AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 11th Lesson డూడూ బసవన్న Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 11th Lesson డూడూ బసవన్న

6th Class Telugu 11th Lesson డూడూ బసవన్న Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న 1

ప్రశ్న 1.
పై సన్నివేశాలు ఏ పండుగరోజు కనిపిస్తుంటాయి?
జవాబు:
సంక్రాంతి పండుగ రోజులలో పై సన్నివేశాలు కనిపిస్తుంటాయి.

ప్రశ్న 2.
ఏ పండుగ సందర్భంలో హరిదాసు మీ ఇంటికి వస్తాడు?
జవాబు:
సంక్రాంతి పండుగ రోజులలో సుమారు నెలరోజులు హరిదాసు మా ఇంటికి వస్తాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ప్రశ్న 3.
సంక్రాంతి పండుగరోజు ఇంకా మన ఇంటి ముంగిళ్ళ ముందు ఎవరు కనిపిస్తారు?
జవాబు:
సంక్రాంతి పండుగరోజులలో హరిదాసులు, గంగిరెద్దులవాళ్లు, పాములనాడించే వారు, పగటివేషగాళ్లు, చిలక జ్యోతిష్యం చెప్పేవారు, సోదమ్మలు మొదలైన వాళ్లంతా మన ముంగిట కనిపిస్తారు.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
మీరు చూసిన లేదా విన్న ఏదైనా కళారూపం గురించి చెప్పండి.
జవాబు:
మేము బుర్రకథను చూశాం. బుర్రకథలో ముగ్గురు ఉంటారు. ముగ్గురిలో మధ్య కథకుడు. అతని చేతిలో తంబూరా ఉంటుంది. తంబూరా మీటుతూ కథను నడుపుతాడు. అతనికి అటు, ఇటు ఇద్దరు ఉంటారు. వారిని వంతలు అంటారు. వారిద్దరి చేతిలో డోలకు ఉంటాయి. వారిలో ఒకరు రాజకీయం చెబుతారు. మరొకరు హాస్యం పండిస్తారు. ముగ్గురికి గజ్జెలు ఉంటాయి. తందాన ….. తాన తందనాన… అంటూ సాగుతుంది.

ప్రశ్న 2.
గంగిరెద్దుల వాళ్ళను చూసినప్పుడు రచయితకు ఎందుకు బాధ కలిగిందో రాయండి.
జవాబు:
పాత ఆచారాలు పోతున్నందుకు రచయిత బాధపడ్డాడు. అందచందాలు ఉన్నది గంగిరెద్దాట. ఎంతోమంది రాజులూ, రాణులూ కూడా ఆదరించినది గంగిరెద్దాట. సామాన్య జనాన్ని కూడా సంతోషపెట్టిన ఆట గంగిరెద్దాట. అటువంటి గంగిరెద్దాట కనుమరుగవుతున్నందుకు రచయిత బాధపడ్డాడు.

ప్రశ్న 3.
బసవయ్య గంగిరెద్దులు ఆడించడం ఎలా నేర్చుకున్నాడు?
జవాబు:
బసవయ్య చిన్నతనం నుండీ తండ్రితో ఊరూరా తిరిగాడు. తండ్రిని గమనిస్తూ ఉండేవాడు. ఆయన మాటల్ని, మన పద్ధతుల్ని అనుకరించేవాడు. అలా చిన్నతనం నుండీ గంగిరెద్దాటలోని మెలుకువలన్నీ నేర్చుకొన్నాడు. తన తండ్రి ఎద్దుచేత మోళీ చేయిస్తుంటే బసవయ్య రాండోలు వాయించేవాడు. అలా పూర్తిగా గంగిరెద్దులను ఆడించడం నేర్చుకొన్నాడు.

ప్రశ్న 4.
కింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

సమాజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు. ఇవి కొండ గ్రామాలలో పుట్టి క్రమక్రమంగా ద్రావిడ దేశాలన్నింటా విస్తరించాయి. వీటిలో ప్రత్యేకమైనది కురవంజి. ఆటవికుల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం కురవంజి. కురవలు అనేవారు ఏదో వినోదం కోసం ఆరంభించినా క్రమంగా అదే జీవనోపాధి అయింది. వీరు పుణ్యక్షేత్రాల దగ్గర వాటి స్థలపురాణాలను, పవిత్ర కథలు, గాథల్ని ఆశువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులుగా చేసేవారు. యాత్రికులు వారి ప్రదర్శనకు మెచ్చి బహుమతులిచ్చేవారు. కురవంజి కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెందింది. ఏకపాత్రగా మారి ఎఱుక చెప్పే సోదెగా నేడు మిగిలింది. వారు సోదె చెప్పే విధానం అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది.

అ) జానపద కళారూపాలు ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
సమాజ వినోదం కోసం జానపద కళారూపాలు ఏర్పడ్డాయి.

ఆ) కురవంజి ప్రదర్శనలో వేటి గురించి కురవలు చెప్పేవారు?
జవాబు:
పుణ్యక్షేత్రాల స్థల పురాణాలు, పవిత్ర కథలు, గాథలను గురించి కురవంజి ప్రదర్శనలో కురవలు చెప్పేవారు.

ఇ) కురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది?
జవాబు:
కాలక్రమేణా కురవంజి ఏకపాత్రగా మారింది. ప్రస్తుతం ఎఱుక చెప్పే సోదెగా మారింది.

ఈ) పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జానపద కళారూపాలు ఎక్కడ విస్తరించాయి ?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ఎక్కడ ధర్మప్రభువులుంటే అదే మా ఊరు” అని బసవయ్య ఎందుకు అని ఉంటాడు?
జవాబు:
బసవయ్య దృష్టిలో ధర్మప్రభువులు అంటే దానగుణం కలవారు. కళాపోషణ చేసేవారు. అటువంటి వారున్నచోట గంగిరెద్దాట ఆడేవారికి లోటుండదు. బియ్యం ఇస్తారు. డబ్బులు ఇస్తారు. బట్టలు ఇస్తారు. గంగిరెద్దుకు మేత పెడతారు. తమకు నివాసం చూపిస్తారు. గంగిరెద్దాట చూసి ఆనందిస్తారు. బహుమతులిస్తారు. కనుక ధర్మప్రభువులున్న ఏ ఊరైనా తమ ఊరేనన్నాడు. గుప్పెడన్నం ఎక్కడ దొరికితే అదే తన ఊరని బసవయ్య ఉద్దేశం. అందుకే అలా అన్నాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ప్రశ్న 2.
గంగిరెద్దాట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలవు?
జవాబు:
దేవతలలో ఆదిదేవుడు పరమేశ్వరుడు. ఆయన వాహనం నందీశ్వరుడు. ఆ పరమేశ్వరుడే నందీశ్వరుడిచేత గంగిరెద్దాట ఆడించాడంటారు.

ఒకసారి శివలింగాన్ని గజాసురుడు మింగేస్తాడు. శివుడి గురించి పార్వతీదేవి, వినాయకుడు, మొదలైన వారు ఆందోళన చెందుతారు. విష్ణువును ఆశ్రయిస్తారు. విష్ణువు గంగిరెద్దుల నాడించేవానిగా మారతాడు. నందీశ్వరుని చేత గజాసురుని ముందు గంగిరెద్దాటను ఆడిస్తాడు. గజాసురుడు ఏం కావాలో కోరుకోమంటాడు. ఆనందంతో పరమేశ్వరుడు కావాలంటాడు. సరే అంటాడు. గజాసురుని పొట్టను నందీశ్వరుడు తన కొమ్ములతో చీల్చాడు. శివుని తెచ్చాడు.

అలాగే రాజులు, రాణులు కూడా గంగిరెద్దాటను ఆస్వాదించారు. అందుచేత గంగిరెద్దాట చాలా ప్రాచీన కాలం నుండీ ఉంది. గంగిరెద్దును నందీశ్వరునిగా, గంగిరెద్దును ఆడించేవాసిని విష్ణువుగా, అతని భార్యను లక్ష్మీదేవిగా పూర్వం భావించేవారు. గంగిరెద్దు గుమ్మంలో ఆడితే ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం.

ప్రశ్న 3.
గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఏ వాయిద్యాలుంటాయి? వాటిని ఎలా ఉపయోగిస్తారు?
జవాబు:
గంగిరెద్దుల వాళ్ళ దగ్గర డోలు, సన్నాయి ఉంటాయి. డోలును రాండోలు అని కూడా అంటారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
గంగిరెద్దుల ఆట ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాయండి.
జవాబు:
ఒక వ్యక్తి గంగిరెద్దు చేత మోళీ చేయిస్తుంటాడు. మరొక వ్యక్తి రాండోలు వాయిస్తుంటాడు. రాండోలు వాయించడ మంటే రెండుచేతులతోనూ రెండు కర్రలు పట్టుకొంటారు. ఒక కర్రతో డోలు చర్మాన్ని రాపాడిస్తారు. మరో కర్రతో రెండోవైపున వరసలు వాయిస్తారు. ఇది గంగిరెద్దు మోళీకి తగినట్లుగా ఉండాలి.

గంగిరెద్దు మోళీ చేస్తుంది. ముంగాళ్లు వంచి ముందుకు నడుస్తుంది. వెనక్కు జరుగుతుంది. ఒంటికాలితో దండం పెడుతుంది. కాదు, ఔను అని తలలో సైగలు చేస్తుంది. రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేస్తుంది. అలుగుతుంది. కోపగించుకొంటుంది. ఆనందంతో చిందులు వేస్తుంది. కోపంతో కాలు దువ్వుతుంది. తోక ఎగబెట్టి రంకెలు వేస్తుంది. ఇలా ఏ పని చెబితే ఆ పనిని చేస్తుంది.

ప్రశ్న 2.
గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూళ్ళలోనే ఉండిపోవడానికి కారణాలు రాయండి.
జవాబు:
మారుమూల పల్లెటూళ్లలో కళాపోషణ ఉంటుంది. తోటివారిని ఆదుకొనే మనస్తత్వం ఉంటుంది. ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. వారి దగ్గర పశువులు కూడా ఉంటాయి. అందుచేత పశువుల మేత కూడా ఉంటుంది. తిండిగింజలకు లోటుండదు. భక్తి ఎక్కువ, ఆదరణ ఎక్కువ. గంగిరెద్దుకు, తమ కుటుంబానికి తిండికీ సౌకర్యానికీ, ఆదరణకూ లోటుండదు కనుక గంగిరెద్దుల వాళ్లు పల్లెటూళ్లలోనే ఉంటున్నారు. సాయంత్రం అయితే అందరూ ఇళ్లకు చేరతారు. గంగిరెద్దాటంటే పల్లెటూరి జనానికి ఇష్టం కూడా.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ప్రశ్న 3.
మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి.
జవాబు:
నాకు గొరవయ్యల నృత్య ప్రదర్శన ఇష్టం. ఇది మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురాలలో ప్రసిద్ది చెందిన జానపద కళారూపం. దీనిని మాదాసి కురవలు అనేవారు ప్రదర్శిస్తారు. ఒక చేత్తో పిల్లనగ్రోవి వాయిస్తారు. మరో చేత్తో జగ్గు లేదా డమరుకం వాయిస్తూ మధ్యమధ్యలో వచనాలు పాడుతూ సామూహిక నృత్యం చేస్తారు. వీరు పెట్టుకొనే టోపీ ఖండాంతరాల కావల గల ఆదివాసీ పురాతన సంప్రదాయ నమూన కలిగి ఉంటుంది. వీరు కన్నడంలోనూ తెలుగులోనూ కూడా వచనాలు చెబుతూ అదరకొట్టేస్తారు. మన జానపద కళలకు ఇటువంటి వారే వారసులు.

భాషాంశాలు

అ) కింద గీతగీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : ఆరిఫ్ కుటుంబం శ్రీకాకుళంలో మకాం ఉంటుంది.
మకాం = నివాసం
ఎలుకలు బొరియలలో నివాసం ఉంటాయి.

1. రాబర్ట్ వాళ్ళ బామ్మ నన్ను ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తుంది.
జవాబు:
ఆప్యాయం = వాత్సల్యం
మా ఉపాధ్యాయులు మమ్ము వాత్సల్యంతో చూస్తారు.

2. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడచుకోవాలి.
జవాబు:
అనుగుణం = తగినట్లు
ప్రశ్నకు తగినట్లు జవాబు ఉండాలి.

3. కాలుష్యం ఎక్కువైతే ప్రకృతి అందాలు కనుమరుగు అవుతాయి.
జవాబు:
కనుమరుగు = నాశనం
మానవులలో మంచితనం నాశనం అవుతోంది.

ఆ) కింది పదాలకు సమానార్థక పదాలు (పర్యాయపదాలు) వెతికి రాయండి.
ఉదా : నదులలో నీరు తియ్యగా, సముద్రంలో జలం ఉప్పగా ఉంటుంది.
జవాబు:
ఉదకం : నీరు, జలం

1. సునీల తండ్రి గురవయ్య. వినయ్ జనకుడు స్వామి.
జవాబు:
నాన్న = తండ్రి, జనకుడు

2. వృషభం, ఎద్దు, గోవు, ధేనువు, పాదపం.
పై వాటిలో ‘బసవయ్య’ అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయండి.
జవాబు:
బసవయ్య = వృషభం, ఎద్దు

3. మా విజ్ఞానయాత్ర మాకు ఆనందాన్ని, మా ఉపాధ్యాయులకు సంతసాన్ని పంచింది.
జవాబు:
సంతోషం = ఆనందం, సంతసం

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ఇ) కింది పదబంధాలకు విశేషార్థాలు చదవండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : రూపుమాపు = నాశనం చేయు
మనం వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి.

1. పట్టుకొని వేలాడు = వదిలిపెట్టకుండా ఉండు
మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడకూడదు.

2. కాలుదువ్వు = తగవుకు సిద్ధపడడం.
అయినదానికీ, కాని దానికి అందరి మీదా కాలుదువ్వడం మంచిదికాదు.

3. తిలోదకాలివ్వడం = సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం.
దుర్మార్గానికి తిలోదకాలివ్వడం మంచిది.

వ్యాకరణాంశాలు

అ) కింది పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి.

1. మహేశ = మహా + ఈశ = ఆ + ఈ = ఏ
2. మహోదధి = మహా + ఉదధి = ఆ + ఉ = ఓ
3. రాజర్షి = రాజ + ఋషి = అ + ఋ = అర్

పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర అ ఆ అనే అచ్చులు ఉన్నాయి. పరపదంలో మొదటి అచ్చులుగా ఇ, ఉ, ఋ లు ఉన్నాయి. వాటి స్థానంలో క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వచ్చాయి కదా !

అలాగే కిందనున్న పదాలను విడదీసి రాయండి.
1. రాజేంద్ర = రాజ + ఇంద్ర = అ + ఇ = ఏ
2. తిలోదకాలు = తిల + ఉదకాలు = అ + ఉ = ఓ
3. మహర్షి = మహా + ఋషి = ఆ + ఋ = అర్

పరిశీలించండి.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న 2

ఏ, ఓ, అర్ లను గుణములు అంటారు. ఇలా అకారానికి (అ, ఆ) “ఇ, ఉ, ఋ” లు (ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఋ) పరమైతే క్రమంగా ఏ, ఓ, అర్ లు వస్తాయి. దీనినే గుణ సంధి అంటారు.

ఆ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

1. పరోపకారం = పర + ఉపకారం – గుణ సంధి
2. రమేశ = రమ + ఈశ = గుణ సంధి
3. జాతీయోద్యమం = జాతీయ + ఉద్యమం – గుణ సంధి
4. దేవర్షి = దేవ + ఋషి = గుణ సంధి

ఇ) కింది సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

1. సత్యాగ్రహం = సత్య + ఆగ్రహం = సవర్ణదీర్ఘ సంధి
2. గిరీశుడు = గిరి + ఈశుడు = సవర్ణదీర్ఘ సంధి
3. గురూపదేశం – గురు + ఉపదేశం = సవర్ణదీర్ఘ సంధి
4. పిత్రణం = పితృ + ఋణం = సవర్ణదీర్ఘ సంధి

ఈ) కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి.
1. శైల + అగ్రం = శైలాగ్రం = సవర్ణదీర్ఘ సంధి
2. ముని + ఇంద్రుడు = మునీంద్రుడు = సవర్ణదీర్ఘ సంధి
3. మధు + ఉదయం = మధూదయం = సవర్ణదీర్ఘ సంధి

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ఉ) కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి.

1. అందచందాలు : అందమును, చందమును
2. కాలుసేతులు : కాళ్ళును, చేతులును
3. అన్నదమ్ములు : అన్నయును, తమ్ముడును

కింది విగ్రహ వాక్యాలను ద్విగు సమాస పదాలుగా మార్చి రాయండి.

1. రెండైన చేతులు = రెండు చేతులు
2. మూడైన మాసాలు = మూడు మాసాలు
3. ఐదుగురైన పిల్లలు = ఐదుగురు పిల్లలు

ఎ) కింది వాక్యాలను పరిశీలించండి.

1. మీరు లోపలికి రావచ్చు.
2. నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు.
3. మీరు సెలవు తీసుకోవచ్చు.

ఇలా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే, అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. ఉదాహరణకు “మీరు పరీక్ష రాయవచ్చు”. ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి.

1. మీరు ఆటలు ఆడుకోవచ్చు – అనుమత్యర్థక వాక్యం
2. మీరు భోజనాలు చేయవచ్చు – అనుమత్యర్థక వాక్యం
3. నీవు లోపలికి రావచ్చు – అనుమత్యర్థక వాక్యం అలాగే

1. నీకు శుభం కలుగుగాక !
2. నిండు నూరేళ్ళూ వర్దిల్లు
3. నీకు మంచి బుద్ధి కలుగుగాక !

ఈ విధంగా ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఆశీరర్థక వాక్యాలు అంటారు. ఆంటోనీ ! నీకు దైవానుగ్రహము కలుగుగాక ! – ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి.

1. నీవు కలకాలం చల్లగా ఉండుగాక ! – ఆశీరర్థక వాక్యం
2. నీవు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడవగు గాక ! – ఆశీరర్థక వాక్యం
3. నీవు ఉన్నత స్థితికి వచ్చుగాక ! ఆశీరర్థక వాక్యం

ఏ) కింది వాక్యాలు చదివి అవి ఏరకం వాక్యాలో రాయండి.
1. నాయనా ! వర్ధిల్లు !
2. రహీమ్ నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు.
3. సరోజా! సద్విద్యా ప్రాప్తిరస్తు !
4. ఎల్విన్ ! నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును.
5. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక !
6. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిరావచ్చును.

వాక్యంవాక్యపు రకం
1. నాయనా ! వర్ధిల్లు !ఆశీరర్థక వాక్యం
2. రహీమ్ నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు.అనుమత్యర్థక వాక్యం
3. సరోజా! సద్విద్యా ప్రాప్తిరస్తు !ఆశీరర్థక వాక్యం
4. ఎల్విన్ ! నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును.అనుమత్యర్థక వాక్యం
5. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక !ఆశీరర్థక వాక్యం
6. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిరావచ్చును.అనుమత్యర్థక వాక్యం

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ఐ) జతపర్చండి.

1. నువ్వు పద్యం చదివావా?అ) ఆశీరర్థకం
2. అల్లరి చేయకండి.ఆ) ఆశ్చర్యార్థకం
3. అబ్బో! పువ్వు ఎంత బాగుందో !ఇ) ప్రశ్నార్థకం
4. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక !ఈ) నిషేధార్థకం

జవాబు:

1. నువ్వు పద్యం చదివావా?ఇ) ప్రశ్నార్థకం
2. అల్లరి చేయకండి.ఈ) నిషేధార్థకం
3. అబ్బో! పువ్వు ఎంత బాగుందో !ఆ) ఆశ్చర్యార్థకం
4. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక !అ) ఆశీరర్థకం

చమత్కార పద్యం

కప్పను చూసి పాము వణికింది అని సమస్యను ఒక కవికి ఇవ్వడం జరిగింది. కప్పను చూసి పాము వణకదు. ఈ సమస్యకు కవి కింది విధంగా పరిష్కారం చూపాడు.

కుప్పలు కావలిగాయగ
చెప్పులు కర్రయును బూని శీఘ్రగతిం దా
జప్పుడగుచు వచ్చెడి వెం
కప్పను గని ఫణివరుండు గడగడ వణికెన్.

భావం :
పద్యం చివరిపాదంలో కప్ప దాని ముందరి అక్షరంతో కలిసి వెంకప్ప అయింది. ఆ వెంకప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకొని కర్రతో బయలుదేరాడు. ఆ వెంకప్పను చూసి ఒక పాము గడగడ వణికిందట.

డూడూ బసవన్న – రచయిత పరిచయం

రచయిత పేరు : రావూరి భరద్వాజ

జననం : 1927 జూలై 5వ తేదీన గుంటూరు జిల్లాలోని తాడికొండలో జన్మించారు.

తల్లిదండ్రులు : మల్లికాంబ, కోటయ్య దంపతులు.

ఉద్యోగం : వ్యవసాయం, ప్రెస్సులో ఉద్యోగం, జమీన్ రైతు పత్రికా సంపాదక వర్గంలోనూ, జ్యోతి, సమీక్ష మొదలైన పత్రికలో పనిచేశారు.

రచనలు : విమల – తొలికథ, అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు, ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రచించారు.

అవార్డులు : పాకుడు రాళ్లు నవలకు జ్ఞానపీఠ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మీ పౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం), లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం ‘జీవన సమరం’ అనే వ్యథార్త జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకొన్నారు.

కఠినపదాలు – అర్థాలు

ప్రభువు = పరిపాలకుడు
దణ్ణం = దండం
కనుమరుగు = నశించు
చందము = విధము
ప్రాచీనం= పూర్వకాలం
పుడక = పుల్ల
గొడ్డుమోతు = సంతానం లేనిది
ముంగాళ్లు = ముందరి కాళ్లు
సుబ్బరంగా = శుభ్రంగా
సాదిక = సారధ్య
మకాం = నివాసం
ఉడకేసుకొని = వండుకొని
ఉత్తరీయం = పైబట్ట (తువ్వాలు, కండువా)
దాటిపోయింది = వెళ్లిపోయింది

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

గడి = గంగిరెద్దాడే ప్రదేశం
దేదీప్యమానంగా = ప్రకాశవంతంగా
ఘట్టం = సంఘటన
తిలోదకాలివ్వడం = వదిలేయడం
గొడ్డు = పశువు
చిందులు = గంతులు
మాసం = నెల
గంగడోలు = ఆవు మెడ దగ్గర మెత్తటి చర్మం
క్రీడ = ఆట

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి

These AP 6th Class Telugu Important Questions 2nd Lesson తృప్తి will help students prepare well for the exams.

AP State Syllabus 6th Class Telugu 2nd Lesson Important Questions and Answers తృప్తి

6th Class Telugu 2nd Lesson తృప్తి Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు

1. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. “అందరూ వినండరా” అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. “వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను” అంటూ లిస్టు చదివాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) జనం మామిడి తోటలో ఎందుకు చేరారు?
జవాబు:
జనం వనసంతర్పణ కోసం మామిడి తోటలో చేరారు.

ఆ) జనం ఎక్కడ కూర్చున్నారు?
జవాబు:
జనం చాపల మీద కూర్చున్నారు.

ఇ) గావుకేక పెట్టింది ఎవరు?
జవాబు:
పూర్ణయ్య గావుకేక పెట్టాడు.

ఈ) పూర్ణయ్య దేని గురించి లిస్టు తయారుచేశాడు?
జవాబు:
పూర్ణయ్య వనసంతర్పణలో చేసే వంటకాల గురించి లిస్టు తయారుచేశాడు.

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి

2. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

నిగనిగలాడే వాక్కాయల బుట్టతో, లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. “వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి” అని తలా ఓ కాయ పంచాడు. “చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది” అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్లీ జనం అంతా వంట కబుర్లలో పడేవారు. బావగాడు ఇలా ప్రదర్శనలిస్తుంటే ఆకలి రెపరెప పెరుగుతోంది.

ఇక అక్కడ గాడిపొయ్యి దగ్గర వంటవాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) పూర్ణయ్య బుట్టలో ఏమి తెచ్చాడు?
జవాబు:
పూర్ణయ్య బుట్టలో వాక్కాయలు తెచ్చాడు.

ఆ) వాక్కాయ ఏ రుచితో ఉంటుంది?
జవాబు:
వాక్కాయ పులుపు రుచితో ఉంటుంది.

ఇ) చుక్కకూర ఏ పప్పుతో చక్కగా మేళవిస్తుంది?
జవాబు:
చుక్కకూర పెసరపప్పుతో చక్కగా మేళవిస్తుంది.

ఈ) పాయసంలో ఏమి వేయమని పూర్ణయ్య పురమాయిస్తున్నాడు?
జవాబు:
పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పూర్ణయ్య పురమాయిస్తున్నాడు.

3. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

“అప్పుడే మంచినీళ్ళు తాగెయ్యకు. మీగడ పెరుగుంది…” ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందునుంచి పైకి లేవడమే కష్టమైంది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత వంటవాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. “కష్టపడి వండారు తినకపోతే ఎలా?” అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున గాడిపొయ్యి పక్కన ఓ చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) “మీగడ పెరుగుంది’ – అని ఎవరు చెప్పారు?
జవాబు:
మీగడ పెరుగుంది అని పూర్ణయ్య చెప్పాడు.

ఆ) విస్తళ్ళ ముందు నుంచి పైకి లేవడం ఎందుకు కష్టమైంది?
జవాబు:
‘వంటలు రుచిగా ఉండడం, ఎక్కువగా ఆహారం తినడం చేత విస్తళ్ళ ముందునుండి పైకి లేవడం కష్టమైంది.

ఇ) అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత భోజనానికి ఎవరు కూర్చున్నారు?
జవాబు:
అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత వంటవాళ్ళు భోజనానికి కూర్చున్నారు.

ఈ) అందరి కంటే చివరన భోజనానికి కూర్చున్నదెవరు?
జవాబు:
అందరికంటె చివరన పూర్ణయ్య భోజనానికి కూర్చున్నాడు.

అపరిచిత గద్యాలు

1. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆరోగ్య పరిరక్షణకు మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 35 ఏళ్ళు దాటాక మరింత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి ఆయువు పట్టు మహిళలే. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. దానివలన రుగ్మతలను ముందుగానే తెలుసుకోవచ్చును. వ్యాధులు ముదిరిన తర్వాత తెలుసుకొంటే వైద్యం కష్టమవుతుంది.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఏ వయసు మహిళలు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి?
జవాబు:
35 సం||లు దాటినవారు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆ) కుటుంబానికి ఆయువు పట్టు ఎవరు?
జవాబు:
మహిళ కుటుంబానికి ఆయువు పట్టు.

ఇ) “రుగ్మత” అంటే అర్థం ఏమిటి?
జవాబు:
రుగ్మత అంటే రోగం అని అర్థం.

ఈ) వ్యాధులు ముదిరితే ఏమవుతుంది?
జవాబు:
వ్యాధులు ముదిరితే వైద్యం దొరకడం కష్టమవుతుంది.

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి

2. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

మానవాళికి ప్రాణాధారమైన నీటిని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని కాపాడుకోవాలి. దీని గురించి అందరికీ అవగాహన ఏర్పడాలి.

దీనికి మంచి మార్గం భూగర్భజలాలను పెంపొందించుకోవాలి. ఇంకుడు గుంటలు ఎక్కువగా ఏర్పరచుకొంటే భూగర్భజలాలు అడుగంటిపోవు. వర్షపునీరు, వాడిన నీరు ఇంకుడు గుంటలోకి ఇంకేలా చేయాలి. ఇంకుడు గుంటలో ఇసుక, కంకర వేయాలి.
ప్రశ్నలు – జవాబులు:
అ) మానవులకు ప్రాణాధారమేది?
జవాబు:
మానవులకు నీరు ప్రాణాధారం.

ఆ) నీటిని కాపాడడం ఎవరి బాధ్యత?
జవాబు:
నీటిని కాపాడడం అందరి బాధ్యత.

ఇ) ఇంకుడు గుంటలెందుకు నిర్మించాలి?
జవాబు:
భూగర్భజలాల రక్షణ కోసం ఇంకుడు గుంటలు నిర్మించాలి.

ఈ) పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.
జవాబు:
జలరక్షణ

3. క్రింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆంధ్రులకు ప్రీతిపాత్రుడైన కాటన్ ఆంధ్రుడు కాడు. కనీసం భారతదేశంలోనైనా జన్మించలేదు. ‘హెన్రీ’, ‘కాల్వెలీ కాటన్’ అనే ఆంగ్ల దంపతులకు పదవ కుమారుడు ఆర్థర్ థామస్ కాటన్, క్రీ.శ. 1803వ సంవత్సరం మే 15న ‘కాంబర్ మిర్ అబీ’ అనే గ్రామంలో జన్మించాడు. ఆయన ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించారు. దానివలన పంటలకు నీరందుతోంది. నేల సస్యశ్యామలమైంది.
ప్రశ్నలు – జవాబులు:
అ) కాటన్ తల్లిదండ్రులెవరు?
జవాబు:
కాటన్ తల్లి హెన్రీ, తండ్రి కాల్వెలీ కాటన్.

ఆ) కాటన్ సోదరులెంతమంది?
జవాబు:
కాటన్ కు తొమ్మిదిమంది సోదరులు.

ఇ) కాటన్ అంటే ఆంధ్రులకెందుకిష్టం?
జవాబు:
కాటన్ ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి, చేలకు నీరందించాడు.

ఈ) పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.
జవాబు:
కాటన్.

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి

4. కింది అపరిచిత గద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

భోజరాజు తఱచుగా రాత్రివేళల్లో మాటువేషం వేసుకొని తిరుగుతూ నగర ప్రజల పరిస్థితిని గమనిస్తూండేవాడు. ఒకనాటి అర్ధరాత్రి ఇలాగే తిరుగుతున్న వేళలో ఒక ఇంటిలో దొంగతనం జరుగుతున్నట్టు ఆయనకు అనిపించింది. ఆ యింటిలోని వారెవ్వరూ కొన్ని రోజులుగా ఊళ్ళో లేనట్టుంది. ఆ కారణంగా ఈ దొంగలకి ఈ ఇల్లు మణింత అనుకూల మన్పించిందని భోజరాజుకి తోచింది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా వాళ్ళు చేయవలసిన దొంగతనాన్ని చాలా శ్రద్ధగా చేసి ఆ దొంగసొత్తుని ఊరి వెలుపల ఉన్న మామిడి తోపులోకి పట్టుకుపోయి పంచుకోవాలని నిశ్చయించుకుని బయటికి రాబోయే సరికి నగరంలో గస్తీ తిరుగుతున్న రక్షక భటుల నగారాధ్వనులు వినిపించాయి.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరు మాఱువేషంలో ఎప్పుడు నగర ప్రజల పరిస్థితిని గమనించేవారు?
జవాబు:
భోజరాజు మాఱువేషంలో రాత్రివేళ నగర ప్రజల పరిస్థితిని గమనించేవాడు.

ఆ) ఒకనాటి అర్ధరాత్రి భోజరాజుకి ఏమనిపించింది?
జవాబు:
ఒకనాటి అర్ధరాత్రి భోజరాజుకు ఒక ఇంటిలో దొంగతనం జరుగుతున్నట్టు అనిపించింది.

ఇ) ఏ కారణంగా దొంగలకు ఇల్లు అనుకూలమన్పించింది?
జవాబు:
ఇంటిలోని వారు ఎవ్వరూ లేని కారణంగా ఇల్లు దొంగలకు అనుకూలమన్పించింది.

ఈ) దొంగలు సొత్తుని ఎక్కడ పంచుకోవాలనుకున్నారు?
జవాబు:
దొంగలు సొత్తుని ఊరి వెలుపల ఉన్న మామిడి తోపులోకి పట్టుకుపోయి పంచుకోవాలని నిశ్చయించుకున్నారు.

5. కింది అపరిచిత గద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

మరాలుడనే దొంగ తను దొంగతనం చేయడానికి కారణం ఏమని చెప్పాడంటే “నా తల్లిదండ్రులు బాగా వృద్ధులు. నేను వారిని కాశీకి తీసుకుపోగలిగినంత సంపన్నతతో లేను. మా కెటిగిన ఒక కుటుంబం కాశీకి పోతోందని తెలిసింది. మా తల్లిదండ్రులనీ ఆ కుటుంబాన్నీ కాశీకి ఈ మొత్తం ద్రవ్యంతో పంపించాలనేది నా తలంపు. ఆ వెళ్ళే కుటుంబం కూడా కాశీ వెళ్ళగలిగినంత స్తోమత కలిగింది కాదు. అందుకని ఈ విధమైన ఏర్పాటు చేయదలిచాను” అని చెప్పాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరు దొంగతనం చేసారు?
జవాబు:
మరాలుడు అనేవాడు దొంగతనం చేసాడు.

ఆ) ఎవరు వృద్ధులు?
జవాబు:
మరాలుని తల్లిదండ్రులు వృద్ధులు.

ఇ) ఎవరు కాశీకి వెళుతున్నారు?
జవాబు:
మరాలునికి తెలిసిన కుటుంబం కాశీకి వెళుతున్నారు.

ఈ) మరాలుని తలంపు ఏమిటి?
జవాబు:
దొంగిలించిన ద్రవ్యంతో తల్లిదండ్రుల్ని కాశీకి పంపాలని తలంపు కలిగింది.

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి

6. కింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఒకప్పుడు ‘అన్నంభట్టు’ అనే పేరున్న ఒక విద్యార్థి ఉండేవాడు. అతనికి పెద్దగా చదువు ఒంట బట్టేది కాదు. ఏదో ఎలాగో వేదవిద్య పూర్తయిందనిపించాడు. వివాహానికి తగిన వయసు రాగా, తల్లిదండ్రులు మంచి శుద్ధ శ్రోత్రియుని కూతురూ సంస్కృతంలో కవిత్వం కూడా చెప్పగల పిల్లతో అతనికి పెళ్ళి జరిపించారు. ఆమె తల్లిదండ్రులూ ఆమె కూడా వీలయినంత ఎక్కువగా సంస్కృతంలోనే మాట్లాడుకుంటూ ఉండడం, కనీసం పెళ్ళిపీటల మీద కూడా సంస్కృతాన్ని విడవకపోవడం కారణంగానూ, ఆ భాష తనకంతగా రాని కారణంగానూ కొంత అర్థమయ్యి, కొంత కాకా అన్నంభట్టుకి పెద్ద తలనొప్పిగా అన్పించింది వారి ధోరణి. అయినా ఏం చేస్తాం? అనుకున్నాడు అన్నంభట్టు అప్పటికి.
ప్రశ్నలు – జవాబులు:
అ) అన్నంభట్టు ఎవరు?
జవాబు:
అన్నంభట్టు ఒక విద్యార్థి.

ఆ) అన్నంభట్టు వివాహం ఎవరితో జరిగింది?
జవాబు:
శుద్ధ శ్రోత్రియుని కుతురూ, సంస్కృతంలో కవిత్వం చెప్పగల అమ్మాయితో అన్నంభట్టు వివాహం జరిగింది.

ఇ) పెళ్ళికూతురూ, తల్లిదండ్రులూ ఎలా మాట్లాడుకున్నారు?
జవాబు:
పెళ్ళికూతురూ, ఆమె తల్లిదండ్రులు కూడా వీలయినంత ఎక్కువగా సంస్కృతంలో మాట్లాడుకునేవారు.

ఈ) పై గద్యాన్ని చదివి ఏవేని రెండు ప్రశ్నలు తయారుచేయండి.
జవాబు:

  1. ఎవరికీ చదువు ఒంటబట్టేదికాదు?
  2. అన్నంభట్టుకి తలనొప్పిగా ఎందుకు అన్పించింది?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
వనసంతర్పణకు వచ్చినవారు పూర్ణయ్య గురించి ఏమనుకొన్నారు?
జవాబు:
వనసంతర్పణలో అన్ని ఏర్పాట్లు చేసినవాడు పూర్ణయ్యే. అతనిని అందరూ ప్రేమగా ‘బావా’ అని పిలుస్తారు. అతను లేకపోతే వారెవరికీ సరదా లేదు. వారికెవరికీ సంబరంగా ఉండదు. ఎవరింట్లో పెళ్లినా, పేరంటమైనా హడావుడి అంతా పూర్ణయ్యదే. అతను లేకపోతే ఆ కార్యక్రమం అందంగా ఉండదు. వనసంతర్పణలో వంట ఏర్పాట్లు అన్నీ పూర్ణయ్యే చూశాడు. పూర్ణయ్య లేకపోతే వంట ఏర్పాట్లు, గాడిపొయ్యి తవ్వించడం ఎవరివల్లా కాదని వారి అభిప్రాయం. తినేవాళ్ళని ఉత్సాహపరుస్తున్న పూర్ణయ్య అంటే అందరికీ అభిమానమే. వనసంతర్పణకు వచ్చిన వారందరూ పూర్ణయ్యను మెచ్చుకొన్నారు, అనుసరించారు. తృప్తిగా తిన్నారు, ఉత్సాహంగా ఉన్నారు.

