Students can go through AP Board 6th Class Maths Notes 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం to understand and remember the concept easily.
AP Board 6th Class Maths Notes 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం
→ చుట్టుకొలత : ఒక బహుభుజి యొక్క అన్ని భుజాల పొడవుల మొత్తాన్ని దాని చుట్టుకొలత అంటాము.
 (i) త్రిభుజం చుట్టుకొలత :
 
 త్రిభుజం చుట్టుకొలత = BC + AC + AB = (a + b + C) యూనిట్లు
(ii) చతురస్రం చుట్టుకొలత :
 
 చతురస్రం చుట్టుకొలత = AB + BC + CD + DA
 = a + a + a + a
 = 4a యూనిట్లు = 4 × భుజము
(iii) దీర్ఘ చతురస్ర చుట్టుకొలత :
 
 దీర్ఘ చతురస్ర చుట్టుకొలత = AB + BC + CD + DA
 = l + b + l + b = 2l + 2b
 = 2 × పొడవు + 2 × వెడల్పు

iv) వృత్తం యొక్క చుట్టుకొలతను వృత్త పరిధి అంటారు. దీనిని ‘C’ తో సూచిస్తారు.
 
 వృత్త పరిధి C = 2πr యూనిట్లు (ఇక్కడ r – వృత్త వ్యాసార్ధం, π = \(\frac{22}{7}\))
 π : వృత్త పరిధి మరియు వ్యాసముల యొక్క నిష్పత్తిని π విలువగా నిర్వచిస్తాము. ఈ విలువ ఎల్లప్పుడు స్థిరము. ఈ స్థిర విలువ \(\frac{22}{7}\)కు సమానము.
 
 π = \(\frac{C}{d}\)
 ∴ C = πd
 వృత్త పరిధి = π × వ్యాసము
 C = π × 2 × వ్యాసార్ధం
 C = 2π × వ్యాసార్ధం
 C = 2πr.
వైశాల్యం : ఒక వస్తువు ఆవరించిన ప్రాంతాన్ని దాని వైశాల్యము అంటాం.
 చతురస్ర వైశాల్యం A = భుజం × భుజం
 దీర్ఘచతురస్ర వైశాల్యం A = పొడవు × వెడల్పు
