AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 4th Lesson అజంతా చిత్రాలు

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఆ) కింది అపరిచిత గద్యాలను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

*ఈ క్రింది వచనాలను చదివి వాటి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ‘మన ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో, నరసరావుపేటకు ఏడుమైళ్ళ దూరంలో “కోటప్పకొండ” ఉంది. ఆ కొండ మీద 600 అడుగుల ఎత్తున కోటేశ్వర స్వామి గుడి ఉంది. పూర్వపు శాసన ఆధారాలను బట్టి క్రీ.శ. 11వ శతాబ్దానికే ఈ గుడి ఉందని తెలుస్తోంది. ఈ కొండ ఎత్తు 1587 అడుగులు. ఈ కొండ చుట్టూ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న నీటి గుంటలున్నాయి. వీనిని “దొనలు” అంటారు. ఈ కొండ మధ్యలో “పాపనాశనము” అనే తీర్థం ఉంది. ఇది శివుడు త్రిశూలంతో కొడితే ఏర్పడింది. దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.
ప్రశ్నలు :
1. కోటప్ప కొండ ఎక్కడ ఉంది?
జవాబు:
కోటప్పకొండ గుంటూరు జిల్లాలో, నరసరావుపేటకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది.

2. కోటప్పకొండపై ఎవరి గుడి ఉంది ? అది ఎంత ఎత్తు?
జవాబు:
కోటప్పకొండపై కోటేశ్వరస్వామివారి గుడి ఉంది. ఆ కొండ 1587 అడుగుల ఎత్తు.

3. కోటప్పకొండ పైనున్న గుడి యొక్క ప్రాచీనత ఎట్టిది?
జవాబు:
ఈ గుడి క్రీ.శ. 11వ శతాబ్దానికి చెందినది. కొండ మధ్యలో పాపనాశనము అనే తీర్థం ఉంది. దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.

4. దొనలు అంటే ఏమిటి?
జవాబు:
కొండ చుట్టూ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న నీటి గుంటలున్నాయి. వీటిని దొనలు అంటారు.

2. శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన భావ కవిత్వం పై తిరుగుబావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తరువాత విప్లవ కవిత్వమునకు స్ఫూర్తినిచ్చాడు. “అనితర సాధ్యం నా మార్గం” అని చాటిన ప్రజాకవి. “మహాప్రస్థానం” కావ్యం, “సిరిసిరి మువ్వ శతకం” శ్రీశ్రీకి మంచి కీర్తిప్రతిష్ఠలు సంపాదించి పెట్టాయి. ఆయన సమాజాన్ని చైతన్యపరిచే రచనలెన్నో చేశాడు. అందుకే సాహిత్య విమర్శకులు ఆయనను అభ్యుదయ కవిత్వానికి యుగకర్త అంటారు.
ప్రశ్నలు :
1. శ్రీశ్రీ అసలు పేరేమి?
జవాబు:
శ్రీరంగం శ్రీనివాసరావు.

2. ఆయన అభ్యుదయ భావాలు దేనికి స్ఫూర్తినిచ్చాయి?
జవాబు:
ఆయన అభ్యుదయ భావాలు విప్లవ కవిత్వానికి స్ఫూర్తినిచ్చాయి.

3. తన రచనాశైలి విషయంలో ఆయన ఏమని చాటుకొన్నాడు?
జవాబు:
‘అనితర సాధ్యం నా మార్గం’ అని శ్రీ శ్రీ తన రచనా శైలి విషయంలో చాటుకొన్నాడు.

4. శ్రీశ్రీకి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన రచనలు ఏవి?
జవాబు:
మహాప్రస్థానం అనే కావ్యం, సిరిసిరి మువ్వ అనే శతకం శ్రీశ్రీకి కీర్తిప్రతిష్ఠలు తెచ్చి పెట్టిన రచనలు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

3. జనపదం అంటే పల్లెటూరు. జనపదాలలో ఉండేవారు జానపదులు. జానపదులు పాడే పాటలు లేక గేయాలను జానపద గేయాలంటారు. వీటిని ఆంగ్లంలో ‘ఫోక్ సాంగ్స్’ అంటారు. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను లోక్ గీత్ లేదా లోక్ సాహిత్య అంటారు. జానపద సాహిత్యం సమిష్టి సంపద. శిష్ట సాహిత్యంలాగా కాక జానపద సాహిత్యం పలువురి చేతులలో పెరిగింది. ఇది దాని మొదటి లక్షణం. గేయ రచనా కాలం స్పష్టంగా ఉండకపోవడం మరో లక్షణం. నదీ నదాలు, వాగులు, వంకలూ మనకు ఉపయోగపడక సముద్రం పాలైనట్లే జానపద గేయస్రవంతి కూడా చాలా భాగం మనకు అందలేదు. జానపద సాహిత్యాన్ని భద్రపరచవలసిన అవసరం ఉన్నది.
ప్రశ్నలు :
1. జానపదులు అంటే ఎవరు?
జవాబు:
జనపదాల్లో ఉండేవారిని జానపదులు అంటారు.

2. ఉత్తర భారతదేశంలో జానపదాలను ఏమంటారు?
జవాబు:
ఉత్తర భారతదేశంలో జానపదాలను ‘లోక్ గీత్’ (లేదా) ‘లోక్ సాహిత్య’ అని అంటారు.

3. జానపద సాహిత్యం ప్రథమ లక్షణం ఏమిటి?
జవాబు:
సమిష్టి సంపదయై, పలువురి చేతులలో పెరుగుట జానపద సాహిత్య ప్రథమ లక్షణం.

4. ఆంగ్లములో జానపద గేయాల్ని ఏమంటారు?
జవాబు:
ఆంగ్లములో జానపద గేయాలను “ఫోక్ సాంగ్స్” అని అంటారు.

4. . మేధా సంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమవుతుంది అనేది ఎంతయినా యథార్థం. ఒక దేశం యొక్క సంస్కృతి, వికాసం, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా, కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక యుగంలో విద్య మానవునికి ఒక ముఖ్యమైన జీవితావసరంగా కూడా మారింది. నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు ఒక ప్రాథమిక అవసరంగా భావించి వాటిని రాజ్యాంగంలో పొందుపరచడమైనది.
ప్రశ్నలు :
1. యథార్థమైనది ఏది?
జవాబు:
స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతమవుతుంది.

2. ఒక దేశ సంస్కృతి, ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది?
జవాబు:
ఒక దేశ సంస్కృతి, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

3. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక అవసరాలేవి?
జవాబు:
నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు అనే ప్రాథమిక అవసరాలు రాజ్యాంగంలో పొందుపరచ బడ్డాయి.

4. వైజ్ఞానిక వాస్తవం ఏమిటి?
జవాబు:
మేధాసంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం.

5. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. 1 – 2018-19)

ఈ గుహలను సమీపిస్తుంటే ఇటు పచ్చనికొండ, అటు పచ్చనికొండ. ఈ రెండు కొండల మధ్య ‘వాఘోరా’ నది రాళ్ళ గుట్టల గుండా జలజలా ప్రవహిస్తూ నది పాడుకొనే పాటలను వింటూ, నది అంచు వెంట కాలినడకన, గుహలకు చేరాలి. మీ పైన నీలాకాశం, మీమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహలను చేరేవరకు రెండు, మూడు మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగు పెడితే, దానికి అదే ఒక ప్రపంచం.
ప్రశ్నలు
1. గుహల సమీపంలో ప్రవహిస్తున్న నది పేరేమిటి?
జవాబు:
వా ఘోరా నది

2. కణకణ, గడగడ ఇటువంటి పదాలను ధ్వన్యనుకరణ పదాలు అంటారు. పై పేరాలో అటువంటి పదం ఉంది. వెతికి రాయండి.
జవాబు:
జలజల

3. “పువ్వుల కమ్మని నెత్తావులు” అంటే ఏమిటి?
జవాబు:
పువ్వుల కమ్మని పరిమళాలు

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘మెలిక’ అంటే ఏమిటి?

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

6. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2017-18)

అజంతా చిత్రాలలో అధిక భాగం జాతక కథలే. సిద్ధార్థుడిగా జన్మించడానికి పూర్వం గౌతమబుద్దుడు కొన్ని వందల జన్మలు ఎత్తినాడని బౌద్ధవుతస్తుల నమ్మకం. పూర్వ జన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడిగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటున్నాయి. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు. అయితే అజంతా చిత్రాలన్నీ జాతక కథలే కావు. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనివీ ఎన్నో ఉన్నాయి. వెలితిగా కాస్త చోటు కనబడితే చాలు దానిలో ఏ ఆకునో, రెమ్మనో, ఏ పువ్వునో చిత్రించి వేశారు. అదీ. ఇదీ కాకపోతే, ఆ కళా తపస్వులు తమ కుంచెతో అటోక గీతను, ఇటోక గీతను గీయడం ద్వారానే సౌందర్య సృష్టి చేశారు.
ప్రశ్నలు :
1. అజంతా చిత్రాలలో అధిక భాగం వేటిని గురించి తెలియజేశారు?
జవాబు:
జాతక కథలు

2. సిద్ధార్థుని జన్మ విషయంలో బౌద్ధ మతస్తుల నమ్మకం ఏమిటి?
జవాబు:
పూర్వం కొన్ని వందల జన్మలు ఎత్తాడని నమ్మకం.

3. కళాతపస్వులు సౌందర్య సృష్టి ఎలా చేసేవారు?
జవాబు:
వారు తమ కుంచెతో అటొక గీతను ఇటొక గీతను గీయడం ద్వారా సౌందర్య సృష్టి చేశారు.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జాతక కథలలోని విషయం ఏమిటి?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“అజంతా చిత్రాలు” పాఠ్యభాగ రచయితను గూర్చి వివరించండి.
జవాబు:
‘అజంతా చిత్రాలు’ పాఠ్యభాగ రచయిత నార్ల వేంకటేశ్వరరావు. ఈయన 1908 లో కృష్ణాజిల్లాలోని ‘కవుతరం’ అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు (అనువాద రచన), నరకంలో హరిశ్చంద్రుడు (నాటకం), నార్లవారిమాట (పద్య కావ్యం ) మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం, సమాజ
శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి. నార్లవారి రచన, సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో సుందరశైలిలో సాగుతుంది.

ప్రశ్న 2.
వ్యూపాయింట్ గురించి రాయండి.
జవాబు:
వాఘోరా నది పుట్టినచోట కొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలుంటాయి. రెండవ వంపు పైన వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. దాన్ని ‘వ్యూపాయింట్’ అంటారు. కొన్ని శతాబ్దాలపాటు అజంతా గుహల గురించి లోకానికి తెలియదు. మేజర్ గిల్ అనే బ్రిటిష్ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకొంటూ కొండపైకి వెళ్ళాడు. ఎదురుగుండా చెట్ల సందులోనుంచి, ఒక చెక్కడపు పని అతనికి కనిపించింది. అతడు కొండ ఎక్కిచూస్తే అతనికి అజంతా గుహలలో పదహారవ దాని శిరోభాగం కనిపించినట్లు అర్థమయింది. లోకం మరచిపోయిన అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి చూశాడో అదే “వ్యూపాయింట్”. చాలామంది సందర్శకులు వ్యూపాయింట్ కు వెళ్ళి అక్కడి నుండి అజంతా గుహలను చూస్తూ ఉంటారు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
అజంతా గుహల ద్వారా భారతీయ సాంఘిక వ్యవస్థ రూపాన్ని వివరించండి.
జవాబు:
ప్రాచీన కాలంలో భారతీయ సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేదో, అప్పటి వృత్తులు, వ్యాసంగాలు, వినోదాలు ఎలాంటివో తెలుసుకోవాలంటే అజంతా గుహలను చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు రాణ్మందిరాలు ఏ విధంగా ఉండేవి? రాజుల, రాణుల వేషభాష లేవి? రాజసభలను ఏవిధంగా తీర్చేవారు? అప్పటి సైనికబలం ఏ విధంగా ఉండేది? ఆనాటి ఆయుధాలేవి? – ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలిపేవి అజంతా గుహలే. అజంతా గుహలకు వెళితే భారత జాతీయ బలాలను సింహళం మీదకు దండయాత్రకు చేరవేసిన నౌకాదళాన్ని చూడవచ్చు. మహాసాగరాలను దాటి వెళ్ళిన భారతీయ వ్యాపారులను చూడవచ్చు. పర్ష్యన్ రాయబారులతో మాట్లాడే భారతీయ చక్రవర్తులను చూడవచ్చు. గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం మానవ వికాసానికే కాక పశుపక్ష్యాదుల జీవితాన్ని సయితం ఎంత పునీతం చేసిందో, తేజోవంతం చేసిందో చూడవచ్చు. అందుచేత అజంతా గుహలను చూస్తే ఆనాటి భారతీయ సాంఘిక వ్యవస్థ ఎలాంటిదో తెలుస్తుంది.

ప్రశ్న 4.
“యాత్రా రచన” ప్రక్రియను పరిచయం చెయ్యండి. (S.A.I – 2019-20)
జవాబు:
రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచనే యాత్రారచన. దీనిలో ఆ ప్రదేశం ప్రత్యేకత, ప్రకృతి రామణీయకత, చరిత్ర వంటి అంశాలుంటాయి. రచయిత ఆత్మాశ్రయ శైలిలో భావాలను తెలియజేస్తాడు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అజంతా చిత్రాల్లోని బుద్ధుని జాతక కథల విశేషాలను తెల్పండి.
జవాబు:
అజంతా చిత్రాలలో అధికభాగం జాతక కథలే. గౌతమ బుద్ధుడు సిద్ధార్థునిగా జన్మించడానికి ముందు కొన్ని వందల జన్మలు ఎత్తినాడని, బౌద్ధులు నమ్ముతారు. ఆ పూర్వజన్మలలోని బుద్ధుని జీవిత చరిత్రలనే ‘జాతక కథలు’ అని పిలుస్తారు. బుద్ధుడు పూర్వజన్మలలో మానవ జన్మలనే కాకుండా, పక్షిరాజుగా, గజేంద్రునిగా ఎన్నెన్నో జన్మలు ఎత్తినట్లు జాతక కథలు తెలియజేస్తున్నాయి. ఈ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాల్లో చూడగలము.

మానవుల పట్ల బౌద్ధులకు ఎంత నిరసన పూర్వకమైన అభిప్రాయముందో, వారు చిత్రించిన జాతక కథలు తెలుపుతాయి. అటువంటి కథలలో ఇది యొకటి.

జాతక కథ :
అడవిగుండా వెడుతున్న ఒక బాటసారి, ఒక గుంటలో పడిపోతాడు. అతనిపై జాలిపడి, ఒక కోతి అతడిని రక్షిస్తుంది. వాడు ఆ కోతి తనకు చేసిన మేలు మరచిపోయి, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. వెంటనే కోతులన్నీ అతడిని ముట్టడిస్తాయి. అతడు భయపడి, తనని మన్నించుమని, ప్రాధేయపడతాడు. ఇక ముందైనా బుద్ధి కలిగియుండమని కోతులు అతడిని విడిచి పెడతాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 2.
అజంతా గుహల్లో వ్యక్తమయ్యే స్త్రీల సౌందర్యాన్ని వివరించండి.
జవాబు:
అజంతా గుహలలో బౌద్ధభిక్షువులు స్త్రీల సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రించారు. అందుకే జవహర్ లాల్ నెహ్రూ గారు ‘అజంతా’ మన మనస్సును ఏదో కలల లోకానికి తీసుకొని వెడుతుందని చెప్పారు. అజంతా అతి వాస్తవికమైన లోకమని చెప్పారు. బుద్ధుడు శిష్యులకు “స్త్రీలకు దూరంగా ఉండండి. వారిని కన్నెత్తి కూడా చూడవద్దు” అని చెప్పినా, బౌద్ధభిక్షువులు అజంతా గుహల్లో అందాలు ఒలుకుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారని నెహ్రూగారు చెప్పారు.

అక్కడ రాజకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు వంటి స్త్రీలు ఎక్కడ చూసినా ఉన్నారు.

అందులో కొందరు కూర్చున్నవారు, కొందరు నిలబడి ఉన్నవారు, కొందరు ముస్తాబు చేసేవారు, కొందరు ఊరేగింపుగా వెడుతున్నవారు ఉన్నారు. ఈ అజంతా స్త్రీలు ఎంతగానో పేరు పొందారు. సన్యసించిన వారైనా ఈ చిత్రకారులు, ఈ స్త్రీలను ఎంతో సౌందర్యవంతులుగా చిత్రించారు. అజంతా గుహలలో మహారాణులే కాక, సమస్త వర్ణాలకు చెందిన స్త్రీలూ చిత్రింపబడ్డారు. ఆనాటి రాణుల మందిరాలనూ, రాణుల వేషాలను చిత్రించిన ఆ చిత్రకారుల ప్రతిభను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రశ్న 3.
వాఘోరానది పుట్టుక, విశేషాలను తెలపండి.
జవాబు:
అజంతా గుహలకు వెళ్ళే దారిలో అటొక కొండ, ఇటొక కొండ ఉంటాయి. అందులో ఒక కొండమెలికే, వాఘోరానది యొక్క జన్మస్థానం. కొండమీద ఏడుకొలనులు ఉంటాయి. ఒక కొలను నుండి నీరు మరొక కొలనుకు జాలువారుతూ, 250 అడుగుల ఎత్తునుంచి పెద్ద ధారగా, కొండ దిగువకు వాఘోరానది దూకుతుంది. అలా దూకిన తరువాత, కొండ ఎన్ని మలుపులు తిరుగుతుందో, తానూ అన్ని మలుపులు తిరుగుతూ, సమతల ప్రదేశానికి చేరి, కొన్ని వందల మైళ్ళు ప్రవహించి, వాఘోరానది తపతిలో కలిసిపోతుంది.

వాఘోరానది వెంట వెళుతుంటే, రాళ్ళగుట్టల గుండా జలజల ప్రవహిస్తూ ఆ నది పాడే పాటలు వినిపిస్తాయి. పైన నీలాకాశమూ, అలరించే అడవి పువ్వులూ, ఆ పువ్వుల కమ్మని సువాసనలూ మరొక లోకంలో మనల్ని విహరింపచేస్తాయి. ఇటుకొండ, అటుకొండ, ముందుకొండ, వెనుకకొండ, పైన కొండ – ప్రక్కన వారానది – నీలాకాశం – నీలాలనీళ్ళు — పచ్చని చెట్లు – కమ్మని సువాసనలు – అదొక భూలోక స్వర్గం అనిపిస్తుంది.

వాఘోరా నది పుట్టిన చోట, కొండ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలుంటాయి. మరొక వంపులో వలయాకారంలో ఒక కట్టడం ఉంటుంది. దానిని ‘వ్యూ పాయింట్’ అంటారు.

ప్రశ్న 4.
నార్ల వారి అనుభూతిని గురించిన వర్ణనను వివరించండి.
జవాబు:
చూచిన ఒక దృశ్యాన్ని వర్ణించడం సులభం కావచ్చు కాని ఒక అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

ఇరుకుగా ఉండే ఇంటిని వదలి, ఇరుకుగా ఉండే వీధుల వెంట నడిచి, అపారమైన సముద్రపు తీరంలో నిలిచినప్పుడు పొందే అనుభూతిని, పరిమిత జీవితాలలోని పరిమిత సమస్యలతో కంటికి నిద్ర దూరమయినప్పుడు, ఆకాశంలోని అనంతమైన నక్షత్రాలను చూచినప్పుడు, పొందే అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

అదేవిధంగా జీవనోపాధి కోసం పగలంతా పాట్లు పడి, విసిగి వేసారి ఇంటికి చేరినప్పుడు, గడపలోనే కేరింతలు కొడుతూ కాళ్ళకు అడ్డంపడే తన ముద్దు బిడ్డను ఎత్తుకొన్నప్పుడు పొందే అనుభూతిని, పచ్చనిచెట్టును, పచ్చికబయలును చూసే అవకాశం లేని బస్తీలో బ్రతికే మనిషి గాలికి తలలూపుతూ, దిక్కులను అంటుకుంటున్నట్లు కనిపించే వరిచేలను చూచినప్పుడు పొందే అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

హృదయాన్ని ఊపివేసే ఏ అనుభూతిని గాని, జీవితాన్ని కదిలించే ఏ అనుభూతిని గాని వర్ణించడం సులభం కాదు.

ప్రశ్న 5.
అజంతా గుహలలోని చిత్రాల గురించి విదేశీయుల అభిప్రాయాలను తెలపండి.
జవాబు:
అజంతా గుహలను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలటరీ ఆఫీసర్. వ్యూపాయింట్ నుండి చూస్తే చెక్కడపు పని కనిపించడంతో ఆయన కొండపైకి వెళ్ళి అజంతా గుహలను చూసి లోకానికి తెలియజేశాడు.

మేజర్ గిల్ ముప్పయి సంవత్సరాలపాటు కష్టపడి అజంతా చిత్రాలకు కాపీలను తయారుచేసుకొన్నాడు. వాటిలో కొన్ని అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. మిగిలిన వాటికి జాన్ గ్రిఫిల్మ్ కాపీలు తయారుచేయించాడు. కాని అవి కూడా అగ్నిప్రమాదంలో బూడిదయ్యాయి. మేజర్ గిల్ కు జాన్ గ్రిఫికు అజంతా చిత్రాలంటే అమిత మక్కువని దీనిని బట్టి అర్థమవుతుంది.

ఫెర్గుసన్ అనే విదేశీయుడు ఫైజాల్, ఆర్కాన్యాజా ఇటలీలో తలెత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటిరాగల చిత్రాలు యూరప్లో లేవని చెప్పాడు.

గ్రీఫ్ త్న్ అనే మరో విదేశీయుడు 26 అజంతా చిత్రాలకు సాటిరాగల చిత్రాలు యూరప్ లో ఉన్నవి అన్నాడు. ఫోరె టైన్ మరింత రేఖావిన్యాసాన్ని ప్రదర్శించినా, వెనాసియన్ మరింత వర్ల వైశిష్యాన్ని చూపినా మరణం ఆసన్నమైన రాకుమారి భావాలను మరింత ప్రభావవంతంగా వారు చూపడం వారికి సాధ్యపడేది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. కొండను తొలిచి, ఆ గుహలలో మలచిన ఆ ఆలయాలలోని చిత్రాలను చూచి రోడౌన్ సైల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

విన్ సెంట్ స్మిత్ అనే విదేశీయుడు అజంతా గుహలలోని చిత్రాలను గీసినవారు పర్ష్యన్ చిత్రకారులు కావచ్చని అన్నాడు.

ప్రశ్న 6.
అజంతా గుహలలో ఎన్నో బుద్ధుడి చిత్రాలు ఉన్నాయి. అజంతా గుహలకు – జాతక కథలకు ఉన్న సంబంధం ఏమిటో వివరించండి. (S.A. III – 2015-16)
జవాబు:
అజంతా చిత్రాలలో అధికభాగం జాతక కథలే. సిద్ధార్థుడుగా జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని వందల జన్మలెత్తాడని బౌద్ధమతస్థుల నమ్మకం. పూర్వజన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడుగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటాయి. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు.

బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీరమూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను, ఈ జగత్తును చిత్రించడంలో ఈ కుడ్య చిత్రాలను చిత్రించిన బౌద్ధభిక్షువులు చూపించారు. అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే, మిగిలినవి బౌద్ధ విహారాలు. గౌతమబుద్ధుని కారుణ్య సందేశం కేవలం మానవుని వికాసానికే కాక పశు పక్ష్యాదుల జీవితాన్ని సైతం ఎంత పునీతం చేసిందో, తేజోవంతం చేసిందో ఇక్కడ చూడవచ్చు.

బుద్ధుని బోధనలకు ప్రేరేపితులైన ఆయన శిష్యులు బుద్ధుని నిర్యాణానంతరం బౌద్ధమత వ్యాప్తికై బుద్ధుని బోధనలు ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా కొందరు అజంతా గుహలను, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను లక్ష్యంగా బుద్ధుని భావాలను ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దారు. ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయత వారికి ఇంకా కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు. బుద్ధుని పట్ల ఉన్న భక్తి వారిచేత అజంతా గుహలను అంత అందంగా తీర్చిదిద్దేటట్లు చేసింది.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
శిల్పిని గురించి ఆత్మకథ రాయండి. దీన్ని ఏకపాత్రాభినయంగా రాయండి.
జవాబు:
నేను మీకు తెలుసా ! నేను రాళ్ళను బొమ్మలుగా చెక్కే శిల్పిని. నేను రాళ్ళను దేవుడి బొమ్మలుగా చెక్కితే, మీరు వాటిని పసుపు కుంకాలతో పూజిస్తున్నారు. పూర్వం మహారాజులు మాకు ఎంతో డబ్బు ఇచ్చి దేవాలయాల్లో శిల్పాలు చెక్కించేవారు. మీరు మేము చెక్కిన నంది విగ్రహాలూ, నాట్య ప్రతిమలూ లొట్టలు వేసుకుంటూ చూస్తారు. చూసినంత సేపూ ఓహో, ఆహా అని అంటారు. కానీ మీలో ఏ ఒక్కరూ నన్ను పోషించరు. మరి నన్ను ఎవరు చూస్తారు ? దేవుడు బొమ్మలు చెక్కే నాకు, ఇంక దేవుడే దిక్కు. నేను సంగీతం వచ్చే స్తంభాలు చెక్కాను. అందమైన స్త్రీమూర్తులను చెక్కాను. నా శిల్పాన్ని పోషించిన రాజులను మీరు రాజుల సొమ్ము రాళ్ళపాలన్నారు. కాని నా శిల్పాలు శాశ్వతంగా నిలుస్తాయి.

ప్రశ్న 2.
శిల్పం, సంగీతం ………. ఇలాంటి వాటికి సంబంధించిన అదనపు సమాచారం లేదా చిత్రాలు సేకరించండి. వాటిని గురించి రాయండి.
జవాబు:
కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనేవి లలితకళలు :

ఎ) ప్రపంచ ప్రసిద్ధుడైన చిత్రలేఖన కళాకారుల వివరాలు :

1) వడ్డాది పాపయ్య :
ఆంధ్రదేశంలో శ్రీకాకుళంలో 1921లో పుట్టాడు. ఈయన భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడు. ఈయన తొలి గురువు తండ్రి. తరువాత గురువు రవివర్మ. చందమామ, ఆంధ్రపత్రిక వంటి పత్రికల్లో చిత్రాలు గీశారు. ఈయన చిత్రాలలో తెలుగుదనం, తెలుగు సంస్కృతి ఆచారవ్యవహారాలు, పండుగలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు.

2) లియోనార్డో డావిన్సి :
ఈయన ఇటలీ దేశస్థుడు. ఈయన ‘మొనాలిసా’ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రాన్ని ఎవరు చూసినా మంత్ర ముగ్ధులవుతారు. ఇప్పుడు ఈ చిత్రం పారిస్ నగరంలో ‘టాఫ్స్’ అనే వస్తు ప్రదర్శనశాలలో ఉంది.

3) పాబ్లో పికాసో (1881 – 1973) :
పికాసో 20వ శతాబ్దిలోని చిత్ర కళాకారులలో మిక్కిలి ప్రసిద్ధుడు. 1901లో ఈయన చిత్రించిన “తల్లి ప్రేమ (మాతా, శిశువు)” చిత్రం అద్భుత కళాఖండం. తన బుగ్గను శిశువు తలకు ఆనించి, కళ్ళు మూసి తన్మయత్వం చెందుతున్న తల్లి చిత్రం ఇది.

4) రాజా రవివర్మ :
దేవుడు మనిషిని సృష్టించాడు. ఆ మనిషి దేవుణ్ణి చిత్రించి మనుషులకు ఇచ్చాడు. గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళను తన చిత్రకళ ద్వారా ఇళ్ళకు తెచ్చిన ఘనత రాజా రవివర్మకు దక్కుతుంది. రవివర్మ చిత్రించిన దేవుళ్ళ బొమ్మలు ప్రసిద్ధి పొందాయి. ఈయన చిత్రించిన కావ్యస్త్రీలందరిలో దమయంతి గొప్ప అందాల రాశి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
విహారయాత్రను గూర్చి స్నేహితునికి / స్నేహితురాలికి లేఖ.
జవాబు:

లేఖ

నిడదవోలు,
x x x x x x x x

ప్రియమైన స్వప్నకు,

శుభాకాంక్షలతో శశిరేఖ రాయునది.
నేను గడచిన సెలవులలో హైదరాబాదు విహారయాత్ర చేసి వచ్చాను. అక్కడ చూడాల్సిన వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాలార్జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, నెహ్రూ జంతుప్రదర్శనశాల (జూ), చార్మినార్, బిర్లా మందిర్, అసెంబ్లీ హాల్, గోలకొండ మొదలైనవి చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాల సౌందర్యాన్ని అందరూ తప్పక చూడవలసిందే. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యపట్టణమైన హైదరాబాదును నీవు కూడా దర్శించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
శశిరేఖ.

చిరునామా :
కె. స్వప్న,
7వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా.

ప్రశ్న 4.
దర్శనీయ స్థలాలలో “అజంతా గొప్పది” అని నిరూపిస్తూ మీ పాఠం ఆధారంగా రాయండి. (S.A. II – 2018-19)
జవాబు:
దర్శనీయ స్థలాల్లో ‘అజంతా గొప్పది’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయ చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలు ఎన్నో అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థాల వల్ల పాడైపోతున్నాయి.

మనదేశంలో దర్శనీయ స్థలాలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది అజంతా గుహలే. ప్రాచీనకాలంలో భారతీయ సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేదో, అప్పటి వృత్తులు, వ్యాసాంగాలు, వినోదాలు ఎలాంటివో తెలుసుకోవాలంటే అజంతా గుహలను చూస్తే తెలుస్తుంది. ఒకప్పటి రాజుల, రాణుల వేషభాషలు, రాజసభలు, సైనికబలం, ఆయుధాలు ఇవన్నీ అజంతా గుహల ద్వారా తెలుస్తాయి. ఇంకా నౌకాదళాన్ని, సాగరాలు దాటిన భారతీయ వ్యాపారులను, పర్ష్యన్ రాయబారులతో మాట్లాడిన భారతీయ చక్రవర్తులను, గౌతమబుద్ధుని సందేశాలను చూడవచ్చు.

అజంతా గుహల్లో బౌద్ధ భిక్షువులు స్త్రీల సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అందుకే జవహర్‌లాల్ నెహ్రూ ‘అజంతా’ మన మనస్సును ఏదో కలల లోకానికి తీసుకువెళుతుందని, అజంతా అతి వాస్తవికమైన లోకమని చెప్పారు. అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతుంది.

అందుకే అజంతా దర్శనీయ స్థలాలలో గొప్పదని చెప్పవచ్చు.

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు 1 Mark Bits

1. అరకులోయ ప్రకృతి సౌందర్యం అద్భుతం (విగ్రహవాక్యం గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) ప్రకృతి దైన సౌందర్యం
బి) ప్రకృతి కొఱకు సౌందర్యం
సి) ప్రకృతి యొక్క సౌందర్యం
డి) ప్రకృతి చేత సౌందర్యం
జవాబు:
సి) ప్రకృతి యొక్క సౌందర్యం

2. ప్రజలు శాంతిని కోరుతున్నారు (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ప్రజలు శాంతిని కోరడం లేదు
బి) ప్రజలచే శాంతి కోరబడుచున్నది
సి) శాంతిని ప్రజలు కోరుచున్నారు
డి) శాంతి చేత ప్రజలు కోరుతున్నారు.
జవాబు:
బి) ప్రజలచే శాంతి కోరబడుచున్నది

3. అజంతా చిత్రాలు అగ్నిలో బూడిద పాలైనాయి. (పర్యాయపదాలు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) బూడిద, బుగ్గి
బి) వహ్ని, నిప్పు
సి) నీరు, జలము
డి) గృహము, ఇల్లు
జవాబు:
బి) వహ్ని, నిప్పు

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

4. అజంతాలోని గుహలగోడల పై బుద్ధుని కుడ్య చిత్రాలున్నాయి. (సమాసాన్ని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) పంచమీ
బి) షష్టీ
సి) సప్తమీ
డి) ప్రథమ
జవాబు:
బి) షష్టీ

5. ప్రజలు పుస్తకాలు చదివారు. (కర్మణి వాక్యాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) పుస్తకాలు ప్రజలను చదివాయి.
బి) చదవడం వల్ల ప్రజలు బాగుపడ్డారు.
సి) పుస్తకాలచేత ప్రజలు చదవబడ్డారు.
డి) ప్రజలచేత పుస్తకాలు చదవబడ్డాయి.
జవాబు:
డి) ప్రజలచేత పుస్తకాలు చదవబడ్డాయి.

6. సముద్రాన్ని వార్ధి అని కూడా అంటారు. గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) సంద్రం
బి) ఇంద్రం
సి) చంద్రం
డి) బృందం
జవాబు:
ఎ) సంద్రం

7. జాతీయాలకు సరిపోయే అర్థం గ్రహించి సరైన సమాధానం కింద గీత గీయండి. దొంగలు అజంతా గుహలో తలదాచుకున్నారు. (S.A. III – 2015-16)
ఎ) నివసించారు.
బి) వస్తువులు దాచుకున్నారు.
సి) తలను దాచుకున్నారు.
డి) ఆశ్రయం పొందారు.
జవాబు:
ఎ) నివసించారు.

భాషాంశాలు – పదజాలం

అర్ధాలు :

8. మేఘాలు ఆవరించాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆవరించాయి
బి) కప్పివేశాయి
సి) కనిపించాయి
డి) గోచరించాయి
జవాబు:
బి) కప్పివేశాయి

9. కొలనులో తామరలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంబుధి
బి) జలధి
సి) సరస్సు
డి) సాగరం
జవాబు:
సి) సరస్సు

10. విహారయాత్రపై కుతూహలం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆసక్తి
బి) అనాసక్తి
సి) గోచరించు
డి) దర్శించు
జవాబు:
ఎ) ఆసక్తి

11. రామాయణం ఆది కావ్యం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంతిమ
బి) మొదటి
సి) చివరి
డి) మధ్యకు
జవాబు:
బి) మొదటి

12. మన అస్తిత్వం కోల్పోకూడదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉనికి
బి) ఊపిరి
సి) ఊరు
డి) ఉసురు
జవాబు:
ఎ) ఉనికి

13. స్త్రీలు ముస్తాబు అవుతున్నారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తిరస్కారం
బి) ఆస్కారం
సి) పరిష్కారం
డి) అలంకారం
జవాబు:
డి) అలంకారం

14. కుడ్యం పై చిత్రాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) గోడ
బి) ఇల్లు
సి) వాకిలి
డి) వారిధి
జవాబు:
ఎ) గోడ

పర్యాయపదాలు :

15. రాజు రాజ్యం పాలించాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పురోహితుడు, అమాత్యుడు
బి) ప్రభువు, నృపతి
సి) నరపతి, సురపతి
డి) క్షితీశుడు, జాలరి
జవాబు:
బి) ప్రభువు, నృపతి

16. ఆకాశంలో తారలు ఉన్నాయి- గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నభం, నింగి
బి) విరులు, సుమం
సి) దివి, దానవం
డి) వరి, గది
జవాబు:
ఎ) నభం, నింగి

17. సరస్సులో జలం ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సముద్రం, క్షీరం
బి) నీరం, సుధ
సి) అవని, జలధి
డి) వారి, ఉదకం
జవాబు:
డి) వారి, ఉదకం

18. సముద్రం అనంతం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) క్షీరం, నీరం
బి) సాగరం, అంబుధి
సి) జలధి, జాగరణ
డి) అంబుధి, వారి
జవాబు:
బి) సాగరం, అంబుధి

19. పూల తావి మధురం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) అంతరంగం, తాపత్రయం
బి) పరిమళం, సువాసన
సి) పరితపించు, తనివి
డి) ఆకాశం, అవరోధం
జవాబు:
బి) పరిమళం, సువాసన

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

20. కొండ పై నది ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పర్వతం, నగం
బి) శిఖరం, సమున్నది
సి) గాలి, మారుతం
డి) కొడవలి, కోరుడం
జవాబు:
ఎ) పర్వతం, నగం

21. సముద్రాలలోని కెరటం భయానకం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వర్చస్సు, మేధస్సు
బి) తరంగం, అల
సి) మిత్రుడు, గోల
డి) సరస్సు, శిరస్సు
జవాబు:
బి) తరంగం, అల

ప్రకృతి – వికృతులు :

22. సంతోషంగా ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సంతసం
బి) సంబరం
సి) సంబురం
డి) సంబారం
జవాబు:
ఎ) సంతసం

23. ఇంతిని గౌరవించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) మహిళ
బి) స్త్రీ
సి) శ్రీ
డి) వనిత
జవాబు:
బి) స్త్రీ

24. తెలుగు భాష లెస్స – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) బస
బి) బాస
సి) బోస
డి) బైస
జవాబు:
బి) బాస

25. యాత్ర చేశాము – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) యాతర
బి) జేతర
సి) జోతర
డి) జైతర
జవాబు:
ఎ) యాతర

26. పక్షి ఎగిరింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పచి
బి) పచ్చి
సి) పక్కి
డి) విహంగం
జవాబు:
సి) పక్కి

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

27. పూవు వికసించింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) పూజ
బి) పుష్పం
సి) కుసుమం
డి) జలం
జవాబు:
బి) పుష్పం

28. గోడ చిత్రాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) గహ్వర
బి) గవాక్షం
సి) కుడ్యం
డి) శిఖరం
జవాబు:
సి) కుడ్యం

29. మానవులు కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) కీరితి
బి) కిరితి
సి) కరితి
డి) కృతి
జవాబు:
ఎ) కీరితి

30. చిత్రం బాగుంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) చెత్తరువు
బి) చిత్తరువు
సి) చిక్కరువు
డి) చిత్తవు
జవాబు:
బి) చిత్తరువు

31. ప్రజ్ఞ ఇంటికి వెళ్ళింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పగై
బి) పజ
సి) గజ
డి) జయీ
జవాబు:
ఎ) పగై

32. వేసము వేశాము – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ధరష
బి) వేషము
సి) వషము
డి) ధృతము
జవాబు:
బి) వేషము

33. దిస్ట్రి తగిలింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) దిష్టి
బి) దృతి
సి) ధృతి
డి) దోష్టి
జవాబు:
ఎ) దిష్టి

నానార్థాలు :

34. దేవుడే దిక్కు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) దెస, దైవం, దాపరికం
బి) శరణు, రక్ష, అంబోధి
సి) శరణు, శతం, శాంకరి
డి) దిస, రక్షణ, పక్షం
జవాబు:
డి) దిస, రక్షణ, పక్షం

35. ఉత్తరం రాశాను – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఉత్తరం, వేరుణ
బి) లేఖ, సమాధానం
సి) కాలం, విచారం
డి) ప్రశ్న, జవాబు
జవాబు:
బి) లేఖ, సమాధానం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

36. వర్షం కురిసింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వాస, సంవత్సరం
బి) మాసం, సంవత్సరం
సి) వాన, వాగ్యుద్ధం
డి) సమరం, వాన
జవాబు:
ఎ) వాస, సంవత్సరం

37. తపస్వి వెళ్ళాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ముని, నారదుడు
బి) చంద్రుడు, చంచలం
సి) చారిత్రం, చరితం
డి) పులుగు, పయోధి
జవాబు:
బి) చంద్రుడు, చంచలం

వ్యుత్పత్త్యర్థాలు :

38. ‘పక్షి’ – దీనికి వ్యత్పత్తి ఏది?
ఎ) పక్షములు కలది
బి) పక్కములు లేనిది
సి) పయస్సు కలది
డి) పరువం కలది
జవాబు:
ఎ) పక్షములు కలది

39. సంతోషింపచేయువాడు – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) సర్వం సహా
బి) చంద్రుడు
సి) శుక్రుడు
డి) ధరణి
జవాబు:
బి) చంద్రుడు

40. మహిని పాలించువాడు – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) మహీపాలుడు
బి) మహాత్ముడు
సి) మహనీయుడు
డి) మహీధరము
జవాబు:
ఎ) మహీపాలుడు

41. సగరపుత్రులచే తవ్వబడినది – ఈ వ్యుత్పత్తి గల పదం గుర్తించండి.
ఎ) సారధి
బి) సాధికారత
సి) జలధి
డి) సాగరం
జవాబు:
డి) సాగరం

వ్యాకరణాంశాలు

సంధులు :

42. నీలాకాశం మనోహరం – ఇది ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) త్రికసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

43. క్రింది వానిలో యడాగమ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) లేకుండెను
బి) తలయెత్తు
సి) అమ్మమ్మ
డి) ఊరెల్ల
జవాబు:
బి) తలయెత్తు

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

44. పక్ష్యాదులు ఉన్నాయి – గీత గీసిన పదానికి విడదీయడం గుర్తించండి.
ఎ) పక్షి + అదులు
బి) పక్షే + యాదులు
సి) పక్షి + ఆదులు
డి) పక్ష్మ + ఆదులు
జవాబు:
సి) పక్షి + ఆదులు

45. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) గసడదవాదేశ సంధి
డి) ఇత్వసంధి
జవాబు:
డి) ఇత్వసంధి

46. చెట్టుగాని – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) త్రికసంధి
సి) గసడదవాదేశ సంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) గసడదవాదేశ సంధి

47. క్రింది వానిలో పుంప్వాదేశ సంధికి ఉదాహరణ ఏది?
ఎ) చెక్కడపు పని
బి) చెక్కపని
సి) చిలుకజోస్యం
డి) మహోన్నతం
జవాబు:
ఎ) చెక్కడపు పని

48. సర్వోత్తమంగా ఉంది – దీనిని విడదీస్తే
ఎ) సర్వ + ఉత్తమం
బి) సర్వో + త్తమం
సి) సర్వ + ఆత్తమ
డి) సర్వే + ఉత్తమ
జవాబు:
ఎ) సర్వ + ఉత్తమం

సమాసాలు :

49. ప్రకృతి సౌందర్యం పరవసింపజేసింది – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం ఏది?
ఎ) ప్రకృతి యొక్క సౌందర్యం
బి) ప్రకృతితో సౌందర్యం
సి) ప్రకృతి కొరకు సౌందర్యం
డి) ప్రకృతియైన సౌందర్యం
జవాబు:
ఎ) ప్రకృతి యొక్క సౌందర్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

50. నది యొక్క ప్రవాహం – దీనికి సమాసపదం గుర్తించండి.
ఎ) జలనది
బి) నదీప్రవాహం
సి) నద్వజలం
డి) అమజలం
జవాబు:
బి) నదీప్రవాహం

51. భక్తి శ్రద్ధలు ఉండాలి – ఇది ఏ సమాసం?
ఎ) ద్విగు సమాసం
బి) కర్మధారయ సమాసం
సి) ద్వంద్వ సమాసం
డి) తత్పురుష సమాసం
జవాబు:
సి) ద్వంద్వ సమాసం

52. సప్తమీ తత్పురుషమునకు ఉదాహరణ గుర్తించండి.
ఎ) కుడ్య చిత్రాలు
బి) ప్రకృతి సౌందర్యం
సి) నలుదిక్కులు
డి) తల్లిదండ్రులు
జవాబు:
ఎ) కుడ్య చిత్రాలు

53. షష్ఠీ తత్పురుషమునకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) దశకంఠుడు
డి) ముజ్జగములు
జవాబు:
ఎ) కర్మణి వాక్యం

54. అగ్ని ప్రమాదం జరిగింది – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) అగ్ని వలన ప్రమాదం
బి) అగ్నికి ప్రమాదం
సి) అగ్ని యందు ప్రమాదం
డి) అగ్ని కొరకు ప్రమాదం
జవాబు:
ఎ) అగ్ని వలన ప్రమాదం

55. సంఖ్యా శబ్దం – పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి.
ఎ) పంచమీ తత్పురుష
బి) ద్విగు సమాసం
సి) రూపకం
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
బి) ద్విగు సమాసం

56. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం గుర్తించండి.
ఎ) తత్పురుష సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహుప్రీహి సమాసం
డి) అవ్యయీభావ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

57. పచ్చిక బయలు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) పచ్చిక యందు బయలు
బి) పచ్చిక వలన బయలు
సి) పచ్చిక కొరకు బయలు
డి) పచ్చికతో బయలు
జవాబు:
డి) పచ్చికతో బయలు

గణ విభజన:

58. అజంత – ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
ఎ) జ గణం

59. చిత్తము – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UIU
బి) UII
సి) IUI
డి) III
జవాబు:
బి) UII

60. వ్యవధి – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UII
బి) IUI
సి) UUU
డి) II
జవాబు:
డి) II

61. IIUI – ఇది ఏ గణము?
ఎ) భగ
బి) సల
సి) నల
డి) గగ
జవాబు:
బి) సల

వాక్యాలు :

62. ప్రజల చేత శాంతి కోరబడింది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నీవార చరిత్ర
బి) పినాకపాణి
సి) అత్మార్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) నీవార చరిత్ర

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

63. వానలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) ధాత్వర్థక వాక్యం
సి) క్వార్థక వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
డి) చేదర్థక వాక్యం

64. పాలు తెల్లగా ఉండును – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) చేదర్థక వాక్యం
సి) శత్రర్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) తద్ధర్మార్థక వాక్యం

65. స్వాతంత్ర్యం పొందాలి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) అప్యర్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) విధ్యర్థక వాక్యం

66. మీరు పాఠం విన్నారు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) మీరు పాఠం శ్రద్ధగా వినలేదు గదా !
బి) మీరు పాఠం వినలేదు.
సి) మీరు పాఠం వినకపోవచ్చు.
డి) మీరు విని తీరాలి.
జవాబు:
బి) మీరు పాఠం వినలేదు.

అలంకారాలు :

67. అర్థ భేదం లేకపోయినా తాత్పర్య భేదం కలిగిన అలంకారం ఏది?
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) వృత్త్యనుప్రాస
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
ఎ) లాటానుప్రాస

68. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) ఉపమ
బి) వృత్త్యనుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

69. మానవా ! నీ ప్రయత్నం మానవా! – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) యమకం
బి) ముక్తపదగ్రస్తం
సి) అంత్యానుప్రాస
డి) పరికరం
జవాబు:
ఎ) యమకం

70. ‘ఉత్ప్రేక్ష’ అనగా
ఎ) ఊహ
బి) బింబప్రతిబింబ భావం
సి) అనన్వయం
డి) సమన్వయం
జవాబు:
ఎ) ఊహ

71. ఈ రాజు సాక్షాత్తు పరమేశ్వరుడే – ఇది ఏ అలంకారం?
ఎ) అతిశయోక్తి
బి) రూపకం
సి) అంత్యానుప్రాస
డి) లాటానుప్రాస
జవాబు:
బి) రూపకం

సొంతవాక్యాలు :

72. కుతూహలం : హిమాలయ సందర్శన కోసం మనస్సు కుతూహల పడుతున్నది.

73. శాశ్వత కీర్తి : సత్కార్యాలు చేసి శాశ్వత కీర్తిని పొందవచ్చు.

74. చెక్కుచెదరకుండ : అమరావతిలో శిల్ప సంపద చెక్కుచెదరకుండా ఉంది.

75. ప్రకృతి సౌందర్యం : హిమాలయాల్లోని ప్రకృతి సౌందర్యం పులకరింప జేస్తుంది.

76. భూతల స్వర్గం : కాశ్మీర్ భూతల స్వర్గంలా మనకు దర్శనం ఇస్తుంది.

77. ఆవరించు : నీలి మేఘాలు ఆకాశాన్ని ఆవరించి ఉన్నాయి.

78. పరిసరాలు : మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

79. తేజోవంతం : సూర్యబింబం తేజోవంతంగా వెలుగొందుతున్నది.

80. సభ్యలోకం : విద్వాంసులను సభ్యలోకం ఘనంగా సత్కరిస్తుంది.

81. పునీతం : పుణ్యక్షేత్ర దర్శనంతో పునీతం అవుతాము.