంగా తమ భూములను ఏకఖండంగా చేసి సహకార ప్రాతిపదికపై నిర్వహించే వ్యవసాయ విధానాన్ని “సహకార వ్యవసాయం” అంటారు.

ప్రశ్న 15.
భూ సంస్కరణల ఆశయం.
జవాబు:

  1. గత సంవత్సరం నుండి వారసత్వంగా వచ్చినటువంటి అడ్డంకులను తొలగించటం.
  2. భూమిని దున్నే వాడికి రక్షణ కల్పించడం
  3. వివిధ రూపాలలో ఉన్న దోపిడీలను అరికట్టడం మొదలగునవి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 16.
జమీందారీ విధానం.
జవాబు:
ఈ పద్ధతిలోని 1793 లార్డ్ కార్నవాలీస్ మొదట బెంగాల్లో ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో జమీందారులు తమపరిధిలోని భూములపై యాజమాన్యపు హక్కులు కలిగి ప్రభుత్వానికి పన్ను చెల్లించే బాధ్యత వహించేవారు. అయితే వారు రైతుల దగ్గర అధిక మొత్తాన్ని వసూలు చేసేవారు.

ప్రశ్న 17.
రైత్వారీ విధానం.
జవాబు:
దీనిని సర్ థామస్ మాన్రో 1792లో మద్రాసు రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. తరువాత ఈ విధానం మహారాష్ట్ర, బీహారు, తూర్పు పంజాబు విస్తరించింది. ఈ విధానంలో రైతులు తమ భూములమీద యాజమాన్యపు హక్కులు కలిగి ఉంటారు. రైతుకి, ప్రభుత్వానికి మధ్యవర్తులు ఉండరు. రైతులే ప్రత్యక్షంగా భూమిశిస్తు చెల్లిస్తారు.

ప్రశ్న 18.
జిరాయితీ హక్కు గల కౌలుదార్లు. [Mar ’16]
జవాబు:
ఏ కౌలుదారులను భూస్వాములు కౌలు చెల్లిస్తున్నంతకాలం తొలగించలేరో వారిని “జిరాయితీ హక్కున్న ‘కౌలుదారులు’ లేదా శాశ్వత కౌలుదారులు అంటారు.

ప్రశ్న 19.
హరిత విప్లవం.
జవాబు:
ఆచార్య నిర్మల్ బోర్లోగ్ ఈ నూతన వ్యవసాయ వ్యూహానికి పితామహుడు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే ఉద్దేశంతో రైతుల్లో నవ చైతన్యాన్ని రగల్చి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి జీవనాధార వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే విప్లవాత్మకమైన మార్పును హరిత విప్లవం అంటారు.

ప్రశ్న 20.
IADP.
జవాబు:
సాంద్రత వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (IADP) భారత ప్రభుత్వం 1964లో ఫోర్సు ఫౌండేషన్ కమిటీ సిఫార్సును ఆధారంగా అధిక భూసారం, నిశ్చితంగా లభించే నీటి వనరులు, తగిన వర్షపాతం మొదలైన సౌకర్యాలుండి వరదలు, మురుగునీరు, భూసార క్షీణత వంటి సమస్య తీవ్రత తక్కువగా ఉన్న ఏడు జిల్లాలను ఎంచుకొని సాంద్ర వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి ప్రారంభించబడినది. ఉదా:ఆంధ్రలో పశ్చిమగోదావరి,

ప్రశ్న 21.
IAAP.
జవాబు:
సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం. భారత ప్రభుత్వం 1967లో సాంద్ర వ్యవసాయ కింద ఉన్న భూసార విస్తీర్ణాన్ని అధికం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని కొన్ని ఎంచుకొన్న పంటలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ పథకాన్ని దేశంలో 114 జిల్లాలకు విస్తరింప చేశారు.

ప్రశ్న 22.
HYVP అధిక దిగుబడిలునిచ్చే విత్తనాలు కార్యక్రమాలు.
జవాబు:
దీనిని 1965లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం, హరిత విప్లవం సాధించడంలో సంకర జాతి విత్తనాల పాత్ర కీలకమైంది. ICAR, ICRISAT మొదలగునవి అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను సృష్టించడం జరిగింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 23.
RIDF
జవాబు:
నాబార్డ్ ఆధ్వర్యంలో గ్రామీణ అవస్థాపనా నిధి 1995-96లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఆశయం అవస్థాపనా సౌకర్యాల కొరత కారణంగా మధ్యలో ఆగిపోయిన వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు అందించడం.

ప్రశ్న 24.
కిసాన్ క్రెడిట్ కార్డు. [Mar ’17]
జవాబు:
ఈ స్కీమ్ను 1998లో ప్రవేశపెట్టింది. రైతులకు వ్యవసాయ ఖర్చులకోసం, వ్యవసాయ ఉత్పాదకాల కొనుగోలు కోసం తక్కువ వడ్డీకి సకాలంలో సరిపడినంత స్వల్పకాలిక పంట రుణాలు అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.

ప్రశ్న 25.
SGSY.
జవాబు:
స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్ గార్ యోజన సంస్థాపరమైన పరపతి అందిస్తున్న పెద్ద పథకం, IRDP, TRYSEM, DWCRA ఇతర అనుబంధ పథకాలన్నింటిని ఒక్కటిగా విలీనం చేసి దీనిని 1999న ప్రారంభించిరి. పేదరికాన్ని నిర్మూలించడం ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం.

ప్రశ్న 26.
సూక్ష్మ విత్తం. [Mar ’17]
జవాబు:
గ్రామీణ, పట్టణ ప్రాంతపు పేదలకు స్వల్ప మొత్తంలో పరపతిని తక్కువ వడ్డీకి అందించడాన్ని సూక్ష్మ పరపతి అంటారు.

ప్రశ్న 27.
అసెంబ్లింగ్.
జవాబు:
వివిధ ప్రాంతాలలోని అనేక మంది రైతులు అల్పపరిమాణంలో చేసిన ఉత్పత్తులను సేకరించి పెద్ద మొత్తంగా పోగు చేసి ఒక నిర్ణీత ప్రదేశంలోనికి చేర్చే ప్రక్రియను “అసెంబ్లింగ్” అంటారు.

ప్రశ్న 28.
ప్రాసెసింగ్.
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తులను వినియోగానికి అనువుగా మార్చే ప్రక్రియను ప్రాసెసింగ్ అంటారు. ఉదా: వడ్లు లేదా ధాన్యంను బియ్యంగా మార్చడం.

ప్రశ్న 29.
AGMARK.
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతల గుర్తుగా వ్యవసాయ మార్కెటింగ్ యొక్క సంకేతాక్షరం AGMARK.

AP Inter 2nd Year Economics Study Material Chapter 4 వ్యవసాయ రంగం

ప్రశ్న 30.
విక్రయం కాగల మిగులు. [Mar ’17]
జవాబు:
వ్యవసాయదారులు తాము పండించిన మొత్తం ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించలేరు. అందులో కొంత భాగాన్ని విత్తనాలకు, వేతనాలకు సొంత వినియోగానికి దాచుకుంటారు. ఈ అవసరాలు పోను మిగిలిన మొత్తం మార్కెట్లో విక్రయించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ మిగులునే విక్రయం కాగల మిగులు అంటారు.

 

ప్రశ్న 31.
రైతు బజార్లు. [Mar ’17, ’16]
జవాబు:
ఏ మార్కెట్లలో అమ్మకందారులైన, రైతులకు కొనుగోలుదారులకు మధ్య దళారీలు ఉండరో అ మార్కెట్లను “రైతు బజార్లు” అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 3rd Lesson జాతీయ ఆదాయం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 3rd Lesson జాతీయ ఆదాయం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో జాతీయాదాయ పెరుగుదల ధోరణులను విశ్లేషించండి.
జవాబు:
ఒక దేశంలో ఒక సంవత్సరకాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల నికర విలువను జాతీయాదాయం అంటారు. కేంద్ర గణాంక సంస్థ జాతీయాదాయ అంచనాలను, వర్తమాన ధరలను మరియు స్థిర ధరలలో మదింపు చేస్తుంది. ప్రస్తుత ధరల వద్ద జాతీయాదాయము పెరుగుదల రెండు అంశాలను ప్రభావితం చేస్తుంది.

  1. వాస్తవిక వస్తు సేవల పెరుగుదల
  2. ధరలలో పెరుగుదల.

వస్తుసేవల ఉత్పత్తి వల్ల జాతీయాదాయం పెరిగితే వాస్తవిక ఆర్థికవృద్ధిని సూచిస్తుంది. రెండవ కారణం వల్ల జాతీయాదాయం పెరిగితే ద్రవ్యరూపంలో పెరిగిన ఆదాయాన్ని స్థిర ధరల వద్ద ఆదాయాన్ని కుదించి వాస్తవిక ఆదాయాన్ని లెక్కించవలసి వస్తుంది. స్థిర ధరల వద్ద నికర జాతీయోత్పత్తి సమాజం యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని సూచిస్తుంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 1

1R: మొదటిసారి సరిచేసిన అంచనాలు 2R: రెండవసారి సరిచేసిన అంచనాలు 3R మూడవసారి సరిచేసిన అంచనాలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

1950 – 51వ సంవత్సరంలో నికర జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 9,464 కోట్ల రూపాయలు ఉండగా 2013 -14 నాటికి రూ. 91,71,045 లకు పెరిగింది. తలసరి నికర జాతీయోత్పత్తి 1950-51వ సం॥లో రూ.264 ఉండగా 2013-14లో రూ.74,380లుగా ఉంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 2
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 3

1, 2 పంచవర్ష ప్రణాళికలలో నికర జాతీయోత్పత్తి 4.2 శాతంగా ఉంది. 3వ ప్రణాళికలో 2.6 శాతంకు తగ్గినది. దీనికి కారణం తీవ్ర కరువు. 4వ ప్రణాళికలో 3.2 శాతం కాగా 5వ ప్రణాళికలో 4.9%, 6వ ప్రణాళికలో 3.1%, 11వ ప్రణాళికాకాలంలో 7.5% గా ఉంది. ఇదే ప్రణాళికలలో తలసరి నికర జాతీయోత్పత్తి వరుసగా 1వ ప్రణాళికలో 2.4% ఉండగా 11వ ప్రణాళికలో 5.9గా ఉంది.

ప్రశ్న 2.
జాతీయోత్పత్తిలో వివిధ రంగాల వాటాలను వివరించండి.
జవాబు:
జాతీయాదాయములో వివిధ రంగాల వాటా వివరాలు అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశము. ఒకవేళ ఆర్థికాభివృద్ధి ముఖ్యంగా వివిధ రంగాలు జాతీయాదాయమునకు సమకూర్చే వాటాలపై ఆధారపడును. జాతీయాదాయములో ఏ రంగానికి ఎంతెంతవాటా ఉన్నదీ పరిశీలిస్తే ఆయారంగాల ప్రాధాన్యతలు, వాటి పోకడలు తెలుస్తాయి. ముఖ్యంగా మనదేశంలో జాతీయాదాయ ప్రాథమిక రంగం, ద్వితీయ, తృతీయ రంగాల ఆదాయంతో సంయోజనమవుతుంది. సాధారణంగా జాతీయాదాయమునకు వ్యవసాయరంగం వాటా అధికముగా ఉన్న ఆ దేశము అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పవచ్చును.

స్థూలదేశీయోత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా: స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిలో. ప్రాథమిక రంగం (వ్యవసాయం, అడవులు, చేపల పెంపకం) వాటా 1950 – 51 లో 55.4 శాతము ఉండగా 1980 81 నాటికి 38 శాతానికి 2013-14 (ముందస్తు అంచనాలు) 13.9 శాతానికి తగ్గినది. దీనికి కారణము ప్రాథమిక రంగంలో కేవలం వ్యవసాయరంగపు వాటా భారీగా తగ్గుట. జాతీయాదాయంలో అటవీ ఉత్పత్తుల విలువకూడా తగ్గుచున్నది. జాతీయాదాయానికి చేపల ఉత్పత్తుల విలువ స్థిరంగా ఉన్నది. రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, భీమా, ఇతర సేవల వ్యవసాయరంగం కంటే వేగంగా అభివృద్ధి చెందడం వలన జాతీయాదాయాన్ని వ్యవసాయేతర రంగాలు ఎక్కువగా ప్రభావితము చేయుచున్నవి. భారతదేశ జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయరంగము వాటా ముఖ్యమైనదిగా పరిగణింపవచ్చును.

ద్వితీయరంగపు వాటా: ద్వితీయ రంగమనగా గనులు, తయారీ, నిర్మాణము, విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా, మొదలగునవి ఉంటాయి. జాతీయాదాయంలో ఈ రంగం వాటా క్రమంగా పెరుగుచున్నది. 1950-51 లో ద్వితీయ రంగం వాటా 15 శాతము. 1980-81 నాటికి ఈ రంగం వాటా 24 శాతానికి పెరిగింది. 2013-14 నాటికి కేవలము 2. 2శాతము పెరిగి 26.2% ఉన్నది.

తృతీయరంగపు వాటా: ఈ రంగం అనగా వ్యాపారము, రవాణా, ఫైనాన్సింగ్, భీమా, రియల్ ఎస్టేట్, బ్యాంకులు, సామాజిక వ్యక్తిగత సేవలు. జాతీయాదాయములో ఈ రంగం వాటా 1950-51లో 29.6 శాతము, 1980-81లో 38 శాతము, 2013-2014 నాటికి ఎక్కువ పెరుగుదలను కలిగి 59.9 శాతానికి పెరిగినది. 1980-81 తరువాత తృతీయ రంగపు వాటా ఎక్కువగా ఉన్నది. జాతీయాదాయములో వ్యాపారము, రవాణా, కమ్యూనికేషన్స్ వాటా 1950-51లో 11.3 శాతము నుంచి మూడురెట్లుకు పైగా పెరిగి 2013-14 నాటికి 26.4 శాతముగా ఉన్నది. స్థూలదేశీయోత్పత్తిలో ఫైనాన్స్, భీమా, రియల్ ఎస్టేట్ మరియు వ్యాపార సేవలవాటా 1950-51 లో 7.7 శాతముకాగా, 30 సంవత్సరముల కాలంలో 0.2% తగ్గి 1980-81 నాటికి 7:5 శాతముగా ఉన్నది. తరువాత దాదాపు మూడురెట్లు దాకా పెరిగి 2013-14లో 20.6 శాతముగా ఉన్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 3.
ఆదాయ – సంపద పంపిణీలోని అసమానతలకు గల కారణాలను వివరింపుము.
జ.
భారతదేశములోని ఆదాయ అసమానతల వలన అట్టడుగు వర్గ ప్రజల జీవితాలు దుర్భరమౌతున్నాయి. ఆకలి చావులకు కారణమౌతున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 4

1) భూ యాజమాన్యంలో అసమానత: బ్రిటీష్వారు ప్రవేశపెట్టిన జమీందారీ పద్ధతి ఫలితంగా భూ సంపద కొద్దిమంది చేతులలో కేంద్రీకృతమైనది. స్వాతంత్ర్యానంతరము భారత ప్రభుత్వము జమీందారీ పద్ధతిని రద్దు చేసినప్పటికీ యాజమాన్య పద్ధతిలో పెద్దగా మార్పులేదు. 2010-11వ సంవత్సరములో మొత్తము వ్యవసాయదారులలో 67 శాతము మంది ఉపాంత కమతాలను కల్గి ఉన్నారు. (ఒక హెక్టారుకన్నా తక్కువ) మొత్తము సాగుభూమిలో వీరు సాగుభూమిలో వీరు సాగుచేయుచున్నది. కేవలము 22.2 శాతము మాత్రమే. పెద్ద కమతాలను (10 హెక్టార్ల కంటే ఎక్కువ) కలిగి ఉన్నావారు కేవలం 0.7 శాతముగా ఉండి మొత్తము సాగు విస్తీర్ణములో 10.9 శాతపు భూమిని వీరు సాగుచేయుచున్నారు.

భూస్వాములు పొదుపుచేసే శక్తిని కలిగి ఉండడమేగాక సంస్థాపూర్వక రుణాలను కూడా సులభంగా పొందగలిగి నూతన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టి అధిక ఆదాయమును ఆర్జించుట ఆదాయ అసమానతలకు కారణము.

2) ప్రైవేటు కార్పొరేటు రంగంలో ఆస్తుల కేంద్రీకరణ: భారీ పారిశ్రామికవేత్తల ఆధీనంలో సంపద కేంద్రీకరించ బడినది. 1975-76వ సంవత్సరము ఆచరణాత్మక ఆర్థిక పరిశోధనపై జాతీయ సంస్థ (NCAER), పై 10 శాతము ప్రజల ఆధీనంలో 46.28 శాతపు పట్టణ సంపద కేంద్రీకృతమైనది. అట్టడుగు 60% ప్రజల ఆధీనంలో కేవలం 11.67 శాతపు సంపద కేంద్రీకృతమైనది. మార్చి 31, 1991 నాటికి భారీ ప్రైవేటు పరిశ్రమల మొత్తము ఆస్తి 45,830 కోట్ల రూపాయలు 2013-14 నాటికి ఒక్క రిలయన్స్ పరిశ్రమల మొత్తము ఆస్తుల 3,62,375 రూపాయలు. ఇదే సంవత్సరము రిలయన్స్ పరిశ్రమ, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్ మరియు లార్సన్ మరియు టూబ్రో అను 5 ప్రైవేటు కంపెనీల మొత్తము ఆస్తులు 9,80,764 రూపాయలుగా ఉన్నవి.

3) వృత్తి నైపుణ్యాలలో అసమానత: వ్యాపార కార్యనిర్వాహకులు, ఇంజనీర్లు, సమాచార సాంకేతిక నిపుణులు, న్యాయవాదులు మరియు ఇతర వృత్తి నైపుణ్యాలు గల వారి ఆదాయాలు ఎక్కువ. సమాజంలో ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే ఉన్నత మరియు సాంకేతిక (వృత్తి) విద్య అందుబాటులో ఉన్నది. వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక శ్రామికులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ఇటువంటి విద్య అందుబాటులో లేదు. కావున విద్య, శిక్షణ అవకాశాల్లో ఉన్న వ్యత్యాసాలు ఆదాయ అసమానతలకు కారణము.

4) ద్రవ్యోల్బణము మరియు ధరల పెరుగుదల: భారతదేశంలో 1950 దశకం మధ్యకాలం నుంచి సాధారణ ధరల స్థాయి క్రమంగా పెరుగుచున్నది. దీని వలన పేదవర్గాల వాస్తవిక ఆదాయము తగ్గుచున్నవి. ద్రవ్యోల్బణ ప్రభావము ధనవంతులపై ఉండదు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు, విక్రయం కాగల మిగులును కల్గివున్న వ్యవసాయదారులు ద్రవ్యోల్బణము ద్వారా లబ్ధిపొందుతారు. ఈ విధముగా ధనిక, పేద వర్గాల మధ్య ఆదాయ వ్యత్యాసాలు అధికమవుతున్నాయి.

5) నగరాలవైపు ప్రైవేటు పెట్టుబడి భారతదేశంలో 70శాతం మంది ప్రజలు గ్రామాలలో జీవిస్తున్నారు. కాని దాదాపు 70% ప్రైవేటు పెట్టుబడి పట్టణ ప్రాంత పారిశ్రామిక రంగానికి వెళ్ళుచున్నది. ప్రైవేటు పెట్టుబడిదారులు గ్రామీణ ప్రాంతములో పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపడములేదు. శ్రామిక సప్లయికి అనుగుణంగా భారీ పరిశ్రమలు ఉపాధిని కల్పించలేకపోవుట ఆదాయపంపిణీలో అసమానతలకు కారణము.

6) పరపతి సౌకర్యాలలో అసమానత: భారీ పారిశ్రామిక వేత్తలకు, పెద్ద వ్యాపారస్తులకు సులభంగా సంస్థాపూర్వక రుణాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు, వ్యవసాయధార సంస్థలకు, చిన్న ఉద్యమదారులకు తక్కువ పరిమాణములో రుణాలను సమకూరుస్తారు. కావున వీరి అధిక వడ్డీరేటుకు రుణాలను పొందుటకు వడ్డీవ్యాపారులపై ఆధారపడవలసి వస్తున్నది. వివిధ ఉత్పత్తి వర్గాల మధ్య ఆదాయ అసమానతలు పెరగుటకు పరపతి వివక్ష ముఖ్య కారణము.

7) ప్రభుత్వ పాత్ర: సంక్షేమ పథకాలైన విద్య, వైద్య, గృహనిర్మాణము, సాంఘిక భద్రతా పథకాలపై (వితంతు, వృద్ధాప్య, అంగవైకల్య, ఫించన్లు, ఫీజురీయింబర్స్మెంట్) ప్రభుత్వ వ్యయవిధానాలు సాపేక్ష ఆదాయాల వారికి అందుచున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లోపించుట అసమానతలకు కారణము.

8) అసమంజసమైన పన్నుల విధానము మొత్తం పన్నుల రాబడిలో ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల వాటా హెచ్చుగా ఉంటుంది. పరోక్ష పన్నుల భారము పేదవారిపై అధికంగా ఉంటుంది. ప్రత్యక్ష పన్నుల నుంచి తప్పించుకోవడానికి లేదా పన్ను చెల్లింపులను ఎగవేయడానికి ధనిక వర్గాలు తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతులగుట | ఆర్థిక అసమానతలకు కారణము.

ప్రశ్న 4.
ఆదాయ అసమానతలను తొలగించుటకు తీసుకోవలసిన చర్యలను సంక్షిప్తంగా వివరింపుము.
జవాబు:
భారతదేశ ఆర్థిక ప్రణాళికల ముఖ్య లక్ష్యము ఆర్థిక అసమానతలను నిర్మూలించి, ప్రజలందరికీ సాంఘీక న్యాయాన్ని కల్పించుట. ఈ లక్ష్యసాధనకు భారతప్రభుత్వము క్రింది నియంత్రణా చర్యలను చేపట్టింది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 5
1) భూ సంస్కరణలు: గ్రామీణ ప్రాంతాలలో అసమానతలకు కారణము భూపంపిణీలోని అసమానతలు. ప్రభుత్వము భూసంస్కరణలలో భాగంగా జమీందారీ పద్ధతిని రద్దుచేసి “దున్నేవానిదే భూమి” అను చట్టాన్ని చేసినప్పటికీ భూపంపిణీలోని అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కౌలు సంస్కరణలలో భాగంగా కౌలు పరిమాణమును తగ్గించి, కౌలుదారునికి భద్రత కల్పించినప్పటికీ, కౌలుదారులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

2) ఏకస్వామ్య వ్యాపార కార్యకలాపాల నియంత్రణ: డిసెంబర్, 1969వ సంవత్సరములో ప్రవేశపెట్టిన ఏకస్వామ్య వ్యాపార నియంత్రణ చట్టము (Monopolies Restrictive Trade Practices Act) జూన్ 1, 1970 నుంచి అమలులోకి వచ్చినది. ఈ చట్టము ఏకస్వామ్య ధోరణి కల్గిన సంస్థలను నియంత్రించుటకు ఉద్దేశించినది. పరిశ్రమల విస్తరణ, ఏకీకరణ మొదలగు వాటిని ఈ చట్టము నియంత్రించును.

3) సహకార చర్యలు: పెద్ద పరిశ్రమల స్థాపన ఆర్థికస్థోమత కేంద్రీకరణకు దారితీస్తుంది. సహకార రంగములో సంస్థలు నెలకొల్పిన అవి ఆర్జించు లాభాలు అందులో సభ్యులైన అందరూ పంచుకోవటము ద్వారా ఆదాయ అసమానతలు తగ్గించవచ్చును. సహకార సంస్థల లక్ష్యము ప్రజల ప్రయోజనాలను కాపాడుట.

4) నూతన సంస్థలను ప్రోత్సహించుట: ఒకే కుటుంబం అనేక సంస్థలను నెలకొల్పుట ద్వారా ఆర్థికస్థోమత కేంద్రీకరణకు తోడ్పడును. ప్రభుత్వము ప్రోత్సాహకాలను ప్రకటించుట ద్వారా నూతన సంస్థలను ప్రోత్సహించాలి. ఇదివరకే పరిశ్రమలను కలిగి ఉన్న వారికి మరల పరిశ్రమల స్థాపనకు లైసెన్సును ఇవ్వకుండా జాగ్రత్త వహించి, ఆర్థిక శక్తి కేంద్రీకరణను నివారించవచ్చును.

5) సాంఘీక భద్రత: ప్రభుత్వము “సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధిరేటు” లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తరచూ ప్రకటిస్తుంది. ప్రభుత్వము వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు సాంఘిక భద్రతాచర్యలలో భాగంగా భరణము (ఫించను) ఇస్తున్నవి. పరిశ్రమలలో ప్రమాదవశాత్తు గాయపడిన వారికి నష్టపరిహారము, ప్రసూతి వసతులు, కనీస వేతన అమలు, ఉద్యోగులకు భీమా, భవిష్యత్తు నిధి మొదలగు వసతులను కల్పించుట ద్వారా ఆదాయాల పెంపునకు కృషిచేస్తున్నది.

6) పన్నుల విధానము: సంపద కేంద్రీకృత ధోరణిని నివారించే విధంగా భారతదేశము పురోగామి పన్నుల విధానమును అమలుచేస్తున్నవి. అధిక ఆదాయము కలవారు తమ ఆదాయ మొత్తాన్ని లెక్కల్లో చూపడము లేదు. పారిశ్రామిక వేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, కాంట్రాక్టర్లు ఆదాయ పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. కావున ప్రత్యక్ష పన్నులను సక్రమముగా అమలుపరచిన ఆర్థిక అసమానతలను కొంతవరకు తగ్గించవచ్చును.

7) ఉపాధి మరియు వేతన విధానము: ఆదాయ అసమానతలు తగ్గించడానికి భారత ప్రభుత్వము అనేక ఉపాధి కల్పనా పథకాలను అమలు చేస్తున్నది. ఉదాహరణకు సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకము, జాతీయ గ్రామీణ ఉపాధి పథకము, జవహర్ గ్రామ సమృద్ధియోజన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకము మొదలగునవి.
ఎక్కువమంది పనిచేయుచున్న అసంఘటిత రంగ శ్రామికుల వేతనాల స్థాయి చాలా తక్కువ. వీరికి కనీస వేతనాలను అమలుచేయుట ద్వారా ఆదాయ అసమానతలను తగ్గించవచ్చు.

8) చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం కుటీర చిన్నతరహా పరిశ్రమలు భారీపరిశ్రమలకు ప్రత్యమ్నాయాలుగా అభివృద్ధి పరచగలిగిన, ఇవి ఆర్జించు లాభాలు అనేకమంది పంచుకొనుట ద్వారా ఆర్థిక స్థోమత కేంద్రీకరణను నివారించవచ్చు. కొన్ని వస్తువుల తయారీని చిన్న పరిశ్రమలకు కేటాయించి, జాతీయ బ్యాంకులు సులభ నిబంధనలతో రుణాలివ్వాలని ప్రభుత్వము నిర్ణయించి, అమలుచేయగలిగితే ఆదాయ అసమానతలు తగ్గించవచ్చును.

ప్రశ్న 5.
భారతదేశములో పేదరికానికి కారణాలు ఏవి ? [Mar ’17]
జవాబు:
పేదరికము మానవ జీవితానికి ఒక శాపములాంటిది. పేదరికము ఒక సాంఘీక, ఆర్థిక సమస్య. సమాజంలో ఒక వర్గం వారు కనీస అవసరాలైన ఆహారము, గృహము, వస్త్రము పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. భారతదేశంలో 2013వ సంవత్సరమున మొత్తము జనాభాలో 230 మిలియన్ల ప్రజలు అనగా 17.59 శాతము మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారు. పేదరిక సమస్యను సమగ్రంగా అర్థంచేసుకోవడానికి నిరపేక్ష మరియు సాపేక్ష పేదరిక భావనలను ఉపకరిస్తాయి.

నిరపేక్ష పేదరికము (Absolute Poverty): సమాజంలో కనీస జీవన అవసరాలను కూడా పొందలేని వారిని నిరపేక్ష పేదవారుగా పేర్కొంటాము.

సాపేక్ష పేదరికము (Relative Poverty): సాపేక్ష పేదరికమనేది ఆదాయ అసమానతలను ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. దేశంలో అధిక ఆదాయ వర్గ ప్రజలతో పోల్చుకొని తక్కువ ఆదాయముతో కనీస వసతులు మాత్రమే పొందేవారిని సాపేక్ష పేదవారుగా పేర్కొంటాము.

పేదరిక కారణాలు: పేదరికం ఒక సాంఘిక, ఆర్థిక సమస్య. ఇందు అనేక సాంఘీక, ఆర్థిక, రాజకీయ, వ్యవస్థాపక కారణాలున్నాయి. పేదరిక ప్రభావము ఒక విషవలయములాంటిది. పేదరికము, నిరుద్యోగము ఒకదానిపై ఒకటి ఆధారపడును. పేదరికము నిరుద్యోగానికి, నిరుద్యోగము పేదరికానికి కారణము

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 6
1. వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ: పేదరికానికి ప్రధాన కారణం భారత ఆర్థికవ్యవస్థ వెనుకబడి ఉండుట దండేకర్ మరియు రధ అభిప్రాయము ప్రకారం లాభసాటికాని వ్యవసాయము మరియు అల్పమూలధన సంచయనము భారత గ్రామీణ పేదరికమునకు కారణము. వ్యవసాయరంగంలోని చిన్న కమతాలు, కమతాల విఘటన, ఉత్పాదకాల కొరత, పరపతి సౌకర్యాల కొరత, కౌలుదారునికి భద్రత లేకుండుట ద్వారా భారత వ్యవసాయరంగం వెనుకబడి గ్రామీణ పేదరికానికి కారణమగుచున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

2. నిరుద్యోగము మరియు అల్పవేతనాల స్థాయి: అల్పఉద్యోగిత మరియు నిరుద్యోగితతో పాటు తక్కువస్థాయి వేతనాలు పేదరికానికి కారణము. దీనికి ముఖ్యకారణము భారతదేశంలో శ్రామిక డిమాండ్ కన్నా శ్రామిక సప్లయ్ ఎక్కువగా ఉండుట. మూలధన కొరత వలన పారిశ్రామికరంగం ఎక్కువమంది ప్రజలకు ఉపాధిని కల్పించలేకపోవుట పేదరికానికి కారణం.

3. జనాభా విస్ఫోటనము: భారతదేశంలో కుటుంబ సంక్షేమ కార్యక్రమ అమలు వల్ల మరణాల రేటు తగ్గి జననముల రేటు అధికంగా వున్నది. మనదేశంలో 1951 సంవత్సరంలో 361.09 మిలియన్ల ఉన్న జనాభా 2011 నాటికి 1210.19 మిలియన్లకు పెరిగినది. గత 60 సంవత్సరములలో జనాభా మనదేశంలో 31/2 రెట్లు పెరిగినది. మూలధన కొరత మరియు అల్పసాంకేతిక పరిజ్ఞానం వలన అధిక జనాభాకు అవసరమైన వస్తుసేవలను ప్రజలందరికీ అవసరమైన మేరకు అందడం లేదు. జనాభా వృద్ధిరేటు కన్నా జాతీయాదాయ వృద్ధిరేటు తక్కువగా వున్నది. తక్కువ జాతీయాదాయాన్ని ఎక్కువమంది జనాభా పంచుకొనుట ద్వారా తలసరి ఆదాయం తక్కువగా ఉండి పేదరికాన్ని అనుభవిస్తున్నారు.

4. ఆదాయ, ఆస్తుల పంపిణీలో అసమానతలు: జాతీయాదాయ పంపిణీలో అసమానత సాపేక్ష పేదరికానికి కారణం. భారతదేశంలో ఎక్కువ వ్యవసాయ కుటుంబాలు ఒక హెక్టారుకన్నా తక్కువ వ్యవసాయ భూమిని కలిగివున్నారు. ఫలితంగా ఆధునిక పద్దతులలో వ్యవసాయ కార్యక్రమాన్ని నిర్వర్తించలేక తక్కువ ఆదాయాన్ని పొందుట పేదరికానికి కారణం. పారిశ్రామిక సంస్థల వాటాలను, సంస్థల యాజమాన్యంలోని అసమానతలు పట్టణ పేదరికానికి కారణం.

5. తక్కువ అందుబాటులో ఉన్న నిత్యావసరాలు: నిత్యావసరాలైన ఆహారం, బట్టలు, వసతిగృహం ప్రజలందరికీ అందుబాటులో లేవు. తీవ్రజనాభా పెరుగుదలకు అవసరమైన వస్తుసేవలను మనదేశం ఉత్పత్తి చేయలేకున్నది. ప్రథమ శ్రేణి (వినియోగ) వస్తువుల అల్ప లభ్యత ప్రజల అల్పజీవన ప్రమాణానికి కారణం. ధనిక, పేద ప్రజల మధ్య వినియోగస్థాయిలో ఎక్కువ తారతమ్యం వున్నది. ఇది సాపేక్ష పేదరికాన్ని సూచిస్తుంది.

6. ద్రవ్యోల్బణం: దేశంలో నిరంతరం పెరుగుచున్న అల్పాదాయ వర్గాల ప్రజల పేదరికానికి కారణం. ముఖ్యంగా వ్యవసాయ, వ్యవసాయేతర కూలీలకు స్థిర ఆదాయముండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ధరల పెరుగుదలను అధిగమించడానికి కరువు భత్యం లభించదు. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల ప్రజలు కనీస అవసరాలను తీర్చుకోవడానికి వీలులేక పేదరికానికి గురవుతున్నారు. ‘

7. పంచవర్ష ప్రణాళికల వైఫల్యం: పంచవర్ష ప్రణాళికల ప్రధాన లక్ష్యం ప్రజలందరికీ కనీస అవసరాలను కల్పించడం. ప్రభుత్వము పన్నెండు పంచవర్ష ప్రణాళికలలో అనేక పేదరిక నిర్మూలనా పథకాలను అమలు చేసినప్పటికీ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయినది. మనదేశంలో ప్రణాళికల ద్వారా సాధించే వృద్ధిరేటు పేదరిక నిర్మూలనకు దోహదపడుట లేదు.

8. సాంఘీక కారణాలు: దేశంలో కులవ్యవస్థ, ఉమ్మడి కుటుంబ విధానం. వారసత్వ చట్టాలు, ఆర్థికాభివృద్ధికి ఆదాయ పెరుగుదలకు అవరోధాలుగా ఉన్నాయి. భారతదేశంలోని సామాజిక వ్యవస్థ ఆలోచనా సరళి ప్రజల పురోగతికి ప్రతిబంధకాలు, ప్రజలలోని మూఢనమ్మకాలు, పాపభీతి, దైవభక్తి, అనుత్పాదకతా వ్యయాన్ని పెంచి పేదరికానికి కారణమగుచున్నది. పండుగలకు, పుట్టినరోజు వేడుకలు, పెళ్ళిళ్లు, మరణాలు మొదలగు వాటిపై చేయు విపరీతమైన ఖర్చులు ప్రజల పేదరిక విషవలయానికి కారణం.
బలహీనపడింది.

9. రాజకీయ కారణాలు: బ్రిటీషు వారి వలస ఆర్థిక విధానం ద్వారా భారతదేశం ఆర్థికంగా స్వాతంత్య్రానంతరం దేశంలోని రాజకీయ నాయకులు తమస్వార్థ ప్రయోజనాల కోసం పేదవారిని మరీ పేదవారిగా వుంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. భూసంస్కరణలు సమర్థవంతంగా ఆమలు కాకపోవడం, భారతదేశ పరిపాలకులలోని అసమర్థత, లంచగొండితనము, పేదరికరేటు ఎక్కువగా ఉండుటకు కారణం. చట్టసభలలో పేదప్రజల అభ్యున్నతికి చట్టాలను తీసుకురావడంలో వెనుకబడి వున్నాము.

10. వ్యవస్థాపరమైన కారణాలు: పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వున్న వ్యవస్థాపూర్వకమైన సమస్యలు ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలోని భూస్వామ్యవ్యవస్థ పేదరికానికి కారణము. గ్రామీణ ప్రాంతములోని తక్కువ భూమి గల రైతులు ఆర్థికంగా వెనుకబడి ఉండుట, నూతన వ్యవసాయ వ్యూహాన్ని అనుసరించలేక హరితవిప్లవంలోని ప్రయోజనాన్ని పొందలేకున్నారు. వ్యవస్థాపూర్వక ప్రతిబంధకము మరియు రాజకీయ ప్రాబల్యము లేనందున ప్రభుత్వ సబ్సిడీల ద్వారా లభించే ఎరువులు, విత్తనాలు ఇతర ఉత్పాదకాలు పేదవారికి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం సమకూర్చే గృహవసతి, ఇతర ఫించను పథకాలు కొంతవరకు రాజకీయ జోక్యంతో పేదవారికి దక్కడము లేదు. వ్యవస్థాపక ప్రతిబంధకాల వలన ప్రభుత్వము కల్పించే విద్య, వైద్య సదుపాయాలు పేదవారికి లభ్యంకావడము లేదు.

ప్రశ్న 6.
భారతదేశంలో పేదరికం నిర్మూలించడానికి తీసుకోవలసిన చర్యలు ఏవి ?
జవాబు:
2000 సంవత్సరం సెప్టెంబర్ నెల, ఐక్యరాజ్యసమితి మిలీనియం శిఖరాగ్ర సమావేశంలో 189 ప్రపంచదేశాల “నాయకులు ప్రపంచ పేదరికానికి ముగింపు పలకాలనే నిర్ణయాన్ని తీసుకొస్తున్నారు. మిలీనియం అభివృద్ధి లక్ష్యాలుగా భావించే పేదరిక నిర్మూలన, మానవ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, ప్రపంచశాంతిని నెలకొల్పడం, పర్యావరణ నిలకడగల స్థితిని పెంపొందించడం మొదలైన లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా సాధించడానికి కృషిచేయాలని ఈ దేశ నాయకులు అంగీకరించారు. పేదరికాన్ని రెండు రకాల స్థాయిలో, స్థానికంగా వున్న సమాజాభివృద్ధి ద్వారానూ, వ్యక్తుల, ఎంపిక చేసిన వర్గాల అభివృద్ధి ద్వారాను నివారించవచ్చును. వ్యక్తుల యొక్క ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలను పెంచుతూ అన్ని రంగాలనూ బలోపేతం చేస్తూ పేదరికాన్ని నిర్మూలించుట.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

1. సరళీకరణ, దేశీయ ఉత్పత్తి వృద్ధి కంటే పేదవారి వృద్ధి వ్యూహాన్ని ఎంపికచేసుకొనుట: మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్పాయ్ 15 ఆగస్టు 2001 స్వాతంత్య్రదినోత్సవ సందేశంలో “సరళీకరణ ఫలితాలు గ్రామీణ పేద ప్రజలకు చేరడములేదు. ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలోని నిరుద్యోగిత తొలగింపునకు ప్రాధాన్యతనివ్వాలి. “పనిహక్కు” (Right to work) ను ప్రాథమిక మానవహక్కుగా గుర్తించాలి. ఈ పద్దతిలో నీటి సంరక్షణ, నీటిపారుదలకు ప్రాధాన్యత నివ్వాలి. సహాకార వ్యవసాయాన్ని బలపరచాలి.

2. వ్యవసాయ వృద్ధిరేటును పెంపొందించుట: వ్యవసాయ వృద్ధిరేటు 9వ పంచవర్ష ప్రణాళికలో 2.7 శాతము 10వ పంచవర్ష ప్రణాళికలో 1.7 శాతము మాత్రమే ఉన్నది. ఈ విధమైన అల్పవృద్ధిని అధిగమించుటకు భారత ప్రభుత్వం ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త యం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినది. ఈ కమిటీ వ్యవసాయ రంగాల వృద్ధికి అంశాలు కార్యాచరణ ప్రణాళికను సూచించినవి. అవి:

  1. భూమి సారవంతాన్ని పెంచే కార్యక్రమాన్ని అమలుచేయుట.
  2. పంట రుణాలపై వడ్డీని 4 శాతానికి తగ్గించుట.
  3. రైతులకు అధునాతన వ్యవసాయ విధానాలపై శిక్షణ ఇచ్చుటకు కృషి విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పుట మొదలైనవి.

3. అసంఘటిత రంగములో వృత్తి నైపుణ్యాన్ని, ఉత్పాదకతను పెంచుట: అసంఘటిత శ్రామికుల ఆదాయాలు తక్కువగా ఉండి పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ప్రభుత్వము వీరి వృత్తి నైపుణ్యాలను పెంచి అసంఘటిత రంగాన్ని లాభసాటిగా మార్చాలి. అసంఘటిత రంగంలో 10 మిలియన్ల ఉద్యోగాల కల్పనకై లక్ష్యంగా 2002 సంవత్సరములో యస్.పి. గుప్తా అధ్యక్షతన నేషనల్ డెమోక్రటిక్ అలియెన్స్ (ఎన్.డి.ఎ) ప్రభుత్వము కమిటీని నియమించినది. దీనిద్వారా నిరుద్యోగాన్ని, పేదరికాన్ని నిర్మూలించవచ్చును.

4. వృద్ధి ప్రక్రియలో వేతనాల రేటును పెంచి పేదరికాన్ని నిర్మూలించుట:
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 7
ఆర్థికవృద్ధి నిర్మాణంలో వేతనాల వాటాను పెంచుట ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు. వేతనాల వాటా 1989-90లో 70.8 శాతము ఉండగా 2009-10 సంవత్సరమునకు 36.5 శాతానికి తగ్గినది. లాభాల వాటా 1989-90 సంవత్సరములో కేవలము 19.1 శాతము ఉండగా 2009-10 నాటికి 56.2 శాతానికి పెరిగినది. లాభాల వాటాలో వచ్చిన గణనీయ మార్పులు, వేతనాల వాటాలో వచ్చిన తగ్గుదల పేదరికము తక్కువ స్థాయిలో తగ్గుటకు కారణం.

5. విద్య, నైపుణ్యాల విషయంలో పేదవారిని శక్తివంతులను చేయుట: భారతదేశంలో వృద్ధిచెందిన విద్యావ్యవస్థలో 378 విశ్వవిద్యాలయాలు, 18,064 కళాశాలు, 152 లక్షల ఉన్నత పాఠశాలలు మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడుతూ పేదరికాన్ని అరికడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వము జాతీయ నైపుణ్యాల అభివృద్ధి సంస్థ నెలకొల్పినది.

6. మంచి ఆరోగ్యవసతుల ద్వారా పేదవారిని శక్తివంతులను చేయుట: ఆరోగ్యానికి, పేదరికానికి మధ్యగల సంబంధాన్ని గుర్తించాలి. దీర్ఘకాలిక ఎక్కువఖర్చుతో కూడిన అనారోగ్యమునకు గురైన పేదరికాన్ని ఎదుర్కోక తప్పదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM) మరియు జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (NUHM) అను రెండు సంస్థలు పేదలను, ఆరోగ్యవంతులను అందుబాటులోకి తెచ్చినవి. పేదరిక ఉచ్చునుండి బయటపడటానికి, అసంఘటిత రంగంలోని శ్రామికులకు ఆరోగ్యభీమా సౌకర్యాన్ని కల్పించాలి.

7. పేదవారికి ఇంటి వసతిని కల్పించాలి: గ్రామీణ మరియు పట్టణ పేదవారికి ఇల్లు ప్రధాన అవసరము. రాబోవు 20 సంవత్సరాల కాలంలో ఇందిరా ఆవాస్ యోజన అనుగొప్ప నిర్మాణ పథకాన్ని, పౌరులందరికీ కనీస వసతుల కల్పనకు, కేంద్ర ప్రభుత్వము ఒక పధకాన్ని ప్రవేశపెట్టినది. ప్రాథమిక అవసరాలైన త్రాగునీరు, విద్యుత్తు వంటి వసతులను పేదలకు కల్పించాలి.

8. ఐటి రంగాన్ని, విస్తృతపరచి, నైపుణ్యాల ద్వారా పేదలను శక్తివంతులను చేయడము: సమాచార సాంకేతికతను వృద్ధిచేయడము ద్వారా ఎక్కువ ఉద్యోగాలు సృష్టించి పేదరికాన్ని నిర్మూలింపవచ్చు. ఎక్కువ మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరుచేయాలి. ప్రభుత్వము విద్యాసంస్థలను ఆర్థికంగా, వ్యవస్థాపరమైన సౌకర్యాలను కల్పిస్తూ’ పేద విద్యార్థులకు విద్యను అందించాలి.

9. జాతీయ ఉపాధి గ్రామీణ పథకము: జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టము వెనుకబడిన 200 జిల్లాలో 2006వ సంవత్సరము నుంచి ప్రారంభించి ఏప్రిల్ 1, 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించబడినది. |2010-11 కేంద్ర బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయించుట ద్వారా గ్రామీణ జనాభాకు ఉపాధిని కల్పించి తద్వారా పేదరికాన్ని నిర్మూలించుటకు ప్రభుత్వము సంకల్పించినది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 7.
నిరుద్యోగితకు కారణాలను మరియు నిరుద్యోగిత నివారణ చర్యలను వివరింపుము.
జవాబు:
భారతదేశంలో నిరుద్యోగితకు కారణాలు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 8
నిరుద్యోగ సమస్యకు అనేక సాంఘిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన కారణాలున్నాయి.
1. అధికరేటులో వృద్ధి చెందే జనాభా: అధికరేటులో వృద్ధిచెందే జనాభాకు అనుగుణముగా శ్రామిక సప్లయ్ పెరుగును. మనదేశంలో 1960 ప్రాంతములో సాలుసరి జనాభా వృద్ధిరేటు 2.2 శాతము కాగా సాలుసరి శ్రామిక శక్తి 1.9 శాతముగా ఉన్నది. 2011-12 సంవత్సరముల మధ్య పెరిగిన నికర శ్రామిక జనాభాకు లాభసాటి ఉపాధిని కల్పించుట మన ఆర్థిక వ్యవస్థకు దుర్లభము.

2. ఉపాధి రహితవృద్ధి: స్వాతంత్య్రానంతర మూడు దశాబ్దాల ప్రణాళికా కాలంలో సాంవత్సరిక స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 3.5 శాతముగా ఉన్నది. ఈ కాలంలో సాంవత్సరిక ఉపాధి అవకాశాలు కేవలము 2 శాతము మాత్రమే. 1999-2000 నుంచి 2004-05 మధ్య 5 సంవత్సరాల కాలంలో సాంవత్సరిక ఉపాధి వృద్ధిరేటు 2.9 శాతము కాగా 2004-05 నుంచి 2009-10 మధ్య ఉపాధి వృద్ధి రేటు దాదాపు శూన్యము.

3. ప్రతికూల సాంకేతికం: భారతదేశము మూలధన కొరతను కల్గి అధిక శ్రామిక శక్తిని కల్గిఉన్నది. మార్కెట్ శక్తులు స్వేచ్ఛగా సమర్ధవంతముగా నిర్వహించిన శ్రమసాంద్రత ఉత్పత్తి పద్ధతిని ఎంపికచేసుకోవలసి వస్తుంది. పారిశ్రామిక రంగంలోనే గాక వ్యవసాయ రంగంలో కూడా ఉత్పత్తిదారులు శ్రమకు బదులుగా మూలధనాన్ని (యాంత్రీకరణను) ఉపయోగించుటవలన నిరుద్యోగిత పెరుగుచున్నది.

4. గ్రామీణ పరిశ్రమలు విస్తరించకపోవుట భారతదేశములో గ్రామీణ పరిశ్రమలు విస్తరించకపోవుట వలన, జనాభా మొత్తము వ్యవసాయముపై ఆధారపడుట వలన వ్యవసాయ రంగంలో ఒత్తిడి అధికమై వ్యవసాయరంగమే వెనుకబడినది. వ్యవసాయరంగము అధికరేటులో పెరిగే జనాభాకు ఉపాధిని కల్పించలేక నిరుద్యోగము అధికమగుచున్నది.

5. లోపభూయిష్ట విద్యావిధానము: బ్రిటీష్ వారి కాలములో మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానము నేటికీ కొనసాగుచున్నది. గున్నార్ మీర్జాల్ ప్రకారము “మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా భారతదేశ విద్యావిధానము లేదని” పేర్కొనుట సమంజసము. ఇతని ప్రకారము ఇంకనూ ఈ విద్యా విధానము కేవలం ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో క్లర్క్స్ ను మరియు తక్కువస్థాయి కార్యనిర్వాహకులను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని పేర్కొనెను. లోపభూయిష్ట విద్యావిధానము వలన మానవ వనరులు అభివృద్ధి చెందనంత వరకు విద్యనభ్యసించిన వారందరికి ఉపాధిని కల్పించుట కష్టము.

6. మానవ వనరుల వృద్ధిలో లోపము: భవిష్యత్లో అవసరమైన నైపుణ్యము కలిగిన శ్రామికులకు అనుగుణంగా తగిన విద్యాభోదన. అందుకు అవసరమైన కోర్సులను ప్రారంభించడములో వెనుకబడుట నిరుద్యోగమునకు కారణము.

7. సాంఘీక కారణాలు: స్వాతంత్య్రానంతరము స్త్రీలు పురుషులతో పాటు విద్యనభ్యసించుచున్నారు. ఉద్యోగం పురుషలక్షణం అనే నానుడి గతించినది. ప్రస్తుతము అన్ని రంగాలలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యోగాలను పొందటంలో పోటీపడుచున్నారు. ప్రభుత్వములు కూడా స్త్రీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించుచున్నది. ఆర్థిక వ్యవస్థ అన్ని వర్గాల వారికి ఉద్యోగితను కల్పించే స్థాయికి చేరకపోవుట నిరుద్యోగితకు కారణము.

8. స్వయం ఉపాధిపై మక్కువ లేకుండుట: గ్రామీణ ప్రాంతంలోని ఉపాంత రైతులు మరియు వ్యవసాయ కూలీలు స్వయం ఉపాధిపై దృష్టిపెట్టక అల్ప ఉద్యోగితను మరియు నిరుద్యోగితను ఎదుర్కొనుచున్నారు. విద్యాధికులైన యువకులలో ఉద్యమిత్వ సామర్థ్యము కొరవడి అతితక్కువ వేతనాలకు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు సంవత్సరముల తరబడి నిరీక్షిస్తూ నిరుద్యోగితను అనుభవిస్తున్నారు.

9. కుటీర పరిశ్రమలు క్షీణించుట: గ్రామీణ ప్రాంత భూమిలేని ప్రజలకు కుటీర పరిశ్రమలు ఉపాధిని కల్పించింది. జీవనోపాధి కొరకు ఎక్కువ మంది ఆధారపడే కుటీర పరిశ్రమలు పారిశ్రామికీకరణ ఫలితంగా క్షీణించినవి. అధునాతన పారిశ్రామిక ఉత్పత్తులలో కుటీరపరిశ్రమల ఉత్పత్తులు పోటీపడలేకుండుట దీనికి కారణము. దీని ఫలితంగా ఈ పరిశ్రమలపై ఆధారపడిన వారు ఉపాధిని కోల్పోయి నిరుద్యోగులుగా ఉన్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

నిరుద్యోగిత – నివారణ చర్యలు:
నిరుద్యోగ సమస్య స్వభావాన్ని, తీవ్రతను, వీటి కారణాలను విశ్లేషించిన అనంతరం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను, ప్రభుత్వ స్పందనను పరిశీలించాలి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 9

1. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి: నూతన ఆర్థిక విధానాలను ప్రోత్సహించి, పెట్టుబడులను పెంచి ఆర్ధికాభివృద్ధిని వేగవంతము చేయాలి. పారిశ్రామిక రంగంలో ఉపాధిని పెంచుట ద్వారా వ్యవసాయరంగంపై ఒత్తిడిని తగ్గించి గ్రామీణ నిరుద్యోగితను అరికట్టవచ్చును.

2. స్వయం ఉపాధికి విరివిరిగా రుణాలిచ్చుట ఉద్యమిత్వ సామర్థ్యము కలిగిన విద్యాధికులు స్వతహాగా. నిర్వహించే పరిశ్రమలు, సేవలరంగానికి విరివిగా రుణసౌకర్యాలను కల్పించిన నిరుద్యోగితను అరికట్టవచ్చును.

3. చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించుట: చిన్నతరహా పరిశ్రమలు శ్రమ సాంద్రతమైనది. ప్రభుత్వము పెద్దపరిశ్రమలతో పోటీని నివారించుటకు కొన్ని వస్తువుల ఉత్పత్తిని చిన్నతరహా పరిశ్రమలకు రిజర్వుచేయాలి.

4. ప్రభుత్వ ప్రధాన ఉద్యోగితా పథకాలు: భారత ప్రభుత్వము దేశం ఎదుర్కొనే ప్రధాన సమస్య అయిన నిరుద్యోగితను తొలగించాలనే ధృడ సంకల్పముతో అనేక ఉద్యోగితా పథకాలను అమలు చేస్తుంది.

  1. సమీకృత గ్రామీణాభివృద్ధి పధకము (IRDP): ఈ పధకాన్ని 1978 – 79లో స్వయం ఉపాధి లక్ష్యంగా ప్రవేశపెట్టబడినది.
  2. స్వయం ఉపాధికోసం గ్రామీణ యువత శిక్షణ పథకము (TRYSEM): గ్రామీణ యువత ఎదుర్కొనే నిరుద్యోగితను తొలగించడానికి 1979 సంవత్సరములో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడమైనది.
  3. జవహర్ రోజ్ గార్ యోజన (JRY): దేశంలో బాగా వెనుకబడిన 120 జిల్లాల్లో ఉపాధిని పెంచుటకు ఫిబ్రవరి 1989లో ఈ పథకం ప్రారంభించబడినది.
  4. జాతీయ గ్రామీణ ఉపాధి పథకము (NREP): వ్యవసాయ పనులు లేనికాలంలో గ్రామీణ జనాభాకు వేతనం, ఉద్యోగితను కల్పించే లక్ష్యంతో 6వ పంచవర్ష ప్రణాళికలో దీనిని ప్రవేశపెట్టడమైనది.
  5. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన (DDUGKY): పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 25, 2014న ఈ పథకము ప్రారంభించబడినది. మేధావంతులైన గ్రామీణయువతకు ఉద్యోగితను కల్పించుట ఈ పథకము ఉద్దేశ్యము.

ప్రశ్న 8.
భారతదేశములో పేదరికాన్ని నివారించుటలో సూక్ష్మ విత్త పాత్రను వివరింపుము.
జవాబు:
సూక్ష్మవిత్త ఆవశ్యకత ప్రపంచబ్యాంకు పరిశోధన ప్రకారము ప్రపంచములో 1/3వ వంతు పేదవారు భారతదేశంలో ఉన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పేదరిక నిర్మూలన పథకములు అమలుచేస్తున్నప్పటికీ, సూక్ష్మవిత్తము యొక్క పాత్ర మనదేశంలో ఎక్కువ. గత కొన్ని దశాబ్దాలుగా పేదరిక నిర్మూలనలో సూక్ష్మవిత్తము ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నది. సూక్ష్మవిత్తము ద్వారా ప్రజలు అధిక ఆదాయాన్ని పొందుతూ జీవన ప్రమాణస్థాయిని పెంచుకొంటున్నారని అనేక నివేదికలు భారతదేశములో తెలియజేస్తున్నాయి.

బ్యాంకుల స్థానంలో సూక్ష్మవిత్త సంస్థలు పేదవారికి మెరుగైన సేవలను అందిస్తున్నాయి. ఈ సంస్థలు విత్తేతర సేవలను శిక్షణ, కౌన్సిలింగ్, భీమా మొదలగునవి కూడా ప్రజలకు అందిస్తున్నాయి. ఋణగ్రహీతల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా తిరిగి చెల్లింపులు ఉంటూ వారి ఇంటి వద్దకే సేవలను అందిస్తున్నాయి. ‘ఇవి వాణిజ్య బ్యాంకులకన్నా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తున్నాయి.

సూక్ష్మవిత్త మార్గాలు (Channels of Micro finance):
1. స్వయం సహాయక సమూహం (Self Help Group): జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకుచే ప్రోత్సాహించబడి, బ్యాంకు ద్వారా సూక్ష్మపరపతిని అందించుట. సాధారణంగా 10 నుంచి 15 మంది స్త్రీలు ఒక స్వయం సహాయక సమూహముగా ఏర్పడుట. బృందంలోని సభ్యులంతా తరచు కొంతమొత్తాన్ని పొదుపుచేసి అందునుంచి అవసరనిమిత్తము రుణాలు పొందుట. ఈ విధానము బహుళ ప్రాచుర్యము పొందినది. స్వయం సహాయక బృందాలు స్వయం పోషక స్థాయికి ఎదిగిన స్వచ్ఛంద సంస్థలు (Non Government Organization) మరియు భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (SIDBI) సహకారముతో స్వంతంగా మనుగడను కొనసాగించగలవు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

2. సూక్ష్మవిత్త సంస్థలు: సూక్ష్మవిత్త సహాయాన్ని అందించుట ఈ సంస్థల ముఖ్య లక్ష్యము బృంద సమిష్ఠి జవాబుదారితనాన్ని ఆధారంగా చేసుకొని రుణాల్విడము జరుగును. పరస్పర హామీ పద్ధతిలో వ్యక్తిగత లేదా గ్రూప్ అవసరాలకు అనియత (Informal) పద్ధతిలో 5 నుండి 10 మంది సభ్యులు కలిగిన సమిష్టి జవాబుదారితనము కలిగిన సమూహము బ్యాంకు రుణాలను పొందును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో నిరుద్యోగ వ్యాప్తి.
జవాబు:
భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిరుద్యోగ సమస్య ఒకటి. అమలులో ఉన్న వేతనం రేటుకు ఇష్టపడి పనిచేయటానికి సిద్ధపడినప్పుడు వారికి పని దొరకని స్థితిని నిరుద్యోగితగా నిర్వచించవచ్చు. భారతదేశంలో 1983 నుంచి 2012 సం॥ల మధ్య నిరుద్యోగిత రేటు సగటున 7.58 శాతంగా ఉన్నది. 2009 సంవత్సరమున నిరుద్యోగిత రేటు గరిష్టంగా 9.4 శాతంగాను, 2012 సంవత్సరము నిరుద్యోగిత రేటు తక్కువ స్థాయిలో అనగా 5.20 శాతంగా ఉంది.

భారతదేశంలో సాధారణ స్థితి నిరుద్యోగిత 1977-78వ సంవత్సరములో 4.23% ఉండగా ఇది 1999-2000 సంవత్సరం నాటికి 2.81 శాతమునకు తగ్గినది. తిరిగి 2004-05 సంవత్సరం నాటికి సాధారణ స్థితి నిరుద్యోగిత 3.06 శాతమునకు పెరిగినది. 2011-12 నాటికి సాధారణ స్థితి నిరుద్యోగిత 2.7% అంచనా వేయబడినది.
మనదేశంలో వర్తమాన రోజువారి స్థితి నిరుద్యోగిత 1977-78వ సం||న 8.18 శాతంగా ఉన్నది. ఈ నిరుద్యోగిత 2004-05 సం॥నాటికి తిరిగి 8.28 శాతమునకు పెరిగింది.

ప్రశ్న 2.
వివిధ రకాలైన పేదరిక భావనలు వివరించండి. [Mar ’16]
జవాబు:
పేదరికం ఒక సాంఘీక ఆర్థిక సమస్య. సమాజంలో ఒక వర్గం వారు కనీస అవసరాలైన ఆహారము, గృహము, వస్త్రము పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. భారతదేశంలో 2013వ సం॥ మొత్తం జనాభాలో 230 మిలియన్ల ప్రజలు అనగా 17.59% మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారు.

పేదరికపు భావనలు:
1. నిరపేక్ష పేదరికం: సమాజంలో కనీస జీవన అవసరాలు కూడా పొందలేని వారిని నిరపేక్ష పేదవారుగా పేర్కొంటాము. నిర్ణయించిన కనీస ఆదాయం లేదా వినియోగ వ్యయాన్ని కూడా పొందలేని వారిని నిరపేక్ష పేదవారుగా చెప్పవచ్చు.

2. సాపేక్ష పేదరికం: దీనిని ఆదాయ అసమానతలను ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. దేశంలో అధిక ఆదాయ వర్గ ప్రజలతో పోల్చుకొని తక్కువ ఆదాయంతో కనీస వసతులు మాత్రమే పొందేవారిని సాపేక్ష పేదవారుగా చెప్పవచ్చు.

3. దారిద్ర్యపు రేఖ: పేదరికాన్ని కొలవడానికి పేదరిక గీత అనే భావనను ఉపయోగిస్తారు. దేశంలోని ప్రజల కనీస అవసరాల వినియోగ వ్యయాన్ని అంచనావేసి, దాని కన్నా తక్కువ వినియోగ వ్యయాన్ని కల్గిన ప్రజలందరు, పేదరిక రేఖకు దిగువన ఉన్నట్లు చెప్పవచ్చును. పేదరిక గీతను నిర్ధారించుటకు దోహదపడే అంశాలు.

  1. కనీస జీవన వినియోగ స్థాయి
  2. కనీస పోషక పదార్థాల వ్యయం
  3. తలసరి, నెలసరి వినియోగ వ్యయం

ప్రశ్న 3.
వివిధ రకాలైన నిరుద్యోగాలు. [Mar ’17]
జవాబు:
నిరుద్యోగాన్ని నిర్వచించడం చాలా కష్టం. వ్యక్తి పనిచేయాలనే కోరిక ఉన్నప్పటికీ పని కల్పించలేక పోవడాన్ని నిరుద్యోగితగా పేర్కొంటారు. భారతదేశంలో నిరుద్యోగిత ఎక్కువగా వ్యవస్థాపరమైనది.
నిరుద్యోగితను ప్రధానంగా 1. పట్టణ ప్రాంత నిరుద్యోగిత (2) గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత అని రెండు రకాలుగా పేర్కొనవచ్చు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 10
I. పట్టణ ప్రాంత నిరుద్యోగిత: పట్టణ ప్రాంతంలో వ్యవసాయేతర రంగాల ప్రాధాన్యత ఎక్కువ. ఈ ప్రాంతంలో
రెండు రకాల నిరుద్యోగిత కనిపించును.

  1. విద్యావంతులలో నిరుద్యోగిత: లోపభూయిష్ట విద్యావిధానము, సృజనాత్మకత కొరవడం, సాంకేతిక విద్యలో వెనుకబడుట, డిమాండ్కు తగిన నైపుణ్యాలు కల్పించలేకపోవటం విద్యావంతులలో నిరుద్యోగిత అధికముగా ఉన్నది.
  2. పారిశ్రామిక నిరుద్యోగిత: మనదేశంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఉద్యోగ కల్పన చేయలేక పోవుచున్నది. దీనికి కారణం వృద్ధిరేటు కన్నా జనాభా మరియు శ్రామిక సప్లయి పెరగడం. పట్టణాలు, దాని సమీప ప్రాంతాలలో కుటీర, చిన్నతరహా పరిశ్రమలు క్షీణించుట పారిశ్రామిక నిరుద్యోగితకు కారణం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

II. గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత: ఇది కూడా రెండు రకాలు.
1. ఋతుసంబంధమైన నిరుద్యోగం: మనదేశంలో ఈ రకమైన నిరుద్యోగిత వ్యవసాయరంగంలో కనిపిస్తుంది. వ్యవసాయ కార్యక్రమాలు ఋతు సంబంధంగా ఉండటమే ఇందుకు కారణము. వ్యవసాయ కార్మికులకు నాట్లు, కోతల సమయంలోనే పనిదొరుకుతుంది. మిగతా సమయంలో నిరుద్యోగులుగా ఉంటారు. సం॥లో 6 నుండి 8 మాసాలు మాత్రమే పని దొరుకుతుంది.

2. ప్రచ్ఛన నిరుద్యోగం: ఇది కూడా మనదేశంలో వ్యవసాయ రంగంలో కనిపించును. వ్యవసాయ రంగంలో అవసరానికి మించి ఎక్కువ మంది పనిచేస్తుంటారు. వీరిని పనినుండి తొలగించినప్పటికీ ఉత్పత్తిలో ఎటువంటి తగ్గుదల ఉండదు. వీరి ఉపాంత ఉత్పాదకత శూన్యం. దీనినే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు.

III. ఇతర నిరుద్యోగాలు:

  1. చక్రీయ నిరుద్యోగం: అభివృద్ధి చెందిన దేశాలలో ఈ నిరుద్యోగిత కనిపించును. కీన్స్ ప్రకారం సార్థక డిమాండ్ కొరతవల్ల చక్రీయ నిరుద్యోగిత ఏర్పడును.
  2. వ్యవస్థాపరమైన నిరుద్యోగం: శ్రామిక మార్కెట్ పనిచేయడానికి సిద్దంగా ఉన్న వారందరికి పనిని కల్పించలేకపోవడం వ్యవస్థాపరమైన నిరుద్యోగం. ఇది జనాభా అధికంగా ఉండే మనలాంటి దేశాలలో ఉంటుంది. దీనినే బహిరంగ నిరుద్యోగిత అంటారు.
  3. అల్ప ఉద్యోగిత: ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయిలో పనుల్లో పనిచేయటాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. ఉదా॥ ఇంజనీరింగు పూర్తిచేసిన వారు ప్రైవేటు స్కూల్లో గుమస్తాగా పనిచేయడం.
  4. సంఘృష్ట నిరుద్యోగం: శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తికి మార్పు చెందే కాలంలో ఏర్పడిన నిరుద్యోగితను సంఘృష్ట లేదా ఘర్షణ నిరుద్యోగిత అంటారు.

ప్రశ్న 4.
ఉపాధి హామీ పథకాన్ని గూర్చి సంక్షిప్తంగా వ్రాయుము.
జవాబు:
దీనినే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం (MGNREGS) అంటారు. దీనిని అక్టోబర్ 2, 2009న ఈ పథకం ప్రారంభించారు. ప్రతి గ్రామీణ కుటుంబంలో ఒకరికి నైపుణ్య రహిత పనులు చేయటకు అర్థిక సంవత్సరంలో 100 రోజులు వేతన ఉద్యోగితను కల్పించుట ఈ పథకం ఉద్దేశ్యం: 33 శాతం మంది లబ్ధిదారులు ఖచ్ఛితంగా స్త్రీలు ఉండాలి. బాంకులు, పోస్టాఫీసుల ద్వారా వేతనాలు ఇవ్వబడును. రోజుకు రూ.100/- వేతనం ఇవ్వబడును. నీటి సంరక్షణ, కరువు నివారణ పనులు, భూమి అభివృద్ధి మొదలగు పనుల నిర్వహణలో ఉపాధి కల్పన. ఈ పథకం క్రింద 2012-13లో 39,661 కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి 229.93 కోట్ల పనిదినాలు కల్పించబడినవి.

ప్రశ్న 5.
దీనదయాళ్ ఉపాధ్యాయ కౌశల యోజన గూర్చి సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన (DDUGKY): పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 25, 2014న ఈ పథకము ప్రారంభించబడినది. మేధావంతులైన గ్రామీణ యువతకు ఉద్యోగితను కల్పించుట ఈ పథకము ఉద్దేశ్యము వీరికి ఉద్యోగాలను కల్పించుటకు భారత ప్రభుత్వము నైపుణ్యాల అభివృద్ధి పథకము (skill development scheme)ను ప్రారంభించినది.

DDUGKY ప్రధాన లక్షణాలు:
– 2017 నాటికి 10 లక్షల గ్రామీణ యువతకు ఉద్యోగితను పొందే విధంగా తర్ఫీదు ఇచ్చుట.
ఈ పథకము క్రిందికి రావటానికి కనీస వయసు 15 సంవత్సరములు.
గ్రామీణ ప్రాంత నిరుద్యోగ సమస్యను అధిగమించుటకు నైపుణ్యాభివృద్ధి తర్ఫీదు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందిస్తూ ప్రధానమంత్రి “భారతదేశంలో తయారీ”కి తోడ్పడాలి.
2015 – 16 బడ్జెట్లో ఈ పథకానికి 1500 కోట్ల రూపాయలు కేటాయించుట. నిరుద్యోగితను తగ్గించగలదనుటలో సందేహము లేదు.

ప్రశ్న 6.
సూక్ష్మ విత్తము.
జవాబు:
1976 సం॥లో బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయుట ద్వారా ఆధునిక సూక్ష్మ విత్తానికి పునాది వేయడము జరిగినది. భారతదేశంలో ప్రభుత్వేతర సంస్థలుగా (NGOs) సూక్ష్మ ఆర్థిక సంస్థలు అమలులో ఉన్నాయి. బాంకింగేతర విత్త సంస్థలు, వాణిజ్యబాంకులు, ప్రాంతీయ గ్రామీణ బాంకులు, సహకారసంస్థలు పెద్ద స్థాయి గల రుణదాతలు మొదలైన 25 కంపెనీలు సూక్ష్మవిత్త సంస్థలకు పునర్విత్త సహాయాన్ని అందిస్తున్నాయి.

అల్పాదాయ వర్గాల వారికి బాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశము తక్కువ. స్వయం ఉపాధికి మరియు వినియోగ ఖర్చులకు విత్త సేవలను అందించుట సూక్ష్మవిత్త ఉద్దేశ్యము. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణస్థాయిని పెంచడానికి రుణము, పొదుపు, భీమా మొదలగు విత్తపరమైన శిక్షణ మరియు కౌన్సిలింగ్ వంటి విత్తేతర సేవలను సూక్ష్మవిత్తం అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

సూక్ష్మవిత్త లక్షణాలు:

  • రుణాలు పొందేవారు అల్పాదాయ వర్గాలుగా ఉండాలి.
  • రుణాలు చిన్న మొత్తంలో ఉంటాయి.
  • రుణ కాలవ్యవధి చాలా తక్కువ.
  • రుణాలు పొందడానికి అదనపు హామీ లేదా భద్రత అవసరములేదు.
  • తరచూ ఋణాలు తిరిగి చెల్లించుట ఎక్కువ సార్లుగా ఉంటుంది (Repayment of Loans).
  • ఆదాయ పెంపుదలకు సాధారణముగా రుణాలు ఇవ్వబడును.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.
జవాబు:
వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ జనాభాకు వేతన ఉద్యోగితను కల్పించే లక్ష్యంతో 6వ పంచవర్ష ప్రణాళికలో దీనిని ప్రవేశపెట్టడమైనది.

ప్రశ్న 2.
సాపేక్ష పేదరికం.
జవాబు:
అధిక ఆదాయ వర్గాల వినియోగ వ్యయంతో అల్పాదాయ వర్గాల వారి వినియోగ వ్యయం పోల్చి చెప్పటం. అభివృద్ధి చెందిన దేశాలలో ఇటువంటి పేదరికం ఉంటుంది.

ప్రశ్న 3.
TRYSEM. [Mar ’16]
జవాబు:
స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువత శిక్షణ పథకం: ఈ పథకాన్ని గ్రామీణ యువత ఎదుర్కొనే నిరుద్యోగితను తొలగించడానికి 1979 సం॥లో ప్రవేశపెట్టారు. సంవత్సరానికి 2 లక్షల యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా ఈ పథకం ఉద్దేశించబడినది.

ప్రశ్న 4.
ప్రచ్ఛన్న నిరుద్యోగిత.
జవాబు:
ఈ నిరుద్యోగిత మనలాంటి దేశాలలో వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. అవసరాన్ని కన్నా ఎక్కువమంది పనిచేయటం వారిని పనినుండి తొలగించిన ఉత్పత్తిలో ఎటువంటి తగ్గుదల ఉండదు. వారి ఉపాంత ఉత్పాదకత శూన్యముగా ఉంటుంది.

ప్రశ్న 5.
పేదరిక వ్యత్యాస సూచిక.
జవాబు:
పేదరిక రేఖ కన్నా దిగువ సగటు వినియోగ స్థాయికి మధ్య ఉన్న అనుపాత స్థాయిని పేదరిక వ్యత్యాసంగా పేర్కొంటారు. పేదవారి ఆదాయాన్ని పెంచి వారిని పేదరికరేఖ వద్దకు చేర్చి పేదరికాన్ని తొలగించడాన్ని పేదరిక వ్యత్యాసం తెలుపుతుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 11

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 6.
సాధారణ స్థితి నిరుద్యోగిత.
జవాబు:
సంవత్సరము మొత్తం కాలంలో నిరుద్యోగులుగా ఉన్న వారిని సాధారణ స్థితి నిరుద్యోగిత అంటారు.

ప్రశ్న 7.
నిరపేక్ష పేదరికం.
జవాబు:
కనీస అవసరాలైన ఆహారం, బట్టలు, వసతి గృహం లేని వారిని నిరపేక్ష పేదరికం అంటారు. భారతదేశంలోని | పేదరికము నిరపేక్ష పేదరికం.

ప్రశ్న 8.
సూక్ష్మ విత్తం.
జవాబు:
1976వ సంవత్సరములో బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ సూక్ష్మ విత్తానికి పునాది వేయడం జరిగింది. పేద ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచటానికి తక్కువ మొత్తంలో రుణం, విత్తపరమైన సేవలు, పొదుపును ప్రోత్సహించాడు.

ప్రశ్న 9.
తలసరి ఆదాయం.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. ఒక దేశ జాతీయాదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే దానిని తలసరి ఆదాయం అంటారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం 12

ప్రశ్న 10.
దారిద్ర్యరేఖ.
జవాబు:
పేదరికాన్ని కొలవడానికి ‘పేదరిక గీత’ అనే భావనను ఆర్థికవేత్తలు ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రజలు తలసరి ఆహారధాన్యాల వినియోగం రోజుకు 2,400 కాలరీలు, పట్టణ ప్రజల తలసరి ఆహారధాన్యాల వినియోగం రోజుకు 2,100 కాలరీలు కూడా పొందలేని వారు పేదరిక రేఖకు క్రిందన ఉన్నారు.

ప్రశ్న 11.
సంఘృష్ట నిరుద్యోగిత.
జవాబు:
శ్రామికులు ఒక వృత్తి నుంచి వేరొక వృత్తికి మార్పుచెందే కాలంలో ఏర్పడిన నిరుద్యోగితను సంఘృష్ట నిరుద్యోగిత అంటారు. శ్రామికులకు ఉద్యోగ అవకాశాల గురించి సరియైన అవగాహన లేకపోవడం వల్ల ఈ నిరుద్యోగిత ఏర్పడును.

ప్రశ్న 12.
అల్ప ఉద్యోగిత.
జవాబు:
ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయి పనుల్లో పనిచేయటాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. పూర్తి స్థాయిలో పనిచేసే శక్తి ఉండి పార్టెమ్ పనిని నిర్వర్తించడంను అల్ప ఉద్యోగిత అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 3 జాతీయ ఆదాయం

ప్రశ్న 13.
చక్రీయ నిరుద్యోగిత.
జవాబు:
ఆర్థిక కార్యకలాపాలలో వచ్చే చక్రీయ మార్పులు ఈ నిరుద్యోగితకు కారణం. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యాపార కార్యకలాపాల్లో మందకొడితనం ఏర్పడటం వల్ల సాధారణంగా ఏర్పడే నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగిత అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 2nd Lesson జనాభా, మానవ వనరుల అభివృద్ధి Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 2nd Lesson జనాభా, మానవ వనరుల అభివృద్ధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జనాభా పరిణామ సిద్ధాంతం వివరించండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధి మరియు జనన మరణాల రేటును బట్టి ఈ సిద్ధాంతాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. ప్రతి దేశంలో ఈ క్రింది మూడు దశలను అనుసరించి జనాభా వృద్ధిరేటు ఉంటుంది.
1) మొదటి దశ: ఈ దశలో ఆర్థికంగా వెనుకబడిన వ్యవసాయ ప్రాధాన్యతగల ఆర్థిక వ్యవస్థలో జననాల రేటు, మరణాల రేటు అధికంగా ఉంటాయి. పోషకాహార లోపం, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల మరణాల రేటు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా, నిరక్షరాస్యత అధికంగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన లోపం, బాల్య వివాహాలు, సాంఘీక మూఢనమ్మకాలు, సంప్రదాయము మొదలైన వాటివల్ల జననాల రేటు అధికంగా ఉంటుంది. ఈ దశలో అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు సమానంగా ఉంటాయి. కాబట్టి జనాభా వృద్ధిరేటు అధికంగా ఉండదు. భారతదేశంలో 1921కి పూర్వము ఈ దశ ఉన్నది.

2) రెండవ దశ: ఈ దశలో ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలు మెరుగుపడతాయి. తత్ఫలితంగా ప్రజల ఆదాయం పెరిగి ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి. ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల ప్రాణరక్షణ ఔషధం మరియు మందుల లభ్యత వలన మరణాల రేటు తక్కువగా ఉంటుంది. మరణాల రేటు క్రమంగా క్షీణిస్తూ జననాల రేటు అదే విధంగా కొనసాగడం వలన జనాభా పెరుగుదల వేగంగా పెరుగుతుంది. దీనినే జనాభా విస్ఫోటనం అంటారు. ప్రస్తుతం భారతదేశంలో జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం రెండవ దశలో ఉన్నది. మనదేశంలో 1921 నుంచి ఈ దశ ప్రారంభం అయినది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

3) మూడవ దశ: ఈ దశలో పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ, నగరీకరణ, అక్షరాస్యత అభివృద్ధి చెందటం వలన జనాభా పెరుగుదల సమస్య నుంచి దేశం బయటపడుతుంది. అభివృద్ధి అధిక స్థాయిలో ఉండడం, జీవన వ్యయం పెరగడం వలన గృహసమస్యలు పెరిగి జీవన విధానం కష్టంగా మారి ప్రజలు కుటుంబ పరిమాణాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడతారు. ఈ మార్పు మొదట పట్టణ ప్రాంతాలలో మరియు అధిక ఆదాయ వర్గాలలో మొదలై క్రమంగా గ్రామాలకు విస్తరించింది. దీనివలన జనన రేటు ఒక్కసారిగా తిరోగమనం చెందుతుంది. దాని వలన జనన మరణ రేటులో సమతౌల్యత ఏర్పడుతుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు ఈ దశలో ఉన్నాయి.