ప్రశ్న 2.
వంట విషయంలో పూర్ణయ్య అందరినీ ఎలా ఉత్సాహపరిచాడు?
జవాబు:
వంకాయ మెంతికారం పెట్టిన కూర వండిస్తున్నానని పూర్ణయ్య వారందరికీ చెప్పాడు. అంతటితో ఆగలేదు, మరో అరగంటలో వంకాయలు కడిగించి, బుట్టలో వేయించి, అందరి దగ్గరకూ తెచ్చి, చూపించాడు. అవి లేత వంకాయలు, నవనవలాడుతున్నాయి. అవి అప్పుడే తోటలో కోయించుకొని వచ్చినట్లు చెప్పి అందరినీ ఉత్సాహపరిచాడు.

మరో అరగంటకు వాక్కాయల బుట్టతో వచ్చాడు. వాక్కాయలు నిగనిగలాడుతున్నాయి. అందరికీ తలొక వాక్కాయ రుచి చూపించాడు. పుల్లగా ఉన్నాయి. తర్వాత లేత చుక్కకూర తెచ్చి చూపించాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతోనే బాగుంటుందని వారందరికీ చెప్పి ఉత్సాహపరిచాడు.

పులిహోర తిరగమోత వెయ్యగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడు. ఆ వాసన చూశారా ! సన్నబియ్యంతో చేయిస్తున్నట్లు చెప్పాడు. అని చెప్పి అందరి దృష్టినీ భోజనాల వైపు పూర్తిగా మలిచాడు. నిమ్మకాయ పిండిన అరటికూర రుచిని చెప్పి, అందరినీ ఉత్సాహపరిచాడు.

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి

ప్రశ్న 3.
పూర్ణయ్య వడ్డనలోని ప్రత్యేకతను వివరించండి.
జవాబు:
పూర్ణయ్య నేతి జారీ తీసుకొన్నాడు. అందరినీ పేరు పేరునా అడిగి నెయ్యి వడ్డించాడు. వంకాయకూర, అరటికాయ కూరల రుచిని వర్ణిస్తూ వడ్డింపచేశాడు. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు కొరుక్కుతింటే బాగుంటుందని ఊరించాడు. పప్పుచారులో గుమ్మడి వడియాలు కలుపుకొని తినమని ఉత్సాహపరిచాడు. వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకొంటే ఉండే మజాను వర్ణించాడు. పాయసానికి ఖాళీ ఉంచుకోమని ఆదేశించాడు. మంచినీళ్లెక్కువగా త్రాగవద్దన్నాడు. పెరుగన్నం తినడానికి ఖాళీ ఉంచుకోమన్నాడు. ఈ విధంగా అందరినీ ఉత్సాహపరిచాడు.

ప్రశ్న 4.
వనసంతర్పణలో ఆకలి పెరగడానికి కారణాలేమిటి?
జవాబు:
వనసంతర్పణలో అందరికీ ఆకలి పెరగడానికి కారణం పూర్ణయ్యే. వండిస్తున్న కూరల గురించీ, పిండి వంటల గురించీ, పచ్చళ్ల గురించీ, పులుసుల గురించీ అందరికీ పూర్ణయ్య చెప్పాడు. వాటి రుచులను ఊహించుకోవడంతో అందరికీ ఆకలి మొదలైంది. వంకాయలు, వాక్కాయలు, చుక్కకూరలను అందరికీ చూపించడంతో వంటల గురించి చర్చ జరిగింది. దానితో ఆకలి ఇంకా పెరిగింది. పులిహోర ఘుమఘుమలు తగిలేటప్పటికి అందరికీ ఆకలి ఇంకా పెరిగిపోయింది. పూర్ణయ్య దగ్గరుండి వడ్డన చేయించిన తీరుకు అందరూ మితిమీరి భోజనాలు చేశారు. మాటలలో ఆదరణ, ఆప్యాయతలుండాలి. వడ్డనలో కొసరి కొసరి వడ్డించే గుణం ఉండాలి. అప్పుడు అతిథులకు ఉత్సాహం, ఆకలి పెరుగుతాయి. మొహమాటం లేకుండా తృప్తిగా తింటారు.

ప్రశ్న 5.
ఈ పాఠంలో ఎవరెవరు ఎందుకు తృప్తి చెందారు?
జవాబు:
వనసంతర్పణకు వచ్చిన వారందరూ పూర్ణయ్య ఆదరణతో తృప్తి చెందారు. అతను చేసిన హడావుడి కబుర్లు, ప్రదర్శనలూ వారందరినీ ఉత్తేజపరిచాయి. వంటకాల ఘుమఘుమలతో తృప్తి చెందారు. అతని వడ్డన తీరుకు అందరూ తృప్తిగా భోజనాలు చేశారు. వనసంతర్పణకు వచ్చిన వారందరినీ పూర్ణయ్య తన కలుపుగోలుతనంతో సంతృప్తి పరిచాడు. వారంతా ఆనందించారు. అందరూ తృప్తిగా కడుపునిండా భోజనాలు చేశారు. కనుకనే పూర్ణయ్యకు ఆహార పదార్థాలు మిగలలేదు. ఆ మిగలకపోవడమే పూర్ణయ్యకు తృప్తి నిచ్చింది. ఇంత చక్కటి పాఠం చదవడం మాకూ తృప్తిగానే ఉంది.

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి

ప్రశ్న 6.
మీ గ్రామం / పట్టణంలో జరిగే వనభోజనాలను వర్ణించండి.
జవాబు:
మా కాలనీలో ఉన్నవారందరం కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు పెట్టుకొంటాం. అప్పుడు మా కాలనీలో ఉన్న వాళ్లందరం రాజుగారి తోటలోని ఉసిరిచెట్టు కిందికి ఉదయమే వెళ్లిపోతాం. పిల్లలందరం కోతి కొమ్మచ్చి, కబడి, బాలాట మొదలైనవి ఆడుకొంటాం. బోలెడంత అల్లరి చేసేస్తాం. మగవాళ్లలో పెద్దవాళ్లంతా పేకాట, క్యారమ్స్, చెస్ మొదలైనవి ఆడుకొంటారు. ఆడవాళ్లంతా వంట వండుతూనే అంత్యాక్షరి, పాటల పోటీలు, అష్టాచమ్మా మొదలైనవి ఆడుకొంటారు. పిల్లలందరం కరివేపాకు తుంపుతాం. మిరపకాయలు ముచికలు తీస్తాం. మగవాళ్లు కూరలు తరుగుతారు. నీళ్లు తెస్తారు. వడ్డన మాత్రం పిల్లలదే, భోజనాలయ్యాక ఆటల పోటీలు, బహుమతులు ఉంటాయి. ఆ రోజు మాత్రం మాకందరికీ పండుగే.

ప్రశ్న 7.
మీరు వెళ్లిన విహారయాత్ర గురించి వ్రాయండి.
జవాబు:
ఒకసారి మా పాఠశాల విద్యార్థులందరం రెండు బస్సులలో ‘అరకు’ విహారయాత్రకు వెళ్లాం. అక్కడ వాతావరణం చాలా బాగుంది. బొర్రా గుహలు చూశాం. చాలా బాగున్నాయి. ప్యాసెంజర్లో ఆ గుహలలోంచి వేడుతుంటే భలే సరదాగా ఉంది.

ఇది సముద్ర మట్టానికి 900 మీటర్లు ఎత్తున ఉందని మా మాష్టారు చెప్పారు. ఇక్కడ జలపాతాలు చాలా బాగున్నాయి. ఆ జలపాతాలు కనుల పండువగా ఉన్నాయి. మ్యూజియం కూడా చాలా బాగుంది. మేం వెళ్లినప్పుడు సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమా యాక్టర్లతో ఫోటోలు తీయించుకొన్నాం. మేమందరం ఈ విహారయాత్రలో చాలా ఆనందించాం.

III. భాషాంశాలు:

1. కింది పదాలను ఒత్తులతో సరిచేసి రాయండి.

1. అమ నాన నను తీసికెళారు
జవాబు:
అమ్మ నాన్న నన్ను తీసికెళ్ళారు.

2. అన చెటు ఎకి ఒక కాయ కోశాడు.
జవాబు:
అన్న చెట్టు ఎక్కి ఒక్క కాయ కోశాడు.

3. కొత. బటలు కొనుకొనాను.
జవాబు:
కొత్త బట్టలు కొనుక్కొన్నాను.

4. ఆకులు కట కటి తెమనారు.
జవాబు:
ఆకులు కట్ట కట్టి తెమ్మన్నారు.

5. చినాన నను రావదనాడు.
జవాబు:
చిన్నాన్న నన్ను రావద్దన్నాడు.

6. కపల పెళ్లికి వెళి వచాము .
జవాబు:
కప్పల పెళ్ళికి వెళ్ళి వచ్చాము.

7. తిక తికగా మాటాడవదనారు
జవాబు:
తిక్కతిక్కగా మాట్లాడవద్దన్నారు.

8. నతినతిగా అనానని నవారు.
జవాబు:
నత్తినత్తిగా అన్నానని నవ్వారు.

9. చకని చుక మా అక అకడ ఉంది.
జవాబు:
చక్కని చుక్క మా అక్క అక్కడ ఉంది.

10. కవం పటిన అవను చూసి నవవదు.
జవాబు:
కవ్వం పట్టిన అవ్వను చూసి నవ్వవద్దు.

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి

2. కింది పదాలను సంయుక్తాక్షరాల వత్తులతో సరిచేసి రాయండి.
1. లక్ + ష్ + మ్ + ఇ = లక్ష్మి
2. పక్ + ష్ + య్ + అ + ము = పక్ష్య ము
3. స్వాతంత్ + ర్ + య్ + అ + ము = స్వాతంత్ర్యము
4. లక్ + ష్ + య్ + అ + ము = లక్ష్యము
5. హర్ + మ్ + య్ + అ + ము = హర్మ్యము
6. దార్ + డ్ + య్ + అ + ము = దార్యా ము

3. ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి.

1. కిందివానిలో సంయుకాక్షరం గుర్తించండి.
అ) క
ఆ) క్క
ఇ) క్ష్మి
జవాబు:
ఇ) క్ష్మి

2. పెద్దవారికి, స్త్రీలకు గౌరవం ఇవ్వాలి. (సంయుక్తాక్షరం గుర్తించండి)
అ) ద్ద
ఆ) స్త్రీ
ఇ) వ్వా
జవాబు:
ఆ) స్త్రీ

3. స్వాతంత్ర్యం మన జన్మహక్కు. (గీతగీసిన దానిలోని అక్షరాలు) ( ఆ )
అ) త్ + అ + రే + య్
ఆ) త్ + ర్ + య్ + అ
ఇ) త + ర + య
జవాబు:
ఆ) త్ + ర్ + య్ + అ

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి

4. కురుక్షేత్రం ధర్మక్షేత్రం – (దీనిలో సంయుక్తాక్షరాలెన్ని ఉన్నాయి)
అ) 3
ఆ) 2
ఇ) 4
జవాబు:
అ) 3

5. న్యాయం కావాలి. గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) న + య
ఆ) న్ + య్ + అ
ఇ) న్ + య్ + ఆ
జవాబు:
ఇ) న్ + య్ + ఆ

6. మూర్బత్వం పనికిరాదు. (గీత గీసిన దానిలోని అక్షరాలను గుర్తించండి)
అ) ర + ఖ్
ఆ) ర్ + ఖ్ + అ
ఇ) ర్ + అ + ?
జవాబు:
ఆ) ర్ + ఖ్ + అ

7. జ్యోత్స్న అందంగా ఉంటుంది. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) త్ + స్ + న్ + అ
ఆ) త + స్ + న్
ఇ) త్ + అ + స్ + న్
జవాబు:
అ) త్ + స్ + న్ + అ

8. అన్నమును వృధా చేయకు. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) న + న
ఆ) న్ + అ + న్ + అ
ఇ) న్ + న్ + అ
జవాబు:
ఇ) న్ + న్ + అ

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి

9. కత్తితో జాగ్రత్తగా ఉండాలి. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) త్ + త్ + అ
ఆ) త్ + త్ + ఇ
ఇ) తి + తి
జవాబు:
ఆ) త్ + త్ + ఇ

10. ఎక్కడైనా నిజాయితీగానే ఉండాలి. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) క్ + క
ఆ) క్ + క్ + అ
ఇ) క + క
జవాబు:
ఆ) క్ + క్ + అ

11. అమ్మేది అని బాలుడడిగాడు. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) మ్ + య్ + ఏ
ఆ) మ + మే
ఇ) మ్ + మ్ + అ + ఏ
జవాబు:
అ) మ్ + య్ + ఏ

12. కుయ్యేరులో బడి ఉంది. (గీత గీసిన దానిలోని అక్షరాలు గుర్తించండి)
అ) యే + యే
ఆ) య్ + య్ + అ + ఏ
ఇ) య్ + య్ + ఏ
జవాబు:
ఇ) య్ + య్ + ఏ

13. వేరు వేరు హల్లుల కలయికతో ఏర్పడేది?
అ) ద్విత్వం
ఆ) సంయుక్తం
ఇ) చేదర్థకం
జవాబు:
ఆ) సంయుక్తం

14. ఒకే హల్లు రెండుసార్లు వస్తే ఏర్పడేది?
అ) ద్విత్వం
ఆ) సంయుక్తం
ఇ) హల్లు
జవాబు:
అ) ద్విత్వం

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి

15. ఒక సంయుక్తాక్షరంలోని అచ్చుల సంఖ్య
అ) రెండు
ఆ) ఒకటి
ఇ) ఎన్నెనా ఉంటాయి
జవాబు:
ఆ) ఒకటి

చదవండి – ఆనందించండి

కుచేలోపాఖ్యానం

AP 6th Class Telugu Important Questions Chapter 2 తృప్తి 1
కుచేలుడు అనే పేరు విన్నారా మీరెప్పుడైనా ? – విన్నాం గురువుగారూ! శ్రీకృష్ణుడి స్నేహితుడు కదా! అంటూ పిల్లలంతా ఉత్సాహంగా అన్నారు.

అందరికీ బాగా తెలిసిందే అంటూ కథ ప్రారంభించారు గురువుగారు. కుచేలుడు చాలా పేదవాడు. చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు. కుటుంబం గడవటం కష్టంగా ఉండేది. ఒకనాడు కుచేలుడితో ఆయన భార్య “నాథా ! ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా ! చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడున్నాడు గదా ! ఆయనను సహాయం అడగండి” అని చెప్పింది.

సరే! అన్నాడు కుచేలుడు. కుచేలుడు చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకొని వెళ్లాలని అనుకొన్నాడు. తీసుకొనిపోవడానికి ఇంట్లో ఏమీ లేవు. భార్య తన పంచెకొంగున కట్టిన పిడికెడు అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు కుచేలుడు.

కుచేలుణ్ణి చూచి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు, అక్కున చేర్చుకున్నాడు, సకలోపచారాలూ చేశాడు. కుచేలుడు తెచ్చిన అటుకులు ఎంతో మక్కువతో ఆరగించాడు. రుక్మిణీ కృష్ణులు కుచేలునికి పరిచర్యలు చేశారు. కుచేలుడు శ్రీకృష్ణుడిని ఏమీ అడగలేదు. కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పాత కుటీరం స్థానంలో మహాభవనం వెలిసింది. కుచేలుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుడిని చేశాడు. ఈ సన్నివేశం మిత్ర ప్రేమకు దృష్టాంతం.

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

These AP 6th Class Telugu Important Questions 1st Lesson అమ్మ ఒడి will help students prepare well for the exams.

AP State Syllabus 6th Class Telugu 1st Lesson Important Questions and Answers అమ్మ ఒడి

6th Class Telugu 1st Lesson అమ్మ ఒడి Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత పద్యాలు

కింది గేయాల్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. అమ్మ ఒడి చదువుల బడి మా
యమ్మ ఒడి నా కొక గుడి
అమ్మ చూపును ఒరవడి, దై
వమ్ము కంటెను త్వరపడి
ప్రశ్నలు – జవాబులు :
అ) ఒరవడి అంటే అర్థం ఏమిటి?
జవాబు:
విద్యార్థులకు అక్షరాలను కుదురుగా నేర్పడానికి గురువులు ముందుగా రాసే మేలు బంతి.

ఆ) బడి, గుడి అయినది ఏది?
జవాబు:
అమ్మ ఒడి.

ఇ) దేని కన్న ముందు అమ్మ ఒరవడి చూపుతుంది?
జవాబు:
దైవం కన్నా ముందు అమ్మ ఒరవడి చూపుతుంది.

ఈ) చదువు నేర్పే చోటును ఏమంటారు?
జవాబు:
చదువు నేర్పే చోటును బడి అంటారు.

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

2. అమ్మ చెప్పిన సుద్దులు, అని
శమ్ము ఒప్పిన బుద్ధులు
అమ్మ పెదవుల హాసము, ని
త్యమ్ము మాకు వికాసము.
ప్రశ్నలు – జవాబులు :
అ) సుద్దులు ఎవరు చెపుతారు?
జవాబు:
అమ్మ సుద్దులు చెపుతుంది.

ఆ) అనిశమ్ము అంటే అర్థం ఏమిటి?
జవాబు:
అనిశమ్ము అంటే ఎల్లప్పుడు అని అర్థం.

ఇ) అమ్మ పెదవులపై ఏమి ఉంటుంది?
జవాబు:
అమ్మ పెదవులపై హాసము ఉంటుంది.

ఈ) అమ్మ హాసము వలన ఏమి కలుగుతుంది?
జవాబు:
అమ్మ హాసము వల్ల వికాసం కలుగుతుంది.

3. అమ్మ మంజుల భాషణం, శ్రా
వ్యమ్ము వీనుల భూషణం
అమ్మ హృది అనురాగము, ది
వ్యమ్ము భవ్యము యోగము !
ప్రశ్నలు – జవాబులు :
అ) అమ్మ భాషణం ఎలా ఉంటుంది?
జవాబు:
అమ్మ భాషణం మంజులంగా ఉంటుంది.

ఆ) భూషణం అంటే అర్థం తెలపండి.
జవాబు:
భూషణం అంటే అలంకారం అని అర్థం.

ఇ) అనురాగంతో నిండి ఉండేది ఏది?
జవాబు:
అమ్మ హృదయం అనురాగంతో నిండి ఉంటుంది.

ఈ) ఈ భాగంలో యోగమైనది ఏది?
జవాబు:
ఈ భాగంలో యోగమైనది అమ్మ అనురాగము.

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

4. అమ్మ చల్లని కరములు, దా
నమ్మునకు ఆకరములు
అమ్మ చరణ తలమ్ములు, క్షే
మమ్ము పండు పొలమ్ములు
ప్రశ్నలు – జవాబులు :
అ) ఈ గేయం భాగం ఏ పాఠంలోనిది?
జవాబు:
ఈ గేయభాగం ‘అమ్మ ఒడి’ అనే పాఠంలోనిది.

ఆ) దానానికి నిలయమైనవి ఏవి?
జవాబు:
అమ్మ చేతులు దానానికి నిలయమైనవి.

ఇ) అమ్మ చరణాలు తాకిన నేలపై ఏమి పండుతుంది?
జవాబు:
అమ్మ చరణాలు తాకిన నేలపై క్షేమం పండుతుంది.

ఈ) ఆకరములు అంటే అర్థం ఏమిటి?
జవాబు:
ఆకరములు అంటే నిలయమైనవి అని అర్థం.

5. అమ్మ కన్నుల కాంతులు, లో
కమ్మునకు సుఖశాంతులు
అమ్మయే నా సర్వము,
ర్యమ్ము బలమూ గర్వము
ప్రశ్నలు – జవాబులు :
అ) అమ్మ కన్నుల్లో ఏమి కనిపిస్తాయి?
జవాబు:
అమ్మ కన్నుల్లో కాంతులు కనిపిస్తాయి.

ఆ) లోకానికి సుఖశాంతులు ఇచ్చేవి ఏవి?
జవాబు:
లోకానికి అమ్మ కన్నుల కాంతులు సుఖశాంతులు ఇస్తాయి.

ఇ) ‘సుఖ శాంతులు’ అనునది ఏ సమాసము?
జవాబు:
‘సుఖ శాంతులు’ అనునది ద్వంద్వ సమాసము.

ఈ) మనిషికి సర్వస్వమైనది ఏది?
జవాబు:
మనిషికి సర్వస్వమైనది అమ్మ.

అపరిచిత పద్యా లు

1. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కోతి ంబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చు లెల్ల ంగొలిచి నట్టు
నీతిహీనును నొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు – జవాబులు :
అ) కోతికి ఏమి కట్టారు?
జవాబు:
కోతికి పట్టుచీర కట్టారు.

ఆ) ఎవరు కోతికి పట్టుచీర కట్టారు?
జవాబు:
కొండముచ్చులు కోతికి పట్టుచీర కట్టారు.

ఇ) కోతికి పట్టుచీర కట్టి కొండముచ్చులు ఏమి చేసాయి?
జవాబు:
కోతికి పట్టుచీర కట్టి కొండముచ్చులు సేవించాయి.

ఈ) నిర్భాగ్యులు ఎవరిని సేవిస్తూ ఉంటారు?
జవాబు:
నిర్భాగ్యులు నీతిహీనుణ్ణి సేవిస్తూ ఉంటారు.

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

2. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమునను గుణము కొరత వడును
కోపమునను బ్రతుకు కొంచమై పోవును
విశ్వదాభిరామ ! వినుర వేమ!
ప్రశ్నలు – జవాబులు :
అ) దేనివలన గొప్పదనము తగ్గిపోతుంది?
జవాబు:
కోపము వలన గొప్పదనము తగ్గుతుంది.

ఆ) గుణము ఏలా కొరతపడుతుంది?
జవాబు:
కోపము వలన గుణము కొరతపడుతుంది.

ఇ) కోపము వలన బ్రతుకు ఏమౌతుంది?
జవాబు:
కోపము వలన బ్రతుకు కొంచమై పోతుంది.

ఈ) పై పద్యానికి సరైన శీర్షిక పెట్టండి.
జవాబు:
కోపము

3. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

బలవంతుడు ! నా కేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా !
బలవంతమైన సర్పము
చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ !
ప్రశ్నలు – జవాబులు :
అ) ఏమని అనుకోకూడదు?
జవాబు:
నేను బలవంతుడను, నాకేమిటి అనుకోకూడదు.

ఆ) ఎవరితో అనరాదు?
జవాబు:
చాలామందితో నేను బలమైన వాడను అని అనకూడదు.

ఇ) సర్పము ఎలాంటిది?
జవాబు:
సర్పము చాలా బలమైనది.

ఈ) సర్పము ఎవరి వలన చనిపోయింది?
జవాబు:
సర్పము చలిచీమల వలన చనిపోయింది.

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

4. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

అనువుకాని చోట నధికుల మనరాదు
కొంచముండుటెల్ల గొదువ గాదు
కొండ యద్దమందు గొంచమై యుండదా
విశ్వదాభిరామ ! వినుర వేమ!
ప్రశ్నలు – జవాబులు :
అ) ఎక్కడ అధికుల మనకూడదు?
జవాబు:
అనువుగాని చోట అధికుల మనరాదు.

ఆ) అనువుగాని చోట ఎలా ఉండాలి?
జవాబు:
అనువుగాని చోట తగ్గి ఉండాలి.

ఇ) కొండ ఎక్కడ నుండి చిన్నదిగా కన్పిస్తుంది?
జవాబు:
కొండ అద్దంలోంచి చిన్నదిగా కన్పిస్తుంది.

ఈ) ఈ పద్యం ఎవరు రచించారు?
జవాబు:
ఈ పద్యం వేమన రచించాడు.

5. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ !
ప్రశ్నలు – జవాబులు :
అ) చుట్టము ఎప్పుడు రావాలి?
జవాబు:
చుట్టము అవసరమైనపుడు రావాలి.

ఆ) మ్రొక్కితే ఎవరు వరాలిస్తారు?
జవాబు:
మ్రొక్కితే దేవతలు వరాలిస్తారు.

ఇ) గుఱ్ఱము ఎప్పుడు పరుగుపెట్టాలి?
జవాబు:
రౌతు ఎక్కినపుడు గుఱ్ఱం పరుగు పెట్టాలి.

ఈ) ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకం లోనిది.

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

6. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆత్మశుద్ధి లేని ఆచార మది యేల
భాండ శుద్ధి లేని పాకమేల ?
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు – జవాబులు :
అ) ఆచారానికి ఏది అవసరం?
జవాబు:
ఆచారానికి ఆత్మశుద్ధి అవసరం.

ఆ) వంటకు ఏది అవసరం?
జవాబు:
గిన్నెలు శుభ్రంగా ఉండాలి.

ఇ) చిత్తశుద్ధితో ఏమి చేయాలి?
జవాబు:
చిత్తశుద్ధితో శివపూజ చేయాలి.

ఈ) పై పద్యానికి తగిన శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
శుద్ధి

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత :

ప్రశ్న 1.
బి.వి. నరసింహారావు గురించి రాయండి.
(లేదా)
“అమ్మ ఒడి’ గేయ రచయితను గురించి రాయండి.
జవాబు:
‘అమ్మ ఒడి’ గేయ రచయిత ‘బాడిగ వెంకట నరసింహారావు. ఆయన కృష్ణాజిల్లాలోని కౌతారంలో జన్మించారు. ఆయన బిరుదు ‘బాలబంధు’. ఆయన బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి మొదలైనవి 17 పుస్తకాలు రచించారు. బాలసాహిత్యాన్ని వ్యాప్తి చేయడమే ధ్యేయంగా జీవించారు. ఆయన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్రను ధరించడం చేత ఆయన ఆ రోజులలో ‘అనార్కలి నరసింహారావు’ అని పేరు పొందారు.

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

ప్రశ్న 2.
అమ్మ ప్రేమ ఎటువంటిది?
జవాబు:
అమ్మ ప్రేమ హృదయమంతా నిండి ఉంటుంది. ఆ ప్రేమ చాలా ఉత్తమమైనది. శుభాలను కలిగిస్తుంది. అది – అన్నింటిని సమకూర్చి పెడుతుంది. ఏ లోటు రాకుండా చేస్తుంది.

ప్రశ్న 3.
అమ్మ కాళ్ళు, చేతులు ఎటువంటివి?
జవాబు:
అమ్మ చేతులు చల్లగా ఉంటాయి. అవి దానధర్మాలు చేస్తూ ఉంటాయి. అమ్మ పాదాలు తగిలిన నేలలు శుభాలు అనే పంటలు పండించే పొలాల వంటివి.

ప్రశ్న 4.
మా అమ్మ ఒడి నాకొక గుడి అని కవి ఎందుకన్నారో వివరించండి.
జవాబు:
పిల్లలు అమ్మ ఒడిలోనే ఆట పాటలతో అన్నీ నేర్చుకొంటారు. దేవాలయాలు మన సంస్కృతికి, కళలకు, సంప్రదాయాలకు నిలయాలు. సమాజానికి శుచిశుభ్రతలను దేవాలయాలు నేర్పుతాయి. భక్తి గూడా నేర్పుతాయి.

అలాగే అమ్మ ఒడిలో పిల్లలు జేజే పెట్టడం (నమస్కరించడం) నేర్చుకొంటారు. రెండు చేతులూ పైకెత్తి ‘గోవిందా’ అనడం కూడా తల్లి నేర్పుతుంది. . ఎవరినీ నిందించకూడదనీ, పెద్దలకు నమస్కరించాలని, ఎవరైనా వస్తుంటే రమ్మని పిలవాలనీ, తల్లి తన ఒడిలోనే పిల్లలకు నేర్పుతుంది. అభినయం కూడా నేర్పుతుంది. ఉదాహరణకు: నీ కోపం చూపించమని, నువ్వెలా నవ్వుతావు అంటూ రకరకాల అభినయాలు నేర్పుతుంది. అందుచేతనే అమ్మ ఒడి నాకొక గుడి అని రచయిత అన్నాడు: సంస్కారానికి పునాది అమ్మ ఒడిలోనే నేర్చుకుంటాం. అందుకే అమ్మ ఒడి మనకొక గుడి అని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
“అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము” – వివరించండి.
జవాబు:
అమ్మ పెదవుల హాసము అంటే అమ్మ చిరునవ్వు. అమ్మ చిరునవ్వులో అనేక భావాలు ఉంటాయి. అమ్మ చిరునవ్వును పిల్లలు గమనిస్తుంటారు. అమ్మ చిరునవ్వే పిల్లలకు ప్రోత్సాహం, అమ్మ చిరునవ్వే పిల్లలకు ధైర్యాన్నిస్తుంది.. అమ్మ చిరునవ్వే పిల్లలకు భరోసానిస్తుంది. అమ్మ చిరునవ్వే పిల్లలకు హుషారునిస్తుంది. పిల్లల అభివృద్ధిని అమ్మ చిరునవ్వుతో గమనిస్తూ ప్రోత్సహిస్తుంది. అమ్మ చిరునవ్వుతో ప్రోత్సహిస్తే పిల్లలు ఎంత ఉన్నత స్థితికైనా చేరతారు. దేనినైనా సాధిస్తారు. ఎంత తెలివిగానైనా ప్రవర్తిస్తారు. ఎంత కష్టమైన దానినైనా అలవోకగా సాధిస్తారు. అందుకే తల్లి చిరునవ్వులే పిల్లలకు అభివృద్ధికి సోపానాలని చెప్పవచ్చు.

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

ప్రశ్న 6.
“అమ్మ చల్లని కరములు – దానమ్మునకు ఆకరములు” – అని ఎట్లు చెప్పగలవు?
జవాబు:
అమ్మ తన చేతులతో అన్నీ అమర్చి పెడుతుంది. పిల్లలను అభివృద్ధి చెందమని ఆశీర్వదిస్తుంది. తనకంటే తన పిల్లలు ఉన్నతంగా ఉండాలని కోరుకొంటుంది. దీవిస్తుంది. అందుచేతనే అమ్మవి చల్లని కరములు అన్నారు.

అమ్మ చేతులకు పెట్టడమే తెలుసు. తను ఎంత కష్టాన్నైనా భరించి పిల్లలకు సౌఖ్యాలనందిస్తుంది. తను ఆకలితో అలమటిస్తున్నా పిల్లల కడుపు నింపుతుంది. తను ఎంత దరిద్రాన్నైనా అనుభవిస్తూ పిల్లలకు సకల సౌభాగ్యాలూ అందిస్తుంది. అందుకే అమ్మ కరములు దానమ్మునకు ఆకరములు తన పిల్లలుగానే భావించడం అమ్మతనంలోని గొప్పతనం. తన పిల్లలనే కాదు, అందరినీ ఎంత పెద్దవారినైనా, ఎంత గొప్పవారినైనా తన బిడ్డలుగానే భావించి కొసరి కొసరి వడ్డిస్తుంది, కడుపు నింపుతుంది. ఆకలిగా ఉన్న వారెవరైనా అమ్మకు పసిపిల్లలే, ఆమె దృష్టిలో వారంతా తన సంతానమే.

ప్రశ్న 7.
అమ్మ చేసే సంభాషణల గురించి వివరించండి.
జవాబు:
అమ్మ ఎవరితో సంభాషించినా.తన పిల్లల గురించీ, కుటుంబం గురించే ఎక్కువ శాతం మాట్లాడుతుంది. అమ్మ సంభాషణలలో తన పిల్లల అల్లరి, చదువులు, ఆకలి మొదలైనవే ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఎంత పెద్దవారైనా ఆమె దృష్టిలో పసిపిల్లలే, అమ్మ ఎక్కువగా పిల్లలతో మాట్లాడడానికే ప్రాధాన్యం ఇస్తుంది. వారి చిన్ననాటి ముచ్చట్లను చెబుతూ సంతోషిస్తుంది. ఎంత మందిలో ఉన్నా, ఎంత మందితో మాట్లాడినా తన పిల్లల గురించే మాట్లాడుతుంది. తన పిల్లలు తప్ప అమ్మకు వేరే ప్రపంచం ఉండదు. అమ్మ సంభాషణలలో ఆప్యాయత ఉంటుంది. అమ్మ మాటలు అమృతం కంటే తియ్యగా ఉంటాయి.

ప్రశ్న 8.
మీ అమ్మ గురించి వ్రాయండి.
జవాబు:
మా అమ్మకు నేనంటే చాలా యిష్టం. ఎంత అల్లరి చేసినా ఏమీ అనదు. ఎన్నో మంచి మాటలు చెబుతుంది. ఎప్పుడైనా నా అల్లరి భరించలేక తిట్టినా, కొట్టినా చాలా బాధపడుతుంది. ‘అంత అల్లరి చేయకూడదమ్మా ! చదువుకోవాలమ్మా !’ అని వెంటనే లాలిస్తుంది. నన్నెవరైనా ఏమైనా అంటే అస్సలు భరించలేదు. ఎప్పుడూ మా గురించే ఆలోచిస్తుంది. తెల్లటి బట్టలే కట్టుకోమంటుంది. ఆటలలో పడి బట్టలెంతగా మాపుకొన్నా ఏమీ అనదు. అప్పుడప్పుడు విసుక్కొంటుంది. మా అమ్మ వంట చాలా రుచిగా వండుతుంది. ఇప్పటికీ నాకూ, మా తమ్ముడికీ, అక్కకీ అన్నం కలిపి తినిపిస్తుంది. అమ్మ కథలు, కబుర్లు చెబుతూ తినిపిస్తుంటే ఎంతైనా తినేస్తాం. మా అమ్మ దేవత. నేను పెద్దయ్యాక మా అమ్మనీ, నాన్ననీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.

ప్రశ్న 9.
అమ్మ గొప్పతనాన్ని కవి ‘అమ్మ ఒడి’ గేయంలో ఎలా వర్ణించారు.
జవాబు:
అమ్మ ఒడి చదువుల బడి, దేవుని గుడి. అమ్మే దేవుని కంటే ముందు భవిష్యత్తుకు ఒరవడి చూపిస్తుంది. అమ్మ చెప్పే మాటలు తెలివితేటలు పెంచుతాయి. అమ్మ పెదవుల మీది చిరునవ్వు వికాసం కలిగిస్తుంది. అమ్మ అందమైన మాటలు చెవులకు ఇంపుగా ఉండి, అలంకారాలవుతాయి. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నింటిని సమకూర్చేదిగా ఉంటుంది. అమ్మ చేతులు దానధర్మాలు చేస్తాయి. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు కలిగిస్తుంది. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని కలిగిస్తాయి. అమ్మ అందరికీ ధైర్యం, బలం, గర్వం, సర్వస్వం అని చెప్పుకోవచ్చు.

ఈ విధంగా ‘బాలబంధు’ బి.వి. నరసింహారావుగారు అమ్మ గొప్పతనాన్ని తన గేయంలో వర్ణించారు.

ప్రశ్న 10.
మీ అమ్మకు నీవు ఏయే పనుల్లో సహాయం చేస్తావో మీ స్నేహితురాలికి ఉత్తరం రాయండి.
జవాబు:

గుంటూరు,
xxxxx.

ప్రియమైన స్నేహితురాలు వాణికి,

నీ స్నేహితురాలు జానకి వ్రాయునది. నీవు మీ అమ్మను గురించి వ్రాసిన ఉత్తరం చేరింది. నేనీ ఉత్తరంలో మా అమ్మకు నేను ఎలా సహాయం చేస్తానో తెలియజేస్తాను.

మా అమ్మకు నేనంటే ఎంత ఇష్టమో, నాకు మా అమ్మ అంటే అంత ఇష్టం. అందుకే అమ్మ పనులు చేసుకుంటూ ఉంటే నేను అమ్మకు సహాయం చేస్తుంటాను. అమ్మ వంట చేసేటప్పుడు ఏదైనా వస్తువు అవసరమయితే తెచ్చి ఇస్తాను. ఏవైనా సరుకులు కావలసివస్తే పొరుగునే ఉన్న దుకాణానికి వెళ్ళి తెచ్చి పెడతాను. అమ్మ బట్టలు ఉతికేటప్పుడు నేను ఇంట్లో ఉంటే, నేను ఆరవేస్తాను. తాతయ్యకు కాఫీ ఇచ్చిరమ్మంటే ఇచ్చివస్తాను. సాయంకాలం హోంవర్కు అయిన తరువాత తోటపనిలో అమ్మకు పాదులకు నీళ్ళు పోయడంలోను, కాయగూరలు కోయడం లోను సాయం చేస్తాను.

మా ఇంటికి అమ్మ స్నేహితులు వస్తే వాళ్ళకు మంచినీళ్ళు తెచ్చి ఇస్తాను. నన్ను మా అమ్మతో పాటు అందరూ మంచి అమ్మాయి అని మెచ్చుకుంటారు సుమా !

