AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 12th Lesson వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 12th Lesson వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కాథోడ్ కిరణాలు అంటే ఏమిటి? [AP. Mar.’17]
జవాబు:
రుణావేశ ఎలక్ట్రాన్ల (కణాల) ప్రవాహంను కాథోడ్ కిరణాలు అంటారు.

ప్రశ్న 2.
మిల్లికాన్ ప్రయోగం ఏ ముఖ్యమైన యదార్థాన్ని వెలువరించింది?
జవాబు:
విద్యుదావేశం క్వాంటీకృతం అవుతుందనే ముఖ్యమైన యదార్థాన్ని వెలువరించింది. విద్యుదావేశం ఎల్లప్పుడు ఎలక్ట్రాన్  ఆవేశంనకు పూర్ణాంక గుణకంగా ఉంటుంది. i.e. Q = ne.

ప్రశ్న 3.
పనిప్రమేయం అంటే ఏమిటి? [TS. Mar: ’17; TS. Mar.’15]
జవాబు:
లోహతలం నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు రావటానికి కావల్సిన కనిష్ట శక్తిని, పని ప్రమేయం అంటారు.

ప్రశ్న 4.
ఫోటోవిద్యుత్ఫలితం అంటే ఏమిటి? [AP. Mar.’17; TS. Mar. ’16; Mar. ’14]
జవాబు:
ఒక లోహ ఉపరితలంపై తగినంత శక్తి ఉన్న కాంతి పతనమయితే, ఎలక్ట్రాన్లు ఉద్గారమగును. ఈ దృగ్విషయంను ఫోటోవిద్యుత్ఫలితం అంటారు.

ప్రశ్న 5.
ఫోటో సూక్ష్మగ్రాహ్యక పదార్థాలకు ఉదాహరణలివ్వండి. వాటిని ఆ విధంగా ఎందుకు పిలుస్తారు?
జవాబు:
ఫోటో సూక్ష్మగ్రాహ్యక పదార్థాలకు ఉదాహరణలు : Li, Na, K, Rb మరియు Cs మొదలైనవి.

క్షారలోహాల పనిప్రమేయం చాలా తక్కువ. సాధారణ దృశ్య కాంతి, క్షారలోహంపై పతనమయినప్పుడు ఫోటో విద్యుత్ ఉద్గారంను ఏర్పరుచును. కావున ఈ క్షార లోహాలను ఫోటో సూక్ష్మగ్రాహ్యక పదార్థాలంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 6.
ఐన్స్టీన్ ఫోటోవిద్యుత్ సమీకరణాన్ని రాయండి. [AP. Mar.’15]
జవాబు:
ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణము, Kగరిష్ట = \(\frac{1}{2}\) mv²గరిష్ట = hν – Φ0.

ప్రశ్న 7.
డి బ్రాయ్ సంబంధాన్ని రాసి, అందులోని పదాలను వివరించండి. [AP & TS. Mar.’16]
జవాబు:
డి బ్రాయ్ సంబంధం, λ = \(\frac{h}{p}=\frac{h}{mυ}\) ఇందులో λ డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం, h ప్లాంక్స్ స్థిరాంకము, p ద్రవ్యవేగం, m కణద్రవ్యరాశి, υవేడి.

ప్రశ్న 8.
హైస్బర్గ్ అనిశ్చితత్వ సూత్రాన్ని పేర్కొనండి. [TS. Mar.’17; Mar. ’14]
జవాబు:
హైసన్బర్గ్ అనిశ్చితత్వ సూత్రము: “ఒక ఎలక్ట్రాను (లేదా మరేదైనా కణం) స్థానం, ద్రవ్యవేగం రెండింటినీ ఒకే కాలంలో యథాతథంగా కొలవడం సాధ్యం కాదు”.
i. e., ∆x. ∆p ≈ h
ఇచ్చట ∆x స్థానాన్ని నిర్దేశించడంలో అనిశ్చితత్వం, ∆p ద్రవ్యవేగాన్ని నిర్దేశించటంలో అనిశ్చితత్వం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫోటో విద్యుత్ ప్రవాహంపై (i) కాంతి తీవ్రత (ii) పొటెన్షియల్ లు కలిగించే ప్రభావం ఏమిటి?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 1
(i) కాంతి విద్యుత్ ప్రవాహంపై కాంతి కాంతి తీవ్రత ప్రభావము :
కాంతి తీవ్రత (I) ఉన్న కాంతి పౌనఃపున్యం, ఆరంభ పౌనఃపున్యం కన్నా ఎక్కువైతే (υ > v0) ఫోటో ఎలక్ట్రాన్లు ఉద్గారమవుతాయి. కాంతి తీవ్రత పెరిగిన, ఫోటో విద్యుత్ ప్రవాహం కూడా పెరుగును.
ie, i α I

ii) ఫోటో విద్యుత్ ప్రవాహంపై పొటెన్షియల్ ప్రభావము :
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 2

  1. ఫోటో ఎలక్ట్రాన్లను సేకరించు ఎలక్ట్రోడుల ధన పొటెన్షియల్ పెంచిన, ఫోటో విద్యుత్ ప్రవాహము పెరుగును. ఒక నిర్దిష్ట ధన పొటెన్షియల్ వద్ద, ఫోటో విద్యుత్ ప్రవాహం గరిష్టం అగును. దీనినే సంతృప్త విద్యుత్ ప్రవాహం (saturated cument) అంటారు.
  2. సేకరణి ఎలక్ట్రోడ్ యొక్క రుణ పొటెన్షియల్ పెంచిన, ఫోటో విద్యుత్ ప్రవాహం క్రమముగా తగ్గుతుంది. ఒక నిర్దిష్ట రుణ పొటెన్షియల్ వద్ద విద్యుత్ ప్రవాహం శూన్యం అగును. ఈ రుణ పొటెన్షియల్ను నిరోధక పొటెన్షియల్ అంటారు.
  3. నిరోధక పొటెన్షియల్, పతనకాంతి తీవ్రతపై ఆధారపడదు. తీవ్రత పెంచిన, సంతృప్త విద్యుత్ ప్రవాహ విలువ కూడా పెరుగును. కాని నిరోధక పొటెన్షియల్ మారదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 2.
నిరోధక పొటెన్షియల్పైన పతన వికిరణ పౌనఃపున్యం ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఒక ప్రయోగాన్ని వర్ణించండి.
జవాబు:
నిరోధక పొటెన్షియల్పై పతనకాంతి వికిరణ పౌనఃపున్యం ప్రభావం ప్రయోగం ద్వారా వివరణ :
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 3
1) ప్రయోగ అమరిక పటంలో చూపబడింది.

2) తగినంత శక్తి(E=hν) ఉన్న ఏకవర్ణ కాంతి, కాంతి ఉద్గార పలకం C పై పతనమయితే, ఎలక్ట్రాన్లు ఉద్గారమవుతాయి.

3) ఘటం, విద్యుత్ క్షేత్రంను C మరియు Aల మధ్య ఏర్పరుచుట వల్ల సేకరణి పలక A, ఎలక్ట్రాన్లను సేకరిస్తుంది.

4) కమ్యుటేటర్ (దిక్ పరివర్తకం) మరియు Aల ధ్రువణతను ఉత్రమం చేస్తుంది.

5) పతన వికిరణ ఒక ప్రత్యేక పౌనఃపున్యంనకు, పలక Aకు కనీస రుణ పొటెన్షియల్ V ప్రయోగించిన, కాంతి విద్యుత్ ప్రవాహం శూన్యం అగును. ఈ పొటెన్షియల్ను నిరోధక పొటెన్షియల్ అంటారు.

6) ప్రయోగంను వేర్వేరు పౌనఃపున్యాల వద్ద చేస్తే, వేర్వేరు పౌనఃపున్యాలకు, వేర్వేరు నిరోధక పొటెన్షియల్ ను వోల్ట్ మీటర్లో కొలుస్తారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 4
7) గ్రాఫ్ నుండి
i) వేర్వేరు వికిరణ పౌనఃపున్యాలకు, వేర్వేరు నిరోధక పొటెన్షియల్ విలువలు ఉండును.
ii) హెచ్చు పతన వికిరణ పౌనఃపున్యంనకు, నిరోధక పొటెన్షియల్ రుణ విలువ చాలా ఎక్కువగా ఉండును.
iii) సంతృప్త విద్యుత్ ప్రవాహం విలువ వికిరణ తీవ్రతపై ఆధారపడును. సంతృప్త విద్యుత్ ప్రవాహం విలువ పతన వికిరణ పౌనఃపున్యంపై ఆధారపడదు.

ప్రశ్న 3.
విద్యుదయస్కాంత వికిరణానికి ఉన్న ఫోటాన్ చిత్రణను సారాంశీకరించండి.
జవాబు:
విద్యుదయస్కాంత వికిరణం ఫోటాన్ క్రింది విషయాలు తెలుపును.
1) ద్రవ్యంతో వికిరణం అంతర చర్యలో, వికిరణం, కణాల సమూహంగా ప్రవర్తించును. ఈ కణాలను ఫోటాన్లు అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 5
3) ఒకే తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి తీవ్రతను పెంచిన, మధ్యచ్ఛేద వైశాల్యం గుండా ఒక సెకనులో పోవు ఫోటాన్ల సంఖ్య పెరుగును. ప్రతి ఫోటాన్ శక్తి సమానము. ఫోటాన్ శక్తి, వికిరణ తీవ్రతపై ఆధారపడదు.
4) ఫోటాన్లు, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో అపవర్తనం చెందవు. దీనిని బట్టి ఫోటాన్లు తటస్థ కణాలని తెలుస్తుంది.
5) ఫోటాన్-కణం అభిఘాతంలో, శక్తి మరియు ద్రవ్యవేగంలు నిత్యత్వం. అభిఘాతంలో ఫోటాన్ల సంఖ్య నిత్యత్వం కావు. ఒక ఫోటాన్ ను శోషణం చేయవచ్చు లేక క్రొత్త ఫోటాన్ ఉద్భవించవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 6
V కణం వేగం మరియు C కాంతివేగం.

ప్రశ్న 4.
0.12 Kg ల ద్రవ్యరాశి కలిగి వడి 20 ms-1 తో చలిస్తున్న బంతి డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఎంత? ఈ ఫలితం నుంచి మనం చేయగలిగే అనుమితి (inference) ఏమిటి?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 7
బంతి తరంగదైర్ఘ్యం చాలా స్వల్పం. కావున దాని చలనంను పరిశీలించవచ్చును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫోటో విద్యుత్ ప్రవాహంపై తీవ్రత, పొటెన్షియల్లు కలిగించే ప్రభావాన్ని ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం ఏ విధంగా వివరించింది ? నిరోధక పొటెన్షియల్పై ఉండే పతన కాంతి పౌనఃపున్యం ప్రభావాన్ని ఈ సమీకరణం ఏవిధంగా వివరించండి?
జవాబు:
1) ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఫోటో విద్యుత్ ప్రభావంనకు సరైన విశ్లేషణను అభివృద్ధి చేశాడు.

2) కాంతి పుంజం, చిన్న శక్తి ప్యాకెట్లను కలిగి ఉండునని ఐన్స్టీన్ ప్రతిపాదించాడు. వీటినే ఫోటాన్లు లేక క్వాంటం అంటారు.

3) ఫోటాన్ శక్తిE=hv. ఇక్కడh’ప్లాంక్ స్థిరాంకం, Vపతనకాంతి (లేక వికిరణం) పౌనఃపున్యం,

4) ఫోటాన్ శోషణం శక్తి, పని ప్రమేయం(Φ0 = hν0) కన్నా ఎక్కువగా ఉంటే, గరిష్ట గతిజ శక్తితో ఎలక్ట్రాన్ ఉద్గారమగును.
i.e., Kగరిష్ట = \(\frac{1}{2}\)mυ²గరిష్ట = hν – Φ0 ఈ సమీకరణంను ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం అంటారు.

కాంతి విద్యుత్ ప్రవాహంపై కాంతి తీవ్రత:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 8
5) (i) కాంతి విద్యుత్ ప్రవాహంపై (1) ఉన్న కాంతి పౌనఃపున్యం, ఆరంభ పౌనఃపున్యం కన్నా ఎక్కువైతే ఫొటో ఎలక్ట్రాన్లు ఉద్గారమవుతాయి. కాంతి తీవ్రత పెరిగిన, ఫొటో విద్యుత్ ప్రవాహం కూడా పెరుగును. ie, i ∝ I.

ii) ఫోటో విద్యుత్ ప్రవాహంపై పొటెన్షియల్ ప్రభావము :
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 9

  1. ఫోటో ఎలక్ట్రాన్లను సేకరించు ఎలక్ట్రోడుల ధన పొటెన్షియల్ పెంచిన, ఫోటో విద్యుత్ ప్రవాహము పెరుగును. ఒక నిర్దిష్ట ధన పొటెన్షియల్ వద్ద, ఫోటో విద్యుత్ ప్రవాహం గరిష్టం అగును. దీనినే సంతృప్త విద్యుత్ ప్రవాహం (saturated current) అంటారు.
  2. సేకరణి ఎలక్ట్రోడ్ యొక్క రుణ పొటెన్షియల్ పెంచిన, ఫోటో విద్యుత్ ప్రవాహం క్రమముగా తగ్గుతుంది. ఒక నిర్దిష్ట రుణ పొటెన్షియల్ వద్ద విద్యుత్ ప్రవాహం శూన్యం అగును. ఈ రుణ పొటెన్షియల్ను నిరోధక పొటెన్షియల్ అంటారు.
  3. నిరోధక పొటెన్షియల్, పతనకాంతి తీవ్రతపై ఆధారపడదు. తీవ్రత పెంచిన, సంతృప్త విద్యుత్ ప్రవాహ విలువ కూడా పెరుగును. కాని నిరోధక పొటెన్షియల్ మారదు

iii) నిరోధక పొటెన్షియల్పై పతన కాంతివికిరణ పౌనఃపున్యం ప్రభావం – ప్రయోగం ద్వారా వివరణ :
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 10

  1. ప్రయోగ అమరిక పటంలో చూపబడింది.
  2. తగినంత శక్తి(E=hν) ఉన్న ఏకవర్ణ కాంతి, కాంతి ఉద్గార పలకC పై పతనమయితే, ఎలక్ట్రాన్లు ఉద్గారమవుతాయి.
  3. ఘటం, విద్యుత్ క్షేత్రంనుC మరియు Aల మధ్య ఏర్పరుచుట వల్ల సేకరణి పలకA, ఎలక్ట్రాన్లను సేకరిస్తుంది.
  4. కమ్యుటేటర్ (దిక్ పరివర్తకం) మరియు Aల ధ్రువణతను ఉత్రమం చేస్తుంది. –
  5. పతన వికిరణ ఒక ప్రత్యేక పౌనఃపున్యంనకు, పలక Aకు కనీస రుణ పొటెన్షియల్ V ప్రయోగించిన, కాంతి విద్యుత్ ప్రవాహం శూన్యం అగును. ఈ పొటెన్షియల్ను నిరోధక పొటెన్షియల్ అంటారు.
  6. ప్రయోగంను వేర్వేరు పౌనఃపున్యాల వద్ద చేస్తే, వేర్వేరు పౌనఃపున్యాలకు, వేర్వేరు నిరోధక పాటెన్షియల్లను వోల్ట్ మీటర్ తో కొలుస్తారు.
    AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 11
  7. గ్రాఫ్ నుండి
    i) వేర్వేరు వికిరణ పౌనఃపున్యాలకు, వేర్వేరు నిరోధక పొటెన్షియల్ విలువలు ఉండును.
    ii) హెచ్చు పతన వికిరణ పౌనఃపున్యంనకు, నిరోధక పొటెన్షియల్ రుణ విలువ చాలా ఎక్కువగా ఉండును.
    iii) సంతృప్త విద్యుత్ ప్రవాహం విలువ వికిరణ తీవ్రతపై ఆధారపడును. సంతృప్త విద్యుత్ ప్రవాహం విలువ పతన వికిరణ పౌనఃపున్యంపై ఆధారపడదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 2.
డేవిస్సన్, జెర్మర్ల ప్రయోగాన్ని వర్ణించండి. ఈ ప్రయోగం నిష్కర్షగా నిరూపించిందేమిటి?
జవాబు:
డేవిస్సన్ మరియు జెర్మర్ ప్రయోగము :
1) ప్రయోగ అమరిక పటంలో చూపబడింది.
2) స్థూపంకు ధన పొటెన్షియల్ అనువర్తించిన సన్నని ఎలక్ట్రాన్ కాంతి పుంజం ఫిలమెంటు F నుండి వెలువడుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 12
3) ఈ సూక్ష్మ సమాంతరీకృత ఎలక్ట్రాన్ పుంజం నికెల్ స్ఫటికంపై పతనమవుతుంది. స్ఫటిక పరమాణువులు, ఎలక్ట్రాన్లను అన్ని దిశలలోనికి పరిక్షిప్తము చెందించును.

4) ఎలక్ట్రాన్ పరిక్షేపణ తీవ్రతను, ఎలక్ట్రాన్ శోధకం (సేకరణి)తో కొలవవచ్చును. శోధకంను వృత్తాకార స్కేలుపై జరిపి సున్నితమైన గాల్వనామాపకంతో, విద్యుత్ ప్రవాహంను నమోదు చేయవచ్చును.

5) గాల్వనా మాపకం అపవర్తనం, సేకరిణిలోనికి ప్రవేశించే ఎలక్ట్రాన్ పుంజం తీవ్రతకు అనులోమానుపాతంలో ఉండును.

6) ఈ పరికరము అంతా శూన్యీకృత పేటికలో ఆవృతమై ఉంటుంది.

7) త్వరణ వోల్టేజి44 నుండి 68Vవరకు మార్చుతూ ప్రయోగం నిర్వహించబడింది. 54Vకు 50°వద్ద తీవ్రత గరిష్టం అని కనుగొనబడింది.

8) θ = 50°ల వద్ద ఎలక్ట్రాన్ పుంజము స్పర్శకోణం Φ(ఎలక్ట్రాన్ పరిక్షేపణ పుంజము స్ఫటిక పరమాణువుల తలంతో చేయు కోణం) ను క్రింద విధంగా గణించవచ్చును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 13
Φ + θ + Φ = 180°
Φ = \(\frac{1}{2}\)[180° -50°] = 65°

9) బ్రాగ్స్ నియమము ప్రకారము మొదటి కోటి(n=1) గరిష్టంనకు 2dsinΦ = 1 × λ
⇒ λ = 2 × 0.91 × sin 65° = 1.65Å = 0.165 pm. (వు మారుగా).
[∵ నికెల్ స్ఫటికంలో అంతరపరమాణు దూరంd = 0.91Å]

10) డీ బ్రోగ్లీ భావన ప్రకారం, ఎలక్ట్రాన్లతో అనుబంధితమై ఉండే తరంగదైర్ఘ్యం
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 14

11) డీ బ్రోగ్లీ తరంగదైర్ఘానికి గల సైద్ధాంతిక విలువ, ప్రయోగాత్మకంగా పొందిన విలువల మధ్య అత్యుత్తమైన పరస్పర అంగీకారం ఉంది.

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
30kVఎలక్ట్రాన్ల వల్ల ఉత్పత్తయ్యే X కిరణాల
(a) గరిష్ట పౌనఃపున్యాన్ని
(b) కనిష్ట తరంగదైర్ఘ్యాన్ని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 15

ప్రశ్న 2.
సీజియం లోహం పనిప్రమేయం2.14eV. ఈ లోహ ఉపరితలంపైన 6 × 1014 Hz పౌనఃపున్యం గల కాంతి పతనం చెందినప్పుడు ఎలక్ట్రానుల ఫోటో ఉద్గారం సంభవిస్తుంది. అయితే,
(a) ఉద్గారిత ఎలక్ట్రానుల గరిష్ఠ గతిజశక్తి ఎంత?
(b)నిరోధక పొటెన్షియల్ ఎంత?
(c) ఉద్గారిత ఫోటో ఎలక్ట్రానుల గరిష్ట వడి ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 16

ప్రశ్న 3.
ఒకానొక ప్రయోగంలో ఫోటోవిద్యుత్ కటాఫ్ వోల్టేజి 1.5 V. ఉద్గారిత ఫోటో ఎలక్ట్రానుల గరిష్ట గతిజశక్తి ఎంత?
జవాబు:
గరిష్ట గతిజశక్తి, eV0 = e × 1.5V = 1.5 eV.

ప్రశ్న 4.
ఒక హీలియం-నియాన్ లేజరు తరంగదైర్ఘ్యం 632.8 pm గల ఏకవర్ణ కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఉద్గారమైన సామర్థ్యం 9.42 mW.
(a) ఆ కాంతి పుంజంలోని ఒక్కొక్క ఫోటాను శక్తి, ద్రవ్యవేగాలను కనుక్కోండి.
(b) ఈ పుంజం ఉద్యోతనం చేసే లక్ష్యం వద్దకు సెకనుకు సగటున ఎన్ని ఫోటానులు చేరుకొంటాయి? (ఈ పుంజానికి, లక్ష్యం వైశాల్యం కంటే తక్కువైన ఏకరీతి మధ్యచ్ఛేద వైశాల్యం ఉంటుందని అనుకోండి.)
(c) ఇందులోని ఫోటానుకు ఉన్న ద్రవ్యవేగానికి సమాన ద్రవ్యవేగం ఉండాలంటే ఒక హైడ్రోజన్ పరమాణువు ఎంత వడితో ప్రయాణించవలసి ఉంటుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 17

ప్రశ్న 5.
భూఉపరితలాన్ని చేరుకొనే సూర్యుని శక్తి అభివాహం 1.388 × 10³W/m². అప్పుడు భూమిపైన ఒక సెకనుకు, ఒక చదరపు మీటరుకు (దాదాపు) ఎన్ని ఫోటాన్లు పతనమవుతాయి? సూర్యకాంతిలోని ఫోటాన్లకు 550 nm ల సగటు తరంగదైర్ఘ్యం ఉంటుందని అనుకోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 18
= 3.84 × 1021 ఫోటాన్లు/మీ² – సె.

ప్రశ్న 6.
ఫోటో విద్యుత్ ఫలితంపైన జరిపిన ఒక ప్రయోగంలో కటాఫ్ వోల్టేజి పతన కాంతి పౌనఃపున్యాలకు చెందిన గ్రాఫు వాలు 4.12 × 10-15 V s ఉందని కనుక్కొన్నారు. ప్లాంక్ స్థిరాంకం విలువను గణించండి.
సాధన:
గ్రాఫ్ వాలు \(\frac{h}{e}\) = 4.12 × 10-15 Vs
h = 4.12 × 10-15 × e = 4.12 × 10-15 × 1.6 × 10-19
∴ h = 6.592 × 10-34 J s.

ప్రశ్న 7.
ఒక 100 సోడియం దీపం ఏకరీతిగా అన్ని దిశల్లోనూ శక్తిని వికిరణ చేస్తుంది. ఈ దీపం ఒక పెద్ద గోళ కేంద్రం వద్ద ఉండగా, తనపైన పతనం చెందే సోడియం కాంతిని అంతా ఈ గోళం శోషించుకొంటుంది. సోడియం కాంతి తరంగదైర్ఘ్యం 589 nm. (a) సోడియం కాంతితో అనుబంధితమై (associate) ఉండే ఒక్కో ఫోటాను శక్తి ఎంత?
(b) ఆ గోళానికి ఏ రేటుతో ఫోటాన్లు అందించబడతాయి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 19

ప్రశ్న 8.
ఒకానొక లోహానికి ఆరంభ పౌనఃపున్యం 3.3 × 1014 Hz. ఆ లోహంపైన 8.2 × 1014 Hz పౌనఃపున్యం గల కాంతి పతనం చెందిందనుకొంటే, ఏర్పడే ఫోటో విద్యుత్ ఉద్గారానికి కటాఫ్ వోల్టేజిని ప్రాగుక్తం (predict) చేయండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 20

ప్రశ్న 9.
ఒక లోహానికి పనిప్రమేయం 4.2 ev. తరంగదైర్ఘ్యం 330 pm గల పతన వికిరణానికి ఈ లోహం ఫోటో విద్యుత్ ఉద్గారాన్ని ఇస్తుందా ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 21
ఫోటాన్ పతన, శక్తి E < Φ0. కావున ఎలక్ట్రిక్ కాంతి ఉద్గారము సంభవించదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 10.
పౌనఃపున్యం 721 × 1014 Hz గల కాంతి ఒక లోహ ఉపరితలంపైన పతనమైంది. ఆ తలంపై నుంచి 6.0 × 105m/ Sల గరిష్ట వడితో ఎలక్ట్రానులు బయటకు వెలువడ్డాయి. ఎలక్ట్రానుల ఫోటో ఉద్గారానికి ఉండే ఆరంభ పౌనఃపున్యం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 22

ప్రశ్న 11.
ఫోటో విద్యుత్ ఫలితంలో ఉపయోగించిన ఒక ఆర్గాన్ లేజరు ఉత్పత్తిచేసే కాంతి తరంగదైర్ఘ్యం 488nm. ఈ వర్ణపట రేఖ నుంచి కాంతి ఉద్గారకం పైన పతనమైనప్పుడు, ఫోటో ఎలక్ట్రానుల నిరోధక (కటాఫ్) పొటెన్షియల్ 0.381. అయితే ఆ ఉద్గారకపు పదార్థం పనిప్రమేయాన్ని కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 23

ప్రశ్న 12.
పొటెన్షియల్ తేడా 56Vల ద్వారా త్వరితమయ్యే ఎలక్ట్రానుల
(a) ద్రవ్యవేగాన్ని
(b)డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని గణించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 24

ప్రశ్న 13.
గతిజశక్తి 120eVతో ఉన్న ఒక ఎలక్ట్రాన్కు ఉండే
(a) ద్రవ్యవేగం, (b)వడి, (c)డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఎంతెంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 25

ప్రశ్న 14.
సోడియం వర్ణపట ఉద్గార రేఖ నుంచి వెలువడే కాంతి తరంగదైర్ఘ్యం 589nm. అయితే ఏ గతిజశక్తి వద్ద (a) ఒక ఎలక్ట్రాను, (h) ఒక న్యూట్రానులకు ఒకే బ్రాయ్ తరంగదైర్యం ఉంటుందో కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 26

ప్రశ్న 15.
(a) ద్రవ్యరాశి 0.040 kg గల ఒక తూటా 1.0 km/sవడితో ప్రయాణిస్తున్నప్పుడు,
(b)ద్రవ్యరాశి 0.060 kgగల ఒక బంతి 1.0m/sవడితో చలిస్తున్నప్పుడు,
(c) ద్రవ్యరాశి 1.0 × 10-9 kgద్రవ్యరాశి గల ధూళి కణం 2.2 m/s వడితో అవసరం (drift) చెందుతున్నప్పుడు వా టికి ఉండే డి బ్రోయ్ తరంగదైర్ఘ్యం ఎంతెంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 27

ప్రశ్న 16.
ఒక ఎలక్ట్రాను, ఒక ఫోటాను ఒక్కొక్కదానికి ఉన్న తరంగదైర్ఘ్యం 1.00nm అయితే,
(a)వా టి ద్రవ్యవేగాలు, (b) ఫోటాను శక్తి, (c) ఎలక్ట్రాను గతిజశక్తులను కనుక్కోండి.
సాధన:
a) ఎలక్ట్రాన్ లేక ఫోటాన్, ద్రవ్యవేగము,
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 28

ప్రశ్న 17.
(a) ఒక న్యూట్రానుకు ఎంత గతిజశక్తి ఉంటే దాని అనుబంధిత డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం 1.40 × 10-10 mఉంటుంది?
(b) 300 Kవద్ద సగటు గతిజశక్తి (32) kTకలిగి ఉండి, ద్రవ్యంతో ఉష్ణ సమతాస్థితిలో ఉన్న ఒక న్యూట్రాన్ డి బ్రాయ్ తరంగదైర్యాన్ని కూడా కడుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 29

ప్రశ్న 18.
విద్యుదయస్కాంత వికిరణం తరంగదైర్ఘ్యం, దాని క్వాంటం (ఫోటాను)కు ఉండే డి బ్రాయ్ తరంగదైర్ఘ్యానికి సమానం అని చూపండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 30

ప్రశ్న 19.
300Kవద్ద గాలిలోని ఒక నైట్రోజన్ అణువుకు డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఎంత? ఈ ఉష్ణోగ్రత వద్ద అణువులకు ఉండే వర్గమధ్యమ మూల(ms) వడితో ఈ అణువు చలిస్తున్నదని అనుకోండి (నైట్రోజన్ పరమాణు ద్రవ్యరాశి = 14.0076u)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 31

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 20.
(a) ఒక శూన్యీకృత నాళంలోని వేడిచేసిన ఉద్గారకం నుంచి ఉద్గారమైన ఎలక్ట్రానులు, ఉద్గారకానికి సాపేక్షంగా 500Vల పొటెన్షియల్ తేడా వద్ద ఉన్న సేకరిణిపైకి ఏ వడితో పతనమౌతాయో అంచనా కట్టండి. ఆ ఎలక్ట్రానుల అల్పమైన తొలి వడులను ఉపేక్షించండి. ఎలక్ట్రాను విశిష్టావేశం, అంటేe/mవిలువ 1.76 × 1011 Ckg-1.
(b) మీరు (a) లో వాడిన ఫార్ములానే ఉపయోగించి, ఒక సేకరిణి పొటెన్షియల్ 10 MV ఉంటే ఎలక్ట్రాను వడి ఎంత కనుక్కోండి. దీంట్లోని తప్పును గమనించగలుగుతున్నారా? ఫార్ములాను ఏవిధంగా మార్చవలసి ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 32

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 21.
(a) ఎలక్ట్రాను వడి 5.20 × 106 m s-1 తో ఉన్న ఒక ఏకశక్తి ఎలక్ట్రాన్ పుంజం, పుంజం వేగానికి లంబంగా ఉన్న 1.30 × 10-4 T అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనవుతుంది. ఎలక్ట్రానుకు e/m విలువ 1.76 × 1011 C kg-1 అనుకొంటే, పుంజం గీచే వృత్తం వ్యాసార్థం ఎంత?
(b) మీరు (a) లో వాడే ఫార్ములా ఒక 20 MeV ఎలక్ట్రాను పుంజం చేసే పథ వ్యాసార్థాన్ని గణించడానికి చెల్లుబాటు అవుతుందా ? కాకపోతే, దాన్ని ఏవిధంగా మార్చాలి?
[సూచన : అభ్యాసాలు 20(b), 21(b), ఈ పుస్తక పరిధిని మించిన సాపేక్షక యాంత్రిక శాస్త్రానికి మిమ్మల్ని తీసుకొనివెళతాయి. అయితే వీటిని ఇక్కడ పొందుపరచడానికి కారణం పై అభ్యాసాల్లోని (a) భాగంలో మీరు ఉపయోగించే ఫార్ములాలు చాలా అధిక వడులు లేదా శక్తుల వద్ద అవి చెల్లవనే అంశాన్ని కేవలం నొక్కి వక్కాణించి చెప్పడం కోసమే. చాలా అధిక వడి లేదా శక్తి అంటే అర్థం తెలుసుకోవడానికి చివరలో ఇచ్చిన జవాబులను చూడండి.]
సాధన:
a) ఇచ్చట, v = 5.20 × 106 ms-1;
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 33
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 34

ప్రశ్న 22.
అల్పపీడనం (~ 10-2 mm of Hg) వద్ద ఉన్న హైడ్రోజన్ వాయువును కలిగి ఉన్న ఒక గోళాకార బల్బులో 100V ల పొటెన్షియల్ వద్ద సేకరిణి గల ఒక ఎలక్ట్రాన్ గన్ ఎలక్ట్రానులను పేల్చుతుంది. 2.83 × 10-4 T ల ఒక అయస్కాంత క్షేత్రం ఈ ఎలక్ట్రానుల పథాన్ని వ్యాసార్థం 12.0 cm గల వృత్తీయ కక్ష్యలోకి మళ్ళిస్తుంది. (ఈ పథాన్ని మనం చూడగలం, ఎందుకంటే ఈ పథంలోని వాయు అయానులు, ఎలక్ట్రానులను ఆకర్షించడం ద్వారా, ఎలక్ట్రాను ప్రగ్రహణం (capture) ద్వారా కాంతిని ఉద్గారిస్తూ పుంజాన్ని కేంద్రీకరిస్తాయి. ఈ పద్ధతిని సూక్ష్మపుంజనాళం(‘fine beam tube’) పద్ధతి అంటారు.) ఈ దత్తాంశాల నుంచి e/m ని నిర్ణయించండి.
సాధన:
ఇచ్చట, V = 100 V; B = 2.83 × 10-4 T; r = 12.0 cm = 12.0 × 10-2M
ఎలక్ట్రానులు V వోల్ట్లతో త్వరణం చెందితే, ఎలక్ట్రాన్ గతిజ శక్తిలో పెరుగుదల,
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 35

ప్రశ్న 23.
(a) ఒక X-కిరణ నాళం, 0.45 Åల వద్ద అల్పతరంగదైర్ఘ్యపు కొన ఉన్న ఒక వికిరణ అవిచ్ఛిన్న వర్ణపటాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ వికిరణంలోని ఒక ఫోటానుకు ఉండే గరిష్ట శక్తి ఎంత?
(b) మీకు (a)లో వచ్చే జవాబు నుంచి, అలాంటి ఒక నాళంలో (ఎలక్ట్రానులకు) ఏ క్రమంలోని త్వరణ వోల్టేజి అవసరమవుతుందో కనిపెట్టండి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 36

b) X-కిరణ గోట్టంలో, త్వరణ వోల్టేజి టార్గెట్పై ఎలక్ట్రాన్లు తాకటానికి కావల్సిన శక్తినిచ్చి, X-కిరణాలను ఉత్పత్తి చేయును. 27.6 KeV, X-కిరణ ఫోటానులు పొందుటకు కనీసం 27.6 KeV గతిజ శక్తిని, పతన ఎలక్ట్రానులు కలిగి ఉండాలి. X-కిరణ గొట్టం వెంట 30 Ke V త్వరణ వోల్టేజి ప్రయోగించి, కావల్సిన X-కిరణ ఫోటాన్లను పొందవచ్చును.

ప్రశ్న 24.
పాజిట్రానులతో, అధిక శక్తి అభిఘాతాలు చేసే ఎలక్ట్రానులపై చేసిన ఒక త్వరణకం ప్రయోగంలో, ఒక నిర్దిష్ట సంఘటనను మొత్తం శక్తి 10.2 BeV గల ఒక ఎలక్ట్రాన్ – పాజిట్రాన్ జంట రెండు సమాన శక్తి గల కిరణాలుగా లయం (annihilation) చెందుతుందని వివరించారు. ఒక్కొక్క γ-కిరణానికి అనుబంధితమైన తరంగదైర్ఘ్యం ఎంత? (1 BeV = 109 eV).
సాధన:
2 γ – కిరణాల మొత్తం శక్తి = 10.2 BeV = 10.2 × 109 eV
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 37

ప్రశ్న 25.
క్రింది రెండు సంఖ్యలను అంచనా కట్టడం ఆసక్తిదాయకంగా ఉండాలి. మొదటి సంఖ్య ఏం చెబుతుందంటే – రేడియో ఇంజనీర్లు ఫోటాన్ల గురించి అంతగా కలత చెందనవసరం లేదని! ఇక రెండవ సంఖ్య, మన కన్ను, కేవలం గుర్తించగలిగే కాంతిలో సైతం ఉండే ఫోటాన్లను ఎన్నటికీ లెక్కించలేదు అని చెబుతుంది.
(a) తరంగదైర్ఘ్యం 500 m గల రేడియో తరంగాలను ఉద్గారించే 10 kW సామర్థ్యం గల మధ్యమ తరంగ (మీడియం వేవ్) ట్రాన్సిమిటర్ సెకనుకు ఉద్గారించే ఫోటాన్ల సంఖ్య.
(b) మానవులు పసిగట్టగలిగే కనిష్ట తీవ్రతగల (-10-10 Wm-2) తెలుపు కాంతికి చెంది మన కనుపాపలోకి సెకనుకు ప్రవేశించే ఫోటాన్ల సంఖ్య. ఈ కనుపాప వైశాల్యం సుమారుగా 0.4 cm² ఉంటుందని, తెలుపు కాంతి సగటు పౌనఃపున్యం దాదాపు 6 × 1014 Hz ఉంటుందని తీసుకోండి.
సాధన:
a) ట్రాన్సిమిటర్ సామర్థ్యం, P = 10 kW = 104W
∴ సెకనుకు ఉద్గారమయ్యే మొత్తం శక్తి = P × t = 104 × 1 = 104J
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 38

b) విద్యార్థి వైశాల్యం, A = 0.4cm² = 0.4 × 10-4 m², v = 6 × 1014 HZ
తీవ్రత = 10-10 Wm-2
ఫోటాన్ శక్తి, E = hv
= 6.63 × 10-34 × 6 × 1014 = 4 × 10-19 J.

N = ప్రమాణ వైశాల్యంపై పతనమయ్యే ఫోటాన్ల సంఖ్య అయితే, ఈ ఫోటానుల వల్ల ఒక సెకనులో ప్రమాణ వైశాల్యంపై శక్తి = n ఫోటానుల మొత్తం శక్తి = N × 4 × 10-19 Jm-2.
తీవ్రత = ఒక సెకనులో ప్రమాణ వైశాల్యంపై శక్తి
∴ 10-10 = N × 4 × 10-19 లేక N = \(\frac{10^{-10}}{4\times10^{-19}}\) = 2.5 × 108 m-2s-1

ఒక సెకనులో విద్యార్థిలోనికి ప్రవేశించే ఫోటానుల సంఖ్య = N × విద్యార్థి వైశాల్యం
= 2.5 × 108 × 0.4 × 10-4 s-1 = 104 s-1

ఈ ఫోటానుల సంఖ్య (a) లో వచ్చిన ఫోటాన్ల సంఖ్య కన్నా చాలా తక్కువ. కనుక మన కన్ను, కేవలం గుర్తించగలిగే కాంతిలో ఉండే ఫోటాన్లను ఎన్నటికీ లెక్కించలేము.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 26.
100 W ల పాదరస (దీప) జనకం నుంచి వెలువడే 2271 Åల తరంగదైర్ఘ్యం గల అతినీలలోహిత కాంతి, మాలిబ్దినం లోహంతో తయారైన ఒక ఫోటోసెల్ను ఉద్యోతనం (irradiate) చేస్తుంది. దీనికి నిరోధక పొటెన్షియల్ – 1.3 V అయితే లోహం పని ప్రమేయాన్ని అంచనా కట్టండి. ఈ ఫోటో సెల్, He-Ne లేజరు ఉత్పత్తి చేసే 6328 Å తరంగదైర్ఘ్యం గల, అధిక తీవ్రత (−105 Wm-2) ఉన్న అరుణ కాంతికి ఏవిధంగా స్పందించవచ్చు?
సాధన:
λ = 2271Å = 2271 × 10-10 m, V0 = 1.3 V; Φ0 = ?
eV0 = hν – Φ0
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 39
ఎర్రని కాంతికి తీవ్రత ఎక్కువ అయినప్పటికి, νr < ν కావున ఫోటోసెల్ లేక కాంతి ఘటం స్పందించదు.

ప్రశ్న 27.
ఒక నియాన్ దీపం నుంచి వెలువడే 640.2 nm (Inm = 10-9 m) తరంగదైర్ఘ్యాన్ని కలిగిన ఏకవర్ణ వికిరణం టంగ్స్టన్ పైన సీజియంతో చేయబడిన ఫోటో సూక్ష్మగ్రాహ్యక పదార్థాన్ని ఉద్యోతనం చేస్తుంది. దీనికి నిరోధక పొటెన్షియల్ 0.54V ఉంటుందని కొలిచారు. ఈ జనకానికి బదులు ఇనుము జనకాన్ని ఉపయోగించినప్పుడు దాని 427.2 nm రేఖ అదే ఫోటోసెలు ఉద్యోతనం చేస్తుంది. కొత్త నిరోధక పొటెన్షియల్ను ప్రాగుక్తం చేయండి.
సాధన:
నియాన్ దీపం λ = 6.10.20nm = 640.2 × 10-9 m ; V0 = 0.54 V
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 40

ప్రశ్న 28.
ఫోటో విద్యుత్ ఉద్గారం పౌనఃపున్యంపై ఆధారపడటాన్ని అధ్యయనం చేయడానికి ఒక పాదరస (మెర్క్యురీ) దీపం ఒక అనుకూలమైన జనకం, ఎందుకంటే ఇది దృశ్య వర్ణపటంలోని UV (అతినీలలోహిత) నుంచి ఎరుపు కొన వరకు వ్యాపించిన అనేక సంఖ్యలో గల వర్ణపటరేఖలను ఇస్తుంది. రుబీడియం ఫోటోసెల్తో చేసిన మన ప్రయోగంలో, ఒక పాదరస జనకం నుంచి వెలువడే క్రింది రేఖలను ఉపయోగించాం :
λ1 = 3650 Å, λ21 = 4047 Å, λ3 = 4358 Å, λ4 = 5461 Å, λ5 = 6907 Å,
వీటికి కొలిచిన నిరోధక పొటెన్షియల్ లు వరసగా
V01 = 1.28 V, V02 = 0.95 V, V03 = 0.74 V, V04 = 0.16 V, V05 = 0 V.
ప్లాంక్ స్థిరాంకం h విలువను, ఈ పదార్థానికి ఆరంభ పౌనఃపున్యాన్ని, పని ప్రమేయాన్ని నిర్ణయించండి.
[సూచన : ఈ దత్తాంశాల నుంచి h పొందాలంటే, మీకు ఆ విలువ తెలిసి (1.6 × 10-19 C గా తీసుకోవచ్చు). ఉండాలని మీరు గుర్తిస్తారు. ఈ రకమైన ప్రయోగాలను మిల్లికాన్ Na, Li, K మొదలైన వాటిపైన చేశాడు. అతను (తన తైల బిందు ప్రయోగం నుంచి లభించిన) తన సొంత విలువను ఆ కి ఉపయోగించి ఐన్స్టీన్ ఫోటోవిద్యుత్ సమీకరణాన్ని | ధ్రువపరచడమేగాక h కు స్వతంత్రంగా అంచనా కట్టిన విలువను ఇచ్చాడు.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 41
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 42
పౌనఃపున్యం υ మరియు అవరోధ పొటెన్షియల్ మధ్య గీసిన గ్రాఫ్ సరళరేఖ. నాల్గు బిందువులతో కలిపిన సరళరేఖ X-అక్షాన్ని 5.0 × 1014 Hz వద్ద ఖండిస్తుంది. ఐదవ బిందువు υ < υ0 వ్యాప్తిలో ఉండి ఫోటో విద్యుత్ ఉద్గారం చూపదు. కావున విద్యుత్ను ఆపుటకు అవరోధ పొటెన్షియల్ అవసరం ఉండదు. గ్రాఫ్ నుండి సరళరేఖవాలు
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 43

ప్రశ్న 29.
క్రింది లోహాలకు పని ప్రమేయాలను ఇచ్చాం :
Na : 2.75 eV; K : 2.30 eV; Mo : 4.17 eV; Ni : 5.15 eV. ఫోటోసెల్ నుంచి 1m దూరంలో ఉంచిన He-Cd లేజర్ నుంచి వెలువడే 3300 Åల తరంగదైర్ఘ్యం గల వికిరణానికి, వీటిలో ఏ లోహం ఫోటోవిద్యుత్ ఉద్గారంను ఇవ్వదు? లేజరును దగ్గరకు తెచ్చి 50 cm దూరంలో ఉంచితే ఏం జరుగుతుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 44
ఈ శక్తి Na మరియు K ల పని ప్రమేయంల కన్నా ఎక్కువ మరియు Mo మరియు Ni కన్నా తక్కువ. ఫొటో విద్యుత్ ఉద్గారం Na మరియు K లోహాలలో మాత్రమే సంభవిస్తుంది.

లేజర్ను దగ్గరగా తీసుకొస్తే, పతన వికిరణ తీవ్రత పెరుగుతుంది. ఇది Mo మరియు Ni లోహాలపై ఫలిత ప్రభావం చూపదు. దీని తీవ్రత పెరిగిన Na మరియు K ల ఫోటోఎలక్ట్రిక్ ఉద్గారం అనుపాతంగా పెరుగును.

ప్రశ్న 30.
ఉపరితల వైశాల్యం 2cm² గల ఒక సోడియం ఫోటోసెల్పైన తీవ్రత 10-5 Wm-2 గల కాంతి పడుతుంది. ఈ పతన శక్తిని సోడియం యొక్క 5 స్తరాలు (పొరలు) శోషించుకొంటాయని అనుకొంటే, ఫోటో విద్యుదుద్గారానికి పట్టే కాలం వికిరణం తరంగ చిత్రణలో ఎంత ఉంటుందో అంచనా వేయండి. ఈ లోహానికి పని ప్రమేయం దాదాపు 2 eV గా ఉంది. మీ జవాబులో ఉన్న అంతస్సూచన (implication) ఏమిటి?
సాధన:
I = 10-5W/m²; A = 2 cm² = 2 × 10-4m²; n = 5, t = ? W0 = 2eV= 2 × 1.6 × 10-19J.
సోడియం పరమాణువు ఒక వాహక ఎలక్ట్రానన్ను కలిగి ఉండును.
ప్రభావ పరమాణు వైశాల్యం = 10-20
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 45
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 46

తరంగపటం, ఈ ప్రయోగంనకు ప్రయోగించకూడదు.

ప్రశ్న 31.
స్ఫటిక వివర్తన ప్రయోగాలను X-కిరణాలను ఉపయోగించి గానీ లేదా తగు వోల్టేజి ద్వారా త్వరితం అయ్యే ఎలక్ట్రానులను ఉపయోగించి గానీ చేయవచ్చు. ఈ రెండింటిలో ఏ శోధన పరికరం (probe) ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది? (పరిమాణాత్మకంగా పోల్చడం కోసం, శోధన తరంగదైర్ఘ్యం 1 కి సమానమని తీసుకోండి. ఈ తరంగదైర్ఘ్యం జాలకంలోని అంతర్ పరమాణుక మధ్య దూరం క్రమంలో ఉంది) (m = 9.11 × 10-31 kg).
సాధన:
ఎలక్ట్రాను, λ = 1 Å = 10-10 m; m = 9.11 × 10-31 kg
గతిజశక్తి ఉన్న ఎలక్ట్రాన్లు X-కిరణాలను ఉత్పత్తి చేయును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 47
కావున ఒకే తరంగదైర్ఘ్యంనకు, ఫోటాన్ ఎలక్ట్రాన్ కన్నా ఎక్కువ గతిజశక్తి కలిగి ఉండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 32.
(a) గతిజశక్తి 150 eV కలిగిన ఒక న్యూట్రాన్కు డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని పొందండి. అభ్యాసం 31లో మీరు చూసినట్లుగా, ఇదే శక్తి కలిగిన ఎలక్ట్రాన్ పుంజం స్ఫటిక వివర్తన ప్రయోగాలకు తగిన విధంగా ఉంటుంది. మరి, ఇదే శక్తి కలిగి ఉన్న ఒక న్యూట్రాన్ పుంజం సమానంగా తగినదై ఉంటుందా? వివరించండి. (mn = 1.6752 × 10-27 kg)
(b) గది ఉష్ణోగ్రత (27 °C) వద్ద ఉన్న ఉప్లీయ న్యూట్రాన్లతో అనుబంధితమైన డి బ్రాయ్ తరంగండి. తద్వారా ఒక వేగవంతమైన వడిగల న్యూట్రాను పంజాన్ని న్యూట్రాన్ వివర్తన ప్రయోగాలకు వినియోగించగలగాలంటే దాన్ని పరిసరాలతో (environment), ఉష్ఠీకృతం (thermalise) చేయవలసిన అవసరం ఎందుకు ఉంటుందో
వివరించండి.
సాధన:
a) న్యూట్రాన్ గతిజశక్తి, E = 150 eV = 150 × 1.6 × 10-19 J
న్యూట్రాన్ ద్రవ్యరాశి, m = 1.675 × 10-27 kg.
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 48
అంతర పరమాణువుల మధ్యదూరం 1Å(= 10-10m), తరంగదైర్ఘ్యం కన్నా 100 రెట్లు ఎక్కువ.
∴ వివర్తన ప్రయోగంలో, న్యూట్రాన్ పుంజము శక్తి 150 ev సరిపోదు.

b) T = t + 273 = 27 + 273 = 300 K
బోల్ట్స్మన్ స్థిరాంకం,K = 1.38 × 10-23 J/mol/K
పరమ ఉష్ణోగ్రత T వద్ద, న్యూట్రాన్ సరాసరి గతిజశక్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 49
ఈ తరంగదైర్ఘ్యం జాలకంలోని అంతర పరమాణుక మధ్య దూరం క్రమంలో ఉంది. కావున ఒక వేగవంతమైన వడిగల న్యూట్రాను పుంజాన్ని న్యూట్రాన్ వివర్తన ప్రయోగాలకు వినియోగించగలగాలంటే దాన్ని పరిసరాలతో ఉష్ఠీకృతం చేయవలసిన అవసం ఉంటుంది.

ప్రశ్న 33.
ఒక ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని 50 kV వోల్టేజి ద్వారా త్వరితమైన ఎలక్ట్రానులను, ఉపయోగించుకొంటుంది. ఈ ఎలక్ట్రానులతో అనుబంధితమైన డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని నిర్ణయించండి. ఒకవేళ ఇతర కారకాలు (సంఖ్యాత్మక అపర్చర్ (కంత/ దారి) మొదలైనటువంటివి) కొంచెం అటుఇటుగా (roughly) ఇవే విలువలను కలిగి ఉన్నాయని తీసుకొంటే, ఒక ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని యొక్క పృథక్కరణ సామర్థ్యం, పసుపు కాంతిని వాడే దృశా సూక్ష్మదర్శిని పృథక్కరణ సామర్ధ్యంతో ఏ విధమైన పోలిక కలిగి ఉంటుంది?
సాధన:
V = 50 KV = 50 × 10³ Volt
∴ ఎలక్ట్రాన్ గతిజశక్తి, E = 50 × 10³ ev = 50 × 10³ × 1.6 × 10-19J
= 50 × 1.6 × 10-16 J
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 50

పసుపు కాంతి తరంగదైర్ఘ్యం (λ) = 5.9 × 10-7 m

పృథక్కరణ సామర్థ్యం, తరంగదైర్ఘ్యంనకు విలోమానుపాతంలో ఉండుట వల్ల ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పృథక్కరణ సామర్థ్యం, దృశ్య మైక్రోస్కోప్నకు 105 రెట్లు. సాధారణంగా జ్యామితీయ కారకంలలో తేడా వాని పోల్చుటలో మార్పు తెచ్చును.

ప్రశ్న 34.
ఒక శోధన పరికరం (probe) తరంగదైర్ఘ్యం, అది కొన్ని వివరాల పరిధి వరకు (in some detail) పరిశీలించగలిగే నిర్మాణం యొక్క పరిమాణానికి కొంచెం అటు ఇటుగా ఉన్న కొలమానమే. ప్రోటాన్లు, న్యూట్రాన్లకు ఉండే క్వార్క్ రచన 10-15 m లేదా అంతకంటే తక్కువ సూక్ష్మమైన పొడవు మానం (length scale) లో ఉన్నట్లు కనిపిస్తుంది. USA లోని స్టాన్ఫోర్డ్ వద్దగల ఒక రేఖీయ త్వరణకం ఉత్పత్తి చేసే అధికశక్తి ఎలక్ట్రాన్ పుంజాలను ఉపయోగించి 1970 లోని తొలి రోజుల్లో మొట్టమొదటగా ఈ నిర్మాణాన్ని లోతుగా పరిశీలించడం జరిగింది. ఈ ఎలక్ట్రాన్ పుంజాల శక్తి ఏ క్రమంలోనిదై ఉండవచ్చో ఊహించి కనిపెట్టండి. (ఎలక్ట్రాన్ విరామ ద్రవ్యరాశి శక్తి = 0.511 MeV.)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 51
కావున త్వరణకారి నుండి ఎలక్ట్రాన్ శక్తులు కొన్ని BeV లను కల్గి ఉండును.

ప్రశ్న 35.
గది ఉష్ణోగ్రత (27 °C), 1 atm పీడనం వద్ద ఉన్న హీలియం వాయువులోని ఒక He పరమాణువుతో అనుబంధితమైన విలక్షణ డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని కనుక్కోండి. ఈ పరిస్థితుల్లో రెండు పరమాణువుల మధ్య ఉండే సగటు ఎడంతో దీన్ని (డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని) పోల్చండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 52

ప్రశ్న 36.
27 °C వద్ద ఉన్న ఒక లోహంలోని ఒక ఎలక్ట్రాన్ విలక్షణ డి బ్రాయ్ తరంగదైర్ఘ్యాన్ని లెక్కకట్టి, ఒక లోహంలోని రెండు ఎలక్ట్రాన్ల మధ్య ఉండే సగటు ఎడం (ఇది దాదాపు 2 × 10-10 m ఉంటుందనుకోండి) తో పోల్చండి.
[సూచన : అభ్యాసాలు 35, 36 లు కింది విషయాన్ని బహిరంగ పరుస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఉండే వాయురూప అణువులతో ఉండే అనుబంధిత తరంగ పొట్లాలు అతిపాతం చెందకుండా ఉండగా, ఒక లోహంలోని ఎలక్ట్రాన్ తరంగ పొట్లాలు ఒకదానితో ఒకటి ప్రబలంగా అతిపాతం చెందుతాయి. సాధారణ వాయువులోని అణువులు విడివిడిగా గుర్తించగలిగేవిగా ఉంటే, ఒక లోహంలోని ఎలక్ట్రానులను ఒకదాని నుంచి మరొకదానిని విడదీసి గుర్తించగలలేనివిగా ఉంటాయని ఇది సూచిస్తుంది. ఈ అభేద్యత (indistinguishibility) అనేక ప్రాథమిక అంతస్సూచనలను కలిగి ఉంటుంది. వీటిని మీరు మరింత ఉన్నతమైన భౌతికశాస్త్ర కోర్సులలో అన్వేషిస్తారు (explore)].
సాధన:
లోహంలో ఎలక్ట్రాన్ ద్రవ్యవేగం, P = √3mKT
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 53

ప్రశ్న 37.
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
(a) ప్రోటాన్లు, న్యూట్రాన్ల అంతర్భాగంలోని క్వార్క్లు, ఆంశిక (fractional) ఆవేశాలు [(+2/3)e; (-1/3)e] ను కలిగి ఉంటాయని అనుకుంటారు. అలాంటప్పుడు అవి మిల్లికాన్ తైలబిందు ప్రయోగంలో ఎందుకు కనిపించలేదు?
సాధన:
క్వార్క్స్ ఆంశిక ఆవేశాలను కలిగిఉండును. ఈ క్వార్క్స్లు బలాలతో బంధితమగును. క్వార్క్ లు దూరంగా లాగటానికి ప్రయత్నిస్తే, ఈ బలాలు దృఢంగా ఉంటాయి. అందువల్ల క్వార్క్లు దగ్గరగా ఉంటాయి. ఈ కారణం వల్ల ప్రకృతిలో ఆంశిక ఆవేశాలు ఇమడతాయి. కాని పరిశీలించిన ఆవేశాలు, ఎలక్ట్రాన్ ఆవేశంనకు పూర్ణాంక గుణిజాలుగా ఉండును.

(b) కలయిక e/m పట్ల గల ప్రత్యేకత ఏమిటి? e,m ల గురించి కేవలంగా, విడివిడిగా మనం ఎందుకు మాట్లాడం?
సాధన:
విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో ఎలక్ట్రాన్ చలనంను \(\frac{1}{2}\)mυ² = eV లేక Beυ = \(\frac{mυ^2}{r}\) అనే రెండు సమీకరణాలు తెలుపుతాయి. ఈ రెండు సమీకరణాలు e మరియు m రెండింటిని కలిగి ఉండును. ఏ ఒక్క సమీకరణంలో e లా m లను ఒక్కొక్కటిగా లేదు. అందువల్ల \(\frac{e}{m}\) మాత్రమే తీసుకుంటాము.

(c) సాధారణ పీడనాల వల్ల వాయువులు ఎందుకు బంధకాలు కావాలి, అత్యల్ప పీడనాల వద్ద అవి వహనాన్ని ఎందుకు ప్రారంభిస్తాయి?
సాధన:
సాధారణ పీడనం వద్ద వాయు అణువుల అయనీకరణం వల్ల స్వల్ప ధన అయాన్లు మరియు ఎలక్ట్రాన్లు ఏర్పడును. ఎలక్ట్రోడ్లు బంధకాలు అవటం వలన ధన అయాన్లు మరియు ఎలక్ట్రాన్లు చేరలేవు. అల్ప పీడనం వద్ద, సాంద్రత తగ్గుతుంటే, సరాసరి స్వేచ్ఛా పథము పెద్దదిగా ఉండును. అధిక పొటెన్షియల్ వద్ద, అవి సరిపోయినంత శక్తిని పొంది, అవి అణువులతో అభిఘాతం జరిపి, అయనీకరణను కలిగించును. దీని వల్ల, వాయువులో అయాన్ల సంఖ్య పెరుగును.
మరియు ఇది వాహకంగా మారును.

(d) ప్రతి లోహానికి ఒక నిర్దిష్ట పని ప్రమేయం ఉంటుంది. పతన వికిరణం ఏకవర్ణకం అయినప్పుడు అన్ని ఫోటో ఎలక్ట్రానులు ఒకే శక్తితో ఎందుకు బయటకు రావు? ఫోటో ఎలక్ట్రానులకు శక్తి వితరణ అంటూ ఎందుకు ఉంది?
సాధన:
లోహంలో ఎలక్ట్రాన్లన్నీ ఒకే శక్తి స్థాయిని కలిగి ఉండును. కాని అవి అవిచ్ఛిన్న స్థాయిలను ఆక్రమించును. లోహతలం పై వికిరణం పతనమయితే, వేర్వేరు శక్తులతో, వేర్వేరు స్థాయిల నుండి ఎలక్ట్రాన్లు బయటకు వచ్చును.

(e) ఒక ఎలక్ట్రాన్ యొక్క శక్తి, ద్రవ్యవేగం, దాని అనుబంధిత ద్రవ్యతరంగ పౌనఃపున్యం, తరంగదైర్ఘ్యాలతో కింది విధంగా సంబంధం కలిగి ఉన్నాయి.
E = h ν, p = \(\frac{h}{\lambda}\)
కాని λ విలువ భౌతికంగా సార్థకం (significant) కాగా, ν విలువ (అందువల్ల, ప్రావస్థ వడి ν λ) కు మాత్రం భౌతిక సార్ధకత ఏమీలేదు. ఎందుకు?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 54

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
ఒక లేజర్ 6.0 × 1014 Hz పౌనఃపున్యం ఉన్న ఏకవర్ణ కాంతిని ఉత్పత్తిచేసింది. తద్వారా ఉద్గారమైన సామర్థ్యం 2.0 × 10-3W. (a) ఈ కాంతి పుంజంలో ఒక ఫోటాను శక్తి ఎంత? (b) సగటున ఒక సెకనుకు ఎన్ని ఫోటాన్లను జనకం ఉద్గారిస్తుంది?
సాధన:
a) ఒక్కొక్క ఫోటాన్ కు ఉండే శక్తి
E = hν = (6.63 × 10-34 J s) (6.0 × 1014 Hz)
= 3.98 × 10-19 J

b) ప్రతి సెకనుకు జనకం నుంచి ఉద్గారమయ్యే ఫోటాన్ల సంఖ్య N అనుకొంటే, పుంజంలో ప్రసారితమయ్యే సామర్థ్యం P, ఒక్కొక్క ఫోటానుకు ఉండే శక్తి Eకి N రెట్లకు సమానమవుతుంది. అందువల్ల P = N E. అప్పుడు,
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 55

ప్రశ్న 2.
సీజియంకు పని ప్రమేయం 2.14 eV అయితే (a) సీజియంకు ఆరంభ పౌనఃపున్యాన్ని (b)0.60 V ల నిరోధక పొటెన్షియల్ వల్ల ఫోటోవిద్యుత్ ప్రవాహం సున్నాకు తీసుకొనిరావడమైంది అనుకొంటే పతన కాంతి తరంగదైర్ఘ్యాన్ని కనుక్కోండి. [AP. Mar.’16]
సాధన:
a) కటాఫ్ లేదా ఆరంభ పౌనఃపున్యానికి, పతన వికిరణ శక్తి hν0 పని ప్రయేయం Φ0 కి సమానం కావాలి. కాబట్టి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 56
అంటే, ఈ ఆరంభ పౌనఃపున్యం కంటే తక్కువ విలువ ఉన్న పౌనఃపున్యాలకు, ఫోటో ఎలక్ట్రానులు బయటకు రావు.

b) మందక శక్మం V0 వల్ల కలిగే స్థితిజశక్తి e V0 కు ఉద్గారిత ఫోటో ఎలక్ట్రానుల గరిష్ట గతిజశక్తి సమానమైనప్పుడే ఫోటో విద్యుత్ ప్రవాహం సున్నాకు తగ్గిపోతుంది. ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం ప్రకారం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 57

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 3.
దృశ్య ప్రాంతంలో కాంతి తరంగదైర్ఘ్యం, నీలలోహిత (ఊదా) వర్ణానికి సుమారుగా 390 nm, పసుపు-ఆకుపచ్చ వర్ణానికి దాదాపు 550 nm (సగటు తరంగదైర్ఘ్యం), ఎరుపు వర్ణానికి దాదాపు 760nm.
(a) ఈ దృశ్య వర్ణపటంలోని (i) నీలలోహిత కొనవద్ద, (ii) పసుపు-ఆకుపచ్చ వర్ణపు సగటు తరంగదైర్ఘ్యం వద్ద, (iii) ఎరుపు కొనవద్ద ఫోటాన్లకు ఉండే శక్తి విలువలు (eV) లలో ఏవిధంగా ఉంటాయి?
(h = 6.63 × 10-34 J s 1 eV = 1.6 × 10-19 J అని తీసుకోండి)
(b) (a) లోని (i), (ii); (iii) ల ఫలితాలను ఉపయోగిస్తూ, పట్టికలోని జాబితాలో ఉన్న ఫోటో సూక్ష్మగ్రాహ్మక పదార్థాలు, వాటి పని ప్రమేయాల నుంచి, దృశ్యకాంతితో పనిచేసే ఒక ఫోటోవిద్యుత్ పరికరాన్ని మీరు నిర్మించగలరా?
సాధన:
a) పతన ఫోటాను శక్తి, E = hv = hc/λ
E = (6.63 × 10-34 Js) (3 × 108m/s) /λ
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 58

i) నీలలోహిత కాంతికి, λ1 = 390 nm (అల్పతమ తరంగదైర్ఘ్యం కొన)
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 59

b) ఒక ఫోటోవిద్యుత్ పరికరం ప్రచలితం కావాలంటే పతన కాంతి శక్తి E విలువ పదార్థ పని ప్రమేయం 60 విలువకు సమానం లేదా అధికంకానీ కావలసి ఉంటుంది. కాబట్టి నీలలోహిత కాంతి (E = 3.19 eV) కి ఫోటోవిద్యుత్ పరికరం Na (Φ0 = 2.75 eV), K (Φ0 = 2.30 eV), Cs (Φ0 = 2.14 eV) ఫోటో సూక్ష్మగ్రాహ్యక పదార్థాలతో ప్రచాలితం కాగలదు. పసుపు-ఆకుపచ్చ కాంతి (E = 2.26 eV తో)కి కూడా Cs (Φ0 = 2.14 eV) తో మాత్రమే ప్రచలితం అవుతుంది. అయితే, ఈ సూక్ష్మగ్రాహ్యక పదార్థాల్లో దేనితో కూడా, ఎరుపు కాంతి (E = 1.64 eV) కి ప్రచలితం కాదు.

ప్రశ్న 4.
(a) 5.4 × 106 m/s వడితో చలిస్తున్న ఒక ఎలక్ట్రాన్తో, (b) 150 g ద్రవ్యరాశి కలిగి 30.0 m/s తో ప్రయాణించే బంతితో అనుబంధితమై ఉండే డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఎంత?
సాధన:
a) ఎలక్ట్రానుకు :
ద్రవ్యరాశి m = 9.11 × 10-31 kg, వడి, υ = 5.4 × 106 m/s.
అప్పుడు ద్రవ్యవేగం p = m υ = 9.11 × 10-31 (kg) × 5.4 × 106 (m/s)
p = 4.92 × 10-24 kg m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 60

b) బంతికి
ద్రవ్యరాశి, m’ = 0.150 kg, వడి υ’ = 30.0 m/s.
అప్పుడు ద్రవ్యవేగం, p’ = m’ υ’ = 0.150 (kg) × 30.0 (m/s)
p’ = 4.50 kg m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 61

ఎలక్ట్రాను డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం, X-కిరణ తరంగదైర్ఘ్యాలతో పోల్చదగినదిగా ఉంది. అయితే, బంతికి అది ప్రోటాన్ పరిమాణం (సైజు)కు 10-19 రెట్లు ఉంది, అంటే, ప్రయోగపూర్వక కొలతకు చాలా ఆవల ఉంది.

ప్రశ్న 5.
ఒక ఎలక్ట్రాను, ఒక α-కణం, ఒక ప్రోటాను ఒకే గతిజశక్తిని కలిగి ఉన్నాయి. ఈ కణాలలో దేనికి అతిచిన్న డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఉంటుంది? [TS. Mar. ’15]
సాధన:
ఒక కణానికి, డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం, λ = h/p
గతిజశక్తి, K = p²/2m
అప్పుడు, λ = h/√2mk

ఒకే గతిజశక్తి ఉన్న సందర్భానికి, కణంతో అనుబంధితమై ఉండే డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం వాటి ద్రవ్యరాశుల వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఒక ప్రోటాను (¹1H) ద్రవ్యరాశి ఎలక్ట్రాను ద్రవ్యరాశికి 1836 రెట్లు కాగా, α-కణం (42He) ప్రోటాను ద్రవ్యరాశికి నాలుగు రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది.

కాబట్టి, α-కణానికి అతిచిన్న డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఉంటుంది.

ప్రశ్న 6.
ఒక ఎలక్ట్రాన్ కంటే మూడు రెట్లు వడితో ఒక కణం చలిస్తోంది. ఆ కణానికి చెందిన డి బ్రాయ్ తరంగదైర్ఘ్యానికీ, ఎలక్ట్రాను తరంగదైర్ఘ్యానికి ఉన్న నిష్పత్తి 1.813 × 10-4 అయితే, ఆ కణం ద్రవ్యరాశిని గణించి, కణాన్ని గుర్తించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 62
కాబట్టి, ఈ ద్రవ్యరాశి గల ఆ కణం ఒక ప్రోటాను లేదా ఒక న్యూట్రాను అయి ఉండవచ్చు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

ప్రశ్న 7.
100 వోల్టుల పొటెన్షియల్ తేడా ద్వారా త్వరితమయ్యే ఎలక్ట్రానుతో అనుబంధితమై ఉండే డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఎంత? [AP. Mar. ’15]
సాధన:
త్వరితం చేసే పొటెన్షియల్ V = 100. డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం λ
AP Inter 2nd Year Physics Study Material Chapter 12 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం 63
ఈ సందర్భానికి, ఒక ఎలక్ట్రానుతో అనుబంధితమై ఉండే డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం X-కిరణ తరంగదైర్ఘ్యాల క్రమంలో ఉంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 11th Lesson విద్యుదయస్కాంత తరంగాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 11th Lesson విద్యుదయస్కాంత తరంగాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
X – కిరణాల సగటు తరంగదైర్ఘ్యం ఎంత?
జవాబు:
X – కిరణాల తరంగదైర్ఘ్య వ్యాప్తి 10-8 m (10nm) నుండి 10-13 m (10-4 nm)
X – కిరణాల సగటు తరంగదైర్ఘ్యము = \(\frac{10+0.0001}{2}\) = 5.00005 nm

ప్రశ్న 2.
పరారుణ కిరణాల ఒక ఉపయోగాన్ని తెలపండి. [AP. Mar. 16]
జవాబు:

  1. భూమిని వేడిగా ఉంచడంలో పరారుణ కిరణాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.
  2. ఫిజియోథెరపీలో పరారుణ దీపాలను ఉపయోగిస్తారు.
  3. భూ ఉపగ్రహాల ఉనికిని గుర్తించడానికి పరారుణ శోధకాలను వాడతారు.
  4. మంచు, పొగ మొదలగు పరిస్థితులలో ఫొటోలు తీయడానికి వీటిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 3.
విద్యుదయస్కాంత వికిరణ తరంగదైర్ఘ్యాన్ని రెట్టింపు చేస్తే ఫోటాన్ శక్తి ఎలా మారుతుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 1

ప్రశ్న 4.
విద్యుదయస్కాంత తరంగాల ఉత్పత్తి సూత్రం ఏమిటి?
జవాబు:
అంతరాళం మరియు కాలంలో అయస్కాంత క్షేత్రం మరియు విద్యుత్ క్షేత్రం మారి ఆవేశము త్వరణము చెందితే, విద్యుదయస్కాంత తరంగాలు జనిస్తాయి.

ప్రశ్న 5.
శూన్యంలో పరారుణ కిరణాల, అతినీలలోహిత కిరణాల వడుల నిష్పత్తి ఎంత?
జవాబు:
శూన్యంలో పరారుణ కిరణాలు మరియు అతినీలలోహిత కిరణాల వేగాల నిష్పత్తి 1 : 1 శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాలు అన్నీ ఒకే వేగం 3 × 108 మి/సె కలిగి ఉంటాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 6.
స్వేచ్ఛాంతరాళంలో ఒక విద్యుదయస్కాంత తరంగానికి, విద్యుత్, అయస్కాంత క్షేత్రాల గోలన పరిమితుల మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
E0 = CB0
ఇక్కడ E0 = విద్యుత్ క్షేత్రం యొక్క కంపన పరిమితి
B0 = అయస్కాంత క్షేత్రం యొక్క కంపన పరిమితి
C = కాంతి వేగం:

ప్రశ్న 7.
సూక్ష్మ (మైక్రో) తరంగాల అనువర్తనాలేమిటి? [TS. Mar.’15]
జవాబు:

  1. మైక్రో తరంగాలను రాడార్లలో ఉపయోగిస్తారు.
  2. మైక్రో తరంగాలను వంట చేయుటకు ఉపయోగిస్తారు.
  3. చలనంలో ఉన్న వాహనం యొక్క వేగాన్ని అంచనా వేయడానికి మైక్రో తరంగాలలో రాడార్లలో వాడతారు.

ప్రశ్న 8.
రాడార్లలో సూక్ష్మ తరంగాలను ఉపయోగించడానికి కారణం ఏమిటి? [Mar. ’14]
జవాబు:
మైక్రో- తరంగాలు స్వల్ప తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి. అందువలన ఒక నిర్దిష్ట దిశలో కిరణ సంకేతం వలె ప్రసారం చేయవచ్చు. ఇవి ప్రయాణించు మార్గంలో అడ్డు యొక్క అంచు వద్ద వంగవు.

ప్రశ్న 9.
పరారుణ కిరణాల రెండు ఉపయోగాలను ఇవ్వండి. [TS. Mar.’17]
జవాబు:

  1. డీహైడ్రేటెడ్ పండ్ల తయారీలో పరారుణ కిరణాలను వాడతారు.
  2. గోడలపై పురాతన కాలంనాటి రాతలను గుర్తించడానికి వీటిని వాడతారు.
  3. గ్రహం వేడిగా ఉండుటకు హరిత గృహప్రభావాన్ని కలిగించుటకు వీటిని వాడతారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 10.
ఒక కెపాసిటర్ను ఆవేశితం చేయడానికి 0.6A విద్యుత్ ప్రవాహాన్ని పంపితే ప్లేట్ల మధ్యలో స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహం ఎంత?
జవాబు:
i = కెపాసిటర్లో విద్యుత్ ప్రవాహము = 0.6 A
i = id = εo\(\frac{d \phi_{\mathrm{B}}}{\mathrm{dt}}\)
∴ i = id = 0.6. A
∴ స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహము (id) = 0.6 A.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక విద్యుదయస్కాంత తరంగం ఏమి కలిగి ఉంటుంది? శూన్యంలో దాని వేగం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
అంతరాళంలో పరస్పరం లంబంగా విద్యుత్ మరియు అయస్కాంతక్షేత్ర సదిశలు మారి విద్యుదయస్కాంత తరంగాలు జనిస్తాయని మాక్స్వెల్ భావించాడు. ఇవి అంతరాళంలో ఎలాంటి యానకం అవసరం లేకుండా ప్రయాణిస్తాయి. ఈ తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలని అంటారు.

మాక్స్వెల్ భావన ప్రకారం విద్యుదయస్కాంత తరంగాలలో విద్యుత్ మరియు అయస్కాంతక్షేత్ర సదిశలు పరస్పరం లంబంగా సైన్ వక్రంగా మారుతూ, తరంగ ప్రసార దిశకు లంబంగా ఉంటాయి. అందువల్ల విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.
విద్యుత్ క్షేత్రం Ex = E0 Sin (Kz – ωt)
అయస్కాంత క్షేత్రం By0 = B0, sin (Kz – ωt)
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 2

విద్యుదయస్కాంత తరంగాల వేగము (i) శూన్య యానకం యొక్క ప్రవేశ్యశీలత (µo) (ii) శూన్యయానకం యొక్క పెర్మిటివిటీ (εo) పై ఆధారపడును. విద్యుదయస్కాంత తరంగాల వేగము = 3 × 108 m / s.

ప్రశ్న 2.
హరితగృహ ప్రభావం అంటే ఏమిటి? భూఉపరితల ఉష్ణోగ్రత పరంగా దాని పాత్ర ఏమిటి?
జవాబు:
హరిత గృహప్రభావం :
వాతావరణంలోని CO2, CH4, N2, క్లోరోఫోరో కార్బన్ వంటి వాయువులు భూమి వెలువరించిన వికిరణాలను బంధించడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుటను హరిత గృహప్రభావం అంటారు.

  1. సూర్యుడి నుండి వచ్చే వికిరణము వాతావరణంలోకి ప్రవేశించి, భూమి పై వస్తువులను వేడెక్కిస్తుంది. వాటి నుండి పరారుణ కిరణాలు ఉద్గారమవుతాయి.
  2. ఈ కిరణాలు భూమి ఉపరితలం నుండి పరావర్తనం చెంది, భూవాతావరణంలో బంధించబడి, భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది.
  3. కార్బన్ డయాక్సైడ్ పొరలు మరియు తక్కువ ఎత్తులో ఉండే మేఘాలు భూవాతావరణం నుండి పరారుణ కిరణాలు తప్పించుకుపోకుండా అడ్డుకుంటాయి.
  4. రోజురోజుకు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగి, వాతావరణంలో పరారుణ కిరణాలు అధికంగా బంధించబడతాయి.
  5. కాబట్టి రోజు రోజుకు భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విద్యుదయస్కాంత తరంగాల అవిష్కరణ సంబంధిత చరిత్రను క్లుప్తంగా తెలపండి.
జవాబు:
1. ఫారడే తన ప్రయోగాల ద్వారా విద్యుదయస్కాంత ప్రేరణను అధ్యయనం చేసినప్పుడు కాలంతో పాటు అయస్కాంతక్షేత్రం మారినప్పుడు, విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది.

2. 1865 వ సంవత్సరంలో మాక్స్వెల్ తన సైద్ధాంతిక అధ్యయనం ప్రకారం, కాలంతో పాటు మారే విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది.

3. అయస్కాంత క్షేత్ర జనకం పర్యవసానంగా స్థానభ్రంశ ప్రవాహం ఏర్పడును.

4. దీనర్ధం కాలంతో పాటు మారే విద్యుత్ (లేదా) అయస్కాంతక్షేత్రాలు మరొక క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి.

5. మాక్స్వెల్ భావన ప్రకారం అంతరాళంలో పరస్పరం లంబంగా మారే విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల సదిశల వల్ల విద్యుదయస్కాంత తరంగాలు జనిస్తాయి.

6. ఈ విద్యుదయస్కాంత తరంగాలు అంతరాళంలో ఎలాంటి యానకం అవసరం లేకుండా ప్రయాణిస్తాయి.

7. విద్యుత్ మరియు అయస్కాంతక్షేత్రాలు రెండూ అంతరాళం మరియు కాలంతో మారేటప్పుడు ఒకే పౌనఃపున్యాలను కలిగి ఉంటాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 3

8. విద్యుత్ క్షేత్రసదిశ \(\overrightarrow{E}\) మరియు అయస్కాంతక్షేత్ర సదిశ \(\overrightarrow{B}\) లు y మరియు z అక్షం దిశలలో కంపిస్తే, x- అక్షం దిశలో విద్యుదయస్కాంత తరంగాలు ప్రసరిస్తాయి.

9. విద్యుదయస్కాంత తరంగాలు శూన్యంలో ప్రయాణించే వేగాన్ని మాక్స్వెల్ కనుగొన్నాడు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 4

10. యానకంలో విద్యుదయస్కాంత తరంగాల వేగము v = \(\frac{1}{\sqrt{\mu \varepsilon}}\)

11. మాక్స్వెల్ భావన ప్రకారం విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.

12. స్పార్క్ డోలకంను ఉపయోగించి 1888 లో హెర్జ్ ప్రయోగపూర్వకంగా విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేయడం మరియు శోధించడంను వివరించాడు.

13. 1895లో జగదీష్ చంద్రబోస్ 5 m.m నుండి 25 m.m తరంగదైర్ఘ్యం గల విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేశాడు.

14. 1899 లో మార్కొని మొట్టమొదటిగా 50 కిలోమీటర్ల దూరం వరకు పనిచేసే వైర్లెస్ సంచారవ్యవస్థను ఏర్పరిచాడు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 2.
విద్యుదయస్కాంత తరంగాల ఆరు అభిలక్షణాలను తెలపండి. హరితగృహ ప్రభావం అంటే ఏమిటి?
జవాబు:
విద్యుదయస్కాంత తరంగాల ధర్మాలు (లేదా) అభిలక్షణాలు :
1. విద్యుదయస్కాంత తరంగాల ప్రసరణకు ఎలాంటి యానకం అవసరం లేదు. ఇవి శూన్యంలో మరియు యానకంలో ప్రసరిస్తాయి.

2. శూన్యంలో (లేదా) స్వేచ్ఛా అంతరాళంలో విద్యుదయస్కాంత తరంగాల వేగము
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 5

3. యానకంలో విద్యుదయస్కాంత తరంగాల వేగము v = \(\frac{1}{\sqrt{\mu \varepsilon}}\)

4. విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.
విద్యుత్ క్షేత్ర సదిశ \(\overrightarrow{E}\) మరియు అయస్కాంతక్షేత్ర సదిశ \(\overrightarrow{B}\) లు పరస్పరం లంబంగా ఉండి, తరంగ ప్రసారదిశకు లంబంగా ఉంటాయి.

5. విద్యుదయస్కాంత తరంగాలు అంతరాళంలో స్వయంగా నిలకడ విద్యుత్ మరియు అయస్కాంత డోలనాలు కలిగి ఉంటాయి.

6. విద్యుదయస్కాంత తరంగాల ప్రసారశక్తి
పాయింటింగ్ సదిశ (\(\overrightarrow{P}\)) = = (\(\overrightarrow{E}\times\overrightarrow{B}\))

7. శూన్యంలో విద్యుత్ క్షేత్ర సదిశ \(\overrightarrow{E}\) మరియు అయస్కాంతక్షేత్ర సదిశల మధ్య సంబంధం. C = \(\frac{E_0}{B_0}\)

8. విద్యుదయస్కాంత తరంగాలు విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో అపవర్తనం చెందవు.

9. విద్యుదయస్కాంత తరంగాలు పరావర్తనం, వక్రీభవనం, వ్యతికరణం, వివర్తనం మరియు ధ్రువణం చెందుతాయి.

10. విద్యుదయస్కాంత తరంగాలు అధ్యారోపణ నియమాన్ని పాటిస్తాయి.

11. విద్యుదయస్కాంత తరంగాల సగటు విద్యుత్ శక్తి సాంద్రత
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 6

హరిత గృహ ప్రభావం :
వాతావరణంలోని CO2, CH4, N2O, క్లోరోఫ్లోరో కార్బన్ వంటి వాయువులు భూమి వెలువరించిన వికిరణాలను బంధించడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుటను హరిత గృహప్రభావం అంటారు.

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
ఒక కెపాసిటర్ వృత్తాకార ప్లేట్ల వ్యాసార్థం 12cm. వీటి మధ్య దూరం 5.0 cm (పటం). ఒక బాహ్య జనకం ద్వారా (పటంలో చూపలేదు) ఈ కెపాసిటర్ను ఆవేశితం చేస్తున్నారు. ఆవేశితం చేయడానికి 0.15 Aస్థిర విద్యుత్ ప్రవాహాన్ని పంపారు.
a) కెపాసిటర్ కెపాసిటెన్స్ను లెక్కించండి ; ప్లేట్ల మధ్య పొటెన్షియల్ భేదం రేటును కనుక్కోండి.
b) ప్లేట్ల మధ్య స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహం లెక్కించండి.
c) కెపాసిటర్ ప్రతి ప్లేటు వద్ద కిర్కాఫ్ మొదటి నియమం (సంధి నియమం) చెల్లుబాటు అవుతుందా? వివరించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 7
జవాబు:
పలకల వ్యాసార్ధం (r) = 12cm = 12 × 10-2 m
రెండు వృత్తాకార పలకల మధ్య దూరం (d) = 5 cm = 5 × 10-2 × m,
విద్యుత్ ప్రవాహం (I) = 0.15A

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 8
(b) స్థానభ్రంశ విద్యుత్, వాహన విద్యుత్కు సమానం (Id) = 0.15 A.
(c) అవును, కిర్కాఫ్ మొదటి నియమం పాటిస్తుంది. కారణం ఇక్కడ వహన విద్యుత్ మరియు స్థానభ్రంశ విద్యుత్ల మొత్తం విద్యుత్ తీసుకుంటాం.

ప్రశ్న 2.
వ్యాసార్ధం R = 6.0 cm గల వృత్తాకార ప్లేట్లతో చేసిన సమాంతర ప్లేట్ల కెపాసిటర్ కెపాసిటెన్స్ C = 100 pF (పటం). ఈ కెపాసిటర్ను (కోణీయ) పౌనఃపున్యం 300 rad s-1 తో గల ఒక 230 Vల a.c జనకంతో సంధానం చేశారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 9
a) వహన (conduction) విద్యుత్ ప్రవాహ rms విలువ ఎంత?
b) వహన విద్యుత్ ప్రవాహ విలువ స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహానికి సమానమా?
c) ప్లేట్ల మధ్యలో అక్షం నుంచి 3.0 cm వద్ద B పరిమాణం కనుక్కోండి.
జవాబు:
పలకల వ్యాసార్ధము (R) = 6 cm = 6 × 10-2 m
కెపాసిటర్ యొక్క కెపాసిటీ (C) = 100 PF 100 × 10-12 = 10-10F
వోల్టేజి (V) = 230 V
పౌనఃపున్యము (ω) = 300 rad/s

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 10
b) అవును వహన ప్రవాహము, స్థానభ్రంశ ప్రవాహానికి సమానం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 11
c) పలకల మధ్య అక్షము నుండి బిందువు వలకు దూరం
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 12

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 3.
10-10m తరంగదైర్ఘ్యం గల X- కిరణాలకూ, 6800 Å తరంగదైర్ఘ్యం గల ఎరుపు కాంతికీ, 500 m తరంగదైర్ఘ్యం గల రేడియో తరంగాలకూ సమానమైన భౌతికరాశి ఏది?
జవాబు:
ఇక్కడ X – కిరణాలు, ఎరుపు కాంతి మరియు రేడియో తరంగాలు అన్నీ విద్యుదయస్కాంత తరంగాలు. విద్యుదయస్కాంత తరంగాలు కాంతి వేగం (C) తో ప్రయాణిస్తాయి. అందువలన X – కిరణాలు, ఎరుపు కాంతి మరియు రేడియో తరంగాలు కాంతివేగంతో ప్రయాణిస్తాయి.

ప్రశ్న 4.
ఒక సమతల విద్యుదయస్కాంత తరంగం శూన్యంలో Z – దిశలో ప్రయాణిస్తున్నది. దాని విద్యుత్, అయస్కాంత క్షేత్ర సదిశల దిశల గురించి ఏమి చెప్పగలరు? తరంగ పౌనఃపున్యం 30MHz అయితే దాని తరంగదైర్ఘ్యం ఎంత?
జవాబు:
విద్యుదయస్కాంత తరంగాల దిశ, విద్యుత్ మరియు అయస్కాంతక్షేత్రాలకు లంబంగా ఉంటుంది. విద్యుదయస్కాంత తరంగం Z – అక్షం దిశలో ప్రయాణిస్తే, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం లంబంగా X-Y దిశలలో ఉంటాయి.

పౌనఃపున్యము (f) = 30MHz = 30 × 106 Hz
వేగం (C) = 3 × 108 m/s
C = f λ
తరంగదైర్ఘ్యము (λ) = \(\frac{3\times10^8}{30\times10^6}=\frac{300}{30}\) = 10 m

ప్రశ్న 5.
ఒక రేడియో 7.5 MHz నుంచి 12 MHz వ్యాప్తి గల బ్యాండ్లో ఏ ప్రసార కేంద్రంతో అయినా శృతి కాగలదు. ఈ బ్యాండ్కు అనురూపమైన తరంగదైర్ఘ్యం బ్యాండ్ ఏమిటి?
జవాబు:
పౌనఃపున్యము (f1) = 7.5 MHz, (f2) = 12 MHz,
విద్యుదయస్కాంత తరంగాల వేగం (C) = 3 × 108 m/s
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 13
కాబట్టి తరంగదైర్ఘ్యము 25 m నుండి 40 m వరకు ఉండును.

ప్రశ్న 6.
ఒక విద్యుదావేశిత కణం తన మాధ్యమిక (సమతాస్థితి) బిందువు పరంగా 109 Hz పౌనఃపున్యంతో డోలనం చేస్తున్నది. ఈ డోలకం వల్ల ఉత్పత్తి అయిన విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యం ఎంత?
జవాబు:
విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యము = 109 Hz.
డోలకం ద్వారా జనించి విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యము, సమతాస్థితి నుండి డోలనం చెందే ఆవేశిత కణం పౌనఃపున్యానికి సమానం.

ప్రశ్న 7.
శూన్యంలో ఒక హరాత్మక విద్యుదయస్కాంత తరంగ అయస్కాంత క్షేత్ర భాగం (అంశ) దోలన పరిమితి B0 = 510 nT. ఈ తరంగ విద్యుత్ క్షేత్ర భాగం (అంశ) దోలన పరిమితి ఎంత?
జవాబు:
అయస్కాంతక్షేత్రం B0 = 510nT
శూన్యంలో కాంతివేగం (C) = \(\frac{E_0}{B_0}\)
E0 అనునది తరంగం విద్యుత్ అంశభాగం
3 × 108 = \(\frac{E_0}{510\times10^{-9}}\)
E0 = 153 N/C

ప్రశ్న 8.
ఒక విద్యుదయస్కాంత తరంగ విద్యుత్ క్షేత్ర పరిమాణం E0 = 120 N/C అనీ, దాని పౌనఃపున్యం V = 50.0 MHz. అనీ భావించండి. (a) B0, ω, k, λ లనూ b) E, B లకు సమాసాలనూ కనుక్కోండి.
జవాబు:
విద్యుదయస్కాంత తరంగం కంపన పరిమితి E0 = 120N/C
పౌనఃపున్యము (f) = 50 MHz 50 × 106 Hz

a) శూన్యంలో కాంతివేగం
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 14

b) విద్యుత్ క్షేత్రం E = E0 sin (kx – ωt)
E = 120 sin (1.05 × 3.14 × 108 t)
అయస్కాంత క్షేత్రం B = B0 sin (kx – wt )
B = 4 × 10-7 sin (1.05 x -3.14 × 108 t)

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 9.
విద్యుదయస్కాంత తరంగ వర్ణపటంలోని వివిధ భాగాల పారిభాషిక పదాలను పాఠంలో పేర్కొన్నారు. – E = hυ సూత్రాన్ని ఉపయోగించి (వికిరణ శక్తి క్వాంటంకు: ఫోటాన్) ఫోటాన్ శక్తిని eV ప్రమాణాలలో, వివిధ విద్యుదయస్కాంత వర్ణపట భాగాలకు, కనుక్కోండి. మీరు పొందిన ఫోటాన్ శక్తుల వివిధ స్కేళ్ళు (మానాలు) ఏ (విధంగా) విద్యుదయస్కాంత వికిరణ జనకాలకు సంబంధించినవో తెలపండి.
జవాబు:
ఫోటాన్ శక్తి (E) = hν

γ – కిరణాలకు :
γ – కిరణాల పౌనఃపున్యము V = 3 × 1020 Hz
γ – కిరణాల శక్తి E = hν = 6.6 × 10-34 × 3 × 1020 = 19.8 × 10-14 J
E = \(\frac{19.8\times10^{-14}}{1.6\times10^{-19}}\) = 1.24 × 106 eV
γ – కిరణాల కేంద్రక విస్ఫోటనం, సంలీనం అప్పుడు జనిస్తాయి.

X- కిరణాలకు :
పౌనఃపున్యము (v) = 3 × 1018 Hz
(E)=hv 6.6 × 10-34 × 3 × 1020 = 19.8 × 10-14 J
E = \(\frac{19.8\times10^{-14}}{1.6\times10^{-19}}\) = 1.24 × 104 eV

అత్యధిక వేగంలో ఉన్న ఎలక్ట్రాన్ త్వరణం తగ్గుట వల్ల X- కిరణాలు జనిస్తాయి.

అతినీలలోహిత కిరణాలు :
పౌనఃపున్యము (v) = 1015 Hz
(E) hv 6.6 × 10-34 × 1015 = 6.6 × 10-19 J
E = \(\frac{6.6\times10^{-19}}{1.6\times10^{-19}}\) = 4.125 eV

దృగ్గోచర కాంతి :

పౌనఃపున్యము (v) = 6 × 1014 Hz
శక్తి (E) = hν = 6.6 × 10-34 × 6 × 1014 = 39.6 × 10-20 J
E = \(\frac{39.6\times10^{-20}}{1.6\times10^{-19}}\) = 2.475 eV

పరారుణ కిరణాలు :
పౌనఃపున్యము (v) = 1013 Hz
శక్తి (E) = hν = 6.6 × 10-34 × 1013 = 6.6 × 10-21 J
E = \(\frac{6.6\times10^{-21}}{1.6\times10^{-19}}\) = 4.125 × 10-2 eV

మైక్రోతరంగాలు :
పౌనఃపున్యము (v) = 1010 Hz
శక్తి (E) = hν = 6.6 × 10-34 × 1010 6.6 × 10-24 J
E = \(\frac{6.6\times10^{-24}}{1.6\times10^{-19}}\) = 4.125 × 105 eV

రేడియో తరంగాలు:
పౌనఃపున్యము (v) = 3 × 108 Hz
శక్తి (E) = hν = 6.6 × 10-34 × 3 × 108 = 19.8 × 10-26 J
E = \(\frac{19.8\times10^{-26}}{1.6\times10^{-19}}\) = 1.24 × 10-6 eV

వికిరణ రకం ఫోటాన్ శక్తి
γ – కిరణాలు 1.24 × 106 eV
X – కిరణాలు 1.24 × 104 eV
అతినీలలోహిత కిరణాలు 4.12 eV
దృగ్గోచర కాంతి 2.475 eV
పరారుణ కిరణాలు 4.125 × 10-2 eV
మైక్రో తరంగాలు 4.125 × 10-5 eV
రేడియో తరంగాలు 1.24 × 10-6 eV

ప్రశ్న 10.
ఒక సమతల విద్యుదయస్కాంత తరంగంలో విద్యుత్ క్షేత్రం జ్యావక్రీయంగా 2.0 × 1010 Hz పౌనఃపున్యంతో డోలనం చేస్తున్నది ; దోలన పరిమితి 48 Vma-1.
a) తరంగం తరంగదైర్ఘ్యం ఎంత?
b) డోలనం చేసే అయస్కాంతక్షేత్ర దోలన పరిమితి ఎంత?
c) E క్షేత్ర సగటు శక్తి సాంద్రత, B క్షేత్ర సగటు శక్తిసాంద్రతకు సమానం అని చూపండి. [c = 3 × 108 ms-1‘].
జవాబు:
డోలన పౌనఃపున్యము = 2 × 1010 Hz
C = 3 × 108m/s
విద్యుత్ క్షేత్ర కంపన పరిమితి (E0) = 48V/m
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 15

విద్యుత్ క్షేత్ర సగటు శక్తి సాంద్రత, అయస్కాంత క్షేత్ర (B) శక్తి సాంద్రతకు సమానం.

అదనపు అభ్యాసము Additional Exercises

ప్రశ్న 11.
శూన్యంలో ఒక విద్యుదయస్కాంత తరంగ విద్యుత్ క్షేత్ర (అంశం) భాగం
E = {(3.1 N/C) cos [(1.8 rad/m) y + {5.4 × 106 rad /s} t]} i.
a) తరంగ ప్రసార దిశ ఏమిటి?
b) తరంగ తరంగదైర్ఘ్యం ఎంత?
c) పౌనః పున్యం v ఎంత?
d) తరంగ అయస్కాంతక్షేత్ర భాగం డోలన పరిమితి ఎంత?
e) తరంగ అయస్కాంత క్షేత్ర భాగానికి సమాసాన్ని రాయండి.
జవాబు:
a) సమీకరణం నుండి ఇది ఋణ y – అక్షం దిశలో చలిస్తుంది. కాబట్టి – \(\hat{j}\) దిశలో చలిస్తుంది.
b) శూన్యంలో విద్యుదయస్కాంత తరంగం విద్యుత్ అంశం
E = 3.1 cos (1.84 +5.4 x 106t) \(\hat{i}\)
దీనిని E = E0 cos (ky + ωt) తో పోల్చగా
కోణీయ పౌనఃపున్యము (a) = 5.4 × 106 rad/s
తరంగసంఖ్య (K) 1.8 rád/m
తరంగం యొక్క విద్యుత్ అంశం కంపన పరిమితి E0 = 3.1N/C
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 16

e) అయస్కాంత క్షేత్ర అంశము
B = B0 cos (ky + ωt) \(\hat{k}\)
B = 1.03 × 108 cos (1.8 y + 5.4 × 108 t) \(\hat{k}\)

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 12.
100 W విద్యుత్ బల్బు సామర్ధ్యంలో దాదాపు 5% దృశ్య వికీరణంగా పరివర్తనం చెందింది. అయితే,
a) బల్బు నుంచి 1m దూరంలో
b) బల్బు నుండి 10m దూరంలో
దృశ్య వికిరణ సగటు తీవ్రత ఎంత? వికిరణ సమదైశికంగా ఉద్గారమౌతుందనీ, పరావర్తనాన్ని ఉపేక్షించవచ్చనీ భావించండి.
జవాబు:
మొత్తం సామర్ధ్యం = 100 W
దృగ్గోచర వికిరణ సామర్ధ్యము = మొత్తం సామర్ధ్యంలో 5% = \(\frac{5}{100}\) × 100 = 5W

a) 1m దూరంలో, శక్తి గోళాకారంగా వితరణ చెంది ఉంటే గోళం యొక్క వైశాల్యం = 4π (వ్యాసార్ధం)²
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 17

ప్రశ్న 13.
λm T = 0.29 cm K ఫార్ములాను ఉపయోగించి విద్యుదయస్కాంత వర్ణపటంలోని వివిధ భాగాల అభిలక్షణ ఉష్ణోగ్రతా వ్యాప్తులను కనుక్కోండి. మీరు పొందిన విలువలు (సంఖ్యలు) ఏమి చెబుతాయి?
జవాబు:
λm T = 0.29cm-K, λm = 10-68m తీసుకుంటే
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 18
ఈ ఉష్ణోగ్రతలు విద్యుదయస్కాంత తరంగాల ఉష్ణోగ్రతల వ్యాప్తిని తెలుపుతాయి.