ప్రశ్న 2.
జనాభా పెరుగుదల వలన లాభనష్టాలను వివరించండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధిలో జనాభా మరియు మానవ వనరులకు అధిక ప్రాధాన్యత ఉంది. మానవులు ఉత్పత్తికి దోహదపడే సాధనాలే కాకుండా ఆ ఉత్పత్తిని వినియోగించేది కూడా మానవులే. భారతదేశం మరియు మూడవ ప్రపంచదేశాలు జనాభా విస్ఫోటన దశలో ఉన్నాయి.
భారతదేశంలో జనాభా అంటే ఒక నిర్ణీత కాలంలో దేశంలో నివసించే ప్రజలు. జనాభా దేశాభివృద్ధికి ఎంతో అవసరం.
జనాభా వలన లాభాలు:

  1. జనాభా వస్తువుల ఉత్పత్తికారి శ్రామిక శక్తిని సమకూరుస్తుంది.
  2. జనాభా వస్తుసేవలకు మార్కెట్ను కల్పిస్తుంది.
  3. జనాభా నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుంది.
  4. జనాభా వలన శ్రమ విభజన మరియు ప్రత్యేకీకరణ సాధ్యపడుతుంది,

నష్టాలు:

  1. జనాభా జీవన విధానం మీద ఒత్తిడిని పెంచుతుంది.
  2. అధిక జనాభా వలన నిరుద్యోగిత పెరుగుతుంది.
  3. జనాభా వలన సామాజిక అవసరాలైన ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులపై ఎక్కువ భారం పడుతుంది.
  4. అధిక జనాభా వలన వస్తువియోగం పెరుగుతుంది. పొదుపు మరియు మూలధన సంచయనము తగ్గుతుంది.
  5. జనాభా అనుత్పాధిక శ్రామికులను పెంచుతుంది.

ప్రశ్న 3.
భారతదేశంలో జనాభా పెరగడానికి గల కారణాలను తెలియజేయండి. [Mar ’16]
జవాబు:
భారతదేశంలో జననాల రేటు అధికంగా ఉన్నది. కుటుంబ నియంత్రణ పథకాలను పూర్తిగా ప్రజలు నమ్మినపుడే, జననాల రేటు తగ్గడానికి వీలుపడుతుంది. గత 50 సంవత్సరాల్లో జననాల రేటు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గకపోవడానికి ఈ క్రింది ఆర్థిక, సాంఘిక కారణాలుగా చెప్పవచ్చు.
1) ఆర్థిక కారణాలు: ఒక దేశం యొక్క ఆర్థిక వాతావరణం ప్రజల ప్రవర్తనపై చాలా వరకు ప్రభావాన్ని కలిగి వుంటుంది. వృత్తులవారీగా జనాభా విభజన, నగరీకరణ, పేదరికం దేశంలోని జననాల రేటును ప్రభావితం చేస్తాయి.

ఎ) వ్యవసాయరంగ ప్రాధాన్యత అధికంగా ఉండడం: వ్యవసాయరంగ సంబంధిత సమాజంలో పిల్లలను ఆర్థికభారంగా పరిగణించరు. అధిక జనాభా వ్యవసాయరంగంపై ఆధారపడి వున్న దేశంలో ఉత్పత్తి కార్యకలాపాల్లో ప్రాచీన పద్ధతులను సాధారణంగా ఉపయోగిస్తారు. వ్యవసాయ ఉత్పత్తి కార్యకాలాపాల్లో శ్రామికుల అవసరం ఉంటుంది.

బి) తక్కువ నగరీకరణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రాధాన్యత: దేశంలో పారిశ్రామికీకరణం వేగవంతంగా చోటుచేసుకోకపోవడం. నగరీకరణ చాలా తక్కువగా ఉన్నది. మన దేశంలో పెరిగిన నగరీకరణ జననాల రేటు తగ్గుదలకు సంబంధించిన సాంఘిక మార్పులను తీసుకురాలేదు.

సి) పేదరికం: మన దేశంలోని పేదరికం జననాల రేటుకు దోహదం చేస్తుంది. తక్కువ ఆదాయ స్థాయి కలిగిన ప్రజలు అదనపు శిశువును పొందడం వలన వచ్చే ఆదాయం, ఆ శిశువును పెంచడానికి అయ్యే ఖర్చు కంటే అధికం అని భావిస్తారు. పేద ప్రజలకు ఇతర ఆర్థిక ఆస్తులు ఏమీ ఉండవు కాబట్టి తమ శ్రమనే ఆస్తిగా పరిగణిస్తారు. కాబట్టి అధిక కుటుంబ సభ్యులు ఉంటే అధిక ఆదాయం పొందవచ్చని భావిస్తారు.

2) సాంఘిక కారణాలు:
ఎ) వివాహం తప్పనిసరి: భారతదేశం మతపరంగా, సామాజికంగా ప్రతి వ్యక్తికి వివాహం అన్నది తప్పనిసరి. ప్రతీ తల్లి, తండ్రి తమ పిల్లలకు వివాహం చేయడం సామాజికపరమైన బాధ్యతగా స్వీకరిస్తారు. స్త్రీల అక్షరాస్యత పెరిగినప్పుడు వివాహం తప్పనిసరికాకపోవచ్చు. కాని అక్షరాస్యత తక్కువగా ఉన్న సమాజంలో ఆశించిన ఫలితం రాకపోవచ్చు.

బి) తక్కువ వయస్సులో వివాహం: మన దేశంలో తక్కువ వయస్సులో వివాహం చేసుకోవడం జననాల రేటు అధికంగా ఉన్నది అని చెప్పవచ్చు. కాని భారతదేశంలో స్త్రీల సగటు వివాహ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రసూతి రేటు అధికంగా ఉండటం వల్ల జననాల రేటు అధికంగా ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

సి) మతపరమైన సాంఘిక మూఢనమ్మకాలు: చాలామంది భారతీయుల్లో మతపరమైన, సామాజికమైన మూఢనమ్మకాల వల్ల పిల్లల్ని కనడం అనేది తమ ఆర్థిక పరిస్థితులు గౌరవం చేకూరినట్లు భావిస్తారు. హిందువుల మత సాంప్రదాయం ప్రకారం కుమారుడు కర్మకాండలు నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి హిందువు కుమారున్ని కోరుకుంటారు.

డి) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ: భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. ఆధునిక సమాజంలో వైయుక్తిక కుటుంబాల ప్రాధాన్యత పెరుగుతుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, యుక్త వయసులోని భార్యభర్తలు పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తుంది.

ఇ) తక్కువ అక్షరాస్యత: 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో అక్షరాస్యత 74.04 శాతం ఉన్నది. పురుషులలో 82.14 శాతం ఉంటే, స్త్రీలలో 65.46 శాతమే అక్షరాస్యులుగా ఉన్నారు. ఇప్పటివరకు స్త్రీలలో సాధించిన ‘అక్షరాస్యత ఎక్కువ శాతం నగరాలలోనే గుర్తించడం జరిగింది. నిరక్షరాస్యత స్త్రీలలో ఎక్కువగా ఉండడం వలన జననాల రేటు అధికంగా ఉన్నది.

ప్రశ్న 4.
జనాభా పెరుగుదల నియంత్రణ చర్యలు ఏమిటి ?
జవాబు:
జనాభా పెరుగుదల నివారణ చర్యలు: జనాభా పెరుగుదల ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన సమస్యగా భావిస్తాము. అందువల్ల జనాభా పెరుగుదలను నియంత్రించవలసిన అవసరం ఎంతయినా ఉంది. ప్రస్తుతం జనాభా సమస్యలను పరిష్కరించడానికి మూడు రకాలైన చర్యలను తీసుకోవలసి ఉంది.
1) ఆర్థిక చర్యలు: భారతదేశంలో జనాభా ఆశించిన విధంగాకాని, తగ్గించడానికి సాధ్యం అయ్యే విధంగా కాని లేనటువంటి పెద్ద పరిణామంతో ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టి, ఆర్థిక చర్యల ద్వారా ప్రస్తుత జనాభా సమస్యను పరిష్కరించవలసి ఉన్నది.

  • పారిశ్రామిక రంగాన్ని విస్తరించడం: వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న కుటుంబాల కంటే పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న కుటుంబాల పరిమాణం చిన్నదిగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందిచినప్పటికీ, కుటుంబ కమతాల్లో పనిచేస్తూ ఉంటారు. మన దేశంలో భూకమతాలు లాభదాయకంగా లేవు కాబట్టి, వ్యవసాయదారులు జీవనాధార వ్యవసాయంను కొనసాగిస్తారు. పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశం పొందటం చాలా కష్టమైన పని కాబట్టి పారిశ్రామిక రంగంలోని శ్రామికులు చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు. జీవన ప్రమాణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కుటుంబ పరిమాణాన్ని నియంత్రించుకుంటారు.
  • నగరాలలో ఉద్యోగావకాశాల కల్పన: దేశంలో పారిశ్రామికీకరణ వలన నగర కేంద్రాలు పెరుగుతాయి. నగరాలలో ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లైతే, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలు పెరుగుతాయి. తత్ఫలితంగా నగరాలలో జనాభా పెరిగి పిల్లల పెంపకం, సమస్యలు ఉత్పన్నమై చిన్న కుటుంబాలకు ప్రాధాన్యతను ఇస్తారు. అందువలన పారిశ్రామికీరణకు అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది.
  • ఆదాయాన్ని సమానంగా పంపిణీ చేయడం మరియు పేదరిక నిర్మూలన: పేద ప్రజలకు తమ కుటుంబ పరిమాణాలపై పెద్దగా శ్రద్ధ ఉండదు. పేద ప్రజల కనీస జీవన సదుపాయం పొందడానికి ఎప్పుడైతే ఇష్టపడతారో, అప్పుడు కుటుంబ పరిమాణంపై వారి ఆలోచనలు మారతాయి. ఇలా మార్పు వస్తే ప్రజలకు కుటుంబంపై శ్రద్ధ పెరుగుతుంది. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని పరిమిత కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు.

2) సాంఘిక చర్యలు: జనాభా విస్ఫోటనం అనేది, ఆర్థిక సమస్యగా కంటే, సాంఘిక సమస్యగా భావిస్తాం. దీనికి అనేక రకాలైన సాంఘిక కారణాలు చెప్పుకోవచ్చు. నిరక్షరాస్యతా, మూఢనమ్మకాలు, ఆచార సాంప్రదాయాలు మొదలైన కారణాలు మనదేశంలోని జనాభా విజృంభనకు దోహదం చేస్తున్నాయి.

  •  విద్య: జననాల రేటును తగ్గించడంలో విద్య చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివాహం, కుటుంబ పరిమాణం, పిల్లల సంఖ్య మొదలైన వాటిని ప్రజలలో మార్పును తీసుకువస్తుంది. భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను విద్య మార్చి వేసి ప్రజలను కుటుంబ నియంత్రణ వైపు ప్రభావితులని చేస్తుంది. కాబట్టి గ్రామాలలో, నగరాలలో స్త్రీల అక్షరాస్యత వృద్ధిని పెంపొందించడానికి అత్యంత ప్రాధాన్యతని ఇవ్వాలి.
  • స్త్రీల హోదాను మెరుగుపరచడం: భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుషులు సమానం కాని ఆర్థికంగా, సామాజికంగా స్త్రీలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సమాజంలో స్త్రీల గౌరవం పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతమంది పిల్లలకు జన్మనివ్వాలి అనే విషయంలో స్త్రీలకు స్వాతంత్ర్యం ఉన్నప్పుడే, జననాల సంఖ్య తగ్గించే అవకాశం ఉంటుంది.
  • కనీస వివాహ వయస్సును పెంచడం: సామాజికంగా, చట్టపరంగా, విద్యాపరంగా కనీస వివాహ వయస్సును తప్పకుండా పెంచవలసిన ఆవశ్యకత ఉంది. 1903 బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం పురుషులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, స్త్రీలకు 15 సంవత్సరాలుగా నిర్ణయించారు. జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరంలో వివాహ వయస్సును సవరించి, పురుషులకు 25 సంవత్సరాలు, స్త్రీలకు 21 సంవత్సరాలు వివాహ వయస్సుగా నిర్ధారించారు. దీని ద్వారా జనాభా వృద్ధిని నియత్రించాలి అని ఆశించారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

3) కుటుంబ నియంత్రణ పథకాలు: ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలను నియంత్రించడంలో కుటుంబ నియంత్రణ పథకాల ప్రాధాన్యతను గుర్తించారు. మన దేశంలో వివాహిత స్త్రీలు 41 శాతం గర్భనిరోధకాలను ఉపయోగిస్తే చైనా దేశంలో 85 శాతం స్త్రీలు వినియోగిస్తున్నారు. కాబట్టి మనదేశంలో జననాల రేటు (26: 1000) అధికంగా
వుంది.

  • ప్రభుత్వ సమాచార పథకం: ఎలాంటి కుటుంబ నియంత్రణలను పాటించని వావాహిత జంటలకు ప్రభుత్వ సమాచార పథకం క్రింద కుటుంబ నియంత్రణ ప్రయోజనాలను తెలియచేయడం, సమాచార సాధనాలైన, సినిమా, రేడియో, పోస్టర్లు, టెలివిజన్లు, వార్తాపత్రికలు మొదలైన వాటి ద్వారా కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యాన్ని ప్రచారం చేస్తుంది.
  • ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు: కుటుంబ నియంత్రణ పాటించే ప్రజలకు ప్రభుత్వం అనేక రకాలైన పథకాల ద్వారా వివిధ రకాలైన ప్రోత్సాహకాలను కల్పిస్తుంది. నగదు బహుమతుల ద్వారా ప్రజలు ముందుకు రాకపోతే కుటుంబ నియంత్రణను పాటించని వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం, కుటుంబ నియంత్రణను నిరాకరించిన వారికి ప్రభుత్వం కల్పించే కొన్ని సదుపాయాలను తొలగించినట్లయితే జననాల రేటు తగ్గి జనాభా పెరుగుదలను నియంత్రించవచ్చు.
  • కుటుంబ నియంత్రణ కేంద్రాలు: కుటుంబ నియంత్రణ పథకాలలో నియంత్రణ కేంద్రాల స్థాపన తప్పనిసరి, ప్రభుత్వం ఈ కేంద్రాలలో అనేక రకాలైన వైద్య సదుపాయాలను కల్పించి కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. ఈ కేంద్రాలతో పాటు అధిక సంఖ్యలో గ్రామాల్లో, నగరాల్లో గర్భనిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి జనాభా పెరుగుదలను నియంత్రిస్తుంది.
  • పరిశోధన: సమాచార ప్రేరణ, జనాభా పునరుత్పత్తి, ప్రసూతి రేటు నియంత్రణ మొదలైన వాటికి కుటుంబ నియంత్రణ పథకాల్లో అధిక ప్రాధాన్యత కల్పించవలసిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం పరిమిత వనరులతో కుటుంబ నియంత్రణపై పరిశోధనలు చేసి గరిష్ట ప్రయోజనం పొందటానికి ప్రయత్నిస్తుంది.

ప్రశ్న 5.
జనాభా విధానం (2000)లోని ముఖ్యాంశాలు ఏవి ?
జవాబు:
జాతీయ జనాభా విధానాన్ని 6-4-1976న ప్రవేశపెట్టినంత వరకు మన దేశంలో కుటుంబ నియంత్రణ పూర్తిగా స్వచ్ఛందంగా ఉండేది. సత్వర ఆశయానికి సంబంధించిన, ఆరోగ్య అవస్థాపన సౌకర్యాలు కావాల్సిన గర్భనిరోధక అంశాలను కల్పిస్తు, ప్రాథమిక పునరుత్పత్తి, శిశు ఆరోగ్యాన్ని సంఘటిక పరచి వైద్య సేవలను కల్పించడం, దీని 2010 సంవత్సరం నాటికి మొత్తం ప్రసూతి రేటును సాధ్యమైనంత వరకు తగ్గించడం. 2045 సంవత్సరం నాటికి స్థిరమైన జనాభా వృద్ధిని సాధించడం దీర్ఘకాలిక ఆశయంగా పెట్టుకున్నారు. జాతీయ జనాభా విధానాన్ని (2000) ఈ క్రింది లక్ష్యాలతో రూపొందించారు.

  1. ప్రసూతి మరణాల రేటును 100: 100000 కు తగ్గించడం.
  2. శిశు మరణరేటును 30: 1000 కి తగ్గించడం.
  3. రోగాల బారి నుంచి రక్షించుకొనే విధంగా పిల్లల్లో వ్యాధి నిరోధకతను పెంచడం.
  4. 100 శాతం కాన్పులు వైద్యశాలలో జరిగేటట్లు చూడటం.
  5. ఎయిడ్స్, ఇతర అంటు వ్యాధుల నివారణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం.
  6. ఇద్దరు పిల్లల పరిమిత కుటుంబాన్ని ప్రోత్సహించడం.
  7. సురక్షితంగా గర్భస్రావాలు జరిగేటట్లు సదుపాయాలు కల్పించడం.
  8. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడం.
  9. 18 సంవత్సరాలలోపు స్త్రీలకు వివాహాలు జరగకుండా చూడటం.
  10. పేదవారిగా ఉండి, ఇద్దరు పిల్లల తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ఆరోగ్య బీమా సదుపాయాలను కల్పించడం.

జాతీయ జనాభా విధానం (2000) అమలు కోసం జనాభాపై జాతీయ కమీషన్ ఏర్పాటు చేశారు. ఇది జాతీయ జనాభా విధానం పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 6.
భారతదేశంలోని వృత్తుల వారీగా జనాభా విభజనను వివరించండి.
జవాబు:
ఒక దేశం జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజింపబడి ఉండటాన్ని వృత్తులవారీగా జనాభా విభజన అని అంటారు. వివిధ రకాలైన వృత్తులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి:
1) ప్రాథమిక వృత్తులు: వ్యవసాయం, అడవులు, చేపల పెంపకం, జంతు సంపద, కోళ్ళ ఫారాలు, మొదలైన వాటిని ప్రాథమిక రంగంలో కలుపుతారు. ఈ రంగం ఉత్పత్తి మానవ మనుగడకు చాలా అవసరం. ఈ రంగం అధికంగా ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని జనాభా ఎక్కువశాతం ఈ రంగంపై ఆధారపడి ఉంటుంది.

2) ద్వితీయ వృత్తులు: వస్తువు తయారీ పరిశ్రమలు, చిన్నతరహా, కుటీర పరిశ్రమలు మరియు గనులు క్వారియింగ్ మొదలైన వాటిని ద్వితీయరంగంలో కలుపుతారు మూడవ ప్రపంచ దేశాల్లో ఈ రంగం చాలా చిన్నదిగా ఉండి తక్కువ శ్రామిక శక్తికి ఉపాధిని కల్పిస్తుంది.

3) సేవా వృత్తులు: వ్యాపారం, రవాణా, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, బీమా, విద్యా, ఆరోగ్యం, మొదలైనవి సేవారంగంలో కలుపుతారు. దేశంలోని సేవారంగం కార్యకలాపాలు, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం కార్యకలాపాలకు తోడ్పడుతాయి.

హాన్స్ సింగర్ ప్రకారం వ్యవసాయరంగంపై ఆధారపడి వున్న 85 శాతం శ్రామిక శక్తి మార్పు చెంది 15 శాతం మాత్రమే వ్యవసాయరంగంపై ఆధారపడి ఉంటే ఆర్థికాభివృద్ధి చోటుచేసుకున్నట్లు అనే అభిప్రాయపడ్డారు.

ప్రశ్న 7.
మానవ అభివృద్ధిని నిర్వచించి, దాన్ని ఏ విధంగా పెంపొందిస్తావు?
జవాబు:
మానవ వనరుల అభివృద్ధి – అర్థం: ఒక దేశం రాజకీయ, ఆర్థికాభివృద్ధికి కావాల్సిన విద్య, సామర్థ్యం, అనుభవంతో కూడుకున్న మానవులను మానవ వనరుల అభివృద్ధి అని అంటారు. మానవునిపై పెట్టుబడి పెడితే మానవ వనరులుగా అభివృద్ధి చెంది, మానవ అభివృద్ధికి ఉత్పాదక వనరులుగా ఉపయోగపడతారు.
చార్లెస్ ఘర్జ్ ఈ క్రింది ఐదు అంశాలు ఉపయోగపడతాయని తెలియచేశాడు.

  1. ఆరోగ్య సదుపాయాలు, సేవలపై వ్యయం, పెరిగితే ప్రజలు ఆయుర్థాయం, సామర్థ్యశక్తి, ఉత్సాహం పెరుగుతాయి.
  2. వలస వచ్చిన వ్యక్తులు, కుటుంబాలు మారుతున్న ఉద్యోగ అవకాశాలకు సర్దుబాటు కావలసి ఉంటుంది.
  3. ప్రాథమిక, ద్వితీయ, ఉన్నతస్థాయిలో విద్యను నిర్వహించవలసి ఉంది.
  4. సంస్థలు నిర్వహించిన వయోజన విద్య, విస్తరణ విద్య కార్యకలాపాలను వ్యవసాయరంగంలో ఏర్పాటు చేయవలిసి ఉంది.
  5. సంస్థలు ఉద్యోగస్తులకు పాత పద్ధతిలో అప్రెంటిస్ మరియు శిక్షణ కల్పించాల్సి ఉంది.

ప్రశ్న 8.
ఆర్థికాభివృద్ధిలో విద్య పాత్రను వివరించండి.
జవాబు:
1) విద్య మరియు ఆర్థికాభివృద్ధి: టొడారో, స్మిత్ ప్రకారం అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో విద్య ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. అది ఏ విధంగా అనేది ఈ క్రింది అంశాలతో వివరించవచ్చు.

  • విద్యవల్ల పరిజ్ఞానం, నైపుణ్యత పెరిగి శ్రామికశక్తి యొక్క ఉత్పాదకత పెరుగుతుంది.
  • అదనంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయల స్థాపనవల్ల ఉద్యోగిత పెరుగుతుంది.
  • విద్య ప్రాథమిక నైపుణ్యాలను మరియు ఆధునికంగా మెరుగైన ప్రవర్తనను అందిస్తుంది.
  •  ప్రభుత్వ సేవల్లో, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మరియు వివిధ వృత్తుల్లో విద్యవల్ల సమర్థవంతమైన విద్యానాయకులు వస్తారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

2) విద్య మరియు ఆదాయ అసమానతల తగ్గింపు: అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యకు, ఆర్థికాభివృద్ధికి దగ్గర సంబంధం ఉన్నప్పటికీ, పేదరికం, ఆదాయం అసమానతలు తగ్గించడానికి, విద్యకు గల సంబంధాన్ని చెప్పడం కష్టం. సాధారణంగా విద్య ద్వారా మానవ వనరుల సమతుల్యాన్ని పెంపొందించవచ్చు మరియు పేద ప్రజల, బలహీన వర్గాల ఆర్థికస్థోమతను కూడా మెరుగుపరచవచ్చు. పేదపిల్లలు నిరక్షరాస్యతతో కూడుకున్న ఇంటి పరిసరాలు మరియు పౌష్టికాహారలేమి, వారి మనస్సులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ధనవంతులైన పిల్లలు సాంఘిక సంబంధాలు, పలుకబడివల్ల సాపేక్షికంగా మెరుగైన ఉపాధి పొందుతారు.

3) విద్య గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ధిలో విద్య అనేక విధాలుగా తోడ్పడుతుంది. గ్రామీణ ప్రజల పరిజ్ఞానాన్ని పెంపొందించి అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలను రూపుమాపుతుంది. వ్యవసాయదారులు విద్యావంతులైతే నూతన వ్యవసాయ సాంకేతికాలు, ఆధునిక ఉత్పత్తి పద్ధతులను త్వరగా అర్థం చేసుకోగలరు. విద్యతో ప్రజల సామర్థ్యాలను, ప్రవర్తనను మార్చుకొని కుటుంబ సౌఖ్యతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. శ్రామికులు ఎక్కువగా ఉన్న మన దేశంలో విద్య ద్వారా ప్రజల నైపుణ్యత పేరిట కుటీర పరిశ్రమలను స్థాపించుకొని స్వయం ఉపాధి పొందుతారు.

4) విద్య మరియు కుటుంబ నియంత్రణ: ప్రజలను ఆధునికీకరణ, విప్లవాత్మక మార్పుల వైపు ఆలోచించే విధంగా విద్య తోడ్పడుతుంది. ఇది కుటుంబ పరిమాణాన్ని నియంత్రించుకొని జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడానికి సహకరిస్తుంది. కాబట్టి దీర్ఘకాలంలో విద్య, కుటుంబ సంక్షేమం పెంపొందిస్తుంది. స్త్రీలలో అక్షరాస్యత పెరగడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు లభ్యంకావడం వల్ల ప్రసూతి రేటు తగ్గి జననాల రేటు తగ్గుతుంది. ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు పోషణ కష్టం అవుతుంది. కాబట్టి పరిమిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు.

5) విద్య వలన ఇతర ప్రయోజనాలు:

  1. అధిక విద్యను అభ్యసించినవారికి ఆదాయ వనరులు పెరుగుతాయి.
  2. విద్యావంతులైన ప్రజల ఆదాయ వనరులు భావితరాల వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది.
  3. నైపుణ్యవంతమైన మానవ వనరులు ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేస్తాయి.
  4. విజ్ఞాన శాస్త్రంలో, సాంకేతిక రంగంలో పరిశోధనలకు కావలసిన వాతావరణాన్ని కల్పిస్తుంది.
  5. మానవ ప్రవర్తన న్యాయబద్ధంగా మారి సంక్షేమ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటారు.

ప్రశ్న 9.
ఆర్థికాభివృద్ధిలో ఆరోగ్యం పాత్రను వివరించండి.
జవాబు:
శ్రామికుల సామర్థ్యం వారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం సరిగ్గా లేక తరచుగా రోగాలకు గురి అవుతుంటే వారి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి సమర్థవంతంగా పనిచేయలేరు. శ్రామికుల ఆరోగ్యం పెరిగితే జాతీయ ఉత్పత్తి దానంతట అదే పెరుగుతుంది.

సంపూర్ణ ఆరోగ్యానికి ఈ క్రింది రెండు అంశాలు చాలా అవసరం.

  1. సంతులిత పౌష్టికాహారం
  2. వైద్యపరమైన జాగ్రత్త

60 సంవత్సరాల కృషి ఫలితం వల్ల ఆరోగ్య ప్రమాణాల పెరుగుదలలో చాలా వరకు విజయం సాధించాము. మశూచి, ప్లేగు మొదలైన వాటిని నివారించాం. మలేరియా, క్షయ, కలరా మొదలైన వ్యాధులను చాలావరకు నియంత్రిస్తున్నందువల్ల శిశుమరణాలు తగ్గుతూ ఆయుర్ధాయం పెరుగుతుంది.
12వ ప్రణాళికలో ఆరోగ్య లక్ష్యాలు 2016 – 2017.

  1. ప్రసూతి మరణ రేటును (MMR) 1,00,000 కు తగ్గించడం.
  2. శిశుమరణ రేటు (IMR)ని 1000కు 19 తగ్గించడం.
  3. మొత్తం ప్రసూతి రేటు (TFR)ని 2.1కి తగ్గించడం.
  4. పరిశుభ్రమైన త్రాగునీరు అందరికీ అందించడం.
  5. పౌష్టికాహార లోపాన్ని మూడు (3) సంవత్సరాల పిల్లల్లో 2015 నాటికి 29 శాతం, 2017 నాటికి 27%కి తగ్గించడం.
  6. స్త్రీలల్లో, బాలికల్లో రక్తహీనత (ANEMIA) 28 శాతం వరకు తగ్గించడం.
  7. స్త్రీ, పురుషుల నిష్పత్తి వయస్సును 0-6 సంవత్సరములు 914 నుండి 935 వరకు పెంచడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 10.
మానవ అభివృద్ధిని లెక్కించడంలో వివిధ సూచికలు ఏమిటి ?
జవాబు:
వర్థమాన కాలంలో స్థూల జాతీయోత్పత్తికి ప్రత్యామ్నాయంగా మానవ అభివృద్ధి సూచికను ఆధారంగా చేసుకొని ఒక దేశం ఆర్థిక అభివృద్ధిని అంచనా వేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం UNDP తయారుచేసిన మొదటి మానవ అభివృద్ధి రిపోర్టు. మహబూబ్-ఉల్-హక్ నాయకత్వంలో 1990 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దీనిని విస్తరించి దానికి సంబంధించిన అనుబంధ సూచికలను, లింగ సంబంధిత అభివృద్ధి సూచిక (GDI) లింగ అధికారికి కొలమానం (GEM) మరియు మానవ పేదరిక సూచిక (HPI) లను 1997 సంవత్సరంలో UNDP ప్రవేశపెట్టింది.

మానవ అభివృద్ధి సూచిక మూడు రకాలైన మానవ అభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక సగటు అంశాలను లెక్కిస్తుంది.

  1. దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆయుర్దాయం ద్వారా అంచనా వేస్తుంది.
  2. పరిజ్ఞానాన్ని వయోజన విద్య ద్వారా అంచనా వేయించడం జరుగుతుంది.
  3. ఉన్నత జీవన ప్రమాణాన్ని, అమెరికా డాలర్లతో స్థూల దేశీయ తలసరి ఉత్పత్తి ద్వారా అంచనా వేయడం. మానవ

అభివృద్ధి సూచికకు అంచనా వేసే ముందు మూడు అంశాలతో ప్రతి దానికి ఒక దిశను నిర్ణయించి, ప్రతి సూచికకు కనీస విలువను, గరిష్ట విలువలకు కల్పిస్తారు.

ప్రతి అంశం ప్రదర్శనను 0 నుంచి 100 మధ్య విలువలను ఇచ్చి ఈ క్రింది సూత్రం ద్వారా అంచనా వేస్తారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 2

కొన్ని దేశాలను ఎన్నుకొని 2014 సంవత్సరానికి మానవ అభివృద్ధి సూచికను అంచనా వేసి దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరించింది.

  1. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.8 కంటే అధికంగా ఉన్న వాటిని అత్యధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
  2. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.7 నుంచి 0.8 ఉన్న వాటిని అధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
  3. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 నుంచి 0.7 ఉన్న వాటిని మధ్యస్థ మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
  4. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 కంటే తక్కువగా ఉన్న వాటిని తక్కువ మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను వర్గీకరించింది.

లింగ సంబంధిత అభివృద్ధి సూచిక:
లింగ సంబంధిత అభివృద్ధి సూచిక స్త్రీ – పురుషుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేస్తుంది. దీనిలో మూడు అంశాలు ఇమిడి ఉన్నాయి.

  1. స్త్రీల ఆయుర్ధాయం
  2. వయోజన స్త్రీల అక్షరాస్యత, స్థూల నమోదు నిష్పత్తి
  3. స్త్రీల తలసరి ఆదాయం

లింగ సమానత్వం, అసమానతలు లేకపోతే HDI, GDI విలువలు సమానంగా ఉంటాయి. కాని లింగపరమైన అసమానతలు ఉంటే GDI విలువ HDI విలువ కంటే తక్కువ ఉంటుంది. GDI, HDI విలువల మధ్య బేధం అధికంగా ఉంటే స్త్రీ పురుషుల వ్యత్యాసం అధికంగా ఉంటుంది.

లింగసాధికార కొలమానము (GEM): మానవ అభివృద్ధి రిపోర్టు లింగసాధికారక కొలమానమును 1995 సంవత్సరంలో ప్రవేశపెట్టినది. ఆర్థిక, రాజకీయ జీవితంలో స్త్రీల యొక్క భాగస్వామ్యమును GEM తెలియజేస్తుంది. ఆర్థిక, రాజకీయ జీవితంలో స్త్రీ, పురుషుల అసమానతను, స్త్రీల సాధికారతను దీనిద్వారా అంచనా వేస్తారు. GDI |ద్వారా

లింగపరమైన అసమానతలను లెక్కిస్తే GEM ద్వారా ఈ క్రింది అంశాలను లెక్కిస్తారు.

  1. రాజకీయ, ఆర్థిక నిర్ణయాల్లో స్త్రీలు పాల్గొనడం.
  2. ఆర్థిక, రాజకీయ అంశాల్లో స్త్రీల భాగస్వామ్యం (లింగభేదం) మరియు
  3. స్త్రీల సాధికారిత.

మానవ అభివృద్ధి రిపోర్టు 75 దేశాల GEM ను అంచనా వేసింది. మొదటి నాలుగు స్థానాలను ఐరోపా దేశాలు ‘ ఆక్రమించుకున్నాయి. అవి నార్వే, స్వీడన్, ఐస్లాండ్, డెన్మార్క్ ఈ దేశాలు స్త్రీల సామర్థ్యాలను పెంపొందించడమే కాకుండా స్త్రీలకు రాజకీయ, ఆర్థిక రంగాల్లో పూర్తి అవకాశాలను కల్పిస్తాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రపంచ జనాభా.
జవాబు: ప్రపంచ జనాభా 1830 వ సంవత్సరము నాటికి 100 కోట్లు చేరింది. అదే ప్రపంచ జనాభా ఒక శతాబ్దకాలంలో 1930 సంవత్సరము నాటికి 200 కోట్లకు చేరింది. 1960 నాటికి ప్రపంచ జనాభా 300 కోట్లకు చేరింది. 1974 నాటికి 400 కోట్లుకా, 1987లో 500 కోట్లు, 1987లో 600 కోట్లు, 1999 లో 700 కోట్లకు 2011లో చేరింది. ప్రస్తుత జనాభా 730 కోట్లు. ప్రపంచ జనాభాలో 98 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉంటుంది.
ప్రపంచ జనాభా 1830 – 2011
AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 3

ప్రశ్న 2.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 10 దేశాలు.
జవాబు:
ఈ క్రింది పట్టిక ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 10 దేశాలను చూపిస్తుంది,
AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 4

ప్రశ్న 3.
భారతదేశంలో జనాభా పెరుగుదలకు కారణాలు.
జవాబు:
సమాధానం కొరకు వ్యాసరూప ప్రశ్న 3ను చూడుము.

ప్రశ్న 4.
భారతదేశంలో కుటుంబ సంక్షేమ పథకాలు. [Mar ’17]
జవాబు:
ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలను నియంత్రించడంలో కుటుంబ నియంత్రణ పథకాల ప్రాధాన్యతను గుర్తించారు. మన దేశంలో అధిక జననాల రేటును తగ్గించడానికి ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించెను.

1) ప్రభుత్వ సమాచార పథకం: ఎలాంటి కుటుంబ నియంత్రణలను పాటించని వివాహిత జంటలకు ప్రభుత్వ సమాచార పథకాల క్రింద కుటుంబ నియంత్రణ ప్రయోజనాలను తెలియజేయడం, సమాచార సాధనాలైన సినిమా, రేడియో, పోస్టర్లు, టెలివిజన్లు, మొదలగువాటి ద్వారా కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యాన్ని ప్రచారం చేస్తుంది.

2) ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు: కుటుంబ నియంత్రణ పాటించే ప్రజలకు ప్రభుత్వం అనేక రకాలైన పథకాల ద్వారా వివిధ రకాలైన ప్రోత్సాహకాలను కల్పిస్తుంది. నగదు రూపంలో బహుమతులు ఇవ్వడం వల్ల కొంత మంది ప్రజలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అదే విధంగా కుటుంబ నియంత్రణను నిరాకరించిన వారికి ప్రభుత్వం కల్పించే కొన్ని సదుపాయాలను తొలగించినట్లయితే జననాల రేటు తగ్గి జనాభా పెరుగుదలను నియంత్రించవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

3) కుటుంబ నియంత్రణ కేంద్రాలు: కుటుంబ నియంత్రణ పథకాల్లో కుటుంబ నియంత్రణ కేంద్రాల స్థాపన తప్పనిసరి. ప్రభుత్వం ఈ కేంద్రాల్లో అనేక రకాలైన వైద్య సదుపాయాలను కల్పించి, కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తోంది. ఈ కేంద్రాలతో పాటు అధిక సంఖ్యలో గ్రామాల్లో, నగరాల్లో, గర్భనిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి, జనాభా పెరుగుదలను నియంత్రిస్తుంది.

4) పరిశోధన: సమాచార ప్రేరణ, జనాభా పునరుత్పత్తి, ప్రసూతి రేటు నియంత్రణ మొదలైన వాటికి కుటుంబ నియంత్రణ పథకాల్లో అధిక ప్రాధాన్యత కల్పించవలసిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం పరిమిత వనరులతో కుటుంబ నియంత్రణపై పరిశోధనలు చేసి, గరిష్ట ప్రయోజనం పొందటానికి ప్రయత్నిస్తుంది.

ప్రశ్న 5.
మానవ వనరుల అభివృద్ధి ప్రాధాన్యత.
జవాబు:
ఒక దేశం రాజకీయ, ఆర్థికాభివృద్ధికి కావాల్సిన విద్య, సామర్థ్యం, అనుభవంతో కూడుకున్న మానవులను మానవ వనరుల అభివృద్ధి అంటారు. మానవునిపై పెట్టుబడి పెడితే మానవ వనరులుగా అభివృద్ధి చెంది, మానవ అభివృద్ధికి ఉత్పాదక వనరులుగా ఉపయోగపడతారు.
మానవ వనరుల అభివృద్ధి ప్రాధ్యానత:

  1. మానవ వనరుల ద్వారానే భౌతిక వనరులు సమర్థవంతంగా వినియోగించబడతాయి.
  2. మానవ వనర్లులో తక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే భౌతిక వనరులు పరిమితంగా ఉపయోగించబడతాయి.
  3. ఉత్పాదక వనరులు పూర్తిగా వినియోగించుకోవడానికి సాంకేతిక నిపుణుల యొక్క అవసరం ఎంతైనా ఉంది.
  4. భౌతిక వనరులు సమర్థవంతంగా, సంపూర్ణంగా వినియోగించబడాలంటే మానవ వనరుల అభివృద్ధిలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టవలసి ఉంది.
  5. మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఒకదానిపై ఒకటి ప్రభావితమై ఉంటాయి.

ప్రశ్న 6.
గ్రామీణాభివృద్ధిలో విద్య పాత్ర.
జవాబు:

  1. గ్రామీణాభివృద్ధిలో విద్య అనేక రకాలైన విధాలుగా తోడ్పడుతుంది. గ్రామీణ ప్రజల పరిజ్ఞానాన్ని పెంపొందించి, అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలను రూపుమాపుతుంది.
  2. వ్యవసాయదారులు విద్యావంతులైతే నూతన వ్యవసాయ, సాంకేతికాలు, ఆధునిక ఉత్పత్తి పద్ధతులను త్వరగా అర్థం చేసుకోగలరు.
  3. విద్యతో ప్రజల సామర్థ్యాలను, ప్రవర్తనను మార్చుకొని కుటుంబ నాణ్యతను పెంపొందించడానికి
    ఉపయోగపడుతుంది.
  4. శ్రామికులు ఎక్కువగా ఉన్న మన దేశంలో విద్య ద్వారా ప్రజల నైపుణ్యత పేరిట కుటీర పరిశ్రమలను స్థాపించుకొని స్వయం ఉపాధి పొందుతారు. ఈ విధంగా ప్రచ్ఛన్న నిరుద్యోగులు గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటారు.
  5.  విద్యవల్ల పరిజ్ఞానం, నైపుణ్యత పెరిగి శ్రామిక శక్తి యొక్క ఉత్పాదకత పెరుగుతుంది.

ప్రశ్న 7.
భారతదేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది ?
జవాబు:
ప్రపంచంలోని అతి పెద్ద విద్యా వ్యవస్థలో భారతదేశం ఒకటి. జాతీయ విద్యా విధానం 1980లో ప్రవేశ పెట్టారు. 1992లో ఈ విధానాన్ని సవరించడం జరిగింది. ఇది ప్రాథమిక విద్యకు సంబంధించి 3 అంశాలు తెలియజేయును. జాతీయ విద్యావిధానం ప్రకారం విద్య మీద చేసిన వ్యయం స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం లక్ష్యంగా ఇది 2011 12లో 48% మాత్రమే ఉంది. మన దేశంలో విద్యపైన చేసే వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించలేము. విద్యపైన ఖర్చుచేసే 106 దేశాలలో మన భారతదేశం 86వ స్థానంలో ఉంది. విద్య యొక్క ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని 11వ ప్రణాళికలో ప్రభుత్వరంగం విద్యపైన వ్యయం స్థూల దేశీయ ఉత్పత్తిలో 4% కేటాయించింది. 12వ పంచవర్ష ప్రణాళికలో మానవ వనరుల మంత్రిత్వ శాఖకు 4,53,728 కోట్లు కేటాయించారు. అందులో 3,43,028 కోట్లు పాఠశాల మరియు మాధ్యమిక విద్యాశాఖకు 1,10,700 కోట్లు ఉన్నత విద్యాశాఖకు కేటాయించారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్నత విద్యను అభ్యసించగల అన్ని రకాల వసతులున్నాయి. విద్యను మానవాభివృద్ధి సాధనంగా |గుర్తించి ప్రభుత్వం ప్రాథమిక విద్యలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి అనే ఆశయం పెట్టుకొన్నది. అందులో భాగంగా 2010 నాటికి దేశంలో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు అందరికి ఉపయోగపడే విధంగా ప్రాథమిక విద్యను కల్పించడానికి 2001, 2002 సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 8.
భారతదేశంలో ఆరోగ్య కార్యక్రమాలు.
జవాబు:
జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (NRHM) 2005లో గ్రామీణ ప్రాంతంలో అందుబాటులో సరసమైన మరియు నాణ్యత ఆరోగ్య సేవలు అందించడానికి ప్రారంభించబడింది.

  1. వివిధ గ్రామాలలో గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్యకార్యకర్తలను ఎంపిక చేసి వారికి ఆరోగ్య సంరక్షణలో శిక్షణ ఇస్తారు. (ASHAS)
  2. జనని సురక్ష యోజన (JSY) అనే కార్యక్రమం ప్రసూతి మరణాలు తగ్గించాలని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం 35 కోట్ల మంది మహిళలు లబ్ది పొందారు.
  3. ప్రధానమంత్రి స్వస్తీయ యోజన (PMSY) కార్యక్రమం దేశంలో ప్రాంతీయ అసమానతలు సరిదిద్ది లక్ష్యాలతో, ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి తేవడానికి ప్రారంభించబడింది.
  4. రోగి కల్యాణ సమితిలు.
  5. గ్రామీణ వైద్య మరియు పారిశుద్ధ్య కమిటి.
  6. మొబైల్ సంచార వైద్య యూనిట్లు.
  7. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హెూమియో (Ayush) సేవలు.
  8. జనని శిశు సురక్ష కార్యక్రమం తల్లి, శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రారంభించబడింది.

ప్రశ్న 9.
భౌతిక ప్రమాణ జీవన సూచిక (PQLI)
జవాబు:
భౌతిక ప్రామాణిక జీవన సూచిక అంటే ఒక వ్యక్తి యొక్క నాణ్యమైన జీవితం లేదా దేశం యొక్క శ్రేయస్సు కొలిచేందుకు ఒక ప్రయత్నం. ఇది మూడు గణాంకాలు యొక్క సగటు ప్రాథమిక అక్షరాస్యత రేటు, శిశు మరణాలు మరియు ఆయుర్దాయు, ప్రాధాన్యత విలువ 0-100 వరకు ఉంటుంది. GNP వినియోగంలో అసంతృప్తి చెందడం చేత మోరిస్ డేవిడ్ మోరిస్ 1970ల మధ్యలో ఓవర్సీస్ డెవలప్మెంట్ కౌన్సిల కోసం దీనిని అభివృద్ధి చేశారు.

సాధారణ సమస్యలు పంచుకుంటుంది. కాని అది శిశు మరణాలు మరియు ఆయుర్ధాయం మధ్య గణనీయమైన తేడా చూపడం వల్ల ఇది కూడా విమర్శించబడింది. ఐక్యరాజ్య సమితి (UNO) మానవ అభివృద్ధి సూచిక (HDI) మరింత విస్తృతంగా కొలవడానికి ఉపయోగపడే కొలమానం.
భౌతిక ప్రామాణిక సూచిక కొలవడానికి గల దశలు.

  1. అక్షరాస్యులు ఉన్న జనాభా శాతాన్ని కనుక్కోండి. (అక్షరాస్యత శాతం)
  2. శిశు మరణాల రేటు కనుగొనేందుకు (ప్రతి 1000 మంది జననాలకు) ఇండెక్స్ శిశు మరణాల రేటు (166 – శిశుమరణాల రేటు) × 0.625
  3. ఆయుర్దాయాన్ని కనుగొనేందుకు = ఆయుర్దాయ సూచిక – (ఆయుర్దాయం – 42) × 2.4
    AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 5

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జనాభా విస్పోటనం. [Mar ’17, ’16]
జవాబు:
మరణాల రేటు క్రమంగా క్షీణిస్తూ, జననాల రేటు అధికంగా కొనసాగడం వల్ల జనాభా పెరుగుదల వేగంగా పెరుగుతుంది. దీనినే జనాభా విస్ఫోటనం అంటారు. మన దేశంలో 1921 సంవత్సరము నుండి ఈ దశ ప్రారంభమైనది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 2.
గొప్ప జనాభా విభజన సంవత్సరం.
జవాబు:
1921వ సంవత్సరము నుండి మన దేశం జనాభా పరిణామ సిద్ధాంతంలోని రెండవ దశలోకి ప్రవేశించింది. ఈ దశలో మరణాల రేటు తక్కువగాను, జననాల రేటు అధికంగాను ఉంది. కనుక 1921 సంవత్సరాన్ని గొప్ప జనాభా విభజన సంవత్సరం అంటారు.

ప్రశ్న 3.
శిశు మరణాల రేటు.
జవాబు:
ఒక సంవత్సరంలో 1000 మందిలో చనిపోయిన వారి నిష్పత్తి ఈ శిశుమరణాల రేటు 1951లో సంవత్సరములో ప్రతి 1000 మందికి 27.4% కాగా 2012లో ఇది 7.0%కు తగ్గింది.

ప్రశ్న 4.
ప్రసూతి మరణాల రేటు.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో, ప్రసూతి సమయం ప్రతి లక్ష మంది స్త్రీలలో చనిపోయే వారి నిష్పత్తి. ఈ మరణాల రేటును 2012 నాటికి 341: 1,00,000.

ప్రశ్న 5.
జననాల రేటు.
జవాబు:
ప్రతి 1000 మంది జనాభాలో ఎంత మంది పుడుతున్నారు అనేది జనన రేటు సూచిస్తుంది.

ప్రశ్న 6.
మరణాల రేటు.
జవాబు:
ఒక సంవత్సరంలో 1000 మందిలో చనిపోయిన వారి నిష్పత్తి 1901లో వైద్య సదుపాయాలు లేకపోవడం, కరువు మొదలైన పరిస్థితుల వల్ల మరణాలరేటు 44.4గా ఉంది. ప్రస్తుతం ఇది 2012 నాటికి 7.0 గా ఉంది.

ప్రశ్న 7.
నగరీకరణ.
జవాబు:
జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 400 ఉండే ప్రదేశాన్ని పట్టణము లేదా నగరముగా చెప్పవచ్చు. పారిశ్రామిక ప్రగతి సాధించడంలో నగరీకరణ, పట్టణీకరణ దోహదం చేస్తాయి. మన దేశంలో 1951వ సంవత్సరంలో నగరీకరణ కేవలం 17.3% కాగా ఇది 2001 నాటికి 27.8% మాత్రమే పెరిగింది. నగరీకరణ ఆర్ధికాభివృద్ధికి ఒక సూచిక.

ప్రశ్న 8.
ఉమ్మడి కుటుంబం.
జవాబు:
భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలోని పెద్ద మొత్తం ఉమ్మడి కుటుంబ బాధ్యతను వహించి వారి అవసరాలు తీరుస్తుంటారు. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యుక్త వయసులోని భార్య – భర్తలు పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆధునిక సమాజంలో వైయుక్తిక కుటుంబాలకు ప్రాధాన్యత పెరుగుచున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 9.
వృత్తుల వారీగా జనాభా విభజన.
జవాబు:
ఒక దేశ జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజింపబడి ఉండటాన్ని వృత్తుల వారీగా జనాభా విభజన అంటారు. వివిధ రకాలైన వృత్తులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి 1. ప్రాథమిక రంగం, 2. ద్వితీయ రంగం, 3. సేవా రంగం. ఆర్థికాభివృద్ధి జరిగితే ఈ వృత్తుల వారి వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి. శ్రామిక శక్తి వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక, సేవారంగాలకు బదిలి అవుతాయి. 2011వ సంవత్సరంలో భారతదేశంలో ప్రాథమిక రంగంలో శ్రామిక శక్తి 48.9%, ద్వితీయరంగంలో 24.3%, తృతీయ రంగంలో 26.8% ఉంది.

ప్రశ్న 10.
ప్రాథమిక రంగం.
జవాబు:
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తులు, చేపల పెంపకం, కోళ్ళ పెంపకం మొదలైన వృత్తులన్నింటిని ప్రాథమిక రంగంగా పరిగణిస్తారు. దీనినే వ్యవసాయరంగమని కూడా అంటారు. మన దేశంలో జాతీయాదాయంలో ఎక్కువ భాగం ఈ రంగం నుండి ఉత్పత్తి చేయబడేది. ఆర్థికాభివృద్ధి జరిగే కొలది దీని వాటా నెమ్మదిగాను, క్రమంగాను, తగ్గుచూ, ద్వితీయ, తృతీయ రంగపు వాటాలు పెరుగుతాయి.

ప్రశ్న 11.
తృతీయ రంగం.
జవాబు:
తృతీయ రంగాన్ని సేవారంగం అని కూడా అంటారు. వ్యాపారం, వాణిజ్యం, గ్రంథాలయాలు, వైద్యశాలలు, పాఠశాలలు, రవాణా, సమాచారం మొదలైన వాటినన్నింటిని కలిపి సేవారంగం అంటారు. తృతీయ రంగం కార్యకలాపాలు, ప్రాథమిక, ద్వితీయ రంగాల కార్యకలాపాలకు తోడ్పడతాయి. అభివృద్ధి చెందిన దేశాలలో తృతీయ రంగపు వాటాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రశ్న 12.
మానవ వనరుల అభివృద్ధి.
జవాబు:
ఒక దేశం రాజకీయ, ఆర్థికాభివృద్ధికి కావలసిన విద్య, సామర్థ్యం, అనుభవముతో కూడుకున్న మానవులను మానవ వనరుల అభివృద్ధి అని అంటారు. విద్య, వైద్యం సేవలు నిరంతరంగా పెరగడం వల్ల మానవ మూలధన సామర్థ్యం పెరిగినది. తత్ఫలితంగా ఉత్పత్తి పెరుగుతుంది. మానవ వనరుల అభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఒక దానిపై ఒకటి | ప్రభావితమై ఉంటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 13.
అక్షరాస్యత రేటు.
జవాబు:
చదవటం, రాయటంలో మనిషికున్న సామర్థ్యమే అక్షరాస్యత. ప్రతి మనిషి తనకు తాను సహాయం చేసుకోవటానికి | అక్షరాస్యత సాధనంగా ఉపయోగపడుతుంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 6

ప్రశ్న 14.
సర్వశిక్ష అభియాన్. [Mar ’17, ’16]
జవాబు:
విద్యను మానవాభివృద్ధి సాధనంగా గుర్తించి A.P. ప్రభుత్వం ప్రాథమిక విద్యలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలనే | ఆశయం పెట్టుకున్నది. 2010 సంవత్సరం నాటికి రాష్ట్రంలో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికి ఉపయోగపడే విధంగా ప్రాథమిక విద్యను కల్పించడానికి 2001 02లో సర్వశిక్ష అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనిని రాజీవ్ విద్యా మిషన్ గా మార్చారు.

 

ప్రశ్న 15.
జననీ సురక్షా యోజన. [Mar ’16]
జవాబు:
2005-06 సంవత్సరంలో జననీ సురక్ష యోజన (JSY) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సంస్థాపరమైన కాన్పులను ప్రోత్సహిస్తూ శిశుమరణ రేటును తగ్గించడం దీని ఆశయం.

ప్రశ్న 16.
మానవ అభివృద్ధి సూచిక.
జవాబు:
1990వ సంవత్సరంలో మహబూబ్-ఉల్-హక్ దీనిని ప్రవేశపెట్టారు. మానవ అభివృద్ధి ఆధారంగా ఒక దేశ | ఆర్థిక వృద్ధిని అంచనా వేస్తారు. 2013వ సంవత్సరంలో వచ్చిన రిపోర్టు ప్రకారం భారతదేశం 187 దేశాల్లో 136వ స్థానానికి దిగజారింది.

ప్రశ్న 17.
లింగ సంబంధిత సూచిక (GDI).
జవాబు:
ఈ సూచిక స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేస్తుంది. దీనిలో మూడు అంశాలు ఇమిడి ఉన్నాయి. 1. స్త్రీల ఆయుర్ధాయం 2. వయోజన స్త్రీల అక్షరాస్యత 3. స్త్రీల తలసరి ఆదాయం.

ప్రశ్న 18.
లింగ సాధికారిక కొలమానం (GEM)
జవాబు:
దీనిని 1995 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆర్థిక, రాజకీయ జీవితంలో స్త్రీ యొక్క భాగస్వామ్యమును GEM తెలియజేయును. ఆర్థిక రాజకీయ కార్యకలాపాల్లో, స్త్రీ – పురుషుల అసమానతలు, స్త్రీల సాధికారతను దీని ద్వారా అంచనా వేస్తారు.

ప్రశ్న 19.
మానవ పేదరిక సూచిక.
జవాబు:
1997లో ఈ సూచికను ప్రవేశపెట్టారు. మానవ పేదరిక సూచిక మూడు అంశాల ద్వారా ప్రజల మెరుగైన జీవన ప్రమాణాన్ని లెక్కిస్తారు. అవి ఆయుర్ధాయం, విజ్ఞానం, జీవన ప్రమాణం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 20.
మొత్తం ప్రసూతి రేటు.
జవాబు:
ఒక స్త్రీ తన పునరుత్పత్తి కాలంలో జన్మనిచ్చే మొత్తం పిల్లల సంఖ్య.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 1st Lesson ఆర్థికవృద్ధి – అభివృద్ధి Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 1st Lesson ఆర్థికవృద్ధి – అభివృద్ధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలను వివరించండి.
జవాబు:
తలసరి ఆదాయం, జీవన ప్రమాణం, వనరుల లభ్యత మరియు ఉపయోగం, సాంకేతికాభివృద్ధి మొదలైన లక్షణాల ఆధారంగా ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా వర్గీకరించబడ్డాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలను అధిక ఆదాయ దేశాలు (High Income Countries), పారిశ్రామిక దేశాలు (Industrialised Countries), ఇతర దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలు (Advanced Countries) గా కూడా పిలవడం జరుగుతుంది. అమెరికా, ఇంగ్లాండు (U.K.), ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్ మొదలైనవి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలను ఉదాహరణలుగా చెప్పవచ్చును.

1) అధిక తలసరి ఆదాయం: ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. అధిక తలసరి ఆదాయం అభివృద్ధి చెందిన దేశాల ముఖ్య లక్షణం. 2012వ సంవత్సరంలో వినిమయ రేటు ఆధారంగా U.S.A. తలసరి G.N.I. ($ 50,120) భారతదేశం యొక్క తలసరి G.N.I. ($ 1,530) కంటే 33 రెట్లు ఎక్కువగాను మరియు కొనుగోలు శక్తి ఆధారంగా 15 రెట్లు ఎక్కువగా ఉంది. అందువల్ల అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల తలసరి ఆదాయాలలో ఎక్కువ తేడాలు ఉన్నట్లు గమనించవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

2) వ్యవసాయేతర రంగాల ప్రాధాన్యత: అభివృద్ధి చెందిన దేశాలు సహజంగా పారిశ్రామిక దేశాలై ఉంటాయి. ఈ దేశాలలో పారిశ్రామిక, సేవారంగాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. వ్యవసాయ రంగంతో పోల్చినపుడు ఆదాయ, ఉద్యోగ అవకాశాల కల్పనలో పారిశ్రామిక సేవారంగాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈ రంగాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటాయి. కాబట్టి ఈ రంగాలలో ఉత్పాదకత వ్యవసాయరంగ ఉత్పాదకత కంటే ఎక్కువగా ఉండి, ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి చోదక శక్తిగా పనిచేస్తుంది. అమెరికాలో (U.S.A) వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నవారు 1.6 శాతం, కాగా స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 1.3 శాతం మాత్రమే ఉంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాలు అయితే భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడినవారు 51.1 శాతం గాను, స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 18 శాతంగా ఉంది.

3) అధిక స్థాయిలో మూలధనం, సాంకేతిక విజ్ఞానం: మూలధన కల్పనరేటు ఎక్కువగా ఉండటం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం అభివృద్ధి చెందిన దేశాల ముఖ్య లక్షణం. అభివృద్ధి చెందిన దేశాలు అధిక ఆదాయ దేశాలు కాబట్టి వారికి పొదుపు సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా బ్యాంకులు, విత్తసంస్థలు సమర్థవంతంగా పనిచేస్తూ పెద్ద ఎత్తున పొదుపును సమీకరిస్తాయి. ఈ దేశాలలో మూలధన లభ్యత అధికంగా ఉండటం వల్ల అది సాంకేతిక ప్రగతికి దారితీస్తుంది.

4) తక్కువ స్థాయిలో నిరుద్యోగం: నిరుద్యోగ స్వభావం మరియు పరిమాణంలో అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మౌళికమైన భేదం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో “సార్థక డిమాండు” కొరత నిరుద్యోగానికి కారణం అవుతుంది. ఈ దేశాలలోని నిరుద్యోగం చక్రీయ (Cyclical) మరియు సంఘృష్ట (Frictional) మైనది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో “మూలధన కొరత” వల్ల బహిర్గత మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగితలు ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలలో శ్రామిక నైపుణ్యం, శ్రామికులు గమనశీలతలు ఎక్కువగా ఉండటమే కాకుండా నిరుద్యోగిత శాతం చాలా తక్కువగా ఉంది.

5) మెరుగైన జీవన ప్రమాణం: సమర్థవంతమైన సాంఘిక భద్రతా వ్యవస్థ, కాలుష్యపరంగా ఉన్నత ప్రమాణాలు పాటించడం, రక్షిత త్రాగునీరు లభ్యత, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం మొదలైన అంశాలు అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాన్ని కల్పిస్తాయి. ఈ దేశాలు విద్య, ఆరోగ్యం, పరిశోధన, శిక్షణ మరియు నైపుణ్యాల కల్పనలపై ఎక్కువ వ్యయం చేస్తాయి. దీనిని మానవ మూలధనం అంటారు. ఉదా: అమెరికాలో విద్య మరియు పరిశోధనల మీద స్థూల దేశీయ ఉత్పత్తిలో 6 శాతం కంటే ఎక్కువ వ్యయం చేస్తూ ఉండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్థూల దేశీయ ఉత్పత్తిలో కేవలం 3 శాతం మాత్రమే వ్యయం చేస్తున్నాయి. భారతదేశం తన స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యపైన 2004-2005లో 3.3 శాతం వ్యయం చేయగా 2011-2012 నాటికి ఇది 4 శాతానికి పెరిగింది. మానవాభివృద్ధి సూచిక విషయంలో 2013వ సంవత్సరానికి 187 దేశాలలో నార్వే. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండు దేశాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉండగా, భారతదేశం 135వ స్థానంలో ఉన్నది.

ప్రశ్న 2.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము – చర్చించండి.
జవాబు:
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు గోచరిస్తాయి.

2005
1) జాతీయాదాయం పెరుగుదల: 1950 – 51 సంవత్సరంలో భారతదేశ జాతీయాదాయం, 2004 సం॥పు స్థిర ధరలలో కౌ 2,55,405 కోట్లు. 2013-14 సంవత్సరాలలో జాతీయాదాయం 49,20,183 కోట్లు. దీనిని వేగవంతమైన అభివృద్ధిగా చెప్పవచ్చు.

2) తలసరి ఆదాయం పెరుగుదల: 1950. 51 సంవత్సరంలో నికర తలసరి ఆదాయం, 2004 – 2005 సం||పు స్థిర ధరలలో కౌ 7, 114. 2013-14 సంవత్సరాలలో 39,904. సాపేక్షికంగా నికర తలసరి ఆదాయం చాలా వేగంగా పెరిగింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

3) పొదుపు, మూలధన కల్పన పెరుగుదల: భారతదేశంలో 1990లో 23 శాతంగా ఉన్న స్థూల దేశీయ పొదుపు రేటు 2012 నాటికి 27.9 శాతానికి పెరిగింది. అదే కాలంలో 24 శాతంగా ఉన్న స్థూల మూలధన కల్పన రేటు 35.6 శాతానికి పెరిగింది. ఇది భారతదేశ అభివృద్ధి గతిని సూచిస్తుంది.

4) వృత్తులవారి శ్రామిక జనాభా: 2011 సంవత్సరపు లెక్కల ప్రకారం 48.9% శ్రామికులు వ్యవసాయ రంగంమీద ఆధారపడినారు. ఇది వ్యవసాయ ప్రాధాన్యతను సూచిస్తుంది. ద్వితీయ రంగం మీద ఆధారపడిన వారి | శాతం క్రమేపి పెరుగుతూ వచ్చింది. 1901లో 10.7% మరియు 2011లో 24.3% శ్రామికులు ద్వితీయ రంగం మీద ఆధారపడినారు. తృతీయ రంగం మీద ఆధారపడిన వారి శాతం 1/5 కంటే కొంచెం ఎక్కువగా ఉన్నారు.

5) స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా: స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 1950-51 సం॥లో 56.5% గా ఉంది. ఈ వాటా క్రమేపి తగ్గుతూ 2013-14 నాటికి 13.9 శాతానికి చేరుకుంది. పారిశ్రామిక రంగం: పారిశ్రామిక రంగంలో 1950-51 సం॥లో వాటా జాతీయాదాయంలో 14.8 శాతం కాగా 2013-14 సం॥ నాటికి పారిశ్రామిక రంగం వాటా 26.2 శాతంగా ఉంది.

అవస్థాపన సౌకర్యాలు: రవాణా, బ్యాంకింగ్, నీటిపారుదల, విద్య, సమాచారం మొదలైన వాటిని అవస్థాపన సౌకర్యాలు అంటారు. వీటి విషయంలో భారత్ ప్రగతిని సాధించింది.
శాస్త్ర విజ్ఞానం – సాంకేతిక విజ్ఞానం: నేడు ఇండియాలో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు కల్గిన 3వ పెద్ద దేశంగా ప్రపంచంలో స్థానం సంపాదించుకున్నది. శాస్త్ర విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానము కల్గిన మానవశక్తిగా ప్రపంచంలో రెండవ దేశంగా భారతదేశం ప్రసిద్ధి చెందినది.

అయినప్పటికీ జనాభా సమస్యను ఎదుర్కొనుచున్నది. 2011వ సం॥లో 1210 మిలియన్లు ఉన్న భారత జనాభా 2015 నాటికి 1278 మిలియన్లకు పెరిగింది. మనదేశంలో ద్వితీయ, తృతీయ రంగాల అభివృద్ధి వల్ల ఉద్యోగిత పెరిగినప్పటికి నిరుద్యోగ సమస్య ఎదుర్కొనుచున్నది. మన దేశంలో ఆదాయ అసమానతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 2011-12 నాటికి గ్రామీణ ప్రాంతాలలో అట్టడుగు 10% ప్రజల తలసరి నెలసరి వినియోగ వ్యయం 11.5 శాతం పెరగగా 10 శాతం అధిక ధనవంతుల నెలసరి తలసరి వినియోగ వ్యయం 38 శాతం పెరిగింది. ఇదే కాలంలో పట్టణ ప్రాంతాలలో పేద, ధనికుల వినియోగ వ్యయం 17.2 శాతం మరియు 30.2 శాతం పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థలో కూడా సాంకేతిక ద్వంద్వత్వం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండగా, వ్యవసాయ రంగం పురాతన ఉత్పత్తి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నది. కనుక భారతదేశంను అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పవచ్చు.

ప్రశ్న 3.
భారతదేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు వివరించండి. [Mar ’17, ’16]
జవాబు:
ఐక్యరాజ్యసమితి వర్గీకరణ ప్రకారము “ఏ దేశాల వాస్తవిక తలసరి ఆదాయం, అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతు కంటే తక్కువగా ఉంటుందో వాటిని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పవచ్చు”.

భారత ప్రణాళికా సంఘం నిర్వచనం ప్రకారం “వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ అంటే ఒక ప్రక్క పూర్తిగా ఉపయోగించని లేదా తక్కువ ఉపయోగించిన మానవ వనరులు, మరోప్రక్క పూర్తిగా వినియోగించని సహజ వనరులు కలిసి ఉంటాయి”.

1) తక్కువ తలసరి ఆదాయం: తలసరి ఆదాయం తక్కువ ఉండడం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల ముఖ్య లక్షణం. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పిలువబడే అల్ప, మధ్య ఆదాయ దేశాలు తలసరి ఆదాయం విషయంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే బాగా వెనుకబడి ఉన్నాయి. చైనా, భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల తలసరి ఆదాయం, అభివృద్ధి చెందిన దేశాల తలసరి ఆదాయంతో పోల్చినపుడు చాలా తక్కువగా ఉంది. వినిమయ రేటు ఆధారంగా భారతదేశ తలసరి GNI $ 1070 (2008) నుండి $1530 (2011), కొనుగోలు శక్తి ఆధారంగా తలసరి GNI $ 2960 నుండి $ 3840 పెరిగినప్పటికీ భారతదేశం ఇంకనూ మధ్య ఆదాయం కంటే తక్కువ ఆదాయం గల దేశాల గ్రూపులోనే ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

2) మూలధన కొరత: మూలధన కొరత అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల ఒక లక్షణం. అప్పుడప్పుడు ఈ దేశాలను ‘మూలధన పేద” దేశాలుగా పిలుస్తారు. తక్కువ తలసరి మూలధనం, ఆర్థిక వ్యవస్థలో మూలధనం కొరతను సూచిస్తుంది. ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే మూలధన కల్పన రేటు ఈ దేశాలలో చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఆ దేశాల స్థూల దేశీయ ఉత్పత్తిలో 15 నుండి 20 శాతం మధ్య ఉంటుంది. ఈ దేశాలలో తలసరి ఆదాయం తక్కువగా ఉండడం వలన పెట్టుబడులను ప్రేరేపించే పొదుపురేటు చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాకుండా ఈ దేశాలలో ప్రోత్సాహకాలు, పొదుపును సమీకరించే సంస్థలు సమర్థవంతంగా లేనందున పొదుపు, పెట్టుబడుల స్థాయి పెరగడం లేదు.

3) జనాభా లక్షణాలు: అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర జనాభా సమస్యను ఎదుర్కొంటున్నాయి. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల రేటు 2 శాతముగా నమోదైంది. వైద్య సౌకర్యాలు మెరుగుపరచి మరణాల రేటు తగ్గించడంలో విజయం సాధించినప్పటికీ అదే రీతిలో జననాల రేటు తగ్గించలేకపోవడం వలన జనాభా విస్ఫోటనానికి దారితీసింది. ఈ అధిక జనాభా సహజ వనరులపైన ఒత్తిడిని పెంచి, పేదరికం, నిరుద్యోగం పెరగడానికి కారణం అయినది. అందువలన ప్రజల జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంటుంది.

భారతదేశం కూడా అధిక జనాభా సమస్యను ఎదుర్కొంటున్నది. 2011వ సం॥లో 1210 మిలియన్లు ఉన్న భారతదేశ జనాభా 2015 సం॥నాటికి 1278 మిలియన్లకు పెరిగింది. ఇది ప్రపంచ జనాభాలో 17.5 శాతంగా ఉంది. 4) నిరుద్యోగం: అధిక నిరుద్యోగిత అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి. ఈ దేశాలలో ఉన్న బహిర్గత నిరుద్యోగిత (Open unemployment) అభివృద్ధి చెందిన దేశాల నిరుద్యోగితతో పోల్చినపుడు చాలా రెట్లు ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు వలస రావడం వల్ల పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నది. మందకొడిగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగం పెరుగుతున్న శ్రామిక శక్తికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగిన స్థితిలో లేనందున వ్యవసాయ రంగాలపై ఒత్తిడి పెరిగి ప్రచ్ఛన్న నిరుద్యోగిత (Disguised unemployment) సమస్యను ఎదుర్కొంటున్నది. భారత ఆర్థిక వ్యవస్థలో మూలధన కొరత నిరుద్యోగానికి కారణం అవుతున్నది. భారతదేశం కూడా బహిర్గత మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగిత సమస్యలను ఎదుర్కొంటున్నది.

5) వ్యవసాయ రంగ ప్రాధాన్యత: హార్వే లిబెన్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా ఉంటాయి. ఈ దేశాలలో 30 నుండి 70 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. జె.కె. గాల్ బ్రెయిత్ అభిప్రాయంలో “ఒక దేశం పూర్తిగా వ్యవసాయ ఆధార దేశం అయినప్పటికీ అది వ్యవసాయ రంగంలోనే బాగా వెనుకబడి ఉంటుంది”.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో శ్రమ సాంద్రతపై ఆధారపడి వ్యవసాయ రంగం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో వెనుకబడి ఉంటుంది. కాబట్టి ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత ఉంటుంది. అంతేగాకుండా అధిక జనాభా ఒత్తిడి వలన ఈ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ భూమి విభజనకు మరియు విఘటనలకు గురి అవ్వడం వలన భూకమతాల పరిమాణం తగ్గుతుంది. దీని ఫలితంగా విక్రయం కాగల మిగులు స్వల్పంగా ఉండి ప్రజల ఆదాయాలు తక్కువగా ఉంటాయి. ఈ దేశాల స్థూల దేశీయ ఉత్పత్తిలో (GDP) ఈ రంగం వాటా 20 శాతం నుండి 30 శాతం వరకు ఉంటుంది.

ఆర్థిక సర్వే 2013-14 ప్రకారం, భారతదేశ వ్యవసాయ రంగంలో పనిచేయుచున్న జనాభా 54.6 శాతం ఉండగా స్థూల దేశీయ ఉత్పత్తిలో దాని వాటా 13.9 శాతంగా ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

6) సామూహిక పేదరికం: పేదరికం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రత్యేక లక్షణం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాపేక్షంగా తక్కువ తలసరి ఆదాయ స్థాయిల వద్ద అధికంగా ఉన్న ఆదాయ అసమానతలు సామూహిక పేదరికానికి దారితీస్తున్నాయి. భారతదేశం కూడా పేదరికపు సమస్యను ఎదుర్కొంటున్నది. టెండుల్కర్ కమిటీ సిఫారసు ఆధారంగా ప్రణాళికా సంఘం పేదరిక గీతను పునఃనిర్వచించింది. దీని ప్రకారం 2009-10 సం॥లో నెలసరి తలసరి వినియోగ వ్యయం గ్రామీణ ప్రాంతాలలో 673 గాను, పట్టణ ప్రాంతాలలో కే 860గా నిర్ణయించింది.

7) ఆదాయ అసమానతలు: ఆదాయ సంపదలలో అసమానతలు ఉండటం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రత్యేక లక్షణం. భారత ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు పెరుగుతూ ఉన్నాయనే వాస్తవాన్ని నిర్వహించిన వివిధ సర్వేలు చెబుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో గడిచిన రెండు దశాబ్దాలలో ఆదాయ అసమానతలు 2 రెట్లు పెరిగాయని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ తెలియజేసింది.

8) తక్కువ జీవన ప్రమాణం: అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవన ప్రమాణ స్థాయి చాలా తక్కువగా ఉన్నది. ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని నిజ ఆదాయం, ఆరోగ్యం, విద్యపరంగా సాధించిన వృద్ధి అనే మూడు సూచికల ఆధారంగా కొలవడం జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని ప్రజలు పోషకాహార లోపం, అధిక స్థాయి కాలుష్యం, పారిశుద్ధ్య లోపం, రక్షిత మంచినీటి కొరత మొదలగు సమస్యలతో జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల ఆయుర్దాయం 65 సం॥ల లోపు ఉండగా అభివృద్ధి చెందిన దేశాలలో 75 సం॥ల కంటే ఎక్కువగా ఉంది.

9) సాంకేతికంగా వెనుకబాటుతనం: అభివృద్ధి చెందుతున్న దేశాలు పరిశోధన, అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం వల్ల ఉత్పత్తి పద్ధతులలో వెనుకబడి ఉన్నాయి. అధిక మూలధనం కొరతగా ఉండటం వల్ల ఈ దేశాలు శ్రమ సాంద్రత పద్ధతులకు ప్రాధాన్యతనిస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థ కూడా సాంకేతికంగా వెనుకబడి ఉంది. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలలో ఆధునిక, సంప్రదాయ పరిజ్ఞానం రెండు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. సాంకేతిక వెనుకబాటుతనం వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది.

10) అధిక జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటరుకు నివసించే సగటు జనాభాను జనసాంద్రత అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధిక జనాభా ఉండటం వల్ల జనసాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక జనసాంద్రత వల్ల సహజ వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది.

11) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ: అభివృద్ధి చెందుతున్న దేశాలలో ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఉన్నాయి. ఒకే ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు అనగా ఆధునిక రంగం మరియు సాంప్రదాయ రంగం ప్రక్కప్రక్కనే ఉండటాన్ని ద్వంద్వత్వం అంటారు. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థలు మూడు రకాలు. 1. సాంకేతిక ద్వంద్వత్వం 2. సామాజిక ద్వంద్వత్వం 3. ఆర్థిక ద్వంద్వత్వం. భారత ఆర్థిక వ్యవస్థలో కూడా సాంకేతిక ద్వంద్వత్వం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగం, అధునాతన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండగా, వ్యవసాయ రంగం పురాతన ఉత్పత్తి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నది.

12) ధరల అస్థిరత్వం: ధరల అస్థిరత్వం అభివృద్ధి చెందుతున్న దేశాల మౌళిక లక్షణం. ఈ దేశాలలో నిత్యావసర వస్తువుల కొరత వలన మరియు వినియోగం, ఉత్పత్తి మధ్య ఉండే అంతరం వల్ల ధరల అస్థిరత్వం కొనసాగుతూ ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలను వివరించండి.
జవాబు:
1960వ వరకు ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే భావనలను పర్యాయపదాలుగా వాడడం జరిగింది. అయితే హిక్స్, షుంపీటర్ లాంటి ఆర్థికవేత్తలు ఈ రెండు పదాలకు వేర్వేరు అర్థాలను ఇస్తూ, వాటి మధ్య స్పష్టమైన తేడాలను సూచించారు. వారి అభిప్రాయం ప్రకారం ఆర్థికవృద్ధి అనే భావన అభివృద్ధి చెందిన దేశాల సమస్యలకు సంబంధించినది కాగా, ఆర్థికాభివృద్ధి అనే భావన అభివృద్ధి చెందిన దేశాల సమస్యలను అధ్యయనం చేస్తుంది.
ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలు:
ఆర్థికవృద్ధి

  1. ఆర్థికవృద్ధి ఒక దేశం యొక్క వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదలను సూచిస్తుంది.
  2. ఆర్థికవృద్ధి అనే ప్రక్రియ ఏకముఖమైనది.
  3. ఆర్థికవృద్ధి సంకుచితమైన భావన.
  4. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఉదా: అమెరికా, కెనడా మొదలైనవి.
  5. ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థికవృద్ధిని సాధించ వచ్చును.
  6. ఇది ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మక మార్పులను సూచించును.
  7. ఆర్థికవృద్ధి ఆర్థిక వ్యవస్థలో ఆదాయ సంపద పంపిణీని తెలియజేయదు.
  8. ఆర్థికవృద్ధిని మానవుని శారీరక పెరుగుదలతో పోల్చవచ్చు.
  9. దీనిని కొలవగలము.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

ఆర్థికాభివృద్ధి

  1. ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధితో పాటు, సాంఘిక మరియు ఆర్థిక నిర్మాణంలో ప్రగతిశీల మార్పులను తెలియజేయును.
  2. ఆర్థికాభివృద్ధి అనే ప్రక్రియ బహుముఖమైనది.
  3. ఆర్థికాభివృద్ధి విస్తృతమైన భావన.
  4. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఉదా: భారతదేశం, చైనా మొదలైనవి.
  5. ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థికాభివృద్ధిని సాధించలేము.
  6. ఇది ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మార్పులను సూచించును.
  7. ఆర్ధికాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలో ఆదాయ సంపద పంపిణీని తెలియజేయును.
  8. ఆర్థికాభివృద్ధిని మానవ సంపూర్ణ అభివృద్ధితో పోల్చవచ్చు.
  9. దీనిని కొలవలేము.

ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలను తెలియజేయండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధి అనేది బహుముఖమైన ప్రక్రియ. సహజ వనరులు, మూలధనం, మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల వైఖరులు, దేశంలోని రాజకీయ పరిస్థితులు వంటి అంశాలచే ఆర్థికాభివృద్ధి ప్రభావితం చేయబడుతుంది. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలను ఈ క్రింది విధంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

I. సహజ వనరులు: ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశంలో లభించే సహజ వనరుల మీద ఆధారపడి ఉంటుంది. జాకబ్ వైనర్, విలియం జె. భౌమాల్ మరియు డబ్ల్యూ ఎ. లూయిస్ మొదలైన ఆర్థికవేత్తలు దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని నిర్ణయించడంలో సహజ వనరుల పాత్ర ముఖ్యమైనదని, వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకోగలిగినప్పుడే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.

II. ఆర్థిక అంశాలు:
1) మూలధన కల్పన: ఒక దేశ ఆర్థికాభివృద్ధి గతిని మూలధన కల్పన నిర్ణయిస్తుంది. ఆర్థిక మరియు సాంఘిక అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి మూలధన లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థికాభివృద్ధి సాధించుటకు మూలధన కొరత ముఖ్యమైన అవరోధంగా ఉంది.

2) విక్రయం కాగల మిగులు: గ్రామీణ ప్రాంతాల ప్రజల కనీస అవసరాలు తీరిన తరువాత మార్కెట్లో అమ్మకానికి లభ్యమయ్యే వ్యవసాయ రంగంలోని అదనపు ఉత్పత్తిని విక్రయం కాగల మిగులు అంటారు. ఈ విక్రయం కాగల మిగులు గ్రామీణ ప్రాంతాలలో ఆదాయాలను పెంచి తద్వారా వస్తు సేవల డిమాండ్ను ప్రేరేపిస్తుంది. ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాల పురోగతి వ్యవసాయ రంగంలోని విక్రయం కాగల మిగులుపై ఆధారపడి ఉంటుంది.

3) విదేశీ వ్యాపారం: విదేశీ వ్యాపారం, శ్రమ విభజన, ప్రత్యేకీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది వనరుల సమర్థవంతమైన ఉపయోగానికి దారితీస్తుంది. అంతేకాకుండా విదేశీ వ్యాపారం వస్తు సేవల మార్కెట్లను విస్తృతపరచి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత పెరగడానికి దోహదపడుతుంది. అందుచేత విదేశీ వ్యాపారం ఆర్థికాభివృద్ధికి ఒక ఇంజను వంటిదని ఆర్థికవేత్తలు అభివర్ణించారు.

III. ఆర్థికేతర అంశాలు:
1) మానవ వనరులు: మానవ వనరులను ఏ దేశం సక్రమంగాను, సమర్థవంతంగాను వినియోగించుకుంటారో, ఆ దేశం త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధిస్తుంది.

2) సాంకేతిక ప్రగతి: సాంకేతిక ప్రగతి ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడమే కాకుండా సామాజిక వాతావరణంలో మార్పులను తీసుకొస్తుంది. దీనివల్ల వనరులు సక్రమంగా వినియోగింపబడి ఉత్పత్తి వ్యయం తగ్గి, వివిధ రంగాలలో గరిష్ట ఉత్పత్తిని సాధించడానికి దోహదపడును.

3) సామాజిక వ్యవస్థ: ఒక దేశంలోని అభివృద్ధి ప్రక్రియలో ఆ దేశంలోని అన్ని వర్గాల ప్రజల చురుకైన భాగస్వామ్యం అవసరం. లోపభూయిష్టమైన సామాజిక నిర్మాణం వలన అభివృద్ధి ఫలాలు ధనికులకు మాత్రమే చెందుతున్నట్లు అనుభవాలు సూచిస్తున్నాయి. దీనివలన ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి.

4) అవినీతి: అభివృద్ధి చెందుతున్న దేశాలలో వివిధ స్థాయిలలో గల అదుపులేని అవినీతి అభివృద్ధి ప్రక్రియకు ఆటంకంగా తయారయ్యింది. పన్నుల ఎగవేత, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అధికారులు కుమ్మక్కు మొదలైన అంశాలు దేశ అభివృద్ధి ప్రక్రియకు ఆటంకాలుగా ఉన్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

5) అభివృద్ధి చెందాలనే కోరిక: అభివృద్ధి చెందాలనే ప్రజల కోరిక ఆదేశ అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. రిచర్డ్. W. గిల్ ఉద్దేశ్యం ప్రకారం “ఆర్థికాభివృద్ధి అనేది ఒక యాంత్రికమైన ప్రక్రియ కాదు. అది మానవుని యొక్క ప్రయత్నం. ఆర్థికాభివృద్ధి దేశంలోని ప్రజల నైపుణ్యం, నాణ్యత, దృక్పధాలపై ఆధారపడి ఉంటుంది”.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆర్థికవృద్ధి.
జవాబు:
ఆర్థికవృద్ధి అనేది దేశంలోని వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదలను సూచించును. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది.

ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధి.
జవాబు:
ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధితో పాటు సాంఘిక మరియు ఆర్థిక నిర్మాణంలో ప్రగతిశీల మార్పులను తెలియజేయును. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది.

ప్రశ్న 3.
తలసరి ఆదాయం.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. ఒక దేశ జాతీయాదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే దానిని తలసరి ఆదాయం అంటారు.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా

ప్రశ్న 4.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రణాళికా సంఘం ఇచ్చిన నిర్వచనం.
జవాబు:
వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ అంటే ఒక ప్రక్క పూర్తిగా ఉపయోగించని లేదా తక్కువ ఉపయోగించిన మానవ వనరులు, మరో ప్రక్క పూర్తిగా వినియోగించని సహజ వనరులు కలిసి ఉంటాయి.

ప్రశ్న 5.
మానవ మూలధనం.
జవాబు:
విద్య, ఆరోగ్యం, పరిశోధన, శిక్షణ మరియు నైపుణ్యాల కల్పనపై చేసే వ్యయాన్ని మానవ మూలధనం అంటారు.

ప్రశ్న 6.
ప్రపంచ దేశాల వర్గీకరణకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నిర్వచనం.
జవాబు:
తలసరి స్థూల జాతీయాదాయం ఆధారంగా ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ప్రపంచ దేశాలను ఈ క్రింది విధంగా వర్గీకరించినవి.

  1. తక్కువ తలసరి ఆదాయం గల దేశాలు. తలసరి GNI 1.045 డాలర్లు లేదా అంతకంటే తక్కువ తలసరి GNI ఉన్న దేశాలు.
  2. మధ్య ఆదాయం గల దేశాలు. తలసరి GNI 1.046 డాలర్లు కంటే ఎక్కువగాను, 12,746 డాలర్ల కంటే తక్కువగా ఉన్న దేశాలు.
  3. అధిక ఆదాయం గల దేశాలు. తలసరి GNI 12,747 డాలర్ల కంటే ఎక్కువగా ఉండే దేశాలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 1 ఆర్థికవృద్ధి – అభివృద్ధి

ప్రశ్న 7.
ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. [Mar ’17, ’16]
జవాబు:
బెంజిమిన్ హెగిన్స్ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అనే భావనను ప్రవేశపెట్టారు. ఒకే ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు అనగా ఆధునిక రంగం మరియు సంప్రదాయ రంగం ప్రక్క ప్రక్కనే ఉండటాన్ని ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 5th Lesson స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 5th Lesson స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విద్యుత్ తీవ్రత శూన్యమైన బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ ఉంటుందా? ఒక ఉదాహరణనివ్వండి.
జవాబు:
అవును. విద్యుత్ తీవ్రత శూన్యమైన బిందువు వద్ద పొటెన్షియల్ ఉంటుంది.
ఉదా : 1) రెండు సజాతి ఆవేశాల మధ్య బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత శూన్యం. కాని పొటెన్షియల్ శూన్యం కాదు.
2) ఆవేశ గోళాకార వాహకం లోపల విద్యుత్ క్షేత్ర తీవ్రత శూన్యం. కాని పొటెన్షియల్ శూన్యం కాదు.

ప్రశ్న 2.
విద్యుత్ పొటెన్షియల్ శూన్యమైన బిందువు వద్ద విద్యుత్ తీవ్రత ఉంటుందా? ఒక ఉదాహరణనివ్వండి.
జవాబు:
అవును. పొటెన్షియల్ శూన్యం అయిన బిందువు విద్యుత్ క్షేత్ర తీవ్రత శూన్యం కావాల్సిన అవసరం లేదు. ఉదా : రెండు సమాన, వ్యతిరేక ఆవేశాల మధ్యబిందువు వద్ద పొటెన్షియల్ శూన్యం. కాని తీవ్రత శూన్యం కాదు.

ప్రశ్న 3.
సమశక్మ ఉపరితలాలంటే అర్థం ఏమిటి?
జవాబు:
ప్రతి బిందువు వద్ద ఒకే పొటెన్షియల్ విలువ కలిగిన తలంను సమశక్మ తలం అంటారు. బిందు ఆవేశంనకు ఏకీకృత గోళాలు సమశక్మ తలాలు అవుతాయి.

ప్రశ్న 4.
సమశక్మ ఉపరితలానికి విద్యుత్ క్షేత్రం ఎప్పుడూ ఎందుకు లంబంగా ఉంటుంది?
జవాబు:
సమశక్మ తలంపై ఒక బిందువు నుండి మరొక బిందువుకు ఆవేశంను జరుపుటలో జరిగిన పని శూన్యం. సమశక్మ తలం వెంట విద్యుత్ క్షేత్ర అంశం శూన్యం. కావున తలం, క్షేత్రరేఖలకు లంబంగా ఉండును.

ప్రశ్న 5.
lµF, 2µF, 3µF కెపాసిటెన్స్ గల మూడు కెపాసిటర్లను సమాంతరంగా సంధానం చేశారు.
(a) ఆవేశాల నిష్పత్తి ఏమిటి?
(b) పొటెన్షియల్ భేదాల నిష్పత్తి ఏమిటి?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 1
కెపాసిటర్ లను సమాంతరంగా కలిపినప్పుడు
(a) q1 : q2 : q3 = C1V : C2V: C3V = 1µF : 2µF : 3µF
∴ q1 : q2 : q3 = 1 : 2 : 3
(b) V1 : V2 : V3 = V : V : V = 1 : 1 : 1

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 6.
1µE, 2µF, 3µF కెపాసిటెన్స్ గల మూడు కెపాసిటర్లను శ్రేణిలో సంధానం చేశారు.
(a) ఆవేశాల నిష్పత్తి ఏమిటి?
(b) పొటెన్షియల్ భేదాల నిష్పత్తి ఏమిటి?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 2
కెపాసిటర్లను శ్రేణిలో కలిపినప్పుడు
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 3

ప్రశ్న 7.
సమాంతర పలకల కెపాసిటర్లో పలకల వైశాల్యాన్ని రెట్టింపు చేసినట్లైతే కెపాసిటెన్స్ ఏమవుతుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 4
∴ కెపాసిటి రెండు రెట్లు పెరుగును.

ప్రశ్న 8.
నిర్ణీత పీడనం వద్ద గాలి రోధక సత్వం 3 × 106.Vm-1. పలకల మధ్య గాలి ఉన్న సమాంతర పలకల కెపాసిటర్లో పలకల మధ్య ఎడం 1 cm ఉన్నప్పుడు 3 × 106V కు కెపాసిటర్ను ఆవేశం చెందించగలరా?
జవాబు:
గాలి రోధక సత్వం E0 = 3 × 106 Vm-1
రెండు పలకల మధ్య విద్యుత్ క్షేత్ర తీవ్రత E = \(\frac{E_0}{K}\) = 3 × 106 Vm-1 [∵ K = 1]
రెండు పలకల మధ్యదూరం, d = 1 cm = 10-2m
రెండు పలకల మధ్య విద్యుత్ పొటెన్షియల్ తేడా, V = Ed = 3 × 106 × 10-2
∴ V = 3 × 104 వోల్ట్లు
కావున కెపాసిటరు 3 × 106 వోల్ట్లకు ఆవేశపరచలేము.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బిందు ఆవేశం వల్ల కలిగే విద్యుత్ పొటెన్షియల్కు సమాసాన్ని ఉత్పాదించండి. [TS. Mar. 16]
జవాబు:
ఒక బిందు ఆవేశం వల్ల విద్యుత్ పొటెన్షియలు సమాసము:
1) ఒక ప్రమాణ ధనావేశంను అనంత దూరం నుండి, ఒక బిందువు వద్దకు తీసుకురావటానికి జరిగిన పనిని బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 5
2) ఆవేశం + q ఉన్న బిందు ఆవేశం నుండి ” దూరం వద్ద ఒక బిందువు P ను భావిద్దాం. B వద్ద విద్యుత్ క్షేత్రం,
E = \(\frac{q}{4 \pi \varepsilon_0x^2}\)

3) B నుండి A కు ప్రమాణ ధనావేశంను తీసుకురావటంలో జరిగిన పని = dV = -E.dX (ఇక్కడ రుణాత్మక విలువ విద్యుత్ క్షేత్రం మరియు స్థానభ్రంశంలు వ్యతిరేక దిశలో ఉండుట సూచించును)

4) ∴ P వద్ద పొటెన్షియల్ = ప్రమాణ ధన ఆవేశంను అనంత దూరం నుండి P వద్దకు తీసుకురావటానికి జరిగిన పని.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 6

ప్రశ్న 2.
రెండు బిందు ఆవేశాలు గల వ్యవస్థ స్థిర విద్యుత్ స్థితిజశక్తి సమాసాన్ని ఉత్పాదించి, ఆవేశం యొక్క విద్యుత్ పొటెన్షియల్తో ఇది కలిగి ఉండే సంబంధాన్ని కనుక్కోండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 7
రెండు బిందు ఆవేశాలు గల వ్యవస్థ స్థిర విద్యుత్ స్థితిజశక్తి సమాసము :

  1. రెండు బిందు ఆవేశాలు q1 మరియు q2 లు ‘r’ దూరంలో స్వేచ్ఛా యానకంలో’ వేరుచేయబడి ఉన్నాయని భావిద్దాం.
  2. ఆవేశం q1 చుట్టూ విద్యుత్ క్షేత్రం ఏర్పడును.
  3. ఆవేశం q2 ను బిందువు B వద్దకు తీసుకురావటానికి కొంత పని జరుగును.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 8
  4. ఈ జరిగిన పని రెండు ఆవేశాల వ్యవస్థ స్థిరవిద్యుత్ స్థితిజ శక్తిరూపంలో నిల్వ ఉండును. దీని ప్రమాణము జౌల్.
    ∴ U = \(\frac{1}{4 \pi \varepsilon_0}\frac{q_1q_2}{r}\)
  5. రెండు సజాతి ఆవేశాలు అయిన ‘U’ ధనాత్మకం. రెండు సజాతి ఆవేశాలు ఒకదానికొకటి వికర్షించును. ఆవేశాలు దగ్గరకు తీసుకురావటానికి వ్యవస్థపై జరిగిన పని ధనాత్మకం.
  6. ఇదేవిధంగా రెండు విజాతి ఆవేశాలు అయిన, అవి ఆకర్షించుకుంటాయి. స్థితిజశక్తి రుణాత్మకము.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 3.
ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ద్విధృవం స్థితిజశక్తికి సమాసాన్ని ఉత్పాదించండి.
జవాబు:
విద్యుత్ ద్విధృవంను ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచినపుడు స్థితిజశక్తికి సమాసము :
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 9

  1. + q మరియు -q ఆవేశాలున్న విద్యుత్ ద్విధ్రువం పొడవు 2 గా భావిద్దాం.
  2. విద్యుత్ ద్విధ్రువంను E ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచామనుకుందాము. దాని అక్షం Eతో చేయు కోణం θ.
  3. ఆవేశాలపై బలం సమానం కాని వ్యతిరేక సంజ్ఞలను కలిగి ఉండును. అవి ద్విధ్రువంపై టార్క్ను ఏర్పరుచును.
    టార్క్ τ = ఒక బలం పరిమాణం (F) × లంబ దూరం (BC)
    F = qE మరియు sinθ = \(\frac{BC}{2a}\) = BC = 2a sinθ
    ∴ టార్క్ τ = qE × 2a sinθ = PE sin θ [∴ p = 2aq]
  4. ద్విధ్రువంను 4θ కోణం త్రిప్పితే, జరిగిన పని
    dw = τdθ = PE sinθ dθ
  5. ద్విధ్రువంను కోణం θ1 నుండి θ2 త్రిప్పితే,
    జరిగిన పని W= \(\int_{\theta_1}^{\theta_2}\)PE sinθ dθ = PE(cos θ1 – cos θ2)
  6. ఈ జరిగిన పని (W) ద్విధ్రువంలో నిల్వ ఉన్న శక్తి (U) కు సమానం.
    ∴ U = PE(cos θ1 – cos θ2)
  7. θ1 = 90°, θ2 = 0° అయితే U = – PE cos θ.
    సదిశ రూపంలో U = –\(\overrightarrow{P}.\overrightarrow{E}\) P.E

ప్రశ్న 4.
సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటెన్స్కు సమాసాన్ని ఉత్పాదించండి. [AP. Mar ’16; Mar. ’14]
జవాబు:
సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటెన్స్కు సమాసము:
1) P మరియు Q లు ఒక కెపాసిటర్లో రెండు సమాంతర పలకలు. అవి d దూరంలో వేరుచేయబడి ఉన్నాయి.
2) ప్రతి పలక వైశాల్యం A. P ఆవేశ పరచబడింది. Q భూమికి కలుపబడింది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 10

ప్రశ్న 5.
ఒక బాహ్య క్షేత్రంలో విద్యుత్ రోధకాల ప్రవర్తనను వివరించండి.
జవాబు:
1) బాహ్యక్షేత్రంను, విద్యుత్ రోధకాల వెంట ప్రయోగిస్తే, విద్యుత్ క్షేత్ర దిశలో ధనావేశ కేంద్రాలు విస్థాపనం మరియు క్షేత్ర దిశకు వ్యతిరేక దిశలో రుణావేశ కేంద్రాలు విస్తాపనం ఉండును. బాహ్యక్షేత్ర దిశకు వ్యతిరేకంగా రోధక యానకం లోపల విద్యుత్ క్షేత్ర ప్రేరణ జరుగును. ఈ సందర్భంలో అణువులు ధ్రువణం చెందినవి అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 11
2) పలకల మధ్య రోధకం ఉన్న కెపాసిటర్ను భావిద్దాం. రోధకం లోపల నికరక్షేత్రం స్వల్పము.

3) బాహ్యక్షేత్ర సత్వము E0 మరియు రోధకయానకం విద్యుత్ క్షేత్ర సత్వప్రేరణ Em. నికర క్షేత్రము జై.
E = (Eనికర) – E – E = ఇక్కడ K యానకం రోధక స్థిరాకం.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విద్యుత్ పొటెన్షియల్ను నిర్వచించండి. విద్యుత్ ద్విధృవం వల్ల కలిగే విద్యుత్ పొటెన్షియల్కు సమాసాన్ని రాబట్టి, విద్యుత్ ద్విధృవం (a) అక్షీయ రేఖపై (b) మధ్య లంబరేఖ (equatorial line) పై విద్యుత్ పొటెన్షియల్లను కనుక్కోండి.
జవాబు:
విద్యుత్ పొటెన్షియల్ (V) :
ప్రమాణశోధన ఆవేశంను అనంతదూరం నుండి విద్యుత్ క్షేత్రంలోనికి తీసుకు రావడానికి జరిగిన పనిని విద్యుత్ పొటెన్షియల్ అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 12

ద్విధ్రువం వల్ల ఒక బిందువు వద్ద పొటెన్షియలు సమాసము :
1) A మరియు B లు – q మరియు + q ఆవేశాలు 2a దూరంలో వేరుచేయబడి ఉన్నాయి.
2) విద్యుత్ ద్విధ్రువ భ్రామకం P = q × 2a. దీని దిశ AB వెంట ఉండును.
3) ‘P’ వద్ద విద్యుత్ పొటెన్షియల్ గణించాలి.
4) ‘O’ బిందువు నుండి ‘r’ దూరంలో P ఉంది. OP మరియు ABల మధ్య కోణము θ.
5) BN మ యు AM లు OP కు లంబాలు.
6) B వద్ద + q ఆవేశం వల్ల P వద్ద పొటెన్షియల్
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 13
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 14

ప్రశ్న 2.
కెపాసిటర్ శ్రేణి, సమాంతర సంయోగాలను వివరించండి. ప్రతి సంయోగంలోను తుల్య కెపాసిటెన్స్కు ఫార్ములాను రాబట్టండ్. [TS. Mar.’17: AP & TS. Mar.’15]
జవాబు:
శ్రేణి సంయోగము :
కెపాసిటర్ ను, ఒకదాని తరువాత మరొకదానిని కలిపే పద్ధతిని, శ్రేణి సంధానం అంటారు.
ఈ సంయోగంలో
1. ప్రతికెపాసిటర్పై ఆవేశం సమానం.
2. కెపాసిటర్ పొటెన్షియల్ తేడా సమానం కాదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 15

సమాంతర సంయోగము :
వేర్వేరు కెపాసిటర్ మొదటి పలకలను ఒక బిందువు వద్ద, రెండవ పలకలను మరొక బిందువు వద్ద కలిపే పద్ధతిని, సమాంతర సంయోగం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 16
ఈ సంయోగంలో
1. ప్రతి కెపాసిటర్పై పొటెన్షియల్ తేడా సమానం.
2. ప్రతి కెపాసిటర్పై ఆవేశం సమానం కాదు.
పటంలో చూపినట్లు C1, C2, C3 కెపాసిటీ ఉన్న కెపాసిటర్లను పొటెన్షియల్ తేడా ‘V’ ఉన్న బ్యాటరీకి కలిపినట్లు భావిద్దాం.
1వ కెపాసిటర్పై ఆవేశం Q1 = C1V
2వ కెపాసిటర్పై ఆవేశం Q2 = C2V

3వ కెపాసిటర్పై ఆవేశం Q3 = C3V
∴ మొత్తం ఆవేశం Q = Q1 + Q2 + Q3
= C1V + C2V + C3V
Q = V(C1, + C2 + C3)
\(\frac{Q}{V}\) = C1 + C2 + C3
C = C1 + C2 +C3][∵ c = \(\frac{Q}{V}\)]
‘n’ కెపాసిటర్లను సమాంతరంగా కలిపినపుడు, ప్రభావ కెపాసిటిని క్రింది విధంగా వ్రాయవచ్చును.
C = C1 + C2 + C3 + …. + Cn

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 3.
కెపాసిటర్లో నిల్వ ఉండే శక్తికి సమాసాన్ని రాబట్టండి. పలకల మధ్య ప్రదేశాన్ని రోధకంతో నింపినప్పుడు నిల్వ ఉండే శక్తిని కింది సందర్భాల్లో కనుక్కోండి.
(a) ఆవేశం చెందించే బ్యాటరీని వేరు చేసినప్పుడు
(b) ఆవేశం చెందించే బ్యాటరీని వలయంలో ఉంచినప్పుడు
జవాబు:
కెపాసిటర్లో నిల్వ ఉండే శక్తికి సమాసము :
C కెపాసిటీ ఉన్న ఆవేశం లేని కెపాసిటర్ను భావిద్దాం. దాని తొలి పొటెన్షియల్ 0 (సున్నా). ఈ కెపాసిటర్ను V పొటెన్షియల్ తేడా ఉన్న బ్యాటరీకి కలిపితే, కెపాసిటర్పై తుది ఆవేశం ‘Q’.
∴ సరాసరి పొటెన్షియల్ తేడా VA = \(\frac{0+V}{2}=\frac{V}{2}\)
ఆవేశం Q ను జరపటంలో జరిగిన పని = W = VA × Q = \(\frac{VQ}{2}\)
ఈ జరిగిన పని కెపాసిటర్లో స్థిర విద్యుత్ స్థితిజశక్తి ‘U’ గా నిల్వ ఉండును.
∴ U = \(\frac{VQ}{2}\)
∴ కెపాసిటర్లో నిల్వ ఉన్న శక్తి, U = \(\frac{VQ}{2}=\frac{1}{2}\)CV² = \(\frac{Q^2}{2C}\) (∴ Q = CV)

నిల్వ ఉన్న శక్తిపై రోధకం ప్రభావము :
సందర్భం (a) : వలయం నుండి బ్యాటరీని తొలగించినప్పుడు :
కెపాసిటరు బ్యాటరీతో Q కు ఆవేశపరచి, వలయం నుండి తొలగించి, ‘K’ రోధక స్థిరాంకం ఉన్న రోధకాన్ని రెండు పలకల మధ్య ఖాళీలో ఉంచితే, పొటెన్షియల్ \(\frac{1}{K}\) రెట్లు తగ్గును. మరియు ఆవేశం స్థిరంగా ఉండును.
కెపాసిటీ ‘K’ రెట్లు పెరుగును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 17
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 18

సందర్భం (b) : వలయంనకు బ్యాటరీని కలిపినప్పుడు :
కెపాసిటర్కు బ్యాటరీ కలిపి Q కు ఆవేశపరిచామనుకుందాము. కెపాసిటర్ పలకల మధ్య K రోధక స్థిరాంకము ఉన్న రోధకంను ఉంచితే, పొటెన్షియల్ \(\frac{1}{K}\) రెట్లు తగ్గును. పలకలపై ఆవేశం, పొటెన్షియల్ తేడా తొలివిలువ V వచ్చేంతవరకు పెరుగును.
పలకలపై కొత్త ఆవేశం Q’ =KQ
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 19
∴ కెపాసిటర్లో నిల్వ ఉన్న శక్తి ‘K’ రెట్లు పెరుగును.

లెక్కలు Problems

ప్రశ్న 1.
తొలుత చాలా అత్యధిక దూరంలో ఉన్న ‘m’ ద్రవ్యరాశి, +e ఆవేశం గల ఒక ప్రాథమిక కణాన్ని విరామంలో ఉన్న + Ze ఆవేశం గల భారయుత కణం వైపు v వేగంతో ప్రక్షిప్తం చేస్తారు. పతన కణం అత్యంత సామీప్యంగా పోగలిగే దూరంను కనుకొనుము.
సాధన:
ప్రాథమిక కణం ద్రవ్యరాశి = m; ఆవేశం = +e; వేగం = v.
చాలా ఎక్కువ ద్రవ్యరాశి గల కణం ఆవేశం = + Ze
ఆవేశ నిత్యత్వ నియమము ప్రకారము,
ప్రాథమిక కణాల గతిజ శక్తి = సమీప దూరం (d) వద్ద ప్రాథమిక కణం స్థిర విద్యుత్ స్థితిజ శక్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 20

ప్రశ్న 2.
హైడ్రోజన్ పరమాణువులో ఎలక్ట్రాను, ప్రొటాన్ 0.5 A దూరంలో కలవు. వ్యవస్థ ద్విధృవ భ్రామకంను కనుగొనుము.
సాధన:
హైడ్రోజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ ఆవేశం, qe = -1.6 × 10-19C
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 21
హైడ్రోజన్ పరమాణువులో ప్రోటాన్ ఆవేశం, qp = +1.6 × 10-19C
ప్రోటాను మరియు ఎలక్ట్రాన్ల మధ్య దూరము,
2a = 0.5Å = 0.5 × 10-10m
వ్యవస్థ ద్విధృవ భ్రామకం
P = 2a × qp = 0.5 × 10-10 × 1.6 × 10-19
∴ P = 8 × 10-30 cm

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 3.
XOY తలంలో ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రంగా (\(40\hat{i}+30\hat{j}\)) Vm-1ని సూచించడమైంది. మూలబిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ 200 V అయితే, (2m, 1m) నిరూపకాలు గల బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ను ఉరి కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 22

ప్రశ్న 4.
ఒక సమబాహు త్రిభుజం అంచు (పక్క) పొడవు L. దాని కేంద్ర బిందువు వద్ద +q ఆవేశం ఉంచారు. త్రిభుజం పరిధిపై P ఒక బిందువు. బిందువు Pకి సాధ్యమయ్యే కనిష్ఠ, గరిష్ట విద్యుత్ పొటెన్షియల్ నిష్పత్తి.
సాధన:
సమబాహు త్రిభుజ కేంద్రబిందువు వద్ద ఆవేశం =+q
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 23

ప్రశ్న 5.
ABC అనేది 2 m అంచు గల ఒక సమబాహు త్రిభుజం. త్రిభుజ తలంలో 100 V/m తీవ్రత గల ఏకరీతి విద్యుత్ క్షేత్రం BCకి సమాంతరంగా కలదు. ఒకవేళ విద్యుత్ పొటెన్షియల్ A వద్ద 200 V అయితే, B, C ల వద్ద విద్యుత్ పొటెన్షియల్లు’ వరుసగా ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 24
సమబాహు త్రిభుజ భుజము పొడవు, a = 2m
E = 100V/m; VA = 200V
B మరియు C ల మధ్య బిందువు అనుకొందాము.
D వద్ద పొటెన్షియల్ = VD = 200V
పటం నుండి, VB – VD = Ed
⇒ VB – 200 = 100 × 1
∴ B వద్ద పొటెన్షియల్, VB = 200 + 100 = 300 V
మరియు VD – VC Ed
∴ C వద్ద పొటెన్షియల్ VC = 200 – 100 = 100 V

ప్రశ్న 6.
ద్విధృవ భ్రామకం P కలిగిన ఒక విద్యుత్ ద్విధృవాన్ని ఏకరీతి విద్యుత్ క్షేత్రం E లో P, Eకి సమాంతరంగా ఉండేట్లు ఉంచారు. తరువాత దాన్ని q కోణంతో భ్రమణం చెందిస్తే, జరిగిన పనిని కనుక్కోండి?
సాధన:
విద్యుత్ ద్విధృవం AB, – q మరియు + q ఆవేశాలు కలిగి ఉందని భావిద్దాం.
AB ద్విధృవ భ్రామకం = P
విద్యుత్ క్షేత్రం = E
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 25

ప్రశ్న 7.
మూడు సర్వసమానమైన లోహ పలకలు, ఒక్కొక్కటి ‘A’ వైశాల్యం గలవి, ఒకదానికొకటి పటంలో చూపినట్లుగా సమాంతరంగా అమర్చారు. ‘V వోల్టుల బ్యాటరీని పటంలో చూపినట్లుగా కలిపారు. పలకల వ్యవస్థలో నిల్వ ఉండే శక్తిని కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 26
సాధన:
ప్రతి పలక వైశాల్యం = A
రెండు పలకల మధ్యదూరం = d
సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటి C = \(\frac{\varepsilon_0A}{d}\)
పటంలో చూపినట్లు రెండు కెపాసిటర్లు సమాంతరంగా కలుపబడినవి.
రెండు కెపాసిటర్లు సమాంతరంగా కలిపినప్పుడు, ఫలిత కెపాసిటి, Cp = 2C = \(\frac{2\varepsilon_0A}{d}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 27

ప్రశ్న 8.
ప్రతి పలక వైశాల్యం A ఉండే నాలుగు సర్వసమానమైన లోహపు పలకలు పరస్పరం d దూరంలో వేరుచేసి పటంలో చూపినట్లు సంధానం చేయబడ్డాయి. A, B కొనల మధ్య వ్యవస్థ కెపాసిటిని కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 28
సాధన:
కెపాసిటర్ ప్రతిపలక వైశాల్యం =A
కెపాసిటర్ రెండు పలకల మధ్యదూరం = d
ప్రతి సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటి, C = \(\frac{\varepsilon_0A}{d}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 29

ప్రశ్న 9.
పటంలో చూపిన వలయంలోని బ్యాటరీ V వోల్టులు కలిగి అంతర్నిరోధం లేకుండా ఉంది. మూడు కెపాసిటర్లు సమాన కెపాసిటి కలిగి ఉన్నాయి. ఏ కెపాసిటర్ అధిక ఆవేశం కలిగి ఉంటుందో కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 30
సాధన:
ఇచ్చిన వలయం యొక్క తుల్య వలయం పటంలో చూపబడింది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 31
శ్రేణి సంధానంలో ప్రతి కెపాసిటర్ గుండా ఆవేశం q ప్రవహిస్తుంది.
అప్పుడు q1 = q = C1 V1; q2 = q = C2V2; q3 = C3V3
∴ = q1 = q2 = q3
కావున మూడు కెపాసిటర్లు C1, C2 మరియు C3 లలో ఒకే ఆవేశం ప్రవహించును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 10.
A, B అనే C, 2C కెపాసిటెన్స్ గల కెపాసిటర్లను సమాంతరంగా సంధానం చేసి సంయోగాన్ని V వోల్టుల బ్యాటరీకి
సంధానం చేశారు. ఆవేశం చెందించడం పూర్తవగానే, బ్యాటరీని తొలగించి K = 2 గల రోధక దిమ్మెను A పలకల మధ్య ప్రదేశం పూర్తిగా నిండేట్లుగా ప్రవేశపెట్టారు. ఆవేశాలను పంచుకొనేటప్పుడు వ్యవస్థ కోల్పోయే శక్తిని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 32
i) సమాంతర సంయోగంతో బ్యాటరీ (ఘటం) కలిపినప్పుడు
C1 = C; C2 = 2C; V = V
Cp = C1 + C2 = 3C; q = 3CV
నిల్వ ఉన్న తొలిశక్తి
Ui = \(\frac{1}{2}\) Cp V² = \(\frac{3}{2}\) CV²
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 33

ప్రశ్న 11.
నియమిత కెపాసిటి గల కెపాసిటర్ను V పొటెన్షియలు ఆవేశితం చేసినప్పుడు అది కొంత శక్తిని నిల్వ ఉంచుకుంది. దీనికి రెట్టింపు కెపాసిటి గల కెపాసిటర్ మొదటిదాని శక్తిలో సగం శక్తిని నిల్వ చేసుకోవాలంటే ఎంత పొటెన్షియలు ఆవేశిం చేయాలి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 34

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
5 × 10-8 C, – 3 × 10-8 C అనే రెండు విద్యుదావేశాలు 16 cm దూరంలో కలవు. వాటిని కలిపే రేఖపై ఏ బిందువు (ల) వద్ద పొటెన్షియల్ సున్నా అవుతుంది ? అనంతం వద్ద పొటెన్షియల్ను సున్నాగా తీసుకోండి.
సాధన:
q1 = 5 × 10-8C, q2 = -3 × 10-8C
ఆవేశం q1 = 5 × 10-8 C నుండి X దూరం వద్ద పొటెన్షియల్ శూన్యం.
∴ r1 = x × 10-2m
r2 = (16 – x) × 10-2 m
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 35

ప్రశ్న 2.
భుజం పొడవు 10 cm గల ఒక క్రమ షడ్భుజి 5 µC ఆవేశం కలదు. అయితే ఆ షడ్భుజి మధ్యబిందువు వద్ద పొటెన్షియల్ను కనుక్కోండి.
సాధన:
భుజం 10cm గల ABCDEFA అష్టభుజి (hexagon) కేంద్రం పటం నుండి స్పష్టంగా OAB, OBC లు సమబాహు త్రిభుజాలు.
∴ OA = OB = OC = OD = OE = OF = r = 10 cm = 10-1m
పొటెన్షియల్ అదిశరాశి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 36

ప్రశ్న 3.
A, B అనే రెండు బిందువుల వద్ద 2 uC, -2 uC ఆవేశాలను 6 cm దూరంలో ఉంచారు.
a) వ్యవస్థ సమ పొటెన్షియల్ ఉపరితలాన్ని గుర్తించండి.
b) ఈ ఉపరితలంపై ప్రతీ బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం దిశ ఏమిటి ?
సాధన:
a) AB లంబంగా మరియు దాని మధ్య బిందువు గుండాపోవు తలంపై బిందువు వద్దనైన, శూన్య పొటెన్షియల్ ఉండును.

b) తలమునకు లంబంగా AB దిశలో ఉండును.

ప్రశ్న 4.
12cm వ్యాసార్థం గల ఒక గోళాకార వాహక ఉపరితలంపై 1.6 × 10-7C ఆవేశం ఏకరీతిగా వితరణ చెంది ఉంది. అయితే క్రింది సందర్భాల్లో విద్యుత్ క్షేత్రం ఏమిటి?
a) గోళ అంతర్భాగంలో
b) గోళానికి కాస్తంత వెలుపల
c) గోళం కేంద్రం నుంచి 18 cm దూరంలో గల బిందువు వద్ద
సాధన:
r = 12 cm = 12 × 10-2m, q = 1.6 × 10-7C.
a) గోళం లోపల, E = 0

b) గోళమునకు కొద్దిగా వెలుపల (గోళం తలంపై తీసుకుందాము)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 37

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 5.
పలకల మధ్య గాలి ఉన్న ఒక సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటి 8 pF (1pF = 10-12F). అయితే, పలకల మధ్యమాన్ని సగానికి తగ్గించి, వాటి మధ్యగల ప్రదేశాన్ని రోధక స్థిరాంకం 6 గల ఒక పదార్ధంతో నింపినట్లైతే కెపాసిటెన్స్ ఎంతవుతుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 38

ప్రశ్న 6.
9 pF కెపాసిటెన్స్ గల 3 కెపాసిటర్లను శ్రేణీ సంధానం చేశారు.
a) ఈ సంయోగం మొత్తం కెపాసిటెన్స్ ఎంత?
b) ఈ సంయోగాన్ని 120 V బ్యాటరీకు కలిపినప్పుడు ప్రతీ కెపాసిటర్ కొనల మధ్య పొటెన్షియల్ భేదం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 39

ప్రశ్న 7.
2 pE, 3 pE, 4 pF ల కెపాసిటెన్స్ గల 3 కెపాసిటర్లను సమాంతర సంధానం చేశారు.
a) ఈ సంయోగం మొత్తం కెపాసిటెన్స్ ఎంత?
b) ఈ సంయోగాన్ని 100 V బ్యాటరీకి కలిపినప్పుడు ప్రతీ కెపాసిటర్పై ఉండే ఆవేశాన్ని కనుక్కోండి.
సాధన:
a) Cp = 2 + 3 + 4 = 9 pF
b) ప్రతి కెపాసిటర్కు V = 100 Volt
q1 = C1 V = 2 × 100 = 200 pC
q2 = C2 V = 3 × 100 = 300 pC
q3 = C3 V = 4 × 100 = 400 pC

ప్రశ్న 8.
పలకల మధ్య గాలి ఉన్నటువంటి ఒక సమాంతర పలకల కెపాసిటర్లో ప్రతీ పలక వైశాల్యం 6 × 10-3 m². వాటి మధ్యదూరం 3 mm అయితే, ఆ కెపాసిటర్ కెపాసిటెన్స్ను కనుక్కోండి. ఈ కెపాసిటర్ను 100 Vబ్యాటరీకి కలిపినట్లయితే, కెపాసిటర్ ప్రతీ పలకపై ఆవేశం ఎంత?
సాధన:
A = 6 × 10-3 m², d = 3mm = 3 × 10-3m, C = ? V = 100 V, q = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 40

ప్రశ్న 9.
పైన అభ్యాసంలోని కెపాసిటర్ పలకల మధ్య 3 mm మందం కలిగిన మైకా (రోధక స్థిరాంకం = 6) ని ప్రవేశ . పెట్టినట్లయితే
a) కెపాసిటర్కు సంధానం చేసిన వోల్టేజి సరఫరాను అలాగే ఉంచినప్పుడు
b) సరఫరాను తొలగించిన తరువాత ఏమి జరుగుతుంది?
సాధన:
a) కెపాసిటి C కు పెరుగును i.e., C = KC0 = 6 × 1.77 × 10-11F
ఆవేశం q¹ కు పెరుగును. i.e., q¹ = C¹V = 6 × 1.77 × 10-11 × 10²C.

b) జనకంను తొలగించినపుడు, కొత్త కెపాసిటి C = KC0 = 6 × 1.77 × 10-11F
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 41

ప్రశ్న 10.
12pF గల ఒక కెపాసిటర్ను 50V బాటరీకి సంధానం చేశారు. అయితే కెపాసిటర్లో ఎంత స్థిర విద్యుత్ శక్తి నిలువ అవుతుంది?
సాధన:
C = 12pF = 12 × 10-12E,
V = 50Volt, E = ?
E = \(\frac{1}{2}\)CV² = \(\frac{1}{2}\)(12 × 10-12)(50)²
= 1.5 × 10-8J.

ప్రశ్న 11.
200V బ్యాటరీతో 600pF కెపాసిటర్ను ఆవేశపరచారు. తరువాత దీనిని బ్యాటరీ నుంచి తొలగించి, 600 pF గల .మరొక ఆవేశరహిత కెపాసిటర్కు సంధానం చేశారు. ఈ ప్రక్రియలో ఎంతమేర స్థిర విద్యుత్ శక్తి నష్టపోతుంది?
సాధన:
C1 = C2 = 600 pF = 600 × 10-12
F = 6 × 10-10F,
V1 = 200 V, V2 = 0
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 42

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 12.
8 mC ఆవేశం మూలబిందువు వద్ద కలదు. అయితే, P(0, 0, 3 cm) బిందువు నుంచి R(0, 6 cm, 9 cm) బిందువు మీదుగా Q(0, 4 cm, 0) బిందువుకు చిన్న ఆవేశం -2 × 10-3 C ని తీసుకొనిరావడానికి జరిగిన పనిని లెక్కించండి.
సాధన:
పటంలో చూపినట్లు మూలబిందువు వద్ద ఆవేశం q = 8mc = 8 × 10-3C
P నుండి R మీదుగా Q కు, తీసుకెళ్తున్న ఆవేశం 4% = -2 × 10-9C
OP = rp = 3 cm = 3 × 10-2 m మరియు
OQ = rQ = 4 cm = 4 × 10-2 m
స్థిరవిద్యుత్ బలాలు, నిత్యత్వ బలాలు, జరిగిన పని పదంపై ఆధారపడదు. కావున బిందువు తో సంబంధం ఉండదు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 43

ప్రశ్న 13.
భుజం పొడవు b గల ఒక ఘనం ప్రతి శీర్షం వద్ద q ఆవేశాన్ని ఉంచారు. ఈ ఆవేశ అమరిక వల్ల ఘనం మధ్యబిందువు వద్ద పోటెన్షియల్, విద్యుత్ క్షేత్రాన్ని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 44
ఘనం ఎనిమిది శీర్షాల వద్ద q ఆవేశం ఉన్న ఎనిమిది ఆవేశాల వల్ల కేంద్రం వద్ద పొటెన్షియల్,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 45
కేంద్రం వద్ద ఎనిమిది ఆవేశాల వల్ల విద్యుత్ క్షేత్రం శూన్యం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 14.
రెండు చిన్న లోహపు గోళాలపై 1.5µC, 2.5µC ఆవేశాలు కలవు. అవి ఒకదానికొకటి 30 cm దూరంలో కలవు. అయితే,
a) రెండు ఆవేశాలను కలిపే రేఖ మధ్యబిందువు వద్ద
b) ఈ మధ్యబిందువు నుంచి 10cm దూరంలో, మధ్యబిందువు నుంచి పోతూ రేఖకు లంబంగా గల తలంలో పొటెన్షియల్, విద్యుత్ క్షేత్రాన్ని కనుక్కోండి.
సాధన:
q1 = 1.5μC = 1.5 × 10-6 C,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 46
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 47
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 48

ప్రశ్న 15.
అంతర వ్యాసార్థం r,, బాహ్య వ్యాసార్థం 1, గల గోళాకార వాహక కర్పరం Q ఆవేశాన్ని కలిగి ఉంది.
a) కర్పరం కేంద్రం వద్ద ఆ ఆవేశాన్ని ఉంచారు. కర్పరం లోపలి తలం, బాహ్య తలంపైన ఉపరితల ఆవేశ సాంద్రత ఎంత?
సాధన:
కర్పరము బయట తలంపై + Q ఆవేశం ఉండును. q ఆవేశంను కర్పరము కేంద్రము వద్ద ఉంచితే, కర్పరం లోపలి తలంపై -q ఆవేశంను వెలుపల తలంపై +q ఆవేశంను ప్రేరణ చేయును.
∴ కర్పరం లోపల తలంపై మొత్తం ఆవేశం -q మరియు వెలపలి తలంపై మొత్తం ఆవేశం (Q + q).
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 49

b) కర్పరం గోళాకారంగా లేనప్పటికీ, ఏదైనా అక్రమాకార ఆకారాన్ని కలిగి ఉన్నప్పటికీ కోటరం అంతర్భాగంలో విద్యుత్ క్షేత్రం (ఎటువంటి ఆవేశాలు లేనప్పుడు) సున్నా అవుతుందా?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 50
కర్పరం ఏ అక్రమ ఆకారంలో ఉన్న కోటరంలో ఆవేశం లేదు. కావున విద్యుత్ క్షేత్రం శూన్యం. కోటరం లోపల క్షేత్రరేఖ వెంట సంవృత లూప్ భాగంను మిగిలినది వెలుపల తీసుకుంటే, అప్పుడు సంవృత లూప్ వెంట శోధన ఆవేశం క్షేత్రం వెంట చేసిన పని శూన్యం. కావున ఆవేశంలేని కోటరం లోపల విద్యుత్ క్షేత్రం ఎల్లప్పుడు శూన్యం.

ప్రశ్న 16.
a)స్థిర విద్యుత్ క్షేత్ర లంబాంశం ఆవేశిత ఉపరితలం ఒకవైపు నుంచి వేరొకవైపుకు విచ్ఛిన్నంగా ఉంటుందని నిరూపించండి.
ఆ లంబాంశం (E2 – E1). \(\hat{\mathrm{n}}=\frac{\sigma}{\varepsilon_0}\) అని చూపండి.
ఇక్కడ \(\hat{n}\) ఒక బిందువు వద్ద తలానికి లంబంగా ఉండే ఏకాంక సదిశ, రా ఆ బిందువు వద్ద ఉపరితల ఆవేశ సాంద్రత ( \(\hat{n}\) దిశ 1 వైపు నుంచి 2 వైపుకు ఉంటుంది. దాన్ని బట్టి వాహకానికి కాస్తంత బయట విద్యుత్ క్షేత్రం σ \(\hat{n}\)/ε0 అని చూపండి.
b) స్థిర విద్యుత్ క్షేత్ర స్పర్శరేఖీయ అంశం (tangential component) ఆవేశిత ఉపరితలం ఒకవైపు నుంచి మరోవైపుకు అవిచ్ఛిన్నంగా ఉంటుందని నిరూపించండి.
(Hint : (a) కోసం గాస్ నియమాన్ని ఉపయోగించండి, (b) సంవృత లూప్పై స్థిర విద్యుత్ క్షేత్రం చేసిన పని శూన్యం అనే వాస్తవాన్ని ఉపయోగించండి.)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 51
b) సంవృత లూప్లో స్థిరవిద్యుత్ క్షేత్రం చేయుపని శూన్యం. కావున. ఒకవైపు ఆవేశతలం నుండి మరియొక వైపు స్థిర విద్యుత్ క్షేత్రక అంశ స్పర్శరేఖ అవిచ్ఛిన్నం.

ప్రశ్న 17.
λ రేఖీయ ఆవేశ సాంద్రత కలిగిన పొడవైన ఆవేశిత స్తూపం వేరొక సహాక్ష బోలు వాహక స్తూపంతో ఆవృతం అయింది. ఈ రెండు స్తూపాల మధ్య ప్రదేశంలో విద్యుత్ క్షేత్రం ఎంత?
సాధన:
l పొడవు, a వ్యాసార్థం, λ రేఖీయ ఆవేశ సాంద్రత ఉన్న A అనే ఒక పొడవాటి స్థూపం l పొడవు, b వ్యాసార్థం ఉన్న చోట సహాక్ష స్థూపంలో అమృతం అయిందని భావిద్దాం.

A వెలుపలి తలంపై ఆవేశం q = λl ఏకరీతిగా విస్తరించి ఉన్నది. స్థూపం B పై – q ఆవేశంను ప్రేరణ చేస్తుంది. రెండు స్తూపాల మధ్య విద్యుత్ క్షేత్రం E ఏర్పడి, వెలుపలివైపుకు పనిచేయును. వ్యాసార్ధము గల సహాక్ష స్థూపాకార గాసియన్ తలంను భావిద్దాం. స్థూపాకార తలం ద్వారా విద్యుత్ అభివాహం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 52
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 53

ప్రశ్న 18.
ఒక హైడ్రోజన్ పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్లు సుమారుగా 0.53 శ్రీ దూరంలో బద్ధమై ఉన్నాయి :
a) ప్రోటాన్ నుంచి ఎలక్ట్రాన్ అనంత దూరంలో ఉన్నప్పుడు స్థితిజశక్తి సున్నాగా తీసుకొని, ఆ వ్యవస్థ స్థితిజశక్తిని eVలలో అంచనా వేయండి.
b) (a) లో పొందిన స్థితిజశక్తి పరిమాణంలో సగం, దాని కక్ష్యలో గల గతిజశక్తికి సమానం అయితే, ఎలక్ట్రాన్న స్వేచ్ఛగా చేయడానికి అవసరమైన కనిష్ఠ పని ఎంత?
c) ఎలక్ట్రాన్, ప్రోటాన్ల మధ్యదూరం 1.06 A ఉన్నప్పుడు స్థితిజశక్తిని సున్నాగా తీసుకుంటే పై లెక్కలో (a), (b) లకు సమాధానాలు ఏమిటి?
సాధన:
a) q1 = −1.6 × 10-19C;
q2 + 1.6 × 10-19C.
r = 0.53 A° = 0.53 × 10-19m
స్థితిజశక్తి = అనంతదూరం వద్ద P.E – r వద్ద P.E
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 54

r1 = 1.06Å వద్ద శూన్య పొటెన్షియల్ తీసుకుంటే, వ్యవస్థ స్థితిజశక్తి
= r1 వద్ద P.E – r వద్ద P.E = 13.58 – 27.16 = – 13.58eV.
శూన్య స్థితిజశక్తిని విస్థాపనం చెందిస్తే, ఎలక్ట్రాన్ న్ను స్వేచ్ఛగా ఉంచుటకు కావాల్సిన పనిపై ఎటువంటి ప్రభావం ఉండదు. పని అదేవిధంగా, + 13.58 eVకు సమానంగా ఉండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 19.
ఒక H2 అణువులోని రెండు ఎలక్ట్రానులలో ఒక ఎలక్ట్రాన్ ను తీసివేస్తే హైడ్రోజన్ అణు అయాన్ H+2 వస్తుంది. H+2 అయాన్ భూస్థాయిలో రెండు ప్రోటాన్లు సుమారుగా 1.5 Å దూరంలో వేరయి ఉంటాయి. ప్రతీ ప్రోటాన్ నుంచి ఎలక్ట్రాన్ సుమారుగా 1 Å దూరంలో ఉంటుంది. వ్యవస్థ స్థితిజశక్తిని నిర్ణయించండి. శూన్య స్థితిజశక్తి ఎంపికను నిర్ధేశించండి.
సాధన:
q1 = ఎలక్ట్రాన్పై ఆవేశం (= -1.6 × 10-19C)
q2, q3 = రెండు ప్రోటాన్స్ ఆవేశాలు, ఒక్కొక్కటి = 1.6 × 10-19 C
r12 = q1 మరియు q2ల మధ్యదూరం = 1Å = 10-10m
r23 = q2 మరియు q3ల మధ్యదూరం = 1.5Å = 1.5 × 10-10m
r31 = q3 మరియు q1ల మధ్యదూరం = 1Å = 10-10m.
అనంతదూరం వద్ద శూన్య స్థితిజశక్తి తీసుకుంటే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 55

ప్రశ్న 20.
a, b వ్యాసార్థం గల రెండు ఆవేశపూరిత వాహక గోళాలను ఒకదానికొకటి తీగతో కలిపారు. రెండు గోళాల ఉపరితలాల మీద విద్యుత్ క్షేత్రాల నిష్పత్తి ఎంత ? ఈ ఫలితాన్ని ఉపయోగించి, ఆవేశ సాంద్రత పదునైన (వాడిగా ఉన్న), మొనతేలిన వాహకపు చివరలపై వాహకపు చదునైన భాగాలపై కంటే ఎందుకు అధికంగా ఉంటుందో వివరించండి.
సాధన:
ఎక్కువ పొటెన్షియల్ గోళం నుండి తక్కువ పొటెన్షియల్ గోళం వైపు, వాని పొటెన్షియలు సమానం అయ్యేవరకు ఆవేశం ప్రవహిస్తుంది. పంచుకున్న తరువాత, రెండు గోళాలపై ఆవేశాల నిష్పత్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 56

ఆవేశ సాంద్రత పదునైన మొనతేలిన వాహక చివర చాలా తక్కువ వ్యాసార్థమున్న గోళం, మరియు చదునైన భాగం చాలా ఎక్కువ వ్యాసార్ధమున్న భాగం. కావున ఆవేశ సాంద్రత చదునైన భాగాలపై కంటే మొనతేలిన వాహకపు చివరలపై అధికంగా ఉంటుంది.

ప్రశ్న 21.
(0, 0, -a) (0, 0, a) బిందువుల వద్ద వరుసగా రెండు ఆవేశాలు -q, +q లు కలవు.
(a) (0, 0, z), (x, y, 0) బిందువుల వద్ద స్థిర విద్యుత్ పొటెన్షియల్ విలువ ఎంత?
(b) r/a>> 1 అయినప్పుడు మూలబిందువు నుంచి దూరం వద్ద ఉన్న బిందువు పొటెన్షియల్ మీద ఆధారపడి ఉంటుందని చూపండి.
(c) x-అక్షం దిశలో (5, 0, 0) బిందువు నుంచి (-7,0,0) బిందువుకు చిన్న శోధన ఆవేశాన్ని జరపడానికి ఎంత పని చేయాలి ? అవే బిందువుల మధ్య శోధన ఆవేశం పథం X అక్షం దిశలో లేకుంటే సమాధానం మారుతుందా?
సాధన:
(0, 0, -a) వద్ద -q మరియు (0, 0, a) వద్ద + q
i) (0,0, z) వద్ద పొటెన్షియల్
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 57
ఆవేశాలున్న Z-అక్షానికి లంబంగా (x, y, 0) బిందువు వద్ద పొటెన్షియల్ శూన్యం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 58

స్థిరవిద్యుత్ క్షేత్రం చేయుపని, రెండు బిందువులను కలుపు పథంపై ఆధారపడదు. కావున ఏ పదం వెంట అయిన జరిగిన పని అవిచ్ఛిన్నంగా శూన్యం.

ప్రశ్న 22.
పటం ఆవేశాల అమరికను చూపుతుంది. దీనిని విద్యుత్ క్వాడ్రపోల్ అంటారు. క్వాడ్రపోల్ అక్షంపై ఒక బిందువుకు, r/a >> 1 అయినప్పుడు, పొటెన్షియల్ పై ఆధారితం కావడాన్ని పొందండి. ఈ ఫలితాలను విద్యుత్ డైపోల్, విద్యుత్ ఏకధృవం (monopole) (అంటే, ఒంటరి ఆవేశం) ఫలితాలతో పోల్చండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 59
సాధన:
A, B, C ల వద్ద + q, – 2q మరియు + q ల వద్ద మూడు ఆవేశాల వ్యవస్థతో విద్యుత్ క్వాడ్రపోల్ ఏర్పడుతుంది.
AC = 2a, BP = r, అధ్యారోపణ సూత్రంను ఉపయోగించి ఏదైనా బిందువు P వద్ద పొటెన్షియల్.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 60
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 61
విద్యుత్ ద్విధ్రువం సందర్భంలో, V ∝ \(\frac{1}{r^2}\) మరియు ఒక ఆవేశం ఉన్న సందర్భంలో, V ∝ \(\frac{1}{r}\).

ప్రశ్న 23.
ఒక విద్యుత్ సాంకేతిక నిపుణుడికి ఒక వలయంలో IkV పొటెన్షియల్ తేడాకు సమాంతరంగా 2 µF కెపాసిటర్ను కలపవలసి ఉంది. అయితే అతనికి 1µF కెపాసిటర్లు అనేక సంఖ్యలో అందుబాటులో కలవు. అవన్నీ కూడా 400 V కంటే అధికంగా తట్టుకోలేవు. కావలసిన 1kV పొటెన్షియల్ తేడాకు 2µF కెపాసిటెన్స్ పొందడానికి వీలయినంత తక్కువ సంఖ్యలో కెపాసిటర్లు అవసరమయ్యే అమరికను సూచించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 62
మొత్తం కెపాసిటన్స్, C = 2µF
పొటెన్షియల్ భేదం, V = 1KV = 1000 Volt
ప్రతి కెపాసిటర్ కెపాసిటీ, C, = 1µF
ప్రతి కెపాసిటర్ వెంట గరిష్ఠ పొటెన్షియల్ భేదము, V = 400 Volt
ఒక్కొక్కటి 1µF ఉన్న n కెపాసిటర్స్ శ్రేణి వరుసలో మరియు m వరుసలు సమాంతరంగా పటంలో చూపినట్లు కలుపబడినవి.
ప్రతి వరుస వెంట పొటెన్షియల్ భేదం = 1000 Volt
∴ ప్రతి కెపాసిటర్ వెంట పొటెన్షియల్ భేదం = \(\frac{1000}{n}\) = 400
∴ n = \(\frac{1000}{400}\) = 2.5
n విలువ 2.5 కు తక్కువ కాకూడదు. ∴ n = 3
1µF కెపాసిటి గల మూడు కెపాసిటర్ ను శ్రేణిలో కల్పితే, ప్రతి వరుస కెపాసిటి = 1/3
సమాంతరంగా అటువంటి m వరుసల మొత్తం కెపాసిట = \(\frac{m}{3}\)
∴ \(\frac{m}{3}\) = 2µF లేక m = 6μF
∴ మొత్తం కెపాసిటర్ల సంఖ్య = n × m = 3 × 6 = 18.
కావున 1μF కెపాసిటర్లను ఆరు సమాంతర వరుసలు కలపాలి. ప్రతి వరుస మూడు కెపాసిటర్లను శ్రేణిలో కలిగి ఉండాలి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 24.
2Fకెపాసిటీ కలిగిన ఒక సమాంతర పలకల కెపాసిటర్ పలకల వైశాల్యం ఎంత? రెండు పలకల మధ్యదూరం 0.5cm అని ఇచ్చారు. మీ సమాధానం నుంచి ఎందుకు సాధారణ కెపాసిటర్ల వ్యాప్తి µF వ్యాప్తిలో లేదా అంతకంటే తక్కువగా ఉంటుందనే వాస్తవాన్ని గ్రహిస్తారు. అయినప్పటికీ, విద్యుత్ విశ్లేషక కెపాసిటర్లలో వాహకాల మధ్య ఎడం చాలా స్వల్పంగా ఉండటం వల్ల వాటి కెపాసిటెన్స్ చాలా అధికంగా (0.1 F) ఉంటుంది.
సాధన:
C = 2F, d = 0.5 cm = 5 × 10-3m, A = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 63
ఇది చాలా పెద్ద విలువ.

సాధారణ కెపాసిటర్స్ వ్యాప్తి µF లేక తక్కువ. విద్యుత్ విశ్లేష్య కెపాసిటర్ లో, డి చాలా తక్కువ. వాని కెపాసిటన్స్ (=0.1 F) చాలా ఎక్కువ.

ప్రశ్న 25.
పటంలో చూపిన జాలం తుల్య కెపాసిటెన్స్ను పొందండి. 300 V సరఫరాకు, ప్రతీ కెపాసిటర్ కొనల మధ్య ఆవేశం, వోల్టేజిని నిర్ణయించండి.
సాధన:
C2 మరియు C3 లు శ్రేణిలో ఉన్నాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 64
(i) నుండి Vp – 300 – V4 = 300 – 200 = 100 V
C1 వెంట పొటెన్షియల్ భేదం V1 = Vp = 100 V
C1 పై ఆవేశం, q1 = C1V1 = 100 × 10-12 × 100 = 10-8C.
శ్రేణిలో C2 మరియు C3 వెంట పొటెన్షియల్ భేదము = 100 V
C2 పై ఆవేశం, q2 = C2V2 = 200 × 10-12 × 50 = 10-8C
C3 పై ఆవేశం, q3 = C3V3 = 200 × 10-12 × 50 = 10-8C

ప్రశ్న 26.
ఒక సమాంతర పలకల కెపాసిటర్ ప్రతి పలక వైశాల్యం 90 cm² మరియు ఆ రెండు పలకల మధ్యదూరం 2.5 mm. ఆ కెపాసిటర్ను 400 V సరఫరాకు సంధానం చేసి ఆవేశపరిచారు.
(a) కెపాసిటర్లో నిల్వ అయిన స్థిర విద్యుత్ శక్తి ఎంత?
(b) ఈ శక్తిని పలకల మధ్యస్థిర విద్యుత్ క్షేత్రంలో నిల్వ ఉన్నదిగా పరిగణించి, ఏకాంక ఘనపరిమాణానికి గల శక్తి u ని పొందండి. దీనినుంచి, u కి, పలకల మధ్య విద్యుత్ క్షేత్రం E పరిమాణానికి మధ్య సంబంధాన్ని తీసుకురండి.
సాధన:
a) A = 90 cm² 90 × 10-4m² = 9 × 10-3
d = 2.5 mm = 2.5 × 10-3m
V = 400 Volt, E¹ = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 65

ప్రశ్న 27.
4 µF కెపాసిటర్ను 200ల సరఫరాకు కలిపి ఆవేశపరిచారు. దానిని బ్యాటరీ నుంచి తొలగించి, మరొక 2 µF ఆవేశరహిత కెపాసిటర్కు కలిపారు. అయితే మొదటి కెపాసిటర్ నుంచి ఉష్ణం, విద్యుదయస్కాంత వికిరణ రూపంలో నష్టపోయిన స్థిర విద్యుత్ శక్తి ఎంత?
సాధన:
C1 = 4 µF = 4 × 10 F, V1 = 200 Volt.
C1 లో నిల్వ ఉన్న తొలి విద్యుత్ శక్తి,
<10-6x200x200
E1 = \(\frac{1}{2}\)C11 = \(\frac{1}{2}\) × 4 × 10-6 × 200 × 200
E1 = 8 × 10-2 జౌల్.
4 µF కెపాసిటర్ను 2 µF ఆవేశం లేని కెపాసిటర్ తో కలిపితే, రెండు ఉమ్మడి పొటెన్షియల్ పొందేవరకు ఆవేశం ప్రవహిస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 66
ఉష్ణం మరియు విద్యుదయస్కాంత వికిరణ రూపంలో నష్టపోయిన స్థిర విద్యుత్ శక్తి =
E1 – E2 = 8 × 10-2 – 5.33 × 10-2 = 2.67 × 10-2 జౌల్.

ప్రశ్న 28.
ఒక సమాంతర పలకల కెపాసిటర్ ప్రతి పలకపై గల బలపరిమాణం (1/2) QE అని చూపండి. ఇక్కడ Q కెపాసిటర్పై గల ఆవేశం, E పలకల మధ్య విద్యుత్ క్షేత్ర తీవ్రత పరిమాణం. దీనిలో 1/2 కారకం మూలాన్ని (origin) వివరించండి.
సాధన:
ప్రతి పలకపై F బలం ఉన్న సమాంతర పలకల కెపాసిటర్లో, వానిదూరం ∆x పెంచుటకు చేయు పని = F.∆x ఇది కెపాసిటర్ స్థితిజ శక్తిని పెంచును.
కెపాసిటర్ ఘనపరిమాణంలో పెరుగుదల = A.∆x
u = శక్తి సాంద్రత = నిల్వ శక్తి / ఘనపరిమాణం, స్థితిజశక్తిలో పెరుగుదల = U.A∆x
∴ f ∆ x = u. A∆x
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 67
బలం, కారకం మూలము 1/2. వాహకం లోపల క్షేత్రం సున్నా. వెలుపల వైపు క్షేత్రం E.
క్షేత్రం సరాసరి విలువ (i.e E/2) ను, బలం ఇస్తుంది.

ప్రశ్న 29.
రెండు ఏకకేంద్ర గోళాకార వాహకాలు గల ఒక గోళాకార కెపాసిటర్ను తగిన విద్యుత్ బంధకాల ఆధారంతో ఉంచారు. అయితే గోళాకార కెపాసిటర్ కెపాసిటెన్స్, C = \(\frac{4 \pi \varepsilon_0 \mathbf{r}_1 \mathbf{r}_2}{\mathbf{r}_1-\mathbf{r}_2}\) అని చూపండి.
ఇక్కడ r1, r2 లు వరుసగా బాహ్య, అంతర గోళాల వ్యాసార్థాలు.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 68
r1 వ్యాసార్ధమున్న బయట గోళం, లోపలి తలంపై +Q ఆవేశం, r2 వ్యాసార్ధమున్న లోపలిగోళం వెలుపల – Q ఆవేశంను ప్రేరణ చేస్తుంది.

పటంలో చూపినట్లు రెండు గోళాల మధ్య ఖాళీలో విద్యుత్ క్షేత్రం ఉండును. రెండు గోళాల మధ్య పొటెన్షియల్ భేదము,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 69
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 70

ప్రశ్న 30.
ఒక గోళాకార కెపాసిటర్లో అంతర గోళం వ్యాసార్థం 12 cm. బాహ్య గోళ వ్యాసార్థం 13 cm. అంతర గోళానికి 2.5 µC ఆవేశం ఇచ్చారు. బాహ్య గోళాన్ని భూమికి కలిపారు. ఈ ఏకకేంద్ర గోళాల మధ్య ప్రదేశాన్ని రోధక స్థిరాంకం 32 గల ఒక ద్రవంతో నింపారు.
(a) కెపాసిటర్ కెపాసిటెన్స్ను నిర్ణయించండి.
(b) లోపలి గోళం పొటెన్షియల్ ఎంత?
(c) ఈ కెపాసిటర్ కెపాసిటెను న్ను 12 cm వ్యాసార్థం గల వియుక్త గోళం కెపాసిటెన్స్తో పోల్చండి. రెండవది చాలా తక్కువ విలువను కలిగి ఉండటాన్ని వివరించండి.
సాధన:
ra = 12 cm = 12 × 10-2 m
rb = 13 cm = 13 × 10-2 m
q = 2.5 µC = 2.5 × 10-6C, εr = 32
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 71
కెపాసిటర్లో, బయట గోళం భూమికి కలుపబడింది. పొటెన్షియల్ భేదం తగ్గును మరియు కెపాసిటన్స్ పెరుగును. కావున వియుక్తగోళం కెపాసిటీ చాలా తక్కువ.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 31.
జాగ్రత్తగా సమాధానాలివ్వండి :
(a) Q1, Q2 ఆవేశాలు గల రెండు అతిపెద్ద వాహక గోళాలను ఒకదానికొకటి దగ్గరగా తీసుకొచ్చారు. వాటి మధ్య స్థిరవిద్యుత్ బలం పరిమాణం సరిగ్గా Q1 Q2/4πε0r² అవుతుందా? ఇక్కడ ” అనేది ఆ రెండింటి కేంద్రాల మధ్యదూరం.
(b) కూలుమ్ నియమం 1/r³ పై ఆధారితమైతే (1/r² కి బదులుగా) గాస్ నియమం ఇంకా నిజమవుతుందా?
(c) స్థిర విద్యుత్ క్షేత్ర ఆకృతిలో ఒక బిందువు వద్ద నిశ్చల స్థితిలో గల చిన్న శోధన ఆవేశాన్ని వదలిపెట్టారు. ఈ ఆవేశం ఆ బిందువు ద్వారా పోయే క్షేత్ర రేఖ దిశలో ప్రయాణిస్తుందా?
(d) ఒక ఎలక్ట్రాన్ పూర్తి వృత్తాకార కక్ష్యలో కేంద్రకం వల్ల కలిగే క్షేత్రం చేసిన పని ఎంత? కక్ష్య దీర్ఘవృత్తాకారమైతే ఏమవుతుంది?
(e) ఆవేశిత వాహకం ఉపరితలం ద్వారా విద్యుత్ క్షేత్రం విచ్ఛిన్నంగా ఉంటుందని మనకు తెలుసు. అక్కడ విద్యుత్ పొటెన్షియల్ కూడా విచ్ఛిన్నంగా ఉంటుందా?
(f) ఏక (ఒంటరి) వాహకానికి కెపాసిటెన్స్కు మీరు ఏమి అర్థం ఇస్తారు?
(g) నీటి రోధక స్థిరాంకం (= 80) చాలా అధికంగా, మైకా కంటే (= 6), ఎందుకు ఉంటుంది?
సాధన:
a) ఆవేశ గోళాలను దగ్గరకు తీసుకువస్తే, వానిపై ఆవేశ వితరణలు అసమరీతిగా ఉండును. కూలుమ్ నియమము వర్తించదు. కావున బలం పరిమాణంను ఈ ఫార్ములా ఖచ్చితంగా ఇవ్వదు.
b) కూలుమ్ నియమము 1/r² బదులు 1/r³ గాస్ నియమము నిజం కాదు.
c) బలరేఖ, ఆవేశ త్వరణ దిశను ఇచ్చును. విద్యుత్ బలరేఖ రేఖీయంగా ఉంటే, శోధన ఆవేశం అదేరేఖ వెంట కదులును. బలరేఖ రేఖీయంగా లేకపోతే శోధన ఆవేశం ఆ రేఖ వెంట కదలదు.
d) క్షేత్రం వల్ల, బలం కేంద్రం వైపు లేకపోతే ఎలక్ట్రాన్ బలదిశలో చలించదు. కక్ష్య వృత్తాకారంగా ఉంటే జరిగిన పని సున్నా. కక్ష్య దీర్ఘవృత్తాకారంగా ఉన్న, స్థిర విద్యుత్ బలాలు నిత్యత్వ బలాలు అయిన ఇది వాస్తవం.
e) విద్యుత్ పొటెన్షియల్ అవిచ్ఛిన్నం కాదు.
f) ఒకేఒక వాహకం కెపాసిటి, రెండవ వాహకం అనంతం అని తెలుపుతుంది.
g) నీటి అణువు సాధారణ స్థితిలో, అసౌష్టవ ఆకారం కలిగి శాశ్వత ద్విదృవభ్రామకంను ఇస్తుంది. మైకా కన్నా నీరు రోధక స్థిరాంకం అధికంగా ఉండుటకు కారణం ఇదే.

ప్రశ్న 32.
ఒక సహాక్ష స్తూపాకార కెపాసిటర్లో స్తూపాల పొడవు 15 cm, వ్యాసార్థాలు 1.5cm, 1.4 cm. బాహ్య స్తూపాన్ని భూమికి కలిపారు. లోపలి స్తూపానికి 3.5 µC ఆవేశాన్ని ఇచ్చారు. వ్యవస్థ కెపాసిటెన్స్న, లోపలి స్తూపం పొటెన్షియల్ను నిర్ణయించండి. అంత్య ప్రభావాలను (end effcts) ఉపేక్షించండి (అంటే, అంత్యాల వద్ద క్షేత్ర రేఖలు వంగడం).
సాధన :
L = 15 cm = 15 × 10-2m
ra = 1.4 cm = 1.4 × 10-2m, rb = 1.5 cm = 1.5 × 10-2m
q = 3.5 µC = 3.5 × 10-6C, C = ? V = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 72
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 73

ప్రశ్న 33.
ఒక సమాంతర పలకల కెపాసిటర్ను రోధక స్థిరాంకం 3 గల పదార్థంతో lkV వోల్టేజి రేటింగ్తో రోధక సత్వం 107 Vm-1తో రూపకల్పన చేయవలసి ఉంది. (రోధక సత్వం అనేది ఒక పదార్థం భంజనం చెందకుండా తట్టుకోగలిగే గరిష్ఠ విద్యుత్ క్షేత్రం, అంటే పాక్షిక అయనీకరణ ద్వారా విద్యుత్ను ప్రవహింపచేయడం మొదలు పెట్టనిది) భద్రత కోసం, రోధక సత్వంలో 10% కంటే క్షేత్రం ఎక్కువ కాకుండా చూస్తాం. కెపాసిటెన్స్ 50 pF కావాలనుకొన్నప్పుడు కెపాసిటర్ పలకల వైశాల్యం కనిష్ఠంగా ఎంత ఉండాలి?
సాధన:
V = 1KV = 1000 Volt; K = εr = 3
రోధక బలం = 107 V/m
విద్యుత్ క్షేత్రం = 10% × రోధక బల
E = 10% × 107 = 10°V/m, A = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 74

ప్రశ్న 34.
కింది వాటికి అనురూపంగా సమపొటెన్షియల్ ఉపరితలాలను పథకాత్మకంగా వర్ణించండి.
(a) Z-దిశలో ఒక స్థిర విద్యుత్ క్షేత్రం
(b) స్థిరమైన (z అనుకోండి) దిశలోనే ఉంటూ పరిమాణంలో ఏకరీతిగా పెరిగే క్షేత్రం
(c) మూలబిందువు వద్ద ఉన్న ఒంటరి ధనావేశం
(d) పొడవైన, సమాన అంతరాలతో సమాంతరంగా ఒక తలంలో ఆవేశిత తీగలు గల ఏకరీతి తీగల చట్రం (గ్రిడ్).
సాధన:
నిర్వచనం ప్రకారం, సమశక్మ ఉపరితలంపై ఏదైన బిందువు వద్ద పొటెన్షియల్ ఒకేవిధంగా ఉండును. పైన ఇచ్చిన నాలుగు సందర్భాలు :
a) సమశక్మ ఉపరితలాలు, x y తలానికి సమాంతరంగా ఉన్న తలాలు. ఇవి సమదూరంలో ఉండును.

b) సమశక్మ ఉపరితలాలు, x y తలానికి సమాంతరంగా ఉన్న తలాలు. క్షేత్రం ఏకరీతిగా పెరిగితే, తలాల మధ్య దూరం తగ్గును.

c) మూలబిందువు కేంద్రంగా గల సమశక్మ ఉపరితలాలు గల గోళాలు.

d) సమశక్మ ఉపరితలాలు ఆకారాన్ని కలిగి ఆవర్తకంగా మారును. గ్రిడ్ నుండి దూరంగా ఉన్నప్పుడు, గ్రిడ్కు సమశక్మ ఉపరితలాల ఆకారం సమాంతరంగా ఉండును.

ప్రశ్న 35.
వాన్ డీ గ్రాఫ్ జనరేటర్లో గోళాకార లోహ కర్పరం 15 × 106 V ల ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్ చుట్టూతా ఉన్న వాయువు రోధక సత్వం 5 × 107 Vm-1. అవసరమైన గోళాకార’ కర్పరం కనిష్ఠ వ్యాసార్థం ఎంత? (అధిక పొటెన్షియల్ను పొందడానికి స్వల్ప ఆవేశం అవసరమైన చాలా చిన్న కర్పరం ఉపయోగించి ఒక స్థిర విద్యుత్ జనరేటర్ను ఎందుకు నిర్మించలేమో ఈ అభ్యాసం నుంచి మీరు నేర్చుకొంటారు.)
సాధన:
V = 15 × 106 Volt
రోధక సత్వం = 5 × 107 Vm-1
కనీస వ్యాసార్థం, r = ?
గరిష్ఠ విద్యుత్ క్షేత్రం, E = 10% రోధక సత్వం
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 75
చాలా స్వల్ప కర్పరంను ఉపయోగిస్తే, స్థిర విద్యుత్ జనరేటరును మనం నిర్మించలేము.

ప్రశ్న 36.
వ్యాసార్ధం r1, ఆవేశం q1 గల ఒక చిన్న గోళం, వ్యాసార్థం r2 ఆవేశం q2 గల గోళాకార కర్పరంతో ఆవృతమైంది. q1 ధనాత్మకమైతే, కర్పరంపై ఉన్న ఆవేశం ఏది అయినప్పటికీ గోళం నుంచి కర్పరానికి ఆవేశం ఆవశ్యకంగా ప్రవహిస్తుందని చూపండి. (రెండూ ఒక తీగతో సంధానం చేసినప్పుడు),
సాధన:
వ్యాసార్థం r1, ఆవేశం q1 గల ఒక చిన్నగోళం, వ్యాసార్థం r2, ఆవేశం qq గల గోళాకార కర్పరంతో ఆవృతమైంది. కర్పరం బయట ఉపరితలంపై ఎల్లప్పుడు ఆవేశం (q2) ఉండును. గోళం మరియు కర్పరంను తీగతో కలిపితే ఆవేశం గోళం నుండి కర్పరంనకు, ఆవేశం q2 సంజ్ఞ మరియు పరిమాణంతో సంబంధం లేకుండా ప్రవహించును.