మీ అమ్మకు, నాన్నకు నమస్కారాలు. మళ్ళీ ఉత్తరం వ్రాయి.

ఇట్లు,
మీ స్నేహితురాలు,
బి. జానకి

చిరునామా :
సి. వాణి,
నెంబరు – 19, 6వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
రావినూతల, ప్రకాశం జిల్లా.

ప్రశ్న 11.
మీ నాన్నగారి గొప్పతనం తెలిసేలా కింది కవితను పొడిగించండి.
మా హీరో మా నాన్న –
నాతో ఆడతాడు మా నాన్న …………
జవాబు:
తప్పు చేస్తే కొడతాడు నాన్న.
డబ్బులు ఇస్తాడు అడిగితే నాన్న.
అందుకే నాకిష్టం మా నాన్న.

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

ప్రశ్న 12.
అమ్మ ఏకపాత్రను రాయండి.
జవాబు:
అమ్మ

నేనర్రా మీ అమ్మని. “ఔనులెండి. మీకాకలి వేస్తే నేను గుర్తొస్తాను. కడుపునిండితే ఆటలు గుర్తొస్తాయి. ఒరేయ్. అల్లరి చేయకు, ఆ కబుర్లు మాని అన్నం తినరా ! అన్నం తింటే ఎంచక్కా మీ నాన్నలా బలంగా తయారౌతావు. నీకిష్టమని బంగాళాదుంపలు వేయించాను. ఇంకొంచెం తిను. అలా మట్టిలో దేకకు, ఆ బట్టలు చూడు ! ఎలా మాసిపోతున్నాయి ? ఉతికేటప్పటికి రెక్కలు నొప్పెడుతున్నాయి. అసలూ బట్టల్ని కాదురా! నిన్ను ఉతకాలి. అప్పుడు జాగ్రత్తగా ఉంటావు. ఆగరా ! ఆగు… పారిపోయేవా ! పిల్లలు బడికెళ్లి పోయారు. ఇంక కబుర్లు చాలమ్మా ! నాకవతల గంపెడు పని ఉంది.

III. భాషాంశాలు:

1. సరైన అక్షరాలతో కింది ఖాళీలను పూరించండి.

  1. నస

2. కింది పదాలలో దాగిన కొత్త పదాలను రాయండి.
అ) పలకల జత
జవాబు:

  1. పలక
  2. కలప
  3. కల
  4. జత
  5. తల
  6. కలత
  7. కత
  8. లత

ఆ) కడవ నడత
జవాబు:

  1. కడ
  2. కడవ
  3. వడ
  4. తడక
  5. నడక
  6. కత
  7. నడవ
  8. నడత
  9. నవ
  10. తన

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

3. కింది వానిలో సరైన చోట ‘o’ (సున్నాలు) ఉంచి అర్థవంతమైన పదాలు తయారు చేయండి.

  1. నద – నంద, నదం
  2. కళక – కళంకం
    3. కల – కలం
  3. రగ – రంగ
  4. మద – మంద, మదం, మందం

4. కింది పట్టికలలో పదాలను చదవండి. రెండేసి పదాలను కలిపి అర్ధవంతమైన వాక్యంగా రాయండి.

  1. ఆట సరదా
  2. నడక పయనం
  3. లత తల
  4. నటన ఏల?
  5. కంచం మంచం
  6. లంచం దగ
  7. పలకల జత
  8. మడత మంచం
  9. మంచం తలగడ
  10. నగరం కథ

5. ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి.

1. …………….. వచం (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) ర
ఆ) మ
ఇ) క
జవాబు:
ఇ) క

2. అ …………. ను (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) ద
ఆ) ర
ఇ) య
జవాబు:
అ) ద

3. ఔ ……….. (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) య
ఆ) ర
ఇ) డ
జవాబు:
ఆ) ర

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

4. జ …………… గ (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) య
ఆ) ట
ఇ) ల
జవాబు:

5. ……….. శ (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) ఆ
ఆ) ఎ
ఇ) బ
జవాబు:
అ) ఆ

6. మద (సున్నాలుపయోగిస్తే ఎన్ని పదాలౌతుంది)
అ) 2
ఆ) 3
ఇ) 4
జవాబు:
ఆ) 3

7. పట ……….. (సున్నాలుపయోగించి ఎన్ని పదాలు రాయగలం?)
అ) 2
ఆ) 1
ఇ) 3
జవాబు:
అ) 2

8. మత ……… (సున్నాలుపయోగించి ఎన్ని పదాలు రాయగలం)
అ) 3
ఆ) 2
ఇ) 1
జవాబు:
ఇ) 1

9. పలకల జత ……… (దీనిలోని పదాల సంఖ్య గుర్తించండి.)
అ) 4
ఆ) 3
ఇ) 2
జవాబు:
అ) 4

10. జలజ జ ……….. (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) క
ఆ) ప
ఇ) డ
జవాబు:
ఇ) డ

11. ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న (వీటిలోని పదం గుర్తించండి)
అ) పడవ
ఆ) దడ
ఇ) నదము
జవాబు:
ఆ) దడ

12. ప,ఫ,బ,భ,మ,య,ర,ల,వ (వీటిలోని పదం గుర్తించండి)
అ) బరమ
ఆ) భారతం
ఇ) వార
జవాబు:
అ) బరమ

13. జ, ఝ, ఇ, ట, ఠ, డ, ఢ ………. (వీటిలోని పదం గుర్తించండి)
అ) ఝషం
ఆ) జఠరం
ఇ) జడ
జవాబు:
ఇ) జడ

14. శ, ష, స, హ, త, న,ం (వీటిలో పదం గుర్తించండి)
అ) సహనం
ఆ) సహజం
ఇ) ఝషం
జవాబు:
అ) సహనం

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి

15. ప, య, ర, ల, ఒ, క – (వీటిలోని పదం గుర్తించండి.)
అ) కమల
ఆ) కత
ఇ) కరప
జవాబు:
ఇ) కరప

చదవండి – ఆనందించండి

మాతృదేవోభవ, పితృదేవో భవ

AP 6th Class Telugu Important Questions Chapter 1 అమ్మ ఒడి 2
పిల్లలూ ! ‘మాతృదేవో భవ’, ‘పితృదేవో భవ’ అంటారు- పెద్దలు. అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్లు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన చిన్నచిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి. తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో, దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను – శ్రద్ధగా వినండి.

మనం ప్రతి సంవత్సరం వినాయకచవితి ? పూజ చేసుకుంటాం. ఆ సందర్భంగా – వినాయకవ్రత కథను వింటూ ఉంటాం. భూమండలాన్ని ముందుగా చుట్టివచ్చిన వాళ్ళకు గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు. వెంటనే కుమారస్వామి నెమలివాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరతాడు. వినాయకుడు పెద్ద బొజ్జ గలవాడు కనుక అంత వేగంగా కదలలేడు. ఈ పరీక్షలో ఎలా నెగ్గాలా ? అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు. అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని చెపుతాడు. ఈ విషయం గ్రహించి, వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులకు ప్రదక్షిణాలు చేసి, నమస్కరించాడు. మాతాపితరులకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టిరావడమే. తన కంటే వినాయకుడే ముందు భూప్రదక్షిణ పూర్తిచేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు. వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది.

చూశారా పిల్లలూ ! వినాయకుడి కథవల్ల మీరు తెలుసుకోవల్సిందేమిటంటే – తల్లిదండ్రుల్ని మించిన దైవం లేదు. ఈ కథను వినాయకచవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకొంటున్నామంటే తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని స్మరించుకొంటున్నామని గ్రహించాలి. అంతేగాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధభావాలు ఉండకూడదు. – అనే విషయము, వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా గ్రహించాలి.

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

These AP 7th Class Telugu Important Questions 13th Lesson ఆలోచనం will help students prepare well for the exams.

AP State Syllabus 7th Class Telugu 13th Lesson Important Questions and Answers ఆలోచనం

7th Class Telugu 13th Lesson ఆలోచనం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత పద్యాలను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కింది పరిచిత పద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

భూగోళం పుట్టుకకోసం
కూలిన సురగోళా లెన్నో ?
ఈ మానవరూపంకోసం
జరిగిన పరిణామాలెన్నో ?
ప్రశ్నలు:
1. దేని పుట్టుక జరిగింది?
జవాబు:
భూగోళం పుట్టుక జరిగింది.

2. ఏ గోళాలు కూలినవి?
జవాబు:
సురగోళాలు కూలినవి.

3. ఎవరి రూపం జరిగింది?
జవాబు:
మానవరూపం జరిగింది.

4. మానవరూపం కోసం ఏం జరిగింది?
జవాబు:
మానవరూపం కోసం పరిణామం జరిగింది.

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

2. కింది పరిచిత పద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో ?
గాయపడిన కవిగుండెల్లో
రాయబడని కావ్యాలెన్నో ?
ప్రశ్నలు:
1. ఎవరు నిదురపోతున్నారు?
జవాబు:
పసిపాపలు నిదురపోతున్నారు.

2. పసిపాపల కనులలో ఏం మురిసింది?
జవాబు:
పసిపాపల కనులలో భవితవ్యం మురిసింది.

3. ఎవరి గుండె గాయపడింది?
జవాబు:
కవి గుండె గాయపడింది.

4. రాయబడనివి ఏవి?
జవాబు:
కావ్యాలు రాయబడలేదు.

3. ఈ కింది పరిచిత గేయ భాగాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. III – 2016-17)
ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానల మెంతో ?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరులెందరో ?
భూగోళం పుట్టుక కోసం
కూలిన సుర గోళాలెన్నో ?
ఈ మానవ రూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో ?
ప్రశ్నలు:
1. సముద్రం తన గర్భంలో దాచినది ఏమిటి?
జవాబు:
బడబానలం

2. కనిపించని భాస్కరులు అంటే ఎవరు?
జవాబు:
ప్రతిభ ఉన్నా పైకి రాక మరుగున పడినవారు.

3. ఈ మానవ రూపం కోసం ఏం జరిగాయని గేయ భాగం తెలుపుతుంది?
జవాబు:
ఎన్నోమార్పులు (పరిమాణం)

4. పై గేయ భాగం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఈ గేయం ఎవరి రచన?

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

కింది అపరిచిత పద్యాలను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. మేడిపండు జూడ మేలిమైయుండును
పొట్టవిచ్చిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగుర
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు:
అ) పిరికివాడు దేనితో పోల్చబడినాడు?
జవాబు:
పిరికివాడు మేడిపండుతో పోల్చబడినాడు.

ఆ) మేడిపండు పైకి ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
మేడిపండు పైకి చక్కగా ఉంటుంది.

ఇ) మేడిపండు లోపల ఎలా ఉంటుంది?
జవాబు:
మేడిపండు లోపల పురుగులతో కూడి ఉంటుంది.

ఈ) ఈ పద్యం వల్ల తెలిసిందేమిటి?
జవాబు:
ఈ పద్యంవల్ల పిరికివాని స్వభావం తెలుస్తోంది.

2. ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు:
అ) తేనెటీగ తేనెను ఎవరికి ఇస్తున్నది?
జవాబు:
తేనెటీగ తేనెను తెరువరికి (బాటసారికి) ఇస్తున్నది.

ఆ) తాను తినక, కూడబెట్టువారి నేమందురు?
జవాబు:
తాను తినక, కూడబెట్టువారిని పిసినారి అంటారు.

ఇ) పై పద్యము నందలి భావమేమి?
జవాబు:
కూడబెట్టిన ధనం సద్వినియోగం చేయకపోతే వృథా అవుతుంది.

ఈ) కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును?
జవాబు:
కూడబెట్టిన ధనం దానం చేసినా లేదా తాను అనుభవించినా సద్వినియోగం అవుతుంది.

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

3. అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు:
అ) అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
జవాబు:
అంటూ ఉంటే రాగం అతిశయిల్లుతుంది.

ఆ) తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు:
తింటూ ఉంటే వేపాకు తీయనవుతుంది.

ఇ) సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు:
సాధనతో పనులు సమకూరుతాయి.

ఈ) ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు:
‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది ఈ పద్యానికి మకుటం.

4. మేరు నగము వంటి ధీరత కలిగియు
పరమశివుడు తనదు పదములంట
ఇంచుకంత చంచలించె పర్వతరాజు
దేవదేవుడన్న భావనమున.
ప్రశ్నలు:
అ) పర్వతరాజు ఎటువంటి ధీరత గలవాడు?
జవాబు:
పర్వతరాజు మేరు నగము వంటి ధీరత గలవాడు.

ఆ) పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినదెవరు?
జవాబు:
పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినది పరమ శివుడు.

ఇ) ఇంచుకంత చలించినది ఎవరు?
జవాబు:
ఇంచుకంత చలించినది పర్వతరాజు.

ఈ) పర్వతరాజు శివుని ఎట్లా భావించాడు?
జవాబు:
పర్వతరాజు శివుని దేవదేవుడుగా భావించాడు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
ఈ పాఠంలో చిత్రాలు చూడండి. వీటి గురించి మాట్లాడండి. గేయంలోని భావాన్ని ఊహించండి.
జవాబు:
ఈ పాఠంలో ఎన్నో చిత్రాలు ఉన్నాయి. సూర్యుడు, నక్షత్రాలు, ఉపగ్రహాలు, భూమి, ఆకాశము వంటివి ఉన్నాయి. అన్నం కోసం అడుక్కుతినే పేదవారి చిత్రాలు ఉన్నాయి. హాయిగా నిద్రిస్తున్న పసిపాప చిత్రం ఉంది. . . కులమతాల కొట్లాటల్లో నలిగిపోతూ బానిసగా జీవించే బాలిక చిత్రం ఉంది.

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

ప్రశ్న2.
‘ఆలోచనం’ గేయ రచయిత దాశరథిని గూర్చి రాయండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్యులుగారు అగ్నిధార అనే కవితా సంపుటిని రచించారు. ‘ఆలోచనం’ అనే గేయం అగ్నిధారలోనిది. ఈయన 1925లో వరంగల్ జిల్లా చిన్న గూడూరులో జన్మించారు. ఈయన అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం వంటి కవితా సంపుటాలు, గాలిబ్ గీతాలు రచించారు.

ఈయనకు కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి అనే బిరుదులు ఉన్నాయి. వీరి ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. వీరి ‘కవితా పుష్పకం’ రచనకు రాష్ట్ర సాహిత్యం అకాడమీ బహుమతి లభించింది. వీరు అనేక సినీగేయాలు రచించారు.

7th Class Telugu 13th Lesson ఆలోచనం 1 Mark Bits

1. పోతన భాగవత కావ్యము రచించాడు. (వికృతిని గుర్తించండి)
ఎ) కర్ణం
బి) కార్యం
సి) గబ్బు
డి) కబ్బము
జవాబు:
డి) కబ్బము

2. సిరి సంపదలు మనిషిని స్వార్థపరుని చేస్తాయి. (ప్రకృతిని గుర్తించండి)
ఎ) లక్ష్మి
బి) బత్తి
సి) సంపద
డి) శ్రీ
జవాబు:
డి) శ్రీ

3. చిట్టెలుక చెట్టు రంధ్రంలోకి దూరింది. (పదాన్ని విడదీయండి)
ఎ) చిఱు + ఎలుక
బి) చిట్టి + ఎలుక
సి) చిర్ + ఎలుక
డి) చిట్ + ఎలుక
జవాబు:
ఎ) చిఱు + ఎలుక

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

4. భారతదేశంలో దిక్కులేని వారు ఎందరో ఉన్నారు. (అర్థాన్ని గుర్తించండి)
ఎ) అనాగరికులు
బి) అనాథలు
సి) ధనవంతులు
డి) రైతులు
జవాబు:
బి) అనాథలు

5. అనాథలను “ఆదరించాలి“.
ఎ) ఉదాహరణ
బి) సమాదరణ
సి) అనాదరణ
డి) జనాదరణ
జవాబు:
సి) అనాదరణ

6. చెట్ల రాపిడిలో “అగ్ని” పుట్టింది. గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) అగ్ఘి
బి) అగ్గి
సి) ఆజ్యం
డి) పూజ్యం
జవాబు:
బి) అగ్గి

III. భాషాంశాలు

పదాలు – ఆర్థాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాల అర్థం గుర్తించండి.

7. కానరాని భాస్కరులెందరో?
ఎ) చంద్రులు
బి) నక్షత్రాలు
సి) సూర్యుడు
డి) గోళములు
జవాబు:
సి) సూర్యుడు

8. ‘కరవంటూ కాటకమంటూ ఉండని లోకం ఎక్కడో!
ఎ) ఆకలి
బి) దరిద్రము
సి) కరవు
డి) కటిక దరిద్రం
జవాబు:
సి) కరవు

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

9. ‘అన్నార్తులు అనాథలు ఉండరు’
ఎ) దిక్కు గలవారు
బి) దిక్కులేని వారు
సి) బీదవారు
డి) ఆకలితో ఉన్నవారు
జవాబు:
బి) దిక్కులేని వారు

10. ‘పసిపాపల భవితవ్యం ఎలాగుంటుందో’
ఎ) భాగ్యం
బి) కష్టం
సి) సుఖం
డి) జరిగేది
జవాబు:
ఎ) భాగ్యం

11. దాచిన బడబానలమెంతో తెలియదు
ఎ) అగ్ని
బి) నిప్పు
సి) బడబాగ్ని
డి) ఆకలిమంట
జవాబు:
సి) బడబాగ్ని

12. సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి.
ఎ) విధానాలు
బి) విలాపాలు
సి) విషాదాలు
డి) వినోదాలు
జవాబు:
ఎ) విధానాలు

13. పిల్లల తీరు మారలేదు
ఎ) తీరం
బి) దరి
సి) వరి
డి) విధం
జవాబు:
డి) విధం

14. జగతిని జాగృతం చేయాలి.
ఎ) నిదురపోవు
బి) నిశ్చయంగా ఉండు
సి) నిదురపుచ్చు
డి) మేలుకొలుపు
జవాబు:
డి) మేలుకొలుపు

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

15. భోజనానికి పంక్తిలో కూర్చున్నారు.
ఎ) నిలబడి
బి) వరుస
సి) వ్యస్తంగా
డి) పంచగా
జవాబు:
బి) వరుస

16. గ్రామంలో వేడుక జరిగింది.
ఎ) నిండుగ
బి) పండుగ
సి) ధండగ
డి) వండుగ
జవాబు:
బి) పండుగ

పర్యాయపదాలు :

17. శ్రమజీవుల నెత్తురు, కార్మికుల రక్తం త్రాగని ధనవంతులు ఉండరు. ఇచ్చిన వాక్యంలో సమానార్థ కాలను గుర్తించండి.
ఎ) శ్రమ, రక్తం
బి) శ్రమజీవులు, కార్మికులు
సి) ధనవంతులు, శ్రమజీవులు
డి) నెత్తురు, రక్తం
జవాబు:
డి) నెత్తురు, రక్తం

18. మా ఊరిలో కరవులేదు. వర్షాల వల్ల కాటకం ఉండదు. ఇచ్చిన వాక్యాల్లో సమానార్థక పదాలు ప్రకృతిని గుర్తించండి.
ఎ) కరవు, కాటకము
బి) లేదు, ఉండదు
సి) వర్షాలు, కరవు
డి) ఊరిలో, ఉండదు
జవాబు:
ఎ) కరవు, కాటకము

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

19. సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు – గీత గీసిన పదానికి సమానార్థకాలు గుర్తించండి.
ఎ) భాస్కరుడు, వెలుగు
బి) రవి, భాస్కరుడు
సి) వెలుగు, వేడి
డి) మిత్రుడు, శత్రువు
జవాబు:
బి) రవి, భాస్కరుడు

20. జనని వందనీయురాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) జాతి, జామాత
బి) మాత, అంబ
సి) హృదయం, మాత
డి) అమ్మ, అమృతం
జవాబు:
బి) మాత, అంబ

21. బంగారం పొందాలి – గీత గీసిన పదానికి గుర్తించండి.
ఎ) జలజం, కాంస్యం
బి) రజితం, రంజితం
సి) హేమం, సువర్ణం
డి) అభ్రకం, ఆరాశం
జవాబు:
డి) అభ్రకం, ఆరాశం

22. తండ్రి మనకు రక్షకుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
ఎ) పిత, జనకుడు
బి) విధాత, విరించి
సి) భామాత, జంతనం
డి) హరి, సంచారి
జవాబు:
ఎ) పిత, జనకుడు

23. ఇంటిలో కుడి పాదం మోపాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
ఎ) అందం, కరం
బి) చరణం, అడుగు
సి) హస్తం, పాదం
డి) చామరం, అంచె
జవాబు:
బి) చరణం, అడుగు

24. అర్జన న్యాయ మార్గంలో సంపాదించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
ఎ) సంపద, విత్తం
బి) వైభవం, విరించి
సి) వినతి, సునతి
డి) ప్రగతి, నిశ్చలత
జవాబు:
ఎ) సంపద, విత్తం

ప్రకృతి – వికృతులు :

25. రాజరాజు రాజమహేంద్రవరాన్ని పాలించేవాడు – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) రాట్టు
బి) రాజ్
సి) రాయడు
డి) తేజు
జవాబు:
సి) రాయడు

26. చెట్టు రాపిడిలో అగ్గి పుట్టింది – గీత గీసిన పదానికి గుర్తించండి.
ఎ) అగ్రి
బి) అగ్నీ
సి) అగ్ని
డి) అగ్నిహోత్రము
జవాబు:
సి) అగ్ని

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

27. పోతన భాగవత కబ్బాన్ని రచించాడు – గీత గీసిన పదం ప్రకృతిని గుర్తించండి.
ఎ) కావ్యాన్ని
బి) కావ్యం
సి) కబ్బం
డి) గ్రంథాన్ని
జవాబు:
ఎ) కావ్యాన్ని

28. సముద్రంలో అలలు ఉంటాయి – గీత గీసిన పదం వికృతిని గుర్తించండి.
ఎ) సముద్రము
బి) సాగరము
సి) సంద్రము
డి) పారావారము
జవాబు:
సి) సంద్రము

29. రూపం మనోహరంగా ఉంది – వికృతి పదం పర్యాయపదాలను గుర్తించండి.
ఎ) రపు
బి) రాపు
సి) రోపు
డి) రూపు
జవాబు:
సి) రోపు

30. స్త్రీని గౌరవించాలి – వికృతి పదం గుర్తించండి.
ఎ) శీరి
బి) వంతి
సి) సీరి
డి) ఇంతి
జవాబు:
డి) ఇంతి

31. ఆకసంలో నక్షత్రాలు ఉన్నాయి – ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అనంతం
బి) అంతరంగం
సి) ఆకాశం
డి) ఆలోచన
జవాబు:
సి) ఆకాశం

32. కంఠంలో రాగం ఉంది – వికృతి పదం గుర్తించండి.
ఎ) గోలి
బి) గార
సి) గొంతు
డి) గానుగ
జవాబు:
సి) గొంతు

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

33. అందుకు నిదురపోయారు – ప్రకృతిపదం గుర్తించు.
ఎ) నృద్ర
బి) నిద్ర
సి) నిదురె
డి) నెద
జవాబు:
బి) నిద్ర

34. సముద్ర గర్భంలో రత్నాలు ఉన్నాయి.
ఎ) కడుపు
బి) కాఫారం
సి) కాంత
డి) గరుచు
జవాబు:
ఎ) కడుపు

వ్యతిరేక పదాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.

35. సముద్రగర్భం చల్లగా ఉంటుంది.
ఎ) నల్లగా
బి) వెచ్చగా
సి) తియ్యగా
డి) ఉప్పగా
జవాబు:
బి) వెచ్చగా

36. కృతజ్ఞతను ప్రదర్శించాలి.
ఎ) కృతనుత్సత
బి) కృతఘ్నత
సి) కూరికృతృత
డి) కృత
జవాబు:
బి) కృతఘ్నత

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

37. పిల్లలు మేలుకున్నారు.
ఎ) భూజించారు
బి) కలలు పొందారు
సి) నిద్రపోయారు
డి) ప్రార్థించారు
జవాబు:
సి) నిద్రపోయారు

38. ఇంట్లో ధనం ఎక్కువగా ఉంది.
ఎ) అగాధం
బి) నివాళి
సి) తక్కువ
డి) అధికం
జవాబు:
సి) తక్కువ

39. ప్రాచీన సాహిత్యం చదవాలి.
ఎ) అంతిమ
బి) నవీన
సి) అనాగరిక
డి) మధ్యమ
జవాబు:
బి) నవీన

40. బస్తా బరువుగా ఉంది.
ఎ) సుఖం
బి) తేలిక
సి) ప్రోయగం
డి) కష్టం
జవాబు:
బి) తేలిక

41. మిత్రులు సఖ్యంగా ఉన్నారు.
ఎ) మూర్తులు
బి) సోదరులు
సి) అనాధలు
డి) శత్రువులు
జవాబు:
డి) శత్రువులు

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

42. ధనం ఎక్కువగా పెరుగుట తగదు.
ఎ) నిండుట
బి) తరుగుట
సి) ఆకలించుట
డి) మండుట
జవాబు:
బి) తరుగుట

సంధులు :

43. అన్నారులు ఎందరో ఉన్నారు – ఇది ఏ సంధి?
ఎ) దీర్ఘసంధి
బి) త్రికసంధి
సి) గుణసంధి
డి) పరిమాపనసంధి
జవాబు:
ఎ) దీర్ఘసంధి

44. అదెంత పని – దీనిని విడదీయడం గుర్తించండి.
ఎ) అదే + యంత
బి) అద + ఎంత
సి) అది + ఎంత
డి) అద + అంత
జవాబు:
సి) అది + ఎంత

45. క్రింది వానిలో సంస్కృతం సంధి గుర్తించండి.
ఎ) కుట్టుసురు
బి) కావ్యాలెన్నో
సి) భారతావని
డి) అరెట్లు
జవాబు:
సి) భారతావని

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

46. మా ఇల్లు ఊరికి చిట్టచివర ఉంది. గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) చిట్ట + చివర
బి) చిరు + చివర
సి) చిర + చివర
డి) చివర + చివర
జవాబు:
డి) చివర + చివర

47. నిట్టూర్పులతో కాలక్షేపం చేయవద్దు – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) టుగాగమ సంధి
బి) ద్విరుక్తటకార సంధి
సి) రుగాగమ సంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
బి) ద్విరుక్తటకార సంధి

48. ‘నట్టనడుమ‘ జరిగేది కనబడదా? – గీత గీసిన పదాన్ని విడదీయండి. (సి)
ఎ) నట్ట + నడుమ
బి) నఱు + నడుమ
సి) నడుమ + నడుమ
డి) నట్టన + డుమ
జవాబు:
సి) నడుమ + నడుమ

48. ‘చిట్టెలుక‘ చెట్టు రంధ్రంలోకి దూరింది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) ద్విరుక్తటకార సంధి
బి) టుగాగమ సంధి
సి) ఉత్వసంధి
డి) అత్వసంధి
జవాబు:
ఎ) ద్విరుక్తటకార సంధి

50. ద్విరుక్తటకార సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) కుట్టుసురు
బి) వంటాముదం
సి) ముందడుగు
డి) మంచిమాట
జవాబు:
ఎ) కుట్టుసురు

సమాసాలు :

51. కులమతాలు సుడిగుండాల వంటివి – గీత గీసిన పదం విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
ఎ) కులంతో, మతం
బి) కులమూ, మతమూ
సి) కులము యొక్క మతము
డి) కులమనే మతము
జవాబు:
బి) కులమూ, మతమూ

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

52. అన్నార్తులు చేసే ఆక్రందన వినండి. గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) చతుర్ణీతత్పురుష
బి) బహువ్రీహి
సి) ద్వంద్వము
డి) అవ్యయీభావము
జవాబు:
ఎ) చతుర్ణీతత్పురుష

53. అభాగ్యం చెందకూడదు – ఇది ఏ సమాసం?
ఎ) ద్విగువు
బి) బహువ్రీహి
సి) నఞ్ తత్పురుష
డి) కర్మధారయం
జవాబు:
సి) నఞ్ తత్పురుష

54. నరకంఠాలు తెగాలి – వాక్యం గుర్తించండి.
ఎ) నరుల వల్ల కంఠాలు
బి) నరులతో కంఠాలు
సి) నరులయందు కంఠాలు
డి) నరులయొక్క కంఠాలు
జవాబు:
డి) నరులయొక్క కంఠాలు

55. షష్ఠీతత్పురుషకు ఉదాహరణను’ గుర్తించండి.
ఎ) తల్లిదండ్రులు
బి) కవిగుండెలు
సి) దొంగభయం
డి) గుండెకవులు
జవాబు:
బి) కవిగుండెలు

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

56. కొత్తదైన యుగం – దీనికి సమాసపదం గుర్తించండి.
ఎ) ప్రతియుగం
బి) నవ్యమయయుగం
సి) కొత్త యుగం
డి) అనుయుగం
జవాబు:
సి) కొత్త యుగం

57. విశేషణ విశేష్యములతో ……… సమాసం ఏది?
ఎ) బహువ్రీహి
బి) కర్మధారయం
సి) ద్వంద్యము
డి) ద్విగువు
జవాబు:
బి) కర్మధారయం

58. అన్యపదార్థ ప్రాధాన్యం గల సమాసం గుర్తించండి.
ఎ) కర్మధారయం
బి) బహువ్రీహీ
సి) తత్పురుష
డి) అవ్యయీభావం
జవాబు:
బి) బహువ్రీహీ

వాక్యప్రయోగాలు :

59. వృద్ధుడు గోరంతదీపం వెలిగించాడు – దీనికి – వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) వృద్ధుడు గోరంతదీపం వెలిగించకూడదు
బి) వృద్ధుడు గోరంతదీపం వెలిగించకపోవచ్చు
సి) వృద్ధుడు గోరంతదీపం తప్పక వెలిగించాలి
డి) వృద్ధుడు గోరంతదీపం వెలిగించలేదు
జవాబు:
డి) వృద్ధుడు గోరంతదీపం వెలిగించలేదు

60. చెట్లను అందరు పెంచాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) చెట్లను అందరు పెంచకూడదు
బి) చెట్లను అందరు పెంచకపోవచ్చు
సి) చెట్లను అందరు నరకకూడదు
డి) చెట్లను కొందరు పెంచకపోవచ్చు
జవాబు:
ఎ) చెట్లను అందరు పెంచకూడదు

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

61. విద్యార్థులపై గౌరవం ఉంది. అభిమానం ఉంది – దీనిని సంయుక్త వాక్యంగా గుర్తించండి.
ఎ) విద్యార్థులపై గౌరవంతో పాటు అభిమానం ఉంది
బి) విద్యార్థులపై గౌరవం, అభిమానం ఉండాలి
సి) విద్యార్థులపై అభిమానంతో పాటు గౌరవం ఉంది
డి) విద్యార్థులపై గౌరవం, అభిమానం ఉంది
జవాబు:
డి) విద్యార్థులపై గౌరవం, అభిమానం ఉంది

62. పోటీలో పదిమంది పాల్గొన్నారు. ఒక్కరికే విజయం వచ్చింది – దీనికి సంయుక్త వాక్యం ఏది?
ఎ) ఒక్కనికే విజయం వచ్చింది గాని పోటీలో పదిమంది పాల్గొన్నారు
బి) పోటీలో పదిమంది పాల్గొనవచ్చునేమో, గాని ఒక్కరే విజయం పొందారు.
సి) పోటీలో పదిమంది పాల్గొనవచ్చు, విజయం మాత్రం ఒక్కరికే
డి) పోటీలో పదిమంది పాల్గొన్నారు గాని ఒక్కరికే విజయం వచ్చింది.
జవాబు:
డి) పోటీలో పదిమంది పాల్గొన్నారు గాని ఒక్కరికే విజయం వచ్చింది.

63. నాకు సెలవు ఇవ్వండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ప్రార్థనార్థక వాక్యం
బి) అనుమత్యర్థక వాక్యం
సి) సామర్థ్యార్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
ఎ) ప్రార్థనార్థక వాక్యం

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

64. దుష్టులతో స్నేహం వద్దు. ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) సర్వనామం
డి) నామవాచకం
జవాబు:
సి) సర్వనామం

65. గురువు దీపం వెలిగించగలడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తుమున్నర్థక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) సామర్థ్యార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
సి) సామర్థ్యార్థక వాక్యం

66. వృద్దుడు చేరదీసి రక్షించాడు. గీత గీసిన పదం ఏ క్రియా పదం?
ఎ) శత్రర్థకం
బి) క్త్యార్థకం
సి) అప్యర్థకం
డి) తద్ధర్మార్థకం
జవాబు:
బి) క్త్యార్థకం

67. విద్యార్థి చదువుతూ వృద్ధి చెందాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అప్యర్థకం
బి) చేదర్థకం
సి) శత్రర్థకం
డి) క్త్వార్థకం
జవాబు:
సి) శత్రర్థకం

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

68. దీపం వెలిగిస్తే మంచిది. గీత గీసిన పదం ఏ క్రియాపదం?
ఎ) చేదర్థకం
బి) అభ్యర్థకం
సి) తద్ధర్మార్థకం
డి) క్వార్ధకం
జవాబు:
ఎ) చేదర్థకం

విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషలు

69. చల్లని సముద్రగర్భంలో బడబానలం ఉంది – గీతగీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
ఎ) నామవాచకము
బి) సర్వనామము
సి) విశేషణము
డి) క్రియ
జవాబు:
సి) విశేషణము

70. గౌరవంతో జీవించాలి – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) తృతీయ
బి) సప్తమీ
సి) షష్ఠీ
డి) చతుర్థి
జవాబు:
ఎ) తృతీయ

71. దొంగ వలన భయం పొందాను – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) ప్రథమ
బి) సప్తమీ
సి) పంచమీ
డి) షష్ఠీ
జవాబు:
సి) పంచమీ

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

72. శాస్త్రమును చదివినవాడు – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) పంచమీ
బి) ద్వితీయ
సి) షష్ఠీ
డి) చతుర్థి
జవాబు:
బి) ద్వితీయ

73. వాడు పాఠం విన్నాడు – గీత గీసిన పదం ఏ భాషా భాగం?
ఎ) క్రియ
బి) అవ్యయం
సి) నిషేధార్థక వాక్యం
డి) అప్యక వాక్యం
జవాబు:
సి) నిషేధార్థక వాక్యం

74. అందరు పాఠం వ్రాశారు గీత గీసిన పదం ఏ భాషా భాగం?
ఎ) క్రియ
బి) సర్వనామం
సి) అవ్యయం
డి) విశేషణం
జవాబు:
ఎ) క్రియ

75. భాషాభాగాలలో లేని దానిని గుర్తించండి.
ఎ) నామవాచకం
బి) క్రియ
సి) ఆమ్రేడితం
డి) విశేషణం
జవాబు:
సి) ఆమ్రేడితం

76. మొత్తం పురుషలు ఎన్ని?
ఎ) 2
బి) 5
సి) 4
డి) 3
జవాబు:
డి) 3

AP 7th Class Telugu Important Questions Chapter 13 ఆలోచనం

సొంతవాక్యాలు :
క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

77. అనాథలు : ఎందరో అనాథలు దేశంలో ఉన్నారు.
78. శోకము : శోకము వలన మన బుద్ధి నశిస్తుంది.
79. శ్రమజీవులు : శ్రమ జీవుల శక్తికి విలువ కట్టలేము.
80. భవితవ్యం : నాయకుల భవితవ్యం ఫలితాల్లో తేలుతుంది.
81. అన్నార్తులు : దాతలు నిరుపేదలైన అన్నార్తులను ఆదుకోవాలి.
82. నవయుగం : నవయుగంలోని యువత అన్ని రంగాల్లో ముందుకెళ్ళింది.
83. అణగారిని : అణగారిన ప్రజలను అందరు ఆదు కోవాలి.
84. పరాక్రమం : అర్జునుడు యుద్ధంలో పరాక్రమం చూపాడు.
86. చెద : నేరస్థులు నిర్దోషులుగా చెద నుండి విడుదల అయ్యారు.
86. పవిత్రులు : పుష్కరస్నానం చేసిన భక్తులు పవిత్రులు అయ్యారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 10th Lesson త్రిజట స్వప్నం Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 10th Lesson త్రిజట స్వప్నం

6th Class Telugu 10th Lesson త్రిజట స్వప్నం Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం 1

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
చిత్రంలో అన్నాచెల్లెలు ఉన్నారు.

ప్రశ్న 2.
పాప ఎందుకు బాధపడుతుంది?
జవాబు:
పాప తన తండ్రి గురించి బాధపడుతోంది.

