AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

SCERT AP 6th Class Social Study Material Pdf 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం

6th Class Social 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
అడవుల నుండి లభించే ఉత్పత్తులను పేర్కొనుము.
జవాబు:
అడవుల నుండి మనకు వివిధ రకాలైన ఉత్పత్తులు లభిస్తున్నాయి. అవి :

  • వివిధ రకాల పళ్ళు ఉదా : సీతాఫలం, జామ, పనస, వెలగ మొ||నవి.
  • వివిధ రకాల దుంపలు. ఉదా : చిలకడదుంప, వెదురు, దుంప మొ||నవి.
  • వివిధ రకాల గింజలు, కాయలు. ఉదా : కుంకుళ్ళు, షీకాయ, బాదాము మొ||నవి.
  • తేనె, టేకు, సాల్, వెదురు మొ|| కలప, చింతపండు.
  • విస్తరాకులు, ఆయుర్వేద ఔషధ వనమూలికలు.
  • వంటచెరకు మొదలైనవి.

ప్రశ్న 2.
సంచార జీవనం అనగా నేమి?
జవాబు:
ఆది మానవులు చిన్న చిన్న సమూహాలు లేదా గుంపులుగా ఉండేవారు. వారు గుహలలో, చెట్ల నీడలలో లేదా రాతి స్థావరాలలో నివసించేవారు. ఆహారం కోసం వారు తరచుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. ఇటువంటి వారిని ‘సంచార జీవులు’ అని అంటారు. వీరు సాగించిన జీవనాన్ని సంచార జీవనం అంటారు.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 3.
నేడు మనం నిప్పును దేనికి ఉపయోగిస్తున్నాం?
జవాబు:
నేడు మనము నిప్పును క్రింది విధంగా ఉపయోగిస్తున్నాము.

  • ఆహారాన్ని వండుకుని తినుటకు
  • వెచ్చదనం పొందటానికి, నీటిని వేడి చేయటానికి.
  • మతానికి సంబంధించిన క్రతువులలో, కర్మకాండలలో
  • కొన్ని రకాల పంటల ప్రాసెసింగ్ లో (ఉదా : పొగాకును కాల్చుట)
  • వివిధ రకాల పరిశ్రమలలో (ఉదా : ఇనుము – ఉక్కు పరిశ్రమలో, సిమెంట్ పరిశ్రమలలో)
  • వెల్డింగ్ పనుల్లో
  • బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయుటకు
  • బంగారం, వెండి మొదలైన లోహాలను కరిగించడానికి, నాణెలు, బొమ్మలుగా చేయుట కొరకు.
  • చల్లని రాత్రులలో వెచ్చదనం కోసం.

ప్రశ్న 4.
నేటి మానవులు, ఆది మానవులు తిన్న ఆహార పదార్థాల జాబితాను తయారు చేసి, దానిలో మీరు గమనించిన పోలికలను, భేదాలను రాయండి.
జవాబు:
నేటి మానవులు మరియు ఆదిమానవుల ఆహార అలవాట్లలోని భేదాలు :

  • ఆదిమానవులు ఆహారాన్ని వండుకుని తినలేదు నేటి మానవులు శుభ్రం చేసుకుని, వండుకుని తింటున్నారు.
  • ఆదిమానవులు పచ్చిమాంసాన్ని భుజించగా నేటి మానవులు వండుకుని వివిధ రుచులలో భుజిస్తున్నారు.
  • ఆదిమానవులు ఆహారాన్ని సేకరించేవారు. నేటి మానవులు, ఆహారాన్ని ఉత్పత్తి (పండిస్తున్నారు) చేస్తున్నారు.
  • ఆదిమానవులు వేటాడి జంతు మాంసాన్ని పొందుతున్నారు. నేటి మానవులు జంతువులను మచ్చిక చేసుకుని పాలు, మాంసం పొందుతున్నారు.
  • ఆదిమానవులు ఆహారాన్ని నిల్వ ఉంచలేదు. నేటి మానవులు ఆహారాన్ని నిల్వ ఉంచుతున్నారు, అనేకరకాలైన ధాన్యాలు పండిస్తున్నారు.
  • ఆదిమానవులు ఆహారాన్ని భుజించడానికి ఎటువంటి పాత్రలు, పరికరాలు వాడలేదు. నేటిమానవులు అనేక రకాల వంట పాత్రలు వాడుతున్నారు మరియు చపాతి, అన్నం, పప్పు, కూరలు మొ||నవి ఆహారంలో భాగంగా ఉన్నాయి.

పోలికలు:

  • ఆదిమానవులు, నవీన (నేటి) మానవులు శక్తి కోసం ఆహారాన్ని భుజించేవారు. అంటే ఆకలి తీర్చుకోవడం కోసం.
  • ఆదిమ మానవుల్లో మాంసాహారులు కలరు అలాగే నవీన మానవుల్లో కూడా మాంసాహారులు కలరు.
  • ఆదిమానవులు ఫలాలు, దుంపలు, వేర్లు మొ||నవి ఆహారంగా తీసుకునేవారు. నేటి మానవులు కూడా ఆహారంలో, అవి స్వీకరిస్తున్నారు.

ప్రశ్న 5.
“జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం ద్వారా ఆది మానవుల జీవనం సుఖమయ అయింది” దీనితో నీవు ఏకీభవిస్తావా? మీ జవాబును సమర్థించండి.
జవాబు:

  • జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం ద్వారా ఆది మానవుల జీవనం సుఖమయం అయిందనుటలో సందేహం లేదు, నేను దీనితో ఏకీభవిస్తున్నాను.
  • జంతువులను మచ్చిక చేసుకొనడం వల్ల వారికి పాలు,మాంసం, జంతుచర్మం మొ||నవి లభించేవి.
  • మొక్కలు పెంచడం వల్ల వారికి కావలసిన ఆహార ధాన్యాలు (గింజలు) కూరగాయలు మరియు జంతువులకు అవసరమైన గడ్డి లభించేవి, గృహ (ఇళ్ళు) నిర్మాణానికి అవసరమైన కలప, ఆకులు మొ||నవి లభించేవి.
  • ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి, సరుకులు మోయటానికి ఉపయోగించుకుని తమ కష్టాన్ని తగ్గించుకున్నారు. ఈ విధంగా వారి జీవనం సుఖమయం అయింది.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 6.
వంటకు రుబ్బురోలు లేనట్లయితే మనం తినే ఆహారపు అలవాట్లపై ఎటువంటి ప్రభావం కలుగుతుంది?
జవాబు:

  • వంటకు రుబ్బురోలు లేనట్లయితే కాయలను పచ్చడి చేయలేము. ముక్కలు గానే తినవలసి వస్తుంది. అలాగే ఇడ్లీ, అట్టు, గారె లాంటి పిండ్లు వేయటానికి కుదరదు.
  • కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటం కష్టం కావచ్చు. కొన్ని రకాల ధాన్యాలను గింజలుగానే తినవలసి వస్తుంది.
  • ఇలా రోలు వాడకం లేనట్లయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేసుకొనుట కూడా కష్టం కావచ్చు.

ప్రశ్న 7.
పండ్లు కోయటానికి మీరు ఎటువంటి పనిముట్లను ఉపయోగిస్తున్నారు? అవి వేటితో తయారు చేస్తారు?
జవాబు:

  • మేము పండ్లు కోయటానికి కత్తి (knife), కోత కత్తి (cutter), చాకు, చెంచా, ముళ్ళ చెంచా (fork), కొడవలి మొదలైన పనిముట్లను ఉపయోగిస్తున్నాము.
  • ఇవి అన్నీ దాదాపు స్టెయిన్లెస్ స్టీల్, ఇనుముతో తయారు చేయబడినవే.

ప్రశ్న 8.
ఆది మానవులు ధాన్యాన్ని వేటిలో నిల్వ చేసేవారు?
జవాబు:
ఆది మానవులు ఆహార నిల్వ కొరకు మట్టి పాత్రలు, గంపలు / బుట్టలు లేదా నేల మాళిగలను ఉపయోగించేవారు.

ప్రశ్న 9.
నవీన శిలాయుగ వ్యవసాయదారుల, పశుపోషకులకు, ప్రస్తుత ఆధునిక యుగ వ్యవసాయదారుల, పశు పోషకులకు మధ్య తేడాలను రాయండి.
జవాబు:

నవీన శిలాయుగ వ్యవసాయదారు/ పశుపోషకులుఆధునిక వ్యవసాయదారు/ పశుపోషకులు
1. వీరు వ్యవసాయానికి సరైన పనిముట్లను వినియోగించలేదు. (రాతినాగలి)1. వీరు వ్యవసాయానికి సరైన పనిముట్లు వినియోగిస్తున్నారు. (ఇనుపనాగలి)
2. వీరు పొలం దున్నటానికి జంతువులపై ఆధారపడినారు. (ఉదా : ఎద్దు)2. వీరు ఆధునిక వాహనాలపై పొలం దున్నుతున్నారు. (ఉదా : ట్రాక్టర్)
3. వీరికి సస్యరక్షణ చర్యలు అంతగా తెలియవు.3. వీరు-సస్యరక్షణకు పురుగుమందులు వాడుతున్నారు.
4. వీరు నీరు అందుబాటులో ఉన్నచోటనే పంటలు పండించారు.4. నీరు అందుబాటులో లేకపోయినా కాల్వల ద్వారా, బావుల ద్వారా పంటలు పండిస్తున్నారు.
5. జంతువులను పాలు, మాంసం, చర్మాల కోసం పోషించారు.5. జంతువులను వినోదం కోసం, పందేలకోసం కూడా పోషిస్తున్నారు.
6. వీరి వ్యవసాయ లేదా పశువుల ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోలేక పోయారు.6. వ్యవసాయ, జంతు సంబంధ ఉత్పత్తులను చాలాకాలం నిల్వ ఉంచుతున్నారు. (ఉదా : కోల్డ్ స్టోరేజి)

ప్రశ్న 10.
నవీన శిలాయుగ వ్యవసాయ పశుపోషకులకు, జీవన విధానం, నాగరికతల ఆవిర్భావానికి ఎలా దారి తీసింది?
జవాబు:

  • నవీన రాతి యుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేసారు. తమ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమయిన పనిముట్లను తయారు చేసుకొన్నారు.
  • కాంస్యయుగ ప్రారంభ కాలం నాటికి ఈ వ్యవసాయ, పశు పోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు.
  • సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి చెందాయి. ప్రపంచ వ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోమియా, ఈజిప్ట్, సింధూలోయ (భారతదేశం) మరియు చైనాలలో వర్ధిల్లాయి.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 11.
కింద ఇచ్చిన రాతి చిత్ర కళా స్థావరాలను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి.
A. చింతకుంట
B. ఆదోని
C. కావలి
D. నాయుడు పల్లి
E. వేల్పు మడుగు
F. శ్రీకాళహస్తి
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం 1

6th Class Social Studies 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం InText Questions and Answers

6th Class Social Textbook Page No.54

ప్రశ్న 1.
AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం 2
పై చిత్రాలను పరిశీలించి ఆది మానవులు చేస్తున్న పనుల జాబితాను తయారు చేయండి.
జవాబు:

  • జింకను వేటాడి, పట్టుకుని తీసుకు వచ్చుచున్నారు.
  • స్త్రీలు, పిల్లలు (దుంపలను, కాయలను) ఆహారాన్ని సేకరిస్తున్నారు.
  • జంతు చర్మాన్ని శుభ్రం చేయుచున్నారు.
  • రాతిపనిముట్లను తయారు చేస్తున్నారు.
  • నిప్పుపై మాంసాన్ని కాల్చుచున్నారు.

6th Class Social Textbook Page No.55

ప్రశ్న 2.
మీరు తినే ఆహారంలో అడవుల నుండి, ప్రకృతి సిద్ధంగా లభించే వాటి జాబితాను తయారు చేయండి.
జవాబు:
మేము తినే ఆహారంలో అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించేవి :

  • తేనె, చింతపండు, ఔషధ మూలికలు (క్వినైన్, కర్పూరం మొ||నవి)
  • దాల్చిన చెక్క లవంగాలు, మిరియాలు, యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలు.
  • వివిధ రకాల ఫలాలు (సీతాఫలము, రేగుజాతి పండ్లు మొ||నవి)
  • చూయింగ్ గమ్ తయారీలో వాడే చికిల్ మొ||నవి.

ప్రశ్న 3.
ఆది మానవులు నిప్పును ఎలా కనిపెట్టి ఉంటారో మీ ఉపాధ్యాయుల సహాయంతో చర్చించి రాయండి.
జవాబు:

  • సహజసిద్ధంగా ఏర్పడిన మెరుపు అడవిలోని చెట్లను తాకినపుడు ఏర్పడిన మంట ఆది మానవులను ఆశ్చర్యానికి గురిచేసింది.
  • గాలి బలంగా వీచినపుడు రెండు చెట్ల రాపిడి వలన ఏర్పడిన నిప్పు (మంట) ఆది మానవుడిలో ఆలోచనలను కలగజేసింది.
  • కాలక్రమేణ ఆది మానవుడు కర్ర మరియు చెకుముకిలను ఉపయోగించి మొదటగా నిప్పును ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకున్నారని పరిణామవాదులు సిద్ధాంతీకరించారు.

6th Class Social Textbook Page No.57

ప్రశ్న 4.
వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? మీ ఉపాధ్యాయులు, స్నేహితులతో చర్చించి సమాధానం వ్రాయండి.
జవాబు:
వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను క్రింది విధంగా ప్రభావితం చేస్తున్నాయి

  • వాతావరణంలో మార్పులు మానవ జీవితంలో అభివృద్ధి సూచికగా చెప్పవచ్చును. వాతావరణంలో మార్పులు వలన మొక్కలు, చెట్లు, గడ్డి భూములు పెరిగి తద్వారా వ్యవసాయం, పచ్చదనం విస్తరించింది.
  • గడ్డితినే జంతువులయిన ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకలు మొదలైన వాటి సంఖ్య క్రమంగా పెరిగింది, జంతువులను మచ్చిక చేసుకోవటం, పశుపోషణ పెరిగింది.
  • వ్యవసాయంలో (పంటల దిగుబడిలో) గుర్తించదగిన అభివృద్ధి సాధించటం జరిగింది.
  • అయితే వాతావరణంలో నేడు అనేక కాలుష్య పదార్థాలు చేరి, వాతావరణ సమతౌల్యతను దెబ్బతీస్తూ, అతివృష్టి, – అనావృష్టి మొదలైన ప్రకృతి భీభత్సాలకు ఏర్పడుతున్నాయి.

6th Class Social Textbook Page No.58

ప్రశ్న 5.
ఆది మానవులు పశుపోషకులుగా ఎలా మారారు?
జవాబు:

  • మానవులు నివసిస్తున్న ప్రాంతాలకు ఆహారం కొరకు జంతువులు రావడం ప్రారంభించాయి.
    వారు తమ నివాసాల దగ్గరకు వచ్చే జంతువులకు ఆహారాన్ని అందించి వాటిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు.
  • ఎంపిక చేసుకొన్న జంతువులతోనే పశోత్పత్తి గావించేవారు.
  • ఇలా మచ్చిక చేసిన జంతువులలో గొర్రెలు, మేకలు, ఎద్దులు లాంటి గడ్డి తినే జంతువులు, గుంపులుగా నివసించే పందులు ముఖ్యమైనవి.
  • ఆది మానవులు మచ్చిక చేసుకోవడానికి జంతువులు కూర మృగాల నుండి కాపాడేవారు.
  • ఈ విధంగా మానవులు వ్యవసాయ, పశుపోషకులుగా మార్పు చెందారు.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 6.
‘పశుపోషణ’ ఆది మానవుల స్థిర జీవనానికి నాంది పలికిందని నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:

  • మచ్చిక జంతువులను జాగ్రత్తగా కాపాడుకొంటే అవి అనతికాలంలోనే తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి.
  • ఇవి మాంసం, పాలు, పాల పదార్థాలు అందిస్తాయి.
  • ఈ ‘కారణాల వల్ల ఆది మానవులు చాలాకాలం పాటు ఒకే ప్రదేశంలో నివాసం (స్థిర జీవనం) ఉండటం ప్రారంభించారు.

6th Class Social Textbook Page No.59

ప్రశ్న 7.
ఆధునిక రైతుల జీవన విధానాన్ని, నాటి వ్యవసాయ, పశుపోషకుల జీవన విధానాలతో పోల్చండి.
జవాబు:

  • ఆధునిక రైతులు ఆధునిక పరికరాలను ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తున్నారు. కాని నాటి వ్యవసాయ, పశుపోషకులు కరుకురాతి పరికరాలను ఉపయోగించారు.
  • నేటి రైతులు వివిధ రకాల పంటలను పండిస్తూ, పెద్ద పెద్ద భవనాలలో (రాతి కట్టడాలు) ఉంటూ, జంతువులను , మంచి షెడులలో పెంచుతూ వాణిజ్య తరహా పాడి, పంటలను పండిస్తున్నారు. కాని నాడు పరిమిత పంటలను పండిస్తూ తాటాకు (పూరి) గుడిసెల్లో నివసిస్తూ సాధారణ జీవనం గడిపేవారు.
  • ఈనాటి ఆధునిక రైతులు మంచి ఎరువులను పురుగు మందులను ఉపయోగిస్తూ వాణిజ్య / నగదు పంటలను లాభాలకై పండిస్తున్నారు. నాటి వ్యవసాయ పశుపోషకులు ఆహారం కొరకు జీవనాధారా వ్యవసాయం చేసినారు.
  • ఆధునిక రైతు అన్ని విధాల (నీటి సౌకర్యం, యాంత్రీకరణ, మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగి సౌకర్యం మొ||నవి) అభివృద్ధి చెంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. నాడు ఈ సౌకర్యలేవి లేవు, ఆహారం కొరకు మాత్రమే పంటలు పండించేవారు

ప్రశ్న 8.
ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోకపోతే ఏమవుతుంది?
జవాబు:
ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోకపోతే :

  • భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుంది.
  • తర్వాత పంటకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉండవు.
  • కరవు, కాటకాలు లాంటివి ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల నిల్వలు లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది.
  • ఆహార కొరత సమయంలో వ్యాపారులు (నల్ల బజారు) బ్లాక్ మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది.
  • ఆహార కొరత సమయంలో ఆకలి చావులు ఏర్పడే ప్రమాదం ఉంది.

6th Class Social Textbook Page No.60

ప్రశ్న 9.
జంతువుల నుండి ఆహారం కాకుండా, మనం పొందే ఇతర వస్తువులు ఏవి?
జవాబు:
జంతువుల నుండి ఆహారం కాకుండా, మనం పొందే ఇతర వస్తువులు:

  • జంతుచర్మాలు, జంతు కొమ్ములు, దంతాలు, గోళ్ళు.
  • జంతు క్రొవ్వు, జంతు శ్రమ (ఎద్దు, గాడిదలను బరువు మోయటానికి ఉపయోగిస్తాం.)
  • జంతువుల వెంట్రుకలు (బొచ్చు)

ప్రశ్న 10.
మీ ప్రాంతంలో పెంచుకొనే జంతువులు, పక్షుల జాబితాను తయారు చేయండి.
జవాబు:

జంతువులుపక్షులు
గొర్రె, మేక, గేదెలు, దున్న, ఆవు గాడిద, కుక్క పందులు, పిల్లులు ఒంటెలు, గుర్రాలు మొ||నవి.కోళ్ళు, బాతులు, పావురాలు, చిలుకలు నెమలి, పాలపిట్ట, హంస, ఆస్ట్రిచ్ మొ||నవి.

ప్రశ్న 11.
AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం 3
పురాతన కుండ దీనిలో ఏమి నిల్వ ఉంచుకొనేవారని మీరు భావిస్తున్నారు.
జవాబు:
ఈ పురాతన కుండలో ధాన్యం నిల్వ ఉంచుకొనేవారని భావిస్తున్నాను. అలాగే వంటకు కూడా ఉపయోగించి ఉండవచ్చు.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

6th Class Social Textbook Page No.61

ప్రశ్న 12.
వంట చేయడానికి, ధాన్యం నిల్వ చేయడానికి ఆధునిక కాలంలో వాడుతున్న పరికరాలను పేర్కొనండి.
జవాబు:

వంట చేయడానికిధాన్యం నిల్వ చేయడానికి
• గ్యాస్టవ్, ఇండక్షన్ స్టవ్• గాలి, వేడి, తేమ ధాన్యంకు హాని కల్గించే అంశాలు వీటి నుండి రక్షణకై గ్లాసు, ప్లాస్టిక్, స్టీల్ అల్యూమినియం కంటైనర్స్ వాడతారు.
• ఎలక్ట్రిక్ కుక్కర్, ప్రెజర్ కుక్కర్
• ప్యాన్, స్టీల్ పాత్రలు
• ఓవెన్, టోస్టర్• రిఫ్రిజిరేటర్
• గ్రిల్ (ఎలక్ట్రిక్)• జాడీలు
• స్టీల్ డబ్బాలు
• కోల్డ్ స్టోరేజీలు (శీతల గిడ్డంగులు)

AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

SCERT AP 6th Class Social Study Material Pdf 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

6th Class Social 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భూ స్వరూపం అనగా నేమి?
జవాబు:
మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు. కొన్నిచోట్ల ఉన్నతి చెందిన ప్రాంతాలు, విశాల మైదానాలు నుండి లోయల వరకు ఈ అంతరాలు ఉండవచ్చును. మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు మైదానం పీఠభూమి, కొండ, పర్వతం, లోయ వంటి వివిధ రూపాలను గమనిస్తాం. వీటినే భూస్వరూపాలని పిలుస్తారు.

ప్రశ్న 2.
భూ స్వరూపాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చును?
జవాబు:
భూస్వరూపాలు ముఖ్యంగా మూడు రకాలుగా చెప్పవచ్చును. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఈ ప్రధాన భూస్వరూపాలు అనేక చిన్న భూస్వరూపాలను కలిగి ఉంటాయి. ఈ భూస్వరూపాల ఎత్తు సముద్రమట్టం ఆధారంగా కొలుస్తారు.

ప్రశ్న 3.
డెల్టా ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
నది సముద్రంలో కలిసే ముందు చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్యభాగంలో ఇసుక, మెత్తటి మట్టి (ఒండ్రు) మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. సాధారణంగా ఇవి ‘A’ త్రిభుజాకారం (డెల్టా)లో ఉంటాయి. ఇవి చాలా సారవంతంగా ఉంటాయి.

ప్రశ్న 4.
మైదాన ప్రాంతాలలో ఎందువలన జనసాంద్రత అధికంగా ఉంటుంది?
జవాబు:
మైదాన ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉండటానికి గల కారణాలు :

  • మైదాన ప్రాంతాల్లోని నేలలు సారవంతంగా ఉండి మంచి పంటల దిగుబడినిస్తాయి.
  • భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అనేక రకాల పంటలు పండించడానికి అనుకూలమైన నేలలున్నాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన నగరాలకు ఆలవాలంగా ఉన్నాయి.
  • ఇక్కడ మెరుగైన రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి, చెందుతున్నాయి.
  • వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన “సాగు నీరు, త్రాగునీరు” వసతులు కల్గి ఉండి ఇండ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండి జననివాస యోగ్యంగా ఉన్నాయి.
  • మైదాన ప్రాంతాలు ప్రాచీన కాలం నుండి మానవ ఆవాసాలకు నిలయం.
    ఉదా : సింధూ నాగరికత.

AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

ప్రశ్న 5.
విభిన్న భూస్వరూపాలలోని వివిధ రకాల నేలలను పోలండి.
జవాబు:

మైదానాల నేలలుపీఠభూముల నేలలుపర్వత (కొండ) ప్రాంత నేలలు
ఇవి సారవంతమైన ఒండ్రు, నల్లరేగడి నేలలు.ఇవి తక్కువ సారవంతమైన నేలలు. ఎర్ర, లాటరైట్, నల్లరేగడి నేలలు.రాతి పొరలతో కూడిన ఎర్ర నేలలు.
ఇవి తేమను ఎక్కువ నిలువ చేసుకుంటాయి.ఇవి తేమను తక్కువ నిలువ చేసుకుంటాయి.ఇవి తేమను నిల్వ చేసుకోవు.
ఇవి నదీతీరాలలో ఉంటాయి.ఇవి కొండల పాదాల దగ్గరగాని లేదా కొండలతో నిండిగాని ఉంటాయి.కొండ ఉపరితలంపై ఉంటాయి.
ఇవి సం||రానికి మూడు పంటలకు అనుకూలం.ఇవి సం||రానికి ఒక పంటకి కూడా అనుకూలం అని చెప్పలేము.పానీయపు పంటలకు అనుకూలం పోడు వ్యవసాయం చేస్తారు.

ప్రశ్న 6.
ప్రభుత్వం కొన్ని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా ఎందుకు గుర్తిస్తుంది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాలలో జూన్ నుండి నవంబరు వరకు వర్షాకాలం. వర్షం తక్కువ’ మరియు అంతగా నమ్మదగినదిగా ఉండదు. కరవు తరచుగా పునరావృతమయ్యే ప్రక్రియ. వర్షం చాలా తక్కువగా ఉండడం, రైతులు తరచుగా పంట నష్టపోతూ ఉండడంతో ప్రభుత్వం కొన్ని మండలాలను కరవుకి గురయ్యే ప్రాంతాలుగా ప్రకటిస్తుంది.

ప్రశ్న 7.
“భౌగోళిక మరియు శీతోష్ణస్థితి పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలను నిర్ధారిస్తాయి”. వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని ఈ భూస్వరూపాల కింద విస్తరించియున్న వివిధ ప్రాంతాలలో విభిన్నమైన పరిస్థితులను మనం గమనిస్తాం. భౌగోళిక మరియు శీతోష్ణస్థితి పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపుతాయి. మైదానాలలో ఉండే ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడితే, కోస్తా తీర ప్రాంతాలలోని ప్రజలు చేపలు పట్టడం వారి ప్రధాన వృత్తిగా మలచుకుంటారు. బుట్టలు అల్లడం, చేపలు పట్టడం, పందులు పెంపకం, కోళ్ళ ఫారాలు, రైసు మిల్లులలో పనిచేయడం మైదాన ప్రాంతాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు కాగా గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంటు ఇటుకల తయారీ మొదలగు పనులు పీఠభూమి ప్రాంతాలలో చేపడతారు.

పర్వత ప్రాంతాలు, కొండలపైన పశువుల పెంపకం, పండ్లు, తేనె, జిగురు వంటి అటవీ వస్తువులను సేకరణ చేస్తారు. కొండవాలులు కాఫీ, టీ మొదలగు పంటల సాగుకి అనుకూలమైన శీతోష్ణస్థితిని కలిగి ఉంటాయి. అడవిలో వెదురు సమృద్ధిగా లభిస్తుంది కనుక గిరిజనులు బుట్టలు, చేటలు, దోనెలు మొదలగు వస్తువులను తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్ముతారు. కాగితం మిల్లుల ప్రతినిధులు వీరిని వెదురు నరికే పనిలో వినియోగించుకోవడం వలన గిరిజనులు మంచి ఆదాయాన్ని పొందుతారు.

ఇలా భూస్వరూపాలలో వైవిధ్యతలు ఆ ప్రాంతంలోని వృత్తులు, ఆహార పద్ధతులు, సహజ జీవజాలంపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రాంతంలోని శీతోష్ణస్థితులపై అక్కడి వృక్ష, జంతు సంపదలు ఆధారపడి ఉంటాయి. ఆహారం, వస్త్రధారణ, వృత్తులు వారి జీవనోపాధులు ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాలు, శీతోష్ణస్తితితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి.

ప్రశ్న 8.
మీగ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవేనా? మీ జవాబు అవును, కాదు ఏదైనా తగిన కారణాలు రాయండి.
జవాబు:
మా గ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవి (అవును)
కారణం:

  • మా గ్రామం మైదాన ప్రాంతంలో ఉంది.
  • ఇక్కడి నేలలన్నీ సారవంతమైనవి.
  • కొంత పల్లపు (మాగాణి), కొంత మెరక (మెట్ట) భూములున్నాయి.
  • దాదాపు అన్ని భూములకు నీటి సౌకర్యం (కాలువలు, బోరుబావులు) కలదు.

మా గ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవి (కాదు)
కారణం:

  • మా గ్రామంలో కొంత ప్రాంతం గుట్టలు, మిట్లతో (కొండలతో) కూడి ఉంది.
  • ఇక్కడి నేలలన్ని వ్యవసాయంకు అనుకూలంగా ఉండవు.
  • నీటి సౌకర్యం కూడా అంతగా లేదు. కొన్ని భూములకు మాత్రమే నీటి సౌకర్యం ఉంది.
  • ఎక్కువగా వర్షపాతం మీద ఆధారపడటం.

ప్రశ్న 9.
గిరిజనుల జీవన విధానాన్ని పరిరక్షించడం ముఖ్యమైనదిగా నీవు భావిస్తున్నావా?
జవాబు:
గిరిజనులు జీవనవిధానాన్ని పరిరక్షించడం ఎంతో ముఖ్యం, అవసరం కూడా అని నేను భావిస్తున్నాను.

  • గిరిజనులు వారికి మాత్రమే ప్రత్యేకమైన భిన్న సంస్కృతిని కలిగి ఉంటారు.
  • వారు ఉపయోగించుకునే అడవులను వారు నాశనం చేసుకోరు. అడవులను గూర్చి సంపూర్ణ అవగాహనని కలిగి ఉంటారు, కనుక అడవిలో స్వేచ్ఛగా నివసించడాన్ని వారు ఇష్టపడతారు.
  • వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న ఈ సమూహాల జీవన విధానాన్ని పరిరక్షించాల్సిందే. వీరి సంస్కృతి మరియు నాగరికత ప్రాచీన గిరిజనుల చరిత్రకు నిదర్శనం.
  • పర్యావరణానికి విఘాతం కలిగించకుండా వీరు జీవనాన్ని సాగిస్తారు. అందువల్ల వీరి జీవన విధానాన్ని పరిరక్షించడం ముఖ్యమైనదిగా భావిస్తున్నాను.

ప్రశ్న 10.
గిరిజనుల పెరటితోట ఎందువలన ముఖ్యమైనది?
జవాబు:
అటవీ ప్రాంతాలలో ఉండే గుడిసెలకి వెనుక విశాలమైన పెరడు ఉంటుంది. ఇంటి చుట్టూ వెదురుతో కంచె నిర్మిస్తారు. పెరటితోట కొరకు ఈ భూమిని చదును చేసిన సేంద్రియ పదార్థాలను కలిపి సారవంతంగా తయారుచేస్తారు. ఆహారంగా ఉపయోగించడానికి మరియు జీవనోపాధికి ప్రధానంగా మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి మొదలగు కూరగాయలను ఇక్కడ పండిస్తారు. కావున గిరిజనుల పెరటితోట ముఖ్యమైనది.

ప్రశ్న 11.
మైదాన ప్రాంతంలో వ్యవసాయం ఎందుకు లాభదాయకమైన వృత్తి వివరించండి.
జవాబు:

  • ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండడం చేత మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
  • లోతైన, సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం వలన పంటసాగులో యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది.
  • అంతేగాక పశువులకు దాణాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఉపకరిస్తాయి.
  • పంటల దిగుబడికి అవసరమైన మెరుగైన నీటి సౌకర్యం ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది
  • వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల సౌకర్యం, రవాణా సౌకర్యాలు కల్గి ఉంటాయి.

12. తూర్పు కనుమలలో ఎత్తయిన శిఖరం ………….. (అరోమ కొండ (జిందగడ)
13. …….. లో చాలాభాగం దక్కన్ పీఠభూమిలో కలదు. (రాయలసీమ)
14. మైదాన ప్రాంతాలలో ………… పంట ఎక్కువగా పండించబడుతుంది. (వరి)
15. తూర్పు కనుమలలోని కొండలు ………….. చే ఏర్పడినవి. (ఖాండలైట్, చార్నో కైట్)
16. కొండ ప్రాంతాలలోని ప్రజలు …………. నుంచి నీరు తెచ్చుకుంటారు. (చిన్నవాగులు, నీటి ఊటల)
17. …………. నేలలు ఎక్కువ శాతం సున్నం, క్షారాలను కలిగి ఉంటాయి. (చౌడు)
18. మైదాన ప్రాంతాలు ……………. కురిసే నేలలు. (ఋతుపవన వర్షాలు)

19. పీఠభూములు వీటికి ప్రసిద్ధి
అ) కూరగాయలు
ఆ) ఖనిజాలు
ఇ) జనాభా
ఈ) పంటలు
జవాబు:
ఆ) ఖనిజాలు

20. నల్లరేగడి నేలలు ఏ పంటకు సారవంతమైనవి?
అ) పత్తి
ఆ) చిరుధాన్యాలు
ఇ) కూరగాయలు
ఈ) గోధుమ
జవాబు:
అ) పత్తి

21. కోస్తా ఆంధ్రాలో జిల్లాలు కలవు.
అ) 6
ఆ) 4
ఇ) 9
ఈ) 5
జవాబు:
ఇ) 9

22. ఈ కింది పట్టికను సరైన సమాచారంతో నింపండి.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 1
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 2

6th Class Social Studies 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.41

ప్రశ్న 1.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 3
పై చిత్రం చూసి భూస్వరూపాల పేర్లు వ్రాయండి.
జవాబు:
పర్వతాలు (కొండలు), పీఠభూములు, మైదానం.

ప్రశ్న 2.
మీ గ్రామం/పట్టణం పరిసరాలలో ఉన్న భూస్వరూపాల పేర్లు వ్రాయండి.
జవాబు:
మా గ్రామం పరిసరాలలో మైదానం, కొండలు ఉన్నాయి.

ప్రశ్న 3.
‘మైదాన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం సులభం’ కారణం చెప్పండి.
జవాబు:
మైదాన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం సులభం కారణం:

  • ఇవి సమతలంగా ఉంటాయి, రోడ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయి.
  • మైదాన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంకు ఖర్చు తక్కువవుతంది..
  • రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు ఎక్కువగా ఉండటం.

6th Class Social Textbook Page No.42

ప్రశ్న 4.
మైదాన ప్రాంతాలు ఎందువలన ఎక్కువ జనసాంద్రతను కలిగి ఉంటాయి?
జవాబు:
మైదాన ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉండటానికి గల కారణాలు :

  • మైదాన ప్రాంతాల్లోని నేలలు సారవంతంగా ఉండి మంచి పంటల దిగుబడినిస్తాయి.
  • భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అనేక రకాల పంటలు పండించడానికి అనుకూలమైన నేలలున్నాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన నగరాలకు ఆలవాలంగా ఉన్నాయి.
  • ఇక్కడ మెరుగైన రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి, చెందుతున్నాయి.
  • వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన “సాగు నీరు, త్రాగునీరు” వసతులు కల్గి ఉండి ఇండ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండి జననివాస యోగ్యంగా ఉన్నాయి.
  • మైదాన ప్రాంతాలు ప్రాచీన కాలం నుండి మానవ ఆవాసాలకు నిలయం.
    ఉదా : సింధూ నాగరికత.

ప్రశ్న 5.
సాధారణంగా మైదాన ప్రాంతాలలో ఉండే గ్రామాలు మంచి ఉపాధి, జీవన ప్రమాణం కలిగి ఉంటాయి? ఎందువలన?
జవాబు:
మైదాన ప్రాంతాలలో ఉండే గ్రామాలు మంచి ఉపాధి జీవన ప్రమాణం కల్గి ఉండటానికి కారణం :

  • ఈ ప్రాంతాల్లో సారవంతమైన నేలలు ఉండటం వలన ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.
  • వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి.
    ఉదా : రైసుమిల్లులు, చక్కెర కర్మాగారాలు మొ||నవి.
  • మెరుగైన రవాణా సౌకర్యాలుండటం వలన (ఎగుమతులు, దిగుమతులు) వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధి .. చెంది ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
  • అనేక రకాల ఇతర వృత్తులు కూడా అధికంగా వృద్ధి చెంది ఉండటం.

ప్రశ్న 6.
ఏరకమైన నేలలు వ్యవసాయానికి ఎక్కువ అనుకూలం?
జవాబు:
మైదాన ప్రాంతంలోని ఒండ్రు (డెల్టా), నల్లరేగడి నేలలు వ్యవసాయానికి ఎక్కువ అనుకూలం. నేలలతోపాటు నీటిసౌకర్యం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 7.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 4 AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 5 AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 6
పైన ఉన్న పర్వతాలు, పీఠభూమి, మైదానాలు చిత్రాలను చూసి మీ ప్రాంతం దేనిని పోలి ఉందో గుర్తించండి.
జవాబు:
మా ప్రాంతం మైదాన ప్రాంతాన్ని పోలి ఉంది. (నోట్ : విద్యార్థులు, మీ ప్రాంతాలను బట్టి జవాబు రాయగలరు.)