ప్రశ్న 37.
క్రింది వాటికి సమాధానాలివ్వండి.
(a) ఉన్నతి (ఎత్తు)తో తగ్గుతున్న విద్యుత్ క్షేత్రానికి అనురూపంగా, భూమి ఉపరితలం పరంగా వాతావరణం పైభాగం దాదాపు 400 kV వద్ద కలదు. భూమి ఉపరితలం దగ్గరగా క్షేత్రం 100 Vm-1. మన ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టగానే మనకు ఎందుకు విద్యుత్ షాక్ తగలదు? (ఇల్లును ఒక స్టీల్ బోను (cage) గా ఊహించుకోండి. అందువల్ల లోపల ఎలాంటి క్షేత్రం ఉండదు.)
(b) ఒక వ్యక్తి తన ఇంటి బయట సాయంకాలం 1m² చదరపు వైశాల్యం గల పెద్ద అల్యూమినియం పలకను రెండు మీటర్ల ల ఎత్తున్న విద్యుద్బంధిత పలకపై బిగించాడు. లోహపు పలకను మరుసటి రోజు ఉదయం తాకగానే అతనికి విద్యుత్ షాక్ తగులుతుందా?
(c) భూపటంపై (globe) సగటున గాలి యొక్క స్వల్ప వాహకత్వం వల్ల వాతావరణంలో ఉత్సర్గం చెందే విద్యుత్ ప్రవాహం 1800 A అని తెలిసింది. అలాంటప్పుడు సహజంగానే వాతావరణం తనకు తానే పూర్తిగా ఉత్సర్గం చెంది విద్యుత్పరంగా ఎందుకు తటస్థం కాదు? మరోవిధంగా చెప్పాలంటే, వాతావరణాన్ని ఆవేశితంగా ఏది ఉంచుతుంది?
(d) మెరుపు వచ్చేటప్పుడు వాతావరణపు విద్యుత్ శక్తి ఏయే శక్తి రూపాలలోకి దుర్వ్యయం అవుతుంది?
(Hint : ఉపరితల ఆవేశ సాంద్రత = -10-9Cm-2 కి అనురూపంగా భూమి ఉపరితలం వద్ద అథో దిశలో దాదాపు 100 Vm-1 విద్యుత్ క్షేత్రం ఉంటుంది. దాదాపు 50 km వరకు (దీని తరువాత అది మంచి వాహకం) ఉండే వాతావరణపు స్వల్ప వాహకత్వం వల్ల ప్రతి సెకనుకు దాదాపు + 1800 C ఆవేశం మొత్తం భూమికి పంప్ అవుతుంది. అయినప్పటికీ, భూమి ఉత్సర్గం చెందదు. ఎందుకంటే, భూపటంపై నిరంతరం సంభవించే పిడుగులు, మెరుపులు భూమిపై సమాన పరిమాణంలో రుణావేశాన్ని పంపుచేస్తాయి).
సాధన:
a) మన శరీరం మరియు భూమి ఉపరితలం రెండు వాహకాలు. కావున ఈ రెండు సమశక్మ తలాలను ఏర్పరుచును. మనం ఇంట్లో నుండి బయటకు వస్తే, గాలి యధార్థ సమశక్మతలం మారును. శరీరంను, భూమిని ఒకే పొటెన్షియల్ వద్ద ఉంటే విద్యుత్ షాక్ పొందలేము.

b) అవును మనిషికి షాక్ తగులుతుంది. దీనికి కారణం వాతావరణ ఆవేశాలు నిలకడ కోల్పోతున్నప్పుడు, అల్యూమినియం పలక ఆవేశం క్రమంగా పెరుగును. అల్యూమినియం పలక, భూమి మరియు బంధకంతో కండెన్సర్ను ఏర్పరుచును. అల్యూమినియం పలక గరిష్ఠ ఆవేశంనకు చేరును. కావున మనిషి షాక్కు గురవుతాడు.

c) వాతావరణం ఆవేశంను పిడుగుల వల్ల క్రమంగా కోల్పోతుంటే గ్లోబు అన్ని వైపులా మెరుపు ఏర్పడును. ఇది కూడా గాలి స్వల్ప వాహకత్వం వల్ల ఆవేశం కోల్పోవును. రెండు వ్యతిరేక ఆవేశ ప్రక్రియలు సరాసరి, సమతుల్యతలు కలిగి వాతావరణం ఆవేశంను కలిగి ఉండునట్లు చేయును.

d) మెరిసేటప్పుడు, వాతావరణ విద్యుత్ శక్తి, కాంతి, ఉష్ణం మరియు ధ్వని రూపంలో దుర్వ్యయం అగును.

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
(a) 4 × 10-7C విద్యుదావేశం నుంచి 9 cm దూరంలో ఉన్న P అనే బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువను లెక్కకట్టండి.
(b) అందువల్ల, అనంత దూరంలో ఉన్న 2×10-9C విద్యుదావేశాన్ని P అనే బిందువు వద్దకు తీసుకొనిరావడానికి చేయవలసిన పనిని లెక్కకట్టండి. ఈ విద్యుదావేశాన్ని తీసుకొనిరావడానికి చేసే పని, దానిని తీసుకొని వచ్చిన పథం మీద ఆధారపడుతుందా?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 76
కాదు, చేసిన పని దాని పథం మీద ఆధారపడదు. దానికి కారణం ఏదైనా అనియత అనంత సూక్ష్మ పథాన్ని రెండు లంబ అంశాలుగా విభజించవచ్చు. ఒకటి గా వెంబడి, రెండవది కులంబంగా, రెండవ దాని వల్ల చేసిన పని శూన్యం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 2.
3 × 10-8 C, -2 × 10-8C విద్యుదావేశాలు 15 cm ఎడంలో ఉన్నాయి. ఆ రెండు విద్యుదావేశాలను కలిపే సరళరేఖపై ఏ బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువ సున్నా అవుతుంది? అనంత దూరం వద్ద పొటెన్షియల్ విలువ సున్నాగా తీసుకోండి.
సాధన:
ధనావేశ స్థానం వద్ద మూలబిందువు ను తీసుకోండి. రెండు ఆవేశాలను కలిపే రేఖను X-అక్షంగా తీసుకోవలసి ఉంటుంది; రుణావేశాన్ని మూలబిందువుకు కుడివైపుగా తీసుకోవలసి ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 77

X-అక్షంపై పొటెన్షియల్ శూన్యంగా ఉండే బిందువుగా P ని తీసుకోండి. X అనేది P నిరూపకం అయితే, తప్పకుండా ధనాత్మకంగా ఉండాలి. (x < 0 కు రెండు ఆవేశాల వల్ల పొటెన్షియల్ కలిసి శూన్యం అవడం సాధ్యం కాదు; X అనేది Aల మధ్య ఉన్నట్లయితే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 78

అంటే, ధనావేశం నుంచి 9 cm, 45 cm దూరాలలో, రుణావేశం వైపు విద్యుత్ పొటెన్షియల్ శూన్యంగా ఉంటుంది. గణన చేయడానికి ఉపయోగించిన ఫార్ములాకు అవసరమైంది ఏమంటే, అనంతం వద్ద పొటెన్షియలు శూన్యంగా ఎంపిక చేసుకోవడం.

ప్రశ్న 3.
పటం(a), (b) లు ధన, రుణ బిందు విద్యుదావేశాల వల్ల కలిగే క్షేత్ర రేఖలను సూచిస్తాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 79
(a) Vp ∝ VQ; VB – VA పొటెన్షియల్ తేడాల సంజ్ఞలను తెలపండి.
(b) Q, P; A, B ల మధ్య ఒక చిన్న రుణ విద్యుదావేశాన్ని ఉంచినప్పుడు, స్థితిజశక్తి తేడా సంజ్ఞలను తెలపండి.
(c) ఒక చిన్న ధనావేశాన్ని Q నుంచి P వరకు జరపడానికి క్షేత్రం చేసే పని సంజ్ఞను తెలపండి.
(d) ఒక చిన్న రుణావేశాన్ని B నుంచి A వరకు జరపడానికి బాహ్యకారకం చేసిన పని సంజ్ఞను తెలపండి.
(e) చిన్న రుణ విద్యుదావేశం B నుంచి A కు పోయేటప్పుడు దాని గతిజశక్తి పెరుగుతుందా? లేదా తగ్గుతుందా?
సాధన:
(a) V ∝ \(\frac{1}{r}\) కాబట్టి, VP > VQ. అందువల్ల, (VP – VQ) ధనాత్మకం. VA కంటే VB తక్కువ రుణాత్మకం కూడా. అందువల్ల, VB > VA లేదా (VB – VA) ధనాత్మకం.

(b) ఒక చిన్న రుణావేశం ధనావేశం వైపు ఆకర్షితమవుతుంది. రుణావేశం అధిక స్థితిజశక్తి నుంచి అల్ప స్థితిజశక్తికి చలిస్తుంది. కాబట్టి, Q, P ల మధ్య ఉన్న ఒక చిన్న రుణావేశం స్థితిజశక్తి భేదం సంజ్ఞ ధనాత్మకం. అదేవిధంగా, (P.E.) A > (P.E.)B, అందువల్ల స్థితిజశక్తి భేదం ధనాత్మకం.

(c) Q నుంచి P కి ఒక చిన్న ధనావేశాన్ని జరపడానికి విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేకంగా బాహ్యకారకం పని చేయవలసి ఉంటుంది. కాబట్టి, క్షేత్రం వల్ల జరిగిన పని రుణాత్మకం.

(d) B నుంచి A కి చిన్న రుణావేశాన్ని జరపడానికి బాహ్యకారకం పని చేయవలసి ఉంటుంది. ఇది ధనాత్మకం.

(e) చిన్న రుణావేశంపై వికర్షణ బలం వల్ల, వేగం తగ్గుతుంది. కాబట్టి B నుంచి A కి పోయేటప్పుడు గతిజశక్తి తగ్గుతుంది.

ప్రశ్న 4.
(a) పటంలో చూపిన విధంగా d అంచు గల ఒక చతురస్రం మూలలు ABCD ల వద్ద +q, –q, +q, –q అనే నాలుగు విద్యుదావేశాలను అమర్చారు. (a) పటంలో చూపిన విధంగా ఈ విద్యుదావేశాలను అమర్చడానికి చేయవలసిన పనిని కనుక్కోండి. (b) నాలుగు మూలల వద్ద ఆవేశాలను అలాగే స్థిరంగా ఉంచి, చతురస్ర కేంద్రం E వద్దకు q0 అనే విద్యుదావేశాన్ని తీసుకొనిరావడానికి చేయవలసిన పని ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 80
సాధన:
(a) చేసిన పని ఆవేశాల తుది అమరికపైనే ఆధారపడి ఉంటుంది. కాని వాటిని ఏవిధంగా కలిసి పెట్టామనేదానిపై ఆధారపడి ఉండదు. కాబట్టి ఆవేశాలను A, B, C, D ల వద్ద ఒక విధంగా పెట్టడానికి అవసరమైన పనిని లెక్కిస్తాం. మొదట + q ను A వద్దకు, తరువాత -q, + q, – qలను వరుసగా B, C, D ల వద్దకు తెచ్చామనుకొందాం. చేయవలసిన మొత్తం పనిని దశల వారిగా లెక్కకట్టవచ్చు:
(i) ఎక్కడా ఎటువంటి ఆవేశం లేనప్పుడు + q ను A వద్దకు తీసుకొనిరావడానికి చేయవలసిన పని శూన్యం. (ii) +q, A వద్ద ఉన్నప్పుడు -q ని B వద్దకు తీసుకొనిరావడానికి చేయవలసిన పని, B వద్ద ఆవేశం) × (A వద్ద గల +q వల్ల B వద్ద స్థిరవిద్యుత్ పొటెన్షియల్) = -q × \(\left(\frac{\mathrm{q}^2}{4 \pi \varepsilon_0 \mathrm{~d}}\right)=-\frac{\mathrm{q}^2}{4 \pi \varepsilon_0 \mathrm{~d}}\)
(iii) + q, A వద్ద; −q, B వద్ద ఉన్నప్పుడు + q ని C వద్దకు తీసుకొనిరావడానికి చేయవలసిన పని, (C వద్ద ఆవేశం) × (A, B ల వద్ద గల ఆవేశాల వల్ల C వద్ద పొటెన్షియల్)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 81
(iv) + q, A వద్ద; –q, B వద్ద; + q, C వద్ద ఉన్నప్పుడు -q ని D వద్దకు తీసుకొనిరావడానికి చేయవలసిన పని, (D వద్ద ఆవేశం) × (A, B, C ల వద్ద గల ఆవేశాల వల్ల D వద్ద పొటెన్షియల్)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 82

చేసిన పని ఆవేశాల అమరిక మీదనే ఆధారపడి ఉంటుంది. కాని వాటిని ఏవిధంగా సమూహపరచారన్న దానిపై కాదు. నిర్వచనం ప్రకారం, ఇది ఆవేశాల మొత్తం స్థిర విద్యుత్ శక్తి.
(విద్యార్థులు వారికి తోచినట్లుగా ఆవేశాల క్రమాన్ని తీసుకొని ఇదే పని/శక్తిని లెక్కగట్టడానికి ప్రయత్నించినప్పుడు శక్తి విలువ మారదు అని వారికివారే ఒప్పుకొంటారు.)

b) A, B, C, D ల వద్ద నాలుగు ఆవేశాలున్నప్పుడు E వద్దకు q0 ఆవేశాన్ని తీసుకొని రావడానికి చేయవలసిన అదనపు పనిని q0 × (A, B, C, D ల వద్ద గల ఆవేశాల వల్ల E వద్ద స్థిర విద్యుత్ పొటెన్షియల్). A, Cల వల్ల కలిగే పొటెన్షియల్, B, D ల వల్ల కలిగే పొటెన్షియల్ వల్ల రద్దవడంతో E వద్ద స్థిర విద్యుత్ పొటెన్షియల్ స్పష్టంగా శూన్యమవుతుంది. కాబట్టి E వద్దకు ఏదైనా ఆవేశాన్ని తీసుకొని రావడానికి ఎటువంటి పని చేయవలసిన అవసరం ఉండదు.

ప్రశ్న 5.
a) బాహ్య క్షేత్రం లేనప్పుడు 7µC, -2µC ఆవేశాలను (-9 cm, 0, 0), (9cm, 0, 0) ల వద్ద ఉంచిన వ్యవస్థ యొక్క స్థిర విద్యుత్ స్థితిజశక్తిని కనుక్కోండి.
b) ఈ రెండు విద్యుదావేశాలను ఒకదాని నుంచి మరొకదానిని అనంతంలోకి వేరుచేయడానికి చేయవలసిన పనిని లెక్కకట్టండి.
c) ఇదే ఆవేశ వ్యవస్థను E = A(1/r²); A = 9 × 105 Cm-2 అనే బాహ్యక్షేత్రంలో ఉంచామనుకోండి. అప్పుడు ఆకృతి స్థిర విద్యుత్ పొటెన్షియల్ శక్తి ఏమై ఉంటుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 83
(c) రెండు విద్యుదావేశాల పరస్పర అన్యోన్యచర్య శక్తి ఏ మాత్రం మారదు. దీనికి అదనంగా, రెండు ఆవేశాలు బాహ్య విద్యుత్ క్షేత్రంతో అన్యోన్య చర్య జరపడం వల్ల కలిగే శక్తి ఉంటుంది. దీనినుంచి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 84

ప్రశ్న 6.
ఒక పదార్థపు అణువు శాశ్వత ద్విధృవ భ్రామకం పరిమాణం 10-29 Cm. తక్కువ ఉష్ణోగ్రత వద్ద 106 Vm-1 పరిమాణం కలిగిన ప్రబలమైన స్థిర విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తించడం ద్వారా ఈ పదార్థం ఒక మోల్ ధృవణం చెందింది. ఇప్పుడు హఠాత్తుగా విద్యుత్ క్షేత్ర దిశను 60° కి మార్చారు. పదార్థం దాని ద్విధృవాలను కొత్త క్షేత్ర దిశలోకి తీసుకొనిరావడం వల్ల పదార్థం వల్ల విడుదలయిన ఉష్ణాన్ని అంచనావేయండి. సరళత కోసం, నమూనా (పదార్థం) 100% ధృవణం దనుకోండి.
సాధన:
ప్రతి అణువు ద్విధృవ భ్రామకం = 10-29 Cm
నార్థంలో 6 × 10-29 అణువులుంటాయి కాబట్టి, అన్ని అణువుల మొత్తం ద్విధృవ భ్రామకం,
p – × 10-29 Cm = 6 × 10-6 Cm
తొలి స్థితిజ శక్తి, Ut = -pE cos θ = 6 × 10-6 × 106 cos 0° = -6J
తుది స్థితిజశక్తి (θ = 60° అయినప్పుడు), Uf = -6 × 10-6 × 106 × cos 60° = – 3J
స్థితిజశక్తిలో మార్పు = -3J – (-6J) = 3J
కాబట్టి, స్థితిజశక్తిలో నష్టం ఉంది. పదార్థం దాని ద్విధృవాలను క్షేత్ర దిశలోకి తీసుకొనిరావడానికి ఉష్ణరూపంలో ఇంత శక్తి తప్పక ‘విడుదల కావాలి.

ప్రశ్న 7.
(a) ఒక పొడి జుట్టును దువ్విన దువ్వెన చిన్న కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది. ఎందుకు?
ఒక వేళ జుట్టు తడిగా ఉంటే లేదా వర్షం పడుతున్నట్లయితే ఏమవుతుంది ? (కాగితం విద్యుత్ను వహనం చేయదని గుర్తుంచుకోండి.)
(b) సాధారణ రబ్బరు ఒక బంధకం. కాని విమానం టైర్లు, ప్రత్యేక రబ్బరుతో, స్వల్పంగా వాహకత్వం ఉండే రబ్బరుతో చేస్తారు. ఇది ఎందుకు అవసరం?
(c) సులభంగా ఉండే పదార్థాలను తీసుకొనిపోయే వాహనాలకు లోహపుతాళ్ళు ఉండి, వాహనం చలిస్తున్నప్పుడు అవి భూమిని తాకేలా ఉంటాయి. ఎందుకు?
(d) అరక్షితంగా ఉన్న అధిక సామర్థ్య విద్యుత్ తీగపై ఒక పక్షి కూర్చొని ఉన్నప్పుడు పక్షికి ఏమి జరగలేదు. భూమిపై నిల్చొన్న మనిషి అదే తీగను తాకినప్పుడు ప్రాణాంతకమైన విద్యుత్ షాక్కు గురవుతాడు. ఎందుకు?
సాధన:
(a) ఎందుకంటే ఘర్షణ వల్ల దువ్వెన ఆవేశితమవుతుంది. కాగితంలోని అణువులు ఆవేశిత దువ్వెన వల్ల ధృవితమై,. నికర ఆకర్షణ బలం కలుగుతుంది. జుట్టు తడిగా ఉన్నా లేదా వర్షం పడినా, దువ్వెన జుట్టుల మధ్య ఘర్షణ తగ్గుతుంది. దువ్వెన ఆవేశితం చెందక, చిన్న కాగితం ముక్కలను ఆకర్షించదు.

(b) ఆవేశాన్ని (ఘర్షణ వల్ల ఉత్పత్తి అయింది) భూమికి వహనం చేయడానికి, చాలా పెద్ద మొత్తంలో పోగయిన స్థిర విద్యుత్ వల్ల స్పార్క్ కలిగి, మంట రావచ్చు.

(c) (b) లో వివరించిన కారణమే.

(d) పొటెన్షియల్ తేడా ఉన్నప్పుడే విద్యుత్ ప్రవాహం ఉంటుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 8.
K రోధక స్థిరాంకం గల పదార్థ దిమ్మె వైశాల్యం, సమాంతర పలకల కెపాసిటర్ పలకల వైశాల్యాన్ని కలిగి ఉంది. కాని మందం (3/4)d కలిగి ఉంది. ఇక్కడ డి పలకల మధ్య ఎడం. పలకల మధ్య రోధకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కెపాసిటెన్స్ ఏ విధంగా మారుతుంది?
సాధన:
పలకల మధ్య ఎటువంటి రోధకం లేనప్పుడు విద్యుత్ క్షేత్రం E0 = V0/d అనుకోండి. పొటెన్షియల్ భేదం V0 ఇప్పుడు, రోధకాన్ని ప్రవేశపెట్టినట్లైతే, రోధకంలో విద్యుత్ క్షేత్రం E = E0/K అవుతుంది. అప్పుడు పొటెన్షియల్ భేదం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 85 AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 86

ప్రశ్న 9.
పటంలో చూపినట్లు, 10 µF విలువ కలిగిన 4 కెపాసిటర్లు గల ఒక జాలం (network) ని 500 y సరఫరాకు సంధానం చేశారు. a) జాలం తుల్య కెపాసిటెన్స్, (b) ప్రతి కెపాసిటర్పై ఆవేశాన్ని కనుక్కోండి. (గమనిక: కెపాసిటర్పై ఉన్న ఆవేశం హెచ్చు పొటెన్షియల్ కలిగిన పలక మీద ఉన్న ఆవేశంతో సమానంగా ఉండి, తక్కువ పొటెన్షియల్లో ఉన్న పలకపై ఆవేశానికి సమానం, వ్యతిరేకంగా ఉంటుంది.)
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 87
సాధన:
(a) ఇచ్చిన జూలంలో C1, C2, C3 లు శ్రేణి సంధానంలో ఉన్నాయి. ఈ మూడు కెపాసిటర్ ప్రభావాత్మక కెపాసిటెన్స్, C అయితే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 88

(b) పటం నుంచి, ప్రతీ కెపాసిటర్పై (C1, C2, C3లు) ఆవేశం ఒకే విధంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. అది Q అనుకోండి. C4 పై ఆవేశం Q’ అనుకోండి. AB కొనల మధ్య పొటెన్షియల్ భేదం Q/C1, BC కొనల మధ్య Q/C2, CD కొనల మధ్య Q/C3 అవుతుంది. దీనినుంచి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 89

AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్

ప్రశ్న 10.
(a) 900pF కెపాసిటర్ను 100 V బ్యాటరీతో ఆవేశితం చేశారు. (a) ఆ కెపాసిటర్ ఎంత స్థిర విద్యుత్ శక్తిని నిల్వ ఉంచుకొంటుంది?
(b) ఆ కెపాసిటర్ను బ్యాటరీ నుంచి వేరుచేసి, మరొక 900 pF కెపాసిటర్ తో కలిపారు. (b) వ్యవస్థలో నిల్వ ఉన్న స్థిర విద్యుత్ శక్తి ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 5 స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ 90
సాధన:
(a) కెపాసిటర్పై ఆవేశం,
= CV = 900 × 10-12F × 100 V
= 9 × 10-8C
కెపాసిటర్ నిల్వ ఉంచుకొన్న శక్తి = (1/2) CV² = (1/2) QV
= (1/2) × 9 × 10-8C × 100 V
= 4.5 × 10-6J

(b) నిలకడ పరిస్థితిలో, రెండు కెపాసిటర్ల ధన పలకలు ఒకే పొటెన్షియల్ వద్ద, రుణ పలకలు ఒకే పొటెన్షియల్ వద్ద కలవు. ఉమ్మడి పొటెన్షియల్ భేదం V అనుకోండి. అప్పుడు, ప్రతి కెపాసిటర్పై ఆవేశం, Q’ = CV. ఆవేశ నిత్యత్వం వల్ల, Q’ = Q/2. ఇది V’ = V/2 అని సూచిస్తుంది. వ్యవస్థ మొత్తం శక్తి = 2 × \(\frac{1}{2}\)Q’V’ = \(\frac{1}{4}\)QV= 2.25 × 106J. అందువల్ల, (a) నుంచి (b) కి పోయేటప్పుడు ఆవేశ నష్టం లేనప్పటికీ, తుది శక్తి, తొలి శక్తిలో సగం ఉంటుంది. మిగతా శక్తి ఎక్కడికి వెళ్ళింది? వ్యవస్థ పరిస్థితి (b) కి స్థిరపడటానికి ముందు తాత్కాలిక కాలం ఉంటుంది. ఈ కాలంలో, తాత్కాలిక ప్రవాహం మొదటి కెపాసిటర్ నుంచి రెండవ దానికి ప్రవహిస్తుంది. ఈ కాలంలో శక్తి ఉష్ణ, విద్యుదయస్కాంత వికిరణ రూపాలలో నష్టపోతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 4th Lesson విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 4th Lesson విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆవేశం క్వాంటీకరణం చెందింది అనే ప్రవచనం అర్థం ఏమిటి?
జవాబు:
ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు ప్రసారమగు కనీస ఆవేశం, ఎలక్ట్రాన్ ఆవేశం (e = 1.602 × 10-19C) కు సమానము. ఆవేశం ఎల్లప్పుడు ఎలక్ట్రాన్ ఆవేశంనకు పూర్ణ గుణిజాలలో (q = ne) ఉండును. అప్పుడు ఆవేశం క్వాంటీకృతమైంది అంటారు.

ప్రశ్న 2.
ఆకర్షణ కంటే వికర్షణ ఏ ఆవేశానికి సరైన పరీక్ష, ఎందుకు?
జవాబు:
ఒక ఆవేశ వస్తువు, తటస్థ ఆవేశ వస్తువును మరియు వ్యతిరేక ఆవేశ వస్తువును ఆకర్షించును. కాని ఇది ఎల్లప్పుడు సజాతి ఆవేశ వస్తువును వికర్షించును. కావున విద్యుద్దీకరణకు ఆకర్షణకన్నా, వికర్షణ సరైన పరీక్ష.

ప్రశ్న 3.
1C ఆవేశం ఎన్ని ఎలక్ట్రాన్లతో ఏర్పడుతుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 1

ప్రశ్న 4.
వస్తువును ధనావేశితం చేసినప్పుడు వస్తువు భారం ఏమవుతుంది?
జవాబు:
ఒక వస్తువును ధనావేశితం చేసినప్పుడు, అది కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవును. కావున వస్తుభారం తగ్గును.

ప్రశ్న 5.
రెండు ఆవేశాల మధ్య దూరాన్ని a) సగానికి తగ్గిస్తే, b) రెట్టింపు చేస్తే వాటి మధ్య బలం ఏమవుతుంది?
జవాబు:
కూలుమ్ నియమము నుండి F ∝ \(\frac{1}{d^2}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 2

ప్రశ్న 6.
విద్యుత్ బలరేఖలు (క్షేత్ర రేఖలు) పరస్పరం ఖండించుకోవు. ఎందుకు?
జవాబు:
విద్యుత్ బలరేఖలు (క్షేత్ర రేఖలు) ఖండించుకుంటే, ఖండన బిందువు, రెండు విద్యుత్ క్షేత్ర దిశలను తప్పక కలిగి ఉండాలి. ఇది అసంభవము. కావున విద్యుత్ బలరేఖలు ఖండించుకోవు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 7.
ABC సమబాహు త్రిభుజంపై B, Cల వద్ద +q, -q ఆవేశాలు ఉన్నాయనుకోండి. ఈ వ్యవస్థకు మొత్తం ఆవేశం శూన్యం. కాని, B, C ల నుంచి సమదూరంలో ఉండే A వద్ద విద్యుత్ క్షేత్రం (తీవ్రత) శూన్యం కాదు. ఎందుకు?
జవాబు:
ఆవేశాలు అదిశలు. కాని విద్యుత్ తీవ్రతలు సదిశలు మరియు సదిశ సంకలనం చెందును.

ప్రశ్న 8.
స్థిర విద్యుత్ బల క్షేత్రరేఖలు సంవృత లూప్లను ఏర్పరచవు. ఒకవేళ సంవృత లూప్లను ఏర్పరిస్తే, సంవృత పథం వెంబడి ఆవేశాన్ని జరిపేందుకు చేసిన పని శూన్యం కాజాలదు. పై రెండు ప్రవచనాల నుంచి స్థిర విద్యుత్ బలం స్వభావాన్ని ఊహించగలరా?
జవాబు:
ఇది శక్తి నిత్యత్వ బలం.

ప్రశ్న 9.
స్థిర విద్యుత్ శాస్త్రంలోని గాస్ నియమాన్ని తెలపండి.
జవాబు:
గాస్ నియమము :
“సంవృత తలం ద్వారా పోవు మొత్తం విద్యుత్ అభివాహం తలం ఆవరించి ఉన్న నికర ఆవేశంకు \(\frac{1}{\varepsilon_0}\) రెట్లు ఉండును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 3

ప్రశ్న 10.
ఏయే సందర్భాల్లో విద్యుత్ అభివాహం రుణాత్మకం, ధనాత్మకం?
జవాబు:
విద్యుత్ అభివాహం Φ = \(\overrightarrow{\mathrm{E}} \cdot \overrightarrow{\mathrm{A}} \cdot \overrightarrow{\mathrm{E}}\) మరియు \(\overrightarrow{\mathrm{A}}\) ల మధ్య కోణం 180° అయిన అభివాహం రుణ సంజ్ఞను కలిగి ఉండును. తలం నుండి అభివాహం వెలుపలకు ప్రవహిస్తే ధన మరియు అభివాహం తలంలోనికి ప్రవేశిస్తే రుణ సంజ్ఞను కలిగి ఉండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 11.
అనంతమైన పొడవు ఉండే ఆవేశిత తీగ నుంచి r త్రైజ్యా దూరంలో విద్యుత్ (క్షేత్ర) తీవ్రతకు సమాసాన్ని రాయండి.
జవాబు:
అనంతమైన పొడవు గల ఆవేశ తీగ వల్ల విద్యుత్ తీవ్రత E = \(\frac{\lambda}{2 \pi\varepsilon_0r}\), వాహకంనకు లంబంగా
λ = ఏకరీతి రేఖీయ ఆవేశ సాంద్రత
r = వాహకం నుండి బిందు దూరం

ప్రశ్న 12.
అనంతమైన వైశాల్యం గల ఆవేశిత పలకవల్ల ఏర్పడే విద్యుత్ (క్షేత్ర) తీవ్రతకు సమాసాన్ని రాయండి.
జవాబు:
అనంతమైన ఆవేశతలం పలక వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రత, E = \(\frac{\sigma}{2\varepsilon_0}\)

ప్రశ్న 13.
ఆవేశిత వాహక గోళాకార కర్పరం వల్ల దాని వెలుపల, లోపల బిందువుల వద్ద ఏర్పడే విద్యుత్ (క్షేత్ర) తీవ్రతకు సమాసాలను రాయండి.
జవాబు:
a) ఆవేశ గోళాకార కర్పరం లోపల బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత శూన్యం.

b) ఆవేశ గోళాకార కర్పరం వెలుపలి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత, E = \(\frac{1}{4 \pi\varepsilon_0}.\frac{q}{r^2}\)

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విద్యుత్లోని కూలుమ్ విలోమవర్గ నియమాన్ని తెలిపి, వివరించండి. [TS. Mar.’17; Mar.’14]
జవాబు:
కూలుమ్ నియమము-నిర్వచనం:
“రెండు ఆవేశాల మధ్య బలం, ఆవేశాల లబ్దంనకు అనులోమానుపాతంలో మరియు వాని మధ్య దూరం వర్గంనకు విలోమానుపాతంలో ఉండును. బలం రెండు ఆవేశాలను కలిపే రేఖపై పనిచేయును.

వివరణ :
q1 మరియు q2 అను రెండు ఆవేశాలు దూరంలో వేరుచేయబడి ఉన్నాయని భావిద్దాం. అప్పుడు
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 4
ఇక్కడ ε యానకం పెర్మిటి విటీ.

ప్రశ్న 2.
ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను నిర్వచించండి. బిందు ఆవేశం వల్ల ఏర్పడే తీవ్రతకు సమాసాన్ని ఉత్పాదించండి. [AP. Mar.’16]
జవాబు:
విద్యుత్ క్షేత్ర తీవ్రత (E) :
విద్యుత్ క్షేత్రంలో ఏదైనా బిందువు వద్ద ఉంచిన ప్రమాణ ధనావేశంపై పనిచేయు బలంను, ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతగా నిర్వచిస్తారు.

సమాసము:

  1. విద్యుత్ క్షేత్ర తీవ్రత ఒక సదిశ. దీని దిశ ప్రమాణ ధనావేశం కదిలే దిశలో ఉండును.
  2. బిందు ఆవేశం q ను భావిద్దాం. ఆవేశం చుట్టు విద్యుత్ క్షేత్రం ఏర్పడును. ఆవేశం నుండి విద్యుత్ క్షేత్రంలో r దూరంలో బిందువు P ను భావిద్దాం. P వద్ద శోధన ఆవేశం q0 ఉంచుదాము.
  3. q వల్ల q0 పై బలం F = \(\frac{1}{4 \pi\varepsilon_0}.\frac{qq_0}{r^2}\)
  4. బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత, q0 శోధన ఆవేశంపై పనిచేయు బలంనకు సమానం.
    విద్యుత్ క్షేత్ర తీవ్రత,
    AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 5

ప్రశ్న 3.
ఏకరీతి విద్యుత్ క్షేత్రంలోని విద్యుత్ డైపోల్పై పనిచేసే యుగ్మానికి లేదా టార్క్కు సమాసాన్ని ఉత్పాదించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 6

  1. సమాన, వ్యతిరేక ఆవేశాల జంట స్వల్ప దూరంలో వేరుచేయబడితే, దానిని ద్విధ్రువం అంటారు.
  2. −q మరియు+q కూలుమ్ ఆవేశాలను భావిద్దాం. వాటి మధ్యదూరం 2a.
  3. ద్విధ్రువ భ్రామకం, P = q × 2a = 2a. ఇది ఒక సదిశ. దీని దిశ ద్విధ్రువ అక్షంపై – q నుండి + q వైపుకు.
  4. పటంలో చూపినట్లు, ద్విధ్రువ అక్షం, క్షేత్రదిశలో 9 కోణము చేయునట్లు ఉంచామనుకుందాము.
  5. విద్యుత్ క్షేత్రం వల్ల +q పై బలం F = +qE మరియు – q పై బలం
    F = -qE.
  6. ఈ రెండు సమాన వ్యతిరేక బలాలు టార్క్ లేక యుగ్మ భ్రామకంను ఏర్పరుచును.
    i.e., టార్క్, τ = లంబదూరం × ఒక బలపరిమాణం
    ∴ τ (2a sin θ)qE = 2aqE sin θ = PE sin θ
    సదిశ రూపంలో, = \(\vec{\tau}=\overrightarrow{\mathrm{P}} \times \overrightarrow{\mathrm{E}}\)

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 4.
విద్యుత్ డైపోల్ అక్షంపై ఏదైనా బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమాసాన్ని ఉత్పాదించండి. [TS. Mar.’16; AP. Mar.’17]
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 7
ద్విధ్రువం అక్షంపై ఏదైనా బిందువు వద్ద క్షేత్ర తీవ్రత :
1) ఒక విద్యుత్ ధృవంలో -q మరియు + q ఆవేశాలు గల ’24’ దూరంలో వేరుచేయబడినట్లు భావిద్దాం. ‘O’ కేంద్రం.

2) ద్విధ్రువం అక్షంపై OP = r దూరంలో P బిందువు వద్ద, విద్యుత్ క్షేత్ర తీవ్రత గణిద్దాం.

3) P వద్ద +q మరియు -q ఆవేశాల వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతలు E1 మరియు E2.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 8
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 9

ప్రశ్న 5.
విద్యుత్ డైపోల్ మధ్య లంబ తలంపై ఏదైనా బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమాసాన్ని ఉత్పాదించండి. [AP. Mar.’15]
జవాబు:
విద్యుత్ డైపోల్ లంబ తలంపై ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత :
1) ఒక విద్యుత్ ద్విధ్రువంలో -q మరియు +q ఆవేశంలు ‘2a’ దూరంలో వేరు చేయబడినట్లు భావిద్దాం. ‘O’ కేంద్రం.
2) ద్విధ్రువం లంబ సమద్విఖండన రేఖపై OP = r దూరంలో P బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత గణిద్దాం.
3) +q మరియు -q ఆవేశాల వల్ల P వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతలు E1 మరియు E2.
4) లంబ అంశాలు (E1 sin θ మరియు E2 sin θ) లు సమానం మరియు వ్యతిరేకం. కావున అవి రద్దుపరుచుకుంటాయి. సమాంతర అంశాలు (E1 cos θ మరియు E2 cos θ) లు ఒకే దిశలో ఉండును. కావున వాటిని కలుపవచ్చును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 10
7) r >> a, అయితే అప్పుడు, a² ను r²తో పోల్చినపుడు విస్మరించవచ్చును. అప్పుడు
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 11

ప్రశ్న 6.
స్థిర విద్యుత్ శాస్త్రంలోని గాస్ నియమాన్ని తెలిపి, దాని ప్రాముఖ్యతను వివరించండి. [TS. Mar.’15]
జవాబు:
గాస్ నియమము :
“ఏదైనా సంవృత తలం ద్వారా పోవు మొత్తం విద్యుత్ అభివాహం, తలం ఆవరించి ఉన్న నికర ఆవేశంనకు \(\frac{1}{\varepsilon_0}\) రెట్లు ఉండును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 12
ఇక్కడ S తలముచే ఆవరించబడిన మొత్తం ఆవేశం q, \(\oint_S\) సంవృత తలము యొక్క తల సమాకలనంను సూచించును.

ప్రాముఖ్యత :

  1. సంవృత తలము నిర్మించుటకు వీలున్న లెక్కలలో విద్యుత్ క్షేత్రం తీవ్రతను గణించుటకు గాస్ నియమం ఉపయోగపడుతుంది.
  2. పదార్థం లేకపోయినా, దాని ఆకారం మరియు పరిమాణం ఎలా ఉన్నా, ఏదైనా సంవృత తలంనకు గాస్ నియమమును వర్తింపచేయవచ్చును,
  3. సౌష్టవతను భావించి, గాస్ నియమ అనువర్తనంతో ఎక్కువ లెక్కలను చాలా తేలికగా చేయవచ్చును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విద్యుత్ అభివాహాన్ని నిర్వచించండి. గాస్ నియమాన్ని అనువర్తించి అనంతమైన, తిన్నని పొడవాటి ఆవేశిత తీగ వల్ల కలిగే విద్యుత్ తీవ్రతకు సమాసాన్ని ఉత్పాదించండి. (విద్యుత్ క్షేత్రం ప్రతి బిందువు వద్ద రేడియల్ క్షేత్రమని, తీగనుంచి బిందువు ఉండే త్రైజ్యా దూరం పైనే ఆధారపడుతుందని అనుకోండి).
జవాబు:
విద్యుత్ అభివాహం :
వైశాల్యంనకు లంబంగా పోవు విద్యుత్ బలరేఖల సంఖ్యను విద్యుత్ అభివాహం (Φ) అంటారు.
విద్యుత్ అభివాహం Φ = \(\overrightarrow{E}.\overrightarrow{A}\) అభివాహం ఒక సదిశ.

అనంతమైన, తిన్నని పొడవాటి ఆవేశిత తీగవల్ల విద్యుత్ తీవ్రతకు సమాసము :
1) ఒక అనంతమైన తిన్నని పొడవాటి ఆవేశ తీగ, ఏకరీతి రేఖీయ ఆవేశ సాంద్రత ”గా భావిద్దాం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 13
3) l పొడవు, r వ్యాసార్థము గల సహాక్ష స్థూపాకార గాసియన్ తలంను నిర్మిద్దాం. సౌష్టవము వల్ల విద్యుత్ క్షేత్రం, ఆవేశ తీగకు లంబంగా ఊహించవచ్చును.

4) AB మరియు CD సమతల తలాలు, తీగకు లంబంగా ఉండును. AB మరియు CD తలంపై ds,, మరియు ds చిన్న వైశాల్యాలు తీసుకుందాము. అవి \(\overrightarrow{E}\) కు లంబము. వాని నుండి వచ్చు అభివాహం శూన్యం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 14

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 2.
స్థిర విద్యుత్ శాస్త్రంలోని గాస్ నియమాన్ని తెలపండి. గాస్ నియమాన్ని అనువర్తించి అనంత సమతల ఆవేశిత పలక వల్ల ఏర్పడే విద్యుత్ తీవ్రతకు సమాసాన్ని ఉత్పాదించండి.
జవాబు:
గాస్ నియమము :
“ఏదైనా సంవృత తలం ద్వారా పోవు మొత్తం విద్యుత్ అభివాహం, తలం ఆవరించి ఉన్న నికర ఆవేశంనకు \(\frac{1}{\varepsilon_0}\) రెట్లు ఉండును”.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 15

అనంత సమతల ఆవేశ పలక వల్ల Eకు సమాసము :
1) అనంత సమతల ఆవేశ పలకను భావిద్దాం. ఆ తలంపై ఆవేశం ఏకరీతి వితరణ కలిగి ఉందని భావిద్దాం.
2) ఆ తలంపై ఏకరీతి ఆవేశ సాంద్రత σ = \(\frac{dq}{dS}\). ఇక్కడ dq చిన్న వైశాల్యం ds పై ఆవేశము.
3) 2. పొడవు ఉన్న ABCD క్షితిజ సమాంతర స్థూపాకార గాసియన్ ఉపరితలంను, అనంత సమతల ఆవేశిత తలంనకు లంబంగా నిర్మిద్దాం.
4) AD మరియు BC సమతలాలు పలక తలంనకు సమాంతరంగా మరియు తలం నుండి సమాన దూరంలో ఉండును.
5) ఈ ఉపరితలాల వైశాల్యాలు ds1 మరియు ds2. ఇవి \(\overrightarrow{E}\) కు సమాంతరము. ఈ రెండు ఉపరితలాల ద్వారా పోవు అభివాహం శ్రీ \(\oint \overrightarrow{\mathrm{E}} \cdot \mathrm{d} \overrightarrow{\mathrm{S}}=\oint \mathrm{EdS}=\mathrm{E}(\mathrm{S}+\mathrm{S})=2 \mathrm{ES}\) ఇక్కడ AD లేక BC సమతల తల వైశాల్యం S. రెండు వైశాల్యాలు మరియు తీవ్రతలు సమానం.
6) AB మరియు CD స్థూపాకార ఉపరితలంను భావిద్దాం. వానిపై చిన్న వైశాల్యాలు ds3 మరియు ds4 తీసుకుందాం. ఈ ఉపరితలాలు విద్యుత్ క్షేత్ర తీవ్రత E కు లంబము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 16

ప్రశ్న 3.
గాస్ నియమాన్ని అనువర్తించి ఆవేశిత వాహక గోళాకార కర్పరం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్రానికి సమాసాలను
(i) కర్పరం వెలుపలి బిందువు వద్ద, (ii) కర్పరం ఉపరితలంపై గల బిందువు వద్ద, (iii) కర్పరం లోపల బిందువు వద్ద ఉత్పాదించండి.
జవాబు:
ఆవేశ వాహక గోళాకార కర్పరం వల్ల E కు సమాసము:
1) ఏకరీతి ఆవేశ గోళాకార కర్పరంను భావిద్దాం. దానిపై ఆవేశం ‘q’ మరియు వ్యాసార్ధం R.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 17
2) కర్పరంను ఏకరీతిగా ఆవేశపరిచినప్పుడు, ఏ బిందువు వద్దనైనా విద్యుత్ క్షేత్ర తీవ్రత ‘O’ నుండి రేడియల్ దూరం ‘I’ పై ఆధారపడును. E దిశ కేంద్రం నుండి వ్యాసార్థం వెంట దూరంగా ఉండును.

i) కర్పరం వెలుపల బిందువు వద్ద E :
1) గోళాకార కర్పరం వెలుపలఁదూరంలో ఉన్న బిందువుని భావిద్దాం. వ్యాసార్థంగల గాసియన్ ఉపరితలంను (r > R) నిర్మిద్దాం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 18

ii) కర్పరం ఉపరితలంపై బిందువు వద్ద E:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 19
1) r = R వ్యాసార్థం ఉన్న గాసియన్ ఉపరితలంను నిర్మిద్దాం.
2) ఈ తలం ద్వారా పోవు మొత్తం అభివాహం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 20
3) ∴ గోళాకార కర్పరంపై ఏదైనా బిందువు వద్ద తీవ్రత
E = \(\frac{\sigma}{\varepsilon_0}\)

iii) కర్పరం లోపలి బిందువు వద్ద E :
1) కర్పరం లోపల ఒక బిందువును భావిద్దాం. r వ్యాసార్థం ఉన్న గాసియన్ ఉపరితలం (r < R) ను నిర్మిద్దాం. కర్పరము లోపల ఆవేశం శూన్యం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 21
2) ఆవేశ గోళాకార కర్పరం లోపలి ఏదైనా బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత శూన్యం.

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
ఒక్కొక్కటి 0.20g ద్రవ్యరాశి గల రెండు చిన్నవైన, సర్వసమానమైన బంతులు సమాన ఆవేశాన్ని కలిగి ఉన్నాయి. వీటిని సమాన పొడవుగల రెండు దారాలతో వేలడదీశారు. దారాల మధ్య కోణం 60° ఉండే విధంగా ఆ బంతులు తమకుతామే సమతాస్థితిలోకి వచ్చాయి. బంతుల మధ్య దూరం 05 m అయితే బంతులపై ఉండే ఆవేశం ఎంత?
సాధన:
ఇచ్చినవి m = 0.20 g = 0.2 × 10-3 kg; θ = 60°
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 22
∴ ప్రతి బంతిపై ఆవేశం, q = 1.79 × 10-7 C.

ప్రశ్న 2.
ఒక్కొక్కటి q ఆవేశం గల అనంతమైన ఆవేశాలను X-అక్షంపై మూల బిందువు నుంచి 1, 2, 4, 8, ……………. మీటర్ దూరాల వద్ద ఉంచారు. మూల బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం ఎంత?
సాధన:
q1 = q2 = q3 = q4 = …………. = q గా తీసుకుందాము
r1 = 1; r2 = 2; r3 = 4; r4 = 8,
మూల బిందువు ‘O’ వద్ద ఫలిత విద్యుత్ క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 23

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 3.
గడియారంలోని డయల్పై ఉండే అంకెల వద్ద -9, -24, -3q, ………… -12q ఆవేశాలను బిగించారు. బిందు ఆవేశాలు ఉత్పత్తి చేసే విద్యుత్ క్షేత్రాన్ని గడియారంలోని ముల్లులు ఆటంకపరచవు. ఏ సమయం వద్ద గంటల ముల్లు డయల్ కేంద్రం వద్ద ఉండే విద్యుత్ క్షేత్ర దిశలో ఉంటుంది?
సాధన:
‘O’ వద్ద ఉన్న ప్రమాణ ఆవేశం నుండి ప్రతి ఆవేశం దూరం = r.
ఫలిత క్షేత్ర తీవ్రత, E = \(\frac{1}{4 \pi \varepsilon_0} \frac{6 q}{r^2}\) [∵ -6q – (-12q)]
OX నిర్దేశ అక్షము. OX-అక్షంతో ఫలిత క్షేత్రాల కోణాలు పటంలో చూపబడినవి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 24
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 25
∴ గంటల ముల్లు డయల్ కేంద్రం వద్ద 9.30 చూపును.

ప్రశ్న 4.
E = 3 × 10³ N/C పరిమాణం గల ఏకరీతి విద్యుత్ క్షేత్రాన్ని పరిగణించండి. (a) yz తలాన్ని సమాంతరంగా తలాన్ని కలిగి ఉండే భుజానికి 10 cm పొడవు గల చతురస్రం ద్వారా క్షేత్ర అభివాహం ఎంత? (b) చతురస్రం తలానికి గీచిన లంబం X అక్షంతో 60° కోణం చేసే విధంగా ఉంటే చతురస్రం ద్వారా అభివాహం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 26
a) ఇచ్చినవి E = 3 × 10³ N/C
S = 10²cm²
= 10² x (10-2m)² = 10²m²
θ = 0°
Φ = ES cos θ
= 3 × 10³ × 10-2 × cos 0°
∴ Φ = 30 Nm²C-1
60° Φ = ES cos θ
× 10³ × 10-2 × cos 60°
∴ Φ = 15 Nm²C-1

ప్రశ్న 5.
Qపరిమాణం గల 4 ఆవేశాలు కలవు. వీటిలో రెండు ధనాత్మకం, రెండు రుణాత్మకం. వీటిని ‘ L’ భుజంగాగల చతురస్రం శీర్షాల వద్ద ప్రతి మూల వద్ద ఒకటి ఉండేట్లు ప్రతి ఆవేశంపై పనిచేసే బల దిశ కేంద్రం వైపు ఉండే విధంగా అమర్చారు. ప్రతి ఆవేశం అనుభవించే నికర విద్యుత్ బల పరిమాణాన్ని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 27

ప్రశ్న 6.
ఒక ప్రదేశంలోని విద్యుత్ క్షేత్రాన్ని \(\overrightarrow{E}\) = \(a\hat{i}+b\hat{j}\) సూచిస్తుంది. ఇక్కడ a, b లు స్థిరాంకాలు, y zతలానికి సమాంతరంగా ఉండే L భుజంగా గల చతురస్ర వైశాల్యం ద్వారా పోయే నికర అభివాహాన్ని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 28

ప్రశ్న 7.
r వ్యాసార్థం గల బోలు గోళాకార కర్పరం ఆ ఏకరీతి ఆవేశ సాంద్రతను కలిగి ఉంది. కర్పరం కేంద్రం, ఘనం కేంద్రంతో ఏకీభవించే విధంగా దీన్ని 3 అంచుగల సమఘనంలో ఉంచారు. ఘనం తలం నుంచి బహిర్గతం అయ్యే విద్యుత్ అభివాహాన్ని లెక్కించండి.
సాధన:
గోళాకార కర్పరం, ఆవేశం = q అనుకుందాము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 29

ప్రశ్న 8.
ఒక విద్యుత్ డైపోల్ 2l దూరంలో ఉండే +Q, -Q అనే రెండు సమాన, వ్యతిరేక ఆవేశాలను కలిగి ఉంది. ఆవేశాలకు సరేఖీయంగా(collinear) P అనే బిందువు ఉంది. ధనావేశం నుంచి P దూరం, రుణావేశం నుంచి P ఉండే దూరంలో సగం అయితే P వద్ద విద్యుత్ తీవ్రత
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 30

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 9.
λ, 2λ ఏకరీతి రేఖీయ ఆవేశ సాంద్రతలు గల రెండు అనంతమైన పొడవుతో ఉండే తిన్నని తీగలను r దూరంలో సమాంతరంగా అమర్చారు. రెండింటికి మధ్య దూరంలో ఉండే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత,
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 31
రెండు సమాంతర, అనంతమైన పొడవు గల తిన్నని తీగల మధ్యదూరం = r
అనంత పొడవు గల తిన్నని తీగవల్ల విద్యుత్ క్షేత్రం E = \(\frac{\lambda}{2 \pi\varepsilon_0r}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 32
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 33
∴ మధ్య బిందువు వద్ద విద్యుత్ తీవ్రత, E = E2 – E1 = 2E1 – E1 = E
∴ E = \(\frac{\lambda}{\pi\varepsilon_0r}\)

ప్రశ్న 10.
λ, 3λ. ఏకరీతి రేఖీయ ఆవేశ సాంద్రతలు గల రెండు అనంతమైన పొడవుతో ఉండే తిన్నని తీగలను దూరంలో సమాంతరంగా అమర్చారు. రెండింటికి మధ్య దూరంలో ఉండే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత.
సాధన:
ఇచ్చినవి λ1 =λ, λ2 = 3λ.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 34

ప్రశ్న 11.
m ద్రవ్యరాశి, ఆ ఆవేశం గల ఎలక్ట్రాన్ను తొలివేగంతో E క్షేత్ర తీవ్రత గల ఏకరీతి విద్యుత్ క్షేత్రానికి లంబంగా తుపాకీతో పేల్చారు. పేల్చిన దిశలోనే ఎలక్ట్రాన్ క్షేత్రంలో X దూరం ప్రయాణిస్తే, అది పొందే తిర్యక్ స్థానభ్రంశం y విలువ ఎంత?
సాధన:
ఇచ్చినవి me = m; q = e; d = x; ux = u; uy = 0
పలకల మధ్య విద్యుత్ క్షేత్రం = E
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 35

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 1.
2 × 10-7 C, 3 × 10-7 C ఆవేశాలు గల రెండు చిన్న గోళాలను గాలిలో 30 cm ఎడంతో ఉంచారు. వాటి మధ్య పనిచేసే బలం ఎంత?
సాధన:
q1 = 2 × 10-7 C; q2 = 3 × 10-7 C; r = 30 cm = 30 × 10-2m; F = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 36
∴ F = 6 × 10-3 N.

ప్రశ్న 2.
0.4µC ఆవేశం గల చిన్న గోళంపై -0.8 C ఆవేశం గల మరొక గోళం గాలిలో కలగచేసే స్థిర విద్యుత్ బలం 0.2N.. అయితే (a) రెండు గోళాల మధ్య దూరం ఎంత? (b) రెండో గోళంపై మొదటి గోళం వల్ల కలిగే బలం ఎంత?
సాధన:
a) q1 = 0.4 µc = 0.4 × 10-6 C
r2 = – 0.8 µc = 0.8 × 10-6 C
F = 0.2 N; r = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 37
మొదటి గోళం వల్ల రెండవ గోళంపై బలం అంతే ఉండును.
i.e., 0.2 N.

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 3.
ke²/G memp అనే నిష్పత్తికి మితులు లేవని సరిచూడండి. భౌతిక స్థిరాంకాల పట్టికను పరిశీలించి, ఈ నిష్పత్తి విలువను నిర్ణయించండి. నిష్పత్తి డేన్ని తెలియచేస్తుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 38
ఇచ్చిన నిష్పత్తి మితిరహితం.
K = 9 × 109 Nm²c-2, e = 1.6 × 10-19 C;
G = 6.67 × 10-11 N/m²/kg²
me = 9.1 × 10-31 kg మరియు mp = 1.66× 10-27 kg
\(\frac{Ke^2}{Gm_em_p}\) = 2.29 × 1039
ఇదియే ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్ ల మధ్య స్థిర విద్యుత్ బలం మరియు గురుత్వాకర్షణ బలంల మధ్య నిష్పత్తి.

ప్రశ్న 4.
a) ఒక వస్తువు విద్యుదావేశం క్వాంటీకరణం చెందింది అనే ప్రవచనం అర్థాన్ని వివరించండి.
b) స్థూల లేదా బృహధ్శాన ఆవేశాలతో వ్యవహరించేటప్పుడు క్వాంటీకరణాన్ని ఎందుకు ఉపేక్షిస్తారు ?
సాధన:
a) విద్యుత్ ఆవేశ వస్తువు క్వాంటీకృతమైనది అంటే ఆ వస్తువు ఆవేశం నిర్దిష్ట విలువలు కలిగి ఉండును. వస్తువుపై ఆవేశం ఎల్లప్పుడు ప్రాథమిక ఆవేశం అయిన ఎలక్ట్రాన్ ఆవేశంనకు పూర్ణాంక గుణిజాలుగా ఉండును. వస్తువుపై ఆవేశంనుq = ± ne గా వ్యక్తపరుస్తారు. ఇక్కడ n = సరఫరా అయిన ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానం మరియు e = ఎలక్ట్రాన్పై ఆవేశం. క్వాంటీకరణంనకు కారణం ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు ఎలక్ట్రాన్లు పూర్ణాంక గుణిజాలుగా సరఫరా జరుగుటయే.

b) ఎలక్ట్రాన్ ఆవేశము 1.6 × 10-19 C. ఈ విలువ స్వల్పము, కావున స్థూల లేదా బృహద్మాన ఆవేశాలతో వ్యవహరించేటప్పుడు క్వాంటీకరణంను ఉపేక్షిస్తారు.

ప్రశ్న 5.
గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్దినప్పుడు రెండింటిపై ఆవేశాలు కనిపిస్తాయి. ఇదే దృగ్విషయాన్ని ఇంకా ఎన్నో జతల వస్తువుల విషయంలోనూ గమనించడమైంది. ఈ పరిశీలన ఆవేశ నిత్యత్వ నియమంతో ఏ విధంగా సుసంగతం అవుతుంది? వివరించండి.
సాధన:
ఆవేశ నిత్యత్వ నియమము ప్రకారము, ఆవేశం సృష్టించబడదు. మరియు నాశనం కాదు. కాని ఒక వస్తువు నుండి మరియొక వస్తువుకు బదిలీ జరుగును. రెండు వస్తువులు రుద్దక ముందు రెండు తటస్థముగా ఉండును. వ్యవస్థ మొత్తం ఆవేశం స్థిరం. గాజు కడ్డీని, సిల్క్ గుడ్డతో రుద్దితే, గాజుకడ్డీ నుండి సిల్క్ గుడ్లలోనికి ఎలక్ట్రాన్ లు బదిలీ జరుగును. కావున గాజుకడ్డీ ధనావేశంను, సిల్క్ గుడ్డ రుణావేశంను పొందును.

గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్దిన తరువాత వ్యవస్థ మొత్తం ఆవేశం శూన్యం. ఇది ఆవేశ నిత్యత్వ నియమమును కలిగి ఉంటుంది. ఇక్కడ ఆవేశాలు సమానంగా మరియు విజాతి జంటలుగా సృష్టించబడును.

ప్రశ్న 6.
10cm భుజంగాగల ABCD చతురస్రం శీర్షాల వద్ద qA = 2 µC, qB = -5 µC, qC = 2 µC, qD = -5 µC అనే నాలుగు బిందు ఆవేశాలున్నాయి. చతురస్రం కేంద్రం వద్ద ఉంచిన 1 µC ఆవేశంపై పనిచేసే బలం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 40
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 39
O వద్ద ఉన్న lµC ఆవేశంపై A మరియు C ల
వద్ద ఉన్న 2µC ఆవేశాల వల్ల ఆకర్షణ బలాలు సమానం మరియు వ్యతిరేకం. అందువల్ల అవి రద్దు అవుతాయి. ఇదే విధంగా, వద్ద ఉన్న 1µC ఆవేశంపై, B మరియు Dల వద్ద ఉన్న – 5µC ఆవేశాల వల్ల ఆకర్షణ బలాలు సమానం మరియు వ్యతిరేకం. అందువల్ల అవి రద్దు అవుతాయి. కావున O వద్ద 1µC ఆవేశంపై ఫలితబలం శూన్యం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 7.
a) స్థిర విద్యుత్ క్షేత్రరేఖ ఒక అవిచ్ఛిన్న వక్రం. అంటే, క్షేత్ర రేఖ ఎలాంటి అంతరాలను కలిగి ఉండదు. ఎందుకు?
b) రెండు క్షేత్ర రేఖలు పరస్పరం ఏ బిందువు వద్ద అయిన ఎందుకు ఖండించుకోవో వివరించండి.
సాధన:
a) విద్యుత్ క్షేత్ర రేఖ, విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధనావేశం ప్రయాణించి వాస్తవ పథము అవిచ్ఛిన్న వక్రంను సూచిస్తుంది. రేఖ అకస్మాత్తుగా తెగితే, ప్రమాణ ఆవేశం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంనకు దూకుటను తెలుపును. ఇది అసాధ్యం. దాని అర్ధం తెగిన ప్రదేశం వద్ద విద్యుత్ క్షేత్రం శూన్యం. ఇది అసాధ్యం. కావున క్షేత్ర రేఖ అంతరాలను కలిగి ఉండదు.

b) రెండు క్షేత్ర రేఖలు ఒక దానితో మరొకటి ఖండించుకొంటే ఖండన బిందువు వద్ద గీసిన రెండు స్పర్శ రేఖలు, రెండు విద్యుత్ క్షేత్ర దిశలను తెలుపవలెను. ఒక బిందువు ఒకేసారి రెండు దిశలను సూచించదు. కావున రెండు క్షేత్ర రేఖలు ఏ బిందువు వద్ద కూడా ఖండించుకోవు.

ప్రశ్న 8.
శూన్యంలో qA = 3 µC, qg = -3 µC అనే రెండు బిందు ఆవేశాలు 20 cm దూరంలో ఉన్నాయి.
a) రెండు ఆవేశాలను కలిపే AB రేఖ మధ్య బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం ఎంత?
b) ఈ బిందువు వద్ద 1.5 × 10-19 C పరిమాణం గల శోధన రుణావేశాన్ని ఉంచితే, శోధన ఆవేశం అనుభూతికి లోనయ్యే బలం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 41
a) qA = 3 µC = 3 × 10-6
qB = -3 µC = -3 × 10-6 C, AB = 20 cm
r = OA = OB = 10 cm = 10-1 m, E = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 42

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 43
b) ‘O’ వద్ద ఉన్న q = -1.5 × 10-9 C
ఆవేశంపై బలం, F = qE = -1.5 × 10-9 × (5.4 × 106) N
F = -8.1 × 10-3 N, OA వెంట

ప్రశ్న 9.
ఒక వ్యవస్థలో A : (0, 0, -15 cm), B(0, 0, + 15 cm) బిందువుల వద్ద qA = 2.5 × 10-7 C, qB = -2.5 × 10-7 C అనే బిందు ఆవేశాలున్నాయి. ఈ వ్యవస్థ మొత్తం ఆవేశం, విద్యుత్ ద్విధ్రువ (డైపోల్) భ్రామకం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 45
qA మరియు qB ఆవేశాలు Z – అక్షంపై (0, 0, -15) మరియు B (0, 0, 15) బిందువుల వద్ద పటంలో చూపినట్లు ఉన్నాయి. అవి విద్యుత్ (డైపోల్) ద్విధ్రువంను ఏర్పరచును. మొత్తం ఆవేశం
q = q = qA + qB = 2.5 × 10-7 – 2.5 × 10-7 = 0
AB = 15 + 15 = 30cm = 30 × 10-2m.

విద్యుత్ ద్విధ్రువం (డైపోల్) భ్రామకం, P = ఒక ఆవేశం × AB
= 2.5 × 10-7 × (30 × 10-2)
= 7.5 × 10-8 c – m
\(\overrightarrow{P}\) దిశ BA వెంట i. e., రుణాత్మక Z-అక్షం వెంట పనిచేయును.

ప్రశ్న 10.
4 × 10-9 Cm డైపోల్ భ్రామకం గల విద్యుత్ డైపోల్ 5 × 104 NC-1 పరిమాణం గల ఏకరీతి విద్యుత్ క్షేత్రం దిశతో 30° కోణం చేసే విధంగా అమరి ఉంది. డైపోల్పై పనిచేసే టార్క్ పరిమాణాన్ని లెక్కించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 46
P = 4 × 10-9 Cm; 6 = 30°, E = 5 × 104 N C-1, τ = ?
τ = PE sin θ = (4 × 10-9) × (5 × 104) sin 30°
= 4 × 5 × 10-5 × \(\frac{1}{2}\) = 10-4 N-m

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 11.
ఉన్నితో రుద్దిన పాలిథీన్ ముక్కపై రుణావేశం 3 × 10-7 C ఏర్పడినట్లు గుర్తించారు.
a) బదిలీ అయ్యే ఎలక్ట్రాన్ల సంఖ్యను అంచనా వేయండి (ఇవి దేని నుంచి దేనికి)
b) ఉన్ని నుంచి పాలిథీన్కు ద్రవ్యరాశి బదిలీ అవుతుందా?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 47
a) q = -3 × 10-7 C, ఎలక్ట్రాన్పై ఆవేశం,
e = -1.6 × 10-19 C
∴ ఉన్ని నుండి పాలిథీన్ ముక్కలోకి బదిలీ అయిన ఎలక్ట్రాన్ల సంఖ్య,
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 48

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 49
b) ద్రవ్యరాశి బదిలీ ఉండును.
ప్రతి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి = 9 × 10-19 kg
పాలిథీన్ లోనికి బదిలీ అయిన ద్రవ్యరాశి = 2 × 1012 × 9 × 10-31 kg
= 1.8 × 10-18 kg

ప్రశ్న 12.
a) రెండు విద్యుత్ బంధిత, ఆవేశిత రాగి గోళాలు A, B ల కేంద్రాల మధ్య దూరం 50 cm. ఒక్కొక్క దానిపై 6.5 × 10-7 C ఆవేశం ఉంటే, వాటి మధ్య పనిచేసే స్థిర విద్యుత్ వికర్షణ బలం ఎంత? A, B ల మధ్య దూరంతో పోల్చితే వాటి వ్యాసార్థాలు ఉపేక్షణీయం.
b) వాటిపై ఆవేశాన్ని రెట్టింపు చేసి, మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తే వాటి మధ్య వికర్షణ బలం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 50

ప్రశ్న 13.
అభ్యాసం 2లోని A, B గోళాల పరిమాణాలు సర్వసమానమని ఊహించండి. అంతే పరిమాణం గల, ఆవేశితం కాని మూడో గోళాన్ని మొదటి గోళంతో స్పర్శింపచేసి తిరిగి రెండో గోళాన్ని తాకించి, చివరకు రెండింటి నుంచి తొలగిస్తే A, B ల మధ్య పనిచేసే కొత్త వికర్షణ బలం విలువ ఎంత ?
సాధన:
A పై ఆవేశం = 6.5 × 10-7 C
B పై ఆవేశం = 6.5 × 10-7 C
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 52
వాని పరిమాణంలు సమానం. అంతే పరిమాణం ఉన్న ఆవేశంలేని మూడవగోళం C ను A కు దగ్గరగా తెచ్చి స్పృశించితే, వాని ఆవేశాలను
సమానంగా పంచుకొనును.
∴ A పై ఉన్న ఆవేశం, q1 = \(\frac{6.5\times10^{-7}}{2}\) = 3.25 × 10-7C
3.25 × 10-7 C ఆవేశం ఉన్న గోళం Cను 6.5 × 10-7 C ఆవేశం ఉన్న గోళం B దగ్గరకు తెచ్చి స్పృశించితే, వాని పరిమాణాలు సమానం కావున B మరియు C గోళాలు సమానంగా పంచుకుంటాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 53

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 14.
ఏకరీతి స్థిర విద్యుత్ క్షేత్రంలో ప్రయాణించిన మూడు ఆవేశ కణాల పథాలను పటం చూపుతోంది. మూడు కణాల ఆవేశ సంజ్ఞలను ఇవ్వండి. ఏ కణం అత్యధిక ఆవేశ, ద్రవ్యరాశి నిష్పత్తిని కలిగి ఉంటుంది?
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 54
సాధన:
ఆవేశ కణాలు, వ్యతిరేక ఆవేశ పలకలవైపు అపవర్తనం చెందును. కావున కణాలు (1) మరియు (2) లు రుణావేశాలు మరియు కణం (3) ధనావేశం.

స్థానభ్రంశం y ∝ (\(\frac{e}{m}\)) . అన్ని కణాలు ఒకే వేగంతో విద్యుత్ క్షేత్రంలోనికి ప్రవేశిస్తే, కణం 3 గరిష్ట y విలువ అనగా ఎక్కువ ఆవేశం మరియు ద్రవ్యరాశి నిష్పత్తి కలిగి ఉండును.

ప్రశ్న 15.
ఏకరీతి విద్యుత్ క్షేత్రం E = 3 × 10³ \(\hat{i}\)N/C ని పరిగణించండి.
(a) yz తలానికి సమాంతరంగా ఉండే 10 cm భుజంగా గల చతురస్రం ద్వారా క్షేత్ర అభివాహం ఎంత?
(b) చతురస్రం తలానికి గీచిన లంబం X అక్షంతో 60° కోణం చేస్తే దాని ద్వారా అభివాహం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 55
\(\overrightarrow{E}\) = 3 × 10³ \(\hat{i}\) N/C i. e., ధన X-అక్షం వెంట క్షేత్రం ఉండును.
ఉపరితల వైశాల్యం, S = (10cm)² = 10² cm²
= 10² × 10-4 m² = 10-2

a) తలం, YZ తలానికి సమాంతరంగా ఉంటే θ = 0°
ΦE = ES cos θ° = 3 × 10³ × 10-2 × cos 0°
= 30 Nc-1

b) X అక్షంతో తలానికి గీసిన లంబము చేయు కోణం 60,
అప్పుడు θ = 60°
ΦE = ES cos θ = 3 × 10³ × 10-2 × cos 60° = 30 × \(\frac{1}{2}\) = 15 NC-1 m².

ప్రశ్న 16.
అభ్యాసం 15లో సూచించిన ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో తలాలు నిరూపకతలాలకు సమాంతరంగా ఉండే విధంగా అమర్చితే 20 cm భుజంగాగల ఘనం నుంచి వచ్చే నికర అభివాహం ఎంత?
సాధన:
ఘనంలోనికి మరియు వెలుపలకు వెళ్ళు బలరేఖల సంఖ్య సమానం. కావున ఘనంపై నికర అభివాహం శూన్యం.

ప్రశ్న 17.
ఒక పెట్టె ఉపరితలం వద్ద విద్యుతక్షేత్రంపై జాగ్రత్తగా చేసిన కొలత, ఆ తలం నుంచి బహిర్గతం అయ్యే నికర అభివాహం 8.0 × 10³ Nm²/C అని సూచించింది.
(a) పెట్టెలోని నికర ఆవేశం ఎంత?
(b) పెట్టె ఉపరితలం ద్వారా బహిర్గతం అయ్యే నికర అభివాహం శూన్యం అయితే పెట్టెలోపల ఎలాంటి ఆవేశాలు లేవని మీరు నిశ్చయిస్తారా? ఎందుకు లేదా ఎందుకు కాదు?
సాధన:
a) ΦE = 8.0 × 10³ N C-1 m², q = ? ΦE = \(\frac{q}{\varepsilon_0}\)
q = εo ΦE = (8.85 × 10-12) (8.0 × 10³)
= 0.07 × 10-6 C = 0.07C

b) ΦE =0, q=0; ∑q = 0ie, పెట్టె లోపల ఆవేశాల బీజీయ. మొత్తం శూన్యం లేక పెట్టె లోపల ఆవేశం ఉండదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 18.
పటంలో చూపిన విధంగా 10 cm భుజంగా ఉండే చతురస్రం కేంద్రం నుంచి 5 cm ఎత్తులో +10 µC ఆవేశం గల బిందు ఆవేశం ఉంది. చతురస్రం ద్వారా విద్యుత్ అభివాహం పరిమాణం ఎంత? (Hint : చతురస్రాన్ని 10 cm అంచుగా ఉండే ఘనం ఒక తలంగా భావించండి.)
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 56
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 57
పటంలో చూపినట్లు, ABCD చతురస్ర భుజం పొడవు 10 cm.
ABCD చతురస్ర కేంద్రంపైన 5 cm వద్ద + 10 C బిందు ఆవేశం కలదు.
10 cm ప్రక్క భుజం ఉన్న ఘనం ఆరుభుజాలలో ABCD చతురస్రంను భావిద్దాం.
గాస్ సిద్ధాంతం ప్రకారము, ఘనం ఆరు తలాల ద్వారా
-మొత్తం విద్యుత్ అభివాహం = \(\frac{q}{\varepsilon_0}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 58

ప్రశ్న 19.
9.0 cm అంచుగాగల ఘనాకార గాసియన్ ఉపరితలం కేంద్రం వద్ద 2.0 pC బిందు ఆవేశం ఉంది. ఉపరితలం ద్వారా నికర విద్యుత్ అభివాహం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 59

ప్రశ్న 20.
10am వ్యాసార్థం గల గోళాకార గాసియన్ ఉపరితలం కేంద్రం వద్ద ఉండే బిందు ఆవేశం, తలం నుంచి -1.0 × 10³Nm²/C విద్యుత్ అభివాహాన్ని వెలువరించడానికి కారణం అవుతోంది. (a) గాసియన్ ఉపరితలం వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే, తలం ద్వారా ఎంత అభివాహం వెళుతుంది? (b) బిందు ఆవేశం విలువ ఎంత?
సాధన:
ΦE = – 1.0 × 10³ N m²/C, r = 10.0cm

a) గాసియన్ తలం వ్యాసార్థం రెట్టింపు అయితే, తలం ద్వారా పోవు అభివాహం ఒకే విధంగా ఉండును. దీనికి కారణం ఆవేశం లోపల ఉన్న ఆవేశంపై అభివాహం ఆధారపడదు.

b) ΦE = \(\frac{q}{\varepsilon_0}\)
∴ qE = εo ΦE = (8.85 × 10-12) (-1.0 × 10³) = -8.85 × 10-9C.

ప్రశ్న 21.
10 cm వ్యాసార్థంలో ఉండే వాహక గోళం కొంత ఆవేశాన్ని కలిగి ఉంది. గోళం కేంద్రం నుంచి 20 cm దూరంలో ఉండే విద్యుత్ క్షేత్రం 1.5 × 10³N/C. క్షేత్రం వ్యాసార్థం దిశలో లోపలికి పనిచేస్తే గోళంపైన ఉండే నికర ఆవేశం ఎంత?
సాధన:
గోళం వ్యాసార్థం = 10 cm
గోళం కేంద్రం నుండి బిందువు దూరం, r = 20 cm = 0.2 m
, విద్యుత్ క్షేత్రం, E =- 1.5 × 10³ N/C
(ఋణ సంజ్ఞ క్షేత్రంలోనికి వెళ్లుటను తెలుపును)
ఆవేశం, q = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 60

ప్రశ్న 22.
2.4m వ్యాసం గల ఏకరీతి ఆవేశిత వాహక గోళం 80.0 µC/m² ఉపరితల ఆవేశ సాంద్రతను కలిగి ఉంది.
a) గోళంపై ఆవేశాన్ని కనుక్కోండి.
b) గోళం ఉపరితలాన్ని వదిలి వెళ్ళే ముందు మొత్తం విద్యుత్ అభివాహం ఎంత?
సాధన:
a) D = 2r = 2.4 m = 1.2 m
σ = 80 uc/m2 = 80 × 10-6 C/m²
గోళంపై ఆవేశం, Q = σ × 4πr² 80 × 10-6 × 4 × \(\frac{22}{7}\) × (1.2)² = 1.45 × 10-3C

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 61

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 23.
ఒక అనంత రేఖీయ ఆవేశం 2 cm దూరంలో 9 × 104 N/C క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తోంది. రేఖీయ ఆవేశ సాంద్రతను లెక్కించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 62

ప్రశ్న 24.
రెండు పెద్ద, పలుచని లోహ పలకలు సమాంతరంగా, ఒకదానికి మరొకటి సమీపంగా ఉన్నాయి. వాటి లోపలివైపు ఉపరితలాలపై 17.0 × 10-22 C/m2 పరిమాణంగల సమాన, వ్యతిరేక ఉపరితల ఆవేశ సాంద్రతలున్నాయి.
a) మొదటి పలక వెలుపలి ప్రదేశంలో,
b) రెండవ పలక వెలుపలి ప్రదేశంలో, c) పలకల మధ్య విద్యుత్ క్షేత్రం E విలువలు ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 63
a) σA = 17.0 × 10-22 Cm-2
సిద్ధాంతంలో చెప్పినట్లు మొదటి పలక వెలుపలి ప్రదేశంలో E
E = 0

b) సిద్ధాంతంలో చెప్పినట్లు రెండవ పలక వెలుపలి ప్రదేశంలో
E = 0

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 64

ప్రశ్న 25.
మిల్లికాన్ తైల బిందు ప్రయోగంలో 12 ఎలక్ట్రాన్లు అధికంగా ఉండే తైల బిందువుపై 2.55 × 104 NC-1 స్థిర విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించి స్థిరంగా ఉంచారు. నూనె సాంద్రత 1.26 g cm-3. ద్రవ బిందువు వ్యాసార్థాన్ని అంచనా వేయండి (g = 9.81 ms-2; e = 1.60 × 10-19C).
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 65
n = 12; E = 2.55 × 104 Vm-1
ρ = 1.26 gm/cm³ = 1.26 × 10³ kg/m³, r = ?
బిందువు నిశ్చలంగా ఉంటే,
బిందువు భారం = విద్యుత్ క్షేత్రం వల్ల బలం
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 66

ప్రశ్న 26.
పటంలో చూపిన వక్రాల్లో ఏవి స్థిర విద్యుత్ క్షేత్రరేఖలను సూచించవు?
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 67
సాధన:
a) వాహక తలంనకు 90° వద్ద మాత్రమే స్థిర విద్యుత్ బలరేఖలు మొదలు లేక అంతమవుతున్నాయి. కావున పటం (a) అటువంటి రేఖలను సూచించదు.

b) స్థిర విద్యుత్ బలరేఖలు రుణావేశం నుండి మొదలుకావు. కావున అటువంటి రేఖలను పటం (b) సూచించదు.

c) పటం (c) స్థిర విద్యుత్ బలరేఖలను సూచించును.

d) విద్యుత్ బలరేఖలు ఒకదానికొకటి ఖండించుకోవు. కావున (d) ఇటువంటి రేఖలను సూచించదు.

ప్రశ్న 27.
అంతరాళంలోని నియమిత ప్రాంతంలో అంతా విద్యుత్ క్షేత్రం z–దిశలో ఉంది. కాని, విద్యుత్ క్షేత్రం పరిమాణం మాత్రం స్థిరం కాదు. ఇది ధన z-దిశలో మీటర్ దూరానికి 105 NC-1చొప్పున ఏకరీతిగా పెరుగుతోంది. డైపోల్ (ద్విధ్రువ) భ్రామకం 10-7 Cm తో రుణ Z-దిశలో ఉండే వ్యవస్థపై పనిచేసే బలం, టార్క్ల విలువ ఎంత?
సాధన:
z – అక్షం వెంట A వద్ద – q ఆవేశం మరియు B వద్ద +q ఆవేశం గల విద్యుత్ ధ్రువంను భావిద్దాం. రుణ Z దిశలో
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 68

ప్రశ్న 28.
a) పటం (a) లో చూపిన విధంగా కోటరాన్ని కలిగి ఉండే వాహకం A కి ఇచ్చిన ఆవేశం Q. మొత్తం ఆవేశం వాహకం బాహ్య ఉపరితలంపైనే కనిపించాలని చూపండి.
b) q ఆవేశంతో ఉండే మరొక వాహకం B ని A తో విద్యుద్బంధితం అయ్యే విధంగా కోటరంలోకి ప్రవేశపెట్టారు. A బాహ్యం ఉండే మొత్తం ఆవేశం Q + q అని చూపండి. (పటం (b). (e) ఒక సున్నితమైన పరికరాన్ని దాని చుట్టూ ఉండే బలమైన స్థిర విద్యుత్ క్షేత్రాల నుంచి రక్షించవలసి ఉంది. సాధ్యమయ్యే ఒక మార్గాన్ని సూచించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 69
సాధన:
a) ఆవేశ వాహకం లోపల నికర క్షేత్రం శూన్యం. i. e., \(\overrightarrow{E}\) = 0.
వాహకం లోపల రంధ్రంను ఆవరించి ఉన్న గాసియన్ తలంను భావిద్దాం. గ్లాస్ నియమము ప్రకారము,
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 70
∴ q = 0_i.e., రంధ్రం లోపల ఆవేశం శూన్యం. వాహకంపై మొత్తం ఆవేశం Q, వాహకం వెలుపల తలంపై ఉండును.

b) వాహకం B రంధ్రము వద్ద +q ఆవేశం ఉంచితే, తలంపై -q ఆవేశం వాహకం A వెలుపల +q ప్రేరణ వల్ల ఏర్పడును. A వెలుపల తలం Q ఆవేశం మొదటే ఉంటే దానిపై మొత్తం ఆవేశం (Q + q).

c) పరిసరాలలోని బలమైన విద్యుత్ క్షేత్రం నుండి రక్షించుటకు సున్నితమైన పరికరమును లోహ కవచంలో ఉంచుతారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 29.
బోలు ఆవేశ వాహకం ఉపరితలంలోకి ఒక చిన్న రంధ్రం ఉంది. రంధ్రంలో విద్యుత్ క్షేత్రం (σ/2ε0) \(\hat{n}\) అని చూపండి. ఇక్కడ \(\hat{n}\) బహిర్గత లంబ దిశలోని యూనిట్ సదిశ, ఆ రంధ్రం వద్ద ఉపరితల ఆవేశ సాంద్రత.
సాధన:
రంధ్రంనకు సమీపంన ఉపరితల ఆవేశ సాంద్రత = σ
బహిర్గత లంబదిశలో యూనిట్ సదిశ = \(\hat{n}\)
రంధ్రంపై బిందువు P.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 71
ఈ విద్యుత్ క్షేత్రం, వాహక విరామ ఆవేశం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్రం మరియు రంధ్రంలో విద్యుత్ క్షేత్రంనకు సమానం. వాహకం లోపల రెండు క్షేత్రాలు సమానం మరియు వ్యతిరేకం.