ప్రశ్న 3.
అన్నయ్య చెల్లికి ఎలాంటి మాటలు చెబుతున్నాడు?
జవాబు:
అన్నయ్య చెల్లికి ఓదార్పు మాటలు చెబుతున్నాడు.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాల భావం సొంత మాటలలో చెప్పండి.
జవాబు:
ఓ స్త్రీలారా ! వినండి. అని త్రిజట చెప్పింది. తను కలగన్నది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయినట్లు, రావణుని రత్న కిరీటాలు నేలపడినట్లు, రాముడు మదించిన ఏనుగు నెక్కి సీతాదేవిని తీసుకొని వెడుతున్నట్లు కలగన్నది. రాముడు, సీత పవిత్రులు. సీతాదేవితో కఠినంగా మాట్లాడవద్దన్నది. ఇటుపైన ఆమె వలన రక్షణ పొందాలన్నది. సీతమ్మను తప్పక రాముడు తీసుకొని వెడతాడని చెప్పింది. తమను కాపాడమని ప్రార్థించింది. రాక్షస స్త్రీలు నిద్రపోయేరు. సీతాదేవి దుఃఖించింది. శ్రీరాముడు బాగున్నాడు. సీతాదేవిని తప్పక తీసుకొని వెడతాడని ‘హనుమ సీతతో చెప్పాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ప్రశ్న 2.
త్రిజటకు లంకను గురించి ఏమని కల వచ్చిందో రాయండి.
జవాబు:
త్రిజటకు కల వచ్చింది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోతున్నట్లు కనిపించింది. రావణుని తలలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడినట్లు ఆమెకు కలలో కనిపించింది.

ప్రశ్న 3.
త్రిజట స్వప్నం పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
జవాబు:
రావణుడు సీతను అపహరించాడు. సీతతో లంకకు చేరాడు. అశోకవనంలో శింశుపా వృక్షం కింద ఆమెను ఉంచాడు. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు చంపుతామని భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిదురించిన త్రిజట మేల్కొంది. తనకు వచ్చిన కలను గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పింది. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం.

ప్రశ్న 4.
కింది పద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
తనవారు లేనిచోటను
జనవించుక లేనిచోట, జగడము చోటన్
అనుమానమైనచోటను
మనుజుడచట నిలువదగదు మహిలో సుమతీ !

అ) తనవారు అంటే ఎవరు?
జవాబు:
తనవారు అంటే తన బంధువులు, తన మిత్రులు.

ఆ) జగడం అంటే ఏమిటి?
జవాబు:
జగడం అంటే గొడవ.

ఇ) ఈ పద్యం ఏ శతకంలోనిది?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది.

ఈ) మనిషి ఎక్కడెక్కడ నివసించకూడదు?
జవాబు:
తనవారు లేనిచోట, చనువు లేనిచోట, గొడవలు జరిగేచోట, అనుమానించే చోట మనిషి నివసించకూడదు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
త్రిజట తోటి రాక్షస స్త్రీలతో సీతాదేవిపట్ల ఎలా నడచుకోవాలని చెప్పింది?
జవాబు:
రాముడు పవిత్రాత్మ గలవాడు. సీతాదేవి ఆయన రాణి. కనుక సీతాదేవిని రక్షిస్తున్న రాక్షస స్త్రీలెవ్వరూ కఠినంగా మాట్లాడకూడదు. ఇటుపైన సీతాదేవి వల్లనే రాక్షస స్త్రీలందరూ రక్షించబడాలి. కనుక సీతాదేవిని జాగ్రత్తగా చూడాలని త్రిజట రాక్షస స్త్రీలకు చెప్పింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ప్రశ్న 2.
కవయిత్రి మొల్ల గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
మొల్ల పూర్తి పేరు ఆత్కూరి మొల్ల. ఆమె 16వ శతాబ్దపు కవయిత్రి. ఆమె రామాయణం తెలుగులో రచించారు. ఆమె పద్యాలు సరళంగా, రమణీయంగా ఉంటాయి.

ప్రశ్న 3.
తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతాదేవిని హనుమంతుడు ఏమని ఓదార్చాడు?
జవాబు:
శ్రేష్ఠుడైన శ్రీరాముడు సీతాదేవిని రక్షించడానికి ఉన్నాడు. వానరులతో కలిసి వస్తాడు. తప్పనిసరిగా ఆమెను తీసుకొని వెడతాడు. అది నిజమని సీతాదేవిని హనుమంతుడు ఓదార్చాడు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
త్రిజట తన కలలో వచ్చిన అంశాలను తోటి వారితో ఎలా వివరించిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
అశోకవనంలో సీతాదేవికి కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో త్రిజట తన కలలో వచ్చిన అంశాలను వివరించింది. తను కల కనినట్లు చెప్పింది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయింది. తమ ప్రభువు తలలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడ్డాయి. రాముడు ఆనందంగా ఉన్నాడు. మదించిన ఏనుగును శ్రీరాముడు ఎక్కాడు. కాంతితో ప్రకాశిస్తున్న సీతను శ్రీరాముడు తీసుకొని వెడుతున్నాడు. అని వివరించింది.

ప్రశ్న 2.
త్రిజట సీతను ఎలా ఓదార్చింది? ఆ తరువాత ఏం జరిగిందో వివరించండి.
జవాబు:
త్రిజట “అమ్మా ! మీరు భయపడవద్దు. మనసులో ఆనందం నింపుకో ! నీ భర్త వచ్చి నిన్ను త్వరలో తీసుకొని వెళతాడు. నీవే మమ్ములనందరిని రక్షించాలి” అని సీతను ఓదార్చింది. ఆ తరువాత రాక్షస స్త్రీలందరూ నిద్రపోయారు. అప్పుడు హనుమంతుడు మానవ భాషలో “సీతమ్మ తల్లీ ! రాముడు క్షేమంగా ఉన్నాడు. వానర సైన్యంతో త్వరలో వస్తాడు. నిన్ను తీసుకొని వెళతాడు. ఈ మాటలు నిజం” అని చెప్పి సీతను ఓదార్చాడు.

ప్రశ్న 3.
రాష్ట్రస్థాయి ఆటలపోటీకి ఎన్నికై గెలుపు గురించి ఆందోళన చెందుతున్న మీ మిత్రుడికి ధైర్యం చెబుతూ లేఖ రాయండి.
జవాబు:

లేఖ

కర్నూలు,
XXXXX.

ప్రియమైన
శ్రీధర్ కు, శ్రీకర్ వ్రాయు లేఖ

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

నీవు రాష్ట్రస్థాయి ఆటలపోటీకి ఎన్నికైనందుకు అభినందనలు. జిల్లాస్థాయిలో నెగ్గినవాడికి రాష్ట్రస్థాయిలో నెగ్గడం పెద్ద కష్టమేం కాదు. దీని గురించి ఆందోళన చెందకు. నీ పట్టుదల, కృషి మాకు తెలుసు. పట్టుదలతో కృషి చేస్తే దేనినైనా సాధించవచ్చనే మన తెలుగు ఉపాధ్యాయుల మాటలు మరచిపోకు. మన వ్యాయామ ఉపాధ్యాయులు జాతీయస్థాయి క్రీడా విజేత. ఆయన పర్యవేక్షణలో అపజయం ఉండదు. నీ ఆత్మవిశ్వాసమే నిన్ను గెలిపిస్తుంది. ధైర్యంతో ఆడు. విజయం సాధించు. నీ పేరు టి.వి.లోనూ, పేపర్లలోనూ మార్ర్మోగాలి. ఉంటాను. నీ విజయగాథతో రిప్లై రాయి.

ఇట్లు,
నీ స్నేహితుడు,
సి. శ్రీకర్ వ్రాలు.

చిరునామా:
టి. శ్రీధర్, 6వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
పేరుసోముల, కర్నూలు జిల్లా.

భాషాంశాలు

అ) కింద గీతగీసిన మాటలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యం రాయండి.
ఉదా : ఆ చెట్టు కింద ఉన్న ఇంతి సీతాదేవి.
ఇంతి = స్త్రీ
మసం స్త్రీలను గౌరవించాలి.

1. రావణుని తల పైనున్న కోటీరం నేలపై పడింది.
కోటీరం = కిరీటం
ప్రజాస్వామ్యంలో రాచరికాలు కిరీటాలు లేవు.

2. ఈ ఉర్వి పై మనమంతా నివసిస్తున్నాము.
ఉర్వి = భూమి
భూమిని జాగ్రత్తగా కాపాడాలి.

3. సీతాదేవి భర్త అయిన రాఘవుడు వస్తాడు.
రాఘవుడు = శ్రీరాముడు
శ్రీరాముడు ధర్మ స్వరూపుడు.

4. శ్రీరాముడు లెస్సగా ఉన్నాడు,
లెస్స = బాగు
అన్ని భాషలలోకీ తెలుగుభాష బాగుగా ఉంటుంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ఆ) కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోను ఒక పదానికి అదే అర్ధం వచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదాలను గుర్తించి రాయండి.
ఉదా :
భూమిపై మనం నివసిస్తున్నాం. ఈ ధరణిలో మనతోపాటు అనేక ప్రాణులున్నాయి.

1. సీతను చూడగానే హనుమంతుడు సంతోషించాడు. శ్రీరాముని గురించి వినగానే సీతమనసు ఎలమితో పొంగిపోయింది.
జవాబు:
సంతోషం , ఎలమి

2. గురువు చెప్పిన మాట వినాలి. ఆ ఉక్తి మనకు మేలు చేస్తుంది.
జవాబు:
మాట, ఉక్తి

3. చంద్రుడి కాంతి మనకు ఆనందాన్నిస్తుంది. ఆ వెలుగు ప్రకృతిని కూడా పరవశింప జేస్తుంది…
జవాబు:
కాంతి, వెలుగు

4. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిపై కరుణ చూపాలి. మనం చూపే దయ వారికి ఆ బాధను తగ్గిస్తుంది.
జవాబు:
కరుణ, దయ

ఇ) కింది పదాలకు ప్రకృతి, వికృతులను జతపరచి రాయండి.
భాష, అమ్మ, నిద్ర, బాస, అంబ, నిదుర
జవాబు:
ప్రకృతి – వికృతి
ఉదా : భాష – బాస
అంబ – అమ్మ
నిద్ర – నిదుర

వ్యాకరణాంశాలు

ఈ) కింది పదాలను విడదీయండి.
ఉదా : శుద్ధాత్ముడు = శుద్ధ + అత్ముడు
రామాలయం = రామ + ఆలయం

ఉదా : రవీంద్రుడు = రవి + ఇంద్రుడు
2. కవీంద్రుడు = కవి + ఇంద్రుడు

ఉదా : భానూదయం = భాను + ఉదయం
3. గురూపదేశం = గురు + ఉపదేశం

ఉదా : పితౄణం = పితృ + ఋణం
4. మాతౄణం = మాతృ + ఋణం

పై మాటలలో ఈ కింది మార్పు జరిగింది.
1. అ + ఆ = ఆ
2. ఇ + ఇ = ఈ
3. ఉ + ఉ = ఊ
4. ఋ + ఋ = ఋ
‘అ-ఇ-ఉ-ఋ’ అనే వర్ణాలకు అవే వర్ణాలు (సవర్ణాలు) కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని ‘సవర్ణదీర్ఘ సంధి’ అంటారు.
‘అ’ వర్ణానికి ‘అ ఆ’ లు సవర్ణాలు.
‘ఇ’ వర్ణానికి ‘ఇ ఈ’ లు సవర్ణాలు .
‘ఉ’ వర్ణానికి ‘ఉ-ఊ’ లు సవర్ణాలు.
‘ఋ’ వర్ణానికి ‘ఋ ఋ’ లు సవర్ణాలు.

పైన సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలు / సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను ‘సంస్కృత సంధులు’ అంటారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ఉ) కింది పదాలను విడదీయండి.

ఉదా : విద్యార్థి = విద్యా + అర్థి = (ఆ + అ = ఆ)
1. కవీశ్వరుడు = కవి + ఈశ్వరుడు = (ఇ + ఈ = ఈ)
2. కోటీశ్వరుడు = కోటి + ఈశ్వరుడు = (ఇ + ఈ = ఈ)
3. వధూపేతుడు = వధూ + ఉపేతుడు = (ఊ + ఉ = ఊ)
4. దేవాలయం = దేవ + ఆలయం = (అ + ఆ = ఆ)

ఊ) కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.

1. సీతకు ఆనందం కలిగింది.
రామునికి ఆనందం కలిగింది.
సంయుక్త వాక్యం : సీతారాములకు ఆనందం కలిగింది.

2. త్రిజట బాధపడింది.
ద్విజట బాధపడింది.
సంయుక్త వాక్యం : త్రిజట, ద్విజటలు బాధపడ్డారు.

3. మీరు కఠినంగా మాట్లాడకండి.
మీరు కోపంగా మాట్లాడకండి.
సంయుక్త వాక్యం : మీరు కఠినంగానూ, కోపంగానూ మాట్లాడకండి.

4. హనుమంతుడు గొప్పవాడు.
హనుమంతుడు మంచి భక్తుడు.
సంయుక్త వాక్యం : హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు.

5. అపర్ణ సంగీతం నేర్చుకుంది.
అపర్ణ నృత్యం నేర్చుకుంది.
సంయుక్త వాక్యం : అపర్ణ సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ఎ) ప్రశ్నార్థక వాక్యం :
వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దానిని ప్రశ్నార్థక వాక్యం అంటారు.
ఉదా : 1. త్రిజట ఏం మాట్లాడుతుంది ?
2. సీత ఎందుకు బాధపడింది?

మీరు కొన్ని ప్రశ్నార్థక వాక్యాలు రాయండి.
1. హనుమంతుడు ఎవరిని చూశాడు?
2. త్రిజట తన కల గురించి ఎవరికి చెప్పింది?
3. సీతాదేవి భర్త పేరేమిటి?

ఏ) ఆశ్చర్యార్థక వాక్యం :
వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లైతే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు.
ఉదా :
1. ఆహా ! ఎంత బాగుందో !
2. ఔరా ! సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో !

మీరు కొన్ని ఆశ్చర్యార్థక వాక్యాలను రాయండి.
1. ఆహా ! అరణ్యం ఎంత పచ్చగా ఉందో !
2. అబ్బ ! హనుమ ఎంత బలవంతుడో !
3. ఓహో ! ఇది ఇల్లా ! నందనవనమా !

త్రిజట స్వప్నం కవయిత్రి పరిచయం

కవయిత్రి పేరు : ఆత్కూరి మొల్ల
కాలం : 16వ శతాబ్దం
జన్మస్థలం : కడప జిల్లాలోని గోపవరం
రచనలు : 871 గద్య పద్యాలతో మొల్ల రామాయణం రచించారు. చక్కని పద్యాలతో సరళంగా,రమణీయంగా రాశారు. తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటకట్టుగొన్న రచయిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది.

పద్యాలు – అర్థాలు – భావాలు

1. మ! కలగంటిన్ వినుఁడింతులార! మన లంకాద్వీప మీయబి లో
పల వ్రాలన్, మన రావణేశ్వరుని శుంభద్రత్నకోటీరముల్
కలనన్ గూల రఘూద్వహుండెలమితో గంధిద్విపం బెక్కి, యు
జ్జ్వలకాంతిన్ విలసిల్లుసీతఁ గొనిపోవన్ మిన్నకే నిప్పుడే
అర్థాలు :
కంటిన్ = చూచితిని
ఇంతులు = స్త్రీలు
అబ్ధి = సముద్రం
ఈశ్వరుడు = ప్రభువు
శుంభత్ = ప్రకాశించే
కోటీరములు = కిరీటాలు
ఎలమి = సంతోషం
ద్విపం = ఏనుగు
ఉజ్జ్వలము = వెలుగునది
విలసిల్లు = ప్రకాశించు

భావం :
“ఓ స్త్రీలారా! వినండి. నేను కలగన్నాను. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగి పోయింది. రావణుని తలలపై ప్రకాశించే రత్నకిరీటాలు నేలపై రాలిపడ్డాయి. రాముడు ఆనందంతో ఉన్నాడు. మదించిన ఏనుగును ఎక్కాడు. కాంతితో ప్రకాశిస్తున్న సీతాదేవిని తీసుకుని వెళుతున్నాడు” అని అప్రయత్నంగా తనకు కలిగిన కలను త్రిజట వివరించింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

2. క॥ శుద్దాత్ముఁడైన రాముఁడు
శుద్దాంతపుదేవిఁ గానశుభసూచకముల్
శుద్ధమయి తోఁచుచున్నవి
సిద్ధం బీమాట వేదసిద్ధాంతముగాన్
అర్థాలు :
శుద్ధాత్ముడు = పవిత్రమైన ఆత్మ గలవాడు
శుద్ధాంతము = అంతఃపురము
శుద్ధమయి = పవిత్రమయి
సిద్ధాంతము = స్థిరమైన నిర్ణయం
సిద్ధము = న్యాయమైనది

భావం :
రాముడు పవిత్రమైన ఆత్మ కలవాడు. ఆయన అంతఃపుర రాణి సీతాదేవి కనుక అన్నీ పవిత్రమైన శుభసూచకాలే కనిపిస్తున్నాయి. వేదం యొక్క స్థిరమైన నిర్ణయం లాగా నా మాట న్యాయమైనది.

3. క॥ కావున నిక్కోమలియెడఁ
గావలి యున్నట్టిమీరు కఠినోక్తులు గా
నేవియు నాడకుఁ, డిఁక నీ
దేవియ రక్షింప మనకు దిక్కగు మీఁదన్
అర్థాలు :
కావున = కనుక కావలి = కాపలా
కఠిన + ఉక్తులు – పరుషమైన మాటలు
ఆడకుడు = మాట్లాడకండి
దిక్కు = శరణు
మీదన్ = ఇటుపైన

భావం :
అందువల్ల సీతాదేవిని రక్షిస్తున్న మీరు కఠినంగా మాట్లాడవద్దు. ఇకమీదట ఈ సీతాదేవి వల్లనే మనం రక్షింపబడతాము.

4. వ|| అని చెప్పి మటియును
భావం : అని చెప్పి ఇంకా ఇలా అంది.

5. క॥ అమ్మా వెఱవకు మదిలో
నిమ్ముగ మటి వేడ్క నుండు మిఁక, నీ మగఁడున్
నెమ్మిగ నినుఁ గొనిపోవును
మమ్మందఱ మనుపు మమ్మ! మఱవక కరుణన్
అర్థాలు :
వెఱవకు = భయపడకు
మది = మనస్సు
ఇమ్ముగ = ఆనందంగా
నెమ్మిగ = ప్రేమగ
మునుపు = ముందు, పూర్వం
మనుపుము = బ్రతికించుము
కరుణన్ = దయతో రక్షించుము

భావం :
“అమ్మా! భయపడవద్దు. మనసులో ఆనందాన్ని నింపుకుని సుఖంగా ఉండు. నీ భర్త ప్రేమతో నిన్ను తీసుకొని వెళతాడు. తప్పక దయతో మమ్మల్ని కాపాడు.”

6. ఆ|| అనుచు దనుజకాంత లంతంత నెడఁబాసి
నిదుర వోయి రంత నదరి సీత
తనకు దిక్కు లేమిఁ దలపోసి దుఃఖింపఁ
బవనసుతుఁడు మనుజ భాషఁ బలికె
అర్థాలు :
దనుజకాంతలు = రాక్షస స్త్రీలు
ఎడబాసి = విడిచి
అదరి = భయపడి, ఉలిక్కిపడి
లేమి = లేకపోవడం
తలపోసి = ఆలోచించి
పవనము = గాలి, వాయువు
సుతుడు = కొడుకు
పవనసుతుడు = హనుమంతుడు

భావం :
అంటూ రాక్షస స్త్రీలు దూరంగా జరిగి నిద్ర పోయారు. సీత తనకు సమీపంలో రక్షించేవారు ఎవరూ లేరనే భావనతో దుఃఖించింది. అప్పుడు ఆంజనేయుడు మానవ భాషలో ఇలా పలికాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

7. క॥ ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
డున్నాఁ డిదె కపులఁ గూడి, యురుగతి రానై
యున్నాఁడు, నిన్నుఁ గొని పో
నున్నాఁ డిది నిజము నమ్ము ముర్వీతనయా!
అర్థాలు :
లెస్స = బాగుగా
రాఘవుడు = రాముడు
కపులన్ = కోతులతో
కొనిపోవుట = తీసుకొని వెళ్లుట
ఉరుగతి = వేగంగా, గొప్పగా
ఉర్వి = భూమి
తనయ = కుమార్తె
ఉర్వీతనయ : సీతాదేవి

భావం : ఓ సీతమ్మా! శ్రేష్ఠుడైన రాముడు నిన్ను రక్షించడానికి ఉన్నాడు. ఇప్పుడే వానరులతో కలిసి తగిన మార్గంలో వస్తాడు. నిన్ను తీసుకొని వెళతాడు. ఇది నిజం.

AP Board 6th Class Telugu Solutions Chapter 9 ధర్మ నిర్ణయం

SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 9th Lesson ధర్మ నిర్ణయం Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 9th Lesson ధర్మ నిర్ణయం

6th Class Telugu 9th Lesson ధర్మ నిర్ణయం Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 9 ధర్మ నిర్ణయం 1

ప్రశ్న 1.
చిత్రాలను చూసి కథ చదవండి, మాట్లాడండి.
జవాబు:
కథ :
ఒక జింక ఒక పులికి చిక్కింది. తనను చంపవద్దని పులిని ప్రార్థించింది. తన బిడ్డకు పాలిచ్చి వస్తానని నమ్మబలికింది. పులికి దయకలిగింది. జింకను విడిచిపెట్టింది. జింక బిడ్డకు పాలిచ్చి, బిడ్డకు మంచి మాటలు చెప్పి తిరిగి వచ్చింది. పులి ఆశ్చర్యపోయింది. అన్నమాట నిలబెట్టుకొన్న జింకను చంపకుండా విడిచి పెట్టింది.

జింక యొక్క నిజాయితీయే దాని ప్రాణాలు కాపాడింది. మాట తప్పకుండా వచ్చిన జింక, క్రూరమైన పులి స్వభావాన్ని కూడా మార్చింది. సత్యమునకు తప్పక విజయం లభిస్తుంది.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
మాధవవర్మ వంటి ధర్మాత్ములు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తే ఎలా ఉంటుంది? మాట్లాడండి. చెప్పండి.
జవాబు:
మాధవవర్మ వంటి ధర్మాత్ములు పరిపాలిస్తే ప్రజలంతా ధర్మపరాయణులై ఉంటారు. ఎవరూ అబద్దం ఆడరు. మోసం చేయరు. పెద్దలను ఎదిరించరు. తమది కాని దానిని ఆశించరు. తమకు కేటాయించిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. హత్యలు, ఆత్మహత్యలు ఉండవు. ప్రమాదాలు జరుగవు. సుభిక్షంగా ఉంటుంది.

ప్రశ్న 2.
రాజకుమారుడు చేసిన పొరపాటు ఏమిటి?
జవాబు:
అతివేగంగా పరిగెత్తే గుజ్రాలను కట్టిన రథాన్ని ప్రజలు తిరిగే కోటవీధిలో వేగంగా నడపడం తప్పు. అతని మితిమీరిన ఉత్సాహం వలన ఆ రథ చక్రాల కిందపడి ఒక యువకుడు మరణించాడు. అది రాజకుమారుడు చేసిన పొరపాటు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
దుర్గాదేవి ఎందుకు ప్రసన్నురాలైంది?
జవాబు:
ఒక వృద్ధురాలి కొడుకు మరణానికి తన కుమారుడు కారణమయ్యాడని మాధవవర్మకు తెలిసింది. మాధవవర్మ ధర్మాత్ముడు. వివేకి. తన కుమారునికి మరణశిక్ష విధించాడు. ఆ సాయంకాలమే అమలు జరిపాడు. ఆయన ధర్మనిరతికి దుర్గాదేవి ప్రసన్నురాలయింది. బంగారు వర్షం కురిపించింది. మరణించిన వారిద్దరినీ బ్రతికించింది.

ప్రశ్న 4.
కింది సంభాషణ చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

కెజియా : సుప్రజా ! సెలవుల్లో ఎక్కడి కెళ్ళావ్?
సుప్రజ : నేనా ! మా కుటుంబంతో యాగంటి క్షేత్రం చూడటానికి వెళ్ళాను.
కెజియా : ఓహెూ ! అలాగా ఆ పుణ్యక్షేత్రం ప్రత్యేకత ఏమిటో !
సుప్రజ : ఒకటేమిటి? అనేక ప్రత్యేకతల నిలయమది.
కెజియా : నిజమా ! అవేమిటో చెప్పు.
సుప్రజ : ‘యాగంటి’ కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో ఉంది. అత్యంత రమణీయ ప్రదేశం, సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగరూపంలో ఉంటాడు. కానీ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు.
కెజియా : అలాగా !
సుప్రజ . : ఔను ! ఆలయం వెలుపల ‘అగస్త్య పుష్కరిణి’ అనే కొలను ఉంది. అందులో నీళ్ళు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. అంతేకాదు అక్కడ ఉన్న నంది విగ్రహం రోజు రోజుకూ పెరుగుతూ ఉండటం ముఖ్యమైన విశేషం. అక్కడ మూడు సహజసిద్ధంగా ఏర్పడిన గుహలున్నాయి. వీరబ్రహ్మంగారు ఆ గుహల్లోనే కూర్చుని కాలజ్ఞానం రాశారట !
పర్వీన్ : ఏంటి ? మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు. పదండి. బడికి వెళ్తాం ! (ముగ్గురూ నిష్క్రమిస్తారు)

ప్రశ్నలు – జవాబులు :
అ) యాగంటిలోని ఉమామహేశ్వరాలయానికి, మిగిలిన శివాలయాలకు తేడా ఏమిటి?
జవాబు:
సాధారణంగా శివాలయాలలో శివుడు లింగరూపంలో ఉంటాడు. కాని యాగంటిలో పార్వతీ, పరమేశ్వరులు విగ్రహరూపంలో ఉంటారు.

ఆ) అగస్త్య పుష్కరిణి ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
అగస్త్య పుష్కరిణిలో నీరు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది.

ఇ) కాలజ్ఞానం ఎవరు రాశారు?
జవాబు:
వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు.

ఈ) పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
యాగంటి క్షేత్రం ఏ జిల్లాలో ఉంది?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దుర్గాదేవిని కనకదుర్గగా ప్రజలెందుకు పిలుస్తున్నారు?
జవాబు:
మాధవవర్మ కుమారుని రథం క్రింద పడి ఒక యువకుడు మరణించాడు. ధర్మాత్ముడైన మాధవవర్మ తన కుమారుడు చేసిన తప్పుకు మరణశిక్ష విధించి అమలు జరిపాడు. అతని ధర్మనిరతికి దుర్గాదేవి ఆనందించింది. విజయవాడ నగరమంతా బంగారుకాసుల వర్షం కురిపించింది. అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా ప్రజలంతా పిలుస్తున్నారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 2.
మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులేనని ఎట్లా చెప్పగలవు?
జవాబు:
మాధవవర్మ రాజ్యంలో ఎవరు తప్పుచేసినా తగిన శిక్ష విధించేవాడు. తప్పు చేసిన వారిపట్ల తనవాళ్ళు, పరాయివాళ్ళు అనే భావన ఉండేది కాదు. అతని రాజ్యంలో వ్యక్తిని చంపినవాడికి మరణశిక్ష విధించేవాడు. రథాన్ని వేగంగా నడిపి ఒక యువకుని మరణానికి మాధవవర్మ కొడుకే కారణమయ్యాడు. ఆ నేరానికి తన కుమారునికి కూడా
మరణశిక్ష విధించి అమలు జరిపాడు. అందుచేత మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులే అని చెప్పగలను.

ప్రశ్న 3.
పుత్రవాత్సల్యం అంటే ఏమిటి?
జవాబు:
తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఉండే ప్రేమను పుత్రవాత్సల్యం అంటారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
విజయవాడలో బంగారు వర్షం ఎందుకు కురిసిందో వివరంగా రాయండి.
జవాబు:
విజయవాడను పరిపాలించే మహారాజు పేరు మాధవవర్మ. ఆయన ధర్మాత్ముడు. ఒకసారి ఆయన కుమారుడు రథం మీద చాలావేగంతో కోట వీధిలో ప్రయాణించాడు. ఒక యువకుడు రథం కిందపడి మరణించాడు.

అతని తల్లి వృద్ధురాలు. తనకు న్యాయం చేయమని రాజును అర్థించింది. ఆ నేరం చేసినవాడు తన కుమారుడే అని తెలిసింది. న్యాయం ప్రకారం అతనికి మరణశిక్ష విధించాడు. ఆ సాయంత్రమే అతనిని ఉరి తీయించాడు.

అతని ధర్మనిరతికి దుర్గాదేవి ఆనందించింది. ఘడియసేపు బంగారు వర్షం కురిపించింది. ప్రజలంతా వీథులలోకి వచ్చి, బంగారు కాసులు ఏరుకొన్నారు. మరణించిన వారిద్దరిని బతికించింది.

ప్రశ్న 2.
ధర్మపరాయణుడైన మాధవవర్మ గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
మాధవవర్మ ధర్మ పరాయణుడు. ధర్మం, న్యాయం విషయంలో ఆయనకు తనవారు, పరాయివారు అనే భేదం లేదు. ఒకరోజు తన కుమారుని రథచక్రాల కిందపడి ఒక యువకుడు మరణించాడు. ధర్మనిర్ణయం చేయమని, న్యాయాధికారులను ఆదేశించాడు మాధవవర్మ. దానికి మరణశిక్ష తప్ప మరో దారి లేదని న్యాయాధికారులు చెప్పారు. రాజకుమారుడైనా, సామాన్యుడైనా న్యాయదేవతకు సమానమేనని చెప్పారు. బంధుప్రీతికి చోటులేదని చెప్పారు. తీర్పు వింటున్నంతసేపూ మాధవవర్మ మౌనంగా ఉన్నాడు. గంభీరంగా ఉన్నాడు. ఆయన ధర్మాన్ని కాదనలేడు. పుత్రవాత్సల్యం, ధర్మ నిర్ణయం రెండింటికీ ఘర్షణ ఏర్పడినపుడు ధర్మ నిర్ణయమే గెలిచింది. అందుకే మాధవవర్మ పట్ల దుర్గాదేవి కూడా ప్రసన్నురాలైంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన పదాల ఆధారంగా కథను రాయండి.

శిబిచక్రవర్తి – కొలువు – పావురం-డేగ – ప్రవేశించడం – శరణు – అభయం – ఇవ్వడం – తక్కెడ – తేవడంతూచడం – సరితూగకపోవడం – సిద్ధమవడం – త్యాగనిరతి – ప్రజలు – మెచ్చుకోవడం – అగ్ని – ఇంద్రుడు – ప్రత్యక్షమవడం – ప్రవేశించడం.
జవాబు:
త్యాగం
ఒకనాడు శిబిచక్రవర్తి కొలువుతీరి ఉన్నాడు. ఆయన కొలువులోనికి ఒక పావురం ప్రవేశించింది. దానిని తరుముకొంటూ ఒక డేగ వచ్చింది. పావురం .శిబి చక్రవర్తిని శరణు వేడింది. తనను కాపాడమని ప్రార్థించింది. శిబి అభయం ఇచ్చాడు. అది తన ఆహారం కనుక తనకు మాంసం కావాలని డేగ అడిగింది. శిబి చక్రవర్తి తక్కెడ తెమ్మన్నాడు. తన శరీరం నుండి మాంసం కోసి తక్కెడలో వేసి పావురంతో తూచాడు. ఎంత మాంసం వేసినా సరిపోలేదు. చివరకు తానే కూర్చున్నాడు. ఆయన త్యాగనిరతిని ప్రజలు మెచ్చుకొన్నారు. అగ్ని, ఇంద్రుడు ప్రత్యక్షమయ్యారు. తామే డేగ, పావురం రూపంలో వచ్చినట్లు చెప్పారు. శిబి చక్రవర్తిని ఆశీర్వదించారు.

భాషాంశాలు

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : శ్రీకృష్ణుని చేతిలో కంసుడు అసువులు వదిలాడు.
అసువులు = ప్రాణాలు
సమయానికి సరైన వైద్యం అందడంచేత ఒక వ్యక్తి ప్రాణాలు నిలిచాయి.

1. ఘడియ మాత్రంలోనే సత్య వంటపని ముగించింది.
ఘడియ = 24 నిముషాలు.
ఈ రోజు 24 నిముషాల్లోనే 20 కిలోమీటర్లు వెళ్లాను.

2. పర మతాన్ని గౌరవించడం ధర్మం.
పర = ఇతర
ఇతర విషయాలు పట్టించుకోకుండా చదువుకోవాలి.

3. పూర్వం అశ్వాన్ని వాహనంగా ఉపయోగించేవారు.
అశ్వం = గుర్రం
దూరం పరుగెత్తినా గుఱ్ఱం తొందరగా అలసిపోదు.

4. సువర్ణ భూషణాలంటే అందరికీ ప్రీతి.
సువర్ణం = బంగారం
బంగారం ధర నానాటికీ పెరిగిపోతోంది.

ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలు (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి.

1. వాసు గుర్రం ఎక్కి ఊరు బయలుదేరాడు.. ఆ అశ్వం వేగవంతమైంది. గంట లోపలే హయం వల్ల ఊరు చేరిపోయాడు.
జవాబు:
1) గుర్రం
2) అశ్వం
3) హయం

2. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఆదిత్యుని రశ్మి సోకి ప్రకృతి నిదుర లేచింది. రవి తాపాన్ని భరించడం సాధ్యం కాదు.
జవాబు:
1) సూర్యుడు
2) ఆదిత్యుడు
3) రవి

3. అద్రి శిఖరం నుండి సెలయేరు జాలువారుతోంది. కొండపైన నగరం విస్తరించింది. ఆ పర్వతం మీదనే . దేవాలయం వెలసింది.
జవాబు:
1) అది
2) కొండ
3) పర్వతం

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఇ) కింది ప్రకృతులను వికృతులతో జతపర్చండి.

1) రథంఅ) ఆన
2) కుమారుడుఆ) అరదం
3) ఆజ్ఞఇ) కొమరుడు

జవాబు:

1) రథంఆ) అరదం
2) కుమారుడుఇ) కొమరుడు
3) ఆజ్ఞఅ) ఆన

ఈ) కింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి.

1) న్యాయం 2) అసామాన్యం  3) అస్తమిస్తాడు 4) దుఃఖం

1. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమరన …………… (అస్తమిస్తాడు)
2. నా కుమారునికి అన్యాయం జరిగిందని అనుకుంటే ……………….. జరిగింది. (న్యాయం)
3. సుఖం …………….. కావడి కుండలు అంటారు. (దుఃఖం)
4. ప్రతి సామాన్య విషయం ఒక్కోసారి ……………… గా మారుతుంది. (అసామాన్యం)

వ్యాకరణాంశాలు

అ) కింది పదాలను గమనించండి.

1) నాలుగు ముఖాలు
2) మూడు కన్నులు
3) పంచ పాండవులు
4) ముల్లోకాలు
5) ఏడు ద్వారాలు

పై పదాలన్నీ సమాస పదాలే. వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తోంది. ఉత్తరపదం నామవాచకాన్ని సూచిస్తోంది. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలంటారు.

కింది వాక్యాల్లో ద్విగు సమాస పదాలున్నాయి. గుర్తించి రాయండి.
1. వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు.
జవాబు:
చతుర్వేదాలు

2. శంకుస్థాపనలో నవధాన్యాలు వాడతారు.
జవాబు:
నవధాన్యాలు

3. ఇంద్రధనుస్సులో సప్తవర్ణాలు ఉంటాయి.
జవాబు:
సప్తవర్ణాలు

ఆ) ముందటి పాఠాలలో అత్వ సంధి పదాలను తెలుసుకున్నారు కదా! కింద ఇచ్చిన అత్వ సంధి పదాలను విడదీయండి.
1. చిన్నప్పుడు
2. తిరగకేమి
3. రామయ్య
4. జరగకేమి
5. రామక్క
6. సీతమ్మ
జవాబు:
1. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు – అత్వ సంధి
2. తిరగకేమి = తిరగక + ఏమి – అత్వ సంధి
3. రామయ్య = రామ + అయ్య అత్వ సంధి
4. జరగకేమి జరగక + ఏమి – అత్వ సంధి
5. రామక్క = రామ + అక్క – అత్వ సంధి
6. సీతమ్మ = సీత + అమ్మ – అత్వ సంధి

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఇ) ఈ కింది సంధి పదాలను కలిపి రాయండి.
1. రవ్వ + అంత 2. చింత + ఆకు 3. వెంక + అప్ప
జవాబు:
1. రవ్వ + అంత = రవ్వంత – అత్వ సంధి
2. చింత + ఆకు = చింతాకు – అత్వ సంధి
3. వెంక + అప్ప = వెంకప్ప – అత్వ సంధి

ఈ) సంయుక్త వాక్యం :

సమప్రాధాన్యం గల ‘రెండుగాని, అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్తవాక్యం ఏర్పడుతుంది. ఇందులో అన్నీ ప్రధానవాక్యాలే ఉంటాయి. కాబట్టి, కాని, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి.

