AP 9th Class Physical Science Notes 2nd Lesson గమన నియమాలు

Students can go through AP Board 9th Class Physical Science Notes 2nd Lesson గమన నియమాలు to understand and remember the concept easily.

AP Board 9th Class Physical Science Notes 2nd Lesson గమన నియమాలు

→ నిశ్చలంగా ఉండే వస్తువుల విషయంలో ఎటువంటి వివరణా అవసరం లేదు. – అరిస్టాటిల్

→ బాహ్యబలం లేనంత వరకు కదులుతున్న వస్తువు సమవడితో సమచలనంలోనే ఉంటుంది. – గెలీలియో

→ అరిస్టాటిల్, గెలీలియోలు అభివృద్ధిపరిచిన పరికల్పనల ఆధారంగా సర్ ఐజాక్ న్యూటన్ బలానికి, చలనంలో మార్పుకు సంబంధాన్ని వివరించాడు.

→ న్యూటన్ ప్రతిపాదించిన మూడు ప్రాథమిక సూత్రాలను న్యూటన్ గమన నియమాలు అంటారు.

→ ఫలిత బలం పనిచేయనంత వరకు నిశ్చలస్థితిలో ఉన్న వస్తువు లేదా సమచలనంలో ఉన్న వస్తువు అదే స్థితిలో ఉండును. – న్యూటన్ మొదటి గమన నియమం

→ నిశ్చలస్థితిలో గానీ, సమచలనంలో గానీ ఉన్న వస్తువు, తన గమన స్థితిలో మార్పుని వ్యతిరేకించే సహజ గుణాన్ని జడత్వం అంటారు.

AP 9th Class Physical Science Notes 2nd Lesson గమన నియమాలు

→ జడత్వం యొక్క కొలతనే వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటాము.

→ ద్రవ్యరాశికి ప్రమాణము – కిలోగ్రాము.

→ వస్తువు ద్రవ్యవేగంలోని మార్పురేటు, దాని పై పనిచేసే ఫలిత బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. – న్యూటన్ రెండవ గమన నియమం

→ ద్రవ్యరాశి, వేగాల లబ్దాన్ని రేఖీయ ద్రవ్యవేగం అంటాము.

→ ద్రవ్యవేగానికి S.I పద్ధతిలో ప్రమాణం – కి.గ్రా. మీ/సె.

→ న్యూటన్ రెండవ గమన నియమము ద్వారా ఫలిత బలం పనిచేసే దిశలోనే ద్రవ్యవేగంలో మార్పును సూచిస్తుంది.
AP 9th Class Physical Science Notes 2nd Lesson గమన నియమాలు 1

→ న్యూటన్ రెండవ గమన నియమం ఉపయోగించి సమస్యల్ని సాధించాలంటే, వస్తు భారాన్ని క్షితిజ లంబంగా తీసుకోవాలి.

→ అటవుడ్ యంత్రంలో కప్పి ద్వారా సాగే గుణం లేని ఒక తాడుకు రెండు చివరలలో m1 మరియు m2 ద్రవ్యరాశులు గల భారాలు వేలాడుతుంటాయి.
AP 9th Class Physical Science Notes 2nd Lesson గమన నియమాలు 2

→ న్యూటన్ మొదటి, రెండవ గమన నియమాలు ఒకే వస్తువుకు వినియోగిస్తాము.

→ న్యూటన్ మూడవ గమన నియమాన్ని రెండు వస్తువుల మధ్యగల ప్రక్రియకు వాడతాము.

→ ఒక వస్తువు, వేరొక వస్తువుపై బలాన్ని కలుగజేస్తే, ఆ రెండవ వస్తువు కూడా మొదటి దానిపై అంతే పరిమాణంలో బలాన్ని వ్యతిరేక దిశలో కలుగజేస్తుంది. – న్యూటన్ మూడవ గమన నియమం

AP 9th Class Physical Science Notes 2nd Lesson గమన నియమాలు

→ ఫలిత బలం శూన్యంగా గల ఏకాంక వ్యవస్థలో మొత్తం ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది.

→ ప్రతి ఒక చర్యకు ప్రతిచర్య సమానంగాను, దిశలో వ్యతిరేకంగాను ఉంటుంది.
∴ చర్య = – ప్రతిచర్య

→ రెండుగాని అంతకన్నా ఎక్కువగాని వస్తువులు ఒకదానినొకటి ఢీకొడితే వాటి ద్రవ్యవేగాల బీజీయ మొత్తం స్థిరంగా ఉంటుంది.

→ రాకెట్లు, జెట్ విమానాలు న్యూటను మూడవ గమన నియమంపై ఆధారపడి పనిచేస్తాయి.

→ ఫలిత బలం, ఫలిత బలం పని చేసిన కాలాల లబ్దాన్ని ప్రచోదనం (Impulse) అంటారు.

→ స్వల్పకాలాలపాటు ప్రయోగించబడిన ఆ బలాలను ప్రచోదనా బలాలు అంటాము.

→ గమన నియమాలు : చలనంలో ఉన్న వస్తువు పాటించు కొన్ని ధర్మాలు.

→ జడత్వం : మార్పును వ్యతిరేకించే లక్షణం.

→ ద్రవ్యరాశి : వస్తువులో ఉండు పదార్థం పరిమాణం.

AP 9th Class Physical Science Notes 2nd Lesson గమన నియమాలు

→ రేఖీయ ద్రవ్యవేగం : సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క ద్రవ్యరాశి, వేగాల లబ్ధము.

→ ద్రవ్యవేగ నిత్యత్వం : ఒక వ్యవస్థలోని ద్రవ్యము, వేగాల పరిమాణాలను గూర్చి తెలుపు భౌతిక ధర్మము.

→ ప్రచోదనం : ఫలిత బలం మరియు అది పనిచేసిన కాలాల లబ్దం.

→ ప్రచోదనా బలం : ఒక వ్యవస్థపై స్వల్ప కాలం పాటు ప్రయోగింపబడిన బలం.

AP 9th Class Physical Science Notes 2nd Lesson గమన నియమాలు 3