వాహకం లోపల విద్యుత్ క్షేత్రం ఉండదు. వాహకం వెలుపల, విద్యుత్ క్షేత్రాలు సమానం మరియు ఒకే దిశలో ఉండును.

ప్రతి భాగం వల్ల, P వద్ద విద్యుత్ క్షేత్రం \(\frac{1}{2}\) E = E\(\frac{\sigma}{2 \varepsilon_0} \hat{\mathrm{n}}\)

ప్రశ్న 30.
గాస్ నియమాన్ని ఉపయోగించకుండా, 2. రేఖీయ ఆవేశ సాంద్రతను ఏకరీతిగా కలిగి ఉండే సన్నని, పొడవాటి తీగ వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్రానికి ఫార్ములాను రాబట్టండి.
[Hint : కూలుమ్ నియమాన్ని నేరుగా ఉపయోగించి అవసరమయిన సమాకలనం విలువ కట్టండి.]
సాధన:
సన్నని AB పొడవాటి తీగ. దాని రేఖీయ సాంద్రత 2. తీగ నుండి PC = r లంబదూరంలో P బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర ఫార్ములాను గణిద్దాం.

తీగ మధ్య బిందువు O నుండి OC = x దూరంలో dx పొడవు ఉన్న చిన్న మూలకాన్ని భావిద్దాం.
మూలకంపై ఆవేశం, q = λdx
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 72

∆OCP = θ అయితే \(\overrightarrow{dE}\) ను రెండు అంశాలుగా విడదీయవచ్చును. P వెంట dE cos θ మరియు PF వెంట dE sin θ. క్షితిజ సమాంతర అంశాలు రద్దు అవుతాయి. రేడియల్ అంశాలు కలుస్తాయి.
∴ ఆవేశ మూలకం వల్ల తుల్య అంశ విద్యుత్ తీవ్రత, dE’ = dE cos θ
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 73

ప్రశ్న 31.
ప్రోటాన్లు, న్యూట్రాన్లు (సాధారణ ద్రవ్యం కేంద్రాలను ఏర్పరచేవి) కూడా మరింత ప్రాథమిక ప్రమాణాలైన క్వార్క్ నే వాటితో నిర్మితం అవుతాయని ఇప్పుడు నమ్ముతున్నారు. ప్రోటాన్, న్యూట్రాన్ ఒక్కొక్కటి మూడేసి క్వార్క్లను కలిగి ఉంటాయి. +(2/3)e ఆవేశం గల ఎగువ (up) క్వార్క్ (u తో సూచిస్తారు), -1/3 e ఆవేశం గల దిగువ (down) క్వార్క్ (d తో సూచిస్తారు) అని పిలిచే రెండు రకాల క్వార్క్లు, ఎలక్ట్రాన్లతో కలిసి సాధారణ ద్రవ్యం నిర్మితం అవుతుంది. (ఇతర రకాల క్వార్క్లను కూడా కనుక్కొన్నారు. ఇవి అసాధారణ రకాలైన ద్రవ్యాన్ని ఏర్పరుస్తాయి) ప్రోటాన్, న్యూట్రాన్లలో సాధ్యమయ్యే క్వార్క్ సంఘటనాన్ని సూచించండి.
సాధన:
ప్రోటాన్, ఊర్థ్వ క్వార్క్స్ n గా తీసుకుందాము.
∴ అథోక్వార్క్స్ సంఖ్య = (3 – n)
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 74
∴ ఊర్ధ్వ క్వార్క్స్ సంఖ్య (u) = 2, అథోక్వార్క్స్ సంఖ్య (d) = 3 – 2 = 1
∴ ఒక ప్రోటాను P గా సూచిస్తే= UUd.
ఒక న్యూట్రాన్లో క్వార్క్స్ సంఖ్య = n గా భావిద్దాం.
∴ అథో క్వార్క్స్ సంఖ్య = (3 – n)
న్యూట్రాన్్ప మొత్తం ఆవేశం= (\(\frac{2}{3}\)e)n – \(\frac{1}{3}\)e (3 – n) = 0
\(\frac{2}{3}\)en -e + \(\frac{1}{3}\)en = 0
en = e, n = 1
ఊర్ధ్వ క్వార్క్స్ (u) సంఖ్య = 1
అథో క్వార్క్స్ (d) సంఖ్య = 3 – 1 = 2
∴ ఒక న్యూట్రాన్ ను n గా సూచిస్తే = udd

ప్రశ్న 32.
a) అనియతమైన స్థిర విద్యుత్ క్షేత్ర ఆకృతిని పరిగణించండి. ఒక చిన్న శోధన ఆవేశాన్ని ఆకృతిలోని శూన్య బిందువు (E = 0 అయ్యే ప్రాంతం) వద్ద ఉంచారు. శోధన ఆవేశం సమతాస్థితి తప్పకుండా అస్థిరం అని చూపండి.
b) సమాన పరిమాణం, ఒకే సంజ్ఞతో కొంత దూరంలో ఉండే రెండు ఆవేశాల సరళ ఆకృతికి కూడా ఈ ఫలితాన్ని సరిచూడండి.
సాధన:
a) మొదట ఒక చిన్న శోధన ఆవేశంను శూన్య బిందువు (E = 0 అయ్యే ప్రాంతం) వద్ద ఉంచారని భావిద్దాం. శోధన ఆవేశంను శూన్య బిందువు నుండి స్థానభ్రంశం చెందిస్తే, శూన్య బిందువు వైపు పునఃస్థాపక బలంను ప్రయోగించును. శూన్య బిందువు చుట్టూ సంవృత తలం ద్వారా లోపలకు నికర అభివాహం ఉంటుందని దీని అర్థం. గాస్ సిద్ధాంతం ప్రకారం, ఆవేశంను ఆవరించి ఉన్న తలం ద్వారా నికర అభివాహం శూన్యం. కావున శోధన ఆవేశం సమతాస్థితి తప్పకుండా అస్థిరం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 75

b) సమాన పరిమాణం, ఒకే సంజ్ఞతో కొంత దూరంలో రెండు ఆవేశాలు భావిద్దాం. వాని మధ్య బిందువు వద్ద శూన్య బిందువు ఏర్పడును. శోధన ఆవేశంను శూన్య బిందువు నుండి రేఖపై ప్రక్కకు బరిశిత, పునఃస్థాపక బలం, శోధన ఆవేశంను శూన్య బిందువు తీసుకురావటానికి ప్రయత్నించును. రేఖకు లంబంగా శోధన ఆవేశంను జరిపితే, శూన్య బిందువు నుండి శోధన ఆవేశంను దూరంగా తీసుకువెళ్ళును. కావున సమతాస్థితి తప్పకుండా అస్థిరం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 33.
m ద్రవ్యరాశి, (-q) ఆవేశంతో తొలుత x-అక్షం దిశలో vx వేగంతో చలించే పటంలోని కణాన్ని పోలిన) కణం రెండు ఆవేశిత పలకల మధ్య ప్రదేశంలోకి ప్రవేశించింది. పలక పొడవు L, పలకల మధ్య ఏకరీతి విద్యుత్ క్షేత్రం E ని కొనసాగిస్తున్నారు. పలక చివరి అంచు వద్ద కణం పొందే అంబ అపవర్తనం qEL² (2m vx²) అని చూపండి.
ఈ చలనాన్ని మొదటి సంవత్సరం భౌతికశాస్త్ర పాఠ్యాంశంలో చర్చించిన గురుత్వ క్షేత్రంలోని ప్రక్షేపకం చలనంతో పోల్చండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 76
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 77
ఈ సందర్భం, గురుత్వ క్షేత్రంలో క్షితిజ ప్రక్షేపకం చలనము y = 7 gt ను ఖచ్చితంగా పోలియున్నది.

ప్రశ్న 34.
అభ్యాసం 33 లోని కణాన్ని vx = 2.0 × 106 ms-1 వేగంతో ప్రక్షిప్తం చేసిన ఎలక్ట్రాన్ గా పరిగణించండి. 0.5 cm దూరంతో వేరుచేసిన పలకల మధ్య E విలువ 9.1 × 102 N/C అయితే, పైన ఉండే పలకను ఎలక్ట్రాన్ ఎక్కడ ఢీ కొడుతుంది? (|e| = 1.6 × 10-19 C, me = 9.1 × 10-31 kg.)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 78
V = 2.0 × 106 ms-1
E = 9.1 × 10² N/C
d = 0.5cm 5 × 10-3 m
q = e = 1.6 × 10-19 C
me = 9.1 × 10-31 kg
ఎలక్ట్రాన్ అపవర్తనంలో పై పలక రెండవ చివర X = L వద్ద తాకితే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 79

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
ఒక లోహ గోళాన్ని స్పర్శించకుండా దాన్ని మీరెలా ధనావేశితం చేస్తారు?
సాధన:
విద్యుద్భంధక లోహ స్టాండ్పై ఉన్న అనావేశిత లోహ గోళాన్ని పటం చూపుతుంది. పటంలో చూపిన విధంగా రుణావేశిత లోహ కడ్డీని లోహ గోళం వద్దకు తీసుకొనిరండి. కడ్డీని గోళానికి సమీపంగా తీసుకొని రాగానే, వికర్షణతో గోళంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు దూరంగా వెళ్ళి రెండో చివరన పోగవుతాయి. గోళం మొదటి చివర ఎలక్ట్రాన్ల లేమి వల్ల ధనావేశితం అవుతుంది. లోహ లోపలి స్వేచ్ఛా ఎలక్ట్రాన్లపై పనిచేసే నికర బలం శూన్యం కాగానే ఆవేశ వితరణ ప్రక్రియ ఆగిపోతుంది. వాహక తీగతో గోళాన్ని భూమికి అనుసంధానం చేయండి. ఎలక్ట్రాన్లు భూమిలోకి ప్రవహిస్తే, కడ్డీపై ఉండే రుణావేశాల ఆకర్షణ బలంతో గోళం సమీప చివర వద్ద ఉన్న ధనావేశాలు పటం (c)లో చూపిన విధంగా ఉండిపోతాయి. గోళం, భూమి అనుసంధానాన్ని తొలగించండి. సమీప కొన వద్ద ధనావేశాలు అలాగే ఉండిపోతాయి. పటం (d). విద్యుదీకృత కడ్డీని తొలగించండి. పటం (e) లో చూపిన విధంగా ధనావేశం గోళంపై వ్యాపిస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 80

ఈ ప్రయోగంలో లోహ గోళం ప్రేరణ వల్ల ఆవేశాన్ని పొందుతుంది. కడ్డీ తన ఆవేశాన్ని ఎంతమాత్రం కోల్పోదు. ఇదే విధంగా ధనావేశిత కడ్డీని గోళం వద్దకు తెచ్చి దాన్ని ప్రేరణతో రుణావేశితం చేయవచ్చు. ఈ సందర్భంలో ఎలక్ట్రాన్లు భూమి నుంచి గోళానికి, భూమిని, గోళాన్ని సంధానం చేసిన తీగ ద్వారా ప్రవహిస్తాయి.

ప్రశ్న 2.
ఒక వస్తువు నుంచి మరో వస్తువుకు ప్రతి సెకనుకు 109 ఎలక్ట్రాన్లు బయటకు వెళ్తే రెండో వస్తువుపై 1 C ఆవేశం చేరుకొనేందుకు ఎంత సమయం పడుతుంది?
సాధన:
ఒక సెకనులో బయటకు వెళ్ళిపోయే ఎలక్ట్రాన్లు 109. కాబట్టి ఒక సెకన్లో ఇచ్చే ఆవేశం
1.6 × 10-19 × 109C = 1.6 × 10-10 C. 1 C ఆవేశం పేరుకొనిపోయేందుకు కావలసిన సమయాన్ని ఈ విధంగా అంచనా వేయవచ్చు.

1 C ÷ (1.6 × 10-10 C/s) = 6.25 × 109 s = 6.25 × 109 ÷ (365 × 24 × 3600 సంవత్సరాలు = 198 సంవత్సరాలు. కాబట్టి ఒక సెకన్కు 10° ఎలక్ట్రాన్లను ఇచ్చే వస్తువు నుంచి ఒక కూలుమ్ ఆవేశాన్ని సేకరించేందుకు మనకు సుమారు 200 సంవత్సరాలు అవసరం. కాబట్టి ఎన్నో ప్రాయోగిక ప్రయోజనాలకు, ఒక కులూమ్ అతి పెద్ద ప్రమాణం.

పదార్థపు ఒక ఘనపు సెంటీ మీటర్ ముక్కలో సుమారుగా ఎన్ని ఎలక్ట్రాన్లుంటాయో తెలుసుకోవడం కూడా అతి ముఖ్యమైందే. 1 cm భుజంగా ఉండే రాగి ఘనపు ముక్కలో సుమారు 2.5 × 1024 ఎలక్ట్రాన్ల ఉంటాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 3.
ఒక కప్పు నీటిలో ఉండే ధన, రుణావేశం ఎంత?
సాధన:
ఒక కప్పు నీటి ద్రవ్యరాశి 250 g అని అనుకొంటే, నీటి అణు ద్రవ్యరాశి 18g ఒక మోల్ (= 6.02 × 1023 అణువులు) నీటి ద్రవ్యరాశి 18 g. కాబట్టి ఒక కప్పు నీటిలోని అణువుల సంఖ్య (250/18) × 6.02 × 1023.

ప్రతి నీటి అణువులో రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువులుంటాయి. అంటే, దాన్లో 10 ఎలక్ట్రాన్లు, 10 ప్రోటాన్లుంటాయి. అందువల్ల మొత్తం ధానవేశం, మొత్తం ధనావేశం సమాన పరిమాణాన్ని కలిగి ఉంటాయి. ఆవేశ పరిమాణం (250/18) × 6.02 × 1023 × 10 × 1.6 × 10-19 C = 1.34 × 10-7Cకి సమానం.

ప్రశ్న 4.
రెండు బిందు ఆవేశాల మధ్య పనిచేసే స్థిర విద్యుత్ బలానికి కూలుమ్ నియమం, అలాగే రెండు స్థిర (stationary) బిందు ద్రవ్యరాశుల మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలానికి న్యూటన్ నియమం రెండూ ఆవేశాలు/ద్రవ్యరాశుల మధ్య ఉండే దూరంపై విలోమ వర్గ ఆధారితమై ఉంటాయి.
(a) (i) ఎలక్ట్రాన్, ప్రోటాను (ii) రెండు ప్రోటాన్లకు వాటి పరిమాణాల నిష్పత్తిని కనుక్కోవడం ద్వారా ఈ బలాలను పోల్చండి.
(b) ఎలక్ట్రాన్, ప్రోటాన్లు 1 Å (= 10-10 m) దూరంతో ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసే పరస్పర ఆకర్షణ వల్ల ఎలక్ట్రాన్, ప్రోటాన్లు పొందే త్వరణాలను అంచనా వేయండి?
(mp = 1.67 × 10-27 kg, me = 9.11 × 10-31 kg).
సాధన:
a)
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 81
ii) ఇదే విధంగా r దూరంలో ఉండే రెండు ప్రోటాన్ల మధ్య ఉండే విద్యుత్, గురుత్వ బలాల పరిమాణాల నిష్పత్తి :
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 82

అయితే, ఇక్కడ రెండు రకాల బాల సంజ్ఞలు భిన్నమైనవని గమనించాలి. రెండు ప్రోటాన్లకు సంబంధించి గురుత్వ బలం ఆకర్షక స్వభావాన్ని కలిగి ఉంటే కూలుమ్ బలం వికర్షక స్వభావాన్ని కలిగి ఉంటుంది. కేంద్రకంలో ఉండే రెండు ప్రోటాన్ల మధ్య ఉండే (కేంద్రకంలో రెండు ప్రోటాన్ల మధ్య దూరం ~10-15 m) ఈ బలాల నిజ విలువలు Fe ~ 230N అయితే FG ~ 1.9 × 10-34 N. విద్యుత్ బలాలు, గురుత్వాకర్షణ బలాల కంటే చాలా ప్రబలమైనవని రెండు బలాల నిష్పత్తి (మితులు లేనిది) సూచిస్తుంది.

b) ఎలక్ట్రాన్ పై ప్రోటాన్ కలుగచేసే విద్యుత్ బలం F పరిమాణం, ప్రోటాన్పై ఎలక్ట్రాన్ కలగచేసే బలం పరిమాణం రెండూ ఒకటే. అయితే, ఎలక్ట్రాన్, ప్రోటాన్ల ద్రవ్యరాశులు మాత్రం భిన్నమైనవి. కాబట్టి బల పరిమాణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 83

న్యూటన్ రెండవ గమన నియమం, F = ma ని ఉపయోగించి, ఎలక్ట్రాన్ పొందే త్వరణం
a = 2.3 × 10-8 N/9.11 × 10-31 kg = 2.5 × 1022 m/s²

దీన్ని గురుత్వ త్వరణం విలువతో పోల్చితే ఎలక్ట్రాన్ చలనంపై గురుత్వ కేక ప్రభావం ఉపేక్షణీయమని, ప్రోటాన్ వల్ల కలిగే కూలుమ్ బలం వల్ల ఎలక్ట్రాన్ చాలా అధిక త్వరణాలను పొందుతుందని మనం ముగించవచ్చు. ప్రోటాన్ త్వరణానికి విలువ 2.3 × 10-8 N/1.67 × 10-27 kg = 1.4 × 109 m/s².

ప్రశ్న 5.
ఒక ఆవేశిత లోహ గోళం A ని నైలాన్ దారంతో వేలాడదీశారు. మరొక ఆవేశిత లోహ గోళం B ని విద్యుద్బంధక పిడితో పట్టుకుని పటం (a) లో చూపిన విధంగా (రెండు గోళాల కేంద్రాల మధ్య 10cm దూరం ఉండేట్లుగా) Aకి సమీపంలోకి తీసుకొని వచ్చారు. ఫలితంగా కలిగే A యొక్క వికర్షణను గుర్తించారు. (ఉదాహరణకు గోళాన్ని కాంతి పుంజంతో ప్రకాశింపచేసి తెరపై దాని నీడలో వచ్చే అపవర్తనాన్ని కొలవడం ద్వారా) పటం (b) లో చూపినట్లు A, B గోళాలను ఆవేశరహిత, సర్వసమానాలయిన మరో రెండు గోళాలు C, D లతో పటం (b) లో చూపినట్లు స్పర్శింపచేసారు. C, D లను తొలగించి, కేంద్రాల మధ్య దూరం 5.0 cm ఉండేట్లుగా, పటం (c) లో చూపిన విధంగా B ని సమీపంలోకి తీసుకొనివచ్చారు. కూలుమ్ నియమం ప్రకారం A వికర్షణ ఎంతని ఊహిస్తున్నారు? A, C గోళాలు, B, D గోళాలు ఒకే పరిమాణాలను కలిగి ఉన్నాయి. A, B ల కేంద్రకాల మధ్య దూరంతో పోల్చి, వాటి పరిమాణాలను ఉపేక్షించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 84
సాధన:
A గోళంపై ఉండే మౌలిక (లేదా సహజ) ఆవేశం q అనుకుంటే B పై q’ అనుకోండి. వాటీ కేంద్రాల మధ్య దూరం ఉన్నప్పుడు, ప్రతిదానిపై ఉండే స్థిర విద్యుత్ బలం పరిమాణంతో పోల్చితే A, B గోళాల పరిమాణాలను ఉపేక్షించినప్పుడు
F = \(\frac{1}{4 \pi \varepsilon_0} \cdot \frac{\mathrm{qq}}{\mathrm{r}^2}\)

A ను పోలిన ఆవేశరహిత గోళం C, A ని తాకితే A, C లపై ఆవేశాలు పునర్వితరణ చెంది, సౌష్టవం వల్ల ప్రతి గోళం q/2 ఆవేశం కలిగి ఉంటుంది. ఇదేవిధంగా D, B ని తాకిన తరువాత ప్రతి గోళంపై పునర్వితరణ వల్ల కలిగే ఆవేశం q’/2. A, B ల మధ్య దూరం సగానికి తగ్గిస్తే, ప్రతిదానిపై స్థిర విద్యుత్ బలం పరిమాణం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 85
కాబట్టి B వల్ల A పై పనిచేసే స్థిర విద్యుత్ బలంలో మార్పులేదు.

ప్రశ్న 6.
l భుజంగా గల సమబాహు త్రిభుజ మూడు శీర్షాల వద్ద మూడు ఆవేశాలు q1, q2, q3లు ప్రతీది q కు సమానంగా, ఉన్నాయనుకోండి. పటంలో చూపిన విధంగా త్రిభుజం కేంద్రాభం (centroid) వద్ద Q (q సంజ్ఞనే కలిగి ఉన్న) ఆవేశాన్ని ఉంచితే దానిపై పనిచేసే బలం ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 86
సాధన:
l భుజం పొడవు ఉండే సమబాహు త్రిభుజం ABC లో BC భుజానికి లంబం AD ని గీస్తే
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 87

ప్రశ్న 7.
పటంలో చూపిన విధంగా ఒక సమబాహు త్రిభుజం శీర్షాల వద్ద q, q, −q ఆవేశాలను ఉంచారు. ప్రతి ఆవేశంపై పనిచేసే బలం ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 88
సాధన:
పటంలో చూపిన విధంగా, A వద్ద ఉండే ఆవేశం q పై B వద్ద ఉండే ఆవేశం q వల్ల, C వద్ద ఉండే q వల్ల పనిచేసే బలాలు వరసగా F12 (BA దిశలో), F13 (AC దిశలో). సమాంతర చతుర్భుజ నియమం ప్రకారం A వద్ద ఉండే ఆవేశం q పై పనిచేసే మొత్తం బలం F, అయితే,
F1 = F \(\hat{r_1}\)1, ఇక్కడ \(\hat{r_1}\) BC దిశలో ఏకాంక సదిశ

ప్రతి జత ఆవేశాల మధ్య. పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాల పరిమాణాలు సమానం, దీని విలువ F = \(\frac{q^2}{4 \pi\varepsilon_0l^2}\) B వద్ద ఉండే ఆవేశం q పై పనిచేసే మొత్తం బలం F2 అయితే, F2 = F\(\hat{r_2}\), ఇక్కడ \(\hat{r_2}\), AC దిశలో ఏకాంక సదిశ. ఇదే విధంగా C వద్ద ఉండే ఆవేశం -q పై పనిచేసే మొత్తం బలం F3 = √3 F \(\hat{n}\), ఇక్కడ \(\hat{n}\), ∠BCA సమద్విఖండన దిశలోని ఏకాంక సదిశ.

మూడు ఆవేశాలపై పనిచేసే బలాల మొత్తం శూన్యం కావడం అనేది ఆసక్తి కలిగించే అంశం. అంటే,
F1 + F2 + F3 = 0

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 8.
2.0 × 104 N C-1 పరిమాణం గల ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఎలక్ట్రాన్ 1.5cm దూరం పతనం చెందుతోంది. (పటం a). పరిమాణంలో మార్పులేకుండా క్షేత్ర దిశను వ్యతిరేక దిశలోకి మార్చడం వల్ల ప్రోటాన్ కూడా అంతే దూరం. పతనం చెందింది. (పటం (b)). రెండు సందర్భాల్లో పతన కాలాన్ని లెక్కించండి. దీన్ని గురుత్వ వల్ల స్వేచ్ఛా పతన సన్నివేశంతో భేదపర్చండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 89
సాధన:
పటం (a) లో E పరిమాణం గల, క్షేత్రం ఊర్ధ్వ దిశలో ఉంది కాబట్టి రుణావేశిత ఎలక్ట్రాన్ eE పరిమాణం గల అథోబలానికి లోనవుతుంది. ఇక్కడ E విద్యుత్ క్షేత్ర తీవ్రత, ఎలక్ట్రాన్ త్వరణం ae = eE/me.
ఇక్కడ me ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 90

కాబట్టి, భారయుత కణం (ప్రోటాన్) సమాన దూరాన్ని ప్రయాణించేందుకు ఎక్కువ కాలాన్ని తీసుకొంటుంది. ఇదే స్వేచ్ఛాపతన వుస్తువుకు, ఈ సన్నివేశానికి ఉండే ప్రాథమిక భేదం. స్వేచ్ఛాపతన వస్తువు పతన కాలం వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడదు. ఉదాహరణలో పతన కాలాన్ని లెక్కించడంలో గురుత్వ త్వరణాన్ని ఉపేక్షించామని గమనించండి. ఇది దోషరహితమేనా అని తెలుసుకొనేందుకు ఇచ్చిన విద్యుత్ క్షేత్రంలో ప్రోటాన్ త్వరణాన్ని లెక్కిద్దాం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 91

ఇది గురుత్వ త్వరణం g (9.8 ms-2) విలువతో పోల్చితే అత్యధికం. ఎలక్ట్రాన్ త్వరణం మరీ ఎక్కువ కాబట్టి, ఈ ఉదాహరణలో గురుత్వ త్వరణాన్ని ఉపేక్షించవచ్చు.

ప్రశ్న 9.
+10-8 C, -10-8 C ఆవేశ పరిమాణం గల q1, q2, అనే రెండు బిందు ఆవేశాలను 0.1 m ఎడంతో అమర్చారు. పటంలో చూపిన A, B, C బిందువుల వద్ద విద్యుత్ క్షేత్రాలను లెక్కించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 92
సాధన:
q1 ధనావేశం వల్ల A వద్ద విద్యుత్ క్షేత్ర సదిశ E1A. ఇది కుడివైపు చూపిస్తుంది. దాని పరిమాణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 93

q2 రుణావేశం వల్ల A వద్ద విద్యుత్ క్షేత్ర సదిశ E2A కుడివైపు చూపిస్తుంది. మరియు పై పరిమాణాన్నే (ఒకే విధమైన) కలిగి ఉంటుంది. కాబట్టి, A వద్ద మొత్తం విద్యుత్ క్షేత్రం పరిమాణం
EA = E1A + E2A = 7.2 × 104 NC-1
EA కుడివైపు దిశలో ఉంటుంది.
q1 ధనావేశం వల్ల B వద్ద విద్యుత్ క్షేత్ర సదిశ E1B ఎడమవైపు చూపుతుంది. దీని పరిమాణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 94
B వద్ద మొత్తం విద్యుత్ క్షేత్రం పరిమాణం = EB = E1B – E2B = 3.2 × 104 N C-1.
EB దిశ ఎడమవైపు ఉంటుంది.

బిందువు C వద్ద, q1, q2 ఆవేశాల వల్ల కలిగే ప్రతి విద్యుత్ క్షేత్ర పరిమాణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 95

ప్రశ్న 10.
రెండు ఆవేశాలు ± 10 µC లను 5.0 mm దూరంలో ఉంచారు. పటం (a) లో చూపిన విధంగా కేంద్రం నుంచి ధనావేశం ఉన్న వైపు 15 cm దూరంలో అక్షంపై ఉండే బిందువు P వద్ద, (b) పటం (b) లో చూపినట్లు డైపోల్ అక్షానికిలంబంగా ఉంటూ ద్వారా పోయే రేఖపై Oనుంచి 15cm దూరంలో ఉండే బిందువు Qవద్ద విద్యుత్ క్షేత్రాలను కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 96
సాధన:
a) + 10 ±C ఆవేశం వల్ల బిందువు P వద్ద క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 97
A, B ల వద్ద ఉండే ఆవేశాల వల్ల P వద్ద ఫలిత విద్యుత్ క్షేత్రం = 2.7 × 105 NC-1, BP దిశలో

OP/OB నిష్పత్తి విలువ చాలా అధికం (= 60). డైపోల్ అక్షంపై ఉండే చాలా దూర బిందువు వద్ద విద్యుత్ క్షేత్రానికి గల ” ఫార్ములాను ఉపయోగించి కూడా పైన పొందిన ఫలితాన్నే ఉజ్జాయింపుగా పొందవచ్చు. 22 దూరంతో ±q ఆవేశాలను కలిగి ఉండే డైపోల్ అక్షంపై కేంద్రం నుంచి దూరంలో విద్యుత్ క్షేత్రం పరిమాణం.
E = \(\frac{2p}{4 \pi\varepsilon_0r^3}\) (r/a >> 1)
ఇక్కడ p = 2aq డైపోల్ భ్రామకం పరిమాణం

డైపోల్ అక్షంపై ఏర్పడే విద్యుత్ క్షేత్రం దిశ ఎప్పుడూ డైపోల్ భ్రామకం సదిశ దిశలోనే (అంటే -q నుంచి q వైపు). ఉంటుంది. ఇక్కడ p = 10-5 × C × 5 × 10-3 m = 5 × 10-8 C m
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 98
ఇది డైపోల్ భ్రామకం AB దిశలో ఉంటూ, దీని విలువ ఇంతకు ముందే పొందిన విలువకు దగ్గరగా ఉంది.

(b) B వద్ద ఉండే + 10 µC వల్ల Q వద్ద ఏర్పడే క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 99

ఈ రెండు బలాల సమాన పరిమాణం గల అంశాలు OQ దిశలో రద్దుపరచుకొంటే, BA కి సమాంతర దిశలో సంకలనం చెందుతాయి. కాబట్టి, A, B ల వద్ద ఉండే రెండు ఆవేశాల వల్ల Q వద్ద ఏర్పడే ఫలిత విద్యుత్ క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 100

a) లో చూసిన విధంగానే డైపోల్ అక్షానికి లంబంగా ఒక బిందువు వద్ద ఏర్పడే క్షేత్రానికి గల ఫార్ములాను నేరుగా ఉపయోగించి కూడా ఇదే ఫలితాన్ని ఉజ్జాయింపుగా పొందవచ్చు :
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 101
ఈ సందర్భంలో విద్యుత్ క్షేత్రం దిశ డైపోల్ భ్రామకం సదిశ దిశకు వ్యతిరేకం. మళ్ళీ, ఫలితం ఇంతకు ముందే పొందిన దానితో ఏకీభవిస్తుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 11.
పటం లోని విద్యుత్ క్షేత్ర అంశాలు Ex = ax½, Ey = Ez = 0. ఇక్కడ a = 800 N/C m½. (a) ఘనం ద్వారా అభివాహాన్ని, (b) ఘనంలోని ఆవేశాన్ని లెక్కించండి. a = 0.1 m అని అనుకోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 102
సాధన:
a) విద్యుత్ క్షేత్రం కేవలం x అంశాన్ని మాత్రమే కలిగి ఉంది. కాబట్టి, x-అక్షానికి లంబంగా ఉండే తలాలకు E, ∆S ల మధ్య కోణం ± π/2. కాబట్టి, అభివాహం Φ = E. ∆S రెండు నీలం రంగు తలాల్లో (ముఖాల్లో) (faces) తప్ప మిగతా అన్నింటికి విడివిడిగా శూన్యం. ఎడమ తలం (ముఖం) వద్ద విద్యుత్ క్షేత్రం పరిమాణంEL = αx½ = αa½ (ఎడమ తలం వద్ద x = a). కుడి ఉపరితలం వద్ద విద్యుత్ క్షేత్రం పరిమాణం ER = αx½ = α[2a]½ (కుడి తలం వద్ద X = 2a).
ఈ తలాల వద్ద అభివాహాలు
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 103

b) ఘనంలోని మొత్తం ఆవేశం q ని కనుక్కొనేందుకు గాస్ నియమాన్ని ఉపయోగించవచ్చు.
Φ = q/ε0 లేదా q = Φε0. కాబట్టి, q = 1.05 × 8.854 × 10-12 C = 9.27 × 10-27. C.

ప్రశ్న 12.
ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రం ధన x- విలువకు ధన x-అక్షం దిశలో, రుణ x విలువకు రుణ x అక్షం దిశలో అంతే పరిమాణంతో ఏకరీతి ఉంది. x > 0 కి E = 200 \(\hat{i}\) N/C, x <0 కి E = -200 \(\hat{i}\) N/C అని ఇచ్చారు. 20 cm పొడవు, వ్యాసార్థం 5 cm గల లంబ వృత్తాకార స్థూపం కేంద్రం మూల బిందువు వద్ద ఉంది. దాని ఒక తలం x = + 10 cm వద్ద మరొక తలం x = – 10 cm వద్ద ఉండే విధంగా దాని అక్షం (x-అక్షం దిశలో ఉంది. (a) దా ని ‘ప్రతి చదునైన తలం ద్వారా వెలువడే నికర అభివాహం ఎంత? (b) స్థూపం పక్క తలం ద్వారా అభివాహం ఎంత? (c) స్థూపం ద్వారా వెలువడే నికర అభివాహం ఎంత? (d) స్థూపం లోపల నికర ఆవేశం ఎంత?
సాధన:
a) ఎడమ తలం (ముఖం) పై E, ∆S లు సమాంతరం అని పటం నుంచి తెలుసుకోవచ్చు. కాబట్టి, వెలువడే అభివాహం
ΦL = E. ∆S -200 \(\hat{i}\)
∆S = +200 ∆S,
ఎందుకంటే \(\hat{i}\). ∆S = – ∆S
= +200 × π(0.05)²
= +1.57 Nm²C-1

కుడి తలంపై, E, ∆S లు సమాంతరాలు కాబట్టి,
ΦR = E. ∆S = +1.57 Nm²C-1.

b) స్థూపం పక్క (పార్శ్వ) తలంపై ఏ బిందువు వద్దనైనా, E, ∆S కి లంబం. కాబట్టి E. ∆S = 0 కాబట్టి, స్థూపం పక్క తలం నుంచి బయటకు వచ్చే అభివాహం శూన్యం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 104

c) స్థూపం ద్వారా వెలువడే నికర అభివాహం
Φ = 1.57 + 1.57 + 0 = 3.14 Nm²C-1.

d) గాస్ నియమం నుంచి స్థూపం లోపల నికర ఆవేశాన్ని కనుక్కోవచ్చు. దాని ప్రకారం.
q = ε0Φ
= 3.14 × 8.854 × 10-12 C
= 2.78 × 10-12 C

AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రశ్న 13.
తొలి పరమాణు నమూనా ప్రకారం, Ze ఆవేశం గల ధనావేశిత బిందు కేంద్రకం ఉండి, దాని చుట్టూ ఏకరీతి సాంద్రతతో రుణావేశం వ్యాసార్థం R వరకు ఉంటుందని అనుకొనేవారు. పరమాణువు మొత్తంగా తటస్థం. ఈ నమూనాకు, కేంద్రకం నుంచి r దూరంలో విద్యుత్ క్షేత్రం ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 105
సాధన:
ఈ పరమాణు నమూనాకు సంబంధించిన ఆవేశ వితరణను పటంలో చూపించారు. R వ్యాసార్ధం గల ఏకరీతి గోళాకార ఆవేశ వితరణలో మొత్తం రుణావేశం -Ze కావాల్సిందే. ఎందుకంటే పరమాణువు తటస్థావేశాన్ని కలిగి ఉంది. కేంద్రకం Ze ఆవేశం + రుణావేశం) ఇది రుణావేశ సాంద్రత ρ ని ఇస్తుంది. కాబట్టి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 106

కేంద్రకం నుంచి దూరంలో ఉండే బిందువు P వద్ద విద్యుత్ క్షేత్రం E (r) ని కనుక్కొనేందుకు మనం గాస్ నియమాన్ని ఉపయోగిస్తాం. ఆవేశ వితరణ గోళీయ సౌష్టవాన్ని కలిగి ఉంది కాబట్టి r దిశతో సంబంధం లేకుండా విద్యుత్ క్షేత్రం E(r) పరిమాణం కేవలం త్రైజ్యా (రేడియల్) దూరంపై మాత్రమే ఆధారపడుతుంది. దీని దిశ మూల బిందువు నుంచి బిందువు P దిశలోని వ్యాసార్థ సదిశ r దిశలో (లేదా వ్యతిరేక దిశలో) ఉంటుంది. కేంద్రకం (nucleus) కేంద్రంగా ఉండే గోళాకార తలం గాసియన్ ఉపరితలం అని మనకు స్పష్టమౌతోంది. r < R, r > R అనే రెండు పరిస్థితులను చూద్దాం.

i) r < R : గోళాకార ఉపరితలంతో ఆవృతమైన విద్యుత్ అభివాహం Φ = E(r) × 4πr²
ఇక్కడ E(r), r వద్ద విద్యుత్ క్షేత్ర పరిమాణం. ఎందుకంటే, గోళాకార గాసియన్ ఉపరితలంపై ఉండే అన్ని బిందువుల వద్ద క్షేత్రం పరిమాణం సమానం. అలాగే ఏదైనా బిందువు వద్ద క్షేత్రం ఆ బిందువు వద్ద గీచిన లంబం దిశలోనే ఉంటుంది.

గాసియన్ ఉపరితలంతో ఆవృతమైన ఆవేశం q అనేది కేంద్రక ధనావేశం, r వ్యాసార్థం గల గోళంలోని రుణావేశాల మొత్తం. అంటే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 4 విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు 107
విద్యుత్ క్షేత్రం వ్యాసార్థం దిశలో వెలుపలివైపు ఉంటుంది.

ii) r > R : ఈ సందర్భంలో పరమాణువు తటస్థం కాబట్టి ఈ సందర్భంలో గోళాకార గాసియన్ ఉపరితలంతో ఆవృతం అయ్యే ఆవేశం శూన్యం. కాబట్టి, గాస్ నియమం నుంచి,
E(r) × 4 π r² = 0
లేదా E(r) = 0 ; r > R
r = R వద్ద రెండు సందర్భాలు ఒకే ఫలితాన్ని ఇస్తాయి : E = 0.

AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 3rd Lesson తరంగ దృశాశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 3rd Lesson తరంగ దృశాశాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫ్రెనెల్ దూరం అంటే ఏమిటి?
జవాబు:
సరళరేఖా మార్గం నుండి కాంతి కిరణపుంజం గుర్తించదగ్గ విచలనం చెందేవరకు ప్రయాణించే కనిష్ఠ దూరాన్ని ఫ్రెనెల్ దూరం అంటారు.
ఫ్రెనెల్ దూరం (ZF) = \(\frac{a^2}{\lambda}\); a = ద్వారం యొక్క మందము; λ = తరంగ దైర్ఘ్యము

ప్రశ్న 2.
కిరణ దృశాశాస్త్రం చెల్లుబాటుకు సమర్ధనను ఇవ్వండి.
జవాబు:
ZF కన్నా దూరాలు బాగా తక్కువైనప్పుడు, కిరణం యొక్క పరిమాణంతో పోల్చినప్పుడు వివర్తనం వల్ల విస్తరణ తక్కువగా ఉంటుంది.

దూరాలు ZF కు సమానం మరియు ZF కన్నా బాగా ఎక్కువైతే వివర్తనం వల్ల విస్తరణ కిరణ దృశాశాస్త్రంలో అధిగమిస్తుంది. (ద్వారం పరిమాణం a).
ZF = \(\frac{a^2}{\lambda}\)

ఈ సమీకరణం నుండి తరంగదైర్ఘ్య అవధి సున్నాను సమీపిస్తే కిరణ దృశాశాస్త్రము పాటించబడుతుంది.

ప్రశ్న 3.
కాంతి ధృవణం అంటే ఏమిటి?
జవాబు:
కాంతి యొక్క కంపనాలు కేవలం ఒకే ఒక్క దిశలో ఉంటే ఆ దృగ్విషయాన్ని ధ్రువణం అంటారు.
(లేదా)
కాంతి తరంగం యొక్క విద్యుత్ క్షేత్ర తిర్యక్ సదిశ, ఒకే తలానికి పరిమితమైతే ఆదృగ్విషయాన్ని ధ్రువణం అంటారు.

ప్రశ్న 4.
మాలస్ నియమం అంటే ఏమిటి?
జవాబు:
విశ్లేషణకారి గుండా పోయే ప్రసార ధ్రువిత కాంతి యొక్క తీవ్రత, విశ్లేషణకారి యొక్క ప్రసారతలానికి, ధ్రువణకారి యొక్క తలానికి మధ్యగల కొసైన కోణము వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
I cos² θ; I = I0 cos² θ.

ప్రశ్న 5.
బ్రూస్టర్ నియమాన్ని వివరించండి.
జవాబు:
బ్రూస్టర్ నియమం :
యానకం యొక్క వక్రీభవన గుణకము ధ్రువణ కోణము యొక్క టాంజెట్ విలువకు సమానం.
µ = tan iB, ఇక్కడ iB = బ్రూస్టర్ నియమం, µ = వక్రీభవన గుణకం
గమనిక : r + iB = 90°

AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం

ప్రశ్న 6.
ఒక పరావర్తక తలం మీద పతనమైన ఏకవర్ణ కాంతి పుంజం ఎప్పుడు పూర్తిగా ప్రసారితం అవుతుంది?
జవాబు:
లేసర్ జనకం నుండి ఉద్గారమైన కాంతిని ధ్రువణకారి గుండా పంపి, పరావర్తిత తలంపై బ్రూస్టర్ కోణం (iB) తో పతనమైనప్పుడు ధ్రువణకారిని తిప్పితే ఒక నిర్దిష్ట అమరిక వద్ద పతనకాంతి పూర్తిగా ప్రసారమవుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కాంతిలో డాప్లర్ ప్రభావాన్ని వివరించండి. అరుణ విస్థాపనం, నీలివిస్థాపనాల మధ్య భేదాన్ని గుర్తించండి. [TS (Mar.’16)]
జవాబు:
కాంతితో డాప్లర్ ప్రభావం :
కాంతిజనకము మరియు పరిశీలకుడు మధ్య సాపేక్ష గమనము ఉన్నప్పుడు, కాంతి యొక్క దృశ్య పౌనఃపున్యములో మార్పు జరుగుతుంది. ఈ దృగ్విషయాన్ని డాప్లర్ ప్రభావం అంటారు.

పరిశీలకుడు మరియు కాంతి జనకం మధ్యదూరం తక్కువైతే కాంతి యొక్క దృశ్యపౌనఃపున్యము పెరుగుతుంది. మరియు పరిశీలకుడు, కాంతిజనకం మధ్యదూరం పెరిగితే, కాంతి యొక్క దృశ్యపౌనఃపున్యము తగ్గుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 1

అనువర్తనాలు :

  1. దీనిని ఉపయోగించి నక్షత్రాల వేగాన్ని మరియు పాలపుంతల వేగాన్ని కొలవవచ్చు.
  2. దీనిని ఉపయోగించి సూర్యుడి భ్రమణవడిని తెలుసుకోవచ్చు.

అరుణ విస్తాపనం :
వర్ణపటంలోని దృగ్గోచర ప్రాంతం యొక్క మధ్యభాగం దృశ్య తరంగదైర్ఘ్యము ఎరుపురంగువైపు కదులుతుంది. దీనిని అరుణ విస్తాపనం అంటారు.

నీలి విస్తాపనం :
జనకం నుండి సేకరించిన తరంగాలు, పరిశీలకుడివైపు చలించినప్పుడు, దృశ్యతరంగదైర్ఘ్యము తగ్గుతుంది. దీనినే నీలివిస్తాపనం అంటారు.

ప్రశ్న 2.
సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏమిటి? ఈ దృగ్విషయాన్ని హైగెన్స్ సూత్రాన్ని ఉపయోగించి పరిశీలించండి.
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనం :
కాంతికిరణము సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించినప్పుడు, పతన కోణం, సందిగ్ధకోణం కన్నా ఎక్కువైతే తిరిగి అదేయానకంలోకి పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 2

హైగెన్ సూత్రం :
హైగెన్ నియమం ప్రకారం తరంగాగ్రం ABపై ఉన్న ప్రతిబిందువు, గౌణ తరంగాగ్రాలకు జనకం వలే పని చేస్తుంది. తరంగాగ్రముBనుండి Cకి ప్రయాణించుటకు పట్టుకాలము.
దూరం BC = υτ
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 3

పరావర్తన తరంగాన్ని υτ వ్యాసార్థం గల గోళంగా A బిందువు నుండి గీయాలి.

C నుండి గోళము వరకు ఒక స్పర్శరేఖ CE ని గీయాలి.
AE = BC = υτ

EAC మరియు BAC లు ఒకే మాదిరి త్రిభుజాలు.

∴ i మరియు r కోణాలు సమానం. దీనిని పరావర్తన నియమం అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం

ప్రశ్న 3.
కాంతి వ్యతికరణం సంభవించే బిందువు వద్ద కాంతి తీవ్రతకు సమాసాన్ని ఉత్పాదించండి. గరిష్ట, శూన్య తీవ్రతల నిబంధనలను రాబట్టండి. [AP. Mar.’16; ‘TS. Mar.’15]
జవాబు:
ఒకే కంపన పరిమితి (a) గల రెండు తరంగాల స్థానభ్రంశాలు Y మరియు y2 అనుకొనుము. అనునది వాటి మధ్య దశాభేదం అనుకొనుము.
y1 = a sin ωt ………………… (1)
y2 = a sin (ωt + Φ) ……………… (2)
ఫలిత స్థానభ్రంశం y = y1 + y2
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 4

y = a sin ωt + a sin (ωt + Φ)
y = a sin ωt + a sin ωt cos Φ + a cos ωt sin Φ
y = a sin ωt [1 + cos Φ] + cos ωt (a sin Φ) ………… (3)
R cos θ = a (1 + cos Φ) ………… (4)
R sin θ = a sin Φ ………… (5)
y = R sin ωt . cos θ + R cos ωt . sin θ
y = R sin (ωt + θ) ………….. (6)

ఇక్కడ R అనునది P వద్ద ఫలిత కంపన పరిమితి, (4) మరియు (5) సమీకరణాలను వర్గము చేసి కూడగా
R² [cos² θ + sin² θ] = a²[1 + cos² Φ + 2 cos Φ + sin² Φ]
R² [1] = a’ [1 + 1 + 2 cos Φ]
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 5

ప్రశ్న 4.
వ్యతికరణం, వివర్తనం’ దృగ్విషయాలకు శక్తి నిత్యత్వ నియమం వర్తిస్తుందా? క్లుప్తంగా వివరించండి. [Mar. ’14]
జవాబు:
అవును. శక్తి నిత్యత్వ నియమం పాటించబడుతుంది. నిర్మాణాత్మక వ్యతికరణములో తీవ్రత గరిష్ఠం. కాబట్టి వెలుగు పట్టీలు తెరపై ఏర్పడతాయి. అదేవిధంగా వినాశాత్మక వ్యతికరణము జరిగినప్పుడు తీవ్రత కనిష్ఠం. కాబట్టి తెరపై చీకటి పట్టీలు ఏర్పడతాయి.

ఈ విధంగా ఏర్పడిన వ్యతికరణము మరియు వివర్తనంలో కాంతి తీవ్రత తిరిగి సర్దుబాటు జరుగుతుంది. అనగా శక్తి ద్యుతిహీన పట్టీ (చీకటి పట్టీ) నుండి ద్యుతిమయ పట్టీ (వెలుగుపట్టీ)కి బదిలీ జరుగుతుంది. ఇక్కడ శక్తి సృష్టించబడలేదు (లేదా) నాశనం చేయబడలేదు. కేవలం పునఃసర్దుబాటు జరిగింది.

కాబట్టి వ్యతికరణము మరియు వివర్తనాలలో శక్తి నిత్యత్వ నియమం పాటించబడుతుంది.

ప్రశ్న 5.
మీ కన్ను పృథక్కరణ సామర్థ్యాన్ని మీరు ఏ విధంగా నిర్థారిస్తారు? [AP Mar.’17]
జవాబు:
సమాన వెడల్పు గల నలుపు నిలువు చారలను వాటితో విడివడిన తెలుపు చారలను తయారు చేయండి. అన్ని నలుపు నిలువు చారలు సమాన వెడల్పు కలిగి ఉండాలి. అయితే వాటిమధ్య మధ్యస్థంగా తెలుపు నిలువుచారల వెడల్పు ఎడమ నుండి కుడికి పోయేకొద్ది పెరుగుతూ పోవాలి.

ఇప్పుడు ఉత్తమంగా ఒక కంటితో మాత్రమే వ్యూహాన్ని వీక్షించండి. గోడ నుండి దూరంగా (లేదా) దగ్గరగా చలించడం’ ద్వారా, మీరు ఏవైనా రెండు మాత్రమే నలుపు నిలువు చారలను వేరుపడిన చారలుగా కనిపించే స్థానాన్ని గుర్తించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 6

ఈ నలుపు చారకు ఎడమవైపుకు ఉండే అన్ని నిలువు చారలు ఒకదానితో ఒకటి కలిసిపోయి, భేదపరచడానికి వీలుగాకుండా అవుతాయి. మరోవైపు దీనికి కుడివైపున ఉండే నలుపుచారలు మరింత స్పష్టంగా దృగ్గోచరమవుతాయి.

రెండు ప్రాంతాలను వేరుచేసే ఆ తెలుపు చార వెడల్పు d ని నమోదు చేసి, మీ కంటి నుండి గోడదూరం D ని కొలవండి. అప్పుడు \(\frac{d}{D}\) అనేదే మైక్రోస్కోపు వస్తు కటకం ఏర్పరచే నిజప్రతిబింబంమీకన్ను యొక్క పృథక్కరణం అవుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం

ప్రశ్న 6.
వ్యత్యస్థంగా ఉండే రెండు పోలరాయిడ్ల మధ్య ఇంకా పోలరాయిడ్ పలకను భ్రమణం చెందించినప్పుడు ప్రసారిత కాంతి తీవ్రతను చర్చించండి. [TS Mar. 17]
జవాబు:
మొదటి ధ్రువణకారి P1 గుండా పోయిన తర్వాత ధ్రువితకాంతి తీవ్రత I0 అనుకొనుము. రెండవ ధ్రువణకారి P2 గుండా పోయిన తర్వాత ధ్రువిత కాంతి తీవ్రత I = I0cos²θ.

θ అనునది P1 మరియు P2 ల అక్షాల మధ్యకోణం. P1 మరియు P2 లు లంబంగా ఉన్నప్పుడు P2 మరియు P3 మధ్య కోణము (\(\frac{2 \pi}{2}\) – θ)
కాబట్టి P3 నుండి బహిర్గతమయ్యే కాంతి యొక్క తీవ్రత
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 7

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైగెన్స్ సూత్రం అంటే ఏమిటి? హైగెన్స్ సూత్రాన్ని ఉపయోగించి వక్రీభవన దృశా దృగ్విషయాన్ని వివరించండి.
జవాబు:
హైగెన్స్ సూత్రం :
తరంగాగ్రం మీద ప్రతి బిందువును కొత్త గౌణజనకంగా తీసుకోవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 8

సమతలం నుంచి సమతల తరంగాగ్రం వక్రీభవనం :
PP’ అనే సమతలము µ1 మరియు µ2 వక్రీభవన గుణకాలు గల రెండుయానకాలను వేరు చేస్తుంది. మొదటి యానకంలో కాంతి వేగము υ1 మరియు రెండవ యానకంలో కాంతివేగము υ2 అనుకొనుము.

హైగెన్ సిద్ధాంతం ప్రకారం పతన తరంగాగ్రం AB పై ప్రతిబిందువు గౌణ జనకంగా తీసుకోవచ్చు. తరంగాగ్రం B నుండి Cని చేరేకాలంలో, తరంగాగ్రం A నుండి E కి చేరుతుంది. B నుండి C కి చేరే కాలము, A నుండి D కి చేరే కాలం t కి సమానం అనుకొనుము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 9
ఇది స్నెల్ వక్రీభవన నియమం

రెండవ వక్రీభవ నియమం :
పతన కిరణం, పతన బిందువు వద్ద వక్రీభవన తలం PP’ కి గీసిన లంబం, వక్రీభవన కిరణం ఒకే తలంలో ఉన్నాయని రేఖా గణితపరంగా తెలుస్తుంది. ఇది వక్రీభవన నియమాలలో రెండవది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం

ప్రశ్న 2.
సంబద్ధం, అసంబద్ధ తరంగాల సంకలనాల మధ్య భేదాన్ని గుర్తించండి. సంపోషక, వినాశాత్మక వ్యతికరణాల సిద్ధాంతాన్ని అభివృద్ధిపరచండి.
జవాబు:
సంబద్ధ జనకాలు :
రెండు జనకాల మధ్య దశాభేదము శూన్య (లేదా) స్థిర దశాభేదం ఉంటే వాటిని సంబద్ధ జనకాలు అంటారు.

అసంబద్ధ జనకాలు :
రెండు జనకాల మధ్య దశాభేదం కాలంతో పాటు మారితే వాటిని అసంబద్ధ జనకాలు అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 10

నిర్మాణాత్మక మరియు వినాశాత్మక వ్యతికరణం సిద్ధాంతం :
రెండు సంబద్ధ జనకాల తరంగాలు
y1 = a sin ωt ………………… (1)
y2 = a sin (ωt + Φ) ……………… (2)

ఇక్కడ a కంపన పరిమితి, Φ అనునది రెండు తరంగాల మధ్య దశాభేదం.
అధ్యారోపణ సూత్రం ప్రకారం, y = y1 + y2.
y = a sin ωt + a sin (ωt + Φ)
= a sin ωt + a sin ωt cos Φ + a cos ωt sin Φ
y = a sin ωt [1 + cos Φ] + cos ωt [a sin Φ] ……………… (3)
A cos θ = a (1 + cos Φ] ……………… (4)
A sin θ = a sin Φ ……………… (5)
(4) మరియు (5) సమీకరణాలను (3)వ సమీకరణంలో ప్రతిక్షేపించగా
y = A sin ωt. cos θ + A cos ωt sin θ
y = A sin (ωt + θ) ………….. (6)
A అనునది ఫలితం కంపన పరిమితి. (4) మరియు (5) సమీకరణాలను వర్గము వేసి కూడగా
A²[cos² θ + sin² θ] = a²[1 + cos² Φ + 2 cos Φ + sin² Φ]
A² [1] = a² [1 + 1 + 2 cos Φ]
I = A² = 2a² [1 + cos Φ] (∵ I = A²)
I = 2a² × 2 cos² \(\frac{\phi}{2}\)
I = 4a2 cos2 1 = 41 cos2 (∵ I0 = a²)

సందర్భం (i) నిర్మాణాత్మక వ్యతికరణము : తీవ్రత గరిష్ఠం కావాలంటే cos \(\frac{\phi}{2}\) = 1 ⇒ Φ = 2nπ కావాలి.
ఇక్కడ n = 0, 1, 2, 3 … ⇒ Φ = 0, 2π, 4π, 6π ………….. Iగరిష్ట 4I0

సందర్భం (ii) వినాశాత్మక వ్యతికరణము : తీవ్రత కనిష్ఠం కావాలంటే cos Φ = 0 ⇒ Φ = (2n + 1)π
ఇక్కడ n = 0, 1, 2, 3 …………; ⇒ Φ = π, 3π, 5π ⇒ Iకనిష్ఠం = 0

ప్రశ్న 3.
వ్యతికరణాన్ని పరిశీలించడానికి యంగ్ ప్రయోగాన్ని వర్ణించండి. దీని నుంచి పట్టీ వెడల్పుకు సమీకరణాన్ని రాబట్టండి.
జవాబు:
వ్యతికరణము :
రెండు (లేదా) అంతకు ఎక్కువ సంఖ్యలో తరంగాలు అధ్యారోపణం చెందడం వల్ల శక్తి తీవ్రతలో సంభవించే మార్పును వ్యతికరణం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 11

వర్ణన :

  1. థామస్ యంగ్ రెండు సంబద్ధ కాంతి జనకాలను ఉపయోగించి కాంతి వ్యతికరణాన్ని ప్రయోగపూర్వకంగా పరిశీలించాడు.
  2. ఏకవర్ణ కాంతి సన్నని సూదిరంధ్రము S పై పతనం చెంది, గోళాకార తరంగాన్ని జనింపచేస్తుంది.
  3. S నుండి సమాన దూరాలలో S, మరియు S అను రెండు సన్నని సూది రంధ్రాలు.
  4. తెర D దూరంలో ఉంచబడినది.
  5. రెండు శృంగాలు (లేదా) రెండు ద్రోణులు అధ్యారోపణం చెందే బిందువుల వద్ద నిర్మాణాత్మక వ్యతికరణము జరిగి తెరపై ద్యుతిమయ పట్టీలు (వెలుగు పట్టీలు) ఏర్పడతాయి.
  6. ఒక తరంగము యొక్క శృంగము, మరొక తరంగద్రోణి అధ్యారోపణం చెందే బిందువుల వద్ద వినాశాత్మక వ్యతికరణం జరిగి తెరపై ద్యుతిహీన పట్టీలు (చీకటి పట్టీలు) ఏర్పడతాయి.
  7. కాబట్టి తెరపై వెలుగు మరియు చీకటి పట్టీలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఏర్పడతాయి.

పట్టీ వెడల్పు :
i) రెండు వరుస వెలుగు. (లేదా) చీకటి పట్టీల మధ్య దూరాన్ని పట్టీ వెడల్పు అంటారు. దీనిని β తో సూచిస్తారు.

ii) పథ భేదం (δ) = d sin θ
θ చాలా స్వల్పమైతే, పటం నుండి sin θ ≈ tan θ = \(\frac{x}{D}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 12

iii) వెలుగు పట్టీల మధ్య పదభేదం S2P – S2P = nλ
∴ d sin θ = nλ
d × \(\frac{x}{D}\) = ηλ ; x = \(\frac{n \lambda D}{d}\) ………… (1)
ఇక్కడ n = 0, 1, 2, 3 ……..
ఈ సమీకరణము వెలుగు పట్టీ స్థానాన్ని తెలుపుతుంది.
n = 0, అయితే x0 = 0
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 13
కాబట్టి వెలుగు మరియు చీకటి పట్టీలకు పట్టీ వెడల్పు ఒకేవిధంగా ఉంటుంది.

ప్రశ్న 4.
వివర్తనం అంటే ఏమిటి? ఒంటి చీలిక నుంచి పొందగలిగే వివర్తన వ్యూహాన్ని చర్చించండి.
జవాబు:
వివర్తనం :
అవరోధాల అంచుల వద్ద కాంతి వంగి, జ్యామితీయ ఛాయా ప్రదేశంలోకి వ్యాపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని వివర్తనం అంటారు.

ఉదాహరణ:
సూర్యోదయానికి కొద్దిసేపటికి ముందు, పర్వత శిఖరాలు వెండిపొరవలె మెరుస్తాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 14

ఏకచీలిక వద్ద కాంతి వివర్తనము:

  1. AB అనునది d మందం గల సన్నిని చీలిక. దీనిపై λ తరంగదైర్ఘ్యము గల ఏకవర్ణకాంతి లంబంగా పతనం చెందుచున్నది.
  2. వివర్తనం చెందిన కాంతి కుంభాకార కటకం ద్వారా తెరపై కేంద్రీకరణ చెందును.
  3. గౌణ తరంగాగ్రములు OP0 దిశ ప్రయాణించి P0 వద్ద కేంద్రీకరణ చెందుతాయి.
  4. తరంగాగ్రమునకు లంబదిశలో θ కోణము చేయు దిశలో వివర్తనము చెందిన కాంతి P1 బిందువు వద్ద తెరపై కేంద్రీకరణ చెందినది.
  5. P1 వద్ద తీవ్రతను కనుక్కోవడానికి BR పై AC లంబాన్ని గీయాలి.
  6. గౌణ తరంగాగ్రముల మధ్య పథ భేదము BC = AB sin θ = a sin θ (∵ sin θ ≈ θ)
    పథ భేదము (λ) = a θ ………… (1)
  7. ప్రయోగ పరిశీలనల ద్వారా పటంలో θ = 0° వద్ద గరిష్ట తీవ్రత, θ = (n + \(\frac{1}{2}\))\(\frac{\lambda}{a}\) వద్ద గౌణ గరిష్ఠములు మరియు θ = \(\frac{n\lambda}{a}\) వద్ద కనిష్ఠ తీవ్రత వచ్చును.
  8. (1)వ సమీకరణం నుండి, θ = \(\frac{\lambda}{a}\) ఇప్పుడు చీలికను రెండు సమభాగాలుగా, ప్రతిభాగం \(\frac{a}{2\times}\) పరిమాణం ఉండునట్లు విభజించాలి.
  9. θ = \(\frac{n\lambda}{a}\) వద్ద తీవ్రతలు సున్నా అని చూపవచ్చు.
    ఇక్కడ n = 1, 2, 3 ….
  10. θ = (n + \(\frac{1}{2}\))\(\frac{\lambda}{a}\) వద్ద కూడా గరిష్టాలు వస్తాయని చూపవచ్చు.
  11. θ = \(\frac{3\lambda}{2a}\) అనునది రెండు చీకటి పట్టీల మధ్య మధ్య బిందువు అనుకొనుము.
  12. చీలిక యొక్క మొదటి \(\frac{2}{3}\) వంతు తీసుకుంటే, రెండు చివరల మధ్య పదబేధము
    \(\frac{2}{3}\)a × θ = \(\frac{2a}{3}\times\frac{3\lambda}{2a}\) = λ ………. (2)
    AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 15
  13. చీలిక యొక్క మొదటి \(\frac{2}{3}\) వంతును \(\frac{\lambda}{2}\) పధబేధం ఉండునట్లుగా రెండు భాగాలుగా విభజిస్తే, వీటిలో తీవ్రత రద్దవుతుంది. కేవలం మిగిలిన \(\frac{1}{3}\) వంతు భాగంలో మాత్రమే తీవ్రత కనిష్ఠం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం

ప్రశ్న 5.
దృక్ సాధనాల పృథక్కరణ సామర్థ్యం అంటే ఏమిటి? ఏ నిబంధన క్రింద ప్రతిబింబాలు పృథక్కరింపబడతాయో ఉత్పాదించండి.
జవాబు:
పృథక్కరణ సామర్థ్యము :
దగ్గరగా ఉన్న రెండు బిందువులను ఎంతదూరం వరకు విడగొట్టి చూపగలదో ఆ ధారుడ్యాన్ని కటకం యొక్క పృథక్కరణ సామర్థ్యం అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 16

దృశా పరికరాల యొక్క పృథక్కరణ సామర్థ్యము :
i) ఒక సమాంతర కాంతి కిరణము కుంభాకార కటకంపై పతనం చెందినది అనుకొనుము. వివర్తన ప్రభావముచేత, కిరణము పరిమిత వైశాల్యములో చుక్కవలె ఏర్పడుతుంది. ii) వివర్తన ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటే, మధ్యభాగం వృత్తాకారంగా వెలుగు ప్రాంతం, దాని చుట్టూ చీకటి మరియు వెలుగు వృత్తాలు ఏర్పడతాయి.
iii) కేంద్రము వద్ద వెలుగు ప్రాంతం వ్యాసార్ధము
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 17
ఇక్కడ f అనునది కటకం నాభ్యాంతరము 2 = కటకం యొక్క వ్యాసము.

పృథక్కరణకు నిబంధనను రాబట్టుట :
చుక్క పరిమాణము చాలా చిన్నదైతే, పృథక్కరణమునకు గల అవధి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 18

∆θ స్వల్పమైతే, వస్తువు యొక్క వ్యాసము (2a) పెద్దదిగా ఉంటుంది. a విలువ అధికమైతే పృథక్కరణ సామర్థ్యానికి దూరదర్శిని ఉత్తమం.

వస్తువు మరియు వస్తు కటకానికి మధ్య కనిష్ట దూరము dకనిష్టం = \(\frac{1.22 \lambda}{2 \mu \sin \beta}\)

ఇక్కడ µ = వక్రీభవన గుణకం; µ sin B = న్యూమరికల్ అపర్చర్ (సంఖ్యాత్మక కంత)

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
589 pm తరంగదైర్ఘ్యం గల ఏకవర్ణ కాంతి గాలిలో నుంచి నీటి ఉపరితలంపై పతనమైంది. నీటి వక్రీభవన గుణకం 1.33 అయితే, (a) పరావర్తిత కాంతి, (b) వక్రీభవనం చెందిన కాంతి తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం, వడులను కనుక్కోండి.
సాధన:
λ = 589 nm = 589 × 10-9 m

a) పరావర్తన కాంతి :
(పతనకాంతి వలే ఒకే తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం, వడి కలిగి ఉంది)
λ = 589 × 10-9 m, υ = 5.09 × 1014 Hz
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 19

b) వక్రీభవన కాంతి :
(ప్రతన కాంతి వలే ఒకే పౌనఃపున్యం కలిగి ఉంది)
υ = 5.093 × 1014 Hz
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 20

ప్రశ్న 2.
క్రింది ప్రతి సందర్భంలోను తరంగాగ్రం ఆకారం ఏమిటి?
a) ఒక బిందు జనకం నుంచి అపసరం చెందే కాంతి.
b) ఒక కుంభాకార కటకం నాభి వద్ద బిందు జనకాన్ని ఉంచినప్పుడు కటకం నుంచి బహిర్గతమయ్యే కాంతి.
c) భూమి అడ్డగించే సుదూర నక్షత్రం నుంచి వచ్చే కాంతి తరంగాగ్ర భాగం.
సాధన:
a) ఇది గోళాకార తరంగాగ్రం
b) ఇది సమతల తరంగాగ్రం
c) సమతల తరంగాగ్రం (అతిపెద్ద గోళంపై స్వల్ప వైశాల్యం దాదాపు సమతలంగా ఉంటుంది).

ప్రశ్న 3.
a) గాజు వక్రీభవన గుణకం 1.5. గాజులో కాంతి వడి ఎంత? (శూన్యంలో కాంతి వడి 3.0 × 1014 m s-1)
b) గాజులో కాంతి వేగం కాంతి రంగు మీద ఆధారపడదా? అలా కాకుంటే, ఎరుపు, ఊదా రెండు రంగులలో ఏది గాజు పట్టకంలో నెమ్మదిగా ప్రయాణిస్తుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 21

b) లేదు. వక్రీభవన గుణకం మరియు యానకంలో కాంతివేగం తరంగదైర్ఘ్యంపై ఆధారపడును. µν > µr.
∴ vఊదా < vఎరుపు కాబట్టి ఊదారంగు కాంతి ఎరుపురంగు కాంతి కన్నా నెమ్మదిగా ప్రయాణిస్తుంది.

ప్రశ్న 4.
యంగ్ జంట చీలిక ప్రయోగంలో, చీలికలను 0.28 mm వేరుపరచి, తెరను 1.4 m దూరంగా ఉంచారు. కేంద్రీయ గరిష్ఠం, నాల్గవ గరిష్ఠాల మధ్య దూరాన్ని 1.2 cm గా కొలిచారు. ప్రయోగంలో ఉపయోగించిన కాంతి తరంగదైర్ఘ్యాన్ని కురుక్కోండి.
సాధన:
d = 0.28 mm = 0.28 × 10-3 m, D = 1.4 m, β = 1.2 × 10-2 m, n = 4
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 22

ప్రశ్న 5.
ఏకవర్ణ కాంతి తరంగదైర్ఘ్యం λ ని ఉపయోగించిన యంగ్ జంట చీలిక ప్రయోగంలో తెరమీద పథభేదం λ గల ఒక బిందువు వద్ద కాంతి తీవ్రత K యూనిట్లు. పథభేదం λ/3 గల బిందువు వద్ద కాంతి తీవ్రత ఎంత?
సాధన:
I1 = I2 = I అనుకొనుము. రెండు కాంతి తరంగాల మధ్య దశాభేదం Φ అయితే ఫలిత తీవ్రత
IR = I1 + I2 + \(2\sqrt{I_1I_2}\) . cos Φ
పథ భేదం = λ, దశాభేదం Φ = 0°
∴ IR = I + I + \(2\sqrt{II}\) . cos 0° = 4I = k
పథ భేదం = \(\frac{\lambda}{3}\)
దశాభేదం Φ = \(\frac{2 \pi}{3}\) రేడియన్
∴ I’R = I + I + \(2\sqrt{II}\) . cos \(\frac{2 \pi}{3}\)
⇒ I’R = 2I + 2I(\(\frac{-1}{2}\)) ⇒ I = \(\frac{k}{4}\)

AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం

ప్రశ్న 6.
యంగ్ జంట చీలిక ప్రయోగంలో వ్యతికరణ పట్టీలను పొందడానికి 650nm, 520 nm అనే రెండు తరంగదైర్ఘ్యాలను కలిగి ఉండే ఒక కాంతి పుంజం ఉపయోగిస్తున్నారు.
a) 650 nm తరంగదైర్ఘ్యానికి తెరమీద కేంద్రీయ గరిష్ఠం నుంచి మూడవ ద్యుతిమయ పట్టీకి గల దూరాన్ని కనుక్కోండి.
b) ఈ రెండు తరంగ దైర్ఘ్యాల వల్ల మృతిమయ పట్టీలు ఎక్కడయితే ఏకీభవిస్తాయో అక్కడి నుంచి కేంద్రీయ గరిష్టానికి ఉండే కనీస దూరం ఎంత?AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 23
సాధన:
λ1 = 650nm = 650 × 10-9m ⇒ λ2 = 520 nm = 520 × 10-9 m
d = చీలికల మధ్యదూరం; D = చీలికల నుండి తెరవకు దూరం
a) మూడవ వెలుగు పట్టీ, n = 3 = x = nλ, \(\frac{D}{d}\) = 3 × 650 \(\frac{D}{d}\) nm

b) nవ వెలుగు పట్టీకి λ2 = 520 nm, (n – 1) వెలుగు పట్టీకి λ1 = 650nm
∴ nλ2 = (n- 1) λ1; n× 520 = (n-1) 650;
4n = 5n – 5 (లేదా) n = 5
∴ అవసరమైన కనిష్ట దూరం, x = nλ2 \(\frac{D}{d}\) = 5 × 520 \(\frac{D}{d}\) = 2600 \(\frac{D}{d}\)nm.

ప్రశ్న 7.
జంట చీలిక ప్రయోగంలో 1 m దూరంలో ఉంచిన తెరమీద ఒక పట్టీ కోణీయ వెడల్పు 0.2° లుగా కనుక్కోవడమైంది. ఉపయోగించిన కాంతి తరంగదైర్ఘ్యం 600 nm. మొత్తం ప్రయోగ అమరికను కనుక నీటిలో ముంచినట్లయితే పట్టీ కోణీయ వెడల్పు ఎంత ? నీటి వక్రీభవన గుణకాన్ని 4/3 గా తీసుకోండి.
సాధన:
ఇక్కడ θ1 = 0.2°, D = 1m, λ1 = 600 nm, θ2 = ?, µ = 4/3
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 23

ప్రశ్న 8.
గాలి నుంచి గాజు సంక్రమణకు బ్రూస్టర్ కోణం ఎంత? (గాజు వక్రీభవన గుణకం = 1.5.)
సాధన:
ఇక్కడ ip = ? µ = 1.5; tan ip = µ = 1.5 ∴ ip = tan-1 (1.5); ip = 56.3

ప్రశ్న 9.
5000 తరంగదైర్ఘ్యం గల కాంతి ఒక సమతల పరావర్తక తలం మీద పడింది. పరావర్తిత కాంతి తరంగదైర్ఘ్యం, పౌనః పున్యాలు ఏమిటి? ఏ పతన కోణం విలువకు పరావర్తిత కిరణం, పతన కిరణానికి లంబంగా ఉంటుంది?
సాధన:
λ = 5000 Å = 5 × 10-7 m
పరావర్తన కాంతి తరంగదైర్ఘ్యం మరియు పౌనఃపున్యం ఒకేవిధంగా ఉంది.
∴ పరావర్తన కాంతి తరంగదైర్ఘ్యం (λ) = 5000 Å
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 24
పతన కోణం i = 45° అయితే పరావర్తన కాంతి, పతనకాంతికి లంబంగా ఉంటుంది.

ప్రశ్న 10.
4 mm కంత, 400 nm కాంతి తరంగదైర్ఘ్యం ఉంటే కిరణ దృశాశాస్త్రం ఎంత దూరానికి సరియైన ఉజ్జాయింపు చేయబడుతుందో అంచనా వేయండి.
సాధన:
a = 4 mm = 4 × 10-3 m; 1 = 400nm = 400 × 10-9 m = 4 × 10-7 m
కిరణ దృశా శాస్త్రంలో దూరాలు, ఫైనల్ దూరాలకు దాదాపుగా సమానం
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 25

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 11.
ఒక నక్షత్రంలోని హైడ్రోజన్ వల్ల ఉద్గారమైన 6563 Å Hα రేఖ 15 Åలకు అరుణ విస్థాపనం చెందినట్లు గుర్తించారు. నక్షత్రం ఎంత-వడితో భూమి నుంచి దూరంగా వెళుతున్నదో అంచనా వేయండి.
సాధన:
λ’ = λ = 15Å = 15 × 10-10m; λ = 6563 Å = 6563 × 10-10 m; v = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 26

ప్రశ్న 12.
శూన్యంలో కాంతివేగం కంటే ఏదైనా ఒక యానకంలో, (నీరు అనుకోండి) కాంతివేగం ఎక్కువగా ఉంటుందని కాంతి కణమయ సిద్ధాంతం ఏవిధంగా ప్రాగుక్తీకరిస్తుందో వివరించండి. నీటిలో కాంతి వేగాన్ని కనుక్కొనే ప్రాయోగిక నిర్ధారణ వల్ల ఈ ప్రాగుక్తీకరణ ధృవపరచబడ్డదా? అలాకాకపోతే, ప్రయోగంలో ఏ ప్రత్యామ్నాయ కాంతి చిత్రణ సుసంగతంగా ఉంటుంది?
సాధన:
న్యూటన్ కణ సిద్ధాంతం ప్రకారం వక్రీభవనంలో విరళ యానకం నుండి వచ్చే పతన కాంతి కిరణాలలోని కణాలు సాంద్రతర యానకంలో కన్నా, తలానికి లంబంగా ఆకర్షణ బలాన్ని కలిగిస్తాయి.
దీని ఫలితంగా లంబవేగాంశము పెరుగుతుంది. కాని తలం వెంబడి అంశం మారదు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 27
ప్రయోగఫలితాలకు ఇది విరుద్ధం (V > c). కావున కాంతి తరంగస్వభావం కలిగి ఉంది.

ప్రశ్న 13.
హైగెన్స్ సూత్రం ఏవిధంగా పరావర్తన, వక్రీభవన నియమాలకు దారితీసిందో ఈ పాఠ్యాంశంలో మీరు నేర్చుకొన్నారు. ఇదే సూత్రాన్ని నేరుగా ఉపయోగించి; ఒక సమతల దర్పణం ముందు ఒక బిందు జనకాన్ని ఉంచినప్పుడు దర్పణం నుంచి దాని మిధ్యా ప్రతిబింబ దూరం, దర్పణం నుంచి వస్తుదూరానికి సమానమని ఉత్పాదించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 28
పటంలో సమతల దర్పణం M1 M2 నుండి దూరంలో ఒక బిందురూప వస్తువు P. OP = r = వ్యాసార్థం గోళాకార చాపాన్ని (AB) గీయాలి. ఇది వస్తువు నుండి గోళాకార తరంగాగ్రం. ఇది M1 M2 పై పతనమవుతుంది. దర్పణం లేకపోతే A’B’ తరంగాగ్రం స్థానం A’B’ అవుతుంది. ఇక్కడ PP’ = 2r, దర్పణం ఉండుటచే AB తరంగాగ్రం A”PB”ను తెలుపుతుంది. హైగెన్ నిర్మాణం ప్రకారం పటంలో A’B’ మరియు A”B” అను రెండు గోళాకార తరంగాగ్రాలు దర్పణం M1 M2 కు ఇరువైపులా సౌష్టవంగా ఉన్నాయి. A’PB’ అనునది A”PB” యొక్క పరావర్తన ప్రతిబింబం. కావున జ్యామితీయంగా OP OP’ అని నిరూపించబడినది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం

ప్రశ్న 14.
తరంగ ప్రసార వడిని ప్రభావితం చేయ సాధ్యమయ్యే కొన్ని అంశాలను పేర్కొందాం :
i) జనక స్వభావం ii) ప్రసార దిశ iii) జనకం మరియు / లేదా పరిశీలకుని చలనం iv) తరంగదైర్ఘ v) తరంగ తీవ్రత
క్రింది ఏ అంశాలపై, ఒకవేళ ఏదైనా, ఆధారపడుతుందా?
a) శూన్యంలో కాంతి వేగం,
b) యానకం (గాజు లేదా నీరు అనుకోండి)లో కాంతి వేగం.
సాధన:
a) శూన్యంలో కాంతివేగం విశ్వస్థిరాంకం, మిగిలిన అన్ని అంశాలపై ఆధారపడదు.

b) యానకంలో కాంతి వేగంపై ఆధారపడును.
i) జనకం యొక్క స్వభావంపై ఆధారపడదు.
ii) యానకంలో ప్రసార దిశపై ఆధారపడదు.
iii) యానకంతో సాపేక్షంగా జనకం చలనంపై ఆధారపడదు. కాని యానకంలో సాపేక్షంగా పరిశీలకుడి చలనంపై ఆధారపడుతుంది.
iv) తరంగదైర్ఘ్యంపై ఆధారపడుతుంది.
v) తీవ్రతపై ఆధారపడదు.

