Students can go through AP Board 9th Class Physical Science Notes 1st Lesson కణ నిర్మాణం – విధులు to understand and remember the concept easily.
AP Board 9th Class Physical Science Notes 1st Lesson కణ నిర్మాణం – విధులు
→ కుడి, ఎడమ; రాత్రి, పగలు; పైన, క్రింద; పొడవు, పొట్టి వంటివి స్థానము మరియు పరిశీలకుని దృష్ట్యా సాపేక్ష పదాలు.
→ చలనం అనేది సాపేక్షమైనది. ఒక వస్తువు చలనం పరిశీలకుని పరంగా చెప్పబడుతుంది.
→ పరిశీలకుడి పరంగా ఒక వస్తు స్థానం కాలంతో పాటు నిరంతరం మారుతుంటే ఆ వస్తువు చలనంలో ఉంది అంటాము.
→ నిర్ణీత కాలంలో ఒక వస్తువు ప్రయాణించిన మార్గం మొత్తము పొడవును దూరము అంటారు.
→ వేగంలో మార్పురేటుని త్వరణం అంటారు. త్వరణం \(\mathrm{a}=\frac{\Delta \mathrm{v}}{\Delta \mathrm{t}}\) త్వరణం యొక్క S.I. ప్రమాణం మీ./సె².
→ దూరం అదిశరాశి, స్థానభ్రంశం సదిశరాశి.
→ ఏకాంక కాలంలో ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని సరాసరి వడి అంటారు.
→ ఏకాంక కాలంలో ఒక వస్తువు పొందే స్థానభ్రంశాన్ని సరాసరి వేగం అని అంటారు.
→ ఏదైనా ఒక నిర్దిష్ట సమయం వద్ద వడిని తక్షణ వడి అంటారు. వడి, వస్తువు స్థానంలో మార్పు ఎంత త్వరగా వస్తుందో తెలియజేస్తుంది.
→ కాలం – దూరం గ్రాఫు ద్వారా ఒక సరళరేఖ వెంబడి వస్తువు చలనాన్ని అధ్యయనం చేయవచ్చు.
→ ఏదైనా ఒక బిందువు వద్ద, కాలం – దూరం గ్రాఫు యొక్క వాలు, ఆ వస్తువు యొక్క వడిని తెలియజేస్తుంది.
→ ఏదైనా వస్తువు వృత్తాకార చలనంలో ఉన్నపుడు, ఏదైనా ఒక బిందువు వద్ద గీయబడిన స్పర్శరేఖ ఆ వస్తువు యొక్క వేగ దిశను తెలియజేస్తుంది.
→ ఒక వస్తువు స్థిరవేగంతో చలిస్తూ ఉంటే ఆ చలనాన్ని సమ చలనం అంటారు.
→ సమ చలనంలో ఉన్న వస్తువు చలనం యొక్క దూరం – కాలం గ్రాఫు ఒక సరళరేఖ.
→ కాలంతో పాటు ఒక వస్తువు వేగం మారుతూ ఉంటే ఆ చలనాన్ని అసమచలనం అంటారు.
→ నిర్దిష్ట దిశలో వస్తువు కదిలిన కనిష్ఠ దూరాన్ని స్థానభ్రంశం అంటారు.
→ వేగంలో మార్పురేటు ఋణాత్మకంగా ఉంటే, ఆ త్వరణాన్ని రుణత్వరణం అంటారు. దీనిని ‘- a’ తో సూచిస్తారు.
→ సమత్వరణచలన సమీకరణాలు
v = u + at
s = ut + \(\frac{1}{2}\)at²
v² – u² = 2as
→ సాపేక్షం : మరొక దానితో పోల్చినప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండడాన్ని సాపేక్షం అంటారు.
ఉదా : భూమితో సాపేక్షంగా సూర్యుని స్థానం.
→ దూరం : వస్తువు ప్రయాణించిన మార్గం మొత్తం పొడవును ‘దూరం’ అంటారు.
→ స్థానభ్రంశం : రెండు బిందువుల మధ్య నిర్దిష్ట దిశలో గల కనిష్ఠ దూరాన్ని స్థానభ్రంశం అంటారు.
→ సరాసరి వడి : ఏకాంక కాలంలో ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని సరాసరి వడి అంటారు.
→ సరాసరి వేగం : ఏకాంక కాలంలో ఒక వస్తువు పొందే స్థానభ్రంశాన్ని సరాసరి వేగం అని అంటాం.
→ తక్షణ వడి : ఏదైనా ఒక నిర్దిష్ట సమయం వద్ద వడిని తక్షణవడి అంటాం. తక్షణ వడి, వస్తువు స్థానంలో మార్పు ఎంత త్వరగా వస్తుందో తెలియజేస్తుంది.
→ వడి :
→ వేగం :
→ త్వరణం : వేగంలోని మార్పురేటును త్వరణం అంటారు.
త్వరణం \(\mathrm{a}=\frac{\Delta \mathrm{v}}{\Delta \mathrm{t}}\)
త్వరణం యొక్క S.I ప్రమాణము మీ/సె².
→ రేఖీయ చలనం : ఒక సరళరేఖ వెంబడి ఉండే వస్తువు చలనాన్ని రేఖీయ చలనం అంటారు.
→ సమ చలనం : ఒక వస్తువు స్థిర వేగంతో చలిస్తూ ఉంటే ఆ చలనాన్ని సమ చలనం అంటారు.
→ సమత్వరణం : నిర్దిష్ట కాల వ్యవధులలో ఒక వస్తువు వేగంలో మార్పులు సమానంగా ఉంటే, ఆ వస్తువు త్వరణాన్ని సమత్వరణం’ అంటారు.
→ రుణత్వరణం : వేగంలో తగ్గుదల రేటును ‘రుణత్వరణం’ అంటారు.