These AP 9th Physical Science Important Questions and Answers 9th Lesson తేలియాడే వస్తువులు will help students prepare well for the exams.
AP Board 9th Class Physical Science 9th Lesson Important Questions and Answers తేలియాడే వస్తువులు
9th Class Physical Science 9th Lesson తేలియాడే వస్తువులు 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
 హైడ్రాలిక్ లిఫ్ట్ ఏ నియమం ఆధారంగా పని చేస్తుంది?
 (లేదా)
 దైనందిన జీవితంలో పాస్కల్ నియమం యొక్క ఏదైనా ఒక అనువర్తనాన్ని రాయండి.
 జవాబు:
 హైడ్రాలిక్ లిఫ్ట్, పాస్కల్ నియమం ఆధారంగా పనిచేస్తుంది.
ప్రశ్న 2.
 సాంద్రతను నిర్వచించి దాని సూత్రం రాయండి.
 జవాబు:
 ప్రమాణ ఘనపరిమాణంలో గల ద్రవ్యరాశిని సాంద్రత అంటారు.
 
ప్రశ్న 3.
 సాపేక్ష సాంద్రత అనగానేమి? సూత్రం రాయుము.
 జవాబు:
 వస్తువు సాంద్రతకి, నీటి సాంద్రతకి గల నిష్పత్తిని సాపేక్ష సాంద్రత అంటారు.
 
ప్రశ్న 4.
 పాల స్వచ్ఛతని ఏ పరికరంతో కొలుస్తారు?
 జవాబు:
 పాల స్వచ్ఛతని లాక్టోమీటరుతో కొలుస్తారు.
ప్రశ్న 5.
 ద్రవాల సాపేక్ష సాంద్రతని కొలవడానికి వాడే పరికరం ఏది?
 జవాబు:
 ద్రవాల సాపేక్ష సాంద్రతని హైడ్రోమీటరు అనే పరికరం ద్వారా కనుగొంటారు.

ప్రశ్న 6.
 వాతావరణ పీడనం అనగానేమి?
 జవాబు:
 భూమి ఉపరితలంపై నున్న అన్ని వస్తువులపై గాలి కలుగజేసే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు.
వాతావరణ పీడనం ρo = ρhg
ప్రశ్న 7.
 ఆర్కిమెడీస్ సూత్రమును వ్రాయుము.
 జవాబు:
 ఏదైనా ఒక వస్తువును ఒక ప్రవాహిలో పూర్తిగా గాని, పాక్షికంగా గాని ముంచినపుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన ఉత్తవన బలం ఆ వస్తువుపై ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది.
ప్రశ్న 8.
 పాస్కల్ నియమమును పేర్కొనుము.
 జవాబు:
 ప్రమాణ ఘనపరిమాణంలో బంధించబడిన ప్రవాహి పై కలుగజేయబడిన బాహ్యపీడనం ఆ ప్రవాహిలో అన్ని దిశలలో ఒకే విధంగా కలుగజేయబడుతుంది.
9th Class Physical Science 9th Lesson తేలియాడే వస్తువులు 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 ఒకే ద్రవ్యరాశిగల నీటిని, పాలను కలిపినపుడు మిశ్రమం ఫలిత సాంద్రత ఎంత?
 జవాబు:
 1) పాలు, నీటిల ద్రవ్యరాశులను ρ1, ρ2 అనుకొనుము.
 2) ఒకే ద్రవ్యరాశి m , వేరు వేరు ఘనపరిమాణాలు V1 , V2 లుగా వాటిని తీసుకున్నపుడు
 
ప్రశ్న 2.
 ఒకే ఘనపరిమాణం గల పాలు, నీరు కలిపినపుడు మిశ్రమం యొక్క ఫలిత సాంద్రత ఎంత?
 జవాబు:
 