ప్రశ్న 15.
ధ్వని తరంగాల సందర్భానికి పౌనఃపున్య విస్థాపనానికి డాప్లర్ ఫార్ములా రెండు పరిస్థితుల మధ్య స్వల్పంగా తేడా కలిగి ఉంటుంది : (i) జనకం విరామంలో ఉండి; పరిశీలకుడు కదులుతున్నప్పుడు, (ii) జనకం చలిస్తున్నప్పుడు; పరిశీలకుడు నిశ్చలంగా ఉన్నప్పుడు. అయితే, శూన్యంలో ప్రయాణించే కాంతి తరంగాల సందర్భానికి యధాతథ డాప్లర్ ఫార్ములాలు, ఈ పరిస్థితులకు ఖచ్చితంగా సర్వసమానం. ఈ విధంగా ఎందుకు ఉండాలో వివరించండి. ఇవే రెండు పరిస్థితులకు, ఒక యానకంలో కాంతి ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఫార్ములాలు ఖచ్చితంగా సర్వసమానంగా ఉంటాయని మీరు ఆశిస్తారా?
సాధన:
ధ్వని ప్రసారానికి యానకం అవసరం. అందువలన (i) మరియు (ii) సందర్భాలలో జనకం మరియు పరిశీలకుడు మధ్య సాపేక్ష గమనంలో ఉన్నప్పుడు ఒకే విధంగా ఉండదు. రెండు సందర్భాలలో యానకంతో పరిశీలకుడు సాపేక్ష. గమనంలో ఉన్నప్పుడు, డాప్లర్ సూత్రం వేరువేరుగా ఉంటుంది.

కాంతి శూన్యంలో ప్రయాణిస్తున్నప్పుడు, రెండు సందర్భాలలో తేడాను గుర్తించలేం. కావున సూత్రాలు ఖచ్చితంగా సమానం.

కాంతి యానకంలో ప్రయాణిస్తున్నప్పుడు (i) మరియు (ii) సందర్భాలు సమానం కాదు. కావున సూత్రాలు కూడా వేరువేరుగా ఉంటాయి.

ప్రశ్న 16.
600nm తరంగదైర్ఘ్యం ఉపయోగించే యంగ్ జంట చీలిక ప్రయోగంలో, దూరంగా ఉన్న తెరపై ఏర్పడిన పట్టీ కోణీయ వెడల్పు 0.1°. రెండు చీలికల మధ్య ఉండే అంతరం ఎంత?
సాధన:
λ = 600 nm = 6 × 10-7 m,
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 29

ప్రశ్న 17.
క్రింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి :
a) ఒంటి చీలిక వివర్తన ప్రయోగంలో చీలిక వెడల్పును మౌలిక (original) వెడల్పుకు రెండు రెట్లు చేశారు. కేంద్రీయ వివర్తన పట్టీ పరిమాణం, తీవ్రతలను ఇది ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?
b) జంట చీలిక ప్రయోగంలోని వ్యతికరణ వ్యూహంతో ఒక్కో చీలిక వల్ల కలిగే వివర్తనం ఏవిధంగా సంబంధాన్ని కలిగి ఉంటుంది?
c) సుదూర జనకం నుంచి వచ్చే కాంతి మార్గంలో చాలా చిన్నదైన ఒక వృత్తాకార అడ్డును ఉంచినప్పుడు అడ్డు జ్యామితీయ ఛాయ కేంద్రం వద్ద ఒక ద్యుతిమయ చుక్కను చూడటమైంది. ఎందుకో వివరించండి.
d) 10 m ఎత్తుగల ఒక గదిలో ఇద్దరు విద్యార్థులు విభజన గోడ (separated wall) తో 7 m వేరు చేసి ఉన్నారు. కాంతి, ధ్వని తరంగాలు రెండూ అడ్డుల చుట్టూతా వంగగలిగినా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం సులభం. కానీ ఒకరినొకరు చూసుకోవడం ఎందుకు సాధ్యపడదు?
e) కాంతి సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుందనే ఊహన మీద కిరణ దృశాశాస్త్రం ఆధారపడి ఉన్నది. కానీ వివర్తన ప్రభావాలు (చిన్నవి కంత / చీలికలు లేదా చిన్న అడ్డుల చుట్టూతా కాంతి ప్రసారమైనప్పుడు పరిశీలించినది) ఈ ఊహనను తప్పు అని నిరూపిస్తున్నాయి. అయినా కూడా, దృక్సాధనాల విషయంలో ప్రతిబింబాల స్థానాలను, ఇతరత్రా ధర్మాలను అర్థం చేసుకోవడంలో కిరణ దృశాశాస్త్రం భావనలను చాలా సాధారణంగా ఉపయోగిస్తారు. దీనికి మీ సమర్ధన ఏమిటి?
సాధన:
a) ప్రకారం, కేంద్ర వివర్తన పట్టీ పరిమాణం సగానికి క్షీణిస్తే తీవ్రత నాలుగు రెట్లు పెరుగుతుంది.

b) జంట చీలికల ప్రయోగంలో వ్యతికరణ పట్టీల యొక్క తీవ్రతను, ప్రతి చీలిక యొక్క వివర్తనంతో మాడ్యులేట్ చేయవచ్చు.

c) వృత్తాకార అడ్డు యొక్క అంచు వద్ద వివర్తనం చెందిన తరంగం, జ్యామితీయ ప్రాంతం యొక్క కేంద్రం వద్ద వెలుగు పట్టీని ఏర్పరుస్తుంది.

d) వివర్తనంలో అడ్డు యొక్క పరిమాణం, కాంతి తరంగదైర్ఘ్యం కన్నా తక్కువగా ఉంటుంది. అనుకోకుండా అడ్డు యొక్క పరిమాణం తరంగదైర్ఘ్యం కన్నా బాగా ఎక్కువైతే స్వల్ప కోణం వివర్తనం జరుగును. అడ్డుగోడ యొక్క పరిమాణం కొన్ని మీటర్లు ఉంటుంది. కాంతి యొక్క తరంగదైర్ఘ్యం 5 × 10-7 m, ధ్వని 1 kHZ పౌనఃపున్యము వద్ద ‘తరంగదైర్ఘ్యం 0.3 m. అందువలన ధ్వని తరంగాలు వంగుతాయి కాని కాంతి తరంగాలు వంగవు.

e) సాధారణ దృశా పరికరాల పరిమాణము తరంగదైర్ఘ్యం కన్నా అధికం.

ప్రశ్న 18.
రెండు కొండల పైభాగంలో ఉన్న రెండు శిఖరాలు (towers) 40 km ఎడంతో ఉన్నాయి. వీటిని కలిపే రేఖ రెండు శిఖరాలకు మధ్య సగభాగంలో ఒక కొండకు 50 m పైన పోతున్నది. గుర్తించగల వివర్తన ఫలితాలు లేకుండా శిఖరాల మధ్య పంపించగలిగే రేడియో తరంగాల అత్యంత దీర్ఘ (longest) తరంగదైర్ఘ్యం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 30

ప్రశ్న 19.
500nm తరంగదైర్ఘ్యం గల ఒక సమాంతర కాంతి పుంజం ఒక సన్నని చీలిక మీద పడుతుంది. ఫలిత వివర్తన వ్యూహం 1 m దూరంగా ఉండే తెరపై పరిశీలించడమైంది. తెర యొక్క కేంద్రం నుంచి మొదటి కనిష్ఠం 2.5mm దూరం వద్ద గమనించారు. చీలిక వెడల్పును కనుక్కోండి.
సాధన:
λ = 500 nm = 5 × 10-7 m, D = 1 m, y = 2.5 mm = 2.5 × 10-3 m, d = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 31

ప్రశ్న 20.
క్రింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి :
a) తక్కువ ఎత్తులో ఎగిరే ఎయిర్ క్రాప్ట్ పైనుంచి వెళ్లినప్పుడు మన టి.వి. తెరపై బొమ్మ కొద్దిగా కదులుతున్నట్లు మనం గమనిస్తాం. దీనికి సాధ్యమయ్యే వివరణను సూచించండి.
b) వివర్తన, వ్యతికరణ వ్యూహాలలో తీవ్రత వితరణలను అవగాహన చేసుకోవడంలో తరంగ స్థానభ్రంశాల రేఖీయ అధ్యారోపణ సూత్రం ప్రాథమికమైనదని మీరు పాఠ్యాంశంలో నేర్చుకొన్నారు. ఈ సూత్రాన్ని ఏ విధంగా మీరు సమర్థిస్తారు?
సాధన:
a) యాంటెన్నా గ్రహించే సంకేతం, ఎయిర్ క్రాప్ట్ నుండి పరావర్తనం చెందే బలహీన సంకేతంతో వ్యతికరణం చెందుతుంది.

b) తరంగ చలనంలో సమీకరణము అధ్యారోపణ సూత్రాన్ని పాటిస్తుంది. ఇది నిజం, తరంగ కణాలు స్వల్ప కంపన పరిమితి కలిగి ఉంటాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం

ప్రశ్న 21.
ఒంటి చీలిక వివర్త వ్యూహం ఉత్పాదనలో nλ/a కోణాల వద్ద తీవ్రత శూన్యమని చెప్పడమైంది. చీలికను సరియైన విధంగా విభజించడం ద్వారా రద్దుపరచే భావనను సమర్ధించండి.
సాధన:
చీలికను n చీలికలుగా విభజిస్తే చీలిక మందం a’ = \(\frac{a}{n}\). θ దిశలో ప్రతి చిన్న చీలిక తీవ్రత సున్నా. అందువల్ల మొత్తం తీవ్రత సున్నా

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
589.0 mm తరంగదైర్ఘ్యం వద్ద ఉండే సోడియం రేఖ 589.6 pm వద్ద ఉన్నట్లు పరిశీలించినట్లయితే మనకు సాపేక్షంగా పాలపుంత ఎంత వడితో చలించాలి?
సాధన:
νλ = C కాబట్టి, \(\frac{\Delta v}{v}=-\frac{\Delta \lambda}{\lambda}\)
(ν, λ గెలలో స్వల్ప మార్పులకు)
∆λ = 589.6 – 589.0 = + 0.6nm
క్రింది సమీకరణంను ఉపయోగించినట్లయితే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 32
కాబట్టి, పాలపుంత మన నుంచి దూరంగా చలిస్తోంది.

ప్రశ్న 2.
a) రెండు యానకాలను వేరుచేసే తలం మీద ఏకవర్ణ కాంతి పడినప్పుడు, పరావర్తనం, వక్రీభవనం చెందిన కాంతులు రెండూ పతన పౌనఃపున్యంతో సమానంగా పౌనఃపున్యాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకో వివరించండి.
b) కాంతి విరళయానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణించినప్పుడు కాంతి వడి తగ్గుతుంది. వడిలో తగ్గుదల కాంతి తరంగం మోసుకొనిపోయే శక్తిలో తగ్గుదలను సూచిస్తుందా?
c) కాంతి తరంగ చిత్రణలో కాంతి తీవ్రతను కంపనపరిమితి వర్గంతో నిర్ధారిస్తారు. మరి కాంతి ఫోటాన్ చిత్రణలో ఏది కాంతి తీవ్రతను నిర్ధారిస్తుంది.
సాధన:
a) ద్రవ్య పరమాణువులు ఆంగికాలతో పతనకాంతి జరిపే అన్యోన్య చర్య వల్ల పరావర్తనం, వక్రీభవనాలు ఉద్భవిస్తాయి. పరమాణువులను డోలకాలుగా చూడవచ్చు. ఇవి, బాహ్య కారకం పౌనఃపున్యాన్ని తీసుకొని బలాత్కృత డోలనాలు చేస్తాయి. ఆవేశితమైన డోలకం నుంచి ఉద్గారమయ్యే కాంతి పౌనఃపున్యం దాని డోలన పౌనఃపున్యానికి సమానం. కాబట్టి, పరిక్షిప్త కాంతి పౌనఃపున్యం పతన కాంతి పౌనఃపున్యానికి సమానంగా ఉంటుంది.

b) లేదు. ఒక తరంగం మోసుకొనిపోయే శక్తి దాని కంపనపరిమితి మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని తరంగ ప్రసార వడి మీద కాదు.

c) ఫోటాన్ చిత్రణలో, ఇచ్చిన పౌనఃపున్యానికి, ఏకాంక వైశాల్యాన్ని ఏకాంక కాలంలో దాటిపోయే ఫోటాన్ల సంఖ్యతో కాంతి తీవ్రతను నిర్ధారిస్తారు.

ప్రశ్న 3.
1 mm ఎడంతో రెండు చీలికలను చేసి తెరను 1m దూరంలో ఉంచారు. ఉపయోగించిన నీలం-ఆకుపచ్చ కాంతి తరంగదైర్ఘ్యం 500 nm అయితే పట్టీ అంతరం ఎంత?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం 33

AP Inter 2nd Year Physics Study Material Chapter 3 తరంగ దృశాశాస్త్రం

ప్రశ్న 4.
క్రింది ఒక్కొక్క పరిక్రియలవల్ల యంగ్ జంట చీలిక ప్రయోగంలో వ్యతికరణ పట్టీల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది?
a) చీలికల తలం నుంచి తెరను దూరంగా జరిపితే ;
b) (ఏకవర్ణ) జనకం బదులు హ్రస్వ తరంగదైర్ఘ్యం గల మరొక (ఏకవర్ణ) జనకాన్ని ఉపయోగిస్తే;
c) చీలికల మధ్య అంతరం పెరిగితే;
d) జనకం చీలికను జంట చీలిక తలానికి దగ్గరగా జరిపితే;
e) జనకం చీలిక వెడల్పు పెరిగితే;
f) ఏకవర్ణ కాంతి జనకం బదులు వేరొక తెల్లని కాంతి జనకాన్ని ఉపయోగిస్తే
(ప్రతి ఒక్కో పరిక్రియలో నిర్దేశించినవి మినహా, అన్ని పరామితులు మారకుండా ఉంటాయి.)
జవాబు:
a) పట్టీల కోణీయ అంతరం (= λd) స్థిరంగా ఉంటుంది. చీలికల తలం నుంచి తెరకు గల దూరానికి అనులోమానుపాతంగా పట్టీల వాస్తవ అంతరం పెరుగుతుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 5th Lesson వినియోగదారుల రక్షణ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 5th Lesson వినియోగదారుల రక్షణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం వినియోగదారుని హక్కులను వివరించండి.
జవాబు:
వ్యాపారులు తమ యొక్క సామాజిక బాధ్యతలను గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్నప్పటికి అనేక చోట్ల వినియోగదారుడు దోపిడికి గురి అవుతున్నాడు. ఆ కారణముచేత భారత ప్రభుత్వము వినియోగదారుల చట్ట పరిధిలో దిగువ తెలపబడిన వినియోగదారుల హక్కులను పొందుపరచడమైనది.
1) భద్రత హక్కు: తన ప్రాణమునకు గాని, ఆస్తులకు గాని ప్రమాదకరమైన వస్తువులు లేదా సేవల వినియోగము నుండి భద్రత వినియోగదారుని హక్కుగా పరిగణించడమైనది. దీని వలన భద్రమైన జీవనము సాగించుటకు వీలు కల్పించబడినది.

2) సమాచార హక్కు : వస్తువులు మరియు సేవలకు సంబంధించిన నాణ్యత, పరిమాణము, స్వచ్ఛతల గురించి పూర్తి సమాచారము పొందు హక్కు కల్పించబడినది. కాబట్టి ఉత్పత్తిదారుడు వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారమును వినియోగదారునకు అందించవలెను.

3) ఎంపిక హక్కు : తన ఇష్టానికి సరితూగే విధముగా వస్తువుల కొనుగోలు, సేవలను పొందే హక్కు వినియోగదారునకు ఇవ్వబడినది. పంపిణీదారులు వారి ఇష్ట ప్రకారము వినియోగదారులకు వస్తువులు అమ్మరాదు. వినియోగదారులను బలవంతము చేయరాదు. తన ఇష్టానుసారం వస్తువులను ఎంపిక చేసుకునే హక్కు, స్వేచ్ఛ వినియోగదారునకు ఉన్నది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

4) వినియోగదారునకు అవగాహన కల్పించు హక్కు : ఒక వస్తువును గురించి సరైన అవగాహన, నైపుణ్యం కలిగించుకునే హక్కు వినియోగదారునకు కల్పించబడినది. అక్షరాస్యులైన వినియోగదారులు వారి హక్కులు మరియు ఎలాంటి చర్యలు తీసుకునే జ్ఞానము కలిగి ఉంటారు.

5) సమస్యల పరిష్కార హక్కు తనకు జరిగిన దోపిడీ మరియు మోసానికి పరిష్కారము పొందుటకు, వ్యాపారస్తుల దోపిడీ నుంచి నష్టపరిహారము పొందే హక్కు కల్పించబడినది. ఈ హక్కు ద్వారా దోపిడీ, మోసము నుంచి న్యాయము కలుగజేయబడుతుంది.

6) వినిపించే, విన్నవించుకునే హక్కు : వినియోగదారుడు తనకు జరిగిన అన్యాయము గురించి విన్పించుటకు, వ్రాతపూర్వకముగా విన్నవించుకొనుటకు వినియోగదారునకు హక్కు ఉన్నది. తాను కొనుగోలు చేసిన వస్తువులు లోపభూయిష్టముగా ఉన్నా, తనకు అందించిన సేవలలో వ్యత్యాసము ఉన్ననూ వినియోగదారుని మాటలు వినవలెను.

ప్రశ్న 2.
వినియోగదారుని బాధ్యతలు ఏవి ?
జవాబు:
వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుటకు ప్రభుత్వముగాని, స్వచ్ఛంద సంస్థలు గాని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటకీ వినియోగదారుడు తనకు తానుగా వ్యాపారస్తుల దోపిడీ నుంచి రక్షించుకొనుటకు ముందుకురావలెను. అందువలన దిగువ తెలిపిన బాధ్యతలను స్వీకరించవలెను.

1) వస్తువుల నాణ్యత అవగాహన : ఉత్పత్తిదారుల నీతి బాహ్యమైన చర్యల నుండి, కల్తీలను నిరోధించుటకు గాను తాను కొనదలచిన వస్తువుల నాణ్యతపై వినియోగదారుడు కొంత అవగాహన కలిగి ఉండుట అతని బాధ్యత. ఆ వస్తువులపై ఉన్న నాణ్యత ప్రమాణాలను ధృవీకరించిన (I.S.I) ఐ.యస్.ఐ, ఆగ్మార్క్, FPO, పూల్మార్క్, ఎకోమార్క్, హాల్మార్క్ కలిగిఉన్నవా గమనించాలి.

2) తప్పుదారి పట్టించే ప్రకటనల గురించి జాగ్రత్త : వస్తువుల నాణ్యత గురించి అతిశయోక్తిగా ఇవ్వబడే ప్రకటనలపై ఆధారపడకూడదు. ఇతర వినియోగదారులు ఎవరైతే వీటిని వినియోగిస్తున్నారో వారి నుంచి సమాచారము పొందవలెను.

3) ఎంపిక చేసుకునే ముందు వివిధ రకములైన వస్తువులను పరీక్షించే బాధ్యత : వస్తువులను పరీక్షించిన తర్వాత తాము వస్తువులను కొనటానికి ముందు నాణ్యత గురించి, విలువ, మన్నిక, కొన్న తర్వాత అమ్మకపుదారు అందించే సేవలు గురించి తెలుసుకోవాలి.

4) వినియోగదారుడు అమ్మకపుదారునితో జరిగిన వ్యవహారమునకు ఋజువు సంపాదించుట : వీరిద్దరి మధ్య జరిగిన లావాదేవీల గురించి సరైన వ్రాతపూర్వక ధృవీకరణను స్వీకరించి దానిని జాగ్రత్తగా భద్రపరచాలి. ఒకవేళ ఆ వస్తువుపై ఫిర్యాదు చేయవలసినపుడు అది ఉపయోగపడుతుంది. సాధారణముగా వాడే వస్తువులకు వ్యాపారస్తుడు వారంటీ లేక గ్యారంటీ పత్రమును కొనుగోలు చేసిన వస్తువుతో జత చేస్తారు. వాటిపై వ్యాపారస్తుని సంతకము చేసినాడో లేదో గమనించవలెను. వాటిపై వ్యాపార సంస్థ సీలు, తేదీ ఉన్నట్లు చూడవలెను. వాటి కాలపరిమితి ఉన్నంతవరకు భద్రపరచవలెను.

5) వినియోగదారుడు తన హక్కుల గురించి తెలుసుకొనవలెను : వస్తువుల కొనుగోలులోగాని, సేవలు ఉపయోగములోగాని పైన తెలిపిన హక్కులను గురించి సరియైన అవగాహన కలిగి, అవసరమైనపుడు వాటిని ఉపయోగించవలెను. తాము కొనుగోలు చేసిన వస్తువులలో ఎలాంటి లోపాలు లేకుండా వాటికి సంబంధించిన సమాచారము మొత్తం గ్రహించి నాణ్యతను కూడా గమనించి కొనుగోలు చేయవలెను.

6) వాస్తవమైన లోపానికి ఫిర్యాదు చేయుట : ఒక వినియోగదారునిగా మీరు కొన్న వస్తువుపై అసంతృప్తి ఉన్నట్లయితే దానిని పరిష్కరించవలసినదిగా కోరవచ్చును. ఈ విషయములో మీరు మొదట వ్యాపారస్తునికి కావలసిన పరిష్కారము గురించి విన్నవించవలెను. వ్యాపారస్తుడు ఆ ఫిర్యాదుకు స్పందించని యడల మీరు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చును. వాస్తవముగా మీరు కోరుతున్న పరిహారము, జరిగిన నష్టము సమర్థనీయముగా ఉండవలెను. అవాస్తవ ఫిర్యాదులు చేయకూడదు. బలమైన కారణము ఉండవలెను, లేనియెడల ఫోరం మీకు అపరాధ సుంకమును విధించవచ్చును.

7) వస్తుసేవలను సరిగా వినియోగించుకోవడం : వినియోగదారులు వస్తువుల వినియోగము జాగ్రత్తగా చేయవలెను. గ్యారంటీ కాలపరిమితి ఉన్న కారణముగా వేరొక వస్తువు బదులుగా వస్తుంది అనే భావనతో నిర్లక్ష్య ధోరణితో వినియోగించకూడదు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

ప్రశ్న 3.
వినియోగదారుల రక్షణ చట్టం 1986 క్రింద వినియోగదారుని సమస్యల పరిష్కారానికి యంత్రాంగమును వివరించండి.
జవాబు:
వినియోగదారుల రక్షణ చట్టము, 1986 వినియోగదారుల తగాదాల పరిష్కారానికి వివిధ స్థాయిలలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినవి. ఈ యంత్రాంగాన్ని జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి మరియు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగినది.
1) జిల్లా ఫోరం : రాష్ట్ర ప్రభుత్వము ప్రతి జిల్లాలోను జిల్లా ఫోరంను నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసినది. ఈ ఫోరంలో ఒక ప్రెసిడెంటును రాష్ట్ర ప్రభుత్వము నామినేట్ చేస్తుంది. జిల్లా కోర్టులో అతడు అర్హతగల జడ్జి అయి ఉండవలెను. మరో ఇద్దరు సభ్యులు కూడా ఉంటారు. అందులో ఒక స్త్రీ సభ్యురాలు కూడా ఉంటుంది. ఈ సభ్యులకు ఆర్థిక, న్యాయ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన సమస్యలపై కనీసం 10 సంవత్సరాల అనుభవము ఉండవలెను. ఈ సభ్యుల వయస్సు 35 సంవత్సరాలు తక్కువ కాకూడదు మరియు గుర్తింపు పొందిన యూనివర్సిటీ పట్టభద్రులై ఉండాలి. ఫోరంలోని ప్రతి సభ్యుని కాలపరిమితి 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు (ఏది ముందైతే అది).

కలెక్టర్ ఫోరం ఛైర్మన్గా ఉంటాడు. 20 లక్షల రూపాయలకు మించని వస్తువుల ధర మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చును. ఒకవేళ జిల్లాఫోరంలో ఫిర్యాదుదారు సంతృప్తి పొందకపోతే, ఆదేశాలను జారీచేసిన 30 రోజులలోపు రాష్ట్ర కమీషన్కు అప్పీలు చేసుకోవచ్చును.

2) రాష్ట్ర కమీషన్ : రాష్ట్ర కమీషన్ వినియోగదారుల తగాదాలను రాష్ట్ర స్థాయిలో పరిష్కరిస్తుంది. రాష్ట్ర కమీషన్లో ఒక హైకోర్టులో అర్హత గలిగిన జడ్జి మరియు ఇద్దరుకు తక్కువ కాకుండా మరియు నిర్ణయించిన సభ్యులకు మించకుండా ఉంటారు. అందులో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. రాష్ట్ర కమీషన్ 20 లక్షల రూపాయలకు మించని వస్తువుల ధర మరియు కోరిన పరిహారము ఉన్న ఫిర్యాదులను స్వీకరిస్తుంది. రాష్ట్ర పరిధిలోని వినియోగదారుని తగాదా విషయములో అవసరమైన రికార్డులు తెప్పించి సరైన ఆదేశాలను జారీ చేయవచ్చును. జిల్లా ఫోరంలో పెండింగ్లో ఉన్న ఏ ఫిర్యాదునైనా ఒక ఫోరం నుంచి మరొక ఫోరంనకు బదిలీ చేయవచ్చు. దీనికి సర్క్యుట్ బెంచీలు ఉన్నవి. ఒకవేళ బాధిత వ్యక్తి ఈ |కమీషన్ ఆదేశాలతో తృప్తి చెందకపోతే ఆ ఆదేశాలు వెలువడిన 30 రోజులలోపు జాతీయ కమీషన్కు అప్పీలు చేసుకొనవచ్చును.

3) జాతీయ కమీషన్ : 1988 వ సంవత్సరములో కేంద్ర ప్రభుత్వము జాతీయ కమీషన్ ను ఏర్పాటు చేసినది. ఇది జాతీయస్థాయిలో పని చేస్తుంది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వముచే ఏర్పాటు చేయబడిన అత్యున్నత స్థానము. దీని కార్యాలయము కొత్త ఢిల్లీలో ఉన్నది. జాతీయ కమీషన్లో ఒక ప్రెసిడెంటు మరియు నలుగురు సభ్యులు, అవసరమయితే అంతకుమించి ఉంటారు. ఆ సభ్యులలో ఒకరు స్త్రీ సభ్యురాలు ఉంటారు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జీగాని, విశ్రాంతి జడ్జిగాని అయి ఉండాలి. సభ్యులందరూ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పట్టభద్రులై ఉండాలి. ప్రెసిడెంటు, మిగిలిన సభ్యులను కేంద్ర ప్రభుత్వము నియమిస్తుంది. ఒక కోటి రూపాయలకు మించిన విలువ గల వస్తువులు మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జాతీయ కమీషన్కు ఫిర్యాదు చేయవచ్చును. జాతీయ కమీషన్ ఇచ్చిన తీర్పుతో బాధితుడు సంతృప్తి పొందకపోతే ఉత్తర్వులు జారీ చేసిన 30 రోజులలోపు సుప్రీంకోర్టుకు అప్పీలు చేయవచ్చు.

ప్రశ్న 4.
వినియోగదారుల రక్షణ చట్టము 1986 క్రింద ఏ వ్యక్తులు ఫిర్యాదు నమోదు చేయవచ్చు? ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయవచ్చు ? ఫిర్యాదు ఎక్కడ ? ఎలా ? నమోదు చేయాలో చెప్పండి ?
జవాబు:
వినియోగదారుడు తనకు కలిగిన నష్టానికి సంబంధించి సరైన ఫోరంలో ఫిర్యాదు చేయవలెను. వినియోగదారుల రక్షణ చట్టము 1986 ప్రకారం దిగువ తెలిపిన వ్యక్తులు ఫిర్యాదు చేయవచ్చు.

  1. వినియోగదారుడు.
  2. వినియోగదారుల స్వచ్ఛంద సంఘము. ఇందులో సభ్యత్వము లేకపోయినా ఆ వ్యక్తి తరపున వీరు ఫిర్యాదు చేయవచ్చును.
  3. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వము.
  4. ఒకే రకమైన ఫిర్యాదులు చేయదలిచిన వ్యక్తులు కలిసి ఫిర్యాదు చేయవచ్చును.
  5. వినియోగదారునకు మరణం సంభవించిన అతని తరపున అతని వారసుడు.

ఒకరు లేదా అంతకు మించిన వారితరపున ఒక వినియోగదారుడు ఫిర్యాదు చేయవచ్చును.

  1. చేయకూడని వ్యాపారము, నిషేధించిన వ్యాపారమును చేయు వ్యాపారస్తులు, సరిగా సేవలను అందించని సేవా కేంద్రాలపై ఫిర్యాదు చేయవచ్చు.
  2. కొనుగోలు చేసిన వస్తువులు, కొనుగోలుకై చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన వస్తువులలో లోపాలు ఉన్నప్పుడు.
  3. అందించవలసిన సేవలలో లేక అందించుటకు జరిగిన ఒప్పందము ప్రకారము సేవలలో లోటు ఏర్పడినపుడు.
  4. నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధర కలిగినపుడు :
    ఎ) అప్పటికి అమలులో ఉన్న చట్టబద్ధమైన విలువకు ఎక్కువగా ఉన్నట్లయితే;
    బి) ఆ వస్తువులో పేర్కొన్న ధర కంటే;
    సి) ధరల పట్టికలో పేర్కొన్న ధర కంటే;
    డి) అమ్మకపుదారుడు మరియు కొనుగోలుదారు చేసుకున్న ఒప్పందము ప్రకారము;
    ఇ) భద్రతలేని, ప్రాణహాని కలిగించే వస్తువులు లేదా సేవలకు సంబంధించి హాని జరిగితే;

AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

కొనుగోలు చేసిన వస్తువులు/సేవలు మరియు కోరిన పరిహారము 20 లక్షల రూపాయలలోపు ఉన్నట్లయితే జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయాలి. 20 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలు దాటకపోతే ఫిర్యాదులు రాష్ట్ర ఫోరంలో చేయాలి. ఒక కోటి రూపాయలు మించినచో జాతీయ కమీషన్కు ఫిర్యాదు చేయవలెను.

ఫిర్యాదును వ్యక్తిగతముగా గాని, అధీకృత ఏజెంటు ద్వారా గాని లేదా పోస్టు ద్వారా చేయవచ్చు. సరైన సాక్ష్యాధారాలతో చేయనున్న ఆరోపణను ఆధారముగా చూపి ఒక పేపరుపై ఫిర్యాదు చేయవలెను. ఇందులో కోరిన పరిహారము కూడా స్పష్టముగా తెలపవలెను. ఈ పరిస్థితులు తలయెత్తిన సమయము, స్థలము తెలుపుతూ ఫిర్యాదు దారుని మరియు ఎవరిపై చేయదలచినారో ఆ వ్యక్తి చిరునామా ఇతర వివరాలు తెలపవలెను.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వినియోగదారుని అర్థం తెలపండి.
జవాబు:
వినియోగదారుని రక్షణ చట్టం 1986 ప్రకారము వస్తువులకు సంబంధించి వినియోగదారుడు అంటే వస్తువు కొనుగోలుదారు. ప్రతిఫలాన్ని చెల్లించడం ద్వారా లేదా చెల్లిస్తానని తెల్పడం ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తానని ” హామీ ఇచ్చినవారు, పూర్తిగా లేదా పాక్షికముగా ప్రతిఫలాన్ని చెల్లించి వస్తువులు కొన్నవారు, వస్తువులను కొనుగోలుదారు అంగీకారముతో ఉపయోగించేవారు. సేవల విషయములో, ప్రతిఫలానికి సేవలను పొందేవారు లేదా అద్దెకు పొందేవారు, సేవలను కొనుగోలుదారు అంగీకారముతో ఉపయోగించేవారు.

ప్రశ్న 2.
వినియోగదారిత్వం అంటే ఏమిటి ?
జవాబు:
వినియోగదారిత్వము వ్యాపారము మీద వినియోగదారుని ఒత్తిడిని వ్యవస్థీకరించుట ద్వారా మార్కెట్లో అతని హక్కులను పరిరక్షించడము. వినియోగదారిత్వము అనగా వినియోగదారుల రక్షణ చట్టము 1986లో తెలపబడిన వినియోగదారుల హక్కులను రక్షించి చెల్లించే వస్తుసేవలకు సరైన ప్రమాణాలు ఉండేటట్లు చూడడము. ఫిలిఫ్ కొట్లర్ వినియోగదారిత్వము ఒక సామాజిక ఉద్యమము. దీనిలో అమ్మకపుదారులకు సంబంధించి కొనుగోలుదారుల హక్కులను తెలియజేయుట.

పై నిర్వచనాలను బట్టి వినియోగదారిత్వము అనగా ఇది పెరుగుతున్న సామాజిక శక్తి. ఇది వినియోగదారుల హక్కులను గురించి అవగాహన కల్గిస్తుంది. ఈ హక్కుల రక్షణకై

  1. వినియోగదారులకు బోధించి, వారి హక్కులకై పోరాడేటట్లు సంచయమును కలుగజేస్తుంది.
  2. వినియోగదారుల న్యాయమైన హక్కులను హామీ ఇచ్చే విధముగా ప్రభుత్వముపై ఒత్తిడిని తేవడం.
  3. వ్యాపారము నిజాయితీగాను, బాధ్యతగా చేసేటట్లు చూడటం.
  4. వ్యాపారములో అనుచిత చర్యలు, అన్యాయాలు జరగకుండా నివారించడం.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

ప్రశ్న 3.
వినియోగదారుని రక్షణ అంటే ఏమిటి ?
జవాబు:
వినియోగదారుల ఆసక్తిని, హక్కులను పరిరక్షించడాన్ని వినియోగదారుని రక్షణ అంటారు. వ్యాపార సంస్థల అనుచిత చర్యలను అరికట్టడానికి, వినియోగదారుల ఇబ్బందులను నివారించడం ద్వారా వినియోగదారులను రక్షించడాన్ని వినియోగదారుని రక్షణగా చెప్పవచ్చును. దిగువ తెల్పబడినవి సాధారణముగా వ్యాపారములో కన్పించే అనుచిత చర్యలు.

  1. కల్తీ వస్తువులను అమ్మడం, అమ్మే వస్తువులలో నాసిరకం వస్తువులను కలపడం.
  2. అసలు వస్తువులకన్నా తక్కువ విలువ గల వస్తువులను అమ్మడం.
  3. తక్కువ ప్రమాణము గల వస్తువులను అమ్మడం.
  4. నకిలీ వస్తువుల అమ్మకము.
  5. తూనికలు, కొలతలలో లోపం.
  6. అక్రమ నిల్వ, నల్లబజారు. ఈ చర్యల వలన కొరత, ధరలలో పెరుగుదల ఏర్పడతాయి.
  7. గరిష్ట రిటైల్ ధర కన్నా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడం.
  8. లోపభూయిష్టమైన వస్తువుల సరఫరా.
  9. తప్పుదోవ పట్టించే ప్రకటనలు.
  10. చౌకబారు సేవలను సప్లయి చేయుట.

ప్రశ్న 4.
మహాత్మా గాంధీ మాటలలో వినియోగదారుడు అనగా ?
జవాబు:
జాతిపిత మహాత్మాగాంధీ ఒక గొప్ప నాయకుడే కాదు గొప్ప దార్శినికుడు కూడా. ఆర్థికపరమైన రక్షణ చర్యల ద్వారా వినియోగదారులను మోసాల నుండి కాపాడాలని ఉద్భోదించారు. ప్రస్తుతం దేశములో అసంఖ్యాక వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలలో ఆయన వినియోగదారుని విషయములో పేర్కొన్న దిగువ సూత్రాలు పొందు పరచిన బోర్డులు దర్శనమిస్తాయి.

“మన వద్దకు వచ్చే అందరి వ్యక్తులలో వినియోగదారుడు అందరి కంటే ముఖ్యమైనవాడు. అతడు మనపై ఆధారపడి జీవించటం కాదు. మనమే అతనిపై ఆధారపడుతున్నాము. అతడు మన కార్యకలాపాలకు ఆటంకము కాదు. మనము చేసే పనులన్నీ అతని కోసమే. మన వ్యాపారమునకు సంబంధించి అతడు బయట వ్యక్తికాదు. అతడే మన వ్యాపారములో ముఖ్యభాగస్వామి. అతనికి సేవలను అందించడం ద్వారా మనం అతనికి ఏదో మేలు చేస్తున్నట్లుగా భావించరాదు. సేవలను అందించే అవకాశం మనకు కల్పించడం ద్వారా అతనే మనకు ఎంతో మేలు చేస్తున్నాడు”.

ప్రశ్న 5.
జిల్లా ఫోరం.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వముచే ప్రతి జిల్లాలో ఈ ఫోరం ఏర్పాటుచేయబడును. జిల్లా ఫోరంనకు ఒక ఛైర్మన్ మరియు ఇద్దరు సభ్యులు ఉంటారు. అందులో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. జిల్లా జడ్జీ స్థాయి ఉన్న వ్యక్తి ఈ ఫోరానికి అధికారి. 20 లక్షల రూపాయలకు మించని వస్తువుల ధర మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జిల్లాఫోరంలో ఫిర్యాదు చేయవచ్చును. ఒకవేళ జిల్లా ఫోరంలో వినియోగదారుడు సంతృప్తి పొందకపోతే ఆదేశాలు వెలువడిన 30 రోజులలో రాష్ట్ర కమీషన్కు అప్పీలు చేసుకొనవచ్చును.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 5 వినియోగదారుల రక్షణ

ప్రశ్న 6.
రాష్ట్ర కమీషన్.
జవాబు:
రాష్ట్ర కమీషన్ ను రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేసినవి. రాష్ట్ర కమీషన్ లో ఒక ప్రెసిడెంటు, ఇద్దరు సభ్యులు తక్కువ కాకుండా, నిర్దేశించబడిన సభ్యుల సంఖ్య మించకుండా ఉంటారు. ఇందులో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. హైకోర్టు స్థాయి గల జడ్జీ పర్యవేక్షణలో ఉంటాడు. 20 లక్షల రూపాయలకు మించి 1 కోటి రూపాయలకు తక్కువగా ఉన్న వస్తువుల విలువ మరియు కోరిన పరిహారము ఈ పరిమితిలో ఉన్నట్లయితే వ్రాతపూర్వకముగా ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ బాధిత వ్యక్తి ఈ కమీషన్ ఆదేశాలకు తృప్తి చెందనట్లయితే ఈ ఆదేశాలు వెలువడిన 30 రోజులలోపు జాతీయ కమీషన్కు అప్పీలు చేసుకోవచ్చును.

ప్రశ్న 7.
జాతీయ కమీషన్.
జవాబు:
1988లో కేంద్ర ప్రభుత్వము జాతీయ కమీషన్ ను ఏర్పాటు చేసినది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వముచే ఏర్పాటు చేయబడిన అత్యున్నత స్థానము. దీనిని ఢిల్లీలో ఏర్పాటు చేసారు. ఇందులో ఒక ప్రెసిడెంటు మరియు నలుగురు సభ్యులు, (అవసరమయితే అంతకుమించి) వారిలో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జీగాని, విశ్రాంత జడ్జీగాని దీనికి సారథ్యము వహిస్తారు. ఒక కోటి రూపాయలకు మించిన విలువ గల వస్తువులు మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జాతీయ కమీషన్ ఎదుట ఫిర్యాదు చేయవచ్చును. జాతీయ కమీషన్ వెలువరించిన తీర్పుతో సంతృప్తి పొందని పక్షములో ఈ ఉత్తర్వులు వెలువడిన 30 రోజులలోపు బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 4th Lesson విత్త మార్కెట్లు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 4th Lesson విత్త మార్కెట్లు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విత్తమార్కెట్ అంటే ఏమిటి ? దాని విధులు మరియు వర్గీకరణను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
విత్త మార్కెట్ అనే పదానికి విస్తృతమైన అర్థము ఉన్నది. ద్రవ్యత్వ ఆస్తులైన వాటాలు, బాండ్లు, కరెన్సీ నోట్లు మరియు డెరివేటివ్స్ వర్తకము కొరకు కొనుగోలు మరియు అమ్మకపుదారులు పాల్గొనే ఏ మార్కెట్ స్థలమైనా అది విత్తమార్కెట్ అవుతుంది. పెద్ద సంఖ్యలో విత్త సాధనాలను కలిగి ఉండే వివిధ విత్తమార్కెట్లు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటాయి. 20వ శతాబ్దము చివరి వరకు ఈ మార్కెట్లలో కొన్ని ప్రయివేటు పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ ప్రవేశము కల్పించగా, మిగిలినవి దేశీయముగా ఉన్న పెద్ద అంతర్జాతీయ బ్యాంకులు మరియు విత్త నిపుణుల కొరకు ప్రత్యేకించబడినవి.

విత్తమార్కెట్ విధులు’: దిగువ తెలిపిన నాలుగు ముఖ్య విధులను నిర్వర్తించుట ద్వారా పరిమిత వనరులను పంపిణీ చేయుటలో విత్త మార్కెట్లు ముఖ్యమైన పాత్రను వహిస్తున్నవి.
1) పొదుపును సమీకరించి ముఖ్య ఉత్పాదక రంగాలకు మళ్ళించడము: విత్త మార్కెట్ పొదుపు చేసేవారి నుంచి పెట్టుబడిదారులకు పొదుపు మొత్తాలను చేర్చడాన్ని సులభతరము చేస్తుంది. వివిధ పెట్టుబడులలో తమకు ఇష్టమైన వాటిలో అవకాశము కల్పించుట ద్వారా మిగులు నిధులు ముఖ్య ఉత్పాదక అవసరాలకు సరఫరా చేస్తుంది.

2) ధర నిర్ణయాన్ని సులభతరం చేయడం మార్కెట్ డిమాండ్ మరియు సప్లై శక్తులు, వస్తువు లేదా సేవల ధరలను నిర్ణయించడములో సహాయపడతాయి. విత్తమార్కెట్లో కుటుంబాలు నిధుల సరఫరాకు, వ్యాపార సంస్థలు డిమాండుకు ప్రాతినిధ్యము వహిస్తాయి. వాటి మధ్య ఉండే సంబంధము సంబంధిత మార్కెట్లో ఆర్థిక సంబంధమైన ఆస్తుల ధరలను నిర్ణయించడములో తోడ్పడుతుంది.

3) ఆర్థికపరమైన ఆస్తులకు ద్రవ్యత్వము కలుగజేయుట: ఆర్థిక పరమైన ఆస్తుల కొనుగోలు మరియు అమ్మకాలను విత్తమార్కెట్లు సులభతరము చేస్తాయి. ఈ విధముగా చేయడం వలన ఆస్తులకు ద్రవ్యత్వాన్ని కలుగజేసి అవసరమైనపుడు సులభముగా నగదులోనికి మార్చబడతాయి. విత్తమార్కెట్ యంత్రాంగము ద్వారా ఆస్తుల యజమానులు వారి ఆస్తులను || తక్షణము అమ్మగలుగుతారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

4) కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించడము మార్కెట్ లో వర్తకమయ్యే సెక్యూరిటీలను గురించి విలువైన సమాచారాన్ని విత్తమార్కెట్లు అందజేస్తాయి. ఇది విత్త ఆస్తుల కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారుల కాలాన్ని, శ్రమను, ధనాన్ని ఆదా చేస్తుంది. అందువలన విత్తమార్కెట్ కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారులు వారి వ్యక్తిగత అవసరాలను నెరవేర్చుకొనుటకు కలుసుకునే సాధారణ వేదికగా ఉంటుంది.

విత్తమార్కెట్ల వర్గీకరణ: విత్త మార్కెట్ల వర్గీకరణ అవి నిర్వహించే లావాదేవీల కాలపరిమితిని బట్టి ఉంటుంది. ఒక సంవత్సరంలోపు పరిమితిగల కార్యకలాపాలను ద్రవ్య మార్కెట్లోను, దీర్ఘకాల పరిమితిగల కార్యకలాపాలు మూలధన మార్కెట్లో నిర్వహించబడతాయి.

ద్రవ్యమార్కెట్: ఒక సంవత్సరము కాలపరిమితి గల స్వల్పకాలిక నిధులు / ద్రవ్య ఆస్తులతో వ్యవహారాలను జరిపే మార్కెట్ను డ్రవ్య మార్కెట్ అంటారు. ఈ ఆస్తులు ద్రవ్యానికి సమీప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. తాత్కాలిక ‘ద్రవ్య అవసరాలకు, బాధ్యతలకు స్వల్పకాలిక నిధులను ఈ మార్కెట్ సమకూరుస్తుంది. మిగుల నిధుల నుండి రాబడులను ఆర్జించడానికి తాత్కాలిక బదలాయింపు చేస్తుంది. ఈ మార్కెట్లో రిజర్వుబ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్ ఇతర సంస్థలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, భారీ కార్పొరేటు సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యపాత్రను వహిస్తాయి.

మూలధన మార్కెట్: మూలధన మార్కెట్ దీర్ఘకాలిక ఋణాలు సమకూర్చే సంస్థలు, సదుపాయాలను కలుగజేస్తుంది. ఇది ఋణ ఈక్విటీ దీర్ఘకాలిక నిధులు సమకూర్చి పెట్టుబడిగా పెడుతుంది. సమాజములోని పొదుపు మొత్తాలు వివిధ మార్గాల ద్వారా సేకరించి, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలలో పెట్టుబడి పెట్టుటకు అందుబాటులో ఉంటాయి. మూలధన మార్కెట్లో అభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, స్టాక్ ఎక్సేంజ్లు ఉంటాయి.

మూలధన మార్కెట్ను ప్రాథమిక మార్కెట్ మరియు ద్వితీయ మార్కెట్ అను రెండు ముఖ్య విభాగాలుగా విభజించవచ్చును. మొదటి సారి నూతనముగా చేసిన జారీలను ప్రాథమిక మార్కెట్ అని, తదుపరి జరిగే ఏదైనా ద్వితీయ మార్కెట్ లో జరుగుతుంది.

ప్రశ్న 2.
మూలధన మార్కెట్ అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
మూలధన మార్కెట్ అనే పదము దీర్ఘకాలిక ఋణాలు సమకూర్చే సంస్థలు మరియు సదుపాయాలను తెలుపుతుంది. దీనిలో ఋణ మరియు ఈక్విటీ దీర్ఘకాలిక నిధులు సమకూర్చబడి పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. దీనిలో సమాజములోని పొదుపు మొత్తాలను వివిధ మార్గాల ద్వారా సేకరించి, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలలో పెట్టుబడి పెట్టుటకు అందుబాటులో ఉంటాయి. మూలధన మార్కెట్లో అభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు మరియు స్టాక్ ఎక్సేంజ్లు ఉంటాయి. బాగా పనిచేసే మూలధన మార్కెట్ ఉండటము వలన ఆర్థికాభివృద్ధి ప్రక్రియ సులభతరం అవుతుంది. వాస్తవంగా ఆర్థికాభివృద్ధికి విత్త విధానము అభివృద్ధి చెందడం తప్పనిసరి అవుతుంది. ద్రవ్య సహాయక సంస్థలు అవసరమైన మేరకు అభివృద్ధి చెందడంతో పాటు మార్కెట్ కార్యకలాపాలు సులభముగా, నిష్పక్షపాతముగా మరియు పారదర్శకముగా ఉండటం ఎంతో అవసరము.

మూలధన మార్కెట్ ప్రాముఖ్యత:
1) పొదుపు చేసేవారిని, పెట్టుబడిదారులను అనుసంధానము చేయుట: దేశములో నిద్రాణముగా ఉన్న పొదుపు మొత్తాలను సమీకరించి ఉత్పాదక, పెట్టుబడి సంస్థలకు సరఫరా చేయడములో మూలధన మార్కెట్ ప్రముఖ పాత్రను వహిస్తుంది. అధిక ఆదాయము ఉన్నవారి నుంచి పొదుపును సమీకరించి, లోటు మరియు ఉత్పాదక రంగాలకు విత్త వనరులను బదిలీ చేస్తుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

2) పొదుపును ప్రోత్సహించడము: అభివృద్ధి చెందని దేశాలలో మూలధన మార్కెట్ లేకపోవడం వలన చాలా స్వల్ప పొదుపు మొత్తాలు మాత్రమే కలిగి, వాటిని అనుత్పాదక రంగాలలోను మరియు స్పష్టమైన వినియోగములోనూ వెచ్చిస్తున్నారు. మూలధన మార్కెట్ అభివృద్ధి చెందితే విత్త సంస్థలు ప్రజలను ప్రోత్సహించుటకు వివిధ రకాల సాధనాలను అందుబాటులోకి తెస్తాయి.

3) పెట్టుబడికి ప్రోత్సాహము: వాటాలు, బాండ్లు, సెక్యూరిటీలు మొదలైన పత్రాల లభ్యత వలన ప్రభుత్వానికి ఋణాల మంజూరుకు లేదా పరిశ్రమలలో పెట్టుబడికి ప్రోత్సాహం లభిస్తుంది. అందువలన వ్యాపారస్తులకు, ప్రభుత్వానికి ఋణాలు మంజూరు చేయడం ద్వారా మూలధన మార్కెట్ పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది.

4) ధరలలో స్థిరత్వము: మూలధన మార్కెట్ వాటాలు, సెక్యూరిటీల ధరలను స్థిరీకరించి ధరల హెచ్చు, తగ్గులను నివారిస్తుంది. స్థిరీకరణ ప్రక్రియలో పరపతి కోరేవారికి తక్కువ వడ్డీ పెట్టుబడి సరఫరా సాధ్యపడుతుంది. స్పెక్యులేషన్ మరియు అనుత్పాదక రంగాలలో పెట్టుబడిని తగ్గించవచ్చును.

5) ఆర్థికాభివృద్ధిని పెంపొందించడము: ఏ దేశములోనైనా వివిధ రకాల పరిశ్రమలకు వనరులను సక్రమముగా పంపిణీ చేయుట ద్వారా సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని సాధించవచ్చును. మూలధన మార్కెట్ దేశ సాధారణ స్థితిగతులను ప్రతిబింబించడమే కాక ఆర్థికాభివృద్ధి ప్రక్రియను, సులభతరము మరియు వేగవంతము చేస్తుంది.

ప్రశ్న 3.
ద్రవ్య మార్కెట్ మరియు మూలధన మార్కెట్ల మధ్య భేదాలు వ్రాయండి.
జవాబు:
మూలధన మార్కెట్

  1. పార్టిసిపెంట్సు: మూలధన మార్కెట్లో అభివృద్ధి బ్యాంకులు మరియు పెట్టుబడి సంస్థలు ప్రధాన పాత్రను పోషిస్తాయి.
  2. సాధనాలు: ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్లు, బాండ్లు మొదలైనవి ప్రధాన వ్యాపార సాధనాలుగా ఉంటాయి.
  3. పెట్టుబడి వ్యయము: మూలధన మార్కెట్లో పెట్టుబడి పెద్ద మొత్తములో అవసరము ఉండదు. దీనిలో సెక్యూరిటీల యూనిట్ల విలువ సాధారణముగా తక్కువగా ఉంటుంది.
  4. కాలపరిమితి: ఇది ఒక సంవత్సరము కంటే ఎక్కువ దీర్ఘకాల పరిమితిగల నిధులకు చెందిన మార్కెట్.
  5. ద్రవ్యత: మూలధన మార్కెట్ లోని సెక్యూరిటీలను ద్రవ్యత గల పెట్టుబడులుగా భావిస్తారు. కారణం వీటిని స్టాక్ ఎక్సేంజ్లలో అమ్మవచ్చును.
  6. భద్రత: రాబడి మరియు పెట్టుబడి తిరిగి పొందే విషయములో మూలధన మార్కెట్ సాధనాలు నష్టభయంతో కూడుకున్నవి.
  7. ఆశించే రాబడి: మూలధన మార్కెట్లో పెట్టుబడి వలన సాధారణముగా పెట్టుబడిదారులకు ద్రవ్యమార్కెట్లో కంటే ఎక్కువగా రాబడి వచ్చే అవకాశము ఉన్నది.
  8. నియంత్రణ: మూలధన మార్కెట్లోని సంస్థలను సెబి నియంత్రిస్తుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ద్రవ్య మార్కెట్
కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకులు ప్రధాన భాగస్వాములుగా ఉంటాయి.
స్వల్పకాల పరిమితి ఋణ సాధనాలైన ట్రెజరీ బిల్లులు, వర్తకపు బిల్లులు, వాణిజ్య పత్రాలు, డిపాజిట్ సర్టిఫికేట్లు ముఖ్య సాధనాలుగా ఉంటాయి. ద్రవ్య మార్కెట్లో సాధనాలు అధిక వ్యయముతో కూడినవి కావడముతో కార్యకలాపాలు పెద్ద మొత్తములో జరుగుతాయి.

ఇది ఒక సంవత్సరం కాలము మించని స్వల్ప కాల పరిమితి గల నిధుల మార్కెట్.

ద్రవ్య మార్కెట్లోని సాధనాలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం వలన అత్యధిక ద్రవ్యత్వాన్ని పొందుతున్నది.

ద్రవ్య మార్కెట్ సాధారణముగా కనీస నష్టభయం మాత్రమే కలిగి చాలా బాధ్యతతో కూడినది. స్వల్పకాల పెట్టుబడి మరియు జారీ చేసే వారి ఆర్థిక పటిష్టత వలన భద్రత అధికముగా ఉంటుంది.

మూలధన మార్కెట్తో పోల్చి చూసినపుడు ద్రవ్య మార్కెట్లో పెట్టిన పెట్టుబడికి రాబడి తక్కువగా ఉంటుంది.
భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్యమార్కెట్లను నియంత్రిస్తుంది.

ప్రశ్న 4.
స్టాక్ ఎక్సేంజ్్న నిర్వచించి, దాని విధులను చూపండి.
జవాబు:
సెక్యూరిటీల కాంట్రాక్టు క్రమబద్ధచట్టము 1956 స్టాక్ ఎక్సేంజ్ని క్రింది విధముగా నిర్వచించినది. “సెక్యూరిటీలలో వ్యవహారాలు, వాటి కొనుగోలు, అమ్మకాల వ్యాపారములో సహాయము చేయుట, క్రమబద్ధము చేయుట, నియంత్రణ చేయుట మొదలైన ఆశయాలతో ఏర్పడిన నమోదు అయిన లేదా నమోదు కాని వ్యక్తుల సంఘము లేదా వ్యవస్థ”.

స్టాక్ ఎక్సేంజ్ విధులు:
1) మార్కెట్ను సిద్ధముగా ఉంచుట: అన్ని రకములైన సెక్యూరిటీలను అన్నివేళలా కొనడానికి, అమ్మడానికి సంసిద్ధంగా ఉన్న మార్కెట్ స్టాక్ ఎక్సేంజ్. అందువలన పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మూలధనాన్ని సేకరిస్తాయి.

2) సెక్యూరిటీలకు ద్రవ్యతను కలుగజేయుట: స్టాక్ ఎక్సేంజ్ వలన పారిశ్రామిక సంస్థల సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి సిద్ధముగా ఉంటుంది. పెట్టుబడిదారులు తేలికగా సెక్యూరిటీలను అమ్ముకొని, సొమ్ము వాపసు తీసుకోవచ్చు. స్టాక్ ఎక్సేంజ్ల వలన సెక్యూరిటీలకు ద్రవ్యత మరియు మార్కెట్ లభిస్తాయి.

3) కొత్త సెక్యూరిటీల పంపిణీ: కొనసాగుతున్న కంపెనీలకు మూలధనము అవసరము అవుతుంది. ఈ అవసరాన్ని స్టాక్ ఎక్సేంజ్ల ద్వారా తీసుకోవచ్చు. కంపెనీ సెక్యూరిటీలకు విస్తృతమైన ప్రచారము చేసి, పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి.

4) మూలధన కల్పనకు అవకాశము: ప్రజలలో పొదుపును, పెట్టుబడి, నష్టము భరించే శక్తిని స్టాక్ ఎక్సేంజ్లు ప్రోత్సహిస్తాయి. దీని వలన ఎక్కువ మూలధన కల్పనకు, దేశ సౌభాగ్యానికి అవకాశము ఏర్పడి దేశ ఆర్థికాభివృద్ధి జరుగును.

5) సెక్యూరిటీల విలువను లెక్కగట్టుట: స్టాక్ ఎక్సేంజ్లలో నిత్యం జరిగే వ్యవహారములు అధికారికముగా నమోదు అవుతాయి. దీనివలన ఏ కంపెనీ పరిస్థితి ఏ విధముగా ఉందనే విషయము పెట్టుబడిదారులకు తెలుస్తుంది. కంపెనీల సెక్యూరిటీల విలువను హేతుబద్ధముగా నిర్ణయించడం జరుగుతుంది.

6) పెట్టుబడిదారుల ఆసక్తులను పరిరక్షించుట: వ్యవహారాలన్నీ స్టాక్ ఎక్సేంజ్లో ముందుగా నిర్ణయించబడిన నిబంధనల ప్రకారము జరుగుతాయి. ఈ నిబంధనలు సెక్యూరిటీల కాంట్రాక్టు రెగ్యులేషన్ చట్టము 1956కు లోబడి ఉంటాయి. అందువలన పెట్టుబడిదారులకు న్యాయము, భద్రత చేకూరుతాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

7) స్పేక్యులేషన్కు అవకాశము: సెక్యూరిటీల ధరలలో మార్పులను హేతుబద్ధముగా ముందుగానే ఊహించి సెక్యూరిటీలను కొనుగోలు, అమ్మకాలు జరపడాన్ని స్పెక్యులేషన్ వ్యాపారం అంటారు. స్టాక్ ఎక్సేంజ్లు స్పెక్యులేషన్కు అవకాశాన్ని కల్పిస్తాయి. సెక్యూరిటీల డిమాండ్, సప్లల మధ్య పొంతన ఏర్పడి, దేశమంతటా ఇంచుమించు ఒకే ధర
అమలులో ఉంటుంది.

8) ఉత్పాదక కార్యక్రమాలకు ద్రవ్యమును ఉపయోగించుట: క్రమబద్ధమైన స్టాక్ మార్కెట్లు ఉండటం వలన దేశములో జరిగే పొదుపు, బంగారములోను, భూముల రూపములో కాకుండా పారిశ్రామిక రంగములో పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. ‘పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు.

ప్రశ్న 5.
SEBI అనగానేమి ? దాని లక్ష్యాలు మరియు విధులను వివరించండి.
జవాబు:
సెక్యూరిటీస్ మరియు ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) క్రమబద్ధమైన మరియు ఆరోగ్యకరమైన సెక్యూరిటీల అభివృద్ధి మరియు పెట్టుబడిదారులకు రక్షణగా పరిపాలన సమితిగా 1988 ఏప్రిల్లో భారత ప్రభుత్వముచే స్థాపించబడినది. ఇది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలన, నియంత్రణలో పనిచేస్తుంది. SEBI |కి జనవరి 1992లో ఒక ఆర్డినెన్సు ద్వారా చట్టబద్ధత కల్పించబడి, తర్వాత ఆర్డినెన్సు స్థానములో పార్లమెంటు సెక్యూరిటీస్ నుండి ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా చట్టము, 1992లో చేయబడినది.

సెబి లక్ష్యాలు: సెబి ప్రధాన లక్ష్యము పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటం, అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు సెక్యూరిటీల మార్కెట్ను నియంత్రించడం.

  1. సరైన మార్గములో విధులు నిర్వర్తించేలా స్టాక్ ఎక్సేంజ్లను మరియు సెక్యూరిటీల పరిశ్రమను నియంత్రించడం.
  2. పెట్టుబడిదారులు ముఖ్యముగా వ్యక్తిగత పెట్టుబడిదారుల హక్కులు మరియు ఆసక్తులను పరిరక్షించడం, వారికి మార్గదర్శకం మరియు అవగాహన కల్పించడము.
  3. ట్రేడింగ్ అక్రమాలను నిరోధించడం మరియు సెక్యూరిటీల పరిశ్రమల స్వయం నియంత్రణ మరియు దాని చట్టబద్ధ నియంత్రణల మధ్య సమన్వయం సాధించడం.
  4. బ్రోకర్లు, మర్చంట్ బ్యాంకర్లు మొదలైన మధ్యవర్తులలో పోటీతత్వము మరియు వృత్తినైపుణ్యం కలుగజేయుటకు ప్రవర్తనా నియమావళిని అభివృద్ధి చేయడం మరియు సక్రమ విధానాలను రూపొందించడము.

సెబి విధులు: సెబి సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణ మరియు అభివృద్ధి, రక్షణ విధులను కూడా నిర్వహిస్తుంది.
I) నియంత్రణ విధులు:

  1. బ్రోకర్లు, ఉపబ్రోకర్లు మరియు మార్కెట్లో గల ఇతర వ్యక్తుల నమోదు.
  2. ఉమ్మడి పెట్టుబడి పథకాలు మరియు మ్యూచువల్ ఫండ్స్ నమోదు.
  3. స్టాక్ ఎక్సేంజ్లు, మరే ఇతర సెక్యూరిటీల మార్కెట్లోని స్టాక్ బ్రోకర్లు, పోర్ట్ ఫోలియో ఎక్సేంజ్లు, చందా పూచీదారులు మరియు మర్చంట్ బ్యాంకర్లను నియంత్రిస్తుంది.
  4. కంపెనీల టేస్ఓవర్ బిడ్లను నియంత్రించుట.
  5. స్టాక్ ఎక్సేంజ్లు మరియు మధ్యవర్తులను పర్యవేక్షణ చేయడం, విచారించడం మరియు ఆడిట్ చేయడం ద్వారా సమాచారాన్ని సేకరించడం.
  6. చట్టము యొక్క ప్రయోజనాలు కాపాడటానికి ఫీజు లేక ఇతర ఛార్జీలను విధించడం.
  7. భారత ప్రభుత్వము సెక్యూరిటీల కాంట్రాక్టు (క్రమబద్ధ) చట్టం, 1956 క్రింద అప్పగించిన అధికారాన్ని
    వినియోగించడం.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

II) అభివృద్ధి విధులు

  1. సెక్యూరిటీల మార్కెట్ మధ్యవర్తులకు శిక్షణ ఇవ్వడం.
  2. పరిశోధనలను నిర్వహించి మార్కెట్లో పాల్గోనే వారికి ఉపయోగపడే సమాచారాన్ని ప్రచురించడం.
  3. సరళమైన విధానాన్ని అనుసరించుట ద్వారా మూలధన మార్కెట్ అభివృద్ధికి చర్యలు చేపట్టడం.

III) రక్షిత విధులు:

  1. తప్పుడు ప్రకటనలు, అవకతవకలు మొదలైన మోసపూరిత మరియు అన్యాయమైన వ్యాపార విధానాలను నిషేధించడము.
  2. ఇన్సైడ్ ట్రేడింగ్ను నియంత్రించడం మరియు అటువంటి విధానాలపై భారీ జరిమానాలు విధించడం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్రవ్య మార్కెట్ యొక్క భాగాలను వివరించండి.
జవాబు:
ద్రవ్య మార్కెట్లో దిగువ భాగాలు ఉంటాయి.
1) పిలుపు ద్రవ్య మార్కెట్: ఇది భారతదేశ ద్రవ్య మార్కెట్కు ఒక ముఖ్యమైన ఉప మార్కెట్. దీనిని పిలుపుకు ద్రవ్యము మరియు చిన్న నోటీసుకు ద్రవ్యము మరియు బ్యాంకుల మధ్య ఋణ మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఈ మార్కెట్లో ద్రవ్యాన్ని అతిస్వల్ప కాలము కోసం డిమాండు చేస్తారు. ఇందులో లావాదేవీల వ్యవధి కొన్ని గంటల నుండి 15 రోజుల వరకు ఉంటుంది. ఇది ముంబై, ఢిల్లీ, కలకత్తా మొదలైన పారిశ్రామిక మరియు వాణిజ్య ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందినది. ప్రాథమికముగా ఈ లావాదేవీలు, స్టాక్ బ్రోకర్లు మరియు డీలర్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి సహాయపడతాయి. అందుబాటులో ఉన్న ద్రవ్యముపై విధించే రేటును పిలుపు రేటు అంటారు. ఈ రేటును ద్రవ్యానికి ఉన్న డిమాండు మరియు పిలుపు రేటు అంటారు. ఈ రేటును ద్రవ్యానికి ఉన్న డిమాండు మరియు సప్ల ఆధారముగా మార్కెట్ శక్తులచే నిర్ణయింపబడుతుంది.

2) అంగీకార మార్కెట్: ఇది స్వల్పకాలిక సాధనాలు కలిగిన మార్కెట్. ప్రధానముగా ఎగుమతిదారులు తాము ఎగుమతి చేసిన వస్తువులకు త్వరగా చెల్లింపు పొందడానికి ఉపయోగించే పరపతి సాధనము.

3) బిల్ మార్కెట్: బిల్ మార్కెట్ అనగా స్వల్పకాలిక బిల్లులు అని అర్థము. ఇది స్వల్ప తేదీగల పత్రాలు, బిల్లులు మొదలైనవి కొనుగోలు మరియు అమ్మకాల కోసం ఉద్దేశించబడినది. ఇది వాణిజ్య బిల్ మార్కెట్ మరియు ట్రెజరీ బిల్ మార్కెట్ను కలిగి ఉంటుంది. ట్రెజరీ బిల్లులను మార్కెట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి సహాయపడుతుంది. అలాగే ఇతర రంగాలకు కూడా సహాయపడుతుంది.

4) అనుషంగిక ఋణ మార్కెట్: ఇది ద్రవ్యమార్కెట్లో ఒక ముఖ్యమైన భాగము. ఓవర్ డ్రాఫ్టులు, నగదు క్రెడిట్లపై ఋణాల రూపములో తీసుకుంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, బంగారం, వెండి, కార్పొరేషన్ల స్టాక్లు కనీస నగదు నిల్వలను నగదు రిజర్వు నిష్పత్తి అంటారు. పిలుపు ద్రవ్య ఋణాలపై చెల్లించే వడ్డీ రేటును పిలుపు రేటు అంటారు. ఈ రేటు రోజు రోజుకు, కొన్నిసార్లు గంట గంటకు మారుతూ ఉంటుంది.

5) డిపాజిట్ సర్టిఫికేట్లు: సెక్యూరిటీ ఆధారము లేని స్వల్పకాల సాధనాలైన డిపాజిట్ సర్టిఫికేట్లను వాణిజ్య బ్యాంకులు మరియు అభివృద్ధి చెందిన ద్రవ్యసహాయ సంస్థలు జారీ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల వృద్ధి తక్కువగా ఉండి, పరపతి అవసరాలు ఎక్కువగా ఉండి ద్రవ్యత్వము లోపించిన సందర్భాలలో వ్యక్తులకు, కార్పొరేషన్లకు మరియు కంపెనీలకు ఈ సర్టిఫికేట్లు జారీ చేయబడతాయి. స్వల్ప కాలానికి పెద్ద మొత్తాలలో డబ్బు సమీకరించడానికి సహాయపడతాయి. దీనిలో నష్టభయము ఎక్కువగా ఉండటం వలన డిపాజిట్ సర్టిఫికేట్లపై రాబడి ట్రెజరీ బిల్లుల కంటే ఎక్కువగా ఉంటుంది.

6) వాణిజ్యబిల్లు: వ్యాపారము చేసే వివిధ సంస్థలు నిర్వహణ మూలధన అవసరాలకు జారీచేసే బిల్లులను వాణిజ్య బిల్లులు అంటారు. ఇది సంస్థల అరువు అమ్మకాల ద్రవ్య సహాయానికి ఉపయోగపడే స్వల్పకాలిక, బదిలీ యోగ్యతగల, స్వయం ద్రవ్యత్వముగల సాధనము. ఈ బిల్లును అరువుకు అమ్మినవారు వ్రాయగా, అరువుకు కొన్నవారు సమ్మతిని తెలుపుతారు. అప్పుడు అది బిల్ మార్కెట్ సాధనమై వర్తకపు బిల్లుగా పిలవబడుతుంది. గడువు కాలంలోగా అమ్మకపుదారుడు డబ్బు అవసరమయితే ఈ బిల్లును బ్యాంకు వద్ద డిస్కౌంటు చేసుకోవచ్చు. వర్తకపు బిల్లులను వాణిజ్య బ్యాంకు అంగీకరిస్తే ఆ బిల్లును వాణిజ్య బిల్లు అంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

7) అనుషంగిక ఋణాలు: ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్ల ఆధారముగా వాణిజ్య బ్యాంకులు అందజేసే ఋణాలను అనుషంగిక ఋణాలు అంటారు.

ప్రశ్న 2.
ద్రవ్య మార్కెట్ సాధనాలను వివరించండి.
జవాబు:
1) ట్రెజరీబిల్: సాధారణముగా కేంద్ర ప్రభుత్వము సంవత్సరము లోపు కాలపరిమితిగల స్వల్పకాలిక ఋణం పొందడానికి ట్రెజరీబిల్ ఒక సాధనముగా ఉపయోగపడుతుంది. స్వల్పకాలిక అవసరాలకు నిధులు పొందడానికి భారత ప్రభుత్వము తరపున భారతీయ రిజర్వుబ్యాంకు ‘జీరో కూపన్ బాండ్ల’ పేరుతో వీటిని జారీ చేస్తుంది. వీటి కొనుగోలు ధర ముద్రిత విలువ కంటే తక్కువగా ఉంటుంది. తిరిగి చెల్లించేటపుడు పూర్తి ముఖ విలువను ప్రభుత్వం చెల్లిస్తుంది.

2) వాణిజ్య పత్రము: నిర్ణీత కాలపరిమితికి జారీచేసి, తిరిగి విమోచనము చేయు సెక్యూరిటీ లేని ప్రామిసరీ నోటు, అన్యాక్రాంత మరియు బదిలీ యోగ్యత గల పత్రాన్ని వాణిజ్య పత్రము అంటారు. భారీ మరియు పరపతి గల కంపెనీలు మార్కెట్ రేటు కంటే తక్కువ వడ్డీకి స్వల్పకాలిక నిధులు పెంచుకునేందుకు వీటిని జారీ చేస్తాయి. సాధారణముగా ఈ వాణిజ్య పత్రాల కాలవ్యవధి 15 రోజుల నుండి ఒక సంవత్సరము వరకు ఉంటుంది. దీనిని డిస్కాంటుకు జారీ చేసి అసలు ధరకు విమోచనం చేయడం జరుగుతుంది. కాలానుగుణ మరియు నిర్వహణ మూలధన అవసరాలకు స్వల్పకాలిక నిధులు సమకూర్చడం దీని ముఖ్యఉద్దేశము. బ్రిడ్జ్ ఫైనాన్స్ అవసరాల నిమిత్తము ఈ సాధనాన్ని కంపెనీలు ఉపయోగిస్తాయి.

3) పిలుపు ద్రవ్యము: ఇది స్వల్పకాలిక నిధుల మార్కెట్. కోరిన తక్షణము కాల పరిమితి ఒక రోజు నుంచి 15 రోజు లోపు తిరిగి చెల్లించే పద్ధతిపై తక్కువ నగదు నిల్వలు ఉన్న బ్యాంకులు ఎక్కువ నగదు నిల్వలున్న బ్యాంకుల నుంచి ఋణాలు తీసుకుంటాయి.

ప్రశ్న 3.
మూలధన మార్కెట్ యొక్క సాధనాలను వివరించండి.
జవాబు:
మూలధన మార్కెట్ సాధనాలు:
1) రక్షిత ప్రీమియం నోట్లు: ప్రీమియంతో విమోచన చేయదగిన మరియు వేరుచేయగల వారెంటుతో 4 నుండి 7 సంవత్సరాల కాల వ్యవధిలో జారీ చేసిన డిబెంచర్లను రక్షిత ప్రీమియం నోట్లు అంటారు. వీటికి జత చేసిన వారంట్ల ఆధారముగా కలిగిన వారికి పూర్తిగా చెల్లించిన ఈక్విటీ వాటాలను పొందే హక్కు ఉంటుంది.

2) అధిక డిస్కౌంటు బాండ్లు: కాలవ్యవధి తరువాత సమాన విలువకు విమోచనము చేసే ఉద్దేశ్యముతో డిస్కౌంటుకు విక్రయించే బాండ్లను డిస్కౌంటు బాండ్లు అంటారు. జారీదారు దీర్ఘకాలిక నిధుల అవసరాలకు అనుగుణముగా వీటిని రూపొందిస్తారు. పెట్టుబడిదారులు వెంటనే రాబడి కోసం ఎదురు చూడకుండా 25-30 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత అమ్మడానికి కొనుగోలు చేస్తారు.

3) వేరుచేయగలిగిన వారెంట్లతో ఈక్విటీ వాటాలు: కంపెనీ జారీ చేసిన వారెంట్లలో పేర్కొన్న కాలము నిర్ణయించిన ధరవద్ద నిర్దేశించిన వాటాల సంఖ్యను వాటాదారుడు కొనుగోలు చేస్తాడు. ఈ వారంట్లు స్టాక్ ఎక్సేంజ్లో విడిగా నమోదై, విడిగా ట్రేడ్ అవుతాయి.

4) వడ్డీతో పూర్తిగా మారే డిబెంచర్లు: ఇవి నిర్దిష్టకాలము తర్వాత పూర్తిగా ఈక్విటీ వాటాలుగా మార్చబడతాయి. మార్పిడి అనేది ఒకటి లేదా అనేక దశలలో జరగవచ్చు. సాధనము ఒక పూర్తి ఋణ సాధనము అయినపుడు పెట్టుబడిదారులకు వడ్డీ చెల్లించబడుతుంది. అయితే మార్పిడి తర్వాత వడ్డీ చెల్లింపు కూడా మారుతుంది.

5) స్వెట్ ఈక్విటీ వాటాలు: ఉద్యోగులు లేదా డైరెక్టర్లు చేసిన పనికి గుర్తింపుగా సంస్థ వారికి జారీచేసే ఈక్విటీ వాటాలను స్వెట్ ఈక్విటీ వాటాలు అంటారు. సాధారణముగా కంపెనీ వాటాలను కొనుగోలు చేయడం ఉద్యోగులకు ఐచ్ఛికము, కాబట్టి స్వెట్ వాటాల వలన వారు జీతముతో పాటు యాజమాన్య లాభాలలో కూడా భాగం పంచుకుంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

6) విపత్తు బాండ్లు: వీటినే ఉపద్రవ లేదా కాట్ బాండ్లు అంటారు. విపత్తు బాండు సాధారణముగా బీమా సౌకర్యం కలిగిన అధిక దిగుబడినిచ్చే ఋణ సాధనము మరియు విపత్తు సమయంలో డబ్బును సేకరించడానికి వీటిని జారీ చేస్తారు. జారీదారు (బీమా లేదా పునఃభీమా కంపెనీ) ముందుగా నిర్వచించబడిన విపత్తుల వలన ఏర్పడిన నష్టాలతో సతమవుతున్న ప్రత్యేక పరిస్థితులలో వడ్డీని చెల్లించి, తిరిగి చెల్లించవలసిన అసలును వాయిదా వేయడం లేదా పూర్తిగా వదిలి వేయడం జరుగుతుంది.

7) విదేశీ కరెన్సీ మారకపు బాండ్లు మారకపు బాండును డెట్ మరియు ఈక్విటీ సాధనాల సమ్మేళనముగా చెప్పవచ్చు. ఇది రెగ్యులర్ కూపను మరియు అసలు చెల్లింపుతో పాటు బాండు యొక్క ఈక్విటీ లక్షణం కారణముగా కంపెనీ స్టాక్ లో వచ్చే ధరల పెరుగుదల ప్రయోజనము కూడా పొందగలడు.

8) డెరివేటివ్స్: డెరివేటివ్ అనేది ఒక విత్త సాధనము. సాధారణముగా ఆస్తులైన కమాడిటీ, బాండ్, ఈక్విటీ, కరెన్సీ, ఇండెక్స్ మొదలైన వాటి లక్షణాలు మరియు విలువల మీద డెరివేటివ్ లక్షణాలు మరియు విలువలు ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న 4.
ప్రాథమిక మరియు ద్వితీయ మార్కెట్ల మధ్యగల తేడాలు ఏవి ?
జవాబు:
ప్రాథమిక మార్కెట్

  1. నూతనముగా ప్రారంభమైన కంపెనీ లేదా కొనసాగుతున్న కంపెనీ కొత్తగా సెక్యూరిటీలను పెట్టుబడిదారులకు అమ్మడం జరుగుతుంది.
  2. కంపెనీ పెట్టుబడిదారుకు నేరుగా లేదా మధ్య వర్తుల ద్వారా సెక్యూరిటీలను అమ్మడం జరుగుతుంది.
  3. నిధుల ప్రవాహము పొదుపు చేసే వారి నుండి పెట్టుబడిదారులకు బదిలీ ద్వారా ప్రాథమిక మార్కెట్ ప్రత్యక్షముగా మూలధన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది.
  4. ప్రాథమిక మార్కెట్ సెక్యూరిటీల కొనుగోలు మాత్రమే జరుగుతుంది. అమ్మకాలు సాధ్యము కాదు.
  5. కంపెనీ నిర్వాహకులచే సెక్యూరిటీల ధరలు నిర్ణయించబడతాయి.
  6. స్థిరమైన భౌగోళిక ప్రదేశము ఉండదు.

