Andhra Pradesh AP Board 3rd Class Telugu Solutions 3rd Lesson మంచి బాలుడు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Telugu Solutions Chapter 3 మంచి బాలుడు
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి ?
జవాబు:
వన్య మృగాలు, కౄరమృగాలు కలిసి మృగరాజైన సింహాన్ని మోసుకుంటూ దగ్గరలోని వైద్యశాలకు తీసుకొచ్చాయి.
లేదా
ఒక అడవిలో వన్యమృగాలు, కౄరమృగాలు కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నాయి. ఒకసారి- మృగరాజైన సింహానికి ఆరోగ్యం బాగుండలేదు. ఆ సంగతి తెలుసుకుని అక్కడున్న కొన్ని జంతువులు – స్నేహ ధర్మానికి ప్రధాన్యతచ్చి- ఆ సింహాన్ని దగ్గరలోని వైద్యశాలకు తీసుకొచ్చాయి.
ప్రశ్న 2.
చిత్రంలో ఏయే జంతువులు ఉన్నాయి? ఏం చేస్తున్నాయి ?
జవాబు:
చిత్రంలో పులి, ఏనుగు, ఎలుగుబంటి, కోతి, సింహం ఉన్నాయి. సింహాన్ని మిగతా నాలుగు జంతువులు మోసుకెళ్తున్నాయి.
ప్రశ్న 3.
మీరు మీ ఇంట్లో ఎవరెవరికి ఏ విధంగా సహాయం చేస్తారో చెప్పండి.
జవాబు:
నేను మా అమ్మకు : ఇల్లు శుభ్రం చేసే విషయంలో సహాయ పడతాను. వంట చేసే విషయంలో సహాయపడతాను. అమ్మకు అన్ని విషయాలలో సహాయపడతాను.
నేను నాన్నకు : అడగంగానే మంచినీళ్ళు – టీ, కాఫీ ఫలహారం- అమ్మనడిగి తీసుకొచ్చి ఇస్తాను. నాన్నగారు అడిగిన వస్తువులు వెంటనే వెతికి పెడతాను.
తాతగారికి, అమ్మమ్మ గారికి : సమయానికి అన్ని అందేలా సహాయపడతాను. మందులు చక్కగా తీసి చేతికి అందిస్తాను. తాతగారికి మామ్మగారికి అన్ని విధాలుగా సహాయపడతాను.
పిల్లలూ! పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి:
జవాబు:
- వైద్యశాల
- రహదారి
- సింహాం
- ఏనుగు
- పులి
- ఎలుగుబంటి
- కోతి
- రోగిని మోసుకెళ్ళే మంచం
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
గేయాన్ని అభినయం చేస్తూ పాడండి.
జవాబు:
ముందుగా ఉపాధ్యాయ కృత్యం. ఆ పై విద్యార్థి కృత్యం
ప్రశ్న 2.
గేయ కథలో బాలుడు ముసలమ్మకు సహాయం చేశాడు కదా! మీరెప్పుడైనా ఎవరికైనా అటువంటి సహాయం చేశారా! చెప్పండి.
జవాబు:
కథలో బాలుడు లా నేను కూడా ఒకసారి సహాయం చేశాను. ఎలాగంటే… రోజూలాగే ఆ రోజు కూడా సంచి తీసుకుని పాఠశాలకు వద్దామని నడుస్తున్నాను. మధ్యలో రహదారి దాటాలి. వాహనాల రద్దీ కొంచెం ఆగగానే నాతో పాటున్న చాలా మంది దాటి వెళ్ళిపోయారు. కాని ఒక ముసలాయిన దాటలేక అక్కడ ఉండిపోయాడు. అది చూచి నేను ఆ పెద్దాయన చేయి పట్టుకుని జాగ్రత్తగా ఆ రహదారి దాటించాను. అప్పుడు ఆయన చాలా ఆనందించాడు. నాకు కూడా చాలా ఆనందం కలిగింది.
ప్రశ్న 3.
గేయ కథను మీ సొంతమాటల్లో చెప్పండి ?
జవాబు:
వర్షం ఎక్కువగా కురవటం వల్ల కాల్వలు బాగా నిండాయి. వీధులు నీళ్ళతో నిండాయి. చెప్పులు బట్టలు తడిసిపోయి జనులందరూ జాగ్రత్తగా వెళ్తున్నారు. ఆ దోవలోనే ఒక ముసలమ్మ కూడా వెల్తోంది. వణికిపోతోంది. నడవలేక నడవలేక నడుస్తోంది. చాలా మంది పిల్లలు, పెద్దలు ఆ దారిలోనే ఆ ముసలమ్మ ప్రక్కగానే వెళ్తున్నారు. కాని ఎవ్వరూ సాయం చేయటం లేదు.
ఇంతలో ఆ దగెరలోని బడి వదిలారు. పిల్లలందరూ వడి వడిగా ఆనందంగా ఇళ్ళకు పరుగులు తీస్తున్నారు. ఆ పరిగెత్తే పిల్లల్లో ఒక పిల్లాడు ఆ ముసలమ్మ బాధను చూసి, ఆమె చేయి పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తూ ఆమె ఇంటి దగ్గర దించి వచ్చాడు.
దించి వచ్చి, తనతోటి స్నేహితులతో – స్నేహితుల్లారా! అమ్మ ఎవరికైనా అమ్మేకదా! ” ఏదో ఒక రోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చెయ్యాలి కదా!” అన్నాడు. ఆ మాటలకు అందరూ ఆనందపడ్డారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చెయ్యని మనిషి జీవితం అనవసరమని వారు తెలుసుకున్నారు.
చదవడం – వ్యక్త పరచడం
అ) కింది వాక్యాలకు సమాన అర్థాన్నిచ్చే గేయ పాదాలను గేయంలోత గుర్తించి గీత గీయండి.
ప్రశ్న 1.
వీధులన్నీ నీళ్ళతో నిండాయి :
జవాబు:
వీధుల్లో కాల్వలు కట్టాయి, కాల్వల నిండా నీళ్ళొచ్చాయి.
ప్రశ్న 2.
పిల్లల పాదాలు నేలపై ఆనడం లేదు :
జవాబు:
బాలుర అడుగులు ఆనవు భూమిని
ప్రశ్న 3.
మనుషులు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు :
జవాబు:
జనులు మెల్లగా పోతున్నారు.
ప్రశ్న 4.
సందడి చేస్తూ వచ్చారు :
జవాబు:
కేకలు వేస్తూ, పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ.
ప్రశ్న 5.
ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు.
జవాబు:
విడిచి వచ్చి నాడాయె భవనమున
ఆ) కింది పేరాను చదవండి. పేరా ఆధారంగా జతపరచండి.
జోరున వాన కురిసింది. నేలంతా బురదగా వుంది. ముసలమ్మ వణకుతు నడుస్తున్నది. ఒక పిల్లవాడు ఆమెను చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. అందరూ అతడిని అభినందించాడు.
జవాబు:
ఉదా :
- జోరున వాన కురిసింది
- నేలంతా బురదగా మారింది
- ముసలమ్మ గడగడ వణికింది
- పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు
- అందరూ అభినందించారు.
ఇ) కింది కథను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఒకరోజు కాకికి దాహం వేసింది. పెరట్లో ఓ నీళ్ళ కుండ కనిపించింది. కాని అందులో నీళ్ళు అడుగున ఉన్నాయి. అవి కాకికి అందడం లేదు. కుండలో కొన్ని గులక రాళ్ళు వేసింది కాకి. అప్పుడు నీళ్ళు పైకి వచ్చాయి. కాకి ఆ నీళ్ళు తాగింది. హాయిగా ఎగిరిపోయింది.
ప్రశ్న 1.
కాకికి నీటి కుండ ఎక్కడ కనిపించింది?
జవాబు:
కాకికి నీటి కుండ పెరట్లో కనిపించింది.
ప్రశ్న 2.
కాకికి కుండలో నీరు ఎందుకు అందలేదు?
జవాబు:
కుండలో నీళ్ళు అడుగున ఉన్నాయి. అందుకు కాకికి నీళ్ళు అందలేదు.
ప్రశ్న 3.
కాకి కుండలోని నీరు పైకి రావడానికి ఏం చేసింది?
జవాబు:
కుండలో కొన్ని గులక రాళ్ళు వేసింది. అప్పుడు కుండలో నీళ్ళు పైకి వచ్చాయి.
పదజాలం
అ) పాఠంలోని జంట పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
ఉదా :
- తళ తళ
- మిల మిల
- గడ గడ
- వడివడి
- కిల కిల
ఆ) కింది మాటలు గమనించండి.
మెరుపు – మెరుపులు
పై మాటల్లో మొదటిది ఒకటే (ఏకవచనం). అంటే ఒక మెరుపు. రెండో మాట మొదటి దానికి ‘లు’ చేర్చినది. అంటే ఒకటికంటే ఎక్కువ ఉన్నాయని అర్థం (బహువచనం). కింది పదాలకు బహువచనాలు రాయండి.
ఏకవచనం – బహువచనం
కేక – ……………………..
కల – ……………………..
పిల్ల – ……………………..
అడుగు – ……………………..
జవాబు:
ఏకవచనం – బహువచనం
కేక – కేకలు
కల – కలలు
పిల్ల – పిల్లలు
అడుగు – అడుగులు
స్వీయరచన
కింది పదాల ఆధారంగా ‘వర్షం’కు సంబంధించిన రెండు వాక్యాలు రాయండి.
జవాబు:
- వర్షం జోరుగా కురింసింది.
- వర్షం కురిసి వీధులు నిండాయి.
- వర్షం కురిసి కాలువలు నిండాయి.
- వర్షం కురిసే ముందు మెరుపులు మెరిసాయి.
- వర్షం వలన దారులన్నీ బురదమయం అయ్యాయి.
సృజనాత్మకత
సాయం చేసిన పిల్లవాడికి అవ్వ మూడు బహుమతులు ఇచ్చింది అనుకోండి. ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో చిత్రాలు చూసి కథ చెప్పండి.
ప్రశ్న 1.
జవాబు:
అవ్వబాలుడికి లడ్డూ, పూలమొక్క విసనకర్ర ఇచ్చింది.
ప్రశ్న 2.
జవాబు:
లడ్డు తన ముద్దుల చెల్లికి ఇచ్చాడు.
ప్రశ్న 3.
జవాబు:
తనూ, తన చెల్లెలు కలసిమొక్కనాటి నీళ్ళు పోసారు.
ప్రశ్న 4.
జవాబు:
విసన కర్రతనకు ఇష్టమైన-ఉపాధ్యాయురాలికి ఇచ్చాడు.
ప్రశంస
గేయంలో బాలుడు ముసలమ్మకు సహాయం చేసి, మంచి పని చేశాడు కదా! మీరు ఏయే మంచి పనులు చేస్తారో చెప్పండి.
జవాబు:
- రద్దీగా ఉండే రహదారి దాటలేని వారికి, పెద్ద వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి చేయూత నిస్తాను.
- ఆకలితో అలమటిస్తున్న అనాధలను ఆదుకుంటాను.
- నాతోటి స్నేహితులలో చదువులో వెనుకబడిన వారిని (ముందుకు నడిపిస్తాను) చదివిస్తాను.
- పుస్తకాలు లేని పేద విద్యార్ధులకు – మా తల్లిదండ్రులను అడిగి సాయం చేస్తాను.
- ఈ విధంగా సమాజానికి అన్ని విధాలుగా – మంచి పనులు చేస్తాను.
భాషాంశాలు
అ) కింది వాక్యాలు చదవండి.
- తేజ బడికి వెళ్ళాడు.
- నేను రేపు సినిమాకు వెళ్తాను.
- మా తోట చాలా అందంగా ఉంది.
పై వాక్యాల చివర చుక్క ( ) గుర్తు ఉందికదూ! ఇలా వాక్యం చివరన ఉంచే (.)ను వాక్యాంతబిందువు (పూర్ణ విరామం) అంటారు. దీన్ని ఆంగ్లంలో ‘పుల్ స్టాప్” అంటారు. ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తి అయింది అని అర్థం.
ఆ) కింది పేరాను చదవండి. పూర్ణవిరామాన్ని సరైన చోట ఉంచండి.
ఒక అడవిలో కుందేలు ఉంది అది ఆడుకుంటూ కాలుజారి పడింది దాని కాలికి దెబ్బ తగిలింది కదలలేక ఏడ్చిండి కోతి వచ్చింది కుందేలును ఆసుపత్రికి తీసుకొని పోయింది.
జవాబు :
ఒక అడవిలో కుందేలు ఉంది. అది ఆడుకుంటూ కాలుజారి పడింది. దాని కాలికి దెబ్బ తగిలింది. కదలలేక ఏడ్చిండి. కోతి వచ్చింది. కుందేలును ఆసుపత్రికి తీసుకొని పోయింది.
ఇ) కింది వాక్యాలు చదవండి. పదాల మధ్య ఉన్న గుర్తును గమనించండి.
- తోటలో జామ చెట్లు, సపోట చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి.
- రాము, అంజి, జగ్గు మంచి స్నేహితులు.
పై వాక్యాలు చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం కదా! అట్లా ఆపి చదవటాన్ని స్వల్ప నిరామం అంటారు. అట్లా స్వల్ప విరామం ఇచ్చే చోట [,] గుర్తు ఉంది కదూ! దీన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు. ఆంగ్లంలో ‘కామా’ అంటారు.
ఈ) ఈ కింది పేరాను చదవండి. స్వల్ప విరామ చిహ్నాన్ని (కామాను) సరైన చోట ఉంచండి.
ఒక చెరువులో కప్పలు చేపలు తామరపూలు ఉన్నాయి. అక్కడికి జయ జలజ రాకేష్ వెళ్ళారు. తామర పూలను చూసి ఆనందించారు.
జవాబు:
ఒక చెరువులో కప్పలూ, చేపలూ, తామరపూలు ఉన్నాయి. అక్కడికి జయ, జలజ, రాకేష్ వెళ్ళారు. తామర పూలను చూసి, ఆనందించారు.
సారాంశం
ఒకరోజు జోరున వాన కురుస్తుంది. నేలంతా బురదగా మారింది. ఆ జోరు వానలో ఒక ముసలమ్మ గడగడ వణుకుతూ నడుస్తున్నది. ఆమె అడుగులు తడబడుతున్నాయి. ఆమెను ఎవరు పట్టించుకోవటం లేదు. ఆ సమయంలో బడి వదిలారు. 4 పిల్లలు సందడి చేస్తూ బయటకి వచ్చారు. ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు.
ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు. చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. ఆమెను వాళ్ళ ఇంటిదగ్గర దిగబెట్టి వచ్చాడు. అప్పుడు అవ్వ అబ్బాయిని దీవించింది. ఆ అబ్బాయి స్నేహితుల దగ్గరకు తిరిగి వచ్చాడు. “అమ్మ ఎవరికైనా అమ్మే” అన్నాడు. ఏదో ఒకరోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చేయ్యాలి గదా! అన్నాడు.
పిల్లలందరికి అతని మాటలు నచ్చాయి. ముసలమ్మకు సాయం చేయనందుకు వారంతా సిగ్గుపడ్డారు. కష్టాలలో ఉన్నవారికి సాయం చెయ్యని మనిషి జీవితం వ్యర్థం అని వారు తెలుసుకున్నారు.
పదాలు – అర్థాలు
వీథులు = బజారులు
జడిసి = భయపడి
జనులు = ప్రజలు, జనం
త్రోవ = దారి
వడి = వేగం
సాయం = సహాయం
ముదుసలి = ముసలి
జాలి = దయ
కొనిపోవు = తీసుకుపోవు
మనము = మనస్సు
దుర్బలులు = బలం లేనివారు
మనుజుడు = మనిషి
మనుగడ = జీవనం, జీవితం
కవి పరిచయం
కవి : ఆలూరి బైరాగి
కాలము . : 5.11.1925 – 9.9.1978
రచనలు : చీకటిమేడలు, నూతిలో గొతుకలు, ఆగమగీతి, దివ్యభవనం
విశేషాలు : 20వ శతాబ్దపు ఆగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. కేంద్రసాహిత్య అకాడమి పురస్కారం పొందారు.
ఈ మాసపు పాట
కలపండి చేయి చేయి
ప॥ కలపండి చేయి చేయి కలపండి
పదిమంది భుజం భుజం కలపండి
చేయి చేయి కలపండి.
చ॥ కొండరాళ్ళు పగులగొట్టి కోన చదును చేద్దాం…
కోస వెంట దారితీసి రాదారులు వేద్దాం
కొండరాళ్ళు పగులగొట్టి కోన చదును చేద్దాం
కోన వెంట దారితీసి గోదారులు వేద్దాం
కొండ కోన లొంగ దీసి కొల్లలు పండిద్దాం
|| కలపండి ||
చ॥ పాదుకుంటు పనిచేస్తే పదిమందికి లాహిరి
ఆడుకుంటు పనిచేస్తే అనిసించదు చాకిరి
పాడుకుంటు పనిచేస్తే పదిమందికి లాహిరి
ఆడుకుంటు పనిచేస్తే అనిపించదు చాకిరి
కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి
కలిపేస్తాం రైలుదారి కానకోన రహదారి
|| కలపండి ||
కవి పరిచయం
కవి : దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
కాలము : 1-11-1897 – 24-2-1980
రచనలు : ‘కృష్ణపక్షం’, ‘ఊర్వశి’, ‘ప్రవాసము”
విశేషాలు : ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి. అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు అందుకనే వారి కవిత్వాన్ని శ్రీ శ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
ఈ మాషపు కథ
బావిలో నీళ్ళు
లక్టర్ – ఉరుల కథ
అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. ఆయన ఏ సమస్యనైనా తన తెలివితేటలతో సులువుగా పరిష్కరించేవాడు.
ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉన్నాడు. అతను రైతుకి ఒక బావి అమ్మాడు. ఆ రైతు బావిలో నీళ్ళు తోడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు జమీందారు రైతుని ఆపాడు. “ నేను నీకు బావిని అమ్మాను కానీ, అందులోని నీళ్ళు అమ్మలేదు. అవి నావి. ఆ నీళ్ళు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో!” అన్నాడు.
రైతుకి కోపం వచ్చింది. వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. నాయ్యం కోసం అక్బర్ ఆస్థానానికి వెళ్ళారు. అక్బర్ వారు చెప్పినదంతా విని బీర్బల్ వైపు చూశాడు. సమస్యను పరిష్కరించమన్నాడు.
బీర్బల్ కొద్దిసేపు ఆలోచించాడు. జమీందారు వైపు చూసి ఇలా అన్నాడు “సరే నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదు కదా!” జమీందారు సంతోషంగా “అవును” అన్నాడు. బీర్బల్ అడిగాడు “బావి రైతుదేనా?” జమీందారు ” అవును ” అన్నాడు.
” సరే, రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి. వెంటనే బావిలోని నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో లేదా నీళ్ళు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు” అని తీర్మానించాడు.
జమీందారు ముఖం పాలిపోయింది. చేసిన తప్పుకు తలదించుకున్నాడు. రైతుని మోసం చేయాలనుకున్నందుకు తనను క్షమించమని అక్బర్ పాదుషాని వేడుకున్నాడు. రైతు సంతోషించాడు. అక్బర్ బీర్బల్ ని అభినందించాడు.