SCERT AP 8th Class Social Study Material Pdf 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్ Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్
8th Class Social Studies 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్ Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
కొన్ని లావాదేవీల ఉదాహరణలతో కింది పట్టిక నింపండి. (AS1)
జవాబు:
రూపాయి నోట్లు, నాణాలతో జరిగే లావాదేవీలు | రూపాయలు, నాణాలు లేకుండా జరిగే లావాదేవీలు. |
1) రైలు ప్రయాణం | 1) పల్లెటూర్లలో బల్లకట్టుదాటుట |
2) విద్యుత్తు పరికరాల కొనుగోలు | 2) ఉప్పు, ముగ్గు కొనుట |
ఉదా :
- నేను విజయవాడ నుండి హైదరాబాదుకు టిక్కెట్టు కొనుక్కుని రైలులో ప్రయాణం చేశాను.
- మా ఇంట్లో 45 రూ||లు ఇచ్చి ట్యూబ్ లైట్ కొన్నాము.
- మా ఊరు లక్ష్మీ పోలవరం బల్లకట్టు వానికి, కాలవ దాటించినందుకు సంవత్సరానికి ఒకసారి 2 బస్తాల ఒడ్లు ఇస్తారు మా తాతగారు.
- మా అమ్మమ్మ దోసెడు బియ్యానికి శేరు ఉప్పు, దోసెడు బియ్యానికి శేరు ముగు కొంటుంది.
ప్రశ్న 2.
బ్యాంకులో డబ్బు పెట్టడం వల్ల ఏమైనా నష్టాలు, సమస్యలు ఉంటాయా? ఆలోచించి రాయండి. (AS1)
జవాబు:
బ్యాంకులో డబ్బు పెట్టడం వలన సమస్యలు ఎక్కువగా ఉండవు. కాని ఒక్కోసారి యంత్రాల వల్ల, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఉంటాయి.
ఉదా :
- ATM లో డబ్బు తీసుకునేటప్పుడు అనేక సమస్యలు వస్తాయి.
- లోన్లు తీసుకున్న వారి అకౌంట్ల నుండి ఒకేసారి 2 ఇన్‌స్టాలుమెంట్లు తీసుకోవడం.
- అకౌంట్లను బ్లాక్ చేయడం వంటివి.
ప్రశ్న 3.
డబ్బు మార్పిడిని చెక్కులు ఏ విధంగా సులభతరం చేశాయి? (AS1)
జవాబు:
ప్రస్తుతం డబ్బులు చెల్లించటానికి, తీసుకోటానికి చెక్కులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఆ వ్యక్తి పేరుతో చెక్కు ఇస్తారు. వేరే ఊళ్లో ఉన్న వ్యక్తికి డబ్బు పంపించాలంటే ఆమె పేరుమీద చెక్కు రాసి దానిని పోస్టులో పంపించవచ్చు. బ్యాంకు ద్వారా మరొకరి ఖాతాలోకి డబ్బుని బదిలీ చేయటానికి కూడా చెక్కును ఉపయోగించవచ్చు. వ్యాపారాలలో డబ్బులు తీసుకోవటం, చెల్లించటానికి సంబంధించి అనేక లావాదేవీలు ఉంటాయి. ఈ లావాదేవీలలో మాధ్యమంగా చెక్కులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ విధంగా డబ్బు మార్పిడిని చెక్కులు సులభతరం చేశాయి.
ప్రశ్న 4.
బ్యాంకు తన దగ్గర కొంత డబ్బును మాత్రమే నగదుగా ఉంచుకుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వల్ల బ్యాంకుకు లాభం ఏమిటి? (AS1)
జవాబు:
బ్యాంకు తన దగ్గర కొంత డబ్బులు మాత్రమే నగదుగా ఉంచుకుంటుంది. బ్యాంకు ఖాతాదారులు తమ సేవింగ్ ఖాతాలనుండి డబ్బులు తీస్తుంటారు. అలాగే ఫిక్స్ డిపాజిట్ కాలపరిమితి పూర్తయిన వారికి డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. కొత్తగా కొందరికి రుణాలు ఇస్తారు. ఐతే తమ దగ్గర ఉంచిన డిపాజిట్ మొత్తాలు ఒకేసారి ఖాతాదారులు తీసుకోరు. అదే సమయంలో వివిధ రూపాలలో బ్యాంకుకు జమలు కూడా వస్తాయి. అందువలన వీరు కొంత డబ్బును మాత్రమే నగదుగా ఉంచుకుంటారు.
ప్రశ్న 5.
ఖాతాదారులలో చాలామంది బ్యాంకులో డబ్బు ఉంచాలని అనుకోకపోతే అది బ్యాంకు పనితీరును ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? (AS1)
జవాబు:
ఖాతాదారులలో చాలామంది బ్యాంకులో డబ్బు ఉంచాలని అనుకోకపోతే బ్యాంకులో సొమ్ములు నిల్వ ఉండవు. అపుడు బ్యాంకు ఇతరులకు , అప్పు ఇవ్వలేదు., వారి నుండి వడ్డీలు సేకరించలేదు. దీని మూలంగా బ్యాంకు నిర్వహణ అసాధ్యమైపోతుంది.
ప్రశ్న 6.
బ్యాంకులు అప్పులలో చాలా వాటిని మాఫీ చేస్తే (అంటే అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు) అది బ్యాంకు పని తీరును ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? (AS1)
జవాబు:
బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ. డబ్బులు జమ చేసిన వారికి అది వడ్డీ ఇవ్వాలి. ఉద్యోగస్థులకు జీతాలు ఇవ్వాలి, , పరికరాలు కొని, నిర్వహించాలి, అద్దెలు చెల్లించాలి. బ్యాంకు నడపటానికి అయ్యే ఇతర ఖర్చులు భరించాలి. అంతిమంగా లాభాలు సంపాదించాలి.
మరి అప్పులు మాఫీ చేస్తే బ్యాంకు వీటినన్నింటిని చేయలేదు. కావున బ్యాంకులు ఋణాలను మాఫీ చేయలేవు. – ఒకవేళ ప్రభుత్వం మాఫీ చేసినట్లయితే ఆ లోటును ప్రభుత్వం భరించాల్సి వస్తుంది.
ప్రశ్న 7.
ఒక కాలానికి చేసిన ఫిక్స్ డిపాజిట్టుపై ప్రజలకు లభించే వడ్డీ కంటే అదే కాలానికి తీసుకున్న అప్పు పై ఎక్కువ వడ్డీచెల్లించాలి. ఇలా ఎందుకు ఉండాలి? (AS1)
జవాబు:
బ్యాంకుకి ‘ఫిక్స్ డిపాజిట్టు’పై ఇచ్చే వడ్డీ ఖర్చు క్రింద లెక్క అప్పుపై వచ్చే వడ్డీ ఆదాయం. ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువైతేనే లాభాలుంటాయి. లేకుంటే బ్యాంకులు నష్టపోతాయి.
ప్రశ్న 8.
ఈ సంవత్సరం వర్షాలు ఆశించనంతగా కురవలేదు. ఇలా జరిగినప్పుడు రైతులు తీసుకున్న అప్పులో సగమే తిరిగి చెల్లించాలని కొంతమంది అంటారు. వచ్చే సంవత్సరం పంటను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న అప్పు మొత్తం తిరిగి చెల్లించాలని కొంతమంది అంటారు. మీ అభిప్రాయం ప్రకారం బ్యాంకులు ఏం చేయాలి? మీ కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
వానలు తక్కువ పడినా పంటలు బాగానే పండి ఉండవచ్చు. ఒకవేళ పంటలు సగమే పండి ఉంటే రైతులు తీసుకున్న అప్పులో సగమే చెల్లించనివ్వాలి. మిగతా సగాన్ని మరుసటి పంట అప్పుతోపాటు కలిపి తీర్చమనాలి. లేదంటే వీరు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు, ఇతర మార్వాడీల దగ్గరకు అప్పుకు వెళతారు. వారి చేతుల్లో పడినవారు వారి పొలాన్ని మిగుల్చుకోలేరు.
ప్రశ్న 9.
“అప్పులు రకాలు” శీర్షిక కింద ఉన్న పేరాను చదివి దిగువ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. మీ ప్రాంతంలో తీసుకున్న రుణాల రకాలను పేర్కొనండి. (AS2)
జవాబు:
- పంట ఋణాలు
- గృహనిర్మాణ ఋణాలు
- స్వయం సహాయక సంఘ ఋణాలు
ప్రశ్న 10.