6th Class Social Textbook Page No.43 & 44

ప్రశ్న 8.
పటం పరిశీలించి క్రింది ఖాళీలను పూరించండి.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 7
A. ఉత్తరం నుండి దక్షిణం వరకు కోస్తా జిల్లాల పేర్లు.
జవాబు:

  1. శ్రీకాకుళం
  2. విజయనగరం
  3. విశాఖపట్నం
  4. తూర్పు గోదావరి
  5. పశ్చిమ గోదావరి
  6. కృష్ణా
  7. గుంటూరు
  8. ప్రకాశం
  9. PSR నెల్లూరు

B. రాయలసీమ జిల్లాల పేర్లు
జవాబు:

  1. కర్నూలు
  2. అనంతపురం
  3. YSR కడప
  4. చిత్తూరు

C. మీ గ్రామం / పట్టణం / నగరం పేరు : ……………
మండలం : ……………
జిల్లా : ……………
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న జిల్లాలు : …………………….
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలు : ……………
జవాబు:
మీ గ్రామం / పట్టణం / నగరం పేరు : రాయపూడి
మండలం : తుళ్ళూరు
జిల్లా : గుంటూరు
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న జిల్లాలు : కృష్ణా, ప్రకాశం
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలు : తెలంగాణ

6th Class Social Textbook Page No.46

ప్రశ్న 9.
కొండ ప్రాంతాలు పానీయపు పంటల ఉత్పత్తికి ఎందువలన అనుకూలం? మీ స్నేహితులు మరియు ఉపాధ్యాయులతో చర్చించి రాయండి.
జవాబు:
కొండ ప్రాంతాలు పానీయపు పంటల ఉత్పత్తికి అనుకూలం ఎందువలన అంటే,

  • కొండ ప్రాంతాలలో నేలలు వాలుగానూ, ఎగుడు దిగుడుగాను ఉంటాయి.
  • ఇవి ఎత్తులో ఉండటం వలన నీరు నిలబడకుండా కిందకి జారిపోవడం జరుగుతుంది.
  • తేయాకు మొక్కలకు వెచ్చని, ఆర్ధ శీతోష్ణస్థితితోపాటు, హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి.
  • కొండ (వాలు) ప్రాంతాలలో సహజంగా కాంటూర్ వ్యవసాయం చేస్తారు. ఇక్కడి నేలల్లో మిగతా పంటలు అంతగా దిగుబడినీయవు.
  • కొండప్రాంతాలు వాలుగా ఉండి వర్షపు నీరు మొక్కల మొదళ్ళల్లో నిలబడకుండా చక్కగా పారతాయి. ఇలాంటి సౌకర్యమే ఈ పానీయపు పంటలకు కావాలి అంటే వర్షపాతం సంవత్సరం అంతా అవసరం, అలాగే ఎక్కువ నీరు మొక్కల మొదళ్లల్లో చేరకూడదు.

ప్రశ్న 10.
కొన్ని అటవీ ఉత్పత్తుల పేర్లు రాయుము.
జవాబు:
అటవీ ఉత్పత్తులు :

  1. వివిధ రకాల పళ్లు (సీతాఫలం, జామ, పనస మొ||నవి)
  2. వివిధ రకాల దుంపలు (వెదురు, చిలకడదుంప మొ||నవి)
  3. వివిధ రకాల గింజలు (కుంకుళ్లు, బాదము, షీకాయి మొ||నవి)
  4. తేనె
  5. వెదురు, టేకు, సాల్ మొదలైన కలప
  6. చింతపండు
  7. విస్తరాకులు
  8. వంట చెరకు
  9. ఇతర ఔషధాలు, వనమూలికలు.

ప్రశ్న 11.
నీవెప్పుడైనా అడవికి వెళ్ళావా? వెళ్తే మీ అనుభవాన్ని రాయండి.
జవాబు:
నేను ‘తిరుపతి’ వెళ్ళినప్పుడు, తిరుమల కొండకు నడకదారిన అడవుల్లో నుంచి వెళ్ళాను.

  • మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, పర్యావరణం ప్రశాంతంగా ఉంది.
  • కోతులు, జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు మొ||న జంతు పక్షులను చూడగలిగాను.
  • రకరకాల వృక్ష జాతులను, ఔషధ మొక్కలను పరిశీలించాము.
  • కొన్ని ప్రాంతాలలో అడవి దట్టంగా ఉండి కొంచెం భయపడ్డాము.
  • కొన్నిచోట్ల ఎక్కువ వాలు ఉండి, కొన్నిచోట్ల పల్లంగా ఉంది.
    (నోట్ : విద్యార్థులు ఇలా తమ అనుభవాన్ని స్వంతంగా రాయండి)

6th Class Social Textbook Page No.48

ప్రశ్న 12.
ఈ ప్రాంతంలో (పీఠభూమి) వ్యవసాయ పద్ధతులలో ప్రధానంగా వచ్చిన మార్పులు ఏమిటి?
జవాబు:
ఇటీవల కాలంలో రైతులు చిరుధాన్యాలకి బదులుగా వేరుశనగ, మిర్చి వంటి వ్యాపార పంటల సాగుకి మారుతూ ఉన్నారు. కొన్నిసార్లు జొన్న, కంది, మొక్కజొన్న పంటలని వేరుశనగ చేల మధ్యలో కూడా పండిస్తారు. భూసారం పెంచడానికి, తెగుళ్లను అరికట్టడానికి ఈ మధ్యకాలంలో కొందరు రైతులు గట్లు నిర్మించడం సేంద్రియ వ్యవసాయం లాంటి కొత్త పద్ధతులకు మారుతున్నారు. వ్యవసాయ భూములకు నీరందించడానికి పురాతన చెరువులు, వాగులను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. నీటి సమస్య వలన కొందరు రైతులు సపోటా, బత్తాయి, మామిడి తోటలను పెంచడం ప్రారంభించారు. ఈ పండ్ల తోటలకు కొన్ని కాలాల్లో నీటి సౌకర్యం కల్పిస్తే అవి ప్రతి సంవత్సరం ఫలసాయాన్ని ఇస్తాయి. నీటి సదుపాయం ఉన్నచోట అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ మొదలగు పండ్లతోటలను కూడా పెంచుతున్నారు.

ప్రశ్న 13.
భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో బోరుబావులను తవ్వడం వలన మనం ఎటువంటి సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చును? Page No. 48
జవాబు:
ఎక్కువ సంఖ్యలో బోరు బావులను తవ్వడం వలన ఏర్పడే సమస్యలు :

  • బోరు బావులను వాణిజ్య పంటలకు అధికంగా ఉపయోగించడం మూలంగా భూగర్భ జలవనరులు తగ్గిపోతున్నాయి. త్వరలో అంతరించిపోవచ్చు కూడా.
  • ఈ ప్రాంతం ఎడారిగా మారిపోవచ్చు, నీటికొరత ఎక్కువ అవ్వవచ్చును.
  • నీరు ఇంకే స్వభావాన్ని నేలలు కోల్పోవచ్చు, భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది.

ప్రశ్న 14.
కోస్తా మైదానం మరియు పీఠభూమి ప్రాంతంలోని గ్రామాలలో వర్షపాతం స్థితిని పోల్చండి. Page No. 48
జవాబు:

వర్షపాత పరిస్థితి
కోస్తా మైదానముపీఠభూమి
1) జూన్ నుండి అక్టోబరు వరకు నైఋతి ఋతుపవన కాలంలో వర్షాన్ని పొందుతుంది.1) జూన్ నుండి నవంబరు వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది.
2) నవంబరు నుండి మే వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది.2) ఈ కాలంలో వర్షపతం ఉండదు. కాబట్టి తరుచూ కరవుకూ గురవుతుంటాయి.

6th Class Social Textbook Page No.49

ప్రశ్న 15.
ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన నదులేవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన నదులు.

  1. గోదావరి
  2. కృష్ణా
  3. పెన్నా

ప్రశ్న 16.
కృష్ణా, గోదావరి డెల్టాలలో ఏ జిల్లాలున్నాయో గుర్తించండి.
జవాబు:

  • కృష్ణా డెల్టాలో గుంటూరు, కృష్ణా జిల్లాలు కలవు.
  • గోదావరి డెల్టాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కలవు.

ప్రశ్న 17.
డెల్టాలు ప్రారంభమయ్యే ప్రాంతంలో గల రెండు ముఖ్య నగరాల పేర్లు రాయండి. కృష్ణానదిలో కలిసే రెండు నదులను గుర్తించండి.
జవాబు:

  1. విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాలు.
  2. తుంగభద్ర, మూసి, బుడమేరు, నాగులేరు, భీమ, గుండ్లకమ్మ.

AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 8

ప్రశ్న 18.
పంట విధానాలలో మార్పులు రావడానికి కారణమేమిటి?
జవాబు:
మైదాన ప్రాంతాల్లో పంట విధానాలలో మార్పు రావడానికి కారణాలు :

  • ఆహార పంటల నుండి నగదు/వ్యాపార పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
  • పెట్టుబడి పెరుగుతున్న నేపథ్యంలో ఇవి లాభదాయకంగా ఉంటున్నాయి.
  • వీటికి మార్కెటింగ్ సౌకర్యం బాగా ఉంది.
  • కాలువలు, బోరుబావుల ద్వారా నీటి సౌకర్యము అందుబాటులో ఉంటుంది.
  • యాంత్రీకరణ పెరగటం.

ప్రశ్న 19.
కోస్తా మైదానాలు ఎందువలన మిక్కిలి సారవంతమైనవి?
జవాబు:
కోస్తా (డెల్టా) మైదానాలు మిక్కిలి సారవంతమైనవి ఎందుకంటే :

  • ఇక్కడ నదులు అవక్షేపాల వల్ల మిక్కిలి ఒండ్రునేలలు ఉండడం చేత.
  • లోతైన, సారవంతమైన, చదునైన నేలలు ఉండటం వలన.
  • ఈ మైదాన ప్రాంతాలలో భూగర్భ జలవనరుల లభ్యత కూడా అధికంగా ఉంటుంది.
  • ఈ డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడ్డంగుల వంటివి, వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు.

ప్రశ్న 20.
వ్యవసాయం మైదాన ప్రాంతాలలో ఎందువలన ప్రధాన వృత్తిగా ఉన్నది?
జవాబు:

  • ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండడం చేత మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
  • లోతైన, సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం వలన పంటసాగులో యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది.
  • అంతేగాక పశువులకు దాణాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఉపకరిస్తాయి.
  • పంటల దిగుబడికి అవసరమైన మెరుగైన నీటి సౌకర్వం ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది
  • వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల సౌకర్యం, రవాణా సౌకర్యాలు కల్గి ఉంటాయి.

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

SCERT AP 6th Class Social Study Material Pdf 3rd Lesson పటములు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 3rd Lesson పటములు

6th Class Social 3rd Lesson పటములు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పటంలోని ముఖ్యమైన అంశాలేవి?
జవాబు:
పటంలోని ముఖ్య అంశాలు :
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 1

ప్రశ్న 2.
భూమిపై కల వాస్తవ దూరాన్ని పటంలో ఎందుకు తగ్గించి చూపాలి?
జవాబు:
ఒక ప్రదేశము యొక్క మొత్తము వైశాల్యమును కాగితంపై చూపించవలెనన్న అంతే వైశాల్యము కాగితము అవసరమగును అంటే భారతదేశ పటం గీయవలెనన్న అంతే వైశాల్యముకల కాగితము కావలెను మరియు భూమిపై ఉన్న వాస్తవ దూరము చాలా పెద్దదిగా ఉంటుంది. అంత పెద్ద వైశాల్యం గల ప్రదేశాలను వాటి మధ్య దూరాలను మానచిత్రంలో చూపించటము అసాధ్యము. కావున పటంలో తగ్గించి చూపాలి.

ప్రశ్న 3.
పటాల తయారీలో చిహ్నాల ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలుమార్గాలు బావులు మొదలైనటువంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలు చిహ్నాలతో సూచిస్తారు. ఇవి తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. పటాలు గీయడం, చదవడం సులభమవుతుంది.

ప్రశ్న 4.
మీ జిల్లా పటంలో మీ మండలం కేంద్ర కార్యాలయానికి, జిల్లా కేంద్ర కార్యాలయానికీ కల దూరాన్ని కొలవండి. వాస్తవ దూరానికి, దానికి కల నిష్పత్తి సహాయంతో పటంలో ఉపయోగించిన స్కేలు కనుగొనండి.
జవాబు:
విద్యార్థులు తమతమ జిల్లా, మండల కేంద్రాల నుండి క్రింద ఉదాహరణలో చూపిన విధంగా లెక్కించండి.

మా శ్రీకాకుళం జిల్లా కేంద్ర కార్యాలయానికి మా ‘టెక్కలి’ మండల కేంద్ర కార్యాలయానికి పటంలో
దూరం = 5 సెం.మీ,
వాస్తవ దూరం = 50 కి.మీ.
స్కేల్ : ఒక సెం.మీ. = 10 కి.మీ.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 2

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

ప్రశ్న 5.
రాజకీయ పటాలకీ, భౌతిక పటాలకీ కల వ్యత్యాసమేమి?
జవాబు:
రాజకీయ పటాలు :
గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను (అంటే రాజకీయ విభాగాలను) మాత్రమే చూపిస్తాయి.

భౌతిక పటాలు :
పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి.

ప్రశ్న 6.
విషయ నిర్దేశిత పటాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
విషయ నిర్దేశిత పటాల యొక్క ప్రాముఖ్యత :

  • ఒక నిర్ధిష్ట (నిర్ణీత) అంశాన్ని గూర్చి సవివరంగా తెలియజేస్తాయి.
  • ఏదైనా ఒక ప్రాంతం గూర్చి వివరంగా తెలుసుకోవచ్చు.
  • భూవినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలుమార్గాలు, జనాభా వంటి నిర్ధిష్ట అంశాలను గురించి వివరిస్తాయి.

ప్రశ్న 7.
నిత్య జీవితంలో పటాల యొక్క ఉపయోగమేమి?
జవాబు:
పటాల వలన ఉపయోగాలు :

  • పటాలు దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు వంటి ప్రదేశాలను గుర్తించడానికి మనకి చాలా ఉపయోగకరం.
  • పటాలను ఉపయోగించి పర్వతాలు, పీఠభూములు, మైదానాల వంటి భూస్వరూపాలను చూడవచ్చును.
  • ప్రధాన రహదారి మార్గాలైన రోడ్లు, రైల్వేలను గురించి తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి.
  • పటాలు పంటలు, ఖనిజాలు, నేలలు పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి ఉపకరిస్తాయి.
  • పటాలు యుద్ధ సమయంలో సైనికులకు భద్రత దృష్ట్యా ఉపయోగకరం.
  • పటాలు పర్యాటకులు మరియు ప్రయాణీకులకు వారి గమ్య చేరడానికి మార్గదర్శకంగా ఉంటాయి.

ప్రశ్న 8.
ఇవ్వబడిన ప్రపంచ పటంలో ఖండాలు, మహాసముద్రాలు గుర్తించండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 3
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 4

→ సరియైన సమాధానాన్ని ఎంచుకుని బ్రాకెట్లో రాయండి.

1. అడవులు విస్తరణని తెలిపే పటాలు ………..
అ) భౌతిక పటము
ఆ) విషయ నిర్దేశిత పటం
ఇ) రాజకీయ పటం
ఈ) పైవేవీ కావు
జవాబు:
ఆ) విషయ నిర్దేశిత పటం

2. నీలిరంగు ……….. ని సూచించడానికి ఉపయోగిస్తాము.
అ) జలభాగములు
ఆ) పర్వతాలు
ఇ) భూభాగం
ఈ) మైదానాలు
జవాబు:
అ) జలభాగములు

3. స్కేల్ దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగము …………
అ) పటము
ఆ) చిత్తుచిత్రము
ఇ) ప్రణాళిక
ఈ) ఏదీకాదు
జవాబు:
అ) పటము

4. దిక్సూచిని దీని కొరకు ఉపయోగిస్తారు.
అ) చిహ్నాలను చూపుటకు
ఆ) ప్రధాన దిక్కులను గుర్తించడానికి
ఇ) దూరాన్ని కొలవడానికి
ఈ) ఎత్తుని తెలుసుకోవడానికి
జవాబు:
ఆ) ప్రధాన దిక్కులను గుర్తించడానికి

5. ఉత్తరం మరియు తూర్పుకి మధ్యగల దిక్కుని ఇలా పిలుస్తారు.
అ) ఈశాన్యము
ఆ) ఆగ్నేయము
ఇ) వాయవ్యము
ఈ) నైరుతి
జవాబు:
అ) ఈశాన్యము

6th Class Social Studies 3rd Lesson పటములు InText Questions and Answers

6th Class Social Textbook Page No.30

ప్రశ్న 1.
మృదుల పై చిత్తుచిత్రం సహాయంతో ఎందుకు తను వెళ్ళవలసిన చోటికి చేరుకోలేదు? Page No. 30)
జవాబు:
మృదుల చిత్తుచిత్రం సహాయంతో తను వెళ్ళవలసిన చోటికి చేరలేకపోవడానికి కారణాలు :

  • చిత్తు చిత్రంలో ప్రధానంగా దిక్కులు చూపలేదు. స్కేల్ చూపలేదు.
  • చిత్తుచిత్రంలో ఏ విధమైన కొండ గుర్తులు, చిహ్నాలు చూపలేదు.

6th Class Social Textbook Page No.31

ప్రశ్న 2.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 5
పైన ఇచ్చిన చిత్రాన్ని పరిశీలించి కింది పట్టికను పూరించండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 6
జవాబు:

దిక్కువస్తువులు
ఉత్తరంచెట్లు
ఈశాన్యంగుడి
దక్షిణంబావి
నైరుతిమసీదు
తూర్పుసూర్యోదయము
ఆగ్నేయంపాఠశాల
పడమరఇల్లు
వాయువ్యంచర్చి

6th Class Social Textbook Page No.32

ప్రశ్న 3.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 7
చిత్రము పరిశీలించి స్కేల్ ని ఉపయోగించి కింద చూపిన ప్రదేశాల మధ్య వాస్తవ దూరాన్ని లెక్కించండి.
i) పోస్ట్ ఆఫీస్ మరియు రాజు ఇంటి మధ్య దూరం
ii) రాజు మరియు పూజ ఇంటి మధ్య దూరం
iii) చిరు ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరం
జవాబు:
i) 60 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 6 సెం.మీ. × 10 మీ. = 60 మీ॥)
ii) 10 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 1 సెం.మీ. × 10 మీ. = 10 మీ॥)
iii) 50 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 5 సెం.మీ. × 10 మీ. = 50 మీ॥)

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

ప్రశ్న 4.
చిహ్నాలు మనకు సమాచారాన్ని ఎలా ఇస్తాయి?
జవాబు:
స్కేల్ పటంలోని ముఖ్యమైన అంశం. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు గీతలతో సూచిస్తారు. ఈ చిహ్నాలు తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించుట వలన పటాలను గీయడం, చదవడం కూడా సులభం అవుతుంది. ఒక ప్రాంతలో మనకు భాష , తెలియకపోయినా ఎవరినీ సలహాలు అడగకుండానే పటాన్ని ఉపయోగించి చిహ్నాల సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

6th Class Social Textbook Page No.35

ప్రశ్న 5.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి పట్టికను తయారు చేయండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 8
జవాబు:
మనదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు గలవు. అవి :

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంరాజధాని
1. ఆంధ్రప్రదేశ్అమరావతి
2. ఒడిశాభువనేశ్వర్
3. పశ్చిమబెంగాల్కోల్‌కతా
4. జార్ఖండ్రాంచి
5. బీహార్పాట్నా
6. ఉత్తరప్రదేశ్లక్నో
7. ఉత్తరాఖండ్డెహ్రాడూన్
8. హిమాచల్ ప్రదేశ్సిమ్లా
9. పంజాబ్ఛండీఘర్
10. హరియాణాఛండీఘర్
11. రాజస్థాన్జైపూర్
12. గుజరాత్గాంధీనగర్
13. మహారాష్ట్రముంబయి
14. మధ్యప్రదేశ్భోపాల్
15. ఛత్తీస్ ఘడ్రాయపూర్
16. కర్ణాటకబెంగళూర్
17. తెలంగాణహైద్రాబాద్
18. కేరళతిరువనంతపురం
19.  తమిళనాడుచెన్నెై
20. గోవాపనాజి
21. సిక్కింగాంగ్‌టాక్
22. అరుణాచల్ ప్రదేశ్ఇటానగర్
23. అస్సాండిస్పూర్
24. మేఘాలయషిల్లాంగ్
25. నాగాలాండ్కోహిమా
26. మణిపూర్ఇంఫాల్
27. మిజోరాంఐజ్వా ల్
28. త్రిపురఅగర్తల
కేంద్రపాలిత ప్రాంతాలు
1. అండమాన్ & నికోబార్ దీవులుపోర్టుబ్లెయిర్
2. పుదుచ్చేరి (పాండిచ్చేరి)పుదుచ్చేరి
3. లక్ష ద్వీపు(ప్)కవరత్తి
4. దాద్రానగర్ హవేలిసిల్వాస్సా
5. డామన్ & డయ్యూడామన్
6. ఛండీగర్ఛండీగర్
7. న్యూఢిల్లీన్యూఢిల్లీ
8. జమ్ము & కాశ్మీర్శ్రీనగర్ & జమ్ము
9. లడక్లెహ్

ప్రశ్న 6.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 9
ఈ భౌతిక పటాన్ని పరిశీలించి భారతదేశం యొక్క కొన్ని భౌగోళిక స్వరూపాలను గురించి రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 10

6th Class Social Textbook Page No.36

ప్రశ్న 7.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 11
భారతదేశం – ముఖ్య పంటలు (విషయ నిర్దేశిత పటం)
i) ఈ పటం ఏమి సూచిస్తోంది?
జవాబు:
భారతదేశంలో పండే ముఖ్య పంటలను సూచిస్తోంది.

ii) దీనిని విషయ నిర్దేశిత పటం అని ఎందుకు పిలుస్తారు?
జవాబు:
ఏదైనా ఒక నిర్దిష్ట అంశాన్ని తెలియజేసే పటం విషయ నిర్దేశిత పటం అంటారు. ఈ పటంలో ‘భారతదేశం – ముఖ్య పంటలు’ అనే నిర్దిష్ట అంశాన్ని తెలియజేస్తుంది, కనుక దీనిని విషయ నిర్దేశిత పటం అని పిలుస్తారు.

ప్రాజెక్టు పని

మీ పాఠశాల చిత్తు చిత్రం గీయండి.
జవాబు:
స్వయం చేయగలరు.

వివిధ రకాల పటాలను సేకరించి ఒక స్క్రిప్ పుస్తకం తయారుచేయండి.
జవాబు:
స్వయం చేయగలరు.

సరియైన చిహ్నాలను ఉపయోగించి మీ ఇంటినుంచి పాఠశాలకి వెళ్ళే దారి యొక్క చిత్తు చిత్రాన్ని గీయండి.
జ. ఉదా :
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 7

AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

SCERT AP 6th Class Social Study Material Pdf 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా

6th Class Social 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
గ్లోబు అంటే ఏమిటి?
జవాబు:
భూమికి ఖచ్చితమైన నమూనానే గ్లోబు. గ్లోబు అనే పదం ‘గ్లోబస్’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గోళం అని దాని అర్థం.

ప్రశ్న 2.
భూమికి గల చలనాలు ఏవి?
జవాబు:
ప్రాథమికంగా భూమికి రెండు రకాలైన చలనాలు ఉన్నాయి. అవి :

  1. భూభ్రమణం
  2. భూ పరిభ్రమణం

ప్రశ్న 3.
భూమి యొక్క ఏ చలనం వలన రాత్రి, పగలు ఏర్పడతాయి?
జవాబు:
భూభ్రమణం వలన రాత్రి, పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగం పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి.

ప్రశ్న 4.
భూభ్రమణం వలన ఏమి సంభవిస్తుంది?
జవాబు:
భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి.

AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

ప్రశ్న 5.
భూభ్రమణం, పరిభ్రమణాలను నిర్వచించండి.
జవాబు:
భూభ్రమణం :
భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కి.మీ. వేగంతో తిరుగుతుంది. దీనినే భూభ్రమణం అంటారు. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావటానికి 23 గంటల 56 ని॥ల 4.09 సెకన్ల (సుమారు 24 గం||లు) సమయం అనగా ఒక రోజు పడుతుంది.

భూపరిభ్రమణం :
భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూపరిభ్రమణానికి 365 4 రోజుల సమయం పడుతుంది.

ప్రశ్న 6.
భూమి యొక్క ఖచ్చితమైన ఆకారం ఏమిటి?
జవాబు:
భూమి పూర్తిగా గోళాకారంగా ఉండకుండా ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లుగా ఉంటుంది.

ప్రశ్న 7.
కర్కటరేఖ అని ఏ అక్షాంశాన్ని అంటారు?
జవాబు:
231/2° ఉత్తర అక్షాంశాన్ని కర్కటరేఖ అని అంటారు.

ప్రశ్న 8.
పాఠ్యాంశంలోని ‘విషవత్తు’ పేరాను చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
మార్చి 21 మరియు సెప్టెంబరు 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్టనిలువుగా పడతాయి. ఈ తేదీలో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఈ రెండు తేదీలను విషవత్తులు అంటారు.

సెప్టెంబరు 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంతఋతువు ఉంటాయి. దీనికి భిన్నంగా మార్చి 21వ ఉత్తరార్ధగోళంలో వసంతబుతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటాయి.

దీనిని బట్టి భూభ్రమణం మరియు భూపరిభ్రమణం వలన రాత్రి, పగలులలో మరియు ఋతువులలో మార్పులు సంభవిస్తాయని మనం తెలుసుకున్నాము.

ప్రశ్న 9.
అక్షాంశ, రేఖాంశాల మధ్య సారూప్యతలను మరియు భేదాలను పట్టిక రూపంలో తయారు చేయండి.
జవాబు:

అక్షాంశాలురేఖాంశాలు
1) అక్షాంశాలు ఒకదానికొకటి కలవవు. సమాంతరంగా ఉంటాయి.1) రేఖాంశాలే మధ్యాహ్నరేఖలు. లంబంగా ఉంటాయి.
2) భూమధ్యరేఖ నుండి ఉత్తర, దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి.2) రేఖాంశాలు, ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు, పడమరలకు దూరాన్ని కొలుస్తాయి.
3) వీటి పొడవులు సమానంగా ఉండవు.3) రేఖాంశాల పొడవులో సమానంగా ఉంటాయి.
4) అక్షాంశాలు భూమధ్యరేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు.4) రేఖాంశాలు భూమధ్యరేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఇవి ఉత్తర – దక్షిణ దిశలలో ఉంటాయి.
5) ఇవి వృత్తాలు.5) ఇవి అర్ధ వృత్తాలు
6) శీతోష్ణస్థితిని తెలుసుకోవచ్చు.6) కాలాల్లోని తేడాలు తెలుసుకోవచ్చు.

ప్రశ్న 10.
ఇండియాలో పగటికాలం అయితే అమెరికాలో రాత్రి అవుతుంది. ఈ వ్యత్యాసానికి గల కారణం ఏమిటి?
జవాబు:
భూమి మీద ఒక ప్రదేశంలో పగటికాలం ఉన్నప్పుడు దానికి అభిముఖంగా వున్న ప్రదేశంలో రాత్రి అవుతుంది. భూభ్రమణం వలన సూర్యునికి ఎదురుగా ఉన్న భూమి యొక్క సగభాగం ప్రకాశిస్తుంది. అభిముఖంగా ఉన్న భాగంలో సూర్యకాంతి పడకపోవటం వలన చీకటి రాత్రి ఏర్పడుతుంది. కావున ఇండియాకి దాదాపు భూమిపై అభిముఖంగా వున్న అమెరికాలో రాత్రి అవుతుంది.

ప్రశ్న 11.
బంతిని తీసుకొని దాని ఉపరితలంపై అక్షాంశ రేఖాంశాలను గీయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 1

ప్రశ్న 12.
గ్లోబుకు, అట్లాసు మధ్య తేడాను తెల్పండి.
జవాబు:

గ్లోబుఅట్లాసు
1) గ్లోబు త్రిమితీయ (3డి) నమూనా.1) అట్లాసు ద్విమితీయ (2 డి) నమూనా.
2) ఇది గోళాకారంగా ఉంటుంది.2) ఇది బల్ల పరపుగా ఉంటుంది.
3) దీనిని త్రిప్పుటకు వీలవుతుంది.3) దీనిని త్రిప్పలేము.
4) భూమికి ఖచ్చితమైన నమూనా.4) అంతఖచ్చితమైన నమూనా కాదు.
5) నావిగేషను ఉపయోగించలేము.5) నావిగేషను ఉపయోగపడుతుంది.

ప్రశ్న 13.
ఈ మధ్య కాలంలోని లీపు సంవత్సరం, రాబోయే లీపు సంవత్సరాలను తెల్పండి.
జవాబు:
గతంలోని లీపు సంవత్సరం : 2016
ఈ మధ్య కాలంలోని లీపు సంవత్సరం : 2020
రాబోయే కాలంలోని లీపు సంవత్సరం : 2024
రాబోయే కాలంలోని లీపు సంవత్సరం : 2028

AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

ప్రశ్న 14.
సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటానికి ఏ సన్నాహాలు చేయాలి?
జవాబు:
సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటానికి తీసుకోవలసిన/ చేయాల్సిన సన్నాహాలు :

  • సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడరాదు. అలా చూసినట్లయితే కన్నులలోని తేలికపాటి పొరలు దెబ్బ తినవచ్చు.
  • సూర్యగ్రహణాన్ని నల్లటి గ్లాసుల సహాయంతో మాత్రమే చూడాలి.
  • టెలిస్కోప్, బైనాక్యూలర్ లాంటి వాటి ద్వారా చూడరాదు.
  • సోలార్ ఫిల్టర్ ద్వారా మాత్రమే చూడాలి. పెద్దలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే చూడాలి.
  • ప్లానిటోరియం లాంటి ప్రదేశాలు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి వీక్షించవచ్చు.
  • గ్రహణ సమయంలో అయస్కాంత విద్యుత్ పరారుణ తరంగాలు, ప్రసరించవచ్చు. కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రశ్న 15.
ఊహారేఖలైన అక్షాంశ, రేఖాంశాలు లేకపోతే ఒక ప్రదేశం ఉనికి, కాలము మరియు దూరాన్ని అర్థం చేసుకోవటం కష్టమయ్యేది. ఊహారేఖలైన అక్షాంశ, రేఖాంశాల రూపకల్పనను అభినందించండి, ప్రశంసించండి.
జవాబు:

  • అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికి తెలుసుకోవచ్చు.
  • అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత సమయాన్ని తెలుసుకోవచ్చు.
  • అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత శీతోష్ణస్థితిని తెలుసుకోవచ్చు.
  • అక్షాంశ, రేఖాంశాలు ఊహారేఖలైనప్పటికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవి లేని గ్లోబు (ప్రపంచపటం)ను ఊహించలేము.
  • ఈ అక్షాంశ, రేఖాంశాలు రూపకల్పనను ఖచ్చితంగా అభినందించవలసిందే.

ప్రశ్న 16.
ఒక యువజన దినోత్సవంలో వేణు వివిధ నగరాలకు చెందిన గీతిక, జాన్, నిహాల్ మరియు ఉమలను కలిశాడు. వేణు వారి వారి నగరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి మనకు ఇచ్చాడు. వేణు ఇచ్చిన సమాచారం ఆధారంగా అట్లాస్ సహాయంతో ఆ నగరాలను కనుగొనగలరా?
జవాబు:
గీతిక – 19° ఉత్తర అక్షాంశం 72° తూర్పురేఖాంశం పోయే ప్రదేశంలో ఉండే నగరం నుండి ఈ అమ్మాయి వచ్చినది.
నగరం పేరు : ……… (ముంబయి)

జాన్ – 12° ఉత్తర అక్షాంశం 77° తూర్పురేఖాంశం పోయే నగరం నుండి వచ్చిన బాలుడు.
నగరం పేరు: …. (బెంగుళూరు)

నిహాల్ – 28° ఉత్తర అక్షాంశం 77° తూర్పు రేఖాంశం దాదాపుగా ఖండించుకునే ప్రదేశం నుండి వచ్చిన బాలుడు.
నగరం పేరు : …….. (న్యూఢిల్లీ)

ఉమ – 22° ఉత్తర అక్షాంశం 88° తూర్పురేఖాంశం దాదాపుగా ఖండించుకునే ప్రదేశం నుండి వచ్చిన బాలిక.
నగరం పేరు : ….. (కోల్ కత్తా)

ప్రశ్న 17.
ఒక అంతరిక్ష నౌక నుండి వ్యోమగామి భూమి వైపునకు చూస్తే అతడు/ఆమె భూమి యొక్క భ్రమణాన్ని చూడగలరా?
జవాబు:
అంతరిక్ష నౌక నుండి వ్యోమగామి భూమి వైపునకు చూస్తే అతడు/ఆమె భూమి యొక్క భ్రమణాన్ని చూడగలరు.

ప్రశ్న 18.
భూమి భ్రమణం, పరిభ్రమణాలను మనం ఎందుకు స్పృశించలేం?
జవాబు:
భూమి భ్రమణం, పరిభ్రమణాలను మనం స్పృశించలేం కారణమేమిటంటే :
భూమితో పాటు మనం కూడా అంతే వేగంతో తిరుగుతున్నాము కనుక.
ఉదా : భూమితో పాటు కొండలు, చెట్లు, గుట్టలు, సముద్రాలు అన్ని తిరుగుతుండటం వలన మనం భూభ్రమణంను స్పృశించలేం.

AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

ప్రశ్న 19.
సరియైన సమాధానాలను ఎంపిక చేయండి.
ఆ. సూర్యుని చుట్టూ భూమి తిరగటాన్ని ఏమంటారు?
i) భ్రమణం
ii) పరిభ్రమణం
iii) వంగడం
జవాబు:
i) భ్రమణం

ఆ. భూమధ్యరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు
i) మార్చి 21
ii) జూన్ 21
iii) డిసెంబర్ 22
జవాబు:
i) మార్చి 21

ఇ. క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడ జరుపుకుంటారు.
i) జపాన్
ii) ఆస్ట్రేలియా
iii) ఇండియా
జవాబు:
ii) ఆస్ట్రేలియా

ఈ. ఋతువులు దీని కారణంగా ఏర్పడతాయి.
i) భ్రమణం
ii) పరిభ్రమణం
iii) గురుత్వాకర్షణ
జవాబు:
ii) పరిభ్రమణం

ప్రశ్న 20.
అట్లాసు లేదా గ్లోబు సహాయంతో కింద ఇవ్వబడిన పట్టికలోని ప్రదేశాల అక్షాంశ, రేఖాంశాలను కనుగొని పట్టికను నింపండి.
AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 2
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 3

ప్రశ్న 21.
గూగుల్ మ్యాప్ లేక అట్లాసు సహాయంతో ఇవ్వబడిన పట్టికలోని భారతదేశం, ఆంధ్రప్రదేశ్, మీ జిల్లా మరియు మీ మండలం అక్షాంశ, రేఖాంశాల పరిధిని కనుగొని పట్టికను నింపండి.
AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 4
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 5

ప్రశ్న 22.
ఈ కింది చిత్రాలను గమనించి రంగులో చూపిన అర్ధగోళాల పేర్లను గడిలో రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 6

6th Class Social Studies 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా InText Questions and Answers

6th Class Social Textbook Page No.10

ప్రశ్న 1.
i) మీరు ఎప్పుడైనా ప్రపంచ పటాన్ని గమనించారా?
ii) పక్కన ఇవ్వబడిన ప్రపంచపటంలో ఎడమవైపు ఇవ్వబడిన మహాసముద్రం పేరేమిటి?
iii) కుడివైపున ఉన్న మహాసముద్రము పేరేమిటి?
AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 7
జవాబు:
i) గమనించాము.
ii) పసిఫిక్ మహాసముద్రం
iii) పసిఫిక్ మహాసముద్రం

6th Class Social Textbook Page No.16

ప్రశ్న 2.
గ్లోబు వలె ఎలాంటి అక్షం లేకుండా భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతుంది? మీ ఉపాధ్యాయులతో – చర్చించండి. Page No. 16
జవాబు:
భూమి ఎలాంటి అక్షం లేకుండా తిరగటానికి ప్రధాన కారణం. అంతరిక్షంలోని సూర్యుడు, చంద్రుడు ఇతర ఖగోళ వస్తువుల (ఆకర్షణ) గురుత్వాకర్షణ బలాలతో తిరుగుతుంది.