ప్రశ్న 14.
భౌతిక శాస్త్రంలో వివిధ సందర్భాల్లో విద్యుదయస్కాంత వికిరణాలకు సంబంధించిన ప్రముఖమైన సంఖ్యలు కింద ఇవ్వడమైంది. వీటిలో ప్రతి సంఖ్య ఏ విద్యుదయస్కాంత వర్ణపట భాగానికి సంబంధించినదో తెలపండి.
a) 21 cm (అంతర్ నక్షత్ర, అంతరాళంలోని పరమాణు హైడ్రోజన్ ఉద్గారించే తరంగదైర్ఘ్యం)
b) 1057 MHz (లాంబ్ విస్థాపనం : అత్యంత సమీపంలో ఉన్న రెండు హైడ్రోజన్ శక్తిస్థాయిల మధ్య ఎలక్ట్రాన్ సంక్రమణ వికిరణ పౌనఃపున్యం).
c) 2.7K [విశ్వారంభపు తొలి పేలుడుతో అంతరాళంలో నిండిన సమదైశిక అవశేష వికిరణ సంబంధిత ఉష్ణోగ్రత).
d) 5890 Å – 5896 Å [సోడియం జంట వర్ణపట రేఖలు]
e) 14.4 keV [అధిక పృథక్కరణ వర్ణపటశాస్త్ర పద్ధతికి సంబంధించిన 57Fe కేంద్రకంలో ప్రత్యేక సంక్రమణంలో వెలువడిన శక్తి (మాస్బార్ (Mossbauer) వర్ణపట శాస్త్రం)].
జవాబు:
a) ఈ తరంగదైర్ఘ్యం (21 cm) రేడియో తరంగాలకు సంబంధించినది.
b) ఈ పౌనఃపున్యము (1057 MHz) కూడా రేడియో తరంగాలకు సంబంధించినది.
c) T = 2.7 K
λm T = 0.29 cm – K
∴ λm = \(\frac{0.29}{2.7}\) cm = 0.11cm
ఈ తరంగదైర్ఘ్యం మైక్రోతరంగాలకు సంబంధించినది.

d) ఈ తరంగదైర్ఘ్య అవధి దృగ్గోచర ప్రాంతానికి చెందినది.
e) శక్తి (E) = 14,4KeV = 14.4 × 10³ × 1.6 × 10-19J
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 19
ఈ పౌనఃపున్యము X- కిరణాలకు సంబంధించినది.

ప్రశ్న 15.
కింది ప్రశ్నలకు సమాధానం తెలపండి.
a) సుదూర రేడియో ప్రసారాలకై హ్రస్వ – తరంగ బ్యాండ్ (short-wave bands) (హ్రస్వ తరంగదైర్ఘ్య వ్యాప్తి) ని వాడతారు. ఎందుకు?
b) సుదూర T.V ప్రసారాలకు ఉపగ్రహాలను వాడటం అవసరం. ఎందుకు?
c) ఖగోళ శాస్త్ర అధ్యయనానికి భూఉపరితలంపై దృశ్య, రేడియో టెలిస్కోప్ల నిర్మాణం జరిగింది. అయితే X-కిరణ ఖగోళశాస్త్ర అధ్యయనం కేవలం భూమిచుట్టూ తిరిగే కృత్రిమ ఉపగ్రహాలవల్లనే సాధ్యం. ఎందువల్ల?
d) మానవజాతి మనుగడకు స్ట్రాటో ఆవరణపైన గల సన్నటి ఓజోన్ పొర అత్యంత కీలకమైంది. ఎందుకు?
e) ఒకవేళ భూమి వాతావరణాన్ని కలిగి ఉండకపోతే, సగటు భూతల ఉష్ణోగ్రత విలువ ఇప్పటి విలువ కంటే ఎక్కువగా ఉండేదా ? తక్కువగా ఉండేదా?
f) భూగోళంపై ప్రపంచ వ్యాప్త న్యూక్లియర్ యుద్ధం తరువాత వచ్చే తీవ్రమైన న్యూక్లియర్ శీతాకాలంతో భూమిపై జీవాలకు వినాశకరమైన ఫలితం కలగబోతుందని కొంతమంది శాస్త్రజ్ఞులు భవిష్యద్దర్శనం చేశారు. ఈ భవిష్యద్దర్శనం మూలం ఏమై ఉండవచ్చు?
జవాబు:
a) రేడియో తరంగాలను ఎక్కువ దూరం ప్రసారంచేయుటకు అల్పతరంగదైర్ఘ్యాలను వాడతారు. కారణం అవి ఐనో ఆవరణం నుండి పరావర్తనం చెందుతాయి.

b) T.V ప్రసారాలకు ఉపగ్రహాలను వాడతారు కారణం T.V సంకేతాలు అధిక పౌనఃపున్యాలు కలిగి ఐనో ఆవరణము నుండి పరావర్తనం చెందవు కావున పరావర్తనం చెందించడానికి ఉపయోగిస్తారు.

c) రేడియో తరంగాలు వాతావరణం గుండా చొచ్చుకు పోతాయి కాబట్టి దృశా మరియు రేడియో టెలీస్కోప్లలో వాడతారు. కాని X- కిరణాలు తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి వాతావరణంలో శోషింపబడతాయి. కావున దృశా మరియు రేడియో టెలీస్కోప్లు భూమిపై పనిచేస్తాయి. కాని X- కిరణాలను భూ వాతావరణంలో పరిభ్రమించే ఖగోళ దూరదర్శినిలలో ఉపయోగిస్తారు.

d) సన్నని ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలను అధిక భాగం శోషించుకుంటుంది. ఇవి చాలా ప్రమాదకరం, కణజాలాన్ని నష్టపరుస్తాయి. ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా, మనలను కాపాడుతుంది.

e) భూమిపై వాతావరణం లేకపోతే, వాతావరణంలో గ్రీన్ హౌస్ ప్రభావం లేకపోతే భూవాతావరణం చల్లగా ఉంటుంది.

f) అణుయుద్ధం వలన భూమిపై మేఘాలు ఏర్పడి, సూర్యకాంతి భూమిని చేరదు. అందువలన భూమిపై శీతాకాలం వలె ఉంటుంది.

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
1m వ్యాసార్ధం ఉన్న వృత్తాకార ప్లేట్లుగల ఒక సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటెన్స్ 1 nF. t = 0 వద్ద ఈ కెపాసిటర్ను ఆవేశితం చేయడానికిగానూ 2 V బ్యాటరీకి,’ నిరోధం R = 1 M Ω తో శ్రేణిలో సంధానం చేశారు. t = 10-3s తరవాత కెపాసిటర్ ప్లేట్ల అంచుకు, కేంద్రానికి సరిగ్గా మధ్యలో అయస్కాంత క్షేత్రాన్ని లెక్కించండి. కాలం t వద్ద కెపాసిటర్పై ఆవేశం q (t) = CV [1 – exp (−t/7)], ఇక్కడ కెపాసిటర్ కాల స్థిరాంకం. ఇది CR కి సమానం.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 20
CR వలయ కాల స్థిరాంకం τ = CR = 10-3s. అప్పుడు,
q(t) = CV [1 – exp (−t/τ)] = 2 × 10-9 [1 – exp (−t / 10-3]
కాలం వద్ద ప్లేట్ల మధ్య విద్యుత్ క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 21

ఇప్పుడు సమాంతర ప్లేట్లకు సమాంతరంగా వ్యాసార్థం (1/2)m ఉండేట్లు, P బిందువు ద్వారా పోయే ఒక వృత్తాకార లూప్ను ఊహించండి. ఈ లూప్ పరిధి వెంబడి అన్ని బిందువుల వద్ద అయస్కాంత క్షేత్రం B సమాన విలువను కలిగి ఉంటుంది.

ఈ లూప్ ద్వారా విద్యుత్ క్షేత్ర అభివాహం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 22

ప్రశ్న 2.
శూన్యంలో, X – అక్షం దిశలో ప్రయాణిస్తున్న ఒక సమతల విద్యుదయస్కాంత తరంగ పౌనఃపున్యం 25 MHz. కాల-అంతరాళంలో ఒక నిర్దిష్ట బిందువు వద్ద, E = 6.3 j V/m. ఆ బిందువు వద్ద B ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 23
దిశను కనుక్కోవడానికి, y- అక్షం వెంబడి Eని, X- అక్షం వెంబడి తరంగం ప్రసారమవుతుందని గుర్తిద్దాం. అందువల్ల x, y అక్షాలకు రెండింటికీ లంబ దిశలో B తప్పక ఉండి తీరాలి. సదిశా బీజగణితాన్ననుసరించి, Ex B x-అక్షం దిశలోనే ఉండాలి. ఎందుకంటే, (+ \(\hat{j}\)) × (+ \(\hat{k}\)) = i కాబట్టి B z- అక్షం వెంబడి ఉంటుంది.
అందువల్ల, B = 2.1 × 10-8 \(\hat{k}\)T.

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 3.
ఒక సమతల విద్యుదయస్కాంత తరంగంలోని అయస్కాంత క్షేత్రం సమీకరణం BH = 2 × 10-7 sin (0.5 × 10³ x + 1.5 × 1011t)T.
a) తరంగం తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం ఎంత?
b) విద్యుత్ క్షేత్రానికి సమాసాన్ని వ్రాయండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 24
b) E0 = B0c = 2 × 10-7 T × 3 × 108 m/s = 6 × 10¹ V/m
తరంగ ప్రసార దిశకూ, అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా విద్యుత్ క్షేత్ర అంశం ఉంటుంది. అందువల్ల, 2- అక్షం వెంబడి విద్యుత్ క్షేత్ర అంశాన్ని, Ez = 60 sin (0.5 × 10³x + 1.5 ×x 1011t) V/m అని పొందవచ్చు.

ప్రశ్న 4.
ఒక అపరావర్తక తలంపై లంబంగా పతనమయ్యే కాంతి శక్తి అభివాహం 18 W/cm². తలం వైశాల్యం 20 cm² అయితే, 30 నిమిషాల కాలంపాటు తలంపై ప్రయోగించే సగటు బలం కనుక్కోండి.
సాధన:
తలంపై పతనమయ్యే మొత్తం శక్తి, U = (18 W/cm²) × (20 cm²) × (30 × 60) = 6.48 × 105 J
అందువల్ల, (పూర్తి శోషణానికి) తలానికి అందిన మొత్తం ద్రవ్యవేగం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 25
తలం పరిపూర్ణ పరావర్తకమైతే మీ సమాధానం ఎలా మారుతుంది?

AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు

ప్రశ్న 5.
దూరంలో ఉన్న 100 W విద్యుద్దీపం నుంచి వెలువడే వికిరణం వల్ల జనించే విద్యుత్, అయస్కాంతక్షేత్రాలను లెక్కించండి. దీపాన్ని బిందు జనకంగానూ, దాని దక్షతను 2.5% గానూ భావించండి.
సాధన:
బిందు జనకంగా భావించిన విద్యుద్దీపం అన్ని దిశల్లోకి ఏకరీతిగా కాంతిని వెలువరిస్తుంది. దానికి 3m దూరంలో ఉన్న ఆవరించగలిగిన గోళం ఉపరితల వైశాల్యం A = 4π² = 4π(3)² = 113 m²
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 26

పైన కనుక్కొన్న E విలువ విద్యుత్ క్షేత్రం వర్గమధ్యమ మూలం (root mean square) విలువను ఇస్తుంది. ఒక కాంతిపుంజంలోని విద్యుత్ క్షేత్రం జ్యావిక్రీయం కాబట్టి, విద్యుత్త్ర శిఖర విలువ
Eo = √2 Erms = √2 × 2.9 V/m = 4.07 V/m

మనం చదవడానికి ఉపయోగించే కాంతి విద్యుత్ క్షేత్ర తీవ్రత చాలినంత అధికంగా ఉండటాన్ని మనం గమనిస్తాం. కొన్ని మైక్రో వోల్ట్ / మీటర్ విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉండే టి.వి లేదా FM తరంగాల విద్యుత్ క్షేత్రంతో కాంతి విద్యుత్ క్షేత్ర తీవ్రతను పోల్చి చూడండి.
ఇప్పుడు మనం అయస్కాంత క్షేత్ర సత్వాన్ని (strength) లెక్కిద్దాం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 11 విద్యుదయస్కాంత తరంగాలు 27

అయస్కాంత క్షేత్రపు శక్తి విద్యుత్ ప్రేరపు శక్తికి సమానమైన అయస్కాంత క్షేత్ర తీవ్రత చాలా బలహీనమైనదని స్పష్టమోతోంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 9th Lesson విద్యుదయస్కాంత ప్రేరణ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 9th Lesson విద్యుదయస్కాంత ప్రేరణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫారడే, హెన్రీ చేసిన ప్రయోగాలు ఏమి నిరూపించాయి?
జవాబు:
ఫారడే మరియు హెన్రీ అనేక ప్రయోగాల ఆధారంగా విద్యుదయస్కాంత ప్రేరణ ఆవిష్కరణ మరియు అర్థం చేసుకోవడం జరిగింది.

ప్రశ్న 2.
అయస్కాంత అభివాహాన్ని నిర్వచించండి.
జవాబు:
ఒక తలం నుండి పోయే మొత్తం అయస్కాంత బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు.
ΦB = \(\overrightarrow{B}.\overrightarrow{AB}\) = BA cos θ
C.G.S ప్రమాణం → మాక్స్వెల్
S.I. ప్రమాణం → వెబర్ (wb)
అయస్కాంత అభివాహం అదిశరాశి.

ప్రశ్న 3.
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్ని తెలపండి.
జవాబు:
ప్రేరిత విద్యుచ్ఛాలక బలం పరిమాణం, అయస్కాంత అభివాహంలో మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది.
ε ∝ \(\frac{-\mathrm{d} \phi}{\mathrm{dt}}\)

ప్రశ్న 4.
లెంజ్ నియమాన్ని తెలపండి.
జవాబు:
ప్రేరిత విద్యుచ్ఛాలక బలదిశ ఎప్పుడూ దాన్ని కలగచేసిన అయస్కాంత క్షేత్ర అభివాహం మార్పును వ్యతిరేకిస్తుంది. ఈ నియమాన్ని లెంజ్ నియమం అంటారు.

ప్రశ్న 5.
ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో వాహకాన్ని కదిలించినప్పుడు యాంత్రిక శక్తి (చలనం యొక్క) ఏమౌతుంది?
జవాబు:
అయస్కాంత క్షేత్రంలో వాహకం చలనం వల్ల చలన విద్యుచ్ఛాలక బలం జనిస్తుంది.
చలన వి.చా.బ (ε) = Blυ.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 6.
ఎడ్డీ విద్యుత్ ప్రవాహాలు అంటే ఏమిటి? [AP. Mar. ’15]
జవాబు:
ఎడ్డీ విద్యుత్ ప్రవాహాలు లేదా ఫోకాల్టు ప్రవాహాలు:
వాహకాలను మారుతున్న అయస్కాంత అభివాహానికి గురిచేసినప్పుడు, వాటిలో ప్రేరిత విద్యుత్ ప్రవాహాలు ఉత్పన్నమవుతాయి. ఈ సుళ్ళు తిరిగే విద్యుత్ ప్రవాహాలను ఎడ్డీ ప్రవాహాలు అంటారు. ఎడ్డీ ప్రవాహాల వల్ల ఉష్ణరూపంలో శక్తి నష్టం జరుగుతుంది.

ప్రశ్న 7.
ప్రేరకత్వాన్ని నిర్వచించండి.
జవాబు:
ప్రేరకత్వం అనునది విద్యుదయస్కాంత ప్రేరణ గుణకం. ఇది కెపాసిటెన్స్ వలె పదార్థం యొక్క స్వతస్సిద్ధ ధర్మం. ప్రేరకత్వం అనునది అదిశరాశి. ఇది తీగచుట్ట జ్యామితిపైన ఆధారపడుతుంది.

ప్రశ్న 8.
‘స్వయం ప్రేరకత్వం’ అంటే మీరు ఏమి అర్ధం చేసుకొన్నారు?
జవాబు:
ఒక తీగచుట్టలో విద్యుత్ ప్రవాహంలో మార్పు రేటు ఏకాంక విలువ అయితే, దానిలో జనించే ప్రేరిత విద్యుచ్ఛాలక బలాన్ని స్వయం ప్రేరకత అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 1

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గమన తలానికి లంబంగా ఉన్న ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ వాహకం చలించినప్పుడు వాహకం కొనల మధ్య ప్రేరితమయ్యే విద్యుచ్ఛాలక బలానికి సమాసాన్ని పొందండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 2
దీర్ఘ చతురస్రాకార వాహకం ABCD పై l పొడవు గల PQ వాహకం \(\overrightarrow{B}\) ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో υ ఏకరీతి వేగంలో స్వేచ్ఛగా చలిస్తోందనుకొనుము. ఏదైనా అనియత ఆవేశము q వాహకంలో అదే వేగంతో క్షేత్రంలో చలిస్తోందనుకొనుము.
ఈ ఆవేశంపై లారెంజ్ బలం
(F) = Bqυ ……….. (1)
P నుండి Qకు ఆవేశము చలించుటకు జరిగిన పని
W = బలం × స్థానభ్రంశం
W = Bqυ × l (2) (బలం దిశ ఫ్లెమింగ్ ఎడమచేతి నియమం ఆధారంగా చూపబడుతుంది.)
చలనాత్మక విద్యుచ్ఛాలక బలం (ε) = \(\frac{w}{q}\)
ε = \(\frac{Bqυl}{q}\)
చలనాత్మక విద్యుచ్ఛాలక బలం (ε) = Blυ.

ప్రశ్న 2.
ఎడ్డీ విద్యుత్ ప్రవాహాలను లాభదాయకంగా ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో వర్ణించండి. [AP. Mar.’17; AP. Mar: ’16; AP & TS. Mar.’15]
జవాబు:
i) రైళ్ళలో అయస్కాంత బ్రేకులు :
విద్యుత్ సామర్థ్యంతో నడిచే కొన్ని రైళ్ళలో, వాటిలోని ఇనుప కమ్మీలపైన ప్రబల విద్యుదయస్కాంతాలను అమరుస్తారు. ఈ విద్యుదయస్కాంతాలు చర్యలోకి రాగానే, ఆ ఇనుప కమ్మీలలో ప్రేరితమయ్యే ఎడ్డీ ప్రవాహాలు రైలు చలనాన్ని వ్యతిరేకిస్తాయి. కాబట్టి రైలు ఆగిపోవడం అనే ప్రభావం మృదువుగా జరుగుతుంది.

ii) ప్రేరణ మోటార్ :
షార్ట్ సర్క్యూట్ చేసిన రోటర్ను ఎడ్డీ విద్యుత్ ప్రవాహాలు తిప్పుతాయి. సీలింగ్ ఫ్యాన్ కూడా ప్రేరణ మోటార్. ఇది ఒకే దశ ఏకాంతర విద్యుత్ ప్రవాహంలో పనిచేస్తుంది.

iii) విద్యుదయస్కాంత అవరుద్ధం :
కొన్ని గాల్వనీ మాపకాలలో అయస్కాంతీయ లోహ పదార్థంతో తయారయిన ఒక కోర్ బిగించి ఉంటుంది. ఇందులోని తీగచుట్ట డోలనాలు చేసినప్పుడు ఆ కోర్లో ఉత్పత్తి అయ్యే ఎడ్డీ ప్రవాహాలు దాని చలనాన్ని వ్యతిరేకించి, వెంటనే తీగచుట్టను విరామస్థితికి తీసుకొస్తాయి.

iv) ప్రేరణ కొలిమి :
అత్యధిక ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేయడానికి ప్రేరణ’ కొలిమిని ఉపయోగించవచ్చు. ఈ ఉష్ణోగ్రతలను వాడుకోవడం ద్వారా అంశిక భాగాలుగా ఉన్న లోహాలను కరిగించి మిశ్రమ లోహాలను తయారుచేయవచ్చు. కరిగించవలసిన లోహాలను ఆవృతం చేసే తీగచుట్ట ద్వారా అధిక పౌనఃపున్యం గల ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని పంపిస్తారు. అప్పుడు ఆ లోహాలలో జనించే ఎడ్డీ ప్రవాహాలు ఆ లోహాలను కరిగించే ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేస్తాయి.

v) విద్యుత్ సామర్థ్య మీటర్లు :
మన ఇళ్ళలో వాడే అనలాగ్ మీటర్లలోని మెరిసే లోహపు బిళ్ళ ఎడ్డీ ప్రవాహాల వల్లనే భ్రమిస్తూ ఉంటుంది. ఒక తీగచుట్టలో జ్యావక్రీయంగా మారే ప్రవాహాలు ఉత్పత్తి చేస్తే అయస్కాంత క్షేత్రాలు ఈ బిళ్ళలో విద్యుత్ ప్రవాహాలను ప్రేరేపిస్తాయి. ఈ విధంగా తిరుగుతున్న మెరిసే బిళ్ళను మీ ఇంట్లోని సామర్థ్య మీటర్లో గమనించవచ్చు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 3.
రెండు పొడవైన సహాక్ష సాలినాయిడ్ల అన్యోన్య ప్రేరకత్వానికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 3
పటంలో రెండు సాలినాయిడ్లను చూడవచ్చు. ప్రాథమిక చుట్ట పొడవు l మరియు అడ్డుకోత వైశాల్యం A అనుకొనుము. N1 మరియు N2లు ప్రాథమిక, గౌణ చుట్టలలో చుట్ల సంఖ్య n1 మరియు n2లు. ప్రమాణ పొడవులలో చుట్లసంఖ్య [n1 = \(\frac{N_1}{l}\) మరియు n2 = \(\frac{N_2}{l}\)]. ప్రాథమిక తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం i అనుకొనుము.
ప్రాథమిక తీగచుట్టలో అయస్కాంత ప్రేరణ (B) = µ0n1 I = \(\frac{\mu_0 \mathbf{N}_1 \mathrm{I}}{l}\) …………. (1)
ప్రాథమిక తీగచుట్టలో ప్రతి చుట్ట గుండా అయస్కాంత అభివాహం
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 4

ప్రశ్న 4.
అయస్కాంత క్షేత్రం, సాలినాయిడ్ వైశాల్యం, పొడవు పదాలలో సాలినాయిడ్లో నిల్వ ఉండే అయస్కాంత శక్తికి ఒక సమాసాన్ని పొందండి.
జవాబు:
L ప్రేరకత గల ప్రేరకం గుండా విద్యుత్ ప్రవహిస్తే, దానిలో ప్రేరిత విద్యుచ్ఛాలక బలం
ε = -L \(\frac{dI}{dt}\)dI ………….. (1)
(ఇక్కడ ఋణ గుర్తు వి.చా. బ., విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది.)
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 5

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫారడే, హెన్రీలు చేసిన అసాధారణ ప్రయోగాలను సంగ్రహంగా వివరించి, విద్యుదయస్కాంతత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఈ ప్రయోగాలు చేసిన అంశదానాల ప్రాధాన్యతను ఇవ్వండి.
జవాబు:
ఫారడే మరియు హెన్రీ ప్రయోగాలు :
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 6
ప్రయోగం 1:
సాపేక్ష చలనం వల్ల అయస్కాంతం విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.

  1. పరికరంలో తీగచుట్టకు గాల్వనామీటరు G కలుపబడి ఉంటుంది మరియు దండాయస్కాంతము ఉంటుంది.
  2. దండాయస్కాంతం (NS) నిశ్చలంగా ఉన్నప్పుడు, గాల్వనా మీటరులో అపవర్తనం ఉండదు.
  3. దండాయస్కాంతం యొక్క ఉత్తర ధృవాన్ని తీగచుట్టవైపు జరిపితే వలయంలో ప్రేరిత విద్యుత్ ప్రవహించి, గాల్వనామీటరులో ఒకవైపు అపవర్తనం కలుగుతుంది.
  4. దండాయస్కాంతం యొక్క ఉత్తర ధృవాన్ని, తీగచుట్ట నుండి దూరంగా జరిపితే వలయంలో ప్రేరిత విద్యుత్ ప్రవహించి, గాల్వనామీటరులో ఇప్పుడు వ్యతిరేక దిశలో అపవర్తనం కలుగుతుంది.
  5. దండాయస్కాంతంను తీగచుట్టకు దగ్గరగా (లేదా) దూరంగా వేగంగా జరిపితే గాల్వనామీటరులో అపవర్తనం ఎక్కువగా ఉంటుంది.
  6. దండాయస్కాంతం దక్షిణ ధ్రువాన్ని తీగచుట్టకు దగ్గరగా (లేదా) దూరంగా జరిపితే గాల్వనామీటరులో అపవర్తనం ఉత్తర ధ్రువంలో వచ్చు అపవర్తనానికి వ్యతిరేక దిశలో ఉంటుంది.

దీనిని బట్టి తీగచుట్టకు, అయస్కాంత క్షేత్రానికి మధ్య సాపేక్షవేగం ఉన్నప్పుడు మాత్రమే విద్యుచ్ఛాలకు బలం ప్రేరితమవుతుంది. అయస్కాంతం మరియు తీగచుట్టకు మధ్య సాపేక్ష చలనం అధికంగా ఉంటే ప్రేరిత వి.చా.బ (లేదా) విద్యుత్ అధికంగా జనిస్తుంది.

ప్రయోగం 2:
తీగచుట్ల మధ్య సాపేక్ష గమనం వల్ల ప్రేరిత విద్యుత్ జనించుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 7

  1. దండాయస్కాంతంను తీసివేసి బ్యాటరీ కలిపిన గౌణ తీగచుట్ట C2 ను పటంలో చూడండి.
  2. తీగచుట్టలో C2 లో స్థిర విద్యుత్ ప్రవాహము స్థిర అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది.
  3. C2 తీగచుట్టను C1 తీగచుట్ట వైపు జరిపితే, గాల్వనామీటరు అపవర్తనాన్ని చూపుతుంది. తీగచుట్ట C1 లో విద్యుత్ ప్రవాహం ప్రేరితమవుతుందని ఇది సూచిస్తుంది.
  4. C2 తీగచుట్టను దూరంగా జరిపితే గాల్వనా మీటరులో వ్యతిరేక దిశలో అపవర్తనం కలుగుతుంది.
  5. C2 తీగచుట్ట చలనంలో ఉన్నంతసేపు అపవర్తనం చూపుతుంది.
  6. C2 తీగచుట్టను స్థిరంగా ఉంచి, C1 ని కదిల్చినా ఒకే విధమైన ప్రభావాన్ని చూడవచ్చు.

ప్రయోగం 3 :
సాపేక్ష చలనం లేకుండా మారే విద్యుత్ ప్రవాహం, విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది :
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 8

  1. ఫారడే ప్రయోగం ద్వారా సాపేక్ష గమనం తప్పనిసరి కాదని నిరూపించాడు.
  2. పటంలో C1 మరియు C2 తీగచుట్టలు నిశ్చలంగా ఉన్నాయి.
  3. C1 తీగచుట్టకు ట్యాప్ కీ Kతో బ్యాటరీని కలుపుతారు మరియు C2 తీగచుట్టకు గాల్వనా మీటరును కలుపుతారు.
  4. ట్యాప్ కీని నొక్కినప్పుడు గాల్వనా మీటరులో అపవర్తనం కలుగుతుంది.
  5. గాల్వనామీటరులో సూచీ ఆకస్మికంగా తిరిగి సున్నాను చూపుతుంది.
  6. ట్యాప్ కీని అవిచ్ఛిన్నంగా మూసి ఉంచితే, గాల్వనా మీటరులో అపవర్తనం కలుగదు.
  7. ట్యాప్ కీని వదిలితే, గాల్వనా మీటరులో వ్యతిరేక దిశలో అపవర్తనం కలుగుతుంది.
  8. కొయ్య కాండానికి బదులు ఇనుప కడ్డీని ఉపయోగించినప్పుడు, విద్యుత్ ప్రవాహ పరిమాణం పెరుగుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 2.
ఏకాంతర విద్యుత్ ప్రవాహ జనరేటర్ సాధనం పనితీరును సరళమైన పటం, అవసరమైన సమాసాల సహాయంతో వర్ణించండి.
జవాబు:
యాంత్రికశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే విద్యుత్ యంత్రాన్ని AC జనరేటర్ (లేదా) ఆల్టర్నేటర్ అంటారు.

సూత్రం :
ఇది విద్యుదయస్కాంత ప్రేరణపై పనిచేస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 9

నిర్మాణం :
i) ఆర్మేచర్ :
మెత్తని ఇనుపకోర్పై బంధిత రాగితీగను అనేక చుట్లుగా చుట్టబడిన ABCD ని ఆర్మేచర్ తీగచుట్ట అంటారు.

ii) బలమైన అయస్కాంతం :
బలమైన శాశ్వత అయస్కాంతం (లేదా) విద్యుదయస్కాంత ధ్రువాలు N మరియు S స్థూపాకారంగా ఉంటాయి. ఇది బలమైన క్షేత్ర అయస్కాంతంగా ఉపయోగపడుతుంది. అయస్కాంత ధ్రువాల మధ్య ఆర్మేచర్ తీగచుట్ట తిరుగుతుంది.

iii) స్లిప్ రింగ్లు :
ఆర్మేచర్ తీగచుట్ట రెండు చివరలకు రెండు ఇత్తడి స్లిపింగ్లు R1 మరియు R2 లు కలుపబడి ఉంటాయి. ఈ స్లిప్ రింగ్లు ఆర్మేచర్ దిశలో తిరుగుతాయి.

iv) బ్రష్లు :
B1 మరియు B2 అను రెండు కార్బన్ బ్రష్ లు స్లిపింగ్లను నొక్కుతాయి. బ్రష్లు స్థిరంగా ఉంటాయి, కాని స్లిపింగ్లు ఆర్మేచర్ తిరిగే దిశలో తిరుగుతాయి. ఈ బ్రష్ల నుండి పొందిన నిర్గమనాన్ని లోడ్కు కలుపుతారు.

పనిచేయు విధానం :
ABCD ఆర్మేచర్ తీగచుట్ట అయస్కాంత క్షేత్రంలో తిరిగితే బలమైన అయస్కాంత క్షేత్రాన్ని అందిస్తుంది. ఇది అయస్కాంత బలరేఖలను ఖండిస్తుంది. ఆర్మేచర్ భ్రమణం వల్ల తీగచుట్టలో అయస్కాంత అభివాహం మారుతుంది. అందువలన తీగచుట్టలో విద్యుచ్చాలకు జలం ప్రేరితమవుతుంది.

అర్థ భ్రమణానికి బ్రష్ B1 ద్వారా ఒక దిశలో విద్యుత్ ప్రవహిస్తుంది. మరియు తర్వాత అర్థ భ్రమణానికి బ్రష్ B2 ద్వారా వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఏకాంతరంగా విద్యుచ్ఛాలక బలం జనిస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 10

సిద్ధాంతం:
i) తీగచుట్ట స్థిర కోణీయ వేగం ω తో తిరుగుచున్నది.
ii) తీగచుట్ట యొక్క లంబానికి, అయస్కాంత క్షేత్రానికి \(\overrightarrow{B}\) ఏదైనా సమయంలో
కోణము θ = ωt ………… (1)
iii) తీగచుట్ట తలానికి లంబంగా ఉన్న అయస్కాంత క్షేత్ర అంశము B cos θ = B cosωt ………… (2)
iv) ఒక చుట్టు గల తీగచుట్టలో అయస్కాంత అభివాహం = (B cos ωt) A ………… (3)
A అనునది తీగచుట్ట వైశాల్యం మరియు n అనునది చుట్ల సంఖ్య
v) తీగచుట్టలో మొత్తం అయస్కాంత అభివాహం (Φ) = n(B cos ωt) A ………… (4)
ఫారడే నియమం ప్రకారం
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 11
విద్యుత్ ప్రవాహ దిశ ఆవర్తనంగా మారుతుంది మరియు దీనిని ఏకాంతర ప్రవాహం (A.C) అంటారు.

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
(a) నుంచి (f) వరకు గల కింద ఇచ్చిన పటాలలో వర్ణించిన పరిస్థితులలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను ప్రాగుక్తీకరించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 12
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 13
జవాబు:
a) ఇక్కడ దక్షిణ ధృవంను తీగచుట్ట వైపు కదిల్చితే లెంజ్ నియమం ప్రకారం విద్యుత్ ప్రవాహము సవ్య దిశలో ప్రవహిస్తుంది. అనగా విద్యుత్ p నుండి q కు ప్రవహిస్తుంది.

b) p-q తీగ చుట్టలో q వద్ద s ను q వైపు జరిపితే ఇది దక్షిణ ధృవం వలే పనిచేస్తుంది. విద్యుత్ ప్రవాహము సవ్య దిశలో ఉంటుంది. (అనగా p నుండి q) ఉత్తర ధృవంను దూరం జరిపితే చివర దక్షిణ ధృవం వలె పనిచేస్తుంది. విద్యుత్ ప్రవాహము సవ్య దిశలో X నుండి y కు ఉంటుంది.

c) ట్యాప్ కీని మూస్తే, తీగచుట్టలో విద్యుత్ పెరిగి, అయస్కాంత అభివాహం పెరుగుతుంది. మాక్స్వెల్ నియమం ప్రకారం‘అయస్కాంత క్షేత్రం ఎడమవైపుకు పనిచేస్తుంది. ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ, క్షేత్రాన్ని తగ్గిస్తుంది. క్షేత్ర దిశ కుడి వైపు పనిచేస్తుంది. మాక్స్వెల్ నియమం ప్రకారం ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ అపసవ్య దిశలో అనగా xyz దిశలో ఉండును.

d) రియోస్టాట్ను మారిస్తే, విద్యుత్ మారుతుంది. క్షేత్రదిశ ఎడమవైపు చూపుతుంది. ఎడమ తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ వలన జనించే క్షేత్ర దిశ కుడివైపుకు ఉంటుంది. అందువలన ఎడమ చుట్టలో విద్యుత్ దిశ అపసవ్య దిశ అనగా Zyx దిశలో ఉండును.

e) కీని వదిలితే విద్యుత్ అపసవ్య దిశలో ప్రవహించి తగ్గుతుంది. దాని వలన ప్రేరిత విద్యుత్ జనించి, ఎడమచుట్టలో క్షేత్రం పెరుగుతుంది. కావున కుడివైపు చుట్టలో అయస్కాంత క్షేత్రం కుడివైపు పనిచేస్తుంది. కావున ప్రేరిత విద్యుత్ అపసవ్య దిశలో అనగా x నుండి yx దిశలో ఉండును.

f) విద్యుత్ ప్రవాహ తీగలో అయస్కాంత క్షేత్ర రేఖలు చుట్ట తలంలో ఉంటాయి. కావున తీగచుట్టలో ప్రేరిత విద్యుత్ జనించదు.

ప్రశ్న 2.
పటం చూపిన సందర్భాలలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను నిర్ధారించడానికి లెంజ్ నియమాన్ని ఉపయోగించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 14
(a) అక్రమాకారంలో ఉన్న తీగ వృత్తాకారంలోకి మారుతున్నప్పుడు.
(b) వృత్తాకార లూప్ సన్నని నిలువైన తీగగా
(a) విరూపణం చెందుతున్నప్పుడు.
జవాబు:
a) ఇక్కడ అయస్కాంత క్షేత్ర దిశ కాగితపు తలానికి లంబంగా లోనికి పనిచేస్తుంది. తీగను వృత్తాకారంగా చుడితే దాని వైశాల్యం పెరుగుతుంది. అందువలన అయస్కాంత అభివాహం పెరుగుతుంది. ఆ దిశలో ప్రేరిత విద్యుత్ జనించి అయస్కాంత క్షేత్రాన్ని తగ్గిస్తుంది. విద్యుత్ ప్రవాహము అపసవ్య దిశలో అనగా adcb a దిశలో ఉండును.

b) వృత్తాకార తీగచుట్టను సన్నని తీగలాగా మార్చితే, దాని అయస్కాంత అభివాహం తగ్గుతుంది. ప్రేరిత విద్యుత్ అపసవ్య దిశలో ప్రవహిస్తుంది. అనగా a’d’c’b’a’. దీనివలన కాగితపు తలానికి వెలుపల అయస్కాంత క్షేత్రం జనిస్తుంది.

ప్రశ్న 3.
సెంటీమీటర్కు 15 చుట్లు గల పొడవైన సాలినాయిడ్ లోపల దాని అక్షానికి లంబంగా 2.0 cm3 వైశాల్యం గల చిన్న లూప్ను ఉంచారు. సాలినాయిడ్లో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం 4.0 A నుంచి 2.0 A లకు 0.1 సెకనులో నిలకడగా మార్పు చెందితే, విద్యుత్ ప్రవాహం మారుతున్నప్పుడు లూప్ లో ప్రేరితమయ్యే విద్యుచ్ఛాలక బలం ఎంత?
సాధన:
చుట్ల సంఖ్య (n) = 15/cm = 1500/m
వైశాల్యం (A) = 2 cm² = 2 × 10-4 m².
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 15

ప్రశ్న 4.
చిన్న గాటు (small cut) కలిగి, భుజాలు 8 cm, 2 cm గల ఒక దీర్ఘచతురస్రాకార లూప్ 0.3 T పరిమాణం గల ఏకరీతి అయస్కాంత క్షేత్ర ప్రాంతం నుంచి బయటకు చలిస్తుంది. క్షేత్ర దిశ లూప్కు లంబంగా ఉన్నది. లూప్ 1 cms-1 వేగంతో (a) పెద్ద భుజానికి, (b) చిన్న భుజానికి, లంబ దిశలో కదిలితే గాటు వద్ద వృద్ధిచెందే విద్యుచ్ఛాలక బలం ఎంత? ప్రతి సందర్భంలో ప్రేరిత వోల్టేజి ఎంత సమయం పాటు ఉంటుంది?
సాధన:
తీగచుట్ట పొడవు (l) = 8 cm = 8 × 10-2 m.
మందము (b) = 2 cm = 2 × 10-2 m.
వేగము = 1 cm/s = 0.01 m/s
అయస్కాంత ప్రేరణ B = 0.3 T

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 16
a) వేగము పొడవుగా ఉన్న వైపుకు లంబంగా ఉంటే
l = 8 cm = 8 × 10-2 m
చలనాత్మక వి.చా.బ (e) = Blυ = 0.3 × 8 × 10-2 × 0.01
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 17
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 18

ప్రశ్న 5.
1.0 m పొడవైన లోహ కడ్డీని కడ్డీకి లంబంగా, , కడ్డీ ఒక కొన ద్వారా పోయే అక్షం దృష్ట్యా 400 rad s-1 కోణీయ పౌనః పున్యంతో భ్రమణం చేశారు. కడ్డీ రెండో కొన ఒక వృత్తాకార లోహ కంకణంతో స్పర్శలో కలదు. స్థిర, ఏకరీతి 0.5 T అయస్కాంత క్షేత్రం అక్షానికి సమాంతరంగా అంతటా వ్యాపించి ఉంది. కంకణం, దాని కేంద్రం మధ్య వృద్ధి చెందే విద్యుచ్ఛాలక బలాన్ని లెక్కించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 19
కడ్డీ యొక్క పొడవు (l) = 1m
కోణీయ పౌనఃపున్యము (ω) = 400 rad/s
అయస్కాంత ప్రేరణ (B) = 0.5 T
రేఖీయ వేగం = 0
మరొక రేఖీయ వేగం = lω
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 20

ప్రశ్న 6.
3.0 × 10-2 T పరిమాణం గల ఏకరీతి క్షితిజ సమాంతర అయస్కాంత క్షేత్రంలో 8.0 cm వ్యాసార్థం 20 చుట్లు గల వృత్తాకార తీగచుట్టను దాని నిట్టనిలువు వ్యాసం దృష్ట్యా 50 rad s-1 కోణీయ వడితో భ్రమణం చేశారు. తీగచుట్టలో ప్రేరితమయ్యే గరిష్ఠ, సగటు విద్యుచ్ఛాలక బలాన్ని పొందండి. తీగచుట్ట 10౧ నిరోధం గల సంవృత వలయాన్ని ఏర్పరిస్తే, తీగచుట్టలోని గరిష్ఠ విద్యుత్ ప్రవాహ విలువను లెక్కించండి. జౌల్ ఉష్టీకరణం కారణంగా జరిగే సగటు సామర్థ్య నష్టాన్ని లెక్కించండి. ఈ సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చింది?
సాధన:
తీగచుట్ట వ్యాసార్థము = 8 cm = 0.08 cm
చుట్ల సంఖ్య = 20; నిరోధము = 10Ω
కోణీయ వేగము (ω) = 50 rad/s
అయస్కాంత ప్రేరణ (B) = 3 × 10-2 T
ప్రేరిత వి.చా.బ. (e) = NBA ω sin ωt
గరిష్ఠ వి. చా. బ. sin ωt = 1
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 21
సామర్ధ్య నష్టం తీగచుట్టలో ఉష్ణం రూపంలో వెలువడును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 7.
భూ అయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశం 0.30 × 10-4 Wb m-2 కి లంబంగా తూర్పు నుంచి పశ్చిమంగా విస్తరించి ఉన్న 10 m పొడవైన క్షితిజ సమాంతర తిన్నని తీగ 5.0 m s-1 వేగంతో పడుతుంది.
(a) తీగలో ప్రేరితమైన విద్యుచ్ఛాలక బలం తాక్షణిక విలువ ఎంత?
(b) విద్యుచ్ఛాలక బలం దిశ ఏమిటి ?.
(c) తీగ ఏ కొన అధిక విద్యుత్ పొటెన్షియల్ వద్ద ఉంటుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 22
తిన్నని తీగ వేగం = 5 m/s
అయస్కాంత ప్రేరణ (B) = 0.30 × 10-4Wb/m-2
తీగ పొడవు l = 10m
a) తీగలో వి.చా.బ. (e) = Blυsin θ
ఇక్కడ θ = 90°, sin θ = 1
e = 0.3 × 10-4 × 10 × 5 = 1.5 × 10-3 V.

b) ఫ్లెమింగ్ ఎడమచేతి నియమం ప్రకారం, బలం క్రింద వైపుకు, ప్రేరిత వి. చా.బ పడమర నుండి తూర్పు వైపుకు ఉంటుంది.

c) ప్రేరిత వి.చా.బ (లేదా) విద్యుత్ దిశ పడమర నుండి తూర్పుకు ఉంటే పడమర వైపు అధిక పొటెన్షియల్ వద్ద ఉంటుంది.

ప్రశ్న 8.
ఒక వలయంలో విద్యుత్ ప్రవాహం 5.0 A నుంచి 0.0 A కి 0.1 s లో పడిపోయింది. 200 V సగటు విద్యుచ్ఛాలకు బలం ప్రేరితం అయితే, ఆ వలయం స్వయం ప్రేరకత్వాన్ని అంచనా వేయండి. [TS. Mar.’16; Mar.’14]
సాధన:
విద్యుత్ ప్రవాహంలో మార్పు (dI) = 5 – 0 = 5A
కాలంలో మార్పు (dt) = 0.1 sec
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 23

ప్రశ్న 9.
పక్కపక్కన ఉన్న ఒక జత తీగచుట్ల అన్యోన్య ప్రేరకత్వం 1.5 H. ఒక చుట్టలో విద్యుత్ ప్రవాహం 0 నుంచి 20 A లకు 0.5 s లలో మారినట్లయితే, రెండవ తీగచుట్టలో అభివాహ బంధనంలో వచ్చే మార్పు ఎంత?
సాధన:
అన్యోన్య ప్రేరణ (M) = 1.5 H
విద్యుత్ ప్రవాహంలో మార్పు (dl) 20 – 0 = 20 A
కాలంలో మార్పు (dt) = 0.5 sec
ప్రేరిత వి.చా.బ. (e) = M\(\frac{dI}{dt}=\frac{-\mathrm{d} \phi}{\mathrm{dt}}\)
dΦ = M.dI = 1.5 × 20
అభివాహంలో మార్పు (dΦ) = 30 Wb

ప్రశ్న 10.
ఒక జెట్ విమానం 1800 km/h వడితో పశ్చిమ దిశ వైపు ప్రయాణిస్తోంది. ఆ ప్రదేశపు భూఅయస్కాంత క్షేత్ర పరిమాణం 5 × 10-4 T, అవపాత కోణం 30° అయితే 25 m వరకు వ్యాపించి ఉన్న రెక్క కొనల మధ్య వృద్ధి చెందే వోల్టేజి భేదం ఎంత?
సాధన:
జెట్ విమాన గం (V) = 1800 km/h = 1800 × \(\frac{5}{8}\) = 500 m/s
రెక్కల మధ్య దూరం (l) = 25m
అయస్కాంత ప్రేరణ (B) = 5 × 10-4T
డిప్ కోణం (δ) = 30°
చలన వి.చా.బ. (e) = BvVl
e = B sin δ Vl (∵ Bv = B sin δ),
e = 5 × 10-4 + sin 30° × 500 × 25
e = 3.1 V.

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 11.
అభ్యాసం 4 లోని లూప్ స్థిరంగా ఉందనుకోండి. అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తున్న విద్యుదయస్కాంతానికి అందించే విద్యుత్ ప్రవాహాన్ని క్రమంగా తగ్గించడం ద్వారా క్షేత్రం తొలి విలువ 0.3 T నుంచి 0.02 T s-1 రేటు వరకు క్షీణింపచేశారు. లూప్ ని గాటును (cut) కలిపినట్లయితే మరియు లూప్ నిరోధం 1.6Ω అయితే, లూప్ వల్ల ఎంత శక్తి ఉష్ణ రూపంలో దుర్వ్యయమవుతుంది? ఈ సామర్థ్యానికి జనకం ఏమిటి?
సాధన:
వైశాల్యం = 8 × 2 = 16 cm² 16 × 10-4
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 24

ప్రశ్న 12.
X, Y అక్షాలకు సమాంతరంగా 12 cm భుజం గల చతురస్రాకార లూప్ 8 cm s-1 వేగంతో ధన X అక్షం దిశలో, అయస్కాంత క్షేత్రం ధన Z- అక్షం దిశ ఉన్న పరిసరం (environment) లో చలిస్తుంది. క్షేత్రం ప్రాదేశికంగా ఏకరీతిగా, కాలంతో స్థిరంగా లేదు. రుణ X- దిశలో క్షేత్రం 10-3 T cm-1 ప్రవణతను కలిగి ఉంది. (అంటే ధన X- దిశలో చలిస్తున్నప్పుడు క్షేత్ర విలువ 10-3 T cm-1” చొప్పున పెరుగుతుంది). కాలంతోపాటు 10-3 Ts-1 చొప్పున క్షేత్ర విలువ తగ్గుతుంది. లూప్ నిరోధం 4.50 ml అయితే, ప్రేరిత విద్యుత్ ప్రవాహం దిశను, పరిమాణాన్ని నిర్ణయించండి.
సాధన:
తీగచుట్ట భుజం (a) = 12 cm
వైశాల్యం (A) = a² = (12)² = 144 cm² = 144 × 10-4
వేగము (v) = 8 cm/s = 8 × 10-2 m/s.
దూరంతో పాటు అయస్కాంత ప్రేరణలో మార్పు = \(\frac{dB}{dx}\) = 10-3 T/cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 25
ప్రేరిత విద్యుత్ దిశ కూడా ధన Z- అక్షం దిశలోనే ఉంటుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 13.
ఒక శక్తివంతమైన లౌడ్ స్పీకర్ అయస్కాంతపు ధృవాల మధ్య క్షేత్రాన్ని కొలవాలనుకున్నారు. 2 cm² వైశాల్యంతో 25 దగ్గర చుట్లు గల చిన్న సమతల శోధన తీగచుట్టను క్షేత్రానికి లంబదిశలో ఉంచి క్షేత్రం ప్రాంతం నుంచి శీఘ్రంగా బయటకు లాగారు (తుల్యంగా, ఆ తీగచుట్టను క్షేత్ర దిశకు సమాంతరంగా తీసుకొనిరావడానికి దానికి శీఘ్రంగా 90° భ్రమణం కూడా ఇవ్వచ్చు). తీగచుట్ట ద్వారా ప్రయాణించిన మొత్తం ఆవేశం (తీగకు కలిపి ప్రక్షేపక గాల్వనా మాపకం ద్వారా కొలవగా) 7.5 mC. తీగ, గాల్వనా మాపకం రెండింటి సంయోగ నిరోధం 0.50Ω అయస్కాంత క్షేత్ర సత్వాన్ని అంచనా వేయండి.
సాధన:
తీగచుట్ట వైశాల్యం (A) = 2cm² = 2 × 10-4
చుట్ల సంఖ్య (N) = 25
తీగచుట్టలో మొత్తం ఆవేశం (Q) = 7.5 mc = 7.5 × 10-3 c
నిరోధము (R) = 0.5Ω
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 26

ప్రశ్న 14.
శాశ్వత అయస్కాంత ధృవాల మధ్య ఉంచిన నునుపైన AB పట్టాల పై PQ లోహ కడ్డీ పటంలో చూపిన విధంగా నిశ్చలంగా ఉంది. పట్టాలు, కడ్డీ, అయస్కాంత క్షేత్రం ఒకదానితో ఒకటి పరస్పరం లంబ దిశలలో ఉన్నాయి. గాల్వనీ మాపకం G స్విచ్ K ద్వారా పట్టాలను కలుపుతుంది. కడ్డీ పొడవు= 15 cm, B = 0.50 T, కడ్డీని కలిగి ఉన్న సంస్కృత లూప్ నిరోధం = 9.0 mΩ. అయస్కాంత క్షేత్రం ఏకరీతిగా ఉందనుకోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 27
a) పటంలో చూపిన దిశలో స్విచ్ Kని తెరిచినప్పుడు కడ్డీ 12 cm s-1 వడితో కదిలిందనుకోండి. ప్రేరిత విద్యుచ్ఛాక బలం ధృవణత, పరిమాణాన్ని ఇవ్వండి.
b) K ని తెరిచినప్పుడు కడ్డీ కొనల వద్ద ఏదైనా అదనపు ఆవేశం వృద్ధి అవుతుందా? K ని మూసినప్పుడు ఏమి జరుగుతుంది?
c) Kని తెరిచినప్పుడు, కడ్డీ ఏకరీతిగా చలిస్తున్నప్పుడు, కడ్డీ PQ లోని ఎలక్ట్రాన్లు కడ్డీ చలనం వల్ల అయస్కాంతీయ బలాన్ని అనుభవించినప్పటికీ వాటిపై పనిచేసే నికర బలం ఏమి ఉండదు. వివరించండి.
d) Kని మూసినప్పుడు, కడ్డీపై ఉండే మందక (retarding) బలం ఏమిటి?
e) Kని మూసినప్పుడు, కడ్డీని అదే వడితో (=12 cm s-1) చలింపచేయడానికి (బాహ్య ఏజెంట్ వల్ల) ఎంత సామర్థ్యం అవసరం?
f) మూసిన (సంవృత) వలయంలో ఎంత సామర్థ్యం ఉష్ణంగా దుర్వ్యయం అయ్యింది? ఈ సామర్థ్యానికి జనకం ఏమిటి?
g) లంబ దిశకు బదులు అయస్కాంత క్షేత్ర దిశ పట్టాలకు సమాంతరంగా ఉంటే చలిస్తున్న కడ్డీలో ప్రేరితమయ్యే విద్యుచ్ఛాలక బలం ఎంత?
సాధన:
కడ్డీ పొడవు (I) = 15 cm = 15 × 10-2 m
అయస్కాంత ప్రేరణ (B) = 0.5 T
నిరోధము (R) = 9mΩ = 9 × 10-3
కడ్డీ వేగము (V) = 12 cm/s = 12 × 10-2 m/s.
a) చలన వి.చా.బ. () = BVI = 0.5 × 12 × 10-2 × 15 × 10-2
e = 9 × 10-3 V.

ఫ్లెమింగ్ ఎడమచేతి నియమం ప్రకారం లోరెంజ్ బలం
F = – e(V × B) ఎలక్ట్రాన్లపై PQ లో P నుండి Q కు ఉంటుంది. కావున P ధనావేశమును, Q ఋణావేశమును పొందును.

b) అవును. P వద్ద అదనపు ధనావేశము ఏర్పడును. కీని తెరచినప్పుడు అంటే పరిమాణంలో Q వద్ద ఋణావేశము ఏర్పడును. కీని మూస్తే ప్రేరిత విద్యుత్ ప్రవహించి, అదనపు ఆవేశము కలిగి ఉండును.

c) కీని తెరిస్తే, ఎలక్ట్రాన్లపై ఎలాంటి బలం పనిచేయదు. అందుకు కారణం P మరియు Q వద్ద విద్యుత్ క్షేత్రం వల్ల అదనపు ఆవేశం ఏర్పడును. అయస్కాంత క్షేత్రబలం, విద్యుత్ క్షేత్ర బలానికి సమానం కావున కడ్డీపై ఫలితం శూన్యం.

d) కీని మూసివేస్తే, విద్యుత్ ప్రవహించి, విద్యుత్ ప్రవహించే తీగలో అయస్కాంత క్షేత్రం వల్ల ఋణబలం పనిచేస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 28

e) కడ్డీ అదే వేగంతో ఉండుటకు అవసరమైన సామర్థ్యం = ఋణబలం × వేగం = 7.5 × 10-2 × 12 × 10-2 × 10-3 W
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 29

g) క్షేత్రము కడ్డీలకు సమాంతరంగా ఉంటే (8 = 0), ప్రేరిత వి.చా.బ. = e = BVl sin θ
(∵ sin θ° = (0). ఈ సందర్భంలో చలించే కడ్డీ క్షేత్ర రేఖలను ఖండించదు. కావున అభివాహంలో మార్పు శూన్యం మరియు ప్రేరిత వి.చా. బ శూన్యం.

ప్రశ్న 15.
30 cm పొడవు, 25 cm2 మధ్యచ్ఛేద వైశాల్యం, 500 చుట్లు కలిగి, గాలి కాండం (కోర్) గల సాలినాయిడ్లో 2.5 A విద్యుత్ ప్రవహిస్తోంది. విద్యుచ్ఛాలక బలం జనకం నుంచి సాలినాయిడ్ను విడదీసినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం 10×sలో శూన్యానికి పడిపోతుంది. వలయంలో తెరిచి ఉంచిన స్విచ్ కొనల మధ్య ఏర్పడే సగటు తిరోదిశా విద్యుచ్ఛాలక బలం ఎంత ? సాలినాయిడ్ కొనల దగ్గర అయస్కాంత క్షేత్ర మార్పును ఉపేక్షించండి.
సాధన:
సాలినాయిడ్ పొడవు (1) = 30 cm = 30 × 10-2 m
అడ్డుకోత వైశాల్యం (A) = 25 cm² = 25 × 10-4
చుట్ల సంఖ్య (N) = 500
విద్యుత్ ప్రవాహం (I1) = 2.5A, I2 = 0
కాలం (dt) = 10-3 sec
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 30

ప్రశ్న 16.
(a) పటంలో చూపిన పొడవైన తిన్నని తీగ a భుజం గల చతురస్రాకార లూప్ మధ్య ఉండే అన్యోన్య ప్రేరకత్వానికి ఒక సమాసాన్ని పొందండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 31
(b) ఇప్పుడు తిన్నని తీగలో 50 A విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్నట్లు, కుడి పక్కకు, స్థిర వేగం υ = 10 m/s తో లూప్ చలించినట్లు భావించండి. x = 02mఅయిన సందర్భంలో లూప్లో ప్రేరితమయ్యే విద్యుచ్ఛాలక బలాన్ని లెక్కించండి. a = 0.1 m గా తీసుకొని, లూప్ చాలా అధిక నిరోధాన్ని కలిగి ఉన్నట్లుగా భావించండి.
సాధన:
a) ఒక అల్పాంశము మందము dx. ఇది తీగనుండి దూరంలో ఉంది. తీగలో విద్యుత్ ప్రవాహము I.
చతుర్భుజము పొడవు = a
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 32
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 33

ప్రశ్న 17.
M ద్రవ్యరాశి, R వ్యాసార్థం గల చక్రం అంచుకు ఏకరీతిగా ఏకాంక పొడవుకు రేఖీయ ఆవేశం)ఇవ్వడమైంది. చక్రం తేలికైన అవాహక ఊచ (ఆకు—spoke) లు కలిగి, ఘర్షణ లేకుండా స్వేచ్ఛగా దాని అక్షం దృష్ట్యా భ్రమణం చేయగలదు. ఏకరీతి అయస్కాంత క్షేత్రం చక్రం అంచులోపల వృత్తాకార ప్రాంతం అంతా విస్తరించి ఉంది. దీనిని
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 34
B=-B0k (r ≤ a; a < R)
= 0 (మరొక విధంగా otherwise)
గా సూచించారు. క్షేత్రాన్ని ఒక్కసారిగా ఆపివేసిన (switched off) తరువాత చక్రం కోణీయ వేగం ఎంత ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 35
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 36

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
a) గాల్వనామీటర్లో అధిక అపవర్తనం పొందడానికి మీరు ఏం చేస్తారు? (b) గాల్వనా మీటర్ లేకుండా వలయంలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఉండటాన్ని ప్రాయోగికంగా ఏ విధంగా ప్రదర్శిస్తారు?
సాధన:
a) గాల్వనామీటర్లో అధిక అపవర్తనాన్ని పొందడానికి కింది విధంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విధానాలను అవలంబించవచ్చు. (i) తీగచుట్ట C, లోపల మెత్తని ఇనుపకడ్డీని ఉపయోగించడం, (ii) తీగచుట్టను శక్తివంతమైన బ్యాటరీకి అనుసంధానం చేయడం, (iii) అమరికనంతా తీగచుట్ట C, వైపు వేగంగా జరపడం.

b) వలయంలో గాల్వనామీటర్కు బదులుగా చిన్న టార్చ్ లైట్ ఉపయోగించే చిన్న బల్బును ఉపయోగించండి. ఈ రెండు తీగచుట్టల మధ్య సాపేక్ష చలనం బల్బు, వెలిగేలా చేస్తుంది. ఈ విధంగా ప్రేరిత ప్రవాహం ఉండటాన్ని ప్రాయోగికంగా ప్రదర్శించవచ్చు.

ప్రయోగ భౌతికశాస్త్రంలో ఎవరైనా నూతన రీతుల కల్పనను నేర్చుకోవాల్సి ఉంటుంది. అత్యుత్తమ ప్రయోగవేత్తలలో ఒకరుగా, శాశ్వతంగా ఉన్నత స్థానంలో ఉన్న మైఖేల్ ఫారడే నూతన రీతులను కనుక్కొనే నైపుణ్యం వల్ల చారిత్రకంగా ప్రసిద్ధి చెందాడు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 2.
భుజం 10 cm, నిరోధం 0.5 Ωలు గల ఒక చతురస్రాకార లూప్ను తూర్పు – పడమర తలానికి నిలువుగా ఉంచారు. దాని తలం వెంట 0.10 T తీవ్రత గల ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని ఉత్తర – దక్షిణ దిశల్లో ఏర్పాటు చేశారు. అయస్కాంత క్షేత్రాన్ని నిలకడ రేటుతో 0.70 s లలో శూన్యానికి తగ్గించారు. ఈ కాల వ్యవధిలో ప్రేరిత విద్యుచ్ఛాలక ‘బలం, ప్రవాహాల పరిమాణాలను కనుక్కోండి.
సాధన:
తీగచుట్ట వైశాల్య సదిశ, అయస్కాంత క్షేత్ర దిశతో చేసే కోణం θ = 45°.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 37

భూ అయస్కాంత క్షేత్రం కూడా లూప్ ద్వారా అభివాహాన్ని జనింపచేస్తుంది అని గమనించండి. కాని ఇది నిలకడ క్షేత్రం (ప్రయోగం జరుగుతున్నంత కాలం మారకుండా ఉండేది) కాబట్టి అది ఏ విధమైన విద్యుచ్ఛాలక బలాన్ని ప్రేరేపించదు.

ప్రశ్న 3.
వ్యాసార్థం 10 cm, నిరోధం 2 Ω, 500 చుట్లు ఉన్న ఒక వృత్తాకార తీగచుట్ట తలాన్ని భూఅయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశానికి లంబంగా ఉండేటట్లు ఉంచారు. ఈ. తీగచుట్టను దాని నిలువు వ్యాసం పరంగా 0.25 s కాలంలో 180° భ్రమణం చెందించారు. ఆ తీగచుట్టలో ప్రేరితమైన విద్యుచ్ఛాలక బలం, ప్రవాహాలను అంచనావేయండి. ఆ ప్రదేశంలో భూ అయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశం 3.0 × 10-5 T.
సాధన:
తీగచుట్ట ద్వారా తొలి అభివాహం, ΦB(తాలి) = BA cos θ = 3.0 × 10-5 × (π. × 10-2) × COS 0°
= 3π × 10-7 Wb.

భ్రమణం చెందిన తరువాత తుది అభివాహం, ΦB(తుది) = 3.0 × 10-5 × (π × 10-2) × cos 180°
= -3π × 10-7 Wb.

కాబట్టి, ప్రేరిత విద్యుచ్ఛాలక బలం యొక్క అంచనా విలువ,
ε = N\(\frac{\Delta \phi}{\Delta \mathrm{t}}\) = 500 × (6π × 10-7)/0.25 = 3.8× 10-3 v
I = ε/R = 1.9 × 10-3 A.

ε, I ల పరిమాణాలు అంచనావేసిన విలువలు అని గమనించండి. వాటి తక్షణ విలువలు వేరుగా ఉండి, అవి ఆ క్షణం వద్ద తీగచుట్ట భ్రమణ వడిపై ఆధారపడతాయి.

ప్రశ్న 4.
పటంలో చూపినట్లు వివిధ ఆకృతులు గల సమతల లూప్లు వాటి తలాలకు లంబంగా (పాఠకుని నుంచి దూరంగా) ఉన్న అయస్కాంత క్షేత్రం (పుటతలం నుంచి లోపలికి ఉన్న) లోకి, బయటకు చలిస్తున్నాయి. లెంజ్ నియమం ప్రకారం ప్రతి లూప్ ని ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను నిర్ణయించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 38
సాధన:
i) దీర్ఘ చతురస్రాకార లూప్ abcd అయస్కాంత క్షేత్రంలోకి చలించడం వల్ల దాని ద్వారా అయస్కాంత అభివాహం పెరుగుతుంది. ప్రేరిత విద్యుత్ ప్రవాహం తప్పకుండా పథం వెంబడి ప్రవహించాలి. అప్పుడే అది పెరిగే అభివాహాన్ని వ్యతిరేకిస్తుంది.
ii) త్రిభుజాకార ఉచ్చు abc అయస్కాంత క్షేత్రం నుంచి బయటకు చలించడం వల్ల దాని ద్వారా పోయే అయస్కాంత అభివాహం తగ్గుతుంది. దీనివల్ల ప్రేరిత విద్యుత్ ప్రవాహం అభివాహంలోని మార్పును వ్యతిరేకించేలా bacd వెంబడి ప్రవహిస్తుంది.
iii) అక్రమాకార ఉచ్చు abcd అయస్కాంత క్షేత్ర ప్రాంతం నుంచి బయటకు చలించడం వల్ల దాని ద్వారా అయస్కాంత అభివాహం తగ్గడం వల్ల, అభివాహంలోని మార్పును వ్యతిరేకించేలా ప్రేరిత విద్యుత్ ప్రవాహం cdabc వెంబడి ప్రవహిస్తుంది.

అయితే లూప్లు పూర్తిగా అయస్కాంత క్షేత్రం లోపల గాని, బయటగాని ఉన్నంత వరకు ఎలాంటి ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఉండదని గమనించండి.

ప్రశ్న 5.
a) స్థిరంగా బిగించి ఉన్న రెండు శాశ్వత అయస్కాంతాల ఉత్తర దక్షిణ ధృవాల మధ్య అయస్కాంత క్షేత్రంలో ఒక సంవృత లూపు స్థిరంగా ఉంచారు. చాలా బలమైన అయస్కాంతాలను ఉపయోగించి ఆ లూప్ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేసే అవకాశం కలదా?
b) ఒక పెద్ద కెపాసిటర్ పలకల మధ్య స్థిర విద్యుత్ క్షేత్రానికి లంబంగా ఒక సంవృత లూప్ చలిస్తుంది. ఆ సంవృత లూప్ (i) పలకల మధ్య ప్రదేశం లోపల పూర్తిగా మధ్యలో ఉన్నప్పుడు, (ii) పలకల నుంచి పాక్షికంగా బయటకు ఉన్నప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ప్రేరితమవుతుందా? విద్యుత్ క్షేత్రం లూప్ తలానికి లంబంగా ఉన్నది.
c) పటంలో మాదిరిగా, ఒక దీర్ఘచతురస్రాకార లూప్, వృత్తాకార లూప్లు ఏకరీతి అయస్కాంత క్షేత్రం నుంచి బయటవైపుకు క్షేత్రరహిత ప్రాంతానికి V స్థిర వేగంతో చలిస్తున్నాయి. ఆ లూప్ల తలాలకు అయస్కాంత క్షేత్రం లంబంగా ఉన్నది. ప్రేరిత విద్యుచ్ఛాలక బలం స్థిరంగా ఉంటుందని మీరు అయితే క్షేత్రం నుంచి బయటకి పోతున్నప్పుడు ఏ లూప్లో ఆశించగలరు?
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 39
d) పటం ద్వారా వర్ణించిన పరిస్థితిలో కెపాసిటర్ ధృవణతను ఊహించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 40
సాధన:
a) ఉత్పత్తి చేయలేం. అయస్కాంతం ఎంత బలమైనది అయినప్పటికీ లూప్ ద్వారా పోయే అయస్కాంత అభివాహాన్ని ‘ మార్చడం వల్ల మాత్రమే విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపితం చేయవచ్చు.

b) ఏ సందర్భంలోను ఎలాంటి విద్యుత్ ప్రవాహం ప్రేరితం కాదు. విద్యుత్ అభివాహాన్ని మార్చడం వల్ల విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపితం చేయలేం.

c) దీర్ఘచతురస్రాకార లూప్ విషయంలో మాత్రమే ప్రేరిత విద్యుచ్ఛాలక బలం స్థిరంగా ఉంటుందని ఆశించవచ్చు. వృత్తాకార లూప్ విషయంలో, అది క్షేత్ర ప్రాంతం నుంచి బయటకు వచ్చేటప్పుడు దాని వైశాల్యంలోని మార్పు రేటు స్థిరంగా ఉండదు. అందువల్ల దానికి అనుగుణంగా ప్రేరిత విద్యుచ్ఛాలక బలం మారుతుంది.

d) కెపాసిటర్ B పలక పరంగా, A పలక ధృవణత ధనాత్మకంగా ఉంటుంది.

ప్రశ్న 6.
1m పొడవు ఉన్న ఒక లోహపు కడ్డీని 1m వ్యాసార్థం గల వృత్తాకార లోహపు కంకణం కేంద్రం వద్ద కడ్డీ ఒక చివర, కంకణం పరిధి వద్ద మరొక చివర ఉండేటట్లుగా ఉంచి, కంకణం కేంద్రం ద్వారా పోతూ, కంకణ తలానికి లంబంగా ఉండే అక్షం పరంగా 50 rev/ S పౌనఃపున్యంతో భ్రమణం చెందించారు. 1 T ఏకరీతి, స్థిర అయస్కాంత క్షేత్రం, అక్షానికి సమాంతరంగా అంతటా ఉంది. లోహపు కంకణానికి, కేంద్రానికీ మధ్య విద్యుచ్ఛాలక బలం ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 41
సాధన:
పద్ధతి – I :
కడ్డీ భ్రమణం చెందినప్పుడు, కడ్డీలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు లోరెంజ్ బలం వల్ల బయట చివరివైపు చలించి, కంకణంపై వితరణ చెందుతాయి. ఈ విధంగా వేరయిన ఆవేశాలు కడ్డీ చివరల మధ్య విద్యుచ్ఛాలక బలాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఒక నిర్ణీత విద్యుచ్ఛాలక బలం విలువ వద్ద ఇక ఎలక్ట్రాన్ల ప్రవాహం ఉండక నిలకడ స్థితి చేరుతుంది. -సమీకరణం – Bl\(\frac{dx}{dt}\) = dx = Blυ ని ఉపయోగించి, కడ్డీ అయస్కాంత క్షేత్రానికి లంబంగా చలించినప్పుడు కడ్డీ పొడవు dr చివరల మధ్య ఉత్పత్తి అయిన విద్యుచ్ఛాలక బల పరిమాణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 42

పద్ధతి – II :
విద్యుచ్ఛాలక బలాన్ని లెక్కించడానికి ఒక సంవృత లూప్ OPQ ని ఊహించవచ్చు. దీనిలో బిందువులు 0, P లు నిరోధకం Rతో సంధానం అయి ఉంటే, 0Q అనేది భ్రమణం చెందే కడ్డీ. నిరోధకం కొనల మధ్య పొటెన్షియల్ భేదం అప్పుడు ప్రేరిత విద్యుచ్ఛాలక బలానికి సమానమవుతుంది. అది B × (లూప్ వైశాల్యం మార్పురేటు) కు సమానం. θ అనేది t కాలం వద్ద కడ్డీకి, P వద్ద వృత్త వ్యాసార్థానికి మధ్య కోణం అయితే, OPQ భాగం (సెక్టార్) వైశాల్యం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 43
ఈ సమాసం, పద్ధతి – I ద్వారా పొందిన సమాసంతో సర్వసమంగా ఉంది. మనం ఒకే ε విలువను పొందుతాం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 7.
ఒక్కొక్కటి 0.5 m పొడవున్న 10 లోహపు కమ్మీలు (పుల్లలు – spokes) గల ఒక చక్రాన్ని 120 rev/min వడితో ఒక ప్రదేశంలో భూఅయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశానికి లంబంగా ఉండే తలంలో భ్రమణం చెందించారు. ఆ ప్రదేశంలో HE = 0.4 G (గ్రాస్) అయితే చక్రం ఇరుసు (అక్షం) కు, చక్రం అంచు (రిమ్)కు మధ్య ప్రేరిత విద్యుచ్ఛాలక బలం ఎంత? 1G = 10-4 T అని గమనించండి.
సాధన:
ప్రేరిత విద్యుచ్ఛాలక బలం = (1/2) ωBR² (పై problem నుంచి)
= (1/2) × 4π × 0.4 × 10-4 × (0.5)² = 6.28 × 10-5 v
చక్రం కమ్మీల సంఖ్య అముఖ్యమైంది. ఎందుకంటే, కమ్మీల చివరల విద్యుచ్ఛాలక బలాలు సమాంతరం.

ప్రశ్న 8.
పటం (a) చూడండి. ఇందులో PQRS దీర్ఘ చతురస్ర వాహకంలో PQ భుజం X = 0 నుంచి బయటవైపుకు చలించింది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 44
x = 0 నుంచి x = b వరకు ఏకరీతి అయస్కాంత క్షేత్రం విస్తరించి, ఆ పైన x > b కి శూన్యం అయ్యే విధంగా ఉండి, ఈ వాహక తలానికి అయస్కాంత క్షేత్రం లంబంగా ఉన్నది. PQ భుజం మాత్రమే చెప్పుకోదగిన నిరోధం rని కలిగి ఉంది. PQ భుజాన్ని x = 0 నుండి x = 2b వరకు బయటవైపుకు లాగి తిరిగి x = 0 వరకు స్థిర వడితో జరిపే పరిస్థితిని పరిగణించండి. అప్పుడు అభివాహం, ప్రేరిత విద్యుచ్ఛాలక బలం PQ భుజాన్ని లాగడానికి కావలసిన బలం, జౌల్ ఉష్ణం రూపంలో దుర్వ్యయం అయ్యే సామర్థ్యాలకు సమాసాలను పొందండి. ఈ రాశుల మార్పులను చిత్రీకరించండి.
సాధన:
ముందుగా PQ భుజం x = 0 నుంచి x = 2b వరకు ముందుకు కదిలే సందర్భాన్ని తీసుకోండి.
అప్పుడు వలయం SPQR తో బంధితమైన అభివాహం
ΦB అనుకుంటే,
ΦB = Blx 0 ≤ x< b
= Blb b ≤ x < 2b

ప్రేరిత విద్యుచ్ఛాలక బలం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 45

x = 2b నుంచి x = 0 కి లోపలికి చలింపచేసినప్పుడు కూడా ఇదే విధమైన సమాసాలను పొందుతారు. పటం (b) లో ప్రదర్శించిన వివిధ రాశుల రేఖాచిత్రాన్ని పరీక్షించిన తరువాత ఈ మొత్తం ప్రక్రియను ఒకరు అంచనా కట్టవచ్చు.

ప్రశ్న 9.
ఒకటి తక్కువ వ్యాసార్థం r1, మరొకటి అధిక వ్యాసార్థం r2, కలిగి, r1, << r2 అయ్యే విధంగా ఉన్న రెండు ఏక కేంద్ర వృత్తాకార తీగచుట్టలను వాటి కేంద్రాలు ఏకీభవించేలా సహాక్షంగా ఉంచారు. ఈ అమరిక అన్యోన్య ప్రేరకత్వాన్ని పొందండి.
సాధన:
బాహ్య వృత్తాకార తీగ చుట్టలో I2, విద్యుత్ ప్రవహిస్తుందనుకోండి. అప్పుడు ఆ తీగచుట్ట కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రం B1 = µ0I2/2r2. దీనితో సహాక్షంగా ఉంచిన తీగచుట్ట చాలా తక్కువ వ్యాసార్థం కలిగి ఉన్నది. కాబట్టి దాని మధ్యచ్ఛేదంపై అయస్కాంత క్షేత్రం B2 స్థిరంగా ఉన్నట్లు భావించవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 46

π r²1 వైశాల్యంపై అయస్కాంత క్షేత్రం B2 ఏకరీతిగా ఉంటుందనుకొని, Φ1 యొక్క ఉజ్జాయింపు విలువ నుంచి M12 ని లెక్కించామని గమనించండి. ఏదేమైనప్పటికీ, మనం ఈ విలువను అంగీకరించవచ్చు. ఎందుకంటే r1 << r2.

ప్రశ్న 10.
a) సాలినాయిడ్లో నిల్వ ఉండే అయస్కాంత శక్తికి సమాసాన్ని అయస్కాంత క్షేత్రం B, సాలినాయిడ్ వైశాల్యం A, పొడవు l పదాలలో పొందండి.
b) ఏ విధంగా ఈ అయస్కాంత శక్తి, కెపాసిటర్లో నిల్వ ఉండే స్థిర విద్యుత్ శక్తితో పోల్చదగింది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ 47
రాబట్టినవి. అయితే, అవి అయస్కాంత క్షేత్రం లేదా (మరియు) విద్యుత్ క్షేత్రం ఉన్నటువంటి అంతరాళంలోని ఏ ప్రదేశంలో అయినా వర్తిస్తాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 9 విద్యుదయస్కాంత ప్రేరణ

ప్రశ్న 11.
నిశ్చల స్థితిలో ఉన్న సైకిల్ పెడల్స్ను కమల తొక్కుతోంది. ఈ పెడల్స్ను 0.10 m2 వైశాల్యం, 100 చుట్లు ఉన్న తీగచుట్టకు కలిపారు. ఈ తీగచుట్ట సెకనుకు అర్ధ పరిభ్రమణం చొప్పున భ్రమణం చేస్తుంది. తీగచుట్టను తీగచుట్ట భ్రమణాక్షానికి లంబంగా ఉండే 0.01 T ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచారు. తీగచుట్టలో గరిష్ఠంగా ఉత్పత్తి అయ్యే వోల్టేజి ఎంత?
సాధన:
ఇక్కడ f = 0.5 Hz; N = 100, A = 0.1 m², B = 0.01 T.
సమీకరణం ε = NBA @ sin ot ని ఉపయోగించగా.
ε0 = NBA (2πv)
= 100 × 0.01 × 0.1 × 2 × 3.14 × 0.5 = 0.314 V
గరిష్ఠ వోల్టేజి 0.314 V

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 8th Lesson అయస్కాంతత్వం-ద్రవ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 8th Lesson అయస్కాంతత్వం-ద్రవ్యం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అయస్కాంత క్షేత్రంలో ఉంచిన అయస్కాంత ద్విధృవం ఒక నికర బలానికి గురవుతుంది. అయస్కాంత క్షేత్ర స్వభావం గురించి మీరేమి చెప్పగలరు?
జవాబు:
ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో, అయస్కాంత ద్విధృవం (దండాయస్కాంతం) నికర బలంను (లేక టార్క్ను) ప్రయోగించును.

ప్రశ్న 2.
భూమి ధృవాల మధ్య ఉండే అయస్కాంత సూదికి ఏమవుతుంది? [TS. Mar. ’17]
జవాబు:
ధృవాల వద్ద, భూమి క్షేత్రము ఖచ్చితంగా నిలువుగా ఉండును. అందువల్ల కంపాసు సూచి, క్షితిజ సమాంతర తలంలో స్వేచ్ఛగా తిరుగును. ఇది ఏ దిశనైనా చూపవచ్చును.

ప్రశ్న 3.
ఇచ్చిన పదార్థ మచ్చు యొక్క అయస్కాంతీకరణం గురించి మీరు ఏమి అర్థం చేసుకొంటారు? [AP. Mar.’16]
జవాబు:
అయస్కాంత నమూనాను అయస్కాంత క్షేత్రంలో ఉంచిన, వాని అయస్కాంత భ్రామకాలు అన్నీ అయస్కాంత క్షేత్ర దిశలో ఉండును. కావున నమూనా నికర అయస్కాంత భ్రామకం (mనికర ≠ 0) కలిగి ఉండును.

ప్రమాణ ఘనపరిమాణంనకు నికర అయస్కాంత భ్రామకంను అయస్కాంతీకరణం అంటారు. i. e., M = \(\frac{m_{నికర}}{V}\)

ప్రశ్న 4.
సాలినాయిడ్లో అనుబంధితమైన అయస్కాంత భ్రామకం ఎంత?
జవాబు:
సాలినాయిడ్ అయస్కాంత ద్విధృవ భ్రామకము m = NIA, ఇక్కడ ‘N’ లూపు చుట్ల సంఖ్య ‘T’ విద్యుత్ మరియు A సదిశ వైశాల్యము.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 5.
అయస్కాంత భ్రామకం, అయస్కాంత ప్రేరణం, అయస్కాంత క్షేత్రాలకు ఉన్న ప్రమాణాలు ఏవి? [TS. Mar.’16]
జవాబు:

  1. అయస్కాంత భ్రామకము m Am² లేక JT-1.
  2. అయస్కాంత ప్రేరణ – wb m-2 లేక టెస్లా (I)
  3. అయస్కాంత క్షేత్రము – టెస్లా.

ప్రశ్న 6.
అయస్కాంత రేఖలు అవిచ్ఛిన్న సంవృత లూప్లను ఏర్పరుస్తాయి. ఎందుకు? [TS. Mar ’17; AP. Mar ’16]
జవాబు:
అయస్కాంత బలరేఖలు దండాయస్కాంతం వెలుపల ఉత్తర ధృవం నుండి బయలుదేరి, దక్షిణ ధృవంను వక్ర పథంలో చలించును. .దండాయస్కాంతం లోపల దక్షిణ ధృవం నుండి ఉత్తర ధృవంనకు సరళ పథంలో చలించును. కావున బలరేఖలు సంవృత లూపులను ఏర్పరుచును.

ప్రశ్న 7.
అయస్కాంత దిక్పాతాన్ని నిర్వచించండి. [Mar. ’14]
జవాబు:
అయస్కాంత దిక్పాతము (D) :
నిజ భౌగోళిక ఉత్తర ధృవంనకు మరియు కంపాసు సూచి చూపు ఉత్తర ధృవంనకు మధ్యగల కోణంను అయస్కాంత దిక్పాతము అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 1

ప్రశ్న 8.
అయస్కాంత ప్రవణత లేదా అవపాత కోణం నిర్వచించండి. [AP & TS. Mar.’15]
జవాబు:
అయస్కాంత అవపాతము లేక అవపాత కోణము (I) :
భూ అయస్కాంత క్షేత్రం మొత్తం తీవ్రత ఏదైనా ప్రదేశంలో క్షితిజ సమాంతర దిశతో చేయు కోణంను అయస్కాంత అవపాతము (I) అంటారు.

ప్రశ్న 9.
అయస్కాంతత్వం దృష్ట్యా క్రింది పదార్థాలను వర్గీకరించండి. మాంగనీస్, కోబాల్ట్, నికెల్, బిస్మత్, ఆక్సిజన్, కాపర్. [TS. Mar. ’16 ’15]
జవాబు:
ఫెర్రో అయస్కాంత పదార్థాలు → కోబాల్టు, నికెల్
పారా అయస్కాంత పదార్థాలు → ఆక్సిజన్, మాంగనీసు
డయా అయస్కాంత పదార్థాలు → బిస్మత్, రాగి

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
r వ్యాసార్థం, ఏకాంక పొడవుకు n చుట్లు, i విద్యుత్ ప్రవాహం ఉన్న సాలినాయిడ్ అక్షీయ క్షేత్రానికి సమాసాన్ని ఉత్పాదించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 2
సాలినాయిడ్ అక్షీయ క్షేత్రమునకు సమాసము :
1) 2l పొడవు మరియు ‘a’ వ్యాసార్ధమున్న సాలినాయిడ్ ప్రమాణ పొడవుపై ‘n’ చుట్లు కలిగి ఉన్నాయని భావిద్దాం.
2) సాలినాయిడ్లో విద్యుత్ ప్రవాహము ‘I’.
3) సాలినాయిడ్ అక్షంపై ఏదైనా బిందువు P వద్ద అయస్కాంత క్షేత్రంను గణిద్దాం. OP = r గా తీసుకుందాము.
4) సాలినాయిడ్పై O నుండి ‘x’ దూరం వద్ద dx మందం ఉన్న చిన్న మూలకాన్ని భావిద్దాం.
5) మూలకంలో చుట్ల సంఖ్య = ndx.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 3

ప్రశ్న 2.
గాలిలో d ఎడం ఉన్న రెండు అయస్కాంత ధృవాల మధ్య బలం F. వాటి మధ్య ఏ దూరం ఉంటే బలం రెట్టింపు అవుతుంది?
జవాబు:
రెండు అయస్కాంత ధృవాల మధ్య బలం, F1 = F
రెండు అయస్కాంత ధృవాల మధ్య దూరం, d1 = d
రెండు అయస్కాంత ధృవాల మధ్య బలం రెట్టింపు చేసినప్పుడు, F2 = 2F
రెండు అయస్కాంత ధృవాల మధ్య దూరం, d2 = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 4

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 3.
పారా, దయా, ఫెర్రో అయస్కాంత పదార్థాల ధర్మాలను పోల్చండి.
జవాబు:

డయా అయస్కాంత పదార్థాలు పారా అయస్కాంత పదార్థాలు ఫెర్రో అయస్కాంత పదార్థాలు
a) ఈ పదార్థాలు, బాహ్య అయస్కాంత క్షేత్రానికి వ్యతిరేక దిశలో బలహీన అయస్కాంతీకరణను పొందుతాయి. a) ఈ పదార్థాలు, బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో, బలహీన అయస్కాంతీ కరణను పొందుతాయి. a) ఈ పదార్థాలు, అయస్కాంత క్షేత్ర దిశలో, బలంగా అయస్కాంతీకరణను పొందుతాయి.
b) ఈ పదార్థ కడ్డీని ఏకరీతి క్షేత్రంలో స్వేచ్ఛగా వ్రేలాడదీస్తే, అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా విరామ స్థితికి వచ్చును. b) ఈ పదార్థ కడ్డీని ఏకరీతి క్షేత్రంలో ‘స్వేచ్ఛగా వ్రేలాడదీస్తే, అయస్కాంత. క్షేత్ర దిశలో విరామ స్థితికి వచ్చును. b) ఈ పదార్థ కడ్డీని ఏకరీతి క్షేత్రంలో స్వేచ్ఛగా వ్రేలాడదీస్తే, ఆయస్కాంత క్షేత్ర దిశలో విరామ స్థితికి వచ్చును.
c) ఈ పదార్థాలను అసమరీతి క్షేత్రంలో ఉంచితే, బలమైన క్షేత్రం నుండి బలహీన క్షేత్రం వైపుకు చలించును. c) ఈ పదార్థాలను అసమరీతి క్షేత్రంలో ఉంచితే, బలహీన క్షేత్రం నుండి బలమైన క్షేత్రం వైపుకు చలించును. c) ఈ పదార్థాలను అసమరీతి క్షేత్రంలో ఉంచితే, బలహీన క్షేత్రం నుండి బలమైన క్షేత్రం వైపుకు చలించును.
d) వీని సాపేక్ష ప్రవేశ్యశీలత µr >1 మరియు ధనాత్మకము. d) వీని సాపేక్ష ప్రవేశ్యశీలత µr >1 మరియు ధనాత్మకము. d) వీని సాపేక్ష ప్రవేశ్యశీలత, µr < 1 మరియు రుణాత్మకము.
e) వీని ససెప్టిబిల్టి (χ) విలువ తక్కువ మరియు రుణాత్మకం.
ఉదా : రాగి, బిస్మత్, నీరు, బంగారం, ఆంటిమొని, పాదరసం, క్వార్ట్జ్, వజ్రం etc.
e) వీని ససెప్టిబిల్టి (χ) విలువ స్వల్పము మరియు ధనాత్మకం
ఉదా: అల్యూమినియం, మెగ్నీషియం, టంగ్స్టన్, ప్లాటినమ్, మాంగనీస్, ద్రవ ఆక్సిజన్, ఫెర్రిక్ క్లోరైడ్, క్యూప్రిక్ క్లోరైడ్.
e) వీని ససెప్టిబిల్టి (χ) విలువ ఎక్కువ మరియు ధనాత్మకము.
ఉదా : ఇనుము, కోబాల్ట్, నికెల్, గడోలినియమ్ మరియు దాని మిశ్రమ లోహాలు.

ప్రశ్న 4.
భూఅయస్కాంత క్షేత్ర ప్రాథమిక రాశులను వివరించి, క్షితిజలంబ, క్షితిజ సమాంతర అంశాల మధ్య సంబంధాన్ని, అవపాత కోణాన్ని వివరించే పటాన్ని గీయండి.
జవాబు:
భూమి ఉపరితలముపై ఏదైనా బిందువు వద్ద భూమి అయస్కాంత క్షేత్రంను, దిక్పాతము D, అవపాతము I మరియు భూమి క్షితిజ సమాంతర అంశము HE లతో గుర్తిస్తారు. వీటినే భూ అయస్కాంత క్షేత్ర మూలకాలు అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 5

వివరణ :

  1. P బిందువు వద్ద మొత్తం అయస్కాంత క్షేత్రంను క్షితిజ అంశము HE మరియు లంబ అంశము ZE లుగా విడదీస్తారు.
  2. HE తో BE చేయు కోణము (డిప్ కోణము) అవపాత కోణము I.
  3. లంబ అంశమును ZE తో సూచిస్తే, అప్పుడు
    ZE = BE Sin I
    HE = BE Cos I
    tan I = \(\frac{Z_E}{H_E}\)

ప్రశ్న 5.
రిటెంటివిటి, కోయెర్సివిటీలను నిర్వచించండి. మెత్తని ఇనుము, ఉక్కులకు హిస్టిరిసిస్ వక్రాలను గీయండి. ఈ వక్రాల నుంచి మీరేమి అనుమితం చేస్తారు?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 6
1) రెటింటివిటి :
అయస్కాంతీకరణ బలం (H) ను సున్నాకు తగ్గించిన, ఫెర్రో అయస్కాంత పదార్థ నమూన (specimen) అయస్కాంత క్షేత్ర తీవ్రత (\(\overrightarrow{B}\)) విలువను రెటెంటివిటి లేక రిసిడ్యువల్’ అయస్కాంతీకరణము అంటారు.

2) కోయెర్సివిటి :
రెటెంటివిటి సున్నాకు రావటానికి, వ్యతిరేక దిశలో ప్రయోగించాల్సిన అయస్కాంతీకరణ బలం (H) విలువను కోయెర్సిటి లేక కోయిర్సీవ్ బలం అంటారు.

3) హిస్టిరిసిస్ :
ఒక ఫెర్రో అయస్కాంత పదార్థము యొక్క అయస్కాంత ప్రేరణ (B) లేక అయస్కాంతీకరణ తీవ్రత (I) కు అయస్కాంతీకరణ బలం లేక అయస్కాంత తీవ్రత (\(\overrightarrow{H}\)) కు మధ్య సంబంధమును తెలుపు వక్రమును హిస్టిరిసిస్ వక్రము అంటారు.

4) మెత్తని ఇనుము మరియు ఉక్కుకు గల హిస్టారిసిస్ వక్రము పటంలో చూపబడింది.
మెత్తని ఇనుము మరియు ఉక్కుల హిస్టారిసిస్ వక్రాలు క్రింది విషయాలు తెలుపును.
i) మెత్తని ఇనుము రెటింవిటి, ఉక్కు రెటింవిటి కన్నా ఎక్కువ.
ii) మెత్తని ఇనుము, ఉక్కు కన్నా ఎక్కువ దృఢత్వంను కలిగి ఉండును.
iii) మెత్తని ఇనుము కోమెర్సివిటి, ఉక్కు కన్నా తక్కువ. ఉక్కు కన్నా మెత్తని ఇనుము అయస్కాంతీకరణను త్వరగా కోల్పోవును.
iv) మెత్తని ఇనుము I – Hవక్రము, ఉక్కు I H వక్రము కన్నా చాలా తక్కువ. మెత్తని ఇనుము సందర్భంలో హిస్టారిసిస్ నష్టము, ఉక్కు సందర్భంలో హిస్టారిసిస్ నష్టము కన్నా చాలా తక్కువ.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 6.
L పొడవు ఉండే ఒక చుట్టగల వృత్తాకార చుట్టలో విద్యుత్ ప్రవహిస్తోంది. చుట్ట కేంద్రం వద్ద ఉండే అయస్కాంత క్షేత్రం B. ఇదే తీగచుట్టను 10 చుట్లు ఉండే చుట్టగా చేసినప్పుడు దాని కేంద్రం వద్ద ఎంత అయస్కాంత క్షేత్రం ఉంటుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 7

ప్రశ్న 7.
ఇతర కారకాలను స్థిరంగా ఉంచి, సాలినాయిడ్ చుట్ల సంఖ్యను రెట్టింపు చేస్తే సాలినాయిడ్ అక్షంపై అయస్కాంత క్షేత్రం ఏవిధంగా మారుతుంది?
జవాబు:
B1 = B; n1 = n; n2 = 2n; B2 = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 8

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విద్యుత్ ప్రవాహం ఉన్న వృత్తాకార లూప్ అక్షంపై ఏదైనా ఒక బిందువు వద్ద అయస్కాంత క్షేత్రానికి సమాసాన్ని ఉత్పాదించండి.
జవాబు:
విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార లూప్ అక్షంపై ఒక బిందువు వద్ద అయస్కాంత క్షేత్రంనకు సమాసము:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 9

  1. వృత్తాకార లూప్ యొక్క కేంద్రము ‘0’ మరియు వ్యాసార్థం ‘a’.
  2. లూప్ అక్షం వెంట, కేంద్రము నుండి దూరంలో P బిందువును తీసుకుందాము.
  3. లూప్ తలం, పేపర్ తలానికి లంబంగా ఉండును.
  4. ఒక్కొక్కటి dl పొడవు గల మూలకాలు AB మరియు A’B’ లను వ్యాసంపై అభిముఖంగా భావిద్దాం.
  5. ఈ రెండు మూలకాల వల్ల P వద్ద అయస్కాంత క్షేత్రాలు dB మరియు dB లు వరుసగా PM మరియు PN దిశలలో ఉండును.
  6. ఈ దిశలు మూలకాల మధ్య బిందువులను బిందువుతో కలుపు రేఖలకు లంబంగా ఉండును.
  7. ఈ క్షేత్రాలను లూప్ అక్షం వెంట సమాంతర అంశములు (dB sinθ) మరియు లంబ అంశములు (dB) గా విడిపోవును.
  8. dB cosθ అంశాలు ఒకదానితో మరొకటి రద్దు చేసుకొనును. వృత్తాకార లూప్ మూలకాలు సౌష్టవంగా ఉండుట వల్ల dB sinθ అంశాలు ఒకే దిశలో కలుస్తాయి.
  9. అక్షం వెంట మొత్తం అయస్కాంత క్షేత్రం = B = ∫dB sin θ ………….. (I)
    వృత్తాకార లూప్ అక్షం PC వెంట
  10. ‘dl’ పొడవున్న విద్యుత్ ప్రవాహం ఉన్న మూలకం వల్ల ‘P’ వద్ద అయస్కాంత క్షేత్రం
    AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 10

ప్రశ్న 2.
దండాయస్కాంతం, సాలినాయిడ్ సదృశ క్షేత్రాలను ఉత్పత్తి చేస్తాయని నిరూపించండి.
జవాబు:
1) విద్యుత్ ప్రవాహ లూపు అయస్కాంత ద్వి ధృవం వలె పనిచేస్తుంది. ఆంపియర్స్ నియమము ప్రకారము, అయస్కాంత దృగ్విషయంను విద్యుత్ ప్రవాహాలలో వివరిస్తుంది.

2) ఒక దండాయస్కాంతంను, సాలినాయిడ్ వలె కత్తిరిద్దాము. బలహీన అయస్కాంత ధర్మాలున్న సాలినాయిడ్లను పోల్చుదాము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 11
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 12

3) సాలినాయిడ్ ఒక తలం నుండి అయస్కాంత బలరేఖలు అవిచ్చిన్నంగా మరొక తలంలోనికి ప్రవేశిస్తాయి.

4) ఒక చిన్న కంపాసు సూచిని దండాయస్కాంతం చుట్టు మరియు సాలినాయిడ్ చుట్టు త్రిప్పిన, రెండు సందర్భాలలో సూచి అపవర్తనాలు పటములో చూపినట్లు ఒకే విధంగా ఉండును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 13
8) దండాయస్కాంతము సాలినాయిడ్ సదృశ క్షేత్రాలను ఉత్పత్తి చేయును.