స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొందిన సభ్యులకు రుణాలు ఉపయోగకరంగా ఉన్నాయా? ఎలా? (AS6)
జవాబు:
ఇవి వారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.
- ఈ ఋణాలకు వారు హామీ చూపించనవసరం లేదు.
- వీటి లావాదేవీలన్నింటికి సంఘం బాధ్యత తీసుకుంటుంది.
- వడ్డీ కూడా నామ మాత్రంగానే ఉంటుంది.
- నెలనెలా సులభ సమాన వాయిదాలలో చెల్లించవచ్చు.
కృత్యం
మీకు రెండు వేల రూపాయలు అవసరం ఉందనుకోండి. ఒక చెక్కు రాసి మీ చెల్లెలికిచ్చి నగదు తీసుకురమ్మని పంపించండి.
జవాబు:
Self Cheque:
- నేను Cheque నా చెల్లి పేరు మీద వ్రాస్తాను. మరియు నాకు 2000 కావాలి అన్నట్లుగా amount ను వ్రాస్తాను.
- నేను ఆ చెక్కు క్రింద భాగంలోనూ మరియు వెనుక భాగంలోనూ సంతకం చేసి మా చెల్లెలికి ఇచ్చి బ్యాంకుకు వెళ్ళి నగదు తీసుకురమ్మని పంపిస్తాను. ఆమెకు చెక్కు ఎక్కడ ఇవ్వాలి నగదు ఎక్కడ తీసుకోవాలో నేను చెప్పి పంపిస్తాను.
- ఇలా చెక్కును నగదుగా మార్చడానికి మా చెల్లికి బ్యాంకులో ఎలాంటి account ను maintain చేయనవసరం లేదు.
Cross Cheque :
ఒకవేళ నేను amount cross cheque మీద వ్రాస్తే మా చెల్లికి ఈ Cheque ని Cash గా మార్చడానికి ఏదో ఒక Bank లో account ఉండి తీరాలి.
8th Class Social Studies 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్ InText Questions and Answers
8th Class Social Textbook Page No.77
ప్రశ్న 1.
డబ్బులు లేకుండా జరిగే మార్పిడులు ఏమైనా మీకు తెలుసా?
జవాబు:
“బార్టరు విధానం” గురించి నాకు తెలుసు. వస్తువులను వస్తువులతోనే మార్చుకొనే విధానమే ఇది.
ప్రశ్న 2.
పాతబట్టలు, ప్లాస్టిక్ సామాను, దిన పత్రికలు, వెంట్రుకలు, ధాన్యం ఇచ్చి ఏమైనా వస్తువులు మీరు కొని ఉండవచ్చు. ఈ లావాదేవీలు ఎలా జరిగాయో చర్చించండి.
జవాబు:
పాతబట్టలు : వీటిని మార్చి మేము స్టీలు సామాను తీసుకుంటాము. ఇది సామానులు అమ్మేవారి ఇష్టం పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.
ప్లాస్టిక్ సామాన్లు, దిన పత్రికలు : వీటిని ఇచ్చి మేము ఉల్లిపాయలు తీసుకుంటాము. 1 కే.జీ.కి 1½ కే.జీ ఉల్లిపాయలు ఇస్తారు.
వెంట్రుకలు : వెంట్రుకలు ఇస్తే డబ్బులు ఇస్తారు.
ధాన్యం : మా ఊళ్ళో ధాన్యం చాకలివాళ్ళకు, మంగలి వాళ్ళకు ఇచ్చి వారిచే పనులు చేయించుకుంటాము.
8th Class Social Textbook Page No.78
ప్రశ్న 3.
ఖాళీలు పూరించండి.
గోపాల్ తన మేకను …………… ఇచ్చి …………… తీసుకుంటే అప్పుడు గోపాల్ ఈ డబ్బును ఉపయోగించి ………. నుంచి బియ్యం కొంటాడు. ఇప్పుడు ….. ఈ డబ్బుతో శీను నుంచి …… కొంటాడు.
జవాబు:
శీనుకు, డబ్బులు, రాము, రాము, గోధుమలు
ప్రశ్న 4.
గ్రామాలలో, పట్టణాలలో బట్టలు ఉతికే వాళ్లు, జుట్టు కత్తిరించేవాళ్లు, నీరటి వారు (చెరువు నీటిని కావలి కాసేవారు) మొదలగువారి పనికి వేతనం ఎలా చెల్లిస్తారా? మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి.
జవాబు:
ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు వారి పనికి డబ్బు రూపంలోనే వేతనాలు చెల్లిస్తున్నారు. కాని, 15 సం||రాల క్రితం వరకు వారికి ధాన్యం రూపంలోనే డబ్బులు చెల్లించేవారట.
ప్రశ్న 5.
ఈ పట్టిక పూరించండి :
1. పై పట్టిక నుంచి మీరు ఏ నిర్ధారణకు వస్తారు?
జవాబు:
వీరి మధ్యలో అమ్మకం కష్టసాధ్యం
2. గోపాలకు, శీనుకు మధ్య వస్తుమార్పిడికి ఎందుకు వీలుకాదో మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
గోపాలుకు బియ్యం కావాలి. శీనుకు మేక అవసరం లేదు, గోధుమలు కావాలి.
3. డబ్బు వినియోగం దీనికి సహాయపడుతుందా?
జవాబు:
డబ్బు వినియోగం వీటికి సహాయపడుతుంది.
ప్రశ్న 6.
గోపాల్, శీను, రాముల మధ్య లావాదేవీలో డబ్బు ఎలా ఉపయోగపడుతుంది? ఫ్లో చార్ట్ సహాయంతో వివరించండి.
జవాబు:
ప్రశ్న 7.
పైన వివరించిన విధంగా డబ్బు మార్పిడి మాద్యమంగా పనిచేయటం అనే దానితో మీరు ఏకీభవిస్తారా. కారణాలతో వివరించండి.
జవాబు:
డబ్బు పాత్ర మార్పిడి మాధ్యమంగా పనిచేయడంతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే వస్తుమార్పిడిలో వస్తువుల విలువలలో తేడా ఉంటుంది. కాబట్టి అది సరియైన విధంగా ఉండదు. అందువలన నేను ఈ విషయంతో ఏకీభవిస్తున్నాను.
8th Class Social Textbook Page No.79
ప్రశ్న 8.
తన మేకను గోపాల్ ఎంత బియ్యంతో మార్చుకోవాలి?
జవాబు:
ఇది మేకకున్న డిమాండ్ ను బట్టి ఉంటుంది. ఆ రోజు మేకను కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఎక్కువమంది ఉంటే అది గోపాల్ చెప్పిన తూకంలో బియ్యం ఇవ్వాలి. లేదంటే బియ్యం అమ్మకందారు చెప్పిన లెక్కలోనే మార్చుకోవాలి.
ప్రశ్న 9.
వస్తు మార్పిడి వ్యవస్థలో మీ జుట్టు కత్తిరించిన వ్యక్తికి ఎలా చెల్లిస్తారు? చర్చించండి.
జవాబు:
వస్తు మార్పిడిలో నా జుట్టు కత్తిరించిన వ్యక్తికి ఒక కిలో బియ్యం ఇస్తాను. ఒక కిలో బియ్యం ఖరీదు రూ. 30/- అలాగే జుట్టు కత్తిరింపుకు కూడా 30/- ఇవ్వవచ్చు.
ప్రశ్న 10.
పైన ఇచ్చిన ఉదాహరణలతో లావాదేవీ పూర్తయ్యేలా సంభాషణను పూర్తిచేయండి.
జవాబు:
గోపాల్ : ఈ మేకకు ఎన్ని బస్తాల బియ్యం ఇస్తావు?
సీతయ్య : నాలుగు బస్తాలు.
గోపాల్ : నాకు రెండు బస్తాల బియ్యం, రెండు బస్తాల గోధుమలు ఇవ్వు.
సీతయ్య : నా దగ్గర గోధుమలు లేవు. కావాలంటే వంటనూనె, పప్పుధాన్యాలు ఇస్తాను.
గోపాల్ : నాకు పప్పుధాన్యాలు అవసరం లేదు చెక్కర కావాలి.
సీతయ్య : అయితే మేకను ఇచ్చి తీసుకొని వెళ్లు.
గోపాల్ : తీసుకో
ప్రశ్న 11.
మీరు, వ్యాపారస్తులు సంతలలో డబ్బు వినియోగించకపోతే ఏమవుతుంది? ఒక పేరాలో వివరించండి.