ద్వితీయ మార్కెట్

  1. ఇక్కడ అప్పటికీ జారీ చేసిన వాటాలలో ట్రేడింగ్ జరుగుతుంది.
  2. అప్పటికీ ఉన్న వాటాల యజమాన్యపు హక్కు పెట్టుబడిదారుల మధ్య బదిలీ అవుతుంది.
  3. వాటాలను నగదులోనికి మార్చుకునే వీలుండడం వలన ద్వితీయ మార్కెట్ పరోక్షముగా మూలధన నిర్మాణమును ప్రోత్సహిస్తుంది.
  4. స్టాక్ ఎక్సేంజ్లో సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకాలు జరుగుతాయి.
  5. సెక్యూరిటీల ధరలు వాటి డిమాండు మరియు సప్లయి ఆధారముగా నిర్ణయించబడతాయి. 6) నిశ్చయమైన ప్రదేశములో ద్వితీయ మార్కెట్ వ్యవహారాలు జరగుతాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ప్రశ్న 5.
BSE మరియు NSE గురించి మీకు ఏమి తెలుసు ?
జవాబు:
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE): భారతదేశములో మొట్టమొదటి స్టాక్ ఎక్సేంజ్ నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ బొంబాయి నగరములో 1875వ సంవత్సరములో స్థాపించబడినది. కాలానుక్రమముగా ఈ సంస్థ బాంబే స్టాక్ ఎక్సేంజ్ గా రూపాంతరము చెందినది. ఇది ఆసియాలో మొదటి స్టాక్ ఎక్సేంజ్ మరియు భారతదేశములోనే లీడింగ్ ఎక్సేంజ్ గ్రూపులలో ఒకటి. గడచిన 140 సంవత్సరాల నుంచి మూలధన సమీకరణ చేస్తూ భారతీయ కార్పొరేటు రంగ అభివృద్ధికి సహకరిస్తుంది. ఇది సెక్యూరిటీల కాంట్రాక్టు (రెగ్యులేషన్) చట్టం 1956 కింద కేంద్ర ప్రభుత్వంచే 1956లో గుర్తించబడిన మొదటి స్టాక్ ఎక్సేంజ్. ఇది ఆసియాలో 4వ అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్ మరియు ప్రపంచములో 9వ అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్ కీర్తించబడినది. 5000లకు పైగా కంపెనీల నమోదు కలిగిన స్టాక్ ఎక్సేంజ్ ప్రపంచములో మొదటి స్థానం పొందినది.

జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (NSE): భారత స్టాక్ మార్కెట్లో అతి ముఖ్యమైన అభివృద్ధి జాతీయ స్టాక్ ఎక్సేంజ్ స్థాపనగా చెప్పవచ్చు. దీనిని నవంబరు 27, 1992న అధునాతన సాంకేతిక పరిజ్ఞానముతో స్థాపించబడి, ఏప్రిల్ 1993లో స్టాక్ ఎక్సేంజ్ గుర్తింపబడినది. 1994వ సంవత్సరములో తన కార్యకలాపాలను డెట్ రంగములో ప్రారంభించినది. తదుపరి నవంబరు 1994లో ఈక్విటీల కొరకు మూలధన రంగములోకి జూన్ 2000 సంవత్సరములో డెరివేటివ్స్ రంగములోనికి తన కార్యకలాపాలను విస్తరించినది. ఇది జాతీయ స్థాయిలో అధునాతన స్క్రీన్ ఆధారిత వర్తక విధానాన్ని నెలకొల్పినది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను పెట్టుబడిదారుల ముందరకు తీసుకొనిరాగలిగినది. భౌగోళిక ప్రాంతాలతో సంబంధము లేకుండా పాదర్శకతతో అందరికి సమానముగా అందుబాటులో ఉండే విధముగా జాతీయ స్క్రీన్ ఆటోమేటిక్ వర్తక విధానాన్ని జాతీయ స్టాక్ ఎక్సేంజ్ ఏర్పాటు చేసినది.

ప్రశ్న 6.
డిపాజిటరీ మరియు డిమెటీరియలైజేషన్ గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
డిపాజిటరీ: బ్యాంకు ఖాతాదారుల సొమ్మును సురక్షితముగా ఉంచినట్లే డిపాజిటరీ కూడా పెట్టుబడిదారుల తరపున సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపములో ఉంచుతుంది. డిపాజిటరీ వద్ద ఖాతాను ప్రారంభించి వాటాలన్నీ | డిపాజిట్ చేయబడతాయి. ఖాతాదారుని తరపున అతని సూచనలకు అనుగుణముగా వాటాలను కొనడం, అమ్మడం జరుగుతుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానంతో నడపబడే ఎలక్ట్రానిక్ స్టోరేజ్ పద్ధతి. దీనిలో వాటా పత్రాలు, బదిలీలు మొదలైన వాటికి సంబంధించి ఎటువంటి పేపర్ వర్క్ ఉండదు. పెట్టుబడిదారుల వ్యవహారాలన్నీ ఎక్కువ వేగము, సామర్థ్యముతో పరిష్కరించబడతాయి మరియు సెక్యూరిటీలన్నీ బుక్ ఎంట్రీ రూపములో నమోదు చేయబడతాయి.

డిమెటీరియలైజేషన్: వ్యవహారాలన్నీ కంప్యూటరీకరించుట వలన సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు ఎలక్ట్రానిక్ బుక్ ఎంట్రీ పద్ధతిలో పరిష్కారమవుతాయి. సెక్యూరిటీలు భౌతిక రూపములో ఉండి, పెట్టుబడిదారుకు ఎలక్ట్రానిక్ ఎంట్రీ లేదా నంబరు ఇవ్వడం వలన తన అకౌంటులో ఎలక్ట్రానిక్ నిల్వ కలిగి ఉండటం. ఎలక్ట్రానిక్ రూపములో సెక్యూరిటీలు కలిగి ఉండే విధానాన్ని డిమెటీరియలైజేషన్ అంటారు. దీని కొరకు పెట్టుబడిదారుడు సంస్థతో డిమాట్ అకౌంటు ప్రారంభించడాన్ని డిపాజిటరీ అంటారు. వాస్తవానికి ఇపుడు (IPOS) డిమెటీరియలైజేషన్ పద్ధతిలో జారీ చేయబడి 99 శాతం కంటే ఎక్కువ టర్నోవర్ డిమాట్ రూపములో పరిష్కరించడుతుంది. ట్రేడింగ్ 500 వాటాలకు మించితే పరిష్కార విధానము డిమాట్లో జరగాలని సెబీ తప్పనిసరి చేసింది. డిమాట్ రూపములో వాటాలు కలిగి ఉండటము బ్యాంకు ఖాతా వలె చాలా సౌకర్యవంతముగా ఉంటుంది. భౌతిక రూపములో ఉన్న వాటాలు ఎలక్ట్రానిక్ రూపములో లేదా ఎలక్ట్రానిక్ రూపములోఉన్న వాటాలను తిరిగి భౌతిక రూపములోనికి మార్చుకోవచ్చు. నగదువలె డిమెటీరియలైజేషన్ వాటాలను ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు బదిలీ చేస్తుంది. మరియు వాటాలకు సంబంధించిన అన్ని లావాదేవీలు ఒకే ఖాతా ద్వారా పరిష్కరించుకోవచ్చు. డిమాట్ అకౌంట్లో ఉన్న సెక్యూరిటీలను తాకట్టుపెట్టి ఋణాలు పొందవచ్చును. వాటా, సర్టిఫికేట్లు పాడైపోవుట, దొంగిలించబడటం లేదా ఫోర్జరీ అనే భయం ఉండదు. పెట్టుబడిదారుని ఖాతాలో సరైన సంఖ్యలో వాటాలను నమోదు చేయవలసిన బాధ్యత బ్రోకర్.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ప్రశ్న 7.
సూచీ అంటే ఏమిటి ? మన దేశములోని రెండు ప్రధాన సూచీలను వివరించండి.
జవాబు:
స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది మార్కెట్ ప్రవర్తనకు భారమితి వంటిది. మార్కెట్ ప్రతినిధి అయిన స్టాక్ సమూహం ద్వారా మొత్తం మార్కెట్ సెంటిమెంట్ను కొలుస్తుంది. ఇది మార్కెట్ దిశను ప్రతిబింబించడముతో పాటు స్టాక్ ధరలలో రోజు రోజుకు వచ్చే హెచ్చుతగ్గులను సూచిస్తుంది. ఆదర్శవంతమైన సూచీ సెక్యూరిటీల ధరలలో మార్పులకు ప్రాతినిథ్యం వహిస్తూ సాధారణ వాటాల ధరలలో వచ్చే మార్పులను ప్రతిబింబించే విధముగా ఉండాలి. మార్కెట్ సూచీ పెరిగితే మార్కెట్లో అనుకూల పరిస్థితులు ఉండటాన్ని, మార్కెట్ సూచీ తగ్గితే మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉండటాన్ని తెలుపుతుంది. భారతీయ మార్కెట్లో BSE -సెన్సెక్స్ మరియు NSE- నిఫ్టీ ముఖ్యమైన సూచీలు.

సెన్సెక్స్ (SENSEX): సెన్సెక్సున్న సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు. సెన్సెక్స్ అనేది BSE యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్. BSE- సెన్సెక్స్ను BSE – 30 అని కూడా అంటారు. BSE భారతీయ సెకండరీ మార్కెట్ ప్రముఖ ఎక్సేంజ్ గా ఉండటం వలన, సెన్సెక్స్ భారతీయ స్టాక్ మార్కెట్కు ముఖ్య సూచికగా ఉన్నది. మార్కెట్ స్థితిగతులను తెలియజేయునపుడు దీనిని తరుచుగా ఉపయోగిస్తారు. 1986లో ప్రారంభించిన సెన్సెక్స్ మార్కెట్లో అత్యంత చురుకుగా | లావాదేవీలు జరిపే 30 స్టాక్స్లో రూపొందించబడినది. అవి ఆర్థిక వ్యవస్థలోని 13 రంగాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వాటికి సంబంధించిన పరిశ్రమలలో అగ్రగాములుగా ఉన్నాయి. ఈ సూచీ ప్రాతిపదిక సంవత్సరం 1978 కాగా, ఆధార సంవత్సరం విలువ 100తో ప్రారంభమైనది

నిఫ్టీ (NIFTY): జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీని నిఫ్టీ అంటారు. NSE లో నమోదైన వివిధ రంగాల స్టాక్ల పనితీరు ఆధారముగా దీనిని లెక్కిస్తారు. నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీని తెలుపుతుంది. 24 రంగాలకు చెందిన 50 ప్రముఖ కంపెనీల స్టాక్ సమూహాన్ని నిఫ్టీ కలిగిఉంటుంది. NSE అవలంభించే అనేక అంశాలపై ఆధారపడి నిఫ్టీలో ఉండే స్టాక్స్ వాటి కంపెనీల పనితీరునుబట్టి కాలానుగుణముగా మారుతూ ఉంటాయి.. 1995 – 96 సంవత్సరము ప్రాతిపదిక సంవత్సరముగా పరిగణిస్తూ 1000 ఆధార విలువతో సూచీ నిర్మించబడినది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విత్త మార్కెట్.
జవాబు:
విత్త మార్కెట్ అనే పదానికి విస్తృతమైన అర్థము కలదు. ద్రవ్యత్వ ఆస్తులైన వాటాలు, బాండ్లు, కరెన్సీ నోట్లు మరియు డెరివేటివ్స్ వర్తకము కొరకు కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారులు పాల్గొనే ఏ మార్కెట్ స్థలమైన అది విత్త మార్కెట్ అంటారు.

ప్రశ్న 2.
విత్త మార్కెట్ వర్గీకరణ.
జవాబు:
విత్త మార్కెట్ల వర్గీకరణ వాటిలో నిర్వహింపబడే లావాదేవీల కాలపరిమితిని బట్టి ఉంటుంది. ఒక సంవత్సరములోపు కాలపరిమితిగల కార్యకలాపాలు ద్రవ్య మార్కెట్లోను, దీర్ఘకాల పరిమితి కార్యకలాపాలు మూలధన మార్కెట్లో నిర్వహించబడతాయి. మూలధన మార్కెట్ను ప్రాథమిక మార్కెట్ అని, ద్వితీయ మార్కెట్ అని వర్గీకరించవచ్చును.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ప్రశ్న 3.
ద్రవ్య మార్కెట్.
జవాబు:
ఒక సంవత్సరములోపు కాలపరిమితి గల స్వల్పకాలిక నిధులు ద్రవ్యత్వ ఆస్తులతో వ్యవహారాలు జరిపే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు. ఈ ఆస్తులు ద్రవ్యానికి సమీప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. తాత్కాలిక ద్రవ్య అవసరాలకు, బాధ్యతలకు స్వల్పకాలిక నిధులను ఈ మార్కెట్ సమకూరుస్తుంది.

ప్రశ్న 4.
మూలధన మార్కెట్.
జవాబు:
మూలధన మార్కెట్ అనే పదము దీర్ఘకాలిక ఋణాలు సమకూర్చే సంస్థలు మరియు సదుపాయాలు తెలుపుతుంది. దీనిలో డెట్ మరియు ఈక్విటీ దీర్ఘకాలిక నిధులు సమకూర్చబడి పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. దీనిలో ప్రజల నుంచి వివిధ మార్గాలలో సేకరించి, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలలో పెట్టుబడి పెట్టుటకు అందుబాటులో ఉంటాయి.

ప్రశ్న 5.
ప్రాథమిక మార్కెట్..
జవాబు:
ప్రాథమిక మార్కెట్ను నూతన జారీల మార్కెట్ అని కూడా అంటారు. మొదటిసారి జారీ చేసే సెక్యూరిటీలతో పనిచేస్తుంది. పెట్టుబడి నిధులు పొదుపుచేసే వారి నుంచి వ్యవస్థాపకులకు బదిలీ చేయడానికి సహకరించడం ప్రాథమిక మార్కెట్ యొక్క ప్రధాన విధి. ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్లు, ఋణాలు మరియు డిపాజిట్ల రూపములో ప్రాథమిక మార్కెట్లో కంపెనీలు పెట్టుబడులను సమకూర్చుకుంటాయి.

ప్రశ్న 6.
ద్వితీయ మార్కెట్.
జవాబు:
ద్వితీయ మార్కెట్ను స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్సేంజ్ అని కూడా అంటారు. లోగడ జారీ అయిన సెక్యూరిటీ ల కొనుగోలు మరియు అమ్మకాలకు ఈ మార్కెట్ వీలు కల్పిస్తుంది. ఇది ప్రస్తుత సెక్యూరిటీలకు ద్రవ్యత్వాన్ని మరియు మార్కెట్ అవకాశాన్ని కల్పిస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ మరియు తిరిగి పెట్టుబడి ద్వారా ఉత్పాదక పెట్టుబడులకు నిధులు మళ్ళిస్తూ ఆర్థికాభివృద్ధికి ఈ మార్కెట్ తోడ్పడుతుంది.

ప్రశ్న 7.
ట్రెజరీ బిల్.
జవాబు:
సాధారణముగా కేంద్ర ప్రభుత్వము సంవత్సరంలోపు కాలపరిమితిగల స్వల్పకాలిక ఋణం పొందడానికి ట్రెజరీ | బిల్ ఒక సాధనముగా ఉపయోగపడుతుంది. స్వల్పకాలిక అవసరాలకు నిధులు పోందడానికి భారత ప్రభుత్వం తరపున భారత రిజర్వు బ్యాంకు ‘జీరో కూపన్ బాండ్ల’ పేరుతో వీటిని జారీ చేస్తుంది.

ప్రశ్న 8.
వాణిజ్య పత్రాలు.
జవాబు:
నిర్ణీత కాలపరిమితికి జారీచేసి, తిరిగి విమోచనము చేయు సెక్యూరిటీ లేని ప్రామిసరీ నోటు, అన్యాక్రాంత మరియు బదిలీ యోగ్యత గల పత్రాన్ని వాణిజ్య పత్రము అంటారు. భారీ మరియు పరపతి గల కంపెనీలు మార్కెట్ రేటు కంటే తక్కువ వడ్డీకి స్వల్పకాలిక నిధులు పెంచుకునేందుకు దీనిని జారీ చేస్తాయి.

ప్రశ్న 9.
డిపాజిట్ల సర్టిఫికేట్.
జవాబు:
సెక్యూరిటీ ఆధారము లేని, బదిలీ యోగ్యత గల స్వల్ప కాలిక సాధనాలు అయిన డిపాజిట్ సర్టిఫికేట్లను వాణిజ్య బ్యాంకులు మరియు అభివృద్ధి చెందిన ద్రవ్య సహాయ సంస్థలు జారీ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల వృద్ధి తక్కువగా ఉండి, పరపతి అవసరాలు ఎక్కువగా ఉండి, ద్రవ్యత్వము లోపించిన అవసరమైన సంస్థలకు ఈ సర్టిఫికేట్లు జారీ చేయబడతాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ప్రశ్న 10.
OTCEI.
జవాబు:
ఇది కంపెనీ చట్టం 1956 క్రింద నమోదైన కంపెనీ. చిన్న మరియు మధ్య తరహా కంపెనీల మూలధన మార్కెట్లో ప్రవేశించి ఫైనాన్స్ సమకూర్చుకోవడానికి ఇది స్థాపింబడినది. ఇది మూలధన మార్కెట్లో పెట్టుబడి కొరకు ఒక అనుకూలమైన పారదర్శక మరియు సమర్థవంతమైన విధానాన్ని పెట్టుబడిదారులకు కల్పిస్తుంది. 1992లో ట్రేడింగ్ ప్రారంభించి పూర్తి కంప్యూటీకరణ, పారదర్శకత మరియు సింగిల్ విండో ఎక్సేంజ్ సౌకర్యం కలదు.

ప్రశ్న 11.
డిమెటీరియలైజేషన్.
జవాబు:
ప్రస్తుతము సెక్యూరిటీల ట్రేడింగ్ అంతా కంప్యూటర్ టెర్మినల్స్ ద్వారా జరుగుతుంది. వ్యవహారాలన్నీ కంప్యూటరీకరించుట వలన సెక్యూరిటీల కొనుగోలు అమ్మకాలు ఎలక్ట్రానిక్ బుక్ ఎంట్రీ పద్దతిన పరిష్కారమవుతున్నాయి. ఈ పద్ధతిలో సెక్యూరిటీలు భౌతిక రూపములో ఉండటం వలన పెట్టుబడిదారులకు ఎలక్ట్రానిక్ ఎంట్రీ లేదా నంబరు ఇవ్వడం వలన తన అకౌంటులో ఎలక్ట్రానిక్ నిల్వ కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్ రూపములో సెక్యూరిటీలు కలిగిఉండే విధానాన్ని డిమెటీరియలైజేషన్ అంటారు.

ప్రశ్న 12.
డిపాజిటరీ.
జవాబు:
డిపాజిటరీ పెట్టుబడిదారుల తరపున సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపములో ఉంచుతుంది. డిపాజిటరీ వద్ద ఖాతాను ప్రారంభించి వాటాలన్నీ డిపాజిట్ చేయబడతాయి. ఖాతాదారుని తరపున అతని సూచనలకు అనుగుణంగా వాటాలను కొనడం, అమ్మడం జరిగినది. ఇది సాంకేతిక పరిజ్ఞానంతో నడపబడే ఎలక్ట్రానిక్ స్టోరేజి పద్ధతి.

ప్రశ్న 13.
సెన్సెక్స్ (SENSEX).
జవాబు:
సెన్సెక్స్: సెన్సెక్స్ను సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు. దీనిని BSE – 30 అని కూడా అంటారు. BSE భారతీయ సెకండరీ మార్కెట్ యొక్క ప్రముఖ ఎక్సేంజ్ ఉన్నందు వలన, సెన్సెక్స్ భారతీయ స్టాక్ మార్కెట్కు ముఖ్య సూచికగా ఉన్నది. మార్కెట్ స్థితిగతులను తెలియజేయునపుడు దీనిని తరుచుగా ఉపయోగిస్తారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 4 విత్త మార్కెట్లు

ప్రశ్న 14.
నిఫ్టీ (NIFTY).
జవాబు: నిఫ్టీ: జాతీయ స్టాక్ ఎక్సేంజ్ని నిఫ్టీ అంటారు. NSE లో నమోదైన వివిధ రంగాల స్టాక్ ల పనితీరు ఆధారముగా దీనిని లెక్కిస్తారు. నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీని తెలుపుతుంది. 24 రంగాలకు చెందిన 50 ప్రముఖ కంపెనీల స్టాక్ సమూహాన్ని నిఫ్టీ కలిగి ఉంటుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 3rd Lesson వ్యాపార సేవలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 3rd Lesson వ్యాపార సేవలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్యాంకును నిర్వచించి, వాటి విధులను వివరించండి.
జవాబు:
బ్యాంకింగ్ నియంత్రణ చట్టము 1949 ప్రకారము “ఖాతాదారుల డిమాండ్లపై చెక్కు ద్వారాగాని, డ్రాఫ్ట్ ద్వారా గాని, మరేదైనా పత్రము ద్వారా గాని, తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లను స్వీకరించి ఆ సొమ్మును ఋణాలు ఇవ్వడానికి గాని, పెట్టుబడి కోసం గాని ఉపయోగించడం బ్యాంకింగ్ వ్యాపారము అంటారు.

బ్యాంకులు ఆర్థిక సంస్థలు దేశ ఆర్థిక ప్రగతికి పునాది లాంటివి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు ప్రముఖమైన పాత్రను వహిస్తున్నవి. ఈ బ్యాంకులు ఎక్కువ భాగము ద్రవ్య సప్లయిని నియంత్రిస్తున్నవి. బ్యాంకులు నిర్వహించే విధులను స్థూలముగా రెండు రకాలుగా విభజించవచ్చును. అవి (ఎ) ప్రాథమిక విధులు, (బి) అనుషంగిక విధులు. ఎ) ప్రాథమిక విధులు: 1. డిపాజిట్లను స్వీకరించడము: బ్యాంకులు వివిధ రకములైన డిపాజిట్లను సేకరిస్తాయి.
అవి:
i) ఫిక్స్డ్ డిపాజిట్లు: ఈ ఖాతాలలో డిపాజిట్ చేయబడిన మొత్తము నిర్ణీత కాల వ్యవధికి ముందు ఉపసంహరించడానికి వీలుకాదు. ఈ కాల వ్యవధి సాధారణముగా ఒకటి, రెండు, మూడు లేదా ఐదు సంవత్సరాలు ఉంటుంది. బ్యాంకులు ఈ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లను కాలపరిమితి గల డిపాజిట్లు మరియు టైమ్ డిపాజిట్లు అంటారు.

ii) కరెంట్ డిపాజిట్ ఖాతాలు: ఈ ఖాతాలను వ్యాపారస్తులు తెరుస్తారు. ప్రతిరోజు ఎన్ని సార్లయినా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి, ఉపసంహరించవచ్చును. ఈ ఖాతాలోని నిల్వపై వడ్డీని చెల్లించరు. వీటిని డిమాండు డిపాజిట్లు అని కూడా అంటారు.

iii) సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు: ఈ డిపాజిట్ల ముఖ్య ఉద్దేశము వ్యక్తులు, వ్యాపారస్తులు, సంస్థల నుంచి చిన్న చిన్న పొదుపు మొత్తాలను ప్రోత్సహించడము. డిపాజిట్ల ఉపసంహరణపై కొన్ని సాధారణ నిబంధనలు ఉంటాయి. ఈ డిపాజిట్లపై తక్కువ వడ్డీని చెల్లిస్తారు.

iv) రికరింగ్ డిపాజిట్ ఖాతాలు: తక్కువ ఆదాయాన్ని పొందేవారు చిన్న మొత్తాలలో పొదుపు చేయడానికి ఈ డిపాజిట్లు అనుకూలము. ఈ డిపాజిట్లలో కొంత కాల వ్యవధిలో (ప్రతి వారానికి, నెలకుగాని నిర్ణయించిన మొత్తాలలో నిర్ణీత కాలము పూర్తి అయ్యేవరకు నగదు జమచేస్తూ ఉండాలి. గడువుకాలము పూర్తి అయిన తర్వాత వడ్డీతో కలిపి పూర్తి మొత్తము సొమ్మును డిపాజిట్ దారుకు తిరిగి చెల్లించబడుతుంది. ఈ డిపాజిట్లపై వడ్డీరేటు సేవింగ్స్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

2) ఋణాలు మంజూరు చేయుట: బ్యాంకు విధులలో రెండవది అవసరమున్న వ్యక్తులకు, సంస్థలకు ఋణాలు లేదా అడ్వాన్సులు అందజేయడము, ప్రతి బ్యాంకు కనిష్ట రిజర్వు నిల్వను రిజర్వు బ్యాంకుల వద్ద డిపాజిట్ చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఋణాల రూపములో అందజేస్తుంది. ఇవి ఐదు రకాలుగా ఉంటాయి.
i) ఋణాలు: ఒక నిర్ణీతకాలానికి బ్యాంకులు కాలపరిమితి గల ఋణాలను గాని, డిమాండు ఋణాలనుగాని అంగీకరించిన వడ్డీ రేటుకు మంజూరు చేస్తాయి. ఈ ఋణాలను సాధారణముగా సెక్యూరిటీలపై జారీచేస్తారు.

ii) క్యాష్ క్రెడిట్: ఒక సంవత్సరము లేదా అంతకంటే తక్కువ కాలానికి ఖాతాదారునికు మంజూరు చేసిన ఋణాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. సరుకునుగాని, ఇతర ఆస్తిని గాని హామీగా ఉంచుకొని ఋణాన్ని మంజూరు చేస్తారు. గడువు కాలము పూర్తి అయిన తర్వాత తిరిగి రెన్యువల్ చేసుకోవచ్చు. బ్యాంకు మంజూరు చేసిన ఋణాన్ని అవసరాన్ని బట్టి ఖాతాదారుడు ఒకేసారిగాని లేక కొన్ని వాయిదాలలో తీసుకొనవచ్చును. క్యాష్ క్రెడిట్పై వడ్డీని వాడుకున్న మొత్తము మీద లెక్కిస్తారు.

iii) ఓవర్ డ్రాఫ్ట్: ఖాతాదారుడు డిపాజిట్ చేసిన మొత్తము కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకోవడానికి సౌకర్యము కల్పించబడుతుంది. దీనిని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. డిపాజిట్ మొత్తము కంటే ఎంత మొత్తము అప్పుగా తీసుకోవడం జరుగుతుందో దాని మీదనే వడ్డీని వసూలు చేయడం జరుగుతుంది. కరెంట్ ఖాతాదారులకే ఈ సౌకర్యముంటుంది.

iv) బిల్లును డిస్కౌంట్ చేయడము: బిల్లును కలిగిన వ్యక్తికి నగదు అవసరమైనపుడు ఆ బిల్లును బ్యాంకులో డిస్కౌంటు చేసుకొనవచ్చును. బ్యాంకు కొంతమొత్తము డిస్కౌంట్లుగా తగ్గించి, బిల్లుదారుకు డబ్బును చెల్లిస్తాయి. బిల్లు గడువు తేదీన బ్యాంకు బిల్లు స్వీకర్త నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసుకుంటాయి.

v) కోరగానే పిలుపు ద్రవ్యపు ఋణం: కోరిన వెంటనే తిరిగి చెల్లించే షరతుపై ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు ఇచ్చే ఋణాన్ని పిలుపు ద్రవ్యము అంటారు. ఋణాన్ని కేవలము ఒక రోజు నుంచి 14 రోజులకు మాత్రమే మంజూరు చేస్తారు. ఈ ఋణాలను అంతర్గత బ్యాంకు ఋణాలు అంటారు. బ్యాంకుల మిగులు నిధులను అవసరమైన బ్యాంకులకు ఒక రోజు నుంచి వారానికి ఋణంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఋణాన్ని ఇచ్చిన రెండవ రోజు లేదా స్వల్పకాల నోటీసుతో తిరిగి చెల్లించడం జరుగుతుంది.

బి) అనుషంగిక విధులు: బ్యాంకులు ప్రాథమిక విధులతో పాటు దిగువ అనుషంగిక విధులు నిర్వర్తిస్తాయి. 1) ఏజెన్సీ సేవలు: ఖాతాదారులకు ప్రతినిధిగా ఈ క్రింది సేవలు అందిస్తాయి.

  1. చెక్కుల ద్వారా మరియు డ్రాఫ్ట్ ద్వారా ద్రవ్యాన్ని ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి బదిలీచేస్తాయి.
  2. పరపతి సాధనాలు అయిన చెక్కులు, బిల్లులు, ప్రామిసరీ నోట్లపై వసూళ్ళు, చెల్లింపులు చేస్తాయి.
  3. ఖాతాదారుల తరఫున వాటాలు, డిబెంచర్లు, బాండ్లు మొదలైన సెక్యూరిటీలను కొనుగోలు, అమ్మకాలను చేస్తాయి.
  4. బ్యాంకులు ఖాతాదారులు వీలునామాను జాగ్రత్తపరచి, వారి మరణానంతరము వీలునామాను అమలు చేస్తాయి.

2) సాధారణ ప్రజోపయోగ సేవలు:

  1. బ్యాంకులు తమ ఖాతాదారులకు పరపతి లేఖలు జారీ చేస్తాయి.
  2. దూరప్రాంతాలకు ప్రయాణాలపై వెళ్ళినపుడు దొంగల భయం లేకుండా ప్రయాణీకుల చెక్కులను జారీ చేస్తాయి.
  3. విలువైన ఆభరణాలు, వస్తువులు, పత్రాలు దాచుకొనడానికి సేఫ్ డిపాజిట్ లాకర్ల సౌకర్యాలను కల్పిస్తాయి.
  4. విదేశీ బిల్లును అంగీకరించుట లేదా చెల్లించడం చేస్తాయి.

ప్రశ్న 2.
భీమా సూత్రాలను వివరించుము.
జవాబు:
సక్రమమైన కాంట్రాక్టుకు ఉండవలసిన ప్రతిపాదన, స్వీకృతి, స్వేచ్ఛాసమ్మతి, పార్టీల సామర్థ్యము, ప్రతిఫలము, నాయాత్మక ఉద్దేశము మొదలగు సూత్రాలతో పాటు భీమాకు సంబంధించిన దిగువ ప్రాథమిక సూత్రాలను కూడా తృప్తిపరచవలెను.

ఎ) భీమా ఆసక్తి: సక్రమమైన భీమా కాంట్రాక్టుకు ఉండవలసిన ఆవశ్యకాలలో భీమా ఆసక్తి ప్రధానమైనది. భీమా ఆసక్తి లేని ఒప్పందాన్ని జూదము ఒప్పందముగా పరిగణిస్తారు. అది చెల్లని కాంట్రాక్టు అవుతుంది. అటువంటి దానిని కోర్టు ద్వారా అమలుపరచడానికి వీలుండదు. కనుక భీమాపాలసీ తీసుకునే వ్యక్తికి తన జీవితము మీదగాని, ఆస్తిమీద గాని ఆసక్తి కలిగి ఉండాలి. ఉదా: ఒక వ్యక్తికి తన జీవితం మీద, తన భార్య జీవితము మీద ఆసక్తి ఉంటుంది. బ్యాంకరుకు తన వద్ద తనఖా ఉంచిన బాకీదారు ఆస్తిమీద ఆసక్తి ఉంటుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

బి) అత్యంత విశ్వాసము: భీమా కాంట్రాక్టు విషయము సమగ్రముగాను మరియు కాంట్రాక్టు పార్టీలు అందరూ అత్యంత విశ్వాసపూరితముగా ఉండాలి. కాంట్రాక్టునందు నమ్మకము లోపించిన యడల ఆ పార్టీల మధ్య ఒప్పందము చెల్లదు. అనగా అందులో మోసము లేనపుడే ఆ భీమా కాంట్రాక్టు అత్యంత విశ్వాసపూరితమైది. అందువలన భీమా తీసుకునే వ్యక్తి ఒప్పందానికి సంబంధించిన అన్ని వాస్తవాలను భీమా సంస్థకు తెలియజేయాలి లేని యడల విశ్వాసము లోపించినట్లుగా, ఆ కాంట్రాక్టు చెల్లని కాంట్రాక్టు అవుతుంది.

సి) నష్టపూర్తి: సంభవించిన నష్టాన్ని ద్రవ్య రూపేణ భర్తీ చేయడాన్ని నష్టపూర్తి అని అంటారు. ఇది భీమా ఆస్తి విలువకు మించరాదు. ముందుగా ఒప్పందము చేసుకున్న విధముగా ఒక నిర్దిష్టమైన సంఘటన జరిగినపుడు భీమాదారుడు జరిగే నష్టాన్ని అంచనా వేసి, దానిని భీమా సంస్థ చెల్లించడాన్ని నష్టపూర్తి అంటారు. నష్టము జరుగుతున్నప్పుడు భీమాదారుడు నష్టాన్ని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఆ ఆస్తిని తిరిగి పూర్వపు స్థితిలో (యధాస్థితిలో) ఉంచడానికి ఎంత అవుతుందో ఆ మొత్తాన్ని భీమా సంస్థ అంచనా వేసి భీమాదారుకు చెల్లిస్తుంది. జీవిత భీమా కాంట్రాక్టులు మినహా, ఇతర భీమా కాంట్రాక్టులన్నీ నష్టపూర్తి కాంట్రాక్టులు అవుతాయి.

డి) సమీపకారణము: ఇది (causa proxima) అనే లాటిన్ సూత్రము నుండి ఏర్పడినది. దగ్గర కారణము లేదా తక్షణ కారణం దీని అర్ధము. ఒక నష్టము సంభవించడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో వాస్తవమైన కారణాన్ని సమీపకారణము అంటారు. భీమా సంస్థ చెల్లించవలసిన బాధ్యతను లెక్కించునపుడు సుమారు కారణమును పరిగణించకుండా సమీపకారణాన్ని తీసుకుంటారు. సముద్ర భీమా విషయములో ఓడలేదా ఓడలోని సరుకునకు వివిధ కారణాల వలన నష్టము సంభవించినపుడు, ఏ ఒక్క కారణాన్ని లెక్కలోకి తీసుకోకుండా సమీపకారణము అనే సూత్రము ద్వారా నష్టాన్ని లెక్కిస్తారు.

ఇ) హక్కుల సంక్రమణ సిద్ధాంతము: దీనినే హక్కులకు ప్రత్యామ్నాయ సిద్ధాంతము అని కూడా అంటారు. దీని అర్ధము హక్కులను పొందే వ్యక్తిని ఋణదాత స్థానములో ఉంచడము. భీమాదారుకు భీమా ఆస్తిపై మరియు ఇతరులపై గల సర్వహక్కులు భీమా సంస్థకు లభించడాన్ని హక్కుల సంక్రమణ అంటారు. దీనినే ప్రతి నివేశము అని కూడా అంటారు. నష్టపూర్తి జరిగిన తర్వాత భీమాదారునికి గల హక్కులు, ఉపశమనాలు అన్ని భీమాసంస్థకు బదిలీ అవుతాయి, భీమా ఆస్తి మీదనే కాక, నష్టాన్ని పూరించడానికి మూడవవ్యక్తి మీద కూడా భీమా సంస్థకు హక్కులు సంక్రమిస్తాయి.

ఎఫ్) చందా: భీమా ఆస్తికి నష్టము కలిగినపుడు, ఆ ఒప్పందములో వేరే భీమా సంస్థలు ఉన్నప్పుడు, ఆ భీమా సంస్థలు దామాషా పద్ధతిలో బాధ్యతను చెల్లించవలసి ఉంటుంది. భీమాదారుడు తనకు కలిగిన నష్టానికి మించిన మొత్తాన్ని పొందలేడు. అన్ని పాలసీలకు భీమా ఆసక్తి ఉండవలెను.

జి) నష్టము తగ్గింపు: భీమా ఆస్తికి కలిగే నష్ట తీవ్రతను తగ్గించడానికి ఈ సూత్రము వర్తిస్తుంది. భీమాదారుడు భీమా చేయని ఆస్తికి హాని కలిగినపుడు నష్టాన్ని నివారించడానికి లేదా తగ్గించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడో భీమా చేసినపుడు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలని ఈ సూత్రం తెలియజేస్తుంది.

ప్రశ్న 3.
జీవిత భీమా పాలసీని నిర్వచించి, వాటి రకాలను తెలపండి.
జవాబు:
జీవితభీమాను దిగువ విధముగా నిర్వచించవచ్చును. “భీమా సంస్థ తాను పొందిన ప్రీమియంకు బదులుగా, ఆ ప్రీమియం ఒకే మొత్తముగా గాని లేదా నిర్ణీత వాయిదాలలో గాని, భీమాదారుడు మరణించినపుడు లేదా నిర్ణీత సమయము పూర్తి అయినపుడు నిర్దిష్టమైన సొమ్ము చెల్లించటానికి చేసుకునే కాంట్రాక్టును జీవితభీమా కాంట్రాక్టు
అంటారు.

జీవిత భీమా పాలసీలో గల రకాలు:
1) యావజ్జీవిత పాలసీ: దీనిని సాధారణ పాలసీ అని కూడా అంటారు. ఈ పాలసీలో భీమా చేసిన వ్యక్తి జీవితాంతము ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. భీమా మొత్తాన్ని భీమా చేసిన వ్యక్తి మరణించిన తర్వాతనే చెల్లిస్తారు. ఈ పాలసీ మీద ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇది భీమా చేసిన వ్యక్తి కుటుంబానికి పనికివస్తుంది. ఈ పాలసీలో ముఖ్యమైన లోపము ఏమిటంటే భీమా చేసిన వ్యక్తి ముసిలితనములో, రాబడి ఏమీ లేకపోయినా ప్రీమియం అతడు జీవితాంతము చెల్లించవలెను.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

2) ఎండోమెంట్ పాలసీ: ఈ పాలసీని నిర్దిష్ట కాలానికి అనగా ఎండోమెంట్ కాలానికి తీసుకుంటారు. ఈ పాలసీ నిర్దిష్టకాలము పూర్తి అయిన తర్వాత లేదా ఒక నిర్ణీత వయస్సు వచ్చినపుడు లేదా భీమా చేసిన వ్యక్తి మరణించినపుడు వీటిలో ఏది ముందు జరిగితే అప్పుడు గడుపుకాలము ముగుస్తుంది. ఈ పాలసీలో పెట్టుబడి మరియు రక్షణ కల్పిస్తుంది.

3) లాభాలతో కూడిన, లాభాలు లేని పాలసీలు: లాభాలతో కూడిన పాలసీని జారీచేసినపుడు, పాలసీదారుడు కంపెనీ లాభాలలో భాగాన్ని పంచుకుంటాడు. వీటిని బోనస్ అంటారు. పాలసీ గడువు ముగిసిన తర్వాత భీమా మొత్తాన్ని బోనస్తో కలిపి చెల్లిస్తారు. లాభాలు లేని పాలసీలు అయితే, పాలసీదారునకు లాభాలలో భాగం ఇవ్వరు. పాలసీ గడువు తీరిన తర్వాత భీమా మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తారు. ఈ పాలసీలను భాగమును పంచుకునే మరియు ” భాగాన్ని పంచుకోని పాలసీలు అంటారు.

4) ఉమ్మడి జీవిత భీమా పాలసీ: ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తులపై ఉమ్మడిగా జీవితభీమా పాలసీ తీసుకోవచ్చు. పాలసీదారులలో ఏ ఒక్కరు మరణించినా జీవించి ఉన్న మిగిలిన పాలసీదారులకు భీమా సొమ్మును చెల్లిస్తారు. ఈ రకమైన పాలసీలను భార్య, భర్తలు తీసుకుంటారు.

5) మార్పిడి చేయదగు యావజ్జీవిత భీమా పాలసీ: దీనిని యావజ్జీవిత భీమా పాలసీగా జారీ చేసినా నిర్దిష్ట కాలము తర్వాత దీనిని ఎండోమెంట్ పాలసీగా మార్చుకోవడానికి అవకాశము ఉంటుంది. పాలసీదారు కోరిన మీదట ఈ పాలసీని మార్పిడి చేస్తారు. పాలసీని మార్పిడి చేసిన తర్వాత పాలసీ మీద చెల్లించే ప్రీమియం పెరుగుతుంది.

6) జనతా పాలసీ: జనతాపాలసీని జీవిత భీమా కార్పరేషన్ మే, 1957లో ప్రవేశపెట్టినది, దీనిని స్వల్ప ఆదాయముగల వారి కోసం ఉద్దేశించబడినది. దీనిన 5, 10, 15, 20 మరియు 25 సంవత్సరాలకు జారీ చేసినా 60 సంవత్సరములో గడువు తీరుతుంది. ఈ పాలసీల మీద ఎలాంటి ఋణాలు మంజూరు చేయరు.

7) వార్షిక పాలసీ: ఈ పాలసీలో పాలసీదారు భీమా సంస్థ వద్ద నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. నిర్ణీతకాలము లేదా పాలసీదారుడు మరణించిన తర్వాత సొమ్మును భీమాసంస్థ చెల్లిస్తూనే ఉంటుంది.

8) సామూహిక భీమా పాలసీ: కుటుంబ సభ్యులు లేదా సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఈ పాలసీని తీసుకోవచ్చును. 9) పిల్లల ఎండోమెంట్ పాలసీ: పిల్లల చదువులకు అయ్యే మొత్తానికి గాని లేదా వారి వివాహాలకు గాని సొమ్ము చెల్లించే పాలసీలను పిల్లల పేరున తీసుకుంటే అలాంటి పాలసీలను పిల్లల ఎండోమెంట్ పాలసీలు అంటారు. పిల్లలు మేజరు అయిన తర్వాత భీమా సొమ్మును చెల్లిస్తారు.

ప్రశ్న 4.
రవాణా గురించి నీవు ఏమి అర్థము చేసుకున్నావు ? రవాణా ప్రయోజనాలను, పరిమితులను వివరించుము.
జవాబు:
భౌతిక పంపిణీలో రవాణా ఒక భాగము. భౌతిక పంపిణీ మార్కెటింగ్ మిశ్రమములో అంతర్భాగము. భౌతికముగా వస్తువులను, వ్యక్తులను ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి తరలించడమే ‘రవాణా’. వస్తు, సేవల ఉత్పత్తి కొన్ని ప్రాంతాలకే పరిమితము కాగా వాటి వినియోగము దేశమంతటా విస్తరించి ఉంటుంది. రవాణా ద్వారా ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగదారుల ప్రదేశాలకు వస్తువులను చేరవేస్తారు. ఈ విధముగా స్థల, సమయ అవరోధాలను రవాణా ద్వారా అధిగమించవచ్చును. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని, కాల ప్రయోజనాన్ని కల్పిస్తుంది.

సాధారణ పరిభాషలో రవాణా అనగా వస్తువులను ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి తరలించడము. రవాణా వలన ప్రయోజనాలు:
1) సరుకును తరలించడము: వస్తువులను ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి తరలించడమే రవాణా ముఖ్యవిధి. ముడిసరుకులను కర్మాగారానికి, తయారైన వస్తువులను వినియోగ కేంద్రాల (మార్కెట్) కు తరలిస్తుంది.

2) మూలధన, కార్మిక గమనశీలత: రవాణా అభివృద్ధి చెందడం వలన కార్మికులు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తరలివెళ్ళడానికి ఆస్కారము ఉన్నది. మూలధనాన్ని లాభదాయకమైన దానిలో పెట్టుబడి పెట్టటానికి రవాణా చాలా ఉపయోగపడుతుంది.

3) స్థల ప్రయోజనము: సరుకులు ఎక్కడైతే సమృద్ధిగా లభిస్తాయో అక్కడ నుంచి కొరతగా ఉన్న ప్రాంతానికి రవాణా ద్వారా తరలించవచ్చును.

4) ప్రత్యేకీకరణ మరియు శ్రమ విభజన: రవాణా వలన శ్రమ విభజన సాధ్యపడుతుంది. శ్రమ విభజన వలన ప్రత్యేకీకరణ పొందవచ్చును. రవాణా ద్వారా సహజవనరులను సమర్థవంతముగా ఉపయోగించుకొనవచ్చును. ఉదాహరణకు అరబ్ దేశాలలో పెట్రోలియం, స్విట్జర్లాండులో గడియారాలు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

5) కాల ప్రయోజనము: అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానము వలన రవాణా సమయం తగ్గుతుంది. దీని వలన సరుకు వ్యయాన్ని తగ్గించవచ్చును.

6) ధరల స్థిరీకరణ: సరుకులను ఎక్కువగా ఉన్న ప్రదేశము నుంచి కొరతగా ఉన్న ప్రదేశానికి రవాణా ద్వారా తరలించబడుతుంది. అందువలన ధరలు అన్ని ప్రాంతాలలో సమానముగా ఉంటాయి.

7) జాతీయ ఆదాయానికి సహాయము: రవాణా జాతీయ ఆదాయానికి తన వంతు భాగాన్ని అందిస్తుంది. ఉదా: భారత రైల్వేలు.

8) పెద్దతరహా ఉత్పత్తి వలన ఆదాలు: రవాణా వలన భారీతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. రవాణా వలన ముడి సరుకులను, కార్మికులను పొందవచ్చు. తయారైన వస్తువులను త్వరగా అమ్మడానికి సాధ్యపడుతున్నాయి.

9) జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుంది: తక్కువ ధరకు నాణ్యమైన సరుకు అందుబాటులో ఉండటం వలన ప్రజల యొక్క జీవన ప్రమాణస్థాయి పెరుగుతుంది.

10) దేశ రక్షణ: రవాణా దేశరక్షణను బలోపేతం చేస్తుంది. యుద్ధ సమయాలలో సైనికులను, యుద్ధసామాగ్రి, ఇతర పరికరాలను త్వరగా సరిహద్దు ప్రాంతాలకు తరలించవచ్చును.

రవాణా పరిమితులు:

  1. కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలు వాటి వైభవాన్ని కోల్పోతున్నాయి: రవాణా అభివృద్ధి చెందడం వలన శ్రామికులు పెద్ద పెద్ద కర్మాగారాలలో పనిచేయుటకు ఆసక్తి చూపుతున్నారు. అందువలన కుటీర, చిన్న తరహా పరిశ్రమలలో శ్రామికుల లభ్యత తగ్గుతుంది.
  2. ప్రమాదాలు: రవాణా సౌకర్యాలు వృద్ధి చెందడం వలన ప్రమాదాలు కూడా పెరుగుతున్నవి.
  3. అధిక పట్టణీకరణ: రవాణా అభివృద్ధి చెందడం ద్వారా పెద్ద పెద్ద పట్టణాలు ఏర్పడతాయి. అధిక జనాభా పట్టణాలలో ఉండటం వలన గృహాల సమస్యలు, కాలుష్యము, ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 5.
రోడ్డు రవాణాను వివరించి, భారత రోడ్డు రకాలను తెలపండి.
జవాబు:
రోడ్డు రవాణా అతి పురాతనమైనది. స్వల్ప దూరాలకు ఈ పద్ధతి అనుకూలమైనది. రోడ్డు రవాణా ద్వారా ఇంటింటి నుంచి వస్తువుల సేకరణ మరియు బట్వాడా సాధ్యపడుతుంది. చెడిపోయే స్వభావము గల వస్తువులకు ఈ పద్ధతి అనుకూలమైనది. ఈ రవాణా పద్ధతిలో ఎద్దులబండ్లు, గుర్రపుబండి, రిక్షా, జీపు, బస్సు, ట్రక్కు వంటి మోటారు వాహనాలను ఉపయోగిస్తారు. రోడ్డు రవాణా ముఖ్యముగా కాగితపు వస్తువులు, బట్టలు, కంప్యూటర్లు, సిమెంటు, పశువులు మొదలైన వాటికి అనుకూలముగా ఉంటుంది.

ప్రపంచ రోడ్డు రవాణా వ్యవస్థలో భారతదేశము చాలా ప్రముఖ స్థానములో ఉన్నది. భారతీయ రోడ్డు మార్గాలను జాతీయ రహదారిగా, రాష్ట్ర రహదారిగా, జిల్లా రోడ్డు మరియు గ్రామీణ రోడ్లుగా వర్గీకరించవచ్చును.

భారతీయ రోడ్డు రకాలు:
ఎ) జాతీయ రహదారులు: జాతీయ రహదారులు వివిధ రాష్ట్రాల రహదారులను కలుపుతూ సైనికులను చేరవేస్తుంది. ఈ రహదారులు రాష్ట్ర రాజధానులను, మహానగరాలను కలుపుతుంది. జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టినది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

బి) రాష్ట్ర రహదారులు: రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారులను నిర్వహిస్తాయి. జిల్లా ముఖ్య నగరాలను, ఇతర ముఖ్య పట్టణాలను రాష్ట్ర రాజధానితో అనుసంధానము చేస్తూ ఏర్పాటు చేస్తారు. మొత్తము రోడ్డు రవాణా వ్యవస్థలో ఈ రహదారుల వ్యవస్థ 4% మాత్రమే కలిగి ఉన్నది.

సి) జిల్లా రహదారులు: ఈ రహదారులు జిల్లా ముఖ్య రోడ్లను, మహానగరాలను కలుపుతాయి. మొత్తము రోడ్డు రవాణా వ్యవస్థలో ఈ రహదారులు 14% కలిగి ఉన్నాయి.

డి) గ్రామీణ రోడ్లు: ఈ రోడ్లు గ్రామీణ ప్రాంతాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి మొత్తము రహదారులలో 80% ఆక్రమించి ఉన్నాయి.

ఇ) సరిహద్దు రోడ్లు -: ఈ రహదారులు ఉత్తర ఈశాన్య సరిహద్దులలో విస్తరించి ఉన్నాయి. సరిహద్దు రహదారి సంస్థవారు నిర్మాణ, నిర్వహణను చేపడతారు. ఈ సంస్థ ఎత్తు ప్రాంతాలలో రోడ్లను నిర్మించి రవాణా సాఫీగా జరగడానికి మంచును తొలగిస్తుంది.

ఎఫ్) అంతర్జాతీయ రహదారులు: భారతదేశము ఇతర దేశాలతో ముఖ్యముగా పొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఉండటం కోసం ఈ రహదారులను ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 6.
గిడ్డంగి భావనను వివరించి, దాని ప్రాముఖ్యతను వివరించుము.
జవాబు:
వేర్ హౌసింగ్ అనేది రెండు పదముల కలయిక. వేర్ అనగా వస్తువులు అని అర్ధము. అందువలన వేర్ హౌస్ అనగా వస్తువులను భద్రపరుచు ప్రదేశము. కాబట్టి వేర్ హౌసింగ్ వస్తువులను స్టోర్ చేసే కార్యకలాపము. మామూలు పరిభాషలో వేర్ హౌస్ అంటే గోడౌన్ లేదా గిడ్డంగి. వేర్ హౌసింగ్ మార్కెటింగ్ విధులైన Assembling, గ్రేడింగ్ మరియు రవాణాను నిర్వర్తిస్తుంది.

గిడ్డంగులు రెండు ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. తయారైన వస్తువులను తరలించడం మరియు నిల్వచేయడం చేస్తుంది. వస్తువులను ప్లాంటు నుంచి గిడ్డంగికి, మరియు గిడ్డంగి నుంచి వినియోగదారులకు చేరవేస్తాయి. నిల్వచేసే విధులలో వస్తువులను అమ్ముడు అయ్యేవరకు గిడ్డంగులలో భద్రపరచి అవసరమైనపుడు సరుకును తరలిస్తాయి. గిడ్డంగులు కాల ప్రయోజనాన్ని తక్కువ వ్యయంతో కల్గిస్తాయి. వర్తకములో ఇవి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నవి.

గిడ్డంగుల ప్రాముఖ్యత:

  1. కొన్ని వస్తువులు కొన్ని కాలాలలో మాత్రమే ఉత్పత్తి అవుతాయి. కాని అన్ని కాలాలలో వినియోగించేందుకు గిడ్డంగులు దోహదపడతాయి.
  2. కొన్ని వస్తువులు సంవత్సరము పొడవునా ఉత్పత్తి అవుతాయి. కాని వాటి డిమాండు కొన్ని కాలాలలో, మాత్రమే ఉంటుంది. కాబట్టి గిడ్డంగులు ఈ విషయములో చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి.
  3. పెద్ద పెద్ద మొత్తాలలో సరుకును ఉత్పత్తి చేసి, సరుకులను సప్లయి చేసే కంపెనీలకు గిడ్డంగులు తప్పనిసరి.
  4. గిడ్డంగులు వస్తువులకు డిమాండ్ ఉన్నప్పుడు త్వరగా సప్లయి చేసి కంపెనీలకు సహాయపడతాయి.
  5. వస్తువుల ఉత్పత్తి నిరాటంకముగా ఉండటానికి, ఉత్పత్తి అయిన వస్తువులు సరఫరా కావడానికి గిడ్డంగులు తోడ్పడతాయి.
  6. గిడ్డంగులు ధరల స్థిరీకరణకు ఉపయోగపడతాయి. నిత్యావసర వస్తువులను గిడ్డంగులలో నిల్వచేసి వాటిని నియంత్రిస్తుంది. ధరలలో ఒడిదుడుకులు లేకుండా కాపాడుతుంది.
  7. గిడ్డంగుల ముఖ్య అవసరము ఏమిటంటే ఎక్కువ సరుకులను విభజించడము.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సేవలు, వస్తువులను నిర్వచించుము.
జవాబు:
సేవలు ఒక పని లేదా ప్రక్రియ. ఇవి జాతీయమైనవి. కంటికి కనిపించనివి. వివిధ రకాల వినియోగదారులు వివిధ రకాల డిమాండును కలిగి ఉంటారు. ఒకే సమయములో ఉత్పత్తి మరియు వినియోగం జరుగుతుంది. సేవలను స్టాక్ గా నిల్వ చేయలేము. సేవలను కలుగజేసినపుడు వినియోగదారుడు పాల్గొనవచ్చును.
ఉదా: ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో స్వయం సేవ.

వస్తువు భౌతికమైనది, సజాతీయమైనది. కంటికి కనిపించేది. వివిధ రకాల వినియోగదారులు ప్రామాణికమైన డిమాండ్లను పొందుతారు. ఉదా: మొబైల్ఫోన్.

వినియోగము మరియు ఉత్పత్తిని విడదీయవచ్చును. స్టాక్గా నిల్వచేసుకోవచ్చు. వస్తువును తయారుచేసేటపుడు వినియోగదారుని చేరిక సాధ్యముకాదు. ఉదా: మోటారు కారు తయారీ.

ప్రశ్న 2.
ఈ – బ్యాంకింగ్ ప్రయోజనాలను వ్రాయండి.
జవాబు:
ఈ – బ్యాంకింగ్ వలన క్రింది ప్రయోజనాలు లభిస్తాయి.

  1. తక్కువ వ్యయం: ఈ పద్ధతిలో బ్యాంకింగ్ వ్యవహారములకు అయ్యే వ్యయం తక్కువగా ఉంటుంది. అందువలన బ్యాంకులు ఎక్కువ లాభాలను ఆర్జిస్తాయి.
  2. త్వరితగతిన సేవలు: ఈ – బ్యాంకింగ్లో ఖాతాదారులకు ఖచ్చితమైన సేవలు బ్యాంకులు త్వరగా అందిస్తాయి.
  3. ఎక్కడైనా ఎప్పుడైనా బ్యాంకింగ్: ఈ పద్ధతిలో బ్యాంకింగ్ సేవలు రోజుకు 24 గంటలు వారానికి 7 రోజులు అందిస్తాయి. ఖాతాదారులు తన ఇంటి నుంచి, ఆఫీసు నుంచి తన ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని మరియు వ్యవహారాలు నిర్వహించడం జరుగుతుంది.
  4. నగదు రహిత బ్యాంకింగ్: ఈ బ్యాంకింగ్ ఎక్కడికైనా నగదు తీసుకొని వెళ్ళే అవసరము ఉండదు.
  5. ప్రపంచ వ్యాప్తము: ఈ బ్యాంకింగ్ బ్యాంకింగ్ సేవలు ప్రపంచ వ్యాప్తముగా ఏర్పాటు చేస్తుంది.
  6. సెంట్రల్ డేటాబేస్: ప్రతి బ్యాంకు బ్రాంచి దత్తాంశాన్ని కేంద్రీకరించడం జరుగుతుంది. ఖాతాదారు డిపాజిట్ చేయడం గాని, ఉపసంహరణ గాని ఒక బ్రాంచి నుంచి మరొక బ్రాంచికి పంపడం చేయవచ్చు.

ప్రశ్న 3.
మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏమిటి ? మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఏయే సేవలు పొందవచ్చునో వివరించండి?
జవాబు:
ఖాతాదారులు సెల్ఫోన్ ద్వారా బ్యాంకు సేవలను వినియోగించుకునే పద్ధతిని మొబైల్ బ్యాంకింగ్ అంటారు. టెలిఫోన్ బ్యాంకింగ్తో పోల్చినపుడు మొబైల్ బ్యాంకింగ్ పరిధి ఎక్కువ మరియు ఉపయోగమైనది. దీనిని దిగువ పద్ధతులలో వినియోగించుకొనవచ్చును.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ఎ) SMS బ్యాంకింగ్: మొబైల్ఫోన్లకు సంక్షిప్త వివరాలను పంపడాన్ని SMS బ్యాంకింగ్ అంటారు. SMS సమాచారాన్ని ప్రాముఖ్యత, అంత ప్రాముఖ్యత లేని బ్యాంకింగ్ వ్యవహారములకు ఉపయోగిస్తారు. ఏదైనా బ్యాంకు వ్యవహారము జరిగిన వెంటనే ఖాతాదారుడు తన ఖాతా నిల్వ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

బి) జి.యస్.యమ్.టూల్ కిట్: జి.యస్.యమ్. టూల్ కిట్లు అనేవి ఈ టెక్నాలజీ ఉన్న మొబైల్ ఫోన్లకు మాత్రమే వర్తిస్తాయి. ఈ సాఫ్ట్వేర్ మొబైల్ ఫోన్ మెనూలో వచ్చు మార్పులను తెలియజేస్తుంది. ఈ టూల్కిట్ కలిగి ఉన్న మొబైల్ ఫోన్లకు ప్రత్యేక సిన్కార్డులు కలిగి ఉంటాయి. మరియు ఒక స్థిరమైన బ్యాంకు బ్రాంచిలో సంబంధము కలిగి ఉంటాయి. ఖాతాదారుడు ఈ సేవలను ఉపయోగించుకొనవచ్చు.

సి) వేప్: వేప్ అనగా wireless application protocol. వేపు వెబ్ పేజీలతో పోల్చడం జరుగుతుంది. కంప్యూటర్ మానిటర్పై పేజీలు కనపడడమే కాకుండా దాని output చిన్న మొబైల్ ఫోన్లో కూడా చూపుతుంది. వేప్ బ్యాంకింగ్ అంత ప్రాముఖ్యత పొందలేదు. కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ సేవలను అందిస్తున్నవి.

ప్రశ్న 4.
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ దశలను వ్రాయుము.
జవాబు:
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ క్రింది దశలు ఉంటాయి.
1. ఎ.టి.యం: దీనిని ఆటోమేటిక్ టెల్లర్ మిషీన్ అంటారు. ఖాతాదారులు త్వరిత గతిన నగదు తీసుకొనుటకు, నగదు బదిలీ, బిల్లుల చెల్లింపు, డిపాజిట్లు మొదలగునవి ఎ.టి.యం ద్వారా జరుగుతాయి. వీటిని వివిధ స్థలాలలో ఏర్పాటు చేసి బ్యాంకులోని కంప్యూటర్ అనుసంధానము చేస్తారు. ఖాతాదారుడు బ్యాంకు వారు ఇచ్చిన కార్డు ద్వారా నగదు తీసుకొనవచ్చును.

2. టెలిఫోన్ బ్యాంకింగ్: టెలిఫోన్ నుండి ఖాతాదారులు అనేక వ్యవహారాలు జరుపుతారు. అవి ఖాతాలలోని నిల్వ తెలుసుకొనుట, బదిలీ, బిల్లులు చెల్లింపు, ఆర్డరు నివేదికలు మరియు చెక్కు పుస్తకాలు మొదలైన సేవలు పొందవచ్చును.

3. ఈ – మెయిల్ బ్యాంకింగ్: ఖాతాదారులు ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా వ్యవహారాలు జరుపుతారు. క్లయింటు యొక్క మెయిల్ బాక్స్కు అకౌంటు నివేదికను తరుచుగా కాల ప్రాతిపదికలో పంపడం జరుగుతుంది.

4. నెట్వర్క్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్: ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడాన్ని ఆన్లైన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. కంప్యూటరీకరణ చేసిన ప్రతిబ్యాంకు బ్రాంచి నెట్వర్క్ ద్వారా ఖాతాదారులు తమ ఆమోదాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుపుతారు. ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది ఖాతాదారులు బ్యాంకుకు సంబంధించిన వ్యవహారములు నెరవేర్చుటకు అవకాశమును కల్పిస్తుంది.

5. మొబైల్ బ్యాంకింగ్: ఖాతాదారులు సెల్ఫోన్ ద్వారా బ్యాంకింగ్ సేవలను వినియోగించుకొనే పద్ధతిని మొబైల్ బ్యాంకింగ్ అంటారు. దీని పరిధి చాలా ఎక్కువ. మొబైల్ బ్యాంకింగ్ను SMS, G.S.M, Sim Toolkit, మరియు వేప్ టెక్నాలజీలో వినియోగించుకొనవచ్చును.

ప్రశ్న 5.
భీమా అంటే ఏమిటి ? భీమా విధులను వివరించండి.
జవాబు:
భీమా అనగా ఒప్పందము. భీమాలో ఒక పార్టీ మరొక పార్టీకి ప్రతిఫలము కొంత నగదును, వస్తువులకు నష్టము సంభవించడం వలన, పాడైపోవడం వలన లేదా ఒక అనిశ్చిత సంఘటన వలన కలిగే నష్టాన్ని ఇవ్వడం జరుగుతుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

భీమా విధులు:
i) నిర్దిష్టతను కలుగజేయును: నష్టము సంభవించినపుడు ఒక నిర్ణీత మొత్తాన్ని, భీమా సంస్థ భీమాదారునకు చెల్లించడం జరుగుతుంది. నష్టము సంభవించడం వలనగాని లేక నిర్ణీతకాలము పూర్తి అయిన తర్వాత నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. నిర్దిష్టతను కల్పించడానికి భీమా సంస్థకు ప్రీమియం చెల్లించడం జరుగుతుంది.

ii) రక్షణ: భీమా రెండవ ముఖ్యవిధి రక్షణ కల్పించడం. నష్టము సంభవించుటకు గల అవకాశము నుంచి రక్షిస్తుంది. భీమా అనేది ఒక అనిశ్చిత సంఘటనను నిలవరించదు. కాని సంఘటన జరిగినపుడు నష్ట పరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది.

iii)నష్టాన్ని పంచుకోవడం: ఒక అనిశ్చిత సంఘటన జరిగినపుడు ఆ నష్టాన్ని భీమా పాలసీదారులు అందరూ పంచుకోవడం జరుగుతుంది. భీమా పాలసీదారులు అందరూ ప్రీమియం సంస్థకు చెల్లిస్తారు. కాబట్టి నష్టాన్ని కూడా పంచుకుంటారు.

iv)మూలధన కల్పనకు సహాయం: ప్రీమియం రూపములో వచ్చిన మొత్తాన్ని తిరిగి వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అందువలన మూలధన కల్పనకు తోడ్పడుతుంది.

ప్రశ్న 6.
భీమా ప్రయోజనాలు, పరిమితులను వివరించండి.
జవాబు:
భీమా ప్రయోజనాలు: భీమా వలన సాధారణ ప్రజలకు, వర్తకులకు, ప్రభుత్వానికి మరియు వివిధ ఏజెన్సీలకు అనేక లాభాలు కలుగుతాయి.
1. నిర్దిష్టతను కల్పించుట: భీమా సంస్థతో ఒప్పందము చేసుకోవడము వలన భీమాదారుడు అనిర్దిష్టతను నిర్దిష్టముగా మార్చుకోడానికి భీమా సహాయము చేస్తుంది. భీమాదారుడు ప్రీమియంను భీమా సంస్థకు చెల్లించడం ద్వారా నష్ట భయము తగ్గుతుంది.

2. నష్టాలను పంచుట: అనిర్దిష్ట సంఘటనల వలన కలిగే నష్టాలను ఎక్కువమంది భీమాదారులకు పంపిణీ చేయడానికి భీమా తోడ్పడుతుంది. భీమాదారుల నష్టభయాన్ని అన్ని భీమా కంపెనీలకు బదిలీ చేసే అవకాశము కలుగుతుంది. ఆర్థిక నష్టాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది.

3. భద్రత కల్పించుట: అనిశ్చిత సంఘటనల వలన కలిగే నష్టభయము నుండి భీమాదారునకు భద్రత కలుగజేస్తుంది. భీమా ప్రీమియం చెల్లించడం వలన అందుకు ప్రతిఫలముగా భీమాదారుకు కలిగే నష్టానికి లేదా పరిహారానికి భీమా కంపెనీ హామీ ఇస్తుంది. దీనివలన భీమాదారునకు నష్టభయం నుండి రక్షణ లభిస్తుంది.

4. మూలధనము సమకూర్చుట: వివిధ సంస్థలలో మూలధన పెట్టుబడులకు అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక నష్టభయాలను మరియు నష్టాలను తగ్గిస్తుంది.

5. సామర్థ్యాన్ని పెంచును: నష్టభయాన్ని భీమా తగ్గిస్తుంది. వ్యాపార సామర్థ్యాన్ని పెంచుతుంది. వ్యాపారస్తులకు భద్రత కల్పిస్తుంది. దీని వలన పారిశ్రామిక అభివృద్ధి మరియు పరిశ్రమలను విస్తరించడానికి అవకాశాలు కలుగుతాయి.

6. విదేశీ మారకద్రవ్యము ఆర్జన: అంతర్జాతీయ వ్యాపారుస్తులకు, ఓడల రవాణాదారులకు మరియు బ్యాంకింగ్ సంస్థలకు భీమా భద్రతను కల్పిస్తుంది. దీని వలన విదేశీ వ్యాపారము వృద్ధి చెంది, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడం జరుగుతుంది. ఫలితముగా దేశ ఆర్థిక వ్యవస్థ పఠిష్టముగా ఉంటుంది.

7. సామాజిక భద్రత: పేదరికము, నిరుఓ’్యగము, రోగాలు, వృద్ధాప్యము, అశక్తత ప్రమాదాలు, అగ్ని మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే అనర్థాలతో పోరాడటానికి భీమా ఒక సాధనముగా పనిచేస్తుంది.

8. పొదుపును ప్రోత్సహించుట: భీమా పొదుపును ప్రోత్సహిస్తుంది. ప్రజలలో ఖర్చు పెట్టే అలవాట్లను మార్చుతుంది. నిర్దిష్టమైన మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రోత్సహిస్తుంది.

భీమా పరిమితులు:

  1. నష్టాన్ని పంచడం: ఒక పాలసీదారుకు కలిగే నష్టాన్ని ఇతర పాలసీదారులందరికి పంచడం వలన తమకు రావలసిన పెట్టుబడి తగ్గిపోతుందని చాలామంది పెట్టుబడిదారులు భీమాను వ్యతిరేకిస్తున్నారు.
  2. ద్రవ్యము వాస్తవిక విలువ: గడువు పూర్తి అయిన చెల్లించే పాలసీ మొత్తము ఎక్కువగా ఉన్నప్పటికి ద్రవ్యము అసలు విలువతో పోలిస్తే తక్కువ.
  3. విశ్వాసంలో లోపము: చాలా మంది పెట్టుబడిదారులకు భీమాపై విశ్వాసము లేకపోవుట వలన తమ పెట్టుబడిని బ్యాంకులు, ఇతర సంస్థలలో ఉంచడానికి ఇష్టపడతారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 7.
జీవిత భీమా ప్రయోజనాలను తెలపండి.
జవాబు:
జీవిత భీమా వలన కలిగే ప్రయోజనాలు:

  1. పొదుపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది: జీవిత భీమాలో ప్రజలు నిర్ణీతకాలానికి ప్రీమియం చెల్లిస్తారు. ఈ విధముగా వారిలో పొదుపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది.
  2. పాలసీ తాకట్టు పెట్టుట లేదా బదిలీ: జీవిత భీమా పాలసీపై గల హక్కులను ఇతరులకు బదిలీ చేయడం ద్వారా ఋణాలను పొందవచ్చును. ఇతర భీమా సంస్థలు మరియు ద్రవ్య సహాయక సంస్థలకు భీమా పాలసీలను తనఖా ఉంచి గృహ ఋణాలను, ఇతర ఋణాలను పొందవచ్చును.
  3. పన్ను రాయితీ: భీమాదారుడు చెల్లించే ప్రీమియం మొత్తమునకు కేంద్ర ఆర్థికశాఖ పన్నురాయితీలను ఇస్తుంది.
  4. కుటుంబ సభ్యులకు రక్షణ: భీమాదారునకు అకాలమరణము సంభవించినపుడు, అతని కుటుంబ సభ్యులకు జీవిత భీమా ఆర్థిక సహాయం చేయును. ఈ విధముగా కుటుంబసభ్యులకు ఆధారాన్ని కల్పిస్తుంది.
  5. పెట్టుబడికి మంచి మార్గం: భీమాదారుడు పెట్టిన పెట్టుబడికి జీవిత భీమా నుంచి ఆదాయం వస్తుంది మరియు పెట్టుబడి మొత్తానికి రక్షణను కూడా కల్పిస్తుంది.
  6. సామాజిక భద్రత కల్పిస్తుంది: జీవిత భీమా వృద్ధులు, ఆరోగ్యము ప్రమాదము, అంగవైకల్యం, పిల్లల విద్య, వివాహము మొదలైన వాటికి సామాజిక భద్రతను కల్పిస్తుంది.

ప్రశ్న 8.
సముద్రభీమా లక్షణాలను వివరించుము.
జవాబు:
ఆర్నాల్ట్ ప్రకారము “సముద్ర భీమా ఒక పార్టీ ఎదుటి వ్యక్తి నుంచి పొందిన ప్రతిఫలమునకు సముద్ర ప్రయాణము మరియు ఓడలోకి సరుకు ఎక్కించునప్పుడు నిర్ణీత కాలములో సంభవించిన నష్టాన్ని భర్తీ చేసుకొనుటకు ఒక కాంట్రాక్టు”.

సముద్ర భీమా లక్షణాలు:
1. సాధారణ కాంట్రాక్టు సూత్రాలు అనగా భీమా ఆసక్తి, అత్యంత విశ్వాసము, నష్టపూర్తి, హక్కుల సంక్రమణ, పూచీ, సమీపకారణం మొదలైనవి సముద్ర భీమాకు వర్తిస్తాయి.

2. భీమాదారునకు, భీమా సంస్థకు మధ్య ఒప్పందమే సముద్రభీమా, నష్టభయానికి హామీ ఇచ్చినందుకు భీమాదారుడు నిర్ణీత వ్యవధిలో నిర్దిష్టమైన సొమ్మును భీమా సంస్థకు చెల్లించే బాధ్యత ఏర్పడుతుంది.

3. సముద్ర భీమాలో సముద్రములో సరుకు, ఓడ, సముద్రప్రయాణ ఛార్జీలు మొదలైన వాటికి భీమా ఉంటుంది. ఓడ మునిగిపోవుట, కాలిపోవుట, ఓడలు ఢీకొట్టుకొనుట, ఇసుకమేటలలో చిక్కుకొనిపోవుట, దొంగతనము మొదలైన నష్టభయాలకు సముద్ర భీమా హామీ కల్పిస్తుంది.

4. ఒక వైపు ప్రయాణానికి లేక అనేక ప్రయాణాలకు లేదా ఒక నిర్దిష్ట సమయానికి భీమా చేసుకొనవచ్చును. ప్రధానమైన షరతుపూర్తి అయిన తర్వాత తిరిగి భీమాను పునరుద్ధరణ చేసుకొనవచ్చును.

5. సముద్ర భీమాలో సముద్ర ప్రమాదాల వలన కలిగే నష్టాలను పూరించడానికి సంస్థ హామీ ఇవ్వడం జరుగుతుంది. 6. సముద్ర భీమాలో ఓడ లేదా ఓడలోని సరుకు నిల్వకు కలిగిన నష్టమును భీమాదారుకు చెల్లించబడుతుంది. ఇందులో మూడవ వ్యక్తి ‘భీమా కూడా ఉంటుంది.

ప్రశ్న 9.
అగ్ని భీమాను నిర్వచించి, లక్షణాలు వివరించుము.
జవాబు:
భీమా చట్టము 1938 సెక్షన్ 2(62) అగ్ని భీమాను ఇలా నిర్వచించినది. “ఇతర రకాల భీమా వ్యాపారాలతో సంబంధము లేకుండా, ఉదహరించిన భీమా ఆస్తికి అగ్ని వలన లేదా సాంప్రదాయ సిద్ధముగా అగ్నితో సంబంధము కలిగి ఉండి, దాని వలన కలిగే నష్టభయానికి ఇచ్చిన హామీ భీమా కాంట్రాక్టు”..
అగ్ని భీమా లక్షణాలు:
1. నష్టపూర్తి కాంట్రాక్టు: అగ్ని భీమా నష్టపూర్తి కాంట్రాక్టుకు చెందినది. ఈ కాంట్రాక్టులలో నిర్ణీతమైన పాలసీ మొత్తము లేదా అగ్ని ప్రమాదము వలన కలిగిన నష్టము ఏది తక్కువైతే ఆ మొత్తానికి మించి భీమాదారుడు క్లెయిం చేయలేడు.

2. న్యాయాత్మక ప్రతిఫలము: అగ్ని భీమా కాంట్రాక్టులలో ప్రతిఫలము విధిగా ఉండాలి. కాంట్రాక్టులో భీమాదారుడు చెల్లించిన ప్రతిఫలమును ప్రీమియం అంటారు. ఇది భీమా కాంట్రాక్టు ఆవశ్యకాలలో ఒకటి.

3. భీమా ఆసక్తి: అగ్ని భీమా చేయబడిన ఆస్తి లేదా సరుకు మీద భీమాదారునకు ఆసక్తి ఉండవలెను. అదే విధముగా నష్టము జరిగినపుడు నష్ట పరిహారము క్లెయిం చేసే సమయంలో కూడా అతనికి భీమా ఆసక్తి ఉండాలి.

4. అవశేషానికి క్లెయిం: భీమా సరుకు అగ్ని ప్రమాదములో నష్టానికి గురైనపుడు సంస్థ క్లెయిం చెల్లించగానే మిగిలిన సరుకు లేదా నష్టపోయిన సరుకు సంస్థకు బదిలీ అయి, భీమాదారుడు హక్కు కోల్పోతాడు.

5. ప్రమాదానికి కారణము: ప్రమాదము వలన జరిగిన నష్టానికి కారణము అగ్ని లేదా నిప్పురవ్వలు అయి ఉండాలి. ఏ ఇతర కారణం వలన నష్టము జరిగినా సంస్థ ఆ క్లెయిమును పరిష్కారానికి అంగీకరించదు.

6. అత్యంత విశ్వాసము: అగ్ని భీమా కాంట్రాక్టులో భీమాదారుడు మరియు సంస్థకు ఒకరిపై మరొకరికి అత్యంత నమ్మకము ఉండాలి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 10.
రోడ్డు రవాణా ప్రయోజనాలు, పరిమితులు తెలపండి.
జవాబు:
రోడ్డు రవాణా ప్రయోజనాలు:

  1. తక్కువ మూలధనము: రైల్వేలు మరియు విమానాలతో పోలిస్తే రోడ్ల నిర్మాణానికి తక్కువ మూలధనము అవసరము. రోడ్ల నిర్వహణ సాధారణముగా రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక సంస్థలు చేపడతాయి.
  2. ఇంటింటికి సేవ: వస్తువులను, ప్రయాణీకులను ఎంత మారుమూల ప్రాంతానికైనా, చేరవేస్తుంది. రోడ్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తుంది.
  3. గ్రామీణ ప్రాంతానికి సేవలు: గ్రామీణ ప్రాంతాల వారికి రోడ్డు రవాణా చాలా అనుకూలము. సరుకులను గ్రామీణ పట్టణ ప్రాంతాలలో అమ్మడానికి ఇది అనువైనది.
  4. తక్కువ నిర్వహణ ఖర్చు రైల్వేలతో పోల్చినపుడు రోడ్డు నిర్వహణ వ్యయము చాలా తక్కువగా ఉంటుంది.
  5. మార్పుకు అనుకూలము: రోడ్డు రవాణా వాహనాలను మార్చుకోవడానికి అనుకూలముగా ఉంటుంది. వ్యక్తిగత అవసరాల ఆధారముగా కాలాన్ని, రహదారులను మార్చుకోవచ్చు.
  6. స్వల్ప దూరానికి అనుకూలము: స్వల్ప దూరానికి వస్తువులను మరియు ప్రయాణీకులను త్వరగా, తక్కువ ఖర్చుతో తరలించవచ్చును.
  7. ఇతర రవాణా వ్యవస్థలకు సహాయకారి: ఏ ఇతర రవాణా వ్యవస్థకైనా రోడ్డు రవాణా సహాయకారిగా ఉంటుంది. అన్ని వస్తువుల తరలింపు రోడ్డు రవాణాతో ప్రారంభం అవుతుంది.
  8. తక్కువ వ్యయం: రోడ్డు రవాణాలో ప్రారంభ మూలధనము, నిర్వహణ ఖర్చులు, ఇతర రవా తో పోలిస్తే తక్కువ.
  9. వేగం ఎక్కువ: రోడ్డు రవాణాలో రవాణాకు పట్టేకాలము తగ్గించవచ్చును. జల రవాణాతో పోలిస్తే రోడ్డు రవాణా వేగవంతమైనది.