ప్రశ్న 3.
ఖగోళ వస్తువులన్నీ గుండ్రని ఆకారంలో ఉంటాయి. ఎందుకు?
జవాబు:
ఖగోళ వస్తువులన్నీ గుండ్రంగా, గోళాకారంలో ఉండటానికి కారణం – ప్రధానంగా గురుత్వాకర్షణ శక్తి అని చెప్పవచ్చు. ఖగోళ వస్తువు యొక్క గురుత్వాకర్షణ శక్తి అన్ని వైపులకు సమానంగా లాగబడటం వలన ఇవి గోళాకారంగా ఉన్నాయి. (విశ్వం ఏర్పడినప్పుడు ఏర్పడిన ఈ ఖగోళ వస్తువులన్ని నక్షత్రాల చుట్టు తిరుగుతూ, వాని ఆకర్షణకు లోనవ్వటం కూడా మరొక కారణం)

6th Class Social Textbook Page No.17

ప్రశ్న 4.
భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది?
జవాబు:
భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది.

ప్రశ్న 5.
ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలున్నాయి?
జవాబు:
ఉత్తరార్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలున్నాయి.

ప్రశ్న 6.
అంటార్కిటికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది?
జవాబు:
అంటార్కిటికా ఖండం దక్షిణార్ధగోళంలో ఉంది.

ప్రశ్న 7.
ప్రపంచపటం, గ్లోబు లేక అట్లాసు సహాయంతో కింది పట్టికను పూరించండి.
AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 8
జవాబు:

ఉత్తరార్ధ గోళంలో ఉన్న ఖండాల పేర్లుదక్షిణార్ధ గోళంలో ఉన్న ఖండాల పేర్లుఉత్తర, దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉన్న ఖండాల పేర్లు
1. ఉత్తర అమెరికా
2. యూరప్
3. ఆసియా
1. ఆస్ట్రేలియా
2. అంటార్కిటికా
1. దక్షిణ అమెరికా
2. ఆఫ్రికా
ఉత్తరార్ధ గోళంలో ఉన్న మహా సముద్రాల పేర్లుదక్షిణార్ధ గోళంలో ఉన్న . మహాసముద్రాల పేర్లుఉత్తర, దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉన్న మహా సముద్రాల పేర్లు
1. ఆర్కిటిక్ మహాసముద్రం1. అంటార్కిటిక్ (దక్షిణ) మహాసముద్రం1. పసిఫిక్ మహాసముద్రం
2. అట్లాంటిక్ మహాసముద్రం
3. హిందూ మహాసముద్రం

6th Class Social Textbook Page No.18

ప్రశ్న 8.
గ్లోబు లేక న్యూస్ సహాయంతో కింది పట్టికను పూరించండి.

అక్షాంశాలుడిగ్రీలు
ఉత్తర ధృవం
ఆర్కిటిక్ వలయం
కర్కటరేఖ
భూమధ్యరేఖ
మకరరేఖ
అంటార్కిటిక్ వలయం
దక్షిణ ధృవం

జవాబు:

అక్షాంశాలుడిగ్రీలు
ఉత్తర ధృవం90° ఉత్తర అక్షాంశం
ఆర్కిటిక్ వలయం66½° ఉత్తర అక్షాంశం
కర్కటరేఖ23½° ఉత్తర అక్షాంశం
భూమధ్యరేఖ
మకరరేఖ23½° దక్షిణ అక్షాంశం
అంటార్కిటిక్ వలయం66½° దక్షిణ అక్షాంశం
దక్షిణ ధృవం90° దక్షిణ అక్షాంశం

AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

ప్రశ్న 9.
అక్షాంశాలు ధృవాల వైపుకు వెళ్ళే కొలదీ ఎందుకు చిన్నవిగా ఉంటాయి? అతి పెద్ద అక్షాంశం ఏది?
జవాబు:

  • భూమి గోళాకారంగా ఉండటం వలన మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి చివరలకు (పైకి, క్రిందకు) వెళ్ళినట్లయితే చిన్నవిగా ఉంటూ (ధృవాల వైపు) ఇంకా పైకి క్రిందకు వెళితే బిందువులుగా మారిపోతాయి.
  • భూమధ్యరేఖ అతి పెద్ద అక్షాంశం.

6th Class Social Textbook Page No.20

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్ పటంలో ఇవ్వబడిన అక్షాంశాల మరియు రేఖాంశాల విస్తరణను గుర్తించండి. మీరు అట్లాసు సహాయం తీసుకొనవచ్చును.
AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 9
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 10

6th Class Social Textbook Page No.23

ప్రశ్న 11.
క్రిస్టమస్ వేడుకలు ఆస్ట్రేలియాలో వేసవికాలంలో జరుపుకుంటారు, మీకు తెలుసా?
జవాబు:
డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకరరేఖ మీద పడతాయి. మకర రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వలన దక్షిణార్ధ గోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. ఆస్ట్రేలియా దక్షిణార్ధగోళంలో వుండటం వలన క్రిస్టమస్ వేడుకలు (డిసెంబర్ 25) వేసవికాలంలో జరుపుకుంటారు.

ప్రాజెక్టు పని

ఒక గ్లోబును గీసి భూమి యొక్క అక్షం, భూమధ్యరేఖ, కర్కటరేఖ, మకరరేఖ, ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయాలను, గుర్తించండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 11

AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

SCERT AP 6th Class Social Study Material Pdf 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి

6th Class Social 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
నక్షత్రం కంటే గ్రహం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
నక్షత్రం కంటే గ్రహం ఏ విధంగా భిన్నమైనదంటే :

  • నక్షత్రం స్వయం ప్రకాశం కలది. గ్రహం స్వయం ప్రకాశం కాదు.
  • నక్షత్రాలు చాలా పెద్దగా, వేడిగా ఉంటాయి. గ్రహాలు నక్షత్రాల కంటే చిన్నగా ఉంటాయి, అంతవేడిగా ఉండవు.
  • నక్షత్రం స్థిరంగా ఉంటుంది. గ్రహాలు తమచుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి.
  • నక్షత్రంపై జీవం అసాధ్యం, గ్రహాలపై జీవానికి అవకాశం ఉంది.
    ఉదా : భూగ్రహంపై జీవం కలదు.

ప్రశ్న 2.
సౌర కుటుంబం అనగానేమి?
జవాబు:
సూర్యుడు, ఎనిమిది గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని మనం ‘సౌర కుటుంబం’ అని పిలుస్తాం.

AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 3.
అన్ని గ్రహాలపై జీవం ఎందుకు సాధ్యం కాదు?
జవాబు:
అన్ని గ్రహాలపై జంతువులు, మొక్కలు (మానవులు) మొదలైన జీవులు పెరగటానికి (జీవించడానికి) అత్యంత కీలకమైన వనరు నీరు మరియు వాతావరణం. ఇవి అన్ని గ్రహాలపై అందుబాటులో లేని కారణంగా అక్కడ జీవం సాధ్యం కాదు.

ప్రశ్న 4.
మనం కేవలం చంద్రుని యొక్క ఒక వైపు మాత్రమే ఎందుకు చూడగలం?
జవాబు:
చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే తనచుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది. ఫలితంగా, చంద్రుని యొక్క ఒక వైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది.

ప్రశ్న 5.
విశ్వం అనగానేమి?
జవాబు:
విశ్వం అనేది కొన్ని కోట్లాది. గెలాక్సీల సమూహం. విశ్వం ఎంత పెద్దదో ఊహించటం కష్టం. దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తున్నారు. దాని పరిమాణం గురించి మనకు కచ్చితంగా తెలియదు కాని మనమందరం ఈ విశ్వానికి చెందినవారని మనకు తెలుసు.

ప్రశ్న 6.
భూమిపై జీవించడానికి గాలి, నీరు, చాలా అవసరం. కానీ ప్రస్తుతం అవి మానవులచే కలుషితం చేయ బడుతున్నాయి. కాలుష్యం ఇంకా పెరిగితే ఈ భూమిపై జీవులకు ఏమి జరుగుతుంది?
జవాబు:
గాలి కాలుష్యం పెరిగితే :

  • వాతావరణంలో ప్రాణవాయువు (ఆక్సిజన్) తగ్గిపోతుంది.
  • వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సెడ్) లాంటి గ్రీన్‌హౌస్ వాయువులు పెరిగిపోతాయి.
  • భూగోళం వేడెక్కుతుంది. వాతావరణ సమతుల్యత దెబ్బ తింటుంది.
  • అతివృష్టి, అనావృష్టిలు ఏర్పడతాయి.
  • ధృవ ప్రాంతాల్లోని మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి.
  • ఓజోన్ పొరకు ప్రమాదం కలుగుతుంది.
  • శ్వాస, చర్మ సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం కలదు.

నీటి కాలుష్యం పెరిగితే :

  • నీటి కాలుష్యం వలన అనేక రకాల వ్యాధుల బారిన పడవలసి ఉంటుంది.
  • నీటి కాలుష్యం వలన పంటల దిగుబడి తగ్గిపోతుంది, తద్యం ఆహార కొరత ఏర్పడుతుంది.
  • చేపలు మొదలైన నీటిలో నివసించే జలచరాలకు ముప్పు ఏర్పడి, తద్వారా వాటి కొరత ఏర్పడుతుంది. అలాగే వాటిని స్వీకరించిన
  • మానవులకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
  • పర్యావరణ వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది.

AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 7.
శాస్త్రవేత్తలు ఇప్పుడు చంద్రుడు, ఇతర గ్రహాల గురించి మరింత అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు మనకు ప్రయోజనం చేకూరుస్తాయని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
చంద్రుడు, ఇతర గ్రహాల గురించిన శాస్త్రవేత్తల ప్రయత్నాలు మనకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తాయని నేను అనుకుంటున్నాను. కారణం,

  • చంద్రుడు, ఇతర గ్రహాలపై జీవం ఉన్నదో, లేదో మరియు జీవించడానికి అవసరమైన అనుకూలతల గురించి తెలుసుకోవచ్చు.
  • అక్కడ ఏ విధమైన ఖనిజాలు లభ్యమవుతాయో తెలుసుకొని, వాడుకోవచ్చు.
  • వీలుగా ఉంటే చంద్రగ్రహంపై నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
  • అంతరిక్ష , ఖగోళ రహస్యాలను గురించి విపులంగా తెలుసుకోవచ్చు.

ప్రశ్న 8.
చిత్రం. 1.4 సౌర కుటుంబం పరిశీలించి కింది పట్టికను నింపుము.
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 1
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 2 AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 3

→ సరియైన సమాధానం గుర్తించుము.

1. సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ, పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది?
అ) సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు.
ఆ) భూమితో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నది
ఇ) సూర్యుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నాడు
జవాబు:
అ) సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు.

2. భూమికి కవల గ్రహం (ఎర్త్ – ట్విన్) అని పిలువబడే గ్రహం ……….
అ) బృహస్పతి
ఆ) శని
ఇ) శుక్రుడు
జవాబు:
ఇ) శుక్రుడు

3. సూర్యుడికి మూడవ సమీప గ్రహం ఏది?
అ) శుక్రుడు
ఆ) భూమి
ఇ) బుధుడు
జవాబు:
ఇ) బుధుడు

4. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్ష్యలో తిరుగుతాయి …………
అ) వృత్తాకార కక్ష్య
ఆ) దీర్ఘచతురస్రాకార మార్గం
ఇ) పొడిగింపబడిన వృత్తాకార కక్ష్య
జవాబు:
ఇ) పొడిగింపబడిన వృత్తాకార కక్ష్య

5. గ్రహశకలాలు ఈ రెండు గ్రహాల కక్ష్యల మధ్య కనిపిస్తాయి ……….
అ) శని మరియు బృహస్పతి
ఆ) అంగారకుడు మరియు బృహస్పతి
ఇ) భూమి మరియు అంగారకుడు
జవాబు:
ఆ) అంగారకుడు మరియు బృహస్పతి

కింది వానిని జతపరుచుము.

1. నీలి గ్రహంఅ) అంగారకుడు
2. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహంఆ) వరుణుడు
3. సూర్యుని నుంచి నాలుగవ గ్రహంఇ) బుధుడు
4. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహంఈ) భూమి

జవాబు:

1. నీలి గ్రహంఈ) భూమి
2. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహంఆ) వరుణుడు
3. సూర్యుని నుంచి నాలుగవ గ్రహంఅ) అంగారకుడు
4. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహంఇ) బుధుడు

ఇవి చేద్దాం

→ కింద ఇవ్వబడిన ఆధారాలతో పదబంధాన్ని నింపండి.

అడ్డం
1. కోట్లాది నక్షత్రాల సమూహం
2. భూమి యొక్క సహజ ఉపగ్రహం
3. వలయాలు కలిగి ఉన్న గ్రహం (చిత్రం 1.4 చూడండి)
4. నీటితో కూడిన ఆవరణం
5. తల మరియు తోక భాగాలు కలిగిన ఖగోళ వస్తువు

నిలువు
1. భూమి యొక్క ఆకారం
2. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం
3. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం
4. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల పొర
5. అంగారకుడు, బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతున్న చిన్న ఖగోళ వస్తువులు
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 4
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 5

6th Class Social Studies 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి InText Questions and Answers

6th Class Social Textbook Page No.4

ప్రశ్న 1.
ప్రాచీన కాలం నుండి ప్రజలు సూర్యుని దేవునిగా భావించి పూజిస్తున్నారు. కారణాలు తెలపండి.
జవాబు:
ప్రాచీన కాలం నుండి ప్రజలు సూర్యుడిని దేవునిగా భావించి పూజించటానికి కారణాలు :

  • ప్రాచీనులు ప్రకృతి శక్తులను ఆరాధించేవారు. ప్రకృతి శక్తులలో ముఖ్యుడు సూర్యుడు.
  • సూర్యుడు ఈ భూమండలానికంతటికీ వెలుగు, వేడిని ప్రసాదిస్తున్నాడు.
  • భూమిపై జీవనానికి మూలాధారము సూర్యుడే, ప్రాణాధారము సూర్యుడే.
  • ఋతువులు ఏర్పడటంలో, పంటల అభివృద్ధిలో సూర్యునిది కీలకపాత్ర కాబట్టి.
  • సహజశక్తికి మూలం సూర్యుడు. భూమికి అవసరమైన శక్తి సూర్యుని నుండే లభిస్తుంది.
  • సూర్యుడు లేనిదే జీవం లేదు. జీవికి మనుగడ లేదు.

AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

6th Class Social Textbook Page No.6

ప్రశ్న 2.
2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. కానీ ప్రస్తుతం 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. 9వ గ్రహం ఏమిటి? అది ఏమైంది? మీ టీచర్ సహాయంతో తెలుసుకోండి.
జవాబు:
2006 ఆగస్టు 25 నాటి వరకు మన సౌర కుటుంబంలో గ్రహాలు ‘9’ అని చెప్పుకునేవాళ్ళం . అప్పటి ‘9’వ గ్రహం ‘ప్లూటో’. అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య 26వ జనరల్ అసెంబ్లీలు ఫ్లూటోను గ్రహం కాదు అని నిర్ణయించటం జరిగింది. ఎందుకనగా ఫ్లూటో “క్లియర్డ్ ద నైబర్ హుడ్” (తోటి గ్రహాల కక్ష్యలకు ఆటంకం కలిగించరాదు) అన్న నియమాన్ని ఉల్లంఘిస్తున్నది. ఇది కొన్ని సందర్భాలలో నెప్ట్యూన్ కక్ష్యలోకి ప్రవేశిస్తున్నది.

ప్రశ్న 3.
కింది చిత్రాన్ని పరిశీలించి గ్రహాలకు అనుగుణంగా ఇవ్వబడిన పెట్టెలలో వాటి పేర్లను రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 6

ప్రశ్న 4.
జంతువులు మరియు మొక్కలు పెరగడానికి, జీవించడానికి ఏమి అవసరం?
జవాబు:
జంతువులు మరియు మొక్కలు పెరగడానికి, జీవించడానికి అవసరమైనవి – గాలి (వాతావరణం), నీరు, వేడిమి,
కాంతి, మృత్తికలు (నేలలు) మరియు ఇతర వనరులు.

6th Class Social Textbook Page No.7

ప్రశ్న 5.
మన భూమి సౌరకుటుంబంలో ఒక ప్రత్యేకమైన గ్రహం అని మీరు ఎలా చెప్పగలరు?
జవాబు:
భూమి సౌరకుటుంబంలో ఒక ప్రత్యేకమైన గ్రహం, ఎలా చెప్పగలనంటే,

  • సౌర కుటుంబంలో జీవం కల్గిన ఏకైక గ్రహం భూమి.
  • సౌర కుటుంబంలో నీరు కల్గిన ఏకైక గ్రహం భూమి.
  • సౌర కుటుంబంలో వాతావరణం కల్గిన ఏకైక గ్రహం భూమి. (ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి. మరీ వేడిగానీ, చల్లగాగానీ ఉండదు)
  • జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి.

6th Class Social Textbook Page No.8

ప్రశ్న 6.
అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు?
జవాబు:
అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ, (ఏప్రిల్ 2, 1984)

AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 7.
మీరు చంద్రయాన్-1, చంద్రయాన్-2గురించి విన్నారా? వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి, తరగతిలో చర్చించండి.
జవాబు:
మేము చంద్రయాన్ -1, చంద్రయాన్ – 2 గురించి విన్నాము.

  • 2008 అక్టోబర్ 22న మనదేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు చంద్రయాన్ -1 ను ప్రయోగించింది.
  • 2019, ఆగస్టు 14న చంద్రయాన్ – 2ను ప్రయోగించి, ఆగస్టు 20, 2019న చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు
  • 2019, సెప్టెంబర్ 2న ‘విక్రమ్’ ల్యాండరు వేరు చేయటం జరిగింది.

ముఖ్య ఉద్దేశ్యాలు :

  1. చంద్రునిపై నీటి జాడను వెదకడం.
  2. చంద్రునిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం.
  3. హీలియం – 3ను వెదకడం.
  4. చంద్రుని యొక్క త్రిమితియ అట్లాస్ ను తయారు చేయడం.
  5. సౌర వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించిన ఆధారాలను వెతకడం.

చంద్రయాన్ – 1ను ప్రయోగించడం ద్వారా చంద్రునికి ఉపగ్రహాలను పంపిన ఆరు దేశాలలో ఒకటిగా మన భారతదేశం అవతరించింది.

6th Class Social Textbook Page No.9

ప్రశ్న 8.
మానవ నిర్మిత ఉపగ్రహాలు మానవాళికి ఎలా ఉపయోగపడతాయి? చర్చించండి.
జవాబు:
మానవ నిర్మిత (కృత్రిమ) ఉపగ్రహాల ఉపయోగాలు :

  • వాతావరణ అధ్యయనానికి ఇవి ఉపయోగపడతాయి.
  • రేడియో, టెలివిజన్ ప్రసారాలకు ఇవి ఉపయోగపడతాయి.
  • టెలికమ్యూనికేషన్స్ కొరకు ఇవి ఉపయోగపడతాయి.
  • రిమోట్ సెన్సింగ్ (నిర్ణీత దూరంలో ఉండి సమాచారాన్ని సేకరించడం)కు ఉపయోగపడతాయి. వైమానిక, సైనిక కార్యకలాపాలకు వీటిని ఉపయోగిస్తారు.
  • విశ్వం, భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కొరకు ఉపయోగపడతాయి.
  • గూఢచర్యం మరియు దేశ భద్రతావసరాలకు కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి

AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

6th Class Social Textbook Page No.11

ప్రశ్న 9.
ఇప్పుడు మీరు విశ్వంతో మీకు గల సంబంధాన్ని గ్రహించారా? మీరు భూమిపై ఉన్నారు.. ఈ భూమి సౌర కుటుంబంలో ఒక భాగం. మన సౌర కుటుంబం విశ్వంలో భాగమైన పాలపుంత/గెలాక్సీలో ఒక భాగం. విశ్వం లక్షలాది గెలాక్సీల సమూహం అన్న సత్యం మీరు గ్రహించారు కదా. మీరు చిత్రంలో ఎలా సరిపోతారు? మీరు ఎంత చిన్నవారు? కాసేపు ఆలోచించండి.
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 7
జవాబు:
మనం నివసిస్తున్న భూమి మన సౌరకుటుంబం విశ్వంలో భాగమైన పాలపుంత గెలాక్సీలో ఒక భాగం. విశ్వం లకలాది గెలాక్సీల సమూహం. గెలాక్సీ అంటే కోట్లాది నక్షత్రాల (సౌర కుటుంబాల) సమూహం అని గ్రహించాము. ఈ విశాల విశ్వంలో మన భూమే అతి సూక్ష్మధూళి రేణవంతగా అనిపిస్తుంది, అలాంటి భూమిపై మనం ఎంత సూక్ష్మాతి సూక్ష్మమో ఊహించగలను.

ప్రాజెక్టు పని

సౌర కుటుంబం నమూనా తయారు చేయండి. (లేదా) సౌర కుటుంబం బొమ్మను గీయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 8

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

SCERT AP 8th Class Social Study Material Pdf 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 24th Lesson విపత్తులు – నిర్వహణ

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో సంభవించిన లేదా టీవీలో చూసిన ప్రకృతి వైపరీత్యాలను, జరిగిన నష్టాన్ని చెప్పండి. నష్టాన్ని తగ్గించాలంటే ఏ ఏ చర్యలు చేపట్టాలో తెల్పండి. (AS4)
జవాబు:
ఇటీవల మా ప్రాంతంలో విపరీతమైన వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. మా ఇళ్ళు, పొలాలు అన్నీ నీట మునిగాయి. మా ప్రాంతంలో 8 మంది వరద ఉధృతికి నీట మునిగి కొట్టుకుపోయారు. చేలు మునగటం వలన వరి పంట మొత్తం నాశనమయ్యింది. పశువులు మేతలేక, నీట మునిగి మరణించాయి.

కృష్ణానదికి అడ్డుకట్ట వేసి నీటిని మళ్ళిస్తే ఈ వరదను అరికట్టవచ్చు. లోతట్టు ప్రాంతాల వారిని వర్షం ఉధృతంగా ఉన్నప్పుడే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దాతలను ప్రోత్సహించి వారికి ఉచిత ఆహార, వైద్య సదుపాయాలు కల్పించాలి. ఈ విధంగా చేయటం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు.

ప్రశ్న 2.
వైపరీత్యాలను ఎలా నివారించవచ్చు? ఎలా ఎదుర్కోవచ్చు? (AS1)
జవాబు:
సృష్టిలో మనిషి తప్ప మిగతా ప్రాణులన్నీ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. మనిషి మాత్రం ప్రకృతిని తనకు అనుగుణంగా మలుచుకుంటున్నాడు. ఇలాకాక మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. అంతేకాక మడచెట్ల పెంపకం, భద్రమైన ప్రదేశాలలోకి గ్రామాలను మార్చటం, తుపానులను, భూకంపాలను తట్టుకునే విధంగా భవన నిర్మాణాలను ప్రోత్సహించడం మొదలైన వాటితో నష్టాలను నివారించవచ్చు.

వైపరీత్య బృందాలను ఏర్పాటు చేసి శిక్షణనివ్వటం, షెల్టర్లు, దిబ్బలు ఏర్పాటు చేయడం మొదలైన వాటితో వీటిని ఎదుర్కోవచ్చు.

ప్రశ్న 3.
వైపరీత్యాలకు సంబంధించి పెద్దవాళ్ల అనుభవాలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకుని వాటి గురించి రాయండి. (AS3)
జవాబు:
ఒకసారి హైదరాబాదులో భూకంపం వచ్చిందట. వేసవికాలం రాత్రిపూట అందరూ ఆరు బయట పడుకుని ఉండగా వచ్చిందట. ముందు మా బామ్మగారు ఏదో కుక్క మంచాన్ని కదుపుతోంది అనుకున్నారట. ఈలోగా చుట్టు ప్రక్కల వాళ్లు ‘భూకంపం’ అని కేకలు వేయడం వినిపించిందట. అంతే అందరూ ఒక్క ఉదుటున లేచి వీధిలోకి పరిగెత్తారట. చూస్తుండగానే రోడ్డు చివర ఒక ఎత్తైన భవనం కూలిపోయిందట. ఇళ్ళల్లోని సామానులన్నీ క్రిందపడిపోయాయట. చాలామంది ఇళ్ళ గోడలు పగుళ్లు వచ్చాయట. ఆ రాత్రి నుంచి తెల్లారే వరకు 5, 6 సార్లు భూమి కంపించిందట. మా వాళ్ళు అలాగే రోడ్ల మీద కూర్చుని ఉన్నారట కానీ ఇళ్ళల్లోకి వెళ్ళలేదట. తెల్లారాక భయం లేదని నమ్మకం కలిగాక ఇళ్ళలోకి వెళ్లి పని పాటలు మొదలు పెట్టారట.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 4.
ప్రజలు విపత్తులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను సూచించండి. (AS4)
జవాబు:
ప్రకృతి విపత్తులను ముందే ఊహించి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

  1. సులువుగా తప్పించుకునే మార్గం ముందే ఆలోచించి ఉంచుకోవాలి.
  2. అవసరమైన సామగ్రిని ఒక బ్యాగులో సర్దుకుని ఉంచుకోవాలి.
  3. నీటికి సంబంధించిన విపత్తు అయితే ఎత్తైన ప్రాంతాలకు ముందే చేరుకోవాలి.
  4. నిల్వ చేసుకునే ఆహార పదార్థాలను సేకరించి ఉంచుకోవాలి.
  5. అత్యవసరమైన మందులను దగ్గరుంచుకోవాలి.
  6. ఇతరులకు అవకాశమున్నంతమేర సాయం చేయాలి.

ప్రశ్న 5.
కరవు ప్రభావాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
కరవు ప్రభావం :
కరవు ప్రభావం మెల్లగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

  1. భూగర్భజల నీటిమట్టం పడిపోవటం, తాగునీటి కొరత.
  2. పంటల విస్తీర్ణం తగ్గటం.
  3. వ్యవసాయం కుంటు పడటంతో వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవటం.
  4. వ్యవసాయ, అనుబంధ రంగాలలోని ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం.
  5. ఆహారధాన్యాల కొరత.
  6. పశుగ్రాస కొరత.
  7. పశువులు చనిపోవటం.
  8. పోషకాహార లోపం, ప్రత్యేకించి చిన్న పిల్లల్లో
  9. అతిసారం, విరేచనాలు, కలరా వంటి రోగాలు, అనారోగ్యం విస్తరించటం, ఆకలికి గురికావటం వల్ల కంటి చూపులో లోపం ఏర్పడటం.
  10. నగలు, ఆస్తులు వంటివి తప్పనిసరయ్యి తాకట్టు పెట్టటం లేదా అమ్మటం.
  11. పని కోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లటం.

ప్రశ్న 6.
నీటి వృథా జరిగే సందర్భాలను పేర్కొని, దాని నివారణకు మార్గాలను సూచించండి. (AS6)
జవాబు:
నీరు వృథా జరిగే సందర్భాలు దాని నివారణకు మార్గాలు :

  1. పట్టణ, గ్రామ ప్రాంతాలలోని మంచినీటి కుళాయిలకు హెడ్లు సరిగ్గా లేకపోవడం- దీనిని ఎప్పటికప్పుడు సరిచేయాలి.
  2. టూత్ బ్రష్, షేవింగ్ చేయునపుడు కొలాయిని వృథాగా వదలరాదు.
  3. మంచినీటి పైపుల లీకేజీని నివారించాలి.
  4. కాలువల ద్వారా పంటపొలాలకు నీటిని అవసరం మేరకు వదలాలి.
  5. నీటికొరత సమయాలలో గృహ అవసరాల కొరకు పరిమితంగా నీరు వాడాలి.
  6. బిందు సేద్యం వంటి వ్యవసాయ పద్ధతులు ఉపయోగించాలి.
  7. వర్షపు నీరు వృథాకాకుండా చెరువులకు మళ్ళించాలి.
  8. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గొయ్యి త్రవ్వి వర్షపునీటి భూమిలో ఇంకేటట్లు చూడాలి.

ప్రశ్న 7.
ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన చిత్రాలతో ఆల్బమ్ తయారు చేయండి. (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 1

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ InText Questions and Answers

8th Class Social Textbook Page No.254

ప్రశ్న 1.
విపత్తులలో రకాలు ఏవి? వాటిని వివరించండి.
జవాబు:
విపత్తులలో రకాలు :
విపత్తులు ఏర్పడటానికి గల కారణాలను బట్టి, అది సంభవించే వేగాన్ని బట్టి వీటిని అనేక రకాలుగా విభజించవచ్చు.
1. సంభవించే వేగాన్ని బట్టి నిదానంగా వచ్చే, వేగంగా వచ్చే విపత్తులని రెండుగా విభజించవచ్చు.

ఎ) నిదానంగా సంభవించే విపత్తులు :
అనేక రోజులు, నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలపాటు సంభవించే కరువు, పర్యావరణ క్షీణత, పురుగుల తాకిడి, కాటకం వంటివి నిదానంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

బి) వేగంగా సంభవించే విపత్తులు :
తృటి కాలంలో సంభవించే విపత్తు విభ్రాంతికి గురి చేస్తుంది. ఇటువంటి విపత్తుల ప్రభావం కొద్ది కాలం ఉండవచ్చు. లేదా ఎక్కువ రోజులు ఉండవచ్చు. భూకంపాలు, తుపాను, ఆకస్మిక వరదలు, అగ్ని పర్వతాలు బద్దలవటం వంటివి వేగంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

2. కారణాలను బట్టి ప్రకృతి, సహజ, మానవ నిర్మిత విపత్తులని రెండు రకాలుగా విభజించవచ్చు.
ఎ) ప్రకృతి విపత్తులు :
ప్రకృతి సహజ కారణాల వల్ల ఇటువంటి విపత్తులు ఏర్పడి మానవ, భౌతిక, ఆర్ధిక, పర్యావరణ నష్టాలకు దారితీస్తాయి. ప్రకృతి విపత్తులలో రకాలు :
అ) భూకంపాలు
ఆ) తుపానులు
ఇ) వరదలు
ఈ) కరవు
ఉ) సునామీ
ఊ) కొండ చరియలు విరిగి పడటం
ఋ) అగ్నిపర్వతాలు, మొ||నవి

బి) మానవ నిర్మిత విపత్తులు :
మానవ కారణంగా సంభవించే విపత్తుల వల్ల సాధారణ జీవితం అస్తవ్యస్తమవుతుంది. ప్రాణ, ఆస్తి, ఆర్థిక, పర్యావరణ నష్టం కలుగుతుంది. వీటికి గురయ్యే ప్రజలు ఈ సమస్యలను ఎదుర్కోగల స్థితిలో ఉండరు. 1984 భోపాల్ గ్యాస్ విషాదం, 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమాహాలులో అగ్ని ప్రమాదం, 2002లో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పటం, 2003లో కుంభకోణం (తమిళనాడు)లో పాఠశాలలో అగ్ని ప్రమాదం, 2008లో జైపూర్‌లో వరుస పేలుళ్లు వంటివి దీనికి ఉదాహరణలు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 2.
విపత్తుల యాజమాన్యం అంటే ఏమిటి?
జవాబు:
విపత్తులపై / అత్యవసర పరిస్థితులపై నియంత్రణ సాధించటం, విపత్తుల ప్రభావాన్ని నివారించటానికి, తగ్గించటానికి, లేదా వాటి నుంచి కోలుకోవటానికి దోహదం చేసే విధానాలను అందించే దానిని విపత్తుల యాజమాన్యం అంటారు. ఈ కార్యక్రమాలు సంసిద్ధతకు, తీవ్రతను తగ్గించటానికి, అత్యవసర స్పందనకు, సహాయానికి, కోలుకోటానికి (పునర్నిర్మాణం, పునరావాసం) సంబంధించినవి కావచ్చు.

8th Class Social Textbook Page No.256

ప్రశ్న 3.
సునామీలు అంటే ఏమిటో మీకు తెలుసా? అవి ఎలా ఏర్పడతాయి? వాటిని ముందుగా ఎలా ఊహించవచ్చు? రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో నివసిస్తున్నట్లయితే సునామీ సంభవించినపుడు మిమ్మల్ని ఎలా రక్షించుకుంటారు?
జవాబు:
జపాన్ భాషలో ‘సు’ అంటే రేవు’, ‘నామె’ అంటే ‘అలలు’ అని అర్థం. ఈ రెండూ కలిసి ‘సునామీ’ అన్న పదం ఏర్పడింది. సముద్రంలోని భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం, లేదా కొండచరియలు విరిగి పడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీరప్రాంతాలను అతలాకుతలం చేయటాన్ని ‘సునామీ’ అంటారు. దగ్గరలోని భూకంపాల వల్ల ఉత్పన్నమైన సునామీ అలలు కొద్ది నిమిషాలలోనే తీరాన్ని తాకుతాయి. ఈ అలలు తక్కువలోతు నీటిని చేరినప్పుడు చాలా అడుగుల ఎత్తు, అరుదుగా పదుల అడుగుల ఎత్తు పైకెగసి తీరప్రాంతాన్ని విధ్వంసకర శక్తితో తాకుతాయి. ఒక పెద్ద భూకంపం తరువాత సునామీ ముప్పు చాలా గంటలపాటు ఉండవచ్చు.

ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సునామీలను పసికట్టవచ్చు. సునామీలు వచ్చినపుడు వాతావరణశాఖ హెచ్చరికల ద్వారా తెలుసుకుని, ముందే సురక్షిత ప్రాంతాలకు చేరుకుని మమ్మల్ని మేము రక్షించుకుంటాము.

ప్రశ్న 4.
సునామీ ముందు ఏం చేయాలి?
జవాబు:

  1. సునామీ ముప్పుకి గురయ్యే ప్రాంతంలో మీ ఇల్లు, బడి, పని ప్రదేశం, తరచు సందర్శించే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి.
  2. సునామీ సంభవించినప్పుడు మీరు ఉండటానికి అవకాశం ఉన్న ఇల్లు, బడి, పని ప్రదేశం, ఇతర ప్రదేశాల నుంచి తప్పించుకునే మార్గం గురించి ముందే తెలుసుకుని ఉండాలి.
  3. తప్పించుకునే మార్గాల ద్వారా క్షేమంగా ఉండే ప్రాంతాలను చేరుకోటాన్ని సాధన చేస్తూ ఉండాలి.
  4. అత్యవసర పరిస్థితుల్లో ఉంచుకోవలసిన సామగ్రితో సిద్ధంగా ఉండాలి.
  5. సునామీ గురించి మీ కుటుంబంతో చర్చిస్తూ ఉండాలి.

ప్రశ్న 5.
సునామీ గురించి రాయండి.
జవాబు:

  1. సునామీలో అనేక అలలు ఉంటాయి. మొదటి అల అన్నిటికంటే పెద్దది కాకపోవచ్చు. మొదటి అల తరవాత అనేక గంటలపాటు పెద్ద అలలు తాకే ప్రమాదముంటుంది.
  2. మైదాన ప్రాంతంలో సునామీ మనిషికంటే వేగంగా, అంటే గంటకి 50 కి.మీ. వేగంతో పయనించగలదు.
  3. సునామీ పగలు కానీ, రాత్రి కానీ ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.

ప్రశ్న 6.
సునామీ పై మరింత సమాచారం, చిత్రాలు సేకరించండి. తరగతి గదిలో చర్చించండి. సమాచారంను నోటీస్ బోర్డులో ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 3
విద్యార్థులు స్వయంగా చర్చ నిర్వహించి, సమాచారంను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.

  1. తేదీ : 00.58.83 26.12.2004.
  2. మాగ్నిట్యూడ్ : 9.1 – 9.3 mw
  3. లోతు : 30 km (19 mi)
  4. భూకంప నాభి : 3.316°N-95.854°E
  5. రకం : సముద్రంలో
  6. దేశాలు లేదా ప్రాంతాలు : ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, థాయ్ లాండ్, మాల్దీవులు, ఆఫ్రికా తూ|| తీరం (సోమాలియా)
  7. మరణాలు : 230,210 – 280,000

8th Class Social Textbook Page No.259

ప్రశ్న 7.
కరవు గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
కరువు అన్నది వర్మపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్వం. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని అనావృష్టి (Meteorological drought) అంటారు. ఒక సంవత్సరంలో వర్షం సాధారణంగానే ఉండవచ్చు. కానీ రెండు వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి వర్షాధార పంటలు దెబ్బతినవచ్చు. దీనిని వ్యవసాయ కరువు (Agricultural drought) అంటారు. కాబట్టి ఎంత వర్షం అన్నదే కాకుండా, ఎప్పుడెప్పుడు పడిందన్నది కూడా ముఖ్యమవుతుంది.

అధిక లేదా తక్కువ వర్షపాతం అన్నది (70-100 సంవత్సరాల) సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి ఈ విధంగా చెబుతారు.
అధిక + సగటు వర్షపాతం కంటే 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ.
సాధారణ + సగటు వర్షపాతం కంటే 19 శాతం ఎక్కువ నుంచి 19 శాతం తక్కువ వరకు.
తక్కువ – సగటు వర్షపాతం కంటే 20 శాతం నుంచి 59 శాతం తక్కువ వరకు,
బాగా తక్కువ – సగటు వర్షపాతం కంటే 60 శాతం కంటే తక్కువ.