ప్రశ్న 3.
చిన్న అయస్కాంత సూదిని అయస్కాంత క్షేత్రంలో డోలనాలు చేయిస్తే, దాని డోలనావర్తన కాలానికి సమాసాన్ని రాబట్టండి.
జవాబు:
దోలన ఆవర్తన కాలమునకు సమీకరణము :
1) అయస్కాంత భ్రామకము m మరియు భ్రామక జఢత్వము ఉన్న ఒక చిన్న అయస్కాంత సూచి (అయస్కాంత ద్విధృవం) ను ఏకరీతి అయస్కాంత క్షేత్రం B లో ఉంచి, డోలనాలు చేయిద్దాము.
2) ఈ అమరిక పటములో చూపబడింది.
3) సూచిపై టార్క్ τ = m × B
4) పరిమాణంలో τ = mB sin θ
ఇక్కడ τ పునఃస్థాపక టార్క్, మరియు θ, m మరియు B ల మధ్య కోణము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 14

ప్రశ్న 4.
క్షితిజ సమాంతరంగా ఉండే దండాయస్కాంతాన్ని భూఅయస్కాంత క్షేత్రంలో కోణీయ డోలనాలను చేయించారు. అవపాత కోణాలు, θ1, θ2 ఉండే రెండు ప్రదేశాల్లో అయస్కాంతం డోలనావర్తన కాలాలు వరసగా T1, T2 లు. రెండు ప్రదేశాల్లోని ఫలిత అయస్కాంత క్షేత్రాల నిష్పత్తికి సమాసాన్ని రాబట్టండి.
జవాబు:
1) రెండు ప్రదేశాలు A మరియు B ల వద్ద ఫలిత అయస్కాంత క్షేత్రాలను పోల్చాలనుకుందాము.
2) A వద్ద ఒక దండాయస్కాంతంను భూఅయస్కాంత క్షేత్రంలో క్షితిజ సమాంతరంగా వ్రేలాడదీసి, కోణీయ డోలనాలు చేయిద్దాము.
3) ప్రదేశం ‘A’ వద్ద దండాయస్కాంత డోలనావర్తన కాలం T1 మరియు అవపాత కోణము θ1.
4) దండాయస్కాంతం క్షితిజ సమాంతరంగా స్వేచ్ఛగా తిరిగితే, లంబ అంశము (B1 sinθ1) ఉండదు. ఒకే ఒక క్షితిజ సమాంతర అంశము (B1 cos θ1) ను మాత్రమే కలిగి ఉండును.
G:\AP board\apboardsolutions in\VIKRAM TS & AP Inter 2nd Year Physics Question Bank (TM)\Ch 8\AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 16.png
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 16
14) T1, T2 మరియు θ1, θ2 లు A మరియు B ల వద్ద తెలిసిన, ఫలిత అయస్కాంత క్షేత్రాల నిష్పత్తి కనుగొనవచ్చును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 5.
పదార్థ అయస్కాంత ససెప్టబిలిటిని నిర్వచించండి. ధన ససెప్టిబిలిటీ, రుణ ససెప్టెబిలిటీ కలిగిన రెండు మూలకాల పేర్లను తెలపండి. [AP. Mar. ’15]
జవాబు:
1) సెసెప్టెబిలిటి :
ఒక పదార్థమును అయస్కాంత క్షేత్రంలో ఉంచినపుడు, అది పొందు అయస్కాంతీకరణ తీవ్రతకు మరియు ప్రయోగించిన అయస్కాంత క్షేత్ర తీవ్రతకు గల నిష్పత్తిని ససెప్టబిలిటి అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 17
2) పదార్థ ససెప్టబిలిటి, అది పొందు అయస్కాంత సామర్థ్యంను తెలుపును.
3) సెప్టెబిలిటి మిత రహిత రాశి.

4) µr మరియు χ ల మధ్య సంబంధము :
a) ఒక పదార్థమును, అయస్కాంత క్షేత్ర తీవ్రత H లో ఉంచామనుకుందాము. ఆ పదార్థము పొందు అయస్కాంతీకరణ తీవ్రత I.
b) ఆ పదార్థం లోపల అయస్కాంత ప్రేరణ,
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 18

5) రుణ ససెప్టబిలిటి (χ) గల డయా అయస్కాంత మూలకాలు బిస్మత్ (-1.66 × 10-5) మరియు రాగి (9.8 × 10-6).

6) కోబాల్టు మరియు నికెల్ ధన ససెప్టబిలిటి గల ఫెర్రో అయస్కాంత మూలకాలు.

ప్రశ్న 6.
అయస్కాంతత్వానికి గాస్ నియమాన్ని పొంది వివరించండి.
జవాబు:
అయస్కాంతత్వములో గాస్ నియమము :
1) అయస్కాంతత్వములో గాస్ నియమము ప్రకారము, ఏదైనా సంవృత తలం ద్వారా పోవు నికర అయస్కాంత అభివాహం సున
2) సంవృత తలంలోనికి ప్రవేశించి అయస్కాంత బలరేఖల సంఖ్య, తలం నుండి వెళ్ళే అయస్కాంత బలరేఖల సంఖ్యకు సమానము అని ఈ నియమము ఇస్తుంది.
3) ఏకరీతి అయస్కాంత క్షేత్రంBలో సంవృత తలంను వ్రేలాడదీస్తాము అనుకుందాము. ఈ తలంపై ఒక చిన్న సదిశ వైశాల్య మూలకముASపటంలో చూపబడింది.
4) ఈ వైశాల్య మూలకం ద్వారా పోవు అయస్కాంత అభివాహంను g= B. ASగా నిర్వచిస్తారు. అప్పుడు నికర
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 19
7) తలములో ఆవరించబడిన విద్యుత్ ద్విధృవం సమాన మరియు వ్యతిరేక ఆవేశాలు గల ద్విధృవంతో కలిసిన, సున్నా అగును.
8) ΦB = 0 అయిన, అయస్కాంత మూలకము ద్విధృవం లేక విద్యుత్ లూపును సూచిస్తుంది.
9) వియుక్త అయస్కాంత ధృవాలను, అయస్కాంత ఏకాంక ధృవాలు అంటారు. ఈ ఏకాంక ధృవాలు ఇమడవు.
10) మొత్తం అయస్కాంత దృగ్విషయంను, అయస్కాంత ద్విధృవాలు లేక విద్యుత్ లూపులలో వివరిస్తుంది.

ప్రశ్న 7.
హిస్టరిసిస్ అంటే మీరు అర్థం చేసుకొన్నదేమిటి? విద్యుదయస్కాంతాలను వాడుకొనే భిన్న ఉపకరణాల్లో వాడే పదార్థాల ఎంపికను ఈ ధర్మం ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
1) అయస్కాంతీకరణ సైకిల్:
ఒక ఫెర్రో అయస్కాంత పదార్థ నమూనాను నెమ్మదిగా అయస్కాంతీకరించిన, ఒక సైకిల్లో అయస్కాంతీకరణ తీవ్రత (I), అయస్కాంత క్షేత్ర తీవ్రత (H)తో మారును. దీనినే అయస్కాంతీకరణ సైకిల్ అంటారు.

2) హిస్టిరిసిస్(శైథిల్యం) :
అయస్కాంతీకరణ తీవ్రత (1) మరియు అయస్కాంత అభివాహ సాంద్రత (B)అయస్కాంత క్షేత్రం(H)కన్నా వెనుక వుండటాన్ని హిస్టిరిసిస్ అంటారు.

3) రెటింవిటీ (ధారణశీలత):
Hవిలువ సున్నా అయ్యే, విలువను రెటింవిటి అంటారు.

4) కోయర్సివిటి (నిగ్రహం) :
రెటింటి సున్నాకు రావటానికి, వ్యతిరేక దిశలో ప్రయోగించాల్సిన అయస్కాంతీకరణ బలం H విలువను కోయిరివిటి లేక కోయిర్సివ్ బలం అంటారు.

5) హిస్టరిసిస్ వక్రము(శైథిల్య వక్రము) :
ఒక ఫెర్రో అయస్కాంత పదార్థము యొక్క అయస్కాంత ప్రేరణ (B) లేక అయస్కాంతీకరణ తీవ్రత (I)కు, అయస్కాంతీకరణ బలం లేక అయస్కాంత తీవ్రత (H)కు మధ్య సంబంధంను తెలుపు వక్రంను హిస్టరీసిస్ వక్రము అంటారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 20
6) హిస్టరిసిస్ లూపు లేక వక్రము వివరణ :
a) H – I తలంలో ABCDEFA సంవృత వక్రము లేక హిస్టరిసిస్ లూపు పటంలో చూపబడింది.
b) ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని నెమ్మదిగా అయస్కాంతీ కరించిన Hతో I విలువ క్రమంగా పెరుగును.
c) వక్రంలో భాగం H తో పెరుగుట చూపును.
d) A బిందువు వద్ద 1 విలువ స్థిరంగా ఉండును. దీనినే సంతృప్త విలువ అంటారు.
e) B వద్ద I కొంత విలువ కలిగి, H శూన్యం అగును.
f) పటంలో BO రెటింవిటి మరియు OC కోయిర్సివిటీను తెలుపును.

లెక్కలు Problems

ప్రశ్న 1.
స్థిరాంకంగా ఉన్న అయస్కాంత క్షేత్రం B లో ఉంచిన “n” చుట్లు, A వైశాల్యం, “i” విద్యుత్ కలిగి ఉండే సమతల చుట్టపై చర్య జరిపే టార్క్ ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 21
దీర్ఘ చతురస్రాకార తీగచుట్ట PQRS కు :
పొడవు PR = QS = l ; వెడల్పు PQ = RS = b
విద్యుత్ ప్రవాహం = i; అయస్కాంత ప్రేరణ క్షేత్రం = B
తీగ చుట్ట తలం లంబము B తో చేయు కోణం = θ
వాహకం PR మరియు SQ ల పై బలము, F = Bil sin θ
వాహకం PQ మరియు RS ల పై బలము, F = 0
దీర్ఘ చతురస్రాకార తీగ చుట్టపై టార్క్ τ = F × లంబదూరం (b) ⇒ τ = Bil sin θ (b)
∴ τ = BiA sin 6.[∵ A = l × b].
తీగ చుట్ట n చుట్లు కలిగి ఉంటే, టార్క్ τ = B sin A sin θ.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 2.
20 చుట్లు, 800 mm² వైశాల్యం గల చుట్టలో 0.5A విద్యుత్ ప్రవహిస్తోంది. దీన్ని 0.3T ఉన్న అయస్కాంత క్షేత్ర ప్రేరణలో చుట్టతలం క్షేత్రానికి సమాంతరంగా ఉండే విధంగా అమర్చితే, అది ఎంత టార్క్కు గురవుతుంది?
సాధన:
n = 20; A = 800 mm² = 800 × 10-6 m²; i = 0.5A; B = 0.3T; θ = 0°
తీగ చుట్ట తలం క్షేత్ర దిశకు సమాంతరంగా ఉంటే టార్క్
τ = B in A cos 0 = 0.3 × 0.5 × 20 × 800 × 10-6 × cos 0°
∴ τ = 2.4 × 10-3 Nm

ప్రశ్న 3.
బోర్ పరమాణు నమూనాలో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తాయి. హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ అయస్కాంత భ్రామకం (µ) కు సమాసాన్ని కోణీయ ద్రవ్యవేగం, L. పదాలలో రాబట్టండి.
సాధన:
హైడ్రోజన్ పరమాణువులో, వ్యాసార్థం ఉన్న వృత్తాకార కక్ష్యలో, ఆ ఆవేశం ఉన్న ఎలక్ట్రాన్ v స్థిర వేగంతో చలిస్తున్నట్లు
భావిద్దాం. కేంద్రకం చుట్టూ వృత్తాకార చలనంలో తిరుగు ఎలక్ట్రాన్ కలిగి ఉండు విద్యుత్ ప్రవాహం. I = \(\frac{e}{T}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 22

ప్రశ్న 4.
22.5cm పొడవు, 900 చుట్లు ఉండే సాలినాయిడ్లో 0.8 A విద్యుత్ ప్రవాహం ఉంది. దాని కేంద్రం, చివరల నుంచి దూరంగా ఉండే అయస్కాంతీకరణం చేసే క్షేత్రం H విలువ ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 23

ప్రశ్న 5.
0.1mపొడవు, 5Am² అయస్కాంత భ్రామకంతో ఉండే దండాయస్కాంతాన్ని 0.4T ప్రేరణ గల ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో దాని అక్షం, క్షేత్రంతో 60° ఏర్పరచే విధంగా, ఉంచితే దానిపై చర్యజరిపే టార్క్ విలువ ఎంత? [Mar. ’14]
సాధన:
ఇచ్చినవి 2l = 0.1m; m = 5A – m²2; B = 0.4T; θ = 60°.
టార్క్, τ = mb sin θ = 5 × 0.4. × sin 60° = 2 × \(\frac{\sqrt{3}}{2}\)
∴ τ = 1.732 N – m

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 6.
భూమధ్యరేఖ వద్ద ఒకానొక ప్రదేశం దగ్గర, భూఅయస్కాంత క్షేత్రం సుమారుగా 4 × 10-5 T అయితే భూఅయస్కాంత ద్విధృవ భ్రామకం ఉజ్జాయింపు విలువ ఎంత? (భూవ్యాసార్థం = 6.4 × 106m)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 24

ప్రశ్న 7.
ఒక ప్రదేశంలో భూఅయస్కాంత క్షేత్రం క్షితిజ సమాంతర అంశం 2.6 × 10T, అవపాత కోణం 60° అయితే ఆ ప్రదేశంలోని భూఅయస్కాంత క్షేత్రం విలువ ఎంత ?
సాధన:
ఇచ్చినవి HE = 2.6 × 10-5T
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 25

ప్రశ్న 8.
400 సాపేక్ష పెర్మియబిలిటీ గల కోర్పై విద్యుద్బంధక తీగను చుట్టి సాలినాయిడ్ను తయారుచేశారు. సాలినాయిడ్ పై ప్రతి ఒక మీటర్కు 1000 చుట్లు ఉన్నాయి. సాలినాయిడ్ ద్వారా 2A విద్యుత్ ప్రవహిస్తే, H, B, అయస్కాంతీకరణ . M లను లెక్కించండి.
సాధన:
ఇచ్చినవి, µr = 400, I = 2A, n = 1000
H = nI = 1000 × 2 = 2 × 10³ A/m
B = µr µoH = 400 × 4π × 107 × 2 × 10³ = 1.0 T
అయస్కాంతీకరణం m = (µr – 1) H = (4001)H – 399 × 2 × 10³
∴ m ≅ 8 × 105 A/m

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 1.
భూఅయస్కాంతత్వానికి సంబంధించిన క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెల్పండి.
a) సదిశను నిర్దేశించేందుకు మూడు రాశులు అవసరం. భూఅయస్కాంత క్షేత్రాన్ని నిర్దేశించటానికి సంప్రదాయంగా ఉపయోగిస్తున్న మూడు స్వతంత్ర రాశుల పేర్లను తెలపండి.
జవాబు:
భూఅయస్కాంత క్షేత్రంను తెల్ప ఆధారపడని మూడు రాశులు అయస్కాంత దిక్పాతం (θ), అయస్కాంత అవపాతము (δ) మరియు భూ-క్షితిజ సమాంతర అంశము (H).

b) దక్షిణ భారతదేశంలోని ఒక ప్రదేశంలో అవపాత కోణం విలువ సుమారు 18°. బ్రిటన్ దేశంలో అవపాత కోణం చి వ దీనికంటే ఎక్కువగా ఉంటుందా ? లేదా తక్కువగా ఉంటుందా?
జవాబు:
అవును. బ్రిటన్ అవపాత కోణము ఎక్కువ. దీనికి కారణం ఉత్తర ధృవంనకు దగ్గరగా ఉండుటయే. బ్రిటన్లో δ = 70°.

c) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మీరు అయస్కాంత క్షేత్ర రేఖల పటాన్ని గీస్తే, దాని రేఖలు భూమిలోకి వెళుతున్నట్లు కనిపిస్తాయా? లేదా భూమి నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తాయా?
జవాబు:
దక్షిణార్థ గోళంలో భూమి ఉత్తరం వద్ద మెల్బోర్న్ ఉంది. కావున భూ అయస్కాంత క్షేత్ర రేఖలు (ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్) భూమి నుండి బయటకు వస్తున్నట్లు కనిపించును.

d) భౌగోళిక ఉత్తర లేదా దక్షిణ ధృవాల వద్దనే నిలువు తలంలో స్వేచ్ఛగా కదిలే కంపాస్ సూదిని ఉంచితే అది ఏ దిశలో నిశ్చలస్థితిలోకి వస్తుంది?
జవాబు:
ధృవాల వద్ద, భూ క్షేత్రము ఖచ్చితంగా నిలువుగా ఉండును. కావున కంపాస్ సూచి క్షితిజ సమాంతర తలంలో స్వేచ్ఛగా తిరుగును, ఏ దిశనైనా చూపును.

e) 8 × 1022 J T-1 అయస్కాంత భ్రామకం గల డైపోల్ను భూమి కేంద్రం వద్ద ఉంచితే, దాని వల్ల ఏర్పడే క్షేత్రానికి భూ అయస్కాంత క్షేత్రం ఉజ్జాయింపుగా సమానమని ప్రకటించారు. ఈ సంఖ్య పరిమాణ క్రమాన్ని ఏదో ఒక పద్ధతిలో సరిచూడండి.
జవాబు:
m = 8 × 1022 JT-1.
d = R = భూమి వ్యాసార్థం = 6,400 km = 6.4 × 106 m.
పొట్టి అయస్కాంత ద్విధృవం అయస్కాంత రేఖపై అయస్కాంత క్షేత్ర తీవ్రత
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 26
ఈ విలువ పరిశీలించిన భూ క్షేత్రం విలువతో ఉజ్జాయింపుగా సరిపోతుంది.

f) భూఉపరితలంపై ప్రధాన అయస్కాంత N-S ధృవాలకు అదనంగా మరిన్ని స్థానిక ధృవాలు, వివిధ దిశల్లో అమర్చబడి ఉన్నాయని భూవిజ్ఞానశాస్త్ర లు ప్రకటించారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది?
జవాబు:
భూమి అయస్కాంత క్షేత్రము సుమారుగా ద్విధృవ క్షేత్రంనకు సుమారుగా ఉండును. N- S ధృవాలు వేర్వేరు దిశలలో తిరుగును. అయస్కాంత ఖనిజాలు నిక్షేపాల వల్ల ఇది సాధ్యం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి:
a) భూఅయస్కాంత క్షేత్రం అంతరాళంలో ఒక బిందువు నుంచి మరొక బిందువుకు పోయే కొద్దీ మారుతూ ఉంటుంది. ఇది కాలంతోపాటు కూడా మారుతుందా? అదే నిజమైతే, ఏ కాలం స్కేలుపై ఇది చెప్పుకోదగ్గ విధంగా మారుతుంది?
జవాబు:
అవును. కాలంతో పాటు భూక్షేత్రం మారును. ఉదాహరణకు రోజు మార్పుకు, సంవత్సర మార్పుకు, 960 సంవత్సరాల ఆవర్తనకాల మార్పుతో మరియు అయస్కాంత అలజడులతో క్రమం తప్పి మార్పులు ఉండును.

b) భూమి కోర్- ఇనుమును కలిగి ఉంటుందని మనకు తెలుసు. అయినప్పటికీ, భూ అయస్కాంతత్వానికి కారణం ఇది కాదని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు భావిస్తారు. ఎందుకు ?
జవాబు:
భూమి కోర్ ఇనుము కలిగి, ద్రవ స్థితిలో ఉండును. ఇది ఫెర్రో అయస్కాంతం కాదు. దీనిని భూ అయస్కాంత జనకంగా భావించరాదు.

c) భూమి కోర్ బాహ్య వాహక ప్రదేశంలోని ఆవేశాల ప్రవాహమే భూఅయస్కాంతత్వానికి కారణమని భావిస్తారు.’ ఈ ప్రవాహాలను భరిస్తూ కొనసాగేందుకు కారణమయ్యే బ్యాటరీ (శక్తి జనకం) ఏదై ఉండవచ్చు?
జవాబు:
భూ అంతర్భాగంలో రేడియోధార్మికత సాధ్యము. కాని ఇది అయస్కాంతంను కలిగి ఉండదు.

d) 4 నుంచి 5 బిలియన్ సంవత్సరాల చరిత్రలో, భూమి తన క్షేత్ర దిశను అనేకసార్లు మార్చుకొని ఉండవచ్చు. ఇంత పురాతన కాలంలోని భూక్షేత్రాన్ని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకోగలుగుతారు?
జవాబు:
కొన్ని రాళ్ళు ఘనస్థితిలో, భూఅయస్కాంత క్షేత్రము బలహీనంగా రికార్డు చేయబడును. ఈ రాళ్ళ విశ్లేషణ భూమి అయస్కాంత చరిత్రను తెలుపును.

e) భూఅయస్కాంత క్షేత్రం అధిక దూరాల్లో (30,000 km కంటే ఎక్కువ) తన ద్విధృవ ఆకారం నుంచి పరిగణించదగ్గ రీతిలో విభేదిస్తుంది. దీనికి కారణమయ్యే కారకాలు ఏవై ఉండవచ్చు?
జవాబు:
భూమి ఐనో ఆవరణలో ఏర్పడు అయాన్ల చలనం వల్ల క్షేత్రం సవరించబడి భూమి అయస్కాంత క్షేత్రంను పొందుతాము.

f) గ్రహాల మధ్య ఉండే అంతరాళం అతిబలహీనమైన, 10-12 T క్రమంలోని అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది. ఇంత బలహీన క్షేత్రం వల్ల ఏదైనా చెప్పుకోదగ్గ పర్యవసానమేమైనా ఉంటుందా? వివరించండి.
[Note : అభ్యాసం 2 ప్రధానంగా మీలో కుతూహలాన్ని పెంపొందించేందుకే. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తాత్కాలికమైనవి. లేదా తెలియనివి క్లుప్త సమాధానాలు, సాధ్యమయ్యే సందర్భాలకు చివర ఇచ్చినాం. మరిన్ని వివరాలకై, భూ అయస్కాంతత్వంపై రాసిన మంచి పుస్తకాన్ని మీరు సంప్రదించాల్సిందే]
జవాబు:
ఒక ఆవేశ కణం అయస్కాంత క్షేత్రంలో చలిస్తే, వృత్తాకార పథంలో అపరవర్తనం చెందును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 27

B తక్కువగా ఉన్నప్పుడు, r అధికము i.e., పదము వక్ర వ్యాసార్థము చాలా ఎక్కువ. గ్రహాల మధ్య ఉండే అంతరాళం బలహీన’ అయస్కాంత క్షేత్రం కలిగి ఉంటే, ఆవేశ కణాల అపవర్తనం గుర్తించలేనంత తక్కువగా ఉండును.

ప్రశ్న 3.
ఒక దండాయస్కాంతం అక్షం, 0.25 T ఏకరీతి బాహ్య అయస్కాంత క్షేత్రంతో 30° చేసే విధంగా ఉన్నప్పుడు దానిపై 4.5 × 10-2 J. పరిమాణం గల టార్క్ చర్య జరుపుతుంది. ఆ అయస్కాంతం యొక్క అయస్కాంత భ్రామకం పరిమాణం ఎంత?
సాధన:
θ = 30°, B = 0.25 T, τ = 4.5 × 10-2 J, M = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 28

ప్రశ్న 4.
m = 0.32 JT-1 అయస్కాంత భ్రామకం గల పొట్టి దండాయస్కాంతాన్ని 0.15T ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచారు. ఆ క్షేత్ర తలంలో దండాయస్కాంతం స్వేచ్ఛగా భ్రమణం చేయగలిగే విధంగా ఉంటే అది ఏ దిశలో అమరి ఉన్నప్పుడు (a) స్థిర (h) అస్థిర సమతాస్థితులను సూచిస్తుంది? ప్రతి సందర్భానికి, అయస్కాంత స్థితిజశక్తి ఎంత?
సాధన:
m = 0.32JT-1, B = 0.15T

i) స్థిర సమతాస్థితిలో, దండాయస్కాంతం అయస్కాంత క్షేత్ర దిశ వెంట ఉండును. i.e., θ = 0°.
స్థితిజ శక్తి = -mB cos 0° = 0.32 × 0.15 × 1 = – 4.8 × 10-2 J

ii) అస్థిర సమతాస్థితిలో, అయస్కాంతం, అయస్కాంత క్షేత్ర దిశలో 180″ తిరిగితే,
స్థితిజ శక్తి = mB cos 180° = – 0.32 × 0.15 (-1) = 4.8 × 10-2 J,

ప్రశ్న 5.
800 చుట్లతో దగ్గర దగ్గరగా చుట్టి ఉండి 2.5 X 10 m మధ్యచ్ఛేద వైశాల్యం గల సాలినాయిడ్ ద్వారా 3.0A విద్యుత్ ప్రవాహం ఉంది. సాలినాయిడ్ దండాయస్కాంతంలాగా ప్రవర్తించే విధానాన్ని వివరించండి. దీనికి అనుబంధితమైన అయస్కాంత భ్రామకం ఎంత?
సాధన:
n = 800, A = 2.5 × 10-4 m², I = 3.0 A
సాలినాయిడ్ అక్షం వెంట అయస్కాంత క్షేత్రంను ఏర్పరుచును.
∴ విద్యుత్ ప్రవహిస్తున్న సాలినాయిడ్ దండాయస్కాంతం వలె ప్రవర్తించును.
m = nIA = 800 × 3.0 × 2.5 × 10-4
= 0.6 JT-1 సాలినాయిడ్ అక్షం వెంట.

ప్రశ్న 6.
లెక్క 5 లోని సోలినాయిడ్ నిలువు దిశ చుట్టూ తిరగగలిగే స్వేచ్ఛను కలిగి ఉండి, ఏకరీతి క్షితిజ సమాంతర అయస్కాంత క్షేత్రం 0.25 T ని అనువర్తింపచేస్తే, ఈ క్షేత్ర దిశతో సాలినాయిడ్ ‘ అక్షం 30° కోణం చేసినప్పుడు, దానిపైన చర్య జరిపే పరిమాణం ఎంత?
సాధన:
m = 0.6 JT-1
B = 0.25T, τ = ?, θ = 30°
τ = M B sin θ ∴ τ = 0.6 × 0.25 sin 30° = 0.075 N-m.

ప్రశ్న 7.
0.22T ఏకరీతి అయస్కాంత క్షేత్రం దిశతో 1.5 JT-1 అయస్కాంత భ్రామకం గల దండాయస్కాంతం అమరి ఉంది.
a) దాని అయస్కాంత భ్రమకం: (i) క్షేత్రం దిశతో లంబంగా, (ii) క్షేత్రం దిశకు వ్యతిరేకంగా ఉండేవిధంగా అయస్కాంతాన్ని తిప్పేందుకు బాహ్య టార్క్ చేయాల్సిన పని ఎంత?
సాధన:
m = 1.5 JT-1, B = .0.22 T, W = ?
θ1 = 0° (అక్షం వెంట); θ2 = 90° (అక్షంనకు లంబంగా)
W = -mB (cos θ2 – cos θ1)
= -1.5 × 0.22 (cos 90° – cos 0°) = -0.33 (0 – 1) = 0.33J

ii) θ1 = 0o, θ2 = 180°.
W = -1.5 × 0.22 (cos 180° – cos 0°)
= -0.33 (-1 – 1) = 0,.66 J.

b) (i), (ii) సందర్భాల్లో అయస్కాంతంపై పనిచేసే టార్క్ విలువ ఎంత?
సాధన:
టార్క్ τ = mB sin θ.
i) θ = 90°, τ = 1.5 × 0.22 sin 90° = 0.33 N-m
ii) θ = 180°, τ = 1.5 × 0.22 sin 180° = 0

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 8.
దగ్గర దగ్గరగా చుట్టిన 2000 చుట్లు కలిగి, మధ్యచ్ఛేద వైశాల్యం 1.6 × 10-4 m² ఉన్న సాలినాయిడ్లో 4.0 A ల విద్యుత్ ప్రవాహం ఉంది. దీనిని, దాని కేంద్రం ద్వారా వేలాడదీసి, క్షితిజ సమాంతర తలంలో తిరగడానికి వీలు కలిగించారు.
a) సాలినాయిడ్తో అనుబంధితమైన అయస్కాంత భ్రామకం ఎంత?
సాధన:
N = 2000, A = 1.6 × 10-4 m²,
I = 4 amp, m = ?
m = NIA
∴ m = 2000 × 4 × 1.6 × 10-4 = 1.28 JT-1.

b) సాలినాయిడ్ అక్షంతో 30° కోణం చేస్తున్నట్లుగా ఒక 7.5 × 10-2 Tల ఏకరీతి క్షితిజ సమాంతర అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే, దానిపై చర్యజరిపే బలం, టార్క్ ఎంతెంత?
సాధన:
సాలినాయిడ్ పై నికర బలం = 0
టార్క్, τ = m B sin θ = 1.28 × 7.5 × 10-2 sin 30°
= 1.28 × 7.5 × 10-2 × \(\frac{1}{2}\)
τ = 4.8 × 10-2 Nm.

ప్రశ్న 9.
10 cm వ్యాసార్థం, 16 చుట్లుగల వృత్తాకార చుట్టలో 0.75 A. విద్యుత్ ప్రవాహం ఉంది. దీని తలం 8.0 × 10-2 T పరిమాణం గల బాహ్య క్షేత్రానికి లంబంగా నిలిచి ఉండేటట్లు ఉంచారు. క్షేత్ర దిశకు లంబంగా ఉండే తలంలోని అక్షం. పరంగా చుట్ట స్వేచ్ఛగా చలించగలుగుతుంది. చుట్టను కొంచెం తిప్పి, వదిలితే దాని నిలకడ సమతాస్థితికి ఇరువైపులా 2.0s-1 పౌనఃపున్యంతో అది డోలనాలు చేస్తుంది. భ్రమణాక్షం పరంగా దాని జడత్వ భ్రామకం ఎంత?
సాధన:
n = 16, r = 10 cm = 0.1 m, I = 0.75A,
B = 5.0 × 10-2T
υ = 2.0 s-1, I = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 29

ప్రశ్న 10.
అయస్కాంత యామ్యోత్తర రేఖకు సమాంతరంగా ఉండే లంబ తలంలో ఒక అయస్కాంత సూది స్వేచ్ఛగా భ్రమించ గలుగుతుంది. సూది ఉత్తరం చివర, క్రిందివైపు దిశలో సమాంతరంతో 22° కోణం చేస్తుంది. ఆ ప్రదేశంలోని భూ అయస్కాంత క్షేత్రం క్షితిజ సమాంతర అంశం 0.35 G. ఆ ప్రదేశంలోని భూఅయస్కాంత క్షేత్రం పరిమాణాన్ని నిర్ధారించండి.
సాధన:
δ = 22°, H = 0.35 G, R = ?
H = R cos δ
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 30

ప్రశ్న 11.
ఆఫ్రికాలోని ఒక ప్రాంతంలో, అయస్కాంత సూచి భౌగోళిక ఉత్తరం నుంచి 12° పశ్చిమ దిశలో ఉంది. అయస్కాంత యామ్యోత్తర తలంలో ఉంచిన అవపాత సూచి అయస్కాంత సూది ఉత్తరం కొన, సమాంతరానికి పైన 60° కోణం చేస్తుంది. భూఅయస్కాంత క్షితిజ సమాంతర అంశం 0.16 G. గా కొలిచారు. ఆ ప్రదేశంలో భూఅయస్కాంత క్షేత్రం దిశను, పరిమాణాన్ని నిర్దేశించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 32
డిక్లినేషన్ δ = 12° పడమర, దిక్పాతం δ = 60° H = 0.16 గాస్ = 0.16 × 10-4 టెస్లా, R = ?
H = R cos δ
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 31

భూఅయస్కాంత క్షేత్రం నిలువు తలంలో భౌగోళిక యామ్యోత్తర తలంకు
12° పశ్చిమ దిశలో, సమాంతరానికి పైన 60° కోణం చేస్తుంది.

ప్రశ్న 12.
ఒక పొట్టి దండాయస్కాంత అయస్కాంత భ్రామకం 0.48 JT దాని (a) అక్షం మీద, (b) లంబ సమద్విఖండన రేఖపై అయస్కాంతం వల్ల దాని మధ్య బిందువు నుంచి 10 cm దూరంలో ఏర్పడే అయస్కాంత క్షేత్రం యొక్క దిశ, పరిమాణాలను తెలపండి.
సాధన:
m = 0.48JT-1, B = ? d = 10 cm = 0.1 m
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 33

ప్రశ్న 13.
క్షితిజ సమాంతర తలంలో ఉంచిన పొట్టి దండాయస్కాంతం, అయస్కాంత ఉత్తర-దక్షిణ దిశల్లో అమరి ఉంది. అయస్కాంతం కేంద్రం నుంచి 14 cm దూరంలో, అక్షంపై శూన్య బిందువులను గుర్తించారు. ఆ ప్రదేశంలో భూఅయస్కాంత క్షేత్రం 0.36G., అవపాత కోణం శూన్యం. అయస్కాంత కేంద్రం నుంచి తటస్థ బిందువు ఉండే దూరం (14 cm) లోనే, లంబ సమద్విఖండన రేఖపై మొత్తం అయస్కాంత క్షేత్రం ఎంత? శూన్య బిందువుల వద్ద, అయస్కాంతం వల్ల కలిగే క్షేత్రం భూ అయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశానికి సమానం, వ్యతిరేకంగా ఉంటుంది.
సాధన:
అయస్కాంత అక్షంపై శూన్య బిందువులు ఏర్పడితే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 34

ప్రశ్న 14.
అభ్యాసం 13 లో దండాయస్కాంతాన్ని 180° కోణంతో తిప్పితే, కొత్త శూన్య బిందువులు ఎక్కడ ఏర్పడతాయి?
సాధన:
దండాయస్కాంతంను 180° త్రిప్పితే, మధ్య లంబరేఖపై తటస్థ బిందువులు ఏర్పడును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 35

ప్రశ్న 15.
5.25 × 10-2 JT-1 అయస్కాంత భ్రామకం గల పొట్టి దండాయస్కాంతం అక్షం భూమి క్షేత్ర దిశకు లంబంగా ఉండే విధంగా అమర్చారు. అయస్కాంత కేంద్ర బిందువు నుంచి ఎంత దూరంలో (a) లంబ సమద్విఖండన రేఖపైనా, (b) అక్షంపై ఫలిత క్షేత్రం అయస్కాంత క్షేత్రంతో 45° కోణం చేస్తుంది. ఆ ప్రదేశంలోని భూ అయస్కాంత క్షేత్రం ‘ పరిమాణం 0.42 G అని ఇచ్చారు. సంబంధిత దూరాలతో పోల్చితే అయస్కాంతం పొడవును ఉపేక్షించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 36
m = 5.25 × 10-2 JT-1
r = ?
భూమి క్షేత్రం \(\overrightarrow{B_e}\) = 0.42 G = 0.42 × 10-4 T

a) మధ్యగత లంబరేఖపై r దూరంలో P బిందువు వద్ద, అయస్కాంతం వల్ల క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 37
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 38

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 16.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి :
a) పారాఅయస్కాంతీయ మచ్చు పదార్థం చల్లబరిస్తే, అది ఎక్కువ అయస్కాంతీకరణను (అదే అయస్కాంతీకరణం చేసే క్షేత్రానికి ప్రదర్శిస్తుంది. ఎందుకు?
జవాబు:
అల్ప ఉష్ణోగ్రతల వద్ద, ఉష్ట్రీయ చలనం తగ్గి, డైపోలులు అయస్కాంత క్షేత్ర దిశలోనికి వచ్చును. కావున పారా అయస్కాంతం ఎక్కువ అయస్కాంతీకరణను ప్రదర్శించును.

b) డయా అయస్కాంతత్వం విషయంలో, పై పరిశీలనకు భిన్నంగా, ఉష్ణోగ్రతపై దాదాపు ఆధారపడదు. ఎందుకు?
జవాబు:
డయా అయస్కాంత నమూనాలో, ప్రతి అణువు తనంతట తాను అయస్కాంత ద్విధృవం కాదు. అణువుల ఉష్ట్రీయ చలనం, అయస్కాంత మచ్చుపై ప్రభావం చూపదు. ఎందుకనగా డయా అయస్కాంతం ఉష్ణోగ్రతపై ఆధారపడదు.

c) టొరాయిడ్లో బిస్మత్ను కోర్గా ఉపయోగిస్తే, కోర్ క్షేత్రం కోర్ ఖాళీగా (ఏమీలేకుండా) ఉన్న దానికంటే (స్వల్పంగా) ఎక్కువాలేదా (స్వల్పంగా) తక్కువా?
జవాబు:
బిస్మత్ డయా అయస్కాంతము కోర్లో క్షేత్రం కోర్ ఖాళీగా ఉంటే ఉన్నదానికంటే స్వల్పంగా తక్కువగా ఉంటుంది.

d) ఫెర్రో అయస్కాంత పదార్థాల పెర్మియబిలిటి. అయస్కాంత క్షేత్రంపై ఆధారపడదా? ఆధారపడకపోతే, అదీ అల్ప క్షేత్రానికి – లేదా అధిక క్షేత్రానికీ, రెండింటిలో దేనికి ఎక్కువ?
జవాబు:
కాదు. ఫెర్రో అయస్కాంత పదార్థాలు పెర్మియబిలిటి అయస్కాంత క్షేత్రంపై ఆధారపడును. శైథిల్య వక్రం నుండి స్పష్టంగా, అల్ప క్షేత్రాలకు µ అధికము.

e) ఫెర్రో అయస్కాంత పదార్థానికి గీచిన అయస్కాంత క్షేత్ర రేఖలు దాని ప్రతి బిందువు వద్ద దాదాపు తలానికి లంబంగా ఉంటాయి. (ఈ సత్యం, వాహకపు ప్రతి బిందువు వద్ద తలానికి లంబంగా స్థిర విద్యుత్ క్షేత్ర రేఖలకు సదృశమైంది) ఎందుకు?
జవాబు:
ఫెర్రో అయస్కాంత పదార్థానికి గీచిన అయస్కాంత క్షేత్ర రేఖలు దాని ప్రతి బిందువు వద్ద దాదాపు తలానికి లంబంగా ఉంటాయి. ఈ ముఖ్య వాస్తవ నిరూపణ, రెండు యానకంల అంతరముఖం వద్ద అయస్కాంత క్షేత్రాలు (B మరియు H) సరిహద్దు నిబంధనలపై ఆధారపడును.

f) పారా అయస్కాంత నమూనాకు గరిష్టంగా సాధ్యమయ్యే అయస్కాంతీకరణ ఫెర్రో అయస్కాంత పదార్థ అయస్కాంతీకరణం పరిమాణ క్రమానికి సమానమేనా?
జవాబు:
అవును. రెండు వేర్వేరు పదార్థాల విడివిడి పరమాణు ద్విధృవాల ధ్రువసత్వాలలో స్వల్ప తేడాలుండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 17.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి :
a) డొమైన్ చిత్రణ ఆధారంగా ఫెర్రో అయస్కాంత పదార్థ అయస్కాంతీకరణ వక్రం అనుత్రమణీయతను (Irreversibility) గుణాత్మకంగా వివరించండి.
జవాబు:
ఫెర్రో అయస్కాంత పదార్ధములో, డొమైన్ల అమరిక వల్ల అయస్కాంత ధర్మాలు కలిగి ఉండును. అయస్కాంత క్షేత్రంతో యదార్థ డొమైన్ను ఏర్పరచలేము.

b) మెత్తని ఇనుప ముక్క హిస్టిరిసిస్ లూప్ వైశాల్యం, కార్బన్ స్టీల్ లూప్ వైశాల్యం కంటే చాలా తక్కువ. పదార్థం పునరావృత అయస్కాంతీకరణ చక్రాలకు పదేపదే గురయితే, ఏ ముక్క ఎక్కువ ఉష్ణశక్తిని దుర్వ్యయం చేస్తుంది?
జవాబు:
కార్బన్ స్టీలు ముక్క కారణం ఒక చక్రమునకు ఉష్ణశక్తి దుర్వ్యయము, వైశాల్యంనకు అనులోమానుపాతంలో ఉండును.

c) హిస్టిరిసిస్ లూపు ప్రదర్శించే ఒక వ్యవస్థ, అంటే ఒక ఫెర్రో అయస్కాంతం వంటిది ‘మెమొరీని నిల్వ చేసే పరికరం’. ఈ ప్రవచనం అర్థాన్ని వివరించండి.
జవాబు:
ఫెర్రో అయస్కాంత అయస్కాంతీకరణం, అయస్కాంత క్షేత్రం ఒకే విలువ గల ప్రమేయం కాదు. దీని నిర్దిష్ట క్షేత్ర విలువ, క్షేత్రం మరియు అయస్కాంతీకరణ చరిత్రపై ఆధారపడును. మరియొక విధంగా చెప్పాలంటే మెమొరీని నిల్వచేసే పరికరం. ఈ చక్రాలకు అనురూపంగా సమాచార బిట్స్ను తయారుచేసి, సమాచారంను నిల్వచేసి మరియు ప్రదర్శించే హిస్టారిసిస్ వ్యవస్థ ఉన్న సాధనం నిల్వ చేయును.

d) కాసెట్ ప్లేయర్లలోని అయస్కాంత టేపుల పూతకు, అలాగే, లేదా ఆధునిక కంప్యూటర్లలోని మెమొరీ స్టోర్ల నిర్మాణానికి ఏ రకమైన ఫెర్రో అయస్కాంత పదార్థాలను ఉపయోగిస్తారు?
జవాబు:
(బేరియం ఇనుము ఆక్సైడ్) ఫెరైట్స్ను వాడతారు.

e) అంతరాళంలోని ఒక ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రాల నుంచి పరిరక్షించడానికి ఒక పద్ధతిని సూచించండి.
జవాబు:
ఇనుము వలయాలు ఆవరించి ఉన్న ప్రాంతంను అయస్కాంత క్షేత్రానికి గురిచేస్తే, అయస్కాంత క్షేత్ర రేఖలు వలయాలలోనికి ప్రవేశించును. లోపలి ప్రాంతం అయస్కాంత క్షేత్ర రేఖల నుండి స్వేచ్ఛగా ఉండును.

ప్రశ్న 18.
ఒక పొడవాటి తిన్నని క్షితిజ సమాంతర కేబుల్లో 2.5 A ల విద్యుత్ ప్రవాహం ఉంది. ఈ విద్యుత్ ప్రవాహ దిశ 10° నైరుతి దిశ నుంచి 10° ఈశాన్య దిశలో ఉంది. ఆ ప్రదేశ అయస్కాంత యామ్యోత్తర రేఖ భౌగోళిక యామ్యోత్తర రేఖకు పశ్చిమంగా 10° కోణం చేస్తోంది. ఆ ప్రదేశంలో భూఅయస్కాంత క్షేత్రం 0.33 G, అవపాతకోణం సున్నా. తటస్థ బిందువుల రేఖను గుర్తించండి. (కేబుల్ మందాన్ని విస్మరించండి). (తటస్థ బిందువుల వద్ద, విద్యుత్ ప్రవాహం గల కేబుల్ వల్ల కలిగే అయస్కాంత క్షేత్రం, భూఅయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశానికి సమానం, వ్యతిరేకం)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 39
i = 2.5 amp
R = 0.33G = 0.33 × 10-4 T; δ = 0°
భూమి క్షితిజ సమాంతర అంశము
H = R cos δ = 0.33 × 10-4 cos 0°
= 0.33 × 10-4 టెస్లా.

కేబుల్ నుండి దూరం వద్ద తటస్థ బిందువును తీసుకుందాము. కేబుల్లోని విద్యుత్ వల్ల ఆ లైన్పై అయస్కాంతక్షేత్ర
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 40
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 41

పట తలంనకు లంబంగా 1.5 cm లంబదూరంలో కేబుల్ లైను సమాంతరంగా తటస్థ బిందువు ఉండును.

ప్రశ్న 19.
ఒక టెలిఫోన్ కేబుల్ నాలుగు తిన్నని పొడవాటి సమాంతర తీగలను కలిగి ఉంది. ఇవి 1.0 A విద్యుత్ ప్రవాహాన్ని తూర్పు నుంచి పడమర దిశవైపు కలిగి ఉన్నాయి. ఆ ప్రదేశంలోని భూఅయస్కాంత క్షేత్రం 0.39 G, అవపాత కోణం 35° అయస్కాంత దిక్పాతం సుమారుగా సున్నా. కేబుల్ క్రింద 4.0 cm దూరంలో ఉండే ఫలిత అయస్కాంత క్షేత్రాలేమిటి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 42
తీగల సంఖ్య, n = 4, i = 1.0amp
భూమి క్షేత్రం R = 0.39 G. = 0.39 × 10-4 T
δ = 35, θ = 0°
R1 = ?, R2 = ?
r = 4 cm (ఒక్కొక్కటి) = 4 × 10-2 m
4 తీగలలో విద్యుత్ ప్రవాహాల వల్ల 4 cm వద్ద అయస్కాతం క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 43

భూమి క్షేత్ర క్షితిజ అంశం,
H = R cos δ = 0.39 × 10-4 cos 35°
= 3.19 × 10-4 × 0.8192 = 3.19 × 10-5 టెస్లా
భూమి క్షేత్ర క్షితిజ అంశం, V = R sin δ = 0.39 × 10 sin 35°
= 0.39 × 10-4 × 0.5736
= 2 2 × 10-5 టెస్లా

తీగకు 4 cm క్రింద, Q బిందువు వద్ద, భూమి క్షేత్ర క్షితిజ అంశం మరియు విద్యుత్ వల్ల క్షేత్రం ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో ఉండును. అందువలన,
H1 = H – B
∴ H1 = 3.19 × 10-5 – 2 × 10-5
= 1.19 × 10-5 టెస్లా.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 44

ప్రశ్న 20.
30 చుట్లు, 12 cm వ్యాసార్థం గల వృత్తాకార చుట్ట కేంద్రం వద్ద సమాంతర తలంలో స్వేచ్ఛగా తిరగగలిగే అయస్కాంత సూదిని ఉంచారు. అయస్కాంత యామ్యోత్తర రేఖతో 45°కోణం చేస్తూ, చుట్ట లంబ తలంలో ఉంది. తీగ చుట్టలో 0.35 A విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు సూది పడమర నుంచి తూర్పు దిశను సూచించింది.
a) ఆ ప్రదేశంలోని భూఆయస్కాంత క్షేత్ర సమాంతర అంశాన్ని నిర్ధారించండి.
b) చుట్టలోని విద్యుత్ ప్రవాహ దిశను ఉత్రమం చేసి, చుట్టను దాని లంబాక్షంపై 90° కోణంతో పై నుంచి చూస్తు, అప సవ్యదిశలో తిప్పారు. సూది దిశను ప్రాగుక్తీకరించండి. ఆ ప్రాంతంలోని అయస్కాంత దిక్పాతాన్ని సున్నాగా తీసుకోండి.
సాధన:
a) n = 30, r = 12 cm 12 × 10-2 m, i = 0.35 amp, H = ?
సూచి పడమర నుండి తూర్పుకు మాత్రమే స్పష్టంగా సూచించును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 45

ప్రశ్న 21.
ఒక అయస్కాంత డైపోల్ను రెండు అయస్కాంత క్షేత్రాల ప్రభావానికి గురిచేశారు. రెండు క్షేత్రాల దిశల మధ్య కోణం 60° మరియు అందులోని ఒక క్షేత్ర పరిమాణం 1.2 × 10-2 T. ఈ క్షేత్రంలో 15° కోణం వద్ద డైపోల్ నిలకడ సమతాస్థితికి చేరుకొంటే, ఇతర క్షేత్రం పరిమాణం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 46
θ = 60°; B1 = 1.2 × 10-2 టెస్లా
θ1 = 15°; θ2 = 60° – 15° = 45°
సమతాస్థితిలో, రెండు క్షేత్రాల వల్ల టార్క్ లు తుల్యమగును.
i.e., τ1 = τ2
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 47

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 22.
18kev ఏకశక్తి కలిగి, క్షితిజ సమాంతర దిశలో ప్రయాణిస్తున్న ఎలక్ట్రాన్ పుంజాన్ని 0.04G క్షితిజ సమాంతర అయస్కాంత క్షేత్రానికి, ఎలక్ట్రాన్ల ప్రవాహ (తొలి) దిశకు లంబదిశలో గురిచేశారు. 30 cm దూరంలో పుంజం పొందే ఊర్థ్వ లేదా అథో అపవర్తనాన్ని అంచనా వేయండి. (me = 9.11 × 10-31 kg). (Note: టి.వి.లోని తెరను ఎలక్ట్రాన్ గన్ నుంచి చేరే ఎలక్ట్రాన్ పుంజం చలనంపై భూఅయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని అవగాహన చేసుకొనే విధంగా ఈ అభ్యాసంలోని దత్తాంశం, జవాబులు ఎంచుకోబడ్డాయి.]
సాధన:
శక్తి E = 18 KeV = 18 × 1.6 × 10-19 J
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 48

ప్రశ్న 23.
ఒక పారా అయస్కాంత లవణ మచ్చు ఒక్కొక్కటి 1.5 × 10-23 J T-1 ద్విధృవ భ్రామకం గల 2.0 × 1024 పరమాణు ద్విధృవాలను కలిగి ఉంది. మచ్చును 0.64 T సజాతీయ అయస్కాంత క్షేత్రంలో ఉంచి, దాన్ని 4.2 K ఉష్ణోగ్రతకు చల్లబరిచారు. 15%. అయస్కాంత సంతృప్తత స్థాయిని పొందారు. 0.98 T అయస్కాంత క్షేత్రానికి, 2.8 K ఉష్ణోగ్రతకు మచ్చు కలిగి ఉండే మొత్తం ద్విధృవ భ్రామకం విలువ ఎంత? (క్యూరీ నియమాన్ని పరిగణించండి)
జవాబు:
ద్విధృవాల సంఖ్య n = 2 × 10-24
ఒక్కొక్క మచ్ఛు ద్విధృవం అయస్కాంత భ్రామకం m¹ = 1.5 × 10-23 JT-1.
మొత్తం మచ్చు ద్విధృవ భ్రామకం = n × m¹ = 2 × 1024 × 1.5 × 10-23 = 30
15% సంతృప్త స్థాయిని చేరితే, తుల్య ద్విధృవ భ్రామకం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 49

ప్రశ్న 24.
800 సాపేక్ష పెర్మియబిలిటి గల ఫెర్రో అయస్కాంత కోర్పై 3500 తీగ చుట్లు చుట్టిన 15 cm సగటు వ్యాసార్థం గల రోలాండ్ రింగ్ ఉంది. అయస్కాంతీకరణ చేసే విద్యుత్ ప్రవాహం 1.2 A అయితే కోర్ కలిగి ఉండే అయస్కాంత క్షేత్రం B విలువ ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 50

ప్రశ్న 25.
క్వాంటం సిద్ధాంతం ప్రాగుక్తీకరించిన ఎలక్ట్రాన్ స్పిన్ కోణీయ ద్రవ్యవేగం S కక్ష్యా కోణీయ ద్రవ్యవేగం 1 లతో అనుబంధితం అయి ఉన్న అయస్కాంత భ్రామక సదిశలు వరసగా µsµlలు (ప్రయోగాత్మకంగా అధిక యదార్ధత ధృవీకరించబడినవి) : µs = -(e/m) S, µl = -(e/2m)1
ఈ రెండు సంబంధాలలో ఏ సంబంధం సంప్రదాయంగా ఆశించే ఫలితానికి అనుగుణంగా ఉంది ? సంప్రదాయ ఫలితం ఉత్పాదనకు చెందిన బాహ్యరూపు రేఖలను (Outline) ఇవ్వండి.
జవాబు:
ఇచ్చిన రెండు సంబంధాలలో, ఒకే ఒకటి సాంప్రదాయక భౌతికశాస్త్రంతో అనుగుణంగా ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 51

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
పటంలో అయస్కాంత సూది అయస్కాంత భ్రామకం 6.7 × 10-2 Am² జడత్వ భ్రామకం, 9 = 7.5 × 10-26 kg m² లను కలిగి ఉంది. అది 6.70 s లలో 10 డోలనాలు పూర్తిచేస్తుంది. అప్పుడు అయస్కాంత క్షేత్ర పరిమాణం ఎంత
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 52

ప్రశ్న 2.
ఒక పొట్టి దండాయస్కాంత అక్షాన్ని 800 G బాహ్య క్షేత్రంతో 30′ కోణంతో ఉంచినప్పుడు అది 0.016 Nm టార్కుకు లోనయ్యింది.
(a) ఆ అయస్కాంతం అయస్కాంత భ్రామకం ఏమిటి?
(b) దాని అత్యంత స్థిరస్థానం నుంచి అత్యంత అస్థిరస్థానానికి కదిలించడానికి జరిగిన పని ఎంత?
(c) ఈ పొట్టి దండాయస్కాంతానికి బదులు 2 × 10-4 m² మధ్యచ్ఛేద వైశాల్యం, 100 చుట్లూ, అంతే అయస్కాంత భ్రామకం గల సాలినాయిడ్ను ఉంచారు. అప్పుడు ఆ సాలినాయిడ్ ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి.
సాధన:
a) సమీకరణం τ = m × B నుంచి, τ = m B sin θ, θ = 30°, కాబట్టి, sin θ = 1/2.
అందువల్ల 0.016 = m × (800 × 10 T) × (1/2)
m = 160 × 2/800 = 0.40 Am²

b) సమీకరణం -m.B నుంచి, అత్యంత స్థిరస్థానం θ = 0° అయితే అస్థిర స్థానం θ = 180° జరిగిన పని
W = Um (θ = 180) – Um (θ = 0′)
= 2 m B = 2 × 0.40 × 800 × 10-4 = 0.064 J

c) ms = NIA. విభాగం (a) నుంచి, ms = 0.40 Am²
= 0.40 1000 × I × 2 × 10-4
I = 0.40 × 104/(1000 × 2) = 2A

ప్రశ్న 3.
a) ఒక దండాయస్కాంతాన్ని రెండు ముక్కలుగా (i) దాని పొడవుకు లంబంగా, (ii) దాని పొడవు వెంబడి ఖండిస్తే ఏమవుతుంది?
b) ఒక ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో అయస్కాంతీకృత సూది ఒక టార్క్కు లోనవుతుంది. కాని నికర బలానికి లోనుకాదు. అయితే, ఒక దండాయస్కాంతం దగ్గర ఉన్న ఒక ఇనుపమేకు మాత్రం టార్కు అదనంగా ఒక ఆకర్షణ బలాన్ని కూడా అనుభవిస్తుంది. ఎందుకు?
c) ప్రతి అయస్కాంతత్వ ఆకృతి ఉత్తర ధృవం, దక్షిణ ధృవం కలిగి ఉండాలా? ఒక టొరాయిడ్ వల్ల జనించే క్షేత్రం మాట ఏమిటి?
d) సర్వసమంగా కనిపించే A, B అనే రెండు ఇనుప కడ్డీలను ఇచ్చారు. ఇందులో ఏదో ఒకదానిని అయస్కాంతీకృతం చేసారని నిశ్చయంగా తెలుసు (దేన్ని చేసారో తెలియదు). రెండింటినీ అయస్కాంతీకృతం చేసారో లేదో అని ఎలా నిర్ధారించుకుంటారు? ఒకవేళ ఒక దానిని మాత్రమే’ అయస్కాంతీకృతం చేసి ఉంటే, దేనిని చేసామో ఎలా నిర్ధారించుకొంటాం? [ఇక్కడ దందాలు A, B లను తప్ప మరేమీ ఉపయోగించకండి.].
సాధన:
a) ఏ సందర్భంలోనైనా, ప్రతిదానికి ఉత్తర, దక్షిణ ధృవాలు ఉన్న రెండు అయస్కాంతాలు లభిస్తాయి.

b) క్షేత్రం ఏకరీతిగా ఉన్నట్లయితే, ఏ బలం ఉండదు. ఇనుపమేకు, దండాయస్కాంతం మూలంగా ఒక అసమరీతి క్షేత్రాన్ని అనుభవిస్తుంది. అప్పుడా మేకులో ప్రేరిత అయస్కాంత భ్రామకం ఉంటుంది. అందువల్ల, అది బలమూ, టార్కూ రెండింటినీ అనుభవిస్తుంది. ఈ నికర బలం ఆకర్షణాత్మకం. ఎందుకంటే, మేకులోని ప్రేరిత దక్షిణ ధృవం దండాయస్కాంత ధృవానికి ప్రేరిత ఉత్తర ధృవం కంటే దగ్గరగా ఉంటుంది.

c) ఆవశ్యకమేమీ కాదు. క్షేత్ర జనకానికి ఒక నికర అశూన్య అయస్కాంత భ్రామకం ఉన్నప్పుడు మాత్రమే అది సత్యం. టొరాయిడ్ లేదా తిన్నని అనంత వాహకానికి సైతం అది అలా కాదు.

d) కడ్డీల విభిన్న కొనలను దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించండి. ఏదో ఒక పరిస్థితిలో తలెత్తే వికర్షణ బలం రెండు కడ్డీలూ అయస్కాంతీకృతం అయినవే అని నిర్ధారిస్తుంది. ఒకవేళ అది ఎప్పుడూ ఆకర్షణ బలం అయినట్లయితే, వాటిలో ఏదో ఒకటి అయస్కాంతీకృతం కానిదై ఉంటుంది. ఒక దండాయస్కాంతంలో అయస్కాంత క్షేత్ర తీవ్రత (intensity) దాని రెండు చివరల (ధృవాల వద్ద ప్రబలంగాను, మధ్యస్థ ప్రాంతంలో దుర్బలంగాను ఉంటుంది. ఈ వాస్తవాన్ని, A, B లలో ఏది అయస్కాంతమో నిర్ధారించడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంలో, ఈ రెండు కడ్డీలలో ఏది అయస్కాంతమో చూడటానికి, ఏదో ఒక కడ్డీని (A అందాం) పట్టుకోండి. ఇప్పుడా కడ్డీ ఏదో ఒక కొనను, తొలుతగా వేరే కడ్డీ (B అందాం) ఒకానొక కొనకు తగిలిద్దాం. ఆ తరువాత B మధ్య ప్రాంతంలో తగిలిద్దాం. B యొక్క ఈ మధ్య ప్రాంతంలో A. ఏ విధమైన బలాన్ని అనుభవించలేదని మీరొక వేళ గమనిస్తే, అప్పుడు B అయస్కాంతీకృతమైనదన్నట్లు. ఒకవేళ B కొన నుంచి దాని మధ్య వరకు మీరు ఏ మార్పును గమనించకపోయినట్లయితే, అప్పుడు A అయస్కాంతీకృతమైనట్లు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 4.
8.0 cm పొడవు ఉన్న ఒక దండాయస్కాంతం మధ్య బిందువు నుంచి 50 cm దూరం వద్ద ఆ దండాయస్కాంతం మూలంగా నెలకొనే మధ్య లంబరేఖా క్షేత్రం, అక్షీయరేఖా క్షేత్రాల పరిమాణాలను లెక్కించండి. 2వ సమస్యలో లాగానే, ఇక్కడ కూడా దండాయస్కాంతం అయస్కాంత భ్రామకం 0.40 Am² గా ఉంది.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 53

ప్రశ్న 5.
బిందువు Q వద్ద ఉంచిన ఒక చిన్న అయస్కాంత సూది P ని పటం చూపిస్తున్నది. బాణం గుర్తు దాని అయస్కాంత భ్రామకం దిశను చూపిస్తున్నది. మిగతా బాణం గుర్తులు దానితో సర్వసమం అయిన వేరొక అయస్కాంత సూది Q యొక్క వివిధ స్థానాలను (మరియు అయస్కాంత భ్రామకం దిగ్విన్యాసాలను చూపిస్తున్నవి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 54
a) ఏ విన్యాసం(configuration) లో వ్యవస్థ సమతాస్థితిలో ఉండదు?
b) ఏ విన్యాసంలో వ్యవస్థ (i) స్థిర సమతాస్థితి, (ii) అస్థిర సమతాస్థితిలో ఉంటుంది?
c) ఇక్కడ చూపించిన విన్యాసాలన్నింటిలో ఏ విన్యాసం అత్యల్ప స్థితిజ. శక్తికి చెంది ఉంటుంది?
సాధన:
ద్విధృవం (P) అయస్కాంత క్షేత్రంలో ద్విధృవం Q కలిగి ఉండే స్థితిజశక్తి వల్ల ఆ అమరికకు స్థితిజశక్తి ఉత్పన్నమవుతుంది. P మూలంగా ఉత్పన్నమయ్యే క్షేత్రాన్ని క్రింది సమాసాల ద్వారా ఇవ్వవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 55

ఇక్కడ mp ద్విధృవం P యొక్క అయస్కాంత భ్రామకం.
mo అనేది Bp కి సమాంతరం అయినప్పుడు సమతాస్థితి స్థిరమైనదిగాను, Bp కి ప్రతిసమాంతరం అయినప్పుడు అది అస్థిరమైనదిగాను ఉంటుంది.

ఉదాహరణకు, ద్విధృవం P యొక్క లంబ సమద్విఖండన రేఖ వెంబడి Q ఉన్నటువంటి అమరిక Q3 విషయంలో Q యొక్క అయస్కాంత భ్రామకం, స్థితి 3 వద్ద ఉన్న అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఉంది. కాబట్టి, Q3 స్థిరం. అందువల్ల,
a) PQ1, PQ2
b) (i) PQ3, PQ6 (స్థిరం); (ii) PQ5, PQ4 (అస్థిరం)
c) PQ6

ప్రశ్న 6.
పటంలో ఇచ్చిన అనేక పటాలలో అయస్కాంత క్షేత్రరేఖలను (దట్టంగా ఉన్న రేఖలను) తప్పుగా చూపించారు. వాటిలో ఏమి తప్పు ఉందో ఎత్తి చూపండి. వాటిలో కొన్ని స్థిరవిద్యుత్ క్షేత్ర రేఖలను సరిగ్గానే చూపించి ఉండవచ్చు. అవి ఏవో ఎత్తిచూపండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 56
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 57
జవాబు:
a) తప్పు, పటంలో చూపించిన విధంగా అయస్కాంత క్షేత్ర రేఖలు ఒక బిందువు నుంచి ఎప్పుడూ బహిర్గతం కాలేవు. ఏదైనా సంవృత ఉపరితలం ద్వారా, నికర అభివాహం B ఎప్పుడూ సున్నానే అయి తీరాలి. అంటే పటంలో ఉపరితలంలోకి ఎన్ని క్షేత్ర రేఖలు వచ్చినట్లుగా కనిపిస్తాయో అన్నే రేఖలు దాని నుంచి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. నిజానికి, పటంలో చూపించిన క్షేత్ర రేఖలు, ఒక పొడవైన ధనాత్మక ఆవేశిత తీగ విద్యుత్ క్షేత్రాన్ని సూచిస్తాయి. సరియైన అయస్కాంత క్షేత్ర రేఖలు అధ్యాయం 7లో వర్ణించినట్లుగా ఆ తిన్నని వాహకం చుట్టూ వృత్తాకారంలో చుట్టి ఉంటాయి.

b) తప్పు. అయస్కాంత రేఖలు (విద్యుత్ క్షేత్ర రేఖల లాగానే) ఒకదానికొకటి ఖండించుకోవు. ఎందుకంటే ఒకవేళ అలాకాక అవి ఖండించుకొంటే, ఆ ఖండన బిందువు వద్ద క్షేత్ర దిశ సందిగ్ధంగా (ambiguous) ఉంటుంది. పటంలో మరో తప్పు ఉంది. స్థిర అయస్కాంత క్షేత్ర రేఖలు ఖాళీ ప్రదేశం చుట్టూతా సంవృత వలయాలను ఎప్పటికీ ఏర్పరచలేవు. స్థిర అయస్కాంత క్షేత్రపు ఒక సంవృత వలయం విద్యుత్ తన ద్వారా ప్రవహిస్తున్న ఒక ప్రదేశాన్ని ఆవృతం చేయాలి. దానికి విరుద్ధంగా, స్థిర విద్యుత్ క్షేత్ర రేఖలు ఖాళీ ప్రదేశంలో గాని లేదా లూప్ విద్యుదావేశాలను ఆవృతం చేసినప్పుడు గాని సంవృత లూప్లను ఏర్పరచలేవు.

c) ఒప్పు. అయస్కాంత రేఖలు ఒక టొరాయిడ్లో సంపూర్ణంగా బంధితమై ఉంటాయి. ప్రతి లూప్ విద్యుత్ ప్రవహిస్తున్న ఒక ప్రాంతాన్ని చుట్టి ఉంటుంది. కాబట్టి, ఇక్కడ క్షేత్ర రేఖలు సంవృత లూప్లను ఏర్పరచడంలో తప్పేమీ లేదు. పటంలో స్పష్టత కోసం, టొరాయిడ్ లోపల కొన్ని క్షేత్ర రేఖలను మాత్రమే చూపిండమైందని గమనించండి. నిజానికి, తీగచుట్టలతో ఆవృతమైన ప్రాంతమంతా అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది.

d) తప్పు. సాలినాయిడ్ చివరల వద్ద, దాని బయటా క్షేత్ర రేఖలు అంత పూర్తిగా తిన్నగాను, బంధితమై ఉండలేవు. అలాంటిది .ఆంపియర్ నియమాన్ని ఉల్లంఘిస్తుంది. సాలినాయిడ్ రెండు కొనల వద్ద ఈ రేఖలు వక్రరూపంలో బయటకు చొచ్చుకు వచ్చి ఎట్టకేలకు సంవృత లూప్లను ఏర్పరుస్తాయి.

e) ఒప్పు. ఇవి ఒక దండాయస్కాంతం బయటా, లోపలా ఉండే క్షేత్ర రేఖలు. లోపల ఉండే క్షేత్ర రేఖల దిశను జాగ్రత్తగా గమనించండి. క్షేత్ర రేఖలు అన్నీ ఉత్తర ధృవం నుంచి బహిర్గతం కావు (లేదా దక్షిణ ధృవం వద్దకు అభిసరణం చెందవు). N-ధృవం, S-ధృవం రెండింటి చుట్టూతా క్షేత్ర నికర అభివాహం సున్నా అవుతుంది.

f) తప్పు. బహుశా ఈ క్షేత్ర రేఖలు ఒక అయస్కాంత క్షేత్రాన్ని సూచించవు. పటంలోని పైన ఉన్న క్షేత్ర ప్రాంతాన్ని చూడండి. క్షేత్ర రేఖలన్నీ ఛాయా ఫలకం (shaded plate) నుంచి బయటకు వస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ఈ ఛాయా ఫలకాన్ని చుట్టుముట్టి ఉన్న ఉపరితలం ద్వారా పోయే నికర అభివాహం సున్నా కాదు. అయస్కాంత క్షేత్రం విషయంలో ఇది అసాధ్యం. ఇక్కడ ఇచ్చిన క్షేత్ర రేఖలు నిజానికి, ఒక ధనవిద్యుదావేశ ఎగువ పలక, రుణ విద్యుదావేశ దిగువ పలక చుట్టూతా ఉన్న స్థిర విద్యత్ క్షేత్ర రేఖలను చూపిస్తున్నాయి. పటం[(e), (f)]ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి.

g) తప్పు, రెండు ధృవపు ముక్కల మధ్య ఉన్న రేఖలు కొనల వద్ద నిక్కచ్చిగా తిన్నగా ఉండజాలవు. రేఖలు కొంత వంపు తిరగడం అనేది తప్పదు. అలాకాకపోతే, ఆంపియర్ నియమం ఉల్లంఘన అవుతుంది. విద్యుత్ క్షేత్ర రేఖల విషయంలో కూడా ఇది నిజం.

ప్రశ్న 7.
a) ఒక చిన్న అయస్కాంత సూది, ఒక రేఖ వెంబడి (ఆ బిందువు వద్ద) ఏ దిశలో అమరి ఉంటుందో ఆ దిశను (ప్రతి బిందువు వద్దా) క్షేత్ర రేఖలు చూపిస్తాయి. చలనంలో ఉన్న ఒక ఆవేశిత కణంపై ప్రతి బిందువు వద్ద బలరేఖలను ఈ అయస్కాంత క్షేత్ర రేఖలు సూచిస్తాయా?
b) ఒక టొరాయిడ్ కోర్ లోపల అయస్కాంత క్షేత్ర రేఖలన్నింటినీ సంపూర్ణంగా బంధించవచ్చు. కాని ఒక తిన్నని సాలినాయిడ్ లోపల బంధించలేము. ఎందుకు?
c) ఒకవేళ, అయస్కాంత ఏక ధృవాలు ఉనికిలో ఉంటే, అయస్కాంతత్వం యొక్క గాస్ నియమాన్ని ఎలా మార్చాల్సి ఉంటుంది?
d) ఒక దండాయస్కాంతం దాని స్వయం క్షేత్రం మూలంగా దానిపైన అదే ఒక టార్క్ను ప్రయోగించుకొంటుందా? విద్యుత్ ప్రవహిస్తున్న ఒక తీగలోని ఒక స్వల్పాంశం అదే తీగ మరో స్వల్పాంశంపై బలాన్ని ప్రయోగిస్తుందా?
e) చలనంలో ఉన్న ఆవేశాల మూలంగా అయస్కాంత క్షేత్రం తలెత్తుతుంది. ఒక వ్యవస్థ నికర ఆవేశం సున్నా అయినప్పటికీ, ఆ వ్యవస్థ అయస్కాంత భ్రామకాలను కలిగి ఉంటుందా?
జవాబు:
a) లేదు. అయస్కాంతీయ బలం Bకి లంబంగానే ఉంటుంది. (అయస్కాంతీయ బలం = qv × B అని గుర్తు తెచ్చుకోండి). అయస్కాంత క్షేత్ర రేఖలను, బలరేఖలుగా పిలవడం అనేది తప్పుదారి పట్టించడం.

b) తిన్నని సాలినాయిడ్ రెండు చివరల మధ్య క్షేత్ర రేఖలన్నీ బంధితమైతే, ప్రతి చివరన ఆ మధ్యచ్ఛేదాల ద్వారా పోయే. అభివాహం సున్నా కానిది అవుతుంది. ఏదైనా ఒక సంవృత ఉపరితలం ద్వారా పోయే క్షేత్రం B యొక్క అభివాహం ఎప్పుడూ సున్నా అయితీరాలి. టొరాయిడ్ విషయంలో ఈ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే, దానికి ఏ ‘చివరలు’ ఉండవు కాబట్టి.

c) ఏదైనా ఒక సంవృత ఉపరితలం ద్వారా పోయే B యొక్క అభివాహం ఎప్పుడూ సున్నా అవుతుందని, అయస్కాంతత్వం యొక్క గాస్ నియమం ప్రవచిస్తుంది \(\int_{\mathrm{s}}\)B. ds = 0.
ఒకవేళ, ఏక ధృవాలు ఉనికిలో ఉన్నట్లయితే, కుడిచేతివైపు ఉన్న పదం S తో ఆవృతమైన ఏకధృవం (అయస్కాంత ఆవేశం) qm కు సమానమయ్యేది. (స్థిర విద్యుత్ శాస్త్రంలోని గాస్ నియమం \(\int_{\mathrm{s}}\)B.ds = µ0qm కు సాదృశ్యంగా, ఇక్కడ qmm అనేది (ఏకధృవం) S తో ఆవృతమైన ఆయస్కాంత ఆవేశం.)

d) లేదు. ఒకానొక స్వల్పాంశంపై ఆ స్వల్పాంశం వల్లనే ఉత్పత్తి అయిన క్షేత్రం మూలంగా బలం లేదా టార్క్ ఉండదు. కాని అదే తీగపై ఉన్న స్వల్పాంశంపై బలం (లేదా టార్క్ ఉంటుంది (ఒక తిన్నని తీగ ఉన్నప్పటి ప్రత్యేక సందర్భంలో, ఈ బలం సున్నా).

e) అవును. ఆ వ్యవస్థలోని ఆవేశం యొక్క సరాసరి సున్నా కావచ్చు.. అంతమాత్రాన, అనేక విద్యుత్ ప్రవాహ లూప్ల వల్ల కలిగే అయస్కాంత భ్రామకాల మాధ్యమం సున్నా అవ్వాలని లేదు. నికర ఆవేశం సున్నా అయినప్పటికీ నికర ద్విధృవ భ్రామకం ఉన్నటువంటి పరమాణువులను కలిగి ఉండే పారా అయస్కాంత పదార్థాలలో మనకి ఇలాంటి ఉదాహరణలు ఎదురవుతాయి.

ప్రశ్న 8.
భూమధ్య రేఖ వద్ద భూఅయస్కాంత క్షేత్రం ఉజ్జాయింపుగా 0.4 G. భూమి ద్విధృవ భ్రామకాన్ని అంచనావేయండి.
సాధన:
సమీకరణం మధ్య లంబరేఖపై అయస్కాంత క్షేత్రం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 58
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 59
ఈ విలువ భూ అయస్కాంత్వం 8 × 1022 Am² విలువకు దగ్గరగా ఉంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 9.
ఒకానొక నిర్దిష్ట ప్రదేశపు అయస్కాంత యామ్యోత్తర తలంలో భూ అయస్కాంత క్షేత్రం క్షితిజ సమాంతర అంశం 0.26 G అవపాత కోణం (dip angle) 60°. ఈ ప్రదేశం వద్ద భూ అయస్కాంత క్షేత్రం ఎంత?
సాధన:
HE = 0.26 G. అని ఇచ్చారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 60

ప్రశ్న 10.
సాపేక్ష పెర్మియబిలిటి 400 గల పదార్థాన్ని కోర్ గా ఒక సాలినాయిడ్ కలిగి ఉంది. సాలినాయిడ్ చుట్టలు కోర్ నుంచి విద్యుద్బంధితమై, వాటిలో 2A విద్యుత్ ప్రవహిస్తున్నది. ఒక మీటర్కు చుట్ల సంఖ్య 1000 ఉన్నట్లయితే(a) H, (b) M, (c) B, (d) అయస్కాంతీకరించే విద్యుత్ ప్రవాహం Imలను లెక్కించండి.
సాధన:
a) క్షేత్రం H అనేది కోర్ పదార్థం మీద ఆధారపడుతుంది. అది
H = nI = 1000 × 2.0 = 2 × 10³ A/m.

b) అయస్కాంత క్షేత్రం,
B = µrµ0, H
= 400 × 4π × 10-7 (N/A²) × 2 × 10³ (A/m) = 1.0 T

c) అయస్కాంతీకరణం,
M = (B – µ0 H)/µ0
= (µrµ0 H – µ0 H) / µ0 = (µr – 1) H = 399 × H × 8 × 105 A/m.

d) అయస్కాంతీకరించే విద్యుత్ ప్రవాహం IM అనేది కోర్ లేనప్పుడు సాలినాయిడ్ చుట్టల ద్వారా ప్రవహింపచేయాల్సిన అదనపు ప్రవాహం. ఇది కోర్ ఉన్నప్పుడు కలిగే B ని ఇస్తుంది. కాబట్టి, B = µrn0 (I + IM) . I = 2A, B = 1 T లను ఉపయోగించి, IM = 794 A పొందుతాం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం

ప్రశ్న 11.
ఫెర్రో అయస్కాంత ఇనుములోని ఒక డొమైన్ (domain) 1pm భుజం పొడవు గల ఘనాకారంలో ఉన్నది.
డొమైన్లోని ఇనుము పరమాణువుల సంఖ్య, గరిష్టంగా సాధ్యమయ్యే ద్విర్భవ భ్రామకం, డొమైన్ అయస్కాంతీకరణాలను అంచనా వేయండి. ఇనుము అణు ద్రవ్యరాశి 55g/mole, దాని సాంద్రత 7.9 g/cm³, ప్రతి ఒక్క ఇనుము పరమాణువు 9.27 × 10-24 Am² ద్విధృవ భ్రామకాన్ని కలిగి ఉన్నదనుకోండి.
సాధన ఘనాకార డొమైన్ ఘనపరిమాణం,
V = (10-6 m)³ = 10-18 m³ = 10-12 cm³
డొమైన్ ద్రవ్యరాశి అంటే దాని ఘనపరిమాణం × సాంద్రత = 7.9 g cm-3 × 10-12 cm³ = 7.9 × 10-12 g
అవగాడ్రో సంఖ్య (6.023 × 1023పరమాణువుల ద్రవ్యరాశి 55g అని ఇవ్వడమైంది. కాబట్టి, డొమైన్లోని పరమాణువుల సంఖ్య
AP Inter 2nd Year Physics Study Material Chapter 8 అయస్కాంతత్వం-ద్రవ్యం 61

అన్ని పరమాణు భ్రామకాలు పరిపూర్ణంగా ఒకే వరసలోకి అమరినప్పుడు (అవాస్తవికం) గరిష్ఠంగా సాధ్యమయ్యే ద్విధృవ
mగరిష్ఠం ని పొందగలుగుతాం. కాబట్టి,
mగరిష్ఠం = (8.65 × 1010) × (9.27 × 10-24)
= 8.0 × 10-13 A m²
పర్యవసానంగా కలిగే అయస్కాంతీకరణ,
Mగరిష్ఠం = mగరిష్ఠం / డొమైన్ ఘనపరిమాణం
= 8.0 × 10-13 Am²/10-18
= 8.0 × 105 Am-1.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 10th Lesson అర్థగణాంక శాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 9th Lesson అర్థగణాంక శాస్త్రం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విస్తరణ ప్రయోజనాలు ఏమిటి ?
జవాబు:
శ్రేణుల యొక్క పంపిణీని తెలియజేసేది విస్తరణ.
బౌలే అభిప్రాయం ప్రకారం “అంశాల విచరణ మానమే విస్తరణ”. బ్రూక్స్ మరియు డిక్ అభిప్రాయం ప్రకారం “సగటు చుట్టూ సంఖ్య దత్తాంశపు విలువలు ఏ స్థాయిలో వ్యాపింపబడి ఉంటాయో దానిని “దత్తాంశ విస్తరణ” అంటారు.

విస్తరణ లక్షణాలు :

  1. విస్తరణ మానం సూక్ష్మంగా గుణించడానికి వీలుగా ఉండవలెను.
  2. విస్తరణ మానం నిర్దిష్టంగా నిర్వచింపబడి ఉండాలి.
  3. విస్తరణ మానం శ్రేణి పంపిణీలో ప్రతి అంశంపై ఆధారపడినదై ఉండాలి.
  4. బీజీయ ప్రస్తావనకు తగినదిగా ఉండవలెను.
  5. విస్తరణ మానంకు ప్రతిచయన సుస్థిరత్వం ఉండవలెను.
  6. విస్తరణ మానం అంత్య అంశాల ద్వారా ప్రభావితం కాకూడదు.

ప్రాముఖ్యత :

  1. సగటు విశ్వసనీయతను నిర్ధారించవచ్చును.
  2. విస్తరణ స్వభావాన్ని, కారణాలను విశ్లేషించడం.
  3. అధ్యయనం చేసిన చలరాశులలో గల విచరణత్వాన్ని అదుపులో, నియంత్రణ చేయడంలో తోడ్పడటం.
  4. ఇతర గణాంక మానాలను కొలవడానికి కొలబద్దగా సహకరించడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 2.
విస్తరణ అనగానేమి ? వివిధ విస్తరణ మానాల పద్ధతుల గురించి వివరించండి.
జవాబు:
కేంద్రస్థానపు కొలతలైన అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం మొదలగునవి దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించే అంకెలను తెలియజేస్తాయి. శ్రేణుల పంపిణీని తెలియజేసేది విస్తరణ.

బౌలే అభిప్రాయం ప్రకారం “అంశాల విచరణ మానమే విస్తరణ”.

బ్రూక్స్ మరియు డిక్ అభిప్రాయంలో “సగటు చుట్టూ సంఖ్యా దత్తాంశపు విలువలు ఏ స్థాయిలో వ్యాపింపబడి ఉంటాయో దానిని దత్తాంశ విస్తరణ” అంటారు.
విస్తరణ మానాలను ఈ క్రింది పద్ధతుల ద్వారా కొలవవచ్చు.

  1. వ్యాప్తి
  2. చతుర్థాంశపు విచలనం
  3. మధ్యమ లేదా సగటు విచలనం
  4. ప్రామాణిక విచలనం
  5. లారెంజ్ వక్రరేఖ

1) వ్యాప్తి : విస్తరణను అధ్యయనం చేయడంలో అతి సులభమైన పద్ధతి వ్యాప్తి. కెండాల్ ప్రకారం “అత్యధిక, అత్యల్ప విలువల తేడాను వ్యాప్తి” గా చెప్పవచ్చు.
ఇందులో
R = L – S
R = వ్యాప్తి
L = అత్యధిక విలువ
S = అత్యల్ప విలువ

2) చతుర్ధాంశ విచలనం : ఇచ్చిన పౌనఃపున్యం విభాజనం ఎగువ, దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని చతుర్థాంశ విచలనమని అంటారు. ఈ చతుర్థాంశ విచలనము మధ్య గతమునకు అటూ, ఇటూ గల వివిధ అంశాలను అధ్యయనం చేస్తుంది. దీనిలో మొత్తం దత్తాంశాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజించినట్లయితే ప్రతి భాగం 25 శాతం విలువను కల్గి ఉంటుంది, దీనితో మనం చతుర్థాంశ విచలనం మరియు మధ్యగతం విలువలను పొందవచ్చును.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 1

Q.D = చతుర్థాంశ విచలనం
Q3 = ఎగువ చతుర్థాంశం
Q1 = దిగువ చతుర్థాంశం

3) మధ్యమ విచలనం : క్లార్క్ అభిప్రాయంలో “విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుండి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం లేదా మధ్యమ విచలనం అంటారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 2
M.D = మధ్యమ విచలనం
f = పౌనఃపున్యం
N = అంశాల సంఖ్య
|D| = మాడ్యులస్

4) ప్రామాణిక విచలనం : విస్తరణ కొలమానాలలో ముఖ్యమైనది ప్రామాణిక విచలనం. దీనిని 1893వ సం॥లో కారల్ పియర్సన్ అభివృద్ధిపరిచారు. దీనిని “విచలనాల వర్గముల సగటు యొక్క వర్గమూలం” అనవచ్చు. విచలనాలను అంక మధ్యమము నుండి తీసుకొనవలసి ఉంటుంది. దీనిని గ్రీక్ అక్షరం (సిగ్మా) తో తెలియజేస్తారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 3

5) లారెంజ్ వక్రరేఖ : విస్తరణ రేఖా పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని లారెంజ్ రేఖాపద్ధతి అంటారు. ఈ పద్ధతి ఆర్థిక అసమానతలను కొలవడానికి, లాభాల పంపిణీ, వేతనాల పంపిణీ మొదలైన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 3.
చతుర్థాంశ విచలన గుణకం గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 4
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 5
దిగువ చతుర్థాంశ గణన = n/4 వ అంశం
= 40/4 = 10వ అంశం
ఇది సంచిత పౌనఃపున్యంలో 13 కంటే తక్కువగా ఉంది. కనుక తరగతి అంతరం 10-20
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 6
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 7

ప్రశ్న 4.
కార్ల్ పియర్సన్ సహ సంబంధ గుణకంను గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 8
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 9
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 10

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
ఈ క్రింది దత్తాంశాన్ని కోటి సహసంబంధంను గణన చేయండి.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 11
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 12

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మధ్యమ విచలనము, ప్రామాణిక విచలనము మరియు చతుర్థాంశ విచలనము మధ్య సంబంధాన్ని నిర్వచింపుము.
జవాబు:
ఇచ్చిన పౌనఃపున్యం విభాజనం ఎగువ, దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని చతుర్థాంశ విచలనమని అంటారు. ఈ పరిస్థితులలో మొత్తం దత్తాంశాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజించినట్లయితే ప్రతి భాగం 25 శాతం విలువను కల్గి ఉంటూ, చతుర్థాంశ విచలనం మరియు మధ్యగతం విలువలను పొందగలము.

మధ్యమ విచలనము : విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుంచి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం అని అంటారు. ప్రామాణిక విచలనం : ప్రామాణిక విచలనాన్ని విచలనాల వర్గముల సగటు యొక్క వర్గమూలమని అనవచ్చును. విచలనాలను అంక మధ్యమం నుండి తీసుకొనవలసి ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 2.
క్రింది అంశాలకు ప్రామాణిక విచలనమును లెక్కకట్టండి.
5, 10, 25, 30, 50.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 13
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 14

ప్రశ్న 3.
లారెంజ్ వక్రరేఖను నిర్వచిస్తూ ఉపయోగించే పద్ధతిని వివరించండి.
జవాబు:
విస్తరణను రేఖాపద్ధతి ద్వారా అధ్యయనం చేయడాన్ని లారెంజ్ వక్రరేఖా పద్ధతి అంటారు. ఈ పద్ధతి ఆర్థిక అసమానతలను కొలవడానికి, లాభాల పంపిణీ, వేతనాల పంపిణీ మొదలైన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ క్రింది వివరాల ఆధారంగా ఒక కంపెనీలో పనిచేస్తున్న ఏ ఉద్యోగస్తుల ఆదాయంతో విచరణత్వం తక్కువగా ఉందో లారెంజ్ వక్రరేఖా పద్ధతి ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 15

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

లారెంజ్ వక్రరేఖ నిర్మాణాలకు ఈ క్రింది నియమాలు పాటించాలి.

  1. దత్తాంశంలోని చలనరాశుల విలువలను, వాటి పౌనఃపున్యాలను సంచితం చేయాలి.
  2. సంచితం చేసిన ఈ రెండు విలువలకు శాతాలను వేర్వేరుగా లెక్కించాలి.
  3. ‘X’ అక్షంపై సంచిత చేసిన పౌనఃపున్యాల సంచిత శాతాలను, Y అక్షంపై సంచితం చేసిన చలనరాశుల శాతాలను చూపాలి.
  4. చలనరాశుల సంచిత శాతాలను వ్యతిరేకంగా, పౌనఃపున్యాల సంచిత శాతాలను గుర్తించి, ఆ బిందువులను కలుపుతూ వక్రరేఖ గీయండి. ఆ రేఖను లారెంజ్ వక్రరేఖ అంటారు.
    AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 16

పై రేఖాపటంలో సమ విభజన రేఖకు (0) లారెంజ్ వక్రరేఖ దూరం ఎక్కువగా ఉంటే విచరణత్వం ఎక్కువగా ఉందని, ఆ రెండు రేఖలు చాలా సమీపంలో ఉండే విచరణత్వం చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చును.

ప్రశ్న 4.
సహ సంబంధం అనగానేమి ? సహ సంబంధం ప్రాముఖ్యత తెలియజేయండి. [Mar ’16]
జవాబు:
ఒక చలరాశిలో వచ్చిన మార్పులు వేరొక చలరాశిలో ఎలాంటి మార్పులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి సహ సంబంధం ఉపయోగపడుతుంది.

A.M. ట్యిటల్ ప్రకారం “రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్యగల విచరణాన్ని అధ్యయం చేయడానికి ఉపయోగపడే గణాంక పద్ధతి.

సిమ్సన్ మరియు కబ్కా ప్రకారం “రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్యగల సంబంధ స్థాయిని నిర్ణయించడానికి ఉపయోగపడే గణాంక పద్ధతి సహ సంబంధం.

  1. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంబంధిత అంశాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
  2. వ్యాపార ఆర్థిక రంగాలకు సంబంధించిన సహ సంబంధం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
  3. ఒక చలనరాశి విలువ ఆధారంగా వేరొక చలనరాశి విలువను అంచనా వేయవచ్చును.
  4. సహ సంబంధం ద్వారా ప్రతిచయన దోషాలను కూడా కొలవవచ్చును.
  5. వ్యాపారవేత్తలకు వ్యయాలను, అమ్మకాలను, ధరను, ఇతర సంబంధిత అంశాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 5.
సూచీ సంఖ్యల రకాలు ఎన్ని ?
జవాబు:
క్రీ.శ. 1764లో మొదటిసారిగా సూచీ సంఖ్యలను ఉపయోగించారు. ధరలలో మార్పులు అధ్యయనం చేయడం |కోసం ఉపయోగించిన సూచీసంఖ్యలు దేశంలోని ఆర్థిక పరిస్థితులు, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

క్రోటాన్ మరియు కౌటన్ ప్రకారం “పరస్పర సంబంధం కలిగి ఉన్న చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడే సాధనాలే సూచీ సంఖ్యలు”.

సూచీ సంఖ్యల వర్గీకరణ : ఆర్థిక వ్యాపార రంగాలలో ఉపయోగించే సూచీ సంఖ్యలను ఈ క్రింది రకాలుగా వర్గీకరించవచ్చును. అవి :

  1. ధరల సూచీ సంఖ్యలు
  2. పరిమాణ సూచీ సంఖ్యలు
  3. విలువ సూచీ సంఖ్యలు
  4. ప్రత్యేక అవసర సూచీ సంఖ్యలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాప్తి. [Mar ’17, ’16]
జవాబు:
విస్తరణను అధ్యయనం చేయడంలో అతి సులభమైన పద్దతి వ్యాప్తి. కెండాల్ ప్రకారం “అత్యధిక, అత్యల్ప విలువల తేడాను వ్యాప్తి” గా పరిగణించవచ్చును.
R=L-S

ప్రశ్న 2.
మధ్యమ విచలనము.
జవాబు:
కేంద్రస్థానపు కొలతల నుంచి తీసుకున్న విచలనాల పరమ సగటుగా మధ్యమ విచలనాన్ని చెప్పవచ్చును. క్లార్క్ అభిప్రాయం ప్రకారం “విచలనం గుర్తుల్ని విస్మరిస్తూ అంక మధ్యమం నుంచి గాని, మధ్యగతం నుంచి గాని, బాహుళకం నుంచి గాని విభాజనంలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం లేదా మధ్యమ విచలనం” అంటారు.
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 17

ప్రశ్న 3.
సహ సంబంధం. [Mar ’17]
జవాబు:
ఒక చలనరాశిలో వచ్చిన మార్పులు వేరొక చలనరాశిలో ఎలాంటి మార్పులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఈ సహ సంబంధం ఉపయోగపడుతుంది. ఇది మూడు రకాలు.

  1. వ్యాపనపటం పద్ధతి
  2. కార్ల్ పియర్సన్ పద్దతి
  3. స్పియర్మన్ కోటి సహ సంబంధ గుణకం.

ప్రశ్న 4.
కోటి సహ సంబంధం.
జవాబు:
1904వ సంవత్సరంలో చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్ మన్ దీనిని ప్రతిపాదించాడు. గుణాత్మక దత్తాంశంలో అంశాలను క్రమ పద్ధతిలో కోడీకృతం చేసి, ఆ చలనరాశుల మధ్య సహ సంబంధ గుణకంను కోటి సహ సంబంధ గుణకం అంటారు.

ప్రశ్న 5.
సూచీ సంఖ్యలు.
జవాబు:
1764వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సూచీ సంఖ్యలను ఉపయోగించారు. పరస్పర సంబంధం కలిగి ఉన్న చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడే సాధనాలే సూచీ సంఖ్యలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం

ప్రశ్న 6.
లాస్పెయిర్ సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 18

ప్రశ్న 7.
పాషి సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 19

ప్రశ్న 8.
ఫిషర్ సూచీ సంఖ్య సూత్రం.
జవాబు:
AP Inter 2nd Year Economics Study Material Chapter 10 అర్థగణాంక శాస్త్రం 20

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 7th Lesson చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 7th Lesson చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆయిర్టెడ్ ప్రయోగం ప్రాముఖ్యత ఏమిటి? [TS. Mar.’17]
జవాబు:
విద్యుత్ ప్రవాహ వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది విద్యుత్ ప్రవాహ వాహకానికి లంబంగా ఉంటుంది. దీనినే ఆయిర్ స్టెడ్ ప్రయోగ ప్రాముఖ్యత అంటారు.

ప్రశ్న 2.
ఆంపియర్, బయోట్-సవర్ట్ నియమాలను తెలపండి.
జవాబు:
ఆంపియర్ నియమం : విద్యుత్ ప్రవాహం గల వాహకం చుట్టూ తీసుకున్న ఒక సంవృత పరిపథంలో \(\overrightarrow{B}.\overrightarrow{dl}\) యొక్క రేఖీయ సమాకలని µ0 కి సమానం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 1

బయోట్-సవర్ట్ సూత్రం :
బయోట్-సవర్ట్ నియమం ప్రకారం అల్పాంశం యొక్క అయస్కాంత ప్రేరణ (dB) విలువ

  1. విద్యుత్ ప్రవాహనికి (i)
  2. అల్పాంశం పొడవుకు (dl)
  3. r మరియు dl మధ్యకోణం sin విలువకు అనులోమానుపాతంలోను మరియు
  4. అల్పాంశం నుండి బిందువు వరకు దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోను ఉంటుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 2 AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 3

ప్రశ్న 3.
విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్ట అక్షంపై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణకు సమాసం రాయండి. దీనినుంచి, దాని కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణను పొందండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 3

ప్రశ్న 4.
‘r వ్యాసార్థం, N చుట్లు ఉన్న వృత్తాకార తీగచుట్టలో “1” విద్యుత్ ప్రవహిస్తుంది. దాని అయస్కాంత భ్రామకం ఎంత?
జవాబు:
అయస్కాంత భ్రామకం (M) = Ni A
M = Ni (πr²) (∵ A = πr²)
∴ M = π N i r²

ప్రశ్న 5.
L పొడవు గల వాహకంలో “i” విద్యుత్ ప్రవహిస్తుంది. దీనిని B ప్రేరణ గల అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దానిపై పనిచేసే బలం ఎంత? ఆ బలం ఎప్పుడు గరిష్టం అవుతుంది?
జవాబు:
i) వాహకంపై పనిచేసే బలం (F) = B i L sin θ

ii) θ = 90° అయితే Fగరిష్టం = B i L

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

అనగా విద్యుత్ ప్రవాహము మరియు అయస్కాంతక్షేత్రము పరస్పరం లంబంగా ఉంటాయి. అందువలన బలం గరిష్టంగా ఉంటుంది.

ప్రశ్న 6.
“q” ఆవేశం ఉన్న కణం, “v” వేగంతో, B ప్రేరణ గల ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో చలిస్తున్నప్పుడు దానిపై పనిచేస్తే బలం ఎంత? అది ఎప్పుడు గరిష్ఠం అవుతుంది?
జవాబు:
i) ఆవేశిత కణంపై పనిచేసే బలం (F) = B q v sin θ.
ii) θ – 90° అయితే Fగరిష్టం = B q v.

ప్రశ్న 7.
అమ్మీటరు, వోల్టు మీటరు మధ్య భేదాలను గుర్తించండి. [AP. Mar, ’15]
జవాబు:

అమ్మీటరు వోల్టు మీటరు
1) దీనిని విద్యుత్ ప్రవాహం కొలిచేందుకు ఉపయోగిస్తారు. 1) దీనిని రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడాలను కొలిచేందుకు ఉపయోగిస్తారు.
2) ఆదర్శ అమ్మీటరు నిరోధం సున్నా. 2) ఆదర్శ వోల్టు మీటరు నిరోధం అనంతం.
3) దీనిని వలయాలలో ఎల్లప్పుడూ శ్రేణిలో కలుపుతారు. 3) దీనిని వలయాలలో ఎల్లప్పుడూ సమాంతరంగా కలుపుతారు.

ప్రశ్న 8.
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరు సూత్రం ఏమిటి?
జవాబు:
విద్యుత్ ప్రవహించే తీగచుట్టను ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దానిపై టార్క్ పని చేస్తుంది. దీనిపై కదిలే తీగచుట్ట గాల్వానా మీటరు ఆధారపడుతుంది.
∴ తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం (i) ∝ అపవర్తన కోణం (θ).