రవాణాలో లోపాలు:

  1. ఋతు విధేయమైనది: దూరప్రాంతాలకు రోడ్డు రవాణా అనుకూలమైనది కాదు. వర్షాలు లేక వరదలు వచ్చినపుడు రోడ్డు రవాణా నమ్మదగినది కాదు.
  2. రవాణాలో ప్రమాదాలు: రైళ్ళతో పోలిస్తే రోడ్డు రవాణా అంత సురక్షితం కాదు. మోటారు వాహనాల ద్వారా ప్రమాదాలకు అవకాశాలెక్కువ.
  3. తక్కువ వేగం: ఇతర రవాణాలతో పోల్చినపుడు రోడ్డు రవాణాలో వాహనాలు తక్కువ వేగముతో నడుస్తాయి.
  4. పరిమిత రవాణా సామర్థ్యము: భారీ వస్తువుల రవాణాకు రోడ్డు రవాణా అనుకూలము కాదు. కారణం రోడ్డు రవాణా సామర్థ్యం తక్కువ.
  5. ఖర్చు ఎక్కువ: దూర ప్రాంతాలకు రైలు రవాణాతో పోలిస్తే రోడ్డు రవాణాలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 11.
రైలు రవాణా ప్రయోజనాలను, లోపాలను వ్రాయుము.
జవాబు:
రైలు రవాణా ప్రయోజనాలు:

  1. దూర ప్రాంతాలకు మోటారు వాహనాల ద్వారా వీలుకాని పెద్ద పెద్ద వస్తువులను రైల్వేలు రవాణా చేస్తాయి.
  2. రైల్వేలు అతిత్వరగా ఖచ్చితముగా వస్తువులను ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి చేరుస్తాయి.
  3. బొగ్గు, ఇతర ముడిసరుకులను సరసమైన రేట్లకు ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి సులభముగా రవాణా చేస్తాయి.
  4. కరువు కాటకాలు మరియు వస్తువులు కొరత ఉన్నప్పుడు అతి త్వరగా వస్తువులను ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి తీసుకొనిపోవడానికి రైల్వేలు సహాయపడతాయి.
  5. శ్రామిక గమనాన్ని ప్రోత్సహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.
  6. రైలు ప్రయాణము సురక్షితమైనది. ప్రమాదాలు, విఘాతాలకు ఇతర రవాణాలతో పోలిస్తే రైల్వేలో తక్కువ.
  7. రైల్వేలకు వస్తువుల యొక్క రవాణా సామర్థ్యము చాలా ఎక్కువగా ఉంటుంది. అవసరాలను బట్టి రైల్వే వేగను పెంచవచ్చును.

రైల్వే రవాణా లోపాలు:

  1. రైల్వేలకు మూలధనము భారీమొత్తములో అవసరమవుతుంది. నిర్మాణ వ్యయము, నిర్వహణ వ్యయం, పరోక్ష ఖర్చులు మొదలైనవి ఇతర రవాణాలతో పోలిస్తే చాలా ఎక్కువ.
  2. రైల్వే రవాణాలో మరొక లోపము మార్పు లేకపోవడం. వ్యక్తిగత అవసరాలకు అనుగుణముగా రైలు మార్గాన్ని, సమయాన్ని మార్పు చేయలేము.
  3. రైల్వే రవాణా రోడ్డు రవాణా వలె వస్తువులను ఇంటికి తరలించదు.
  4. రైల్వే రవాణా అనేది తక్కువ దూరానికి మరియు తక్కువ బరువు గల వస్తువులను రవాణా చేయడానికి అనుకూలము కాదు.
  5. మోటారు రవాణాతో పోల్చినపుడు రైలు రవాణాలో వస్తువులను లోడింగ్ చేయడానికి, డెలివరీ చేయడానికి ఎక్కువ సమయము, ఎక్కువ శ్రమ అవసరమవుతుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎ.టి.యమ్.
జవాబు:
ఎ.టి.యమ్ అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ అని, ఎనీ టైమ్ మనీమెషీన్ అని కూడా అంటారు. ఖాతాదారులు త్వరగా నగదు తీసుకొనుటకు, బదిలీ, బిల్లుల చెల్లింపు మొదలైనవి ఎ.టి.యమ్ ద్వారా జరుగుతాయి. వీటిని వివిధ స్థానాలలో ఏర్పాటు చేసి బ్యాంకులో కంప్యూటరుకు అనుసంధానము చేస్తారు. ప్రతి ఖాతాదారునకు ఒక కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు సహాయముతో ఖాతాదారుడు నగదు తీసుకోవచ్చును.

ప్రశ్న 2.
ఆన్లైన్ బ్యాంకింగ్.
జవాబు:
ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడాన్ని ఆన్లైన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. కంప్యూటీకరణ చేసిన ప్రతి బ్యాంకు బ్రాంచి, నెట్వర్క్ ద్వారా ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవహారాలు జరపడానికి అవకాశం ఏర్పడినది. ఖాతాదారులు ఇంటివద్దనే బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వహించుకుంటారు.

ప్రశ్న 3.
టెలీ బ్యాంకింగ్.
జవాబు:
దీనిని హోమ్ బ్యాంకింగ్ అంటారు. టెలీఫోన్ నుండి ఖాతాదారులు అనేక వ్యవహారాలు జరుపుతారు. అవి ఖాతాలోని నిల్వ తెలుసుకొనుట, బదిలీ, బిల్లుల చెల్లింపు, ఆర్డర్ స్టేటుమెంట్లు, చెక్కు పుస్తకాలు మొదలైన సేవలను పొందవచ్చు.

ప్రశ్న 4.
మొబైల్ బ్యాంకింగ్.
జవాబు:
ఖాతాదారులు సెల్ఫోన్ ద్వారా బ్యాంకు సేవలను వినియోగించుకొను పద్ధతిని మొబైల్ బ్యాంకింగ్ అంటారు. టెలిఫోన్ బ్యాంకింగ్తో పోల్చినపుడు మొబైల్ బ్యాంకింగ్ పరిథి ఎక్కువ మరియు ఉపయోగమైనది. మొబైల్ బ్యాంకింగ్ను యస్.యమ్.ఎస్ బ్యాంకింగ్, జి.యస్.ఎమ్. సిమ్ టూల్కిట్ మరియు వేప్ టెక్నాలజీలలో వినియోగించుకొనవచ్చును.

ప్రశ్న 5.
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్.
జవాబు:
కంప్యూటర్ రాకతో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ప్రారంభమైనది. 1970లో ఎ.టి.యమ్, 1980లో టెలీ బ్యాంకింగ్ మరియు ఈ మెయిల్ బ్యాంకింగ్ ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఆచరణలోనికి వచ్చాయి. కొత్త పరికరాలైన క్రెడిట్ కార్డులు, ATM, ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ మరియు ఎలక్ట్రానిక్ క్లియరింగ్ హౌస్ పద్ధతులు ప్రతిభావంతమైన, వేగవంతమైన చెల్లింపులు, పరిష్కార పద్ధతులు. వీటిని అన్నింటిని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటారు.

ప్రశ్న 6.
భీమా సంస్థ మరియు భీమాదారుడు.
జవాబు:
భవిష్యత్తులో ఒక సంఘటన జరిగినపుడు అందుకు సొమ్ము చెల్లించుటకు అంగీకరించిన వారిని భీమా సంస్థ లేదా ఇన్సూరర్ అంటారు. తనకు అనుకోకుండా జరిగే నష్టానికి భద్రత కోరుతూ, అందుకోసం కొంత సొమ్మును సంస్థకు చెల్లించే వ్యక్తిని భీమాదారుడు లేదా ఇన్సూర్డ్ అంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 7.
ప్రీమియం.
జవాబు:
భీమాదారునకు కలిగే నష్టానికి రక్షణ కల్పించినందుకు బదులుగా, భీమాసంస్థకు నిర్దిష్ట సమయానికి భీమాదారుడు చెల్లించే సొమ్మును ప్రీమియం అంటారు.

ప్రశ్న 8.
భీమా నిర్వచనము.
జవాబు:
భీమా అనగా ఒప్పందము. భీమాతో ఒక పార్టీ మరొక పార్టీకి ప్రతిఫలముగా కొంతనగదు మొత్తాన్ని, వస్తువులకు సంభవించడం వలన గాని, పాడైపోవుట వలన గాని, గాయపడుట వలన గాని లేదా అనిశ్చిత సంఘటన జరుగుట వలన గాని కలిగే నష్టాన్ని ఇవ్వడం జరుగుతుంది.

ప్రశ్న 9.
పునరీమా.
జవాబు:
రెండు లేదా ఎక్కువ భీమా సంస్థల మధ్య జరిగిన భీమా కాంట్రాక్టును పునర్భీమా అంటారు. ఒక భీమా సంస్థ తాను అంగీకరించిన భీమా విషయములో కొంతభాగాన్ని మరొక భీమా సంస్థకు బదిలీ చేస్తూ చేసుకున్న ఏర్పాటునే పునర్భీమా అంటారు. దీని వలన మొదటి భీమా సంస్థ బాధ్యత పరిమితము అవుతుంది.

ప్రశ్న 10.
ద్వంద్వ భీమా
జవాబు:
ద్వంద్వ భీమా అంటే ఒకే ఆస్తిపై ఒకటి కంటే ఎక్కువ భీమా పాలసీలు తీసుకోవడము. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ భీమా పాలసీలను తీసుకోవచ్చు. ఆ పాలసీదారు మరణించినా లేదా నిర్ణీత గడువు తీరినపుడు ఏది ముందు జరిగినా, భీమా సొమ్మును అన్ని భీమా సంస్థలు పూర్తిగా ఎవరికి చెల్లిస్తారు. కాని అగ్ని, సముద్ర భీమాలలో అన్ని భీమా సంస్థలు నష్టాన్ని మించకుండా చెల్లిస్తారు.

ప్రశ్న 11.
హక్కుల సంక్రమణ.
జవాబు:
దీని అర్థము ఋణదాత హక్కులను పొందిన వ్యక్తిని ఋణదాత స్థానములో ఉంచడము. నష్టపరిహారాన్ని చెల్లించిన తర్వాత భీమాదారుకు గల అన్ని హక్కులు భీమాసంస్థకు బదిలీ అవుతాయి. దీనిని హక్కుల సంక్రమణ సిద్ధాంతము లేదా ప్రతినివేశం అంటారు.

ప్రశ్న 12.
సమీపకారణము.
జవాబు:
ఇది causa proxima అనే లాటిన్ సూత్రము నుండి ఏర్పడినది. దీని అర్థము దగ్గర కారణము. ఒక నష్టము సంభవించడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో వాస్తవమైన కారణాన్ని సమీపకారణము అంటారు. భీమా సంస్థ బాధ్యతను లెక్కించుటకు సుమారు కారణంకాక సమీపకారణం లెక్కలోకి తీసుకుంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 13.
భీమా ఆసక్తి.
జవాబు:
సక్రమమైన భీమా కాంట్రాక్టు ఆవశ్యకాలలో భీమా ఆసక్తి ప్రధానమైనది. భీమా ఆసక్తి లేని ఒప్పందము జూదముగా భావిస్తారు. అది చెల్లని కాంట్రాక్టు అవుతుంది. కనుక భీమా చేసే వ్యక్తికి ఆస్తి మీద లేదా జీవితం మీద గాని ఆసక్తి కలిగి ఉండాలి. ఉదా: ఒక వ్యక్తికి తన జీవితం మీద గాని, తన భార్య జీవితం మీద భీమా ఆసక్తి ఉంటుంది.

ప్రశ్న 14.
ఎండోమెంట్ పాలసీ.
జవాబు:
ఎండోమెంట్ జీవిత భీమాపాలసీ ఒక నిర్దిష్ట కాలానికి తీసుకునే పాలసీ. గడువుకాలము పూర్తి అయిన తర్వాత గాని లేక పాలసీదారు మరణించినపుడు గాని వీటిలో ఏది ముందు జరిగినా భీమా సంస్థ హామీ ఇచ్చిన సొమ్మును చెల్లిస్తుంది.

ప్రశ్న 15.
యావజ్జీవిత పాలసీ.
జవాబు:
యావజ్జీవిత పాలసీ జీవితకాలము అమలులో ఉంటుంది. ఈ పాలసీ మీద ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ రిస్క్న భరిస్తుంది. భీమా ప్రీమియం 20 నుంచి 25 సంవత్సరాలు లేదా జీవితకాలం చెల్లించాలి.

ప్రశ్న 16.
సముద్ర భీమా.
జవాబు:
సముద్ర భీమాలో ఒక పార్టీ ఎదుట వ్యక్తి నుంచి ప్రతిఫలమును స్వీకరించినందుకుగాను ఆ వ్యక్తికి సముద్ర ప్రయాణములో ప్రమాదాలు మరియు ఓడలోకి సరుకు ఎక్కించునపుడు, భవిష్యత్ అనగా నిర్ణీత కాలములో సంభవించిన నష్టాన్ని భర్తీ చేయుటకు, చేసుకొనుటకు ఒక కాంట్రాక్టు.

ప్రశ్న 17.
సరుకు భీమా.
జవాబు:
సరుకు రవాణా చేయునపుడు అనేక ప్రమాదాలకు గురి అవుతుంది. నౌకాశ్రయములో దొంగతనము లేదా ప్రయాణములో సరుకునకు నష్టము జరుగుట మరియు ఇతర ప్రమాదాలకు గురి అగును. ఇటువంటి నష్ట భయానికి ఇచ్చే హామీని కార్గో భీమా (సరుకు భీమా) అంటారు.

ప్రశ్న 18.
అగ్ని భీమా.
జవాబు:
“భీమా చట్టము 1938 సెక్షన్ 2(6ఎ) అగ్ని భీమాను ఇలా నిర్వచించినది”. ఇతర రకాల భీమా వ్యాపారాలతో సంబంధము లేకుండా ఉదహరించిన భీమా ఆస్తికి అగ్ని వలన గాని లేదా సంప్రదాయ సిద్ధముగా అగ్నితో సంబంధం కలిగి జరిగే నష్టానికి ఇచ్చిన హామీ భీమా కాంట్రాక్టు”.

ప్రశ్న 19.
అగ్ని భీమా లక్షణాలు.
జవాబు:

  1. అగ్ని భీమా నష్ట పూర్తి కాంట్రాక్టు.
  2. అగ్ని భీమాలో న్యాయాత్మక ప్రతిఫలం ఉండాలి.
  3. భీమాదారుకు ఆస్తి మీద భీమా ఆసక్తి ఉండాలి.
  4. ప్రమాదము వలన జరిగిన నష్టానికి కారణం అగ్ని అయి ఉండాలి.
  5. ఈ కాంట్రాక్టు అత్యంత విశ్వాసము గలది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 20.
జాతీయ రహదారి.
జవాబు:
జాతీయ రహదారులు వివిధ రాష్ట్రాల రహదారులను కలుపుతూ సైనికులను చేరవేస్తుంది. ఈ రహదారి రాష్ట్ర రాజధానులను, మహానగరాలను కలుపుతుంది. జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ నియంత్రణను ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ చేపట్టింది.

ప్రశ్న 21.
పైపులైన్లు.
జవాబు:
పైపులైన్లు ద్రవ పదార్థాలను తరలించడానికి ఎంతో ప్రాముఖ్యత వహించినది. పైపులైన్ల ద్వారా సహజ వాయువు మరియు ముడిచమురు, ఇతర పెట్రోలియం ఉత్పత్తులు పైప్ లైన్ల ద్వారా పంపబడతాయి. పైపులైన్లు ఎటువంటి అంతరాయము లేకుండా తక్కువ ఖర్చుతో నిర్వహించబడతాయి.

ప్రశ్న 22.
బాండెడ్ గిడ్డంగులు.
జవాబు:
ప్రభుత్వము చేత అనుమతి పొంది పన్నులు మరియు కస్టమ్స్ సుంకాలు చెల్లించక మునుపు దిగుమతి చేసుకున్న వస్తువులు నిల్వచేయడానికి ఉపయోగపడే గిడ్డంగులను బాండెడ్ గిడ్డంగులు అంటారు. దిగుమతిదారుడు పూర్తి సుంకాలు చెల్లించలేనపుడు, మొత్తం సరుకు అవసరం లేనపుడు, కస్టమ్స్ అధికారులు బాండెడ్ గిడ్డంగులలో భద్రపరుస్తారు.

ప్రశ్న 23.
గిడ్డంగుల రెండు ప్రాముఖ్యతలు.
జవాబు:

  1. కొన్ని వస్తువులు కొన్ని కాలాలలో మాత్రమే ఉత్పత్తి అవుతాయి. కాని అన్ని కాలాలలో వినియోగించేందుకు గిడ్డంగులు దోహదపడతాయి.
  2. గిడ్డంగులు ధరల స్థిరీకరణకు ఉపయోగపడతాయి. నిత్యావసర వస్తువులను ప్రభుత్వ గిడ్డంగులలో నిల్వచేసి వాటిని నియంత్రిస్తుంది. ధరలలో ఒడిదుడుకులు లేకుండా కాపాడుతుంది.

ప్రశ్న 24.
క్యాష్ క్రెడిట్
జవాబు:
ఒక సంవత్సరానికి లేదా అంతకంటే తక్కువ కాలానికి ఖాతాదారునకు మంజూరు చేసిన ఋణాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. సరుకుగాని, ఇతర ఆస్తి హామీగా ఈ ఋణాన్ని మంజూరు చేస్తారు. ఋణ మొత్తాన్ని ఖాతాదారుడు ఒకేసారి లేదా కొన్ని వాయిదాలలో తీసుకోవచ్చు. ఋణమొత్తముపై కాక ఖాతాదారుడు వాడుకున్న మొత్తంపై వడ్డీని విధిస్తారు.

ప్రశ్న 25.
బిల్లుల డిస్కౌంట్.
జవాబు:
బిల్లుదారు బిల్లు గడువు తేదీకి ముందు నగదు అవసరమయినపుడు బ్యాంకు వద్ద డిస్కౌంటు చేసుకొనవచ్చును. బ్యాంకు బిల్లు మొత్తములో కొంత మొత్తాన్ని తగ్గించి బిల్లుదారుకు చెల్లిస్తుంది. గడువుతేదీన బిల్లు స్వీకర్త నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసుకుంటుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 26.
రికేరింగ్ డిపాజిట్.
జవాబు:
తక్కువ ఆదాయము పొందేవారు చిన్న మొత్తాలలో పొదుపు చేయడానికి ఈ డిపాజిట్లు అనుకూలము. ఈ డిపాజిట్లను కొంత కాలవ్యవధి అనగా వారానికి, నెలకు నిర్ణయించిన మొత్తాన్ని నిర్ణీతకాలము పూర్తి అయ్యేవరకు నగదు జమచేస్తూ ఉండాలి. గడువుకాలము పూర్తి అయిన తర్వాత వడ్డీతో సహా మొత్తం సొమ్మును డిపాజిట్ దారుకు చెల్లిస్తారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్వదేశీ, విదేశీ వర్తకం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్వదేశీ, విదేశీ వర్తకం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వర్తకము అనగానేమి ? వివిధ రకాల వర్తకాలను వివరింపుము.
జవాబు:
వస్తువులు లేదా సేవల అమ్మకము మరియు కొనుగోలు చేయడాన్ని వర్తకము అంటారు. ఈ అమ్మకము మరియు కొనుగోలు ఇద్దరు వ్యక్తుల మధ్యగాని, రెండు సంస్థల మధ్యగాని లేదా రెండు దేశాల మధ్య జరుగవచ్చును. వర్తకము రెండు రకాలు. 1) స్వదేశీ వర్తకము, 2) విదేశీ వర్తకము.

1) స్వదేశీ వర్తకము : ఒకదేశ సరిహద్దు లోపల కొనుగోలు మరియు అమ్మకాలు జరపడాన్ని స్వదేశీ వర్తకము అంటారు. స్వదేశీ వర్తకాన్ని దేశీయ వర్తకము అని కూడా అంటారు.
స్వదేశీ వర్తకము యొక్క లక్షణాలు :

  1. కొనుగోలు, అమ్మకాలు ఒక దేశ సరిహద్దులలోనే జరుగుతాయి.
  2. వస్తువుల రవాణా సాధారణముగా రోడ్డు లేదా రైల్వే వాహనాల ద్వారా జరుగుతుంది.
  3. స్వదేశీ వర్తకములో చెల్లింపులు స్వదేశీ కరెన్సీ ద్వారానే జరుగుతాయి.
  4. స్వదేశీ వర్తకములో వ్యాపార వ్యవహారాలు ఉత్పత్తిదారులు, మధ్యవర్తులు, వినియోగదారుల మధ్య జరుగుతాయి.
  5. స్వదేశీ వర్తకములో చాలారకాలైన వస్తువులు అందుబాటులో ఉంటాయి.

స్వదేశీ వర్తకాన్ని మరల రెండు రకాలుగా విభజించవచ్చును. అది ఎ) టోకు వర్తకము బి) చిల్లర వర్తకము. ఎ) టోకు వర్తకము : ఉత్పత్తిదారుల నుండి పెద్ద పెద్ద పరిమాణములో వస్తువులను కొనుగోలు చేసి, చిన్నచిన్న పరమాణములో చిల్లర వర్తకులకుగాని, తుది వినియోగదారులకు గాని అమ్మకము చేయడాన్ని టోకు వర్తకమని, ఆ వ్యాపారాన్ని నిర్వహించే వర్తకుడిని టోకు వర్తకుడు అని అంటారు. ఇతడు ఉత్పత్తిదారులకు, చిల్లర వర్తకులకు మధ్య వారధిగా ఉంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

బి) చిల్లర వర్తకము : టోకు వర్తకుల నుంచి పెద్ద మొత్తాలలో సరుకును కొనుగోలు చేసి, చిన్న మొత్తాలలో తుది వినియోగదారులకు చేరవేసే వర్తకము చిల్లర వర్తకము. చిల్లర వర్తకము చేసేవారిని చిల్లర వర్తకులు అని అంటారు. వీరు అటు టోకు వర్తకులకు, ఇటు వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటారు.

2) విదేశీ వర్తకము : రెండు వేరువేరు దేశాల మధ్య జరిగే కొనుగోలు, అమ్మకాలను అంతర్జాతీయ వర్తకము లేదా విదేశీ వర్తకము అంటారు. విదేశీ వర్తకాన్ని మూడురకాలుగా విభజించవచ్చును. అవి ఎ) దిగుమతి వర్తకము, బి) ఎగుమతి వర్తకము, సి) మారు వర్తకము.

ఎ) దిగుమతి వర్తకము : ఏదైనా ఒక దేశము తన దేశ అవసరాలకు వస్తువులను లేదా సేవలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అలాంటి వర్తకాన్ని దిగుమతి వర్తకము అంటారు. ఉదా : భారతదేశము చైనా నుంచి అత్యాధునిక ఎలక్ట్రిక్ పరికరాలను కొనుగోలు చేయడము.

బి) ఎగుమతి వర్తకము : ఏదైనా ఒక దేశము తన దేశ అవసరాలకు సరిపడగా, మిగిలిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడాన్ని ఎగుమతి వర్తకము అంటారు. ఉదా : భారతదేశము వజ్రాలను వేరే దేశాలకు ఎగుమతి చేయడము.

సి) ఎంట్రిపో వర్తకము (మారు వర్తకము) : ఒక దేశము తన దేశ అవసరాల కోసం కాకుండా వేరొక దేశ అవసరాలకు విదేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకొని, వేరొక దేశానికి ఎగుమతి చేసినట్లయితే ఆ వర్తకాన్ని

3. విత్తనాలను ఎంట్రిపో వర్తకము లేక మారు వర్తకము అంటారు. ఉదా : భారతదేశము అమెరికా నుంచి నూనె దిగుమతి చేసుకొని, మలేషియాకు ఎగుమతి చేయడము.

ప్రశ్న 2.
విదేశీ వర్తకము అనగానేమి ? వివిధ రకాల విదేశీ వర్తకాలను తెలుపుము.
జవాబు:
రెండు దేశాల మధ్య జరిగే వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకము అంటారు. రెండు దేశాలలోని వ్యాపారస్తుల మధ్య సరుకు మరియు సేవల వినిమయము జరిగితే అది అంతర్జాతీయ వర్తకము అవుతుంది. విదేశీ వర్తకములో రెండు వేరు వేరు దేశాల మధ్య కేవలము వస్తువులే కాకుండా ఆయాదేశాల కరెన్సీ కూడా మారకం జరుగుతుంది. విదేశీ వర్తకము ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒక దేశములో తయారైన వస్తువులు మరొక దేశములోని వినియోగదారులు ఉపయోగించుకుంటారు.

విదేశీ వర్తకాన్ని మూడు రకాలుగా విభజించవచ్చును. అవి 1. దిగుమతి వర్తకము, 2. ఎగుమతి వర్తకము, 3. మారు వర్తకము (ఎంట్రిపో వర్తకము).
1. దిగుమతి వర్తకము : Import అనే పదము యొక్క భావన ఏమిటంటే వస్తు, సేవలను దేశములోని రేవులకు చేరవేయడము. ఇతర దేశము నుంచి సరుకును కొనుగోలు చేసినపుడు, ఆ దేశము నుంచి కొనుగోలుదారు దేశానికి దిగుమతి చేసుకున్నట్లు భావిస్తారు. ఇలాంటి వర్తకాన్ని దిగుమతి వర్తకము అంటారు. ఉదా : చైనాలో అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు చౌకగా లభ్యమవుతాయి. వాటిని భారతదేశము దిగుమతి చేసుకుంటున్నది.

2. ఎగుమతి వర్తకము : Export అనే పదము యొక్క భావము ఏమిటంటే వస్తు, సేవలను ఇతర దేశాలకు ఓడరేవుల నుంచి బయటకు షిప్పింగ్ చేయడము. ఇతర దేశాలలోని వర్తకులకు సరుకును అమ్మినపుడు, సరుకును ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగా భావిస్తారు. ఉదా : మన దేశము ఇతర దేశాలకు వజ్రాలను ఎగుమతి చేస్తుంది.

3. మారు వర్తకము (ఎంట్రిపో వర్తకము) : ఒక దేశము తన అవసరాల కోసం కాకుండా వేరొక దేశానికి అవసరాల కోసం, వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, వాటిని మరల ఆ దేశానికి ఎగుమతి చేసే వర్తకాన్ని మారు వర్తకము అంటారు. ఉదా: భారతదేశము అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకొని వాటిని మలేషియాకు ఎగుమతి చేయడము.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

ప్రశ్న 3.
విదేశీ వర్తకము అనగానేమి ? వాటి యొక్క ప్రాముఖ్యతను వివరింపుము.
జవాబు:
రెండు దేశాల మధ్య జరిగే వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకము అంటారు. రెండు దేశాలలోని వ్యాపారస్తుల మధ్య సరుకు మరియు సేవల వినిమయం జరిగితే అది అంతర్జాతీయ వర్తకము అవుతుంది. విదేశీ వర్తకములో రెండు వేరు వేరు దేశాల మధ్య కేవలం వస్తువులే కాకుండా ఆయా దేశాల కరెన్సీ కూడా మారకము జరుగుతుంది. విదేశీ వర్తకము ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒక దేశములో తయారైన వస్తువులు మరొక దేశములోని వినియోగదారులు ఉపయోగించుకుంటారు.

విదేశీ వర్తకము ప్రాముఖ్యత : ప్రతి దేశానికి విదేశీ వర్తకము అవసరము అవుతుంది. కారణమేమంటే ఏ దేశమైనా ప్రజల వినియోగానికి అవసరమైన అన్ని వస్తువులను ఉత్పత్తి చేయలేదు. ఈ దిగువ తెలుపబడిన అంశాలను పరిశీలిస్తే విదేశీ వర్తక ప్రాముఖ్యత తెలుస్తుంది.

1. ప్రపంచములోని వివిధ దేశాలలో వివిధ సహజ వనరులు కలిగి ఉంటాయి. మరికొన్ని దేశాలలో సహజ వనరులు ఉండకపోవచ్చును. అటువంటి పరిస్థితులలో ఆ దేశము సహజ వనరులకై ఇతర దేశాలపై ఆధారపడుతుంది.”

2. కొన్ని దేశాలు కొన్ని రకములైన వస్తువులను ముడిపదార్థాల లభ్యత, శ్రామికుల లభ్యత, సాంకేతిక పరిజ్ఞానము మొదలైన కారణాల వలన తక్కువ ఉత్పత్తి వ్యయముతో తయారుచేస్తాయి. అటువంటి పరిస్థితులలో ఎక్కువ వ్యయము వస్తువులను ఉత్పత్తి చేయకుండా, ఆయా దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి విదేశీ వర్తకము తోడ్పడుతుంది.

3. ప్రతిదేశము ఆ దేశానికి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసుకోలేదు. కొన్ని దేశాలలో కొన్ని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వలన ఆయా దేశాలలో ఆ వస్తువులు తయారుచేయబడతాయి. ఉదా : క్యూబా దేశములో చక్కెర, ఈజిప్టు దేశములో పత్తి ఉత్పత్తి అవుతుంది.

4. ఆర్థిక అసమానతలు తొలగించి, వివిధ దేశాల ఆర్థికాభివృద్ధికి విదేశీ వర్తకము తోడ్పడుతుంది.

5. అంతర్జాతీయ వర్తకము ఇరుదేశాల మధ్య సంబంధాలను, సంస్కృతిని, శాంతిని పెంపొందిస్తుంది.

6. అంతర్జాతీయ వర్తకము వలన వివిధ దేశాలలో వస్తుసేవల ధరలు తగ్గుతాయి.

7. ఈ ప్రపంచీకరణ యుగములో ఏ దేశమైనా స్వయముగా అభివృద్ధి చెందదు. కాబట్టి ప్రతిదేశము మరొక దేశముపై ఆధారపడవలసి వస్తుంది.

ప్రశ్న 4.
స్వదేశీ మరియు విదేశీ వర్తకాల మధ్య భేదాలను తెలుపుము.
జవాబు:
స్వదేశీ వర్తకానికి, విదేశీ వర్తకానికి మధ్య క్రింది తేడాలున్నవి.

విదేశీ వర్తకము

  1. వర్తకము : వర్తకము ఒక దేశ సరిహద్దులలోపు జరుగుతుంది.
  2. కరెన్సీ మార్పిడి : స్వదేశీ వర్తకములో కరెన్సీ మార్పిడి ఉండదు.
  3. ఆంక్షలు : స్వదేశీ వర్తకము ఎలాంటి ఆంక్షలకు లోబడి ఉండదు.
  4. రవాణా వ్యయాలు : స్వదేశీ వర్తకములో రవాణా వ్యయాలు, నష్టభయాలు ఎక్కువ.
  5. స్వభావము : దీనిలో ఒకదేశములో వస్తుసేవల ‘వినిమయము జరుగుతుంది.
  6. సరుకు తరలింపు : సరుకు తరలింపు ఎక్కువగా రవాణా సౌకర్యాలైన రైలు, రోడ్ల అభివృద్ధిపై ఆధారపడుతుంది.
  7. ప్రత్యేకీకరణ : దేశములోని ప్రత్యేకీకరణ లాభాలను అందజేయడంలో సహకరిస్తుంది.
  8. వర్తక పరిమాణము : వర్తక పరిమాణము జనాభా పరిమాణము, ఉత్పత్తి పరిమాణము, బ్యాంకుల అభివృద్ధిపై ఆధారపడుతుంది.
  9. అనుకూలత : ఇది వస్తువులను ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగిత కేంద్రాలకు తరలిస్తుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

స్వదేశీ వర్తకము

  1. వరక్తము ఒక దేశానికి, మరొక దేశానికి మధ్య జరుగుతుంది.
  2. విదేశీ వకర్తములో కరెన్సీ మార్పిడి ఉంటుంది.
  3. విదేశీ వర్తకము అనేక ఆంక్షలకు లోబడి ఉంటుంది.
  4. విదేశీ వర్తకములో రవాణా వ్యయాలు, నష్టభయము తక్కువ.
  5. దీనిలో వస్తువుల ఎగుమతి, దిగుమతి జరుగుతుంది.
  6. సరుకును ఎక్కువగా సముద్రము (నౌకల ద్వారా) తరలిస్తారు.
  7. ప్రపంచ దేశాల ప్రత్యేకీకరణ లాభాలను అందజేయడం సహకరిస్తుంది.
  8. వస్తువులు ఒక దేశములో ప్రవేశించుటకు ఎన్నో ఆంక్షలు ఉంటాయి. డ్యూటీలు, పన్నులను చెల్లించవలెను.
  9. ఏ దేశమైతే వస్తువుల ఉత్పత్తికి అనుకూలముగా ఉంటుందో, వాటిలో ప్రత్యేకీకరణ సాధించడానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 5.
విదేశీ వర్తకము యొక్క పరిమితులను తెలుపుము.
జవాబు:
పరిమితులు :

  1. అంతర్జాతీయ వర్తకము ఆర్థికముగా ఇతర దేశాలపై ఆధారపడుటకు దారితీస్తుంది. యుద్ధ సమయములో ఇది సంక్షోభాన్ని సృష్టిస్తుంది.
  2. అంతర్జాతీయ వర్తకము దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని సెక్టార్లను నిర్లక్ష్యము చేయడానికి దారితీస్తుంది.
  3. దిగుమతులపై ఆంక్షలు లేకపోతే అభివృద్ధి చెందుతున్న దేశాల పారిశ్రామికీకరణపై ప్రభావాన్ని చూపుతుంది.
  4. ఇది వివిధ దేశాల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తుంది.
  5. తులనాత్మక వ్యయ సిద్ధాంతాన్ని అనుసరించి కొద్ది పరిశ్రమలలో ప్రత్యేకీకరణ అనేక సమస్యలను సృష్టిస్తుంది.

ప్రశ్న 6.
విదేశీ వర్తకములో లోపాలను తెలుపుము.
జవాబు:
విదేశీ వర్తకములో లోపాలు / నష్టాలు :

  1. ద్రవ్య సమస్య : ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన ద్రవ్యం ఉండటం వలన వ్యాపార వ్యవహారములు జరిగినప్పుడు ద్రవ్య సమస్యలు ఏర్పడతాయి.
  2. న్యాయసంబంధిత సమస్యలు : ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన చట్టాలుంటాయి. అంతర్జాతీయ వర్తకములో దేశాల మధ్య న్యాయసంబంధిత చిక్కులు ఏర్పడతాయి.
  3. పరపతి సమస్య : ఎగుమతిదారులు, దిగుమతిదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండవు కాబట్టి ఎగుమతిదారులు, దిగుమతిదారుల ఆర్థిక స్థోమతను గురించి తెలుసుకోవలసి ఉంటుంది.
  4. నష్టభయాలు : వివిధ దేశాల మధ్యదూరము ఎక్కువగా ఉండటము వలన, రవాణాలో వస్తువులకు నష్టము కలిగే అవకాశాలు ఎక్కువ.
  5. కాలయాపన : ఒక దేశము నుంచి సరుకును ఎగుమతి చేయడానికి మరియు ఆ దేశములో సరుకును స్వీకరించి, ధరను చెల్లించడానికి ఎక్కువ సమయం పడుతుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

ప్రశ్న 7.
ప్రత్యేక ఆర్థిక మండలి యొక్క లాభాలను తెలుపుము.
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్లు) ద్వారా క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.

  1. ఉద్యోగ అవకాశాలు : ఉద్యోగ అవకాశాలు కల్పించడములో ప్రత్యేక ఆర్థిక మండళ్ళు సార్థకమైన పనిముట్టుగా పరిగణిస్తారు.
  2. ఆర్థిక అభివృద్ధి : సెజ్లను ఆర్థిక అభివృద్ధి సాధనాలుగా గుర్తించడం జరిగినది. సెజ్లు సక్రమముగా నెలకొల్పితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారతాయి.
  3. శ్రమ ఆధారిత పరిశ్రమల వృద్ధి: సెజ్లను నెలకొల్పడం వలన శ్రమ ఆధారిత పరిశ్రమలు, సేవారంగము ఎక్కువగా వృద్ధి చెందుతాయి.
  4. సమతల ప్రాంతీయ అభివృద్ధి: సమాన ప్రాంతీయ అభివృద్ధికి సెజ్లు ఇతోధికముగా తోడ్పడతాయి.
  5. సామర్థ్య నిర్మాణము దృఢమైన, సామర్థ్య నిర్మాణానికి సెజ్ల ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
  6. ఎగుమతులు (Performance) : ఎగుమతులలో అనవసర టారిఫ్, వర్తక అవరోధాలు, కార్పొరేటు పన్ను విధానము మరియు బ్యూరోక్రసీని తొలగించి ఎగుమతుల performance లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

ప్రశ్న 8.
ప్రత్యేక ఆర్థిక మండలి ధ్యేయాలను తెలుపుము.
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలి ఒక భౌగోళిక ప్రాంతము. దీనిలోని ఆర్థిక చట్టాలు దేశములోని ఆర్థిక చట్టాల కంటే సరళముగా ఉంటాయి. సెజ్ యొక్క ప్రధాన ధ్యేయము విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే. ఆర్థికాభివృద్ధికి సెజ్లు సాధనాలుగా ఉపయోగపడుతున్నవి. భారతప్రభుత్వం 2000 సంవత్సరములో ప్రత్యేక ఆర్థిక మండలిని స్థాపించినారు. పార్లమెంటులో సెజ్ల చట్టాన్ని 2005లో ఆమోదించినారు. ఎగుమతి ప్రక్రియ అనుభవము నుంచి సెజ్ విధానము ఆవిర్భవించి పరిగణించబడే సుంకాలు చెల్లించనవసరము లేని ప్రత్యేక ప్రాంగణములే ఈ ప్రత్యేక ఆర్థికమండలి.

ధ్యేయాలు / లక్ష్యాలు :

  1. అదనపు ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడము.
  2. వస్తుసేవల యొక్క ఎగుమతులను ప్రోత్సహించడము.
  3. స్వదేశీ మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడము.
  4. ఉద్యోగ అవకాశాలను కల్పించడము.
  5. మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయడము.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
టోకు వర్తకుని నిర్వచించుము.
జవాబు:
ఉత్పత్తిదారుల నుండి పెద్దపెద్ద పరిమాణములో వస్తువులను కొనుగోలు చేసి, వాటిని చిన్నచిన్న పరిమాణాలలో చిల్లర వర్తకులకు గాని, తుది వినియోగదారులకు కాని అమ్మకము చేయడాన్ని టోకు వర్తకము అంటారు. టోకు వర్తకము చేసే వ్యాపారులను టోకు వర్తకులు అంటారు. వీరు ఉత్పత్తిదారులు మరియు చిల్లర వర్తకులకు మధ్య వారధిగా ఉంటారు.

ప్రశ్న 2.
చిల్లర వర్తకుడు అనగా ఎవరు ?
జవాబు:
టోకు వర్తకుల నుంచి సరుకు కొనుగోలు చేసి, చిన్న చిన్న మొత్తాలలో తుది వినియోగదారులకు చేరవేసే ప్రక్రియను చిల్లర వర్తకము అంటారు. చిల్లర వర్తకము చేసే వారిని చిల్లర వర్తకులు అంటారు. చిల్లర వర్తకులు వస్తువుల పంపిణీ గొలుసులో చివరి లింకు. చిల్లర వర్తకులు అటు టోకు వర్తకులకు, ఇటు వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటారు. అతడి కార్యకలాపాలు స్థానికముగానే ఉంటాయి.

ప్రశ్న 3.
స్వదేశీ వర్తకము అనగానేమి ?
జవాబు:
ఒక దేశ సరిహద్దు లోపల కొనుగోలు మరియు అమ్మకాలు జరపడాన్ని స్వదేశీ వర్తకము అంటారు. అనగా కొనుగోలుదారుడు మరియు అమ్మకపుదారులు ఒకే దేశానికి చెంది ఉండి, వర్తకము కొనసాగించినపుడు దానిని స్వదేశీ వర్తకము అంటారు. స్వదేశీ వర్తకాన్ని ‘దేశీయ వర్తకము’ అని కూడా అంటారు. స్వదేశీ వర్తకములో కరెన్సీ మార్పు
ఉండదు.

ప్రశ్న 4.
ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) అనగానేమి ?
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలి ఒక భౌగోళిక ప్రాంతము. దీనిలోని ఆర్థిక చట్టాలు దేశములోని ఆర్థిక చట్టాల కంటే సరళముగా ఉంటాయి. సెజ్ యొక్క ప్రధానమైన ధ్యేయము విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే. ఆర్థికాభివృద్ధికి సెజ్లు సాధనాలుగా ఉపయోగపడుతున్నవి. భారత ప్రభుత్వము 2000 సంవత్సరములో ఎగుమతి, దిగుమతి విధానములో ప్రత్యేక ఆర్థిక మండలిని స్థాపించినారు. పార్లమెంటులో సెజ్ల చట్టాన్ని 2005 సంవత్సరములో ఆమోదించినారు. ఎగుమతి ప్రక్రియ అనుభవము నుంచి సెజ్ల విధానము ఆవిర్భవించి పరిగణించే సుంకాలు చెల్లించనవసరములేని ప్రత్యేక ప్రాంగణాలే సెజ్లు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
సెజ్ ల పని తీరుపై గల విమర్శలను వివరించండి.
జవాబు:

  1. ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు కోసము వ్యవసాయ భూములను స్వాధీనము చేసుకుంటున్నారు అనేది ప్రధానమైన విమర్శ. దీనివలన చాలామంది వారి కులవృత్తులైన వ్యవసాయము, చేపలు పట్టుట మొదలైన వాటికి దూరమై జీవనోపాధిని కోల్పోతున్నారు. సెజ్లు రియల్ ఎస్టేటులో స్పెక్యులేషన్ను ప్రోత్సహిస్తున్నది. చిన్న మరియు మార్జినల్ రైతులు, వీవర్లు, livestock కు సంబంధించిన కులాలవారు సెజ్ల వలన వారి వృత్తులకు దూరమవుతున్నారు.
  2. సెజ్ వలన వాతావరణ కాలుష్యము ఏర్పడి ప్రజల ఆరోగ్యము దెబ్బతింటున్నది.
  3. సెజ్లపైన మరొక విమర్శ ఏమిటంటే తీసుకున్న భూములకు సరైన నష్టపరిహారము చెల్లించడం లేదు. ఇది చాలా తక్కువగా ఉంటోంది. తొలగించబడిన ప్రజలకు పునరావాస చర్యలు తీసుకోవడం లేదు.
  4. సాధారణముగా సెజ్లను మారుమూల ప్రాంతాలలో నెలకొల్పి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే థ్యేయం. పట్టణ ప్రాంతాల దగ్గరలోనే సెజ్లను ఏర్పాటు చేయడం వలన ఈ ధ్యేయము నెరవేరలేదు.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక మండలికి అందించిన ప్రోత్సాహకాలను తెలుపండి.
జవాబు:
బహుళ ఉత్పాదక ప్రాజెక్టుగా మరియు వర్తకపు కార్యకలాపాల నిమిత్తము, విదేశీ భూభాగము పరిగణింపబడి, సుంకాలు అనగా పన్నులు చెల్లించనవసరము లేని ప్రత్యేక ప్రాంగణము సెజ్. పరిశ్రమలను అభివృద్ధి చేయుటకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సదుపాయాలను ఉపయోగించి, ప్రాంతాలను అభివృద్ధి చేసే విధముగా ఈ సెజ్లను ఏర్పాటు చేసినారు. సెజ్లు వస్తూత్పత్తి మరియు సేవారంగములోని పరిశ్రమలకు సహాయం చేస్తాయి.

ఆంధ్రప్రదేశ్ సెజ్ ఉత్పత్తి మరియు సేవా పరిశ్రమలకు ప్రత్యేక మౌళిక సదుపాయాలను కలుగజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సెజ్ విదేశీ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఆర్థిక మరియు పన్నుల ప్రోత్సాహకాలు ఇవ్వడంలో సరళీకృత అనుమతులు ఇస్తున్నది. భారతదేశములో APSEZ ఒక భారీతరహా బహుళ ఉత్పాదక ప్రత్యేకమండలి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

సెజ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు :

  1. డ్యూటీలు మరియు ఎక్సైజ్ల నుంచి మినహాయింపు.
  2. 50% నూతన మూలధనం అనగా గత 5 సంవత్సరాలలో పెట్టుబడి.
  3. అంతర్జాతీయ నిధులను ఉపయోగించుకొనుట.
  4. చెల్లించిన డ్యూటీని తిరిగి పొందుట..
  5. సెజ్ యూనిట్లలో హిడ్జింగ్కు అనుమతి.
  6. విదేశాలలో సబ్కాంట్రాక్టులకు అనుమతి.
  7. లోపలే కస్టమ్స్ క్లియరెన్సు.
  8. స్వదేశీ ఎగుమతిదారులకు ప్రత్యక్ష ఎగుమతికి ఆమోదం.
  9. FDI 100%.
  10. AP పారిశ్రామిక విధానము 2010-15 నుంచి ప్రయోజనాలు.
  11. స్టాంపుడ్యూటీ మినహాయింపు.
  12. వాట్, అమ్మకపు పన్ను, ఆల్ట్రాయ్ నుంచి మినహాయింపు.
  13. విద్యుచ్ఛక్తి సబ్సిడీ.
  14. రాష్ట్రస్థాయిలో సింగిల్ విండో సిస్టమ్ క్లియరెన్సు.
  15. పరిశ్రమలకు తక్కువ విద్యుత్ టారిఫ్.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 1st Lesson ఎంట్రప్రిన్యూర్షిప్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 1st Lesson ఎంట్రప్రిన్యూర్షిప్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంట్రప్రిన్యూర్ లక్షణాలను వివరించండి.
జవాబు:
సాధారణ వ్యక్తుల కంటే ఎంట్రప్రిన్యూర్కు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వ్యాపారములో విజేతగా నిలవాలంటే ప్రతి ఎంట్రప్రిన్యూర్కు క్రింది లక్షణాలు ఉండవలెను.
1) నవకల్పన: నూతన వ్యాపారములో నవకల్పన అనే లక్షణము వ్యవస్థాపకుడికి చాలా అవసరము. వ్యవస్థాపకుడు ఒకవైపున ఉత్పత్తిని పెంచుకోవడము, మరో వైపున ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొనుటకు, నవకల్పనలను ప్రవేశపెట్టుటకు ప్రయత్నిస్తాడు. నవకల్పన వలన ఉత్పత్తి ప్రక్రియలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టవచ్చును. లేక ప్రస్తుతమున్న పద్ధతులను అభివృద్ధి చేయవచ్చును. దీనిలో కొత్త మార్కెట్లను కనుగొనడం, ముడిసరుకు మరియు నూతన సాంకేతిక ఉత్పత్తి పద్ధతులను కనుగొనవచ్చును.

2) రిస్కును భరించుట: వ్యవస్థాపకుని మరో లక్షణం రిస్కును భరించుట. ఉత్పత్తికి కావలసిన వనరులను ముందుగానే సమకూర్చుకోవాలి. ఇలాంటి సందర్భాలలో మంచి లాభాలకు లేదా ఎక్కువ నష్టాలకు అవకాశమున్నది. కాబట్టి రిస్కును భరించడం వ్యవస్థాపకుని అంతిమ బాధ్యత. రిచర్డ్ కాంటిలిన్ అభిప్రాయము ప్రకారము వ్యవస్థాపకుడు ఒక ఏజెంటుగా ఉత్పత్తి కారకాలను నిశ్చిత ధరకు కొనుగోలు చేసి, వాటిని ఒక వస్తువు రూపములో చేసి అనిశ్చిత ధరకు అమ్మడము.

3) ఉత్పత్తికి సంబంధించిన వ్యవస్థీకరణ: వ్యవస్థాపకుడు వస్తువులు ఉత్పత్తి చేయుటకు లేదా సేవలు అందించుటకు కావలసిన ఉత్పత్తి కారకాలను సమకూర్చుకొనును. అతను ఉత్పత్తి ప్రక్రియకు కావలసిన భూమి, శ్రామికులు, మూలధనము, ముడిసరుకులను సమకూర్చుకొనును. అన్ని రకాలైన ఉత్పత్తి ప్రక్రియలను అధ్యయనము చేసి తనకు ఎక్కువ అనుకూలమైన పద్ధతిని ఎంపిక చేసుకొనెను.

4) నిర్ణయాలు తీసుకోవడము: వ్యవస్థాపకుడు వ్యాపార సంస్థను స్థాపించడం, దానిని నిర్వహించడము మరియు వివిధ వనరులను సమన్వయపరుచుటకు నిర్ణయాలు తీసుకొనవలెను. వ్యాపారములో ప్రతి పనికి నిర్ణయీకరణ అవసరమవుతుంది. వ్యాపార కార్యకలాపాల గురించి వ్యవస్థాపకుడు ప్రతిరోజు నిర్ణయాలు తీసుకొనవలెను.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

5) నాయకత్వము: వ్యవస్థ విధులను నియంత్రణ చేయుటకు, నిర్ణయించుటకు, ఆదేశించుటకు, నిర్వహించుటకు వ్యవస్థాపకునికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండవలెను. ఇతను దిగువస్థాయి సిబ్బందికి ఆదర్శముగా ఉండవలెను. ఎందుకనగా ఇతని వ్యక్తిత్వము ఆధీనులపై ప్రభావము చూపును. వ్యవస్థాపకుని లక్షణాలు అతని ఉద్యోగులు అభినందించే విధముగా ఉండవలెను. నాయకుడు మార్గదర్శకుడే కాకుండా సంస్థ లక్ష్యాలను త్వరగా సమర్థవంతంగా సాధించే విధముగా ప్రేరణ కలిగించవలెను.

6) ప్రణాళికీకరణ: వ్యవస్థాపకుడు వ్యాపారములో ప్రతి విషయానికి ఒక ప్రణాళిక తయారుచేస్తాడు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను బేరీజు వేసుకొని ఎక్కువ ప్రయోజనము పొందుతాడు. ప్రణాళికీకరణ అనేది ఒక ప్రక్రియ. దీనిలో పనిచేసే ముందు ఆలోచించడం ఇమిడి ఉన్నది. ఏమి చేయాలి ? ఎపుడు చేయాలి ? ఎలా చేయాలి ? ఆ పనిని ఎవరు చేయాలి ? వ్యవస్థాపకుడు ఉత్పత్తికి సంబంధించినవి. మార్కెట్ సంబంధించిన ప్రణాళికలే కాకుండా పారిశ్రామిక విధానం ప్రకారం వ్యవస్థలో విధులను నిర్ణయించడానికి ప్రణాళికలు తయారుచేయును.

7) కష్టపడేతత్వము: విజయవంతమైన వ్యవస్థాపకునికి, అపజయాలు పొందిన వారికి మధ్య తేడా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడడం మాత్రమే. సంస్థ ఖాయిలా పడే దశకు చేరిననూ తన స్వేదముతో, శ్రమతో ధైర్యముగా నిలువగలుగుతాడు. విజయవంతమైన వ్యవస్థాపకుడు ప్రారంభం నుండి చివరి వరకు నిరంతరము జీవితాంతము శ్రమిస్తూనే ఉంటాడు.

8) ఉన్నత లక్ష్యాలను సాధించాలనే కోరిక వ్యవస్థాపకులు వ్యాపారములో ఉన్నత లక్ష్యాలను సాధించాలనే గాఢమైన కోరికను కలిగి ఉంటాడు. ఈ తపనతోనే అతడు ఎన్ని అవరోధాలు వచ్చినా ఆతురతతో తనకు వాటిల్లిన దురదృష్ట ఘటనలకు భయపడక విజయం వైపు సాగి విజయవంతమైన వ్యాపారం చేయగలడు.

9) ఉన్నతమైన ఆశావాద దృక్పథము: విజయవంతమైన వ్యవస్థాపకులు తను ఎదుర్కొనే సమస్యలకు చలించరు. భవిష్యత్తులో వ్యాపారములో మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనే ఆశావాద దృక్పథముతో సంస్థను
విజయవంతంగా నడపగలుగుతారు.

10) స్వేచ్ఛ: విజయవంతమైన వ్యవస్థాపకుడు ఇతరులచేత మార్గనిర్దేశించబడడు. తన వ్యాపార వ్యవహారములో స్వతంత్రముగా ఉండుటకు ఇష్టపడతాడు.

11) దూరదృష్టి / ముందుచూపు: వ్యవస్థాపకులు భవిష్యత్తులో వ్యాపార పరిస్థితులు ఎలా ఉంటాయో చక్కటి ముందుచూపు కలిగి ఉంటారు. మార్కెట్లో వచ్చే మార్పులను, వినియోగదారుల అభిరుచులు, సాంకేతిక పరిజ్ఞానములో వచ్చే మార్పులకు అనుగుణముగా తగు చర్యలు తీసుకొనును.

ప్రశ్న 2.
ఎంట్రప్రిన్యూర్ విధులను వివరించండి.
జవాబు:
వ్యవస్థాపకుని ఆలోచన మొదలైనప్పటి నుంచి సంస్థను, స్థాపించే వరకు అన్ని రకాల విధులను నిర్వహిస్తాడు. అందులో ముఖ్యమైనవి:
1) నూతన ఉత్పాదక వ్యవస్థాపన: J.B. Say ప్రకారం ఉత్పత్తి కారకాలను సంఘటిత పరిచి వాటిని నూతన ఉత్పత్తి వ్యవస్థగా రూపొందించడము వ్యవస్థాపకుని విధులలో ఒకటి.

2) నిర్ణయీకరణ: వ్యవస్థాపకుడు క్రింది విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాడు. అవి:

  1. సంస్థ లక్ష్యాలను నిర్ణయించడము
  2. ఆర్థిక వనరుల లభ్యత
  3. ఉత్పత్తి మిశ్రమము
  4. ధరల విధానము
  5. అభివృద్ధి వ్యూహాలు
  6. అనువైన సాంకేతిక లేక నూతన సాధనాలు

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

3) నవకల్పన: నవకల్పన అనేది వ్యవస్థాపకుని ముఖ్య విధి. నవకల్పన అనగా కొత్త పనులు చేయడం లేదా పాత పనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్థికపరముగా వాడడము. కాబట్టి శాస్త్ర పారిశ్రామికాభివృద్ధికి మరియు ఆర్థికాభివృద్ధికి నవకల్పన ఎంతో ఆవశ్యకము.

4) నిర్వహణ: వ్యవస్థాపకుడు నిర్వహణ విధులను నిర్వహించును. అవి సేకరణ మరియు నిర్వహణ విధులు, ఉత్పత్తి ప్రణాళికలను తయారు చేయడం, ముడిసరుకు సమకూర్చడము, భౌతిక సదుపాయాలు, ఉత్పత్తి సదుపాయాలు, వ్యవస్థీకరణ మరియు అమ్మకాల నిర్వహణ.

5) రిస్కు భరించుట: అనుకోని సంఘటనల వలన భవిష్యత్తులో సంభవించే నష్టాలకు వ్యవస్థాపకుడే బాధ్యత వహించవలెను. ఋణదాతలకు వడ్డీ, శ్రామికులకు వేతనాలు మరియు భూమికి భాటకం చెల్లించుటకు హామీ ఇవ్వవలెను.

6) పర్యవేక్షణ, నియంత్రణ మరియు దిశా నిర్దేశము: జె.యస్. మిల్ మాటలలో పర్యవేక్షణ, నియంత్రణ మరియు దిశా నిర్దేశనలు వ్యవస్థాపకుని విధులు. పర్యవేక్షణలో పనిని పర్యవేక్షించడం, తక్కువ వ్యయముతో ఎక్కువ ఉత్పత్తిని సాధించడం వంటివి ఇమిడి ఉన్నాయి. వ్యవస్థాపకుడు యంత్రాలను, విత్త వినియోగానికి వస్తువుల పంపిణీని మరియు ఉద్యోగులను నియంత్రిస్తాడు. లక్ష్యాలకు అనుగుణముగా వ్యవస్థను నిరంతరము నడిపిస్తూ ఉంటాడు.

7) ప్రణాళికీకరణ: ప్రణాళిక అనేది. ఒక సంస్థను స్థాపించుటలో మొదటి మెట్టు. వ్యవస్థాపకుడు ప్రారంభించబోయే ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళికను ఒక క్రమ పద్ధతిలో తయారుచేస్తాడు. అధికార సంస్థలు ఆ ప్రణాళికలతో సంతృప్తి చెందిన యెడల న్యాయపరమైన మంజూరు చేయును.

కిల్బి ప్రకారము వ్యవస్థాపకుడు క్రింది నాలుగు ముఖ్యమైన విధులను నిర్వహించును. అవి:
1) వినియమ విధులు:

  • మార్కెటింగ్ అవకాశాలు గుర్తించడం.
  • అరుదైన, కొరతగా ఉన్న వనరులను సాధించుట.
  • ఉత్పాదకాల కొనుగోలు.
  • ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేయుట, పోటీని ఎదుర్కొనుట.

2) పరిపాలనా విధులు:

  • ప్రజా బ్యూరోక్రసితో కలిసి వ్యవహరించుట.
  • సిబ్బంది నిర్వహణ.
  • పంపిణీదారులను నిర్వహించడం.
  • వినియోగదారులను ఆకర్షించుట.

3) నిర్వహణ మరియు నియంత్రణ విధులు:

  • విత్త నిర్వహణ.
  • ఉత్పత్తి నిర్వహణ.
  • ఫ్యాక్టరీ నియంత్రణ.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

4) సాంకేతిక పరిజ్ఞాన విధులు:

  • యంత్రాలను, పనిముట్లను సమకూర్చడం.
  • పారిశ్రామిక ఇంజనీరింగ్.
  • ఉత్పత్తి ప్రక్రియలో, వస్తు నాణ్యతలో మెరుగుదల.
  • కొత్త వస్తూత్పత్తి పద్ధతులను, వస్తువులను ప్రవేశపెట్టడం.

ప్రశ్న 3.
ఎంట్రప్రిన్యూర్ రకాలను వివరించండి.
జవాబు:
క్లారెన్స్ డన్ హాఫ్, అమెరికా వ్యవసాయరంగాన్ని పరిశీలించి వ్యవస్థాపకులను వర్గీకరించారు. ఆర్థికాభివృద్ధి ప్రారంభదశలో వ్యవస్థాపకులలో తక్కువ చొరవ, ఉత్సాహము ఉండినది. ఎప్పుడైతే ఆర్థికాభివృద్ధి చెందనారంభించినదో వ్యవస్థాపకులలోనూ తగిన ఉత్సాహము, ఉత్తేజము కలిగినది. దీని ఆధారముగా వీరిని నాలుగు రకాలుగా విభజించారు.

1) నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు నవకల్పన వ్యవస్థాపకులు కొత్తరకపు వస్తువులను ప్రవేశపెట్టడము, కొత్త ఉత్పత్తి పద్ధతులను అవలంబించడము, కొత్త మార్కెట్లను రూపొందించడం మరియు సంస్థను కొత్తగా నిర్వహించడము. వీరు ఇదివరకే కొంత అభివృద్ధిని సాధించి ఉంటారు. మరియు మార్పు కోసం, అభివృద్ధి కోసం ముందుచూపుతో
ఉంటారు.

2) అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు: వీరు కొత్త పద్ధతులను, సాంకేతికతను విజయవంతమైన వ్యవస్థాపకుల నుండి అనుకరిస్తారు. వీరు కొత్త నవకల్పనలు చేయరు. వీరు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరిపోతారు. వీరు అభివృద్ధి చెందిన దేశాల నుండి వస్తువులను, సాంకేతికతను దిగుమతి చేసుకొని అనుకరిస్తారు.

3) నిదానపు ఎంట్రప్రిన్యూర్లు: వీరు జాగ్రత్తపరులు. వీరు మార్పులను తొందరగా అనుకరించరు. వీరు కొత్త పద్ధతులను అనుసరించవలెనంటే అవి ఖచ్చితముగా నష్టాలు రాని విధముగా ఉంటేనే పాటిస్తారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు.

4) స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు: వీరు వస్తు తయారీ పద్ధతిలో మార్పులు తీసుకొని వచ్చుటకు అవకాశాలు ఉన్నప్పటికీ, వ్యయాలు తగ్గించుకునేందుకు అవకాశాలు ఉన్నప్పటికి మార్పులు చేయరు. వీరికి నష్టాలు వస్తున్నప్పటికీ ప్రస్తుత తయారీ పద్ధతిలో మార్పులు చేయరు.

ప్రశ్న 4.
ఎంట్రప్రెన్యూర్కి, ఎంట్రప్రిన్యూర్షిప్కి మధ్యగల సంబంధాలను వివరించండి.
జవాబు:
ఎంట్రప్రిన్యూర్ అనువాడు కర్త, ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది ఒక ప్రక్రియ. ఎంటర్ప్రైజ్ అనేది ఒక వ్యక్తి యొక్క ” సృష్టి మరియు ఒక ప్రక్రియ ద్వారా ఏర్పడినది.
ఎంట్రప్రిన్యూర్, ఎంట్రప్రిన్యూర్షిప్ అనే పదాల ఉచ్ఛారణలో ఒకే విధముగా ఉన్నప్పటికి వాటి భావములో మాత్రము తేడా ఉన్నది. ఇవి ఒక నాణానికి ఉన్న బొమ్మ, బొరుసులాంటివి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

ఎంట్రప్రిన్యూర్, ఎంట్రప్రిన్యూర్షిప్కి మధ్యగల సంబంధము:

  1. ఎంట్రప్రిన్యూర్ ఒక వ్యక్తి. ఎంట్రప్రిన్యూర్షిప్ ఒక ప్రక్రియ.
  2. ఎంట్రప్రిన్యూర్ ఒక నిర్వాహకుడు. ఎంట్రప్రిన్యూర్షిప్ ఒక నిర్వాహక సంస్థ.
  3. ఎంట్రప్రిన్యూర్ నవకల్పన కర్త. ఎంట్రప్రిన్యూర్షిప్ నవకల్పన ప్రక్రియ.
  4. ఎంట్రప్రిన్యూర్ నష్టభయాన్ని స్వీకరించేవాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ నష్టభయంతో కూడిన చర్య.
  5. ఎంట్రప్రిన్యూర్ ప్రేరణ చేయువాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ ప్రేరేపింపబడేది. `
  6. ఎంట్రప్రిన్యూర్ సృష్టికర్త. ఎంట్రప్రిన్యూర్షిప్ సృష్టించబడేది.
  7. ఎంట్రప్రిన్యూర్ మనోదృష్టి కలవాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ మనోదృష్టి.
  8. ఎంట్రప్రిన్యూర్ నాయకుడు. ఎంట్రప్రిన్యూర్షిష్ నాయకత్వము.
  9. ఎంట్రప్రిన్యూర్ అనుకరించువాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ అనుకరణ.

ప్రశ్న 5.
ఆర్థికాభివృద్ధిలో ఎంట్రప్రెన్యూర్షిప్ పాత్రను వివరించండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధిలో ఎంట్రప్రిన్యూర్షిప్ పాత్ర ఒక ఆర్థిక వ్యవస్థకు, మరొక ఆర్థిక వ్యవస్థకు వస్తు వనరుల మీద, పారిశ్రామిక వాతావరణము మరియు రాజకీయ వ్యవస్థపై మారుతూ ఉంటుంది. వీరు ఆర్థిక వ్యవస్థలో తక్కువ అనుకూల అవకాశాలు ఉంటే ఎక్కువ అనుకూల అవకాశాలను కల్పిస్తారు.

భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము. ఆర్థికాభివృద్ధి సాధించుటకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగవలెను. తద్వారా ప్రాంతీయ అసమానతలను తొలగించవచ్చును. ఈ క్రమములో సమాన ప్రాంతీయ అభివృద్ధిని సాధించుటకు చిన్నతరహా పరిశ్రమలు ముఖ్యమైన పాత్ర వహించును. చిన్నతరహా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించును. అంతేకాకుండా జాతీయ ఆదాయాన్ని సమానముగా పంచుటకు మరియు మానవ వనరులను, మూలధన వనరులను సమర్థవంతంగా తరలించి ఉపయోగించుకొనును. లేకపోతే అవి వృధాగా ఉండును. ఆర్థికాభివృద్ధిలో ఎంట్రప్రిన్యూర్షిప్ ముఖ్య భూమిక పోషించును. ఒక క్రమ పద్ధతిలో దిగువ తెలిపిన విధముగా పంపిణీ జరిగినట్లయితే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.

  1. ఎంట్రప్రిన్యూర్షిప్ ప్రజల వద్ద నిరుపయోగముగా ఉన్న పొదుపు మొత్తాలను సేకరించి దానిని మూలధనముగా మార్చును.
  2. ఎంట్రప్రిన్యూర్షిప్ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తుంది. తద్వారా దేశములో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఇదే ఆర్థిక, సాంఘిక సమస్యలకు మూలము.
  3. ఎంట్రప్రిన్యూర్షిప్ సమతల ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుంది.
  4. ఆర్థికశక్తుల కేంద్రీకరణను తగ్గించడానికి దోహదపడుతుంది.
  5. దేశ అవసరాల దృష్ట్యా సంపదను, ఆదాయాన్ని మరియు రాజకీయ అధికారాన్ని సమానముగా పంపిణీ చేయడానికి తోడ్పడుతుంది.
  6. నిరుపయోగముగా ఉన్న పొదుపును, మానవ నైపుణ్యాలను, మూలధన అవసరాలకు తరలించును. 7) దేశ ఆర్థికాభివృద్ధిలో వెనుక, ముందు అనుసంధాలను కలుగజేస్తుంది.
  7. ఆర్థికాభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన ఎగుమతి వర్తకాన్ని ప్రోత్సహిస్తుంది. కావున ఎంట్రప్రిన్యూర్షిప్ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్లో ఎంట్రప్రిన్యూర్షిప్కు గల అవకాశాలను వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్లో అతి విలువైన సహజ వనరులు పుష్కలంగా ఉండటమే గాక వ్యవసాయ మరియు అటవీ సంపదతో వ్యవస్థాపకులకు పెట్టుబడులు పెట్టుటకు అనువైన అవకాశాలు ఉన్నవి. క్రియాశీల పారిశ్రామికాభివృద్ధికి అనుకూలము. సాంకేతికపరముగా నిపుణులు అయిన మానవ వనరులతో పాటు శీఘ్రముగా స్పందించే ప్రభుత్వ విధానాలు, అనువైన సౌకర్యాలు, పంట మార్పిడి విధానము, పరిశ్రమలు మరియు గనులు పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి. సాంప్రదాయ పరిశ్రమలు అయిన బట్టలు, చర్మ పరిశ్రమలు, ఖనిజ మరియు ఆహార వస్తువుల పరిశ్రమలు అభివృద్ధి పథములో ఉన్నాయి. ఇవేకాకుండా సమాచార, సాంకేతిక మరియు పర్యాటక రంగములో మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

1) సమాచార సాంకేతిక రంగము: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమాచార సాంకేతిక రంగాన్ని అత్యవసర సేవా నిర్వహణ చట్టముగా ప్రకటించినది. మరియు విద్యుత్ కోతల నుండి మినహాయించినది. రాష్ట్రాన్ని విజ్ఞాన సమాజముగా మార్చాలని, సాంకేతిక విజ్ఞానము పౌరులందరికి ముఖ్యముగా గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉండాలని, రాష్ట్రములో పెట్టుబడిదారులు ముందంజలో ఉండాలని చూస్తోంది. మన రాష్ట్రములో నిష్ణాతులైన మానవశక్తి మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా సదుపాయాలున్నవి. ప్రపంచస్థాయి ఐ.టి. కంపెనీలను ఆకర్షించుటకు అవకాశాలున్నవి. మహిళా వ్యవస్థాపకులు, SC, ST వర్గాలకు చెందిన వ్యక్తులు ఐ.టి సంస్థలు స్థాపించినట్లయితే వారి స్థిర మూలధనములో 25 శాతం రాయితీ ఇవ్వబడుతుంది. అంతేగాక ఇతర ఆకర్షణీయమైన వెసులుబాట్లు కూడా ప్రభుత్వము కల్పించింది.

2) ఆటోమొబైల్: నిపుణులైన, శిక్షణ కలిగిన, మానవశక్తి కలిగి ఉన్నందున ఆటోమొబైల్ పరికరాల పరిశ్రమలను స్థాపించుటకు ఆంధ్రప్రదేశ్ అనువైన స్థలము. 100కు పైగా ఆటోమొబైల్ పరికరాల తయారీ పరిశ్రమలు ముఖ్యంగా అల్యూమినియం కాస్టింగ్, అధిక ఒత్తిడి గల డైకాస్టింగ్, ఫోర్జింగ్, యంత్రపరికరాలు, లోహ పరికరాలు, గేర్లు, ఫిస్టన్లు మొదలైన వాటికి ఎక్కువ డిమాండు ఉన్నది. వ్యవస్థాపకులకు ఇది చక్కని అవకాశము.

3) మందుల పరిశ్రమలు: మన రాష్ట్రములో శిక్షణ పొందిన, నైపుణ్యము కలిగిన మానవశక్తి, మౌళిక సదుపాయాలు, పరిశోధన అభివృద్ధి సదుపాయాలు ఉండటము వలన ఔషధ పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశాలున్నవి. దేశములోని మందుల తయారీలో ఆంధ్రప్రదేశ్లో మూడవవంతు తయారవుతున్నాయి. దీనిని ఔషధ రాజధానిగా పేర్కొన్నారు. అంతేగాక విశాఖపట్టణము చుట్టుప్రక్కల ప్రాంతాలలో ప్రైవేటు భాగస్వామ్యములో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినది. అందువలన వ్యవస్థాపకులకు ఎన్నో అవకాశాలున్నవి.

4) గనులు మరియు ఖనిజ సంపద: భారతదేశములో ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద ఖనిజసంపద గల రాష్ట్రం. బొగ్గు, సున్నపురాయి, స్లాబ్స్, నూనె, సహజవాయువు, మాంగనీస్, ఆస్బెస్టాస్, ముడి ఇనుము, బంగారము, వజ్రాలు, గ్రాఫైటు, సహజ వాయువు మొదలైనవి లభ్యమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము గనులు మరియు ఖనిజ సంపద రంగాన్ని అభివృద్ధి చెందే పరిశ్రమగా గుర్తించినది. కాబట్టి ఈ రంగములో పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

5) వ్యవసాయ మరియు అటవీసంపద: ఆంధ్రప్రదేశ్లో ఎక్కువమంది ముఖ్యవృత్తి వ్యవసాయము. ఆహార పంటలలో వరి ముఖ్యమైనది. అన్ని ఆహారపు ధాన్యాలలో వరి ధాన్యము 77 శాతము, ఇతర ముఖ్య పంటలు జొన్నలు, సజ్జలు, రాగి, అపరాలు, పొగాకు, పత్తి, చెరకు. రాష్ట్రము పండ్ల తోటలకు ముఖ్యముగా మామిడి, నిమ్మ, ద్రాక్ష, అనాస, అరటి, ఉల్లి అనువైనది. మన రాష్ట్రములోనే కొన్ని ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అవి టేకు, తైలము, వెదురు, జీడిపప్పు మొదలైనవి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, నూనెగింజల పరిశ్రమలు, ఆహార పదార్థాలు, నూనె శుద్ధి కర్మాగారాలు, ఎక్కువ ప్రొటీన్ గల ఆహార పదార్థాల పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలున్నాయి.

6) పర్యాటక రంగము: ఆంధ్రప్రదేశ్ సుందరమైన రాష్ట్రము. ఇందులో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. సముద్ర తీరాలు, కొండలు, వన్యమృగ అరణ్యాలు, ఓడరేవులు, చారిత్రాత్మక కట్టడాలు, పార్కులు ఉన్నాయి. అంతేగాక శిల్పకళా సంపద గలిగిన దేవాలయాలు, తిరుపతి, అన్నవరం, సింహాచలంలోని దేవాలయాలు, అరకు లోయలు మొదలైనవి వ్యవస్థాపకులకు వ్యాపార సంస్థలు స్థాపించుటకు మంచి అవకాశాలు గల ప్రదేశాలు.

7) మత్స్యసంపద: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బంగాళాఖాతము ఒడ్డున విస్తరించి ఉన్నది. విస్తారమైన సముద్రతీరము ఉండటం వలన సముద్రపు ఆహారము దొరుకును. రొయ్యల సాగుకు సముద్రతీరం అనుకూలముగా ఉండటం వలన సముద్రపు ఆహారము ఎగుమతులలో ఎక్కువ భాగము ఉన్నది. వ్యవస్థాపకులు సంస్థలు స్థాపించుటకు ఉన్న అవకాశాలు పరిశీలించి స్థాపించుట ద్వారా ఎగుమతి చేయుటకు అవకాశాలు ఉన్నాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంట్రప్రిన్యూర్ అనగా అర్థమేమి ?
జవాబు:
ఎంట్రప్రిన్యూర్ అనే పదము ఫ్రెంచి మూలమైన ఎంట్రప్రిడేర్ (Entreprede) అనే పదము నుంచి ఆవిర్భవించినది. ‘దీని అర్థము ఒక కొత్త పనిని చేపట్టడము. నష్టభయాన్ని స్వీకరించి, ఒక కొత్త సంస్థను స్థాపించడమనే కార్యాన్ని చేపట్టేవాడే ఎంట్రప్రిన్యూర్. ఒక వ్యక్తిగాని, కొంతమంది వ్యక్తులు కలిసి వివిధ రకాల వనరులను సేకరించి ఒక కొత్త సంస్థను ప్రారంభించి తద్వారా వచ్చే రిస్క్ న్ను భరించడము.

ప్రశ్న 2.
ఎంట్రప్రిన్యూర్కు ఒక నిర్వచనము వ్రాయండి.
జవాబు:
పీటర్ ఎఫ్. డ్రక్కర్ ప్రకారము ‘ఎంట్రప్రిన్యూర్’ అనేవాడు ఎల్లప్పుడూ మార్పు కోసం వెదుకుతూ, వచ్చిన మార్పులకు స్పందించి అట్టి మార్పులనే అవకాశాలు చేజిక్కించుకునేవాడు మరియు నూతన రూపకల్పన అనేది ఎంట్రప్రిన్యూర్షిప్ సాధనలో ఉపయోగపడే ఒక సాధనము.

ప్రశ్న 3.
ఎంట్రప్రిన్యూర్షిప్ ను నిర్వచించుము.
జవాబు:
అమెరికాలో జరిగిన ఒక సదస్సులో ఎంట్రప్రిన్యూర్షిప్ ను ఈ క్రింది విధముగా నిర్వచించినారు. “ఎంట్రప్రిన్యూర్షిప్ వ్యాపార అవకాశాలను గుర్తించుట, ఆ అవకాశాలకు అనుగుణముగా రిస్క్న నిర్వహణ చేయడం మరియు నిర్వహణ నైపుణ్యాల ద్వారా మానవ, విత్త, వస్తు వనరులను అవసరమైన వరకు తరలించి వాటికి విలువను సృష్టించడము”.

ప్రశ్న 4.
ఎంట్రప్రిన్యూర్ ఒక లక్షణము వివరించండి.
జవాబు:
నవకల్పన: నూతన వ్యాపారములో నవకల్పన అనే లక్షణము వ్యాపారస్తుడికి చాలా అవసరము. వ్యవస్థాపకుడు ఒక వైపున ఉత్పత్తిని పెంచుకోవడం, మరోవైపున ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొనుటకు నవకల్పనను ప్రవేశపెట్టుటకు ప్రయత్నిస్తాడు. నవకల్పన వలన ఉత్పత్తి ప్రక్రియలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టవచ్చును. లేక ప్రస్తుతము ఉన్న పద్ధతులను అభివృద్ధి చేయవచ్చును. దీనిలో కొత్త మార్కెట్లను కనుగొనడం, ముడిసరుకు మరియు నూతన సాంకేతిక పద్దతులను కనుగొనవచ్చును.

 

ప్రశ్న 5.
ఎంట్రప్రిన్యూర్ ఒక విధిని వివరించండి.
జవాబు:
నిర్ణయీకరణ: వ్యవస్థాపకుడు క్రింది విషయాలకు సంబంధించి వివిధ రకాల నిర్ణయాలను తీసుకుంటాడు.
అవి:

  1. సంస్థ లక్ష్యాలను నిర్ణయించడం
  2. ఆర్థిక వనరుల లభ్యత
  3. ఉత్పత్తి మిశ్రమము
  4. ధరల విధానము
  5. అభివృద్ధి వ్యూహాలు
  6. అనువైన సాంకేతిక లేక నూతన విధానాలు

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 6.
ఎంట్రప్రిన్యూర్ రకాలను వ్రాయండి.
జవాబు:
ఎంట్రప్రిన్యూర్లలో రకాలు:

  1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు.
  2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు
  3. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు
  4. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు