AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

SCERT AP 6th Class Social Study Material Pdf 3rd Lesson పటములు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 3rd Lesson పటములు

6th Class Social 3rd Lesson పటములు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పటంలోని ముఖ్యమైన అంశాలేవి?
జవాబు:
పటంలోని ముఖ్య అంశాలు :
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 1

ప్రశ్న 2.
భూమిపై కల వాస్తవ దూరాన్ని పటంలో ఎందుకు తగ్గించి చూపాలి?
జవాబు:
ఒక ప్రదేశము యొక్క మొత్తము వైశాల్యమును కాగితంపై చూపించవలెనన్న అంతే వైశాల్యము కాగితము అవసరమగును అంటే భారతదేశ పటం గీయవలెనన్న అంతే వైశాల్యముకల కాగితము కావలెను మరియు భూమిపై ఉన్న వాస్తవ దూరము చాలా పెద్దదిగా ఉంటుంది. అంత పెద్ద వైశాల్యం గల ప్రదేశాలను వాటి మధ్య దూరాలను మానచిత్రంలో చూపించటము అసాధ్యము. కావున పటంలో తగ్గించి చూపాలి.

ప్రశ్న 3.
పటాల తయారీలో చిహ్నాల ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలుమార్గాలు బావులు మొదలైనటువంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలు చిహ్నాలతో సూచిస్తారు. ఇవి తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. పటాలు గీయడం, చదవడం సులభమవుతుంది.

ప్రశ్న 4.
మీ జిల్లా పటంలో మీ మండలం కేంద్ర కార్యాలయానికి, జిల్లా కేంద్ర కార్యాలయానికీ కల దూరాన్ని కొలవండి. వాస్తవ దూరానికి, దానికి కల నిష్పత్తి సహాయంతో పటంలో ఉపయోగించిన స్కేలు కనుగొనండి.
జవాబు:
విద్యార్థులు తమతమ జిల్లా, మండల కేంద్రాల నుండి క్రింద ఉదాహరణలో చూపిన విధంగా లెక్కించండి.

మా శ్రీకాకుళం జిల్లా కేంద్ర కార్యాలయానికి మా ‘టెక్కలి’ మండల కేంద్ర కార్యాలయానికి పటంలో
దూరం = 5 సెం.మీ,
వాస్తవ దూరం = 50 కి.మీ.
స్కేల్ : ఒక సెం.మీ. = 10 కి.మీ.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 2

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

ప్రశ్న 5.
రాజకీయ పటాలకీ, భౌతిక పటాలకీ కల వ్యత్యాసమేమి?
జవాబు:
రాజకీయ పటాలు :
గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను (అంటే రాజకీయ విభాగాలను) మాత్రమే చూపిస్తాయి.

భౌతిక పటాలు :
పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి.

ప్రశ్న 6.
విషయ నిర్దేశిత పటాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
విషయ నిర్దేశిత పటాల యొక్క ప్రాముఖ్యత :

  • ఒక నిర్ధిష్ట (నిర్ణీత) అంశాన్ని గూర్చి సవివరంగా తెలియజేస్తాయి.
  • ఏదైనా ఒక ప్రాంతం గూర్చి వివరంగా తెలుసుకోవచ్చు.
  • భూవినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలుమార్గాలు, జనాభా వంటి నిర్ధిష్ట అంశాలను గురించి వివరిస్తాయి.

ప్రశ్న 7.
నిత్య జీవితంలో పటాల యొక్క ఉపయోగమేమి?
జవాబు:
పటాల వలన ఉపయోగాలు :

  • పటాలు దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు వంటి ప్రదేశాలను గుర్తించడానికి మనకి చాలా ఉపయోగకరం.
  • పటాలను ఉపయోగించి పర్వతాలు, పీఠభూములు, మైదానాల వంటి భూస్వరూపాలను చూడవచ్చును.
  • ప్రధాన రహదారి మార్గాలైన రోడ్లు, రైల్వేలను గురించి తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి.
  • పటాలు పంటలు, ఖనిజాలు, నేలలు పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి ఉపకరిస్తాయి.
  • పటాలు యుద్ధ సమయంలో సైనికులకు భద్రత దృష్ట్యా ఉపయోగకరం.
  • పటాలు పర్యాటకులు మరియు ప్రయాణీకులకు వారి గమ్య చేరడానికి మార్గదర్శకంగా ఉంటాయి.

ప్రశ్న 8.
ఇవ్వబడిన ప్రపంచ పటంలో ఖండాలు, మహాసముద్రాలు గుర్తించండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 3
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 4

→ సరియైన సమాధానాన్ని ఎంచుకుని బ్రాకెట్లో రాయండి.

1. అడవులు విస్తరణని తెలిపే పటాలు ………..
అ) భౌతిక పటము
ఆ) విషయ నిర్దేశిత పటం
ఇ) రాజకీయ పటం
ఈ) పైవేవీ కావు
జవాబు:
ఆ) విషయ నిర్దేశిత పటం

2. నీలిరంగు ……….. ని సూచించడానికి ఉపయోగిస్తాము.
అ) జలభాగములు
ఆ) పర్వతాలు
ఇ) భూభాగం
ఈ) మైదానాలు
జవాబు:
అ) జలభాగములు

3. స్కేల్ దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగము …………
అ) పటము
ఆ) చిత్తుచిత్రము
ఇ) ప్రణాళిక
ఈ) ఏదీకాదు
జవాబు:
అ) పటము

4. దిక్సూచిని దీని కొరకు ఉపయోగిస్తారు.
అ) చిహ్నాలను చూపుటకు
ఆ) ప్రధాన దిక్కులను గుర్తించడానికి
ఇ) దూరాన్ని కొలవడానికి
ఈ) ఎత్తుని తెలుసుకోవడానికి
జవాబు:
ఆ) ప్రధాన దిక్కులను గుర్తించడానికి

5. ఉత్తరం మరియు తూర్పుకి మధ్యగల దిక్కుని ఇలా పిలుస్తారు.
అ) ఈశాన్యము
ఆ) ఆగ్నేయము
ఇ) వాయవ్యము
ఈ) నైరుతి
జవాబు:
అ) ఈశాన్యము

6th Class Social Studies 3rd Lesson పటములు InText Questions and Answers

6th Class Social Textbook Page No.30

ప్రశ్న 1.
మృదుల పై చిత్తుచిత్రం సహాయంతో ఎందుకు తను వెళ్ళవలసిన చోటికి చేరుకోలేదు? Page No. 30)
జవాబు:
మృదుల చిత్తుచిత్రం సహాయంతో తను వెళ్ళవలసిన చోటికి చేరలేకపోవడానికి కారణాలు :

  • చిత్తు చిత్రంలో ప్రధానంగా దిక్కులు చూపలేదు. స్కేల్ చూపలేదు.
  • చిత్తుచిత్రంలో ఏ విధమైన కొండ గుర్తులు, చిహ్నాలు చూపలేదు.

6th Class Social Textbook Page No.31

ప్రశ్న 2.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 5
పైన ఇచ్చిన చిత్రాన్ని పరిశీలించి కింది పట్టికను పూరించండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 6
జవాబు:

దిక్కు వస్తువులు
ఉత్తరం చెట్లు
ఈశాన్యం గుడి
దక్షిణం బావి
నైరుతి మసీదు
తూర్పు సూర్యోదయము
ఆగ్నేయం పాఠశాల
పడమర ఇల్లు
వాయువ్యం చర్చి

6th Class Social Textbook Page No.32

ప్రశ్న 3.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 7
చిత్రము పరిశీలించి స్కేల్ ని ఉపయోగించి కింద చూపిన ప్రదేశాల మధ్య వాస్తవ దూరాన్ని లెక్కించండి.
i) పోస్ట్ ఆఫీస్ మరియు రాజు ఇంటి మధ్య దూరం
ii) రాజు మరియు పూజ ఇంటి మధ్య దూరం
iii) చిరు ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరం
జవాబు:
i) 60 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 6 సెం.మీ. × 10 మీ. = 60 మీ॥)
ii) 10 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 1 సెం.మీ. × 10 మీ. = 10 మీ॥)
iii) 50 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 5 సెం.మీ. × 10 మీ. = 50 మీ॥)

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

ప్రశ్న 4.
చిహ్నాలు మనకు సమాచారాన్ని ఎలా ఇస్తాయి?
జవాబు:
స్కేల్ పటంలోని ముఖ్యమైన అంశం. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు గీతలతో సూచిస్తారు. ఈ చిహ్నాలు తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించుట వలన పటాలను గీయడం, చదవడం కూడా సులభం అవుతుంది. ఒక ప్రాంతలో మనకు భాష , తెలియకపోయినా ఎవరినీ సలహాలు అడగకుండానే పటాన్ని ఉపయోగించి చిహ్నాల సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

6th Class Social Textbook Page No.35

ప్రశ్న 5.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి పట్టికను తయారు చేయండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 8
జవాబు:
మనదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు గలవు. అవి :

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం రాజధాని
1. ఆంధ్రప్రదేశ్ అమరావతి
2. ఒడిశా భువనేశ్వర్
3. పశ్చిమబెంగాల్ కోల్‌కతా
4. జార్ఖండ్ రాంచి
5. బీహార్ పాట్నా
6. ఉత్తరప్రదేశ్ లక్నో
7. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్
8. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా
9. పంజాబ్ ఛండీఘర్
10. హరియాణా ఛండీఘర్
11. రాజస్థాన్ జైపూర్
12. గుజరాత్ గాంధీనగర్
13. మహారాష్ట్ర ముంబయి
14. మధ్యప్రదేశ్ భోపాల్
15. ఛత్తీస్ ఘడ్ రాయపూర్
16. కర్ణాటక బెంగళూర్
17. తెలంగాణ హైద్రాబాద్
18. కేరళ తిరువనంతపురం
19.  తమిళనాడు చెన్నెై
20. గోవా పనాజి
21. సిక్కిం గాంగ్‌టాక్
22. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్
23. అస్సాం డిస్పూర్
24. మేఘాలయ షిల్లాంగ్
25. నాగాలాండ్ కోహిమా
26. మణిపూర్ ఇంఫాల్
27. మిజోరాం ఐజ్వా ల్
28. త్రిపుర అగర్తల
కేంద్రపాలిత ప్రాంతాలు
1. అండమాన్ & నికోబార్ దీవులు పోర్టుబ్లెయిర్
2. పుదుచ్చేరి (పాండిచ్చేరి) పుదుచ్చేరి
3. లక్ష ద్వీపు(ప్) కవరత్తి
4. దాద్రానగర్ హవేలి సిల్వాస్సా
5. డామన్ & డయ్యూ డామన్
6. ఛండీగర్ ఛండీగర్
7. న్యూఢిల్లీ న్యూఢిల్లీ
8. జమ్ము & కాశ్మీర్ శ్రీనగర్ & జమ్ము
9. లడక్ లెహ్

ప్రశ్న 6.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 9
ఈ భౌతిక పటాన్ని పరిశీలించి భారతదేశం యొక్క కొన్ని భౌగోళిక స్వరూపాలను గురించి రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 10

6th Class Social Textbook Page No.36

ప్రశ్న 7.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 11
భారతదేశం – ముఖ్య పంటలు (విషయ నిర్దేశిత పటం)
i) ఈ పటం ఏమి సూచిస్తోంది?
జవాబు:
భారతదేశంలో పండే ముఖ్య పంటలను సూచిస్తోంది.

ii) దీనిని విషయ నిర్దేశిత పటం అని ఎందుకు పిలుస్తారు?
జవాబు:
ఏదైనా ఒక నిర్దిష్ట అంశాన్ని తెలియజేసే పటం విషయ నిర్దేశిత పటం అంటారు. ఈ పటంలో ‘భారతదేశం – ముఖ్య పంటలు’ అనే నిర్దిష్ట అంశాన్ని తెలియజేస్తుంది, కనుక దీనిని విషయ నిర్దేశిత పటం అని పిలుస్తారు.

ప్రాజెక్టు పని

మీ పాఠశాల చిత్తు చిత్రం గీయండి.
జవాబు:
స్వయం చేయగలరు.

వివిధ రకాల పటాలను సేకరించి ఒక స్క్రిప్ పుస్తకం తయారుచేయండి.
జవాబు:
స్వయం చేయగలరు.

సరియైన చిహ్నాలను ఉపయోగించి మీ ఇంటినుంచి పాఠశాలకి వెళ్ళే దారి యొక్క చిత్తు చిత్రాన్ని గీయండి.
జ. ఉదా :
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 7