ప్రశ్న 9.
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరు కొలవగల విద్యుత్ ప్రవాహ కనిష్ఠ విలువ ఎంత?
జవాబు:
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరు చాలా సున్నిత గాల్వానా మీటరు. దీనిని ఉపయోగించి 10-9 A వరకు అతిస్వల్ప విద్యుత్ ప్రవాహాలను కొలవవచ్చు.

ప్రశ్న 10.
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరును అమ్మీటరుగా ఎలా మారుస్తావు? [Mar.’14]
జవాబు:
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరుకు సమాంతరంగా స్వల్పనిరోధాన్ని కలిపితే, అమ్మీటరుగా మారుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 4

ప్రశ్న 11.
కదిలే తీగచుట్ట గాల్వనా మీటరును వోల్టు మీటరుగా ఎలా మారుస్తావు? [AP & TS. Mar.’16; TS. Mar:’15]
జవాబు:
కదిలే తీగచుట్ట గాల్వానా మీటరుకు శ్రేణిలో అధిక నిరోధాన్ని కలిపితే వోల్టు మీటరుగా మారుతుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 5

ప్రశ్న 12.
స్వేచ్ఛాంతరాళపు పెర్మిటివిటి ε0, స్వేచ్ఛాంతరాళపు పెర్మియబిలిటి µ0, శూన్యంలో కాంతి వడుల మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
శూన్యంలో కాంతి వేగం (C) = \(\frac{1}{\sqrt{\mu_0 \varepsilon_0}}\)
ఇక్కడ µ0 = m0 = శూన్యయానకం పెర్మియబులిటీ
ε0 = శూన్యంలో పెర్మిటివిటీ

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 13.
విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వృత్తాకార లూప్ మృదువైన క్షితిజ సమాంతర తలంపై ఉంది. లూపు దాని లంబాక్షం పరంగా తిరిగే విధంగా ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయవచ్చా?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 6

ఇక్కడ i విద్యుత్ ప్రవాహం, వైశాల్య సదిశ \(\overrightarrow{A}\), అయస్కాంత క్షేత్రం \(\overrightarrow{B}\). వైశాల్య సదిశ \(\overrightarrow{\tau}\) తీగ చుట్ట తలానికి లంబంగా ఉంటుంది. కాబట్టి నిలువు అక్షంలో టార్క్ (\(\overrightarrow{A}\)) పని చేయదు. అందువలన తీగచుట్ట లంబాక్షంపరంగా తిరిగితే అయస్కాంత క్షేత్రం ఏర్పడదు.

ప్రశ్న 14.
విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార లూప న్ను ఏకరీతి బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచారు. లూప్ స్వేచ్ఛగా తిరగగలిగితే, అది స్థిరమైన సమతాస్థితిని పొందినప్పుడు దాని దిగ్విన్యాసం ఏవిధంగా ఉంటుంది?
జవాబు:
తీగచుట్ట తలం అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా ఉండుటచే దానిపై టార్క్ పనిచేయదు.

ప్రశ్న 15.
విద్యుత్ ప్రవహిస్తున్న క్రమరహిత తీగ లూపు బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచారు. తీగ నమ్యంగా (flexible) ఉంటే, అది ఎటువంటి ఆకారానికి మారుతుంది? ఎందుకు?
జవాబు:
అన్ని ఆకారాలకన్నా వృత్తం యొక్క చుట్టుకొలత అధికం. అందువలన అయస్కాంత అభివాహం గరిష్ఠంగా ఉండుటకు వృత్తం తలము అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉండునట్లు తీసుకుంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బయోట్-సవర్ట్ నియమాన్ని తెలిపి, వివరించండి. [TS. Mar: ’17; AP. Mar.’17; TS. Mar.’16; Mar.’14]
జవాబు:
ఒక వాహకంలో అల్ఫాంశము యొక్క పొడవు dl దీనిగుండా విద్యుత్ ప్రవహిస్తోందనుకోండి. దీనినుండి దూరంలో p బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ (dB) విలువ i) విద్యుత్ ప్రవాహము (i) ii) అల్పాంశము పొడవు (dl) iii) r మరియు dl ల మధ్యకోణం sin విలువకు అనులోమానుపాతంలోను మరియు iv) అల్పాంశం నుండి దూరం యొక్క వర్గానికి విలోమాను పాతంలోను ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 7
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 8

ప్రశ్న 2.
ఆంపియర్ నియమాన్ని తెలిపి, వివరించండి.
జవాబు:
ఆంపియర్ నియమం :
విద్యుత్ ప్రవాహం గల వాహకం చుట్టూ ఒక సంవృత పరిపథంలో \(\overrightarrow{B}.\overrightarrow{dl}\) యొక్క రేఖీయ సమాకలని µ0i కి సమానం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 9

ప్రశ్న 3.
విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం వల్ల కలిగే అయస్కాంత ప్రేరణను కనుక్కోండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 10
ఒక తిన్నని పొడవైన వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తోందనుకొనుము. వాహకం నుండి దూరంలో ఒక బిందువు P ని తీసుకోండి. వాహకం చుట్టూ వ్యాసార్థంలో ఒక వృత్తాన్ని గీయాలి.

ఈ వృత్తంపై అయస్కాంత ప్రేరణ అన్ని బిందువుల వద్ద ఒకేవిధంగా ఉండును. ఒక అల్పాంశం పొడవు dl.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 11
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 12

ప్రశ్న 4.
విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్ట కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణకు సమాసాన్ని బయోట్-సవర్ట్ నియమాన్ని ఉపయోగించి రాబట్టండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 13
ఒక వృత్తాకార తీగచుట్ట వ్యాసార్థము r, దీనిగుండా i విద్యుత్ ప్రవహిస్తోందనుకొనుము. ఒక అల్పాంశం యొక్క పొడవు ‘dl’ అనుకొనుము. తీగచుట్ట కేంద్రము అనుకొనుము. బయోట్-సవర్ట్ నియమం ఉపయోగించి
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 14

వృత్తాకార తీగచుట్టలో అన్ని అల్పాంశాల యొక్క క్షేత్రాలు ఒకేదిశలో ఉండును. (1)వ సమీకరణంసు సమాకలనం చేయగా ఫలిత అయస్కాంత క్షేత్రాన్ని పొందవచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 15

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 5.
విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్ట అక్షంపై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణకు సమాసాన్ని బయోట్ – సవర్ట్ నియమాన్ని ఉపయోగించి రాబట్టండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 16
ఒక వృత్తాకార తీగ చుట్ట వ్యాసార్థం R, దానిలో విద్యుత్ ప్రవాహం i అనుకొనుము. దానికేంద్రము O నుండి x దూరంలో అక్షంపై ఒక బిందువు P ని తీసుకొనుము. అల్పాంశము dl నుండి P వరకు దూరము అనుకొనుము.
బయోట్ – సవర్ట్ నియమం నుండి
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 17

dBని రెండు అంశాలుగా విభజించవచ్చు. dB cosθ మరియు dB sinθ. AB కి వ్యతిరేక దిశలో మరొక అల్పాంశమును తీసుకొనుము. అక్షం వైపు ఉన్న అంశాలను కూడాలి మరియు అక్షానికి లంబంగా ఉన్న అంశాలు రద్దవుతాయి.
P వద్ద ఫలిత అయస్కాంత ప్రేరణ
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 18

ప్రశ్న 6.
విద్యుత్ ప్రవాహ లూస్ అయస్కాంత ద్విద్భవ భ్రామకానికి సమాసాన్ని రాబట్టండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 19
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 20

ప్రశ్న 7.
పరిభ్రమించే ఎలక్ట్రాన్ అయస్కాంత ద్విర్భవ భ్రామకానికి సమాసాన్ని రాబట్టండి. [AP. Mar. 16]
జవాబు:
r వ్యాసార్థం, v వేగం మరియు పౌనఃపున్యము గల ఎలక్ట్రాన్ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుందనుకొందాం. వృత్తాకార కక్ష్యపై P అనే ఒక బిందువును గుర్తించాలి. ప్రతి పరిభ్రమణంలో ఎలక్ట్రాన్ ఈ బిందువును ఒక్కసారి దాటుతుంది. ఒక పరిభ్రమణంలో ఎలక్ట్రాన్ ప్రయాణించిన దూరం = 2πr.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 21

ప్రశ్న 8.
వ్యత్యస్త క్షేత్రాలు (crossed fields) E, B లు వేగ వరణకం (velocity selector) గా ఎలా పనిచేస్తాయో వివరించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 24
q ఆవేశిత కణం, V వేగంలో విద్యుత్ క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్రం రెండింటిలో చలిస్తోందనుకొనుము.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 22
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 23

అందువలన విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం లంబంగా ఉంటాయి.

E మరియు B లను సరిచేసి, వాటి బలాలను సమానం చేస్తే
FE = FB
qE= q υ B
υ = \(\frac{E}{B}\)

ఈ నిబంధన ఉపయోగించి ఆవేశిత కణాల వేగాన్ని నిర్ణయించవచ్చు. అందువలన E మరియు B సదిశా క్షేత్రాలను వేగవరణకంగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 9.
సైక్లోట్రాన్ ప్రాథమిక ఘటకాలు (components) ఏవి? వాటి ఉపయోగాలను పేర్కొనండి.
జవాబు:
ప్రోటాన్లు, α – కణాలు, డ్యుటరాన్లు మొదలగు ధనావేశిత కణాలను త్వరణం చెందించుటకు ఉపయోగించే పరికరాన్ని సైకోట్రాస్ అంటారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 25

సైక్లోట్రాన్లో ప్రాథమిక ఘటకాలు

  1. D ఆకారంలో ఉన్న రెండు లోహపు చాంబర్లు
    D1 మరియు D2
  2. అధిక పౌనఃపున్య డోలకం
  3. బలమైన విద్యుదయస్కాంతం
  4. శూన్య ఆవరణ

సైక్లోట్రాన్ ఉపయోగాలు :

  1. వైద్యశాస్త్రంలో రేడియోధార్మిక పదార్థాలను ఉత్పత్తి చేయడానికి దీనిని వాడతారు. అనగా డయాగ్నస్టిక్ మరియు క్రోనిక్ వ్యాధుల నివారణలో వీటిని వాడతారు.
  2. అయాన్లను చొప్పించి ఘనపదార్థాల నాణ్యతను మెరుగుపరచవచ్చు.
  3. క్రొత్త పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
  4. అధికంగా త్వరణం చెందిన కణాలతో కేంద్రకాలను తాడనం చెందించి కేంద్రక చర్యలను అధ్యయనం చేయవచ్చు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అయస్కాంత క్షేత్రంలో ఉన్న విద్యుత్ ప్రవాహం గల వాహకంపై పనిచేసే బలానికి సమాసాన్ని రాబట్టండి. విద్యుత్ ప్రవహిస్తున్న రెండు సమాంతర వాహకాల మధ్య ఏకాంక పొడవుకు పని చేసే బలానికి సమాసాన్ని ఉత్పాదించండి.
జవాబు:
విద్యుత్ ప్రవహించే వాహకంపై పనిచేసే బలానికి సమీకరణం రాబట్టుట :
ఒక తిన్నని పొడవైన వాహకం పొడవు ‘l’ మరియు అడ్డుకోత వైశాల్యం ‘A’, దానిగుండా ‘i’ విద్యుత్ ప్రవహిస్తోందనుకొనుము. దీనిని ‘B’ అయస్కాంత ప్రేరణ గల క్షేత్రములో ఉంచామనుకొనుము.

వాహకంలో ఎలక్ట్రాన్లపై బలం పనిచేసి, అవి ‘Vd‘ డ్రిఫ్ట్ వేగంతో చలిస్తాయి. సాంప్రదాయ విద్యుత్ ప్రవాహదిశ, డ్రిఫ్ట్ వేగానికి వ్యతిరేకంగా ఉంటుంది. క్షేత్రదిశ ‘B’, విద్యుత్ ప్రవాహ దిశకు ‘θ’ కోణం చేయుచున్నది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 26

Bలో ‘q’ ఆవేశముపై పని చేయు బలం
F’ = q Vd B sin θ

ప్రమాణ ఘనపరిమాణంలో ఎలక్ట్రాన్ల సంఖ్య ‘n’
∴ విద్యుత్ ప్రవాహం (i) = nq Vd A

‘l’ పొడవులో మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య (N) = nlA (∵ n = \(\frac{N}{V}\))
వాహకంపై మొత్తం బలం (F) = F’.N (∵ N = nV = n × A × l)
= (q Vd B sin θ) (nlA)
= (nqVdA) (lB sin θ)
∴ F = ilB sin θ

సందర్భం (i) : θ = 0° అయితే Fకనిష్ఠం = 0

సందర్భం (ii) : θ = 90° అయితే Fగరిష్టం = Bil

రెండు తిన్నని పొడవైన సమాంతర వాహకాల మధ్య పని చేయుబలము :
‘AB మరియు ‘CD’ అను రెండు తిన్నని సమాంతర వాహకాల గుండా ‘i1‘ మరియు ‘i2‘ విద్యుత్లు ప్రవహిస్తున్నాయి. ‘ఇవి గాలిలో ‘r’ దూరంలో ఉన్నాయనుకొనుము.

AB మరియు CD వాహకాల చుట్టూ ఏర్పడే అయస్కాంత ప్రేరణలు B1 మరియు B2. AB వాహకం నుండి r దూరంలో
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 27

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 2.
ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవహిస్తున్న లూప్పై పనిచేసే టార్కు సమాసాన్ని పొందండి. కదిలే తీగచుట్ట గాల్వానా మీటరు నిర్మాణం, పనిచేసే విధానం వర్ణించండి.
జవాబు:
ఏకరీతీ అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవాహ తీగచుట్టలో పని చేసే టార్క్:
ఒక దీర్ఘచతురస్రాకార తీగచుట్ట ABCD యొక్క పొడవు l = AB = CD మరియు వెడల్పు b = AD = BC. దీనిలో విద్యుత్ ప్రవాహము “i” దీనిని B అయస్కాంత అభివాహ సాంద్రత గల క్షేత్రంలో ఉంచామనుకొనుము.

తీగచుట్ట తలం నుండి గీసిన లంబము ON, అయస్కాంత క్షేత్రం B తో చేయు కోణము ‘θ’.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 28

కావున ఈ బలాలు రద్దవుతాయి.
AB భుజంపై బలం = Bil
CD భుజంపై బలం = Bil

ఈ రెండు సమాన మరియు వ్యతిరేక బలాలు తీగచుట్టను త్రిప్పితే బలయుగ్మ భ్రామకం ఏర్పడుతుంది.
టార్క్ (లేదా) బల యుగ్మ భ్రామకం = బలం × లంబదూరం = Bil × (PQ sin θ)
టార్క్ = Bilb sinθ (∴ A = 1 × b)
∴ τ = iAB sin θ

తీగచుట్టలో ‘n’ చుట్లు ఉన్నాయనుకొంటే
τ = n i AB sin θ
‘Φ’ అనునది తీగ ట్ట తలానికి, అయస్కాంత క్షేత్రం B గల కోణం అనుకుంటే
τ = ni AB cos Φ

కదిలే తీగచుట్ట గాల్వనామీటరు :
సూత్రం :
విద్యుత్ ప్రవాహ తీగచుట్టను ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దానిపై టార్క్ పని చేస్తుంది.

నిర్మాణం :

  1. దీనిలో విద్యుత్ బంధిత రాగి తీగతో ఒక ఫ్రేముపై చుట్టిన దీర్ఘచతురస్రాకారపు తీగచుట్ట ఉంటుంది.
  2. ఈ చుట్టను విమోటన శీర్షం నుండి ఒక ఫాస్ఫర్ బ్రాంజ్ తీగతో బలమైన గుర్రపునాడా అయస్కాంత ధ్రువాల మధ్య వ్రేలాడదీస్తారు.
  3. తీగచుట్ట క్రింది కొన ఫాస్ఫార్ బ్రాంజ్ స్ప్రింగ్కు కలుపుతారు.
  4. ఒక చిన్న దర్పణం M ను ఫాస్పార్ బ్రాంజ్ తీగకు వ్రేలాడదీసి తీగచుట్టలో అపవర్తనాన్ని కొలుస్తారు.
  5. ఒక ఇనుప స్థూపాన్ని తీగచుట్ట మధ్యలో బిగిస్తారు. అందువలన అయస్కాంత ప్రేరణ తీవ్రత పెరుగుతుంది.
  6. పుటాకార అయస్కాంత ధ్రువాలు వాటిమధ్య ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని రేడియల్ క్షేత్రంగా చేస్తాయి.
  7. ఈ మొత్తం అమరికను ఒక గాజు కిటికి ఉన్న ఇత్తడి పెట్టెలో ఉంచుతారు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 29

సిద్ధాంతం :
l పొడవు, b వెడల్పు మరియు i విద్యుత్ ప్రవాహం గల దీర్ఘచతురస్రాకార తీగచుట్టను B అయస్కాంత ప్రేరణ గల క్షేత్రంలో వ్రేలాడదీశామనుకోండి.

అపవర్తన టార్క్ (τ) = BiAN → (5)
A = తీగచుట్ట వైశాల్యం,
N = మొత్తం చుట్ల సంఖ్య
పునఃస్థాపక టార్క్ (τ) = C θ → (6)

తీగలో ప్రమాణ పురిపెట్టడానికి అవసరమైన బలయుగ్మభ్రామకం C.
సమతాస్థితిలో, అపవర్తన టార్క్ = పునఃస్థాపక టార్క్
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 30

తీగచుట్టలో అపవర్తనం, దానిలో విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీపము-స్కేలు ఏర్పాటుతో తీగచుట్టలో అపవర్తనాన్ని కొలుస్తారు.

ప్రశ్న 3.
గాల్వనా మీటరును అమ్మీటరుగా ఎలా మార్చవచ్చు? గాల్వనా మీటరుకు సమాంతరంగా కలిపిన నిరోధం గాల్వనా మీటరు నిరోధం కంటే ఎందుకు తక్కువగా ఉంటుంది?
జవాబు:
గాల్వనా మీటరును అమ్మీటరుగా మార్చుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 31
గాల్వానా మీటరుకు తగిన నిరోధాన్ని సమాంతరంగా కలిపితే అమ్మీటరుగా మారుతుంది.

ఈ ఏర్పాటు వల్ల ఫలిత నిరోధం తగ్గుతుంది. విద్యుత్ వలయాలలో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచేందుకు అమ్మీటరును ఉపయోగిస్తారు. వలయంలో అమ్మీటరును కలుపుట వల్ల విద్యుత్ ప్రవాహం మారదు. ఆదర్శ అమ్మీటరు నిరోధము సున్నా.

G మరియు S అనునవి గాల్వానా మీటరు నిరోధం మరియు షంట్ నిరోధాలు. i అనునది మొత్తం విద్యుత్. A వద్ద ig మరియు is గా విభజించబడినాయి.
కిరాఫ్ మొదటి నియమం ప్రకారం, i = ig + is

‘G’ మరియు ‘S’ సమాంతరంగా ఉన్నాయి కనుక
‘మీటరు వద్ద పొటెన్షియల్ తేడా = షంట్ వద్ద పొటెన్షియల్ తేడా
ig G = is S
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 32
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 33

కాబట్టి గాల్వానా మీటరులో విద్యుత్ ప్రవాహము, మొత్తం విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. S గుండా అధికభాగం విద్యుత్ ప్రవహిస్తుంది. మరియు G గుండా తక్కువ భాగం విద్యుత్ ప్రవహిస్తుంది.

సమాంతర నిరోధము గాల్వానామీటరు నిరోధం కన్నా తక్కువగా ఉండుట వల్ల అధిక విద్యుత్ షంట్ గుండా ప్రవహిస్తుంది. కాబట్టి షంట్ వల్ల అధిక విద్యుత్ ప్రవాహాల బారినుండి గాల్వానా మీటరు రక్షింపబడుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 4.
గాల్వనా మీటరును వోల్టు మీటరుగా ఎలా మార్చవచ్చు? శ్రేణి నిరోధం గాల్వనామీటరు నిరోధం కంటే ఎందుకు ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
గాల్వనా మీటరును వోల్టు మీటరుగా మార్చుట : అధిక నిరోధం (R) ను గాల్వానా మీటరుకు శ్రేణిలో కలుపుట వల్ల అది వోల్టు మీటరుగా మారుతుంది. వోల్టు మీటరును వలయంలో రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడాలు కొలిచేందుకు వాడతారు. వోల్టు మీటరును వలయాలలో సమాంతరంగా కలుపుతారు.

‘A’ మరియు ‘B’ బిందువుల మధ్య పొటెన్షియల్ తేడా “V” అనుకొనుము.
∴ V = (R+G) ig [∵ V = iR]
ఇక్కడ G = గాల్వనా మీటరు నిరోధం
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 34

పై సూత్రంను ఉపయోగించి Rవిలువను లెక్కించవచ్చు. గాల్వానా మీటరు వద్ద గరిష్ఠ పొటెన్షియల్ తేడా (Vg) = ig G
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 35

గమనిక :
n = \(\frac{V}{V_g}\) అనునది గరిష్ఠ వోల్టేజికి, గాల్వానా మీటరు వద్ద గరిష్ఠ వోల్టేజికి గల నిష్పత్తి.

శ్రేణి నిరోధము, గాల్వనా మీటరు నిరోధం కన్నా ఎక్కువ. కారణం బాహ్య నిరోధంలో విద్యుత్ ప్రవాహం మరియు పొటెన్షియల్ తేడా తగ్గుతాయి మరియు గాల్వానా మీటరు నిరోధము పెరుగుతుంది.

ప్రశ్న 5.
బాగా పొడవైన విద్యుత్ ప్రవహిస్తున్న రెండు సమాంతర వాహకాల మధ్య పనిచేసే బలానికి సమాసాన్ని రాబట్టండి. దీనినుంచి ఆంపియర్ను నిర్వచించండి.
జవాబు:
రెండు తిన్నని సమాంతర వాహకాల మధ్య పని చేయు బలం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 36
A మరియు B అను రెండు తిన్నని సమాంతర వాహకాల గుండా i1 మరియు i2 విద్యుత్లు ఒకే దిశలో ప్రవహిస్తున్నాయి. వీటిని గాలిలో దూరంలో ఉంచామనుకొనుము.

i1 విద్యుత్ ప్రవాహం వల్ల A వాహకం చుట్టూ అయస్కాంత ప్రేరణ B1 మరియు i2 విద్యుత్ ప్రవాహం వల్ల B వాహకం ట్టూ అయస్కాంత ప్రేరణ B2 ప్రతివాహకం పొడవు l అనుకొనుము.

A నుండి దూరంలో అయస్కాంత ప్రేరణ B1

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 37
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 38
“అనంతమైన పొడవు ఉన్న రెండు తిన్నని సమాంతర వాహకాలు శూన్యంలో 1m ఎడంగా ఉన్నప్పుడు వాటి మధ్య ప్రతి మీటరు పొడవుపై పని చేసే బలం 2 × 10-7Nm ఉండునట్లుగా ఆ రెండు వాహకాలలో ఒక్కొక్క దానిలో ప్రవహించే విద్యుత్ ప్రవాహ విలువను ఒక ఆంపియర్ అంటారు”.

లెక్కలు Problems

ప్రశ్న 1.
10 A విద్యుత్ ప్రవహిస్తున్న బాగా పొడవైన రెండు తీగలను ఒకదానికొకటి సమాంతరంగా 1m దూరంలో ఉంచారు. వాటి మధ్య ఏకాంక పొడవుకు పని చేసే బలం ఎంత? [TS. Mar.’15]
సాధన:
i1 = i2 = 10A
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 39

ప్రశ్న 2.
ఒక కదిలే తీగచుట్ట గాల్వనా మీటరు 10-6 A విద్యుత్ ప్రవాహాన్ని కొలవగలదు. 1A విద్యుత్ ప్రవాహాన్ని కొలవాటంటే షంట్ నిరోధం ఎంత ఉండాలి? గాల్వనామీటర్ నిరోధం GΩ.
సాధన:
గాళ్యానామీటరులో విద్యుత్ ప్రవాహము (ig) 10-6, i = 1A
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 40
G = గాల్వానా మీటరు నిరోధం

ప్రశ్న 3.
30cm వ్యాసార్థం ఉన్న వృత్తాకార లూప్ ద్వారా 3.5 A విద్యుత్ ప్రవహిస్తుంది. దాని అక్షంపై కేంద్రం నుంచి 40 cm దూరంలో ఉన్న బిందువు వద్ద అయస్కాంత క్షేత్రాన్ని కనుక్కోండి.
సాధన:
వ్యాసార్థము (r) = 30 cm = 30 × 10-2m
విద్యుత్ ప్రవాహము (i) = 3.5 A
x = 40 సెం.మీ = 40 × 10-2 m
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 41

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
0.40 A విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్టలో 100 చుట్లు ఉన్నాయి. ప్రతిచుట్ట వ్యాసార్థం 8.0 cm. తీగచుట్ట కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రం B పరిమాణం ఎంత?
సాధన:
ఇక్కడ n = 100, r = 8cm = 8 × 10-2 m, i = 0.40 A
కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రం
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 42
అయస్కాంతక్షేత్ర దిశ, విద్యుత్ ప్రవాహ దిశపై ఆధారపడుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 2.
పొడవైన తిన్నని తీగలో 35 A విద్యుత్ ప్రవహిస్తుంది. తీగ నుంచి 20 cm దూరంలో క్షేత్ర పరిమాణం B ఎంత?
సాధన:
P వద్ద అయస్కాంత క్షేత్రం
I = 35 A, r = 20 cm = 0.2 m
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 43

ప్రశ్న 3.
పొడవైన తిన్నని తీగలో క్షితిజ సమాంతర తలంలో 50 A విద్యుత్, ఉత్తరం నుంచి దక్షిణం దిశకు ప్రవహిస్తుంది. తీగ నుంచి 2.5 m దూరంలో తూర్పు దిశగా B పరిమాణాన్ని, దిశను కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 44
l = 50A మరియు r = 2.5 m
అయస్కాంత క్షేత్ర పరిమాణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 45
అయస్కాంత క్షేత్ర దిశ P వద్ద కాగితపు తలానికి లంబంగా వెలుపలికి పని చేస్తుంది.

ప్రశ్న 4.
పైన ఉండే (overhead) ఒక క్షితిజ సమాంతర విద్యుత్ తీగ ద్వారా తూర్పు నుంచి పడమర దిశలో 90 A విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ తీగలోని విద్యుత్ ప్రవాహం వల్ల, దానికంటే 1.5 m దిగువన అయస్కాంత క్షేత్రం పరిమాణం, దిశ ఏమిటి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 46
అయస్కాంత క్షేత్ర దిశ P వద్ద కాగితపు తలానికి లంబంగా వెలుపలికి ఉంటుంది.

ప్రశ్న 5.
0.15 T ఏకరీతి అయస్కాంత క్షేత్ర దిశతో 30° కోణం చేస్తున్న 8A విద్యుత్ ప్రవహిస్తున్న తీగపై ఏకాంక పొడవుకు పనిచేసే అయస్కాంత బలం పరిమాణం ఎంత ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 47
I = 8 A, 0 = 30°, B = 0.15 T, 1 = 1 m
అయస్కాంత బలం (F) = 1 (1 × B) = Bil. sin θ
= 8 × 1 × 0.15 × sin 30°
= \(\frac{8\times0.15}{2}\) = 4 × 0.15 = 0.6 N/m
బలది కాగితపు తలానికి లంబంగా లోనికి పనిచేస్తుంది.

ప్రశ్న 6.
10 A విద్యుత్ ప్రవహిస్తున్న 3.0 cm పొడవున్న తీగను, సోలినాయిడ్ లోపల దాని అక్షానికి లంబంగా ఉంచారు. సోలినాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రం 0.27T. ఈ తీగపై పనిచేసే అయస్కాంత బలం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 48
ఇక్కడ అయస్కాంత క్షేత్రం మరియు విద్యుత్ ప్రవాహదిశ మధ్యకోణం 90°.
l = 3 cm = 3 × 10-2 m, I = 10A, B = 0.27 T
అయస్కాంత బలపరిమాణం (F) = I l B sin θ°
= 10 × 3 × 10-2 × 0.27 × sin 90°
= 8.1 × 10-2 N
బలదిశ కాగితపు తలానికి లంబంగా లోనికి పనిచేస్తుంది.

ప్రశ్న 7.
4.0cm దూరంలో ఉన్న రెండు పొడవైన సమాంతర తీగలు A, B ల ద్వారా ఒకే దిశలో పోయే విద్యుత్ ప్రవాహాలు వరుసగా 8.0 A, 5.0 A. తీగ A యొక్క 10 cm భాగంపై పనిచేసే బలాన్ని లెక్కకట్టండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 49
ఫ్లెమింగ్ ఎడమ చేతినియమం ప్రకారం బలం B వైపు పని చేస్తుంది.

ప్రశ్న 8.
దగ్గరగా చుట్టిన 80 cm పొడవు ఉన్న సోలినాయిడ్ 5 పొరలు కలిగి ఉంది. ప్రతి పొరలో, 400 చుట్లు ఉన్నాయి. సోలినాయిడ్ వ్యాసం 1.8 cm. ప్రవహించే విద్యుత్ 8.0 A అయితే సోలినాయిడ్ అంతర్భాగంలో దాని కేంద్రం దగ్గర B పరిమాణాన్ని లెక్కించండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 50
సాలినాయిడ్ పొడవు 1 = 80 cm = 0.8 m
పొరల సంఖ్య = 5
ప్రతి పొరలో చుట్లసంఖ్య = 400
సాలినాయిడ్ వ్యాసము = 1.8 cm
విద్యుత్ ప్రవాహం I = 8 A
∴ మొత్తం చుట్ల సంఖ్య N = 400 × 5 = 2000
ప్రమాణ పొడవులో చుట్ల సంఖ్య (n) = \(\frac{2000}{0.8}\) = 2500
సాలినాయిడ్ లోపల అయస్కాంత ప్రేరణ (B) = µ0nI = 4 × 3.14 × 10-7 × 2500 × 8 = 2.5 × 10-2 T అయస్కాంత క్షేత్ర దిశ సాలినాయిడ్ అక్షం వైపు ఉండును.

ప్రశ్న 9.
10 cm భుజం పొడవు గల చతురస్రాకర తీగచుట్టలో 20 చుట్లు ఉన్నాయి. దీనిద్వారా 12 A విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ తీగచుట్టను క్షితిజ లంబంగా వేలాడదీశారు. 0.80 T పరిమాణం ఉన్న ఏకరీతి క్షితిజ సమాంతర అయస్కాంత క్షేత్రంలో తీగచుట్ట తలం యొక్క లంబం 30° కోణం చేస్తుంది. తీగచుట్ట లోనయ్యే టార్క్ పరిమాణం ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 51
తీగచుట్ట భుజం = 10 cm = 0.1 m
(n) = 20, I = 12 A, θ = 30°, B = 0.80 T
టార్క్ (τ) = NI AB sinθ
= 20 × 12 × (10 × 10-2)² × 0.80 × sin 30°
\(\frac{2.4\times0.8}{2}\) = 0.96 N – m

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 10.
M1, M2 అనే కదిలే తీగచుట్ల మీటర్లు క్రింది వివరాలను కలిగి ఉన్నాయి :
R1 = 10 Ω, N1 = 30,
A1 = 3.6 × 10-3 m², B1 = 0.25 T
R2 = 14Ω, N, = N2 = 42
A2 = 1.8 × 10-3 m², B2 = 0.50 T
(ఈ రెండు మీటర్లకు స్ప్రింగ్ స్థిరాంకాలు సర్వసమం)
M1, M2 (a) విద్యుత్ ప్రవాహ సున్నితత్వం, (b) వోల్టేజి సున్నితత్వం నిష్పత్తులను కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 52

ప్రశ్న 11.
ఒక గదిలో (chamber), 6.5 G (1 G = 10-4 T) ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయడమైంది. క్షేత్రంలోకి లంబంగా 4.8 × 106 m s-1 వడితో ఒక ఎలక్ట్రాన్ను వదిలారు. ఈ ఎలక్ట్రాన్ పథం ఎందుకు వృత్తాకారంగా ఉంటుందో వివరించండి. వృత్తాకార కక్ష్యా వ్యాసార్థాన్ని కనుక్కోండి.
(e = 1.5 × 10-19 C, Me = 9.1 × 10-31 kg)
సాధన:
అయస్కాంత క్షేత్రము B = 6.5 G = 6.5 × 10-4T
ఆవేశము (e) = -1.6 × 10-19 C
ఎలక్ట్రాన్ యొక్క వేగము (V) = 4.8 × 106 m/s
ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి (m) = 9.1 × 10-31 kg
అయస్కాంత క్షేత్రం మరియు ఎలక్ట్రాన్ మధ్య కోణం (θ) – 90°
ఆవేశిత కణంపై అయస్కాంత క్షేత్రంలో బలం F = q (V × B) = e (V × b)
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 53

ప్రశ్న 12.
అభ్యాసం 11 లో ఇచ్చిన వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ పరిభ్రమణ పౌనఃపున్యాన్ని పొందం సమాధానం, ఎలక్ట్రాన్ వడిపై ఆధారపడుతుందా? వివరించండి.
సాధన:
B = 6.5 G = 6.5 × 10-4 T, V = 4.8 × 106 m/s, e = 1.6 × 10-19 C
me = 9.1 × 10-31 kg
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 54

ప్రశ్న 13.
(a) 6.0 A విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్టను 1.0 T పరిమాణం ఉన్న ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో క్షితిజ లంబంగా వేలాడదీశారు. దీని వ్యాసార్థం 8.0 cm, చుట్ల సంఖ్య 30. తీగ చుట్ట తలం లంబంతో క్షేత్ర రేఖలు -60° కోణం చేస్తున్నాయి. తీగచుట్ట తిరగకుండా ఆపడానికి అనువర్తించే ప్రతిటార్క్ (counter torque) పరిమాణాన్ని లెక్కించండి.

(b) వృత్తాకార తీగచుట్ట బదులుగా అంతే వైశాల్యం ఉన్న క్రమరహితంగా ఉన్న సమతల తీగచుట్టను ఉంచితే మీ సమాధానం మారుతుందా? (మిగతా అన్నివివరాలు మారకుండా ఉన్నాయి.)
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 55
a) చుట్ల సంఖ్య (n) = 30, వ్యాసార్ధము (r) = 8 cm = 0.08 m
తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహము (I) = 6A, అయస్కాంత ప్రేరణ (B) = 1.0 T, θ = 60°
టార్ (τ) = n I AB sinθ
= 30 × 6 × π (0.08)² × 1 × sin 60°
= 30 × 6 × 3.14 × 0.08 × 0.08 × \(\frac{\sqrt{3}}{2}\)
τ = 3.133 N – m

b) తీగచుట్టపై పనిచేసే టార్క్ దాని ఆకారంపై ఆధారపడదు. దాని వైశాల్యం స్థిరం కనుక టార్క్ కూడా స్థిరంగా ఉంటుంది.

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 14.
ఉత్తరం నుంచి దక్షిణం దిశలో ఉన్న ఒక నిలువు తలంలో X, Y అనే రెండు ఏకకేంద్ర వృత్తాకార తీగచుట్టలు ఉన్నాయి. వాటి వ్యాసార్థాలు వరుసగా 16 cm, 10 cm. X తీగచుట్టలో 20 చుట్లు ఉన్నాయి, దానిలో 16 A విద్యుత్ ప్రవహిస్తుంది. Yతీగచుట్టలో 25 చుట్లు ఉన్నాయి. దానిలో 18 A విద్యుత్ ప్రవహిస్తుంది. పడమరకు అభిముఖంగా ఉండి తీగచుట్టలను చూస్తున్న పరిశీలకునికి, విద్యుత్, X లో అపసవ్యదిశలోను, Yలో సవ్యదిశలోను ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. తీగమట్టలు కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రం పరిమాణం, దిశను తెలపండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 56
X తీగచుట్టలో
వ్యాసార్ధము (rx) = 16 cm = 0.16 m
చుట్ల సంఖ్య (nx) = 20
విద్యుత్ ప్రవాహము (Ix) = 16A

Y తీగచుట్టలో
వ్యాసార్థము (ry) = 10 cm = 0.1m
చుట్ల సంఖ్య (ny) = 25
విద్యుత్ ప్రవాహం (Iy) = 18 A
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 57

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 15.
10cm రేఖీయ పరిమాణం, 10-3 m² మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న ప్రాంతంలో 100 G (1 G = 10-4 T) ఏకరీతి అయస్కాంత క్షేత్రం కావాలి. ఒక కోర్కు ఏకాంక పొడవుకు చుట్టగలిగే చుట్ల సంఖ్య 1000 చుట్లు m-1. తీగచుట్ట ద్వారా ప్రవహించగలిగే గరిష్ఠ విద్యుత్ ప్రవాహం 15 A. ఈ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి, తగిన సోలినాయిడ్ రూపకల్పనకు వివరాలను సూచించండి. కోర్ ఫెర్రో అయస్కాంత పదార్థం కాదని ఊహించండి.
సాధన:
అయస్కాంత ప్రేరణ B = 100 G = 100 × 10-4
గరిష్ఠ విద్యుత్ (I) = 15A, n = 1000/m
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 58
I = 8A and మరియు చుట్ల సంఖ్య n = 1000
మరొక డిజైన్లో I = 10A మరియు n = 800/m.

ప్రశ్న 16.
R వ్యాసార్థం, N చుట్లు ఉన్న వృత్తాకార తీగచుట్టలో 1 విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ తీగచుట్ట అక్షంపై దాని కేంద్రం నుంచి
X దూరంలో ఉన్న బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర పరిమాణం
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 59 అని ఇచ్చారు.
a) తీగచుట్ట కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రానికి, ఇది బాగా తెలిసిన ఫలితాన్ని ఇస్తుందని చూపండి. .
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 60

b) ఒకే చుట్ల సంఖ్య N, వ్యాసార్థం R కలిగి R దూరంలో వేరయి ఉన్న రెండు సమాంతర సహాక్ష వృత్తాకార తీగచుట్ల ద్వారా సమాన విద్యుత్ ప్రవాహాలు ఒకే దిశలో ప్రవహిస్తున్నాయనుకోండి. తీగచుట్ల అక్షంపై వాటి మధ్య ఉన్న బిందువు చుట్టూ Rతో పోల్చినప్పుడు స్వల్పదూరాలకు, క్షేత్రం ఏకరీతిగా ఉంటుందని, ఇది ఉజ్జాయింపుగా B = 0.72 \(\frac{\mu_0 \mathbf{N I}}{\mathbf{R}}\) గా ఉంటుందని చూపండి.
[చిన్న ప్రాంతంలో దాదాపు ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరనే ఏర్పాటును ‘హెల్మ్ హోల్డ్(Helmholtz) తీగచుట్టలు అంటారు.]
సాధన:
రెండు సహక్ష తీగచుట్ల వ్యాసార్థం = R, చుట్ల సంఖ్య = N మరియు విద్యుత్ ప్రవాహము = I
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 61
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 62
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 63

ప్రశ్న 17.
ఒక టొరాయిడ్ కోర్పై (ఫెర్రో అయస్కాంత పదార్థం కాదు) 3500 తీగచుట్లు చుట్టడం జరిగింది. దాని అంతర్ వ్యాసార్థం 25 cm, బాహ్య వ్యాసార్థం 26 cm. తీగలో ప్రవహించే విద్యుత్ 11 A అయితే (a) టొరాయిడ్ వెలుపల, (b) టొరాయిడ్ కోర్ లోపల, (c) టొరాయిడ్తో ఆవరించిన ఖాళీ ప్రదేశంలో అయస్కాంత క్షేత్రం ఎంత?
సాధన:
a) టొరాయిడ్ వెలుపల అయస్కాంత క్షేత్రం శూన్యం. అయస్కాంతక్షేత్రం కేవలం టొరాయిడ్ లోపల, దాని పొడవు వెంట ఉండును.

b) టొరాయిడ్ అంతర వ్యాసార్ధం r1 = 25 cmi = 0.25 m
బాహ్య వ్యాసార్థం, r2 = 26 cm = 0.26 m
చుట్ల సంఖ్య N = 3500
తీగచుట్టలో విద్యుత్ ప్రవాహము, I = 11 A
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 64

c) టొరాయిడ్ లోపల ఖాళీప్రదేశంలో అయస్కాంత క్షేత్రం శూన్యం. కారణం అయస్కాంత క్షేత్రం దాని పొడవు వెంబడి మాత్రమే’ ఉండును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 18.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి :
a) స్థిరమైన దిశ (తూర్పు నుంచి పడమరకు) కలిగి, బిందువు నుంచి బిందువుకు పరిమాణం మారే అయస్కాంత క్షేత్రాన్ని ఒక గదిలో ఏర్పాటు చేయడమైంది. ఈ గదిలోకి ప్రవేశించిన ఆవేశ కణం, స్థిర వడితో అపవర్తనం చెందకుండా సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. కణం తొలివేగం గురించి మీరు ఏమీ చెప్పగలరు ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 65
అయస్కాంత క్షేత్రం దిశ తూర్పు నుండి పడమర వైపు స్థిరంగా ఉంది. ఇచ్చిన ప్రశ్న ప్రకారం ఆవేశిత కణం స్థిరవేగంతో సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తోంది. ఆవేశిత కణంపై అయస్కాంత క్షేత్రం వల్ల కలిగే బలం శూన్యం కావడం వల్ల మాత్రమే ఇది సాధ్యం. చలించే ఆవేశంపై క్షేత్రంలో కలిగే బలం F = qvB sin θ. ఇక్కడ 8 అనునది V మరియు B ల మధ్య కోణం. sin θ = = 0 అయితే F = 0 (v ≠ 0, q ≠ 0, B ≠ 0) అవుతుంది. వేగం మరియు అయస్కాంత క్షేత్రం మధ్యకోణం 0° (లేదా) 180° లను సూచిస్తుంది. అందువలన ఆవేశిత కణం క్షేత్రదిశకు సమాంతరంగా (లేదా వ్యతిరేకంగా చలిస్తుంది.

b) బిందువు నుంచి బిందువుకు దిశ, పరమాణం రెండూ మారుతున్న బలమైన అసమరీతి అయస్కాంత క్షేత్ర పరిసరాల్లోకి ఒక ఆవేశిత కణం ప్రవేశించి, ఒక సంక్లిష్టమయిన ప్రక్షేపక మార్గం అనుసరించి వెలుపలికి వచ్చింది. ఇది పరిసరాలతో అభిఘాతం చెందకుండా ఉంటే, దాని తొలి వడి తుది వడికి సమానంగా ఉంటుందా?
సాధన:
అవును. ఆవేశిత కణంపై పని చేసే బలం కేవలం వేగదిశను మారుస్తుంది కాని వేగ పరిమాణంను మార్చదు. కనుక తుది వేగం, తొలివేగం సమానం.

c) పడమర నుంచి తూర్పుకు ప్రయాణించే ఒక ఎలక్ట్రాన్, ఉత్తరం నుంచి దక్షిణం దిశగా ఏకరీతి స్థిర విద్యుత్ క్షేత్రం ఏర్పాటు చేసిన గదిలోకి ప్రవేశించింది. ఎలక్ట్రాన్ సరళరేఖా మార్గం నుంచి అపవర్తనం చెందకుండా ఉండటానికి ఏ దిశలో ఏకరీతి అయస్కాంత క్షేత్రం ఏర్పాటు చేయాలి?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 66
ఉత్తరం వైపు ధనావేశం, దక్షిణం వైపు ఋణావేశం ఉండుటవలన విద్యుత్ క్షేత్ర దిశ ఉత్తరం నుండి దక్షిణం వైపు ఉంటుంది. అందువలన ఎలక్ట్రాన్లు ధనపలక వైపు ఆకర్షించబడును. ఎలక్ట్రాన్ మార్గంపై అయస్కాంత బలం లేకపోతే దక్షిణం దిశవైపు ఉండును. F = -e(V × B), వేగదిశ పడమర నుండి తూర్పు వైపు ఉంటుంది. బలదిశ దక్షిణం వైపు, క్షేత్ర దిశ కాగితం తలానికి లంబంగా లోనికి ఉంటుంది.

ప్రశ్న 19.
వేడి చేసిన కేథోడ్ నుంచి ఉద్గారమైన ఎలక్ట్రాన్ 2.0 KV పొటెన్షియల్ తేడాగల విద్యుత్ క్షేత్రంలో ప్రయాణించినప్పుడు త్వరణం చెంది, 0.15 T పరిమాణం గల ఏకరీతి అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించింది. క్షేత్రం (a) దాని తొలివేగానికి లంబంగా ఉన్నప్పుడు, (b) తొలి వేగదిశకు 30° కోణం చేస్తున్నప్పుడు, ఎలక్ట్రాన్ ప్రక్షేపక మార్గాన్ని కనుక్కోండి.
సాధన:
పొటెన్షియల్ తేడా (V) = 2KV = 2000 V
ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం (e) = 1.6 × 10-19 C
ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి (m) = 9.1 × 10-31 kg
పొటెన్షియల్ తేడా వలన ఎలక్ట్రాన్ త్వరణం చెంది దానిలో గతిజశక్తిగా మారుతుంది. V అనునది ఎలక్ట్రాన్ వేగం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 67
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 68

ప్రశ్న 20.
హెల్మ్ హోల్డ్ తీగచుట్టలను ఉపయోగించి (అభ్యాసం 16లో వర్ణించడమైంది) ఒక చిన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన అయస్కాంత క్షేత్రం ఏకరీతిగా ఉంటుంది. దాని పరిమాణం 0.75 T. ఇదే ప్రాంతంలో తీగచుట్టల ఉమ్మడి అక్షానికి లంబంగా ఏకరీతి స్థిర విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. 15 kV తో త్వరణం చెందిన ఆవేశిత కణాల సన్నని కిరణపుంజం, తీగచుట్టల అక్షం, స్థిర విద్యుత్ క్షేత్రం రెండింటికి లంబంగా ఈ ప్రాంతంలోకి ప్రవేశించింది. 9.0 × 10-5 V m-1స్థిర విద్యుత్ క్షేత్రం ఉన్నప్పుడు ఈ కిరణపుంజం అపవర్తనం చెందకుండా ఉంటే, కిరణపుంజంలో ఏమి ఉంటాయో ఊహించండి. ఇది ఏకైక (unique) సమాధానం ఎందుకు కాదు?
సాధన:
B = 0.75 T, పొటెన్షియల్ తేడా (V) = 15 KV = 15 × 10³ V
విద్యుత్ క్షేత్రం (E) = 9 × 105 Vm
స్థితిజశక్తి, గతిజశక్తిగా మారును
V = \(\frac{1}{2}\) mv² ……… (1)
విద్యుత్ క్షేత్రం వల్ల కలిగే బలం, అయస్కాంత క్షేత్రం వల్ల కలిగే బలానికి సమానం.
qE= q(V × B)
qE = qVB
V = \(\frac{E}{B}\) ………….. (2)
సమీకరణం (2)ను సమీకరణం (1)లో ప్రతిక్షేపించగా
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 69

ప్రశ్న 21.
0.45m పొడవు, 60 g ద్రవ్యరాశి ఉన్న తిన్నని క్షితిజ సమాంతర వాహక కడ్డీని దాని చివరలకు కట్టిన రెండు నిలువు తీగల ద్వారా వ్రేలాడదీశారు. ఈ తీగల ద్వారా 5.0 A విద్యుత్ ప్రవాహం కడ్డీలో ఏర్పాటు చేశారు.
a) తీగలలో తన్యత శూన్యం కావాలంటే వాహకానికి లంబంగా ఎంత అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలి ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 70
కడ్డీ పొడవు l = 0.45 m
కడ్డీ ద్రవ్యరాశి (m) = 60 gm = 60 × 10-3 kg
విద్యుత్ ప్రవాహం (I) = 5A
అయస్కాంత క్షేత్రం B పని చేసినప్పుడు, అయస్కాంత బలం తీగ భారానికి సమానం మరియు తీగలో తన్యత శూన్యం.
అయస్కాంత బలం = కడ్డీ భారం
I(l × B) = mg (B మరియు l మధ్యకోణం 90°)
IlB sin 90° = mg
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 71

b) ఇంతకు ముందు లాగానే అదే అయస్కాంత క్షేత్రాన్ని ఉంచి, విద్యుత్ను వ్యతిరేక దిశలో ప్రవహింపచేస్తే తీగలలోని మొత్తం తన్యత ఎంత ? తీగ ద్రవ్యరాశిని లెక్కలోకి తీసుకోనక్కర్లేదు) g = 9.8 m s-2.
సాధన:
అయస్కాంతక్షేత్ర దిశ మారితే అయస్కాంత బలం, భారం రెండూ క్రిందకు పని చేస్తాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 72
T = B I l + mg = (0.26 × 5 × 0.45) + (60 + 10-3 × 9.8)
T = 1.176 N

ప్రశ్న 22.
ఆటోమోబైల్ను ఆరంభించే(starting) మోటారును, బ్యాటరీని కలిపే తీగలలో ప్రవహించే విద్యుత్ 300 A (స్వల్ప కాలాలకు). ఈ తీగల పొడవు 70 cm ఉండి వాటిని 1.5 cm ఎడంగా ఉంచితే, ఏకాంక పొడవుకు వాటి మధ్య పనిచేసే బలం ఎంత? ఇది ఆకర్షణ బలమా లేదా వికర్షణ బలమా?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 74
I1 = I2 = 300 A
దూరం (r) = 1.5 cm = 1.5 × 10-2 m
పొడవు (l) = 70 cm
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 73
విద్యుత్ ప్రవాహాలు వ్యతిరేక దిశలలో ఉన్నాయి కనుక వాటిమధ్య వికర్షణ బలం పని చేస్తుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 23.
10.0 cm వ్యాసార్థం స్తూపాకార ప్రాంతంలో, దాని అక్షానికి సమాంతరంగా, తూర్పు నుంచి పడమర దిశలో, 1.5 T ఏకరీతి అయస్కాంత క్షేత్రం ఉంది. 7.0 A విద్యుత్ ప్రవహిస్తున్న తీగ, ఉత్తరం నుంచి దక్షిణ దిశలో ఈ’ ప్రాంతం ద్వారా వెళుతుంది.
a) తీగ అక్షాన్ని ఖండించినప్పుడు
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 75
B = 1.57
వ్యాసార్థం = 10 cm = 0.1 m
విద్యుత్ ప్రవాహం (I) = 7A
బలం (F) = I(l × B = IIB sin 90°
∴ తీగపై బలం (F) = I × 2r × B = 7 × 2 × 0.1 × 1.5 = 21 N
ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం ప్రకారం బలం, కాగితం తలానికి లంబంగా లోనికి పని చేస్తుంది.
F = 2.1 N

b) తీగ ఉత్తర – దక్షిణం నుంచి ఈశాన్యం – వాయువ్యం దిశకు తిరిగితే,
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 76
క్షితిజ సమాంతర అంశము ఎలాంటి బలం కలిగించదు.
క్షితిజ లంబ అంశము (Y) = స్థూపం వ్యాసం
బలం (F) = I l B sin 90°
= 7 × 0.1 × 1.5 × 2 × 1
= 2.1 N
ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం ప్రకారం బలం, కాగితం తలానికి లంబంగా లోనికి పని చేస్తుంది.

c) ఉత్తర-దక్షిణ దిశలో ఉన్న తీగను అక్షం నుంచి 6.0 cm దూరం క్రిందకు దించినప్పుడు తీగపై పనిచేసే బలం దిశ, పరిమాణం ఏమిటి ?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 77
తీగ 6 cm దూరం జరిగితే, తీగ యొక్క కొత్తస్థానం CD
OE = 6 cm
OD = 10 cm
DE = EC = X
ODE నుండి D² = OE² + DE²
100 = 36 + DE²
DE²= 64 ⇒ DE = 8 cm
l¹ = CD = 2DE = 16 cm = 0.16 m
బలపరిమాణం (F¹) = I ( × B) = 7. × 0.16 × 1.5 × sin 90° = 1.68 N
బలదిశ కాగితపు తలానికి లంబంగా క్రిందకు పని చేస్తుంది.

ప్రశ్న 24.
ధన, z-అక్షం వెంబడి 3000 G ఏకరీతి అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. 10 cm, 5 cm భుజాలుగా గల ఒక దీర్ఘచతురస్రాకార లూప్ ద్వారా 12 A విద్యుత్ ప్రవహిస్తుంది. పటంలో చూపిన వివిధ సందర్భాల్లో లూప్పై పనిచేసే టార్క్ ఎంత? ప్రతి సందర్భంలో పనిచేసే బలం ఎంత? ఏ సందర్భానికి స్థిరమైన సమతాస్థితి ఉంటుంది?
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 78
సాధన:
z–అక్షం దిశలో ఏకరీతి అయస్కాంత క్షేత్రం (B) = 3000 G = 3000 × 10-4 = 0.3 T
దీర్ఘచతురస్ర చుట్ట వైశాల్యం (A) = 10 × 5 = 50 cm² = 50 × 10-4
విద్యుత్ ప్రవాహం (I) = 12 A
టార్ (τ) = I(A × B)

a) B=0.3 KT (Z – అక్షం దిశలో)
A = 50 × 10-4 m² (x అక్షం దిశలో)
మరియు I = 12 A
τ = 12(50 × 10-4 i × 0.3 K)
τ = -1.80 × 10-2 J N-m
టార్క్ ఋణ Y-అక్షం దిశలో పని చేస్తుంది.

b) B = 0.3 KT, A = 50 × 10-4 i m² మరియు I = 12 A
టార్క్ (τ) = I(A × B) = 12 × 50 × 10 i × 0.3
= -1.80 × 10² JNm
టార్క్ ఋణ Y-అక్షం దిశలో పని చేస్తుంది.

c) B = 0.3 KT, A = 50 × 10-4 (-J)m² మరియు I = = 12 A
టార్క్ (τ) = 12(-50 × 10-4 J × 0.3 K
=-1.80 × 10² i N-m
టార్క్ ఋణ X-అక్షం దిశలో పని చేస్తుంది.

d) B = 0.3 KT, A = 50 × 10-4 m² మరియు I = 12 A
టార్క్ (τ) = 12 × 50 × 10-4 × 0.3 = 1.80 × 10-2 N-m
ఋణ X-అక్షం దిశలో (900 + 300) పని చేస్తుంది. ధన X-అక్షం దిశలో 3600-1200 = 2400 టార్క్ పని చేస్తుంది.

e) B = 0.3 KT, A = 50 × 10-4 km-4 మరియు I = 12 A
టార్క్ (τ) = 12(50 × 10-4 K × 0.3 K) = 0

f) B = 0.3 KT, A = -50 × 10-4 km-4 మరియు I = 12 A
టార్క్ (τ) = 12(–50 × 10-4 K × 0.3 K) = 0

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 25.
10 cm వ్యాసార్థం, 20 చుట్లు ఉన్న వృత్తాకార తీగచుట్టను, 0.10 T ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో, తీగచుట్ట తలానికి లంబంగా ఉండేట్లు ఉంచారు. తీగచుట్ట ద్వారా ప్రవహించే విద్యుత్ 5.0 A అయితే,
(a) తీగచుట్టపై పనిచేసే మొత్తం టార్క్,
(b) తీగచుట్టపై పనిచేసే బలం,
(c) అయస్కాంత క్షేత్రం వల్ల తీగచుట్టలోని ప్రతి ఎలక్ట్రాన్పై పనిచేసే సగటు బలాలను లెక్కించండి.
(10-5 m² మధ్యచ్చేద వైశాల్యం ఉన్న రాగి తీగతో తీగచుట్టను తయారుచేశారు. రాగిలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్ సాంద్రత సుమారుగా 1029 m-3 ఉంటుందని ఇచ్చారు.)
సాధన:
చుట్ల సంఖ్య (n) = 20, వృత్తాకార తీగ చుట్ట వ్యాసార్థం (r) = 10 cm = 0.1 m,
అయస్కాంత ప్రేరణ (B) = 0.1 T,
వైశాల్య సదిశ మరియు అయస్కాంత ప్రేరణ మధ్యకోణం (0) = 0°
విద్యుత్ ప్రవాహం (1) = 5A

a) తీగ చుట్టపై టార్క్ (T) = nIAB sin θ = 20 × 5 × π (0.1)² × sin θ = 0.

b) తీగచుట్ట ఎదురెదురు తలాలపై పనిచేయు బలం సమానం మరియు వ్యతిరేకం.
కావున తీగచుట్టపై మొత్తం బలం శూన్యం.
∵ (F1 = -F2 మరియు F3 – F4)

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 80
c) ఎలక్ట్రాన్ల సాంద్రత (N) = 1029/m³
వైశాల్యం (A) = 10-5
బలపరిమాణం (F) = e(vd × B)
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 79

ప్రశ్న 26.
60 cm పొడవు, 7.0 cm వ్యాసార్థం ఉన్న సోలినాయిడ్లో 3 పొరలలో చుట్లు చుట్టి ఉన్నాయి. ప్రతి పొరకు 300 చుట్లు ఉన్నాయి. సోలినాయిడ్ లోపల దాని అక్షానికి లంబంగా (దాని కేంద్రానికి దగ్గరగా 2.0 cm పొడవు, 2.5 g ద్రవ్యరాశి ఉన్న ఒక తీగ ఉంది. తీగ, మరియు సోలినాయిడ్ అక్షం రెండూ క్షితిజ సమాంతర తలంలో ఉన్నాయి. ఈ తీగను, సోలినాయిడ్ అక్షానికి సమాంతరంగా ఉన్న రెండు చాలక తంత్రుల (leads) ద్వారా 6.0 A విద్యుత్ను సరఫరా చేసే బ్యాటరీకి కలిపారు. సోలినాయిడ్ చుట్లలోని ఏ విద్యుత్ ప్రవాహ విలువ (ప్రసరణ దిశ తగు విధంగా ఉంటూ) తీగ భారాన్ని మోయగలదు? g = 9.8 m s-2.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 81
సాలినాయిడ్ పొడవు l = 60 cm
వ్యాసార్ధము = 4.cm
పొరల సంఖ్య = 3
ప్రతిపొరలో చుట్ల సంఖ్య = 300
తీగ యొక్క పొడవు lw = 2 cm
ద్రవ్యరాశి m = 2.5 gm
విద్యుత్ ప్రవాహము lw = 6A
సోలీనాయిడ్లో విద్యుత్ ప్రవాహం I అయితే సోలినాయిడ్లో అయస్కాంత ప్రేరణ (B) = µ0ni
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 82

ప్రశ్న 27.
ఒక గాల్వనా మీటరు తీగచుట్ట నిరోధం 12Ω. ఇది 3 mA విద్యుత్ ప్రవాహానికి పూర్తి స్కేలు అపవర్తనం చూపిస్తుంది. దీనిని 0 నుంచి 18 V ల వ్యాప్తి ఉన్న వోల్టు మీటరుగా మీరు ఏ విధంగా మారుస్తారు?
సాధన:
గాల్వానా మీటరు నిరోధం (G) = 12Ω,
గాల్వానా మీటరులో విద్యుత్ ప్రవాహం (Ig) = 3mA = 3 × 10-3 A,
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 83

ప్రశ్న 28.
గాల్వనా మీటరు తీగచుట్ట నిరోధం 15 Ω. ఇది 4 mA విద్యుత్ ప్రవాహానికి పూర్తి స్కేలు అపవర్తనం చూపిస్తుంది. దీనిని 0 నుంచి 6 Aల వ్యాప్తి ఉన్న అమ్మీటరుగా మీరు ఏ విధంగా మారుస్తారు?
సాధన:
గాల్వానా మీటరు నిరోధము (G) = 15Ω,
గాల్వానా మీటరులో విద్యుత్ ప్రవాహము (Ig) =4 × 10-3A, I = 6A
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 84
S = 0.01 0 షంట్ను గాల్వానా మీటరుకు సమాంతరంగా కలపాలి.

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
1.5 m పొడవు, 200 g ద్రవ్యరాశి ఉన్న తిన్నని తీగ గుండా 2 A విద్యుత్ ప్రవహిస్తుంది. పటంలో చూపినట్లు ఏకరీతి అయస్కాంత క్షేత్రం B వల్ల ఈ తీగను గాలిలో కిందకి పడకుండా ఉండేటట్లు చేశారు. అయస్కాంత క్షేత్ర పరిమాణం ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 85
సాధన:
II B పరిమాణం ఉన్న F అనే ఊర్థ్వబలం పని చేస్తుందని (=Il × B) మనకు తెలుస్తుంది. గాలిలో కిందకి పడకుండా ఉండేటట్లు చేయడానికి ఈ బలం గురుత్వ బలంతో సంతులనం కావాలి.
mg = IIB
B = \(\frac{\mathrm{mg}}{\mathrm{I} l}=\frac{0.2 \times 9.8}{2 \times \mathrm{l} .5}\) = 0.65 T
ఏకాంక పొడవుకు తీగ ద్రవ్యరాశి m/l ని చెప్పుకుంటే సరిపోయేది. భూఅయస్కాంత క్షేత్రం దాదాపు 4 × 10° T కాబట్టి, దానిని మనం ఉపేక్షించడమైంది.

ప్రశ్న 2.
అయస్కాంత క్షేత్ర ధన y-అక్షానికి సమాంతరంగా ఉండి, X- అక్షం దిశలో ఆవేశిత కణం చలిస్తున్నట్లయితే (పటం), (a) ఎలక్ట్రాన్ (రుణావేశ కణం), (b) ప్రోటాన్ (ధనావేశం)లకు లోరెంజ్ బలం ఏ దిశలో ఉంటుంది?
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 86
సాధన:
కణం – అక్షం దిశలో వేగంతో చలిస్తుంటే B y అక్షం దిశలో ఉండటం వల్ల vx Bz-అక్షం దిశలో ఉంటుంది. (మర సూత్రం లేదా కుడిచేతి బొటనవేలు సూత్రం). కాబట్టి (a) ఎలక్ట్రాన్కు -z అక్షం దిశలో ఉంటుంది. (b) ధనావేశానికి (ప్రోటాన్) బలం +z అక్షం దిశలో ఉంటుంది.

ప్రశ్న 3.
6 × 10-4 T అయస్కాంత క్షేత్రానికి లంబంగా 3 × 107 m/s వేగంతో చలిస్తున్న ఎలక్ట్రాన్ (ద్రవ్యరాశి 9 × 10-31 kg, ఆవేశం 1.6 × 10-19 C) పథం వ్యాసార్థం ఎంత? దాని పౌనఃపున్యం ఎంత ? శక్తిని keV లలో లెక్కించండి. (1 eV = 1.6 × 10-19 J).
సాధన:
సమీకరంణం r = mυ/qB ను ఉపయోగిస్తే,
r = mυ/(qB) = 9 × 10-31 kg × 3 × 107 m s-1 / (1.6 × 10-19 C × 6 × 10-4T)
= 26 × 10-2 m = 26 cm
v = υ / (2 πr) = 2 × 106 s-1 = 2 × 106 Hz = 2MHz.
E = (½) mυ² = (½) 9 × 10-31 kg × 9 × 1014 m²/s² = 40.5 × 10-17 J
= 4 × 10-16 J = 2.5 keV.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 4.
ఒక సైక్లోట్రాన్ డోలక పౌనఃపున్యం 10 MHz. ప్రోటాన్లను త్వరణం గావించడానికి ప్రచాలన (operating) అయస్కాంత క్షేత్రం ఎంత ఉండాలి? డీల వ్యాసార్థం 60 cm ఉంటే త్వరణకారిలో జనించే ప్రోటాను పుంజం గతిజశక్తి (MeV లలో) ఎంత? (e = 1.60 × 10-19 C, mp = 1.67 × 10-27 kg, 1 MeV = 1.6 × 10-13 J),
సాధన:
డోలక పౌనఃపున్యం, ప్రోటాన్ యొక్క సైక్లోట్రాన్ పౌనఃపున్యానికి సమానంగా ఉండాలి.
సమీకరణాలను ఉపయోగిస్తే r = mυ/qb మరియు o = 2πυ = \(\frac{qB}{m}\)
B = 2r m υ/q = 6.3 × 1.67 × 10-27 × 107 / (1.6 × 10-19) = 0.66 T
ప్రోటాన్ల తుది వేగం
υ = r × 2π v = 0.6 m × 6.3 × 107 = 3.78 × 107 m/s.
E = ½ mv² = 1.67 × 10-27 × 14.3 × 1014 / (2 × 1.6 × 10-13) = 7 MeV.

ప్రశ్న 5.
అధిక విద్యుత్ ప్రవాహం I = 10 A ప్రవహిస్తున్న ∆1 = ∆ x \(\hat{i}\) అనే మూలకం మూలబిందువు వద్ద కలదు. (పటం) 0.5 m దూరంలో y-అక్షంపై అయస్కాంత క్షేత్రం ఎంత? ∆x = 1 cm.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 87
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 88
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 89

ప్రశ్న 6.
A విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్న తిన్నని తీగను 2.0 cm వ్యాసార్థం ఉన్న అర్థ వృత్త చాపంగా పటంలో చూపినట్లు వంచారు. చాపం కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రం B ని పరిగణిద్దాం. (a) తిన్నని ఖండాల (segments) వల్ల అయస్కాంత క్షేత్రం ఎంత? (b) Bకి అర్థ వృత్తం నుంచి కలిగే అంశదానం, వృత్తాకార ఉచ్చు నుంచి కలిగే అంశదానంతో ఏ విధంగా నేరుగా ఉంటుంది, ఏ విధంగా పోలిక కలిగి ఉంటుంది? (c) పటంలో చూపినట్లు తీగను అంతే వ్యాసార్థం ఉన్న అర్ధవృత్తంగా వ్యతిరేక దిశలో వంచితే మీ సమాధానం మారుతుందా?
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 90
సాధన:
a) తిన్నని ఖండాల ప్రతి మూలకానికి dl, rలు సమాంతరంగా ఉంటాయి. కాబట్టి, dl × r=0. తిన్నని ఖండాలు |B| కి అంశదానాన్ని ఇవ్వవు.

b) అర్థవృత్తాకార చాపం అన్ని ఖండాలకు dl × rలు అన్నీ ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి (పుట తలానికి లోపలికి అటువంటి అన్ని అంశదానాల పరిమాణాలు కలుస్తాయి. కుడిచేతి నిబంధన అర్థవృత్త చాపానికి B దిశని ఇస్తుంది. పరిమాణం వృత్తాకార ఉచ్చు వల్ల కలిగే పరిమాణంలో సగం ఉంటుంది. అందువల్ల B విలువ 1.9 × 10-4 T పుట తలానికి లంబంగా లోపలివైపుకు ఉంటుంది.

c), b) లో వచ్చిన B పరిమాణానికి సమానంగా, దిశలో వ్యతిరేకంగా ఉంటుంది.

ప్రశ్న 7.
10cm వ్యాసార్థం కలిగి, 1A విద్యుత్ ప్రవహిస్తున్న బిగుతుగా చుట్టిన 100 చుట్లు ఉన్న తీగ చుట్టను పరిగణించండి. తీగచుట్ట కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్ర పరిమాణం ఎంత?
సాధన:
తీగచుట్టను బిగుతుగా చుట్టడం వల్ల ప్రతి వృత్తాకార మూలకానికి ఒకే వ్యాసార్థం R = 10 cm = 0.1 m ఉన్నట్లు
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 91

ప్రశ్న 8.
విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన తీగ వల్ల అయస్కాంత క్షేత్రం : విద్యుత్ ప్రవహిస్తున్న తీగచుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని ఆయిర్ స్టెడ్ ప్రయోగాలు తెలిపాయి. I విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన తిన్నని తీగ నుంచి కొంత దూరంలో అయస్కాంతక్షేత్రాన్ని నిర్ధారిద్దాం.
సాధన:
కుడిచేతి నిబంధన ద్వారా క్షేత్రం దిశను ఇస్తారు. విద్యుత్ ప్రవహిస్తున్న తీగ మూలకం dlను పటంలో చూపడమైంది.

ఎక్కడైతే క్షేత్రాన్ని నిర్ధారించాలనుకొంటున్నామో ఆ బిందువు P నుంచి తీగకు ఉన్న లంబ దూరం ‘s’. dl నుంచి P కి గల స్థాన సదిశ r.

బయోట్-సవర్ట్ నియమం, dl వల్ల అయస్కాంత క్షేత్రం పరిమాణం dBని ఇస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 92

ప్రశ్న 9.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 93
సాధన:
a) అపసవ్య దిశలో పథం చుట్టూ వెళ్ళినప్పుడు, I, ను ధనాత్మకంగా తీసుకొంటే, I, రుణాత్మకం అవుతుంది. 12, 14 విద్యుత్ ప్రవాహాలు పథంతో అప్పడం అవలేదు కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకోనక్కరలేదు…

సూచన :
I2, I4 విద్యుత్ ప్రవాహాలు వాటి చుట్టూ అయస్కాంత క్షేత్రాలను ఏర్పరుస్తాయి. వీటివల్ల కలిగే B పథంపై ఏ మూలకం పైన అయినా శూన్యం కాదు. అయితే వాటి వల్ల కలిగే B.dl మొత్తం శూన్యమవుతుంది.

b) మొత్తం పథానికి B. dl గణనను రెండు వేరు వేరు గణనలుగా విడగొట్టవచ్చు. ఒకటి I1 చుట్టూ అపసవ్య దిశలో ప్రయాణించినప్పుడు అన్ని అంశదానాలను తీసుకొంటూ, ఇంకొకటి I3 చుట్టూ సవ్య దిశలో ప్రయాణించినప్పుడు అన్ని అంశదానాలను తీసుకొంటూ. అందువల్ల
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 95

ప్రశ్న 10.
నిలకడ విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్న వ్యాసార్థం ఉన్న పొడవైన తిన్నని తీగ వృత్తాకార మధ్యచ్చేదాన్ని పటం చూపుతుంది. మధ్యచ్ఛేదం అంతా విద్యుత్ ప్రవాహం I ఏకరీతిగా వితరణ చేయబడింది. a (చుక్కల గీతలతో చూపిన బాహ్య వృత్తం) ఉన్న ప్రాంతంలో అయస్కాంత క్షేత్రాన్ని లెక్కించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 96
సాధన:
a) r > a సందర్భాన్ని పరిగణిద్దాం. 2 అని రాసిన ఆంపిరియన్ లూప్ వృత్తాకార మధ్యచ్ఛేదంతో ఉన్న ఏక కేంద్రవృత్తం.
ఈ లూప్కు L = 2 πr.
Ie = ఉచ్చుతో ఆవృతం అయిన విద్యుత్ ప్రవాహం = I
ఈ ఫలితం, పొడవైన తిన్నని తీగకు ఉపయోగపడేది B(2πr) = µ0I
B = \(\frac{\mu_0 \mathrm{I}}{2 \pi \mathrm{r}}\) …………… (1)

b) r < a సందర్భాన్ని పరిగణించండి. I అని రాసిన ఆంపిరియన్ లూప్ ఒక వృత్తం. ఈ లూప్కు వృత్త వ్యాసార్థాన్ని rగా తీసుకొన్నప్పుడు, L = 2 πr.
ఇప్పుడు ఆవృతం అయిన విద్యుత్ ప్రవాహం Ie, I కి సమానంగా ఉండక దాని కంటే తక్కువగా ఉంటుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 97

(r< a కాబట్టి), విద్యుత్ ప్రవాహం ఏకరీతిగా వితరణమవడం వల్ల ఆవృతం అయిన విద్యుత్ ప్రవాహం,
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 98
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 99

తీగ కేంద్రం (అక్షం) నుంచి దూరానికి B పరిమాణానికి గీసిన గ్రాఫ్ను పటం చూపిస్తుంది. వృత్తాకార ‘ లూప్ (1 లేదా 2) లకు స్పర్శరేఖీయంగా క్షేత్రం దిశ ఉంటుంది. ఇంతకుముందు సెక్షన్లో వివరించిన కుడిచేతి నిబంధన ఈ దిశను ఇస్తుంది.

ఈ ఉదాహరణ కావలసిన సౌష్ఠవాన్ని కలిగి ఉంది. కాబట్టి ఆంపియర్ నియమాన్ని అనువర్తించవచ్చు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 11.
500 చుట్లు, 0.5 m పొడవు ఉన్న సోలినాయిడ్ వ్యాసార్థం 1 cm. దీని ద్వారా ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం 5A. సోలినాయిడ్ అంతర్భాగంలో అయస్కాంత క్షేత్రం పరిమాణం ఎంత?
సాధన:
ఏకాంక పొడవుకు చుట్ల సంఖ్య n = \(\frac{500}{0.5}\) = 1000 చుట్లు/మీ.
పొడవు l = 0.5 మీ, వ్యాసార్థం = 0.01 మీ. అందువల్ల l/a = 50 అంటే l >> a
అందువల్ల పొడవైన సోలినాయిడ్ ఫార్ములా, B = µ0nI సమీకరణంను ఉపయోగించవచ్చు.
B = µ0nI = 4π × 10-7 × 10³ × 5 = 6.28 × 10-3 T.

ప్రశ్న 12.
ఒక నిర్ణీత ప్రదేశం వద్ద భూఅయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశం 3.0 × 10-5 T. దాని దిశ భౌగోళిక దక్షిణం నుంచి భౌగోళిక ఉత్తరం వైపుకు ఉంది. బాగా పొడవైన తిన్నని వాహకం ద్వారా 1A స్థిరవిద్యుత్ ప్రవహిస్తుంది. దాన్ని క్షితిజ సమాంతర బల్లపై ఉంచినప్పుడు విద్యుత్ ప్రవాహ దిశ (b) తూర్పు నుంచి పడమరకు, (a) దక్షిణం నుంచి ఉత్తరానికి ఉన్నప్పుడు దాని ఏకాంక పొడవుపై పనిచేసే బలాన్ని కనుక్కోండి.
సాధన:
F = Il × B
F = IlB sin θ
ఏకాంక పొడవుకు బలం f = F/l = I B sin θ

a) విద్యుత్ తూర్పు నుంచి పడమరకు ప్రవహించినప్పుడు, θ = 90° కాబట్టి,
f = I B
= 1 × 3 × 10 ° = 3 × 10-5 Nm-1

ఆంపియర్ నిర్వచనంలో తెలిపిన 2 × 10-7 Nm-1 విలువ కంటే ఈ విలువ పెద్దది. అందువల్ల ఆంపియర్ను ప్రామాణీకరించేటప్పుడు భూఅయస్కాంత క్షేత్రం, ఇతర అవాంఛిత క్షేత్రాల ప్రభావాలను తొలగించడం చాలా ముఖ్యం. బల దిశ అధోముఖంగా ఉంటుంది. సదిశల వజ్రలబ్ధం దిశా ధర్మం నుంచి ఈ దిశను మనం పొందవచ్చు.

b) విద్యుత్ దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తున్నప్పుడు,
θ = 0°
f = 0
అంటే వాహకంపై బలం పనిచేయదు.

ప్రశ్న 13.
10 cm వ్యాసార్థం కలిగి, 100 చుట్లు దగ్గరగా చుట్టిన వృత్తాకార తీగచుట్టలో 3.2. A విద్యుత్ ప్రవహిస్తుంది. (a) తీగచుట్ట కేంద్రం వద్ద క్షేత్రం ఎంత? (b) ఈ తీగచుట్ట అయస్కాంత భ్రామకం ఎంత? తీగచుట్టను నిలువు తలంలో ఉంచారు. దాని వ్యాసంతో ఏకీభవించే క్షితిజ సమాంతర అక్షం పరంగా స్వేచ్ఛగా భ్రమణం చేస్తుంది. క్షితిజ సమాంతర దిశలో 2T ఏకరీతి అయస్కాంత క్షేత్రం, ప్రారంభంలో తీగచుట్ట అక్షం క్షేత్ర దిశలో ఉండే విధంగా ఉంది. అయస్కాంత క్షేత్ర ప్రభావంతో తీగచుట్ట 90″ కోణంతో భ్రమణం చేస్తుంది. (c) తొలి, తుది స్థానాల్లో తీగచుట్టపై పనిచేసే టార్క్ పరిమాణం ఎంత? (d) తీగచుట్ట 90° భ్రమణం చెందినప్పుడు అది పొందే కోణీయ వడి ఎంత? తీగచుట్ట జడత్వ భ్రామకం 0.1 kg m².
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 100
కుడిచేతి బొటనవేలు నిబంధన దిశను ఇస్తుంది.

b) సమీకరణం అయస్కాంత భ్రామకాన్నిస్తుంది.
m = N I A = N I π r² = 100 × 3.2 × 3.14 × 10-2 = 10 A m²
మళ్ళీ, కుడిచేతి బొటనవేలు నిబంధన దిశను ఇస్తుంది.

c) τ = |m × B| (సమీకరణం నుంచి)
= mB sin θ

ప్రారంభంలో, θ = 0. అందువల్ల, తొలి టార్క్ 7. = 0 తుదకు, θ = \(\frac{\pi}{2}\) (లేదా 90°).
అందువల్ల, తుది టార్క్ τf = m B = 10 × 2 = 20 N m.

d) న్యూటన్ రెండవ నియమం నుంచి,
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 101

ప్రశ్న 14.
a) ఒక నునుపైన క్షితిజ సమాంతర తలంపై విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార లూప్ ఉంది. లూప్ తన చుట్టూ తాను తిరిగే విధంగా ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయవచ్చా? (నిలువు అక్షం పరంగా తిరగడం).
సాధన:
లేదు. అలా జరగాలంటే τ నిలువు దిశలో ఉండాలి. కాని τ = IA × B క్షితిజ సమాంతర లూప్ యొక్క A నిలువు దిశలో ఉంది. కాబట్టి ఏ B కైనా τ లూప్ తలంలో ఉంటుంది.

b) ఏకరీతి బాహ్య అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార లూప్ కలదు. ఈ లూప్ స్వేచ్ఛగా తిరగ గలిగితే దాని స్థిరమైన సమతాస్థితి యొక్క దిగ్విన్యాసం ఏది? ఈ దిగ్విన్యాసంలో మొత్తం క్షేత్ర (బాహ్య క్షేత్రం + లూప్ వల్ల ఏర్పడిన క్షేత్రం) అభివాహం గరిష్ఠం అని రూపండి.
సాధన:
లూప్ వైశాల్య సదిశ A బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో ఉంటే అది ఒక స్థిర సమతాస్థితి దిగ్విన్యాసం అవుతుంది. ఈ దిగ్విన్యాసంలో లూప్ ఉత్పత్తి చేసిన అయస్కాంత క్షేత్రం, బాహ్య అయస్కాంత క్షేత్రం ఒకే దిశలో ఉంటూ, లూప్ తలానికి ఈ రెండూ లంబంగా ఉండటం వల్ల మొత్తం క్షేత్ర అభివాహం గరిష్టంగా ఉండేట్లు చేస్తుంది.

c) బాహ్య అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవహిస్తున్న క్రమరహిత లూప్ను ఉంచారు. తీగ నమ్యంగా (flexible) ఉంటే, ఎందుకు అది వృత్తాకారంగా మారుతుంది? లూప్ లోని విద్యుత్ ప్రవాహం, అయస్కాంత క్షేత్ర దిశలు ఏ విధంగా ఉంటాయి?
సాధన:
ఇచ్చిన చుట్టుకొలతకు, ఏ ఇతర ఆకారాల కంటే వృత్తం ఎక్కువ వైశాల్యాన్ని ఆవృతం చేస్తుంది. కాబట్టి, అభివాహం గరిష్ఠంగా ఉండేందుకు తలం క్షేత్రానికి లంబంగా ఉండేట్లు అది వృత్తాకారాన్ని పొందుతుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

ప్రశ్న 15.
పటంలో చూపిన వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవాలి. పటంలో చూపిన అమ్మీటర్ (a) నిరోధం RG = 60.00 Ω తో గాల్వనామీటరు అయినప్పుడు; (b) పైన (a) లో వర్ణించిన విధంగా ఉన్న గాల్వనామీటరును, (b) షంట్ నిరోధం ద్వారా అమ్మీటరుగా మార్చినప్పుడు; (c) శూన్య నిరోధం కలిగిన ఆదర్శ అమ్మీటరు అయినప్పుడు, విద్యుత్ ప్రవాహ విలువలు ఎంత?
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 102
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం 103

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 9th Lesson ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 9th Lesson ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
నైసర్గిక స్వరూపము: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 12°41′ మరియు 22° ల ఉత్తర అక్షాంశ రేఖలకు మరియు 77°, 80°40′ తూర్పు రేఖాంశాల మధ్య ఏర్పడి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ మరియు ఒడిషా, తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి ఉంది. గోదావరి, కృష్ణా మరియు తుంగభద్ర వంటి ప్రధాన నదులు ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సహజ మరియు మానవ వనరులను సమృద్ధిగా కలిగి, పోటీ తత్వానికి కావల్సిన సామాజిక ఆర్థిక పరిపుష్టులను కలిగివుంది. మొత్తం 1,60,20,400 హెక్టార్ల భౌగోళిక భూభాగాన్ని కల్గిన భారతదేశంలోని 8వ పెద్ద రాష్ట్రంగా నిల్చింది. గుజరాత్ తర్వాత దేశంలో 974 కి.మీ. తీరప్రాంతము కల్గిన 2వ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మొత్తం భూభాగంలో 21.81 శాతము అంటే 34,93,475 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఎత్తైన పర్వత ప్రాంతాలు, మైదానాలు, మరొకవైపు తీరప్రాంతము మరియు పీఠభూములతో కూడిన బహువిధ భౌతిక లక్షణాలు కల్గి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ – లక్షణాలు: భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగములో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గి ఉండి, జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నది. మొత్తం భూభాగంలో 40.95% వ్యవసాయ యోగ్య భూమి, 21.81% అడవులను కల్గివున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

1) రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004 – 05 మరియు 2013-14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కనిపిస్తున్నది. 2004 – 05 లో R 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013 – 14 నాటికి 2,50,282 కోట్లుగా చేరుకొన్నది. 2011-12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివుంది.

2) తలసరి ఆదాయము: రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగిలిన సంవత్సరాలలో అధికంగా నమోదు అయ్యింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణానికి సూచికగా పరిగణింపవచ్చును. 2013-14 సం॥లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా ? 11,417 లుగా ఉంది.

3) జనాభా వృద్ధిరేటులో పోకడలు: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో పదవస్థానంలో నిల్చింది. మొదటి నుండి భారతదేశ జనాభా వృద్ధి రేటు కన్నా, రాష్ట్ర జనాభా దశాబ్ద వృద్ధి రేటు తక్కువగానే నమోదవుతున్నది.
మొదటిసారి 2011 దశకంలో రాష్ట్ర వార్షిక జనాభా వృద్ధిరేటు 1% కన్నా తక్కువ (0.921)గా నమోదయింది.

4) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో రంగాల వాటా: దీనిలో వివిధ రంగాల వాటా వర్తమాన సంవత్సర ధరల ప్రకారం కాని, ఆధార సంవత్సర (2004-05) ధరల ప్రకారం కాని అనేక మార్పులకు గురవుతూ, వాటా ఆధిపత్యం వ్యవసాయం నుండి క్రమంగా సేవారంగానికి మారుతూ వస్తున్నది.

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 2004-05 ఆర్థిక సంవత్సరంలో కౌ 1,36,767 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవసాయ రంగం R 40,232 కోట్లు సమకూర్చగా, గనులు, వస్తు తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సప్లయి మొదలగు ఉపరంగాలు కలిగిన పారిశ్రామిక రంగం 29,124 కోట్లు మరియు సేవారంగం 65,411 కోట్లను సమకూర్చడం జరిగింది. | 2013 – 14 సంవత్సర తాత్కాలిక అంచనాల ప్రకారం మొత్తం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 2004 – 05 ఆధార సంవత్సరం ధరలలో 58,390 కోట్లు, పారిశ్రామిక రంగం కౌ 51,838 కోట్లు మరియు సేవారంగము శౌ 1,40,054 కోట్లు సమకూర్చడం జరిగింది.

5) నిరుద్యోగిత రేటు: నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ (NSS) అనే సంస్థ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఉద్యోగిత, నిరుద్యోగితలను అంచనా వేస్తుంది. ఇటీవలి (2011-12) సర్వే ప్రకారం నిరుద్యోగుల రేటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో, దేశ సగటు కన్నా ఎక్కువగా నమోదయింది. రాష్ట్రంలో ఈ రేటు 2004 – 05 వరకు పెరిగి ఆ తర్వాత మొత్తం దేశంలో లాగానే గ్రామీణ, పట్టణ ప్రాంతంలో తగ్గుతూ వస్తున్నది.

ప్రతి వెయ్యిమంది శ్రామిక శక్తిలో నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్యను “నిరుద్యోగిత రేటు” అంటారు. 2011 – 12 సంవత్సరానికి NSS వారు వేసిన 68వ రౌండు అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత రేటు (12%), భారత గ్రామీణ నిరుద్యోగిత రేటు (17%) కన్నా తక్కువగా ఉంది. కాని పట్టణ నిరుద్యోగితా రేటు విషయంలో రాష్ట్ర నిరుద్యోగిత రేటు (43%), దేశ సగటు కన్నా (34%) ఎక్కువగా నమోదయ్యింది.

6) పేదరికము: ఆంధ్రప్రదేశ్ వివిధ నూతన పేదరిక నిర్మూలనా పథకాలకు రూపొందించడంలో అగ్రగామిగా ఉంది. సబ్సిడీలు, మహిళా సాధికారత కోసం ఇందిర క్రాంతి పథం (IKP), పేదలకు గృహ నిర్మాణం కోసం రాజీవ్ స్వగృహ పథకం, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్యశ్రీ వంటి వైద్య పథకాలు మొదలైనవి రాష్ట్రంలో అమలవుతున్నాయి.

ప్రశ్న 2.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) అనగానేమి ? ఆంధ్రప్రదేశ్ (SGDP) సరళిని పరిశీలించండి.
జవాబు:
భారతదేశములో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగంలో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గివుండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రముగాను ఉన్నది. మొత్తం భూభాగములో 40.95 శాతం వ్యవసాయ యోగ్య భూమి, 21.81 శాతం అడవులను కల్గివున్నది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004-05 మరియు 2013-14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కన్పిస్తున్నది. 2004-05లో 3 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013-14 నాటికి 2,50,282 కోట్లకు చేరుకొన్నది. – 2011 – 12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదు అయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి నిలకడ (2004 – 05) ధరలలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 1

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్లో జనాభా మరియు తలసరి ఆదా మీ వృజ్ఞ పోకడలను తెలపండి.
జవాబు:
రాష్ట్ర తలసరి ఆదాయం. దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగతా సం॥లలో అధికంగా నమోదు అయింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణ సూచికగా చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం మరియు భారతదేశ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలలో) రూ.లలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2

2013 – 14 సం||లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా కౌ 11,417 లుగా ఉంది. జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటు (శాతంలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 3

ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత.
జవాబు:
వ్యవసాయ రంగం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తున్నది. మన రాష్ట్రం “Bejeweled rice bowl of India” గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయాన్నే తమ ప్రధాన వృత్తిగా భావిస్తున్నారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో కూడా వ్యవసాయరంగ వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.

1) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) లో వాటా: భారత ఆర్థిక వ్యవస్థలో మాదిరే రాష్ట్ర GSDPలో కూడా వ్యవసాయరంగ వాటా క్రమంగా తగ్గుతున్నప్పటికీ దాని ప్రాధాన్యత నిరర్ధకమైనదిగా భావించరాదు. 2004 – 05 మరియు 2013 – 14 సం||లలో రాష్ట్ర GSDPలో వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల వాటాను ఇతర రంగాల వాటాను ఈ క్రింది పట్టికలో చూపబడినది.

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం, మిగతా రంగాల వాటా (%)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 4
మూలం: ఆంధ్రప్రదేశ్ గణాంక సూచిక 2014, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పేజీ నెం. 233 మరియు 234.
గమనిక: సంఖ్యలు 2004-05 నిలకడ ధరలలో

పై పట్టిక మరియు చిత్రమును గమనిస్తే రాష్ట్ర GSDPలో వ్యవసాయరంగ వాటా క్రమంగా తగ్గుతూ, ఆ మేరకు సేవారంగం వాటా పెరుగుతున్నట్లు అర్థం అవుతున్నది. పారిశ్రామికరంగ వాటా, పరిశీలనలోని కాలాలలో దాదాపు స్థిరంగా కొనసాగుతున్నది. 2007వ సంవత్సరం నాటికి సేవారంగం వాటా 50 శాతం స్థాయిని దాటితే 2010-11 నాటికి వ్యవసాయరంగ వాటా 25 శాతం కన్నా దిగువకు పడిపోయింది. అయితే ఇప్పటికీ రాష్ట్ర వ్యవసాయరంగ వాటా జాతీయ వ్యవసాయం వాటా కన్నా ఎక్కువ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ కూడా రాష్ట్ర GSDPలో వ్యవసాయ రంగం 1/5 వంతు వాటాను సమకూరుస్తుంది.

2) ఉపాధి కల్పన: రాష్ట్రంలోని అత్యధిక జనాభాకు వ్యవసాయమే ప్రధాన ఉపాధి మార్గము. సగాని కన్నా ఎక్కువమంది ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి పనిచేస్తున్నారు. పారిశ్రామిక, సేవారంగాలు ఎంతగా అభివృద్ధి జరిగినా, ఉపాధి కల్పనలోను, ప్రధాన ఆదాయ వనరుగా వ్యవసాయం తన ప్రాధాన్యతను కొనసాగిస్తూ ఉన్నది.

2011 జనాభా లెక్కల ప్రకారం వ్యవసాయ రంగం అటు వ్యవసాయదారులకు, ఇటు వ్యవసాయ కూలీలకు కలిపి మొత్తం 62.36 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇప్పటికినీ దేశం మరియు రాష్ట్రాలలో 50 శాతం కన్నా ఎక్కువ మందికి వ్యవసాయమే ప్రధాన ఉపాధి మూలం.

3) భూమిని ఉపయోగించే తీరు: ఆంధ్రప్రదేశ్ 160.20 లక్షల హెక్టార్ల మొత్తం భూభాగంతో భారతదేశంలో ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. రాష్ట్రంలో భూమిని ఉపయోగిస్తున్న తీరు స్వల్ప మార్పులతో చాలాకాలంగా దాదాపు యధాతథంగా కొనసాగుతూ ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

4) ఆహార మరియు ఆహారేతర పంటల క్రింద ఉన్న భూమి: రాష్ట్రంలో పండే పంటలను స్థూలంగా ఆహార మరియు ఆహారేతర పంటలుగా విభజించవచ్చు. అన్ని తృణధాన్యాలు, పప్పుదినుసులు, వంటనూనెలు మొదలైనవి ఆహారపంటల క్రిందకు వస్తే, పసుపు, ప్రత్తి, చెరకు మొదలైనవి ఆహారేతర లేక వాణిజ్య పంటల క్రిందకు వస్తాయి. మొత్తం భూభాగాన్ని ఆహార, ఆహారేతర పంటల కోసం కేటాయించిన తీరునుబట్టి ఈ ప్రాంతంలో వ్యవసాయ వాణిజ్యీకరణ ఏ మేరకు జరిగిందో అంచనా వేయవచ్చు. 2013-14 సం॥లో మొత్తం 81.28 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో 54. 92 లక్షల హెక్టార్లు అంటే 67.57 శాతం భూమిని ఆహారపంటల ఉత్పత్తికి కేటాయించడం జరిగింది.
వాణిజ్య పంటలను 32 శాతం వ్యవసాయ భూమిలో పండించడం జరుగుతున్నది. 2013-14లో ఆహారేతర పంటలను 32.43 లక్షల హెక్టార్లలో పండించడం జరుగుతుంది.

5) ప్రధాన పంటల ఉత్పాదకత: సగటున ఒక హెక్టారు భూమిలో పండిన పంటను ఉత్పాదకత అంటారు. ప్రధాన పంటల ఉత్పాదకత 2010-11 మరియు 2013-14 సం॥లలో మిశ్రమ సరళిని కలిగివున్నది.
వరి ఉత్పాదకత ఒక హెక్టారుకో గరిష్టంగా నెల్లూరులోను (4,051) మరియు కర్నూలులో (3,670) ఉంది. గోధుమ ఉత్పత్తి రాష్ట్రంలో అత్యల్పంగా ఉంది.

6) నీటిపారుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న మరియు వంశధార వంటి ముఖ్యమైన నదులను ప్రసాదింపబడింది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపివున్న మొత్తం నీటి పరిమాణం | 2,746 TMC లు. కాని ఇప్పటివరకు ఉపయోగించుకుంటున్న నీరు కేవలం 1,753 TMC లు. నదులే కాకుండా రాష్ట్రంలో ఇతర కృత్రిమ సరస్సులు, రిజర్వాయర్లు కూడా త్రాగునీరు, సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి.

2013 – 14 సం||నికి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీటిపారుదల కలిగిన నికర భూమి 46 శాతం, 65.61 లక్షల సాగుభూమిలో 30.14 లక్షల హెక్టార్లు నీటిపారుదలను కలిగివున్నాయి. నీటిపారుదల కలిగిన నికర సాగుభూమిలో 48 శాతం కాలువలు (canals), చెరువుల ద్వారా 9 శాతం మరియు అన్ని రకాల బావుల ద్వారా 40 శాతం భూమి నీటిపారుదలను పొందినది.

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మూలాలు (హెక్టార్లలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 5
జిల్లాలను పరిశీలిస్తే 4.38 లక్షల హెక్టార్ల నీటిపారుదల గల సాగుభూమితో అంటే మొత్తం జిల్లా భూభాగంలో 14.5 శాతంతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 3.83 లక్షల హెక్టార్ల నీటిపారుదల సాగుభూమితో పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో కొనసాగుతుంది. 2013-14 సం॥కి విజయనగరం మరియు అనంతపురంలు రాష్ట్రం మొత్తం మీద అతితక్కువ నీటిపారుదల భూమిని కలిగివున్నాయి.

ఇతర అంశాలు:
రాష్ట్రంలో సగటు భూకమతము 1.6 హెక్టార్లు. మొత్తం రైతుల సంఖ్యలో ఉపాంత రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పెద్ద రైతుల విషయంలో సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉంది.

సంస్థాగత పరపతిలో 70 శాతం వాణిజ్య బ్యాంకులు, 20 శాతం సహకార బ్యాంకులు మరియు 11 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పరపతిని అందిస్తున్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్లోని లోపాలను సరిచేయడానికి “రైతుబంధు పథకం”, DAATT సెంటర్లు, కంప్యూటరీకరణ, సహకార మార్కెటింగ్ మొదలైన అనేక చర్యలు చేపట్టడం జరిగింది.

రాష్ట్రం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు మొదలైనవాటి ఉత్పత్తి ద్వారా 3,000 కోట్లు అంటే భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తి విలువలో 50 శాతం ఆర్జించి పెడుతున్నది.
పట్టు పరిశ్రమలోను, పట్టు ఉత్పత్తిలోను రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం ప్రాధాన్యత.
జవాబు:
పారిశ్రామిక రంగం: ఏ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్నైనా పారిశ్రామిక పాత్రనే నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాలైన సహజవనరులు, దక్షిణ భారతదేశంలోనే పొడవైన సముద్ర తీర ప్రాంతము, అవస్థాపన సౌకర్యాలు, కమ్యూనికేషన్లు, సాంకేతిక నిపుణులు మరియు విస్తృత మార్కెట్ అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఎ) రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో పారిశ్రామికరంగ వాటా: రాష్ట్ర (GSDP) లో ఆధార సం||పు 2004 – 05 ధరల ప్రకారం వివిధ సంవత్సరాలలో పారిశ్రామికరంగ వాటాను క్రింది పట్టిక తెలుపుతుంది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో పరిశ్రమరంగ వాటా
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 6

నిరపేక్షికంగా రాష్ట్ర GSDPలో పారిశ్రామిక రంగ వాటా క్రమంగా పెరుగుతున్నది. 2004 – 05 ఆధార సం॥లో ఈ రంగ మొత్తం విలువ 7 29,124 కోట్లు మాత్రమే ఉండగా, ఒక్క 2008-09 సంవత్సరాన్ని మినహాయిస్తే 2013 – 14 వరకు నిరంతరంగా పెరిగి ఔ 51,838 కోట్లకు చేరుకుంది. 2007-08లో 23.7 శాతం ఉన్న ఈ రంగ వాటా 2013-14 నాటికి 20.7 శాతానికి తగ్గిపోయింది.

