Students can go through AP Board 8th Class Biology Notes 5th Lesson కౌమార దశ to understand and remember the concept easily.
AP Board 8th Class Biology Notes 5th Lesson కౌమార దశ
→ కౌమార దశ 13-19 సం||ల మధ్య పిల్లలలో వచ్చే అతి ముఖ్యమైన దశ.
→ ఈ దశలో శారీరక, మానసిక, ఎదుగుదల వేగంగా జరుగుతుంది.
→ ఈ దశలో మగ, ఆడపిల్లలో లైంగిక అవయవాలు బాహ్య, అంతర నిర్మాణాలలో అభివృద్ధి జరుగుతుంది.
→ హర్మోనులు L.H.; F.S.H. లైంగిక అవయవాలను ఉద్దీపన చెందించి ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి చేస్తాయి.
→ ఈ దశ చివరలో పిల్లలు ఎత్తు పెరగటం ఆగిపోతుంది.
→ అంతఃస్రావీ గ్రంథులు హర్మోనులను ఉత్పత్తి చేస్తాయి. ఇవి పెరుగుదలను అనుసంధానపరుస్తాయి. అవి:
- పీయూష గ్రంథి – మెదడులో ఉంటుంది.
- ఖైరాయిడ్ గ్రంథి – గొంతు దగ్గర
- ముష్కాలు – సోటల్ సంచులు
- స్త్రీ బీజకోశాలు – గర్భాశయానికి ఇరువైపులా
- అడ్రినల్ గ్రంధి – మూత్రపిండాల పైన
- క్లోమంలో లాంగర్హాన్స్ పుటికలు – క్లోమం
→ స్త్రీలలో 10-12 సం||ల నుండి (రజస్వల అయిన దగ్గర నుండి) ఋతుచక్రం ప్రారంభమవుతుంది. ఇది 40-50 సం||ల వరకు జరిగి ఆగిపోతుంది. ఈ దశను మోనోపాజ్ అంటారు.
→ కౌమార దశలో మంచి పోషకాహారం తీసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరం.
→ చట్టపరమైన వివాహ వయస్సు
- పురుషులకు – 21 సం||లు
- స్త్రీలకు – 18 సం||లు
→ బాల్య వివాహం ఒక సామాజిక దురాచారం.
→ కొమార దశలో ఉద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వీయ క్రమశిక్షణ (Introspection) అలవర్చుకుని భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి.
→ కౌమార దశలో ఉన్న వారి సందేహాలను శాస్త్రీయంగా నివృత్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.
→ ఈ దశలో వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
→ మంచి వ్యాయామం, ఆటలాడటం వల్ల మంచి నిద్ర, మానసిక ఉల్లాసం కలుగుతుంది.
→ దీనివల్ల ‘మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
→ పాఠశాలలో జరిగే కామార విద్య కార్యక్రమాలలో ప్రతి విద్యార్థి చురుకుగా పాల్గొనాలి.
![]()
→ కౌమార దశ : 13-19 సం॥ల మధ్య హార్మోనుల ప్రభావం వల్ల పిల్లల్లో (టీనేజర్లలో) వచ్చే లైంగిక, శారీరక, మానసిక, భావోద్వేగాలు అభివృద్ధి చెందే దశ.
→ టీనేజ్ : 13-19 సంవత్సరాల మధ్య వయస్సును టీనేజ్ అంటారు.
→ ఆడమ్స్ యాపిల్ : గొంతు (స్వరపేటిక) దగ్గర ముందుకు పొడుచుకు వచ్చిన థైరాయిడ్ మృదులాస్థి ఎముకను ఆడమ్స్ యాపిల్ అంటారు.
→ పరిపక్వత : వయస్సుకు అవసరమైనంత పెరుగుదల, ఆలోచనా పరిధి అభివృద్ధి చెందే దశకు రావటం.
→ స్వేదగ్రంథులు : చర్మంలో ఉండి, స్వేదం (చెమట)ను ఉత్పత్తి చేసే గ్రంథులు (ఇవి విసర్జక వ్యవస్థలో అంతర్భాగం).
→ సబేసియస్ గ్రంథులు : ‘తైలం’ను తయారుచేస్తూ చర్మం పై భాగాన్ని చెమ్మగా ఉంచటానికి ఉపయోగపడే గ్రంథులు.
→ ద్వితీయ లైంగిక లక్షణాలు: టీనేజ్ లో హార్మోనుల ప్రభావం వల్ల శారీరకంగా అభివృద్ధి చెందే లైంగిక లక్షణాలు (గడ్డం, మీసాలు, ఆడవారిలో సున్నితత్వం మొదలగునవి)
→ ఋతుచక్రం : ఆడపిల్లలలో కౌమార దశ ప్రవేశించిన దగ్గర నుంచి ప్రతి 28-30 రోజులకొకసారి వచ్చే క్లిష్టమైన సున్నితమైన శారీరక ప్రక్రియ.
→ రజస్వల : ఆడపిల్లల్లో కౌమార దశ ప్రారంభంలో వచ్చే మొట్టమొదటి ఋతుచక్రాన్ని ‘రజస్వల’ అంటారు. 10-12 ఏళ్ళ మధ్య ఆరంభమవుతుంది.
→ మోనోపాజ్ : స్త్రీలలో రజస్వల అయిన దగ్గర నుంచి ఆరంభమైన ఋతుచక్రం. 45-50 సం॥ మధ్యలో ఆగిపోతుంది. దీనినే మోనోపాజ్ అంటారు.
→ గర్భం దాల్చటం : స్త్రీలలో వున్న గర్భాశయానికి ఇరువైపులా ఉన్న ఫాలోపియన్ నాళాలలో అండం శుక్రకణంతో కలసి సంయుక్త బీజం ఏర్పడి, అది పిండంగా మారటాన్ని గర్భం దాల్చడం అంటారు. (ఈ పిండం గర్భాశయ గోడలకు అంటుకుని అభివృద్ధి చెందుతుంది.)
→ అంతః ప్రావ గ్రంథులు : మన శరీరంలో వివిధ భాగాలలో వుండి హార్మోనులను ఉత్పత్తి చేసి రక్తంలోకి విడుదల చేసే గ్రంథులు. ఉదా : వీయూష గ్రంథి. అధివృక్క గ్రంథి. వీటికి నాళాలు ఉండవు. కాబట్టి వీటిని వినాళ గ్రంథులు అని కూడా అంటారు.
→ హార్మోములు : అంతఃస్రావ గ్రంధులు ఉత్పత్తి చేసే రసాయన పదార్థాలను హార్మోనులు అంటారు. ఇవి మానసిక, శారీరక, లైంగిక లక్షణాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి.
→ టెప్లాస్టిరాన్ : ఇది పురుష లైంగిక హార్మోను. దీనిని ముష్కాలు విడుదల చేస్తాయి. ఇది పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి చేస్తుంది.
→ ఈస్ట్రోజన్ : ఇది స్త్రీలలో లైంగిక హార్మోను. ఇది అండాశయ పుటిక ఉత్పత్తి చేస్తుంది. ఇది స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి చేస్తుంది.