ప్రశ్న 3.
 వాతావరణ పీడనాన్ని ఎలా కొలుస్తారు?
 జవాబు:
 1) వాతావరణ పీడనాన్ని భారమితిలోని పాదరస స్థంభం ఎత్తు ఆధారంగా చెప్పవచ్చు.
2) గాజు గొట్టంలోని పాదరస మట్టం యొక్క భారం దానిపై వాతావరణ పీడన ఫలితంగా గిన్నెలోని పాదరసం వల్ల కలిగే బలానికి సమానంగా ఉంటుంది.
 పాదరస స్థంభం భారం (W) = పాదరసం ద్రవ్యరాశి (ρ) × g
 = ఘనపరిమాణం × సాంద్రత × g
 = గొట్టం అడ్డుకోత వైశాల్యం (A) × మట్టం ఎత్తు (h) × సాంద్రత (ρ) × g
 = A hρg
వాతావరణ పీడనాన్ని P0 గా తీసుకుంటే
 పాదరస మట్టంపై వాతావరణ పీడనం వల్ల కలిగే బలం = P0A
 అప్పుడు A hρg = P0A
 P0 = hρg
ఇక్కడ ρ, g లు స్థిరరాశులు కాబట్టి గాజు గొట్టంలో పాదరస మట్టం అనేది వాతావరణ పీడనంపై ఆధారపడి ఉంటుంది.
గాజు గొట్టంలో పాదరస మట్టం ఎత్తు h = 76 సెం.మీ. = 76 × 10-2 మీ
 పాదరసం సాంద్రత p = 13.6 గ్రా/ఘ. సెం.మీ. = 13.6 × 10³ కి.గ్రా/మీ³
 గురుత్వ త్వరణం g = 9.8 మీ/సె²
 P0 = hρg
 = 76 × 10-2 × 13.6 × 10³ × 9.8
 = 1.01 × 105 కి.గ్రా. మీ/మీ² సె²
 1 కి.గ్రా మీ/సె² = 1 న్యూటన్
 = 1.01 × 105 న్యూటన్/మీ²
 ఈ విలువను వాతావరణ పీడనం అంటారు.
 1 అట్మాస్ఫియర్ = 1.01 × 105 న్యూటన్/మీ²
 = 1.01 × 105 పాస్కల్

ప్రశ్న 4.
 ఒక ద్రవంలో లోతున ఉన్న ప్రదేశం దగ్గర పీడనం కనుగొనండి.
 జవాబు:
 
 1) ఒక పాత్రలో 2 సాంద్రత గల ద్రవం ఉందనుకుందాం.
2) పటంలో చూపినట్లు ఆ ద్రవం ఉపరితలం కింద A ఆధారవైశాల్యం,
 h ఎత్తు గల ద్రవ స్థూపాన్ని పరిగణనలోకి తీసుకుందాం.
3) ఆ ద్రవ స్థూపం ఘనపరిమాణం V = Ah
4) ఆ ద్రవ స్టూపం ద్రవ్యరాశి n = Ahρ
 దాని భారం w= mg = Ahρg
 ఆ ద్రవ స్థూపం సమతాస్థితిలో ఉన్నది కాబట్టి న్యూటన్ గమన
 నియమాల ప్రకారం దానిపై పనిచేసే ఫలిత బలం శూన్యం.
5) ఆ ద్రవ స్థూపంపై పనిచేసే బలాలు
 ఎ) భూమ్యాకర్షణ వల్ల కలిగిన ఆ ద్రవ స్తూపం భారం (W) (కింది దిశలో)
 బి) వాతావరణ పీడనం వలన ఆ ద్రవస్తూపంపై కలుగజేయబడిన బలం (P0A)
 సి) ద్రవం పీడనం వలన ఆ స్థూపంపై కలుగజేయబడిన బలం (PA) (పై దిశలో)
6) న్యూటన్ గమన నియమాల ప్రకారం పై దిశలో పనిచేసే బలాల మొత్తం, కింది దిశలో పనిచేసే బలాల మొత్తానికి సమానం.
 PA = P0A + W
 PA = P0A+ hρgA
 P = P0 + hρg
 ఇక్కడ P అనేది ద్రవ ఉపరితలం నుండి + లోతులో గల ప్రదేశంలో పీడనం, P0 అనేది వాతావరణ పీడనం. ఒకే లోతులో ఉన్న అన్ని ప్రదేశాలలోనూ ,ఈ పీడనం ఒకే విధంగా ఉంటుంది.
ప్రశ్న 5.
 ద్రవంలోని వివిధ లోతుల్లో పీడన వ్యత్యాసం కనుగొనుము.
 జవాబు:
 
 1) ద్రవంలో A ఆధార వైశాల్యం, 7 ఎత్తు ఉండేటట్లు ఒక ద్రవ స్థూపాన్ని పరిగణనలోకి తీసుకుందాం.
2) ద్రవంలో h1 లోతులో ఉండే పీడనం P1 అనుకుంటే
 P1 = P0 + h1ρg ……… (1)
3) ద్రవంలో h2 లోతులో ఉండే పీడనం P2 అనుకుంటే
 P2 = P0 + h2ρg ……… (2)
4) సమీకరణము (1) , (2) ల నుండి
 P2 – P1 = (P0 + h2ρg) – (P0 + h1ρg)
 = h2ρg – h1ρg
 P2 – P1 = ρg (h2 – h1)
 5) పటం నుండి h2 – h1 = h
 P2 – P1 = ρgh
6) ఆ ద్రవంలో రెండు ఎత్తుల వద్ద గల పీడనాల వ్యత్యాసం = ρgh
7) ఇందులో ρ, g లు స్థిరాంకాలు కనుక ద్రవం లోతు పెరిగితే పీడన వ్యత్యాసం పెరుగుతుంది.
ప్రశ్న 6.
 ద్రవ సాంద్రతతో సమాన సాంద్రత లేని వేరొక పదార్థంతో చేయబడిన వస్తువును ఆ ద్రవంలో ఉంచినపుడు పీడన వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది?
 జవాబు:
 ద్రవ సాంద్రతతో సమాన సాంద్రత లేని వేరొక పదార్థంతో చేయబడిన వస్తువును ఆ ద్రవంలో ముంచినపుడు ఆ వస్తువు పై భాగం, కింది భాగంలోని పీడనాల వ్యత్యాసం
 P2 – P1 = hρg
 ⇒ P2 – P1 = h\(\frac{m}{V}\)g
 ⇒ P2 – P1 = h \(\frac{m}{Ah}\)e
 ⇒ P2 – P1 = \(\frac{m}{A}\)g
 ⇒ (P2 – P1)A = mg (F = PA, W = mg)
 ⇒ F = W
 1) ఇక్కడ F అనేది నీటిలో ఉన్న వస్తువుపై పై దిశలో కలుగజేయబడే బలం, వస్తువు వలన తొలగింపబడిన ద్రవం బరువు W.
2) కనుక ఆ వస్తువుపై కలుగజేయబడే బలం తొలగింపబడిన ద్రవం బరువుకు సమానమని తెలుస్తుంది.

ప్రశ్న 7.
 పాస్కల్ సూత్రాన్ని పేర్కొని ఒక ఉదాహరణతో వివరించుము.
 (లేదా)
 పాస్కల్ నియమాన్ని తెలిపి, పాస్కల్ నియమం ఆధారంగా పనిచేసే ఒక పరికరం పటం గీయంది.
 జవాబు:
 పాస్కల్ సూత్రం :
 ఏదైనా ప్రవాహి బంధింపబడి ఉన్నప్పుడు దానిపై బాహ్యపీడనం కలుగజేస్తే ఆ ప్రవాహిలో అన్ని వైపులా ఒకే విధంగా పీడనం పెరుగుతుంది.
 
వివరణ:
- పటాన్ని చూడండి.
- ఇక్కడ U ఆకారం గల గొట్టంలో ఒక ప్రవాహి బంధింపబడి ఉండడం చూడవచ్చు.
- ఆ గొట్టం రెండు చివరల రెండు ముషలకాలు అమర్చబడి ఉన్నాయి.
- గొట్టం యొక్క కుడి, ఎడమ గొట్టాల అడ్డుకోత వైశాల్యాల నిష్పత్తి A1 : A2 మరియు A1 > A2
- ఎడమవైపునున్న ముషలకంపై F1 బలాన్ని ప్రయోగిస్తే అది గొట్టంలోని ప్రవాహి పై అధికంగా కలుగజేసే పీడనం F1/A1 అవుతుంది.
- పాస్కల్ నియమం ప్రకారం ఈ పీడనం ప్రవాహి అంతటా ఒకే విధంగా ఉండాలి.
- కావున కుడి గొట్టంలో కూడా, దాని అడ్డుకోత వైశాల్యం A3 కావడం చేత ఆ కుడి ముషలకంపై కలుగజేయబడే పీడనం \(\mathrm{F}_{2}=\frac{\mathrm{A}_{2} \times \mathrm{F}_{1}}{\mathrm{~A}_{1}}\)
- F2, F1 కన్నా ఎక్కువగా ఉంటుంది.
- కావున ఎడమవైపు ముషలకంపై ప్రయోగించబడిన తక్కువ బలం, కుడివైపు ముషలకంపై ఎక్కువ బలాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా పాస్కల్ నియమం నిత్యజీవితంలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
9th Class Physical Science 9th Lesson తేలియాడే వస్తువులు 4 Marks Bits Questions and Answers
1. సాంద్రత : \(\frac{\mathrm{kg}}{\mathrm{m}^{3}}\) :: సాపేక్ష సాంద్రత : ……….
 C) పాస్కల్ / మీ
 D) ప్రమాణాలు లేవు
 జవాబు:
 D) ప్రమాణాలు లేవు
2. పాలతో కలసిన నీటిని గుర్తించుటకు వాడు పరికరం
 A) బారోమీటరు
 B) లాక్టోమీటరు
 C) హైడ్రోమీటర్
 D) థర్మామీటరు
 జవాబు:
 B) లాక్టోమీటరు
3. హైడ్రాలిక్ జాక్ నిర్మాణానికి సంబంధించి భిన్నమైనది
 A) ముషలకాలకు ఘర్షణ ఉండరాదు.
 B) ఓటు పోని (leak proof) ముషలకాలుండాలి.
 C) ముషలకాలకు ఒకే వైశాల్యం ఉండాలి.
 D) జాక్ లోని ప్రవాహి సంపీడ్యం చెందనిదిగా ఉండాలి.
 జవాబు:
 C) ముషలకాలకు ఒకే వైశాల్యం ఉండాలి.
4. ఒక పాస్కల్ కు సమానమైన విలువ
 A) 1.01 × 10 న్యూ. మీ.-2
 B) 1.01 × 10 న్యూ.మీ.-2
 C) 1 న్యూ. మీ.-2
 D) 76 న్యూ.మీ.-2
 జవాబు:
 C) 1 న్యూ. మీ.-2
5. పాల స్వచ్చతను కనుగొనుటకు ఉపయోగించు పరికరం
 A) భారమితి
 B) హైడ్రోమీటర్
 C) పొటెన్షియోమీటర్
 D) లాక్టోమీటర్
 జవాబు:
 D) లాక్టోమీటర్
6. 2 సెం.మీ. వ్యాసార్థం గల గోళం యొక్క ద్రవ్యరాశి 0.05 కి.గ్రా. అయితే దాని సాపే సాంద్రత ఎంత?
 A) 1.39
 B) 1.39 కి.గ్రా/మీ³
 C) 1.49
 D) 1.46 కి.గ్రా/మీ³
 జవాబు:
 C) 1.49
7. ఉత్సవనం గురించి తెలియజేయు నియమం ఏది
 A) పాస్కల్ నియమం
 B) ఆర్కిమెడిస్ నియమం
 C) బాయిల్ నియమం
 D) న్యూటన్ నియమం
 జవాబు:
 B) ఆర్కిమెడిస్ నియమం

8. పాలకు నీరు కలిపినపుడు …………
 A) మిశ్రమం సాంద్రత పాల సాంద్రత కన్నా ఎక్కువ
 B) మిశ్రమం సాంద్రత పాల సాంద్రత కన్నా తక్కువ
 C) మిశ్రమం ఘన పరిమాణం పాల ఘనపరిమాణం కన్నా ఎక్కువ
 D) మిశ్రమం ఘన పరిమాణం పాల ఘనపరిమాణం కన్నా తక్కువ
 జవాబు:
 B) మిశ్రమం సాంద్రత పాల సాంద్రత కన్నా తక్కువ
I. సరియైన సమాధానమును రాయుము.
9. కిరోసిన్ నీటిలో …………
 A) తేలును
 B) మునుగును
 C) తేలియాడును
 D) ఏమీ చెప్పలేము
 జవాబు:
 A) తేలును
10. కిందివాటిలో నీటిలో మునిగేది.
 A) చెక్క ముక్క
 B) మైనం ముక్క
 C) గాజు గోళీ
 D) ప్లాస్టిక్ బంతి
 జవాబు:
 C) గాజు గోళీ
11. సాంద్రత అనగా …………..
 A) ద్రవ్యరాశి / లీటర్లు
 B) ద్రవ్యరాశి ఘనపరిమాణం
 C) ద్రవ్యరాశి వైశాల్యం
 D) ద్రవ్యరాశి / అడ్డుకోత వైశాల్యం
 జవాబు:
 B) ద్రవ్యరాశి ఘనపరిమాణం
12. ఒకే పరిమాణం గల ఇనుప ముక్కను, చెక్కముక్కను తూచినపుడు, ఇనుపముక్క ఎక్కువ బరువుగా ఉంటుంది. కారణం ఏమనగా
 A) ఇనుము సాంద్రత చెక్క సాంద్రత కన్నా తక్కువ
 B) ఇనుము బరువు చెక్క బరువు కన్నా ఎక్కువ
 C) ఇనుము వైశాల్యం చెక్క వైశాల్యం కన్నా ఎక్కువ
 D) ఇనుము సాంద్రత చెక్క సాంద్రత కన్నా ఎక్కువ
 జవాబు:
 D) ఇనుము సాంద్రత చెక్క సాంద్రత కన్నా ఎక్కువ
13. సాంద్రతకు ప్రమాణాలు …………
 A) కి.గ్రా/సెం.మీ.
 B) గ్రా/మీ
 C) కి.గ్రా/మీ
 D) మీ/కి.గ్రా
 జవాబు:
 C) కి.గ్రా/మీ
14. ఒక వస్తువు ద్రవం ఉపరితలంపై తేలాలంటే
 A) ఆ వస్తువు సాంద్రత ద్రవం సాంద్రత కంటె ఎక్కువ ఉండాలి
 B) ఆ వస్తువు సాంద్రత ద్రవం సాంద్రత కంటె తక్కువ ఉండాలి
 C) ఆ వస్తువు బరువు ద్రవం బరువు కంటే ఎక్కువ ఉండాలి
 D) ఆ వస్తువు బరువు ద్రవం బరువు కంటే తక్కువ ఉండాలి
 జవాబు:
 B) ఆ వస్తువు సాంద్రత ద్రవం సాంద్రత కంటె తక్కువ ఉండాలి
15. వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత =
 A) వస్తువు సాంద్రత / నీటి బరువు
 B) నీటి సాంద్రత / వస్తువు సాంద్రత
 C) వస్తువు బరువు/ నీటి బరువు
 D) వస్తువు ద్రవ్యరాశి / అంతే ఘనపరిమాణం గల నీటి ద్రవ్యరాశి
 జవాబు:
 D) వస్తువు ద్రవ్యరాశి / అంతే ఘనపరిమాణం గల నీటి ద్రవ్యరాశి
16. పాల స్వచ్ఛతను తెలుసుకోవడానికి వాడేది
 A) భారమితి
 B) హైడ్రోమీటరు
 C) డెన్సిట్ మీటరు
 D) లాక్టోమీటరు
 జవాబు:
 D) లాక్టోమీటరు
17. లాక్టోమీటరు ……. సూత్రంపై పనిచేస్తుంది.
 A) సాంద్రత
 B) సాపేక్ష సాంద్రత
 C) ఉత్సవనము
 D ఘనపరిమాణము
 జవాబు:
 B) సాపేక్ష సాంద్రత

18. సాపేక్ష సాంద్రత 1 కన్నా ఎక్కువ ఉన్న వస్తువులు నీటిపై (లో) ………….
 A) తేలును
 B) మునుగును
 C) వేలాడును
 D) చెప్పలేము
 జవాబు:
 D) చెప్పలేము
19. వాతావరణ పీడనాన్ని కొలవడానికి వాడేది ………….
 A) లాక్టోమీటరు
 B) హైడ్రోమీటరు
 C) భారమితి
 D) హైగ్రోమీటరు
 జవాబు:
 C) భారమితి
20. సాధారణ వాతావరణ పీడనం వద్ద పాదరస స్తంభం ఎత్తు ………….
 A) 76 సెం.మీ.
 B) 7.6 సెం.మీ
 C) 76 మి. మీ
 D) 100 సెం.మీ.
 జవాబు:
 A) 76 సెం.మీ.
21. 1 అట్మాస్ఫియర్ పీడనము, అనగా ……….
 A) 1.01 × 10³ న్యూ మీ²
 B) 1.01 × 104 న్యూ మీ²
 C) 1.01 × 106 న్యూ మీ²
 D) 1.01 × 105 న్యూ మీ²
 జవాబు:
 D) 1.01 × 105 న్యూ మీ²
22. వాతావరణ పీడనానికి ప్రమాణాలు ………..
 A) పాస్కల్
 B) న్యూ మీ²
 C) A లేదా B
 D) ఏదీకాదు
 జవాబు:
 C) A లేదా B
23. ద్రవంలో మునిగిన ఏ వస్తువు పైనైనా పనిచేసే ఊర్ధ్వ బలాన్ని ………… అంటారు.
 A) గురుత్వ బలం
 B) ఉత్సవనము
 C) పీడనం
 D) సాంద్రత
 జవాబు:
 B) ఉత్సవనము

24. హైడ్రాలిక్ జాక్స్ ………. నియమంపై పనిచేస్తాయి.
 A) ఆర్కిమెడీస్ నియమం
 B) ఉత్సవనము
 C) పాస్కల్ నియమం
 D) గాలి పీడనం
 జవాబు:
 C) పాస్కల్ నియమం
II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.
1. ప్రమాణ ఘనపరిమాణము గల వస్తువు యొక్క ద్రవ్యరాశిని ……………… అంటారు.
 2. MKS పద్ధతిలో సాంద్రతకు ప్రమాణాలు ………..
 3. ఒక వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత = …………
 4. ఒక ద్రవం యొక్క సాపేక్ష సాంద్రత = …………
 5. సాపేక్ష సాంద్రతకు ప్రమాణాలు ……………
 6. లాక్టోమీటరును ………… కనుగొనుటకు వాడుతారు.
 7. లాక్టోమీటరు పనిచేయుటలో ఇమిడియున్న సూత్రం
 8. ఒకే ద్రవ్యరాశి గల రెండు వస్తువుల సాంద్రతలు ρ1, ρ2 అయిన ఆ మిశ్రమం యొక్క ఫలిత సాంద్రత ……………..
 9. ఒకే ఘనపరిమాణం గల రెండు వస్తువుల సాంద్రతలు ρ1 ρ2 అయిన ఆ మిశ్రమం యొక్క ఫలిత సాంద్రత
 10. ఏ ద్రవం యొక్క సాంద్రతనైనా ………….. నుపయోగించి కనుగొనవచ్చును.
 11. ఒక వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత 1 కన్నా ఎక్కువైన ఆ వస్తువు నీటిపై (లో) …………..
 12. ఒక ద్రవంలో ముంచబడిన వస్తువుపై పనిచేసే ఊర్ధ్వ బలాన్నే ……………… అంటారు.
 13. 1 అట్మాస్ఫియర్ = …………….
 14. పాదరసం సాంద్రత = …………..
 15. ఒక ద్రవంలో h లోతులో పీడనం ……………….
 16. ఉత్సవన బలం ఆ వస్తువు యొక్క ………………కు సమానము.
 17. బ్రాహప్రెస్ లో కుడి ముషలకముపై పనిచేసే బలం = …………….
 18. ఒక వస్తువును ద్రవంలో ముంచినపుడు దానిపై పనిచేసే ఉత్సవన బలం ………………. కు సమానం.
 19. ఓడలు …… సూత్రం ఆధారంగా నిర్మింపబడతాయి.
 జవాబు:
- సాంద్రత
- కి.గ్రా / మీ³
- వస్తువు సాంద్రత / నీటి సాంద్రత (లేదా) వస్తువు బరువు / వస్తువు ఘనపరిమాణమునకు సమాన ఘనపరిమాణము గల నీటి బరువు
- ద్రవం బరువు / అంతే ఘనపరిమాణం గల నీటి బరువు
- ప్రమాణాలు లేవు
- పాల స్వచ్ఛత
- సాపేక్ష సాంద్రత
- \(\frac{2 \rho_{1} \rho_{2}}{\rho_{1}+\rho_{2}}\)
- \(\frac{1}{2}\)(ρ1 + ρ2)
- హైడ్రోమీటరు లేదా డెన్సిటోమీటరు
- మునుగును
- ఉత్సవనము
- 1.01 × 105 న్యూ/మీ²
- 13.6 గ్రా/సి.సి.
- P = P0 + ρhg
- కోల్పోయినట్లనిపించు బరువు
- \(\mathrm{F}_{2}=\frac{\mathrm{A}_{2} \times \mathrm{F}_{1}}{\mathrm{~A}_{1}}\)
- వస్తువుచే తొలగింపబడిన ద్రవం బరువుకు సమానం
- ఉత్సవన సూత్రం
III. జతపరచుము.
i)
| Group – A | Group – B | 
| 1. ఉత్సవన నియమం | A) పాల స్వచ్ఛత | 
| 2. హైడ్రాలిక్ జాక్స్ | B) నీటిలో మునుగును | 
| 3. లాక్టోమీటరు | C) ఆర్కిమెడీస్ | 
| 4. హైడ్రోమీటరు | D) నీటిపై తేలును | 
| 5. సాపేక్ష సాంద్రత 1 కన్నా తక్కువ | E) పాస్కల్ సూత్రం | 
| F) ఏదైనా ద్రవం యొక్క సాంద్రత | |
| G) నీటిలో వేలాడును | 
జవాబు:
| Group – A | Group – B | 
| 1. ఉత్సవన నియమం | C) ఆర్కిమెడీస్ | 
| 2. హైడ్రాలిక్ జాక్స్ | E) పాస్కల్ సూత్రం | 
| 3. లాక్టోమీటరు | A) పాల స్వచ్ఛత | 
| 4. హైడ్రోమీటరు | F) ఏదైనా ద్రవం యొక్క సాంద్రత | 
| 5. సాపేక్ష సాంద్రత 1 కన్నా తక్కువ | D) నీటిపై తేలును | 
ii)
| Group – A | Group – B | 
| 1. 1 అట్మాస్ఫియర్ | A) P2 – P1 = hρg | 
| 2. పాదరసం సాంద్రత | B) 1.01 × 105 పాస్కల్ | 
| 3. భారమితిలో పాదరస స్తంభం ఎత్తు | C) P = P0 + ρ h g | 
| 4. వాతావరణ పీడనం P0 = | D) 13.6 గ్రా/సి.సి | 
| 5. ఒక ద్రవంలో స్త్రీ లోతులో పీడనం | E) ρ h g | 
| F) 76 సెం.మీ | 
జవాబు:
| Group – A | Group – B | 
| 1. 1 అట్మాస్ఫియర్ | B) 1.01 × 105 పాస్కల్ | 
| 2. పాదరసం సాంద్రత | D) 13.6 గ్రా/సి.సి | 
| 3. భారమితిలో పాదరస స్తంభం ఎత్తు | F) 76 సెం.మీ | 
| 4. వాతావరణ పీడనం P0 = | E) ρ h g | 
| 5. ఒక ద్రవంలో స్త్రీ లోతులో పీడనం | C) P = P0 + ρ h g | 
మీకు తెలుసా?
ఆధార వైశాల్యం 1 సెం.మీ², భూమిపై 30 కి.మీ. వాతావరణం ఎత్తు కలిగిన స్థూపాకార గొట్టంలో ఆవరించి ఉన్న గాలి ద్రవ్యరాశి 1 కి.గ్రా. ఉంటుంది.
1 సెం.మీ² వైశాల్యం గల భూ ఉపరితలంపై పనిచేసే భారమే వాతావరణ పీడనం.
వాతావరణ పీడనం P0 = mg/A = (1 కి.గ్రా. × 10 మీ/సె)² /1 సెం.మీ² = 10 న్యూ / సెం.మీ² లేదా 105 న్యూ / మీ.² (105 పాస్కల్) ఈ విలువ సుమారుగా 1 అట్మాస్ఫియర్ కు సమానం.

 ఆర్కిమెడీస్ గ్రీకు దేశ శాస్త్రవేత్త. ఆ రోజుల్లో రాజు గారికి ఒక కిరీటం ఉండేది. అయితే అది స్వచ్ఛమైన బంగారంతో చేయబడిందో, లేదోననే అనుమానం రాజుకు కలిగింది. దానిని కరిగించకుండా మరియు ఆకృతి చెడగొట్టకుండా అది స్వచ్ఛమైనదో, కాదో పరీక్షించవలసిందిగా రాజు ఆర్కిమెడీసకు బాధ్యత అప్పగించాడు.

ఒకరోజు ఆర్కిమెడీస్ స్నానం చేయడానికి స్నానపు తొట్టిలోకి దిగినప్పుడు అందులోని నీరు పొర్లిపోయింది. ఈ సంఘటన ద్వారా కిరీటం యొక్క ఘనపరిమాణం కనుగొనడానికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. కిరీటాన్ని నీటిలో ముంచితే అది దాని ఘనపరిమాణానికి సమాన ఘనపరిమాణం గల నీరు పొర్లిపోయేట్లు చేస్తుంది. కిరీటం యొక్క ద్రవ్యరాశిని ఆర్కిమెడిస్ కొలిచి దానిని కిరీటం ఘనపరిమాణంతో భాగిస్తే కిరీటం యొక్క సాంద్రత తెలుస్తుంది. ఒకవేళ కిరీటంలో సాంద్రత తక్కువ గల లోహం కలీ చేయబడితే కనుగొన్న కిరీటం సాంద్రత స్వచ్ఛమైన బంగారం సాంద్రత కన్నా తక్కువ ఉంటుంది. ఈ ఆలోచన రాగానే ఆర్కిమెడీస్ తన ఒంటి మీద బట్టలు లేని సంగతి కూడా మర్చిపోయి “యురేకా” (నేను కనుగొన్నాను) అని అరుస్తూ వీధిలోకి పరుగెత్తాడు.