బి) ఉపాధి అవకాశాల కల్పన: ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ఒక రంగం యొక్క వాటాను ఆ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న శ్రామికుల సంఖ్యను ఒక సూచికగా భావించి చెప్పవచ్చు. దేశంలోను, రాష్ట్రంలోను మొదటి నుండి పారిశ్రామిక రంగం కల్పిస్తున్న ఉపాధి శాతములో చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. 2011 నాటికి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పారిశ్రామిక రంగం దాదాపు 21 శాతము మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది.

సి) పరిశ్రమలకు ప్రణాళికా కేటాయింపులు: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికై ప్రణాళికలలో చెప్పుకోదగ్గ కేటాయింపులే జరిగాయి. 12వ ప్రణాళికలోని మొదటి వార్షిక ప్రణాళిక 2012-13లో మొత్తం ప్రణాళిక వ్యయం 48,935 కోట్ల రూపాయలలో 784 కోట్ల రూపాయలు పరిశ్రమలు మరియు ఖనిజ రంగానికి కేటాయించారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

డి) పారిశ్రామిక ఉత్పత్తి సూచిక: పారిశ్రామిక ప్రగతిని కొలిచే ఒక సాధనమే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP). ఒక కాలంలో జరిగిన భౌతిక పారిశ్రామిక ఉత్పత్తి, అంతకుముందు కాలం కన్నా సాపేక్షికంగా ఎంత మార్పు జరిగిందో ఇది తెలుపుతుంది. రాష్ట్ర IIP విలువ 2004-05 ఆధార సంవత్సర ఉత్పత్తి ప్రకారం ముదింపు చేయబడుతుంది. ఇ) రిజిస్టరు అయిన ఫ్యాక్టరీల సంఖ్య: వివిధ సెకన్ల ప్రకారం రిజిస్టరు అయిన పనిచేసే ఫ్యాక్టరీల సంఖ్యను చూపడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్లో పని చేయుచున్న ఫ్యాక్టరీల సంఖ్య
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 7
పట్టిక ప్రకారం 2m(i), 2m (ii) సెక్షన్ల ప్రకారం నమోదు అయిన ఫ్యాక్టరీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2008 – 09లో 9,972 గా ఉన్నా ఈ ఫ్యాక్టరీల సంఖ్య 2011 – 12 నాటికి 11,195కు పెరిగాయి. 2010 – 11 మరియు 2011 – 12 మధ్య ఒక సంవత్సర కాలంలో కొత్తగా 837 ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి.

ఎఫ్) ఇతర ముఖ్యాంశాలు:

  • రాష్ట్రం నుండి వెళ్ళే పారిశ్రామిక ఎగుమతుల విలువ క్రమంగా పెరుగుతున్నది. 2012-13 సంవత్సరంలో దీని విలువ 1,29,001 కోట్ల రూపాయలు.
  • దేశంలోని మొత్తం ఖాయిలా పడ్డ పరిశ్రమలో, రాష్ట్రంలోని ఖాయిలా పరిశ్రమలు 10.2 శాతం మరియు వీటి విషయంలో రాష్ట్రం నాల్గవ స్థానంలో ఉంది.
  • ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపనా కార్పొరేషన్ (APIIC) రాష్ట్రంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) లకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది. పూర్తిస్థాయి SEZ విధానాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
  • మార్చి, 2014 నాటికి రాష్ట్రంలో 32 SEZలు ఉండగా అందులో 10IT రంగానికి, 6 విభిన్న వస్తువులకు, 4 ఔషధాలకు, 2 బయోటిక్, 10 రంగ ప్రాధాన్యత గల SEZలు ఉన్నాయి.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ప్రాధాన్యత.
జవాబు:
సేవా మరియు అవస్థాపన రంగాలు: భారతదేశంలో వలే రాష్ట్రంలో కూడా సేవారంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పారిశ్రామిక రంగం స్థిరంగా ఉండడం వల్ల వ్యవసాయ రంగం కోల్పోతున్న రేటులో, సేవా రంగం అభివృద్ధి సాధిస్తున్నది.

ఎ) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వాటా: 2004-05 సంవత్సరంలో రాష్ట్ర (GSDP)లో 48.54 శాతం తోను, 2013 -14లో ఇంకా పెరిగి 55.99 శాతంలో సేవా రంగం అతి ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నది. 2004 -05 సంవత్సరంలో 3 64,411 కోట్లు, రాష్ట్ర GSDPకి సమకూర్చినది ఈ రంగమే. ఈ రంగం 2013-14 నాటికి ఏకంగా కౌ 1,40,054 కోట్లు ఆర్జించి పెట్టింది. అంటే రాష్ట్ర GSDPలో సగ భాగానికన్నా ఎక్కువ ఒక సేవారంగమే సమకూరుస్తుంది.

బి) ఉపాధి కల్పన: రాష్ట్రంలో సేవారంగం ఉపాధి కల్పనలో మూడు రంగాలలో రెండవ స్థానంలో ఉండి, దాదాపు 1/4 వంతు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. రాష్ట్రంలో 24.5 శాతం శ్రామిక శక్తికి ఉపాధిని కల్పిస్తున్నది. ఇది జాతీయ సగటున 25.4 శాతానికి దాదాపు సమానము.

సి) నీటిపారుదల: ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా సాగునీటి అభివృద్ధి, నిర్వహణ అత్యంత ప్రాధాన్యతను కలిగివుంది. రాష్ట్రం ప్రధాన నదీ వనరులైన గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార వంటి ప్రముఖ నదులను కలిగి “నదుల రాష్ట్రం” గా ‘గా పిలువబడుటకు అన్ని విధాల అర్హతలు కలిగి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా 52 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో 54 భారీ, మధ్యతరహా, ఇతర ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్ట్ ఒక బహుళార్థక సాగునీటి ప్రాజెక్ట్ గా చేపట్టబడి ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే “జాతీయ ప్రాజెక్ట్ హోదా” ను పొందినది.

పట్టిసీమ ప్రాజెక్ట్ చాలా కీలకమైనది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు గోదావరి నదిలోని మిగులు జలాలు 80 (tmcft) లు దాకా, పట్టిసీమ ద్వారా శ్రీశైలం నుండి రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలకు తరలించే యోచనతో రూపొందించబడినది.

ప్రభుత్వం రాష్ట్రంలో బిందుసేద్య విధానాన్ని కూడా ప్రోత్సహిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రైతులకు బిందు సేద్య పరికరాలను సబ్సిడీ రేట్లకే అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూక్ష్మ నీటిపారుదల పద్దతి విషయంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉండి, ప్రస్తుతం 5.63 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

డి) విద్యుచ్ఛక్తి: 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సప్లయిని ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,717 MWల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగివుంది. ఇందులో 70 శాతం థర్మల్ మరియు 21 శాతం జలవనరుల ద్వారా సాధిస్తున్నది.

సింహాద్రి STPS, దామోదరం సంజీవయ్య TPS, రాయలసీమ TPS మొదలైనవి రాష్ట్రంలోని ప్రధాన థర్మల్ విద్యుత్ కేంద్రాలు, లాంకో కొండపల్లి, స్పెక్ట్రం, కోనసీమ కంబైన్డ్ సైకిల్ విద్యుత్ సంస్థ మొదలైనవి గ్యాస్ ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, అలాగే శ్రీశైలం, టిబి డ్యామ్, పోలవరం, పెన్నహోబిలం, సీలేరు మొదలైనవి ప్రధాన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు.

ఇవేకాకుండా అనంతపురం జిల్లాలోని కదిరి వద్ద అమృత్ సౌర విద్యుత్ ప్లాంట్లు, అనంతపురం జిల్లాలోనే స్థాపించబడిన రామగిరి, నర్మద పవన విద్యుత్ ప్లాంట్లు మరియు పుత్లూరు ప్లాంట్లు పవన ఆధారిత విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి.

ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల వసతులను తెలపండి.
జవాబు:
నీటిపారుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న మరియు వంశధార వంటి ముఖ్యమైన నదులను ప్రసాదింపబడింది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపి మొత్తం నీటి పరిమాణం 2,746 TMC లు. కాని ఇప్పటివరకు ఉపయోగించుకుంటున్న నీరు కేవలం 1,753 TMC లు. నదులే కాకుండా రాష్ట్రంలో ఇతర కృత్రిమ సరస్సులు, రిజర్వాయర్లు కూడా త్రాగునీరు, సాగునీటి అవసరాలు తీరుస్తాయి.

2013 – 14 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీటిపారుదల కలిగిన నికర భూమి 46 శాతం. 65.61 లక్షల సాగుభూమిలో 30.14 లక్షల హెక్టార్లు నీటిపారుదలను కలిగి ఉన్నాయి. నీటిపారుదల కలిగిన నికర సాగుభూమిలో 48 శాతం కాలువలు (canals), చెరువులు ద్వారా 9 శాతం మరియు అన్ని రకాల బావుల ద్వారా 40 శాతం భూమి నీటిపారుదలను పొందినది.

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మూలాలు (హెక్టార్లలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 8

జిల్లాలను పరిశీలిస్తే, 4.38 లక్షల హెక్టార్ల నీటిపారుదల గల సాగుభూమితో అంటే మొత్తం జిల్లా భూభాగంలో 14.5 శాతంతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 3.83 లక్షల హెక్టార్ల నీటిపారుదల సాగుభూమితో పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో కొనసాగుతుంది. 2013-14 సం||కి విజయనగరం మరియు అనంతపురంలు రాష్ట్రం మొత్తం మీద అతితక్కువ నీటిపారుదల భూమిని కలిగివున్నాయి.

ఇతర అంశాలు:
రాష్ట్రంలో సగటు భూకమతము 1.6 హెక్టార్లు. మొత్తం రైతుల సంఖ్యలో ఉపాంత రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పెద్ద రైతుల విషయంలో సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉంది.

సంస్థాగత పరపతిలో 70 శాతం వాణిజ్య బ్యాంకులు. 20 శాతం సహకార బ్యాంకులు మరియు 11 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పరపతిని అందిస్తున్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్ లోని లోపాలను సరిచేయడానికి “రైతుబంధు పథకం”, DAATT సెంటర్లు, కంప్యూటరీకరణ, సహకార మార్కెటింగ్ మొదలైన అనేక చర్యలు చేపట్టడం జరిగింది.

రాష్ట్రం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు మొదలైనవాటి ఉత్పత్తి ద్వారా 73,000 కోట్లు అంటే భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తి విలువలో 50 శాతం ఆర్జించి పెడుతున్నది.

పట్టు పరిశ్రమలోను, పట్టు ఉత్పత్తిలోను రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్లోని రవాణా సౌకర్యాలను వివరింపుము.
జవాబు:
1) రైల్వేలు: ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తూనే, మరో ప్రక్క రాష్ట్రంలో పారిశ్రామిక మరియు పర్యాటక రంగ వృద్ధికి తోడ్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దక్షిణమధ్య రైల్వే, దక్షిణ రైల్వే, తూర్పు తీర రైల్వే |అనే మూడు రైల్వే జోన్ల సేవలను పొందుతున్నది. రాష్ట్రంలో మొత్తం 444 రైల్వేస్టేషన్లు మరియు 3,355 కి.మీ. మేర నెట్వర్క్ కలిగివుంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ మనవి, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పరిశీలనలో ఉంది.

ప్రపంచంలోనే అత్యధిక బ్రాడ్ గేజ్ ట్రాకులు విశాఖపట్టణం నుండి అనంతగిరిని కలుపుతూ తూర్పు కనుమల గుండా సాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే స్టేషన్ ప్రఖ్యాతమైనదే కాక అత్యంత రద్దీ కలిగిన రైల్వే జంక్షన్గా దేశంలోనే గుర్తింపు పొందింది.

2) రోడ్డు మార్గాలు: రోడ్లు ప్రాథమిక రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవే కాకుండా అత్యంత కీలకమైన అవస్థాపన సౌకర్యము కూడా. ఆర్థిక వ్యవస్థలో రోడ్ల శాస్త్రీయమైన అభివృద్ధి అనునది ఆర్థికవృద్ధికి ఒక ప్రాథమిక అవసరమేకాక, ఆర్థిక వృద్ధిని వేగవంతం కూడా చేయగలదు. దేశంలోని వివిధ రవాణా వ్యవస్థలన్నింటిలో ఒక్క రోడ్డు మార్గాలే 80 |శాతం ప్రయాణికుల, వస్తు రవాణా అవసరాలు తీరుస్తున్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ 42,511 కి.మీ.ల రాష్ట్ర రహదారులు, 3,144 కి.మీ.ల జాతీయ రహదార్లు, 1,01,484 కి.మీ. జిల్లా రోడ్లను కలుపుకొని మొత్తం 1,46,954 కి.మీ. విస్తారమైన నెట్వర్క్ కలిగివుంది. రాష్ట్రంలోని రోడ్లను 1998లో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థ (APRDC) నే నిర్వహణ బాధ్యత కలిగివుంది.

3) పౌర విమానయానము: రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, కడప మరియు రాజమండ్రి ఎయిర్పోర్టను మెట్రోయేతర ఎయిర్పోర్టుగా ఆధునీకరించుటకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో అవగాహన తాఖీదు (MOU) కుదుర్చుకున్నది. తిరుపతి ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ ప్రమాణాల అనుసారం ఆధునీకరించుటకు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా (AAI) ప్రతిపాదించినది. అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కూడా (AAI) ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది.

4) సముద్ర ఓడరేవులు: భారతదేశంలో గుజరాత్ తర్వాత 972 కి.మీ.ల సముద్రతీర ప్రాంతంతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. రేవులు ఎగుమతులు, దిగుమతులు, అంతర్జాతీయ వ్యాపారం, ఓడల రిపేర్లు, పర్యాటకం, చేపల వేట మరియు జల క్రీడల వంటి సముద్ర కార్యకలాపాల వృద్ధికి దోహదం చేస్తాయి. రేవులు వాణిజ్యానికి సింహద్వారము వంటివి. విశాఖపట్టణం ఓడరేవు రాష్ట్రంలో అతిపెద్దదే కాకుండా, దేశంలోనే సరుకు రవాణా విషయంలో అతిపెద్ద రేవులలో ఒకటి. విశాఖపట్టణం నుండి అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్కి ప్రయాణికుల సముద్ర యాత్రా వసతి కూడా కలదు.

ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక అభివృద్ధిలో ఐ.టి. (IT) రంగ ప్రాధాన్యతను తెలుపుము.
జవాబు:
IT/సాఫ్ట్వేర్ పరిశ్రమ: సాఫ్ట్వేర్ పరిశ్రమ సమాచార సాంకేతిక రంగంలోని ప్రధాన అంశము. సాఫ్ట్వేర్ పరిశ్రమలో కంప్యూటర్ సాఫ్ట్వేరు సంబంధించిన అభివృద్ధి చేయబడే వ్యాపారం, నిర్వహణ మరియు ముద్రణ అనే అంశాలు కలిసి ఇవి ఏ వ్యాపార రూపంలోనైనా ఉండవచ్చు. ఈ రంగం 1960 మొదట్లో మొదలై 1970 దశకంలో బాగా విస్తరించింది. ఈ పరిశ్రమలో ముఖ్యంగా 5 రంగాలు ఉన్నాయి. అవి:
1. సాఫ్ట్వేర్ అవస్థాపన రంగం 2. ఉద్యమిత్వ సాఫ్ట్వేర్ 3. రక్షణాత్మక సాఫ్ట్వేర్ 4. పరిశ్రమ పరిమిత సాఫ్ట్వేర్ 5.ప్రత్యేక కంపెనీ క్లయింట్గా గల సాఫ్ట్వేర్

రాష్ట్ర విభజన తర్వాత 2014, జూన్ 2న నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్ర ఐ.టి. టర్నోవర్లో 2 శాతం మరియు కేవలము 1.8 శాతం ఉద్యోగ అవకాశాలను మాత్రమే కలిగివుంది.

ఆంధ్రప్రదేశ్ భారతదేశ హైటెక్ రాజధాని, భారత సిలికాన్ లోయగా గుర్తింపు పొందినది. కాని విభజనానంతరం వైజాగ్ నగరం ఐ.టి. సెంటర్ గా అభివృద్ధి చెందుటకు అన్ని అనుకూల అంశాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్టణం రాష్ట్ర నూతన ఐ.టి. రాజధాని అవుతుంది.

  • ప్రతి జిల్లా కేంద్రము ఒక ఐ.టి. పార్కును కలిగివుంటుంది.
  • రాష్ట్రం మొత్తం ఎగుమతుల్లో ఐ.టి. రంగం 38.22 శాతం వాటా కలిగివుంది (ఉమ్మడి రాష్ట్రం).
  • 2013 నాటికి ఐ.టి. రంగం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
  • 2013లో ఈ రంగం మొత్తం ఎగుమతుల విలువ సుమారు 36 వేల కోట్ల రూపాయలు.
  • ఐ.టి. రంగం ప్రస్తుతం ఉన్న 36,000 కోట్ల రూపాయల స్థితి నుండి 2017 నాటికి 1,50,000 కోట్ల స్థాయికి చేరగలదని అంచనా.
  • రాష్ట్ర ప్రభుత్వం ఐ.టి. మరియు బి.టి. (IT & BT)లను సమన్వయం చేసే యోచనలో ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ సంక్షేమ పథకాలను పరిశీలింపుము.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ – సంక్షేమ పథకాలు/కార్యక్రమాలు: ఏ సంక్షేమ రాజ్య లక్ష్యమైన తన ప్రజల జీవన ప్రమాణాన్ని కొనసాగించడం లేదా ఇంకా మెరుగుపరచడమే. చాలాకాలం వరకు ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పరిశ్రమలు ప్రధాన వాహకాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యత వల్ల సామాజిక రంగ అవస్థాపన సౌకర్యాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, నీటి సప్లయి, గృహవసతి, సామాజిక రక్షణ వంటి వాటిని మెరుగుపరచడము ద్వారానే సాధ్యం అవుతుంది. సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వాలు సాధించాలంటే ఈ సాంఘిక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ క్రింది పట్టికలో పొందుపరచడమైనది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ వర్గాల వారి సంక్షేమ పథకాలు
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 9

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP).
జవాబు:
భారతదేశములో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగంలో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గివుండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రముగాను ఉన్నది. మొత్తం భూభాగములో 40.95 శాతం వ్యవసాయ యోగ్య భూమి, 21.81 శాతం అడవులను కల్గివున్నది.

రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004-05 మరియు 2013 – 14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కన్పిస్తున్నది. 2004-05లో ఔ 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013-14 నాటికి 2,50,282 కోట్లకు చేరుకొన్నది. 2011 – 12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదు అయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివున్నది.

ప్రశ్న 2.
రాష్ట్ర తలసరి ఆదాయం.
జవాబు:
రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగతా సం॥లలో అధికంగా నమోదు అయింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణ సూచికగా చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం మరియు భారతదేశ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలలో) రూ.లలో
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 10

2013 – 14 సం||లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా కౌ 11,417లుగా ఉంది.
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్
దేశంలో 10వ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటు (శాతంలో)
AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 11

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్లో వృత్తివారీ శ్రమ విభజన. [Mar ’17]
జవాబు:
ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ఆర్థికాభివృద్ధి స్థాయిని ఆ ఆర్థిక వ్యవస్థలోని వృత్తివారి శ్రమ విభజన తీరు నిర్ణయిస్తుంది. ఏ ఆర్థిక వ్యవస్థనైనా వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగాలుగా విభజించవచ్చు. జనాభాను, వారు చేసే వృత్తులు లేక పనులు ఆధారంగా విభజించడాన్ని వృత్తివారీ శ్రమ విభజన లేక వృత్తివారీ జనాభా విభజన అంటారు. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు కలిసి మొత్తంగా 1,43,92,736 మంది అనగా 62.36 శాతము వ్యవసాయ రంగాలలో ఉపాధి పొందుతున్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

అదే విధంగా గృహ పరిశ్రమలలో పనిచేసే శ్రామికులు 6,62,608 మంది అంటే మొత్తం శ్రామిక సంఖ్యలో కేవలం 2.87 శాతము ఉన్నారు. పారిశ్రామిక మరియు సేవా రంగాల కార్యకలాపాలు పరస్పరం పూరకంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు రంగాలలో మొత్తం 80,25,620 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే మొత్తం కార్మిక సంఖ్యలో
ఇది 34.77 శాతము.

ఇప్పటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న కార్మిక సంఖ్య ఎక్కువగా ఉంది. సేవారంగం రెండవ స్థానాన్ని కలిగి, వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ద్వితీయ లేక పారిశ్రామికరంగ వాటా రాష్ట్రంలో సంవత్సరాలుగా స్థిరంగా కొనసాగుతున్నది.

ప్రశ్న 4.
రాష్ట్రంలోని పర్యావరణ పరిరక్షణ అంశాలు. [Mar ’17]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పర్యావరణ పరిస్థితులను కలిగి ఉంది. దీని కోస్తా తీర ప్రాంతము పొడవు దృష్ట్యా భారతదేశంలోనే రెండవది మరియు దక్షిణ భారత రాష్ట్రాలలో మొదటిది. ఇందులోని జీవ వైవిధ్యం, విభిన్నమైన జీవ జాతులను కలిగి దేశంలోనే ఒక ప్రత్యేకతను సంపాదించుకొన్నది. ఈ అమూల్య పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు:
1) పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు: సామాజిక అటవీ నిర్వహణ (CFM), జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళికా కార్యక్రమం (NRCP) మరియు జాతీయ వృక్ష సంరక్షణ కార్యక్రమము (NAP) మొదలైన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.

2) చెట్టు – నీరు కార్యక్రమము: 2015లో రాష్ట్ర ప్రభుత్వం వృక్ష సంరక్షణ మరియు నీటి పరిరక్షణ కోసం ‘నీరు – చెట్టు’ పథకాన్ని అన్ని జిల్లాలో ఆరంభించెను. ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి, కనీసం 90 శాతం మొక్కలు బ్రతికేటట్లు పలు చర్యలను తీసుకోవడం జరుగుతుంది.

3) సాంప్రదాయేతర శక్తి: ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వారు రాష్ట్రంలో సోలార్ మరియు పవన విద్యుత్ శక్తి మూలాలను వృద్ధి చెయ్యడం ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని ఒక పెద్ద “గ్రీన్ ఎనర్జి కారిడార్” గా మార్చుటకు నిర్ణయించిరి.

4) వన మహోత్సవం: 2013లో అటవీశాఖ వారు “రెండు మిలియన్ల మొక్కలను నాటే ఉద్దేశ్యంతో 64వ వన మహోత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవములు అదే సమయంలో జిల్లా కేంద్రాలలోను జరుపుకున్నారు. సామాజిక అటవీ కార్యక్రమంలో ఇది ఒక భాగము.

5) వన్యమృగ సంరక్షణ: మొక్కలు, వృక్షాలు, జంతువులు మరియు పర్యావరణ వ్యవస్థలతో కూడిన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుటకు ప్రభుత్వం 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు 3 జాతీయ పార్కులతో సహా 16 ప్రాంతాలను వన్యప్రాణి రక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య సంరక్షణ సొసైటి (BIOSAP)ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల బాగోగులు చూసే బాధ్యతను అప్పగించారు. శ్రీశైలం జీవావరణ రిజర్వుని గుర్తించి నిర్వహిస్తున్నారు. స్థానిక కమిటీలతో పాటు ప్రభుత్వ కమిటీలు కూడా జీవావరణ నిర్వహణ ప్రణాళిక అంతిమ ఆమోదం కోసం కృషి చేస్తున్నాయి.

6) ప్రాజెక్ట్ టైగర్: మన జాతీయ జంతువు అయిన పులుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్నూలు, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలో విస్తరింపబడిన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) 50 కన్నా ఎక్కువ పులులకు నివాస స్థానంగా ఉంది.

7) పర్యావరణ విద్య: ప్రజలను ప్రకృతి పరిరక్షణపై జాగృతం చేయడానికి రాష్ట్రంలోని చాలా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్ పార్కుల వద్ద ప్రదర్శనశాలలు, వ్రాయబడిన బోర్డుల ప్రదర్శన, మిని ఆడిటోరియంలు మరియు లైబ్రరీల ద్వారా పర్యావరణ విద్యపై అవగాహన పెంచుతున్నారు.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ ప్రాధాన్యత. [Mar ’16]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ “భారతదేశ కోహినూర్” గా మరియు పర్యాటకం విషయంలో దేశంలోనే గమ్యస్థాన రాష్ట్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప రాజవంశాలకు, పవిత్ర దేవాలయాలకు, లోహపూత బొమ్మలు, నేతపని వస్తువులు, అమూల్య పాండిత్యము, కూచిపూడి నాట్యం వంటి మహోన్నత కళలకు గుర్తింపు పొందినది. రాష్ట్రం దాదాపు 300 పర్యాటక ప్రాంతాలలో అసంఖ్యాకంగా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆదర్శిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) అనునది రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ. ఇది పర్యాటకంలో అవస్థాపనా సౌకర్యాల కల్పన మరియు వస్తువులను సృష్టిస్తుంది. ఈ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఘన చరిత్ర మరియు గత స్మృతులను సూచించే విధంగా సాంస్కృతిక, వారసత్వ, ప్రకృతి, సాహస, ఆరోగ్య మరియు గ్రామీణ పర్యాటకాల ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

పర్యాటకాన్ని ఆర్థికాభివృద్ధి ఇంజనుగా, ఆంధ్రప్రదేశ్ విజన్ -2020 భావిస్తున్నది. “ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటం, ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి తీసుకుపోవడం” అనే లక్ష్యాన్ని పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు మొదలు పెట్టింది. 2010లో నూతన పర్యాటక విధానాన్ని ప్రకటించింది. రాష్ట్రాన్ని పర్యాటక హిత గమ్యస్థానంగా మార్చుటకు చర్యలు మొదలు పెట్టిరి.

  1. తీర్ధయాత్ర పర్యాటకం
  2. వైద్య పర్యాటకం
  3. బుద్ధిస్ట్ పర్యాటకం
  4. సముద్ర తీర పర్యాటకం
  5. వ్యవసాయ పర్యాటకం
  6. పర్యావరణ పర్యాటకం
  7. విశ్రాంత పర్యాటకం.

రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అత్యధిక మంది దేశీయ, విదేశీ పర్యాటకులను ఏడుకొండలపై వెలసిన ప్రసిద్ధ వైష్ణవాలయం తిరుమలను కలిగి ఉన్న చిత్తూరు జిల్లా ఆకర్షించగలిగింది. దీని తర్వాత స్థానంలో ప్రసిద్ధ జ్యోతిర్లింగముతో పాటు, ఒకానొక శక్తి పీఠము కూడా అయిన శ్రీశైలం కారణంగా కర్నూలు జిల్లాను పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిలు ప్రధాన మరియు కర్నూలు, విజయవాడలు ద్వితీయ పర్యాటక గమ్యాలుగా గుర్తింపబడినవి.
అలాగే రాష్ట్రం నదీపర్యాటక కేంద్రాలను కూడా అభివృద్ధి చేస్తున్నది. ఉదాహరణకు గోదావరి నుండి పాపికొండల వరకు గోదావరి నదిపై నౌకా విహార కేంద్రం అయిన హరిత. ప్రస్తుతం ఐ.టి. రంగం మాదిరే పర్యాటక రంగం కూడా రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా లక్షణాలు. [Mar ’16]
జవాబు:
జనాభా: ఆంధ్రప్రదేశ్ 4.96 కోట్ల మొత్తం జనాభాతో, దేశ జనాభాలో 4.1 శాతంగా ఉండి జనాభా రీత్యా 10వ అత్యధిక జనాభా కల్గిన రాష్ట్రంగా ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా వృద్ధిరేటు 2011 నాటికి 11.89 శాతం నుండి 9.21 శాతానికి తగ్గినది.
మరో వైపు అదే కాలానికి దేశ జనాభా 4.3 రెట్లు పెరిగింది. దీనిని బట్టి దేశంలో కన్నా రాష్ట్రంలో జనాభా వృద్ధి వేగంగా తగ్గుతున్నట్లు అర్థం అవుతున్నది.

జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటరు భూభాగంలో నివసించే సగటు ప్రజల సంఖ్యను జనసాంద్రత అనవచ్చు. జనసాంద్రత = ఆ ప్రాంత జనాభా / ప్రాంత భూభాగం చదరపు కిలోమీటర్లలో.

కాబట్టి రాష్ట్ర సౌభాగ్యం లేక పేదరికానికి జనసాంద్రత ఒక సూచికగా పనిచేస్తుంది.

కాని 1971 తర్వాత జాతీయ సగటు జనసాంద్రత కన్నా తక్కువ స్థాయిని రాష్ట్రం నమోదు చేస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత 1 చ.కిమీ. కు 304 మంది ఉండగా, దేశం మొత్తంలో 382 చ.కి.మీ.కు జనసాంద్రత ఉంది.

రాష్ట్రంలోని జిల్లాలను పరిశీలిస్తే కృష్ణాజిల్లా అత్యధికంగా 518 మందితోను, పశ్చిమ గోదావరి 470 మందితోను మొదటి రెండు స్థానాలలో నిలిచాయి.

పురుష నిష్పత్తి: భారతదేశంలో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా జనాభా సరళి పురుష జనాభాకు అనుకూలంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి మరియు కృష్ణా జిల్లాలలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువ. విజయనగరం జిల్లాలో ప్రతి 1000 పురుషులకు అత్యధికంగా 1019 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలలో అనంతపురం జిల్లాలో అతి తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి ప్రతి 1000 పురుషులకు కేవలం 977 మంది స్త్రీలు ఉన్నారు.

వయసు ఆధారిత జనాభా: ఒక దేశంలో కాని, ప్రాంతంలో కాని మొత్తం జనాభాలో పనిచేయగల శ్రామిక శక్తిని ఇది తెలియజేస్తుంది. వయస్సు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాను మూడు తరగతులగా విభజించవచ్చు. అవి 0-14, 15-59 మరియు 60 సంవత్సరాలు మరియు ఆపైన వయస్సు ఉన్న వారి తరగతి. జననరేట్లు అధికంగా ఉండడం, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గడం వల్ల బాలల శాతం ఎక్కువగా ఉంటుంది.

గ్రామీణ – పట్టణ జనాభా: గ్రామీణ పట్టణ జనాభా అధ్యయనము జనాభా యొక్క జీవన సరళిని ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా భారతదేశంలో మాదిరి అధిక జనాభా గ్రామాలలోనే నివసిస్తున్నది.

2011 అంచనాల ప్రకారం విశాఖపట్నం అత్యధిక పట్టణ జనాభా 47.45 శాతము కలిగి ఉంది. కృష్ణాజిల్లా 40.81 శాతంతో రెండవ స్థానంలో ఉంది.

అక్షరాస్యత: అక్షరాస్యత ప్రజల యొక్క చదవగల, వ్రాయగల నైపుణ్యం. ఇది ఒక మంచి విద్యా వ్యవస్థకు కావలసిన కనీస అవసరం. ఒక ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగానికి, అక్షరాస్యత స్థాయికి ధనాత్మక సంబంధం ఉన్నట్లు గుర్తింపబడినది.

ఆంధ్రప్రదేశ్ అటు స్త్రీ అక్షరాస్యతలోను, పురుష అక్షరాస్యతలోను, ఇటు మొత్తం అక్షరాస్యత రేటులో భారత అక్షరాస్యత రేటు కన్నా వెనుకబడి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత రేటు 67.41. ఇందులో 74.83 శాతం పురుష అక్షరాస్యత కాగా, 60.01 శాతం స్త్రీ అక్షరాస్యత. అంటే జాతీయ అక్షరాస్యత రేటుకన్నా రాష్ట్ర అక్షరాస్యత 5.58 శాతం ఎక్కువ.

ప్రశ్న 7.
రాష్ట్రంలోని వివిధ వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు/కార్యక్రమాలు: ఏ సంక్షేమ రాజ్య లక్ష్యమైన తన ప్రజల జీవన ప్రమాణాన్ని కొనసాగించడం లేదా ఇంకా మెరుగుపరచడమే. చాలాకాలం వరకు ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పరిశ్రమలు ప్రధాన వాహకాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యత వల్ల సామాజిక రంగ అవస్థాపన సౌకర్యాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, నీటి సప్లయి, గృహవసతి, సామాజిక రక్షణ వంటి వాటిని మెరుగుపరచడము ద్వారానే సాధ్యం అవుతుంది. సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వాలు సాధించాలంటే ఈ సాంఘిక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
SGDP
జవాబు:
ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక ఎల్లల్లో ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల అంతిమ విలువను రాష్ట్ర స్థూల అంతర్గత ఆదాయం అంటారు. రాష్ట్ర స్థూల అంతర్గత ఆదాయాన్ని ‘రాష్ట్ర ఆదాయం’ గా కూడా పేర్కొనవచ్చు. దీనిని రాష్ట్ర ఆర్థిక గణాంకశాఖ అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని

  1. ప్రాథమిక రంగం.
  2. పారిశ్రామిక రంగం.
  3. సేవారంగం నుంచి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి లభిస్తుంది.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత.
జవాబు:
ఒక చదరపు కిలోమీటరు భూభాగంలో నివసించే సగటు ప్రజల సంఖ్యను జనసాంద్రత అనవచ్చు. జనసాంద్రత = ఆ ప్రాంత జనాభా / ప్రాంత భూభాగం చ.కిమీ.లలో.
రాష్ట్ర సౌభాగ్యం లేక పేదరికానికి జనసాంద్రత ఒక సూచికగా పనిచేయును.

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత.
జవాబు:
అక్షరాస్యత అనగా ప్రజల యొక్క చదవగల, వ్రాయగల నైపుణ్యం. ఒక ఆర్థికవ్యవస్థ అభివృద్ధి వేగానికి, అక్షరాస్యత స్థాయికి ధనాత్మక సంబంధం ఉన్నట్లు గుర్తింపబడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 67.11%. ఇందులో పురుష అక్షరాస్యత 74.83% మరియు స్త్రీ అక్షరాస్యత 60.01%.

ప్రశ్న 4.
ప్రాజెక్ట్ టైగర్. [Mar ’16]
జవాబు:
మన జాతీయ జంతువు అయిన పులుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్నూలు, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలలో విస్తరింపబడిన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) 50 కన్నా ఎక్కువ పులులకు నివాస స్థానంగా ఉంది.

ప్రశ్న 5.
సర్వశిక్ష అభియాన్.
జవాబు:
రాష్ట్రంలో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అందరికీ ఉపయోగపడే విధంగా ప్రాథమిక విద్యను కల్పించడానికి 2001-02లో సర్వశిక్ష అభియాన్ పధకాన్ని ప్రవేశపెట్టారు. సామాజిక నిర్వహణ పాఠశాలల ద్వారా సాంఘీక ప్రాంతీయ లింగపరమైన వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం సర్వశిక్ష అభియాన్ కృషి చేస్తుంది. ప్రస్తుతం దీని పేరు “రాజీవ్ విద్యామిషన్” గా మార్చారు.

ప్రశ్న 6.
ఏదేని సంక్షేమ పథకం.
జవాబు:
A.P. ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నది. అవి: మహిళల కోసం జననీ సురక్ష యోజన, వెనుకబడిన తరగతులకు బి.సి. వసతి గృహాలు, మైనారిటీలకు ఉర్దూ అకాడమీ, గిరిజనులకు ఐ.టి.డి.ఎ., యువతకు TRYSEM పథకం మొదలగునవి.

ప్రశ్న 7.
పర్యావరణ పర్యాటకం. [Mar ’17]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ ప్రధాన పర్యావరణ పర్యాటక బిందువుగా కూడా ఉంది. మారేడుమిల్లు; నేలపట్టు; మాయందూర్; తలకోన, ఎత్తిపోతలు మొదలగునవి ప్రముఖ పర్యావరణ పర్యాటక కేంద్రాలు.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్లో పౌర విమానయానం.
జవాబు:
రాష్ట్రంలో ప్రాంతాల మధ్య మెరుగైన అనుసంధానం కోసం మరియు ఆర్థికాభివృద్ధిని వేగతరం చేసే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం “ప్రాంతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదన తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, కడప మరియు రాజమండ్రి ఎయిర్పోర్టులను మెట్రోయేతర ఎయిర్పోర్టులుగా ఆధునికరించుటలో ఎయిర్పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో తాఖీదు కుదుర్చుకుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్లో రోడ్డుమార్గాలు.
జవాబు:
రోడ్లు ప్రాథమిక రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవే కాకుండా అత్యంత కీలకమైన అవస్థాపనా సౌకర్యం ఆంధ్రప్రదేశ్లో 42,511 కి.మీ.లలో రాష్ట్ర రహదార్లు 3,144 కి.మీ.ల, జాతీయ రహదార్లు 1,01,484 కి.మీ.లలో జిల్లాలను కలుపుకొని 1,46,954 కి.మీ. విస్తారమైన నెట్వర్క్ కలిగి ఉంది. దీనిని రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థనే నిర్వహణ బాధ్యత కల్గి ఉంటుంది.

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్లో నౌకా కేంద్రాలు. [Mar ’17, ’16]
జవాబు:
సముద్ర తీర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. విశాఖ ఓడరేవు రాష్ట్రంలో అతిపెద్దదే కాకుండా | అండమాన్ నికోబార్ దీవులలోని పోర్టబ్లెయిర్కు ప్రయాణికుల సముద్ర యాత్రా వసతి కూడా కలదు. కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ రేవులు రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 8th Lesson పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 8th Lesson పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘పర్యావరణం’ అంటే ఏమిటో నిర్వచించి, పర్యావరణం యొక్క అనుఘటకాలను గురించి వివరించండి.
జవాబు:
ఎన్విరాన్మెంట్ (పర్యావరణం) అన్న ఆంగ్లపదాన్ని “ఎన్విరానర్” అనే ఫ్రెంచిపదం నుంచి గ్రహించడం జరిగింది. “ఎన్విరాన్” అంటే “చుట్టూ ఉన్న” అని అర్థం. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రతి విషయాన్ని సమిష్టిగా పర్యావరణం (ఎన్విరాన్మెంట్) అని పిలువవచ్చు.

జీవరాశిని ప్రభావితం చేస్తూ వున్న సజీవ, భౌతిక మూలపదార్థాల కలయికనే ‘పర్యావరణం’ అని చెప్పవచ్చు. పర్యావరణం-భావనలు:1969లో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం (National Einvironmental Policy Act (NEPA) ప్రకారం పర్యావరణం భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు సౌందర్యపరమైన పర్యావరణాలుగా విభజింపబడి ఉంటుంది. రావ్ మరియు ఊటెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు.

1) భౌతిక పర్యావరణం:ఇది భౌతిక, రసాయన మరియు జీవ అంశాలైన భూమి, వాతావరణం, వృక్షసంపద, వన్యమృగాలు, చుట్టుప్రక్కల ఉన్న భూమి మరియు దాని స్వభావము, అవస్థాపనా సౌకర్యాలు, గాలి మరియు శబ్ద కాలుష్యస్థాయి మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

2) సాంఘీక పర్యావరణం: ఇందులో జనాభా మరియు జనసాంద్రత, సామాజిక కూర్పు, మతపరమైన, విద్యాపరమైన, సామాజిక సౌకర్యాలు అంటే పాఠశాలలు, ఉద్యానవనాలు, వైద్యశాలలు, వినోదాత్మక మరియు సాంస్కృతిక సౌకర్యాలు వంటి అనేక అంశాలు అంతర్భాగమై ఉంటాయి.

3) ఆర్థిక పర్యావరణం:ఆర్థికాంశాలైన ఉద్యోగిత, నిరుద్యోగం, ఆదాయవనరులు, ఉత్పత్తి కారకాల లభ్యత, డిమాండులో మార్పులు, పేదరిక స్థాయి మొదలైనవి ఇందులో ఉంటాయి.

4) మనోహరమైన పర్యావరణం: ఇందులో చారిత్రాత్మక, పురావస్తు, శిల్పసంపదకు సంబంధించిన ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఉంటాయి. ప్రజలు వీటిని చూసి ఆహ్లాదం పొందుతారు.

పర్యావరణంలో అనుఘటకాలు వైవిధ్యమైనవే గాక ఒకదాని మీద మరొకటి ఆధారపడి పరస్పరం ప్రభావితం చేస్తూ, ప్రభావితమవుతూ ఉంటాయి. కాబట్టి పర్యావరణం అనేది ఒక సంపూర్ణమైన అన్ని శాఖలు కలిసిన విజ్ఞానశాస్త్ర అధ్యయనమని చెప్పవచ్చు.

పర్యావరణం – అనుఘటాలు:మన చుట్టూ పర్యావరణం జీవ, నిర్జీవ అనుఘటాలను, వాటి పరస్పర ఆధారిత పరస్పర ప్రభావితాలను కలిగి ఉంది. ఈ విషయాలన్నింటి అధ్యయనాన్నే ‘జీవావరణ శాస్త్రం’ అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

1) జీవావరణ వ్యవస్థ (Eco system):ఇంగ్లాడుకు చెందిన ఎ.జి. ట్రాన్సీ అనే జీవావరణ శాస్త్రవేత్త 1935లో మొదటిసారి ‘జీవావరణం’ అనే పదాన్ని ఉపయోగించెను. జీవావరణం అనునది ఒక నిర్ధిష్ట మరియు గుర్తించదగిన భూమి యొక్క భాగము అంటే అడవులు, గడ్డిమైదానాలు, ఎడారులు, తీరప్రాంతాలు మొదలైనవి అని అర్థం. పర్యావరణంలోని వృక్షాలు మరియు జంతువులతో కూడిన జీవపర భాగాలతో పాటు నిర్జీవ భాగాలన్నింటినీ కలిపి ‘జీవావరణం’ అనవచ్చు. ఇది ఆ ప్రాంతంలోని మొక్కలు, వృక్షాలు, జంతువులు, చేపలు, సూక్ష్మజీవులు, నీరు, నేల మరియు మానవులందరి కలయిక, ఇటువంటి జీవావరణంలో కూడా ‘వృద్ధి-క్షయం’ అనే సూత్రం వర్తించి జీవ, నిర్జీవకాలు సృష్టింపబడి తిరిగి నశింపజేయబడుతూ ఒక విధమైన సంతులిత స్థితి నిర్వహింపబడుతుంది. దీనినే ‘జీవావరణ స్థిరత్వం’ అని అంటారు.

2) జీవ వైవిధ్యం (Biodiversity):జీవవైవిధ్యం అన్న పదం 1986లో అమెరికా శాస్త్రవేత వాల్టర్ రోసెన్ ప్రతిపాదించారు. భూమి జీవరాశులకు నిలయం. జీవరాశులు రకరకాల రంగులు, ఆకారాలు, ఆకృతులు, నిర్మాణాలను కలిగి ఉంటాయి. జన్యువులు, పర్యావరణం మరియు ఆవరణ వ్యవస్థలు కలిసి జీవరాశుల్లో ఉండే వైవిధ్యానికి, సంక్లిష్టతకు కారణమవుతున్నాయి.

జీవవైవిధ్యానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను అనేక ప్రయోజనాలుంటాయి. ప్రత్యక్షంగా ‘జీవ వైవిధ్యం’ మనకు ప్రాణాన్ని కాపాడే మందులు, ఆహారం, హార్మోన్లు, ఎంజైములు, పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు, అలంకరణకు పనికి వచ్చే తీగలు, మొక్కలు, మొదలైన వాటిని అందిస్తుంది.

జీవ వైవిధ్యం పరోక్షంగా కూడా ప్రయోజనాలను కలిగిస్తుంది. కర్బన స్థాయిని స్థిరపరచడం పరపరాగ సంపర్కం, జన్యు ప్రవాహం, నీటి వలయాలను నిర్వహించడం, భూగర్భజలాలను తిరిగి నింపడం, నేలను రూపొందించడం, పోషక వలయాలను స్థిరీకరించడం, కాలుష్యాలను విలీనం చేసుకోవడం, వాతావరణాన్ని క్రమపరచడం, సహజ పర్యావరణం అందించే రససౌందర్య, మానసోల్లాసాన్ని సంరక్షించడం మొదలయిన ఎన్నో రకాల పరోక్ష ప్రయోజనాలు మనకు జీవ వైవిధ్యం వల్ల లభిస్తాయి.

3) గ్రీన్ హౌస్ ప్రభావం:భూగ్రహంపై ఉన్న వాతావరణం కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు మీథైన్ వంటి కొన్ని రకాల వాయువులు ఎక్కువైన కారణంగా సూర్యుని నుండి విడుదల అయ్యే రేడియేషన్ని తమ ద్వారా లోపలికి రానిస్తాయి. కాని తిరిగి ఆ రేడియేటడ్ ఉష్ణాన్ని అట్టి పెట్టుకొని భూ ఉపరితలం నుండి బయటికి పోనివ్వవు. ఈ ప్రక్రియ వల్ల భూ ఉపరితలము ఉష్ణవికిరణాన్ని గ్రీన్ హౌస్ వాయువుల సహాయంతో గ్రహించి అన్ని’ దిశలకు వ్యాపింపచేస్తుంది. అలా కొంతభాగం తిరిగి భూమి వైపుకు, వాతావరణ దిగువ పొరలకు చేర్చబడి ఫలితంగా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇటువంటి గ్రీన్ హౌస్ వల్ల ఉష్ణపెరగడం, వాతావరణం మార్పులు, ఋతుపవన గమనం మరియు వాటి సామర్థ్యం మొదలైనవి జరుగుతాయి.

4) భూమి వేడెక్కుట (Global Warming):హరితగృహ వాయులైన కార్బన్ డై ఆక్సైడ్ వాటి వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఈ కార్బన్ డై ఆక్సైడ్ ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించుట ద్వారా, అడవుల నరికివేత వల్ల ఎక్కువగా వెలువడుతుంది. దీని ప్రభావంతో ఉష్ణం గ్రహింపబడి తిరిగి భూమి నుండి పరావర్తనం చెందకుండా భూమిపైనే ఉండిపోతుంది. దీని వల్ల గత శతాబ్దం నుంచి భూ వాతావరణ ఉష్ణోగ్రత 1.1°F పెరిగింది మరియు సముద్ర మట్టము కూడా కొన్ని ఇంచుల దాకా పెరిగింది. భూమి వేడెక్కడం వల్ల వచ్చే దీర్ఘకాల ఫలితాల్లో ముఖ్యమైనవి ధృవ ప్రాంతపు మంచు కరగడం, తద్వారా సముద్ర మట్టాలు పెరిగి, తీర ప్రాంతాలు ముంపుకు గురికావడం, కొన్ని రకాల జీవులు నశించి జీవ సమతుల్యం దెబ్బతినడం, ఉష్ణ ప్రాంతాలకు తుఫాన్లు రావడం మొదలగునవి జరుగుతాయి.

5) ఆమ్ల వర్షాలు (Acid Rain):ఆమ్ల వర్షం అనగా వాతావరణంలోని నైట్రిక్, సల్ఫ్యూరికామ్లాలు ఉండవల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉండి తద్వారా పడే రసాయనిక వర్షాలే. ఇవి వృక్షజాలము తగ్గిపోవుటచే సహజ కారణాల వల్ల మరియు సల్ఫ్యూరిక్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లను ఎక్కువగా విడుదల చేసే వాహనాలు వాడటం వంటి మానవ చర్యల వల్ల ఏర్పడుతాయి. ఆమ్ల వర్షాలు మొక్కల పెరుగుదలను అడ్డుకొని అవి చనిపోయేలా చేస్తాయి. కాబట్టి ఆమ్ల వర్షాల వల్ల వ్యవసాయం, అడవులు దెబ్బతింటాయి. అంతేగాక నీటిలో జీవించే జీవరాశులకు హానికరంగా మారుతాయి. శిల్పాలు, భవనాలు, వాహనాలు, పైపులు, కేబుల్ వైర్లు కూడా దీనికి ప్రభావితమవుతాయి. ఆమ్ల వర్షాల వల్ల సున్నితంగా వుండే సున్నపురాయి, ఇసుకరాయి కట్టడాలు తీవ్రంగా దెబ్బతింటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

6) ఓజోన్ పొర క్షీణత:స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ 03 తగ్గిపోవుటను ఓజోన్ క్షీణత అంటారు. ఈ ప్రాంతంలో హానికర క్లోరైన్ మరియు బ్రోమైన్ సంబంధ మూలాలు పెరగడం వల్ల ఓజోన్ క్షీణించడం లేక మందం తగ్గడం లేక రంధ్రాలు ఏర్పడడం జరగుతుంది. పర్యావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర కృశించి, రంధ్రాలు ఏర్పడతాయి.

ప్రశ్న 2.
ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి మధ్యగల సంబంధాన్ని వివరించండి.
జవాబు:
జీవరాశిని ప్రభావితం చేస్తూ, ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే పర్యావరణం అని చెప్పవచ్చు. పర్యావరణం ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ముడిసరుకులను సరఫరా చేయడమే కాక ఆర్థిక వ్యవస్థనుండి ఉత్పన్నమయ్యే వ్యర్థపదార్థాలను తనలో విలీనం చేసుకుంటుంది.

ఆర్థిక వ్యవస్థ అనగా నిరంతరం పెరిగిపోయే కోర్కెలను సంతృప్తి పరచడానికి అవసరమయ్యే వస్తు సముదాయాన్ని అందుబాటులో ఉన్న పరిమిత వనరుల సహాయంతో ఉత్పత్తి చేయటానికి రూపొందించుకున్న సముచితమైన సంవిధానాన్ని ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు.

పర్యావరణం ఒక వైపు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ముడి పదార్థాలు సప్లయి చేయడమే కాకుండా మరో వైపు ఆర్థిక వ్యవస్థ విడుదల చేసే వ్యర్థాలను సంగ్రహిస్తుంది. ఆధునిక కాలంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్లక్ష్యంగా దోపిడి తత్వంతో పెరిగిపోయి పర్యావరణ సామర్థ్యాన్ని, అది సప్లయి చేయగల వనరులను ప్రభాతం చేయును. అలాగే వ్యర్థాలను సంగ్రహించగల పర్యావరణ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. 1966లో బ్రిటీష్ ఆర్థికవేత్త ఇ. బిల్లింగ్ పర్యావరణ వనరులను విపరీతంగా వాడుకోవడం ఎంతో ప్రమాదకరమని హెచ్చరించారు.

ఆయన ఉద్దేశ్యంలో “ఈ ప్రపంచం పరిమిత జీవనాధార వనరులు కల్గిన ఒక పాత్ర వంటిది. కాబట్టి మానవాళి వనరుల వినియోగాన్ని గరిష్టంకాకుండా ఎంత కనిష్టం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక కార్యాకలాపాలు పర్యావరణంపై ఒత్తిడి ఎలా కలిగిస్తాయో ఈ క్రింది పటం తెలియజేయును.

పర్యావరణం మరియు ఆర్థిక కార్యకలాపాలు
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 1
పై పటంలో పర్యావరణ సహజ వనరులను వివిధ ఆర్థిక రంగాలైన వ్యవసాయ పారిశ్రామిక మరియు సేవారంగాలకు వనరులను ముడి పదార్థాల రూపంలో పంపిణీ చేస్తుంది. ఈ రంగాలు వనరులు ఉపయోగించుకొని వస్తు సేవలను ఉత్పత్తి చేస్తున్నాయి. వస్తు సేవల ఉత్పత్తి పర్యావరణ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు పర్యావరణ భౌతిక ఉపయోగం పెరిగి, పర్యావరణ పరిమాణం తగ్గుతూ వస్తుంది. మరోవైపు ఆర్థిక కార్యకాలాపాలు పర్యావరణంలోకి వ్యర్థ పదార్థాలను మరియు వివిధ రూపాలలోని కాలుష్యాన్ని వదలుతున్నాయి. ఇది పర్యావరణ నాణ్యతను దెబ్బతీస్తుంది. ఇది పర్యావరణం యొక్క కాలుష్యాన్ని గ్రహించే శక్తిని కోల్పోయేలా చేస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 3.
గాలి కాలుష్యం అంటే ఏమిటి ? అందుకు గల కారణాలు, ఫలితాలు తెల్పండి.
జవాబు:
కాలుష్యం – రకాలు:పర్యావరణానికున్న స్వాభావిక లక్షణాల్లో భౌతికంగా, రసాయనికంగా లేదా జీవపరమైన అవాంఛనీయ పరిమాణాలు కలిగితే దాన్ని కాలుష్యం అంటారు. పర్యావరణంలోని కాలుష్యం వివిధ రకాలుగా ఉంటుంది. వాటిలో వాయు, జల, నేల, శబ్ద, ఘనవ్యర్థ పదార్థాల, ఉష్ణకాలుష్యాలు ప్రధానమైనవి.

గాలిలో ఇతర కాలుష్యకారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో వున్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని ‘వాయు లేక గాలి కాలుష్యం’ అంటారు.

1) వాయు కాలుష్యం:మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎన్నో రకాలైన వాయువులు ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ మొదలయినవి ఆవరించి ఉంటాయి. భూమి చుట్టూ ఉన్న వాతావరణం ఇలాంటి వాయువుల కలయికతో ఏర్పడి, ఉమ్మడిగా వీటన్నంటిని కలిపి ‘వాయువు’ (గాలి) అని సామాన్య అర్థంగా పిలుస్తుంటారు. బరువు దృష్ట్యా చూస్తే మానవుడు రోజు తీసుకొనే పదార్థాల్లో 80% వరకు గాలి ఉంటుంది. మనుషులు సగటున ఒకరోజుకు 2200 సార్లు శ్వాసిస్తూ ఒక రోజులో సుమారు 16 నుంచి 20 కి.గ్రాల గాలిని పీల్చుకుంటూ ఉంటారు. అన్ని జీవరాశుల శ్వాసక్రియ ఈ వాయువు మీదనే ఆధారపడి ఉంటుంది. కాని మానవుని వివిధ కార్యకాలాపాల వల్ల గాలి కాలుష్యం కాబడి, అందులోని వివిధ వాయువుల సహజసిద్ధమైన కూర్పు భంగము చేయడుతుంది. కాలుష్యం వల్ల ప్రాణికోటికి అవసరమైన ప్రాణవాయువు తగ్గిపోయి, హానికారక బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) మరియు నత్రజని (నైట్రోజన్) స్థాయిలు పెరిగిపోతాయి.

వాయు కాలుష్యం కారణాలు:ప్రస్తుత అంచనాల ప్రకారం సగటున ఒక సంవత్సరానికి 2 బిలియన్ టన్నుల వాయు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి.
1) వాయు కాలుష్యం సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరుగుతూ ఉంటుంది.

2) వంట చెరుకును కాల్చడం, శిలాజ ఇంధనాలను వాడడం, పారిశ్రామికీకరణ, పంటలసాగు, వాహన విసర్జకాలు, న్యూక్లియర్ పరీక్షలు, అడవులు నాశనమైపోవడం, గనుల తవ్వకం, విద్యుత్పత్తి, శీతలీకరణ పరిశ్రమలు మొదలగునవి వాయు కాలుష్యానికి ముఖ్య కారణాలు.

వాయు కాలుష్యం ప్రభావాలు:వాయు కాలుష్యం ప్రజలను, మొక్కలను, జంతువులను, జలచరాలను, ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మానవుల ఆరోగ్యాన్ని తారుమారు చేస్తుంది. చెట్ల, మొక్కల ఆకులను పాడుచేస్తుంది. కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరగనీయదు. మొక్క వృద్ధిని అడ్డుకుంటుంది. చారిత్రాత్మక కట్టడాలను వర్ణవిహీనం చేస్తుంది. ఇండ్లు, కార్లులాంటి వాటికుండే వెలుపలి రంగులు పేలవంగా తయారుచేస్తుంది. సహజమైన అందాలను కలిగిన ప్రదేశాల స్వచ్ఛతను, నాణ్యతను క్షీణింపచేస్తుంది.

ఉదా:ప్రసిద్ధ కట్టడం తాజ్మహల్ తెల్లటి పాలరాయి 1998లో పసుపు రంగులోకి మారడం ప్రారంభించింది. ఈ మార్పు ప్రమాదస్థాయిని కూడా మించిపోయింది. వాయుకాలుష్యం స్ట్రాటోస్పియరు, శీతోష్ణస్థితిని తారుమారు చేసి భూతాపానికి ఆమ్ల వర్షాలకు, ఓజోన్ పొర క్షీణతకు, ఉష్ణోగ్రతలు పెరుగుదలకు కరువులు రావడానికి, మొక్కల, పంటల క్రిమికీటకాల, పశువుల స్వాభావిక లక్షణాలు మారిపోవడానికి, అతినీలలోహిత కిరణ ధార్మికతకు కారణమవుతూ ఉంటుంది.

ప్రశ్న 4.
నీటి కాలుష్యానికి కారణాలు, దాని ప్రభావాలను తెలపండి.
జవాబు:
నీటి కాలుష్యం:నీటిని ‘నీలి బంగారం’ అంటారు. జీవరాశులకు గాలి, ఎండ, ఎంత అత్యవసరమో నీరు కూడా అంతే అవసరం. మానవుని శరీర బరువులో 70 శాతం నీరు ఉంటుంది. భూమి ఉపరితంలో 80 శాతం వరకు నీరు ఆక్రమించి ఉంది. భూమి మీద ఉండే నీటిలో 97 శాతం “కు సముద్రాల్లో ఉంటుంది. మిగతా 3 శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు. అందులో 2.997 శాతం మంచు డ్డ డ లో ఉంది. మిగతా 0.003 శాతం చాలా కొద్ది పరిమాణంలో మాత్రమే మానవాళి ఉపయోగానికి లభిస్తోంది. కాబట్టి నీరు అత్యంత విలువైన వనరుగా పరిగణించబడుతోంది. నీరు లేకపోతే ఈ భూమి మీద అసలు జీవమే ఉండదు. సెలయేళ్ళు, సరస్సులు, చెరువులు, నదులు, సముద్రాలు, ఆనకట్టలు, జలధారల్లో నిల్వచేసిన నీరు మొదలైనవి ఉపరితల నీటి వనరులు. భూమి లోపల ఇంకిపోయిన బావులు, గొట్టపు బావుల ద్వారా లభించే నీటిని భూగర్భజలం అంటారు. ఆర్థిక కార్యకలాపాల్లోని ప్రతిదశలో నీరు చాలా అవసరం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

కొన్ని పదార్థాలు గాని, కారకాలు గాని, నీటిలో ఎక్కువగా చేరిపోయి, నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించివేసి దానిని ఆరోగ్యానికి హానికరంగాను, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చివేస్తాయి. దానినే నీటి కాలుష్యంగా చెప్పవచ్చు. మానవ ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటంతో, నీరు వినియోగానికి కూడా పనికిరానంతగా కలుషితమవుతుంది. నీరు నాణ్యతను కోల్పోయి, వ్యవసాయానికేకాక, త్రాగటానికి కూడా పనికిరాకుండా పోతుంది. ఆర్థిక కార్యకాలాపాలు విస్తరించడంతో ఉపరితంలో ఉన్న నీరే కాకుండా భూగర్భ జలం కూడా కలుషితమౌతుంది.

నీటి కాలుష్యం – కారణాలు:గృహాలలో వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, మేటవేయడం, పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలు, ప్రమాదవశాత్తు సముద్రంలో చిందిపోయే నూనెలు, విషపూరితమైన లోహాల మూలకాలు, గనుల తవ్వకం వల్ల వచ్చే వ్యర్థాలు, మొదలగు వాటి వల్ల నీరు కలుషితమవుతుంది.

నీటి కాలుష్యం – ప్రభావాలు :

  1. నీటి నుంచి పుట్టే వ్యాధులను వ్యాపింపచేస్తుంది. తద్వారా వైద్యఖర్చుల రూపంలో అధిక ఆర్థిక భారం మోపుతుంది.
  2. త్రాగు నీటి స్వచ్ఛతను క్షీణింపచేస్తుంది. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా ఉపయోగించడానికి కూడా పనికిరాకుండా పోతుంది.
  3. సముద్ర ఉత్పత్తులు కలుషితమై తినడానికి వీలులేని ప్రమాదకరమైనవిగా మార్చేస్తుంది. తద్వారా ఎగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గుతుంది.
  4. నీటిలోని ఆక్సిజన్ని తగ్గిస్తుంది. అది సముద్ర వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పునకు దారి తీసి, నీటిలో జీవించే జీవుల పునరుత్పత్తి తద్వారా దేశ సముద్ర ఉత్పాదక విలువను ప్రభావితం చేస్తుంది.
  5. మానవులు పనిచేసే రోజులు అనారోగ్యం వల్ల తగ్గిపోతాయి. తద్వారా ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గిపోతాయి.

ప్రశ్న 5.
‘ధ్వని కాలుష్యం’ అంటే ఏమిటో నిర్వచించి, అది పర్యావరణ స్వచ్ఛతను ఎలా కలుషితం చేస్తుందో వివరించండి.
జవాబు:
ధ్వని కాలుష్యం కారకాలు:ధ్వని కాలుష్యం (ఇంట, బయటా) ఉంటుంది. గృహోపకరణాల వాడకం వల్ల, లౌడ్ స్పీకర్ల వాడకం, గడియారం అలారం, శబ్దాల వల్ల ఊపిరి పీల్చడం, మాట్లాడటం, శబ్దాలు మొదలైనవి ఇంటిలోపల ధ్వనులకు ఆధారాలు. బయటి ధ్వని కాలుష్యం ముఖ్యంగా థర్మల్ ప్లాంటు, గనుల త్రవ్వకం, విమానాశ్రయాలు, వివిధ రవాణా సాధనాల ద్వారా ఏర్పడుతుంది.

ధ్వని కాలుష్యం – ప్రభావాలు:ధ్వని కాలుష్యం పర్యావరణ స్వచ్చతను భూమిమీద జీవించే ప్రాణులను ప్రభావితం చేస్తుంది. ధ్వని కాలుష్యం అనేక ప్రభావాలకు దారితీస్తుంది. అందులో ముఖ్యమైనవి.

  1. సంగీతం, భాషణల యొక్క తియ్యదనం, ఇంపు నశించిపోతుంది.
  2. వార్తా ప్రసార శ్రవణాన్ని అడ్డుకుంటుంది.
  3. తాత్కాలికంగా కాని, శాశ్వతంగా కాని వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం వుంది.
  4. మానవుని శరీరంలోని వివిధ వ్యవస్థలు చేసే పనులకు అడ్డుపడుతుంది. నరాలపై ఒత్తిడి పెరగడం, నిద్రలేకుండా పోవడం, జీర్ణక్రియలు సరిగా లేకపోడం, రక్తపోటులాంటి అనారోగ్య పరిస్థితులు ధ్వని కాలుష్యం వల్ల కలుగుతాయి.
  5. నాడి సక్రమంగా కొట్టుకోకపోవడానికి లేదా వేగంగా కొట్టుకోవడానికి, రక్తంలో కొవ్వు శాతం పెరగడానికి కారణమవుతుంది.
  6. గర్భస్థ శిశువులకు సరిచేయలేనటువంటి ప్రమాదాలను కలుగచేస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 6.
పర్యావరణ క్షీణతకు గల ఆర్థిక కారణాలు ఏవి ?
జవాబు:
ఆర్థికాభివృద్ధి, పర్యావరణ క్షీణత లేదా కాలుష్యం ఒకే దిశలో పయనిస్తాయి. విచక్షణారహితంగా, సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల భౌతిక పర్యావరణం క్షీణిస్తుంది. పర్యావరణ క్షీణత ప్రభావాలను మనం అనేక విధాలుగా చూడవచ్చు. కాలష్యాల దుష్ఫలితాలను క్రింద వివరించడం జరిగింది.

1) మానవ ఆరోగ్యంపై ప్రభావాలు:పర్యావరణ క్షీణత, మానవ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నందున, శ్రామికలు తమ పనులకు హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్య కారణాలు, శ్రామికుల సామర్థ్యాన్ని తగ్గించగా అది | అల్ప ఉత్పాదకతకు దారితీస్తుంది.

ఎ) వాయు కాలుష్యం:వాయు కాలుష్యకారకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, కణరూపద్రవ్యం మొదలైనవి శ్వాసకోశం ద్వారా మానవశరీరంలోకి నేరుగా ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మానికి చిరాకును కలిగించి బాధపెట్టే అలర్జీ మొదలైన వ్యాధులకు వాయు కాలుష్యమే
కారణం.

బి) నీటి కాలుష్యం:వ్యాధులను వ్యాపింపచేసే సాధనాలలో అతి ముఖ్యమైనది నీరు. వివిధ వ్యాధులను కలిగించే వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవాలాంటి సూక్ష్మక్రిములు నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఈ సూక్ష్మక్రిముల వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లులాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.

సి) ధ్వని కాలుష్యం:ధ్వని కాలుష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్దశబ్దాలు నిద్రాభంగాన్ని కలిగించి, ఆరోగ్యం మీద ప్రభావాలను కలిగిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల వినికిడి దెబ్బ తినడం, పనిపాటల్లో, సంభాషణలో అంతరాయాన్ని, ఏకాంతానికి భంగం, నిద్రాభంగాన్ని బాధను లేదా చిరాకును కలిగిస్తుంది. అలాగే ఏకాగ్రతకు భంగం కలిగించడం, రక్తపోటు, గుండెవేగం పెరగడంలను కలుగ చేస్తుంది.

2) వ్యవసాయంపై ప్రభావం:పర్యావరణ క్షీణత వల్ల వ్యవసాయరంగం దెబ్బతింటుంది. వ్యవసాయ ఉత్పాదకత, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతాయి.

ఎ) వాయు కాలుష్యం:వాయు కాలుష్యకారకాలైన సల్ఫర్-డై-ఆక్సైడ్ వదిలే పొగలు మొక్కలను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మొక్కలలోని లెట్యూస్, బార్లీ, వైట్ – ఫైన్ మొదలైనవి ఈ పొగల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతాయి. సాధారణంగా వాయుకాలుష్యం మొక్కల ఆకులను దెబ్బతీస్తుంది. మొక్కల ఆకులలోని పత్రహరితాన్ని కోల్పోయి అవి పసుపు పచ్చగా మారతాయి. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తిని వాయుకాలుష్యం తగ్గిస్తుంది. వాతావరణంలో మార్పులకు వాయుకాలుష్యం కారణమని అనేక సూచికలు తెలియచేస్తున్నాయి. ఆమ్లవర్షాలకు కారణం వాయు కాలుష్యమే. వాతావరణంలో మార్పులు, ఆమ్ల వర్షాలు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తాయి.

బి) నీటి కాలుష్యం:నీటి కాలుష్యం వ్యవసాయభూముల ఉత్పాదకతను అధికంగా దెబ్బతీస్తుంది. కలుషిత నీటిలో నిర్జీవ లవణాలు, ముఖ్యంగా క్లోరైడ్ ఉంటుంది. ఈ నీరు పంట పొలాలలోకి ఇంకి ఆవిరైపోతే లవణాలు మాగాణి భూమిలో కేంద్రీకృతం అవుతాయి. ఈ విధంగా లవణాలు భూమిలో పేరుకుపోయి కేంద్రీకృతమై, భూసారం తగ్గి, సాగుభూమి బీడుబారిపోతుంది.

సి) నేల కాలుష్యం:నేలకోత, లవణీకరణ, ఎడారీకరణ మొదలైనవి భూమి నాణ్యత, సాగుభూమి పరిమాణాన్ని తగ్గిస్తాయి. గనుల నిర్వహణ కూడా పంటపొలాలను తగ్గించి భూమికోతకు కారణమవుతున్నది. కావున భూకాలుష్యం పంటపొలాల విస్తీర్ణాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

3) పరిశ్రమలపై ప్రభావాలు:పర్యావరణ కాలుష్యం పారిశ్రామిక ఉత్తత్త్పిని తగ్గిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యత కూడా దీని వల్ల క్షీణిస్తుంది.

ఎ) వాయు కాలుష్యం:భవనాలు, కార్లు, వస్త్రాలు, మొదలైనవి గాలిలోని వ్యర్థపరమాణువుల వల్ల ప్రభావితం అవుతున్నాయి. సల్ఫర్ ఆక్సైడ్లు భవనాల తయారీలో ఉపయోగపడు పాలరాయి, సున్నపురాళ్ల క్షీణతకు కారణం అవుతున్నాయి. సల్ఫర్ ఆక్సైడ్ ప్రభావం వల్ల వస్త్రాలు, తోళ్లు, స్టీలు మొదలైనవి దెబ్బతింటున్నాయి. నైట్రోజన్ ఆక్సైడ్ సున్నితమైన రంగులను వెలసిపోయేటట్లు చేస్తుంది. వాయు కాలుష్యం పరిశ్రమల, యంత్రాల తరుగుదలకు కారణమవటంతో పాటు, పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను తగ్గిస్తుంది.

బి) నీటి కాలుష్యం:కలుషితమైన నీరు, పరిశ్రమలకు తక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. భిన్న పరిశ్రమలలో ఉపయోగపడే నీటి నాణ్యత భిన్నరకాలుగా ఉంటుంది. చల్లటి నీటిలో సాధారణంగా తక్కువ శుభ్రత కలిగి ఉంటాయి. అవసరం లేని వేడిమి, పదార్థాలని తీసివేసే గుణం వున్న నీరు పరిశ్రమలకు ఉపయుక్తం కాదు. కలుషిత నీటి వల్ల పరిశ్రమలలో వ్యయాలు ఎక్కువగా అవుతాయి. నీటిని శుద్ధిచేయటం, దెబ్బతిన్న యంత్ర సామాగ్రిని బాగుచేయటం, పారిశ్రామిక ప్రక్రియలో సర్దుబాటు వల్ల పరిశ్రమల వ్యయాలు పెరుగుతాయి.

సి) నేల కాలుష్యం:ఖనిజాలు, ఖనిజనూనెలు భూమిలో అంతర్భాగాలు. వీటిని ఉపయోగిస్తే అవి శాశ్వతంగా కోల్పోవడం జరుగుతుంది. శక్తిని ఉత్పత్తి చేయటానికి బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వివిధ ఖనిజాలను పరిశ్రమల్లో ముడి పదార్థాలుగా ఉపయోగించటం జరుగుతుంది. విచక్షణా రహితంగా ఈ వనరులను ఉపయోగిస్తే, ఇవి హరించుకుపోయి పారిశ్రామిక అభివృద్ధిని తగ్గిస్తాయి.

4) పశుసంపదపై ప్రభావాలు:పర్యావరణ కాలుష్యం పశు పక్ష్యాదుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను కల్గిస్తుంది. పశుపక్ష్య సంబంధమైన ఉత్పత్తులు కూడా తగ్గుతాయి. పశు ఆరోగ్యానికి అతి ప్రమాదకరమైన కాలుష్యకం ఫ్లోరైడ్ పాడి పశువులు ఫ్లోరైడ్ వల్ల అతిగా ప్రభావితమై, పాల ఉత్పత్తులు తగ్గిస్తాయి. ఫ్లోరైడ్ వల్ల వచ్చే ‘ఫ్లోరోసిస్’ అనే వ్యాధి వల్ల పళ్లు, ఎముకలు ప్రభావితమై అవిటి అవడం జరుగుతుంది.

5) సముద్ర ఆహార పదార్థాలపై ప్రభావం:నీటి కాలుష్యం మత్స్యవనరుల మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నీటిని కలుషితం చేసే విషపదార్థాలు నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గించడం వల్ల నీటి ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి చేపల పునరుత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా అవి కలుషితమై భుజించడానికి కూడా పనికిరాకుండా చేస్తుంది.

6) ఇతర ప్రభావాలు:పై ఆర్థిక ప్రభావాలే కాకుండా, ఇతర పదార్థాలు కూడా పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడతాయి. ఇది జీవవైవిధ్యాన్ని తగ్గిస్తుంది. జీవవైవిధ్యంలోని విభిన్న జంతువులు జీవరాశులు, మొక్కలు ప్రభావితం చేయబడి, వాటి మధ్య అంతర్గత సంబంధాలు దెబ్బతింటాయి. ఈ కారణాల వల్ల పరస్పర ఆధారమైన, సున్నితమైన ఆహార గొలుసులోని బంధం తెగిపోవచ్చు లేదా బలహీనం కావచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 7.
పర్యావరణ కాలుష్యానికి దారితీసిన కారకాలు ఏమిటి ?
జవాబు:
పర్యావరణ క్షీణత, వాతావరణం కాలుష్యం కన్నా కొద్దిగా భిన్నమైనవి. పర్యావరణ నాణ్యత తగ్గడాన్ని క్షీణత అంటాము. కాని ప్రకృతి కొన్ని హానికారక మూలకాలతో కాలుష్యం అవడాన్ని కాలుష్యం అనవచ్చు. పర్యావరణ మార్పులు ఆర్థికాభివృద్ధి, జనాభా వృద్ధి, నగరీకరణ, సాంద్ర వ్యవసాయం పద్ధతులు, విద్యుత్ వాడకం పెరగడం మరియు రవాణా వంటి అనేక కారణాల వల్ల ఏర్పడవచ్చు. పర్యావరణ క్షీణతకు ప్రాధమిక కారకాలను క్రింది విధంగా చర్చించవచ్చు.

1) సాంఘీక కారణాలు:పర్యావరణ క్షీణతకు కారణమైన సాంఘిక కారణాలను సంక్షిప్తంగా క్రింద వివరించడం జరిగింది.

ఎ) జనాభా:ఆర్థికాభివృద్ధి జరగాలంలే జనాభాయే మూలం. అయితే, ఒక హద్దు దాటి పెరిగితే పర్యావరణ క్షీణతకు కూడా జనాభాయే ముఖ్య కారణమవుతుంది. కాబట్టి పెరుగుతున్న జనాభా జీవ సహాయం వ్యవస్థల మధ్య సంబంధాన్ని స్థిరీకరించాలి. లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు, నవకల్పనలు, సత్ఫలితాలను ఇవ్వలేవు.
ప్రపంచ భూభాగంలో 2.4% ఉన్న భారతదేశం ప్రపంచ జనాభాలో 17% జనాభాను పోషిస్తుంది. ప్రస్తుత భారత జనాభా పెరుగుదల రేటు 1.77 (2011 జనగణన). ఈ రేటు భారతదేశం ఎదుర్కొనే జనాభా సమస్యను సూచిస్తుంది. కాబట్టి జనాభా, పర్యావరణ సంబంధాలను దృష్టిలో ఉంచుకొని జనాభా నియంత్రణకు ఉధృత చర్యలను (Vigourous Drive) చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

బి) పేదరికం:పర్యావరణ క్షీణతకు పేదరికం కారణం మరియు ఫలితం కూడా అని చెప్పవచ్చు. పేదరికానికి, పర్యావరణానికి ఉన్న చక్రరూప సంబంధం అతి క్లిష్టమైన దృగ్విషయం. అసమానతలు, వనరుల క్షీణతని పెంపొందిస్తాయి. ఎందుకంటే ధనికుల కంటే పేదలు ఎక్కువగా సహజ వనరులపై ఆధారపడతారు. కాబట్టి సహజ వనరలు తగ్గుతాయి. పేదవారికి ఇతర వనరుల ద్వారా సరైన ఫలితాలు పొందే అవకాశం లేదు. దేశంలో రంగరాజన్ కమిటీ ప్రకారం 29.5 శాతం మరియు సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 21.9% (2011-12)గా పేదరిక శాతాన్ని అంచనా వేశారు. కానీ నిరపేక్ష పేదరిక పరిమాణం అంటే దారిద్య్ర రేఖకు దిగువన నివసించే వారి మొత్తం సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.

2) నగరీకరణ (Urbanization):గ్రామాలలో లాభసాటి ఉద్యోగవకాశాలు లేనందువల్ల పేదకుటుంబాలు పట్టణాలకు తరలి వెళ్ళడం జరుగుతోంది. అందువల్ల జీవావరణంపై ఒత్తిడి పెరుగుతుంది. మెగా సిటీలు లేదా పెద్ద నగరాలు పెరగటంతో పాటు మురికివాడలు కూడా విస్తృతమవుతాయి. 2001 జనగణన ప్రకారం 28.6 కోట్ల ప్రజలు నగరాల్లో నివసిస్తున్నారు. శాతంలో చెప్పాలంటే 27.8% మంది అన్నమాట. అదే 2011 జనగణన ప్రకారం 37.7 కోట్లకు (30%) పెరిగారు. ఈ విధమైన శీఘ్ర ప్రణాళికా రహిత పట్టణాలు పెరుగుదల, పట్టణాల పర్యావరణ ల క్షీణతకు దారితీస్తుంది.

3) ఆర్థిక అంశాలు (Economic Factors):పర్యావరణ క్షీణతకు చాలా వరకు మార్కెట్ వైఫల్యమే కారణం, అంటే పర్యావరణ వస్తు, సేవలకు సంబంధించి మార్కెట్ లేకపోవటమే లేదా మార్కెట్ సమర్థవంతంగా పనిచేయలేకపోవటమే కారణంగా చెప్పవచ్చు. ప్రైవేటు, సాంఘిక వ్యయాల (Social costs or benefits) వల్ల వినియోగం, ఉత్పత్తుల్లో బహిర్గత ప్రభావాలు ఏర్పడి పర్యావరణ క్షీణతకు కారణమవుతున్నాయి. మార్కెట్ వైఫల్యానికి స్పష్టంగా నిర్వచించని ఆస్తి హక్కు ఒక కారణం. అంతేకాకుండా ధరల నియంత్రణ, సబ్సిడీల వల్ల మార్కెట్ వక్రీకరణ ఫలితంగా సాధించవలసిన పర్యావరణ లక్ష్యాలను పెంచుతున్నాయి.

తత్ఫలితంగా సహజ వనరులు (ఖనిజ నూనెలు, ఖనిజాలు) తగ్గిపోవడం, నీరు, గాలి, భూమి, కలుషితమవటం ఫలితంగా ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు జీవావరణ వ్యవస్థ నాణ్యత తగ్గిపోతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వివిధ పర్యావరణ భావనలను వివరించండి.
జవాబు:
1969లో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం (National Environmental Policy Act (NEPA) ప్రకారం పర్యావరణ భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు సౌందర్యపరమైన పర్యావరణాలుగా విభజింపబడి ఉంటుంది. రావ్’ మరియు ఊటెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు.

1) భౌతిక పర్యావరణం:ఇది భౌతిక, రసాయన మరియు జీవ అంశాలైన భూమి, వాతావరణము, వృక్షసంపద, వన్యమృగాలు, చుట్టప్రక్కల వున్న భూమి మరియు దాని స్వభావము, అవస్థాపనా సౌకర్యాలు, గాలి మరియు శబ్ద కాలుష్య స్థాయి మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

2) సాంఘిక పర్యావరణము:ఇందులో జనాభా మరియు జనసాంద్రత, సామాజిక కూర్పు, మతపరమైన, విద్యాపరమైన, సామాజిక సౌకర్యాలు అంటే పాఠశాలలు, ఉద్యానవనాలు, వైద్యశాలలు, వినోదాత్మక మరియు సాంస్కృతిక సౌకర్యాలు వంటి అనేక అంశాలు అంతర్భాగమై అంటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

3) ఆర్థిక పర్యావరణం:ఆర్థికాంశాలైన ఉద్యోగిత, నిరుద్యోగం, ఆదాయవనరులు, ఉత్పత్తి కారకాల లభ్యత, డిమాండులో మార్పులు, పేదరికస్థాయి మొదలైన అంశాలు ఇందులో ఉంటాయి.

4) మనోహరమైన పర్యావరణం:ఇందులో చారిత్రాత్మక, పురావస్తు, శిల్ప సంపదకు సంబంధించిన ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఉంటాయి. ప్రజలు వీటిని చూసి ఆహ్లాదం పొందుతారు.

పర్యావరణంలో అనుఘటకాలు వైవిధ్యమానమై గాక ఒకదాని మీద మరొకటి ఆధారపడి పరస్పరం ప్రభావితం చేస్తూ, ప్రభావితమవుతూ ఉంటాయి. కాబట్టి పర్యావరణం అనేది ఒక సంపూర్ణమైన అన్ని శాఖలు కలిసిన విజ్ఞానశాస్త్ర అధ్యయనమని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
నేల లేక భూమి కాలుష్యం.
జవాబు:
భూపటలంలోని పై పొరలను ‘నేల’ లేదా ‘మృత్తిక’ అంటారు. రాళ్ళు నిరంతరం భౌతిక, రసాయనిక, జీవ శైధిల్యానికి గురవుతూ ఉండడం వల్ల నేల ఏర్పడింది. ప్రకృతి మానవునికిచ్చిన వరమే నేల నేల ప్రాణంతో ఉన్న (సజీవ) వనరు.

నేల నాణ్యత కొన్ని ప్రతికూల మార్పులకు గురి అయి అందులోని సహజ మూలకాల కూర్పు తారుమారు కావడం తద్వారా భూమి ఉత్పాదకత తగ్గడమే “నేల కాలుష్యమని” నిర్వచించవచ్చు.

నేల కాలుష్యానికి కారణాలు:నేల కాలుష్యం అనేది మృత్తికా క్రమక్షయ వల్ల ఏర్పడుతుంది. మృత్తికా క్రమక్షయం అనేది నేల ఉపరితలంలోని సారవంతమైన పొరలు కోతకు గురిచేసి, భూమి నిస్సారంగా మార్చడం వల్ల జరుగుతుంది. ఇది అడవుల నరికివేత, విస్తృత వ్యవసాయం వల్ల, గనుల త్రవ్వకం మొదలగు వాటి వల్ల ఏర్పడుతుంది. అదే విధంగా నేల కోతకు ఎడారీకరణ కూడా కారణమే. దీని వల్ల నేల జీవంలేకుండా ఇసుక సముద్రంగా తయారవుతుంది. ఎడారీకరణ అనేది పశువులను ఎక్కువగా మేపడం వల్ల తక్కువ సారం కలిగిన నేలలనే ఎక్కువగా ఉపయోగించడం వల్ల, క్షారీకరణ, లవణీకరణ మొదలగు వాటి వల్ల ఏర్పడుతుంది.

అధికంగా రసాయనిక ఎరువుల, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల వివిధ రసాయనాలు, ఆమ్లాలు, క్షారాలు, భూమిలోకి చొచ్చుకుపోయి భూమికి ఉండే సహజ రసాయనిక ధర్మాలు మార్పుచెంది మొక్కలు, పంటల నాశనానికి దారితీస్తుంది. వ్యర్థపదార్థాలతో భూమిని నింపటం వల్ల కూడా నేల క్షీణతకు ..రవుతుంది.

ప్రశ్న 3.
సహజ వనరుల రకాలు, ఉదాహరణలతో వ్రాయుము. [Mar ’16]
జవాబు:
భూమి వనరుల నిలయం. వనరులు ప్రకృతి ప్రసాదిం వరాలు. వనరులను మనం ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించుకుంటాం.

సహజ వనరుల విభజన:సహజ వనరులను వాటి పరిమాణాన్ని బట్టి, నూర్పుచెందే గుణాలను బట్టి, వాటిని తిరిగి వాడుకొనే విధానాన్ని బట్టి విభజించవచ్చు. కాని సాధారణంగా రెండు రకాలుగా విభజించి పరిశీలించడం సౌకర్యంగా ఉంటుంది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 2

1) పునరావృతం అయ్యే వనరులు:ఎలాంటి తరుగుదల లేకుండా ఎన్నిసార్లు ఉపయోగించుకున్నా క్షీణించని వనరులను పునరావృతమయ్యే వనరులు అంటారు. అవి తరిగిపోవు. స్వల్పకాలంలోనే ఆ వనరులు తమంతట తామే పునరుత్పత్తి చేసుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వాటి నిల్వలు స్థిరంగా ఉండక పెరుగుతూ, తరుగుతూ ఉంటాయి. వీటినే “సాంప్రదాయేతర వనరులు” అని కూడా అంటారు. ఉదాహరణకు గాలి, సౌరశక్తి, సముద్రపు అలలు, భూగర్భ ఉష్ణవనరులు (Geo-Thermal) మొదలగునవి.

2) పునరావృతం కాని వనరులు:వాడుకొంటూ పోతే తరిగిపోయేటటువంటి సహజ వనరులను ‘పునరావృతం కాని వనరులు అంటారు. వీటిని సాంప్రదాయ వనరులు అంటారు. ఈ వనరులను మనం పునరుత్పత్తి చేయలేము. ఒక్కసారి ఈ వనరులు తరిగిపోతే, అవి వాడుకోవడానికి అందుబాటులో ఉండవు. ఇటువంటి వనరులను ఎంతగా వినియోగిస్తూపోతామో, రాబోయే తరాల వారికి ఇది అంత కొరతగా మారిపోతుంది.
ఉదాహరణకు బంగారం, వెండి, రాగి, శిలాజ ఇంధనాలు, నూనెలు మొదలైనవి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 4.
కాలుష్యం అంటే ఏమిటి ? కాలుష్యాన్ని ఎన్ని తరగతులుగా విభజించవచ్చో వ్రాయండి.
జవాబు:
పర్యావరణానికున్న స్వాభావిక లక్షణాలల్లో భౌతికంగా, రసాయనికంగా లేదా జీవపరమైన అవాంఛనీయ పరిణామాలు కలిగితే దాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యం వల్ల ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో స్వచ్ఛత తగ్గిపోయి ఉపయోగించుకోవడానికి పనికిరాకుండా పోతాయి. పర్యావరణంలోని కాలుష్యం వివిధ రకాలుగా ఉంటుంది. వాటిలో వాయు, జల, నేల, శబ్ద, ఘన వ్యర్థ పదార్థాల, ఉష్ణ కాలుష్యాలు ప్రధానమైనవి. ఇతర కాలుష్యకారకాలు ధర్మల్ కాలుష్యం, రేడియో ఆక్టివ్ కాలుష్యం మొదలగునవి.

1) వాయు కాలుష్యం:గాలిలో ఇతర కాలుష్య కారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో ఉన్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని వాయు లేక గాలి కాలుష్యం అంటారు. వాయు కాలుష్యం సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరగుతూ ఉంటుంది. వంటచెరకు కాల్చడం, పారిశ్రామీకరణ, న్యూక్లియర్ పరీక్షలు, అడవులు నరికి వేయడం మొదలగునవి గాలి కాలుష్యానికి ముఖ్యకారణాలు.

2) నీటి కాలుష్యం:కొన్ని పదార్థాలుగాని, కారకాలుగాని నీటిలో ఎక్కువగా చేరిపోయి నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించివేసి దానిని ఆరోగ్యానికి హానికరంగాను, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చివేస్తాయి. దానినే నీటి కాలుష్యంగా చెప్పవచ్చు. గృహాల్లోని వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మొదలైనవి నీటి కాలుష్యంకు
కారణాలు.

3) నేల కాలుష్యం:నేల నాణ్యత కొన్ని ప్రతికూల మార్పులకు గురి అయి అందులోని సహజ మూలకాల కూర్పు తారుమారు కావడం ద్వారా భూమి ఉత్పాదకత తగ్గడమే నేల కాలుష్యం. రసాయనిక ఎరువుల వాడకం, ఆమ్లాలు, క్షారాలు భూమిలోనికి చొచ్చుకొనిపోవడం, మొదలైనవి నేలకాలుష్యానికి కారకాలు.

4) శబ్ద కాలుష్యం:ఏ ధ్వనులైతే 125 డెసిబెల్స్ పీడనం కంటే ఎక్కువగా ఉండి పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి, మానవుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తాయో వాటిని ‘ధ్వని కాలుష్యం’ అంటారు. గృహోపకరణాల వాడకం, లౌడ్ స్పీకర్ల వాడకం, థర్మల్ పవర్ ప్లాంటు, గనుల త్రవ్వకం మొదలగునవి కారకాలు.

5) ఘన వ్యర్థ పదార్థాల కాలుష్యం:ఘన వ్యర్థ పదార్థాల్లో గృహ సంబంధింత వ్యర్థాలు, జంతువుల మృతకళేబరాలు, పరిశ్రమలు, వ్యవసాయ సంబంధిత వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, వైద్య సంబంధ వ్యర్థాలు ఉంటాయి. ప్లాస్టిక్ ఘన వ్యర్థ పదార్థాల కంటే ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.

6) ఉష్ణ కాలుష్యం:సమీపంలో ఉన్న కాలువలు, సరస్సులు, చెరువులు, నదుల్లోకి వేడి నీటిని విడుదల చేసిన ఫలితంగా వచ్చే కాలుష్యాన్ని ఉష్ణ కాలుష్యంగా చెప్పవచ్చు. న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, శుద్ధి కర్మాగారాలు, కాగితం పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు మొదలగునవి ఉష్ణ కాలుష్యానికి కారణమవుతున్నాయి.

ప్రశ్న 5.
‘సుస్థిరత్వం’ అంటే అర్థం ఏమిటి ? సుస్థిరమైన అభివృద్ధిలోని అనుఘటకాలను గురించి వివరించండి.
జవాబు:
సుస్థిరత్వం భాగాలు:“సుస్థిరమైన అభివృద్ధి” అన్న భావనలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి. అవి ఆర్థిక, సాంఘిక, పర్యావరణమనే మూడు భాగాలు. ఇవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం కలిగిన స్వతంత్రమైన అనుఘటకాలు. సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలంటే ఈ మూడు అనుఘటకాల మధ్య సమతూకాన్ని సాధించవలసి వుంటుంది. ఇలాంటి సమతూకాన్ని సాధించడం ఎలాగో పటంలో చూపడం జరిగింది.
AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి 3

ఆర్థిక సంబంధమైన అంశాలు:మానవ నిర్మితమైన మూలధనం, మానవ మూలధనం, సహజ మూలధనం వంటి మౌలికమైన విలువలను సమాజాలు రక్షించుకుంటూ, అభిలషనీయ పరిమాణంలో ఆదాయ ప్రవాహాన్ని పెంపొందిచుకోవలసి వుంటుందని ఆర్ధికభావనలో కొనసాగించగలిగే అభివృద్ధి తెలియజేస్తుంది.

సామాజిక సంబంధమైన అంశాలు:సామాజిక పరమైన సుస్థిరత న్యాయం, సమానత్వం అనే రెండు సూత్రాలపై నిర్మితమైంది. అభివృద్ధిపథం కొనసాగాలంటే సంపద, వనరులు అవకాశాలు సమానంగా పంపిణీ జరగాలి. పౌరులందరికీ ! కనీస ప్రమాణంలో భద్రత, మానవ హక్కులు, సామాజిక ప్రయోజనాలైన ఆహారం, ఆరోగ్యం, విద్య, స్వయం అభివృద్ధికి అవకాశాలు చేకు చాలి.

పర్యావరణ సంబంధమైన అంశాలు:పర్యావరణ భావనలో కొనసాగించగలగడం అనేది వనరులను సుస్థిరంగా ఉపయోగించడం, సమర్థవంతంగా వృథాలను ఇముడ్చుకునే విధిని నిర్వర్తించడం, సహజ మూలధనాన్ని రక్షించుకోవడం, ఈ మూడు విధులను సమర్ధవంతంగా అంతరాయం లేకుండా నిర్వహించగలిగితే జీవావరణ వ్యవస్థలో స్థిరత్వం సాధించవచ్చు.

ప్రశ్న 6.
మానవ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావాన్ని చర్చించండి.
జవాబు:
1) మానవ ఆరోగ్యంపై ప్రభావాలు:పర్యావరణ క్షీణత, మానవ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నందున, శ్రామికులు తమ పనులకు హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్య కారణాలు, శ్రామికుల సామర్థ్యాన్ని తగ్గించగా, అది అల్ప ఉత్పాదకతకు దారి తీస్తుంది.

ఎ) వాయు కాలుష్యం (Air Pollution):వాయు కాలుష్యకారకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, కణరూపద్రవ్యం మొదలైనవి శ్వాసకోశం ద్వారా మానవ శరీరంలోకి నేరుగా ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉబ్బసం (Bronchitis), ఊపిరితిత్తుల క్యాన్సర్, కళ్ళకి, చర్యానికి చిరాకును కలిగించే బాధపెట్టే అలర్జీ (Eye Irritation, Skin Irritation) మొదలైన వ్యాధులకు వాయు కాలుష్యమే కారణం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

బి) నీటి కాలుష్యం (Water Pollution):వ్యాధులను వ్యాపింపచేసే (transmission) సాధనాలలో అతి ముఖ్యమైనది నీరు, వివిధ వ్యాధులను కలిగించే వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవాలాంటి సూక్ష్మక్రిములు, నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఈ సూక్ష్మక్రిముల వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లు వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. –

సి) ధ్వని కాలుష్యం (Sound Pollution):ధ్వని కాలుష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్ద శబ్దాలు నిద్రాభంగాన్ని కలిగించి, ఆరోగ్యం మీద ప్రభావాలను కలిగిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల వినికిడి దెబ్బతినడం, పనిపాటల్లో, సంభాషణలో అంతరాయాన్ని, ఏకాంతానికి భంగం, నిద్రాభంగాన్ని బాధను లేదా చిరాకును కలిగిస్తుంది. అలాగే ఏకాగ్రతకు భంగం కలిగించడం, రక్తపోటు, గుండె వేగం పెరగడంలను కలుగచేస్తుంది.

ప్రశ్న 7.
అడవుల పరిరక్షణకు కావలసిన జాగ్రత్తలు. [Mar ’17]
జవాబు:
అడవులను ‘కర్బన శోషణాగారాలని’ (carbon sinks), ‘ప్రకృతి సౌందర్యాల ఖజానాలని’ అంటారు. వాటికున్న ప్రాధాన్యాన్ని గమనించి, వాటిని సంరక్షించుకోవడం అత్యంత ఆవశ్యకం, అడవులను క్రింది చర్యల ద్వారా సంరక్షించుకోవచ్చు.

  1. పేదల ఇళ్ళు కట్టుకోవడానికిగాను అటవీ భూములను కేటాయించడం మానుకోవాలి.
  2. సామాజిక అటవీ కార్యక్రమాల క్రింద కొన్ని ప్రత్యేక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.
  3. వృథాగా ఉన్న భూముల్లో మొక్కలు నాటడం జరగాలి.
  4. అడవులు మంటలపాలు కాకుండా (ముఖ్యంగా వేసవి కాలంలో) సంరక్షించుకోవాలి.
  5. అడవులు తరిగిపోయిన ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో చెట్లను నాటి తరిగిపోయిన అడవిని చేయాలి.
  6. సంయుక్త అటవీ యాజమాన్య, సంఘాలను స్థాపించడం చాలా అవసరం.
  7. పశువులను మేపడం, చట్టవిరుద్ధంగా చెట్లను నరికివేయడం మొదలైనవి అనుమతించకూడదు.
  8. అటవీ సంరక్షణ చర్యల్లో స్థానిక ప్రజలను కలుపుకొని, వారిని భాగస్వామ్యులను చేయాలి.