కొన్ని ప్రాంతాలు అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని ‘కరవు పీడిత’ ప్రాంతాలు అంటారు.

8th Class Social Textbook Page No.260

ప్రశ్న 8.
వాటర్ షెడ్ అభివృద్ధి పథకం అంటే ఏమిటి? దీని ఉద్దేశ్యమేమి?
జవాబు:
కరవు ప్రభావాలను తగ్గించటానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలలో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రజలలో నైపుణ్యాలను పెంపొందించి ప్రకృతి వనరులను సమర్థంగా ఉపయోగించుకునేలా చేయటం, సామర్థ్యాన్ని బట్టి నేలను ఉపయోగించుకోవటం ద్వారా నేల, నీటి వనరులను బాగా వినియోగించుకోవచ్చు. వాటి దురుపయోగాన్ని అరికట్టవచ్చు. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే ముఖ్యమైన పనులు పొలాల్లో వాననీటి సంరక్షణ, అడవుల పెంపకం, తక్కువ నీళ్లు అవసరమయ్యే చెట్లు / పంటలను ప్రోత్సహించటం, ప్రత్యామ్నాయ జీవనోపాధులు మొదలైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 9.
కరవును ఎదుర్కోవటం ఎలా?
జవాబు:
ఒక్కసారిగా సంభవించే ప్రమాదం మాదిరి కాకుండా కరువు మెల్లగా సంభవిస్తుంది కాబట్టి మనం దానికి సంసిద్ధతగా ఉండటానికి, ప్రతిస్పందించటానికి, దాని ప్రభావాన్ని తగ్గించటానికి తగినంత సమయం ఉంటుంది. పర్యవేక్షణ, ముందుగా జారీచేసే హెచ్చరికలవల్ల అన్నిస్థాయిల్లో నిర్ణయాత్మక బాధ్యతలు ఉన్నవాళ్లు సకాలంలో స్పందించవచ్చు. కరవుకు గురయ్యే ప్రాంతాల్లో నీటి సంరక్షణా విధానాలు వంటి అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలి.

ప్రశ్న 10.
వర్షపు నీటిని పట్టణ ప్రాంతాలలో ఎలా నిల్వ చేయాలి?
జవాబు:
వర్షపు నీటి నిల్వ :
పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటినంతా జాగ్రత్తగా నిలువ చేయాలి. ఈ వాన నీటినంతా ఇంకుడు గుంతలలోకి మళ్లించటం అన్నింటికంటే తేలికైన పని. ప్రత్యేకించి కట్టిన ట్యాంకులు, సంపు (sump)ల లోకి వాన నీటిని మళ్లించి రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికైన వడపోత విధానాలతో తాగటానికి అత్యంత శుద్ధమైన నీటిని పొందవచ్చు.

8th Class Social Textbook Page No.261

ప్రశ్న 11.
మీరు నీటిని ఆదా చేసేవారా, వృథా చేసేవారా?
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 2
మీరు వాడుతున్న నీటిని పట్టికలో నింపి మొత్తం కూడండి, మీరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోండి.
– 200 లీటర్ల కంటే తక్కువ – పర్యావరణ హీరో
– 201 – 400 లీటర్లు – నీటి పొదుపరి
– 401 – 600 లీటర్లు – నీటి ఖర్చుదారు
– 600 లీటర్ల కంటే ఎక్కువ – నీటి విలన్
జవాబు:
నేను పర్యావరణ హీరో స్థానంలో ఉన్నాను.

ప్రశ్న 12.
ఆ వైపరీత్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు?
జవాబు:
స్థానిక ప్రభుత్వం వారు చాలా వరకు వరద ముప్పున్న ప్రాంతాల ప్రజలను ఊళ్ళోని పాఠశాలలకు, కమ్యూనిటీహాలుకు తరలించారు. వారికి ఆహార పొట్లాలు, త్రాగునీరు అందించారు. కొందరు తమ దుప్పట్లు, కట్టుకోవడానికి వస్త్రాలు అవీ దానంగా యిచ్చారు. ఈ విధంగా వైపరీత్యాన్ని ఎదుర్కొన్నారు.

ప్రశ్న 13.
మీ ప్రాంతంలో ఏదైనా వైపరీత్యాన్ని చూశారా? వివరించండి.
జవాబు:
మా ఇంటి దగ్గర ‘స్పాంజి డస్టర్లు’ తయారుచేసే చిన్న కంపెనీ ఒకటున్నది. అనుకోకుండా ఒక రోజు సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. పనిచేసేవారు జాగ్రత్తపడే లోపలే లోపలున్న ‘స్పాంజి’ మొత్తం కాలిపోయింది. పనివారికి కూడా ఒళ్ళు కాలి గాయాలయ్యాయి. దాదాపు రూ. 3,50,000 నష్టం వాటిల్లిందని దాని యాజమానులు చెప్పగా విన్నాము.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 14.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
సునామీల గురించి ముందుగా పసిగట్టడం :

సునామీకి కారణమయ్యే భూకంపాల గురించి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దాదాపు వెనువెంటనే హెచ్చరికలు జారీచేయవచ్చు. సునామీ కేంద్రం నుంచి తీరం ఎంత దూరం అన్నదాన్ని బట్టి హెచ్చరిక ఎంత ముందుగా చేయవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

తీరప్రాంత అలల కొలతల పరికరాలు సునామీలను తీరం దగ్గరగా గుర్తించగలవు కానీ సముద్రంలోపల ఇవి ఉపయోగపడవు. సముద్రం లోపలి కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లు సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి. సునామీ మీటర్లు సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
1. సునామీకి కారణం ఏమిటి?
జవాబు:
భూకంపం.

2. హెచ్చరికలు ఎలా సాధ్యం?
జవాబు:
ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సాధ్యం

3. హెచ్చరికలో ఏమి చెబుతారు?
జవాబు:
హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

4. సునామీ డిటెక్టర్లు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి.

5. సునామీ మీటర్లు ఏం చేస్తాయి?
జవాబు:
సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.

ప్రశ్న 15.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.

టీచర్లు, విద్యార్థులు ఒక ప్రాంత జనాభాలో సమగ్రభాగం. విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్లకు ముఖ్యమయిన పాత్ర ఉంది. తల్లిదండ్రులు, ఇతర ప్రజలలో అవగాహన కల్పించటంలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించవచ్చు. ఈ విషయంలో విద్యార్థులకు మార్గదర్శనం చేయటం ఉపాధ్యాయుల గురుతరమైన బాధ్యత.
1. టీచర్లు, విద్యార్థులు ఎవరు?
జవాబు:
వీరు ఒక ప్రాంత జనాభాలో సమభాగం.

2. దేనిలో వీరికి ముఖ్య మైన పాత్ర ఉంది?
జవాబు:
విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్ళకు ముఖ్యమైన పాత్ర ఉంది.

3. విద్యార్థులు ఎవరికి అవగాహన కల్పిస్తారు?
జవాబు:
తల్లిదండ్రులకు, ఇతర ప్రజలకు.

4. విద్యార్థులకు ఎవరు మార్గదర్శనం చేస్తారు.
జవాబు:
ఉపాధ్యాయులు.

ప్రశ్న 16.
‘వాటర్ షెడ్ అభివృద్ధి’ పేరాను చదివి, రెండు ప్రశ్నలను తయారు చేయుము.
జవాబు:

  1. IWMP ని ఎవరు అమలు చేస్తున్నారు?
  2. ఏవేనీ రెండు ప్రత్యామ్నాయ జీవనోపాధుల పేర్లు రాయండి.

పట నైపుణ్యాలు

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 4
ప్రశ్న 17.
సునామీ ఏయే ప్రాంతాలను తాకింది?
జవాబు:
అలప్పుజా, కొల్లం, కన్యాకుమారి, కడలూర్, నాగపట్నం, చైన్నై, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులు.

ప్రశ్న 18.
ఇవి ఏ తీరంలో ఉన్నాయి?
జవాబు:
ఎక్కువ ప్రదేశాలు తూర్పు తీరంలో, కొన్ని దక్షిణ తీరంలోనూ ఉన్నాయి.

ప్రశ్న 19.
కరవు అంటే ఏమిటి?
జవాబు:
కరవు అన్నది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని వాతావరణ కరవు అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 20.
ప్రకృతి విపత్తులలో రకాలేవి?
జవాబు:

  1. భూకంపాలు
  2. తుపానులు
  3. వరదలు
  4. కరవు
  5. సునామి
  6. కొండచరియలు విరిగిపడటం
  7. అగ్నిపర్వతాలు
    బ్రద్దలవటం మొదలైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

SCERT AP 8th Class Social Study Material Pdf 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం

8th Class Social Studies 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి : (AS1)
1. తమ పాలనలో ఉన్న దేశాల మధ్య పోటీలు నిర్వహించటానికి క్రికెట్ ను వలస పాలకులు ప్రోత్సహించారు.
2. పాశ్చాత్యీకరణ చెందటానికి ప్రజలు ఈ ఆటను నేర్చుకోసాగారు.
3. భారతీయ గ్రామస్తులు క్రికెట్ ఆడేవాళ్లు.
4. మంచి నడవడిక అలవాటు చేయటానికి ఈ ఆటను పాఠశాలల్లో ప్రవేశపెట్టారు.
జవాబు:
2. ఈ ఆటను అభిమానించి ప్రజలు నేర్చుకోసాగారు.
3. ఇంగ్లాండు గ్రామస్థులు క్రికెట్టు ఆడేవాళ్లు.

ప్రశ్న 2.
క్రికెట్టు, ఇతర ఆటలపై గాంధీజీ దృక్పథం గురించి కొన్ని వాక్యాలు రాయండి. (AS1)
జవాబు:
శరీరం, మనసు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని మహాత్మాగాంధి నమ్మాడు. అయితే క్రికెట్, హాకీ వంటి ఆటలు బ్రిటిషు వాళ్ల ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేసుకోబడి సంప్రదాయ ఆటలను కనుమరుగు చేస్తున్నాయని అతడు తరచు విమర్శించేవాడు. ఇది వలస పాలిత మనస్తత్వాన్ని చూపిస్తోంది. చేనులో పనిచేయడం ద్వారా పొందే వ్యాయామంతో పోలిస్తే ఈ ఆటల వల్ల విద్యాప్రయోజనం చాలా తక్కువ.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 3.
కింది వాటిని కుషంగా వివరించండి. (AS2)
• భారతదేశంలో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయటంలో పార్శీలు మొదటివాళ్లు.
• ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి దుబాయికి మారటంలోని ప్రాముఖ్యత.
జవాబు:
భారతీయ క్రికెట్ అంటే భారతీయులు ఆడిన క్రికెట్టు బొంబాయిలో పుట్టింది. ఈ ఆటను మొదట చేపట్టిన వాళ్లు తక్కువ సంఖ్యలో ఉన్న పార్శీలు. తమ వ్యాపారాల వల్ల బ్రిటిషువాళ్లతో మొదట పరిచయం అయింది పార్శీ సమాజానికి, మొదట పాశ్చాత్యీకరణ చెందింది వీళ్లే. భారతదేశ మొదటి క్రికెట్టు క్లబ్బును వీళ్లు 1848లో బొంబాయిలో స్థాపించారు, దాని పేరు ఓరియంటల్ క్రికెట్ క్లబ్. పార్శీ వ్యాపారస్తులైన టాటాలు, వాడియాలు పార్శీ క్రికెట్ క్లబ్బులకు నిధులు సమకూర్చారు, వాటికి ప్రాయోజకులుగా ఉన్నారు. అయితే భారతదేశంలోని శ్వేతజాతీయ కులీనులు ఈ ఆటలో ఆసక్తి కనబరుస్తున్న పార్శీలకు ఏ విధంగానూ సహాయపడలేదు. వాస్తవానికి తెల్లజాతివాళ్లకే పరిమితమైన బాంబే – జింఖానాలో పార్కింగ్ ప్రదేశం వినియోగించుకోవటంలో పార్శీ క్రికెటర్లతో తెల్లజాతి వాళ్లు గొడవపడ్డారు.

వలస పాలకులు శ్వేత జాతీయుల పట్ల పక్షపాతం వహిస్తారని నిర్ధారణ కావటంతో క్రికెట్టు ఆడటానికి పార్శీలు తమ సొంత జింఖానా ఏర్పాటు చేసుకున్నారు. పార్శీలకు, జాతి వివక్షత ప్రదర్శించిన బాంబే జింఖానాకు మధ్య వైరుధ్యంలో భారతీయ తొలి క్రికెట్టు ఆటగాళ్లకు తీయని విజయం లభించింది. 1885లో భారత జాతీయ కాంగ్రెసు ఏర్పడిన నాలుగు సంవత్సరాలకు అంటే 1889లో క్రికెట్టులో బాంబే జింఖానాని ఒక పార్శీ బృందం ఓడించింది.

సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్ ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్‌కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.

ప్రశ్న 4.
ఏదైనా ఒక స్థానిక ఆట చరిత్ర తెలుసుకోండి. మీ తల్లిదండ్రులను, తాతా, అవ్వలను వాళ్ల బాల్యంలో ఈ ఆటను ఎలా ఆడేవాల్లో అడగండి. ఇప్పుడు కూడా ఆ ఆటను అలాగే ఆడుతున్నారా? మార్పులకు కారణమైన చారిత్రక శక్తులు ఏమై ఉంటాయో ఆలోచించండి. (AS3)
జవాబు:
‘కబడ్డీ’ అంటే ‘కూత’ అని అర్థం. ఇది కౌరవులు, పాండవుల కాలం నాటి నుండి మన దేశంలో ఉన్నది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ‘చిక్ చిక్’ అని, కొన్ని ప్రాంతాల్లో ‘చెడుగుడు’ అని అంటారు. మా ప్రాంతంలో దీనిని ‘కబడ్డీ – కబడ్డీ! అంటారు. ఇది రెండు జట్ల మధ్య జరిగే పోటీ. జట్టుకు 12 మంది సభ్యులుంటారు. కాని జట్టుకు 7 మంది మాత్రమే ఆటలో పాల్గొంటారు.

ఈ ఆటలో కొన్ని నియమాలు :

  1. నిర్ణీత కాలవ్యవధిలో ఆడే ఆట.
    15 నిమిషాలు – 5 నిమిషాలు విశ్రాంతి – 15 నిమిషాలు.
  2. ‘అవుట్’ అయిన వాళ్లు బరి నుండి బయటకు వెళ్ళాలి.
  3. ‘పాయింట్’ వచ్చినపుడు లోపలికి రావాలి.
  4. ‘7 గురు’ అవుట్ అయితే ‘లోనా’ అంటారు.
  5. ‘లోనా’కి అదనంగా 2 పాయింట్లు వస్తాయి.

దీని యొక్క నియమాలు ‘కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ వారు రూపొందిస్తారు. రాష్ట్రస్థాయిలో కూడా ఈ సంస్థ ఉన్నది.

ఈ ఆట అనేక మార్పులకు, చేర్పులకు లోనయింది. ఇటీవలి కాలంలో ‘బోనస్ లైన్ పాయింట్’ ను ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే 6 లేదా 7 గురు క్రీడాకారులు బరిలో ఉండగా వారి బోనస్ లైన్ ను తాకి వచ్చిన వారికి ఒక పాయింట్ అదనంగా వస్తుంది. అయితే ఆటలో కూత మాత్రం ఆపరాదు.

ప్రశ్న 5.
సాంకేతిక విజ్ఞానంలో, ప్రత్యేకించి టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ఏ రకంగా ప్రభావితం చేసాయి? (AS4)
జవాబు:
రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీప కాంతులలో క్రికెట్టు వంటివి పాకర్ అనంతర ఆటలో ప్రామాణికంగా మారాయి. అన్నిటికీమించి క్రికెట్టును సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా పాకర్ దానికి గుర్తింపు తెచ్చాడు. టెలివిజన్ కంపెనీలకు ప్రసార హక్కులు అమ్ముకోవటం ద్వారా క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి. టీ.వీకి అతుక్కుపోయిన క్రికెట్టు అభిమానులకు వాణిజ్య ప్రకటనలు జారీ చేయటానికి వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేయసాగాయి. టెలివిజన్లో నిరంతర ప్రసారాల వల్ల క్రికెట్టు ఆటగాళ్లు హీరోలైపోయారు. క్రికెట్టు బోర్డు వీళ్లకి చెల్లించే మొత్తం గణనీయంగా పెరిగింది. అంతేకాదు టైర్ల నుంచి శీతల పానీయాల వరకు వివిధ వస్తువులకు వాణిజ్య ప్రకటనలలో పాల్గొనటం ద్వారా క్రికెట్టు ఆటగాళ్లు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించసాగారు. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్ ఆటను మార్చివేశాయి. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలో సైతం ప్రసారం చేయటం ద్వారా క్రికెట్ ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. క్రికెట్ ఆడే వాళ్ల సామాజిక నేపథ్యాన్ని కూడా విస్తరింపచేసింది. పెద్ద పట్టణాల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచు చూసే అవకాశం లేని పిల్లలు ఇప్పుడు తమ అభిమాన క్రీడాకారులను అనుకరించి, ఆట నేర్చుకోగలిగారు. ఉపగ్రహ టెలివిజన్ సాంకేతిక విజ్ఞానం వల్ల, బహుళజాతి టెలివిజన్ కంపెనీల వల్ల, క్రికెట్ కి అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.

ఈ రకంగా టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ప్రభావితం చేసాయి.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 6.
క్రికెట్టు వాణిజ్య క్రీడగా మారటం వల్ల సంభవించిన పరిణామాలపై ఒక కరపత్రం తయారు చేయండి. (AS6)
జవాబు:
కరపత్రం

సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్టు ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్ కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.

పాత ఆంగ్ల-ఆస్ట్రేలియా, అక్షం నుంచి క్రికెట్టు కేంద్రం మారిందనటానికి మరొక ముఖ్య సంకేతంగా చెప్పవచ్చు: క్రికెట్ పద్ధతుల్లో వినూత్న ప్రయోగాలు ఉపఖండ దేశాలైన భారత, పాకిస్తాన్, శ్రీలంక వంటి క్రికెట్లు దేశాల నుంచి వచ్చాయి. బౌలింగ్ లో రెండు గొప్ప పరిణామాలకు పాకిస్తాన్ బీజం వేసింది : ‘దూస్‌రా’, ‘రివర్స్ స్వింగ్’. ఈ రెండు నైపుణ్యాలు కూడా ఉపఖండంలోని స్థితులకు అనుగుణంగా రూపొందాయి. బరువైన ఆధునిక బ్యాటులతో దుందుడుకు ఆటగాళ్ళు ‘ఫింగర్ స్పిన్’కి చరమగీతం పాడుతున్న పరిస్థితుల్లో ‘దూరా’ ముందుకొచ్చింది. నిర్మలమైన ఆకాశం కింధ, వికెట్టుపడని దుమ్ము పరిస్థితులలో బంతిని కదిలించటానికి ‘రివర్స్ స్వింగ్’ వచ్చింది. మొదట్లో ఈ రెండు పద్ధతులను బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుమానంతో చూశాయి. క్రికెట్టు నియమాలను అక్రమంగా మారుస్తున్నారని ఇవి ఆరోపించాయి. బ్రిటిషు, ఆస్ట్రేలియాలోని ఆట పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే క్రికెట్లు నియమాలను రూపొందించటం సాధ్యం కాదని కాలక్రమంలో రుజువయ్యింది, ప్రపంచవ్యాప్తంగా బౌలర్లు అందరూ ఉపయోగించే పద్ధతిగా ఇవి మారాయి.

నూటయాభై సంవత్సరాల క్రితం భారతదేశంలో మొదటి క్రికెట్టు ఆటగాళ్లిన పార్టీలు ఆడటానికి ఖాళీ ప్రదేశం కోసం పోరాడవలసి వచ్చింది. ఈనాడు ప్రపంచమార్కెటు ఫలితంగా భారతీయ ఆటగాళ్లకు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తున్నారు, అత్యధిక ప్రజాదరణ కూడా వీళ్లకే ఉంది. ప్రపంచమంతా వీళ్లకి వేదికగా మారింది. ఎన్నో చిన్న చిన్న మార్పుల కారణంగా ఈ చారిత్రక మార్పులు సంభవించాయి. సరదా కోసం ఆడే పెద్దమనుషుల స్థానాన్ని, వృత్తిగా డబ్బు కోసం ఆడే క్రీడాకారులు తీసుకున్నారు. ప్రజాదరణలో టెస్టు మ్యాచ్ స్థానాన్ని ఒక రోజు మ్యాచు ఆక్రమించాయి. సాంకేతిక విజ్ఞానంలో, ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మారుతున్న కాలంతో మారటమే వ్యాపార చరిత్ర అవుతుంది.

ప్రశ్న 7.
ప్రపంచ పటంలో క్రికెట్ ఆడే ఐదు దేశాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 1

8th Class Social Studies 23rd Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.246

ప్రశ్న 1.
మీకు ఆటలు ఆడటం అంటే ఇష్టమా?
జవాబు:
అవును

– ఏ ఆటలు ఆడతారు?
జవాబు:
ఖో ఖో, వాలీబాల్, బాడ్మింటన్

– ఏ ఆట అంటే మీకు ఎక్కువ ఇష్టం?
జవాబు:
బాడ్మింటన్

– కేవలం ఆడపిల్లలు లేదా కేవలం మగపిల్లలు ఆడే ఆటలు పేర్కొనండి.
జవాబు:
కేవలం ఆడపిల్లలు ఆడే ఆట : తొక్కుడు బిళ్ళ
కేవలం మగపిల్లలు ఆడే ఆట : గోళీలు.

– కొన్ని ఆటలను కేవలం పల్లెల్లోనే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : చెడుగుడు

– కొన్ని ఆటలను కేవలం బాగా డబ్బు ఉన్న వాళ్లే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : గోల్ఫ్

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 2.
మీరు ఎందుకు ఆడతారు?
కింద ఇచ్చిన కారణంతో మీరు అంగీకరిస్తే (✓) టిక్కు పెట్టండి. అంగీకరించకపోతే (✗) గుర్తు పెట్టండి. మీకు అదనంగా తోచిన కారణాలను జాబితాకు చేర్చండి.

ఆటలు ఆడటం తేలిక.
ఆటలు ఆడటం సరదాగా ఉంటుంది.
తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు మెచ్చుకుంటారు.
ఆటలు సవాళ్లను విసురుతాయి.
ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
సచిన్, సానియా వంటి అభిమాన క్రీడాకారులను అనుకరించే అవకాశం.
చదువుల కంటే ఆటలు తేలిక.
టెలివిజన్లో కనపడతాం.
ఆటలలో రాత పరీక్షలు, ఇతర పరీక్షలు ఉండవు.
అంతర్జాతీయ పోటీలలో పతకాలు పొందవచ్చు.
దేశానికి ఖ్యాతి తీసుకురావటానికి
పేరు, డబ్బు, ఖ్యాతి గడించటానికి

ప్రశ్న 3.
తరగతిలోని విద్యార్థులందరి అభిప్రాయలను క్రోడీకరించి ఏ కారణాన్ని వారు ముఖ్యమైనదిగా భావిస్తున్నారో తెలుసుకోండి.
జవాబు:
మా తరగతిలో అందరూ ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రశ్న 4.
వెండీస్ అన్న పేరు గల ఒక దేశం ఏదీ లేదన్న విషయం గుర్తించారా? బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ఏ. దీవులలో ఏ దీవి నుంచి వచ్చాడో గుర్తించండి.
జవాబు:
వెస్టండీస్ అనేవి కరేబియన్ దీవులు. ఇవి ఈ పేరు మీద 1958 నుండి 1962 వరకు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఇవి కొన్ని సార్వభౌమ దీవులుగాను, కొన్ని సెయింట్ కిట్స్, నివీలో భాగాలుగానూ, యు.కే. మీద ఆధారపడి కొన్ని, – డచ్ ఆధారితాలుగా కొన్ని, యు.యస్. మీద ఆధారపడి ఒకటి ఉన్నాయి. కాబట్టి ఈ పేరుమీద ఏ దేశం లేదు.

ఈ దీవులలో బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ‘ఉసియన్ బోల్ట్’ జమైకా దీవుల నుండి వచ్చాడు.

8th Class Social Textbook Page No.249

ప్రశ్న 5.
క్రికెట్టుకీ, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించటానికీ మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
క్రికెట్టు ఇంగ్లాండులో పుట్టింది, పెరిగింది. ఇది ఇంగ్లాండు వలస దేశాలలో రాణించింది. మార్పులు, చేర్పులు అన్నీ వీరి స్థాయిలోనే జరుగుతాయి. కాబట్టి క్రికెట్టుని ప్రోత్సహించడం అంటే పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడమే. ఇదే వాటి మధ్యనున్న సంబంధం.

ప్రశ్న 6.
ఇక్కడ ఆటలు ఆడటానికి వివిధ క్రీడా పరికరాలు ఉన్నాయి. మీకు స్థానికంగా దొరికే వాటితో పోలిస్తే వీటి నాణ్యత తేడాగా ఉందని మీరు గమనించి ఉంటారు. డబ్బుకోసం వృత్తి క్రీడాకారులు ఉపయోగించే ఈ పరికరాలను సరదా కోసం ఆదుకునే పిల్లలు కొనగలుగుతారా?
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 2
జవాబు:
ఇవి చాలా ఖరీదైన ఆట వస్తువులు. వీటిని మామూలు స్థాయివారు కొనలేరు. సరదా కోసం ఆడేవారు అసలే కొనలేరు. వృత్తి క్రీడాకారులు డబ్బు సంపాదిస్తారు, అదీగాక వీరిని పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. కాబట్టి కొనగలుగుతారు.

8th Class Social Textbook Page No.250

ప్రశ్న 7.
టెస్టు క్రికెట్టు ప్రాముఖ్యత అంతరించటం వల్ల సంభవించిన మార్పుల జాబితా తయారు చేయండి.
జవాబు:

  1. 1970వ దశకంలో క్రికెట్ మారుతున్న ప్రపంచానికి అనువుగా మారటం మొదలెట్టింది.
  2. టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత తగ్గి ఒకరోజు అంతర్జాతీయ పోటీ మొదలయ్యింది. ఇది జనాదరణ పొందింది.
  3. రెండు సంవత్సరాలు పాకర్ ‘సర్కస్’ అద్భుతంగా నిర్వహించబడింది.
  4. రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీపకాంతులలో క్రికెట్టు మొదలగునవి ప్రామాణికంగా మారాయి.
  5. క్రికెట్టు సొమ్ము చేసుకోగల ఆటగా మారింది.
  6. క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి.
  7. వాణిజ్య ప్రకటనలకు వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేసాయి.
  8. క్రికెట్ ఆటగాళ్ళు హీరోలైపోయారు. వీరు అనేక మార్గాలలో ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు.
  9. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్టు ఆటను మార్చేశాయి. పల్లెల్లో సైతం ప్రేక్షకులు పెరిగారు.
  10. పట్టణాల్లో పిల్లలు తమ అభిమాన ఆటగాళ్ళ .ఆటను అనుకరించి, ఆట నేర్చుకుంటున్నారు.
  11. క్రికెట్టుకు అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.

8th Class Social Textbook Page No.251

ప్రశ్న 8.
క్రికెట్టు గురించి కొంచెం సేపు ఆలోచించిన తరవాత వినాయక్ ఇంగ్లీషులోనే ఉన్న పదాలను కొన్నింటిని రాశాడు – ‘బౌండరీ’, ‘ఓవరు’, ‘వికెట్’. వీటికి తెలుగు పదాలు ఎందుకు లేవో అతడికి వివరించండి.
జవాబు:
క్రికెట్ అచ్చంగా ఇంగ్లీషు దేశంలో పుట్టింది. కాబట్టి దానికి సంబంధించిన పదాలన్నీ ఆ భాషలోనే ఉన్నాయి. వాటికి తెలుగు అనువాదాలు చేయటం కుదరదు. అందువలన అవి తెలుగులో లేవు.
ఉదా :
‘కబడ్డీ’ని అన్ని భాషలలో మనం కబడ్డీ అనే అంటాము. అనువాదం చేయలేము.

ప్రశ్న 9.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు కవ్వటం అని అభిమానులకు తెలుసు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ, ముంబయి తలపడుతుంటే అభిమానులు ఏ పట్టణం నుంచి వచ్చారు. దీనికి మద్దతునిస్తారు అన్నదాన్ని బట్టి ఒక పక్షం వహిస్తారు. భారతదేశం, ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్టు మ్యాచ్ జరుగుతుంటే హైదరాబాదు లేదా చెన్నెలలో టీ.వీలో మ్యాచ్ చూస్తున్న వాళ్లు భారతీయులుగా తమ దేశం వైపున నిలబడతారు. అయితే భారతదేశ తొలి రోజులలో బృందాలు ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడలేదు. 1932 దాకా టెస్ట్ మ్యాచ్ లో భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు. మరి బృందాలను ఎలా ఏర్పాటు చేసేవాళ్లు? ప్రాంతీయ, జాతీయ బృందాలు లేనప్పుడు అభిమానులు తమ మద్దతు తెలపటానికి బృందాన్ని దేని ప్రాతిపదికగా ఎంచుకునేవాళ్లు?
1. అభిమానులకు ఏమి తెలుసు?
జవాబు:
క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు ఇవ్వటం అని అభిమానులకు తెలుసు.

2. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
క్రికెట్‌కు సంబంధించినది.

3. భారతదేశానికి టెస్ట్ మ్యా చ్ లో అవకాశం ఎప్పటి దాకా రాలేదు.
జవాబు:
1932 దాకా.

4. అభిమానులు ఎవరికి మద్దతు తెలియచేస్తారు?
జవాబు:
అభిమానులు తమ ప్రాంతం వారికి మద్దతు తెలియచేస్తారు.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 10.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

‘మీ బాలురకు ఎటువంటి ఆటలు లేవంటే నాకు బాధతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. జాతీయ క్రీడలు, సంప్రదాయ ఆటలను పునరుద్ధరించటంలో మీ సంస్థ ముందు ఉండాలి. మనదేశంలో ఎన్నో సంప్రదాయ ఆటలు ఉన్నాయి. ఇవి ఆసక్తికరమూ, ఉత్సాహభరితంగా ఉండటమే కాకుండా వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.’

– మహీంద్ర కళాశాలలో 1927 నవంబరు 24న ఇచ్చిన ఉపన్యాసం, మహాత్మాగాంధీ సంకలిత రచనలు.

‘ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకి తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది. నా దృష్టిలో ఇటువంటి శరీరాలు ఫుట్ బాల్ మైదానంలో తయారుకావు. అవి మొక్కజొన్న, పంటపొలాల్లో తయారవుతాయి. దీని గురించి ఆలోచిస్తే, ఇందుకు రుజువుగా మీకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. వలస పాలకుల మోజులో ఉన్న భారతీయులకు ఫుట్ బాల్, క్రికెట్టు పిచ్చి పట్టుకుంది. కొన్ని సందర్భాలలో ఈ ఆటలకు చోటు ఉండవచ్చు… శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండే మానవాళిలోని అధికశాతం రైతులకు ఈ ఆటలు తెలియవన్న వాస్తవాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదు … ?’

– లాజరస్ కి లేఖ, 1915 ఏప్రిల్ 17, మహాత్మాగాంధీ సంకలిత రచనలు, సంపుటి 14.
1. ఉపన్యాసం ఎవరు, ఎక్కడ ఇచ్చారు?
జవాబు:
ఉపన్యాసం మహీంద్ర కళాశాలలో గాంధీజీ ఇచ్చారు.

2. మన దేశంలో ఏ ఆటలు ఉన్నాయి?
జవాబు:
మన దేశంలో ఎన్నో సాంప్రదాయ ఆటలున్నాయి.

3. ఆరోగ్యకరమైన శరీరం అంటే ఏమిటి?
జవాబు:
ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకు తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది.

4. ఆరోగ్యకరమైన శరీరాలు ఎక్కడ తయారు అవుతాయి?
జవాబు:
మొక్కజొన్న, పంట పొలాల్లో తయారు అవుతాయి.

5. ఈ లేఖ ఎవరికి రాశారు?
జవాబు:
లాజరు రాశారు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 11.
మీ అట్లా లో క్రికెట్ ఆడే దేశాలను గుర్తించండి. /Page No.247)

ప్రశ్న 12.
ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ఎండీస్.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 3

ప్రశ్న 13.
క్రీడలను, వాటిని ప్రోత్సహించే వారిని ప్రశంసించండి.
జవాబు:
క్రీడలు మానసిక వికాసంతోపాటు శారీరకాభివృద్ధిని పెంపొందిస్తాయి. పాఠశాల స్థాయి నుండే పిల్లల్లోని క్రీడాసక్తిని, అభిరుచిని గుర్తించి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుంది. ప్రభుత్వం వ్యవస్థాపరంగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధ్వర్యంలో క్రీడాశాఖ దేశంలో క్రీడారంగం అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పాఠశాల స్థాయి నుండే ప్రతిభావంతులైన బాలబాలికలను గుర్తించి క్రీడామండలుల ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పరుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడలతోపాటు స్థానిక క్రీడాంశాలు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ విజేతలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రీడలు, క్రీడల పట్ల అభిరుచిని పెంపొందించడంతోపాటు అంతర్జాతీయంగా సాంస్కృతిక వికాసానికి, అవగాహనకు తోడ్పడి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయి. భిన్న సంస్కృతులు కలిగిన మన దేశానికి జాతీయ సమైక్యతను పెంపొందించడానికి క్రీడలు ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి.

ప్రశ్న 14.
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్నీలు ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు?
జవాబు:
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్శీలు 1848లో బొంబాయిలో స్థాపించారు.

ప్రశ్న 15.
రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
రంజీ ట్రోఫీ క్రికెట్ కు సంబంధించిన పోటీ.

ప్రశ్న 16.
భారతదేశానికి టెస్ట్వ్య లో అవకాశం ఎప్పటిదాకా రాలేదు?
జవాబు:
భారతదేశానికి టెస్ట్ మ్యాచ్ లో అవకాశం 1952 దాకా రాలేదు.

ప్రశ్న 17.
ఏ దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది.
జవాబు:
1970 దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది?

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 18.
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో ఏ దేశానిది పైచేయి?
జవాబు:
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో భారత్ దే పైచేయి.

ప్రాజెకు

ఏదైనా ఒక క్రీడ గురించి సమాచారాన్ని సేకరించి, ఆ క్రీడా చరిత్రను నివేదిక రూపంలో రాయండి.
జవాబు:
కబడ్డీ :
మన భారతదేశానికి చెందిన ఒక సాంప్రదాయ క్రీడ – కబడ్డీ. ఈ కబడ్డీ మొదట దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఆవిర్భవించింది. ఒక గ్రూపు వాళ్ళు వేటాడుతుంటే మిగతావారు వారిని కాపాడుకోవడం అనే దాని నుండి ఆవిర్భవించింది.

మనదేశానికి చెందిన ప్రాచీన క్రీడ ఇది. ఈ క్రీడను వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.
బంగ్లాదేశ్ లో – హుదుదు అని
మాల్దీవులలో – బైబాల అని
ఆంధ్రప్రదేశ్ లో – చెడుగుడు అని
తమిళనాడులో – సడుగుడు అని
మహారాష్ట్రలో – హుటుటు అని. ప్రాంతీయ పేర్లతో పిలుస్తారు.

ఇది భారతదేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పంజాబు రాష్ట్రాలకు రాష్ట్ర క్రీడగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ 1936లో జరిగిన బెర్లిన్ ఒలంపిక్స్ లో ఈ ఆటకు అంతర్జాతీయ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

1938లో కలకత్తాలో జరిగిన భారతదేశ జాతీయ క్రీడలలో దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

1950లో All India కబడ్డీ ఫెడరేషన్ అనే దానిని స్థాపించి ఈ క్రీడకు నియమ నిబంధనలను రూపొందించడం జరిగింది.

ప్రస్తుతం స్త్రీల కబడ్డీ పోటీలు కూడా జరుగుతున్నాయి. భారతదేశంలో ప్రో కబడ్డీ పేరిట ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల ‘జట్ల మధ్య పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడను ఆసియా క్రీడలలో కూడా చేర్చడం జరిగింది.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 22st Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు

8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సినిమాలకు, నాటకాలకు ఉన్న మూడు తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:

సినిమాలునాటకాలు
1. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి.1. తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.
2. ఒకేసారి అనేక చోట్ల ప్రదర్శించబడతాయి.2. ఒక్కసారీ ఒక్కచోట మాత్రమే ప్రదర్శించగలుగుతారు.
3. అనేక ప్రాంతాలలో చిత్రీకరిస్తారు.3. ఒక్క స్టేజీపైనే అన్నీ చూపించటానికి ప్రయత్నిస్తారు.