జవాబు:
ప్రస్తుత కాలంలో డబ్బు మంచి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఇదే గనక లేకపోతే మార్కెట్టు మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. కనీసం ఒక్కో వస్తువుకు, లేదా సరుకుకు విలువ నిర్ణయించాలన్నా కష్టసాధ్యమవుతుంది. పైగా యిపుడందరూ రైతులు కూడా కాదు. ఉద్యోగస్థుల దగ్గర మార్పిడికి డబ్బు తప్ప ఏమీ ఉండదు. కనుక అమ్మకం, కొనుగోళ్ళు మొత్తం అయోమయంలో పడిపోతాయి.
ప్రశ్న 12.
సరుకులు, సేవల విలువను డబ్బుతో అంచనా వేయవచ్చా? వివరించండి.
జవాబు:
వస్తువుల విలువను డబ్బుతో అంచనా వేయవచ్చు. ప్రభుత్వ సేవలు, ప్రైవేటు సేవలను కూడా డబ్బుతో అంచనా వేయవచ్చు. కాని తల్లిదండ్రులు, ఇతర రక్త సంబంధీకులు చేసిన సేవలను డబ్బుతో అంచనా వేయలేము. వేయరాదు.
ఉదా :
ప్రభుత్వ సేవలు : 1) రవాణా – (APSRTC), 2) వైద్యం – ప్రభుత్వ ఆసుపత్రులు.
ప్రైవేటు సేవలు : 1) రవాణా – ప్రైవేటు బస్సులు, 2) వైద్యం – ప్రైవేటు ఆసుపత్రులు.
ప్రశ్న 13.
i) హరి టమాటాలు, బెండకాయలు, ఆకుకూరలు వంటి కూరగాయలు పండిస్తాడు. మూడు నెలల తరవాత అతడు ఎరువులు కొనుక్కోవాలి. కూరగాయలు ఇచ్చి ఎరువులు తీసుకోటానికి అప్పటిదాకా వాటిని నిలవ ఉంచలేదు. డబ్బు ఉపయోగించకపోతే ఎరువులు సరఫరా చేసే వ్యక్తితో హరి ఎటువంటి ఒప్పందం చేసుకుంటాడు?
జవాబు:
హరి తను పండించిన కూరగాయలు అప్పటి ధరకు ఎరువుల అమ్మకందారుకు ఇచ్చివేయాలి. 3 నెలల తరువాత ఆ విలువకు సరిపడా ఎరువులను ఇమ్మని ఒప్పందం చేసుకోవాలి.
ii) మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఇటువంటి ఏర్పాట్లు ఇంకా ఉన్నాయా?
జవాబు:
మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇటువంటి ఏర్పాట్లు లేవు.
iii) ఇటువంటి ఏర్పాట్లు చాలాసార్లు రైతులకు లాభసాటిగా ఉండకపోవచ్చు. చర్చించంది.
జవాబు:
ఇవి రైతులకు లాభసాటివి అయినవి కావు. కాలాన్ని బట్టి విలువలలో తేడా వస్తాయి. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి.
8th Class Social Textbook Page No.80
ప్రశ్న 14.
డబ్బుగా లోహాలను ఎందుకు ఎంచుకున్నారు?
జవాబు:
రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటి లోహాలు పాడవ్వకుండా చాలాకాలం ఉంటాయి. వీటిని చిన్నభాగాలుగా చేయవచ్చు. తేలికగా రవాణా చేయవచ్చు. ఇది కొరతవస్తువు కాబట్టి అందరూ దీనిని ఆమోదిస్తారు. అందువలన డబ్బుగా లోహాలను ఎంచుకున్నారు.
ప్రశ్న 15.
నాణాలను ముద్రించటం మంచి ఆలోచనేనా?
జవాబు:
వాటి నాణ్యత, తూకం, మన్నిక సరిగా ఉండాలి. అపుడు నాణాలను ముద్రించటం మంచి ఆలోచనే అవుతుంది.
ప్రశ్న 16.
నాణాలను ముద్రించటం వల్ల పాలకులకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? మూడు విభిన్న కారణాలను పేర్కొనండి.
జవాబు:
నాణాలను ముద్రించడం వల్ల పాలకులకు కలిగే ప్రయోజనాలు :
- వీరి రాజ్యంలో క్రయ, విక్రయాలు, ఇతర లావాదేవీలు సక్రమంగా జరుగుతాయి. దాంతో రాజుల ఖజానాలు, నిండుతాయి.
- వీటి తయారీ వలన కూడా వీరికి ఆదాయం లభిస్తుంది. టంకశాల వారికి ఒక ఆదాయ వనరు.
- ఈ నాణేల మీద వీరి అభిరుచుల ప్రకారం డిజైన్లు ముద్రిస్తారు. వీటిని చూసిన భవిష్యత్తు తరాల వారికి, వీరి వివరాలు తెలుస్తాయి.
ఉదా :
వాయిద్యాల బొమ్మలుంటే సంగీత ప్రియులని, దేవాలయాల బొమ్మలుంటే దైవ భక్తులని అర్థం చేసుకోవచ్చు.
8th Class Social Textbook Page No.82
ప్రశ్న 17.
స్వర్ణకారులపై నమ్మకం విఫలమయ్యే సందర్భాలు ఏమిటి?
జవాబు:
స్వర్ణకారుడు నాణ్యమైన నాణేలను ఇవ్వకపోయినా, లేదా అడిగిన వెంటనే ఇవ్వకపోయినా, విలువను తగ్గించి ఇచ్చినా లేదా ఏదైనా మోసంచేసే ప్రయత్నం చేసినా వారిపై నమ్మకం విఫలమవుతుంది.
ప్రశ్న 18.
ఆమ్ స్టర్ డాంలో వర్తకులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? వాటికి వాళ్ళు ఏ పరిష్కారం కనుగొన్నారు?
జవాబు:
1606లో యూరప్ లో ఆమ్ స్టడాం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ మార్పిడికి ప్రభుత్వం ఆమోదించిన 846 రకాల బంగారు, వెండి నాణాలు ఉండేవి. అయితే వ్యాపారస్తులు ఒకరినొకరు అనుమానిస్తూ ఉండేవాళ్లు – ఈ నాణాల బరువు, నాణ్యతల పట్ల ఎవరికీ నమ్మకం ఉండేది కాదు. ఆమ్ స్టడాం వర్తకులందరూ సమావేశమై ఈ సమస్యకు ప్రత్యేక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఆ నగర యాజమాన్యంలో ఉండే ఒక బ్యాంకును వాళ్లు స్థాపించారు.
ప్రశ్న 19.
మీరు ఎప్పుడైనా బ్యాంకు లోపలకు వెళ్లారా? మీకు తెలిసిన కొన్ని బ్యాంకుల పేర్లు చెప్పండి.
జవాబు:
బ్యాంకుల పేర్లు : –
- సిండికేట్ బ్యాంక్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్
- ఇండియన్ బ్యాంక్
- విజయా బ్యాంక్
- దేనా బ్యాంక్
- కనకదుర్గా గ్రామీణ బ్యాంక్
ప్రశ్న 20.
మీరు బ్యాంకు లోపలికి వెళితే వివిధ కౌంటర్ల దగ్గర ఖాతాపుస్తకాలు కంప్యూటర్ల సహాయంతో ఖాతాదారులతో వ్యవహరించే ఉద్యోగస్తులు కనపడతారు. కొన్ని కౌంటర్ల దగ్గర ఖాతాదారులు డబ్బులు జమ చేయటం, కొన్నింటి దగ్గర డబ్బు తీసుకోవటం కూడా చూసి ఉంటారు. ఒక క్యాబిన్లో బ్యాంకు మేనేజరు కూర్చుని ఉంటారు. ఈ బ్యాంకు ఉద్యోగస్టులు ఏం చేస్తారు?
జవాబు:
నా పేరు సురేష్ నేను ఒకసారి మా అమ్మగారితో కామారెడ్డిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్ళాను. అక్కడ ఉన్న అద్దాల గదిలో ఒక పెద్దాయన కూర్చుని ఉన్నారు. ఆయన ముందు బల్లమీద
అనసింగరాజు వేంకట నర్సయ్య
బ్రాంచి మేనేజరు
అని రాసి ఉన్న చెక్క పలక ఉన్నది. ఆయన ఎవరితోనో మాట్లాడుతూ, పేపర్లు చూస్తూ ఉన్నారు. మా అమ్మగారు శ్యామల గారు బ్యాంకు నుండి డబ్బులు తీయడానికి వచ్చారు. బ్యాంకులో “విత్ డ్రాయల్ కాగితాన్ని” అడిగి తీసుకుని దాన్ని పూర్తిచేసారు. ఆ కాగితాన్ని, బ్యాంకు పాస్ పుక్కును కౌంటరు ‘2’ వ నంబరులో ఇచ్చారు. ఆ కౌంటర్లో ఉద్యోగి దానిని పరిశీలించి, సంతకం చేసి ఒక ‘టోకెన్’ను (4వ నంబరు) మా అమ్మగార్కి ఇచ్చారు. మేము అక్కడే ఉన్న సోఫా మీద కూర్చున్నాము. ఇంతలో మాకు తెలిసిన ఒకాయన యజ్ఞయ్యగారు వచ్చి “డిపాజిట్ కాగితం”ను తీసుకుని కొంతసొమ్మును జమచేసి, మమ్మల్ని పలకరించి వెళ్ళిపోయారు. మా అన్నయ్య వాళ్ళ స్నేహితుడు రామకృష్ణ కొత్త అకౌంటు తెరవటానికి బ్యాంకుకి వచ్చి వివరాలు తెలుసుకుంటున్నాడు. బ్యాంకువారు అతనికి ఏమేం కావాలో వివరాలు చెబుతున్నారు.
బ్యాంకు ఉద్యోగస్తులు డి.డి.లు రాయటం, అకౌంట్లను పరిశీలించటం, కొత్త ఖాతాల వివరాలను నమోదుచేసుకోవడం, ఎవరైనా లాకర్లు తెరవాలని వస్తే వారికి సహకరించడం మొదలైన పనులన్నీ చేస్తున్నారు. ఇంతలో 6వ నంబరు కౌంటరు నుండి “నంబరు 4” అన్న పిలుపు వినపడింది. మా అమ్మగారు, నేను ఆ కౌంటరుకు వెళ్ళి టోకెన్ ఇచ్చి డబ్బులు తెచ్చుకున్నాము. మేనేజరుగారు బ్యాంకు విధి, విధానాలను పరిశీలిస్తూ, సమస్యలేమైనా ఉంటే వాటిని తీరుస్తారని మా అమ్మగారు చెప్పారు.
ప్రశ్న 21.
ప్రస్తుత కాలంలో రూపాయల నోట్ల మీద ఉండే హామీని చదవండి. ఎవరు హామీ ఇస్తున్నారు? ఎవరికి? ఇది ఎందుకు ముఖ్యం? చర్చించండి.
జవాబు:
100 రూపాయల నోటు మీద ఈ క్రింది హామీ ఉంది. “I promise to pay the bearer the sum of one Hundred Rupees”.
Governor.
ఈ హామీని రిజర్వు బ్యాంకు గవర్నరుగారు ఇస్తున్నారు. ఈ హామీ ఆ నోటు స్వంతదారునికి ఇస్తున్నారు. ఇది లేకపోతే ఈ నోటు కాగితంతో సమానం. కాబట్టి ఇది చాలా ముఖ్యం.
ప్రశ్న 22.
రెండు శతాబ్దాల తరవాత ఆమ్ స్టర్ డాం బ్యాంకు కుప్పకూలిపోయింది. దానికి కారణాలు ఏమై ఉంటాయి? చర్చించండి.
జవాబు:
‘ఆమ్ స్టర్ డాం బ్యాంకు యొక్క అనుబంధ బ్యాంకులు నాడు అన్ని ఐరోపా దేశాలలోనూ ఉండేవి. అది డలో విసెల్ – బ్యాంకుగా ఉండేది. ఇక్కడ తరుచు డబ్బు విలువ పడిపోతూ ఉండేది. దీనివలన బ్యాంకులో దాచుకున్నవారు తాము ఆశించిన దానికంటే తక్కువ నాణేలు పొందేవారు. వీరు నిరుత్సాహానికి గురయ్యేవారు. ఇది చిన్నదేశం కావడం మూలాన తరచూ విలువ పడిపోతూ ఉండేది. దీని మూలంగా ‘ఆమ్ స్టర్ బ్యాంకు’ పేరు దెబ్బతిన్నది.
4వ ఆంగ్లో – డచ్ యుద్ధం తరువాత, బ్రిటను ఆసియా ఖండంలో వలసలను ఏర్పాటు చేసుకుంది. దీనివలన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం దెబ్బతింది. వీరికి అందరికీ అప్పులు ఇచ్చిన బ్యాంకు ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. 4 సం||రాల వ్యవధిలో బ్యాంకులోని ఇరవై మిలియన్ల నాణేల సంఖ్య ఆరు మిలియన్లకు పడిపోయింది. ఫ్రెంచి విప్లవం దీనిని పూర్తిగా దెబ్బతీసింది. చివరికి 1819లో ఈ బ్యాంకు మూతపడింది.
ప్రశ్న 23.
గీత ATM కి వెళ్ళి డబ్బు ఎలా తీసుకోవచ్చు?
జవాబు:
(1)గీత ATM ఉన్న గదిలోకి వెళ్ళి స్క్రీన్ సరిగా ఉందో లేదో సరిచూసుకుని, కార్డుని లోపలకి ఉంచాలి. (2) తరువాత స్క్రీన్ మీద వచ్చే వివరాలను చదువుతూ తన పిన్ నంబరు, కావలసిన సొమ్ము వివరాలను టైపు చెయ్యాలి. (3) తరువాత బయటకు వచ్చిన సొమ్మును తీసుకోవాలి. (4) దాని తరువాత వచ్చే రశీదును తీసుకుని ‘clear’ అనే మాటని నొక్కి వచ్చేయాలి.
ప్రశ్న 24.
ఆమె తన ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి డబ్బు ఎలా తీసుకోవచ్చు?
జవాబు:
ఆమె తన ఖాతా ఉన్న బ్యాంకుకి వెళితే ‘విత్ డ్రాయల్ స్లిప్’ తీసుకుని, తనకు కావలసిన సొమ్ము రాసి సంతకం చేసి పాసు తో కలిపి కౌంటర్లో ఇస్తుంది. తర్వాత వరుస ప్రకారం వారు పిలిచినప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకుంటుంది.
8th Class Social Textbook Page No.84
ప్రశ్న 25.
మీ నోట్ పుస్తకంలో బ్యాంకు చెక్కు చిత్రాన్ని గీసి మీ ప్రక్కన కూర్చున్న స్నేహితుని పేరు మీద 1,50,000 రూపాయలకు ఒక చెక్కు రాయండి.
జవాబు:
ప్రశ్న 26.
కంచర్ల సుజాత ఖాతాకు సురేష్ 1,75,000/- రూపాయలను ఎలక్ట్రానిక్ పద్దతిలో డిపాజిట్ చేయాలి. అది ఎలా జరుగుతుంది. అందుకు అతనికి ఏ సమాచారం అవసరం ? బ్యాంకును సందర్శించి వివరాలు రాయండి.
జవాబు:
- ఇలా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది.
- దీనికొరకు ఇద్దరికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవసరం.
- కంచర్ల సుజాత ఖాతా నెంబరు, సురేష్ కు తెలిసి ఉండాలి.
ప్రశ్న 27.
చెక్కు ఉపయోగించకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో బ్యాంకు ద్వారా నేరుగా ఏఏ చెల్లింపులు చేస్తారో చర్చించి, వాటి జాబితా తయారుచేయండి.
జవాబు:
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెక్కునుపయోగించకుండా బ్యాంకు ద్వారా నేరుగా అనేక చెల్లింపులు చేయవచ్చు. అవి:
- వస్తువుల కొనుగోలు, అమ్మకం
- పెట్టుబడులు పెట్టుట
- అప్పులు చెల్లించుట
- కరెంటు, ఫోను బిల్లుల చెల్లింపు
- డబ్బులు బదిలీ చేయుట
- ఇన్‌కంటాక్స్ చెల్లించుట
- ఇంటిపన్నులు మొ||నవి చెల్లించుట
ప్రశ్న 28.
పొదుపు ఖాతా, కరెంటు ఖాతాల మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
పొదుపు ఖాతా :
ఉద్యోగస్టులు మొ||న వారు ఈ ఖాతాని కలిగి ఉంటారు. పొదుపు ఖాతాలోని సొమ్ముపై కొంత వడ్డీ వస్తుంది. డబ్బు క్షేమంగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. అడిగినప్పుడు డబ్బు చెల్లిస్తానన్న హామీ బ్యాంకు ఇస్తుంది.
కరెంటు ఖాతా :
వ్యాపారస్థులు మొ||న వారు ఈ ఖాతాను కలిగి ఉంటారు. ఈ ఖాతా నుంచి ఎన్నిసార్లయినా డబ్బులు తీయవచ్చు. జమ చేయవచ్చు. ప్రత్యేకమైన పరిమితి ఏమీలేదు. అయితే దీనిలో ఉన్న సొమ్ముకు వడ్డీ రాదు. అదనంగా సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ప్రశ్న 29.
స్వర్ణకారులు ఇచ్చిన రశీదులు డబ్బుగా ఎందుకు పనిచేస్తాయి?
జవాబు:
స్వర్ణకారుడు తగిన రుసుము తీసుకుని, వాటిని భద్రపరచి వారు కోరినపుడు వాటిని అందుబాటులో ఉంచేవాడు. ఈ విధానం ప్రాచుర్యం పొందింది. స్వర్ణకారుల మీద, అకౌంటెంట్ల మీద నమ్మకం పెరిగింది. వీరికి అనేక పట్టణాలలో శాఖలుండేవి. ఈ విధానం ‘కాగితపు డబ్బు’ లేదా ‘హుండీ’ లకు దారి తీసింది. వీరి మీద ఉన్న నమ్మకం కొద్దీ ఈ రశీదులు కూడా డబ్బుగా పనిచేస్తాయి.
ప్రశ్న 30.
క్రాస్ చేసిన చెక్కు ఇవ్వటం ఎందుకు మంచిది? చర్చించండి.
(లేదా)
బ్యాంకు లావాదేవీలు జరిపేటప్పుడు చెక్కులను క్రాస్ చేసి ఇవ్వడం మంచిది. ఎందుకు?
జవాబు:
చెక్కును ఎడమచేతి వైపు పై భాగాన మూలంగా, ఆ చెక్కు ఇవ్వబడిన వారి పేరు మీద అకౌంటు ఉంటేనే అది డబ్బుగా మార్చి ఆ అకౌంటులో వేస్తారు. ఇది ఇచ్చేవారికి, పుచ్చుకునే వారికి కూడా నమ్మకం కలిగించే అంశం. లేదంటే దీనిని , దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది.
8th Class Social Textbook Page No.86
ప్రశ్న 31.
వరుస-ఎ లో ఉన్న వాటిని వరుస-బి లోని వాటితో జతపరచండి.
జవాబు:
వరుస -ఎ | వరుస – బి |
అ) మనం నగదు తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా మన ఖాతాలోంచి చెల్లింపులు చేయటానికి వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యం | i) ఎటిఎం |
ఆ) రోజులో 24 గంటలలో ఎప్పుడైనా డబ్బులు జమ చేయటానికి, తీసుకోటానికి వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యం | ii) ఫోన్ బ్యాంకింగ్ |
ఇ) ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించటానికి | iii) క్రెడిట్ కార్డ్ |
ఈ) ఈ సౌకర్యం ఉపయోగించి మొబైల్ ఫోను ద్వారా మన ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలుసుకోవచ్చు | iv) డెబిట్ కార్డ్ |
ఉ) ఈ సౌకర్యం ఉపయోగించి రకరకాల చెల్లింపులు చేయవచ్చు. | v) నెట్ బ్యాంకింగ్ |
జవాబు:
అ – iv, ఆ – i, ఇ – V, ఈ – ii, ఉ – iii
ప్రశ్న 32.
పొదుపు కోసం ఫిక్స్ డిపాజిట్టును ఎపుడు ఎంచుకోవాలి?
జవాబు:
డిపాజిట్లు చేసిన పొదుపు మొత్తాన్ని నిర్ణీత గడువు లోపల తీయరాదు. అలాంటి అవకాశం ఉన్నప్పుడే పొదుపు కోసం ఫిక్స్ డిపాజిట్ ను ఎంచుకోవాలి.
ప్రశ్న 33.
వడ్డీ 8% అయితే, 5 సం||రాల తరవాత మనస్వినికి ఎంత డబ్బు వస్తుంది?
జవాబు:
వడ్డీ 8% అయితే, 5 సం||రాల తరవాత మనస్వినికి దాదాపు 15,000 రూ||లు వస్తుంది.
ప్రశ్న 34.
వైద్య ఖర్చుల కోసం ఆమెకు అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయని అనుకుందాం. బ్యాంకులో ఉన్న ఫి’ డిపాజిట్ నుంచి ఆ మొత్తాన్ని ఆమె తీసుకోవచ్చా? ఏమవుతుంది?
జవాబు:
మనస్విని ఆ మొత్తాన్ని తీసుకోవచ్చు. కాని ఆమెకు 8% వడ్డీ రాదు. బ్యాంకు నిబంధనల ప్రకారం తక్కువ శాతం వడ్డీతో తీసుకోవాలి.
8th Class Social Textbook Page No.87
ప్రశ్న 35.
బ్యాంకు నుంచి అప్పు తీసుకునే వాళ్లందరి నుంచి ఒకే రకమైన వడ్డీ వసూలు చేస్తారా?
జవాబు:
బ్యాంకు నుంచి అప్పు తీసుకునే వాళ్లందరి నుంచి ఒకే రకమైన వడ్డీ వసూలు చేయరు. గృహ ఋణాలకు ఒకరకం, విద్యా ఋణాలకు, వ్యక్తిగత ఋణాలకు మరోరకంగా వసూలు చేస్తారు.
ప్రశ్న 36.
అప్పు తీసుకున్నవాళ్ళు ఎవరైనా తిరిగి బ్యాంకుకు చెల్లించకపోతే ఏమవుతుంది?
జవాబు:
వారు బ్యాంకుకి హామీ ఇచ్చిన దాని నుండి, లేదా ఇచ్చిన బ్యాంకు నుండి బ్యాంకు వసూలు చేసుకుంటుంది.
ఉదా :
గృహఋణం తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోతే, వారి ఇంటిని వేలంవేసి తన బాకీని చెల్లించి, మిగతా సొమ్మును వారికిస్తుంది.
8th Class Social Textbook Page No.88
ప్రశ్న 37.
వ్యక్తిగతంగా తీసుకునే అప్పుకు, స్వయం సహాయక సంఘంగా తీసుకునే అప్పుకు తేడా ఏమిటి?
జవాబు:
వ్యక్తిగతంగా అప్పు తీసుకునే వారు బ్యాంకుకి తగిన హామీని చూపించాలి.
స్వయం సహాయక సంఘం తీసుకునే అప్పుకు హామీకోసం ఎటువంటివి చూపించాల్సిన అవసరం లేదు.
ప్రశ్న 38.
అప్పు తీసుకోవడానికి బ్యాంకులు మంచివా, వడ్డీ వ్యాపారస్తులా? ఎందుకు?
(లేదా)
ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల ద్వారా ఋణాలు పొందడం మంచిదా? వడ్డీ వ్యాపారస్తుల ద్వారా ఋణం పొందడం మంచిదా? మీ సమాధానాన్ని సమర్థిస్తూ 4 వాక్యాలు రాయండి.
జవాబు:
అప్పు తీసుకోవడానికి బ్యాంకులే మంచివి. కారణాలు :
- బ్యాంకు వారి వడ్డీ సులభతరంగా ఉంటుంది.
- నెలవారీ వాయిదాలలో చెల్లించవచ్చు.
- తిరిగి చెల్లించలేని పక్షంలో వీరు ఋణగ్రహీతలకు ఎక్కువ సమయం ఇస్తారు.
ప్రశ్న 39.
ప్రాథమిక పొదుపు ఖాతాను గూర్చి వివరించండి.
జవాబు:
- కనీస నిల్వ అసలు లేకుండా (‘జీరో’ బ్యాలెన్స్) లేదా అతి తక్కువ ఉండవచ్చు.
- వ్యక్తులకు, ఖాతా తెరవడానికి, వయస్సు, ఆదాయం , జమ చేయవలసిన కనీస మొత్తం వంటి షరతులు లేవు.
- నెలకి నాలుగుసార్లు (ATM నుండి తీసుకొన్న వాటితో కలిపి) నగదు తీసుకోవడం అనుమతించబడుతుంది.)
- నగదు తీసుకొను, డిపాజిట్ చేయుట; ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలు / చెక్ (cheque) ల ద్వారా వచ్చిన సొమ్ము జమ చేయుటవంటి సేవలు పొందవచ్చు.
- కేంద్ర ప్రభుత్వం వారు ప్రధానమంత్రి జనధన్ యోజన (PMJDY) స్కీం ఆగస్టు 2014లో ప్రారంభించబడింది.
దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా పేద ప్రజలందరికి జీరో బ్యాలెన్స్ తో బ్యాంక్ లో ఖాతాలు తెరిచేలా సదుపాయం కల్పించారు.
ప్రశ్న 40.
చిన్న ఖాతాలకు వర్తించే షరతులు ఏవి?
జవాబు:
ఒకవేళ, ప్రాథమిక పొదుపు ఖాతా, సులభం చేసిన “Know Your Customer (KYC)” షరతులతో గనుక తెరిచినట్లయితే, ఇది చిన్న ఖాతావలె కూడా పరిగణించబడుతుంది.
- ఈ ఖాతాల్లో మొత్తం జమ, ఒక సంవత్సరంలో లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు.
- ఏ సమయంలో కూడా, ఈ ఖాతాలో గరిష్ఠ నిల్వ ఏభైవేల రూపాయలు మించి ఉండరాదు.
- నగదు రూపంలో గాని, ఇతర బదిలీల రూపంలో గాని తీసుకొన్న మొత్తం, ఒక నెలలో పదివేల రూపాయలు మించి ఉండకూడదు.
- చిన్న ఖాతాలు మొదట 12 నెలల వరకు అమలులో ఉంటాయి. ఆ తరువాత, ఖాతాదారు అధికారికంగా సమ్మతించిన పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు రుజువు సమర్షిస్తే, దీన్ని మరో 12 నెలలు పొడిగించవచ్చు.
ప్రశ్న 41.
క్రింది. పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.
కాలక్రమంలో అరుదైన, ఆకర్షణీయమైన లోహాలను మార్పిడి మాధ్యమంగా ప్రజలు ఉపయోగించటం మొదలుపెట్టారు. రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి పాడవ్వకుండా చాలాకాలం ఉంటాయి. చిన్న భాగాలుగా చేయవచ్చు, తేలికగా రవాణా చేయవచ్చు. ఇది కొరత వస్తువు కాబట్టి అందరూ దీనిని ఆమోదిస్తారు. ప్రజలు తమ చేతిలో ఉన్న డబ్బు విలువైనదని, ఇతరులు కోరుకొనేది అనే నమ్మకంతో అమ్మడం, కొనడం చేసేవారు. ఈ డబ్బుకి విలువ ఉందని, ఇతరులు దానిని ఆమోదిస్తారని ప్రజలకు తెలుసు కాబట్టి తమ సరుకులను డబ్బుకి అమ్ముకునేవారు. ధాన్యం, పశువుల విలువ పడిపోయినట్టు డబ్బు విలువ పడిపోతుందని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. అయితే వస్తుమార్పిడిలోని అన్ని సమస్యలు ఈ రకమైన డబ్బు వల్ల పరిష్కారం కాలేదు, కొత్త సమస్యలు కూడా వచ్చాయి. లోహాలతో మార్పిడి చేసేటప్పుడు ప్రతిసారీ దానిని తూకం వేయాల్సి వచ్చేది. తరవాత లోహాల నాణ్యత పట్ల వ్యాపారస్థులకు అనుమానం కలిగేది. మార్పిడిలో స్వచ్ఛమైన వెండి, బంగారం లభించకపోవచ్చు. కొంతకాలం తరవాత మార్పిడికి ఉపయోగించిన లోహనాణ్యతలో నమ్మకం పెద్ద సమస్యగా మారింది.
1) చాలాకాలం పాడవకుండా ఉండే కొన్ని లోహాలను చెప్పండి.
జవాబు:
రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి పాడవ్వకుండా చాలాకాలం ఉంటాయి.
2) ప్రజలు ఏ విషయాలకు భయపడాల్సిన అవసరం లేదు?
జవాబు:
ధాన్యం, పశువుల విలువ పడిపోయినట్టు డబ్బు విలువ పడిపోతుందని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు.
3) డబ్బు వలన వస్తుమార్పిడిలోని సమస్యలు పరిష్కారమయ్యాయా?
జవాబు:
వస్తుమార్పిడిలోని అన్ని సమస్యలు ఈ రకమైన డబ్బు వల్ల పరిష్కారం కాలేదు, కొత్త సమస్యలు కూడా వచ్చాయి.
4) డబ్బు వల్ల కలిగిన సమస్యలు ఏవి?
జవాబు:
లోహాలతో మార్పిడి చేసేటప్పుడు ప్రతిసారీ దానిని తూకం వేయాల్సి వచ్చేది. తరవాత లోహాల నాణ్యత పట్ల వ్యాపారస్తులకు అనుమానం కలిగేది. – మార్పిడిలో స్వచ్చమైన వెండి, బంగారం లభించకపోవచ్చు. కొంతకాలం తరవాత మార్పిడికి ఉపయోగించిన లోహ నాణ్యతలో నమ్మకం పెద్ద సమస్యగా మారింది.
ప్రశ్న 42.
ఈ క్రింది పేరాను చదివి సమాధానములిమ్ము.
అనేక పట్టణాలు, నగరాల్లో అన్ని బ్యాంకుల, ప్రతినిధులు ప్రతిరోజూ సమావేశమై ఆ రోజు ప్రతి బ్యాంకుకీ ఇతర బ్యాంకుల నుంచి రావలసిన మొత్తాలను, అలాగే ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలను నిర్ధారించుకుంటారు. సరిచూసిన చెక్కులు ఒకరికొకరు మార్చుకుంటారు. ఒక బ్యాంకు క్లియరింగ్ బ్యాంకు’గా పని చేస్తుంది. ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికీ ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులను ఈ క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది.
కొత్త విధానంలో అన్ని బ్యాంకులు, వాటి అన్ని శాఖలూ కంప్యూటర్ల ద్వారా అనుసంధానమై ఉన్నాయి. అన్ని బ్యాంకు ఖాతాలను, వారి సంతకాలను ఎక్కడ ఉన్న శాఖలోనైనా సరిచూసుకోవచ్చు. కాబట్టి బ్యాంకు ప్రతినిధులు కలవాల్సిన పనిలేదు. అదే విధంగా వేరే ఊళ్లో ఉన్న శాఖలకు బ్యాంకులు చెక్కులు పంపించాల్సిన అవసరం లేదు. ఒక బ్యాంకు మరొక బ్యాంకు మధ్య లావాదేవీలను అనుసంధానం చేయబడిన కంప్యూటర్లతో నిర్వహిస్తారు. దీని వల్ల పనులు చాలా తేలికగానే కాకుండా చాలా తొందరగా కూడా పూర్తవుతాయి.
1) ఎవరెవరు సమావేశమవుతారు?
జవాబు:
అన్ని బ్యాంకుల ప్రతినిధులు సమావేశమవుతారు.
2) వారు ఏమి మార్చుకుంటారు?
జవాబు:
సరిచూసిన చెక్కులు ఒకరికొకరు మార్చుకుంటారు.
3) క్లియరింగ్ బ్యాంకు ఏమి పనిచేస్తుంది?
జవాబు:
ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికీ ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులను ఈ క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది.
4) కొత్త విధానంలో కొత్తదనం ఏమిటి?
జవాబు:
కొత్త విధానంలో అన్ని బ్యాంకులు, వాటి అన్ని శాఖలు కంప్యూటర్ల ద్వారా అనుసంధానమై ఉన్నాయి.
5) దీని వలన ఫలితం ఏమిటి?
జవాబు:
దీనివల్ల పనులు చాలా తేలికగానే కాకుండా చాలా తొందరగా కూడా పూర్తవుతాయి.
ప్రశ్న 43.
ఈ క్రింది పేరాను చదివి, రెండు ప్రశ్నలను వ్రాయుము.
కాగితపు నోట్లకు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అది మురికి అవుతుంది. చిరిగిపోతుంది. దాంతో నోట్లకు ప్లాసికను ఉపయోగించాలన్న భావన ఏర్పడింది. ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు పాడవ్వకుండా చాలాకాలం మన్నుతాయి. వీటిలో నకిలీ నోట్లను కూడా తేలికగా గుర్తించవచ్చు. ఇది నీటికి తడవదు, పర్యావరణానికి హాని చెయ్యదు.
జవాబు:
- కాగితపు నోట్లకు ఉన్న లోపాలేవి?
- పాలిమర్ నోట్లకున్న అర్హతలేవి?
ప్రశ్న 44.
మీ ప్రాంతంలో ఉన్న వాణిజ్య బ్యాంకును సందర్శించి ఈ పట్టికను నింపండి.
జవాబు:
ప్రశ్న 45.
బ్యాంకులు అప్పు ఇచ్చేటప్పుడు హామీ ఎందుకు తీసుకుంటాయి?
జవాబు:
బ్యాంకు సిబ్బందికి, బ్యాంకుకు వచ్చేవారికి ఎటువంటి సంబంధం ఉండదు – మేనేజ్ మెంట్, కస్టమర్ సంబంధం తప్పు. అలాంటి సందర్భంలో బ్యాంకువారు ఎవరికి పడితే వారికి ఋణాలిచ్చి, తిరిగి వసూలు చేయలేకపోతే దివాళా తీసే పరిస్థితి వస్తుంది. అలాంటివి ఎదుర్కోకుండా బ్యాంకు అప్పులు ఇచ్చేటపుడు హామీలను తీసుకుంటాయి.
ప్రశ్న 46.
చెక్కులు మరియు డి.డి.ల మధ్య భేదాలు ఏమిటి?
జవాబు:
చెక్కులు:
- చెక్కుని బ్యాంకు ఖాతాదారుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే వారి పేరు మీద వ్రాసి ఇస్తాడు.
- చెక్కు నుండి నగదును డ్రా చేయడానికి ఎలాంటి సేవా రుసుమును చెల్లించనక్కరలేదు.
- ఒక వేళ చెక్కు ఇచ్చిన వ్యక్తి account లో నగదు ఉన్నట్లయితే మనం వెంటనే ఆ చెక్కును నగదుగా మార్చుకోవచ్చు. ఎక్కువ సమయం వృథా కాదు.
- అయితే చెక్కు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడినంత నగదు లేకపోతే బ్యాంకులు మనకు డబ్బులు ఇవ్వవు చెక్కులను తిరస్కరిస్తాయి.
D.Dలు:
- D.D లను బ్యాంకులు ఇష్యూ చేస్తాయి.
- మనం ఏవైనా సంస్థలు అందించే సేవలు పొందాలంటే కొంతడబ్బును ముందుగా ఆ సంస్థలకు చెల్లించాలి. ఆ డబ్బును D.D ల రూపంలో చెల్లించాలి.
- D.D లను కట్టే సమయంలో మనం కొంత సేవా రుసుమును కట్టాలి.
- బ్యాంకు ఎవరి పేరు మీద D.D ని ఇస్తుందో వారు ఆ D.D ని పొందిన వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు.
- D.D ని డబ్బుగా మార్చడానికి 2 లేదా 3 రోజుల సమయం పడుతుంది.
- D.D లు ఆమోదయోగ్యమైనవి ఇది తిరస్కరింపబడవు.
ప్రశ్న 47.
చెక్కుల కంటె డి.డి.లు ఎలా ఆమోదయోగ్యమైనవి?
జవాబు:
- D.D లు ఎందుకు ఆమోదయోగ్యమైనవి అనగా బ్యాంకుకి ముందుగానే డబ్బులు కట్టి డి.డిలు తీసుకుంటాము. కాబట్టి అన్ని రకాల చెల్లింపులకు D.D లు ఆమోదయోగ్యమైనవే.
- కొన్ని సందర్భాలలో చెక్కులు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడినంత నగదు లేక పోయినట్లయితే చెక్కులు తిరస్కరించబడతాయి.
ప్రశ్న 48.
బ్యాంక్ వారు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ కంటే వారు ఇచ్చే అప్పులపైన వడ్డీ ఎందుకు ఎక్కువ? Page No. 84)
జవాబు:
1) బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ
2) ప్రజలు ఒక ఒప్పందం ప్రకారం అనగా బ్యాంకు వారు ఎంత అయితే వడ్డీని డిపాజిట్లకు చెల్లించుతామని చెప్పారో దానికి ఇష్టపడి ప్రజలు డిపాజిట్లు చేశారు. ఎందుకనగా వారికి అవసరం అయినప్పుడు అడిగినంత లభిస్తుందన్న నమ్మకం ప్రజలకుంది.
అయితే బ్యాంకు వారు ఇచ్చే అప్పులపై వడ్డీ ఎందుకు ఎక్కువ వసూలు చేస్తారంటే, ఆ వచ్చే వడ్డీతోనే బ్యాంకు జమచేసిన వారికి వడ్డీ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి. పరికరాలు కాని నిర్వహించాలి. అద్దెలు చెల్లించాలి, బ్యాంకు నడపడానికి అయ్యే ఇతర ఖర్చులు భరించాలి. అంతిమంగా లాభాలు సంపాదించాలి. అందువలన బ్యాంకులు ఇచ్చే అప్పుల పైనే వడ్డీ ఎక్కువగా తీసుకుంటారు.
ప్రశ్న 49.
ఖాతాదారులలో చాలామంది బ్యాంకులో డబ్బు ఉంచాలని అనుకోకపోతే అది బ్యాంకు పనితీరును ఏ రకంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
ఖాతాదారులలో చాలామంది బ్యాంకులో డబ్బు ఉంచాలని అనుకోకపోతే బ్యాంకులో సొమ్ములు నిల్వ ఉండవు. అపుడు బ్యాంకు ఇతరులకు అప్పు ఇవ్వలేదు. వారి నుండి వడ్డీలు సేకరించలేదు. దీని మూలంగా బ్యాంకు నిర్వహణ అసాధ్యమైపోతుంది.
ప్రశ్న 50.
గ్రామాలలో, పట్టణాలలో చాకలివారు, మంగలి వారు మరియు నీరటి వారు (చెరువు నీటిని కావలి కాసేవారు) మొదలగువారి, పనికి తగిన వేతనం చెల్లిస్తారా?
జవాబు:
ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు వారి పనికి డబ్బు రూపంలోనే వేతనాలు చెల్లిస్తున్నారు. కాని 15 సం||రాల క్రితం వరకు వారికి ధాన్యం రూపంలోనే డబ్బులు చెల్లించేవారట.
ప్రశ్న 51.
పొదుపు ఖాతా అంటే ఏమిటి?
జవాబు:
పొదుపు ఖాతా : ఉద్యోగస్టులు మొ||న వారు ఈ ఖాతాని కలిగి ఉంటారు. పొదుపు ఖాతాలోని సొమ్ముపై కొంత వడ్డీ వస్తుంది. డబ్బు క్షేమంగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. అడిగినప్పుడు డబ్బు చెల్లిస్తానన్న హామీ బ్యాంకు ఇస్తుంది.
ప్రశ్న 52.
కరెంటు ఖాతా అంటే ఏమిటి?
జవాబు:
కరెంటు ఖాతా : వ్యాపారస్థులు మొ||నవారు ఈ ఖాతాను కలిగి ఉంటారు. ఈ ఖాతా నుంచి ఎన్నిసార్లయినా డబ్బులు తీయవచ్చు. జమ చేయవచ్చు. ప్రత్యేకమైన పరిమితి ఏమీలేదు. అయితే దీనిలో ఉన్న సొమ్ముకు వడ్డీ రాదు. అదనంగా సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ప్రశ్న 53.
మీకు 2000/- రూ||ల అవసరం ఉందనుకోండి. ఒక చెక్కు రాసి మీ చెల్లెలికిచ్చి నగదు తీసుకురమ్మని పంపించండి. ఏమి జరుగుతుంది?
జవాబు:
బ్యాంకు వారు దీనిని త్రిప్పి పంపుతారు. చెక్కులకు నగదు ఎవరికీ చేతి కివ్వరు. బ్యాంకులో అకౌంటు వుంటేనే, ఆ చెక్కును తీసుకుని, చెల్లెలు అకౌంట్లో వేస్తారు.
ప్రశ్న 54.
చాలాకాలం పాడవకుండా ఉండే కొన్ని లోహాలను చెప్పండి.
జవాబు:
రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి పాడవ్వకుండా చాలాకాలం ఉంటాయి.
ప్రశ్న 55.
ప్రజలు తమ సరుకులను డబ్బుకి ఎందుకు అమ్ముకునేవారు?
జవాబు:
డబ్బుకి విలువ ఉందని, ఇతరులు దానిని ఆమోదిస్తారని ప్రజలకు తెలుసు కాబట్టి తమ సరుకులను. డబ్బుకి అమ్ముకునేవారు.
ప్రశ్న 56.
క్లియరింగ్ బ్యాంకు ఏమి పనిచేస్తుంది?
జవాబు:
క్లియరింగ్ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికీ ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులను ఈ . క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది.
ప్రశ్న 57.
మీకు తెలిసిన కొన్ని బ్యాంకుల పేర్లు చెప్పండి.
జవాబు:
బ్యాంకుల పేర్లు :
- ఆంధ్రాబ్యాంక్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఇండియన్ బ్యాంక్
ప్రశ్న 58.
ఒక కాలానికి చేసిన ఫిక్స్ డిపాజిట్టుపై ప్రజలకు లభించే వడ్డీ కంటే అదే కాలానికి తీసుకున్న అప్పుపై ఎక్కువ వడ్డీ చెల్లించాలి. ఇలా ఎందుకు ఉండాలి?
జవాబు:
బ్యాంకుకి ‘ఫిక్స్ డిపాజిట్టు’ పై ఇచ్చే. వడ్డీ ఖర్చు క్రింద లెక్క అప్పుపై వచ్చే వడ్డీ ఆదాయం. ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువైతేనే లాభాలుంటాయి. లేకుంటే బ్యాంకులు నష్టపోతాయి.
ప్రశ్న 59.
పదివేల రూపాయలకు, వడ్డీ 8% అయితే, 5 సం||రాల తరువాత మనస్వినికి ఎంత డబ్బు వస్తుంది?
జవాబు:
వడ్డీ 8% అయితే 5 సం||రాల తరువాత మనస్వినికి దాదాపు రూ. 15,000 లు వస్తుంది.
ప్రశ్న 60.
డబ్బులు లేకుండా జరిగే మార్పిడులు ఏమైనా మీకు తెలుసా?
జవాబు:
“బార్టరు పద్ధతి” గురించి నాకు తెలుసు. వస్తువులను వస్తువులతోనే మార్చుకొనే విధానం.
ప్రశ్న 61.
ప్రస్తుతం బ్యాంకుల లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి?
జవాబు:
ప్రస్తుతం బ్యాంకులలో లావాదేవీలు కంప్యూటర్, ఇంటర్నెట్, NEFT ద్వారా జరుగుతున్నాయి.
పట నైపుణ్యాలు
ప్రశ్న 62.
దిగువనీయబడిన భారతదేశ పటంలో తొలి బ్యాంకర్ల ప్రదేశాలను గుర్తించుము.
జవాబు:
ప్రాజెక్టు
బ్యాంకుకు వెళ్లండి, లేదా బ్యాంకు అధికారిని మీ బడికి ఆహ్వానించి ఈ కింది విషయాలు తెలుసుకోండి.
అ) మీ పేరుతో పొదుపు ఖాతా తెరిచే విధానం
ఆ) బ్యాంకులు చెక్కుల మొత్తాలను ఎలా చెల్లిస్తాయి?
ఇ) నెస్ట్ (NEFT) బదిలీలను బ్యాంకులు ఎలా చేస్తాయి? (National Electronic Funds Transfer)
ఈ) ఎటిఎం పనిచేయటానికి భద్రతాపరంగా ఎటువంటి జాగ్రత్తలు అవసరం?
ఉ) చెక్కుల ద్వారానే కాకుండా డ్రాఫ్టులు / ఆన్లైన్ లావాదేవీల ద్వారా కూడా డబ్బులు బదిలీ చేయవచ్చు. ఆ వివరాలు తెలుసుకోండి.
ఊ) డబ్బులు పొందవలసిన వ్యక్తికి చెక్కుతో పోలిస్తే ఆన్ లైన్ లావాదేవీ వల్ల ప్రయోజనం ఏమిటి?
ఋ) వివిధ రకాల అప్పులకు వర్తించే వడ్డీ
పొదుపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ | |
ఫిక్స్ డిపాజిట్టుపై చెల్లించే వడ్డీ | |
రైతులకు ఇచ్చే అప్పులపై వడ్డీ | |
గృహ ఋణాలపై వసూలు చేసే వడ్డీ | |
విద్యా ఋణాలపై వసూలు చేసే వడ్డీ |
జవాబు:
అ) రెండు ఫోటోలు, నివాస గృహానికి సంబంధించిన ఋజువు, గుర్తింపు పత్రంతో బ్యాంకుకి వెళ్ళి దరఖాస్తును నింపాలి. బ్యాంకులో అంతకుముందే ఖాతా ఉన్నవారిచే పరిచయ సంతకం తీసుకోవాలి. తర్వాత బ్యాంకులో ఈ పత్రాలు ఇస్తే అకౌంటు ఓపెన్ చేస్తారు.
ఆ) బ్యాంకులు చెక్కుల మొత్తాలను ‘క్లియరింగ్ బ్యాంక్’లో ఇచ్చి దాని ద్వారా చెల్లింపులు జరుపుతాయి.
ఇ) దేశంలో అన్ని బ్యాంకులు ఇప్పుడు కంప్యూటర్‌తో అనుసంధానం చేయబడి ఉన్నాయి. అంతేకాక Internet ద్వారా పనిచేస్తున్నాయి. ఒక వ్యక్తి ‘X’ అనే బ్యాంక్ లోని తన అకౌంటు నుండి, ‘Y’ అనే బ్యాంక్ లోని తన మిత్రుడు అకౌంట్ కి డబ్బులు పంపాలంటే NEFT ద్వారా పంపవచ్చు. 2,00,000/- రూ||ల వరకు బ్యాంకు ఎటువంటి చార్జి తీసుకోదు. (దేశంలోనే)
ఈ) ATM కు కావలసిన జాగ్రత్తలు :
- ATM లోని కంప్యూటర్ సరిగా పనిచేస్తోందో లేదో జాగ్రత్త తీసుకోవాలి.
- రశీదు వచ్చే ఏర్పాటును చూసుకోవాలి.
- వినియోగదారులు ఇచ్చే ఆజ్ఞలను సరిగా అర్థం చేసుకోవాలి.
- నోట్ల సంఖ్య సరిగా ఉండేలా చూడాలి.
- ATM వద్ద కాపలాదారు ఉండాలి.
- ATM లో camera ఉండాలి.
- ATM లో పిన్ నంబరుతో బాటు వేలిముద్ర ఫడే పద్ధతి కూడా ఉండాలి. కంప్యూటర్ పిన్ నంబరును, బ్యాలెనన్ను సరిచూస్తుంది.
ఉ) అవును. డ్రాఫ్టులు / ఆన్లైన్ లావాదేవీలు కూడా ఉంటాయి. ‘డ్రాప్టు’ డబ్బు కట్టిన వ్యక్తికి కాగితం రూపంలో ఇస్తే వారు డబ్బు చేరవల్సిన వారికి పంపుతారు. వారు అక్కడ బ్యాంకులో దానిని చూపించి డబ్బు తీసుకుంటారు. ఆన్లైన్లో అయితే కౌంటర్లో డబ్బు ఇస్తే అది మనం ఇవ్వవలసిన వారి అకౌంటుకు వెళ్ళిపోతుంది.
ఊ) డబ్బులు పొందవలసిన వ్యక్తికి చెక్కు ద్వారా అయితే సమయం ఎక్కువ పడుతుంది. అదే ఊళ్ళో ఉన్న వ్యక్తి అయితే 2 రోజులు పడుతుంది. వేరే ఊరి వ్యక్తి అయితే చెక్కు పోస్టులో అంది బ్యాంక్ లో వేసేటప్పటికే 3, 4 రోజులు పడుతుంది. అదే ‘ఆన్‌లైన్’ ద్వారా అయితే ఇక్కడ డబ్బులు వేసిన వెంటనే అక్కడ డ్రా చేసుకోవచ్చు. సమయం ఆదా అవుతుంది. అవసరం తీరుతుంది.
ఋ)
పొదుపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ | 3 నెలలు – 6.50%, 6 నెలలు – 6.50% |
ఫిక్స్ డిపాజిట్టుపై చెల్లించే వడ్డీ | 1 సంవత్సరం – 8.50%, 1 సంవత్సరం 4% |
రైతులకు ఇచ్చే అప్పులపై వడ్డీ | 8% 1 సంవత్సరం మరియు 2 సంవత్సరం 9% |
గృహ ఋణాలపై వసూలు చేసే వడ్డీ | 10.50% |
విద్యా ఋణాలపై వసూలు చేసే వడ్డీ | 13.50% – 14% |