ప్రశ్న 8.
పర్యావరణాన్ని పరిరక్షించవలసిన ఆవశ్యకత.
జవాబు:
పర్యావరణం అనేది ఉమ్మడి ఆస్తి. పర్యావరణాన్ని మానవులు, జంతువులు, మొక్కలు మరియు చెట్లు, పక్షులు, చేపలు ఇలా ప్రపంచంలోని అన్ని జీవరాశులు ఉపయోగించుకుంటున్నాయి, అనుభవిస్తున్నాయి. ప్రత్యేకంగా మానవులు తమ అత్యాశతో ఈ ఉమ్మడి వనరులను అధికంగా ఉపయోగిస్తున్నారు. తత్ఫలితంగా, పర్యావరణం బలహీనమై, తన సహజ విధులను కూడా నిర్వహించలేకపోతుంది.

కావున దాదాపు ఆర్థికవేత్తలందరూ, ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ మనం వారి హెచ్చరికలను ప్రక్కకు పెడుతూ, పర్యావరణం దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నాము. పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే

  1. ప్రస్తుత తరానికి మరియు రాబోయే తరాల అవసరాలు తీరేందుకు.
  2. సమాన పంపిణీ జరుగుటకు (పర్యావరణ మరియు ఆర్థిక కార్యకలాపాలు).
  3. మానవ, భౌతిక మరియు సహజ మూలధనాలను కాపాడుటకు.
  4. జీవ వైవిధ్యాన్ని మరియు దాని అంతర్భాగాలైన, జంతు, వృక్ష జాతుల నాశనాన్ని నిరోధించుటకు.
  5. సున్నితమైన జీవవ్యవస్థలు మరింత క్షీణించకుండా నిరోధించుటకు పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం, ఎన్నో న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన మరియు పరిపాలనా సంబంధ ప్రయత్నాలు చేస్తోంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పర్యావరణం.
జవాబు:
పర్యావరణం “Environment” అనే ఆంగ్ల పదము ప్రాచీన ఫ్రెంచి పదము “Environ” నుండి రూపొందించబడింది. ఎన్విరాన్ అంటే ‘చుట్టూ ఉన్న’ జీవరాశిని ప్రభావితం చేస్తూ ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే పర్యావరణం అంటారు. దీనిలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ మరియు మేధోపరమైన
అంశాలు ఉంటాయి.

వాతావరణం:భూమి మొత్తాన్ని అవరించిన ఉన్న వాయువుల సమూహం. దీనిలో నాలుగు పొరలు ఉంటాయి.

  1. ట్రోపోస్పియర్,
  2. స్ట్రాటో స్పియర్,
  3. ఐనోస్పియర్,
  4. ధర్మోస్పియర్

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 2.
ఆవరణ వ్యవస్థ. [Mar ’16]
జవాబు:
అవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935 సంవత్సరములో ‘విట్రాన్ల’ ప్రతిపాదించాడు. ఒక నిర్ణీత భౌగోళిక ప్రదేశంలో ఉన్నటువంటి స్వాభావిక, భౌతికమైన పర్యావరణ కలయికను వాటి మధ్య జరిగే చర్య, ప్రతిచర్యలను కలిపి ”ఆవరణ వ్యవస్థ’ గా చెప్పవచ్చు. ఆవరణ వ్యవస్థ స్థూలంగా రెండు రకాలు 1. సహజ ఆవరణ వ్యవస్థ, 2. కృత్రిమ ఆవరణ వ్యవస్థ.

ప్రశ్న 3.
గ్రీన్ హౌస్ ప్రభావం. [Mar ’17]
జవాబు:
భూగ్రహంపై ఉన్న వాతావరణం కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు మీధైన్ వంటి కొన్ని రకాల వాయువులు ఎక్కువైన కారణంగా సూర్యుని నుండి విడుదల అయ్యే రేడియేషన్ని తమ ద్వారా లోపలికి రానిస్తాయి. కాని తిరిగి ఆ రేడియేటెడ్ ఉష్ణాన్ని అట్టిపెట్టుకొని భూ ఉపరితలం నుండి బయటకు పోనివ్వవు. దీనినే గ్రీన్ హౌస్ ప్రభావం అంటారు.

ప్రశ్న 4.
గాలి కాలుష్యం.
జవాబు:
గాలిలో ఇతర కాలుష్యకారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి, మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో ఉన్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని వాయు లేక గాలి కాలుష్యం అంటారు. ఇవి సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరుగుతుంది. వంటచెరకు కాల్చడం, పారిశ్రామికీకరణ, పంటల సాగు, అడవులు నరికివేయడం మొదలగునవి వాయు కాలుష్యానికి ముఖ్య కారణాలు.

ప్రశ్న 5.
నీటి కాలుష్యం. [Mar ’17]
జవాబు:
కొన్ని పదార్థాలు గాని, కారకాలు గాని నీటిలో ఎక్కువగా చేరిపోయి నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించి వేసి దానిని అరోగ్యానికి హానికరంగానూ, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చి వేస్తాయి. దానినే నీటి కాలుష్యం అంటారు. |గృహాల్లోని వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు మొదలైనవి నీరు కలుషితంకు కారణాలు.

ప్రశ్న 6.
ఓజోన్ పొర. [Mar ’17, ’16]
జవాబు:
సూర్యుని రేడియేషన్ వల్ల వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డుకొని భూమి మీద మానవుని జీవనానికి అవసరమైన శక్తిని ప్రసాదించే రక్షక కవచాన్ని ఓజోన్ పొర అంటారు. క్లోరోఫ్లోరోకార్బన్స్, హాలోజన్స్ అణువులు స్టోటోస్పియర్ను చేరి ఓజోన్ ను నాశనం చేస్తాయి.

ప్రశ్న 7.
భూగోళం వేడెక్కడం (Global Warming).
జవాబు:
హరితగృహ వాయువులైన CO2, మొదలైన వాటి వల్ల భూఉపరితల ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతూ ఉంది.. CO2 ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించుట ద్వారా, అడవుల నరికివేత వల్ల ఎక్కువగా వెలువడుతుంది. దీని ప్రభావంతో ఉష్ణం గ్రహింపబడి, తిరిగి భూమి నుండి పరావర్తనం చెందకుండా భూమిపైన ఉండిపోతుంది. దీనిని భూమి వేడెక్కుట అంటారు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 8.
సుస్థిరమైన అభివృద్ధి.
జవాబు:
సుస్థిరమైన అభివృద్ధి అనగా మనం వారసత్వంగా పొందిన నాణ్యమైన జీవనాన్ని, ఆస్తులను ఏ మాత్రం తగ్గకుండా భవిష్యత్ తరాల వారికి అందించుట. సుస్థిరమైన అభివృద్ధిలో మూడు ముఖ్యమైన అనుఘటకాలున్నాయి. అవి ఆర్థిక, సాంఘిక, పర్యావరణం అనేవి.

ప్రశ్న 9.
వ్యయ – ప్రయోజన విశ్లేషణ.
జవాబు:
పర్యావరణ వ్యయ ప్రయోజనాలు అంచనా వేయడంలో ఒక ప్రాజెక్టు యొక్క మూలధన మూల్యాంకనము మరియు తులనాత్మకత జరగాలి. ప్రతి ఆర్థిక కార్యకలాపం ప్రయోజనాలను, నష్టాలను కల్గి ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టును మూల్యాంకనం చేసేటప్పుడు ఆర్థిక ప్రయోజనలతో పాటు పర్యావరణ నష్టాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

ప్రశ్న 10.
అటవి నాశనానికి గల కారణాలు.
జవాబు:
అడవులు ఎన్నో కారణాల వల్ల తొలగించబడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి జనాభా పెరుగుదల, పేదరికం, నిరుద్యోగం, భూమి డిమాండ్ పెరగటం (ఇల్లు, వ్యవసాయం, కలపకోసం) పశువులను ఎక్కువగా మేపడం వల్ల అడవులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆనకట్టల నిర్మాణం, రోడ్లు, రైల్వేల నిర్మాణం అడవుల నరికివేతకు అతి ముఖ్య కారణాలు. అడవులలో మంటలు వ్యాపించుట, పోడు వ్యవసాయం మొదలగునవి ఇతర కారణాలు.

ప్రశ్న 11.
జీవవైవిధ్యం. [Mar ’17, ’16]
జవాబు:
‘జీవవైవిధ్యం’ అనే పదాన్ని 1986 సంవత్సరంలో అమెరికా శాస్త్రవేత్త వాల్టర్ రోసెన్ మొదటిసారిగా ప్రతిపాదించాడు. జీవవైవిధ్యం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. జన్యుపరమైన తేడాలు, జాతులలోని వైవిధ్యం ఆవరణ వ్యవస్థలోని విచ్ఛిన్న గుణాలను అన్నింటిని కలిపి జీవవైవిధ్యం అంటారు.

ప్రశ్న 12.
ధ్వని అంటే ఏమిటి ?
జవాబు:
నియమానుసారంగా, చెవులకు ఇంపైన తియ్యనైన, వినడానికి సౌకర్యంగా ఉండే శబ్దాన్ని ‘ధ్వని’ అని అంటారు. శబ్దము, ధ్వని అని రెండు పదాలలో ఒకే అర్థంలో వాడుతున్నా శబ్దం వేరు, ధ్వని వేరు. శబ్దాలన్ని ధ్వనులు కావు. గాఢమైన, తీవ్రమైన, గట్టిదైన శబ్దాన్నే ‘ధ్వని’ అంటారు. 50 నుండి 90 డెసిబెల్స్ మధ్య గల శబ్దాన్ని ‘ధ్వని’ అంటారు. 120 డెసిబెల్స్ స్థాయిని కలిగిన ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు.

ప్రశ్న 13.
భూమి విచ్ఛేదనం.
జవాబు:
ఎప్పుడైతే భూమి భౌతికస్థితి, స్వచ్ఛత, ఉత్పాదక శక్తిలో మార్పులు సంభవిస్తాయో అప్పుడు భూమి విచ్ఛేదనానికి గురైందని చెప్పవచ్చును. అడవులు అంతరించిపోవటం, పశువులు ఎక్కువగా మేయటం పంటలను సాగుచేయటం, పారిశ్రామికీకరణ, గాలి వికోషీకరణ, నీటి వల్ల వికోషీకరణం, నీరు ఎక్కువగా నిలబడిపోవడం, భూమి క్షారవంతమైపోవడం జనాభా వత్తిడి వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఎక్కువ చేయడం మొదలైనవి భూమి విచ్ఛేదనానికి కారణమయ్యే కాలుష్య జనకాలు. భూమి ఇలా విచ్ఛేదనకు గురైతే భూమి ఉత్పాదకశక్తి, స్వచ్ఛత క్షీణించిపోతుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 8 పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి

ప్రశ్న 14.
పర్యావరణ బహిర్గతాలు.
జవాబు:
ఒక ఆర్థిక కార్యకలాపం వల్ల ఏ మాత్రం సంబంధం లేని మూడవ వర్గం ప్రభావితం కావడాన్ని బహిర్గతాలు అంటారు. ఇటువంటి బహిర్గతాలు అనుకూలం గాని ప్రతికూలంగా కాని ఉండవచ్చు. ఉదా:ఒక ఫ్యాక్టరీ నుండి వెలువడే కాలుష్యం పరిసర పర్యావరణాన్ని దగ్గరలోని నివాసమున్న ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ప్రతికూల బహిర్గతంగా చెప్పవచ్చు. బాగా విద్యావంతులైన ప్రజలు ఉన్న ప్రాంతంలో ఫ్యాక్టరీని మొదలు పెట్టినపుడు ఉత్పాదకత పెరగడం అనుకూల బహిర్గత.

ప్రశ్న 15.
స్వచ్ఛ భారత్ అభియాన్.
జవాబు:
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి 2014 అక్టోబరులో 2న స్వచ్చ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇందుకోసం ఒక బహిరంగ వెబ్సైట్ను మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం లక్ష్యం వచ్చే 5 సంవత్సరాలలో భారత్న పరిశుభ్ర దేశంగా మార్చడమే తద్వారా గాంధీజీ 150వ జన్మదినోత్సవాన్ని పరిశుభ్ర భారతదేశంలో ఘనంగా జరుపుకోవడం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయగలిగితే అనేక పర్యావరణ సమస్యలను పరిష్కరించగలదు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు – ఆర్ధిక సంస్కరణలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 7th Lesson ప్రణాళికలు – ఆర్ధిక సంస్కరణలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 7th Lesson ప్రణాళికలు – ఆర్ధిక సంస్కరణలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘ప్రణాళికను’ నిర్వచించి, స్థూలంగా ప్రణాళికల లక్ష్యాలను వివరించండి.
జవాబు:
ప్రణాళిక అంటే నిర్ణీత కాల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాల వైపుకు ఒక క్రమంలో నడపడాన్ని ప్రణాళిక అని అంటారు. మన దేశంలో పంచవర్ష ప్రణాళికల అమలు 1951లో ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తి అయి, 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఉన్నాయి.

ప్రణాళిక లక్ష్యాలు:
1) జాతీయాదాయ తలసరి ఆదాయాల వృద్ధి: భారత ప్రణాళికల ప్రధాన లక్ష్యం జాతీయాదాయాన్ని పెంచుట, తద్వార తలసరి ఆదాయము పెరుగుతుంది. పేదరికాన్ని నిర్మూలించి, జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి. అంటే తలసరి ఆదాయం పెరగాలి. అందువలన ప్రతి ప్రణాళికలలోను వృద్ధిరేటు నిర్ణయించబడింది.

2) ఉద్యోగిత: ప్రభుత్వం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి పరచటం ద్వారా జాతీయాదాయం పెరుగుతుంది అని భావించి, దీనితో పాటు ఈ రెండు రంగాల అభివృద్ధి ఉద్యోగితా స్థాయిని పెంపొందిస్తుందని ప్రణాళికావేత్తలు భావించారు. నిరుద్యోగ నిర్మూలన ప్రణాళికలన్నింటిలోను ప్రధాన లక్ష్యంగా ఉంది.

3) సామ్యవాదరీతి సమాజస్థాపన: ప్రణాళికాభివృద్ధి యొక్క లక్ష్యం సామ్యవాద రీతి సమాజస్థాపన, విద్య, వృత్తి, ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు లభించేటట్లు చేయుట, ఆర్థిక శక్తి కొందరి చేతిలోనే కేంద్రీకృతం కాకుండా ఆదాయం అందరి మధ్య సమానంగా పంపిణీ జరిగేటట్లు చూచుట ప్రణాళికల ముఖ్యమైన ఆశయాలు. ప్రభుత్వం ఆర్థికశక్తి కేంద్రీకరణను నియంత్రణ చేసే అధికారం కలిగి ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

4) స్వావలంబన: ప్రతి ప్రణాళికలలోను “స్వయం సమృద్ధి” ప్రధాన లక్ష్యంగా ఉన్నప్పటికీ 3వ ప్రణాళికలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. 9వ ప్రణాళిక ఆశయమును నికర విదేశీ సహాయం ‘0’ గా ఉండేటట్లు
చూచుట.

5) ఇతర లక్ష్యాలు:

  1. ఆర్థిక అసమానతలు తగ్గించుట.
  2. పేదరికం నిర్మూలన.
  3. ధరల స్థిరీకరణ ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించుట.
  4. ప్రాంతీయ అసమానతలు తొలగింపు.
  5. ప్రత్యేకించి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధికి కృషి.

ప్రశ్న 2.
పన్నెండవ’ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను వివరించండి. [Mar ’17, ’16]
జవాబు:
భారత ప్రభుత్వం అక్టోబరు 4న, 12వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను (2012-17)లో అంతకు ముందున్న వార్షిక సగటు వృద్ధిరేటు 9 శాతాన్ని, 8.2 శాతానికి తగ్గించి లక్ష్యాన్ని నిర్ధారించుకుంది. ఇందుకు కారణం అప్పటి ప్రపంచ వ్యాప్తం అయిన ఆర్థిక మాంద్యం. దీని ప్రకారం సాధించాల్సిన వృద్ధిరేటు 8.2 శాతం నుండి 9 శాతం వరకు ఉంటుంది. ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం – “సత్వర, సుస్థిర మరియు మిక్కిలి సమ్మిళిత వృద్ధి”. 12వ పంచవర్ష ప్రణాళికకు అయిన మొత్తం వ్యయం, జి.డి.పిలో 37 శాతం కాగా, అంచనా వేయబడిన మొత్తం పొదుపు రేటు జి.డి.పిలో 34.2 శాతంగా ఉంది.

ముఖ్య లక్ష్యాలు: 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం – “సత్వర, సుస్థిర మరియు సమ్మిళిత వృద్ధి” కాగా ఇతర లక్ష్యాలను క్రింద పేర్కొనడం జరిగినది.
ఎ) ఆర్థిక వృద్ధి:

  • వాస్తవ జి.డి.పి వృద్ధి రేటు 8.0 శాతం సాధించడం.
  • సంవత్సరానికి తలసరి ఆదాయంలో వృద్ధి 6.5 శాతం సాధించడం.
  • వ్యవసాయంలో 4.0 శాతం వృద్ధి రేటు సాధించడం.
  • పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి రంగంలో 10 శాతం సాంవత్సరిక వృద్ధి రేటు సాధించుట.
  • పారిశ్రామిక రంగంలో, 7.6 శాతం వృద్ధి రేటు సాధించడం.
  • సేవా రంగంలో 9.0 శాతం వృద్ధి రేటు సాధించడం.
  • ప్రతి రాష్ట్రం 11వ ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటు కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించుట.

బి) పేదరికం మరియు ఉద్యోగాలు:
12వ పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యే నాటికి తలసరి వినియోగం ప్రకారం గణింపబడిన, అంతకు ముందున్న స్థాయి నుండి 10 శాతం బిందువుకు పేదరికాన్ని తగ్గించడం.

  • ఈ ప్రణాళికా కాలంలో 50 మిలియన్ల ఉద్యోగావకాశాలు అసంఘటిత రంగంలో కల్పిస్తూ, అంతే సంఖ్యలో నైపుణ్యం అర్హత పత్రాలను అందించడం.

సి) విద్య:
2017 నాటికి అక్షరాస్యతను 85 శాతానికి పెంచడం.

  • 12వ పంచవర్ష ప్రణాళిక అంతానికి బడిలో గడిపే సరాసరి సంవత్సరముల సంఖ్య 7కు పెంచడం. (సర్వ శిక్షా అభయన్)
  • కళాశాలల్లో 2 మిలియన్ల సీట్లను పెంచడం ద్వారా ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలను పెంచడం (RUSA).
  • 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యే నాటికి, పాఠశాలల్లో లింగ, వివక్షత, సామాజిక వివక్షతలను తొలగించడం.

డి) ఆరోగ్యం:

  • 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యే నాటికి, ప్రతీ 1000 జననాలకు, శిశు మరణాల రేటును 25కు, మాతా మరణాల రేటును 1కి తగ్గించడం, అలాగే బాల్య లింగ నిష్పత్తి (0-6 సం) 950 కి పెంచడం. త్రాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు పెంచడం ద్వారా ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరచడం.
  • మొత్తం పునరుత్పత్తి రేటును ప్రణాళిక చివరి నాటికి 2.1కి తగ్గించడం.
  • 0-3 సంవత్సరముల వయసు పిల్లల్లో పోషకాహార లోపం కలిగిన వారి సంఖ్యను సగానికి తగ్గించడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

ఇ) అవస్థాపనా సౌకర్యాలు (గ్రామీణ అవస్థాపనలతో కలిపి):

  • జి.డి.పిలో శాతం పెట్టుబడిని అవస్థాపనా సౌకర్యాల కొరకు కేటాయించడం.
  • స్థూల నీటి పారుదల గల ప్రాంతాన్ని 90 మిలియన్ హెక్టార్ల నుండి 103 మిలియన్ హెక్టార్లకు పెంచడం.
  • ప్రతీ గ్రామానికి విద్యుత్తు సదుపాయాలు కల్పించడం. విద్యుత్ రవాణాలోని డ్రాపవుట్ నష్టాలను 20 శాతానికీ తగ్గించడం.
  • అన్ని గ్రామాలను, అన్ని వాతావరణాలను తట్టుకోగల రోడ్డులతో అనుసంధానించడం.
  • గ్రామీణ ప్రాంతాల్లో టెలిసాంద్రతను 70 శాతానికి పెంచడం.

ఎఫ్) పర్యావరణము – సుస్థిరత:

  • అడవులను, చెట్లను మొత్తం భూభాగంలో 33 శాతానికి పెంచుట.
  • ప్రతీ సంవత్సరం 1 మిలియన్ హెక్టార్ ప్రాంతాన్ని పచ్చదనంతో నింపడం.
  • పునరావృతమయ్యే శక్తి మూలాల నుండి ఉత్పన్నం చేసే విద్యుత్ను 30,000 మెగా వాట్లకు పెంచడం.
  • జి.డి.పిలో 2020 నాటికి, కాలుష్య కారక సాంద్రతను 2005 నాటి స్థాయి కన్నా 20 నుండి 25 శాతం కన్నా దిగువకు పరిమితం చేయడం.
  • కలుషితమైన ప్రధాన నదులను పరిశుభ్రం చేయడం.

జి) సేవలు:
ఈ ప్రణాళిక పూర్తయ్యే నాటికి 90 శాతం కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందేలా చేయడం. ఆధార్ను బ్యాంక్ అకౌంట్తో అనుసంధానం చేయడం ద్వారా రాయితీలు, నగదు బదిలీ నేరుగా ఉద్దేశింపబడిన వ్యక్తి అకౌంట్ను చేరే విధముగా చూడడం.

ప్రశ్న 3.
పదకొండు పంచవర్ష ప్రణాళికలలో మన దేశం సాధించిన విజయాలను, అపజయాలను సమీక్షించండి.
జవాబు:
విజయాలు: ప్రణాళికల అమలు సమయములో ఉన్న పరిస్థితులు చాలా దీనముగా ఉండేవి. కాని కొన్ని ప్రణాళికలు తమ లక్ష్యాలను చేరుకోలేక పోయినప్పటికిని అవి సాధించిన విజయాలను కొనియాడక తప్పదు. ఇందులోని కొన్ని ముఖ్యమైన విజయాలను క్రింది విధముగా పేర్కొనవచ్చును.
ఎ) జాతీయ – తలసరి ఆదాయాల్లో పెరుగుదల: మన దేశంలో ప్రణాళికల ప్రధాన లక్ష్యం మరియు తలసరి ఆదాయాల్లో పెరుగుదలను సాధించడం.

జాతీయ మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో కౌ 1.32 లక్షల కోట్లుగా ఉన్న జాతీయాదాయము 2004-05 ఆధార సంవత్సర ధరలలో 11వ పంచవర్ష ప్రణాళికా కాలము నాటికి (2012) 47.67 లక్షల కోట్లకు చేరింది.
మరోవైపు అధిక జనాభా పెరుగుదల వల్ల వాస్తవిక తలసరి ఆదాయ వృద్ధిరేటు మందకొడిగా పెరిగింది.

బి) వ్యవసాయంలో వృద్ధి: భారత ప్రభుత్వం, 60 సంవత్సరములుగా వ్యవసాయము, దాని అనుబంధ కార్యకాలాపాలపై 23 నుండి 24 శాతం వ్యయాన్ని ఖర్చు చేసింది. ఈ భారీ వ్యయం మరియు క్రొత్త వ్యవసాయ వ్యూహము (1960) వల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు గణనీయముగా పెరిగాయి.

భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950- 51లో 50.8 మి. టన్నులు కాగా, 2014 నాటికి అది 264 మి. టన్నుల రికార్డు స్థాయికి పెరిగింది. ఆహారేతర పంటలైన నూనె గింజలు, చెఱకు మరియు ప్రత్తి మొదలగు వాటి ఉత్పత్తి కూడా పెరిగింది. కానీ, పప్పు ధాన్యాల ఉత్పత్తి అనుకున్నంతగా పెరగలేదు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

సి) పరిశ్రమలలో వృద్ధి: రెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలోనే పారిశ్రామికాభివృద్ధికి పునాది వేయబడింది. మౌలిక మరియు మూలధన పరిశ్రమలను నెలకొల్పడం జరిగింది. 11 పంచవర్ష ప్రణాళికలలో భారత ప్రభుత్వం ఎక్కువగా పారిశ్రామికాభివృద్ధి కోసం పెట్టుబడులను పెట్టడం జరిగింది. దాదాపు 55 శాతము ప్రణాళికా వ్యయాన్ని పారిశ్రామికాభివృద్ధికి కేటాయించడం జరిగింది.

1950-51లో బొగ్గు ఉత్పత్తి 32 మిలియన్ టన్నులు ఉండగా, 2011-12 నాటికి అది 583 మిలియన్ టన్నులు పెరిగింది.

డి) అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి: ప్రణాళికల వల్ల సాధింపబడిన మరొక అద్భుత విజయం సత్వర ఆర్థికాభివృద్ధికి అత్యవసరమైన నిబంధన అయిన ఆర్థిక మరియు సామాజిక అవస్థాపనా సౌకర్యాల సృష్టి. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలానికి భారతదేశ అక్షరాస్వత రేటు 18.3 శాతం ఉండగా ప్రస్తుతం అది 74 శాతానికి పెరిగింది. అందులో పురుష అక్షరాస్యత శాతం 82% కాగా, స్త్రీ అక్షరాస్యత 66%, శిశుమరణాల రేటు, మాతా మరణాలరేటు, బాల్యమరణాల రేటు తగ్గుదలను గమనించవచ్చును.

రవాణా: 1950-51 ప్రణాళిక అమలు తరువాత అన్ని మార్గాల ద్వారా రవాణా మంచి వృద్ధిని కనపరిచాయి. భారత రైల్వేల నెట్వర్క్ 1950-51లో 53,596 కి.మీ.ల నుండి ప్రస్తుతం 63,220 కి.మీకు పెరిగింది. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు కూడా వస్తు రవాణా సామర్థ్యం మరియు రాబడి వంటి అనేక అంశాలలో పెరుగుదలను ప్రదర్శించాయి. బొగ్గు, విద్యుత్, పెట్రోలియం, సహజవాయువు అనునవి ముఖ్యమైన ఇంధన వనరులు. 2004లో డెలిఫోను వినియోగదారుల సంఖ్య 76.5 మిలియన్లు ఉండగా 2014 జనవరి నాటికి 922.04 మిలియన్లకు పెరిగింది. భారీ, మధ్య మరియు చిన్న ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా నీటి పారుదల వసతులు కూడా విస్తరింపబడుతున్నాయి.

ఇ) ఎగుమతులు మరియు దిగుమతుల్లో మార్పులు: 1990లో వచ్చిన నూతన ఆర్థిక సంస్కరణల వల్ల భారతదేశ దిగుమతుల్లో గొప్ప మార్పులు సంభవించాయి. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలానికి భారతదేశం ఎగుమతుల విలువ’ 606 కోట్లు ఉండగా, 12వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నాటికి కౌ 16,35,261 కోట్లకు పెరిగింది.

ఎఫ్) శాస్త్ర – సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి సాధించడం మరియు నిర్వహణా విభాగం, సాంకేతికాభివృద్ధి ప్రణాళికల మరొక ముఖ్యమైన విజయం. మనదేశం విదేశీ నిపుణులపై ఆధారపడడం తగ్గి, ప్రస్తుతం ప్రపంచ నలుమూలలకు కూడా నిపుణులను ఎగుమతి చేయగల దేశంగా మారింది.

జి) విద్యా వ్యవస్థ అభివృద్ధి: ప్రపంచంలోనే విద్యా వ్యవస్థ అభివృద్ధిలో భారతదేశం రెండవ పెద్ద దేశంగా అవతరించింది. విద్యా వార్షిక నివేదిక 2012 ప్రకారం 6-14 సంవత్సరముల వయస్సుగల గ్రామీణ బాల బాలికలలో 96.5 శాతం మంది పాఠశాలల్లో నమోదు చేయబడ్డారు. 2011 నాటికి మన దేశంలో 573 విశ్వవిద్యాలయాలు 33,023 కళాశాలలు ఉన్నాయి.

అపజయాలు: భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఈ 65 సంవత్సరాల ప్రణాళికా శకంలో చెప్పుకోదగిన అభివృద్ధి సాధించినది. అయినప్పటికి కొన్ని బలహీనతలు, ప్రణాళికలు విఫలమవడానికి కారణాలయ్యాయి.

  1. 65 సంవత్సరాల ఆర్థికాభివృద్ధిలో పేదరికం, నిరుద్యోగం, మొదలైన సమస్యలు పరిష్కరింపబడలేదు.
  2. భూ సంస్కరణలు ప్రవేశ పెట్టి దశాబ్దాలు గడిచినా, వాస్తవిక పరిస్థితులలో భూ పంపిణీ సక్రమంగా అమలు కాలేదు.
  3. భారతదేశ పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం అసమానతలు లేని సమసమాజాన్ని నిర్మించడం, కానీ ఇది ఇప్పటి వరకు పూర్తి కాలేదు.
  4. అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని ఇప్పటకీ చేరుకోలేక పోయాం.
  5. సంతులిత ప్రాంతీయాభివృద్ధి సాధించడంలో ప్రణాళికలు విఫలమయ్యాయి.

ప్రశ్న 4.
భారతదేశంలో ప్రాంతీయ అసమానతలకు గల కారణాలరలను వివరించండి. [Mar ’16]
జవాబు:
దేశ సమగ్రతకి, సత్వర పురోగతికి, ఆర్థికాభివృద్ధికి ప్రాంతీయ అసమానతలు అడ్డంకిగా ఉంటాయి. వివిధ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాల్లో వ్యత్యాసాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవడానికి ముందుగా, దీనికి గల అసలు కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. అవి:

ఎ) భౌగోళిక కారణాలు: భౌగోళికంగా కొన్ని ప్రాంతాలు మిగతా ప్రాంతాల నుంచి వేరుపరచబడి ఉంటాయి. కొండలు, లోయల కారణంగా ఇలాంటి ప్రాంతాలు ఏర్పడవచ్చు. అలాంటి ప్రాంతాలు వెనకబడి ఉంటాయి. ఉదా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాల్లోని ఉత్తర కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా వాతావరణం, రవాణా మార్గాలు సరిగ్గా లేకపోవడం వల్ల వెనుకబడి ఉన్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

బి) శీతోష్ణస్థితి పరిస్థితులు: వర్షపాతం, వాతావరణం మొదలైనవి అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువ. ఇలాంటి ప్రదేశాల్లో వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ తొందరగా అభివృద్ధి చెందలేవు.

సి) బ్రిటీషువారి పరిపాలన: చారిత్రాత్మకంగా చూస్తే భారతదేశంలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండటానికి బ్రిటీషువారి పరిపాలన కూడా కొంత కారణం. పారిశ్రామిక ఉత్పత్తికి, తమ వ్యాపారానికి అనుకూలముగా ఉండి మన దేశ సంపదను తమ దేశానికి తరలించడానికి అనువుగా ఉండే ప్రాంతాలనే వారు ఎన్నుకొని అభివృద్ధి పరచడం జరిగింది. మహా నగరాలైన కలకత్తా, బొంబాయి, మద్రాసులను వ్యాపార కేంద్రాలుగా చేసుకోవడం వల్ల, భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడి వెనుకబడ్డాయి.

డి) పరిశ్రమల కేంద్రీకరణ: అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే ప్రైవేటు రంగం నూతన పరిశ్రమలు స్థాపించడం జరుగుతుంది కారణం, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పరిశ్రమలకు కావలసిన అవస్థాపనా వసతులైన నైపుణ్యం గల శ్రామికులు, రవాణా మరియు మార్కెట్ సౌకర్యాలు సులభంగా లభ్యం కావడం.

ఇ) సహజ వనరుల కొరత: ప్రకృతి పరంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వనరులు పుష్కలంగా లభించడం వల్ల ఆ ప్రాంతాలు మాత్రం వేగంగా అభివృద్ధి చెందగలుగుతున్నాయి. అలాంటి అవకాశాలు లేని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి అని చెప్పవచ్చు.

ఎఫ్) అవస్థాపనా సౌకర్యాల కొరత: పరిశ్రమల స్థాపనకు అవర్షాలైన విద్యుచ్ఛక్తి, రోడ్లు, తంతి తపాలా సౌకర్యాలు, నీరు, విద్య, ఆరోగ్యం, సాంకేతిక శిక్షణ సౌకర్యాలు, పరపతి మొదలైనవి కొరతగా ఉన్న ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. ఈ సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలు త్వరితంగా అభివృద్ధి చెందుతాయి.

ప్రశ్న 5.
ప్రాంతీయ సమానాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను వివరించండి.
జవాబు:
ప్రాంతీయ అసమానతలు అనే సమస్య బహుముఖమైనది మరియు ప్రత్యేకమైనది. కాబట్టి దానిని పూర్తిగా. తొలగించడం చాలా కష్టతరమైన పని. రెండవ పంచర్ష ప్రణాళిక కాలం నుండి ప్రాంతీయ అసమానతలను తొలగించుటకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నప్పటికిని ఈ దశలో ఇంకా చేయవలసింది, సాధించవలసింది చాలా ఉంది. వివిధ ప్రాంతాల్లో అసమానతలను తొలగించడానికి ఈ క్రింది చర్యలను తీసుకోవాలి.

వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక వనరులను బదిలీ చేయడం.

  • వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు ప్రైవేటు రంగం ముందుకు రాదు కాబట్టి ఆ ప్రాంతాలలో ప్రభుత్వం పరిశ్రమలను స్థాపించాలి.
  • వెనుకబడిన ప్రాంతాల్లో అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను కల్పించడం.
    ఉదా: విద్యుచ్ఛక్తి, తంతితపాలా, రోడ్డు, నీటి వసతి మొదలైనవి.
  • పారిశ్రామిక వికేంద్రీకరణను ప్రోత్సహించడం, ఉదాహరణకు ప్రాంతీయ ప్రణాళికలు, సూక్ష్మప్రణాళికలను సాధించవచ్చును.
  • వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక క్షేత్రాల ఏర్పాటు.
  • తరచూ క్షామాలకు, వరదలకు గురి అయ్యే ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి పధకాలు. కొండ, గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి పథకాలు.
  • చిన్న తరహా పరిశ్రమలను వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించుటకు తగిన ప్రోత్సాహకాలను ఇవ్వడం. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన, అభివృద్ధి కోశపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడం. ఉదాహరణకు సబ్సిడీలు, పన్ను రాయితీలు, మొదలైనవి ప్రకటించడం.

ప్రశ్న 6.
ఆర్థికాభివృద్ధిలో అంతర్జాతీయ వ్యాపారం పాత్రను వివరించండి.
జవాబు:
అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించుటలో అంతర్జాతీయ వాణిజ్యం చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
ఎ) ఉత్పత్తి పెరుగుదల (Increases Output): అంతర్జాతీయ వ్యాపారం వల్ల లాభాలను గడించి, జాతీయ ఆదాయాన్ని, ఉత్పత్తిని పెంపొందించుకొని ఆర్థిక వృద్ధి రేటును అధికం చేసుకోవచ్చు. అంతర్జాతీయ వ్యాపారం వల్ల అధిక ఉత్పత్తి సాధించి, పేదరికపు విష వలయాన్ని ఛేదించి ఆర్థికాభివృద్ధిని సాధించుకోవచ్చు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

బి) మార్కెట్ల విస్తరణ (Expands Markets): ఈ దేశాల్లో మార్కెట్ల పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారం మార్కెట్లను విస్తృత పర్చటడమేకాక, పొదుపు పెట్టుబడులను ప్రోత్సహించి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిపిస్తుంది.

సి) ఉపాధి పెరగడం (Increase in Employment): చాలా వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒకటి లేక రెండు ముఖ్యమైన వస్తువుల ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ సాధించి వాటికి ఎగుమతి చేసినట్లయితే మార్కెట్లు విస్తరిస్తాయి. అందుబాటులో ఉన్న ఉత్పాదక వనరులకు ఉపాధిని కల్పించి, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించకోవచ్చు. దేశంలో పొదుపు పెట్టుబడులు పెరిగి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఎగుమతి రంగం విస్తరిస్తున్నప్పుడు అనేక రకాల ఉత్పత్తి కారకాల ప్రవాహం ఈ రంగంలో పెరుగుతుంది.

డి) అంతర్గత – బహిర్గత ఆదాలు (Internal & External & Economies): ఉత్పత్తి కార్యకలాపాల విస్తరణ మరియు మార్కెట్ అవకాశాలు పెరగడం వల్ల అనేక రూపాలలో అంతర్గత, బహిర్గత ఆదాలు లభ్యమవుతాయి. వీటి వల్ల ఉత్పాదక వ్యయం తగ్గుతుంది. ఇది అంతర్జాతీయ వ్యాపారం వల్ల లభించే ప్రత్యక్ష ప్రయోజనం.

ఇ) పరోక్ష ప్రయోజనాలు (Indirect benefits): అంతర్జాతీయ వ్యాపారం వల్ల మార్కెట్ల విస్తరణ జరిగి మరియు ప్రత్యేకీకరణ సాధ్యమై దేశంలో యంత్రాల పూర్తిస్థాయి ఉపయోగం నవకల్పనలకు దారితీసి శ్రామిక ఉత్పాదకత శక్తి కూడా పెరుగుతుంది. నూతన వస్తువులు అందుబాటులోకి వచ్చి వాటిని పొందుటకు ప్రజలను కష్టపడే విధముగా, పొదుపు చేసే విధముగా ప్రేరేపిస్తుంది.

ఎఫ్) ప్రాధమిక వస్తువుల ఎగుమతి మూలధన వస్తువుల దిగుమతి (Import of Capital Goods against Export of Staple Commoditeis): తక్కువ అభివృద్ధికి దోహదపడే స్వదేశీ వస్తువులను, అధిక అభివృద్ధికి దోహదపడే విదేశీ వస్తువులతో వినిమయం చేసుకోవడం వల్ల ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది.

జి) విద్యాపరమైన కీలక ప్రభావాలు (Important Educative Effect): సాధారణంగా అంతర్జాతీయ వ్యాపారం విద్యపైన అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతిక నైపుణ్యత తక్కువగా ఉండటం వల్ల మూలధన కొరత ఏర్పడి ఆర్థికాభివృద్ధిని ఆటంక పరుస్తుంది. అంతర్జాతీయ వ్యాపారం ఈ బలహీనతను | తొలగిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు పోటీతత్వాన్ని పెంచుకోవడానికి విద్య, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి విధానాల్లో మార్పులను తీసుకురావాలి.

హెచ్) విదేశీ మూలధన దిగుమతికి ఆధారం (Basis of Importation of Foreign Capital): అభివృద్ధి చెందుతున్న దేశాలు మూలధన కొరతను కలిగి ఉంటాయి. ఒక దేశం అంతర్జాతీయ వ్యాపారంలో చురుకుగా పాల్గొనడం వల్ల ధనిక దేశాలలోని ఉపయోగింపబడని మూలధనం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రవహించి ఇక్కడ సమర్ధవంతంగా ఉపయోగింపబడతాయి. విదేశీ మూలధనం ఉపాధి ఆదాయం మరియు ఉత్పత్తిని పెంచడమే కాక ప్రతికూల వర్తక శేషాన్ని కల్పించడానికి, ద్రవ్యోల్బణ ఒత్తిడులను అధిగమించడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 7.
ప్రపంచీకరణను నిర్వచించి, భారతదేశంలో ప్రపంచీకరణకు అవసరమైన పరిస్థితులను గురించి వ్రాయుము.
జవాబు:
దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడమే ప్రపంచీకరణ అంటారు. దీని వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తు సేవలు, సాంకేతిక, శ్రమ, మొదలగునవి సులభంగా ప్రవహింపబడి ప్రపంచ దేశాలన్ని అనుసంధానింపబడతాయి.

ప్రపంచీకరణకు అవసరమైన పరిస్థితులు:
1) వ్యాపార స్వేచ్ఛ: ప్రపంచీకరణ ప్రక్రియలో అవసరమైన ప్రభుత్వ నియమ నిబంధనలు ఉండరాదు. దిగుమతి నియంత్రణలు, విత్త వనరులపై నియమాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మొదలైన వాటికి ప్రభుత్వం అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఆర్థిక సరళీకరణ చాలా ముఖ్యం.

2) అవస్థాపన సదుపాయాలు: స్వదేశీ సంస్థ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందటానికి కావలసిన సదుపాయాలను కల్పించవలసి ఉంది.
ఉదా: నీరు, రవాణా, విద్యుత్, ఫైనాన్స్ మొదలగునవి.

3) ప్రభుత్వ ప్రోత్సాహం: ప్రపంచీకరణ ప్రక్రియలో ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమవుతుంది. ఆర్థిక సంస్కరణలు, అవస్థాపన సౌకర్యాల కల్పన, పరిశోధన మరియు అభివృద్ధి మొదలైన వాటిని ప్రభుత్వం కల్పించినప్పుడే ప్రపంచీకరణ విజయవంతం అవుతుంది.

4) వనరులు: ఒక వ్యాపార సంస్థ ప్రపంచీకరణలో అభివృద్ధి చెందటానికి దానికి కావలసిన వనరులు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. పరపతి, సాంకేతికత, నైపుణ్యం యజమాన్యాలు, మానవ వనరులు పరిశోధన మరియు అభివృద్ధి మొదలైన వనరులు ఉన్నప్పుడు వ్యాపార సంస్థలు ప్రపంచీకరణలో అభివృద్ధి చెందుతాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

5) పోటీతత్వం: అంతర్జాతీయ వ్యాపారంలో ఒక వ్యాపార సంస్థ విజయాన్ని, దానికి గల పోటీతత్త్వాన్ని బట్టి నిర్ణయించవచ్చు. సంస్థలు తక్కువ ధర, వ్యయం, మెరుగైన సాంకేతికం, వస్తుభిన్నత్వం మొదలైన వాటి ద్వారా చిన్న వ్యాపార సంస్థ ఎక్కువ తులనాత్మక ప్రయోజనాలతో లాభాలు పొందవచ్చు.

6) అనుసరణీయ వ్యూహాలు ప్రపంచీకరణలో వ్యాపార సంస్థలు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తే విజయాన్ని సాధిస్తాయో తెలుసుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రపంచీకరణలో పాల్గొనే సంస్థలకు ప్రాపంచిక వ్యాపార వ్యూహాలపై తగిన అవగాహన అవసరం.

ప్రశ్న 8.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావం తెలియజేయండి.
జవాబు:
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావం:

  • 1991లో ప్రపంచ ఎగుమతులలో భారతదేశం వాటా 0.53% వుండగా 2013 నాటికి 1.7% కు పెరిగింది.
  • విదేశీ ద్రవ్య నిధులు 1 బిలియన్ యు.యస్. డాలర్ల స్థాయి నుండి 2015, ఫిబ్రవరి అంతానికి 333 బిలియన్ యు.యస్. డాలర్లకు పెరిగాయి.
  • ఎగుమతుల ద్వారా ఆర్జించిన ద్రవ్యం, 65% మేరకు దిగుమతుల చెల్లింపులకు సరిపోవుచున్నది.
  • దేశం యొక్క కరెంటు ద్రవ్యలోటుపై నియంత్రణ సాధ్యం అవుతుంది.
  • విదేశీ రుణ పెరుగుదల రేటు సంస్కరణల ముందు కంటే బాగా తగ్గుదల చూపుతున్నది.
  • అంతర్జాతీయంగా భారతదేశంపై నమ్మకం పెరిగింది.
  • భారతదేశ వినియోగదారులు ఇప్పుడు వివిధ నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకే సొంతం చేసుకుంటున్నారు.
  • ప్రపంచీకరణ వల్ల ఉద్యోగ పరిస్థితి క్షీణించడం జరిగింది. ఉద్యోగాలవృద్ధి రేటు ప్రపంచీకరణ పూర్వఉన్న 2% నుండి 0.98%కి పడిపోయినది.
  • ప్రభుత్వంపై బహుళజాతి సంస్థలు (MNC’s) అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (IMF) మరియు ప్రపంచ బ్యాంక్ (World Bank)ల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టింది. వాటి ఫలితంగా అనేక చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు మూతపడుచున్నవి.
  • ప్రపంచీకరణ వల్ల ప్రజల మధ్య ఆదాయ అసమానతలు అదే విధముగా ప్రాంతీయ అసమానతలు కూడా పెరుగుచున్నాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రణాళిక రకాలు.
జవాబు:
ఒక నిర్ణీత కాల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాల వైపుకు ఒక క్రమంలో నడపడాన్ని ‘ప్రణాళిక’ అంటారు.
1) దీర్ఘదర్శి ప్రణాళిక: ఇది ఒక స్థూల ప్రణాళిక. అనగా 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల కాలానికి దీర్ఘకాల అవసరాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని తయారుచేయబడుతుంది.

2) పంచవర్ష ప్రణాళికలు: ఇది 5 సంవత్సరాల కాలానికి రూపొందింపబడిన ప్రణాళిక. దీనిలో 5 సంవత్సరాలు పూర్తయిన తరువాత సాధించిన లక్ష్యాలను సమీక్షించడం జరుగుతుంది. ఇది దీర్ఘదర్శి ప్రణాళికలో అంతర్భాగంగా ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

3) వార్షిక ప్రణాళికలు: వార్షిక ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఉంటాయి. పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు వార్షిక లక్ష్యాలుగా విభజింపబడి ప్రతి సంవత్సరానికి సంబంధించిన వార్షిక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తారు.

4) నిరంతర ప్రణాళికలు: ఈ ప్రణాళికలకు నిర్ణీత సమయము ఉండదు. దీనిని గున్నార్ మిర్డాల్ మొట్టమొదటి సారిగా ప్రతిపాదించారు. ప్రణాళికలు ముందు కెళ్తున్న కొద్ది, పూర్తయిన సంవత్సరాన్ని మినహాయించి రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ వెళ్ళడం జరుగుతుంది. ఇవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. 1979 సంవత్సరము తరువాత ఈ ప్రణాళికలు ఆపివేయబడ్డాయి.

ప్రశ్న 2.
ప్రణాళికా సంఘం.
జవాబు:
1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని 39వ అధికరణలోని ఆదేశిక సూత్రాల్లో భాగంగా ప్రణాళిక సంఘాన్ని స్థాపించారు. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తుంది. దీనికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు. దీని ప్రధాన కార్యాలయం “యోజనా భవన్” న్యూఢిల్లీలో ఉంది. ప్రధాన మంత్రి
సంఘానికి అధ్యక్షుడుగాను, 5గురు దీర్ఘకాలిక సభ్యులుగా నియమితులు అవుతారు. కీలక శాఖల కేబినెట్ మంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. ప్రణాళికా సంఘానికి మొట్ట మొదటి ఉపాధ్యక్షుడు శ్రీ గుల్జారీలాల్ నందా కాగా చివరి ఉపాధ్యక్షుడు శ్రీ మాంటెక్ సింగ్ అహ్లువాలియా చివరి ఉపాధ్యక్షుడు. జనవరి 1, 2015 నుండి ప్రణాళికా సంఘం “నీతి ఆయోగ్” గా రూపాంతరం చెందినది.

ప్రశ్న 3.
ప్రణాళిక సంఘం యొక్క లక్ష్యాలు. [Mar ’17]
జవాబు:
ప్రణాళిక సంఘంను 1950వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కల్గినది. ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తుంది.

  1. సహజ వనరులు, మానవ వనరులు, మూలధన వనరుల లభ్యత ఎంత వరకు దేశంలో ఉన్నాయో అంచనా వేయడం.
  2. ఆశించిన దానికంటే తక్కువగా ఉన్న వనరుల పెంపుదలను పరిశోధన చేయడం.
  3. ప్రణాళికా ప్రాధాన్యతను లక్ష్యాలను నిర్ణయించడం.
  4. ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకాలుగా ఉన్న కారకాలను గుర్తించి మరియు వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించుట.
  5. ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని నిర్ణయించడం.
  6. ప్రణాళిక అమలు వల్ల సాధించిన ప్రగతిని అంచనా వేయడం.
  7. ప్రణాళిక విజయానికి అవసరమైన మధ్యంతర సిఫారసులు చేయడం.

ప్రశ్న 4.
ఏవేని 3 ప్రణాళికా వైఫల్యాలను గురించి పేర్కొనండి.
జవాబు:

  1. 65 సంవత్సరముల ఆర్థికాభివృద్ధిలో పేదరికం, నిరుద్యోగం మొదలైన సమస్యలు పరిష్కరింపబడలేదు. 2012లో భారత ప్రభుత్వ నివేదిక ప్రకారం 21.9 శాతం జనాభా దారిద్య్రరేఖను దిగువన ఉన్నారు. 1999-2000 నాటికి 26.58 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉండగా, 2009 – 10 నాటికి ఈ సంఖ్య 28.1 మిలియన్లకు పెరిగింది.
  2. భూ సంస్కరణలు ప్రవేశపెట్టి దశాబ్దాలు గడిచినా, వాస్తవిక పరిస్థితులలో భూపంపిణీ సక్రమంగా అమలు
    కాలేదు.
  3. భారతదేశ పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం అసమానతలు లేని సమ సమాజాన్ని నిర్మించడం కాని ఇది ఇప్పటికి పూర్తి కాలేదు.
  4. “అందరికీ ఆరోగ్యం” అనే లక్ష్యాన్ని ఇప్పటికీ చేరుకోలేకపోయాం.

ప్రశ్న 5.
భారత దేశంలో ప్రాంతీయ అసమానతలకు కారణాలు. [Mar ’17]
జవాబు:
దేశ సమగ్రతకి, సత్వర పురోగతికి, ఆర్థికాభివృద్ధికి ప్రాంతీయ అసమానతలు అడ్డంకిగా ఉంటాయి. వివిధ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాల్లో వ్యత్యాసాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవడానికి ముందుగా, దీనికి గల అసలు కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. అవి:
ఎ) భౌగోళిక కారణాలు: భౌగోళికంగా కొన్ని ప్రాంతాలు మిగతా ప్రాంతాల నుంచి వేరుపరచబడి ఉంటాయి. కొండలు, లోయల కారణంగా ఇలాంటి ప్రాంతాలు ఏర్పడవచ్చు. అలాంటి ప్రాంతాలు వెనకబడి ఉంటాయి. ఉదా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాల్లోని ఉత్తర కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా వాతావరణం, రవాణా మార్గాలు సరిగ్గా లేకపోవడం వల్ల వెనుకబడి ఉన్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

బి) శీతోష్ణస్థితి పరిస్థితులు: వర్షపాతం, వాతావరణం మొదలైనవి అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువ. ఇలాంటి ప్రదేశాల్లో వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ తొందరగా అభివృద్ధి చెందలేవు.

సి) బ్రిటీషువారి పరిపాలన: చారిత్రాత్మకంగా చూస్తే భారతదేశంలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండటానికి బ్రిటీషువారి పరిపాలన కూడా కొంత కారణం. పారిశ్రామిక ఉత్పత్తికి, తమ వ్యాపారానికి అనుకూలముగా ఉండి మన దేశ సంపదను తమ దేశానికి తరలించడానికి అనువుగా ఉండే ప్రాంతాలనే వారు ఎన్నుకొని అభివృద్ధి పరచడం జరిగింది. మహా నగరాలైన కలకత్తా, బొంబాయి, మద్రాసులను వ్యాపార కేంద్రాలుగా చేసుకోవడం వల్ల, భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడి వెనుకబడ్డాయి.

డి) పరిశ్రమల కేంద్రీకరణ: అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే ప్రైవేటు రంగం నూతన పరిశ్రమలు స్థాపించడం జరుగుతుంది కారణం, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పరిశ్రమలకు కావలసిన అవస్థాపనా వసతులైన నైపుణ్యం గల శ్రామికులు, రవాణా మరియు మార్కెట్ సౌకర్యాలు సులభంగా లభ్యం కావడం.

ఇ) సహజ వనరుల కొరత: ప్రకృతి పరంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వనరులు పుష్కలంగా లభించడం వల్ల ఆ ప్రాంతాలు మాత్రం వేగంగా అభివృద్ధి చెందగలుగుతున్నాయి. అలాంటి అవకాశాలు లేని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి అని చెప్పవచ్చు.

ఎఫ్) అవస్థాపనా సౌకర్యాల కొరత: పరిశ్రమల స్థాపనకు అవరాలైన విద్యుచ్ఛక్తి, రోడ్లు, తంతి తపాలా సౌకర్యాలు, నీరు, విద్య, ఆరోగ్యం, సాంకేతిక శిక్షణ సౌకర్యాలు, పరపతి మొదలైనవి కొరతగా ఉన్న ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. ఈ సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలు త్వరితంగా అభివృద్ధి చెందుతాయి.

ప్రశ్న 6.
ప్రైవేటీకరణ సమర్థతను తెలుపు 3 విషయాలను వివరింపుము.
జవాబు:
ప్రభుత్వ రంగంలోని ఉత్పాదక కార్యకలాపాలపై యాజమాన్య హక్కును ప్రైవేటురంగ వ్యక్తులకు పూర్తిగాగాని, పాక్షికంగా కాని బదిలి చేసే ప్రక్రియను ప్రైవేటీకరణ అంటారు..
1) సామర్థ్యం, ప్రదర్శన పెరుగుదల: ప్రైవేటు రంగం పూర్తిగా లాభార్జనతో కూడుకున్న నిర్ణయాలు చేస్తుంది. కాబట్టి వ్యాపార సంస్థల సామర్థ్యం మరియు ప్రదర్శన పెరుగుతాయి. అదిగాక ప్రైవేటు రంగం మేనేజర్లకు మార్కెట్టును సృష్టిస్తుంది. కాబట్టి నిర్వహణ నాణ్యత కూడా పెరుగుతుంది.

2) బాధ్యతను అప్పగించడం సులభం: ప్రభుత్వ రంగంలోని లోపాలకు ఎవరు కూడా బాధ్యత వహించరు. కాని ప్రైవేటు రంగంలోని ప్రతి అంశానికి బాధ్యతలను విభజించి వ్యక్తులకు అప్పచెప్పుతారు. కాబట్టి ప్రైవేటు రంగంలో ఎలాంటి పొరపాటు జరిగినా వారు సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

3) ప్రణాళిక సాధన: ప్రైవేటు సంస్థలో అన్ని నిర్ణయాలు ముందుగానే రూపొందిస్తారు. వాటికి అనుకూలముగా ఏ అధికారి అయిన నడుచుకోవలసి వస్తుంది.

4) ప్రైవేటు రంగంలో సత్వర పరిష్కార మార్గాలు: ప్రైవేటు సంస్థలన్ని లాభర్జనపై ఆధారపడి ఉంటాయి. వీటికి తమ సంస్థలను ప్రభుత్వం తీసుకుంటుందేమోననే భయం ఉంటుంది లేదా నష్టాలు రావచ్చు అనే భయం కారణాలు వల్ల పరిష్కార మార్గాలు చాలా వేగంగా చేపడతారు.

ప్రశ్న 7.
అంతర్జాతీయ వ్యాపార పాత్ర.
జవాబు:
అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించుటలో అంతర్జాతీయ వాణిజ్యం చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
ఎ) ఉత్పత్తి పెరుగుదల (Increases Output): అంతర్జాతీయ వ్యాపారం వల్ల లాభాలను గడించి, జాతీయ ఆదాయాన్ని, ఉత్పత్తిని పెంపొందించుకొని ఆర్థిక వృద్ధి రేటును అధికం చేసుకోవచ్చు. అంతర్జాతీయ వ్యాపారం వల్ల అధిక ఉత్పత్తి సాధించి, పేదరికపు విష వలయాన్ని ఛేదించి ఆర్థికాభివృద్ధిని సాధించుకోవచ్చు.

బి) మార్కెట్ల విస్తరణ (Expands Markets): ఈ దేశాల్లో మార్కెట్ల పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారం మార్కెట్లను విస్తృత పర్చటడమేకాక, పొదుపు పెట్టుబడులను ప్రోత్సహించి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిపిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

సి) ఉపాధి పెరగడం (Increase in Employment): చాలా వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒకటి లేక రెండు ముఖ్యమైన వస్తువుల ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ సాధించి వాటికి ఎగుమతి చేసినట్లయితే మార్కెట్లు విస్తరిస్తాయి. అందుబాటులో ఉన్న ఉత్పాదక వనరులకు ఉపాధిని కల్పించి, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించకోవచ్చు. దేశంలో పొదుపు పెట్టుబడులు పెరిగి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఎగుమతి రంగం విస్తరిస్తున్నప్పుడు అనేక రకాల ఉత్పత్తి కారకాల ప్రవాహం ఈ రంగంలో పెరుగుతుంది.

డి) అంతర్గత బహిర్గత ఆదాలు (Internal & External & Economies): ఉత్పత్తి కార్యకలాపాల విస్తరణ మరియు మార్కెట్ అవకాశాలు పెరగడం వల్ల అనేక రూపాలలో అంతర్గత, బహిర్గత ఆదాలు లభ్యమవుతాయి. వీటి వల్ల ఉత్పాదక వ్యయం తగ్గుతుంది. ఇది అంతర్జాతీయ వ్యాపారం వల్ల లభించే ప్రత్యక్ష ప్రయోజనం.

ఇ) పరోక్ష ప్రయోజనాలు (Indirect benefits): అంతర్జాతీయ వ్యాపారం వల్ల మార్కెట్ల విస్తరణ జరిగి మరియు ప్రత్యేకీకరణ సాధ్యమై దేశంలో యంత్రాల పూర్తిస్థాయి ఉపయోగం నవకల్పనలకు దారితీసి శ్రామిక ఉత్పాదకత శక్తి కూడా పెరుగుతుంది. నూతన వస్తువులు అందుబాటులోకి వచ్చి వాటిని పొందుటకు ప్రజలను కష్టపడే విధముగా, పొదుపు చేసే విధముగా ప్రేరేపిస్తుంది.

ప్రశ్న 8.
GATT యొక్క లక్ష్యాలు.
జవాబు:
సుంకాలు, వ్యాపారంపై సాధారణ ఒప్పందం (గాట్) 1.1.1948 నుంచి అమలులోనికి వచ్చింది. ఇది 1.1.1995 వరకు కొనసాగింది. 1.1.95 నుండి ఇది WTOలో వీలినమైనది.
లక్ష్యాలు:

  1. నిష్పక్షపాతంగా అత్యంత అభిమాన దేశంను అనుసరించడం.
  2. సంప్రదింపుల ద్వారా తగాదాల పరిష్కారం.
  3. కొన్ని విషయాలలో చట్ట బద్ధత కల్పించడం.
  4. సుంకాల ద్వారానే స్వదేశీ పరిశ్రమలకు రక్షణ కల్పించడం.
  5. బహుళ ఒప్పందాల ద్వారా సుంకాలను, సుంకేతర అంశాలను సరళీకరించడం.
  6. అంతర్జాతీయ వ్యాపారాన్ని పారదర్శకంగా విచక్షణ రహితంగా అమలు చేయడం.

ప్రపంప వ్యాపారంలో సరళీకరణ ద్వారా వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకొని, ఉత్పత్తి, స్థారక డిమాండ్ను క్రమంగా పెంపొందించి, సంపూర్ణ ఉద్యోగితను సాధించి, నిజ ఆదాయాన్ని ప్రజల జీవన ప్రమాణాన్ని వృద్ధి పరచి ప్రపంచ వ్యాప్తంగా వస్తు వినిమయాన్ని విస్తరించడం గాట్ లక్ష్యం.

ప్రశ్న 9.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) యొక్క లక్ష్యాలు.
జవాబు:

  1. WTO ప్రధాన లక్ష్యం – జీవన ప్రమాణాన్ని పెంచడం, సంపూర్ణ ఉద్యోగిత మరియు సుస్థిర వృద్ధి, ఉత్పత్తిని విస్తరించడం, వస్తుసేవల వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపచేయడం.
  2. సుస్థిరాభివృద్ధిని సాధించుటకు ప్రపంచ వనరులను అభిలషనీయముగా సద్వినియోగ పరుచుకొంటూ సుస్థిర ఆర్థికాభివృద్ధి అనే లక్ష్యానికి అనుగుణముగా వనరుల వినియోగం జరిగేటట్లు చూడడం.
  3. అంతర్జాతీయ వ్యాపారం వల్ల అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు రావాల్సినవి అందేలా చూడడం.
  4. సభ్యదేశాలను పరస్పర ఒప్పందాల ద్వారా అందరికి ప్రయోజనకరంగా ఉంటుందని ఒప్పించడం.
  5. ఒక సమగ్ర, నమ్మకమైన మరియు నాణ్యతతో కూడిన బహుళ పాక్షిక వర్తక వ్యవస్థను అభివృద్ధి చేయడం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

ప్రశ్న 10.
గాట్ (GATT), ప్రపంచ వాణిజ్య సంస్థల (W.T.O) మధ్య భేదాలు.
జవాబు:
గాట్ (GATT)

  1. దీనికి చట్టబద్ధత లేదు.
  2. ఇది శాసనసభల ద్వారా గాని, ప్రభుత్వాల ద్వారా గాని సృష్టింపబడలేదు.
  3. ఇది ఐక్యరాజ్య సమితి ఏజెంటు కాదు.
  4. కొన్ని ఎంపిక చేయబడిన అంశాలలో బహుళ పాక్షిక ఒప్పందాలకు సంబంధించి కొన్ని నియమ నిబంధలను కలిగి ఉంది.
    ప్రత్యేక విషయాలకు ప్రత్యేక ఒప్పందాలు కలిగి ఉంటుంది. కాని సభ్యులు దానికి ఖచ్చితంగా లోబడి ఉండాల్సిన పనిలేదు. ఏ సభ్యదేశమైన ఒప్పందం బయటే ఉండిపోవచ్చు. కేవలం సంతకం చేసిన సభ్యులే అందుకు లోబడి ఉంటారు.
  5. గాట్ సభ్యదేశాల మధ్య తలెత్తే తగాదాలపై చర్చించగలదు. కాని సభ్యులు ఖచ్చితంగా తన నిర్ణయాన్ని పాటించేలా చెయ్యలేదు.
  6. ప్రపంచ వర్తక సమస్యలను చర్చించుటకు ప్రతి దశాబ్దంలో సమావేశమయ్యే ఒక వేదికగా గాట్ పని చేస్తుంది.
  7. గాట్ నియమాలు వస్తు వ్యాపారానికి మాత్రమే సంబంధించినవి కలిగి ఉంది.
  8. ఇది డైరెక్టర్ జనరల్ ద్వారా నిర్వహింపబడే ఒక చిన్న సెక్రటేరియలు మాత్రమే కలిగి ఉండేది.

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)

  1. ఇది చట్టబద్ధమైనది.
  2. ఇది సభ్యదేశాల శాసన సభలు ప్రభుత్వాలచే ఒక ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయబడింది.
  3. ఇది ఐక్యరాజ్య సమితిలో సహకార సంబంధాలు కలిగి ఉంటుంది.
  4. ఇందులో ఒప్పందాలు శాశ్వతమైనవి మరియు సభ్యదేశాలన్ని తప్పనిసరిగా వాటికి లోబడక తప్పదు.
    నిబంధనలను ఉల్లంఘించిన సభ్యదేశంపై ఇతర సభ్యులు క్రమ శిక్షణ చర్యలను తీసుకోవచ్చు.
  5. WTO లోని తగాదాలను పరిష్కారణ యంత్రాంగం స్వయం చాలకము, వేగవంతం మరియు అన్ని దేశాలు నిర్ణయాలకు బద్దులై ఉండాలి.
  6. ఇది పటిష్ట నియమాలతో సక్రమంగా స్థాపించ బడిన సంస్థ కాబట్టి ఒప్పంద నిర్ణయాలు కాల బద్దతను కలిగి ఉంటాయి.
  7. WTO వస్తుసేవల వాణిజ్యమేకాక మేథస్సుకు సంబంధించిన మేథోసంపత్తి హక్కులు మరియు అనేక ఒప్పందాలు కలిగి ఉంది.
  8. ఇది పెద్ద సెక్రటేరియట్ను కలిగి పెద్ద నిర్వహణ స్వరూపాన్ని కలిగి ఉంది.

ప్రశ్న 11.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) విధులు.
జవాబు:
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) క్రింది విధులను నిర్వహిస్తుంది. [Mar ’16]

  1. ప్రపంచ వ్యాపార ఒప్పందాల అమలు, పరిపాలన మరియు కార్యాచరణలో చొరవ తీసుకుంటుంది.
  2. WTO తన సభ్యదేశాలను, వ్యాపార ఒప్పందాల్లో ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
  3. వ్యాపార తగాదాలను పరిష్కరిస్తుంది.
  4. ఇది సభ్యదేశాల జాతీయ వ్యాపార విధానాలను పర్యవేక్షిస్తుంది.
  5. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతికంగా శిక్షణను, ఇతర సహాయాలను చేస్తుంది.
  6. ఇది IMF, IBRD మరియు దాని అనుబంధ సంస్థలతో శాంతియుత సహాయ సహకార సంబంధాన్ని కలిగి ఉంటుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రణాళికను నిర్వచింపుము.
జవాబు:
ప్రణాళిక అంటే నిర్ణీత కాలవ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాలవైపు ఒక క్రమంలో నడవటాన్ని ప్రణాళిక అంటారు. మన దేశంలో ప్రణాళికలు 1951వ సంవత్సరములో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 12వ ప్రణాళిక అమల్లో ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

ప్రశ్న 2.
నిరంతర ప్రణాళిక అనగానేమి ?
జవాబు:
నిరంతర ప్రణాళికలు: దీనిని గున్నార్ మిర్డాల్ ప్రతిపాదించినాడు. ప్రణాళికలు ముందుకెళ్తున కొద్ది, పూర్తయిన సంవత్సరాన్ని మినహాయించి రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ వెళ్ళడం జరుగుతుంది. కావున ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.

ప్రశ్న 3.
ప్రణాళికా విరామము.
జవాబు:
ప్రణాళికకు, ప్రణాళికకు మధ్య గల కాలంలో విరామమును ప్రణాళికా విరామము అంటారు. 1966-69 మధ్య కాలంలో ప్రభుత్వ ప్రణాళిక విరామము ఏర్పడినది. దీనికి కారణం ఆర్థిక, రాజకీయ ఒత్తుడులు, 1990-92 మధ్య కాలం ప్రభుత్వ అనధికార సెలవుగా ప్రకటించారు.

ప్రశ్న 4.
దీర్ఘదర్శి ప్రణాళికను నిర్వచింపుము.
జవాబు:
15 సంత్సరాల నుండి 20 సంవత్సరాల కాలానికి దీర్ఘకాల అవసరాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని తయారుచేయబడే ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. ఇది ఇక స్థూల ప్రణాళిక.

ప్రశ్న 5.
వార్షిక ప్రణాళిక అనగానేమి ? ఉదాహరణ వ్రాయుము.
జవాబు:
పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు వార్షిక లక్ష్యాలుగా విభజింపబడి ప్రతి సంవత్సరానికి సంబంధించిన వార్షిక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయడాన్ని వార్షిక ప్రణాళిక అంటారు. ఇది పంచవర్ష ప్రణాళికలో భాగముగా ఉంటాయి.

ప్రశ్న 6.
భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాలు.
జవాబు:
మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, బీహారు రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. వెనుకబడిన రాష్ట్రాలలో సగటు జీవిత కాలం, శిశు మరణాలు, స్త్రీ విద్య వంటి అంశాల్లో కూడా ఎంతో వెనుకబడ్డాయి.

ప్రశ్న 7.
ప్రాంతీయ అసమానతలను నిర్వచింపుము.
జవాబు:
దేశంలో ఒకవైపు కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెంది, మరో వైపు కొన్ని వెనుకబడి, ఒక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల మధ్య ఈ రకమైన వ్యత్యాసాలు ఉండడాన్ని ప్రాంతీయ అసమానతలుగా పేర్కొనవచ్చు. ఈ విధమైన అసమానతలు ప్రకృతి సిద్ధంగా వనరుల లభ్యతలోని తేడాలు ఏర్పడినవి కావచ్చు లేదా మానవ ప్రయత్నాల ఫలితంగా ఏర్పడవచ్చు.

ప్రశ్న 8.
సమతౌల్య ప్రాంతీయాభివృద్ధి.
జవాబు:
అన్ని ప్రాంతాలను ఒకే స్థాయిలో అభివృద్ధి చేయడం సమతౌల్య ప్రాంతీయాభివృద్ధి. అభివృద్ధి ఫలితాలు దేశ ప్రజలందరికి అందచేయడానికి శ్రామిక శక్తి, సహజ వనరులను సంపూర్ణంగా వినియోగించడానికి, ప్రాంతీయ అసమానతలు తొలగించి అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

ప్రశ్న 9.
సరళీకరణ అనగానేమి ?
జవాబు:
ఉత్పత్తి కార్యకలాపాలలో ప్రైవేటు రంగానికి ప్రభుత్వ రంగంతో పాటు సమాన ప్రతిపత్తిని కల్పిస్తూ, ప్రభుత్వ పరమైన ఆంక్షలను లైసెన్సులను సరళీకృతం చేయడం ద్వారా ప్రైవేటు రంగం ప్రగతికి దోహదపడే విధానమే సరళీకరణ భారతదేశ నూతన ఆర్థిక విధానం 1991లో సరళీకరణ ప్రధానమైన అంశం.

ప్రశ్న 10.
ప్రైవేటీకరణ భావనను వివరింపుము.
జవాబు:
ప్రభుత్వ నిర్వహణలోనున్న సంస్థల యాజమాన్యాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు లేదా ప్రైవేటు రంగానికి అప్పగించుటను ప్రైవేటీకరణ అంటారు.

ప్రశ్న 11.
ప్రపంచీకరణను నిర్వచింపుము.
జవాబు:
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మిళితం చేయడమే ప్రపంచీకరణ. ఎలాంటి ప్రభుత్వ ఆటంకాలు లేకుండా వస్తు సేవలు, సాంకేతిక, మూలధనం, శ్రామికులు లేక మానవ మూలధన ప్రవాహ ప్రక్రియ ద్వారా ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలు సంఘటితంగా ఏర్పడటాన్ని ప్రపంచీకరణ అంటారు.

ప్రశ్న 12.
TRIPs లోని అంశాలు.
జవాబు:
వ్యాపార సంబంధిత మేథో సంపత్తి హక్కులు, పేటంట్, భౌగోళిక గుర్తు లేఅవుట్లు, సమాచారం, కాపిరైట్, ట్రేడ్మార్కు మొదలైన వానికి సంబంధించినది.

ప్రశ్న 13.
ట్రిమ్స్ TRIMs భావన.
జవాబు:
వ్యాపార సంబంధిత పెట్టుబడి కొలమానములు ప్రకారం దేశంలోని అన్ని రకములైన నియమ నిబంధనలను తొలగించి విదేశీ పెట్టుబడులను స్వదేశీ పెట్టుబడులుగా పరిగణించడం ద్వారా జాతీయ భావం కల్పించడం.

ప్రశ్న 14.
M. F.N. నిబంధన. [Mar ’16]
జవాబు:
గాట్ ప్రాథమిక సూత్రాన్ని మొదటి ప్రకరణలో చేర్చారు. దీని ప్రకారం సభ్యదేశాల మధ్య విచక్షణా రహితంగా ప్రవర్తించరాదు. సభ్యదేశాలన్ని అధికార అనుకూల జాతీయత క్లాజ్ను అనుసరించటం. దీని ప్రకారం ఏదైనా ఒక సభ్య దేశానికి అనుకూలమైన తీర్మానం చేస్తే గాట్లోని అన్ని సభ్య దేశాలకు ఆ తీర్మానం వర్తిస్తుంది.

ప్రశ్న 15.
పెట్టుబడి ఉపసంహరణ.
జవాబు:
ప్రభుత్వరంగ సంస్థలలోని ఈక్విటీని ప్రైవేటు వ్యక్తులకు, ప్రజలకు పెట్టుబడుల సంస్థకు, మ్యూచవల్ ఫండ్స్క ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే శ్రామికులకు అమ్మడమే పెట్టుబడుల ఉపసంహరణ.

ప్రశ్న 16.
గాట్ (GATT).
జవాబు:
ప్రపంచంలో 1930 దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయ వ్యాపారం చాలా వేగంగా తగ్గింది. అగ్రదేశాలు సరళీకరణలో కూడిన అంతర్జాతీయ వ్యాపారం ఉండాలని భావించాయి. వాటి ఆలోచనా ఫలితంగానే సుంకాలు వ్యాపారంపై సాధారణ ఒప్పందం (GATT) ఏర్పడినది. గాట్ 1.1.1948 నుండి 1.1.1995 వరకు తన విధులు నిర్వహించింది.

ప్రశ్న 17.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO). [Mar ’17]
జవాబు:
ఉరుగ్వే రౌండ్ అంతిమ చట్టంపై ఏప్రిల్ 1994 సంవత్సరంలో 124 గాట్ సభ్య దేశాలు సంతకాలు చేయటం వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది. ఇది 1.1.1995 నుండి తన విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం 2013 వరకు దీనిలో 160 సభ్య దేశాలు ఉన్నాయి. ఇది చట్టబద్ధమైన వ్యవస్థ. ఇది ప్రపంచ వ్యాపారాన్ని, సేవలు, విదేశీ పెట్టుబడిని, మేథో సంపత్తి హక్కులను పరిరక్షించటం మొదలైన వాటిలో ముఖ్యమైన పాత్ర పోషించుచున్నది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 7 ప్రణాళికలు - ఆర్ధిక సంస్కరణలు

ప్రశ్న 18.
ఉరుగ్వే రౌండ్.
జవాబు:
గాట్ సభ్యదేశాల 8వ సమావేశాన్ని ఉరుగ్వే రౌండ్గా పిలుస్తారు. గాట్ సాధారణ సమావేశాలకు విరుద్ధంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం W.T.O. ఏర్పడటానికి మార్గదర్శకమైంది.

ప్రశ్న 19.
F.D.I (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి).
జవాబు:
విదేశాలలో పెట్టిన పెట్టుబడులపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉండటం.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 6th Lesson తృతీయ రంగం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 6th Lesson తృతీయ రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
సేవల రంగమంటే ఏమిటి నిర్వచించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సేవలరంగం ప్రాధాన్యతను గూర్చి వివరించండి.
జవాబు:
సేవా రంగాన్నే తృతీయ రంగం లేదా మూడవ రంగమని పిలుస్తారు. బాంకులు, అంతర్జాతీయ వర్తకం, కమ్యూనికేషన్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు మొదలైన సేవలన్నీ తృతీయ రంగంలోకి వస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తృతీయ రంగం నుండి ఎక్కువగా స్థూల జాతీయదాయం సమకూరుతుందని, ఎక్కువ మందికి ఉపాధి ఈ రంగం కల్పిస్తూ ఉంటుందని మరియు ఎగుమతి ఆదాయం ఈ రంగం నుంచి ఎక్కువగా సమకూరుతుందని, ఎక్కువ మందికి ఉపాధిని ఈ రంగం కల్పిస్తూ ఉంటుందని మరియు ఎగుమతుల అదాయం ఈ రంగం నుంచి ఎక్కువగా సమకూరుతుందని అర్థికవేత్తల అభిప్రాయం. తృతీయరంగం వాటా జాతీయోత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలోను, ఇండియా పదకొండవ స్థానంలోను ఉంది.

1) స్థూల జాతీయోత్పత్తిలో వాటా:
దేశాలు వారీగా స్థూల జాతీయోత్పత్తిలో వాటి వాటాలు పరిశీలిస్తే 2001 నుంచి 2013 మధ్యకాలంలో సేవలరంగం వాటా పెరిగింది. మొదటి మూడు స్థానాల్లో ఇంగ్లాండు, ఆమెరికా, ఫ్రాన్సు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టికను బట్టి భారతదేశం జాతీయోత్పత్తిలో సేవలరంగం వాటా 2001లో 51.3 శాతం కలిగి ఉండగా 2013 నాటికి 57.0 శాతం పెరిగింది.
దేశాల వారిగా జాతీయోత్పత్తి సేవల రంగం వాటా
AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం 1

2) శ్రామికుల శాతం:
సేవల రంగంలో పనిచేసే వారి సంఖ్య శాతం మిగతా రంగాలలో పనిచేసేవారి సంఖ్యశాతం కంటే ఎక్కువగా ఉంది. వివరాలను గమనిస్తే ఇండియా, చైనా తప్ప మిగతా దేశాలలో సేవల రంగంలో పనిచేసే వారి సంఖ్య 2001 మరియు 2013 సంవత్సరాల మధ్య 60 మరియు 80 శాతం మధ్య ఉంది. భారతదేశంలో తృతీయ రంగంలో పనిచేసే శ్రామికుల శాతం 2001 లో 24.0 శాతం నుంచి 2013 నాటికి 28.1 శాతం పెరిగింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

3) సేవల ఎగుమతులు:
ప్రస్తుత కాలంలో ప్రతి అర్థిక వ్యవస్థకు ఎగుమతులు అనేవి అర్థికాభివృద్ధికి ఇంజను లాంటిది. ఎగుమతులు, విదేశీ మారకద్రవ్యాన్ని సమకూరుస్తుంది. ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉంటే విదేశీ చెల్లింపుల శేషం అనుకూలంగా ఉన్నట్లు చెప్పవచ్చును.
ఇంగ్లాండు (35.1%), భారతదేశం (32.5%), అమెరికా (29.5%) మరియు ఫ్రాన్సు (29.0%) సేవలరంగం ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి.

ప్రశ్న 2.
భారతదేశంలో అవస్థాపనా సౌకర్యాలు ఆర్థికాభివృద్ధికి ఎట్లా దోహదపడుతుందో వివరించండి.
జవాబు:
సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి అవస్థాపనా సౌకర్యాలు అవసరమని చెప్పవచ్చును. స్వాతంత్య్రానంతరం, ప్రణాళికా కర్తలు అర్థికాభివృద్ధికి అవస్థాపన సౌకర్యాలు ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. అర్థిక అవస్థాపనా సౌకర్యాలైన విద్యుత్, రవాణా, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ మొదలైన వాటిపై పెట్టుబడులు భారీగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం. అందుకని అవస్థాపన సౌకర్యాలకై సరళీకరణ విధానాన్ని ఉపయోగించి ప్రైవేటు మరియు విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించింది.
సాధారణంగా అవస్థాపన సౌకర్యాలను రెండుగా వర్గీకరించవచ్చును. అవి ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు మరియు సాంఘిక అవస్థాపన సౌకర్యాలు. ఇవి:

  1. శక్తి: బొగ్గు, విద్యుచ్ఛక్తి, పెట్రోల్, సాంప్రదాయ, సాంప్రదాయేతర వనరులు.
  2. రవాణా: రోడ్లు, రైల్వేలు, నౌక మరియు వైమానిక సర్వీసులు..
  3. సమాచారం: తంతి తపాలా, టెలిఫోన్, టెలీకమ్యూనికేషన్.
  4. బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు భీమా.
  5. సాంఘీక అవస్థాపనా సౌకర్యాలు: విద్య, వైద్యం, పరిశుభ్రత.

ఆర్థిక అవస్థాన మూలధనం, సాంఘీక అవస్థాపన మూలధనం అనేవి సేవారంగంలో ఉపరంగాలుగా చెప్పవచ్చును. అవస్థాపనా సౌకర్యాలు బాగా లభిస్తే తలసరి స్థూల జాతీయోత్పత్తి పెరగటంతో పాటు కింది ఫలితాలు కూడా లభిస్తాయి.

  1. ఉత్పత్తి ప్రక్రియ యొక్క ఉత్పాదకత పెరుగుతుంది.
  2. మార్కెట్లను అందుబాటులోకి తెస్తుంది.
  3. వ్యాపార వ్యయాలను తగ్గిస్తుంది. వ్యాపార ఆస్తుల, చరమూలధనాల మీద చేసే వ్యయాన్ని తగ్గిస్తుంది. 4) ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
  4. వర్తకంలోను, ఉత్పత్తులలోను వైవిధ్యాన్ని, ఆధునికతను సాధించే వీలు కలుగచేస్తుంది.
  5. సంక్షేమం అంటే ఏమిటో తెలియజేస్తుంది. దారిద్ర్యాన్ని తగ్గిస్తూ, ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందటానికి తగిన హామీనిస్తుంది.
  6. జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.
  7. వ్యవసాయేతర ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
  8. మానవ ఆవాసాల యొక్క పర్యావరణ సుస్థిరతను పెంపొందిస్తుంది.
  9. ప్రజారోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలను అందిస్తుంది.

అవస్థాపన సౌకర్యాలు కలిగించే ప్రయోజనకరమైన ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని మనదేశ ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సౌకర్యాలను అభివృద్ధి పరచటానికి మొత్తం చేయనున్న రూ.14,36,559 కోట్ల పెట్టుబడుల్లో రూ.4,35,349 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి నిశ్చయించింది. ఈ మొత్తాన్ని విద్యుత్, రోడ్లు, టెలీకమ్యూనికేషన్స్, సాగునీరు, నీటి సరఫరా, పరిశుభ్రత సౌకర్యాలను అభివృద్ధి చేయాడానికి కేటాయించడం జరిగింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సేవా రంగంలో స్థూల జాతీయోత్పత్తి స్థాయిని వివరించండి.
జవాబు:
ఒక దేశం యొక్క జాతీయాదాయంలోని పెరుగుదల ఆ దేశంలోని వస్తు-సేవల ఉత్పత్తిలోని పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. అర్థికవ్యవస్థలో ఈ రంగం నుండి ఎక్కువగా స్థూల జాతీయదాయం సమకూర్చుతుంది. సేవా రంగంలో సేవలను అందించే వివిధ సంస్థలుంటాయి అవి రవాణా, బ్యాంకింగ్, భీమా సంస్థలు, హోటల్స్, గ్రంథాలయాలు మొదలైనవి.

జాతీయాదాయంలో సేవరంగం వాటా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇది ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో వచ్చే అశించదగిన పరిణామం. 1950-51లో స్థూల దేశీయోత్పత్తిలో సేవరంగం వాటా 28% కాగా 2013లో ఇది 57.0% చేరింది. దేశాల వారిగా స్థూల జాతీయోత్పత్తిలో వాటి వాటాలను పరిశీలిస్తే 2001 నుంచి 2013 మధ్యకాలంలో సేవల రంగం వాటా పెరిగింది.

దేశాల వారిగా జాతీయోత్పత్తి సేవల రంగం వాటా
AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం 2
పై పట్టికలో మొదటి మూడు స్థానాలలో ఇంగ్లండు, అమెరికా, ఫ్రాన్సు ఉన్నాయి. పై పట్టికలో ఇండియాలో జాతీయోత్పత్తి సేవారంగం వాటా 2001 లో 57.3% ఉండగా 2013 నాటికి 57.0% పెరిగింది.

ప్రశ్న 2.
భారతదేశ సేవారంగంలో తలచిన కార్యకలాపాలు ఏమిటి ?
జవాబు:
మన దేశంలో ఇటీవల కాలంలో తృతీయరంగం ఎక్కువ మందికి ఉపాధి కలిస్పూ, మన జాతీయాదాయంలో ఎక్కువ వాటాను అందించుచున్నది. సేవారంగంలో రకరకాల కార్యకలాపాలను కొన్ని ప్రధాన తరగతులుగా విభజించవచ్చును.

  1. వ్యాపారం
  2. రవాణావ్యవస్థ
  3. హోటళ్లు, రెస్టారెంట్లు
  4. నిర్మాణాలు
  5. గిడ్డంగులు
  6. బ్యాంకులు, భీమా సంస్థలు
  7. ప్రభుత్వ పాలన మరియు రక్షణ
  8. విద్య, వైద్య, మత, సామాజిక సేవలు మొదలైనవి
  9. కమ్యూనికేషన్లు
  10. స్థిరాస్తి వ్యాపారం మరియు వర్తక సేవలు

ప్రశ్న 3.
రోడ్డు రవాణా వల్ల లాభాలు ఏమిటి ? [Mar ’17, ’16]
జవాబు:
ఒక ప్రదేశాన్ని, మరొక ప్రదేశాన్ని కలిపేటటువంటి రోడ్డు రవాణా మనదేశంలో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ప్రధాన రవాణా పద్ధతి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు అత్యంత కీలకంగా పనిచేస్తాయి. సమీకృతంగా ఉండే రవాణా వ్యవస్థలో రోడ్లు అత్యంత కీలకమైనవిగా చెప్పవచ్చు. మనదేశం ప్రపంచ దేశాలలో అతి పెద్ద రోడ్డు వ్యవస్థ గల దేశం. మనదేశంలో 48.65 లక్షల కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉన్నాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

లాభాలు:

  1. అన్ని గ్రామలను, ప్రాంతాలను కలిపేది రోడ్డు రవాణా, రైల్వే మార్గాలలో కలవనటువంటి ప్రదేశాలను రోడ్లు కలుపుతాయి.
  2. తొందరగా చెడిపోయే, చెడిపోవడం చాలా తక్కువగా ఉంటుంది.
  3. రైల్వే రవాణా వ్యవస్థకు సరుకులను, ప్రయాణికులను చేరవేస్తుంది.
  4. సరుకులు నష్టపోవడం, చెడిపోవడం చాలా తక్కువగా ఉంటుంది.
  5. గ్రామీణ, పట్టణ నగరాల్లో చాలా అనుకూలమైన రవాణా సౌకర్యాలను అందజేస్తుంది.
  6. రోడ్డు రవాణా వ్యవస్థలో మూలధన వ్యయం తక్కువగా ఉంటుంది.
  7. అత్యవసర పరిస్థితులలో ఇతర మార్గాల ద్వారా చేరలేని ప్రదేశాలను రక్షణ బలగాలను త్వరగా చేర్చేందుకు సహాయపడతాయి.

ప్రశ్న 4.
రైల్వేలు ప్రాముఖ్యత వివరించండి.
జవాబు:

  1. ఆర్థికాభివృద్ధికి రైల్వే రవాణా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ప్రయాణీకులను, సరుకులను రవాణా చేసే ప్రధాన వ్యవస్థల్లో రైల్వే రవాణా ఒకటి.
  2. ముడి పదార్థాలు, యంత్ర సామాగ్రి తయారీ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైన వాటి రవాణాకు `దేశీయ, విదేశీ వ్యాపారాభివృద్ధికి, శ్రామిక గమనశీలతకు రైల్వేలు ఎంతో దోహదపడతాయి.
  3. వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధిపర్చడంలో డై ప్రధానపాత్రను పోషిస్తున్నాయి.
  4. ప్రయాణికులకు కావలసిన సౌకర్యాలను మెరుగుపర్చడం, సాంకేతిక విజ్ఞానాన్ని మరియు ఆధునికం చేయడం ఎంతైనా అవసరం.

ప్రశ్న 5.
పర్యాటకం అంటే ఏమిటి ? మన దేశ ఆర్థిక వ్యవస్థలో దాని ప్రాధాన్యతను గూర్చి వివరించండి.
జవాబు:
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రకారం “విశ్రాంతి కోసం గాని, వ్యాపారనిమిత్తం గాని, ఇతర ప్రయోజనాల కోసం గాని ప్రజలు (ప్రయాణీకులు) వారి సాధారణ పరిసరాల నుండి దూరంగా వరసగా ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం ప్రయాణిస్తూ ఒక స్థలంలో నిలిచి ఉండే వారి కార్యకలాపాలనే పర్యాటకం” అని అంటారు.

పర్యాటకం తృతీయ రంగంలో ఒక ఉపవిభాగము ప్రత్యేకించి సేవలరంగంలో ముఖ్యమైన విభాగము. పర్యాటక రంగానికి ఉన్నటువంటి అంతర్జాతీయ ధృక్కోణాల కారణంగా ఈ రంగాన్ని ‘అదృశ్యవాణిజ్యం’ అని ‘ధూమరహిత ‘పరిశ్రమ’ అని అంటారు. ఈ పర్యాటకరంగం వలన అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు ఆర్థికపరమైన ఆర్థికేతరమైన లాభాలు కలుగుతున్నాయని నిపుణుల అభిప్రాయము.

పర్యాటకం – లక్షణాలు:
“ప్రయాణీకులు అనేక అవసరాలను సంతృప్తిపరిచే అన్ని కార్యకలాపాలను పర్యాటకం” అని చెప్పవచ్చును. ప్రయాణాలను పర్యాటకం అని చెప్పడానికి క్రింది లక్షణాలుండాలి.

  1. ప్రయాణం తాత్కాలికమైనదై ఉండాలి.
  2. ప్రయాణం ఐచ్ఛికమైనదై ఉండాలి.
  3. ప్రయాణం స్థానికేతరులు చేసినదై ఉండాలి.
  4. ఒక ప్రతిఫలాన్నిచ్చే ఉపాధి లక్ష్యంగా ప్రయాణం ఉండరాదు.
  5. ఆ ప్రయాణం వస్తు సేవలకు గిరాకీని కల్పించేదై ఉండాలి.
  6. ప్రయాణీకులు ఎక్కడికైతే పర్యటిస్తూ ఉంటారో అక్కడి వస్తుసేవలను వారు వినియోగించాలి.
  7. ప్రయాణీకులు ఒక చోట 24 గంటలకంటే ఎక్కువ సమయం నిలిచి ఉండాలి.
  8. ప్రయాణం, తిరుగు ప్రయాణం చేసేదిగా ఉండాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

ప్రశ్న 6.
భారతదేశంలో బాంకింగ్ రంగ పద్దతి గూర్చి వివరించండి.
జవాబు:
అసంఘటిత విభాగంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రాచీన కాలం నుండి నిర్వహించబడుతూనే ఉన్నాయి. కాని ఒక శతాబ్దం కాలం నుండి బ్యాంకింగ్ వ్యవస్థ సంఘటిత విభాగంలో అభివృద్ధి చెందసాగింది. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల పొదుపును సమీకరించి, పెట్టుబడికి మళ్ళిస్తుంది. వనరులను ఉత్పాదకంగా ఉపయోగించడానికి, మూలధన కల్పనకు బాంకులు సమర్ధవంతమైన ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఇటీవల కాలంలో బాంకులు మనదేశంలో సాంఘీక, అర్థికాభివృద్ధిని సాధించడంలో కీలకపాత్రను పోషిస్తున్నాయి.
మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మూడు విధాలుగా విభజించవచ్చు.

  1. వాణిజ్య బ్యాంకులు
  2. సహకార బ్యాంకులు
  3. కేంద్ర బ్యాంకు లేదా భారత రిజర్వు బాంకు

వాణిజ్య బ్యాంకులను దశల వారీగా 1969లోనూ, 1980లోనూ జాతీయం చేశారు. S.B.I, దాని అనుబంధ బ్యాంకులను, ఇతర 20 బ్యాంకులను జాతీయ బ్యాంకులు అంటారు. జాతీయం చేయబడని బ్యాంకులను ప్రైవేటు బ్యాంకులు అంటారు.

స్వల్పకాలిక ఋణాలనందిస్తూ సహకార బ్యాంకుల వ్యవస్థ పరిధి క్రిందకు వచ్చే రాష్ట్ర సహకార బ్యాంకులను, జిల్లా కేంద్ర బ్యాంకులు మొదలైన వాటిని సహకార బ్యాంకులు అంటారు.

భారత రిజర్వు బ్యాంకు 1935లో స్థాపించి 1949లో జాతీయం చేశారు. ఇది మనదేశంలో అత్యన్నత స్థాయి బ్యాంకు. షెడ్యులు బ్యాంకు ద్రవ్యాన్ని భవిష్యత్తు ఉపయోగాల కోసం తన వద్ద రిజర్వు ఉంచుకుంటుంది.

ప్రశ్న 7.
భారతదేశ భీమా పరిశ్రమలో గల ముఖ్యమైన అంశాలేమిటి ?
జవాబు:
ఖాతాదారులు తమకు కలిగినటువంటి నష్టాలనుంచి లేదా ప్రమాదాల నుంచి ఆర్థికంగా రక్షణ పొందేందుకు గాను ఒక సంస్థలో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని భీమా అంటారు. అభివృద్ధి చెందిన భీమా రంగం వల్ల నష్టాభయాన్ని భరించే కార్యకాలాపాలను చేపట్టడంతో పాటు దీర్ఘకాలిక పొదుపు పెరుగుతుంది. పొదుపు పెరుగుదల ఆర్థికాభివృద్ధి కీలకమైనది.

భీమా పరిశ్రమలో రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి.

  1. జీవిత భీమా
  2. సాధారణ భీమా

1. జీవిత భీమా: కుటుంబంలో అదాయాన్ని ఆర్జించే కుటుంబ యాజమాని అకాల మరణ నష్ట భయం నుంచి భద్రత కల్పించడానికి ఉద్దేశించినది.

2. సాధారణ భీమా: అనారోగ్యం, ప్రమాదాలు, ఆస్తి నష్టం మొదలైన నష్ట భయాల భద్రతలకు సంబంధించినది. ఇది కంపెనీ మోటారు వాహనాలు, జల రవాణా, వస్తు రవాణా మరియు ఆగ్ని ప్రమాదాలు అనే మూడు రకాలైన వ్యాపారాలు చేస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సేవారంగం. [Mar ’17]
జవాబు:
సేవారంగాన్నే తృతీయ లేదా మూడవ రంగమని పిలుస్తాం. బాంకులు, అంతర్జాతీయ వర్తకం, రవాణా, కమ్యూనికేషన్లు, హోటళ్ళు, లాయర్లు, డాక్టర్లు మొదలైన సేవలన్నీ తృతీయరంగంలోకి వస్తాయి. మనలాంటి దేశాలు వ్యవసాయ, పరిశ్రమ రంగాలు సేవలరంగం మీద ప్రత్యక్షంగా ఆధారపడి వృద్ధి చెందుతూ ఉంటాయి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

ప్రశ్న 2.
అవస్థాపన.
జవాబు:
అవస్థాపన సౌకర్యాలను సాంఘిక వ్యవస్థా మూలధనం అని కూడా అంటారు. వీటివల్ల కలిగే ప్రయోజనం సమాజం అంతటికి వరిస్తుంది. అవస్థాపనలో ప్రధాన విభాగాలు శక్తి, రవాణా, సమాచారం, బాంకులు, ఆరోగ్యం, విద్య, పరిశుభ్రత మొదలైనవి.

ప్రశ్న 3.
రవాణా.
జవాబు:
ప్రయాణికులను, సంపదను ఒక చోటు నుండి వేరొక చోటుకు తరలించడాన్నే రవాణా అంటారు. ప్రసుత్తం మన దేశంలో రవాణా వ్యవస్థలో రైల్వేలు, రోడ్డు రవాణా, జలరవాణా, వాయు రవాణా ముఖ్యమైనవి. వివిధ రవాణా సాధనాలను సంవిధానపరచటం వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఎంతగానో అవసరం.

ప్రశ్న 4.
జల రవాణా. [Mar ’16]
జవాబు:
అధిక పరిమాణం, బరువుగల సరుకులను రవాణా చేయడానికి జలరవాణా ఉపయోగపడుతుంది. ఇది రెండు రకాలు 1. దేశీయ జల రవాణా 2. అంతర్జాతీయ జల రవాణా
అంతర్జాతీయ నౌక రవాణా మరియు తీర నౌక రవాణా అని, ఓవర్సీస్ షిప్పింగ్ అని విభజించటం జరిగింది. దేశీయ జల రవాణాను నదుల మీద, కాలువల మీద కొనసాగించవచ్చు.