ప్రశ్న 2.
మీ తెలుగు పాఠ్యపుస్తకంలోని ఏదైనా కథను లేదా పాటను చిన్న సినిమాగా తీయవచ్చా? దీని ఆధారంగా సినిమా తీయటానికి ఎవరెవరు అవసరమో జాబితా తయారుచేయండి. (AS1)
జవాబు:
తీయవచ్చును. దీనికి నిర్మాత, దర్శకుడు, ఎడిటరు, కెమెరామెన్, నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, గాయకులు, మ్యూజీషియన్లు ఇంకా ఇతర పనివారు కావాలి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 3.
“సమాజాన్ని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం,” అని కొంతమంది వాదిస్తారు, “సినిమా ప్రభావం చెడుగా ఉంటుంది,” అని మరికొంతమంది అంటారు. మీరు ఎవరితో ఏకీభవిస్తారు? ఎందుకు? (AS4)
జవాబు:
“సమాజాన్ని మంచిగా కాని, చెడుగా కాని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం” – అని నేను భావిస్తాను. అంటే మార్పు ఎటువంటిదైనాకాని, సినిమాకు ఆ శక్తి ఉన్నది.

కారణం :
సినిమా ఒక విలువైన మాధ్యమం. వినోదం కోసం వీటిని చూసినా కొన్ని విషయాలు మనసుకు హత్తుకుంటాయి. చిన్న చిన్న విషయాలే మనుషుల ప్రవర్తనను మారుస్తుంటాయి.

ఉదా :

  1. ‘పోకిరి’ సినిమా చూసిన తరువాత మగ పిల్లలందరూ రెండు షర్టులు ధరించడం మొదలు పెట్టారు.
  2. పూర్వం కొన్ని సినిమాలలో హీరోకు కాన్సర్ వ్యాధి రావటం, రక్తం కక్కుకుని మరణించటం తరుచుగా జరిగేవి. కాని “గీతాంజలి’ అనే సినిమాలో కాన్సరు వచ్చిన హీరో తనలాంటి మరో రకం వ్యాధిగ్రస్తురాలిని ప్రేమిస్తాడు. తరువాత కాన్సరు వ్యాధితో హీరో మరణించిన సినిమాలు రాలేదు. అంటే ప్రేక్షకులు వాటిని ఆశించలేదు అని అర్ధం.

ఈ విధంగా సినిమా నిజంగా ఒక బలమైన ఆయుధం అని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
ముందుకాలం సినిమాల్లోని అంశాలు ఏమిటి? మీరు చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
ముందుకాలం నాటి సినిమాలు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలుగా ఉండేవి. కొన్ని సమాజానికి సందేశాత్మకంగా ఉండే చిత్రాలు ఉండేవి. మరికొన్ని పౌరాణికాలు ఉండేవి. నేను చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు పోలికలు.

  1. రెండు ఎక్కువగా కుటుంబ ప్రధాన చిత్రాలు.
  2. రెంటిలోనూ పౌరాణికాలు ఉన్నాయి.
  3. రెంటిలోనూ మంచి నటీనట వర్గం ఉంది.

తేడాలు :

నేను చూసిన సినిమాలుగతంలోని సినిమాలు
1. ఇవి ఎక్కువ పాటల ప్రధానమైనవి.1. ఇవి ఎక్కువ ఫైటింగున్నవి.
2. ఇవి ఎక్కువ బడ్జెట్ చిత్రాలు.  2. ఇవి తక్కువ బడ్జెట్ చిత్రాలు.
3. ఇవి ప్రేమ ప్రధానమైనవి.3. ఇవి విలువలు ప్రధానమైనవి.
4. ఇవి కొంచెం అభ్యంతరకరంగా ఉంటున్నాయి.4. ఇవి అందరిచే ఆమోద యోగ్యాలు.
5. హాస్యం అపహాస్యం అవుతోంది.5. హాస్యం సున్నితంగా ఉండేది.

ప్రశ్న 5.
స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర ఎలా పోషించాయి? (AS6)
జవాబు:
సాంస్కృతిక చైతన్యం, జాతీయోద్యమంలో దిన పత్రికల పాత్ర :
బ్రిటీషు పాలనలో సంఘ సంస్కర్తలు సమాజంలో మార్పుల కోసం ఉద్యమించారు. హిందూమతంలో సంస్కరణలు, ‘సతి’ని నిషేధించటం, విధవా పునర్ వివాహాన్ని ప్రోత్సహించటం వంటివి ముఖ్యమైన సంస్కరణలు. ఈ సంస్కర్తలతో ప్రేరణ పొంది దేశ వివిధ ప్రాంతాల నుంచి పలు పత్రికలు ప్రచురితం కాసాగాయి.

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన అనేకమంది నాయకులు పత్రికా సంపాదకులు. ‘అమృత్ బజార్ పత్రిక’ (1868లో మొదలయ్యింది) సంపాదకుడు శిశిర కుమార్ ఘోష్, ‘బెంగాలీ’ (1833లో మొదలు) సంపాదకుడు సురేంద్రనాథ్ బెనర్జీ, ‘ది హిందూ’ (1878లో మొదలు) సంపాదకుడు జి. సుబ్రహ్మణ్యం అయ్యర్, ‘కేసరి’ (1881లో మొదలు) సంపాదకుడు బాలగంగాధర తిలక్ ఇందులో చెప్పుకోదగిన వాళ్లు. ఈ పత్రికల సంపాదకులు తమ భావాలను, దృక్పథాలను ఈ పత్రికల ద్వారా ప్రచారం చేసేవారు. భారతీయులలో జాతీయతా భావాన్ని పెంపొందించటంలో వార్తా పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి. ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో కృష్ణా పత్రిక నిర్వహించబడింది.

మహాత్మా గాంధీ 1918లో ‘యంగ్ ఇండియా’ అనే పత్రిక బాధ్యత చేపట్టాడు. ఆ తరువాత గుజరాతీలో ‘నవజీవన్’ అనే పత్రికను స్థాపించాడు. మహాదేవ్ దేశాయి సంపాదకత్వంలోని ‘హరిజన్’ అనే పత్రికకు విరివిగా వ్యాసాలు రాసేవాడు. ఇలా గాంధీగారు పత్రికలకు బాగా విస్తృతంగా రాసేవాడు.

ఈ విధంగా స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 6.
తాజా అంశాలను తెలియచేసే వార్తలను దినపత్రికల నుంచి సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి. (AS1)
జవాబు:
తాజా అంశం: నేడు ఎంసెట్ ఫలితాలు

సాయంత్రం 4.30 గంటలకు విడుదలు

ఈనాడు-హైదరాబాద్ : ఎంసెట్-2013 ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వీటిని విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్జ్ విశ్వవిద్యాలయ ఆవరణలో జరగనుంది. ఫలితాల్లో మార్కులతో సహా ర్యాంకులను కూడా ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణారావు మంగళవారం వెల్లడించారు. ఫలితాలు విడుదలైన వెంటనే వాటిని విద్యార్థుల సెల్ ఫోన్ నంబర్లకు తెలియజేసే ఏర్పాట్లు కూడా చేశారు. ఫలితాలు వెల్లడించే వెబ్ సైట్లు : Www.eenadu.net, apeamcet.org, educationandhra.com, vidyavision.com, manabadi.com, schools9.com, nettlinxresults.net, iitjeefoum.com, aksharam.in., resumedropbox.com etc.
ఈ ఉదాహరణ ప్రకారం తాజా వార్తలను సేకరించండి.

8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.239

ప్రశ్న 1.
మీ తల్లిదండ్రులను వారి బాల్యంలోని నాటకాల గురించి అడిగి తెలుసుకోండి.
జవాబు:
మా తల్లిదండ్రుల కాలంలో భువన విజయం, చింతామణి, కన్యాశుల్కం, రక్త కన్నీరు మొదలైన నాటకాలు బాగావేసేవారు.

ప్రశ్న 2.
కాలక్రమంలో నాటకాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి?
జవాబు:
పూర్వకాలం నాటకాలు ఎక్కువగా పౌరాణికాలు ఉండేవి. నేడు సాంఘిక నాటకాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆనాటి వేదిక అలంకరణ నేడు ఆధునికంగా మారింది. నాడు నటుల గాత్రానికి చాలా విలువనిచ్చేవారు. నేడు వారు గట్టిగా మాట్లాడలేకపోయినా, మైకు వారికి సహకరిస్తున్నాయి. నాడు ఉన్న ఆదరణ నేడు లేదనే చెప్పవచ్చు.

8th Class Social Textbook Page No.240

ప్రశ్న 3.
నాటక ప్రదర్శనకు, సినిమాకు మధ్య తేడాలు ఏమిటి? పోలికలు, తేడాలతో ఒక పట్టిక తయారు చేయండి.
జవాబు:

పోలికలు :

  1. రెండూ వినోద మాధ్యమాలే.
  2. రెంటిలోనూ నటులే నటిస్తారు.
  3. రెండూ ప్రజాదరణ పొందాయి.

తేడాలు :

నాటకాలు :
ఇవి వేదికపై సజీవంగా ప్రదర్శించబడతాయి. ప్రదర్శన సమయంలో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. నటులు తమ స్వరాన్ని, ముఖ కవళికల్ని, ప్రేక్షకులు గ్రహించేలా అభినయించాలి. నటులు కొన్ని నెలలు ఈ నాటకాలని రిహార్సల్ చేయాల్సి ఉంటుంది. వీటిలో నటించడానికి నటీనటులకు ఆడిషన్ టెస్టులు కేవలం రెండు వారాలలో పూర్తి అవుతాయి.

సినిమాలు :
ఇవి రికార్డు చేయబడినవి. చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంది. సినిమా తీసేముందు కేవలం కొన్ని నిమిషాలు మాత్రం రిహార్సల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని చిత్రీకరించడానికి నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. ఆడిషన్ టెస్టు నెలలు పడతాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 4.
నాటకాల నుండి సినిమాలకు మారటం వల్ల కళాకారులు జీవనోపాధి పొందే అవకాశాలలో ఎటువంటి మార్పులు వచ్చాయో మీ టీచరు సహాయంతో చర్చించండి.
జవాబు:
నాటకాలకు ఎక్కువగా మంచి వాక్కు ఉన్నవాళ్ళను నటులుగా ఆదరించేవారు. వీరు సినిమాలకు మారటం వలన వీరి హావభావ ప్రదర్శన, శారీరకమైన అందచందాలు కూడా పరిగణనలోనికి వచ్చాయి. సినిమాల్లో అవకాశాల కోసం రంగస్థల కళాకారులు స్టూడియోల చుట్టూ తిరగటం ప్రారంభించారు. అదృష్టంతోనో, అండదండలతోనో ఈ రంగంలో రాణించినవారు మంచి జీవనోపాధిని, ఆదాయాన్ని పొందారు. లేనివారు కొంతమంది బికారులైన ఉదాహరణలు కూడా ఉన్నాయి.

ప్రశ్న 5.
అయిదు నిమిషాలపాటు ఎటువంటి మాటలు లేకుండా మూకాభినయం చేయండి. ఒక అయిదు నిమిషాల నాటకం వేయండి. ఈ రెండింటిలో నటనలో సౌలభ్యం, ఎంచుకోగల అంశాలు, ప్రేక్షకులకు అర్థం కావటం వంటి విషయాలను పోల్చండి. Page No.240
జవాబు:
విద్యార్థులు ఎవరికి వారుగా మూకాభినయం చేయండి. గ్రూపులవారీగా నాటకాలు వేయండి.
పోల్చుట

అంశాలుమూకాభినయంనాటకం
1. నటనలో సౌలభ్యంఇది నటించడం కష్టం.ప్రయత్నిస్తే తేలిక.
2. ఎంచుకోగల అంశాలుచిన్న, చిన్న అంశాలు, సామాజికమైనవి ఎంచుకోవాలి.సామాజికమైన విషయాలు, పౌరాణిక , అంశాలు, హాస్యభరితమైనవి ఎంచుకోవాలి.
3. ప్రేక్షకులకు అర్ధం కావటంప్రేక్షకులు మొదలైన కొద్ది సేపటికి అర్థం చేసుకోగలుగుతారు.డైలాగ్ చెప్పిన తరువాత అర్థం అవుతుంది.

8th Class Social Textbook Page No.241

ప్రశ్న 6.
మీ ఊళ్లో, పట్టణంలో గల వినోద సాధనాల జాబితా తయారుచేయండి. వాటి జనాదరణను ఎలా అంచనా వేస్తారు? కాలక్రమంలో వాటిలో వస్తున్న మార్పులు ఏమిటి?
జవాబు:
మా ఊళ్ళో సినిమా హాళ్ళు, కళాక్షేత్రం మరియు రాజీవ్ గాంధీ పార్కు ఉన్నాయి. వీటిలో సినిమాహాళ్ళు సినిమాలు బాగుంటే లాంటివి ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. కళాక్షేత్రంలో మంచి మంచి నాటకాలు, నృత్యాలు మొదలైనవి ఉంటాయి. వాటికి హాలు సగం, సగానికి పైన నిండుతుంది. రాజీవ్ గాంధీ పార్కుకు ఆదివారాలు, శెలవు దినాలు, వేసవి సాయంకాలాలు జనులు ఎక్కువగా వస్తారు.

ఈ మధ్యకాలంలో వీటన్నిటి కన్నా టీవీలకు, క్రికెట్ మ్యాచ్ లకు ఎక్కువ ఆదరణ పెరిగింది. పెద్దవాళ్ళు, ఆడపిల్లలు టీవీల ముందు, మగపిల్లలు క్రికెట్ మ్యాచ్ ల్లోనూ లీనమై ఉంటున్నారు.

8th Class Social Textbook Page No.242

ప్రశ్న 7.
జాతీయోద్యమానికి సంబంధించి తీసిన మరో రెండు సినిమాలు చెప్పండి.
జవాబు:
భగత్ సింగ్, మంగళ్ పాండే.

ప్రశ్న 8.
తెలుగు సినిమాలలోని దేశభక్తి గీతాలను సేకరించండి.
జవాబు:
1. “భారతయువతా కదలిరా ||
నవయువ భారత విధాయకా.
“భారతయువతా కదలిరా ||”

2. “మేరీ దేశ్ కీ ధరతీ
సోనా ఉగలే ఉగలే హిరీమోతీ ||

3. “నా జన్మభూమి ఎంత అందమైన దేశము.
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము.”

4. “పుణ్యభూమి నా దేశం నమోనమామి
ధన్యభూమి నా దేశం సదాస్మరామి”

8th Class Social Textbook Page No.243

ప్రశ్న 9.
రెండు బృందాలుగా ఏర్పడి అభిమాన సంఘాల వల్ల ప్రయోజనాలు, సమస్యల గురించి చర్చించండి.
జవాబు:
ప్రయోజనాలు : అభిమాన సంఘాలు వారి అభిమాన హీరోలు, హీరోయిన్లను ఆకాశానికెత్తుతాయి. వారికి ఉచితంగా అడ్వర్టయిజ్ మెంటు ఇస్తారు. సినిమా 100 రోజులు ఆడటానికి విశ్వప్రయత్నం చేస్తారు. అంతేకాక వారు సంఘపరంగా సేవాకార్యక్రమాలను చేపడతారు.
ఉదా :
రక్తదాన శిబిరాలు, ఐ క్యాంపులు మొదలగునవి.

సమస్యలు :
విపరీతమైన అభిమానం వలన సంఘాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇది తీవ్రమైతే అనారోగ్యకరమైన పోటీ అవుతుంది. ఒకోసారి, వీరు సినిమా గురించి అబద్దపు అభిప్రాయాలను వెలిబుచ్చుతారు. ఇవి సినీ అభిమానులను నిరాశపరుస్తాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 10.
మీరు ఇటీవల చూసిన సినిమాలోని కథ, సన్నివేశాలు మీబోటి పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో విశ్లేషించండి. Page No.243)
జవాబు:
నేను ఇటీవల ‘బాషా’ సినిమా చూశాను. ఈ సినిమాలో హీరో ఒక పోలీసు ఆఫీసరు. కానీ అతను అండర్ కవర్ లో ఉంటాడు. ఇందులో సన్నివేశాలు ఒక పోలీసు ఆఫీసరు యిలా ఉంటారా అనిపించేటట్లు ఉన్నాయి. ఇవి మా బోటి పిల్లలకు పోలీసులపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయి.

కేవలం ‘బాషా’ మాత్రమే కాదు. అన్ని సినిమాలు యిదే రీతిగా ఎవరినో ఒకరిని కించపరిచే విధంగా ఉంటున్నాయి.

ప్రశ్న 11.
గత నెలలో వివిధ విద్యార్థులు చూసిన సినిమాల జాబితా తయారు చేయండి. వీటిల్లో హింసను బట్టి 0-5 మార్కులు వేయండి. ఏ మాత్రం హింసలేని సినిమాలకు 5 మార్కులు, ఏహ్యత పుట్టించే తీవ్ర హింస ఉన్న సినిమాలకు 0 మార్కులు వేయాలి.
జవాబు:
ఉదా : 1. శతమానం భవతి – 5
2. గౌతమీపుత్ర శాతకర్ణి – 3
3. ఖైదీ నెంబర్ – 150 – 3
4. …………………..
5. …………………..
6. …………………..

8th Class Social Textbook Page No.244

ప్రశ్న 12.
మీ ప్రాంతంలో దొరికే వివిధ రకాల దిన పత్రికలను తరగతికి తీసుకురండి. ఎన్ని పత్రికలు ఉన్నాయో అన్ని బృందాలుగా ఏర్పడండి. వార్తలు, విశేషాలు ఎలా పొందుపరిచారో (ఏ పేజీలో ఏముంది) విశ్లేషించండి.
జవాబు:
మా గ్రామంలోకి ఈనాడు, సాక్షి అనే రెండు పత్రికలు వస్తాయి. –

మా తరగతిలోని వారందరమూ 2 బృందాలుగా ఏర్పడ్డాము.

ఈనాడు బృందం :
దేశానికి సంబంధించిన ముఖ్య వార్త. తరువాత పేజీల వార్తలు సంక్షిప్తంగా మొదటి పేజీలో, సంపాదకీయం. 4 పేజీలకు వసుంధర అనే పేరుతో స్త్రీలకు సంబంధించిన విషయాలు. ఆటలకు ఒక పేజీ, బిజినెస్ గురించి, అన్ని ప్రకటనలు, సినిమాల గురించి వెండితెర గురించి, టీ.వీ గురించి వివరాలు.

జిల్లా పేపర్ :
దీనిలో జిల్లాకు సంబంధించిన అన్ని రకాల వార్తలు ఉంటాయి.

సాక్షి బృందం : సాక్షి పేపర్ 14 పేజీలు + జిల్లా పేపర్…

మొదటి పేజీలోనే దాదాపుగా ఆ రోజుకు ముఖ్యమైన వార్త అది దేశవ్యాప్తమైనది అవుతుంది. తరువాత పేజీల్లో వచ్చే ముఖ్య వార్తల్ని మొదటి పేజీలో చిన్న చిన్న వ్యాఖ్యలతో ఇచ్చి పేజీ నెంబరు ఇస్తారు. అది ఒక ఉపయోగం. తరువాత ఆ వార్తల్ని వివరంగా ఇస్తారు. టెండర్ల గురించి ప్రకటనలు. ఇక తరువాత ఫ్యామిలీ అనే పేరుతో 4 పేజీల పేపర్ ఉంటుంది. దానిలో ఒక గొప్ప వ్యక్తితో (ఏ రంగమైన) పరిచయం లేదా ఏదైనా మంచిపని చేసేవాళ్ళతో పరిచయం. పిల్లలకు కథలు, అన్నీ అంటే సోషల్ సైన్స్ మొ|| వాటిలో పిల్లలకు తెలియని విషయాలు, భక్తికి సంబంధించిన సందేశాలు, సినిమా కబుర్లు ఉంటాయి.

ఉద్యోగ అవకాశాలు, ఇంకా సంక్షిప్త వార్తలు, బిజినెస్ కు ఒక పేజీ, సెన్సెక్స్. తరువాత ఆటలకు ఒక పేజీ, చివరలో మిగిలిన అన్ని వార్తలు చాలాసార్లు ఫోటోలతో సహా జిల్లా పేపర్ లో మొదటి ముఖ్యవార్త, టెండర్, క్రైమ్, వెండితెర (సినిమా) – బుల్లితెర (ఆరోజు ప్రసారాలు) తరువాత మూడు పేజీల్లో స్థానిక వార్తలు, క్లాసిఫైడ్ (ప్రకటనలు) తరువాత విద్య (ఎంసెట్, బి.ఎడ్ మొ||) తరువాత స్థానిక వార్తలు 2 పేజీల్లో ఉంటాయి.

ప్రశ్న 13.
పైన పేర్కొన్న దిన పత్రికల సంచికలను వరుసగా వారం రోజులపాటు సేకరించండి. పై బృందాలలో ఒక్కొక్క పత్రికలో ఏ ఏరోజున ఏ ప్రత్యేక అంశాలు ప్రచురితమౌతాయో తెలుసుకోండి. ఆ వివరాలను తరగతి గదిలో పంఛుకోండి. దినపత్రికలలో ఇటువంటి అంశాలు ఎందుకు ప్రచురిస్తున్నారో కారణాలను పేర్కొనండి.

ప్రశ్న 14.
వివిధ విషయాలపై రకరకాల పత్రికలు ఉన్నాయి. మీ ఊరు / పట్టణంలో దొరికే పత్రికల పాత సంచికల నుంచి కరకాలున్నాయి ముఖచిత్ర పేజీలను సేకరించండి. వీటిని విషయాల వారీగా వర్గీకరించండి. వీటిని ఇంకే రకంగానైనా వర్గీకరించవచ్చా?
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు 1

ఇంకా ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి. వీటిని భాషనుబట్టి, కాలాన్ని బట్టి, అంశాలను బట్టి వర్గీకరించవచ్చు.

ప్రశ్న 15.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

సినిమా – వినోదరూపం :
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి. కాలక్రమంలో వినోదానికి సినిమా ప్రధాన రూపంగా మారింది. సినిమాలో పాటలకు తగినంత ప్రత్యేక ప్రజాదరణ ఉంది. ఇంతకు ముందు రేడియో, ఇప్పుడు టీవి సినిమా పాటలను విడిగా ప్రసారం చేస్తున్నాయి. సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది, అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సినిమాల్లోని జనాదరణ పొందిన సంభాషణలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను ప్రజలు అనుకరిస్తున్నారు. టెలివిజన్ రాకతో సినిమాలు చూడటానికి సినిమాహాళ్ళకే వెళ్లవలసిన పనిలేకుండా పోయింది. సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్లు లేదా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.
1. సినిమా కంటే ముందున్న వినోద రూపాలు ఏవి?
జవాబు:
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి.

2. సినిమా పాటలకున్న ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
వీటికి తగినంత ప్రజాదరణ ఉంది. రేడియోలు, టీవీలు వీటిని ప్రసారం చేస్తున్నాయి.

3. అభిమాన సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది. అందుకే అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.

4. ప్రజలు వేటిని అనుకరిస్తున్నారు?
జవాబు:
ప్రజలు నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను అనుకరిస్తున్నారు.

5. సినిమాహాళ్ళకు వెళ్ళవలసిన పని ఎందుకు లేదు?
జవాబు:
సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్ళు, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.

ప్రశ్న 16.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

1938, 1939 లో విడుదలైన ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ సినిమాల గురించి రంగయ్య మాటల్లో ఆనాటి ఉత్సాహం ఈనాటికీ కనపడుతోంది. అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం ‘మాలపిల్ల’లో ప్రధాన అంశం. దీంట్లోని కథానాయకుడు చౌదరయ్య గాంధేయవాది. అతడు ఉన్నత కులాల వాళ్లకు తమ పద్ధతులను మార్చుకోమనీ, నిమ్న కులాల వాళ్లకు తాగుడు మానెయ్యమనీ, చదువుకోమనీ చెబుతుంటాడు. పూజారి కొడుకు దళిత అమ్మాయితో ప్రేమలో పడతాడు. పూజారి భార్య మంటల్లో చిక్కుకుంటే ఒక దళితుడు ఆమెను కాపాడతాడు. ఈ ఘటనతో అంటరానితనం ఉండగూడదని పూజారి గుర్తిస్తాడు. దీంతో అతడు దళితులకు ఆలయ ప్రవేశం కల్పిస్తాడు. పూజారి కొడుకు, దళిత అమ్మాయి పెళ్ళిని అందరూ ఆశీర్వదిస్తారు.
1. ‘మాలపిల్ల’లో ప్రధాన అంశాలు ఏమిటి?
జవాబు:
అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం.

2. కథానాయకుడు ఎవరు?
జవాబు:
చౌదరయ్య.

3. ఆయన ఎవరికి మంచి చెప్పాడు?
జవాబు:
నిమ్న కులాల వాళ్ళకు.

4. ఎవరు మంటల్లో చిక్కుకున్నారు?
జవాబు:
పూజారి భార్య.

5. పూజారి ఏమి గుర్తిస్తాడు?
జవాబు:
అంటరానితనం ఉండరాదని పూజారి గుర్తిస్తాడు.

6. ఎవరికి ఆలయ ప్రవేశం జరిగింది?
జవాబు:
దళితులకు

7. ఎవరెవరికి పెళ్లి జరిగింది?
జవాబు:
పూజారి కొడుకుకి, దళిత అమ్మాయికి పెళ్లి జరిగింది.

ప్రశ్న 17.
ప్రస్తుత నాటకాలు కనుమరుగయ్యాయి. కారణం ఏమిటి?
జవాబు:
ప్రస్తుతం నాటకాలు కనుమరుగవటానికి కారణాలు :

  1. సినిమాలు చూచుటకు అలవాటు పడిన ప్రజలు నాటకాలు, చూడడానికి ఆసక్తి చూపడం లేదు.
  2. టీ.వీల్లో సినిమాలు, సీరియల్స్ కు అలవాటు పడిన ప్రజలకు నాటకాలు రుచించడం లేదు.
  3. సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయభారం, చింతామణి వంటి పేరెన్నిక గల నాటకాలు నేటితరం యిష్టపడటం లేదు.
  4. ఈతరం యువత ఈ పద్య నాటకాలను అభ్యసించడం లేదు.
  5. ప్రజాదరణ లేకపోవడంతో నాటక సమాజాలు అంతరించిపోతున్నాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 18.
‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను ప్రశంసించండి.
జవాబు:
1882లో బ్రిటిషు వాళ్లు అటవీ చట్టం చేసి గిరిజనులు అడవులలో స్వేచ్ఛగా తిరగకుండా, పోడు వ్యవసాయం చేయకుండా అడ్డుకోసాగారు. బ్రిటిషువాళ్ల వేధింపులకు వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళనలకు సీతారామరాజు నాయకత్వం వహించాడు. 1922 రంపా తిరుగుబాటుగా ఖ్యాతిగాంచిన పోలీసు స్టేషనులపై దాడి చేశారు. గిరిజనులు తమ సాంప్రదాయ ఆయుధాలతోనూ, స్వాధీనం చేసుకున్న ఆయుధాలతోనూ పోరాటం చేయసాగారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిషు పాలకులు రూథర్ ఫోర్డ్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ ను పంపించింది. ఘంటం దొర వంటి గిరిజన నాయకులందరినీ చంపేశారు. చివరికి సీతారామరాజుని కూడా కాల్చి చంపేశారు. ఈ సినిమా వ్యాపార పరంగా ఎంతో లాభాలు ఆర్జించి పెట్టింది. దీంట్లోని ‘తెలుగు వీర లేవరా …’ పాటకి జాతీయ ఉత్తమ గీతం బహుమతి లభించింది. ఈ పాటని శ్రీశ్రీగా ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగం శ్రీనివాసరావు రాశాడు.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

SCERT AP 8th Class Social Study Material Pdf 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

8th Class Social Studies 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) అన్ని నృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపుదిద్దుకున్నాయి.
ఆ) చారిత్రాత్మకంగా కళాకారులను పెద్ద పెద్ద జమిందారులు పోషించారు.
ఇ) ప్రజలను చైతన్యపరచటానికి బుర్రకథను ఉపయోగించుకున్నారు.
ఈ) ప్రస్తుతం భరతనాట్యాన్ని ప్రధానంగా నట్టువనార్లు నేర్పుతున్నారు.
జవాబు:
సరియైనవి
అ) అన్ని వృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపుదిద్దుకున్నాయి.
ఆ) చారిత్రాత్మకంగా కళాకారులను పెద్ద పెద్ద జమిందారులు పోషించారు.
ఇ) ప్రజలను చైతన్యపరచటానికి బుర్రకథను ఉపయోగించుకున్నారు.
ఈ) ప్రస్తుతం భరతనాట్యాన్ని ప్రధానంగా నట్టువనార్లు నేర్పుతున్నారు.

ప్రశ్న 2.
గత 50 సం||రాలలో జానపద కళాకారుల జీవితాల్లో వచ్చిన మార్పులను చర్చించండి. (AS1)
జవాబు:
సినిమాలు, టెలివిజన్ వంటి ఆధునిక సమాచార, వినోద రూపాలు అందుబాటులోకి రావటంతో సంప్రదాయ ప్రదర్శన కళలకు ప్రజల ఆదరణ తగ్గిపోతూ ఉంది. అంతేకాకుండా గతంలోమాదిరి గ్రామ పెద్దలు, భూస్వాములు ఈ కళాకారులకు పోషకులుగా ఉండటం లేదు. ఈ కారణంగా జానపద కళలు క్షీణించిపోతున్నాయి. కళాకారులు జీవనోపాధి సమస్యను ఎదుర్కొంటున్నారు. వీళ్లు సంచార కళాకారులు కావటం వల్ల వాళ్ళ పిల్లలు ఆధునిక పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేదు. ఇక వాళ్ళకు మిగిలింది నైపుణ్యంలేని కూలిపని చేయటమే.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయటానికి ఈ కళారూపాలను ఎంచుకోవటం ద్వారా ప్రభుత్వం కొంతమేరకు సహాయపడుతోంది. పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, ఆడపిల్లల చదువులు, కుటుంబ నియంత్రణ, పర్యావరణం వంటి అంశాలపై అనేక సంప్రదాయ బృందాలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇటువంటి ప్రదర్శనలలో చెప్పాల్సిన అంశాన్ని ఈ ప్రదర్శనలకు ప్రాయోజకులైన ప్రభుత్వమే అందచేస్తుంది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 3.
జానపద కళలు క్షీణతకు గురి అవుతున్నాయా? దీనివల్ల మన సంస్కృతికి ఎటువంటి నష్టం జరుగుతుంది? (AS4)
జవాబు:
జానపద కళలు క్షీణతకు గురి అవుతున్నాయి. దీనివల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వాన్ని కోల్పోతాయి. తరువాత తరాల వారికి వీటి గురించి తెలియకుండా పోతుంది. సాంస్కృతిక వారసత్వం ఒక దేశం యొక్క ఉనికిని నిలబెడుతుంది. అది లేకపోతే దాని ఉనికే ఉండదు.

ప్రశ్న 4.
ఆధునిక జీవితంలోని కొత్త అవసరాలకు అనుగుణంగా జానపద కళలను మలిచి వాటిని పునరుద్ధరించటం సాధ్యమవుతుందా? (AS4)
జవాబు:
సాధ్యమవదనే చెప్పాల్సి వస్తుంది. నేటి జీవనం చాలా వేగంగా ఉన్నది. టీవీలు, కంప్యూటర్లు మొదలైన వాటికి ఇంట్లో కూర్చుని చూడటానికి అలవాటు పడ్డవారు ఈ జానపద కళలను ఖర్చు పెట్టి చూస్తారా అన్నది అనుమానస్పదమే. విద్యుత్తు, ఫ్యానులు వచ్చాక విసనకర్ర అవసరం తగ్గిపోయింది. పవర్ కట్ వచ్చాక మళ్ళీ విసనకర్రలు అందరిళ్ళల్లో కనబడుతున్నాయి. అటువంటి పరిస్థితులు ఏమన్నా ఏర్పడితే తప్ప వీటికి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తేలేము.

ప్రశ్న 5.
సదిర్ నాటినుంచి భరతనాట్యంలో చోటుచేసుకున్న ముఖ్యమైన మార్పులు ఏమిటి? (AS1)
జవాబు:

  1. సదిర్ నాటి తమిళనాట ఉన్న నృత్య సాంప్రదాయం.
  2. దీనిని ఆరాధనలలో భాగంగా దేవదాసీలు దేవాలయాలలో ప్రదర్శించేవారు.
  3. నట్టువనార్లు వీరికి నాట్యం నేర్పి, ప్రక్కవాయిద్యకారులుగా ఉండి అనేక రకాలుగా సహకరించేవారు.
  4. బ్రిటిషు వారి ప్రభావంతో చదువుకున్న భారతీయులు దీనిని చిన్న చూపు చూడసాగారు.
  5. తరువాత దేవదాసీ విధానం సామాజిక దురాచారంగా మారి నిషేధించబడి, అంతమైపోయింది.
  6. ఆ విధంగా 20వ శతాబ్దం ప్రారంభంనాటికి ఈ సాంప్రదాయ నృత్య రూపం అంతరించి పోయింది.
  7. లాయరు, స్వాతంత్ర్య పోరాట యోధుడు అయిన ఇ కృష్ణ అయ్యర్, రుక్మిణీదేవి ఈ నాట్యానికి పూర్వవైభవం తీసుకుని వచ్చారు.
  8. దేవదాసీల కుటుంబాలవారైన, తంజావూరుకు చెందిన సుబ్బరామన్ నలుగురు కుమారులు ముత్తుస్వామి దీక్షితార్ గారి సంగీతంతో కలిపి దీనిని సదిర్ నుండి భరత నాట్యంగా మార్చారు.

ప్రశ్న 6.
కింద పేర్కొన్న వాళ్ళలో దేవదానీ వ్యవస్థను సమర్థించినవాళ్లు, వ్యతిరేకించినవాళ్లు, అందులో సంస్కరణలు చేయాలన్న వాళ్లు ఎవరు? (AS1)
బాల సరస్వతి, రుక్మిణీ దేవి, వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ, కృష్ణ అయ్యర్, బెంగుళూర్ నాగరత్నమ్మ.
జవాబు:
సమర్థించినవాళ్లు : బాల సరస్వతి , బెంగుళూరు నాగరత్నమ్మ.
వ్యతిరేకించినవాళ్లు. : వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ
సంస్కరణలు చేయాలన్న వాళ్లు : రుక్మిణీదేవి, కృష్ణ అయ్యర్

ప్రశ్న 7.
తమ కళ ద్వారా జీవనోపాధి పొందటం కళాకారులకు ఎప్పుడూ కట్టుగా ఉండేది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? (AS1)
జవాబు:

  1. ప్రస్తుతం కళాకారులు జీవనోపాధి సమస్యను ఎదుర్కొంటున్నారు.
  2. వీళ్ళు సంచార కళాకారులు కావటం వల్ల వాళ్ళ పిల్లలు ఆధునిక పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేదు.
  3. చివరకు వారు వారికి అలవాటులేని పనిమీద ఆధారపడి బ్రతుకుతున్నారు.

వారికి ప్రభుత్వం మద్దతును కల్పించాలి.

  1. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ఈ కళారూపాలను ఎంచుకోవడం ద్వారా కొంత సహాయం చేయవచ్చు.
  2. ప్రస్తుతం టెక్నాలజీకి అలవాటు పడిన ప్రజలు ఈ కళల గురించి తెలియని వారు చాలామంది ఉన్నారు. అందుకోసం పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఆడపిల్లల చదువులు, కుటుంబ నియంత్రణ, పర్యావరణం వంటి అనేక అంశాలపై ప్రభుత్వం ప్రకటనలను ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకటనలను ప్రభుత్వం ఈ కళారూపాల ద్వారా టెలివిజన్లలో ఇప్పించడం ద్వారా ప్రభుత్వం వారికి ఉపాధిని కల్పించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం ఏవైనా మీటింగులు, బహిరంగ సభల సమయంలో ఈ కళాకారుల ద్వారా స్టేజిషోలు ఇప్పించడం వలన వారికి కొంతమేలు జరుగుతుంది. వారికి నిరుద్యోగ భృతిని కల్పించవచ్చు. అంతరించిపోతున్న కళలను కాపాడవచ్చు. తోలుబొమ్మలాట, బుర్రకథ ఒగ్గునృత్యం ఇలాంటి వాటి ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలల్లో నెలకు ఒకసారి ఈ కళా ప్రదర్శనలను నిర్వహించడం వలన వారికి ఉపాధిని కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 8.
జానపద కళలను పునరుద్ధరించడానికి కళాక్షేత్ర వంటి సంస్థలు దోహదం చేయగలవా? (AS6)
జవాబు:
చేయగలవు. కాని యివి డబ్బున్నవారికి, ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఈ కళను అందివ్వగలవు. కాని యదార్థ వారసులకు మాత్రం అందివ్వలేవు. ఈ విధంగా కళాక్షేత్రం వంటి సంస్థలు మిశ్రమ ఫలితాలు యివ్వగలవు.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 9.
మీ ప్రాంతంలోని కళాకారులను కలిసి, వారు ప్రదర్శించే నాటకాలు, కళారూపాలతో పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:

నాటకాలు, కళారూపాలుఅంశం
పక్షివలస పక్షుల జీవనం
అంతం – అంతం – అంతం (నాటిక)ఎయిడ్స్ పై అవగాహన
ఫోర్త్ మంకీ (నాటిక)ఉగ్రవాదంపై అవగాహన
తోలు బొమ్మలాటప్రాచీన కళారూపం
బుర్రకథప్రాచీన కళారూపం
చికాగో అడ్రస్ (నాటిక)స్వామి వివేకానంద పరిచయం

8th Class Social Studies 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.227

ప్రశ్న 1.
ప్రదర్శన కళల ఫోటోలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాటిలో ఎన్నింటిని మీరు గుర్తించగలుగుతారు? ఫోటోల కింద వాటి పేర్లు రాయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు 2

ప్రశ్న 2.
వీటిలో ఏదైనా మీ ఊళ్లో ప్రదర్శింపబడటం చూశారా? మీ అనుభవాన్ని తరగతిలో పంచుకోండి.
జవాబు:
ఒకసారి శ్రీరామనవమికి మా ఊరి పందిట్లో భారతి అనే ఒక స్త్రీ భారత నాట్యాన్ని ప్రదర్శించారు. అది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్నది. ఆమె ముఖకవళికలు, అలంకరణ నాకు ఎంతో నచ్చాయి.

