AP 9th Class Biology Notes 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

Students can go through AP Board 9th Class Biology Notes 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు to understand and remember the concept easily.

AP Board 9th Class Biology Notes 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

→ భూమి మీద పర్యావరణం నుండి జీవులకు, జీవుల నుండి పర్యావరణానికి పోషకాల ప్రసరణ జరగడంలో ఇమిడి ఉండే నిర్దిష్ట మార్గాలను “జీవ భౌగోళిక వలయాలు” అంటారు.

→ జీవావరణంలోని వివిధ అంశాల మధ్య పదార్ధం, శక్తి బదిలీ కోసం పరస్పర చర్యలు జరుగుతాయి.

→ భూమి మీద పదార్థాల బదిలీ మార్గాన్ని నిర్దేశించేవి జీవ భౌగోళిక రసాయన వలయాలు.

→ నీరు సార్వత్రిక ద్రావణి. జీవకణంలో జరిగే వివిధ చర్యలకు చాలా అవసరం.

→ భూమి మీద ఉన్న నీటిలో దాదాపు 97% నీరు ఉప్పునీటి రూపంలో సముద్రంలో ఉంది. 3% మాత్రమే మంచినీరు.

→ కిరణజన్య సంయోగక్రియ, జీర్ణక్రియ, కణశ్వాసక్రియలతో సహా వివిధ జీవరసాయనిక చర్యలలో నీరు పాల్గొంటుంది.

AP 9th Class Biology Notes 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

→ జీవరాశి ఏర్పడడానికి కావలసిన సేంద్రీయ పదార్థాలలో అతిముఖ్యమైన మూలకాలు హైడ్రోజన్, ఆక్సిజన్ నీటి ద్వారానే లభ్యమవుతాయి.

→ వాతావరణంలోని నైట్రోజన్ 78% ఉన్నా మొక్కలు మరియు జంతువులు దీనిని ఆ రూపంలో వినియోగించుకోలేవు.

→ వాతావరణంలో క్రియారహితంగా ఉండే నైట్రోజనను కొన్ని రకాల జీవులు తమ శరీరంలో వివిధ సమ్మేళనాల రూపంలో నత్రజని స్థాపన చేయగలవు.
ఉదా : రైజోబియం, నైట్రో సోమోనాస్.

→ నేలలోని డీనైట్రిఫైయింగ్ బాక్టీరియాలు నైట్రేట్లను అమ్మోనియం రూపంలో మార్చటాన్ని నత్రీకరణం అంటారు.

→ నైట్రోజన్ సంబంధ పదార్థాలు ప్రధానంగా నైట్రేట్స్ లేదా అమ్మోనియం (NH4+) అయాన్లను మొక్కలు, నేల నుండి గ్రహించడం స్వాంగీకరణం.

→ నైట్రేట్స్ మరియు ఇతర నైట్రోజన్ సంబంధ పదార్థాల నుంచి అమ్మోనియా (NH3) ఉత్పత్తి కావటాన్ని అమ్మోనిఫికేషన్ అంటారు.

→ జంతు, వృక్ష కణాలలోకి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణం లేదా డినైట్రిఫికేషన్ అంటారు.

→ గాలి ఘనపరిమాణంలో కార్బన్ డై ఆక్సైడ్ 0.04% గా ఉంటుంది.

AP 9th Class Biology Notes 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

→ మొక్కలలోనూ, ఇతర జీవులైన ఉత్పత్తిదారులలోనూ కిరణజన్య సంయోగక్రియ ద్వారా జీవరూపంలో కార్బన్ స్థాపన చేయబడుతుంది.

→ వాతావరణంలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, నీటి ఆవిరి వంటి గ్రీన్‌హౌజ్ వాయువులు భూమి ఉపరితలం పైనున్న వాతావరణాన్ని వేడెక్కించడాన్ని ‘గ్రీన్‌హౌజ్ ఎఫెక్టు’ అంటారు.

→ వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్‌హౌజ్ వాయువులు ఎక్కువ మొత్తంలో విడుదల కావడం వలన భూ ఉష్ణోగ్రతలు పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు.

→ వాతావరణంలో 21% వరకు ఆక్సిజన్ మూలక రూపంలో ఉంటుంది.

→ వాయు సహిత బాక్టీరియా వ్యర్థ పదార్థాలను కుళ్ళింపచేయడానికి కావలసిన ఆక్సిజన్ మొత్తం పరిమాణాన్ని ‘జీవులకు అవసరమైన ఆక్సిజన్ (BOD) సూచిస్తుంది.

→ భూమి ఉపరితలం నుండి 15-30 కి.మీ దూరంలో వ్యాపించి ఉన్న స్ట్రాటోస్పియర్ లో ఎక్కువ మొత్తం ఓజోన్ పూరిత వాతావరణం ఉంటుంది.

→ ఓజోన్ పొర ప్రధానంగా సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను శోషిస్తుంది.

→ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, న్యూక్లిక్ ఆమ్లాలు మరియు కొవ్వులు వంటి జీవ అణువుల్లో ఆక్సిజన్ అత్యవసరమైన అంశంగా ఉంటుంది.

→ 1987లో ఓజోన్ పొర సంరక్షణ కోసం నిర్దేశించిన విధి విధానము మాట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం క్లోరోఫ్లోరో కార్బన్స్ వంటి పదార్థాల ఉత్పత్తి మరియు సరఫరాను నియంత్రించడం.

AP 9th Class Biology Notes 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

→ జలచక్రం లేదా హైడ్రాలాజికల్ వలయం : నీరు నిరంతరం పునః చక్రీయం పొందే ప్రక్రియ.

→ నత్రజని వలయం : ఈ వలయంలో జడ స్వభావం కలిగి, వాతావరణంలో అణు రూపంలో ఉండే నైట్రోజన్ (N2) జీవక్రియలకు ఉపయోగపడే రూపంలోకి మారుతుంది.

→ నత్రజని స్థాపన : వాతావరణంలోని నైట్రోజన్ వాయువు అమ్మోనియం మరియు నైట్రేట్లుగా మారటం.

→ నైట్రిఫికేషన్ : నేలలోని డీనైట్రిఫైయింగ్ బాక్టీరియాలు నైట్రేట్లను అమ్మోనియా రూపంలోకి మార్చటం.

→ స్వాంగీకరణం : నైట్రోజన్ సంబంధ పదార్థాలు, ప్రధానంగా నైట్రేట్స్ లేదా అమ్మోనియం అయాలను మొక్కలు, నేల నుండి గ్రహించడం.

→ అమ్మోనిఫికేషన్ : నైట్రేట్స్ మరియు ఇతర నైట్రోజన్ సంబంధ పదార్థాల నుంచి అమ్మోనియా (NH3) ఉత్పత్తి కావడం.

→ వినత్రీకరణం : జంతు వృక్ష కణాలలో మనరూపంలో ఉన్న వైబ్రేట్స్ (NO3) వాయు రూపంలో ఉండే (N2)గా మారటం.

→ కార్బన్ వలయం : ఆవరణ వ్యవస్థలోని ఒక అంశము నుండి మరియొక అంశమునకు కార్బన్ కదలిక. సజీవ జీవులు మరియు నిర్జీవ వాతావరణం మధ్య కార్బన్ కదలిక.

→ గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ (Greenhouse effect : వాతావరణంలోని కార్బన్ డై ఆక్సెడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, నీరు, వాయువులు గాలిలోని పరారుణ కిరణాలను గ్రహించి భూమిని వెచ్చగా ఉంచడం.

→ డీనైట్రిఫికేషన్ : జంతు, వృక్ష కణాలలోకి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడం విసత్రీకరణం లేదా డీనైట్రిఫికేషన్

→ ఓజోన్ పొర తగ్గటం : కొన్ని పరిశ్రమలు పాటిస్తున్న విధానాలు మరియు ఉత్పాదకాల వలన ఓజోన్ పొర తగ్గటం జరుగుతుంది.

AP 9th Class Biology Notes 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

→ గ్లోబల్ వార్మింగ్ : వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌజ్ వాయువులు ఎక్కువ మొత్తంలో విడుదల కావటం వలన భూ ఉష్ణోగ్రతలు పెరగడం.

→ ఆక్సిజన్ వలయం : వాతావరణంలోని ఆక్సిజన్ వివిధ జీవక్రియలకు మరియు వివిధ ఆక్సెలు ఏర్పడడానికి వినియోగించబడి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాతావరణానికి చేరుతుంది.

→ ద్రవీభవనం : వాయువు ద్రవముగా మారే ప్రక్రియ.

→ అవక్షేపం : ద్రవము నుండి ఘనపదార్థమును వేరుచేసే రసాయన ప్రక్రియ.

AP 9th Class Biology Notes 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1