ప్రశ్న 5.
విమానయానం.
జవాబు:
ఆర్థికాభివృద్ధిలో ఈ వ్యవస్థ అత్యంత కీలకమైనది. విమానయానం ఖరీదైనప్పటికి కాలాన్ని ఆదా చేయవచ్చు. దూర ప్రాంతాల ప్రయాణానికి ఇది ఉపకరిస్తుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు దేశంలో 125 విమానయాన సేవలు అందిస్తున్నారు.

ప్రశ్న 6.
పర్యాటకం. [Mar ’17, ’16]
జవాబు:
పర్యాటకం తృతీయ రంగంలో ఒక ఉప విభాగం. దీనిని “అదృశ్య వాణిజ్యం” అని “ధూమరహిత పరిశ్రమ” అని అంటారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం “విశ్రాంతి కోసంగాని, వ్యాపారం నిమిత్తంగాని, ఇతర ప్రయోజనాలకోసం గాని ప్రజలు వారి సాధారణ పరిసరాల నుంచి దూరంగా, వరుసగా ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం ప్రయాణిస్తూ ఒక స్థలంలో నిలిచి ఉండే వారి కార్యకలాపాలనే పర్యాటకం” అంటారు.

ప్రశ్న 7.
జీవిత భీమా సంస్థ (LIC).
జవాబు:
దీనిని 1956 సం॥లో స్థాపించిరి. ఇది ప్రజల నుండి చిన్న చిన్న పొదుపు మొత్తాలను సేకరించి నిర్మాణాత్మక కార్యక్రమాలలో ఉపయోగిస్తుంది. ఇది ప్రత్యేకంగా వ్యక్తుల జీవితానికి భద్రత కల్పించును అనుకోని సంఘటనల వల్ల వ్యక్తి ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు నిర్ణీత మొత్తంలో భీమా సంస్థ నష్టపరిహారం అందచేయును. వివిధ పాలసీల ద్వారా, స్కీముల ద్వారా భీమా సంస్థ వినియోగదార్లకు సౌకర్యాలు కల్గిస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

ప్రశ్న 8.
సాధారణ భీమా సంస్థ (GIC).
జవాబు:
దీనిని కేంద్ర ప్రభుత్వం 1972 సం॥లో స్థాపించిరి. జాతీయం చేసిన తరువాత 107 సాధారణ భీమా కంపెనీలన్నింటిని కలిపి నాలుగు కంపెనీలుగా విభజించారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఆస్తినష్టం మొదలైన నష్టభయాల భద్రతకు సంబంధించినది సాధారణ భీమా. సాధారణ భీమా కంపెనీ మోటారు వాహనాలు, జలరవాణా మరియు అగ్ని ప్రమాదాలు అనే మూడు రకలైన వ్యాపారాలు చేస్తోంది.

ప్రశ్న 9.
సూక్ష్మ భీమా.
జవాబు:
సూక్ష్మ విత్త విధానంలో ఇది అంతర్భాగం. ప్రజలకు విస్తృతమైన, పరిపూరకమైన సేవలను అందించడానికి, రవాణాతో పాటు పొదుపును పెంపొందించే పథకానికి అనుగుణంగా సూక్ష్మ భీమా విధానం అమల్లోకి వచ్చింది. చాలా తక్కువ ప్రీమియంతో ఈ భీమా సౌకర్యాన్ని వాడుకోవచ్చు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు, రైతులకు, చిన్న వ్యాపారులకు, షెడ్యూల్డు తెగల వారికి సూక్ష్మ భీమా పథకం వర్తించును.

ప్రశ్న 10.
సమాచార వ్యవస్థ.
జవాబు:
ఇది అర్థికాభివృద్ధిలో ఒక అంతర్భాగం. మార్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని, వస్తుసేవల వివరాలను అందిస్తూ కొనుగోలుదారులను, అమ్మకందారులను దగ్గరకు చేరుస్తుంది. సమాచారం తపాలా సేవలు, టెలీకమ్యూనికేషన్లు, ప్రసార సాధనాలు, టెలివిజన్లు, ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవల ద్వారా ప్రసారమవుతుంది.

ప్రశ్న 11.
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం.
జవాబు:
ఆర్థికాభివృద్ధిని సాధించడానికి తోడ్పడే సాధానాల్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాల సేవలు అత్యంత అవసరమైనవి. విజ్ఞానం పెరుగుదల శాస్త్రమైతే, యంత్రపరికరాల ఆధునీకరణ సాంకేతిక పరిజ్ఞానం అవుతుంది. ఆర్థికాభివృద్ధి సాధించాలంటే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను వ్యవసాయ, రవాణా, ఆర్థిక, ఆర్థికేతర రవాణాలకు విస్తరించాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 6 తృతీయ రంగం

ప్రశ్న 12.
సాఫ్ట్వేర్ పరిశ్రమ ప్రగతి.
జవాబు:
ఈ పరిశ్రమ 1960 సం॥లో ప్రారంభమైనది మనదేశంలో సమాచార సాంకేతిక విజ్ఞాన రంగానికి చెందిన అతి ముఖ్యమైన రంగాల్లో సాఫ్ట్వేర్ పరిశ్రమ ఒకటి. 2012 13 అంచనాల ప్రకారం ఈ పరిశ్రమ మనదేశ స్థూల జాతీయోత్పత్తి 14.1 % అదాయం సమకూర్చింది. 2013 – 14లో 3.1 మిలియను మందికి ఉపాధి కల్పించింది. 2011 – 12లో మనదేశం నుంచి 69 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ గల సాఫ్ట్వేర్ ఎగుమతులు జరిగాయి.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Physics Study Material 6th Lesson ప్రవాహ విద్యుత్తు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Physics Study Material 6th Lesson ప్రవాహ విద్యుత్తు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వాహకంలో ఎలక్ట్రాన్ స్వేచ్ఛా పథమాధ్యమాన్ని నిర్వచించండి.
జవాబు:
ఒక వాహకంలో, ఒక ఎలక్ట్రాన్ రెండు వరుస అభిఘాతాల మధ్య ప్రయాణించిన సరాసరి దూరంను వాహకంలో ఎలక్ట్రాన్ సరాసరి స్వేచ్ఛాపథ మాధ్యమము అంటారు.

ప్రశ్న 2.
ఓమ్ నియమాన్ని తెలిపి, దాని గణిత రూపం రాయండి.
జవాబు:
ఓమ్ నియమము :
స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకంలో విద్యుత్ ప్రవాహసత్వం (1), దాని రెండు చివరల పొటెన్షియల్ తేడా (V) కు అనులోమానుపాతంలో ఉండును.
∴ I ∝ V ⇒ I = \(\frac{V}{R}\) ⇒ V = IR (గణితరూపం)
ఇక్కడ R ఒక స్థిరాంకం. దీనినే వాహకం నిరోధం అంటారు.

ప్రశ్న 3.
నిరోధకత లేదా విశిష్ట నిరోధంను నిర్వచించండి.
జవాబు:
నిరోధకత లేక విశిష్ట నిరోధం :
ప్రమాణ పొడవు మరియు ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యం గల వాహకం నిరోధంను నిరోధకత అంటారు.
l = 1, A = 1 ⇒ ρ = \(\frac{R\times1}{1}\) ⇒ ρ =R

ప్రశ్న 4.
ఉష్ణోగ్రత నిరోధ గుణకంను నిర్వచించండి.
జవాబు:
ఉష్ణోగ్రత నిరోధ గుణకం :
ప్రమాణ ఉష్ణోగ్రత పెరుగుదలకు నిరోధకతలోని మార్పుకు, 0°C వద్ద నిరోధకంనకు గల నిష్పత్తిని ఉష్ణోగ్రత నిరోధ గుణకం అంటారు.
α = \(\frac{\mathrm{R}_{\mathrm{t}}-\mathrm{R}_0}{\mathrm{R}_0 \mathrm{t}}\)

ప్రశ్న 5.
ఘటాల మిశ్రిత సంధానం ద్వారా ప్రవహించే విద్యుత్ ఏ సందర్భాల్లో గరిష్ఠంగా ఉంటుంది ?
జవాబు:

  1. అన్ని ఘటాల ప్రభావ వి.చా.బ గరిష్ఠం అయిన
  2. బాహ్య నిరోధం, అన్ని ఘటాల అంతర నిరోధాల మొత్తమునకు సమానమయినప్పుడు, ఘటాల మిశ్రమ గ్రూపింగ్ విద్యుత్ ప్రవాహం గరిష్ఠం.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 6.
ఒక తీగను దాని ద్రవ్యరాశిలో మార్పు లేకుండా తొలి పొడవు రెట్టింపు అయ్యేట్లు సాగదీస్తే, తీగ నిరోధకత ఎలా ప్రభావితం అవుతుంది?
జవాబు:
ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా, ఒక పదార్థం పరిమాణంలో మార్పు లేకుండా, తీగ నిరోధకత్వం మారదు.

ప్రశ్న 7.
ప్రామాణిక నిరోధకాల తయారీలో మాంగనీన్ను ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
మాంగనీన్ (Cu-84% + Mn – 12% + Ni – 4%) తీగ హెచ్చు నిరోధకత్వం (ρ) మరియు అల్ప ఉష్ణోగ్రత నిరోధ గుణకంను కల్గి ఉండుట వల్ల ప్రమాణ నిరోధాలలో వాడతారు.

ప్రశ్న 8.
కార్బన్ నిరోధకంపై గుర్తించిన రంగుల పట్టీల క్రమం: ఎరుపు, ఎరుపు, ఎరుపు, వెండి, అయితే దాని నిరోధం, సహనం ఎంత?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 1
ఎరుపు, ఎరుపు, ఎరుపు గుర్తులతో మార్కు చేయబడిన కార్బన్ నిరోధం = 22 × 10² = 2.2kΩ = 2200Ω
[∵ ఎరుపు క్రమ సంఖ్య = 2 మరియు లబ్ద కారకం = 10²]
కార్బన్ నిరోధకము టోలరెన్స్ = 10²

ప్రశ్న 9.
23 కిలో ఓమ్ల నిరోధం గల కార్బన్ నిరోధకం రంగుల కోడ్ను రాయండి.
జవాబు:
23 కిలో ఓమ్స్ (= 23 × 10³Ω) కార్బన్ నిరోధకం కలర్ కోడ్ వరుసగా ఎరుపు, నారింజ, నారింజ.
[∵ ఎరుపుకు క్రమసంఖ్య 2, నారింజకు 3, నారింజ లబ్ది కారకం 10³]

ప్రశ్న 10.
ఒక వాహకం చివరల మధ్య అనువర్తించిన వోల్టేజిని Vనుంచి 20కి పెంచితే, ఎలక్ట్రాన్ల డ్రిఫ్ట్ వేగం ఎలా మారుతుంది?
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 2
∴ డ్రిఫ్ట్ వేగం రెండు రెట్లు పెరుగును.

ప్రశ్న 11.
సమాన పొడవులు గల రాగి, మాంగనీస్ తీగలు సమాన నిరోధాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో ఏది మందమైంది?
జవాబు:
R = \(\frac{\rho \mathrm{A}}{l}\) ⇒ A = \(\frac{Rl}{\rho}\)
ρరాగి < ρమాంగనీస్ కావున రాగితీగ, మాంగనీన్ తీగకన్నా మందమైంది.

ప్రశ్న 12.
గృహ ఉపకరణాలను ఎందుకు సమాంతరంగా కలుపుతారు?
జవాబు:
గృహోపకరణ తీగలను సమాంతరంగా కలిపితే, ప్రతి దానిపై వోల్టేజి సమానం. వాని గుండా ప్రవహించి విద్యుత్ (1) గృహోపకరణ సామర్థ్యంపై ఆధారపడును. హెచ్చు సామర్థ్య గృహోపకరణం ఎక్కువ విద్యుత్ను తీసుకొనును. తక్కువ సామర్థ్య గృహోపకరణం తక్కువ విద్యుత్ను తీసుకొనును.
(∵ P = VI or I ∝ P)

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 13.
లోహాలలో ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ వడి తక్కువ (~ms-1), ఎలక్ట్రాన్ ఆవేశం కూడా చాలా తక్కువ (~10-19C), అయినప్పటికీ లోహంతో అధిక పరిమాణంలో విద్యుత్ ప్రవాహాన్ని మనం పొందగలుగుతున్నాం. ఎందుకు?
జవాబు:
లోహం గుండా విద్యుత్ ప్రవాహం, I = n A eVd.

Aలోహ మధ్యచ్ఛేద వైశాల్యం. ఎలక్ట్రాన్ అవసర వడి Vd(~105ms-1) జన్వల్పము. ఎలక్ట్రాన్ ఆవేశం e(~1.6 × 10-19C) కూడా చాలా స్వల్పము. వాహకంలో చాలా స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు (~ 1029 m-3) ఉండుట వల్ల, వాహకంలో ఎక్కువ పరిమాణం ఉన్న విద్యుత్ ప్రవాహంను ఇంకను పొందుతాము.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
10V emf, 3Ω అంతర్నిరోధం గల ఒక బాటరీని R నిరోధానికి సంధానం చేశారు.
i) వలయంలో విద్యుత్ ప్రవాహం 0.5 A అయితే, R విలువను లెక్కించండి.
ii) వలయం మూసి ఉంటే బాటరీ టెర్మినల్ వోల్టేజి ఎంత ?
జవాబు:
ఇచ్చినవి E 10 V, r = 3Ω, I = 0.5 A, R = ?, V = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 3
i) E = I (R + r)
లేక R + r = \(\frac{E}{I}=\frac{10}{0.5}\) = 20Ω
⇒ R = 20 – 3 = 17Ω

ii) టెర్మినల్ వోల్టేజి, V = IR
= 0.5 × 17 = 8.5Ω

ప్రశ్న 2.
ఒక ఘటం అంతర్నిరోధం తెలుసుకోవడానికి పొటెన్షియోమీటర్ ఎలా ఉపయోగపడుతుందో తెలిపే వలయం రేఖా చిత్రాన్ని గీయండి. దానికి సూత్రాన్ని రాబట్టండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 4
పొటెన్షియోమీటర్తో అంతర్నిరోధం (r) ను కొలుచుట :
1) అంతర్నిరోధం కొలుచు పొటెన్షియోమీటర్ పటంలో చూపబడింది.
2) ఘటం(వి. చా. బ.) అంతర్నిరోధం (r)ను నిర్ణయించుటకు కీ K2 ద్వారా నిరోధాల పెట్టె సంధానం చేయబడి ఉంటుంది.
3) కీ K తెరిచి, సంతులన పొడవు l1 (AN1) పొందుతాము.
అప్పుడు ε = Φ l1 …………… (1)
4) కీ K2 ను మూస్తే నిరోధాల పెట్టె (R.B) ద్వారా, ఘటం నుండి విద్యుత్ ప్రవాహం I ప్రవహింపచేస్తుంది.
5) ఘటం, టెర్మినల్ పొటెన్షియల్ తేడా (V) అయినపుడు, సంతులన పొడవు I2(AN2) ను పొందితే అప్పుడు
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 5

ప్రశ్న 3.
మూడు నిరోధకాలను (i) శ్రేణి, (ii) సమాంతరంగా కలిపినప్పుడు ప్రభావాత్మక నిరోధానికి సమీకరణాన్ని ఉత్పాదించండి.
జవాబు:
i) మూడు నిరోధకాలను శ్రేణిలో కలిపినప్పుడు ప్రభావ నిరోధం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 6

  1. మూడు నిరోధకములు R1, R2 మరియు R3 లు శ్రేణిలో పటంలో చూపినట్లు కలుపబడినవి. R1, R2 మరియు R3ల వెంట పొటెన్షియల్ తేడాలు V1, V2 మరియు V3. వాని గుండా ప్రవహించు విద్యుత్ I.
  2. R1, R2 మరియు R3 లకు ఓమ్ నియమము అనువర్తిస్తే,
    అప్పుడు V1 = IR1, V2 = IR2, V3 = IR3
  3. ఈ శ్రేణిలో, V = V1 + V2 + V3
    IRs = IR1 + IR2 + IR3 [∵ V = IRs]
    ∴ Rs = R1 + R2 + R3

ii) మూడు నిరోధాలను సమాంతరంగా కలిపినపుడు ప్రభావ నిరోధం :
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 7

1. మూడు నిరోధకములు R1, R2 మరియు R3 లు సమాంతరంగా పటంలో చూపినట్లు కలుపబడినవి. ప్రతి నిరోధకము వెంట పొటెన్షియల్ తేడా V. వాని గుండా ప్రవహించు విద్యుత్లు I1, I2 మరియు I3.

2. R1, R2 మరియు R3 లకు ఓమ్ నియమము అనువర్తిస్తే, అప్పుడు V = I1R1 = I2R2 = I3R3
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 8

ప్రశ్న 4.
ఒక్కొక్కటి E emf, r అంతర్నిరోధం గల m ఘటాలను సమాంతరంగా సంధానం చేశారు. మొత్తం emf, అంతర్నిరోధం ఎంత ? ఘటాల మిశ్రిత సంధానం ద్వారా ఏ సందర్భాలలో విద్యుత్ ప్రవాహం గరిష్టంగా ఉంటుంది?
జవాబు:
ఘటాలను సమాంతరంగా కలిపినప్పుడు :
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 10
1) అంతర్నిరోధం r, వి.చా.బ. ౬ ఉన్న ఒకే రకమైన m ఘటాలను, బాహ్య నిరోధం R కు సమాంతరంగా పటంలో చూపినట్లు కలిపి ఉన్నాయని భావిద్దాం.

2) ఘటాలు సమాంతరంగా కలుపబడి ఉన్నాయి కావున వాని ప్రభావ అంతర్నిరోధం ను క్రింది సమీకరణం ఇస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 9

3) Rమరియు r లు శ్రేణిలో ఉన్నాయి. వలయంలో మొత్తం
నిరోధం = R + \(\frac{r}{m}\)

4) ఒకే రకమైన ఘటాల సమాంతర సంయోగంలో, వలయంలో ప్రభావ వి.చా. బ. ఒకే ఒక వి.చా. బకు సమానము. ఎందువలన అనగా, ఈ సంయోగంలో ఎలక్ట్రోడుల పరిమాణం మాత్రమే పెరుగును. కాని వి. చా. బ. పెరగదు.

5) ∴ నిరోధంలో విద్యుత్ R = \(\frac{\varepsilon}{\mathrm{R}+\frac{\mathrm{r}}{\mathrm{m}}}=\frac{\mathrm{m} \varepsilon}{\mathrm{mR}+\mathrm{r}}\)

6) బాహ్య నిరోధం, అంతర్నిరోధంతో పోల్చినపుడు విస్మరించ దగిన విలువ కలిగి ఉంటే (R<<r) ఘటాల మిశ్రమ గ్రూపింగులో తీసుకొను విద్యుత్ గరిష్ఠము.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 5.
విద్యుత్ నిరోధాన్ని నిర్వచించండి. దాని SI ప్రమాణం రాయండి. కింది సందర్భాలలో వాహక నిరోధం ఎలా మారుతుందో తెల్చండి.
a) వాహకాన్ని దాని పొడవుకు 4 రెట్లు అయ్యేటట్లు సాగదీస్తే,
b) వాహక ఉష్ణోగ్రతను పెంచితే
జవాబు:
విద్యుత్ నిరోధం (R) :
వాహకంలో ఎలక్ట్రాన్ల ప్రవాహంను నిరోధించు ధర్మంను విద్యుత్ నిరోధం అంటారు. నిరోధం SI ప్రమాణం ఓమ్ (Ω).
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 11

b) ఉష్ణోగ్రతతో నిరోధంలో మార్పు Rt = R0 (1 + α t)
ఉష్ణోగ్రత పెరిగిన, నిరోధం కూడా పెరుగును.

ప్రశ్న 6.
ఘటానికి శ్రేణిలో కలిపిన నిరోధం సగం అయితే, విద్యుత్ ప్రవాహం రెట్టింపు లేదా రెట్టింపు విలువకు స్వల్పంగా తక్కువ లేదా రెట్టింపు విలువకు స్వల్పంగా ఎక్కువ అవుతుంది. ఎందుకు?
జవాబు:
నిరోధం R ను E వి.చా.బ ఉన్న ఘటంనకు శ్రేణిలో కల్పితే,
విద్యుత్ I = \(\frac{\varepsilon}{R+r}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 12
ii) r << \(\frac{R}{2}\) అయితే, విద్యుత్ I’ స్వల్పంగా 2 కన్నా ఎక్కువ.
iii) r, R కన్నా స్వల్పంగా ఎక్కువగా ఉంటే, విద్యుత్ (1) స్వల్పంగా 2 కన్నా తక్కువ.

ప్రశ్న 7.
రెండు ఘటాల emfలు, అంతర్నిరోధాలు వరుసగా 4.5V, 6.0V, 6Ω, 3Ω . ఈ ఘటాల రుణ టెర్మినల్స్న 18Ω నిరోధం గల తీగతో ధన టెర్మినలు నన్ను 12Ω నిరోధం గల తీగతో కలిపారు. ఈ తీగల మధ్య బిందువులను 24Ω నిరోధం గల మూడవ తీగ సంధానం చేస్తుంది. కిర్కాఫ్ నియమాలను ఉపయోగించి మూడవ తీగ కొనల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కనుక్కోండి.
జవాబు:
1) నెట్వర్క్ వేర్వేరు భుజాల గుండా విద్యుత్ ప్రవాహాలను పటంలో చూపినట్లు భావిద్దాం.
2) ABCDA సంవృత వలయంనకు కిర్కాఫ్ వోల్టేజి. నియమాన్ని అనువర్తిస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 13

ప్రశ్న 8.
10Ω నిరోధం గల మూడు నిరోధకాలను (i) కనిష్ట నిరోధం, (ii) గరిష్ట నిరోధం వచ్చేటట్లు సంధానం చేశారు. (a) ప్రతీ సందర్భంలో ప్రభావాత్మక నిరోధం, (b) ఆ విధంగా పొందిన కనిష్ఠ, గరిష్ఠ నిరోధాల నిష్పత్తిని గణించండి.
జవాబు:
ప్రతి నిరోధకము యొక్క నిరోధం R = 10Ω
నిరోధకముల సంఖ్య, n = 3

i) మూడు నిరోధకములను సమాంతరంగా కలిపితే, కనిష్ఠ నిరోధం పొందుతాము.
∴ కనిష్ట నిరోధం Rకనిష్ట Rp = \(\frac{R}{n}=\frac{10}{3}\)Ω = 3.33Ω
ii) మూడు నిరోధకములను శ్రేణిలో కలిపితే, గరిష్ట నిరోధం పొందుతాము.
∴ గరిష్ట నిరోధం Rగరిష్ట = Rs = nR = 3 × 10 = 30Ω

a) కనిష్ట నిరోధం పొందటానికి ప్రభావ నిరోధం,
Rప్రభావ = \(\frac{R}{n}=\frac{10}{3}\) = 3.33Ω (సమాంతరంగా).
గరిష్ట నిరోధం పొందటానికి ప్రభావ నిరోధం,
Rప్రభావ = nR = 3 × 10 = 30Ω (శ్రేణిలో)
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 14

ప్రశ్న 9.
ఒక విద్యుత్ జాలానికి కిర్కాఫ్ నియమాలను తెలపండి. ఈ నియమాలను ఉపయోగించి వీటన్ బ్రిడ్జికి సంతులన నిబంధనను రాబట్టండి. [TS. Mar. 16; Mar. ’14]
జవాబు:
1) కిర్కాఫ్ మొదటి నియమము (సంధి నియమము లేక KCL) :
ఏదైనా సంధి వద్ద విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తం శూన్యం.
∴ ∑I = 0 (లేక)

సంధి వద్దకు చేరు విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తము, సంధి నుండి దూరంగా పోవు విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తమునకు సమానము.

2) కిర్కాఫ్ రెండవ నియమము (సంవృత నియమము లేక KVL) :
ఏదైనా సంవృత వలయం వెంబడి పొటెన్షియల్ల బీజీయ మొత్తం శూన్యం.
∴ ∑(IR) + ∑E = 0

వీటన్ బ్రిడ్జి :
వీటన్ బ్రిడ్జి వలయం R1, R2, R3 మరియు R4 నిరోధాలు పటములో చూపినట్లు కలుపబడి ఉంటాయి. A మరియు C ల మధ్య ε వి. చా. బ ఉన్న ఘటం, B మరియు D ల మధ్య ఒక గాల్వనామీటర్ పటంలో చూపినట్లు కలుపబడి ఉంటాయి. వేర్వేరు భుజాలలో విద్యుత్ ప్రవాహాలు I1, I2, I3 మరియు I4. గాల్వనా మీటర్ Gలో విద్యుత్ ప్రవాహము Ig.
కిర్కాఫ్ మొదటి నియమం ప్రకారం
D సంధి వద్ద I1 – I3 – Ig = 0 …………. (1)
B సంధి వద్ద I2 + Ig – I4 = 0 …………… (2)

కిర్కా రెండవ నియమమును ADBA సంవృత వలయముకు అనువర్తిస్తే,
-I1R1 – IgG + I2R2 = 0 లేక
⇒ I1R1 + IgG = I2R2 ………… (3)

కిర్కాఫ్ రెండవ నియమమును BCBD సంవృత G వలయంకు అనువర్తిస్తే,
-I3R3 + I4R4 + IgG = 0
⇒ I3R3 – IgG = I4R4 ……….. (4)

గాల్వనా మాపకం శూన్య అపవర్తనంను చూపితే, బిందువులు D మరియు B లు ఒకే పొటెన్షియల్ చూపును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 15
Ig = 0.
ఈ విలువను (1), (2), (3) మరియు (4)లలో ప్రతిక్షేపించగా
I1 = I3 ……….. (5)
I2 = I4 ……….. (6)
I1R1 = I2R2 ……….. (7)
I3R3 = I4R4 ……….. (8)

సమీకరణం (7) ను (8) చే భాగించగా
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 16

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 10.
పొటెన్షియోమీటర్ పనిచేసే సూత్రాన్ని తెలపండి. పొటెన్షియోమీటర్ను ఉపయోగించి రెండు ప్రాథమిక ఘటాల emf లను ఎలా పోలుస్తారో వలయం రేఖా చిత్రం సహాయంతో వివరించండి. [AP. Mar: ’17; AP. Mar ’16]
జవాబు:
పొటెన్షియోమీటర్ పనిచేయు సూత్రము : పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా, తీగ పొడవుకు | అనులోమానుపాతంలో ఉండును. (లేక) ఏకరీతి తీగ గుండా నిలకడ విద్యుత్ ప్రవహిస్తే, ప్రమాణ పొడవుకు పొటెన్షియల్ తగ్గుదల లేక పొటెన్షియల్ నతిక్రమము స్థిరము.
i.s.ε ∝ l
⇒ ε = Φl. ఇక్కడ Φ పొటెన్షియల్ నతిక్రమము.

రెండు ఘటాల వి.చా.బ. లు ε1 మరియు ε1 లను పోల్చుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 17

  1. పొటెన్షియోమీటర్తో పోల్చవలసిన రెండు ఘటాల విచాబ E1 మరియు E2 లు పటంలో చూపబడినవి.
  2. 1, 2, 3 బిందువుల గుర్తులు ఒక ద్విమార్గ కీను తెల్పును.
  3. కీ మొదటి స్థానంలో 1, 3 లు గాల్వనామాపకం ద్వారా ఘటం ε1 కి కలుపబడినవి.
  4. జాకీని తీగవెంట A నుండి N1 కు జరిపిన, గాల్వనా మీటర్
    అపవర్తనం సున్న. సంతులన పొడవు AN1 = l1.
    అప్పుడు ε1 ∝ l1 ⇒ ε1 = Φl1 …………… (1)
  5. ఇదే విధంగా మరొక ఘటం ε2, సంతులన పొడవు AN2 = l2.
    అప్పుడు ε2 ∝ l2 ⇒ ε2 = Φl2 …………… (2)
  6. \(\frac{\text { (1) }}{(2)} \Rightarrow \frac{\varepsilon_1}{\varepsilon_2}=\frac{l_1}{l_2}\)

ప్రశ్న 11.
పొటెన్షియోమీటర్ పనిచేసే సూత్రాన్ని తెలపండి. పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం అంతర్నిరోధాన్ని ఎలా కనుక్కోవచ్చో వలయం రేఖా చిత్రం సహాయంతో వివరించండి. [TS. Mar. 17; AP & TS. Mar. 15]
జవాబు:
పొటెన్షియోమీటర్ పనిచేయు సూత్రము :
పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా, తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉండును. (లేక) ఏకరీతి తీగ గుండా నిలకడ విద్యుత్ ప్రవహిస్తే, ప్రమాణ పొడవుకు పొటెన్షియల్ తగ్గుదల లేక పొటెన్షియల్ నతిక్రమము స్థిరము.
i.e. ε ∝ l ⇒ ε = Φl ఇక్కడ పొటెన్షియల్ నతిక్రమము.

పొటెన్షియోమీటర్తో అంతర్నిరోధం (r) ను కొలుచుట :
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 18
1) అంతర్నిరోధం కొలుచు పొటెన్షియోమీటర్ పటంలో చూపబడింది.

2) ఘటం (వి.చా.బ. E) అంతర్నిరోధం (r) ను నిర్ణయించుటకు కీ K ద్వారా నిరోధాల పెట్టె సంధానం చేయబడి ఉంటుంది.

3) కీ K2 తెరిచి, సంతులన పొడవు I1 (AN1) పొందుతాము.
అప్పుడు ε = Φ l1 ………… (1)

4) కీ K ను మూస్తే నిరోధాల పెట్టె (R.B) ద్వారా, ఘటం నుండి విద్యుత్ ప్రవాహం I ప్రవహింపచేస్తుంది.

5) ఘటం, టెర్మినల్ పొటెన్షియల్ తేడా (V) అయినపుడు, సంతులన పొడవు I2(AN2) ను పొందితే అప్పుడు
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 19
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 20

ప్రశ్న 12.
GaAs కు అనువర్తించిన వోల్టేజి, విద్యుత్ ప్రవాహానికి గ్రాఫ్ను చూపండి. గ్రాఫ్లో (i) రేఖీయంగా లేని ప్రాంతం, (ii) ఋణాత్మక నిరోధ ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:
V మరియు I ల మధ్య సంబంధం ఒకే విధంగా ఉండదు. ఒకే విద్యుత్ ప్రవాహం కు ఒకదాని కన్నా ఎక్కువ V విలువలు ఉండును. ఇటువంటి పదార్థ స్వభావంను GaAs (i.e., ఒక కాంతి ఉద్గార్గి డయోడ్) చూపును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 21

ప్రశ్న 13.
ఒక విద్యార్థి దగ్గర సమానమైన పొడవు, వ్యాసాలు గల ఇనుము, రాగి రెండు తీగలు కలవు. అతడు ఆ రెండు తీగలను మొదట శ్రేణిలో కలిపి ఆ సంధానం ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని క్రమేపీ పెంచాడు. ఆ తరువాత ఆ రెండు తీగలను సమాంతరంగా కలిపి పై విధంగా ప్రవాహాన్ని పంపడాన్ని పునరావృతం చేశాడు. ప్రతీ సందర్భంలోను ఏ తీగ మొదట వెలుగును ఇస్తుంది?
జవాబు:
1) శ్రేణి సంధానంలో, ఇనుము మరియు రాగితీగ గుండా ఒకే విద్యుత్ ప్రవహించును. ఉష్ణ ఉత్పత్తి రేటు, P ∝ I² R లేక P ∝ R. (∵ I = స్థిరం). ఒకే పొడవు, ఒకే వ్యాసము ఉన్న తీగలలో, ఇనుము తీగ నిరోధము, రాగి తీగ కన్నా ఎక్కువగా ఉండును. కావున ఇనుము తీగలో, ఉష్ణ ఉత్పత్తి రేటు క్రమముగా పెరుగును. శ్రేణి సంధానములో ఇనుము మొదట వెలుగును.

2) ఇనుము మరియు రాగి తీగల సమాంతర సంధానంలో, వాని వెంట ఒకే పొటెన్షియల్ తేడా (V) ఉండును. ఉష్ణ ఉత్పత్తి రేటు, P = \(\frac{V^2}{R}\) లేక P ∝ \(\frac{1}{R}\) (∵ V = స్థిరం), ఒకే పొడవు, ఒకే వ్యాసము ఉన్న తీగలలో, ఇనుము తీగ నిరోధం, రాగి, తీగకన్నా ఎక్కువగా ఉండును. కావున. రాగితీగలో, ఉష్ణ ఉత్పత్తి రేటు ఎక్కువ. సమాంతర సంధానంలో రాగితీగ మొదట వెలుగును.

ప్రశ్న 14.
సర్వ సమమైన మూడు నిరోధకాలను సమాంతరంగా కలిపినప్పుడు వలయం మొత్తం నిరోధం R/3. ప్రతీ నిరోధం విలువను కనుక్కోండి.
జవాబు:
మూడు నిరోధాలు ఒకే విధంగా ఉండును.
కావున R1 = R2 = R3 = X (అనుకుందాము)
సమాంతర సంధానంలో మొత్తం నిరోధం, Rp = \(\frac{R}{3}\)
మూడు ఒకే విధమైన నిరోధాలు సమాంతరంగా కలుపబడితే, అప్పుడు
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 22

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక విద్యుత్ వలయంలో ఉత్పత్తి అయిన ఉష్ణం ఏ పరిస్థితుల్లో ఆ వలయం నిరోధానికి a) అనులోమానుపాతంలో,b) విలోమానుపాతంలో ఉంటుంది ? ఈ రెండు సందర్భాల్లో ఉత్పత్తి అయిన ఉష్ణ పరిమాణాల నిష్పత్తిని గణించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 23
జవాబు:
విద్యుత్ ప్రవాహం వల్ల ఉష్ణ ఉత్పత్తికి సమాసము :
నిరోధం ఉన్న వాహకం AB ను భావిద్దాం.
AB వెంట ప్రయోగించిన పొటెన్షియల్ తేడా = V
AB గుండా పోవు విద్యుత్ = I
విద్యుత్ ప్రవహించిన కాలం = t

∴ t కాలంలో A నుండి B కు ప్రవహించిన మొత్తం ఆవేశం q = It.

పొటెన్షియల్ తేడా నిర్వచనం ప్రకారం, A నుండి B కు ప్రమాణ ఆవేశంను తీసుకొని పోవటానికి జరిగిన పని = V.
A నుండి B కు “q” ఆవేశంను తీసుకుపోవుటలో జరిగిన పని
W = V × q = VIt = I²Rt (∵ V = IR)
ఈ జరిగిన పనిని, విద్యుత్ జరిగిన పని అంటారు. ఈ విద్యుత్ జరిగిన పని ఉష్ణరూపంలో వెలువడును. వెలువడిన ఉష్ణ ఉత్పత్తి
H = W = I²Rt’ జౌల్
ఇదియే జౌల్స్ ఉష్ణ నియమ నిర్వచనం.
a) విద్యుత్ వలయంలో ప్రవహించిన ఉష్ణం వెలువడును.
i.e., H1 ∝ R

b) ఒకే పొటెన్షియల్ తేడాను, విద్యుత్ వలయం వెంట ప్రయోగిస్తే, ఉష్ణం వెలువడును.
i. e., H2 ∝ \(\frac{1}{R}\)
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 24

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 2.
A, B అనే రెండు లోహపు తీగలను సమాంతరంగా సంధానం చేశారు. A అనే తీగ L పొడవు, వ్యాసార్థాన్ని కలిగి ఉంటే, B తీగ 2L పొడవు, 2. వ్యాసార్థాన్ని కలిగి ఉంది. సమాంతర సంధానం మొత్తం నిరోధానికి A తీగ నిరోధానికి గల నిష్పత్తిని గణించండి.
జవాబు:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 25
2) A మరియు B తీగల సమాంతర సంధానంలో, మొత్తం నిరోధం.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 26
4) సమాంతర సంధానంలో మొత్తం నిరోధంనకు తీగ నిరోధం A కు గల నిష్పత్తి
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 27

ప్రశ్న 3.
ఒక ఇంట్లో ఒక్కొక్కటి 100 W రేటింగ్ ఉన్న 3 విద్యుత్ బల్బులు రోజుకు 4 గంటలు వెలుగుతున్నాయి. అలాగే 20W రేటింగ్ ఉన్న ఆరు ట్యూబ్లెట్లు రోజుకు 5 గంటలు వెలుగుతున్నాయి. 400 W రిఫ్రిజిరేటర్ రోజుకు 10 గంటలు చొప్పున వినియోగిస్తే నెలకు 30 రోజుల చొప్పున ఒక యూనిట్కు రూ.4.00 వంతున విద్యుత్ బిల్లును లెక్కించండి.
జవాబు:
ఒక ఇంట్లో ఉన్న బల్బుల సంఖ్య, N = 3
ప్రతి బల్బుపై సామర్థ్య రేటు, P = 100 W
వెలిగించిన కాలం, t = 4 గం||లు
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 28
1 యూనిట్ ఖరీదు = రూ.4.00/-
174 యూనిట్ల ఖరీదు = యూనిట్ల సంఖ్య X ఒక యూనిట్ ఖర్చు = 174 × 4 = రూ.696/-
ఆ ఇంటికి ఒక నెలకు విద్యుత్ బిల్లు = రూ. 696/–.

ప్రశ్న 4.
4 ఓమ్లు, 6 ఓమ్లు, 12 ఓమ్లు గల మూడు నిరోధకాలను సమాంతరంగా సంధానం చేశారు. ఈ నిరోధకాల శ్రేణి సంయోగాన్ని 2 ఓమ్ల నిరోధానికి, 6Vల బ్యాటరీకి శ్రేణిలో సంధానం చేశారు. వలయం రేఖాచిత్రాన్ని గీసి, కింది మూడు సందర్భాలలోని విలువలను లెక్కించండి.
a) ప్రధాన వలయంలోని విద్యుత్ ప్రవాహం
b) సమాంతర సంధానంలో ప్రతీ నిరోధకం ద్వారా ప్రవహించే విద్యుత్.
c) 2 ఓమ్ల నిరోధకం ఉపయోగించిన పొటెన్షియల్ భేదం, సామర్థ్యం.
జవాబు:
ఇచ్చిన దత్తాంశమునకు వలయ పటం క్రింద ఇవ్వబడింది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 29
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 30

ప్రశ్న 5.
220 V వద్ద 100 W, 220 V వద్ద 60 W రేటింగ్లు గల రెండు బల్బులను 220 V సరఫరాకు సమాంతరంగా కలిపారు. సరఫరా తీగల నుంచి ఎంత విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుంటుంది?
జవాబు:
దత్తాంశము
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 31

ప్రశ్న 6.
3.0 × 10-7 m² మధ్యచ్ఛేద వైశాల్యం, 5 A విద్యుత్ ప్రవహిస్తున్న రాగి తీగలోని వహన ఎలక్ట్రాన్ల సరాసరి డ్రిఫ్ట్ వడిని అంచనా వేయండి. ప్రతీ రాగి పరమాణువు ఒక వహన ఎలక్ట్రాను సమకూరుస్తుంది అని భావించండి. రాగి సాంద్రత 9.0 × 10³ kg/m³, దాని పరమాణు ద్రవ్యరాశి 63.5u.
జవాబు:
రాగితీగ మధ్యచ్ఛేద వైశాల్యం A = 3 × 10-7 m² రాగి తీగ ద్వారా విద్యుత్, I = 5 A
ఎలక్ట్రాన్ ఆవేశం, e = 1.6 × 10-19C
ఎలక్ట్రాన్ల వాహక సాంద్రత = ప్రమాణ ఘనపరిమాణంలో పరమాణువుల సంఖ్య
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 32

ప్రశ్న 7.
పై లెక్కలో వచ్చిన డ్రిఫ్ట్ వడిని కింది వాటితో పోల్చండి.
i) సాధారణ ఉష్ణోగ్రతల వద్ద రాగి పరామణువుల ఉష్ణయవడి (Thermal speed)
ii) డ్రిఫ్ట్ గమనానికి కారణమై, తీగ వెంబడి వ్యాపనం (propagation) చెందే విద్యుత్ క్షేత్రం వడి.
జవాబు:
i) T ఉష్ణోగ్రత వద్ద, రాగి పరమాణు ద్రవ్యరాశి (M) ఉష్ణ వడిని క్రింది సమీకరణం నుండి రాబట్టవచ్చును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 33
∴ ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ వడి (Vd) = 1.047 × 10-8 = సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉష్ణవడి × 10-8 రెట్లు

ii) వాహకం వెంట విద్యుత్ క్షేత్రం, విద్యుదయస్కాంత తరంగ వడితో ప్రయాణించును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 34
∴ అపసర వడిని C తో పోల్చిన, 10-11 రెట్లు తక్కువగా ఉండును.

లెక్కలు Problems

ప్రశ్న 1.
10Ω మందమైన ఒక తీగను దాని పొడవు మూడు రెట్లు అయేటట్లు సాగదీశారు. సాగదీయడం వల్ల దాని సాంద్రతలో ఎటువంటి మార్పు లేదని భావించి సాగ దీసిన తీగ నిరోధం కనుక్కోండి.
సాధన:
ఇచ్చినది R1 = 10Ω
l1 = l
l2 = 3l
R2 = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 35

ప్రశ్న 2.
4R నిరోధం గల ఒక తీగను వృత్తాకారంలో వంచారు. దాని వ్యాసం కొనల మధ్యగల ప్రభావాత్మక నిరోధం ఎంత? [TS. Mar. 16; Mar. ’14]
సాధన:
పొడవాటి తీగ నిరోధం = 4R
సగం తీగ నిరోధం = \(\frac{4R}{2}\) = 2R
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 36
సగం పొడవున్న, రెండు తీగల చివరలు పటంలో చూపినట్లు కలిపితే వృత్తం ఏర్పడుతుంది. వ్యాసం వెంట తీగ చివరల మధ్య ప్రభావ నిరోధము,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 37

ప్రశ్న 3.
15 Vm-1 విద్యుత్ క్షేత్రాన్ని ఒక వాహకం కొనల మధ్య అనువర్తించినప్పుడు, ఆ వాహకం 2.5 × 106 Am-2 విద్యుత్ ప్రవాహ- సాంద్రతను కలిగి ఉంది. ఆ వాహకం నిరోధకతను కనుక్కోండి.
సాధన:
విద్యుత్ ప్రవాహ సాంద్రత = J = \(\frac{I}{R}\)
= 2.5 × 10-6 Am-2
ప్రయోగించిన విద్యుత్ క్షేత్రం, E = 15 Vm-1
వాహకం విశిష్టోష్ణం, ρ = \(\frac{E}{J}=\frac{15}{2.5\times10^6}\)
∴ ρ = 6 × 10-6 Ωm.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 4.
5% సహనంతో 350ml ల నిరోధాన్ని కలిగి ఉన్న ఒక నిరోధకం రంగుల కోడ్ ఏమిటి?
సాధన:
ఒక నిరోధకము యొక్క నిరోధం = 350 mΩ
= 350 × 10-3
= 35 × 10-2

సహన శీలత (Tolerance) = 5%
మొదటి సార్థకసంఖ్య (3), మొదటి పట్టీను సూచించును.
రెండవ సార్థకసంఖ్య (5), రెండవ పట్టీను సూచించును.
మూడవ సార్థకసంఖ్య (10-2) మూడవ పట్టీను సూచించును.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 38

ప్రశ్న 5.
మీకు 8Ω నిరోధకం ఇచ్చారు. 6Ω నిరోధాన్ని పొందడానికి దానికి, 120 Ωm నిరోధకతను కలిగి ఉన్న ఎంత పొడవుగల తీగను సమాంతరంగా కలపాలి?
సాధన
నిరోధకము యొక్క నిరోధం R = 8Ω
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 39
తీగ విశిష్ట నిరోధం ρ = 120
1 పొడవున్న నిరోధంను Rకు సమాంతరంగా కలిపితే,
ప్రభావ నిరోధం, Rp = 6Ω
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 40

ప్రశ్న 6.
ఒక బ్యాటరీకి 3Ω, 6Ω, 9Ω మూడు నిరోధకాలను సంధానం చేశారు. ఒకవేళ a) అవన్నీ సమాంతరంగా కలిపినప్పుడు, b) అవన్నీ శ్రేణిలో కలిపినప్పుడు వాటిలోని ఏ నిరోధకంలో సామర్థ్య దుర్వ్యయం గరిష్టంగా ఉంటుంది. కారణాలను ఇవ్వండి.
సాధన:
ఇచ్చినవి R1 = 3Ω, R2 = 6Ω, R3 = 9Ω

a) సమాంతరంగా కలిపిన నిరోధాల ప్రభావ నిరోధము
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 41
∴ సమాంతర సంయోగంలో దుర్వ్యయ సామర్థ్యము,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 42

b) శ్రేణిలో ప్రభావ నిరోధం,
Rs = R1 + R2 + R3 = 3 + 6 + 9 = 18Ω
∴ శ్రేణిలో దుర్వ్యయ సామర్థ్యం
PS ∝ RS ⇒ PS ∝ 18 → (2)

(1) మరియు (2) సమీకరణాల నుండి, దుర్వ్యయ సామర్థ్యం శ్రేణిలో గరిష్టం మరియు సమాంతరంగా కనిష్టం.

కారణాలు :

  1. శ్రేణి సంధానంలో, P ∝ R మరియు V ∝ R. కావున దుర్వ్యయ సామర్థ్యం (P) మరియు పొటెన్షియల్ భేదం (V) ఎక్కువ. ఎందుకనగా ప్రతినిరోధకం వెంట విద్యుత్ ప్రవాహం సమానము.
  2. సమాంతర సంధానంలో P ∝ \(\frac{1}{R}\) మరియు I ∝ \(\frac{1}{R}\) కావున దుర్వ్యయ సామర్థ్యం (P) మరియు పొటెన్షియల్ భేదము (V) తక్కువ. ఎందుకనగా ప్రతినిరోధకము వెంట వోల్టేజి సమానము.

ప్రశ్న 7.
ఒక వెండి తీగ 27.5°C వద్ద 2.1Ω నిరోధాన్ని, 100°C వద్ద 2.7Ω నిరోధాన్ని కలిగి ఉంది. వెండి ఉష్ణోగ్రత నిరోధకత గుణకం కనుక్కోండి.
సాధన:
వెండి తీగకు (సిల్వర్) R1 = 2.1Ω, t1 = 27.5°C
R2 = 2.7Ω,
t2 = 100°C, α = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 43
∴ ఉష్ణోగ్రత నిరోధకత గుణకం a = 0.443 × 10-2 °C

ప్రశ్న 8.
ఒక విద్యుత్సాహక తీగ పొటెన్షియల్ భేదాన్ని స్థిరంగా ఉంచి, దాని పొడవు రెట్టింపు అయ్యేటట్లు సాగదీస్తే, ఎలక్ట్రాన్ల డ్రిఫ్ట్ వడి ఎన్ని రెట్లు మారుతుంది?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 44
∴ ఎలక్ట్రాన్స్ డ్రిఫ్ట్ వడి 2 రెట్లు అగును.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 9.
25,200 రేటింగ్ ఉన్న రెండు 120 V బల్బులను శ్రేణిలో కలిపారు. వాటిలో ఒక బల్బు దాదాపు వెంటనే కాలిపోయింది. ఏ బల్బు కాలిపోయింది? ఎందుకు?
సాధన:
మొదటి బల్బుకు
P1 = 25W, V1 = 120V
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 45
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 46
రెండు బల్బులు ఒకే వోల్టేజిని కలిగి ఉన్నప్పటికి, R1 > R2 అగుట వల్ల 25 W బల్బు తక్షణం కాలి పోతుంది.

ప్రశ్న 10.
ఒక స్థూపాకార లోహపు తీగను దాని పొడవు 5% పెరిగేటట్లు సాగదీశారు. దాని నిరోధంలో కలిగే మార్పు శాతం కనుక్కోండి.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 47

ప్రశ్న 11.
ఒక పదార్థంతో చేసిన A, B అనే రెండు తీగలు సమాన పొడవులు కలిగి ఉన్నాయి. వాటి మధ్యచ్ఛేద వైశాల్యాల నిష్పత్తి 1: 4, ఆ రెండు తీగల కొనల మధ్య స్థిరమైన వోల్టేజిని అనువర్తిస్తే, వాటిలో ఉత్పత్తి అయ్యే ఉష్ణదాశుల నిష్పత్తి ఎంత?
సాధన:
ఇచ్చినవి lA = lb, ρA = ρB, VA = VB, AA : BB = 1 : 4
తీగలో జనించు ఉష్ణరేటు,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 48
A మరియు B తీగలకు ఒకే V, ρ, l లు ఉంటే
H ∝ A (మధ్యచ్ఛేద వైశాల్యం)
A మరియు B రెండు తీగలకు,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 49

ప్రశ్న 12.
స్థిరమైన వోల్టేజి జనకానికి సమాంతరంగా కలిపిన రెండు బల్బుల నిరోధాల నిష్పత్తి 1 : 2. వాటిలో దుర్వ్యయం అయ్యే సామర్థ్యాల నిష్పత్తి ఎంత ?
సాధన:
ఇచ్చినవి R1 : R2 = 1 : 2
సమాంతర సంధానంలో దుర్వ్యయ సామర్థ్యం,
P = \(\frac{V^2}{R}\)
⇒ P = \(\frac{1}{R}\) [∵ V = స్థిరాంకము]
రెండు బల్బులలో దుర్వ్యయ సామర్ధ్యాల నిష్పత్తి.
\(\frac{P_1}{P_2}=\frac{R_2}{R_1}=\frac{2}{1}\)
∴ P1 : P2 = 2 : 1.

ప్రశ్న 13.
5m పొడవు గల పొటెన్షియోమీటర్ తీగ కొనల మధ్య 6 V పొటెన్షియల్ భేదం కొనసాగించారు. పొటెన్షియో మీటర్ తీగ 180 cm పొడవు వద్ద సంతులన స్థానాన్ని ఇస్తే, ఆ ఘటం emf కనుక్కోండి. [AP. Mar.’17; AP. Mar.’16]
సాధన:
పొటెన్షియోమీటర్ తీగ పొడవు, L = 5m
పొటెన్షియల్ భేదము, V = 6 వోల్ట్
పొటెన్షియల్ నతిక్రమము,
Φ = \(\frac{V}{L}=\frac{6}{5}\) = 1.2V/M.
సంతుల పొడవు, l = 180 cm = 1.80 m
ఘటం వి.చా. బ., E = Φl
= 1.2 × 1.8 = 2.16V.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 14.
2.5 Vemf, r అంతర్నిరోధం గల ఒక బ్యాటరీని 1 ఓమ్ నిరోధం గల అమ్మీటర్ ద్వారా 45 ఓమ్ నిరోధానికి శ్రేణిలో కలిపారు. అమ్మీటర్ 50 m విద్యుత్ ప్రవాహం చూపిస్తుంది. వలయం రేఖా చిత్రాన్ని గీయండి, r విలువను కనుక్కోండి. [TS. Mar: ’17]
సాధన:
ఇచ్చిన దత్తాంశ వలయ పటం కింద చూపబడింది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 50
E = 2.5
R = 45 Ω
rA = 1A
i = 50 mA
r = ?
E = I(R + rA + r)
2.5 = 50 × 10-3 (45 + 1 + r)
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 51

ప్రశ్న 15.
ఒక తీగ మధ్యచ్ఛేదం ద్వారా పోయే విద్యుదావేశ పరిమాణం q(t) = at² + bt + c. a, b, c లకు మితీయ ఫార్ములాలు రాయండి. SI ప్రమాణాలలో a, b, c విలువలు వరుసగా 6, 4, 2 అయితే, t = 6 సెకన్ల వద్ద విద్యుత్ ప్రవాహ విలువను కనుక్కోండి.
సాధన:
తీగ గుండా ప్రవహించు ఆవేశం q(t) = at²+bt +c
సజాతీయ సూత్రం ప్రకారం,
q(t) = at² మితిఫార్ములా
IT = aT²
q(t) మితిఫార్ములా = bt మితిఫార్ములా
IT = bT
∴ b మితిఫార్ములా = I
q(t) మితిఫార్ములా = C మితిఫార్ములా
IT = C మితి ఫార్ములా
∴ C మితి ఫార్ములా =IT
విద్యుత్ ప్రవాహం, I = \(\frac{dq(t)}{dt}\)
= \(\frac{d}{dt}\) [at² + bt + c]
= 2at + b
ఇక్కడ a = 6 మరియు b = 4
⇒ I = 12t + 4
∴ t = 6 సె. వద్ద విద్యుత్ ప్రవాహం
I = 12 × 6 + 4 = 76A.

అభ్యాసాలు Textual Exercises

ప్రశ్న 1.
ఒక కారు సంచాయక ఘటమాల (storage battery) emf 12 V, అంతర్నిరోధం 0.40. బ్యాటరీ నుంచి పొందగలిగే గరిష్ట విద్యుత్ ప్రవాహం ఎంత?
సాధన:
E = 12 V, r = 0.4 Ω
గరిష్ట విద్యుత్, Imax = \(\frac{E}{r}=\frac{12}{0.4}\) = 30A

ప్రశ్న 2.
10V emf, 3Ω అంతర్నిరోధకం గల ఒక బ్యాటరీని నిరోధకానికి సంధానం చేశారు. వలయంలోని విద్యుత్ ప్రవాహం 0.5 A అయితే, ఆ నిరోధకం నిరోధం ఎంత ? వలయం మూసి (closed) ఉన్నప్పుడు బ్యాటరీ టెర్మినల్ వోల్టేజిని కనుక్కోండి. [TS. Mar. 15]
సాధన:
E = 10 V, r = 3Ω, I = 0.5 A, R = ?, V = ?
I = \(\frac{E}{(R+r)}\) లేక (R + r) = \(\frac{E}{I}=\frac{10}{0.5}\) = 20
లేక R = 20 – r = 20 – 3 = 17Ω
అంత్య వోల్టేజి, V = IR = 0.5 × 17 = 8.5 Ω.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 3.
a) 1Ω, 2Ω, 3Ω ల మూడు నిరోధకాలను శ్రేణిలో సంధానం చేశారు. సంయోగం మొత్తం నిరోధం ఎంత ?
సాధన:
R1 = 1 Ω, R2 = 2 Ω, R3 = 3 Ω, V = 12 V
శ్రేణిలో, మొత్తం నిరోధం RS = R1 + R2 + R3
= 1+ 2+ 3 = 6Ω.

b) ఈ సంయోగాన్ని ఉపేక్షించదగిన అంతర్నిరోధం, 12 Vemf గల బ్యాటరీకి కలిపితే, ప్రతి నిరోధకం కొనల మధ్య గల పొటెన్షియల్ పాతాన్ని పొందండి.
సాధన:
వలయంలో ప్రవహించు విద్యుత్ I = \(\frac{V}{R_S}=\frac{12}{6}\) = 2A
R1 వెంట పొటెన్షియల్ = IR1 = 2 × 1 = 2V
R2 వెంట పొటెన్షియల్ = IR2 = 2 × 2 = 4V
R3 వెంట పొటెన్షియల్ = IR3 = 2 × 3 = 6V

ప్రశ్న 4.
a) మూడు నిరోధకాలు 2 Ω, 4 Ω, 5 Ω లను సమాంతరంగా కలిపారు. ఈ సంయోగం మొత్తం నిరోధం ఎంత?
సాధన:
R1 = 2 Ω, R2 = 4 Ω, R3 = 5 Ω, V = 20V
సమాంతర సంధానంలో, మొత్తం నిరోధం = Rp
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 52

b) ఈ నిరోధకాల సంయోగాన్ని ఉపేక్షించదగిన అంతర్నిరోధం, 20 Vemf గల బ్యాటరీకి కలిపితే, ప్రతీ నిరోధకం గుండా ప్రవహించే విద్యుత్, బ్యాటరీ నుంచి తీసుకొన్న మొత్తం విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి.
సాధన:
R ద్వారా విద్యుత్ = \(\frac{V}{R_1}=\frac{20}{2}\) = 10A
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 53

ప్రశ్న 5.
గది ఉష్ణోగ్రత వద్ద (27.0°C) ఒక వేడెక్కే తీగ (heating element) నిరోధం 100 Ω. ఆ వేడెక్కే తీగ నిరోధాన్ని 117 Ω గా గుర్తించినట్లయితే దాని ఉష్ణోగ్రత ఎంత? ఆ నిరోధక పదార్థం ఉష్ణోగ్రత గుణకం 1.70 × 10-4° C-1గా ఇచ్చారు.
సాధన:
R27 = 100 Ω, R1 = 117 Ω, t = ?
α = 1.70 × 10-4/°C.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 54

ప్రశ్న 6.
15m పొడవు, 6.0 × 10-7m² ఏకరీతి మధ్యచ్ఛేద వైశాల్యం గల తీగ ద్వారా ఉపేక్షించదగినంత స్వల్పంగా విద్యుత్ను పంపారు. ఆ తీగ నిరోధం 5.0 Ω గా కొలవడమైనది. ఆ ప్రయోగం జరుగుతున్న ఉష్ణోగ్రత వద్ద ఆ పదార్థ నిరోధకత ఎంత?
సాధన:
l = 15 m, A = 6.0 × 10-7 m², R = 5.0 Ω, ρ = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 55

ప్రశ్న 7.
ఒక వెండి తీగ 27.5°C వద్ద 2.1 Ω నిరోధాన్ని, 100°C వద్ద 2.7 Ω నిరోధాన్ని కలిగి ఉంది. వెండి ఉష్ణోగ్రత నిరోధకత గుణకాన్ని కనుక్కోండి.
సాధన:
R27.5 = 2.1 Ω, R100 = 2.7 2; α = ?

ప్రశ్న 8.
నిక్రోమ్ చేసిన ఒక వేడెక్కే తీగను 230 V సరఫరాకు కలిపినప్పుడు అది తొలుత 3.2 A విద్యుత్ ప్రవాహం తీసుకుంటుంది. కొన్ని సెకన్ల తరువాత ఆ ప్రవాహం 2.8 A నిలకడ విలువకు చేరింది. గది ఉష్ణోగ్రత 27.0°C అయితే, వేడెక్కే తీగ నిలకడ ఉష్ణోగ్రత ఎంత ? దీనిలో తీసుకున్న ఉష్ణోగ్రతా అవధిపై సరాసరిన తీసుకొన్న నిక్రోమ్ తీగ ఉష్ణోగ్రతా నిరోధ గుణకం 1.70 × 10-4 °C-1.
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 57
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 58

ప్రశ్న 9.
పటంలో చూపిన జాలం ప్రతి నిరోధకంలో విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 59
సాధన:
వలయం వేర్వేరు భుజాల ద్వారా పోవు విద్యుత్ ప్రవాహాలు పటంలో చూపబడినవి.
కిర్కాఫ్స్ రెండవ నియమం ప్రకారం,
EABCE సంవృత వలయంలో
-10 + 10 (i1 + i2) + 10i1 5(i1 -i3)=0
లేక 10 = 25i1 + 10i2 – 5i3
లేక 2 = 5i1 + 2i2 – i3 → (i)

ABDA సంవృత వలయంలో,
10i1 + 5i3 – 5i2 = 0
లేక 2i1 + i3 – i2 = 0
లేక i2 = 2i1 + i3 → (ii)

BCDB సంవృత వలయంలో,
5(i1 – i3) – 10(i2 + i3) – 5i3 = 0
లేక 5i1 – 10i2 – 20i3 = 0
i1 = 2i2 + 4i3 → (iii)
(ii) మరియు (iii) ల నుండి
i1 = 2 (2i1 + i3) + 4i3 = 4i1 + 6i3
లేక 3i1 = −6i3
లేక i1 = -2i3 → (iv)
ఈ విలువను (ii) లో వ్రాయగా,
i2 = 2(−2i3) + i3 = – 3i3 → (v)
ఈ విలువను (i) లో వ్రాయగా,
2 = 5(−2i3) + 2(-3i3) -i3 లేక 2 = -17i3
లేక i3 = -2/17A
(iv) నుండి; i1 = -2 (-2/17) = 4/17A
(v) నుండి; i2 = -3(−2/17) = (6/17) A
∴ i1 + i2 = (4/17) + (6/17) = (10/17)A
i1 – i3 = 4/17 – (−2/17) = (6/17)A
i2 + i3 = (6/17) + (-2/17) = 4/17A.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 10.
a) మీటర్ బ్రిడ్జిలో Y నిరోధకం 12.5 Q అయినప్పుడు A కొన నుంచి 39.5 cm దూరంలో సంతులన బిందువును గుర్తించారు. X నిరోధాన్ని కనుక్కోండి. వీటన్ బ్రిడ్జి, మీటర్ బ్రిడ్జిలలోని నిరోధకాలను కలపడానికి మధ్యలో మందంగా గల రాగి పట్టీలను ఎందుకు ఉపయోగిస్తారు?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 60
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 61

మందమైన రాగి పట్టీలను ఉపయోగించి, కల్పిత నిరోధంను తగ్గిస్తారు.

b) ఒకవేళ X, Y లను తారుమారుచేస్తే బ్రిడ్జి సంతులన బిందువును నిర్ధారించండి.
సాధన:
X మరియు Y లను పరస్పరము మార్చితే, 1, మరియు 1, (పొడవులు) కూడా మారును.
కావున l = 100 – 39.5′ = 60.5cm.

c) సంతులన బిందువు వద్ద గాల్వనామీటర్, ఘటాలను తారుమారుచేస్తే ఏమవుతుంది ? గాల్వనామీటర్ ఏదైనా విద్యుత్ ప్రవాహాన్ని చూపుతుందా ?
సాధన:
గాల్వనా మీటర్ విద్యుత్ ప్రవాహంను చూపదు.

ప్రశ్న 11.
8.0 Vemf, 0.5 Ω అంతర్నిరోధం గల ఒక సంచాయక ఘటమాలను 15.5Ω శ్రేణిలో గల నిరోధకం ఉపయోగించి 120 V dc సరఫరాకు కలిపి ఆవేశితం చేశారు. ఆవేశం చెందేటప్పుడు బ్యాటరీ టెర్మినల్ వోల్టేజి ఎంత ? ఆవేశం చెందించే వలయంలో శ్రేణిలో గల నిరోధకం ఆవశ్యకత ఏమిటి?
సాధన:
ఘటం వి.చా. బి. = 8.0 V
d.c. సప్లై వోల్టేజి = 120 V
ఘటం అంతర్నిరోధం, r = 0.5 Ω
బాహ్య నిరోధం, R = 15.5Ω
వి.చా.బ. 8V గల ఘటంను 120 V, d.c సప్లైతో ఆవేశపరిస్తే, వలయం ఫలిత వి.చా.బి.
E = 120 – 8 = 112 V
వలయం మొత్తం నిరోధం = R + r = 15.5+ 0.5. = 16.0Ω
∴ వలయంలో విద్యుత్, I = \(\frac{E}{R+r}=\frac{112}{16}\) = 7.0A
∴ R వెంట వోల్టేజి = IR = 7.0 × 15.5 = 108.5 V

వలయంలో d.c. సప్లై వోల్టేజి, R వెంట వోల్టేజి మరియు ఘటం అంత్య వోల్టేజిల మొత్తమునకు సమానం.
∴ 120 = 108.5 V లేక V = 120 – 108.5 = 11.5V

శ్రేణి నిరోధం, బాహ్య d.c జనక సప్లై నుండి తీసుకునే విద్యుత్ను లిమిట్ చేస్తుంది. నిరోధం లేకపోతే విద్యుత్ ఎక్కువ ప్రమాద స్థాయిలో ఉండును.

ప్రశ్న 12.
పొటెన్షియోమీటర్ అమరికలో 1.25 Vemf గల ఘటం సంతులన బిందువును 35.0 cm వద్ద ఇచ్చింది. ఈ ఘటాన్ని మార్చి దాని స్థానంలో మరొక ఘటాన్ని ఉంచినప్పుడు కొత్త సంతులన బిందువు 63.0 cm కి జరిగింది. రెండవ ఘటం em ఎంత? [AP. Mar.’15]
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 62

ప్రశ్న 13.
సాధించిన సమస్యల్లో 1వ ప్రశ్నలో అంచనావేసినట్లు ఒక రాగి వాహకంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య సాంద్రత 8.5 × 1028 m-3, 3.0 m పొడవు గల తీగ ఒక కొన నుంచి మరొక కొనకు డ్రిఫ్ట్ చెందటానికి ఎలక్ట్రాన్లకు ఎంత కాలం పడుతుంది ? తీగ మధ్యచ్ఛేద వైశాల్యం 2.0 × 10-6 m², దాని గుండా 3.0 A విద్యుత్ ప్రవహిస్తుంది.
సాధన:
n = 8.5 × 1028 m-3; l = 3.0 m;
A = 2.0 × 10-6 m²; I = 3.0 A, t = ?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 63

అదనపు అభ్యాసాలు Additional Exercises

ప్రశ్న 14.
భూ ఉపరితలం 10° Cm రుణాత్మక ఉపరితల ఆవేశ సాంద్రతను కలిగి ఉంది. అత్యధిక ఎత్తులో గల వాతావరణ పై పొరకు, ఉపరితలానికి మధ్యగల 400 kV ప్రొటెన్షియల్ భేదం ఫలితంగా (తక్కువ ఎత్తులో గల వాతావరణం స్వల్ప వాహకత్వం వల్ల) గోళం (భూమి) అంతటా కేవలం 1800 A విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఒకవేళ అక్కడ వాతావరణ విద్యుత్ క్షేత్రాన్ని కొనసాగించే క్రియావిధానం లేకుంటే, భూఉపరితలాన్ని తటస్థం చేయడానికి (సుమారుగా) ఎంతకాలం అవసరం? (ఆచరణలో ఇలా ఎప్పటికీ జరుగదు. ఎందుకంటే (భూగోళంపై వివిధ ప్రదేశాల్లో సంభవించే మెరుపులు, తరచూ సంభవించే ఉరుములూ, మెరుపులతో కూడిన వర్షాల వల్ల విద్యుదావేశాలు తిరిగి నింపే క్రియావిధానం అక్కడ ఉంటుంది). (భూ వ్యాసార్థం = 6.37 × 106m).
సాధన:
6.37 × 106 m; σ = 10-9cm-2 ; I = 1800 A
గ్లోబ్ వైశాల్యం A = 4πr² = 4 × 3.14 × (6.37 × 106)² = 509.64 × 1012
ఆవేశము, Q = σ × A = 10-9 × 509.64 × 1012
= 509.64 × 10³ C
∴ t = \(\frac{Q}{I}=\frac{509.64 \times 10^3}{1800}\) = 283.1 s

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 15.
a) ఒక్కొక్కటి 2.0 Vemf, 0.015 Q అంతర్నిరోధం గల ఆరు లేడ్ ఆసిడ్ రకం గౌణ ఘటాలను 8.5 Ω నిరోధానికి విద్యుత్ సరఫరా చేయడానికి శ్రేణిలో కలిపారు. విద్యుత్ సరఫరా నుంచి అది తీసుకునే విద్యుత్ ప్రవాహం, దాని టెర్మినల్ వోల్టేజీ ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 64

b) చాలాకాలం ఉపయోగించిన తరువాత ఒక గౌణ ఘటం 1.9 Vemf, 380 Ω అత్యధిక అంతర్నిరోధాన్ని కలిగి ఉంది. ఆ ఘటం నుంచి పొందగలిగే గరిష్ఠ విద్యుత్ ప్రవాహం ఎంత? ఒక కారు మోటారును ఈ ఘటం గుండా నడపగలుగుతుందా (ఆన్ చేయగలుగుతుందా)?
సాధన:
E = 1.9 V; r = 380 2
Iగరిష్ఠ = \(\frac{E}{r}=\frac{1.9}{380}\) = 0.005A
కొద్ది సెకనులు మోటారు స్టార్ట్ చేయుటకు కావలసిన విద్యుత్ 100 A. కావున పైన వచ్చిన విద్యుత్ విలువతో కారును స్టార్ట్ చేయలేము.

ప్రశ్న 16.
సమాన పొడవు గల అల్యూమినియం, రాగి తీగలు సమాన నిరోధాన్ని కలిగి ఉన్నాయి. ఆ రెండు తీగల్లో ఏది తేలికైనది ? చాలా ఎత్తు ‘మీద నుంచి పోయే విద్యుత్ సామర్థ్య తీగలుగా అల్యూమినియం తీగలను ఎందుకు ప్రాధాన్యం ఇస్తారో తెలపండి. (ρAl = 2.63 × 10-8 Ωm, ρCu 1.72 × 10-8 Ωm, Al, Cu ల సాపేక్ష సాంద్రతలు వరుసగా 2.7, 8.9.)
సాధన:
అల్యూమినియం తీగకు, R1 = R; l1 = 1
సాపేక్ష సాంద్రత d1 = 2.7.
రాగి తీగకు, R2 = R, l2 = l1, d2 = 8.9

A1 మరియు A2 లు అల్యూమినియం మరియు రాగి తీగల మధ్యచ్ఛేద వైశాల్యాలు అయితే
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 65

రాగి తీగ ద్రవ్యరాశి, అల్యూమినియం తీగ ద్రవ్యరాశికి 2.16 రెట్లు అని చూపును. ఒకే పొడవు అంతే నిరోధం గల అల్యూమినియం తీగ, రాగి తీగకన్నా తక్కువ ద్రవ్యరాశి కల్గి ఉండును. కావున పైన ఉండే పవర్ కేబుల్స్లో అల్యూమినియం తీగను వాడతారు. భారమైన కేబుల్స్, వాని బరువు వల్ల క్రిందికి సాగును.

ప్రశ్న 17.
మాంగనీస్ మిశ్రమ లోహంతో తయారైన నిరోధకంపై చేసిన కింది పరిశీలనల నుంచి మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 66
సాధన:
వేర్వేరు రీడింగుల, వోల్టేజి మరియు విద్యుత్ల నిష్పత్తి విలువలు సమానం. కావున ఓమ్స్ నియమము ఎక్కువ యదార్థతతో పాటించును. మాంగనీన్ విశిష్ట నిరోధం, ఉష్ణోగ్రతపై ఆధారపడదు.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 18.
కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
a) అసమరీతి మధ్యచ్ఛేద వైశాల్యం కలిగి ఉన్న లోహపు వాహకంలో నిలకడగా విద్యుత్ ప్రవహిస్తున్నది. కింది రాశులలో ఏవి వాహకం వెంబడి స్థిరంగా ఉంటాయి :
విద్యుత్ ప్రవాహం, విద్యుత్ ప్రవాహ సాంద్రత, విద్యుత్ క్షేత్రం, డ్రిఫ్ట్ వడి. సాధన. అసమ మధ్యచ్ఛేద వైశాల్య వాహకం ద్వారా పోవు విద్యుత్ మాత్రమే స్థిరం. మిగిలిన రాశులు వాహక మధ్యచ్ఛేద వైశాల్యంనకు విలోమానుపాతంలో ఉండును.

b) అన్ని వాహక మూలకాలకు ఓమ్ నియమం సార్వత్రికంగా అనువర్తనీయమా? ఒకవేళ కాకుంటే, ఓమ్ నియమాన్ని పాటించని మూలకాలకు ఉదాహరణలివ్వండి.
సాధన:
అఓమిక్ మూలకాలకు ఓమ్ నియమం వర్తించదు.
ఉదా : శూన్య నాళికలు, పాక్షిక వాహక డయోడ్లు, విద్యుద్విశ్లేష్య ద్రవాలు.

c) తక్కువ వోల్టేజి గల ఒక జనకం నుంచి అధిక విద్యుత్ ప్రవాహాలు అవసరమైనప్పుడు తప్పకుండా దాని అంతర్నిరోధం చాలా తక్కువగా ఉండాలి. ఎందుకు?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 67

d) ఒక హైటెన్షన్ (high tension (HT)) సరఫరా 6 kV అనుకోండి, తప్పకుండా చాలా అధిక అంతర్నిరోధాన్ని కలిగి ఉండాలి. ఎందుకు?
సాధన:
HT సప్లయి చాలా ఎక్కువ అంతర్నిరోధం కలిగి ఉండును. అనుకోకుండా వలయం షార్ట్ అయితే, తీసుకునే విద్యుత్ సురక్షిత అవధిని దాటి వలయం పాడవటానికి కారణం అగును.

ప్రశ్న 19.
సరియైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి :
a) సాధారణంగా మిశ్రమ లోహాల నిరోధకత వాటి అనుఘటక లోహాల నిరోధకతల కంటే (ఎక్కువ / తక్కువ).
b) మిశ్రమ లోహాల ఉష్ణోగ్రతా నిరోధ గుణకాలు శుద్ధలోహాల కంటే తక్కువ / ఎక్కువ).
c) ఉష్ణోగ్రత పెరుగుదలతో మాంగనీస్ మిశ్రమ లోహం నిరోధకత (ఉష్ణోగ్రతపై ఆధారపడదు / శీఘ్రంగా పెరుగుతుంది).
d) ఒక మాదిరి బంధకం (ఉదా : అంబర్ – సీమ గుగ్గిలం) నిరోధకత లోహ నిరోధకత కంటే (1022 1023) రెట్లు అధికం.
సాధన:
a) ఎక్కువ
b) తక్కువ
c) ఉష్ణోగ్రతపై ఆధారపడదు.
d) 1022

ప్రశ్న 20.
a) R నిరోధం గల నిరోధకాలను ఇవ్వడమైంది.
i) గరిష్ఠంగా, ii) కనిష్ఠంగా ప్రభావాత్మక నిరోధాన్ని పొందడానికి మీరు వాటిని ఏ విధంగా సంయోగం చేస్తారు ? గరిష్ఠ, కనిష్ట నిరోధం నిష్పత్తి ఎంత?
సాధన:
తుల్య నిరోధం గరిష్టం కావటానికి, n నిరోధాలను శ్రేణిలో కలపాలి.
గరిష్ట తుల్య నిరోధం, RS = nR

తుల్య నిరోధం కనిష్టం కావటానికి, n నిరోధాలను సమాంతరంగా కలపాలి.
కనిష్ట తుల్య నిరోధం’, RP = \(\frac{R}{n}\)
∴ \(\frac{\mathrm{R}_{\mathrm{S}}}{\mathrm{R}_{\mathrm{P}}}=\frac{\mathrm{nR}}{\frac{\mathrm{R}}{\mathrm{n}}}=\mathrm{n}^2\)

నిరోధాల సమాంతర సంయోగంలో తుల్య నిరోధం, విడివిడి నిరోధాల కన్నా తక్కువ మరియు నిరోధాల శ్రేణి సంయోగంలో తుల్య నిరోధం, విడివిడి నిరోధాల కన్నా ఎక్కువ.

b) 1Ω, 2Ω, 3Ω నిరోధాలు మీకివ్వడమైంది. కింద ఇచ్చిన తుల్య నిరోధాలను పొందడానికి వాటిని ఏ విధంగా సంయోగం చేస్తారు? i) (11/3) Ω (ii) (11/5) Ω, (iii) 6Ω, (iv) (6/11)Ω ?
సాధన:
సందర్భం (i) : 1Ω మరియు 2Ω ల సమాంతర సంయోగమును 3Ω లతో శ్రేణిలో కలిపినప్పుడు
1Ω మరియు 2Ω లను సమాంతరంగా కలచినప్పుడు, తుల్య నిరోధం
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 68

c) పటంలో చూపిన జాలాల (networks) తుల్య నిరోధాలను కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 69
సాధన:
ఇచ్చిన వలయంను శ్రేణిలో 4 సమ భాగాల సంయోగము ప్రభావం 4 నిరోధాలు కలిగి ఉండును. వాటిలో ఒక్కొక్కటి 1Ω గల శ్రేణి నిరోధాలు 2 మరియు ఒక్కొక్కటి 2Ω గల సమాంతర నిరోధాలు 2.

ఒక్కొక్కటి 1Ω నిరోధం ఉన్న 2 నిరోధాల శ్రేణి. సన తుల్య నిరోధం= 1 + 1 = 2Ω.
ఒక్కొక్కటి 2Ω నిరోధం ఉన్న 2 నిరోధాల శ్రేణి సంధాన తుల్య నిరోధం = 2 + 2 = 4Ω
ఒక భాగంలో ఫలిత నిరోధం, \(\frac{1}{R_p}=\frac{1}{2}+\frac{1}{4}=\frac{3}{4}\) లేక Rp = \(\frac{3}{4}\)Ω
∴ 4 భాగాల మొత్తం నిరోధం Rp = \(\frac{3}{4}\) × 4 = \(\frac{16}{3}\)Ω = 5.33Ω
పటం (b)లో R నిరోధం ఉన్న 5 నిరోధాలు శ్రేణిలో కలిపారు. వాని తుల్య నిరోధం = 5R.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 21.
పటంలో చూపినట్లు అనంత జాలం, 0.5 Ω అంతర్నిరోధం గల 12V ల జనకం నుంచి పొందే విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి. ప్రతీ నిరోధకం 1 Ω నిరోధాన్ని కలిగి ఉంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 70
సాధన:
అనంతమైన నెట్వర్క్ తుల్య నిరోధం x.నెట్వర్క్ అనంతమైనది కావున టెర్మినల్స్ వెంట ఒక్కొక్కటి 1Ω విలువ గల మూడు నిరోధాల ప్రమాణంను కల్పితే నెట్వర్క్ మొత్తం నిరోధం మారదు. i. e., వలయం మిగిలిన నిరోధం x.
నెట్వర్క్ పటంలో చూపినట్లు ఉండును. మొత్తం నిరోధం x.

x మరియు 1Ω ల సమాంతర సంయోగము ఒక్కొక్కటి 1Ωగల 2 నిరోధాలతో శ్రేణితో కలపబడినవి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 71

ప్రశ్న 22.
AB నిరోధకం తీగ కొనల మధ్య పొటెన్షియల్ పాఠాన్ని కొనసాగిస్తున్న 2.0 V emf, 0.40 Ω అంతర్నిరోధం గల ఘటంతో గల పొటెన్షియో మీటర్ను పటం చూపుతుంది. 1.02 V స్థిర emf ను కొనసాగిస్తున్న ప్రామాణిక ఘటం (చాలా మిత విద్యుత్ ప్రవాహాలకు, కొన్ని mA విద్యుత్ ప్రవాహాల వరకు) 67.3 cm ల పొడవు వద్ద సంతులన బిందువును ఇస్తుంది. ప్రామాణిక ఘటం నుంచి కచ్చితంగా స్వల్ప విద్యుత్ ప్రవాహాలను పొందడానికి, దానితో శ్రేణిలో 600 kΩ అధిక నిరోధాన్ని కలిపారు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 72

ఈ నిరోధాన్ని సంతులన బిందువుకు దగ్గరగా షార్ట్ (short) చేశారు. ఇప్పుడు ప్రామాణిక ఘటానికి బదులుగా తెలియని emf ε గల ఘటాన్ని అమర్చి, అదే విధంగా సంతులన పొడవును కనుక్కుంటే 82.3 cm పొడవు వద్ద సంతులన బిందువును ఇచ్చింది.
a) ε విలువ ఎంత?
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 73

b) 600 kΩ నిరోధం అమర్చడానికి గల ఉద్దేశ్యమేమి?
సాధన:
600 kΩ హెచ్చు నిరోధం, గాల్వనామాపకం ద్వారా చాలా తక్కువ విద్యుత్ ప్రవాహంను అనుమతించును.

c) ఈ అధిక నిరోధం వల్ల సంతులన బిందువు ప్రభావితం అవుతుందా?
సాధన:
ఈ నిరోధం వలయంలో ఉండుట వల్ల తుల్యస్థానం మారదు.

d) చోదక ఘటం (driving cell) అంతర్నిరోధం వల్ల సంతులన బిందువు ప్రభావితం అవుతుందా?
సాధన:
విద్యుత్ ఘటం అంతర్నిరోధం వల్ల తుల్యస్థానం మారదు.

e) పొటెన్షియోమీటర్ చోదక ఘటం emf 2.0 V కు బదులుగా 1.0 V కలిగి ఉంటే పై పద్ధతి పనిచేస్తుందా?
సాధన:
కాదు. నడిచే ఘటం వి.చా. బ మరో ఘటం వి.చా. బ కన్నా తక్కువ అయితే పొటెన్షియోమీటర్ పద్ధతి పనికిరాదు. సంతులన బిందువును పొందలేము.

f) అత్యంత స్వలమైన emf లను, అంటే, కొన్ని mV ల వరకు (ఉష్ణయుగ్మం విలక్షణ emf లాంటివి) కనుక్కోవడానికి పై వలయం చక్కగా పనిచేస్తుందా? ఒకవేళ పనిచేయకపోతే, వలయాన్ని ఎలా మారుస్తారు?
సాధన:
స్వల్ప వి.చా. బ ను కొలుచుటకు వలయం పనికిరాదు. దీనికి కారణం సంతులన బిందువు A చివరకు దగ్గరగా ఉండును. వలయంను సరిచేయుటకు 2.0V ఘటంనకు శ్రేణిలో సరైన అధిక నిరోధంను ఉపయోగించాలి. ఇది పొటెన్షియో మీటర్ తీగ గుండా పోవు విద్యుత్ను తగ్గించును. కావున 1 cm తీగ పొటెన్షియల్ తేడా తగ్గును. కావున తక్కువ వి.చా. బను కనుగొనవచ్చును.

ప్రశ్న 23.
రెండు నిరోధాలను పోల్చడానికి పొటెన్షియోమీటర్ వలయాన్ని పటం సూచిస్తుంది. ప్రామాణిక నిరోధం R = 10.0 Ω తో సంతులన బిందువును 58.3 cm వద్ద కనుక్కొంటే, తెలియని నిరోధం X తో 68.5cm వద్ద సంతులన బిందువును కనుక్కొన్నారు. X విలువను కనుక్కోండి. ఒకవేళ emfe గల ఇచ్చిన ఘటంతో సంతులన బిందువును తెలుసుకోలేకపోతె, మీరు ఏం చేస్తారు?
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 74
సాధన:
l1 = 58.3cm; l2 = 68.5 cm; R = 10Ω; X = ?
పొటెన్షియోమీటర్ తీగలో విద్యుత్ I. R మరియు Xల వెంట పొటెన్షియల్లు E1 మరియు E2. కీని మూసి వలయంనకు R మరియు X లను కలిపితే అప్పుడు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 75

ఇచ్చిన ఘటం (వి. ఒ.బ) తో సంతులన బిందువు ఉండదు. దీని అర్థం R లేక X వెంట పొటెన్షియల్ డ్రాప్. పొటెన్షియోమీటర్ తీగ AB ట పొటెన్షియల్ డ్రాప్ కన్నా తక్కువ. R మరియు X లలో దేనికైనా సరైన నిరోధంను శ్రేణిలో ఉంచి లేక స్వల్ప వి. చా. బ ఉన్న ఘటంను ఉపయోగించి, R మరియు X గుండా పోవు విద్యుత్ తగ్గించి, వాని వెంట పొటెన్షియల్ డ్రాప్ తగ్గించి, సంతులన బిందువును పొందవచ్చును. మరియొక సాధ్యమగు మార్గము, వాడుతున్న ఘటం వోల్టేజి పెంచి, పొటెన్షియోమీటర్ తీగ వెంట పొటెన్షియల్ డ్రాప్ను పెంచవచ్చును.

ప్రశ్న 24.
పటం 1.5 Vఘటం అంతర్నిరోధం కనుక్కోవడానికి ఉపయోగించే 2.0V పొటెన్షియోమీటర్ను చూపిస్తుంది. వివృత వలయంలో ఘటం సంతులన బిందువు 76.3cm. ఘటం బాహ్య వలయంలో 9.5 Q నిరోధకాన్ని ఉపయోగించినపుడు, సంతులన బిందువు పొటెన్షియోమీటర్ తీగ పొడవు 64.8 cm వద్దకు జరిగింది. ఘటం అంతర్నిరోధం కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 76
సాధన:
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 77

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
a) 1.0 × 10-7 m² మధ్యచ్ఛేద వైశాల్యం, 1.5 A విద్యుత్ ప్రవాహాన్ని తీసుకొనిపోతున్న ఒక రాగితీగలోని వహన ఎలక్ట్రాన్ల సరాసరి డ్రిఫ్ట్ వడిని అంచనావేయండి. ప్రతి రాగి పరమాణువు సుమారుగా ఒక వహన ఎలక్ట్రాన్ న్ను ఇస్తుంది అని భావించండి. రాగి పరమాణు ద్రవ్యరాశి 63.5 u, సాంద్రత 9.0 × 10³ kg/m³
b) పై విధంగా పొందిన డ్రిఫ్ట ్వడిని కింద తెలియజేసిన వివిధ సందర్భాలలో గల వడితో పోల్చండి. i) సాధారణ ఉష్ణోగ్రతల వద్ద రాగి అణువుల ఉష్ట్రీయ వదులు (thermal speeds), ii) డ్రిఫ్ట్ చలనాన్ని కలుగచేసే వాహకం వెంబడి విద్యుత్ క్షేత్ర వ్యాపన వడి (speed of propagation).
సాధన:
a) వహన ఎలక్ట్రాన్ల డ్రిఫ్ట్వేగం దిశ విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ప్రొటెన్షియల్ పెరిగే దిశలో ఎలక్ట్రాన్లు క్రిఫ్ట్ అవుతాయి.

సమీకరణం I∆t = + neA/υd/∆t నుంచి డ్రిఫ్ట్ వడి υd = (I/neA)

ఇక్కడ e = 1.6 × 10-19 C, A = 1.00 × 10-7 m², I 1.5 A. ఒక ఘనపు మీటర్ లోని పరమాణువుల సంఖ్య వహన ఎలక్ట్రాన్ల సాంద్రత n కి సమానం. రాగి పరమాణువులో సంయోజక (వేలన్సీ) ఎలక్ట్రాన్ ఒకటి కాబట్టి, ప్రతి Cu పరమాణువుకు ఒక వహన ఎలక్ట్రానన్ను ఊహించడం సమంజసంగా ఉంటుంది. ఒక ఘనపు మీటర్ కాగి ద్రవ్యరాశి 9.0 × 10³ kg, 6.0 × 1023 రాగి పరమాణువులు 63.5 g ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి కాబట్టి
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 78

b) i) T ఉష్ణోగ్రత వద్ద, M ద్రవ్యరాశి గల రాగి పరమాణువుల ఉష్ట్రీయవడిని *[<(1/2) Mυ² > = (3/2) kBT] నుంచి. పొందవచ్చు. ఇది విలక్షణంగా, \(\sqrt{\mathrm{k}_{\mathrm{B}} \mathrm{T} / \mathrm{M}}\) క్రమంలో ఉంటుంది. ఇక్కడ kB బోల్ట్స్ ఎన్ స్థిరాంకం. రాగి లోహానికి 300 K ఉష్ణోగ్రత వద్ద kg విలువ 2 × 10² m/s. ఈ విలువ వాహకంలోని రాగి పరమాణువుల అనియత కంపన వడులను తెలియజేస్తుంది. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద విలక్షణ ఉష్ట్రీయ వడ్డీ కంటే ఎలక్ట్రాన్ల క్రిఫ్ట్ వడి 10-5 రెట్లు తక్కువ అని గమనించండి.

ii) వాహకం వెంబడి ప్రయాణించే విద్యుత్ క్షేత్రం విద్యుదయస్కాంత తరంగాల వడి, అంటే 3.0 × 108 ms-1 ని కలిగి ఉంది. డ్రిఫ్ట్ వడిని విద్యుత్ క్షేత్రం వడితో పోల్చితే చాలా స్వల్పం, 10-11 కారకంతో చిన్నది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 2.
a) కొన్ని ఆంపియర్ల అవధిలో ఉండే విద్యుత్ ప్రవాహాలకు ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ వడి స్వల్పంగా mm s-1 లో ఉంటుందని పై సమస్యలో అంచనావేయడమైంది. అయితే, ఇంచుమించు వలయాన్ని మూసిన వెంటనే విద్యుత్ ప్రవాహం ఏ విధంగా ఏర్పాటవుతుంది?
b) వాహకం లోపల గల విద్యుత్ క్షేత్రంలో ఎలక్ట్రాన్లు బలానికి గురికావడం వల్ల ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ ఉత్పత్తి అవుతుంది. కాని, బలం త్వరణాన్ని కలిగించాలి. అయితే ఎందుకు ఎలక్ట్రాన్లు నిలకడగా గల సరాసరి డ్రిఫ్ట్ వడిని పొందుతాయి?
c) ఎలక్ట్రాన్ ఆవేశం, డ్రిఫ్ట్ వడి చాలా స్వల్పం అయినప్పటికీ, వాహకంలో అధిక పరిమాణం గల ప్రవాహాలను మనం ఏ విధంగా పొందగలుగుతున్నాం?
d) ఒక లోహం లోపల ఎలక్ట్రాన్లు తక్కువ పొటెన్షియల్ నుంచి అధిక పొటెన్షియల్ వైపుకు డ్రిఫ్ట్కు చెందినప్పుడు, దీనర్థం ఆ లోహానికి చెందిన స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు అన్నీ ఒకే దిశలో చలిస్తున్నాయా?
e) కింది రెండు సందర్భాల్లో వరుస అభిఘాతాల మధ్య (లోహం ధన అయాన్లతో) ఎలక్ట్రాన్ల పథం సరళరేఖలేనా?
i) విద్యుత్ క్షేత్రం లేనప్పుడు, ii) విద్యుత్ క్షేత్రం ఉన్నప్పుడు
సాధన:
a) వలయం అంతటా ప్రతి భాగంలో విద్యుత్ క్షేత్రం, ఇంచుమించు క్షణికంగా (కాంతివేగంతో) ఏర్పాటై, ప్రతి బిందువు వద్ద స్థానిక ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ ఏర్పడేట్లు చేస్తుంది. వాహకం ఒక కొన నుంచి మరొక కొనకు ఎలక్ట్రాన్లు ప్రయాణించే వరకు ప్రవాహ ఏర్పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే, ప్రవాహం నిలకడ స్థితిని చేరడానికి మాత్రం అదీ స్వల్ప సమయాన్ని తీసుకొంటుంది.

b) ప్రతి స్వేచ్ఛా ఎలక్ట్రాన్ లోహం యొక్క ధన అయాన్తో అభిఘాతం చెందే వరకు త్వరణం చెంది దాని డ్రిఫ్ట్ వడిని పెంచుకొంటుంది. అభిఘాతం తరువాత తన డ్రిఫ్ట్ వడిని కోల్పోతుంది. కాని త్వరణం చెందడం ఆరంభం అవుతుంది. డ్రిఫ్ట్ వడి పెరుగుతుంది. తిరిగి అభిఘాతానికి లోనవుతుంది. ఇదే క్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సరాసరిగా, ఎలక్ట్రాన్లు డ్రిఫ్ట్ వడిని మాత్రమే పొందుతాయి.

c) ఎందుకంటే, ఎలక్ట్రాన్ సాంద్రత సంఖ్య చాలా పెద్దది ~ 1029 m-3.

d) అర్థరహితం. ఎలక్ట్రాన్ల అధిక అనియత వేగాలతో డ్రిఫ్ట్వేగం అధ్యారోపితం అవుతుంది.

e) విద్యుత్ కేత్రం లేనప్పుడు, పథాలు సరళరేఖలు, విద్యుత్ క్షేత్రం ఉన్నప్పుడు పథాలు సాధారణంగా వక్రాలు.

ప్రశ్న 3.
ఒక విద్యుత్ టోస్టర్ (toaster) లో వేడిచేయడానికి నిక్రోమ్ తీగని (heating element) ఉపయోగించుకొంది. గది ఉష్ణోగ్రత (27.0 °C) వద్ద దాని గుండా ఉపేక్షించదగిన స్వల్ప విద్యుత్ ప్రవహించినప్పుడు దాని నిరోధాన్ని 75.3 Ωగా కనుక్కొన్నారు. ఆ టోస్టర్ను 230 V ప్రధాన సరఫరాకి కలిపినప్పుడు విద్యుత్ ప్రవాహం స్థిరత్వం ఏర్పరచుకొని, కొన్ని సెకన్ల తరువాత 2.68 A నిలకడగా గల విలువకు చేరింది. నిక్రోమ్ తీగ నిలకడ ఉష్ణోగ్రత ఎంత ? పరిగణనలోకి తీసుకొన్న ఉష్ణోగ్రత అవధిపై సరాసరి ఉష్ణోగ్రత నిరోధ గుణకం విలువ 1:70 × 10-4 °C-1,
సాధన:
తీగ (heating element) ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం చాలా స్వల్పంగా ఉన్నప్పుడు, ఉష్ణ ఫలితాలను ఉపేక్షించవచ్చు. దాని ఉష్ణోగ్రత T1 గది ఉష్ణోగ్రత అంతం అవుతుంది. టోస్టర్ను సరఫరాకు కలిపినప్పుడు, తొలి ప్రవాహం, నిలకడ విలువ 2.68 A కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాని విద్యుత్ ప్రవాహం వల్ల ఉష్ణ ఫలితం ఏర్పడి ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనితో నిరోధం పెరిగి విద్యుత్ ప్రవాహం కొద్దిగా తగ్గుతుంది. ఇంకా ఉష్ణోగ్రత పెరగకుంటే, కొద్ది సెకన్లలోనే నిలకడ స్థితికి చేరుతుంది. తీగ నిరోధం, తీసుకొన్న విద్యుత్ ప్రవాహం రెండూ నిలకడ విలువలను పొందుతాయి. నిలకడ ఉష్ణోగ్రత T2 వద్ద, నిరోధం R2 అనుకొంటే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 79

అందువల్ల, వేడెక్కే తీగ నిలకడ ఉష్ణోగ్రత (విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం, పరిసరాలకు అయ్యే ఉష్ణ నష్టానికి సమానం అయినప్పుడు) విలువ 847 °C.

ప్రశ్న 4.
ఒక ప్లాటినం నిరోధపు థర్మామీటర్ లోని ప్లాటినం తీగ నిరోధం మంచు (ice point) బిందువు వద్ద 5 Ω, నీటి ఆవిరి (steam point) బిందువు వద్ద 5.39 Ω. ఈ థర్మామీటర్ను ఒక ఉష్ణతాపకంలోకి ప్రవేశపెట్టినప్పుడు ప్లాటినం తీగ నిరోధం 5.795 Ω. తాపకం ఉష్ణోగ్రతను లెక్కించండి.
సాధన:
R0 = 5 Ω, R100 = 5.23 Ω, Rt = 5.795 Ω
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 80

ప్రశ్న 5.
నిరోధకాల ఒక జాలం, (network) ను 10 అంతర్నిరోధం గల 16 V బ్యాటరీకి పటంలో చూపినట్లు సంధానం చేశారు :
a) జాలం తుల్య నిరోధాన్ని గణించండి.
b) ప్రతీ నిరోధకంలో విద్యుత్ ప్రవాహాన్ని రాబట్టండి.
c) VAB VBC, VCD వోల్టేజి పాతాలను పొందండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 81
సాధన:
a) ఈ జాలం నిరోధకాల శ్రేణి, సమాంతర సంయోగం. మొదటి రెండు 4 Ω నిరోధకాలు సమాంతరంగా కలవు. వీటి ఫలితం = [(4 × 4)/ (4 + 4)] Ω = 2 Ω నిరోధానికి తుల్యమవుతుంది.