ప్రశ్న 3.
ప్రత్యేక సందర్భాలలో కుటుంబ సభ్యులు పాడేపాటలు, చేసే నాట్యాల గురించి మీ తల్లిదండ్రులతో, తాత, అవ్వలతో మాట్లాడి తెలుసుకోండి. సందర్భం, నమూనా పాటలతో ఒక జాబితా తయారు చేయండి. ఇటీవల కాలంలో ఈ ప్రదర్శనల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? మీరు తెలుసుకున్న విషయాలు తరగతిలో మిగిలిన విద్యార్థులతో పంచుకోండి?
జవాబు:

సందర్భంనమూనా పాట
1. సంక్రాంతి, గొబ్బిళ్ళు1. కొలను దోపరికి గొబ్బియల్లో యదుకుల సామికి గొబ్బియల్లో
2. బతుకమ్మ పండుగకు1. బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలు ఆనటి కాలన ఉయ్యాలు
2. కలవారి కోడలు కలికి సుందరి కడుగు చుంది పప్పు – కడవలో పోసి వచ్చిరి వారన్నలు – వనములుదాటి
3. అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దెఒప్పులగుప్ప, ఒయ్యారిభామ సన్నబియ్యం – చాయపప్పు అట్లతద్దె ఆరట్లోయ్ ముద్దుపప్పు మూడట్లోయ్
4. హారతి పాటలుగైకొనవే హారతీ – గౌరీ పాహి అమ్మనాదుమనవి ఆలకించవమ్మా ఆ అర్ధనారీశ్వరి, అభయము నీయవే
5. దీపావళి1. అమ్మా ! సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
2. దుబ్బు, దుబ్బు, దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి
6. దసరాదాండియా నృత్యం
7. భోగిమంటలుమంటచుట్టూ చప్పట్లు కొడుతూ నాట్యం , పాట ‘గోగులపూచే, గోగులుకాచే ఓ లచ్చా గుమ్మాడి పుత్తడి వెలుగులు చక్కగా విరిసే ఓ లచ్చా గుమ్మాడి.”

ఇటీవల కాలంలో చాలామంది వీటిని మోటుగా భావించి ఆచరించటం లేదు. కాని యింకా యివి మన రాష్ట్రంలో సజీవంగానే ఉన్నాయని చెప్పవచ్చును.

8th Class Social Textbook Page No.229

ప్రశ్న 4.
ఊరూరూ తిరిగే కళాకారులు ప్రదర్శించేవాటిని మీరు ఏమైనా చూశారా? వాళ్లు ఎవరు, ఏం చేశారు, ప్రేక్షకులు వాళ్లపట్ల ఎలా వ్యవహరించారు వంటి వివరాలను తోటి విద్యార్థులతో పంచుకోండి.
జవాబు:
మా ఊరిలో శివరాత్రికి కళ్యాణం చేసి తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుపుతారు. అందులో భాగంగా రామాయణంలో ‘లంకా దహనం’ ను తోలుబొమ్మలాటలో ప్రదర్శించారు. హనుమంతుడు ఎగురు తున్నట్లు, లంకను తగులబెట్టినట్లు, రావణుడి పదితలకాయలు, చెట్టుకింద సీతమ్మ తల్లి, ఎంత బాగా చూపించారో?

ప్రేక్షకులు అంతా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఆనందించారు. తోలు బొమ్మలను ఆడించినవారు ఒక గుంపుగా మా ఊరికొచ్చారు. 2 రోజులున్నారు. 7 గురు పెద్దవాళ్ళు 3 గురు పిల్లలు వచ్చారు. మా ఊరి వాళ్ళు వాళ్ళని ఆదరంగా చూశారు. కొందరు బియ్యం, పప్పులు, కూరగాయలు, కొందరు పాత బట్టలు, కొందరు డబ్బులు ఇచ్చారు. తరువాత వాళ్ళు మా పొరుగురుకు వెళ్ళారని మా అమ్మ చెప్పింది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 5.
అటువంటి కళాకారులు దగ్గరలో నివసిస్తూ ఉంటే వాళ్ళని కలుసుకొని వాళ్ల కళలు, జీవితాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మా యింటి దగ్గర గంగాధరం గారి కుటుంబం నివసిస్తోంది. వాళ్ళయింట్లో గంగాధరం గారు, ఆయన కొడుకు బావమరిది ముగ్గురు బుర్రకథలు చెపుతారు. చుట్టుపక్కల ఊర్లలో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రభుత్వం వారు వీరిని పిలిపిస్తారు. దీని మీద వీరికొచ్చే ఆదాయం వీరికి సరిపోదు. అందుకని సంవత్సరం పొడుగునా వ్యవసాయ కూలీలుగా పని చేస్తారు. మధ్యలో కార్యక్రమాలున్నప్పుడు వాటికి వెళతారు. వీరు వీరగాథలు, అక్షరాస్యతమీద, కుటుంబ నియంత్రణ మీద బుర్రకథలు చెబుతారు.

8th Class Social Textbook Page No.233

ప్రశ్న 6.
జాతీయ ఉద్యమకాలంలో కళాకారుల పరిస్థితులలో, వాళ్ళు ఇచ్చే ప్రదర్శనలలోని అంశాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
జవాబు:
జాతీయ ఉద్యమం తరువాత స్వాతంత్ర్య భారతంలో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ కళలను ఆదరించేవారు కరువయ్యారు. రాజులు, జమీందారులు లేకపోవటం మూలనా వీరు అనాథలయ్యారు. ప్రజలకు అనేక రకాలైన వినోదాలు అందుబాటులోకి రావడం మూలంగా వీరి ప్రదర్శనలకి గిరాకీ తగ్గింది.

బుర్రకథ :
వీరు జాతీయోద్యమ కాలంలో అనేక వీరగాథలు, బ్రిటిషువారి అకృత్యాలు కంటికి కనబడేలా తెలియ చేసేవారు. కాని నేడు యివి ప్రభుత్వ ఆదరణలో అక్షరాస్యత, ఎయిడ్స్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

తోలు బొమ్మలాట :
వీరు పురాణ గాథలను ఎంచుకుని ప్రదర్శించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా కళాకారులలోను, కళా ప్రదర్శనలలోను అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు 1

ప్రశ్న 7.
టీ.వీ, సినిమాలు ప్రధాన వినోద సాధనాలుగా మారుతున్న పరిస్థితుల్లో సంప్రదాయ జానపద కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందా? కారణాలు పేర్కొనండి.
జవాబు:
అవసరం ఉంది. మన పూర్వీకుల నుండి సంస్కృత, సంప్రదాయాలు మనకు వారసత్వంగా వచ్చాయి. ముఖ్యంగా జానపద కళల రూపంలో, అనేక వినోద సాధనాలు మన జీవితాల్లోకి వచ్చిన నేపథ్యంలో మనం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జానపద కళలు, మన జాతికి గర్వకారణాలు కాబట్టి వానిని కూడా కాపాడుకోవాలి.

ప్రశ్న 8.
జాతీయవాదులు, కమ్యూనిస్టులు జానపద కళలను పునరుద్ధరించడానికి ఎందుకు ప్రయత్నించారు?
జవాబు:
జాతీయవాదం, సామ్యవాదం వంటి కథలను ఇతివృత్తాలను వారు చేపట్టడం వల్ల వారిని బ్రిటిషు వారు, నిజాం ప్రభువులు వేధించారు. పరదేశ కళలను వ్యతిరేకించి స్వదేశీ కళలను పునరుద్ధరించే ఉద్దేశ్యంతో జాతీయవాదులు కమ్యూనిస్టులు వీటిని ప్రోత్సహించారు.

8th Class Social Textbook Page No.234

ప్రశ్న 9.
దేవదాసీ వ్యవస్థను వ్యతిరేకించేవాళ్లు, సమర్థించేవాళ్ల మధ్య చర్చ జరుగుతోందని ఊహించుకోండి. ఇరువర్గాలు చేసే . వాదనలను పేర్కొనంది. ఈ చర్యతో ఒక చిన్న రూపకం తయారు చేయండి.
జవాబు:
రామప్ప పంతులు :
అయ్యో ! యిదేం వింత? తగుదునమ్మా అని ఈ వీరేశలింగం పంతులు గారు అన్ని విషయాల్లో చేసుకుంటున్నారు? ఏమండోయ్ గిరీశంగారు ! ఇది మహాచెడ్డ కాలం సుమండీ! లేకపోతే శుభప్రదంగా భగవంతునికి దాస్యం చేయడానికి జీవితాన్ని అంకితం చేస్తుంటే దాన్ని అమానుషం అంటారేంటండి? మీరైనా చెప్పండి ! యిలా ఈ దేవదాసీ విధానాన్ని ఆపడం పాపం కదండీ!

గిరీశం : ఏమండోయ్ రామప్ప పంతులుగారు ! నేను కూడా యాంటి-నాచ్చిలో ఉన్నానండోయ్ అది సరేగాని అదే పుణ్యమైతే మరి అందరి ఆడపిల్లల్ని పంపరేంటంట. యిది ఒక కులం వాళ్ళని, వాళ్ళ బలహీనతని భగవంతుడి పేరు చెప్పి ఉపయోగించుకోవడం అని మా అభిప్రాయం.

రామప్ప పంతులు :
అయితే మధురవాణి సంగతేంటంట? ఆమెనయితే నీవు …..

మధురవాణి : హ్పప్పు………. ఏం పంతులు బావగారు ! మధ్యలో నా పేరెత్తు తున్నారు. ఏంటి సంగతి. గిరీశం గారితో మళ్ళీ ఏవైనా గొడవలాంటిది.

రామప్ప పంతులు :
అబ్బెబ్బై … అహహ…. లేదు, లేదు మధురవాణి గిరీశం గారు యాంటి- నాచ్చి అంటుంటేనూ.

మధురవాణి : అవునండి ! గిరీశం బావగారు ఈ మధ్య మారిపోయారు. దేవదాసి విధానం మంచిది కాదని, దాని రద్దు చేయాలని, ప్రభుత్వానికి అర్టీలు కూడా పంపించారు. నిజంగానే దాని మూలంగా చాలామంది ఆడవాళ్ళు అజ్ఞాతంగా ఏడుస్తున్నారు. కాబట్టి నేను కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాను. మీ సంగతేమిటి?

రామప్ప పంతులు : అది నిజమే అనుకో. కానీ ……..

గిరీశం : డామిట్ ! కథ మళ్ళీ మొదటికే వచ్చింది. కానీ లేదు గీనీ లేదు. మళ్ళీ కనిష్టీబు గారిని పిలవమందురా?

రామప్ప పంతులు : హాహా బలే వాడివోయ్ గిరీశం నేనేదో ఆలోచిస్తూ కానీ అన్నాను. ఇంతమంది స్త్రీలు బాధపడితే నేను మాత్రం ఎలా సహిస్తాను. రేపటి నుంచి నేను కూడా మీతోపాటు యాంటి-నాచ్చి లోనే….

మధురవాణి : మంచిది బావగారు ఇకనుంచైనా ఇతరుల మేలుకోరి బతకండి.

రామప్ప పంతులు : అదే మరి … ఇక నుంచి నన్ను బావగారు అనకు మధురవాణి.

మధురవాణి : సరే సరే …
జై కందుకూరి – జైజై కందుకూరి

8th Class Social Textbook Page No.235

ప్రశ్న 10.
దేవదాసీ జీవితం గడపటం ఇష్టం లేని ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కష్టాలు ఊహించుకోండి. ఆమె తన మిత్రురాలికి తన వ్యధను వ్యక్తపరుస్తూ ఉత్తరం రాసినట్టు ఊహించుకుని ఆ ఉత్తరం మీరు రాయండి.
జవాబు:
ప్రియమైన మీనాక్షి,

ఎలా ఉన్నావు? ఇక్కడ నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. ఇంతవరకు నువ్వు నాకు తోడున్నావు. యిపుడేమో ఈ కష్ట సమయంలో వేరే ఊరు వెళ్ళిపోయావు. అందుకే ఉత్తరం ద్వారా నా బాధ నీకు తెలియపరుస్తాను.

నీకు తెలుసుగా చిన్నప్పటి నుండి నాకు చదువంటే ఎంతో యిష్టమని. ఈ మధ్య నేను చదువుకో కూడదని అమ్మా, నాన్న చాలాసార్లు అంటుండడం విన్నాను. కానీ కారణం యిపుడు తెలిసింది. నన్ను దేవదాసిని చేస్తారట. మా యిలవేల్పు అయిన ఎల్లమ్మ తల్లి ! కి నన్ను యిచ్చేస్తారుట. మా సాంప్రదాయాన్ని అనుసరించి నేను నృత్యం నేర్చుకుని దేవాలయంలో గజ్జ కట్టాలిట. నేను పెళ్ళి చేసుకోకూడదట. నన్ను ఎవరు కోరుకుంటే వారితోనే ఆ రోజు జీవితం గడపాలిట. నాకు బిడ్డలు పుడితే వారు కూడా యిలా గడపాల్సిందేట. ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా మీనా ! నీకు తెలుసుగా నాకు ఇద్దరు చెల్లెళ్లు. అన్నలు, తమ్ములు లేరు. మేం అందరం పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే మా అమ్మా, నాన్నలను ఎవరు చూస్తారు. అందుకని పెళ్ళి చేయకుండా ఇలాచేస్తే వారి ముసలితనంలో వాళ్ళని నేను ఆదుకుంటానని వారి ఆశ.

నేను చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించి చూస్తానని చెప్పినా వాళ్ళు వినటం లేదు. వచ్చే నెల మొదటి గురువారం ఉదయం ముహూర్తం పెట్టారు.

మీనా నాకు యిది యిష్టం లేదు. మీ మావయ్య పోలీసుగా పనిచేస్తున్నారుగా ! నాకు సాయం చేయవూ ! ప్లీజ్ ! ఆయన్ని తీసుకుని వచ్చి మా వాళ్లకి చెప్పి భయపెట్టవూ ! లేకుంటే నువ్వు సరేనని ఉత్తరం రాయి. బస్సెక్కి నీ దగ్గరకు వచ్చేస్తా, ఏదైనా హాస్టలులో ఉండి చదువుకుంటాను. ప్లీజ్ నాకు సహాయం చేయవూ !
ఇట్లు కన్నీళ్ళతో,
నీ నేస్తం,
అరుంధతి.

8th Class Social Textbook Page No.236

ప్రశ్న 11.
ఈ నాట్యాన్ని గౌరవ ప్రదమైనదిగా చేయటానికి అందులో ఎటువంటి మార్పులు చేసి ఉంటారు?
జవాబు:
ఈ నాట్యాన్ని గౌరవ ప్రదమైనదిగా చేయటానికి చేసిన మార్పులు :

  1. ఈ నాట్యాన్ని మొదటిగా మార్చినవారు తంజావూరుకు చెందిన నట్టువనార్ సుబ్బరామన్ కుమారులు నలుగురు. వీరు ముత్తుస్వామి దీక్షితర్ వారి సహకారంతో సాదిరను భరతనాట్యంగా మార్చారు.
  2. ఇది విద్యాధికులు, బ్రాహ్మణులచే కూడా నేర్వబడింది.
  3. దీని ప్రదర్శనలో ఉన్న అసభ్యకరమైన అంశాలన్నింటినీ మార్పు చేసి ఉంటారు.
  4. దీనిని ముఖ్యంగా భక్తి పూరితంగా ప్రదర్శించి ఉంటారు.
  5. దేవదాసీలు పూర్వం వలే వ్యభిచారంతో సంబంధం లేకుండా కళాకారులుగా నాట్యాన్ని ప్రదర్శించి ఉంటారు.
  6. మహిళలకు బదులు పురుషులు ఎక్కువ దీనిని నేర్చుకుంటారు.
  7. మ్యూజిక్ అకాడమీ వేదిక మీద చోటు దొరకటం దీనికి మరింత గౌరవాన్ని ఆపాదించింది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 12.
ఈ నాట్యాన్ని పునరుద్ధరించడానికి ఇతర కులాలవాళ్లు దాన్ని హస్తగతం చేసుకోవటం ఎందుకు ముఖ్యమయ్యింది?
జవాబు:

  1. ఈ నాట్యం దేవదాసీలది.
  2. ఇది కొంత అసభ్యతతో కూడుకున్నది.
  3. తరువాత కాలంలో దేవదాసీ వ్యవస్థతోపాటు నాట్యం కూడా దురాచారంగా చూడబడింది.
  4. అందువల్ల దేవదాసీ నిషేధంతో ఈ కళ కూడా తుడిచిపెట్టుకుపోయింది.

ఈ వ్యతిరేక పరిణామాలన్నీ పక్కన పెట్టి నాట్యాన్ని కళగా చూడటానికి, ప్రదర్శించడానికి, అందరి ఒప్పుకోలు పొందడానికి ఇతర కులాలవాళ్ళు దాన్ని హస్తగతం చేసుకోవటం ముఖ్యమైంది.

ప్రశ్న 13.
ఒక వైపున సంప్రదాయంగా ఈ నాట్యం చేస్తున్న వాళ్లని దాంట్లో కొనసాగనివ్వలేదు. ఇంకోవైపున దానిని గౌరవప్రదంగా మార్చటానికి ఇతర కులాల వాళ్లు దానిని చేజిక్కించుకున్నారు. ఈ మార్పులలో ఏదైనా అన్యాయం జరిగిందా?
జవాబు:
నిజం చెప్పాలంటే భారతదేశంలో దేవదాసీ వ్యవస్థను నిర్మూలించినా అది ఇంకా అనధికారికంగా కొనసాగుతూనే ఉంది.

ప్రభుత్వం ఈ సంప్రదాయంలోని చెడుని నిషేధించి కళను కొనసాగించేలా వారిని ప్రోత్సహిస్తే బాగుండేది. కాని యిపుడు వ్యవస్థ మారలేదు, వారికున్న కళావారసత్వం మాత్రం దూరమయ్యింది. మరి ఈ మార్పులలో అన్యాయమే జరిగిందని చెప్పవచ్చు.

8th Class Social Textbook Page No.237

ప్రశ్న 14.
నట్టువనార్ల ప్రత్యేక పాత్ర ఏమిటి? వాళ్ల పాత్రను నాట్యం చేసే వాళ్లే చేపడితే భరతనాట్యం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది?
జవాబు:
నట్టువనార్లు దేవదాసీలకు పుట్టిన మగ సంతానంవారే తరవాతి తరం దేవదాసీలకు గురువులయ్యే వారు. వీరు తరతరాలుగా తమ సాంప్రదాయాలను కాపాడుకుంటే వచ్చారు. పునరుద్ధరణ సమయంలో ఇతర కులాల నుండి వచ్చిన వాళ్ళకు కూడా దేవదాసీలు, నట్టువనార్లే శిక్షణ నిచ్చారు. నట్టువనార్లు తమ శిక్షణ కార్యకలాపాలను మళ్ళీ ప్రారంభించగలిగారు. వీరి గ్రామాల పేర్లతో ప్రఖ్యాతి గాంచిన వైవిధ్య భరిత నాట్యరీతులు గుర్తింపు పొందాయి.

కాని ప్రస్తుత కాలంలో ఈ కళారూపానికి నట్టువనార్లు కాక నాట్యం చేసే వాళ్ళే సంరక్షకులుగా మారారు. దీనివలన నాట్య నాణ్యత బోధన దెబ్బ తింటోంది. నట్టువనార్ల వారసత్వం దెబ్బ తింటోంది. అంతేకాక నాట్యంలో అనేక కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. చేసుకుంటున్నాయి. ఇది నాణ్యతను ప్రాచీనతను దెబ్బ తీస్తోంది.

ప్రశ్న 15.
కళాక్షేత్ర వంటి ఆధునిక సంస్థలను ఏర్పాటు చేయటం వల్ల కళపైన, కళాకారులపైన ఎటువంటి ప్రభావం పడింది?
జవాబు:
కళాక్షేత్ర వంటి ఆధునిక సంస్థలను ఏర్పాటు చేయడం వలన కళకున్న అభ్యంతరాలన్నీ తొలగిపోయి అది జనాధారణ పొందింది. ఇది కళాకారులను, వాద్యకారులను ఆకర్షించింది. నాట్యం వినోదం స్థాయినుండి విద్య స్థాయికి ఎదిగింది.

కళాకారులు దీనికి ఆకర్షితులయ్యారు. కులంతో సంబంధం లేకుండా కళాభిరుచి ఉన్నవారందరూ అనేక ప్రదర్శనలు యిచ్చి కళకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అంతేకాక తిరిగి వీరు శిక్షకులుగా మారి దీనిని, ముందుతరాలకు తీసుకుని వెళ్ళుచున్నారు.

ప్రశ్న 16.
భరతనాట్యానికి వచ్చిన విపరీత ప్రజాదరణ దానికి ఎలా తోడ్పడింది? ఏ కొత్త సమస్యలకు కారణమయ్యింది?
జవాబు:
తోడ్పాటు :
ఈ కళా రూపానికి నట్టువనార్లు కాకుండా నాట్యం చేసేవాళ్లు సంరక్షకులుగా మారారు. పునరుద్ధరణ కాలంలో నాట్యంలో శిక్షణనిచ్చిన నట్టువనార్లే ఆ వారసత్వానికి చెందిన ఆఖరి తరం. నాట్యం నేర్చుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉండటం వల్ల శిక్షణ కేవలం నట్టువనార్లకు పరిమితం కాలేదు. కళాక్షేత్ర వంటి సంస్థలలో శిక్షకులుగా శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన నాట్యకారులు ముందుతరాలకు దీనిని నేర్పిస్తున్నారు. అంతేకాదు చాలామంది విద్యార్థులు నాట్యకారుల నుంచి వ్యక్తిగతంగా కూడా దీనిని నేర్చుకుంటున్నారు. ప్రదర్శనలలో నట్టువనార్లు పోషించిన పాత్రను ప్రత్యేక శిక్షణ పొందిన సంగీత వాయిద్యకారులు. నాట్యకారులు తీసుకున్నారు.

సమస్యలు :
భరతనాట్య ప్రదర్శనలో ఖర్చులు తగ్గించడానికి చాలామంది రికార్డు చేసిన సంగీతాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. ప్రదర్శనల ద్వారా నేడు నాట్యకారులు జీవనోపాధిని సాధారణంగా పొందలేరు. కొన్ని మినహాయింపులు తప్పించి భరతనాట్యం ఈనాడు కుటుంబ మద్దతు ఉన్నవారికి రెండవ ఉపాధిగానే ఉంది. కొంతమంది మాత్రమే ఈ నాట్యం నేర్చుకోటానికి, నాట్యకారులుగా ఎదగటానికి తమ జీవితమంతా అంకితం చేయగలుగుతున్నారు. డబ్బులు సంపాదించటానికి నాట్యకారులు తమ వృత్తి జీవిత తొలి సంవత్సరాలలోనే దీనిని ఇతరులకు నేర్పటం మొదలు పెడుతున్నారు. ఇది వారి నాట్య నాణ్యతనే కాకుండా వారి బోధనను కూడా ప్రభావితం చేస్తుంది.

నట్టువనార్లు లేకుండా మరింతమంది నాట్యకారులు బోధకులుగా మారటంతో తరతరాలుగా సంప్రదాయంగా నాట్యరూపాన్ని కాపాడుతూ వచ్చిన వారసత్వానికి తెరపడింది. కొంతమంది శిక్షకుల చేతిలో కాకుండా అనేకమంది నాట్యకారులు భరతనాట్యాన్ని బోధించటం వల్ల దీంట్లో కొత్త కొత్త మార్పులు వచ్చే అవకాశాలు పెరిగాయి.

ప్రశ్న 17.
1986లో నాజర్ వలీకి వచ్చిన బిరుదు ఏది?
జవాబు:
1986లో నాజర్ వలీకి వచ్చిన బిరుదు పద్మశ్రీ .

ప్రశ్న 18.
నాజర్ వలీ ఎవరు?
జవాబు:
నాజర్ వలీ బుర్రకథకుడు.

ప్రశ్న 19.
నాజర్ వలీ జీవిత చరిత్ర ఏ పేరుతో విడుదలైంది?
జవాబు:
నాజర్ వలీ జీవిత చరిత్ర ‘పింజారి’ పేరుతో విడుదలైంది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 20.
బుర్రకథను కోస్తా ఆంధ్రలో ఏమంటారు?
జవాబు:
బుర్రకథను కోస్తా ఆంధ్రలో జంగమకథ అంటారు.

ప్రశ్న 21.
నాట్యశాస్త్ర రచయిత ఎవరు?
జవాబు:
నాట్యశాస్త్ర రచయిత భరతుడు.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

SCERT AP 8th Class Social Study Material Pdf 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 20th Lesson లౌకికత్వం – అవగాహన

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ పరిసర ప్రాంతాలలో వివిధ మత ఆచారాల జాబితా తయారుచేయండి – రకరకాల ప్రార్థనలు, దేవుడిని కొలిచే విధానాలు, పవిత్ర స్థలాలు, భక్తి పాటలు, సంగీతం మొదలైనవి. మత ఆచరణ స్వేచ్ఛను ఇది సూచిస్తోందా? (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన 1

ప్రశ్న 2.
మా మతం శిశుహత్యలను అనుమతిస్తుంది అని ఒక మత ప్రజలు అంటే ప్రభుత్వం అందులో జోక్యం చేసుకుంటుందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
చేసుకుంటుంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
కారణాలు :

  1. భారతదేశ లౌకికవిధానం మతాలలో జోక్యం చేసుకుంటుంది.
  2. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.

ప్రశ్న 3.
ఒకే మతంలో భిన్న దృక్పథాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను సేకరించండి. (AS1)
జవాబు:
మనం దీనికి ఉదాహరణగా బౌద్ధమతంను తీసుకుందాము.

బుద్ధుని బోధనలను అనుసరించేవారిని బౌద్ధులు అని అంటాము. వీరు ఆచరించే విధానాలను బౌద్ధమతం అని చెప్పుకుంటాము. అయితే దీనిలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి.

  1. తేరవాదం
  2. మహాయానం
  3. వజ్రయానం

1) తేరవాదం :
తేరవాదులు ఎవరికి వారే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని నమ్ముతారు.

2) మహాయానం :
వీరు ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నిస్తూనే ఇతరులకు కూడా ఆ స్థాయి రావడానికి సహాయం చేయాలని భావిస్తారు.

3) వజ్రయానం :
ఇతరులకు సహాయం చేయటమేకాక వారిని ఆ స్థాయికి తేవడానికి తగిన శక్తిని కలిగి ఉండాలని భావిస్తారు.

ఈ విధంగా ఒకే మతంలో విభిన్న దృక్పథాలు ఉంటాయి.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 4.
భారత రాజ్యం మతానికి దూరంగా ఉంటుంది. మతంలో జోక్యం చేసుకుంటుంది. ఈ భావన గందరగోళం సృష్టించవచ్చు. ఈ అధ్యాయంలో ఇచ్చిన ఉదాహరణలతో పాటు మీకు అనుభవంలోకి వచ్చిన / తెలిసిన ఇతర ఉదాహరణలతో దీనిని మరోసారి చర్చించండి. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగం లౌకిక విధానాన్ని అవలంబిస్తూనే మత విధానాలలో జోక్యం చేసుకుంటుంది. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.
ఉదా :

  1. హిందూమతంలోని ‘అంటరానితనాన్ని’ నిషేధించింది.
  2. భారతదేశ ముస్లిం మహిళలు వారి మతధర్మం ప్రకారం విడాకులు పొందినా, భారతదేశంలో కోర్టుకు వెళ్ళినట్లయితే వారికి భరణం ఇవ్వాల్సిందిగా నిర్దేశించినది. (షాబానోకేసు)
  3. శిశు విద్యా మందిరం, ఆర్.సి.యం పాఠశాలలు, ఉర్దూ పాఠశాలలు మొదలగునవి మతపరమైన విద్యాలయాలు అయినా వాటికి ప్రభుత్వం ఆర్ధిక మద్దతు అందిస్తుంది.
  4. అదే విధంగా వారసత్వంలో సమాన ఆస్తిహక్కును కాపాడటానికి ప్రజల మత ఆధారిత పౌర చట్టాలలో రాజ్యం జోక్యం చేసుకోవలసిరావచ్చు.
  5. మన ప్రభుత్వం తరఫున ఒంటిమిట్ట రాములవారి కళ్యాణానికి ప్రభుత్వ లాంఛనాలతో ముత్యాలు, పట్టువస్త్రాలు మొదలైనవి పంపుతారు. వీటిని ముఖ్యమంత్రి లేదా ఒక మంత్రిస్థాయిలోని వారు తీసుకుని వెళతారు.
  6. రంజాన్ మాసంలో ప్రభుత్వ శాఖలలో పనిచేసే ముస్లింలకు నమాజుకు ప్రభుత్వం సమయం కేటాయిస్తూ పనివేళలు మారుస్తుంది.

ఈ విధంగా మన రాజ్యాంగం లౌకికంగానే ఉంటూ మతపరమైన విషయాలలో జోక్యం చేసుకుంటుంది.

ప్రశ్న 5.
లౌకికవాదం అంటే ఏమిటి ? అన్న భాగం చదివి దానిపై వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:

  1. ప్రభుత్వంలో మతవరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.
  2. భారతదేశం లౌకికంగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది.
  3. అందుచే అది మతానికి దూరంగా ఉంటుంది.
  4. ఆధిపత్య నివారణకు, జోక్యం చేసుకోకుండా ఉండటం అన్న విధానాన్ని అనుసరిస్తుంది.
  5. అవసరమైతే భారత రాజ్యం మతంలో జోక్యం చేసుకుంటుంది.

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన InText Questions and Answers

8th Class Social Textbook Page No.223

ప్రశ్న 1.
ఈ అధ్యాయానికి పైన ఉన్న పరిచయాన్ని మరొకసారి చదవండి. ఈ సమస్యకు ప్రతీకార చర్య సరైనది ఎందుకు కాదు? వివిధ బృందాలు ఈ పద్ధతిని అనుసరిస్తే ఏమవుతుంది?
జవాబు:
పై పేరాను చదివిన తర్వాత ప్రతీకార చర్య సరైనది కాదు. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామిక, లౌకికవాద దేశం. సంస్కృతి, సాంప్రదాయాలకు, మత సామరస్యానికి ప్రతీక. అలా చేయడం వలన మత విద్వేషాలు పెరుగుతాయి. అధికులు ఎక్కువగా ఉన్న మతవాదులు, అల్పజన మతంపై దాడులు చేస్తే మత స్వేచ్ఛకు భంగం కలిగి, భారతదేశం లాంటి శాంతి కాముక దేశ ఆదర్శవాదం దెబ్బతింటుంది.

8th Class Social Textbook Page No.224

ప్రశ్న 2.
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చా ? తరగతిలో చర్చించండి.
జవాబు:
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చు. ప్రపంచంలో చాలా మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నవే ఉన్నాయి.
ఉదా :
వీటినన్నింటిని పరిశీలించినట్లయితే అన్ని ముఖ్యమైన మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నాయని తెలుస్తోంది.

8th Class Social Textbook Page No.225

ప్రశ్న 3.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే భారత లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.

8th Class Social Textbook Page No.226

ప్రశ్న 4.
ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా, రాజ్యాంగంలోని లౌకిక ఆదర్శాలు ఉల్లంఘింపబడిన ఘటనలు విన్నారా? మతం కారణంగా వ్యక్తులు వేధింపబడి, చంపబడిన ఘటనలు విన్నారా?
జవాబు:
ఇటీవల కాలంలో అంటే 11 సంవత్సరాల క్రితం 2002 లో ఇటువంటి ఘటనలు జరిగాయని మా పెద్దలు చెప్పుకోగా విన్నాము.

ఫిబ్రవరి 22వ తేదీ, 2002 ….

కొంతమంది రామభక్తులు అయోధ్య వెళ్ళి తిరిగి వస్తున్నారు. గుజరాత్ లో ‘గోద్రా’ రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే వీరి భోగీలపై ఒక ముస్లింల గుంపు దాడిచేసి కంపార్టుమెంటును తగులబెట్టారు.

ఇందులో 58 మంది హిందువులు ఉన్నారు. వీరిలో 25 మంది స్త్రీలు, 15 మంది పిల్లలు ఉన్నారు. వీరందరూ మరణించారు. ఇది ముందే ప్లాన్ చేయబడినదని తరువాత జరిగిన విచారణలు తెలియచేశాయి.

దీని కారణంగా హిందూ – ముస్లింల మధ్య అనేక మతపరమైన అల్లర్లు జరిగాయి. వీటి మూలంగా 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోగా ఎంతోమంది ఇళ్ళనూ, ఆస్తులనూ కోల్పోయారు.

అయితే ఈ సంఘటనలో చెప్పుకోదగిన విశేషమేమిటంటే రాజ్యాంగంలోని ఆదర్శాలను గౌరవించాల్సిన మునిసిపల్ కౌన్సిలర్, మునిసిపల్ ప్రెసిడెంట్ ఇరువురూ కూడా ఈ గుంపు మధ్యలో ఉండి ఈ మారణకాండను నడిపించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ సంగతి విని మేము చాలా బాధపడ్డాము. ఇది మనదేశ లౌకికత్వానికి మాయని మచ్చ.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 5.
ఈ క్రింది పేరాను చదివి రెండు ప్రశ్నలను తయారు చేయండి.

లౌకికవాదంలో ముఖ్యమైన అంశం ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరుచేయటం. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఒకటికంటే ఎక్కువ మతాల ప్రజలు నివసిస్తుంటారు. ఈ మతాలలో ఏదో ఒకటి అధిక ప్రజలను కలిగి ఉంటుంది. అధిక సంఖ్యలో ఉన్న మత బృందం ప్రభుత్వాధికారంలోకి వస్తే, ఈ అధికారాన్ని, ఆర్థిక వనరులను వినియోగించుకుని ఇతర మతాలకు చెందిన వ్యక్తులను వేధించవచ్చు, వివక్షతకు గురిచేయవచ్చు. అధిక సంఖ్యాకుల ఆధిపత్యం వల్ల ఈ అల్పసంఖ్యాక ప్రజలు వివక్షత, ఒత్తిడికి గురికావచ్చు. ఒక్కొక్కసారి చంపబడవచ్చు. అధిక సంఖ్యలో ఉన్నవాళ్లు తేలికగా తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళని వాళ్ల మతాన్ని పాటించకుండా చేయవచ్చు. మతంలో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ ప్రజాస్వామిక సమాజం ఇచ్చే హక్కులు మత ఆధిపత్యం వల్ల ఉల్లంఘింపబడతాయి. అంటే అధిక సంఖ్యాకుల పెత్తనాన్ని ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడకుండా” చూడాలన్నా ప్రజాస్వామిక సమాజాలలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం చాలా ముఖ్యమవుతుంది.

వ్యక్తులకు వారి మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని స్వీకరించడానికి, మత బోధనలను భిన్నంగా విశ్లేషించ డానికి, స్వేచ్ఛను కాపాడటానికి కూడా ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం ముఖ్యమవుతుంది.
జవాబు:

  1. మత మార్పిడులు ‘అధిక సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా? అల్ప సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా?
  2. ప్రభుత్వాధికారం నుండి మతాన్ని వేరు చేయటం ఎందుచే ముఖ్యమవుతుంది?

ప్రశ్న 6.
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.

2004 ఫిబ్రవరిలో ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ, యూదుల టోపీ, క్రైస్తవ శిలువలు వంటి మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్ధులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. ఫ్రాన్స్ కింద ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్న అల్జీరియా, ట్యునీసియా, మొరాకో దేశాల నుంచి వచ్చి ఫ్రాన్స్ లో నివసిస్తున్న వాళ్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1960లలో ఫ్రాన్స్ లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆ దేశాల నుంచి వలస వచ్చి పనిచేయటానికి వీసాలు ఇచ్చింది. ఈ వలస కుటుంబాల ఆడపిల్లలు బడికి వెళ్లేటప్పుడు తలకి గుడ్డ కట్టుకుంటారు. ఈ చట్టం చేసిన తరువాత తలకి గుడ్డ కట్టుకున్నందుకు ఈ పిల్లలు బడి నుంచి బహిష్కరించబడ్డారు.
అ) ఫ్రాన్స్ ఏమి చట్టం చేసింది?
జవాబు:
మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది.

ఆ) ఈ చట్టాన్ని ఎవరు వ్యతిరేకించారు?
జవాబు:
ఫ్రాన్సుకు వలస వచ్చినవారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇ) చట్టం ఎప్పుడు చేయబడింది?
జవాబు:
2004 ఫిబ్రవరిలో

ప్రశ్న 7.
లౌకికవాదం అంటే ఏమిటి?
జవాబు:
ప్రభుత్వంలో మతపరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.

ప్రశ్న 8.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.

ప్రశ్న 9.
బౌద్ధమతంలో ఎన్ని రకాల దృక్పథాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
బౌద్ధమతంలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి. అవి

  1. తేరవాదం
  2. మహాయానం
  3. వజ్రాయానం

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 10.
ఏ దేశంలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు?
జవాబు:
సౌదీ అరేబియాలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
“పాశ్చాత్య విద్య, క్రైస్తవ మత ప్రచారాలు భారతదేశంలోని సామాజిక మత సంస్కరణ ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి” – దీనితో నీవు ఏకీభవిస్తావా? ఎందుకు? (AS2)
జవాబు:
ఏకీభవిస్తున్నాను ఎందుకనగా :
యూరోపియన్ కంపెనీలతో పాటు అనేకమంది క్రైస్తవ మత ప్రచారకులు భారతదేశంలో క్రైస్తవ మతాన్ని బోధించటానికి వచ్చారు. అప్పటి స్థానిక మత ఆచరణలను, నమ్మకాలను వాళ్లు తీవ్రంగా విమర్శించి క్రైస్తవ మతం పుచ్చుకోమని ప్రజలకు బోధించసాగారు. అదే సమయంలో వాళ్లు అనేక విద్యాసంస్థలు, ఆసుపత్రులు నెలకొల్పారు. పేదలకు, అవసరమున్న ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో దాతృత్వపనులు చేపట్టారు. ఇది ప్రజలలో కొత్త ఆలోచనలు రేకెత్తడానికి దోహదపడింది.

అనతి కాలంలోనే ఈ మత ప్రచారకులకూ, హిందూ, ఇస్లాం మతనాయకులకూ మధ్య తమతమ మత భావనలను సమర్థించుకునే చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల వల్ల ప్రజలకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలియటమే కాకుండా తమ తమ మతాలలోని మౌలిక సూత్రాలను తరచి చూసేలా చేసింది. అనేక యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి, అనువదించి, పుస్తకాలుగా ప్రచురించారు. ప్రాచ్య దేశాల పుస్తకాలు చదివారు. పురాతన సంస్కృత, తమిళ, తెలుగు, పర్షియన్, అరబిక్ పుస్తకాలు ఐరోపా భాషలలోకి అనువదించడంతో దేశ సంపన్న, వైవిధ్యభరిత సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ గుర్తించారు. వారి మతాలలోని తమ భావనలను కొత్తగా వ్యాఖ్యానించడానికి వీలు కలిగింది.

ప్రశ్న 2.
సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రాముఖ్యత ఏమిటి? (AS1)
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రముఖ పాత్ర వహించింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 3.
అనేక దేవుళ్లను ఆరాధించటం, విగ్రహారాధన, సంక్లిష్ట సంప్రదాయాలు వంటి వాటిని మాన్పించటానికి మత సంస్కరణలు ప్రయత్నించాయి. ఈ సంస్కరణలను ప్రజలు ఆమోదించారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS2)
జవాబు:
అనేక దేవుళ్ళు, దేవతలను, గుడిలో విగ్రహాలను ఆరాధించటం, బ్రాహ్మణ పూజారులను పూజించటం, బలులు ఇవ్వటం, హిందూమతంలోని మౌడ్యం, మూఢాచారాలను వదలి పెట్టడానికి మతసంస్కరణ ఉద్యమాలు ప్రయత్నించి ఫలితాలు సాధించాయి. సనాతన, సాంప్రదాయ ఆచారాలు, పద్ధతులు వదలి పెట్టడానికి ప్రజలు ఒప్పుకోలేదు సరికదా అనేక దాడులకు దిగారు. ముస్లింలలో కూడా సంస్కరణలకు అంగీకరించక, సనాతన మతాచారాలు కొనసాగించారు. ఆధునిక విజ్ఞానం, తత్వశాస్త్రాలను బోధించే ఆంగ్ల విద్యను సైతం మౌఖ్యాలు తిరస్కరించారు.

కాని తదనంతర కాలంలో చర్చోపచర్చలు ఒకరి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నాక, యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళలపట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం, ఆంగ్లవిద్య ఆవశ్యకతను తెలుసుకున్న ప్రజలు మార్పును అంగీకరించి తమ జీవితంలో కొత్త కోణం ఆలోచించారు.

ప్రశ్న 4.
రమాబాయి వంటి వ్యక్తులు వితంతువుల పరిస్థితిపై ప్రత్యేక కృషి ఎందుకు చేశారు? (AS1)
జవాబు:
రమాబాయి, సావిత్రీబాయి ఫూలే వంటి వ్యక్తులు మహిళలకు ప్రత్యేకించి వితంతువులకు సహాయపడటానికి జీవితాలను అంకితం చేసారు. వితంతు మహిళలపై సమాజం చాలా చిన్న చూపు చూసింది. సమాజంలో అపశకునంగా, దుశ్శకునంగా భావించి, బయట తిరగనిచ్చేవారు కాదు. తెల్లచీర కట్టి, గుండు చేయించి, పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు సుమంగళులైన ఇతర మహిళలు వెళ్ళే కార్యక్రమాలకు వెళ్ళకూడదు. భర్త చనిపోవడమే ఆమె దురదృష్టం. ఆమె నుదుట మీద అనేక కష్టాలు ఉన్నాయి, ఇంకా ఈ కట్టుబాట్లు పేరుతో వితంతువులను హింసించడం సామాజిక దుశ్చర్యగా రమాబాయి వంటి సంస్కర్తలు ప్రతిఘటించారు. ఆత్మస్టెర్యం పెంచి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు సమాజం మెచ్చేటట్లు వితంతువులు బ్రతికేందుకుగాను వృత్తి విద్యలు, స్వయం ఉపాధి పథకాలు అందించారు. వితంతువులు విద్యావంతులైతే మార్పు వస్తుందని భావించి, బొంబాయి లాంటి పట్టణాలలో “శారదాసదన్” వంటి పాఠశాలలు, ఆశ్రమాలు ఏర్పరిచి, ఆత్మ విశ్వాసం పెంచేటట్లు కృషి చేసారు.

ప్రశ్న 5.
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర వివరించండి. (AS1)
జవాబు:
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర :

  1. రాజారాంమోహన్ రాయ్ బెంగాల్ లో 1772లో జన్మించాడు.
  2. అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అన్నింటిలోని సారం ఒకటేనని గ్రహించాడు.
  3. ఇతరుల మతాలను విమర్శించవద్దన్నాడు.
  4. హేతు బద్ధంగా ఉన్న, ప్రయోజనకరమైన మత భావనలను అంగీకరించమన్నాడు.
  5. అనేక రచనలు చేసి ప్రజల్లో తన భావజాలాన్ని నింపాడు.
  6. ‘బ్రహ్మసమాజం’ను స్థాపించాడు.
  7. ‘సతి’ ని నిర్మూలించడానికి తోడ్పడ్డాడు.
  8. స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డాడు.

ప్రశ్న 6.
ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించటంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? (AS1)
జవాబు:

  1. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్’ ముస్లింలకు, బ్రిటిషు వారికి మధ్య నున్న శత్రుత్వం అంతం కావాలని భావించాడు.
  2. ప్రగతి సాధనకు ముస్లింలు ప్రభుత్వంలో పాల్గొంటూ, ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద వాటా పొందాలని భావించాడు.
  3. ఆధునిక విద్య ద్వారా మాత్రమే ఇది సాధ్యమని భావించారు. అందుకే ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 7.
‘అంటరాని’ కులాలను మిగిలిన వాటితో సమానంగా చేయటానికి వివిధ నాయకులు వివిధ పద్ధతులను అనుసరించారు. ఫూలే, భాగ్యరెడ్డి వర్మ, నారాయణ గురు, అంబేద్కర్, గాంధీజీ వంటి నాయకులు సూచించిన చర్యల జాబితాను తయారు చేయండి. (AS3)
జవాబు:
అనాదిగా సమాజంలో అట్టడుగు వర్గాలైన శ్రామిక ప్రజలను శూద్రులుగా, అంటరాని వాళ్ళుగా చూపేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు వంటి వాళ్ళు, వీళ్ళను దేవాలయములోనికి ప్రవేశం కల్పించలేదు. అందరిలా నీళ్ళు తోడుకోవడానికి, చదవటం, రాయటం నేర్చుకోనిచ్చే వాళ్ళు కాదు. మత గ్రంథాలను చదవనివ్వలేదు. గ్రామాలలో రెండు గ్లాసుల పద్ధతి అమలయ్యేది. ఉన్నత కులాలకు ! సేవ చేయటమే వీళ్ళ పనని భావించారు. ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా జ్యోతిబాపూలే, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్, గాంధీజీ, నారాయణగురు వంటివారు పోరాడారు. వీళ్ళకై జీవితాలను అంకితం చేసారు.

జ్యోతిబాపూలే :
ఉన్నతులమని భావించే బ్రాహ్మణులు వంటి వారి వాదనను ఖండించాడు. శూద్రులు (శ్రామిక కులాలు), అతిశూద్రులు (అంటరానివాళ్ళు) కలసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు. సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయటానికి “సత్యశోధక సమాజ్” అన్న సంస్థను స్థాపించాడు. అంటరాని వాళ్ళుగా భావించే మహర్, మాంగ్ కులాలకు చెందిన వాళ్ళకొరకు పాఠశాలను స్థాపించి, తాను తన భార్య సావిత్రి పూలే కృషి చేసారు.

డా||బి. ఆర్. అంబేద్కర్ :
బాల్యంలోనే తానే స్వయంగా కుల వ్యవస్థను సంస్కరించడానికి నడుము కట్టాడు. 1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కొరకు, ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్ళు ఉపయోగించుకొనే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాడు. “భారతదేశ రాజకీయ భవిష్యత్తు” సమావేశంలో సైతం దళితుల హక్కుల కొరకు కృషి చేసి, దళితులకు రిజర్వేషన్లు సాధించాడు. దళితుల సంక్షేమానికి “ఇండిపెండెంట్ లేబర్ పార్టీని” స్థాపించాడు. రాజ్యాంగ రచనలో, కూడా అంటరానితనాన్ని రూపు మాపడానికి అనేక అధికరణలు పొందుపరిచారు.

మహాత్మాగాంధీ :
మహాత్మాగాంధీ అంటరానితనం నిర్మూలన కొరకు విశేషంగా కృషి చేసారు. అంటరాని కులాల వాళ్ళకు గాంధీజీ ‘హరిజనులు’ అని నామకరణం చేసాడు. అంటే “దేవుడి ప్రజలు” అని పేరు పెట్టాడు. దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి వాటిల్లో ప్రవేశ హక్కులు, సమాన హక్కులు కల్పించాలని ఆశించాడు.

నారాయణగురు :
మనుషులందరిదీ “ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణగురు. ఈయన కులవివక్షతను పాటించని దేవాలయాలను స్థాపించాడు. బ్రాహ్మణపూజారులు లేని పూజా విధానాన్ని అనుసరించాడు. “గుడులు కట్టటం కంటే బాలలకు బడులు కట్టటం ఎంతో ముఖ్యమని చెప్పాడు.

భాగ్యరెడ్డి వర్మ :
దళితుల సంక్షేమం, హక్కుల కొరకు విశేషంగా కృషి చేసినవాడు భాగ్యరెడ్డి వర్మ. దళితులే ఈ ప్రాంత , మూలవాసులని, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను అణచివేసారని చెప్పాడు. కాబట్టి దళితులు “ఆది ఆంధ్రులు” అని పిలుచుకోవాలని చెప్పాడు. దళితులలో చైతన్యం నింపడానికి, 1906లో “జగన్ మిత్రమండలి భాగ్యరెడ్డి, ప్రారంభించాడు. దళిత బాలికలను దేవదాసీలు లేదా జోగినులుగా మార్చడాన్ని వ్యతిరేకించాడు.

ప్రశ్న 8.
ఈనాటికి కూడా కులం ఎందుకు వివాదాస్పద విషయంగా ఉంది? వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమం ఏది? (AS4)
జవాబు:
‘కులం’ అనేది వాస్తవానికి వ్యక్తిగతమయిన ఆచారం. ఇది వారి వారి ఆచార, వ్యవహారాల వరకు పాటించుకోవాలి. అంతేకాక ఎవరి కులం వారికే గొప్పగా అనిపిస్తుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన కుటుంబ కార్యక్రమాల్లో ‘కులం’ అనేది ఇప్పటికే పునాదిగా నిలబడి ఉంది. దీన్ని దాటడానికి అగ్ర వర్ణాలుగా పిలువబడేవాళ్ళు, నిమ్న కులాలుగా పిలువబడే వాళ్ళు, ఎవరు కూడా ఒప్పుకోరు. అయితే ఈ ‘కులాన్ని’ సంఘపరమైన విషయాలలోకి తేవడం మూలంగా ఇది వివాదాస్పద విషయంగా ఉంటోంది.
ఉదా :
ఇరువురు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వస్తే అది రెండు కులాల మధ్య వివాదం తెచ్చి పెడుతోంది.

వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమంగా ‘సత్యశోధక్ సమాజ్’ జరిపిన ఉద్యమం ముఖ్యమైన ఉద్యమంగా చెప్పుకోవచ్చు.

ప్రశ్న 9.
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కర్ ఏమి సాధించదలుచుకున్నాడు? (AS1)
జవాబు:
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కరు మానవులందరూ భగవంతుడి దగ్గర ఒక్కటేనని, భగవంతుడిపై అందరికీ సమాన హక్కులుంటాయని చెప్పదలచుకున్నాడు.

ప్రశ్న 10.
భారత సమాజంలోని సామాజిక మూఢాచారాలు లేకుండా చేయటంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా దోహదపడ్డాయి? ఈనాడు ఎటువంటి సామాజిక మూఢాచారాలు ఉన్నాయి? వీటిని ఎదుర్కోటానికి ఎటువంటి సంఘ సంస్కరణలు చేపట్టాలి? (AS4)
జవాబు:
భారత సమాజంలో పూర్వకాలం నుండి కూడా అనేక సామాజిక మూఢాచారలు కులవివక్ష, మతోన్మాదం, స్త్రీలపట్ల వివక్షత బాల్యవివాహాలు, సతీసహగమనం, పరదాపద్ధతి, వితంతు స్త్రీల జీవనం వంటి సామాజిక మూఢాచారలు ఉండేవి. అయితే రాజారామ్మోహన్ రాయ్ సనాతన ఆచారాలను తిరస్కరించడమే కాకుండా “సతీ” సతీసహగమనం లాంటి సాంఘిక దురాచారాలను దూరం చేసాడు. బ్రహ్మసమాజం ద్వారా విరివిగా కృషి చేసి, ప్రజలలో చైతన్యం తేవడానికి కంకణం కట్టుకున్నాడు. దయానంద సరస్వతి ఆర్యసమాజం ద్వారా అనేక దేవుళ్ళు, దేవతలను గుడిలో, విగ్రహారాధన, కుల వ్యవస్థను ఖండించాడు “సత్యార్థ ప్రకాష్” గ్రంథం ద్వారా ప్రజలను మేల్కొలిపాడు. ముస్లిం సమాజంలోని సనాతన మత దురాచారాలను రూపు మాపడానికి, ఆంగ్ల విద్య ద్వారా సంస్కరణ చేయాలని, పరదా పద్దతి వంటి దురాచారాలను దూరం చేయడానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ “విజ్ఞాన శాస్త్ర సంఘం” ద్వారా కృషి చేసాడు. జ్యోతిబాపూలే, నారాయణగురు, కందుకూరి, రమాబాయి సరస్వతి వంటి సంస్కర్తలు అనేక ఉద్యమాలు ద్వారా కులవివక్ష, బాల్యవివాహాల నిషేదం, వితంతు పునర్వివాహం, వంటి వాటిని అణచడానికి కృషి చేసాడు.

ఈనాటికి కూడా మతోన్మాదం, కులవివక్ష స్త్రీలపై దాడులు, బాలికలకు విద్య లేకపోవడం వంటి సామాజిక నేరాలు మనం గమనించవచ్చు. వీటిని దూరం చేయడానికి ప్రజలలో మార్పు రావాలి. విద్యావంతులు కావాలి. చైతన్యవంతులు కావాలి. చట్టాలు, హక్కులు, న్యాయస్థానాలను గౌరవించాలి. స్త్రీలకు సమాన హోదా, కల్పించి, ప్రోత్సహించాలి. కులవివక్షతను రూపు మాపడానికి విద్యార్థి దశనుండే సమగ్రత భావాలు పెంపొందించాలి. అన్ని మతాల సారం ఒక్కటేనని వివరించి జాతీయ సమగ్రతను పెంచాలి.

ప్రశ్న 11.
బాలికల విద్య ప్రాధాన్యతను తెలిపే ఒక కరపత్రం తయారుచేయండి. (AS6)
జవాబు:
కరపత్రం
ఈనాడు సమాజంలో బాలురుతో పాటుగా బాలికలకు విద్య తక్కువగా అందిస్తున్నారు. కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు పేరిట బాలికల విద్యను మధ్యలో మాన్పిస్తున్నారు. బయటకు తిరగనీయకుండా, పంపకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. కాని ఇటీవల కాలంలో తల్లిదండ్రులలో కూడా మార్పు కన్పిస్తుంది. బాలురతో పాటుగా బాలికలను కూడా ప్రోత్సహిస్తూ విద్యను అందిస్తున్నారు.

బాల్యవివాహాలు, కులవివక్షతను పగడ్బందీగా అమలు చేస్తున్నారు. అక్కడక్కడ కులవివక్షత కన్పిస్తుంటే ప్రజలలో చైతన్యం కొరకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపట్ల చట్టాలు కఠినంగా శిక్షిస్తున్నాయి. ‘యువతీయువకులలో సామాజిక అవగాహన కొరకు కృషిచేస్తున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 12.
సంఘ సంస్కర్తల్లో నీకు నచ్చిన గుణాలు ఏవి? అవి ఎందుకు నచ్చాయి? (AS6)
జవాబు:
సంఘ సంస్కర్తలలో నాకు నచ్చిన గుణాలు – కారణాలు :

  1. సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేస్తారు. దీనివలన చాలాకాలంగా దురాచారాలతో వెనుకబడిన మనం ముందంజ వేయగలం.
  2. దురాచారాలను రూపుమాపే దిశగా ప్రజలను చైతన్యవంతులను చేస్తారు. తద్వారా ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది.
  3. వీటిలో భాగంగా వీరు అనేక సంస్థలను నెలకొల్పుతారు. ఉదా : బాలికల విద్య కొరకు పోరాటం జరిగినపుడు బాలికలకు ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పారు.
  4. అవసరమైతే సనాతనవాదులనెదురొడ్డి పోరాడుతారు.
  5. ఉద్యమం ప్రారంభంలో సమాజం వెలివేసినంత పనిచేసినా, ధైర్యంగా ముందుకు సాగుతారు.
  6. నవసమాజాన్ని నిర్మిస్తారు.

8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.213

ప్రశ్న 1.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానందల దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. వీరిరువురూ హిందూ ధర్మశాస్త్రాలను చదివారు.
  2. అన్ని మతాలలోని సారం ఒకటేనని విశ్వసించారు.
  3. వీరిరువురూ సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ, దీనజనుల ఉద్ధరణకు, సంఘసేవకు ప్రాధాన్యత నిచ్చారు.

తేడాలు :

రామ్మోహన్ రాయ్స్వామి వివేకానందుడు
అన్ని మతాలు ఒకటేనని నమ్మాడు.హిందూమతం అన్ని మతాల కంటే గొప్పదన్నాడు.
బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.రామకృష్ణ మిషను స్థాపించాడు.
ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమన్నాడు.మూఢాచారాలు వదలి మత ధర్మాన్ని పాటించమన్నాడు.

ప్రశ్న 2.
యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల తొలితరం సంస్కర్తలు ఏవిధంగా ప్రభావితులయ్యారు?
జవాబు:

  1. ఆంగ్ల సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళల పట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం వంటి వాటితో వీరు ప్రభావితులయ్యారు. అందువలన వీరు బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహాల ప్రోత్సాహం మొదలైన వాటిని అమలులోకి తెచ్చారు.
  2. వీరి మత బోధనలచే ప్రభావితులైన వారు ఏకేశ్వరోపాసనను ప్రబోధించారు.
  3. వీరు ఆంగ్ల విద్యను అభ్యసించారు. ఈ భాషతో అనేక గ్రంథాలను చదివి జ్ఞానార్జన చేశారు. అలా అందరూ అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆంగ్ల విద్యను, పాఠశాలలను ప్రోత్సహించారు.

ఈ విధంగా తొలితరం సంస్కర్తలు అనేక విషయాలలో యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల ప్రభావితులయ్యారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 3.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానంద, దయానందల మత దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. వీరు ముగ్గురూ హిందూ ధర్మశాస్త్రాలను విశ్వసించారు.
  2. ఇతర మతాలలోని మంచిని స్వీకరించి ఆచరించాలని చెప్పారు. ‘
  3. ముగ్గురూ సమాజసేవను ఆదర్శంగా తీసుకున్నారు.

తేడాలు :

దయానందుడురాంమోహన్ రాయ్వివేకానందుడు
1) సనాతన సాంప్రదాయాలతో కూడిన హిందూ మతాన్ని తిరస్కరించాడు.1) అన్ని మతాలు ఒకటేనని భావించాడు.1) హిందూమతం అన్ని మతాలలోకి గొప్పదని విశ్వసించాడు.
2) ఆర్యసమాజాన్ని స్థాపించాడు.2) బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు.2) రామకృష్ణ మిషను స్థాపించాడు.
3) అన్ని మతాలను తప్పు మతాలుగా తిరస్కరించి వేదాల ఆధారిత హిందూ మతంలోకి తిరిగి రావాలని ప్రజలకు పిలుపునిచ్చాడు.3) ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమని చెప్పాడు.3) మౌఢ్యాన్ని, మూఢాచారాల్ని వదిలి పెట్టి హిందు మత ధర్మాన్ని పాటించాలని చెప్పాడు.

ప్రశ్న 4.
ఈ కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఏ విధంగా ఉపయోగపడింది?
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఉపయోగపడింది.

ప్రశ్న 5.
మీరు DAV పాఠశాల, గురుకుల పాఠశాల, ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తే దేనిని ఎంచుకుంటారు? కారణాలు తెల్పండి.
జవాబు:
నేను ప్రభుత్వం నడిపే పాఠశాలలను ఎంచుకుంటాను.
కారణాలు:

  1. ఇక్కడ లౌకిక దృక్పథంతో బోధన జరుగుతుంది.
  2. అందరు విద్యార్థుల్నీ సమాన దృష్టితో చూస్తారు.

8th Class Social Textbook Page No.214

ప్రశ్న 6.
1857 తరువాత ముస్లింలు – బ్రిటిష్ మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
సంస్కరణవాద హిందువులు సనాతన వాదులతో ఘర్షణపడాల్సి వచ్చినట్లే సంస్కరణవాద ముస్లింలు కూడా వారి సనాతన మతాచారాలతో తలపడాల్సి వచ్చింది. 1857 తిరుగుబాటు అణచివేత ముస్లింలు, ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది. ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆధునిక విజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రాలను బోధించే ఇంగ్లీషు విద్యను చాలామంది మౌల్వీలు తిరస్కరించారు.

ప్రశ్న 7.
DAV పాఠశాలలు, MAO కళాశాల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా?
జవాబు:

DAV పాఠశాలMAO కళాశాల
1) దీనిని స్వామి దయానంద్ అనుచరులు స్థాపించారు.1) దీనిని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు.
2) దీని ద్వారా ఆంగ్ల బోధనతో పాటు హిందూమతాన్ని, దాని సంస్కృతిని పునరుద్ధరించాలని భావించారు.2) ఇది ఇస్లామిక్ వాతావరణంలో ఇంగ్లీషు, విజ్ఞాన శాస్త్రాలను బోధించటానికి ప్రయత్నించింది.
3) చివరలో ఇది వేదమతాన్ని మాత్రమే బోధించేలా మారింది. హరిద్వార్‌లో గురుకుల కాంగ్రి విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది.3) ఇది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 8.
తమ సంస్కరణ’ భావాలను సమర్ధించుకోవటానికి సంస్కర్తలందరూ తమ తమ ప్రాచీన మత గ్రంథాలను కొత్త కోణంలో చూడటానికి ప్రయత్నించారన్న విషయాన్ని మీరు గమనించి ఉంటారు. ప్రముఖ సంస్కర్తల ఉదాహరణలను చూసి దీనిని వాళ్లు ఎలా చేశారో తెలుసుకోండి.
జవాబు:
1) రాజారాంమోహన్ రాయ్ :
ఇతడు హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సూఫి వంటి అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అనేక పుస్తకాలు చదవటం వల్ల అతడికి దేవుడు ఒక్కడే అన్న నమ్మకం కలిగింది. విగ్రహారాధన, బలులు ఇవ్వటం సరికాదని ఇతడికి అనిపించింది. అన్ని ప్రముఖ మతాలు ఒకే నమ్మకాలు కలిగి ఉన్నాయని, ఇతరుల మతాలను . విమర్శించటం సరికాదని అతడు భావించాడు. హేతుబద్దంగా ఉన్నప్పుడు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మత భావనలను అంగీకరించాలని కూడా అతడు భావించాడు. పూజారుల అధికారాన్ని తిరస్కరించి తమ మతంలోని మూల గ్రంథాలను చదవమని ప్రజలను అతడు కోరాడు. ముద్రణలోని కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధిక సంఖ్యలో ప్రజలకు చేరటానికి అతడు తన భావాలను పత్రికల్లో, పుస్తకాలుగా ప్రచురించాడు.

2) స్వామి వివేకానంద :
హిందూమతం ఇతర మతాలకంటే గొప్పదని వివేకానంద భావించాడు. ఇతడు ఉపనిషత్తుల – బోధనలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఇవి అనువాదం అయ్యి, పెద్ద సంఖ్యలో ముద్రింపబడ్డాయి.

3) స్వామి దయానంద సరస్వతి :
అతడు వేదాలను చదివి నిజమైన మతం వాటిల్లోనే ఉందని సమ్మాడు. ఆ తరవాత హిందూ మతంలోకి వచ్చి చేరిన అనేక దేవుళ్ళను, దేవతలను, గుడిలో విగ్రహాల ఆరాధనను, బ్రాహ్మణ పూజారులను, కుల వ్యవస్థను అతడు తిరస్కరించాడు. సాధారణ పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్కడే దేవుడిని పూజించాలని అతడు ప్రచారం చేశాడు. మిగిలిన అన్ని మతాలను అతడు తప్పు మతాలుగా తిరస్కరించి, ఇతర మతాలకు మారిన హిందువులను షేధాల ఆధారంగా ఉన్న హిందూమతంలోకి తిరిగి రావాలని భావించాడు.

ప్రశ్న 9.
భక్తి ఉద్యమంలో భాగంకాని మత భావనలను సంస్కర్తలు ప్రచారం చేశారా?
జవాబు:
లేదు. సంస్కర్తలు అందరూ భక్తి ఉద్యమంలోని మత భావనలనే ఎక్కువగా ప్రచారం చేశారు.

8th Class Social Textbook Page No.215

ప్రశ్న 10.
సంఘసంస్కరణ కోసం ప్రభుత్వం చట్టాలు చేయటం ఎందుకు ముఖ్యమైంది?
జవాబు:
19వ శతాబ్దం ఆరంభం నాటికి బ్రిటిష్ అధికారులలో చాలామంది కూడా భారతీయ సంప్రదాయాలను, ఆచారాలను, విమర్శించసాగారు. రాజా రామ్మోహన్‌రాయ్ వాదాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆలకించారు. ఆవిధంగా 1829లో ‘సతి’ ని నిషేధించారు. వితంతు పునర్వివాహా చట్టాన్ని 1855లో చేసారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ అనేక చట్టాలు అవసరమని భావించారు.

ప్రశ్న 11.
వితంతు పునర్వివాహాన్ని సమర్ధించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళ మధ్య సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
1856 సం॥రం – మొదటి వితంతు పునర్వివాహం జరిగిన సందర్భం – ఊరు కలకత్తా.

శ్రీకాంత్ ఛటర్జీ :
వాహ్వా ! ఈ రోజు ఈ దేశ చరిత్రలో లిఖించదగ్గ రోజు. భారతదేశంలో మహిళల కష్టాలు కడతేరిన రోజు. ఆ భగవంతుని కృప వీరిపై సదా వర్పించుగాక.

ముఖేశ్ బందోపాధ్యాయ :
ఎంత నీచంగా మాట్లాడుతున్నావు శ్రీకాంత్ బాబూ ! ఇది మనని పరలోకంలో శిక్షలనుభవించేలా చేస్తుంది. విధవకు మళ్ళీ పెళ్ళి ! ఆమె వివాహం ద్వారా ఒక ఇంటికి గృహిణిగా వెళ్ళి అక్కడ వంశవృద్ధికి తోడ్పడుతుంది. అలాంటిది మరోసారి మరో ఇంటికా ! అయ్యో ! భగవంతుడా రక్షించు నా దేశాన్నీ, దేశవాసులనూ.

రాజ్యలక్ష్మి:
ఇది నిజంగా సుదినం శ్రీకాంత్ బాబూ ! మా ఆడవారికి చిన్నవయసులో వృద్దులతో వివాహం, వారి మరణంతో వీరు విధవలై, జీవితాంతం అత్త వారిళ్ళలో ఉచితంగా ఊడిగం చేయటం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇది మంచి ఆరంభం. ఆ భగవంతునికి శతకోటి కృతజ్ఞతలు.

8th Class Social Textbook Page No.217

ప్రశ్న 12.
బాలుర మాదిరిగా బాలికల చదువులకు ఈనాడు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారా? లేక బాలికలు వివక్షతకు, ‘గురవుతున్నారా?
జవాబు:
ఈనాడు బాలుర మాదిరిగా బాలికల చదువుకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వాస్తవానికి చాలా పాఠశాలల్లో, కళాశాలల్లో బాలికల నమోదే ఎక్కువగా ఉంటోంది అని చెప్పవచ్చు. కానీ ఎక్కడో కొన్ని కుటుంబాల్లో మాత్రం బాలికలు వివక్షకు గురి అవుతున్నారని చెప్పవచ్చు. అంతేకాక కొన్ని వెనుకబడిన రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి కనబడుతోంది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 13.
చదువుకోటానికి బాలురు ఎదుర్కోనే ఏ కష్టాలను బాలికలు ఎదుర్కొంటున్నారు?
జవాబు:

  1. బాలికలు సాధారణంగా ఉన్నత విద్యను తక్కువగా అందుకుంటున్నారు.
  2. బాలురు చదువుకోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నారు. కానీ బాలికలకు అన్నిచోట్లకి అనుమతి దొరకటం లేదు.
  3. కొన్ని కోర్సులలో బాలికలకు అవకాశం ఉండటం లేదు.

ప్రశ్న 14.
వితంతువుల పట్ల వ్యవహరించే తీరు ఈనాడు ఎంతవరకు మారింది?
జవాబు:
వితంతువుల పట్ల ఈనాడు సమాజ దృక్పథం మారింది అని స్పష్టంగా చెప్పవచ్చును. నేటి సమాజంలో చాలావరకు – వీరిని అందరు ఇతర మహిళల లాగానే గుర్తిస్తున్నారు. వీరికి పెద్దలే మరలా వివాహాలు చేస్తున్నారు. చేసుకోవటానికి పురుషులు కూడా వారంతటవారే ముందుకు వస్తున్నారు. కొన్ని మతపరమైన ఆచారాలలో తప్ప వీరిని అన్నింటా ఇతరులతో సమానంగానే గౌరవిస్తున్నారు.

ప్రశ్న 15.
ఈనాటికీ దళిత బాలికలు, ముస్లిం బాలికలు చదువుకోటానికి ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నారా?
జవాబు:
దళిత బాలికలు ఎక్కడో ఒకటి, రెండు చోట్ల ఇతర సమాజం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నారని అప్పుడప్పుడు వార్తా పత్రికలలో వార్తలు వింటున్నాం. వీరు కూడా అందరితోపాటు సమానంగానే తరగతి గదుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ముస్లిం బాలికలకు కూడా ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి. వీరు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చదువుకుంటున్నారు.

8th Class Social Textbook Page No.218

ప్రశ్న 16.
అంటరాని ప్రజలు అసలు చదువులేకుండా ఉండడం కంటే ఇది మెరుగని కొంతమంది భావించారు. మీరు వీళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. నేను వాళ్ళతో ఏకీభవిస్తాను. జ్యోతిబా పూలే, అంబేద్కర్లు అటువంటి కష్టనష్టాల కోర్చి విద్యనభ్యసించారు కాబట్టే వారు భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగారు. లేకుంటే ఇప్పటికీ అదే పరిస్థితి ఉండి ఉండేది.

8th Class Social Textbook Page No.219

ప్రశ్న 17.
ఈనాటికీ జ్యోతిబా పూలే భావాలు అవసరమని మీరు భావిస్తున్నారా?
జవాబు:
అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నాటి నుండి నిమ్నకులాల అభివృద్ధి కొరకు మన ప్రభుత్వాలు ‘రిజర్వేషన్లు’ అన్నిటా అమలు చేస్తున్నాయి. ఈ కులాల వారందరూ మిగతా అన్ని కులాల వారితో సమానంగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయంగా ఎదుగుతున్నారు. కాబట్టి ఆ భావాలు అవసరం లేదని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 18.
నిమ్నకులాల విద్యార్థులకు ఆ కులాల ఉపాధ్యాయులే చదువు చెప్పాలని అతడు ఎందుకు అన్నాడు?
జవాబు:
శూద్రులు, అతిశూద్రులు కుల వివక్షతకు గురై పాఠశాలల్లో, కళాశాలల్లో అనేక అవమానాలకు గురౌతున్నారని అంతే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన ఉపాధ్యాయులు, నిమ్నకులాల విద్యార్థులకు చదువు చెప్పకుండా వెలివేసే విధానంలో చదువు నేర్పిస్తున్నారని, కులవ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ అతడు దీనికి వ్యతిరేకంగా గులాంగిరి వంటి పుస్తకాలతో పాటు నిమ్నకులాల పిల్లలకోసం నిమ్న కులాల టీచర్లే చదువు చెప్పాలని తలంచాడు. దీని ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మ స్టైర్యం పెరుగుతుందని భావించాడు.

ప్రశ్న 19.
నారాయణ గురు, జ్యోతిబా పూలేల కృషిని పోల్చండి. వాళ్ళ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:

  1. ఇరువురూ కులవ్యవస్థను ఖండించారు.
  2. ఇరువురూ అనేక పాఠశాలలను స్థాపించారు.
  3. ఇరువురూ బ్రాహ్మణాధిక్యతను తోసిరాజన్నారు.

తేడాలు :

నారాయణ గురుజ్యోతిబా పూలే
1) ఈయన ఒక మత గురువు.1) ఈయన ఒక సంఘసంస్కర్త.
2) కుల వివక్షత లేని దేవాలయాలను స్థాపించి, బ్రాహ్మణ పూజారులు లేని సామాన్య పూజా విధానాన్ని ప్రోత్సహించాడు.2) నిమ్న కులాల వారికి ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాలని పిలుపునిచ్చాడు. వీటిలో నిమ్న కులాల ఉపాధ్యాయులే బోధించాలని చెప్పాడు.
3) కుల వివక్షతను ఖండించాడు. అన్ని రకాల కుల వివక్షతలకు స్వస్తి చెప్పాలని చెప్పారు.3) నిమ్న కులాలవారు బ్రాహ్మలు లేకుండా పెళ్ళిళ్ళు, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాడు.

8th Class Social Textbook Page No.220

ప్రశ్న 20
కులవ్యవస్థకు సంబంధించి బుద్ధుని బోధనలను గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
బుద్ధుడు సర్వమానవ సమానత్వాన్ని చాటాడు. కుల,మత భేదాలను వ్యతిరేకించాడు. అందరినీ కలిసి ఉండమని బోధించాడు. తన పంథాను అనుసరించిన వారందరినీ సమానంగా చూశాడు.

ప్రశ్న 21.
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఏవిధంగా దోహదపడింది?
జవాబు:
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిందనే చెప్పాలి. దళితులే ఈ ప్రాంతపు మూలవాసులనీ, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను బలంతో అణచివేసారని చెబుతారు. జనాదరణ పొందిన కళలను ఉపయోగించుకుని దళితులలో చైతన్యం కలిగించడానికి 1906లో ‘జగన్‌మిత్ర మండలి’ని
భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించి ఆత్మస్టైర్యం పెంచారు. దళితులకు ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా కూడా వాళ్ళలో చైతన్యం వెల్లివిరిసింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 22.
స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికీ ఓటుహక్కు లభించిందా?
జవాబు:
సహాయ నిరాకరణ సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా మహిళలను గాంధీజీ ఆశించి, ప్రోత్సహించారు. ఉప్పుసత్యాగ్రహం, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం, రైతాంగ ఉద్యమం వంటి వాటిలో మహిళలు పాల్గొని విజయవంతం చేయడం వల్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికు ఓటుహక్కు లభించింది.

ప్రశ్న 23.
స్వాతంత్ర్య పోరాటంలోని ముఖ్యమైన మహిళా నాయకుల గురించి తెలుసుకోండి – కల్పనాదత్, అరుణ అసఫ్ అలీ, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ మొదలగువారు.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 1
1) కల్పనాదత్ :
ఈమెను తరువాత కాలంలో కల్పనాజోషి అని పిలిచేవారు. ఈమె చిటగాంగ్ రిపబ్లికన్ ఆర్మీలో సభ్యురాలు. పేరొందిన చిటగాంగ్ ఆయుధాల దోపిడీ కేసులో ఈమె కూడా పాల్గొన్నారు. తరువాత ఈమె కమ్యూనిస్టు పార్టీలో చేరారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 2
2) అరుణా అసఫ్ అలీ :
ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కాలంలో అరుణ గొవాలియా మైదానంలో భారత జాతీయ జెండాను ఎగురవేసి యువతి గుండెల్లో స్ఫూర్తిని నింపారు. ఆమె ఈ కింది అవార్డులను పొందారు.
లెనిన్ ప్రైజ్ ఫర్ పీస్ – 1975
జవహర్లాల్ నెహ్రూ అవార్డు – 1991
భారతరత్న – 1998

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 3
3) కెప్టెన్ లక్ష్మీ సెహగల్ :
ఈమె 1943లో నేతాజీని సింగపూర్ లో కలిసే వరకు డాక్టరు వృత్తిలో కొనసాగారు. నేతాజీతో కలిసి మహిళా రెజిమెంట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. వెంటనే ‘ఝాన్సీరాణి రెజిమెంట్’ను స్థాపించి కెప్టెన్‌గా మారారు. 1945 మేలో బ్రిటిషు వారు ఆమెను అరెస్టు చేశారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 4
4) సరోజినీనాయుడు :
భారత జాతీయ కాంగ్రెస్ కు ద్వితీయ మహిళాధ్యక్షురాలు. ఆమెను నైటింగేలు ఆఫ్ ఇండియా అని పిలిచారు. ఆమె బెంగాలు విభజన కాలంలో ఉద్యమంలో చేరారు. అనేక కవితలు రాశారు. ఈమె జన్మదినాన్ని భారతదేశంలో మహిళా దినోత్సవంగా జరుపుతారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 5
5) కమలాదేవి ఛటోపాధ్యాయ :
ఈమె స్వాతంత్ర్య పోరాటంలో 1923లో సహాయ నిరాకరణోద్యమంలో చేరారు. భారతదేశంలో మొట్టమొదట అరెస్ట్ అయిన మహిళ.

8th Class Social Textbook Page No.221

ప్రశ్న 24.
దళితుల పట్ల తమ దృక్పథంలో గాంధీజీ, అంబేద్కర్ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:

  1. ఇరువురూ దళితుల కోసం పాటుపడ్డారు.
  2. ఇరువురూ కాంగ్రెస్ వాదులే.

తేడాలు :

గాంధీజీఅంబేద్కర్
1) ఈయన అగ్రవర్ణస్తుడై దళితుల కోసం పోరాడారు.1) ఈయన దళితుడిగా దళితుల కోసం పోరాడారు.
2) ఈయన దళిత అభ్యర్థులకు ఎన్నికలలో సీట్లు రిజర్వు చేయించారు.2) ఈయన దళితులకు, దళితులే వేరుగా ఓట్లు వేయాలని భావించారు.
3) ఈయన కాంగ్రెసులో ఉండే వారికోసం పనిచేశారు. ఈ పోరాటాన్ని కాంగ్రెస్ లో భాగంగా చేశారు.3) ఈయన దళితుల కోసం ఇండిఫెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు.
4) ఈయన చివరి వరకు హిందూ మతంలోనే ఉండి దళితుల కోసం పోరాడారు.4) ఈయన హిందూమతాన్ని విశ్వసించలేక చివరలో బౌద్ధ మతానికి మారారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 25.
ఈనాడు దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలల్లో దళితులకు సమాన హక్కులు ఉన్నాయా? వాళ్లు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి?
జవాబు:
నేడు దేవాలయాల్లోకి అందరికీ ప్రవేశం లభ్యమే. నీటి వనరులు, పాఠశాలల్లో చెప్పుకోవాలంటే దళితులకు సమానహక్కులే కాక, రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అంటే అందరితో పాటు సమానంగా అన్ని ప్రభుత్వం వీరికి అందిస్తోంది. అంతేకాక కొన్ని వీరి కొరకు రిజర్వు చేసి అవి వారికి మాత్రమే అందిస్తుంది. వీరు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు ఏమీ లేవనే చెప్పవచ్చు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 26.
ఈ క్రింది బొమ్మలలో మత సంస్శలు సంఘ సంస్కర్తలను గుర్తించి, మీ ఉపాధ్యాయుల సహకారంతో వారి పేర్లు వ్రాయుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 6

ప్రశ్న 27.
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో ఏమి స్థాపించాడు?
జవాబు:
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

SCERT AP 8th Class Social Study Material Pdf 18th Lesson హక్కులు – అభివృద్ధి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 18th Lesson హక్కులు – అభివృద్ధి

8th Class Social Studies 18th Lesson హక్కులు – అభివృద్ధి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిదిద్దండి. (AS1)
అ) ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాలి.
ఆ) పథకాల అమలును కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించేలా ప్రజలు చూడాలి.
ఇ) సమాచార అధికారులు ఇష్టం వచ్చినంత కాలం సమాచారాన్ని వెల్లడి చేయకుండా ఉండవచ్చు.
ఈ) వివిధ పత్రాలు చూడటం ద్వారా కార్యక్రమాలు అవినీతి లేకుండా జరుగుతున్నాయని గుర్తించవచ్చు.
జవాబు:
ఆ) పథకాల అమలును ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా పర్యవేక్షించాలి.
ఇ) అడిగిన సమాచారాన్ని అధికారులు నిర్దేశిత సమయంలో వెల్లడి చేయాలి.

ప్రశ్న 2.
“అవినీతిని ఎదుర్కోవడానికి సమాచారం అవసరం” శీర్షిక కింద గల పేరా చదివి దిగువ ప్రశ్నకు జవాబివ్వండి. (AS2)

ప్రభుత్వ వ్యవస్థ చాలా పెద్దది, సంక్లిష్టమయినది. విధానాలు, పథకాలు సక్రమంగా అమలు అయ్యేలా చూడటం చాలా కష్టం. పేదల ప్రయోజనాల కోసం, పేదరికం నిర్మూలన కోసం రూపొందించిన కార్యక్రమాలు సాధరణంగా వాళ్లకు చేరవు, నిధులు మళ్లింపబడతాయి. దీనికి ప్రధాన కారణం అవినీతి. ప్రభుత్వ కార్యక్రమాల గురించి, అవి అమలు అయ్యే తీరు గురించి ప్రజలకు సరైన సమాచారం లేకపోవటం అవినీతి ప్రబలటానికి ఒక ప్రధాన కారణమవుతోంది.
మీ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ కార్యక్రమం అమలు తీరును పరిశీలించి నివేదికను తయారుచేయండి.
జవాబు:
మా ప్రాంతంలో ప్రభుత్వం వారు వికలాంగులకు, వృద్ధులకు ఫించన్లు ఇస్తున్నారు. ప్రతినెలకు వృద్ధులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500లు ఇస్తారు. ఈ నిధులు 2, 3 నెలలకు ఒకసారి విడుదల అవుతాయి. వీటిని స్థానిక సంస్థల ద్వారా వీరికి అందచేస్తారు.

అయితే వీటిని బట్వాడా చేయటానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అందరినీ అక్కడికి రమ్మని చెబుతారు. దాదాపు ఒక్కో ప్రదేశంలో 400, 500 మంది వరకు 2, 3 రోజులు బట్వాడా జరుగుతుంది. పాపం వృద్ధులు, వికలాంగులు అంతంత సేపు ఎండలో, వానలో వరుసలో ఉండాల్సి వస్తుంది. ఒక్క రోజు సాయంత్రం వరకూ ఉన్నా వారికి రావాల్సిన సొమ్ము అందదు. మరలా మరుసటి రోజు రావాల్సి వస్తుంది. ఇదంతా చూడటానికి మాకు ఎంతో ఇబ్బందిగా, బాధగా అనిపించింది. ప్రభుత్వం ఆలోచించి వీరి లాంటి వారికి సొమ్మును నేరుగా ఇంటికే అందచేయవచ్చుగా అనిపించింది. ఇలాంటి విషయాలలో అధికారులు, నాయకులు మానవీయ కోణంలో ఆలోచించాలని మా ప్రార్థన.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 3.
సమాచార హక్కు చట్టం (స.హ.చ) ద్వారా సాధించిన విజయాలను వార్తాపత్రికల నుండి సేకరించి మీ తరగతిలో చెప్పండి. (AS3)
జవాబు:
వార్త – 1, న్యూఢిల్లీ :
హర్యానాకు చెందిన 70 సం||ల వృద్ధురాలు లక్ష్మి సింగ్ తన కుమారుడు అనూప్ సింగ్ ను ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకుంది. అనూప్ సింగ్ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. అతను మరణించిన తరువాత అతని భార్యకు ఫించను ఇచ్చారు. కాని ఆమె కొద్ది సం||ల తరువాత ద్వితీయ వివాహం చేసుకుంది. లక్ష్మి దిక్కులేనిదయింది. అప్పుడు ఆమె స.హ. చట్టం ద్వారా పిటీషను పెట్టుకోగా ప్రభుత్వం వారు ఫించను మార్చి ఆమెకు ఇచ్చారు.

వార్త -2:
క్షేత్రమణి భువనేశ్వర్ లో ఒక చిన్న స్థలం కొనుక్కుంది. అమ్మకందారు, ఆమె రిజిష్ట్రార్ ఆఫీసులో రిజిష్టరు చేసుకున్నారు. కాని అక్కడి గుమాస్తా 1½ సం||రం అయినా ఆమెకు డాక్యుమెంట్లు ఇవ్వలేదు. దానితో స.హ. చట్టం ఆఫీసును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఇచ్చిన కొద్ది సేపటికే ఆమె కాగితాలు ఆమెకు తెచ్చి ఇచ్చాడు ఆ గుమాస్తా.

వార్త -3:
లక్నోలో నివసిస్తున్న ఆషియానా 13 సం||ల బాలిక. మే 2005లో ఆమె ఆరుగురుచే సామూహిక అత్యాచారానికి గురి అయింది. అయితే అందులో ప్రథమ నిందితుడు తాను మైనరనని సాక్ష్యాలు చూపించి జువెనైల్ కోర్టుకు కేసును మరల్చాడు.

ఆషియానా తండ్రి స.హ. చట్టం ద్వారా అతని డ్రైవింగ్ లైసెన్సును, తుపాకీ లైసెన్సును పొందిన వివరాలను సేకరించి వాటిని కోర్టుకు సమర్పించాడు. అప్పుడు కోర్టు అతనిని ‘ఆ సంఘటన జరిగినప్పుడు అతను మేజరే’ అని తేల్చింది.

వార్త – 4:
‘నాకాబందీ’ సమయంలో మోటారు వాహనాలలో కూర్చుని కనబడకుండా కొంతమంది తప్పించుకుంటున్నారని స.హ. చట్టం ద్వారా అప్పీలు చేయటం మూలంగా ప్రభుత్వం ఈ క్రింది రూలు విధించింది.

మోటారు కార్ల అద్దాలకు డార్క్ ఫిల్ములుగానీ, ఏ ఇతరాలు కానీ అంటించరాదు. ఇది 4.5.2012 నుండి అమలులోనికి వచ్చింది.

ప్రశ్న 4.
విద్యాహక్కు చట్టం బాలలకు వరం వంటిది. వివరించండి: (AS1)
జవాబు:
6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ ఉచిత విద్యకు హక్కు ఉందనీ విద్యాహక్కు చట్టం తెలియచేస్తుంది. పిల్లల పరిసర ప్రాంతాలలో తగినన్ని పాఠశాలలు నిర్మించటం, సరైన అర్హతలున్న టీచర్లను నియమించటం, అవసరమైన సౌకర్యాలన్నింటినీ కల్పించటం వంటి పనులను ప్రభుత్వం చేయాలి. విద్య పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలని, చదువు పిల్లలను కేంద్రంగా చేసుకుని కృత్యాల ద్వారా, పరిశోధన, ఆవిష్కరణ పద్ధతుల ద్వారా సాగాలని చట్టం చెబుతోంది. పిల్లలు మాతృభాషలో చదువు నేర్చుకోవాలని, వాళ్ళు భయం, ఆందోళనలు లేకుండా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని కూడా చట్టం చెబుతోంది.

పరిసర ప్రాంతాలలో పాఠశాలలు అందుబాటులో లేకపోయినా, పాఠశాలల్లో బోధనకు తగినంతమంది టీచర్లు లేకపోయినా, బోధన – అభ్యసన పరికరాలు తగినన్ని అందుబాటులో లేకపోయినా, పిల్లలను కొట్టినా, భయభ్రాంతుల్ని చేసినా అటువంటి సందర్భాలలో అధికారులపై పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఫిర్యాదు చేయవచ్చు.

కాబట్టి ఇది బాలలకు వరం.

ప్రశ్న 5.
మీకు ఇంకా ఏమైనా హక్కులు అవసరమని భావిస్తున్నారా? అవి ఏమిటి? ఎందుకు? (AS4)
జవాబు:
ఈ పాఠం చదివిన తరువాత ఈ హక్కులు బాధ్యతతో కూడినవి అని అర్ధం చేసుకున్నాను. నాకు ఏమి కావాలో అన్నీ నా దేశం చూసుకుంటోంది. కాబట్టి నాకు కొత్త హక్కులు అవసరం లేదు. ఉన్న హక్కులను పొందటానికి, కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను.

ప్రశ్న 6.
సమాచార హక్కు చట్టం ప్రకారం మీ పాఠశాల గురించి ప్రధానోపాధ్యాయుడిని ఏ సమాచారం అడుగుతారు? (AS4)
జవాబు:
సమాచార చట్టం హక్కు ప్రకారం పాఠశాల గూర్చి ప్రధానోపాధ్యాయునికి అడిగే సమాచారం.

  1. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం యిచ్చిన నిధులెంత?
  2. ఆ నిధులను దేనికొరకు ఖర్చు చేసారు?
  3. పాఠశాల మరమ్మతులు, నిర్మాణం కోసం నిధులు వచ్చాయా? వస్తే ఎంత వచ్చాయి? వేటికొరకు ఎంత ఖర్చు చేస్తారు?
  4. బడిపిల్లలందరికీ పాఠ్యపుస్తకాలు ఉచితంగా సరఫరా చేసారా?

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 7.
అవినీతిని ఎదుర్కోవడానికి సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందని ఎలా చెప్పగలవు? (AS6)
జవాబు:
అవినీతిని ఎదుర్కొనడంలో సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టం ద్వారా ఎటువంటి సమాచారాన్నైనా పొందే హక్కు ప్రజలకు లభించింది. దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేసిన పథకాలు, ఖర్చు, లబ్దిదారుల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో వాస్తవంగా అమలుజరిగిన దానితో పోల్చడం ద్వారా అవినీతి జరిగితే తెలుసుకొని పోరాడవచ్చు.

8th Class Social Studies 18th Lesson హక్కులు – అభివృద్ధి InText Questions and Answers

8th Class Social Textbook Page No.204

ప్రశ్న 1.
పేజి నెం. 204 లో ఉన్న ఉదాహరణలోని పవన్, అతడి తల్లి గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నారా?
జవాబు:
ఎవరైనా సరే చట్ట, ధర్మ విరుద్ధమైన పనులు చేయకుండా జీవనం సాగిస్తే అది గౌరవప్రదమైన జీవనమే అవుతుంది. పవన్ తల్లి వేరొకరింట్లో కష్టపడి పనిచేయటం గౌరవకరమే. కానీ పవన్ గుడి దగ్గర అడుక్కోవడం మాత్రం సరియైనది కాదు అని నా భావన.

ప్రశ్న 2.
దేని ద్వారా వాళ్లకి గౌరవప్రదమైన జీవనం దొరుకుతుంది?
జవాబు:
కష్టించి పనిచేసి జీవనం గడపటం ద్వారా మాత్రమే వారికి గౌరవప్రదమైన జీవనం దొరుకుతుంది.

ప్రశ్న 3.
తమకు కావలసింది చేసే స్వేచ్ఛ పవన్‌కు కానీ, అతడి తల్లికి కానీ ఉందా?
జవాబు:
ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, అధికారులైనా పనిలో స్వతంత్రంగా వ్యవహరించరాదు, వ్యవహరించలేరు. అలాగే వీరు కూడా పని వ్యవహారంలో యజమానిని అనుసరించి పోవాలి. స్వంత విషయాలలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించ వచ్చు.
ఉదా :
పవన్ తల్లి ఇష్టం లేకపోతే వారింట పని మానేయవచ్చు. వేరే చోట చేరవచ్చు.

ప్రశ్న 4.
పవన్, అతడి తల్లి ఈ విధమైన జీవితం గడపటానికి ఎవరు కారణం? వాళ్ల పరిస్థితికి వాళ్లనే నిందించాలా?
జవాబు:
వీరి పరిస్థితికి తరతరాలుగా వస్తున్న వ్యవస్థ కారణం అని చెప్పాలి. సమాజంలో ధనికులు ఇంకా ధనికులుగాను, పేదవారు కటిక పేదవారుగానూ మారతారు. వీరు కూడా అంతే. భారతదేశంలో ‘కర్మ’ అని ఎవరికి వారే నిందించుకోవడం అలవాటు. అలాగే వారినే నిందించుకోవాలి లేదా వ్యవస్థ తీరును నిందించాలి.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 5.
గౌరవప్రదమైన, స్వేచ్ఛతో కూడిన జీవితం పవన్, అతడి తల్లి జీవించగలిగేలా చూడాల్సిన బాధ్యత ఎవరిది?
జవాబు:
గౌరవప్రదమైన, స్వేచ్ఛతో కూడిన జీవితం పవన్, అతడి తల్లి జీవించగలిగేలా చూడాల్సిన బాధ్యత సమాజానిది, ప్రభుత్వానిది.

8th Class Social Textbook Page No.206

ప్రశ్న 6.
ఒక రోడ్డు లేదా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని గుత్తేదారులు ఎలా నిర్వహిస్తున్నారో చర్చించండి.
జవాబు:
ఏదైన ఒక రోడ్డు లేదా ఇల్లు నిర్మించాలంటే ప్రభుత్వ సంస్థలు లేదా పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థలు ముందు గుత్తేదారుల నుండి టెండర్లు స్వీకరిస్తారు. టెండర్లలో ఆ కట్టడాన్ని వారు కోరిన విధంగా నిర్మించడానికి ఎవరు అతితక్కువ ధరని ‘కోట్’ చేస్తారో వారికి మాత్రమే కాంట్రాక్టు ఇస్తారు. పని మొదలు పెట్టిన తరువాత గుత్తేదారులు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేయాలి. ఏ సిమెంటు వాడారు? సిమెంటు, ఇసుక ఏ నిష్పత్తిలో కలిపారు, ఇటుక మందం ఎంత, కొలతలు మొదలైనవి అన్నింటిని ఒక పుస్తకంలో నమోదు చేసి ఉంచుతారు. ఎంతమంది కూలీలు ఎన్ని రోజులు పని చేశారు? వారి కూలిరేట్లు ఎంత? ఎంత చెల్లించారు? మొదలైనవన్నీ దీంట్లో నమోదు చేసి ఉంటాయి. నిర్మాణం తాలూకు యజమాని (ప్రభుత్వం / ప్రైవేటు సంస్థ) వీటిని చూసి, నాణ్యతను పరీక్షించి, వీరికి వాయిదాలలో సొమ్ము చెల్లిస్తారు. ప్రభుత్వం వారయితే సంబంధించిన ఇంజనీరుతో పర్యవేక్షింపచేస్తారు.

ప్రశ్న 7.
ఈ సమాచారాన్ని సరిచూడటం ద్వారా, జవాబుదారీతనాన్ని ఎలా పెంచవచ్చు?
జవాబు:
ఈ సమాచారాన్ని సరిచూడటం ద్వారా పనిచేసేవారికి, దానిని పర్యవేక్షించేవారికి కూడా కొంత భయం, తప్పనిసరి నిజాయితీ అలవడతాయి. దాని మూలంగా జవాబుదారీతనం పెరుగుతుంది.

8th Class Social Textbook Page No.208

ప్రశ్న 8.
గత సంవత్సర కాలంలో మీ ఉపాధ్యాయులకు విద్యాశాఖనుంచి వచ్చిన ఆదేశాలు, నివేదికలు, సలహాలు, లాగ్ పుస్తకాల వంటి వాటి జాబితా తయారుచేయండి. విద్యాశాఖకు అందచేయటానికి పాఠశాల ఎటువంటి రికార్డులు నిర్వహిస్తుంది? మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రికార్డులు ఎలా నిర్వహిస్తారు?
జవాబు:
విద్యాశాఖ నుండి ఆదేశాలు, నివేదికలు, సలహాల జాబితా :

  1. బడి ఈడు బాలబాలికలు పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  2. డ్రాపవుట్సును తిరిగి పాఠశాలకు రప్పించాలి.
  3. విద్యార్థులందరికీ ఉచిత యూనిఫాం, టెక్స్ట్ పుస్తకాలు అందచేయాలి.
  4. పదవ తరగతి విద్యార్ధులకు అదనపు తరగతులు నిర్వహించాలి.
  5. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలుచేయాలి.
  6. విద్యార్థులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించి, తగు వైద్యం అందించాలి.
  7. విద్యార్థులకు Deworming మాత్రలు వేయాలి.
  8. విద్యార్థుల హాజరు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  9. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి.

పాఠశాల నిర్వహించే రికార్డులు :

  1. అడ్మిషను రిజిస్టరు
  2. టి.సీ.ల పుస్తకం
  3. హాజరు పట్టీలు
  4. మధ్యాహ్న భోజన వివరాల రిజిస్టరు.
  5. జీతాల రిజిస్టరు, బిల్లులు
  6. విజిటర్సు రిజిస్టరు
  7. మార్కుల రిజిస్టరు మొదలైనవి

మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రికార్డులు :
1. బియ్యం రిజిస్టరు
2. తేదీ
AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి 1
3. రోజువారీ మెనూ పుస్తకం
4. నెలవారీ లెక్కల రిజిస్టరు మొ||నవి.

ప్రశ్న 9.
రాష్ట్ర సమాచార కమిషన్ సందర్భంలో ‘స్వతంత్ర’ అన్న పదం ఎందుకు కీలకమైంది?
జవాబు:
రాష్ట్ర సమాచార కమిషన్ పాలనా యంత్రాంగానికో, కార్యనిర్వాహక వర్గానికి అనుబంధమైతే అది అవినీతిని ప్రశ్నించలేదు, అరికట్టలేదు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించలేదు. కాబట్టి అది ‘స్వతంత్రం’గానే వ్యవహరించాలి, ఉండాలి. – అందువలన ‘స్వతంత్ర’ అన్న పదం కీలకమైంది.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 10.
ఆరోగ్యశాఖలో, సమాచార అధికారిని అడగటానికి ప్రశ్నల జాబితా తయారుచేయండి.
జవాబు:

  1. విపత్కర సమయాలలో రోగులను ఆదుకోవటానికి అంబులెన్స్ లు ఎన్ని ఉన్నాయి?
  2. ప్రాంతీయ ఆసుపత్రులలో సౌకర్యాలు ఏమి ఉన్నాయి?
  3. గ్రామీణ ప్రాంతాలలో వైద్యులు కొనసాగటానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారు?
  4. ‘పిచ్చి కుక్కలు వంటివి కరిచినప్పుడు ఉపయోగించాల్సిన మందులు అన్ని చోట్లా ఉన్నాయా?
  5. ‘ఆరోగ్యశ్రీ’లో ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించే సొమ్మును ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణకు ఎందుకు ఉపయోగించడం లేదు?

8th Class Social Textbook Page No.210

ప్రశ్న 11.
మీ బడి ఈ ప్రామాణికాలకనుగుణంగా ఉందా?
జవాబు:
అవును. మా బడి ఈ ప్రామాణికాలకు అనుగుణంగానే ఉన్నది.

  1. మా పాఠశాలలో సరైన అర్హతలున్న టీచర్లు ఉన్నారు.
  2. అవసరమైన సౌకర్యాలున్నాయి.
  3. పారాలు ల్యాబ్ లో, LCD రూములలో బోధించబడుతున్నాయి.
  4. మేము పాఠశాలలో బాధ్యతతో కూడిన స్వేచ్ఛను అనుభవిస్తాము.
  5. మా ఉపాధ్యాయులు మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు.

ప్రశ్న 12.
అవసరమైతే మీ బడి పనితీరుపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలుసుకోంది.
జవాబు:
అవసరమైతే బడి తీరుపై జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారికి, రాష్ట్రస్థాయిలో డైరెక్టరు, పాఠశాల విద్యకు ఫిర్యాదు చేయాలి.

ప్రశ్న 13.
ఈ చిత్రాన్ని వ్యాఖ్యానించుము.
AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి 2
ఇది వర్షాలు కురవని సంవత్సరం
జవాబు:
ఈ చిత్రం చాలా ఏళ్ళనాటిదని వృద్ధురాలి వస్త్రధారణను, ఇంట్లోని మట్టిబానలను, కుండలను చూసి చెప్పవచ్చు. ఒకప్పుడు ధాన్యం దాచుకోవడానికి వారు ఏర్పాటు చేసుకున్న వస్తువులన్నీ నేడు ఖాళీగా ఉన్నాయి. ఒక పాత్రలో బియ్యంలో ఎక్కడో అడుగున ఉన్నాయి. వృద్ధురాలు కూడా సరియైన తిండిలేక వడలిపోయి ఉన్నది. అది కరవు కాలం అని భావించవచ్చు.

ప్రశ్న 14.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.

13 సంవత్సరాల పవన్ అనే బాలుడు వాళ్ల అమ్మతో కలిసి ఎంతోమంది భక్తులు సందర్శించే ఒక పుణ్యస్థలంలో ఉంటాడు. పవన్ గుడి బయట నిలబడి భక్తుల కాళ్లమీద పడి అడుక్కుంటాడు. అతడికి కొంతమంది మిగిలిపోయిన పాచి పదార్థాలు తినటానికి ఇస్తారు. కొన్నిసార్లు అతడు బరువైన సామాను మోస్తాడు, అందుకు వాటి యజమానులు కొంత డబ్బు ఇస్తారు.

అతడి తల్లి వేరొకరి ఇంటిలో పనిచేస్తుంది. ఆమె రోజుకి 12 గంటలపాటు, నెలలో 30 రోజులూ పనిచేస్తుంది. యజమానురాలే కాకుండా, చిన్న పిల్లలు సైతం ఆమెను ఇది చెయ్యి, అది చెయ్యి అని చెబుతుంటారు. అందరూ తిన్న తరవాత మిగిలిన ఆహారం ఆమెకు పెడతారు. యజమానుల ముందు ఆమె కూర్చోటానికి వీలులేదు. వాళ్లతో భయభక్తులతో మాట్లాడాలి. చిన్న చిన్న తప్పులకు, ఆలస్యానికి ఆమెను తరచు అవమానిస్తుంటారు. ఆమె కన్నీళ్లతోపాటు కోపాన్ని కూడా దిగమింగుకోవాలి. లేదంటే పని నుంచి తీసేస్తారు.
1. పవన్ వయస్సు ఎన్ని సంవత్సరాలు?
జవాబు:
13 సంవత్సరాలు.

2. పవన్ కి డబ్బులు ఎందుకు ఇస్తారు?
జవాబు:
అతడు బరువైన సామాను మోసినందుకు ఇస్తారు.

3. అతడి తల్లి ఏమి చేస్తుంది?
జవాబు:
వేరొకరి ఇంటిలో పని చేస్తుంది.

4. ఆమెకున్న ఇబ్బందులను లేదా కష్టాలను రెండింటిని చెప్పండి.
జవాబు:
1. యజమానుల ముందు కూర్చోడానికి వీలులేదు.
2. అందరూ తిన్న తరువాత మిగిలిన ఆహారం ఆమెకు పెడతారు.

5. పవన్ కాళ్ల మీద పడి ఎందుకు అడుక్కుంటాడు?
జవాబు:
వారికి జాలి కలిగి డబ్బులు ఇస్తారని

ప్రశ్న 15.
కింది పేరాను చదివి జవాబులు వ్రాయుము.

ప్రజా విచారణ :
‘జన్ సునావాయి’ (అంటే ప్రజా విచారణ) పేరుతో MKSS (మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్) సమావేశాలు నిర్వహించేది. పేదలలో చాలామంది ప్రభుత్వ పత్రాలను తమంతట తామే చదవలేరన్నది వాస్తవం. ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ పత్రంలో ఏమి ఉందో తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి వీటిని పైకి చదివి వినిపించేవాళ్లు, వివరించేవాళ్లు. చేతిపంపు వేయటానికి ఎవరెవరికి కూలీ చెల్లించారో మస్టర్/హాజరు జాబితా తెలియచేస్తుంది. మస్టర్ జాబితాలో పేర్లు ఉన్న వాళ్లు ఆ సమయంలో ఊళ్లో ఉన్నారో, లేక వలస వెళ్లారో ప్రజలు చెప్పగలుగుతారు, లేదా మస్టర్‌లో పేర్కొన్న మొత్తం వాళ్లకు చెల్లించారో లేదో చెప్పగలుగుతారు. దీని ద్వారా ఏదైనా అవినీతి జరిగి ఉంటే అది వెల్లడవుతుంది. ఇటువంటి సమావేశాల ద్వారా ప్రజలు కార్యాచరణకు పూనుకునేవాళ్లు. పత్రాలలో ఉన్న సమాచారం గురించి వివరించటానికి, సమర్ధించుకోటానికి అధికారులకు కూడా అవకాశం ఇచ్చేవాళ్లు. ఈ సమావేశాల్లో జిల్లా పాలనా యంత్రాంగం, పంచాయితీ అధికారులు కూడా పాల్గొనేవాళ్లు. అవినీతిని గుర్తించినప్పుడు సంబంధిత వ్యక్తుల మీద కేసులు నమోదు చేసేవాళ్లు.
1. ‘జన్ సునావాయి’ అంటే తెలుగులో ఏమిటి?
జవాబు:
ప్రజా విచారణ.

2. పత్రాలను పైకి చదివి ఎందుకు వినిపించేవారు?
జవాబు:
పేదలలో చాలామంది ప్రభుత్వ పత్రాలను చదవలేరు. అందుకే వాటిని పైకి చదివి వినిపించేవారు.

3. ‘మస్టర్’ అంటే ఏమిటి?
జవాబు:
కూలీవాళ్ళు లేదా చేతిపనులు చేసేవాళ్ళు ఆ రోజు పనికి హాజరయ్యారో లేదో ఒక పుస్తకంలో నమోదు చేస్తారు. దానినే మస్టర్ అంటారు.

4. సమావేశాల ద్వారా ప్రజలు ఏం చేసేవారు?
జవాబు:
సమావేశాల ద్వారా ప్రజలు కార్యాచరణకు పూనుకునేవాళ్ళు.

5. కేసులు ఎప్పుడు నమోదు చేసేవాళ్ళు?
జవాబు:
అవినీతిని గుర్తించినప్పుడు కేసులు నమోదు చేసేవాళ్ళు.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 16.
‘సమాచారాన్ని వెల్లడి చేయడం పై ప్రజల వాదనలు ఏవి?
జవాబు:
వారి వాదనలు :

  1. మానవ అభివృద్ధి, ప్రజాస్వామిక హక్కులకు సమాచారం కీలకమైనది. అధికారిక పత్రాల రూపంలో తగినంత సమాచారం ఉన్నప్పుడే ప్రజలు పాలనలో భాగస్వాములై, న్యాయమైన అభివృద్ధి జరిగేలా చూడగలుగుతారు.
  2. సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటంవల్ల ప్రభుత్వాలు తమ పనితీరులో మరింత జవాబుదారీగా ఉంటాయి. దీనివల్ల వాటి పనితీరును పర్యవేక్షించటం, అవినీతి జరగకుండా చూడటం సాధ్యమవుతుంది.
  3. పేదల మనుగడకు సమాచారం కీలకమైనది.
  4. సమాచారాన్ని వెల్లడి చేయాల్సి ఉన్నప్పుడు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవటాన్ని అరికట్టవచ్చు.

ప్రశ్న 17.
విద్యా హక్కు చట్టంలోని ఏవేని 6 ముఖ్యాంశాలను రాయండి.
జవాబు:
విద్యాహక్కు చట్టం, 2009 :
6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యనందించడానికి ఉద్దేశించబడినది. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది.

చట్టంలోని ముఖ్యాంశాలు :

  1. పిల్లలందరికి అందుబాటులో పాఠశాలలను ఏర్పాటు చేయాలి.
  2. పాఠశాలలకు మౌలిక వసతులను కల్పించాలి.
  3. పిల్లలందరిని వయస్సుకు తగిన తరగతిలో చేర్పించాలి.
  4. వయస్సుకు తగ్గ రీతిలో చేర్చిన తరవాత వారితో సమానంగా ఉండటానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి.
  5. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సాధారణ పిల్లలతోపాటు విద్య కొనసాగించడానికి తగు వసతులు ఏర్పాటు చేయాలి.
  6. బడిలో చేర్చుకోవడానికి ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదు. ఎటువంటి రుసుము, ఛార్జీలు వసూలు చేయరాదు.

ప్రశ్న 18.
సమాచారం వెల్లడి కోసం ఉద్యమం ఎలా మొదలైంది?
జవాబు:
రాజస్థాన్లో కొంతమంది మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన (MKSS) పేరుతో సంఘటితమై ప్రభుత్వ కార్యక్రమాల గురించి, అవి అమలు అయ్యే తీరు, స్థానికసంస్థలు డబ్బులు ఎలా ఖర్చు చేశామో తనిఖీ లేదా MNREGA వంటి సమాచారం అడగసాగారు. ప్రభుత్వం నుంచి ప్రజలు సమాచారం పొందటానికి ఎటువంటి చట్టబద్ధ హక్కులేదు. మొదట్లో కొంతమంది అధికారుల సహాయంతో సంబంధిత పత్రాలను సేకరించి బహిరంగ సమావేశాల్లో ప్రజలు వీటిని తనిఖీ చేయటం మొదలు పెట్టారు. కొంతకాలం తరవాత ఈ వివరాలు ఇవ్వటానికి అధికారులు నిరాకరించారు. ఫలితంగా ఈ విషయమై మూడు సంవత్సరాల పాటు ప్రదర్శనలు, ఊరేగింపులతో ఉద్యమించారు. ఈ విధంగా ఉద్యమం మొదలైంది.

ప్రశ్న 19.
విద్యా హక్కు చట్టం గురించి తెలపంది.
జవాబు:
విద్యాహక్కు చట్టం, 2009 : 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యనందించడానికి ఉద్దేశించబడినది. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది.

ప్రశ్న 20.
86వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
86వ రాజ్యాంగ సవరణ 2002లో జరిగింది.

ప్రశ్న 21.
మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్ (MKSS) ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
జవాబు:
మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్ రాజస్థాన్‌లో ప్రారంభమైంది.

ప్రశ్న 22.
ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
ఐక్యరాజ్యసమితి 1945లో ఏర్పడింది.

ప్రశ్న 23.
జీవించే హక్కు అంటే?
జవాబు:
మానవ గౌరవానికి భంగం కలగకుండా జీవించే హక్కు.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 24.
జాతీయస్థాయిలో పార్లమెంట్ సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో చేసింది?
జవాబు:
2005లో

ప్రశ్న 25.
స్వాతంత్ర్య ఉద్యమంలో గోపాలకృష్ణ గోఖలే ఏ వర్గానికి చెందినవాడు?
జవాబు:
మితవాదులు.