కింద ఇచ్చిన వాక్యాలను గమనించండి. సంయుక్త వాక్యాలుగా మార్చండి.
ఉదా :
మధు బడికి వెళ్లాడు. రహీమ్ బడికి వెళ్ళాడు. జాన్ బడికి వెళ్ళాడు.
మధు, రహీమ్, జాన్ బడికి వెళ్ళారు.

1. సీత అక్క. గీత చెల్లెలు.
2. శారద సంగీతం నేర్చుకుంది. శారద నాట్యం నేర్చుకుంది.
3. నగీస్ స్టేషన్ కి వెళ్లింది. రైలు వెళ్ళిపోయింది.
4. మాధవి పరుగెత్తింది. బస్సు అందలేదు.
5. వర్షాలు వచ్చాయి. చెరువులు నిండలేదు.
జవాబు:
1. సీత, గీత అక్కాచెల్లెళ్ళు.
2. శారద సంగీతం, నాట్యం నేర్చుకుంది.
3. నగీస్ స్టేషనుకు వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది.
4. మాధవి పరుగెత్తింది కానీ బస్సు అందలేదు.
5. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రాజెక్టు పని (నాలుగవ నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం)

* మీ ప్రాంతంలోని దర్శనీయ స్థలాలను గూర్చిన వివరాలు సేకరించి రాయండి.
జవాబు:
మేము విజయవాడలో నివసిస్తాం.

విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నది. లెనిన్ విగ్రహం నాకు చాలా నచ్చింది. విక్టోరియా మ్యూజియం కూడా చాలా బాగుంటుంది.

గాంధీ కొండపై మహాత్ముడి సంస్మరణార్థం ఒక స్మారక స్తూపం ఉంది. ఈ స్తూపం 52 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ గాంధీ స్మారక గ్రంథాలయం, నక్షత్రశాల చూడతగినవి. ప్రకాశం బ్యారేజీ కూడా దర్శనీయ ప్రాంతమే. రాజీవ్ గాంధీ పార్కులో చాలా పూలమొక్కలు ఉన్నాయి. సంగీతాన్ని వినిపించే ఫౌంటేను, మినీ జూపార్కు ఇక్కడ ప్రత్యేకాకర్షణ. విజయవాడకు 4 కిలోమీటర్ల దూరంలో భవానీ ద్వీపం చక్కటి పర్యాటక క్షేత్రం. విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గమ్మ గుడి, చాలా బాగుంటుంది. గుణదల మేరీమాత గుడి కూడా చూడదగిన ప్రాంతం.

కఠిన పదాలు – అర్ధాలు

కోలాహలం = హడావిడి
సువర్ణం = బంగారం
అశ్వం = గుఱ్ఱం
రథం = తేరు
ధ్వని = శబ్దం
అసువులు = ప్రాణాలు
ఆకస్మికంగా = హఠాత్తుగా
వదనం = ముఖం
మూర్తీభవించిన = రూపుదాల్చిన
ఆశ్రితులు = ఆశ్రయించినవారు
ఆపన్నులు = ఆపదలో ఉన్నవారు
మృతదేహం = శవం
సొమ్మసిల్లుట = స్పృహ తప్పుట
సపర్యలు = సేవలు
ఆనతి = ఆజ్ఞ
శాసనం = చట్టం
సూక్తి = మంచిమాట
శోకము= ఏడ్పు

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

These AP 7th Class Telugu Important Questions 16th Lesson బాల్య క్రీడలు will help students prepare well for the exams.

AP State Syllabus 7th Class Telugu 16th Lesson Important Questions and Answers బాల్య క్రీడలు

7th Class Telugu 16th Lesson బాల్య క్రీడలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గేయాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కసవు గల దిరవు పసులకు,
లస దద్రినదీ మహీజ లతికావలి పెం
పెసఁగును, గాఁపురమునకును,
బొసఁగును బృందావనంబు వొదఁడచ్చటికిన్.
ప్రశ్నలు – జవాబులు :
అ) బృందావనము పశువులకు ఎలా ఉంటుంది?
జవాబు:
బృందావనము పశువులకు అనుకూలము. అక్కడ వాటికి గడ్డి దొరుకుతుంది.

ఆ) బృందావనము పర్వతాలు, నదులు, చెట్లు, తీగలతో ఉంటుంది. అనే భావం గల పంక్తి ఏది ?
జవాబు:
“లసద8నదీమహీజలతికావలి పెంపెసఁగును” అనే పెద్దబొబ్బ పెట్టాడు. పద్యంలో పంక్తి పై భావాన్ని ఇస్తుంది.

ఇ) ఈ పద్య రచయిత ఎవరు ? ఇది ఏ పాఠంలోనిది ?
జవాబు:
ఈ పద్య రచయిత “బమ్మెరపోతన” – ఇది ‘బాల్య క్రీడలు’ పాఠంలోనిది.

ఈ) ‘పొదడచ్చటికిన్’ – అంటే ఏమిటి?
జవాబు:
‘అక్కడికి పోదాం’ అని ఆ పంక్తికీ గల భావం.

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

2. ఒక్కఁడు ము న్నే మతి చన
నొక్కఁడు బలుబొబ్బ పెట్టు నులికిపడన్, వే
టొక్కఁడు ముట్టి తటాలున,
నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁ గన్ ఆ
ప్రశ్నలు – జవాబులు :
అ) ఎప్పుడు బలుబొబ్బ పెట్టాడు?
జవాబు:
ఒకడు ఏమరుపాటుగా . నడుస్తుండగా, మరొకడు పెద్దబొబ్బ పెట్టాడు.

ఆ) పెద్దబొబ్బ పెడితే ఏమయింది?
జవాబు:
బలుబొబ్బ (పెద్దకేక) పెడితే, నడిచివెళ్ళే వాడు ఉలికిపడ్డాడు.

ఇ) . ‘ఉలికిపడేటట్లు ఓకడు పెద్దకేక వేయగా’ అనే అర్థం వచ్చే పంక్తి ఏది?
జవాబు:
‘ఒక్కడు బలుబొబ్బ పెట్టు నులికిపడన్’ అనే పంక్తి పై భావాన్ని ఇస్తుంది.

ఈ) కనుదోయి మూయగా ఏమి జరిగింది?
జవాబు:
ఒకడు కనుదోయి మూయగా, అది చూచి మరొకడు నవ్వాడు.

3. వనజాక్షుఁడు మున్నరిగిన,
‘మునుపడఁగా నేనెయతని ముట్టెద’ ననుచుం
గని మును ముట్టనివానిన్,
మును ముట్టినవాఁడు నవ్వు మొనసి నరేంద్రా !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఈ పద్యంలో నరేంద్రా ! అన్న నరేంద్రుడు ఎవరు?
జవాబు:
ఇక్కడ పద్యంలోని నరేంద్రుడు “పరీక్షిత్తు మహారాజు ”.

ఆ) ముందుగా వెళ్ళినవారు ఎవరు?
జవాబు:
ముందుగా వెళ్ళినవాడు ‘వనజాక్షుడు’ అనగా శ్రీకృష్ణుడు.

ఇ) గోపబాలురు ఏమి పందెము వేసుకున్నారు?
జవాబు:
ఇతరుల కంటే ముందుగా వెళ్ళి, కృష్ణుని ముట్టు కోవాలని వారు పందెము వేశారు.

ఈ) ‘ముందుగా నేనే అతన్ని ముట్టుకుంటాను’ అని అర్థం వచ్చే పంక్తి ఏది?
జవాబు:
‘మునుపడగా నేనెయతని ముట్టెదను’ అనే పంక్తి ఈ భావాన్ని ఇస్తుంది.

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

ఈ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ఎఱుక గలవారి చరితలు
గడచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగినదానిని
మఱువ కనుష్ఠించునది సమంజసబుద్దిన్
ప్రశ్నలు :
అ) ఎవరి చరిత్ర తెలుసుకోవాలి?
జవాబు:
జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.

ఆ) ధర్మాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి?
జవాబు:
ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.

ఇ) దేనిని అనుష్ఠించాలి?
జవాబు:
ధర్మాన్ని అనుష్ఠించాలి.

ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యా నికి శీర్షిక ‘నీతిబోధ’.

2. తను లోకము గొనియాడగ
విని యుబ్బడు సజ్జనుండు వెండియుఁ గడు మే
లొనరించుఁ గీడాకించుక
యును దనదెసఁ దోఁపనిక యుడుపుచు వచ్చున్.
ప్రశ్నలు :
అ) లోకం తనను పొగిడితే పొంగిపోనివాడు ఎవరు?
జవాబు:
లోకం తనను పొగిడితే పొంగిపోనివాడు సజ్జనుడు.

ఆ) సజ్జనుడు లోకానికి ఏం చేస్తాడు?
జవాబు:
సజ్జనుడు లోకానికి మేలు చేస్తాడు.

ఇ) తనవల్ల ఏమాత్రం హాని కలుగకుండ చూసేవాడు ఎవరు?
జవాబు:
తనవల్ల ఏమాత్రం హాని కలుగకుండ చూసేవాడు సజనుడు.

ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘సజ్జన స్వభావం’.

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

3. సద్గోష్ఠి సిరియు నొసగును
సద్గోష్టియె కీర్తిఁబెంచు; సంతుష్టియు నా
సద్గోష్ఠియె యొనగూర్చును;
సద్గోష్టియె పాపములను చఱచు కుమారా!
ప్రశ్నలు :
అ) సద్గోష్ఠి దేన్ని ఇస్తుంది?
జవాబు:
సద్గోష్ఠి సంపదను ఇస్తుంది.

ఆ) కీర్తిని పెంచేది ఏది?
జవాబు:
కీర్తిని పెంచేది సదౌష్ఠి.

ఇ) పాపములను పోగొట్టేది ఏది?
జవాబు:
పాపములను పోగొట్టేది సదౌష్ఠి.

ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘సదౌష్ఠి ప్రయోజనం’.

4. కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.
ప్రశ్నలు :
అ) సుజనుడు ఎట్లా ఉంటాడు?
జవాబు:
సుజనుడు కందుకంలా ఉంటాడు.

ఆ) మందుడు ఎలా ఉంటాడు?
జవాబు:
మందుడు మృత్పిండంలా ఉంటాడు.

ఇ) సుజనుని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
సుజనుని కవి బంతితో పోల్చాడు.

ఈ) ఈ పద్యంలోని అలంకారమేమి?
జవాబు:
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న1.
బాల్యక్రీడలు పాఠ్యభాగ రచయిత పోతన కవిని గూర్చి పరిచయం చేయండి. (S.A. II – 2017-18)
జవాబు:
‘బాల్యక్రీడలు’ అనే పాఠం పోతన మహాకవి రచించిన ఆంధ్రమహాభాగవతము దశమ స్కంధములోనిది. పోతన 15వ శతాబ్దము వాడు. ఈయన తెలంగాణాలో వరంగల్లు జిల్లా బమ్మెర గ్రామంలో పుట్టాడు. ఈయనకు ‘సహజ పండితుడు’ అనే బిరుదు ఉంది.

పోతన గారు ఆంధ్రమహాభాగవతము, భోగినీ దండకము, వీరభద్ర విజయము, నారాయణ శతకము అనే ” గ్రంథాలు రచించాడు. పోతనగారి పద్యం ఒక్కటైనా రాని తెలుగువాడు ఉండడు.

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

ప్రశ్న2.
పాఠంలోని చిత్రాలను చూడండి. పద్యభావాలను ఊహించండి.
జవాబు:

  1. గోపాలురు, ‘బృందావనం’ మంచి చెట్లతో పచ్చిగడ్డితో అందంగా ఉందని, పశువులకు అక్కడ మంచి మేత దొరుకుతుందని వారు ఆనందపడుతున్నారు.
  2. కొందరు పిల్లలు మునీశ్వరులవలె తపస్సు చేస్తున్నారు. గోవులు పచ్చిక మేస్తున్నాయి. పిల్లలు చేతులెత్తి ఆనందంగా – కేకలు వేస్తున్నారు. కొందరు ఆనందంగా కళ్ళు మూసుకుని చేతులు చాపి పాడుతున్నారు, చెట్లపై రాళ్ళు . విసిరి పళ్ళు పడగొడుతున్నారు.
  3. బలరాముడు నాగలి ధరించాడు. గోపాలురు చేతికర్రలతో పశువులను మేపుతున్నారు.
  4. కొందరు పర్వతాలపైకి ఎక్కి, కిందికి జారుతున్నారు.
  5. బాలికలు దాగుడుమూతలు ఆడుతున్నారు.
  6. శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవిని చేతితో పట్టుకొని నడుస్తున్నాడు. కొందరు పిల్లలు ఒకరి చేతిలో మరొకరు చేతులు . వేస్తూ చెమ్మ చెక్క ఆట ఆడుతున్నారు.

పూర్వకథ :
కృష్ణుడు వ్రేపల్లెలో యశోదానందుల ఇంట్లో పెరుగుతున్నాడు. అక్కడ పూతన చనుబాలు ఇచ్చి కృష్ణుడిని చంపబోయింది. సుడిగాలి వచ్చి కృష్ణుడిని ఎత్తుకుపోయింది. శకటాసురుడు వచ్చాడు. చెట్లు వానిపై పడిపోయాయి. ఈ అపాయాలు అన్నీ భగవంతుని దయవల్ల తప్పిపోయాయి. అప్పుడు నందుడు వ్రేపల్లెలో ఒక
సమావేశం ఏర్పాటుచేశాడు. వస్తున్న ఉపద్రవాల గురించి చర్చించారు. వారిలో ‘ఉపనందుడు’ అనే ముసలి గోపాలకుడికి దైవ సంకల్పం వల్ల ఒక ఆలోచన వచ్చింది. వ్రేపల్లెను విడిచి పెట్టి, బృందావనమునకు వెళ్ళడం మంచిదని అతడే వారికి ఇలా సలహా ఇచ్చాడు.

7th Class Telugu 16th Lesson బాల్య క్రీడలు 1 Mark Bits

1. “ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం” – ఏ అలంకార లక్షణం?
ఎ) ఉపమ
బి) ఉత్ప్రేక్ష
సి) వృత్త్యనుప్రాస
డి) అంత్యానుప్రాస
జవాబు:
బి) ఉత్ప్రేక్ష

2. “రాముడు” – గురు, లఘువులు గుర్తించండి.
ఎ) UIU
బి) III
సి) UII
డి) UUI
జవాబు:
సి) UII

3. దైత్యవరులమై అబ్ది చిలుకుదామా ! (అర్థాన్ని గుర్తించండి)
ఎ) ఆకాశం
బి) సముద్రం
సి) వాయువు
డి) వెలుగు
జవాబు:
బి) సముద్రం

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

4. ‘ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్లయితే అది ఏ అలంకార లక్షణం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) లాటానుప్రాస
డి) ఉపమాలంకారం
జవాబు:
ఎ) వృత్త్యనుప్రాస

5. “సాగరం” (గురు లఘువులు గుర్తించండి)
ఎ) UII
బి) UIU
సి) UUI
డి) UUU
జవాబు:
బి) UIU

6. “రామయ్యకు భాగ్యం కొద్దీ ఉద్యోగం దొరికింది”.
ఎ) సముద్రం
బి) రాజు
సి) దుఃఖం
డి) అదృష్టం
జవాబు:
డి) అదృష్టం

III. భాషాంశాలు

పదాలు – ఆర్థాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థం గుర్తించండి.

7. రాముడు కపులతో కలసి వారధి కట్టాడు.
ఎ) సైనికులు
బి) రాక్షసులు
సి) కోతులు
డి) చెట్లు
జవాబు:
సి) కోతులు

8. ప్రావీణ్యం కోసం రోజూ అభ్యాసం చెయ్యాలి.
ఎ) నేర్పు
బి) ప్రతిభ
సి) తెలివి
డి) జ్ఞానము
జవాబు:
ఎ) నేర్పు

9. గోప కుమారులు పన్నిదములు వేసి పండ్లగుత్తులను రాల్చారు.
ఎ) రాళ్ళు
బి) పందెములు
సి) చిక్కాలు
డి) ప్రతిజ్ఞలు
జవాబు:
బి) పందెములు

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

10. వారు కపులవలె జలరాశిని బంధించారు.
ఎ) నీళ్ళు
బి) చెరువులు
సి) సరస్సు
డి) సముద్రము
జవాబు:
డి) సముద్రము

11. పిల్లలకు ఈడు వచ్చింది.
ఎ) మదం
బి) వయసు
సి) దురంతం
డి) సొగసు
జవాబు:
బి) వయసు

12. ఆకాశంలో నక్షత్రాలు తనరుట చూచాను.
ఎ) పలకరించు
బి) నశించు
సి) ప్రకాశించు
డి) ఆరాధించు
జవాబు:
సి) ప్రకాశించు

13. తటాలున వర్షం కురిసింది.
ఎ) మందంగా
బి) చిన్నగా
సి) మనోహరంగా
డి) హఠాత్తుగా
జవాబు:
డి) హఠాత్తుగా

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

14. పుణ్యాత్ములకు ఈ భూమి ఇరవుగా ఉంది.
ఎ) పాపం
బి) మందిరం
సి) కర్మ
డి) స్థానం
జవాబు:
డి) స్థానం

15. క్రేపు మందలో కలిసింది.
ఎ) నాడ
బి) వాడ
సి) దూడ
డి) వరాహం
జవాబు:
సి) దూడ

పర్యాయపదాలు :
సూచన : గీత గీసిన పదాలకు పర్యాయపదాలను గుర్తించండి.

16. “కవులమై జలరాశి కట్టుదుమా?” గీత గీసిన పదానికి సమానార్థక పదాలు గుర్తించండి.
ఎ) సముద్రము, అబ్ది
బి) సరోవరము, పారావారము
సి) సంద్రము, అంబుజాకరము
డి) అంభోది, చలిచెలమ
జవాబు:
ఎ) సముద్రము, అబ్ది

17. రాజు రాజ్యం పాలించాడు.
ఎ) సచివుడు, సేనాని
బి) సచివుడు, నరపతి
సి) నరపతి, పృథ్వీపతి
డి) సురపతి, నరపతి
జవాబు:
సి) నరపతి, పృథ్వీపతి

18. అమరులు వరాలు ఇస్తారు.
ఎ) రాక్షసులు, దేవతలు
బి) దేవతలు, సురలు
సి) దానవులు, సురలు
డి) కిన్నెరులు, కింపురుషులు
జవాబు:
బి) దేవతలు, సురలు

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

19. అందరు ఆవళిలో ఉన్నారు.
ఎ) జలధి, ఆశ
బి) ఆవరణం, ఆరోపణ
సి) వరుస, పంక్తి
డి) సాగరం, సముదాయం
జవాబు:
సి) వరుస, పంక్తి

20. దెయ్యాలు దయాహీనులు.
ఎ) బుధులు, వామరులు
బి) రమణులు, రంజనులు
సి) దానవులు, రాక్షసులు
డి) నటులు, వైద్యులు
జవాబు:
సి) దానవులు, రాక్షసులు

21. అంఘ్రి యుగళానికి నమస్సులు.
ఎ) పాదము, పాపము
బి) కరము, వారము
సి) తొండము, కిరణము
డి) కాలు, పాదము
జవాబు:
డి) కాలు, పాదము

22. తనువును రక్షించాలి.
ఎ) మేను, మనువు
బి) మంత్రి, నాశిక
సి) శరీరం, దేహం
డి) నరము, నయనం
జవాబు:
సి) శరీరం, దేహం

23. వనంలో దిరిగాము.
ఎ) జలధి, జలం
బి) వారి, వారిదం
సి) ధనము, దాపు
డి) అరణ్యం, విపినం
జవాబు:
డి) అరణ్యం, విపినం

ప్రకృతి – వికృతులు :

24. కరవు వల్ల కసవుకు లోటు వచ్చింది – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
ఎ) గ్రాసము
బి) ఘాసము
సి) గటిక
డి) కాసము
జవాబు:
బి) ఘాసము

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

25. రాజకుమారులు అడవికి వెళ్ళారు – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) కొమరులు
బి) క్రూరులు
సి) పుత్రులు
డి) పిల్లలు
జవాబు:
ఎ) కొమరులు

26. గోపబాలకులు పన్నిదము వేశారు – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
ఎ) ఫణిదం
బి) పనిదం
సి) పణితము
డి) పందెము
జవాబు:
సి) పణితము

27. ఆ యోగి మా గ్రామానికి రాలేదు – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) జ్యోగి
బి) రోగి
సి) సన్నాసి
డి) జోగి
జవాబు:
డి) జోగి

28. అప్సర నటించింది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) అచ్చర
బి) అమ్మర
సి) అక్కర
డి) అప్పర
జవాబు:
ఎ) అచ్చర

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

29. మృగాలు అటవిలో ఉంటాయి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) ఆడావి
బి) అరవి
సి) అడవి
డి) అరివె
జవాబు:
సి) అడవి

30. అతని రూపము బాగుంది. – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) రోపు
బి) రూపు
సి) రూపం
డి) రిపు
జవాబు:
బి) రూపు

31. భాగ్యం పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) బాయము
బి) బారము
సి) బరము
డి) బాగెము
జవాబు:
డి) బాగెము

వ్యతిరేక పదాలు :

32. దేవతలు వచ్చారు.
ఎ) రాక్షసులు
బి) కిన్నరులు
సి) సురలు
డి) గంధర్వులు
జవాబు:
ఎ) రాక్షసులు

33. చెట్టు అడ్డంగా పెరిగింది.
ఎ) మధ్యగ
బి) మధ్యము
సి) నిలువు
డి) మరియ
జవాబు:
సి) నిలువు

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

34. ఇహంలో స్థానం పొందాలి.
ఎ) పారం
బి) గతం
సి) పరం
డి) తానం
జవాబు:
సి) పరం

35. ముందు నడవాలి.
ఎ) మెల్లగా
బి) అడ్డుగా
సి) మందంగా
డి) వెనక
జవాబు:
డి) వెనక

36. రాకుమారులు చనుదురు.
ఎ) వెళ్తారు
బి) వత్తురు
సి) రారు
డి) పోవుదురు
జవాబు:
బి) వత్తురు

సంధులు :

37. వనజాక్షుడు వేణుగానం చేశాడు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) వన + జాక్షుడు
బి) వనజా + క్షుడు
సి) వనజ + అక్షుడు
డి) వనజం + అక్షుడు
జవాబు:
సి) వనజ + అక్షుడు

38. ‘నరేంద్రుడు‘ – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) అత్యసంధి
సి) వృద్ధి సంధి
డి) యణాదేశ సంధి
జవాబు:
ఎ) గుణసంధి

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

39. బొబ్బవెట్టి పిలిచాడు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) బొబ్బ + వెట్టి
బి) బొబ్బ + ఎట్టి
సి) బొబ్బ + పెట్టి
డి) బొబ్బా + పెట్టి
జవాబు:
సి) బొబ్బ + పెట్టి

40. ‘పరాగమింత’ ఉంది – దీనిని విడదీయండి.
ఎ) పరాగము + అంత
బి) పరాగం + అంత
సి) పరాగము + ఇంత
డి) పరాగ + అంత
జవాబు:
సి) పరాగము + ఇంత

41. క్రింద వానిలో నిత్యసంధి ఏది?
ఎ) ఉత్వసంధి
బి) త్రికసంధి
సి) అత్వసంధి
డి) టుగాగమసంధి
జవాబు:
ఎ) ఉత్వసంధి

42. ఐ, ఔ లను ఏమంటారు?
ఎ) గుణాలు
బి) యజ్ఞులు
సి) అనునాసికలు
డి) వృద్ధులు
జవాబు:
డి) వృద్ధులు

43. ‘తెచ్చియిచ్చు – ఇది ఏ సంధి?
ఎ) అత్వసంధి
బి) యడాగమసంధి
సి) ఇత్వసంధి
డి) త్రికసంధి
జవాబు:
బి) యడాగమసంధి

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

44. క్రింది వానిలో తెలుగు సంధి పదం గుర్తించండి.
ఎ) ప్రత్యయం
బి) గుణైక
సి) చల్లులాడ
డి) నరేంద్రుడు
జవాబు:
సి) చల్లులాడ

సమాసాలు :

45. రామకృష్ణులు’ అనే పదం ఏ సమాసమో గుర్తించండి.
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహువ్రీహి సమాసం
డి) అవ్యయీభావ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

46. ‘వనజాక్షుడు’ అనే సమాసానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) వనజములు, అక్షులు
బి) వనజముల వంటి అక్షులు గలవాడు
సి) వనం యొక్క అక్షుడు
డి) వనజము లాంటి కన్నులు
జవాబు:
బి) వనజముల వంటి అక్షులు గలవాడు

47. మతిహీనుడు – ఇది ఏ సమాసం?
ఎ) తృతీయా తత్పురుష
బి) బహువ్రీహి
సి) షష్ఠీ తత్పురుష
డి) ద్వంద్వము
జవాబు:
ఎ) తృతీయా తత్పురుష

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

48. అసత్యం పలుకరాదు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) ప్రతిసత్యం
బి) సత్యం సత్యం
సి) సత్యం కానిది
డి) అనుసత్యం
జవాబు:
సి) సత్యం కానిది

49. షష్ఠీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) నెలరాజు
బి) కావ్యనిధి
సి) చక్రపాణి
డి) నరేంద్రుడు
జవాబు:
డి) నరేంద్రుడు

50. లతికల యొక్క ఆవళి – దీనికి సమాస పదం గుర్తించండి.
ఎ) లతా వరస
బి) ప్రత్యావళి
సి) లతికావళి
డి) అనుతావళి
జవాబు:
సి) లతికావళి

51. ఉర్వీనాథుడు – దీనికి విగ్రహవాక్యం ఏది?
ఎ) ఉర్వి యందు నాథుడు
బి) ఉర్వి కొరకు నాథుడు
సి) ఉర్వికి నాథుడు
డి) ఉర్విని నాథుడు
జవాబు:
సి) ఉర్వికి నాథుడు

52. అన్యపదార్థ ప్రాధాన్యము గల సమాసం గుర్తించండి.
ఎ) బహువ్రీహి
బి) తత్పురుష
సి) ద్వంద్వము
డి) ద్విగువు
జవాబు:
ఎ) బహువ్రీహి

వాక్య ప్రయోగాలు :

53. బాలుడు ఆశ్రమం, చేరాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) బాలుడు ఆశ్రమం చేరలేదు
బి) బాలుడు ఆశ్రమం చేరకపోవచ్చు
సి) బాలుడు ఆశ్రమం చేరాలి
డి) బాలుడు ఆశ్రమం చేరలేకపోవచ్చు
జవాబు:
ఎ) బాలుడు ఆశ్రమం చేరలేదు

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

54. వృద్దుడు’ అందరిని ఆదుకున్నాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) వృద్దుడు అందరిని తప్పక ఆదుకోకూడదు
బి) వృద్దుడు ఆదుకోకూడదు
సి) వృద్ధుడు కొందరిని ఆదుకోలేదు
డి) వృద్దుడు అందరిని ఆదుకోలేదు
జవాబు:
డి) వృద్దుడు అందరిని ఆదుకోలేదు

55. అంతట బంధువులు కలరు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) అంతట బంధువులు ఉండాలి
బి) అంతట బంధువులు మాత్రమే ఉండకూడదు
సి) అంతట బంధువులు లేరు
డి) అంతట బంధువు లేకపోవచ్చు
జవాబు:
సి) అంతట బంధువులు లేరు

56. అన్నింటికి కారణం ఉంటుంది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) అన్నింటికి కారణం ఉండాలి
బి) అన్నింటికి కారణం ఉండకపోవచ్చు
సి) అన్నింటికి కారణం ఉండి తీరాలి
డి) అన్నింటికి కారణం ఉండదు
జవాబు:
డి) అన్నింటికి కారణం ఉండదు

57. మితిమీరిన ఆశ ఉండాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) మితిమీరిన ఆశ ఉండకూడదు
బి) మితిమీరిన ఆశ ఉండకపోవచ్చు
సి) మితిమీరిన ఆశ ఉండి తీరాలి
డి) మితిమీరిన ఆశ ఉండలేకపోవచ్చు
జవాబు:
ఎ) మితిమీరిన ఆశ ఉండకూడదు

58. సన్యాసి పండుకున్నాడు. సన్యాసి నిద్రపోలేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది?
ఎ) నిద్ర కోసం, సన్యాసి పండుకున్నాడు
బి) సన్యాసి నిద్ర కోసం పండుకున్నాడు
సి) సన్యాసి పండుకున్నాడుగాని నిద్రపోలేదు
డి) సన్యాసి పండుకున్నాడు నిద్రించాడు.
జవాబు:
సి) సన్యాసి పండుకున్నాడుగాని నిద్రపోలేదు

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

59. నాలో చురుకుదనం ఉంది. జిజ్ఞాస ఉంది – దీనికి సంయుక్త వాక్యం ఏది?
ఎ) నాలో చురుకుదనం, జిజ్ఞాస ఉన్నాయి
బి) నాలో చురుకుదనమే కాదు జిజ్ఞాస కూడా ఉంది
సి) నాలో జిజ్ఞాస వల్ల చురుకుదనం ఉంది
డి) నాలో చురుకుదనం వల్ల జిజ్ఞాస ఉంది
జవాబు:
ఎ) నాలో చురుకుదనం, జిజ్ఞాస ఉన్నాయి

60. ఆయన సత్యకాలం వాడు. పరమ సాత్వికుడు దీనికి సంయుక్త వాక్యం ఏది?
ఎ) ఆయన సత్యకాలం వాడు, పరమ సాత్వికుడు
బి) ఆయన సత్యకాలంలోనేవాడు కాదు సాత్వికుడు
సి) ఆయన సాత్వికత వల్ల సత్యకాలం వాడు
డి) పరమ సాత్వికుడు సత్యకాలం వాడు ఆయన
జవాబు:
ఎ) ఆయన సత్యకాలం వాడు, పరమ సాత్వికుడు

61. మీరు రావద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ధాత్వర్థక వాక్యం
బి) నిషేధార్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) నిషేధార్థక వాక్యం

62. రాము ఊరికి తప్పక వెళ్తాడు – ఇది ఏ రకమైన పురుష వాక్యం? (సి)
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) నిశ్చయార్థక వాక్యం
డి) వ్యతిరేకార్థక వాక్యం
జవాబు:
సి) నిశ్చయార్థక వాక్యం

63. రామం తప్పక వెళ్తాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) నిశ్చయార్థక వాక్యం
సి) తుమున్నర్థక వాక్యం
డి) ప్రార్థనార్థక వాక్యం
జవాబు:
బి) నిశ్చయార్థక వాక్యం

64. అతడు వస్తాడో ! రాడో ! – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) సందేహార్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) సందేహార్థక వాక్యం

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

65. వారందరికి ఏమైంది? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ప్రశ్నార్థక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) సందేహార్థక వాక్యం
జవాబు:
ఎ) ప్రశ్నార్థక వాక్యం

66. అగ్ని మండును – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) ప్రశ్నార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) తద్ధర్మార్థక వాక్యం

విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషలు

67. నేర్పుతో పని సాధించాలి – ఇది ఏ విభక్తి?
ఎ) తృతీయా విభక్తి
బి) సప్తమీ విభక్తి
సి) పంచమీ విభక్తి
డి) షష్ఠీ విభక్తి
జవాబు:
ఎ) తృతీయా విభక్తి

68. నదులలో నీరుంది – ఇది ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) ప్రథమా
బి) షష్ఠీ
సి) ద్వితీయా
డి) సప్తమీ
జవాబు:
బి) షష్ఠీ

69. అందరు గుడికి వెళ్ళారు – ఇది. భాషాభాగం?
ఎ) అవ్యయం
బి) క్రియ
సి) సర్వనామం
డి) క్రియ
జవాబు:
సి) సర్వనామం

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

70. పచ్చతోరణాలు ఇంటికి కట్టారు – ఇది ఏ భాషా భాగం?
ఎ) విశేషణం
బి) క్రియ
సి) అవ్యయం
డి) ధాతువు
జవాబు:
ఎ) విశేషణం

71. వాడు పెళ్ళికి వెళ్ళాడు – ఇది ఏ పురుష ప్రత్యయం?
ఎ) ప్రథమ పురుష
బి) మధ్యమ
సి) అధమ పురుష
డి) ఉత్తమ పురుష
జవాబు:
ఎ) ప్రథమ పురుష

72. నేను, మేము – ఇవి ఏ పురుష ప్రత్యయాలు?
ఎ) ప్రథమ పురుష
బి) ఉత్తమ పురుష
సి) మధ్యమ పురుష
డి) అధమ పురుష
జవాబు:
బి) ఉత్తమ పురుష

AP 7th Class Telugu Important Questions Chapter 16 బాల్య క్రీడలు

సొంతవాక్యాలు :
సూచన : క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.

73. ఒడిసి పట్టుకొను : నీటిలో మునుగుతున్న నా మిత్రుడి చొక్కాను ఒడిసిపట్టుకొని పైకి లాగాను.
74. బొబ్బపెట్టు : చీకట్లో మనిషిని చూసి దెయ్యం అనుకొని పెద్దగా బొబ్బ పెట్టాను.
75. మన్ననచేయు : మా గ్రామ సర్పంచి గారిని, మా గ్రామస్థులు అంతా బాగా మన్నన చేస్తారు.
76. కౌతుకము : మా మామయ్య పిల్లలతో కౌతుకముతో ఆడుతాను.
77. వన్య జంతువులు : వన్య జంతువులను మనం బాధించరాదు.
78. బాల్య క్రీడలు : పెద్దవారికి కూడా వారి బాల్య క్రీడలు గుర్తిస్తే ఉత్సాహం కలుగుతుంది.
79. ప్రావీణ్యం : కళాకారులు తమ కళలో ప్రావీణ్యం ప్రదర్శిస్తారు.
80. జలరాశి : జలరాశిలో నదులన్నీ కలిసి తీరుతాయి.
81. నరేంద్రుడు : నరేంద్రుడు రాజ్యాన్ని పాలించాడు.
82. పన్నిదములు : గోదావరి జిల్లాలో పన్నిదములు జరుగుతాయి.

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

These AP 7th Class Telugu Important Questions 11th Lesson సీత ఇష్టాలు will help students prepare well for the exams.

AP State Syllabus 7th Class Telugu 11th Lesson Important Questions and Answers సీత ఇష్టాలు

7th Class Telugu 11th Lesson సీత ఇష్టాలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ కింది పరిచిత గద్యాలను చదవండి నాలుగు ప్రశ్నలు తయారుచేయండి.

1. జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలకపాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతూంటే వారికి చెరో పక్కా ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని “కథకుడు” అనీ ఆయనకు రెండుపక్కలా నిలబడి గొంతు కలిపేవాళ్ళను “వంతలు” అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతుంది. రోజా, రాజు వంతలుగా వస్తున్నారు.
ప్రశ్నలు:
అ) జానపద కళల్లో ప్రాచుర్యం పొందిన కళ ఏది?
జవాబు:
జానపద కళల్లో ప్రాచుర్యం పొందిన కళ “బుర్రకథ”

ఆ) బుర్రకథను చెప్పేవారిని ఏమంటారు?
జవాబు:
బుర్రకథను చెప్పేవారిని కథకుడు అంటారు.

ఇ) తంబురా వాయించేది ఎవరు?
జవాబు:
కథకుడు తంబూరా వాయిస్తాడు.

ఈ) కథకునికి వంత పాడేవాళ్ళను ఏమంటారు?
జవాబు:
కథకునికి వంత పాడేవారిని “వంతలు” అంటారు.

2. శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా ఉన్న ఊళ్ళో పై చదువులకు అవకాశం లేకపోయినా పక్క టౌనుకు పోయి స్కూల్ చదువుతూ కాలేజీలో ఇంటరూ పూర్తిచేసి డిగ్రీలో చేరింది. ఏదో చదువుకొని, డబ్బులు సంపాదించి, తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత. తను బాగా చదువుకొని, తనలాంటి పిల్లలను బాగుపరచాలని, కలెక్టరుగానో, నాయకురాలుగానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నది. డిగ్రీ చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించి, మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది.
ప్రశ్నలు:
అ) సీత మనసులో చదువు బీజాలు నాటింది ఎవరు?
జవాబు:
శ్రావణి టీచర్ సీత మనసులో చదువు. బీజాలు నాటింది.

ఆ) పై చదువులకు సీత ఎక్కడికి వెళ్ళింది?
జవాబు:
సీత పై చదువులకు టౌనుకు వెళ్ళింది.

ఇ) సీత ఎంత వరకు చదువుకొంది?
జవాబు:
సీత డిగ్రీ వరకు చదువుకొంది.

ఈ) సీత ఏ అధికారిగా ఎంపికైంది?
జవాబు:
సీత “మండల అభివృద్ధి అధికారి”గా ఎంపిక అయ్యింది.

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

ఈ క్రింది అపరిచిత గద్యాలను చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. పరశురాముడు దుష్టులైన క్షత్రియులను చంపుటకు పుట్టినవాడు. అతని చేతిలో ఎందరో రాజులు మరణించారు. ఒక్క శ్రీరాముడు మాత్రమే అతనిని ఓడించాడు. అప్పటి నుండి యుద్దాలు మానేసి, మహేంద్రపర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటివాడు గంగ కోరిక పై భీష్మునికి యుద్ధవిద్యలు నేర్పాడు. భీష్ముడు పరశు రాముని శిష్యుడు కనుక గురువు ఆజ్ఞాపించిన కార్యమును శిరసావహించి తీరతాడని అంబ నమ్మింది. ఏదో విధంగా పరశురాముని అనుగ్రహం సంపాదించి, భీష్ముని సాధించవచ్చని ఊహించింది.
ప్రశ్నలు:
అ) గురు, శిష్యులెవరు?
జవాబు:
పరశురాముడు, భీష్ముడు.

ఆ) ఎవరి ఆజ్ఞను శిరసావహించాలి?
జవాబు:
గురువు యొక్క ఆజ్ఞను.

ఇ) రాజులు ఎందుకు మరణించారు?
జవాబు:
దుష్టత్వము వలన.

ఈ) పరశురాముని శ్రీరాముడు ఎందుకు ఓడించగలిగాడు?
జవాబు:
శ్రీరామునిలో దుష్టత్వము లేకపోవటం వలన.

2. ప్రపంచంలో మొట్టమొదట విడుదల చేయబడిన తపాళాబిళ్ళ అతికించే రకం కాదు. అది రెండు అణాల ఖరీదు కలిగిన కాపర్ టికెట్. ఈస్టిండియా కంపెనీ అధికారానికి లోబడిన వందమైళ్ళ లోపు చిరునామాకు దాని ద్వారా ఒక కవరును పంపవచ్చును. ఆ కవరును డాక్ రన్నర్ తీసుకువెడతాడు. ఈ కాపర్ టోకెన్ ప్రప్రథమంగా 1774 మార్చి 31వ తేదీన పాట్నాలో విడుదల చేయబడింది. 1852లో సింధు ప్రావిన్స్ కమిషనర్ సర్ బార్టిల్ ఫెర్ ఆసియాలో మొట్టమొదట తపాలాబిళ్ళను తీసుకువచ్చాడు. అందులో ఈస్టిండియా కంపెనీ ముద్ర ఉండేది. దానిని సింధు లోపల ఉత్తరాలు పంపడానికి ఉపయోగించేవారు. దీనిని సింధ్ డాక్ అనేవారు.
ప్రశ్నలు:
అ) డాక్ రన్నర్ అంటే ఎవరు?
జవాబు:
తపాలా బంట్రోతు

ఆ) సింధు ప్రావిన్స్ ఎవరి పరిపాలనలో ఉంది?
జవాబు:
ఈస్టిండియా కంపెనీ.

ఇ) అణా అంటే, ఎన్ని పైసలు?
జవాబు:
ఆరు పైసలు.

ఈ) సింధ్ డాక్ అంటే ఏమిటి?
జవాబు:
సింధు ప్రావిన్స్ లోని కాపర్ టికెట్.

3. అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాము. నిజానికి ఆహారధాన్యాల కొరత లేకపోయినా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ప్రజలు తిండి లేక చనిపోవటం దారుణసత్యం. దీనికి కారణాలు అనేకం. అందులో ఒకటి ఆహార పదార్థాలను వృథా చేయటం. మనం ఆహారాన్ని వృథా చేస్తున్నామంటే అది అందవలసిన వారికి అందకుండా అడ్డుపడుతున్నామన్నమాట. ఇలా వృథా అవుతున్న ఆహారంలో సగానికి సగం మామూలుగా పిల్లలు తినే కంచాలలోనే వృథా అవుతున్నది. తల్లిదండ్రులే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. పిల్లలు ఇష్టపడే ఆరోగ్యకరమైన, పుష్టికరమైన ఆహారాన్ని వారికి ఇవ్వాలి. వారు దాన్ని వృథా చేయకుండా తినేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత.
ప్రశ్నలు:
అ) పిల్లల పట్ల ఎవరు బాధ్యతగా ఉండాలి?
జవాబు:
తల్లిదండ్రులు..

ఆ) ప్రపంచ ఆహారదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం?
జవాబు:
కొంతమంది ఆహారాన్ని వృథా చేయడం వలన.

ఇ) సరిపడ ఆహారమున్నా కొందరికి ఎందుకు తిండిలేదు?
జవాబు:
అక్టోబరు 16వ తేదీ.

ఈ) మనం వృథా చేసేవాటిలో ఇంకొకటి ఏమిటి?
జవాబు:
నీరు.

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

4. పురాతనమైన ఏడు ప్రపంచ అద్భుతాలలో ప్రధానమైనవి ఈజిప్టులోని పిరమిడ్లు. మిగిలిన ఆరు అద్భుతాలు కాలగర్భంలో కలిసిపోయాయి. లేదా శిథిలావస్థను చేరుకున్నాయి. విలక్షణమయిన ఆకారంతో భూమ్యాకర్షణ శక్తికి తట్టుకుని నిలబడడం వలన పిరమిడ్లు ఈనాటి నిలిచి ఉన్నాయి. పిరమిడ్ ఆకారంలో ఇళ్ళు నిర్మించడానికి ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించలేదు. అయినా కలపతో, గాజుతో చేసిన పిరమిడ్ ప్రతిరూపాలు ఫ్యూరియోలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. భవిష్యత్ లో సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటీ క్విటీస్ ఆఫ్ ఈజిప్ట్ సంస్థ అనుమతి పొందకుండా వీటి రెప్లికాలు తయారుచేయడానికి వీలుకాదు.
ప్రశ్నలు :
అ) ప్రపంచంలోని వింతలెన్ని?
జవాబు:
ఏడు

ఆ) కాలగర్భంలో కలిసిపోవడమంటే ఏమిటి?
జవాబు:
నశించిపోవడం

ఇ) “శిథిలావస్థ” దీనిలో ఏ సంధి ఉంది?
జవాబు:
సవర్ణదీర్ఘ సంధి

ఈ) ఎవరి అనుమతితో పిరమిడ్ ఆకారం తయారుచేయాలి?
జవాబు:
సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటీ క్వీటీస్ ఆఫ్ ఈజిప్టు

5. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

బాలమురళీకృష్ణగారు 1930 జూలై 6వ తేదీన తూర్పుగోదావరిలోని శంకరగుప్తంలో పుట్టారు. అమ్మ సూర్యకాంతమ్మ, వీణా కళాకారిణి. నాన్న పట్టాభిరామయ్య, వయోలిన్ ఉపాధ్యాయులు. బాలమురళీకృష్ణగారు కర్నాటక సంగీత విద్వాంసుడి గానే కాక వాగ్గేయకారుడిగా బోలెడంత పేరు సంపాదించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి జాతీయ పురస్కారాలు పొందారు.
ప్రశ్నలు:
1. బాలమురళీకృష్ణగారు ఎప్పుడు జన్మించారు?
జవాబు:
6.7.1930.

2. పట్టాభిరామయ్యగారు ఏం చేసేవారు?
జవాబు:
వయోలిన్ ఉపాధ్యాయులు.

3. బాలమురళీకృష్ణగారు పొందిన జాతీయ పురస్కారాలు ఏవి?
జవాబు:
పద్మశ్రీ, పద్మభూషణ్

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
బాలమురళీకృష్ణ గారి తల్లి పేరేమి?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

1. పాఠంలోని 84 పేజీలోని చిత్రం చూడండి. వాళ్ళమధ్య సంభాషణలు ఊహించి చెప్పండి.
జవాబు:
శ్రావణి అనే ఉపాధ్యాయురాలు శివయ్య దంపతుల ఇంటికి వచ్చింది. శ్రావణి శివయ్య దంపతులతో సీతమ్మను బడి మాన్పించవద్దని, సీతమ్మ తెలివైన పిల్ల అని, సీతమ్మ చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించి శివయ్య కుటుంబానికి సాయం చేస్తుందని చెప్పి ఉంటుంది.

శివయ్య తాను బీదవాడిననీ, తానూ, భార్య పనిలోకి వెళ్ళి సంపాదించకపోతే తన సంసారం గడవదనీ, సీత బడికి రావడం కుదరదనీ, ఇంటి వద్ద తమ్ముడిని చూసుకోవాలని చెప్పి ఉంటాడు.

అప్పుడు సీత చదువుకుంటే ఆమెకు మధ్యాహ్నం భోజనం స్కూలులో పెడతారనీ, స్కాలర్ షిప్ కూడా ఇస్తారనీ, చదువుకున్న స్త్రీలు సాధించిన విజయాలను గురించి శివయ్య దంపతులకు చెప్పి సీతను బడికి పంపడానికి వారిని ఒప్పించి ఉంటుంది.

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

2. “సీత ఇష్టాలు” బుర్రకథ చదువుకున్నారు కదా ! అలాగే మీరు చూసిన ఏదైనా కళారూపాన్ని గురించి వివరించండి.
జవాబు:
నాకు నచ్చిన కళారూపం కోలాటం. ఇది భజన సంప్రదాయానికి చెందిన జానపద కళారూపం. కోల అంటే కర్ర. కర్రలతో ఆడుతూ చేసే భజన కోలాటం. కోలాటం ఒక బృంద నృత్యం. కళాకారుల చేతిలో కోలాటం కర్రలు పట్టుకొని నిల్చుంటారు. వారి మధ్యలో జట్టు నాయకుడు ఈలవేస్తూ ఏ పదానికి ఏ నాట్యం చెయ్యాలో, ఏ దరువుకు ఎలా స్పందించాలో చెబుతూ ప్రదర్శన, నడిపిస్తాడు. కళాకారులు ఒకరికొకరు కర్రలు తాకిస్తూ లయబద్దంగా వాయిస్తూ పాడుతూ, గుండ్రంగా తిరుగుతూ అడుగులు వేస్తారు. ఎంత వేగంగా చిందులేస్తున్నా చేతిలో కర్రలు శ్రు తి తప్పకుండా వాయిస్తారు. జట్టు నాయకుణ్ణి కోలన్న పంతులు, మేళగాడు అంటారు. జట్టు నాయకుడు నిలిచే ప్రదేశాన్ని ‘గరిడీ’ అంటారు. కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ‘కోపు’ అంటారు. దీనిలో కృష్ణకోపు, లాలికోపు, బసవకోపు మొదలైన ప్రక్రియలుంటాయి. తూర్పుగోదావరి జిల్లా వెల్ల గ్రామానికి చెందిన వేంకట రమణ ప్రముఖ కోలాట విద్వాంసుడు.

3. సోదరి వివాహం సందర్భంగా వారం రోజులు సెలవు కోరుతూ మీ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి లేఖ రాయండి.
జవాబు:

ప్రధానోపాధ్యాయునికి లేఖ

చెరుకూరు,
xxxx

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
xxxxx

ఆర్యా !

నేను మీ పాఠశాల నందు 7వ తరగతి చదువుతున్నాను. ఈ నెల x x తారీఖున మా అక్కయ్య వివాహం. కనుక నాకు వారం రోజులు. (x x x x నుండి x x x x వరకు) సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను.

ఇట్లు,
మీ విధేయుడు / రాలు
xxxxx.

7th Class Telugu 11th Lesson సీత ఇష్టాలు 1 Mark Bits

1. గోపి నిజాయితీపరుడు, తెలివైనవాడు (ఇది ఏ రకమైనవాక్యం)
ఎ) సామాన్యవాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సంయుక్తవాక్యం
డి) అసామాన్యవాక్యం
జవాబు:
సి) సంయుక్తవాక్యం

2. చాలా సేపు టి.వి చూడొద్దు (ఏ వాక్యమో గుర్తించండి)
ఎ) నిషేదార్థక
బి) ఆశ్చర్యార్థక
సి) విధ్యర్థక
డి) హేత్వర్థక
జవాబు:
ఎ) నిషేదార్థక

3. కింది వాటిలో ఆశ్చర్యార్థక వాక్యాన్ని గుర్తించండి.
ఎ) ఆహా ! ఎంత బాగుందో !
బి) నీ పేరేమిటి?
సి) అన్నం తిను
డి) తరగతిలో మాట్లాడరాదు
జవాబు:
ఎ) ఆహా ! ఎంత బాగుందో !

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

4. రవి పాఠం చదివి నిద్రపోయాడు. (ఏ రకపు వాక్యమో గుర్తించండి)
ఎ) సంయుక్త వాక్యం
బి) అప్యర్థకం
సి) సంక్లిష్ట వాక్యం
డి) ప్రార్ధనార్ధకం
జవాబు:
సి) సంక్లిష్ట వాక్యం

5. కింది వాక్యాల్లో అనుమత్యర్థక వాక్యాన్ని గుర్తించండి.
ఎ) రసాభాస చేయకండి
బి) నీవు ఇంటికి వెళ్లవచ్చు
సి) అక్క చెప్పేది విను
డి) నిండు నూరేళ్లు వర్థిల్లు
జవాబు:
బి) నీవు ఇంటికి వెళ్లవచ్చు

6. కింది వాటిలో సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి.
ఎ) సెలవు ఇవ్వండి ?
బి) పరీక్షలు రాయవచ్చు !
సి) ఎవరా పసిడి బొమ్మ?
డి) తిన్న వెంటనే చదువుకో !
జవాబు:
సి) ఎవరా పసిడి బొమ్మ?

III. భాషాంశాలు

పదాలు – అర్థాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థం గుర్తించండి.

7. రామయ్యగారు కథలను అలవోకగా రాస్తారు.
ఎ) చక్కగా
బి) బాగుగా
సి) స్వేచ్ఛగా
డి) తేలికగా
జవాబు:
సి) స్వేచ్ఛగా

8. నేను వేసిన తారాజువ్వ అంతరిక్షాన్ని తాకింది.
ఎ) నేలను
బి) ఆకాశాన్ని
సి) సముద్రాన్ని
డి) రాకెట్ ను
జవాబు:
బి) ఆకాశాన్ని

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

9. జా చైతన్యంలో బుర్రకథ కీలకపాత్ర వహించింది.
ఎ) ప్రధాన పాత్ర
బి) రహస్య పాత్ర
సి) విశేష పాత్ర
డి) చిన్నపాత్ర
జవాబు:
ఎ) ప్రధాన పాత్ర

10. పైడితో ఆభరణాలు చేస్తారు.
ఎ) ఇనుము
బి) బంగారం
సి) అభ్రకం
డి) వెండి
జవాబు:
బి) బంగారం

11. దంపతులు గుడికి వెళ్ళారు.
ఎ) అక్కాచెల్లెళ్ళు
బి) మామా అల్లుళ్ళు
సి) భార్యాభర్తలు
డి) అన్నదమ్ములు
జవాబు:
సి) భార్యాభర్తలు

12. భూమిలో బీజం నాటాలి.
ఎ) శాఖ
బి) పత్రం
సి) ఫలం
డి) విత్తనం
జవాబు:
డి) విత్తనం

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

13. సంగతి అందరికి తెలుసు.
ఎ) విషయం
బి) విరామం
సి) విచిత్రం
డి) సంపద
జవాబు:
ఎ) విషయం

14. భారత సమరం అద్భుతం.
ఎ) పొందు
బి) యుద్ధం
సి) వారి
డి) జలం
జవాబు:
బి) యుద్ధం

పర్యాయపదాలు :

15. ‘భారతమాతకు జయము – సరస్వతి తల్లిని చల్లగా చూడు’ – ఈ వాక్యాలలో సమానార్ధక పదాలు గుర్తించండి.
ఎ) భారత, మాత
బి) మాత, తల్లి
సి) మాత, సరస్వతి
డి) జయము, చూడు
జవాబు:
బి) మాత, తల్లి

16. ‘మహిళలకు మంగళం – స్త్రీలకు మేలు చేయండి’ – ఈ వాక్యాల్లో సమానార్థక పదాలు గుర్తించండి.
ఎ) మంగళం, మేలు
బి) మహిళలు, స్త్రీలు
సి) స్త్రీలు, మంగళం
డి) మేలు, స్త్రీలు
జవాబు:
బి) మహిళలు, స్త్రీలు

17. పాత గాథలు అయ్యాయి. కొత్త కథలు చెబుదాం – 2 ఈ వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించండి.
ఎ) పాత, కొత్త
బి) గాథలు, కథలు
సి) అయ్యాయి,
డి) గాథలు, కొత్తవి
జవాబు:
బి) గాథలు, కథలు

18. అందరికి మేలు జరగాలి – పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) హితం, సన్నిహితం
బి) మంచి, శుభం
సి) పుత్తడి, పురోగామి
డి) మంచి, కీడు
జవాబు:
బి) మంచి, శుభం

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

19. పైడితో ఆభరణం చేయించారు – పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) తొలి, పదిల
బి) కనకం, కారు
సి) బంగారం, పుత్తడి
డి) రజతం, కాంస్యం
జవాబు:
సి) బంగారం, పుత్తడి

20. దంపతులు వచ్చారు – పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నవదంపతులు, అక్కాచెల్లెళ్ళు
బి) భార్యాభర్తలు, శివపార్వతులు
సి) నలుదిశలు, ఆలుమగలు
డి) భార్యాభర్తలు, ఆలుమగలు
జవాబు:
డి) భార్యాభర్తలు, ఆలుమగలు

21. అందరికి మేలు కలగాలి – పర్యాయపదాలను గుర్తించండి.
ఎ) కళ్యాణం, కనికరం
బి) పసిడి, పాపం
సి) తమకం, తామరసం
డి) మంచి, శుభం
జవాబు:
డి) మంచి, శుభం

22. రాజు రాజ్యం పాలించాడు – పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సచివుడు, సామరం
బి) నృపతి, పృథ్వీపతి
సి) రంజితం, రంగం
డి) నటన, బరము
జవాబు:
బి) నృపతి, పృథ్వీపతి

ప్రకృతి – వికృతులు :

23. మా ఇంట్లో దీపము వెలిగించారు – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) దీపం
బి) దివ్వె
సి) వెలుగు
డి) దివ్యము
జవాబు:
బి) దివ్వె

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

24. ఇటు చూడరా సన్నాసి – గీత గీసిన పదానికి, ప్రకృతిని గుర్తించండి.
ఎ) యతి
బి) సన్యాసి
సి) పరివ్రాజకుడు
డి) ముని
జవాబు:
బి) సన్యాసి

25. శాస్త్ర విజ్ఞానము లేనిదే దేశ ప్రగతి సాగదు – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) విజ్ఞత
బి) విద్య
సి) పాండిత్యము
డి) విన్నాణము
జవాబు:
డి) విన్నాణము

26. ఈ బొమ్మ చాలా బాగుంది – గీత గీసిన పదానికిప్రకృతిని గుర్తించండి.
ఎ) బామ్మ
బి) బ్రహ్మ
సి) బమ్మా
డి) బొరుసు
జవాబు:
బి) బ్రహ్మ

27. పుణ్యం పొందాలి – వికృతి పదం గుర్తించండి.
ఎ) పునుము
బి) పున్నెం
సి) పనుము
డి) పునిము
జవాబు:
బి) పున్నెం

28. అక్షరం నేర్వాలి – వికృతి పదం గుర్తించండి.
ఎ) అప్పరం
బి) అచ్చరం
సి) అచ్ఛరం
డి) అక్కరం
జవాబు:
డి) అక్కరం

29. విన్నాణము పొందాలి – ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) విజ్ఞానం
బి) విద్యానం
సి) విన్నేనం
డి) విన్యకం
జవాబు:
ఎ) విజ్ఞానం

30. శాస్త్రం చదవాలి – వికృతి పదం గుర్తించండి.
ఎ) శాసము
బి) శాసనం
సి) సస్త్రము
డి) చట్టం
జవాబు:
డి) చట్టం

31. అందరు ప్రయాణం చేయాలి – వికృతి పదం గుర్తించండి.
ఎ) ఎయణం
బి) పయనం
సి) పాయణం
డి) పాయనం
జవాబు:
బి) పయనం

32. సిరి పొందాలి – ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) స్త్రీ
బి) సీరి
సి) శ్రీ
డి) శిరి
జవాబు:
సి) శ్రీ

వ్యతిరేక పదాలు :
సూచన : క్రింది గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలను రాయండి.

33. కొత్త నీకు వచ్చింది.
ఎ) నవీనం
బి) పాత
సి) ఆధునిక
డి) చెడు
జవాబు:
బి) పాత

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

34. రామాయణం మనకు తొలికావ్యం.
ఎ) మలి
బి) మధ్యమ
సి) అంతిమ
డి) కడలి
జవాబు:
ఎ) మలి

35. శ్రీరాముడు ఉత్తముడు.
ఎ) నిపుణుడు
బి) మధ్యముడు
సి) అధముడు
డి) చిలుడు
జవాబు:
సి) అధముడు

36. మనం శత్రువులకు సహితం కీడు తలపెట్టరాదు – గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
ఎ) హాని
బి) చెడు
సి) మేలు
డి) ధర్మం
జవాబు:
సి) మేలు

37. సీత ఇష్టాలు తెలుసుకోవాలి – గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
ఎ) కష్టాలు
బి) అనిష్టాలు
సి) ఇష్టం లేనివి
డి) అస్పష్టాలు
జవాబు:
బి) అనిష్టాలు

38. బుద్ధిమంతులకు తప్పక జయము కల్గుతుంది – గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
ఎ) అజయము
బి) విజయము
సి) అపజయము
డి) అభ్యుదయము
జవాబు:
సి) అపజయము

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

39. అబద్ధాలు చెప్పడం మహాపాపము – గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
ఎ) పాపరహితం
బి) పుణ్యము
సి) అపాపము
డి) ధర్మసహితం
జవాబు:
బి) పుణ్యము

40. దేశం ముందుకు వెళ్ళాలి.
ఎ) అగాధం
బి) వెనుక
సి) మధ్య
డి) అంతరాళం
జవాబు:
బి) వెనుక

41. ప్రజలు సుఖం పొందాలి.
ఎ) మంచి
బి) ఆనందం
సి) వినోదం
డి) దుఃఖం
జవాబు:
డి) దుఃఖం

42. రాముడు బలంగా ఉన్నాడు.
ఎ) సబలం
బి) విబలం
సి) ప్రతిబలం
డి) దుర్బలం
జవాబు:
డి) దుర్బలం

సంధులు :

43. పల్లెటూరు అందాలు మంచి మజాగా ఉంటాయి – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) పల్లె + టూరు
బి) పల్లెటు + ఊరు
సి) పల్లె + ఊరు
డి) పల్లెటూ + రు
జవాబు:
సి) పల్లె + ఊరు

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

44. ప్రధానోపాధ్యాయుడు సీతన్నగారు వచ్చారు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) ప్రధాన + ఉపాధ్యాయుడు
బి) ప్రధాన + వుపాధ్యాయుడు
సి) ప్రధానోప + అధ్యాయుడు
డి) ప్రధాన + ఊపాధ్యాయుడు
జవాబు:
ఎ) ప్రధాన + ఉపాధ్యాయుడు

45. చిన్నక్క బడికి వెళ్ళింది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) ఇత్వసంధి
బి) అత్వసంధి
సి) ఆమ్రేడితసంధి
డి) ద్విరుక్తటకారసంధి
జవాబు:
బి) అత్వసంధి

46. ‘నాయకురాలు‘ చెప్పింది – గీత గీసిన పదం ఏ సంధి ?
ఎ) టుగాగమసంధి
బి) అత్వసంధి
సి) రుగాగమసంధి
డి) ద్విరుక్తటకారసంధి
జవాబు:
సి) రుగాగమసంధి

47. అంతా రసాభాస అయ్యింది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) వృద్ధి సంధి
సి) సవర్ణదీర్ఘసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) సవర్ణదీర్ఘసంధి

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

48. అభ్యున్నతి సాధించాలి – దీనికి విడదీయడం గుర్తించండి.
ఎ) అభై + ఉన్నతి
బి) అభి + ఉన్నతి
సి) అభా + యున్నతి
డి) అభ + ఉన్నతి
జవాబు:
బి) అభి + ఉన్నతి

49. ఈడున్న పిల్ల వచ్చింది – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) అత్వసంధి
సి) యడాగమసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
డి) ఉత్వసంధి

50. క్రింది వానిలో అత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) విద్యాలయం
బి) మాటలన్ని
సి) మీరిక్కడ
డి) సీతమ్మ
జవాబు:
డి) సీతమ్మ

51. గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) గుణైక
బి) దినోత్సవం
సి) సురైక
డి) దినావారం
జవాబు:
బి) దినోత్సవం

52. క్రింది వానిలో తెలుగు సంధి రూపం గుర్తించండి.
ఎ) చక్కనమ్మ
బి) సురేంద్రుడు
సి) రామాయణం
డి) కుష్ఠిక
జవాబు:
ఎ) చక్కనమ్మ

సమాసాలు :

53. ‘లవకుశులు‘ – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) అవ్యయీభావ సమాసం
డి) బహుహ్రీహి సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

54. ‘నాలుగు రాళ్ళు‘ – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహువ్రీహి
డి) కర్మధారయ సమాసం
జవాబు:
ఎ) ద్విగు సమాసం

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

55. మనం పుణ్యఫలం పొందాలి – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) పుణ్యమందు ఫలం
బి) పుణ్యము యొక్క ఫలం
సి) పుణ్యం కొరకు ఫలం
డి) పుణ్యతతో, ఫలం
జవాబు:
బి) పుణ్యము యొక్క ఫలం

56. క్రింది వానిలో ద్వంద్వ సమాసమునకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) నెలరాజు
బి) చతుర్ముఖుడు
సి) తల్లిదండ్రులు
డి) నాలుగు వేదాలు
జవాబు:
సి) తల్లిదండ్రులు

57. స్వరాజ్య సమరం సాగించాలి – ఇది ఏ సమాసం?
ఎ) సప్తమీ తత్పురుష
బి) ద్వితీయా తత్పురుష
సి) తృతీయా తత్పురుష
డి) చతుర్డీ తత్పురుష
జవాబు:
డి) చతుర్డీ తత్పురుష

58. నాలుగు రాళ్ళు సంపాదించాలి – దీనికి విగ్రహ వాక్యం గుర్తించండి.
ఎ) నాలుగు కొరకు రాళ్ళు
బి) నాలుగుసు రాళ్ళు
సి) నాలుగు సంఖ్యగల రాళ్ళు
డి) నాలుగులా రాళ్ళు
జవాబు:
సి) నాలుగు సంఖ్యగల రాళ్ళు

59. శత్రువు యొక్క నాశనం జరగాలి – సమాస పదం గుర్తించండి.
ఎ) శత్రపలాయనం
బి) నాశన శత్రు
సి) శాత్ర నాశనం
డి) శత్రు నాశనం
జవాబు:
డి) శత్రు నాశనం

60. మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) షష్ఠీ తత్పురుష
బి) ప్రథమా తత్పురుష
సి) బహుజొహి
డి) కర్మధారయం
జవాబు:
ఎ) షష్ఠీ తత్పురుష

వాక్య ప్రయోగాలు :

61. ‘అల్లరి చేయవద్దు’ – ఇది ఏ రకం వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) నిషేధార్థక వాక్యం
సి) ప్రార్థనార్థక వాక్యం
డి) సామర్థ్యార్థక వాక్యం
జవాబు:
బి) నిషేధార్థక వాక్యం

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

62. మానవులు ప్రకృతిని ఆస్వాదించాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) మానవులు ప్రకృతిని ఆస్వాదించకూర
బి) మానవులు ప్రకృతిని ఆస్వాదింపకపోవచ్చు
సి) మానవులు ప్రకృతిని తప్పక ఆస్వాదించాలి
డి) మానవులు ప్రకృతిని తక్కువగా ఆస్వాదించాలి
జవాబు:
ఎ) మానవులు ప్రకృతిని ఆస్వాదించకూర

63. చంద్రుడు క్రమంగా పెరుగుతున్నాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
ఎ) చంద్రుడు మాత్రమే పెరుగకూడదు
బి) చంద్రుడు క్రమంగా పెరగడం లేదు
సి) చంద్రుడు క్రమంగా పెరుగకూడదు
డి) చంద్రుడు కొంత పెరుగకూడదు
జవాబు:
బి) చంద్రుడు క్రమంగా పెరగడం లేదు

64. వర్షాలు వచ్చాయి. చెరువులు నిండలేదు – దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి.
ఎ) వర్షాలు రాకపోవడంతో చెరువులు నిండలేదు
బి) వర్షాలు వస్తేనేగాని చెరువులు నిండవు
సి) వర్షాలు వచ్చాయి కాని చెరువులు నిండలేదు
డి) వర్షాలు రావడంతో చెరువులు నిండలేదు
జవాబు:
సి) వర్షాలు వచ్చాయి కాని చెరువులు నిండలేదు

65. కృష్ణుడు కూర్చున్నాడు. త్రాసు లేవలేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది?
ఎ) కృష్ణుడు కూర్చున్నాడు గాని త్రాసు లేవలేదు
బి) కృష్ణుడు కూర్చున్నందువల్ల త్రాసు లేవలేదు
సి) త్రాసు, కృష్ణుడు పైకి లేవలేదు
డి) త్రాసు లేవలేదు, కృష్ణుడు లేవలేదు
జవాబు:
ఎ) కృష్ణుడు కూర్చున్నాడు గాని త్రాసు లేవలేదు

66. చంద్రుడు మిమ్ములను దీవించుగాక – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) ధాత్వర్థక వాక్యం
సి) ఆశీర్వార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
సి) ఆశీర్వార్థక వాక్యం

67. రవి చక్కగా పాడగలడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అప్యర్థక వాక్యం
బి) సామర్థ్యార్థక వాక్యం
సి) హేత్వర్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
బి) సామర్థ్యార్థక వాక్యం

62. నన్ను అనుగ్రహించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థ వాక్యం
బి) సామర్థార్థక వాక్యం
సి) ప్రార్థనార్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
సి) ప్రార్థనార్థక వాక్యం

68. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అప్యర్థక వాక్యం
బి) ఆశీర్వార్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
డి) హేత్వర్థక వాక్యం

69. ‘సీత అన్నం తిని బడికి వెళ్ళింది’ – ఇది ఏ రకం వాక్యం?
ఎ) సామాన్యవాక్యం
బి) సంయుక్తవాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) మహావాక్యం
జవాబు:
సి) సంక్లిష్ట వాక్యం

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

70. ‘సీత అన్నం తిన్నది కాని బడికి వెళ్ళలేదు’ – ఇది ఏ రకం వాక్యం?
ఎ) ప్రశ్నార్థక వాక్యం
బి) సందేహార్థక వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) సామార్థ్యార్థక వాక్యం
జవాబు:
డి) సామార్థ్యార్థక వాక్యం

విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషులు :

71. బుర్రకథను అందరు వినాలి – ఇది ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) సప్తమీ విభక్తి
బి) షష్ఠీ విభక్తి .
సి) చతుర్థి విభక్తి
డి) ద్వితీయా విభక్తి
జవాబు:
డి) ద్వితీయా విభక్తి

72. పెద్దలు పనికి వెళ్ళాలి – ఇది ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) ప్రథమా విభక్తి
బి) సప్తమీ విభక్తి
సి) ద్వితీయా విభక్తి
డి) షష్ఠీ విభక్తి
జవాబు:
డి) షష్ఠీ విభక్తి

73. నామవాచకానికి బదులుగా వాడే భాషాభాగం గుర్తించండి.
ఎ) ప్రత్యయం
బి) నామవాచకం
సి) సర్వనామం
డి) క్రియ
జవాబు:
సి) సర్వనామం

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

74. తందనా ! భళా ! తందనా నీ – ఇది ఏ భాషాభాగం?
ఎ) క్రియ
బి) నామవాచకం
సి) సర్వనామం
డి) అవ్యయం
జవాబు:
డి) అవ్యయం

75. క్రింది వానికి మధ్యమ పురుష ప్రత్యయం గుర్తించండి.
ఎ) వాడు
బి) నీవు
సి) నేను
డి) మేము
జవాబు:
బి) నీవు

76. మీరు బడికి వెళ్ళారు – ఇది ఏ పురుష ప్రత్యయం?
ఎ) ఉత్తమ పురుష
బి) మధ్యమ పురుష
సి) ప్రథమ పురుష
డి) అధమ పురుష
జవాబు:
బి) మధ్యమ పురుష

AP 7th Class Telugu Important Questions Chapter 11 సీత ఇష్టాలు

సొంతవాక్యాలు :
సూచన : క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.

77. మేలు : విద్యార్థులు ఇతరుల మేలు చూడాలి.
78. బీజం : స్నేహితుల మధ్య కొందరు విషబీజం నాటుతారు.
79. సంగ్రామం : కౌరవ పాండవుల సంగ్రామం భారతంలో ఉంది.
80. దంపతులు : సీతారాములు ఆదర్శ దంపతులు.
81. అలవోకగా : మా చెల్లెలు అలవోకగా త్యాగరాజ కీర్తనలు పాడుతుంది.
82. కీలక పాత్ర : మా సంసారమును నడిపించడంలో మా అమ్మగారు కీలక పాత్ర వహించారు.
83. కలకలలాడు : పెళ్ళి పెద్దలతో మా ఇల్లు కలకల లాడుతోంది.

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

These AP 6th Class Telugu Important Questions 4th Lesson సమయస్ఫూర్తి will help students prepare well for the exams.

AP State Syllabus 6th Class Telugu 4th Lesson Important Questions and Answers సమయస్ఫూర్తి

6th Class Telugu 4th Lesson సమయస్ఫూర్తి Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు

1. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పంచవటం (ఐదు చెట్ల సమూహం) అనే ప్రాంతంలోని ఒక మర్రిచెట్టు తొర్రలో “రోమశుడు” అనే పిల్లి నివసిస్తోంది. ఆ చెట్టు క్రింది కన్నంలో “పలితుడు” అనే ఎలుక కాపురముంటోంది. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి, ఆ చెట్టు చుట్టూ వల పన్నాడు.

అది తెలియని రోమశుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఇది చూసిన పలితుడు “ఆహా ! ఎంత అదృష్టము. నా శత్రువు వలలో చిక్కుకున్నాడు. ఈ నాటితో వాడి పీడ…” అనుకున్నాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) మర్రిచెట్టు ఏ ప్రాంతంలో ఉంది?
జవాబు:
మర్రి చెట్టు పంచవటం అనే ప్రాంతంలో ఉంది.

ఆ) పిల్లి ఎక్కడ నివసిస్తోంది?
జవాబు:
పిల్లి మర్రి చెట్టు తొర్రలో నివసిస్తోంది.

ఇ) రాత్రి వేటగాడు వచ్చి ఏమి చేశాడు?
జవాబు:
రాత్రి వేటగాడు వచ్చి చెట్టు చుట్టూ వలపన్నాడు.

ఈ) రోమశుడు ఎలా వలలో చిక్కుకున్నాడు?
జవాబు:
రోమశుడు వల విషయం తెలియక తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారన్వేషణకు బయలుదేరి వలలో చిక్కుకున్నాడు.

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

2. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఇదే సమయంలో “చంద్రకుడు” అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది. చంద్రకుని చూసి పలితుని గుండె గుభేలుమంది. అయిపోయింది నాపని అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. “ఏం చెయ్యనురా దేవుడా” అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకనే కాబోలు “ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది” అని మనసులో బాధపడ్డాడు. ‘ఐనా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యమొందుతారు కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు’ అని ధైర్యం తెచ్చుకున్నాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరిని చూచి ఎలుక భయపడింది?
జవాబు:
చంద్రకుని (గుడ్లగూబ) చూచి ఎలుక భయపడింది.

ఆ) పలితుడు ఎందుకు చంకలు కొట్టుకున్నాడు?
జవాబు:
తన శత్రువు పిల్లి వలలో చిక్కిందని చూచి పలితుడు చంకలు కొట్టుకున్నాడు.

ఇ) పలితుడు ఎందుకు గజగజలాడాడు?
జవాబు:
పలితుడు చంద్రకుని చూచి ప్రాణభయంతో గజగజలాడాడు.

ఈ) పలితుడు ఏమనుకొని ధైర్యం తెచ్చుకున్నాడు?
జవాబు:
‘బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండాలి గాని ప్రాణం పోతుందని ఏడవరు’ అంటూ ధైర్యం తెచ్చుకున్నాడు.

3. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి, తన పథకం పారదని నిరాశతో తన దారిన తాను పోయాడు. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేటకుక్కలతో వస్తున్నాడు. అది చూసిన రోమశుడు “మిత్రమా ! పలితుడా ! ఆ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు. నన్ను తొందరగా రక్షించు” అన్నాడు. పలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ, వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుటుక్కున వల కొరికి, రోమశుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరుగెత్తాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) చంద్రకుడు ఎందుకు నిరాశపడ్డాడు?
జవాబు:
పిల్లి, ఎలుక స్నేహంగా మాట్లాడుకోవడం చూచి చంద్రకుడు వారి మైత్రికి భయపడ్డాడు. తన పథకం పారదని నిరాశపడ్డాడు.

ఆ) వేటగాడు ఎలా వచ్చాడు?
జవాబు:
వేటగాడు పిల్లికోసం వేటకుక్కలతో వచ్చాడు.

ఇ) కిరాతుని చూచి పిల్లి ఎలుకతో ఏమన్నది?
జవాబు:
కిరాతుని చూచి పిల్లి ఎలుకతో ‘కిరాతుడు కాల యముని వలె వస్తున్నాడు. నన్ను తొందరగా రక్షించు” అన్నది.

ఈ) ఎలుక వలను ఎప్పుడు కొరికింది?
జవాబు:
ఎలుక వేటగాడు దగ్గరకు వచ్చినప్పుడు వలను కొరికింది.

అపరిచిత గద్యాలు

1. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

మహిళలకు ఓటుహక్కు కల్పించిన మొదటిదేశం న్యూజిలాండ్ (1893). బ్రిటిష్ ఇండియాలో మహిళలు 1894 సాధారణ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 14,505 మంది మహిళలు మాత్రమే ఓటేశారు. స్వతంత్ర భారతావనిలో 1951లో పురుషులతో సమానంగా మహిళలు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) మహిళలకు ఓటుహక్కు కల్పించిన మొదటి దేశమేది?
జవాబు:
మహిళలకు ఓటుహక్కు కల్పించిన మొదటిదేశం న్యూజిలాండ్ (1893).

ఆ) బ్రిటిష్ ఇండియాలో మహిళలు ఎప్పుడు ఓటు వేశారు?
జవాబు:
బ్రిటిష్ ఇండియాలో మహిళలు 1894 సాధారణ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేశారు.

ఇ) ఎంతమంది మహిళలు బ్రిటిష్ ఇండియాలో ఓటువేశారు?
జవాబు:
బ్రిటిష్ ఇండియాలో 14,505 మంది మహిళలు ఓటువేశారు.

ఈ) స్వతంత్ర భారతావనిలో మహిళలు ఓటుహక్కు ఎప్పుడు వినియోగించుకున్నారు?
జవాబు:
స్వతంత్ర భారతావనిలో 1951లో మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు.

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

2. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కాశీ దగ్గర కురియారీ గ్రామపు స్త్రీలు తమ ఊరిని మద్యం, మాదకద్రవ్య రహితంగా మార్చాలని కంకణం కట్టుకున్నారు. ఆకుపచ్చరంగు చీరల్లో ఉండేవాళ్ళు. దీనికోసం ఇంటింటికీ తిరుగుతూ తాగుడూ, మాదక ద్రవ్యాల వల్ల వచ్చే నష్టాలను వివరిస్తున్నారు. తాగేవాళ్ళకు మద్యం మానమంటూ తమ బృందాల ద్వారా వినతి పత్రాలు అందిస్తున్నారు. ప్రతి ఇంటి మహిళనూ తమ ఉద్యమంలో భాగస్వామిగా చేస్తూ ఎవరినీ ఊళ్లో మద్యం సేవించేందుకు అనుమతించడం లేదు.
ప్రశ్నలు – జవాబులు:
అ) కురియారీ గ్రామపు స్త్రీలు ఎందుకు కంకణం కట్టుకున్నారు?
జవాబు:
తమ ఊరిని మద్యం, మాదక ద్రవ్య రహితంగా మార్చాలని కురియారీ గ్రామపు స్త్రీలు కంకణం కట్టుకున్నారు.

ఆ) ఎలా ప్రచారం చేస్తున్నారు?
జవాబు:
ఇంటింటికీ తిరుగుతూ తాగుడూ, మాదక ద్రవ్యాల వల్ల వచ్చే నష్టాలను వివరిస్తున్నారు.

ఇ) తమ బృందాల ద్వారా ఏమి ఇస్తున్నారు?
జవాబు:
త్రాగేవాళ్ళకు మద్యం మానమంటూ తమ బృందాల ద్వారా వినతిపత్రాలు ఇస్తున్నారు.

ఈ) కురియారీ గ్రామపు స్త్రీలు ఎవరికి అనుమతి ఈయట్లేదు?
జవాబు:
మద్యం త్రాగేందుకు ఎవరికీ అనుమతి ఈయట్లేదు.

3. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

భాషా శైలులు, పండుగలు జరుపుకోవడం, వస్త్రధారణ, ఆహారం, ఇళ్ళ నిర్మాణం, పంటలు, చదువు, గృహాలంకరణ, సాహిత్యం , కళలు, ఆటలు, సంగీతం మొదలైన అనేక అంశాలలో మనదేశంలో వైవిధ్యం కనిపిస్తుంటుంది. ప్రాంతాలను బట్టి, పట్టణ, గ్రామీణ, కొండ, సంస్కృతి, ఆచార వ్యవహారాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు గిరిజనుల్లో వైద్యానికి సంబంధించిన స్థానిక పరిజ్ఞానం అధికంగా ఉంటుంది. స్థానికంగా దొరికే ఔషధ మొక్కలతో వారు చేసుకొనే వైద్యం నిరపాయకరం. చౌక కూడా. ఇలాంటి భిన్న సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ప్రశ్నలు – జవాబులు:
అ) మనదేశంలో వేనిలో వైవిధ్యం కనిపిస్తుంది?
జవాబు:
భాషా శైలులు, పండుగలు, చదువు, సాహిత్యం , కళలు, మొదలైన అనేక అంశాలలో మనదేశంలో వైవిధ్యం కనిపిస్తుంది.

ఆ) ఏవి భిన్నంగా ఉంటాయి?
జవాబు:
ప్రాంతాలను బట్టి సంస్కృతి, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి.

ఇ) గిరిజనులలో ఏ పరిజ్ఞానం అధికంగా ఉంటుంది?
జవాబు:
గిరిజనుల్లో వైద్యానికి సంబంధించిన స్థానిక పరిజ్ఞానం అధికంగా ఉంటుంది.

ఈ) మనం వేటిని కాపాడుకోవాలి?
జవాబు:
మనం భిన్న సాంప్రదాయాలను కాపాడుకోవాలి.

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

4. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

మదునయ్య చేపల వ్యాపారి. శ్రీశైలం రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు. పెద్ద పెద్ద వలలను నీటిలో వేసి చేపలను పడతాడు. ఇందుకోసం ఒరిస్సా రాష్ట్రం నుంచి శేఖరం అనే బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి డబ్బులిస్తానని అతనిని పనిలో చేర్చుకున్నాడు. – శేఖరం పగలూ, రాత్రి వలలను చూస్తూ ఉండేవాడు. ఇది తెలుసుకున్న అధికారులు మదునయ్యను శిక్షించి శేఖరాన్ని బళ్ళో చేర్పించి అతని తల్లిదండ్రులను మందలించారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) మదునయ్య ఎవరు?
జవాబు:
మదునయ్య చేపల వ్యాపారి.

ఆ) మదునయ్య ఏం చేసేవాడు?
జవాబు:
మదునయ్య పెద్ద పెద్ద వలలను నీటిలో వేసి చేపలు పట్టేవాడు.

ఇ) శేఖరను మదునయ్య ఏమి చేశాడు?
జవాబు:
శేఖర్ తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి మదునయ్య పనిలో పెట్టుకున్నాడు.

ఈ) మదునయ్యను అధికారులు ఎందుకు శిక్షించారు?
జవాబు:
బాలల హక్కును ఉల్లంఘించినందుకు అధికారులు మదునయ్యను శిక్షించారు.

5. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
దేశానికి వెన్నెముక రైతు. ఒకప్పుడు వ్యవసాయం దాదాపు స్వయం ఆధారితంగా ఉండేది. ఇంట్లో ఉన్న గొడ్డు గోదా రైతుకు కావలసిన ఎరువును అందించేవి. సేంద్రియ ఎరువులతోనే పంటలు పండేవి. ఆహార ధాన్యాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉండేవి. రసాయనిక ఎరువులు రాగానే పరిస్థితులు మారిపోయాయి. వాటిలోని విషపదార్థాలు ఆహారధాన్యాలు, ఆకుకూరలు మొదలైన వాటిలోకి ఇంకి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. జాతిని రోగగ్రస్త్రం చేస్తున్నాయి.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరు దేశానికి వెన్నెముక?
జవాబు:
రైతు దేశానికి వెన్నెముక.

ఆ) పూర్వం వ్యవసాయానికి కావలసిన ఎరువు ఎలా లభించేది?
జవాబు:
ఇంట్లో ఉన్న గొడ్డు గోదా వ్యవసాయానికి కావలసిన సేంద్రియ ఎరువు అందించేవి.

ఇ) ఏ ఆహార ధాన్యాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవి?
జవాబు:
సేంద్రియ ఎరువులతో పండిన ఆహారధాన్యాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవి.

ఈ) జాతిని ఏవి రోగగ్రస్తం చేస్తున్నాయి?
జవాబు:
రసాయనిక ఎరువులతో పండిన పంటలు జాతిని రోగగ్రస్తం చేస్తున్నాయి.

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

2. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆకాశవీధిలో కనిపించే జెండా మనదే, ఆ జెండా కోసం ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు రక్తం చిందించారు. ప్రాణాలు అర్పించారు. క్రొత్త క్రొత్త ఆలోచనలతో మనదేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మనదేశం | అభివృద్ధి చెందాలి. స్వాతంత్ర్య సమరయోధుల కష్టం వృథా కాకూడదు.
ప్రశ్నలు – జవాబులు:
అ) అది ఏ దేశపు జెండా?
జవాబు:
అది మన భారతదేశపు జెండా.

ఆ) ఆ జెండా కోసం ఎవరు ప్రాణాలర్పించారు?
జవాబు:
ఆ జెండా కోసం స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలు అర్పించారు.

ఇ) ఏది అభివృద్ధి చెందాలి?
జవాబు:
మనదేశం అభివృద్ధి చెందాలి.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
మనదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి?

7. కింది లేఖను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

బొబ్బిలి,
xxxxx.

మేనేజర్,
విజి.యస్. పబ్లిషర్స్,
విజయవాడ – 9.

అయ్యా ,
నాకు ఈ క్రింద తెలియజేసిన పుస్తకాలను పంపించవలసినదిగా కోరుచున్నాను. ధరను G.P. ద్వారా చెల్లించగలను.
6వ తరగతి క్వశ్చన్ బ్యాంక్స్ – 6
7వ తరగతి క్వశ్చన్ బ్యాంక్స్ – 12
8వ తరగతి క్వశ్చన్ బ్యాంక్స్ – 9

ఇట్లు
తమ విధేయుడు,
కె.వి. రామారావు,

చిరునామా :
మేనేజర్
వి.జి.యస్. పబ్లిషర్స్,
తమ్మిన కృష్ణ వీథి, విజయవాడ.

ప్రశ్నలు – జవాబులు:
అ) పై లేఖను ఎక్కడి నుండి రాశారు?
జవాబు:
పై లేఖను బొబ్బిలి నుండి రాశారు.

ఆ) వి.జి.యస్. పబ్లిషర్స్ వ్యాపారం ఏమిటి?
జవాబు:
వారిది పుస్తకాల వ్యాపారం.

ఇ) మొత్తం ఎన్ని పుస్తకాలు కావాలన్నారు?
జవాబు:
మొత్తం 27 పుస్తకాలు కావాలన్నారు.

ఈ) పై లేఖకు తగిన ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై లేఖను ఎక్కడికి రాశారు?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
సమయస్ఫూర్తి కథలో ఎక్కువగా నష్టపోయింది ఎవరు? ఎందుకు?
జవాబు:
సమయస్ఫూర్తి కథలో ఎక్కువగా నష్టపోయినది వేటగాడు. ఎందుకంటే వేటగాడు జంతువుల కోసం వలపన్నాడు. పిల్లి వలలో పడింది. అంతలో ఎలుకకు గుడ్లగూబ వలన ప్రాణభయం కలిగింది. ఎలుక గుడ్లగూబ నుండి రక్షించుకొనేందుకు పిల్లితో స్నేహం చేసింది. వల కొరికి పిల్లిని రక్షిస్తానంది. అన్నమాట ప్రకారం ఎలుక వలను కొరికింది. పిల్లిని రక్షించింది. అన్ని జంతువులు బాగానే ఉన్నాయి. వేటగాడికి పిల్లి దొరకలేదు సరికదా ! వల కూడా నాశనమయ్యింది. అందుచేత వేటగాడు ఎక్కువగా నష్టపోయాడు.

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

ప్రశ్న 2.
వలలో చిక్కిన పిల్లిని చూసి ఎలుక ఎందుకు ఆనందించింది?
జవాబు:
పంచవటం ప్రాంతంలో మర్రిచెట్టు తొర్రలో పిల్లి నివసిస్తోంది. ఆ చెట్టు కిందే కన్నంలో ఎలుక నివసిస్తోంది. పిల్లిని చూస్తే ఎలుకకు భయము. కన్నంలోంచి బయటకు రావడానికి కూడా భయపడిపోయేది. పిల్లికి దొరికితే తన బ్రతుకు తెల్లారిపోతుంది. కానీ పిల్లిని ఎలుక ఏమి చేయలేదు. పిల్లి పీడ వదిలిపోవాలని కోరుకొనేది. అందుచేత పిల్లి వలలో పడగానే ఎలుక చాలా ఆనందించింది. ఇక తనకు పిల్లి బాధ ఉండదని స్వేచ్ఛగా తిరగవచ్చునని అనుకుంది.

ప్రశ్న 3.
శత్రువుతోనైనా స్నేహం చేసి ఆపదను అధిగమించినదెవరు? ఎలా?
జవాబు:
పంచవటంలో ఒక మర్రిచెట్టు తొర్రలో పిల్లి నివసించేది. ఆ చెట్టు క్రింద కన్నంలో ఎలుక నివసించేది. ఒకనాడు పిల్లి వలలో చిక్కింది. తన శత్రువు వలలో చిక్కినందుకు ఎలుక చాలా ఆనందించింది. ధైర్యంగా బయటకు వచ్చి తిరుగుతోంది. ప్రక్కనే మరొక శత్రువైన గుడ్లగూబను చూసింది. ఎలాగైనా తప్పించుకోవాలనుకుంది. గుడ్లగూబకు పిల్లి అంటే భయం. అందుచేత వెంటనే పిల్లి దగ్గరకు వెళ్ళింది. పిల్లితో స్నేహంగా మాట్లాడింది. పిల్లి గొంతు విన్న గుడ్లగూబ హడలిపోయింది. ప్రాణభయంతో పారిపోయింది. తను అన్నమాట ప్రకారం ఎలుక వలను కొరికి పిల్లిని రక్షించింది.

ప్రశ్న 4.
ఎలుక మాటలలోని తెలివితేటలను, సంస్కారాన్ని వివరించండి.
జవాబు:
ఎలుక పిల్లి వద్దకు వెళ్ళి మిత్రమా నమస్కారం అని సంభాషణ ప్రారంభించింది. శత్రువునైనా మిత్రమా అని సంభోదిస్తే అతని మనసులో ఉండే ద్వేషభావం కొంత పోతుంది. పెద్దలతో మాట్లాడేటప్పుడు నమస్కారం పెట్టడం సంస్కారం. అందుకే నమస్కారం పెడితే మనపట్ల ఇతరులకు ఆదరణ కలుగుతుంది. జాతి వైరమున్నా మనము శత్రుమిత్రులము అని పిల్లితో ఎలుక అన్నది. ఈ మాటలలో ఎలుక యొక్క నిజాయితీ అర్థమవుతోంది. మనం కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలి. మనం శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయట పడదామని ఎలుక పిల్లితో అన్నది. తను ఆపదలో ఉన్నా ఎలుక ధైర్యాన్ని కోల్పోలేదు. బేలతనంతో మాట్లాడలేదు. మీ అవసరం నాకూ ఉంది. నా అవసరం మీకూ ఉంది అన్నట్లుగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే మాట్లాడింది. దీనినిబట్టి ఎంత ఆపద ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇతరులకు లోకువ కాకూడదు. ఇలాగే ఎలుక చాలా తెలివితో, సంస్కారంతో ఆదర్శవంతంగా మాట్లాడింది.

ప్రశ్న 5.
ఎలుకను పిల్లి బయటకు రమ్మన్నప్పుడు ఎలుక ఏమన్నది?
జవాబు:
పిల్లి స్వభావం ఎలుకకు తెలుసు. అవసరం కొద్దీ దానితో స్నేహం చేసినట్టు ఎలుక చెప్పింది. అప్పుడు ప్రాణభయం ఇద్దరికీ ఉంది. ఆ స్నేహం వల్ల ఇద్దరికీ ప్రాణాలు దక్కాయని చెప్పింది. కానీ నిరంతరం స్నేహం చేయటం కుదరదని చెప్పింది. ఎందుచేతనంటే. పిల్లికి, ఎలుకకూ జాతివైరం. ఎలుక కనిపిస్తే పిల్లి తినేస్తుంది. కనుక స్నేహం చేస్తే తనకు ప్రాణగండం తప్పదని ఎలుక ఖచ్చితంగా చెప్పింది, తప్పించుకొంది.

ప్రశ్న 6.
కందుకూరి వీరేశలింగం గారి గురించి మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

క్షేమం

కడప,
xxxxx.

ప్రియమైన శివకు,

నీ మిత్రుడు సృజిత్ వ్రాయు లేఖ

ఇక్కడ మేమంతా క్షేమం, అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

మాకు మొన్ననే సమయస్ఫూర్తి పాఠం చెప్పారు. ఆ పాఠం కందుకూరి వీరేశలింగం పంతులుగారు రచించిన గ్రంథంలోనిది, పాఠం చాలా బాగుంది.

కందుకూరి వారు 130 గ్రంథాలు రచించారు. ఆయన తొలి నవల, తొలి నాటకం, తొలి ప్రహసనం రచించారు. ఆయన సంస్కృతం నుండి, ఆంగ్లం నుండి కూడా కొన్ని గ్రంథాలు అనువదించారు.

ఆయన మన తెలుగు వారు కావడం మన అదృష్టం అని చెప్పారు. ఆయన మీ రాజమండ్రిలోనే జన్మించారట. ఈ సారి రాజమండ్రి వచ్చినపుడు ఆయన నివసించిన చోటు చూద్దాం.

నీకు వీలైతే ఆయన నివసించిన ప్రాంతం ఫోటో తీసి నా ‘వాట్సప్’కు పెట్టు ఉంటాను. ‘జవాబు వ్రాయి.

ఇట్లు,
నీ స్నేహితుడు,
వంకా సృజిత్ వ్రాలు.

చిరునామా :
చింతా శివరామకృష్ణ,
మున్సిపల్ హైస్కూల్,
దానవాయిపేట,
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా.

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

ప్రశ్న 7.
సమయస్ఫూర్తి కథలోని పిల్లి ఏక పాత్ర రాయండి. ప్రదర్శించండి.
జవాబు:
పిల్లి

మ్యావ్, మ్యావ్. ఇలా అంటే మీకర్థం కాదుగా, నేను పిల్లిని అదే రోమశుడను. నేను చాలా తెలివైన దానిననుకొంటాను. ఆ వేటగాడు పన్నిన వలలో పడ్డాను, కేవలం ముందుచూపు లేక ఆ వలలో చిక్కాను. నన్ను చూస్తే వణికిపోయే ఎలుక కూడా ఎంత ఫోజు కొట్టేసిందో ! నాతో దానికి స్నేహమంట. నేను దాన్ని రక్షించాలట. ఏం చెయ్యను ఖర్మ! వలలోంచి బైటపడాలంటే ఆ చిట్టెలుక చెప్పినట్టు వినాలి. అందుకే స్నేహం నటించాను. పుటుక్కున వల కొరికితే గుట్టుక్కున మింగేద్దామనుకొన్నాను. దీని తెలివి తగలెయ్య. సరిగ్గా వేటగాడు వచ్చేటపుడు కొరికింది. ప్రాణభయంతో. అప్పటికి పారిపోయాను. తర్వాత స్నేహం చేద్దామన్నా కన్నంలోంచి రాలేదు. కుదరదని చెప్పేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. అది కందుకూరి వీరేశలింగం పంతులుగారి దగ్గర చదువుకొందేమో ! చాలా తెలివైంది. పిల్లలూ మీరు నాలాగ నటించకండి. ఎలుకలా తెలివిగా బతకండి. హాయిగా చదువుకోండి. తెలివి పెంచుకోండి. అదిగో మరో ఎలుక వస్తోంది. కడుపులో ఆకలి కరకరలాడుతోంది. ఇదెంత తెలివైందో చూస్తాను. –

III. భాషాంశాలు

పర్యాయపదాలు

వటము = మఱ్ఱిచెట్టు, బాహుపాదము
పిల్లి = బిడాలము, మార్జాలము
ఎలుక = మూషికము, ఖనకము
గుడ్లగూబ = ఉలూకము, గూబ
చెట్టు = వృక్షము, తరువు
వల = జాలకము, జాలము
కన్నం = రంధ్రం, కలుగు
చీకటి = తమస్సు, తమము
గుండె = హృదయము, ఎద
ప్రాణము = అసువులు, ఉసురు
కష్టము = ప్రమాదం, ఇబ్బంది
సంతోషం = ఆనందం, మోదము
ప్రమాదం = ఆపద, కష్టం
బ్రతుకు = జీవితం, మనుగడ
మిత్రుడు = స్నేహితుడు, సఖుడు
నమస్కారం = కైమోడ్పు, అంజలి
వైరము = విరోధం, శత్రుత్వం
శత్రువు = విరోధి, వైరి
స్నేహం = సఖ్యం , మైత్రి
సంవత్సరం = వర్షం, వత్సరం
అపకారం = కీడు, చేటు
చావు = మరణం, చనిపోవు
భయం = పిరికితనం, జంకు
మెచ్చుకొను = పొగడు, నుతించు
అజ్ఞానం = అవిద్య, తెలివి లేకపోవడం
సత్యం = నిజం, యథార్థం
తెలివి = విజ్ఞత, వివేకం

వ్యతిరేక పదాలు

వచ్చి × వెళ్లి
చీకటి × వెలుగు
అదృష్టం × దురదృష్టం
శత్రువు × మిత్రుడు
వచ్చింది × రాలేదు
ఏడుపు × నవ్వు
కష్టం × సుఖం
సంతోషం × విచారం
బాధ × ఆనందం
బుద్ధిమంతులు × బుద్ధిహీనులు
ధైర్యం × అధైర్యం
అపకారం × ఉపకారం
వైరం × స్నేహం
ప్రస్తుతం × అప్రస్తుతం
రక్షించు × శిక్షించు
భయం × నిర్భయం
భీతి × నిర్భీతి
చావు × పుట్టుక
ధర్మం × అధర్మం
చివరి × మొదటి
కృతజ్ఞత × కృతఘ్నత
అజ్ఞానం × జ్ఞానం
కాలం × అకాలం
స్వ × పర
కపటం × నిష్కపటం
బయటకు × లోపలకు
అవసరం × అనవసరం
మాయమవడం × ప్రత్యక్షమవడం
ఆశ × నిరాశ
సుఖం × దుఃఖం
అంతం × ఆరంభం
సత్యం × అసత్యం
ఆశ్రయం × నిరాశ్రయం

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

ప్రకృతి-వికృతులు

ప్రాంతము = పొంత
ఆహారము = ఓగిరము
సంతోషము = సంతసము
స్నేహము = నెయ్యము
ధర్మము = దమ్మము

1) కింద గీతగీసిన పదాల అర్ధాలు రాసి సొంత వాక్యాలు రాయండి.

1. అందరూ సంతోషంగా ఉండాలి.
జవాబు:
సంతోషం = ఆనందం
పనిచేయడంలోనే ఆనందం ఉంది.

2. ఎప్పుడూ సత్యం పలకాలి.
జవాబు:
సత్యం = నిజం
గాంధీగారు నిజం మాత్రమే పలికే వారు.

3. ఎవరినీ దేనికీ అర్థించి కాదనిపించుకోకూడదు.
జవాబు:
అర్థించి = అడిగి
అడిగిన వారికి లేదనకూడదు.

2) కింద గీతగీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.

1. పిల్లి సాధు జంతువు.
జవాబు:
పిల్లి = బిడాలము, మార్జాలము

2. మంచి మిత్రుడు వంద పుస్తకాలతో సమానం.
జవాబు:
మిత్రుడు = స్నేహితుడు, సఖుడు

3. భయం మనకు శత్రువు వంటిది.
జవాబు:
భయం = పిరికితనం, జంకు

3) కింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి.

1. చిన్నపిల్లల ఏడుపు చూస్తే నవ్వు వస్తుంది.
2. బుద్ధిమంతులు ఆపదలు ఎదుర్కొంటారు. బుద్ధిహీనులు భయపడతారు.
3. భయం పనికిరాదు. నిర్భయంగా జీవించు.

4) కింది ఖాళీలను పూరించండి.
1. ఉందామని = ………. + …………
జవాబు:
ఉందాము + అని

2. వారు + ……….. = వారిద్దరూ
జవాబు:
ఇద్దరూ

3. కాదు + అనలేను = …………..
జవాబు:
కాదనలేను.

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

5) కింది వానిలో నామవాచకాలు, అవ్యయాలు రాయండి.
సీత,
రాముడు అడవికి వెళ్లారు. అబ్బ ! అడవి ఎంత అందంగా ఉందో !, అక్కడ ఆహా ! సెలయేరు చూడు బాగుంది కదూ ! అన్నాడు రాముడు. సీత నవ్వింది.
జవాబు:
నామవాచకాలు : సీత, రాముడు, అడవి, సెలయేరు.
అవ్యయాలు : అబ్బ, ఆహా

6) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.

1. ప్రాంతంఅ) కస్తి
2. రాత్రిఆ) పొంత
3. కష్టముఇ) రాతిరి

జవాబు:

1. ప్రాంతంఆ) పొంత
2. రాత్రిఇ) రాతిరి
3. కష్టముఅ) కస్తి

7) ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి.

1. వటవృక్షం కింద చల్లగా ఉంటుంది. (అర్థం గుర్తించండి)
అ) రావిచెట్టు
ఆ) వేపచెట్టు
ఇ) మట్టిచెట్టు
జవాబు:
ఇ) మట్టిచెట్టు

2. శత్రువును కూడా బాధపెట్టకూడదు. (అర్థం గుర్తించండి)
అ) విరోధి
ఆ) కోపం గలవాడు
ఇ) అప్పు ఇచ్చినవాడు
జవాబు:
అ) విరోధి

3. గుడ్లగూబను చూసి ఎలుక గుండె గుభేలుమంది. (అర్థం గుర్తించండి)
అ) మెదడు
ఆ) హృదయం
ఇ) మనసు
జవాబు:
ఆ) హృదయం

4. సదాలోచనతో జీవించాలి. (అర్థం గుర్తించండి).
అ) మంచి ఆలోచన
ఆ) ఆలోచన
ఇ) తలంపు
జవాబు:
అ) మంచి ఆలోచన

5. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. (అర్థం గుర్తించండి)
అ) హుషారు
ఆ) ఉత్సాహం
ఇ) ఆనందం
జవాబు:
ఇ) ఆనందం

6. దేనికీ నిరాశ పనికిరాదు. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) దురాశ
అ) పేరాశ
ఇ) ఆశ
జవాబు:
ఇ) ఆశ

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

7. అవినీతిని అంతం చేయాలి. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) ఆరంభం
ఆ) ముగింపు
ఇ) చివర
జవాబు:
అ) ఆరంభం

8. కొందరు అవసరం ఉండే పొగడుతారు. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) పని
ఆ) అనవసరం
ఇ) నిరాశ
జవాబు:
ఆ) అనవసరం

9. దేనికీ ఎప్పుడూ భయం పనికిరాదు. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) పిరికితనం
ఆ) వెరపు
ఇ) నిర్భయం
జవాబు:
ఇ) నిర్భయం

10. చీకటిని చూసి భయపడకు. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) వెలుగు
ఆ) తమము
ఇ) అంధకారము
జవాబు:
అ) వెలుగు

11. గుడ్లగూబ భయపడింది. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) గూబ, దివాంధము
ఆ) పక్షి, పులుగు
ఇ) కళ్లు, కనుగ్రుడ్లు
జవాబు:
అ) గూబ, దివాంధము

12. ఎప్పుడూ పిల్లి అంటే ఎలుకకు భయమే. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) మూషకం, మూషికం
ఆ) బిడాలము, మార్జాలము
ఇ) జంతువు, మృగం
జవాబు:
ఆ) బిడాలము, మార్జాలము

13. ఆపదలో మిత్రుడు సాయం చేస్తాడు. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) వైరి, విరోధి
ఆ) చెలికాడు, సూర్యుడు
ఇ) చెలికాడు, సఖుడు
జవాబు:
ఇ) చెలికాడు, సఖుడు

14. శత్రువుకు కూడా కీడు చేయకూడదు. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) ఖైది, కారాగారవాసి
ఆ) విరోధి, వైరి
ఇ) దొంగ, తస్కరుడు
జవాబు:
ఆ) విరోధి, వైరి

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

15. మంచివారితో స్నేహం చేయాలి. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) చెలిమి, మైత్రి
ఆ) స్నేహితుడు, మిత్రుడు
ఇ) కాలక్షేపం, కబుర్లు
జవాబు:
అ) చెలిమి, మైత్రి

16. పండితులకు ఏ ప్రాంతంలోనైనా గౌరవం దక్కుతుంది. (వికృతి గుర్తించండి)
అ) పాత
ఆ) ప్రదేశం
ఇ) పొంత
జవాబు:
ఇ) పొంత

17. పనిచేసి ఆహారం సంపాదించుకోవాలి. (వికృతి గుర్తించండి)
అ) ఓగిరం
ఆ) అన్నం
ఇ) భోజనం
జవాబు:
అ) ఓగిరం

18. మంచి నెయ్యము విడువకూడదు. (ప్రకృతి గుర్తించండి)
అ) నెయ్యి
ఆ) స్నేహము
ఇ) ఆహారం
జవాబు:
ఆ) స్నేహము

19. కస్తికి భయపడితే బతకలేం. (ప్రకృతి గుర్తించండి)
అ) కత్తి
ఆ) బాధ
ఇ) కష్టము
జవాబు:
ఇ) కష్టము

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

20. బుద్ధిలేని వారితో జాగ్రత్తగా ఉండాలి. (వికృతి గుర్తించండి)
అ) బుద్ధి
ఆ) బుర్ర
ఇ) ఆలోచన
జవాబు:
అ) బుద్ధి

21. ప్రమాదం ఎదురైనప్పుడు తెలివిగా తప్పుకోవాలి. (సంధి పేరు గుర్తించండి)
అ) ఇత్వ సంధి
ఆ) ఉత్వ సంధి
ఇ) వృద్ధి సంధి
జవాబు:
ఆ) ఉత్వ సంధి

22. వైరమున్నా మరచిపోవాలి. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
అ) వైరము + ఉన్నా
ఆ) వైరం + ఉన్నా
ఇ) వైరమూ + ఉన్నా
జవాబు:
అ) వైరము + ఉన్నా

23. వాడు తహతహలాడుతూ వచ్చాడు. (సంధి విడదీసి రూపం గుర్తించండి)
అ) తహతహలు + ఆడుతూ
ఆ) తహతహల + ఆడుతూ
ఇ) తహతహలా + ఆడుతూ
జవాబు:
అ) తహతహలు + ఆడుతూ

24. ‘ఉందాము + అని (సంధి కలిపిన రూపం గుర్తించండి)
అ) ఉందామాని
ఆ) ఉందాముని
ఇ) ఉందామని
జవాబు:
ఇ) ఉందామని

25. వచ్చాను + అనుకో – (సంధి కలిపిన రూపం గుర్తించండి)
అ) వచ్చాననుకో
ఆ) వచ్చాననకో
ఇ) వచ్చానుఅనుకో
జవాబు:
అ) వచ్చాననుకో

26. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాల పేరు గుర్తించండి.
అ) అంతస్థాలు
ఆ) మూర్ధన్యాలు
ఇ) ఊష్మాలు
జవాబు:
ఇ) ఊష్మాలు

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

27. పరుష, సరళాలు కాక మిగిలిన హల్లులనేమంటారు?
అ) స్పర్శాలు
ఆ) స్థిరాలు అంత
ఇ) అంతస్థాలు
జవాబు:
ఆ) స్థిరాలు అంత

28. కిందివానిలో మూర్ధన్యాలు గుర్తించండి.
అ) ట,ఠ,డ,ఢ,ణ
ఆ) చ,ఛ,జ,ఝ,ఞ
ఇ) త,థ,ద,ధ,న
జవాబు:
అ) ట,ఠ,డ,ఢ,ణ

29. కిందివానిలో కంఠాష్యాలు గుర్తించండి.
అ) ఎ,ఏ, ఐ
ఆ) ఒ,ఓ, ఔ
ఇ) ఋ,బ
జవాబు:
ఆ) ఒ,ఓ, ఔ

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి

30. కిందివానిలో దంతో ష్ట్యం గుర్తించండి.
అ) వ
ఆ) బ
ఇ) శ
జవాబు:
అ) వ

చదవండి – ఆనందించండి
స్ఫూర్తి

AP 6th Class Telugu Important Questions Chapter 4 సమయస్ఫూర్తి 1
చాలా కాలం క్రితం మగధను విక్రమ సేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఎంతో ధైర్య సాహసాలు కల విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండువుగా సంపద తులతూగుతూ ఉండేది.

మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగు దేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని మగధపై దాడి చేసాడు. విక్రమ సేనుడి వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు. యుద్ధంలో పరాజయం పొందిన విక్రమ సేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండగుహలో దాక్కున్నాడు.

ఒంటరితనం, పరాజయం , బాధ, అలసట… అన్నీ ఒక్కసారిగా విక్రమసేనుణ్ణి ఆవరించాయి.

“నా కన్న బిడ్డల్లాంటి ప్రజల్ని, రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకటం అనవసరం. నిస్సహాయుడిగా ఎంత కాలమిలా దాక్కోవాలి ?” అని ఆలోచించిన విక్రమసేనుడు చావే శరణ్యమని అనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది.

ఒక చిన్న సాలీడు గుహ పైభాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. సాలీడు పైకి పాకే కొద్ది దాని నుండి వచ్చే దారం తెగి అది క్రిందికి జారిపోతూ ఉంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నోమార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా పైకి ఎగబాకి గూడును అల్లటం పూర్తి చేయగలిగింది.

అది చూసిన విక్రమసేనుడిలో ఒక కొత్త ఆలోచన కలిగింది. ‘ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు. వైఫల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చెనను మోసుకు వస్తుంది. ఇలా ఆలోచించిన విక్రమసేనుడిలో నిరాశా, నిస్పృహలు పటాపంచలై పోయాయి. కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది.

విక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి, చెల్లాచెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 8th Lesson మేలుకొలుపు Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 8th Lesson మేలుకొలుపు

6th Class Telugu 8th Lesson మేలుకొలుపు Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు 1

ప్రశ్న 1.
చిత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
చిత్రంలో ఒక చక్రవర్తి, భరతమాత, ఒక కవి, ఒక ఋషి ఉన్నారు. ప్రజలకు జీవన విధానాన్ని తెలిపినవాడు ఋషి. కవి ఆ జీవితాలను చక్కగా జీవించడం, మంచిచెడులు తెలుసుకోవటం చెబుతాడు. రాజు ప్రజలందరికీ రక్షణ కల్పిస్తాడు. భారతదేశంలోని అన్ని జీవులను ప్రకృతిని కాపాడేది భరతమాత. భరతమాత చేతిలోని జెండా ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణార్పణ చేస్తే వచ్చింది. ఆ జెండాను పింగళి వెంకయ్యగారు రూపొందించారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 2.
రాజుల కాలం నాటికి, ఇప్పటికి మన దేశంలో వచ్చిన మార్పు ఏమిటి?
జవాబు:
రాజుల కాలంలో రాజు మాటే శాసనం. తనకు తోచింది చేసేవాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రాజుగారి అధికారాన్ని ప్రజలు భరించవలసిందే. అతని తర్వాత అతని కొడుకు రాజయ్యేవాడు. ఇలా అనువంశిక పాలన కొనసాగేది. ఇప్పుడు మన దేశంలో రాచరికం లేదు. రాజుల పాలన అంతమయ్యింది. ఇప్పుడు ప్రజలే పాలకులను ఓటు ద్వారా ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధుల పరిపాలన నచ్చకపోతే తర్వాత ఎన్నికలలో వారిని దింపేస్తారు. ప్రజల హక్కులను కాపాడడానికి రాజ్యాంగం ఉంది. న్యాయస్థానాలు ఉన్నాయి. ఇపుడు మనదేశంలో ప్రజలకు చాలా హక్కులు ఉన్నాయి.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఈ పాఠంలో మీకు నచ్చిన పద్యం గురించి చెప్పండి.
జవాబు:
ఈ పాఠంలో ‘కాళిదాసాది’ అనే పద్యం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ పద్యంలో భరతమాత యొక్క సమగ్ర స్వరూపాన్ని వర్ణించారు. . ఆమెను కాళిదాసాది మహాకవులను కన్న విద్యావంతురాలిగా వర్ణించారు. కృష్ణదేవరాయల వంటి మహావీరులను, చక్రవర్తులను కన్న వీరమాత భరతమాత అన్నారు. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు కలిగిన పుణ్యాత్మురాలన్నారు. కోహినూరు వంటి వజ్రాలు గల రత్నగర్భగా వర్ణించారు. సద్గుణవతి, పుణ్యవతి, తేజోవతి, దాతృత్వం కలది భరతమాత అని వర్ణించారు కనుక ఈ పద్యం అంటే నాకిష్టం.

ప్రశ్న 2.
హక్కులకై పోరాడటం గురించి నాలుగు వాక్యాలలో రాయండి.
జవాబు:
హక్కులకై పోరాడాలి. సమయము దాటిపోకుండా పోరాడాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతీ వ్యక్తికీ అన్నిటి పైనా అందరిలాగే హక్కులున్నాయి. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా ఫరవాలేదు. హక్కులను సాధించాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
కుసుమ ధర్మన్న కవి గురించి రాయండి.
జవాబు:
కుసుమ ధర్మన్న కవి రాజమండ్రిలోని లక్ష్మీవారపు పేటలో జన్మించారు. నాగమ్మ, వీరస్వామి ఆయన తల్లిదండ్రులు. వైద్య విద్వాన్ చదివారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో ఆయన పండితుడు. నిమ్నజాతి ముక్తి తరంగిణీ, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం మొదలైనవి రచించారు. అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారు.

ప్రశ్న 4.
ఈ కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
అన్నమయములైన వన్నిజీవమ్ములు
కూడులేక జీవకోటి లేదు
కూడు తినెడికాడ కులభేదమేలకో
కాళికాంబ హంసకాళికాంబ

అ) జీవులు దేనిమీద ఆధారపడి బ్రతుకుతాయి?
జవాబు:
జీవులు అన్నం మీద ఆధారపడి బ్రతుకుతాయి.

ఆ) కూడు లేకపోతే ఏమి లేదు?
జవాబు:
కూడు లేకపోతే జీవకోటి లేదు.

ఇ) అన్నం తినేదగ్గర ఏ భేదం చూపించరాదని కవి అంటున్నాడు?
జవాబు:
అన్నం తినేదగ్గర కుల భేదం చూపించరాదని కవి అంటున్నాడు.

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యంలోని అమ్మవారి పేరేమిటి?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దీనజనుల హక్కుల కోసం పోరాడటం నిజమైన స్వర్గమని పిలుపునిచ్చిన కవి గురించి రాయండి.
జవాబు:
కుసుమ ధర్మన్న కవి రాజమండ్రిలోని లక్ష్మీవారపు పేటలో జన్మించారు. నాగమ్మ, వీరస్వామి ఆయన తల్లిదండ్రులు. వైద్య విద్వాన్ చదివారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో ఆయన పండితుడు. నిమ్నజాతి ముక్తి తరంగిణీ, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం మొదలైనవి రచించారు. అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారు.

ప్రశ్న 2.
కవి, తన కవితను ఎవరికి అంకితమిస్తానన్నాడు? ఎందుకు?
జవాబు:
పరుల ధనాన్ని అపహరించడం మహాపాపం. ఇతరుల గౌరవాన్ని పాడుచేయడం తప్పు. ఇతరుల ప్రాణాలను తీయడం మహాపాతకం. ఇలా ఆలోచించేవారికే కుసుమ ధర్మన్న కవి తన కవితను అంకితమిస్తానన్నాడు.

ఎందుకంటే అటువంటి వారు ధన్యులు. ఇతరులను పీడించకుండా ఉండే అటువంటి వారి వలన దేశంలో శాంతి పెరుగుతుంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
భరతమాత దుఃఖానికి కారణం వివరించండి.
జవాబు:
భరతమాత తన సంతానం యొక్క దీనత్వాన్ని చూసి దుఃఖిస్తోంది. వారి బాధలను చూసి బాధపడుతోంది. ఆమె దుఃఖానికి కారణం దీనుల కన్నీరు, అంటరానితనం, జాతి భేదాలు, విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం అనే మూడు గర్వాలు కలవారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
భరతమాత గొప్పతనాన్ని కవి ఏమని వర్ణించాడు?
జవాబు:
భరతమాత సకల సద్గుణరాశి. ఆమె అందరి పాపాలను దూరం చేస్తుంది. అందరిచేత పొగడ్తలందుకొంటుంది. గొప్ప తేజస్సు కలది. అనేక విధాలుగా కీర్తి కలది. కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి. అటువంటి భరతమాత మనకు భద్రతను కల్గిస్తోంది.

ప్రశ్న 2.
స్వరాజ్య రథం ఎప్పటిదాకా సాగాలని కవి భావించాడు?
జవాబు:
దీనులైన తన సంతానాన్ని చూసి భరతమాత బాధపడుతున్నది. ఆ బాధ తగ్గేవరకు శుభప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి. అణగారిన ప్రజల కన్నీటి సముద్రం ఇంకిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. జాతి భేదాలు పోయి, భరతమాత శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా రూపుదిద్దు కొనేవరకు సాగాలి. ధర్మానికి అడ్డుపడే మదత్రయం (విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం) నాశనమయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడపాలి.

ప్రశ్న 3.
కింది కవితను పొడిగించండి.
జవాబు:
భరతమాత మా మాత
జగతినామె పరమ దేవత
నేత వైరము మాకు రోత
గాంధీజీ మాకు తాత
ఆయన స్వాతంత్ర్యోద్యమ
మారుస్తాం దేశపు తల రాత

భాషాంశాలు

అ) కింద గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : మగవానితో సమానంగా వెలది ని గౌరవించాలి.
వెలది = స్త్రీ
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.

1. రణం నాశనానికి దారితీస్తుంది.
రణం = యుద్ధం
యుద్ధం వలన అనర్థాలెక్కువ.

2. అఘం చేయకూడదు.
అఘం = పాపం
ఏ జీవినైన బాధపెట్టడం పాపం.

3. సన్నుతం విని పొంగిపోకు.
సన్నుతం = పొగడ్త
పొగడ్తలన్నీ నిజమనుకొంటే గర్వం పెరుగుతుంది.

4. తలపోటు దుర్భరంగా ఉంటుంది.
దుర్భరం = భరింపరానిది
భరింపరాని బాధనైనా ఒక్కొక్కసారి భరించాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఆ) కింద ఇచ్చిన పదానికి సమానార్ధక పదాలు వాక్యాలలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి.

1. జనని ప్రేమకు వెలకట్టలేము. బ్రహ్మయైనా మాతకు కొడుకే.
జవాబు:
తల్లి = జనని, మాత

2. వెలదిని దేవతగా భావించి ఆ పొలతిని గౌరవించాలి.
జవాబు:
నారి = వెలది, పొలతి

3. తగిన సమయంలో కాలమును అనుసరించి మాట్లాడాలి.
జవాబు:
తరుణము = సమయం, కాలం

4. పాతకం చేసేటపుడు ఆ దురితం వల్ల వచ్చే నష్టాలను ఊహించుకోవాలి.
జవాబు:
పాపము = పాతకం, దురితం

ఇ) కింది వానిలో ప్రకృతి, వికృతులను జతపర్చండి.

1. కవిఅ) విద్య
2. విద్దెఆ) కృష్ణుడు
3. కన్నడుఇ) కయి

జవాబు:

1. కవిఇ) కయి
2. విద్దెఅ) విద్య
3. కన్నడుఆ) కృష్ణుడు

ఈ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.

1. విద్య × అవిద్య
2. పుణ్యం × పాపం
3. సద్గుణం × దుర్గుణం

వ్యాకరణాంశాలు

అ) కింది ఖాళీలను పూరించండి.

సమాస పదంవిగ్రహ వాక్యంసమాసం పేరు
1. అక్కాచెల్లెళ్లు……………………………ద్వంద్వ సమాసం
2. ……………………………తల్లియును తండ్రియును……………………………
3. తండ్రీకొడుకులు…………………………………………………………
4. ……………………………ధర్మమును, అధర్మమునుద్వంద్వ సమాసం
5. పాపపుణ్యాలు……………………………ద్వంద్వ సమాసం

జవాబు:

సమాస పదంవిగ్రహ వాక్యంసమాసం పేరు
1. అక్కాచెల్లెళ్లుఅక్కాచెల్లెళ్లు అక్కయునుద్వంద్వ సమాసం
2. తల్లిదండ్రులుతల్లియును తండ్రియునుద్వంద్వ సమాసం
3. తండ్రీకొడుకులుతండ్రియును, కొడుకులునుద్వంద్వ సమాసం
4. ధర్మాధర్మములుధర్మమును, అధర్మమునుద్వంద్వ సమాసం
5. పాపపుణ్యాలుపాపమును, పుణ్యమునుద్వంద్వ సమాసం

ఆ) కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

1. భరతమాత కవులను కన్నది. భరతమాత కవులను పెంచింది.
జవాబు:
భరతమాత కవులను కని, పెంచింది.

2. హక్కులకై పోరాడాలి. హక్కులను సాధించాలి.
జవాబు:
హక్కులను పోరాడి, సాధించాలి.

3. దేశభక్తి కలిగి ఉండాలి. దేశభక్తితో జీవించాలి.
జవాబు:
దేశభక్తిని కలిగి, జీవించాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఇ) సంధులు:

రెండు పదాల మధ్య సంధి జరిగినపుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం. మొదటి పదం చివర ‘ఉ’ ఉంటే అది ఉత్వ సంధి. ‘అ’ ఉంటే అత్వ సంధి, ‘ఇ’ ఉంటే ఇత్వ సంధి.

అత్వ సంధి బహుళం కాబట్టి నాలుగు విధాలుగా సంధిరూపాలు ఏర్పడతాయి.
ఉదా :
చూసినప్పుడు = చూసిన + అప్పుడు = న్ + అ + అ = అ
AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు 2
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు 3

ఈ) కింది అభ్యాసాలు పరిశీలించి రాయండి.
1. తగినంత = తగిన + అంత
2. చూసినప్పుడు = చూసిన + అప్పుడు
3. ఇచ్చినంత = ఇచ్చిన + అంత
4. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు

చమత్కార పద్యం

వంగతోటనుండు వరిమళ్ళలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూల నుండు తలమీదనుండును
దీని భావమేమి తిరుమలేశ !

పద్యం చదవగానే – వంగతోటలో, వరిమళ్ళలో, జొన్నచేలలో, తలుపు మూలలో, తల పైన ఉండేది ఏది? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ సమాధానం అక్కడే ఉంది. వంగ – తోటలోనే ఉంటుంది. వరి – ‘మళ్ళ’ లోనే ఉంటుంది. జొన్న – ‘చేల’ లోనే ఉంటుంది. తలుపు – ఇంటికి, ‘మూల’నే ఉంటుంది. తల – శరీరానికి ‘మీద’ నే ఉంటుంది.

మేలుకొలుపు కవి పరిచయం

కవి పేరు : కుసుమ ధర్మన్న

జననం : 17.3. 1900న రాజమహేంద్రవరంలోని లక్ష్మివారపు పేటలో జన్మించారు.

తల్లిదండ్రులు : నాగమ్మ, వీరాస్వామి గార్లు.

చదువు : వైద్య విద్వాన్, సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం కలవారు.

రచనలు : నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం మొదలైనవి.

ప్రత్యేకత : దళిత వర్గం నుంచి అతికష్టం మీద చదువుకొని, పైకొచ్చి, ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించారు. చదువుకొనే రోజులలోనే సంఘసంస్కరణాభిలాష గల కందుకూరి వారిచే ప్రభావితం అయ్యారు. భారతరత్న, డా|| బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది, అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం తొలి దళిత కవి. ప్రస్తుత పాఠ్యభాగం ఆయన రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించబడింది. 1946లో ఆయన స్వర్గస్థులయ్యారు.

పద్యాలు – అర్థాలు – భావాలు

1. సీ॥ కాళిదాసాది సత్కవి పుంగవుల గాంచి
విద్యావతి యన నేవెలది యొప్పె ?
రణశూరులగు కృష్ణరాయాదులను గని
వీరమాత యన నేనారి తనరె?
నతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు గల్గి
పుణ్యవతియన నేపొలతి నెగడె ?
కొహినూరు మొదలగు మహిత మణులనీని
రత్నగర్భయన నేరామ వెలసె ?

తే॥గీ|| నట్టి సద్గుణసంఘాత యఘ విదూర
సన్నుతవ్రాత విపుల తేజస్సమేత
బహుళ విఖ్యాత యాచక పారిజాత
భద్రముల మీకొసగుగాత భరతమాత.
అర్థాలు :
సత్కవి పుంగవుడు = మంచి కవులలో శ్రేష్ఠుడు
పుంగవము = ఎద్దు
ఆది = మొదలైన
వెలది = స్త్రీ
రణము = యుద్ధము
శూరుడు = వీరుడు
వీరమాత = వీరులను కన్న తల్లి
నారి = స్త్రీ
తనరు = ఒప్పు
అతుల = సాటిలేని
పొలతి = స్త్రీ
నెగడు = అతిశయించు
మహిత = గొప్పదైన
రామ = స్త్రీ
సంఘాత = సమూహం
అఘము = పాపము
విదూర = దూరముగా నెట్టునది
సన్నుతి = పొగడ్త
వ్రాత = సమూహము
సమేత = కూడినది
విఖ్యాతి = కీర్తి
యాచకులు = భిక్షువులు

భావం :
సకల సద్గుణ రాశి మన భరతమాత. ఈమె అందరి పాపాలను దూరం చేస్తుంది. అందరూ పొగడ దగినది. గొప్ప తేజస్సు కలది. అనేక విధాలుగా కీర్తి కలది. కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి. అటువంటి భరతమాత మీకు భద్రతను కల్గిస్తోంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

2. సీ॥ దీన జాతుల దుర్గతిగని ఘోషిలు భార
తాంబ దుర్భర దుఃఖమణగు వఱకు
నిమ్నులు కురియు కన్నీటి మున్నీరు సం
పూర్ణంబుగా నింకిపోవువలకు
అస్పృశ్యతాబాడబానల జ్వాల ది
గంత భూములకు జల్లారువఱకు
జాతిభేద చ్చిన్న సకలాంగకంబులు
సంచితాకృతి ధరియించు వఱకు

తే॥గీ॥ ధర్మమున కడ్డుపడెడు మదత్రయంబు
హైందవుల డెందముల నాశమందు
వఱకు ప్రథిత మంగళదత్త స్వరాజ్యరథము
తెంపు సాగింతురే భారతీయ హితులు
అర్థాలు :
దుర్గతి = చెడ్డ స్థితి
దుర్భరము = భరింపరానిది
అణగు = నశించు
మున్నీరు = సముద్రము
బడబానలము = సముద్రంలో ఉండే అగ్ని
జ్వాల = మంట
అంగకములు = అవయవాలు
మదత్రయము = కుల, ధన, విద్యా గర్వములు మూడూ
డెందము = హృదయము
ప్రధిత = కీర్తి గల
దత్త = ఇవ్వబడిన
ఆకృతి, = ఆకారము
హితులు = మిత్రులు

భావం :
దీనులైన తన సంతానాన్ని చూసి బాధపడుతున్నది భరతమాత. ఆ బాధ తగ్గేవరకు శుభప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి. అణగారిన ప్రజల కన్నీటి సముద్రం ఇంకిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. జాతి భేదాలు పోయి, భరతమాత శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా రూపుదిద్దు కొనేవరకు సాగాలి. ధర్మానికి అడ్డుపడే మదత్రయం (విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం) నాశనమయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడపాలి.

3. తే॥గీ॥ మేలుకొనుమయ్య తరుణము మించకుండ
జన్మహక్కులకై పోరుసల్పు మిపుడె
హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు
స్వర్గపదమని నమ్ముము స్వాంతమందు
అర్థాలు :
తరుణము = సమయము
పోరు = రణము

భావం :
ఓ దీనజనుడా! మేలుకో! సమయం దాటిపోనివ్వకు. ఈ దేశంలో పుట్టిన నీకు అన్నింటిపై అందరిలా హక్కులున్నాయి. ఆ హక్కుల కోసం పోరాడు. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా పరవాలేదు. అదే స్వర్గం. దీనిని హృదయంలో నమ్ము.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

4. తే॥గీ|| పరుల ధన మాన ప్రాణ సంపదల ద్రుంచి
మనుచునుండుట పాతకంబని దలంచు
వారలెందున ధన్యులు వారికెల్ల
నంకితమొనర్తు దానినేనధికభక్తి
దేశమున శాంతి చేకూరి తేజరిలగ
అర్థాలు :
మనుట = జీవించుట
పాతకము = పాపము

భావం :
ఇతరుల ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాలు, ఐశ్వర్యాన్ని నాశనం చేసి బతకడం మహాపాపం అనుకొనేవారు ధన్యులు. మన దేశానికి శాంతి కలిగేలాగా నేనటు వంటి వారికే నా కవిత్వం అంకితం చేస్తాను. కవి జీవించిన కాలంలో స్వాతంత్ర్య పోరాటం దేశమంతా తీవ్రంగా వ్యాపించింది. త్వరలోనే స్వాతంత్ర్యం వస్తుందని కవి నమ్మకం. అయితే ఈ పోరాట స్ఫూర్తి అధికారం మార్పుతో ఆగిపోకుండా దేశంలో వేళ్ళూనుకుని ఉన్న అసమానతలు అంతమయ్యేవరకు కొనసాగాలని కవి ఈ విధంగా కోరుకున్నాడు.

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 6th Class Telugu పదాలు – అర్థాలు Notes, Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu పదాలు – అర్థాలు

అర్థాల పట్టిక

1. అంకె = వశం
2. అంగడి = కొట్టు (దుకాణం)
3. అంబుధి = సముద్రం
4. అఘము = పాపం
5. అజ్ఞానం = జ్ఞానం లేకపోవడం
6. అణగుట = నశించుట
7. అతుల = సాటిలేని
8. అధునాతనము = ఆధునికం
9. అనర్గళంగా = ధారాళంగా / అడ్డంకి లేకుండా
10. అనుకరించు = మరొకరు చేసినట్లు చేయు
11. అనుగుణము = తగిన విధంగా
12. అన్వేషణ = వెదకుట
13. అబ్ది = సముద్రం
14. అర్థించి = వేడుకొని
15. అలరించు = ఆనందింపజేయు
16. అవగతము = తెలియబడినది
17. అశ్వము = గుర్రం
18. అసువులు = ప్రాణాలు

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. ఆకృతి = ఆకారం
2. ఆచరణ = నిజ జీవితంలో అమలు చేయడం / నడత
3. ఆజ్ఞ = ఆనతి
4. ఆత్మవిశ్వాసం = తన శక్తి, సామర్థ్యాలపై తనకున్న నమ్మకం
5. ఆనందపరవశుడు = ఎక్కువ ఆనందం పొందిన వాడు
6. ఆపన్నులు = ఆపదలో ఉన్నవారు
7. ఆపద = ప్రమాదం
8. ఆప్యా యత = ప్రేమ, ప్రీతి
9. ఆలి = భార్య
10. ఆవశ్యకత = అవసరం
11. ఆశ్రయించు = నమ్ముకొను
12. ఆశ్రితులు ఆ = ఆశ్రయించినవారు

1. ఇంకుట = ఇగిరిపోవుట
2. ఇంతి = స్త్రీ
3. ఇమ్ముగ = కుదురుగ | స్థిరంగా

1. ఉచ్చు = పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టే ఉరి
2. ఉజ్జ్వల = బాగా ప్రకాశించు
3. ఉత్తరీయం = కండువా
4. ఉదకము = నీరు
5. ఉబలాటం = కుతూహలం / ఒక పని చేయాలనే తొందరతో కూడిన కోరిక

1. ఏకభుక్తులు = ఒకపూట మాత్రమే తినేవారు
2. ఎడబాయు = వేరగు
3. ఎలమి = సంతోషం
4. ఎరుక = జ్ఞానం

1. ఐశ్వర్యం = సంపద

1. ఒద్దిక = అనుకూలత, స్నేహం
2. ఒసగుట = ఇచ్చుట

1. ఔన్నత్యము = గొప్పతనం

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. కదనం = యుద్ధం
2. కనుమఱుగు = కంటికి కనిపించకుండా పోవు
3. కన్నుల పండుగ = చూడడానికి ఆనందంగా ఉండటం
4. కపటం = మోసం
5. కపి = కోతి
6. కర్తవ్యం = బాధ్యత
7. కవిపుంగవుడు = శ్రేష్ఠమైన కవి
8. కాంస్యం = కంచు
9. కాలుడు = యముడు
10. కాడు = శ్మశానం
11. కాలయముడు = ప్రాణాలు తీసేవాడు
12. కావలి = రక్షణ
13. కినియు = కోపించు
14. కూడు = అన్నం
15. కూరిమి = స్నేహం
16. కృతజ్ఞతలు = ధన్యవాదాలు
17. కేరింత = నవ్వు / సంతోషంలో చేసే ధ్వని
18. కోటీరము = కిరీటం
19. కోమలి = అందమైన స్త్రీ
20. కోలాహలం = హడావుడి

1. గండం = ప్రమాదం
2. గిరాకీ = వెల ఎక్కువ / కొనుగోలు దారులకున్న ఆసక్తి

1. ఘట్టం = సందర్భం / తీరు

1. చారెడు = కొద్దిగా చెయ్యి వంచినప్పుడు ఏర్పడే పరిమాణం, ఒక చేతిలో పట్టినన్ని
2. చిక్కం = తీగలతో అల్లి పశువుల
3. చిరస్మరణీయుడు = నిత్యం స్మరింపదగినవాడు
4. చేజారిపోవు = దొరకకుండాపోవు
5. చేటు = కీడు, అనర్థం

1. జాగృతి = మేలుకొలుపు
2. జాడ = ఆనవాలు
3. జీవనశైలి = జీవించే విధానం/బతికే పద్దతి

1. డెందము = హృదయం

1. తనయ = కూతురు
2. తనరు = ప్రకాశించు
3. తనూభవుడు = కుమారుడు
4. తర్కించు = చర్చించు
5. తరుణము = తగిన సమయం
6. తలపోయు = ఆలోచించు
7. తహతహలాడు = ఆరాటపడు
8. తిలలు = నువ్వులు
9. తీవ్రత = ఆధిక్యం
10. తుల్యం = సమానం
11. తెంపు = సాహసం
12. తేట తెల్లం చేయు = స్పష్టంగా వివరించు

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. దత్త = ఇవ్వబడిన
2. దనుజులు = రాక్షసులు.
3. దళం = ఆకు
4. దాణా = పశువులకు పెట్టు ఆహారం
5. దాశరథి- = శ్రీరాముడు .
6. ద్విపము = ఏనుగు
7. ద్వీపము – నాలుగువైపులా నీటితో చుట్టబడిన భూమి
8. దుర్గతి = చెడ్డ స్థితి మూతికి తగిలించే బుట్ట
9. దుర్బరం = భరింపలేనిది
10. దేదీప్యమానం = ప్రకాశవంతం
11. దొరతనం = పాలన, అధికారం
12. దోచు = అపహరించు

1. ధరణి = భూమి
2. ధాటి = దాడి

1. నారి = స్త్రీ
2. నిక్కం = నిజం
3. నిరాడంబరం = ఆడంబరం లేని విధంగా
4. నిర్దేశం = ఆజ్ఞ
5. నిశ్చితాభిప్రాయం = దృఢమైన అభిప్రాయం, గట్టి నిర్ణయం
6. నిష్ఫలం = ప్రయోజనం లేనిది
7. నేమ్మి = ప్రేమ, క్షేమం
8. నెటిగుటి = సరియైన లక్ష్యం
9. నేరము = తప్పు

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. పటాపంచలు = పూర్తిగా తొలగిపోవు
2. పథకం = ఆలోచన, ప్రణాళిక
3. పరస్పరం = ఒకరికొకరు
4. పరవ = ప్రవాహం
5. పస్తు = ఉపవాసం
6. పాటు = ఆపద
7. పాతకం = పాపం
8. పామరుడు = తెలివిలేనివాడు
9. పారదని = జరగదని
10. పీడ= బాధ
11. పుంగవం = ఎద్దు
12. పుడుక = పుల్ల (పుడక అని వాడుక)
13. పుష్కలం = అధికం, సమృద్ధి
14. పుస్తె = తాళిబొట్టు
15. పొంచి = చాటున దాగియుండి
16. పొలతి = స్త్రీ
17. పోరాటం = యుద్ధం
18. పోరు = యుద్ధం
19. ప్రజ్ఞాశాలి = ప్రతిభ గలవాడు
20.. .ప్రతీక = గుర్తు
21. ప్రథితం – ప్రఖ్యాతి నొందినది
22. ప్రభువు = రాజు
23. ప్రస్తుతం = ఇప్పుడు
24. ప్రాచీనం = పూర్వకాలం, పురాతనం
25. ప్రాణం = జీవం
26. ప్రారంభం = మొదలు

1. బుధుడు = పండితుడు
2. బుడతడు = బాలుడు

1. భద్రం = శుభకరం, శ్రేష్ఠం
2. భావన = తలపు/ఆలోచన
3. భావి = భవిష్యత్తు
4. భాస్కరుడు = సూర్యుడు
5. భీతి = భయం
6. భూషణములు = అలంకారాలు
7. భేదం = తేడా
8. భ్రాతృజనం = అన్నదమ్ములు

1. మకాం = నివాసం
2. మదం = గర్వం
3. మదత్రయం = విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం
4. మనువు = రక్షణ
5. మనువు = జీవించుట
6. మట్టగుడిసె = ఒకరకమైన చేప
7. మమకారం = ప్రేమ/నాది అనే భావం
8. మహనీయులు = గొప్పవారు
9. మిన్నక = ఊరక / అప్రయత్నం
10. ముట్టుకోవడం = తాకడం
11. మున్నీరు = సముద్రం
12. ముల్లె = ధనం/మూట
13. మెలకువ = మేలుకొనుట/జాగృతి
14. మేటి = శ్రేష్ఠం
15. మేను = శరీరం
16. మైత్రి = స్నేహం
17. మొరాయించు = మొండిబడు/ఎదిరించే
18. మొహమాటం = జంకు, సంకోచం
19. మోళీ = రీతి / తరగతి
20. మౌనం = మాట్లాడకుండా ఉండడం

1. యాచకులు = భిక్షకులు

1. రణము = యుద్ధం
2. రమ్యము = అందమైన
3. రాజద్రోహం = రాజాపరాధం
4. రాట్నం = నూలువడికే యంత్రం
5. రాశి = పోగు
6. రూకలు = ధనం
7. రూపు మాయు = నశించు, అంతరించు

1. లేసు = సులభం

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. వదనం = ముఖం
2. వర్ధనం = వృద్ధి
3. వలయాకారం = గుండ్రంగా
4. వాత్సల్యం = ప్రేమ
5. వ్రాత = సమూహం
6. విక్రయించు = అమ్ము
7. విచ్ఛిన్నం = తునాతనకలు
8. విధూతము = కంపించబడినది
9. విరసం = రసము లేనిది
10. వివేకి = తెలివైనవాడు
11. విహరిస్తున్న = తిరుగుతున్న
12. వీడ్కోలు = వెళ్ళడానికి ఇచ్చే అనుమతి
13. ఐచు = భయపడు
14. వైరం = శత్రుత్వం

1. శిశుంపా వృక్షం = ఇరుగుడు చెట్టు
2. శుంభత్ = ప్రకాశించే
3. శుద్ధము = పవిత్రం
4. శూరులు = శౌర్యం కలవారు య
5. శ్రేయస్సు = శుభం

1. సంక్రామిక వ్యాధులు = అంటు వ్యాధులు
2. సంఘాతం = సమూహం / గట్టి దెబ్బ
3. సంచితం = కూడబెట్టినది
4. సంప్రదాయం = గతం నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారం
5. సంబరం = సంతోషం
6. సంస్కృతి = ఆచార వ్యవహారాలు, నాగరికత
7. సఖ్యంగా = స్నేహంగా
8. సత్కవి = మంచి కవి
9. సత్యమైనది = నిజమైనది
10. సన్నుతి = పొగడ్త
11. సాక్షాత్కరించు = ఎదుటకువచ్చు
12. సాదిక = సారథ్యం
13. సిరి = సంపద
14. సుంత = కొంచెం
15. సునాయాసం = తేలిక
16. సువర్ణము = బంగారం
17. సొంపు = అందం
18. స్ఫూర్తి = స్ఫురణం, ప్రకాశం
19. స్మరించు = తలచుకొను
20. స్వాంతం = హృదయం
21. స్మారకం = స్పృహ

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. హరియించు = చంపు
2. హితము = మేలు
3. హితుడు = మేలుకోరేవాడు
4. హెచ్చు = ఎక్కువ

పర్యాయపదాలు

1. అఘము : పాపం, దురితం
2. ‘అధికం : ఎక్కువ, మెండు
3. అనలం : అగ్ని, వహ్ని
4. అభి : సముద్రం, జలధి
5. అశ్వము : గుర్రం, తురగం
6. ఇంతి : స్త్రీ, వనిత
7. ఉదకము : నీరు, జలం
8. ఉర్వి : భూమి, వసుధ
9. కన్ను : నేత్రం, నయనం
10. కపి : కోతి, మర్కటం
11. కుమారుడు : తనయుడు, పుత్రుడు
12. కూరిమి : స్నేహం, చెలిమి
13. కాశీ : వారణాసి, అవిముక్తం
14. డెందము : హృదయం, ఎద
15. తండ్రి : జనకుడు, పిత
16. తరుణము : సమయం / కాలం
17. దనుజులు : అసురులు, రాక్షసులు
18. దుఃఖము : భేదం, బాధ
19. నంది : వృషభం, ఎద్దు
20. నారి : స్త్రీ, పొలతి
21. పరులు : ఒరులు, ఇతరులు
22. పామరుడు : అజ్ఞుడు, నీచుడు
23. ప్రతీక : గుర్తు, చిహ్నం
24. ప్రారంభం : అంకురార్పణ, మొదలు
25. ప్రాచీనము : ప్రాక్తనం, సనాతనం
26. భాస్కరుడు : సూర్యుడు, భానుడు
27. ప్రాణం : ఉసురు, జీవం
28. మకాం : బస, నివాసం
29. మదం : గర్వం, పొగరు
30. మాత : తల్లి , జనని
31. మేను : శరీరం, దేహం
32. మైత్రి : స్నేహం, నెయ్యం
33. రణం : యుద్ధం, పోరు
34. రథము : తేరు, స్యందనం
35. రాజు : ప్రభువు, భూపతి
36. వృక్షం : చెట్టు, తరువు
37. సకలం : సర్వం, సమస్తం
38. స్వర్గం : దివి, నాకం

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

ప్రకృతి – వికృతి

1. అంబ – అమ్మ
2. ఆకాశం – అకసం
3. అశ్చర్యం – అచ్చెరువు
4. ఆహారం – ఓగిరం
5. ఉత్తరీయం – ఉత్తరిగం
6. కథ – కత
7. కవి – కయి.
8. కాలం – కారు
9. కార్యం – కర్జం
10. కుమారుడు – కొమరుడు
11. గర్భం – కడుపు
12. త్యాగం – చాగం
13. దిశ – దెస
14. దీపం – దివ్వె
15. దోషం – దోసం
16. ధర్మము – దమ్మం
17. పుణ్యము – పున్నెం
18. పుస్తకము – పొత్తం
19. భక్తి – బత్తి
20. సంతోషం – సంతసం

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation

Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 10 Games and Recreation

I. Conceptual Understanding:

Question 1.
Write five outdoor games you like to play.
Answer:
Cricket, foot ball, tennis, tennicoit, basket ball are the outdoor games which I like to play.

Question 2.
Write the rules of any game you know.
Answer:
Cricket Rules :

  1. Cricket is played between two teams each made up of eleven players.
  2. Each team get a chance for batting and fielding / bowling in a game.
  3. The fielding team will have a border bowl the ball to the batsman who tries to hit the ball with their bat.

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation

II. Questioning and Hypothesis:

Question 3.
Name your friends who play daily at home.
Answer:
Sarala, Sarika, Bibuthi, Vignesh, Pujitha, Vaishnavi, Sai, Kiran, Surya are my friends who play daily at home.

III. Experiments & field Observations:

Question 4.
Play a local game mentioned in the text book and write your experiences.
Answer:
I have played Edupenkulata Which is our local game with my friends. I felt very happy & gain good energy by playing this game. It improved team spirit and togetherness among our friends. It also developed life skills such as accepting failure as well as enjoying success.

IV. Information skills & Project Work:

Question 5.
Ask your friends about the games they like ? Fill in the table with the details. Which games are liked by most?

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation 1

Answer:
Student activity.

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation

V. Drawing Pictures and Model Making:

Question 6.
Prepare the play items with clay e.g. ball, bat, tenni-coit, tennis racket, shuttle cock etc. and display in your class room.
Answer:
Students Activity.

VI. Appreciation, values and creating awareness towards bio-diversity:

Question 7.
Your friend won a prize at the school level games on 15th August. He showed it to you. How do you feel ?
Answer:
I felt very happy when my friend showed me the prize he won at the school level games on 15th August. I will encourage him to improve his skills more and to continue the success in his future.

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation

Additional Questions:

I. Conceptual Understanding:

Question 1.
Why do children need to play games ?
Answer:
Children study hard and always engage in learning activities. Some times they feel bored with their hard work as it is monotonous. Working all the time make them dull and boring. It is also important for children to get relaxed and have fun. So, they need some recreation by playing games, Which makes them happy.

Question 2.
What are indoor games ? Give examples.
Answer:
Games which can be played inside a house are called ‘indoor games’.
Ex : Ludo, Chinese – Checker, Table – tennis etc.

Question 3.
What is Recreation ? Mention some recreational activities.
Answer:
An activity we do for pleasure or to get our body relaxed is called ‘Recreation’.
Examples for recreational activities are reading, playing, listening music, dancing, watching TV, movies gardening, travelling, parks, beaches etc.

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation

Question 4.
What are outdoor games ? Give examples.
Answer:
Games that are played in the open fields or play grounds are known as ‘Outdoor games’.
Ex : Fool ball, Basket ball, Tennis, Tenni-Coit etc.

Question 5.
Now-a-days Children spend much time with electronic gadgets (video games)? What are the bad effects by doing so ?
Answer:
Now-a-days children prefer to watch TV or play Video games with electronic gadgets. But it effect their eyes and causes obsity and ill health.

Question 6.
What are the uses of sports and games ?
Answer:
Uses of Games:

  1. 1) Children feel happy and gain good health.
  2. 2) Develop noble qualities like cooperation, Unity, mutual understanding and leadership qualities
  3. 3) Team spirit
  4. 4) Develops concentration and patience.
  5. 5) Develops life skills such as accepting failure as well as enjoying success.

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation

Question 7.
Match the following riddle with the pictures.
Answer:

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation 2

Question 8.
What are the ‘rules’ ? Why should we follow ‘rules’ ?
Answer:
1) Rules are the conditions to be followed by all the team members.
2) All the participants must obey the rules of certain games to avoid arguments.

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation

Multiple Choice Questions:

Question 1.
________ is the state game of Answer:P.
a) Cricket
b) Kabaddi
c) Tennis
d) None
Answer:
b) Kabaddi

Question 2.
________ is our National game.
a) Cricket
b) Kabaddi
c) Hockey
d) Tennis
Answer:
c) Hockey

Question 3.
Play is the way of ________.
a) sorrow
b) joy
c) recreation
d) none
Answer:
c) recreation

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation

Question 4.
Games that can be played inside a house are called ________.
a) Oudoor games
b) Indoor games
c) Sports
d) none
Answer:
b) Indoor games

Question 5.
Sports and games improves ________ qualities.
a) team spirit
b) concentration
c) patience
d) all
Answer:
d) all

Question 6.
________ is an ideal play time for children.
a) 4 – 6 pm
b) 5 – 7 pm
c) 12 noon
d) None
Answer:
a) 4 – 6 pm

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation

Question 7.
Recreational Activities of the following. ________
a) playing
b) watching T.V.
c) listening music
d) all
Answer:
d) all

Question 8.
An activity we do for pleasure or to get relaxed is ________.
a) happiness
b) sorrow
c) recreation
d) none
Answer:
c) recreation

Question 9.
Kotikommacchi, Edupenkulata, Tokkudu Billa are the examples of ________.
a) indoor games
b) sports
c) local games
d) none
Answer:
c) local games

AP Board 3rd Class EVS Solutions 10th Lesson Games and Recreation

Question 10.
Which of the following games don’t need (objects) things. ________.
a) Kho-Kho
b) running
c) a & b
d) none
Answer:
c) a & b