అదే విధంగా, 122, 62 నిరోధకాలు సమాంతరంగా కలవు. వీటి ఫలితం = [(12×6) / (12 + 6)] Ω = 4Ω నిరోధానికి తుల్యమవుతుంది. జాలం తుల్య నిరోధం R ను పై రెండు నిరోధకాల (2Ω, 4Ω) ను 12 తో శ్రేణిని కలిపి రాబట్టవచ్చు.
R = 2Ω + 4Ω + 1Ω = 7Ω

b) వలయంలో మొత్తం విద్యుత్ ప్రవాహం అనుకొంటే,
I = \(=\frac{\varepsilon}{R+r}=\frac{16 V}{(7+1) \Omega}\)

A, B ల మధ్య నిరోధకాలను పరిగణించండి. ఆ రెండింటిలో 4 Ω నిరోధం గల ఒక దానిలో విద్యుత్ I1 అనుకొంటే, రెండవ దానిలో విద్యుత్ I2 అవుతుంది.
I1 × 4 = I1 × 4
అంటే, I1 = I2 మరో విధంగా చూస్తే రెండు భుజాల సౌష్టవం వల్ల కూడా ఇది స్పష్టం. కాని I1 + I2 = I = 2A. కాబట్టి, I1 = I2 = IA

ప్రతీ 4 Ω నిరోధకంలోని విద్యుత్ ప్రవాహం 1 A, B, C ల మధ్య గల 1 Ω నిరోధకంలోని విద్యుత్ ప్రవాహం 2 A అవుతుంది. ఇప్పుడు C, D ల మధ్య గల రెండు నిరోధకాలను తీసుకొంటే, 12 Ω నిరోధకంలో విద్యుత్ ప్రవాహం I3, 6 Ω నిరోధకంలో I4 అనుకోండి.
I3 × 12 = I4 × 6 i. e., I4 = 2I3
కానీ, I3 + I4 = I = 2A
అందువల్ల I3 = (\(\frac{2}{3}\))A, I4 = (\(\frac{4}{3}\))A
అంటే 12Ω నిరోధకంలో విద్యుత్ ప్రవాహం (2/3) A, అదే సమయంలో 6Ω నిరోధకంలో విద్యుత్ ప్రవాహం (4/3) A.

c) AB కొనల మధ్య వోల్టేజి పాతం, VAB = I1 × 4 = 1 A × 4Ω = 4 V.
ఈ విలువను A, B ల మధ్య గల మొత్తం విద్యుత్ ప్రవాహాన్ని, A, B ల మధ్య గల తుల్య నిరోధంతో గుణించి కూడా రాబట్టవచ్చు. అంటే,
VAB = 2A × 2 Ω =4V
BC కొనల మధ్య వోల్టేజి పాతం,
VBC = 2A × 1 Ω = 2V
CD కొనల మధ్య వోల్టేజి పాతం,
VCD = 12 Ω × I3 = 12Ω × (\(\frac{2}{3}\)) A = 8 V.

ఈ విలువను C, D ల మధ్యగల మొత్తం విద్యుత్ ప్రవాహాన్ని, C, D ల మధ్య తుల్య నిరోధంతో గుణించి రాబట్టవచ్చు. అంటే, VCD = 2 A × 4 Ω = 8 V

AD కొనల మధ్య మొత్తం వోల్టేజి పాతం, 4 V+ 2 V + 8 V = 14 V అని గమనించండి. ఘటం కొనల మధ్య వోల్టేజి, (టెర్మినల్ వోల్టేజి) 14 V. అదే సమయంలో దాని emf 16 V. వోల్టేజిలో కలిగే నష్టం (= 2 V), ఈ నష్టం ఘటం అంతర్నిరోధం 1Ω వల్ల జరుగుతుంది [2 A × 1Ω = 2 V).

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 6.
ఒక్కొక్కటి 1Ω నిరోధం గల 12 నిరోధకాలను కలిగి ఉన్న ఘనాకార జాలం కర్ణాల ఎదురెదురు కొనల మధ్య ఉపేక్షించదగిన అంతర్నిరోధం ‘గల 10 V బ్యాటరీని సంధానం చేశారు. జాలం తుల్య నిరోధాన్ని, ఘనం ప్రతీ అంచు ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 82
సాధన:
ఈ జాలాన్ని నిరోధకాల సరళశ్రేణి, సమాంతర సంయోగాలకు తగినట్లుగా రూపాంతరం చెందించలేం. అయితే, ఇచ్చిన లెక్కలో స్పష్టమైన సౌష్టవం ఉంది కాబట్టి దానిని ఉపయోగించుకొని జాలం తుల్య నిరోధాన్ని పొందవచ్చు.

AA’, AD, AB పథాలను స్పష్టంగా, సౌష్టవంగా ఉండేటట్లు జాలంలో ఉంచారు. కాబట్టి, ప్రతీ దానిలోని విద్యుత్ ప్రవాహం I సమానంగా ఉండాలి. ఇంకా A’, B, D కొనల వద్ద లోపలికి ప్రవేశించే విద్యుత్ ప్రవాహం I బయటికి పోయే రెండు శాఖల్లోకి తప్పకుండా రెండు సమాన భాగాలుగా విడిపోవాలి.

ఈ విధంగా లెక్కలోని సౌష్టవం, కిర్కాఫ్ మొదటి నియమాన్ని ఉపయోగించి ఘనం 12 అంచులలోని విద్యుత్ ప్రవాహాన్ని I పదాలలో సులభంగా రాయవచ్చు. తరువాత ABCCEA సంవృత లూపు తీసుకొని కిర్కాఫ్ రెండవ నియమాన్ని అనువర్తించండి :

-IR – (1/2) IR – IR + ε = 0

ఇక్కడ R ప్రతీ అంచు నిరోధం, ε ఘటం emf. అందువల్ల, ε = \(\frac{5}{2}\)IR
జాలం తుల్య నిరోధం Req అనుకొంటే, Req = \(\frac{\varepsilon}{3I}=\frac{5}{6}\)R
R = 1Ω కు Req = (5/6) Ω, ε = 10V అయితే జాలంలోని మొత్తం విద్యుత్ ప్రవాహం (=3I)
3I = 10V/(5/6) Ω = 12 A, అంటే, I = 4 A

ప్రశ్న 7.
పటంలో చూపిన జాలంలో ప్రతీ శాఖలోని విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 83
సాధన:
జాలం ప్రతీ శాఖ తెలియని విద్యుత్ ప్రవాహంతో నిర్దేశితమై ఉంది. వీటిని కిర్కాఫ్ నియమాలను ఉపయోగించి కనుక్కోవలసి ఉంది. మొదట తెలియని వాటి సంఖ్యను తగ్గించడానికి, ప్రతీ శాఖలో తెలియని విద్యుత్ ప్రవాహాన్ని నిర్దేశించడానికి ప్రతీ సంధి వద్ద కిర్కాఫ్ మొదటి నియమాన్ని ఉపయోగించాలి. అప్పుడు మనకు I1, I2, I3 అనే మూడు తెలియనివి – ఉన్నాయి. వీటిని మూడు వివిధ సంవృత లూప్లు కిర్కాఫ్ రెండవ నియమాన్ని అనువర్తించి కనుక్కోవచ్చు. ADCA సంవృత లూప్కు కిర్కాఫ్ రెండవ నియమాన్ని ఉపయోగిస్తే,
10 – 4(I1 – I2) + 2 (I2 + I3 – I1) – I1 = 0
అంటే, 7I1 – 6I2 – 2I3 = 10 → (1)

ABCA సంవృత వలయానికి ఉపయోగిస్తే,
10 -4I2 – 2 (I2 + I3) – I1 = 0
అంటే, I1 + 6I2 + 2I3 = 10 → (2)

BCDEB సంవృత వలయానికి ఉపయోగిస్తే,
5 – 2 (I2 + I3) – 2 (I2 + I3 – I1) = 0
అంటే, 2I1 – 4I2 – 4I3 = -5. → (3)

సమీకరణాలు (1, 2, 3) మూడు తెలియని విలువలు కలిగి ఉన్న సమకాలిక సమీకరణాలు. వీటిని సాధారణ. పద్ధతుల్లో సాధించినట్లయితే, కింది విలువలు వస్తాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 84

మిగతా సంవృత లూప్లకు కిర్కాఫ్ రెండవ నియమాన్ని అనువర్తించినట్లయితే, ఏ మాత్రం అదనపు స్వతంత్ర సమీకరణాన్ని సమకూర్చదని సులభంగా నిరూపితమైంది. అంటే, పై విద్యుత్ ప్రవాహ విలువలు జాలంలోని ప్రతీ సంవృత లూప్కు కిర్కా రెండవ నియమాన్ని సంతృప్తిపరుస్తాయి. ఉదాహరణకు, సంవృత లూప్ BADEB కి మొత్తం వోల్టేజి పాతం
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 85

కిరాఫ్ రెండవ నియమం ప్రకారం అవసరమైనట్లు, ఇది శూన్యానికి సమానం.

ప్రశ్న 8.
వీటన్ బ్రిడ్జి నాలుగు భుజాలు ఈ క్రింది విధంగా నిరోధాలను కలిగి ఉన్నాయి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 86
AB = 100Ω, BC = 10Ω, CD = 5Ω, DA= 60Ω BD కొనల మధ్య 15Ω నిరోధం గల గాల్వనామీటర్ను కలిపారు. AC ల మధ్య 10 V పొటెన్షియల్ భేదం కొనసాగించినప్పుడు, గాల్వనామీటర్ ద్వారా విద్యుత్ . ప్రవాహాన్ని కనుక్కోండి.
సాధన:
BADB వల (mesh) ను పరిగణనలోకి తీసుకొంటే,
100I1 + 15Ig – 60I2 = 0 లేదా 20I1 + 3Ig – 12I2 = 0 → (1)

BCDB వలను పరిగణనలోకి తీసుకొంటే,
10(I1 – Ig) – 15Ig – 5(I2 + Ig) = 0
10I1 – 30Ig – 5I2 = 0
2I1 – 6Ig – I2 = 0 → (2)

ADCEA వలను పరిగణనలోకి తీసుకొంటే,
60I2 + 5(I2 + Ig) = 10
65I2 + 5Ig = 10
13I2 + Ig = 2
సమీకరణం (2) ని 10 తో గుణిస్తే,
20I1 + 60Ig – 10I2 = 0
సమీకరణాలు (4) మరియు (1) ల నుంచి
63Ig – 2I2 = 0
I2 = 31.5Ig

పై I2 విలువను సమీకరణం (3) లో ప్రతిక్షేపిస్తే,
13(31.5Ig) + Ig = 2
410.5 Ig = 2
Ig = 4.87 mA.

ప్రశ్న 9.
మీటరు బ్రిడ్జిలో A నుంచి 36.7 cm ల దూరం వద్ద శూన్య బిందువును కనుక్కొన్నారు. ఇప్పుడు 12Ω నిరోధాన్ని S కి సమాంతరంగా కలిపితే, శూన్య బిందువు 51.9 cm వద్ద కలుగుతుంది. R, S విలువలను కనుక్కోండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 87
సాధన:
మొదటి సంతులన బిందువు నుంచి కింది విధంగా వస్తుంది.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 88
సమీకరణం (1) నుంచి R/S విలువ పై సమీకరణంలో ప్రతిక్షేపిస్తే,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 89
దీని నుంచి S = 13.5 Ω వస్తుంది. పై R/S విలువను ఉపయోగిస్తే, మనకు R = 6.86Ω వస్తుంది.

AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు

ప్రశ్న 10.
RΩ ల ఒక నిరోధం పొటెన్షియోమీటర్ నుంచి విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుంటుంది. పొటెన్షియోమీటర్ కలిగి ఉండే మొత్తం నిరోధం R0 Ω. పొటెన్షియోమీటరు సరఫరా అయిన వోల్టేజి V. జాకీ (తీగపై జారుతూ తీగతో స్పర్శలో ఉండేది) పొటెన్షియోమీటర్ మధ్యలో ఉన్నప్పుడు, R కొనల మధ్య ఉండే వోల్టేజికి సమీకరణాన్ని ఉత్పాదించండి.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 90
సాధన:
జాకీ పొటెన్షియోమీటర్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే A, B బిందువుల మధ్య నిరోధం మొత్తం నిరోధంలో సగం (R0/2) ఉంటుంది. అందువల్ల A, B ల మధ్య గల మొత్తం నిరోధం R1 అనుకుంటే, దీనిని కింది సమాసంగా ఇవ్వచ్చు.
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 91

A, C. మధ్య గల మొత్తం నిరోధం A, B, B, C ల మధ్య గల నిరోధాల మొత్తానికి సమానం. అంటే, R1 + R0 /2
∴ పొటెన్షియోమీటర్ ద్వారా ప్రవహించే విద్యుత్,
AP Inter 2nd Year Physics Study Material Chapter 6 ప్రవాహ విద్యుత్తు 92

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 5th Lesson పారిశ్రామిక రంగం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 5th Lesson పారిశ్రామిక రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశములో పారిశ్రామిక రంగము యొక్క పాత్రను వివరింపుము.
జవాబు:
భారతదేశములో పారిశ్రామికీకరణ పాత్ర: అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశానికి పారిశ్రామికీకరణ అత్యావశ్యకము. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి చేయబడి, సరసమైన ధరలకు అందుబాటులో ఉండు యంత్రములు, పరికరములపై ప్రధాన రంగాలైన వ్యవసాయం, సేవల రంగం ఆధారపడినది. పారిశ్రామికీకరణ ప్రజల ఆదాయాలను పెంచి తత్ఫలితముగా వారి జీవనప్రమాణ స్థాయి పెరుగుటకు తోడ్పడును. పారిశ్రామికీకరణ క్రింది ప్రయోజనాలను కల్పిస్తుంది.
పారిశ్రామికీకరణ ప్రయోజనములు
AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం 1

1) ఆదాయ వృద్ధి: పారిశ్రామికీకరణ దేశంలో జాతీయాదాయాన్ని త్వరితగతిన పెంచుతుంది. వనరుల సద్వినియోగానికి దోహదం చేస్తుంది. 2012వ సంవత్సరంలో తలసరి ఆదాయములు జర్మనీలో 44,010 $, జపాన్లో 47,870 $, U.K. 38,250 $, USA.50,120 $ భారతదేశములో తక్కువగా 1,530 $ గా ఉన్నది.

2) ఆర్థిక వ్యవస్థ నిర్మాణములో మార్పు: వెనుకబడిన దేశాలలో పారిశ్రామికీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైన మార్పులు అవసరము. పారిశ్రామికీకరణ ఫలితాలు వ్యవసాయ, సేవలరంగ అభివృద్ధికి తోడ్పడుతూ, ఉపాధి, ఉత్పత్తి ఆదాయాలను పెంచును. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 13.9 శాతము, పారిశ్రామిక రంగం వాటా 26.2 శాతం, సేవల రంగం వాటా 59.9 శాతముగా ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

3) అధిక ఆదాయ వర్గాల డిమాండు తీర్చుట: అధిక ఆదాయ వర్గాల వారు ఒక పరిమితి దాటిన తర్వాత పారిశ్రామిక వస్తువులను డిమాండ్ చేస్తారు. (రిఫ్రిజిరేటర్, ఎ.సి., మొదలగునవి) అవసరాలు తీరిన తరువాత అధిక ఆదాయ వర్గాలు తమ ఆదాయాన్ని తయారీ వస్తువులపై ఖర్చు చేస్తారు. ధనవంతుల విషయంలో తయారీ వస్తువుల డిమాండ్ ఆదాయ వ్యాకోచంగానూ, వ్యవసాయ వస్తువుల డిమాండ్ ఆదాయ అవ్యాకోచముగా ఉండును. ప్రజల డిమాండుకు అనుగుణంగా తయారీ వస్తువులను అందించుటకు పారిశ్రామికీకరణకు అవసరము.

4) విదేశీ వ్యాపారములో అభివృద్ధి: ప్రాథమిక వస్తువుల ధరలలో వచ్చు ఒడుదుడుకులను ఎదుర్కొనుటకు పారిశ్రామికీకరణ అవసరము. ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేస్తూ తయారీ వస్తువులను దిగుమతి చేసుకుంటారు. మన దేశములో ప్రాథమిక వస్తువుల ధరలు స్థిరంగానూ లేదా తగ్గే అవకాశముంటుంది. తయారీ రంగ వస్తువుల ధరలు మాత్రం హెచ్చుగా ఉంటాయి. ఇది అంతర్జాతీయ వ్యాపార ప్రతికూలతలకు కారణము. ఇటువంటి దేశాలు దిగుమతి ప్రత్యామ్నాయ, ఎగుమతి ప్రోత్సాహక పారిశ్రామిక విధానాన్ని అనుసరించాలి.

5) ఉద్యోగ అవకాశాల కల్పన: భారతదేశములో అధిక జనాభా పెరుగుదల వలన శ్రామిక మిగులు ఎక్కువ. వ్యవసాయ రంగంలో అల్ప ఉద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువ. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచిన ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించవచ్చును.

6) సాంకేతిక పురోగతి: పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచి నూతన యంత్రాలు, పరికరాలను ఎక్కువగా ఉత్పత్తి చేసి తక్కువ ధరలకు అందజేయగలిగిన వాటిని ఉత్పత్తి రంగంలో ప్రవేశపెట్టి ఉత్పత్తిని పెంచవచ్చును. నూతన పరిశ్రమల ప్రారంభానికి దోహదపడతాయి. అనేక బహుళార్థసాధక ప్రాజెక్టులు, రైల్వేలు, విద్యుచ్ఛక్తి మొదలైన అవస్థాపన సౌకర్యాలు పెరుగుతాయి. సాంకేతిక ప్రగతి జరుగుతుంది.

7) ఆర్థిక వ్యవస్థ బలపడుటకు:

  • భవిష్యత్ ఆర్థిక పురోగతికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలు పెరగటానికి పరిశ్రమలు దోహదం చేస్తాయి.
  • వ్యవసాయరంగ అభివృద్ధికి అవసరమైన వ్యవసాయ పనిముట్లు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, రవాణా సదుపాయాలు వృద్ధి చెందుట ద్వారా ఉత్పత్తి పెరుగును.
  • బహుముఖంగా ఆర్థిక వ్యవస్థ విస్తృతం చేయుటకు పారిశ్రామికీకరణ అవసరము.
  • దేశ ఆర్థిక భద్రతకు పారిశ్రామికీకరణ ముఖ్యము. దేశ రక్షణకు అవసరమైన యుద్ధ సామాగ్రిని ఉత్పత్తి చేయుటలో స్వయం సమృద్ధిని సాధించుట అవసరం.

ప్రశ్న 2.
భారతదేశములో 1948 పారిశ్రామిక విధాన తీర్మానమును సమీక్షింపుము.
జవాబు:
1948 పారిశ్రామిక విధాన తీర్మానము: స్వాతంత్ర్యము పొందిన తరువాత త్వరిత పారిశ్రామికీకరణ 1948వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన భారత ప్రభుత్వము సమగ్ర, క్రమబద్ధమైన మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. ఈ తీర్మానము భారతదేశానికి మిశ్రమ ఆర్థికవ్యవస్థ అవసరముందని గుర్తించింది. ఇందులో పబ్లిక్ రంగము యొక్క ప్రయివేటు రంగము యొక్క పాత్రలు స్పష్టీకరించడమైనది.

లక్ష్యాలు:

  1. న్యాయమైన, సమాన అవకాశాలు అందరికీ కల్పించబడడం.
  2. దేశములో అంతర్గతముగా ఉన్న వనరులను పూర్తిగా వినియోగములోకి తెచ్చి, ప్రజల జీవన ప్రమాణాన్ని అభివృద్ధి చేయడం.
  3. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా త్వరగా ఉత్పత్తి పెంచడం.
  4. సామాజిక సేవలో అందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించడము.

ఈ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని 1948 పారిశ్రామిక విధానము పరిశ్రమలను నాలుగు విధాలుగా విభజించటం జరిగింది.
I. ప్రభుత్వ ఏకస్వామ్యం గల పరిశ్రమలు: ఈ జాబితాలో 3 రకాల పరిశ్రమలు ఉన్నాయి. అవి: 1) దేశరక్షణ, తత్సంబంధ పరిశ్రమలు, ఆయుధ సామాగ్రి, ఆయుధాల ఉత్పత్తి, 2) అణుశక్తి ఉత్పత్తి, నియంత్రణ,. 3) రైల్వే రాకపోకలు. వీటి నిర్వహణ, యాజమాన్యము ప్రభుత్వానిదే.

II. క్రమేణ ప్రభుత్వ యాజమాన్యం క్రిందికి వచ్చే పరిశ్రమలు: ఈ జాబితాలో బొగ్గు, ఇనుము, ఉక్కు, విమానాల ఉత్పత్తి, నౌకా నిర్మాణము, టెలిఫోన్, టెలిగ్రాఫ్, ఖనిజపు నూనెలు. ఇవి మౌళిక, కీలక పరిశ్రమలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

III. ప్రైవేటు రంగానికి వదిలిపెట్టిన పరిశ్రమలు: పరిశ్రమలు ప్రైవేట్ రంగములో ఉన్నను, ప్రభుత్వ నియంత్రణకు, నిబంధనలకు లోబడిన పరిశ్రమలు. ఇందులో కొన్ని మౌళికమైన పరిశ్రమలు ఉన్నాయి. మోటారు కార్లు, ట్రాక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, భారీ యంత్రసామాగ్రి, యంత్ర పనిముట్లు, ఎరువులు మొదలైనవి. వీటిని ప్రైవేట్ రంగము నిర్వహించినప్పటికీ వీటిలో ప్రభుత్వ నియంత్రణ, నిబంధనలకు లోబడి ఉత్పత్తి జరుగుతుంది.

IV. పైన తెల్పిన పరిశ్రమలు మినహా మిగిలినవన్నీ ప్రయివేట్ రంగానికి వదిలివేయడం జరిగింది. వీటి పై ప్రభుత్వ సాధారణ అజమాయిషీ ఉంటుంది.

V. ఈ పారిశ్రామిక విధానములో కుటీర, చిన్నతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలకు పరిపూరకంగా స్థాపించడానికి, అవి సహకార సంఘాల ఆధ్వర్యంలో స్థాపించవచ్చునని తెలియజేసినది. సంస్థలలో శ్రామికులకు వాటా పెంచి, వారిని భాగస్వాములుగా చేయాలని చెప్పింది.

VI. ఈ పారిశ్రామిక విధానంలో ముఖ్యంగా విదేశీ మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని ప్రభుత్వము భావించింది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక పద్ధతులు మనదేశ త్వరిత పారిశ్రామికీకరణకు అవసరమని ప్రభుత్వము గుర్తించినది. విదేశీ మూలధనంపై, దేశ సంక్షేమం, లాభాల దృష్ట్యా, ప్రభుత్వ నియమ నిబంధనలు ఉంటాయి.

ప్రశ్న 3.
1956 పారిశ్రామిక విధాన తీర్మానమును గురించి వివరింపుము.
జవాబు:
1956 పారిశ్రామిక విధాన తీర్మానము: మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అనుకున్న వృద్ధిరేటును భారతదేశం సాధించలేదు. అయితే 1948 తరువాతనే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు గల రాజ్యాంగం రూపొందించటం, సామ్యవాద పద్ధతిలో సాంఘిక, ఆర్థిక మార్పులను తేవచ్చునని, పార్లమెంట్ భావించడం, అనుకూల ఉత్సాహపూరిత వాతావరణములో రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామికీకరణ – భారీ, మౌళిక పరిశ్రమల స్థాపనకు కావలసిన ఏర్పాట్ల కోసం 1956 పారిశ్రామిక విధాన తీర్మానమును రూపొందించడం జరిగింది.

1956 పారిశ్రామిక విధాన తీర్మానము లక్ష్యాలు:

  1. ఆర్థికాభివృద్ధిని శీఘ్రతరము చేయడానికి, పారిశ్రామికీకరణను త్వరితం చేయడం.
  2. భారీ యంత్ర నిర్మాణ పరిశ్రమలను అభివృద్ధి పరచడము.
  3. విశాలమైన, అభివృద్ధికరమైన సహకార రంగాన్ని నిర్మించుట.
  4. ప్రజల ఆదాయ సంపదలలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడము.
  5. ప్రాంతీయ అసమానతలను తొలగించడము.
  6. సామ్యవాదరీతి సమాజ స్థాపన.
  7. ఏకస్వామ్యాలను నిరోధించడం, ఆర్థికశక్తి కేంద్రీకృతము కావటాన్ని నిలుపుదల చేయటము, దాన్ని చిన్న ఉత్పత్తిదారులకు వికేంద్రీకరించటం.

1956 పారిశ్రామిక విధాన తీర్మానము ప్రధాన అంశాలు: ఈ పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించారు.
ఎ) గ్రూపు పరిశ్రమలు: ఈ వర్గములో 17 పరిశ్రమలున్నాయి. భవిష్యత్తులో ఈ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఈ వర్గ పరిశ్రమలైన ఇనుము, ఉక్కు, అణుశక్తి, భారీ యంత్రాలు, బొగ్గు, ఖనిజపు నూనెలు, రైల్వే, రవాణా, టెలిఫోన్, టెలిగ్రాఫ్, విద్యుచ్ఛక్తి మొదలగునవి.

బి) గ్రూపు పరిశ్రమలు: ఈ వర్గములో 12 పరిశ్రమలు ఉన్నాయి. ఈ వర్గములోని పరిశ్రమలను, ఎక్కువగా కొత్త సంస్థలను ప్రభుత్వమే స్థాపించి తన భాగస్వామ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే ప్రైవేటు రంగము ఇందులోని పరిశ్రమలను స్థాపించడానికి నిరాకరించడము జరగదు.

సి) గ్రూపు పరిశ్రమలు: పై రెండు వర్గాల్లో పేర్కొనబడని పరిశ్రమలు’ సి వర్గములో ఉంటాయి. వీటిని ప్రైవేట్ రంగము చొరవకు, సాహసానికి వదిలి పెట్టడము జరిగినది.

డి) ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు: ఈ తీర్మానము ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పరస్పరము సహకరించుకుంటాయి. అయితే ప్రభుత్వము ఏ రంగములోనైనా సంస్థలను స్థాపించవచ్చును. అలాగే ‘ఎ’ వర్గము మరియు ‘బి’ వర్గములో గల కొన్నింటిని మినహాయించి మిగిలిన ఏ ఇతర పరిశ్రమలలోనైనా ప్రయివేట్ రంగాన్ని అనుమతించవచ్చును.

ఇ) కుటీర మరియు చిన్నతరహా పరిశ్రమలు: కుటీర, చిన్నతరహా పరిశ్రమల ప్రాముఖ్యతను గుర్తించి, వీటిని ప్రోత్సహించడానికిగాను పెద్ద పరిశ్రమల ఉత్పత్తులపై పరిమితి విధించడం, విచక్షణాత్మక పన్నుల విధానాన్ని అనుసరించడం, సబ్సిడీలను ఇవ్వడము, ఆధునికీకరణకు తోడ్పడడం మొదలైన చర్యల ద్వారా వీటిని ప్రోత్సహించవలెను.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ఎఫ్) ప్రాంతీయ అసమానతలను తగ్గించడం: దేశంలోని అన్ని ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాలను కల్పించడం ద్వారా, వికేంద్రీకరణకు అవకాశము కల్పిస్తూ, ప్రాంతీయ అసమాతలను తగ్గించాలని ఈ తీర్మానములో పేర్కొనడం జరిగింది.

జి) కార్మిక పాత్ర: శ్రామికులు పనిచేసే స్థలములో సౌకర్యాల కల్పన, వారి సామర్థ్యాన్ని పెంచవలసిన ఆవశ్యకతను ఈ తీర్మానము గుర్తించింది. యాజమాన్యం, శ్రామికుల మధ్య ముఖ్య సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

హెచ్) విదేశీ పెట్టుబడి: పారిశ్రామిక తీర్మానము వేగవంతము చేయడానికి భారత సాంకేతిక నిపుణులకు, నిర్వాహకులకు శిక్షణను ఇవ్వడానికి విదేశీ మూలధనాన్ని వినియోగించాలని ఈ తీర్మానము సూచించడము జరిగింది. అయితే పరిశ్రమల యాజమాన్యం, నియంత్రణ భారతీయుల చేతులలోనే ఉండాలని స్పష్టం చేసింది.

1956 పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యంగా భావించవచ్చును. అయితే సామ్యవాదరీతి సమాజస్థాపన, మిశ్రమ ఆర్థికవ్యవస్థ నిర్మాణం, ఈ తీర్మానంలో ప్రధానంగా చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వరంగ విస్తరణకు ఈ తీర్మానము ఎక్కువ ప్రాముఖ్యతను కల్పించింది.

ప్రశ్న 4.
భారతదేశములో 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానమును విమర్శనాత్మకంగా పరిశీలింపుము. [Mar ’16]
జవాబు:
1991 నూతన పారిశ్రామిక విధానము: దేశ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక, ఇతర రంగాలలో ఉన్న స్తబ్దతను తొలగించడానికి, ఆర్థిక వ్యవస్థను చలనస్థితికి తీసుకొనివచ్చి అభివృద్ధి పథములో నడిపించేందుకు ఒక నూతన పారిశ్రామిక విధానము అవసరము అయింది. దీనిని పూరించుటకు 1991 పారిశ్రామిక విధానము అమలులోకి వచ్చింది.

లక్ష్యాలు:

  1. అప్పటికే అనుభవిస్తున్న ప్రయోజనాల ఆధారంగా పారిశ్రామిక వ్యవస్థను నిర్మించటం.
  2. వ్యవస్థలోని బలహీనతలు, వక్రీకరణలు పారిశ్రామిక వృద్ధికి ఆటంకాన్ని కలిగించకుండా సరిదిద్దుట.
  3. పరిశ్రమలు తమ ఉత్పాదకశక్తిని పెంచి, లాభదాయకమైన ఉపాధి అవకాశాలను పెంచడము.
  4. సాధించిన (పొందిన) సాంకేతిక విజ్ఞానము ప్రపంచస్థాయి పోటీకి దీటుగా ఉండటం.
  5. భారత ఆర్థికరంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమైక్యపరచటం.

1991 పారిశ్రామిక విధాన తీర్మాన ప్రధాన అంశాలు: 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానములోని ప్రధానాంశాలను ఈ క్రింది విధముగా తెలియజేయవచ్చు.
1) డిలైసెన్సింగ్: దీని ప్రకారం పరిశ్రమల స్థాపన, నిర్వహణలో లైసెన్సు పొందవలసిన అవసరము లేదు. తప్పనిసరిగా లైసెన్సు పొందవలసిన పరిశ్రమలకూ పరిధిని తగ్గించారు. అలాగే వినియోగ సంబంధమైన వస్తువులు, చిన్నతరహా సంస్థలు ఉత్పత్తి చేసే వివిధ ఉత్పతులకు లైసెన్సింగ్ అవసరము లేదు. అయితే కొన్ని ముఖ్యమైన పరిశ్రమలకు లైసెన్సు అవసరము. ఉదా: బొగ్గు, పెట్రోలియం మొదలగునవి.

2) ప్రభుత్వ రంగమునకు ప్రత్యేక వసతి: ముఖ్యమైన, వ్యూహాత్మకమైన పరిశ్రమ రంగాలైన వాటికి ప్రత్యేక వసతి అవసరం. ఉదా: రక్షణ పరికరాలు, అణుశక్తి, ఖనిజపు నూనెలు, రైల్వే రవాణా మొదలగునవి. అయితే ప్రభుత్వ రంగ పరిధి కుదింపబడినది. ఈ చర్య ద్వారా ప్రైవేటు రంగ పరిధిని విస్తృత పరచడము జరిగినది.

3) మూలధన వస్తువుల దిగుమతి: దిగుమతుల వల్ల విదేశీ మారకద్రవ్యం కోల్పోవడం జరుగును. కావున దిగుమతుల మీద ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. మూలధన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఆమోదించడం జరుగును.

4) స్థల విధానము: 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలలో పరిశ్రమలు ఎక్కడైనా స్థాపించుకొనవచ్చును. అయితే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలలో కాలుష్యము కలిగించే పరిశ్రమలు స్థాపించుటకు నగరమునకు 25 కిలోమీటర్ల వెలుపలకు స్థాపించవలెను. పరిశ్రమల కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను తప్పనిసరిగా తీసుకొనవలెను.

5) నిలుపుదల చేసి తిరిగి మరలా ఉత్పత్తిని కొనసాగించే గుణము గల పరిశ్రమలు: ఇలాంటి పరిశ్రమల విషయంలో చట్టపరంగా విత్త సంస్థల నుంచి ఋణాలను పొంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి, దీర్ఘకాలిక నిబంధనలు వర్తిస్తాయి. అయితే ఇలాంటి పరిశ్రమల యాజమాన్యానికి వాటాలు అవసరము.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

6) విదేశీ పెట్టుబడి విధానము: విదేశీ మారక ద్రవ్యార్జన దృష్ట్యా విదేశీ పెట్టుబడులు అధిక ప్రాధాన్యత గల రంగాలలో అవసరమని ప్రభుత్వం భావిస్తే ఆ రంగాలలో మూలధన పెట్టుబడులు 51% వరకు అనుమతిస్తుంది. ఈ పెట్టుబడికి సంబంధించిన లావాదేవీలను చర్చించేందుకు ప్రత్యేక అధికారాలు ఉన్న బోర్డును ఏర్పాటు చేస్తారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కొన్ని రంగాలకు మాత్రమే నిషేధించడమైనది. అవి:

  1. చిల్లర వ్యాపారము
  2. అణుశక్తి
  3. లాటరీ వ్యాపారము
  4. జూదము మరియు పందెము.

7) విదేశీ సాంకేతిక ఒప్పందాలు: 1991 తీర్మానం ప్రకారం విదేశీ సాంకేతిక విజ్ఞానం బదిలీ కోసం, ఒప్పందాల చెల్లింపు విషయంలో అధిక ప్రాధాన్యత గల పరిశ్రమలకు సంబంధించి ఒక కోటి రూపాయల వరకు, దేశీయ అమ్మకాలపై రాయల్టీ 5 శాతము వరకు, ఎగుమతులపై రాయల్టీ 8 శాతము వరకు రిజర్వుబ్యాంకు తక్షణమే ఆమోదిస్తుంది.

8) ప్రభుత్వ రంగ విధానము: ప్రభుత్వ రంగానికి దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తము పరిశ్రమలపై దృష్టిని పెట్టక, వాటికి ప్రత్యేకంగా కేటాయించిన పరిశ్రమలపై మాత్రమే అధికారము ఉంటుంది. నష్టపోయిన పరిశ్రమలను ప్రభుత్వము స్వాధీనము చేసుకుంటుంది. వీటి పునర్ నిర్మాణము కోసము పారిశ్రామిక విత్త పునర్నిర్మాణ మండలి (BIFR) అను సంస్థను ఏర్పాటు చేసింది.

9) MRTP చట్టము: 1991 తీర్మానం ప్రకారం MRTP పరిధిలోని సంస్థలు, కొత్త సంస్థల స్థాపనకు, ఉత్పత్తిని పెంచటానికి (సంస్థ విస్తరణకు), వేరొక సంస్థలో విలీనం కావటానికి ఎటువంటి అనుమతి పొందనవసరం లేదు. ఆర్థిక స్థోమత కేంద్రీకరణను, ఏకస్వామ్యాలను, అక్రమ వ్యాపార పద్ధతులను సమర్థవంతంగా నియంత్రించటానికి ఈ | తీర్మానం MRTP చట్టానికి సవరణలు ప్రతిపాదించినది. ఈ చట్టం పరిధిలోకి వచ్చే సంస్థల విషయంలో గరిష్ట ఆస్తుల పరిమితిని (1985 నుంచి ఈ పరిమితి గౌ 100 కోట్లు) తొలగించుట.

1991 పారిశ్రామిక విధానము వల్ల భారత పారిశ్రామిక అభివృద్ధి ఆశించిన రేటులో పొందటానికి మార్గము ఏర్పడింది. అయితే పరిశ్రమల లైసెన్సింగ్, విదేశీ సహాయము, పరిజ్ఞానము, ఉపయోగము, MRTP చట్ట సవరణ మొదలైన చర్యల ద్వారా ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందినది.

ప్రశ్న 5.
భారతదేశ జాతీయ తయారీ విధానమును గురించి వ్రాయుము.
జవాబు:
భారత ప్రభుత్వము – జాతీయ తయారీ విధానము: వ్యాపార నియంత్రణలను సడలిస్తూ దేశ ప్రయోజనాలను బలహీనపరచని విధంగా భారత జాతీయ తయారీ విధానాన్ని ప్రకటించడమైంది. తయారీ రంగాన్ని ప్రోత్సహించినట్లే సూక్ష్మ, చిన్నతరహా, మాధ్యమిక పరిశ్రమల ప్రాముఖ్యతను గుర్తించి ప్రోత్సహించుటకు సంకల్పించింది. సాంకేతికతను మెరుగుపరచుట, వాతావరణ పరిరక్షణ, స్నేహపూర్వక సాంకేతికత, పెట్టుబడి వాటాలలో ప్రభుత్వ జోక్యం ఉంటుంది. ప్రైవేటు రంగానికి కోశపరమైన ప్రోత్సాహకాల్ని కల్పించి, యువత ఎక్కువ ఉద్యోగాలను పొందే విధంగా నైపుణ్యాలను అభివృద్ధి పరచుట ఈ తయారీ విధానము యొక్క లక్ష్యము. వ్యవసాయమునకు ఉపయోగపడని భూములలో జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్లను ఏర్పాటు చేయుట ఈ విధానము లక్ష్యము.

జాతీయ తయారీ విధానము – లక్ష్యాలు:

  1. తయారీ రంగంలో 12 నుండి 14 శాతము మాధ్యమిక వృద్ధిరేటును సాధించుట.
  2. స్థూల జాతీయోత్పత్తిలో ప్రస్తుతము 16 శాతముగా ఉన్న తయారీ రంగపు వాటాను 2022 నాటికి 25
    శాతమునకు పెంచుట.
  3. తయారీ రంగంలో 2012 నాటికి 100 మిలియన్ల అదనపు ఉద్యోగాల కల్పన.
  4. తయారీ రంగంలో ఉపాధి అవకాశములను అందుకొనే విధంగా గ్రామీణ వలసదారులకు మరియు పట్టణ పేదరికానికి సరిపడినన్ని నైపుణ్యాలను కల్పించుట.
  5. ప్రపంచ పోటీని తట్టుకొనే విధంగా భారత తయారీ విధానాన్ని అభివృద్ధి పరచుట.
  6. తయారీ రంగంలో దేశీయ ఉత్పత్తి విలువలు మరియు సాంకేతిక పరిధిని పెంపొందించుట. దేశ జనాభాలో 60 శాతము మంది శ్రమైక జీవన లక్షణములను కలిగిన యవ్వనదేశము భారతదేశము. ఇప్పుడున్న శ్రామిక జనాభాకు రాబోయే దశాబ్ది కాలంలో 220 మిలియన్ల అదనపు శ్రామిక సప్లయ్ ఉండగలదని అంచనా. వీరిలో సగం మందికైనా లాభసాటి ఉద్యోగితను కల్పించునట్లు తయారీ రంగమును అభివృద్ధిపరచాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 6.
భారతదేశ పెట్టుబడుల ఉపసంహరణ విధానమును వివరింపుము.
జవాబు:
పెట్టుబడుల ఉపసంహరణ: ఉత్పాదక కార్యకలాపాలను ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగానికి బదిలీచేసే విధానమే ప్రైవేటీకరణ. ప్రభుత్వ రంగం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం జరుగును. నూతన ఆర్థిక విధానములో భాగంగా ప్రభుత్వము జూలై 1991 నుంచి పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని అనుసరిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలలో ఉత్పాదకత అల్పంగా ఉండుట. ఈ సంస్థలలో |నిర్వహణపరమైన లోపాలు చోటుచేసుకోవడం తదితరమైన అంశాలు డిజిన్వెస్ట్మెంట్కు కారణం.

“వనరుల పెంపుదలకు మరియు విస్తృత ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించుటకు, ప్రభుత్వ రంగంలోని కొంత వాటాను మ్యూచువల్ ఫండ్స్కు, విత్త సంస్థలకు, అసాధారణ ప్రజలకు, శ్రామికులకు ఇవ్వటాన్ని “పెట్టుబడుల ఉపసంహరణ అంటారు.

పెట్టుబడి ఉపసంహరణ విధాన లక్షణాలు:

  1. ప్రభుత్వ రంగ సంస్థలలో కొంత భాగము వాటాల రూపములో పొందే హక్కు ప్రజలకు కల్పించుట.
  2. ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ సంపద కాబట్టి ఆ సంపద ప్రజలకే చెందుతాయి.
  3. ఈ ప్రక్రియలో కనీసము 51 శాతపు వాటా ప్రభుత్వ ఆధీనములో ఉంటుంది మరియు వాటి నిర్వహణ, నియంత్రణ ప్రభుత్వానిది.

పెట్టుబడి ఉపసంహరణ విధానము: నవంబర్ 5, 2009న లాభాలు ఆర్జించు ప్రభుత్వ కంపెనీలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వము ప్రకటించింది.

  1. ప్రభుత్వము గాని, కేంద్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థలు గాని “వాటాల అమ్మకము లేదా తదుపరి వాటాల జారీ” పద్దతిని లాభదాయ ప్రభుత్వ రంగ సంస్థలలో కల్పించుట.
  2. నష్టాలలో లేకుండా వరుసగా మూడు సంవత్సరములు నికర లాభాన్ని ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను జాబితాలోని సంస్థలుగా చేర్చుట.
  3. పెట్టుబడుల ఉపసంహరణ సరయిన ప్రభుత్వరంగ సంస్థలలో కనీసము 51 శాతము పెట్టుబడులను ప్రభుత్వమే ఉంచుకోవాలి. తద్వారా సంస్థలపై యాజమాన్య నియంత్రణ ప్రభుత్వానిదే.
  4. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో అవసరమైన మూలధనాన్ని దృష్టిలో ఉంచుకొని “తదుపరి మూలధన సేకరణ” పద్ధతిని ప్రోత్సహించి, క్రమేణా ఆ సంస్థల అభివృద్ధిని సాధించుట.

2004-05వ సంవత్సరము నుంచి భారీ ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 2,684.07 కోట్లు, మారుతి ఉద్యోగ లిమిటెడ్ (MVL) (Not a CPSU) R 2277.62 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PGCIL) < 994.82 కోట్లు, ఆయిల్ ఇండియా లిమిటెడ్ శ్ 2247.05 కోట్లు (N.M.D.C) (National Mineral Development Corporation) లిమిటెడ్ 9930.40 కోట్లు, కోల్ ఇండియా లిమిటెడ్ 15,199 కోట్లు మరియు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1144.55 కోట్లు మరియు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ కోట్లు డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 30-1-2015 నాటికి భారత ప్రభుత్వము 1,79,625.25 కోట్లు రాబట్టినది. ఈ మొత్తాన్ని సాంఘిక అవస్థాపన సౌకర్యాలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయడం జరుగును.

ప్రశ్న 7.
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అవసరాన్ని వివరింపుము.
జవాబు:
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు: 1991 పారిశ్రామిక విధాన తీర్మానం విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించింది. పరిశ్రమల ఆధునికీకరణకు, సాంకేతిక పరిజ్ఞానం పెంచటానికి, ఆర్థికాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఋణపూరిత పద్ధతిలో ఆర్థిక వనరుల లభ్యతకు అవకాశం కల్పించును. భారతదేశంలో శ్రమ చౌకగా లభించడమే కాక, పన్ను మినహాయింపులు ఇవ్వడము, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత ప్రభుత్వము ఆకర్షిస్తుంది. ఏ దేశంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంటుందో అచ్చట సాంకేతిక అభివృద్ధిని పొందటానికి, ఉపాధిని పెంచుటకు అవకాశము ఏర్పడును.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

భారతదేశములో నిరంతర విదేశీ పెట్టుబడులు వెల్లువలా వచ్చి అన్ని రంగాలకు విస్తరించుట భారతదేశంపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నది. ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ప్రభుత్వ విధానము మరియు అధిక వ్యాపార అవకాశాలు విదేశీ పెట్టుబడులు మనదేశంలోని విరివిగా వస్తున్నాయి. భారత ప్రభుత్వము విదేశీ పెట్టుబడులపై ఇటీవల నియంత్రణ తొలగించుట అన్ని రంగాలకు విదేశీ పెట్టుబడులు విస్తరించినవి. రక్షణ, ప్రభుత్వ రంగములోని ఇంధనశుద్ధి కర్మాగారాలు, టెలికామ్, విద్యుచ్ఛక్తి మార్పిడి, స్టాక్ ఎక్స్ఛేంజీస్, ఆటోమొబైల్ రంగము, మందుల కంపెనీలు, రసాయనాలు మొదలగు పరిశ్రమలలోనికీ విదేశీ పెట్టుబడులు విచ్చలవిడిగా వచ్చుట భారత సత్వర ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలదు.

ప్రశ్న 8.
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ప్రత్యేక ఆర్థికమండళ్ళ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలింపుము.
జవాబు:
ప్రత్యేక ఆర్థికమండళ్ళు: భారత ప్రభుత్వము ఏప్రిల్ 2000 సంవత్సరమున ప్రత్యేక ఆర్థికమండళ్ళను ప్రకటించినది. ఈ విధానము త్వరిత ఆర్థికవృద్ధికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలతో పాటు పన్ను రాయితీలు పొందుతూ కనీస నియంత్రణలకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఏర్పాటు చేయబడినది. భారతదేశములో ప్రత్యేక ఆర్థికమండళ్ళను ఏర్పాటు చేస్తూ, మే నెల 2005లో చట్టమును రూపొందించి ఫిబ్రవరి 2006 నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
వీటి లక్ష్యాలు:

  1. అదనపు ఆర్థిక కార్యకలాపాలను సృష్టించుట.
  2. వస్తు సేవల ఎగుమతులను పెంచుట.
  3. దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించుట.
  4. ఉద్యోగావకాశాలను కల్పించుట.
  5. అవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధిపరచుట.

SEZ’s ప్రయోజనాలు: ప్రత్యేక ఆర్థిక నియంత్రణ మండళ్ళు ఎగుమతులను, ఉద్యోగితను, పెట్టుబడిని ఎక్కువగా పెంచుటకు కృషి చేస్తున్నాయి. ఆర్థిక సౌభాగ్యస్థితిని తీసుకొచ్చేవే ప్రత్యేక ఆర్థికమండళ్ళు. వీటి ప్రయోజనాలు కింద పేర్కొన్నాము.

  1. ఆర్థికవృద్ధి తీవ్రంగా పెరిగే శక్తినిచ్చుట.
  2. గ్రామీణ ప్రాంతంలో సంపదను సృష్టించుట.
  3. తయారీ మరియు ఇతర సేవల రంగంలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పించడము.
  4. ప్రపంచ తయారీ సంస్థలను మరియు సాంకేతిక నైపుణ్యాలను ఆకర్షించుట.
  5. అంతర్గత, విదేశీ పెట్టుబడులు ప్రైవేట్ మరియు పబ్లిక్ రంగాలకు తీసుకెళ్ళడము.
  6. భారతదేశ సంస్థలను ప్రపంచ పోటీని తట్టుకొనే విధంగా తయారుచేయుట.
  7. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలసలు తగునట్లు దోహదం చేయుట.

ప్రత్యేక ఆర్థికమండళ్ళ ఉత్పత్తి ఉద్యోగితను పెంచి పారిశ్రామికీకరణకు తోడ్పడుచున్నవి.

ప్రశ్న 9.
భారతదేశములో పారిశ్రామికవృద్ధి వెనుకబాటుతనానికి వివిధ కారణాలను తెల్పండి.
జవాబు:
భారత పారిశ్రామిక రంగం వెనుకబడుటకు కారణాలు: భారతదేశము సుసంపన్నమైన సహజ వనరులు మరియు ఎక్కువ మంది శ్రామిక జనాభాను కలిగి ఉన్నను పారిశ్రామిక రంగం ఆశించిన ప్రగతిని సాధించలేదు. పదకొండు పంచవర్ష ప్రణాళికలు పూర్తయినా నిర్ణయించుకొన్న లక్ష్యాలను, సాధించిన ప్రగతికి ఎంతో తేడా ఉన్నది.
పారిశ్రామిక వెనుకబాటుకు కారణాలు
AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం 2
1) ఉత్పాదక సామర్థ్యాన్ని తక్కువగా వినియోగించుకోవడం: అనేక పారిశ్రామిక సంస్థలు తమ పూర్తి ఉత్పాదకతా సామర్థ్యాన్ని వినియోగించుకొనే స్థాయి లేదు. దీనికి ముడిసరుకు కొరత, తక్కువ సాంకేతిక పరిజ్ఞానము కారణాలు.

2) ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు: సరళీకరణకు ముందు ప్రభుత్వ రంగ సంస్థల వృద్ధి గుర్తించదగిన స్థాయిలో ఉండేది. 1999-2000 సంవత్సరములో 10,302 కోట్ల రూపాయలుగా ఉన్న నష్టాలు 2011-12 నాటికి |27,602 కోట్ల రూపాయలకు పెరిగింది.

3) రాజకీయ కారణాలు: ఒక ప్రాంతము పరిశ్రమల స్థాపనకు అనుకూలముగాక పోయిన రాజకీయ కారణాల ప్రభావము చేత అచ్చటి పరిశ్రమలను స్థాపించవలసి వస్తున్నది. దీని వలన మూలధన వనరులు నిరుపయోగమగుచున్నవి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

4) అవస్థాపనా సౌకర్యాల కొరత: పారిశ్రామిక ప్రగతి వెనుకబడుటకు అవస్థాపనా సౌకర్యాలు కొరతగా ఉండుట లేదా వాటిని సమకూర్చుకోవడానికి ఎక్కువ వ్యయమగుట కారణము. వీటి కారణంగా ప్రపంచ మార్కెట్టులో భారతదేశ పారిశ్రామిక రంగము పోటీపడలేకున్నది.

5) లక్ష్యాలకు మరియు సాధించిన ప్రగతికి మధ్య వ్యత్యాసము: గడచిన ప్రణాళికా కాలములో లక్ష్యాలను సాధించడములో ప్రభుత్వము విఫలమయినాయి.

6) తక్షణ సవాళ్ళు: ప్రపంచ వ్యాపార సంస్థ (W.T.O.) ప్రారంభ సభ్యదేశమైన భారతదేశము దిగుమతులపై అన్ని పరిమాణాత్మక పరిమితులను ఉపసంహరించడమైనది. భారతదేశములో అనేక సంస్థలు మూతబడుటకు ఇదొక కారణము.

ప్రశ్న 10.
భారత ఆర్థిక వ్యవస్థలో చిన్నతరహా సంస్థల లాభనష్టాలను తెలపండి. [Mar ’17]
జవాబు:
నిర్వచనములు: చిన్నతరహా పరిశ్రమలనగానే వాటి పెట్టుబడి 5 లక్షలకు లోబడి ఉంటుంది. విద్యుచ్చక్తి వినియోగించుకుంటూ 50 కంటే తక్కువ శ్రామికులకు ఉపాధి కల్పించేవి ఒక వర్గం. విద్యుచ్ఛక్తిని వినియోగించకుండా 100 కంటే తక్కువ శ్రామికులకు ఉపాధి కల్పించేవి ఇంకొక వర్గం.

భారత ప్రభుత్వము అక్టోబర్ 2, 2006వ సంవత్సరమున, “సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల చట్టము” ను అమలులోకి తెచ్చినది. ఈ చట్టము ప్రకారము “సూక్ష్మ లేదా లఘు పరిశ్రమల విషయంలో యాంత్రీకరణను ప్రవేశపెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి కల్గినవి. మధ్యతరహా పరిశ్రమల పెట్టుబడి 5 నుంచి 10 కోట్ల రూపాయల మధ్య ఉండాలి. పెద్ద పరిశ్రమలలో పెట్టుబడి 10 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చును. మెగా పరిశ్రమలలో పెట్టుబడి 100 కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చును.

లాభాలు:
1) పారిశ్రామిక ఉత్పత్తిలో వాటా: 2006-07 సంవత్సరం తర్వాత శీఘ్రగతిన వృద్ధి చెందుతున్న చిన్నతరహా | పరిశ్రమలు భారతదేశ స్థూలదేశీయోత్పత్తికి ఎక్కువ వాటాలను సమకూరుస్తున్నాయి. 2006-07 సంవత్సరమున సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మొత్తం ఉత్పత్తి 13,51,383 కోట్ల రూపాయలు ఉండగా, 2011-12 నాటికి ఈ మొత్తం 18,34,332 కోట్ల రూపాయలకు పెరిగినది. దీనిని బట్టి మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల వాటా 8 శాతం, తయారీ రంగ ఉత్పత్తులలో ఈ సంస్థల వాటా 38 శాతముగా ఉన్నది,

2) ఉద్యోగ అవకాశాల కల్పన: చిన్న తరహా పరిశ్రమలు శ్రమసాంద్రతమైనవి. చిన్నతరహా సంస్థలో మూలధన శ్రామికుల నిష్పత్తి తక్కువ. పెద్ద పరిశ్రమలలో ఒక వ్యక్తికి ఉపాధి కల్పించే మూలధనంతో చిన్నతరహా పరిశ్రమలలో 8 మందికి ఉపాధిని కల్పించవచ్చును. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం కుటీర చిన్న తరహా పరిశ్రమ.

3) తక్కువ మూలధనము: చిన్న తరహా సంస్థలలో మూలధన ఉత్పత్తి నిష్పత్తి తక్కువ. ఇది భారీ పరిశ్రమలలో 5:4:1 వుండగా చిన్న పరిశ్రమలలో కేవలం 1: మాత్రమే. భారతదేశంలో మూలధనము కొరతగా ఉంది. తక్కువ మూలధనంతో హెచ్చు ఉత్పత్తిని సాధించడం ఈ పరిశ్రమలలో సాధ్యపడుతుంది.

4) మూలధన సేకరణ: చిన్న తరహా సంస్థలు మూలధనాన్ని సులభంగా సేకరించుకోగలదు. చిన్న తరహా పరిశ్రమల విస్తరణ గ్రామీణ ప్రజల పొదుపు మరియు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

5) నైపుణ్యమును వెలికితీయడం: చిన్న తరహా పరిశ్రమలకు అధునాతన నైపుణ్యాలు అవసరం లేదు. చిన్న | తరహా పరిశ్రమల నిర్వహణదారులకు పెద్ద పరిశ్రమలలో కొద్దిమందైనా పని చేయగలిగిన అనుభవాన్ని గడించే శిక్షణను చిన్న తరహా పరిశ్రమలు కల్పించును. చిన్న తరహా పరిశ్రమలు ప్రజల పొదుపు మరియు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

6) తక్కువ దిగుమతులు: తక్కువ మూలధన సాంద్రత చిన్న తరహా పరిశ్రమల లక్షణము. చిన్న తరహా పరిశ్రమలు విదేశీ మూలధనంపై, విదేశీ మారకద్రవ్యంపై ఆధారపడకుండా విదేశీ వ్యాపార చెల్లింపులలోని ఇబ్బందులను తొలగిస్తుంది.

7) పారిశ్రామికాభివృద్ధి వికేంద్రీకరణ: చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించి, వికేంద్రీకరణ ద్వారా సంతులిత ప్రాంతీయాభివృద్ధిని సాధించవచ్చు. ఈ సంస్థలు స్థానికంగా లభించే మానవశక్తి, ముడిసరుకులు మరియు మూలధనంపై ఆధారపడును.

8) సమాన పంపిణీ: చిన్నతరహా పరిశ్రమలు ఆర్జించు లాభాలు వాటిని నిర్వహించే అనేకమంది ఉద్యమదారులు పంచుకోవడం వలన ఆదాయ మరియు సంపద పంపిణీలో వికేంద్రీకరణ జరుగును.

9) ఎగుమతులు: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో చిన్నతరహా పరిశ్రమలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 2006-07 సంవత్సరంలో మనదేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేయు మొత్తం వస్తు సేవల విలువలో 31.1 శాతం చిన్నతరహా పరిశ్రమలదే.

10) అనారోగ్య పట్టణ సంస్కృతిని నివారించుట లఘు, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ధి పరచడం ద్వారా గ్రామీణ ప్రాంతం వారికి లాభసాటి ఉపాధి కల్పించబడును. దీని ఫలితం నిరుద్యోగ యువత పట్టణాలకు ఉపాధి కొరకు వలస వెళ్ళుటను నివారించవచ్చును.

11) శ్రామిక సంబంధాలు: చిన్నతరహా పరిశ్రమలలో శ్రామిక తగాదాలు ఎక్కువగా ఉండవు. ఈ సంస్థలలో పరిమితమైన శ్రామికులు పనిచేయుట వలన యాజమాన్యంతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. సమ్మెలు, లాకౌట్ల ప్రభావం ఈ చిన్నతరహా పరిశ్రమలపై తక్కువగా ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

నష్టాలు:
1) అసమర్థ మానవ వనరులు: ఎక్కువ మంది గ్రామీణ జనాభా నిరక్షరాస్యులు. వారిలో సాంకేతిక అవగాహన తక్కువ స్థాయిలో ఉంటుంది. ఆధునిక ఉత్పత్తి పద్ధతులను గూర్చి తెలిసి ఉండరు. ప్రభుత్వ పరపతి విధానాలపై అవగాహన ఉండదు.

2) పరపతి కొరత: చాలా చిన్నతరహా పరిశ్రమల నిర్వాహణకు అవసరమైన పరపతి లభ్యం కావడం లేదు. ఈ విషయంలో కుటీర పరిశ్రమలు మరీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వారు మధ్యవర్తుల నుంచి హెచ్చు వడ్డీకి అప్పులు చేస్తారు. తయారయిన వస్తువులను వారికి తక్కువ ధరలకు అమ్ముతూ నష్టపోతున్నారు.

3) ముడిసరుకు సమస్య: చిన్నతరహా సంస్థలకు ఆర్థికస్థోమత లేనందున, బ్యాంకులు అవసరమైన పరపతిని సమకూర్చకపోవడం వల్ల ఈ సంస్థల యాజమాన్యం పెద్దతరహా ఉత్పత్తి సంస్థల లాగా ధర తక్కువగా ఉన్నప్పుడు ముడి పదార్థాలను భారీ స్థాయిలో కొనుగోలు చేయలేనందున తక్కువ మొత్తాలలో ముడిసరుకును కొనుగోలు చేయుట వలన, ధర విషయంలో వీరికి బేరమాడే శక్తి ఉండదు.

4) మార్కెటింగ్ సమస్యలు: చిన్నతరహా పరిశ్రమలకు చెందిన వస్తువులను విక్రయించడానికి సంఘటిత మార్కెటింగ్ వ్యవస్థ అందుబాటులో లేదు. కుటీర పరిశ్రమల వస్తు విక్రయానికి మధ్యవర్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తున్నది.

5) ఆధునిక యంత్రపరికరముల కొరత: చిన్న పరిశ్రమలలో వాడుతున్న యంత్రాలు పురాతనమైనవి. వాటి ఆధునికీకరణకు నూతన పరికరములను ప్రవేశపెట్టుటకు పెట్టుబడి కొరతగా ఉన్నది. దీని ఫలితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోలేకపోతున్నాయి. ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువే, తక్కువ నాణ్యత కలిగిన వస్తువులు తయారవుతున్నాయి.

6) విద్యుచ్ఛక్తి కొరత: చిన్నతరహా ఉత్పత్తి సంస్థలు ఎదుర్కొనే మొదటి సమస్య విద్యుచ్ఛక్తి. తరచూ విద్యుత్ కోతలతో చిన్నతరహా పరిశ్రమలు లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తిని సాధించలేకున్నవి. గ్రామీణ ప్రాంతములో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోల్చిన విద్యుత్ కోతల ఫలితంగా చిన్నతరహా కుటీర పరిశ్రమలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి.

7) పురాతన సాంకేతికత కొరత: చిన్నతరహా పరిశ్రమల ఉత్పాదకత మరియు సాంకేతికత ప్రపంచస్థాయి పోటీని తట్టుకోలేకున్నది. సాంకేతికత అభివృద్ధి చెందనంతవరకు చిన్నతరహా పరిశ్రమలు ప్రపంచ ప్రజల అవసరాలను తీర్చుట కష్టము.

8) అధిక పన్నులు: చిన్నతరహా పరిశ్రమలు ముడిసరుకు కొనుగోలు చేయునప్పుడు భారీ ఎత్తున పన్ను చెల్లించవలసి వస్తున్నది. ముగింపు వస్తువులను మార్కెట్లో విక్రయించునపుడు కూడా పన్ను చెల్లించవలసి వస్తున్నందున వీటి ధరలు పెరిగి డిమాండ్ తగ్గుచున్నది.

9) సరళీకరణ – ప్రపంచీకరణ: 1991వ సంవత్సరము తర్వాత ప్రభుత్వం సరళీకృత విధానాలను అమలుపరచడంలో భాగంగా దిగుమతి సుంకాలను తగ్గించడము జరిగినది. అందువల్ల ప్రపంచ దేశాల నుంచి ముఖ్యంగా చైనా, జపాన్, కొరియాల నుండి అత్యధికంగా వస్తువులు దిగుమతి కావడంతో మనదేశ చిన్నతరహా ||పరిశ్రమలు వాటితో పోటీ పడలేకున్నవి.

ప్రశ్న 11.
వివిధ పంచవర్ష ప్రణాళికలలో భారత పారిశ్రామికాభివృద్ధి రేటును వివరింపుము.
జవాబు:
భారతదేశములో పంచవర్ష ప్రణాళికలు – పారిశ్రామికాభివృద్ధి: భారత ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి విధానంలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నది. పారిశ్రామికీకరణ ప్రాథమికరంగ అభివృద్ధికి, అవస్థాపనా సౌకర్యాల పెరుగుదలకు, పరిశోధన ద్వారా సాంకేతిక మార్పులకు దోహదము చేస్తుంది. భారతదేశము వినియోగ వస్తువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించినది. మూలధన వస్తువుల ఉత్పత్తి కూడా ఆశాజనకముగా ఉన్నది. గనులు, రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఎరువులు, మూలధన వస్తువులు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుచ్ఛక్తి, రవాణా, నిర్మాణ రంగములలో వృద్ధిని సాధించుట ద్వారా పారిశ్రామిక రంగం కొంతమేర ప్రగతిని సాధించినది.

రెండవ పంచవర్ష ప్రణాళిక ద్వారా పారిశ్రామిక స్వావలంబనకు అవసరమైన మౌలిక, కీలక మూలధన పరిశ్రమలు ప్రభుత్వ రంగానికి కేటాయించబడ్డాయి.

మొదటి ప్రణాళిక (1951-56): మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వనరులు తక్కువగా కేటాయించుట, వ్యవసాయ రంగ తక్షణ అభివృద్ధిని ప్రోత్సహించుటకు, ఈ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించలేదు.

పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల ఈ ప్రణాళికా కాలంలో 39 శాతము కాగా సాంవత్సరిక వృద్ధిరేటు 8 శాతముగా ఉన్నది.

రెండవ ప్రణాళిక (1956-61): ఈ ప్రణాళికలో పారిశ్రామికీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమైనది. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రభుత్వరంగ విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. మహళనోబీస్ నమూనా ప్రకారం భారీ స్థాయిలో మౌలిక, మూలధన వస్తువుల పరిశ్రమలు నెలకొల్పడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
పారిశ్రామిక ఉత్పత్తి సూచి సంఖ్య (ఆదాయము 1950-51 = 100) 1955-56 సంవత్సరమున ఉన్న 139 శాతము 1960-61 సంవత్సరము నాటికి 194 శాతానికి పెరిగినది. సాంవత్సరిక సగటు వృద్ధిరేటు 11 శాతముగా ఉన్నది. మూడవ ప్రణాళిక (1961-66): ఈ ప్రణాళికలో కూడా భారీ కీలక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల మధ్య సంతులితను సాధించడానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. పారిశ్రామిక వ్యవసాయ సంతులనంతో సమగ్రాభివృద్ధి సాధించే లక్ష్యంగా 15 సంవత్సరాల దీర్ఘదర్శి ప్రణాళికకు ఈ ప్రణాళిక నాంది పలికింది.

నాల్గవ ప్రణాళిక (1969-74): మూడవ ప్రణాళికలో ఆరంభించిన పరిశ్రమలను పూర్తిచేయుట, ఎగుమతి ప్రోత్సాహక, దిగుమతి ప్రత్యామ్నాయ పరిశ్రమల స్థాపన శక్తిని పెంచడానికి ఈ ప్రణాళిక నిర్ణయించినది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

సాంవత్సరిక పారిశ్రామిక వృద్ధిరేటును ఈ ప్రణాళికలో 8 శాతము లక్ష్యముగా నిర్ణయించుకోగా సాధించినది కేవలం 5 శాతము మాత్రమే.

ఐదవ ప్రణాళిక (1974-79): స్వావలంబన, సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రణాళిక ప్రాధాన్యత నిచ్చినది. ఈ ప్రణాళికలో ప్రభుత్వరంగ వాటా 9,700 కోట్ల రూపాయలు. ఈ ప్రణాళిక సత్వర మౌలిక పరిశ్రమల అభివృద్ధికి నిర్ణయించినది. సామాన్య ప్రజలకు అవసర వస్తువులు సరిపడా ఉత్పత్తి చేయాలని నిర్ణయించినది. పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చుట జరిగినది.

ఆరవ ప్రణాళిక (1980-85): అభిలషణీయమైన ఉత్పత్తి స్థాయి కంటే తక్కువ ఉత్పత్తి చేయడం ద్వారా పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వ రంగ అభివృద్ధికి అవసరమైన వనరులను సమకూర్చుకోలేక పోతుందని, ప్రాంతీయ వ్యత్యాసాలు పెరిగాయని, వెనుకబడిన ప్రాంతాలు నిర్లక్ష్యము చేయబడ్డాయని, ఆరవ పంచవర్ష ప్రణాళిక పేర్కొన్నది. దీనిని సరిదిద్దుటకు ప్రభుత్వ రంగానికి ఈ ప్రణాళికలో 23,000 కోట్ల రూపాయలు కేటాయించిరి. ఈ ప్రణాళిక. 5.45 శాతము వృద్ధిరేటును సాధించినది.

ఏడవ ప్రణాళిక (1985-90): ఏడవ ప్రణాళిక మార్గదర్శక సూత్రాలైన సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, ఉత్పాదక పెరుగుదలకు అనుగుణంగా ఈ ప్రణాళిక పారిశ్రామిక రంగానికి లక్ష్యాలను నిర్దేశించినది. 7వ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించుకొన్న 8.5 శాతము వృద్ధిని సాధించడమైనది. నూతన ఆర్థిక విధానము మరియు అవస్థాపనా సౌకర్యాల కొరత లేకుండుట వలన ఇది సాధ్యమైనది.

ఎనిమిదవ ప్రణాళిక (1992-97): ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఎనిమిదవ ప్రణాళిక ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ రంగాల వైఫల్యంతో అనగా ప్రభుత్వ రంగాలు ఎక్కువ నష్టాలతో, ఆశించిన పారిశ్రామిక ప్రగతికి దోహదము చేయడములేదనే నమ్మిక బలపడి ప్రైవేటు రంగమునకు ప్రభుత్వము ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగినది. ఎనిమిదవ ప్రణాళిక పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధి లక్ష్యం 7.4 శాతము కాగా వాస్తవిక వృద్ధిరేటు 7.3 శాతముగా ఉన్నది.

తొమ్మిదవ ప్రణాళిక (1997-2002): ఈ ప్రణాళిక ప్రభుత్వ రంగంలోను, ప్రైవేటు రంగంలోను నాణ్యమైన అవస్థాపనా సౌకర్యాలను పెంచడం కొరకు నిశ్చయించినది. దేశం పెట్రోలియం ఉత్పత్తులను విపరీతంగా దిగుమతి చేసుకుంటున్న దృష్ట్యా, ఈ ప్రణాళికా కాలంలో వీటి అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు.

9వ ప్రణాళిక పారిశ్రామిక వృద్ధిరేటు 8 శాతము లక్ష్యంగా నిర్ణయించగా వాస్తవంగా సాధించినది 5 శాతము మాత్రమే. దీనికి ముఖ్య కారణము ప్రపంచవ్యాప్తంగా సాధించిన తక్కువ వృద్ధిరేటు.

పదవ ప్రణాళిక (2002-07): తొమ్మిదవ ప్రణాళికలో ప్రైవేటు రంగం కార్యకలాపాల విస్తరణకు అధిక అవకాశం ఇచ్చినందున ప్రభుత్వం రంగం కేటాయింపులు తగ్గించడం జరిగింది. పదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో వార్షిక వృద్ధిరేటు పారిశ్రామిక రంగంలో 8.9 శాతము.

పదకొండవ ప్రణాళిక (2007-12): ఈ ప్రణాళికా కాలంలో పారిశ్రామిక వృద్ధిరేటు 10 నుంచి 11 శాతము ఉండాలని లక్ష్యంగా నిర్ణయించింది.

పన్నెండవ ప్రణాళిక (2012-17): రాబోవు 5 సంవత్సరాలలో మొత్తము పెట్టుబడి 50 లక్షల కోట్ల రూపాయలు. ||ప్రైవేటు రంగము 25 లక్షల కోట్ల పెట్టుబడి ఆశిస్తున్నది.
12వ ప్రణాళికలో 9.5 శాతము వృద్ధిని పారిశ్రామిక రంగము సాధించాలన్న తయారీ రంగము, విద్యుచ్ఛక్తి, గ్యాస్ మరియు నీటి సప్లయ్ రంగాలలో ఎక్కువ వృద్ధిరేటును సాధింపవలసి ఉన్నది.

ప్రశ్న 12.
భారత పారిశ్రామిక విత్తానికి గల మూలాధారాలను వివరింపుము.
జవాబు:
పారిశ్రామిక సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన విత్తాన్ని పారిశ్రామిక మూలధన విత్తం అంటారు. సమర్థవంతమైన విత్త విధానం దేశ పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమర్థవంతమైన విత్త సంస్థలుంటే ఆ దేశంలో అధిక మొత్తంలో పొదుపు సమీకరించి, ఆ పొదుపు మొత్తాన్ని లాభసాటిగా ఉపయోగించుకునే పరిశ్రమలను అందించటం జరుగుతుంది. పరిశ్రమలకు కావలసిన మూలధనం 2 రకాలుగా ఉంటుంది. 1) దీర్ఘకాలిక మూలధనం 2) స్వల్పకాలిక మూలధనం.

1) దీర్ఘకాలిక విత్త సంస్థలు: దీర్ఘకాలిక మూలధన అవసరాలైన స్థిర మూలధనము భవన నిర్మాణాలకు యంత్రాలు – యంత్ర పరికరాల కొనుగోలుకు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి మొదలైన వాటికై పరిశ్రమలకు ఋణ సహాయం అందించే ఋణ చెల్లింపు కాల వ్యవధి 5-7 సం॥ల నుండి 10-15 సం||లు లేదా ఆపైన ఉంటుంది. దీర్ఘకాలిక ద్రవ్య అవసరాలను మూలధన మార్కెట్ తీరుస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

2) స్వల్పకాలిక విత్త సంస్థలు: స్వల్పకాలిక మూలధన అవసరమైన చర మూలధనం ముడి పదార్థాల కొనుగోలుకు, రవాణా ఖర్చులకు, శ్రామికులకు చెల్లించే వేతనాలకు, ఇంధన ఖర్చులకు, ప్రకటన ఖర్చులకు మొదలైన అవసరాల కోసం ఋణ సహాయం అందించే సంస్థలను స్వల్పకాలిక విత్త సంస్థలు అంటారు. ఈ సంస్థలిచ్చే స్వల్పకాలిక మూలధనాన్ని చర మూలధనాన్ని చర మూలధనం లేదా వర్కింగ్ కాపిటల్ అంటారు. సాధారణంగా స్వల్పకాలిక విత్త సంస్థల ఋణాలు చెల్లింపుల కాల వ్యవధి ఒక సంవత్సరం లేదా ఒక సంవత్సరానికి మించి ఉంటుంది. స్వల్పకాలిక విత్త అవసరాలను ద్రవ్య మార్కెట్ తీరుస్తుంది.

చర మూలధనం: చర మూలధనాన్ని తగిన హామీపై వాణిజ్య బ్యాంకులు పరిశ్రమలకు సమకూరుస్తాయి. స్థిర మూలధనం: స్థిర మూలధనాన్ని పారిశ్రామిక సంస్థలు అనేక మార్గాల ద్వారా సమీకరిస్తాయి. అవి:

  1. వాటాలు, ఋణపత్రాలు: పరిశ్రమలకు కావలసిన మూలధనంలో ఎక్కువ భాగం వాటాలు, మూలధన పత్రాలను ప్రత్యక్షంగా విక్రయించటం ద్వారా సమకూర్చుకుంటాయి.
  2. పబ్లిక్ డిపాజిట్లు: పరిశ్రమలు, ప్రజల నుండి డిపాజిట్లను తీసుకుంటుంది.
  3. ప్రైవేటు డిపాజిట్లు: మేనేజింగ్ ఏజెంట్లు, ప్రైవేట్ సంస్థలు మొదలగునవి సమకూర్చే ఋణాలను ప్రైవేట్ డిపాజిట్లు అంటారు.
  4. రిజర్వ్లు: పారిశ్రామిక సంస్థలు మూలధనపు రిజర్వ్ ు, తరుగుదల రిజర్వ్ ు మొదలగునవి ఏర్పరచుకొని వాటిని పెట్టుబడిగా వినియోగించుకుంటాయి.
  5. ఇన్సూరెన్సు కంపెనీలు: జీవితబీమా, సాధారణ బీమా కంపెనీలు కూడా పరిశ్రమలకు కావలసిన మూలధనాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సమకూరుస్తాయి.
  6. ప్రత్యేక ద్రవ్య సంస్థలు పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పడిన పారిశ్రామిక ద్రవ్య సహాయ సంస్థలు పరిశ్రమలకు మూలధనాన్ని సమకూరుస్తాయి.

భారత ప్రభుత్వం రెండవ ప్రణాళికా కాలం నుండి పారిశ్రామికీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. కొత్త పరిశ్రమల స్థాపన, ఉన్న పరిశ్రమల ఆధునికీకరణలకు భారీ ఎత్తున మూలధనం అవసరమవుతుంది. కనుక పరిశ్రమల మధ్యకాలిక, దీర్ఘకాలిక విత్త అవసరాలను తీర్చడానికి కింది సంస్థలు ముందుకు వచ్చాయి. అవి:

  1. భారత పారిశ్రామిక విత్త సంస్థ (IFCI)
  2. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (SIDC)
  3. భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ (ICIC)
  4. భారత జీవితబీమా సంస్థ (LIC)
  5. భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు (IDBI)
  6. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (UTI)
  7. భారతీయ పారిశ్రామిక పునర్నిర్మాణ సంస్థ (IRCI)
  8. ఎక్స్పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ (EXIM Bank)
  9. సాధారణ బీమా సంస్థ (GIC)
  10. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ (SIDBI)
  11. వెంచర్ కాపిటల్ ఫండ్
  12. జాతీయ గృహ నిర్మాణ సంస్థ (NHB)
  13. రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థలు (SFC)

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత పారిశ్రామిక విత్త సంస్థ.
జవాబు:
భారతీయ పారిశ్రామిక విత్త సంస్థ 1948వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇది ప్రజల నుండి డిపాజిట్లను ఆకర్షిస్తుంది. ఈ విత్త సంస్థ బాండ్లు మరియు డిబెంచర్లను బహిరంగ మార్కెట్టులో విడుదల చేసే అధికారమున్నది.
విధులు:

  1. పారిశ్రామిక సంస్థలకు 25 సం॥ల కాల పరిమితి గల ఋణాలు, అడ్వాన్సులు ఇస్తుంది.
  2. ప్రత్యక్షంగా విత్త సహాయం అందించడం.
  3. పారిశ్రామిక సంస్థలు చేసే రుణాలకు హామీగా నిలబడుతుంది.
  4. పారిశ్రామిక సంస్థల షేర్లు, డిబెంచర్లను కొంటుంది.
  5. వాయిదా పద్ధతిలో ఋణాల చెల్లింపులకు హామీ ఇస్తుంది..
  6. ఔత్సాహిక ఉద్యమదారులకు ప్రోత్సాహకాలు, సాంకేతిక శిక్షణ ఇస్తుంది.
  7. విదేశీ సంస్థల నుండి విదేశీ కరెన్సీలో తీసుకున్న ఋణాలకు హామీ ఇస్తుంది.

ప్రశ్న 2.
భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ (ICICI).
జవాబు:
దీనిని 1955వ సంవత్సరంలో భారత ప్రభుత్వం, విదేశీ పెట్టుబడి వాటాదారులను అనుమతిస్తూ ప్రారంభించారు. ఇది మొదటి ప్రైవేట్ పెట్టుబడి లిమిటెడ్ కంపెనీగా ప్రారంభమయిన విత్త సహాయ సంస్థ. దీనిలో వాటాదారులు జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలు, అమెరికా, ఇంగ్లాండులోని ప్రైవేటు పెట్టుబడి సంస్థలు, భారత ప్రజలు 2002లో ICICIని (ICICI) బ్యాంకు లిమిటెడ్ విలీనం చేయడం వల్ల దేశంలో మొదటి యూనివర్సల్ బ్యాంకుగా ఆవిర్భవించింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

విధులు:

  1. ప్రైవేటు రంగ భారీ పరిశ్రమలకు, దీర్ఘకాలిక రుణాలు అందజేయడం. ఈ ఋణాల మొత్తం రూపాయలలో, విదేశీ కరెన్సీలలో కూడా అందిస్తారు.
  2. ప్రైవేటు రంగ పెట్టుబడులకు, ఋణాలకు గ్యారంటీ ఇవ్వండి.
  3. పారిశ్రామిక సంస్థలు సేకరించే ఋణాలకు, డిబెంచర్లకు హామీదారుగా ఉండటం.
  4. పరిశ్రమలకు నిర్వహణ, సాంకేతిక సలహాలు అందించుట.
  5. పరిశ్రమల ఈక్విటీ మూలధనము, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టడం.
  6. ఋణ వాయిదాలకు, వడ్డీకి తీసుకున్న అప్పు, వాయిదాలలో అమ్మకాలు. తాత్కాలిక వ్యాపార మూలధనం మొదలగు వాటికి విత్త సలహాలనిస్తుంది.

ICICI ద్వారా ఋణాలిచ్చిన మొత్తము 1981లో 180 కోట్ల రూపాయలు, 2001వ సంవత్సరము నాటికి ఈ మొత్తము 31,660 కోట్ల రూపాయలకు పెరిగినది.

ప్రశ్న 3.
పారిశ్రామిక క్షేత్రాలు. [Mar ’17]
జవాబు:
పారిశ్రామిక క్షేత్రాలు చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందటానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అనేక చిన్న పరిశ్రమలు కేంద్రీకృతమైన ప్రదేశాన్ని పారిశ్రామిక క్షేత్రం / పారిశ్రామిక వాడ అని అంటారు. వీటిలో పరిశ్రమలకు కావలసిన స్థలం, భవనాలు, నీరు, విద్యుచ్ఛక్తి, రవాణా, సమాచార సౌకర్యాల వంటి వసతులు చౌకగా లభింపచేయబడిన పారిశ్రామిక క్షేత్రాల ఏర్పాటు లక్ష్యం. పై వసతులన్నింటినీ ఒకే ప్రదేశంలో లభింపచేయడం వలన ఉత్పాదక సంస్థల ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి.

ప్రయోజనాలు:

  1. వీటిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న / పాక్షిక పట్టణాలలో ఏర్పాటు చేయటం వలన ఆ ప్రదేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశముంది.
  2. ప్రాంతీయంగా లభ్యమయ్యే వనరులను ఉపయోగించే అవకాశం ఏర్పడుతుంది
  3. ప్రాంతీయ అసమానతలు తగ్గే అవకాశం ఉంటుంది.
  4. పారిశ్రామిక కేంద్రీకరణ వల్ల ఏర్పడే అంతర్గత, బహిర్గత ఆదాలు లభిస్తాయి.
  5. భారీ పరిశ్రమలున్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తే ఇవి పెద్ద పరిశ్రమలకు అనుబంధ / అనుషంగిక పరిశ్రమలుగా ఉంటాయి.
  6. చిన్న పరిశ్రమలు ఇక్కడ లభించే వసతులను ఉపయోగించుకోవటం వలన ఉత్పత్తిని లాభసాటిగా మార్చుకునే వీలుంటుంది.

ప్రశ్న 4.
ప్రత్యేక ఆర్థికమండళ్ళు,
జవాబు:
భారత ప్రభుత్వము ఏప్రిల్ 2000 సంవత్సరమున ప్రత్యేక ఆర్థికమండళ్ళను ప్రకటించినది. ఈ విధానము త్వరిత ఆర్థికవృద్ధికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలతో పాటు పన్ను రాయితీలు పొందుతూ కనీస నియంత్రణలకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఏర్పాటు చేయబడినవి. మన దేశములో ప్రత్యేక ఆర్థికమండళ్ళను 2005లో ఏర్పాటు చేస్తూ చట్టమును రూపొందించిరి. 2006 నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.

లక్ష్యాలు:

  1. అదనపు ఆర్థిక కార్యకలాపాలను సృష్టించుట.
  2. వస్తు సేవల ఎగుమతులను పెంచుట.
  3. దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించుట.
  4. అవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధిపరచటం.
  5. ఉద్యోగావకాశాలను కల్పించుట.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 5.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.
జవాబు:
1991వ పారిశ్రామిక విధాన తీర్మానం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించింది. పరిశ్రమల ఆధునికీకరణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచటానికి, ఆర్థికాభివృద్ధికి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఋణరహిత పద్ధతిలో ఆర్థిక వనరుల లభ్యతకు అవకాశం కలిగించును. ఏ దేశంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంటుందో అచ్చట సాంకేతిక అభివృద్ధి పొందటానికి ఉపాధిని పెంచటానికి అవకాశం కలుగును. ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ప్రభుత్వ విధానం మరియు అధిక వ్యాపార అవకాశాలు మన దేశంలోకి విరివిగా వస్తున్నాయి. ప్రభుత్వము విదేశీ పెట్టుబడులపై నియంత్రణను తొలగించటం వల్ల అన్ని రంగాలకు ఈ పెట్టుబడులు విస్తరించినవి. రక్షణ ప్రభుత్వ రంగంలోని ఇంధన శుద్ధి కర్మాగారాలు Stock exchange, టెలికం, మందుల కంపెనీలు మొదలగు పరిశ్రమలలోకి ఈ పెట్టుబడులు రావటం వల్ల సత్వర ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలదు. మన కేంద్ర ప్రభుత్వం రైల్వే రంగంలో అవస్థాపన నిర్మాణానికి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. అదే విధంగా నిర్మాణ రంగంలో కూడా 100% అనుమతించింది. పట్టణీకరణ షాపింగ్ మాల్స్ మరియు వ్యాపార కేంద్ర నిర్వహణకు 100% FDI అనుమతించింది.

ప్రశ్న 6.
జాతీయ పెట్టుబడి నిధి.
జవాబు:
భారత ప్రభుత్వం నవంబరు 3, 2005లో జాతీయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ అను రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణల మొత్తం రూపాయలు 1814.45 కోట్లతో ఈ పెట్టుబడి నిధిని ప్రారంభించింది.

లక్షణాలు:

  1. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిర్వహించబడును. సేకరించిన మొత్తము భారత సంఘటిత నిధిలో కలపకుండా ప్రత్యేకంగా ఉంటుంది.
  2. జాతీయ పెట్టుబడి నిధి శాశ్వత వినియోగ స్వభావం కలిగి ఉంటుంది.
  3. ప్రభుత్వానికి నిలకడతో కూడిన ఆర్థిక ఫలితాలను చేకూర్చే విధంగా. ఈ విధి నిర్వహణ జరుగుతుంది.
  4. ఈ నిధిపై వచ్చే వార్షిక ఆదాయంలో 75% విద్య, ఆరోగ్య ఉపాధి మొదలగు సామాజిక పధకాలైన జవహర్లాల్ నెహ్రూ పట్టణ రెన్యువల్ మిషన్, ఇందిరా ఆవాస్ యోజన మొదలగు కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.

ప్రశ్న 7.
జాతీయ తయారీ విధాన లక్ష్యాలు.
జవాబు:
భారత ప్రభుత్వం జాతీయ తయారీ విధానాన్ని నవంబరు 4, 2011లో నూతన పారిశ్రామిక విధానం పేరుతో ప్రకటించడమైంది. ప్రైవేటు రంగానికి కోశపరమైన ప్రోత్సాహకాల్ని కల్పించి, యువతకు ఎక్కువ ఉద్యోగాల్ని పొందే విధంగా నైపుణ్యాలను అభివృద్ధి పరచుట ఈ తయారీ విధానము యొక్క లక్ష్యము. వ్యవసాయమునకు ఉపయోగపడని భూములలో జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్లను ఏర్పాటు చేయుట ఈ విధానము లక్ష్యము.
జాతీయ తయారీ విధానము
లక్ష్యాలు:

  1. తయారీ రంగంలో 12 నుండి 14 శాతము మాధ్యమిక వృద్ధిరేటును సాధించుట.
  2. తయారీ రంగంలో 2012 నాటికి 100 మిలియన్లు అదనపు ఉద్యోగాల కల్పన.
  3. తయారీ రంగంలో ఉపాధి అవకాశములను అందుకొనే విధంగా గ్రామీణ వలసదారులకు మరియు పట్టణ పేదరికానికి సరిపడినన్ని నైపుణ్యాలను కల్పించుట.
  4. స్థూల జాతీయోత్పత్తిలో ప్రస్తుతము 16 శాతముగా ఉన్న తయారీ రంగపు వాటాను 2022 నాటికి 25 శాతమునకు పెంచుట.
  5. తయారీ రంగంలో దేశీయ ఉత్పత్తి విలువలు మరియు సాంకేతిక పరిణతిని పెంపొందించుట.
  6. ప్రపంచ పోటీని తట్టుకొనే విధంగా భారత తయారీ రంగాన్ని అభివృద్ధి పరచుట.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 8.
జాతీయ పెట్టుబడి మరియు తయారీ మండళ్ళు.
జవాబు:

  1. తయారీ రంగానికి అనువైన 5000 హెక్టార్ల భూమిని ఎంపిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది.
  2. జాతీయ పెట్టుబడి మరియు తయారీ మండళ్ళు వ్యవహారాలను నిర్వహించేందుకు ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని ఏర్పాటు చేయాలి.
  3. జాతీయ మూలధనం మరియు తయారీ మండళ్ళకు అవస్థాపనా సౌకర్యాలైన రైలు, రోడ్డు, విమానాశ్రయాలు మొదలగునవి ప్రణాళిక మేరకు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయడం.
  4. నీరు, విద్యుచ్ఛక్తి మరియు ఇతర అవస్థాపనా సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి.
  5. ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 20%కు మించకుండా ఆర్థిక సదుపాయ సౌకర్యానికి తగు నిధులను కేంద్ర ప్రభుత్వం కల్పించుట.
  6. జాతీయ తయారీ మండళ్ళు అంతర్గత అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కోసం బహుళ ఆర్థిక సదుపాయ సంస్థలు వాణిజ్యపరమైన ఋణ సదుపాయాన్ని కల్పించుట.

ప్రశ్న 9.
సూక్ష్మ, చిన్నతరహా, మాధ్యమిక పరిశ్రమలు.
జవాబు:
1) సూక్ష్మ పరిశ్రమలు: సూక్ష్మ పరిశ్రమలు యంత్రాలు, యంత్ర పరికరాలపై, సేవలపై 25 లక్షలలోపు పెట్టుబడి ఉన్న పరిశ్రమలు.

2) చిన్నతరహా పరిశ్రమలు: ఉత్పత్తిపై 25 లక్షల నుండి 5 కోట్లు, సేవలపై 10 లక్షల నుండి 2 కోట్లు పెట్టుబడి పెట్టే పరిశ్రమలు. ఇవి మరల మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

  • గ్రామీణ పరిశ్రమలు: 10 లక్షలు అంతకంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలలో ఒక్కో శ్రామికునిపై సగటున గరిష్టంగా 15 వేలు పెట్టుబడి పెడితే వాటిని గ్రామీణ పరిశ్రమలంటారు.
  • కుటీర పరిశ్రమలు: నామమాత్రపు పెట్టుబడితో కుటుంబ సభ్యులతో కలిసి, శ్రమ సాంద్రత పద్ధతులు ద్వారా వస్తు సేవలను తయారుచేసే పరిశ్రమలను కుటీర పరిశ్రమ అంటారు.
  • చిన్నతరహా పరిశ్రమ: కోటి రూపాయల నుండి 5 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్న పరిశ్రమలు. 3) మధ్యతరహా పరిశ్రమలు: ఉత్పత్తిలో గరిష్ట పెట్టుబడి 35 కోట్ల నుండి 3 10 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్న పరిశ్రమలు.

ప్రశ్న 10.
భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు. [Mar ’16]
జవాబు:
1971వ సంవత్సరంలో ఖాయిలాపడ్డ పరిశ్రమలను పునరుజ్జీవింప జేయుటకు భారత పారిశ్రామిక పునర్నిర్మాణ కార్పోరేషన్ (IRCI) ఏర్పాటు చేయబడినది. దీనిని 1985 నుండి భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకు (IRBI) గా మార్చడమైనది. పోటీ పరిస్థితులు, విత్త సంస్థల పునర్నిర్మాణం దృష్టిలో ఉంచుకొని IRBD ని 1997లో దీనిని భారతీయ పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకుగా పూర్తిస్థాయి పరపతి సంస్థగా మార్పు చేయడమైనది. ఇది పరిశ్రమల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఋణాలను అందిస్తున్నది.

భారతీయ పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు 2004 మార్చి నాటికి పారిశ్రామికాభివృద్ధికి మంజూరు చేసిన మొత్తం 14,050 కోట్ల రూపాయలలో చెల్లించినవి 13,396 కోట్ల రూపాయలు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (SIDBI).
జవాబు:
భారత ప్రభుత్వం ఏప్రిల్ 1990లో భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకుకు అనుబంధంగా భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయడమైనది. భారతదేశంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు, అభివృద్ధికి, విస్తరణకు ప్రధానమైన విత్త సహాయ సంస్థగా “భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు” ఏర్పడినది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 2.
భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (IDBI).
జవాబు:
పరిశ్రమలకు దీర్ఘకాలిక పరపతిని అందించుటకు 1964వ సంవత్సరంలో భారతీయ పారిశ్రామికాభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయడమైంది. ఇది పరిశ్రమల ఆధునికీకరణకు, బహు విధాలుగా విస్తరించుటకు పరపతిని అందిస్తుంది.

ప్రశ్న 3.
రాష్ట్ర విత్త సహాయ సంస్థలు (SFIS).
జవాబు:
భారత పారిశ్రామిక విత్త సంస్థల వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల దీర్ఘకాలిక అవసరాలను సక్రమంగా తీర్చలేకపోవడం వల్ల దీనిని సెప్టెంబర్ 18, 1951లో ఏర్పాటు చేసారు. ఇవి ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.

ప్రశ్న 4.
పెట్టుబడుల ఉపసంహరణ.
జవాబు:
వనరుల పెంపుదలకు మరియు విస్తృత ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించుటకు, ప్రభుత్వ రంగంలోని కొంత వాటాలను మ్యూచువల్ ఫండ్స్కు, విత్త సంస్థలకు, సాధారణ ప్రజలకు, శ్రామికులకు ఇవ్వటాన్ని పెట్టుబడుల ఉప సంహరణ అంటారు.

ప్రశ్న 5.
ఏకస్వామ్య నిర్బంధ వర్తక ఆవరణ చట్టం (MRTP Act).
జవాబు:
ఆర్థిక స్థోమత కేంద్రీకరణగాను, ఏకస్వామ్యాలను, అక్రమ వ్యాపార పద్ధతులను సమర్థవంతంగా నియంత్రించుటకు ఈ తీర్మానాన్ని MRTP చట్టానికి సవరణలు ప్రతిపాదించింది.

ప్రశ్న 6. ప్రత్యేక ఆర్థికమండళ్ళు, [Mar ’17]
జవాబు:
భారత ప్రభుత్వం ఏప్రిల్ 2000వ సం॥లో ప్రత్యేక ఆర్థికమండళ్ళను ప్రకటించింది. ఈ విధానము త్వరిత ఆర్థికాభివృద్ధికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలతో పాటు పన్ను రాయితీలు పొందుతూ కనీస నియంత్రణలకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఏర్పాటు చేయబడింది. ఈ చట్టం 2006 నుండి తన కార్యకలాపాలను నిర్వహించుచున్నది.

ప్రశ్న 7.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి.
జవాబు:
1991 పారిశ్రామిక విధాన తీర్మానం విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించింది. పరిశ్రమల-ఆధునికీకరణకు, సాంకేతిక పరిజ్ఞానం పెంచటానికి, ఆర్థికాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా ఋణరహిత పద్ధతిలో ఆర్థిక వనరుల లభ్యతకు అవకాశం కల్పించును.

ప్రశ్న 8.
పారిశ్రామిక క్షేత్రాలు.
జవాబు:
ఒక ప్రాంతంలో అనేక చిన్న పరిశ్రమలు కేంద్రీకృతం కావడాన్ని పారిశ్రామిక క్షేత్రాలు లేదా పారిశ్రామిక వాడలు అంటారు. చిన్న పరిశ్రమలకు అవసరమైన అవస్థాపనా సౌకర్యాలైన నీరు, రవాణా, విద్యుచ్ఛక్తి మొదలగునవి కల్పించి అనేక చిన్న పరిశ్రమల నిర్మాణం జరిగిన ప్రాంతాన్ని పారిశ్రామిక క్షేత్రాలు అంటారు.

ప్రశ్న 9. సూక్ష్మ, చిన్నతరహా, మాధ్యమిక పరిశ్రమలు.
జవాబు:
భారత ప్రభుత్వం అక్టోబర్ 2, 2006వ సం॥న సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల చట్టమును అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం సూక్ష్మ లేదా లఘు పరిశ్రమల విషయంలో యాంత్రీకరణను ప్రవేశపెట్టిన పెట్టుబడి 25 లక్షల రూ॥ నుంచి 5 కోట్ల వరకు పెట్టుబడి కలిగినవి. మధ్యతరహా పరిశ్రమల పెట్టుబడి 5 నుంచి 10 కోట్ల మధ్య ఉండాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 10.
భారతీయ పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ (ICICI).
జవాబు:
దీనిని 1995వ సం॥లో ప్రైవేట్ రంగంలో ప్రారంభించారు. దీర్ఘకాలిక ఋణాలను, మధ్యకాలిక ఋణాలను, స్వదేశీ, విదేశీ కరెన్సీలలో అందిస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పరపతి సౌకర్యం కల్పిస్తుంది. పరిశ్రమల షేర్లకి, డిబెంచర్లకు పూచీదారుగా వ్యవహరిస్తుంది.

ప్రశ్న 11.
ప్రపంచీకరణ.
జవాబు:
ప్రపంచ దేశాల మధ్య రాజకీయ ఎల్లలు లేని ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధి.